ATelugu2h 39m
రామయ్యా వస్తావయ్యా అనేది 2013లో హరీష్ శంకర్ రచన మరియు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు భాషా యాక్షన్ చిత్రం. దీనిని దిల్ రాజు నిర్మించారు మరియు NT రామారావు జూనియర్, శృతి హాసన్ మరియు సమంతా రూత్ ప్రభు నటించారు. సౌండ్‌ట్రాక్‌ను S. థమన్ స్వరపరిచారు. సినిమాటోగ్రఫీని చోటా కె. నాయుడు నిర్వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 11 అక్టోబర్ 2013న విడుదలై దాని కథాంశాన్ని విమర్శించిన విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవంగా ఆడింది.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
ఎన్టీ రామారావు జూనియర్.
నందు / రాముశృతి హాసన్
అమ్ములుసమంత రూత్ ప్రభు
ఆకర్షపి. రవిశంకర్
భిక్షపతిముఖేష్ రిషి
మొసళ్లపాడు నాగభూషణంకోట శ్రీనివాసరావు
ఉమాపతి - భిక్షపతి తండ్రిరోహిణి హట్టంగడి
బేబీ షాలినిరావు రమేష్
సీబీఐ ఆఫీసర్ అవినాష్తనికెళ్ల భరణి
అమ్ములు నాన్నప్రగతి మహావాది
అమ్ములు అమ్మనాగినీడు
రాజారావు బహదూర్ రామచంద్ర నాయుడు (నందు తాత)జయసుధ కపూర్
అన్నపూర్ణమ్మ (రాము తల్లి; సెట్‌లో ఉపయోగించే పోర్ట్రెయిట్‌లలో మాత్రమే కనిపిస్తుంది)విద్యుల్లేఖ రామన్
ఆకర్ష స్నేహితుడుఅజయ్
రాము అన్నయ్యభరణిరాము 2వ అన్నయ్య
ప్రణితఆకర్ష స్నేహితురాలు
ప్రవీణ్
నందు స్నేహితుడుప్రదీప్ మాచిరాజు
నందు స్నేహితుడుసత్య అక్కల
నందు స్నేహితుడుహంస నందిని
ఐటమ్ నంబర్ ఇది రణరంగంసిబ్బంది
హరీష్ శంకర్
దర్శకుడుదిల్ రాజు
నిర్మాతతమన్ ఎస్
సంగీతకారుడుహరీష్ శంకర్
కథఛోటా కె. నాయుడు
సినిమాటోగ్రాఫర్కథనాలు
Pawan vs Jr NTR: పవన్ ‘ఓజీ’కి సవాలు విసురుతున్న తారక్ ‘దేవర’.. ఎందుకంటే?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఇక్కడి స్టార్ హీరోల చిత్రాలన్ని దాదాపుగా జాతీయ స్థాయిలోనే విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ‘ఓజీ’ (OG), జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ (Devara) చిత్రాలు కూడా ఇండియా వైడ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ‘ఓజీ’లో పవన్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తుండగా.. ‘సాహో’ (Sahoo) ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు దేవర (Devara) చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ రెండు సినిమాల విడుదల తేదీలు విడుదల కాగా.. అవి క్లాష్ అయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
క్లాష్ ఎలా వచ్చిందంటే?
పాన్ ఇండియా (Pawan vs Jr NTR) లెవెల్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమాల్లో ‘దేవర’, ‘ఓజీ’ ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోస్ విడుదలై మంచి రెస్పాన్స్‌ని దక్కించుకున్నాయి. దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది అంటే చెప్పలేని సిట్యువేషన్. తాజాగా రెండు సినిమాల మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. దీని ప్రకారం పవన్ ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 27న వస్తుండగా.. తారక్ దేవర మూవీ అక్టోబర్ 10న విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలకు (OG vs Devara) దాదాపు రెండు వారాల సమయం ఉన్నప్పటికీ స్టార్ హీరోలు బరిలో నిలుస్తుండటంతో వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
https://twitter.com/cinecorndotcom/status/1758446390534197283
గతంలోనూ ఇలాగే!
గతంలోనూ పవన్ కల్యాణ్, తారక్ (OG vs Devara) చిత్రాలు కొద్ది రోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి. 2013లో పవన్ నటించిన అత్తారింటికి దారేది (Atharintiki Daaredi) చిత్రం కూడా సరిగ్గా సెప్టెంబర్ 27న విడుదలైంది. అప్పట్లో ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ముందే ఒరిజినల్ ప్రింట్ బయటకు వచ్చినప్పటికీ పవన్ మేనియాతో ఆ సినిమా సాలిడ్ హిట్ అందుకుంది. అయితే కొద్ది రోజుల గ్యాప్‌లో ఎన్టీఆర్ 'రామయ్య వస్తావయ్యా' (Ramayya Vasthavayya) చిత్రం రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పవన్ విన్నర్‌గా నిలిచాడు. అయితే ఈసారి పోటీ చాలా రసవత్తరంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే సాహో ఫ్లాప్‌తో సుజీత్.. ఆచార్య డిజాస్టర్‌తో కొరటాల శివ ఈ సినిమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు.
2 వారాలు సరిపోతాయా?
పవన్ సినిమా 'దేవర'కు మధ్య (Pawan vs Jr NTR) రెండు వారాల గడువు మాత్రమే ఉంది. ముందుగా ‘ఓజీ’ థియేటర్లలోకి వస్తుండటంతో ఆ చిత్రానికి థియేటర్ల కేటాయింపులో సమస్య ఉండకపోవచ్చు. కానీ రెండు వారాల గ్యాప్‌లోనే ‘దేవర’ వస్తుండటంతో ఓజీ థియేటర్లను ఆ సినిమా ఆక్రమించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఓజీ కలెక్షన్స్‌పై భారీగా ప్రభావం పడవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది క్రిస్మస్ కానుకగా వచ్చిన సలార్ (Salaar)కు కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. రెండు వారాల తర్వాత సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు నిలవడంతో సలార్ భారీ సంఖ్యలో థియేటర్లను కోల్పోయింది. దీంతో రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందనుకున్న ప్రభాస్ చిత్రం రూ.700 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఓజీకి కూడా ఇదే పరిస్థితి ఎదురువుతుందా? అన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది.
‘ఒకేసారి రిలీజ్ చేయండి’
దేవర, ఓజీ సినిమాల క్లాష్ అంశం (Pawan vs Jr NTR) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇరువురి హీరోల ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేయాలని వారు సూచిస్తున్నారు. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ హీరో సినిమా విజయం సాధిస్తుందని పవన్, తారక్ ఫ్యాన్స్ ఇరువురు చాలా దీమాగా ఉన్నారు. ఇండస్ట్రీ రికార్డులను అవి బద్దలు కొడతాయని అంటున్నారు. మరికొందరు న్యూట్రాల్ ఫ్యాన్స్ రెండు వారాల గ్యాప్ ఉండటమే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. అది ఇండస్ట్రీకి మేలు చేస్తుందని చెబుతున్నారు.
ఫిబ్రవరి 17 , 2024
HBD SSMB: ఫ్లాప్స్‌ని నిజాయితీగా యాక్సెప్ట్ చేసిన హీరో.. మహేశ్ లాగే ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన హీరోలు ఎవరో తెలుసా?
సినీ ప్రస్థానంలో ఎంత పెద్ద హీరోకైనా హిట్, ఫ్లాప్‌లు సహజం. పరాజయాలను తట్టుకుని నిలబడితేనే ఇక్కడ రాణించగలం. అయితే, సినిమా హిట్ అయితే క్రెడిట్ హీరోది, ఫ్లాప్ అయితే డైరెక్టర్లదనే వాదన ఉండేది. కానీ, ఫెయిల్యూర్‌ని నిజాయితీగా ఒప్పుకున్న హీరోలు కొంత మందే ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉండేది మహేశ్ బాబునే. తన చిత్రాల పరాభవానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పి అభిమానుల ఆదరణను నిలబెట్టుకున్నాడు. మరి మహేశ్ సారీ చెప్పిన సందర్భాలేంటి? ఈ లిస్టులో ఉన్న ఇతర హీరోలు ఎవరో చూద్దాం.
