• TFIDB EN
  • రామ్ రాబర్ట్ రహీమ్
    UTelugu2h 40m
    ముగ్గురు అన్నదమ్ములు పుట్టుకతోనే విడిపోయి వేర్వేరు మతాల్లో పెరిగిన తర్వాత మళ్లీ కలుస్తారు. కలిసి, వారు తమ ఎడబాటుకు కారణమైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకుంటారు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌MXPlayerఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    కృష్ణ
    as Robert Gonsalves
    రజనీకాంత్
    as Ram
    చంద్ర మోహన్
    as Rahim Lakhnavi
    శ్రీదేవి
    as Rosy
    Sunithaas Lakshmi
    ఫటాఫట్ జయలక్ష్మి
    as Dr. Razia Mia
    అంజలీ దేవి
    as Bharathi
    జగ్గయ్య
    as Jagadish Babu
    Tyagaraajuas Cunningham
    as Jinghu Mia
    కాంత రావు
    as Church Father (Catholic Priest)
    మిక్కిలినేని
    as DSP
    PJ శర్మ
    as Lakhnavi
    పండరీ బాయి
    లక్ష్మి అమ్మమ్మ
    ప్రసాద్ బాబు
    as Ganga Ram
    యూసుఫ్ ఖాన్
    as James
    సిబ్బంది
    విజయ నిర్మల
    దర్శకుడు
    కృష్ణ
    నిర్మాత
    Uppalapati Suryanarayana BabuKrishna (Presenter)నిర్మాత
    కె. చక్రవర్తి
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Chandra Mohan: సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
    Chandra Mohan: సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
    టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా షుగర్‌, గుండె, డయాలసిస్‌ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్‌ 11న) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చంద్రమోహన్‌ మృతి నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తీసుకొచ్చింది.  కుటుంబ నేపథ్యం చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రమోహనరావు. ఏపీలోని కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న ఆయన జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి చాలా దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు.  సినిమా నేపథ్యం చంద్రమోహన్‌ 1966లో ‘రంగుల రాట్నం’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1987లో ‘చందమామ రావే’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’ సినిమాకుగానూ ఫిలిం ఫేర్‌ అవార్డు గెలుచుకున్నారు. ‘రంగుల రాట్నం’, ‘ఆమె’ ‘పదహారేళ్ల వయసు’, ‘సీతామహాలక్ష్మి’, ‘రాధాకల్యాణం’, ‘రెండు రెళ్ల ఆరు’, ‘చందమామ రావే’, ‘రామ్‌ రాబర్ట్ రహీమ్‌’ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 932 సినిమాలలో నటించారు. చంద్రమోహన్‌ మెచ్చిన చిత్రాలు సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినని ఓ ఇంటర్యూలో చంద్రమోహన్‌ చెప్పారు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో కొనసాగాలా? వద్దా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించినట్లు చెప్పుకొచ్చారు. అంతిమంగా సినిమావైపే అడుగులు వేశారు. తన కెరీర్‌లో ‘సిరిసిరిమువ్వ’, ‘శుభోదయం’, ‘సీతామహాలక్ష్మి’, ‘పదహారేళ్ల వయసు’ చిత్రాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్తూ ఉండేవారు. లక్కీ హీరోగా గుర్తింపు ఒకప్పుడు చంద్రమోహన్‌ను అందరూ లక్కీ హీరోగా అనేవారు. ఆయనతో ఏ హీరోయిన్‌ అయినా నటిస్తే సినిమా హిట్‌ అవ్వాల్సిందే. అలా కెరీర్‌ ప్రారంభంలో శ్రీదేవి (Sri Devi), జయసుధ (Jayasuda), జయప్రద (Jaya Prabha) ఆయనతో కలిసి నటించి హిట్స్‌ అందుకున్నారు. చంద్రమోహన్‌-సుధ కాంబినేషన్‌ అయితే సూపర్‌హిట్‌ అయింది. అటు చంద్రమోహన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించారు. ఈయన నటించిన చివరి చిత్రం ఆక్సిజన్‌. సంపాదనలో శూన్యమే! చంద్రమోహన్‌ 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదు. చివరి రోజుల్లో ఆయన సాదాసిదా జీవితాన్నే గడిపారు. వందల కోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నట్లు చంద్రమోహన్‌ స్వయంగా ఓ ఇంటర్యూలో తెలిపారు. హైదరాబాద్‌ కోంపల్లిలో 35 ఎకరాల ద్రాక్ష తోట కొన్నప్పటికీ చూసుకోవడం వీలుపడటం లేదని దాన్ని అమ్మేశారు. శోభన్‌ బాబు చెబుతున్నా వినకుండా చెన్నైలోని 15 ఎకరాలు కూడా విక్రయించేశారు. దాని విలువ ప్రస్తుతం  రూ.30 కోట్లపైనే. శంషాబాద్‌ ప్రధాన రహదారి పక్కన ఆరు ఎకరాలు కొన్నప్పటికీ దాన్ని నిలుపుకోలేకపోయారు.   చెయ్యి చాలా మంచిదట! చంద్రమోహన్‌ దగ్గర ఆస్తి నిలవలేదు కానీ, ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా బాగా కలిసొస్తుందని చాలామంది నమ్మకం. అందుకని కొత్త ఏడాది ప్రారంభంలో (జనవరి 1) ఎంతోమంది ఆయన ఇంటికి వెళ్లి చంద్రమోహన్‌ చేతుల మీదుగా డబ్బు తీసుకునేవారు. ఈ విషయాన్ని చంద్రమోహన్‌ భార్య, రచయిత్రి జలంధర స్వయంగా తెలిపారు.
    నవంబర్ 11 , 2023
    HBD Rajinikanth: రజనీకాంత్‌ - చిరంజీవి కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా?
    HBD Rajinikanth: రజనీకాంత్‌ - చిరంజీవి కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా?
    ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కలిగిన అగ్ర నటుల్లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ఒకరు. కోలీవుడ్‌కు చెందిన రజనీకి తెలుగుతో పాటు హిందీలోనూ వీరాభిమానులు ఉన్నారు. ఆయన చేసిన చాలవరకూ చిత్రాలు తెలుగులో డైరెక్ట్‌గా రిలీజై సూపర్‌ హిట్‌ విజయాలను అందుకున్నారు. కాగా, ఇవాళ (12 December) రజనీకాంత్‌ (HBD Rajinikanth) పుట్టిన రోజు . 74వ ఏటలోకి సూపర్‌ స్టార్‌ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో కలిసి నటించిన తెలుగు స్టార్‌ హీరోలు ఎవరు? ఏ ఏ చిత్రాల్లో నటించారు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  నందమూరి తారకరామారావుతో.. టాలీవుడ్‌ దిగ్గజ నటుడు, దివంగత నందమూరి తారకరమారావు (Nandamuri Taraka Rama Rao)తో రజనీకాంత్‌ నటించారు. వారి కాంబోలో రూపొందిన ఒకే ఒక్క చిత్రం ‘టైగర్‌’ (Tiger Movie). 1979లో వచ్చిన ఈ చిత్రంలో రామారావు ప్రధాన హీరోగా నటిస్తే రజనీకాంత్‌ రెంటో కథానాయకుడిగా స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాను హిందీలో అమితాబ్‌ బచ్చన్‌, వినోద్‌ ఖన్నా హీరోలుగా ‘ఖూన్‌ పసీనా’ పేరుతో రీమేక్‌ చేశారు.  శోభన్‌ బాబుతో..  నట భూషణ్‌ శోభన్ బాబు (Sobhan Babu) తోనూ రజనీకాంత్‌ ఓ చిత్రంలో నటించారు. 1986లో వచ్చిన ‘జీవన పోరాటం’ సినిమాలో శోభన్‌ బాబు, రజనీకాంత్‌ అన్నదమ్ములుగా చేశారు. ఈ సినిమా కూడా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో సూపర్‌ హిట్‌గా నలిచిన ‘రోటి కపడా ఔర్‌ మకాన్‌’ చిత్రానికి రీమేక్‌గా తీశారు. అందులో మనోజ్‌ కుమార్‌, శశికపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషించారు.  సూపర్‌ కృష్ణతో.. ఒకప్పటి దిగ్గజ నటుడు సూపర్‌ కృష్ణ (Krishna) తోనూ రజనీకాంత్‌ నటించారు. ఏకంగా మూడు సినిమాల్లో వారు కలిసి చేశారు. ‘ఇద్దరూ అసాధ్యులే’ (1979), ‘అన్నదమ్ముల సవాల్‌’ (1978), ‘రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌’ (1977) చిత్రాల్లో కృష్ణ, రజనీ నటించారు. ఈ మూడు చిత్రాలు యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  మెగాస్టార్‌ చిరంజీవితో..  మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తోనూ రజనీకాంత్‌ మూడు చిత్రాల్లో నటించారు. తెలుగులో వచ్చిన ‘కాళీ’, ‘బందిపోటు సింహం’ సినిమాల్లో వీరు (Chiranjeevi Rajinikanth Movies) స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ‘కాళీ’ సినిమాలో చిరు, రజనీ హీరోలుగా చేశారు. అయితే ‘బందిపోటు సింహం’లో మాత్రం రజనీకి విలన్‌గా చిరు నటించారు. అయితే ఆ రెండు చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించలేదు. అటు తమిళంలో రూపొందిన ‘మాపిళ్లై’ సినిమాలో చిరు గెస్ట్‌ రోల్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశాడు. తెలుగు చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు సినిమాకు రీమేక్‌గా ‘మాపిళ్లై’ తమిళంలో రూపొందింది.  https://twitter.com/atheisttindian/status/1212794102867083265 డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబుతో..  తెలుగు ఇండస్ట్రీలో నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu)తో రజనీకాంత్‌కు మంచి స్నేహబంధం ఉంది. ఒకరినొకరు ఓరేయ్‌ అని పిలుచుకునేంత చనువు వారి మధ్య ఉంది. ఇది పలు వేదికల్లో నిరూపితమైంది. ఇదిలా ఉంటే వీరి కాంబోలో పలు చిత్రాలు వచ్చాయి. రజనీ నటించిన చిత్రాల్లో మోహన్‌బాబు విలన్ పాత్ర పోషించారు. అయితే వీరి కాంబోలో వచ్చిన ‘పెదరాయుడు’ (Pedarayudu Movie) చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో మోహన్‌బాబు తండ్రిగా రజనీకాంత్‌ కనిపించారు. పాపారాయుడు పాత్రలో నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నందమూరి తారకరామారావు పాల్గొనడం విశేషం.  అక్కినేని నాగార్జునతో.. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రజనీకాంత్‌ (HBD Rajinikanth) కాంబోలో చాన్నాళ్ల తర్వాత ఓ సినిమా రూపుందుతోంది. రజనీకాంత్‌ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరు కలిసి ఒక్కసారి కూడా తెరపై కనిపించలేదు. దీంతో ‘కూలీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గతంలో ఒకే సినిమా షూటింగ్‌లో నాగార్జున - రజనీకాంత్‌ పాల్గొన్నారు. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్‌తో కలిసి ‘పోలీస్ బుల్లెట్’ అనే సినిమాలో రజనీకాంత్‌ నటించారు. అయితే తెలుగులో ఈ సినిమాను ‘శాంతి క్రాంతి’ పేరుతో నాగార్జున, రవిచంద్రన్ తీశారు. ఒకేసారి తెరకెక్కించడంతో రజనీకాంత్‌ షూట్‌ అవ్వగానే నాగార్జున ఆయన పాత్రలో షూటింగ్‌లో నటించాడు. జగపతి బాబుతో.. రజినీకాంత్ (HBD Rajinikanth), జగపతి బాబు (Jagapathi Babu) కలిసి ‘కథానాయకుడు’తో పాటు ‘లింగ’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే ‘అన్నాత్తే’, ‘పెద్దన్న’ సినిమాల్లో కూడా ఈ దిగ్గజ నటులు కలిసి నటించారు. ముఖ్యంగా ‘కథానాయకుడు’ సినిమాలో వీరి నటనకు మంచి గుర్తింపు లభించింది.  https://twitter.com/SolidLover123/status/1562791842898669568
    డిసెంబర్ 12 , 2024
    <strong>Game Changer: మూడు హిట్‌ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ మెలోడీ సాంగ్‌.. ఇదెక్కడి అరాచకం!&nbsp;</strong>
