• TFIDB EN
  • సాహో
    UATelugu2h 50m
    వాజీ అనే నగరం కేంద్రంగా గ్యాంగ్‌స్టర్ కార్యకలాపాలను సిండికేట్‌గా రాయ్( జాకీ ష్రాప్) నిర్వహిస్తుంటాడు. అండర్‌వరల్డ్‌ను చేజిక్కించుకోవాలని దేవరాజ్ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో రాయ్ ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ తర్వాత అతని కొడుకు విశ్వక్ క్రైమ్ వరల్డ్‌లోకి అడుగు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ప్రభాస్
    సిద్ధాంత్ నందన్ సాహో / అశోక్ చక్రవర్తి
    శ్రద్ధా కపూర్
    సాహో ప్రేమ ఆసక్తి
    జాకీ ష్రాఫ్
    నరంతక్ రాయ్
    అరుణ్ విజయ్
    ఇబ్రహీం కుమారుడు
    చంకీ పాండే
    దేవరాజ్
    నీల్ నితిన్ ముఖేష్
    జై / అశోక్ చక్రవర్తి
    లాల్
    ఇబ్రహీం
    మురళీ శర్మ
    డేవిడ్
    ప్రకాష్ బెలవాడి
    షిండే IPS
    మహేష్ మంజ్రేకర్
    ప్రిన్స్
    వెన్నెల కిషోర్
    గోస్వామి
    తనికెళ్ల భరణి
    భారత విదేశాంగ మంత్రి రామస్వామి
    సుప్రీత్
    అలెక్స్ ఫెర్నాండెజ్
    ఎవెలిన్ శర్మ
    జెన్నిఫర్
    టిన్ను ఆనంద్
    పృథ్వీరాజ్
    రవి వర్మ
    అజయ్
    శరత్ లోహితస్వా
    మణి
    దువ్వాసి మోహన్
    సబ్-పోలీస్ ఇన్‌స్పెక్టర్
    అభయ్ బేతిగంటి అసిస్టెంట్ మేనేజర్
    షైరా రాయ్‌షాఅరీ రాజీ
    నటాషా
    హర్ష వర్ధన్ షిండే అసిస్టెంట్
    ఖలీల్అంగరక్షకుడు
    జాక్వెలిన్ ఫెర్నాండెజ్
    గో-గో డాన్సర్ (బ్యాడ్ బాయ్ ఐటెమ్ సాంగ్‌లో అతిధి పాత్ర)
    సిబ్బంది
    సుజీత్
    దర్శకుడు
    V.వంశీ కృష్ణా రెడ్డినిర్మాత
    ప్రమోద్ ఉప్పలపాటినిర్మాత
    జిబ్రాన్
    సంగీతకారుడు
    తనిష్క్ బాగ్చి
    సంగీతకారుడు
    గురు రంధవా
    సంగీతకారుడు
    బాద్షా
    సంగీతకారుడు
    Shankar–Ehsaan–Loyసంగీతకారుడు
    R. మధి
    సినిమాటోగ్రాఫర్
    ఎ. శ్రీకర్ ప్రసాద్
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>OG Movie: ‘ఓజీ’లో ప్రభాస్‌? సాహోతో కనెక్షన్!</strong>
    OG Movie: ‘ఓజీ’లో ప్రభాస్‌? సాహోతో కనెక్షన్!
    పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఏపీ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో తన పెండింగ్‌ ప్రాజెక్ట్స్‌ హరి హర వీరమల్లు, ఓజీ (OG Movie) చిత్రాలను ఫినిష్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. హరి హర వీరమల్లు షూటింగ్‌ ఈ వీకెండ్‌తో పూర్తవుతుందన్న వార్తలు సైతం వచ్చాయి. మరోవైపు యంగ్ డైరెక్టర్ సుజీత్‌ సైతం ‘ఓజీ’ శరవేగంగా ఫినిష్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్‌ లేని సన్నివేశాలను చకా చకా షూట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ఓజీ’ సంబంధించి దిమ్మతిరిగే బజ్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే థియేటర్లు బద్దలవ్వడం ఖాయమని చెప్పవచ్చు.&nbsp; ‘ఓజీ’లో ప్రభాస్‌..? పవన్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజీ’ (OG Movie) చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ అందుతోంది. ఈ సినిమాలో పాన్‌ ఇండియా స్థార్ ప్రభాస్‌ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ప్రభాస్‌కు సంబంధించి కళ్లు చెదిరే క్యామియో ఉంటుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారని కూడా ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ ఇదే నిజమైతే 'ఓజీ'పై ఉన్న అంచనాలు తారా స్థాయికి వెళ్లడం ఖాయం. ప్రభాస్‌, పవన్‌ను ఒకే స్క్రీన్‌పై చూడటం కన్నుల పండగా ఉంటుందని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/TBO_Updates/status/1862813629441011860 ‘సాహో’తో కనెక్షన్ ఉందా? ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో (Saaho) చిత్రానికి కూడా యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ (Director Sujeeth) దర్శకత్వం వహించారు. అందులో ప్రభాస్‌ను చూపించిన విధానం, మేకింగ్స్‌ స్కిల్స్‌ ఆడియన్స్‌ను చాలా ఇంప్రెస్‌ చేశాయి. అయితే ప్రభాస్‌ ‘ఓజీ’తో ‘సాహో’కి కనెక్షన్ ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘సాహో’లోని ప్రభాస్‌ పాత్ర ‘ఓజీ’లో కనిపించొచ్చని చర్చించుకుంటున్నారు. కాగా, ఆ సినిమాలో ప్రభాస్‌ సైతం గ్యాంగ్‌స్టర్‌గా నటించారు. ఫస్టాఫ్‌ మెుత్తం పోలీసు ఆఫీసర్‌గా కనిపించి తోటి అధికారులను బురిడి కొట్టిస్తాడు. సెకండాఫ్‌లో అతడి ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్ రోల్‌ను దర్శకుడు సూజీత్‌ చూపించాడు. ఓజీలోనూ పవన్‌ గ్యాంగ్‌స్టర్‌ గానే చేస్తుండటంతో ఆ పరంగా ‘సాహో’తో ఏమైనా లింక్ ఉండే అవకాశముందని నెటిజన్లు భావిస్తున్నారు.&nbsp; https://twitter.com/GetsCinema/status/1862830321810493680 బ్యాంకాక్‌లో కలుస్తారా? ‘ఓజీ’ (OG) షూటింగ్‌కు సంబంధించి ఓ అప్‌డేట్‌ బయట కొచ్చింది. బ్యాంకాంక్‌లో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను దర్శకుడు సుజీత్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్‌తో పవన్‌ (Pawan Kalyan) షూటింగ్ పూర్తవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో పవన్‌ వచ్చేవారంలో బ్యాంకాంక్‌ వెళ్లి ఓజీ షూట్‌లో జాయిన్ అవుతారని సమాచారం. ప్రస్తుత అప్‌డేట్స్‌ ప్రకారం హీరో ప్రభాస్‌ సైతం బ్యాంకాక్‌ షూట్‌లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. అదే జరిగితే ప్రభాస్‌, పవన్‌లను భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లో చూసే అవకాశం దక్కుతుంది. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; అకీరానందన్‌ సైతం! పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) కుమారుడు అకీరానందన్ (Akira Nandan) ఫిల్మ్‌ ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న ఓజీతోనే అకీరా తెరంగేట్రం చేయబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సర్‌ప్రైజింగ్‌గా అకీరా నందన్‌పై షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అకీరానందన్ ఎంట్రీ వందశాతం ‘ఓజీ’తోనే ఉండనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వచ్చింది. అయితే అకీరా తెరంగేట్రాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచనున్నారట. అతడి ఎంట్రీ నేరుగా తెరపై చూడాల్సిందేనని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరి ‘ఓజీ’లో అకీరా ఏ పాత్రలో కనిపిస్తాడనేది మాత్రం ఎక్కడా రివీల్ కాలేదు.&nbsp;
    నవంబర్ 30 , 2024
    <strong>HBD Sujeeth: ‘ఓజీ’ డైరెక్టర్‌ సుజీత్‌ గురించి ఈ టాప్‌ సీక్రెట్స్‌ తెలుసా?</strong>
    HBD Sujeeth: ‘ఓజీ’ డైరెక్టర్‌ సుజీత్‌ గురించి ఈ టాప్‌ సీక్రెట్స్‌ తెలుసా?
    యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ (HBD Sujeeth) టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇప్పటివరకూ చేసింది రెండే చిత్రాలే అయినప్పటికీ పది చిత్రాలు చేసినా రానీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘రన్‌ రజా రన్‌’తో డైరెక్టర్‌గా మారిన సుజీత్‌ ‘సాహో’ (Saaho)తో పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో ‘ఓజీ’ చిత్రాన్ని తెరకెకిస్తూ మెగా ఫ్యాన్స్‌ దృష్టంతా తన వైపునకు తిప్పుకున్నాడు. ఇవాళ ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్ పుట్టిన రోజు. 34వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్‌లోని సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; 17 ఏళ్లకే షార్ట్‌ ఫిల్మ్స్‌ సుజీత్‌ రెడ్డి ఏపీలోని అనంతపురంలో 1990 అక్టోబర్‌ 26న జన్మించాడు. తొలుత చార్టెట్‌ అకౌంటెండ్‌ (CA) కావాలని కలలు కన్నాడు. సినిమాలపై ఆసక్తి పెరగడంతో L.V. ప్రసాద్‌ ఫిల్మ్‌ &amp; టీవీ అకాడమీలో ఫిల్మ్‌ కోర్సు చేశాడు. 17 ఏళ్లకే యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిల్మ్స్‌ చేయడం మెుదలు పెట్టాడు. ఇప్పటివరకూ 30కి పైగా షార్ట్‌ఫిల్మ్‌ను సుజీత్‌ తెరకెక్కించాడు.&nbsp; షార్ట్‌ ఫిల్మ్స్‌లో క్రియేటివిటీ సాధారణంగా యూట్యూబ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌ అంటే తక్కువ బడ్జెట్‌తో రూపొందుతుంటాయి. వాటి నుంటి హై స్టాండర్డ్స్‌ను ఎవరు పెద్దగా ఎక్స్‌పెక్ట్‌ చేయరు. కానీ సుజీత్‌ తెరకెక్కించిన ‘రన్‌ రాజా రన్‌’, ‘ప్రేమ ఇష్క్‌ కాదల్’, ‘తొక్కలో లవ్‌ స్టోరీ’, ‘వేషం’, ‘యుద్ధం’, ‘ప్రేమ కేరాఫ్‌ డ్రామా’, ‘ఇండియన్‌ ఐడల్‌’ వంటి షార్ట్‌ఫిల్మ్‌ను చాలా రిచ్‌గా తెరకెక్కించి సినీ ఇండస్ట్రీ వాళ్లను ఆశ్చర్యపరిచాడు. తన క్రియేటివిటీ మెస్మరైజ్‌ చేశాడు.&nbsp; View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign) తొలుత ఫ్యామిలీ ఒప్పుకోలేదట తను డైరెక్టర్ అవుతానని సుజీత్‌ చెప్పినప్పుడు కుటుంబ సభ్యులు విముఖత వ్యక్తం చేశారట. అయితే సినిమాపై అతడికి ఉన్న శ్రద్ధ చూసి ఫైనల్‌గా ఓకే చెప్పారట. అంతే కాదు సుజీత్‌ ఫస్ట్ కెమెరాను అతని తల్లి స్వయంగా తన డబ్బులతో కొనుగోలు చేసి గిఫ్ట్‌గా ఇచ్చిందట. అలా తల్లి, కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో సుజీత్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు.&nbsp; పూరి జగన్నాథ్‌ సూచనతో డైరెక్టర్‌ కావాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుజీత్‌ తొలుత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్‌ దగ్గర పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన్ను కలవగా అప్పటికే డైరెక్టర్‌ స్కిల్స్‌ పుష్కలంగా ఉన్నాయని పూరి చెప్పారు. దీంతో డైరెక్టర్‌గా సుజీత్‌ ప్రయత్నాలు మెుదలుపెట్టాడు.&nbsp; 23 ఏళ్లకే డైరెక్టర్‌గా.. డైరెక్టర్‌ ఛాన్స్ కోసం సుజీత్‌ ప్రయత్నిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ అతడి టాలెంట్‌ను గుర్తించి అవకాశమిచ్చింది. 'రన్‌ రాజా రన్‌' చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. అలా 23 ఏళ్లకే సుజీత్‌ డైరెక్టర్‌గా మారాడు. తొలి చిత్రంతోనే సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు.&nbsp; షార్ట్‌ ఫిల్మ్‌నే సినిమా తీసి.. తనకు ఎంతగానో గుర్తింపు తీసుకొచ్చిన ‘రన్‌ రాజా రన్‌’ షార్ట్‌ ఫిల్మ్‌నే తన ఫస్ట్‌ ఫిల్మ్‌గా సుజీత్‌ తెరకెక్కించడం విశేషం. షార్ట్‌ ఫిల్మ్‌లోని స్టోరీ కొద్దిగా మార్పులు చేసిన సినిమాను తెరకెక్కించడం గమనార్హం.&nbsp; బాహుబలి కంటే ముందే తొలి చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేషన్స్‌ వాళ్లే ప్రభాస్‌తో ‘మిర్చి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలో ప్రభాస్‌తో రెండో ఫిల్మ్‌ ప్లాన్‌ చేయాలని యువీ క్రియేషన్స్ భావించగా తన వద్ద కథ ఉందంటూ సుజీత్‌ తెలియజేశాడు. ఆ స్టోరీని ప్రభాస్‌కు చెప్పగా బాగా నచ్చిందట. అయితే అప్పటికీ బాహుబలి రిలీజ్‌ కాలేదు. బాహుబలి రిలీజ్‌ తర్వాత ప్రభాస్‌ క్రేజ్ అమాంతం పెరగడంతో కథలో సుజీత్‌ మార్పులు చేశాడు. అలా ‘సాహో’ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాకపోయిన అంత చిన్న వయసులో సుజీత్‌ పనితనం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.