• TFIDB EN
  • రిపబ్లిక్
    UATelugu
    అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సాయి ధరమ్ తేజ్
    IAS
    ఐశ్వర్య రాజేష్
    ఒక NRI
    రమ్య కృష్ణన్
    అవినీతి రాజకీయ నాయకుడు
    జగపతి బాబు
    అభిరామ్ తండ్రి
    సుబ్బరాజు
    విజయ్ కుమార్ IAS
    రాహుల్ రామకృష్ణ
    రాహుల్ రామకృష్ణ$
    శ్రీకాంత్ అయ్యంగార్
    ఎస్పీ గోపాల్ రావు
    ఆమని
    అభిరామ్ సవతి తల్లి
    సురేఖ వాణిఅభిరామ్ తల్లి
    సాయి ధీనా
    ఒక గూండా
    జయప్రకాష్
    UPSC బోర్డు కార్యదర్శి
    పోసాని కృష్ణ మురళి
    స్కూల్ ప్రిన్సిపాల్
    మనోజ్ నందం
    సబ్-ఇన్‌స్పెక్టర్ మనోజ్
    రవి వర్మ
    రాహుల్ సేన్‌గుప్తా
    CVL నరసింహారావు జస్టిస్ నరసింహం
    వెంకటేష్ కాకుమానుఅభి స్నేహితుడు
    వినయ్ నల్లకడిజీతు
    సిబ్బంది
    దేవా కట్టా
    దర్శకుడు
    J. భగవాన్నిర్మాత
    జె. పుల్లారావునిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    ఎం. సుకుమార్
    సినిమాటోగ్రాఫర్
    ప్రవీణ్ కెఎల్
    ఎడిటర్
    కథనాలు
    Animal OTT: యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో ఆ సీన్లు లేకపోవడమే రచ్చకు కారణమైందా?
    Animal OTT: యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో ఆ సీన్లు లేకపోవడమే రచ్చకు కారణమైందా?
    ఓటీటీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'యానిమల్' (Animal) చిత్రం ఎట్టకేలకు స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (#AnimalOnNetflix)లో ప్రసారం అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో శుక్రవారం (జనవరి 26న) అందుబాటులోకి వచ్చింది. సినిమా బాగుందా? బాగాలేదా? అన్న విషయాన్ని పక్కన పెడితే ఓ విషయంలో మాత్రం ఓటీటీ ప్రేక్షకులు ‘యానిమల్‌’పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా చెప్పుకుంటూ వచ్చిన విషయాన్ని చిత్ర యూనిట్‌ పక్కన పెట్టేయడంపై డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ మేటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.  అసంతృప్తికి కారణమదే! యానిమల్‌ ప్రమోషన్స్ సందర్భంగా సినిమా గురించి ఎన్నో విషయాలు చెప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల మూవీ కాకుండా మరిన్ని సీన్లు ఉన్నాయని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓటీటీలోకి ఎడిట్ చేసిన సన్నివేశాలు కూడా జోడిస్తామని తెగ ఊరించారు. దీంతో యానిమల్ ఓటీటీ వెర్షన్‌పై అందర్లో చెప్పలేనంత క్యూరియాసిటీ పెరిగింది. థియేటర్‌లో సినిమా చూసిన వారు సైతం అదనపు సీన్లు జోడిస్తుండంతో ఓటీటీ వెర్షన్‌పై ఆసక్తి పెంచుకున్నారు. తీరా చూస్తే థియేటర్లలో చూసిన సినిమా కట్‌నే ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. దీంతో అదనపు సన్నివేశాలు ఉంటాయని భావించిన వారంతా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు.  