    Game Changer: మూడు హిట్‌ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ మెలోడీ సాంగ్‌.. ఇదెక్కడి అరాచకం!&nbsp;
    స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానుంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటించింది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల రెండు పాటలను విడుదల చేయగా వాటికి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే మూడో సాంగ్‌ను కూడా రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాటకు సంబంధించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఈ మెలోడీ సాంగ్‌ కోసం చేసిన ఖర్చు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  ఒక్క పాటకు రూ.20 కోట్లు! 'గేమ్‌ ఛేంజర్‌' నుంచి వచ్చిన మెుదటి రెండు పాటలు ‘జరగండి.. జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా ‘రా మచ్చా మచ్చా’ సాంగ్‌ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ రాబట్టి నేషనల్‌ వైడ్‌గా ట్రెండింగ్‌ అయ్యింది. అయితే త్వరలో థర్డ్‌ సింగిల్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్‌ చివర్లో లేదా నవంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ఈ సాంగ్‌ రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి రెండు పాటలు మంచి బీట్‌తో వచ్చి దుమ్మురేపగా థర్డ్‌ సింగిల్‌ మాత్రం మెలోడిగా రానుంది. ఇక లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ మూడో పాటకు రూ.20 కోట్ల పైనే ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్‌ ధ్రువీకరించాల్సి ఉంది. మూడు హిట్‌ చిత్రాల బడ్జెట్‌! ఇటీవల తెలుగులో రిలీజైన ‘ఆయ్‌’ (Aay), ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu), ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేసి ప్రశంసలు పొందాయి. అయితే ఈ మూడు సినిమాలు తక్కువ బడ్జెట్‌తో వచ్చి మంచి వసూళ్లు సాధించాయి. ఈ మూడు చిత్రాలు బడ్జెట్‌ కలిపితే దాదాపు రూ.20 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అయితే గేమ్‌ ఛేంజర్‌లో ఒక్క సాంగ్‌ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేశారని రూమర్లు రావడం చర్చకు తావిస్తోంది. ఇటీవల వచ్చిన సెకండ్ సింగిల్‌ ‘రా మచ్చా మచ్చా’ పాటకు కూడా దాదాపు రూ.6-10 కోట్లు ఖర్చు అయినట్లు కథనాలు వచ్చాయి. ఆ పాటలో వందల సంఖ్యలో డ్యాన్సర్లు పాల్గొని వివిధ కాస్ట్యూమ్స్‌లో స్టెప్పులు వేశారు. ఇలా సాంగ్‌లకే భారీ మెుత్తం ఖర్చు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  శంకర్‌ మారాల్సిన అవసరం ఉందా? తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ సినిమా అంటే అందులోని పాటలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ‘భారతీయుడు’, ‘జీన్స్‌’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’, ‘స్నేహితుడు’, ‘రోబో 2.0’ ఇలా ఏ సినిమా తీసుకున్న అందులోని పాటలు చాలా రిచ్‌గా ఉంటాయి. విదేశాల్లోని బ్యూటీఫుల్‌ లోకేషన్స్‌లో పాటలను చిత్రీకరించడం ద్వారా ఆడియన్స్‌లో కొత్త అనుభూతిని కలిగించేందుకు శంకర్ ప్రయత్నిస్తుంటారు. అయితే గతంలో వరుస హిట్స్‌తో శంకర్ ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఈ పాటల గురించి పెద్దగా చర్చ జరగలేదు. అయితే గత కొంతకాలంగా డైరెక్టర్ శంకర్‌కు అసలు కలిసిరావడం లేదు. ఆయన తీసిన చివరి నాలుగు చిత్రాలు ఫ్లాప్‌ అయ్యాయి. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. ఇలాంటి సమయంలో పాటల కోసం రూ. కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుండటాన్ని సినీ ఆడియన్స్ తప్పుబడుతున్నారు. ప్రస్తుతం కాలంలో పాటలకు ఏ దర్శక నిర్మాతలు అంత మెుత్తంలో ఖర్చు చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. శంకర్‌ తన తీరు మార్చుకోకుంటే అతనితో వర్క్‌ చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేసే పరిస్థితులు తలెత్తవచ్చని అభిప్రాయపడుతున్నారు.  రికార్డు ధరకు ఓటీటీ హక్కులు! గేమ్‌ ఛేంజర్‌ ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తండేల్‌ vs గేమ్‌ ఛేంజర్‌ గేమ్‌ ఛేంజర్‌ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు నాగచైతన్య హీరోగా చేస్తున్న తండేల్‌ సైతం సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్‌ సంక్రాంతి హిస్టరీలో ఇప్పటికే పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తలపడ్డారు. అయితే ఈ సంక్రాంతికి వాళ్ల వారసులు తలపడనున్నట్లు బజ్‌ వినిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. RRR సక్సెస్‌తో రామ్‌చరణ్‌ గ్లోబల్‌ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. దాన్ని గేమ్‌ ఛేంజర్‌ ద్వారా మరింత పదిలం చేసుకోవాలని చరణ్‌ చూస్తున్నాడు. మరోవైపు లవ్‌స్టోరీ తర్వా చైతూకి సరైన హిట్‌ లభించలేదు. దీంతో ఎలాగైనా తండేల్‌తో హిట్‌ కొట్టి హిట్‌ ట్రాక్‌లోకి రావాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. చరణ్‌ వర్సెస్‌ చైతూ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
    అక్టోబర్ 18 , 2024
    <strong>Kalki 2898 AD Day1 Collections Target: అదే జరిగితే ప్రభాస్‌ చరిత్ర సృష్టించడం ఖాయం..!</strong>
    Kalki 2898 AD Day1 Collections Target: అదే జరిగితే ప్రభాస్‌ చరిత్ర సృష్టించడం ఖాయం..!
    బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిసేందుకు సరిగ్గా ఒక రోజే మిగిలి ఉంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తొలి రోజు కలెక్షన్స్‌లో ఎలాంటి రికార్డ్స్‌ బద్దలు అవుతాయోనని యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే కల్కి సినిమా ప్రీ బుకింగ్స్‌ టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ముంబయి వంటి నగరాల్లో ఒక్కో టికెట్‌ రూ.3000 వేలకు సైతం విక్రయించారు. అటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం టికెట్ ధరలు పెంచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. దీంతో డే1 కలెక్షన్స్‌ పరంగా కల్కి సరికొత్త రికార్డ్‌ సృష్టించే అవకాశముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. తొలి రోజు రూ.230 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ చరిత్రను తిరగరాస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో డే 1 కలెక్షన్స్‌ పరంగా టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; యూఎస్‌లో రికార్డు వసూళ్లు 'కల్కి 2898 ఏడీ' చిత్రం యూఎస్‌లో దుమ్మురేపుతోంది. విడుదలకు ముందే పలు రికార్డులు బ్రేక్‌ చేస్తోంది. ఇప్పటికే యూఎస్‌లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కలెక్షన్స్‌ 3 మిలియన్లు దాటిపోయాయి. కల్కికి పాజిటివ్‌ టాక్‌ వస్తే ఈజీ గానే 'ఆర్‌ఆర్‌ఆర్‌', ‘బాహుబలి 2’ రికార్డ్స్‌ను చెరిపేస్తుందని అక్కడి వారు అంటున్నారు. యూఎస్‌లోని కొన్ని ఏరియాల్లో కల్కి టికెట్‌ ధర గరిష్టంగా రూ.1.5 లక్షలు కూడా పలికినట్లు చెబుతున్నారు. ఈ ఊపు చూస్తుంటే కల్కికి ఏమాత్రం పాటిజివ్‌ టాక్‌ వచ్చినా ఓవర్సీస్‌ రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.&nbsp; Top 10 Highest Opening Day Collections in India 1. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) ఎన్టీఆర్‌ (Jr.NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలుగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్‌ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వసూళ్లను చూసి ట్రేడ్‌ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం. 2. బాహుబలి 2 (2017) రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్‌ ఇండియన్‌ ఓపెనింగ్‌ గ్రాసర్‌ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది.&nbsp; 3. సలార్‌ (2023) ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన సలార్‌ చిత్రం.. తొలిరోజున రూ.178.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. 2023 ఏడాదిలో అత్యధిక డే1 వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ సినిమా ఇదని ఫ్యాన్స్‌ తెగ మెచ్చుకున్నారు.&nbsp; 4. కేజీఎఫ్‌ 2 (2022) ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్‌ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం.&nbsp; 5. ఆదిపురుష్‌ (2023) ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్‌ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్‌ మెుదటి రోజు కలెక్షన్స్‌ రూ.136.8 కోట్లుగా రికార్డ్‌ అయ్యాయి. 6. జవాన్‌ (2023) బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ చిత్రం.. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై తొలిరోజున రూ.129.6 కోట్లు కొల్లగొట్టింది. హిందీ సినిమా హిస్టరీలో తొలి రోజున ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన మెుదటి చిత్రంగా నిలిచింది. ప్రముఖ సౌత్‌ ఇండియన్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి విలన్‌గా చేశారు. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఈ సినిమాలో తొలిసారి షారుక్‌తో జత కట్టింది. 7. సాహో (2019) ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్‌ చేసింది.&nbsp; 8. రోబో 2.0 (2018) తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా చేసిన ‘రోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్‌ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్‌ టాక్‌ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటించాడు.&nbsp; 9. పఠాన్‌ (2023) ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్‌ ఖాన్‌ పఠాన్‌ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్‌ మూవీ మంచి బూస్టప్‌ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్‌ కూడా హిట్‌ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; 10. జైలర్‌ (2023) రజనీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ ‘జైలర్‌’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది.&nbsp;
    జూన్ 26 , 2024
    Guntur Kaaram Record: భారత సినీ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు.. ట్రోలర్లకు మహేష్ దెబ్బ అదుర్స్!
    Guntur Kaaram Record: భారత సినీ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు.. ట్రోలర్లకు మహేష్ దెబ్బ అదుర్స్!
