• TFIDB EN
  • రాక్షసుడు
    UATelugu2h 29m
    అరుణ్ కొత్తగా డ్యూటీలో చేరిన పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్. ఆ సమయంలో పెద్ద ఎత్తున అమ్మాయిలు మిస్సింగ్ అవుతూ శవాలుగా బయటపడుతుంటారు. ఈ కేసును అరుణ్ చేపట్టడంతో అతని కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది. ఇంతకు ఈ కేసును అరుణ్ ఎలా ఛేదించాడు అనేది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    బెల్లంకొండ శ్రీనివాస్
    సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్
    అనుపమ పరమేశ్వరన్
    కృష్ణవేణి
    శరవణన్క్రిస్టోఫర్ మేరీ ఫెర్నాండెజ్/అన్నాబెల్లా జార్జ్ (ద్వంద్వ పాత్ర)
    యాసర్యంగ్ క్రిస్టోఫర్
    అమ్ము అభిరామి
    అరుణ్ మేనకోడలు
    రాజీవ్ కనకాల
    సిరి తండ్రి మరియు అరుణ్ బావమరిది
    వినోదిని వైద్యనాథన్
    సిరి తల్లి మరియు అరుణ్ సోదరి
    కేశవ్ దీపక్వెంకట్
    సుజానే జార్జ్
    ACP లక్ష్మి
    సూర్య
    డా. కిషోర్
    కాశీ విశ్వనాథ్
    పోలీస్ కానిస్టేబుల్ విశ్వనాథ్
    రవి ప్రకాష్
    పోలీస్ ఆఫీసర్ శ్రవణ్
    త్రిశాల సంజన సంగీత (ద్వంద్వ పాత్ర)
    ప్రియమీరా
    రాధా రవి
    ఇన్‌స్పెక్టర్ జయ ప్రకాష్ (అతి అతిధి పాత్ర)
    జిబ్రాన్
    స్వయంగా (అతి అతిధి పాత్ర)
    నోయెల్ సీన్
    స్వయంగా (అతి అతిథి పాత్ర)
    సిబ్బంది
    రమేష్ వర్మ
    దర్శకుడు
    హవిష్ మంధాడి
    నిర్మాత
    సత్యనారాయణ కోనేరునిర్మాత
    జిబ్రాన్
    సంగీతకారుడు
    కథనాలు
    Chiranjeevi- Radha Movies: చిరంజీవి- రాధ మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
    Chiranjeevi- Radha Movies: చిరంజీవి- రాధ మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
    విజయశాంతి(19) తర్వాత చిరంజీవితో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్ రాధ. ఈమె ఏకంగా 16 సినిమాల్లో నటించి చిరంజీవితో హిట్‌ పేయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వీటిలో 10 చిత్రాలు హిట్‌గా నిలిచాయి. వాటిపై ఓ లుక్‌ వేద్దాం. గూండా(1984) చిరంజీవి- రాధ (Chiranjeevi and Radha Movies List) కాంబోలో వచ్చిన తొలి చిత్రం 'గూండా'. ఈ చిత్రాన్ని  ఏ.కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. నాగు(1984) తాతినేని ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రెండోసారి చిరంజీవి- రాధ జత కట్టారు. ఈ సినిమాను ఏవీఎం ప్రొడక్షన్‌లో వచ్చింది. ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దొంగ(1985) ఏ. కొదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది. తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా హిట్లు లేని సమయంలో ఈ చిత్రం విజయం సాధించి ఊపు తీసుకొచ్చింది. ఈ సినిమాతో చిరంజీవి- రాధ హిట్ పెయిర్‌గా నిలిచారు. పులి(1985) చిరంజీవి- రాధ జంటగా నటింటిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమాను రాజ్ భరత్ డైరెక్ట్ చేశారు. రక్త సింధూరం(1985) ఏ. కొదండరామిరెడ్డి డైరెక్షన్‌లో చిరంజీవి-రాధ జంటగా మెప్పించిన మరో చిత్రం పులి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దగా పెద్దగా ఆడలేదు. అడవి దొంగ(1986) చిరంజీవి- రాధ (Chiranjeevi and Radha Movies List)  జంటగా నటించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను కే. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.  కొండవీటి రాజా(1986) కే. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో చిరంజీవి-రాధ కాంబోలో బ్యాక్‌ టూ బ్యాక్ హిట్‌గా నిలిచిన చిత్రం 'కొండవీటి రాజా'. ఈ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.  రుద్ర నేత్ర(1989) కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ ప్లాప్ అయింది. ఈ సినిమాలో చిరుకు జోడీగా రాధ, విజయశాంతి నటించారు.  రాక్షసుడు(1986) చిరంజీవి- రాధ కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. రాక్షసుడు చిత్రాన్ని ఏ.కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. జేబు దొంగ(1987) కొదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. చిరంజీవి- రాధ మరోసారి తమ కెమిస్ట్రీతో మెప్పించారు. ఈ చిత్రం హిందీలో ఆజ్‌కా గ్యాంగ్‌ లీడర్ పేరుతో డబ్‌ చేశారు. యముడికి మొగుడు(1988) చిరంజీవి, రాధ, విజయశాంతి జోడిగా రవిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం 'యముడికి మొగుడు'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టైయింది.  మరణ మృదంగం(1988) ఏ కొదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ హిట్‌ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధ మరోసారి నటించింది. స్టేట్ రౌడీ(1989) బి.గోపాల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి, రాధ(Chiranjeevi and Radha Movies List)  పోటీపడిమరి నటించారు. లంకేశ్వరుడు(1989) చిరంజీవి, రాధ, రేవతి జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాను దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు తెరకెక్కించారు. ఇది ఆయనకు 100వ సినిమా. కొండవీటి దొంగ(1990) చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్‌లలో కొండవీటి దొంగ ఒకటి. ఈ చిత్రాన్ని కొదండ రామిరెడ్డి డైరెక్ట్ చేశారు. చిరంజీవి సరసన రాధ, విజయశాంతి జంటగా నటించారు. కొదమ సింహం(1990) చిరంజీవి- రాధ కలిసి నటించిన చివరి సినిమా ఇది. ఈ సినిమాను కే మురళిమోహన్‌రావు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి కౌబాయ్ గెటప్‌తో అలరించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.
    నవంబర్ 08 , 2023
    Teachers Day 2023: తెలుగు తెరపై పంతులమ్మ పాత్రల్లో అలరించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీళ్లే..!
    Teachers Day 2023: తెలుగు తెరపై పంతులమ్మ పాత్రల్లో అలరించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీళ్లే..!
