రివ్యూస్
YouSay Review
Swag Movie Review: స్త్రీ, పురుషులలో ఎవరు గొప్పో చెప్పేసిన శ్రీవిష్ణు.. ‘స్వాగ్’తో హిట్ కొట్టినట్లేనా?
వివైధ్య కథలకు కేరాఫ్‌గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్వాగ్’ (Swag Movie) ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) వంటి సూపర్ హి...read more
How was the movie?
తారాగణం
శ్రీ విష్ణు
రీతూ వర్మ
మీరా జాస్మిన్
దక్ష నాగర్కర్
రవిబాబు
సునీల్
గెటప్ శ్రీను
సిబ్బంది
హసిత్ గోలీదర్శకుడు
టీజీ విశ్వ ప్రసాద్నిర్మాత
కథనాలు
Swag Movie Review: స్త్రీ, పురుషులలో ఎవరు గొప్పో చెప్పేసిన శ్రీవిష్ణు.. ‘స్వాగ్’తో హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు : శ్రీవిష్ణు, రితూ శర్మ, దక్ష నగర్కర్, మీరా జాస్మిన్, సునీల్, గెటప్ శ్రీను, రవి బాబు, గోపిరాజు రమణ, శరణ్య ప్రదీప్ తదితరులు
రచన, దర్శకత్వం : హసిత్ గోలి
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్
ఎడిటింగ్: విప్లవ్
నిర్మాత : టి. జి. విశ్వప్రసాద్
విడుదల తేదీ: 04-10-2024
వివైధ్య కథలకు కేరాఫ్‌గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్వాగ్’ (Swag Movie) ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) వంటి సూపర్ హిట్ తర్వాత హసిత్ గోలి (Hasith Goli) దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం ఇది. ఇందులో రీతూవర్మ (Ritu Varma), మీరా జాస్మిన్ (Meera Jasmine), దక్ష నగర్కర్ (Daksha Nagarkar) కథానాయికలుగా చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? శ్రీవిష్ణు-హసిత్ గోలి కాంబోకు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
శ్వాగనిక వంశానికి సంబంధించి కథ సాగుతుంది. 1550 ప్రాంతంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగ, ఆడవారి మధ్య ఆధిపత్య తగాదాలు ఉండేవి. భవభూతి మహారాజు (శ్రీవిష్ణు) తన సతీమణి(రీతువర్మ)ని గుప్పెట్లో పెట్టుకోవాలని ప్లాన్ వేసి అందులో విజయం సాధిస్తాడు. అప్పటి నుండి రాజ్యంలోని మహిళలు అంతా అతని ఆధీనంలో ఉంటారు. ఇక అతని తర్వాతి సంతతిలో యభూతి (శ్రీవిష్ణు)కి వరుసగా ఆడపిల్లలు పుడతారు. తర్వాత మగపిల్లలు కవలలుగా పుడతారు. కానీ, తన స్నేహితుడు(సునీల్)కి మగపిల్లలు లేరని తన ఇద్దరి పిల్లల్లో ఒకరిని దానం చేసేస్తాడు. కాలక్రమేణా శ్వాగనిక వంశానికి చెందిన వారు చెల్లాచెదురు అవుతారు. కట్ చేస్తే శ్వాగనిక వంశానికి చెందిన సంపద ఓ చోట భద్రంగా ఉంటుంది. ఆ వంశానికి చెందిన వారసుడికి అది ఇవ్వాలని నిర్ణయిస్తారు. ఈ క్రమంలో తామే శ్వాగనిక వంశానికి చెందినవారమంటూ కొందరు వస్తారు. ఇంతకీ వారు ఎవరు? సంపద వారికి దక్కిందా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
యువ నటుడు శ్రీవిష్ణు తన నటనతో అదరగొట్టాడు. భవభూతి మహారాజు, యభూతి, భవభూతి, విభూతి, సింగ వంటి ఐదు పాత్రల్లో అతడు కనిపించాడు. యభూతి పాత్రతో ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాడు. భవభూతి పాత్రతో నవ్విస్తూ ఆకట్టుకున్నాడు. రీతూవర్మ కూడా తన పర్ఫామెన్స్‌తో మెప్పించింది. 11 ఏళ్ల తర్వాత తెలుగు తెరపై రీఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ తన నటనతో పర్వాలేదనిపించింది. దక్షా నగర్కర్ తన గ్లామర్‌తో మంచి మార్కులు కొట్టేసింది. నటనకు పెద్దగా స్కోప్ లభించలేదు. రవి బాబు, సునీల్, గెటప్ శ్రీను వంటి నటులు ఉన్నప్పటికీ సినిమా మెుత్తం శ్రీవిష్ణు మీదనే తిరగడంతో వారి పాత్రలు హైలేట్ కాలేదు. మిగిలిన పాత్రదారులు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు హసిత్ గోలి ఎంపిక చేసుకున్న పాయింట్ బాగుంది. కానీ టేకింగ్ చాలా గందరగోళంగా అనిపిస్తుంది. తొలి అర్ధభాగంలో దాదాపు 40 నిమిషాల వరకు కథేంటో తెలీదు. ఆ టైంలో వచ్చే కామెడీ కాస్త ఊరటనిస్తుంది. భవభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆసక్తిగా చూపించి కథలోకి తీసుకెళ్లారు డైరెక్టర్. ఇంటర్వెల్ బ్లాక్ గజిబిజిగా అనిపించినా ఓకే అనిపిస్తుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ విషయానికి వస్తే యభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు నవ్వించేలా ఉన్నాయి. కానీ క్లైమాక్స్ మళ్ళీ గందరగోళంగానే ముగుస్తుంది. ‘లింగ వివక్ష అనేది సమాజానికి చీడ’ అన్నట్టు ఓ లైన్‌తో ముగించారు దర్శకుడు. అయితే అర్దాంతరంగానే సినిమా ముగిసిన భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యుజింగ్‌గా అనిపిస్తుంది. సినిమా మెుత్తం పూర్తి ఏకాగ్రతతో చూస్తే తప్ప అర్ధమయ్యేలా లేదు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే వివేక్ సాగర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్‌గా మారాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్డెట్ తక్కువే అయినా మంచి రిచ్ ఔట్‌పుట్‌ను అందించారు.
ప్లస్ పాయింట్స్
కథశ్రీవిష్ణు నటనకామెడీ
మైనస్ పాయింట్స్
కన్ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లేస్లో నేరేషన్
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 04 , 2024
This Week Movies: ఈ వారం రిలీజయ్యే చిత్రాలు.. ‘దేవర’కు స్పీడ్ బ్రేకులు వేయగలవా!
థియేటర్లలో దేవర ప్రభజనం కొనసాగుతున్న వేళ తమ సత్తా ఏంటో చూపించేందుకు పలు చిన్న చిత్రాలు ఈ వారం థియేటర్లలోకి రాబోతున్నాయి. దసరా సెలవుల నేపథ్యంలో మిమల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు మీకోసం స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? ఏ రోజున రిలీజ్ కాబోతున్నాయి? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
స్వాగ్ (Swag)
వివైధ్య కథలకు కేరాఫ్‌గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్వాగ్’ (Swag Movie) ‘రాజ రాజ చోర’ వంటి సూపర్ హిట్ తర్వాత హసిత్ గోలి దర్శకత్వంలో వస్తోన్న రెండో చిత్రం ఇది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక వంశ వృక్షంలోని పలు భిన్న తరాల కథల్ని ఇందులో చెప్పనున్నట్లు చిత్రం తెలిపింది. ఇందులో రీతూవర్మ, మీరా జాస్మిన్, దక్ష నగర్కర్ కీలక పాత్రలు పోషించారు.
చిట్టి పొట్టి (Chitti Potti)
రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చిట్టి పొట్టి’ (Chitti Potti). భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించడంతో పాటు దర్శకత్వం వహించారు. సిస్టర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దారు. అక్టోబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
దక్షిణ (Dakshina)
తమిళ నటి సాయి ధన్సిక నటించిన తాజా చిత్రం ‘దక్షిణ’ (Dakshina Movie). అక్టోబరు 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మంత్ర’, ‘మంగళ’ సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఓషో తులసిరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా సాయిధన్సిక ఇందులో కనిపించనున్నారు.
కలి (Kali)
ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న మరో సైకలాజికల్ థ్రిల్లర్ ‘కలి’ (Kali). ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించారు. శివ సాషు దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అతి మంచితనం వల్ల ఇబ్బందులు పడే ఓ వ్యక్తిలైఫ్‌లోకి ఒక అపరిచితుడు రావడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.
బహిర్భూమి (Bahirbhoomi)
నోయల్, రిషిత నెల్లూరు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘బహిర్భూమి’ (Bahirbhoomi). ఈ చిత్రాన్ని మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మించారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 4న విడుదలకు సిద్ధమైంది. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu)
ప్రముఖ నటి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ’35 చిన్న కథ కాదు’. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు.ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ వీకెండ్‌లో మిమల్ని అలరించేందుకు ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 2 నుంచి ఆహా వేదికగా ఈ సినిమాను వీక్షించవచ్చు.
బ్లింక్ (Blink)
‘దసర’ ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా చేసిన కన్నడ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'బ్లింక్'. మేలో అమెజాన్ ప్రైమ్ వేదికగా కన్నడలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. తాజాగా తెలుగు వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆహా వేదికగా సెప్టెంబర్ 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో డిఫరెంట్ నరేషన్‍తో వచ్చిన ఈ మూవీ బాగా పాపులర్ అయ్యింది.
కళింగ (Kalinga)
ధృువ వాయు హీరోగా నటించిన రీసెంట్ చిత్రం 'కళింగ'. అతడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రగ్యా నయన్ హీరోయిన్‌గా చేసింది. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్ ఎలిమెంట్స్‌కు ఫాంటసీ అంశాలను జోడించి దర్శకుడు ఈ మూవీని రూపొందించారు. సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ వారం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆహా వేదికగా సెప్టెంబర్ 2 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateTim Dillan MovieEnglishNetflixOct 01Sheffs TableSeriesEnglishNetflixOct 02Love Is BlindSeriesEnglishNetflixOct 02Unsolved Mysteries 5SeriesEnglishNetflixOct 02Hearts Topper 3SeriesEnglishNetflixOct 03CTRLSeriesHindiNetflixOct 04House Of Spoilers SeriesEnglishAmazonOct 03The TribeSeriesEnglishAmazonOct 04The SignatureMovieHindiZee 5Oct 23Amar Prem Ki Prem KahaniMovieHindiJio CinemaOct 04Furiosa: A Mad Max SagaMovieEnglishJio CinemaOct 2335 Chinna Katha KaduMovieTeluguAhaOct 02Balu Gani TalkiesMovieTeluguAhaOct 04
సెప్టెంబర్ 30 , 2024
Sree Vishnu: మైండ్ బ్లోయింగ్ రిస్క్ చేస్తున్న శ్రీ విష్ణు.. సినీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్!
యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu).. జయపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇటీవల ఆయన చేసిన చిత్రాలు హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగానూ మారిపోయాడు. కెరీర్ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన శ్రీవిష్ణు.. ప్రస్తుతం సోలో హీరోగా దూసుకెళ్తున్నాడు. రీసెంట్‌గా ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో కెరీర్ బెస్ట్ వసూళ్లను సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇదిలా ఉంటే తన లేటెస్ట్ చిత్రం ‘స్వాగ్’ (SWAG) కోసం శ్రీ విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
14 విభిన్న పాత్రల్లో..
యువ నటుడు శ్రీ విష్ణు.. ప్రస్తుతం 'స్వాగ్' (SWAG) అనే చిత్రంలో చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని 'రాజ రాజ చోర' డైరెక్టర్ హసిత్ గోలి రూపొందిస్తున్నారు. దాంతో ఈ కాంబినేషన్‌పై మంచి హైప్ ఏర్పడింది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం.. ఈ మూవీలో శ్రీ విష్ణు 14 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. అందులో ఒకటి ట్రాన్స్‌జెండర్ పాత్ర కూడా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. ఇదే నిజమైతే ఏ హీరో చేయని సాహాసాన్ని శ్రీ విష్ణు చేస్తున్నట్లే చెప్పాలి. కాగా, ఈ మూవీలో రీతు వర్మ హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే రిలీజైన టైటిల్ టీజర్, హీరోయిన్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇండియాలోనే తొలిసారి!
దిగ్గజ నటుడు కమల్ హాసన్ (Kamal Hassan).. ‘దశావతారం’ చిత్రంలో 10 విభిన్నమైన పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రతీ పాత్రలో తనదైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే యంగ్ హీరో శ్రీ విష్ణు.. ఈ రికార్డును బీట్ చేయబోతున్నట్లు లేటెస్ట్ బజ్‌ను బట్టి తెలుస్తోంది. భారత సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఏ హీరో 14 విభిన్న పాత్రలు పోషించలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి శ్రీ విష్ణు ఈ డేరింగ్ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా ప్రశంసనీయమేనని చెబుతున్నారు. అయితే రోల్స్ సినిమాను ఏ మేరకు సక్సెస్ చేస్తాయో వేచి చూడాల్సి ఉందని అంటున్నారు.