మహేశ్ బాబు
టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న మహేశ్.. తన కెరీర్‌లో కొన్ని పరాజయాలను చవిచూశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాలు బోల్తా కొట్టడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేదు. దీంతో మహేశ్ బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. ఆగడు మూవీ పరాజయంపై శ్రీమంతుడు ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాడు. ఆగడు సినిమా మిమ్మల్ని నిరాశపరచడంపై సారీ చెప్తున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదే కాకుండా, ‘భరత్ అనే నేను’ సినిమా ఈవెంట్‌లో బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్‌ని యాక్సెప్ట్ చేశాడు. స్పైడర్ సినిమాపై కూడా సూపర్ స్టార్ సారీ చెప్పాడు.
https://www.youtube.com/watch?v=R99OpY-9uis&t=41s
జూనియర్ ఎన్టీఆర్
వరుస హిట్ మూవీలతో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’గా మారాడు ఎన్టీఆర్. కెరీర్‌లో రెండు, మూడు సినిమాల పరాజయాల్ని ఎన్టీఆర్ మరచిపోలేడు. రభస, రామయ్య వస్తావయ్యా సినిమాల విషయంలో అభిమానులకు సారీ చెప్పాడు. టెంపర్ మూవీ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌తో మనసులో మాట పంచుకున్నాడు. ‘ప్రతి సినిమాతో వస్తున్నాం. పోతున్నాం. కానీ, ఈ సారి మాత్రం కాలర్ ఎగిరేసే సినిమాను అందించబోతున్నాం’ అంటూ మైకులో చెప్పేశాడు. దీంతో పాటు ఎన్టీఆర్, మెహర్ రమేశ్ కాంబోలో వచ్చిన డిజాస్టర్ ‘శక్తి’ మూవీపై పలుమార్లు ప్రస్తావించాడు తారక్.
https://www.youtube.com/watch?v=-ZitbUbHFKQ&t=7s
పవన్ కళ్యాణ్
ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పుకునే విజయాన్ని సాధించలేదు. గబ్బర్‌సింగ్‌తో ఈ కోరిక తీరిపోయింది. గబ్బర్ సింగ్ సినిమాల కన్నా ముందు పరాజయం సాధించిన సినిమాలను ప్రస్తావించాడు. గబ్బర్ సింగ్ మూవీ ఆడియో ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రతి సినిమాకు శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు.
https://www.youtube.com/watch?v=0VAIYgsc5Bc&t=92s
నాగార్జున
భాయ్ సినిమా విషయంలోనూ నాగార్జున పెదవి విప్పారు. మనం మూవీ ఆడియో ఫంక్షన్‌లో ఆ సినిమా ఫెయిల్యూర్‌పై మాట్లాడారు.
https://www.youtube.com/watch?v=cXM5F5FAKKA&t=55s
రామ్‌చరణ్ తేజ్
రంగస్థలం సినిమా అనంతరం అంచనాల మధ్య వచ్చిన మూవీ.. ‘వినయ విధేయ రామ’. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా చెర్రీకి ఊహించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో సినిమా ఫలితంపై రామ్‌చరణ్ ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలో ఒక నోట్ రిలీజ్ చేశాడు.
అఖిల్, వరుణ్ తేజ్
రీసెంట్‌గా వచ్చిన స్పై మూవీపై నిఖిల్ సిద్ధార్థ, ఏజెంట్ మూవీపై అఖిల్, గని సినిమాపై వరుణ్ తేజ్‌లు కూడా పబ్లిక్‌గానే సారీ చెప్పారు. ఇంకా, ఇలా ఫెయిల్యూర్స్‌ని యాక్సెప్ట్ చేసిన హీరోలు ఉంటే కామెంట్ చేయండి.
https://twitter.com/AkhilAkkineni8/status/1658079819790422016
ఆగస్టు 08 , 2023
Sana Makbul : బిగ్‌బాస్ ఓటీటీ 3 విజేతగా తెలుగు హీరోయిన్
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్3 విజేతగా టాలీవుడ్ నటి సనా మక్బుల్ (Sana Makbul) నిలిచింది. టైటిల్‌తో పాటు రూ.25 లక్షల బహుమతిని అందుకుంది. దీంతో ఈ అమ్మడి పేరు నెట్టింట మార్మోగుతోంది.
సనా మక్బుల్ గురించి తెలుసుకునేందుకు బిగ్ బాగ్ ఆడియన్స్ ఆసక్తికనబరుస్తున్నారు. ఈ భామను ఎక్కడో చూశామే అని తెలుగు ప్రేక్షకులు సైతం బుర్రలు బద్దలు కొట్టుకున్నారు.
ముంబయిలో పుట్టి పెరిగిన సనా మక్బుల్ తెలుగు ఫిల్మ్‌తోనే సినీ రంగ ప్రవేశం చేసింది. ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది.
సినిమాల్లోకి రాకముందు సనా టెలివిజన్ నటిగా కెరీర్ ప్రారంభించింది. 'ఇషాన్ : సప్నో కో అవాజ్ దే', 'కితనీ మెహబ్బత్ హై 2', 'ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్?', 'అర్జున్' వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు సంపాదించింది.
ఆ ఫేమ్‌తోనే దిక్కులు ‘చూడకు రామయ్య’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ ట్రయాంగిల్ లవ్ చిత్రంలో సంహిత పాత్రలో నటించింది. అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.
ఆ తర్వాత 'రంగూన్' (2017) అనే తమిళ ఫిల్మ్‌తో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇక అదే ఏడాది 'కాదల్ కండీషన్స్ అప్లే' అనే మూవీలోనూ సనా మక్బూల్ నటించింది.
2017లో 'మామ ఓ చందమామ' అనే తెలుగు ఫిల్మ్‌లో సనా మక్బూల్ నటించింది. ఇందులో బుజ్జమ్మ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.
తెలుగులో చేసిన రెండు చిత్రాలు కమర్షియల్‌గా హిట్ కాకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో బాలీవుడ్‌పై సనా ఫోకస్ పెట్టింది.
హిందీలో గేమ్స్, వినోదానికి సంబంధించిన పలు రియాలిటీ షోలలో పాల్గొని అక్కడి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
ఈ క్రమంలోనే ఇటీవల 'బిగ్ బాస్ ఓటీటీ 3' రియాలిటీ షోలో పాల్గొని తన ప్రవర్తనతో అందరి చేత ప్రసంసలు అందుకుంది. తాజాగా టైటిల్ సైతం గెలుచుకొని విజేతగా నిలిచింది.
సనా మక్బూల్ పలు మ్యూజిక్ వీడియోలలో నటించింది. ‘ఖేలేగి క్యా?’, ‘సైకో’, ‘గల్లాన్’, 'ఎక్ తూ హి తో హై' ఆల్బమ్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంది.
బుల్లితెర షోలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు రచ్చ రచ్చ చేస్తోంది. బిగ్‌బాస్‌కు వెళ్లకముందు వరకూ తన హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను హోరెత్తించింది.
ఈ అమ్మడి అందచందాలను చూసి నెటిజన్లు మైమరిపోయారు. ఇంతటి అందాల తారకు హీరోయిన్‌గా ఎందుకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో సనా మక్బూల్‌కు పెద్ద ఎత్తునే ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఖాతాను 2.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
ఆగస్టు 03 , 2024
EXCLUSIVE: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సైడ్ రోల్స్.. ఓ లుక్కేయండి!
సాధారణంగా సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలే ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుంటాయి. విలన్ నటన బట్టి ఆ పాత్రనూ ఆదరించేవారు ఉంటారు. అయితే కొన్నిసార్లు క్రేజ్‌తో సంబంధం లేకుండా సైడ్ పాత్రలు కూడా ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంటాయి. తెరపై ఆ పాత్ర సాగుతున్నంతసేపు తమ వెంటే ప్రేక్షకుల అటెన్షన్‌ను తీసుకువెళ్తుంటాయి. టాలీవుడ్‌లో మరో పదేళ్లు గడిచినా ఆ పాత్రలకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ పాత్రలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి?
[toc]
సత్యరాజ్ (బాహుబలి)
బాహుబలిలో ప్రభాస్, రాణా పాత్రల తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్ కట్టప్ప. దర్శకుడు రాజమౌళి ఈ పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. కట్టప్ప పాత్ర లేకుండా బాహుబలి చిత్రాన్ని అసలు ఊహించలేము. సీనియర్ నటుడు సత్యరాజ్ (Sathyaraj) ఆ పాత్రలో పరాకయప్రవేశం చేసి మరి నటించాడు.
ప్రకాష్ రాజ్ (అతడు)
మహేష్ కెరీర్‌లో వచ్చిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘అతడు’ ఒకటి. ఇందులో మహేష్ బాబు (Mahesh Babu) తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునే పాత్ర ప్రకాష్ రాజ్‌ది. సీబీఐ ఆఫీసర్‌గా అతడి అందరినీ అలరించాడు. కేసు దర్యాప్తు సందర్భంగా ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్, ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
https://youtu.be/Kk93JgAM7wA?si=5saRnFWzIEeDf3fR
సుకుమారి (మురారి)
మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘మురారి’ (Murari) చిత్రం అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని శబరి పాత్రలో సీనియర్ నటి మెప్పించింది. మహేష్ జాతకంలో ఉన్న గండం వల్ల అతడికి ఏం జరుగుతుందో అని భయపడుతూ సినిమాలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. హీరో కోసం చివర్లో ప్రాణ త్యాగం చేసి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.
https://youtu.be/3GrsswRGUaA?si=TgwJ6hZRa0rtRu18
శ్రీకాంత్ (శంకర్‌దాదా MBBS)
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా చేసిన ‘శంకర్ దాదా MBBS’ చిత్రం అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసింది. ఇందులో ‘ఏటీఎం’ అనే పాత్ర ఎంతో కీలకమైనది. సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) ఈ పాత్రలో కనువిందు చేశాడు. చిరుకి రైట్‌గా ఉంటూ సందర్భానుసరంగా వచ్చే సీన్లలో నవ్వులు పూయించాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘శంకర్ దాదా జిందాబాద్’లోనూ శ్రీకాంత్ ఈ తరహా పాత్రనే చేసి అదరగొట్టాడు.
