• TFIDB EN
  • రాజ్
    UATelugu1h 50m
    హీరో తన ప్రేమ విషయాన్ని దాచి మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. వారి కాపురం సాఫీగా సాగిపోతున్న క్రమంలో మాజీ ప్రేయసి హీరో లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు వారి జీవితం ఎలాంటి ఒడిదొడుకులకు లోనైంది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సుమంత్
    విమలా రామన్
    ప్రియమణి
    అజయ్
    మురళీ మోహన్
    సత్యం రాజేష్
    గిరి బాబు
    సిబ్బంది
    VN ఆదిత్య
    దర్శకుడు
    కుమార్ బ్రదర్స్నిర్మాత
    కోటి
    సంగీతకారుడు
    కథనాలు
    రాజ్ తరుణ్ (Raj Tarun) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రాజ్ తరుణ్ (Raj Tarun) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    ఉయ్యాల జంపాలా(2013) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయిన రాజ్‌ తరుణ్.. తక్కువ టైంలోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. సినిమాల్లోకి రాక ముందు దాదాపు 50కి పైగా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. కుమారి 21F చిత్రం ద్వారా గుర్తింపు లభించింది. ఈ సినిమా కమర్షియల్ మంచి విజయం సాధించింది. రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించాడు. టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఇమేజ్ పొందిన రాజ్ తరుణ్ గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. రాజ్ తరుణ్ ముద్దు పేరు? రాజ్ రాజ్ తరుణ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు రాజ్ తరుణ్ తొలి సినిమా? ఉయ్యాల జంపాల రాజ్ తరుణ్ ఎక్కడ పుట్టాడు? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాజ్ తరుణ్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1992, మే11 రాజ్ తరుణ్‌కు వివాహం అయిందా? ఇంకా జరగలేదు. రాజ్‌ తరుణ్‌కు లవర్ ఉందా? కుమారి21F సినిమా సమయంలో హెబ్బా పటెల్‌తో ప్రేమాయణం సాగించినట్లు రూమర్లు వచ్చాయి. రాజ్‌ తరుణ్ ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి రాజ్ తరుణ్ తొలి హిట్ సినిమా? కుమారి 21F రాజ్ తరుణ్ ఇష్టమైన కలర్? వైట్, బ్లాక్, గ్రీన్ రాజ్ తరుణ్ తల్లిదండ్రుల పేరు? తండ్రి పేరు నిడమర్తి బసవరాజు, తల్లి పేరు రాజ్య లక్ష్మి? రాజ్ తరుణ్ ఫెవరెట్ హీరోయిన్? సమంత, అనుష్క శెట్టి రాజ్ తరుణ్‌కు ఇష్టమైన ప్రదేశం? లండన్ రాజ్‌ తరుణ్‌కు ఇష్టమైన సినిమాలు? టైటానిక్, జగడం రాజ్ తరుణ్ ఏం చదివాడు? ఇంజనీరింగ్, సినిమాల్లోకి రాకముందు 50 వరకు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. రాజ్ తరుణ్ అభిరుచులు? పుస్తకాలు చదవడం, కథలు రాయడం రాజ్ తరుణ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 20 సినిమాల్లో నటించాడు.  రాజ్ తరుణ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు?  ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=1nbxCrXjMeY
    మార్చి 21 , 2024
    <strong>Bhale Unnade Movie Review: నెల రోజుల్లో రాజ్‌ తరుణ్‌ మూడో చిత్రం.. ‘భలే ఉన్నాడే!’తో హిట్‌ కొట్టాడా?</strong>
    Bhale Unnade Movie Review: నెల రోజుల్లో రాజ్‌ తరుణ్‌ మూడో చిత్రం.. ‘భలే ఉన్నాడే!’తో హిట్‌ కొట్టాడా?
    న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్‌, మ‌నీషా కంద్కూర్, అభిరామి, అమ్ము అభిరామి, హైప‌ర్ ఆది, గోప‌రాజు ర‌మ‌ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కృష్ణ భ‌గ‌వాన్‌, వీటీవీ గ‌ణేష్‌, సింగీతం శ్రీనివాస్‌, లీలా శాంస‌న్‌, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు దర్శకత్వం: జె శివసాయి వర్ధన్ సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్ర‌హ‌ణం: నగేష్ బానెల్లా నిర్మాత: N.V కిరణ్ కుమార్ స‌మ‌ర్ప‌ణ: మారుతి విడుద‌ల తేదీ: 13-09-2024 రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’ (Bhale Unnade Movie Review in telugu). ఇందులో మనీషా కంద్కూర్‌ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి వర్ధన్‌ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్‌ సమర్పణలో రవికిరణ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. నెల రోజుల వ్యవధిలో రాజ్‌తరుణ్‌ నుంచి వచ్చిన మూడో చిత్రం ఇది. గత రెండు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ‘భలే ఉన్నాడే!’ సినిమాపై రాజ్‌ తరుణ్‌ చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రాజ్‌తరుణ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి రాధ (రాజ్‌త‌రుణ్‌) వైజాగ్‌లో శారీ డ్రాపర్‌ (అమ్మాయిల‌కు చీర క‌ట్టే వృత్తి)గా పనిచేస్తుంటాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి గౌరి (అభిరామి) పెంపకంలో పెరుగుతూ ఆమెకు చేదోడుగా ఉంటాడు. గౌరి ప‌ని చేసే బ్యాంకులోనే కొత్త‌గా కృష్ణ (మ‌నీషా) ఉద్యోగంలో చేరుతుంది. ఆమె గౌరీ తీసుకొచ్చే లంచ్ బాక్స్ తిని రాధ వంట‌ల‌కు ఫిదా అవుతుంది. రాధ‌ మొహం కూడా చూడ‌కుండానే అత‌నిపై మ‌న‌సు పారేసుకుంటుంది. రాధ కూడా కృష్ణ‌ను చూడ‌కుండానే లంచ్ బాక్స్ ద్వారా ఆమె పంపే లేఖ‌లు చ‌దువుతూ త‌న‌తో ప్రేమ‌లో ప‌డిపోతాడు. వీళ్లిద్ద‌రూ పెద్ద‌ల అంగీకారంతో పెళ్లికి సిద్ధ‌మ‌వ్వ‌గా నిశ్చితార్థం స‌మయంలో కృష్ణ స్నేహితురాలు ఆమెకు ఓ విష‌యం చెబుతుంది. దీంతో రాధ పెళ్లికి ప‌నికొస్తాడా? లేదా? అన్న సందేహాం కృష్ణకు కలుగుతుంది. ఆ త‌ర్వాత ఏమైంది? రాధకు కృష్ణ పెట్టిన పరీక్ష ఏంటి? రాధ అమ్మాయిల‌కు ఎందుకు దూరంగా ఉంటున్నాడు? వారి పెళ్లి జరిగిందా? లేదా? అన్నది స్టోరీ.  ఎవరెలా చేశారంటే రాధ పాత్ర‌లో రాజ్‌త‌రుణ్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో నటనకు బాగా స్కోప్‌ దొరికింది. అతడి లుక్స్‌, భావోద్వేగాలు మెప్పిస్తాయి. కృష్ణ పాత్ర‌లో మ‌నీషా అందంగా క‌నిపించింది. వీరిద్దరి కెమిస్ట్రీ చ‌క్క‌గా కుదిరింది. త‌ల్లిగా అభిరామి పాత్ర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. సింగీతం శ్రీనివాస్ క‌నిపించేది నాలుగైదు స‌న్నివేశాలైనా బలమైన ప్రభావాన్ని చూపించారు. అమ్ము అభిరామి, గోప‌రాజు ర‌మ‌ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర ఉంటాయి. హైప‌ర్ ఆది, నెల్లూరు సుద‌ర్శ‌న్ పాత్ర‌లు అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు పంచుతాయి. మిగిలిన పాత్రధారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే రాముడిలా ఉండాలనుకునే అబ్బాయిని నేటి సమాజం, అమ్మాయిలు ఎలా చూస్తారన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు శివసాయి వర్ధన్ ఈ సినిమా తెరకెక్కించారు. ప్ర‌థమార్ధం మెుత్తం హీరో, హీరోయిన్‌ ల‌వ్‌ట్రాక్‌, తల్లీకొడుకుల అనుబంధంతో స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతుంది. లంచ్ బాక్స్ వార‌ధిగా నడిచే ప్రేమ రాయబరాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. నిశ్చితార్థ సమయంలో వచ్చే మలుపుతో తొలి భాగాన్ని ముగించారు దర్శకుడు. అమ్మాయిలకు రాధ ఎందుకు దూరంగా ఉన్నాడనే నేపథ్యంతో సెకండ్‌పార్ట్‌ను తీసుకెళ్లారు. ప్ర‌థమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం చ‌ప్ప‌గా సాగినట్లు అనిపిస్తుంది. హీరోను పరీక్షించేందుకు కేరళ ఆశ్రమానికి తీసుకెళ్లడం, అక్కడ వైద్యం పేరుతో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ చేసే హంగామా పెద్దగా వర్కౌట్‌ కాలేదు. రాధ‌-కృష్ణ విడిపోయిన తీరులోనూ కొత్తదనం కనిపించదు. క్లైమాక్స్‌ కూడా బలహీనంగా ఉండటం మరో మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ చక్కటి పనితీరు కనబరిచారు. తన అద్భుత పనితీరుతో స్క్రీన్‌ను ఫ్రెష్‌గా, కలర్‌ఫుల్‌గా మార్చేశారు. శేఖర్ చంద్ర అందించిన పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రాజ్‌ తరుణ్‌ నటనకథా నేపథ్యంప్రథమార్థం మైనస్‌ పాయింట్స్‌ కమర్షియల్‌ హంగులు లేకపోవడంసెకండాఫ్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 13 , 2024
    <strong>Thiragabadara Saami Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ - మాల్వీ మల్హోత్ర చిత్రం ఎలా ఉందంటే?</strong>
    Thiragabadara Saami Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ - మాల్వీ మల్హోత్ర చిత్రం ఎలా ఉందంటే?