&nbsp; View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign) ఫ్యాన్‌ నుంచి పవన్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి.. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు సుజీత్‌ వీరాభిమాని. జానీ సినిమాకు తలకు బ్యాండ్‌ కట్టుకొని మరి థియేటర్‌కు వెళ్లినట్లు ఓ ఇంటర్వ్యూలో సుజీత్‌ చెప్పారు. ఏడు రోజుల పాటు బ్యాండ్‌ను అలాగే ఉంచుకున్నట్లు స్పష్టం చేశారు. అటు గబ్బర్‌ సింగ్‌ రిలీజ్‌ సమయంలోనూ ర్యాలీగా థియేటర్‌కు వెళ్లినట్లు సుజీత్ అన్నారు. అటువంటి స్టేజ్‌ నుంచి ‘ఓజీ’తో పవన్‌ను డైరెక్ట్‌ చేసే స్థాయికి సుజీత్‌ ఎదగడం సాధారణ విషయం కాదు.&nbsp; జపనీస్‌ సినిమాలంటే చాల ఇష్టం డైరెక్టర్‌ సుజీత్‌కు జపనీస్‌ సినిమాలంటే చాలా ఇష్టమట. ఓ ఇంటర్వూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. పవన్‌ ‘ఓజీ’ సినిమాపైనా జపనీస్‌ సినిమాల ప్రభావం ఉంటుందని అంటున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign) ఫ్రెండ్స్‌తో ట్రావెలింగ్‌ సుజీత్‌ తీరిక దొరికినప్పుడుల్లా స్నేహితులతో గడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. వారితో కలిసి వరల్డ్‌ టూర్‌కు వెళ్తుంటారు. అక్కడ దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ఉంటారు.&nbsp; View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign) క్రికెట్ అంటే పిచ్చి సుజీత్‌కు క్రికెట్‌ అంటే మహా ఇష్టం. రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid), సచిన్‌ టెండూల్కర్ (Sachin Tendulkar) అతడి తన ఫేవరేట్ ప్లేయర్స్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.&nbsp; భక్తి ఎక్కువే సుజీత్‌కు భక్తి కాస్త ఎక్కువనే చెప్పాలి. సమయం దొరికినప్పుడూ దేవాలయాలను సందర్శిస్తుంటాడు. View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign) ప్రేయసితో వివాహం దర్శకుడు సుజీత్‌ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2020లో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రవల్లికను వివాహం చేసుకున్నారు.&nbsp; https://twitter.com/Filmiparadise/status/1271319435127603205 ఉత్తమ డైరెక్టర్‌గా తాను డైరెక్ట్ చేసిన తొలి సినిమా రన్‌ రాజా రన్ చిత్రానికి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా నంది అవార్డ్స్‌లో&nbsp; సుజీత్ నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత అతని రెండో చిత్రం సాహోకు గాను ఉత్తమ డైరెక్టర్‌గా సైమా అవార్డు పొందాడు. బర్త్‌డే స్పెషల్ వీడియో నేడు ద‌ర్శ‌కుడు సుజీత్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అతనికి బ‌ర్త్‌డే విషెస్‌ తెలుపుతూ ‘ఓజీ’ టీమ్‌ స్పెషల్ వీడియోను పంచుకుంది. షూటింగ్‌ స్పాట్‌లో సుజీత్‌కి సంబంధించిన వీడియో క్లిప్స్‌ను ఒక దగ్గర చేర్చి నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1850075370994925843
    అక్టోబర్ 26 , 2024
    Pawan kalyan: పవన్‌ ఫ్యాన్స్‌ కోసం అదిరిపోయే ట్రీట్‌ లోడింగ్‌.. తెలిస్తే ఎగిరిగంతేస్తారు!&nbsp;
    Pawan kalyan: పవన్‌ ఫ్యాన్స్‌ కోసం అదిరిపోయే ట్రీట్‌ లోడింగ్‌.. తెలిస్తే ఎగిరిగంతేస్తారు!&nbsp;
    టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ఆయన నటిస్తోన్న లేటెస్ట్‌ చిత్రం 'ఓజీ' (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌). ‘సాహో’ (Saaho) ఫేమ్‌ సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో వ‌స్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, గ్లింప్స్‌ అభిమానుల్లో మంచి హైప్‌ క్రియేట్‌ చేసింది. కాగా, ఈ సినిమాకు సంబంధించి చాలా వరకూ షూటింగ్‌ పూర్తవ్వగా.. పవన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ మాత్రం పెండింగ్‌లో ఉంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో పవన్‌ బిజీగా ఉండటంతో షూటింగ్‌ కొన్ని రోజులు వాయిదా పడింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్‌ చేశాడు. ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అవుతోంది.&nbsp; కొత్త పోస్టర్‌తో మరింత హైప్‌! మ్యూజిక్‌ డైరెక్టర్ థమన్‌ (SS Thaman) షేర్ చేసిన పోస్టర్‌లో.. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. కత్తి పట్టుకుని ప్రత్యర్థులను తెగనరుకుతున్న‌ట్లు ఈ పోస్టర్‌లో పవన్‌ ఉన్నాడు. దీనిని చూసిన పవన్‌ అభిమానులు ఫిదా అవుతున్నారు. తమ హీరో కటౌట్‌కు తగ్గ సినిమా ‘ఓజీ’ అవుతుందని అంటున్నారు. ఇండస్ట్రీ రికార్డులను ‘ఓజీ’ కొల్లగొట్టడం ఖాయమని కామెంట్స్‌ రూపంలో తెలియజేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తోంది. అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అదిరిపోయే ట్రీట్‌ లోడింగ్‌! ఓజీ తర్వాత ప్రస్తుతం పవన్‌ చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్‌ 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' (Ustad Bhagat Singh). గబ్బర్‌ సింగ్‌ వంటి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ తర్వాత పవన్‌ - డైరెక్టర్‌ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబో ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీ పైన కూడా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈ మూవీ షూట్‌ కూడా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్‌ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్‌ చేశారు. ఈ మేరకు 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' మూవీ నుంచి ఊహించనిది రాబోతుంది' అంటూ ఎక్స్‌లో మేకర్స్‌ ట్వీట్‌ పెట్టారు. దీంతో ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ వస్తుందని అంతా భావిస్తున్నారు. పవన్‌ పొలిటికల్‌ డైలాగ్‌తో కూడిన ఓ వీడియోను రిలీజ్‌ చేయబోతున్నట్లు సమాచారం.&nbsp; https://twitter.com/MythriOfficial/status/1768870185656807451? సన్నగిల్లుతున్న అంచనాలు! పవన్‌ కల్యాణ్‌ హీరోగా.. దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్న మరో చిత్రం 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్‌లో మంచి హైప్‌ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా ఎటువంటి సాలిడ్‌ అప్‌డేట్‌ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరుస్తోంది. సినిమా షూటింగ్‌ వాయిదా మీదా వాయిదా పడుతుండటంతో పాటు అరకొరగా అప్‌డేట్స్‌ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇటీవల శివరాత్రి సందర్భంగా ఓ ప్రోమో రిలీజ్‌ చేస్తామని ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించినప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో పవన్‌ కెరీర్‌లో ప్రిస్టేజియస్‌ ప్రాజెక్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న 'హరిహర వీరమల్లు'పై పవన్‌ ఫ్యాన్స్‌లో ఆసక్తి తగ్గుతూ వస్తోంది.&nbsp;
    మార్చి 16 , 2024
    OG Movie Story: పవన్‌ ‘ఓజీ’ కథ నెట్టింట వైరల్‌.. అదే నిజమైతే ఇక గూస్‌బంప్సే!
    OG Movie Story: పవన్‌ ‘ఓజీ’ కథ నెట్టింట వైరల్‌.. అదే నిజమైతే ఇక గూస్‌బంప్సే!
    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్‌ చిత్రం 'ఓజీ' (OG). ప్రభాస్‌తో సాహో తీసిన డైరెక్టర్ సుజిత్.. ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‍గా నటిస్తోంది. అర్జున్ దాస్, ప్రకాష్‌ రాజ్, శ్రీయారెడ్డి, హరిశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీరోల్స్ చేస్తున్నారు. థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ లీకైనట్లు తెలుస్తోంది. ‘ఓజీ’ (OG Movie Story) కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; ఓజీ కథ ఇదేనా! (Is this the story of OG)? ఓజీ సినిమా కోసం పవన్‌ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్‌ డేట్ అప్‌డేట్‌ కూడా రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో సినిమా స్టోరీలైన్‌ అంటూ ఓ కథ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ‘ముంబయిలో పదేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్‌ గ్రూప్స్‌ అందరికీ బాస్ అయినటువంటి ఓజాస్‌ గంభీర సడెన్‌గా మాయం అవుతాడు. తన శత్రు మూకలపై రివేంజ్‌ తీర్చుకోవడానికి మళ్లీ తిరిగి వస్తాడు’ అన్నది కథ సారాంశం. దీంతో ఈ మూలకథ సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఓజీ ఫస్ట్‌ గ్లింప్స్‌తోనే డైరెక్టర్‌ సుజీత్‌ కథ బ్యాక్‌డ్రాప్‌ను రివీల్‌ చేశాడు. ‘పవన్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడని అజ్ఞాతంలో ఉన్న అతడు మళ్ళీ వచ్చాడు’ అన్నట్టు చూపించారు.&nbsp; సుజీత్‌ ‘డీపీ’ వైరల్‌ ఓజీ సినిమా దర్శకుడు సుజీత్‌ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో డీపీని మార్చారు. ముఖాలు కనిపించని ఇద్దరు వ్యక్తులు ఆ డీపీలో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు 'ఓజీ' (పవన్‌ కల్యాణ్‌) కాగా, మరొకరు డైరెక్టర్‌ సుజీత్‌. పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ చిత్రం వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘తన ఓజీతో సుజీత్‌’ (Sujeeth) అని కామెంట్స్‌ చేస్తున్నారు. ‘వైరల్‌ అవ్వడానికి ఫేసే కనిపించాలా ఏంటి? కటౌట్‌ ఉంటే చాలు’ అని అంటున్నారు. కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ సరిపోతుందని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.&nbsp; విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ‘ఓజీ’ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. సల్మాన్‌ ఖాన్‌ 'టైగర్ 3'లో విలన్‌గా మెప్పించిన ఇమ్రాన్‌.. ఓజీలోనూ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఇమ్రాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని.. బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది దర్శక నిర్మాతలు చాలా ముందున్నారని వ్యాఖ్యానించారు. చాలా క్రమ శిక్షణతో పనిచేస్తారన్నాడు. అందుకే సౌత్‌ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని చెప్పాడు.&nbsp; ఓజీపై శ్రియారెడ్డి హైప్‌ సలార్‌ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి శ్రియా రెడ్డి (Shriya Reddy) ఓజీ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె.. సలార్ కంటే ఓజీ ప్రపంచం చాలా పెద్దదని వ్యాఖ్యానించింది. ఓజీలో తానది నెగిటివ్‌ పాత్ర కాదని.. సినిమాలో తాను పోషిస్తున్న పాత్ర చాలా పెద్దదని చెప్పింది. ఓజీలో తన పాత్ర చూసిన తర్వాత సలార్‌లో తన రోల్‌ చాలా చిన్నదిగా అనిపిస్తుందని తెలిపింది. ఓజీ మూవీలోని క్యారెక్టర్‌ లైఫ్‌ లాంగ్ తనకు గుర్తింపు తీసుకొచ్చి పెడుతుందని చెప్పుకొచ్చింది.&nbsp;
    ఫిబ్రవరి 17 , 2024
    <strong>Indian Films With Rs.100 cr opening: </strong><strong>తొలి రోజే రూ.100 కోట్లు ఖాతాలో వేసుకున్న పాన్‌ ఇండియా స్టార్స్‌ వీరే!</strong>
    Indian Films With Rs.100 cr opening: తొలి రోజే రూ.100 కోట్లు ఖాతాలో వేసుకున్న పాన్‌ ఇండియా స్టార్స్‌ వీరే!
