• TFIDB EN
  • రాధే శ్యామ్
    UATelugu2h 18m
    విక్రమాదిత్య (ప్రభాస్‌) పేరు మోసిన జ్యోతిషుడు. ప్రేరణ (పూజా హెగ్డే)ను చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు. కానీ ప్రేమించలేని పరిస్థితి. మరి విధి ఆ ఇద్దరినీ ఎలా కలిపింది? వారు ప్రేమకు వచ్చిన సమస్య ఏంటి? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Prime
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflix
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    Watch
    రివ్యూస్
    YouSay Review

    Radhe Shyam Movie Review

    ప్ర‌భాస్‌ను వెండితెర‌పై చూసేందుకు గ‌త నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. 'రాధే శ్యామ్' వారికి పండ‌గ‌ను తీసుకొచ్చింది. 2018లో షూటింగ్ ప్రారంభించ...read more

    How was the movie?

    తారాగణం
    ప్రభాస్
    విక్రమాదిత్య ఆదిత్య
    పూజా హెగ్డే
    డా. ప్రేరణ చక్రవర్తి
    కృష్ణం రాజు
    పరమహంస (తెలుగులో)[c]
    సత్యరాజ్
    పరమహంస (హిందీలో)
    భాగ్యశ్రీ
    గిరిజా రాణి
    జగపతి బాబు
    ఆనంద్ రాజ్‌పుత్
    సచిన్ ఖేడేకర్
    డీన్ దేవ్ చక్రవర్తి
    ప్రియదర్శి పులికొండ
    సుబ్బారావు
    మురళీ శర్మ
    జగత్ చక్రవర్తి
    కునాల్ రాయ్ కపూర్
    వేదాంత్
    రిద్ధి కుమార్
    తార
    సత్యన్
    ఆనంద్ రాజ్‌పుత్ అసిస్టెంట్
    జయరామ్
    ది షిప్ కెప్టెన్[16]
    బీనా బెనర్జీ
    ప్రేరణ అమ్మమ్మ
    అనురాధ పటేల్
    మాధురి
    సూర్య
    శాస్త్రవేత్త (తెలుగులో)
    తలైవాసల్ విజయ్
    శాస్త్రవేత్త (హిందీలో)
    సిబ్బంది
    రాధా కృష్ణ కుమార్
    దర్శకుడు
    భూషణ్ కుమార్
    నిర్మాత
    సంచిత్ బల్హరఅంకిత్ బల్హార
    సంగీతకారుడు
    జస్టిన్ ప్రభాకరన్
    సంగీతకారుడు
    అంకిత్ బల్హారసంగీతకారుడు
    మనోజ్ పరమహంస
    సినిమాటోగ్రాఫర్
    కోటగిరి వెంకటేశ్వరరావు
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    పూజా హెగ్డే గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పూజా హెగ్డే గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. ఈక్రమంలో (Some Lesser Known Facts Pooja hegde)గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. పూజా హెగ్డే  ముద్దు పేరు? పూజిత పూజా హెగ్డే వయస్సు ఎంత? 1990, అక్టోబర్ 13న జన్మించింది పూజా హెగ్డే తెలుగులో నటించిన తొలి సినిమా? ఒక లైలా కోసం(2014) పూజా హెగ్డే ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు  పూజా హెగ్డే ఎక్కడ పుట్టింది? మంగళూరు, కర్ణాటక పూజా హెగ్డే ఉండేది ఎక్కడ? ముంబై పూజా హెగ్డే  ఏం చదివింది? Mcom పూజా హెగ్డే  అభిరుచులు? ట్రావెలింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, పుస్తకాలు చదవటం పూజా హెగ్డేకి ఇష్టమైన ఆహారం? బిర్యాని, ఫిజా పూజా హెగ్డేకి  ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ పూజా హెగ్డేకి ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ పూజా హెగ్డేకు ఇష్టమైన హీరోయిన్? మాధురి దీక్షిత్ పూజా హెగ్డే  పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. పూజా హెగ్డే  తల్లిదండ్రుల పేరు? లతా హెగ్డే, మంజునాథ్ హెగ్డే పూజా హెగ్డే  రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది పూజా హెగ్డే  ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/hegdepooja/ పూజా హెగ్డే నికర ఆస్తుల విలువ? రూ.50కోట్లు https://www.youtube.com/watch?v=B-Ep3Hhy2Sk
    ఏప్రిల్ 16 , 2024
    <strong>EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌!&nbsp;</strong>
    EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌!&nbsp;
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రతీ చిత్రం సూపర్‌ హిట్‌ కావాలన్న రూల్‌ ఏమి లేదు. కొన్నింటికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మరికొన్నింటికి అసలే దక్కదు. దీనిని బట్టే ఆయా సినిమాలను హిట్స్‌, ఫ్లాప్స్‌గా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే ఫ్లాప్‌ అయిన చిత్రాలు కూడా కొన్ని సందర్భాల్లో ఓటీటీలో మంచి ఆదరణ పొందడం ఈ రోజుల్లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చిత్రాలకు పరమ డిజాస్టర్లుగా పేరుంది. అప్పట్లో ఆ సినిమాల ప్రదర్శన సందర్భంగా ఆడియన్స్‌ మూవీ మధ్యలో నుంచే బయటకు వచ్చేశారని టాక్ ఉంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటిపై నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.&nbsp; [toc] ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ (Extra Ordinary Man) నితీన్‌ (Nithiin) - శ్రీలీల (Sreeleela) జంటగా చేసిన రీసెంట్‌ చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్‌’. ఈ సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. సినిమా ఇంటర్వెల్‌ వరకూ కూడా చూడలేకపోయామని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అసలు విలన్‌ చెప్పినట్లు హీరో ఆడటం ఏంటని కొందరు ప్రేక్షకులు మండిపడ్డారు. నితీన్‌ కేరీర్‌లో ఎక్కువగా ట్రోల్స్‌ గురైన చిత్రంగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ నిలిచింది.&nbsp; శాకుంతలం (Shakunthalam) సమంత (Samantha) లీడ్‌ రోల్‌లో నటించిన ‘శాకుంతలం’ చిత్రంపై రిలీజ్‌కు ముందు భారీగానే అంచనాలు ఉండేవి. సమంత చేసిన తొలి పౌరాణిక సినిమా కావడం, ప్రచార చిత్రాలు కూడా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేలా ఉండటంతో తెలుగు ఆడియన్స్‌ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత సీన్ అంతా రివర్స్ అయ్యింది. శకుంతల పాత్రకు సమంత పెద్దగా నప్పలేదని, డబ్బింగ్‌ కూడా సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్‌ వరకూ సినిమాను చూడటమే కష్టంగా అనిపించిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్స్ చేశారు.&nbsp;&nbsp; రాధే శ్యామ్‌ (Radhe Shyam) ప్రభాస్‌ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన ‘రాధే శ్యామ్‌’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో ప్రభాస్ వింటేజ్‌ లుక్‌తో స్మార్ట్‌గా ఉండటంతో ఫ్యాన్స్‌లో పెద్ద ఎత్తున అంచనాలు మెుదలయ్యాయి. కానీ రిలీజయ్యాక ప్రభాస్‌ను హస్తముద్రికా నిపుణుడిగా చూసి షాకయ్యారు. జ్యోతిష్యాన్ని ప్రేమను ముడి పెట్టిన విధానం చాలా మంది ఫ్యాన్స్‌కు ఎక్కలేదు. సినిమా మెుదలైన గంటకే విసుగు వచ్చిందని, ఇంటర్వెల్‌కు బయటకు వచ్చేశామని అప్పట్లో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వచ్చాయి. వరల్డ్ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover) విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా... రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లే హీరోయిన్లుగా చేసిన చిత్రం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. హీరో విజయ్‌పై ఈ సినిమా నుంచే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఈ సినిమాలో రొమాన్స్‌ తప్ప కథ లేదని ట్రోల్స్‌ వచ్చాయి. విజయ్‌ పో** చిత్రాలు చేసుకుంటే బెటర్‌ అని కొందరు నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు బయటకు వెళ్లిపోదామా? అని ఎదురు చూసినట్లు పోస్టులు పెట్టారు.&nbsp; బ్రహ్మోత్సవం (Brahmotsavam) సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) కెరీర్‌లోనే పీడకల లాంటి చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం మహేష్‌కు మాయని మచ్చలా మిగిలిపోయిందని ఫ్యాన్స్ అంటుంటారు. కాజల్‌ (Kajal Aggarwal), సమంత (Samantha), ప్రణీత (Pranitha) వంటి కథానాయికలతో పాటు సత్యరాజ్‌, జయసుధ, రేవతి, తులసి, రావు రమేష్‌, షియాజీ షిండే, తనికెళ్ల భరణి వంటి హేమాహేమీలు ఉన్నా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా తొలి రోజు తొలి ఆట నుంచే సినిమాపై ట్రోల్స్‌ మెుదలయ్యాయి. సినిమా చూడకుండా మధ్యలోనే వచ్చేశామంటూ స్వయంగా మహేష్‌ ఫ్యాన్సే కామెంట్స్ చేశారు. సన్‌ ఆఫ్‌ ఇండియా (Son Of India) దిగ్గజ నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu) హీరోగా చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమాపై విడుదలకు ముందు నుంచే నెగిటివ్‌ మెుదలైంది. ఈ సినిమా తొలి రోజు మెుదటి ఆట కోసం ఓ థియేటర్‌లో రెండే టికెట్లు బుక్‌ కావడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఆ టికెట్లు బుక్‌ చేసుకుంది మంచు ఫ్యామిలీనే అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. చూసిన వారు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్‌ రివ్యూ ఇవ్వడంతో కొద్ది రోజులకే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసివేశారు. మోహన్‌ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ నిలిచింది. వినయ విధేయ రామా (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన వినయ విధేయ రామాపై తొలి ఆట నుంచి నెగిటివ్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఈ చిత్రం పరమ రాడ్‌ అంటూ చూసిన వారు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోదామా అని అనిపించిందని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి బిహార్‌కు వెళ్లడం.. హీరో విలన్‌ అనుచరుల తలకాయలు నరికితే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.&nbsp; లైగర్‌ (Liger) విజయ్ దేవరకొండ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన మరో చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. తొలి గంటకే సినిమాపై ఆసక్తి సన్నగిల్లిందని అప్పట్లో నెట్టింట పోస్టులు వెల్లువెత్తాయి. అంత బాడీ పెట్టుకొని విజయ్‌ పాత్రకు నత్తి పెట్టడం ఏంటన్న విమర్శలు వచ్చాయి. శక్తి (Shakthi) తెలుగులో డిజాస్టర్‌ అని అనగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘శక్తి’. ఈ మూవీ దర్శకుడు మేహర్‌ రమేష్‌ను ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికీ ఓ ఆట ఆడుకుంటున్నారు. శక్తి మెుదటి ఆట చూసి తారక్‌ కథను ఎలా ఓకే చేశారని ప్రశ్నించారు. ఒక గంట కూడా సినిమాను వీక్షించలేకపోయామని చెప్పారు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో తారక్ లుక్‌ అసలు సూట్‌ కాలేదన్న విమర్శలు సైతం వచ్చాయి. ఇదే డైరెక్టర్‌ వెంకటేష్‌తో ‘షాడో’ తీయగా ఆ మూవీ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. మేహర్‌ రమేష్‌&nbsp; రీసెంట్‌ చిత్రం ‘భోళా శంకర్‌’ సమయంలోనూ శక్తి సినిమా ప్రస్తావనకు రావడం గమనార్హం.&nbsp; సలీం (Saleem) మంచు విష్ణు (Manchu Vishnu), ఇలియానా (Ileana D'Cruz) జంటగా చేసిన ‘సలీం’.. తెలుగులో వచ్చిన బారీ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం మంచు విష్ణు భారీగా వెయిట్‌ తగ్గాడు. నాలుగైదు సినిమా కథలను మిక్సీలో వేసి సలీం చిత్రాన్ని రూపొందించారని అప్పట్లో విమర్శలు సైతం వచ్చాయి. తొలి అర్ధభాగానికే సినిమా బోర్‌ కొట్టేసిందని కామెంట్స్ వినిపించాయి.&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    Prabhas New Projects: మాట నిలబెట్టుకుంటున్న ప్రభాస్‌.. సెట్స్‌పైకి ఒకేసారి మూడు చిత్రాలు!
    Prabhas New Projects: మాట నిలబెట్టుకుంటున్న ప్రభాస్‌.. సెట్స్‌పైకి ఒకేసారి మూడు చిత్రాలు!
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌తో దేశంలో ఏ స్టార్‌ హీరోకు అందనంత ఎత్తులో నిలుస్తున్నాడు. రీసెంట్‌గా కల్కితో రూ.1200 కోట్ల మార్క్‌ అందుకున్న ప్రభాస్‌ బాక్సాఫీస్‌ వద్ద తనకు తిరుగులేదని మరోమారు నిరూపించాడు. అంతేకాదు వరుసగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చేస్తూ ఫుల్‌ దూకుడు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే సూపర్‌ స్టార్ కృష్ణ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేస్తూ ఫుల్‌ ఫోకస్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఒకేసారి మూడు సినిమాలు పట్టాలెక్కించి ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నాడు. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; ప్రభాస్ ఇచ్చిన మాట ఇదే! హీరో ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రాలకు చిరునామాగా మారిపోయాడు. అతడు ఏ సినిమా పట్టుకున్న అది జాతీయ స్థాయి ప్రాజెక్టుగా మారిపోతోంది. ఆదిపురుష్‌ (2023) ముందు వరకూ ప్రభాస్‌ ఒక్కో&nbsp; చిత్రానికి కనీసం రెండేళ్లు సమయం తీసుకున్నాడు. 2015 బాహుబలి నుంచి ఈ తంతు మెుదలైంది. బాహుబలి నుంచి బాహుబలి 2 మధ్య గ్యాప్‌ రెండేళ్లు రాగా, ఆ తర్వాత వచ్చిన సాహో (2019), రాధే శ్యామ్‌ (2022) మధ్య ఏకంగా మూడేళ్ల సమయం పట్టింది. దీంతో అప్పట్లో ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒక్కో సినిమాకు ఇంత గ్యాప్‌ తీసుకుంటే ఎలా అంటూ డార్లింగ్‌పై సున్నితంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న ప్రభాస్‌ ఇకపై ఏడాదికి కనీసం ఒక సినిమా రిలీజ్‌ చేస్తానని మాటిచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ వరుసగా ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చూస్తూ దూసుకెళ్తున్నాడు.&nbsp; సూపర్‌ స్టార్‌ కృష్ణ వ్యూహం! ప్రభాస్‌ తన ప్రాజెక్టుల విషయంలో గతంతో పోలిస్తే చాలా ఫోకస్డ్‌గా ఉన్నాడు. ఒకప్పటిలాగా ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అనే విధానాన్ని స్వస్థి పలికి సూపర్‌ కృష్ణ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒకప్పుడు కృష్ణ ఏక కాలంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సినిమాల్లో నటించేవారు. ఇప్పుడు ప్రభాస్‌ కూడా ఆయన తరహాలోనే ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. వాస్తవానికి ‘సలార్‌’ సమయంలోనే ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌లోనూ పాల్గొంటూ రెండు చిత్రాలను 6 నెలల వ్యవధిలోనే రిలీజ్‌ చేశాడు. ప్రస్తుతం డైరెక్టర్‌ మారుతీతో 'రాజాసాబ్‌' అనే చిత్రంలో ప్రభాస్‌ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించాడు. నవంబర్‌ కల్లా సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని 'స్పిరిట్‌'ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో డార్లింగ్ ఉన్నాడు. తద్వారా ఏక కాలంలో ఈ మూడు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొని ఒక్కో సినిమాను ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే రిలీజ్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ‘సలార్‌ 2’, ‘కల్కి 2’ చిత్రాలను కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది.&nbsp; దేశంలోనే నెం.1 హీరోగా ప్రభాస్ బాలీవుడ్‌కు చెందిన మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా జులై నెలకు సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల జాబితాలను ప్రకటించింది. ఈ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ప్రభాస్ నిలిచాడు. ప్రభాస్ తర్వాత రెండో స్థానంలో తమిళ స్టార్ విజయ్ నిలవగా మూడో స్థానంలో షారుక్ ఖాన్, నాలుగో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐదో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, ఆరో స్థానంలో అక్షయ్ కుమార్, ఏడో స్థానంలో అల్లు అర్జున్, ఎనిమిదో స్థానంలో సల్మాన్ ఖాన్, తొమ్మిదో స్థానంలో రామ్ చరణ్, పదో స్థానంలో తమిళ స్టార్ హీరో అజిత్ నిలిచారు. మే, జూన్ నెలల్లో ఆర్మాక్స్ ప్రకటించిన జాబితాల్లో కూడా ప్రభాస్ మొదటిస్థానంలోనే నిలవడం విశేషం. దీనిపై అభిమానులు, సినీ ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోలను వెనక్కినెట్టి&nbsp; ప్రభాస్ నెంబర్ వన్‌గా అవతరించాడంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
    ఆగస్టు 31 , 2024
    <strong>Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?</strong>
    Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?