https://youtu.be/QHdvEYMIOao?si=K5wkBfT-Y1gUFlZ3
రాజేంద్ర ప్రసాద్ (ఆ నలుగురు)
డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇవ్వదని నిరూపించిన చిత్రం ‘ఆ నలుగురు’ (Aa Naluguru). ఇందులో రఘు రామయ్య పాత్రలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) నటించాడు. నైతిక విలువలు కలిగిన ఓ పత్రికా ఎడిటర్‌గా, ఎంత కష్టం వచ్చినా న్యాయంగా వ్యవహరించే ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు.
https://youtu.be/AYZjTMg2EbM?si=iOSHIruH84KVRJ-0
శ్రీహరి (నువ్వొస్తానంటే నేనొద్దంటానా)
సిద్ధార్థ్ - త్రిష జంటగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో నటుడు శ్రీహరి (Srihari)కి మంచి పాత్ర దక్కింది. హీరోయిన్‌కు అన్నగా ఆయన ఎంతో అద్భుతంగా నటించాడు. అన్న అంటే ఎలా ఉండాలో ఈ పాత్ర ద్వారా తెలియజేశారు. క్లైమాక్స్‌లో హీరో చేసిన హత్యను తనపైన వేసుకొని జైలుకు వెళ్లే దృశ్యాలు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి.
https://youtu.be/WNCwQvHa1w4?si=f2K-X2pSMJSzfQtd
గొల్లపూడి మారుతిరావు (లీడర్)
దిగ్గజ నటుడు గొల్లపూడి మారుతిరావు (Gollapudi Maruti Rao).. ‘లీడర్’ సినిమాలో ఓ అద్భుతమైన క్యామియో చేశారు. సీనియర్ పొలిటిషన్‌గా హీరో రాణాతో ఆయన చెప్పే డైలాగ్స్ ప్రస్తుత రాజకీయాలకు అద్దం పడతాయి. ఆ సీన్‌పై మీరు ఓ లుక్కేయండి.
https://youtu.be/AjLNxJCU1Cs?si=nNVLqa_4N5Md1O8y
అభినవ్ గోమఠం (ఈ నగరానికి ఏమైంది)
తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హాస్య నటుల్లో అభినవ్ గోమఠం ఒకరు. ఈ నగారానికి ఏమైంది చిత్రం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. కౌషిక్ పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.
https://youtu.be/qAluEZGqhh8?si=xRLufanS8xSuqf9h
సుహాసిని (నువ్వు నాకు నచ్చావ్)
వెంకటేష్ - ఆర్తి అగర్వాల్ జంటగా చేసిన ఈ చిత్రంలో సీనియర్ నటి సుహాసిని (Suhasini) హీరోయిన్‌కు అత్తగా మెప్పించింది. అత్తింటిలో కొందరి ఆడవారి కష్టాలు ఎలా ఉంటాయో తన డైలాగ్స్ ద్వారా కళ్లకు కట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హీరోయిన్ తండ్రిని పెళ్లికి ఒప్పించే సీన్ అదరహో అనిపిస్తుంది.
https://youtu.be/XlXM5l95rEg?si=pepiyzzgooAEmbwe
అక్టోబర్ 22 , 2024
రామ్ పోతినేని (Ram Pothineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల్లో రామ్ పొత్తినేని ఒకడు. దేవదాసు, రెడీ, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజం, స్టైలీష్ డ్యాన్స్‌తో యూత్ ప్రేక్షకులకు RAPO దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఉస్తాద్‌గా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకున్న రామ్ పొత్తినేని గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
రామ్ పొత్తినేని ఎవరు?
వ్యాపారవేత్త మురళి పొత్తినేని కుమారుడు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిశోషోర్ స్వయానా మేనళ్లుడు.
రామ్ పొత్తినేని ముద్దు పేర్లు?
RAPO, ఉస్తాద్, ఎనర్జిటిక్ స్టార్
రామ్ పొత్తినేని ఎత్తు ఎంత?
5 అడుగుల 8 అంగుళాలు
రామ్ పొత్తినేని ఎక్కడ పుట్టారు?
హైదరాబాద్
రామ్ పొత్తినేని పుట్టిన తేదీ ఎప్పుడు?
1988 మే 15
రామ్ పొత్తినేనికి వివాహం అయిందా?
ఇంకా కాలేదు.
రామ్ పొత్తినేనికి ఇష్టమైన రంగు?
వైట్, బ్లూ
రామ్ పొత్తినేని తల్లిపేరు
పద్మ శ్రీ
రామ్ పొత్తినేని అభిరుచులు?
డ్యాన్స్ చేయడం, క్రికెట్ ఆడటం
రామ్ పొత్తినేనికి ఇష్టమైన ఆహారం?
బిర్యాని
రామ్ పొత్తినేని అభిమాన నటుడు?
వెంకటేష్
రామ్ పొత్తినేనికి నచ్చిన సినిమా?
కలిసుందాం రా
రామ్ పొత్తినేని స్టార్ డం అందించిన సినిమాలు?
దేవదాసు, ఇస్మార్ట్ శంకర్, రెడీ
రామ్ పొత్తినేని ఏం చదివాడు?
చెన్నై యూనివర్సిటీలో డిగ్రీ
రామ్ పొత్తినేని ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 20 సినిమాల్లో నటించాడు
https://www.youtube.com/watch?v=nqh6O2HFT-g
రామ్ పొత్తినేని సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.15కోట్లు- రూ.20కోట్లు తీసుకుంటున్నాడు.
రామ్ పొత్తినేని ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు?
దేవదాసు, రెడీ చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాడు.
మార్చి 21 , 2024
రామ్ చరణ్ (Ram charan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు సినీ పరిశ్రమలోని అగ్రహీరోల్లో ఒకరు. తన అద్భుతమైన నటనా సామర్థ్యం, మెస్మరైజ్ డ్యాన్సింగ్ ప్రదర్శనతో తెలుగు ఇండస్ట్రీలో ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి... RRR చిత్రంతో గ్లోబల్ ఇమేజ్ సంపాదించాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయినప్పటికీ.. అత్యంత డౌన్ టు ఎర్త్‌గా ఉండటంతో ఆయనకు విస్తృత అభిమానం పొందారు. ఈక్రమంలో రామ్ చరణ్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
రామ్ చరణ్ ఎవరు?
టాలీవుడ్‌లో స్టార్ హీరో, RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు
రామ్ చరణ్ పుట్టినరోజు ఎప్పుడు?
రామ్ చరణ్ మార్చి 27, 1985న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించారు. మెగాపవర్ స్టార్ వయసు 39 ఏళ్లు.
రామ్ చరణ్ ముద్దు పేరు?
చెర్రీ
రామ్ చరణ్ ఎత్తు ఎంత?
5 అడుగల 8 అంగుళాలు
రామ్ చరణ్ అభిరుచులు?
చరణ్‌కు ఫిట్‌నెస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు జిమ్‌లో సాధన చేస్తుంటాడు. హార్స్ రైడింగ్ అంటే కూడా ఇష్టం
రామ్ చరణ్ హీరోగా ఎన్ని సినిమాలు వచ్చాయి?
రామ్ చరణ్ తన 15 ఏళ్ల కెరీర్‌లో 15 సినిమాల్లో నటించాడు
రామ్ చరణ్ ఏ యాక్టింగ్ స్కూల్‌లో చదివాడు?
తన సినీరంగ ప్రవేశానికి ముందు, చరణ్ ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఈ స్కూలు చాలా ఫేమస్. హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ అందరూ ఇక్కడ నటనను అభ్యసించారు.
రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నాడా?
జూన్ 14, 2012న, రామ్ చరణ్ తన స్నేహితురాలైన కామినేని ఉపాసనను వివాహం చేసుకున్నాడు. ఉపాసన అపోలో హాస్పిటల్స్‌కు CEO.
రామ్‌చరణ్‌కు ఉపాసనకు ఎలా పరిచయం అయింది?
రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ లండన్‌లోని రీజెంట్ యూనివర్శిటీలో తమ చదువును పూర్తి చేసారు, ఆ క్రమంలోనే వారు ప్రేమలో పడ్డారు.
రామ్ చరణ్- ఉపాసనకు ఎంతమంది పిల్లలు?
వీరిద్దరి ఒక పాప జన్మించింది. పాప పేరు క్లింకారా
రామ్ చరణ్ ఎక్కడ నివసిస్తున్నారు?
రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఒక విలాసవంతమైన ఎస్టేట్‌లో నివసిస్తున్నారు.
రామ్ చరణ్ కొత్త సినిమా ఏంటి?
రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు దర్శకుడు శంకర్
https://www.youtube.com/watch?v=8zpKqO0QMn0
రామ్ చరణ్‌కి ఇష్టమైన ఆహారం?
