• TFIDB EN
  • రక్షణ
    UATelugu
    కిరణ్‌ (పాయల్‌) ఐపీఎస్‌ ట్రైనింగ్‌లో ఉండగా ఆమె స్నేహితురాలు సూసైడ్‌ చేసుకుంటుంది. ఏసీపీగా ఛార్జ్‌ తీసుకున్న తర్వాత అరుణ్‌ అనే వ్యక్తిపై ఆమె అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో అరుణ్‌ సూసైడ్‌ చేసుకోవడంతో కిరణ్‌ సస్పెండ్ అవుతుంది. మరోవైపు వరుసగా యువతులు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇందుకు కారణం ఎవరు? ఈ కేసును కిరణ్‌ ఎలా సాల్వ్‌ చేసింది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    2024 Aug 110 months ago
    రక్షణ చిత్రం నేటి నుంచి(ఆగస్టు 1) ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    పాయల్ రాజ్‌పుత్
    మానస్
    రాజీవ్ కనకాల
    వినోద్ బాలా
    శివన్నారాయణ నారిపెద్ది
    సిబ్బంది
    ప్రణ్‌దీప్ ఠాకూర్దర్శకుడు
    ప్రణ్‌దీప్ ఠాకూర్నిర్మాత
    సాగర్ మహతిసంగీతకారుడు
    కథనాలు
    Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
    Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
    తెలుగులో ఎంతో మంది నటులు శ్రీకృష్ణుడి వేషధారణలో నటించి తమదైన ముద్ర వేశారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారల్లో శ్రీకృష్ణావతారం ఎంతో ఉత్కృష్ణమైంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ద్వాపర యుగంలో శ్రీమహా విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆయన నోటి నుంచి వచ్చిన జ్ఞాన బోధే పంచవేదం భగవద్గీతగా విరాజిల్లుతోంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువుగా ప్రసిద్ధిచెందాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా వెండితెరపై శ్రీకృష్ణుడి పాత్రలో మెరిసిన నేటి తరం యువ కథనాయకులు, పాత తరం హీరోలపై YouSay Telugu ప్రత్యేక కథనం. జూ.ఎన్టీఆర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వచ్చిన ‘బృందావనం’ సినిమాలో కొద్దిసేపూ జూ. ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపించి అలరించాడు. ఈ సినిమాలో ‘చిన్నదో వైపు, పెద్దదో వైపు’  పాటలో తారక్ మోడ్రన్ కృష్ణుడి గెటప్‌లో వావ్ అనిపించాడు. అయితే రాముడిగా, యంగ్ యముడి పాత్రలో ప్రేక్షకులను అలరించిన  జూ.ఎన్టీఆర్‌ను.. కృష్ణుడిగా ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో చూడాలని ఆయన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. అయితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌ మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రలో జూ.ఎన్టీఆర్ నటించే అవకాశం ఉన్నట్లు వార్తలైతే ఉన్నాయి. https://www.youtube.com/watch?v=hzAaEN6yc1g మహేష్ బాబు సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఓ సినిమాలో శ్రీకృష్ణుడిగా అలరించాడు. ఆయన కేరీర్ ఆరంభంలో వచ్చిన ‘యువరాజు’ సినిమాలోని 'గుంతలకిడి గుంతలకిడి గుమ్మ' పాటలో శ్రీకృష్ణుడిగా కనువిందు చేశాడు. కృష్ణుడి వేషంలో మహేష్ బాగా సెట్ అయ్యాడని అప్పట్లో అభిమానులు తెగ సంతోషపడిపోయారు. https://youtu.be/b02ieSLiyRI?feature=shared పవన్ కళ్యాణ్ ఈ తరం హీరోల్లో కృష్ణుడి పాత్రలో అలరించిన మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా మెరిసాడు. సామన్య మానవుడి రూపు దాల్చిన  శ్రీకృష్ణ పరమాత్మ వేషంలో పవర్ స్టార్ కనిపించి కనువిందు చేశాడు. https://www.youtube.com/watch?v=HNeBe1JvBmU నాగార్జున మంచు విష్ణు హీరోగా వచ్చిన 'కృష్ణార్జున' మూవీలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. నాగార్జున సైతం మోడ్రన్ కృష్ణుడిగా... సామాన్యుడిలా కనిపించి అలరించాడు. సునీల్ విలక్షణ నటుడు సునీల్ తొలిసారి తేజా డైరెక్షన్‌లో వచ్చిన నువ్వు- నేను సినిమాలో కాసేపు చిలిపి కృష్ణుడిగా కనిపించి నవ్వులు పూయించాడు. ‘గాజువాక పిల్ల మేము గాజులోల్లం కాదా’ సాంగ్‌లో సునీల్ కృష్ణుడిగా మెరిసాడు. అలాగే అందాలరాముడులో కొంటె శ్రీకృష్ణుడిగా కాసేపు కనువిందు చేశాడు.. https://youtu.be/VhyejE23l4M?feature=shared రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ డ్యుయల్ రోల్‌లో మెప్పించిన ‘కన్నయ్య కిట్టయ్య’ సినిమాలో... నటకిరిటి శ్రీకృష్ణుడిగా, భక్తుడిగా రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. బాలకృష్ణ పౌరాణిక వేషాల్లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ఆహార్యం సంపాదించిన నటులు బాలకృష్ణ. శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు, ఎన్టీఆర్ చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడిగా నటించి ప్రేక్షకులను అలరించారు. https://youtu.be/wcJhLH_T6N0?feature=shared శోభన్ బాబు: వెండితెరపై శ్రీకృష్ణుడి వేషం వేసి మెప్పించిన నటుల్లో శోభన్ బాబు ఒకరు.  బాపు డైరెక్షన్‌లో వచ్చిన 'బుద్దిమంతుడు' చిత్రంలో కాసేపూ ఆయన కృష్ణుడి వేషంలో దర్శనమిచ్చారు. 'కురుక్షేత్రం' సినిమాలో పూర్తి నిడివిలో కృష్ణ భగవానుడిగా అలరించారు. https://youtu.be/Nf2ts_Cld-s?feature=shared కాంతరావు ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడి పాత్రలో మెప్పించిన నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన తొలిసారి మలయాళ చిత్రం భక్త కుచేల చిత్రంలో కృష్ణుడిగా కనిపించారు. ఆ తర్వాత పాండవ వనమాసం, నర్తనశాల, ప్రమీలార్జనీయం చిత్రాల్లో కృష్ణుడి వేషంలో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల మదిలో కృష్ణుడు, రాముడు అంటే గుర్తుకొచ్చే పేరు ఎన్టీఆర్. వెండితెరపై ఎంతమంది కృష్ణుడి వేషంలో కనిపించినా ఆయనకు సాటి రాలేదనేది చాలా మందివాదన. ఆయన రూపం, సంభాషణ చాతుర్యం ఇలాంటివన్నీ ఎన్టీఆర్‌ను వెండితెర కృష్ణుడిగా నిలబెట్టాయి. ఆయన సినిమాలు, ఇతర నాటకాల్లో కలిపి మొత్తం 33 సార్లు శ్రీకృష్ణుడిగా కనిపించారు. మాయాబజార్, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణతులాభారం, దానవీరశూరకర్ణ వంటి చిత్రాల్లో ఆయన కృష్ణుడిగా అలరించారు. శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ 18 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. https://www.youtube.com/watch?app=desktop&v=JlsXEmQIWNs
    సెప్టెంబర్ 06 , 2023
    <strong>Mohan Babu: హైకోర్టులో మోహన్‌ బాబుకు బిగ్‌ షాక్‌.. అరెస్టు కావడం ఖాయమేనా?</strong>
    Mohan Babu: హైకోర్టులో మోహన్‌ బాబుకు బిగ్‌ షాక్‌.. అరెస్టు కావడం ఖాయమేనా?
    నటుడు మంచు మోహన్ బాబుకు (Manchu mohan babu) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మీడియా ప్రతినిధిపై దాడికి సంబంధించి పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ మోహన్‌బాబు హైకోర్టుకు వెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపో, మాపో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసే అవకాశముందను అంటున్నారు.  హైకోర్టును ఏం కోరారంటే? పహడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న మోహన్‌ బాబు (Manchu mohan babu) ఫాంహౌస్‌లో డిసెంబర్‌ 10న తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంచు వివాదం కవరేజ్‌కు వెళ్లిన ఓ మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మోహన్‌బాబుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు నోటీసులు సైతం జారీ చేశారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని.. అరెస్టు, తదుపరి దర్యాప్తు చేయకుండా పోలీసులను ఆదేశించాలని మోహన్‌బాబు తన పిటిషన్‌లో కోరారు.  https://twitter.com/DailyCultureYT/status/1866490766245417269 వాదనలు ఎలా జరగాయంటే? మోహన్‌ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటీషన్‌పై సోమవారం (డిసెంబర్‌ 23) హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మోహన్‌ బాబు తరపు లాయర్‌ వాదనలు వినిపించారు. గాయపడిన మీడియా ప్రతినిధితో మోహన్‌బాబుకు కనీసం పరిచయం కూడా లేదని, అతనెవరో కూడా తెలియనప్పుడు హత్యాయత్నం కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు సరైనవి కావని వాదనలు వినిపించారు. మోహన్‌బాబు కుటుంబ సమస్యలు, గొడవలను మీడియా ఛానళ్లు, సోషల్‌మీడియా పెద్దవిగా చేసి చూపించాయని పేర్కొన్నారు. బెయిల్ ఎందుకు కొట్టిసిందంటే? మంచు మనోజ్‌తో వచ్చిన బౌన్సర్లతో మోహన్‌ బాబుకు ప్రాణ హాని ఉండటంతో ఆ విధంగా దాడి చేశారని మోహన్‌బాబు లాయర్‌ వాదించారు. అనుకోకుండా జరిగిన ఘటన అని చెప్పుకొచ్చారు. మరోవైపు పోలీసుల తరపున వాదించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. బాధితుడి వాంగ్మూలం మేరకు సెక్షన్లు నమోదు చేసినట్లు కోర్టుకు స్పష్టం చేశారు. ఈ కేసులో మోహన్‌బాబు విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పారు. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదన విన్న న్యాయమూర్తి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేశారు.   అరెస్టుకు రంగం సిద్ధం! హైకోర్టులో ముందస్తు బెయిల్‌ దాఖలు చేసిన నేపథ్యంలోనే మోహన్‌బాబు అరెస్టు ఆలస్యమైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బెయిల్‌ తిరస్కరిస్తున్నట్లు కోర్టు ప్రకటించడంతో ఆయన అరెస్టుకు క్లియరెన్స్ వచ్చినట్లేనని ప్రచారం జరుగుతోంది. హత్యాయత్నం కేసుకు సంబంధించి త్వరలోనే ఆయన్ను అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందని క్రైమ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్‌ అరెస్టు వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడు మోహన్‌బాబు కూడా అరెస్టు అయితే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఫిల్మ్‌ వర్గాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
    డిసెంబర్ 23 , 2024
    Kajal Aggarwal: కాజల్‌ Vs పాయల్‌ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!
    Kajal Aggarwal: కాజల్‌ Vs పాయల్‌ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!
    గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే థియేటర్లలో విడుదలై సందడి చేస్తూ వచ్చాయి. ఇందులో కొన్ని హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే మరికొన్ని ఫ్లాప్‌గా నిలిచి.. నెల అయినా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే ఈ వారం కూడా స్టార్‌ హీరోల సినిమాలు థియేటర్లలోకి రాకపోవడం ఆడియన్స్‌ కాస్త నిరాశకు గురి చేస్తోంది. అయితే ఈ వారం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న రెండు చిత్రాలు మాత్రం అందరిలో ఆసక్తి పెంచుతున్నాయి. ప్రముఖ హీరోయిన్స్‌ కాజల్‌ అగర్వాల్‌ నటించిన ‘సత్యభామ’, పాయల్‌ రాజ్‌పుత్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ‘రక్షణ’ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారోనని ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది.&nbsp; తొలిసారి ఖాకీ డ్రెసుల్లో.. కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో సుమన్‌ చిక్కాల తెరకెక్కించిన చిత్రం 'సత్యభామ' (Satyabhama). బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పోలీసు అధికారిణిగా కనిపించనుంది. ఆమె పోలీసు ఆఫీసర్‌గా చేయడం కెరీర్‌లో ఇదే తొలిసారి. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. అటు పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) చేసిన లేడీ ఓరియెంటేడ్‌ చిత్రం 'రక్షణ' (Rakshana) కూడా జూన్‌ 7వ తేదీనే థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇందులోనూ పాయల్‌ కూడా తొలిసారి ఖాకీ దుస్తుల్లో ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్‌ కానుండటంతో కాజల్‌, పాయల్‌ మధ్య కోల్డ్‌ వార్‌ మెుదలైనట్లు కనిపిస్తోంది.&nbsp; యాక్షన్‌తో రాణించేనా! కాజల్‌ అగర్వాల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ గత చిత్రాలను పరిశీలిస్తే.. వీరు గ్లామర్‌తోనే ఆడియన్స్‌ను ఎక్కువగా అలరించారు. అటువంటిది తొలిసారి వీరిద్దరు ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా ఎంతో పవర్‌ఫుల్‌ అయినా పోలీసు అధికారిణి పాత్రల్లో థియేటర్లలోకి వస్తున్నారు. మరి వీరు యాక్షన్ సీక్వెన్స్‌లో ఏ మేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే విడుదలైన ‘సత్యభామ’, ‘రక్షణ’ ట్రైలర్స్‌ రెండూ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. కాజల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ఇద్దరూ తమ యాక్షన్‌తో దుమ్మురేపినట్లే కనిపిస్తోంది. కాజల్‌, పాయల్‌ మధ్య ప్రస్తుతం నెలకొన్న థగ్‌ ఆఫ్‌ వార్‌లో విజయం ఎవరిదో ఈ శుక్రవారం (జూన్‌ 7) తేలిపోనుంది.&nbsp; ఇతర చిత్రాలు ఈ శుక్రవారం సత్యభామ, రక్షణ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందిన 'లవ్‌ మౌళి' (Love Mouli) చిత్రం.. అనేక వాయిదాల తర్వాత ఈ వారమే థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. అలాగే శర్వానంద్‌, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Maname) కూడా ఈ నెల 7న రిలీజ్‌ కానుంది. ఈ మూవీకి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించాడు. మరోవైపు సత్యరాజ్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రలో నటించిన 'వెపన్‌' (Weapon) చితరం కూడా ఈ శుక్రవారం మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. వార్నర్‌ బ్రదర్స్‌, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్‌ తెలిపారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌ కాబోతున్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఈ కింద ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి.&nbsp; https://telugu.yousay.tv/this-week-movies-these-are-the-films-series-that-will-double-your-happiness-this-week.html
    జూన్ 04 , 2024
    Payal Rajput: ఇండస్ట్రీలో పాయల్ రాజ్‌పుత్‌కు వేధింపులు.. నటి సెన్సేషనల్‌ పోస్టు!
    Payal Rajput: ఇండస్ట్రీలో పాయల్ రాజ్‌పుత్‌కు వేధింపులు.. నటి సెన్సేషనల్‌ పోస్టు!
    ఆర్‌ఎక్స్‌ 100 (RX100) చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించిన నటి 'పాయల్‌ రాజ్‌పుత్‌' (Payal Rajput). ఆ మూవీ తర్వాత పలు చిత్రాల్లో చేసినప్పటికీ ఈ అమ్మడికి ఆ స్థాయి సక్సెస్‌ రాలేదు. ఇటీవల ‘RX100’ డైరెక్టర్‌తో చేసిన 'మంగళవారం' సినిమాతో పాయల్‌ తెలుగు ఆడియన్స్‌ను మరోమారు పలకరించింది. ఇందులో పాయల్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో తనకు వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఆమె చేసిన ఓ పోస్టు.. అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; అసలు ఏ జరిగిందంటే! 2020లో 'రక్షణ' అనే చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ నటించింది. అయితే ఈ సినిమా ఇప్పటివరకూ విడుదల కాలేదు. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ప్రదీప్‌ ఠాకూర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్‌ 7న విడుదల చేయనున్నట్లు లేటెస్ట్‌గా మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఈ మూవీకి సంబంధించిన పారితోషికం ఇంతరవకూ తనకు చెల్లించలేదని పైగా ప్రమోషన్స్‌లో పాల్గొనాలని మేకర్స్‌ వేధింపులకు గురిచేస్తున్నారంటూ పాయల్‌ సంచలన ఆరోపణలు చేసింది. ‘చట్టపరమైన చర్యలు తీసుకుంటా’ ‘రక్షణ’ మేకర్స్‌ వేధింపులపై నటి పాయల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. దీని ప్రకారం.. ‘చిత్రబృందం ఇప్పటివరకు నాకు పారితోషికం ఇవ్వలేదు. ఇటీవల నా సినిమాలు సక్సెస్‌ కావడంతో దానిని ఉపయోగించుకోవాలని మూవీ టీమ్‌ భావిస్తోంది. ఎలాంటి బకాయిలు చెల్లించకుండా ప్రమోషన్లకు రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాలేనని నా టీమ్‌ చెప్పినా వినడం లేదు. నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగేలా నా పేరును వాడుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని మీటింగ్స్‌లో నాపై అభ్యంతరకరంగా మాట్లాడారు. పారితోషికం విషయం తేల్చకుండా.. నా అనుమతి లేకుండా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అందుకే నా టీమ్ ఆ చిత్రబృందంపై న్యాయపరమైన చర్చలు తీసుకునేందుకు సిద్ధమైంది’ అని పాయల్‌ తెలిపింది.&nbsp; View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) పాయల్‌ బిజీ బిజీ 'మంగళవారం' మూవీ సక్సెస్‌తో పాయల్‌ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తోంది. తమిళంలో 'గోల్‌మాల్‌', 'ఏంజెల్‌' చిత్రాల్లో పాయల్‌ నటిస్తోంది. తెలుగులో 'కిరాతక' సినిమాలో చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. కాగా, విడుదల సిద్ధంగా ఉన్న ‘రక్షణ’ మూవీలో పాయల్‌ పోలీసు అధికారిణిగా కనిపించనుంది.&nbsp;
    మే 20 , 2024
    Latest OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు
    Latest OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు
    ఫిబ్రవరిలో లాస్ట్‌ వీక్ రానే వచ్చింది. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా లేవు. అయితే వ్యూహం, ఆపరేషన్ వాలెంటైన్, చారీ 111, భూతద్దం భాస్కర్ ఈ వీకెండ్ విడుదలయ్యే సినిమాల్లో చెప్పుకోదగ్గవి. మరి వీటిలో ఏది బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందో చూడాలి. మరోవైపు ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 25కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం. ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) మెగా హీరో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శక్తి&nbsp; ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. హిస్టారికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల జరిగిన ప్రిరిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అయి చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. ఇలాంటి సినిమాలు దేశ రక్షణ కోసం పొరాడే సైనికులకు నిజమై సెల్యూట్ అంటూ ప్రశంసించారు. భూతద్దం భాస్కర్ నారాయణ(Bhoothaddam Bhaskar Narayana) శివ కందుకూరి, రాశి సింగ్ ప్రధాన పాత్రల్లో పురుషోత్తం రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విలేజ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. చారీ 111 (Chaari 111) స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్, సంయుక్త విశ్వనాథన్ జంటగా నటిస్తున్న చిత్రం చారీ 111. ఈ చిత్రాన్ని టీజీ కీర్తి కుమార్ డైరెక్ట్ చేయగా..సైమన్ కే కింగ్ సంగీతం అందించారు. ఈ సినిమా యాక్షన్, కామెడీ జనర్‌లో తెరకెక్కింది. చారీ 111 చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ఈ వారం ఓటీటీల్లో అలరించనున్న సినిమాలు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott Title CategoryLanguagePlatformRelease DateAmbajipeta Marriage Band&nbsp;MovieTeluguAhaMarch 01Indigo&nbsp;MovieIndonesian CinemaNetflix&nbsp;Feb 27American Conspiracy: The Octopus MurdersSeries&nbsp;EnglishNetflix&nbsp;Feb 28Code 8 Part 2MovieEnglishNetflix&nbsp;Feb 28The Mire Season 3Series&nbsp;PolishNetflix&nbsp;Feb 28A Round of ApplauseSeriesTurkishNetflix&nbsp;Feb 29Man SooangMovieThaiNetflix&nbsp;Feb 29The Indrani Mukherjee Story: Buried TruthMovieHindiNetflix&nbsp;Feb 29Furies&nbsp;SeriesFrenchNetflix&nbsp;Feb 29Mamla Legal HighSeriesHindiNetflix&nbsp;March 01My Name is Loh KiwonMovieKoreanNetflix&nbsp;March 01Shake, Rattle &amp; Roll: ExtremeMovieTagalogNetflix&nbsp;March 01Somebody Feed Phil Season 7&nbsp;SeriesEnglishNetflix&nbsp;March 01Space ManMovieEnglishNetflix&nbsp;March 01The Pig The Snake and the PigeonMovieMandarinNetflix&nbsp;March 01The Netflix SlamMovieEnglishNetflix&nbsp;March 03Bootcut BalarajuMovieTeluguAmazon PrimeMarch 01Wedding Impossible&nbsp;SeriesKoreanAmazon PrimeFeb 26Anyone But YouMovieEnglishAmazon PrimeFeb 26Poor ThingsMovieEnglishAmazon PrimeFeb 27Blue StarMovieTamilAmazon PrimeFeb 29Paw Patrol: The Mythical MovieMovieEnglishAmazon PrimeFeb 29Iwaju&nbsp;SeriesEnglishDisney+hotstarFeb 28&nbsp; ShogunSeriesEnglishDisney+hotstarFeb 28Wonderful WorldSeriesKoreanDisney+hotstarMarch 01Sunflower Season 2SeriesHindiZee 5March 01Five Nights at Freddy's&nbsp;MovieEnglishJio CinemaFeb 27
    ఫిబ్రవరి 26 , 2024
    <strong>Google Most Searched Movies 2024: టాప్ 10 చిత్రాల్లో 3 తెలుగు సినిమాలే.. ప్రభాస్ డబుల్ ధమాకా!</strong>
    Google Most Searched Movies 2024: టాప్ 10 చిత్రాల్లో 3 తెలుగు సినిమాలే.. ప్రభాస్ డబుల్ ధమాకా!
