• TFIDB EN
 • ఆర్ఆర్ఆర్ (2022)
  U/ATelugu3h 2m

  నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ.

  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
  Watch
  స్ట్రీమింగ్‌ ఆన్‌Netflix
  Watch
  స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstar
  Watch
  రివ్యూస్
  How was the movie?

  తారాగణం
  ఎన్టీ రామారావు జూనియర్.కొమరం భీమ్/అక్తర్, హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణకు చెందిన గోండు గిరిజన నాయకుడు.
  రామ్ చరణ్ఎ. రామరాజు, బ్రిటీష్ రాజ్‌కు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన విప్లవ నాయకుడు
  అజయ్ దేవగన్తండ్రి సీతారామరాజు
  అలియా భట్సీతారామ రాజు కాబోయే భర్త
  శ్రియా శరన్సీతారామరాజు తల్లి
  సముద్రకనిసీతారామరాజు మామయ్య
  రే స్టీవెన్సన్గవర్నర్ స్కాట్ బక్స్టన్
  అలిసన్ డూడీకేథరీన్ బక్స్టన్
  ఒలివియా మోరిస్జెన్నిఫర్ జెన్నీ
  చత్రపతి శేఖర్భీమ్ సహచరుడు
  మకరంద్ దేశ్‌పాండేభీమ్ సహచరుడు
  రాజీవ్ కనకాలనిజాం ప్రత్యేక సలహాదారు
  మార్క్ బెన్నింగ్టన్కన్నింగ్‌హామ్
  ఎడ్వర్డ్ బుహాక్ జేక్
  ట్వింకిల్ శర్మమల్లి
  ఎడిటోరియల్ లిస్ట్
  కథనాలు
  SSMB29: రాజమౌళి సినిమాలో మహేష్‌ డ్యూయల్‌ రోల్‌.. మరో కీలక పాత్రలో తెలుగు హీరో?
  SSMB29: రాజమౌళి సినిమాలో మహేష్‌ డ్యూయల్‌ రోల్‌.. మరో కీలక పాత్రలో తెలుగు హీరో?
  ‘ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ సక్సెస్ అందుకున్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తన తదుపరి సినిమాని మహేష్ బాబు (Mahesh Babu)తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘SSMB29’ చిత్రంలో మహేష్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అది చూసిన మహేష్‌ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు.  మహేష్ ద్విపాత్రిభినయం! లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం రాజమౌళి తెరకెక్కించనున్న 'SSMB29' మూవీలో మహేష్‌ ద్విపాత్రిభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రాజమౌళి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. ఇది సూపర్ స్టార్ అభిమానులకు నిజంగా శుభవార్త కానుంది. ఇక ఈ మూవీలో మహేష్‌ చాలా ఇంటెన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటి వరకూ చూడని మహేష్‌ను ఈ సినిమాలో చూడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. SSMB29 కథకు ప్రేరణ అతడే! మహేష్‌ - రాజమౌళి చిత్రం.. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ ఇటీవల ఓ ఇంటర్యూలో సినిమా కథకు సంబంధించి మాట్లాడారు. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాసే ప్రయత్నం చేశాను. కానీ, రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నాని స్పెషల్‌ రోల్‌..! 'SSMB 29' గురించి మరో రూమర్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో యంగ్‌ హీరో నాని (Nani) ఓ స్పెషల్‌ రోల్‌లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా తెరకెక్కనుండటంతో పలు పాత్రల కోసం రాజమౌళి.. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకూ నటీనటులను రంగంలోకి దించనున్నారట. ఈ క్రమంలోనే ఒక పాత్ర కోసం నాని పేరును ఫైనల్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజమౌళి, నాని మధ్య మంచి అనుబంధం ఉండటంతో యంగ్‌ హీరో నటించడం ఖాయమని అంటున్నారు. దీనిపై రాజమౌళి టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా, గతంలో రాజమౌళి రూపొందించిన 'ఈగ' సినిమాలో నాని నటించాడు. స్క్రీన్‌పైన కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకున్నాడు.  శరవేగంగా ప్రీ ప్రొడక్షన్‌ పనులు! ప్రస్తుతం రాజమౌళి తన 200 మంది బృందంతో ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం కాకముందే 200 మంది టీమ్‌ అంటే సెట్స్‌ పైకి వెళ్లాక ఇంకెంత మంది పని చేస్తారోనని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. కాగా, ‘SSMB29’ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా రాజమౌళి తెరకెక్కించనున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో హాలీవుడ్ మేకర్స్‌తో రాజమౌళి ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా ఇండోనేషియా యాక్ట్రెస్ ‘చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్’ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.  https://telugu.yousay.tv/ssmb-29-is-this-mahesh-babus-final-look-in-rajamoulis-film.html
  మార్చి 12 , 2024
  <strong>Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్‌ నుంచి రామ్‌చరణ్‌ ఫొటోస్‌ లీక్‌.. వైజాగ్‌లో చెర్రీ క్రేజ్‌ మామూల్గా లేదుగా !</strong>
  Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్‌ నుంచి రామ్‌చరణ్‌ ఫొటోస్‌ లీక్‌.. వైజాగ్‌లో చెర్రీ క్రేజ్‌ మామూల్గా లేదుగా !
  మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ (Ram Charan).. టాప్‌ గేర్‌లో దూసుకెళ్లున్నాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఆయన క్రేజ్‌ గ్లోబల్‌ స్థాయికి చేరింది. ప్రస్తుతం చరణ్‌.. గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ’ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్‌చరణ్‌ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు మెుదలయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. తాజాగా సెట్‌లో రామ్‌చరణ్‌ లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వైజాగ్‌లో షూటింగ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా చివరి దశ షూటింగ్‌ను మేకర్స్‌ వైజాగ్‌లో ప్లాన్ చేశారు. ఈ మూవీలోని పొలిటికల్ మీటింగ్‌కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఆర్‌కే బీచ్‌లో షూట్ చేస్తున్నారు. ఓపెన్ సెట్‌లో రామ్ చరణ్, ఎస్‌.జే సూర్య తదితరుల ముఖ్య తారాగణంతో శంకర్ ఈ షెడ్యూల్‌ని చిత్రీకరిస్తున్నారు. మార్చి 19 వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. బహిరంగ షూటింగ్ కావడంతో సెట్స్‌లోని చరణ్ ఫోటోలు, వీడియోలు బయటకి వచ్చాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో రామ్ చరణ్.. చాలా స్టైలిష్‌గా జెంటిల్‌మెన్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్ ఐఏఎస్ పాత్రకి సంబంధించినదని సమాచారం. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి.&nbsp; https://twitter.com/i/status/1768563620739453357 https://twitter.com/n_suren/status/1768531852414079277 https://twitter.com/i/status/1767734419715133518 https://twitter.com/venkysayzzz/status/1768539657896087692 చరణ్‌కు ఘన స్వాగతం వైజాగ్‌ షూటింగ్‌ నేపథ్యంలో.. నిన్ననే రామ్‌చరణ్‌, తమిళ నటుడు ఎస్‌.జే సూర్యతో పాటు ప్రధాన తారాగణం అంతా వైజాగ్‌ చేరుకుంది. వైజాగ్‌ ఎయిర్‌పోర్టుకు రామ్‌చరణ్‌ వస్తున్నట్లు ముందే తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి వెళ్లారు. చరణ్‌ ఎయిర్‌పోర్టులో దిగగానే కేరింతలు కొట్టారు. చరణ్‌ నినాదాలతో ఎయిర్‌పోర్టును మార్మోగించారు. తమ అభిమాన హీరోపై పూల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1768308149847753158 https://twitter.com/i/status/1768557163746656272 https://twitter.com/i/status/1768447264660296074 చరణ్‌ బర్త్‌డే రోజున స్పెషల్‌ సాంగ్‌ రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. మార్చి 27వ తేదీన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం నుంచి తొలి పాట రానుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (SS Thaman) ఇటీవలే ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించారు. ‘జరగండి.. జరగండి’ పాటని ఆ రోజున విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది దీపావళికి ఈ పాటను తీసుకొస్తామని ప్రకటించి మూవీ టీమ్ వాయిదా వేసింది. ఇప్పుడు చెర్రీ పుట్టిన రోజున ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఈ పాటతోనే ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్ డేట్ కూడా వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.&nbsp; ‘RC 16’ చిత్రానికి ముహోర్తం ఫిక్స్‌! ‘గేమ్‌ ఛేంజర్’ సినిమా తర్వాత రామ్‌ చరణ్‌.. ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు (Buchi Babu) దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నారు. ‘RC16’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. మార్చి 20వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఆ కార్యక్రమంతో ఈ సినిమా షురూ అవుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.&nbsp; మూవీ టైటిల్ అదేనా! రామ్‍చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్‍ను కూడా ఖరారు చేసినట్టు సినీ సర్కిల్‍లో టాక్ వినిపిస్తోంది. దీనిపై పూజా కార్యక్రమం రోజున అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. ఉత్తరాంధ్ర సైడ్ ‘పెద్ది’ అంటే పెద్ద అని అర్ధం. ఇప్పటికీ చాలామంది ముసలివారిని, పెద్దవారిని ‘మా పెద్ది’ అని బంధువులు, కుటుంబ సభ్యులు పిలుస్తూ ఉంటారు. కథ కూడా టైటిల్‌కు మ్యాచ్‌ అయ్యేలా ఉండటంతో ఆ పేరునే సినిమాకు ఫిక్స్‌ చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ టైటిల్‌ను ఎన్టీఆర్‌ కోసం బుచ్చిబాబు అనుకున్నారని గతంలో రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ టైటిల్‌నే రామ్‌చరణ్‌కు తీసుకున్నట్లు వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.&nbsp;
  మార్చి 16 , 2024
  War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌.. పూర్తిగా లుక్‌ మార్చిన తారక్&nbsp;
  War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌.. పూర్తిగా లుక్‌ మార్చిన తారక్&nbsp;
  భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). YRF (Yash Raj Films) స్పై యూనివ‌ర్స్‌లో 6వ చిత్రంగా రానుండటంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇటీవల ‘బ్ర‌హ్మ‌స్త’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అయాన్ ముఖ‌ర్జీ.. ‘వార్‌ 2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోష‌న్‌, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఈ సినిమాలో నటించనున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వార్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. అయితే తాజాగా హృతిక్‌, తారక్‌లకు సంబంధించి సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.&nbsp; హృతిక్‌, తారక్‌ షూట్‌ ఎప్పుడంటే! ‘వార్‌ 2’ (War 2) చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్న హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), తారక్‌ (Jr NTR) షూటింగ్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. దీని ప్రకారం 'వార్‌ 2'లో హృతిక్‌కు సంబంధించిన సన్నివేశాలను జపాన్‌లో చిత్రీకరించనున్నారు. షావోలిన్‌ టెంపుల్‌ దగ్గర హృతిక్ ఎంట్రీ సీన్స్‌ తెరకెక్కిస్తారని టాక్‌ వినిపిస్తోంది. మార్చి 7 నుంచి షూటింగ్‌ ప్రారంభమవుతుందని సమాచారం. ఇక తారక్ విషయానికి వస్తే అతడు ఏప్రిల్‌లో షూటింగ్‌లో జాయిన్‌ అవుతాడని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచి తారక్‌-హృతిక్‌కు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తారని అంటున్నారు.&nbsp; గాయం నుంచి కోలుకున్న హృతిక్‌! బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌.. వార్ 2 చిత్రం కోసం గత కొంతకాలం నుంచి వర్కౌట్స్‌ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఆయన జిమ్‌ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అనుకున్న దానికంటే ‘వార్‌ 2’ షూట్‌ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం హృతిక్‌ పూర్తి ఫిట్‌గా ఉండటంతో మార్చి 7 నుంచి ఆయనకు సంబంధించిన సన్నివేశాలను షూట్‌ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హృతిక్‌ కూడా ఓకే చెప్పడంతో మూవీ యూనిట్‌ జపాన్‌లో వాలిపోయేందుకు సిద్ధమవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1764908346640040382 ‘వార్‌ 2’లో తారక్‌ గెటప్‌ అదేనా? కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ (Devara) చిత్రంలో ప్రస్తుతం తారక్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి వరుస షెడ్యూల్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటిస్తోంది. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ఓ పార్టీకి తారక్‌ సతీసమేతంగా హాజరయ్యాడు. అక్కడ తారక్‌ లుక్‌ చూసి అంతా ఫిదా అయ్యారు. మెున్నటి వరకూ కాస్త లావుగా కనిపించిన తారక్‌.. లేటెస్ట్‌ ఫొటోల్లో బరువు తగ్గి చాలా స్లిమ్ అయ్యారు. దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రిభినయం చేస్తున్నారని వార్తలొస్తున్న తరుణంలో ఎన్టీఆర్‌ ఇలా మారి ఆ గాసిప్స్‌ను కన్ఫార్మ్‌ చేశారని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరోవైపు ‘వార్‌ 2’లోనూ తారక్‌ ఇదే గెటప్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ‘వార్‌ 2’ రిలీజ్ ఎప్పుడంటే? భారీ బడ్జెట్‌తో రూపొందనున్న 'వార్‌ 2' చిత్రం విడుదల తేదీని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 2025 ఆగ‌ష్టు 14న ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు సమాచారం ఉంది. హృతిక్ రోష‌న్‌కు ధీటుగా ప‌వ‌ర్‌ఫుల్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని స‌మాచారం. అటు బాలీవుడ్‌ స్టార్‌ హీరో జాన్‌ అబ్రహం కూడా ‘వార్‌ 2’లో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించ‌నుంది.&nbsp;
  మార్చి 05 , 2024
  Telugu Films based on the Ramayana: సీతారాములు లేకున్నా రామాయాణాన్ని గుర్తు చేసిన చిత్రాలు ఇవే!