    భారతీయ సంస్కృతిలో ఉపధ్యాయ వృత్తికి అత్యున్నత గౌరవం ఉంది. పురాణాలు, చరిత్రలో గురువులకు సముచిత స్థానం కల్పించారు మన పూర్వికులు. "గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః" అంటూ గురువును త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పొల్చారు. విద్యార్థుల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రబోధించే గురువులకు అప్పటికీ, ఇప్పటికీ ఉన్నారు. వారందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలుగు తెరపై టీచర్లుగా నటించి మంచి గుర్తింపు పొందిన నటీమణులు చాలా మంది ఉన్నారు. ఆ పంతులమ్మలు ఎవరో ఓసారి చూద్దాం... విజయశాంతి: తెలుగు తెరపై ఎన్ని సినిమాలు వచ్చినా అందులో విజయశాంతి నటించిన ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ చిత్రాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. ప్రతిఘటనలో లెక్చరర్‌గా ఆమె పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఆ సినిమాలో గతి తప్పిన విద్యార్థులను ఉద్దేశిస్తూ విజయశాంతి పాడిన పాట సినిమాకే హైలెట్. "ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతలోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం ఆరవవేదం మానభంగపర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం... ఆసిన్ విజయశాంతి తర్వాత టీచర్ పాత్ర చేసి అంత గుర్తింపు పొందిన హీరోయిన్ ఆసిన్. విక్టరీ వెంకటేష్ నటించిన ఘర్షణ చిత్రంలో మ్యాథ్య్ టీచర్‌గా సీరియస్‌ రోల్‌ నటించి మెప్పించింది. కమలినీ ముఖర్జీ హ్యాపీ డేస్ చిత్రంలో తన గ్లామర్‌తో మాయ చేసింది కమలినీ ముఖర్జీ. ఇంగ్లిష్ లెక్చరర్‌గా కనువిందు చేసింది. ఇలియానా రవితేజ నటించిన ‘ఖతర్నాక్’ మూవీలో చేసిన టీచర్ పాత్రకు కాస్త గ్లామర్ అద్దింది ఇలియానా. ఈ రోల్‌పై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. టీచర్‌ పాత్రను ఇలా చూపించడం ఏమిటంటూ పలువురు పెదవి విరిచారు. నయనతార లేడీ బాస్ నయనతార సైతం పలు చిత్రాల్లో పంతులమ్మ క్యారెక్టర్లో నటించి మెప్పించింది. ‘నేనే అంబానీ మూవీలో టీచర్‌ క్యారెక్టర్‌లో నటించి మెప్పించింది. అనుపమ పరమేశ్వరన్ క్యూట్ డాల్ అనుపమ పరమేశ్వరన్ కూడా టీచర్ రోల్‌ మెప్పించి ఔరా అనిపించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రంలో టీచర్ పాత్రలో కనిపించింది. సాయి పల్లవి ఈ తరం కుర్రకారును లెక్చరర్ పాత్రలో బాగా మెప్పించిన రోల్‌ ఏదైన ఉందంటే  'ప్రేమమ్'(మలయాళం) సినిమాలో సాయిపల్లవి చేసిన అధ్యాపకురాలి పాత్ర. ఈ పాత్రలో సాయిపల్లవి పరకాయ ప్రవేశం చేసి అలరించింది. శృతిహాసన్ తెలుగులో వచ్చిన 'ప్రేమమ్' సినిమాలోనూ లెక్చరర్ పాత్రలో ఒదిగిపోయింది శృతిహాసన్‌. ఆ సినిమాలో హీరోగా నాగచైతన్య నటించిన సంగతి తెలిసిందే. సన్నిలియోన్ మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంటు తీగ’ సినిమాలో కాసేపు టీచర్ పాత్రలో నటించి కాసేపు కనువిందు చేసింది సన్ని లియోన్. షకిలా నితిన్-సదా జంటగా నటించిన జయం సినిమాలో షకిలా లెక్చరర్ పాత్రలో నటించి నవ్వులు పూయించింది. అప్పట్లో ఈ క్యారెక్టర్ వివాదాస్పదమైంది.   కలర్స్ స్వాతి సుమంత్ హీరోగా నటించిన గోల్కొండ హై స్కూల్ చిత్రంలో టీచర్ పాత్రలో మెరిసింది కలర్స్ స్వాతి  సంయుక్త మీనన్ ధనుష్ హీరోగా నటించిన 'సార్' మూవీలో లెక్చరర్ పాత్రలో నటించి కనువిందు చేసింది సంయుక్త మీనన్. బయాలజీ టీచర్‌ రోల్‌లో నటించి అలరించింది. ఈ సినిమా సూపర్ హిట్  సుహాసిని ఇక పాత తరంలో 'ఆరాధన' సినిమాలో సుహాసిని చేసిన టీచర్ పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
    సెప్టెంబర్ 05 , 2023
    <strong>Kala Bhairava: భారీ బడ్జెట్‌తో లారెన్స్ ఫిల్మ్.. చేతులు కాలక తప్పదా?</strong>
    Kala Bhairava: భారీ బడ్జెట్‌తో లారెన్స్ ఫిల్మ్.. చేతులు కాలక తప్పదా?
    కొరియోగ్రాఫర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలుత డైరెక్టర్‌గా సత్తాచాటిన లారెన్స్ ఆ తర్వాత నటుడిగాను తన ప్రతిభ చూపించాడు. ‘మాస్’, ‘స్టైల్’, ‘ముని’, ‘డాన్‌’, ‘కాంచన’, ‘గంగ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రీసెంట్‌గా చంద్రముఖి 2 వచ్చిన అతడు బాక్సాఫీస్‌ వద్ద దారణంగా విఫలయ్యాడు. దీంతో తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై ‘కాల భైరవ’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.&nbsp; గంభీరమైన లుక్‌లో లారెన్స్‌! రాఘ‌వ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా ర‌మేష్ వ‌ర్మ (Ramesh Varma) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న చిత్రం ‘కాల భైరవ’ (Kala Bhairava). తెలుగులో ‘రాక్ష‌సుడు’ (Rakshasudu), రవితేజతో ‘ఖిలాడి’ (Khiladi) వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన రమేష్‌ వర్మ ఈ ప్రాజెక్ట్‌కు వర్క్‌ చేయనుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్‌గా త‌న‌దైన ముద్ర వేసిన లారెన్స్‌ కెరీర్‌లో 25వ చిత్రంగా ఇది రానుంది. ఇవాళ (సెప్టెంబర్ 29) లారెన్స్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌, టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. పాన్‌ ఇండియా సూపర్‌ హీరో ఫిల్మ్‌గా రానున్న ‘కాల భైరవ’ పోస్టర్‌ ఇంటెన్స్‌గా ఉంది. లారెన్స్ గంభీరమైన లుక్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. https://twitter.com/DirRameshVarma/status/1851126864137363612 కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బడ్జెట్‌! లారెన్స్‌ హీరోగా నటించనున్న ‘కాల భైరవ’ చిత్రాన్ని ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి (A STUDIOS LLP), గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్‌, నీలాద్రి ప్రొడ‌క్ష‌న్స్‌, హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత కోనేరు సత్యనారాయణ ఎంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. లారెన్స్ కెరీర్‌లో ఇదే హయేస్ట్‌ బడ్జెట్‌గా రాబోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. నవంబర్‌ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మెుదలు కానుంది. 2025 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్‌ తెలియజేయనున్నారు.&nbsp; రిస్క్‌ చేస్తున్నారా? ‘కాల భైరవ’ చిత్రానికి రూ.200 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తారని వార్తలు రావడంపై ఫిల్మ్ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో లారెన్స్‌కు మంచి గుర్తింపు ఉన్నప్పటికీ మార్కెట్‌ పరంగా అతడు వెనుకబడి ఉన్నట్లు చెబుతున్నాయి. అతడు నటించిన ఏ చిత్రం కూడా ఇప్పటివరకూ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరలేదని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లారెన్స్‌ను నమ్మి రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టడం నిజంగా రిస్కే అవుతుందని సూచిస్తున్నారు. రిజల్ట్ ఏమాత్రం అనుకూలంగా లేకపోయిన తీవ్ర నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయితే సబ్జెక్ట్‌పై ఉన్న నమ్మకంతో ఎంతైన ఖర్చు చేసేందుకు మేకర్స్‌ వెనుకాడటం లేదు.&nbsp; లారెన్స్‌ మంచి మనసు రాఘవ లారెన్స్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవలోనూ ముందుంటారు. గతంలోనే ఓ స్వచ్ఛంద సంస్ధను స్థాపించిన ఆయన దాని ద్వారా పేదలు, రైతులకు పలుమార్లు సాయం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మరోమారు మంచి మనసు చాటుకున్నారు. పేద వితంతు మహిళలకు అండగా నిలుస్తూ కుట్టు మిషన్స్‌ను పంపిణీ చేశారు. వారి కాళ్లపై వారు నిలబడేలా తోడ్పాటు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా లారెన్స్ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. తారెన్స్‌ మంచి మనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుతున్నారు. https://twitter.com/offl_Lawrence/status/1850890389521092953
    అక్టోబర్ 29 , 2024
    <strong>NTR 31: ప్రశాంత్‌ నీల్‌ మూవీలో </strong><strong>జూ.ఎన్టీఆర్‌ పాత్ర ఇంత వైలెంట్‌గా ఉంటుందా? ఇక ఊచకోత తప్పదా!</strong>
    NTR 31: ప్రశాంత్‌ నీల్‌ మూవీలో జూ.ఎన్టీఆర్‌ పాత్ర ఇంత వైలెంట్‌గా ఉంటుందా? ఇక ఊచకోత తప్పదా!