కీలక పాత్రలో మీరా జాస్మిన్
‘స్వాగ్’ చిత్రంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ 'మీరా జాస్మిన్' కీలక పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆమె పాత్రకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను సైతం ఇటీవల మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో మీరా జాస్మిన్ భారీ ఆభరణాలతో డిజైనర్ వేర్ కాస్ట్యూమ్‌లో రాణిలాగా ముస్తాబై కనిపించింది. రిలీజ్ అనంతరం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, స్వాగ్ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు.
https://twitter.com/movielovers1021/status/1797136038881837295
శ్రీవిష్ణు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
శ్రీ విష్ణు గత ఆరు చిత్రాలను పరిశీలిస్తే అందులో నాలుగు (రాజ రాజ చోర, అల్లూరి, సామజవరగమన, ఓం భీమ్ బుష్) మంచి హిట్ టాక్ సాధించాయి. మిగిలిన రెండు (భళా తందనాన, అర్జున పాల్గుణ) యావరేజ్‌గా నిలిచాయి. ప్రస్తుతం అతడి కెరీర్ హైప్‌లో ఉండటంతో నిర్మాతలు అతడితో సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం అతడు ‘స్వాగ్’ సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. ‘SV18’, ‘SV19’ ప్రొడక్షన్ టైటిల్స్‌తో ప్రస్తుతం అవి షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాలు కూడా సక్సెస్ అయితే టాలీవుడ్‌లో శ్రీ విష్ణుకు తిరుగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
View this post on Instagram A post shared by Geetha Arts (@geethaarts)
జూన్ 04 , 2024
Double iSmart Heroine: అధికారికంగా చెప్పకపోయినా ఆ బ్యూటీ ఎవరో టీజర్‌లో తెలిసిపోయింది
రామ్ పొత్తినేని(RAPO) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న డబుల్ ఇస్మార్ట్ టీజర్ రానే వచ్చింది. నేడు (మే 15) సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను రిలీజ్ చేసింది. టీజర్ ఆసాంతం పవర్ ఫ్యాక్డ్ యాక్షన్ డైలాగులతో ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. టీజర్‌లో రామ్ లుక్స్, స్ట్రైల్, స్వాగ్ వెటికవే ప్రత్యేకంగా ఉన్నాయి. పూరి జగన్నాథ్.. రామ్‌పై(Ram Pothineni) సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్స్‌లు ప్లాన్ చేసినట్లు టీజర్‌ను బట్టి అర్ధమవుతోంది. ఈ సినిమాలో అలీ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. టీజర్‌లో అలీ భిన్నమైన గెటప్‌లో కనిపించాడు. మరోసారి పూరి- అలీ కామెడీ మ్యాజిక్ అవిష్కృతం కానుంది.
Double ismart Dialogues
ఇక ఈ చిత్రంలో మేయిన్ విలన్‌గా నటిస్తున్న సంజయ్ దత్‌ను కూడా టీజర్‌లో క్రూరంగా చూపించారు. ఇక టీజర్‌లో రామ్ పొత్తినేని చెప్పే లాస్ట్ డైలాగ్ ఊర మాస్‌గా ఉంటుంది. “నాకు తెల్వకుండా నాపైనా సినిమా ప్లాన్ చేస్తే..నా గుడ్డులో మండుతది” అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఇలాంటి మాస్ డైలాగ్‌లు డబుల్ ఇస్మార్ట్‌లో అలరించనున్నట్లు అర్థమవుతోంది. ఇక మణిశర్మ అందించిన సంగీతం ఇస్మార్ట్ శంకర్ చిత్రం మాదిరి గ్రాండ్‌గా ఉంది. ముఖ్యంగా BGM సూపర్బ్‌గా ఉంది. మరి సాంగ్స్ ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.
https://twitter.com/TheAakashavaani/status/1790604878475301304
సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్
డబుల్ ఇస్మార్ట్ టీజర్(Double ismart Teaser) ఇచ్చిన హైప్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. సోషల్ మీడియాలోనూ సినిమా టీజర్‌పై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
https://twitter.com/warriorkrishnaa/status/1790606705455497645
యాక్షన్ ప్యాక్‌డ్ టీజర్ అంటూ క్రిష్ణ అనే నెటిజన్ కామెంట్ చేశాడు. చివర్లో సూపర్బ్ అంటూ చెప్పుకొచ్చాడు.
డబుల్ ఇస్మార్ట్ టీజర్ బాగుందంటూ శ్రీహర్ష అనే మరో నెటిజన్ కామెంట్ చేశాడు. రామ్ ఎనర్జీ ఎప్పటిలాగే అదిరిపోయిందని, బీజీఎం, సాంగ్ ర్యాపో అంచనాలు అందుకుందని చెప్పుకొచ్చాడు.
https://twitter.com/NameisSrii/status/1790603578266321121
డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ రివీల్
ఇక ఈ సినిమా హీరోయిన్ గురించి ఎక్కడా ఇంతవరకు అధికారికంగా(Double ismart heroine) ప్రకటించనప్పటికీ.. సినిమా టీజర్‌లో హీరోయిన్ ఎవరో రివీల్ అయింది. టీజర్‌లో వచ్చే ''ఇస్మార్ట్ ఇంకర్‌కా స్టైల్ క్యా మాలూమ్..కిర్రాక్ పోరొస్తే సైట్ మార్..కతర్నాక్ బీట్ వస్తే.. స్టెపా మార్" అంటూ చెప్పే డైలాగ్‌లో కావ్యా థాపర్(Kavya Thapar) కనిపిస్తుంది.
ఏక్ మినీ కథ, ఈగల్ సినిమాలో నటించిన కావ్యా థాపర్.. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ పొత్తినేనితో రొమాన్స్ చేయనుంది. ఈ గ్లామర్ డాల్ టీజర్‌లో కొన్ని క్షణాలే కనిపించినప్పటికీ.. స్మైలింగ్ లుక్, ఆకట్టుకునే అందంలో కనిపించింది. ఈ ముద్దుగుమ్మను చూస్తుంటే మరోసారి అందాల విందు తప్పదని అర్ధమవుతోంది.
పూరి జగన్నాథ్ సినిమా అంటేనే హీరోయిన్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా యూత్‌ను దృష్టిలో ఉంచుకుని హీరోయిన్ క్యారెక్టర్లను పూరి డిజైన్ చేస్తుంటాడు. గతంలో వచ్చిన నభా నటేష్,ఆసిన్, అనుష్క, నిధి అగర్వాల్, హన్సిక, అదా శర్మ పూరి సినిమాల్లో హీరోయిన్లుగా నటించి కుర్రకారుకు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు. తాజాగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ టీజర్ ద్వారా కావ్యథాపర్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పూరి కనెక్ట్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక సినిమాలో కావ్యా థాపర్(Kavya Thapar)తో రామ్ పొత్తినేనికి మంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని సమాచారం.
'ఏక్ మినీ కథ' చిత్రంతో గుర్తింపు పొందిన కావ్యా థాపర్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. క్యూట్‌గా కనిపిస్తూనే హాట్ ట్రీట్ ఇవ్వగలదని ఇప్పటికే ఈగల్ చిత్రం ద్వారా నిరూపితమైంది. ఈక్రమంలోనే కావ్య థాపర్‌ను డబుల్ ఇస్మార్ట్‌లో హీరోయిన్‌గా తీసుకున్నారని తెలిసింది.
నార్త్ బ్యూటీ అయిన కావ్యా థాపర్ ప్రస్తుతం దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది.
తెలుగులో ఈ మాయ పేరేమిటో, ఏక్ మినీ కథా, రవితేజతో కలిసి ఈగల్ చిత్రంలో నటించింది
అటు సాండిల్ వుడ్‌లో బిచ్చగాడు 2లో కావ్యా థాపర్ హీరోయిన్‌గా చేసింది. గతేడాది మే 19న ఈ సినిమా విడుదలైంది. అప్పట్లో ఈమె ప్రమోషన్లలో పాల్గొన్న తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.
మహారాష్ట్రకు చెందిన ఈ భామ 2013లో ‘తత్కాల్’ అనే షార్ట్‌ఫిల్మ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. సినిమాలతో పాటు సోషల్‌మీడియాలోనూ కావ్య బిజీబిజీగా ఉంటోంది. హాటో ఫొటో షూట్‌లతో ఎప్పటికప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది.
మే 15 , 2024
Pushpa 2 Teaser: టాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న ‘పుష్ప 2’ టీజర్.. కారణం ఏంటంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా చేస్తున్న 'పుష్ప 2' (Pushpa 2) కోసం సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేస్తోంది. ఇవాళ అల్లు అర్జున్ (HBD Allu Arjun) పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. సినిమాలో ఎంతో కీలకమైన జాతర సన్నివేశానికి సంబంధించిన క్లిప్‌ను టీజర్ రూపంలో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.
టీజర్‌లో ఏముంది?
'పుష్ప 2'కు సంబంధించిన లేటెస్ట్ టీజర్‌లో బన్నీ చాలా పవర్‌ఫుల్‌గా, ఫెరోషియస్‌గా కనిపించాడు. అమ్మవారి గెటప్‌లో మాస్ అవతారంతో గూప్‌బంప్స్ తెప్పించాడు. జాతరలో ఫైట్‌కు సంబంధించిన సీన్‌ను మేకర్స్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ నడిచే స్టైల్, స్వాగ్ అదిరిపోయాయి. కాళ్లకు గజ్జెలు, చెవులకు రింగ్స్, కళ్లకు కాటుకతో ‘పుష్ప రాజ్’ లుక్ అదిరిపోయింది. టీజర్‌లో రివీల్ చేసిన ఫైట్ సీక్వెన్స్ థియేటర్లను మోత మోగించేలా కనిపిస్తోంది. ఇక టీజర్‌లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్ అనేలా ఉంది. ఓవరాల్‌గా ఈ టీజర్ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. అల్లు అర్జున్ బర్త్ డేకు ఈ టీజర్ పర్ఫెక్ట్ గిఫ్ట్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
https://twitter.com/i/status/1777210307448029663
రిలీజ్ ఎప్పుడంటే?
పుష్ప 2 సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తోపాటు రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ 2021లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'పుష్ప 2'పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఏప్రిల్ 08 , 2024
ALLU ARJUN SON: “ఇక నా పిల్లల చేత శ్రీవల్లి పాట పాడిస్తా”.. అయాన్ టాలెంట్‌కు షారుక్ ఫిదా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పాడిన ఓ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ డుంకీ చిత్రంలోని లుట్ ఫుట్ గయా పాటను మంచి రిదమ్‌తో పాడాడు. ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేయగా SRK ఫ్యాన్స్‌తో పాటు బన్నీ ఫ్యాన్స్ సైతం అయాన్ ప్రతిభను ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఈ వైరల్ వీడియో షారుఖ్ ఖాన్‌కు చేరింది. అయాన్ టాలెంట్‌పై SRK స్పందిస్తూ.. నువ్వో ఫ్లవర్, ఫైర్ కలిగిన బుడ్డోడివి అంటూ ప్రశంసించాడు.
అల్లు అర్జున్ కొడుకు అయాన్.. సెలబ్రెటీ కిడ్ మాదిరిలా కాకుండా చాలా ఫ్రీగా ఉంటాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఇతర ఈవెంట్లలోనూ అప్పుడప్పుడు కనిపిస్తూ తన టాలెంట్‌ను చాటుతుంటాడు. తన తండ్రి స్టార్ డమ్‌ను ఏమాత్రం తనపై ప్రభావం లేకుండా చాలా స్వేచ్ఛగా మాట్లాడుతుంటాడు.