    నటీనటులు : రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్ర, మన్నారా చోప్రా, అంకిత ఠాకూర్‌, మకరంద్‌ దేశ్‌పాండే, ప్రగతి, రాజా రవీంద్ర, జాన్‌ విజయ్‌, పృథ్వీ, తాగుబోతు రమేష్‌ తదితరులు డైరెక్టర్‌ : ఏ.ఎస్‌. రవి కుమార్‌ సంగీతం : జేబీ సినిమాటోగ్రఫీ : జవహర్‌ రెడ్డి నిర్మాత : మాల్కాపురం శివ కుమార్‌ విడుదల తేదీ : ఆగస్టు 2, 2024 యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ నటించిన లేటెస్ట్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘తిరగబడరా సామి’ (Thiragabadara Saami Movie Review). ఏ.ఎస్‌ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra), మన్నారా చోప్రా (Mannara Chopra) హీరోయిన్లుగా చేశారు. మకరంద్‌ దేశ్‌పాండే, రాజా రవీంద్ర, ప్రగతి ఇతర ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా హీరో హీరోయిన్లుగా చేసిన రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రపై సంచలన ఆరోపణలు వచ్చాయి. రాజ్‌తరుణ్‌ తనను మోసం చేసి మాల్వీతో రిలేషన్‌లో ఉన్నట్లు అతడి మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే ఆగస్టు 2న ‘తిరగబడరా సామి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి గిరి (రాజ్ తరుణ్) చాలా పిరికివాడు. ప్రతి దానికి భయపడుతూ చుట్టూ ఏం జరుగుతున్నా అసలు పట్టించుకోడు. కానీ శైలజా (మాల్వీ మల్హోత్ర) అలా కాదు. చాలా దూకుడుతో వైలెంట్‌గా ఉంటుంది. టీజ్‌ చేసిన వారిని ఇరగ దీస్తుంటుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. అయితే శైలజాను కంట్రోల్‌ చేయలేక గిరి ఎలాంటి తిప్పలు పడ్డాడు? వారి ప్రేమకు వచ్చిన సమస్య ఏంటి? ఎప్పుడు సౌమ్యంగా ఉండే గిరి ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? తన ప్రేమను గెలిపించుకునేందుకు అతడు ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే హీరో రాజ్‌ తరుణ్‌ గిరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తొలుత అమాయకుడిగా, ఆపై ప్రేయసి కోసం శత్రువులపై తిరగబడే ప్రియుడిగా రెండు డైమన్షన్లలో మంచి నటన కనబరిచాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో రాజ్‌ దుమ్మురేపాడు. ఈ స్థాయి యాక్షన్‌ సీన్స్‌ అతడు ఇప్పటివరకూ చేయలేదు. ఇక శైలజా పాత్రలో హీరోయిన్‌ మాల్వీ మల్హోత్ర ఒదిగిపోయింది. తెలుగులో ఆమెకు ఇది తొలి సినిమానే అయిన్పప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. స్క్రీన్‌పై రాజ్‌ తరుణ్‌ - మాల్వీ మల్హోత్ర కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. సెకండ్‌ హీరోయిన్ మన్నారా చోప్రా కూడా అద్భుతంగా నటించింది. ఇక జాన్‌ విజయ్‌, రఘుబాబు, అంకిత ఠాకూర్‌, ప్రగతి, రాజా రవీంద్ర తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు ఏ.ఎస్‌ రవికుమార్ ఈ చిత్రాన్ని లవ్‌ &amp; యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. తొలి భాగం మెుత్తం హీరో-హీరోయిన్‌ పరిచయం, వారి లవ్‌ ట్రాక్‌తో సాగిపోయింది. గిరిని శైలజా డామినేట్‌ చేసే క్రమంలో వచ్చే హాస్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా కుదరడంతో ఫస్టాఫ్‌ ఎక్కడా బోర్‌ లేకుండా వెళ్లిపోతుంది. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచారు డైరెక్టర్‌. రెండో భాగాన్ని హీరో ఎలివేషన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌తో పూర్తిగా నింపేశారు. రాజ్‌ తరుణ్‌ను ఎన్నో మాస్‌ యాంగిల్స్‌లో చూపించి డైరెక్టర్‌ ఆకట్టుకున్నారు. అయితే అక్కడక్కడ వచ్చే కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. కొన్ని ఫైట్స్‌ రాజ్‌తరుణ్‌ కటౌట్‌కు మించి ఉండటంతో లాజికల్‌గా కనెక్ట్‌ కాలేము. భావోద్వేగ సన్నివేశాలు సైతం పెద్దగా వర్కౌట్‌ కాలేదు. ఒక మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను కోరుకునేవారికి 'తిరబడరా సామి' నచ్చుతుంది.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే జేబీ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను బీజీఎం మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే పాటలు గుర్తుంచుకునేలా లేవు. అటు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్‌ రాజ్‌తరుణ్‌ నటనలవ్‌ ట్రాక్‌యాక్షన్‌ సీక్వెన్స్‌ మైనస్‌ పాయింట్స్‌ వర్కౌట్‌ కాని ఎమోషన్స్‌కొన్ని బోరింగ్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 02 , 2024
    <strong>Purushothamudu Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ ఆకట్టుకుందా!</strong>
    Purushothamudu Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ ఆకట్టుకుందా!
    నటీనటులు: రాజ్‌ తరుణ్‌, హాసిని, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు రచన, దర్శకత్వం: రామ్‌ భీమన సంగీతం: గోపీ సుందర్‌ సినిమాటోగ్రఫీ: పీజీ విందా ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ నిర్మాత: డాక్టర్‌ రమేశ్‌ తేజవత్‌, ప్రకాశ్‌ తేజవత్‌ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ (Raj Tarun) ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అటు సినీ, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదొడుకులను ఫేస్‌ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు నటించిన లేటేస్ట్ చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu Movie review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్‌ భీమన (Ram Bhimana) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హాసిని (Actress Hasini) హీరోయిన్‌గా చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రాజ్‌ తరుణ్‌కు హిట్‌ను అందించి ఊరట కల్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి రచిత్‌ రామ్‌ (రాజ్‌తరుణ్‌) పుట్టుకతోనే కోటీశ్వరుడు. పీఆర్‌ గ్రూప్స్‌ అధినేత ఆదిత్య రామ్‌ (మురళీ శర్మ) ఏకైక తనయుడు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని తిరిగొచ్చిన కుమారుడికి సీఈవో బాధ్యతలు అప్పగించాలని ఆదిత్య నిర్ణయించుకుంటాడు. అయితే రచిత్‌ పెద్దమ్మ వసుంధర దానికి (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ రూల్స్‌ ప్రకారం సీఈవోగా ఎంపికవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు సామాన్యుడిలా అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది. దీనికి రచిత్‌ అంగీకరించి బయటకువచ్చేస్తాడు. ఏపీలోని మారుమూల గ్రామమైన రాయపులంకకు వెళ్తాడు. అక్కడికి వెళ్లాక రచిత్‌ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు అతడు ఎలాంటి సాహసాలు చేశాడు? అమ్ముతో అతడి లవ్‌ స్టోరీ ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే రచిత్‌ రామ్‌ పాత్రలో రాజ్‌తరుణ్‌ చక్కటి నటన కనబరిచాడు. కోటీశ్వరుడిగా, ఎటువంటి ఐడెంటిలేని సాధారణ వ్యక్తిలా రెండు డైమన్షన్స్‌లో చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్స్‌లోనూ పర్వాలేదనిపించాడు. ఇక పల్లెటూరి అమ్మాయి అమ్ము పాత్రలో హాసిని సుధీర్‌ స్క్రీన్‌పై ఎంతో అందంగా మెరిసింది. రాజ్‌తరణ్‌ - అమ్ము మధ్య వచ్చే లవ్‌ సీన్స్ మెప్పిస్తాయి. హీరో ఫ్రెండ్‌ పాత్రలో ప్రవీణ్‌ నవ్వులు పూయిస్తాడు. సత్య, బ్రహ్మానందం వంటి కమెడియన్లు సినిమాలో తళుక్కుమని మెరిశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని కారణాల వల్ల ఓ సామాన్యుడిలా గడపటం గతంలో చాలా చిత్రాల్లోనే చూశాం. 'పురుషోత్తముడు' చిత్రాన్ని కూడా దర్శకుడు రామ్‌ భీమన ఈ కోవలోనే రూపొందించారు. ధనవంతుడైన హీరో రాయపులంక గ్రామం చేరాక అసలు కథ మెుదలవుతుంది. హీరోయిన్‌తో పరిచయం, లవ్‌ సీన్స్‌ ఆకట్టుకునేలా ఉంటాయి. ఫస్టాఫ్‌ మెుత్తం విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కామెడీతో ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. ఊర్లో జరిగే అన్యాయాలపై హీరో తిరగబడటం, ఇంటర్వెల్‌ బ్యాంగ్ మెప్పిస్తాయి. అయితే ద్వితీయార్థం నుంచి కథ గాడి తప్పినట్లు కనిపిస్తుంది. ఎలాంటి మలుపు లేకుండా ఊహకు తగ్గట్లు సాఫీగా, బోరింగ్‌గా సాగిపోతుంది. క్లైమాక్స్‌ సైతం అంచనాలకు తగ్గట్లు ఉన్నా ప్రకాశ్‌ రాజ్‌ ఎంట్రీ, అతడు చెప్పే డైలాగ్స్‌ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కథ, కథనంలో వైవిధ్యం చూపడంలో దర్శకుడు రామ్‌ భీమన పూర్తిగా విఫలమయ్యాడు. సాంకేతికంగా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే గోపి సుందర్‌ అందించిన సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. పీజీ విందా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని తన కెమెరా పనితనంతో చక్కగా చూపించారు. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ రాజ్‌తరుణ్‌ నటనఫస్టాఫ్‌లోని కొన్ని సీన్స్‌హీరో-హీరోయిన్‌ కెమెస్ట్రీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీఊహకందేలా సాగే కథనంట్విస్టులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    జూలై 27 , 2024
    <strong>Raj Tarun Case: </strong><strong>రాజ్‌తరుణ్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌.. ప్రేయసికి షాకిచ్చిన పోలీసులు!</strong>
    Raj Tarun Case: రాజ్‌తరుణ్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌.. ప్రేయసికి షాకిచ్చిన పోలీసులు!
