ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ సూన్ ఆన్Youtube
ఇన్ ( Telugu, Hindi )
Watch
Free
రివ్యూస్
How was the movie?
తారాగణం
మహేష్ బాబు
రాజాప్రీతి జింటా
రాణికృష్ణ
ప్రకాష్ రాజ్
ధనుంజయ్జయ ప్రకాష్ రెడ్డి
సర్వారాయుడుసుమలత
ధనుంజయ్ భార్యఅస్రానీ
ముంబై పోలీస్ ఇన్స్పెక్టర్శ్రీహరి రఘుముద్రి
నర్సింహరాయుడుబ్రహ్మానందం
హైదరాబాద్ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ వాగ్లేఎంఎస్ నారాయణ
పోలీస్ కానిస్టేబుల్తేజ సజ్జ
వెంగళ్ల రాయుడుసిబ్బంది
కె. రాఘవేంద్రరావు
దర్శకుడుసి. అశ్వని దత్
నిర్మాతమణి శర్మ
సంగీతకారుడుఅజయన్ విన్సెంట్
సినిమాటోగ్రాఫర్కోటగిరి వెంకటేశ్వరరావు
ఎడిటర్ర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి ఈ స్థాయి సక్సెస్ సాధించడం వెనక దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాటు నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్’ (Vyjayanthi Movies) బ్యానర్ పాత్ర కూడా ఎంతో ఉంది. నిర్మాత అశ్వనీ దత్ (Aswani Dutt) ఎంతో సాహాసోపేతంగా కల్కి చిత్రాన్ని నిర్మించారు. బడ్జెట్ అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. క్వాలిటీ ఔట్‌పుట్ ఇవ్వాలన్న లక్ష్యంతో దర్శకుడు నాగ్ అశ్విన్‌కు బడ్జెట్ పరంగా పూర్తి స్వేచ్ఛను కల్పించారు. రూ.600 కోట్లకు పైగా వ్యయంతో ఇండియాలోనే అతి భారీ బడ్జెట్ ఫిల్మ్‌గా కల్కిని తీర్చిదిద్దారు. కల్కి లాంటి విజువల్ వండర్‌ను అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పేరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.
[toc]
వైజయంతీ మూవీస్ ప్రస్థానం
అశ్వనీ దత్.. నిర్మాతగా తన ప్రస్థానాన్ని అభిమాన హీరో నందమూరి తారక రామారావు ఫిల్మ్‌తోనే ప్రారంభించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌ను నిర్మించి దాని లోగోగా కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్‌ను పెట్టారు. 1975లో వచ్చిన 'ఎదురులేని మనిషి' చిత్రంతో వైజయంతీ మూవీస్ సంస్థ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలినాళ్లలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. బ్లాక్‌బాస్టర్ చిత్రాలను అందించడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ బ్యానర్‌లో వచ్చిన పలు చిత్రాలు టాలీవుడ్‌లో ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఇంతకీ ఆ బ్లాక్‌బాస్టర్ చిత్రాలు ఏంటి? తెలుగు చిత్ర పరిశ్రమలో అవి ఎలాంటి మార్క్‌ను క్రియేట్ చేశాయి? ఇప్పుడు చూద్దాం.