    ‘కేజీఎఫ్‌’ (KGF), ‘సలార్‌’ (Salaar) లాంటి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel).. త్వరలో జూ.ఎన్టీఆర్‌ (Jr NTR)తో ఓ సినిమా చేయబోతున్నారు. ‘NTR 31’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం తారక్‌.. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో 'దేవర' (Devara) చిత్రం చేస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు నెలల తర్వాత 'NTR 31' సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది.&nbsp; రాక్షసుడిగా తారక్‌! ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో రూపొందనున్న 'NTR 31' చిత్రాన్ని ఆగస్టులో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రం తారక్‌ కెరీర్‌లో 31వ సినిమాగా తెరకెక్కనుంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. తారక్‌ ఈ సినిమాలో నెగిటివ్‌ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నరరూప రాక్షసుడిగా కనిపిస్తాడని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. తారక్‌ పాత్రను సరికొత్తగా డిజైన్‌ చేసినట్లు సమాచారం. ఆ పాత్ర కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాతనే 'సలార్‌ 2' మెుదలు పెట్టాలని ప్రశాంత్‌ నీల్‌ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది.&nbsp; పవర్‌ఫుల్‌ టైటిల్‌! NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్‌ఫుల్‌ పేరు అయినందువల్లే డ్రాగన్‌ టైటిల్‌ను ప్రశాంత్‌ నీల్‌ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్‌ ఇందులో నెగిటివ్‌ రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్‌ అయితేనే సరిగ్గా మ్యాచ్‌ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్‌ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.&nbsp; భారీ బడ్జెట్‌ చిత్రం తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్‌గా తారక్‌కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. కాగా, ఈ మూవీలో తారక్‌ సరసన రష్మిక మందన్న చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే ఇతర నటీనటులను కూడా ఫైనల్‌ చేస్తారని సమాచారం.&nbsp; ‘దేవర’ రిలీజ్‌ ఎప్పుడంటే? క్రేజీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న దేవర చిత్రం సెప్టెంబర్‌ 27న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. జనతా గ్యారేజ్‌ తర్వాత తారక్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) చేసింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ఇందులో విలన్‌గా కనిపించనున్నారు. వాస్తవానికి అక్టోబర్ 10న దేవర రిలీజ్‌ కావాల్సి ఉండగా.. పనులు శరవేగంగా సాగుతుండటంతో సెప్టెంబర్‌ 27కు మార్చినట్లు చిత్ర యూనిట్‌ స్పష్టం చేసింది.&nbsp;
    జూన్ 22 , 2024
    <strong>NTR 31: 75 ఏళ్ల వృద్ధుడిలా తారక్‌.. నీల్‌ మామ గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నాడుగా!</strong>
    NTR 31: 75 ఏళ్ల వృద్ధుడిలా తారక్‌.. నీల్‌ మామ గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నాడుగా!
    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సక్సెస్‌ తర్వాత జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) క్రేజ్‌ గ్లోబల్‌ స్థాయికి చేరింది. బాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. ప్రస్తుతం తారక్‌ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రం తర్వాత ‘NTR 31’ ప్రాజెక్ట్‌లో నటించేందుకు తారక్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ‘కేజీఎఫ్‌’ (KGF), ‘సలార్‌’ (Salaar) లాంటి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది.&nbsp; డ్యూయల్‌ రోల్‌లో తారక్‌? తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఇందులో తారక్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్‌ కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ప్రశాంత్‌ నీల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.&nbsp; నర రూప రాక్షసుడిగా..! 'NTR 31' చిత్రంలో తారక్‌ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం ఓ పాత్రలో మాఫియా డాన్‌గా తారక్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో అతడు నరరూప రాక్షసుడిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. తారక్‌ పాత్రను డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ సరికొత్తగా డిజైన్‌ చేసినట్లు సమాచారం. ఆ పాత్ర కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాతనే 'సలార్‌ 2' మెుదలు పెట్టాలని ప్రశాంత్‌ నీల్‌ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. డ్రాగన్‌ టైటిల్‌ ఫిక్స్‌! NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్‌ఫుల్‌ పేరు అయినందువల్లే డ్రాగన్‌ టైటిల్‌ను ప్రశాంత్‌ నీల్‌ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్‌ ఇందులో నెగిటివ్‌ రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్‌ అయితేనే సరిగ్గా మ్యాచ్‌ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్‌ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.&nbsp; రూ.300 కోట్ల ఖర్చుతో.. తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్‌గా తారక్‌కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. కాగా, ఈ మూవీలో తారక్‌ సరసన రష్మిక మందన్న చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే ఇతర నటీనటులను కూడా ఫైనల్‌ చేస్తారని సమాచారం.&nbsp; ‘దేవర’ రిలీజ్‌ ఎప్పుడంటే? క్రేజీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న దేవర చిత్రం సెప్టెంబర్‌ 27న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. జనతా గ్యారేజ్‌ తర్వాత తారక్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) చేసింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ఇందులో విలన్‌గా కనిపించనున్నారు. వాస్తవానికి అక్టోబర్ 10న దేవర రిలీజ్‌ కావాల్సి ఉండగా.. పనులు శరవేగంగా సాగుతుండటంతో సెప్టెంబర్‌ 27కు మార్చినట్లు చిత్ర యూనిట్‌ స్పష్టం చేసింది.&nbsp;
    జూలై 26 , 2024
    <strong>SS Rajamouli: రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్‌లో సంచలన నిజాలు.. జక్కన ఇంత ఇబ్బంది పెట్టాడా?</strong>
    SS Rajamouli: రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్‌లో సంచలన నిజాలు.. జక్కన ఇంత ఇబ్బంది పెట్టాడా?
    భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్స్‌లో దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) ముందు వరుసలో ఉంటారు. ‘బాహుబలి’ (Baahubali), ‘బాహుబలి 2’ (Baahubali 2), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) వంటి చిత్రాలతో ప్రపంచ సినిమా రంగాన్ని దేశం వైపు చూసేలా చేశారు. సినిమాలకు సంబంధించిన పలు అంతర్జాతీయ అవార్డులను భారత్‌కు అందించారు. అటువంటి రాజమౌళిపై ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో ఓ డాక్యూమెంటరీ (Rajamouli Documentary) రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా ప్రస్తుతం అది యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్ సినీ ప్రముఖులు రాజమౌళిపై చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.&nbsp; రాజమౌళిపై ప్రశంసల వర్షం దర్శకధీరుడు రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) డాక్యుమెంటరీ రూపొందించింది. ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో రానున్న ఈ డాక్యుమెంటరీలో (Netflix Documentary)&nbsp; ఇందులో ఆయన సినీ ప్రయాణాన్ని చూపనున్నారు. ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. వీడియో ప్రారంభంలో ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌, రమా రాజమౌళి, కరణ్‌జోహార్‌, జేమ్స్‌ కామెరూన్‌, రమా రాజమౌళి వంటి ప్రముఖులు దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. వారు ఏమన్నారంటే..&nbsp; ఇప్పటివరకు ఎవరూ చూపని స్టోరీలను ప్రపంచానికి తెలియజేయడం కోసమే రాజమౌళి పుట్టారు - ఎన్టీఆర్‌ ఇలాంటి దర్శకుడిని నేను ఇప్పటివరకు చూడలేదు. సినిమాలంటే ఆయనకు పిచ్చి ప్రేమ - ప్రభాస్‌ రాజమౌళికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎవరితోనైనా పని చేయగలరు. ఆయనంటే నాకెంతో గౌరవం - జేమ్స్‌ కామెరూన్‌ ఆయన సినిమాల్లో నన్ను నేను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోతాను - రామ్‌చరణ్‌ ఈ దర్శకుడు ఓ లెజెండ్‌ - కరణ్‌ జోహార్‌ https://twitter.com/NetflixIndia/status/1815243072801763362 ‘ఎలాంటి దయ, జాలి ఉండవు’ రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్‌లో సెలబ్రిటీలకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆయనతో పని చేయడం ఎంత తలనొప్పో చెప్పాలంటూ ప్రశ్నించారు. అప్పుడు సెలబ్రిటీలు రాజమౌళితో తాము ఫేస్‌ చేసిన ఇబ్బందులను తెలియజేశారు. సెట్స్‌లో ఎన్నో మైక్స్‌ పగిలిపోవడం తాను చూశానంటూ రామ్‌చరణ్‌ చెప్పుకొచ్చారు. తాను రాజమౌళి పక్కన ఉన్నప్పుడు తన వస్తువులు పగలకుండా ఉంటే చాలు అని కోరుకునేవాడినని తెలిపారు. అటు జూ.ఎన్టీఆర్‌ మాట్లాడుతూ 'ఎలాంటి దయ, జాలి ఉండవు. తాను కోరుకున్నది రాబట్టుకోవడం, వెళ్లిపోవడం ఇలాగే చేస్తూ ఉంటాడు. అతను ఒక మ్యాడ్‌ పర్సన్‌' అని చెప్పుకొచ్చారు. భార్య రమా రాజమౌళి కూడా ఈ ట్రైలర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాజమౌళితో పని చేసిన వారందరూ ఆయన్ని పని రాక్షసుడని పిలుస్తుంటారు' అని ఆమె చెప్పుకొచ్చారు.&nbsp; ఆస్కార్‌ కమిటీకి రాజమౌళి! దర్శకధీరుడు రాజమౌళికి ఇటీవల అస్కార్‌ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. దర్శకుల కేటగిరిలో రాజమౌళి (SS Rajamouli), కాస్ట్యూమ్‌ డిజైనర్‌ జాబితాలో రమా రాజమౌళి (Rama Rajamouli) ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్‌ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్‌ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్‌ సిద్వానీ, రవి వర్మన్‌ తదితరులు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు. ‘SSMB29’తో బిజీ బిజీ! ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి తన తర్వాతి మూవీని మహేష్‌ బాబుతో చేయనున్నారు. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందనుందని టాక్‌. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. కథ కూడా ఇటీవలే ఫైనల్‌ అయినట్లు ఫిల్మ్‌ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సినిమాలో మహేష్‌ను నెవర్ బిఫోర్ అవతార్‌లో రాజమౌళి చూపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో రాజమౌళి ఈ సినిమాను రూపొందించనున్నారు.&nbsp;
    జూలై 22 , 2024
    <strong>SS Rajamouli: రాజమౌళి డాక్యుమెంటరీపై నెటిజన్లు ఫైర్‌.. మరీ ఇలా చేశారేంటీ!</strong>
    SS Rajamouli: రాజమౌళి డాక్యుమెంటరీపై నెటిజన్లు ఫైర్‌.. మరీ ఇలా చేశారేంటీ!
    దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli)పై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్‌ ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో రాజమౌళిపై హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలబ్రిటీలు ప్రసంశల వర్షం కురిపించారు. అయితే ఈ డాక్యుమెంటరీ తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇలా ఎందుకు చేశారంటూ తీవ్ర స్థాయిలో నెటిజన్లు మండిపతున్నారు. వారి కోపానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏకీపారేస్తున్న నెటిజన్లు! దర్శకధీరుడు రాజమౌళి సాధించిన ఘనతలపై ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix) ఆగస్టు 2 నుంచి దీనిని ప్రసారం చేయనుంది. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించి తొలుత ఇంగ్లీష్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఆపై కొన్ని గంటల వ్యవధిలో తెలుగు వెర్షన్‌నూ తీసుకొచ్చారు. ఇంగ్లీషు వెర్షన్‌పై ప్రశంసలు కురిపించిన నెటిజన్లు తెలుగు ట్రైలర్‌ చూసి మాత్రం షాక్‌కి గురవుతున్నారు. ఆంగ్ల ట్రైలర్‌లో ప్రభాస్‌, రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ తమ సొంత వాయిస్‌తో రాజమౌళితో తమకున్న వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకున్నారు. తెలుగుకు (SS Rajamouli Documentary) వచ్చేసరికి రాజమౌళి సహా ఆ ముగ్గురు స్టార్ హీరోలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల చేత డబ్బింగ్‌ చెప్పించారు. తెలుగు సెలబ్రిటీలైన రాజమౌళి, ప్రభాస్‌, చరణ్‌, తారక్‌లకు వేరే వాళ్లతో డబ్బింగ్‌ చెప్పించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దానికి తోడు డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా పూర్‌గా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది తమనెంతో నిరాశకు గురిచేస్తోందని పోస్టులు పెడుతున్నారు. డబ్బింగ్‌ వల్ల డాక్యుమెంటరీని ఓన్‌ చేసుకోలేకపోతున్నట్లు ఫైర్ అవుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికైనా తెలుగు డబ్బింగ్‌ విషయంలో పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=OTHKWEZilL4 డబ్బింగ్‌ చెప్పే సమయం లేదా? రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్‌ ఇంగ్లీష్‌ వెర్షన్‌లో ప్రభాస్‌, తారక్‌, రామ్‌చరణ్‌ తమ ఓన్‌ వాయిస్‌తో అభిప్రాయాలు తెలిపి తెలుగులో మాత్రం చెప్పకపోవడంపై వారిపైనా నెటిజన్లు మండిపడుతున్నారు. తెలుగు డైరెక్టర్‌కు సంబంధించి తొలిసారి ఓ డాక్యుమెంటరీ రూపొందుతుంటే ఇలా చేయడం సమంజసం కాదని అంటున్నారు. డబ్బింగ్‌ చెప్పే సమయం లేదా అంటూ నిలదీస్తున్నారు. ఎంత బిజీ షెడ్యూల్‌ ఉన్నప్పటికీ తెలుగులో ఆ స్టార్స్‌ డబ్బింగ్‌ చెప్పి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. అది దర్శకధీరుడికి ఇచ్చే నిజమైన గౌరవమని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు స్టార్‌ హీరోలకు మద్దతు తెలియజేస్తున్నారు. డాక్యుమెంటరీ మేకర్స్ హీరోల అభిప్రాయాలను కేవలం ఇంగ్లీషులోనే కలెక్ట్‌ చేసి ఉండొచ్చని అంటున్నారు. తెలుగులోనూ కోరి ఉంటే అప్పుడే తెలియజేసి ఉండేవారని మద్దతుగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్‌పై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.&nbsp; రాజమౌళి గురించి మన స్టార్స్ ఏమన్నారంటే? ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో రానున్న ఈ డాక్యుమెంటరీలో (Netflix Documentary)&nbsp; రాజమౌళి సినీ ప్రయాణాన్ని చూపనున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళితో పనిచేసిన ప్రముఖుల అభిప్రాయాలను డాక్యుమెంటరీ మేకర్స్‌ అడిగి తెలుసుకున్నారు. వీడియో ప్రారంభంలో ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌, రమా రాజమౌళి, కరణ్‌జోహార్‌, జేమ్స్‌ కామెరూన్‌, రమా రాజమౌళి వంటి ప్రముఖులు దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. వారు ఏమన్నారంటే..&nbsp; ఇప్పటివరకు ఎవరూ చూపని స్టోరీలను ప్రపంచానికి తెలియజేయడం కోసమే రాజమౌళి పుట్టారు - ఎన్టీఆర్‌ ఇలాంటి దర్శకుడిని నేను ఇప్పటివరకు చూడలేదు. సినిమాలంటే ఆయనకు పిచ్చి ప్రేమ - ప్రభాస్‌ రాజమౌళికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎవరితోనైనా పని చేయగలరు. ఆయనంటే నాకెంతో గౌరవం - జేమ్స్‌ కామెరూన్‌ ఆయన సినిమాల్లో నన్ను నేను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోతాను - రామ్‌చరణ్‌ ఈ దర్శకుడు ఓ లెజెండ్‌ - కరణ్‌ జోహార్‌ https://twitter.com/NetflixIndia/status/1815243072801763362 సెట్స్‌లో ఎన్నో మైక్స్‌ పగలడం చూశా: చరణ్‌ రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్‌లో సెలబ్రిటీలకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆయనతో పని చేయడం ఎంత తలనొప్పో చెప్పాలంటూ ప్రశ్నించారు. అప్పుడు సెలబ్రిటీలు రాజమౌళితో తాము ఫేస్‌ చేసిన ఇబ్బందులను తెలియజేశారు. సెట్స్‌లో ఎన్నో మైక్స్‌ పగిలిపోవడం తాను చూశానంటూ రామ్‌చరణ్‌ చెప్పుకొచ్చారు. తాను రాజమౌళి పక్కన ఉన్నప్పుడు తన వస్తువులు పగలకుండా ఉంటే చాలు అని కోరుకునేవాడినని తెలిపారు. అటు జూ.ఎన్టీఆర్‌ మాట్లాడుతూ 'ఎలాంటి దయ, జాలి ఉండవు. తాను కోరుకున్నది రాబట్టుకోవడం, వెళ్లిపోవడం ఇలాగే చేస్తూ ఉంటాడు. అతను ఒక మ్యాడ్‌ పర్సన్‌' అని చెప్పుకొచ్చారు. భార్య రమా రాజమౌళి కూడా ఈ ట్రైలర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాజమౌళితో పని చేసిన వారందరూ ఆయన్ని “పని రాక్షసుడని” పిలుస్తుంటారు' అని ఆమె చెప్పుకొచ్చారు.&nbsp; ఆస్కార్‌ కమిటీకి రాజమౌళి! దర్శకధీరుడు రాజమౌళికి ఇటీవల అస్కార్‌ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. దర్శకుల కేటగిరిలో రాజమౌళి (SS Rajamouli), కాస్ట్యూమ్‌ డిజైనర్‌ జాబితాలో రమా రాజమౌళి (Rama Rajamouli) ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్‌ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్‌ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్‌ సిద్వానీ, రవి వర్మన్‌ తదితరులు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.
    జూలై 23 , 2024
    <strong>Daku Maharaj Story: ‘డాకు మహారాజ్‌’ స్టోరీ ఇదేనా? ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ రివీల్!</strong>
    Daku Maharaj Story: ‘డాకు మహారాజ్‌’ స్టోరీ ఇదేనా? ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ రివీల్!