    టాలీవుడ్‌లో గత ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు హీరోలు విభిన్నమైన కథలను ఎంచుకొని పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగితే మరికొందరు తమ ఫేమ్‌ను తిరోగమనంలోకి తీసుకెళ్లారు. కొందరు హీరోలు చకచకా సినిమాలు చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తే ఇంకొందరు రెండేళ్లకు కూడా ఒక సినిమా రిలీజ్‌ చేయలేక ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమయ్యారు. ముఖ్యంగా కొందరు యంగ్‌ హీరోలు ఫ్లాప్స్‌ తియ్యడంలో పోటీ పడుతూ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత ఐదేళ్లలో టాలీవుడ్‌లో వచ్చిన గణనీయమైన మార్పులు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. ఒక మూవీకి ఏళ్లకు ఏళ్ల సమయం! టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజ నటులు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ను అలరించేవారు. వీరి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంటటేష్‌, బాలకృష్ణ సైతం ఈ పరంపరను కొనసాగిస్తూ ఏడాదిలో ఒక సినిమాకు తగ్గకుండా రిలీజ్‌ చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల సమయం పడుతోంది. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, తారక్‌ వంటి స్టార్‌ హీరోల నుంచి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు దాటిపోయింది. ఓ వైపు ప్రభాస్‌ ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు ఉండేలా ప్లాన్‌ చేసుకుంటే ఈ ముగ్గురు స్టార్స్‌ మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారు. సైంటిఫిక్‌, మైథాలజీ, ఫ్యూచరిక్‌ సినిమాలంటే కొంత ఆలస్యం జరిగిన ఓ అర్థం ఉంది. ప్రస్తుతం తారక్‌ (దేవర), రామ్‌చరణ్‌ (గేమ్‌ ఛేంజర్‌), అల్లు అర్జున్‌ (పుష్ప 2) చేస్తున్న కమర్షియల్‌ చిత్రాలకు కూడా ఇంత ఆలస్యం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది.&nbsp; ఫ్లాప్స్‌తో పోటీపడుతున్న కుర్ర హీరోలు! యంగ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నాగచైతన్య (Naga Chaitanya), రామ్‌ పోతినేని (Ram Pothineni)లకు గత ఐదేళ్లుగా టాలీవుడ్‌లో అసలు కలిసి రావడం లేదు. వారి నుంచి సాలిడ్‌ హిట్‌ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు హిట్‌ సినిమాలతో పోటీ పడిన ఈ ముగ్గురు హీరోలు అనూహ్యంగా గత ఐదేళ్ల నుంచి ఫ్లాప్స్‌తో పోటీ పడుతున్నారు. విజయ్‌ నటించిన రీసెంట్‌ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’తో పాటు గతంలో వచ్చిన ‘లైగర్‌’, ‘ఖుషి’, ‘డియర్ కామ్రేడ్‌’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. అలాగే నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’, ‘లాల్‌ సింగ్‌ చద్ధా’, ‘థ్యాంక్యూ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని చేసిన లేటెస్ట్‌ చిత్రం 'డబుల్‌ ఇస్మార్ట్‌' కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అంతకుముందు వచ్చిన ‘స్కంద’, ‘వారియర్‌’, ‘రెడ్‌’ సినిమాలు హిట్స్‌ అందుకోలేక ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. మార్కెట్‌ కోల్పోయే దిశగా సీనియర్లు ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి గత ఐదేళ్ల వ్యవధిలో దారుణంగా మారిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవికి ఇప్పటివరకూ సరైన కమ్‌బ్యాక్‌ లభించలేదని చెప్పాలి. ఓవైపు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ తమ వయసుకు తగ్గ స్టోరీలు ఎంచుకొని ‘జైలర్‌’, ‘విక్రమ్‌’ సినిమాలతో సాలిడ్‌ విజయాలను అందుకున్నారు. అయితే చిరు ఇప్పటికే కమర్షియల్ పాత్రలనే ఎంచుకుంటూ పోవడం ఆయనకు మైనస్‌గా మారుతోంది. అటు నాగార్జున, వెంకటేష్‌ పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. నాగార్జున గత చిత్రాలు ‘మన్మథుడు 2’, ‘బంగార్రాజు’, ‘నా సామిరంగ’లోని పాత్రలు ఏమాత్రం నాగార్జునకు సెట్ అయ్యేవిగా కనిపించవు. ఇక వెంటేష్‌ ‘రానా నాయుడు’ సిరీస్‌తో విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పటిలాగే మాస్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. అయితే కొత్త కథలు ఎంచుకోకపోవడం, వయసు తగ్గ పాత్రలు చేయకపోవడం, సరైన హిట్స్ లేకపోవడంతో ఒకప్పటి స్టార్‌ హీరోలుగా వెలిగిన ఈ హీరోల కలెక్షన్స్‌ కుర్రహీరోలతో పోలిస్తే పడిపోతూ వస్తున్నాయి. మార్కెట్‌ను పూర్తిగా కోల్పేయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; ప్రభాస్‌, నాని సూపర్బ్‌! గత ఐదేళ్ల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హీరోలుగా ప్రభాస్‌, నానిలను చెప్పవచ్చు. ఓవైపు వేగంగా సినిమాలు చేస్తూనే ప్రతీ మూవీకి కథ, పాత్ర పరంగా వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నారు. క్వాలిటీ పరంగానూ మంచి సినిమాలు తీస్తూ ఎప్పటికప్పుడు తమ క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రభాస్‌ గత చిత్రాలను పరిశీలిస్తే ‘బాహుబలి 1 &amp; 2’, ‘సాహో’, ‘రాధే శ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కథ, పాత్ర పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. అటు నాని రీసెంట్ చిత్రాలైన ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘అంటే సుందరానికి’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ కూడా విభిన్నమైనవే. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ కూడా ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిందే. అటు ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ‘రాజాసాబ్‌’, సలార్‌ 2, ‘కల్కి 2’, ‘స్పిరిట్‌’, ‘ఫౌజీ’ కథ, పాత్ర పరంగా ప్రభాస్‌ను మరో లెవల్‌లో చూపించనున్నాయి.&nbsp; రీరిలీజ్‌లతో ఫ్యాన్స్‌ సంతృప్తి! గతంలో లేని విధంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్‌ హీరోల బర్త్‌డేల సందర్భంగా గతంలో వారు చేసిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు విడుదలవుతున్నాయి. మహేష్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలకు లాంగ్‌ గ్యాప్‌ వస్తుండటంతో రీరిలీజ్‌ మూవీస్‌లోనే తమ హీరోను చూసుకొని ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. గత రోజులను గుర్తుచేసుకుంటూ సంతోష పడుతున్నారు. అయితే రీరిలీజ్‌ చిత్రాలకు ఆదరణ పెరగడానికి ఓ కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఆ తరహా చిత్రాలను హీరోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రీరిలీజ్‌ రూపంలో తమ ఫేవరేట్‌ చిత్రాలను మళ్లీ చూసుకొని అభిమానులు సంతోష పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.&nbsp; ఆ స్టార్‌ డైరెక్టర్లకు ఏమైంది? టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగిన పూరి జగన్నాథ్‌కు హీరోలతో సమానంగా సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. గతంలో ఆయన నుంచి సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొనేది. ‘ఇడియట్‌’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘పోకిరి’, ‘బిజినెస్‌ మ్యాన్‌’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్స్‌తో ఓ దశలో టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. అటువంటి పూరి గత కొంత కాలంగా హిట్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన గత చిత్రం ‘లైగర్‌’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. తాజాగా వచ్చిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సైతం ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అటు హరీష్‌ శంకర్‌ పరిస్థితి కూడా ఇంచుమించు పూరి లాగానే ఉంది. ‘మిరపకాయ్‌’, ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి సూపర్‌ హిట్స్‌తో మాస్‌ డైరెక్టర్‌గా హరీష్‌ శంకర్‌ ఇటీవల సరైన హిట్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’, ‘గద్దల కొండ గణేష్‌’ ప్లాప్స్‌తో లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’పై అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మిస్టర్‌ బచ్చన్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. హరీష్‌ శంకర్‌ టేకింగ్‌ సాదా సీదాగా ఉందంటూ విమర్శలు సైతం వచ్చాయి.&nbsp;
    ఆగస్టు 17 , 2024
    Tollywood Movies: రిలీజ్‌కు ముందే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న చిత్రాలు.. ఎందుకో తెలుసా?
    Tollywood Movies: రిలీజ్‌కు ముందే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న చిత్రాలు.. ఎందుకో తెలుసా?
    ఒక సినిమా థియేటర్‌లోకి రావాలంటే ఎంతో మంది కృషి అవసరం. ముఖ్యంగా హీరో, డైరెక్టర్‌ తమ సర్వశక్తులు ఒడ్డి సినిమాను తెరకెక్కిస్తారు. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అవుతుంటాయి. మరికొన్ని యావరేజ్‌ టాక్‌తో నిర్మాతలకు పెట్టుబడి మెుత్తాన్ని తిరిగి అందిస్తుంటాయి. ఇవన్నీ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత జరిగే సంఘటనలు. అయితే కొన్ని చిత్రాలు మాత్రం థియేటర్లలోకి రాకముందే ఫ్లాప్‌ టాక్‌ (Tollywood Films Got Flop Talk Before The Release)ను మూటగట్టుకున్నాయి. సోషల్‌ మీడియాలో ఆయా చిత్రాలపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. అటువంటి చిత్రాలు ఏవి? ఇందుకు గల కారణాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; భోళాశంకర్‌ (Bhola Shankar) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా.. మేహర్‌ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో రూపొందిన రీసెంట్‌ చిత్రం ‘భోళాశంకర్‌’. ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందంటూ రిలీజ్‌కు ముందే నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. మేహర్‌ రమేష్‌.. గతంలో ఇచ్చిన డిజాస్టర్ల నేపథ్యంలో ఈ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇందుకు అనుగుణంగానే రిలీజ్‌ తర్వాత ‘భోళాశంకర్‌’ ఫ్లాప్ టాక్‌ తెచ్చుకోవడం గమనార్హం.&nbsp; ఆదిపురుష్‌ (Aadi Purush) పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్‌ సీతగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం కూడా విడుదలకు ముందే తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ విడుదలైనప్పటి నుంచి నెట్టింట విపరీతంగా ట్రోల్స్‌ మెుదలయ్యాయి. గ్రాఫిక్స్ మరి అద్వాన్నంగా ఉన్నాయని.. సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఇందుకు తగ్గట్లే విడుదల తర్వాత ‘ఆదిపురుష్‌’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సంభాషణలపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. షాడో (Shadow) వెంకటేష్‌ (Venkatesh) హీరోగా మేహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘షాడో’. మేహర్‌ రమేష్‌ గత చిత్రాలు ‘కంత్రి’, ‘శక్తి’ డిజాస్టర్‌గా నిలవడంతో దాని ప్రభావం ‘షాడో’పై కూడా పడింది. ఈ మూవీ ట్రైలర్‌.. అంచనాలను అందుకోకపోవడంలో విఫలం కావడంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్స్‌ ఉందని అప్పట్లో కథనాలు వచ్చాయి. లాంగ్‌ హెయిర్‌లో వెంకీ లుక్‌ బాలేదని కూడా సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. మెుత్తానికి విడుదల తర్వాత ‘షాడో’ కూడా డిజాస్టర్ నిలిచి ఆ విమర్శలను నిజం చేసింది.