నెటిజన్ల మండిపాటు డైరెక్టర్‌ సందీప్‌ చెప్పినట్లు 8 నిమిషాల సీన్లను కాకుండా కేవలం 3 నిమిషాల అదనపు సీన్లను మాత్రమే ఓటీటీ వెర్షన్‌లో యాడ్‌ చేసినట్లు తెలుస్తోంది. యానిమల్‌ థియేటర్‌ వెర్షన్‌ నిడివి 3 గంటల 21 నిమిషాలు. అదే ఓటీటీ వెర్షన్‌ తీసుకుంటే 3 గంటల 24 నిమిషాలుగా ఉంది. దీని ప్రకారం కేవలం మూడు సీన్లను మాత్రమే ఓటీటీలో వెర్షన్‌లో యాడ్‌ చేశారని వీక్షకులు అంటున్నారు. ట్విటర్‌ (ఎక్స్‌)లో #Animal హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదనపు సీన్లు కూడా పట్టి పట్టి చూస్తే కానీ గుర్తించలేమని అంటున్నారు. కొత్త సీన్లను ఎక్స్‌పెక్ట్‌ చేసిన తమకు తీవ్ర నిరాశే ఎదురైందని పేర్కొంటున్నారు. మెుత్తంగా యానిమల్‌ వ్యవహారంపై కొందరు క్రేజీగా కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు మూవీ యూనిట్‌ తమను మోసం చేసిందని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కోరుకున్న సీన్లు అవేనా! యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో తాము ఏ సీన్లను కోరుకున్నామో కొందరు నెటిజన్లు ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా స్పష్టం చేశారు. ఫ్లైట్‌లో హీరో, హీరోయిన్ల మధ్య జరిగే రొమాన్స్‌, రణ్‌బీర్‌ - త్రిప్తి దిమ్రితో శారీరకంగా కలిసే సన్నివేశాలకు అదనపు సీన్లను జత చేసి మరింత బోల్డ్‌గా చూపిస్తారని ఆశించినట్లు పోస్టులు పెట్టారు. మరికొందరు ఆ పోస్టులను లైక్‌ చేయడం ద్వారా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకొందరు నెటిజన్లు యాక్షన్‌ సీన్స్‌లో మరింత వైలెంట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసినట్లు చెప్పారు. సెన్సార్‌ బోర్డు ప్రేక్షకులకు చూపించకుండా కట్‌ చేసిన రొమాన్స్‌, వైలెన్స్‌ సీన్లు అన్ని ఓటీటీలో ఉంటాయని భావించి భంగపడినట్లు కామెంట్స్‌ చేశారు. https://twitter.com/MaayonTweetz_/status/1750863511738265790 మరోవైపు ప్రశంసలు కూడా! ఇదిలా ఉంటే మెుదటిసారి యానిమల్‌ చిత్రాన్ని చూసినవారు మాత్రం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రన్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) నటన అద్భుతమంటూ కొనియాడుతున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ వంగా టేకింగ్‌, స్క్రీన్‌ప్లే చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాలను, హీరోయిజాన్ని ఆయన చక్కగా ఎలివేట్‌ చేశారని కొనియాడుతున్నారు. అంతేకాకుండా యానిమల్‌ చిత్రంలోని హైలెట్‌ సీన్లను తమ ఎక్స్‌ ఖాతాల ద్వారా షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోస్టులు కూడా #Animal హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.  https://twitter.com/i/status/1751101072092127579 బాక్సాఫీసుపై కాసుల వర్షం! డిసెంబర్‌ 1న విడుదలైన యానిమల్‌ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు బాలీవుడ్‌లో రెండోది. ఆయన మెుదటి చిత్రం కబీర్‌ సింగ్‌ (Kabir Singh). యానిమల్‌ వరల్డ్‌వైడ్‌గా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించింది. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అటు తండ్రి పాత్రలో అనిల్‌ కపూర్‌ జీవించారు. చిత్ర విజయంలో తన వంతు పాత్ర పోషించారు.  https://twitter.com/i/status/1751124216349638941
    జనవరి 27 , 2024
    This Week OTT Movies : ఈ వారం విడుదల కానున్న చిత్రాలు/వెబ్ సిరీస్‌లు ఇవే!
    This Week OTT Movies : ఈ వారం విడుదల కానున్న చిత్రాలు/వెబ్ సిరీస్‌లు ఇవే!