అయితే ఈ మధ్య అల్లు అర్జున్‌తో కారులో ట్రావెలింగ్ చేస్తున్న క్రమంలో తనకు ఇష్టమైన సాంగ్‌ను పాడుతా అంటూ బన్నీకి చెప్పాడు. రీసెంట్ మూవీ డుంకీ చిత్రంలోని "లుట్ ఫుట్ గయా" అంటూ తనదైన స్వాగ్‌లో అయాన్ హమ్ చేశాడు. బ్లాక్, వైట్ అండ్ ఎల్లో జెర్సీ వేసుకున్న అయాన్ చివర్లో షారుక్ ఖాన్ స్టైల్‌లో ఓ లుక్ ఇస్తూ ముగించాడు. ఈ వీడియోను అల్లు అర్జున్ ఫ్యాన్ పేజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైరల్ చేశారు. అయాన్‌కు గొప్ప భవిష్యత్ ఉందంటూ అతని ప్రతిభ ప్రశంసిస్తూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపించారు.
https://twitter.com/SRKUniverse/status/1761332479590297791?s=20
ఈ వైరల్ వీడియోపై బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ స్పందించారు. "నువ్వో ఫ్లవర్, ఫైర్ కలిగిన వ్యక్తివి అంటూ ప్రశంసించారు. అలాగే పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను తన పిల్లల చేత త్వరలో పాడిస్తానని ఎక్స్‌లో చెప్పుకొచ్చాడు. షారుక్ స్పందించడంపై అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు అగ్రహీరోల మధ్య జరిగిన ఈ స్వీట్ కాన్వర్జేషన్ ఫ్యాన్స్‌ను ఆకర్షించింది.
https://twitter.com/iamsrk/status/1761701819687030986?s=20
టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్.. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. గతంలో జవాన్ సినిమా విడుదలైన సమయంలో షారుక్ నటనను ప్రశంసిస్తూ బన్నీ కామెంట్ చేశాడు. మాస్ అవతార్‌లో షారుక్ లుక్ అదిరిపోయిందని, జవాన్ చిత్రం అతి పెద్ద బ్లాక్ బాస్టర్ అంటూ ప్రశంసించాడు. ఆ చిత్ర యూనిట్‌గా ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఈ పోస్ట్‌పై SRK సైతం స్పందించి థ్యాంక్స్ చెప్పాడు. తాను పుష్ప సినిమాను మూడు రోజుల్లో మూడు సార్లు చూసినట్లు చెప్పుకొచ్చాడు. ఖాళీ సమయం దొరికినప్పుడు ఒకసారి వ్యక్తిగతంగా కలుస్తానని పేర్కొన్నాడు.
https://twitter.com/iamsrk/status/1702214179212411127?s=20
తాజాగా అల్లు అర్జున్ కొడుకు అయాన్ వీడియో అదేస్థాయిలో షారుక్ స్పందించడం విశేషం. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మరోవైపు షారుక్ ఖాన్ డుంకీ తర్వాత తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించాడు.
ఫిబ్రవరి 26 , 2024
New Hair Styles : దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ హీరోల ఈ హేయిర్ స్టైల్స్ గురించి తెలుసా?
అబ్బాయిలు హ్యాండ్సమ్‌గా కనిపించేందుకు ఎక్కువగా హేయిర్ స్టైల్స్ మీద దృష్టి పెడుతుంటారు. అభిమాన హీరో ఎలాంటి హెయిర్ స్టైల్‌లో ఉంటే అలాంటి హెయిర్ కట్‌ను ఫాలో(New Hair Styles) అవుతుంటారు. ఇక సినిమాల్లోనూ అంతే.. ఎప్పుడు కొత్త లుక్‌లతో అభిమానులను హీరోలు మెస్మరైజ్ చేస్తుంటారు. హీరోలను హెయిర్ స్టైల్స్ సరికొత్తగా ఆవిష్కరిస్తుంటాయి.ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ హీరోల ఏ ఏ హేయిర్ స్టైల్స్ ట్రెండ్ అయ్యాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
[toc]
జూనియర్ ఎన్టీఆర్ హేయిర్ స్టైల్స్
జూనియర్ ఎన్టీఆర్ తన పాతికేళ్ల సినీ కెరీర్‌లో ఎంతో లుక్స్ పరంగా, స్టైల్ పరంగా ఎంతో ట్రాన్స్‌పామ్ అయ్యాడు. కెరీర్ తొలినాళ్లలో కర్లీ హెయిర్‌తో కనిపించిన తారక్ తర్వాత సినిమా, సినిమాకు హెయిర్ స్టైల్స్, లుక్స్ మారుస్తూ ట్రెండ్ సెట్ చేశాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో ఏ హెయిర్ స్టైల్‌తో కనిపించాడో ఇప్పుడు చూద్దాం.
బాద్‌షా
బాద్‌షా సినిమాలోనూ తారక్ లుక్ ట్రెండ్ సెట్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో జూ. ఎన్టీఆర్ 'డౌన్‌వార్డ్ ఫ్లిక్స్' హేయిర్ స్టైల్‌తో స్టైలీష్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్ యూత్ మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
జనతా గ్యారేజ్
ఈ సినిమాలో తారక్... 'సెమీ క్రూ'(semi Crew cut) హేయిర్ కట్‌తో స్టైలీష్‌గా కనిపించాడు.
టెంపర్
ఫస్ట్‌టైం ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్... సిక్స్ ప్యాక్ బాడీతో ట్సాన్స్‌పార్మ్ అయ్యాడు. ఈ సినిమాలో తారక్ స్టైలీష్‌గా కనిపించాడు. స్పైక్‌డ్ హేయిర్(Spiked hairStyle) స్టైల్‌తో కనిపించాడు.
యమదొంగ
యమదొంగ చిత్రంలో తారక్ లాంగ్ స్ట్రెయిట్ హెయిర్‌తో(Long Strait Hair) స్టైల్‌గా కనిపించాడు. ఈ చిత్రం తర్వాత ఆ హేయిర్ స్టైల్‌ను అనుకరించేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు.
నాన్నకు ప్రేమతో
ఇక ఈ సినిమాలో స్టైలీష్ లుక్‌లో తారక్ అలరించాడు. ఈ హెయిర్ స్టైల్‌ను ఎంతో మంది అభిమానులు ఫాలో అయ్యారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ పేరు పోంపాడర్ విత్ సైడ్ ఫేడ్(pompadour with side Fade). ఈ హేయిర్ స్టైల్ తారక్‌ను మరింత అందంగా కనిపించేలా చేసింది.
జై లవకుశ
ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ హేయిర్ స్టైల్ లుక్‌లో కనిపించాడు. జై పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. క్లాసిక్ సైడ్ పార్టింగ్ (classic Side Parting), లవ్‌కుమార్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ స్ట్రేయిట్ లాంగ్ హేయిర్ స్టైల్‌లో అందంగా కనిపించాడు.
దేవర
పాతాళ భైరవిలో రామారావు లుక్‌కు.. ‘దేవర’ (Devara)లోని తారక్ గెటప్‌ను నందమూరి ఫ్యాన్స్ మ్యాచ్ చేసుకుంటున్నారు. పరిశీలనగా చూస్తే అందరికీ ఇదే భావన కలుగుతుందని చెబుతున్నారు. తారక్ ‘దేవర’ సినిమాలో డ్యూయల్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఒక పాత్ర రింగుల జుట్టుతో కూడిన లాంగ్ హెయిర్‌తో ఉంటుంది. ఈ గెటప్‌లో తారక్ అచ్చం నందమూరి తారకరామారావు లాగా కనిపిస్తున్నాడని నెటిజన్లు సైతం అభిప్రాయపడ్డారు.
మహేష్ బాబు హేయిర్ స్టైల్స్
బాబి
తన కెరీర్ ప్రారంభంలో మహేష్ మిల్కీ బాయ్‌గా కనిపించేవాడు. దాదాపు పోకిరి సినిమా వరకు ఒకే ఒకే హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో చైల్డీష్ లుక్ హేయిర్ స్టైల్ లుక్‌తో కనిపించాడు.
పోకిరి
పోకిరి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న తన లుక్స్, స్టైల్, స్వాగ్‌ను మహేష్ పూర్తిగా మార్చేశాడు. ముఖ్యంగా అతని హేయిర్ స్టైల్ ఎంతో ఫేమస్ అయింది. ఈ హేయిర్ స్టైల్‌ను... అంటారు. ఈ చిత్రం తర్వాత మహేష్ అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యారు.
సైనికుడు
ఈ చిత్రంలో మహేష్ బాబు స్టూడెంట్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఫంక్ హేయిర్ స్టైల్‌తో హ్యాండ్సమ్‌గా కనిపించాడు.
అతిథి
అతిథి సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. బ్రౌన్ కలర్ జుట్టుతో పొడవాటి లాంగ్ హెయిర్‌తో రగ్గ్‌డ్ లుక్‌లో అలరించాడు
వన్ నేనొక్కడినే
ఈ సినిమాలో మహేష్ బాబు ట్రెండీ లుక్‌లో అలరించాడు. అతని స్పైక్‌డ్ హెయిర్ స్టైల్‌తో మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ.. మహేష్ బాబు నటనకు(Mahesh Babu Hair Styles) విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
SSMB29
‘SSMB 29 నేపథ్యంలో మహేష్ షేర్ చేసిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫోటోని షేర్ చేశాడు. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు.
సిద్దు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్
డీజే టిల్లు& టిల్లు స్కేర్
డీజే టిల్లు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ చాలా ఫేమస్ అయింది. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది కూడా. ఈ హెయిర్ స్టైల్‌ను తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్ అని పిలుస్తారు. టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హేయిర్ స్టైల్స్
భద్రినాథ్
ఈ చిత్రంలో అల్లు అర్జున్ యుద్ధ వీరుడిగా కనిపించాడు. బన్నీ హెయిర్ స్టైల్ చాలా క్రేజీగా ఉంటుంది. మ్యాన్ బన్స్(Man Buns) మరియు పోనిటేయిల్స్(ponytails) హేయిర్ స్టైల్స్‌తో ఆకట్టుకున్నాడు.
అల వైకుంఠపురములో
ఈ చిత్రంలో అల్లు అర్జున్ లాంగ్ వేవ్స్(Long waves)హేయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. టాప్‌లో పప్ బాటమ్‌లో వేవీ హెయిర్ లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ను అనేక మంది అతని (Allu Arjun Hair styles)అభిమానులు ట్రై చేశారు.
హ్యాపీ
హ్యాపీ చిత్రంలో బన్నీ స్పైక్స్ హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఈ హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది.
దువ్వాడ జగన్నాథం
ఈ సినిమాలో "ఫోర్ హెడ్ సెమీ ఫ్రింజ్" హేయిర్ స్టైల్‌తో ఇంప్రెస్ చేశాడు ఇది కూడా ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. ఇదే చిత్రంలో బన్నీ మరో స్టైలీష్ హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు ఫ్రింజ్ బ్యాంగ్ (fringe Bangs)
సరైనోడు
ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్లాసిక్ హేయిర్ స్టైల్‌లో కనిపిస్తాడు. ఈ హెయిర్ స్టైల్ పేరు పొంపాడర్ హేయిర్ లుక్
(Pompadour)
బన్నీ ఇతర హేయిర్ స్టైల్స్
అల్లు అర్జున్ ఎక్కువగా బయట థిక్ బియర్డ్‌తో లాంగ్ వేవీ వెట్ హేయిర్(long wavy wet-hair)లుక్ కనిపిస్తుంటాడు. ఈ హెయిర్ స్టైల్ బన్నీ ఫెవరెట్ అని తెలిసింది.
రామ్ చరణ్ హేయిర్ స్టైల్స్
గోవిందుడు అందరివాడేలే
ఈ చిత్రంలో రామ్ చరణ్ పోని టేయిల్(Pony Tail) హేయిర్ కట్‌లో స్టైలీష్‌గా కనిపిస్తాడు. ఈ హెయిర్ స్టైల్‌ను బాలీవుడ్‌లో షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ కూడా ఫాలో అయ్యారు. ఈ హేయిర్ కట్‌ను చెర్రీ అభిమానులు క్రేజీగా ఫాలోయ్యారు.
గేమ్ ఛేంజర్
లెటేస్ట్ గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ గెల్డ్ హేయిర్ స్టైల్‌తో ఫర్‌ఫెక్ట్ లుక్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు.
రామ్ చరణ్ ఇతర హేయిర్ స్టైల్స్
రామ్ చరణ్ పలు సందర్భాల్లో గుడ్ బాయ్ లుక్‌లో కనిపంచేవాడు. ఈ హేయిర్ కట్ పైరు "సైడ్ పార్టింగ్". షూటింగ్ లేని సమయాల్లో రామ్ చరణ్ ఎక్కువగా ఈ హేయిర్ స్టైల్‌లో ఉంటాడు.
మరికొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఇవెంట్లు, మీడియా సమావేశాల్లో చరణ్ ఈ హేయిర్ కట్‌లో కనిపిస్తుంటాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు 'మెస్సీ హెయిర్ లుక్'(messy Hair lock).ఈ టైప్ హేయిర్ స్టైల్ కూడా బాగా ట్రెండ్ అయింది. చెర్రీ అభిమానులు చాలావరకు ఈ టైప్ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యారు.
కొన్నిసార్లు లైట్ బియర్డ్, షార్ట్ సైడ్స్ హెవీ "పొంపాడర్ హెయిర్"(pompadour) లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్ కూడా చెర్రీకి బాగా కుదిరింది. అయితే ఇలాంటి(Ram charan Hair styles) హేయిర్ స్టైల్‌తో రామ్‌చరణ్ ఏ సినిమాలోనూ నటించలేదు.
విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్స్
లైగర్
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్‌పై క్రేజీ టాక్ నడిచింది. "లాంగ్ వేవీ"(Long Wavy) హేయిర్ కట్‌లో మేరిసాడు. ఈ హేయిర్ స్టైల్‌ను చాలా మంది అతని అభిమానులు ఫాలో అయ్యారు.
ఇదే చిత్రంలో దేవరకొండ 'మ్యాన్ బన్' హేయిర్ కట్‌లోనూ కనిపిస్తాడు. గతంలో అనేమంది సెలబ్రెటీలు ఈ స్టైల్‌ను ఫాలో అయినప్పటికీ... విజయ్‌కు సెట్ అయినట్లుగా మరెవరికీ సెట్ అవ్వలేదు.