    సూపర్​స్టార్ మహేష్‌​బాబు (Mahesh Babu) 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమాతో ఆల్​టైమ్ రికార్డు కొల్లగొట్టాడు. జనవరి 12న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల (Guntur Kaaram Collections) జోరు ప్రదర్శిస్తోంది. ఓపెనింగ్ రోజు రూ.94 కోట్లు, సెకండ్ డే రూ.33 కోట్లు, మూడో రోజు రూ.37 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం తొలి వారంలోనే ఏకంగా రూ.212 మొత్తం కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.  భారత సినీ చరిత్రలో ప్రాంతీయ భాషలో రిలీజైన ఓ చిత్రం తొలి వారంలోనే ఇలా రూ.212 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించడం ఇదే తొలిసారి. ఈ అరుదైన ఘనతను సాధించి ‘గుంటూరు కారం’(Guntur Kaaram) ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిందని మేకర్స్ తాజా పోస్టర్‌ ద్వారా తెలియజేశారు. కాగా, మహేష్‌ కెరీర్​లో రూ.200+ గ్రాస్ అందుకోవడం ఇది మూడోసారి. అదే విధంగా టాలీవుడ్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో మహేష్‌ సినిమాలు ఐదు ఉన్నాయి.  గుంటూరు కారం చిత్రం ద్వారా మహేష్‌​బాబు కెరీర్​లో వరుసగా ఐదోసారి రూ.100+ కోట్ల షేర్ సాధించాడు. 'భరత్‌ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' సినిమాల ద్వారా ఆయన ఈ ఫీట్ అందుకున్నారు. దీంతో వరుసగా ఐదుసార్లు ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా మహేష్‌ నిలిచాడు.  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ముచ్చటగా ముడోసారి మహేష్‌​తో ‘గుంటూరు కారం’ తెరకెక్కించారు. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ మంచి సక్సెస్ సాధించాయి. తొలుత ‘గుంటూరు కారం’ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ సినిమాకు బాగా కనెక్ట్‌ కావడంతో కలెక్షన్లలో ఆ ప్రభావం కనిపంచలేదు. మహేష్‌​బాబు యాక్టింగ్, మేనరిజం, ఫైట్స్​కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ సినిమాలో మహేష్‌​కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) నటించగా, మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  కీ రోల్ ప్లే చేసింది. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు. కాగా హారికా అండ్ హసిన్ ప్రొడక్షన్ బ్యానర్​పై నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్​ఫ్లిక్స్​ భారీ ధరకు దక్కించుకుందని టాక్. మార్చి ఆఖరి వారంలో గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. మహేష్‌ టాప్‌-5 కలెక్షన్లు ఇవే! ‘గుంటూరు కారం’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కనక వర్షం కురిపిస్తూ మరిన్ని రికార్డులను కొల్లగొట్టేందుకు పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో మహేష్‌ నటించిన చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాలపై ఓ లుక్కేద్దాం. సర్కారు వారి పాట పరుశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్ల వసూళ్లు సాధించి మహేష్‌ సత్తా ఏంటో చూపించింది. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్‌ నటించింది. సరిలేరు నీకెవ్వరు మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' (Sarileru Neekevvaru). రూ.85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తొలి రోజే రూ. 64.7 కోట్లను వసూలు చేసింది. ఓవరాల్‌గా రూ.214 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది.  మహర్షి రూ.90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘మహర్షి’(Maharshi) చిత్రం.. వరల్డ్‌వైడ్‌గా రూ.170.5 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. తొలి రోజునే రూ.48.2 కోట్లు రాబట్టి నిర్మాతలపై కనక వర్షం కురిపించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్‌, పూజా హెగ్డే, జగపతిబాబు ముఖ్యపాత్రలు పోషించారు. భరత్ అనే నేను కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన 'భరత్‌ అనే నేను' సినిమా సైతం మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్ర బడ్జెట్‌ రూ.95 కోట్లు కాగా.. వరల్డ్‌వైడ్‌గా రూ. 164.9 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ నటించింది.  శ్రీమంతుడు మహేష్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో 'శ్రీమంతుడు'(Srimanthudu) ఒకటి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.145.2 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌ సరసన శ్రుతి హాసన్‌ చేసింది. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రలు పోషించారు.
    జనవరి 19 , 2024
    <strong>Kalki 2898 AD Day 1 Collections: టికెట్ రేట్లు పెంచిన నిరాశ పరిచిన కలెక్షన్లు.. కారణం ఏమిటంటే?</strong>
    Kalki 2898 AD Day 1 Collections: టికెట్ రేట్లు పెంచిన నిరాశ పరిచిన కలెక్షన్లు.. కారణం ఏమిటంటే?
    పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం.. గురువారం (జూన్‌ 27) వరల్డ్‌ వైడ్‌గా విడుదలై అదరగొడుతోంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కల్కి సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి.. ఈ మూవీ తొలిరోజు కలెక్షన్స్‌పై పడింది. మైథాలజీ - ఫ్యూచరిక్‌ జానర్‌లో విజువల్‌ వండర్‌గా రూపొందిన కల్కి ఫిల్మ్‌.. మెుదటి రోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తూ వచ్చాయి. మరి కల్కి ఆ మార్క్‌ను అందుకుందా? బాక్సాఫీస్‌ వద్ద ప్రభాస్‌ మేనియా ఏ స్థాయిలో పని చేసింది? అటు యూఎస్‌లో కల్కి సృష్టించిన ఆల్‌టైమ్‌ రికార్డ్‌ ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; డే1 కలెక్షన్స్‌ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘లెట్స్‌ సెలబ్రేట్‌ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్‌ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్‌ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్‌ చేసుకుంది. కానీ, ఈ వారంతంలో కల్కి కచ్చితంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆల్‌టైమ్‌ రికార్డు ప్రభాస్‌ ‘కల్కి’ సినిమా నార్త్‌ అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్‌తో (Prabhas) పాటు అగ్రతారల నటనకు అక్కడి ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే నార్త్‌ అమెరికాలో కల్కి ఆల్‌టైమ్‌ రికార్డును క్రియేట్‌ చేసింది. నార్త్‌ అమెరికా ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌లో కల్కి ఏకంగా 3.8 మిలియన్‌ డాలర్ల వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికాలో ఒక ఇండియన్‌ చిత్రం ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాతి స్థానాల్లో ‘ఆర్‌ఆర్ఆర్‌’ (3.46 మిలియన్లు), ‘సలార్‌’ (2.6 మిలియన్లు), ‘బాహుబలి2’ (2.45 మిలియన్లు) ఉన్నాయి. ఓవర్సీస్‌లో ఎంతంటే? ప్రీమియర్స్‌, ఫస్ట్‌డే కలెక్షన్స్‌ కలిపి అమెరికాలో తొలి రోజు 5 మిలియన్‌ డాలర్ల వసూళ్లను కల్కి రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. అమెరికాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల్లో ‘కల్కి’ ఒక్క రోజులోనే 5వ స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే అత్యంత వేగంగా 5 మిలియన్లు వసూలు చేసిన సినిమాగానూ రికార్డు నెలకొల్పింది. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఓవర్సీస్‌లో కల్కి బెంచ్‌మార్క్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీకెండ్‌కు కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్‌ సేఫ్‌! ట్రేడ్‌ వర్గాలు లెక్కలను బట్టి.. 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డును 'కల్కి 2898 ఏడీ' బీట్‌ చేయలేకపోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తొలిరోజు రూ.223 కోట్లు (GROSS) రాబట్టి అత్యధిక డే1 వసూళ్లు సాధించిన ఇండియన్‌ చిత్రంగా టాప్‌లో ఉంది. ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం 'కల్కి 2898 ఏడీ' రూ.180 కోట్ల వద్దే ఆగిపోవడంతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్‌ అలాగే భద్రంగా ఉంది. ఆ తర్వాత 'బాహుబలి 2' రూ.217 కోట్లతో రెండో స్థానంలో నిలించింది. అయితే రెండింటి రికార్డులను కల్కి బ్రేక్‌ చేయలేకపోయింది. కానీ, కేజీఎఫ్ 2 (రూ.164.5 కోట్లు), సలార్ (రూ.158 కోట్లు), ఆదిపురుష్ (136.8 కోట్లు), సాహో (రూ.125.6 కోట్లు) రికార్డ్స్‌ను బ్రేక్‌ చేసి టాప్‌-3లో నిలిచింది. కలెక్షన్లపై మ్యాచ్ ఎఫెక్ట్! 'కల్కి 2898 ఏడీ' సినిమాను ‘బాహుబలి 2’, ‘RRR’ చిత్రాల మాదిరిగా ప్రమోట్ చేయడంలో చిత్రబృందం వెనుకబడింది. ఇంకా పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉండేది. అటు ఈ సినిమా కలెక్షన్లపై టీ-20 వరల్డ్ కప్ ఎఫెక్ట్ పడింది. గురువారం సాయంత్రం జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు ఆడియన్స్ మొగ్గు చూపడం కొంత మైనస్ గా మారింది. దీనికి తోడు గురువారం వర్కింగ్‌ డే కావడం కూడా కల్కి కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. అయితే సర్వత్రా పాజిటివ్‌ టాక్‌ రావడంతో ఈ వీకెండ్‌లో కల్కి వసూళ్లు గణనీయంగా పెరిగే అవకాశముంది.&nbsp; Top 10 Highest Opening Day Collections in India 1. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) ఎన్టీఆర్‌ (Jr.NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలుగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్‌ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వసూళ్లను చూసి ట్రేడ్‌ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం. 2. బాహుబలి 2 (2017) రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్‌ ఇండియన్‌ ఓపెనింగ్‌ గ్రాసర్‌ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది.&nbsp; 3. సలార్‌ (2023) ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన సలార్‌ చిత్రం.. తొలిరోజున రూ.178.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. 2023 ఏడాదిలో అత్యధిక డే1 వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ సినిమా ఇదని ఫ్యాన్స్‌ తెగ మెచ్చుకున్నారు.&nbsp; 4. కేజీఎఫ్‌ 2 (2022) ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్‌ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం.&nbsp; 5. ఆదిపురుష్‌ (2023) ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్‌ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్‌ మెుదటి రోజు కలెక్షన్స్‌ రూ.136.8 కోట్లుగా రికార్డ్‌ అయ్యాయి. 6. జవాన్‌ (2023) బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ చిత్రం.. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై తొలిరోజున రూ.129.6 కోట్లు కొల్లగొట్టింది. హిందీ సినిమా హిస్టరీలో తొలి రోజున ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన మెుదటి చిత్రంగా నిలిచింది. ప్రముఖ సౌత్‌ ఇండియన్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి విలన్‌గా చేశారు. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఈ సినిమాలో తొలిసారి షారుక్‌తో జత కట్టింది. 7. సాహో (2019) ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్‌ చేసింది.&nbsp; 8. రోబో 2.0 (2018) తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా చేసిన ‘రోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్‌ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్‌ టాక్‌ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటించాడు.&nbsp; 9. పఠాన్‌ (2023) ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్‌ ఖాన్‌ పఠాన్‌ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్‌ మూవీ మంచి బూస్టప్‌ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్‌ కూడా హిట్‌ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; 10. జైలర్‌ (2023) రజనీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ ‘జైలర్‌’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది.&nbsp;
    జూన్ 28 , 2024
    <strong>Game Changer: దీపావళికి గేమ్‌ ఛేంజర్ నుంచి బిగ్ అప్‌డేట్!&nbsp;</strong>
    Game Changer: దీపావళికి గేమ్‌ ఛేంజర్ నుంచి బిగ్ అప్‌డేట్!&nbsp;
    గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటించిన పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గేమ్‌ ఛేంజర్ టీజర్‌ రిలీజ్‌కు సైతం ముహోర్తం ఫిక్సయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; దీపావళి కానుకగా టీజర్‌? రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌’ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్‌ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీపావళి కానుకగా టీజర్‌ను విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్‌ ఉన్నట్లు సమాచారం. వీకెండ్‌లోనే దీనిపై అధికారిక ప్రకటన సైతం ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.&nbsp; తెలుగు స్టేట్స్‌లో రికార్డు బిజినెస్? ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ.150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాయి. ‘గేమ్‌ఛేంజర్‌’ను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పుడు ఇంత బిజినెస్ జరిగే అవకాశం కనిపించలేదట. అయితే ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి వాయిదా పడటంతో బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోయినట్లు ఫిల్మ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; చరణ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే! సంక్రాంతి రిలీజ్‌ అంటే సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఈ సంక్రాంతికి బాలయ్య, వెంకటేష్‌ పాటు, సందీప్ కిషన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నాగచైతన్య 'తండేల్‌' కూడా పొంగల్‌కు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్‌ వద్ద గట్టి పోటీ ఉంటుందని తెలిసినా డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మెుత్తంలో చెల్లించేందుకు ముందుకు వస్తున్నారట. చరణ్‌ కాకుండా మరే హీరో సినిమా సంక్రాంతికి రిలీజైనా ఈ స్థాయి బిజినెస్‌ జరుగుతుందన్న అంచనాలు ఉండేవి కాదని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో చరణ్‌కు పూర్తిస్థాయిలో క్రెడిట్ ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు.&nbsp; భారీ ధరకు ఓటీటీ హక్కులు! గేమ్‌ ఛేంజర్‌ ఓటీటీ హక్కులు సైతం రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక్క పాటకు రూ.20 కోట్లు! 'గేమ్‌ ఛేంజర్‌' నుంచి వచ్చిన మెుదటి రెండు పాటలు ‘జరగండి.. జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా ‘రా మచ్చా మచ్చా’ సాంగ్‌ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ రాబట్టి నేషనల్‌ వైడ్‌గా ట్రెండింగ్‌ అయ్యింది. అయితే త్వరలో థర్డ్‌ సింగిల్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్‌ చివర్లో లేదా నవంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ఈ సాంగ్‌ రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి రెండు పాటలు మంచి బీట్‌తో వచ్చి దుమ్మురేపగా థర్డ్‌ సింగిల్‌ మాత్రం మెలోడిగా రానుంది. ఇక లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ మూడో పాటకు రూ.20 కోట్ల పైనే ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్‌ ధ్రువీకరించాల్సి ఉంది.