    హీరో రాజ్‌తరుణ్‌ (Raj Tarun) తనను మోసం చేశాడంటూ అతడి మాజీ ప్రేయసి లావణ్య శుక్రవారం (జులై 5) పోలీసులకు ఫిర్యాదు చేయడం.. టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఎఫ్‌ఐఆర్‌ కాపీలో యంగ్‌ హీరోపై సంచలన ఆరోపణలు చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజ్‌తరుణ్‌ సైతం తనదైన శైలిలో స్పందించాడు. లావణ్యతో గతంలో జరిగిన వ్యవహారం మెుత్తాన్ని బయటపెట్టాడు. టాక్‌ ఆఫ్‌ టాలీవుడ్‌గా మారిపోయిన ఈ కేసులో శనివారం (జులై 6) ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్యకి ఉల్టాగా పోలీసులు నోటీసులు పంపారు.&nbsp; నోటీసులు ఎందుకంటే? హీరో రాజ్‌తరుణ్‌పై మాజీ ప్రేయసి లావణ్య.. శుక్రవారం (జులై 5) నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్‌ తను 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నామని పేర్కొంది. హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించింది. మాల్వీ మల్హోత్ర, ఆమె బంధువులు తనను బెదిరిస్తున్నారని కూడా కంప్లైంట్‌లో పేర్కొంది. మరోవైపు అందులో ఎలాంటి వాస్తవం లేదని రాజ్‌తరుణ్‌ కూడా వివరణ ఇచ్చాడు. దీంతో నార్సింగి పోలీసులు లావణ్యకు ఊహించని షాక్‌ ఇచ్చారు. రాజ్ తరుణ్‌పై ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ నోటీసుల్లో కోరారు. 91 CRPC కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ నోటీసులపై లావణ్య ఇప్పటివరకూ స్పందించలేదని తెలుస్తోంది. ఆమె సమర్పించే ఆధారాలను బట్టి ఈ కేసు ముందుకు కదలనుంది.&nbsp; ఫిర్యాదులోని మరిన్ని విషయాలు! శుక్రవారం నార్సింగ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య మరిన్ని ఆరోపణలు చేశారు. 2012 నుంచి రాజ్‌తరుణ్‌ తాను రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్‌ మెుదలైనప్పటి నుంచి మాల్వీ మల్హోత్రాతో రిలేషన్‌ స్టార్ట్‌ చేసినట్లు ఆరోపించింది. ఇదే విషయమై రాజ్‌తరుణ్‌ను నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను సంబంధం లేని కేసు (డ్రగ్స్‌)లో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని ఆరోపించింది. ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేయనున్నట్లు గురువారమే స్పష్టం చేశారు. అయితే స్టార్‌ సెలబ్రిటీలపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. ఆధారాల కోసం ఇవాళ లావణ్యకు నోటీసులు పంపారు. అది చూసి తట్టుకోలేకపోయా: రాజ్‌ తరుణ్‌ మాజీ ప్రేయసి లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై నటుడు రాజ్‌ తరుణ్‌ శుక్రవారమే (జులై 5) స్పందించారు. ఓ ఛానల్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను షార్ట్‌ఫిల్మ్స్‌ చేసే సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. మంచి అమ్మాయే. నేను హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో సాయం చేసింది. మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నది వాస్తవమే. 2014 నుంచి 2017 వరకు కలిసున్నాం. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి సంబంధంలేదు. ఆమె ఫ్రెండ్స్‌ సర్కిల్‌, తను డ్రగ్స్ తీసుకోవడం చూసి తట్టుకోలేకపోయా. వదిలేసి వెళ్లిపోదామనుకుంటే.. మీడియా ముందుకెళ్తానని నన్ను బెదిరించేది. నా పరువుకు భంగం కలగకుండా ఉండేందుకు భరిస్తూ వచ్చా. ఆమెపై డ్రగ్స్‌ కేసు నమోదవగా దానికి నేనే కారణమని ఆరోపణలు చేస్తోంది’ అని మండిపడ్డారు.&nbsp; ‘తన తండ్రినీ బెదిరించింది’ ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ లావణ్యపై రాజ్‌తరుణ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. తాను ఉండగానే ఆమె మరో యువకుడితో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. 'మరో అబ్బాయితో ఆమె రిలేషన్‌ కొనసాగించింది. రోజూ కొడుతున్నాడంటూ ఆ వ్యక్తిపైనా కేసు పెట్టింది. మళ్లీ అతడితో కలిసి నా ఇంట్లోనే కొన్నాళ్లు ఉంది. నేనే బయటకు వచ్చేశా. తన తండ్రినీ బ్లాక్‌ మెయిల్‌ చేసింది. మాకు పెళ్లి కాలేదు. జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్‌ అయిన సంగతి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. ఆమెకూ ఆ విషయం తెలుసు. ముంబయికి చెందిన నటితో సహజీవనం చేస్తున్నట్టు ఆమె ఆరోపిస్తోంది. నేను హైదరాబాద్‌లో ఉంటున్నా. ఆమె ముంబయిలో నివాసముంటోంది. మేం సహజీవనం ఎలా చేస్తాం? తనను ఇంట్లోంచి నేను పంపించేస్తానన్న భయంతో ఇదంతా చేస్తోంది’ అని రాజ్‌తరుణ్‌ ఆరోపించాడు.&nbsp;
    జూలై 06 , 2024
    పాయల్ రాజ్‌పుత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పాయల్ రాజ్‌పుత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పాయల్ రాజ్‌పుత్&nbsp; 2017లో పంజాబీ చిత్రం "చన్నా మెరేయా"తో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో "RX 100" చిత్రం ద్వారా విస్తృత గుర్తింపు పొందింది. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి విజయాలను అందించాయి. పాయల్ రాజ్‌పుత్ చాలా తక్కువ వ్యవధిలో అనేక విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో భాగం అయ్యింది. "RX 100", "వెంకీ మామ," "RDX లవ్, "మంగళవారం", "తమిళ చిత్రం "ఏంజెల్" వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.&nbsp; శృంగార తారగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిను పాయల్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. పాయల్ రాజ్‌పుత్ ముద్దు పేరు? టింకీ పాయల్ రాజ్‌పుత్ ఎప్పుడు పుట్టింది? 1990, డిసెంబర్ 6న జన్మించింది పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా? చన్నా మేరేయా (2017) పాయల్ రాజ్‌పుత్‌కు తెలుగులో తొలి సినిమా? RX 100(2018) పాయల్ రాజ్‌పుత్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7అంగుళాలు&nbsp; పాయల్ రాజ్‌పుత్ ఎక్కడ పుట్టింది? ఢిల్లీ పాయల్ రాజ్‌పుత్ ఏం చదివింది? యాక్టింగ్‌లో డిప్లోమా చేసింది పాయల్ రాజ్‌పుత్&nbsp; అభిరుచులు? &nbsp;మోడలింగ్, ట్రావెలింగ్ పాయల్ రాజ్‌పుత్‌కు ఇష్టమైన ఆహారం? బిర్యాని పాయల్ రాజ్‌పుత్‌కి&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ పాయర్ రాజ్‌పుత్ తల్లిదండ్రుల పేర్లు? విమల్ కుమార్ రాజ్‌పుత్( అకౌంట్ టీచర్), నిర్మల రాజ్‌పుత్ పాయల్ రాజ్‌పుత్‌కి ఇష్టమైన హీరో? సల్మాన్ ఖాన్ పాయల్ రాజ్‌పుత్‌కి ఇష్టమైన హీరోయిన్? దీపికా పదుకునే పాయల్ రాజ్‌పుత్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.60లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది పాయల్ రాజ్‌పుత్&nbsp; ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/rajputpaayal/ పాయల్ రాజ్‌పుత్&nbsp; బాయ్ ఫ్రెండ్? పాయల్ రాజ్‌పుత్ ముంబైకి చెందిన మోడల్ సౌరబ్ డింగ్రాతో డేటింగ్‌లో ఉంది. పాయల్‌కు వచ్చిన అవార్డులు? &nbsp;తెలుగులో "RX 100"చిత్రానికి గాను ఉత్తమ తొలిచిత్ర నటిగా సైమా అవార్డును పొందింది. పాయల్ రాజ్‌పుత్&nbsp; సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? పాయల్ రాజ్‌పుత్&nbsp; సినిమాల్లోకి రాకముందు టీవీ సీరియళ్లలో నటించింది. మహాకుంభ్, సప్నోంసే భరె నైనా అనే సీరియళ్లలో పాయల్ నటించింది. https://www.youtube.com/watch?v=jPSBXjYO9uU
    ఏప్రిల్ 08 , 2024
    <strong>Raj Tarun Case: కడుపు చేసి అబార్షన్‌ చేయించాడు..రాజ్‌తరుణ్‌పై లావణ్య సంచలన వ్యాఖ్యలు!</strong>
    Raj Tarun Case: కడుపు చేసి అబార్షన్‌ చేయించాడు..రాజ్‌తరుణ్‌పై లావణ్య సంచలన వ్యాఖ్యలు!