    టాలీవుడ్‌ మాస్‌ చిత్రాలకు కేరాఫ్ అనగానే ముందు గుర్తుకువచ్చే హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). గత కొంతకాలంగా వరుస మాస్‌ ఎంటర్‌టైనర్స్ తీస్తూ వరుస హిట్స్‌ అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్‌ బాబీతో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NBK 109 అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టైటిట్‌ను ‘డాకూ మహారాజ్‌’గా చిత్ర బృందం అనౌన్స్‌ చేసింది. అంతేకాదు అదిరిపోయే టీజర్‌తో నందమూరి అభిమానులకు గూస్‌బంప్స్‌ తెప్పించింది. అయితే టైటిల్‌, టీజర్‌తోనే దర్శకుడు బాబీ సినిమా కథను చెప్పకనే చెప్పాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.&nbsp; టీజర్‌లో ఏముంది? నటుడు బాలకృష్ణ - దర్శకుడు బాబీ (Bobby) కాంబోలో రాబోతున్న 'డాకు మహారాజ్‌' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ఈ సినిమాను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీజర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. 'ఈ కథ వెలుగుని పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది’ అనే డైలాగ్‌తో మెుదలైంది. గుర్తుపట్టావా.. డాకు మహారాజ్‌’’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్‌, విజువల్స్‌ ఈలలు వేయించేలా ఉన్నాయి. ఈ టీజర్‌ ఫుల్‌ ఆఫ్‌ యాక్షన్స్‌ సీక్వెన్స్‌తో దర్శకుడు నింపేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్‌ మరోమారు బాలయ్య మాస్‌ తాండవం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=teN0JZ67KZU డాకు మాన్సింగ్‌ ప్రేరణతో..&nbsp; బాలయ్య పోషిస్తున్న డాకు మహారాజ్‌ రోల్‌ను ఓ వ్యక్తి నిజ జీవితం ఆధారంగా తీసుకున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎవరీ డాకు మహారాజ్‌? అని సినీ లవర్స్ తెగ సెర్చ్‌ చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి అసలు పేరు డాకు మాన్సింగ్‌. పంజాబ్, ఛంబల్‌ ప్రాంతాల్లో బందిపోటు దొంగగా ఒకప్పుడు చలామణీ అయ్యాడు. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ తన చిన్నతనంలో డాకు మాన్సింగ్‌ పేరు బాగా వినేవారట. ఆయన చేసే దోపిడీలు, తప్పించుకునే తీరు విని చిన్నప్పుడు ఎంతో భయపడినట్లు అమితాబ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. అయితే డాకు మాన్సింగ్‌ దోచుకున్న సొమ్మును సొంతానికి వాడుకునేవారు కాదట. పేదోళ్లకు ఆ ధనం మెుత్తాన్ని పంచేవారని చంబల్‌ ప్రాంత ప్రజలు చెబుతుంటారు.&nbsp; https://twitter.com/SitharaEnts/status/1857285926067823074 స్టోరీ ఇదేనా! ఒకప్పటి ఫేమస్‌ బందిపోటు డాకు మాన్సింగ్‌ (Daku Maharaj Story) పాత్రను ప్రేరణగా తీసుకొని దర్శకుడు బాబీ బాలయ్య చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్‌ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. దీని ప్రకారం ఈ సినిమాలో బందిపోటైన బాలయ్య ప్రజలకు అండగా నిలుస్తాడని అర్థం చేసుకోవచ్చు. ప్రజలను పీడించి, వారి కష్టాన్ని దోచుకున్న వారిని ఇందులో బాలయ్య టార్గెట్‌ చేసే ఛాన్స్ ఉంది. వారి నుంచి ఎంతో చాకచక్యంగా దోచుకున్న ధనాన్ని తిరిగి ప్రజలకే పంచుతాడని అంచనా వేయవచ్చు. అయితే మూడు భిన్న కాలాల్ని ప్రతిబింబించేలా కథ ఉంటుందని కూడా అంటున్నారు. దీన్నిబట్టి కథలో డాకు మహారాజ్‌ ఒక భాగం అవుతాడా? లేదా అతడి చుట్టూనే సినిమా తిరగనుందా? అన్నది తెలియాల్సి ఉంది.&nbsp; https://twitter.com/SitharaEnts/status/1857296349605273899 మూడు కోణాల్లో బాలయ్య..&nbsp; 'భగవంత్‌ కేసరి' (Bhagavanth Kesari) వంటి సూపర్‌ హిట్‌ తర్వాత బాలయ్య చేస్తున్న 'డాకు మహారాజ్‌'. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌, చాందినీ చౌదరి, శ్రద్ధాశ్రీనాథ్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన బాబీదేవోల్‌ ఇందులో కీలకపాత్రలో కనిపించనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక అగ్ర నటుడు కూడా ఇందులో నటిస్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. కథ సాగే కాలానికి తగ్గట్లుగా బాలకృష్ణ మూడు కోణాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. యాక్షన్‌ సీక్వెన్‌ కూడా మరో లెవల్లో ఉంటాయని అంటున్నారు. కాగా, ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. థమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.&nbsp;
    నవంబర్ 15 , 2024
    <strong>Bagheera Trailer Review: ప్రశాంత్‌ నీల్‌ ‘భగీరా’ట్రైలర్‌లో ఇవి గమనించారా.. మరో కేజీఎఫ్‌ కానుందా?</strong>
    Bagheera Trailer Review: ప్రశాంత్‌ నీల్‌ ‘భగీరా’ట్రైలర్‌లో ఇవి గమనించారా.. మరో కేజీఎఫ్‌ కానుందా?
    ప్రశాంత్‌ నీల్‌ ‘భగీరా’ట్రైలర్‌లో ఇవి గమనించారా.. మరో కేజీఎఫ్‌ కానుందా?కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్‌’ (KGF), ‘కేజీఎఫ్‌ 2’ (KGF 2) దేశవ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. కేజీఎఫ్‌ ముందు వరకూ పెద్దగా ఎవరికి తెలియని కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ఆ రెండు చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఇటీవల ప్రభాస్‌తో ‘సలార్‌’ తెరకెక్కించి బాక్సాఫీస్‌ వద్ద మరోమారు వసూళ్ల సునామి సృష్టించాడు. ముఖ్యంగా కథల విషయంలో ప్రశాంత్‌ నీల్‌ ఎంతో శ్రద్ధ వహిస్తారని పేరుంది. ఈ క్రమంలోనే ఆయన ఓ పాన్‌ ఇండియా చిత్రానికి స్టోరీ అందించారు. ‘బఘీర’ పేరుతో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ఇవాళ విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ట్రైలర్‌లో ‘కేజీఎఫ్‌’ మార్క్ కనిపించేలా చాలా అంశాలే ఉన్నాయి.&nbsp; బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌‌లో.. ‘కేజీఎఫ్’ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్‌‌కు, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌‌కు పాన్ ఇండియా రేంజ్‌‌లో గుర్తింపు వచ్చింది. వీళ్ల కాంబినేషన్‌లో ఏ ప్రాజెక్ట్‌ రూపొందిన దానిపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రశాంత్‌ నీల్‌ కథతో హోంబలే ఫిల్మ్స్‌‌ ‘బగీరా’ అనే పాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందించింది. ప్రశాంత్‌ నీల్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ 'ఉగ్రమ్‌' హీరో శ్రీ మురళి ఇందులో లీడ్‌ రోల్‌ చేశాడు. సూరి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేయగా అది విపరీతంగా ఆకట్టుకుంటోంది. భగీర ట్రైలర్&nbsp; చూస్తే రెండు డిఫరెంట్ గెటప్స్‌‌లో శ్రీమురళి కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ నీల్ స్టైల్‌‌లోనే యాక్షన్‌‌తో పాటు బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌‌లోనే ట్రైలర్ విజువల్స్ ఉన్నాయి. https://www.youtube.com/watch?v=O38mUkgL-w8 కేజీఎఫ్‌ తరహా డైలాగ్స్‌! ప్రశాంత్‌ నీల్‌ సినిమా అంటే యాక్షన్‌తో పాటు డైలాగ్స్‌ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా కేజీఎఫ్‌ సినిమాలోని డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ‘బగీరా’ ట్రైలర్‌లోనూ ఆ తరహా డైలాగ్స్‌ను మనం చూడవచ్చు. 