&nbsp; స్కంద (Skanda) హీరో రామ్‌ (Ram), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో రూపొందిన ‘స్కంద’పై ట్రైలర్‌ రిలీజ్‌ ముందు వరకూ భారీ అంచనాలే ఉన్నాయి. ట్రైలర్‌ రిలీజ్ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. యాక్షన్‌ సీన్స్‌ మరి ఓవర్‌ డోస్‌ అయినట్లుగా ఉందని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని కొందరు నెటిజన్లు అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే ‘స్కంద’ రిలీజ్‌ తర్వాత బి లో యావరేజ్‌గా నిలిచింది. ముఖ్యంగా రామ్‌కు నటుడు శ్రీకాంత్‌ ఎలివేషన్‌ ఇచ్చే డైలాగ్‌ ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రోల్‌ కావడం గమనార్హం. వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌ హీరోగా (Tollywood Films Got Flop Talk Before The Release) బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను తొలి ఆట నుంచే ట్రోల్స్‌ చుట్టుముట్టాయి. ముఖ్యంగా రామ్‌చరణ్‌ విలన్ సోదరుడి తల నరకడం.. గద్ద దాన్ని ఎత్తుకెళ్లడానికి సంబంధించిన సీన్‌ విపరీతంగా ట్రోల్‌కు గురైంది. అలాగే రైలు పై నుంచి పరిగెత్తుకుంటూ రామ్‌చరణ్‌ బిహార్‌ వెళ్లడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఓవరాల్‌గా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచి చరణ్‌ ఫ్లాప్‌ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.&nbsp; లైగర్‌ (Liger) విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్‌ అయ్యింది. ప్రమోషన్స్‌ సందర్భంగా నిర్మాత చార్మీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు దోహదం చేశాయి. పైగా సిక్స్‌ ప్యాక్‌తో ఎంతో దృఢంగా ఉన్న విజయ్‌కు సినిమాలో నత్తి ఉన్నట్లు చూపించడం కూడా ట్రోల్స్‌కు కారణమైంది. రాధే శ్యామ్‌ (Radheshyam)&nbsp; బాహుబలి తర్వాత ప్రభాస్‌ తీసిన రెండో చిత్రం ‘రాధేశ్యామ్‌’. సాహో ఫ్లాప్‌ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా 1976 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఇందులో ప్రభాస్‌ హస్తసాముద్రికం తెలిసిన జ్యోతిష్కుడిగా కనిపిస్తాడని తెలియగానే ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అటు సోషల్‌ మీడియాలో ఈ సినిమా కూడా డౌటే అంటూ ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే విడుదలైన రాధేశ్యామ్‌ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకొని.. ఆ రూమర్స్‌ను నిజం చేసింది.&nbsp; వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover) విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' చిత్రం టీజర్‌ రిలీజ్‌ నుంచే విమర్శలను మూటగట్టుకుంది. టీజర్‌ బోల్డ్‌గా ఉండటంతో పాటు విజయ్‌ నలుగురు హీరోయిన్లతో రొమాన్స్‌ చేయడం చూపించారు. అర్జున్‌ రెడ్డి సినిమా నుంచి హీరోయిన్లతో విజయ్‌ రొమాన్స్‌ ఎక్కువైందని సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి. అటు మహిళ సంఘాలు కూడా ఈ సినిమాపై తీవ్రంగా స్పందించాయి. ఇన్ని ట్రోల్స్‌, విమర్శల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో దారుణంగా విఫలమైంది.&nbsp; సన్‌ ఆఫ్‌ ఇండియా (Son of India) మంచు మోహన్‌బాబు (Mohan Babu) హీరోగా చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ (Tollywood Films Got Flop Talk Before The Release) చిత్రం విడుదలకు ముందే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా కొన్ని సోషల్‌ మీడియా అకౌంట్స్‌ మీమ్స్‌ క్రియేట్‌ చేశాయి. మరో ఫ్లాప్‌ లోడింగ్‌ అంటూ ట్రోల్స్‌ చేశాయి. ఈ పరిణామాల మధ్య వచ్చిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది.&nbsp;
    మార్చి 16 , 2024
    సాయి పల్లవి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    సాయి పల్లవి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    సాయి పల్లవి తెలుగులో ఫిదా చిత్రంతో పరిచయమైంది.&nbsp; ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అంతకు ముందు ఆమె మలయాళంలో నటించిన ప్రేమమ్ సినిమాలో మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.&nbsp; ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంది. మరి సాయి పల్లవి గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన (Some Lesser Known Facts about Sai Pallavi) విషయాలు ఇప్పుడు చూద్దాం. సాయి పల్లవి&nbsp; ముద్దు పేరు? మలార్ సాయి పల్లవి పేరు ఎవరు పెట్టారు? సాయి పల్లవి పేరును పుట్టపర్తి సాయిబాబా పెట్టారు &nbsp;సాయి పల్లవి వయస్సు ఎంత? 1992, మే 9న జన్మించింది సాయి పల్లవి తెలుగులో నటించిన తొలి సినిమా? ఫిదా సాయి పల్లవి ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు&nbsp; సాయి పల్లవి ఎక్కడ పుట్టింది? కోటగిరి, తమిళనాడు సాయి పల్లవి&nbsp; ఏం చదివింది? MBBS సాయి పల్లవి&nbsp; అభిరుచులు? డ్యాన్సింగ్, సింగింగ్ సాయి పల్లవికి ఇష్టమైన ఆహారం? చాకోలెట్స్, స్వీట్స్ పూజా హెగ్డేకి&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ సాయి పల్లవికి ఇష్టమైన హీరో? కమల్ హాసన్, మమ్మాటి సాయి పల్లవికి ఇష్టమైన హీరోయిన్? జ్యోతిక, సిమ్రాన్ సాయి పల్లవి&nbsp; పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల&nbsp; వరకు ఛార్జ్ చేస్తోంది. సాయి పల్లవి&nbsp; తల్లిదండ్రుల పేరు? సెంతమార కన్నన్, రాధ కన్నన్&nbsp; సాయి పల్లవి రాకముందు ఏం చేసేది? సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు పలు డ్యాన్స్ షోల్లో పాల్గొంది. ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ షోలో కూడా సాయి పల్లవి పార్టిసిపేట్ చేసింది. సాయి పల్లవి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/saipallavi.senthamarai/ సాయి పల్లవి నికర ఆస్తుల విలువ? రూ.30కోట్లు https://www.youtube.com/watch?v=1OtXtXJWTVg
    ఏప్రిల్ 16 , 2024
    Pooja Hegde: పూజాను వెంటాడుతున్న ఫ్లాపులు.. ఐరన్‌ లెగ్‌ ట్యాగ్‌కు సల్మాన్‌ చెక్ పెట్టేనా?
    Pooja Hegde: పూజాను వెంటాడుతున్న ఫ్లాపులు.. ఐరన్‌ లెగ్‌ ట్యాగ్‌కు సల్మాన్‌ చెక్ పెట్టేనా?
    టాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. 2014లో ‘ఒక లైలా కోసం’ చిత్రం ద్వారా పరిచయమైన ఈ భామ ‘ముకుంద’తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బన్నీతో డీజే సినిమాలో నటించిన పూజా.. ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’, ‘అలా వైకుంఠ పురం’ ద్వారా సాలిడ్ హిట్స్‌ అందుకుంది. అయితే గత కొంతకాలంగా పూజా హెగ్డేకు సినిమాల పరంగా కలిసిరావడం లేదు. టాలీవుడ్‌లో ఈ భామ చేసిన రీసెంట్‌ సినిమాలన్నీ ఫ్లాప్‌గా నిలిచాయి.మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, బీస్ట్, ఆచార్య, రాధేశ్యామ్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో నెటిజన్లు పూజాపై ఐరన్‌ లెగ్ ముద్ర వేస్తున్నారు.&nbsp; అటు బాలీవుడ్‌లోనూ పూజాను ఫ్లాపుల బెడద వెంటాడుతోంది. హృతిక్‌కు జోడీగా మెుహంజదారో చిత్రంలో నటించిన ఈ భామ హిందీలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వాలని భావించింది. అయితే ఆ సినిమా కూడా బోల్తా పడటంతో పూజా ఆశలు ఆవిరయ్యాయి. హౌస్‌ఫుల్‌ 4 చిత్రం ద్వారా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో తాజాగా సల్మాన్‌తో నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంతోనైనా ఐరెన్‌ లెగ్‌ ట్యాగ్‌ చెరిపేసుకోవాలని పూజా భావిస్తోంది. ఈ సినిమా ద్వారా తిరిగి హిట్ల బాట పట్టాలని పూజా కోరుకుంటోంది.&nbsp; ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా ఏప్రిల్‌ 21న రిలీజ్‌ కాబోతోంది. సల్మాన్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటల టీజర్లు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్‌చరణ్‌, వెంకటేష్‌ ముఖ్య పాత్రల్లో కనిపిస్తుండటం సినిమాపై మరింత క్రేజ్‌ క్రియేట్‌ చేసింది. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన వీరమ్‌ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సల్మాన్‌తో పాటు డైరెక్టర్‌ ఫర్హద్‌ సామ్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; మరోవైపు తనపై పడ్డ ఐరన్‌ లెగ్‌ ముద్రపై గతంలోనే పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చారు. ప్రతీ సినిమా విజయం సాధించాలన్న ఉద్దేశంతోనే కష్టపడి చేస్తానని చెప్పుకొచ్చారు. జయాపజయాలు మన చేతిలో ఉండవని పేర్కొన్నారు.ప్రస్తుతం మహేశ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28లో పూజా నటిస్తోంది. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ సరసన ‘జనగణమన’ చిత్రంలోనూ పూజా హీరోయిన్‌గా చేయనుంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్‌ కానున్నాయి.
    ఏప్రిల్ 10 , 2023
    <strong>Devara Record: రాజమౌళి, ప్రభాస్‌కు షాకిచ్చిన తారక్‌.. తెలుగు సినీ చరిత్రలో ఏకైక చిత్రంగా ‘దేవర’!&nbsp;</strong>
    Devara Record: రాజమౌళి, ప్రభాస్‌కు షాకిచ్చిన తారక్‌.. తెలుగు సినీ చరిత్రలో ఏకైక చిత్రంగా ‘దేవర’!&nbsp;
    జూ. ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా రిలీజై 18 రోజులు అయినప్పటికీ దేవర జోరు ఏమాత్రం తగ్గలేదు. రిలీజైన అన్ని ఏరియాల్లో ఎప్పుడో బ్రేక్ ఈవెన్‌ సాధించిన ఈ చిత్రం, ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. తొలిరోజు ‘దేవర’పై కాస్త నెగిటివ్‌ టాక్స్‌ వచ్చినా కలెక్షన్స్‌పై ఏమాత్రం ప్రభావం కనిపించలేదు. వసూళ్ల పరంగా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ రికార్డును బద్దలు కొట్టింది. అంతేకాదు గ్లోబల్‌ స్టార్‌గా వెలుగొందుతున్న ప్రభాస్‌కు సైతం సాధ్యం కానీ ఘనతను తారక్‌ అందుకున్నాడు.&nbsp; తెలుగులో కొత్త చరిత్ర! తారక్‌ (Jr NTR), జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) జంటగా నటించిన ‘దేవర’ చిత్రం వసూళ్ల పరంగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. రిలీజైన 18 రోజుల్లో ఏపీ, తెలంగాణాల్లో రోజూ రూ.కోటీకి పైగా వసూళ్లు సాధించింది. పోస్టు కోవిడ్‌ తర్వాత రిలీజైన తెలుగు చిత్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా దేవర రికార్డు సృష్టించింది. అంతకుముందు ఈ ఘనత రాజమౌళి తెరకెక్కించిన&nbsp; ‘RRR’ పేరిట ఉండేది. ఆ చిత్రం వరుసగా 17 రోజులు తెలుగు రాష్ట్రాల్లో రూ. కోటికి పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు జూ.ఎన్టీఆర్ దెబ్బకు ఆ రికార్డు గల్లంతైంది. అటు కరోనా తర్వాత వచ్చిన ప్రభాస్‌ చిత్రాలు (రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, సలార్‌, కల్కి 2898 ఏడీ) సైతం ఈ ఫీట్‌ను సాధించలేదని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. దీన్ని బట్టి చూస్తే తారక్‌ స్టామినా ఏంటో అర్థమవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. https://twitter.com/AndhraBoxOffice/status/1846039904913863146 దేవర కలెక్షన్స్‌ ఎంతంటే? ‘దేవర’ చిత్రం తొలి 16 రోజుల్లోనే వరల్డ్‌ వైడ్‌గా రూ.509 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు ఇటీవల మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. గత రెండ్రోజుల కలెక్షన్స్‌ జత చేస్తే రూ.520 కోట్లు టచ్‌ చేసే అవకాశముందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ. 222.60 కోట్లు (GROSS) ఖాతాలోకి వచ్చి చేరినట్లు పేర్కొన్నాయి. కర్ణాటకలో రూ.17.70&nbsp; కోట్లు, తమిళనాడు రూ. 4.13 కోట్లు, కేరళ రూ. 97 లక్షలు, హిందీ + రెస్ట్‌ ఆఫ్ ఇండియా రూ. 33.55 కోట్లు వసూలైనట్లు వివరించాయి. ఈ వసూళ్ల పరంపర ఇలాగే కొనసాగితే ఈజీగానే రూ.550 కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి లాంగ్‌ రన్‌లో ఈ ఫీట్‌ సాధిస్తుందో లేదో చూడాలి. స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్సయ్యిందా? దేవర డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు దక్కించుకుంది. ఈ సినిమా రిలీజై 18 రోజులు గడిచిపోయిన నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడూ వస్తుందా అన్న ఎదురుచూపులు అందరిలోనూ మెుదలయ్యాయి. లేటెస్ట్ బజ్‌ ప్రకారం 'దేవర'ను దీపావళి కానుకగా ఓటీటీలోకి తీసుకొచ్చే ఛాన్స్‌ ఉందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దీపావళికి సాధ్యం కాకపోతే నవంబర్‌ రెండో వారంలోనైనా కచ్చితంగా స్ట్రీమింగ్‌కు తెచ్చే అవకాశముంది. అటు దేవర ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.150 కోట్లకు దక్కించుకుంది. మూవీ రిలీజ్‌ అయిన 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేలా ఒప్పందం చేసుకుంది.&nbsp; ‘NTR 31’ లోడింగ్‌! ‘దేవర’ (Devara: Part 1) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత జూ.ఎన్టీఆర్‌ (Jr NTR), ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే సీక్వెల్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్‌ నీల్‌ ఎవరూ ఊహించని విధంగా ‘NTR 31’ సింగిల్‌ పార్ట్‌గా తీసుకురావాలని నిర్ణయించారట. అంతేకాదు ఇందులో బంగ్లాదేశ్‌ రైతుగా తారక్‌ కనిపిస్తారని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. కథ మెుత్తం బంగ్లాదేశ్‌ నేపథ్యంలోనే ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు హీరోయిన్‌ను కూడా ఈ మూవీ కోసం లాక్‌ చేశారని తెలుస్తోంది. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్‌ ఇందులో తారక్‌కు జోడీగా నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె నిఖిల్‌తో ‘అప్పుడో ఇప్పుడో’ అనే సినిమా చేస్తోంది.&nbsp;