    సంక్రాంతి తర్వాత మరోసారి సినీ ప్రేక్షకులను పలకరించడానికి ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. థియేటర్‌తో పాటు, ఓటీటీలోనూ అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ రిపబ్లిక్‌ డే సందర్భంగా వస్తున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లేంటో ఇప్పుడు చూద్దాం.  థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు ఫైటర్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొణె (Deepika Padukone) జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఫైటర్‌’ (Fighter). సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్‌ యాక్షన్‌ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఇందులో యుద్ధ విమాన పైలట్‌గా హృతిక్‌ కనిపించనున్నాడు. అనిల్‌ కపూర్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం జనవరి 25న థియేటర్స్‌లో విడుదల కానుంది. మలైకోటై వాలిబన్‌ మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌.. ‘మలైకోటై వాలిబన్‌’ సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లిజో జోస్‌ పెలిసెరీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఓటమెరుగని రెజ్లర్‌ వాలిబన్‌ పాత్రలో ఆయన కనిపించనున్నారు. జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కెప్టెన్‌ మిల్లర్‌ ధనుష్‌ (Dhanush) కథానాయకుడిగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయిక. సందీప్‌కిషన్‌, శివరాజ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. జనవరి 25 నుంచి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. అయలాన్‌ శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన ‘అయలాన్‌’ (Ayalaan) చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ సినిమాను జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) హీరోయిన్‌గా చేసింది. శివ కార్తికేయన్‌ నటన, కామెడీ,  గ్రహాంతరవాసి హంగామా తమిళ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి తెలుగులోనూ ఈ సినిమా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. 105 మినిట్స్‌ ఒకే ఒక్క పాత్రతో తెరకెక్కిన చిత్రం ‘105 మినిట్స్‌’. ప్రముఖ కథానాయిక హన్సిక (Hansika) ప్రధాన పాత్ర పోషించగా... రాజు దుస్సా దర్శకత్వం వహించారు. బొమ్మక్‌ శివ నిర్మించారు. జనవరి 26న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ వారం ఓటీటీలో విడుదయ్యే చిత్రాలు యానిమల్‌ రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్‌ (Animal) చిత్రం.. ఈ వారమే ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో కంటే 8 నిమిషాల ఎక్కువ నిడివి (3 గం.ల 29 ని.)తో ప్రసారం కానుంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. యానిమల్ మూవీపై ఎన్ని విమర్శలు వచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.900 కోట్లకుపైగా వసూళ్లతో సంచలనం సృష్టించింది. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateQueer EyeSeriesEnglishNetflixJan 24Six NationsSeriesEnglishNetflixJan 24AnimalMovieTelugu/HindiNetflixJan 26Bad Land HuntersMovieKorean/EnglishNetflixJan 26HustlersMovieHindiAmazon PrimeJan 24PanchayatSeriesHindiAmazon PrimeJan 26Sam BahadurMovieHindiZee5Jan 26NeruMovieTelugu/MalayalamDisney+HotStarJan 23Karma callingMovieHindi Disney+HotStarJan 26Flex X CopSeriesEnglish/KoreanDisney+HotStarJan 26Fight ClubMovieTamilDisney+HotStarJan 27Shark Tank IndiaSeriesHindi SonyLIVJan 22WonkaMovieEnglishBook My ShowJan 22Aqaman 2MovieEnglishBook My ShowJan 23FearMovieEnglishBook My ShowJan 23
    జనవరి 22 , 2024
    2023 జనవరిలో విడుదలవుతున్న సినిమాలివే..!
    2023 జనవరిలో విడుదలవుతున్న సినిమాలివే..!