  Telugu Films based on the Ramayana: సీతారాములు లేకున్నా రామాయాణాన్ని గుర్తు చేసిన చిత్రాలు ఇవే!
  వాల్మీకి రచించిన ఇతిహాసగాథ రామాయణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకొని ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కి అఖండ విజయాన్ని అందుకున్నాయి. ఈ కోవలోనే తాజాగా ‘ఆదిపురుష్‌’ చిత్రం సైతం తెరకెక్కింది. రామాయణం గొప్పతనాన్ని ఈ తరం వారికి చాటి చెప్పే ఉద్దేశంతో ఈ సినిమాను తీశారు. అయితే రామాయణంలోని పాత్రలు లేకుండా కథను మాత్రమే ప్రతిబింబిస్తూ కమర్షియల్‌ హంగులతో రూపొందిన చిత్రాలు కూడా తెలుగులో వచ్చాయి. వాటిని పరిశీలనగా చూస్తే తప్ప ఆ విషయం అర్థం కాదు. అటువంటి చిత్రాలను YouSay మీ ముందుకు తెచ్చింది. ఆయా చిత్రాల్లోని రామాయణం తాలుకూ మూలాలను ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; దసరా (Dasara) హీరో నాని రీసెంట్‌ చిత్రం ‘దసరా’లోనూ రామాయణం కనిపిస్తుంది. ముఖ్యంగా విలన్‌ పాత్రలు రావణుడి ఛాయలు కనిపిస్తాయి. హీరోయిన్‌పై కన్నేసిన విలన్‌.. ఆమెను సొంతం చేసుకోవడానికి కుట్రలు చేస్తుంటాడు. చివరికి హీరో అతడ్ని చంపి తన భార్యకు, ఊరికి ప్రశాంతత కల్పిస్తాడు.&nbsp; ఆర్ఆర్ఆర్‌ (RRR) ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ తారక్ (Jr NTR) పాత్రను గమనిస్తే ఆంజనేయుడు గుర్తుకు రాక మానడు. తన గూడెం నుంచి బ్రిటిష్‌ వారు ఎత్తుకెళ్లిన పాప ఆచూకి కోసం తారక్‌ హస్తినకు వెళ్తాడు. రావణకోట లాంటి బ్రిటిష్‌ బంగ్లాలోకి వెళ్లి బందింపబడిన బాలికలో ధైర్యం నింపుతాడు. చివరికి పాపను రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు. రాముడి వద్దకు సీతను ఆంజనేయుడు ఎలా చేర్చాడో అచ్చం అలాగే.&nbsp; వర్షం (Varsham) ప్రభాస్‌ - త్రిష (Trisha) జంటగా నటించిన ఈ చిత్రానికి శోభన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో హీరోయిన్లుగా గాఢంగా ప్రేమించుకోగా వీరి మధ్యలోకి విలన్‌ (గోపీచంద్‌) ఎంట్రీ ఇస్తాడు. త్రిషను ఇష్టపడి ఆమెను దక్కించుకోవాలని అనుకుంటాడు. అతడ్ని అంతం చేసి చివరికి ప్రభాస్‌ (Prabhas) తన ప్రేమను గెలిపించుకుంటాడు. ఈ కథను పరిశీలిస్తే రామాయణంలో సీతపై మనసు పడ్డ రావణుడు.. అతడ్ని సంహరించిన రాముడు గుర్తుకు వస్తారు.&nbsp; వరుడు (Varudu) 2010లో వచ్చిన ఈ చిత్రానికి గుణశేఖర్‌ (Gunasekhar) దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్‌ (Allu Arjun), భానుశ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) జంటగా నటించగా.. ప్రతినాయకుడిగా తమిళ నటుడు ఆర్య (Actor Arya) చేశాడు. కథలోకి వెళ్తే హీరో హీరోయిన్లకు పెళ్లి నిశ్చయం అవుతుంది. ఈ క్రమంలో పెళ్లి పీటలపై నుంచి కథానాయకిని విలన్‌ ఎత్తుకెళ్తాడు. విలన్‌ను కనిపెట్టి అంతం చేయడం ద్వారా హీరో తన భార్యను పొందుతాడు. ఈ మూవీ స్టోరీ కూడా రామాయణాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక్కడు (Okkadu) గుణశేఖర్‌ దర్శకత్వంలో మహేష్‌ బాబు (Mahesh Babu), భూమిక (Bhumika) జంటగా నటించిన బ్లాక్‌బాస్టర్‌ చిత్రం ‘ఒక్కడు’. ఇందులో హీరోయిన్‌పై మనసు పడ్డ విలన్‌ (ప్రకాష్‌రాజ్‌) ఆమె కుటుంబాన్ని చంపి మరి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. భూమిక అతడి నుంచి తప్పించుకునే క్రమంలో హీరో కంట పడుతుంది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడతారు. విలన్‌ను అంతం చేసి హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.&nbsp; రావణన్‌ (Raavanan) విక్రమ్, ఐశ్వర్యరాయ్‌, పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'రావణన్‌' చిత్రాన్ని మణిరత్నం రూపొందించారు. ఇందులో రాముడు లాంటి ఎస్పీ దేవ్ (పృథ్వీ) భార్య ఐశ్వర్యరాయ్‌ను నల్లమల్ల అడవులకు విక్రమ్‌ తీసుకొస్తాడు. సీతలాంటి ఆమెను వెత్తుక్కుంటూ పోలీసు ఆఫీసర్ పృథ్వీ, ఆంజనేయుడి పాత్ర లాంటి&nbsp; అడవులు తెలిసిన కానిస్టేబుల్‌ కార్తిక్ వెళ్తారు. రామాయణాన్ని ఆధునీకరీస్తూ రావణుడిని హైలెట్‌ చేస్తూ ఈ చిత్రం వచ్చింది.&nbsp; సైనికుడు (Sainikudu) మహేష్‌ - త్రిష జంటగా చేసిన ‘సైనికుడు’ సినిమా కథ రామాయణానికి కాస్త ఆపోజిట్‌గా ఉంటుంది. విలన్‌ మంచోడని భావించిన హీరోయిన్‌ అతడ్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ఓ కారణం చేత హీరోయిన్‌ను హీరో ఎత్తుకెళ్తాడు. విలన్‌ నిజస్వరూపం తెలుసుకున్నాక త్రిష.. మహేష్‌బాబుని ప్రేమిస్తుంది. త్రిషను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని విలన్‌ ప్రయత్నించడంతో హీరో అతడ్ని చంపి ఆమెను సొంతం చేసుకుంటాడు.&nbsp; రోబో (Robo) రజనీకాంత్‌ (Rajinikanth), ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai) జంటగా డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన చిత్రం ‘రోబో’. కథలోకి వెళితే సైంటిస్ట్‌ వశీకర్‌ చిట్టి అనే రోబోను తయారు చేస్తాడు. దానిలో మనుషులకు లాగే ఫీలింగ్స్‌ ఉండేలా చేస్తాడు. దీంతో ఆ రోబో హీరోయిన్‌పై మనసు పడుతుంది. ఆమెను ఎత్తుకెళ్లి పోతుంది. రక్షణగా తనలాగా ఉండే వందలాది రోబోలను సైన్యంగా చేసుకుంటుంది. చివరికీ హీరో ఆ రోబోను నిర్విర్యం చేసి ప్రేయసిని దక్కించుకుంటాడు.&nbsp; ఆదిపురుష్‌ (Adipurush) గతేడాది ప్రభాస్ (Prabhas), కృతిసనన్ (Kriti Sanon) నటించిన ‘ఆదిపురుష్’ మూవీ కూడా రామాయణంలోని యుద్ధకాండ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాపై దారుణమైన విమర్శలు వచ్చినా.. రామాయణాన్ని ఈ కాలం పిల్లలకు తగినట్లుగా రూపొందించానని దర్శకుడు ఓంరౌత్ సమర్థించుకున్నాడు.&nbsp; సీతారాముల కల్యాణం లంకలో&nbsp; నితిన్‌ - హన్సిక జంటగా నటించిన ఈ చిత్రం (Seeta Ramula Kalyanam Lankalo) టైటిల్‌కు తగ్గట్లే రామయాణ కథను గుర్తు చేస్తుంది. కాలేజీలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే హీరోయిన్‌ కుటుంబానికి విలన్‌కు మధ్య కుటుంబ కక్ష్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో విలన్‌ కథానాయికను రావణాసురుడిలా మాయ చేసి ఎత్తుకెళ్తాడు. అది గ్రహించిన హీరో లంక లాంటి అతడి ఇంటికి మారు వేషంలో వెళ్లి వారితో కలిసిపోతాడు. విలన్లను మాయ చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు.&nbsp;
  ఫిబ్రవరి 19 , 2024
  Chiru Leaks: లీకు రాజా బిరుదుకు చెక్ పెట్టిన మెగాస్టార్.. సినిమా ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్..!&nbsp;
  Chiru Leaks: లీకు రాజా బిరుదుకు చెక్ పెట్టిన మెగాస్టార్.. సినిమా ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్..!&nbsp;
  సినిమాను తీయడం ఒక ఎత్తయితే, ఆ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు. చిత్రబృందం పడిన కష్టానికి ఫలితం ప్రేక్షకులకు చేరాలంటే సినిమాకు ప్రచారం తప్పనిసరి. ఇలా పబ్లిసిటీ కోసం ప్రత్యేకంగా ఓక బృందమే పనిచేస్తుంది. అయితే, రాను రాను ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోతోంది. ఎవరో అప్‌డేట్స్ లీక్ చేయడం కన్నా.. చిత్రబృందమే వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా అర చేతిల్లోకి రావడంతో సినిమాకు కావాల్సిన ప్రచారమూ దక్కుతోంది. ఈ కోవలోకి చెందిందే చిరు లీక్స్. మెగాస్టార్ చిరంజీవి ఈ అప్‌డేట్స్‌ని అధికారికంగా లీక్ చేస్తుండటం ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది.&nbsp; తప్పుని ఒప్పులా.. మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ బ్రెయిన్‌కు చిరు లీక్స్ నిదర్శనం. గతంలో చిరంజీవి పలు లీకులను చేశాడు. ఆచార్య టైటిల్ రివీల్ చేయడం, ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు సంబంధించి అన్యాపదేశంగా చెప్పేశాడు.&nbsp; https://twitter.com/AKentsOfficial/status/1666764990228107267 పొరపాటున వెల్లడించిన వివరాల వల్ల కొంతవరకు విమర్శలకు గురయ్యారు. కానీ, ఇప్పుడు అదే నెగెటివ్ పాయింట్‌ని పాజిటివ్‌గా మలిచిన నటుడు చిరంజీవి.&nbsp; లీక్ చేస్తున్నామని అధికారికంగా వెల్లడించి మరీ చెప్తుండటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గాడ్‌ఫాదర్ మూవీ నుంచి చిరులీక్స్‌ని అఫీషియల్ చేసేశాడు మెగాస్టార్.&nbsp; ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ని స్వయంగా మెగాస్టారే రివీల్ చేస్తున్నాడు.&nbsp; https://twitter.com/MeherRamesh/status/1666809538392240129 ఇతర పీఆర్‌లతో పోలిస్తే చిరుకి ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. దీంతో ఎక్కువ మందికి రీచ్ కావడానికి ఈ లీక్స్ ఉపయోగపడుతున్నాయి. అలా గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల నుంచి చేసిన లీక్స్ థియేటర్లకు జనాలను రప్పించాయి.&nbsp; ఇప్పుడు ఇదే పంథాలో భోళాశంకర్ మూవీ నుంచి మేకింగ్ వీడియోను ఫ్యాన్స్‌కి లీక్ చేశాడు. ఓ సాంగ్ కోసం రూపొందించిన భారీ సెట్‌ వీడియో ఇది. ఇందులో ‘జాం జాం జజ్జనిక.. తెల్లార్లు ఆడుదాం తయ్యితక్క’ సాంగ్‌కి చిరు, సుమంత్, తమన్నా, కీర్తి సురేష్ స్టెప్పులేశారు. ఈ పాటను కాసర్ల&nbsp; శ్యాం రాయగా, మహతి స్వర సాగర్ స్వరపరిచాడు. వీజే శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ అందించాడు.&nbsp; సినిమా అనేది కోట్ల రుపాయలతో కూడుకున్న బిజినెస్. సినిమాలోని ఏ విషయం లీకైనా అది మొత్తం సినిమా రెవెన్యూపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటూ కాన్ఫిడెన్షియాలిటీని మెయింటేన్ చేస్తూ ఉంటారు సిబ్బంది.&nbsp; తెలియకుండానే చిరు చేసిన లీక్స్ కారణంగా కొందరు విమర్శించారు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు తలనొప్పిలా మారాడని పెదవి విరిచారు.&nbsp; ఇప్పుడు ఇదే సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటజీగా మారింది. చిరు నుంచి ఎప్పుడెప్పుడు లీక్స్ వస్తాయా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండటం గమనార్హం.&nbsp; భోళాశంకర్ సినిమాను ఆగస్టు 11న విడుదల చేస్తున్నారు. దీంతో 2 నెలల ముందు నుంచే సినిమా ప్రమోషన్లను తన స్టైల్‌లో మొదలు పెట్టాడు చిరు. ఒకొక్క లీక్ ఇస్తూ జనాల్లో తన సినిమా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక అధికారిక ప్రచారాలు సపరేటు.&nbsp; తమిళ సినిమా వేదాళంకు రిమేక్‌గా భోళాశంకర్ తెరకెక్కుతోంది. తెలుగులో మెహర్ రమేశ్ తీస్తున్నాడు. చిరుకు జోడీగా తమన్నా నటించింది. కీర్తి సురేశ్ చిరంజీవి చెల్లెలి పాత్ర పోషించింది. https://www.youtube.com/watch?v=91RtI6ZG2bc
  జూన్ 09 , 2023
  <strong>Rajamouli: టెన్షన్‌లో రాజమౌళి ఫ్యామిలీ.. ధైర్యం చెప్పిన జపాన్ వాసులు.. అసలు ఏం జరిగిందంటే?</strong>
  Rajamouli: టెన్షన్‌లో రాజమౌళి ఫ్యామిలీ.. ధైర్యం చెప్పిన జపాన్ వాసులు.. అసలు ఏం జరిగిందంటే?