    అక్టోబర్ 15 , 2024
    <strong>Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్‌.. ప్రభాస్‌ సైతం వెనక్కి తగ్గాల్సిందే!&nbsp;</strong>
    Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్‌.. ప్రభాస్‌ సైతం వెనక్కి తగ్గాల్సిందే!&nbsp;
    జూ.ఎన్టీఆర్‌ హీరోగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ చేసింది. విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్ నటించారు. అయితే ‘దేవర’ మూవీ తారక్‌కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెరపైకి తీసుకొచ్చింది. ప్రభాస్‌ వంటి గ్లోబల్‌ స్టార్‌కు సాధ్యం కానీ విజయాన్ని తారక్‌కు అందించింది. అటు ఫ్లాప్‌ దర్శకులకు తారక్‌ ఓ వరమని మరోమారు నిరూపించింది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఫ్లాప్‌ డైరెక్టర్లతో హిట్స్‌! టాలీవుడ్‌లోని ఫ్లాప్ డైరెక్టర్స్‌ పాలిట జూ.ఎన్టీఆర్‌ ఓ దేవుడిలా మారాడని చెప్పవచ్చు. భారీ డిజాస్టర్‌తో ఫేమ్‌ కోల్పోయిన డైరెక్టర్లు తారక్‌తో ఓ సినిమా చేస్తే మునుపటి క్రేజ్‌ను తిరిగి పొందడం ఖాయంగా కనిపిస్తోంది. రీసెంట్‌గా దేవర విషయంలోనూ ఇదే నిరూపితమైంది. దర్శకుడు కొరటాల శివ గతంలో తీసిన ‘ఆచార్య’ చిత్రం డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. అసలు కొరటాల శివ చిత్రమేనా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటువంటి డైరెక్టర్‌కు ఛాన్స్‌ ఇచ్చి దేవరతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు తారక్. అంతకుముందు ఫ్లాప్‌లతో ఉన్న పూరి జగన్నాథ్‌కు 'టెంపర్‌'తో సక్సెస్‌ ఇచ్చాడు. ‘1: నేనొక్కడినే’ పరాజయంతో ఢీలా పడిపోయిన సుకుమార్‌తో ‘నాన్నకు ప్రేమతో’ మూవీ తీసి గాడిలో పెట్టాడు. రవితేజతో ఫ్లాప్ అందుకున్న బాబీకి ‘జై లవకుశ’తో మంచి హిట్ ఇచ్చాడు. ‘అజ్ఞాతవాసి’తో భారీ డిజాస్టర్‌ అందుకున్న త్రివిక్రమ్‌కు ‘అరవింద సామెత’తో&nbsp; సక్సెస్‌ అందించాడు. ఇలా ఫ్లాప్ డైరెక్టర్లకు వరుసగా హిట్స్‌ ఇచ్చి సరికొత్త రికార్డును తారక్‌ క్రియేట్ చేస్తున్నాడు. ఒకే ఒక్క హీరోగా తారక్‌ హీరోల కెరీర్‌లో హిట్స్‌, ఫ్లాప్స్‌ అనేవి సర్వ సాధారణం. ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా తీసిన ప్రతీ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం లేదు. గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సైతం బాహుబలి తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’ చిత్రాలతో ఫ్లాప్‌ అందుకున్న వాడే. అయితే తారక్‌ మాత్రం గత తొమ్మిదేళ్లుగా ఒక్క ఫ్లాప్‌ లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన గత 7 చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బాస్టర్స్‌గా నిలిచాయి. ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’, ‘RRR’, ‘దేవర’ వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఈ జనరేషన్‌ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా తారక్‌ నిలవడం విశేషం. ఫ్యూచర్‌లో ‘దేవర 2’, ప్రశాంత్‌ నీల్‌తో ‘NTR 31’, సందీప్‌ రెడ్డి వంగాతో ఓ చిత్రం (గాసిప్‌) వంటి బిగ్‌ ప్రాజెక్ట్స్‌ ఉండటంతో తారక్ జైత్రయాత్ర ఇకపైనా కొనసాగే అవకాశముంది.&nbsp; 23 ఏళ్ల ఫ్లాప్‌ రికార్డు బద్దలు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో సినిమా చేస్తే బ్లాక్‌ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా వెంటనే హిట్‌ కొట్టిన దాఖలాలు లేవు. అయితే 'దేవర'తో తారక్‌ ఈ ఫ్లాప్‌ సెంటిమంట్‌ను బీట్‌ చేశాడు. రాజమౌళితో 'RRR' చేసిన తారక్‌ వెంటనే ‘దేవర’తో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘స్టూడెంట్‌ నెం.1’తో ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌కు శ్రీకారం చుట్టిన తారక్‌ స్వయంగా తానే దీనిని&nbsp; బ్రేక్‌ చేయడం విశేషం. అది కూడా 23 క్రితం స్టూడెంట్ నెం.1 రిలీజైన రోజున దేవరను తీసుకొచ్చి రాజమౌళి సెంటిమెంట్‌ను బద్దలు కొట్టాడు. రైతు పాత్రలో తారక్‌! తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్‌ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని ఫిల్మ్‌ వర్గాల సమాచారం.&nbsp; హీరోయిన్‌గా రష్మిక? దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్‌-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్‌ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.&nbsp;&nbsp;
    అక్టోబర్ 04 , 2024
    Adipurush: పెళ్లిపై క్లారిటీ.. ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్&nbsp;
    Adipurush: పెళ్లిపై క్లారిటీ.. ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్&nbsp;
    ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. అడుగడుగునా ఆధ్యాత్మికత ఫరిడవిల్లేలా సభా ప్రాంగణాన్ని నిర్వహకులు తీర్చిదిద్దారు. దాదాపు లక్షకు పైగా పాసులు మంజూరు చేయగా అంతకుమించి అభిమానులు వేడుకకు వచ్చారు. ఎటు చూసినా రాముడి స్వరూపమే. జై శ్రీరామ్ నినాదమే. అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలో ముఖ్య అతిథులతో పాటు ప్రభాస్, కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ సహా సినిమాకు పనిచేసిన నటీనటులు ఇతర టెక్నిషియన్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రభాస్, కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లిపై ప్రకటన.. ప్రభాస్ ప్రస్తుత వయసు 43. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచ్‌లర్ ప్రభాసే. దీంతో ఎక్కడ కనిపించినా డార్లింగ్‌కు ఈ ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. కానీ, ఏనాడూ పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ‘త్వరలో.. త్వరలో’ అంటూ సమాధానాన్ని దాటవేసేవాడు. ‘ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్’ పుణ్యమా అని ప్రభాస్ పెళ్లిపై కొద్దోగొప్పో క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నా.. అది తిరుపతిలోనే జరుగుతుందని తేల్చేశాడు. అభిమానుల నుంచి వచ్చిన ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్ ఈ రిప్లై ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.&nbsp; https://twitter.com/DailyCultureYT/status/1666291610722930689?s=20 ఇక సినిమాల జాతరే.. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్‌లో వేగం మందగించింది. గత ఐదేళ్లలో ప్రభాస్ చేసింది 2 సినిమాలు మాత్రమే. 2017లో బాహుబలి2 సినిమా విడుదలయ్యాక 2019లో సాహో రిలీజ్ చేశాడు. మళ్ళీ 2022లో రాధేశ్యామ్‌ సినిమాతో వచ్చాడు. ఇవి రెండూ పెద్దగా రాణించకపోవడంతో ఆదిపురుష్‌పైనే అంచనాలు పెట్టుకున్నారు. అయితే, సినిమాల విషయంలోనూ ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇక నుంచి ఏడాదికి 2, 3 సినిమాలు చేస్తానని ఫ్యాన్స్‌కి మాటిచ్చాడు. ఎక్కువ సినిమాలు చేస్తూ తక్కువ మాట్లాడతానని చెప్పాడు.&nbsp; https://twitter.com/TheAakashavaani/status/1666136550361673728?s=20 ఆదిపురుష్ సినిమా.. ఆదిపురుష్ మూవీ తొలి ట్రైలర్ గతేడాది రిలీజ్ అయినప్పుడు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఓం రౌత్ పనితీరుపై ప్రభాస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ, అవేవీ నిజం కాదని ప్రభాస్ పరోక్షంగా కొట్టి పారేశాడు. ఆదిపురుష్ సినిమా వెనకాల ఉన్న కష్టాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. సినిమా కోసం రోజుకు 20 గంటలు పనిచేశారని గుర్తు చేశారు. దర్శకుడు ఓం రౌత్ పెద్ద యుద్ధమే చేసినట్లు వివరించాడు. తన జీవితంలోనే ఓం రౌత్ లాంటి వ్యక్తులను చూడలేదని ప్రశంసించాడు.&nbsp; చిరంజీవి కామెంట్స్‌.. ఆదిపురుష్ సినిమా చేయడం నిజంగా తన అదృష్టమని ప్రభాస్ చెప్పాడు. గతంలో చిరంజీవితో జరిగిన సంభాషణను ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పంచుకున్నాడు. ‘రామాయణం సినిమా చేస్తున్నావా? అని చిరంజీవి సర్ అడిగారు. అవునని చెప్పా. ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు. నీకు దొరికింది అని చెప్పారు’ అంటూ ప్రభాస్ గుర్తు చేసుకున్నాడు.&nbsp; https://www.youtube.com/watch?v=A8NS3vSJ1Gc కృతి సనన్.. ప్రభాస్‌కు జంటగా కృతిసనన్ ఈ సినిమాలో నటించింది. సీత పాత్ర పోషించింది. అయితే, వీరిద్దరి మధ్య ఏదో ఉందని బాలీవుడ్ వర్గాలు అప్పట్లో కోడై కూశాయి. కానీ, అలాంటిదేమీ లేదని కృతిసనన్ గతంలో ఖండించింది. అన్‌స్టాపబుల్ షోలోనూ ప్రభాస్‌ను బాలయ్య ఈ ప్రశ్న అడిగాడు. దీంతో ‘మేడం అంతా క్లారిటీ ఇచ్చేసిందిగా సర్’ అంటూ డార్లింగ్ జవాబు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఈ సినిమాలో నటించిన కృతిసనన్ ప్రభాస్ అభినందించాడు. ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో అభిమానులను ఫిదా చేసిందని కొనియాడాడు.&nbsp; ప్రభాస్‌పై కృతి సనన్.. ప్రభాస్‌పై కృతిసనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆన్‌స్క్రీన్‌, ఆఫ్‌స్క్రీన్ ప్రభాస్ గురించి చెప్పింది.&nbsp; ‘ఆన్‌స్క్రీన్‌లో యాక్టీవ్‌గా, ఆఫ్ స్క్రీన్‌లో ప్రభాస్ కామ్‌గా ఉంటారని అనుకుంటారు. కానీ ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు. ప్రభాస్‌లోని కామ్‌నెస్ ఎవరిలోను చూడలేదు. రాముడిగా ప్రభాస్‌ను తప్ప ఎవరిని ఉహించుకోలేం. ఈ సినిమాలో జానకి పాత్ర ఎంతో ప్రత్యేకం’ అని కృతి చెప్పుకొచ్చింది. https://www.youtube.com/watch?v=fmbZE7J9IMA ప్రభాస్ లేకుండా ఈ సినిమా చేసి ఉండే వాడిని కాదని డైరెక్టర్ ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఏ ఒక్కరికో సొంతం కాదని, భారత దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి చెందిన సినిమా అంటూ వెల్లడించాడు. ఇది ఇండియన్ ఫిల్మ్ అని ప్రకటించాడు. సినిమా నిర్మాణానికి సహకరించిన నిర్మాత భూషణ్‌కుమార్‌కు ఓం రౌత్ ధన్యవాదాలు చెప్పాడు.&nbsp;&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=JopeURxPZmE హైలెట్స్.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డిజైన్ చేశాడు. అయోధ్య సెట్‌ని అందంగా తీర్చిదిద్దాడు. స్టేజిపై వచ్చాక ప్రభాస్ విల్లును ఎక్కుపెట్టడం ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.&nbsp; ముఖ్య అతిథులు.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా చినజీయర్ స్వామి హాజరయ్యారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా వేడుకలో పాల్గొన్నారు. జూన్ 16న సినిమా విడుదల కానుంది. https://www.youtube.com/watch?v=qkD5juVLDgM
    జూన్ 07 , 2023
    <strong>Tollywood Women Producers: టాలీవుడ్‌లో స్టార్ల కుమార్తెల కొత్త ట్రెండ్‌.. ఇండస్ట్రీపై తమదైన ముద్ర!</strong>
    Tollywood Women Producers: టాలీవుడ్‌లో స్టార్ల కుమార్తెల కొత్త ట్రెండ్‌.. ఇండస్ట్రీపై తమదైన ముద్ర!
