• TFIDB EN
  • సలీమ్
    U/ATelugu2h 44m
    సత్య కిడ్నాపైనప్పుడు మున్నా ఆమెను రక్షిస్తాడు. వారిద్దరూ ఒకరికొకరు ప్రేమించుకుంటారు. అయితే, సత్య వేరొకరితో పారిపోయినప్పుడు కథ మలుపు తిరుగుతుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్ సూన్‌ ఆన్‌SunNext
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    విష్ణు మంచు
    సలీమ్ / మున్నా
    మోహన్ బాబు
    ఓగిరాల జోగయ్య ఓజో
    ముఖేష్ రిషి
    అప్పల నాయుడు
    అలీ
    గఫర్ ఖాన్
    జీవా
    అప్పల నాయుడు అనుచరుడు
    రఘు బాబు
    ఓజో హెంచ్‌మ్యాన్
    నెపోలియన్
    సత్యవతి తండ్రి
    కావేరీ ఝా
    ఇంగ్లీష్ టీచర్
    బెనర్జీ
    అప్పల నాయుడు అనుచరుడు
    బ్రహ్మానందం
    తనికెళ్ల భరణి
    సత్యవతి బంధువు
    పృధ్వీ రాజ్
    సత్యవతి బంధువు
    జయ ప్రకాష్ రెడ్డి
    సత్యవతి బంధువు
    హేమ
    సత్యవతి బంధువు
    శివన్నారాయణ నారిపెద్ది
    సత్యవతి బంధువు
    భరత్ రెడ్డి
    సత్యవతి నకిలీ వరుడు
    గిరి బాబు
    సింగమనాయుడు స్నేహితుడు
    మాస్టర్ భరత్
    ఎంఎస్ నారాయణ
    సత్యవతి బంధువు
    తెలంగాణ శకుంతల
    నూకమ్మ
    రమ్య శ్రీఅప్పల నాయుడు భార్య
    గిరిధర్సత్యవతి బంధువు
    అమిత్ ఝా
    సిబ్బంది
    వైవీఎస్ చౌదరి
    దర్శకుడు
    మోహన్ బాబు
    నిర్మాత
    సందీప్ చౌతా
    సంగీతకారుడు
    కోటగిరి వెంకటేశ్వరరావు
    ఎడిటర్
    కథనాలు
    <strong>Mrunal Thakur: తెలుగులో మళ్లీ జతకట్టనున్న మృణాల్ ఠాకూర్- దుల్కర్ సల్మాన్.. డైరెక్టర్ ఎవరంటే?</strong>
    Mrunal Thakur: తెలుగులో మళ్లీ జతకట్టనున్న మృణాల్ ఠాకూర్- దుల్కర్ సల్మాన్.. డైరెక్టర్ ఎవరంటే?
    సీతారామం సినిమా తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఎంత పెద్ద హిట్టైందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో జతకట్టిన దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకూర్ హిట్ పేయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ రామ్ పాత్ర‌లో, మృణాల్ సీత పాత్రలో అలరించారు. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌ను తమ క‌ళ్ల‌తోటే పలికించి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని అద్భుతంగా పండించారు. మృణాల్ ఠాకూర్ సాంప్ర‌దాయ వస్త్రధారణతో ఆమె చేసిన అభినయం తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఈ జోడీ మరోసారి జత కట్టనుట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ పరుశురామ్ శిష్యుడు రవి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని మంచి ప్రేమకథా చిత్రం రాసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.&nbsp; హిట్ పేయిర్ రిపీట్ సీతారామం మూవీ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్‌తో పాటు మృణాల్ ఠాకూర్‌కు సరైన హిట్ పడలేదనే చెప్పాలి. దుల్కర్ కింగ్ కొత్త వంటి వెబ్ సిరీస్‌లో నటించినా అది ఆశించినంత విజయం సాధించలేదనే చెప్పాలి. మరోవైపు సీతారామం సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్.. హాయ్ నాన్నా, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు చేసింది. ఇందులో హాయ్ నాన్న బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా... ఫ్యామిలీ స్టార్ చిత్రం మాత్రం చతికిలపడిపోయింది. ఫ్యామిలీ స్టార్‌కు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆశించినంతగా వసూళ్లు రాలేదు. ఈ సినిమా కోసం మృణాల్ బాగానే కష్టపడిందని చెప్పాలి. విజయ్ దేవరకొండతో కలిసి మూవీ ప్రమోషన్లలో తీరిక లేకుండా పాల్గొంది. స్వయంగా రీల్స్ చేసి వైరల్ చేసినా.. సినిమా ఫలితం మాత్రం వేరేలాగా వచ్చింది. దీంతో ఆమె కెరీర్ తెలుగులో ప్రశ్నార్థకంగా మారింది. కొత్త హీరోయిన్లతో గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మృణాల్ హవా కొనసాగేనా? దశాబ్దకాలంగా మృణాల్ బాలీవుడ్‌లో నటిస్తోంది."సూపర్ 30"లో హృతిక్ రోషన్‌తో జతకట్టింది, కానీ ఇప్పటివరకు ఈ కలువ కనుల సుందరికి బీటౌన్‌లో సరైన గుర్తింపు దక్కలేదు. అయితే టాలీవుడ్‌లో మృణాల్ కేవలం ఒక్క సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకుంది. తెలుగు ప్రజల ప్రేమకు మైమరిచిపోయిన ఈ భామ అప్పట్లో కన్నీళ్లు కూడా పెట్టుకుంది.సీతారామం విజయం మృణాల్‌కు టాలీవుడ్‌లో రాచబాట పరిచింది. సీతారామం సినిమాకోసం రూ.80 లక్షలు పారితోషికం తీసుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత తన రెమ్యూనరేషన్‌ను రూ.కోటీన్నరకు పెంచింది. ఫ్యామిలీ స్టార్ పరాజయంతో&nbsp; ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు సన్నగిల్లాయి. రవి డైరెక్షన్‌లో దుల్కర్ సల్మాన్‌తో జత కట్టే సినిమాపై ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ను నిర్ణయించే అవకాశం ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో స్టోరీ టాలీవుడ్‌లో దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకుర్ జోడీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో.. ఈ జంటలో మరో మారు సినిమా తీయాలని టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ పరుశురాం అసిస్టెంట్ డైరెక్టర్ రవి ఈ జంటతో సినిమా తీసేందుకు ముందుకొచ్చాడని సమాచారం. దుల్కర్- సల్మాన్‌ కోసం ఓ వినూత్నమైన ప్రేమ కథను రాసుకున్నాడంట. ఇది పూర్తిగా విలేజ్ బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా రవి పూర్తి చేశాడంట. ఈ సినిమా కోసం దిల్ రాజు దగ్గరికి వెళ్లగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్‌లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాశ్‌ను ఎంపిక చేశారంట. ఆయన కూడా ఈ సినిమాకు పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ.. తెలుగులో సార్, ఆదికేశవ వంటి చిత్రాలకు సంగీతం అందించాడు. సార్ సినిమా పాటలు ఎంత హిట్‌ అయ్యాయో అందరికి తెలిసిందే. అదే తరహాలో మ్యూజిక్ అందించేందుకు జీవీ ప్రకాశ్ సిద్ధమయ్యారు. షూటింగ్ ఎప్పుడంటే? ప్రస్తుతం దిల్ రాజు గేమ్ ఛేంజర్, విజయ్ దేవరకొండతో మరో సినిమాతో ఆయన బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తికాగానే దుల్కర్- మృణాల్ ఠాకూర్ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. అటు మృణాల్ ఠాకూర్ సైతం పూజా మేరి జాన్ అనే బాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉంది. ఇటు దుల్కర్ సైతం మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తికాగానే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు టాక్. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ జంటపై ఊహగానాలు వినిపిస్తున్నాయి.
    మే 14 , 2024
    <strong>రానా దగ్గుబాటి (Rana Daggubati) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
    రానా దగ్గుబాటి (Rana Daggubati) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. తన నటనతో విలక్షణ నటుడిగా ఎదిగాడు రానా దగ్గుబాటి. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ్ భాషల్లో నటిస్తూ గుర్తింపు దక్కించుకున్నాడు. బాహుబలి1, బాహుబలి2, నేనేరాజు నేనే మంత్రి, లీడర్ చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు రానా దగ్గరయ్యాడు. తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రానా గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. రానా అసలు పేరు? రామానాయుడు రానా ఎవరు? తెలుగులో దిగ్గజ నిర్మాత అయిన డి.రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు రానా ఎత్తు ఎంత? 6 అడుగుల 2 అంగుళాలు రానా&nbsp; ఎక్కడ పుట్టారు? నిజామాబాద్ రానా&nbsp; వివాహం అయిందా? మిహికా బజాజ్‌తో 2020లో పెళ్లి జరిగింది. రానాకి ఇష్టమైన రంగు? బ్లాక్ రానా తల్లిదండ్రుల పేరు డి.సురేష్ బాబు, లక్ష్మి దగ్గుబాటి రానా అభిరుచులు? చెత్తను రీ సైక్లింగ్ చేయడం, బాక్సింగ్, ఫొటోగ్రఫి, వంటచేయడం వంటివి అతని అభిరుచులు రానాకి ఇష్టమైన ఆహారం? నాటు కోడి పులుసు రానా అభిమాన నటుడు? కమల్‌ హాసన్, అక్షయ్ కుమార్ రానాకు స్టార్ డం అందించిన సినిమాలు? లీడర్, బాహుబలి సిరీస్, నేనేరాజు నేనే మంత్ర రానా&nbsp; ఏం చదివాడు? ఇండస్ట్రియల్ ఫొటోగ్రఫీలో డిగ్రీ చదివాడు రానా ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 22 సినిమాల్లో నటించాడు రానా సినిమాకు ఎంత తీసుకుంటారు? &nbsp;ఒక్కో సినిమాకి దాదాపు రూ.8కోట్ల వరకు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=WHGxx6ganOY రానా ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు? బాహుబలి2 చిత్రానికి గాను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకున్నాడు. అలాగే సైమా అవార్డుల్లో ఉత్తమ ప్రతినాయకుడు అవార్డులను బాహుబలి1,2 చిత్రాలు, భీమ్లానాయక్ సినిమాలకు గాను గెలుచుకున్నాడు.