అగ్నిపర్వతం
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘అగ్నిపర్వతం’ (Agni Parvatam) ఒకటి. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ డబుల్ రోల్స్ చేయగా.. రాధ, విజయశాంతి హీరోయిన్లుగా కనిపించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిల్మ్ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం కృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ దూకుడుగా చెప్పిన ‘అగ్గి పెట్టుందా?’ డైలాగ్ అప్పట్లో మారుమోగింది. అలాగే ‘కదులుతున్న అగ్నిపర్వతం’ సాంగ్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. నటుడిగా సరికొత్త కృష్ణను పరిచయం చేసింది. మూవీ కథ ఏంటంటే.. ‘జమదగ్ని తన తల్లిని విడిచిపెట్టినందుకు అతని తండ్రిని ద్వేషిస్తాడు. అయితే అతని శత్రువులు సమస్య సృష్టించేందుకు జమదగ్ని సవతి సోదరుడిని తెరపైకి తెస్తారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
https://www.youtube.com/watch?v=FaJqLrjanQM
జగదేక వీరుడు అతిలోక సుందరి
వైజయంతీ మూవీస్ రొటిన్ చిత్రాలనే కాకుండా ప్రయోగాత్మక ఫిల్మ్స్ కూడా తీయగలదని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం నిరూపించింది. మెగాస్టార్ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం.. అప్పట్లో కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రం విడుదలకు ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం. రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ఫిల్మ్.. ఆ రోజుల్లో రూ.15 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన మధురమైన పాటలు ఇప్పటికీ ఎక్కడోచోట మారుమోగుతూనే ఉన్నాయి. కథ ఏంటంటే ‘నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
శుభలగ్నం
జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. భార్య భర్తలు సంతోషంగా జీవించడానికి డబ్బుతో సంబంధం లేదని నిరూపించింది. డబ్బు కోసం భర్తనే అమ్మేసిన భార్య.. చివరికి మారి భర్తను ఎలా దక్కించుకుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీలోని ‘చిలకా ఏ తోడు లేక’ అనే పాటకు ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకు నంది పురస్కారం రావడం విశేషం. కథ ఏంటంటే.. ‘డబ్బుపై ఆశతో రాధ తన భర్తను ధనవంతురాలైన లతకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఫలితంగా ఆమెకు కోటి రూపాయలు లభిస్తాయి. అయితే కాలక్రమంలో భర్త తోడు లేని జీవితం వృథా అని భావిస్తుంది’.
గోవిందా గోవిందా
నాగార్జున - రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా'.. అప్పట్లో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. వెంకటేశ్వర స్వామి కిరీటం చుట్టూ తిరిగే ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇందులో శ్రీదేవి తెలుగు ఆడియన్స్ ఎంతగానో మిస్మరైజ్ చేశారు. కథ ఏంటంటే.. ‘భగవంతుడైన వేంకటేశ్వరుడు.. దైవిక ఆయుధాన్ని ఉపయోగించి భూమిపై గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ ఆయుధంపై ఉన్న ఆభరణాలను కొంతమంది దుండగులు దొంగిలించినప్పుడు పరిస్థితి దిగజారుతుంది’.
ఓటీటీ వేదిక : సన్ నెక్స్ట్
రాజకుమారుడు
వైజయంతీ మూవీస్ బ్యానర్ ద్వారానే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరిచయం చేశారు. కథానాయకుడిగా అతడి ఫస్ట్ ఫిల్మ్ 'రాజకుమారుడు'ను కల్కి నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు సైతం వచ్చింది. చాలా సెంటర్లలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ప్లాట్ ఏంటంటే.. 'సెలవులను ఎంజాయ్ చేయడానికి వచ్చిన రాజ్.. రాణిని చూసి ప్రేమలో పడతాడు. అయితే కుటుంబం ఒత్తిడితో ఆమె ప్రేమను వదులుకుంటాడు. ఇంతకి రాణి ఎవరు? ఆమె ఫ్యామిలీతో రాజ్ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి? చివరికి వారు ఎలా ఒక్కటయ్యారు?' అన్నది కథ.
ఇంద్ర
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా 'ఇంద్ర'కు పేరుంది. ఈ సినిమాలో చిరు.. తొలిసారి ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించారు. నిర్మాత అశ్వనీదత్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. 2002లో ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది పురస్కారం వచ్చేలా చేసింది. 'రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు?' అన్నది కథ.