    అక్టోబర్ 24 , 2024
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!
    టాలీవుడ్‌లో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు ఇటీవలే విడుదలై మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ప్రేమలు సినిమా మలయాళం నుంచి డబ్బింగై తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తాజాగా మరో మలయాళ బ్లాక్ బాస్టర్‌ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ కూడా తెలుగులో విడుదలై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా మలయాళంలో వచ్చిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; మంజుమ్మల్‌ బాయ్స్‌ గత నెల ఫిబ్రవరి 22న రిలీజైన ఈ (Manjummel Boys) చిత్రం మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పటివరకూ రూ.214 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టిన తొలి చిత్రంగా ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ నిలిచింది. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుణ్ణి మంజుమ్మల్‌ యువకులు ఎలా కాపాడారు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్‌ 6 తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. 2018 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. రూ.26 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 2023లో విడుదలై ఏకంగా రూ.175.5 కోట్ల వసూళ్లను సాధించింది. అటు తెలుగులోనూ డబ్‌ అయ్యి ఇక్కడా కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. జూడ్ ఆంథనీ జోసేఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్‌, కున్‌చకో బొబన్‌, అపర్ణా బాలమురళి ముఖ్య పాత్రలు పోషించారు. ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ముందు వరకూ మలయాళంలో అత్యధిక కలెక్షన్ల రికార్డు ఈ మూవీ పేరునే ఉండేది.&nbsp; పులిమురుగన్‌ మలయాళంలోని స్టార్‌ హీరోల్లో మోహన్‌లాల్‌ (Mohan Lal) ఒకరు. ఆయన నటించిన ‘పులిమురుగన్‌’ (Pulimurugan) చిత్రం.. 2016లో విడుదలై ఏకంగా రూ.152 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఆరు రెట్లు కలెక్షన్స్‌ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2016-2023 మధ్య ఏడేళ్ల పాటు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పులిమురుగన్‌ కొనసాగింది. అటు తెలుగులోను ‘మన్యంపులి’ (Manyam Puli) పేరుతో ఈ చిత్రం విడుదలై హిట్‌ టాక్‌ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రానికి వైశాక్‌ దర్శకత్వం వహించారు.&nbsp; ప్రేమలు (Premalu) నస్లేన్‌ కె. గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్‌ ఎ. డి తెరకెక్కించిన మలయాళ చిత్రం 'ప్రేమలు' (Premalu). ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా రూ.130 కోట్ల గ్రాస్ సాధించి.. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గో చిత్రంగా నిలిచింది. అటు టాలీవుడ్‌లో ఈ సినిమాకు విశేష ఆదరణ దక్కింది. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా హైదరాబాద్‌లో జరగడంతో తెలుగు ఆడియన్స్‌ ఈ సినిమాను ఓన్‌ చేసుకున్నారు.&nbsp;&nbsp; లూసిఫర్‌&nbsp; 2019లో మోహన్‌లాల్‌ (Mohan lal) హీరోగా వచ్చిన లూసిఫర్‌ (Lucifer) కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళంలో ఈ స్థాయి కలెక్షన్స్‌ వసూలు చేసిన ఐదో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు సలార్ ఫేమ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందగా.. రూ.127 కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఈ సినిమానే తెలుగులో ‘గాడ్ ఫాదర్‌’ (Godfather) పేరుతో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రీమేక్ చేయడం గమనార్హం.&nbsp; నెరు&nbsp; గతేడాది వచ్చిన నెరు (Neru) సినిమా మలయాళంలో బ్లాక్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ లాయర్‌గా నటించాడు. రూ.12 బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.86 కోట్ల గ్రాస్ సాధించింది. అత్యాచారానికి గురైన ఓ అంధ యువతికి ఓ లాయర్‌ అండగా నిలబడి ఎలా న్యాయం చేశాడు? అన్న కథాంశంతో దర్శకుడు జీతు జోసెఫ్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; భీష్మ పర్వం మమ్ముట్టి (Mammootty) హీరోగా 2022లో వచ్చిన ‘భీష్మ పర్వం’ (Bheeshma Parvam) కూడా మలయాళ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా రూ.85 కోట్లు (గ్రాస్‌) రాబట్టి ఈ జాబితాలో ఏడో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు అమల్‌ నీరద్‌ దర్శకత్వం వహించగా మమ్ముట్టితో పాటు నదియా, అనసూయ, నెడుముడి వేణు ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; ఆర్‌డీఎక్స్‌ రాబర్ట్ (R), డానీ (D), జేవియర్‌ (X) అనే ముగ్గురు స్నేహితుల్లో జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. గతేడాది విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. రూ.8 కోట్ల బడ్జెట్‌కు గాను రూ.84.55 వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం నిహాస్‌ హిదయనాథ్ అందించారు.&nbsp; కన్నూర్‌ స్క్వాడ్‌ మమ్ముట్టి హీరోగా చేసిన్న ‘కన్నూర్‌ స్క్వాడ్‌’ (Kannur Squad) చిత్రం కూడా కలెక్షన్ల పరంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.10 కోట్లు. విడుదల అనంతరం ఈ సినిమా రూ.82 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. కేరళలోని కన్నూర్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రోబీ వర్గీస్‌ రాజ్‌ ఈ మూవీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; కురుప్‌ దుల్కార్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా చేసిన ‘కురుప్‌’ (Kurup) చిత్రం.. కలెక్షన్స్‌ పరంగా మలయాళంలో టాప్‌-10లో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.35 కోట్లు. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.81 కోట్ల గ్రాస్‌ వచ్చింది. కేరళలో ఫేమస్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్పు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) నటించింది.&nbsp;
    మార్చి 29 , 2024
    <strong>Pushpa 2 Box Office Collections: రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘పుష్ప 2’? ఐదు రోజుల్లోనే కొత్త చరిత్ర!</strong>
    Pushpa 2 Box Office Collections: రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘పుష్ప 2’? ఐదు రోజుల్లోనే కొత్త చరిత్ర!
    అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం థియేటర్లను షేక్‌ చేస్తోంది. విడుదలైన అన్ని చోట్ల బ్లాక్‌ బాస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్‌ నటనకు ఫిదా అవుతున్నారు. దీంతో నార్త్‌, సౌత్‌, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కాసుల వర్షం కురుస్తోంది. తొలి రోజే ఇండియన్‌ సినిమా చరిత్రను తిరిగరాసిన పుష్ప రాజ్‌ వీకెండ్ పూర్తయ్యేసరికి మరిన్ని రికార్డులను కొల్లగొట్టాడు. బాక్సాఫీస్‌ (Pushpa 2 Day5 Box Office Collections) వద్ద ఊచకోత సృష్టించాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  రూ.800 కోట్ల క్లబ్‌లో అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా 12,500 పైగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచి రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. వీకెండ్‌ పూర్తయ్యే సరికి తొలి నాలుగు రోజుల్లో (Pushpa 2 Box Office Collections) ఈ చిత్రం రూ. వరల్డ్ వైడ్‌గా రూ.829 కోట్ల గ్రాస్‌ సాధించినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. అత్యంత వేగంగా రూ.800 కోట్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్ ఇండియన్‌ సినిమాగా చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి స్పెషల్‌ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. కాగా, ఈ చిత్రం తొలి రోజు రూ. 282.91 కోట్లు, రెండో రోజు రూ.134.63 కోట్లు, మూడో రోజు రూ.159.25 కోట్లు, నాల్గో రోజు రూ.204.52 కోట్లు తన ఖాతాలో వేసుకుందని ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. థియేటర్లలో పుష్పరాజ్‌ దూకుడు చూస్తుంటే కలెక్షన్స్‌ పరంగా మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయమని పేర్కొన్నాయి. https://twitter.com/PushpaMovie/status/1866057903498829889 హిందీలో రికార్డుల పరంపర బాలీవుడ్‌ ప్రేక్షకులు 'పుష్ప 2' (Pushpa 2&nbsp; day 5 Box Office Collections) చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్‌లో తొలి రోజు నుంచి కాసుల వర్షం కుపిరిస్తున్నారు. అక్కడ ఫస్ట్‌ డే రోజున రూ.72 కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టి 'పుష్ప 2' ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో నాల్గో రోజైన ఆదివారం (డిసెంబర్‌ 8) ఏకంగా రూ.86 కోట్లకు పైగా నెట్‌ వసూళ్లు సాధించి అక్కడ ఒక రోజులో అత్యధిక వసూళ్లు సాధించిన ఫస్ట్ ఇండియన్‌ మూవీగా కొత్త చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా హిందీలో వీకెండ్‌ పూర్తయ్యే సరికి రూ. 291 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ను 'పుష్ప 2' తన ఖాతాలో వేసుకుంది. తొలి రోజు రూ.72 కోట్లు, రెండో రోజు రూ.59 కోట్లు, మూడో రోజు రూ.74 కోట్ల నెట్‌ వసూళ్లను పుష్ప 2 రాబట్టినట్లు మేకర్స్ అఫిషియల్‌గా ప్రకటించారు. ఇది ఆల్‌ టైమ్‌ రికార్డు అంటూ స్పష్టం చేశారు.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1866041047488528542 https://twitter.com/PushpaMovie/status/1866022278150160679 రేపే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి? ‘పుష్ప 2’ రూ.1000 కోట్ల క్లబ్‌ (Pushpa 2 Box Office Collections)లో చేరేందుకు రూ.171 కోట్లు మాత్రమే మిగిలి ఉంది. బాక్సాఫీస్‌ వద్ద పుష్పరాజ్‌ దూకుడు చూస్తుంటే రేపే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వీకెండ్‌ అయిపోయిన నేపథ్యంలో ఒక వేళ కలెక్షన్స్ తగ్గినా ఎల్లుండి మాత్రం కచ్చితంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఫాస్టెస్ట్‌ థౌజండ్‌ క్రోర్స్‌ (Fastest Rs.1000 Movie) సాధించిన చిత్రంగా ‘పుష్ప 2’ కొత్త చరిత్ర సృష్టించనుంది. ఒక సారి ఆ ఫీట్‌ సాధించాక ‘పుష్ప 2’ టార్గెట్‌ రూ.1500 కోట్ల మైలురాయిపై  పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ విలన్‌గా చేశాడు. జగపతిబాబు, సునీల్‌, రావు రమేష్‌, అనసూయ ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాకు పార్ట్‌ 3 కూడా రానుంది.  కథేంటి ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌) స్మగ్లింగ్‌ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్‌ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్‌ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్‌ షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్‌)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్‌ బయలుదేరగా సీఎంతో 'ఓ ఫొటో తీసుకొని రా' అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్‌ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్‌ ఎలాంటి ప్లాన్స్‌ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.&nbsp;
    డిసెంబర్ 09 , 2024
    <strong>Indian 2 Weekend Collections: దారుణంగా పడిపోయిన ‘భారతీయుడు 2’ వసూళ్లు.. వీకెండ్‌ ఎంతంటే?</strong>
    Indian 2 Weekend Collections: దారుణంగా పడిపోయిన ‘భారతీయుడు 2’ వసూళ్లు.. వీకెండ్‌ ఎంతంటే?