    సాధారణంగా సినిమా అంటే ముందుగా హీరో, హీరోయిన్‌, దర్శకుడే గుర్తుకు వస్తారు. తర్వాత మ్యూజిక్‌ డైరెక్టర్‌, ఇతర తారాగణం, టెక్నికల్‌ టీమ్‌పై అందరి దృష్టి పోతుంది. చివర్లో ఆ సినిమా నిర్మాత ఎవరు అని సినీ లవర్స్‌ తెలుసుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఒక సినిమా నిర్మాణంలో ఎక్కువగా కష్టపడేది నిర్మాతే. సినిమా బాగా రావడం కోసం ఖర్చులో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు హీరోను డైరెక్టర్‌ను ముందుకు తీసుకెళ్లేదే నిర్మాతలే. హీరోలు, డైరెక్టర్లకు ఈ సినిమా పోతే ఇంకోటి అనే ఆప్షన్‌ ఉంటుంది. కానీ నిర్మాతల పరిస్థితి అలా కాదు. ఎక్కడెక్కడి నుంచే డబ్బు కూడగట్టి తీసిన ఫిల్మ్‌ ఫ్లాప్‌ అయితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. అంతటి రిస్క్‌ కలిగిన నిర్మాణ రంగంలోకి స్టార్ల కుమార్తెలు వచ్చేస్తున్నారు. కుమారులు హీరోగా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో తాము ఏమాత్రం తక్కువ కాదని నిర్మాణ రంగంవైపు అడుగులు వేస్తున్నారు. యంగ్‌ ప్రొడ్యుసర్స్‌గా సత్తా చాటేందుకు సై అంటున్నారు. వారెవరో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; తేజస్విని నందమూరి టాలీవుడ్‌లో నటుడిగా బాలకృష్ణ (Bala Krishna) చెరగని ముద్రవేశారు. యంగ్‌ హీరోలతో సమానంగా వరుస చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన నట వారసత్వాన్ని మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) తీసుకొని టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాతోనే బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని (Tejaswini Nandamuri) నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరించనున్నారు. లెజెండ్‌ ప్రొడక్షన్స్‌పై ఆమె దీనిని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. నిహారిక కొణిదెల మెగా కుటుంబం నుంచి ఎందరో హీరోలు వచ్చి అలరిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని భారతీయ సినిమా ఖ్యాతిని పెంచుతున్నారు. ఇప్పుడు నిర్మాణ రంగంలోనూ సత్తా చాటేందుకు మెగా ఫ్యామిలీ వారసురాళ్లు రెడీ అయ్యారు. నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల (Niharika Konidela) ఇటీవల నిర్మాతగా మారింది. పింక్‌ ఎలిఫెంట్ పిక్చర్స్‌ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించింది. దాని ద్వారా తొలిసారి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే చిత్రాన్ని నిర్మించింది. వైవిధ్యభరితమైన కథతో, కొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మించి ప్రశంసలు దక్కించుకుంది. రూ.6 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కమిటీ కుర్రోళ్లు చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.18 కోట్లకుపైగా వసూలు చేసింది.&nbsp; సుస్మితా కొణిదెల మెగా కుటుంబం నుంచి మరో నిర్మాత కూడా ఇండస్ట్రీలో ‌అడుగుపెట్టబోతోంది. చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల (Sushmita Konidela) ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్’ అంటూ కొత్త నిర్మాణ సంస్థను స్థాపించారు. దీనిపై తొలి చిత్రమే తన తండ్రితో తీయనున్నట్లు ఆమె ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా సుస్మిత కొణిదెలకు మంచి పేరుంది. చిరంజీవి హీరోగా నటించిన పలు చిత్రాలకు ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు నిర్మాణ రంగంలోనూ ఆమె ప్రతిభ చూపడం ఖాయమని మెగా ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.&nbsp; అశ్వనీదత్‌ వారసురాళ్లు టాలీవుడ్‌లో ‘వైజయంతీ మూవీస్‌’కు ప్రత్యేక స్థానం ఉంది. 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థ ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించింది. అశ్వనీదత్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం ఆయన కుమార్తెలు స్వప్న దత్‌ (Swapna Dutt), ప్రియాంక దత్‌ (Priyanka Dutt)లు సిద్ధమయ్యారు. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో ప్రపంచస్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. త్వరలోనే మరిన్ని సినిమాలు తీయనున్నట్లు తెలిపారు. అంతకముందు ‘స్వప్న సినిమా’, ‘త్రీ ఏంజెల్స్‌ స్టూడియో’, ‘ఎర్లీ మన్‌సూన్‌ టేల్స్‌’ వంటి సబ్‌ బ్యానర్లను ఏర్పాటు చేసి ‘మహానటి’, ‘సీతారామం’, ‘బాణం, ‘సారొచ్చారు’ వంటి హిట్‌ చిత్రాలను అశ్వని దత్ కుమార్తెలు నిర్మించారు.&nbsp; ప్రసీద ఉప్పలపాటి&nbsp; దిగ్గజ నటుడు కృష్ణం రాజు కుమార్తె, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సోదరి ప్రసీద ఉప్పలపాటి (Praseedha Uppalapati) సైతం నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ‘గోపికృష్ణ మూవీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి దానితో ప్రభాస్ హీరోగా ‘రాధేశ్యామ్‌’ (Radheshyam)ను నిర్మించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. మంజులా ఘట్టమనేని సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి కూడా ఓ మహిళ నిర్మాత టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కృష్ణ కుమార్తె, మహేష్‌ బాబు (Mahesh Babu) సోదరి అయిన మంజుల ఘట్టమనేని (Manjula Ghattamaneni) నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. ఇందిరా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై&nbsp; ‘షో’, ‘నాని’, ‘పోకిరి’, ‘ఏమాయ చేసావె’ వంటి చిత్రాలకు ప్రొడ్యూసర్‌గా వర్క్‌ చేశారు. ఆ తర్వాత నటిగాను మారి పలు చిత్రాల్లో పాత్రలు పోషించారు.&nbsp;
    సెప్టెంబర్ 11 , 2024
    &nbsp;SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
    &nbsp;SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
    సూపర్ స్టార్ మహేష్‌తో చేయబోయే SSMB29 చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో నిర్మించేందుకు డైరెక్టర్‌ రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. కౌబాయ్‌ తరహాలో తెరకెక్కనున్న ఈ అడ్వెంజర్‌ మూవీ కోసం హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌ను కూడా తీసుకోబోతున్నట్లు తెలిసింంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల మహేష్‌బాబు నటించిన గుంటూరు కారం సినిమా మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ... కలెక్షన్ల పరంగా సేఫ్ జోన్‌లో పడింది. మహేష్‌బాబు స్టామినాకు తగ్గ హిట్ పడలేదన్నది నిజం. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమాపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.&nbsp;&nbsp; గ్లోబల్ స్థాయి అయితే రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీస్ అయిన బాహుబలి, RRR ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెన్సేషన్ క్రియేట్ చేశాయి. జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్ గ్లోబర్ స్టార్లుగా ఎదిగిపోయారు. ప్రస్తుతం వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాజమౌళితో ఏ హీరో సినిమా తీసినా హిట్‌ అవడం ఖాయం. కానీ ఆ తర్వాత చేసే సినిమాలు ఇండస్ట్రీలో ఫ్లాప్‌గా నిలుస్తున్నాయి. మహేష్‌కు లాభమా నష్టమా? ఇప్పటివరకు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఇదే నియమం లెక్కతప్పకుండా కొనసాగుతుంది. ఆయనతో సినిమాలు చేసిన హీరోలు వరుసగా మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్స్‌గా మూటగట్టుకున్నారు. దీంతో SSMB 29 అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎటువంటి సినిమా చేస్తారు?&nbsp; ఏ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తారు? సగటు సూపర్ స్టార్ అభిమానిని తొలచివేస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే రాజమౌళి సినిమాతో మహేష్ బాబుకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ లభిస్తుంది. మరి దానిని నిలబెట్టుకునేలా మహేష్ బాబు తన తదుపరి SSMB30 సినిమాను ఎలా ఎంచుకుంటాడు? అతని కెరీర్‌కు బిగ్‌ ఛాలెంజ్ అంటూ ఇండస్ట్రీ పెద్దలు విశ్లేషిస్తున్నారు. SSMB29 క్రియేట్ చేస్తున్న బజ్.. మహేష్ బాబుకు లాభంతో పాటు నష్టాన్ని కూడా తెచ్చిపెట్టనుందని ఊహిస్తున్నారు. గతంలో ఇదే విధంగా రాజమౌళితో ఇండస్ట్రీ హిట్లు అందుకున్న తెలుగు హీరోలు ఆ తర్వాత ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక వరుసగా పరాజయాలు పొందారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్స్ అందుకున్న హీరోల జాబితాను ఓసారి పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా 'స్టూడెంట్‌ నెం.1'ను జూ. ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన 'సుబ్బు' సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ తారక్‌తో "సింహాద్రి" సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన 'ఆంధ్రావాల' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు RRRలో తారక్ నటించి గ్లోబర్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.&nbsp; ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ RRRకు ముందు రామ్‌చరణ్‌తో 'మగధీర' సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా తీస్తున్న రామ్‌చరణ్ ఎలాంటి ఫలితాన్ని పొందుతాడో వేచి చూడాల్సి ఉంది. ఇక రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన 'ఈగ' సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.&nbsp; మహేష్ బాబు కూడా అదే పరిస్థితా? దీంతో మహేష్ బాబు కూడా SSMB29 తర్వాత ఇతర టాలీవుడ్ అగ్రహీరోల మాదిరి బోల్తా పడుతాడా లేక గత చరిత్రను తిరిగి రాస్తాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా అంది. అటు ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) కూడా నటిస్తారని తెలుస్తోంది. మలయాళం నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కూడా ఓ కీలకపాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఆ నటులతో రాజమౌళి బృందం చర్చలు జరుపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చర్చలు గాని ఫలిస్తే SSMB29 పై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అయితే దీనిపై రాజమౌళి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.&nbsp; వరల్డ్ వైడ్ బజ్ మరోవైపు మహేష్‌ బాబు.. రాజమౌళి సినిమా కోసం తన లుక్స్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన అన్న కొడుకు మ్యారెజ్ కార్డు ఇవ్వడానకి వెళ్లినప్పుడు.. మహేష్ బాబు పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్కువ జుట్టు, ఒత్తైన గడ్డంతో హాలీవుడ్ హీరోలా మహేష్ కనిపించాడు. అలాగే కొన్ని స్టంట్స్‌ నేర్చుకునేందుకు జర్మనీలో ఇటీవల మహేష్ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. అటు దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిఫ్ట్ కూడా ఫైనల్ చేసి రాజమౌళికి వినిపించినట్లు సమాచారం. ఏప్రిల్‌ నుంచి నటీనటుల ఎంపిక, సాంకేతిక బృందం వంటి అంశాలను చిత్ర యూనిట్ పరిశీలించనున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా వరల్డ్‌ వైడ్‌గా క్రియేట్ చేస్తున్న బజ్ అంతా ఇంతా కాదు.
    ఫిబ్రవరి 14 , 2024
    Guntur Kaaram: నిరాశలో మహేశ్ ఫ్యాన్స్.. బర్త్ డే పోస్టర్‌తో సరిపెట్టిన మూవీ టీమ్‌.. ఎప్పుడూ ఇదే వరస!
    Guntur Kaaram: నిరాశలో మహేశ్ ఫ్యాన్స్.. బర్త్ డే పోస్టర్‌తో సరిపెట్టిన మూవీ టీమ్‌.. ఎప్పుడూ ఇదే వరస!
    మహేశ్ బాబు, త్రివిక్రమ్‌ల కాంబోలో సినిమా వస్తుందంటే చాలు ఎన్నో అంచనాలు ఏర్పడతాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రెండు సినిమాల్లోనూ మహేశ్ బాబును విభిన్నంగా చూపించి మెప్పించాడు త్రివిక్రమ్. తన మార్క్ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక, వీరిద్దరి కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాపై కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మహేశ్ బాబు బర్త్ డే(Mahesh babu Birthday) సందర్భంగా మాస్ పోస్టర్‌ని రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చింది. అయితే, తెర వెనకాల ఇందుకు పరిస్థితి విరుద్ధం. వీరి కాంబోలో మూవీ వస్తుందంటే అభిమానులకు నిరీక్షణ తప్పడం లేదు. ఏళ్లకు ఏళ్లు వేచి ఉండాల్సి వస్తోంది. తాజాగా బర్త్ డే ట్రీట్ విషయంలోనూ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. రెండేళ్లు.. అతడు(Athadu Movie) మూవీ 2005లో విడుదలైంది. నాని, అర్జున్ సినిమాల వరుస పరాభవం తర్వాత ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఈ మూవీ రిలీజ్ కావడానికి దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంది. రెండేళ్ల పాటు చిత్రీకరణ దశలోనే ఉంది. సినిమా విడుదలయ్యాక ఈ ఆలస్యాన్ని మరిచిపోయి ఫ్యాన్స్ సక్సెస్‌ని తెగ ఎంజాయ్ చేశారు. ఒక ఏడాదిలో 1350 సార్లు టీవీల్లో ప్రసారం అయిన తొలి సినిమాగా(Athadu Movie Record) ఇది రికార్డ్ నెలకొల్పింది.&nbsp; https://twitter.com/GunturKaaram/status/1672478971827720192 మూడేళ్లు.. అతడు స్టోరీ ఒప్పుకున్నాక మహేశ్ బాబు మధ్యలో రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. అయితే, ఖలేజా మూవీ విషయంలో సూపర్ స్టార్ పూర్తి సమయాన్ని కేటాయించాడు. అతిథి (2007) సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. ఖలేజా చిత్రీకరణకే తన టైంని డెడికేట్ చేశాడు. అలా, వివిధ కారణాలతో వాయిదాల మీద వాయిదాలతో సినిమా షూటింగ్ మూడేళ్లకు పూర్తయింది. 2010లో ఖలేజా మూవీ విడుదలైంది. కానీ, మధ్యలో ఫ్యాన్స్ తెగ నిరీక్షించారు.&nbsp; https://twitter.com/GunturKaaram/status/1664273686810198024 గుంటూరు కారం 2021 మే నెలలో మహేశ్, త్రివిక్రమ్‌ల మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. తొలుత 2022 సమ్మర్‌కి ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత 2023 సంక్రాంతికి వాయిదా వేద్దామని చూశారు. అయినప్పటికీ పూర్తి కాలేదు. స్క్రిప్ట్‌లో మాటల మాంత్రికుడు తెగ మార్పులు చేశాడట. ఈ క్రమంలోనే ఓల్డ్ రీల్స్‌ని తీసేసి మళ్లీ ఫ్రెష్‌గా సీన్లు తెరకెక్కించాడట. ఇక, ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతికి ముహూర్తం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే షూటింగ్ కూడా శర వేగంగా జరుపుకుంటోందని భావిస్తుండగానే మరో షాక్ ఎదురైంది.&nbsp; కారణాలు.. సినిమా నుంచి లీడ్ హీరోయిన్ పూజా హెగ్డేని త్రివిక్రమ్ పక్కన పెట్టాడు. కారణాలు వెల్లడి కానప్పటికీ బుట్ట బొమ్మ స్థానంలో మరో హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. సైడ్ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీల మెయిన్ రోల్‌లోకి వచ్చేసింది. దీంతో సీన్స్‌ని మళ్లీ తెరకెక్కించాల్సి వచ్చింది. శ్రీలీల క్యారెక్టర్‌ని మీనాక్షి చౌదరికి అప్పగించడంతో పని రెట్టింపయ్యింది. ఇదిలా ఉండగానే, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పీఎస్ వినోద్‌ని చిత్రబృందం తీసేసినట్లు ప్రచారం జరిగింది. ఇతడి స్థానంలో రాధేశ్యామ్, బీస్ట్ మూవీలకు పనిచేసిన మనోజ్ పరమహంసను తీసుకున్నట్లు టాక్ వచ్చింది. అయితే, లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పీఎస్ వినోద్ పేరునే ఉంచడం గమనార్హం. ఇలా గందరగోళం నెలకొనడంతో చిత్రం వాయిదా పడుతూ వస్తోంది.&nbsp; https://twitter.com/SSMB_CULTS_/status/1680635379073032192 త్రివిక్రమ్ డైవర్ట్? ‘గుంటూరు కారం’ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు సినిమాలకు డైలాగ్స్ అందించాడు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు త్రివిక్రమ్ పనిచేశాడు. దీంతో మహేశ్ సినిమాపై త్రివిక్రమ్ సరిగా ఫోకస్ పెట్టట్లేదని ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు. సినిమా షూటింగ్ వాయిదాకు దీనిని కూడా ఒక కారణంగా చూపిస్తున్నారు. మరి, ఇప్పటికైనా సినిమా కచ్చితంగా సంక్రాంతికి వస్తుందా? అంటే సందేహమే.&nbsp; https://twitter.com/GunturKaaram/status/1664248261442678784 నిరాశలో ఫ్యాన్స్ సూపర్ స్టార్ క్రిష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ‘గుంటూరు కారం’గా వెల్లడించింది. ఈ మేరకు ఓ గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేశారు. అయితే, మహేశ్ బర్త్ డే సందర్భంగా కేవలం పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ని తెగ నిరుత్సాహ పరిచింది. తమ హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ అవుతుందని అంతా భావించారు. ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కి చిత్రబృందం కసరత్తులు చేయడంతో విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ, అది తుది రూపం దాల్చలేదు. ఏ క్షణమైనా పాటను రిలీజ్ చేయాల్సి వస్తే.. ముందు జాగ్రత్తగా ప్రోమోని కూడా కట్ చేసి పెట్టుకున్నారట. చివరికి ఆ ఆశ నిరాశే అయింది. శ్రీలీల, మహేశ్ బాబు బర్త్ డేలు రెండూ ఒక్కటేనా? అంటూ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU
    ఆగస్టు 09 , 2023
    <strong>Tollywood Top 10: ‘సైరా నరసింహ రెడ్డి’ని బీట్‌ చేయలేకపోయిన ‘దేవర’.. తెలుగులో టాప్‌-10 ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ చిత్రాలు ఇవే!</strong>
    Tollywood Top 10: ‘సైరా నరసింహ రెడ్డి’ని బీట్‌ చేయలేకపోయిన ‘దేవర’.. తెలుగులో టాప్‌-10 ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ చిత్రాలు ఇవే!