    టాలీవుడ్ నటుడు రాజ్‌తరుణ్‌ (Raj Tarun), అతడి మాజీ ప్రేయసి లావణ్య (Lavanya) కేసు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్‌ వెలుగు చూస్తోంది. రాజ్‌ తరుణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని లావణ్య ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా ఆమె మరోమారు పోలీసులను ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు, మెడికల్ రిపోర్ట్స్‌ను సైతం ఆమె పోలీసులకు అందజేశారు. దీంతో నార్సింగి పోలీసులు రాజ్‌తరుణ్‌తో పాటు హీరోయిన్‌ మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌ మల్హోత్రాపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్‌ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.&nbsp; తాజా ఫిర్యాదులో ఏముందంటే? లావణ్య ఇచ్చిన లేటెస్ట్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులో ఏ1గా రాజ్‌తరుణ్, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ3గా మయాంక్‌ మల్హోత్రాను పోలీసులు చేర్చారు. అంతకుముందు లావణ్య తన ఫిర్యాదులో వారిపై మరిన్ని అభియోగాలు మోపారు. 2008 నుంచి రాజ్‌తరుణ్‌తో పరిచయం ఉందని, 2010లో ప్రపోజ్ చేసి 2014లో తనను పెళ్లి చేసుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించారు. రాజ్‌తరుణ్‌ కుటుంబానికి తన ఫ్యామిలీ రూ.70 లక్షలు ఇచ్చిందని లావణ్య తెలిపారు. 2016లో తాను గర్భం దాల్చానని రెండో నెలలోనే అతడు అబార్షన్‌ చేయించినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. సర్జరీకి సంబంధించిన ఆసుపత్రి బిల్లులు రాజ్‌ చెల్లించినట్లు చెప్పారు. నటి మాల్వీ పరిచయం అయ్యాకే రాజ్‌ తన నుంచి దూరమయ్యాడని పోలీసులకు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే నటి మాల్వీతో పాటు ఆమె సోదరుడు మయాంక్‌ తనను బెదిరించారని తెలిపారు. లావణ్య ఫిర్యాదు మేరకు సెక్షన్ 420, 493, 506 కింద రాజ్‌ తరుణ్‌తో పాటు మాల్వీ, మయాంక్‌లపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. https://twitter.com/i/status/1811302046747803956 కీలక ఆధారాలు అందజేత! రాజ్‌తరుణ్‌ను హెచ్చరిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆడియో క్లిప్స్‌పై లావణ్య స్పందించారు. తనను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వంగా ఆడియో రికార్డ్‌ చేశారని పేర్కొంది. మాల్వీ మల్హోత్రా, రాజ్‌తరుణ్‌ విదేశాలకు వెళ్లేందుకు కూడా ప్లాన్‌ చేస్తున్నారని ఆరోపించారు. తమ బెదిరింపు, చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్, టెక్నికీల్‌ ఎవిడెన్స్‌ను నార్సింగి పోలీసులకు అందజేసినట్లు లావణ్య చెప్పారు. పోలీసు వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.&nbsp; https://twitter.com/i/status/1811055519525679537 లావణ్యనే బెదిరించింది : మాల్వీ నటుడు రాజ్‌తరుణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని 6 నెలలుగా తాము మాట్లాడుకుందే లేదని ఓ న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాల్వీ మల్హోత్రా స్పష్టం చేశారు. తాను లావణ్యను బెదిరించలేదని, కనీసం ఆమె ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. మరోవైపు లావణ్యనే తనకు కాల్‌ చేసి వేధించిందని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని లావణ్య మెంటల్‌గా హేరాస్‌ చేసిందని చెప్పారు. తన నెంబర్ బ్లాక్‌ చేస్తే ఆమె నేరుగా తన తల్లిదండ్రులకు కాల్‌ చేసి వాళ్లని ఇబ్బంది పెట్టిందని అన్నారు. తన పేరెంట్స్‌ నెంబర్‌ ఎవరితోనూ షేర్‌ చేసుకోలేదని అయినా ఆమె వద్దకు ఎలా వచ్చిందని మాల్వీ ప్రశ్నించారు. లావణ్య తన మీద అసత్య ప్రచారాలు చేస్తోందని పేర్కొన్నారు. రాజ్‌ కేవలం తనకు సహచర నటుడు మాత్రమేనని మేము కలిస్తే సినిమాల గురించే మాట్లాడుకుంటామని మాల్వీ స్పష్టం చేశారు. అంతకుమించి అతడిలో ఎలాంటి సంబంధం లేదని ఇంటర్యూలో వెల్లడించారు. తన సోదరుడు గురించి చేసినవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టిపారేశారు.&nbsp; https://twitter.com/i/status/1809555802203607322 లావణ్యపై ఫిర్యాదు మరోవైపు నటి మాల్వీ మల్హోత్రా లావణ్యపై ఫిల్మ్‌నగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మాల్వీ మల్హోత్ర ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టోలిచౌకి అజీజ్‌బాగ్‌కాలనీలోని విక్టోరియం ఆదిత్య ఎంప్రెస్‌ టవర్‌లో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా తన సోదరుడికి లావణ్య వాట్సాప్, ఇన్‌స్టాలో అనుచిత సందేశాలు పంపుతుందని మాల్వీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై లావణ్య తప్పుడు ఆరోపణలు చేస్తోందని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఫిల్మ్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.&nbsp;
    జూలై 11 , 2024
    Payal Rajput: ఇండస్ట్రీలో పాయల్ రాజ్‌పుత్‌కు వేధింపులు.. నటి సెన్సేషనల్‌ పోస్టు!
    Payal Rajput: ఇండస్ట్రీలో పాయల్ రాజ్‌పుత్‌కు వేధింపులు.. నటి సెన్సేషనల్‌ పోస్టు!
    ఆర్‌ఎక్స్‌ 100 (RX100) చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించిన నటి 'పాయల్‌ రాజ్‌పుత్‌' (Payal Rajput). ఆ మూవీ తర్వాత పలు చిత్రాల్లో చేసినప్పటికీ ఈ అమ్మడికి ఆ స్థాయి సక్సెస్‌ రాలేదు. ఇటీవల ‘RX100’ డైరెక్టర్‌తో చేసిన 'మంగళవారం' సినిమాతో పాయల్‌ తెలుగు ఆడియన్స్‌ను మరోమారు పలకరించింది. ఇందులో పాయల్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో తనకు వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఆమె చేసిన ఓ పోస్టు.. అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; అసలు ఏ జరిగిందంటే! 2020లో 'రక్షణ' అనే చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ నటించింది. అయితే ఈ సినిమా ఇప్పటివరకూ విడుదల కాలేదు. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ప్రదీప్‌ ఠాకూర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్‌ 7న విడుదల చేయనున్నట్లు లేటెస్ట్‌గా మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఈ మూవీకి సంబంధించిన పారితోషికం ఇంతరవకూ తనకు చెల్లించలేదని పైగా ప్రమోషన్స్‌లో పాల్గొనాలని మేకర్స్‌ వేధింపులకు గురిచేస్తున్నారంటూ పాయల్‌ సంచలన ఆరోపణలు చేసింది. ‘చట్టపరమైన చర్యలు తీసుకుంటా’ ‘రక్షణ’ మేకర్స్‌ వేధింపులపై నటి పాయల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. దీని ప్రకారం.. ‘చిత్రబృందం ఇప్పటివరకు నాకు పారితోషికం ఇవ్వలేదు. ఇటీవల నా సినిమాలు సక్సెస్‌ కావడంతో దానిని ఉపయోగించుకోవాలని మూవీ టీమ్‌ భావిస్తోంది. ఎలాంటి బకాయిలు చెల్లించకుండా ప్రమోషన్లకు రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాలేనని నా టీమ్‌ చెప్పినా వినడం లేదు. నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగేలా నా పేరును వాడుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని మీటింగ్స్‌లో నాపై అభ్యంతరకరంగా మాట్లాడారు. పారితోషికం విషయం తేల్చకుండా.. నా అనుమతి లేకుండా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అందుకే నా టీమ్ ఆ చిత్రబృందంపై న్యాయపరమైన చర్చలు తీసుకునేందుకు సిద్ధమైంది’ అని పాయల్‌ తెలిపింది.&nbsp; View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) పాయల్‌ బిజీ బిజీ 'మంగళవారం' మూవీ సక్సెస్‌తో పాయల్‌ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తోంది. తమిళంలో 'గోల్‌మాల్‌', 'ఏంజెల్‌' చిత్రాల్లో పాయల్‌ నటిస్తోంది. తెలుగులో 'కిరాతక' సినిమాలో చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. కాగా, విడుదల సిద్ధంగా ఉన్న ‘రక్షణ’ మూవీలో పాయల్‌ పోలీసు అధికారిణిగా కనిపించనుంది.&nbsp;
    మే 20 , 2024
    Athira Raj: ‘కృష్ణమ్మ’ బ్యూటీ అతిరా రాజ్‌ గురించి ఈ విశేషాలు తెలుసా?
    Athira Raj: ‘కృష్ణమ్మ’ బ్యూటీ అతిరా రాజ్‌ గురించి ఈ విశేషాలు తెలుసా?
    యంగ్‌ బ్యూటీ ‘అతిరా రాజ్‌’ పేరు.. ప్రస్తుతం టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. ‘కృష్ణమ్మ’ సినిమాలో ఈ అమ్మడి నటనకు తెలుగు ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు.&nbsp; టాలీవుడ్‌కు మరో కొత్త హీరోయిన్‌ దొరికేసిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; శుక్రవారం రిలీజైన (మే 11) ‘కృష్ణమ్మ’ సినిమాతో అతిరా రాజ్‌.. తొలిసారి తెలుగు తెరకు పరిచయమైంది.&nbsp; ఇందులో సత్య దేవ్‌కు జోడీగా మీనా పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంటుంది.&nbsp; View this post on Instagram A post shared by athiraraj (@athiraraj_1) అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉందంటూ అథిరాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.&nbsp; దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.&nbsp; View this post on Instagram A post shared by athiraraj (@athiraraj_1) అథిరా రాజ్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఈ అమ్మడు 20 ఆగస్టు, 2001న కేరళలోని కన్నూర్‌లో జన్మించింది.&nbsp; 2021లో సినిమా రంగంలో అడుగుపెట్టిన ఈ అతిరా.. చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఎంటర్‌టైన్‌ చేసింది.&nbsp; View this post on Instagram A post shared by athiraraj (@athiraraj_1) 2023లో వచ్చిన తమిళ చిత్రం ‘వీరన్‌’లో లీడ్‌ రోల్‌లో నటించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; ఈ మూవీలో సెల్వీ పాత్రలో కనిపించిన అతిరా.. తన నటనతో తమిళ ఆడియన్స్‌ను ముగ్దుల్ని చేసింది.&nbsp; కాగా రీసెంట్‌గా తమిళంలో వచ్చిన ‘అమిగో గ్యారేజ్‌’ చిత్రంలోనూ అతిరా హీరోయిన్‌గా చేసింది.&nbsp; చైల్డ్‌ ఆర్టిస్టుగా తెలుగులో పలు సినిమాల్లో నటించి మాస్టర్‌ మహేంద్రన్‌కు జోడీగా నటించింది. View this post on Instagram A post shared by athiraraj (@athiraraj_1) అతిరా ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది.&nbsp; ఎప్పటికప్పుడు ఫొటో షూట్‌లు నిర్వహిస్తూ నెట్టింట తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.&nbsp; ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 103K మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    మే 11 , 2024