డియర్ కామ్రెడ్
డియర్ కామ్రెడ్ చిత్రంలో విజయ్ కర్లీ & మెస్సీ హేయిర్ స్టైల్ లుక్‌లో కనిపించి అదరగొట్టాడు. ఈ హేయిర్ స్టైల్ సైతం విజయ్‌కి బాగా కుదిరింది. (Vijay Deverakonda Hair styles)ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
ఖుషి
ఈ చిత్రంలోనూ విజయ్ దేవరకొండ మ్యాన్లీ లుక్‌లో కనిపిస్తాడు. సమంత, విజయ్ కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.
ఫ్యామిలీ స్టార్
ఈ సినిమాలో లైట్‌గా గడ్డం, ఒత్తైన మీసాలతో డీసెంట్ లుక్ హేయిర్ స్టైల్‌ను విజయ్ దేవరకొండ కలిగి ఉన్నాడు. ఈ లుక్ చాలా మంది ఫ్యాన్స్ అట్రాక్ట్ చేసింది. ఈ హేయిర్ కట్‌ను చాలా మంది ఫాలో అయ్యారు.
రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్స్
స్కంద
ఈ సినిమా చేయడానికి ముందు.. రామ్ పొత్తినేని(RAPO) 'స్పైకీ' హేయిర్ స్టైల్‌లో రామ్ పొత్తినేని అలరించాడు. ఈ చిత్రంలో రామ్ హేయిర్ స్టైల్ క్రేజీ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ హేయిర్ స్టైల్‌ను అనేకమంది అభిమానులు ఫాలో అయ్యారు.
ఇస్మార్ట్ శంకర్
ఈ చిత్రంలో రామ్ పొత్తినేని లుక్స్, హేయిర్ స్టైల్, స్వాగ్ ట్రెండ్ సెట్ చేశాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత చాలా మంది అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయిపోయారు. ఈ చిత్రంలో రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్ పేరు "హై వాల్యూమ్ క్విఫ్ విత్ ఫేడ్" ( high-volume quiff with a fade) ఈ హేయిర్ కట్‌కు గడ్డం గంభీరంగా ఉంటేనే సెట్ అవుతుంది.
మే 22 , 2024
Double iSmart: డబుల్ ఇస్మార్ట్ రూ.100 కోట్లు కొల్లగొడుతాడా? గతం ఏం చెబుతుంది?
ఎనర్జిటిక్ హీరో రామ్ పొత్తినేని, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్(Double iSmart). ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. ఈ చిత్రం పూరి జగన్నాథ్, రామ్ కెరీర్‌కు కీలకం కానుంది. ఎందుకంటే పూరి తీసిన ‘లైగర్’(Liger) ఘోర పరాజయం చవిచూడటం.. రామ్ నటించి రెడ్, స్కంద చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో..వీరి కలయిక మళ్లీ అనివార్యమైంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. మనిషి మెడదులో వేరే వ్యక్తి ఆలోచనలకు సంబంధించిన చిప్ పెడితే ఎలా ప్రవర్తిస్తాడు అనే వినూత్న కాన్సెప్ట్‌తో వచ్చి మంచి విజయం సాధించింది. రీసెంట్‌గా ఈ చిత్రానికి సంబంధించి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. మే 15న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఒక రకమైన బజ్ ఏర్పడింది.
రూ.100 కోట్లు కొల్లగొట్టే ఛాన్స్
అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇండియాలో రూ.66 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ఈ సినిమాకు వస్తున్న సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంపై సహజంగానే అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందా? కనీసం దరిదాపుల్లోకైనా వస్తుందా అనే అంశాలపై చర్చ జరుగుతుంది.
టాలీవుడ్‌లో టైర్ 2 హీరోగా రామ్ పొత్తినేని ఉన్నప్పటికీ టైర్ 1 హీరో స్థాయిలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన మాస్ యాక్టింగ్, డాన్సింగ్‌తో ప్రేక్షకులను అలరించడంలో ఏమాత్రం తగ్గడు. ఇప్పటికే ఈ విషయం అతని సినిమాల ద్వారా నిరూపితమైంది. రామ్ పొత్తినేని- పూరి జగన్నాథ్ కాంబోలో సినిమా వస్తుండటం, ఇస్మార్ట్ శంకర్ చిత్రం హిట్ అవడం వంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇది డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి అనుకూలంశాలు. ఇవన్నీ ప్రేక్షకులను మొదటి రెండు రోజులు సినిమా థియేటర్లకు రప్పించేలా చేశాయి.
ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో బరిలో దిగిన ఇస్మార్ట్ శంకర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఓవరాల్‌గా రూ.80 కోట్లు కలెక్ట్ చేసి రామ్ పొత్తినేని సత్తా చాటాడు. దీంతో ఈ సినిమాకు కొనసాగింపుగా పూరి.. డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక రోల్‌లో నటిస్తున్నారు. తాజాగా విడుదలే చేసిన టీజర్ ప్రోమో ఆకట్టుకుంది. రామ్ గెటప్, స్వాగ్ కూడా చాలా బాగున్నాయి. ప్రోమోపై ప్రేక్షకులు పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. మే 15న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. మరి ఈ టిజర్ టాక్ ప్రి రిలీజ్ బిజినెస్‌పై ప్రభావం చూపనుంది. డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి రూ.100కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. పూరి- రామ్ హిటో కాంబో కావడంతో.. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ భారీ ధరకు చేజిక్కించుకునేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీపడుతున్నాయి. ఇప్పటికే చిత్రబృందానికి మంచి నంబర్ ఆఫర్ చేసినట్లు తెలిసింది.
కథ ఇదేనా?
ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ (Double iSmart Movie) సినిమా కథకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమాలో పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో రామ్ పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపిస్తాడని సమాచారం. యాక్షన్ - థ్రిల్లర్ నేపథ్యంలో ఇది సాగుతుందని అంటున్నారు. పైగా తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువగానే ఉండనుందట. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
పట్టుదలతో పూరి
డబుల్ ఇస్మార్ట్ మూవీని డైరెక్టర్ పూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఆయన గత మూవీ ‘లైగర్’ (Liger Movie) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం కావడంతో పూరీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. సినిమాకు ముందు ఆయన చేసిన కామెంట్స్ కూడా ఇందుకు కారణమయ్యాయి దీనిని అద్భుతంగా తెరకెక్కించి తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాలన్న కసిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా రేంజ్‌లో..
ఆ కారణంగానే ‘డబుల్ ఇస్మార్ట్’ను పాన్ ఇండియా స్థాయిలో పూరి జగన్నాథ్ రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని కేవలం సింగిల్ లాంగ్వేజ్ (తెలుగు)లో రిలీజ్ చేసిన పూరి.. సెకండ్ పార్ట్‌ను మాత్రం దేశంలోని పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. తద్వారా తన క్రేజ్‌ను జాతీయ స్థాయికి చేర్చాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు టాక్. ఇందులో భాగంగానే ‘డబుల్ ఇస్మార్ట్’ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
హీరో రామ్‌కూ కీలకం!
ఇక హీరో రామ్ కూడా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart Movie) చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘స్కంద’ (Skanda) చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా రాణించలేదు. పైగా ఈ సినిమాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలో యాక్షన్ మరి ఓవర్‌గా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అటు ఈ చిత్రానికి ముందు రామ్ చేసిన ‘వారియర్’ (Warrior Movie In Telugu)) కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక పోయింది. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రామ్‌కు ఎంతో కీలకంగా మారింది.
మే 14 , 2024
Pushpa 2 OTT Record: విడుదలకు ముందే RRR రికార్డు బ్రేక్.. ఇది పుష్పగాడి రూలు..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం పుప్ప2. తొలి పార్ట్ సూపర్ హిట్ కావడంతో ఈచిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం గురించి వినిపిస్తున్న లెటెస్ట్ బజ్ ప్రకారం.. ఈ సినిమా నార్త్ హక్కులే సుమారు 200 కోట్లకి అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఈ విషయంలో కల్కి, దేవర.. పుష్ప తరువాతే ఉన్నారని చెప్పవచ్చు. కల్కి నార్త్ రైట్స్ 100 కోట్లకు కొనుగోలు అయితే.. దేవర 50 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఇక ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే.. రిలీజ్ తరువాత నార్త్ లో పుష్ప రూల్ ఎలా ఉండబోతుందో కళ్లకు కడుతోంది. మరోవైపు పుష్ప 2 ఓటిటి (Pushpa 2 OTT Rights) హక్కుల కొనుగోలుపై కూడా రూమర్స్ అయితే చక్కర్లు కొడుతున్నాయి.
RRR రికార్డు బ్రేక్
తాజాగా వస్తున్న వార్తల ప్రకారం పుష్ప 2 ది రూల్ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఏకంగా ఈ సినిమా ఓటీటీ ప్రసార హక్కుల కోసం రూ.275 కోట్ల భారీ డీల్‌ను మూవీ మేకర్స్‌తో కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇది ఇండియాలోనే అత్యధికమైన డీల్ అని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో మరే చిత్రం ఈ స్థాయిలో అమ్ముడుపోలేదని చెబుతున్నారు. పుష్ప2కు ముందు.. RRR చిత్రం ఓటీటీ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయి. దీంతో అల్లు అర్జున్ RRR రికార్డును బ్రేక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5, నెట్‌ఫ్లిక్స్ కలిసి రూ.350 కోట్లకు దక్కించుకున్నాయి. అయితే నెట్‌ఫ్లిక్స్ ఇందులో మెజార్టీ వాటను నెట్ ఫ్లిక్స్ చెల్లించింది. అయితే మొత్తం పుష్ప 2 డీల్ కంటే తక్కువ అని తెలిసింది. RRR చిత్రాన్ని కన్నడ మినహా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కోసం నెట్‌ఫ్లిక్స్ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. జీ5 కన్నడ భాష ప్రసార హక్కులను దక్కించుకుంది. అయితే పుష్ప 2 ఓటీటీ ప్రసార హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఎన్ని భాషాల్లో స్ట్రీమింగ్ చేయనుందో తెలియాల్సి ఉంది. RRR సినిమా మాదిరి మెజారిటీ భాషల్లో ప్రసారం చేస్తుందా? లేక అన్ని భాషల్లో ప్రసార హక్కులను దక్కించుకుందో తెలియాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
మరోవైపు పుష్ప 2 థియేట్రికల్ ప్రి రిలీజ్ బిజినెస్ సైతం భారీగానే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం దాదాపు రూ.200కోట్లకు బయ్యర్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది.
టీజర్‌తో భారీ హైప్
పుష్ప 2 పై ఉన్న క్రేజ్ అభిమానుల్లో మాములు లెవల్లో అయితే లేదనే చెప్పాలి. ఇప్పటికే విడుదలైన పుష్ప 2 టీజర్ సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తిని సర్వత్రా కలిగించింది. టీజర్‌లో బన్నీ చాలా పవర్‌ఫుల్‌గా, ఫెరోషియస్‌గా కనిపించాడు. అమ్మవారి గెటప్‌లో మాస్ అవతారంతో గూప్‌బంప్స్ తెప్పించాడు. జాతరలో ఫైట్‌కు సంబంధించిన సీన్‌ను మేకర్స్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ నడిచే స్టైల్, స్వాగ్ అదిరిపోయాయి. కాళ్లకు గజ్జెలు, చెవులకు రింగ్స్, కళ్లకు కాటుకతో ‘పుష్ప రాజ్’ లుక్ అదిరిపోయింది. టీజర్‌లో రివీల్ చేసిన ఫైట్ సీక్వెన్స్ థియేటర్లను మోత మోగించేలా కనిపిస్తోంది. ఇక టీజర్‌లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్ అనేలా ఉంది. ఓవరాల్‌గా ఈ టీజర్ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చేసింది.
పుష్ప 2 రిలీజ్ ఎప్పుడంటే?
పుష్ప 2 సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తోపాటు రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ 2021లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'పుష్ప 2'పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో రష్మికా హీరోయిన్‌గా నటిస్తుండగా సునీల్, రావు రమేష్, ఫహద్ పాసిల్ అలాగే అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది.
ఏప్రిల్ 18 , 2024
Naa Saami Ranga Review: మాస్ యాక్షన్‌తో వింటేజ్ నాగార్జునను గుర్తు తెచ్చిన ‘నా సామిరంగ’... సినిమా హిట్టా? ఫట్టా?
సొగ్గాడే చిన్నినాయన చిత్రం తర్వాత కింగ్ నాగార్జున(Nagarjuna) కమర్షియల్ విజయం దక్కలేదు. మధ్యలో ఘోస్ట్ చిత్రం చేసినప్పటికీ.. విజయం వరించలేదు. దీంతో మరోసారి యాక్షన్ జనర్ నమ్ముకున్న నాగార్జున 'నా సామిరంగ' చిత్రం ద్వారా సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈ సినిమా విడుదలకు (Naa Saami Ranga Review) ముందు వచ్చిన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. సంక్రాంతి బరిలో నాగార్జునకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఈ పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలు సక్సెస్ సాధించాయి. దీంతో నా సామిరంగ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నాగార్జున హిట్ కొట్టాడా? YouSay సమీక్షలో చూద్దాం.