    మే 29 , 2024
    <strong>Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?</strong>
    Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
    తెలుగు చిత్ర సీమలో అందాలకు కొదువ లేదు. హాట్ గ్లామర్‌ను పండిచడంలో మన హీరోయిన్లు ఏ చిత్ర పరిశ్రమకు తక్కువకాదు. హాట్ సీన్లైనా, బెడ్‌రూం సీన్లలోనైనా నటించేందుకు వెనకాడటం లేదు. ఇక సినిమాల్లో గ్లామర్‌ షోను కాసేపు పక్కన పెడితే... సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో అదరహో అనిపిస్తున్నారు. బికినీ సూట్‌లలో దర్శనమిస్తూ హీటెక్కిస్తున్నారు. కుర్ర హీరోయిన్లే కాదు.. వారితో పోటీపడుతూ మరి సీనియర్ భామలు కూడా పరువాల ప్రదర్శనకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరి ఆ అందాలపై మీరు ఓ లుక్కేయండి. [toc] Samantha Ruth Prabhu సమంత సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్‌ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది. తొలి తరంలో కాస్త గ్లామర్ షోకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం..ఐటెం సాంగ్స్, లిప్ లాక్, బెడ్‌ రూం సీన్లలోనూ నటించేందుకు సిద్ధమైంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఫ్యాన్స్‌ను కవ్విస్తుంటుంది. హాట్ ఫొటో షూట్‌తో అలరిస్తుంది. ఆమె బికినీ ఫొటోలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మరి సమంత బికినీ ఫోటోస్‌పై మీరు ఓ లుక్కేయండి. Samantha bikini images Kajal Aggarwal కాజల్ అగర్వాల్ &nbsp; తెలుగు, హిందీ, తమిళ్ భాషాల్లో ప్రధానంగా నటించింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారం అందుకుంది. ఇక కాజల్ అగర్వాల్ అందాలకు ఫ్యాన్‌ బేస్ ఓ రేంజ్‌లో ఉంటుంది. చీర కట్టులో ఉన్నా, మోడ్రన్ డ్రెస్‌లో ఉన్నా తరగని అందం ఆమె సొంతం. బహిరంగంగా బికినీలో తన అందాలు చూపించేందుకు కాజల్‌కు ఇష్టముండదట. బికినీ ధరించాల్సి వచ్చిన సమయంలో సినిమాలనే వదులుకుంది ఈ భామ. అయితే కాజల్ తన బర్త్‌డే సందర్భంగా బికినీలో స్విమ్ చేసిన వీడియో మాత్రం ఉంది.&nbsp; Kajal Agarwal bikini video https://twitter.com/TCINEUpdate/status/1670989988929077250 Tamannaah Bhatia తమన్నా భాటియా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015), ఊపిరి (2016), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017), ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2019), సైరా నరసింహా రెడ్డి (2019), ఎఫ్3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2022) వంటివి తమన్నా నటించిన ప్రముఖ తెలుగు సినిమాలు. కల్లూరి (2007), అయాన్ (2009), పయ్యా (2010), సిరుతై (2011), వీరమ్ (2014), ధర్మ దురై (2016), దేవి (2016), స్కెచ్ (2018), జైలర్ (2023) వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాల్లో నటించింది. నవంబర్ స్టోరీ (2021), జీ కర్దా (2023), ఆఖ్రీ సచ్ (2023), లస్ట్ స్టోరీస్2 వంటి వెబ్‌సిరీస్‌ల్లో ప్రధాన నటిగా పనిచేసింది. లస్ట్‌ స్టోరీస్‌లో ఆమె గ్లామర్ షోపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితేనేం ఏమాత్రం పరువాల ఘాటు తగ్గించకుండా దూసుకెళ్తోంది. ఆమె బికినీలో చేసే హాట్ షోకు అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. Tamannaah Bhatia Bikini images View this post on Instagram A post shared by Think Music India (@thinkmusicofficial) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) Anushka Shetty అనుష్క శెట్టి&nbsp; పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ త్వారత విక్రమార్కుడు(2006), లక్ష్యం(2007) వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అరుంధతి(2009), బిల్లా(2009), మిర్చి(2013), బాహుబలి(2015), రుద్రమదేవి(2015), బాహుబలి ది కన్‌క్లూజన్(2017) వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను పొందిన ఏకైక హీరోయిన్‌గా అనుష్క శెట్టిని చెప్పవచ్చు. Anushka shetty Bikini Images Disha Patani దిషా పటాని తెలుగు చిత్రం లోఫర్ (2015)తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె బయోపిక్ MS ధోనితో&nbsp; హిందీ చలన చిత్రాల్లోకి అడుగుపెట్టింది. సాహో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దిషా నటనతోనే కాదు తన అందంతోనూ ఆకట్టుకుంటుంది. ఆమె గ్లామర్ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు బికినీ ఫొటోలు పెడుతూ కుర్రకారును ఊరిస్తు ఉంటుంది. Disha Patani Bikini images Pragya Jaiswal ప్రగ్యా జైస్వాల్ ప్రధానంగా తెలుగు చిత్రాలలో పని చేస్తుంది. జైస్వాల్ తెలుగు పీరియడ్ డ్రామా కంచె (2015)తో గుర్తింపు పొందింది. తొలి చిత్రంతోనే ఉత్తమ డెబ్యూ యాక్టర్‌గా ఫిల్మ్‌ ఫేర్ అవార్డును పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మకు చెప్పుకోదగ్గ అవాకాశాలు ప్రస్తుతం లేకున్నా…తనదైన గ్లామర్‌ షోతో ఆకట్టుకుటుంది. ఆ అందాలను మీరు చూసేయండి. Pragya Jaiswal bikini Images ShwetaTiwari శ్వేతా తివారీ హిందీ సినిమా, టెలివిజన్ నటి. 2000లో 'ఆనే వాలా పల్' సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. తివారీ బిగ్ బాస్ 4 (2010–11), కామెడీ సర్కస్ కా నయా దౌర్ (2011) రియాల్టీ షోలలో విజేతగా నిలిచి గుర్తింపు పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు హద్దు అంటూ లేదు. ఓసారి మీరు చూసేయండి మరి. ShwetaTiwari Bikini Images Deepika Padukone దీపికా పదుకొనే ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు, ఆమె ప్రశంసలలో మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. ఆమె దేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల జాబితాలలో ఉంది; టైమ్ ఆమెను 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది మరియు 2022లో ఆమెకు టైమ్100 ఇంపాక్ట్ అవార్డును ప్రదానం చేసింది. deepika padukone bikini Images Pooja Hegde పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది. కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు అందాల దేవతగా మారింది. ఈ అమ్మడి సోకులకు కుర్రకారు హుషారెక్కుతుంటారు. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా చూడండి. Pooja Hegde Bikini Images Pooja Hegde Hot Videos https://twitter.com/RakeshR86995549/status/978983052364808194 View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) Raashii Khanna రాశి ఖన్నా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాశి ఖన్నా చదువులో టాపర్‌. ఐఏఎస్‌ కావాలని ఆకాంక్షించినప్పటికీ... క్రమంగా మోడలింగ్ వైపు మొగ్గు చూపింది. ఆ తర్వాత తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత ప్రతిరోజు పండగే, జీల్, జై లవకుశ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో హిందీ బాట పట్టింది. అక్కడ హాట్ గ్లామర్ షో చేస్తూ టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ అమ్మడి అందాలకు మంచి క్రేజ్ ఉంది. ఫొటోలు పెట్టినా క్షణాల్లోనే లక్షల్లో లైక్‌లు వస్తుంటాయి. Raashii Khanna Bikini images Dimple Hayathi డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమె డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. కేవలం ఆమె అందం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. డింపుల్ బికినీ అందాలను ఇప్పటికీ ఏ హీరోయిన్‌ బీట్‌ చేయలేదంటే అతిశయోక్తి కాదు. మీరు ఓసారి ఆ సోగసులపై లుక్‌ వేయండి https://twitter.com/PicShareLive/status/1525365506471231488 Ketika Sharma Bikini Images కేతిక శర్మ తెలుగు సినిమా నటి. పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగరంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్‌ లైఫ్‌ (2016)' వీడియోతో పాపులర్‌ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది. ఈ పాప సోషల్ మీడియాలో కాస్త కూడా కుదురుగా ఉండదు. హాట్ హాట్ ఫొటో షూట్‌లతో వెర్రెక్కిస్తుంటుంది. మరి మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్‌ వేయండి Ketika Sharma Bikini Images Catherine Tresa కేథరీన్ థెరీసా ప్రధానంగా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో నటిస్తోంది. తెలుగులో చమ్మక్ చల్లో చిత్రం ద్వారా పరిచయమైంది. కన్నడలో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును పొందింది. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమా నటించింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. సరైనోడు, నేనేరాజు నేనే మంత్రి, బింబిసారా, వదలడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు కేథరీన్ మోడలింగ్ చేసింది. "నల్లి సిల్క్స్", "చెన్నై సిల్క్స్", "ఫాస్ట్ ట్రాక్","దక్కన్ క్రానికల్" లకు మోడల్‌గా వ్యవహరించింది. ఈ ముద్దుగుమ్మ నటనలోనే కాదు అందాల ప్రదర్శనలోనూ ఓ మెట్టు ఎక్కింది. తన సొగసుల సంపదను అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల గుండెల్లో వీణలు మోగిస్తుంటుంది. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా ఆస్వాదించండి. Catherine Tresa Bikini images Mrunal Thakur మృణాల్ ఠాకూర్ లవ్‌ సోనియా(2018) హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది. తెలుగులో వచ్చిన జెర్సీ రీమేక్‌లో షాహిద్ కపూర్ సరసన నటించడంతో ఆమె టాలీవుడ్ పెద్దల దృష్టి పడింది. దీంతో ఆమెకు తెలుగులో సీతారామం(2022) చిత్రం ద్వారా అవకాశం వచ్చింది. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఇక మృణాల్ అందాల గురించి ఎంత మాట్లాడిన తక్కువే అవుతుంది. మరి ఆ రేంజ్‌లో ఉంటుంది ఈ అమ్మడి అందాల తెగింపు. ఒక్క పాటలో చెప్పాలంటే ఇంతందం దారి మళ్లిందా అనిపిస్తుంది తన సోగసుల సోయగాలు చూస్తుంటే.. మీరు ఓసారి చూసేయండి మరి. Mrunal Thakur Bikini images Mrunal Thakur hot video https://twitter.com/MassssVishnu/status/1786566946600988750 https://twitter.com/MrunalThakur143/status/1788433120221401193 https://twitter.com/SastaJasoos/status/1788498532162236427 Anasuya Bharadwaj బుల్లితెర వ్యాఖ్యతగా అలరించిన గ్లామరస్ యాంకర్ అనసూయ.. నటిగా తొలిసారి నాగ(2003) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయన చిత్రంలో బుజ్జి క్యారెక్టర్‌లో నటించింది. ఈ చిత్రంలో ఆమె గ్లామరస్ నటనకుగాను అవకాశాలు క్యూ కట్టాయి. రామ్‌చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ఆమె చేసిన రంగమత్త పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. యాంకర్ రోల్‌ను వదిలి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడేలా చేసింది. క్షణం, విన్నర్, పుష్ప, రంగమర్తాండ, విమానం వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు తనలోని నటనా కోణాన్ని పరిచయం చేసింది. రంగస్థలం, క్షణం చిత్రాలకుగాను ఉత్తమ సహాయనటిగా సైమా పురస్కారాలు అందుకుంది. నటన కంటే ముందు ఆమెను పాపులర్ చేసింది మాత్రం ఆమె గ్లామర్ షో అని చెప్పాలి. బిగువైన అందాల విందుతో కుర్రకారుకు కలల రాణిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఏ ఫొటో పెట్టినా ఇట్టే ట్రెండ్ అవుతాయి మరి. Anasuya Bharadwaj Bikini images View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) Nidhhi Agerwal నిధి అగర్వాల్&nbsp; ప్రధానంగా తెలుగుతో పాటు హిందీ భాషల్లో నటిస్తోంది. తెలుగులో సవ్యసాచి చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పూరి డైరెక్షన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తొలి బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో గ్లామరస్ క్వీన్‌గా గుర్తింపు పొందింది. సినిమాల్లోకి రాకముందు.. కపిల్ శర్మ టాక్ షో, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా సీజన్‌-4లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇక నిధి శర్మ ఇచ్చే గ్లామర్ షో గురించి మాట్లాడితే.. చూసేవారికి కన్నుల పండుగేనని చెప్పాలి. ఈ పాప బికిని వేసిన ఫొటోలు తక్కువేకానీ..చూపించిన ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉంది. కావాలంటే మీరు ఓసారి చూసేయండి. Nidhhi Agerwal Bikini Images Mehreen Kaur Pirzada మెహ్రీన్ తెలుగు సినిమా నటి. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మహానుభావుడు చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. జవాన్, F2, అశ్వథ్థామ, F3 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ పిల్ల అందాల ప్రదర్శన గురించి మాట్లాడితే.. పర్వాలేదనే చెప్పాలి. ఫోటో షూట్‌ల కంటే ఈ అమ్మడు వీడియో షూట్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది. Mehreen Kaur Pirzada Bikini Videos View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) Manushi Chillar మానుషి చిల్లర్.. ప్రముఖ మోడల్‌. మిస్‌ వరల్డ్‌ 2017 పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్‌ వరల్డ్‌ కిరీటం పొందిన ఆరో భారత మహిళగా రికార్డులకెక్కింది. 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్‌గా బడేమియా చోటేమియా సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మాజీ ప్రపంచ సుందరి బికినీ అందాల గురించి చెప్పేదిమి లేదు. మీరే చూసేయండి. Manushi Chillar Bikini Images Manushi Chillar Bikini videos View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) https://twitter.com/ManushiChhillar/status/1787462061280166182 Sobhita Dhulipala శోభితా ధూళిపాళ ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది మరియు మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ యొక్క థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016)లో ఆమె తొలిసారిగా నటించింది మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చీర కట్టినా.. మోడ్రన్ డ్రెస్ వెసినా తరగని అందంతో చెలరేగుతుంటుంది. మరి ఆ అందాల విందును మీరు చూసేయండి మరి. Sobhita Dhulipala bikini images Hot videos View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) Tripti Dimri తృప్తి డిమ్రి.. కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ (2017) ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను (2018)లో ఆమె మొదటి సారి లీడ్ రోల్‌లో నటించింది. ఆ తరువాత ఆమె అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020), కళ (2022)లలో చిత్రాలలో నటించింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన రాని గుర్తింపు యానిమల్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. రెడిఫ్ డాట్ కామ్ 2020 బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఆమె 8వ స్థానంలో నిలిచింది. ఇక అమ్మడు ఎక్స్‌పోజింగ్‌లో బాలీవుడ్ హీరోయిన్లకంటే రెండు అకులు ఎక్కువే చదివింది. ఓసారి ఆ అందాల విందును మీరు తనివితీరా ఎంజాయ్ చేయండి. Tripti Dimri Bikini images View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) Shirley Setia షిర్లె సెటియా... కృష్ణ వ్రింద విహారి చిత్రం(2022) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సినిమా యావరేజ్‌గా ఆడిన మంచి గుర్తింపు సాధించింది. అయితే ఈ చిత్రానికి కంటే ముందు లాక్‌డౌన్(2018) వెబ్‌సిరీస్‌ ద్వారా గుర్తింపు దక్కించుకుంది. షిర్లె సెటియాలో బహుముఖ ప్రజ్ఞ దాగి ఉంది. నటిగా మాత్రమే కాకుండా.. సింగర్‌గాను రాణించింది. ఇక కుర్రదాని అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. Shirley Setia Bikini Images
    మే 11 , 2024
    <strong>This Week OTT Movies: ఈ వారం సందడి చేసేందుకు వస్తోన్న చిత్రాలు ఇవే!</strong>
    This Week OTT Movies: ఈ వారం సందడి చేసేందుకు వస్తోన్న చిత్రాలు ఇవే!
    టాలీవుడ్‌లో గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ సమ్మర్‌లో స్టార్‌ హీరోల చిత్రాలు లేకపోవడంతో యంగ్‌ హీరోలు తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మే చివరి వారంలో పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం మే 31న విడుదలవుతోంది. ఓ సామాన్యుడిగా చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టి అసామాన్యుడిగా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి&nbsp;సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. భజే వాయు వేగం యంగ్‌ హీరో కార్తికేయ.. ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) చిత్రంతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్‌రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. సామాన్య వ్యక్తి అసాధారణ సమస్యలో ఇరుక్కుని తిరిగి అందులో నుంచి ఎలా బయటపడ్డాడు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానున్నట్లు చెప్పింది.&nbsp; గం.. గం.. గణేశా విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన లేటెస్ట్‌ చిత్రం.. ‘గం.. గం.. గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్‌ శెట్టి దర్శకుడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. రిష్మా, వెన్నెల కిశోర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘బేబీ’ లాంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ చేస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ మే 31న విడుదల కానుంది.&nbsp; మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించిన లేటెస్ట్ రొమాంటిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా&nbsp; ‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి’ (Mr. &amp; Mrs. Mahi). శరణ్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాజ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్వీ క్రికెటర్‌గా కనిపించనుంది. హిట్ లిస్ట్ తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘హిట్ లిస్ట్’ (Hit List). యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో రూపొందిన ఈ చిత్రానికి సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వ వహించారు. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచుతోంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌ సిరీస్‌లు ఆ ఒక్కటి అడక్కు కామెడీ స్టార్‌ అల్లరి నరేష్‌ (Allari Naresh) నటించిన లేటెస్ట్ చిత్రం 'ఆ ఒక్కటి అడక్కు' (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేసింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. ఈ సినిమాను మే 31 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ స్ట్రీమింగ్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateErikSeriesEnglishNetflixMay 30Geek GirlSeriesEnglishNetflixMay 30Panchayat S3SeriesHindiAmazon primeMay 28Aa Okkati AdakkuMovieTeluguAmazon primeMay 31Swatantra Veer SavarkarMovieHindiZee 5May 28ComdenSeriesEnglishDisney + HotstarMay 28The First AmenMovieEnglishDisney + HotstarMay 30Uppu Puli KaramMovieTamilDisney + HotstarMay 30Illegal S3SeriesHindiJio CinemaMay 29Dedh Bigha ZameenMovieHindiJio CinemaMay 31The Last Refill ManMovieEnglishJio CinemaMay 31
    మే 27 , 2024
    <strong>Love Me Movie Review: దెయ్యంతో హీరో ప్రేమాయణం.. ‘లవ్‌ మీ’ ప్రయోగం ఫలించిందా?</strong>
    Love Me Movie Review: దెయ్యంతో హీరో ప్రేమాయణం.. ‘లవ్‌ మీ’ ప్రయోగం ఫలించిందా?