రామ్ చరణ్ వంట చేయడం చాలా ఇష్టం. బిర్యానీ అతనికి ఇష్టమైన వంటకం.
రామ్ చరణ్ వ్యాపారాలు?
గుర్రపు పందేలపై తనకున్న అభిరుచిని సూచించేందుకు చరణ్ హైదరాబాద్‌లో పోలో టీమ్‌ని కొనుగోలు చేశాడు. అతను స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌లో వాటా కలిగి ఉన్నాడు.
రామ్ చరణ్‌కు వచ్చిన సినిమా అవార్డులు?
తన కెరీర్ మొత్తంలో, రామ్ చరణ్ అనేక గౌరవాలను అందుకున్నాడు. మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు గెలుచుకున్నాడు.
మార్చి 19 , 2024
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బాస్టర్ సినిమాలు తెలుసా?
ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు అనౌన్స్ అవుతాయి కానీ అన్నీ తెరమీదకు రావు. రకరకాల కారణాలతో ఆగిపోతాయి. సీనియర్ హీరోల నుంచి నేటి తరం హీరోల వరకూ అందరి కెరీర్‌లోనూ ఈ పరిస్థితి ఉంటుంది. కొన్ని సినిమాలు పూర్తిగా అటకెక్కితే కొన్ని మాత్రం వేరే హీరోలతో వస్తాయి. కొన్ని బ్లాక్ బస్టర్లు అవుతాయి. మరికొన్ని అట్టర్ ఫ్లాపులుగా మిగులుతాయి. ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో ఇలాంటి సినిమాలేంటో ఓ సారి చూద్దాం.
మెరుపు
అప్పట్లో ఈ సినిమా క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. రామ్ చరణ్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించబోతున్నాడన్న వార్తతో అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘బంగారం’ సినిమా తీసిన దర్శకుడు ‘ధరణి’ ఈ సినిమా తెరకెక్కించాలనుకున్నాడు. మెగా సూపర్ గుడ్ మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్‌లో మొదలుపెట్టిన ఈ సినిమా ఆ తర్వాత అటకెక్కింది. దీంతో అదే బ్యానర్‌లో రామ్ చరణ్ ‘రచ్చ’ సినిమా చేశారు.
రామ్ చరణ్- కొరటాల శివ
రామ్ చరణ్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సింది కానీ స్క్రిప్ట్ సరిగా పూర్తి కాక ఈ సినిమా ఆగిపోయింది. అయితే కొరటాల శివతో రామ్ చరణ్ తప్పకుండా ఓ సినిమా చేస్తారని అంటుంటారు.
శ్రీమంతుడు
కొరటాల ‘శ్రీమంతుడు’ కథను కూడా రామ్ చరణ్‌కు వినిపించాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత మహేశ్ బాబుతో ఈ సినిమా తెరకెక్కించగా సూపర్ హిట్‌గా నిలిచింది. రామ్ చరణ్‌తో పాటు మరికొందరు హీరోలు కూడా శ్రీమంతుడుకు నో చెప్పారు.
సూర్య s/o కృష్ణన్
తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ సూపర్ హిట్ మూవీ సూర్య s/o కృష్ణన్ కోసం మొదట రామ్ చరణ్‌ను సంప్రదించారట. కానీ అప్పటికే రాజమౌళి మగధీరతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఈ సినిమా చేయలేకపోయారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. రామ్ చరణ్‌కు ‘మగధీర’ స్టార్ ఇమేజ్‌ను తీసుకురావడమే గాక అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
https://telugu.yousay.tv/a-record-breaking-game-changer-first-look-poster.html
లీడర్
శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ డ్రామా ‘లీడర్’. రానా తెరంగేట్రం చేసిన ఈ సినిమా కూడా తొలుత రామ్ చరణ్ దగ్గరికే వెళ్లిందట. కానీ రామ్ చరణ్ ఈ కథను తిరస్కరించాడు.
డార్లింగ్
అప్పటిదాకా మాస్ ఇమేజ్‌తో దూసుకెళ్తున్న ప్రభాస్‌ను అమ్మాయిలకు ‘డార్లింగ్’ను చేసిన సినిమా ఇది. కరుణాకర్ మార్క్ లవ్ స్టోరీ, GV ప్రకాశ్ కుమార్ సెన్సేషనల్ మ్యూజిక్‌తో ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఇది కూడా రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో ఒకటి.
కృష్ణం వందే జగద్గురుమ్
క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ప్రయోగాత్మక, కళా విలువలు ఉన్న సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్’. ప్రయోగాత్మక సినిమాలకు పెట్టిన పేరు రానానే ఈ సినిమాలోనూ నటించాడు. తొలుత ఈ సినిమా రామ్ చరణ్ దగ్గరకు వెళ్లినా రిజెక్ట్ చేశాడట.
https://telugu.yousay.tv/virat-kohli-biopic-will-ram-charan-be-set-as-virat-kohli-the-story-climax-directors-of-the-movie-are-all-uproar-on-the-net.html
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ RC15లో నటిస్తున్నాడు. సినిమా టైటిల్ కూడా ‘గేమ్ చేంజర్’గా ఫిక్స్ చేశారు. ఇది పక్కా శంకర్ స్టైల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. రామ్ చరణ్ ఇందులో ఎన్నికల అధికారిగా కనిపించబోతున్నారు.
ఏప్రిల్ 01 , 2023
కళ్యాణ్ రామ్ (Kalyan Ram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
'తొలి చూపులోనే' చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. నందమూరి హరికృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. బింబిసారా, పటాస్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాడు. టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ గురించి చాలా మందికి తెలియని కొన్ని సీక్రెట్స్ మీకోసం.
కళ్యాణ్ రామ్ ముద్దు పేరు?
కళ్యాణ్ బాబు
కళ్యాణ్ రామ్ ఎత్తు ఎంత?
5 అడుగు 11 అంగుళాలు
కళ్యాణ్ రామ్ తొలి సినిమా?
చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాలగోపాలుడు(1989) చిత్రంలో నటించాడు. హీరోగా మాత్రం అతని మొదటి సినిమా 'తొలిచూపులోనే'
కళ్యాణ్ రామ్ ఎక్కడ పుట్టాడు?
హైదరాబాద్, తెలంగాణ
కళ్యాణ్ రామ్ పుట్టిన తేదీ ఎప్పుడు?
జులై 5, 1978
కళ్యాణ్ రామ్ భార్య పేరు?
స్వాతి
కళ్యాణ్ రామ్ పెళ్లి ఎప్పుడు జరిగింది?
ఆగస్టు 10, 2006
కళ్యాణ్ రామ్ ఫెవరెట్ హీరోయిన్?
సాయిపల్లవి, శ్రీదేవి
కళ్యాణ్ రామ్ ఫెవరెట్ హీరో?
Sr.NTR, రజనీకాంత్
కళ్యాణ్ రామ్ తొలి హిట్ సినిమా?
అతనొక్కడే చిత్రం తొలి హిట్ అందించింది. ఆ తర్వాత పటాస్, బింబిసార చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్లు అందించాయి.
కళ్యాణ్ రామ్‌కు ఇష్టమైన కలర్?
వైట్ అండ్ బ్లాక్
కళ్యాణ్‌రామ్‌కు ఇష్టమైన సినిమా?
దానవీర సూరకర్ణ
కళ్యాణ్ రామ్ తల్లి పేరు?
లక్ష్మి హరికృష్ణ
కళ్యాణ్ రామ్‌కు ఇష్టమైన ప్రదేశం?
కేరళ, మనాలి
కళ్యాణ్ రామ్ చదువు?
MS(USA)
కళ్యాణ్ రామ్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 21 సినిమాల్లో హీరోగా నటించాడు.
కళ్యాణ్ రామ్ ఇష్టమైన ఆహారం?
చేపల కూర
కళ్యాణ్ రామ్ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడు?
దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు
కళ్యాణ్ రామ్ అభిరుచులు?
బుక్స్ చదవడం, మ్యూజిక్ వినడం
కళ్యాణ్ రామ్ వ్యాపారాలు?
NTR క్రియేషన్స్ బ్యానర్ ద్వారా ఇప్పటివరకు 10 చిత్రాలను నిర్మించారు
కళ్యాణ్ రామ్ నికర ఆస్తులు(Net Worth)?
రూ.110కోట్లు
https://www.youtube.com/watch?v=xmZT13t7xxI
మార్చి 21 , 2024
Raai Laxmi: థండర్ థైస్ అందాలతో పంబ రేపుతున్న రాయ్ లక్ష్మి.. కుర్రకారుకు కనుల విందు!
హీరోయిన్ రాయ్ లక్ష్మి మరోసారి సోగసుల విందు చేసింది. మల్దీవ్స్‌లో వెకెషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాల తెగింపునకు పాల్పడింది.
థండర్ థైస్ అందాలతో కుర్రకారుకు కనువిందు చేసింది. వైట్ డ్రెస్‌లో అమ్మడి అందాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
బోట్‌లో ప్రయాణిస్తూ డ్రింక్ స్విప్ చేస్తున్న రాయ్ లక్ష్మి.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది.