నటీనటులు
నాగార్జున, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్, కరుణ కుమార్, నాసర్, రావు రమేష్
కథ
ఒక ఊరిలో రంగా(నాగార్జున) స్నేహితులతో కలిసి సరదాగా జీవనం సాగిస్తుంటాడు. అవసరం ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. అలాంటి రంగాకి(Naa Saami Ranga Review) ఆ ఊరిలో కొంతమంది పెద్ద మనుషులతో గొడవ ఏర్పడుతుంది. ఇదే సమయంలో తన స్నేహితులు అయిన అంజి (అల్లరి నరేష్), భాస్కర్ (రాజ్ తరుణ్) చేసిన ఒక పని వల్ల ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి నష్టం ఏర్పడుతుంది. దీంతో ఆ పెద్ద మనుషులు వీరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. చంపడానికి కూడా సిద్ధపడుతారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో రంగా తన స్నేహితులను ఎలా కాపాడుకున్నాడు?. వరలక్ష్మి, రంగాల మధ్య ప్రేమ ఎలా ఉంది? తన స్నేహితులను చంపాలనుకున్న దుర్మార్గులను రంగా ఏం చేశాడు అనేది మిగతా కథ.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
కొరియోగ్రాఫర్ అయిన విజయ్ బిన్నికి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన నాగార్జున నమ్మకాన్ని బిన్ని నిలబెట్టుకున్నాడు. కథలో ఎక్కడా ఎమోషన్స్ పండించాలో అక్కడ పండించి క్యారెక్టర్స్‌కు తగ్గ ఎలివేషన్స్ అందించాడు. ఎక్కడ ఎమోషన్స్ మిస్ కాకుండా నాగార్జున మ్యానరిజాన్ని జాగ్రత్తగా వాడుకుని కామెడీ పండిచడంలో విజయవంతం అయ్యాడు.
సినిమా ఎలా ఉందంటే?
నా సామిరంగ ఫస్టాఫ్ మొత్తం నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కామెడీ ట్రాక్, ఆషికా రంగనాథ్(Ashika Ranganath) లవ్ ట్రాక్ అలరిస్తుంది. నాగార్జున, రాజ్ తరుణ్, అల్లరి నరేష్‌ల మధ్య నడిచే కామెడీ సీన్స్ బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుంది. సెకండాఫ్ పూర్తి సీరియస్‌గా నడుస్తుంది. ఓ కీలక పాత్ర చనిపోవడంతో నాగార్జున ప్రతీకారం తీర్చుకునేందుకు విలన్లపై పొరాడుతుంటాడు. ఎమోషనల్ సీన్లు బాగున్నప్పటికీ..కొన్ని సీన్లల్లో లెంత్ మరీ ఎక్కువ అయిపోయింది. దాన్ని లాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే (Naa Saami Ranga Review in Telugu) ఈ సినిమాలో కొన్ని సీన్లు అనవసరంగా పెట్టారు అనే భావన కనిపిస్తుంది. అయితే ఈ సినిమా లో హీరోయిజంతో పాటు ఆషిక రంగనాథ్‌తో నాగార్జున రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాయి.
ఎవరెలా చేశారంటే?
నా సామిరంగ(Naa Saami Ranga ) సినిమాలో టైటిల్ రోల్ పోషించిన నాగార్జున యాక్టింగ్ ఇరగదీశాడు. కింగ్ నాగార్జున(Nagarjuna) మరోసారి వింటేజ్ మాస్ లుక్‌ను గుర్తు తెచ్చాడు. ప్రతి ఫ్రేమ్‌లో ఆకట్టుకునేలా కనిపించాడు. ఆషికా రంగనాథ్‌తో రొమాన్స్ పండించాడు. ముఖ్యంగా 'నా సామిరంగ' అనే ఆ ఊత పదంతో ప్రేక్షకులందరిలో జోష్ నింపాడు. ఇంటర్వెల్ బ్రేక్‌లో నాగార్జున స్వాగ్ సినిమాకే హైలెట్. ఆ సీన్‌న్లో కీరవాణి బీజీఎమ్ అదిరిపోయింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లు తమ నటనతో ఆకట్టుకున్నారు. నాగార్జునతో కామెడీ పండిస్తూనే ఎమోషనల్ సీన్లలో కంటతడి పెట్టించారు. ఇక హీరోయిన్ ఆషికా రంగనాథ్ గ్లామర్ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. తన పాత్ర పరిధి మేరకు నటించడమే కాకుండా రొమాంటిక్, ఎమోషనల్ సీన్లలో పోటీపడి నటించింది. ఇక మిగిలిన ఆర్టిస్టులు నాజర్, రావురమేష్ కూడా వాళ్ల పరిధి మేరకు నటించారు. సినిమా విజయానికి కావాల్సిన ఇన్‌పుట్స్‌ను తమ నటన ద్వారా అందించారు.
టెక్నికల్ విషయాలు…
సాంకేతికంగా నా సామిరంగ చిత్రం ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ శివేంద్ర దాశరధి తన విజువల్స్ టేకింగ్‌లో మ్యాజిక్ చేశాడు. వింటేజ్ నాగార్జున చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా తీర్చిదిద్దాడు. ఈ సినిమాకి సంగీతం అందించిన ఆస్కార్ విజేత MM కీరవాణి మ్యూజిక్ పర్వాలేదనిపించింది. పాటలు ఓకే అనిపిస్తాయి. 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే', నాసామిరంగ(Naa Saami Ranga ) టైటిల్ సాంగ్ విజిల్స్ కొటిస్తాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్బ్‌గా ఉంది. నాగార్జున యాక్షన్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. రాజమౌళి సినిమాలో ఇచ్చినట్టుగా మ్యూజిక్ రాలేదు కానీ... సినిమాకు కావాల్సిన మేర అందించాడు. మరోవైపు చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. చాలా సీన్లను లాంగ్ లెంగ్త్‌తో కట్ చేశారు. అక్కడక్కడా లాగ్ అనిపిస్తాయి. ఇక రామ్‌లక్ష్మణ్ ఫైట్స్ కూడా అదిరిపోయాయి. మరి ఓవర్ కాకుండా హీరోయిజన్ని ఎలివేట్ చెసేలా ఉన్నాయి.
బలాలు
నాగార్జున వింటేజ్ యాక్షన్అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కామెడీ ట్రాక్ఆషికా రంగనాథ్- నాగార్జున లవ్ ట్రాక్ఇంటర్వెల్ సీన్
బలహీనతలు
ల్యాగ్ సీన్లుఅక్కడక్కడ అనవసరమైన సీన్లు
చివరగా: సంక్రాంతికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి నా సామిరంగ నిరాశ పరుచదు.
రేటింగ్: 3/5
జనవరి 14 , 2024
17 Years for POKIRI: ఇండస్ట్రీ హిట్ ట్రెండ్ సెట్టింగ్ సినిమాలో అసలు ప్రత్యేకత ఏంటి?
తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరో…! సింపుల్ స్టోరీ లైన్… ! చివర్లో చిన్న ట్విస్ట్…! కానీ, ఇందులో పాత్రలు మాట్లాడాయి. డైలాగులు గుర్తిండిపోయేలా పేలాయి. పాటలు మార్మోగాయి. ఇన్నీ జరిగాయి కనుకే ఇండస్ట్రీ హిట్ అనే కొత్త ట్రెండ్ సెట్ చేసింది. దాదాపు మూడేళ్ల పాటు ఆ సినిమా కలెక్షన్లను కొట్టే చిత్రమే రాలేదంటే నమ్ముతారా? ఏం సినిమా అనుకుంటున్నారా ! మహేశ్ బాబు నటించిన “పోకిరి”. చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 17 ఏళ్లు అయ్యింది. ఈ సమయంలో మరొక్కసారి అలా ఓసారి సినిమాను గుర్తు చేసుకుందాం.
మాస్ టచ్
“ గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అని తీయ్ 200 సెంటర్స్ 100 డేస్”. ఈ సినిమాకు సరిగ్గా సరిపోయే మాట ఇది. లేకపోతే మహేశ్ బాబు లాంటి హీరోను పెట్టి “పోకిరి” అనే టైటిల్ పెట్టి ఏకంగా రికార్డులు తిరగరాశాడంటే పూరి జగన్నాథ్ గట్స్‌ను మెచ్చుకోవాలా? వద్దా?. మాస్ ఆడియన్స్ మెుత్తం థియేటర్లకు క్యూ కట్టారంటే టైటిల్ వల్లే కదా.
స్టైల్ సాలా
సినిమాలో హీరో ఓ గ్యాంగ్‌స్టర్. డిఫరెంట్‌గా కనిపించాలి కదా మరి. అందుకే ఇద్దరూ కలిసి అలా కాసేపు మాట్లాడుకొని నిర్ణయించుకున్నారు. ఏంటంటే? షర్ట్ మీద షర్ట్ వేసేద్దాం గురూ అని. ఇంకేముంది అదో ట్రెండ్ సెట్ అయ్యింది.
మాటల తూటాలు
పూరీ జగన్నాథ్ అంటే మాస్ డైలాగులే. పోకిరి చిత్రంలో వాటికి కొదవ లేదు. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను ఇలా పవర్ ప్యాక్డ్ డైలాగులు ఒక్కటేమిటీ బోలేడున్నాయి. సినిమా ఆ స్థాయిలో ఉండటానికి కారణం అయ్యాయి.
స్వాగ్ సాంగ్స్
పోకిరి సినిమాలో పాటలు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డోలే డోలే దిల్ జర జర అంటూ మహేశ్ కుర్చీలో కూర్చొని వేసిన ఓ స్వాగ్ స్టెప్ ఎవరైనా మర్చిపోతారా? అంతేనా..ఇందులో ఉన్న 6 పాటలు సూపర్ హిట్టే.
https://www.youtube.com/watch?v=obUCNoFPG1Y
https://www.youtube.com/watch?v=Cuzj7kbftwU
కృష్ణమనోహర్ IPS
గ్యాంగ్‌స్టర్ పండుగాడు శత్రువులపై బుల్లెట్స్ వర్షం కురిపించి ఒక్కసారిగా కృష్ణ మనోహర్ IPSగా పోలీస్ గెటప్‌లో కనిపిస్తే ఆ సీన్ గుర్తొస్తేనే గూస్‌బంప్స్ వస్తాయి కదా ! పూరీ మార్క్ మరి ఆ మాత్రం లేకుండా ఎలా ఉంటుంది.
ఇండస్ట్రీ హిట్
సినిమా తీశాక ఇందులో ఏముంది అనుకున్నారంటా? అస్సలు ఆడదని కొందరు చెప్పారంటా? ఒక్కసారి విడుదలయ్యాక వాళ్లే ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. దెబ్బకి కొడితే ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ పదాన్ని అప్పుడే సృష్టించారంటే నమ్మండి. పక్కా కమర్షియల్ చిత్రానికి కావాల్సిన మాటలు, పాటలు అన్నీ ఉన్నాయి కనుకే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తీస్తే.. ఏకంగా రూ. 66 కోట్లు వసూలు చేసింది. అప్పుడు రూ 66 కోట్లు అంటే ఇప్పుడు రూ. 1000 కోట్లకు సమానమే అవుతుంది కదా. రీరిలీజ్‌లోనూ పోకిరి చిత్రం రూ. 1.7 కోట్లు వసూలు చేసింది.
ఎందరిని దాటుకుని మహేశ్ దగ్గరికి వచ్చిందో తెలుసా?
పూరి సినిమా తీస్తున్నాడంటే మూడు నెలల్లో అయిపోవాల్సిందే. అస్సలు సమయం వృథా చేయడు. ఓ హీరోకి కథ చెప్పి ఎక్కువ ఆలస్యం అవుతుందనిపిస్తే ఇంకో హీరోతో తీసేస్తాడంతే. పోకిరి కూడా మహేశ్‌బాబుకి అలా వచ్చిందే. సినిమా స్టోరీని మెుదట పవన్ కల్యాణ్‌కు చెప్పాడు పూరీ. కానీ, పవన్ పెద్దగా ఆసక్తి చూపలేదు. తర్వాత రవితేజకు వినిపించాడు. ఓకే చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. అనంతరం సోనూసూద్‌ని పెట్టి తీసేద్దాం అనుకున్నాడట. ఇది కూడా మూలన పడింది. తర్వాత మహేశ్ ఓకే చెప్పడంతో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది.
పోకిరి సినిమాకు ముందు అనుకున్న టైటిల్
పోకిిరి సినిమాకు ముందు ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్య నారాయణ అనే టైటిల్ పెట్టాడు జగన్. కానీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చాలని సూచించాడు మహేశ్. దానికి ఒప్పుకున్న పూరి పోకిరి అనే ఖరారు చేశాడు.