    ప్రస్తుతం దేశంలో పాన్‌ ఇండియా చిత్రాల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు తమ ఇండస్ట్రీలకు మాత్రమై పరిమితమైన స్టార్‌ హీరోలు ఇప్పుడు ఇతర ఇండస్ట్రీలలోనూ సత్తా చాటుతున్నారు. జాతీయ స్థాయిలో తమ చిత్రాలను రిలీజ్‌ చేస్తూ పెద్ద ఎత్తున కలెక్షన్స్‌ రాబడుతున్నారు. తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను తమ ఖాతాల్లో వేసుకుంటూ సత్తా చాటుతున్నారు. తారక్‌ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం ఇటీవలే విడుదలై తొలిరోజు రూ.172 కోట్లను కొల్లగొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లో తమ చిత్రాలను నిలిపిన స్టార్‌ హీరోలు ఎవరో ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం దేశంలో ఏ హీరోకు లేనంత క్రేజ్ ప్రభాస్‌కు ఉంది. ఆయన సినిమా వస్తుందంటే రికార్డులన్నీ దాసోహం కావాల్సిందే. తొలి రోజు అత్యధికసార్లు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హీరోగా ప్రభాస్‌ టాప్‌లో ఉన్నారు. ప్రభాస్‌ ఐదు సార్లు ఈ ఫీట్‌ను సాధించాడు. ‘బాహుబలి 2’ (రూ. 214.5 కోట్లు), ‘సాహో’ (రూ.130 కోట్లు), ‘ఆదిపురుష్‌’ (రూ.140 కోట్లు), ‘సలార్‌’ (రూ.178.7 కోట్లు), ‘కల్కి 2898 ఏడీ’ (రూ.191.5 కోట్లు) చిత్రాలన్నీ తొలిరోజు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి.&nbsp; విజయ్‌ (Vijay) ప్రభాస్‌ తర్వాత విజయ్‌ అత్యధిక సార్లు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నారు. ఆయన నటించిన ‘లియో’, ‘ది గోట్‌’ చిత్రాలు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో గతేడాది వచ్చిన 'లియో' (Leo) చిత్రం తొలి రోజు రూ.145 కోట్లు కొల్లగొట్టింది. ఇటీవల వచ్చిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్‌' (The G.O.A.T) ఫస్ట్‌ డే రూ. 126.3 కోట్లను తన ఖాతాలో వేసుకుంది.&nbsp; జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) దేవర సినిమా సక్సెస్‌తో తారక్ ఈ జాబితాలో టాప్‌ 3లో నిలిచారు. ఆయన చేసిన రెండు చిత్రాలు తొలి రోజు రూ.100 కోట్ల మార్క్‌ను అందుకున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో చేసిన ‘RRR’ చిత్రం తొలి రోజు ఏకంగా రూ.223 కోట్లను రాబట్టింది. తారక్‌ రీసెంట్‌ చిత్రం ‘దేవర’ (Devara) ఫస్ట్‌ డే రూ.172 కోట్లను వసూలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు చిత్రాల సక్సెస్‌తో తారక్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు.&nbsp; షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ రెండు సార్లు ఈ ఫీట్‌ సాధించారు. ఆయన నటించిన ‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో షారుక్‌, దీపికా పదుకొనే జంటగా నటించిన ‘పఠాన్’ (Pathan) చిత్రం తొలిరోజు రూ.106 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ‘జవాన్‌’ (Jawan) ఫస్ట్‌ డే వరల్డ్ వైడ్‌గా రూ.129 కోట్లను తన ఖాతాలో వేసుకుంది.&nbsp; యష్‌ (Yash) కన్నడ నటుడు యష్‌ ‘కేజీఎఫ్‌ 2’ (KGF 2) చిత్రం ద్వారా తొలి రోజే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరారు. ‘కేజీఎఫ్‌’ (KGF)కు ముందు వరకూ కన్నడ ఇండస్ట్రీకి పరిమితమైన యష్‌ ఆ సినిమా సక్సెస్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నారు. ‘కేజీఎఫ్‌ 2’ చిత్రం తొలి రోజు రూ.164 కోట్లు కొల్లగొట్టి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) బాలీవుడ్ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా డేర్ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి (Sandeep Reddy Vanga) వంగా రూపొందించిన ‘యానిమల్‌’ (Animal) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రణ్‌బీర్‌ కెరీర్‌లో తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచింది. గతేడాది డిసెంబర్‌ 1 రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ డే రూ.116 కోట్లను తన ఖాతాలో వేసుకుంది. రామ్‌చరణ్‌ (Ramcharan) దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘RRR’ చిత్రంలో తారక్‌తో పాటు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సైతం హీరోగా నటించారు. ఆ చిత్రం ద్వారా తొలి రోజు రూ.223 కోట్లను కొల్లగొట్టి ఈ జాబితాలో చోటు సంపాదించాడు. డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో వస్తోన్న ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) కూడా తొలి రోజు రూ.100 కోట్లు పైనే రాబడుతుందని చరణ్‌ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మక్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp;
    సెప్టెంబర్ 30 , 2024
    Pawan vs Jr NTR: పవన్‌ ‘ఓజీ’కి సవాలు విసురుతున్న తారక్‌ ‘దేవర’.. ఎందుకంటే?
    Pawan vs Jr NTR: పవన్‌ ‘ఓజీ’కి సవాలు విసురుతున్న తారక్‌ ‘దేవర’.. ఎందుకంటే?
    ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీ పాన్‌ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఇక్కడి స్టార్‌ హీరోల చిత్రాలన్ని దాదాపుగా జాతీయ స్థాయిలోనే విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ (OG), జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘దేవర’ (Devara) చిత్రాలు కూడా ఇండియా వైడ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ‘ఓజీ’లో పవన్‌ సరసన ప్రియాంక మోహన్‌ (Priyanka Mohan) నటిస్తుండగా.. ‘సాహో’ (Sahoo) ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు దేవర (Devara) చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ రెండు సినిమాల విడుదల తేదీలు విడుదల కాగా.. అవి క్లాష్‌ అయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; క్లాష్‌ ఎలా వచ్చిందంటే? పాన్ ఇండియా (Pawan vs Jr NTR) లెవెల్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమాల్లో ‘దేవర’, ‘ఓజీ’ ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోస్ విడుదలై మంచి రెస్పాన్స్‌ని దక్కించుకున్నాయి. దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది అంటే చెప్పలేని సిట్యువేషన్. తాజాగా రెండు సినిమాల మేకర్స్‌ విడుదల తేదీని ప్రకటించారు. దీని ప్రకారం పవన్‌ ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్‌ 27న వస్తుండగా.. తారక్‌ దేవర మూవీ అక్టోబర్‌ 10న విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలకు (OG vs Devara) దాదాపు రెండు వారాల సమయం ఉన్నప్పటికీ స్టార్‌ హీరోలు బరిలో నిలుస్తుండటంతో వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.&nbsp; https://twitter.com/cinecorndotcom/status/1758446390534197283 గతంలోనూ ఇలాగే! గతంలోనూ పవన్‌ కల్యాణ్‌, తారక్‌ (OG vs Devara) చిత్రాలు కొద్ది రోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి. 2013లో పవన్‌ నటించిన అత్తారింటికి దారేది (Atharintiki Daaredi) చిత్రం కూడా సరిగ్గా సెప్టెంబర్‌ 27న విడుదలైంది. అప్పట్లో ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ముందే ఒరిజినల్‌ ప్రింట్‌ బయటకు వచ్చినప్పటికీ పవన్‌ మేనియాతో ఆ సినిమా సాలిడ్ హిట్‌ అందుకుంది. అయితే కొద్ది రోజుల గ్యాప్‌లో ఎన్టీఆర్‌ 'రామయ్య వస్తావయ్యా' (Ramayya Vasthavayya) చిత్రం రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పవన్‌ విన్నర్‌గా నిలిచాడు. అయితే ఈసారి పోటీ చాలా రసవత్తరంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే సాహో ఫ్లాప్‌తో సుజీత్‌.. ఆచార్య డిజాస్టర్‌తో కొరటాల శివ ఈ సినిమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు.&nbsp; 2 వారాలు సరిపోతాయా? పవన్‌ సినిమా 'దేవర'కు మధ్య (Pawan vs Jr NTR) రెండు వారాల గడువు మాత్రమే ఉంది. ముందుగా ‘ఓజీ’ థియేటర్లలోకి వస్తుండటంతో ఆ చిత్రానికి థియేటర్ల కేటాయింపులో సమస్య ఉండకపోవచ్చు. కానీ రెండు వారాల గ్యాప్‌లోనే ‘దేవర’ వస్తుండటంతో ఓజీ థియేటర్లను ఆ సినిమా ఆక్రమించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఓజీ కలెక్షన్స్‌పై భారీగా ప్రభావం పడవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది క్రిస్మస్‌ కానుకగా వచ్చిన సలార్‌ (Salaar)కు కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. రెండు వారాల తర్వాత సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు నిలవడంతో సలార్‌ భారీ సంఖ్యలో థియేటర్లను కోల్పోయింది. దీంతో రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందనుకున్న ప్రభాస్‌ చిత్రం రూ.700 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఓజీకి కూడా ఇదే పరిస్థితి ఎదురువుతుందా? అన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది.&nbsp; ‘ఒకేసారి రిలీజ్‌ చేయండి’ దేవర, ఓజీ సినిమాల క్లాష్‌ అంశం (Pawan vs Jr NTR) సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇరువురి హీరోల ఫ్యాన్స్‌ రంగంలోకి దిగారు. రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్‌ చేయాలని వారు సూచిస్తున్నారు. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ హీరో సినిమా విజయం సాధిస్తుందని పవన్‌, తారక్ ఫ్యాన్స్ ఇరువురు చాలా దీమాగా ఉన్నారు. ఇండస్ట్రీ రికార్డులను అవి బద్దలు కొడతాయని అంటున్నారు. మరికొందరు న్యూట్రాల్‌ ఫ్యాన్స్ రెండు వారాల గ్యాప్ ఉండటమే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. అది ఇండస్ట్రీకి మేలు చేస్తుందని చెబుతున్నారు.&nbsp;
    ఫిబ్రవరి 17 , 2024
    <strong>Akkineni Akhil Engagement: సైలెంట్‌గా అఖిల్‌&nbsp; నిశ్చితార్థం.. నాగార్జునకు కోడలిగా మరో నటి!</strong>
    Akkineni Akhil Engagement: సైలెంట్‌గా అఖిల్‌&nbsp; నిశ్చితార్థం.. నాగార్జునకు కోడలిగా మరో నటి!
    అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం జరిగింది. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున (Akkineni Nagarjuna) స్వయంగా ప్రకటించారు. చిన్న కోడలు - కుమారుడు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. డిసెంబర్‌లో పెద్ద కూమారుడు అక్కినేని నాగచైతన్య వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఖిల్‌ కూడా త్వరలో పీటలు ఎక్కబోతుండటంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.&nbsp; పెళ్లికూతురు ఎవరంటే? అఖిల్‌ అక్కినేని నిశ్చితార్థం (Akkineni Akhil Engagement) ఇవాళ (నవంబర్‌ 26) హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో ఘనంగా జరిగింది. ప్రముఖ ఆర్టిస్టు 'జైనాబ్‌ రవద్జీ' చేతికి అఖిల్‌ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ తొడిగాడు. ఈ వేడుకకు అతికొద్ది మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలకు చెందిన అతి ముఖ్యులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అక్కినేని నాగార్జున పంచుకున్నారు. అక్కినేని కుటుంబంలోకి చిన్న కోడలికి స్వాగతం పలికారు. ఈ యువ జంటను ఆశీర్వదించండంటూ నాగార్జున కోరారు. https://twitter.com/iamnagarjuna/status/1861374206338048318 వచ్చే ఏడాదే పెళ్లి! అఖిల్ చాలాకాలం నుంచి నటి జైనాబ్ రవద్జీ (Akkineni Akhil Engagement) ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపగా వారు కూడా అంగీకరించారు. దీంతో అందరి సమక్షంలో ఒక్కటయ్యేందుకు వీరు రెడీ అయ్యారు. నిశ్చితార్థం జరుపుకొని పెళ్లి వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అఖిల్ పెళ్లి వచ్చే ఏడాదిలో జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక డిసెంబర్ 4న జరగనున్న అక్కినేని నాగచైతన్య - శోభిత దూళిపాళ్ల పెళ్లిలో అఖిల్‌ జంట ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.&nbsp; గతంలో అఖిల్‌ నిశ్చితార్థం రద్దు అక్కినేని నాగచైతన్య సమంతల వివాహం కంటే ముందే అక్కినేని అఖిల్ (Akhil Akkineni) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. రామ్ చరణ్ భార్య ఉపాసన బంధువు అయినా శ్రియ భూపాల్‌తో అఖిల్‌కు నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళలేదు. కొన్ని కారణాలతో అఖిల్‌-శ్రియ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలో శ్రియ భూపాల్ మరో యువకుడిని పెళ్లి చేసుకోగా అఖిల్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు జైనాబ్‌ రవద్జీతో పెళ్లికి సిద్ధమయ్యాడు.&nbsp; అఖిల్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా అఖిల్‌ నెక్ట్స్‌ ఫిల్మ్‌ రాబోతున్నట్లు సమాచారం. అక్కినేని నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తారని అంటున్నారు. 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్‌ మురళీ కిషోర్‌ (Murali Kishore) ఈ సినిమాను డైరెక్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన సైతం వస్తుందని చెబుతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు సైతం ఇప్పటికే మెుదలైనట్లు చెబుతున్నారు. దీంతో పాటు 'సాహో'కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసిన అనిల్‌ కుమార్‌తో మరో ప్రాజెక్ట్‌ అఖిల్ చేయనున్నట్లు సమాచారం. ఈ కొత్త డైరెక్టర్‌ చెప్పిన స్టోరీ అఖిల్‌కు విపరీతంగా నచ్చిందని, వెంటనే స్క్రిప్ట్‌ కూడా ఓకే చేశారని టాక్‌. ఈ నేపథ్యంలో అఖిల్‌ ఈ రెండు చిత్రాలను ఒకేసారి ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి.
    నవంబర్ 26 , 2024
    <strong>Akhil Akkineni: ఆ స్టార్ డైరెక్టర్‌తో గట్టిగానే ప్లాన్ చేసిన అఖిల్‌.. త్వరలో డబుల్‌ ట్రీట్‌!</strong>
    Akhil Akkineni: ఆ స్టార్ డైరెక్టర్‌తో గట్టిగానే ప్లాన్ చేసిన అఖిల్‌.. త్వరలో డబుల్‌ ట్రీట్‌!
    అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నట వారసుడిగా అఖిల్ భారీ అంచనాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. హ్యాండ్సమ్‌ లుక్‌, అద్భుతమైన ఫిజిక్‌ కలిగిన అఖిల్‌ ఇప్పటివరకూ హీరోగా ఐదు చిత్రాల్లో నటించాడు. అందులో ఒక్కటి కూడా బ్లాక్‌ బాస్టర్ కాలేదు. ఇది అఖిల్‌తో పాటు అక్కినేని ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. రీసెంట్‌ చిత్రం ‘ఏజెంట్‌’ కూడా ఫ్లాప్‌ కావడంతో ఈసారి ఎలాగైన హిట్‌ కొట్టి అభిమానులకు గ్రాండ్‌ ట్రీట్‌ ఇవ్వాలని అఖిల్‌ పట్టుదలగా ఉన్నాడు. అయితే ఏజెంట్‌ వచ్చి ఏడాదిన్నర దాటినా అఖిల్‌ ఇప్పటివరకూ ఒక్క ప్రాజెక్ట్‌ కూడా అనౌన్స్‌ చేయలేదు. ఈ క్రమంలోనే తాజాగా అఖిల్‌ నెక్ట్స్‌ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్‌ బయటకొచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు.&nbsp; పీరియాడికల్‌ డ్రామా! అఖిల్‌ (Akkineni Akhil) తర్వాతి ప్రాజెక్ట్‌ గురించి సోషల్‌ మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా అతడి నెక్ట్స్‌ ఫిల్మ్‌ రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. అక్కినేని నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తారని అంటున్నారు. 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్‌ మురళీ కిషోర్‌ (Murali Kishore) ఈ సినిమాను డైరెక్ట్‌ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన సైతం వస్తుందని చెబుతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు సైతం ఇప్పటికే మెుదలైపోయినట్లు చెబుతున్నారు. దర్శకుడు మురళీ కిషోర్‌ స్క్రిప్ట్‌ కూడా సిద్ధం చేశారని స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. త్వరలో డబుల్‌ ట్రీట్‌! పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాతో పాటు అఖిల్‌కు సంబంధించి మరో ప్రాజెక్ట్‌ సైతం దాదాపుగా ఓకే అయినట్లు టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో కొత్త దర్శకుడు అనిల్‌ కుమార్‌ (Anil Kumar) ఈ మూవీని తెరకెక్కిస్తారని సమాచారం. వాస్తవానికి కొన్ని నెలల క్రితమే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి వార్తలు బయటకు వచ్చాయి. ప్రభాస్‌ ‘సాహో’ చిత్రానికి అనిల్‌ కుమార్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారు. ఈ కొత్త డైరెక్టర్‌ చెప్పిన స్టోరీ అఖిల్‌కు విపరీతంగా నచ్చిందని, వెంటనే స్క్రిప్ట్‌ కూడా ఓకే చేశారని టాక్‌. ఈ నేపథ్యంలో అఖిల్‌ ఈ రెండు చిత్రాలను ఒకేసారి ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో అఖిల్‌ ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌ పక్కా అంటూ ప్రచారం కూడా జరుగుతోంది.&nbsp; అఖిల్‌ న్యూలుక్‌ గమనించారా? అఖిల్‌ తన కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం మేకోవర్ అవుతున్నాడు. అతడు పీరియాడికల్ యాక్షన్‌ డ్రామా కోసం తన లుక్‌ను మార్చుకున్నట్లు సమాచారం. రీసెంట్‌గా అఖిల్‌ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. లాంగ్‌ హెయిర్‌, బియర్డ్‌ లుక్‌తో కనిపించాడు. SSMB 29 ప్రాజెక్ట్‌ కోసం మహేష్‌ మేకోవర్‌ అయిన తరహాలోనే అఖిల్‌ సైతం మారాడు. గతంతో పోలిస్తే కండలు సైతం బాగా పెంచాడు. మరింత హ్యాండ్సమ్‌గా కనిపిస్తూ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెంచేస్తున్నాడు. అఖిల్‌ తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌తోనైనా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ కొట్టి సక్సెస్‌ ట్రాక్‌లోకి రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. https://twitter.com/GulteOfficial/status/1800901270997516612 ‘ఏజెంట్‌’ ఎక్కడ? అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఏజెంట్‌' (Agent). మలయాళ నటుడు మమ్ముట్టి ఇందులో కీలక పాత్ర పోషించాడు. భారీ అంచనాలతో గతేడాది ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్‌ సంస్థ సోనీలివ్‌ దక్కించుకుంది. గతేడాది మే 19 నుంచే స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. కానీ, ఇప్పటివరకూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కి రాలేదు. ఓటీటీలోకి ఏజెంట్‌ రాక ఎప్పుడంటూ గతంలో పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో చర్చ జరిగింది. త్వరలోనే స్ట్రీమింగ్ అంటూ పదే పదే సోనిలివ్‌ ఇప్పటికే చాలా సార్లు సోనిలివ్‌ చెప్పినా అది ఆచరణలోకి రాలేదు. దీంతో ఏజెంట్‌ గురించి ఆలోచించడం కూడా మానేశారు.&nbsp;
    అక్టోబర్ 18 , 2024
    <strong>Tollywood Collections: జనవరి - డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు</strong>
    Tollywood Collections: జనవరి - డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు
    టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడితే మరొన్ని వసూళ్ల సునామి సృష్టిస్తుంటాయి. అయితే ప్రతి సంతవ్సరం ఏ సినిమా టాప్‌లో నిలిచిందన్న లెక్కలు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ నెలల వారీగా ఏ సినిమా టాప్‌లో ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ వివరాలను వెల్లడిస్తూ Yousay ఈ ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. జనవరి నుంచి డిసెంబర్‌ వరకూ ఆయా నెలల్లో రిలీజైన చిత్రాల్లో కలెక్షన్స్‌ పరంగా ఏది అగ్రస్థానంలో నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; జనవరి&nbsp; ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘హనుమాన్‌’ (Hanuman) చిత్రం రూ.350 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా జనవరిలో రిలీజైన తెలుగు చిత్రాలతో పోలిస్తే హనుమాన్ కలెక్షన్స్‌ పరంగా టాప్‌లో ఉంది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ నటుడు తేజ సజ్జ హీరోగా నటించాడు.&nbsp; ఫిబ్రవరి ఫిబ్రవరిలో రిలీజైన చిత్రాల్లో 'భీమ్లా నాయక్‌' (Bheemla Nayak) కలెక్షన్స్‌ పరంగా అగ్రస్థానంలో ఉంది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.193 కోట్లను కలెక్ట్‌ చేసింది. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌, రానా, నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'RRR' మార్చి నెలలో అగ్రభాగాన నిలిచింది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.1300 కోట్లను వసూలు చేసింది. ఇందులో రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ హీరోలుగా నటించారు.&nbsp; ఏప్రిల్‌&nbsp; 2017 ఏప్రిల్ వచ్చిన 'బాహుబలి 2' (Bahubali 2)చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.1810 కోట్లను కొల్లగొట్టింది. తద్వారా ఏప్రిల్‌ నెలలో తిరుగులేని విధంగా టాప్‌లో నిలిచింది. ఓవరాల్‌గా చూస్తే కలెక్షన్స్‌ పరంగా రెండో భారతీయ చిత్రంగా 'బాహుబలి 2' నిలిచింది. ఇందులో ప్రభాస్‌, రానా, అనుష్క, సత్యరాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించారు.&nbsp; మే మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' (Sarkaru vaari Pata)చిత్రం రూ.180 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి మే నెలలో టాప్‌లో నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రానికి పరుశురామ్‌ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేసింది. జూన్‌ ఈ ఏడాది జూన్‌లో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా జూన్‌లో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది. ఇందులో ప్రభాస్‌ హీరోగా నటించగా కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; జులై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేసిన 'బాహుబలి' (Bahubali) చిత్రం కలెక్షన్ల పరంగా జులైలో నెం.1 స్థానంలో నిలిచింది. 2015లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.650 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతోనే రాజమౌళి టాలెంట్‌ పాన్‌ ఇండియా స్థాయికి తెలిసింది. ఆగస్టు ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ (Saaho) బాక్సాఫీస్‌ వద్ద రూ.445 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఆగస్టులో టాప్‌లో ఉంది. 2019లో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా చేసింది.  సెప్టెంబర్ గత నెల సెప్టెంబర్‌ రిలీజైన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం వసూళ్ల పరంగా సెప్టెంబర్‌లో టాప్‌లో నిలిచింది. తారక్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.341 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికీ విజయవంతంగా బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్రలో కనిపించారు.&nbsp; అక్టోబర్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' (Syra Narasimha Reddy) 2019 అక్టోబర్‌లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.240.60 కోట్లు రాబట్టి అక్టోబర్‌లో టాప్‌లో నిలిచింది. ఈ మూవీకి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు.&nbsp; నవంబర్‌&nbsp; టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత కలెక్షన్స్‌ పరంగా నవంబర్‌లో నెం.1గా ఉంది. 2022లో ఆమె నటించి యశోద (Yashoda) చిత్రం ఈ నెలలోనే రిలీజై రూ.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు హరి శంకర్ - హరీష్ నారాయణ్ ద్వయం దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘సలార్‌’ (Salaar) చిత్రం రూ.700 కోట్లు కొల్లగొట్టి ఈ నెలలో టాప్‌లో ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ చేసింది. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రూపొందనుంది.&nbsp;
    అక్టోబర్ 17 , 2024
    <strong>Tatva Review in Telugu: 58 నిమిషాల నిడివితో అర్ధరాత్రి జరిగే క్రైమ్‌ థ్రిల్లర్‌.. ‘తత్వ’ మెప్పించిందా?</strong>
    Tatva Review in Telugu: 58 నిమిషాల నిడివితో అర్ధరాత్రి జరిగే క్రైమ్‌ థ్రిల్లర్‌.. ‘తత్వ’ మెప్పించిందా?
