• TFIDB EN
  • ప్రాజెక్ట్ Z
    UATelugu2h 1m
    నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. ఇదంతా సీరియల్‌ కిల్లర్‌ పని పోలీసు డిపార్ట్‌మెంట్‌కు తెలుస్తోంది. దీంతో పోలీసు ఆఫీసర్‌ కుమార్‌ (సందీప్‌ కిషన్‌) రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి. ఇంతకీ ఆ హంతకుడు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? కుమార్‌ ఈ కేసును ఎలా ఛేదించాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సందీప్ కిషన్
    లావణ్య త్రిపాఠి
    జాకీ ష్రాఫ్
    డేనియల్ బాలాజీ
    మైమ్ గోపి
    ఆర్. అమరేంద్రన్
    బగవతి పెరుమాళ్
    జయప్రకాష్
    అక్షర గౌడ
    కెఎస్ రవికుమార్
    KSG వెంకటేష్
    జీవ రవి
    సాయి ధీనా
    రాజీ విజయ్ సారథి
    సూపర్‌గుడ్ సుబ్రమణి
    కర్పగం
    తమిళ్ సెల్వి
    కత్తి రవి
    నవీన్ కుమార్
    యమునా చిన్నదురై
    సిబ్బంది
    C. V. కుమార్దర్శకుడు
    C. V. కుమార్నిర్మాత
    జిబ్రాన్
    సంగీతకారుడు
    నలన్ కుమారస్వామి
    స్క్రీన్ ప్లే
    గోపీ అమర్‌నాథ్
    సినిమాటోగ్రాఫర్
    లియో జాన్ పాల్
    ఎడిటర్ర్
    కథనాలు
    <strong>Bhumika Chawla: భూమిక చావ్లాకు ఘోర అవమానం.. ప్రేయసి కోసం ప్రాజెక్ట్‌ నుంచి తొలగింపు!</strong>
    Bhumika Chawla: భూమిక చావ్లాకు ఘోర అవమానం.. ప్రేయసి కోసం ప్రాజెక్ట్‌ నుంచి తొలగింపు!
    టాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి స్టార్‌ హీరోయిన్లలో భూమిక చావ్లా ఒకరు. పవన్‌ కల్యాణ్‌, మహేష్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, రవితేజ, వెంకటేష్ వంటి స్టార్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసింది. ఆమె చేసిన ఒక్కడు, ఖుషీ, సింహాద్రి చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. అటువంటి భూమికకు హిందీలో ఘోర అవమానం జరిగింది. కెరీర్‌ తొలినాళ్లలో జరిగిన ఈ విషయాన్ని భూమిక తాజాగా పంచుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రాజెక్ట్ నుంచి ఆమెను అర్ధాంతరంగా తొలగించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఏడాది వెయిట్‌ చేసినా.. తప్పించారు! సుమంత్‌ హీరోగా రూపొందిన యువకుడు (2000) చిత్రంతో నటి భూమిక చావ్లా హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత ఖుషి, వాసు, ఒక్కడు, మిస్సమ్మ, సింహాద్రి చిత్రాలతో తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది. సింహాద్రి తర్వాత హిందీలో చేసిన ఫస్ట్ ఫిల్మ్‌ 'తేరే నామ్' కూడా సక్సెస్‌ కావడంతో బాలీవుడ్‌లో ఈ అమ్మడికి వరుసగా రెండు ఆఫర్లు వచ్చాయి. అందులో ఒకటి మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ కాగా, మరొకటి 'జబ్‌ వీ మెట్‌'. షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌ జంటగా చేసిన&nbsp; 'జబ్‌ వీ మెట్‌' తొలుత తనను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు భూమిక తాజాగా వెల్లడించారు. ఆ మూవీ కోసం దాదాపు ఏడాది పాటు ఎదురుచూసినట్లు చెప్పారు. డేట్స్ ఇష్యూ రాకుండా వేరే సినిమాలేవి ఒప్పుకోలేదని తెలిపారు. అయితే జబ్‌ వీ మెట్‌ సినిమాకు తొలుత బాబీ డియోల్‌ను హీరోగా అన్నుకున్నారని, ఆ తర్వాత అతడ్ని కాదని షాహీద్‌ కపూర్‌ను తెరపైకి తీసుకొచ్చారని భూమిక అన్నారు. ఆ తర్వాత తనను కూడా సైడ్‌ చేసి కరీనా కపూర్‌ను ఫైనల్‌ చేశారని వాపోయారు. ఇది తనను ఎంతో బాధించిందని చెప్పారు. ఆ సినిమా చేసి ఉంటే తన కెరీర్‌ మరోలా ఉండేదని పేర్కొన్నారు.&nbsp; https://twitter.com/theBuzZBasket/status/1846077009803297009 ఆ మూవీస్‌ సక్సెస్‌ సంతోషాన్నిచ్చింది: భూమిక హిందీలో తెరకెక్కిన ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ విషయంలోనూ భూమిక చావ్లాకు అన్యాయం జరిగినట్లు తెలుస్తోంది. సంజయ్‌ దత్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలోనూ తొలుత భూమికను హీరోయిన్‌గా అనుకున్నారు. అనివార్య కారణాలతో ఆమెను తప్పించి విద్యాబాలన్‌ను ఫైనల్‌ చేశారు. ఈ సినిమా హిందీలో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమానే తెలుగులో శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ పేరుతో మెగాస్టార్‌ రీమేక్‌ చేసి ఘన విజయం అందుకున్నారు. అయితే ఆ రెండు ఆఫర్లు కోల్పోయినప్పటికీ తెలుగులో తాను చేసిన ఖుషీ, ఒక్కడు, సింహాద్రి చిత్రాలు బాగా ఆడాయని భూమిక గుర్తు చేశారు. ఇటీవల రీరిలీజ్‌ కూడా అయ్యి మంచి వసూళ్లు సాధించడం సంతోషంగా ఉందని కామెంట్ చేశారు.&nbsp; గర్ల్‌ఫ్రెండ్‌ కోసమే తప్పించారా? ‘జబ్‌ వి మెట్‌’ సినిమా నుంచి భూమికను తప్పించడం వెనుక ఓ బలమైన కారణమే ఉందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ మూవీ సమయంలో బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌తో షాహిద్‌ కపూర్‌ ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భూమికను తప్పించి తన ప్రియురాలుకు షాహిద్‌ కపూర్‌ ఛాన్స్ ఇప్పించారని విమర్శలు ఉన్నాయి. కానీ, ఆ తర్వాత వారిద్దరు విడిపోవడం ఆపై సైఫ్ అలీఖాన్‌ను కరీనా ఇష్టపడటం జరిగింది. కొద్ది కాలం తర్వాత సైఫ్‌ అలీఖాన్‌ను ఆమె రెండో వివాహం చేసుకుంది. అయితే షాహిద్‌ పక్కన భూమిక కన్నా కరీనా అయితేనే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే చివరి క్షణంలో ఆమెను తప్పించినట్లు చెబుతున్నారు. ఆ ప్రాజెక్ట్స్‌ తర్వాత భూమిక హిందీలో పలు చిత్రాలు చేసినప్పటికీ అవి పెద్దగా కలిసిరాలేదు.&nbsp; 21 ఏళ్ల తర్వాత..&nbsp; ప్రస్తుతం భూమిక తెలుగులో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మెుదలు పెట్టింది. కీలకమైన సహాయక పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటోంది. MCA (మిడిల్‌ క్లాస్ అబ్బాయి), సవ్యసాచి, రూలర్‌, పాగల్‌, సీటిమార్‌, సీతారామం, బటర్‌ఫ్లై వంటి చిత్రాల్లో నటించింది. తాజాగా గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యుఫోరియా చిత్రంలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఒక్కడు వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత గుణశేఖర్‌ నటిస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. 21 ఏళ్ల తర్వాత గుణశేఖర్‌తో పనిచేస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. కొత్త జర్నీ మెుదలైందంటూ రాసుకొచ్చారు.&nbsp; View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t)
    అక్టోబర్ 16 , 2024
    <strong>Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్‌’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!&nbsp;</strong>
    Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్‌’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!&nbsp;
    ఒకే తరహా చిత్రాలను చూడాలంటే ఎంతటి సినిమా లవర్స్‌కైనా బోర్‌ కొట్టక మానదు. దీనిని గమనించిన కొందరు దర్శక నిర్మాతలు.. క్రేజీ కాన్సెప్ట్‌తో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించారు. వైవిధ్యమైన కథ, కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ చిత్రాలు ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్నాయి. విభిన్న తరహా చిత్రాలు చూడాలని కోరుకునేవారు వీటిని ఎంచక్కా వీక్షించవచ్చు. ఇవి మీకు తప్పనిసరిగా కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌ ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; అహం రీబూట్‌ (Aham Reboot) సుమంత్‌ హీరోగా రూపొందిన లేటెస్ట్‌ చిత్రం అహం రీబూట్‌'. జూన్‌ 30 నుంచి ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీకి ప్రశాంత్ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో సుమత్‌ పాత్ర ఒక్కటే స్క్రీన్‌పై కనిపిస్తాయి. మిగత పాత్రలు కేవలం వినిపిస్తాయి అంతే. ఈ మూవీ స్ట్రీమింగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తున్నట్లు ఆహా వర్గాలు తెలిపాయి. ప్లాట్‌ ఏంటంటే.. ఆర్జే నిలయ్‌ (సుమంత్‌) స్టూడియోలో ఉండగా ఒక అమ్మాయి నుంచి కాల్‌ వస్తుంది. ఎవరో కిడ్నాప్‌ చేశారని చెబుతుంది. తొలుత ప్రాంక్‌ అని భావించిన నిలయ్‌.. ఆమె మాటలకు కన్విన్స్‌ అవుతాడు. ఎలాగైన కాపాడాని అనుకుంటాడు. మరోవైపు ఆమెను రక్షించేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగుతారు. ఇంతకీ కిడ్నాపైన యువతి ఎవరు? ఆమెకు నిలయ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ వేదిక : ఆహా 105 మినిట్స్‌ (105 Minuttess) ‘అహం రీబూట్‌’ తరహాలోనే రీసెంట్‌గా ఓ లేడీ ఒరియెంటేడ్‌ చిత్రం వచ్చింది. సింగిల్‌ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ‘105 మినిట్స్‌’ (105 Minuttess) సినిమాలో హీరోయిన్‌ హన్సిక (Hansika) నటించారు. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తికావడం విశేషం. ఈ సినిమా ప్లాట్‌ ఏంటంటే.. జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులకు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌ ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ఆరంభం (Aarambham) కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్‌ మోహన్‌ భగత్‌ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరంభం' చిత్రం కూడా ప్రయోగాత్మక కథతో రూపొందింది. ‘డెజావు’ అనే డిఫరెంట్‌ కాన్సెప్టుతో దర్శకుడు అజయ్‌ నాగ్‌ ఈ సినిమా తెరకెక్కించారు. జైల్లో శిక్ష అనుభవించే ఖైదీ ఉన్నట్టుండి మాయమవుతాడు. సెల్‌కు వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. ఊచలు వంచకుండా, గోడలు పగలగొట్టకుండా సునాయాసంగా అతడెలా తప్పించుకున్నాడు? అనేది ఆసక్తికరం. ఈ మూవీలో సుప్రితా సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, లక్ష్మణ్‌ మీసాల, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్లాట్‌ విషయానికి వస్తే.. ‘మిగిల్.. జైలులో శిక్ష అనుభవిస్తూ ఉరి తీయడానికి ఒక రోజు ముందు అనూహ్యంగా మిస్‌ ‌అవుతాడు. జైలు గది తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అతడికి మిగిల్‌ డైరీ దొరగడంతో కథ మలుపు తిరుగుతుంది. డైరీలో ఏముంది? డెజావు ఎక్స్‌పెరమెంట్‌కు కథకు సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : ఈటీవీ విన్‌ లవ్‌ మీ (Love Me) ఆశిష్‌ (Ashish Reddy), వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో అరుణ్‌ భీమవరపు తెరకెక్కించిన చిత్రం 'లవ్‌ మీ'. ఈ మూవీ కూడా వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందింది. ఒక యువకుడు దెయ్యంతో ప్రేమలో పడితే&nbsp; ఎలా ఉంటుంది? ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా జయాపజయాలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ మూవీకి కచ్చితంగా ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌లో అందిస్తుంది. ప్లాట్‌ ఏంటంటే.. ‘అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ప్రాజెక్ట్‌ జెడ్‌ (Project Z) సందీప్ కిష‌న్‌ (Sundeep Kishan), లావ‌ణ్య త్రిపాఠి (Lavanya Tripathi) హీరో హీరోయిన్లుగా న‌టించిన 'ప్రాజెక్ట్ జెడ్' మూవీ.. ఇప్పటివరకూ చూడని స్టోరీ లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషికి చావు అనేది లేకుంటే ఎలా ఉంటుంది? ఆనే కాన్సెప్ట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. ఇదంతా సీరియల్‌ కిల్లర్‌ పని పోలీసు డిపార్ట్‌మెంట్‌కు తెలుస్తోంది. దీంతో పోలీసు ఆఫీసర్‌ కుమార్‌ (సందీప్‌ కిషన్‌) రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి. ఓ సైంటిస్టు ఇవన్ని చేస్తున్నట్లు గ్రహిస్తారు? ఇంతకీ ఆ సైంటిస్టు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతడు చేసిన ప్రయోగం ఏంటి? కుమార్‌ ఈ కేసును ఎలా ఛేదించాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : ఆహా ప్రసన్న వదనం (Prasanna Vadanam) సుహాస్‌ (Suhas) రీసెంట్‌ చిత్రం 'ప్రసన్న వదనం'.. ఓ ప్రయోగాత్మక మూవీగా చెప్పవచ్చు. ఇందులో హీరో ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే స‌మ‌స్య బారిన పడతాడు. ఎవరి ముఖాన్ని, వాయిస్‌నూ గుర్తుపట్టలేకపోతాడు. దీని వల్ల అతడు ఫేస్‌ చేసిన సమస్యలు ఏంటి? అన్నది కాన్సెప్ట్‌. ఇందులో పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. మూవీ కథ ఏంటంటే.. రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ. భ్రమయుగం (Bramayugam) మలయాళ చిత్ర పరిశ్రమ ప్రయోగాలకు పెట్టింది పేరు. అక్కడి స్టార్‌ హీరో మమ్ముట్టి (Mammootty) నటించిన ‘భ్రమయుగం’ (Bramayugam) కూడా ఇప్పటివరకూ చూడని కాన్సెప్ట్‌తో రూపొందింది.&nbsp;డిజిటల్‌ యుగంలోనూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్నితెరకెక్కించారు. ఈ సినిమా మెుత్తం మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. కథ ఏంటంటే.. ‘తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్ముట్టి (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : సోనీ లివ్‌
    జూలై 03 , 2024
    <strong>HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;</strong>
    HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;
    నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) అధికారికంగా సినీ రంగ ప్రవేశం చేశాడు. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ‘హనుమాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఈ అరంగేట్ర చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ (సెప్టెంబర్‌ 6) మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే సమయంలో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి ఎగిరిగంతేసే న్యూస్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోక్షజ్ఞ పోస్టర్ ఎలా ఉందంటే నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ తాజాగా విడుదలైంది. ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్‌మ్‌ లుక్‌లో స్మైలింగ్‌ ఫేస్‌తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించి పక్కా హీరో మెటీరియల్‌గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌ మోక్షజ్ఞకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1831921862609154407 తారక్‌ స్పెషల్‌ విషెస్‌ నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ బర్త్‌డేతో పాటు ఆయన డెబ్యూ ఫిల్మ్‌ పోస్టర్‌పై జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) స్పందించారు. మోక్షజ్ఞను విష్‌ చేస్తూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు అన్ని దైవ శక్తులు నీపై ఆశీస్సులు కురిపించాలని కోరుకుటుంన్నాను! హ్యాపీ బర్త్‌డే మోక్షూ’ అంటూ జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్‌ చేశారు. మరోవైపు నందమూరి హీరో కల్యాణ్‌ రామ్ కూడా తన తమ్ముడు మోక్షజ్ఞకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘టిన్సెల్ టౌన్‌కు నీకు స్వాగతం మోక్షూ. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్స్‌ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నతమ్ముల అనుబంధం అంటే ఇలానే ఉండాలని అంటున్నారు. రెండ్రోజులుగా వరుస హింట్స్‌ రెండు రోజులుగా డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి హింట్స్‌ ఇస్తూనే వచ్చారు. ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని తొలుత అతడు పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత ‘వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ పెట్టిన మరో పోస్టు కూడా నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ. https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368 https://twitter.com/PrasanthVarma/status/1831604468355391886 ‘జై హనుమాన్‌’తో లింకప్‌! ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా మోక్షజ్ఞ ఫస్ట్‌ ఫిల్మ్‌ రూపొందనుంది. ప్రస్తుతం 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్‌ వర్మ వివరించారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదల చేస్తానని ఆయన (Prasanth Varma) స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి&nbsp; తొలుత హనుమాన్‌ను ప్రశాంత్ వర్మ రిలీజ్‌ చేశారు. సెకండ్‌ ఫిల్మ్‌గా మోక్షజ్ఞ ఫిల్మ్‌ రాబోతోంది. ఈ విషయాన్ని ‘సింబా ఈజ్‌ బ్యాక్‌’ అనే పోస్టర్‌లో 'PVCU 2' ప్రాజెక్ట్‌ అంటూ ప్రశాంత్‌ వర్మనే స్పష్టం చేశారు. తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్‌తో లింకప్‌ ఉంటుందని గతంలో ప్రశాంత్‌ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 'PVCU 2' ప్రాజెక్ట్‌ తర్వాత ‘జై హనుమాన్‌’ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా 'జై హనుమాన్‌'తో కనెక్షన్‌ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్‌ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్‌ మామా ఏం ప్లాన్‌ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/theBuzZBasket/status/1831944240831852919 శ్రీకృష్ణుడిగా బాలయ్య! మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్‌, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్‌ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్‌ తరహాలోనే ఈ సినిమాలో సూప‌ర్ హీరో, మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయ‌ని, చివ‌ర్లో బాల‌య్య శ్రీ‌కృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంద‌ని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్‌ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; హీరోయిన్‌ ఫిక్స్ అయ్యిందా? మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్‌. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్‌ జోడీ మరో ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.