    Raj Tarun: ఆ అమ్మాయితో 3 ఏళ్లు ఒకే రూమ్‌లో ఉన్నా… తన అఫైర్‌పై స్పందించిన రాజ్‌ తరుణ్
    Raj Tarun: ఆ అమ్మాయితో 3 ఏళ్లు ఒకే రూమ్‌లో ఉన్నా… తన అఫైర్‌పై స్పందించిన రాజ్‌ తరుణ్
    టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్‌ హీరోల్లో రాజ్‌ తరుణ్‌ ఒకరు. తొలి చిత్రం 'ఉయ్యాల జంపాల' (Uyyala Jampala) తో మంచి సక్సెస్‌ అందుకున్న రాజ్‌తరుణ్‌.. ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్‌’ సినిమాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల వరుసగా ఫ్లాపులను చవిచూశాడు. ఇదిలా ఉంటే తాజాగా రాజ్‌తరుణ్‌పై అతడి ప్రేయసి సంచలన ఆరోపణలు చేసింది. తనను మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రాజ్‌ తరుణ్‌ కూడా ఘాటుగా స్పందించడంతో.. ఈ వ్యవహారం టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారిపోయింది.&nbsp; ‘ఆ హీరోయిన్‌తో ఎఫైర్‌’ సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tarun) తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌, తాను 2012 నుంచి రిలేషన్‌లో ఉన్నామని ఇటీవల ఒక హీరోయిన్‌తో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్‌ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్‌ కొనసాగిస్తున్నట్టు ఆరోపించింది. ఇదే విషయమై రాజ్‌తరుణ్‌ను నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను సంబంధం లేని కేసు (డ్రగ్స్‌)లో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే రాజ్‌తరణ్‌ ఎఫైర్‌లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నటి హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా అని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ‘తిరగబడర సామీ’లో ఈ భామే కథానాయికగా చేస్తుండటమే ఇందుకు కారణమని అంటున్నారు.&nbsp; https://twitter.com/galli2delhi/status/1809123625074614310 అది నిజం కాదు: రాజ్‌ తరుణ్‌ మాజీ ప్రేయసి లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై నటుడు రాజ్‌ తరుణ్‌ స్పందించారు. ఓ ఛానల్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను షార్ట్‌ఫిల్మ్స్‌ చేసే సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. మంచి అమ్మాయే. నేను హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో సాయం చేసింది. మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నది వాస్తవమే. 2014 నుంచి 2017 వరకు కలిసున్నాం. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి సంబంధంలేదు. ఆమె ఫ్రెండ్స్‌ సర్కిల్‌, తను డ్రగ్స్ తీసుకోవడం చూసి తట్టుకోలేకపోయా. వదిలేసి వెళ్లిపోదామనుకుంటే.. మీడియా ముందుకెళ్తానని నన్ను బెదిరించేది. నా పరువుకు భంగం కలగకుండా ఉండేందుకు భరిస్తూ వచ్చా. ఆమెపై డ్రగ్స్‌ కేసు నమోదవగా దానికి నేనే కారణమని ఆరోపణలు చేస్తోంది’ అని మండిపడ్డారు.&nbsp; https://twitter.com/BunnyJashu3/status/1769400224081219797 ‘మరో అబ్బాయితో నా ఇంట్లోనే ఉంది’ ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ లావణ్యపై రాజ్‌తరుణ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. తాను ఉండగానే ఆమె మరో యువకుడితో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. 'మరో అబ్బాయితో ఆమె రిలేషన్‌ కొనసాగించింది. రోజూ కొడుతున్నాడంటూ ఆ వ్యక్తిపైనా కేసు పెట్టింది. మళ్లీ అతడితో కలిసి నా ఇంట్లోనే కొన్నాళ్లు ఉంది. నేనే బయటకు వచ్చేశా. తన తండ్రినీ బ్లాక్‌ మెయిల్‌ చేసింది. మాకు పెళ్లి కాలేదు. జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్‌ అయిన సంగతి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. ఆమెకూ ఆ విషయం తెలుసు. ముంబయికి చెందిన నటితో సహజీవనం చేస్తున్నట్టు ఆమె ఆరోపిస్తోంది. నేను హైదరాబాద్‌లో ఉంటున్నా. ఆమె ముంబయిలో నివాసముంటోంది. మేం సహజీవనం ఎలా చేస్తాం? తనను ఇంట్లోంచి నేను పంపించేస్తానన్న భయంతో ఇదంతా చేస్తోంది’ అని రాజ్‌తరుణ్‌ ఆరోపించాడు.&nbsp;
    జూలై 05 , 2024
    Kajal Aggarwal: కాజల్‌ Vs పాయల్‌ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!
    Kajal Aggarwal: కాజల్‌ Vs పాయల్‌ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!
    గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే థియేటర్లలో విడుదలై సందడి చేస్తూ వచ్చాయి. ఇందులో కొన్ని హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే మరికొన్ని ఫ్లాప్‌గా నిలిచి.. నెల అయినా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే ఈ వారం కూడా స్టార్‌ హీరోల సినిమాలు థియేటర్లలోకి రాకపోవడం ఆడియన్స్‌ కాస్త నిరాశకు గురి చేస్తోంది. అయితే ఈ వారం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న రెండు చిత్రాలు మాత్రం అందరిలో ఆసక్తి పెంచుతున్నాయి. ప్రముఖ హీరోయిన్స్‌ కాజల్‌ అగర్వాల్‌ నటించిన ‘సత్యభామ’, పాయల్‌ రాజ్‌పుత్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ‘రక్షణ’ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారోనని ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది.&nbsp; తొలిసారి ఖాకీ డ్రెసుల్లో.. కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో సుమన్‌ చిక్కాల తెరకెక్కించిన చిత్రం 'సత్యభామ' (Satyabhama). బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పోలీసు అధికారిణిగా కనిపించనుంది. ఆమె పోలీసు ఆఫీసర్‌గా చేయడం కెరీర్‌లో ఇదే తొలిసారి. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. అటు పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) చేసిన లేడీ ఓరియెంటేడ్‌ చిత్రం 'రక్షణ' (Rakshana) కూడా జూన్‌ 7వ తేదీనే థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇందులోనూ పాయల్‌ కూడా తొలిసారి ఖాకీ దుస్తుల్లో ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్‌ కానుండటంతో కాజల్‌, పాయల్‌ మధ్య కోల్డ్‌ వార్‌ మెుదలైనట్లు కనిపిస్తోంది.&nbsp; యాక్షన్‌తో రాణించేనా! కాజల్‌ అగర్వాల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ గత చిత్రాలను పరిశీలిస్తే.. వీరు గ్లామర్‌తోనే ఆడియన్స్‌ను ఎక్కువగా అలరించారు. అటువంటిది తొలిసారి వీరిద్దరు ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా ఎంతో పవర్‌ఫుల్‌ అయినా పోలీసు అధికారిణి పాత్రల్లో థియేటర్లలోకి వస్తున్నారు. మరి వీరు యాక్షన్ సీక్వెన్స్‌లో ఏ మేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే విడుదలైన ‘సత్యభామ’, ‘రక్షణ’ ట్రైలర్స్‌ రెండూ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. కాజల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ఇద్దరూ తమ యాక్షన్‌తో దుమ్మురేపినట్లే కనిపిస్తోంది. కాజల్‌, పాయల్‌ మధ్య ప్రస్తుతం నెలకొన్న థగ్‌ ఆఫ్‌ వార్‌లో విజయం ఎవరిదో ఈ శుక్రవారం (జూన్‌ 7) తేలిపోనుంది.&nbsp; ఇతర చిత్రాలు ఈ శుక్రవారం సత్యభామ, రక్షణ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందిన 'లవ్‌ మౌళి' (Love Mouli) చిత్రం.. అనేక వాయిదాల తర్వాత ఈ వారమే థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. అలాగే శర్వానంద్‌, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Maname) కూడా ఈ నెల 7న రిలీజ్‌ కానుంది. ఈ మూవీకి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించాడు. మరోవైపు సత్యరాజ్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రలో నటించిన 'వెపన్‌' (Weapon) చితరం కూడా ఈ శుక్రవారం మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. వార్నర్‌ బ్రదర్స్‌, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్‌ తెలిపారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌ కాబోతున్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఈ కింద ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి.&nbsp; https://telugu.yousay.tv/this-week-movies-these-are-the-films-series-that-will-double-your-happiness-this-week.html
    జూన్ 04 , 2024
    Mangalavaaram Teaser: బోల్డ్ సీన్లలో పాయల్ రాజ్‌పుత్ అరుపులు... ఈసారి గట్టిగానే ఉంటదంట!
    Mangalavaaram Teaser: బోల్డ్ సీన్లలో పాయల్ రాజ్‌పుత్ అరుపులు... ఈసారి గట్టిగానే ఉంటదంట!