    తారక్‌ లేటెస్ట్ చిత్రం 'దేవర' రిలీజ్‌కు ఇంకో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్లే మూవీ టీమ్‌ కూడా వరుసగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై భారీగానే హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే దేవరకు సంబంధించిన రికార్డు స్థాయిలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఎన్నడూ లేనివిధంగా థియేట్రికల్‌ బిజినెస్‌ నమోదైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ దేవర ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఎంత? బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఎన్ని కోట్లు? తెలుగులో ఇప్పటివరకూ అత్యధిక ప్రిరీలిజ్‌ బిజినెస్‌ చేసిన టాప్‌-10 చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; దేవర ప్రీ-రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే? ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రానికి ఓ రేంజ్‌లో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు ఏకంగా రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.115 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు విక్రయించారని అంటున్నారు. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.45 కోట్లకు ‘దేవర’ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. అటు సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటకలో రూ. రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్​లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్​లో రూ.15 కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్‌ వసూలు చేస్తే బ్రేక్‌ ఈవెన్ అవుతుంది.&nbsp; ముఖ్య అతిథులుగా స్టార్‌ డైరెక్టర్స్‌! దేవర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ వేదికగా ఈ నెల 22న ఈవెంట్ జరగనుంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ వేడుకకు ముగ్గురు స్టార్‌ డైరెక్టర్లు హాజరుకానున్నట్లు సమాచారం. దర్శకధీరుడు రాజమౌళి, ప్రశాంత్‌ నీల్‌, త్రివిక్రమ్‌ ఈవెంట్‌లో పాల్గొంటారని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అదే విధంగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూడా ఈవెంట్‌కు హాజరయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే దేవర టీమ్‌ ప్రమోషన్స్‌ పరంగా నార్త్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్స్‌తోపాటు మహేష్‌ను గెస్ట్‌గా పిలవడం ద్వారా ఆ విమర్శల నుంచి బయటపడాలని దేవర టీమ్‌ భావిస్తున్నట్లు సమాచారం.&nbsp; ప్రీరిలీజ్ బిజినెస్‌లో టాప్ మూవీస్ ఇవే ఒకప్పుడు ప్రీరిలీజ్‌ బిజినెస్ అంటే బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాలకు మాత్రమే సాధ్యమన్న ఆలోచనలో తెలుగు ఆడియన్స్‌ ఉండేవారు. దర్శకధీరుడు రాజమౌళి దీనిని పూర్తిగా మార్చివేశారు. ప్రీరిలీజ్‌ బిజినెస్‌ రికార్డులకు కేరాఫ్‌గా టాలీవుడ్‌ను మార్చారు. అలవోకగా 350 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్‌ చేస్తూ తెలుగు చిత్రాలు సత్తా చాటాడు. తెలుగులో అత్యధిక ప్రిరీలిజ్‌ బిజినెస్‌ చేసిన టాప్‌ -10 చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ అత్యధిక ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసిన తెలుగు చిత్రంగా టాప్‌లో నిలిచింది. డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ కలిపి ఆర్‌ఆర్‌ఆర్‌కు దాదాపు రూ.480 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ.191 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. ఇప్పటి&nbsp; కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ. 385 కోట్ల వ్యాపారం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.180 కోట్లు, ఓవర్సీస్‌లో 70 కోట్లు, హిందీలో రూ.85 కోట్ల వ్యాపారం జరిగినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.&nbsp; బాహుబలి 2 (Bahubali 2) దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా కీలకపాత్రలు పోషించిన చిత్రం బాహుబలి 2. బాహుబలికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ.350 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాను రూ.190 కోట్లకు పైగా విక్రయించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. సలార్‌ (Salaar) కేజీఎఫ్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ప్రభాస్‌ హీరోగా ‘సలార్‌’ అనే చిత్రాన్ని తీశాడు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.120 కోట్ల బిజినెస్ చేసిందని అంచనా. సాహో (Sahoo) బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సాహోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దుమ్మరేపింది. సాహోకు ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ.280 కోట్ల వ్యాపారం జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నార్త్ ఇండియాలో ఏకంగా రూ.120 కోట్ల వ్యాపారం చేసి అప్పట్లో సాహో రికార్డ్ క్రియేట్ చేసింది&nbsp; ఆదిపురుష్‌ (Adipurush) ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మూవీ ‘ఆదిపురుష్’. రామాయణాన్ని బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి సనన్ సీతమ్మ తల్లిగా నటించారు. మైథలాజికల్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా అందుకు తగినట్లుగానే బిజినెస్ జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కింద ఈ సినిమా రూ.240 కోట్లకు పైగా వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి రాధేశ్యామ్ (RadheShyam) ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ హీరో ప్రభాస్‌ను కంప్లీట్ డిఫరెంట్‌ లుక్‌లో చూపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా తెలుగు రాష్ట్రాల్లోనే రూ.107 కోట్ల వ్యాపారం చేసి ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది. సైరా నర్సింహారెడ్డి (Saira Narasimha Reddy) చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఏకంగా 187.25 కోట్లకు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. మెగాస్టార్‌ కెరీర్‌ అత్యధిక ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చిత్రంగా అవతరించింది. ఇక ఈ సినిమా తెలుగులో మాత్రమే బ్రేక్ ఈవెన్ దాటడం గమనార్హం. దేవర (Devara) కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన దేవర పార్ట్ 1 రిలీజ్‌కు ముందు రూ.185 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసి ఈ జాబితాలో టాప్‌-9లో చోటు సంపాదించింది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే (సోలో హీరోగా) హయ్యెస్ట్ అని చెప్పవచ్చు.&nbsp; పుష్ప (Pushpa) క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించిన ‘పుష్ప: ది రైజ్‌’ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఐదు భాషల్లోని థియేట్రికల్ రైట్స్, శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ రైట్స్ ఇలా అన్ని కలిపి దాదాపు రూ.160 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా.
    సెప్టెంబర్ 21 , 2024
    Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
    Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
    తెలుగు చిత్ర సీమలో అందాలకు కొదువ లేదు. హాట్ గ్లామర్‌ను పండిచడంలో మన హీరోయిన్లు ఏ చిత్ర పరిశ్రమకు తక్కువకాదు. హాట్ సీన్లైనా, బెడ్‌రూం సీన్లలోనైనా నటించేందుకు వెనకాడటం లేదు. ఇక సినిమాల్లో గ్లామర్‌ షోను కాసేపు పక్కన పెడితే... సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో అదరహో అనిపిస్తున్నారు. బికినీ సూట్‌లలో దర్శనమిస్తూ హీటెక్కిస్తున్నారు. కుర్ర హీరోయిన్లే కాదు.. వారితో పోటీపడుతూ మరి సీనియర్ భామలు కూడా పరువాల ప్రదర్శనకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరి ఆ అందాలపై మీరు ఓ లుక్కేయండి. [toc] Samantha Ruth Prabhu సమంత సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్‌ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది. తొలి తరంలో కాస్త గ్లామర్ షోకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం..ఐటెం సాంగ్స్, లిప్ లాక్, బెడ్‌ రూం సీన్లలోనూ నటించేందుకు సిద్ధమైంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఫ్యాన్స్‌ను కవ్విస్తుంటుంది. హాట్ ఫొటో షూట్‌తో అలరిస్తుంది. ఆమె బికినీ ఫొటోలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మరి సమంత బికినీ ఫోటోస్‌పై మీరు ఓ లుక్కేయండి. Samantha bikini images Kajal Aggarwal కాజల్ అగర్వాల్ &nbsp; తెలుగు, హిందీ, తమిళ్ భాషాల్లో ప్రధానంగా నటించింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారం అందుకుంది. ఇక కాజల్ అగర్వాల్ అందాలకు ఫ్యాన్‌ బేస్ ఓ రేంజ్‌లో ఉంటుంది. చీర కట్టులో ఉన్నా, మోడ్రన్ డ్రెస్‌లో ఉన్నా తరగని అందం ఆమె సొంతం. బహిరంగంగా బికినీలో తన అందాలు చూపించేందుకు కాజల్‌కు ఇష్టముండదట. బికినీ ధరించాల్సి వచ్చిన సమయంలో సినిమాలనే వదులుకుంది ఈ భామ. అయితే కాజల్ తన బర్త్‌డే సందర్భంగా బికినీలో స్విమ్ చేసిన వీడియో మాత్రం ఉంది.&nbsp; Kajal Agarwal bikini video https://twitter.com/TCINEUpdate/status/1670989988929077250 Tamannaah Bhatia తమన్నా భాటియా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015), ఊపిరి (2016), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017), ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2019), సైరా నరసింహా రెడ్డి (2019), ఎఫ్3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2022) వంటివి తమన్నా నటించిన ప్రముఖ తెలుగు సినిమాలు. కల్లూరి (2007), అయాన్ (2009), పయ్యా (2010), సిరుతై (2011), వీరమ్ (2014), ధర్మ దురై (2016), దేవి (2016), స్కెచ్ (2018), జైలర్ (2023) వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాల్లో నటించింది. నవంబర్ స్టోరీ (2021), జీ కర్దా (2023), ఆఖ్రీ సచ్ (2023), లస్ట్ స్టోరీస్2 వంటి వెబ్‌సిరీస్‌ల్లో ప్రధాన నటిగా పనిచేసింది. లస్ట్‌ స్టోరీస్‌లో ఆమె గ్లామర్ షోపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితేనేం ఏమాత్రం పరువాల ఘాటు తగ్గించకుండా దూసుకెళ్తోంది. ఆమె బికినీలో చేసే హాట్ షోకు అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. Tamannaah Bhatia Bikini images View this post on Instagram A post shared by Think Music India (@thinkmusicofficial) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) Anushka Shetty అనుష్క శెట్టి&nbsp; పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ త్వారత విక్రమార్కుడు(2006), లక్ష్యం(2007) వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అరుంధతి(2009), బిల్లా(2009), మిర్చి(2013), బాహుబలి(2015), రుద్రమదేవి(2015), బాహుబలి ది కన్‌క్లూజన్(2017) వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను పొందిన ఏకైక హీరోయిన్‌గా అనుష్క శెట్టిని చెప్పవచ్చు. Anushka shetty Bikini Images Disha Patani దిషా పటాని తెలుగు చిత్రం లోఫర్ (2015)తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె బయోపిక్ MS ధోనితో&nbsp; హిందీ చలన చిత్రాల్లోకి అడుగుపెట్టింది. సాహో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దిషా నటనతోనే కాదు తన అందంతోనూ ఆకట్టుకుంటుంది. ఆమె గ్లామర్ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు బికినీ ఫొటోలు పెడుతూ కుర్రకారును ఊరిస్తు ఉంటుంది. Disha Patani Bikini images Pragya Jaiswal ప్రగ్యా జైస్వాల్ ప్రధానంగా తెలుగు చిత్రాలలో పని చేస్తుంది. జైస్వాల్ తెలుగు పీరియడ్ డ్రామా కంచె (2015)తో గుర్తింపు పొందింది. తొలి చిత్రంతోనే ఉత్తమ డెబ్యూ యాక్టర్‌గా ఫిల్మ్‌ ఫేర్ అవార్డును పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మకు చెప్పుకోదగ్గ అవాకాశాలు ప్రస్తుతం లేకున్నా…తనదైన గ్లామర్‌ షోతో ఆకట్టుకుటుంది. ఆ అందాలను మీరు చూసేయండి. Pragya Jaiswal bikini Images ShwetaTiwari శ్వేతా తివారీ హిందీ సినిమా, టెలివిజన్ నటి. 2000లో 'ఆనే వాలా పల్' సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. తివారీ బిగ్ బాస్ 4 (2010–11), కామెడీ సర్కస్ కా నయా దౌర్ (2011) రియాల్టీ షోలలో విజేతగా నిలిచి గుర్తింపు పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు హద్దు అంటూ లేదు. ఓసారి మీరు చూసేయండి మరి. ShwetaTiwari Bikini Images Deepika Padukone దీపికా పదుకొనే ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు, ఆమె ప్రశంసలలో మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. ఆమె దేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల జాబితాలలో ఉంది; టైమ్ ఆమెను 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది మరియు 2022లో ఆమెకు టైమ్100 ఇంపాక్ట్ అవార్డును ప్రదానం చేసింది. deepika padukone bikini Images Pooja Hegde పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది. కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు అందాల దేవతగా మారింది. ఈ అమ్మడి సోకులకు కుర్రకారు హుషారెక్కుతుంటారు. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా చూడండి. Pooja Hegde Bikini Images Pooja Hegde Hot Videos https://twitter.com/RakeshR86995549/status/978983052364808194 View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) Raashii Khanna రాశి ఖన్నా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాశి ఖన్నా చదువులో టాపర్‌. ఐఏఎస్‌ కావాలని ఆకాంక్షించినప్పటికీ... క్రమంగా మోడలింగ్ వైపు మొగ్గు చూపింది. ఆ తర్వాత తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత ప్రతిరోజు పండగే, జీల్, జై లవకుశ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో హిందీ బాట పట్టింది. అక్కడ హాట్ గ్లామర్ షో చేస్తూ టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ అమ్మడి అందాలకు మంచి క్రేజ్ ఉంది. ఫొటోలు పెట్టినా క్షణాల్లోనే లక్షల్లో లైక్‌లు వస్తుంటాయి. Raashii Khanna Bikini images Dimple Hayathi డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమె డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. కేవలం ఆమె అందం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. డింపుల్ బికినీ అందాలను ఇప్పటికీ ఏ హీరోయిన్‌ బీట్‌ చేయలేదంటే అతిశయోక్తి కాదు. మీరు ఓసారి ఆ సోగసులపై లుక్‌ వేయండి https://twitter.com/PicShareLive/status/1525365506471231488 Ketika Sharma Bikini Images కేతిక శర్మ తెలుగు సినిమా నటి. పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగరంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్‌ లైఫ్‌ (2016)' వీడియోతో పాపులర్‌ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది. ఈ పాప సోషల్ మీడియాలో కాస్త కూడా కుదురుగా ఉండదు. హాట్ హాట్ ఫొటో షూట్‌లతో వెర్రెక్కిస్తుంటుంది. మరి మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్‌ వేయండి Ketika Sharma Bikini Images Catherine Tresa కేథరీన్ థెరీసా ప్రధానంగా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో నటిస్తోంది. తెలుగులో చమ్మక్ చల్లో చిత్రం ద్వారా పరిచయమైంది. కన్నడలో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును పొందింది. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమా నటించింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. సరైనోడు, నేనేరాజు నేనే మంత్రి, బింబిసారా, వదలడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు కేథరీన్ మోడలింగ్ చేసింది. "నల్లి సిల్క్స్", "చెన్నై సిల్క్స్", "ఫాస్ట్ ట్రాక్","దక్కన్ క్రానికల్" లకు మోడల్‌గా వ్యవహరించింది. ఈ ముద్దుగుమ్మ నటనలోనే కాదు అందాల ప్రదర్శనలోనూ ఓ మెట్టు ఎక్కింది. తన సొగసుల సంపదను అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల గుండెల్లో వీణలు మోగిస్తుంటుంది. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా ఆస్వాదించండి. Catherine Tresa Bikini images Mrunal Thakur మృణాల్ ఠాకూర్ లవ్‌ సోనియా(2018) హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది. తెలుగులో వచ్చిన జెర్సీ రీమేక్‌లో షాహిద్ కపూర్ సరసన నటించడంతో ఆమె టాలీవుడ్ పెద్దల దృష్టి పడింది. దీంతో ఆమెకు తెలుగులో సీతారామం(2022) చిత్రం ద్వారా అవకాశం వచ్చింది. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఇక మృణాల్ అందాల గురించి ఎంత మాట్లాడిన తక్కువే అవుతుంది. మరి ఆ రేంజ్‌లో ఉంటుంది ఈ అమ్మడి అందాల తెగింపు. ఒక్క పాటలో చెప్పాలంటే ఇంతందం దారి మళ్లిందా అనిపిస్తుంది తన సోగసుల సోయగాలు చూస్తుంటే.. మీరు ఓసారి చూసేయండి మరి. Mrunal Thakur Bikini images Mrunal Thakur hot video https://twitter.com/MassssVishnu/status/1786566946600988750 https://twitter.com/MrunalThakur143/status/1788433120221401193 https://twitter.com/SastaJasoos/status/1788498532162236427 Anasuya Bharadwaj బుల్లితెర వ్యాఖ్యతగా అలరించిన గ్లామరస్ యాంకర్ అనసూయ.. నటిగా తొలిసారి నాగ(2003) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయన చిత్రంలో బుజ్జి క్యారెక్టర్‌లో నటించింది. ఈ చిత్రంలో ఆమె గ్లామరస్ నటనకుగాను అవకాశాలు క్యూ కట్టాయి. రామ్‌చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ఆమె చేసిన రంగమత్త పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. యాంకర్ రోల్‌ను వదిలి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడేలా చేసింది. క్షణం, విన్నర్, పుష్ప, రంగమర్తాండ, విమానం వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు తనలోని నటనా కోణాన్ని పరిచయం చేసింది. రంగస్థలం, క్షణం చిత్రాలకుగాను ఉత్తమ సహాయనటిగా సైమా పురస్కారాలు అందుకుంది. నటన కంటే ముందు ఆమెను పాపులర్ చేసింది మాత్రం ఆమె గ్లామర్ షో అని చెప్పాలి. బిగువైన అందాల విందుతో కుర్రకారుకు కలల రాణిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఏ ఫొటో పెట్టినా ఇట్టే ట్రెండ్ అవుతాయి మరి. Anasuya Bharadwaj Bikini images View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) Nidhhi Agerwal నిధి అగర్వాల్&nbsp; ప్రధానంగా తెలుగుతో పాటు హిందీ భాషల్లో నటిస్తోంది. తెలుగులో సవ్యసాచి చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పూరి డైరెక్షన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తొలి బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో గ్లామరస్ క్వీన్‌గా గుర్తింపు పొందింది. సినిమాల్లోకి రాకముందు.. కపిల్ శర్మ టాక్ షో, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా సీజన్‌-4లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇక నిధి శర్మ ఇచ్చే గ్లామర్ షో గురించి మాట్లాడితే.. చూసేవారికి కన్నుల పండుగేనని చెప్పాలి. ఈ పాప బికిని వేసిన ఫొటోలు తక్కువేకానీ..చూపించిన ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉంది. కావాలంటే మీరు ఓసారి చూసేయండి. Nidhhi Agerwal Bikini Images Mehreen Kaur Pirzada మెహ్రీన్ తెలుగు సినిమా నటి. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మహానుభావుడు చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. జవాన్, F2, అశ్వథ్థామ, F3 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ పిల్ల అందాల ప్రదర్శన గురించి మాట్లాడితే.. పర్వాలేదనే చెప్పాలి. ఫోటో షూట్‌ల కంటే ఈ అమ్మడు వీడియో షూట్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది. Mehreen Kaur Pirzada Bikini Videos View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) Manushi Chillar మానుషి చిల్లర్.. ప్రముఖ మోడల్‌. మిస్‌ వరల్డ్‌ 2017 పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్‌ వరల్డ్‌ కిరీటం పొందిన ఆరో భారత మహిళగా రికార్డులకెక్కింది. 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్‌గా బడేమియా చోటేమియా సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మాజీ ప్రపంచ సుందరి బికినీ అందాల గురించి చెప్పేదిమి లేదు. మీరే చూసేయండి. Manushi Chillar Bikini Images Manushi Chillar Bikini videos View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) https://twitter.com/ManushiChhillar/status/1787462061280166182 Sobhita Dhulipala శోభితా ధూళిపాళ ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది మరియు మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ యొక్క థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016)లో ఆమె తొలిసారిగా నటించింది మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చీర కట్టినా.. మోడ్రన్ డ్రెస్ వెసినా తరగని అందంతో చెలరేగుతుంటుంది. మరి ఆ అందాల విందును మీరు చూసేయండి మరి. Sobhita Dhulipala bikini images Hot videos View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) Tripti Dimri తృప్తి డిమ్రి.. కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ (2017) ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను (2018)లో ఆమె మొదటి సారి లీడ్ రోల్‌లో నటించింది. ఆ తరువాత ఆమె అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020), కళ (2022)లలో చిత్రాలలో నటించింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన రాని గుర్తింపు యానిమల్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. రెడిఫ్ డాట్ కామ్ 2020 బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఆమె 8వ స్థానంలో నిలిచింది. ఇక అమ్మడు ఎక్స్‌పోజింగ్‌లో బాలీవుడ్ హీరోయిన్లకంటే రెండు అకులు ఎక్కువే చదివింది. ఓసారి ఆ అందాల విందును మీరు తనివితీరా ఎంజాయ్ చేయండి. Tripti Dimri Bikini images View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) Shirley Setia షిర్లె సెటియా... కృష్ణ వ్రింద విహారి చిత్రం(2022) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సినిమా యావరేజ్‌గా ఆడిన మంచి గుర్తింపు సాధించింది. అయితే ఈ చిత్రానికి కంటే ముందు లాక్‌డౌన్(2018) వెబ్‌సిరీస్‌ ద్వారా గుర్తింపు దక్కించుకుంది. షిర్లె సెటియాలో బహుముఖ ప్రజ్ఞ దాగి ఉంది. నటిగా మాత్రమే కాకుండా.. సింగర్‌గాను రాణించింది. ఇక కుర్రదాని అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. Shirley Setia Bikini Images
    మే 11 , 2024
    Best Love Songs 2023: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌ 10 తెలుగు రొమాంటింక్ సాంగ్స్‌?
    Best Love Songs 2023: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌ 10 తెలుగు రొమాంటింక్ సాంగ్స్‌?
    కోపం, చిరాకు, బాధ ఇలా ఏ మూడ్‌నైనా మ్యూజిక్‌ చిటికెలో మాయం చేస్తుంది. ఇష్టమైన మెలోడి సాంగ్స్‌ వింటే ఊహాల్లో విహరించాల్సిందే. ప్రస్తుతం చాలా మంది యువత తమ స్ట్రెస్‌ బస్టర్‌గా మ్యూజిక్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో ఇటీవల ఎన్నో సూపర్‌ హిట్‌ మెలోడీ సాంగ్స్‌ రిలీజ్‌ అయ్యాయి. ప్రస్తుతం ఆ పాటలకు యూట్యాబ్‌లో యమా క్రేజ్‌ నడుస్తోంది. 2023లో అత్యధిక వ్యూస్‌తో&nbsp; యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌-10 తెలుగు మెలోడీ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం… 1. ఇంతందం, ఓ సీతా ( సీతారామం) అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన సీతారామం (Sita Ramam) సినిమా.. తెలుగులో సూపర్‌హిట్‌ అందుకుంది. ఈ సినిమాలోని ప్రతీ పాట దేనికదే ప్రత్యేకం. ముఖ్యంగా ‘ఇంతందం’, ‘ఓ సీతా’ పాటలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పాటల్లో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)&nbsp; అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తున్నాయి. https://youtu.be/hYFzyK9ExuM https://youtu.be/dOKQeqGNJwY 2. కళావతి (సర్కారు వారి పాట) మహేష్‌బాబు (Mahesh Babu), కీర్తి సురేష్‌ (keerthi Suresh) జంటగా చేసిన సర్కారు వారి పాట (Sarkari Vaari Paata) హిట్ టాక్‌ తెచ్చుకుంది. ఇందులోని కళావతి సాంగ్‌ మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) తన స్వరంతో ఈ పాటకు ప్రాణం పోశాడు. ప్రస్తుతం ఈ యూట్యూబ్‌లో పాట తెగ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే 24 కోట్ల మంది యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించారు.&nbsp; https://youtu.be/Vbu44JdN12s 3. గుండెల్లోనా (ఓరి దేవుడా) విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన ‘ఓరి దేవుడా’ (Ori Devuda) సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని గుండెల్లోనా పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఫుల్‌ జోష్‌తో నిండిన ఈ పాట ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. 8.4 కోట్ల వ్యూస్‌లో ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=t_aO4EMP-i0 4. కుంకుమల (బ్రహ్మస్త్ర) బ్రహ్మస్త్ర (Brahmastra) లోని కుంకుమల నువ్వే పాట మ్యూజిక్‌ లవర్స్‌ను కట్టిపడేసింది. ఎంతోమంది ఈ పాటను కాలర్‌ట్యూన్‌గా, మెుబైల్‌ రింగ్‌టోన్‌గా పెట్టుకున్నారు. సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) తన స్వరంతో మరోమారు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ పాట కూడా 4.5 కోట్ల వీక్షణలతో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.&nbsp;&nbsp; https://youtu.be/5kzM6m33DTo 5. మెహబూబా (కేజీఎఫ్‌ 2) కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 (KGF 2)లోని మెహబూబా(Mehabooba) పాట కూడా మెలోడి ప్రియుల ఫేవరెట్‌ సాంగ్. ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కు ఎంత బాగా నచ్చిందో క్లాస్‌ మ్యూజిక్‌ లవర్స్‌ మెహబూబాా పాట అంతకంటే బాగా నచ్చింది. అనన్య భట్‌ పాడిన ఈ పాట ప్రతీ ఫోన్‌లోని మ్యూజిక్‌ ఆల్బమ్‌లో తప్పకుండా ఉంటుంది. యూట్యూబ్‌లో ఈ పాట 3.9 కోట్ల వ్యూస్‌ను సంపాదించింది https://youtu.be/5xwM12SOXEE 6. మాస్టారు మాస్టారు (సార్‌) సార్‌(SIR) సినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్‌ కూడా యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం చాలా మంది మ్యూజిక్‌ లవర్స్‌కు ఈ పాట ఫేవరేట్‌ సాంగ్‌గా ఉంది. సింగర్‌ శ్వేతా మోహన్‌ (Swetha Mohan) అందించిన గాత్రం సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాటను 3.3 కోట్ల మంది చూశారు.&nbsp; https://youtu.be/AXSm49NGkg8 7. నగుమోము తారలే (రాధేశ్యామ్‌) పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), హీరోయిన్‌ పూజా హెగ్డే (Pooja Hedgde) జంటగా చేసిన రాధేశ్యామ్‌ (Radhe Shyam) సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నగుమోము తారలే పాట మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. మ్యూజిక్‌ లవర్స్‌ ఈ పాటను రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని మరి వింటున్నారు. అటు యూట్యూబ్‌లోనూ ఈ పాటను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకూ ఈ పాటను 11 మిలియన్స మంది చూశారు.&nbsp; https://youtu.be/O5LW6HABcRA 8. ఏడు రంగుల వాన (18 పేజెస్‌) నిఖిల్‌(Nikhil), అనుపమ (Anupama Parameswaran) జంటగా నటించిన 18 పేజెస్‌ (18 Pages) సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలోని ఏడు రంగుల వాన పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో 1.8 మిలియన్ వ్యూస్ సంపాదించింది.&nbsp; https://youtu.be/hOLw-mkSnHs 9. ఓ రెండు ప్రేమ మేఘాలిలా (బేబి) ఆనంద్‌ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా త్వరలో బేబి సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట కూడా యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇప్పటివరకు 7.5 మిలియన్ల మంది పాటను చూశారు.&nbsp; https://youtu.be/D_SRMiIWyL4 10. ప్రియతమ (కొత్త కొత్తగా) కొత్త కొత్తగా (Kotha Kothaga) సినిమాలోని ప్రియతమ (Priyathama) పాట కూడా మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. అనంత శ్రీరామ్‌ (Ananth Sriram) ఈ పాటకు లిరిక్స్‌ అందించగా… శిద్‌ శ్రీరామ్‌ చాలా అద్భుతంగా పాడాడు. ఈ పాటను 14 మిలియన్ల మంది యూట్యూబ్‌లో వీక్షించారు.&nbsp; https://youtu.be/CDbuW4689fI
    ఏప్రిల్ 12 , 2023
    Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
    Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
    టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ అనగానే ముందుగా మనకు దర్శకధీరుడు రాజమౌళినే గుర్తుకువస్తాడు. RRR చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఆస్కార్‌ రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అటువంటి రాజమౌళి ఓ విషయంలో విఫలమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని టాప్‌ డైరెక్టర్స్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. ఈ విషయంలో డైరెక్టర్‌ సుకుమార్ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. సుకుమార్‌ దగ్గర దర్శకపాఠాలు నేర్చుకున్న కొందరు డైరెక్టర్లు హిట్‌ సినిమాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. సుకుమార్‌ ఆసిస్టెంట్&nbsp; డైరెక్టర్లు: శ్రీకాంత్‌ ఓదెల(srikanth odela) టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల పేరు మార్మోగుతోంది. డైరెక్టర్‌గా చేసిన తొలి సినిమాతోనే శ్రీకాంత్‌ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. నానితో చేసిన ‘దసరా’( DASARA ) సినిమాను రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చాడు. అయితే శ్రీకాంత్‌ ఈ సినిమాకు ముందు వరకు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల సక్సెస్‌కు తనవంతు సాయం చేశాడు.&nbsp; శ్రీకాంత్‌ ఓదెల లేకుండా రంగస్థలం ఇంత బాగా వచ్చేది కాదని ఓ సందర్భంలో సుకుమార్‌ చెప్పారంటే ఈ డైరెక్టర్‌ టాలెంట్‌ అర్థమవుతోంది. https://telugu.yousay.tv/srikanth-odela-went-around-sukumars-house-for-4-years-for-opportunities-dussehra-director-emotional.html https://twitter.com/vamsikaka/status/1642932721612894208?s=20 బుచ్చిబాబు(Buchi Babu Sana) సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి బుచ్చిబాబు. తొలి సినిమా ఉప్పెనతో బుచ్చిబాబు ఓ ప్రభంజనమే సృష్టించాడు. సుకుమార్‌ నేర్పిన పాఠాలను చక్కగా అవపోసన పట్టిన ఆయన మెుదటి సినిమాతోనే తన మార్క్‌ ఏంటో చూపించాడు. అరంగేట్ర హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ కృతి శెట్టిని స్క్రీన్‌పై చక్కగా ప్రెజెంట్‌ చేశాడు. ఉప్పెన ఘనవిజయం ద్వారా రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను బుచ్చిబాబు కొట్టేశారు. తన 16వ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్‌ చేస్తారని స్వయంగా చరణ్‌ చెప్పే స్థాయికి ఎదిగాడు.&nbsp; పల్నాటి సూర్యప్రతాప్‌(Palnati surya pratap) సుకుమార్‌ డైరెక్షన్‌ స్కూల్‌ నుంచి వచ్చిన పల్నాటి సూర్యప్రతాప్‌ కూడా తన తొలి సినిమాతో మంచి హిట్‌ అందుకున్నాడు. కుమారి 21F చిత్రం ద్వారా తన టాలెంట్‌ ఎంటో నిరూపించుకున్నాడు. ఇటీవల హీరో నిఖిల్, హీరోయిన్‌ అనుపమ జంటగా ‘18 పేజెస్‌’ సినిమాను సూర్య తీశాడు. క్లాసిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. కాగా, సుకుమార్‌ తీసిన 1 నేనొక్కడినే, రంగస్థలం, పుష్పకు సూర్య స్క్రీన్‌ రైటర్‌గా పనిచేశాడు.&nbsp; రాజమౌళి ఆసిస్టెంట్&nbsp; డైరెక్టర్లు: (Rajamouli assistant directors) G.R కృష్ణ( GR KRISHNA ) టాలీవుడ్ డైరెక్టర్‌ G.R కృష్ణ తొలుత రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సింహాద్రి సినిమా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కృష్ణ.. ఆశించిన రేంజ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. దీంతో 2019 నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న కృష్ణ ఇప్పటివరకూ మరో సినిమాను పట్టాలెక్కించలేదు. కరుణ కుమార్‌ ( KARUNA KUMAR) మరో టాలీవుడ్‌ డైరెక్టర్‌ కరుణ కుమార్‌ కూడా రాజమౌళి దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా పలు సినిమాలు చేసి మెప్పించలేకపోయాడు. అయితే ఆయన తొలి సినిమా ‘పలాస’ హిట్‌ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. ఆ తర్వాత తీసిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్‌, కళాపురం వంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందలేక పోయాయి.&nbsp; అశ్విన్‌ గంగరాజు (ASHWIN GANGA RAJU) డైరెక్టర్‌ అశ్విన్‌ గంగరాజు సైతం రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌ డైెరెక్టర్‌గా పనిచేశాడు. ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2021లో ‘ఆకాశవాణి’ చిత్రం ద్వారా అశ్విన్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. రాజమౌళి హీరోలకూ ఫ్లాపుల బెడద..! రాజమౌళి శిష్యులే కాదు ఆయనతో సినిమా తీసిన హీరోలు సైతం తమ తర్వాతి సినిమాల్లో ఫెయిల్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.&nbsp; జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా ‘స్టూడెంట్‌ నెం.1’ను ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన ‘సుబ్బు’ సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన ‘ఆంధ్రావాల’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.&nbsp; ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ముందు రామ్‌చరణ్‌తో ‘మగధీర’ సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది.&nbsp; రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.&nbsp;
    ఏప్రిల్ 06 , 2023
    NBK110: బాలయ్య - బోయపాటి చిత్రానికి ముహోర్తం ఫిక్స్‌.. ఇక బాక్సాఫీస్‌కు ఊచకోతే!