    గూగుల్ ట్రెండ్స్ ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్‌ చేసిన టాప్‌ 10 భారతీయ సినిమాల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలకు చెందిన చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.&nbsp; Stree 2 అత్యధికంగా సెర్చ్‌ చేసిన భారతీయ సినిమాల్లో బాలీవుడ్ మూవీ ‘స్త్రీ 2’ మొదటి స్థానంలో నిలిచింది. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ₹600 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయం సాధించింది. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక స్త్రీ 2 సినిమా స్టోరీ విషయానికొస్తే... చందేరీ గ్రామంలో ‘స్త్రీ’ సమస్య తొలగింది అని అందరూ ఊపిరి పీల్చుకునేలోపు ‘సర్కట’తో కొత్త సమస్య మొదలవుతుంది. ఈ సమస్యను విక్కీ (రాజ్ కుమార్ రావు), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (ఆపర్ శక్తి ఖురానా)తో కలిసి ఓ భూతం (శ్రద్ధా కపూర్) ఎలా ఎదుర్కొంది? అన్నది స్టోరీ. Kalki 2898 AD రెండో స్థానంలో నిలిచిన ‘కల్కి 2898 AD’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకోణే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ వంటి ప్రముఖులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹1200 కోట్లకు పైగా వసూళ్లు చేసి పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్‌గా నిలిచింది. ఇక కల్కి స్టోరీ విషయానికొస్తే…కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్‌).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. కాశీలో నివసించే భైరవ (ప్రభాస్‌) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. సుమతిని పట్టిస్తే కాంప్లెస్‌ వెళ్లొచ్చని తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్‌ యష్కిన్‌ (కమల్‌ హాసన్‌) పాత్ర ఏంటి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? అన్నది కథ. 12th Fail మూడో స్థానంలో ‘12వ ఫెయిల్‌’ నిలవడం విశేషం. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను దోచుకుని మంచి వసూళ్లు సాధించింది. స్ఫూర్తివంతమైన కథనం ఈ సినిమాను సూపర్ హిట్ చేసింది.&nbsp; ఇక స్టోరీ విషయానికొస్తే…మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్‌ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్‌ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. Laapataa Ladies ఆస్కార్ రేసులో భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన ‘లపాటా లేడీస్‌’ నాలుగో స్థానంలో ఉంది, ఇది మహిళల సెంట్రిక్ కథతో సక్సెస్‌ సాధించింది. Hanu-Man తెలుగు సినీ ప్రియులకు గర్వకారణంగా, ‘హనుమాన్’ ఐదో స్థానంలో నిలిచింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో విడుదలై అనేక రికార్డులను తిరగరాసింది. ₹300 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ సూపర్ హీరో సినిమా, తెలుగు, హిందీ భాషల్లో కూడా ఘన విజయాన్ని అందుకుంది.&nbsp; ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే…సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ. Maharaja ఆరవ స్థానంలో విజయ్ సేతుపతి నటించిన తమిళ చిత్రం ‘మహారాజా’, ఏడో స్థానంలో నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే… మ‌హారాజా ఒక‌ ప్ర‌మాదంలో భార్య‌ను పోగొట్టుకొని ఊరి చివర కూతురితో జీవిస్తుంటాడు. ఒక రోజు మ‌హారాజా గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్తాడు. ఆగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి దాడి చేశార‌ని చెప్తాడు. త‌న బిడ్డను కాపాడిన ల‌క్ష్మిని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తాడు ఇంతకీ ఆ ల‌క్ష్మి ఎవ‌రు? మహారాజా కూతురికి జరిగిన అన్యాయం ఏంటి? విలన్లపై హీరో ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అన్నది కథ. Manjummel Boys మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్‌’, ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. The Greatest of All Time తమిళ్ సూపర్ విజయ్ నటించిన ‘గోట్‌’&nbsp; 8వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విన్నర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఓ మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లి కొడుకును పొగొట్టుకుంటాడు. దీంతో భార్య అను (స్నేహా) అతడ్ని దూరం పెడుతుంది. కొన్నేళ్ల తర్వాత మాస్కోకు వెళ్లిన గాంధీకి చనిపోయాడనుకుంటున్న కొడుకు జీవన్‌ (విజయ్‌) కనిపిస్తాడు. సంతోషంగా ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీకి సంబంధించిన వారు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఈ హత్యలకు కారణం ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు? అన్నది స్టోరీ. Salaar ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి భారీ విజయం సాధించింది.&nbsp; ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే………ఖాన్సార్‌ సామ్రాజ్యానికి రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) రూలర్‌. సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. ఖాన్సార్‌ పీఠం కోసం రాజ మన్నార్‌ను దొరలు సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని హత్య చేస్తారు. తండ్రి కోరిక మేరకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) ఖాన్సార్‌కు రూలర్‌ అవ్వాలని భావిస్తాడు. ఇందుకోసం చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌) సాయం కోరతాడు. ఆ ఒక్క‌డు అంత‌మంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? అన్నది స్టోరీ. Aavesham &nbsp;మలయాళం నుంచి ఫహాద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ పదవ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కల్కి 2898 AD మరియు హనుమాన్ వంటి తెలుగు చిత్రాలు టాప్‌ 10లో చోటు దక్కించుకోవడం ఆశ్చర్యకరం కాదు. ఈ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన హైప్‌ అలాంటిది. హనుమాన్ సంక్రాంతి సమయంలో విడుదలై పాత రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ₹300 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా గూగుల్ ట్రెండ్స్ జాబితాలో ఈ ఏడాది మూడు తెలుగు సినిమాలు, మూడు హిందీ చిత్రాలు, రెండు తమిళ సినిమాలు, రెండు మలయాళ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. 2024 సంవత్సరానికి మరింత ఆసక్తికరమైన సినిమాల జాబితా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
    డిసెంబర్ 12 , 2024
    <strong>Actress Pragya Nagra: తెలుగు హీరోయిన్‌ ప్రైవేటు వీడియో లీక్‌.. నెట్టింట వైరల్‌!</strong>
    Actress Pragya Nagra: తెలుగు హీరోయిన్‌ ప్రైవేటు వీడియో లీక్‌.. నెట్టింట వైరల్‌!
    ప్రముఖ నటి ప్రగ్యా నగ్రా (Actress Pragya Nagra) ప్రైవేటు వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. బట్టలు లేకుండా ప్రియుడితో ఇంటిమేట్‌ అవుతున్న విజువల్స్ అందులో కనిపిస్తున్నాయి.&nbsp; https://twitter.com/harishgurjar968/status/1864994806264394059 https://twitter.com/harishgurjar968/status/1864970419524047288 ప్రైవేటు వీడియో (Actress Pragya Nagra Private Video) లోని యువతి ముఖం ప్రగ్యా లాగే ఉండటంతో ఇది ఆమెకు సంబంధించిందేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Sathish01297782/status/1864988262101631459 MMS వీడియో క్లిప్‌ కావడంతో ఫేక్‌ అయ్యే ఛాన్స్‌ లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మెుత్తం మీద #pragyanagra, #pragyanagrahot, #pragyanagrahotvideos వంటి హాష్‌ ట్యాగ్స్‌ నెట్టింట ట్రెండింగ్‌ అవుతున్నాయి. https://twitter.com/hyy_akr/status/1864986448719392971 ఇటీవల హీరోయిన్స్‌పై డీప్‌ ఫేక్‌ వీడియోలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రగ్యా నగ్రా (Actress Pragya Nagra)ను ఎవరో టార్గెట్‌ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు.&nbsp; https://twitter.com/harishgurjar968/status/1864992278336414014 మెుత్తం మీద ఈ ప్రైవేటు వీడియో వ్యవహారం ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. వీడియోలోని ఫొటోలను క్యాప్చర్‌ చేసి నెటిజన్లు వైరల్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/DimpleboyDimple/status/1864981391450214656 ప్రగ్యా నగ్రా వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1998 డిసెంబర్‌ 14న హరియాణాలోని అంబాలలో జన్మించింది.&nbsp; ఆమెది పంజాబీ కుటుంబం. ఈ భామ విద్యాభ్యాసం మెుత్తం ఢిల్లీలోనే జరిగింది. స్కూలింగ్‌, కాలేజ్‌ స్టడీస్‌తో పాటు మోడలింగ్‌ కెరీర్‌ కూడా దేశ రాజధాని ఢిల్లీలోనే మెుదలైంది.&nbsp; మోడల్‌గా 100కి పైగా కమర్షియల్‌ యాడ్స్‌లో ఈ అమ్మడు (Actress Pragya Nagra) నటించింది. అయితే మోడల్‌ కాకముందు ఆమెకు దేశ రక్షణ దళంలో చేరాలని కోరిక ఉండేది.&nbsp; ప్రగ్యా నగ్రా తండ్రి భారత మిలటరీలో పని చేశారు. దీంతో కాలేజీ డేస్‌లో ఆర్మీలో చేరాలని భావించింది. ఇందుకోసం ఎన్‌సీసీ స్టూడెంట్‌గా చేసింది.&nbsp; మోడలింగ్‌లోకి వచ్చాక ఆమె ఆలోచనల్లో మార్పు వచ్చింది. దీంతో నటిగా కెరీర్‌లో స్థిరపడాలని నిర్ణయించుకొని సినిమాల వైపు అడుగులు వేసింది.&nbsp; 2022లో మలయాళ చిత్రం 'వరలారు ముక్కియం'తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. ఇందులో కోలీవుడ్‌ నటుడు జీవాకు జోడీగా నటించింది.&nbsp; ఆ తర్వాత మలయాళంలోనే 'ఎన్‌ 4' (2023) మరో ఫిల్మ్‌ చేసింది. అందులో స్వాతి పాత్రలో అదరగొట్టింది. కానీ ఆ మూవీ హిట్‌ కాకపోవడంతో ప్రగ్యాకు బ్రేక్‌ లేదు.&nbsp; దీంతో మలయాళంలో అడుగుపెట్టిన ప్రగ్యా (Actress Pragya Nagra Private Video) అక్కడ 'నధికలిల్‌ సుందరి యమున' అనే చిత్రంలో చేసింది. ఈ మూవీ కమర్షియల్‌గా ప్రగ్యాకు మంచి విజయాన్ని అందించింది.&nbsp; ఆ సక్సెస్‌తో తెలుగులో నటించే అవకాశం ప్రగ్యా (Actress Pragya Nagra)కు దక్కింది. రీసెంట్‌గా వచ్చిన లగ్గం (2024) మూవీలో ప్రగ్యా హీరోయిన్‌గా చేసింది.&nbsp; తెలంగాణ పెళ్లి చుట్టు అల్లుకున్న మూవీలో ఈ అమ్మడు అచ్చ తెలుగు అమ్మాయిగా మంచి మార్కులు కొట్టేసింది. సినిమా కూడా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది.&nbsp; ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూనే సోషల్‌ మీడియాలో ప్రగ్యా (Actress Pragya Nagra) చాలా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.&nbsp; ప్రగ్యా పెట్టే గ్లామర్‌ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. ఈ భామ సొగసులకు దాసోహం అంటుంటారు ప్రస్తుతం ప్రగ్యా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 1.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె నుంచి ఏ ఫొటో వచ్చిన వెంటనే ట్రెండ్ చేస్తున్నారు.
    డిసెంబర్ 06 , 2024
    <strong>Zainab Ravdjee: అఖిల్ కాబోయే భార్య గురించి ఈ టాప్ 10 సీక్రెట్స్ తెలుసా?</strong>
    Zainab Ravdjee: అఖిల్ కాబోయే భార్య గురించి ఈ టాప్ 10 సీక్రెట్స్ తెలుసా?