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    జూలై 04 , 2023
    Payal Rajput:&nbsp; ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్‌ రాజ్‌పుత్‌… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
    Payal Rajput:&nbsp; ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్‌ రాజ్‌పుత్‌… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
    RX 100 కాంబో మళ్లీ రిపీట్‌ కాబోతుంది. ఈ సారి మరింత డోసు పెంచారు. “మంగళవారం” అనే టైటిల్‌ పెట్టి పాయల్ రాజ్‌పుత్‌ టాప్‌ లెస్‌ ఫోటోను విడుదల చేశారు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో సినిమా రూపుదిద్దుకుంటుంది. పాయల్‌ రాజ్‌పుత్‌ మెుదటి సినిమా నుంచే అందాల ఆరబోతతో&nbsp; హద్దుల్లేకుండా చెలరేగిపోతుంది. RX 100లో కార్తీకేయతో రొమాన్స్‌ చేసి యువతను ఆకర్షించింది ఈ అమ్మడు.&nbsp; ఆ సినిమా తర్వాత RDX లవ్‌, అనగనగా ఓ అతిథి చిత్రాల్లో బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించింది పాయల్‌. అందచందాలు ప్రదర్శించి ఆకట్టుకోవాలని చూసింది.&nbsp; సామాజిక మాధ్యమాల్లోనూ హాట్‌ఫొటోస్‌తో చెలరేగుతుంది పంజాబీ సుందరి. బాత్‌రూమ్‌లో కేవలం టవల్‌పై ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేసి షేక్ చేసింది. ఇటీవల ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న హాట్‌ పిక్స్‌ వైరల్ అయ్యాయి. ఇందులోనూ టాప్‌లెస్‌గా కనిపించింది పాయల్ రాజ్‌పుత్‌.&nbsp; సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ కలిసి అలాంటి ఫోజులు ఇవ్వటంపై ట్రోల్స్‌ ఎదుర్కొంది ఈ హీరోయిన్.&nbsp; జిన్నా సినిమాలోనూ అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గలేదు. వీలైనంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది.&nbsp; మంగళవారం సినిమాలో మరోసారి బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటిస్తుంది ఈ భామ. శైలజ అనే పాత్రలో టాప్‌లెస్‌గా చేతి వద్ద సీతాకోక చిలుక ఉన్నట్లు కనిపించే ఫస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. RX 100 తర్వాత పాయల్‌ రాజ్‌పుత్‌కు తెలుగులో మంచి హిట్‌ లేదు. అందాల విందు చేసినా ఆఫర్లు మాత్రం పెద్దగా రావటం లేదు.&nbsp; ఆఫర్లు లేని కారణంగానే బోల్డ్ పాత్రల్లోనూ నటించేందుకు పాయల్ రాజ్‌పుత్‌&nbsp; సిద్ధపడుతున్నట్లు&nbsp; తెలుస్తోంది.&nbsp; RX 100, మహా సముద్రం చిత్రాలు తీసిన దర్శకుడు అజయ్‌ భూపతి మంగళవారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.&nbsp; మంగళవారం సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి కాంతార, విరూపాక్ష సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు.&nbsp; అజయ్‌ భూపతి రిలీజ్‌ చేసిన ఈ లుక్‌పై ఆసక్తి నెలకొంది. వర్మ కాంపౌండ్‌ నుంచి వచ్చిన ఈ దర్శకుడు మెుదట్నుంచే విభిన్నమైన సినిమాలు తీస్తున్నాడు.&nbsp;
    ఏప్రిల్ 25 , 2023
    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు: పాయల్‌ రాజ్‌పూత్‌, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్‌ అమిర్‌, రవీంద్ర విజయ్‌, కృష్ణ చైతన్య, అజయ్‌ ఘోష్‌ తదితరులు దర్శకత్వం: అజయ్‌ భూపతి సంగీతం: అజనీష్ లోకనాథ్‌ ఎడిటింగ్‌: మాధవ్‌ కుమార్‌ గుళ్లపల్లి సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి నిర్మాత: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ విడుదల: 17-11-2023 ‘RX 100’ సినిమాతో సినీప్రియుల్ని మెప్పించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఆ సినిమాతోనే న‌టి పాయ‌ల్ రాజ్‌పూత్ కూడా తెలుగు వారికి ద‌గ్గ‌రైంది. తిరిగి వారి కాంబోలోనే తేరకెక్కిన లేటెస్ట్‌ మూవీ ‘మంగళవారం’. డార్క్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇటీవల రిలీజైన టీజ‌ర్, ట్రైలర్లు ఈ ఆస‌క్తిని మరింత పెంచింది. అల్లు అర్జున్ వంటి స్టార్ ఈ చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మ‌రి ఈ మంగ‌ళ‌వారం క‌థేంటి? తెర‌పై ఎలాంటి వినోదాన్ని పంచింది? పాయ‌ల్- అజ‌య్‌ల‌కు విజ‌యాన్ని అందించిందా? ఈ కథనంలో చూద్దాం.&nbsp; కథ మ‌హాల‌క్ష్మీపురంలోని ఓ జంట మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌ని ఊరి గోడ‌ల‌పై రాత‌లు క‌నిపిస్తాయి. ఆ జంట అనూహ్య ప‌రిస్థితుల్లో చ‌నిపోతుంది. మ‌రో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చ‌నిపోవ‌డంతో ఊరి ప్ర‌జ‌ల్లో భ‌యం మొద‌ల‌వుతుంది. మంగళవారం రోజునే ఈ మరణాలు చోటుచేసుకోవడంతో గ్రామ‌దేవ‌త మాల‌చ్చ‌మ్మ జాత‌ర జ‌రిపించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ఊరి ప్ర‌జ‌లు భావిస్తారు. అయితే ఈ మిస్ట‌రీ మ‌ర్డ‌ర్స్ వెనుక ఏదో కుట్ర ఉంద‌ని ఎస్ఐ (నందితాశ్వేత‌) భావిస్తుంది. కానీ, ఊరి జ‌మీందారు ప్ర‌కాశం (చైత‌న్య కృష్ణ‌) మాట‌ల‌కు క‌ట్టుబ‌డి ఇమె ఇన్వేస్టిగేష‌న్‌కు ఎవ‌రూ స‌రిగా స‌హ‌క‌రించ‌రు. మరి ఆ హ‌త్య‌ల‌కు వెనుక ఉన్న మ‌ర్మం ఏమిటి? దెయ్యం రూపంలో శైలు (పాయ‌ల్ రాజ్‌పుత్‌) తిరుగుతోంద‌ని ఊరి ప్ర‌జ‌లు ఎందుకు భ్ర‌మ‌ప‌డ్డారు? ఈ హ‌త్య‌ల‌కు శైలుకు సంబంధం ఉందా? మ‌హాల‌క్ష్మీపురం నుంచి ఆమె వెలివేయ‌బ‌డ‌టానికి కార‌ణం ఏమిటి? అన్న‌దే మంగ‌ళ‌వారం సినిమా క‌థ‌. ఎలా సాగిందంటే? సినిమాలో తొలి 15 నిమిషాలు శైలు చిన్న‌త‌నం, రవితో ఆమె ప్రేమకథ, అతడి కుటుంబ నేపథ్యం చుట్టూ సాగుతుంది. ఆ త‌ర్వాత క‌థ వ‌ర్త‌మానంలోకి వ‌స్తుంది. జంట‌ల పేర్లు ఎవ‌రో అజ్ఞాత వ్య‌క్తి ఊరి గోడ‌ల‌పై రాయడం.. వారంతా గ్రామ దేవ‌త‌కు ఇష్ట‌మైన మంగ‌ళ‌వారం రోజునే చనిపోవడం తొలి భాగంలో చూపిస్తారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు తొలి భాగంలో థ్రిల్‌ ఇస్తాయి. ద్వితీయార్ధం మ‌ళ్లీ శైలు గ‌తంతోనే మొద‌ల‌వుతుంది. శైలుకు జ‌రిగిన అన్యాయం, ఆమెకున్న మాన‌సిక రుగ్మ‌త, దానివ‌ల్ల త‌ను ప‌డే యాత‌న రెండో పార్ట్‌లో చూపించారు. ప‌తాక స‌న్నివేశాలు మంచి ట్విస్ట్‌ల‌తో ఆస‌క్తిక‌రంగా ఉంటాయి.&nbsp; ఎవరెలా చేశారంటే? శైలు పాత్ర‌లో పాయ‌ల్ చ‌క్క‌గా ఒదిగిపోయింది. గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌లోనూ అదరగొట్టింది. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లో చ‌క్క‌గా జీవించింది. ఎస్సై పాత్ర‌లో నందితా శ్వేత ఆద్యంతం సీరియ‌స్ లుక్‌లో క‌నిపించింది. న‌ట‌న ప‌రంగా ఆమెకు పెద్ద‌గా స్కోప్‌ లేదు. అజ‌య్ ఘోష్ - ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య వ‌చ్చే కామెడీ&nbsp; ట్రాక్ న‌వ్వులు పూయిస్తుంది. జ‌మిందారుగా చైత‌న్య కృష్ణ పాత్ర‌ను మంచిగా డిజైన్ చేశారు. శ్రీతేజ్‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, ర‌వీంద్ర విజ‌య్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడు అజయ్‌ ఈ సినిమాను మిస్టీక్‌ థ్రిల్లర్‌లా మెుదలుపెట్టి మధ్యలో హారర్‌ టచ్‌ ఇచ్చి ఆఖర్లో ఓ సందేశంతో ముగించారు. అక్ర‌మ సంబంధాల వ్య‌వహారం, డబల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎబ్బెట్టుగా అనిపించేలా ఉన్నాయి. ఈ విషయంలో అజయ్‌ కాస్త జాగ్రత్త పడాల్సింది. మరోవైపు ప్రథమార్థంలో కథే కనిపించకపోవడం, ద్వితియాతార్థంలో పాత్రలకు సరైన ముగింపు ఇవ్వకపోవడం అతడి డైరెక్షన్‌లో మైనస్‌లుగా కనిపిస్తున్నాయి. పతాక సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ డైరెక్టర్‌ సినిమాని ముగించిన తీరు ఆడియన్స్‌కు అసంతృప్తిగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా అజ‌య్ రాసుకున్న క‌థ కుటుంబ ప్రేక్ష‌కుల‌కు రుచించ‌క‌పోవ‌చ్చు. కానీ థ్రిల్లింగ్‌ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది. టెక్నికల్‌గా&nbsp; టెక్నిక‌ల్‌గా ఈ సినిమా ఉన్న‌త స్థాయిలో క‌నిపిస్తుంది. అజ‌నీష్ నేప‌థ్య సంగీతం సినిమాకి ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. జాతర పాట‌ను స్వ‌ర‌ప‌రిచిన తీరు.. దాన్ని తెర‌పై చిత్రీక‌రించిన విధానం ఆక‌ట్టుకుంటాయి. అలాగే శివేంద్ర ఛాయాగ్ర‌హ‌ణం మ‌రో ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ పాయ‌ల్ న‌ట‌న‌, గ్లామ‌ర్‌అజ‌నీష్ సంగీతంట్విస్ట్‌లు మైనస్‌ పాయింట్స్‌ &nbsp;నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం&nbsp;ముగింపు రేటింగ్‌ : 3/5
    నవంబర్ 17 , 2023
    అల్లు అర్జున్‌తో జతకట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న బాలివుడ్‌ భామలు
    అల్లు అర్జున్‌తో జతకట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న బాలివుడ్‌ భామలు
    ]మౌని రాయ్‌ పుష్ప రాజ్‌ అలియాజ్‌ అల్లు అర్జున్‌తో పనిచేయాలని నిజంగా కోరుకుంటున్నా
    ఫిబ్రవరి 11 , 2023
    Krishnamma Movie Review: రివేంజ్‌ డ్రామాలో అదరగొట్టిన సత్యదేవ్‌… సినిమా ఎలా ఉందంటే?