    సెప్టెంబర్ 06 , 2024
    This Week OTT Movies: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
    This Week OTT Movies: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
    కాలేజీ విద్యార్థుల పరీక్షలు ముగిశాయి. ఎండకాలం స్టార్ట్‌ అయిపోయింది. ఈ ఎండల వేడిని తగ్గించి చల్లని వినోదం అందించి ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTTలో సైతం పలు ఆసక్తికర చిత్రాలు ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. ఫ్యామిలీ స్టార్(Family Star) రౌడ్ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), గ్లామర్ డాల్ మృణాల్ ఠాకూర్ జంటగా... పరుశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లోకి రానుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, పరుశురామ్ కాంబోలో వచ్చిన 'గీతా గోవిందం' బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్‌గా నిలచింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌పై పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి.&nbsp; ఈ సినిమా ప్రమోషన్లను సైతం మూవీ మేకర్స్ భారీగా చేస్తున్నారు.&nbsp; భరత నాట్యం కొత్త కుర్రాడు సూర్య తేజ ఏలే(Actor Surya Teja Aelay) హీరోగా పరిచయం అవుతున్న సినిమా భరతనాట్యం. ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలా మార్చిందన్నది ఈ చిత్రం కథ. సూర్య తేజకు జంటగా మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా స్క్రీన్ షేర్ చేసుకొనుంది. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, వైవా హర్ష వంటి ఇతర నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మంజుమ్మల్ బాయ్స్ మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన మంజుమ్మల్‌ బాయ్ తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్‌ను దక్కించుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న తెలుగురాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేయనున్నారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మాణమైన ఈ చిత్రం ఏకంగా రూ.200 కోట్లు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. ప్రొజెక్ట్ లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్ కాంబోలో వచ్చిన తమిళ్ చిత్రం 'మాయవన్'... తెలుగులో ప్రొజెక్ట్‌గా రానుంది.&nbsp; సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జనర్‌లో ఈ చిత్రం&nbsp; తెరకెక్కింది.&nbsp; ఈ సినిమా ఏప్రిల్‌ 6న విడుదల కానుంది. ఈ సినిమాలో డేనియల్ బాలాజీ,&nbsp; జయప్రకాశ్, మైమ్ గోపి వంటి వారు నటించారు.&nbsp; బహుముఖం హర్షివ్ కార్తిక్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బహుముఖం. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో హర్షివ్ కార్తిక్ స్వీయ దర్శకత్వం వహించాడు. గుడ్ బ్యాడ్&nbsp; అండ్ యాక్టర్ ట్యాగ్‌లైన్‌ను ఈ చిత్రానికి అందించారు. ఈ సినిమాలో హీరోయిన్‌లుగా స్వర్ణిమా సింగ్,&nbsp; మార్టినోవా కథానాయికలుగా చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateTogetherSeriesEnglishNetflixApril 2Files Of The UnexplainedSeriesEnglishNetflixApril 3RipleySeriesEnglishNetflixApril 4ScoopSeriesEnglishNetflixApril 5MusicaMovieEnglishAmazon primeApril 5Yeh Meri FamilySeriesHindiAmazon primeApril 4How to Date Billy WalshSeriesEnglishAmazon primeApril 5FarreyMovieHindiZee5April 5LambasingiMovieTelugu&nbsp;Disney+ HotstarApril 2
    ఏప్రిల్ 01 , 2024
    PROJECT K: ప్రాజెక్ట్ కె స్టోరీ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    PROJECT K: ప్రాజెక్ట్ కె స్టోరీ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    ]ప్రాజెక్ట్ కె బడ్జెట్ విషయంలో వైజయంతి &nbsp;మూవీస్ &nbsp;ఏమాత్రం రాజీపడటం లేదు. ఈ సినిమా బడ్జెట్ రూ.500కోట్లుగా అంచనా వేశారు. కానీ సినిమా పూర్తయ్యే సరికి ఈ మొత్తం ఇంకా దాటనుంది.భారీ బడ్జెట్
    ఫిబ్రవరి 18 , 2023
    Amitabh Bachchan: ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌కు ప్రమాదం
    Amitabh Bachchan: ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌కు ప్రమాదం
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    మార్చి 06 , 2023
    Balakrishna: బాలయ్య క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌.. క్యూలో త్రివిక్రమ్‌, ప్రశాంత్‌ వర్మ, బోయపాటి!&nbsp;
    Balakrishna: బాలయ్య క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌.. క్యూలో త్రివిక్రమ్‌, ప్రశాంత్‌ వర్మ, బోయపాటి!&nbsp;
    టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఒకరు. ఇటీవల ఆయన నటించిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్‌ (Kajal Aggarwal).. కూతురిగా శ్రీలీల (Sreeleela) నటించింది. ప్రస్తుతం డైరెక్టర్‌ బాబీ (Director Bobby)తో బాలకృష్ణ ‘NBK109’ చిత్రాన్ని చేస్తున్నారు. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా మరో మూవీ కూడా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంతకీ బాలయ్యను మెప్పించిన ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నాని డైరెక్టర్‌తో సినిమా! ఇప్పటికే తన లైనప్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులను పెట్టుకున్న బాలకృష్ణ.. తాజాగా మరో డైరెక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. 'ట్యాక్సీవాలా' (Taxiwala)తో వచ్చి 'శ్యామ్ సింగ రాయ్' (Shyam Singha Roy)తో భారీ సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్‌ రాహుల్ సంకృత్యాన్‌ (Rahul Sankrityan)కు బాలయ్య దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మధ్యనే రాహుల్.. బాలయ్యను కలిసి ఒక పిరియాడికల్ స్టోరీ లైన్ గురించి చర్చించాడట. ఆ పీరియాడిక్ డ్రామా బాలయ్యకు నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా కథ.. బాలయ్యకు పూర్తిగా నచ్చితే మూవీ కన్ఫామ్ కానుంది. హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌! నటసింహాం బాలకృష్ణ.. తన ‘NBK109’ చిత్రాన్ని డైరెక్టర్ బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ‘NBK110’వ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu)తో బాలయ్య చేయబోతున్నట్లు న్యూస్ ఇప్పటికే బయటకు వచ్చింది. దీన్ని 'అఖండ' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గ స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా చకా చకా రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈలోపు బాలయ్య తన 109వ సినిమాను పూర్తి చేస్తారు. ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ వంటి బ్లాక్‌ బాస్టర్స్ తర్వాత వీరి కాంబోలో ‘NBK110’ వస్తుండటంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీని తర్వాత బాలయ్య - రాహుల్ సంకృత్యాన్‌ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్‌తో బాలయ్య చిత్రం! టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ కూడా త్వరలోనే సెట్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తన తర్వాతి చిత్రాన్ని బాలయ్యతో చేసే అవకాశమున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్‌.. బన్నీతో ఓ సినిమా తీయాల్సి ఉంది. ‘పుష్ప2’ సినిమా షూటింగ్‌తో బన్నీ బిజీ అయిపోవడం.. తాజాగా పార్ట్‌-3 ఉంటుందని హింట్‌ ఇవ్వడంతో త్రివిక్రమ్‌ తన ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన తన తర్వాతి చిత్రాన్ని బాలయ్యతో చేసేందుకు మెుగ్గు చూపుతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కథను సిద్ధం చేయాల్సి ఉందని అంటున్నారు.&nbsp; ఆ డైరెక్టర్లతోనూ చర్చలు! నందమూరి బాలకృష్ణ.. బాబీ, బోయపాటి శ్రీనుతోనే కాకుండా మరికొందరు డైరెక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. తనకు 'వీర సింహా రెడ్డి' వంటి హిట్‌ అందించిన గోపీచంద్ మలినేని (Gopichand Malineni)తోనూ బాలకృష్ణ మరో సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే ప్రశాంత్ వర్మ, హరీశ్ శంకర్ వంటి డైరెక్టర్లు కూడా బాలయ్యతో కథకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాలకృష్ణ చకా చకా కొత్త సినిమాలను ఓకే చేస్తున్నారు. ఒకదాని తర్వాత మరొకదానిని సెట్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.&nbsp; హ్యాట్రిక్‌ హిట్లతో ఫుల్ జోష్‌ టాలీవుడ్‌లోని సీనియర్ నటులతో (చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌) పోలిస్తే ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నది బాలయ్య మాత్రమే. బాలయ్య చివరి మూడు చిత్రాలు బ్లాక్‌ బాస్టర్లుగా నిలవడం విశేషం. 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి క్రేజీ హిట్ల తర్వాత బాలకృష్ణ నటించిన సినిమానే 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రానికి కూడా అదిరిపోయే స్పందన లభించింది. ఇలా బాలయ్య వరుసగా మూడు హిట్లను అందుకుని హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ మూడు చిత్రాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. బాలయ్య రెమ్యూనరేషన్‌ ఎంతంటే? సినిమా సినిమాకి తన రేంజ్‌ని (Nandamuri Balakrishna Remuneration) పెంచుకుంటూ పోతున్న బాలయ్య ఇప్పుడు తన రెమ్యునరేషన్‌ని మరింతగా పెంచేశాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.&nbsp; అఖండ ముందు వరకు మోస్తరు పారితోషికాన్ని తీసుకున్న బాలకృష్ణ.. హ్యాట్రిక్‌ విజయాల తర్వాత దానిని ఒక్కసారిగా పెంచేశారట. తన అప్‌కమింగ్‌ సినిమాలు అన్నింటికి రూ.20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. రాబోయే చిత్రాలు సైతం స్టార్‌ డైరెక్టర్లతో ఉండటంతో బాలయ్య ఫ్యూచర్‌ మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది. రామ్‌చరణ్‌ (Ramcharan), తారక్‌ (Jr NTR) తరహాలోనే బాలయ్య కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే రోజులు ఎంతో దూరంలో లేవని నందమూరి అభిమానులు అంటున్నారు.&nbsp;&nbsp;
    ఫిబ్రవరి 20 , 2024
    Ramayanam: రణ్‌బీర్‌ - సాయి పల్లవి ‘రామాయణం’ ప్రాజెక్ట్‌లో త్రివిక్రమ్‌.. ఎందుకంటే?
    Ramayanam: రణ్‌బీర్‌ - సాయి పల్లవి ‘రామాయణం’ ప్రాజెక్ట్‌లో త్రివిక్రమ్‌.. ఎందుకంటే?
    రామయాణాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌లో మరో సినిమా రాబోతోంది. దర్శకుడు నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) 'రామాయణం' (Ramayanam)పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) రాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతగా నటించనున్నారు. రావణుడిగా కన్నడ స్టార్‌ హీరో యష్‌ (Yash) కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ బాలీవుడ్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ (Trivikram) భాగం కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.&nbsp; ఆ బాధ్యత అప్పగింత! లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం... రామాయణ తెలుగు వెర్షన్‌ డైలాగ్స్‌ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram Srinivas)కు మేకర్స్‌ అప్పగించినట్లు సమాచారం. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు సైతం ఉంది. ఈ విషయం పలు చిత్రాల ద్వారా ఇప్పటికే నిరూపితమైంది. దీంతో రామాయణ చిత్ర యూనిట్‌ ఆయన్ను సంప్రదించినట్లు బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలుగు వెర్షన్‌కు మాటలు అందించాల్సిందిగా కోరినట్లు పేర్కొంటున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి వస్తుందని అంటున్నారు. బన్నీ చేతుల్లో త్రివిక్రమ్‌ భవితవ్యం! ఈ ఏడాదిలో 'గుంటూరు కారం' (Guntur Kaaram)తో ప్రేక్షకులను మెప్పించిన త్రివిక్రమ్‌ తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అల్లు అర్జున్‌తో ఓ సినిమా ఉంటుందని గతంలోనే ఆయన చెప్పారు. అయితే బన్నీ'పుష్ప 2'తో ఫుల్‌ బిజీగా ఉండటం.. దాని తర్వాత అట్లీతో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే రామాయణ టీమ్‌లోకి త్రివిక్రమ్‌ చేరడం ఖాయమని చెప్పవచ్చు. ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి రోజున ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే ఛాన్స్‌ వుంది. ‘ఆదిపురుష్‌’లా జరగకూడదు! ప్రభాస్‌ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాల్లోని డైలాగ్స్‌పై హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆదిపురుష్‌ తెలుగు వెర్షన్‌ చూసిన వారు కూడా సంభాషణలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘రాయయణం’ టీమ్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అలాంటి తప్పిదం పునరావృతం కాకుండా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే త్రివిక్రమ్‌ను డైలాగ్స్‌ అందించాల్సిందిగా మేకర్స్‌ కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమయ్యేందుకు త్రివిక్రమ్‌ ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.&nbsp;
    ఏప్రిల్ 04 , 2024
    <strong>SDT 18: కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌తో వస్తోన్న మెగా మేనల్లుడు.. రికార్డులు గల్లంతేనా!</strong>
    SDT 18: కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌తో వస్తోన్న మెగా మేనల్లుడు.. రికార్డులు గల్లంతేనా!
    మెగా హీరో, చిరంజీవి మేనల్లుడు సాయి దుర్గా తేజ్ అలియాస్‌ సాయి ధరమ్‌ తేజ్‌ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. గతేడాది వచ్చిన ‘విరూపాక్ష’తో సాలిడ్‌ హిట్‌ కొట్టిన తేజ్‌ ఆ సినిమాతో ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌ చేరిపోయాడు. అదే ఏడాది పవన్‌ కల్యాణ్‌తో కలిసి ‘బ్రో’ సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. బ్రో తర్వాత ఇప్పటివరకూ ఒక్క ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేదు. కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘SDT18’ ప్రాజెక్ట్ ప్రకటించి అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపారు.&nbsp; ధైర్యాన్నే కవచంగా.. సుప్రీం స్టార్‌ సాయి దుర్గా తేజ్‌ నుంచి కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. నేడు ఈ యంగ్‌ హీరో పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. ‘SDT 18’ వర్కింగ్‌ టైటిల్‌తో ఇది తెరకెక్కనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఓ మేకింగ్‌ వీడియోతో పాటు పోస్టర్‌ను విడుదల చేసింది. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించిన కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ‘ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’ అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కండల తిరిగిన దేహంతో ఉన్న సాయి దుర్గా తేజ్‌ బ్యాక్‌ సైడ్‌ లుక్‌ను చూపించారు.&nbsp; https://twitter.com/Primeshowtweets/status/1846065983091536150 రాయలసీమ నేపథ్యంలో.. ‘SDT 18’ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. సాయి దుర్గా తేజ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో వస్తోన్న చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా దర్శకుడు రోహిత్‌ కేపీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్స్‌ నిర్మించినట్లు తాగా రిలీజ్‌ చేసిన మేకింగ్‌ వీడియోను బట్టి తెలుస్తోంది. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్‌ను ఒక షాట్‌లో చూపించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం సరికొత్త మేకోవర్‌లోకి మారాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు. https://twitter.com/IamSaiDharamTej/status/1846068731665174954 యాక్సిడెంట్‌తో కోమాలోకి.. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్‌ఫుల్‌ యాక్టర్‌గా మారారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలోనే సాయి దుర్గా తేజ్‌కు ఊహించని విధంగా యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులనూ ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేసింది. ప్రమాదం అనంతరం కోమాలోకి వెళ్లిన తేజ్‌ జీవన్మరణ సమస్య నుంచి కోలుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత విరూపాక్ష, బ్రో సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు. తన తల్లి పేరును తన పేరుకు జత చేసి సాయి ధరమ్‌ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మారాడు.&nbsp;
    అక్టోబర్ 15 , 2024
    <strong>NTR 31: జూ.ఎన్టీఆర్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌పై దిమ్మతిరిగే అప్‌డేట్‌.. బంగ్లాదేశ్‌ రైతుగా తారక్‌?</strong>
    NTR 31: జూ.ఎన్టీఆర్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌పై దిమ్మతిరిగే అప్‌డేట్‌.. బంగ్లాదేశ్‌ రైతుగా తారక్‌?
    తారక్‌ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక మూవీ సక్సెస్‌తో తారక్‌ తర్వాతి చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే సలార్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో తారక్‌ ఓ సినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘NTR 31’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్‌ నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిపై ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. రైతు పాత్రలో తారక్‌! &nbsp;తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న 'NTR 32' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్‌ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని ఫిల్మ్‌ వర్గాల సమాచారం.&nbsp; హీరోయిన్‌గా రష్మిక? దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్‌-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్‌ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.&nbsp;&nbsp; ఆ మూవీ తర్వాత సెట్స్‌పైకి! తారక్‌ బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో తారక్‌ నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లోనూ తారక్‌ పాల్గొన్నాడు. ఈ సినిమాలో తన కోటా షూటింగ్‌ పూర్తి చేసి ఆ తర్వాత ‘NTR 31’ను పట్టాలెక్కించాలని తారక్‌ భావిస్తున్నట్లు సమాచారం. ‘వార్‌ 2’ పూర్తయితే ఇక పూర్తిస్థాయిలో ప్రశాంత్‌ నీల్‌కు డేట్స్‌ అడ్డస్ట్‌ చేయవచ్చని తారక్‌ అనుకుంటున్నారట. ఇక ‘వార్‌ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; రాజకీయాలపై క్లారిటీ దేవర సక్సెస్ నేపథ్యంలో ఎన్టీఆర్ మరోసారి రాజకీయాలపై స్పందించారు. రాజకీయాలు కాదు.. నటనే తన తొలి ఆప్షన్ అని తేల్చి చెప్పారు. తొలి నుంచి నటుడిని కావాలనే అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో జూనియర్ స్పష్టం చేశారు. 17 ఏళ్ల వయసులో ఫస్ట్ మూవీ చేశానన్న తారక్‌ అప్పటి నుంచి నటనపైనే ఫోకస్ చేసినట్లు చెప్పారు. ఓట్ల సంగతి పక్కన పెడితే తన కోసం లక్షలాది మంది టికెట్లు కొంటున్నారని పేర్కొన్నారు. ఇంతమంది ప్రజలను కలుస్తున్నందుకు నటుడిగా తనకు ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ వ్యాఖ్యలను బట్టి ఆయన ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేనట్టు అర్ధమవుతోంది.
    అక్టోబర్ 01 , 2024
    <strong>Jr NTR: ఎన్టీఆర్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ చూస్తే మతి పోవాల్సిందే.. రెండేళ్లలో 4 భారీ చిత్రాలు!</strong>
    Jr NTR: ఎన్టీఆర్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ చూస్తే మతి పోవాల్సిందే.. రెండేళ్లలో 4 భారీ చిత్రాలు!