    కమల్ హాసన్ (Kamal Haasan), శంకర్ (Director Shankar) కాంబినేషన్‌లో వచ్చిన 'భారతీయుడు 2' (Bharateeyudu 2) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎదురీదుతోంది. తొలి ఆట నుంచే ఈ మూవీకి నెగిటివ్‌ టాక్ రావడంతో దాని ప్రభావం వసూళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తొలిరోజుతో పాటు శని, ఆదివారాల్లోనూ ఈ మూవీకి తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా ఈ మూవీ వీకెండ్‌ కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయి. దీంతో ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలిపోతుందన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది.&nbsp; వీకెండ్‌ కలెక్షన్స్‌ ఎంతంటే? ‘భారతీయుడు 2’ చిత్రం ఈ వీకెండ్‌ (Bharateeyudu 2 Weekend Collections)లో రూ.59 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. తొలిరోజు ఈ చిత్రానికి రూ.25 కోట్లు రాగా, శని, ఆది వారాల్లో అది రూ.18.2 కోట్లు, రూ.15.1 కోట్లకు పడిపోయినట్లు పేర్కొన్నాయి. శనివారం తమిళ వెర్షన్‌కు రూ.13.7 కోట్లు, తెలుగుకు రూ.3.2 కోట్లు, హిందీలో రూ.1.3 కోట్లు వచ్చినట్లు తెలిపాయి. ఇక ఆదివారం కలెక్షన్స్‌ పెరగాల్సింది పోయి మరింత తగ్గినట్లు చెప్పాయి. ఆదివారం (జులై 14) ఇండియాలో ఈ సినిమాకు రూ.15.1 కోట్లు రాగా అందులో తమిళ వెర్షన్‌కే రూ.11 కోట్లు వచ్చాయని ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. తెలుగులో రూ.2.8 కోట్లు, హిందీ వెర్షన్‌లో రూ.1.3 కోట్లు మాత్రమే ‘భారతీయుడు 2’ రాబట్టగలిగిందని వెల్లడించాయి.&nbsp; ఇకపై మరింత పతనం! తొలి వీకెండ్‌లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో చిత్ర యూనిట్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మెుదటి వారంతంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో కలెక్షన్స్‌ ఏ స్థాయికి దిగిపోతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల తాకిడి లేకపోవడంతో ‘భారతీయుడు 2’ ప్రసారాలను థియేటర్ యజమానులు నిలిపేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సోమవారం నుంచి ‘భారతీయుడు 2’ వసూళ్లు మరింత దారుణంగా ఉండే ఛాన్స్‌ ఉందని అంచనా వేస్తున్నాయి. కేవలం తమిళ మార్కెట్‌ ఒక్కటే ‘భారతీయుడు 2’కు ఆశా కిరణంగా ప్రస్తుతం కనిపిస్తోందని పేర్కొన్నాయి.&nbsp; డే1 కలెక్షన్స్ ఎంతంటే? ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2 Day 1 Collections)పై వచ్చిన నెగిటివ్‌ రివ్యూస్‌ తొలిరోజు కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.25.6 కోట్ల వసూళ్లను (GROSS) రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు వెల్లడించాయి. ఒక్క త‌మిళ వెర్షన్‌లోనే అత్యధికంగా రూ.16.5 కోట్లు క‌లెక్ట్‌ చేసినట్లు పేర్కొన్నాయి. తెలుగులో రూ.7.9 కోట్లు, హిందీలో కేవలం రూ.1.2 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ప్రకటించాయి. హిందీ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఈ మూవీ పూర్తిగా విఫ‌ల‌మైందని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. అందుకే నార్త్‌లో ఈ మూవీ కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయని చెప్పాయి. అటు తెలుగు ఆడియన్స్‌ సైతం ఈ మూవీపై ఆసక్తి కనబరచడం లేదని తెలియజేశాయి. ఆ చిత్రాలతో పోలిస్తే భారీ కోత! కమల్‌ హాసన్‌ గత చిత్రం 'విక్రమ్‌' (Vikram)తో పోలిస్తే 'భారతీయుడు 2' డే 1 కలెక్షన్స్‌ భారీగా పడిపోయాయి. విక్రమ్‌ తొలి రోజున ఏకంగా రూ.60 కోట్ల వసూళ్లను సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. రీసెంట్‌గా కమల్‌ హాసన్‌ విలన్‌గా చేసిన 'కల్కి 2898 ఏడీ' తొలిరోజున రూ.190 కోట్లకు పైగా కలెక్షన్స్‌ దక్కించుకొని శభాష్ అనిపించుకుంది. అంతేకాదు డైరెక్టర్‌ శంకర్‌ గత చిత్రం ‘రోబో 2.0’ సైతం తొలిరోజు రూ.93 కోట్ల గ్రాస్‌ రాబట్టి రికార్డు క్రియేట్‌ చేసింది. అయితే శుక్రవారం విడుదలైన 'భారతీయుడు 2' (Indian 2) మాత్రం ఆ చిత్రాలకు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆయా మూవీల డే1 కలెక్షన్స్‌లో కనీసం సగం కూడా రాబట్టలేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేశాయి.&nbsp; అందుకే వసూళ్లు తగ్గాయా? ‘భారతీయుడు 2’ డే 1 కలెక్షన్స్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ప్రధాన కారణం ఆ మూవీ అంచనాలను అందులేకపోవడమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. ఔట్‌ డేటెడ్‌ స్టోరీతో రావడం, స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉండటం ఈ సినిమాను దెబ్బతీసింది. సోషల్‌ మెసేజ్‌ సినిమాకు కాస్త బలాన్ని చేకూర్చినా, ‘భారతీయుడు’లో లాగా తండ్రి కూతురు సెంటిమెంట్‌ లేకపోవడం మైనస్‌గా మారింది. పాటలు కూడా వినసొంపుగా లేకపోవడం కూడా సినిమాపై నెగిటివ్‌ ప్రభావం చూపించింది. అన్ని విధాలుగా ఈ సీక్వెల్‌లో సేనాపతి (కమల్‌ హాసన్‌) తమను నిరాశకు గురిచేశారని నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ కారణాల వల్ల ‘భారతీయుడు 2’ వసూళ్లు పడిపోయి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; కథేంటి చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్), అతని ఫ్రెండ్స్‌ దేశంలోని అవినీతి, అన్యాయాలపై పోరాటం చేస్తుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్టులు పెడతారు. దీంతో గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని చంపేస్తాడు. అలాగే యూత్‌ను మోటివేట్ చేస్తాడు. అయితే అనూహ్య ఘటనలతో భారతీయుడుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం జరిగింది? సామాన్య జనం సేనాపతిని ఎందుకు నిందించారు? వారి కోపానికి కారణం ఏంటి? భారతీయుడు తిరిగి వచ్చిన లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది కథ.
    జూలై 15 , 2024
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
    తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్‌ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; నాని స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్‌’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘నేను లోకల్‌’, ‘జెర్సీ’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.&nbsp; విజయ్‌ దేవరకొండ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్‌, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్‌.. ‘లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్‌ రోల్స్‌లో చేశాడు. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్‌ లెన్త్‌ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్‌ రెడ్డి'తో విజయ్‌ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్‌ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్‌ దగ్గరయ్యాడు. రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’తో విజయ్‌ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్‌’, ‘ఆరెంజ్‌’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్‌ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన 'LBW' (లైఫ్‌ బిఫోర్‌ వెడ్డింగ్‌) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్‌' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్‌ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్‌ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్‌ కూడా బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టి సిద్ధూను స్టార్‌ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్‌' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.&nbsp; నవీన్ పొలిశెట్టి యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్‌ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్‌ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్‌ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్‌ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్‌ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్‌ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్‌ చెప్పే ఫన్నీ డైలాగ్‌ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్‌తో నవీన్‌ పొలిశెట్టి క్రేజ్‌ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్‌ నటి అనుష్కతో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్‌ హీరో నటించగా ఆ ఫిల్మ్‌ కూడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో నవీన్‌ మినిమమ్‌ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.&nbsp; తేజ సజ్జ యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్‌ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్‌, అద్భుతం సినిమాలు కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘హనుమాన్‌’ (Hanu Man) సినిమా ప్యాన్‌ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్‌ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.&nbsp; అడవి శేషు స్టార్‌ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్‌ రాజా రన్‌’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్‌’, ‘హిట్‌: సెకండ్‌ కేసు’ కూడా సూపర్‌ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్‌ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు.&nbsp; ప్రియదర్శి యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్‌ హీరోగా వచ్చిన&nbsp; 'టెర్రర్‌' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్‌ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్‌ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్‌’ చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు.&nbsp;
    ఏప్రిల్ 17 , 2024
    రామ్ పోతినేని (Ram Pothineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రామ్ పోతినేని (Ram Pothineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల్లో రామ్‌ పొత్తినేని ఒకడు. దేవదాసు, రెడీ, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజం, స్టైలీష్ డ్యాన్స్‌తో యూత్ ప్రేక్షకులకు RAPO దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఉస్తాద్‌గా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకున్న రామ్‌ పొత్తినేని గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. రామ్‌ పొత్తినేని ఎవరు? వ్యాపారవేత్త మురళి పొత్తినేని కుమారుడు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిశోషోర్ స్వయానా మేనళ్లుడు. రామ్‌ పొత్తినేని ముద్దు పేర్లు? RAPO, ఉస్తాద్, ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పొత్తినేని ఎత్తు ఎంత? 5 అడుగుల 8 అంగుళాలు రామ్‌ పొత్తినేని ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ రామ్‌ పొత్తినేని పుట్టిన తేదీ ఎప్పుడు? 1988 మే 15 రామ్‌ పొత్తినేనికి వివాహం అయిందా? ఇంకా కాలేదు. రామ్‌ పొత్తినేనికి ఇష్టమైన రంగు? వైట్, బ్లూ రామ్‌ పొత్తినేని తల్లిపేరు పద్మ శ్రీ రామ్‌ పొత్తినేని అభిరుచులు? డ్యాన్స్ చేయడం, క్రికెట్ ఆడటం రామ్‌ పొత్తినేనికి&nbsp; ఇష్టమైన ఆహారం? బిర్యాని రామ్‌ పొత్తినేని అభిమాన నటుడు? వెంకటేష్ రామ్‌ పొత్తినేనికి నచ్చిన సినిమా? కలిసుందాం రా రామ్‌ పొత్తినేని&nbsp; స్టార్ డం అందించిన సినిమాలు? దేవదాసు, ఇస్మార్ట్ శంకర్, రెడీ రామ్‌ పొత్తినేని&nbsp; ఏం చదివాడు? చెన్నై యూనివర్సిటీలో డిగ్రీ రామ్‌ పొత్తినేని ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 20 సినిమాల్లో నటించాడు https://www.youtube.com/watch?v=nqh6O2HFT-g రామ్‌ పొత్తినేని సినిమాకు ఎంత తీసుకుంటారు? &nbsp;ఒక్కో సినిమాకి దాదాపు రూ.15కోట్లు- రూ.20కోట్లు తీసుకుంటున్నాడు. రామ్‌ పొత్తినేని ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు? దేవదాసు, రెడీ చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాడు.
