• TFIDB EN
  • SSMB29
    రేటింగ్ లేదు
    U/ATelugu
    మహేశ్‌బాబు కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'SSMB29'. హాలీవుడ్‌ చిత్రం ఇండియానా జోన్స్‌ తరహాలో యాక్షన్‌ అండ్‌ అడ్వెంచరెస్‌ మూవీగా దీన్ని తెరకెక్కించనున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర వర్మ ఈ సినిమాకు కథను అందించారు. ఈ మూవీని 2025 చివర్లో లేదా 2026 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్‌ భావిస్తోంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    మహేష్ బాబు
    సిబ్బంది
    ఎస్ఎస్ రాజమౌళి
    దర్శకుడు
    నారాయణ కె.ఎల్.నిర్మాత
    ఎంఎం కీరవాణి
    సంగీతకారుడు
    పిఎస్ వినోద్
    సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    SSMB29: హమ్మయ్యా..! మొత్తానికి పూర్తి చేశారు… త్వరలో అప్‌డేట్!
    SSMB29: హమ్మయ్యా..! మొత్తానికి పూర్తి చేశారు… త్వరలో అప్‌డేట్!
    దర్శక దిగ్గజం SS రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో వస్తున్న చిత్రం SSMB29 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా అప్‌డేట్ గురించి మహేష్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది ? ఎలా ఉండబోతుంది అనే వాటిపై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమ్మర్‌లో కనీసం ఒక్క అప్‌డేట్ అయినా ఇస్తారా? లేదా? అంటూ మదన పడుతున్నారు. సోషల్ మీడియాలో తమ ఆవేదనను పంచుకుంటున్నారు. అయితే  తాజాగా ఈ చిత్రం గురించి  ఓ రూమర్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందని,  ప్రస్తుతం సంభాషణలపై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. డైలాగ్స్ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నట్లు సమాచారం. ఆయన గతంలో RRR చిత్రానికి మాటలు రాసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా కథ రాసుకున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను, రాజమౌళి సౌతాఫ్రికా రైటర్ విల్బర్ స్మిత్ వీరాభిమానులం అని చెప్పుకొచ్చారు. ఆయన నవలల ఆధారంగానే స్క్రిప్ట్ వర్క్ చేసినట్లు వెళ్లడించారు. దీంతో ఈ చిత్రం అడ్వెంచర్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనుంది. మహేష్‌ లుక్‌పై జాగ్రత్తలు SSMB 29లో మహేష్‌ లుక్‌(Mahesh look) ఎలా ఉండనుందన్న  ఆసక్తి  ప్రస్తుతం ఫ్యాన్స్ అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో మహేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు. మరి ఈ లుక్ SSMB29 కోసమేనా? లేదా నార్మల్ లుక్? అన్న దానిపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే రాజమౌళి చిత్రం కోసం ఈ లుక్‌ను ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ కూడా రానుంది. మహేష్ సరసన అలియా భట్? 'SSMB 29' సినిమాలో మహేష్‌కు జోడీగా అలియా భట్‌ (Alia Bhatt) అయితే ఎలా ఉంటుందని మేకర్స్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో దర్శకుడు రాజమౌళి.. అలియా భట్‌తో పని చేశారు. ఇందులో అలియా భట్‌ నటన నచ్చడంతో మళ్లీ ఆమెను రిపీట్‌ చేసే అవకాశముందని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాగా, హాలీవుడ్‌ నటి చెల్సియా ఇస్లాన్‌ కూడా 'SSMB 29' చిత్రానికి ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తను కూడా మేకర్స్ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. SSMB 29.. టైటిల్‌ ఇదేనా? దర్శకధీరుడు రాజమౌళి.. తన సినిమాల టైటిల్‌ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంటారు. ఇప్పటివరకూ ఆ తీసిన మూవీల పేర్లను గమనిస్తే.. చాలా కొత్తగా ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఈ క్రమంలోనే 'SSMB 29' సినిమాకు కూడా రాజమౌళి ఓ పేరును పరిశీలిస్తున్నారట. మహేష్‌ చిత్రానికి 'మహారాజ' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్‌ పేరులో మహా.. రాజమౌళిలలో 'రాజ' తీసుకొని ఈ టైటిల్‌ను క్రియేట్‌ చేశారట. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే. 
    ఏప్రిల్ 01 , 2024
    SSMB29: రాజమౌళి సినిమాలో మహేష్‌ డ్యూయల్‌ రోల్‌.. మరో కీలక పాత్రలో తెలుగు హీరో?
    SSMB29: రాజమౌళి సినిమాలో మహేష్‌ డ్యూయల్‌ రోల్‌.. మరో కీలక పాత్రలో తెలుగు హీరో?
    ‘ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ సక్సెస్ అందుకున్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తన తదుపరి సినిమాని మహేష్ బాబు (Mahesh Babu)తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘SSMB29’ చిత్రంలో మహేష్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అది చూసిన మహేష్‌ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు.  మహేష్ ద్విపాత్రిభినయం! లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం రాజమౌళి తెరకెక్కించనున్న 'SSMB29' మూవీలో మహేష్‌ ద్విపాత్రిభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రాజమౌళి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. ఇది సూపర్ స్టార్ అభిమానులకు నిజంగా శుభవార్త కానుంది. ఇక ఈ మూవీలో మహేష్‌ చాలా ఇంటెన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటి వరకూ చూడని మహేష్‌ను ఈ సినిమాలో చూడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. SSMB29 కథకు ప్రేరణ అతడే! మహేష్‌ - రాజమౌళి చిత్రం.. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ ఇటీవల ఓ ఇంటర్యూలో సినిమా కథకు సంబంధించి మాట్లాడారు. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాసే ప్రయత్నం చేశాను. కానీ, రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నాని స్పెషల్‌ రోల్‌..! 'SSMB 29' గురించి మరో రూమర్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో యంగ్‌ హీరో నాని (Nani) ఓ స్పెషల్‌ రోల్‌లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా తెరకెక్కనుండటంతో పలు పాత్రల కోసం రాజమౌళి.. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకూ నటీనటులను రంగంలోకి దించనున్నారట. ఈ క్రమంలోనే ఒక పాత్ర కోసం నాని పేరును ఫైనల్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజమౌళి, నాని మధ్య మంచి అనుబంధం ఉండటంతో యంగ్‌ హీరో నటించడం ఖాయమని అంటున్నారు. దీనిపై రాజమౌళి టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా, గతంలో రాజమౌళి రూపొందించిన 'ఈగ' సినిమాలో నాని నటించాడు. స్క్రీన్‌పైన కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకున్నాడు.  శరవేగంగా ప్రీ ప్రొడక్షన్‌ పనులు! ప్రస్తుతం రాజమౌళి తన 200 మంది బృందంతో ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం కాకముందే 200 మంది టీమ్‌ అంటే సెట్స్‌ పైకి వెళ్లాక ఇంకెంత మంది పని చేస్తారోనని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. కాగా, ‘SSMB29’ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా రాజమౌళి తెరకెక్కించనున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో హాలీవుడ్ మేకర్స్‌తో రాజమౌళి ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా ఇండోనేషియా యాక్ట్రెస్ ‘చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్’ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.  https://telugu.yousay.tv/ssmb-29-is-this-mahesh-babus-final-look-in-rajamoulis-film.html
    మార్చి 12 , 2024
    SSMB29: మహేశ్‌ బాబు సరసన ఇండోనేషియా హీరోయిన్!
    SSMB29: మహేశ్‌ బాబు సరసన ఇండోనేషియా హీరోయిన్!
    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) ఖ్యాతి గ్లోబల్ స్థాయికి చేరింది. ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరాన్ సైతం ప్రశంసించే స్థాయికి రాజమౌళి ఎదిగారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి తన తర్వాతి చిత్రాన్ని మహేశ్‌ బాబు (Mahesh babu)తో రూపొందించనున్న సంగతి తెలిసిందే. ‘SSMB29’ పేరుతో ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తవగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ నడుస్తోంది. ఈక్రమంలో సినిమాకు సంబంధించి రోజుకో వార్త సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. తాజాగా మరికొన్ని విషయాలు బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. నటీనటుల ఎంపిక పూర్తి! యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్న ‘SSMB29’ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక పూర్తైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. 24 క్రాఫ్ట్స్‌కు చెందిన టీమ్‌ను దర్శకేందుకు ఫైనలైజ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన టెక్నికల్‌ సిబ్బంది, వీఎఫ్‌ఎక్స్ నిపుణులను రాజమౌళి తన సినిమాకు ఎంచుకున్నట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపుగా పూర్తికావడంతో.. షూటింగ్‌ను ఈ ఏడాది మిడిల్‌ నుంచి ప్రారంభించే అవకాశముందని సిని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  https://twitter.com/MovieTamil4/status/1762770509467689149 కీలక పాత్రలో ఇండోనేషియా భామ! తాజాగా జరుగుతున్న సమాచారం ప్రకారం ‘SSMB29’లో ఓ హాలీవుడ్‌ భామ నటించబోతున్నట్లు సమాచారం. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ (Chelsea Elizabeth Islan) ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఎంపికైనట్టు తెలుస్తోంది. అమెరికన్ - ఇండోనేషియా నటిగా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు ఉంది. చిల్సీ ఇస్లాన్.. 18 ఏళ్లకే వెండితెరపై మెరిసింది. ‘ది బాలిక్ 98’, ‘రూడీ’, ‘హబిబీ’ వంటి చిత్రాలతో ఇండోనేషియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఉత్తమ నటిగా సెకండ్ ఇండోనేషియన్ చాయిస్ అవార్డ్‌ను సైతం ఈ అమ్మడు అందుకుంది. ఈ భామ ఎంట్రీపై రాజమౌళి టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  https://twitter.com/MovieTamil4/status/1762762767856279976 విభిన్న తరహాలో ప్రమోషన్స్! ‘SSMB29’ చిత్రం.. యాక్షన్‌ అండ్‌ అడ్వెంచర్‌ మూవీ కావడంతో కథకు తగినవిధంగా పాత్రలు, వాటి స్కెచ్‌లను ప్రస్తుతం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సెట్స్‌ డిజైన్‌ పైనా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. తన గత చిత్రాల తరహాలోనే విభిన్నమైన ప్రమోషన్స్‌ కోసం డైరెక్టర్‌ రాజమౌళి సినిమాకు సంబంధించిన థీమ్స్‌, లోగోలను సిద్ధం చేస్తున్నాడట. ఈ పనులన్నీ కొలిక్కి రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.  మహేశ్‌కు జక్కన్న కీలక సూచన! రాజమౌళితో చేయబోయే సినిమా కోసం ప్రస్తుతం మహేశ్‌ బాబు సిద్దమవుతున్నారు. యాక్షన్‌ అడ్వెంచర్ మూవీ కావడంతో దృఢంగా కనిపించేందుకు శారీరక కసరత్తులు సైతం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో గడ్డం పెంచి, పొడవాటి జుట్టుతో మహేశ్ కనిపిస్తాడని టాక్‌. అయితే మహేశ్‌ లుక్‌ బయటకు రాకుండా రాజమౌళి ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. సినిమా మెుదలయ్యేలోపు ప్రకటనలకు సంబంధించిన షూట్స్‌ ఉంటే పూర్తి చేసుకోవాలని మహేశ్‌కు జక్కన్న సూచించారట. త్వరలోనే మహేశ్‌ లుక్‌కు సంబంధించి టెక్నికల్‌ టీమ్‌తో వర్క్‌షాప్‌ మెుదలు కానుందని అంటున్నారు.  షూట్‌ ప్రారంభం ఎప్పుడంటే? ‘SSMB29’ సినిమా షూట్‌ను తెలుగు సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్‌ 9న అధికారికంగా ప్రారంభించాలని రాజమౌళి తొలుత భావించారట. అయితే మిగిలిన ప్రీ ప్రొడక్షన్‌ పనులకు ఇంకాస్త సమయం కావాల్సి రావడంతో మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న స్టార్ట్‌ చేస్తారని సోషల్‌మీడియాలో టాక్‌ నడుస్తోంది. అయితే ఐదు నెలల సమయం అంటే ఎక్కువేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతకన్నా ముందే షూటింగ్‌ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్‌! ‘SSMB29’ సినిమాకు సంబంధించి దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకూ అధికారికంగా ఒక్క అప్‌డేట్‌ కూడా ఇవ్వలేదు. గత చిత్రాల మాదిరిగానే దీనికి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి వివరాలు ప్రకటిస్తారా? లేదా? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఈసారి జక్కన్న కాస్త భారీగానే ప్లాన్‌ చేస్తున్నారని ఫీల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ‘SSMB29’ సినిమాకు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్‌ ఉండబోతోందని సమాచారం. తెలుగుతో పాటు, జాతీయ మీడియాకు కూడా ఒకేసారి చెప్పేస్తే ఎలా ఉంటుందా? అని మూవీ టీమ్‌ ఆలోచిస్తోందట. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది త్వరలోనే తెలియనుంది. 