ఇక రాయ్ లక్ష్మి థండస్ థైస్ అందాలకు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఈ హాట్ డాల్ ఎప్పుడు ఫోటోలు పెడుతుందా.. ఎప్పుడూ తమ కామెంట్లకు పనిచెప్పాలా అని ఉబలాటపడుతుంటారు.
3 పదుల వయసులోనూ తరగని అందంతో కుర్రకారు డ్రీమ్ గర్ల్‌గా మారింది రాయ్ లక్ష్మి. తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో 15 ఏళ్ల క్రితమే తెరంగేట్రం చేసింది
తొలి చిత్రం నుంచే అందాల దాడి పెంచిన రాయ్ లక్ష్మి ఇండస్ట్రీలో గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత దక్షిణాది భాషల్లో బిజీగా మారి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది.
సర్దార్ గబ్బర్ సింగ్, బలుపు, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
ఖైదీ 150 సినిమాలో చిరంజీవి సరసన ఐటెం సాంగ్‌లో నటించి ప్రేక్షకుల చేత ముద్దుగా రత్తాలుగా పిలిపించుకుంటోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాయ్ లక్ష్మి... అందాల ఆరబోతకు కెరాఫ్ ఆడ్రస్‌గా నిలుస్తోంది.
ఇక సముద్రయానానికి వెళ్లిందంటే.. రాయ్ లక్ష్మి అందాల దాడిని ఎవరు ఆపలేరు. బికినీ అందాలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతుంది. సింగిల్ పీస్ ధరించి ఇచ్చే ఫోజులకు, ఆమె కళ్లు చెదిరే అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఎప్పటికప్పుడూ తన అందాలకు మెరుగులు అద్దుతూ సరికొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది రాయ్ లక్ష్మి.
ఇక సినిమా ఈవెంట్లలో అమ్మడు ప్రదర్శించే అందాలకు కొలత కట్టడం అసాధ్యమే. ఆ రీతిలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఎక్స్‌పోజింగ్.
ప్రస్తుతం రాయ్ లక్ష్మి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటుంది. సోలో రోల్స్‌తో పాటు గ్లామర్‌కు అవకాశం ఉండే పాత్రలను సైతం ఇష్టంగా చేస్తోందీ సొగసుల సంచలనం.
అక్టోబర్ 23 , 2023
Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
నటీనటులు: రామ్ పొత్తినేని, శ్రీలీల, శ్రీకాంత్, ప్రిన్స్, ఇంద్రజ, సాయిమంజ్రేకర్, శరత్ లోహితాశ్వ
నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి
డైరెక్టర్: బోయపాటి శ్రీను
సంగీతం: ఎస్‌ఎస్ తమన్
ఎడిటింగ్: తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రం స్కంద ప్రపంచవ్యాప్తంగా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న రామ్..ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? అఖండాతో భారీ విజయాన్ని నమోదు చేసిన బోయపాటి మరోసారి తన మాస్ మార్క్‌ను చూపించాడా? ఇంతకు సినిమా ఎలా ఉంది? సినిమాలోని ఏ అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి? వంటి అంశాలను YouSay రివ్యూలో చూద్దాం.
కథ
స్కంద స్టోరీ విషయానికి వస్తే ఓ ఊరిలో ఉండే హీరో రామ్ కుటుంబమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అదేక్రమంలో ఆలయంలో దొంగతనం జరుగుతుంది. ఆ నింద రామ్ ఫ్యామిలీపై పడుతుంది. ఆ నిందను రామ్ చెరిపేశాడా? ఈ మధ్యలో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది. హీరో మరియు విలన్‌ల మధ్య పగ ఎందుకు స్టార్ట్ అయింది. క్లైమాక్స్ ఏంటీ? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని ఇప్పటివరకు అభిమానులు చూడని మాస్ అవతార్‌లో కనిపించడం బాగుంది. సినిమాలో ఫస్టాఫ్ విషయానికొస్తే.. హీరో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్, హీరోయిన్‌తో కామెడీ ట్రాక్ రొమాన్స్ ఉంటుంది. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోయింది. అప్పటి వరకు సాదాసీదగా నడిచిన సినిమా ఆ తర్వాత నుంచి సినిమా హైప్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు బాగున్నాయి. కొన్ని సీన్లు కంటతడిపెట్టిస్తాయి. రామ్ చెప్పే మాస్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. 'ఇయ్యాలే పొయ్యాలే... గట్టిగా అరిస్తే తొయ్యాలే... అడ్డం వస్తే లేపాలే, దెబ్బతాకితే సౌండ్ గొల్కొండ దాటలే' వంటి డైలాగ్స్ ఊపు తెప్పిస్తాయి. ఇక సాంగ్స్‌లో రామ్- శ్రీలీల ఇద్దరు పోటీ పడి మరి స్టెప్పులతో ఇరగదీశారు. నీ చుట్టు సాంగ్, కల్ట్ మామ పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది.
ఎవరెలా చేశారంటే?
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ కంప్లీట్ మాస్ అవతార్‌లో అదరగొట్టాడు. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. సినిమా మొత్తం హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రామ్‌ను బోయపాటి బాగా చూపించారు. రెండు విభిన్న పాత్రల్లో రామ్ మెప్పించాడు. మాస్ డైలాగ్స్ థియేటర్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రామ్ పక్కన శ్రీలీల జోడీ బాగుంది. తన అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌తో అదరగొట్టింది. మరో హీరోయిన్ సాయీ మంజ్రేకర్ సైతం ఆకట్టుకుంది. శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్ తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్
బాలకృష్ణతో అఖండ విజయం తర్వాత బోయపాటి మరోసారి తన యాక్షన్ మార్క్‌ను చూపించాడు. లవ్లీ బాయ్ రామ్‌ను పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇంటెన్సివ్ యాక్షన్ సీన్లు ప్రేక్షకుల ఊహకు మించి ఉంటాయి. పస్టాఫ్‌ను కామెడీ లవ్ ట్రాక్‌తో నడిపిన బోయపాటి... సెకండాఫ్ నుంచి కథలో సీరియస్ నెస్ తీసుకొచ్చి స్టోరీకి ప్రేక్షకున్ని కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఓ నార్మల్ ఫ్యామిలీ స్టోరీకి మాస్ ఎలిమెంట్స్ జోడించి కమర్షియల్ సినిమాగా బోయపాటి మార్చేశాడు.
టెక్నికల్ పరంగా
సాంకేతికంగా , నిర్మాణ విలువల పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. థమన్ అందించిన BGM బాగుంది. సాంగ్స్ పర్వాలేదు. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోతుంది. సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ప్రేక్షకులకు మాస్ మీల్స్‌ను అందించడంలో ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదని తెలుస్తోంది.
బలం
బోయపాటి మార్క్ డైరెక్షన్
రామ్ మాస్ యాక్టింగ్
శ్రీలీల అందం
థమన్ BGM
బలహీతనలు
అవసరానికి మించిన కొన్ని యాక్షన్ సీన్లు
చివరగా:
మాస్ మీల్స్ కోరుకునే ప్రేక్షకులకు ఊహకు మించిన ట్రీట్ అందిస్తుంది స్కంద. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.
రేటింగ్ 4/5
సెప్టెంబర్ 28 , 2023
RC15: రామ్ చరణ్ CEO స్టోరీ ఇదేనా? కథ అయితే మాములుగా లేదు!
‘RRRకు ఆస్కార్ అవార్డు రావడంతో రామ్‌చరణ్ చేసే అప్‌కమింగ్ ప్రాజెక్టులపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ డైరెక్షన్‌లో ‘RC15’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాతో బిజీబిజీగా గడుపుతున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా సినిమా కథ గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మరి ఆ విశేషాలు తెలుసుకుందాం.
కథ ఇదేనా?
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథను దర్శకుడు శంకర్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్ ఇందులో డ్యుయల్ రోల్‌లో చేయనున్నారట. ఈ మేరకు కొన్ని సెట్ ఫొటోలు గతంలో లీక్ అయ్యాయి. గ్రామీణ నేపథ్యానికి చెందిన వ్యక్తిగా ఒక రోల్, IAS అధికారిగా మరొక రోల్‌లో చెర్రీ నటించనున్నారట.
తండ్రీ, కొడుకుల చుట్టూ..
ఎన్నికల అధికారి పాత్రలో చరణ్ నటించనున్నాడు. రామ్‌చరణ్ తండ్రి ఓ రాజకీయ పార్టీ అధినేత. దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన పోరు ఉండనున్నట్లు తెలిసింది. ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకే హైలెట్‌గా ఉంటాయని సమాచారం. వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపి, వాటిని రూపుమాపే ప్రయత్నంలో CEO గా రామ్‌చరణ్ ఎదుర్కొన్న అనుభవాల గురించి ఇందులో చూపించనున్నారట. సినిమా మొత్తం తండ్రీ, కొడుకుల చుట్టూనే తిరుగుతుందని టాక్
సామాజిక కోణం..