  దేశం గర్వించతగ్గ దర్శకుల్లో 'రాజమౌళి' (SS Rajamouli) ఒకరు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్‌ (Jr NTR), రామ్‌చరణ్‌ (Ramcharan) నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) స్క్రీనింగ్‌ కోసం ఇటీవలే రాజమౌళి తన ఫ్యామిలీతో అక్కడికి వెళ్లారు. అయితే తాజాగా ఆయన ఉన్న ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీని గురించి రాజమౌళి కుమారుడు కార్తికేయ (Karthikeya) స్వయంగా ప్రకటించడంతో అంతా ఆందోళన చెందారు. ప్రస్తుతం కార్తికేయ చేసిన పోస్టు నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; కార్తికేయ ఏమన్నారంటే? ప్రస్తుతం రాజమౌళి.. జపాన్‌లో ఫ్యామిలితో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఉంటున్న బిల్డింగ్‌ మెుత్తం ఒక్కసారిగా ఊగిపోయినట్లు రాజమౌళి తనయుడు కార్తికేయ చెప్పారు. ‘జపాన్‌లో ఒక పెద్ద బిల్డింగ్‌లో 28వ ఫ్లోర్‌లో మేమంతా ఉన్నాం. సరిగ్గా అదే సమయంలో బిల్డింగ్ కదులుతున్న ఫీలింగ్ కలిగింది. కొంత సేపటికి ఇది భూకంపం అని తెలిసి కాస్త భయపడ్డాం. కానీ చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఏదో వర్షం పడుతుందన్నట్లుగా కూల్‌గా ఉన్నారు. మొత్తానికి అయితే భూకంపం ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్ చేశాం’ అంటూ కార్తికేయ చెప్పుకొచ్చారు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్‌లో వచ్చిన వార్నింగ్‌‌‌ను ఫోటోను కార్తికేయ ఈ పోస్టుకు జత చేశారు.&nbsp; https://twitter.com/ssk1122/status/1770613017081999768? ధైర్యం చెప్పిన జపనీయులు అయితే భూకంపం చూసి కాస్త ఆందోళన చెందిన రాజమౌళి ఫ్యామిలీ (SS Rajamouli Family)కి స్థానిక జపానీయులు&nbsp; ధైర్యం చెప్పారట. ఇక్కడ భూకంపం రావడం సాధారణమేనని పేర్కొన్నారట. వచ్చింది భారీ భూప్రకంపనలు కాదూ అంటూ వారిని కూల్‌ చేసే ప్రయత్నం చేశారట. అటు కార్తికేయ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కూడా కాస్త టెన్షన్ పడ్డారు. రాజమౌళి ఫ్యామిలీ సేఫ్‌‍గా ఇండియాకి వచ్చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు జపాన్‌లో వచ్చిన తాజా భూకంపం తీవ్రత 5.3 రిక్టర్‌ స్కేల్‌పై నమోదైంద. తూర్పు జపాన్‌లోని దక్షిణ ఇబారకి ప్రాంతంలో గల ప్రిఫెక్చర్స్ ఏరియాలో 46 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు సమాచారం. View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) రాజమౌళికి అదిరే ఆతిథ్యం ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్క్రీనింగ్‌ కోసం జపాన్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి రాజమౌళికి జపనీయులు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు. రాజమౌళిని చూసేందుకు జపనీయులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌కి కూడా వచ్చారు. ఒక పెద్దావిడ అయితే రాజమౌళి కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. దీన్ని ప్రత్యేకంగా రాజమౌళి తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ఓ ఇండియన్ సినిమాకి జపాన్‌లో ఈ రేంజ్‌లో గుర్తింపు రావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ సినిమాను ఇంతలా నెత్తిన పెట్టుకున్న జపనీయులకి రాజమౌళి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. మహేష్‌తో తాను తీయబోతున్న చిత్రం విశేషాలు కూడా వారితో పంచుకున్నారు. సినిమా రిలీజ్‌ సమయానికి మహేష్‌ను కూడా తీసుకొచ్చి ప్రమేషన్స్‌ చేస్తానని జపనీయులకు దర్శకధీరుడు మాట కూడా ఇచ్చారు.&nbsp; View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli)
  మార్చి 21 , 2024
  <strong>SSMB 29: మహేష్‌ చిత్రంపై తొలిసారి పెదవి విప్పిన రాజమౌళి.. జపాన్‌లో కీలక వ్యాఖ్యలు!</strong>
  SSMB 29: మహేష్‌ చిత్రంపై తొలిసారి పెదవి విప్పిన రాజమౌళి.. జపాన్‌లో కీలక వ్యాఖ్యలు!
  సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో&nbsp; 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో తెరకెక్కనున్న ఈ చిత్రం గ్లోబల్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో జపాన్‌లో పర్యటించిన రాజమౌళి ఈ సినిమాపై కీలక అప్‌డేట్స్‌ ఇచ్చారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' స్క్రీనింగ్‌ కోసం జపాన్‌ వెళ్లిన రాజమౌళి.. తన అప్‌కమింగ్‌ మూవీ గురించి తొలిసారి పెదవి విప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; రాజమౌళి ఏమన్నారంటే? రామ్‌చరణ్‌ (Ram Charan), తారక్‌ (Jr NTR) కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం గ్లోబల్‌ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా జపాన్‌లో ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్క్రీనింగ్‌కు రాజమౌళి హజరయ్యారు. అక్కడ రాజమౌళికి ఘనస్వాగతం లభించింది. ఈ క్రమంలో తన తర్వాతి ప్రాజెక్ట్ అయిన SSMB 29 గురించి రాజమౌళి మాట్లాడారు. 'మహేశ్‌ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరో మహేశ్‌ బాబు.. ఆయన తెలుగు వారు.. చాలా అందంగా ఉంటారు. బహుశా మీలో చాలామందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్‌లో కూడా రిలీజ్‌ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్‌ బాబుని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను' అని జక్కన్న వ్యాఖ్యానించారు. దీంతో మహేశ్‌ ఫ్యాన్స్‌ ఆయన మాటలను సోషల్‌ మీడియా ద్వారా తెగ షేర్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1769897700923990284 జెన్నీ పాత్ర చనిపోతుందట.. కానీ! జపాన్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాకు సంబంధించిన ఆసక్తిక విషయాన్ని రాజమౌళి పంచుకున్నారు. ఈ సినిమాలో భీమ్‌ (తారక్‌)కి జోడిగా జెన్నీ పాత్రలో ఓలివియా నటించింది. అయితే వీరిద్దరి కాంబోలో ఇంకొన్ని సన్నివేశాలు ఉన్నాయని, నిడివి కారణంగా వాటిని తీసేయాల్సి వచ్చిందని రాజమౌళి తెలిపారు. అంతేకాకుండా జెన్నీ పాత్రకి ముందుగా విషాదాంతం రాశామని తెలిపారు. రామ్ (రామ్‌చరణ్‌) పాత్రని జైలు నుంచి తప్పించడానికి భీమ్‌కి జెన్నీ సాయం చేసే నేపథ్యంలో ఆమె పాత్ర మరణిస్తుందని పేర్కొన్నారు. అయితే అది మరీ ఎమోషనల్ ఎండింగ్‌లా ఉంటుందేమో అని భావించి బ్రతికి ఉన్నట్లు మార్పు చేశామని చెప్పారు. ఈ ముంగింపు అందరికీ నచ్చిందని రాజమౌళి హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; రాజమౌళికి అపురూప కానుక బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో జపాన్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న రాజమౌళి.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో వారి హృదయాల్లో స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన ఓ వీరాభిమాని రాజమౌళికి అపురూపమైన కానుక ఇచ్చింది. ఆ అభిమాని 83 ఏళ్ల వృద్ధురాలు కావడం విశేషం. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 'జపాన్ ప్రజలు కాగితంతో కొంగ బొమ్మలు తయారు చేసి తమకు ఇష్టమైన వారికి కానుగా ఇస్తారు. ఆ బొమ్మలు వారికి అదృష్టం, ఆరోగ్యం తెచ్చిపెడతాయని నమ్ముతారు. జపాన్‌కు చెందిన ఈ 83 ఏళ్ల వృద్ధురాలు కూడా మమ్మల్ని ఆశీర్వదించేందుకు 1000 కొంగ బొమ్మలు తయారుచేసుకొచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆమెను ఎంతో సంతోషానికి గురిచేసిందట. మాకోసం తను చలిలో బయటే వేచిచూస్తూ నిలుచుంది. కొంతమంది చూపే ఆదరణకు కృతజ్ఞతలు చెప్పడం తప్ప తిరిగి ఏమివ్వగలం’ అంటూ రాజమౌళి వివరించారు. View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli)
  మార్చి 19 , 2024
  James Cameron: ‘RRR’ కిక్కు ఇంకా దిగలేదన్న హాలీవుడ్‌ డైరెక్టర్‌.. రాజమౌళిపై ప్రశంసలు!
  James Cameron: ‘RRR’ కిక్కు ఇంకా దిగలేదన్న హాలీవుడ్‌ డైరెక్టర్‌.. రాజమౌళిపై ప్రశంసలు!
  దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. అపజయం ఎరుగని డైరెక్టర్‌గా ఆయన తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చారు. ఈ క్రమంలోనే ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరాన్‌ (James Cameron).. మరోమారు మన దర్శకధీరుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఓ అంతర్జాతీయ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; జేమ్స్‌ కామెరాన్‌ ఏమన్నారంటే? తాజాగా సాటర్న్‌ అవార్డుల కార్యక్రమంలో జేమ్స్‌ కామెరాన్‌ (James Cameron on SS Rajamouli) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి గురించి అడిగారు. గతంలో రాజమౌళిని,&nbsp; ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. దాని గురించి కాస్త చెబుతారా అంటూ రిపోర్టర్‌ ప్రశ్నించాడు. దీంతో కామెరాన్‌ స్పందిస్తూ.. ‘నిజం చెప్పాలంటే నేను అతనితో చాలా నిజాయతీగా నాకు అనిపించిన విషయాన్ని చెప్పాను. అది (ఆర్‌ఆర్‌ఆర్‌) చాలా అద్భుతమైన సినిమాగా అనిపించింది. ఇండియన్ సినిమాను ప్రపంచ వేదికపై ఆదిరిస్తూ ఇలాంటి స్థాయికి చేరడం గొప్పగా ఉంది’ అని సమాధానం ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోని ఆర్ఆర్ఆర్ టీమ్‌ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్‌ చేయడంతో విషయం బయటకొచ్చింది.&nbsp; https://twitter.com/i/status/1755090067708842276 ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రియాక్షన్‌ ఇదే! హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌.. రాజమౌళిని (James Cameron on SS Rajamouli)&nbsp; మరోమారు మెచ్చుకోవడంపై ఆర్‌ఆర్ఆర్‌ టీమ్‌ స్పందించింది. కామెరాన్ వీడియోను షేర్‌ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు జత చేసింది. ‘జేమ్స్ కామెరాన్.. మీ అమూల్యమైన మాటలు మాలో స్ఫూర్తి నింపుతాయి. మరింత బాగా పని చేసేలా ప్రేరేపిస్తాయి. ఇండియన్ సినిమా అన్ని సరిహద్దులను చెరిపేస్తుందని మేము బలంగా విశ్వసిస్తున్నాం’ అని ఆర్ఆర్ఆర్(RRR) మూవీ తన ఎక్స్ అకౌంట్లో అభిప్రాయపడింది. మరోవైపు ఈ ట్వీట్‌ను నెటిజన్లు రీట్వీట్‌ చేస్తున్నారు. రాజమౌళి పనితనాన్ని మెచ్చుకుంటూ తమదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.&nbsp; గతంలోనూ ఇలాగే..! జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ గతేడాది ‘గోల్డెన్ గ్లోబ్స్’ తో పాటు ‘ఆస్కార్’ కూడా గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు పాట’ బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరి కింద ఆస్కార్‌ను కైవసం చేసుకుంది. ఆస్కార్‌ అవార్డ్‌ కార్యక్రమానికి వచ్చిన జేమ్స్ కామెరాన్‌ను అప్పట్లో రాజమౌళి కలిశారు. తాను కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను చూశానని.. అదోక అద్భుతం అంటూ ఆ సందర్భంగా రాజమౌళితో కామెరూన్‌ వ్యాఖ్యానించారు. తన భార్యకు కూడా ‘ఆర్ఆర్ఆర్‌’ చూడాలని సూచించినట్లు చెప్పారు. ప్రపంచస్థాయి దర్శకుడు రాజమౌళిని, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని ప్రశంసించడంతో ఆ వార్త యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది.&nbsp; https://twitter.com/i/status/1616676262118064132 రాజమౌళి బిజీ బిజీ..! ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి తన తర్వాతి మూవీని మహేష్‌ బాబుతో చేయనున్నారు. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందనుందని టాక్‌. ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. బాలీవుడ్‌ స్టార్ దీపికా పదుకోనే (Deepika Padukone)ను హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. మహేష్‌ను నెవర్ బిఫోర్ అవతార్‌లో రాజమౌళి చూపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తారని సమాచారం.&nbsp; జర్మనీలో చెమటోడ్చిన మహేష్‌! సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజుల క్రితం జర్మనీ వెళ్లారు. రాజమౌళి సినిమా కోసమని అక్కడ మూడు వారాల పాటు వ్యాయామంలో శిక్షణ కూడా తీసుకున్నారని టాక్‌. ఇటీవల మహేష్‌ హైదరాబాద్‌కు తిరిగి రాగా ఎయిర్‌పోర్టులో అతడి లుక్ చూసి ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్‌ అయ్యారు. లాంగ్‌ హెయిర్‌తో తలపైన టోపి పెట్టుకుని అచ్చం హాలీవుడ్‌ హీరోలాగా మహేష్‌ కనిపించాడు. దీంతో రాజమౌళి సినిమాలో ‌అతడి లుక్‌ ఇలాగే ఉండొచ్చని ఊహాగానాలు మెుదలయ్యాయి. ఇదిలా ఉంటే రాజమౌళి తండ్రి, సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా సమాచారం బయట పెట్టారు. స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందని, సినిమా నటీనటులు ఎంపిక, షూటింగ్ త్వరలోనే జరుగుతుందని అన్నారు.&nbsp; https://twitter.com/i/status/1754172589659017328
  ఫిబ్రవరి 07 , 2024
  Adipurush: ఆదిపురుష్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్‌… ప్రమాదంలో బాహుబలి-2, RRR రికార్డ్స్‌?