    బాక్సాఫీస్‌కు వణుకుపుట్టించే అతికొద్ది మంది హీరోల్లో జూ.ఎన్టీఆర్‌ ఒకరు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అప్పటివరకూ ఉన్న రికార్డ్స్‌ అన్ని సైడ్‌ అవ్వాల్సిందే. ఎన్టీఆర్‌ బిగ్‌ స్క్రీన్‌పై కనిపిస్తే ఫ్యాన్స్‌ పూనకాలతో ఊగిపోవాల్సిందే. అటువంటి తారక్‌ నుంచి రెండున్నరేళ్లుగా ఒక్క సినిమా కూడా రాలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (2022) తర్వాత ప్రేక్షకులను పలకరించలేదు. దీంతో ఎన్టీఆర్‌ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అటు తారక్‌ సైతం సెప్టెంబర్‌ 27న ‘దేవర’తో రాబోతున్నాడు. అంతేకాదు నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్‌ పెట్టేందుకు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ చేయబోతున్నాడు. అభిమానుల దాహార్తిని తీర్చేందుకు వచ్చే రెండేళ్లలో ఏకంగా నాలుగు భారీ బడ్జెట్‌ సినిమాలను రిలీజ్‌ చేయబోతున్నాడు. ఎన్టీఆర్‌ లైనప్‌లోని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే.&nbsp; ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్‌! 2018 నుంచి 2024 ఆగస్టు మధ్య ఎన్టీఆర్‌ నుంచి కేవలం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా మాత్రమే వచ్చింది. అయితే ఆ మూవీ భారీ సక్సెస్‌ గ్యాప్‌ను మర్చిపోయేలా చేసింది. లేటెస్ట్‌గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ చిత్రంతో తారక్‌ రాబోతున్నాడు. ఇక మీదట తారక్‌ నుంచి వరుసగా చిత్రాలు రిలీజ్‌ కానున్నాయి. వచ్చే రెండేళ్లలో ఏకంగా 4 పాన్‌ ఇండియా చిత్రాలతో తారక్‌ బిగ్‌ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. తొలుత దేవరతో సందడి చేయనున్న తారక్‌ ఆ తర్వాత బాలీవుడ్‌ చిత్రం 'వార్‌ 2'తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయనున్నాడు. అందులో స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నాడు. అలాగే 'దేవర 2' సీక్వెల్‌ కూడా తారక్‌ లైనప్‌లో ఉంది. తాజాగా స్టార్ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో 'NTR 31' ప్రారంభమైంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. అలాగే దీంతో పాటు 'హాయ్‌ నాన్న' డైరెక్టర్‌ శౌర్యువ్‌తోనూ ఎన్టీఆర్‌ మూవీ ఉండనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తుంది. ఇదీ కూడా పాన్‌ ఇండియా స్థాయిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. మెుత్తంగా రెండేళ్లలో కనీసం నాలుగు చిత్రాలు రిలీజ్‌ అయ్యేలా ఎన్టీఆర్‌ ప్లాన్‌ చేసుకున్నట్లు కనిపిస్తోంది.&nbsp; ‘NTR 31’ స్టోరీ ఇదేనా! ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ ప్రాజెక్ట్‌ శుక్రవారం (ఆగస్టు 9) పూజా కార్యక్రమంతో మెుదలైంది. NTR31 కొత్త పోస్టర్‌ గమనిస్తే ఈ సినిమా చైనా, ఇండియాకు మధ్య సాగే కథాంశం అని ప్రచారం జరుగుతోంది. 1969 నాటి ఓపియం మాఫియాకి రిలేటేడ్‌గా రానున్నట్లు సమాచారం. ఈ మాఫియాలో ఎన్టీఆర్‌ను డ్రగ్ లార్డ్‌గా చూపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 1969 రోజుల్లో కలకత్తా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్‌కి దగ్గరగా ఉండటంతో ఓపియం స్మగ్లింగ్‌కి అది అడ్డాగా మారింది. దాంతో ఆ పోర్టు నుంచే స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేది. చైనా డ్రగ్స్‌ మాఫీయా కోల్‌కాత్తాలో యాక్టివ్‌గా ఉండటం అక్కడి లోకల్స్‌ గ్యాంగ్స్‌కి, వీరికి తరచూ గోడవలు జరిగేవట. ఈ లింకులు సౌత్ ఈస్ట్ ఆసియాకే కాకుండా యూరప్ వరకు విస్తరించాయని అంటారు. ఇప్పుడు ఇదే పాయింట్‌తో ప్రశాంత్‌ NTR31 ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; తారక్‌ ద్విపాత్రాభినయం! తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త ఇటీవల హల్‌చల్‌ చేసింది. ఆ బజ్‌ ప్రకారం ఇందులో తారక్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరిగింది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్‌ కనిపిస్తారని టాక్‌ వినిపించింది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ప్రశాంత్‌ నీల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.&nbsp; ఆ టైటిల్‌ ఖరారు! NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్‌ఫుల్‌ పేరు అయినందువల్లే డ్రాగన్‌ టైటిల్‌ను ప్రశాంత్‌ నీల్‌ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్‌ ఇందులో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్‌ అయితేనే సరిగ్గా మ్యాచ్‌ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్‌ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.&nbsp;
    ఆగస్టు 10 , 2024
    <strong>Yellamma: యంగ్‌ హీరోతో బలగం వేణు ప్రాజెక్ట్‌ లాక్‌.. నాని, తేజ సజ్జా స్థానంలో రీప్లేస్‌!</strong>
    Yellamma: యంగ్‌ హీరోతో బలగం వేణు ప్రాజెక్ట్‌ లాక్‌.. నాని, తేజ సజ్జా స్థానంలో రీప్లేస్‌!
    కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు యెల్దండి (Venu Yeldandi) కెరీర్‌ ప్రారంభంలో చిన్న చిన్న రోల్స్‌ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. ఆ తర్వాత బజర్దస్త్ కామెడీ షాలో టీమ్‌ లీడర్‌గా మారి మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్‌గా మారిన వేణు గతేడాది ‘బలగం’ అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. తెలంగాణ గ్రామీణం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దీంతో వేణు తర్వాతి ప్రాజెక్ట్‌పై సహజంగానే అందరి దృష్టి ఏర్పడింది. అయితే బలగం వచ్చి ఏడాది దాటిన ఒక్క ప్రాజెక్ట్‌ వేణు అనౌన్స్‌ చేయకపోవడంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఓ యంగ్‌ హీరోతో వేణు సినిమా ఓకే అయినట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. వేణు డైరెక్షన్‌లో నితిన్‌! బలగం చిత్రాన్ని నిర్మించిన దిల్‌ రాజు బ్యానర్‌లోనే తన రెండో చిత్రం ఉంటుందని గతంలోనే కమెడియన్‌, దర్శకుడు వేణు యెల్దండి ప్రకటించారు. రెండో చిత్రానికి సంబంధించిన కథను ఎప్పుడో సిద్దం చేసిన వేణు త్వరలోనే పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్‌ హీరో నితీన్‌తో తన తర్వాతి చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్టోరీ గురించి నితీన్‌కు చెప్పగా కొన్ని మార్పులతో ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పాడని సమాచారం. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ మూవీకి 'యల్లమ్మ' (Yellamma Movie) అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్‌ చేసినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.&nbsp; నాని, తేజ సజ్జా రిజెక్ట్! వాస్తవానికి నేచురల్ స్టార్ నానితో వేణు యెల్డండి నెక్స్ట్‌ ప్రాజెక్ట్ ఉంటుందని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకు అనుగుణంగానే 'యల్లమ్మ' స్టోరీని నానికి వేణు వినిపించారు. కానీ సెకండ్‌ హాఫ్‌ పట్ల నాని సంతృప్తి చెందలేదని తెలిసింది. వేణు కూడా కథ పరంగా వెనక్కి తగ్గకపోవడంతో నాని ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత తేజ సజ్జకు స్టోరీ వినిపించగా ఈ యంగ్‌ హీరో ఓకే కూడా చెప్పారని తెలిసింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ కాంబో కూడా సెట్‌ కాలేదు. ఫైనల్‌గా నితీన్‌ వద్దకు కథను తీసుకెళ్లిన వేణు ఫైనల్‌గా అతడ్ని ఒప్పించినట్లు తెలుస్తోంది. షూటింగ్‌ ఎప్పుడంటే? ఇక వేణు యెల్దండి డైరెక్ట్ చేయనున్న ‘ఎల్లమ్మ’ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన ‘జనక అయితే గనక’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఈవెంట్‌కు దర్శకుడు వేణు కూడా హాజరయ్యారు. అతడు స్టేజ్ పైకి వెళ్లగానే కింద కూర్చున్న దిల్ రాజు ‘ఎల్లమ్మ’ ఎప్పుడు అని అడిగాడు. దీనికి వేణు స్పందిస్తూ ‘అదేదో సామెత చెప్పినట్లు ఉంది. కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే.. మీరే చెప్పాలి. నేను రేపు మొదలు పెట్టమన్నా రెడీ. చెప్పండి.. నవంబర్‌లో చేద్దామా అని అన్నాడు. దీనికి దిల్ రాజు బదులిస్తూ ‘వద్దులే ఫిబ్రవరిలో మొదలుపెడదాం’ అని స్పష్టం చేశారు.&nbsp; https://twitter.com/i/status/1844354638587498984 ‘బలగం’కు అవార్డుల పంట హాస్య నటుడు ప్రియదర్శి (Priyadarsi), కావ్యా కళ్యాణ్‌రామ్‌ (Kavya Kalyanram) జంటగా వేణు యెల్దండి తెరకెక్కించిన ‘బలగం’ (Balagam) చిత్రం గతేడాది మార్చి 3న విడుదలైంది. ఇందులో సుధాకర్‌ రెడ్డి, మురళిధర్‌ గౌడ్‌, కోటా జయరామ్‌, మైమ్ మధు ముఖ్యపాత్రలు పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. పల్లెల్లో స్పెషల్‌ షోలను సైతం వేశారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో ‘బలగం’ చిత్రం ఏకంగా మూడు అవార్డులు కొల్లగొట్టింది. అలాగే ఒక సైమా అవార్డు, సంతోషం అవార్డ్‌ను సొంతం చేసుకుంది.&nbsp;
    అక్టోబర్ 15 , 2024
    <strong>Jr NTR New Project: మైండ్‌బ్లోయింగ్‌ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తారక్‌.. మరో ఊచకోతకు సిద్ధం కండి!</strong>
    Jr NTR New Project: మైండ్‌బ్లోయింగ్‌ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తారక్‌.. మరో ఊచకోతకు సిద్ధం కండి!