స్టూడెంట్ నెంబర్ 1
దర్శకధీరుడు రాజమౌళిని నిర్మాత అశ్వని దత్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తారక్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మెుట్ట మెుదటి చిత్రం 'స్టూడెంట్ నెం.1' అశ్వనీదత్ నిర్మాత. వైజయంతీ మూవీస్ సబ్ బ్యానర్ అయి స్వప్న సినిమాస్ ఈ మూవీని తెరకెక్కించింది. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ సినిమాని రూ.1.85 కోట్లతో నిర్మించగా రూ.12 కోట్లు వసూలు చేసింది. కథ ఏంటంటే.. ‘ఆదిత్యకు ఇంజినీర్ కావాలని కోరిక. కానీ అతని తండ్రి లాయర్ కావాలని ఆదేశిస్తాడు. అయితే లా చదవడం ఇష్టం లేని ఆదిత్య పరీక్ష రాసేందుకు వెళ్లే క్రమంలో ఓ అమ్మాయిని రక్షించబోయి సమస్యల్లో పడతాడు. ఆదిత్య తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
మహర్షి
మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో చేసిన మహార్షి చిత్రానికి.. అశ్వనీ దత్ సహా నిర్మాతగా వ్యవహరించారు. 2019 సంవత్సరానికి గాను 10 విభాగాల్లో విభాగాల్లో సైమా అవార్డ్స్ నామినేట్ కాగా.. అందులో 5 పురస్కారాలను మహర్షి కైవసం చేసుకోవడం విశేషం. ‘రిషి (మహేష్) ఓ మల్టీ నేషనల్ కంపెనీకి సీఈవోగా ఉంటాడు. కాలేజీ రోజుల్లో తన కోసం ఫ్రెండ్ రవి చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. అతడ్ని వెతుక్కుంటూ ఊరికి వెళ్లిన రిషికి అతడు సమస్యల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు రిషి తన ఫ్రెండ్ కోసం ఏం చేశాడు? ఎలా అండగా నిలబడ్డాడు?’ అన్నది కథ.
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్
సీతారామం
2022లో తెరకెక్కిన సీతారామం చిత్రం.. ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వని దత్ వ్యవహరించారు. ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రూ.30 కోట్లతో తెరకెక్కిన సీతారామం చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ.91-98 కోట్లు కొల్లగొట్టింది. ప్లాట్ ఏంటంటే.. ‘ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్ సల్మాన్) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామహాలక్ష్మి (మృణాల్ ఠాకూర్) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంతకీ ఈ ఆమె ఎవరు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెని కలుసుకునేందుకని వచ్చిన రామ్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?’ అనేది కథ.
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ & హాట్‌స్టార్
కల్కి 2898 ఏడీ
నిర్మాత అశ్వని దత్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన అతి భారీ బడ్జెట్ చిత్రం ‘కల్కి’ కావడం విశేషం. ఈ సినిమాను మైథాలిజీ & ఫ్యూచరిక్ జానర్లలో నిర్మించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర పోషించిగా.. విలన్‌గా కమల్ హాసన్ చేశారు. దిశాపటానీ, దీపిక పదుకొణె ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
వైజయంతీ మూవీస్ సబ్ బ్యానర్స్‌లో వచ్చిన హిట్ చిత్రాలు
బాణం
అశ్వని దత్ కుమార్తె ప్రియాంక దత్.. త్రీ ఎంజెల్స్ బ్యానర్‌పై తొలిసారి బాణం చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ద్వారా నారా రోహిత్ హీరోగా పరిచయం అయ్యారు. ప్లాట్ ఏంటంటే.. ‘మాజీ నక్సలైట్ కొడుకు అయిన భగత్ ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. స్థానిక గ్యాంగ్‌స్టర్ దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేందకు IPS అధికారి కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? లేదా?’ అన్నది కథ.
సారొచ్చారు
ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా.. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ఇందులో రవితేజ, కాజల్ రిచా గంగోపాథ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే.. 'సంధ్య కార్తిక్‌ను ప్రేమిస్తుంది. అయితే అతడికి ఇదివరకే పెళ్లైన విషయాన్ని తెలుసుకుంటుంది. ఇంతకీ కార్తిక్ గతం ఏంటి? కార్తిక్, సంధ్య కలిశారా? లేదా?’ అన్నది స్టోరీ.