  Adipurush: ఆదిపురుష్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్‌… ప్రమాదంలో బాహుబలి-2, RRR రికార్డ్స్‌?
  ఆదిపురుష్ మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. వరల్డ్‌వైడ్‌గా ఐదు భాషల్లో రిలీజైంది. ఈ నేపథ్యంలో ట్రేడ్ పండితుల దృష్టి ఈ సినిమా కలెక్షన్లపై పడింది. తొలి రోజు ఆదిపురుష్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందా? అన్న ఆసక్తి మొదలైంది. మునపటి సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు భారీగా వసూళ్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. మరి, ఇండస్ట్రీలో ఇది వరకు భారీ ఓపెనింగ్స్‌ని రాబట్టిన సినిమాలేంటి? ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లను సాధించాయి? అనే అంశాలను తెలుసుకుందాం.&nbsp; బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా ‘బాహుబలి2’ అగ్రస్థానంలో ఉంది. ఈ సినిమా ఏకంగా రూ.217 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్ల వసూళ్లను సాధించింది. ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌ నిర్మించింది.&nbsp; కేజీఎఫ్ 2 కన్నడ నాట పెను సంచలనం రేపిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే కేజీఎఫ్2 సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ.164 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితుల అంచనా. సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1300 కోట్లు రాబట్టినట్లు సమాచారం.&nbsp; ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లలోనూ దూసుకెళ్లింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించడం, బాహుబలి తర్వాత జక్కన్న చేసిన సినిమా కావడంతో బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.158 కోట్లను కలెక్ట్ చేసింది. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1200 కోట్ల వసూళ్లను సాధించింది.&nbsp; సాహో బాహుబలి-2 సినిమాతో హీరో ప్రభాస్ మార్కెట్ విశ్వవ్యాప్తమైంది. దీంతో బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందుకు అనుగుణంగానే తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మందగించాయి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.190 కోట్లు కలెక్ట్ చేసింది.&nbsp; పఠాన్ బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం బిగ్ హిట్ అయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.106 కోట్లను రాబట్టింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో వసూళ్లలో దూసుకెళ్లింది. ఓవరాల్‌గా పఠాన్ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2023లో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.&nbsp; రోబో 2.0 రజినీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబోలో వచ్చిన చిత్రం రోబో 2.0. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.106 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను సాధించింది. కానీ, అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించడంలో సినిమా విఫలమైంది. దీంతో ఓవరాల్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది.&nbsp;
  జూన్ 16 , 2023
  Heroes in Ads: మహేష్ బాబుతో విజయ్ దేవరకొండ పోటీ.. ఇక..Jr NTR, అల్లు అర్జున్ పరిస్థితి?
  Heroes in Ads: మహేష్ బాబుతో విజయ్ దేవరకొండ పోటీ.. ఇక..Jr NTR, అల్లు అర్జున్ పరిస్థితి?
  ఒకప్పుడు యాడ్స్ అంటే బాలీవుడ్ నటులే గుర్తొచ్చేవారు. కానీ, ఇప్పుడలా లేదు. ఏ యాడ్ చూసినా టాలీవుడ్ హీరోలే. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి లోకల్ ప్రొడక్టు వరకు ప్రతీ ప్రచారానికి తెలుగు హీరోలే కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలా చేస్తున్న ప్రకటనల సంఖ్య పెరిగిపోయింది. ఒక్కో హీరో ఏకంగా నాలుగైదు యాడ్స్ చేస్తుండటం డామినేషన్‌ని తెలియజేస్తోంది. సినిమాలతో పాటు యాడ్స్‌లలో బిజీబిజీగా గడుపుతున్న ఆ స్టార్స్ ఎవరో చూసేద్దామా.&nbsp; అల్లు అర్జున్ పుష్ప సినిమా బన్నీని ఐకాన్ స్టార్‌గా మార్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పలు యాడ్‌లలో చేస్తున్నాడు. ఇటీవలే రెడ్ బస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. కేఎఫ్‌సి చికెన్ తరఫున ప్రచారం చేస్తున్నాడు. ఆస్ట్రాల్ స్ట్రాంగ్ పీవీసీ పైప్‌లకూ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నాడు. కోకాకోలా కూల్‌డ్రింక్ యాడ్‌లోనూ నటించాడు. జొమాటో ఫుడ్ డెలివరీ యాప్‌కీ అల్లు అర్జునే బ్రాండ్ అంబాసిడర్. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ తరఫున కూడా బన్నీ ప్రచారం చేస్తున్నాడు. ఇలా సినిమాలతో పాటు ప్రకటనలతోనూ బన్నీ బాగానే కమాయిస్తున్నాడు. ఒక్కో ప్రకటనకి అల్లు అర్జున్ రూ.7 నుంచి రూ.10 కోట్లు తీసుకుంటాడని టాక్. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) విజయ్ దేవరకొండ శ్యామ్ స్టీల్ ఇండియాతో విజయ్ చేతులు కలిపాడు. ఈ స్టీల్ గుణగణాలను తెలియజేస్తూ డిజైన్ చేసిన యాడ్‌లో విజయ్ నటించాడు. దీంతో పాటు జైవర్స్ ఫుట్‌వేర్ కంపెనీని కూడా ప్రమోట్ చేస్తున్నాడు. లక్స్ కాజి మెన్స్ ఇన్నర్‌వేర్ తరఫున ప్రచార కర్తగా ఉన్నాడు. థమ్స్ అప్(Thumbs Up) యాడ్‌లోనూ విజయ్ దేవరకొండ నటించాడు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియాకు తంబ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు విజయ్ ఏకంగా రూ.10 కోట్లు తీసుకున్నట్లు టాక్. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) మహేశ్ బాబు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన మహేశ్ బాబు.. యాడ్స్‌ ఎక్కువ చేస్తుంటాడు. ఇటీవల మౌంటెన్ డ్యూ అనే సాఫ్ట్‌డ్రింక్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశాడు. దీంతో పాటు మహేశ్ బాబు ఎవరెస్ట్ గ్రాండ్ మసాలా యాడ్‌లో నటించాడు. ఆంధ్రా హాస్పిటల్స్‌తోనూ మహేశ్ బాబు అసోసియేట్ అయ్యాడు. మౌంటెన్ డ్యూ యాడ్‌కి మహేశ్ బాబు ఏకంగా రూ.12 కోట్లు ఛార్జ్ చేసినట్లు టాక్. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో పలు కంపెనీలు ఎన్టీఆర్ కోసం క్యూ కట్టాయి. రీసెంట్‌గా జూనియర్ మెక్ డొనాల్డ్స్ కి ప్రచారకర్తగా వ్యవహరించాడు.&nbsp; 24 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ.8 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు చర్చ నడుస్తోంది. దీంతో పాటు ఎన్టీఆర్ లిషియస్ అనే ఫుడ్ డెలివరీ యాప్‌కి, ఆప్పీ ఫిజ్ కూల్‌డ్రింక్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు.&nbsp; View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) రామ్‌చరణ్ రామ్‌చరణ్ పలు ప్రకటనల్లో నటించాడు. గతంలో సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ తరఫున ప్రచారం చేశాడు. ఇటీవల ఫ్రూటీ యాడ్‌లోనూ అలియా భట్‌తో కలిసి చెర్రీ నటించాడు. గతేడాది మీషో బ్రాండ్ తరఫున యాడ్‌లో తళుక్కున మెరిశాడు.&nbsp; https://www.youtube.com/watch?v=PtNSXvlZVIM
  జూన్ 13 , 2023
  PAN INDIA MOVIE TITLES: టైటిల్‌తోనే ఈ సినిమాల రేంజ్ చెప్పేశారు..!
  PAN INDIA MOVIE TITLES: టైటిల్‌తోనే ఈ సినిమాల రేంజ్ చెప్పేశారు..!
  ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ పదం కామన్‌గా వినిపిస్తోంది. అదే పాన్ ఇండియా. మొన్నటివరకు ఒక ప్రాంతానికే పరిమితమైన సినిమా పరిధి ఇప్పుడు దేశవ్యాప్తమైంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఎంగేజింగ్ కంటెంట్‌తో పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతున్నాయి. ఈ ఆలోచన సినిమా టైటిల్ ఖరారు చేయడం దగ్గర నుంచే మొదలవుతోంది. అలా పాన్ ఇండియాగా వచ్చిన, రాబోతున్న సినిమాల టైటిల్స్‌ని పరిశీలిస్తే ఓ కామన్ పాయింట్ అర్థమవుతుంది. ఈ టైటిల్స్ ఏ ఒక్క భాష, ప్రాంతానికే పరిమితం కాకుండా ఉంటోంది. అందరికీ తెలిసిన, బహు ప్రాచుర్యంలో ఉన్న పదాలను టైటిల్స్‌గా ఎంచుకుంటుండటం విశేషం. సినిమాలో దమ్ముంటే కచ్చితంగా పరభాషా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా మంది డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు నమ్ముతున్నారు. ఈ భరోసాతోనే భారీ బడ్జెట్‌ చిత్రాలను తీసుకొస్తున్నారు. అందుకు అనుగుణంగా మూవీ టైటిల్‌ని ఫిక్స్ చేస్తున్నారు. పైగా, ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలను సినిమాలో చేర్చుకోవడం కూడా కలిసొస్తోంది. ఇలా వచ్చిన పాన్ ఇండియా మూవీ టైటిల్స్ ఏంటో చూద్దాం. RRR&nbsp; ఆస్కార్ అవార్డు పొందిన సినిమా ‘RRR’. దర్శకధీరుడు జక్కన్న చెక్కిన శిల్పం. అయితే, వాస్తవానికి ఈ సినిమా టైటిల్‌ని ముందుగా ‘RRR’గా నిర్ణయించలేదు. రాజమౌళి, రామారావు(ఎన్టీఆర్), రామ్‌చరణ్‌ల కాంబోలో వస్తున్న సినిమా గనుక వాడుకలో ఉండేందుకు ‘ఆర్ఆర్ఆర్’ అని పిలుచుకున్నారు. క్రమంగా ఇది అందరినీ చేరుకుంది. జనాల నోళ్లలో బాగా నానింది. దీంతో ఇతర భాషల్లో కూడా సులువుగా అర్థమవుతుందని భావించి ఇదే టైటిల్‌ను కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన చరిత్ర మీకు తెలియంది కాదు.&nbsp; KGF రెండు పార్ట్‌లుగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఒక్కసారిగా కన్నడ చిత్ర పరిశ్రమ వైపు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం వచ్చేలా KGF అని కుదించి పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా మూడో పార్ట్ కూడా భవిష్యత్తులో తెరకెక్కనుంది.&nbsp; పఠాన్ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ నటించిన సినిమా ఇది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ‘పఠాన్’ అనే పేరు అంతటా సుపరిచతమే. ఏ ప్రాంతంలోనైనా ఈ పేరు కలిగిన వారుంటారు. అందుకే సినిమాకు ఈ టైటిల్‌ని కంటిన్యూ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.&nbsp; పుష్ప సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. అల్లు అర్జున్ క్యారెక్టర్ పేరునే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ మూవీ కోసం చాలా టైటిళ్లు అనుకున్నప్పటికీ.. క్యాచీగా, సులువుగా ఉంటుందని ఈ టైటిల్‌ని ఖరారు చేసింది. ఊహించినట్టుగానే ఈ మూవీ అన్ని భాషల్లో విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ జరుగుతోంది. బ్రహ్మాస్త్ర అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా కంటెంట్‌కు అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితం. పురాణాలకు భారత్ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే తన అస్త్ర లోకాన్ని అందరికీ పరిచయం చేయాలని భావించి సినిమా ‘బ్రహ్మాస్త్ర’గా టైటిల్ ఖరారు చేశారు. ఇందులో మొదటి పార్ట్‌ని గతేడాది రిలీజ్ చేశారు. రెండు, మూడు పార్ట్‌లు రావాల్సి ఉంది.&nbsp; బీస్ట్ దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా సైతం ఇతర భాషల్లో డబ్ అయింది. ఈ టైటిల్‌ అందరినీ ఆకర్షించింది. కానీ, తెలుగు, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కోలీవుడ్‌లో కాస్త మెరుగ్గా ఆడింది.&nbsp; సలార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రమిది. సలార్ టైటిల్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న మూవీ రిలీజ్ అవుతోంది.&nbsp; OG పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. దీనికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కానీ, చిత్రబృందం మొదటి నుంచి OG అనే పేరుతోనే ప్రచారం నిర్వహిస్తోంది. ఈ టైటిల్ ఇప్పటికే మార్మోగిపోయింది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేసే సూచనలు ఉన్నాయి.&nbsp; LEO లోకేశ్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబోలో వస్తున్న మరో చిత్రం ఇది. ‘లియో’గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా కథ ఆధారంగా ఈ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దసరా కానుకగా మూవీని రిలీజ్ చేయనున్నారు.