    అక్కినేని అఖిల్‌ (Akkineni Akhil) త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. మంగళవారం (నవంబర్‌ 26) జైనాబ్‌ రవద్జీ (Zainab Ravdjee)తో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు అక్కినేని అభిమానులతో పాటు సినీ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో జైనాబ్‌, ఆమె కుటుంబానికి సంబంధించి సమాచారంపై ఓ లుక్కేద్దాం.&nbsp; జైనాబ్‌ (Zainab Ravdjee) హైదరాాబాద్‌కు చెందిన యువతి. థియేటర్ ఆర్టిస్టుతో పాటు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఆమెకు మంచి పేరుంది.&nbsp; వాస్తవానికి ముంబయికి నేపథ్యమున్న కుటుంబంలో జైనాబ్‌ (Akkineni Akhil) జన్మించింది.&nbsp; హైదరాబాద్‌లోనే పుట్టి పెరగడంతో ఇక్కడి కల్చర్‌కు బాగా అలవాటు పడింది.&nbsp; భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఆమె థియేటర్‌ ఆర్టిస్టుగా వర్క్‌ చేశారు. దుబాయి, లండన్‌లో ప్రత్యేక ప్రదర్శనలు చేసి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు.&nbsp; జైనాబ్‌లో ఓ మంచి పెయింటింగ్‌ కళాకారిణి కూడా. 27 ఏళ్ల వయసులోనే హైదరాబాద్‌లో 'రిఫ్లెక్షన్‌' పేరుతో మెగా ఎగ్జిబిషన్‌ నిర్వహించి జైనాబ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; రెండేళ్ల క్రితం జైనాబ్‌తో అఖిల్‌కు పరిచయం అయినట్లు తెలుస్తోంది. తొలుత మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారట. మనసులు కలవడంతో ప్రేమికులుగా మారేందుకు ఎక్కువ సమయం పట్టలేదని సమాచారం. జైనాబ్‌ తండ్రి జుల్ఫీ రవద్జీ (Julbi Ravdjee) ప్రముఖ వ్యాపారవేత్త. ‘జెడ్‌.ఆర్‌. రెన్యువబుల్‌ ఎనర్జీ’ (ZR Renewable Energy Pvt Ltd) కంపెనీ ఉంది. దీనితో పాటు పలు కంపెనీల్లో వాటాలు ఉన్నట్లు సమాచారం.&nbsp; https://twitter.com/IndianEmbRiyadh/status/1234249638309453824 జుల్బీ రవద్జీ ఏపీలోని గత వైకాపా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. జగన్‌కు సలహాదారుడిగా ఆయన వర్క్‌ చేశారు.&nbsp; https://twitter.com/iamkandula/status/1492733739038044160 మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా జుల్ఫీ పని చేశారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడంలో తనవంతు కృషి చేశారు.&nbsp; https://twitter.com/IndianEmbRiyadh/status/1670451101542371329 జైనాబ్‌ రవద్జీకి ఒక సోదరుడు ఉన్నాడు. అతడి పేరు జైన్‌ రవద్జీ. ప్రస్తుతం ‘జెడ్‌.ఆర్‌. రెన్యువబుల్‌ ఎనర్జీ’ (ZR Renewable Energy Pvt Ltd) కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.&nbsp; జైనాబ్‌ తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రైవేటులో ఉంచింది. దీంతో ఆమె వ్యక్తిగత ఫొటోలు, ఇష్టాఇష్టాలు, ఇతర సమాచారం ఎవరికీ తెలియడం లేదు. జుల్బీ రవద్జీతో అక్కినేని కుటుంబానికి మంచి రిలేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. వారి మధ్య స్నేహబంధం ఉన్నట్లు టాక్ ఉంది.&nbsp; జైనాబ్‌కు స్కిన్‌ కేర్‌కు సంబంధించిన ఓ సంస్థ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 'వన్స్‌ ఆపన్‌ ది స్కిన్‌' పేరుతో ఓ పేజీ నడుపుతోంది.&nbsp; View this post on Instagram A post shared by OnceUponTheSkin (@onceupontheskin) ఆ స్కిన్‌ కేర్‌ పేజీ ద్వారా చర్మ రక్షణకు సంబంధించిన టిప్స్‌ను యూత్‌కు అందిస్తోంది. చర్మం కాంతివంతంగా మెరిసేందుకు సలహాలు, సూచనలు ఇస్తోంది.&nbsp; అఖిల్‌ - జైనాబ్‌ పెళ్లిపై ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. నాగచైతన్య - శోభితా దూళిపాళ్లతో పాటే వీరి పెళ్లి కూడా జరపాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp;
    నవంబర్ 27 , 2024
    <strong>The Goat Weekend Collections: రూ.300 కోట్లు జస్ట్‌ మిస్‌.. ‘ది గోట్‌’ 4 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?</strong>
    The Goat Weekend Collections: రూ.300 కోట్లు జస్ట్‌ మిస్‌.. ‘ది గోట్‌’ 4 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?
    తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). వెంకట్‌ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. అయితే గురువారం (సెప్టెంబర్‌ 5)న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తమిళనాడులో మాత్రం విజయ్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షించి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ మూవీ తొలి రోజే రూ.120 కోట్లకు పైగా కొల్లగొట్టింది. మరీ వీకెండ్‌కు వచ్చేసరికి ఈ మూవీ వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; వీకెండ్‌ కలెక్షన్స్ ఎంతంటే? విజయ్‌ హీరోగా నటించిన ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్‌ వద్ద రాణిస్తోంది. తొలి నాలుగు రోజుల్లో ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.282.5 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. కొద్దిలో రూ.300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రంగా ‘ది గోట్‌’ రికార్డు సృష్టించింది. ధనుష్‌ రీసెంట్‌ చిత్రం 'రాయన్‌' రూ.154 కోట్ల (GROSS) లైఫ్‌టైమ్‌ వసూళ్లను తొలి రెండ్రోజుల్లోనే క్రాస్‌ చేసి ఈ ఫీట్‌ సాధించింది. ఒక్క తమిళనాడులోనే ‘ది గోట్‌’ రూ.106.40 కోట్లు వసూలు చేయడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.10.10 కోట్లు, కర్ణాటకలో రూ.21.1 కోట్లు, కేరళ రూ.10.4 కోట్లు, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.13.9 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.120.15 కోట్ల మేర విజయ్‌ చిత్రం రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం రూ.300 కోట్ల క్లబ్‌ దిశగా దూసుకుపోతోంది. 'ది గోట్‌' ఎలా ఉందంటే? దర్శకుడు వెంకట్‌ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్‌ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్‌ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్‌ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్‌ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్‌. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్‌ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని చెప్పవచ్చు.&nbsp; కథేంటి గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్‌ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్‌ (విజయ్‌)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.&nbsp;
    సెప్టెంబర్ 09 , 2024
    <strong>The Goat Day 1 Collections: తొలి రోజున ‘ది గోట్‌’ వసూళ్ల సునామీ.. ‘లియో’తో పోలిస్తే ఎదురుదెబ్బే!</strong>
    The Goat Day 1 Collections: తొలి రోజున ‘ది గోట్‌’ వసూళ్ల సునామీ.. ‘లియో’తో పోలిస్తే ఎదురుదెబ్బే!
    తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). వెంకట్‌ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. అయితే గురువారం (సెప్టెంబర్‌ 5)న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే తమిళనాడులో మాత్రం విజయ్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షించి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తొలి రోజు కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; డే 1 కలెక్షన్స్ ఎంతంటే విజయ్‌ హీరోగా నటించిన ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) అంచనాలకు తగ్గట్లే తొలిరోజు భారీ వసూళ్లను సాధించింది. ఒక్క ఇండియాలోనే ఈ చిత్రం రూ.55 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.43 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఒక్క తమిళనాడులోనే అత్యధికంగా రూ.38.3 కోట్లు (GROSS) వసూలైనట్లు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.3 కోట్లు, హిందీలో రూ.1.7 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసినట్లు ప్రకటించాయి. ఇక వరల్డ్‌వైడ్‌ గ్రాస్‌ కలుపుకుంటే రూ.80 కోట్లు (GROSS)పైనే తొలి రోజు రాబట్టే అవకాశముందని అంచనా వేస్తున్నాయి. అయితే ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం ‘ది గోట్‌’ చిత్రం ‘లియో’ రికార్డ్‌ను దాటలేకపోయినట్లు తెలుస్తోంది. విజయ్‌ గత చిత్రం ‘లియో’ తొలి రోజున రూ. రూ.148.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ రికార్డును ‘ది గోట్‌’ అధిగమించలేకపోయింది.&nbsp; 'ది గోట్‌' ఎలా ఉందంటే? దర్శకుడు వెంకట్‌ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్‌ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్‌ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్‌ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్‌ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్‌. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్‌ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని చెప్పవచ్చు.&nbsp; కథేంటి గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్‌ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్‌ (విజయ్‌)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.&nbsp; https://telugu.yousay.tv/the-goat-review-if-dalapati-vijay-had-to-face-himself-is-the-goat-great-or.html
    సెప్టెంబర్ 06 , 2024
    The GOAT Review: దళపతి విజయ్‌ తనతో తానే తలపడాల్సి వస్తే.. ‘ది గోట్‌’ గ్రేట్‌గా ఉందా? లేదా?
    The GOAT Review: దళపతి విజయ్‌ తనతో తానే తలపడాల్సి వస్తే.. ‘ది గోట్‌’ గ్రేట్‌గా ఉందా? లేదా?
    నటీనటులు : విజయ్‌, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్‌ త్యాగరాజన్‌, కొకిలా మోహన్‌, జయరాం, స్నేహా, వీటీవీ గణేష్‌, అరవింద్‌ ఆకాష్‌, వైభవ్ రెడ్డి తదితరులు కథ, దర్శకత్వం : వెంకట్‌ ప్రభు సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ నూని ఎడిటింగ్‌ : వెంకట్‌ రాజన్‌ నిర్మాతలు : కల్పతి ఎస్‌. అఘోరం, కల్పతి ఎస్. గణేశ్‌, కల్పతి ఎస్‌. సురేష్‌ తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). వెంకట్‌ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? విజయ్‌కు మరో మరుపురాని విజయాన్ని అందించిందా? లేదా? ఈ రివ్యూ&nbsp; (The Greatest of All Time Telugu Review)లో తెలుసుకుందాం.&nbsp; కథేంటి గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్‌ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్‌ (విజయ్‌)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే దళపతి విజయ్‌ ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. గాంధీ పాత్రలో ఎప్పటిలాగే అదరగొట్టాడు. అయితే జీవన్‌ పాత్రలో యంగ్‌ విజయ్‌ డిజిటలైజ్డ్‌ లుక్ కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంత కన్విన్సింగ్‌గా ఉండదు. ఇక యాక్షన్‌ సీక్వెన్స్‌, ఎమోషనల్‌ సన్నివేశాల్లో విజయ్‌ మరోమారు తన మార్క్‌ చూపించాడు. హీరోయిన్‌గా మీనాక్షి చౌదరికి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆమెది గెస్ట్ రోల్‌లాగా అనిపిస్తుంది. స్పెషల్‌ స్క్వాడ్‌ సభ్యులుగా ప్రశాంత్‌, అజ్మల్‌, ప్రభుదేవా పర్వాలేదనిపించారు. వారికి హెడ్‌గా జయరాం తన నటనతో ఆకట్టుకున్నారు. సీనియర్ విజయ్‌కు జోడీగా చేసిన స్నేహా తన నటనతో మెప్పించింది. తమిళ యువ హీరో శివ కార్తికేయన్‌ చిన్న పాత్రలో సందడి చేశారు. త్రిష ఓ స్పెషల్‌ సాంగ్‌లో అలరించింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు వెంకట్‌ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్‌ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్‌ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్‌ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్‌ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్‌. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్‌ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే యువన్‌ శంకర్‌ రాజా అందించిన పాటలు పూర్తిగా తేలిపోయాయి. ఏది మైండ్‌లో గుర్తుంచుకునేలా లేదు. అయితే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం బాగుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లను బీజీఎం మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. గ్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ ఇంకాస్త బెటర్‌గా పనిచేయాల్సింది. ముఖ్యంగా విజయ్ డీఏజింగ్‌ లుక్‌ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడినట్లు అనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విజయ్‌ నటనయాక్షన్‌ సీక్వెన్స్‌క్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ ఊహకందే కథనంప్రథమార్ధం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    సెప్టెంబర్ 05 , 2024