ఏప్రిల్ 28 , 2023
OTT MOVIES: స్నేహితులతో కలిసి ఓటీటీలో చూడగలిగే 10 సినిమాలు
సినిమా చూసేందుకు వెళ్లాలి అనుకున్నప్పుడు అందరికన్నా ముందు గుర్తొచ్చేది స్నేహితులే. వాళ్లతో కలిసి థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ సరదాగా గడిపేస్తాం. ఇక బ్యాచ్‌లర్‌గా ఉంటే వేరే లెవల్. రూమ్‌లో ఉంటూ ఫ్రెండ్స్‌తో కలిసి మజా చేయాలనుకుంటే… ఓటీటీలో చూసేందుకు కొన్ని ఎవర్ గ్రీన్ సినిమాలు ఉన్నాయి. అవేంటో చదివి మీ దోస్తులతో చూసి ఎంజాయ్ చేయండి.
ఈ నగరానికి ఏమైంది
సరాదాగా దోస్తులతో కలిసి మందు కొట్టినప్పుడు “గోవా పోవాలి” అని ఎన్ని బ్యాచ్‌లు అనుకొని ఉంటాయి. ఎంతమంది వెళ్లి ఉంటారు. మన జీవితాల్లోనే జరిగే ఇలాంటి ఎన్నో సరాదా సంఘటనలను గుర్తు చేస్తుంది ఈ సినిమా. విశ్వక్‌సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, సాయి సుశాంత్ రెడ్డి లీడ్ రోల్స్ చేశారు. రూ. 2కోట్లతో తీస్తే రూ. 12 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
జాతిరత్నాలు
ఈ సినిమా గుర్తొస్తే మెుదట తలుచుకునేది క్రేజీ డైరెక్టర్ అనుదీప్ KV. జాతిరత్నాలు చిత్రాన్ని అంతలా ప్రేక్షకుల మదిలో ఉండిపోయేలా తీర్చిదిద్దాడు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి ముగ్గురు స్నేహితులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. సినిమాలోని వన్‌లైన్ పంచులు బాగా పేలాయి. ఎండాకాలం ఉక్కపోస్తున్న, వాన కాలం వర్షం పడుతున్నా… అలా రూమ్‌లో కూర్చొని నవ్వుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు. రూ. 4 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడితే.. ఏకంగా రూ.75 కోట్లు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్‌లో చిత్రాన్ని చూడవచ్చు.
డీజే టిల్లు
డీజే టిల్లు సినిమా వచ్చి రెండేళ్లైనా సిద్ధూ జొన్నలగడ్డ స్వాగ్ ఇంకా మర్చిపోలేరు. టిల్లుతో రాధిక చేయించే విన్యాసాలు.. తెలంగాణ యాసలో పేలిన పంచులను స్నేహితులతో కలిసి చూస్తే కాలక్షేపమే. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఆహా, సోని లివ్ వేదికగా సినిమాను వీక్షించవచ్చు.
హుషారు
మద్యం తాగే మిత్రులు కొనడం ఎందుకు దాన్నే తయారు చేద్దామనే క్రేజీ ఆలోచన వస్తే హుషారు సినిమా. సరదాగా గడిపే నలుగురు వ్యక్తులు, కెరీర్‌ను సెట్ చేసుకోవాలని తిప్పలు పడుతుండటంతో పాటు కష్టం వచ్చిన స్నేహితుడికి అండగా నిలిచే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సరదాగా నవ్వుకోవాలి అనిపించినప్పుడు కబూమ్ హుషారు సినిమా చూసేయండి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.
బ్రోచెవారెవరురా
స్నేహితులు ఎంతవరకైనా తోడు ఉంటారనేది చూడాలంటే బ్రోచెవారెవరూ చూడాల్సిందే. ఫీజు కట్టాలని చెప్పి నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలు, షికార్లు చుట్టేయడం. ఆఖరికి కిడ్నాప్‌లో కూడా స్నేహితులు తోడు వస్తారనే కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో బ్రోచెవారెవరూ రూపొందింది. శ్రీ విష్ణు, దర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో ఈ సినిమా చూడొచ్చు.
ఒకే ఒక జీవితం
టైమ్ ట్రావెల్ కథాంశంతో ముగ్గురు మిత్రులు వాళ్ల చిన్నతనంలోకి వెళితే ఎలా ఉంటుందనే విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఒకే ఒక జీవితం తెరకెక్కింది. ఇందులో ప్రియదర్శి, వెన్నెల కిషోర్, శర్వానంద్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. సరాదాగా సాగే థ్రిల్లింగ్ సినిమాను దోస్తులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. సోని లివ్‌లో అందుబాటులో ఉంది.
మిషన్ ఇంపాజిబుల్
చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి మనం ఎలా ఉండేవాళ్లమో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఈ సినిమా. రఘుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు చిచ్చరపిడుగులు చేసిన విన్యాసాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
హృదయం
కాలేజ్ లైఫ్, లవ్ కాన్సెప్ట్‌తో వచ్చిన హృదయం సూపర్ హిట్ అయ్యింది. మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్, కల్యాణి ప్రియదర్శి లీడ్ రోల్స్‌లో వచ్చింది. స్నేహితులతో కలిసి చూస్తూ దర్శనా అంటూ పాటలు పాడుకునేంత బాగుంటుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
చిచ్చోరే
ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు ఈ సినిమాను ఇష్టపడతారు. కళాశాల జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సుశాంత్ సింగ్ , శ్రద్ధాకపూర్, నవీన్ పొలిశెట్టి నటించిన ఈ సినిమా కాలేజ్ డేస్‌ను గుర్తు చేస్తాయి. డిస్నీ + హాట్‌స్టార్ ఓటీటీలో చిచ్చొరే సినిమా ఉంది.
రొమాంచనమ్
హారర్ కామెడీ జానర్‌లో ఇదొక డిఫరెంట్ మూవీ. ఏడుగురు బ్యాచిలర్స్ ఉండే ఓ ఇంట్లో ఆత్మను పిలిచే గేమ్ ఆడతారు. ఆత్మ వస్తుందా? వస్తే ఏం చేసింది? ఇది కథ. బ్యాచిలర్ రూమ్‌లను కళ్లకు కట్టినట్టు చూపిండటమే గాక అదిరిపోయే కామెడీ ఉంటుంది. స్నేహితులతో కలిసి చూస్తే కడుపుబ్బా నవ్వుతూ చిల్ అవ్వొచ్చు. హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడొచ్చు.
మీకు ఏవైనా మూవీస్ పక్కాగా చూడాల్సినవి తెలిస్తే కామెంట్ చేయండి.
ఏప్రిల్ 21 , 2023
RRRపై తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు… ఏకిపారేసిన నాగబాబు.. నీయమ్మ *** ఖర్చు పెట్టాడారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు
RRR చిత్రంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమ్మారెడ్డిని సినీ ప్రముఖులు విమర్శిస్తున్నారు. తెలుగు చలన చిత్ర స్థాయి పెరగడాన్ని స్వాగతించాల్సింది పోయి ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అసలేంటీ వివాదం?
బంగారుతల్లి సినిమా ప్రమోషన్లలో భాగంగా తమ్మారెడ్డి భరద్వాజ RRR చిత్ర యూనిట్‌పై విమర్శలు చేశారు. “ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు రూ.600 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుతం ఆస్కార్ అవార్డు కోసం రూ.80 కోట్లు వెచ్చిస్తున్నారు. విమాన టికెట్ల కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాటితో 8 సినిమాలు తీసి వారి ముఖాన కొట్టచ్చు” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
https://twitter.com/i/status/1633519566235275266
రచ్చ రచ్చ
తమ్మారెడ్డి వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో రచ్చ మెుదలయ్యింది. తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి తెలుస్తుంటే సొంత ఇంటి వాళ్లే విమర్శలు చేయడం ఏంటనే ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. 8 సినిమాలు తీసి నష్టం మిగల్చడం తప్ప మీరు చేసేది ఏముండదంటూ కామెంట్లు పెడుతున్నారు.
అకౌంట్స్ ఉన్నాయా?
ఈ విమర్శలపై దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా , సాహిత్యం, దర్శకుడు, నటీనటులకు మెుదటిసారి ప్రపంచవేదికలపై వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూసి గర్వపడాలి అన్నారు. అంతే కానీ..రూ.80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి మీదగ్గర అకౌంట్స్ ఉన్నాయా ? అని ప్రశ్నించారు. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి పేరుపొందిన దర్శకులు డబ్బులు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని మీ ఉద్దేశమా? అన్నారు.
https://twitter.com/Ragavendraraoba/status/1633871454445137921
స్ట్రాంగ్ కౌంటర్
ప్రముఖ నటుడు నాగబాబు మరింత ఘాటుగా సమాధాన మిచ్చారు. “ నీయమ్మ మెుగు ఖర్చు పెట్టాడారా రూ.80 కోట్లు RRRకి ఆస్కారం కోసం” (#RRR మీద కామెంట్‌కు వైసీపీ వారి భాషలో సమాధానం) అంటూ కౌంటర్ ఇచ్చాడు.
https://twitter.com/NagaBabuOffl/status/1633845057622253568
నాగబాబుపై విమర్శలు
విమర్శలపై కాస్త కఠినంగానే స్పందించే నాగుబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అతడిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. గౌరవప్రదమైన కుటుంబంలో ఉండి.. ఇలాంటి విమర్శలతో పేరు చెడగొడుతున్నారని మండిపడ్డారు. చిరంజీవి, పవన్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు మరికొందరు.
మార్చి 10 , 2023
Pushpa 2: దద్దరిల్లిన కొచ్చి ఎయిర్‌పోర్ట్.. బన్నీకి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్‌కమ్!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా మరో వారం రోజుల్లోనే రిలీజ్ కానుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను భారీగా చేస్తోంది. ఇప్పటికే పాట్నా, చెన్నైలో భారీ ఈవెంట్స్ నిర్వహించగా నేడు (నవంబర్ 27) కేరళలో మరో ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఇందులో పాల్గొనేందుకు చిత్రం బృందం హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో కొచ్చి వెళ్లింది. అక్కడ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన బన్నీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్స్ సాగర స్వాగతం పలికారు.
దద్దరిల్లిన విమానశ్రయం..
కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగిన బన్నీకి కేరళ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. అల్లు అర్జున్ రాక గురించి ముందే తెలుసుకొని వారంతా పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు తరలి వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న బన్నీకి సుస్వాగతం పలికారు. తమ అభిమాన హీరోను తమ ఫోన్ కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. అంతేకాదు బన్నీతో ఫొటోలు దిగేందుకు కూడా ఎగబడ్డారు. అంచనాలకు మించి వచ్చిన ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయడానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులు బాగా కష్టపడాల్సి వచ్చింది. అభిమానుల కేరింతలకు దెబ్బకు ఓ దశలో బన్నీ తన రెండు చెవులు మూసుకోవడం గమనార్హం. రాష్ట్రం కాని రాష్ట్రంలో బన్నీ వస్తోన్న ఈస్థాయి ఆదరణ చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'రాజు ఎక్కడ ఉన్న రాజే' అని కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/GulteOfficial/status/1861740756030886182
https://twitter.com/IamEluruSreenu/status/1861718081313107982
కేరళలో ఎందుకంత క్రేజ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఏపీ, తెలంగాణ తర్వాత ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాష్ట్రం కేరళ. అక్కడి ప్రజలు బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ (Mallu Arjun) అని పిలుచుకుంటారు. కెరీర్ తొలినాళ్లలో చేసిన ‘ఆర్య’ కేరళలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 100 రోజులకు పైగా ఆడింది. ‘ఆర్య’ నుంచి అల్లు అర్జున్‌ను కేరళ ప్రజలు ఓన్ చేసుకోవడం మెుదలపెట్టారు. అల్లు అర్జున్ హీరోగా చేసిన ప్రతీ సినిమా కేరళలో కచ్చితంగా రిలీజ్ అవుతూ వచ్చింది. తెలుగులో ఏ విధమైన రెస్పాన్స్ వచ్చేదో కేరళలోనూ అంతే స్థాయిలో ప్రేక్షకులు బన్నీ చిత్రాన్ని ఆదరించారు. బన్నీ గత చిత్రం ‘పుష్ప’ సైతం కేరళలో బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ (Pushpa 2) కేరళ ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొచ్చిలో ప్రమోషన్ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు.
https://twitter.com/baraju_SuperHit/status/1861742091337953731
https://twitter.com/alluarjun/status/1861737357105672266
రన్ టైమ్ లాక్
'పుష్ప 2' చిత్రానికి సంబంధించి రన్‌టైన్ లాక్ అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా సుకుమార్ సినిమా అంటే మూడు గంటలు కచ్చితంగా ఉంటుందని అభిమానులు ఓ అంచనాకు వచ్చేస్తుంటారు. ఆయన గత చిత్రాలు ‘రంగస్థలం’, ‘పుష్ప’ దాదాపు మూడు గంటల నిడివితో వచ్చి బ్లాక్ బాస్టర్లుగా నిలిచాయి. అయితే ఇప్పుడు 'పుష్ప 2' మూడు గంటలకు పైగా నిడివితో రాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమాకు 3 గంటల 22 నిమిషాల నిడివిని డైరెక్టర్ సుకుమార్ ఫిక్స్ చేశారట. యూఎస్‌లో 3 గంటల 15 నిమిషాల నిడివితో ‘పుష్ప 2’ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు పర్యవేక్షణ అనంతరం అఫిషియల్‌గా నిడివిని అనౌన్స్ చేయనున్నారు.