ఓటీటీ వేదిక : హాట్‌స్టార్ & ఆహా
Sir Ocharu Movie Posters TollywoodAndhra.in
ఎవడే సుబ్రహ్మణ్యం
కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మెుట్టమెుదటి ఫిల్మ్ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఇందులో నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ టాలెంటెడ్ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. ప్లాట్ ఏంటంటే.. ‘మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈ క్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు’.
ఓటీటీ వేదిక : సన్ నెక్స్ట్
మహానటి
అశ్వని దత్ రెండో కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి కూడా కల్కి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం.. మహానటి సావిత్రి జీవత కథ ఆధారంగా తెరకెక్కింది. ‘సావిత్రి ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? నటుడు జెమినీ గణేషన్ ఆమె జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? జీవత చరమాంకంలో ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించారు?’ అన్నది స్టోరీ.
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్
జాతి రత్నాలు
వైజయంతి మూవీస్ సబ్ బ్యానర్ అయిన 'స్వప్న సినిమా'.. జాతిరత్నాలు మూవీని నిర్మించింది. ప్లాట్ ఏంటంటే.. ‘మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారు’ అనేది కథ.
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్
అక్టోబర్ 25 , 2024
Ponniyin Selvan-2 Review: పొన్నియన్ సెల్వన్ నటుల విశ్వరూపం… మణిరత్నం నుంచి మరో కళాఖండం!
తమిళ్ సూపర్ స్టార్లతో దర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్‌కు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు బాగుందంటే? కొందరు అర్థంకాలేదన్నారు. అయితే..
ఆ చిత్రంలో ఎన్నో ప్రశ్నలు విడిచిపెట్టారు దర్శకుడు. వాటన్నింటికి సమాధానం చెప్పేందుకు పొన్నియన్ సెల్వన్ 2ని తీర్చిదిద్దారు. గత నెల రోజుల నుంచి భారీగా ప్రమోషన్లు చేసిన ఈ చిత్రం విడుదలయ్యింది. మరీ, సినిమా విజయం సాధించిందా? మణిరత్నం మ్యాజిక్ పనిచేసిందా? అనేది సమీక్షిద్దాం.
దర్శకుడు: మణిరత్నం
నటీ నటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తీ, త్రిష, శోభితా, ఐశ్వర్య లక్ష్మి
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
కథేంటి?
చోళ రాజ్య రాకుమారుడు అరుణ్మొళి ( జయం రవి ) ని అంతమెుందించడానికి జరిగిన కుట్రతో మెుదటి భాగం పూర్తవుతుంది. అతడు నిజంగానే చనిపోయాడా? లేదా సామంతరాజుల కుట్రలు తెలుసుకోవాలని వెళ్లిన వల్లవరాయుడు ( కార్తీ ) కాపాడాడా? తమ్ముడి మరణించినట్లు వస్తున్న వార్తలతో ఆదిత్య కరికాలుడు( విక్రమ్ ) ఏం చేశాడు ? చోళుల అంతం చూడాలని నందినీ( ఐశ్వర్య రాయ్ ) ఎందుకు అనుకుంటుంది? ఇలా ఎన్నో ప్రశ్నలకి సమాధానమే పొన్నియన్ సెల్వన్ 2 కథ.
ఎలా ఉంది
మెగాస్టార్ వాయిస్ ఓవర్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. అరుణ్మోళిని వల్లవరాయుడు, నందినీ, బుద్దిస్టులు కాపాడటంతో కథ మెుదలవుతుంది. కుట్ర విషయాన్ని తెలుసుకున్న ఆదిత్య కరికాలుడి ఎత్తుగడలతో చకచకా ముందుకు కదులుతుంది.
ఆదిత్య కరికాలుడు- నందినీ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఇద్దరూ ఎదురుపడిన సంఘటన మరో లెవల్‌లో ఉంటుంది. చోళులను అంతం చేయాలని నందినీ ఎందుకు అనుకుంటుందనే సన్నివేశాలతో పాటు రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనుకునే పళవెట్టురాయర్ ఎత్తుగడలతో ఎక్కడా బోర్ కొట్టదు.