    నటీనటులు : ఆశిష్‌, వైష్ణవి చైతన్య, సిమ్రాన్‌ చౌదరి, రాజీవ్‌ కనకాల, రవి కృష్ణ దర్శకత్వం : అరుణ్&nbsp; భీమవరపు సంగీతం : ఎం. ఎం. కీరవాణి సినిమాటోగ్రాఫీ : పీ.సీ. శ్రీరామ్‌ ఆర్ట్ డైరెక్టర్‌ : కొల్లా అవినాష్‌ నిర్మాతలు : హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లాది విడుదల తేదీ : 25 మే, 2024 ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఇఫ్‌ యూ డేర్‌ (If You Dare) అనే క్యాప్షన్‌తో రూపొందిన ఈ చిత్రానికి అరుణ్‌ దర్శకత్వం వహించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే విడులైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా, మే 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య మరోమారు తన నటనతో ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్‌ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ. ఎవరెలా చేశారంటే తొలి చిత్రం రౌడీ బాయ్స్‌లో కాలేజీ కుర్రాడిగా అలరించిన ఆశిష్‌.. ఈ సినిమాలో డెవిల్స్‌ హంటర్ పాత్రలో మెప్పించాడు. తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఫన్‌ అండ్ ఎమోషనల్‌ సీన్స్‌లో చక్కగా నటించి నటుడిగా ఇంకాస్త మెరుగయ్యాడు. బేబీ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య మరోమారు తన నటనతో మెప్పించింది. ఆమెకు కీలకమైన పాత్రే దక్కింది. ఆడియన్స్‌ వైష్ణవి చైతన్యకు మరోమారు కనెక్ట్‌ అవుతారు. బుల్లితెర నటుడు రవికృష్ణ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. సినిమా మెుత్తం ఈ ముగ్గురి పాత్రల చుట్టే ఎక్కువగా తిరుగుతుంది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అరుణ్‌.. ఒక నవల రచయిత కావడంతో సినిమా చూస్తున్నంత సేపు ఓ నవల చదువుతున్న ఫీల్‌ కలుగుతుంది. దెయ్యమే చెప్తున్నట్లుగా కథను నడిపించడం ఆసక్తికరం. తొలి భాగం అంతా అర్జున్‌ గురించి, అతడు దివ్యవతిని వెతుక్కుంటూ వెళ్లడం గురించే చూపించారు. ఇంటర్వెల్‌కు ముందు దెయ్యంతో వచ్చే సన్నివేశాలు.. ఆపై రివీల్‌ చేసే ట్విస్టు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. దివ్యవతి గురించి అర్జున్‌ చేసే రీసెర్చ్‌.. ప్రీక్లైమాక్స్ నుంచి ఒక్కో ట్విస్టును డైరెక్టర్‌ రివీల్‌ చేసుకుంటూ వెళ్లడం మెప్పిస్తుంది. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో చాలా చోట్ల డైరెక్టర్‌ తడబడినట్లు కనిపిస్తుంది. ఐదారుగురు హీరోయిన్స్‌ను తెరపైకి తీసుకొచ్చి కథపై ఆసక్తిరేపినా.. వారి పాత్రలను సరిగా వివరించకపోవడంతో కన్ఫ్యూజన్‌ క్రియేట్ అయ్యింది. క్లైమాక్స్ కూడా పేలవంగానే అనిపిస్తుంది. అయితే ఓ లవ్‌స్టోరీకి దెయ్యం కథను జోడించి డైరెక్టర్ అరుణ్‌ చేసిన తొలి ప్రయోగం కొంతమేర ఫలించిందని చెప్పొచ్చు. టెక్నికల్‌గా &nbsp; సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం మెస్మరైజ్‌ చేస్తుంది. తన నైపుణ్యంతో అద్భుతమైన విజువల్స్‌ అందించారు. ఆస్కార్ విన్నర్‌ కీరవాణి అందించిన నేపథ్యం సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఆయన తన BGMతోనే ఆడియన్స్‌ను భయపెట్టారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా సినిమా కోసం బాగా శ్రమించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ ఆశిష్‌, వైష్ణవి చైతన్యఆసక్తికరంగా సాగే కథనంసాంకేతిక విభాగం మైనస్‌ పాయింట్స్‌ కన్ఫ్యూజింగ్‌ సీన్స్‌ఏమోషన్స్‌ లేకపోవడం Telugu.youSay.tv Rating : 2.5/5&nbsp;&nbsp; https://telugu.yousay.tv/top-secrets-you-didnt-know-about-vaishnavi-chaitanya.html
    మే 25 , 2024
    <strong>Malavika Mohanan: వైట్ అరేబియన్ గుర్రంలా మాళవిక అందాలు</strong>
    Malavika Mohanan: వైట్ అరేబియన్ గుర్రంలా మాళవిక అందాలు
    మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌.. తన గ్లామర్‌ షోతో మరోమారు నెట్టింట వైరల్‌గా మారింది. చాలీ చాలని గౌనులో ఫొటో షూట్‌ నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; తాజాగా ఫ్లవర్‌ డాట్‌ స్లీవ్‌లెస్‌ గౌనులో కనిపించిన ఈ అమ్మడు తన ఎద అందాలతో సోషల్‌ మీడియాలో రచ్చ రేపింది. మతిపోగొట్టే విధంగా థైస్‌ అందాలను చూపిస్తూ ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. చురకత్తుల్లాంటి చూపులతో మరోమారు వారి మనసు దోచేసింది.&nbsp; ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ‘ఏం సొగసురా బాబు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మాళవిక హాట్‌ పిక్స్‌ను విపరీతంగా షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌ చేస్తున్నారు. ఈ బ్యూటీ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహన్‌కు మాళవిక మోహన్&nbsp; కుమార్తె. ఆమె కుటుంబం కేరళకు చెందినది అయినా పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే. ‘పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అనంతరం ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ సినిమా తరువాత నుంచి మాళవిక వరుస అవకాశాలను అందుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ధనుష్‌ పక్కన ‘మారన్‌’ చిత్రంలో నటించి మాళవిక తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. 2020లో 'మసాబా మసాబా' అని టెలివిజన్‌ సిరీస్‌లోనూ మాళవిక నటించింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇంగ్లీషు భాషలో స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp; గతేడాది క్రిస్టీ (Christy) అనే మలయాళ చిత్రంలో నటించిన మాళవిక.. తన నటనతో అక్కడి ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం ప్రభాస్‌ (Prabhas) హీరోగా చేస్తోన్న ‘రాజా సాబ్‌’ (Raja Saab)లో మాళవిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌తో తెలుగులో మరిన్ని ఆఫర్లు దక్కించుకోవాలని ఈ ముద్దుగుమ్మ భావిస్తోంది.&nbsp; ‘రాజా సాబ్‌’ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లోనూ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం విజయం సాధిస్తే మాళవికకు పాన్‌ ఇండియా స్థాయిలో తిరుగుండదని ఫ్యాన్స్‌ అంచనా వేస్తున్నారు. తమిళంలో విక్రమ్‌తో ‘తంగలాన్‌’ (Thangalaan) అనే సినిమాలో మాళవిక నటిస్తోంది. అలాగే హిందీలో ‘యుద్ర’ (Yudhra) ఫిల్మ్‌లో చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.&nbsp; ఇక మాళవిక అవార్డుల విషయానికి వస్తే.. 2019లో 'బియాండ్‌ ది క్లౌడ్స్‌' అనే బాలీవుడ్‌ చిత్రానికి గాను 'యాక్టింగ్‌ సెన్సేషన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డును ఆమె గెలుచుకుంది.&nbsp; అలాగే 2022లో ‘మాస్టర్‌’ చిత్రానికి గాను బెస్ట్‌ అరేంగేట్ర నటిగా మాళవిక మోహనన్‌ నామినేట్‌ అయ్యింది. కొద్దిలో సైమా అవార్డును చేజార్చుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ మాళవిక చురుగ్గా వ్యవహరిస్తోంది. తన అందాల ఆరబోతతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.&nbsp; స్టన్నింగ్ ఫిగర్‌తో హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ఆమె నిత్యం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
    మే 27 , 2024
    <strong>Ruhani Sharma: జాకెట్ లేకుండా రుహాని శర్మ అందాల షో.. తట్టుకోవడం కష్టమే</strong>
    Ruhani Sharma: జాకెట్ లేకుండా రుహాని శర్మ అందాల షో.. తట్టుకోవడం కష్టమే
    గ్లామర్ డాల్ రుహానీ శర్మ (Ruhani Sharma).. తన లేటెస్ట్‌ హాట్ ఫొటో షూట్‌తో సోషల్‌ మీడియాను అట్టుడికించింది. తన ఎద అందాలను బయటపెడుతూ చెమటలు పట్టించింది. జాకెట్ లేకుండా చీర కట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. సమ్మర్‌లో తన అందంతో మరింత హీట్ పెంచేసింది. తాజా ఫొటోల్లో క్రేజీ ఔట్‌ ఫిట్‌తో కనిపించిన ఈ అమ్మడు.. తన ఎద, నడుము అందాలతో మైండ్‌ బ్లాక్ చేసింది. రుహానీ శర్మ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ ఫొటోలను షేర్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఈ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.&nbsp; మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రుహానీ శర్మ.. తమిళ చిత్రం 'కడైసి బెంచ్‌ కార్తీ' (Kadaisi Bench Karthi) అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.&nbsp; 2018లో వచ్చి 'చి ల సౌ' చిత్రంతో ఈ అమ్మడు తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్‌కు జోడీగా నటించి మెప్పించింది. చిలసౌ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో రుహానీకి వెంటనే టాలీవుడ్‌లో అవకాశం దక్కలేదు. దీంతో ఈ భామ ఫోకస్ మలయాళ ఇండస్ట్రీపై పడింది. 2018లో 'కమల' అనే చిత్రంలో నటించిన రూహానీ.. ఆ సినిమా ద్వారా మలయాళ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో మంచి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; 2020లో విశ్వక్‌ సేన్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో వచ్చిన 'హిట్' సినిమాలో ఈ బ్యూటీకి అవకాశం దక్కింది. ఇందులో నేహా పాత్రలో తెలుగు ఆడియన్స్‌ హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత ‘అవసరాల శ్రీనివాస్‌’ కథానాయకుడిగా చేసిన 'నూటక్క జిల్లాల అందగాడు' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. కానీ, రుహానీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. గతేడాది 'హర్‌ ; చాప్టర్‌ 1' (Her - Chapter 1) అనే లేడీ ఒరియేంటెడ్‌ చిత్రంలో నటించిన ఈ భామ.. పోలీసు అధికారిణి పాత్రలో అదరహో అనిపించింది.&nbsp; రీసెంట్‌గా 'సైంధవ్‌' చిత్రంలో డా. రేణు పాత్ర పోషించి ఆకట్టుకుంటుంది. ఇందులో వెంకటేష్‌తో పోటీ పడి నటించి అందరి ప్రశంసలు అందుకుంది. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ లేటెస్ట్‌ చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’లోనూ రుహానీ శర్మ కీలక పాత్ర పోషించింది ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ.. రుహాని శర్మ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ‘శ్రీరంగ నీతులు’ అనే చిత్రంలోనూ ఈ ముద్దుగమ్మ నటించింది. ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రుహాని శర్మ సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నప్పటికీ.. టాలీవుడ్‌లో ఈ హాట్ డాల్‌కు అవకాశాలు మాత్రం దండిగానే వస్తున్నాయి.
    మే 16 , 2024
    <strong>Pushpa 2 Second Song: ‘రారా నా సామి’ పాటను బీట్‌ చేయలేకపోయిన పుష్ప 2 మెలోడి సాంగ్!</strong>
    Pushpa 2 Second Song: ‘రారా నా సామి’ పాటను బీట్‌ చేయలేకపోయిన పుష్ప 2 మెలోడి సాంగ్!