    తారక్‌ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ (Devara) బాక్సాఫీస్‌ వద్ద సాలిడ్‌ విజయాన్ని అందుకుంది.&nbsp;వారం వ్యవధిలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం దిగ్విజయంగా థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ మూవీ సక్సెస్ తర్వాత తారక్ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ చిత్రం చేస్తున్న జూ.ఎన్టీఆర్‌ త్వరలోనే డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ‘NTR 31’ పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీపై అందరి దృష్టి ఉంది. అయితే లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం తారక్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్‌ డైరెక్టర్‌తో ఆ మూవీ ఉండనున్నట్లు చర్చించుకుంటున్నారు.&nbsp; ‘జైలర్‌’ డైరెక్టర్‌తో పాన్‌ ఇండియా చిత్రం! మ్యాన్ ఆఫ్‌ మాసెస్‌ జూ.ఎన్టీఆర్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. డాక్టర్‌, బీస్ట్ , జైలర్ వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ స్టార్ డైరెక్టర్‌ నెల్సన్ దిలీప్ కుమార్‌తో తారక్‌ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇప్పటికే తారక్‌కు నెల్సన్‌ కథ చెప్పారని అతి అతడికి బాగా నచ్చిందని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో దీనిని తెరెకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీస్ట్‌, జైలర్‌ హిట్స్‌తో నెల్సన్‌ పేరు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగింది. ముఖ్యంగా జైలర్‌తో రజినీకాంత్‌ను చూపించి తీరు అందరిని మెప్పించింది. అటువంటి డైరెక్టర్‌తో తారక్‌కు సినిమా పడితే రికార్డులు గల్లంతేనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.&nbsp; 2026 వరకూ ఆగాల్సిందే! తారక్ - నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చినా ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం తారక్‌ 'వార్‌ 2' (War 2) పెండింగ్‌ షూటింగ్‌తో పాటు త్వరలో 'NTR 31'ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అటు నెల్సన్‌ సైతం ‘జైలర్‌ 2’ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. రజనీకాంత్‌ కూలీ సినిమా షూటింగ్ పూర్తికాగానే ‘జైలర్‌ 2’ షూటింగ్‌ మెుదలు కానుంది. ఇద్దరూ బిజీ షెడ్యూల్స్‌తో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌ పైకి వెళ్లేందుకు మరింత సమయం పట్టవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2026లో ఈ సినిమా పట్టాలెక్క వచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో మూవీ చేయడం తనకు ఓకే అంటూ ఓపెన్‌గా ఇటీవల తారక్‌ ఆఫర్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో కూడా ఓ మూవీ ఉండే అవకాశం లేకపోలేదు.&nbsp; మా స్ట్రెంత్‌ అతడే: తారక్‌ 'దేవర' బ్లాక్‌ బాస్టర్‌ నేపథ్యంలో శుక్రవారం చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తారక్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. కల్యాణ్‌ రామ్‌ బావమరిది (భార్య సోదరుడు) హరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘హరి ముందుకు ఎప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు. చాలా మంది అతన్ని సరిగా అర్ధం చేసుకోరు. ఎందుకంటే అతను ముందుకు వచ్చి తన గురించి చెప్పుకోడు. ఎవరేమి అన్నా, ఎవరేమి అనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌కి మూల స్థంభం హరి. నాకు, కళ్యాణ్ అన్నకి మా ఇద్దరికీ స్ట్రెంత్ హరి. ఇందులో ఎటువంటి డోకా ఉండదు. నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు. నచ్చని వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు’ అని తారక్ అన్నారు. బంగ్లాదేశ్‌ రైతుగా జూ.ఎన్టీఆర్‌! తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ బజ్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్‌ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని ఫిల్మ్‌ వర్గాల సమాచారం.&nbsp; హీరోయిన్‌ ఫిక్సయ్యిందా? దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్‌-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్‌ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.&nbsp;&nbsp;
    అక్టోబర్ 05 , 2024
    <strong>Mahavatar Narsimha Hombale Films: నరసింహ స్వామి అవతారంతో బిగ్ ప్రాజెక్ట్‌.. ఇక రికార్డులన్నీ గల్లంతేనా!</strong>
    Mahavatar Narsimha Hombale Films: నరసింహ స్వామి అవతారంతో బిగ్ ప్రాజెక్ట్‌.. ఇక రికార్డులన్నీ గల్లంతేనా!
    ‘కేజీయఫ్‌’ (KGF), ‘కాంతార’ (Kantara), ‘సలార్’ (Salaar) తదితర చిత్రాలను ప్రేక్షకులను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ (hombale films) మరో సరికొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది. అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘మహావతార్‌: నరసింహ’ను (Mahavatar Narsimha) ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.&nbsp; పాన్‌ ఇండియా స్థాయిలో.. ‘మహావతార్‌: నరసింహ’ (Mahavatar Narsimha) పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ప్రకటించింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలిపింది. ఈ చిత్రాన్ని అశ్విన్‌ కుమార్‌ డైరెక్ట్ చేయనుండగా సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తారు. అత్యంత భారీ బడ్జెట్‌తో శిల్పా ధావన్‌, కుశాల్‌ దేశాయ్‌, చైతన్య దేశాయ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అంతేకాదు, మహావతార్‌ సిరీస్‌లో మరిన్ని చిత్రాలు రానున్నట్లు తెలుస్తోంది. ఇతర అవతారాలతో సినిమాలు రాబోతున్నాయని నిర్మాణ సంస్థ చెప్పకనే చెప్తోంది. https://twitter.com/hombalefilms/status/1857730656639303928 మైండ్‌ బ్లోయింగ్ ప్రాజెక్ట్స్‌ హోంబలే ఫిల్మ్స్‌ విషయానికొస్తే ఇప్పటికే విజయవంతమైన ‘కాంతార’, ‘సలార్‌’ ప్రపంచాలను కొనసాగిస్తూ కొత్త చిత్రాలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రిషభ్‌శెట్టి కీలక పాత్రలో ‘కాంతార: చాప్టర్‌1’ (kantara chapter 1) ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. తొలి భాగానికి ప్రీక్వెల్‌గా భారీ హంగులతో ఇది రూపుదిద్దుకుంటోంది. మరోవైపు ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా ‘సలార్‌: శౌర్యంగ పర్వం’ (salaar 2: shouryanga parvam) షూటింగ్‌ ఇటీవలే మొదలైంది. దీంతో పాటు, ప్రభాస్‌తో మరో రెండు సినిమాలను చేసేందుకు ఒప్పందం కూడా కుదిరింది. https://twitter.com/hombalefilms/status/1854795004155478062 మూడేళ్లు.. మూడు చిత్రాలు ప్రభాస్‌తో మరో రెండు సినిమాలు ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్‌ ఆ సందర్భంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్‌ సినిమాలకు వర్క్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. ఎప్పటికీ సినిమాటిక్‌ అనుభూతిని సృష్టించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభాస్‌తో సినిమాలు అనౌన్స్‌ చేసినట్లు చెప్పింది. ‘ది హోంబలే ఈజ్‌ కాలింగ్‌ ప్రభాస్‌’ అని పేర్కొంది. 2026, 2027, 2028ల్లో ఈ చిత్రాలు ఉండనున్నట్లు చెప్పింది. ‘సలార్‌ 2’ మినహాయించి మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.&nbsp;
    నవంబర్ 16 , 2024
    <strong>Prabhas Upcoming Movies: </strong><strong>ఇండియాలోని టాప్‌ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌!</strong>
    Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్‌ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌!
    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నాడు. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా వరుసగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ లైనప్‌ (Prabhas Upcoming Movies) లో పెడుతూ ‌అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాతో సాలిడ్‌ హిట్‌ అందుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాజాసాబ్‌’ షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇటీవల హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. అదే విధంగా ‘స్పిరిట్‌’, ‘కల్కి 2’ వంటి ప్రాజెక్ట్స్‌ పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా మరో మూడు సాలిడ్‌ ప్రాజెక్ట్స్‌కు ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తద్వారా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా లాంగ్వేజ్‌కు ఒక స్టార్‌ డైరెక్టర్‌తో ప్రభాస్‌ తన సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేయనున్న చిత్రాలు ఏవి? ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌తో.. తమిళ స్టార్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj)తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ‘ఖైదీ’, ‘విక్రమ్‌’, ‘మాస్టర్‌’, ‘లియో’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు తెరకెక్కించి లోకేష్‌ కనగరాజ్‌ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. త్వరలోనే వీరి ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ టాప్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో 'కూలీ' అనే చిత్రాన్ని లోకేష్ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనంతరం హీరో కార్తీతో ‘ఖైదీ 2’ తెరకెక్కించనున్నాడు. దాని తర్వాతనే ప్రభాస్‌-లోకేష్‌ చిత్రం పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. హిందీ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరానీతో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరానీ (Rajkumar Hirani)తో సినిమా చేయడం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ అంటూ ప్రభాస్‌ (Prabhas Upcoming Movies) ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్‌ కల అతి త్వరలోనే నెరవేరే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాజ్‌కుమార్‌ హిరానీ - ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే పరిస్థితులు కనిపిస్తున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం వినిపిస్తోంది. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇదిలా ఉంటే ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘త్రీ ఇడియట్స్‌’,’ పీకే’, ‘సంజు’, ‘డుంకీ’ వంటి బ్లాక్‌ బాస్టర్ చిత్రాలకు రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వం వహించారు. హిందీలో ఆయన సినిమాలకు సెపరేట్‌ ఫ్యాన్ బేస్ ఉంది. అటు ప్రభాస్‌కు సైతం దేశ, విదేశాల్లో అభిమానులు ఉన్నారు. వీరి కాంబోలో సినిమా పడితే అన్ని రికార్డులు గల్లంతు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.&nbsp; కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో.. కన్నడ స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ప్రభాస్‌ మరో చిత్రం (Prabhas Upcoming Movies) చేయనునున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ‘సలార్‌’ (Salaar) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రభాస్‌ కటౌట్‌ తగ్గ యాక్షన్‌ సీన్స్‌తో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. అయితే సినిమాకు సీక్వెల్‌గా ‘సలార్‌ 2’ రానున్నట్లు గతంలోనే ప్రశాంత్‌ నీల్‌ ప్రకటించారు. సలార్‌ మూవీ ఎండింగ్‌లో సెకండ్‌ పార్ట్‌కు సంబంధించిన లింక్‌ కూడా చూపించారు. అయితే ఇటీవల తారక్‌ - ప్రశాంత్ నీల్‌ కాంబోలో 'NTR 31' ప్రాజెక్ట్ లాంచ్‌ అయ్యింది. త్వరలోనే షూటింగ్‌ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత 'సలార్‌ 2'ను పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రశాంత్‌ వర్మ యూనివర్స్‌లోకి ప్రభాస్‌! ‘హనుమాన్‌’ (Hanuman) చిత్రంతో యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించాడు. అటువంటి ప్రశాంత్ వర్మతో ప్రభాస్ (Prabhas Upcoming Movies)&nbsp; ఓ సినిమా చేయడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌ వర్మ చెప్పిన కథకి ప్రభాస్‌ పచ్చజెండా ఊపడంతో ఈ కలయికలో సినిమా రావడం కన్ఫార్మ్‌ అయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సంస్థ ఈ మూవీని నిర్మించేందుకు రంగం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుంత ప్రశాంత్‌ వర్మ చేతిలో రెండు బిగ్‌ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘జై హనుమాన్‌’ (Jai Hanuman)తో పాటు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ఎంట్రీ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మనే డైరెక్ట్‌ చేయనున్నారు. ఈ రెండింటి తర్వాత ప్రభాస్‌తో సినిమా ఉంటుందని సన్నిహిత చెబుతున్నాయి.