    Krishnamma Movie Review: రివేంజ్‌ డ్రామాలో అదరగొట్టిన సత్యదేవ్‌… సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : సత్య దేవ్‌, అథిరా రాజ్‌, ఆర్చన అయ్యర్‌, రఘు కుంచె డైరెక్టర్‌ : వి. వి. గోపాల కృష్ణ సంగీతం: కాల భైరవ సినిమాటోగ్రాఫర్‌ : సన్నీ కుర్రపాటి ఎడిటర్‌ : తిమ్మరాజు నిర్మాత : కృష్ణ కొమ్మలపాటి టాలీవుడ్ నటుడు సత్యదేవ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). వి.వి గోపాల కృష్ణ దర్శకుడు. అథిరా రాజ్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, మే 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? సత్య దేవ్‌కు మరో హిట్‌ను అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.&nbsp; కథేంటి విజయవాడ వించిపేటలో జీవించే భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్‌), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ముగ్గురు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా జీవిస్తుంటారు. గతంలో నేరాలకు పాల్పడిన ఈ ముగ్గురు కొన్ని కారణాలతో మంచిగా మారతారు. భద్ర ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు. అయితే అనుకోకుండా వీరికి రూ. 3 లక్షలు అవసరం పడతాయి. చివరిసారిగా ఒక నేరం చేసి అవసరం తీర్చుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. జైలుకు కూడా వెళ్తారు. ఈ క్రమంలో వీరిలో ఒకరు అనూహ్యంగా చనిపోతారు? స్నేహితుల్లో ఒకరు చనిపోవడానికి కారణం ఎవరు? వారు జైలుకెళ్లేలా కుట్ర చేసిందెవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే విలక్షణ నటుడు సత్యదేవ్‌ ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తనదైన నటనతో అదరగొట్టాడు. పగతో రగిలిపోయే భద్ర పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ఎమోషనల్ సన్నివేశాల్లో సత్యదేవ్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. హీరోయిన్‌గా అతిర పాత్ర పరిమితమే. నటన పరంగా ఆమె పాత్రకు పెద్ద స్కోప్‌ లేదు. స్నేహితులుగా చేసిన మీసాల లక్ష్మణ్‌, కృష్ణ తేజా రెడ్డి తమ నటనతో ఆకట్టుకున్నారు. పోలీసు ఆఫీసర్‌గా చేసిన నందగోపాల్‌ పర్వాలేదనిపించాడు. రఘు కుంచే పాత్ర కూడా సినిమాలో బాగుంది. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు వి.వి గోపాలకృష్ణ.. రివేంజ్‌ డ్రామాగా ఈ సినిమాకు తెరకెక్కించాడు. అయితే కథ పరంగా చూస్తే కొత్త దనం ఏమి లేదని చెప్పాలి. ఈ తరహా రివేంజ్‌ డ్రామాలు చాలానే వచ్చాయి. అయితే స్క్రీన్‌ప్లే మాత్రం ఆకట్టుకుంటుంది. ఆడియన్స్‌ను కథలోకి తీసుకెళ్లిన విధానం ప్రశంసనీయం. ఫస్టాఫ్‌ మెుత్తం ఓ దారుణ హత్య.. స్నేహితుల పాత్రలు, వారి మధ్య ఉన్న ఎమోషనల్‌ బాండ్‌ను పరిచయం చేయడంతోనే సరిపోయింది. దీంతో ఆడియన్స్‌కు కథ ల్యాగ్ అయిన ఫీలింగ్‌ కలిగింది. సెకండాఫ్‌కు వచ్చాక దర్శకుడు కథలో వేగం పెంచాడు. తమ ఫ్రెండ్‌ను చంపిన వారిని హీరో టార్గెట్‌ చేసే సీన్లను దర్శకుడు ఆసక్తికరంగా చూపించాడు. అయితే క్లైమాక్స్ ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. చిన్న చిన్న లోపాలున్నా దర్శకుడిగా వి.వి. గోపాల కృష్ణ సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సన్నీ కుర్రపాటి తన కెమెరా పనితనంతో తెరపై ప్లెజెంట్‌ వాతావరణాన్ని తీసుకొచ్చారు. అటు కాల భైరవ అందించిన పాటలు సో సోగా ఉన్నాయి. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ సత్యదేవ్‌ నటనస్క్రీన్‌ప్లేసెకండాఫ్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్ రీవెంజ్‌ డ్రామాబోరింగ్‌ సీన్స్&nbsp; Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp; https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-satyadev.html
    మే 10 , 2024
    ‘ముఖచిత్రం’తో ఎంట్రీ ఇచ్చిన అయేషా ఖాన్ అందాల విందు
    ‘ముఖచిత్రం’తో ఎంట్రీ ఇచ్చిన అయేషా ఖాన్ అందాల విందు
    ]నటుడు రాహుల్ రామకృష్ణను, రచయిత సందీప్ రాజ్‌ని అయేషా ఖాన్ ఫాలో అవుతోంది. మరికొంత మంది టాలీవుడ్, బాలీవుడ్ తారలను అనుసరిస్తోంది.
    ఫిబ్రవరి 13 , 2023
    Tollywood Nepotism: నెపోటిజం వల్లే నాని, విజయ్ దేవరకొండ ‘టైర్‌ 2’ హీరోలుగా ఉండి పోయారా? దీనికి అసలు కారణం ఎవరు?
    Tollywood Nepotism: నెపోటిజం వల్లే నాని, విజయ్ దేవరకొండ ‘టైర్‌ 2’ హీరోలుగా ఉండి పోయారా? దీనికి అసలు కారణం ఎవరు?
    నెపోటిజం అనేది సినీ పరిశ్రమలో ఎప్పుడు చర్చనీయాంశమే. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత నెపోటిజంపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటీనటుల వల్ల ఇతరులకు అవకాశాలు లభించడం లేదన్న కామెంట్స్‌ పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే వారసత్వం అనేది సినీ పరిశ్రమలో కామన్‌గా మారిపోయింది. ఇందుకు టాలీవుడ్‌ ఏమి అతీతం కాదు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్‌ తర్వాత ఆ స్థాయిలో వారసత్వం ద్వారా వచ్చిన హీరోలు మన ఇండస్ట్రీలోనే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో నాని, విజయ్‌ దేవరకొండ, నితీన్‌, అడివిశేష్‌, శర్వానంద్‌, గోపిచంద్‌ తదితరులు ‘టైర్‌ 2’ హీరోలుగా మిగిలిపోతున్నారన్న వాదనలు ఉన్నాయి. అందులో వాస్తవమెంతా? నెపోటిజం వల్లే వారు రాణించలేకపోతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; అసలు ‘టైర్‌-2’ అంటే ఏంటి? సాధారణంగా ప్రతీ ఇండస్ట్రీలోనూ హీరో, హీరోయిన్లను వారికి ఉన్న క్రేజ్‌ను బట్టి రెండు లేదా మూడు రకాలుగా విడదీస్తారు. టాలీవుడ్‌కు వచ్చేసరికి ప్రభాస్‌ (Prabhas), రామ్‌చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (Jr NTR), అల్లు అర్జున్‌ (Allu Arjun), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), మహేష్‌బాబు (Mahesh Babu), చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) వంటి వారిని టైర్‌-1 హీరోలుగా ఇండస్ట్రీ వర్గాలు, సినీ విశ్లేషకులు లెక్కగడతారు. ఎందుకంటే వారి సినిమా రిలీజ్‌ అవుతుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుంది. తొలి రోజే దాదాపు 30 నుంచి 50 శాతం బడ్జెట్‌ వసూలవుతుంది. భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉండటంతో వారిని అగ్ర శ్రేణి నటులుగా దర్శకులు, నిర్మాతలు లెక్కగడతారు. టైర్‌ 2 విషయానికి వస్తే పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్లు ఈ జాబితాలో నాని, విజయ్‌ దేవరకొండ, నితిన్‌, రామ్‌ పోతినేని, నాగచైతన్య, గోపిచంద్‌ వంటి వారు ఉంటారు. అగ్రహీరోల రెమ్యూనరేషన్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, సినిమాల బడ్జెట్‌ పరంగా చూస్తే వీరు కాస్త వెనకబడి ఉంటారు. అగ్ర హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ వీరి చిత్రాల కలెక్షన్స్ పరిమితంగానే ఉంటాయి.&nbsp; కన్నెత్తి చూడని స్టార్‌ డైరెక్టర్స్‌! రాజమౌళి, త్రివిక్రమ్‌, సుకుమార్‌, కొరటాల శివ వంటి స్టార్‌ డైరెక్టర్లు అగ్ర హీరోలతోనే సినిమాలు చేసేందుకు అసక్తి కనబరుస్తున్నారు. దీనివల్ల విజయ్‌ దేవరకొండ, నాని వంటి స్టార్‌ హీరోలకు అన్యాయం జరుగుతోందని వారి ఫ్యాన్స్‌ అంటున్నారు. స్టార్ డైరెక్టర్స్‌ తమ హీరోలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల వారు పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కాలేకపోతున్నట్లు చెబుతున్నారు. కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. హీరో నాని ‘సరిపోదా శనివారం’ విషయంలో ఇదే జరిగిందని గుర్తుచేస్తున్నారు. పాన్ఇండియా స్థాయిలో ‘సరిపోదా శనివారం’ రిలీజ్‌ని ప్లాన్‌ చేసినా ఇప్పటికీ హిందీలో విడుదల కాలేదు. టాలీవుడ్‌ దాటి స్టార్‌ డమ్‌ లేకపోవడం వల్ల టాలెంట్‌ ఉన్నా కూడా నానికి మైనస్‌గా మారుతోందని ఫ్యాన్స్ అంటున్నారు.&nbsp; కథలు సైతం వెళ్లడం లేదా? ఒక సినిమాలో ఎంత మంచి తారాగణం ఉన్నప్పటికీ సరైన కథ లేకుంటే ఆ సినిమా ఆడటం కష్టం. ఒక సినిమా సక్సెస్సా? ఫెయిల్యూరా? అనేది డిసైడ్‌ చేసేది స్టోరీనే. అయితే ఇటీవల ‘టైర్‌ 2’ హీరోల చిత్రాలు చూస్తుంటే స్టోరీలు సరిగా వినే చేస్తున్నారా అన్న ప్రశ్న ఫ్యాన్స్‌ నుంచి ఎదురవుతోంది. ఇటీవల రామ్ పోతినేని చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’, నితిన్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, గోపిచంద్‌ ‘రామబాణం’ సినిమాలు అసలు ఎందుకు ఒప్పుకున్నారో కూడా ఫ్యాన్స్‌కు అర్థం కాని పరిస్థితి. అయితే పాన్‌ ఇండియా స్థాయి స్క్రిప్ట్స్‌ పెద్ద హీరోల వద్దకే వెళ్లిపోతుండటంతో ఇలా ‘టైర్‌ 2’ హీరోలు వచ్చిన కథలతో సంతృప్తి పడాల్సి వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.&nbsp; నెపోటిజం vs టాలెంట్‌! అయితే వారసత్వం ఉంటేనే సినిమాల్లోనే రాణిస్తారనేది పూర్తిగా అవాస్తవం. అలా అయితే పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ స్టార్‌ హీరోలు అయిపోయేవారు కదా. ఎంత పెద్ద సినీ నేపథ్యమున్నా యాక్టింగ్‌ టాలెంట్ లేకుంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో మనుగడ సాగించలేరు. ఇది చాలా మంది వారసత్వ నటుల విషయంలో నిరూపితమైంది. నాని, విజయ్‌ దేవరకొండ, రవితేజ, సిద్దు జొన్నలగడ్డ, అడివి శేష్‌, నవీన్‌ పోలిశెట్టి వంటి నటులు ఎలాంటి నేపథ్యం లేకుండానే వచ్చి ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తున్నారు. వారిలో టాలెంట్‌ ఉంది కాబట్టే ఇదంతా సాధ్యమైంది. హీరో నాని ఇంకో భారీ విజయం లభిస్తే టైర్‌-1 హీరో స్థాయికి ఎదగడం పక్కా అన్న ప్రచారం జరుగుతోంది.&nbsp; తప్పు ప్రేక్షకుల్లో ఉంది! గతంలో ఓ ఇంటర్యూలో పాల్గొన్న నటులు రానా, నాని నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా రానా మాట్లాడుతూ వారసత్వం వల్ల వచ్చే బరువు, బాధ్యతలు అందరికీ తెలియవని అన్నారు. నెపోటిజం అన్నది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుందని టాలెంట్ లేకపోతే సినీ ఇండస్ట్రీలో నెట్టుకురావడం కుదరదని రానా తేల్చి చెప్పాడు. నెపోటిజంపై మరో యంగ్ హీరో నాని మాట్లాడుతూ నెపోటిజాన్ని సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు ఫాలో కావడం లేదని, సినిమాలు చూసే ప్రేక్షకులే దాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. తాను చేసిన మొదటి సినిమాని లక్ష మంది ప్రేక్షకులు మాత్రమే చూశారని, అదే చరణ్ చేసిన మొదటి సినిమాని కోటి మంది చూశారని చెప్పారు. మరి చూసిన ప్రేక్షకులే కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోందని నాని ప్రశ్నించాడు.&nbsp;
    సెప్టెంబర్ 13 , 2024
    <strong>Aay Movie Review: ఎన్టీఆర్‌ బావమరిది ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా?</strong>
    Aay Movie Review: ఎన్టీఆర్‌ బావమరిది ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా?