    <strong>Kalki 2898 AD Review: ఇండియన్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన ‘కల్కి’.. సినిమా ఎలా ఉందంటే?</strong>
    Kalki 2898 AD Review: ఇండియన్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన ‘కల్కి’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌, దుల్కర్ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, దిశా పటాని, రానా దగ్గుబాటి, అన్నా బెన్‌ తదితరులు రచన, దర్శకత్వం : నాగ్‌ అశ్విన్‌ సంగీతం : సంతోష్‌ నారాయణన్‌ ఎడిటింగ్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు నిర్మాతలు : అశ్విని దత్‌, ప్రియాంక దత్‌, స్వప్న దత్‌ నిర్మాణ సంస్థ : వైజయంతీ మూవీస్‌ మేకర్స్ విడుదల తేదీ : 27 జూన్‌, 2024 ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై గ్లోబల్‌ స్థాయిలో బజ్‌ ఉంది. ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, కమల్‌హాసన్‌, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ నుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ హాలీవుడ్ రేంజ్‌లో ఉండటంతో ఎక్స్‌పెక్టేషన్స్‌ మరింత పీక్స్‌కు వెళ్లాయి. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌ రూపొందిన ఈ చిత్రం.. జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు అంచనాలను అందుకుందా? ప్రభాస్‌ ఖాతాలో మరో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ చేరినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి 'కల్కి 2898 ఏడీ' కథ.. మహాభారతంలో ధర్మరాజు ఆడిన అబద్దం నుంచి మెుదలవుతుంది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్‌).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. మరోవైపు కాశీలో నివసించే భైరవ (ప్రభాస్‌) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇందుకోసం అతడికి 1 మిలియన్‌ యూనిట్లు అవసరం అవుతాయి. అయితే సుమతిని పట్టుకుంటే ఆ మెుత్తం లభిస్తుందని భైరవ తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్‌ యష్కిన్‌ (కమల్‌ హాసన్‌) పాత్ర ఏంటి? అతనికి సుమతి ఎందుకు కావాలి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? కాశీ, శంబాలా ప్రజలు ఎందుకు కష్టాల్లో మునిగిపోయారు? విజయ్‌ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌ పాత్రలు ఏంటి? అన్నది తెలియాలంటే కల్కి సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన విశ్వరూపం చూపించాడు. భైరవ పాత్రలో అదరగొట్టాడు. యాక్షన్స్‌ సీక్వెన్స్‌లో మరోమారు తన మార్క్‌ ఏంటో చూపించాడు. తొలి అర్ధభాగంలో అతడి పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌ చేశాడు. బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అశ్వత్థామ పాత్రలో ఆయన నెవర్‌ బీఫోర్‌ నటనతో మెప్పించారు. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేనంత బాగా నటించారు అమితాబ్‌. యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. విలన్‌గా కమల్‌ హాసన్‌ నెక్స్ట్‌ లెవెల్‌ పర్‌ఫార్మెన్స్‌తో అదరహో అనిపించారు. దీపికా, దిశా పటాని పాత్రలు ఆకట్టుకున్నాయి. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, రాజమౌళి, రానా, ఆర్జీవీ క్యామియో మెప్పిస్తాయి. మిగిలిన పాత్రదారులు అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పేరు.. కల్కితో గ్లోబల్ స్థాయిలో మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి అతిపెద్ద బలం నాగ్‌ అశ్విన్‌ రాసుకున్న కథ. నాగ్ అశ్విన్‌ టేకింగ్‌, విజన్‌, ప్రెజంటేషన్‌కు నూటికి నూరు శాతం మార్కులు ఇవ్వాల్సిందే. తొలి 40 నిమిషాలు కథ స్లోగా నడుస్తున్నట్లు అనిపించినా ఎక్కడా బోర్‌ కొట్టకుండా నాగ్‌ అశ్విన్‌ జాగ్రత్త పడ్డారు. ఇక ఆ తర్వాత నుంచి కథలో వేగం పెరుగుతుంది. క్లైమాక్స్‌ వరకూ ఒకే ఇంటెన్సిటీతో సినిమాను నడిపించారు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్‌ సీన్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. ఫ్యూచరిక్‌ వెహికల్స్‌, ఆయుధాలు, సెట్స్‌ విజువల్‌ వండర్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా చివరి 45 నిమిషాలు నెక్స్ట్‌ లెవల్లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశారు దర్శకుడు. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్‌ కాస్త తడబడినట్లు కనిపిస్తోంది. కొన్ని సన్నివేశాలు మరీ సాగదీతలా అనిపిస్తాయి. మాస్‌ ఆడియన్స్‌కు అలరించే అంశాలు లేకపోవడం మైనస్‌. దీపికా డబ్బింగ్‌ విషయంలోనూ నాగ్‌ అశ్విన్‌ కాస్త జాగ్రపడి ఉంటే బాగుండేది. అయితే మెుత్తంగా నాగ్‌ అశ్విన్‌.. డైరెక్టర్‌గా సూపర్‌ సక్సెస్‌ అయినట్లు చెప్పవచ్చు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు అత్యుత్తమ పనితనాన్ని కనబరిచాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు ఎక్కువ మార్కులు ఇవ్వాల్సిందే. సినిమాటోగ్రాఫర్‌ అద్భుత పనితీరు కనబరిచారు. సంతోష్‌ నారాయణన్‌ అందించిన సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా నేపథ్యం సంగీతం యాక్షన్‌ సన్నివేశాలను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో వారు ఎక్కడా రాజీపడలేదు. ప్రతీ సీన్‌ చాలా రిచ్‌గా ఉంది.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథ, దర్శకత్వంప్రభాస్‌&nbsp;ప్రధాన తారాగణం నటనహాలీవుడ్‌ రేంజ్‌ విజువల్స్‌కురుక్షేత్రం ఎపిసోడ్‌ మైనస్‌ పాయింట్స్‌ తొలి 40 నిమిషాల ఎపిసోడ్‌దీపికా డబ్బింగ్‌ఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 4/5&nbsp;&nbsp; Public Talk On Kalki 2898 AD ప్రభాస్‌ కల్కి (Kalki 2898 AD) చిత్రంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇన్ని రోజుల నిరీక్షణకు తగ్గ ఫలితం దక్కిందని ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానులు అంటున్నారు. కల్కి దెబ్బకు బాక్సాఫీస్‌ రికార్డులు అన్ని చెరిగిపోవడం ఖాయమని పోస్టులు పెడుతున్నారు.&nbsp; కల్కి సినిమాను పెద్ద సక్సెస్‌ చేసినందుకు కృష్ణంరాజు రెండో భార్య శ్యామలా దేవి ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో ప్రభాస్‌ను చూస్తే 1000 రెబల్‌ స్టార్లు కలిసినట్లు ఉందని పేర్కొన్నారు. https://twitter.com/i/status/1806243116405723294 కల్కి సినిమాలో విజయ్‌ దేవరకొండ.. ఓ ముఖ్యపాత్రలో కనిపించడంపై రౌడీ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. విజయ్‌ పాత్రకు సంబంధించిన క్లిప్‌ను నెట్టింట ట్రెండ్‌ చేస్తున్నారు. కల్కి లాంటి బ్లాక్ బాస్టర్‌ తమ హీరో భాగస్వామి అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1806146620867912015 అటు దుల్కర్‌ సల్మాన్ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఈ సినిమాలో దుల్కర్‌ క్యామియో అద్భుతంగా ఉందంటూ అతడి ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1806187132450406624 కల్కిలో రాజమౌళి పాత్ర కూడా తమను ఎంతో సర్‌ప్రైజ్‌ చేసిందని పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అతడి ఎంట్రీకి తాము ఫిదా అయినట్లు చెబుతున్నారు.&nbsp; https://twitter.com/i/status/1806177761280578043 ‘కల్కి 2898 ఏడీ’ చూసిన ఓ అభిమాని నెట్టింట ఆసక్తికర పోస్టు పెట్టాడు. సినిమా లవర్స్‌.. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కాళ్లు మెుక్కి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఓ వీడియోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/saidevendla/status/1806199250327359793 కల్కి సూపర్‌ హిట్‌ టాక్‌ చూసి.. మూవీ యూనిట్‌ మెుత్తం ఫుల్‌ జోష్‌లో ఉన్నట్లు అర్థం వచ్చేలా ఒక నెటిజన్‌ ఓ ఆసక్తిర వీడియోను పంచుకున్నాడు. ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, అమితాబ్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాత అశ్వనిదత్‌ చిందులు వేస్తునట్లుగా మాస్టర్‌ సినిమాలోని డ్యాన్స్‌ క్లిప్‌ను ఎడిటింగ్‌ చేసి పంచుకున్నాడు. https://twitter.com/i/status/1806199186813288713 ప్రభాస్‌కు ఈ స్థాయి సక్సెస్‌ను అందించినందుకు రెబల్‌ స్టార్ ఫ్యాన్స్‌ అందరూ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌కు మెుక్కుతున్నట్లు ఉన్న ఓ వీడియో పెద్ద ఎత్తున ట్రెండింగ్‌ అవుతోంది. ఖలేజా సినిమాలో ఓ సీన్‌ను ఎడిట్‌ చేసి పోస్టు చేశారు.&nbsp; https://twitter.com/i/status/1806199040368910540 ప్రభాస్‌ గత చిత్రం ‘సలార్‌’ కేవలం యూత్‌కు మాత్రమే నచ్చిందని.. కానీ, కల్కి యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ముఖ్యంగా మూవీలోని మహాభారతం ఎపిసోడ్‌కు పునకాలు వచ్చినట్లు పేర్కొన్నారు.&nbsp; https://twitter.com/SALAARSURYAA/status/1806198851164066271 పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకిరా నందన్‌ కూడా కల్కి థియేటర్‌ వద్ద సందడి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లోకి అకిరా వెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; https://twitter.com/i/status/1806198649107755236 కల్కి.. రెగ్యులర్‌ చిత్రం లాంటింది కాదని.. కచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిన మూవీ అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.&nbsp; https://twitter.com/btrsir/status/1806056337714864288?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1806056337714864288%7Ctwgr%5E340e81c546b0e7d2540bbcb78327e8a93b350cf2%7Ctwcon%5Es1_&amp;ref_url=http%3A%2F%2Fnewsroom.etvbharat.org కల్కి సెకండాఫ్‌ ఒక మాస్టర్‌ పీస్‌ అని, చివరి 45 నిమిషాలు గూస్‌ బంప్స్‌ తెప్పించాయని ఓ అభిమాని పోస్టు పెట్టాడు. ప్రభాస్‌, అమితాబ్‌ తమ నటనతో థియేటర్లను షేక్‌ చేశారని చెప్పుకొచ్చాడు.&nbsp; https://twitter.com/SivaHarsha_23/status/1806175733125132706 కల్కి సినిమా సక్సెస్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోంది. దీనికి అర్థం పట్టేలా ఓ అభిమాని షేర్‌ చేసిన వీడియో నెట్టింట ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/i/status/1806134805542941036
    జూన్ 27 , 2024
    <strong>Kalki 2898 AD Story: </strong><strong>సోషల్‌ మీడియాలో ‘కల్కి’ ఫుల్‌ స్టోరీ లీక్‌.. ఊహకందని ట్విస్టులతో మైండ్‌ బ్లాక్‌!</strong>
    Kalki 2898 AD Story: సోషల్‌ మీడియాలో ‘కల్కి’ ఫుల్‌ స్టోరీ లీక్‌.. ఊహకందని ట్విస్టులతో మైండ్‌ బ్లాక్‌!