    NBK110: బాలయ్య - బోయపాటి చిత్రానికి ముహోర్తం ఫిక్స్‌.. ఇక బాక్సాఫీస్‌కు ఊచకోతే!
    నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ (Bobby) కాంబినేషన్‌లో ఓ సినిమా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ‘NBK109’గా ఇది ప్రచారంలో ఉంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా గ్లింప్స్‌ను ఇటీవలే శివరాత్రి సందర్భంగా చిత్ర యూనిట్‌ రిలీజ్ చేసింది. ఇందులో బాలకృష్ణ ఎప్పటిలాగే పవర్‌ఫుల్‌ గెటప్‌లో కనిపించారు. ఈ చిత్ర నిర్మాణంలో త్రివిక్రమ్‌ సొంత సంస్థ ఫార్చూన్‌ ఫోర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం విశేషం. ‘NBK109’ సినిమా తర్వాత బాలయ్య తన 110వ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; బాలయ్య - బోయపాటి కాంబో రిపీట్‌! టాలీవుడ్‌లో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రాలకు మంచి క్రేజ్‌ ఉంది. వీరి కాంబోలో వచ్చిన సింహా (Simha), లెజెండ్‌ (Legend), అఖండ (Akhanda) చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. లేటెస్ట్ బజ్‌ ప్రకారం బాలకృష్ణ తన ‘NBK110’ చిత్రాన్ని బోయపాటి శ్రీనుతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య 110వ చిత్రానికి చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించినప్పటికీ చివరకూ బోయపాటి శ్రీనును ఫైనల్‌ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ‘NBK110’ మూవీ కోసం బోయపాటి పూర్తిస్థాయిలో స్క్రిప్ట్‌ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కోరిక మేరకు కొన్ని మార్పులు కూడా జరుగుతున్నట్లు టాక్‌. ఈ చిత్రంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; నెక్స్ట్‌ చిత్రం 'అఖండ 2' కాదా? బాలకృష్ణ 110వ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ (Allu Aravind) నిర్మించనున్నారు. ‘అఖండ’ తర్వాత తమ కాంబోలో సీక్వెల్‌ కూడా ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీను అప్పట్లోనే ప్రకటించారు. అయితే ‘అఖండ’ చిత్రాన్ని అప్పట్లో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. మరి ఇప్పుడు ఆయన ప్రమేయం లేకుండా 'అఖండ 2' (Akhanda 2) నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు. దీని బట్టి బాలయ్య - బోయపాటి కాంబోలో 'అఖండ 2' కాకుండా మరో కొత్త చిత్రం రూపొందుతుందా? అన్న సందేహం కలుగుతోంది. బాలయ్య, బోయపాటి చిత్రానికి ఏప్రిల్‌ 9 ముహోర్తం కుదరినట్లు తెలుస్తుండగా ఆ రోజే ఈ చిత్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, ‘NBK110’ చిత్రానికి థమన్‌ సంగీతం అందింబోతున్నారు.&nbsp; ఏపీ ఎన్నికల తర్వాతే షూట్‌! ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి మెుదలైన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే రాజకీయాల్లో బిజీ కానున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK109’ చిత్రాన్ని వేగంగా ఫినిష్‌ చేసేందుకు బాలకృష్ణ యత్నిస్తున్నారట. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ షెడ్యూల్‌ను త్వరగా పూర్తి చేసి ఎన్నికల వరకూ తన ఫోకస్‌ను ఏపీ రాజకీయాలపై పెట్టాలని బాలయ్య భావిస్తున్నారట. ప్రస్తుతం బాలయ్య.. ఏపీలో హిందూపురం టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. స్థానికంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బోయపాటితో చేయనున్న ‘NBK110’ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ ఏపీ ఎన్నికల తర్వాతే జరగనున్నట్లు తెలుస్తోంది.&nbsp;&nbsp; నాని డైరెక్టర్‌తో సినిమా! ఇప్పటికే తన లైనప్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులను పెట్టుకున్న బాలకృష్ణ.. మరో యంగ్‌ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. 'ట్యాక్సీవాలా' (Taxiwala)తో వచ్చి 'శ్యామ్ సింగ రాయ్' (Shyam Singha Roy)తో భారీ సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్‌ రాహుల్ సంకృత్యాన్‌ (Rahul Sankrityan) చెప్పిన కథకు బాలయ్య దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మధ్యనే రాహుల్.. బాలయ్యను కలిసి ఒక పిరియాడికల్ స్టోరీ లైన్ గురించి చర్చించాడట. ఆ పీరియాడిక్ డ్రామా బాలయ్యకు నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా కథ.. బాలయ్యకు పూర్తిగా నచ్చితే ఈ మూవీ కూడా కన్ఫామ్ కానుంది.
    మార్చి 14 , 2024
    Balakrishna: బాలయ్య క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌.. క్యూలో త్రివిక్రమ్‌, ప్రశాంత్‌ వర్మ, బోయపాటి!&nbsp;
    Balakrishna: బాలయ్య క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌.. క్యూలో త్రివిక్రమ్‌, ప్రశాంత్‌ వర్మ, బోయపాటి!&nbsp;
    టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఒకరు. ఇటీవల ఆయన నటించిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్‌ (Kajal Aggarwal).. కూతురిగా శ్రీలీల (Sreeleela) నటించింది. ప్రస్తుతం డైరెక్టర్‌ బాబీ (Director Bobby)తో బాలకృష్ణ ‘NBK109’ చిత్రాన్ని చేస్తున్నారు. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా మరో మూవీ కూడా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంతకీ బాలయ్యను మెప్పించిన ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నాని డైరెక్టర్‌తో సినిమా! ఇప్పటికే తన లైనప్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులను పెట్టుకున్న బాలకృష్ణ.. తాజాగా మరో డైరెక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. 'ట్యాక్సీవాలా' (Taxiwala)తో వచ్చి 'శ్యామ్ సింగ రాయ్' (Shyam Singha Roy)తో భారీ సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్‌ రాహుల్ సంకృత్యాన్‌ (Rahul Sankrityan)కు బాలయ్య దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మధ్యనే రాహుల్.. బాలయ్యను కలిసి ఒక పిరియాడికల్ స్టోరీ లైన్ గురించి చర్చించాడట. ఆ పీరియాడిక్ డ్రామా బాలయ్యకు నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా కథ.. బాలయ్యకు పూర్తిగా నచ్చితే మూవీ కన్ఫామ్ కానుంది. హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌! నటసింహాం బాలకృష్ణ.. తన ‘NBK109’ చిత్రాన్ని డైరెక్టర్ బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ‘NBK110’వ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu)తో బాలయ్య చేయబోతున్నట్లు న్యూస్ ఇప్పటికే బయటకు వచ్చింది. దీన్ని 'అఖండ' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గ స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా చకా చకా రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈలోపు బాలయ్య తన 109వ సినిమాను పూర్తి చేస్తారు. ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ వంటి బ్లాక్‌ బాస్టర్స్ తర్వాత వీరి కాంబోలో ‘NBK110’ వస్తుండటంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీని తర్వాత బాలయ్య - రాహుల్ సంకృత్యాన్‌ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్‌తో బాలయ్య చిత్రం! టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ కూడా త్వరలోనే సెట్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తన తర్వాతి చిత్రాన్ని బాలయ్యతో చేసే అవకాశమున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్‌.. బన్నీతో ఓ సినిమా తీయాల్సి ఉంది. ‘పుష్ప2’ సినిమా షూటింగ్‌తో బన్నీ బిజీ అయిపోవడం.. తాజాగా పార్ట్‌-3 ఉంటుందని హింట్‌ ఇవ్వడంతో త్రివిక్రమ్‌ తన ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన తన తర్వాతి చిత్రాన్ని బాలయ్యతో చేసేందుకు మెుగ్గు చూపుతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కథను సిద్ధం చేయాల్సి ఉందని అంటున్నారు.&nbsp; ఆ డైరెక్టర్లతోనూ చర్చలు! నందమూరి బాలకృష్ణ.. బాబీ, బోయపాటి శ్రీనుతోనే కాకుండా మరికొందరు డైరెక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. తనకు 'వీర సింహా రెడ్డి' వంటి హిట్‌ అందించిన గోపీచంద్ మలినేని (Gopichand Malineni)తోనూ బాలకృష్ణ మరో సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే ప్రశాంత్ వర్మ, హరీశ్ శంకర్ వంటి డైరెక్టర్లు కూడా బాలయ్యతో కథకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాలకృష్ణ చకా చకా కొత్త సినిమాలను ఓకే చేస్తున్నారు. ఒకదాని తర్వాత మరొకదానిని సెట్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.&nbsp; హ్యాట్రిక్‌ హిట్లతో ఫుల్ జోష్‌ టాలీవుడ్‌లోని సీనియర్ నటులతో (చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌) పోలిస్తే ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నది బాలయ్య మాత్రమే. బాలయ్య చివరి మూడు చిత్రాలు బ్లాక్‌ బాస్టర్లుగా నిలవడం విశేషం. 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి క్రేజీ హిట్ల తర్వాత బాలకృష్ణ నటించిన సినిమానే 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రానికి కూడా అదిరిపోయే స్పందన లభించింది. ఇలా బాలయ్య వరుసగా మూడు హిట్లను అందుకుని హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ మూడు చిత్రాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. బాలయ్య రెమ్యూనరేషన్‌ ఎంతంటే? సినిమా సినిమాకి తన రేంజ్‌ని (Nandamuri Balakrishna Remuneration) పెంచుకుంటూ పోతున్న బాలయ్య ఇప్పుడు తన రెమ్యునరేషన్‌ని మరింతగా పెంచేశాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.&nbsp; అఖండ ముందు వరకు మోస్తరు పారితోషికాన్ని తీసుకున్న బాలకృష్ణ.. హ్యాట్రిక్‌ విజయాల తర్వాత దానిని ఒక్కసారిగా పెంచేశారట. తన అప్‌కమింగ్‌ సినిమాలు అన్నింటికి రూ.20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. రాబోయే చిత్రాలు సైతం స్టార్‌ డైరెక్టర్లతో ఉండటంతో బాలయ్య ఫ్యూచర్‌ మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది. రామ్‌చరణ్‌ (Ramcharan), తారక్‌ (Jr NTR) తరహాలోనే బాలయ్య కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే రోజులు ఎంతో దూరంలో లేవని నందమూరి అభిమానులు అంటున్నారు.&nbsp;&nbsp;
    ఫిబ్రవరి 20 , 2024
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌&nbsp; బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా (Happy Birthday Nani) వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. ‘అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని.. ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. రీసెంట్‌గా ‘హాయ్‌ నాన్న’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ రెండు సినిమాలతో ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నానీ నిరూపించుకున్నాడు. లేటెస్ట్‌గా ‘సరిపోదా శనివారం’ అనే సినిమాతో థియేటర్లలో రచ్చ చేసేందుకు ఈ నేచురల్‌ స్టార్ సిద్ధమవుతున్నాడు.&nbsp; ఈ తరం యంగ్‌ హీరోలకు స్ఫూర్తిగా నిలిచిన నానికి (Happy Birthday Nani) ఈ సక్సెస్ ఒక్కరోజులో వచ్చింది కాదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఇవాళ నాని పుట్టిన రోజు&nbsp; సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం? నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.&nbsp; అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.&nbsp; రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.&nbsp;&nbsp; పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.&nbsp; ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.&nbsp; నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.&nbsp; MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని (HBD Nani) మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.&nbsp; నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.&nbsp; జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని (HBD Nani) పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.&nbsp; గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.&nbsp; వి (2020) వి(V) సినిమాలో నాని&nbsp; నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.&nbsp; టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.&nbsp; శ్యామ్‌ సింగరాయ్‌ (2021)&nbsp; పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.&nbsp; అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.&nbsp; హాయ్‌ నాన్న (2023) నాని-మృణాల్ ఠాకూర్‌ కాంబినేషన్‌లో యువ డైరెక్టర్‌ శౌర్యువ్‌ రూపొందించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. గుండెలకు హత్తుకునే భావోద్వేగాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోమారు నానీ తన అద్భుతమైన నటనతో ఇందులో ఆకట్టుకున్నాడు.&nbsp; &nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;మెుత్తంగా అష్టా చమ్మా నుంచి ‘హాయ్‌ నాన్న’ వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
    ఫిబ్రవరి 24 , 2024

    @2021 KTree