    నవంబర్ 05 , 2024
    <strong>Adivi Sesh - Shruti Haasan: అడవి శేష్‌కు షాకిచ్చిన స్టార్‌ హీరోయిన్‌.. అర్థాంతరంగా ప్రాజెక్ట్‌ నుంచి క్విట్‌!</strong>
    Adivi Sesh - Shruti Haasan: అడవి శేష్‌కు షాకిచ్చిన స్టార్‌ హీరోయిన్‌.. అర్థాంతరంగా ప్రాజెక్ట్‌ నుంచి క్విట్‌!
    టాలీవుడ్‌ నటుడు అడివి శేష్‌ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్‌’, ‘హిట్‌ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్‌ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు అడివి శేష్‌ ఓకే చెప్పాడు. స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అనౌన్స్‌మెంట్‌ రావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్‌పై పడింది. Sesh Ex Shruti పేరుతో స్పెషల్‌ పోస్టర్‌ సైతం రిలీజ్‌ అయ్యింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు కూడా మెుదలుపెట్టారు. క్రమంలోనే హీరోయిన్ శ్రుతి హాసన్‌ చిత్ర యూనిట్‌కు ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. హ్యాండ్ ఇచ్చిన శ్రుతి హాసన్‌! యంగ్‌ హీరో అడివి శేష్‌, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌ కాంబోలో చిత్రం అనగానే ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. షానియెల్‌ దేవ్‌ దర్శకత్వంలో లవ్‌, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రానికి 'డెకాయిట్: ఏ లవ్‌ స్టోరీ' అనే టైటిల్‌ను సైతం ఖరారు చేశారు. ఇక సినిమాను పట్టాలెక్కించడమే తరువాయి అనుకున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్‌ నుంచి అనూహ్యంగా శ్రుతి హాసన్‌ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి గల స్పష్టమైన కారణాలు ఏంటో బయటకు రాలేదు. మూవీ టీమ్‌ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన సైతం చేయలేదు. మరి శ్రుతి హాసన్‌ను కన్విన్స్‌ చేసి మళ్లీ తీసుకుంటారా? లేదా కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసుకుంటారా? అన్న దానిపై ప్రస్తుతం సందిగ్దం నెలకొంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; డెకాయిట్‌ స్టోరీ ఇదే! ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్‌ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్లు వరుస దోపిడీలకు పాల్పడుతూ ఉంటారని, అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారని మూవీ టీమ్‌ తెలిపింది. డెకాయిట్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా గతేడాది డిసెంబర్‌లోనే రిలీజ్‌ చేశారు. ఇందులో అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. కాగా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకోనుంది.&nbsp; https://twitter.com/TrackTwood/status/1737423086188925221 బాలీవుడ్‌ స్టార్‌కు గాయం అడివి శేష్ (Adivi Sesh) నటించిన 'గూఢచారి' ఎంత‌టి విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ప్రస్తుతం దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'జీ 2'లో అడివి శేష్‌ నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్‌ హష్మీ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్‌ సీక్వెన్స్‌ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో నటుడు ఇమ్రాన్‌ హష్మీ గొంతు వద్ద గాయమైంది. జంపింగ్ సీన్స్ తీస్తున్న స‌మ‌యంలో మెడ స్వల్పంగా కట్ అయి ర‌క్తం కారింది. దీంతో షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చి న‌ట్టు స‌మాచారం. వెంట‌నే వైద్యులు ఇమ్రాన్‌కు చికిత్స అందించారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బ‌నితా సంధు (Banita Sandhu) హీరోయిన్‌గా మ‌ధుశాలిని, సుప్రియ యార్ల‌గ‌డ్డ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల (Sricharan Pakala) సంగీతం అందిస్తున్నాడు. https://twitter.com/Movies4u_Officl/status/1843311804039967199 అడివి శేష్‌ సినీ ప్రస్థానం ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ (Sontham) సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ (Karma) సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన ‘పంజా’ (Panja) సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’ (Kshanam), ‘గూఢచారి’ (Goodachari), ‘ఎవరు’ (Yevaru), ‘మేజర్’ (Major), ‘హిట్‌ 2’ (Hit 2) వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి చేతిలో గూఢచారి సీక్వెల్‌ (G2)తో పాటు, ‘డెకాయిట్’ వంటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్న సంగతి తెలిసిందే.&nbsp;
    అక్టోబర్ 08 , 2024
    వచ్చే రెండెళ్లలో ప్రభాస్ అప్‌ కమింగ్  సినిమాలు ఇవే.. తొలిసారి పోలీస్ ఆఫిసర్‌గా ప్రభాస్
    వచ్చే రెండెళ్లలో ప్రభాస్ అప్‌ కమింగ్ సినిమాలు ఇవే.. తొలిసారి పోలీస్ ఆఫిసర్‌గా ప్రభాస్
    ]ప్రస్తుతం డార్లింగ్ చాలా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో 2024లో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఇందులో కూడా పఠాన్ తరహా యాక్షన్ ఉంటే&nbsp; ఆ ఏడాది ఊపేస్తుంది.
    ఫిబ్రవరి 13 , 2023
    బీ టౌన్‌లో సెగలు పుట్టిస్తున్న హైదరాబాద్‌ అందం శ్రేయా ధన్వంతరి
    బీ టౌన్‌లో సెగలు పుట్టిస్తున్న హైదరాబాద్‌ అందం శ్రేయా ధన్వంతరి
    ]యూసే తరఫున శ్రేయకు తన భవిష్యత్‌ ప్రాజెక్ట్‌లకు శుభాకాంక్షలు.
    ఫిబ్రవరి 13 , 2023
    Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
    Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
    నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగాలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ ‘కామిక్ కాన్’లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ‘ప్రాజెక్ట్ K’ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్ పాల్గొన్నారు. గ్లింప్స్‌ చెప్పే సీక్రెట్స్ ఇవే! కాగా, ప్రాజెక్ట్‌ K సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు. ఇక సినిమా టైటిల్ కింద ‘2898 AD’ అని పెట్టారు. అంటే కలియుగాంతం చివర్లో జరిగే కథ అని డైరెక్టర్‌ చెప్పకనే చెప్పాడు. గ్లింప్స్ చూస్తే సాధారణంగా ప్రపంచాన్ని చీకటి కమ్ముకున్నప్పుడు ఒక వెలుగు వస్తుంది అని, ప్రపంచాన్ని విలన్ తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు కల్కి ఉద్భవిస్తాడని, ప్రజల్ని కాపాడతాడని తెలుస్తుంది. అయితే గ్లింప్స్‌ను మరింత పరిశీలనగా చూస్తే చాలా విషయాలు మనకు అర్థమౌతాయి. కలియుగాంతం సమయంలో ఈ ప్రపంచం పూర్తిగా రోబోల మయంగా, ఆధునిక ఆయుధాలతో యుద్ధం జరిగే స్థాయికి వెళ్తుందని గ్లింప్స్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పైగా 2898 ADలో ప్రస్తుత స్థాయిలో జనాభా కాకుండా చాలా కొద్దిమంది ప్రజలే ఉండొచ్చని భావించవచ్చు. వారంతా ఓ వ్యక్తి (రాజు) పాలనలో జీవిస్తుండవచ్చు. https://twitter.com/DEADLINE/status/1682221771154677760?s=20 అమితాబ్‌ పాత్ర నిడివి తక్కువేనా? ప్రాజెక్ట్‌లో Kలో రాజు (అమితాబ్‌ బచ్చన్‌) తన ప్రజలని పాలిస్తుంటే ఒక విలన్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆ రాజుని బంధించి అతని ప్రజలని విలన్ తనకు బానిసలుగా చేసుకున్నట్లు గ్లింప్స్‌లో కనిపిస్తోంది. అలాంటప్పుడు రాజు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో వారిని ఆదుకునేందుకు కల్కి అవతారంలో హీరో (ప్రభాస్‌) ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. మూవీలో అయితే మొదట అమితాబ్ వచ్చి ఆ తర్వాత ప్రభాస్ వస్తాడని అర్థం చేసుకోవచ్చు. శివాలయంలోకి ఓ రోబో రావడం గ్లింప్స్‌లో చూశాం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడి క్యారెక్టర్‌లో అమితాబ్ నటిస్తున్నట్లు టాక్.&nbsp; https://twitter.com/DEADLINE/status/1682129398600966146?s=20 ప్రభాస్ అందుకే కల్కి అవుతాడా? ఇక ప్రాజెక్ట్ K అంటే ‘ప్రాజెక్ట్ కల్కి’ అని, ప్రభాస్‌తో లోకాన్ని కాపాడించడానికి కొంతమంది చేసే యుద్ధమని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. నిమిషం వీడియోతో డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్‌గా కథ మెుత్తం రివీల్ చేసినట్లు అర్థమవుతోంది. ఇక కొంచెం డీటేలింగ్‌లోకి వెళ్తే అమితాబ్‌ బచ్చన్‌తో పాటు హీరోయిన్‌ దీపికా పదుకొణేను కూడా విలన్లు బంధించినట్లు గ్లింప్స్‌లో చూపించారు. దీన్ని బట్టి ప్రభాస్‌ ఆమె కోసం వచ్చి కల్కి లాగా మారతాడా? అన్న సందేహం కూడా ఉత్పన్నమవుతుంది. లేదా హీరోయిన్‌ను కాపాడే క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా దీపికా, ప్రభాస్‌ మధ్య ప్రేమ సన్నివేశాలను కూడా బాగా ఎలివేట్‌ చేయాలని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నారు.&nbsp; చీకటికి రారాజు అతడే? ఇకపోతే ఈ సినిమాలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రతినాయకుడిగా కనిపిస్తాడని మెున్నటి వరకూ ఊహాగానాలు వినిపించినా తాజాగా విడుదలైన గ్లింప్స్‌ వీడియోతో ‌అది కన్‌ఫార్మ్‌ అయింది. ఎందుకంటే ప్రాజెక్ట్‌Kలో కమల్‌ హాసన్‌ నటించనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించిన సమయంలో ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. 'భూమి మెుత్తాన్ని కమ్మేసే షాడో (చీకటి) కోసం వెతికామని.. ఆ పాత్ర చేయగల ఒకే ఒక్కడు దొరికేశాడు' అని కమల్‌ గురించి ప్రకటించారు. తాజా గ్లింప్స్‌ కూడా భూమిని చీకటి కమ్మేయడం గమనించవచ్చు. ఈ రెండు కలిపి చూస్తే ఇందులో విలన్లకు రారాజుగా కమల్‌ హాసన్‌ కనిపిస్తాడని అర్థం చేసుకోవచ్చు.&nbsp; https://twitter.com/i/status/1672854637014138880 సూపర్ రెస్పాన్స్ గ్లింప్స్‌ని చూస్తుంటే గూస్‌బమ్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు. విజువల్ వండర్‌గా, హాలీవుడ్ రేంజ్ సినిమాని తలపిస్తోందని చెబుతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ విజనరీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇక, సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. మళ్లీ మళ్లీ వినాలనిపించే ట్రాక్‌ని అందించాడు. గ్లింప్స్ చూశాక మ్యూజిక్ హాంట్ చేస్తూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు.&nbsp; https://twitter.com/THR/status/1682126315229683715?s=20 విడుదల తేదీ? ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారం ఈ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ కావాలి. అయితే, గ్లింప్స్‌లో కేవలం 2024లో వస్తుందనే ఇచ్చారు. అంటే, మూవీ డేట్ మారుతుందనే సంకేతాలు ఇచ్చారు. మరి, జనవరి 12న కాకుండా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్‌కి అచ్చొచ్చిన ‘మే9’న కల్కిని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు ఇదే రోజున రిలీజ్ అయ్యాయి. https://www.youtube.com/watch?v=bC36d8e3bb0
    జూలై 21 , 2023
    Project K: మూవీ పోస్టర్లతో కథ చెప్పేసిన నాగ్‌ అశ్విన్‌.! కళ్లు, వేళ్లు ఏం చెబుతున్నాయో తెలుసా?