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో&nbsp; తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘పుష్ప’ (Pushpa: The Rise)కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలే తొలిపాటను విడుదల చేయగా అది జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు తాజాగా మేకర్స్ రెండో సాంగ్‌ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.&nbsp; సోషల్‌ మీడియా షేక్‌ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప 2 ‘నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. ‘సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాట‌ను మేక‌ర్స్ బుధ‌వారం (మే 29) రిలీజ్ చేశారు. ఫోక్ స్టైల్‌లో మాస్ ట్యూన్స్‌తో సాగిన ఈ పాట రిలీజైన కొద్ది క్ష‌ణాల్లోనే సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. చంద్ర‌బోస్ ఈ పాట‌కు సాహిత్యాన్ని స‌మ‌కూర్చగా దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు. బాలీవుడ్‌ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ గణేష్ ఆచార్య ఈ సాంగ్‌కు స్టెప్పులు సమకూర్చారు. ఈ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి. https://www.youtube.com/watch?v=qxbHtcfHq2s&amp;list=PLTtJUIuknk93P010cakd2jZANGFP70tj9&amp;index=1 సాంగ్‌లో ఏముందంటే? ‘సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాట‌లో పుష్పరాజ్‌ (బన్నీ), శ్రీవల్లి (రష్మిక) కెమిస్ట్రీ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ డ్యూయెట్‌లో ఐకానిక్‌ డ్యాన్స్ స్టెప్పుల‌తో అల్లు అర్జున్‌, రష్మిక మందన్న అదరగొట్టారు. గణేష్‌ ఆచార్య అందించిన స్టెప్పులు చాలా క్యాచీగా ఉన్నాయి. దేవిశ్రీప్ర‌సాద్ క్యాచీ ట్యూన్స్‌ మెస్మరైజ్‌చేస్తోంది. డైరెక్టర్ సుకుమార్‌ కూడా సాంగ్‌ చివర్లో స్టెపులు వేసి అలరించారు. తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డం, త‌మిళంతో పాటు మొత్తం ఆరు భాష‌ల్లో సూసేకీ పాట‌ను రిలీజ్ చేశారు. ఆరు భాష‌ల్లోనూ శ్రేయా ఘోష‌ల్ ఈ పాట‌ను పాడ‌టం విశేషం. రారా నా సామి పాటను మరిపించిందా? పుష్ప సినిమా నుంచి వచ్చిన ‘రారా నా సామి’ మెలోడి సాంగ్‌ దేశ వ్యాప్తంగా ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. మాస్, క్లాస్ ఇలా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సాంగ్‌ మెస్మరైజ్‌ చేసింది. అయితే పుష్ప 2 నుంచి మెలోడి సాంగ్ అనగానే ఫ్యాన్స్‌ ‘రారా నా సామి’ రేంజ్‌లోనే ఊహించుకున్నారు. అయితే చాలా మందికి ‘సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాట నచ్చినప్పటికీ.. ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్‌ చేసిన కొద్ది మంది మాత్రం పెదవి విరుస్తున్నారు. తమకు సీక్వెల్‌లో సాంగ్‌ కంటే ‘రారా నా సామి’ పాటే బాగుందని అంటున్నారు. మాస్ ఆడియన్స్‌కు ఈ మెలోడి అంతగా రుచించకవచ్చని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; రికార్డుల మోత పుష్ప 2 సినిమా నుంచి మే 1వ తేదీన ఫస్ట్‌ సింగిల్‌ లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. పుష్ప‌.. పుష్ప&nbsp; అంటూ సాగే ఈ టైటిల్‌ సాంగ్‌ మాస్‌ ఆడియన్స్‌ను, మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఉర్రూత‌లూగిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాట‌కు 10 కోట్లకుపైగా వ్యూస్ వచ్చినట్లు పుష్ప 2 మేకర్స్ ఇటీవల ప్రకటించారు.&nbsp; అంతేకాదు 22.6 లక్షల లైక్స్ కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. రీసెంట్ టైమ్‌లో తెలుగులో అత్య‌ధిక వ్యూస్‌ను ద‌క్కించుకున్న సాంగ్‌గా పుష్ప ఫ‌స్ట్ సింగిల్ నిలిచింది. క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్‌ ప్రస్తుతం ‘పుష్ప 2’ క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా క్లైమాక్స్‌లో మేకర్స్‌ ఊహించని ట్విస్ట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పుష్ప 3కి సంబంధించిన సమాచారం క్లైమాక్స్‌లో ఇవ్వనున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. యానిమల్‌ బ్యూటీ తృప్తి డిమ్రి ఈ సాంగ్‌లో ఆడిపాడనున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సుకుమార్‌ ఈ పాటను కూడా షూట్‌ చేసే అవకాశం ఉంది. కాగా, ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp;
    మే 29 , 2024
    <strong>Movie Ticket Rs.99 at Multiplexes: మల్టీప్లెక్సుల్లో రూ.99కే సినిమా టికెట్.. ఈ ఆఫర్‌ ఆరోజు మాత్రమే!</strong>
    Movie Ticket Rs.99 at Multiplexes: మల్టీప్లెక్సుల్లో రూ.99కే సినిమా టికెట్.. ఈ ఆఫర్‌ ఆరోజు మాత్రమే!
    సాధారణంగా మల్టీప్లెక్సుల్లో సినిమా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక టికెట్‌కు రూ. 250కి పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే మే 31న మాత్రం.. సినీ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. కేవలం రూ.99 టికెట్‌తో ఎంచక్కా మల్టీప్లెక్సుల్లో ఎంచక్కా సినిమాను చూసేయచ్చు. ఏ షో అయినా, ఏ సినిమా అయిన చూసే అవకాశాన్ని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ కల్పిస్తోంది. రిక్లైనర్స్, ప్రీమియం ఫార్మాట్స్ మినహాయించి మిగతా సీట్లకు మాత్రమే ఈ ఛాన్స్ అందుబాటులో ఉంటుంది.&nbsp; ఈ ఆఫర్‌ ఎందుకంటే? మే 31న సినిమా లవర్స్‌ డే సందర్భంగా… మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా (Multiplex Association Of India) సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఆ రోజున రూ.99లకే తమ మల్టీప్లెక్స్‌లలో సినిమా చూసే వెసులుబాటు కల్పిస్తుసందర్భంగా న్నట్లు చెప్పింది. పీవీఆర్‌ - ఐనాక్స్‌ సినీ పోలిస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, ముక్త ఏ2, మూవీ టైం, మూవీ మ్యాక్స్, వేవ్, ఎం2కే, డిలైట్ సహా అనేక మల్టీప్లెక్సుల్లో ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ అవకాశం మే 31 ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని అసోసియేషన్‌ స్పష్టం చేసింది.&nbsp; https://twitter.com/MAofIndia/status/1795374893879710125 ఇలా బుక్‌ చేసుకోండి! మే 31 సినిమా చూడాలని భావిస్తున్న వారు టికెట్‌ను ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. పేటీఎం, అమెజాన్‌ పే, బుక్‌మై షో వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా టిక్కెట్ కొనుగోలు చేస్తే రూ.99తో పాటు అదనంగా జీఎస్టీ, కన్వీనియన్స్‌ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా నేరుగా థియేటర్‌ కౌంటర్ వద్ద టికెట్‌ తీసుకుంటే ఎలాంటి అదనపు రుసుము లేకుండా కేవలం రూ.99కే సినిమాను వీక్షించవచ్చు. మీ వెసులుబాటుకు తగ్గట్లు టికెట్ కొనుగోలు చేసుకోండి.&nbsp; https://twitter.com/girishjohar/status/1795734272068006128 ఈ సినిమాలు చూడొచ్చు! ప్రస్తుతం థియేటర్లలో ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’, ‘రాజు యాదవ్’ సహా అనేక సినిమాలు ఉన్నాయి. అలానే ఈ శుక్రవారం పలు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. జాన్వీకపూర్, రాజ్ కుమార్ నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, ఆనంద్ దేవరకొండ నటించిన గంగం గణేశా మూవీ, కార్తికేయ గుమ్మకొండ నటించిన ‘భజే వాయు వేగం’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే యంగ్‌ హీరో విష్వక్‌ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ ఆ రోజే థియేటర్లలోకి వస్తోంది. కాబట్టి మే 31న కొత్త సినిమాలను రూ.99లకే చూసే అవకాశాన్ని అసలు మిస్‌ చేసుకోకండి. లవర్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకోండి. https://twitter.com/tanaymehrotra1/status/1795748420206100853 గతంలోనూ ఇలాగే.. రూ.99లకే మల్టీప్లెక్స్‌ టికెట్‌ ఆఫర్‌ చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది అక్టోబర్‌ 13న 'నేషనల్‌ సినిమా డే' సందర్భంగా కూడా ఈ ఆఫర్‌ను మల్టీప్లెక్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికి సినీ లవర్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 6.5 మిలియన్స్‌కుపైగా ఆడియన్స్‌ మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూశారు. ఈసారి కూడా ఆ స్థాయిలోనే స్పందన ఉంటుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్‌ అంచనా వేస్తోంది. ఫ్యామిలీ అంతా తక్కువ ఖర్చుతో కొత్త సినిమా చూడాలనుకుంటే ఈ సదావకాశాన్ని మిస్‌ చేసుకోవద్దని అసోసియేషన్‌ ప్రతినిధులు సూచిస్తున్నారు.&nbsp; https://twitter.com/AndhraBoxOffice/status/1711404182790680809
    మే 29 , 2024
    <strong>Pushpa 2 Latest Song: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌పై ఊహించని ట్విస్ట్‌.. తెరపైకి ‘యానిమల్‌’ బ్యూటీ!</strong>
    Pushpa 2 Latest Song: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌పై ఊహించని ట్విస్ట్‌.. తెరపైకి ‘యానిమల్‌’ బ్యూటీ!