    ]అర్జున్ దాస్, అనిఖ సురేంద్రన్ ప్రధాన పాత్రల్లో.. చంద్రశేఖర్ టి. రమేశ్ దర్శకత్వం వహించిన త్రిల్లర్ మూవీ ‘బుట్టబొమ్మ’. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలవుతోంది.బుట్ట బొమ్మ - 26 January
    ఫిబ్రవరి 13 , 2023
    This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
    సంక్రాంతి తర్వాత గతవారం చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ వీక్ (This Week Movies) పెద్ద చిత్రాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాస్తవానికి ఆయా చిత్రాలు సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. మరోవైపు సంక్రాంతికి రిలీజైన రెండు పెద్ద సినిమాలు సైతం ఈ వారమే ఓటీటీలోకి (This Week OTT Releases) రాబోతున్నాయి. వాటితో పాటు మరిన్ని సిరీస్‌లు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఈగల్‌ రవితేజ (Raviteja) కథానాయకుడిగా (This Week Movies) కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle). సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ కథానాయికలు నటించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాదేవ్‌ సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్‌గా సాగే ఓ మంచి మాస్‌ యాక్షన్‌ మూవీగా ‘ఈగల్‌’ అలరిస్తుందని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేసింది.  లాల్‌ సలామ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam) చిత్రం కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రజనీ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. క్రికెట్‌ ఆట చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. రజనీ ఇందులో మొయిద్దీన్‌ భాయ్‌ పాత్రలో అలరించనున్నారు.  యాత్ర-2  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర' (Yatra). ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' (Yatra 2) ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది. వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం జగన్‌ ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 మధ్య ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' సాగుతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ మహీ వి. రాఘవ్‌ తెరకెక్కించారు. ఇందులో వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి, జగన్‌ పాత్రలో జీవా నటించారు. ట్రూ లవర్ మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి (This Week OTT Releases) కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘ట్రూ లవర్’. ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ట్రూ లవర్ రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.  పవన్‌ మూవీ రీ-రిలీజ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రం రీరిలీజ్‌కు (This Week OTT Releases) సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఎంపిక చేసిన థియేటర్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు గుంటూరు కారం మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ డ్రామా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. కెప్టెన్‌ మిల్లర్‌ తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయికగా చేసింది. సందీప్‌ కిషన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా, తెలుగులో రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఫిబ్రవరి 9నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. బబుల్‌గమ్‌ సుమ-రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ (Roshan Kanakala) కథానాయకుడిగా రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘బబుల్‌గమ్‌’(Bubblegum). మానస చౌదరి (Maanasa Choudhary) కథానాయిక. ఈ చిత్రం కూడా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. TitleCategoryLanguagePlatformRelease DateOne Day MovieEnglishNetflixFeb 8BhakshakSeriesHindiNetflixFeb 9AryaSeriesHindiDisney+HotstarFeb 9Aqua ManMovieEnglishBook My ShowFeb 5Bubble gumMovieTeluguAhaFeb 9The ExorcistMovieEnglishJio CinemaFeb 6The Nun 2MovieEnglishJio CinemaFeb 7HelloSeriesEnglishJio CinemaFeb 8AyalaanMovieTamilSun NXTFeb 9
    ఫిబ్రవరి 05 , 2024
    Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి! 
    Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి! 
    ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్‌కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్‌ రిలీజ్‌ అవుతుండటంతో కొన్ని మూవీస్‌ ఆటోమేటిక్‌గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా కూడా అవి అండర్‌ రేటెట్‌ ఫిల్మ్స్‌గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్‌ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్‌ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్‌? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.  అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.  కంచె (Kanche) వరణ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌ కంచె. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్‌ తేజ్‌).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్‌)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్‌తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya) నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు.  మలయాళంలో విజ‌య‌వంత‌మైన‌ ‘మహేశ్‌ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ. పలాస 1978 (Palasa 1978) రక్షిత్‌ అట్లూరి హీరోగా కరుణ కుమార్‌ డైరెక్షన్‌ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్‌ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్‌రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.  మను (Manu) బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్‌ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌గా చేసిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్‌ ఫండింగ్‌ రూపంలో నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు.  కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్‌) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్‌గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్‌లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ. వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ. చక్రవ్యూహం: ది ట్రాప్‌ (Chakravyuham: The Trap) అజయ్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్‌ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్‌) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్‌ (సుదీష్‌)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.  మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్‌, అమృత శ్రీనివాసన్‌ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్‌ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్‌ఫ్యూజన్‌తో ఉండే హీరో లైఫ్‌లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్‌ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.  రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. క్షణం (Kshanam) అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్‌ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్‌ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
    మే 04 , 2024
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్‌ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్‌ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్‌ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఆరెంజ్‌ (Orange) రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్‌’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్‌’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్‌బాస్టర్‌ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.  అ! (Awe) హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్‌లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు. C/o కంచరపాలెం (C/o Kancharapalem) ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్‌ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది. అంటే సుందరానికి (Ante Sundaraniki) నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్‌గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.  అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.  కర్మ (Karma) యంగ్‌ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.  1: నేనొక్కడినే (1: Nenokkadine) సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.  ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi) ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్‌ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.  వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఖలేజా (Khaleja) ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్‌ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్‌ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.  విరాట పర్వం సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్‌ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.  రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్‌ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ. 