    Project K: మూవీ పోస్టర్లతో కథ చెప్పేసిన నాగ్‌ అశ్విన్‌.! కళ్లు, వేళ్లు ఏం చెబుతున్నాయో తెలుసా?
    ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్- K (Project-K). అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, దిశా పటాని వంటి స్టార్లతో నిండిపోయిన ఈ సినిమాలో మరో స్టార్ నటుడు కమల్ హాసన్ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌కు విలన్‌గా కమల్ హాసన్ నటిస్తున్నాడట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డీల్ పూర్తైనట్లు సమాచారం. విలన్ పాత్ర పోషించడానికి కమల్ హాసన్ 10 అంకెల పారితోషికం డిమాండ్ చేశాడట. అయితే, ఈ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ఒక్కో పోస్టర్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేస్తోంది.&nbsp; ఒక్కో పోస్టర్‌లో ఒక్కో ప్రత్యేకత.. విరిగి పడిన చేతికి ఎక్కుపెట్టిన తుపాకులు, పిడికిలి బిగించిన చేతులు, దూరంగా కొండ అంచుపై చీకటిలో నిలబడిన మనిషి, ఆశతో నిండిన కళ్లు.. ఇవీ ప్రాజెక్ట్ K చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు. ఒక్కో పోస్టర్‌పై ఒక్కో రకమైన స్టేట్‌మెంట్‌ని విడుదల చేసి పాత్రల గురించి టీం హింట్ ఇచ్చింది.&nbsp; తాజాగా దిశా పటాని పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పెళ్లి కూతురిని ముస్తాబు చేస్తున్నట్లు ఉంది. దిశా పటాని కళ్లను మాత్రమే చూపించారు. ఆ కళ్లను చూస్తే ఏదో చెప్పాలి అన్నట్లుగా ఆశగా ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోంది. మరి, ఈ ఎదురు చూపు ఎవరికోసం? ఎందుకోసం? అసలు దిశ క్యారెక్టర్ ఏంటి? అని ఆలోచనలో పడ్డారు.&nbsp; శివరాత్రి సందర్భంగా చిత్రబృందం రిలీజ్ ప్రకటిస్తూ పోస్టర్‌ని విడుదల చేసింది. ఓ భారీ చేయి విరిగిపడి ఉండగా, ఆ చేతివైపు ముగ్గురు వ్యక్తులు (ప్రత్యేక సూట్ వేసుకుని) అత్యాధునిక తుపాకులు గురిపెట్టి నిల్చొని ఉండటం ఇందులో చూపించారు. అక్కడ పడి ఉన్న వస్తువులను చూస్తుంటే చుట్టు పక్కల విధ్వంసం జరిగినట్లు తెలిసిపోతోంది. మరి, ఈ విధ్వంసం ఆ చేయి సృష్టించిందా? లేదా అసుర సంహారమా? ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందనే క్యాప్షన్ పెట్టి దీనిని మరింత ఆసక్తికరంగా మలిచారు.&nbsp; బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బర్త్ డే సందర్బంగా విష్ చేస్తూ ప్రాజెక్ట్ K టీం మరో పోస్టర్ రిలీజ్ చేసింది. పిడికిలి బిగించిన చేతి ఫొటోను ఇందులో చూపించింది. చేతికి రక్షణగా ఓ వస్త్రాన్ని కట్టుకున్నట్లు ఉంది. ఈ పోస్టర్‌లోనే ‘Legends are Immortal’ (ధీరులకు మరణం ఉండదు) అని క్యాప్షన్‌ ఇచ్చారు. అంటే, అమితాబ్ పాత్ర పోరాట సన్నివేశాలకు మిళితమై ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కూడా దాదాపు ఇలాంటి పోస్టర్‌నే విడుదల చేసింది టీమ్‌. చేతికి రక్షణగా పెట్టుకున్న సూట్ ఇందులో ఉంది. ఆ పోస్టర్‌కు ‘Heroes are Not Born, They Rise’ అని క్యాప్షన్ ఇచ్చారు.&nbsp; ఎవరీ సేవియర్? దీపిక పదుకునె బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్ రిలీజైంది. పోరాడి అలసిపోయిన ఓ సేవియర్‌ని చూపిస్తున్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ఇందులో దీపిక ముఖం చూపించలేదు. కానీ, కొండపై నిల్చొని పిడికిలిని బిగించినట్లుగా ఉంది.&nbsp; పోస్టర్‌పై ‘A Hope in The Dark’ అని క్యాప్షన్ ఉంది. అంటే, దారులన్నీ చీకటిగా మారినప్పుడు మార్గం చూపి ముందుకు నడిపించే వెలుగు దివ్వె అని చెప్పకనే చెప్పారు. సినిమాలో కథానాయకులు దిగ్బంధంలో ఉన్నప్పుడు వీరిని రక్షించేందుకు దీపిక వస్తుందేమో అని చర్చించుకుంటున్నారు.&nbsp; ఇదేనా స్టోరీ? ‘ప్రాజెక్ట్ K’ స్టోరీపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. విష్ణు మూర్తి దశావతారమైన కల్కి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడట. కల్కికి తండ్రిగా అశ్వథ్థామ పాత్రను బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కలియుగాంత సమయంలో సృష్టి రక్షణకు చేయూతనిచ్చేందుకు కల్కిగా వస్తాడని, దుష్ట సంహారానికై చేసే పోరాటంలో వీరందరూ ఏకమైతారని తెలుస్తోంది.&nbsp; https://twitter.com/VyjayanthiFilms/status/1645313158955802625?s=20 మరోవైపు, కొడుకు ఆశయాన్ని నెరవేర్చడానికి తండ్రి ఏం చేశాడనే నేపథ్యంలో కథ సాగుతుందనే ప్రచారమూ జరుగుతోంది. మొత్తానికి పీరియాడికల్ స్టోరీని ఎంచుకుని లేటెస్ట్ హంగులతో సైంటిఫిక్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. ఇందులో టైమ్ మిషన్ కాన్సెప్ట్ కూడా ఉండనుందట. రైడర్స్‌ని విలన్లుగా పరిచయం చేయడంతో మరింత హైప్ పెరిగింది. ఏదేమైనా ఈ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని నెలకొల్పుతుందని చిత్రబృంద సభ్యులు వెల్లడిస్తున్నారు.&nbsp; స్పెషల్ ఫోకస్.. సినిమాలో టైం మిషన్ కాన్సెప్ట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య 369 వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు మెంటార్‌గా పనిచేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా ఉండబోతోందని ముందుగానే సింగీతం చెప్పారు. ఈ సినిమాలో ఉపయోగించే కార్ల విషయంలో నాగ్ అశ్విన్ స్పెషల్ ఫోకస్ పెట్టాడు. అధునాతన ఈవీ వెహికల్స్ డిజైన్ విషయంలో సాయం అందించాలని అభ్యర్థించగా మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ముందుకొచ్చారు. ఇలాంటి సినిమాలు తనకు ఇష్టమని కచ్చితంగా హెల్ప్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సినిమా జనవరి 12, 2024న విడుదల కానుంది.&nbsp;
    జూన్ 15 , 2023

    @2021 KTree