త్రిష, ఐశ్వర్య రాయ్ ఇద్దరూ కలిసి కనిపించిన ఫ్రేమ్ చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నంత అందంగా మెరిశారు. సినిమా ప్రారంభమైన తర్వాత డీసెంట్ స్క్రీన్‌ప్లే వెళ్లినప్పటికీ కాస్త స్లో నరేషన్ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. ఇది మణిరత్నం స్టైల్ అయినప్పటికీ మరికొంత మెరుగ్గా ఉంటే బాగుండేదనే ఫీలింగ్ వస్తుంది.
క్లైమాక్స్‌ను త్వరగా ముగించాలని చేసినట్లు అనిపిస్తుంది. మరింత ఫోకస్ పెట్టి ఉంటే ప్రేక్షకులకు సినిమా ఎక్కువగా కనెక్ట్ అయ్యేది.
ఎవరెలా చేశారు ?
పొన్నియన్ సెల్వన్ 2లో విక్రమ్ తన విశ్వరూపం చూపించాడు. మెుదటిపార్ట్‌లో తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ ఇందులోనూ ఆయనదే హవా. మరో గుర్తుండిపోయే క్యారెక్టర్ అంటే ఐశ్వర్య రాయ్ అనే చెప్పాలి. నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలోనూ నటించి మెప్పించింది.
జయం రవి, కార్తీ తమ క్యారెక్టర్లకు ప్రాణం పోశారు. ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ మెుదటి భాగంలో చాలామంది కనెక్ట్ అయ్యేది వల్లవరాయన్ కార్తీ పాత్రతోనే. ప్రేక్షకులు ఈ సినిమాలోనూ ఆ క్యారెక్టర్‌తో ప్రయాణం చేస్తారు. త్రిష, శోభితా దూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి పాత్రల పరిధి మేరకు నటించారు.
దర్శకుడు మణిరత్నం మెుదటి భాగంతో పోలిస్తే రెండో పార్ట్‌ను కాస్త మెరుగ్గా తీశారని చెప్పవచ్చు. సినిమాను నీట్‌గా హ్యాండిల్ చేశారు. స్లో నెరేషన్ చేసినప్పటికీ ప్రేక్షకులు విజయాన్ని కట్టబెట్టడం ఖాయమే.
సాంకేతిక పనితీరు
సినిమాకు హైలెట్‌గా నిలిచింది సినిమాటోగ్రఫీ. రవి వర్మన్ తన పనితీరుతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. దర్శకుడి ఊహా చిత్రాన్ని అచ్చుగుద్దినట్లుగా ప్రేక్షకులకు చూపించిన గొప్పతనం ఆయనకే దక్కుతుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సినిమాకు సంగీతం ప్లస్ పాయింట్. ఈ చిత్రంలో ఏ. ఆర్.రెహమాన్ తన ప్రతిభ చూపించినప్పటికీ కొన్ని చోట్ల మరింత బాగుండాలి అనిపిస్తుంది. మెుత్తంగా ఫర్వాలేదనే చెప్పాలి. కానీ, రెహమాన్ నుంచి ఆశించినంత స్థాయిలో లేదు.
బలాలు
కథ, కథనం
నటీనటులు
సినిమాటోగ్రఫీ
బలహీనతలు
స్లో నరేషన్
రేటింగ్ : 3.25/5
ఏప్రిల్ 28 , 2023
Heroes as old men: ప్రభాస్, మహేష్ ముసలివారైతే ఇలా ఉంటారా? పాపం హృతిక్, షారుఖ్.. స్టార్లను వృద్ధులుగా మార్చేసిన AI..!
ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) అభివృద్ధి చెందుతోంది. మనిషి చేసే ప్రతీ పనిని చక్కబెట్టేందుకు కంప్యూటర్లు సిద్ధమవుతున్నాయి. అంతేగాక మనుషుల ఆకృతులను మార్చేస్తూ AI నవ్వులు పూయిస్తోంది. సెలబ్రిటీల జెండర్లు మారుస్తూ వారి ఫొటోలను ఫ్యాన్స్ ముందుకు తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్‌కు స్టార్ హీరోలు వృద్దులైతే ఎలా ఉంటారో అన్న ఆలోచన వచ్చింది. వెంటనే AIకి పని చెప్పాడు. AI ఇచ్చిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
1. అల్లుఅర్జున్:
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో పాటు బయట కూడా ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తుంటాడు. నయా ట్రెండ్ ఫాలో అవుతూ ఫ్యాన్స్‌కు అలరిస్తాడు. అటువంటి అల్లుఅర్జున్ వృద్దుడుగా ఎలా ఉంటాడో కృత్రిమ మేధ (AI) ఒక ఫొటో రూపంలో చూపించింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. ముఖాన ముడతలు, మెరిసిన జట్టు-గడ్డంతో అల్లుఅర్జున్ ఇందులో కనిపించాడు.
Image Courtesy: Instagram(SAHID)
2. మహేష్ బాబు
టాలీవుడ్‌లోని మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో మహేష్ ముందు వరుసలో ఉంటాడు. 47 ఏళ్ల వయసులోని పాతికేళ్ల కుర్రాడిగా మహేష్ కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్‌కు వయసు అయిపోతే ఎలా ఉంటాడో AI ఒక ఇమేజ్‌ను తయారు చేసి చూపించింది.
Image Courtesy: Instagram(SAHID)
3. ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫిజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్‌కు ఏ హీరోకి లేని యూనిక్ పర్సనాలిటీ ఉంది. అటువంటి ప్రభాస్‌ను కూడా AI తన ఊహాజనితమైన ఫొటోలో వృద్ధుడిగా మార్చేసింది. ఆ ఫొటోను మీరూ చూసేయండి.
Image Courtesy: Instagram(SAHID)
4. షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్‌షాగా షారుఖ్ ఖాన్‌కు పేరుంది. ఎంతో హ్యాండ్సమ్‌గా ఉండో షారుఖ్ ఓ దశలో అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అటువంటి షారుఖ్ లుక్‌ను కూడా AI మార్చివేసింది. వయసైపోతే షారుఖ్ ఎలా ఉంటాడో ఫ్యాన్స్‌కు చూపించింది.
Image Courtesy: Instagram(SAHID)
5. హృతిక్ రోషన్
బాలీవుడ్ అగ్రహీరోల్లో హృతిక్ రోషన్ ఒకరు. కండల తిరిగిన దేహంతో హృతిక్ ఇప్పటికీ ఎంతో యంగ్‌గా కనిపిస్తున్నాడు. అతడి ఫొటోను కూడా AI తన సాంకేతికతతో వృద్దుడిగా మార్చేసింది. ముఖంపై ముడతలు, తెల్లటి గడ్డంతో ఉన్న హృతిక్‌ను గుర్తు పట్టడం కష్టమే.
Image Courtesy: Instagram(SAHID)
6. అమీర్ ఖాన్
ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ వయసును కూడా AI అమాంతం పెంచేసింది. వృద్దుడిగా మారిన అమీర్‌ఖాన్ ఊహాజనీత ఫొటోను రూపొందించింది. ఆ ఫొటో ఏంటో మీరు చూడండి.
Image Courtesy: Instagram(SAHID)
7. సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా వయసైపోతే ఎలా ఉంటాడో AI ఫొటో రూపంలో చూపించింది. అయితే ఈ ఫొటోలో సల్మాన్ లుక్ ఓ సైంటిస్టును పోలి ఉంది.
Image Courtesy: Instagram(SAHID)
8. అక్షయ్ కుమార్
బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటువంటి అక్షయ్‌ను కూడా AI ఓల్డ్ మ్యాన్‌గా మార్చేసింది. ఈ లుక్‌లో అక్షయ్ హాలీవుడ్ నటుడిలాగా అనిపిస్తున్నాడు.
Image Courtesy: Instagram(SAHID)
9. షాహిద్ కపూర్
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌ను కూడా AI తన సాంకేతికతతో వయసు మళ్లిన వ్యక్తిగా మార్చేసింది. AI చేసిన ఫొటోలో షాహిద్ పూర్తి డిఫరెంట్‌గా కనిపించాడు.