    నటీనటులు : హిమ దాసరి, పూజా రెడ్డి బోరా, ఒస్మాన్‌ ఘని తదితరులు దర్శకత్వం : రుత్విక్‌ యాలగిరి సంగీతం : సాయి తేజ సినిమాటోగ్రాఫర్‌ : సి. హెచ్‌. సాయి ఎడిటింగ్‌: జై సి. శ్రీకర్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ : అరవింద్‌ ములే నిర్మాత : మానస దాసరి ఓటీటీ వేదిక : ఈటీవీ విన్‌ ఈ మధ్యకాలంలో ఓటీటీలో ఎన్నో విభిన్నమైన కథలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈటీవీ విన్ వారానికి ఒక వైవిధ్యమైన సినిమాను తీసుకొస్తూ ప్రేక్షలను అలరిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం 'తత్వ' (Tatva Review In Telugu) అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. ఇందులో హిమ దాసరి, పూజా రెడ్డి బోరా జంటగా నటించారు. రుత్విక్‌ యాలగిరి దర్శకత్వం వహించారు. కేవలం గంట నిడివితో వచ్చిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి ఆరిఫ్‌ (హిమ దాసరి) ఒక సాధారణ ట్యాక్సీ డ్రైవర్‌. అనుకోకుండా అతడికి డబ్బు అవసరం పడుతుంది. ఈ క్రమంలో బిజినెస్‌ మ్యాన్‌ థామస్‌ (ఒస్మాని ఘని) ఆరిఫ్‌ ట్యాక్సీ ఎక్కుతాడు. తనకు కావాల్సిన డబ్బు థామస్‌ దగ్గర ఉందని గ్రహించిన ఆరిఫ్‌ అతడి నుంచి ఎలాగైన డబ్బు తీసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే అనుకోని విధంగా థామస్‌ హత్య జరుగుతుంది. ఇందులో ఆరిఫ్‌ ఇరుక్కుంటాడు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు పోలీసు ఆఫీసర్‌ జ్యోత్స్న (పూజా రెడ్డి బోరా) రంగంలోకి దిగుతుంది. అసలు థామస్‌ను హత్య చేసింది ఎవరు? ఆరిఫ్‌ ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడు? థామస్‌ - ఆరీఫ్‌ మధ్య రిలేషన్ ఏంటి? ఆరీఫ్‌ నిర్దోషిగా బయటపడ్డాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే సినిమాకి మెయిన్ హీరో హిమ దాసరి అయినప్పటికీ నటుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్న వ్యక్తి మాత్రం ఒస్మాన్ ఘని. థామస్ పాత్రకు అతడు ప్రాణం పోశాడు. ఓ వైపు నవ్విస్తూనే తన నటనతో ఆలోచింపజేశారు. ఇక ఆరీఫ్ పాత్రలో హిమ దాసరి కూడా అలరించాడు. కష్టాల్లో ఉన్న యువకుడిగా అతడి నటన సహజంగా అనిపిస్తుంది. నటి పూజా రెడ్డికి ఇందులో మంచి పాత్రే దక్కింది. ప్రారంభంలో ఆమె రోల్‌ సాదా సీదాగా అనిపించిన క్లైమాక్స్‌ వచ్చే సరికి ఆశ్చర్యపరుస్తుంది. కథను మలుపు తిప్పడంలో ఆమె పాత్రనే కీలకం. కథ మెుత్తం ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టే తిరిగింది. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే ‘రన్ రాజా రన్’, ‘సాహో’ చిత్రాలకు సుజీత్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన రుత్విక్ తనదైన శైలిలో థ్రిల్లింగ్‌గా ఈ సినిమాను రూపొందించారు. మనిషిలో మానవత్వం అంతరిచిపోతున్నదనే విషయాన్ని వివరించిన విధానం బాగుంది. ముఖ్యంగా మెుదటి 20 నిమిషాలు చాలా ఆసక్తికరంగా చూపించారు. తన చెప్పాలనుకున్న పాయింట్స్‌ను ఎలాంటి తికమక లేకుండా నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు. సినిమాను అనవసరంగా సాగదీయకుండా 58 నిమిషాల్లోనే ముగించడం బాగా ప్లస్ అయ్యింది. అయితే కొన్ని సీన్స్‌ లాజిక్‌కు దూరంగా, అసంపూర్ణంగా ఉండటం మైనస్‌గా మారింది. ఈ విషయంలో దర్శకుడు జాగ్రత్త పడి ఉండే రిజల్ట్‌ ఇంకా బెటర్‌గా ఉండేది. సాంగ్స్‌, ఫైట్స్‌, రొమాన్స్, లవ్‌ట్రాక్ వంటి కమర్షియల్‌ హంగులు కోరుకునేవారికి మాత్రం ఈ సినిమా అంతగా ఎక్కకపోవచ్చు. ఓవరాల్‌గా దర్శకుడు రుత్విక్‌ పనితనం మెప్పిస్తుంది.  టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి పనితీరు కనబరిచారు. సినిమా మెుత్తం అర్ధరాత్రి సాగడంతో లో-లైట్‌లోనూ మంచి విజువల్స్ అందించారు. నేపథ్య సంగీతం కూడా సినిమాకు అదనపు బలంగా మారింది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. టెక్నికల్‌గా చూసుకుంటే 'తత్వ'కి మంచి మార్కులే పడ్డాయి. ప్లస్‌ పాయింట్స్ ఆరిఫ్‌, థామస్‌ పాత్రలుకెమెరా వర్క్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కమర్షియల్‌ హంగులు లేకపోవడంఅసంపూర్ణమైన క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 11 , 2024
    <strong>Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్‌.. ప్రభాస్‌ సైతం వెనక్కి తగ్గాల్సిందే!&nbsp;</strong>
    Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్‌.. ప్రభాస్‌ సైతం వెనక్కి తగ్గాల్సిందే!&nbsp;
    జూ.ఎన్టీఆర్‌ హీరోగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ చేసింది. విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్ నటించారు. అయితే ‘దేవర’ మూవీ తారక్‌కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెరపైకి తీసుకొచ్చింది. ప్రభాస్‌ వంటి గ్లోబల్‌ స్టార్‌కు సాధ్యం కానీ విజయాన్ని తారక్‌కు అందించింది. అటు ఫ్లాప్‌ దర్శకులకు తారక్‌ ఓ వరమని మరోమారు నిరూపించింది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఫ్లాప్‌ డైరెక్టర్లతో హిట్స్‌! టాలీవుడ్‌లోని ఫ్లాప్ డైరెక్టర్స్‌ పాలిట జూ.ఎన్టీఆర్‌ ఓ దేవుడిలా మారాడని చెప్పవచ్చు. భారీ డిజాస్టర్‌తో ఫేమ్‌ కోల్పోయిన డైరెక్టర్లు తారక్‌తో ఓ సినిమా చేస్తే మునుపటి క్రేజ్‌ను తిరిగి పొందడం ఖాయంగా కనిపిస్తోంది. రీసెంట్‌గా దేవర విషయంలోనూ ఇదే నిరూపితమైంది. దర్శకుడు కొరటాల శివ గతంలో తీసిన ‘ఆచార్య’ చిత్రం డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. అసలు కొరటాల శివ చిత్రమేనా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటువంటి డైరెక్టర్‌కు ఛాన్స్‌ ఇచ్చి దేవరతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు తారక్. అంతకుముందు ఫ్లాప్‌లతో ఉన్న పూరి జగన్నాథ్‌కు 'టెంపర్‌'తో సక్సెస్‌ ఇచ్చాడు. ‘1: నేనొక్కడినే’ పరాజయంతో ఢీలా పడిపోయిన సుకుమార్‌తో ‘నాన్నకు ప్రేమతో’ మూవీ తీసి గాడిలో పెట్టాడు. రవితేజతో ఫ్లాప్ అందుకున్న బాబీకి ‘జై లవకుశ’తో మంచి హిట్ ఇచ్చాడు. ‘అజ్ఞాతవాసి’తో భారీ డిజాస్టర్‌ అందుకున్న త్రివిక్రమ్‌కు ‘అరవింద సామెత’తో&nbsp; సక్సెస్‌ అందించాడు. ఇలా ఫ్లాప్ డైరెక్టర్లకు వరుసగా హిట్స్‌ ఇచ్చి సరికొత్త రికార్డును తారక్‌ క్రియేట్ చేస్తున్నాడు. ఒకే ఒక్క హీరోగా తారక్‌ హీరోల కెరీర్‌లో హిట్స్‌, ఫ్లాప్స్‌ అనేవి సర్వ సాధారణం. ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా తీసిన ప్రతీ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం లేదు. గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సైతం బాహుబలి తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’ చిత్రాలతో ఫ్లాప్‌ అందుకున్న వాడే. అయితే తారక్‌ మాత్రం గత తొమ్మిదేళ్లుగా ఒక్క ఫ్లాప్‌ లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన గత 7 చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బాస్టర్స్‌గా నిలిచాయి. ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’, ‘RRR’, ‘దేవర’ వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఈ జనరేషన్‌ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా తారక్‌ నిలవడం విశేషం. ఫ్యూచర్‌లో ‘దేవర 2’, ప్రశాంత్‌ నీల్‌తో ‘NTR 31’, సందీప్‌ రెడ్డి వంగాతో ఓ చిత్రం (గాసిప్‌) వంటి బిగ్‌ ప్రాజెక్ట్స్‌ ఉండటంతో తారక్ జైత్రయాత్ర ఇకపైనా కొనసాగే అవకాశముంది.&nbsp; 23 ఏళ్ల ఫ్లాప్‌ రికార్డు బద్దలు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో సినిమా చేస్తే బ్లాక్‌ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా వెంటనే హిట్‌ కొట్టిన దాఖలాలు లేవు. అయితే 'దేవర'తో తారక్‌ ఈ ఫ్లాప్‌ సెంటిమంట్‌ను బీట్‌ చేశాడు. రాజమౌళితో 'RRR' చేసిన తారక్‌ వెంటనే ‘దేవర’తో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘స్టూడెంట్‌ నెం.1’తో ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌కు శ్రీకారం చుట్టిన తారక్‌ స్వయంగా తానే దీనిని&nbsp; బ్రేక్‌ చేయడం విశేషం. అది కూడా 23 క్రితం స్టూడెంట్ నెం.1 రిలీజైన రోజున దేవరను తీసుకొచ్చి రాజమౌళి సెంటిమెంట్‌ను బద్దలు కొట్టాడు. రైతు పాత్రలో తారక్‌! తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్‌ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని ఫిల్మ్‌ వర్గాల సమాచారం.&nbsp; హీరోయిన్‌గా రష్మిక? దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్‌-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్‌ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.&nbsp;&nbsp;
    అక్టోబర్ 04 , 2024
    Prabhas New Projects: మాట నిలబెట్టుకుంటున్న ప్రభాస్‌.. సెట్స్‌పైకి ఒకేసారి మూడు చిత్రాలు!
    Prabhas New Projects: మాట నిలబెట్టుకుంటున్న ప్రభాస్‌.. సెట్స్‌పైకి ఒకేసారి మూడు చిత్రాలు!
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌తో దేశంలో ఏ స్టార్‌ హీరోకు అందనంత ఎత్తులో నిలుస్తున్నాడు. రీసెంట్‌గా కల్కితో రూ.1200 కోట్ల మార్క్‌ అందుకున్న ప్రభాస్‌ బాక్సాఫీస్‌ వద్ద తనకు తిరుగులేదని మరోమారు నిరూపించాడు. అంతేకాదు వరుసగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చేస్తూ ఫుల్‌ దూకుడు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే సూపర్‌ స్టార్ కృష్ణ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేస్తూ ఫుల్‌ ఫోకస్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఒకేసారి మూడు సినిమాలు పట్టాలెక్కించి ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నాడు. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; ప్రభాస్ ఇచ్చిన మాట ఇదే! హీరో ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రాలకు చిరునామాగా మారిపోయాడు. అతడు ఏ సినిమా పట్టుకున్న అది జాతీయ స్థాయి ప్రాజెక్టుగా మారిపోతోంది. ఆదిపురుష్‌ (2023) ముందు వరకూ ప్రభాస్‌ ఒక్కో&nbsp; చిత్రానికి కనీసం రెండేళ్లు సమయం తీసుకున్నాడు. 2015 బాహుబలి నుంచి ఈ తంతు మెుదలైంది. బాహుబలి నుంచి బాహుబలి 2 మధ్య గ్యాప్‌ రెండేళ్లు రాగా, ఆ తర్వాత వచ్చిన సాహో (2019), రాధే శ్యామ్‌ (2022) మధ్య ఏకంగా మూడేళ్ల సమయం పట్టింది. దీంతో అప్పట్లో ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒక్కో సినిమాకు ఇంత గ్యాప్‌ తీసుకుంటే ఎలా అంటూ డార్లింగ్‌పై సున్నితంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న ప్రభాస్‌ ఇకపై ఏడాదికి కనీసం ఒక సినిమా రిలీజ్‌ చేస్తానని మాటిచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ వరుసగా ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చూస్తూ దూసుకెళ్తున్నాడు.&nbsp; సూపర్‌ స్టార్‌ కృష్ణ వ్యూహం! ప్రభాస్‌ తన ప్రాజెక్టుల విషయంలో గతంతో పోలిస్తే చాలా ఫోకస్డ్‌గా ఉన్నాడు. ఒకప్పటిలాగా ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అనే విధానాన్ని స్వస్థి పలికి సూపర్‌ కృష్ణ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒకప్పుడు కృష్ణ ఏక కాలంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సినిమాల్లో నటించేవారు. ఇప్పుడు ప్రభాస్‌ కూడా ఆయన తరహాలోనే ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. వాస్తవానికి ‘సలార్‌’ సమయంలోనే ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌లోనూ పాల్గొంటూ రెండు చిత్రాలను 6 నెలల వ్యవధిలోనే రిలీజ్‌ చేశాడు. ప్రస్తుతం డైరెక్టర్‌ మారుతీతో 'రాజాసాబ్‌' అనే చిత్రంలో ప్రభాస్‌ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించాడు. నవంబర్‌ కల్లా సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని 'స్పిరిట్‌'ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో డార్లింగ్ ఉన్నాడు. తద్వారా ఏక కాలంలో ఈ మూడు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొని ఒక్కో సినిమాను ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే రిలీజ్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ‘సలార్‌ 2’, ‘కల్కి 2’ చిత్రాలను కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది.&nbsp; దేశంలోనే నెం.1 హీరోగా ప్రభాస్ బాలీవుడ్‌కు చెందిన మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా జులై నెలకు సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల జాబితాలను ప్రకటించింది. ఈ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ప్రభాస్ నిలిచాడు. ప్రభాస్ తర్వాత రెండో స్థానంలో తమిళ స్టార్ విజయ్ నిలవగా మూడో స్థానంలో షారుక్ ఖాన్, నాలుగో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐదో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, ఆరో స్థానంలో అక్షయ్ కుమార్, ఏడో స్థానంలో అల్లు అర్జున్, ఎనిమిదో స్థానంలో సల్మాన్ ఖాన్, తొమ్మిదో స్థానంలో రామ్ చరణ్, పదో స్థానంలో తమిళ స్టార్ హీరో అజిత్ నిలిచారు. మే, జూన్ నెలల్లో ఆర్మాక్స్ ప్రకటించిన జాబితాల్లో కూడా ప్రభాస్ మొదటిస్థానంలోనే నిలవడం విశేషం. దీనిపై అభిమానులు, సినీ ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోలను వెనక్కినెట్టి&nbsp; ప్రభాస్ నెంబర్ వన్‌గా అవతరించాడంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
    ఆగస్టు 31 , 2024
    <strong>Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?</strong>
    Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?