    ఫిబ్రవరి 28 , 2024
    SSMB29: మూడు పార్ట్స్‌గా రాజమౌళి-మహేష్ సినిమా… బడ్జెట్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?
    SSMB29: మూడు పార్ట్స్‌గా రాజమౌళి-మహేష్ సినిమా… బడ్జెట్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?
    RRR చిత్రం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి.. మహేష్‌ బాబుతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. RRR చిత్రంతో పాన్‌ వరల్డ్‌ డైరెక్టర్‌గా రాజమౌళి గుర్తింపు సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తీయబోయే SSMB29 చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మహేష్‌ను జక్కన్న ఎలా చూపిస్తారన్న ఆసక్తి దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది. మూడు భాగలుగా.. మహేశ్‌తో రాజమౌళి తీయబోయే చిత్రం మూడు పార్ట్‌లుగా రానున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేగాక ఈ సినిమా బడ్జెట్‌ రూ.1000 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఒకసారి సినిమా ప్రారంభమైతే అది రూ.1500 కోట్లకు కూడా పెరగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికన్‌ యాక్టర్‌ జెన్నా ఒర్టెగా (Jenna Ortega) రాజమౌళి సినిమాలో నటిస్తారని రూమర్స్‌ వస్తున్నాయి. ఇప్పటికే జెన్నాతో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతోందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. https://twitter.com/arjuntn369/status/1645598037446918144 View this post on Instagram A post shared by Greg Williams (@gregwilliamsphotography) https://twitter.com/Theme43259475/status/1645457459971076097 హలీవుడ్ యాక్టర్లు మూడు పార్టులుగా తెరకెక్కబోయే రాజమౌళి సినిమాలో హాలీవుడ్‌, బాలీవుడ్ నటులు కూడా భాగస్వామ్యం అవుతారని తెలుస్తోంది. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు కూడా సినిమా కోసం పనిచేస్తారని సమాచారం. SSMB 29, 30, 31 కూడా రాజమౌళి చేతిలోనే ఉందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రానున్న8 ఏళ్లలో ఈ పార్టులు రిలీజ్‌ అవుతాయని చర్చించుకుంటున్నారు. మూడు పార్టులకు 8 ఏళ్లు అంటే మహేష్‌ ఏం చేస్తారోనని ఇప్పటినుంచే ఆయన అభిమానులు ఆలోచనల్లో పడ్డారు. అప్పటివరకు మరో సినిమాలో మహేష్‌ను చూడలేమా అంటూ దిగులు చెందుతున్నారు. అయితే రాజమౌళితో వరుసగా మూడు సినిమాలంటే మామూలు విషయం కాదని తమకు తామే ఫ్యాన్స్‌ సర్దిచెప్పుకుంటున్నారు.  https://twitter.com/Harmindarboxoff/status/1645422058501980165?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1645422058501980165%7Ctwgr%5E409944ca03b55589956ba02ba037da35535fd255%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FHarmindarboxoff%2Fstatus%2F1645422058501980165 హీరోయిన్లు వీళ్లేనా? SSMB29లో మహేశ్‌ సరసన నటించబోయే హీరోయిన్ల గురించి కూడా నెట్టింట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మహేశ్‌ సినిమాలో మెుత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని టాక్‌. బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ, హాలీవుడ్‌ నటి సిడ్నీ స్వీనీ హీరోయిన్లుగా చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా థర్డ్‌ హీరోయిన్‌గా సారా అలీఖాన్‌( Sara Alikhan) పేరు తెరపైకి వచ్చింది. రాజమౌళికి సారా పేరును బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ సూచించారని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమాలో కమల్‌ హాసన్‌, చియాన్‌ విక్రమ్‌, కేరళ నటుడు పృథ్వీరాజ్‌ కూడా నటిస్తారని ఇటీవలే విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది.  https://twitter.com/TLegoude/status/1645522645528776704?s=20 ప్రస్తుతం మహేష్‌ SSMB 28 షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూాజా హెగ్డే నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్‌ శ్రీలీల కూడా సినిమాలో సందడి చేయనుంది. ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్‌ లోపు ఫినిష్‌ చేసేందుకు చిత్ర బృందం కృషి చేస్తోంది. SSMB28 షూట్‌ పూర్తికాగానే రాజమౌళి సినిమాపై మహేష్‌ ఫోకస్‌ పెడతారని తెలుస్తోంది. అక్టోబర్‌ నుంచి రాజమౌళి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.  https://telugu.yousay.tv/ssmb29-rajamoulis-huge-sketch-for-maheshs-film-talks-with-kamal-haasan-chiyan-vikram.html
    ఏప్రిల్ 13 , 2023
    SSMB29: మహేష్‌ సినిమా కోసం రాజమౌళి భారీ స్కెచ్‌.. కమల్‌ హాసన్‌, చియాన్‌ విక్రమ్‌తో టాక్స్
    SSMB29: మహేష్‌ సినిమా కోసం రాజమౌళి భారీ స్కెచ్‌.. కమల్‌ హాసన్‌, చియాన్‌ విక్రమ్‌తో టాక్స్
    బాహుబలి (Bahubali), ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రాలతో పాన్‌ వరల్డ్ డైరెక్టర్‌గా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మారిపోయారు. దీంతో ఆయన సినిమాకు సంబంధించి ఏ చిన్న లీక్‌ వచ్చిన అది దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిపోతోంది. రాజమౌళి తన నెక్స్ట్‌ మూవీని మహేష్‌ బాబు (Mahesh Babu)తో కలిసి చేయనున్నాడు. దీంతో ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో SSMB29కు సంబంధించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది.  మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) కూడా నటిస్తారని తెలుస్తోంది. మలయాళం నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కూడా ఓ కీలకపాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఆ నటులతో రాజమౌళి బృందం చర్చలు జరుపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చర్చలు గాని ఫలిస్తే SSMB29 పై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అయితే దీనిపై రాజమౌళి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  https://twitter.com/fanaticbuff/status/1644059697098510380?s=20 మహేష్‌తో చేయబోయే చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో నిర్మించేందుకు డైరెక్టర్‌ రాజమౌళి కసరత్తు చేస్తున్నాడు. కౌబాయ్‌ తరహాలో తెరకెక్కనున్న ఈ అడ్వెంచర్‌ మూవీ కోసం హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌ను కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తారని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో చేస్తున్న SSMB28 చిత్రం షూటింగ్‌లో మహేష్‌ బాబు బిజీబిజీగా ఉన్నారు. ఆ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ను ఫాస్ట్‌ ఫాస్ట్‌గా ఫినిష్‌ చేసేందుకు మహేష్‌ కష్టపడుతున్నాడు. ఈ సినిమా షూట్‌ పూర్తి కాగానే రాజమౌళి ప్రాజెక్ట్‌లో మహేష్‌ జాయిన్ అవుతాడని తెలుస్తోంది. దీంతో SSMB 29 షూటింగ్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభం కావొచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. 
    ఏప్రిల్ 07 , 2023
    <strong>SSMB29: ఆఫ్రికన్‌ నవలల ఆధారంగా రాజమౌళి - మహేష్‌ చిత్రం.. ఇందులో నిజమెంత?</strong>
    SSMB29: ఆఫ్రికన్‌ నవలల ఆధారంగా రాజమౌళి - మహేష్‌ చిత్రం.. ఇందులో నిజమెంత?
    దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli), సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో ‘SSMB29’ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం వరకూ తరచూ ఏదోక అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచిన ఈ చిత్రం.. ఇటీవల కాలంలో ఎలాంటి సమాచారం లేకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. అయితే తాజాగా కొత్త అప్‌డేట్‌తో ఈ సినిమా మరోమారు వార్తల్లో నిలిచింది. రాబోయే మహేష్‌ చిత్రం.. రెండు ఆఫ్రికన్‌ నవలల ఆధారంగా రూపొందనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. వాటికి సంబంధించిన వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.&nbsp; కథ.. ఆ నవలల ఆధారమేనా? టాలీవుడ్‌లో ఆసక్తిరేపుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో మహేష్‌ - రాజమౌళి చిత్రం ఒకటి. రాజమౌళి తండ్రి స్టార్‌ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాకు కథను అందించారు. ఇప్పటికే సినిమా స్టోరీ కూడా కంప్లీట్ అయ్యిందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలాంటే తాజాగా రాజమౌళి &amp; టీమ్‌.. రెండు ఆఫ్రికా నవలల హక్కులను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విల్బర్‌ స్మిత్‌ రాసిన రెండు నవలలను వారు కొనుగోలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో 'SSMB29' ఉంటుందని&nbsp; సినీ వర్గాల్లో టాక్ ఉంది. నేపథ్యంలో ఆఫ్రికా దేశానికి సంబంధించిన నవలల హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు రావడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. వీటి ఆధారంగానే రాజమౌళి SSMB29 తెరకెక్కించనున్నారా? అన్న సందేహాం అభిమానుల్లో మెుదలైంది. ఇందులో నిజానిజాలు ఎంతో చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; ఆలస్యానికి కారణమిదే! SSMB29 సినిమా షూటింగ్ ఎప్పుడు మెుదలవుతుందా అని సగటు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి జూన్‌లోనే ఈ సినిమా షూటింగ్‌ మెుదలుకావాల్సి ఉంది. అయితే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇంకా పెండింగ్‌ ఉండటంతో సినిమా పట్టాలెక్కలేదు. లొకేషన్స్‌ వెతకడానికి ఎక్కువ సమయం పట్టడమే షూటింగ్‌ ఆలస్యానికి కారణమని అంటున్నారు. అయితే పనులు ముగించుకొని డిసెంబర్‌లో SSMB29 చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని రాజమౌళి భావిస్తున్నారట. అది కుదరకపోతే కొత్త ఏడాది ప్రారంభంలోనైనా షూటింగ్‌ మెుదలు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.&nbsp; కీలక పాత్రలో ఇండోనేషియా భామ! SSMB29లో ఓ హాలీవుడ్‌ భామ నటించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ (Chelsea Elizabeth Islan) ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఎంపికైనట్టు ప్రచారం జరిగింది. అమెరికన్ - ఇండోనేషియా నటిగా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు ఉంది. చిల్సీ ఇస్లాన్.. 18 ఏళ్లకే వెండితెరపై మెరిసింది. ‘ది బాలిక్ 98’, ‘రూడీ’, ‘హబిబీ’ వంటి చిత్రాలతో ఇండోనేషియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఉత్తమ నటిగా సెకండ్ ఇండోనేషియన్ చాయిస్ అవార్డ్‌ను సైతం ఈ అమ్మడు అందుకుంది. ఈ భామ ఎంట్రీపై రాజమౌళి టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్‌! ‘SSMB29’ సినిమాకు సంబంధించి దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకూ అధికారికంగా ఒక్క అప్‌డేట్‌ కూడా ఇవ్వలేదు. గత చిత్రాల మాదిరిగానే దీనికి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి వివరాలు ప్రకటిస్తారా? లేదా? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఈసారి జక్కన్న కాస్త భారీగానే ప్లాన్‌ చేస్తున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందుకే ‘SSMB29’ కోసం ఇంత సమయం తీసుకుంటున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయితే సినిమాకు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్‌ ఉండబోతోందని సమాచారం. తెలుగుతో పాటు, జాతీయ మీడియాకు కూడా ఒకేసారి చెప్పేస్తే ఎలా ఉంటుందా? అని మూవీ టీమ్‌ ఆలోచిస్తోందట. అయితే దీనిపై రాజమౌళి టీమ్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp;