    మార్చి 22 , 2024
    These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
    These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
    సాధారణంగా ప్రతీ సినిమాలోనూ విలన్లను దుర్మార్గులుగా చూపిస్తుంటారు. ప్రజలను పట్టిపీడిస్తున్నట్లు, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు వారి పాత్రలను డిజైన్‌ చేస్తుంటారు. అప్పుడు హీరో అతడి అన్యాయాలను ఎదిరించి విలన్‌ను అంతం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. అయితే కొన్ని సినిమాల్లో విలన్లు అలా కాదు. వారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే వాటిని సరైన మార్గంలో పెట్టకపోవడంతో వారు ప్రతినాయకులుగా మారాల్సి వస్తుంది. తెలుగులో వచ్చిన అలాంటి విలన్‌ పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.  రోబో 2.0 - పక్షి రాజు రజనీకాంత్‌ హీరోగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో (Robo 2.0) పక్షిరాజా అనే విలన్‌ పాత్రలో అక్షయ్‌ కుమార్ నటించాడు. విలన్‌కు పక్షులంటే అమితమైన ఇష్టం. సెల్‌ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల పక్షులు చనిపోతున్నాయని వాటి వాడకాన్ని మానుకోవాలని ప్రచారం చేస్తుంటాడు. ఎవరు పట్టించుకోకపోడవంతో పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోతుంటాయి. ఆ బాధతో సెల్ టవర్‌కు ఊరేసుకొని భయంకర శక్తిగా మారతాడు విలన్‌. ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు. రోబోలా వచ్చిన రజనీకాంత్‌ అతడ్ని అడ్డుకొని అంతం చేస్తాడు. ప్రజలను కాపాడతాడు.  https://www.youtube.com/watch?v=5OkypaWGYAo నేను లోకల్‌ - నవీన్‌ చంద్ర హీరో నాని - కీర్తి సురేష్‌ జంటగా నటించిన ‘నేను లోకల్‌’ (Nenu Local) చిత్రంలో నవీన్‌ చంద్ర (Naveen Chandra) విలన్‌ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. కథలోకి వెళ్తే నవీన్‌ హీరో కంటే ముందే హీరోయిన్‌ను చూసి ప్రేమిస్తాడు. ఆమె తండ్రి విధించిన షరతుతో పోలీసు ఆఫీసర్‌గా మారి తిరిగి వస్తాడు. ఈ గ్యాప్‌లో హీరో-హీరోయిన్‌ ప్రేమలో పడతారు. హీరోపై కోపంతో హీరోయిన్‌ తండ్రి నవీన్‌ చంద్రతో ఆమె పెళ్లిని నిర్ణయిస్తాడు. నానిని అడ్డుకునేందుకు నవీన్ విఫలయత్నం చేయగా చివరికీ హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.   https://www.youtube.com/watch?v=rYcZLAgPLps ‘వి’ - నాని ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వి’ (V) చిత్రంలో హీరో నాని ప్రతి నాయకుడి పాత్ర పోషించాడు. వరుసగా హత్యలు చేస్తూ డీసీపీ ఆదిత్య (సుధీర్‌ బాబు)కు సవాళ్లు విసురుతుంటాడు. అయితే నాని చేసే హత్యల వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతిని విలన్లు హత్య చేస్తారు. దీంతో నాని వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.  https://youtu.be/2vvywZbPvIc?si=NHylb0Fm4xXRv_nf నిన్నుకోరి - నాని ఈ సినిమాలో నాని కథానాయకుడే అయినప్పటికీ.. ద్వితియార్థంలో కాస్త స్వార్థంతో కనిపిస్తాడు. ప్రేయసికి పెళ్లైందని తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు. భార్య భర్తల మధ్య గొడవలు సృష్టించి వాళ్లు విడిపోయేలా చేయాలని అనుకుంటాడు. అయితే హీరోయిన్‌కు తన భర్తపై ఉన్న ప్రేమను చూసి నాని తన మనసు మార్చుకుంటాడు. తన ప్రేమను చంపుకొని ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.  