శంకర్ సినిమా అంటే అందులో ఓ సోషల్ మెసేజ్ తప్పనిసరిగా ఉంటుంది. సమాజంలోని లోటుపాట్లను సినిమాల ద్వారా ప్రతిబింబించగలడు. దీంతో రామ్‌చరణ్ సినిమాలోనూ ఈ సోషల్ రిలవెన్స్ ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. చారిత్రక కట్టడమైన ‘చార్మినార్’ వద్ద ఇటీవల సినిమా షూటింగ్ జరుపుకోవడం ఇందుకు ఊతమిస్తోంది.
శంకర్ మార్క్ ఎలిమెంట్స్..
సినిమా నాణ్యత విషయంలో డైరెక్టర్ శంకర్ అస్సలు రాజీ పడరు. కచ్చితంగా ఉన్నతంగా తీర్చిదిద్దేవరకు అలసిపోడు. సాధారణంగా ఒక పాట షూటింగ్‌ని పూర్తి చేయడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. కానీ, శంకర్ మాత్రం దాదాపు 10 రోజులు కేటాయిస్తాడని సమాచారం. ఈ సినిమా బృందం న్యూజిలాండ్‌లోనూ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ఎమోషన్స్..
తన ప్రతి సినిమాలో శంకర్ ఎమోషన్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇందులోనూ బలమైన సీన్స్‌ని రాసుకున్నారట. ముఖ్యంగా తండ్రీకొడుకల మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట.
గ్రాండియర్ విజువల్స్..
రామ్‌చరణ్ సినిమాను శంకర్ గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్నాడు. పాటల చిత్రీకరణలోనూ శంకర్ కాంప్రమైజ్ అవ్వట్లేదు. పాటల కోసం ప్రపంచంలోని ఏ లొకేషన్‌కైనా వెళ్లేందుకు శంకర్ వెనుకాడడు. ఇటీవల న్యూజిలాండ్‌లో చిత్రబృందం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
టైటిల్ ఫిక్స్?
శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న RC15 సినిమా గురించి చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు.C.E.O(Chief Electoral Officer) అనే టైటిల్ పెట్టారని టాక్. ఇక చరణ్ పుట్టిన రోజున టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పేశాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
క్రేజీ కాంబినేషన్
RRR తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమాకు భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కావడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రాజెక్టును టేకప్ చేయడంతో అంచనాలు బలపడ్డాయి. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్‌జే సూర్య, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
బర్త్‌డే కానుక
చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్‌రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దర్శకుడు శంకర్ లోగోను తీర్చిదిద్దుతున్నారని మార్చి 27 బర్త్‌డే రోజున విడుదల చేస్తామని వెల్లడించారు. సినిమా విడుదలపై కూడా అటు ఇటుగా ఓ స్పష్టత వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ప్రకారం సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ఫ్యాన్స్‌కి పూనకాలే..
సినిమా ప్రకటించిన తర్వాత షూటింగ్ జరుగుతున్నా చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్‌లు లేవు. దీంతో ఒకొక్క విషయం తెలుస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. దిల్‌రాజు కూడా మూవీ అప్డేట్‌పై క్లారిటీ ఇవ్వడంతో ‘పూనకాలు లోడింగ్’ అంటూ ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.
మార్చి 18 , 2023
కల్యాణ్ రామ్ ‘అమిగోస్’ స్టోరీ లైన్ ఇదే! సిక్రెట్ ఆపరేషన్‌లో ముగ్గురు…
]అమిగోస్ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.విడుదల
ఫిబ్రవరి 13 , 2023
Double iSmart Review: మాస్ ఎనర్జీతో ఇరగదీసిన రామ్ పొత్తినేని.. సినిమా ఎలా ఉందంటే?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని కావ్యాథాపర్ జంటగా నటించిన 'డబుల్ ఇస్మార్ట్' భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'లైగర్' ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh), 'స్కంద' పరాజయం తర్వాత రామ్ పోతినేని (Ram Pothineni) కలిసి చేసిన సినిమా కావడంతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోనూ ఈ చిత్రంపై పెద్ద ఎత్తున బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రామ్- పూరి కాంబో మరోసారి హిట్ అయిందా? లేదా? ఈ సమీక్షలో చూద్దాం.
కథేంటి?
మాఫియా డింపుల్ బిగ్ బుల్(సంజయ్ దత్) మరణం లేకుండా ఉండాలని అనుకుంటాడు. (Double iSmart Review)ఈ క్రమంలో వైద్యులు అతనికి ఓ సలహా ఇస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ గురించి వివరిస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ చేస్తే అలాంటి అవకాశం ఉందని చెబుతారు. బిగ్ బుల్ మెమోరిని రకరకాల వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కానీ విఫలమవుతుంది. ఈక్రమంలో ఇస్మార్ట్ శంకర్ గురించి బిగ్ బుల్‌కు తెలుస్తుంది. తన మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు శంకర్‌ను ఎంచుకుంటారు. మరీ శంకర్ బ్రేయిన్‌లోకి బిగ్ బుల్ మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? మళ్లీ బిగ్ బుల్, ఇస్టార్ట్ శంకర్ ఎందుకు తలపడుతారు? కావ్యా థాపర్‌కు శంకర్‌కు మధ్య సంబంధం ఏమిటి? బోకా(అలీ) క్యారెక్టర్‌కు ఈ చిత్రంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి అన్నది మిగతా సినిమా.
సినిమా ఎలా ఉందంటే?
ఫస్టాఫ్ లవ్, కామెడీ ట్రాక్‌తో ఉంటుంది. తెలంగాణ స్లాంగ్ డైలగ్‌లతో మాస్ జాతర ఉంటుంది. పూరీ జగన్నాథ్ మార్క్ పంచ్ డైలాగ్‌లు తన స్టైల్ కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ నుంచి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు రివీల్ అవుతుంటాయి. ముఖ్యంగా రామ్- సంజయ్ దత్‌ల మధ్య వచ్చే సీన్లు అదిరిపోతాయి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అలాగే డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. తెలంగాణ స్లాంగ్‌లో రామ్ చెప్పే సామెతలు సూపర్బ్‌గా పేలాయి. రామ్- కావ్యాథాపర్ మధ్య రొమాంటిక్ సీన్స్, అలాగే రామ్- సంజయ్ దత్‌ల మధ్య మైండ్ గేమ్, మదర్ సెంటిమెంట్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అలరించాడు.అలీ కామెడీ సన్నివేశాలు బాగున్నాయి.
ఎవరెలా చేశారంటే?
ఇస్మార్ట్ శంకర్‌గా రామ్ పొత్తినేని యాక్టింగ్ ఇరగదీశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా కంటే ఈ చిత్రంలో రామ్ యాక్టింగ్ ట్రిపుల్ టైమ్ మాస్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. తన ఎనర్జీకి మించి కష్టపడ్జాడని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక విలన్ బిగ్ బుల్‌గా సంజయ్ బాబా యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. (Double iSmart Review) తన పాత్రకు 100శాతం న్యాయం చేశాడు. హీరోయిన్ జన్నత్‌గా కావ్యాథాపర్ తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక సీబీఐ అధికారిగా షియాజీ షిండే, బన్నీ జయశంకర్, రామ్ తల్లిగా ఝాన్సీ, బొకాగా అలీ, రామ్ స్నేహితుడిగా గెటప్ శ్రీను తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
లైగర్ ప్లాఫ్ తర్వాత పూరి జగన్నాథ్ చాలా శ్రద్ధగా కథను రాసుకున్నట్లు ఈ సినిమాను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాతో పూరి తిరిగి కమ్‌బ్యాక్ అయ్యారని చెప్పవచ్చు. తాను అనుకున్న స్టోరీని బాగా తీశాడు. స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. యూత్‌ను అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్‌తో పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. తనదైన మార్క్ సింగిల్ లైన్ పంచ్ డైలాగ్‌లతో మరోసారి పాత తరం పూరిని పరిచయం చేశాడు. మదర్ సెంటిమెంట్ బాగున్నా(Double iSmart Review) ఇంకాస్తా ఎలివేట్ చేస్తే బాగుండేది అనిపించింది. ఓవరాల్‌గా యూత్‌ను అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్‌తో సినిమా తీయడంలో పూరి సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తుంది. మణిశర్మ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తుంది. జియాన్ కే గియాన్ హెల్లి, శ్యామ్ కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తంగా ఈ సినిమా మాస్ పీస్ట్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్
రామ్ పొత్తినేని నటన
పూరి డైరెక్షన్
సంజయ్ దత్- రామ్ మధ్య సీన్లు
మైనస్ పాయింట్స్
లెంగ్తీగా ఉన్న అలీ కామెడీ ట్రాక్
కొన్ని పాటలు
తీర్పు: ఓవరాల్‌గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్
రేటింగ్: 3/5
ఆగస్టు 16 , 2024
Lakshmi Roy Hot: కసి అందాలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్న లక్ష్మీ రాయ్..!
కన్నడ బ్యూటీ లక్ష్మీ రాయ్ (Laxmi Roy).. తన సొగసుల సంపదతో సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. ఎద అందాలను ఏకరవు పెడుతూ కవ్విస్తోంది.