  మే 02 , 2023
  Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్… ఎగిరి గంతేసిన రాజమౌళి
  Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్… ఎగిరి గంతేసిన రాజమౌళి
  అనుకున్నదే అయింది. ఊహించినదే నిజమైంది. కల సాకారమైంది. ఇద్దరు తెలుగు వీరులు చేసిన డ్యాన్స్‌కి ఆస్కార్ ఫిదా అయింది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును ‘నాటు నాటు’ గెలుచుకుంది. తెలుగు కీర్తి పతాకం విశ్వవ్యాప్తంగా రెపరెపలాడింది. 95వ ఆస్కార్ వేడుకల్లో ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పాశ్చాత్య పాటలను తలదన్ని అవార్డును సొంతం చేసుకుంది. భారతీయ సినిమా సత్తా ఏంటో విశ్వ వేడుకపై నిరూపించింది.&nbsp; అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్.. ఆస్కార్ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం ‘ఇప్పుడు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు’ అని కీరవాణి పాటపాడుతూ చెప్పడం గూస్‌బంప్స్ తెప్పించింది. ‘నాటు నాటు’ సాంగ్‌ని ప్రపంచంలోనే అత్యుత్తమమైన పాటగా తీర్చిదిద్దాలని భావించాం. ప్రతి భారతీయుడూ గర్వపడాలని ఆశించాం. అది జరిగింది. నాకు, రాజమౌళికి, మా ఫ్యామిలీకి ఉన్న చిరకాల కోరిక నేడు నెరవేరింది. అకాడమీకి ధన్యవాదాలు’ అంటూ కీరవాణి చెప్పారు. అనంతరం లిరిసిస్ట్ చంద్రబోస్ ‘నమస్తే’ అని చెప్పారు. https://twitter.com/fizzie_girl/status/1635114184982814721?s=20 https://twitter.com/HoneyRoseOffl_/status/1635120372013203456?s=20 ఎగిరి గంతేశారు.. ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డును ప్రకటించగానే బాల్కనీలో కూర్చొన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ఎగిరి గంతేసింది. డైరెక్టర్ రాజమౌళి, రమా రాజమౌళి, కార్తికేయ చిన్నపిళ్లల్లా కేరింతలు కొట్టారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఆలింగనం చేసుకుంటూ విజయ నినాదాలు చేశారు.&nbsp; https://twitter.com/AndhraBoxOffice/status/1635114810651328513?s=20 ‘నాటు నాటు’తోనే మొదలు.. ఆస్కార్ వేడుక ప్రారంభమైంది ‘నాటు నాటు’ సాంగ్‌తోనే. అవార్డుల ప్రదానోత్సవానికి ప్రజెంటర్‌గా ఎంపికైన ‘దీపిక పదుకొణె’ ‘నాటు నాటు’ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం సింగర్స్‌ని ఆహ్వానించింది. ‘మీరెప్పుడైనా నాటు నాటు పాటను చెవులారా విన్నారా? కళ్లారా చూశారా? లేకపోతే ఇదే అసలైన సమయం. నాటు నాటు పాటను తిలకిస్తూ ఎంజాయ్ చేయండి’ అంటూ దీపిక పదుకొణె ప్రకటించడం భారతీయ సినిమాకే గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అంతేగాకుండా ‘నాటు నాటు’ సాంగ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆస్కార్ వేడుకలో చప్పట్లు, ఈలలు వినిపించాయి. సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం కాళభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లను ఆహ్వానించిన సమయంలో హాలీవుడ్ ప్రముఖులు ఇచ్చిన స్టాండింగ్ ఒవేషన్ మర్చిపోలేనిది. https://twitter.com/THR/status/1635094319139893248?s=20 గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో.. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అప్పుడు మొదలైన ‘నాటు నాటు’ మేనియా అవార్డు అందుకునే వరకూ జోరుగా కొనసాగింది. ఆస్కార్ వేడుకలో ‘నాటు నాటు’ ప్రభావం క్లియర్‌గా కనిపించింది.&nbsp; ‘నాటు నాటు’కు ప్రాణం..&nbsp; ‘నాటు నాటు’ సాంగ్‌ ఇంతటి కీర్తి ప్రతిష్ఠలు దక్కించుకోవడంలో ప్రముఖ పాత్ర కొరియోగ్రఫీదే. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్పులు ‘నాటు నాటు’ను విశ్వవిజేతగా నిలిపాయి. గేయ రచయిత చంద్రబోస్ తెలుగుదనాన్ని మేళవించి రచించగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బీట్స్ జత చేయగా సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ గొంతెత్తి పాడగా రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఈ పాటకు ప్రాణం పోశారు. ఈ సాంగ్‌ని ఉక్రెయిన్‌లో షూట్ చేశారు.&nbsp; https://www.youtube.com/watch?v=OsU0CGZoV8E
  మార్చి 13 , 2023
  <strong>Most Powerful Hero Roles in Telugu: ఈ సినిమాల్లో హీరో పాత్రలు ఉంటాయి భయ్యా.. నెవర్‌బీఫోర్ అంతే!</strong>
  Most Powerful Hero Roles in Telugu: ఈ సినిమాల్లో హీరో పాత్రలు ఉంటాయి భయ్యా.. నెవర్‌బీఫోర్ అంతే!
  సాధారణంగా ప్రతీ సినిమాకు హీరో పాత్రనే కీలకం. కథానాయకుడి క్యారెక్టరైజేషన్‌పైనే దాదాపుగా ఆ సినిమా ఫలితం ఆధారపడుతూ ఉంటుంది. హీరో రోల్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే ఆ సినిమా సక్సెస్‌ రేట్ అంతగా పెరుగుతుంది. ఎందుకంటే తమ హీరోను చాలా అగ్రెసివ్‌గా, దృఢంగా చూసేందుకే ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు. అయితే టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు రిలీజు కాగా బలమైన ఇంటెన్సిటీ ఉన్న హీరో పాత్రలు కొన్నే వచ్చాయి. ఇంతకీ ఆ&nbsp; పవర్‌ఫుల్‌ హీరో పాత్రలు ఏవి? అందులో నటించిన స్టార్‌ హీరోలు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; బాహుబలి (Baahubali) బాహుబలిలో ప్రభాస్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. యుద్ధరంగంలోకి దిగితే శత్రువులకు ఇక చుక్కలే అన్నట్లు ఆ రోల్‌ ఉంటుంది. ముఖ్యంగా కాలకేయతో యుద్ధం, బాహుబలి 2 క్లైమాక్స్ సీన్స్‌లో ప్రభాస్‌ చాలా అద్భుతంగా చేశాడు.&nbsp; https://youtu.be/mRAi0lTRiMc?si=tIPOoBp8Tq_SjknN శివ (Siva) హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ సినిమాలో చాలా ఇంటెన్సిటీతో కనిపిస్తాడు. కాలేజీ స్టూడెంట్‌గా క్లాస్‌గా కనిపిస్తూనే రౌడీలకు తన విశ్వరూపం చూపిస్తాడు. ముఖ్యంగా ఆ సైకిల్‌ చైన్‌ తెంపే సీన్‌ ఇప్పటికీ చాలా ఫేమస్‌.&nbsp; https://youtu.be/jqwh3PgW4dE?si=eSViXQpf7DJ6SW4g ఆర్ఆర్‌ఆర్‌ (RRR) ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రామ్‌చరణ్‌(Ram Charan) పాత్రను దర్శకధీరుడు రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా చరణ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ ప్రతీ ఒక్కరికీ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. వందలాది మంది ఆందోళన కారుల్ని రామ్‌చరణ్‌ ఒక్కడే కంట్రోల్ చేస్తాడు. అలాగే క్లైమాక్స్‌లోనూ బ్రిటిష్‌ వారిపై విశ్వరూపం చూపిస్తాడు.&nbsp; https://www.youtube.com/watch?si=-3losZAoAU0zUG-2&amp;v=Y8rREdo1LqU&amp;feature=youtu.be సలార్‌ (Salaar) ఇందులో హీరో ప్రభాస్‌ (Prabhas) తన కటౌట్‌కు తగ్గ యాక్షన్ సీక్వెన్స్‌తో ఫ్యాన్స్‌ను ఊర్రూతలుగించాడు. బాహుబలి తర్వాత ఆ స్థాయి ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో డార్లింగ్ అలరించాడు. ఇంటర్వెల్‌ ఫైట్‌, కాటేరమ్మ ఫైట్‌, క్లైమాక్స్ యాక్షన్‌ సీన్స్‌లో ప్రభాస్‌ దుమ్మురేపాడు.&nbsp; https://youtu.be/aniqM3iKskM?si=aAVsDePkCn0z8IID యానిమల్‌ (Animal) అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సినిమాను చాలా వైలెంట్‌గా తెరకెక్కించాడు. బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) తన కెరీర్‌లోనే ఇలాంటి పవర్‌ఫుల్‌ పాత్రను పోషించలేదు. తన తండ్రిని చంపేందుకు యత్నించిన వారిపై రణ్‌బీర్‌ రీవెంజ్‌ తీర్చుకునే విధానం చాలా క్రూరంగా ఉంటుంది.&nbsp; https://youtu.be/6DfaBq2rVoE?si=tZXe7295t9MYMmit సింహాద్రి (Simhadri) ఈ సినిమాలో ఒక డిఫరెంట్‌ ఎన్టీఆర్‌ను చూడవచ్చు. అంతకుముందు ‘ఆది’లో ఫ్యాక్షనిస్టుగా కనిపించినప్పటికీ సింహాద్రిలో దానికంటే పవర్‌ఫుల్‌గా తారక్‌ రోల్ ఉంటుంది. ముఖ్యంగా ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఫైటింగ్‌ సీన్‌ అదరహో అనిపిస్తాయి. కేరళలో నడిరోడ్డుపై రౌడీలను నరికేసే సీన్‌ విజిల్స్ వేయిస్తాయి.&nbsp; https://youtu.be/u0PlQ1J6EHo?si=9Rqa8abQvN1jzYRS విక్రమార్కుడు (Vikramarkudu) స్టార్‌ హీరో రవితేజను ఈ సినిమాలో చూసినంత అగ్రెసివ్‌గా ఎందులోనూ చూసి ఉండరు. ముఖ్యంగా విక్రమ్‌ రాథోడ్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఫైట్‌ సీన్‌ మాత్రం నెవర్‌ బీఫోర్‌ అన్నట్లుగా ఉంటుంది.&nbsp; https://youtu.be/G3ojv3yp03s?si=O1YYFEFiPUm53_WY కర్తవ్యం (Karthavyam) టాలీవుడ్‌లో పవర్‌ఫుల్‌ ఫీమేల్‌ పాత్ర అనగానే ముందుగా కర్తవ్యంలో విజయశాంతి (Vijayashanti)&nbsp; చేసిన రోల్‌ గుర్తుకు వస్తుంది. ఇందులో లేడీ శివంగిలా ఆమె నటించింది. పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో నేరస్తులకు చుక్కలు చూపిస్తుంది.&nbsp; https://youtu.be/8mnwQLH4Src?si=Ukzv6Q6IZYQmSChg అంకుశం (Ankusam) హీరో రాజశేఖర్‌ సూపర్‌ హిట్‌ సినిమా అనగానే ముందుగా ‘అంకుశం’ మూవీనే మదిలో ప్రత్యక్షమవుతుంది. ఇందులో నిజాయతీ గల పోలీసు అధికారిగా అతడు కనిపించాడు. నేరస్తులపై ఉక్కుపాదం మోపి అలరించాడు.&nbsp; https://youtu.be/BQW-c1yEpoc?si=X3IFaKaJ7BFjJgA_ గ్యాంగ్ లీడర్ (Gang Leader) మెగాస్టార్‌ చిరు (Chiranjeevi)ను మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసిన చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. ఇందులో చిరు పాత్ర చాలా రఫ్‌గా ఉంటుంది. ‘చేయి చూడు ఎంత రఫ్‌గా ఉందో రఫ్పాడించేస్తా’ అన్న డైలాగ్‌ ఈ సినిమా ద్వారా చాలా ఫేమస్‌ అయ్యింది.  https://youtu.be/g1ajziOPdJ8?si=BeDHUUGnDRNZfT2C అర్జున్ రెడ్డి (Arjun Reddy) యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. ఇందులో విజయ్ చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైన వెళ్లే ప్రియుడిగా అదరగొట్టాడు. ఈ పాత్రకు యూత్‌ చాలా బాగా కనెక్ట్‌ అయ్యారు. అందుకే ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అయ్యింది.&nbsp; https://youtu.be/tdQWGkTiWd4?si=EFo1pe0NlqpTEP0J ఇస్మార్ట్‌ శంకర్‌ (Ismart Shankar) టాలీవుడ్‌లోని క్లాసిక్‌ హీరోగా ‘రామ్‌ పోతినేని’ (Ram Pothineni)కి పేరుంది. అటువంటి రామ్‌ను కూడా ఇస్మార్ట్‌ శంకర్‌ (Ismart Shankar) ద్వారా చాలా వైలెంట్‌గా చూపించాడు దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh). ఈ సినిమా కోసం రామ్‌ తొలిసారి సిక్స్‌ ప్యాక్‌ చేయడం విశేషం.&nbsp; https://youtu.be/xYb2-OLUQ-U?si=gAXIB9okHto4iH1a పోకిరి (Pokiri) ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో కనిపించే మహేష్‌ బాబు (Mahesh Babu).. పోకిరి (Pokiri) సినిమాతో వచ్చి అప్పట్లో అందర్ని సర్‌ప్రైజ్‌ చేశాడు. సినిమాలో చాలా వరకూ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి విలన్లను ఏరివేస్తాడు. క్లైమాక్స్‌తో అతడు పోలీసు అని తెలియడంతో ఆడియన్స్‌ సర్‌ప్రైజ్‌ అవుతారు. ఈ తరహా పాత్ర టాలీవుడ్‌లో ఎప్పుడు రాలేదు.&nbsp; https://youtu.be/KzQOoyoAGKo?si=5IhFm-wK-PYeIneq
  మార్చి 28 , 2024
  <strong>RC 17: మద్రాస్‌ చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రామ్‌ చరణ్‌-సుకుమార్‌ మూవీ.. రాజమౌళి క్రేజీ కామెంట్స్‌!</strong>
  RC 17: మద్రాస్‌ చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రామ్‌ చరణ్‌-సుకుమార్‌ మూవీ.. రాజమౌళి క్రేజీ కామెంట్స్‌!
  మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar)తో ‘RC17’ చిత్రాన్ని చరణ్‌ చేయనున్నాడు. ‘రంగస్థలం’ (Rangasthalam) లాంటి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రానుండటంతో ఇప్పటి నుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు ‘RC17’పై దర్శకధీరుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలూ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై ఓ లుక్కేద్దాం.&nbsp; చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో..! 'RC 17' చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా మెుదలు కాకముందే ఈ సినిమా కథ ఇదేనంటూ నెట్టింట ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. దాని ప్రకారం ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందట. మద్రాసు పరిసర ప్రాంతాలలోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అప్పటి సామాజిక నిబంధనలను ధిక్కరించిన ఓ గుఢాచారి (స్పై) ఎమోషనల్‌ యాక్షన్‌ జర్నీనే ఈ సినిమా అని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది.&nbsp; రాజమౌళి వ్యాఖ్యలు వైరల్‌ ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రమోషన్స్‌ సమయంలోనే దర్శకధీరుడు రాజమౌళి.. ‘RC17’ చిత్రం గురించి మాట్లాడారు. ‘రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీయనున్న సినిమాలో ఓపెనింగ్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుంది. నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు. ఆ మూవీలో ఓపెనింగ్‌ సీన్‌ చూసిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు సీట్‌ ఎడ్జ్‌కు వచ్చేస్తారని మాత్రం కచ్చితంగా నమ్ముతున్నాను’ అని అన్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌గా మారింది. ‘ఓపెనింగ్‌ సీన్‌ అద్భుతం’ మరోవైపు రాజమౌళి తనయుడు కార్తికేయ (Karthikeya) కూడా ‘RC 17’పై సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌ చిత్రీకరణ సమయంలో సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు చరణ్‌ చెప్పాడు. ఆ సినిమాలో ఓపెనింగ్‌ సీన్ గురించి వివరించాడు. అది ఐదు నిమిషాలు ఉంటుందని.. అద్భుతమని తెలిపాడు. నాటి నుంచి ఈ సినిమా ప్రకటన కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. ఈ మూవీ వీరి కెరీర్‌లోనే మైలురాయి. దీని గురించి ఇంతకంటే ఎక్కువ లీక్ చేయలేను’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేశారు.&nbsp; ఈ ఏడాది చివర్లో ప్రారంభం! ప్రస్తుతం రామ్‌చరణ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. దీనిని స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) రూపొందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్‌ బుచ్చిబాబు (Buchi Babu)తో చరణ్‌ ‘RC16’ సినిమాను పట్టాలెక్కిస్తాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తైన వెంటనే ‘RC17’ సెట్‌లోకి రామ్‌చరణ్‌ అడుగుపెడతాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా మెుదలవుతుందని సమాచారం. వచ్చే ఏడాది చివరిలో ‘RC17’ రిలీజ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.&nbsp; రేపు అదిరిపోయే ట్రీట్‌! రేపు గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా నుంచి ‘జరగండి’ సాంగ్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఉదయం 9.00 గంటలకు ఈ సాంగ్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఓ పోస్టర్‌ ద్వారా తెలియజేశారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్ రూపొందించిన ఈ పాట కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్‌, నవీన్‌ చంద్ర, ఎస్‌.జే సూర్య, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.&nbsp;
  మార్చి 26 , 2024
  Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
  Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
  సూపర్‌ హీరోలను ఇష్టపడని వారు ఉండరు. సినిమాల్లో వారు చూపించే తెగువ, ధైర్య సాహసాలు వీక్షకులను ముఖ్యంగా చిన్న పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. రొటీన్‌ సినిమాల్లో హీరోల్లా కాకుండా వారు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటారు. కొండను సైతం పిండి చేయగల సామర్థ్యం వారి సొంతం. అటువంటి సూపర్‌ హీరోలందర్నీ ఏటా ఒక చోటకు చేరుస్తూ సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈవెంట్‌ ‘కామిక్‌ కాన్‌’ (Comic Con). అవెంజెర్స్‌, స్పైడర్‌మ్యాన్‌, అవతార్‌, సూపర్‌ మ్యాన్‌ వంటి పాత్రలు ఆ ఈవెంట్‌లో తళుక్కుమంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్‌ హీరోల అభిమానులు అక్కడ ప్రత్యక్షమై తమకు నచ్చిన హీరో వేషధారణను ధరిస్తాయి. అయితే తెలుగులోనూ కామిక్‌ కాన్‌ స్థాయి హీరో పాత్రలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; హనుమాన్‌ (Hanuman) ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్‌’ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. తొలి ఇండియన్‌ సూపర్‌ మ్యాన్‌ అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జ పాత్రను ఎలివేట్‌ చేశాడు. హనుమంతుడి పవర్స్‌ను పొందిన హీరో.. ఈ సినిమాలో చాలా శక్తివంతంగా మారతాడు. భారీ కొండరాయిని సైతం అలవోకగా చేతితో పైకెత్తుతాడు. తమ ఊరికి హాని తలపెట్టాలని చూసిన విలన్లకు తగి బుద్ది చెబుతాడు. అయితే హనుమాన్‌ గెటప్‌లోకి మీరూ సింపుల్‌గా మారవచ్చు. లాంగ్‌ హెయిర్‌ చేతిలో గదతో పాటు హీరో ధరించిన టీషర్ట్‌ వేసుకుంటే మీరు హనుమాన్‌లాగా మారిపోతారు. భీమ్ (ఆర్ఆర్‌ఆర్‌) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్రంలో తారక్‌ (Jr NTR) భీమ్‌ పాత్రలో కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో పెద్ద పులిని సైతం ఎదుర్కొని తన బలం ఎంటో నిరూపిస్తాడు. విరామానికి ముందు వచ్చే సీన్‌లో అడవి జంతువులతో కలిసి బ్రిటిష్‌ వారిపై పోరాడే సీన్‌ చూసిన ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇక భీమ్‌లా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా?. తారక్‌లా కర్లీ హెయిర్‌స్టైల్‌, చేతిలో బల్లెం పట్టుకొని ఆ పాత్రకు తగ్గ డ్రెస్‌ వేస్తే మీరూ భీమ్‌ లాగా కనిపించవచ్చు. బాహుబలి (Bahubali) ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వచ్చిన బాహుబలి (Bahubali) చిత్రంలో ప్రభాస్‌ ఎంతో శక్తివంతంగా కనిపిస్తాడు. మదగజం లాంటి ఏనుగును సైతం కంట్రోల్‌ చేయగల సామర్థ్యం అతడికి ఉంటుంది. కండలు తిరిగిన దేహంతో వందలాది మంది శత్రుసైనికులను బాహుబలి తన ఖడ్గంతో&nbsp; అంతం చేస్తాడు. అటువంటి&nbsp; బాహుబలిలాగా మీరు కనిపించాలంటే ఈ కింద ఫొటోలో ఉన్న గెటప్‌లోకి వెంటనే మారిపోండి.&nbsp; భల్లాల దేవ (Bhallala Deva) ‘బాహుబలి’ చిత్రంలో ప్రతినాయకుడైన భల్లాల దేవ పాత్రలో రానా కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో భారీ దున్నపోతుపై భల్లాల పై చేయి సాధించడాన్ని బట్టి అతడు ఎంత పవర్‌ఫుల్‌లో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో వచ్చిన శక్తివంతమైన విలన్ పాత్రలో భల్లాల దేవ కచ్చితంగా టాప్‌-3లో ఉంటాడు. భల్లాలలాగా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా? అయితే గదను పోలిన ఆయుధాన్ని పట్టుకొని.. యుద్ధానికి వెళ్లే సూట్‌ ధరిస్తే సరి. కాకపోతే ముఖంలో కాస్త క్రూరత్వం ఉండేలా ఎక్స్‌ప్రెషన్ పెట్టాల్సి ఉంటుంది.&nbsp; కట్టప్ప (Kattappa) ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రను కూడా దర్శకుడు రాజమౌళి ఎంతో దృఢంగా తీర్చిదిద్దాడు. విశ్వాసానికి నిలువెత్తు రూపంగా ఆ పాత్రను చూపించాడు. ‘బాహుబలి 2’ క్లైమాక్స్‌లో ప్రభాస్‌ సాయం చేస్తూ విలన్లపై కట్టప్ప దండెత్తే తీరు అతడి ధైర్య సాహసాలకు అద్దం పడుతుంది. బాహుబలి తొలి భాగం రిలీజ్‌ తర్వాత కట్టప్ప పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం గమనార్హం. అయితే కట్టప్పలా కనిపించడం చాలా సింపుల్‌. తలపై గుండు.. నెరిసిన గడ్డంతో కట్టప్ప తరహా డ్రెస్‌ వేస్తే మీరు అలాాగే మారిపోతారు.&nbsp; కాలకేయ (Kalakeya) కొన్ని సినిమాల్లో హీరో పాత్రకు సమానంగా విలన్‌ రోల్‌ హైలెట్‌ అవుతుంటాయి. ఈ కోవకు చెందిందే ‘బాహుబలి’ సినిమాలోని ‘కాలకేయ పాత్ర’. చూస్తేనే భయం వేసేలా ఆ పాత్రను రాజమౌళి రూపొందించారు. నటుడు ప్రభాకర్‌ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ముఖ్యంగా కిలికి భాషలో ఆకట్టుకున్నాడు. ఈ వేషధారణను ధరించడం అంత తెలిక కాదు. నిపుణులు వద్దకు వెళ్తే వారు సులభంగా వేయగలరు. అపరిచితుడు (Aparichithudu) ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయగల అతికొద్ది మంది హీరోల్లో తమిళ నటుడు విక్రమ్‌ ఒకరు. అతడు హీరోగా చేసిన ‘అపరిచితుడు’ చిత్రం ఎవర్‌గ్రీన్‌ అని చెప్పవచ్చు. ఇందులో విక్రమ్‌ చేసిన మూడు పాత్రల్లో కెల్లా అపరిచితుడు ఎంతో అగ్రెసివ్‌. తప్పు చేసిన వారిని దండిస్తూ చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్‌ నిపుణులతో విక్రమ్‌ చేసే ఫైట్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అపరిచితుడిలా మీరు కనిపించాలంటే ముందుగా బ్లాక్‌ డ్రెస్‌ ధరించి లాంగ్‌ హెయిర్‌ను ముఖం మీదకు వదిలేయాలి. ఆ తర్వాత సగం ముఖం వరకూ పుర్రె స్టిక్కర్‌ను ధరిస్తే సరిపోతుంది.&nbsp; రోబో (Robo) భారతీయ సినిమా చరిత్రలో ‘రోబో’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హాలీవుడ్‌ చిత్రాన్ని తలపించేలా డైరెక్టర్ శంకర్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో చిట్టి అనే రోబో పాత్రలో&nbsp; రజనీకాంత్‌ సూపర్‌ హీరోలా కనిపిస్తాడు. అసాధ్యం అనుకున్న పనులను ఎంతో తెలిగ్గా చేసేస్తూ ఆశ్చర్యపరుస్తాడు. అయితే రోబోలా కనిపించాలని మీరు కోరుకుంటే వెంటనే రోబో సూట్‌ను ఆర్డర్‌ పెట్టేయండి. చిట్టిలా రెడీ అయ్యి మీ ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్ చేయండి.&nbsp; పక్షిరాజా (Pakshi Raja) ‘రోబో 2’ చిత్రంలో ప్రతినాయకుడు పక్షిరాజా పాత్ర హాలీవుడ్‌ సినిమాల్లో విలన్లను తలపిస్తుంది. ప్రకృతిని కంట్రోల్‌ చేయగల పవర్‌ను పొంది అతడు చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. కథానాయకుడు రజనీకాంత్‌కు సవాళ్లు విసురుతూ ఇబ్బందులకు గురిచేస్తాడు. పక్షి రాజాలా మారాలనుకుంటే కాస్త శ్రమ పడాల్సిందే. కాబట్టి నిపుణుల వద్దకు వెళ్తే వారు మిమ్మల్ని అచ్చం అలాగే తయారు చేస్తారు.&nbsp; అరుంధతి (Arundhati) తెలుగులో పవర్‌ఫుల్‌ ఫీమేల్‌ పాత్ర అనగానే ముందుగా అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమానే అందరికీ గుర్తుకువస్తుంది. దుర్మార్గుడైన పశుపతిని ఎదిరించే వీర వనితగా ఇందులో అరుంధతి కనిపిస్తుంది. అరుంధతి లాగా మీరు పవర్‌ఫుల్‌గా కనిపించాలని అనుకుంటే ముందుగా ముఖాన గుడ్రపు బొట్టు ధరించాలి. శిగను మూడేసి అనుష్క కట్టిన స్టైల్‌లో ఆభరణాలు, శారీ కడితే మీరు అరుంధతి అయిపోతారు.&nbsp; పశుపతి (Pasupathi) తెలుగు సినీ చరిత్రలో ‘పశుపతి’ లాంటి విలన్‌ను చూసి ఉండరు. అరుంధతి చేతిలో చనిపోయినా అతడు పగ తీరని పిశాచిలా మళ్లీ తిరిగి వస్తాడు. అరుంధతి రూపంలో ఉన్న ఆమె వారసురాలని ఇబ్బందులకు గురి చేస్తాడు. పశుపతి లాగా కనిపంచాలంటే మీరు అఘోరాలాగా మారాల్సి ఉంటుంది.&nbsp; ఆదిత్య 369 (Aditya 369) బాలయ్య హీరోగా చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇందులో బాలయ్య ఓ టైమ్‌ మిషన్‌ ద్వారా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్తాడు. అలాగే ఫ్యూచర్‌లోకి వెళ్లి అప్పటి పరిస్థితులు ఎలా ఉండనున్నాయో కళ్లకు కడతాడు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణలాగా మీరు మారిపోవాలని అనుకుంటే అతడు ధరించిన రోబోటిక్‌ జాకెట్‌ను వేయండి.&nbsp; సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy) చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం.. నిజమైన యోధుడి జీవిత కథ ఆధారంగా రూపొందింది. బ్రిటిష్‌ వారి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి.. ఆంగ్లేయులకు సింహస్వప్నంలా సైరా మారతారు ప్రజల కోసం చివరికీ ప్రాణ త్యాగం చేసి అసలైన సూపర్‌ హీరోగా నిలుస్తారు. సైరా నరసింహా రెడ్డి మీరూ కనిపించాలంటే సేమ్‌ చిరంజీవిలాగా లాంగ్‌ హెయిర్‌, కోరమీసంతో వీపున కత్తి ధరించండి.&nbsp; బింబిసార (Bimbisara) 5వ శతాబ్దానికి చెందిన మగద రాజ్యాధిపతి బింబిసారుడు కథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించాడు. శత్రువులను నిర్ధాక్షణ్యంగా ఏరిపారేసే శూరుడిలా బింబిసారుడు కనిపిస్తాడు. అతడి మీరూ కనిపించాలంటే లాంగ్‌ హెయిర్‌ గడ్డంతో పాటు చేతిలో ఖడ్గాన్ని ధరించాలి. కళ్యాణ్‌ రామ్‌ తరహాలో వజ్రాహారాలు, రాజ దుస్తులను ధరిస్తే బింబిసార గెటప్‌లోకి మారిపోతారు.&nbsp; అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) బ్రిటిష్‌ వారికి ముచ్చెమటలు పట్టించిన స్వాతంత్ర సమరయోధుల్లో ‘అల్లూరి సీతారామరాజు’ ఒకరు. సూపర్‌ కృష్ణ ఆయన జీవిత కథను సినిమాగా తీశారు. ఆగస్టు 15 సందర్భంగా ఇప్పటికీ చిన్నారులు అల్లూరి సీతారామరాజు వేషధారణను ధరించి ఆయన్ను గుర్తు చేస్తుంటారు. ఇలా అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించడం చాలా సింపుల్‌. చొక్క లేకుండా శరీరానికి కాషాయ రంగు వస్తాన్ని చుట్టుకొని.. వీపున బాణాలు.. చేతిలో విల్లు పట్టుకుంటే ఆ మహాత్ముడిలా కనిపించవచ్చు.&nbsp;