https://www.youtube.com/watch?v=ie8feBbd4VA సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు - రావు రమేష్‌ వెంకటేష్‌-మహేశ్‌ బాబు అన్నదమ్ములుగా చేసిన ఈ చిత్రంలో నటుడు రావు రమేష్‌.. ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఇందులో ధనవంతుడైన రావు రమేష్‌.. హీరో ఫ్యామిలీకి డబ్బు లేదని విమర్శిస్తూ ఉంటాడు. ఖాళీగా తిరుగుతున్న వెంకటేష్‌, మహేష్‌లను ఏదైనా పని చేసుకొని బాగుపడాలని సూచిస్తుంటాడు. అతడు చెబుతున్న మాటలు మంచివే అయినప్పటికీ వాటి వెనక ఉన్న అహంకార ధోరణి రావు రమేష్‌ను విలన్‌గా మార్చింది. https://www.youtube.com/watch?v=G50OUBEZm-4 మగధీర - శ్రీహరి మగధీరలో రామ్‌చరణ్‌ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు శ్రీహరి. ఇందులో షేర్‌ఖాన్‌ పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. అతడు కాలభైరవుడు (రామ్‌చరణ్‌) సేనానిగా ఉన్న రాజ్యంపైకి దండెత్తుతాడు. దీంతో హీరో.. షేర్‌ఖాన్‌ సైన్యంలోని వంద మందిని చంపి తన వీరత్వాన్ని ప్రదర్శిస్తాడు. హీరో ధైర్యసాహసాలకు మెచ్చిన శ్రీహరి.. ఇచ్చిన మాట ప్రకారం మరో జన్మలో రామ్‌చరణ్‌కు సాయం చేస్తాడు.  https://youtu.be/6L-sfTeMSZM?si=cx22Tp3DbXpIL5ec పుష్ప - శత్రు పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పట్టుకునే డీఎస్పీ గోవిందప్ప పాత్రలో నటుడు శత్రు నటించాడు. ఎర్ర చందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు గోవిందప్ప తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అయితే హీరో ఎర్ర చందనం స్మగ్లర్‌ కావడంతో అతడ్ని పట్టుకునేందుకు యత్నించిన శత్రు.. ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల దృష్టిలో విలన్‌గా మారిపోయాడు.  https://www.youtube.com/watch?v=krENzIi3Tto పరుగు - ప్రకాష్‌ రాజ్‌ బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, షీలా కౌర్‌ జంటగా చేశారు. ప్రకాష్‌ రాజ్ చిన్న కూతురైన హీరోయిన్‌ను చూసి బన్నీ ప్రేమిస్తాడు. లేచిపోయిన పెద్ద కూతురు కోసం తండ్రి పడుతున్న ఆవేదన చూసి హీరో మారతాడు. ఆమెను లేపుకెళ్లడానికి వెనకాడతడు. క్లైమాక్స్ ముందు వరకూ విలన్‌గా కనిపించిన ప్రకాష్‌ రాజ్‌.. చివర్లో చిన్న కూతురు ప్రేమను అర్థం చేసుకొని ఆమెను బన్నీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు.  https://www.youtube.com/watch?v=R7Vw3cJnjyU విక్రమ్‌ - కమల్‌ హాసన్‌ ఇందులో హీరో కమల్‌ హాసన్ మాస్క్‌ మ్యాన్‌ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. పోలీసు ఆఫీసర్ అయిన తన కొడుకును డ్రగ్స్‌ మాఫియా లీడర్‌ సంతానం (విజయ్‌ సేతుపతి) హత్య చేస్తాడు. ఇందుకు కారణమైన వారిని హత్య చేస్తూ కమల్‌ హీరోగా మారతాడు. తొలి భాగంలో తాగుబోతు, డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిలా విలన్‌లా కనిపించే కమల్‌.. సెకండాఫ్‌లో తన యాక్షన్‌తో అదరగొడతాడు. https://youtu.be/x7WPik_LnmY?si=zJ9KW1ZxulMB1ZH2 రిపబ్లిక్‌ - రమ్యకృష్ణ సాయిధరమ్ తేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ విలన్‌ పాత్ర పోషించింది. తొలుత ఆమెప్రాంతీయ పార్టీ అధినేత్రిగా మంచి పొలిటిషియన్‌గా కనిపించారు. ప్రజల మేలు కోరే ఆదర్శ రాజకీయ నాయకురాలిగా మెప్పిస్తారు. కానీ ఆమె నిజ స్వరూపం తెలిశాక ఆడియన్స్ షాకవుతారు.  https://www.youtube.com/watch?v=FWg79VONoTY
    ఫిబ్రవరి 27 , 2024
    Payal Ghosh: మహమ్మద్‌ షమీకి బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ఓపెన్‌ ఆఫర్‌.. కానీ ఓ షరతు!