'దేవుడు ఎందుకమ్మా రామాయణం, భారతం అంటూ ఎప్పుడో వస్తాడు. ఎందుకు ఎప్పుడూ రాడు’ అని ఓ పిల్లాడు తన తల్లిని అడుగుతున్న డైలాగ్‌తో ట్రైలర్ మెుదలవుతుంది. ‘మనిషి మృగంగా మారినప్పుడు వస్తాడు’ అంటూ అందుకు తగ్గ పరిస్థితులను ఆ తల్లి వివరిస్తుంది. ఆ డైలాగ్‌ చెప్తున్న క్రమంలోనే క్రూరమైన విలన్స్‌తో కూడిన సన్నివేశాలను చూపించారు. పోలీస్ ఆఫీసర్ అయిన హీరో తన యూనిఫామ్‌ను పక్కనపెట్టి ఓ ముసుగు మనిషిలా క్రిమినల్స్‌ను పాశవికంగా చంపడం చూపించారు. ఓ వైపు పోలీస్‌గా మరోవైపు రాక్షసులను చంపే వెపన్ గా మారె శ్రీ మురళి యాక్టింగ్ ట్రైలర్‌లో ఆకట్టుకుంది. పోలీసు ఉన్నతాధికారిగా నటుడు ప్రకాష్‌ రాజ్‌ ట్రైలర్‌లో కనిపించాడు.&nbsp; తల్లి సెంటిమెంట్‌! కేజీఎఫ్‌ సినిమాను గమనిస్తే చిన్నప్పుడే హీరో తల్లి చనిపోతుంది. చివరి క్షణాల్లో తల్లికి ఇచ్చిన మాట కోసం హీరో క్రిమినల్‌గా మారతాడు. బగీరా ట్రైలర్‌ను గమనిస్తే కేజీఎఫ్‌కు సిమిలార్‌ స్టోరీతో ఇది వస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇందులోనూ తల్లి సెంటిమెంట్‌ ఉండనున్నట్లు ట్రైలర్‌ను బట్టే తెలిసిపోతోంది. చిన్నప్పుడు తల్లి చనిపోయిన ఓ పిల్లాడు అన్యాయాలను ఎదిరించేందుకు పెద్దయ్యాక పోలీసు అవుతాడు. చట్టబద్దంగా న్యాయం జరగట్లేదని భావించి ముసుగు వ్యక్తిలా మారతాడు. అలా బగీరా గెటప్‌లో క్రిమినల్స్‌ను చాలా దారుణంగా చంపుతాడు. అయితే హీరో తల్లికి క్రిమినల్స్‌ నుంచి ఇబ్బందులు ఎదురై ఉండవచ్చు. దీంతో ఆమెకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదన్న ఉద్దేశ్యంతో హీరో ఖాకీ ధరించి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌‌, యాక్షన్‌ సీక్వెన్స్‌ చూస్తుంటే అచ్చం కేజీఎఫ్‌ను చూసిన ఫీలింగ్ కలుగుతోందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ‘NTR 31’తో బిజీ బిజీ సలార్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత ప్రశాంత్ నీల్‌ తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ను జూ.ఎన్టీఆర్‌ (Jr NTR)తో చేయబోతున్నాడు. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా బంగ్లాదేశ్‌ నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో తారక్‌ బంగ్లాదేశ్‌ రైతుగా కనిపిస్తారని స్ట్రాంగ్ బజ్‌ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అయితే సీక్వెల్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్‌ వర్మ 'NTR 31' ప్రాజెక్ట్‌ను సింగిల్‌ పార్ట్‌గా తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్‌తో 'సలార్‌ 2' ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించే అవకాశముంది. అలాగే రామ్‌ చరణ్‌తోనే ఓ ప్రాజెక్ట్‌ను ఫైనల్‌ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
    అక్టోబర్ 21 , 2024
    Unique Movie Titles: సలార్‌, కంగువ, తంగలాన్‌.. ఈ టైటిల్స్‌ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
    Unique Movie Titles: సలార్‌, కంగువ, తంగలాన్‌.. ఈ టైటిల్స్‌ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
    సినిమాపై ఆసక్తిని పెంచడంలో టైటిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా పేరు ఎంత యూనిక్‌గా ఉంటే ఆడియన్స్‌ అంతగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం రూపొందుతున్న చాలావరకూ సినిమాలు తమ ప్రాంతానికే పరిమితం కాకుండా పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్నాయి. అయితే కథ డిమాండ్‌ మేరకు ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పేర్లనే డైరెక్టర్లు సినిమాకు ఖరారు చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఆ టైటిళ్లు కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వాటి అర్థం తెలుసుకోవాలన్న ఉత్సాహం వారిలో పెరిగిపోతోంది. ఇంతకీ ఆ సినిమా పేర్లు ఏవి? వాటి వెనకున్న అర్థం ఏమిటీ? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; తండేల్‌ నాగ చైతన్య లేటెస్ట్ మూవీ పేరు 'తండేల్‌' (Thandel). ఈ సినిమా టైటిల్‌ వెనకున్న అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తండేల్‌ అంటే మత్సకారుల బృంద నాయకుడు అని అర్థం. సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు అతడే బోటు నడుపుతాడు. చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.&nbsp; సలార్‌ ప్రభాస్‌ హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'సలార్‌' (Salar). దీనికి నాయకుడు.. రక్షకుడు ఇలా పలు అర్థాలున్నాయి. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్‌ నటిస్తోంది. డిసెంబర్‌ 22న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.&nbsp; డంకీ (DUNKI) బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'డంకీ' (DUNKI). ఈ టైటిల్‌కు అర్ధం.. అక్రమంగా దేశ సరిహద్దుల గుండా ప్రయాణించడం. ఈ సినిమాకు రాజ్‌కుమార్‌ హిరాణి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి తాప్సీ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ డిసెంబర్‌ 21న విడుదల కానుంది.&nbsp; తంగలాన్‌ చియాన్‌ విక్రమ్‌ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). ఇది తమిళనాడులోని ఓ తెగ పేరు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (KGF)లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటించింది. పా. రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది.&nbsp; కంగువ స్టార్‌ హీరో సూర్య అప్‌కమింగ్‌ మూవీ పేరు 'కంగువ' (Kanguva). దీనికి ‘అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు’ అని అర్థం. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్యకు జోడీగా దిశా పటానీ (Disha Patani) నటిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.&nbsp; మట్కా వరణ్‌తేజ్‌, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం పేరు 'మట్కా' (Matka). ఇదో రకమైన జూదం. యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కరుణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.&nbsp; జిగర్‌తండ డబుల్‌ ఎక్స్‌ రాఘవ లారెన్స్‌, ఎస్‌.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్‌తండ డబుల్‌ ఎక్స్‌' (Jigarthanda DoubleX). తమిళనాడులోని మధురైలో ప్రసిద్ధి చెందిన ఓ కూల్‌డ్రింక్‌ పేరును దీనికి పెట్టారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.&nbsp; అయలాన్‌ శివకార్తికేయన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం 'అలయాన్' (Ayalaan). దీనికి పొరుగువాడు అని అర్థం. మానవుడు ఏలియన్‌ మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.&nbsp;
    నవంబర్ 25 , 2023
    Top 15 Telugu BGM Movies: తెలుగులో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా?
    Top 15 Telugu BGM Movies: తెలుగులో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా?