    టాలీవుడ్‌లో గత ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు హీరోలు విభిన్నమైన కథలను ఎంచుకొని పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగితే మరికొందరు తమ ఫేమ్‌ను తిరోగమనంలోకి తీసుకెళ్లారు. కొందరు హీరోలు చకచకా సినిమాలు చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తే ఇంకొందరు రెండేళ్లకు కూడా ఒక సినిమా రిలీజ్‌ చేయలేక ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమయ్యారు. ముఖ్యంగా కొందరు యంగ్‌ హీరోలు ఫ్లాప్స్‌ తియ్యడంలో పోటీ పడుతూ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత ఐదేళ్లలో టాలీవుడ్‌లో వచ్చిన గణనీయమైన మార్పులు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. ఒక మూవీకి ఏళ్లకు ఏళ్ల సమయం! టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజ నటులు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ను అలరించేవారు. వీరి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంటటేష్‌, బాలకృష్ణ సైతం ఈ పరంపరను కొనసాగిస్తూ ఏడాదిలో ఒక సినిమాకు తగ్గకుండా రిలీజ్‌ చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల సమయం పడుతోంది. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, తారక్‌ వంటి స్టార్‌ హీరోల నుంచి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు దాటిపోయింది. ఓ వైపు ప్రభాస్‌ ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు ఉండేలా ప్లాన్‌ చేసుకుంటే ఈ ముగ్గురు స్టార్స్‌ మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారు. సైంటిఫిక్‌, మైథాలజీ, ఫ్యూచరిక్‌ సినిమాలంటే కొంత ఆలస్యం జరిగిన ఓ అర్థం ఉంది. ప్రస్తుతం తారక్‌ (దేవర), రామ్‌చరణ్‌ (గేమ్‌ ఛేంజర్‌), అల్లు అర్జున్‌ (పుష్ప 2) చేస్తున్న కమర్షియల్‌ చిత్రాలకు కూడా ఇంత ఆలస్యం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది.&nbsp; ఫ్లాప్స్‌తో పోటీపడుతున్న కుర్ర హీరోలు! యంగ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నాగచైతన్య (Naga Chaitanya), రామ్‌ పోతినేని (Ram Pothineni)లకు గత ఐదేళ్లుగా టాలీవుడ్‌లో అసలు కలిసి రావడం లేదు. వారి నుంచి సాలిడ్‌ హిట్‌ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు హిట్‌ సినిమాలతో పోటీ పడిన ఈ ముగ్గురు హీరోలు అనూహ్యంగా గత ఐదేళ్ల నుంచి ఫ్లాప్స్‌తో పోటీ పడుతున్నారు. విజయ్‌ నటించిన రీసెంట్‌ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’తో పాటు గతంలో వచ్చిన ‘లైగర్‌’, ‘ఖుషి’, ‘డియర్ కామ్రేడ్‌’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. అలాగే నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’, ‘లాల్‌ సింగ్‌ చద్ధా’, ‘థ్యాంక్యూ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని చేసిన లేటెస్ట్‌ చిత్రం 'డబుల్‌ ఇస్మార్ట్‌' కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అంతకుముందు వచ్చిన ‘స్కంద’, ‘వారియర్‌’, ‘రెడ్‌’ సినిమాలు హిట్స్‌ అందుకోలేక ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. మార్కెట్‌ కోల్పోయే దిశగా సీనియర్లు ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి గత ఐదేళ్ల వ్యవధిలో దారుణంగా మారిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవికి ఇప్పటివరకూ సరైన కమ్‌బ్యాక్‌ లభించలేదని చెప్పాలి. ఓవైపు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ తమ వయసుకు తగ్గ స్టోరీలు ఎంచుకొని ‘జైలర్‌’, ‘విక్రమ్‌’ సినిమాలతో సాలిడ్‌ విజయాలను అందుకున్నారు. అయితే చిరు ఇప్పటికే కమర్షియల్ పాత్రలనే ఎంచుకుంటూ పోవడం ఆయనకు మైనస్‌గా మారుతోంది. అటు నాగార్జున, వెంకటేష్‌ పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. నాగార్జున గత చిత్రాలు ‘మన్మథుడు 2’, ‘బంగార్రాజు’, ‘నా సామిరంగ’లోని పాత్రలు ఏమాత్రం నాగార్జునకు సెట్ అయ్యేవిగా కనిపించవు. ఇక వెంటేష్‌ ‘రానా నాయుడు’ సిరీస్‌తో విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పటిలాగే మాస్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. అయితే కొత్త కథలు ఎంచుకోకపోవడం, వయసు తగ్గ పాత్రలు చేయకపోవడం, సరైన హిట్స్ లేకపోవడంతో ఒకప్పటి స్టార్‌ హీరోలుగా వెలిగిన ఈ హీరోల కలెక్షన్స్‌ కుర్రహీరోలతో పోలిస్తే పడిపోతూ వస్తున్నాయి. మార్కెట్‌ను పూర్తిగా కోల్పేయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; ప్రభాస్‌, నాని సూపర్బ్‌! గత ఐదేళ్ల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హీరోలుగా ప్రభాస్‌, నానిలను చెప్పవచ్చు. ఓవైపు వేగంగా సినిమాలు చేస్తూనే ప్రతీ మూవీకి కథ, పాత్ర పరంగా వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నారు. క్వాలిటీ పరంగానూ మంచి సినిమాలు తీస్తూ ఎప్పటికప్పుడు తమ క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రభాస్‌ గత చిత్రాలను పరిశీలిస్తే ‘బాహుబలి 1 &amp; 2’, ‘సాహో’, ‘రాధే శ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కథ, పాత్ర పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. అటు నాని రీసెంట్ చిత్రాలైన ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘అంటే సుందరానికి’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ కూడా విభిన్నమైనవే. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ కూడా ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిందే. అటు ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ‘రాజాసాబ్‌’, సలార్‌ 2, ‘కల్కి 2’, ‘స్పిరిట్‌’, ‘ఫౌజీ’ కథ, పాత్ర పరంగా ప్రభాస్‌ను మరో లెవల్‌లో చూపించనున్నాయి.&nbsp; రీరిలీజ్‌లతో ఫ్యాన్స్‌ సంతృప్తి! గతంలో లేని విధంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్‌ హీరోల బర్త్‌డేల సందర్భంగా గతంలో వారు చేసిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు విడుదలవుతున్నాయి. మహేష్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలకు లాంగ్‌ గ్యాప్‌ వస్తుండటంతో రీరిలీజ్‌ మూవీస్‌లోనే తమ హీరోను చూసుకొని ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. గత రోజులను గుర్తుచేసుకుంటూ సంతోష పడుతున్నారు. అయితే రీరిలీజ్‌ చిత్రాలకు ఆదరణ పెరగడానికి ఓ కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఆ తరహా చిత్రాలను హీరోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రీరిలీజ్‌ రూపంలో తమ ఫేవరేట్‌ చిత్రాలను మళ్లీ చూసుకొని అభిమానులు సంతోష పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.&nbsp; ఆ స్టార్‌ డైరెక్టర్లకు ఏమైంది? టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగిన పూరి జగన్నాథ్‌కు హీరోలతో సమానంగా సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. గతంలో ఆయన నుంచి సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొనేది. ‘ఇడియట్‌’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘పోకిరి’, ‘బిజినెస్‌ మ్యాన్‌’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్స్‌తో ఓ దశలో టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. అటువంటి పూరి గత కొంత కాలంగా హిట్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన గత చిత్రం ‘లైగర్‌’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. తాజాగా వచ్చిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సైతం ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అటు హరీష్‌ శంకర్‌ పరిస్థితి కూడా ఇంచుమించు పూరి లాగానే ఉంది. ‘మిరపకాయ్‌’, ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి సూపర్‌ హిట్స్‌తో మాస్‌ డైరెక్టర్‌గా హరీష్‌ శంకర్‌ ఇటీవల సరైన హిట్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’, ‘గద్దల కొండ గణేష్‌’ ప్లాప్స్‌తో లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’పై అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మిస్టర్‌ బచ్చన్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. హరీష్‌ శంకర్‌ టేకింగ్‌ సాదా సీదాగా ఉందంటూ విమర్శలు సైతం వచ్చాయి.&nbsp;
    ఆగస్టు 17 , 2024
    <strong>Kalki 2898 AD Day 2 Collections: రెండో రోజు 80% మేర పడిపోయిన ‘కల్కి’ వసూళ్లు.. షాక్‌లో ఫ్యాన్స్‌!</strong>
    Kalki 2898 AD Day 2 Collections: రెండో రోజు 80% మేర పడిపోయిన ‘కల్కి’ వసూళ్లు.. షాక్‌లో ఫ్యాన్స్‌!
    ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా హోస్‌ఫుల్‌ బోర్డులతో సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఓపెనింగ్ రోజే ఈ సినిమా ఏకంగా రూ.191.50 కోట్లు వసూల్ చేసి సంచలనం సృష్టించింది. దీంతో రెండో రోజు కలెక్షన్లపై అందరి దృష్టి పడింది. మరి రెండో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; డే 2 కలెక్షన్స్ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' రెండో రోజు వసూళ్లను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. తొలి రోజు రూ.191.5 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.298.5 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. మేకర్స్‌ లెక్కల ప్రకారం.. కల్కి వరుసగా రెండో రోజు కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రెండో రోజు కల్కి ఖాతాలో మరో రూ.107 కోట్లు (GROSS) వచ్చి చేరాయి. అయితే తొలి రోజు కలెక్షన్స్‌తో పోలిస్తే రెండో రోజు వసూళ్లు భారీగా పడిపోయాయి. కలెక్షన్స్‌లో 80% మేర కోత పడింది. దీంతో తొలి రెండు రోజుల్లో ఈజీగా రూ.350 కోట్ల మార్క్‌ దాటుతుందనుకున్న కల్కి.. కనీసం రూ.300 కోట్లు కూడా అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.&nbsp; తొలి రోజు ఆల్‌టైమ్‌ రికార్డు ప్రభాస్‌ ‘కల్కి’ సినిమా నార్త్‌ అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్‌తో (Prabhas) పాటు అగ్రతారల నటనకు అక్కడి ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే నార్త్‌ అమెరికాలో కల్కి ఆల్‌టైమ్‌ రికార్డును క్రియేట్‌ చేసింది. తొలి రోజున నార్త్‌ అమెరికా ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌లో కల్కి ఏకంగా 3.8 మిలియన్‌ డాలర్ల వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికాలో ఒక ఇండియన్‌ చిత్రం ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాతి స్థానాల్లో ‘ఆర్‌ఆర్ఆర్‌’ (3.46 మిలియన్లు), ‘సలార్‌’ (2.6 మిలియన్లు), ‘బాహుబలి2’ (2.45 మిలియన్లు) ఉన్నాయి. 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్‌ సేఫ్‌! ట్రేడ్‌ వర్గాలు లెక్కలను బట్టి.. 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డును 'కల్కి 2898 ఏడీ' బీట్‌ చేయలేకపోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తొలిరోజు రూ.223 కోట్లు (GROSS) రాబట్టి అత్యధిక డే1 వసూళ్లు సాధించిన ఇండియన్‌ చిత్రంగా టాప్‌లో ఉంది. ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం 'కల్కి 2898 ఏడీ' రూ.180 కోట్ల వద్దే ఆగిపోవడంతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్‌ అలాగే భద్రంగా ఉంది. ఆ తర్వాత 'బాహుబలి 2' రూ.217 కోట్లతో రెండో స్థానంలో నిలించింది. అయితే రెండింటి రికార్డులను కల్కి బ్రేక్‌ చేయలేకపోయింది. కానీ, కేజీఎఫ్ 2 (రూ.164.5 కోట్లు), సలార్ (రూ.158 కోట్లు), ఆదిపురుష్ (136.8 కోట్లు), సాహో (రూ.125.6 కోట్లు) రికార్డ్స్‌ను బ్రేక్‌ చేసి టాప్‌-3లో నిలిచింది.&nbsp; కలెక్షన్లపై మ్యాచ్ ఎఫెక్ట్! 'కల్కి 2898 ఏడీ' సినిమాను ‘బాహుబలి 2’, ‘RRR’ చిత్రాల మాదిరిగా ప్రమోట్ చేయడంలో చిత్రబృందం వెనుకబడింది. ఇంకా పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉండేది. అటు ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లపై టీ-20 వరల్డ్ కప్ ఎఫెక్ట్ పడింది. గురువారం (జూన్‌ 27) సాయంత్రం జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు ఆడియన్స్ మొగ్గు చూపడం కొంత మైనస్‌గా మారింది. దీనికి తోడు గురువారం వర్కింగ్‌ డే కావడం కూడా కల్కి కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. ఇవాళ (జూన్‌ 29) వరల్డ్‌ కప్ ఫైనల్ ఉండటంతో కల్కి మూడో రోజు కలెక్షన్స్‌పై ఎఫెక్ట్‌ పడే అవకాశం ఉంది.&nbsp;
    జూన్ 29 , 2024
    <strong>Kalki 2898 AD Day 1 Collections: టికెట్ రేట్లు పెంచిన నిరాశ పరిచిన కలెక్షన్లు.. కారణం ఏమిటంటే?</strong>
    Kalki 2898 AD Day 1 Collections: టికెట్ రేట్లు పెంచిన నిరాశ పరిచిన కలెక్షన్లు.. కారణం ఏమిటంటే?
    పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం.. గురువారం (జూన్‌ 27) వరల్డ్‌ వైడ్‌గా విడుదలై అదరగొడుతోంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కల్కి సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి.. ఈ మూవీ తొలిరోజు కలెక్షన్స్‌పై పడింది. మైథాలజీ - ఫ్యూచరిక్‌ జానర్‌లో విజువల్‌ వండర్‌గా రూపొందిన కల్కి ఫిల్మ్‌.. మెుదటి రోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తూ వచ్చాయి. మరి కల్కి ఆ మార్క్‌ను అందుకుందా? బాక్సాఫీస్‌ వద్ద ప్రభాస్‌ మేనియా ఏ స్థాయిలో పని చేసింది? అటు యూఎస్‌లో కల్కి సృష్టించిన ఆల్‌టైమ్‌ రికార్డ్‌ ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; డే1 కలెక్షన్స్‌ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘లెట్స్‌ సెలబ్రేట్‌ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్‌ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్‌ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్‌ చేసుకుంది. కానీ, ఈ వారంతంలో కల్కి కచ్చితంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆల్‌టైమ్‌ రికార్డు ప్రభాస్‌ ‘కల్కి’ సినిమా నార్త్‌ అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్‌తో (Prabhas) పాటు అగ్రతారల నటనకు అక్కడి ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే నార్త్‌ అమెరికాలో కల్కి ఆల్‌టైమ్‌ రికార్డును క్రియేట్‌ చేసింది. నార్త్‌ అమెరికా ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌లో కల్కి ఏకంగా 3.8 మిలియన్‌ డాలర్ల వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికాలో ఒక ఇండియన్‌ చిత్రం ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాతి స్థానాల్లో ‘ఆర్‌ఆర్ఆర్‌’ (3.46 మిలియన్లు), ‘సలార్‌’ (2.6 మిలియన్లు), ‘బాహుబలి2’ (2.45 మిలియన్లు) ఉన్నాయి. ఓవర్సీస్‌లో ఎంతంటే? ప్రీమియర్స్‌, ఫస్ట్‌డే కలెక్షన్స్‌ కలిపి అమెరికాలో తొలి రోజు 5 మిలియన్‌ డాలర్ల వసూళ్లను కల్కి రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. అమెరికాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల్లో ‘కల్కి’ ఒక్క రోజులోనే 5వ స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే అత్యంత వేగంగా 5 మిలియన్లు వసూలు చేసిన సినిమాగానూ రికార్డు నెలకొల్పింది. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఓవర్సీస్‌లో కల్కి బెంచ్‌మార్క్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీకెండ్‌కు కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్‌ సేఫ్‌! ట్రేడ్‌ వర్గాలు లెక్కలను బట్టి.. 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డును 'కల్కి 2898 ఏడీ' బీట్‌ చేయలేకపోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తొలిరోజు రూ.223 కోట్లు (GROSS) రాబట్టి అత్యధిక డే1 వసూళ్లు సాధించిన ఇండియన్‌ చిత్రంగా టాప్‌లో ఉంది. ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం 'కల్కి 2898 ఏడీ' రూ.180 కోట్ల వద్దే ఆగిపోవడంతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్‌ అలాగే భద్రంగా ఉంది. ఆ తర్వాత 'బాహుబలి 2' రూ.217 కోట్లతో రెండో స్థానంలో నిలించింది. అయితే రెండింటి రికార్డులను కల్కి బ్రేక్‌ చేయలేకపోయింది. కానీ, కేజీఎఫ్ 2 (రూ.164.5 కోట్లు), సలార్ (రూ.158 కోట్లు), ఆదిపురుష్ (136.8 కోట్లు), సాహో (రూ.125.6 కోట్లు) రికార్డ్స్‌ను బ్రేక్‌ చేసి టాప్‌-3లో నిలిచింది. కలెక్షన్లపై మ్యాచ్ ఎఫెక్ట్! 'కల్కి 2898 ఏడీ' సినిమాను ‘బాహుబలి 2’, ‘RRR’ చిత్రాల మాదిరిగా ప్రమోట్ చేయడంలో చిత్రబృందం వెనుకబడింది. ఇంకా పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉండేది. అటు ఈ సినిమా కలెక్షన్లపై టీ-20 వరల్డ్ కప్ ఎఫెక్ట్ పడింది. గురువారం సాయంత్రం జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు ఆడియన్స్ మొగ్గు చూపడం కొంత మైనస్ గా మారింది. దీనికి తోడు గురువారం వర్కింగ్‌ డే కావడం కూడా కల్కి కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. అయితే సర్వత్రా పాజిటివ్‌ టాక్‌ రావడంతో ఈ వీకెండ్‌లో కల్కి వసూళ్లు గణనీయంగా పెరిగే అవకాశముంది.&nbsp; Top 10 Highest Opening Day Collections in India 1. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) ఎన్టీఆర్‌ (Jr.NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలుగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్‌ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వసూళ్లను చూసి ట్రేడ్‌ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం. 2. బాహుబలి 2 (2017) రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్‌ ఇండియన్‌ ఓపెనింగ్‌ గ్రాసర్‌ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది.&nbsp; 3. సలార్‌ (2023) ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన సలార్‌ చిత్రం.. తొలిరోజున రూ.178.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. 2023 ఏడాదిలో అత్యధిక డే1 వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ సినిమా ఇదని ఫ్యాన్స్‌ తెగ మెచ్చుకున్నారు.&nbsp; 4. కేజీఎఫ్‌ 2 (2022) ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్‌ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం.&nbsp; 5. ఆదిపురుష్‌ (2023) ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్‌ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్‌ మెుదటి రోజు కలెక్షన్స్‌ రూ.136.8 కోట్లుగా రికార్డ్‌ అయ్యాయి. 6. జవాన్‌ (2023) బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ చిత్రం.. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై తొలిరోజున రూ.129.6 కోట్లు కొల్లగొట్టింది. హిందీ సినిమా హిస్టరీలో తొలి రోజున ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన మెుదటి చిత్రంగా నిలిచింది. ప్రముఖ సౌత్‌ ఇండియన్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి విలన్‌గా చేశారు. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఈ సినిమాలో తొలిసారి షారుక్‌తో జత కట్టింది. 7. సాహో (2019) ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్‌ చేసింది.&nbsp; 8. రోబో 2.0 (2018) తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా చేసిన ‘రోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్‌ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్‌ టాక్‌ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటించాడు.&nbsp; 9. పఠాన్‌ (2023) ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్‌ ఖాన్‌ పఠాన్‌ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్‌ మూవీ మంచి బూస్టప్‌ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్‌ కూడా హిట్‌ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; 10. జైలర్‌ (2023) రజనీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ ‘జైలర్‌’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది.&nbsp;
    జూన్ 28 , 2024
    OTT Suggestion: ఆహాలో ఈ బోల్డ్‌ మూవీని చూసేందుకు పోటెత్తుతున్నారు.. బెడ్‌ రూం సీన్లతో రచ్చ!
    OTT Suggestion: ఆహాలో ఈ బోల్డ్‌ మూవీని చూసేందుకు పోటెత్తుతున్నారు.. బెడ్‌ రూం సీన్లతో రచ్చ!
    సాధారణంగా బోల్డ్‌ కంటెంట్‌ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్‌ బేస్ ఉంటుంది. ఆ తరహా చిత్రాలను చూసేందుకు వారు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తుంటారు. అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే ‘A’ సర్టిఫికేట్‌ చిత్రాలు టాలీవుడ్‌లో రావడం చాలా అరుదు. గతంలో వచ్చిన అరకొర చిత్రాలను కూడా గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి థియేటర్లలో చూసి వచ్చేవారు. ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తుండటంతో ఆ సమస్యకు చెక్‌ పడింది. ప్రస్తుతం ఎలాంటి కంటెంట్‌ అయినా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన ఓ బోల్డ్‌ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ చిత్రాన్ని వీక్షించేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.  ఆ సినిమా పేరేంటి? ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజ జవేరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బోల్డ్ కంటెంట్ మూవీ ‘మిక్సప్’ (Mixup). ఆకాష్ బిక్కి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో.. మార్చి 15న ఈ సినిమా రిలీజైంది. అప్పటి నుంచి ఈ సినిమా నెంబర్‌ వన్‌ స్థానంలో దూసుకెళ్తోంది. పేరుకి ‘A’ సర్టిఫికేట్ అయినా.. ఈ మూవీ టేకింగ్‌, మెసేజ్‌ నేపథ్యం ఆడియన్స్‌ బాగా కనెక్ట్ అవుతోంది. అందుకే ఈ సినిమాను చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు.&nbsp; ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి? దర్శకుడు ఆకాష్‌ బిక్కి.. ఈ సినిమా కోసం తీసుకున్న కథ నేటి సమాజాన్ని అద్దం పడుతోంది. ఇందులో హైలెట్‌ చేసిన శృంగార కాన్సెప్ట్స్‌ కూడా యదార్థ సంఘటనలకు దగ్గరగా ఉన్నాయి. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే.. విపరీతమైన శృంగార కోరికలు ఉన్న భార్య ఉంటే అవతలి వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? పెళ్లి అంటే కేవలం పడక సుఖం మాత్రమే అనుకునే భర్త ఉంటే ఆ భార్య పరిస్థితి ఏంటి? కట్టుకున్న వాళ్లు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ భాగస్వామి మానసిక స్థితి ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాడు దర్శకుడు అకాశ్ బిక్కి .  మిక్సప్‌ కథేంటి? అభయ్ (కమల్ కామరాజు), నిక్కీ (అక్షర గౌడ).. సాహో (ఆదర్శ్ బాలకృష్ణ), మైథిలి (పూజ ఝవేరి) భార్య భర్తలు. ఈ రెండు జంటలు సెక్సువల్ లైఫ్ దగ్గర విబేధాలు వచ్చి విడిపోదాం అనుకుంటారు. మొదటి జంటలో నిక్కీకి, రెండు జంటలో సాహోకి సెక్సువల్ లైఫ్‌పై ఎక్కువ ఇంట్రెస్ట్. అయితే వారి పార్ట్నర్స్ అయిన అభయ్, మైథిలి.. లస్ట్ కంటే ప్రేమ లైఫ్‌ని కోరుకుంటూ ఉంటారు. దీంతో రెండు జంటల్లో విబేధాలు వస్తాయి. విడిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. అయితే ఓ డాక్టర్‌ సూచన మేరకు ఈ రెండు జంటలు కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక రిసార్ట్‌కి వెళ్తాయి. అక్కడ ఒకరికి ఒకరు పరిచయాలు కావడం.. సెక్సువల్ లైఫ్‌పై ఎక్కువ ఇంటరెస్ట్ ఉన్న సాహో, నిక్కీ బాగా కనెక్ట్‌ అవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రెండు జంటలు చివరికి కలిసున్నాయా? విడిపోయాయా? అన్నది కథ.&nbsp;
    మార్చి 25 , 2024
    &nbsp;SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
    &nbsp;SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
    సూపర్ స్టార్ మహేష్‌తో చేయబోయే SSMB29 చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో నిర్మించేందుకు డైరెక్టర్‌ రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. కౌబాయ్‌ తరహాలో తెరకెక్కనున్న ఈ అడ్వెంజర్‌ మూవీ కోసం హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌ను కూడా తీసుకోబోతున్నట్లు తెలిసింంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల మహేష్‌బాబు నటించిన గుంటూరు కారం సినిమా మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ... కలెక్షన్ల పరంగా సేఫ్ జోన్‌లో పడింది. మహేష్‌బాబు స్టామినాకు తగ్గ హిట్ పడలేదన్నది నిజం. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమాపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.&nbsp;&nbsp; గ్లోబల్ స్థాయి అయితే రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీస్ అయిన బాహుబలి, RRR ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెన్సేషన్ క్రియేట్ చేశాయి. జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్ గ్లోబర్ స్టార్లుగా ఎదిగిపోయారు. ప్రస్తుతం వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాజమౌళితో ఏ హీరో సినిమా తీసినా హిట్‌ అవడం ఖాయం. కానీ ఆ తర్వాత చేసే సినిమాలు ఇండస్ట్రీలో ఫ్లాప్‌గా నిలుస్తున్నాయి. మహేష్‌కు లాభమా నష్టమా? ఇప్పటివరకు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఇదే నియమం లెక్కతప్పకుండా కొనసాగుతుంది. ఆయనతో సినిమాలు చేసిన హీరోలు వరుసగా మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్స్‌గా మూటగట్టుకున్నారు. దీంతో SSMB 29 అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎటువంటి సినిమా చేస్తారు?&nbsp; ఏ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తారు? సగటు సూపర్ స్టార్ అభిమానిని తొలచివేస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే రాజమౌళి సినిమాతో మహేష్ బాబుకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ లభిస్తుంది. మరి దానిని నిలబెట్టుకునేలా మహేష్ బాబు తన తదుపరి SSMB30 సినిమాను ఎలా ఎంచుకుంటాడు? అతని కెరీర్‌కు బిగ్‌ ఛాలెంజ్ అంటూ ఇండస్ట్రీ పెద్దలు విశ్లేషిస్తున్నారు. SSMB29 క్రియేట్ చేస్తున్న బజ్.. మహేష్ బాబుకు లాభంతో పాటు నష్టాన్ని కూడా తెచ్చిపెట్టనుందని ఊహిస్తున్నారు. గతంలో ఇదే విధంగా రాజమౌళితో ఇండస్ట్రీ హిట్లు అందుకున్న తెలుగు హీరోలు ఆ తర్వాత ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక వరుసగా పరాజయాలు పొందారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్స్ అందుకున్న హీరోల జాబితాను ఓసారి పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా 'స్టూడెంట్‌ నెం.1'ను జూ. ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన 'సుబ్బు' సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ తారక్‌తో "సింహాద్రి" సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన 'ఆంధ్రావాల' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు RRRలో తారక్ నటించి గ్లోబర్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.&nbsp; ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ RRRకు ముందు రామ్‌చరణ్‌తో 'మగధీర' సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా తీస్తున్న రామ్‌చరణ్ ఎలాంటి ఫలితాన్ని పొందుతాడో వేచి చూడాల్సి ఉంది. ఇక రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన 'ఈగ' సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.&nbsp; మహేష్ బాబు కూడా అదే పరిస్థితా? దీంతో మహేష్ బాబు కూడా SSMB29 తర్వాత ఇతర టాలీవుడ్ అగ్రహీరోల మాదిరి బోల్తా పడుతాడా లేక గత చరిత్రను తిరిగి రాస్తాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా అంది. అటు ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) కూడా నటిస్తారని తెలుస్తోంది. మలయాళం నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కూడా ఓ కీలకపాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఆ నటులతో రాజమౌళి బృందం చర్చలు జరుపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చర్చలు గాని ఫలిస్తే SSMB29 పై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అయితే దీనిపై రాజమౌళి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.&nbsp; వరల్డ్ వైడ్ బజ్ మరోవైపు మహేష్‌ బాబు.. రాజమౌళి సినిమా కోసం తన లుక్స్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన అన్న కొడుకు మ్యారెజ్ కార్డు ఇవ్వడానకి వెళ్లినప్పుడు.. మహేష్ బాబు పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్కువ జుట్టు, ఒత్తైన గడ్డంతో హాలీవుడ్ హీరోలా మహేష్ కనిపించాడు. అలాగే కొన్ని స్టంట్స్‌ నేర్చుకునేందుకు జర్మనీలో ఇటీవల మహేష్ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. అటు దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిఫ్ట్ కూడా ఫైనల్ చేసి రాజమౌళికి వినిపించినట్లు సమాచారం. ఏప్రిల్‌ నుంచి నటీనటుల ఎంపిక, సాంకేతిక బృందం వంటి అంశాలను చిత్ర యూనిట్ పరిశీలించనున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా వరల్డ్‌ వైడ్‌గా క్రియేట్ చేస్తున్న బజ్ అంతా ఇంతా కాదు.
    ఫిబ్రవరి 14 , 2024
    Indian Movies: కలెక్షన్స్‌లో ‘జవాన్‌’ ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. కానీ, ఇప్పటికీ తెలుగు చిత్రాలే టాప్‌!
    Indian Movies: కలెక్షన్స్‌లో ‘జవాన్‌’ ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. కానీ, ఇప్పటికీ తెలుగు చిత్రాలే టాప్‌!