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2 : ది రూల్‌’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'పుష్ప: ది రైజ్‌' కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచగా.. ఇటీవల వచ్చిన ఫస్ట్‌ సింగిల్‌ వాటిని రెట్టింపు చేసింది. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. మరోవైపు ‘పుష్ప 2’కి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇది విన్న ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; తృప్తి దిమ్రితో ఐటెం సాంగ్‌! బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘యానిమల్‌’.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎంత సెన్సేషన్‌ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇందులో నటించిన బాలీవుడ్‌ నటి తృప్తి దిమ్రీ.. తన గ్లామర్‌తో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. ‘పుష్ప 2’లో ఈ భామ ఐటెం సాంగ్‌ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాంగ్‌ కోసం చిత్ర యూనిట్‌ ఆమెను సంప్రదించగా తృప్తి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్‌ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తుందని అంటున్నారు. పుష్పలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సమంత చేసిన మ్యాజిక్‌ను తృప్తి రిపీట్‌ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బన్నీ, తృప్తి కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; ప్రోమోలో ఏముందంటే? సెకండ్‌ సాంగ్‌ ప్రోమోలో పూర్తిగా హీరోయిన్‌ రష్మిక మందన్ననే కనిపించింది. సాంగ్‌ సెట్‌లో రష్మిక మేకప్‌ వేసుకుంటూ కనిపించింది. ఈ క్రమంలో కేశవ వచ్చి.. శ్రీవల్లి వదిన పుష్ప 2 నుంచి రెండో సాంగ్‌ రిలీజ్‌ చేస్తున్నారంటగా కదా ఆ పాటేందో చెప్తావా అని అడుగుతాడు. అప్పుడు రష్మిక ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ పాట పాడుతుంది. మీరు కూడా ఈ ప్రోమోను ఓసారి చూసేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=sbp9M95-2rQ&amp;t=19sv పూర్తి సాంగ్‌ ఎప్పుడంటే? పుష్ప 2లోని రెండో పాటను మే 29న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తాజా ప్రోమోలో స్పష్టం చేశారు. ఆ రోజు ఉ.11.07 గం.లకు పూర్తి లిరికల్‌ వీడియోను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇది బన్నీ, రష్మిక మధ్య సాగే మెలోడీ సాంగ్ అంటూ వివరించారు. గతంలో పుష్ప సినిమాలో వచ్చిన ‘సామి.. సామి’ సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ పాట కూడా ఆ స్థాయిలోనే అలరిస్తుందని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. ఆ పాట కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.&nbsp; ఆ రోజున ఫ్యాన్స్‌కు పండగే భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రత్యర్థిగా మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) నటిస్తున్నారు. అనసూయ, ధనుంజయ్, సునీల్, రావు రమేశ్‌, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌ రిలీజ్‌ కానుంది. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ అన్నీ కూడా సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.&nbsp;
    మే 23 , 2024
    <strong>Samantha Viral Post: నాగచైతన్య లేదా విరాట్‌ కోహ్లీ.. అసలు సమంత పోస్టు ఎవరి కోసం!</strong>
    Samantha Viral Post: నాగచైతన్య లేదా విరాట్‌ కోహ్లీ.. అసలు సమంత పోస్టు ఎవరి కోసం!
    స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha).. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. మయోసైటిస్‌తో బాధపడుతున్న ఆమె సినిమాల నుంచి కొద్ది కాలం విరామం తీసుకుంది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ తన అభిమానులను ఎప్పటికప్పుడు ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంది. గ్లామర్ ఫొటోలను షేర్‌ చేస్తూ వారిని సామ్ అలరిస్తోంది. ఇదిలా ఉంటే సమంత తాజాగా చేసిన ఓ పోస్టు ఆసక్తికరంగా మారింది. సమంత పోస్టు వెనకున్న అర్థం ఏంటో తెలియక ఫ్యాన్స్‌ తలలు బాదేసుకుంటున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; పోస్టులో ఏముందంటే? స్టార్‌ హీరోయిన్ సమంత.. తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పెట్టిన లేటేస్ట్‌ పోస్టు.. టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ‘నువ్వు గెలవడం నేను చూడాలనుకుంటున్నాను. నీ హృదయం ఏదైతే కోరుకుంటుందో, నువ్వు ఏ ఆశలు కలిగి ఉన్నావో, నేను దానికోసమే ప్రార్థిస్తున్నాను. మీరు విజయానికి అర్హులు’ అంటూ సమంత ఈ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే ఇది ఎవరి గెలుపును ఆకాంక్షిస్తూ పెట్టానన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది నాగచైతన్యను ఉద్దేశించి సమంత పెట్టిందంటూ అతడి ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది నిజమైతే చాలా బాగుంటుందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) అసలు కారణం ఇదే! ప్రస్తుతం దేశంలో ఐపీఎల్‌ ఫీవర్‌ నడుస్తోంది. ఇవాళ (మే 22) సెకండ్‌ ప్లేఆఫ్స్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు.. రాజస్థాన్‌ రాయల్స్‌ (RR)తో తలపడనుంది. అయితే సామ్‌ ఆర్సీబీ గెలుపును ఆకాంక్షిస్తూ ఈ పోస్టును పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఒక్క కప్‌ కూడా గెలవని ఆర్సీబీ ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని సమంత కోరుకుంటున్నట్లు సమాచారం. అందుకే ఆ జట్టును ఎంకరేజ్ చేసేందుకు సామ్ ఇలా పోస్టు పెట్టినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే నేరుగా RCBని ట్యాగ్‌ చేస్తూ పోస్టు పెట్టి ఉంటే బాగుండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా చేసి ఉంటే ఇంత చర్చ జరిగేది కాదని అంటున్నారు. విరాట్‌కు వీరాభిమాని క్రికెట్‌ను అభిమానించే హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె పలు వేదికలపై తనకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. అంతేకాదు క్రికెట్‌లో తాను విరాట్ కోహ్లీకి వీరాభిమానినని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కోహ్లీ ఆర్సీబీ జట్టులో కీలక ప్లేయర్‌ కావడం.. అతడికి ఈ మ్యాచ్‌ చావో రేవో కావడంతో సమంత ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే మరికొందరు ఫ్యాన్స్‌ మాత్రం ఇప్పటికీ ఇది సమంత పర్సనల్‌ పోస్టు అని నమ్ముతున్నారు. దీంతో సమంత దీనిపై క్లారిటీ ఇస్తే తప్పా అర్థం తెలిసేలా లేదు.&nbsp; సమంత సినిమాలు సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరగా గతేడాది విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’లో కనిపించింది. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక సామ్‌ నటించిన సిటాడెల్: హనీబన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలో స్ట్రీమింగ్‌లోకి రానుంది. ప్రస్తుతం సమంత నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'మా ఇంటి బంగారం'. ఇది కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.
    మే 22 , 2024
    <strong>War 2: ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ న్యూస్‌.. ఊగిపోతున్న ఫ్యాన్స్‌!</strong>
    War 2: ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ న్యూస్‌.. ఊగిపోతున్న ఫ్యాన్స్‌!
    భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌.. టాలీవుడ్‌ స్టార్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ మూవీపై బజ్‌ ఏర్పడింది. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్‌ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీగా హైప్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ ముంబయిలో శరవేగంగా సాగుతోంది. తారక్ గత కొన్నిరోజులుగా ముంబయిలోనే ఉంటూ షూట్‌లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ‘వార్‌ 2’కు సంబంధించిన క్రేజీ న్యూస్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.&nbsp; సిక్స్‌ ప్యాక్‌లో తారక్‌! ‘వార్‌ 2’ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య భారీ ఫైట్ సీన్ వుండనుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ ఫైట్ సీన్‌లో ఎన్టీఆర్ మరోసారి సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఫైట్‌ సీన్ మునుపెన్నడూ చూడని విధంగా భారీ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. దీంతో తారక్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు గ్రాండ్‌ ఎంట్రీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ‘వార్‌ 2’ చిత్రానికి అయాన్ ముఖ‌ర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ&nbsp; YRF (Yash Raj Films) స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.&nbsp; ‘వార్‌ 2’లో మరో బాలీవుడ్‌ బ్యూటీ! ‘వార్‌ 2’ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కియా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పుడు మరో స్టార్‌ హీరోయిన్‌ ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హీరోయిన్‌ను కత్రీనా కైఫ్‌ ఈ మూవీలో భాగం కాబోతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ స్పెషల్‌ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయమే మేకర్స్‌ సంప్రదించగా ఇందుకు కత్రీనా గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇదే నిజమైతే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే హృతిక్‌, తారక్‌ లాంటి టాప్‌ డ్యాన్సర్లు ఉన్న సినిమాలో ఐటెం సాంగ్‌ను కత్రినా చేస్తుందంటే ఫ్యాన్స్‌కు ఇక పండగే అని చెప్పవచ్చు. దేవర నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ప్రస్తుతం తారక్‌ 'వార్‌ 2'తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల కాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే మే 20న తారక్‌ పుట్టిన రోజు పురస్కరించుకొని ఒక రోజు ముందే ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ను లాంఛ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తాజాగా ప్రకటించారు. మే 19న సా. 7.02 ని.లకు ఈ పాట విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేయగా.. అది సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/UrsVamsiShekar/status/1791707613316763915
    మే 18 , 2024
    <strong>Prabhas Marriage News: ఒక్క పోస్టుతో పెళ్లిపై అటెన్షన్‌ తీసుకొచ్చిన ప్రభాస్‌.. అసలు ఏం జరిగిందంటే?</strong>
    Prabhas Marriage News: ఒక్క పోస్టుతో పెళ్లిపై అటెన్షన్‌ తీసుకొచ్చిన ప్రభాస్‌.. అసలు ఏం జరిగిందంటే?