  ఫిబ్రవరి 29 , 2024
  Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
  Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
  ఈ రోజుల్లో హీరో కావాలంటే డాన్సులు, నటన రావడమే కాదు ఫిజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో హీరో తెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. అందుకే ఎంత కష్టమైన భరించి కథానాయకులు సిక్స్ ప్యాక్‌లు చేస్తుంటారు. పాత్రలకు అనుగుణంగా తమను తాము రూపాంతరం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి బరువు కూడా పెరగాల్సి ఉంటుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం కోసం తమను ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని బట్టి మన స్టార్‌ హీరోలు సినిమా పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్భుతమైన ఫిజిక్‌ కలిగిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; చిరంజీవి (Chiranjeevi) ఇంద్ర సినిమా ముందు వరకూ టాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్‌ కలిగిన హీరో అంటే ముందుగా మెగాస్టార్‌ చిరంజీవినే గుర్తుకు వచ్చాయి. శంకర్‌దాదా జిందాబాద్‌ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన చిరు బాడీని కాస్త అశ్రద్ధ చేశారు. తిరిగి సినిమాల్లోకి కమ్‌బ్యాక్‌ ఇచ్చిన చిరు.. ఆరు పదుల వయసులోనూ ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల ‘విశ్వంభర’ సినిమా కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపించారు. https://twitter.com/i/status/1752914245170364419 ప్రభాస్‌ (Prabhas) టాలీవుడ్‌లో మెస్మరైజింగ్‌ బాడీ అనగానే ముందుగా పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. తొలి చిత్రం ఈశ్వర్‌ నుంచి ఫిట్‌గానే ఉన్న ప్రభాస్‌.. బుజ్జిగాడు సినిమా కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్‌ చేశాడు. ఆ తర్వాత బాహుబలి కోసం మరింత బరువు పెరిగి కండలు తిరిగిన యోధుడిలా ప్రభాస్‌ మారాడు. రీసెంట్‌గా ‘సలార్‌’లోనూ ప్రభాస్‌ పలకలు తిరిగిన బాడీతో కనిపించాడు.&nbsp; రానా (Rana) ప్రభాస్‌ తర్వాత ఆ స్థాయిలో గంభీరమైన దేహాన్ని కలిగిన హీరో రానా. తొలి సినిమా ‘లీడర్‌’లో బక్కపలచని బాడీతో కనిపించిన రానా.. ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెందాడు. ‘కృష్ణం వందే జగద్గురం’లో కడలు తిరిగిన బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి చిత్రం కోసం మరింత బరువు పెరిగి.. ప్రభాస్‌ను ఢీకొట్ట సమవుజ్జీలా మారాడు.&nbsp; సుధీర్‌ బాబు (Sudheer Babu) శివ మనసు శృతి (SMS) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సుధీర్‌ బాబు.. తన బాడీతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు. బేసిక్‌గా జిమ్మాస్టర్‌ అయిన ఈ హీరో.. ప్రతీ సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ బాడీని మెయిన్‌టైన్‌ చేస్తూ మెప్పిస్తున్నాడు.&nbsp; రామ్‌ చరణ్‌ (Ram Charan) మెగాస్టార్‌ వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్‌. తొలి సినిమాలో ఫిట్‌గా కనిపించిన చరణ్‌.. ‘మగధీర’కు వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా కండలతో మెరిశాడు. ఇక ధ్రువ సినిమాలో ఏకంగా సిక్స్‌ ప్యాక్‌తో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్ఆర్‌’లోనూ దృఢమైన బ్రిటిష్ పోలీసు అధికారిగా కనిపించి మెప్పించాడు.&nbsp; అల్లు అర్జున్‌ (Allu Arjun) గంగోత్రి సినిమాతో లేలేత వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుఅర్జున్‌.. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. దేశముదురు చిత్రంతో తొలిసారి సిక్స్‌ ప్యాక్‌లో కనిపించిన బన్నీ.. తన ఫిట్‌నెస్‌ను ప్రతీ సినిమాలోనూ కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్‌ పుష్పలో తన పాత్ర కోసం బరువు పెరిగి కనిపించాడు.&nbsp; జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) టాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌ బాడీని కలిగి ఉన్న స్టార్‌ హీరోల్లో తారక్‌ ఒకరు. కెరీర్‌ తొలినాళ్లలో చాలా బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్‌.. ‘యమదొంగ’ సినిమాతో సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లావైన తారక్.. ‘టెంపర్‌’లో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ దృఢమైన బాడీతో మెప్పించాడు.&nbsp; రామ్ పోతినేని (Ram Pothineni) లవర్ బాయ్‌లాగా క్యూట్‌గా కనిపించే రామ్‌.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్‌.. డబుల్‌ ఇస్మార్ట్‌ కోసం మళ్లీ సిక్స్‌ ప్యాక్‌ చేసినట్లు తెలుస్తోంది.&nbsp; నాగ శౌర్య (Naga Shourya) యంగ్‌ హీరో నాగ శౌర్య.. కెరీర్‌ ప్రారంభంలో డెసెంట్‌ సినిమాలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించాడు. ఇటీవల ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ చేసి మాస్‌ హీరోగా రూపాంతరం చెందాడు.&nbsp; విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) మంచి హైట్‌, ఫిజిక్‌ కలిగిన విజయ్‌ దేవరకొండ.. ఇటీవల వచ్చిన ‘లైగర్‌’ సినిమాలో మెస్మరైజింగ్‌ బాడీతో అదరగొట్టాడు. బాక్సింగ్‌ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాత్రకు తగ్గట్టు విజయ్‌ తనను తాను మార్చుకున్నాడు.&nbsp; అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సీనియర్‌ నటుల్లో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఒకటే బాడీని మెయిన్‌టెన్‌ చేస్తున్న నాగార్జున.. ‘ఢమరుకం’ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు.&nbsp; సునీల్‌ (Sunil) టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని బాడీ ట్రాన్సఫర్‌మేషన్ ఏదైనా ఉందంటే అది కమెడియన్ సునీల్‌ (Sunil)ది మాత్రమే. హాస్య పాత్రలు పోషించి రోజుల్లో చాలా లావుగా కనిపించిన సునీల్‌.. హీరోగా మారాక సిక్స్‌ ప్యాక్‌ చేశాడు. పూలరంగడు సినిమాలో ఆరు పలకల బాడీతో కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశాడు.&nbsp;
  ఫిబ్రవరి 23 , 2024
  RRR | OSCARS: ‘నాటు నాటు'ను ఏళ్ల తరబడి స్మరించుకుంటాం’.. ప్రధాని మోదీ
  RRR | OSCARS: ‘నాటు నాటు'ను ఏళ్ల తరబడి స్మరించుకుంటాం’.. ప్రధాని మోదీ
  RRR చిత్రంలో నాటునాటు పాటకి ఆస్కార్&nbsp; రావటం పట్ల చిత్రబృందానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజమౌళి టీమ్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందలు తెలుపుతున్నారు. ప్రపంచస్థాయికి భారతీయ సినిమా వెళ్లిందంటూ ప్రశంసిస్తున్నారు.&nbsp; దర్శక దిగ్గజం రాజమౌళితో పాటు చరణ్, ఎన్టీఆర్‌లపై పొగడ్తల వర్షం కురుస్తుంది.&nbsp; RRR చిత్రబృందం ఆస్కార్‌ అందుకోవటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.&nbsp; “ నాటునాటు పాటకి ఆస్కార్‌తో దేశం గర్విస్తోంది. ఈ పాటను కొన్ని ఏళ్లతరబడి స్మరించుకుంటారు. నాటునాటు పాట ప్రపంచమంతా పేరు తెచ్చుకుంది. కీరవాణి, చంద్రబోస్‌కు అభినందనలు” అంటూ ప్రధాని కొనియాడారు.&nbsp; https://twitter.com/narendramodi/status/1635132805628956674 బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో RRRలోని నాటు నాటు గీతం ఆస్కార్ అందుకోవటం అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. చిత్రబృందానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు వెంకయ్య.&nbsp; https://twitter.com/MVenkaiahNaidu/status/1635135662734319616 దేశం మెుత్తం స్టెప్పులు వేసిన పాట ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కీరవాణి, చంద్రబోస్‌ సహా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.&nbsp; https://twitter.com/RahulGandhi/status/1635140606862454784 ఆస్కార్‌ గెలిచి ఆర్ఆర్‌ఆర్ చిత్రం చరిత్ర సృష్టించిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. భారతదేశ గర్వించ దగ్గ విషయం ఒకటైతే, తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతికి మరింత గర్వకారణంం అన్నారు.&nbsp; https://twitter.com/ncbn/status/1635117591806234624 దర్శక ధీరుడు రాజమౌళి దార్శనికత, సాహసం తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాయని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కారం అందుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. ఇందులో చరణ్ కూడా భాగస్వామ్యం కావటం గర్వంగా ఉందన్నారు. https://twitter.com/KChiruTweets/status/1635113504758964227 ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర సంగీత దర్శకులు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లకు జనసేనాని పవన్ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. “ ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నిలిచిన RRRలోని ఈ నాటు నాటు… గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా హుషారెత్తించింది. ఈ గీతాన్ని ఆస్కార్ వేదికపై ప్రదర్శించడంతో పాటు అవార్డు పొందటం ద్వారా భారత సినిమా స్థాయి మరోస్థాయికి చేరింది. ఇంతటి ఘనత పొందేలా చేసిన దర్శకుడు రాజమౌళికి ప్రత్యేక అభినందనలు” చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం భారతీయులను, తెలుగు సినిమాను గర్వించేలా చేసిందని తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రశంసించారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు తమిళిసై. https://twitter.com/DrTamilisaiGuv/status/1635141311887192064 విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటుతూ.. ఆస్కార్ ను గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమన్నారు సీఎం కేసీఆర్. ఆస్కార్ అవార్డుతో&nbsp; తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ గడ్డమీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించిందని పేర్కొన్నారు. ఈ అవార్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా, తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్తు భారత దేశానికి గర్వకారణమని చెప్పారు సీఎం. ఆర్ఆర్‌ఆర్ ఆస్కార్ అందుకోవటంతో ఆనందంలో మునిగి తేలుతున్న వారిలో తాను కూడా చేరానంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కీరవాణి, చంద్రబోస్‌తో పాటు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్‌. https://twitter.com/KTRBRS/status/1635138037549248512 RRR హీరోయిన్ అలియా భట్ నాటు నాటుకు ఆస్కార్‌ రావడం పట్ల తన సంతోషాన్ని ఇన్‌స్టా స్టోరీలో వ్యక్తపరిచింది. సెలబ్రేషన్ ఎమోజీలతో ఆనందాన్ని పంచుకుంది. ఆస్కార్ అవార్డు గెలవటంపై మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. “ ఇప్పటికీ నాకు కలగానే ఉంది. మాకు అంతులేని మద్దతు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. రాజమౌళి, కీరవాణి భారతీయ చిత్ర పరిశ్రమలోనే గొప్ప వ్యక్తులు. ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వారికి కృతజ్ఞతలు. నాటు నాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తుంపు పొందటానికి కారణమైన రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ, ప్రేమ్‌ రక్షిత్‌కు అభినందనలు. తారక్‌తో కలిసి మరోసారి డాన్స్ చేసి రికార్డులు బద్ధలుకొట్టాలని ఆశిస్తున్నాను. ఈ అవార్డు భారత చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క నటుడు, టెక్నిషియన్‌కు అంకితం” అన్నారు.&nbsp;&nbsp; https://twitter.com/AlwaysRamCharan/status/1635151004298772480?s=20 నాటు నాటు పాట ఆస్కార్ గెలవడం పట్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. మేము కూడా ఆస్కార్ సాధించాం అంటూ తన సంతోషాన్ని ట్వీట్ చేశారు. RRR మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి, నాటు నాటు సాంగ్ రాసిన గేయ రచయిత చంద్రబోస్‌ను తారక్ అభినందించారు. మొత్తం RRR చిత్రబృందానికి ఆయన శుక్షాకాంక్షలు తెలిపారు. https://twitter.com/tarak9999/status/1635151033432432641?s=20
  మార్చి 13 , 2023
  <strong>Devara: తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’కు ఊహించని షాక్‌.. ప్రభాస్‌, బన్నీతో పోలిస్తే వెనకబడ్డ తారక్‌!</strong>
  Devara: తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’కు ఊహించని షాక్‌.. ప్రభాస్‌, బన్నీతో పోలిస్తే వెనకబడ్డ తారక్‌!