    నటీనటులు: నార్నె నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య తదితరులు దర్శకుడు: అంజి కె మణిపుత్ర సంగీత దర్శకుడు: రామ్ మిర్యాల, అజయ్ అరసాడ సినిమాటోగ్రఫీ: సమీర్ కళ్యాణి నిర్మాతలు : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ నటించిన రెండో చిత్రం ‘ఆయ్‌’. మ్యాడ్‌ చిత్రంతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్న ఈ యంగ్‌ హీరో తన సెకండ్‌ హిట్‌ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించిన ‘ఆయ్‌’ చిత్రంలో నయన్‌ సారిక హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి అమలాపురంకు చెందిన కార్తీక్‌ (నార్నే నితిన్‌) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరతాడు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఊరికి వస్తాడు. ఇంటి నుంచి పని చేసుకుంటూనే బాల్య మిత్రులు హరి, సుబ్బుతో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలో పక్క ఊరికి చెందిన పల్లవి (నయన్‌ సారిక)ని ప్రేమిస్తాడు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పల్లవికి కులం పట్టింపులు ఎక్కువ. కార్తీక్‌ తన కులం వాడేనని భావించి ఇష్టపడుతుంది. అతడి కులం వేరని తెలిసి దూరం పెడుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరిస్తుంది. దీంతో కార్తీక్‌ తట్టుకోలేకపోతాడు. మరోవైపు వారిద్దరిని కలిపేందుకు స్నేహితులు హరి, సుబ్బు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నం ఫలిచిందా? పల్లవితో కార్తీక్‌ పెళ్లి జరిగిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే కార్తీక్ పాత్రలో నార్నే నితిన్‌ ఆకట్టుకున్నాడు. మెుదటి చిత్రంతో పోలిస్తే నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్రే అతడికి దక్కింది. హావభావాలు, సంభాషణల్లో అత‌నిలో ప‌రిణ‌తి కనిపించింది. డ్యాన్స్ తోనూ మెప్పించాడు. ఇక పల్లవి పాత్రలో నటించిన నయన్ సారిక తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అచ్చ‌మైన గోదావ‌రి అమ్మాయిగా తెర‌పై సందడి చేసింది. ఫ్రెండ్స్‌ పాత్రల్లో రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కోయ చేసిన కామెడీ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా క‌సిరెడ్డి పాత్ర ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. మైమ్ గోపి, వినోద్ కుమార్‌లు పాత్రల పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అంజి ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ దానిని ప్రెజెంట్‌ చేసిన తీరు మెప్పిస్తుంది. అమలాపురం నేపథ్యం, చిన్ననాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, ఆప్యాయతలు ఇలా అన్నింటీని మేళవిస్తూ కథను నడిపించారు. ముగ్గురు స్నేహితులు కలిసినప్పటి నుంచి సినిమాలో సందడి మెుదలవుతుంది. ముఖ్యంగా కార్తిక్ ప్రేమలో పడినప్పటి నుంచి కథ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. హీరో ప్రేమ కోసం ఇద్దరు స్నేహితులు చేసే సాయం, ఈ క్రమంలో వారు పడే ఇబ్బందులు నవ్వులు పంచుతాయి. సాఫీగా సాగిపోతున్న కథలో ట్విస్ట్ తీసుకొచ్చి సెకండాఫ్‌పై ఆసక్తి పెంచాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌లో ఇరు కుటుంబాల పెద్దలను ఇన్‌వాల్వ్‌ చేసి మంచి సందేశం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. అయితే రొటీన్‌ స్టోరీ, లవ్‌ట్రాక్‌ను కామెడీ డామినేట్‌ చేయడం, లాజిక్‌ లేని సన్నివేశాలు మూవీకి మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సమీర్‌ కళ్యాణి కెమెరా పనితనం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అమలాపురం పరిసరాలు, గ్రామీణ నేపథ్యాన్ని తన కెమెరాతో చూపించిన తీరు మెప్పిస్తుంది. సంగీతం విషయానికొస్తే పాటలు సినిమాకి ప్రాణం పోశాయి. రామ్ మిర్యాల అందించిన సూఫియానా పాట ఎంతో వినసొంపుగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ్యుసర్లు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.&nbsp; ప్లస్ పాయింట్స్‌ నటీనటులుకామెడీక్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీఊహకందేలా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 16 , 2024
    Masthu Shades Unnai Ra Review: హీరోగానూ మేజిక్‌ చేసిన అభినవ్‌.. ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ హిట్టా? ఫట్టా?
    Masthu Shades Unnai Ra Review: హీరోగానూ మేజిక్‌ చేసిన అభినవ్‌.. ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ హిట్టా? ఫట్టా?
    నటీనటులు: అభినవ్‌ గోమటం, వైశాలి, రాజ్‌ మెుయిన్‌, అలీ రెజా దర్శకత్వం: తిరుపతి రావు సంగీతం: సంజీవ్‌ థామస్‌ సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ స్వయంభూ నిర్మాత: ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్‌.వి, భవాని కాసుల విడుదల తేదీ: 23-02-2023 హాస్యనటుడు అభినవ్‌ గోమఠం లీడ్‌ రోల్‌లో చేసిన చిత్రం ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ (Masthu Shades Unnay Ra). తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. అలీ రెజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌.వి సంయుక్తంగా నిర్మించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథానాయకుడిగా అభినవ్‌ గోమటం మెప్పించాడా? లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ మనోహర్ (అభినవ్‌ గోమఠం) (Masthu Shades Unnai Ra Review In Telugu) ఓ సాధారణ పెయింటర్. లైఫ్‌లో సెటిల్ కాలేదన్న కారణంతో అతడ్ని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి పీటలపై నుండి లేచిపోతుంది. దీంతో మనోహర్ ఫోటోషాప్ నేర్చుకుని ఫ్లెక్స్ డిజైనింగ్ యూనిట్ సొంతంగా పెట్టుకోవాలని అనుకుంటాడు. ఈ ప్రయాణంలో అతనికి ఉమాదేవి (వైశాలి రాజ్) పరిచయం అవుతుంది. చేతిలో రూపాయి లేని మనోహర్‌ ఈ ప్రయాణంలో ఎలా విజయం సాధించాడు? అతనికి రాహుల్ (అలీ రెజా) నుండి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని మనోహర్ ఎలా దాటగలిగాడు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో మంచి కమెడియన్‌గా గుర్తింపు పొందిన అభినవ్‌ గోమఠం.. ఈ సినిమాలో కథానాయకుడిగానూ తన మార్క్ ఏంటో చూపించాడు. న్యాచురల్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలను చక్కగా పలికించి సంపూర్ణ నటుడిగా నిరూపించుకున్నాడు. ఇక హీరోయిన్ వైశాలి రాజ్ పర్వాలేదు. ఆమెది నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర కాదు. ఇక బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీ రెజా తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు తిరుపతి రావు మంచి కథను ఎంచుకున్నారని చెప్పవచ్చు. స్టోరీపై బాగా హోమ్‌వర్క్‌ చేయడం ప్లస్ అయ్యింది. అయితే స్క్రీన్‌ ప్లే విషయంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. కథకు సంబంధం లేని సీన్లతో తొలి భాగాన్ని చాలా వరకూ నడిపించాడు. స్టోరీలోని మెయిన్‌ పాయింట్‌లోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నారు. అయితే ఓ మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్లాక్ రావడంతో నెక్స్ట్‌ ఏంటి అన్న ఆసక్తి ఆడియన్స్‌లో కలిగించాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌ నుంచి అసలు కథ మెుదలవుతుంది. తొలి పార్ట్‌తో పోలిస్తే చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది. కథలోని మెయిన్ సీక్వెన్స్‌లను దర్శకుడు చాలా బాగా మేనేజ్‌ చేశారు. మంచి ఫన్‌ కూడా జనరేట్ అయ్యింది. సెకండ్‌ పార్ట్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగడంతో సినిమా కొంతమేర గట్టెక్కగల్గింది.&nbsp; టెక్నికల్‌గా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Masthu Shades Unnai Ra Review In Telugu)... ఈ విభాగం పనితీరు చాలా పూర్‌గా ఉంది. సంజీవ్‌ థామస్‌.. సంగీతం ఏమాత్రం ఆకట్టుకోదు. సిద్ధార్థ స్వయంభూ కెమెరా పనితనం కూడా నామ మాత్రంగానే అనిపిస్తుంది. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు ఇంకొంచెం బెటర్‌గా ఉంటే మంచి ఔట్‌పుట్‌ వచ్చేది.&nbsp; ప్లస్ పాయింట్స్‌ అభినవ్‌ నటనకామెడీద్వితియార్థం మైనస్‌ పాయింట్స్ తొలి భాగంఅవసరం లేని సీన్లుటెక్నికల్ విభాగం Telugu.yousay.tv Rating : 2.5/5
    ఫిబ్రవరి 23 , 2024

    @2021 KTree