నవంబర్ 27 , 2024
Akkineni Akhil Engagement: సైలెంట్‌గా అఖిల్ నిశ్చితార్థం.. నాగార్జునకు కోడలిగా మరో నటి!
అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం జరిగింది. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున (Akkineni Nagarjuna) స్వయంగా ప్రకటించారు. చిన్న కోడలు - కుమారుడు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. డిసెంబర్‌లో పెద్ద కూమారుడు అక్కినేని నాగచైతన్య వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఖిల్ కూడా త్వరలో పీటలు ఎక్కబోతుండటంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
పెళ్లికూతురు ఎవరంటే?
అఖిల్ అక్కినేని నిశ్చితార్థం (Akkineni Akhil Engagement) ఇవాళ (నవంబర్ 26) హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో ఘనంగా జరిగింది. ప్రముఖ ఆర్టిస్టు 'జైనాబ్ రవద్జీ' చేతికి అఖిల్ ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగాడు. ఈ వేడుకకు అతికొద్ది మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలకు చెందిన అతి ముఖ్యులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అక్కినేని నాగార్జున పంచుకున్నారు. అక్కినేని కుటుంబంలోకి చిన్న కోడలికి స్వాగతం పలికారు. ఈ యువ జంటను ఆశీర్వదించండంటూ నాగార్జున కోరారు.
https://twitter.com/iamnagarjuna/status/1861374206338048318
వచ్చే ఏడాదే పెళ్లి!
అఖిల్ చాలాకాలం నుంచి నటి జైనాబ్ రవద్జీ (Akkineni Akhil Engagement) ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపగా వారు కూడా అంగీకరించారు. దీంతో అందరి సమక్షంలో ఒక్కటయ్యేందుకు వీరు రెడీ అయ్యారు. నిశ్చితార్థం జరుపుకొని పెళ్లి వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అఖిల్ పెళ్లి వచ్చే ఏడాదిలో జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక డిసెంబర్ 4న జరగనున్న అక్కినేని నాగచైతన్య - శోభిత దూళిపాళ్ల పెళ్లిలో అఖిల్ జంట ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
గతంలో అఖిల్ నిశ్చితార్థం రద్దు
అక్కినేని నాగచైతన్య సమంతల వివాహం కంటే ముందే అక్కినేని అఖిల్ (Akhil Akkineni) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. రామ్ చరణ్ భార్య ఉపాసన బంధువు అయినా శ్రియ భూపాల్‌తో అఖిల్‌కు నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళలేదు. కొన్ని కారణాలతో అఖిల్-శ్రియ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలో శ్రియ భూపాల్ మరో యువకుడిని పెళ్లి చేసుకోగా అఖిల్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు జైనాబ్ రవద్జీతో పెళ్లికి సిద్ధమయ్యాడు.
అఖిల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా అఖిల్ నెక్ట్స్ ఫిల్మ్ రాబోతున్నట్లు సమాచారం. అక్కినేని నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తారని అంటున్నారు. 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్ మురళీ కిషోర్ (Murali Kishore) ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన సైతం వస్తుందని చెబుతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు సైతం ఇప్పటికే మెుదలైనట్లు చెబుతున్నారు. దీంతో పాటు 'సాహో'కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన అనిల్ కుమార్‌తో మరో ప్రాజెక్ట్ అఖిల్ చేయనున్నట్లు సమాచారం. ఈ కొత్త డైరెక్టర్ చెప్పిన స్టోరీ అఖిల్‌కు విపరీతంగా నచ్చిందని, వెంటనే స్క్రిప్ట్ కూడా ఓకే చేశారని టాక్. ఈ నేపథ్యంలో అఖిల్ ఈ రెండు చిత్రాలను ఒకేసారి ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.
నవంబర్ 26 , 2024
Ram Charan Kadapa Dargah: అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లిన రామ్ చరణ్… తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు!
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ (A.R Rahman) ఆహ్వానం మేరకు నటుడు రామ్ చరణ్ కడపలోని దర్గా (Ram Charan Kadapa Dargah)ను సోమవారం (నవంబర్ 18) సందర్శించారు. 80వ నేషనల్ ముషాయిరా గజల్ (ఉర్దూ కవి) సమ్మేళనాన్ని రామ్‌చరణ్ ప్రారంభించారు. తొలుత డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో కలిసి కడపలోని విజయ దుర్గా దేవీ ఆలయాన్ని చరణ్ సందర్శించారు. తన తదుపరి సినిమా ‘RC16’ స్క్రిప్ట్‌ని అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు. అనంతరం దర్గాకు చేరుకున్న చరణ్ ‘మగధీర' టైమ్‌లో దర్గాతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే చరణ్ మాలలో ఉండి దర్గాను దర్శించడం వివాదస్పదమవుతోంది. దీనిని సోషల్ మీడియా వేదికగా పలువురు వ్యతిరేకిస్తున్నారు. దీనికి మెగా ఫ్యాన్స్ దీటుగా సమాధానం ఇస్తున్నారు.
చరణ్‌కు ఊరమాస్ స్వాగతం..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan Kadapa Dargah) సోమవారం రాత్రి (నవంబర్ 19) 7 గం.లకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి కడప బయలుదేరారు. అనంతరం కడప విమానాశ్రయంలో దిగిన రామ్‌చరణ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన గురించి ముందే తెలుసుకున్న మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విమానాశ్రయం వద్ద సందడి చేశారు. విమానశ్రయం నుంచి చరణ్ బయటకు రాగానే బిగ్గరగా అరుస్తూ పలకరించారు. అనంతరం కడప దుర్గా దేవీ ఆలయానికి బయలుదేరిన చరణ్ వాహన శ్రేణిని పెద్ద ఎత్తున అభిమానులు అనుసరించారు. మార్గం మధ్యలో బాణా సంచా కాలుస్తూ తమ హీరో రాకను ఊరమాస్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు చరణ్ కంటే ముందే ఆలయం, దర్గా వద్ద చేరుకున్న మెగా ఫ్యాన్స్ అక్కడ కూడా గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
https://twitter.com/VoiceofAndhra3/status/1858745724977975679
https://twitter.com/i/status/1858523256996688028
https://twitter.com/i/status/1858520994966630608
https://twitter.com/i/status/1858519599362293966
https://twitter.com/i/status/1858539492933521720
https://twitter.com/i/status/1858526070414135792
https://twitter.com/i/status/1858527756038160445
నెట్టింట భారీగా ట్రోల్స్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan Kadapa Dargah) ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పర మతానికి సంబంధించిన దర్గాకు మాలలో ఉండి వెళ్లడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది హిందువులను, ముస్లీములను అవమానించడమేనని నెట్టింట ఆరోపిస్తున్నారు. కొన్ని మతాలకు కట్టుబాట్లు ఉంటాయని దానిని ఎంతటి వారైనా అనుసరించి తీరాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ పిలుపు మేరకు దర్గాకు వచ్చానని చరణ్ అంటున్నారని, అదే రెహమాన్‌ను తిరుమలకు రమ్మని ఆహ్వానించగలవా? అని ప్రశ్నిస్తున్నారు. నీ మాట ప్రకారం రెహమాన్ రాగలడా? అంటూ నిలదీస్తున్నారు. చరణ్‌పై ఇప్పటివరకూ ఉన్న గౌరవం ఈ ఒక్క చర్యతో పోగొట్టుకున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1858762953216192664
https://twitter.com/DevikaRani81/status/1858709625107075108
https://twitter.com/kssivakumar/status/1858738287940116977
https://twitter.com/rajeshg117/status/1858718607263313946
https://twitter.com/PrabhasAnna50/status/1858765445567828393
https://twitter.com/bulliguvva_/status/1858755755245195594
https://twitter.com/SRevanuri/status/1858792387415245278
https://twitter.com/nareshchilakara/status/1858748235071750273
https://twitter.com/youngmonkxxx/status/1858756817565667393
ఘాటుగా బదులిస్తున్న చరణ్ ఫ్యాన్స్!
తమ హీరోగా నెట్టింట జరుగుతోన్న ట్రోల్స్‌కు చరణ్ ఫ్యాన్స్ గట్టిగా బదులిస్తున్నారు. వాస్తవాలను ప్రస్తావిస్తూ చరణ్‌కు అండగా నిలుస్తున్నారు. అయ్యప్ప మాలలో ఉన్న వారు దర్గాను సందర్భించడం ఇదే తొలిసారి కాదని స్పష్టం చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలైకు వెళ్లే ముందుకు స్వాములు ముందుగా కేరళ ఎరుమెలిలోని వావర్ మసీదు (Vavar Juma Masjid)ను సందర్శించే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సైతం నెట్టింట షేర్ చేస్తున్నారు. హిందువు అయితే ఇతర మతస్తుల గుళ్లకు వెళ్లకూడదని రాజ్యాంగంలో ఉందా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. హిందుత్వానికి ఎంతో విలువ ఇచ్చే ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ లాంటి వారే దర్గాలకు వెళ్లారని గుర్తుచేస్తున్నారు. మన ధర్మాన్ని, సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి కాబట్టే చరణ్ దర్గాకు వెళ్లాడని సపోర్ట్ చేస్తున్నారు. సెలబ్రిటీల విషయాల్లో వేలు పెట్టి పాపులర్ కావాలని చూడటం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయ్యిందని మెగా ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
https://twitter.com/mutyala2492/status/1858765282317398031
https://twitter.com/Ryder1162/status/1858736681152618783
https://twitter.com/irah_ranga/status/1858796736900157841
https://twitter.com/mutyala2492/status/1858765966718693462
https://twitter.com/i/status/1858733584565338350
https://twitter.com/Trivikram_Pavan/status/1858747494773256230
https://twitter.com/NBK__MB/status/1858742668500889986
నవంబర్ 19 , 2024
Kanguva: లులు మాల్‌లో హై అలెర్ట్.. ఫ్యాన్స్‌కు మోకళ్లపై దండం పెట్టిన సూర్య!
తమిళ స్టార్ సూర్య (Suriya) హీరోగా శివ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నటుడు సూర్యతో పాటు ‘కంగువా’ టీమ్ చురుగ్గా మూవీ ప్రమోషన్స్ చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ప్రస్తుతం కంగువా టీమ్ కేరళలో పర్యటిస్తోంది. అక్కడ ఓ మాల్‌కు వెళ్లిన సూర్య & టీమ్‌కు ఊహించని స్థాయిలో అభిమానులు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సూర్య ఫ్యాన్స్‌తో కిక్కిరిసిన మాల్
కంగువా (Kanguva) ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా కేరళకు వెళ్లిన మూవీ టీమ్ కొచ్చి నగరంలో పర్యటించింది. వినూత్నంగా అక్కడి ‘లులు మాల్’ (Lulu International Shopping Mall, Kochi)లో ప్రమోషన్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సూర్య అభిమానులు పెద్ద ఎత్తున మాల్‌కు చేరుకున్నారు. తమ అభిమాన నటుడ్ని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో మాల్ మెుత్తం సూర్య అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనం మాల్‌లో కనిపించింది. గతంలో ఎప్పుడు ఈ స్థాయి క్రౌడ్‌ను చూడలేదని మాల్ నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
https://twitter.com/i/status/1853842396104020062
https://twitter.com/i/status/1853810428616597938
https://twitter.com/AnushanSfc/status/1854009930233123020
https://twitter.com/RamuNaiduEdit/status/1853848902769967531
ఫ్యాన్స్‌కు సూర్య అభివాదం
ప్రమోషన్ ఈవెంట్‌లో భాగంగా కొచ్చిలోని లులు మాల్‌కు వచ్చిన సూర్య (Kanguva) అక్కడి క్రౌడ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. తమిళ నటుడైన తనపై కేరళ ప్రజలు ఈ స్థాయిలో అభిమానాన్ని చూపించడం చూసి ఫిదా అయ్యాడు. ఈ సందర్భంగా 15 నిమిషాల పాటు క్రౌడ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తామిచ్చిన ఒక చిన్న ప్రకటన చూసి ఇంతమంది మాల్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మీ విలువైన సమయాన్ని తన కోసం వెచ్చించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఆపై మోకాళ్లపై కూర్చొని మాల్‌లోని వారందరికీ అభివాదం తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/ARMedia28524249/status/1853816589130293352
10 వేల స్క్రీన్స్‌లో విడుదల
‘కంగువా’ (Kanguva) చిత్రం గురించి నిర్మాత ధనుంజయ్ రీసెంట్‌గా ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఏకంగా 10వేల స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 2500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు, ఉత్తరాదిలో 3,500 స్క్రీన్లలో ప్రదర్శించునున్నట్లు చెప్పారు. ఓవరాల్‌గా 10 వేల స్క్రీన్‌లలో భారీస్థాయిలో కంగువా ప్రేక్షకుల ముందుకురానుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు.