    Payal Ghosh: మహమ్మద్‌ షమీకి బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ఓపెన్‌ ఆఫర్‌.. కానీ ఓ షరతు!
    టీమ్‌ఇండియా పేసర్‌ షమీ (Mohammed Shami)ని తాను పెళ్లిచేసుకుంటానని బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ (Payal Ghosh) చేసిన పోస్ట్‌ నెట్టింట్‌ వైరల్‌ అవుతోంది. షమీని తాను పెళ్లి చేసుకోవాలంటే ఓ షరతును కూడా పాయల్‌ ట్విటర్‌ వేదికగా విధించింది. షమీ తన ఇంగ్లీష్‌ను మెరుగుపరుచుకుంటే పెళ్లికి సై అంటూ వ్యాఖ్యానించింది.  ఆ పోస్టు నెట్టింట ట్రెండ్‌ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రేమకు భాషతో పనేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.  పాయల్‌ పెళ్లి ప్రపోజల్‌పై షమీ ఎలా స్పందిస్తాడో చూడాలంటూ మరికొందరు నెటిజన్లు ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు.  బాలీవుడ్‌ నటి, రాజకీయ నాయకురాలైన పాయల్‌ ఘోష్‌ తెలుగు సినీ ప్రేక్షకులకూ సుపరిచితమే. ఆమె పలు టాలీవుడ్‌ చిత్రాల్లో నటించి ఇక్కడి ఆడియన్స్‌కు దగ్గరైంది.  తెలుగులో మంచు మనోజ్‌(Manchu Manoj) నటించిన ‘ప్రయాణం’ (Prayanam) సినిమాతో పాయల్‌  వెండితెరకు పరిచయమైంది. అందులో హీరోయిన్‌గా చేసి అందర్ని మెప్పించింది.  ఆ తర్వాత తారక్‌ (Jr.NTR) ‘ఊసరవెల్లి’ (Oosaravelli) సినిమాలో తమన్నాకు స్నేహితురాలి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. 2020లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ.. రామ్‌దాస్‌ అథవాలేకు చెందిన రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో చేరింది. ప్రస్తుతం ఆ పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది.  బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ తనను రేప్ చేశాడంటూ గతంలో పాయల్‌ ఘోష్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. అనురాగ్‌తో జరిగిన మూడో మీటింగ్‌లోనే అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.  17 సంవత్సరాల వయసులోనే  నటనలోకి అడుగుపెట్టింది పాయల్‌ ఘోష్. షార్ప్స్‌ పెరిల్‌ అనే బీబీసీ టెలిఫిల్మ్‌లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కెనడియన్ చిత్రంలోనూ చేసింది. సినిమాల్లోకి వెళ్లడం ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవటంతో కళాశాలలో చదువుతున్నప్పుడే పారిపోయి ముంబయి వచ్చింది పాయల్. నమిత్ కిషోర్ అకాడమీలో నటనపై మెళుకువలు నేర్చుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం షమీ వరల్డ్‌కప్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా 16 వికెట్లు తీసి అదరగొట్టాడు. రెండు మ్యాచ్‌ల్లో ఐదేసి వికెట్లు తీసి అరుదైన ఘనత అందుకున్నాడు.  వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా షమీ రికార్డు సృష్టించాడు. దీంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ  క్రమంలోనే పాయల్‌ ఘోష్‌ పెళ్లి ప్రపోజల్‌ పెట్టడం ఆసక్తికరంగా మారింది. 