    ప్రస్తుతం దేశంలో ‘కల్కి’ ఫీవర్‌ నడుస్తోంది. ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD).. గురువారం (జూన్‌ 27) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా.. నిమిషాల వ్యవధిలోనే టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. కాగా,&nbsp; ఇందులో ప్రభాస్‌ మహా విష్ణువు అవతారమైన ‘కల్కి’ పాత్రలో కనిపిస్తారని తొలుత జోరుగా ప్రచారం జరిగింది. కానీ, కల్కి ఫస్ట్ ట్రైలర్‌ చూశాక.. ప్రభాస్‌ ‘కల్కి’ కాదని తెలిసి ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేసే ట్విస్ట్‌ సినిమాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కల్కి పూర్తి స్టోరీ ఇదేనంటూ ఓ కథ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; స్త్రీలపై కలి ప్రయోగాలు! 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో మెుత్తం మూడు ప్రపంచాలు ఉంటాయని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ఇప్పటికే ఓ స్పెషల్‌ వీడియా ద్వారా తెలియజేశారు. ఇందులో ఒకటి ‘కాశీ’ కాగా, మిగిలినవి ‘శంబాల’, ‘కాంప్లెక్స్‌’. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. శంబాలాలో అశ్వత్థామ (అమితాబ్‌ బచ్చన్‌) ఉంటారు. కాంప్లెక్స్‌లో విలన్ అయిన కలి (కమల్‌ హాసన్) ఉంటారు. కాశీ, శంబాలాలో ఉండే ప్రజల జీవితాలు మారాలంటే కల్కి రావాల్సిందే. అయితే కల్కి సాధారణంగా పుట్టే వరకూ ఆగలేక కలి.. తన ల్యాబ్‌లో స్త్రీలపై ప్రయోగాలు చేస్తుంటాడట. కల్కి శక్తులను తన వశం చేసుకొవాలన్నది కల్కి ప్లాన్‌ అన్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ నుంచి ఓ మహిళ (దీపిక పదుకొణె) పారిపోయి శంబాలకు వస్తుంది. కల్కి ఆమెకే పుడతాడని గ్రహించిన అశ్వత్థామ.. ఆమెకు రక్షణ కల్పిస్తాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది.&nbsp; అశ్వత్థామ vs భైరవ మరోవైపు కాశీలో ఉండే భైరవ (ప్రభాస్‌) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే అందుకు యూనిట్స్ అవసరమవుతాయి. ఈ క్రమంలోనే కాంప్లెక్స్‌ నుంచి తప్పించుకున్న మహిళను పట్టుకుంటే పెద్ద మెుత్తంలో యూనిట్స్‌ (నగదు) అందిస్తామని కాంప్లెక్స్ ప్రతినిధులు ఆఫర్‌ ఇస్తారు. దీంతో మహిళను అప్పగించి ఎలాగైన మిలియన్‌ యూనిట్స్‌తో కాంప్లెక్స్‌లో సెటిల్‌ అవ్వాలని భైరవ భావిస్తాడు. ఈ క్రమంలోనే ఆ మహిళకు రక్షణగా ఉన్న అశ్వత్థామతో యుద్ధానికి దిగుతాడు. భైరవ యుద్ధం చేసే క్రమంలో అతడి సత్తా ఏంటో అశ్వత్థామకు అర్థమై అతడు ఆశ్చర్యపోతాడని వైరల్ అవుతున్న స్టోరీని బట్టి తెలుస్తోంది.&nbsp; కల్కిగా ప్రభాస్‌! భైరవ, అశ్వత్థామ మధ్య బీకర పోరు జరుగుతున్న సమయంలోనే కల్కిని కడుపులో మోస్తున్న దీపికకు గాయమవుతుందని లేటెస్ట్ బజ్‌ ప్రకారం తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె కడుపులోని బిడ్డకు సైతం ప్రమాదం జరుగుతుందని అంటున్నారు. మరోవైపు అశ్వత్థామతో యుద్ధం చేసే క్రమంలోనే కలి చేస్తున్న అన్యాయాల గురించి భైరవకు తెలుస్తుందట. దీంతో అతడిలో మార్పు వస్తుందట. అలా అశ్వత్థామ.. కల్కి శక్తులను భైరవకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారని అంటున్నారు. ఈ ప్రక్రియతో తొలి భాగం ముగుస్తుందని సమాచారం. ఇక కల్కి సెకండ్‌ పార్ట్‌లో.. 'కలి vs కల్కి'గా కథ మారిపోతుందని సమాచారం. ఇది విన్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తున్నారు. ఈ స్టోరీనే నిజమైతే బొమ్మ బ్లాక్‌బాస్టర్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; లాజిక్‌ మిస్‌..! కల్కి స్టోరీ ఇదేనంటూ వైరల్ అవుతున్న కథ.. కొంచెం కన్విన్సింగ్‌గానే ఉన్నప్పటికీ ఒకటి మాత్రం లాజిక్‌కు అందడం లేదు. దీపికా పదుకొణె గర్భంలో ఉన్న కల్కి పుట్టకముందే చనిపోతాడన్నది లాజిక్‌లెస్‌గా ఉంది. కల్కి అనేది శ్రీ మహావిష్ణువు 10వ అవతారం. అలాంటి కల్కి పాత్రను కడుపులోనే చనిపోయినట్లు చూపించడం పురాణాలను తప్పుబట్టినట్లు అవుతుంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కూడా పురాణాలతో డిఫర్‌ అయ్యేలా కల్కి కథను రాసుకునే ఛాన్స్ లేదని సినీ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. మరి కల్కి పాత్రలో కనిపించబోయేది ఎవరు? అన్నదానిపై స్పష్టత రావాలంటే జూన్‌ 27 వరకూ ఆగాల్సిందే.&nbsp;
    జూన్ 24 , 2024
    New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా చిన్న సినిమాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి చిన్న హీరోల చిత్రాలే విడుదల కావడానికి ఓ కారణం ఉంది. జూన్‌ 27న ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదల కానుంది. దీంతో పెద్ద సినిమాలు ఏవి ఈ వారం విడుదలయ్యేందుకు సాహించలేదు. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు నింద వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 21న ఈ చిత్రం.. ప్రేక్షకుల ముందుకు రానుంది. కాండ్రకోట మిస్టరీ వెనక కథేమిటి? నింద ఎవరిపై పడింది? అన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు చిత్ర బృందం తెలిపింది.&nbsp; హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ చైతన్యరావు, హెబ్బా పటేల్‌ ఫస్ట్‌ టైమ్‌ జోడీగా చేసిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.ఆర్‌, బాలరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; జూన్‌ 21న&nbsp; ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ ఆకట్టుకుంటున్నాయి. OMG హస్యనటుడు వెన్నెల కిషోర్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ఓఎమ్‌జీ (OMG). ఇటీవల ‘చారి 111’ చిత్రంలో ఫ్లాప్‌ను సొంతం చేసుకున్న అతడు.. ఈ వారం హారర్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాడు. నందిత శ్వేత హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రానికి శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్‌ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు రక్షణ పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ర‌క్ష‌ణ’ (Rakshana) ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 21 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. జూన్ 7న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఇందులో పాయల్‌ తొలిసారి పోలీసు అధికారిణి పాత్ర పోషించింది.&nbsp; బాక్‌ సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’ (Baak Movie). ఖుష్బూ సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ‘బాక్‌’ సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 21 నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. కోటా ఫ్యాక్టరీ సీజన్‌-3 నెట్‌ఫ్లిక్స్‌లో మంచి ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌లలో ‘కోట ఫ్యాక్టరీ’ (Kota Factory 3) ఒకటి. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు విజయవంతం కాగా, మూడో సీజన్‌ జూన్‌ 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఐఐటీల్లో అడ్మిషన్స్ కోసం జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థులు, వాళ్లు ఎదుర్కొనే ఒత్తిళ్లు, సవాళ్లు, వాళ్లకు అండగా నిలిచే జీతూ భయ్యా చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. TitleCategoryLanguagePlatformRelease DateAgent Of MysteriesSeriesEnglish/KoreanNetflixJune 18OutstandingMovieEnglishNetflixJune 18Maha RajSeriesHindiNetflixJune 19America’s SweetheartsSeriesEnglishNetflixJune 13NadigarMovieMalayalamNetflixJune 21Trigger WarningMovieEnglishNetflixJune 21Bad CopMovieHindiDisney + HotstarJune 21The HoldoversMovieEnglishJio CinemaJune 16House Of The Dragon 2SeriesEnglishJio CinemaJune 17IndustrySeriesEnglishJio CinemaJune 19Bigboss OTT 3Reality ShowHindiJio CinemaJune 21
    జూన్ 17 , 2024
    This Week Movies: ఈ వారం మీ ఆనందాన్ని రెట్టింపు చేసే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    This Week Movies: ఈ వారం మీ ఆనందాన్ని రెట్టింపు చేసే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    ఈ సమ్మర్‌లో ఇప్పటివరకూ చిన్న చిత్రాలే థియేటర్లలో సందడి చేశాయి. అయితే జూన్‌ తొలి వారంలోనూ చిన్న సినిమాలే ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఇందులో స్టార్ హీరోయిన్లకు సంబంధించిన లేడీ ఒరియెంటేడ్‌ మూవీస్‌ ఉన్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లలో వస్తున్న చిత్రాలేంటి? ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్‌లు రాబోతున్నాయో ఓ లుక్కేయండి. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు మనమే స్టార్‌ హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. ప్రతీ ఒక్కరు కనెక్ట్ అయ్యే చిత్రం ఇదని మూవీ టీమ్‌ తెలిపింది. ఫ్యామిలీగా వెళ్లి ఈ సినిమాను అస్వాదించవచ్చని పేర్కొంది.&nbsp; సత్యభామ ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama Movie). సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్‌.. పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఈ చిత్రం జూన్‌ 7న విడుదల కానుంది. సత్యభామ ఓ విఫ్లవం అంటూ ఇటీవల కాజల్‌ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు పెంచింది.&nbsp; రక్షణ స్టార్‌ నటి పాయల్‌ రాజ్‌పుత్‌ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రక్షణ’ (Rakshana). ప్రణదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రోషన్, మానస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. ఓ పోలీసు ఆఫీసర్‌ జీవితంలో జరిగిన సంఘటన స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.&nbsp; లవ్‌ మౌళి నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ మౌళి’ (Love Mouli). పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. సి స్పేస్‌ సంస్థ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఎందుకు విడిపోతుంటారు? రాజీ పడితేనే బంధాలు నిలుస్తాయా? అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని నిర్మించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.&nbsp; వెపన్‌ సత్యరాజ్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రలో నటించిన ‘వెపన్‌’ చిత్రానికి గుహన్‌ సెన్నియ్యప్పన్‌ దర్శకత్వం వహించారు. తాన్యా హోప్‌, రాజీవ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీసీ, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. జూన్‌ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateShooting StarsMovieEnglishNetflixJune 03Hitler and NazeesSeriesEnglishNetflixJune 05How To Rob A BankMovieEnglishNetflixJune 05Bade Mia Chote MiaMovieHindiNetflixJune 06Sweet ToothSeriesEnglishNetflixJune 06Hit ManMovieEnglishNetflixJune 07Perfect Match 2SeriesEnglishNetflixJune 07MaidanMovieHindiAmazon PrimeJune 05GunahSeriesHindiDisney + HotstarJune 05ClippedSeriesEnglishDisney + HotstarJune 04Star Wars: The EcolightSeriesEnglishDisney + HotstarJune 04The Legend Hanuman&nbsp;SeriesHindiDisney + HotstarJune 05GullakSeriesHindiSonyLIVJune 07Varshangalkku SheshamMovieMalayalamSonyLIVJune 07Boomer UncleMovieTamilAhaJune 07AbigailMovieEnglishBook My ShowJune 07Black OutMovieHindiJio CinemaJune 07