Image Courtesy: Instagram(SAHID)
10. రణబీర్ కపూర్
బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్‌ను AI కురువృద్దుడిగా మార్చేసింది. ముడతలు పడిన చర్మంతో రన్‌బీర్ కనిపించాడు.
Image Courtesy: Instagram(SAHID)
మే 15 , 2023
AI Gender Swapped: జంబలకిడి పంబ అంటే ఇదే.. మన సెలబ్రిటీలను ఇలా చూసి ఉండరు..!
జంబలకిడి పంబ సినిమా గుర్తుందా. ఇందులోని మగవారు, ఆడవారిగాను, ఆడవారు మగవారిగానూ మారుతుంటారు. కట్టుబొట్టుతో అచ్చం తమ అపొజిట్ జెండర్‌గా కనిపిస్తారు. అయితే కృత్రిమ మేధ(AI) కూడా సరిగ్గా ఇదే చేసింది. టాప్ సెలబ్రిటీల చిత్రాలను తీసుకొని వారి జెండర్‌ను మార్చేసింది. మరి మన సెలబ్రిటీలు తమ ఆపోజిట్ జెండర్‌లో ఎలా ఉంటారు?. మగవారు ఆడవారిలాగా, ఆడవారు మగవారిగా మారితే వారి లుక్ ఎలా ఉంటుంది?. తెలియాలంటే ఈ కథనం చూసేయండి.
1. నరేంద్ర మోదీ
ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నేతల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరు. ప్రధాని మోదీ తనదైన వేషధారణతో ఎంతో హుందాగా కనిపిస్తారు. అటువంటి మోదీ ఒక మహిళ అయితే ఎలా ఉంటాడో AI చూపించింది.
2. విరాట్ కోహ్లీ
అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉండే కోహ్లీ బయట చాలా స్టైలిష్‌గా కనిపిస్తాడు. అటువంటి విరాట్ కోహ్లీ.. యువతిగా మారితే ఎలా ఉంటాడో ఒక లుక్ వేయండి.
https://twitter.com/mvdhav/status/1612298825368240128?s=20
3. ఎలాన్ మస్క్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్నారు. ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మస్క్ అమ్మాయి అయితే ఎలా ఉంటారో AI చేసి చూపించింది.
4. అజయ్ దేవ్‌గన్
బాలీవుడ్ సినిమాల్లో పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా నటుడు అజయ్ దేవ్‌గన్ అలరించాడు. యాక్షన్, ఫైట్ సీన్లలో తనదైన నటనతో ఆకట్టున్నాడు. అలాంటి దేవ్‌గన్ మహిళ అయితే ఎలా ఉంటాడో AI మీ ముందు ఉంచింది.
https://twitter.com/mvdhav/status/1612299501737496576?s=20
5. అలియాభట్
బాలీవుడ్ నటి అలియా భట్ పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన అందం, అభినయం, నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అటువంటి అలియా మగాడిగా మారితే ఇంకెంత హ్యాండ్సమ్‌గా ఉంటాడో కదా.
6. మార్క్ జూకర్‌బర్గ్
ఫేస్‌బుక్ సృష్టికర్త మార్క్ జూకర్‌బర్గ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన కూడా తన ఆపోజిట్ జెండర్‌లో ఎలా ఉంటారో AI చూపించింది.
https://twitter.com/mvdhav/status/1612300171655917568?s=20
7. దీపికా పదుకొనే
బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో దీపికా పదుకొనే ఒకరు. గ్లామర్ క్వీన్‌గా గుర్తింపు పొందిన ఈ భామ ఒక పురుషుడైతే ఎలా ఉంటాడో మీరే చూడండి.