    జూన్ 20 , 2024
    &nbsp;SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
    &nbsp;SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
    సూపర్ స్టార్ మహేష్‌తో చేయబోయే SSMB29 చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో నిర్మించేందుకు డైరెక్టర్‌ రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. కౌబాయ్‌ తరహాలో తెరకెక్కనున్న ఈ అడ్వెంజర్‌ మూవీ కోసం హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌ను కూడా తీసుకోబోతున్నట్లు తెలిసింంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల మహేష్‌బాబు నటించిన గుంటూరు కారం సినిమా మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ... కలెక్షన్ల పరంగా సేఫ్ జోన్‌లో పడింది. మహేష్‌బాబు స్టామినాకు తగ్గ హిట్ పడలేదన్నది నిజం. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమాపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.&nbsp;&nbsp; గ్లోబల్ స్థాయి అయితే రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీస్ అయిన బాహుబలి, RRR ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెన్సేషన్ క్రియేట్ చేశాయి. జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్ గ్లోబర్ స్టార్లుగా ఎదిగిపోయారు. ప్రస్తుతం వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాజమౌళితో ఏ హీరో సినిమా తీసినా హిట్‌ అవడం ఖాయం. కానీ ఆ తర్వాత చేసే సినిమాలు ఇండస్ట్రీలో ఫ్లాప్‌గా నిలుస్తున్నాయి. మహేష్‌కు లాభమా నష్టమా? ఇప్పటివరకు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఇదే నియమం లెక్కతప్పకుండా కొనసాగుతుంది. ఆయనతో సినిమాలు చేసిన హీరోలు వరుసగా మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్స్‌గా మూటగట్టుకున్నారు. దీంతో SSMB 29 అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎటువంటి సినిమా చేస్తారు?&nbsp; ఏ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తారు? సగటు సూపర్ స్టార్ అభిమానిని తొలచివేస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే రాజమౌళి సినిమాతో మహేష్ బాబుకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ లభిస్తుంది. మరి దానిని నిలబెట్టుకునేలా మహేష్ బాబు తన తదుపరి SSMB30 సినిమాను ఎలా ఎంచుకుంటాడు? అతని కెరీర్‌కు బిగ్‌ ఛాలెంజ్ అంటూ ఇండస్ట్రీ పెద్దలు విశ్లేషిస్తున్నారు. SSMB29 క్రియేట్ చేస్తున్న బజ్.. మహేష్ బాబుకు లాభంతో పాటు నష్టాన్ని కూడా తెచ్చిపెట్టనుందని ఊహిస్తున్నారు. గతంలో ఇదే విధంగా రాజమౌళితో ఇండస్ట్రీ హిట్లు అందుకున్న తెలుగు హీరోలు ఆ తర్వాత ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక వరుసగా పరాజయాలు పొందారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్స్ అందుకున్న హీరోల జాబితాను ఓసారి పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా 'స్టూడెంట్‌ నెం.1'ను జూ. ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన 'సుబ్బు' సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ తారక్‌తో "సింహాద్రి" సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన 'ఆంధ్రావాల' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు RRRలో తారక్ నటించి గ్లోబర్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.&nbsp; ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ RRRకు ముందు రామ్‌చరణ్‌తో 'మగధీర' సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా తీస్తున్న రామ్‌చరణ్ ఎలాంటి ఫలితాన్ని పొందుతాడో వేచి చూడాల్సి ఉంది. ఇక రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన 'ఈగ' సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.&nbsp; మహేష్ బాబు కూడా అదే పరిస్థితా? దీంతో మహేష్ బాబు కూడా SSMB29 తర్వాత ఇతర టాలీవుడ్ అగ్రహీరోల మాదిరి బోల్తా పడుతాడా లేక గత చరిత్రను తిరిగి రాస్తాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా అంది. అటు ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) కూడా నటిస్తారని తెలుస్తోంది. మలయాళం నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కూడా ఓ కీలకపాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఆ నటులతో రాజమౌళి బృందం చర్చలు జరుపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చర్చలు గాని ఫలిస్తే SSMB29 పై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అయితే దీనిపై రాజమౌళి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.&nbsp; వరల్డ్ వైడ్ బజ్ మరోవైపు మహేష్‌ బాబు.. రాజమౌళి సినిమా కోసం తన లుక్స్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన అన్న కొడుకు మ్యారెజ్ కార్డు ఇవ్వడానకి వెళ్లినప్పుడు.. మహేష్ బాబు పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్కువ జుట్టు, ఒత్తైన గడ్డంతో హాలీవుడ్ హీరోలా మహేష్ కనిపించాడు. అలాగే కొన్ని స్టంట్స్‌ నేర్చుకునేందుకు జర్మనీలో ఇటీవల మహేష్ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. అటు దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిఫ్ట్ కూడా ఫైనల్ చేసి రాజమౌళికి వినిపించినట్లు సమాచారం. ఏప్రిల్‌ నుంచి నటీనటుల ఎంపిక, సాంకేతిక బృందం వంటి అంశాలను చిత్ర యూనిట్ పరిశీలించనున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా వరల్డ్‌ వైడ్‌గా క్రియేట్ చేస్తున్న బజ్ అంతా ఇంతా కాదు.
    ఫిబ్రవరి 14 , 2024
    SSMB 30: మహేష్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో మరో సినిమా.. ఈసారి మామూల్గా ఉండదట!
    SSMB 30: మహేష్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో మరో సినిమా.. ఈసారి మామూల్గా ఉండదట!
    సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో కొత్తగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘SSMB29’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా అధికారిక అనౌన్స్‌మెంట్‌ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్‌ తదుపరి సినిమా గురించి టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌తో మహేష్‌ నాల్గోసారి సినిమా చేయబోతున్నట్లు బజ్‌ వినిపిస్తోంది.&nbsp; మహేష్‌ - గురూజీ కాంబోలో..! రాజమౌళితో సినిమా తర్వాత మహేష్‌ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌(Trivikram Srinivas)తో తీయనున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. మహేష్‌ రీసెంట్‌గా ‘గుంటూరు కారం’ (Guntur Karam)తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించాడు. SSMB 29 తర్వాత కూడా మహేష్‌ తిరిగి త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నట్లు సమాచారం. ‘SSMB 30’ పేరుతో రానున్న ఈ చిత్రం.. భారీ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుందట. ‘గుంటూరు కారం’ షూటింగ్‌ టైమ్‌లోనే ఈ సినిమా కథ గురించి డిస్కషన్‌ జరిగినట్లు సమాచారం. అయితే ఈ సినిమా రూపొందటానికి చాలా సమయం పట్టనుంది.  త్రివిక్రమ్‌కు మాటిచ్చిన మహేష్‌! SSMB30 సినిమా పాన్‌ ఇండియా లెవల్లో రూపొందనున్నట్లు సమాచారం. అది కూడా మహేష్ బాబు స్వయంగా త్రివిక్రమ్‌కు మాటిచ్చాడని తెలుస్తోంది. ‘గుంటూరు కారం’ సమయంలోనే మరోమారు కలిసి పనిచేద్దామని మహేష్ అన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అటు త్రివిక్రమ్ కూడా ఎప్పటి నుంచో పాన్ ఇండియా సినిమా తీసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్‌తో ఆ కల తీర్చుకోవాలని భావించారు. కానీ అది నెరవేరలేదు. అయితే మహేష్‌ ప్రామిస్ చేసినా కూడా SSMB30 పట్టాలు ఎక్కాలంటే ఇంకో మూడేళ్ల సమయం పట్టే అవకాశముంది. ఈలోపు త్రివిక్రమ్ కూడా ఓ సినిమాను తెరకెక్కిస్తారని అంటున్నారు.&nbsp;
    మార్చి 27 , 2024
    SSMB 29: మహేష్‌ - రాజమౌళి సినిమాపై రెండు అప్‌డేట్స్‌.. ఒకటి గుడ్‌.. రెండోది బ్యాడ్‌!
    SSMB 29: మహేష్‌ - రాజమౌళి సినిమాపై రెండు అప్‌డేట్స్‌.. ఒకటి గుడ్‌.. రెండోది బ్యాడ్‌!
    ప్రముఖ హీరో మహేష్‌ బాబు (Mahesh Babu), అగ్రదర్శకుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఒక్క ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ ఇవ్వలేదు. ఇటీవల జపాన్‌లో పర్యటించిన ఆయన హీరోగా మహేష్‌ను ఒక్కరినే ఫైనల్‌ చేసినట్లు చెప్పారు. మిగతా నటీనటుల కోసం కసరత్తు జరుగుతోందని చెప్పి ఊరుకున్నారు. అయితే తాజాగా SSMB29 ఓ అప్‌డేట్‌ బయటకొచ్చింది. అది చూసిన ఫ్యాన్స్‌కు నిరాశ చెందుతున్నారు.&nbsp; మరింత ఆలస్యం! మహేష్‌ రాజమౌళి కాంబోలో సినిమా రానున్న విషయం అందరికీ తెలిసిందే అయినప్పటికీ దీనిపై ఇంతవరకూ మేకర్స్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించలేదు. అయితే ఈ మూవీపై అధికారిక ప్రకటన ఏప్రిల్ 9న ఉగాది కానుకగా ఉంటుందని కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం.. ఈ మూవీ అనౌన్స్ మెంట్ మరింత ఆలస్యం కానుంది. ఏప్రిల్‌లో కాకుండా మహేష్ బాబు పుట్టినరోజైన ఆగష్టు 9న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్‌ చేయాలని దర్శకుడు రాజమౌళి &amp; టీమ్‌ ప్లాన్‌ చేస్తోందట. అప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్‌డేట్స్‌ కోసం ఆగాల్సిందేనని అంటున్నారు. ఈ వార్త విన్న ఫ్యాన్స్‌ నిరాశ చెందుతున్నారు. ఇలా ఎన్ని రోజులు వెయిట్‌ చేయిస్తారంటూ సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.&nbsp; ఆ భామకు ఛాన్స్‌ దక్కిందా? 'SSMB 29' సినిమాలో హీరోయిన్‌గా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. మహేష్‌కు జోడీగా అలియా భట్‌ (Alia Bhatt) అయితే ఎలా ఉంటుందని మేకర్స్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో దర్శకుడు రాజమౌళి.. అలియా భట్‌తో పని చేశారు. ఇందులో అలియా భట్‌ నటన నచ్చడంతో మళ్లీ ఆమెను రిపీట్‌ చేసే అవకాశముందని కామెంట్లు వినిపిస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాగా, హాలీవుడ్‌ నటి చెల్సియా ఇస్లాన్‌ కూడా 'SSMB 29' చిత్రానికి ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తను కూడా మేకర్స్ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. SSMB 29.. టైటిల్‌ ఇదేనా? దర్శకధీరుడు రాజమౌళి.. తన సినిమాల టైటిల్‌ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంటారు. ఇప్పటివరకూ ఆ తీసిన మూవీల పేర్లను గమనిస్తే.. చాలా కొత్తగా ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఈ క్రమంలోనే 'SSMB 29' సినిమాకు కూడా రాజమౌళి ఓ పేరును పరిశీలిస్తున్నారట. మహేష్‌ చిత్రానికి 'మహారాజ' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్‌ పేరులో మహా.. రాజమౌళిలలో 'రాజ' తీసుకొని ఈ టైటిల్‌ను క్రియేట్‌ చేశారట. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.&nbsp;
    మార్చి 26 , 2024
    SSMB 29: మహేష్‌ చిత్రంపై తొలిసారి పెదవి విప్పిన రాజమౌళి.. జపాన్‌లో కీలక వ్యాఖ్యలు!
    SSMB 29: మహేష్‌ చిత్రంపై తొలిసారి పెదవి విప్పిన రాజమౌళి.. జపాన్‌లో కీలక వ్యాఖ్యలు!
    సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో&nbsp; 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో తెరకెక్కనున్న ఈ చిత్రం గ్లోబల్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో జపాన్‌లో పర్యటించిన రాజమౌళి ఈ సినిమాపై కీలక అప్‌డేట్స్‌ ఇచ్చారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' స్క్రీనింగ్‌ కోసం జపాన్‌ వెళ్లిన రాజమౌళి.. తన అప్‌కమింగ్‌ మూవీ గురించి తొలిసారి పెదవి విప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; రాజమౌళి ఏమన్నారంటే? రామ్‌చరణ్‌ (Ram Charan), తారక్‌ (Jr NTR) కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం గ్లోబల్‌ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా జపాన్‌లో ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్క్రీనింగ్‌కు రాజమౌళి హజరయ్యారు. అక్కడ రాజమౌళికి ఘనస్వాగతం లభించింది. ఈ క్రమంలో తన తర్వాతి ప్రాజెక్ట్ అయిన SSMB 29 గురించి రాజమౌళి మాట్లాడారు. 'మహేశ్‌ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరో మహేశ్‌ బాబు.. ఆయన తెలుగు వారు.. చాలా అందంగా ఉంటారు. బహుశా మీలో చాలామందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్‌లో కూడా రిలీజ్‌ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్‌ బాబుని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను' అని జక్కన్న వ్యాఖ్యానించారు. దీంతో మహేశ్‌ ఫ్యాన్స్‌ ఆయన మాటలను సోషల్‌ మీడియా ద్వారా తెగ షేర్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1769897700923990284 జెన్నీ పాత్ర చనిపోతుందట.. కానీ! జపాన్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాకు సంబంధించిన ఆసక్తిక విషయాన్ని రాజమౌళి పంచుకున్నారు. ఈ సినిమాలో భీమ్‌ (తారక్‌)కి జోడిగా జెన్నీ పాత్రలో ఓలివియా నటించింది. అయితే వీరిద్దరి కాంబోలో ఇంకొన్ని సన్నివేశాలు ఉన్నాయని, నిడివి కారణంగా వాటిని తీసేయాల్సి వచ్చిందని రాజమౌళి తెలిపారు. అంతేకాకుండా జెన్నీ పాత్రకి ముందుగా విషాదాంతం రాశామని తెలిపారు. రామ్ (రామ్‌చరణ్‌) పాత్రని జైలు నుంచి తప్పించడానికి భీమ్‌కి జెన్నీ సాయం చేసే నేపథ్యంలో ఆమె పాత్ర మరణిస్తుందని పేర్కొన్నారు. అయితే అది మరీ ఎమోషనల్ ఎండింగ్‌లా ఉంటుందేమో అని భావించి బ్రతికి ఉన్నట్లు మార్పు చేశామని చెప్పారు. ఈ ముంగింపు అందరికీ నచ్చిందని రాజమౌళి హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; రాజమౌళికి అపురూప కానుక బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో జపాన్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న రాజమౌళి.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో వారి హృదయాల్లో స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన ఓ వీరాభిమాని రాజమౌళికి అపురూపమైన కానుక ఇచ్చింది. ఆ అభిమాని 83 ఏళ్ల వృద్ధురాలు కావడం విశేషం. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 'జపాన్ ప్రజలు కాగితంతో కొంగ బొమ్మలు తయారు చేసి తమకు ఇష్టమైన వారికి కానుగా ఇస్తారు. ఆ బొమ్మలు వారికి అదృష్టం, ఆరోగ్యం తెచ్చిపెడతాయని నమ్ముతారు. జపాన్‌కు చెందిన ఈ 83 ఏళ్ల వృద్ధురాలు కూడా మమ్మల్ని ఆశీర్వదించేందుకు 1000 కొంగ బొమ్మలు తయారుచేసుకొచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆమెను ఎంతో సంతోషానికి గురిచేసిందట. మాకోసం తను చలిలో బయటే వేచిచూస్తూ నిలుచుంది. కొంతమంది చూపే ఆదరణకు కృతజ్ఞతలు చెప్పడం తప్ప తిరిగి ఏమివ్వగలం’ అంటూ రాజమౌళి వివరించారు. View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli)
    మార్చి 19 , 2024
    Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?
    Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?
    దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. అపజయం ఎరుగని డైరెక్టర్‌గా ఆయన తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన ఆయన.. మహేష్‌తో SSMB29తో గ్లోబల్‌ మార్కెట్‌ను శాంసించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో రాణించగల డైరెక్టర్లు తెలుగులో ఉన్నారా అన్న సందేహాన్ని నార్త్‌ ఆడియన్స్‌ వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా పలువురు డైనమిక్‌ డైరెక్టర్స్‌ కనిపిస్తున్నారు. రాజమౌళి బాటలోనే నడుస్తూ.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారి ముందున్న అవకాశాలు ఏంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) &nbsp; ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న డైరెక్టర్‌ పేరు ‘నాగ్‌ అశ్విన్‌’. ప్రభాస్‌ హీరోగా అతడు తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై గ్లోబల్‌ స్థాయిలో బజ్ ఉంది. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తోన్న ఈ సినిమా.. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్‌ అయితే నాగ్‌ అశ్విన్‌కు కెరీర్‌ పరంగా తిరుగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా టాలీవుడ్‌ స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్లి.. నాగ్‌ అశ్విన్‌కు ఎనలేని ఫేమ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. పైగా నాగ్‌ అశ్విన్‌.. విజన్‌, ఎగ్జిక్యూషన్‌, యునిక్‌ ప్రమోషన్స్ చూస్తే అచ్చం రాజమౌళి గుర్తుకు రాక మానడు.&nbsp;&nbsp; టెక్నాలజీని సినిమాకు అన్వయించడంలో దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడు ముందుంటాడు. ప్రపంచస్థాయి గ్రాఫిక్స్‌, కొత్త తరహా ఆయుధాలు, వినూత్నమైన కాస్ట్యూమ్స్‌, వైవిధ్యమైన డైలాగ్స్‌, నెవర్‌బీఫోర్‌ హీరో ఎలివేషన్స్‌ ఇలా ప్రతీ అంశంలోనూ తన మార్క్‌ చూపిస్తుంటాడు. అయితే కల్కి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కూడా ఈ విషయంలో రాజమౌళిని గుర్తు చేస్తున్నాడు. కల్కి కోసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ మూవీ కోసం ఓ స్పెషల్‌ వెహికల్‌ను చిత్ర యూనిట్‌ తయారు చేయించింది. సినిమాలో ‘బుజ్జి’ అని పిలిచే ఈ రోబోటిక్‌ వాహనంతోనే హీరో ప్రభాస్‌ అడ్వెంచర్స్ చేశాడు. బుజ్జికి సంబంధించి బుధవారం (మే 22) స్పెషల్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేయగా అది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది.&nbsp; https://twitter.com/i/status/1793606030703927405 బుజ్జి అనే స్పెషల్‌ వెహికల్‌ని మూవీ టీమ్ మహీంద్రా కంపెనీతో కలిసి తయారు చేసింది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 7 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. సాధారణంగా ఏదైనా కొత్త వెహికల్‌ను తయారు చేయడానికి ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.. మహీంద్రా టీమ్‌ను సినిమాలో భాగంగా చేసుకొని తమ ఆలోచనలకు అనుగుణంగా వారిని డైరెక్ట్‌ చేస్తూ వెహికల్‌ను తయారు చేయించుకున్నారు. ఈ సినిమాలో బుజ్జికి చాలా ఇంపార్టెంట్‌ రోల్ ఉందని నాగ్ అశ్విన్‌.. గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో అన్నారు. వెహికల్‌ తయారీకి సహకరించిన ఆనంద్‌ మహీంద్ర టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు.&nbsp; https://twitter.com/i/status/1793303611583418579 సుకుమార్‌ (Sukumar) ‘పుష్ప’ (Pushpa : The Rise) సినిమా ముందు వరకూ టాలీవుడ్‌కే పరిమితమైన సుకుమార్‌.. ఆ మూవీ తర్వాత ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇందులో సుకుమార్‌ దర్శకత్వ నైపుణ్యం చూసి ప్రతీ ఒక్కరు ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి స్టైలిష్‌ హీరోను.. ఎలాంటి మేకప్‌ లేకుండా మాసిన జుట్టు, గడ్డంతో చూపించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే కథకు తగ్గట్లు బన్నీ రూపురేఖలు మార్చి అక్కడే సినిమా విజయానికి పునాది వేశారు సుకుమార్. సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. సాలిడ్‌ ఇంటర్వెల్‌ ద్వారా సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తాడు. అటు సినిమా ముగింపును కూడా ఆడియన్స్‌కు చాలా సంతృప్తి కలిగేలా రాజమౌళి తీర్చిదిద్దుతాడు. అయితే డైరెక్టర్ సుకుమార్‌ దీనికి పూర్తి డిఫరెంట్‌ ఫార్మూలను పుష్ప విషయంలో అనుసరించారు. ఇందులో ఎలాంటి రక్తపాతం లేకుండా ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సీన్లను డిజైన్‌ చేశారు. పుష్ప.. మంగళం శీను (సునీల్‌) ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్‌తో సెకండాఫ్‌పై హైప్‌ క్రియేట్‌ చేశారు సుకుమార్‌. ‌అటు క్లైమాక్స్‌లో ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌)కు పుష్ప చేత సవాలు విసిరించి.. రెండో పార్ట్‌పై ఆసక్తిని రగిలించారు.&nbsp; ప్రస్తుతం సుకుమార్‌ రూపొందిస్తున్న పుష్ప సీక్వెల్‌ ‘పుష్ప 2 : ది రూల్‌’ కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుండగా.. మేకర్స్‌ ఇప్పటికే ప్రమోషన్స్‌ షూరు చేశారు. ఈ సినిమా విజయం సాధిస్తే సుకుమార్‌ స్థాయి మరింత పెరగనుంది. పైగా తన తర్వాతి చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. అటు ‘పుష్ప 3’ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాబట్టి నెక్స్ట్‌ 2, 3 ఏళ్లలో సుకుమార్‌.. రాజమౌళి రేంజ్‌లో పాపులర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) టాలీవుడ్‌ సెన్సేషన్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా.. ‘యానిమల్‌’ (Animal) సినిమా ద్వారా తన సత్తా ఏంటో చూపించాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సందీప్‌.. రాజమౌళిలాగా సినిమా మేకింగ్‌ స్టైల్‌నే మార్చేశాడు. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్‌ సాహించని విధంగా సినిమాలు తీస్తూ అలరిస్తున్నాడు. సందీప్‌ తన తర్వాతి చిత్రాన్ని ప్రభాస్‌తో తీయనున్నాడు. దీనికి స్పిరిట్‌ అనే టైటిల్‌ కూడా ఖరారు చేశారు.&nbsp; స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అతడి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్‌ పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో ప్రభాస్‌ వేసుకున్న పోలీసు డ్రెస్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంటర్‌నేషనల్‌ కాప్‌ లుక్‌ను తలపిస్తోంది. యానిమల్‌ కంటే స్ట్రాంగ్‌ కంటెంట్‌తో స్పిరిట్‌ రానుంది ఇప్పటికే సందీప్‌ ప్రకటించాడు. తొలి రోజే రూ.150 కోట్ల వసూళ్లను రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మూవీ హిట్‌ టాక్‌ వస్తే.. వారం రోజుల్లోనే రూ.1500 కలెక్షన్లు సాధిస్తుందని సందీప్‌ వంగా నమ్మకంగా ఉన్నట్లు తెలిసింది.&nbsp; ఇక స్పిరిట్‌ తర్వాత సందీప్‌ రెడ్డి.. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)తోనే ‘యానిమల్‌ 2’ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్‌ అయితే సందీప్‌కు రాజమౌళి స్థాయిలో ఫేమ్‌ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.. తన టాలెంట్‌ ఏంటో ‘హనుమాన్‌’ (HanuMan) ద్వారా యావత్‌ దేశానికి తెలియజేశాడు. తన మూడో సినిమాతోనే స్టార్‌ డైరెక్టర్ల సరసన నిలబడ్డాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా హనుమాన్‌ నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్‌ కొలగొట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ..&nbsp; ‘హనుమాన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అటు బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)తో ఓ పీరియాడికల్‌ సినిమా చేసే ఛాన్స్ ప్రశాంత్‌కు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌ కూడా సక్సెస్‌ అయితే ప్రశాంత్‌ పేరు జాతీయ స్థాయిలో మారుమోగడం ఖాయం.&nbsp; ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. టాలీవుడ్‌ స్టార్‌ ప్రభాస్‌తో ‘సలార్‌’ (Salaar) రూపొందించి సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఈ దర్శకుడి మేకింగ్‌ స్టైల్‌ రాజమౌళిని సైతం ఎంతగానో ఇంప్రెస్‌ చేసింది. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ ఎలివేషన్స్‌ ఇచ్చి.. ప్రతీ ఒక్కరినీ ప్రశాంత్‌ నీల్ ఆకట్టుకున్నారు. హీరో ప్రభాస్‌ను చాలా స్ట్రాంగ్‌ పర్సనాలిటీగా సలార్‌లో ప్రొజెక్ట్‌ చేశాడు డైరెక్టర్‌. రాజమౌళి తరహాలోనే అద్భుతంగా ఇంటర్వెల్‌ను డిజైన్‌ చేశాడు. ప్రభాస్‌ను స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ వచ్చాయి.&nbsp; ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఫోకస్‌ మెుత్తం ‘సలార్‌ 2’ (Salaar: Part 2 - Shouryanga Parvam)పై ఉంది. ఈ మూవీ కూడా విజయం సాధిస్తే ప్రశాంత్‌ నీల్‌ జాతీయ స్థాయిలో టాప్‌ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోవడం ఖాయం. అటు తారక్‌తోనూ ప్రశాంత్‌.. ఓ సినిమాను ప్రకటించాడు. ‘NTR31’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు ‘కేజీఎఫ్‌ 3’ రూపొందనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మూడు ప్రాజెక్టులు సక్సెస్‌ అయితే ప్రశాంత్‌ క్రేజ్‌ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముంది.&nbsp; కొరటాల శివ (Koratala Siva) టాలీవుడ్‌ టాలెంటెడ్‌ డైెరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆచార్య మినహా ఇప్పటివరకూ అతడు డైరెక్ట్‌ చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అతడు కెరీర్‌లో తొలిసారి ఓ పాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తారక్‌తో ‘దేవర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. మెుత్తం రెండు పార్ట్స్‌గా ఈ మూవీ రానుండగా తొలి భాగం.. అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తారక్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో రిలీజ్‌ చేసిన దేవర గ్లింప్స్‌ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ గ్లింప్‌లో తారక్‌.. కత్తితో శత్రువులను తెగనరకడం చూపించాడు డైరెక్టర్‌. ఓ సీన్‌లో తారక్‌ శత్రువుని నరకగా అతడి రక్తం.. హాఫ్‌ మూన్‌ను కింద వైపు నుంచి ఈక్వెల్‌గా రౌండ్‌ చేయడం గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. అలాగే ఇటీవల తారక్‌ బర్త్‌డేను పురస్కరించుకొని రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ సింగిల్‌ కూడా సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. ముఖ్యంగా తారక్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ రాసుకున్న లిరిక్స్‌ హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీ సక్సెస్‌ అయితే కొరటాల శివ క్రేజ్‌ జాతీయ స్థాయికి చేరనుంది. ఇక దేవర రెండు పార్ట్స్‌ కూడా విజయం సాధిస్తే.. దేశంలోని ప్రముఖ డైరెక్టర్ల జాబితాలో అతడు చేరడం ఖాయం.&nbsp; సుజీత్‌ (Sujeeth) యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌.. స్టైలిష్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో పేరుంది. అతడి డైరెక్షన్‌ స్కిల్స్‌ రాజమౌళి తరహాలోనే హాలీవుడ్‌ డైరెక్టర్లను తలపిస్తాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌ చేసిన ‘సాహో’ చిత్రానికి&nbsp; సుజీత్‌ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ.. సుజీత్‌ మేకింగ్‌ నైపుణ్యం, స్క్రీన్‌ప్లే, ఐడియాలజీకి ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా యాక్షన్స్‌ సీక్వెన్స్‌ను ఆయన తెరకెక్కించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్‌ను చాలా స్టైలిష్‌గా చూపించాడు. సరైన హిట్‌ లభిస్తే సుజీత్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అతడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో ‘ఓజీ’ (OG) సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌ పవన్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ఇందులో పవన్‌ గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ సక్సెస్‌ అయితే సుజీత్ కెరీర్‌ మరోలా ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా. రెండు సాలిడ్ హిట్స్ పడితే అతడి క్రేజ్‌ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముందని విశ్లేషణలు ఉన్నాయి.&nbsp; బుచ్చిబాబు (Buchi Babu) తొలి సినిమాతోనే సాలిడ్‌ హిట్‌ అందుకున్న అతికొద్ది దర్శకుల్లో బుచ్చిబాబు ఒకరు. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో స్వచ్ఛమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అతడు.. తనలో ఎంతో టాలెంట్‌ ఉందని ఇండస్ట్రీకి తెలిసేలా చేశాడు. తన తర్వాతి చిత్రాన్ని టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌తో చేసే స్థాయికి ఎదిగాడు. స్పోర్ట్స్‌ డ్రామాగా రానున్న ఈ చిత్రం కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. రామ్‌చరణ్‌ క్రేజ్‌కు బుచ్చిబాబు టాలెంట్‌ తోడైతే ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయిలో అతడి పేరు మార్మోగుతుందని అభిప్రాయపడుతున్నారు.&nbsp;
    మే 24 , 2024
    SSMB 29: రాజమౌళి సినిమాలో మహేష్‌ బాబు ఫైనల్ లుక్ ఇదేనా?&nbsp;
    SSMB 29: రాజమౌళి సినిమాలో మహేష్‌ బాబు ఫైనల్ లుక్ ఇదేనా?&nbsp;
    సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా ఎప్పుడు మెుదలవుతుందోనని అటు మహేష్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు కూడా చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. కాగా, ప్రస్తుతం 'SSMB29' చిత్రానికి సంబంధించిన ప్రీ పొడక్షన్‌ పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయి. ఈ వర్స్క్‌లోనే మూవీలో మహేష్‌ లుక్‌ ఏ విధంగా ఉండాలన్న డిస్కషన్స్‌ కూడా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేష్‌ షేర్‌ చేసిన ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.  మహేష్‌ లుక్‌ అదేనా? ‘SSMB 29’లో మహేష్‌ లుక్‌ ఎలా ఉండనుందన్న క్యూరియాసిటీ ప్రస్తుతం అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో మహేష్‌ షేర్‌ చేసిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫోటోని షేర్ చేశాడు. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు. మరి ఈ లుక్ SSMB29 కోసమేనా? లేదా నార్మల్ లుక్? అన్న దానిపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే రాజమౌళి చిత్రం కోసం ఈ లుక్‌ను ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ కూడా రానుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.&nbsp; మహేష్‌ కోసం 8 లుక్స్‌ డిజైన్‌! దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. తన సినిమాల్లోని హీరోల లుక్‌ విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. కథకు తగ్గట్టుగా హీరో లుక్‌ను మెయిన్‌టైన్‌ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్న పేరు ఇండస్ట్రీలో ఉంది. ఇందుకు అనుగుణంగానే తన అప్‌కమింగ్‌ మూవీ ‘SSMB29‘లోనూ మహేష్‌ లుక్‌పై రాజమౌళి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. మహేష్‌ పాత్రకు సంబంధించి ఎనిమిది లుక్ డిజైన్స్‌ను ఆయన సిద్ధం చేశారట. వాటిని స్కెచ్‌ రూపంలోకి మార్చి అందులో ఏది మహేష్‌కు బాగా సెట్‌ అవుతుందో రాజమౌళి దగ్గరుండి పరిశీలిస్తున్నారట. ఈ ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే మహేష్‌ లేటెస్ట్‌ లుక్‌ బయటకు రావడం ఆసక్తిని పెంచింది.  కృష్ణుడి గెటప్‌లో మహేష్‌! రాజమౌళి ఆ ఎనిమిది లుక్స్‌కు సంబంధించి మహేష్‌తో ఫొటోషూట్‌ కూడా నిర్వహించారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఆ ఎనిమిది లుక్స్‌లో కృష్ణుడి గెటప్‌ కూడా ఉందట. ఇటీవల మహేష్‌ను కృష్ణుడి గెటప్‌లో షూట్‌ కూడా చేశారని సమాచారం. ఆ లుక్‌ మహేష్‌కు మాటల్లో చెప్పలేనంత బాగా కుదిరిందని అంటున్నారు. మహేష్‌ను కృష్ణుడి గెటప్‌లో చూసి చిత్ర యూనిట్‌ ఎంతగానో మురిసిపోయిందని ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.&nbsp; 200 మందితో ప్రీ ప్రొడక్షన్‌ పనులు! ప్రస్తుతం రాజమౌళి తన 200 మంది బృందంతో ప్రీ ప్రొడక్షన్, స్కెచ్, లుక్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారట. సినిమా ప్రారంభం కాకముందే 200 మంది టీమ్‌ అంటే సెట్స్‌ పైకి వెళ్లాక ఇంకెంత మంది పని చేస్తారోనని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. కాగా, ‘SSMB29’ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రమని ప్రచారం జరుగుతోంది. ఇండియానా జోన్స్ తరహాలో హాలీవుడ్ మేకర్స్‌తో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా ఇండోనేషియా యాక్ట్రెస్ ‘చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్’ని ఎంపిక చేసుకున్నట్లు ఇటీవల వార్తలు సైతం వచ్చాయి.&nbsp; ‘చెల్సియా ఎంత ఫేమస్సో తెలుసా? అమెరికన్ - ఇండోనేషియా నటిగా బ్యూచెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌కి మంచి గుర్తింపు ఉంది. ‘చెల్సియా ఇస్లాన్.. 18 ఏళ్లకే వెండితెరపై మెరిసింది. ‘ది బాలిక్ 98’, ‘రూడీ’, ‘హబిబీ’ వంటి చిత్రాలతో ఇండోనేషియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఉత్తమ నటిగా సెకండ్ ఇండోనేషియన్ చాయిస్ అవార్డ్‌ను సైతం ఈ అమ్మడు అందుకుంది. ఈ భామ ఎంట్రీపై రాజమౌళి టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్‌! ‘SSMB29’ సినిమాకు సంబంధించి దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకూ అధికారికంగా ఒక్క అప్‌డేట్‌ కూడా ఇవ్వలేదు. గత చిత్రాల మాదిరిగానే దీనికి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి వివరాలు ప్రకటిస్తారా? లేదా? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఈసారి జక్కన్న కాస్త భారీగానే ప్లాన్‌ చేస్తున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ‘SSMB29’ సినిమాకు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్‌ ఉండబోతోందని సమాచారం. తెలుగుతో పాటు, జాతీయ మీడియాకు కూడా ఒకేసారి చెప్పేస్తే ఎలా ఉంటుందా? అని మూవీ టీమ్‌ ఆలోచిస్తోందట. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది త్వరలోనే తెలియనుంది.&nbsp;
    మార్చి 08 , 2024
    SSMB 29: మహేష్ బాబు సినిమాతో రాజమౌళి మళ్లీ ఆస్కార్ గెలవనున్నాడా?.. ఫ్యాన్స్‌లో భారీగా హైప్!
    SSMB 29: మహేష్ బాబు సినిమాతో రాజమౌళి మళ్లీ ఆస్కార్ గెలవనున్నాడా?.. ఫ్యాన్స్‌లో భారీగా హైప్!
    RRR చిత్రానికి ఆస్కార్ రావటంతో రాజమౌళి తెరకెక్కించబోయే తదుపరి చిత్రంపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే మహేశ్‌ బాబు హీరోగా ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ కావటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. RRRను మించి చిత్రం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి క్రేజ్ పెరగటంతో ఇప్పుడు పాన్ వరల్డ్‌ను మెప్పించే సినిమాను తీయక తప్పని పరిస్థితి ఏర్పడింది. SSMB29 ట్రెండింగ్ RRR ఆస్కార్ అవార్డు అందుకోవటంతో ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు సినిమా గురించి ట్రెండ్ చేస్తుంటే… మహేశ్‌ ఫ్యాన్స్‌ కూడా రెచ్చిపోయారు. #SSMB 29 కూడా ట్రెండ్ చేశారు. రాజమౌళి, మహేశ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అంచనాలు ఎలా ఉన్నాయంటూ పోస్టులు పెట్టి హోరెత్తించారు.&nbsp; https://twitter.com/i/status/1635126271427624961 పూనకాలు లోడింగ్ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా లాంఛ్‌ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రకటన కాకముందే ఇలా ఉంటే అనౌన్స్‌మెంట్ చేస్తే సగం చచ్చిపోతారేమో అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. జక్కన్న, సూపర్‌ స్టార్‌ ఫొటోలను పెట్టి అగ్నిపర్వతం బద్ధలు కాబోతుందనే రేంజ్‌లో హైప్ పెంచుతున్నారు. https://twitter.com/TribhuvanRishi/status/1635290226062147584 హాలీవుడ్ హీరోయిన్‌ మహేశ్ సరసన హీరోయిన్ గురించి చర్చ మెుదలయ్యింది. ఆస్కార్ వేడుకలో దీపికా పదుకొణె రాజమౌళిని కలిసిందని.. మహేశ్‌తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పిందని టాక్. ఇక ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. “ జక్కన్న హాలీవుడ్ హీరోయిన్లను చూశావు కదా.. అందులో ఎవర్నైనా టాలీవుడ్‌లోకి దింపేయ్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/UrsPrakash_07/status/1635172159688671233 మనదే ఆస్కార్ మహేశ్‌తో పాన్ వరల్డ్ చిత్రం తీయబోతున్న జక్కన్న బాక్సాఫీస్ షేక్ చేయనున్నాడు. ఈ సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలిచేలా చేస్తాడంటూ అభిమానులు ట్విటర్‌లో సందడి చేస్తున్నారు. ఉత్తమ నటుడు, చిత్రం అవార్డులు మళ్లీ మనదే అనే కామెంట్లు చేస్తున్నారు. https://twitter.com/sri_cultdhfm/status/1635131220832165888 శరవేగంగా పనులు రాజమౌళి-మహేశ్‌ బాబు సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. కథను సిద్ధం చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. జేమ్స్‌ బాండ్ తరహాలో స్టోరీ ఉంటుందని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మిగతా పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. అన్ని సవ్యంగా కుదిరితే ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ప్రస్తుతం బిజీ రాజమౌళి సినిమా ప్రారంభం కావటానికి దాదాపు సంవత్సరం సమయం ఉంది.&nbsp; ఇలాంటి సమయంలో ఫ్యాన్స్‌ను నిరాశ పరచకూడదని భావించిన సూపర్ స్టార్ మహేష్… త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వరుస షెడ్యూల్స్ జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు మహేశ్. ఆ తర్వాత దర్శక ధీరుడితో సినిమా పట్టాలెక్కనుంది.