    జూన్ 03 , 2024
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ గంజాయి తీసుకుంటూ గురువారం పోలీసులకు పట్టబడ్డ విషయం తెలిసిందే. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ తనను మోసం చేశాడంటూ డాక్టర్‌ మౌనిక అనే యువతి పెట్టిన కేసును విచారించేందుకు వెళ్లిన పోలీసులకు ఫ్లాటులో షన్ను కనిపించాడు. అతడు గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో సోదరుడు సంపత్‌తో పాటు షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడికి వైద్య పరీక్షలు చేయించగా బాడీలో గంజాయి ఆనవాళ్లు గుర్తించినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు సైతం నివేదిక ఇచ్చారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి షణ్ముఖ్‌ స్నేహితులు సంచలన విషయాలు బయటపెట్టారు. షణ్ముఖ్, అతడి సోదరుడు ఎలాంటి వారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ‘గంజాయి తీసుకుంది నిజమే’ యాంకర్ ధనుష్‌.. షణ్ముఖ్ జస్వంత్ అరెస్టు వెనుక అసలు నిజాలను అతడి ఫ్రెండ్స్‌ను అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ గలాటా గీతు యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా ఆ విషయాలను అతడు పంచుకున్నాడు. షన్ను గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన మాట వాస్తవమేనని అతడి ఫ్రెండ్స్‌ కూడా ఒప్పుకున్నట్లు ధనుష్‌ చెప్పాడు. అయితే వార్తల్లో వస్తున్నట్లుగా డ్రగ్స్, కొకైన్, ఇతర డ్రగ్ పిల్స్ కానీ అతడి వద్ద లభించలేదని స్పష్టం చేశాడు. 16 గ్రాములు గంజాయి మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం కేసు కొనసాగుతున్నందున మరిన్ని విషయాలు పంచుకునేందుకు షన్ను స్నేహితులు వెనకాడినట్లు ధనుష్ చెప్పుకొచ్చాడు.&nbsp; ఆ వార్తలు అవాస్తవం : గీతూ అదే యూట్యూబ్ వీడియోలో గీతూ రాయల్‌ మాట్లాడారు. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ మరొకర్ని పెళ్లి చేసుకున్నాడని, లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నాడని వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి 2021లోనే వినయ్‌కు.. అతడిపై ఫిర్యాదు చేసిన మౌనికకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు గీతూ చెప్పారు. అప్పట్లోనే పెళ్లి అంటూ మౌనిక తనతో చెప్పిందని పేర్కొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సంపత్‌ - మౌనికల పెళ్లికి గ్యాప్ వచ్చిందని.. ఈ నెల 28న పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్ చేసుకున్నారని వివరించారు. ఈ క్రమంలోనే మౌనిక.. వినయ్‌ స్నేహితుల్లో ఒకరికి ఫోన్‌ చేసిందని తెలిపారు. వినయ్‌ ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్నేహితుడు చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని గీతూ వెల్లడించారు. ‘అలా చేయడం సరికాదు’ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు మరో పెళ్లి ఆలోచన చేయడం ఏంటో తనకు అర్థం కావడం లేదని గీతూ రాయల్ అన్నారు. సమస్య ఉంటే ఇద్దరు మాట్లాడుకుని విడిపోవాలి కానీ ఇలా చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తనకు మౌనిక కొన్ని సంవత్సరాలుగా తెలుసని ఆమె చాలా సున్నిత మనస్కురాలని గీతు చెప్పుకొచ్చారు. వినయ్‌కు పెళ్లి అయితే కాలేదని, కానీ లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు అనిపిస్తోందని గీతూ పేర్కొన్నారు. ఇది ఏమైనా ఈ సమస్యను ఇద్దరూ సామరస్యంగా పరిష్కరించుకొని ఉంటే బాగుండేదని గీతూ అభిప్రాయపడ్డారు.&nbsp; మౌనిక చేసిన ఆరోపణలు ఇవే! బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్‌తో పాటు షణ్ముఖ్‌పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్‌ తనను మోసం చేశాడని తెలిపింది. మరోవైపు సంపత్‌ తనను హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్‌ భయపెట్టి అబార్షన్‌ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్‌ తొడిగి నిశ్చితార్థం అయిపోయిందని చెప్పాడని వివరించింది. అటు షణ్ముఖ్‌ దగ్గర గంజాయి, డ్రగ్స్‌ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్‌ షణ్ముఖ్‌కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.&nbsp; షణ్ముఖ్‌కు ఇది తొలిసారి కాదు! షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్‌ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్‌మేట్‌ సిరి హనుమంత్‌తో హద్దులు మీరడంతో విన్నర్‌ కావాల్సిన షణ్ముఖ్‌ రన్నర్‌ కావాల్సి వచ్చింది. ఆ సీజన్‌ విజేతగా సన్నీ నిలిచాడు.&nbsp; బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో బ్రేకప్‌! బిగ్‌బాస్‌ వెళ్లడానికి ముందు వరకూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీప్తి సునైనాతో షణ్ముఖ్‌ డీప్‌ లవ్‌లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్‌ పడింది.&nbsp; అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో&nbsp; అన్న సంపత్‌ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది. షణ్ముఖ్‌తో క్లోజ్‌.. వైష్ణవి లవ్‌ బ్రేకప్‌! బేబీ (Baby Movie)సినిమాతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya).. ఆ చిత్రానికి ముందు యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించేది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్‌తో చేసిన ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్’ సిరీస్‌ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో షన్ను, వైష్ణవి జోడీ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. వీటికి తోడు అప్పట్లో ఈ జంట కలిసి చేసి డ్యూయెట్‌ రీల్స్‌ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ సిరీస్‌కు ముందు వైష్ణవి.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ మెహబూబ్‌ దిల్సేతో చాలా క్లోజ్‌గా ఉండేదట. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియా గుసగుసలు వినిపించాయి. అయితే షన్నుతో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ చేసినప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగిందట. షన్నుతో వైష్ణవి క్లోజ్‌గా ఉండటంతో మెహబూబ్‌ దూరంగా వెళ్లిపోయినట్లు గాసిప్స్‌ వచ్చాయి.&nbsp; షణ్మఖ్‌ను ఫేమస్‌ చేసిన సిరీస్‌లు ఇవే! 2018లో వచ్చిన 'నన్ను దోచుకుందువటే' చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా షణ్ముఖ్‌ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్‌పై తన ఫోకస్ పెట్టాడు. 2020లో అతడు చేసిన ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (The Software Developer) అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘సూర్య’, ‘స్టూడెంట్‌’ వంటి యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించి షణ్ముఖ్‌ తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. రుక్మిణి, మలుపు, Shanmukh Anthem, జాను, అయ్యయ్యో వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ షణ్మఖ్‌ మంచి పేరు సంపాదించాడు.
    ఫిబ్రవరి 23 , 2024
    Shanmukh Jaswanth: భయపెట్టి అబార్షన్ చేయించాడు.. మౌనిక సంచలన కామెంట్స్!
    Shanmukh Jaswanth: భయపెట్టి అబార్షన్ చేయించాడు.. మౌనిక సంచలన కామెంట్స్!
    ప్రముఖ యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth) గంజాయితో పోలీసులకు పట్టుపడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు అతడి ప్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్‌ గంజాయి తీసుకుంటూ కనిపించాడు. దీంతో సంపత్‌ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ను హైదరాబాద్‌ నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్‌ ఫ్లాట్‌లో 16 గ్రాముల గంజాయి పోలీసులకు లభించినట్లు తెలుస్తోంది.  షణ్ముఖ్‌ ఫ్లాట్‌లో ఏం జరిగిందంటే! షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ (Sampath Vinay) ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మౌనిక అనే యువతితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. మూడేళ్ల క్రితం వారికి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే యువతి తల్లి అనారోగ్యం బారిన పడటంతో చికిత్స ఇప్పించే క్రమంలో వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. మరో ఆరు రోజుల్లో వీరి పెళ్లి ఉందనగా.. సంపత్ మరో యువతిని పెళ్లి చేసుకొని మౌనికకు షాకిచ్చాడు. దీంతో ఆమె సంపత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని తీసుకొని సంపత్, షణ్ముఖ్‌ ఉంటున్న ఫ్లాటుకు వెళ్లింది. అక్కడ షణ్ముఖ్ డ్రగ్ తీసుకుంటూ కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి. షణ్ముఖ్, సంపత్‌లను మౌనిక వీడియో తీస్తుండగా.. డ్రగ్స్ మత్తులో ఉన్న యూట్యూబర్ (షణ్ముఖ్ జస్వంత్) వీడియో తీయోద్దంటూ గొడవ చేసినట్లు సమాచారం. దాంతో అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇద్దర్ని అరెస్టు చేసి.. షణ్ముఖ్‌పై డ్రగ్స్ కేసు, సంపత్‌పై చీటింగ్ కేసు పెట్టినట్లు సమాచారం.&nbsp;&nbsp;&nbsp; https://twitter.com/InformedAlerts/status/1760553942201852102 మౌనిక సంచలన ఆరోపణలు! బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్‌తో పాటు షణ్ముఖ్‌పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్‌ తనను మోసం చేశాడని మౌనిక తెలిపింది. మరోవైపు సంపత్‌ తనపై లైంగిక దాడి చేశాడని చెప్పింది. హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి బెదిరించి లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్‌ భయపెట్టి అబార్షన్‌ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్‌ తొడిగి మనకు నిశ్చితార్థం అయిపోయిందని సంపత్ చెప్పాడని పేర్కొంది. సంపత్‌ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చింది. అటు షణ్ముఖ్‌ దగ్గర గంజాయి, డ్రగ్స్‌ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్‌ షణ్ముఖ్‌కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.&nbsp; షణ్ముఖ్‌కు ఇది తొలిసారి కాదు! షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్‌ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్‌మేట్‌ సిరి హనుమంత్‌తో హద్దులు మీరడంతో విన్నర్‌ కావాల్సిన షణ్ముఖ్‌ రన్నర్‌ కావాల్సి వచ్చింది. ఆ సీజన్‌ విజేతగా సన్నీ నిలిచాడు.&nbsp; https://twitter.com/i/status/1760553061007937805 బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో బ్రేకప్‌! బిగ్‌బాస్‌ వెళ్లడానికి ముందు వరకూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీప్తి సునైనాతో షణ్ముఖ్‌ డీప్‌ లవ్‌లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్‌ పడింది.&nbsp; అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో&nbsp; అన్న సంపత్‌ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది.
    ఫిబ్రవరి 22 , 2024
    Gandeevadhari Arjuna Movie Review: రా ఏజెంట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా ఎలా ఉందంటే?