8. అక్షయ్ కుమార్
బాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరోగా అక్షయ్ కుమార్ గుర్తింపు పొందారు. మహిళల్లోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. అటువంటి అక్షయ్‌ను AI వద్దల్లేదు. ఈ హీరో అమ్మాయిగా పుడితే ఎలా ఉంటాడో కళ్లకు కట్టింది.
https://twitter.com/mvdhav/status/1612300512698986498?s=20
9. ప్రభాస్
బాహుబలి సినిమాతో ప్రభాస్ కెరీర్ మారిపోయింది. ఆ సినిమా ప్రభాస్‌కు పాన్ ఇండియా క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. మరి ప్రభాస్ అమ్మాయిగా మారితే ఎలా ఉంటాడో ఒక లుక్కేయండి.
10. లియోనార్డో డికాప్రియో
టైటానిక్ సినిమా ద్వారా లియోనార్డో డికాప్రియా పేరు మారుమోగింది. ఆ తర్వాత కూడా పలు హిట్ చిత్రాలతో లియోనార్డో మంచి గుర్తింపు సంపాదించాడు. హాలీవుడ్ హీరోయిన్ల అందానికి ఏమాత్రం తీసిపోని విధంగా అమ్మాయి లుక్‌లో లియోనార్డో ఉన్నాడు.
https://twitter.com/mvdhav/status/1612301198668992513?s=20
11. లియోనెల్ మెస్సీ
అర్జెంటినా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనాల్ మెస్సీ.. తనదైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. అతడు కూడా అమ్మాయి లుక్‌లో ఎలా ఉంటాడో AI మార్ఫింగ్ చేసి చూపించింది.
12. క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కూడా తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. మహిళగా రొనాల్డో లుక్ ఎలా ఉందో చూసేయండి.
https://twitter.com/mvdhav/status/1612301499228655616?s=20
13. రాక్
హాలీవుడ్ సినిమాలను విపరీతంగా ఇష్టపడేవాళ్లలో రాక్ తెలియని వారు ఉండరు. కండలు తిరిగిన దేహంతో ఎన్నో సూపర్ హిట్ యాక్షన్ సినిమాల్లో ఆయన నటించాడు. అటువంటి రాక్ మహిళగా మారితే ఎలా ఉంటాడు? ఊహించడానికే కష్టంగా ఉంది కదా.
14. నోరా ఫతేహి
బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి కూడా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. తన గ్లామర్ స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. మరి నోరా అబ్బాయిగా మారితే ఎలా ఉంటుందో చూడండి.
https://twitter.com/mvdhav/status/1612301736508784641?s=20
15. షారుక్ ఖాన్
బాలీవుడ్ బాద్‌షాగా పేరు సంపాదించిన షారుక్ ఖాన్.. అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అటువంటి షారుక్ మహిళగా మారితే ఎలా ఉంటాడో చూడాలని ఉందా. అయితే చూసేయండి.
16. బాబా రాందేవ్
యోగా గురు బాబా రాందేవ్ అంటే దేశంలో తెలియని వారు ఉండరు. ఎంతో కఠినమైన ఆసనాలను సైతం చాలా తేలికగా ఆయన వేస్తుంటారు. అయితే బాబా రాందేవ్ ఫొటోను మహిళ చిత్రంగా మార్చడంలో AI విఫలమైంది. కేవలం ఆయన్ను యంగ్‌గా మాత్రమే మన ముందు ఉంచింది.
https://twitter.com/mvdhav/status/1612302529223880705?s=20
17. ముకేష్ అంబానీ
దేశంలోని అపర కుభేరుల్లో ముకేష్ అంబానీ ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీ కింద అనేక వ్యాపార సామ్రాజ్యాలు స్థాపించి ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. అటువంటి అంబానీ మహిళగా మారితే ఎలా ఉంటారో చూడండి.
18. మోనాలిసా
ప్రపంచంలోని అత్యంత అందమైన చిత్ర పటాల్లో మోనాలిసాది తొలి స్థానంలో ఉంటుంది. అలాంటి మోనాలిసా అబ్బాయిగా మారితే ఎలా ఉంటుందో AI చేసి చూపించింది.
https://twitter.com/mvdhav/status/1612302687500120064?s=20
మే 05 , 2023