    మార్చి 14 , 2023
    New Hair Styles : దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ హీరోల ఈ హేయిర్ స్టైల్స్ గురించి తెలుసా?
    New Hair Styles : దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ హీరోల ఈ హేయిర్ స్టైల్స్ గురించి తెలుసా?
    అబ్బాయిలు హ్యాండ్సమ్‌గా కనిపించేందుకు ఎక్కువగా హేయిర్ స్టైల్స్‌ మీద దృష్టి పెడుతుంటారు. అభిమాన హీరో ఎలాంటి హెయిర్ స్టైల్‌లో ఉంటే అలాంటి హెయిర్ కట్‌ను ఫాలో(New Hair Styles) అవుతుంటారు. ఇక సినిమాల్లోనూ అంతే.. ఎప్పుడు కొత్త లుక్‌లతో అభిమానులను హీరోలు మెస్మరైజ్ చేస్తుంటారు. హీరోలను హెయిర్ స్టైల్స్ సరికొత్తగా ఆవిష్కరిస్తుంటాయి.ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ హీరోల ఏ ఏ హేయిర్ స్టైల్స్‌ ట్రెండ్ అయ్యాయో ఈ కథనంలో తెలుసుకుందాం. [toc] జూనియర్ ఎన్టీఆర్ హేయిర్ స్టైల్స్‌ జూనియర్ ఎన్టీఆర్ తన పాతికేళ్ల సినీ కెరీర్‌లో ఎంతో లుక్స్ పరంగా, స్టైల్ పరంగా ఎంతో ట్రాన్స్‌పామ్ అయ్యాడు. కెరీర్‌ తొలినాళ్లలో కర్లీ హెయిర్‌తో కనిపించిన తారక్ తర్వాత సినిమా, సినిమాకు హెయిర్‌ స్టైల్స్, లుక్స్ మారుస్తూ ట్రెండ్ సెట్ చేశాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో ఏ హెయిర్‌ స్టైల్‌తో కనిపించాడో ఇప్పుడు చూద్దాం.&nbsp; బాద్‌షా బాద్‌షా సినిమాలోనూ తారక్ లుక్ ట్రెండ్‌ సెట్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో జూ. ఎన్టీఆర్ 'డౌన్‌వార్డ్ ఫ్లిక్స్‌' హేయిర్‌ స్టైల్‌తో స్టైలీష్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్‌ యూత్‌ మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. జనతా గ్యారేజ్ ఈ సినిమాలో తారక్... 'సెమీ క్రూ'(semi Crew cut) హేయిర్‌ కట్‌తో స్టైలీష్‌గా కనిపించాడు.&nbsp; టెంపర్ ఫస్ట్‌టైం ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్... సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ట్సాన్స్‌పార్మ్ అయ్యాడు. ఈ సినిమాలో తారక్ స్టైలీష్‌గా కనిపించాడు. స్పైక్‌డ్ హేయిర్‌(Spiked hairStyle)&nbsp; స్టైల్‌తో కనిపించాడు. యమదొంగ యమదొంగ చిత్రంలో తారక్ లాంగ్ స్ట్రెయిట్ హెయిర్‌తో(Long Strait Hair) స్టైల్‌గా కనిపించాడు. ఈ చిత్రం తర్వాత ఆ హేయిర్‌ స్టైల్‌ను అనుకరించేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. నాన్నకు ప్రేమతో ఇక ఈ సినిమాలో స్టైలీష్ లుక్‌లో తారక్ అలరించాడు. ఈ హెయిర్ స్టైల్‌ను ఎంతో మంది అభిమానులు ఫాలో అయ్యారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ పేరు పోంపాడర్ విత్ సైడ్ ఫేడ్(pompadour with side Fade). ఈ హేయిర్ స్టైల్ తారక్‌ను మరింత అందంగా కనిపించేలా చేసింది. జై లవకుశ ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ హేయిర్ స్టైల్ లుక్‌లో కనిపించాడు. జై పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. క్లాసిక్ సైడ్ పార్టింగ్ (classic Side Parting), లవ్‌కుమార్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ స్ట్రేయిట్ లాంగ్ హేయిర్ స్టైల్‌లో అందంగా కనిపించాడు. దేవర పాతాళ భైరవిలో రామారావు లుక్‌కు.. ‘దేవర’ (Devara)లోని తారక్‌ గెటప్‌ను నందమూరి ఫ్యాన్స్ మ్యాచ్‌ చేసుకుంటున్నారు. పరిశీలనగా చూస్తే అందరికీ ఇదే భావన కలుగుతుందని చెబుతున్నారు. తారక్‌ ‘దేవర’ సినిమాలో డ్యూయల్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఒక పాత్ర రింగుల జుట్టుతో కూడిన లాంగ్‌ హెయిర్‌తో ఉంటుంది. ఈ గెటప్‌లో తారక్‌ అచ్చం నందమూరి తారకరామారావు లాగా కనిపిస్తున్నాడని నెటిజన్లు సైతం అభిప్రాయపడ్డారు. మహేష్ బాబు హేయిర్ స్టైల్స్‌ బాబి తన కెరీర్ ప్రారంభంలో మహేష్‌ మిల్కీ బాయ్‌గా కనిపించేవాడు. దాదాపు పోకిరి సినిమా వరకు ఒకే ఒకే హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో చైల్డీష్ లుక్ హేయిర్ స్టైల్ లుక్‌తో కనిపించాడు. పోకిరి పోకిరి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న తన లుక్స్, స్టైల్‌, స్వాగ్‌ను మహేష్ పూర్తిగా మార్చేశాడు. ముఖ్యంగా అతని హేయిర్ స్టైల్‌ ఎంతో ఫేమస్ అయింది. ఈ హేయిర్ స్టైల్‌ను... అంటారు. ఈ చిత్రం తర్వాత మహేష్ అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యారు. సైనికుడు ఈ చిత్రంలో మహేష్ బాబు స్టూడెంట్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఫంక్ హేయిర్ స్టైల్‌తో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. అతిథి అతిథి సినిమాలో మహేష్ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించాడు. బ్రౌన్ కలర్ జుట్టుతో పొడవాటి లాంగ్ హెయిర్‌తో రగ్గ్‌డ్ లుక్‌లో అలరించాడు వన్ నేనొక్కడినే ఈ సినిమాలో మహేష్ బాబు ట్రెండీ లుక్‌లో అలరించాడు. అతని స్పైక్‌డ్ హెయిర్‌ స్టైల్‌తో మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ.. మహేష్ బాబు నటనకు(Mahesh Babu Hair Styles) విమర్శకుల ప్రశంసలు దక్కాయి. SSMB29 ‘SSMB 29 నేపథ్యంలో మహేష్‌ షేర్‌ చేసిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫోటోని షేర్ చేశాడు. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు.&nbsp; సిద్దు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ డీజే టిల్లు&amp; టిల్లు స్కేర్ డీజే టిల్లు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ చాలా ఫేమస్ అయింది. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది కూడా.&nbsp; ఈ హెయిర్‌ స్టైల్‌ను తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్‌ అని పిలుస్తారు.&nbsp; టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్‌ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు.&nbsp; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హేయిర్ స్టైల్స్ భద్రినాథ్ ఈ చిత్రంలో అల్లు అర్జున్ యుద్ధ వీరుడిగా కనిపించాడు. బన్నీ హెయిర్‌ స్టైల్ చాలా క్రేజీగా ఉంటుంది.&nbsp; మ్యాన్ బన్స్(Man Buns) మరియు పోనిటేయిల్స్(ponytails) హేయిర్ స్టైల్స్‌తో ఆకట్టుకున్నాడు. అల వైకుంఠపురములో ఈ చిత్రంలో అల్లు అర్జున్ లాంగ్ వేవ్స్(Long waves)హేయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. టాప్‌లో పప్‌ బాటమ్‌లో వేవీ హెయిర్‌ లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ను అనేక మంది అతని (Allu Arjun Hair styles)అభిమానులు ట్రై చేశారు. హ్యాపీ హ్యాపీ చిత్రంలో బన్నీ స్పైక్స్ హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఈ హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. దువ్వాడ జగన్నాథం ఈ సినిమాలో "ఫోర్ హెడ్ సెమీ ఫ్రింజ్" హేయిర్ స్టైల్‌తో ఇంప్రెస్ చేశాడు ఇది కూడా ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. ఇదే చిత్రంలో బన్నీ మరో స్టైలీష్ హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు ఫ్రింజ్ బ్యాంగ్ (fringe Bangs) సరైనోడు ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్లాసిక్ హేయిర్ స్టైల్‌లో కనిపిస్తాడు. ఈ హెయిర్ స్టైల్‌ పేరు పొంపాడర్ హేయిర్ లుక్&nbsp; (Pompadour) బన్నీ ఇతర హేయిర్ స్టైల్స్ అల్లు అర్జున్ ఎక్కువగా బయట థిక్ బియర్డ్‌తో లాంగ్ వేవీ వెట్ హేయిర్(long wavy wet-hair)లుక్ కనిపిస్తుంటాడు. ఈ హెయిర్‌ స్టైల్ బన్నీ ఫెవరెట్‌ అని తెలిసింది. రామ్ చరణ్ హేయిర్ స్టైల్స్ గోవిందుడు అందరివాడేలే ఈ చిత్రంలో రామ్‌ చరణ్ పోని టేయిల్(Pony Tail) హేయిర్ కట్‌లో స్టైలీష్‌గా కనిపిస్తాడు. ఈ హెయిర్‌ స్టైల్‌ను బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్, రణ్‌వీర్ సింగ్ కూడా ఫాలో అయ్యారు. ఈ హేయిర్‌ కట్‌ను చెర్రీ అభిమానులు క్రేజీగా ఫాలోయ్యారు. గేమ్ ఛేంజర్ లెటేస్ట్ గేమ్‌ ఛేంజర్ సినిమాలో రామ్‌ చరణ్ గెల్డ్‌ హేయిర్ స్టైల్‌తో ఫర్‌ఫెక్ట్ లుక్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో రామ్‌ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. రామ్‌ చరణ్ ఇతర హేయిర్ స్టైల్స్ రామ్ చరణ్ పలు సందర్భాల్లో గుడ్ బాయ్&nbsp;లుక్‌లో కనిపంచేవాడు. ఈ హేయిర్ కట్‌ పైరు "సైడ్ పార్టింగ్". షూటింగ్ లేని సమయాల్లో రామ్‌ చరణ్ ఎక్కువగా ఈ హేయిర్ స్టైల్‌లో ఉంటాడు. మరికొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఇవెంట్లు, మీడియా సమావేశాల్లో చరణ్ ఈ హేయిర్‌ కట్‌లో కనిపిస్తుంటాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు 'మెస్సీ హెయిర్ లుక్'(messy Hair lock).ఈ టైప్ హేయిర్ స్టైల్ కూడా బాగా ట్రెండ్ అయింది. చెర్రీ అభిమానులు చాలావరకు ఈ టైప్ హేయిర్‌ స్టైల్‌ను ఫాలో అయ్యారు. కొన్నిసార్లు లైట్ బియర్డ్, షార్ట్ సైడ్స్ హెవీ "పొంపాడర్ హెయిర్‌"(pompadour) లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ కూడా చెర్రీకి బాగా కుదిరింది. అయితే ఇలాంటి(Ram charan Hair styles) హేయిర్‌ స్టైల్‌తో రామ్‌చరణ్ ఏ సినిమాలోనూ నటించలేదు. విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్స్ లైగర్ &nbsp;ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్‌పై క్రేజీ టాక్ నడిచింది. "లాంగ్ వేవీ"(Long Wavy) హేయిర్ కట్‌లో మేరిసాడు. ఈ హేయిర్ స్టైల్‌ను చాలా మంది అతని అభిమానులు ఫాలో అయ్యారు. ఇదే చిత్రంలో దేవరకొండ 'మ్యాన్ బన్' హేయిర్ కట్‌లోనూ కనిపిస్తాడు. గతంలో అనేమంది సెలబ్రెటీలు ఈ స్టైల్‌ను ఫాలో అయినప్పటికీ... విజయ్‌కు సెట్ అయినట్లుగా మరెవరికీ సెట్ అవ్వలేదు. డియర్ కామ్రెడ్ డియర్ కామ్రెడ్ చిత్రంలో విజయ్ కర్లీ &amp; మెస్సీ హేయిర్ స్టైల్‌ లుక్‌లో కనిపించి అదరగొట్టాడు. ఈ హేయిర్ స్టైల్ సైతం విజయ్‌కి బాగా కుదిరింది. (Vijay Deverakonda Hair styles)ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఖుషి ఈ చిత్రంలోనూ విజయ్ దేవరకొండ మ్యాన్లీ లుక్‌లో కనిపిస్తాడు. సమంత, విజయ్ కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఫ్యామిలీ స్టార్ ఈ సినిమాలో లైట్‌గా గడ్డం, ఒత్తైన మీసాలతో డీసెంట్ లుక్ హేయిర్ స్టైల్‌ను విజయ్ దేవరకొండ కలిగి ఉన్నాడు. ఈ లుక్ చాలా మంది ఫ్యాన్స్‌ అట్రాక్ట్ చేసింది. ఈ హేయిర్ కట్‌ను చాలా మంది ఫాలో అయ్యారు. రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్స్ స్కంద &nbsp;ఈ సినిమా చేయడానికి ముందు.. రామ్‌ పొత్తినేని(RAPO) 'స్పైకీ' హేయిర్‌ స్టైల్‌లో రామ్ పొత్తినేని అలరించాడు. ఈ చిత్రంలో రామ్ హేయిర్‌ స్టైల్‌ క్రేజీ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ హేయిర్ స్టైల్‌ను అనేకమంది అభిమానులు ఫాలో అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ ఈ చిత్రంలో రామ్‌ పొత్తినేని లుక్స్, హేయిర్ స్టైల్, స్వాగ్‌ ట్రెండ్ సెట్‌ చేశాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత చాలా మంది అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయిపోయారు. ఈ చిత్రంలో రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్ పేరు "హై వాల్యూమ్ క్విఫ్ విత్ ఫేడ్" ( high-volume quiff with a fade) ఈ హేయిర్ కట్‌కు గడ్డం గంభీరంగా ఉంటేనే సెట్ అవుతుంది.&nbsp;
    మే 22 , 2024
    Kalki 2898 AD: ప్రభాస్‌ కోసం రంగంలోకి మహేష్‌.. ఎందుకంటే?