  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత జూ.ఎన్టీఆర్‌ (Jr. NTR) నటిస్తున్న చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్‌గా చేస్తోంది. సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుండటం, తారక్‌ డ్యూయల్‌ రోల్‌లో చేస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా దేవర ప్రీరిలీజ్ బిజినెస్‌ అంటూ కొన్ని లెక్కలు వైరల్‌ అవుతున్నాయి. అవి చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.&nbsp; ఆ సినిమాల కంటే వెనకే! లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ థియేట్రికల్‌ హక్కులు రూ.130 కోట్లకు అమ్ముడుపోనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ కెరీర్‌లో ఇదే అత్యధికం. అయితే అల్లుఅర్జున్‌ ‘పుష్ప 2’ (Pushpa 2), ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కేవలం ఒక్క రీజియన్‌లోనే రూ.100 కోట్ల మేర బిజినెస్ చేస్తోందని టాక్. వీటితో పోలిస్తే దేవర చాలా తక్కువ థియేట్రికల్‌ బిజినెస్‌ చేసే పరిస్థితులు కనిపిస్తాయి. వాస్తవానికి టాలీవుడ్‌లో బన్నీ, తారక్‌కు సమాన క్రేజ్ ఉంది. ‘పుష్ప 2’ లాగానే ‘దేవర’ కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. అయినా కూడా ‘పుష్ప 2’ బిజినెస్‌ అంచనాలను తారక్ అందుకోకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరుగుతుందని భావించిన వారంతా తాజా లెక్కలు చూసి పెదవి విరుస్తున్నారు.&nbsp; ప్రీరిలీజ్‌ బిజినెస్‌ అంచనాలు ఇవే! లేటెస్ట్ బజ్‌ ప్రకారం దేవర ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఏకంగా రూ.400 కోట్లకు పైగా జరిగే అవకాశముందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.130 కోట్లు పలకనున్నట్లు సమాచారం. ఈ రైట్స్ కోసం నిర్మాత దిల్‌రాజు, మైత్రీమూవీ మేకర్స్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు పోటీ పడుతున్నారట. మరోవైపు ఉత్తరాది, కర్ణాటక, తమిళనాడు, కేరళ కలుపుకొని సుమారు రూ.50-60 కోట్ల బిజినెస్‌ జరిగిందని అంటున్నారు. అటు ఓవర్సీస్‌ హక్కులను రూ.27 కోట్లకు హమ్సిని ఎంటర్‌టైన్‌మెంట్‌ లాక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆడియో రైట్స్‌ను రూ.33 కోట్లకు టి సిరీస్‌ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దేవర ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌.. రూ.155 కోట్లకు ఖాయం చేసుకోగా మిగిలిన శాటిలైట్‌ హక్కులను కూడా కలుపుకుంటే ప్రీ రిలీజ్‌ బిజినెస్ లెక్కలు ఈజీగానే రూ.400 కోట్లు దాటతాయని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.&nbsp; సినిమా రిలీజ్‌ ఎప్పుడంటే? ‘దేవర’ మూవీ టీజర్‌, ట్రైలర్, సాంగ్‌ రిలీజ్‌ కాకుండానే ఈ స్థాయిలో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు బయటకు రావడంపై సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. దేవర ఫస్ట్‌ పార్ట్‌కే ఈ స్థాయిలో బిజినెస్‌ జరిగితే.. రెండో భాగానికి ఇంకెంత బిజినెస్‌ జరుగుతుందోనని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నాయి. కాగా, అక్టోబర్‌ 10న దసరా కానుకగా దేవర చిత్రం విడుదల కానుంది. ఇందులో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధా ఫిల్మ్స్‌ పతాకాలపై కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.&nbsp;
  ఏప్రిల్ 16 , 2024
  <strong>Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌.. ఆ విషయంలో ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ!</strong>
  Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌.. ఆ విషయంలో ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ!
  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ తర్వాత మెగా పవర్‌ స్టార్ ‘రామ్ చరణ్’ (Ram Charan) నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని ప్రముఖ నిర్మా దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇవాళ రామ్‌చరణ్‌ పట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజైంది. ప్రస్తుతం ఈ విజువల్‌ ట్రీట్‌ను చూసి మెగా ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; ఫస్ట్ సాంగ్ వచ్చేసింది? ‘గేమ్‌ ఛేంజర్‌’ మెుదటి సాంగ్‌ కోసం ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈపాటికే సాంగ్‌ రిలీజ్ కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సాంగ్‌ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ‘జరగండి’ (Jaragandi) లిరికల్‌ వీడియో సాంగ్‌ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. ‘జ‌ర‌గండి జ‌ర‌గండి జ‌ర‌గండి.. జాబిల‌మ్మ జాకెటేసుకొచ్చేనండి’ అనే లిరిక్స్‌తో ఈ పాట మొద‌లైంది. మాస్‌ ట్యూన్స్‌, క్యాచీ లిరిక్స్‌తో జ‌ర‌గండి పాట అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట‌కు ఆనంత‌ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా.. ద‌లేర్ మెహందీ, సునిధీ చౌహాన్ ఆల‌పించారు. ప్రభుదేవ కొరియాగ్రఫీ చేశారు. https://www.youtube.com/watch?v=45vS1-xtnp8 పాట ఎలా ఉందంటే? ‘జరగండి’ సాంగ్‌ లిరికల్‌ వీడియోను గమనిస్తే ఇది పక్కా డైరెక్టర్‌ శంకర్‌ మార్క్‌తో రూపొందింది. ఆయన గత చిత్రాల్లోని పాటలు ఎలా అయితే ప్రత్యేకంగా అనిపించాయో ఈ సాంగ్‌ కూడా అలాగే ఆకర్షణీయంగా కనిపిస్తోంది. సాంగ్‌ అంతా కలర్‌ఫుల్‌గా.. పదుల సంఖ్యలో డ్యాన్సర్లతో నిండిపోయింది. ఇందులో రామ్‌చరణ్‌, కియారా అద్వానీ పెయిర్‌ చాలా క్యూట్‌గా ఉంది. ఇద్దరూ ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించారు. చరణ్‌ తన డ్యాన్స్‌తో ఇరగదీసినట్లే కనిపిస్తోంది. ప్రభుదేవ మాస్టర్‌ ఈ సాంగ్‌ను కొరియోగ్రాఫ్‌ చేస్తున్న దృశ్యాలను సైతం ఈ లిరికల్‌ వీడియోలో గమనించవచ్చు. ఓవరాల్‌గా ఈ సాంగ్‌ గేమ్‌ ఛేంజర్ మూవీలో ప్రధాన ఆకర్షణగా నిలిచే ఛాన్స్ ఉంది.&nbsp; ఆ విషయంలో ఫ్యాన్స్‌ నిరాశ! ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ కోసం మెగా ఫ్యాన్స్ గత కొంత కాలంగా ఎదురుచూస్తున్నారు. రామ్‌చరణ్‌ బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ సాంగ్‌తో పాటు విడుదల తేదీని కూడా అనౌన్స్‌ చేస్తారని అంతా భావించారు. అయితే అలా ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. ‘గేమ్‌ ఛేంజర్’ రిలీజ్‌ డేట్‌పై మేకర్స్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కనీసం కమింగ్‌ సూన్‌ (Coming Soon) అని కూడా ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా కోసం ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలని ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.&nbsp;
  మార్చి 27 , 2024
  <strong>Shruti Marathe: ‘దేవర’లో తారక్‌ భార్యగా గుజరాతి బ్యూటీ.. శ్రుతి మరాఠే ఎంత ఫేమస్సో తెలుసా?&nbsp;</strong>
  Shruti Marathe: ‘దేవర’లో తారక్‌ భార్యగా గుజరాతి బ్యూటీ.. శ్రుతి మరాఠే ఎంత ఫేమస్సో తెలుసా?&nbsp;
  'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత ఎన్టీఆర్‌ (Jr NTR) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తారక్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అయితే రెండో పాత్రకు జోడీగా గుజరాతీ నటి శ్రుతి మరాఠే (Shruti Marathe) నటిస్తోంది.&nbsp; దేవరలో నటించే విషయాన్ని శ్రుతినే స్వయంగా ప్రకటించడంతో ఆమె పేరు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ భామ గురించి తెలుసుకునేందుకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు.&nbsp; గుజరాత్‌లోని వడోదరా ప్రాంతంలో 9 అక్టోబర్‌, 1986 శ్రుతీ జన్మించింది. అక్కడి సెయింట్‌ మీరాస్‌ కాలేజీ (St. Mira's College)లో ఆమె చదువుకుంది.&nbsp; కెరీర్‌ ప్రారంభంలో శ్రుతి మరాఠే మోడల్‌గా చేసింది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి గుర్తింపు పొందింది.&nbsp; అలా మరాఠీ సీరియల్స్‌లోకి అడుగుపెట్టిన శ్రుతి.. రాధ హయ్ బవారి (Radha Hi Bawari), జాగో మోహన్‌ ప్యారే (Jaago Mohan Pyare), మఝ్యా నవర్యాచి బేకూ (Majhya Navaryachi Bayko) వంటి సీరియళ్లతో చాలా పాపులర్ అయ్యింది.&nbsp; 2008లో వచ్చిన 'సనాయ్‌ చౌగదే' (Sanai Choughade) అనే మరాఠీ సినిమాతో ఆమె వెండితెరపై అడుగుపెట్టింది. అందులో అశ్విని పాత్రలో కనిపించి అలరించింది.&nbsp; ఆ తర్వాత 'ఇందిరా విఝా' (Indira Vizha) సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టి అక్కడ కూడా గుర్తింపు సంపాదించింది. మరాఠి, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది.&nbsp; 2016లో వచ్చిన&nbsp; బుధియా సింగ్‌ - బొర్న్‌ టూ రన్‌' (Budhia Singh – Born to Run) సినిమాతో శ్రుతి.. బాలీవుడ్‌కు పరిచయమైంది. అదే ఏడాది 'వెడ్డింగ్‌ యానివర్సరీ'తో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. 'బార్డ్ ఆఫ్‌ బ్లడ్‌' (Bard Of Blood) వెబ్‌సిరీస్‌లోనూ శ్రుతి నటించింది. బాలీవుడ్‌లో తనేంటో నిరూపించుకున్న శ్రుతికి టాలీవుడ్‌లో 'దేవర'నే మెుదటి సినిమా. శ్రుతి మరాఠే వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమెకు 2016లోనే వివాహమైంది. ప్రముఖ మరాఠీ నటుడు గౌరవ్‌ ఘట్నేకర్‌ (Gaurav Ghatnekar) ఆమె వివాహం చేసుకుంది.&nbsp; విహార యాత్రలను ఎక్కువగా ఇష్టపడే ఈ భామకు బోటింగ్ అంటే ఇంకా ఇష్టమట. షూటింగ్‌ నుంచి ఏ కాస్త విరామం దొరికినా కుటుంబంతో ట్రిప్‌ ప్లాన్‌ చేస్తుందట.&nbsp; ఈ సోషల్‌ మీడియాలోనూ శ్రుతి మరాఠీ చాలా చురుగ్గా ఉంటోంది. ఇంట్లో వాళ్లతో కలిసి చేసిన రీల్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.&nbsp; శ్రుతి.. అప్పుడప్పుడు గ్లామర్‌ ఫొటోలను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది.
  మార్చి 27 , 2024

  @2021 KTree