    మార్చి 21 , 2024
    కళ్యాణ్ రామ్ (Kalyan Ram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    కళ్యాణ్ రామ్ (Kalyan Ram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    'తొలి చూపులోనే' చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. నందమూరి హరికృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. బింబిసారా, పటాస్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాడు. టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ గురించి చాలా మందికి తెలియని కొన్ని సీక్రెట్స్ మీకోసం. కళ్యాణ్ రామ్ ముద్దు పేరు? కళ్యాణ్ బాబు కళ్యాణ్ రామ్ ఎత్తు ఎంత? 5 అడుగు 11 అంగుళాలు కళ్యాణ్ రామ్ తొలి సినిమా? చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాలగోపాలుడు(1989) చిత్రంలో నటించాడు. హీరోగా మాత్రం అతని మొదటి సినిమా 'తొలిచూపులోనే'  కళ్యాణ్ రామ్ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ కళ్యాణ్ రామ్ పుట్టిన తేదీ ఎప్పుడు? జులై 5, 1978 కళ్యాణ్ రామ్ భార్య పేరు? స్వాతి కళ్యాణ్ రామ్ పెళ్లి ఎప్పుడు జరిగింది? ఆగస్టు 10, 2006 కళ్యాణ్ రామ్ ఫెవరెట్ హీరోయిన్? సాయిపల్లవి, శ్రీదేవి కళ్యాణ్ రామ్ ఫెవరెట్ హీరో? Sr.NTR, రజనీకాంత్ కళ్యాణ్ రామ్ తొలి హిట్ సినిమా? అతనొక్కడే చిత్రం తొలి హిట్ అందించింది. ఆ తర్వాత పటాస్, బింబిసార చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్లు అందించాయి. కళ్యాణ్‌ రామ్‌కు ఇష్టమైన కలర్? వైట్ అండ్ బ్లాక్ కళ్యాణ్‌రామ్‌కు ఇష్టమైన సినిమా? దానవీర సూరకర్ణ కళ్యాణ్ రామ్ తల్లి పేరు? లక్ష్మి హరికృష్ణ కళ్యాణ్ రామ్‌కు ఇష్టమైన ప్రదేశం? కేరళ, మనాలి కళ్యాణ్ రామ్ చదువు? MS(USA) కళ్యాణ్ రామ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? &nbsp;2024 వరకు 21 సినిమాల్లో హీరోగా నటించాడు.&nbsp; కళ్యాణ్ రామ్ ఇష్టమైన ఆహారం? చేపల కూర కళ్యాణ్ రామ్ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడు? &nbsp;దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్ అభిరుచులు? బుక్స్ చదవడం, మ్యూజిక్ వినడం కళ్యాణ్ రామ్ వ్యాపారాలు? NTR క్రియేషన్స్ బ్యానర్‌ ద్వారా ఇప్పటివరకు 10 చిత్రాలను నిర్మించారు కళ్యాణ్ రామ్ నికర ఆస్తులు(Net Worth)? రూ.110కోట్లు https://www.youtube.com/watch?v=xmZT13t7xxI
    మార్చి 21 , 2024
    <strong>Ram Charan Kadapa Dargah: అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లిన రామ్ చరణ్… తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు!</strong>
    Ram Charan Kadapa Dargah: అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లిన రామ్ చరణ్… తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు!
    ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌. రెహమాన్‌ (A.R Rahman) ఆహ్వానం మేరకు నటుడు రామ్‌ చరణ్‌ కడపలోని దర్గా (Ram Charan Kadapa Dargah)ను సోమవారం (నవంబర్‌ 18) సందర్శించారు. 80వ నేషనల్‌ ముషాయిరా గజల్‌ (ఉర్దూ కవి) సమ్మేళనాన్ని రామ్‌చరణ్‌ ప్రారంభించారు. తొలుత డైరెక్టర్‌ బుచ్చిబాబు సానాతో కలిసి కడపలోని విజయ దుర్గా దేవీ ఆలయాన్ని చరణ్‌ సందర్శించారు. తన తదుపరి సినిమా ‘RC16’ స్క్రిప్ట్‌ని అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు. అనంతరం దర్గాకు చేరుకున్న చరణ్‌ ‘మగధీర' టైమ్‌లో దర్గాతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే చరణ్‌ మాలలో ఉండి దర్గాను దర్శించడం వివాదస్పదమవుతోంది. దీనిని సోషల్‌ మీడియా వేదికగా పలువురు వ్యతిరేకిస్తున్నారు. దీనికి మెగా ఫ్యాన్స్‌ దీటుగా సమాధానం ఇస్తున్నారు. చరణ్‌కు ఊరమాస్ స్వాగతం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan Kadapa Dargah) సోమవారం రాత్రి (నవంబర్ 19) 7 గం.లకు హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి కడప బయలుదేరారు. అనంతరం కడప విమానాశ్రయంలో దిగిన రామ్‌చరణ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన గురించి ముందే తెలుసుకున్న మెగా ఫ్యాన్స్‌, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విమానాశ్రయం వద్ద సందడి చేశారు. విమానశ్రయం నుంచి చరణ్‌ బయటకు రాగానే బిగ్గరగా అరుస్తూ పలకరించారు. అనంతరం కడప దుర్గా దేవీ ఆలయానికి బయలుదేరిన చరణ్‌ వాహన శ్రేణిని పెద్ద ఎత్తున అభిమానులు అనుసరించారు. మార్గం మధ్యలో బాణా సంచా కాలుస్తూ తమ హీరో రాకను ఊరమాస్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. మరోవైపు చరణ్‌ కంటే ముందే ఆలయం, దర్గా&nbsp; వద్ద చేరుకున్న మెగా ఫ్యాన్స్ అక్కడ కూడా గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; https://twitter.com/VoiceofAndhra3/status/1858745724977975679 https://twitter.com/i/status/1858523256996688028 https://twitter.com/i/status/1858520994966630608 https://twitter.com/i/status/1858519599362293966 https://twitter.com/i/status/1858539492933521720 https://twitter.com/i/status/1858526070414135792 https://twitter.com/i/status/1858527756038160445 నెట్టింట భారీగా ట్రోల్స్‌ మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan Kadapa Dargah) ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పర మతానికి సంబంధించిన దర్గాకు మాలలో ఉండి వెళ్లడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది హిందువులను, ముస్లీములను అవమానించడమేనని నెట్టింట ఆరోపిస్తున్నారు. కొన్ని మతాలకు కట్టుబాట్లు ఉంటాయని దానిని ఎంతటి వారైనా అనుసరించి తీరాల్సిందేనని కామెంట్స్‌ చేస్తున్నారు. ఏ.ఆర్‌. రెహమాన్‌ పిలుపు మేరకు దర్గాకు వచ్చానని చరణ్ అంటున్నారని, అదే రెహమాన్‌ను తిరుమలకు రమ్మని ఆహ్వానించగలవా? అని ప్రశ్నిస్తున్నారు. నీ మాట ప్రకారం రెహమాన్‌ రాగలడా? అంటూ నిలదీస్తున్నారు. చరణ్‌పై ఇప్పటివరకూ ఉన్న గౌరవం ఈ ఒక్క చర్యతో పోగొట్టుకున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1858762953216192664 https://twitter.com/DevikaRani81/status/1858709625107075108 https://twitter.com/kssivakumar/status/1858738287940116977 https://twitter.com/rajeshg117/status/1858718607263313946 https://twitter.com/PrabhasAnna50/status/1858765445567828393 https://twitter.com/bulliguvva_/status/1858755755245195594 https://twitter.com/SRevanuri/status/1858792387415245278 https://twitter.com/nareshchilakara/status/1858748235071750273 https://twitter.com/youngmonkxxx/status/1858756817565667393 ఘాటుగా బదులిస్తున్న చరణ్ ఫ్యాన్స్‌! తమ హీరోగా నెట్టింట జరుగుతోన్న ట్రోల్స్‌కు చరణ్‌ ఫ్యాన్స్‌ గట్టిగా బదులిస్తున్నారు. వాస్తవాలను ప్రస్తావిస్తూ చరణ్‌కు అండగా నిలుస్తున్నారు. అయ్యప్ప మాలలో ఉన్న వారు దర్గాను సందర్భించడం ఇదే తొలిసారి కాదని స్పష్టం చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలైకు వెళ్లే ముందుకు స్వాములు ముందుగా కేరళ ఎరుమెలిలోని వావర్‌ మసీదు (Vavar Juma Masjid)ను సందర్శించే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సైతం నెట్టింట షేర్ చేస్తున్నారు. హిందువు అయితే ఇతర మతస్తుల గుళ్లకు వెళ్లకూడదని రాజ్యాంగంలో ఉందా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. హిందుత్వానికి ఎంతో విలువ ఇచ్చే ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ లాంటి వారే దర్గాలకు వెళ్లారని గుర్తుచేస్తున్నారు. మన ధర్మాన్ని, సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి కాబట్టే చరణ్‌ దర్గాకు వెళ్లాడని సపోర్ట్ చేస్తున్నారు. సెలబ్రిటీల విషయాల్లో వేలు పెట్టి పాపులర్ కావాలని చూడటం ఈ మధ్య బాగా ఫ్యాషన్‌ అయ్యిందని మెగా ఫ్యాన్స్‌ విమర్శిస్తున్నారు.&nbsp; https://twitter.com/mutyala2492/status/1858765282317398031 https://twitter.com/Ryder1162/status/1858736681152618783 https://twitter.com/irah_ranga/status/1858796736900157841 https://twitter.com/mutyala2492/status/1858765966718693462 https://twitter.com/i/status/1858733584565338350 https://twitter.com/Trivikram_Pavan/status/1858747494773256230 https://twitter.com/NBK__MB/status/1858742668500889986
    నవంబర్ 19 , 2024
    Ram Charan Wax Statue: ప్రభాస్, మహేష్‌, బన్నీ సరసన రామ్ చరణ్‌.. ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేయాల్సిందే!
    Ram Charan Wax Statue: ప్రభాస్, మహేష్‌, బన్నీ సరసన రామ్ చరణ్‌.. ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేయాల్సిందే!
    మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్‌ (Ram Charan) టాలీవుడ్‌ (Tollywood)లో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. ‘చిరుత’ (Chirutha) సినిమాతో తెరంగేట్రం చేసిన అతడు రెండో సినిమా 'మగధీర' (Magadheera) ఇండస్ట్రీ హిట్‌ అందుకున్నాడు. రంగస్థలం (Rangasthalam)తో నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించాడు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR)తో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన ఘనతను సైతం రామ్‌చరణ్ అందుకోబోతున్నాడు.&nbsp; సింగపూర్‌లో మైనపు విగ్రహం నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) అరుదైన గౌరవం దక్కనుంది. ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్‌లోని మ్యూజియంలో చరణ్‌తోపాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహాన్ని కూడా పెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోషూట్‌ ఇప్పటికే పూర్తయింది. విగ్రహం ఏర్పాటు చేసే విషయాన్ని టుస్సాడ్స్‌ టీమ్‌ ఐఫా వేదికగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై మెగా అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి తరహాలోనే అంచెలంచెలుగా ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Nilzrav/status/1840120654193897699 ఫస్ట్‌ తెలుగు హీరోగా రికార్డు! టాలీవుడ్‌ నుంచి ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల మైనపు విగ్రహాలను మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. వాటితో పోలిస్తే ఈసారి చరణ్‌ మైనపు విగ్రహం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే లండన్‌లోని టుస్సాడ్స్‌ మ్యూజియంలో చరణ్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేయబోతున్నారు. మేడమ్ టుస్సాడ్స్ పుట్టిన ఇల్లు అయిన లండన్ మ్యూజియంలో అడుగుపెడుతున్న ఫస్ట్‌ తెలుగు యాక్టర్‌ రామ్ చరణ్‌ కావడం విశేషం. ఈ అరుదైన గౌరవాన్ని చరణ్‌ సొంతం చేసుకోబుతున్నారు. ఆయనకు మూగ జీవాలపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఆయన పెంపుడు కుక్క రైమ్‌ విగ్రహాన్ని అక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేయనుండటం గమనార్హం.&nbsp; చరణ్‌ కంటే ముందే..&nbsp; మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అడుగు పెట్టిన మొదటి తెలుగు హీరో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన మైనపు విగ్రహం బ్యాంకాక్ మ్యూజియంలో పెట్టారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం ఉంది. ఆ మ్యూజియంలోనే శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సైతం ఉంచారు. ఆమె నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'మిస్టర్ ఇండియా'లో గెటప్ తీసుకుని ఆ విగ్రహం రూపొందించారు. ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మ సైతం అక్కడే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఇటీవల దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. పుష్పరాజ్‌ గెటప్‌లో బన్నీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. బాలీవుడ్‌ స్టార్స్‌ విగ్రహాలు బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీల మైనపు విగ్రహాలు సైతం మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు అయ్యాయి. వీరిలో కొందరివి లండన్‌లో, ఇంకొంత మంది విగ్రహాలు సింగపూర్, దుబాయ్ మ్యాజియమ్స్‌లో ఉన్నాయి. బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్ ఖాన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌ కండల&nbsp; వీరుడు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, కరీనా కపూర్ ఖాన్, స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ సహా మరి కొందరి మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు.&nbsp; చరణ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ రామ్‌చరణ్‌, తమిళ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా రానున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు (Director Buchi Babu) దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram Charan) నటించబోతున్నాడు. ‘RC16’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మూవీ తర్వాత డైరెక్టర్‌ సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది. 'పుష్ప 2' రిలీజ్ అనంతరం రామ్‌, సుకుమార్‌ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుంది.&nbsp;
    సెప్టెంబర్ 30 , 2024
    Dhop Song Promo: ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘దోప్’ సాంగ్ ప్రోమో రిలీజ్, సూపర్బ్ రెస్పాన్స్
    Dhop Song Promo: ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘దోప్’ సాంగ్ ప్రోమో రిలీజ్, సూపర్బ్ రెస్పాన్స్
    రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో, శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10, 2025న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘దోప్’ సాంగ్ ప్రోమో విడుదల చేయగా, ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘దోప్’ సాంగ్ విశేషాలు సినిమా టీమ్ ‘దోప్’ సాంగ్ ప్రోమోను విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటలో రామ్ చరణ్, కియారా అద్వానీ డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంది. పాజిటివ్ ఎనర్జీతో కూడిన ఈ సాంగ్, ఆడియన్స్‌ను కట్టిపడేయనుంది. మైక్రో మంత్ర అంటూ సాంగ్ లిరిక్స్ వినసొంపుగా ఉన్నాయి.  కియరా, రామ్‌ చరణ్ కెమిస్ట్రీ కనుల విందుగా ఉంది. మెకోవర్ అట్రాక్టివ్‌గా పదే పదే చూడాలనిపించే విధంగా ఉంది. https://twitter.com/SivaHarsha_23/status/1869361110325018735 కాగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ‘జరగండి’, ‘నానా హైరానా’, ‘రా మచా మచా’ సూపర్ హిట్ కావడంతో, ఇప్పుడు కొత్తగా విడుదలైన ‘దోప్’ సాంగ్ ప్రోమోపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. https://twitter.com/BheeshmaTalks/status/1869298339730386976 రామ్ చరణ్ డ్యూయల్ రోల్ ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు టీజర్ ద్వారా తెలిసింది. ఒక పాత్ర పీరియాడిక్ టైమ్‌ లైన్‌కు చెందినదైతే, మరో పాత్ర (DHOP Song Promo)ప్రస్తుత కాలానికి సంబంధించినది. తండ్రి, కొడుకులుగా రామ్ చరణ్ కనిపించనున్నట్లు బిగ్‌బాస్ సీజన్ 8 ఫినాలేలో ఆయన స్వయంగా వెల్లడించారు. సంక్రాంతి బరిలో ‘గేమ్ ఛేంజర్’ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతున్న మొదటి సినిమా కావడంతో మరింత ఆసక్తి పెరిగింది. జనవరి 12న నందమూరి బాలకృష్ణ ‘డాకూ మహరాజ్’(Daku Maharaj), జనవరి 14న విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, జనవరి 10న అజిత్ నటించిన డబ్బింగ్ చిత్రం ‘విడాముయర్చి’ విడుదల కానున్నాయి. టీజర్‌కు మంచి స్పందన ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టీజర్ చూస్తుంటే ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందనిపిస్తోంది. ఎస్ఎస్ థమన్ అందించిన సంగీతం, శంకర్ వినూత్న దర్శకత్వం, రామ్ చరణ్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీ, శంకర్ దర్శకత్వ ప్రతిభ, థమన్ సంగీతం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అవుతాయి. ‘దోప్’ సాంగ్ ప్రోమో ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉండగా, ఫుల్ సాంగ్ విడుదలకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
    డిసెంబర్ 18 , 2024
    Double iSmart Heroine: అధికారికంగా చెప్పకపోయినా ఆ బ్యూటీ ఎవరో టీజర్‌లో తెలిసిపోయింది
    Double iSmart Heroine: అధికారికంగా చెప్పకపోయినా ఆ బ్యూటీ ఎవరో టీజర్‌లో తెలిసిపోయింది
    రామ్ పొత్తినేని(RAPO) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న డబుల్ ఇస్మార్ట్ టీజర్ రానే వచ్చింది. నేడు&nbsp; (మే 15) సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను రిలీజ్ చేసింది. టీజర్&nbsp; ఆసాంతం పవర్ ఫ్యాక్డ్ యాక్షన్ డైలాగులతో ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. టీజర్‌లో రామ్ లుక్స్, స్ట్రైల్, స్వాగ్ వెటికవే ప్రత్యేకంగా ఉన్నాయి. పూరి జగన్నాథ్.. రామ్‌పై(Ram Pothineni) సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్స్‌లు ప్లాన్ చేసినట్లు టీజర్‌ను బట్టి అర్ధమవుతోంది. ఈ సినిమాలో అలీ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. టీజర్‌లో అలీ భిన్నమైన గెటప్‌లో కనిపించాడు. మరోసారి పూరి- అలీ కామెడీ మ్యాజిక్ అవిష్కృతం కానుంది.&nbsp; Double ismart Dialogues ఇక ఈ చిత్రంలో మేయిన్ విలన్‌గా నటిస్తున్న సంజయ్ దత్‌ను కూడా టీజర్‌లో క్రూరంగా చూపించారు. ఇక టీజర్‌లో రామ్‌ పొత్తినేని చెప్పే లాస్ట్ డైలాగ్ ఊర మాస్‌గా ఉంటుంది. “నాకు తెల్వకుండా నాపైనా సినిమా ప్లాన్ చేస్తే..నా గుడ్డులో మండుతది” అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఇలాంటి మాస్‌ డైలాగ్‌లు డబుల్ ఇస్మార్ట్‌లో అలరించనున్నట్లు అర్థమవుతోంది. ఇక మణిశర్మ అందించిన సంగీతం ఇస్మార్ట్ శంకర్ చిత్రం మాదిరి గ్రాండ్‌గా ఉంది. ముఖ్యంగా BGM సూపర్బ్‌గా ఉంది. మరి సాంగ్స్ ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది. https://twitter.com/TheAakashavaani/status/1790604878475301304 సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ డబుల్ ఇస్మార్ట్ టీజర్‌(Double ismart Teaser) ఇచ్చిన హైప్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. సోషల్ మీడియాలోనూ సినిమా టీజర్‌పై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. https://twitter.com/warriorkrishnaa/status/1790606705455497645 యాక్షన్ ప్యాక్‌డ్ టీజర్ అంటూ క్రిష్ణ అనే నెటిజన్ కామెంట్ చేశాడు. చివర్లో సూపర్బ్‌ అంటూ చెప్పుకొచ్చాడు. డబుల్ ఇస్మార్ట్ టీజర్ బాగుందంటూ శ్రీహర్ష అనే మరో నెటిజన్ కామెంట్ చేశాడు. రామ్ ఎనర్జీ ఎప్పటిలాగే అదిరిపోయిందని, బీజీఎం, సాంగ్ ర్యాపో అంచనాలు అందుకుందని చెప్పుకొచ్చాడు.&nbsp; https://twitter.com/NameisSrii/status/1790603578266321121 డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ రివీల్ ఇక ఈ సినిమా హీరోయిన్‌ గురించి ఎక్కడా ఇంతవరకు అధికారికంగా(Double ismart heroine) ప్రకటించనప్పటికీ.. సినిమా టీజర్‌లో హీరోయిన్ ఎవరో రివీల్ అయింది. టీజర్‌లో వచ్చే ''ఇస్మార్ట్ ఇంకర్‌కా స్టైల్ క్యా మాలూమ్..కిర్రాక్ పోరొస్తే సైట్ మార్..కతర్నాక్ బీట్ వస్తే.. స్టెపా మార్" అంటూ చెప్పే డైలాగ్‌లో కావ్యా థాపర్(Kavya Thapar) కనిపిస్తుంది. ఏక్‌ మినీ కథ, ఈగల్ సినిమాలో నటించిన కావ్యా థాపర్‌.. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్‌ పొత్తినేనితో రొమాన్స్ చేయనుంది. ఈ గ్లామర్ డాల్ టీజర్‌లో కొన్ని క్షణాలే కనిపించినప్పటికీ.. స్మైలింగ్ లుక్‌, ఆకట్టుకునే అందంలో కనిపించింది. ఈ ముద్దుగుమ్మను చూస్తుంటే మరోసారి అందాల విందు తప్పదని అర్ధమవుతోంది.&nbsp; పూరి జగన్నాథ్ సినిమా అంటేనే హీరోయిన్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా యూత్‌ను దృష్టిలో ఉంచుకుని హీరోయిన్ క్యారెక్టర్లను పూరి డిజైన్ చేస్తుంటాడు. గతంలో వచ్చిన నభా నటేష్,ఆసిన్, అనుష్క,&nbsp; నిధి అగర్వాల్,&nbsp; హన్సిక, అదా శర్మ పూరి సినిమాల్లో హీరోయిన్లుగా నటించి కుర్రకారుకు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు.&nbsp; తాజాగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ టీజర్‌ ద్వారా కావ్యథాపర్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పూరి కనెక్ట్స్ నుంచి&nbsp; ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక సినిమాలో కావ్యా థాపర్‌(Kavya Thapar)తో రామ్ పొత్తినేనికి మంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని సమాచారం. 'ఏక్ మినీ కథ' చిత్రంతో గుర్తింపు పొందిన&nbsp; కావ్యా థాపర్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. క్యూట్‌గా కనిపిస్తూనే&nbsp; హాట్ ట్రీట్ ఇవ్వగలదని ఇప్పటికే ఈగల్ చిత్రం ద్వారా నిరూపితమైంది. ఈక్రమంలోనే కావ్య థాపర్‌ను డబుల్ ఇస్మార్ట్‌లో హీరోయిన్‌గా తీసుకున్నారని తెలిసింది. నార్త్ బ్యూటీ అయిన కావ్యా థాపర్ ప్రస్తుతం దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది.&nbsp; తెలుగులో ఈ మాయ పేరేమిటో, ఏక్ మినీ కథా, రవితేజతో కలిసి ఈగల్ చిత్రంలో నటించింది అటు సాండిల్ వుడ్‌లో బిచ్చగాడు 2లో కావ్యా థాపర్ హీరోయిన్‌గా చేసింది. గతేడాది మే 19న ఈ సినిమా విడుదలైంది.  అప్పట్లో ఈమె ప్రమోషన్లలో పాల్గొన్న తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. మహారాష్ట్రకు చెందిన ఈ భామ 2013లో ‘తత్కాల్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ ద్వారా కెరీర్ ప్రారంభించింది. సినిమాలతో పాటు సోషల్‌మీడియాలోనూ కావ్య బిజీబిజీగా ఉంటోంది. హాటో ఫొటో షూట్‌లతో ఎప్పటికప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది.