    Gandeevadhari Arjuna Movie Review: రా ఏజెంట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : వరుణ్ తేజ్, సాక్షివైద్య, వినయ్ రాయ్, నాజర్, విమలా రామన్‌, రవివర్మ తదితరులు దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు&nbsp; నిర్మాత : బీవీఎన్ఎస్ ప్రసాద్&nbsp; సంగీత దర్శకుడు : మిక్కీ జే మేయర్ సినిమా నిడివి : 2 గంటల 16 నిమిషాలు&nbsp; విడుదల తేదీ : ఆగస్టు 25, 2023 మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌(Varun tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). ప్రవీణ్‌ సత్తారు(Praveen sattaru) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సాక్షి వైద్య (Sakshi vaidya) హీరోయిన్‌గా నటించింది. BVS ప్రసాద్‌ నిర్మించిన ఈ మూవీకి మిక్కీ జే. మేయర్‌ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గాండీవధారి అర్జున సినిమా ఎలా ఉంది? ఈ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆడియన్స్‌ను ఏమేరకు మెప్పించింది? వరుణ్‌ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం. కథ కథలోకి వెళితే ఆచార్య (నాజర్‌) అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ మంత్రి. విలన్లు చేసే మెడికల్‌ స్కామ్‌ వల్ల మనుషులతో పాటు పర్యావరణం దెబ్బతింటున్నట్లు ఆచార్య గ్రహిస్తాడు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో ఆచార్యను చంపేందుకు విలన్‌ మనుషులు ప్రయత్నిస్తుంటారు. దీంతో తనకు రక్షణ కల్పించడంతో పాటు, మెడికల్‌ స్కామ్‌ను ఎలాగైనా ఆపే బాధ్యతను రా ఏజెంట్‌ అర్జున్ (వరుణ్‌తేజ్‌)కు ఆచార్య అప్పగిస్తాడు. ఈ క్రమంలో అర్జున్‌కు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి? మెడికల్‌ స్కామ్‌ను అతడు ఎలా బయటపెట్టాడు? ఆ స్కామ్‌కు పర్యావరణానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే. https://twitter.com/baraju_SuperHit/status/1694964373507260852?s=20 ఎలా సాగిందంటే గాండీవధారి అర్జున మూవీ రెగ్యులర్ ఫార్మాట్ మాదిరిగానే ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ చూసే కొందరిని తప్ప.. మిగతావారిని ఆకట్టుకునేలా లేదు. ఇంటర్వెల్ వరకు మూవీ సాగదీతగా అనిపిస్తుంది. కొంత నాటకీయత ఉన్నప్పటికీ అదీ ఎలివేట్ చేయబడలేదు. తర్వాత యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. కామెడీ ఆశించే ప్రేక్షకులకు భంగపాటు తప్పదు. మూవీ ఒక లోకేషన్ నుంచి మరో లోకేషన్‌కు ఈజీగా వెళుతుంది. క్లైమాక్స్ కూడా ఊహించినట్టే ఉంది. పెద్దగా మలుపులు, ట్విస్ట్స్ అంటూ ఏమీ లేవు.&nbsp; ఎవరెలా చేశారంటే..? గాండీవధారి అర్జున మూవీలో వరుణ్ తేజ్ యాక్షన్ రోల్ చేశాడు. తన పర్సనాలిటీతో ఆ పాత్రకు హుందాతనాన్ని తీసుకొచ్చాడు. హాలీవుడ్ యాక్షన్ హీరోను తలపించాడు. అయితే యాక్షన్‌ చిత్రం కావడంతో నటనకు పెద్దగా స్కోప్‌ లేదు. అయినప్పటికీ వరుణ్‌ ఉన్నంతలో తన మార్క్‌ చూపించే ప్రయత్నం చేశాడు. ఇక సాక్షి వైద్య సినిమా మొత్తం ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండదు. నాజర్‌ ఎప్పటిలాగే తన అనుభవాన్ని ఉపయోగించి నటించారు. తమిళ నటుడు వినయ్ రాయ్ విలన్ పాత్రలో మెప్పించాడు. మనీశ్ చౌదరీ, రవి వర్మ పరిధి మేరకు నటించారు. టెక్నికల్‌గా&nbsp; ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే మిక్కీ జే మేయర్‌ అందించిన సంగీతం సినిమాకు ప్లస్‌ కాలేకపోయింది. ఒక్క పాట కూడా గుర్తుంచుకునేలా లేదు. అటు బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సైతం నామమాత్రంగానే ఉంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు ఇచ్చే BGM లాగా అనిపించలేదు. G. ముఖేశ్‌ ఇచ్చిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఆయన పనితనం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ వరుణ్‌ తేజ్‌ నటనయాక్షన్‌ సన్నివేశాలుసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీడైరెక్షన్‌పాటలునో థ్రిల్స్‌ &amp; నో ట్విస్ట్స్‌ సినిమా రేటింగ్‌: 2.5/5 https://www.youtube.com/watch?v=cBGSJcM8C8s
    ఆగస్టు 28 , 2023
    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.&nbsp; ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు కింగ్‌ ఆఫ్‌ కొత్త దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (King of Kotha). ఆయన చిన్ననాటి మిత్రుడైన అభిలాష్‌ జోషిలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 24న మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. గాండీవధారి అర్జున వరుణ్‌ తేజ్‌ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). సాక్షి వైద్య కథానాయిక. BVSN ప్రసాద్‌ నిర్మాత. వరుణ్‌తేజ్‌ ఇందులో సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 25న (శుక్రవారం) ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. తనని నమ్ముకున్న వాళ్లకి రక్షణగా నిలుస్తూ ప్రాణాల్ని కాపాడటం కోసం ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఏం చేశాడు? అన్నది సినిమా కథ. &nbsp; బెదురు లంక 2012 కార్తికేయ, నేహా శెట్టి జంటగా చేసిన చిత్రం ‘బెదురు లంక 2012’ (Beduru Lanka 2012). ఈ సినిమాకు క్లాక్స్‌ దర్శకత్వం వహించాడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించాడు. ఎల్బీ శ్రీరామ్‌, అజయ్‌ ఘోష్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఒక ఊరు నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథగా ఉంటుంది. ఇందులో బలమైన కథతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదముంది’ అని చిత్ర బృందం తెలిపింది. ఏం చేస్తున్నావ్‌ విజయ్‌ రాజ్‌ కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌’ (Em chestunnav). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ కూడ ఆగస్టు 25న విడుదల కానుంది. హాలీవుడ్‌ సీన్లను తలదన్నేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. ప్రతీ 10 నిమిషాలకు కథ మలుపు తిరుగుతుంటుందని పేర్కొన్నారు. ప్రేక్షకులు మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.&nbsp; బాయ్స్‌ హాస్టల్‌ కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’ తెలుగులో&nbsp; ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు తెలుగులో ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాయి. నితిన్‌ కృష్ణమూర్తి దర్శకుడు కాగా.. ప్రజ్వల్‌, మంజునాథ్‌ నాయక, రాకేష్‌ రాజ్‌కుమార్‌, శ్రీవత్స, తేజస్‌ జయన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 26న విడుదలవుతోంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లివే! బ్రో పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)- సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). సముద్రఖని దర్శకుడు. తమిళంలో వచ్చిన ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. బేబీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ముక్కోణపు ప్రేమ కథ ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో (Baby the movie On Aha) స్ట్రీమింగ్‌ కానుంది. ఆగస్టు 25 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు. ‘ఆహా గోల్డ్‌’ సభ్యత్వం కలిగిన వారు ఈ సినిమాను 12 గంటల ముందు నుంచే చూడొచ్చు. TitleCategoryLanguagePlatformRelease DateRagnarokWeb SeriesEnglishNetflixAugust 24Killer book clubMovieEnglishNetflixAugust 25LiftMovieEnglishNetflixAugust 25Aakhri sachWeb SeriesHindiDisney+HotstarAugust 25Somewhere queensMovieEnglishBook My ShowAugust 21Lakhan leela bhargavWeb SeriesHindiJio CinemaAugust 21Bajao&nbsp;MovieHindiJio CinemaAugust 25Invasion 2&nbsp;SeriesEnglishApple Tv PlusAugust 23 APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
    ఆగస్టు 21 , 2023
    Project K: మూవీ పోస్టర్లతో కథ చెప్పేసిన నాగ్‌ అశ్విన్‌.! కళ్లు, వేళ్లు ఏం చెబుతున్నాయో తెలుసా?
    Project K: మూవీ పోస్టర్లతో కథ చెప్పేసిన నాగ్‌ అశ్విన్‌.! కళ్లు, వేళ్లు ఏం చెబుతున్నాయో తెలుసా?
    ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్- K (Project-K). అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, దిశా పటాని వంటి స్టార్లతో నిండిపోయిన ఈ సినిమాలో మరో స్టార్ నటుడు కమల్ హాసన్ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌కు విలన్‌గా కమల్ హాసన్ నటిస్తున్నాడట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డీల్ పూర్తైనట్లు సమాచారం. విలన్ పాత్ర పోషించడానికి కమల్ హాసన్ 10 అంకెల పారితోషికం డిమాండ్ చేశాడట. అయితే, ఈ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ఒక్కో పోస్టర్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేస్తోంది.&nbsp; ఒక్కో పోస్టర్‌లో ఒక్కో ప్రత్యేకత.. విరిగి పడిన చేతికి ఎక్కుపెట్టిన తుపాకులు, పిడికిలి బిగించిన చేతులు, దూరంగా కొండ అంచుపై చీకటిలో నిలబడిన మనిషి, ఆశతో నిండిన కళ్లు.. ఇవీ ప్రాజెక్ట్ K చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు. ఒక్కో పోస్టర్‌పై ఒక్కో రకమైన స్టేట్‌మెంట్‌ని విడుదల చేసి పాత్రల గురించి టీం హింట్ ఇచ్చింది.&nbsp; తాజాగా దిశా పటాని పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పెళ్లి కూతురిని ముస్తాబు చేస్తున్నట్లు ఉంది. దిశా పటాని కళ్లను మాత్రమే చూపించారు. ఆ కళ్లను చూస్తే ఏదో చెప్పాలి అన్నట్లుగా ఆశగా ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోంది. మరి, ఈ ఎదురు చూపు ఎవరికోసం? ఎందుకోసం? అసలు దిశ క్యారెక్టర్ ఏంటి? అని ఆలోచనలో పడ్డారు.&nbsp; శివరాత్రి సందర్భంగా చిత్రబృందం రిలీజ్ ప్రకటిస్తూ పోస్టర్‌ని విడుదల చేసింది. ఓ భారీ చేయి విరిగిపడి ఉండగా, ఆ చేతివైపు ముగ్గురు వ్యక్తులు (ప్రత్యేక సూట్ వేసుకుని) అత్యాధునిక తుపాకులు గురిపెట్టి నిల్చొని ఉండటం ఇందులో చూపించారు. అక్కడ పడి ఉన్న వస్తువులను చూస్తుంటే చుట్టు పక్కల విధ్వంసం జరిగినట్లు తెలిసిపోతోంది. మరి, ఈ విధ్వంసం ఆ చేయి సృష్టించిందా? లేదా అసుర సంహారమా? ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందనే క్యాప్షన్ పెట్టి దీనిని మరింత ఆసక్తికరంగా మలిచారు.&nbsp; బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బర్త్ డే సందర్బంగా విష్ చేస్తూ ప్రాజెక్ట్ K టీం మరో పోస్టర్ రిలీజ్ చేసింది. పిడికిలి బిగించిన చేతి ఫొటోను ఇందులో చూపించింది. చేతికి రక్షణగా ఓ వస్త్రాన్ని కట్టుకున్నట్లు ఉంది. ఈ పోస్టర్‌లోనే ‘Legends are Immortal’ (ధీరులకు మరణం ఉండదు) అని క్యాప్షన్‌ ఇచ్చారు. అంటే, అమితాబ్ పాత్ర పోరాట సన్నివేశాలకు మిళితమై ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కూడా దాదాపు ఇలాంటి పోస్టర్‌నే విడుదల చేసింది టీమ్‌. చేతికి రక్షణగా పెట్టుకున్న సూట్ ఇందులో ఉంది. ఆ పోస్టర్‌కు ‘Heroes are Not Born, They Rise’ అని క్యాప్షన్ ఇచ్చారు.&nbsp; ఎవరీ సేవియర్? దీపిక పదుకునె బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్ రిలీజైంది. పోరాడి అలసిపోయిన ఓ సేవియర్‌ని చూపిస్తున్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ఇందులో దీపిక ముఖం చూపించలేదు. కానీ, కొండపై నిల్చొని పిడికిలిని బిగించినట్లుగా ఉంది.&nbsp; పోస్టర్‌పై ‘A Hope in The Dark’ అని క్యాప్షన్ ఉంది. అంటే, దారులన్నీ చీకటిగా మారినప్పుడు మార్గం చూపి ముందుకు నడిపించే వెలుగు దివ్వె అని చెప్పకనే చెప్పారు. సినిమాలో కథానాయకులు దిగ్బంధంలో ఉన్నప్పుడు వీరిని రక్షించేందుకు దీపిక వస్తుందేమో అని చర్చించుకుంటున్నారు.&nbsp; ఇదేనా స్టోరీ? ‘ప్రాజెక్ట్ K’ స్టోరీపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. విష్ణు మూర్తి దశావతారమైన కల్కి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడట. కల్కికి తండ్రిగా అశ్వథ్థామ పాత్రను బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కలియుగాంత సమయంలో సృష్టి రక్షణకు చేయూతనిచ్చేందుకు కల్కిగా వస్తాడని, దుష్ట సంహారానికై చేసే పోరాటంలో వీరందరూ ఏకమైతారని తెలుస్తోంది.&nbsp; https://twitter.com/VyjayanthiFilms/status/1645313158955802625?s=20 మరోవైపు, కొడుకు ఆశయాన్ని నెరవేర్చడానికి తండ్రి ఏం చేశాడనే నేపథ్యంలో కథ సాగుతుందనే ప్రచారమూ జరుగుతోంది. మొత్తానికి పీరియాడికల్ స్టోరీని ఎంచుకుని లేటెస్ట్ హంగులతో సైంటిఫిక్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. ఇందులో టైమ్ మిషన్ కాన్సెప్ట్ కూడా ఉండనుందట. రైడర్స్‌ని విలన్లుగా పరిచయం చేయడంతో మరింత హైప్ పెరిగింది. ఏదేమైనా ఈ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని నెలకొల్పుతుందని చిత్రబృంద సభ్యులు వెల్లడిస్తున్నారు.&nbsp; స్పెషల్ ఫోకస్.. సినిమాలో టైం మిషన్ కాన్సెప్ట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య 369 వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు మెంటార్‌గా పనిచేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా ఉండబోతోందని ముందుగానే సింగీతం చెప్పారు. ఈ సినిమాలో ఉపయోగించే కార్ల విషయంలో నాగ్ అశ్విన్ స్పెషల్ ఫోకస్ పెట్టాడు. అధునాతన ఈవీ వెహికల్స్ డిజైన్ విషయంలో సాయం అందించాలని అభ్యర్థించగా మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ముందుకొచ్చారు. ఇలాంటి సినిమాలు తనకు ఇష్టమని కచ్చితంగా హెల్ప్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సినిమా జనవరి 12, 2024న విడుదల కానుంది.&nbsp;
    జూన్ 15 , 2023

    @2021 KTree