    టాలీవుడ్‌ ఖ్యాతీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు హీరోల్లో ప్రభాస్ (Prabhas) ముందు వరుసలో ఉంటాడు. ‘బాహుబలి’ (Bahubali), ‘బాహుబలి 2’ (Bahubali 2) చిత్రాలతో ప్రభాస్‌ గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయాడు. ఇటీవల ‘సలార్‌’ (Salaar)తో సాలిడ్‌ హిట్‌ అందుకున్న డార్లింగ్‌.. బాక్సాఫీస్‌ వద్ద మరోమారు తన సత్తా ఎంటో చూపించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా ప్రభాస్‌ ఉన్నాడు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. పెళ్లికి సంబంధించి గతంలో పలుమార్లు రూమర్లు సైతం వచ్చాయి. అయితే తాజాగా ప్రభాస్‌ పెట్టిన ఓ పోస్టు.. అతడి పెళ్లిపై మళ్లీ చర్చను లేవనెత్తాయి.&nbsp; ‘ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు’ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌.. సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటాడు. చాలా అరుదుగా పోస్టులు పెడుతుంటాడు. అయితే లేటెస్ట్‌గా ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వ్యక్తి గురించి పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. ‘డార్లింగ్స్‌.. ఎట్టకేలకు మన జీవితంలోకీ ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్‌ చేయండి’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌లో చెప్పిన ప్రత్యేక వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ఫ్యాన్స్ ఎక్స్‌లో షేర్‌ చేస్తున్నారు. ఆ ప్రత్యేక వ్యక్తి ప్రభాస్‌ మనసుకు నచ్చిన యువతి అయ్యి ఉంటుందని చాలా మంది ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.&nbsp; అసలు నిజం ఇదే! ప్రస్తుతం ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్‌ (Nag Ashwin).. ఈ సినిమాలోని పాత్రలను ఒక్కొక్కటిగా ప్రేక్షకులకు టీజర్‌ రూపంలో పరిచయం చేస్తున్నారు. ఇటీవలే అమితాబ్‌ బచ్చన్‌ చేసిన అశ్వద్థామ పాత్రను రివీల్‌ చేశారు. అలాగే కమల్‌ హాసన్‌ రోల్‌ను కూడా గ్లింప్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. దీనిని ఉద్దేశించే ప్రభాస్‌ లేటెస్ట్‌ పోస్టు పెట్టినట్లు సమాచారం. కల్కి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే డార్లింగ్‌ లేటెస్ట్‌ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది.&nbsp; కమల్‌ అంటే చాలా ఇష్టం ప్రభాస్‌ ఫేవరేట్‌ హీరోల్లో దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ ముందు వరుసలో ఉంటారు. కమల్‌పై తనకున్న అభిమానం గురించి డార్లింగ్‌ ఇప్పటికే చాలా సార్లు తెలియజేశారు. కమల్‌.. కల్కి సినిమాలో భాగమైనట్లు వెల్లడించినప్పుడు కూడా ఆనందంతో పోస్ట్‌ పెట్టారు. ‘నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం. కమల్‌ హాసన్‌ లాంటి లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ అప్పట్లో వ్యాఖ్యానించాడు. ఇప్పుడు కూడా ఆయన కోసమే ప్రభాస్‌ ఈ పోస్ట్‌ పెట్టినట్లు అర్థమవుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.&nbsp; నెలాఖరులో ఫస్ట్‌ సింగిల్‌! కల్కి 2898 ఏడీ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. సినిమా మ్యూజికల్‌ రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్‌ కంపెనీ సరిగమ సొంతం చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అంతేకాదు త్వరలో ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ కూడా విడుదల చేయనున్నట్లు హింట్‌ ఇచ్చారు. ఈ నెలాఖరులో దానిని రిలీజ్‌ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.&nbsp;
    మే 17 , 2024
    <strong>Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్‌ థ్రిల్లర్‌.. ‘మిరల్‌’ ఎలా ఉందంటే?</strong>
    Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్‌ థ్రిల్లర్‌.. ‘మిరల్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు: భరత్, వాణి భోజన్, కేఎస్ రవికుమార్, మీరా కృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు దర్శకత్వం: ఎం. శక్తివేల్ మ్యూజిక్ డైరెక్టర్: ప్రసాద్ ఎస్ఎన్ సినిమాటోగ్రాఫర్: సురేష్ బాలా ఎడిటర్: కలైవనన్.ఆర్ నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్ విడుదల తేదీ: 17-05-2024 ప్రేమిస్తే ఫేమ్‌ భరత్‌ హీరోగా నటించిన చిత్రం 'మిరల్‌'. రెండేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో డబ్‌ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఎం. శక్తివేల్‌ దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి హరి (భరత్‌), రమ (వాణీ భోజన్‌) ప్రేమ వివాహం చేసుకొని కొడుకుతో సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు రమకు పీడ కల రావడంతో ఊరులో ఉన్న కుల దైవానికి పూజా చేయించమని ఆమె తల్లి చెబుతుంది. దీంతో ఊరికి వెళ్లి పూజలు చేయిస్తారు. ఈ క్రమంలో హరి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఓకే కావడంతో అర్ధరాత్రి ఫ్యామిలీతో కలిసి బయలుదేరతాడు. మెయిన్‌ రోడ్డులో వెళ్లాల్సిన వారి కారు ఓ కారణం చేత మరో రూట్‌లోకి వెళ్తుంది. అయితే ఆ రూట్‌లో ఆత్మ తిరుగుతుందని ఊరి ప్రజల నమ్మకం. అందుకని రాత్రి వేళ్లలో ఆ దారిలో ఎవరూ ప్రయాణించరు. అటువంటి మార్గంలో వెళ్లిన హరి ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? నిజంగానే ఆ మార్గంలో అతీత శక్తి ఉందా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హీరో భరత్‌ ఎప్పటి లాగే తన నటనతో అదరగొట్టాడు. హరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. అటు నటి వాణి భోజన్‌.. భరత్‌తో పాటు సినిమాను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరు తమ నటనతో అదరగొట్టారు. తమ హావ భావాలతో ఎమోషనల్‌ సన్నివేశాలను చక్కగా పండించారు. KS రవికుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించి అలరించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిలో పర్వాలేదనిపించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు ఎం. శక్తివేల్‌.. ఓ కుటుంబం చుట్టూ సాగే హార్రర్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్‌ ముందు వరకూ ఏదో జరుగుతోందన్న సస్పెన్స్‌ను మెయిన్‌టెన్‌ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. కథ పరంగా చూస్తే రొటిన్‌ స్టోరీ అయినప్పటికీ స్క్రీన్‌ ప్లే విషయంలో మాత్రం చక్కటి పనితీరును కనబరిచాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్‌లో ఏదో జరిగిపోతుందని భావించిన ప్రేక్షకులకు చివర్లో వచ్చే ట్విస్ట్ ఊసూరుమనిపిస్తుంది. అప్పటివరకూ మెయిన్‌టెన్‌ చేసిన ఆసక్తి మెుత్తం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. క్లైమాక్స్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్లు మరీ సాగదీతగా అనిపిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. చాలా సన్నివేశాల్లో నేపథ్యం సంగీతం భయపెడుతుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ భరత్‌, వాణీ భోజన్‌ నటనఆసక్తికరంగా సాగే కథనంనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథలో కొత్తదనం లేకపోవడంపేలవమైన క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    మే 17 , 2024
    Pushpa 2 Steps Viral: ముంబయి లోకల్‌ ట్రైన్‌లో ‘పుష్ప 2’ స్టెప్‌ వేసిన నైజీరియన్‌.. వీడియో వైరల్!
    Pushpa 2 Steps Viral: ముంబయి లోకల్‌ ట్రైన్‌లో ‘పుష్ప 2’ స్టెప్‌ వేసిన నైజీరియన్‌.. వీడియో వైరల్!
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘పుష్ప’ (Pushpa). పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా బన్నీని జాతీయ స్థాయి నటుడిగా తీర్చిదిద్దింది. ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని సైతం అల్లు అర్జున్‌ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్‌ రూపొందుతోంది. ‘పుష్ప 2’లోని టైటిల్‌ సాంగ్‌ను ఇటీవల మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. అందులోని హుక్‌ స్టెప్‌ బాగా వైరల్ అవుతోంది. చాలా మంది ఈ స్టెప్‌పై రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నైజిరియన్‌ చేసిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.&nbsp; పుష్ప 2 మేనియా! నోయల్‌ రాబిన్‌సన్‌ (Noel Robinson) అనే నైజీరియన్‌.. జర్మన్‌లో ఉంటూ డ్యాన్స్‌ రీల్స్‌ చేస్తూ ఉంటాడు. తద్వార మిలియన్లలో ఫాలోవర్లను సంపాదించాడు. రీసెంట్‌గా భారత్‌ పర్యటనకు వచ్చిన నోయల్‌.. ముంబయి లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించాడు. ఈ సందర్భంగా 'పుష్ప2' టైటిల్‌ సాంగ్‌లోని సింగిల్‌ లెగ్‌ స్టెప్‌ వేసి తోటి ప్రయాణికులను ఉర్రూతలూగించాడు. అటు స్థానికులు కూడా నోయల్‌ను ప్రోత్సహిస్తూ మూమెంట్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను నోయల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌ అవుతోంది. ఇది చూసి బన్నీ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. అల్లు అర్జున్‌ క్రేజ్‌ దేశ సరిహద్దులు దాటి ఎక్కడికో వెళ్లిపోయిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Noel Robinson (@noelgoescrazy) మెలోడి సాంగ్‌ వచ్చేస్తోంది! 'పుష్ప 2' టైటిల్ సాంగ్‌ ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్‌ కావడంతో చిత్ర యూనిట్‌ ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఈ సారి సెకండ్‌ సాంగ్‌ కింద మెలోడీ పాటను రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. గతంలో పుష్ప మూవీలో చేసిన ‘శ్రీవల్లీ’ సాంగ్‌.. ఎంతటి ఆదరణ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు సీక్వెల్‌లోనూ అలాంటి మ్యాజిక్‌నే రిపీట్‌ చేయాలని మేకర్స్‌ యోచిస్తున్నారట. ఈ మెలోడీ పాటను త్వరలో రిలీజ్‌ చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో సాంగ్‌ కోసం ఇప్పటి నుంచే బన్నీ ఫ్యాన్స్‌ ఎదురు చూడటం మెుదలుపెట్టారు. కాగా, ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.&nbsp; రిలీజ్ ఎప్పుడంటే? పుష్ప 2: ది రూల్ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. నార్త్ ఇండియా హిందీ హక్కుల్లోనూ ఇప్పటికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి తోసింది. కాగా, ఈ సినిమాలో ఫహద్‌ ఫాసిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp;
    మే 16 , 2024