తాజాగా చిట్టి పొట్టి గౌనులో ఫొటో షూట్ నిర్వహించిన ఈ అమ్మడు.. తెల్లటి అందాలను ఆరబోసింది. మత్తెక్కించే కళ్లతో కొంటెగా చూస్తూ నెటిజన్లకు గిలిగింతలు పెట్టింది.
రెండ్రోజుల క్రితం బికినిలో ఉన్న ఫొటోను షేర్ చేసిన లక్ష్మీ రాయ్.. నెట్టింట రచ్చ రచ్చ చేసింది. కూల్‌గా కోక్ తాగుతూనే హాట్ మీటర్లను బద్దలు కొట్టింది.
లక్ష్మీ రాయ్ లేటెస్ట్ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమె అందాలకు మైమరిచిపోతున్నారు. స్టార్ హీరోయిన్ కటౌట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కర్ణాటకలోని బెంగళూరు జన్మించిన లక్ష్మీ రాయ్.. 2005లో వచ్చిన 'కర్క కసధార' అనే తమిళ చిత్రం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
అదే ఏడాది శ్రీకాంత్ పక్కన 'కాంచనమాల కేబుల్ టీవీ'లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో శిరీష / కాంచనమాల పాత్రల్లో ఈ అమ్మడు అదరగొట్టింది.
ఆ తర్వాత 'నీకు నాకు' (2006) సినిమాతో మరోమారు టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ కూడా సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.
దీంతో తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలతో ఫోకస్ పెట్టిన లక్ష్మీ రాయ్.. అక్కడ వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2011లో లారెన్స్ సరసన కాంచన సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌షోతో మంచి మార్కులే కొట్టేసింది.
ఆ తర్వాత తెలుగులో అధినాయకుడు (2012), బలుపు (2013) చిత్రాల్లో కనిపించి ఆకట్టుకుంది. అధినాయుకుడు ఆమె పోషించిన దీప్తి పాత్ర నటిగా లక్ష్మీ రాయ్‌కు గుర్తింపు తీసుకొచ్చింది.
మెగాస్టార్ రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ 150’లో ‘రత్తాలు రత్తాలు’ అనే స్పెషల్ సాంగ్‌లో కనిపించి లక్ష్మీ రాయ్ ఆకట్టుకుంది. చిరంజీవితో పోటీపడి మరి స్టెప్పులేసి ప్రశంసలు అందుకుంది.
తెలుగులో చివరిగా 2019లో వచ్చిన 'వేర్ ఇజ్ ద వెంకటలక్ష్మీ' చిత్రంలో లక్ష్మీ రాయ్ చేసింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు దక్కలేదు.
ఇటీవల ‘డీఎన్‌ఏ’ అనే మలయాళ చిత్రంలో లక్ష్మీ రాయ్ నటించింది. ఇందులో ఐపీఎస్ అధికారిణి పాత్రలో ఆకట్టుకుంది.
ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
క్రమం తప్పకుండా హాట్ ట్రీట్ ఇస్తుండటంతో లక్ష్మీ రాయ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఎక్కువ మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఖాతాను 7.1 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
జూన్ 21 , 2024
Jr NTR: ‘ప్రియమైన చంద్రబాబు మామయ్య’ అంటూ వివాదాలకు చెక్ పెట్టిన తారక్..!
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు.. తన తాత స్థాపించిన తెలుగు దేశం పార్టీతో సత్సంబంధాలు లేవని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. లోకేష్‌కు పోటీగా మారతాడన్న ఉద్దేశ్యంతో తారక్‌ను టీడీపీ దూరంగా పెడుతోందన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. టీడీపీ వైఖరితో అతడి మనసు నొచ్చుకుందని అందుకే ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని ప్రచారం కూడా జరిగింది. ఈ వ్యవహారాన్ని అప్పటి అధికార వైకాపా వినియోగించుకునే ప్రయత్నం కూడా చేసింది. ఆ పార్టీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటివారు తారక్‌కు మద్దతు ఇస్తూనే టీడీపీపై పెద్ద ఎత్తున దాడి చేశారు. అయితే వీటన్నింటికి తారక్ ఒక్క ట్విట్‌తో పటాపంచలు చేశారు. 2024 ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీకి తనదైన శైలిలో అభినందనలు చెప్పారు.
‘మామయ్యకు శుభాకాంక్షలు’
ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ విజయాన్ని అందుకున్న చంద్రబాబు (Chandra Babu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan)లకు.. జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ (ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు ప్రియమైన చంద్రబాబు మామయ్యకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిపథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్‌కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్, పురందేశ్వరి అత్తకు శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయాన్ని సాధించిన పవన్ కల్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/tarak9999/status/1798287485879140762
https://twitter.com/tarak9999/status/1798287613130150054
కల్యాణ్‌రామ్ స్పెషల్ విషెస్
తారక్‌తో పాటు టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చిన హీరో నందమూరి కల్యాణ్‌రామ్ కూడా టీడీపీకి ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశాడు. ‘చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబు మామయ్యకీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు. మీ కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని కచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నా. వరుసగా మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్‌కు శుభాకాంక్షలు. భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేష్, శ్రీ భరత్, పురందేశ్వరి అత్త గారికి నా శుభాకాంక్షలు. అలాగే జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు నా శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు.
https://twitter.com/NANDAMURIKALYAN/status/1798290427482877958
https://twitter.com/NANDAMURIKALYAN/status/1798290491995541547
కలిసిపోయినట్లేనా?
గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చిన జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇద్దరూ చంద్రబాబుకు అభినందనలు తెలియజేయడంతో టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. చిన్న చిన్న మనస్పర్థలు ఏమైనా ఉంటే ఇప్పటికైనా వాటిని పక్కన పెట్టేయాలని సూచిస్తున్నారు. తామంతా ఒక్కటే అన్న భావాన్ని కార్యకర్తలు, అభిమానుల్లో నింపాలని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తారక్ లేటెస్ట్ ట్వీట్‌ను టీడీపీ నేతలు సైతం స్వాగతిస్తున్నారు. ఇకపై టీడీపీకి అన్ని మంచి రోజులేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున, రామ్‌చరణ్ ఏమన్నారంటే?
తారక్, కల్యాణ్ రామ్‌తో పాటు స్టార్ హీరోలు నాగార్జున, రామ్‌చరణ్‌లు సైతం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీయే కూటమికి, ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అని నాగార్జున అన్నారు. అటు చరణ్.. ‘దార్శనికుడు చంద్రబాబుకు శుభాకాంక్షలు. అద్భుతమైన విజయం సాధించారు’ అంటూ అభినందనలు తెలియజేశాడు.
జూన్ 05 , 2024
RamCharan Global Craze: రామ్ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ‘రామ్‌చరణ్’ (Ramcharan).. టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరిగా మారారు. ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన అతడు.. ‘మగధీర’తో స్టార్ హీరోగా మారిపోయాడు. ‘రంగస్థలం’ ద్వారా తనలో దాగున్న అద్భుతమైన నటుడ్ని ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. రీసెంట్‌గా వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’తో రామ్‌చరణ్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రం ఆస్కార్ స్థాయికి ఎదగడంతో ఇందులో నటించిన తారక్ (Jr NTR), రామ్‌చరణ్ గురించి గ్లోబల్ స్థాయిలో చర్చ జరిగింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో రామ్‌చరణ్‌కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పే పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
‘చరణ్ లాంటి నటుడు కావాలి’
హాలీవుడ్‌లో ఓ నటీనటుల ఎంపిక సంస్థ తమకి ఈ లక్షణాలు ఉన్న నటుడు కావాలని కొన్ని పాయింట్స్ పెట్టి అందులో పలువురు హాలీవుడ్ స్టార్స్ ఫొటోలను చేర్చింది. ఆస్కార్ ఇసాక్ (Oscar Isaac), టెనెట్ (Tenet) నటుడు జాన్ డేవిడ్ వాషింగ్టన్ (John David Washington), టాప్ గన్ (Top Gun) ఫేమ్ మైల్స్ టెల్లర్ (Miles Teller) లాంటి నటులతో సహా ఆర్‌ఆర్‌ఆర్ (RRR)లో రామ్‌చరణ్ పోలీసు గెటప్‌ను చేర్చింది. తమకు వీరి రేంజ్ ఫిజిక్, లుక్స్ ఉన్న నటులు కావాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రామ్‌చరణ్ (RamCharan) లాంటి నటుడ్ని హాలీవుడ్ కోరుకుంటోందని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తమ హీరో పక్కా హాలీవుడ్ మెటిరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు లేటెస్ట్ పోస్టరే ఉదాహరణ అంటూ పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/TweetRamCharan/status/1763423843023196469?s=20
‘గేమ్ ఛేంజర్’లో ఎన్ని కోణాలో!