    నవంబర్ 10 , 2023
    బాలివుడ్‌ డైరెక్టర్‌పై రేప్‌ ఆరోపణలు..సౌత్‌ దర్శకులు,యాక్టర్లపై ప్రశంసలు కురిపించిన హీరోయిన్
    బాలివుడ్‌ డైరెక్టర్‌పై రేప్‌ ఆరోపణలు..సౌత్‌ దర్శకులు,యాక్టర్లపై ప్రశంసలు కురిపించిన హీరోయిన్
    బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ తనను రేప్ చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్‌ పాయల్ ఘోష్. ఈ క్రమంలో దక్షిణాది చిత్ర పరిశ్రమపై ప్రేమను కురిపించింది. సౌత్‌లో అవార్డులు గెలుచుకున్న ఇద్దరు దర్శకులతో పనిచేసినప్పటకీ కనీసం వాళ్లు టచ్‌ కూడా చేయలేదంటూ వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్‌తో నటించానని… ఒక్కరోజు కూడా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని.. అందుకే సౌత్ ఇండస్ట్రీ అంటే తనకిష్టమంటూ పేర్కొంది ఈ సుందరి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  మూడో మీటింగ్‌లోనే అనురాగ్ కశ్యప్‌ను టార్గెట్‌ చేసుకొని మీటూ వేదికగా విమర్శలు గుప్పించింది ఈ బెంగాల్ భామ. “ అసలు అతడితో కలిసి పనిచేయలేదు. కానీ, అతడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మూడో మీటింగ్‌లోనే ఇలా జరిగింది. ఇలాంటి వాళ్లకు ఇంకా బాలీవుడ్‌లో పని దొరుకుతుండటం బాధాకరం” అన్నారు. ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలతో ట్రెండింగ్‌లోకి వచ్చిన పాయల్ ఘోష్ ఎవరనే విషయాన్ని వెతుకుతున్నారు చాలామంది. తారక్‌తో ఏ సినిమాలో నటించిందని ఆలోచిస్తున్నారు.   ఎవరీ పాయల్‌ 17 సంవత్సరాల వయసులోనే  నటనలోకి అడుగుపెట్టింది పాయలో ఘోష్. షార్ప్స్‌ పెరిల్‌ అనే బీబీసీ టెలిఫిల్మ్‌లో నటించి మెప్పించింది. తర్వాత కెనడియన్ చిత్రంలోనూ చేసింది. సినిమాల్లోకి వెళ్లడం ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవటంతో కళాశాలలో చదువుతున్నప్పుడే పారిపోయి ముంబయి వచ్చింది పాయల్. నమిత్ కిషోర్ అకాడమీలో నటనపై మెళుకువలు నేర్చుకుంది. కశ్యపై కేసు గతంలోనే అనురాగ్‌ కశ్యప్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టింది ఈ హీరోయిన్. 2013లో ముంబయిలోని యారీ రోడ్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని 2022 సెప్టెంబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిి కశ్యప్ కొట్టి పారేశారు. పోలీసుల విచారణకు హాజరైన అతడు… ఆ సమయంలో శ్రీలంకలో షూటింగ్ చేస్తున్నట్లు ఆధారాలు కూడా సమర్పించాడు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టం చేశాడు.  తెలుగులోకి ఎంట్రీ అకాడమీలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి పరిచయం కావటంతో ఆయన తెరకెక్కించిన ప్రయాణం చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. మంచు మనోజ్‌ ఇందులో హీరోగా నటించాడు. తర్వాత Mr. రాస్కెల్‌ సినిమాలో చేసింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన ఊసరవెళ్లి సినిమాలో తమన్నా స్నేహితురాలిగా మెరిసింది ముద్దుగుమ్మ.  రాజకీయ నాయకురాలు ప్రస్తుత కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో 2020లో జాయిన్ అయ్యింది పాయల్‌. అదే రోజున మహిళల విభాగానికి ఉపాధ్యక్షురాలుగా నియమించారు.  ‌అప్పట్నుంచి రాజకీయాల్లో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. ఇటీవల కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ఇచ్చిన స్పీచ్‌పైన విమర్శలు చేసింది. విదేశాల్లో మన దేశం పరువు తీశాడని ఆరోపించింది. సినిమాలు ప్రస్తుతం రెండు సినిమాల్లో పాయల్ ఘోష్ నటిస్తుంది. పటేల్‌కి పంజాబ్‌ షాదీ, కోయి జానే నా అనే చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. 
    మార్చి 19 , 2023

    @2021 KTree