ఏఐతో డబ్బింగ్
‘కంగువా’ (Kanguva) చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తిచేసినట్లు సమాచారం. డబ్బింగ్ పనుల కోసం ఏఐని ఉపయోగించడం కోలీవుడ్‌లో ఇదే తొలిసారని నిర్మాత ధనుంజయ్ రీసెంట్‌గా పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్’లో అమితాబ్‌బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్ చేయించినట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు.
నవంబర్ 06 , 2024
Keerthi Suresh: కీర్తి సురేష్ మంగళ సూత్రంపై అందరి దృష్టి.. ఏమైందంటే!
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌ను ఆమె గోవాలో వివాహమాడింది. ఈ పెళ్లికి స్టార్ హీరో విజయ్‌తో పాటు త్రిష పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలు సైతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్‌కు కీర్తి సురేష్ హాజరవ్వగా ఆమెను చూసి అక్కడి వారు షాకయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు, ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై ప్రశంసలు సైతం కురిపిస్తున్నారు.
తాళిబొట్టుతో కీర్తి..
యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthi Suresh) ‘బేబీ జాన్’ (Baby John)చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. డిసెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న కీర్తి సురేష్ అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. మోడ్రన్ డ్రెస్‌లో తాళిబొట్టు ధరించి ఈ వేడుకల్లో పాల్గొంది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడింది. ఓ వైపు ప్రమోషన్స్ కోసం హాట్‌గా కనిపిస్తూనే ట్రెడిషన్‌ను మాత్రం వదల్లేదని ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి.
https://twitter.com/GoldwinSharon/status/1869702290300674511
https://twitter.com/ActressGlamspo7/status/1869647927683276816
https://twitter.com/celeb_world99/status/1869647535469658421
‘కీర్తిని చూసి నేర్చుకోండి’
హిందూ వివాహం బంధంలో తాళిబొట్టుకు ఎంతో ప్రత్యేకత ఉంది. మహిళలు తాళిని పక్కన పెట్టడాన్ని అశుభంగా భావిస్తుంటారు. అటువంటి తాళిని ధరించడాన్ని కొందరు సెలబ్రిటీలు నమోషిగా ఫీలవుతున్నారు. పెళ్లైన మరుసటి రోజే దానిని పక్కన పెట్టేస్తున్నారు. బోసుపోయిన మెడతో సినిమా ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో కీర్తి సురేష్ తాళిబొట్టుతో కనిపించడాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు. కీర్తిని చూసి నేర్చుకోవాలని ప్రస్తుత తరం నటీమణులకు సూచిస్తున్నారు.
https://twitter.com/CelebGlamGaze/status/1869673197848977765
https://twitter.com/RitamTelugu1/status/1869638324702618082
కీర్తి జంటతో విజయ్..
గోవాలో జరిగిన కీర్తి సురేష్ పెళ్లికి తమిళ స్టార్ హీరో విజయ్ సైతం హాజరై నూతన వధూవరులను ఆశ్వీర్వదించారు. తాజాగా విజయ్కి సంబంధించిన ఫొటోస్ను కీర్తి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మేరకు విజయ్ ఫొటోస్కి క్యూట్ ట్యాగ్ని జోడించింది. ‘మా కలల వివాహానికి మా ఐకాన్ స్టార్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు’ అంటూ ప్రేమతో.. మీ నంబీ అని పోస్ట్ చేసింది. ఇందులో నూతన వధూవరులతో కలిసి విజయ్ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించాడు. తెల్లటి చొక్క, పంచెలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/KeerthyOfficial/status/1869429740660314482
ఆ మూవీకి రీమేక్‌గా..
కీర్తి సురేష్ నటించిన ‘బేబీ జాన్’ (Baby John) విషయానికి వస్తే ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తమిళంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న 'తెరీ' (Theri) చిత్రానికి రీమేక్‌గా ఇది వస్తోంది. అందులో సమంత (Samantha) పోషించిన పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది. ఈ చిత్రానికి కాలీస్ దర్శకత్వం వహించగా వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ అట్లీ కథ అందించడంతో పాటు నిర్మించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమా రాబోతోంది.
https://twitter.com/filmyyguy/status/1867826548726018190
డిసెంబర్ 19 , 2024
Allu Arjun: బన్నీని చూసి విజయ్ దేవరకొండ ఎమోషనల్.. కానరాని మెగా హీరోలు!
‘పుష్ప 2’ (Pushpa 2) ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు శుక్రవారం (డిసెంబర్ 13) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. దీంతో శనివారం (డిసెంబర్ 14) ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ (Allu Arjun Release From Jail) విడుదలయ్యారు. ఇంటికి చేరుకున్న ఆయన్ను చూసేందుకు ప్రస్తుతం సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. విజయ్ దేవరకొండ, నాగచైతన్య, రానా, వంశీపైడిపల్లి, దిల్‌రాజు, కొరటాల శివ, హరీష్ శంకర్‌తో పాటు పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని కొద్దిసేపు ముచ్చటించారు. అయితే బన్నీ-రౌడీ భాయ్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బన్నీని హత్తుకున్న విజయ్..
అల్లు అర్జున్ (Allu Arjun) జైలు నుంచి ఇంటికి చేరుకున్నారన్న వార్త వినగానే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఆగమేఘాల మీద బన్నీ ఇంటికి వచ్చేశారు. శనివారం ఉదయం అల్లు అర్జున్ నివాసానికి హీరో విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో బన్నీ ఫోన్‌లో మాట్లాడుతుండగా విజయ్‌కు నిర్మాత అల్లు అరవింద్ కరచలనంతో స్వాగతం పలికారు. అప్యాయంగా విజయ్‌ను కౌగిలించుకున్నారు. అటు అల్లుఅర్జున్ కూడా ఫోన్ కాల్ ఆపేసి విజయ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆపై ఇద్దరు ఒకరినొకరు అప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కష్టకాలంలో అల్లు అర్జున్‌కు అండగా నిలిచిన రౌడీ భాయ్‌ను బన్నీ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.
https://twitter.com/ANI/status/1867791848879927789
కంటతడి పెట్టిన సుక్కు
‘పుష్ప 2’ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్ కూడా బన్నీని పలకరించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. బన్నీని చూడగానే డైరెక్టర్ సుకుమార్ చాలా ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టారు. దీంతో సుక్కును బాధపడవద్దని బన్నీ వారించారు. ప్రేమగా గుండెలకు హత్తుకొని ఓదార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుకుమార్, బన్నీ బంధం ఎంత బలమైందో మరోమారు నిరూపితమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ తర్వాత బన్నీతో పాటు పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్న సుకుమార్, పుష్ప 2 నిర్మాతలు ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. తాము అండగా ఉన్నామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
https://twitter.com/Telugu_Cult/status/1867793674119393356
https://twitter.com/PTI_News/status/1867794765691203656
మెగా హీరోలు ఎక్కడ?
శుక్రవారం (డిసెంబర్ 13) అల్లు అర్జున్ అరెస్టు వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన ‘విశ్వంభర’ (Viswambhara) షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకొని మరి బన్నీ ఇంటికి వెళ్లారు. భార్య సురేఖతో కలిసి వెళ్లి ఓదార్చారు. కొద్దిసేపటి తర్వాత సోదరుడు నాగబాబు (Naga Babu) సైతం బన్నీ ఇంటికి వెళ్లిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. అయితే శనివారం బన్నీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క మెగా హీరో అతడ్ని పరామర్శించేందుకు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి భార్య సురేఖ (Surekha Konidela) ఒక్కరే బన్నీ ఇంటికి వెళ్లారు. అల్లుఅర్జున్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్‌లలో ఎవరూ బన్నీని పలకరించడానికి వెళ్లలేదు. దీంతో మెగా వర్సెస్ అల్లు వివాదం మరోమారు సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది.
https://twitter.com/ANI/status/1867809564848177444
బన్నీకి ఎమోషనల్ స్వాగతం
శనివారం (డిసెంబర్ 14) తెల్లవారుజామున చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు బన్నీని విడుదల చేశారు. దీంతో జైలు నుంచి నేరుగా తొలుత గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన బన్నీకి కుటుంబల సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు. ఇంటికి వచ్చిన తండ్రిని చూసిన కుమారుడు అయాన్ పరిగెత్తుకొచ్చి హగ్ చేసుకున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. తర్వాత సతీమణి స్నేహాను అప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ సందర్భంగా స్నేహా బావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/ANI/status/1867768390590611610
https://twitter.com/GulteOfficial/status/1867779035968995415
https://twitter.com/ANI/status/1867770277155017094
‘ఆ ఘటనలో నా ప్రమేయం లేదు’
ఇంటి వద్ద బన్నీ మీడియాతో మాట్లాడారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ చెప్పారు. సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటన (Sandhya Theatre Incident) గురించి మాట్లాడుతూ ‘దురదృష్టకర ఘటన. ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నా. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు. సుమారు 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్‌కు నేను వెళ్తున్నా. దాదాపు 30 సార్లు అక్కడ సినిమా చూశా. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. త్వరలోనే ఆమె (చనిపోయిన రేవతి) కుటుంబాన్ని కలుస్తా. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు’ అని అల్లు అర్జున్ అన్నారు.
https://twitter.com/ANI/status/1867823379673432179
డిసెంబర్ 14 , 2024
Shobhitha Shivanna: నటి శోభితా శివన్న సూసైడ్.. పోస్టుమార్టం రిపోర్ట్ ఇదే!
కన్నడ నటి శోభితా శివన్న (Shobhitha Shivanna) హైదరాబాద్‌లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అనుమానస్పద ఆమె ఫ్యాన్‌కు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలను అన్వేషించే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం శోభిత సూసైడ్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ మీడియాలోనూ హైలెట్ అవుతోంది. ఈ నేపథ్యంలో శోభిత శివన్న గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శోభిత శివన్న (Shobhitha Shivanna Suicide) వ్యక్తిగత వివరాలకు వస్తే ఆమె 1992 సెప్టెంబర్ 23న బెంగళూరులో జన్మించింది. అక్కడే విద్యాభ్యాసం చేసింది.
బాల్డ్‌విన్ గర్ల్స్ హై స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)లో గ్రాడ్యుయేషన్ చేసింది.
కెరీర్ ప్రారంభంలో కన్నడ ఛానెల్ రాజ్ మ్యూజిక్‌లో వీజే (వీడియో జాకీ)గా పని చేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సీరియల్స్, సినిమాల్లోకి అడుగుపెట్టింది.
2015లో వచ్చిన కన్నడ ఫిల్మ్ 'రంగితరంగ'తో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు సంపాదించింది.
ఆ తర్వాత చేసిన 'ఎరదొండ్ల మూరు', 'ఏటీఎం', 'అటెంప్ట్ టూ మర్డర్', 'జాక్‌పాట్' చిత్రాలు కన్నడ ఇండస్ట్రీలో ఆమెకు గుర్తింపు తెచ్చాయి.
ఓ వైపు సినిమాలు చేస్తూనే సీరియల్స్‌లోనూ ఆమె నటించింది. 'గాలిపట', 'మంగళ గౌరి', 'బ్రహ్మగంటు', ‘కృష్ణ రుక్మిణి’ సీరియల్స్‌లో శోభిత శివన్న నటించింది.
హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్ రెడ్డితో ఏడాదిన్నర క్రితం శోభిత (Shobhitha Shivanna Suicide) కు ఘనంగా వివాహమైంది.
బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా ఇంజనీర్‌గా పనిచేస్తున్న సుధీర్‌రెడ్డిని మ్యాట్రిమోని పరిచయంతో శోభిత వివాహమాడింది.
వివాహం తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు శోభిత మకాం మార్చింది. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీ సీ బ్లాక్‌లోని ఓ ఇంట్లో ఆమె భర్తతో కలిసి అద్దెకు ఉంటోంది.
శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన అనంతరం ఆమె గదిలోకి వెళ్లి నిద్ర పోయింది. భర్త పక్క గదిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు.
ఆదివారం ఉదయం లేచి చూసేసరికి ఫ్యాన్‌కు వేళాడుతూ శోభిత కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు ఈ విషయం తెలిసిన సాధారణ ప్రజలు సైతం షాకయ్యారు.
పెళ్లైనప్పటి నుంచి శోభిత శివన్న (Shobhitha Shivanna) నటనకు దూరంగా ఉంటున్నారు. భర్తతోనే హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. మరి ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఆమెకు ఏం వచ్చిందన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
ఒక వేళ భర్త సుధీర్ రెడ్డితో ఏమైన గొడవలు జరిగాయా? కాపురంలో సమస్యలు ఉన్నాయా? లేదా డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకుందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శోభిత పోస్టుమార్టం (Shobhitha Shivanna) నివేదిక సైతం బయటకు వచ్చింది. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, అది ఆత్యహత్యేనని వైద్యులు తేల్చారు. శోభిత స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
డిసెంబర్ 02 , 2024