    Kalki 2898 AD: ప్రభాస్‌ కోసం రంగంలోకి మహేష్‌.. ఎందుకంటే?
    సలార్‌ (Salaar) తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా చేస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). మహానటి ఫేమ్ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో క్రేజ్‌ ఉంది. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‍, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజ్‌ న్యూస్‌ బయటకొచ్చింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఈ సినిమాలో భాగస్వామ్యం కాబోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.&nbsp; మహేష్‌ బాబు డబ్బింగ్‌? (Mahesh Babu Dubbing) కల్కి చిత్రం (Prabhas New Movie)లో హీరో ప్రభాస్‌ విష్ణు మూర్తి అవతారంలో కనిపించనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో అతడి పాత్ర పేరు 'భైరవ' అని చిత్ర యూనిట్‌ ఇప్పటికే రివీల్‌ చేసింది. అయితే ప్రభాస్‌ పాత్రను పరిచయం చేసేందుకు మహేష్‌ బాబు (Mahesh Babu) వాయిస్‌ను ఉపయోగించుకోవాలని మేకర్స్‌ భావిస్తున్నారట. ప్రభాస్ ఎంట్రీకి, ఎలివేషన్స్‌కు మహేష్‌ వాయిస్‌ ఇస్తే సినిమాపై హైప్‌ మరింత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారట. ఇప్పటికే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ విషయమై మహేష్‌ను కూడా సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; గతంలో ఇలాగే.. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు ఇలా డబ్బింగ్‌ చెప్పడం కొత్తేమి కాదు. గతంలో ఆయనకు డబ్బింగ్‌ చెప్పిన అనుభవం ఉంది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) - త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ (Jalsa Movie) సినిమాకు మహేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. సంజయ్‌ సాహు పాత్రను పరిచయం చేస్తూ తన వాయిస్‌తో చక్కటి ఎలివేషన్స్‌ ఇచ్చాడు. అప్పట్లో ఇది ‘జల్సా’ సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మహేష్‌ చేత ఎలాగైన డబ్బింగ్‌ చెప్పించాలని దర్శకుడు నాగ్‌ అశ్విన్ పట్టుదలతో ఉన్నట్లు ఫిల్స్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం మహేష్‌ ‘SSMB29’ సినిమా షూట్‌ కోసం సిద్దమవుతున్నాడు. మరి ఈ ఆఫర్‌కు మహేష్ ఓకే చెప్తాడో లేదో చూడాలి. కల్కి వెనక లెజెండరీ డైరెక్టర్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Prabhas New Movie Director).. కల్కి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ద్వాపర యుగం నుంచి కలియుగం అంతంలో కల్కి అవతరించే వరకు ఈ చిత్ర కథ ఉండనుందని టాక్. మహాభారతం నాటి పాత్రలతో ముడిపడి ఉన్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై ఇతిహాసాల ప్రభావం కూడా గట్టిగానే ఉండనుంది. ఈ నేపథ్యంలో పౌరాణిక చిత్రాలపై పట్టున్న లెజెండరీ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) ఈ సినిమా విషయంలో తన వంతు సాయం అందిస్తున్నట్లు సమాచారం. ‘మాయాబజార్‌’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడం, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ లాంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన అనుభవం కల్కికి ఉపయోగపడుతుందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నారు.&nbsp; ‘ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు’ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి’ (Prabhas New Movie) సినిమాపై రానా (Rana Daggubati) ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా కథకు ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కనెక్ట్‌ అవుతారని ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో వ్యాఖ్యానించాడు. ‘భారతీయ తెరపై తదుపరి పెద్ద మూవీ కల్కి. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కల్కికి కనెక్ట్ అవుతారు. ఈ ఇండియన్‌ ఎవెంజర్స్ క్షణం కోసం ఎదురు చూస్తున్నా’ అని అన్నాడు. కాగా, ఈ సినిమాకు అశ్వనీదత్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్‌ సరసన దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు.&nbsp;
    మే 08 , 2024
    Anil Ravipudi: ఐపీఎల్‌పై అనిల్‌ రావిపూడి క్రేజీ కామెంట్స్.. ముసుగేసి గుద్దితే డబ్బు ఇస్తానన్న రాజమౌళి!
    Anil Ravipudi: ఐపీఎల్‌పై అనిల్‌ రావిపూడి క్రేజీ కామెంట్స్.. ముసుగేసి గుద్దితే డబ్బు ఇస్తానన్న రాజమౌళి!
    యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)కి టాలీవుడ్‌లో మంచి పేరుంది. మినిమం గ్యారంటీ చిత్రాలను ఆయన రూపొందిస్తారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్‌గా బాలకృష్ణ (Balakrishna)తో చేసిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండే డైరెక్టర్‌ అనిల్‌.. తాజాగా జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో ఐపీఎల్‌పై కామెంట్స్‌ చేశారు. దీనిపై ఐపీఎల్‌ ఫ్యాన్స్‌, క్రికెట్‌ లవర్స్ మండిపడుతున్నారు.&nbsp; అసలేం జరిగిందంటే? దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ‘కృష్ణమ్మ’ (Krishnamma) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరయ్యాడు. హీరో సత్య (Satya)పై ప్రశంసల వర్షం కురిపించాడు. కృష్ణమ్మ చిత్రం చాలా బాగుంటుందని.. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చాడు. అంతటి ఆగకుండా డైరెక్టర్ అనిల్‌ ఐపీఎల్ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు 2 రోజులు చూడకుంటే కొంపలేమీ మునిగిపోవు. క్రికెట్ స్కోర్‌ ఫోన్లలో కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలకు అందరూ రావాలి’ అంటూ సరదాగా కామెంట్స్‌ చేశారు.&nbsp; https://twitter.com/i/status/1785936991726743773 మండిపడుతున్న ఫ్యాన్స్ అనిల్‌ రావిపూడి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దీనిపై ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. మీ సినిమాలు కూడా నెల తరువాత ఓటీటీ, టీవీల్లో వస్తాయి కదా.. అప్పుడు చూస్తామని కౌంటర్లు వేస్తున్నారు. ఇతరుల ఇష్టా ఇష్టాల గురించి మాట్లాడటం సరైన పద్దతి కాదని సూచిస్తున్నారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేగాని తాము ఏం చేయాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఘాటుగానే బదులిస్తున్నారు.&nbsp; అనిల్‌ను కొడితే రూ.10 వేలు ఇస్తా: రాజమౌళి కృష్ణమ్మ ఈవెంట్‌లో అనిల్‌ రావిపూడితో పాటు దర్శకధీరుడు రాజమౌళి, కొరటాల శివ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రాల గురించి డైరెక్టర్‌ అనిల్ ప్రస్తావించాడు. తనకు రెండు కోరికలు ఉన్నాయని పేర్కొన్నారు.&nbsp; ఒకటి.. కొరటాల శివ స్పీచ్‌లో దేవర రిలీజ్‌ డేట్‌ వినడం, రెండోది రాజమౌళి స్పీచ్‌లో ‘SSMB29’ ఓపెనింగ్‌ డే? జానర్‌? ఏ కథ తీస్తున్నారు? అని తెలుసుకోవడం కోసం ఎగ్జైటింగ్‌ ఉన్నట్లు చెప్పారు. దీనికి రాజమౌళి తనదైన శైలిలో ఫన్నీగా బదులిచ్చారు. 'ఎవరైనా సరే అనిల్‌ రావిపూడిని ముసుగేసి గుద్దేస్తే వారికి రూ.10వేలు ఇస్తా' అని అన్నారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1785935511531511969
    మే 02 , 2024
    Letterboxd: ‘అతడు’, ‘జెర్సీ’, ‘ఖలేజా’ చిత్రాలకు గ్లోబల్‌ స్థాయిలో క్రేజ్‌.. టాప్-100లో చోటు!
    Letterboxd: ‘అతడు’, ‘జెర్సీ’, ‘ఖలేజా’ చిత్రాలకు గ్లోబల్‌ స్థాయిలో క్రేజ్‌.. టాప్-100లో చోటు!