ప్రస్తుతం రామ్ చరణ్.. 'గేమ్ ఛేంజర్' (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండూ పొంతనలేని పాత్రలని టాక్. అందులో ఒక పాత్ర నేటి యువతరానికి ప్రతీకగా నిలిచేదైతే.. మరో పాత్ర 1970-80 కాలానికి చెందిందని అంటున్నారు. రెండు పాత్రల ఆహార్యాలు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇందులో రామ్‌చరణ్ పోషిస్తున్న ఒక పాత్ర పేరు ‘రామ్ నందన్’ అని తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ మూవీలో పీరియాడికల్ నేపథ్యంతో పాటు, ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం, ప్రతీకారం, సామాజిక సమస్యలు.. అన్నీ మిళితమై ఉంటాయని వినికిడి. కైరా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, శ్రీకాంత్, ఎస్.ఎ.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అంబానీ కొడుకు వెడ్డింగ్‌కు రామ్‌చరణ్!
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్‌తో ఏడడుగులు వేయబోతున్నాడు. అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫిబ్రవరి 28 నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మొదలయ్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు రామ్‌చరణ్ అటెండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తన సతీమణి ఉపాసనతో కలిసి ఈ పెళ్లి వేడుకల్లో చెర్రీ పాల్గొంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ మాత్రమే అనంత్ పెళ్లి వేడుకలకు హాజరుకాబోతున్నట్లు సమాచారం. రామ్‌చరణ్‌తో పాటు షారుఖ్ ఖాన్ తన భార్య పిల్లలతో అనంత్ అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బుచ్చిబాబుతో స్పోర్ట్స్ డ్రామా చిత్రం!
గేమ్ ఛేంజర్ తర్వాత రామ్‌చరణ్.. ఉప్పెన (Uppena) ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu)తో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సైతం రెడీ అయిపోయింది. ఈ మూవీ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ‘RC16’ మూవీలో కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించనుంది.
ప్రొడ్యూసర్‌గానూ బిజీ బిజీ!
హీరోగా బిజీగా ఉంటూనే చిత్ర నిర్మాణంపై రామ్‌చరణ్ ఫోకస్ పెట్టాడు. తండ్రి చిరంజీవితో ఆచార్య, ఖైదీ నంబర్ 150 వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన చరణ్.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో కూడిన చిన్న సినిమాలను నిర్మిచండానికి ‘వీ మెగా పిక్చర్స్’ పేరుతో మరో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ బ్యానర్ ద్వారా ‘ది ఇండియా హౌజ్’ పేరుతో ఓ దేశభక్తి మూవీని చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు.
మార్చి 01 , 2024
Double iSmart Movie: రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో అదిరే ట్విస్ట్.. పూరి మార్క్ ఫ్లాష్ బ్యాక్!
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ (Ram Pothineni), స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart). వీరి కాంబోలో 2019లో వచ్చి ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) చిత్రానికి రీమేక్‌గా ఇది వస్తోంది. తొలి భాగం సూపర్ హిట్‌గా నిలవడంతో పార్ట్ 2పై ఆసక్తి నెలకొంది. 2023 జులైలో పూజ కార్యక్రమాలతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంగా.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ షెడ్యూల్ షూటింగ్ ముంబయిలో జరిగింది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి సంబంధించి క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
క్రేజీ ఫ్లాష్ బ్యాక్..!
ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ (Double iSmart Movie) సినిమా కథకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమాలో పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో రామ్ పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపిస్తాడని సమాచారం. యాక్షన్ - థ్రిల్లర్ నేపథ్యంలో ఇది సాగుతుందని అంటున్నారు. పైగా తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువగానే ఉండనుందట. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
కసితో ఉన్న పూరి..!
డబుల్ ఇస్మార్ట్ మూవీని డైరెక్టర్ పూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఆయన రీసెంట్ మూవీ ‘లైగర్’ (Liger Movie) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం కావడంతో పూరీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. సినిమాకు ముందు ఆయన చేసిన కామెంట్స్ కూడా ఇందుకు కారణమయ్యాయి. దీంతో పూరి తన ఫోకస్ మెుత్తం ‘డబుల్ ఇస్మార్ట్’పై పెట్టారట. దీనిని అద్భుతంగా తెరకెక్కించి తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాలన్న కసిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్థాయిలో..
ఆ కారణంగానే ‘డబుల్ ఇస్మార్ట్’ను పాన్ ఇండియా స్థాయిలో పూరి జగన్నాథ్ రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని కేవలం సింగిల్ లాంగ్వేజ్ (తెలుగు)లో రిలీజ్ చేసిన పూరి.. సెకండ్ పార్ట్‌ను మాత్రం దేశంలోని పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. తద్వారా తన క్రేజ్‌ను జాతీయ స్థాయికి చేర్చాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు టాక్. ఇందులో భాగంగానే ‘డబుల్ ఇస్మార్ట్’ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
హీరో రామ్‌కూ కీలకమే!
ఇక హీరో రామ్ కూడా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart Movie) చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘స్కంద’ (Skanda) చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా రాణించలేదు. పైగా ఈ సినిమాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలో యాక్షన్ మరి ఓవర్‌గా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అటు ఈ చిత్రానికి ముందు రామ్ చేసిన ‘వారియర్’ (Warrior Movie In Telugu)) కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక పోయింది. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రామ్‌కు ఎంతో కీలకంగా మారింది.
ఛలో థాయిలాండ్!
‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్‌ను ముంబయిలో పూర్తి చేసిన డైరెక్టర్.. తర్వాతి షెడ్యూల్‌ను థాయిలాండ్‌లో ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అక్కడ కూడా సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను షూట్ చేస్తారని సమాచారం. ఇందుకోసం త్వరలోనే చిత్ర యూనిట్ థాయిలాండ్‌లో వాలిపోతుందని అంటున్నారు.
విలన్‌గా బాలీవుడ్ స్టార్
ఇక ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నారు. బిగ్ బుల్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌లో తాను భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ గతంలో సంజయ్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఆ రోజున రిలీజ్ కష్టమే!(Double Smart Release Date)
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ విడుదల తేదీని కూడా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. మహా శివరాత్రి సందర్భంగా వచ్చే నెల (మార్చి) 8న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అయితే అనుకున్నంత వేగంగా షూటింగ్ జరగడం లేదని సమాచారం. రకరకాల కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా ప్రకటించిన తేదీకి సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రిలీజ్ తేదీ మార్పుపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని పేర్కొంటున్నాయి.
ఫిబ్రవరి 05 , 2024
Nandini Rai: ఎద పొంగులతో రెచ్చిపోయిన నందిని రాయ్.. ఈమె చాలా హాట్ గురూ!
ప్రముఖ నటి నందిని రాయ్ తన హాట్ అందాలతో మరోమారు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్ బ్రాలో ఎద పొంగులను ఆరబోసి రచ్చ రచ్చ చేసింది.
ప్రస్తుతం ఈ భామ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ హాట్ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నందిని రాయ్ ఇండస్ట్రీలోకి రాక ముందు మోడల్‌గా మంచి గుర్తింపు పొందింది. ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని పలువురి ప్రశంసలు అందుకుంది.
2010లో మిస్ ఆంధ్రాగా ఎంపికైన ఈ భామ.. ఆ తర్వాత 80కి పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా పని చేసింది.
2011లో ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హిందీ చిత్రం ద్వారా నందిని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2014లో వచ్చిన ‘మాయ’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
నాని హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్-2 తెలుగు షోలో నందిని రాయ్ పాల్గొంది. తన అందం, అభినయం, గ్లామర్‌తో ఆ సీజన్‌లో వీక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు పరిమితమైన నందినికి బిగ్‌బాస్‌తో వచ్చిన క్రేజ్ వరుస అవకాశాలు అందేలా చేశాయి. దీంతో ఆమె ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’, ‘శివరంజనీ’, ‘కోతి కొమ్మచ్చి’ చిత్రాల్లో నటించింది.
ఈ ఏడాది విడుదలైన వారసుడు, భాగ్‌సాలే, సీఎస్‌ఐ సనాతన్ మూవీల్లోనూ నందిని రాయ్ మెరిసింది. అలాగే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, గాలివాన వంటి వెబ్ సిరీస్‌లలోనూ ఆమె అదరగొట్టింది.
ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా అందరి దృష్టిని ఆకర్షించే పనిలో పడింది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటో షూట్‌లను నిర్వహిస్తూ నెటిజన్లను కవ్విస్తోంది.
ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 5.3 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఆమె ఏ హాట్ ఫొటోను పోస్టు చేసినా వారు విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండింగ్‌లోకి తీసుకొస్తున్నారు.
నవంబర్ 15 , 2023
Raai Laxmi: బికినీలో రాయ్ లక్ష్మి సొగసుల సెగలు.. కుర్రాళ్లకు రత్తాలు హాట్ ట్రిట్
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
సెప్టెంబర్ 08 , 2023
పెళ్లి పనుల్లో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్!
]రాజస్థాన్‌లో పెళ్లి వేడుక పూర్తైన తర్వాత ముంబైలో ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నారని సమచారం. సిద్ధార్థ్ ఈ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నాడని తెలుస్తోంది.గ్రాండ్ పార్టీ
ఫిబ్రవరి 13 , 2023