    షారుక్‌ ఖాన్ లేటెస్ట్‌ మూవీ ‘జవాన్’ (Jawan) ఇండియన్‌ బాక్సాఫీస్‌ (Indian Box Office) వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే దేశంలో అన్ని భాషల్లో కలిపి ఏకంగా రూ.75 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ (Net Collections) సాధించింది. ఇప్పటివరకూ విడుదలైన అన్ని సినిమాలతో పోలిస్తే ఇదే అత్యధిక నెట్‌ కలెక్షన్స్‌.&nbsp; ఈ సినిమాకు ముందు వరకూ పఠాన్‌ (Pathan) రూ.55 కోట్లు, కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 (KGF 2) రూ. 54 కోట్లు, బాహుబలి (Bahubali) రూ. 41 కోట్లు మాత్రమే ఫస్ట్‌ డే నెట్‌ కలెక్షన్స్‌ వచ్చాయి. తాజాగా జవాన్‌ మూవీ ఆ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే జవాన్‌ చిత్రం తొలిరోజు రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ రాబట్టడం విశేషం. కృష్ణాష్టమి సందర్భంగా (సెప్టెంబర్‌ 7) రిలీజైన జవాన్‌ చిత్రం.. హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. పైగా షారుక్‌ ఖాన్‌ (Shahrukh khan)కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డ్స్‌ బద్దలు కొట్టే ఛాన్స్‌ ఉందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ‘జవాన్’ డే 1 గ్రాస్‌ లెక్కల విషయానికి వస్తే వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ రూ.150 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ గ్రాస్‌ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే జవాన్‌ కంటే ముందు పలు చిత్రాలు హైయస్ట్‌ గ్రాస్‌ వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో తొలిరోజు అత్యధిక గ్రాస్‌ వసూళ్లను సాధించిన టాప్‌-10 భారతీయ చిత్రాలు (Highest Opening Day Grossers In Indian Cinema) ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; 1. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) ఎన్టీఆర్‌ (Jr.NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలుగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్‌ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వసూళ్లను చూసి ట్రేడ్‌ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం. 2. బాహుబలి 2 (2017) రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్‌ ఇండియన్‌ ఓపెనింగ్‌ గ్రాసర్‌ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది.&nbsp; 3. కేజీఎఫ్‌ 2 (2022) ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్‌ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం.&nbsp; 4. ఆదిపురుష్‌ (2023) ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్‌ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్‌ మెుదటి రోజు కలెక్షన్స్‌ రూ.136.8 కోట్లుగా రికార్డ్‌ అయ్యాయి. 5. సాహో (2019) ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్‌ చేసింది.&nbsp; 6. రోబో 2.0 (2018) తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా చేసిన ‘రోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్‌ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్‌ టాక్‌ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటించాడు.&nbsp; 7. పఠాన్‌ (2023) ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్‌ ఖాన్‌ పఠాన్‌ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్‌ మూవీ మంచి బూస్టప్‌ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్‌ కూడా హిట్‌ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; 8. జైలర్‌ (2023) రజనీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ ‘జైలర్‌’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది.&nbsp; 9. కబాలి (2016) 2016లో వచ్చిన ‘కబాలి’ (Kabali) చిత్రం ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ తొలి రోజు భారీ వసూళ్లనే సాధించింది. ఈ మూవీ మెుదటి రోజు రూ.90.5 కోట్ల గ్రాస్‌ సాధించింది. జైలర్‌ ముందు వరకు రజనీకాంత్‌కు ఫస్ట్‌ డే హైయస్ట్ గ్రాసింగ్‌ మూవీగా ‘కబాలి’ ఉంటూ వచ్చింది.&nbsp; 10. పొన్నియన్ సెల్వన్‌ (2022) మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌ (Ponniyin Selvan: Part I) మూవీ తొలి రోజున రూ. 83.6 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. రీసెంట్‌గా విడుదలైన ‘పొన్నియన్‌ సెల్వన్‌ పార్ట్‌ 2’ తమిళంలో పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ మూవీలో విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్‌, త్రిష, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషించారు.&nbsp;
    సెప్టెంబర్ 08 , 2023
    Adipurush: ఆదిపురుష్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్‌… ప్రమాదంలో బాహుబలి-2, RRR రికార్డ్స్‌?
    Adipurush: ఆదిపురుష్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్‌… ప్రమాదంలో బాహుబలి-2, RRR రికార్డ్స్‌?
    ఆదిపురుష్ మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. వరల్డ్‌వైడ్‌గా ఐదు భాషల్లో రిలీజైంది. ఈ నేపథ్యంలో ట్రేడ్ పండితుల దృష్టి ఈ సినిమా కలెక్షన్లపై పడింది. తొలి రోజు ఆదిపురుష్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందా? అన్న ఆసక్తి మొదలైంది. మునపటి సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు భారీగా వసూళ్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. మరి, ఇండస్ట్రీలో ఇది వరకు భారీ ఓపెనింగ్స్‌ని రాబట్టిన సినిమాలేంటి? ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లను సాధించాయి? అనే అంశాలను తెలుసుకుందాం.&nbsp; బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా ‘బాహుబలి2’ అగ్రస్థానంలో ఉంది. ఈ సినిమా ఏకంగా రూ.217 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్ల వసూళ్లను సాధించింది. ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌ నిర్మించింది.&nbsp; కేజీఎఫ్ 2 కన్నడ నాట పెను సంచలనం రేపిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే కేజీఎఫ్2 సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ.164 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితుల అంచనా. సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1300 కోట్లు రాబట్టినట్లు సమాచారం.&nbsp; ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లలోనూ దూసుకెళ్లింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించడం, బాహుబలి తర్వాత జక్కన్న చేసిన సినిమా కావడంతో బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.158 కోట్లను కలెక్ట్ చేసింది. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1200 కోట్ల వసూళ్లను సాధించింది.&nbsp; సాహో బాహుబలి-2 సినిమాతో హీరో ప్రభాస్ మార్కెట్ విశ్వవ్యాప్తమైంది. దీంతో బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందుకు అనుగుణంగానే తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మందగించాయి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.190 కోట్లు కలెక్ట్ చేసింది.&nbsp; పఠాన్ బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం బిగ్ హిట్ అయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.106 కోట్లను రాబట్టింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో వసూళ్లలో దూసుకెళ్లింది. ఓవరాల్‌గా పఠాన్ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2023లో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.&nbsp; రోబో 2.0 రజినీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబోలో వచ్చిన చిత్రం రోబో 2.0. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.106 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను సాధించింది. కానీ, అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించడంలో సినిమా విఫలమైంది. దీంతో ఓవరాల్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది.&nbsp;
    జూన్ 16 , 2023
    Adipurush: పెళ్లిపై క్లారిటీ.. ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్&nbsp;
    Adipurush: పెళ్లిపై క్లారిటీ.. ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్&nbsp;
    ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. అడుగడుగునా ఆధ్యాత్మికత ఫరిడవిల్లేలా సభా ప్రాంగణాన్ని నిర్వహకులు తీర్చిదిద్దారు. దాదాపు లక్షకు పైగా పాసులు మంజూరు చేయగా అంతకుమించి అభిమానులు వేడుకకు వచ్చారు. ఎటు చూసినా రాముడి స్వరూపమే. జై శ్రీరామ్ నినాదమే. అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలో ముఖ్య అతిథులతో పాటు ప్రభాస్, కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ సహా సినిమాకు పనిచేసిన నటీనటులు ఇతర టెక్నిషియన్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రభాస్, కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లిపై ప్రకటన.. ప్రభాస్ ప్రస్తుత వయసు 43. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచ్‌లర్ ప్రభాసే. దీంతో ఎక్కడ కనిపించినా డార్లింగ్‌కు ఈ ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. కానీ, ఏనాడూ పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ‘త్వరలో.. త్వరలో’ అంటూ సమాధానాన్ని దాటవేసేవాడు. ‘ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్’ పుణ్యమా అని ప్రభాస్ పెళ్లిపై కొద్దోగొప్పో క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నా.. అది తిరుపతిలోనే జరుగుతుందని తేల్చేశాడు. అభిమానుల నుంచి వచ్చిన ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్ ఈ రిప్లై ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.&nbsp; https://twitter.com/DailyCultureYT/status/1666291610722930689?s=20 ఇక సినిమాల జాతరే.. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్‌లో వేగం మందగించింది. గత ఐదేళ్లలో ప్రభాస్ చేసింది 2 సినిమాలు మాత్రమే. 2017లో బాహుబలి2 సినిమా విడుదలయ్యాక 2019లో సాహో రిలీజ్ చేశాడు. మళ్ళీ 2022లో రాధేశ్యామ్‌ సినిమాతో వచ్చాడు. ఇవి రెండూ పెద్దగా రాణించకపోవడంతో ఆదిపురుష్‌పైనే అంచనాలు పెట్టుకున్నారు. అయితే, సినిమాల విషయంలోనూ ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇక నుంచి ఏడాదికి 2, 3 సినిమాలు చేస్తానని ఫ్యాన్స్‌కి మాటిచ్చాడు. ఎక్కువ సినిమాలు చేస్తూ తక్కువ మాట్లాడతానని చెప్పాడు.&nbsp; https://twitter.com/TheAakashavaani/status/1666136550361673728?s=20 ఆదిపురుష్ సినిమా.. ఆదిపురుష్ మూవీ తొలి ట్రైలర్ గతేడాది రిలీజ్ అయినప్పుడు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఓం రౌత్ పనితీరుపై ప్రభాస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ, అవేవీ నిజం కాదని ప్రభాస్ పరోక్షంగా కొట్టి పారేశాడు. ఆదిపురుష్ సినిమా వెనకాల ఉన్న కష్టాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. సినిమా కోసం రోజుకు 20 గంటలు పనిచేశారని గుర్తు చేశారు. దర్శకుడు ఓం రౌత్ పెద్ద యుద్ధమే చేసినట్లు వివరించాడు. తన జీవితంలోనే ఓం రౌత్ లాంటి వ్యక్తులను చూడలేదని ప్రశంసించాడు.&nbsp; చిరంజీవి కామెంట్స్‌.. ఆదిపురుష్ సినిమా చేయడం నిజంగా తన అదృష్టమని ప్రభాస్ చెప్పాడు. గతంలో చిరంజీవితో జరిగిన సంభాషణను ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పంచుకున్నాడు. ‘రామాయణం సినిమా చేస్తున్నావా? అని చిరంజీవి సర్ అడిగారు. అవునని చెప్పా. ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు. నీకు దొరికింది అని చెప్పారు’ అంటూ ప్రభాస్ గుర్తు చేసుకున్నాడు.&nbsp; https://www.youtube.com/watch?v=A8NS3vSJ1Gc కృతి సనన్.. ప్రభాస్‌కు జంటగా కృతిసనన్ ఈ సినిమాలో నటించింది. సీత పాత్ర పోషించింది. అయితే, వీరిద్దరి మధ్య ఏదో ఉందని బాలీవుడ్ వర్గాలు అప్పట్లో కోడై కూశాయి. కానీ, అలాంటిదేమీ లేదని కృతిసనన్ గతంలో ఖండించింది. అన్‌స్టాపబుల్ షోలోనూ ప్రభాస్‌ను బాలయ్య ఈ ప్రశ్న అడిగాడు. దీంతో ‘మేడం అంతా క్లారిటీ ఇచ్చేసిందిగా సర్’ అంటూ డార్లింగ్ జవాబు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఈ సినిమాలో నటించిన కృతిసనన్ ప్రభాస్ అభినందించాడు. ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో అభిమానులను ఫిదా చేసిందని కొనియాడాడు.&nbsp; ప్రభాస్‌పై కృతి సనన్.. ప్రభాస్‌పై కృతిసనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆన్‌స్క్రీన్‌, ఆఫ్‌స్క్రీన్ ప్రభాస్ గురించి చెప్పింది.&nbsp; ‘ఆన్‌స్క్రీన్‌లో యాక్టీవ్‌గా, ఆఫ్ స్క్రీన్‌లో ప్రభాస్ కామ్‌గా ఉంటారని అనుకుంటారు. కానీ ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు. ప్రభాస్‌లోని కామ్‌నెస్ ఎవరిలోను చూడలేదు. రాముడిగా ప్రభాస్‌ను తప్ప ఎవరిని ఉహించుకోలేం. ఈ సినిమాలో జానకి పాత్ర ఎంతో ప్రత్యేకం’ అని కృతి చెప్పుకొచ్చింది. https://www.youtube.com/watch?v=fmbZE7J9IMA ప్రభాస్ లేకుండా ఈ సినిమా చేసి ఉండే వాడిని కాదని డైరెక్టర్ ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఏ ఒక్కరికో సొంతం కాదని, భారత దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి చెందిన సినిమా అంటూ వెల్లడించాడు. ఇది ఇండియన్ ఫిల్మ్ అని ప్రకటించాడు. సినిమా నిర్మాణానికి సహకరించిన నిర్మాత భూషణ్‌కుమార్‌కు ఓం రౌత్ ధన్యవాదాలు చెప్పాడు.&nbsp;&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=JopeURxPZmE హైలెట్స్.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డిజైన్ చేశాడు. అయోధ్య సెట్‌ని అందంగా తీర్చిదిద్దాడు. స్టేజిపై వచ్చాక ప్రభాస్ విల్లును ఎక్కుపెట్టడం ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.&nbsp; ముఖ్య అతిథులు.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా చినజీయర్ స్వామి హాజరయ్యారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా వేడుకలో పాల్గొన్నారు. జూన్ 16న సినిమా విడుదల కానుంది. https://www.youtube.com/watch?v=qkD5juVLDgM
    జూన్ 07 , 2023

    @2021 KTree