    భారతీయ చిత్ర పరిశ్రమలో టాలీవుడ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను తెలుగు చిత్ర పరిశ్రమ అందిస్తుందని దేశంలో ఏ సినీ ప్రేక్షకుడిని అడిగినా చెబుతాడు. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘బలగం’ వంటి చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. ఇదిలా ఉంటే ప్రముఖ సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ లెటర్స్‌బాక్స్డ్‌ (Letterboxd) తాజా ప్రకటించిన ప్రపంచంలోని టాప్‌ 100 చిత్రాల్లో టాలీవుడ్‌కు చెందిన నాలుగు సినిమాలకు చోటు దక్కాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ర్యాంకులు ఇవే! న్యూజిలాండ్‌ కేంద్రంగా పనిచేసే ప్రముఖ నెట్‌వర్క్‌ లెటర్‌బాక్స్‌డ్‌.. అత్యంత ప్రజాధరణ పొందిన చిత్రాల గురించి చర్చను ఆహ్వానిస్తుంటుంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌ తమకు నచ్చిన సినిమా గురించి ఈ వేదికపై తమ అభిప్రాయాలు తెలియజేస్తుంటారు. రేటింగ్స్‌ కూడా ఇస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా అత్యధిక మంది అభిమానుల ఆదరణ పొందిన ‘టాప్‌-100’ చిత్రాల జాబితాను లెటర్‌బాక్స్‌డ్ ప్రకటించింది. ఆ వంద చిత్రాల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నాలుగు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. అతడు (42), జెర్సీ (57), సాగర సంగమం (75), ఖలేజా (85) చిత్రాలు ఎక్కువ మంది ఇష్టపడ్డ మూవీస్‌గా నిలిచాయి.&nbsp; ఫుల్‌ జోష్‌లో మహేష్‌ ఫ్యాన్స్‌! లెటర్‌బాక్స్డ్ ప్రకటించిన వరల్డ్‌ టాప్‌ 100 చిత్రాల్లో.. టాలీవుడ్‌ నుంచి మహేష్‌ బాబు చేసిన అతడు, ఖలేజా చోటు దక్కించుకున్నాయి. దీంతో మహేష్‌ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇందుకు ఓ కారణం ఉంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు థియేటర్లలో మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద మోస్తరు వసూళ్లతోనే అతడు, ఖలేజాలు సర్దుకోవాల్సి వచ్చింది. అయితే బుల్లితెరపై మాత్రం ఈ సినిమాలు అత్యధిక టీఆర్పీతో టెలికాస్ట్‌ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమాలను టీవీలో చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాలు టాప్‌100లో నిలవడంతో మహేష్‌ ఫ్యాన్స్‌ కాలర్ ఎగరేస్తున్నారు.&nbsp; ‘SSMB29’ ముహోర్తం ఫిక్స్‌! మహేష్‌ తన తర్వాతి చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళితో చేయనున్నాడు. దీంతో అందరి దృష్టి SSMB29 పైనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా సాగుతున్నాయి. మహేష్‌ కూడా ఈ మూవీ కోసం పలు దేశాలు తిరుగుతూ శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం 'SSMB29' చిత్రాన్ని మే 31న అధికారికంగా లాంచ్‌ చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. మహేష్‌ తండ్రి, దివంగత స్టార్‌ హీరో కృష్ణ పుట్టిన రోజు నేపథ్యంలో ఆ రోజున సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం. 
    ఏప్రిల్ 25 , 2024
    మహేష్ బాబు గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    మహేష్ బాబు గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    తెలుగులో అత్యంత కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతికొద్దిమంది హీరోల్లో మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా... తనకంటూ ప్రత్యేకమైన శైలీ, యాక్టింగ్ నేచర్‌తో అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఎన్నో సేవకార్యక్రమాలు చేస్తూ.. రియల్ హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. మరి అలాంటి సూపర్ స్టార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు పుట్టినరోజు ఎప్పుడు? మహేష్ బాబు ఆగస్టు 9న చెన్నైలే జన్మించారు. నటుడు కృష్ణ, ఇందిరలకు జన్మించిన ఐదుగురు పిల్లలలో అతను నాల్గవవాడు.&nbsp; మహేష్ బాబు ఎవరు? మహేష్ బాబు ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత.&nbsp; మహేష్ బాబు ఎత్తు ఎంత? 6 అడుగులు మహేష్ బాబు హీరోగా ఎన్ని సినిమాలు ఆడాడు? &nbsp;సూపర్ స్టార్ మహేష్ నీడ (1979) చిత్రంలో బాల నటుడిగా తన నట జీవితాన్ని ప్రారంభించాడు. తరువాత, అతను బాల నటుడిగా&nbsp; బాల నటుడిగా 9 సినిమాలు చేసాడు. మేయిన్ హీరోగా ఇప్పటి వరకు 28 చిత్రాలకు పనిచేశాడు.&nbsp; మహేష్ బాబుకు పెళ్లయిందా? మహేష్ బాబు.. మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్‌ను ఫిబ్రవరి 10, 2005న వివాహం చేసుకున్నాడు. వంశీ చిత్రంలో మహేష్ సరసన నమ్రత కలిసి నటించారు.&nbsp; మహేష్ బాబు ఎక్కడ నివసిస్తున్నారు? మహేష్ బాబు నికర ఆస్తుల విలువ రూ.150 కోట్లు. భారతదేశంతో పాటు విదేశాలలో అనేక విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నాడు. అతను తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఒక విలాసవంతమైన ఎస్టేట్‌లో నివసిస్తున్నాడు. మహేష్ బాబు కొత్త సినిమా ఏమిటి? సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో కలిసి # SSMB29లో నటిస్తున్నాడు. మహేష్ బాబుకి ఇష్టమైన ఆహారం, పుస్తకాలు మరియు అభిరుచులు? ప్రిన్స్ మహేష్ బాబుకి ఇష్టమైన వంటలలో హైదరాబాదీ బిర్యానీ ఒకటి.&nbsp; మహేష్‌కు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం."ఎమోషనల్ ఇంటెలిజెన్స్" మహేష్‌కి ఇష్టమైన పుస్తకం. మహేష్ బాబుకి ఫిల్మ్ అవార్డ్స్ మహేష్ బాబు ఎనిమిది ప్రతిష్టాత్మక నంది అవార్డులు, ఐదు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు, మూడు సిని'మా' అవార్డులు, మూడు సంతోషం ఫిల్మ్ అవార్డులు, నాలుగు SIIMA అవార్డులు అందుకున్నారు. https://www.youtube.com/watch?v=4TljKLaVuM0
    ఏప్రిల్ 08 , 2024
    SS RAJAMOULI: రాజమౌళి సినిమాల్లో కామన్‌గా కామాంధుడి పాత్ర… అసలు ఎందుకిలా ?
    SS RAJAMOULI: రాజమౌళి సినిమాల్లో కామన్‌గా కామాంధుడి పాత్ర… అసలు ఎందుకిలా ?
    దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సినిమాను ఎమోషన్‌తో నడిపిస్తాడు. ప్రేక్షకులు చిత్రంలో లీనమయ్యేందుకు కొన్ని క్యారెక్టర్లను సృష్టిస్తాడు. తన సినిమాల్లో ఓ కామాంధుడి పాత్ర కామన్‌గా ఉంటుంది. మెుదటి సినిమా స్టూడెంట్‌ నంబర్‌ 1 నుంచి మెుదలుకొని చాలా సినిమాల్లో మనకు ఈ పాత్రలు కనిపిస్తాయి. ఆ క్యారెక్టర్లు ఏంటో ఓసారి చూద్దాం..&nbsp; స్టూడెంట్‌ నంబర్‌ 1 ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్‌ నంబర్‌ 1 సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాజమౌళి. ఈ చిత్రంలో ఛత్రపతి శేఖర్‌ ఓ అమ్మాయిని రేప్ చేయాలని చూస్తుండగా హీరో వాళ్లని అడ్డుకుంటాడు. ఫైట్‌ చేసి అమ్మాయిని రక్షిస్తాడు. ఈ క్రమంలో మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు ఎన్టీఆర్. ఇలాంటి ట్విస్ట్‌తో స్క్రీన్‌ప్లే మార్చేశాడు జక్కన్న. https://www.youtube.com/watch?v=z3zTPvCLNcI సింహాద్రి ఎన్టీఆర్‌తో సింహాద్రి సినిమా తీసి ఊర మాస్ హిట్‌ కొట్టాడు రాజమౌళి. ఇందులో విలన్ రాహుల్‌ దేవ్‌ కామాంధుడి పాత్రలో కనిపిస్తాడు. అత్యంత కిరాతకాలు చేస్తున్న అతడిని చంపేయడంతో సింగమలై అని ఎన్టీఆర్‌ను పిలుస్తుంటారు. అతడిని చంపేయడంతోనే సినిమా కీలక టర్న్ తీసుకుంటుంది. సింగమలై అంటూ కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు హైలెట్‌. ఈ సినిమా కథను తొలుత&nbsp; ప్రభాస్‌కు చెప్పాడట రాజమౌళి.&nbsp; https://www.youtube.com/watch?v=53DHset7VEw సై.. నితిన్‌ హీరోగా కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రం సై. ఇందులో రగ్బీ గేమ్‌తో సంచలనం సృష్టించాడు జక్కన్న. ఈ చిత్రంలోనూ విలన్‌ ప్రదీప్‌ రావత్‌కు అమ్మాయిల వీక్‌నెస్‌ ఉంటుంది. హీరో ముప్పు తిప్పలు పెడుతున్న వేళ శశికళ అనే అమ్మాయి దగ్గరికి వెళతాడు. వీళ్లిద్దరి మధ్య కూడా కొన్ని కామెడీ సన్నివేశాలు తీశాడు దర్శకుడు. https://www.youtube.com/watch?v=FUqXJb37DU4 ఛత్రపతి ఛత్రపతిలో ఎన్ని పాత్రలు ఉన్న షఫీ క్యారెక్టర్‌ ప్రత్యేకం. సినిమాలో ప్రభాస్‌ చెల్లిలి బస్సులో వెళ్తుండగా అసభ్యంగా ప్రవర్తిస్తాడు షఫీ. అతడిని చితక్కొట్టి గుండు గీయిస్తాడు ప్రభాస్. అక్కడే వాళ్లిద్దరూ అన్నదమ్ములు అని తెలుస్తోంది. ఇలా ప్రేక్షకులు చిత్రంలో లీనమయ్యేలా చేశాడు దర్శక దిగ్గజం రాజమౌళి.&nbsp; https://www.youtube.com/watch?v=_rImbIj2wp8 విక్రమార్కుడు విక్రమార్కుడులో బావూజీ కుమారుడిగా నటించిన అమిత్ తివారిది కామాంధుడి పాత్ర. ఊర్లో నచ్చిన మహిళను తీసుకెళ్లి రేప్ చేస్తుంటాడు. అతడిని చితకబాది జైలులో వేస్తాడు రవితేజ. ఈ ఒక్క సీన్‌తో విక్రమ్ రాథోడ్‌ పవర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు రాజమౌళి.&nbsp; ఈ సీన్‌ సినిమాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. https://www.youtube.com/watch?v=Tf8N3VNHt8w మగధీర మగధీరలోనూ రాజమౌళి కామాన్ని ప్రధాన ఇతివృత్తంగా మేళవించాడు.&nbsp; మిత్రవిందపై రణదేవ్ బిల్లా కన్నపడుతుంది. పునర్జన్మల నేపథ్యంలోనూ రణదేవ్ కామంధుడి&nbsp; క్యారెక్టర్‌లో కొనసాగుతాడు. కాజల్‌పై ఉన్న ఇష్టాన్ని తరచూ చూపిస్తుంటాడు. ఇలా విలన్‌ పాత్రను ప్రేక్షకులకు నచ్చకుండా చేస్తూ హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్‌ చేశాడు జక్కన్న. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. https://www.youtube.com/watch?v=Fl2plgSlZnE ఈగ ఈగలో కిచ్చ సుదీప్‌ క్యారెక్టర్‌ కూడా దాదాపు ఇలాంటిదే. సినిమా ప్రారంభంలోనే హంసనందినితో వచ్చే సన్నివేశాలు.. తర్వాత సమంతను ఇష్టపడుతూ ఆమెతో ట్రావెల్‌ చేస్తున్న సంఘటనలతో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. https://www.youtube.com/watch?v=fUY1hIAZyzo బాహుబలి 2 బాహుబలి 2లోనూ ఓ కామంధుడి పాత్ర మనకు కనిపిస్తుంది.&nbsp; దేవసేన దైవ దర్శనం కోసం వస్తుంటే సేతుపతి( రాకేష్ వర్రే) ఆమెను అవమానించాలని ప్రయత్నిస్తాడు. ఆమెతో వస్తున్న మహిళలను అసభ్యంగా తాకుతూ.. దేవసేనను తాకెందుకు ప్రయత్నిస్తాడు. దేవసేన కత్తితో అతని వేళ్లను నరుకుతుంది. ఈ సీన్‌ తర్వాత కోర్ట్ సీన్‌లో ప్రభాస్ సేతుపతి తల నరికే సన్నివేశం గూస్‌బంప్స్ కలిగిస్తుంది.&nbsp; https://youtube.com/shorts/Ih_Dnp-BbaI?feature=share https://telugu.yousay.tv/ssmb29-rajamoulis-huge-sketch-for-maheshs-film-talks-with-kamal-haasan-chiyan-vikram.html
    ఏప్రిల్ 25 , 2023

    @2021 KTree