    ఒక సినిమా సక్సెస్‌లో కథ, హీరో స్టార్‌డమ్‌, పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా గణనీయమైన పాత్రను పోషిస్తుంది. ఒక సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా తీసినప్పటికీ దానిని సరిగ్గా ఎలివేట్‌ చేసే BGM లేకపోతే ఫలితం ఉండదు. అందుకే దర్శకులు పాటలతో పాటు(Top Telugu BGM Movies) నేపథ్య సంగీతానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించి మరీ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ను ఫైనలైజ్‌ చేస్తుంటారు. ఇప్పటివరకూ తెలుగులో వందలాది చిత్రాలు వచ్చినప్పటికీ BGM అనగానే ఠక్కున కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అటువంటి టాప్‌ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; సలార్‌ (Salaar) ప్రభాస్‌ (Prabhas) హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘సలార్‌’. ఈ సినిమా విజయంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. రవి బస్రూర్‌ (Ravi Basrur) అందించిన BGM.. యాక్షన్‌ సీన్లను చాలా బాగా ఎలివేట్ చేసింది.&nbsp; https://twitter.com/i/status/1756920670112317839 పుష్ప (Pushpa) సుకుమర్‌ - అల్లు అర్జున్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa BGM) లోనూ నేపథ్య సంగీతం హైలేట్‌గా అనిపిస్తుంది. రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్ సన్నివేశానికి తగ్గట్లు అద్భుతమైన బీజీఎంలను అందించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే BGM సినిమాకే హైలెట్ అనిచెప్పవచ్చు.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=B4aXmcfwkL4 ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా చేసిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమా గ్లోబల్‌ స్థాయిలో విజయాన్ని అందుకుంది. కీరవాణి అందించిన పాటలు, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. ముఖ్యంగా తారక్‌, రామ్‌చరణ్‌ పాత్రలను హైలెట్‌ చేస్తూ ఇచ్చిన BGM గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. https://www.youtube.com/watch?v=Cve98-ZDIjY రంగస్థలం (Rangasthalam) రామ్‌చరణ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో రంగస్థలం ఒకటి. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ సినిమాకు పాటలతో పాటు బీజీఎం((Rangasthalam) ప్రధాన బలంగా నిలిచింది.&nbsp; https://twitter.com/i/status/1508823419013369857 అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అర్జున్‌ రెడ్డి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో విజయ్ చాలా అగ్రెసివ్‌గా కనిపించాడు. అతడి యాక్షన్‌కు తగ్గ బీజీఎం తోడవడంతో సినిమాలోని సీన్లు అద్భుతంగా ఎలివేట్ అయ్యాయి.&nbsp; https://www.youtube.com/watch?v=RrtLwUR1kVQ బాహుబలి (Baahubali) తెలుగులో అద్భుతమైన నేపథ్య సంగీతంతో వచ్చి చిత్రాల్లో ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ ఒకటి. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాలోని ప్రతీ సన్నివేశానికి జీవం పోసిందని చెప్పవచ్చు. https://www.youtube.com/watch?v=poqKN52SKx0 ఇంద్ర (Indra) మెగాస్టార్ చిరంజీవి చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. ఈ సినిమా అప్పట్లో రికార్డుల మోత మోగించింది. మణిశర్మ ఇచ్చిన బీజీఎం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ‘మెుక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’.. అంటూ చిరు చెప్పే డైలాగ్‌కు మణిశర్మ ఇచ్చిన BGM విజిల్‌ వేసేలా ఉంటుంది. అటు చిరు - ప్రకాష్‌ ఎదురుపడ్డ సందర్భంలోనూ వచ్చే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.&nbsp; https://twitter.com/i/status/1281802257319641090 https://twitter.com/i/status/1286298937746264065 మిర్చి (Mirchi) ప్రభాస్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘మిర్చి’ సినిమా కూడా తన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో వీక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రెయిన్‌లో ఫైట్‌ సందర్భంగా వచ్చే BGM అదరహో అనిపిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1653647992283619340 విక్రమార్కుడు (Vikramarkudu) రాజమౌళి - రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన 'విక్రమార్కుడు' కూడా అద్భుతమైన బీజీఎం గలిగిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా ఉంది. ఇందులో ప్రకాష్‌ రాజ్‌ రవితేజ ప్రొఫైల్‌ను చూస్తున్న క్రమంలో వచ్చే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. నీకు భయం లేదా అన్న ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతుండగా వచ్చే BGM ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1407610528948645889 https://twitter.com/i/status/1672174183395266561 ఛత్రపతి (Chatrapathi) రాజమౌళి - ప్రభాస్‌ కాంబోలో వచ్చిన తొలి చిత్రం ఛత్రపతి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రభాస్ శత్రువులకు వార్నింగ్ వచ్చే సమయంలో నేపథ్య సంగీతం ఆకట్టుకుటుంది.&nbsp; https://twitter.com/i/status/1591641776083070978 స్టాలిన్‌ (Stalin) చిరు హీరోగా తమిళ దర్శకుడు మురగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా BGM అప్పట్లో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. విలన్ ప్రదీప్‌ రావత్‌కు చిరు వార్నింగ్ ఇచ్చే సమయంలో వచ్చే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1307524939029688320 తులసి (Tulasi) వెంకటేష్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి బ్లాక్‌బాస్టర్ చిత్రం ‘తులసి’. సినిమా టైటిల్‌తో వచ్చే BGM ఆడియన్స్‌ను కూర్చిలో కూర్చోనివ్వకుండా చేస్తుంది. అలాగే హీరోయిన్‌ నయనతారతో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లోని BGM కూడా హృదయాలకు హత్తుకుంటుంది.&nbsp; https://twitter.com/i/status/1377645148671148036 https://twitter.com/i/status/1386233991800360961 సింహాద్రి (Simhadri) తారక్‌ నటించిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాల్లో ‘సింహాద్రి’ ఒకటి. ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి రూపొందించారు. తన అక్కను చంపిన విలన్లను తారక్ వేటాడే క్రమంలో వచ్చే BGM మెస్మరైజ్‌ చేస్తుంది.&nbsp;&nbsp; https://twitter.com/i/status/1557928081096028160 రక్షకుడు (Rakshakudu) నాగార్జున హీరోగా ప్రవీణ్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమా సాంగ్స్‌ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అటు నేపథ్య సంగీతం కూడా అప్పటి చిత్రాలకు భిన్నంగా రెహమాన్‌ అందించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=hX06emC9sb8 ఓజీ (OG) పవన్‌ కల్యాణ్‌ హీరోగా డైరెక్టర్ సుజీత్‌ రూపొందిస్తున్న చిత్రం ‘ఓజీ’. ‘హంగ్రీ చీతా’ పేరుతో విడుదలైన ఈ చిత్ర సాంగ్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌లోని బీజీఎంను ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తమ మెుబైల్స్‌కు రింగ్‌టోన్‌, కాలర్‌ ట్యూన్స్‌గా పెట్టుకుంటున్నారు.&nbsp; https://twitter.com/i/status/1759904474091704446 యానిమల్‌ (Animal) ఈ మధ్య కాలంలో నేపథ్య సంగీతంతో బాగా పాపులర్ అయిన చిత్రం యానిమల్‌. రణ్‌బీర్‌ మాస్‌ యాక్షన్‌ను హర్షవర్ధన్‌ రామేశ్వర్ ఇచ్చిన బీజీఎం అద్భుతంగా ఎలివేట్‌ చేసింది. తన తండ్రిని చంపాలని అక్క భర్త స్కెచ్‌ వేస్తున్నట్లు రణ్‌బీర్‌ తెలుసుకున్న సమయంలో వచ్చే BGM సినిమాకే హైలేట్‌.&nbsp; https://twitter.com/Billa2Harry/status/1751450675991773283
    ఫిబ్రవరి 21 , 2024

    @2021 KTree