    మే 15 , 2024
    2022లో మార్మోగిన పాటలు
    2022లో మార్మోగిన పాటలు
    ]రామ్ పోతినేని నటించిన చిత్రంలో ఈ ఎనర్జిటిక్ పాటను తమిళ్ సూపర్‌ స్టార్‌ శింబు పాడాడు. శింబు వాయిస్‌తో పాటు రామ్ డాన్స్‌తో చాలా పాపులర్ అయ్యింది.12. బుల్లెట్ ( ది వారియర్ )Listen nowమరికొన్ని హిట్స్కల్యాణం ( సీతారామం )నీతో ఉంటే చాలు ( బింబిసార )మరికొన్ని హిట్స్నామది ( తిరు )మేఘం కరిగేనా ( తిరు )మరికొన్ని హిట్స్కోకా ( లైగర్ )విజిల్( ది వారియర్)మరికొన్ని హిట్స్రా రా రక్కమ్మ ( విక్రాంత్ రోణ )నాకోసం మారావా నువ్వు ( బంగార్రాజు )
    ఫిబ్రవరి 13 , 2023
    Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్‌ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
    Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్‌ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
    నటీనటులు: రామ్ పొత్తినేని, శ్రీలీల, శ్రీకాంత్, ప్రిన్స్, ఇంద్రజ, సాయిమంజ్రేకర్, శరత్ లోహితాశ్వ నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి డైరెక్టర్: బోయపాటి శ్రీను సంగీతం: ఎస్‌ఎస్ తమన్ ఎడిటింగ్: తమ్మిరాజు సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రం స్కంద ప్రపంచవ్యాప్తంగా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది.&nbsp; ఇస్మార్ట్ శంకర్ తర్వాత&nbsp; వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న రామ్‌..ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? అఖండాతో భారీ విజయాన్ని నమోదు చేసిన బోయపాటి మరోసారి తన మాస్ మార్క్‌ను చూపించాడా? ఇంతకు సినిమా ఎలా ఉంది? సినిమాలోని ఏ అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి? వంటి అంశాలను YouSay రివ్యూలో చూద్దాం. కథ స్కంద స్టోరీ విషయానికి వస్తే ఓ ఊరిలో ఉండే హీరో రామ్ కుటుంబమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అదేక్రమంలో ఆలయంలో దొంగతనం జరుగుతుంది. ఆ నింద రామ్ ఫ్యామిలీపై పడుతుంది. ఆ నిందను రామ్ చెరిపేశాడా? ఈ మధ్యలో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది. హీరో మరియు విలన్‌ల మధ్య పగ ఎందుకు స్టార్ట్ అయింది. క్లైమాక్స్ ఏంటీ? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని ఇప్పటివరకు అభిమానులు చూడని మాస్‌ అవతార్‌లో కనిపించడం బాగుంది. సినిమాలో ఫస్టాఫ్ విషయానికొస్తే.. హీరో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్, హీరోయిన్‌తో కామెడీ ట్రాక్ రొమాన్స్ ఉంటుంది. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోయింది.&nbsp; అప్పటి వరకు సాదాసీదగా నడిచిన సినిమా ఆ తర్వాత నుంచి సినిమా హైప్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు బాగున్నాయి. కొన్ని సీన్లు కంటతడిపెట్టిస్తాయి. రామ్ చెప్పే మాస్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. 'ఇయ్యాలే పొయ్యాలే... గట్టిగా అరిస్తే తొయ్యాలే... అడ్డం వస్తే లేపాలే, దెబ్బతాకితే సౌండ్ గొల్కొండ దాటలే' వంటి డైలాగ్స్ ఊపు తెప్పిస్తాయి. ఇక సాంగ్స్‌లో రామ్- శ్రీలీల ఇద్దరు పోటీ పడి మరి స్టెప్పులతో ఇరగదీశారు. నీ చుట్టు సాంగ్, కల్ట్ మామ పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది.&nbsp; ఎవరెలా చేశారంటే? ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ కంప్లీట్ మాస్ అవతార్‌లో అదరగొట్టాడు. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. సినిమా మొత్తం హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రామ్‌ను బోయపాటి బాగా చూపించారు. రెండు విభిన్న పాత్రల్లో రామ్ మెప్పించాడు.&nbsp; మాస్ డైలాగ్స్ థియేటర్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రామ్ పక్కన శ్రీలీల జోడీ బాగుంది. తన అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌తో అదరగొట్టింది. మరో హీరోయిన్ సాయీ మంజ్రేకర్ సైతం ఆకట్టుకుంది. శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్ తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ బాలకృష్ణతో అఖండ విజయం తర్వాత బోయపాటి మరోసారి తన యాక్షన్ మార్క్‌ను చూపించాడు. లవ్లీ బాయ్ రామ్‌ను పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇంటెన్సివ్ యాక్షన్ సీన్లు ప్రేక్షకుల ఊహకు మించి ఉంటాయి. పస్టాఫ్‌ను కామెడీ లవ్‌ ట్రాక్‌తో నడిపిన బోయపాటి... సెకండాఫ్‌ నుంచి కథలో సీరియస్ నెస్‌ తీసుకొచ్చి స్టోరీకి ప్రేక్షకున్ని కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఓ నార్మల్ ఫ్యామిలీ స్టోరీకి మాస్ ఎలిమెంట్స్ జోడించి కమర్షియల్ సినిమాగా బోయపాటి మార్చేశాడు.&nbsp; టెక్నికల్‌ పరంగా సాంకేతికంగా , నిర్మాణ విలువల పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. థమన్ అందించిన BGM బాగుంది. సాంగ్స్ పర్వాలేదు. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోతుంది.&nbsp; సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ప్రేక్షకులకు మాస్ మీల్స్‌ను అందించడంలో ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదని తెలుస్తోంది.&nbsp; బలం బోయపాటి మార్క్ డైరెక్షన్ రామ్ మాస్ యాక్టింగ్ శ్రీలీల అందం&nbsp; థమన్ BGM బలహీతనలు అవసరానికి మించిన కొన్ని యాక్షన్ సీన్లు చివరగా: &nbsp;మాస్ మీల్స్ కోరుకునే ప్రేక్షకులకు ఊహకు మించిన ట్రీట్ అందిస్తుంది స్కంద. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. రేటింగ్ 4/5
    సెప్టెంబర్ 28 , 2023
    Ram Charan: రామ్‌చరణ్‌ వరల్డ్ రికార్డ్‌.. బ్రిటన్‌ రాణి తర్వాత మనోడే!
    Ram Charan: రామ్‌చరణ్‌ వరల్డ్ రికార్డ్‌.. బ్రిటన్‌ రాణి తర్వాత మనోడే!
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ‘RRR’ బ్లాక్‌ బాస్టర్ తర్వాత అతడు చేసిన ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే చరణ్‌ ఇటీవల రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశాడు. అంబానీ ఇంట వివాహానికి సైతం ఈ కారులోనే వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఈ కారు రిజిస్టేషన్‌కు చరణ్ స్వయంగా వెళ్లారు. ఈ కారుకు సంబంధించిన నెంబర్‌ ప్లేట్ సైతం నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; ఫ్యాన్సీ నెంబర్ ఇదే! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ (Rolls Royce Car) కారును కొనుగోలు చేశారు. ఆ కారుకు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా రవాణాశాఖ ‘TG 09 C 2727’ నెంబర్‌ను కేటాయించింది. ఆ వాహనం రిజిస్ట్రేషన్ కోసం మంగళవారం ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ సెంట్రల్ జోన్ ఆఫీసుకు వచ్చారు. ఆయన రాకతో ఆఫీసులో సందడి నెలకొంది. అభిమానులు సెల్ఫీలు దిగారు. రవాణాశాఖ అధికారులు, సిబ్బంది సైతం కలిశారు. ఫొటోలు దిగారు. వాహన రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో వెళ్లిపోయారు. https://twitter.com/i/status/1848718642428711223 ఎన్నికోట్ల ఖర్చంటే! చరణ్‌ రోల్స్ రాయిస్ కారును రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా చరణ్‌ ఏరి కోరి మరి ‘TG 09 C 2727’ ఫ్యాన్సీ నెంబర్‌ను కారుకు ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.10-20 లక్షల వరకూ రుసుము చెల్లించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే చరణ్‌ దగ్గర చాలా కార్లే ఉన్నాయ్‌. ఇప్పుడు ఆ చెర్రీ గ్యారేజ్‌లోకి మరో కారు వచ్చి చేరింది. కాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా రోల్స్‌ రాయిస్‌ కారునే వినియోగిస్తున్నారు. అలాగే పలువురు సెలబ్రిటీస్‌ దగ్గర కూడా ఈ కారు ఉంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ కారుకి సంబంధించిన ఫ్యాన్సీ నెంబర్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1811294194205425882 రామ్‌చరణ్‌ అరుదైన ఘనత సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో రామ్‌చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. చరణ్‌తో పాటు ఆయన పెంపుడు శునకం ‘రైమ్‌’ విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల వీటికి సంబంధించిన కొలతలను సైతం మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు. అయితే బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ - 2 కూడా గతంలో తన పెంపుడు జంతువుతో మైనపు విగ్రహంగా కనిపించారు. ఆమె తర్వాత చరణ్‌ మాత్రమే తన పెట్‌ డాగ్‌తో మైనపు విగ్రహంగా కనిపించబోతున్నాడు. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి సెలబ్రిటీగా రామ్‌చరణ్‌ నిలిచాడు. ‘రైమ్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నా వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని మిళితం చేస్తూ ఈ విగ్రహం రూపుదిద్దుకోవడం ప్రత్యేకంగా భావిస్తున్నాను’ అని చరణ్‌ అన్నారు. https://twitter.com/Nilzrav/status/1840120654193897699 రికార్డు ధరకు ఓటీటీ హక్కులు! రామ్‌చరణ్‌ లేటెస్ట్‌ ప్రాజెక్ట్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    అక్టోబర్ 23 , 2024

    @2021 KTree