    Double iSmart Heroine: అధికారికంగా చెప్పకపోయినా ఆ బ్యూటీ ఎవరో టీజర్‌లో తెలిసిపోయింది
    Double iSmart Heroine: అధికారికంగా చెప్పకపోయినా ఆ బ్యూటీ ఎవరో టీజర్‌లో తెలిసిపోయింది
    రామ్ పొత్తినేని(RAPO) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న డబుల్ ఇస్మార్ట్ టీజర్ రానే వచ్చింది. నేడు&nbsp; (మే 15) సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను రిలీజ్ చేసింది. టీజర్&nbsp; ఆసాంతం పవర్ ఫ్యాక్డ్ యాక్షన్ డైలాగులతో ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. టీజర్‌లో రామ్ లుక్స్, స్ట్రైల్, స్వాగ్ వెటికవే ప్రత్యేకంగా ఉన్నాయి. పూరి జగన్నాథ్.. రామ్‌పై(Ram Pothineni) సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్స్‌లు ప్లాన్ చేసినట్లు టీజర్‌ను బట్టి అర్ధమవుతోంది. ఈ సినిమాలో అలీ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. టీజర్‌లో అలీ భిన్నమైన గెటప్‌లో కనిపించాడు. మరోసారి పూరి- అలీ కామెడీ మ్యాజిక్ అవిష్కృతం కానుంది.&nbsp; Double ismart Dialogues ఇక ఈ చిత్రంలో మేయిన్ విలన్‌గా నటిస్తున్న సంజయ్ దత్‌ను కూడా టీజర్‌లో క్రూరంగా చూపించారు. ఇక టీజర్‌లో రామ్‌ పొత్తినేని చెప్పే లాస్ట్ డైలాగ్ ఊర మాస్‌గా ఉంటుంది. “నాకు తెల్వకుండా నాపైనా సినిమా ప్లాన్ చేస్తే..నా గుడ్డులో మండుతది” అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఇలాంటి మాస్‌ డైలాగ్‌లు డబుల్ ఇస్మార్ట్‌లో అలరించనున్నట్లు అర్థమవుతోంది. ఇక మణిశర్మ అందించిన సంగీతం ఇస్మార్ట్ శంకర్ చిత్రం మాదిరి గ్రాండ్‌గా ఉంది. ముఖ్యంగా BGM సూపర్బ్‌గా ఉంది. మరి సాంగ్స్ ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది. https://twitter.com/TheAakashavaani/status/1790604878475301304 సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ డబుల్ ఇస్మార్ట్ టీజర్‌(Double ismart Teaser) ఇచ్చిన హైప్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. సోషల్ మీడియాలోనూ సినిమా టీజర్‌పై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. https://twitter.com/warriorkrishnaa/status/1790606705455497645 యాక్షన్ ప్యాక్‌డ్ టీజర్ అంటూ క్రిష్ణ అనే నెటిజన్ కామెంట్ చేశాడు. చివర్లో సూపర్బ్‌ అంటూ చెప్పుకొచ్చాడు. డబుల్ ఇస్మార్ట్ టీజర్ బాగుందంటూ శ్రీహర్ష అనే మరో నెటిజన్ కామెంట్ చేశాడు. రామ్ ఎనర్జీ ఎప్పటిలాగే అదిరిపోయిందని, బీజీఎం, సాంగ్ ర్యాపో అంచనాలు అందుకుందని చెప్పుకొచ్చాడు.&nbsp; https://twitter.com/NameisSrii/status/1790603578266321121 డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ రివీల్ ఇక ఈ సినిమా హీరోయిన్‌ గురించి ఎక్కడా ఇంతవరకు అధికారికంగా(Double ismart heroine) ప్రకటించనప్పటికీ.. సినిమా టీజర్‌లో హీరోయిన్ ఎవరో రివీల్ అయింది. టీజర్‌లో వచ్చే ''ఇస్మార్ట్ ఇంకర్‌కా స్టైల్ క్యా మాలూమ్..కిర్రాక్ పోరొస్తే సైట్ మార్..కతర్నాక్ బీట్ వస్తే.. స్టెపా మార్" అంటూ చెప్పే డైలాగ్‌లో కావ్యా థాపర్(Kavya Thapar) కనిపిస్తుంది. ఏక్‌ మినీ కథ, ఈగల్ సినిమాలో నటించిన కావ్యా థాపర్‌.. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్‌ పొత్తినేనితో రొమాన్స్ చేయనుంది. ఈ గ్లామర్ డాల్ టీజర్‌లో కొన్ని క్షణాలే కనిపించినప్పటికీ.. స్మైలింగ్ లుక్‌, ఆకట్టుకునే అందంలో కనిపించింది. ఈ ముద్దుగుమ్మను చూస్తుంటే మరోసారి అందాల విందు తప్పదని అర్ధమవుతోంది.&nbsp; పూరి జగన్నాథ్ సినిమా అంటేనే హీరోయిన్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా యూత్‌ను దృష్టిలో ఉంచుకుని హీరోయిన్ క్యారెక్టర్లను పూరి డిజైన్ చేస్తుంటాడు. గతంలో వచ్చిన నభా నటేష్,ఆసిన్, అనుష్క,&nbsp; నిధి అగర్వాల్,&nbsp; హన్సిక, అదా శర్మ పూరి సినిమాల్లో హీరోయిన్లుగా నటించి కుర్రకారుకు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు.&nbsp; తాజాగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ టీజర్‌ ద్వారా కావ్యథాపర్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పూరి కనెక్ట్స్ నుంచి&nbsp; ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక సినిమాలో కావ్యా థాపర్‌(Kavya Thapar)తో రామ్ పొత్తినేనికి మంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని సమాచారం. 'ఏక్ మినీ కథ' చిత్రంతో గుర్తింపు పొందిన&nbsp; కావ్యా థాపర్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. క్యూట్‌గా కనిపిస్తూనే&nbsp; హాట్ ట్రీట్ ఇవ్వగలదని ఇప్పటికే ఈగల్ చిత్రం ద్వారా నిరూపితమైంది. ఈక్రమంలోనే కావ్య థాపర్‌ను డబుల్ ఇస్మార్ట్‌లో హీరోయిన్‌గా తీసుకున్నారని తెలిసింది. నార్త్ బ్యూటీ అయిన కావ్యా థాపర్ ప్రస్తుతం దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది.&nbsp; తెలుగులో ఈ మాయ పేరేమిటో, ఏక్ మినీ కథా, రవితేజతో కలిసి ఈగల్ చిత్రంలో నటించింది అటు సాండిల్ వుడ్‌లో బిచ్చగాడు 2లో కావ్యా థాపర్ హీరోయిన్‌గా చేసింది. గతేడాది మే 19న ఈ సినిమా విడుదలైంది.  అప్పట్లో ఈమె ప్రమోషన్లలో పాల్గొన్న తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. మహారాష్ట్రకు చెందిన ఈ భామ 2013లో ‘తత్కాల్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ ద్వారా కెరీర్ ప్రారంభించింది. సినిమాలతో పాటు సోషల్‌మీడియాలోనూ కావ్య బిజీబిజీగా ఉంటోంది. హాటో ఫొటో షూట్‌లతో ఎప్పటికప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది.
    మే 15 , 2024
    Gangs Of Godavari Review: విష్వక్‌ సేన్‌- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్!
    Gangs Of Godavari Review: విష్వక్‌ సేన్‌- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్!
    నటీ నటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, పి. సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు దర్శకత్వం: కృష్ణ చైతన్య సంగీతం: యువన్ శంకర్ సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య విడుదల తేదీ : 31-05-2024 విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari Review In Telugu). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌, టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విష్వక్‌ నటన సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా, మే 31న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? విష్వక్‌ ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్‌ సేన్‌).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌.. మరోమారు తన మాస్ మెస్మరైజింగ్‌ నటనతో మాయ చేశాడు. లంకల రత్నం అనే మాస్‌ క్యారెక్టర్‌లో జీవించేశాడు. ముఖ్యంగా ఈ పాత్ర విష్వక్‌ నటనలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్లలో మాస్‌ జాతరే అన్నట్లు విష్వక్‌ నటన ఉంటుంది. ఇక హీరోయిన్‌ నేహా శెట్టి తనదైన నటనతో మెప్పించింది. విష్వక్- నెహా శెట్టి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.&nbsp; ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మెప్పిస్తాయి. అందాల రాణిలా సాంగ్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది.&nbsp; మరో నటి అంజలికి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కింది. రత్నమాల క్యారెక్టర్‌లో జీవించింది. గతంలో ఎన్నడూ చేయని పాత్ర ద్వారా ఈ సినిమాలో అలరించింది. ఆమె &nbsp; ఊరమాస్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. జబర్దస్త్‌ ఫేమ్ హైపర్ ఆది పంచ్‌లు సినిమాలో నవ్విస్తాయి. మిగతా నటీనటులు సహ తమ పాత్రలకు న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను చాలా ఎంగేజింగ్‌గా తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యాడు. తన గత చిత్రాలు రౌడీ ఫెలో, ఛల్ మోహన్ రంగా సినిమాలకు ఎంతో భిన్నంగా గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిని తీర్చిదిద్దాడు. ప్రతీ పాత్రను కథకు అనుగుణంగా చక్కగా వినియోగించుకున్నాడు. సినిమా ఎండింగ్‌లో తండ్రికూతుళ్ల సన్నివేశాలు, క్లైమాక్స్, డైలాగ్స్‌ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యాయి. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ స్లోగా నడవడం, రొటీన్‌ సన్నివేశాలు, రెగ్యులర్‌ స్టోరీ మూవీకి కాస్త మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం హైలెట్‌గా నిలిచింది. యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఎలివేట్‌ చేయడానికి BGM ఎంతగానో ఉపయోగపడింది. అనిత్ మదాడి కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విష్వక్‌ సేన్‌ నటన డైలాగ్స్‌ సంగీతం మైనస్‌ పాయింట్స్‌ రెగ్యులర్‌ స్టోరీ స్లో నారేషన్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp; Public Talk On Gangs of Godavari సినిమా చాలా బాగుందంటూ ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. కొన్ని ల్యాగ్‌ సీన్స్‌ ఉన్నాయని, స్క్రీన్‌ప్లే మాత్రం అద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు.&nbsp; https://twitter.com/raghav917252/status/1796382241532334575 చాలా రోజుల తర్వాత హౌస్‌ ఫుల్స్‌ చూస్తున్నట్లు మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఇది మ్యాసివ్ వీకెండ్‌ అంటూ వ్యాఖ్యానించాడు.&nbsp; https://twitter.com/PulakithSai/status/1796399917969412273 ఫస్టాఫ్‌ బాగుందని.. కానీ స్టోరీలో మాత్రం కొత్తదనం లేదని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. అయితే మూవీ ఎక్కడా బోర్‌ కొట్టదని స్పష్టం చేశాడు.&nbsp; https://twitter.com/PinkCancerian/status/1796336006402355622 పుష్ప సినిమా ఫాస్ట్ ట్రాక్‌ వెర్షన్‌లా గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి ఉందని ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఎడిటింగ్ అసలు&nbsp; బాలేదని పేర్కొన్నాడు. రన్‌టైమ్‌ చాలా క్రిస్పీగా ఉందని పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/Kamal_Tweetz/status/1796330322730373525 https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vishwak-sen.html https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-neha-shetty.html
    మే 31 , 2024
    <strong>Gam Gam Ganesha Review: అన్న ఫెయిల్‌ అయినా తమ్ముడు సక్సెస్‌ అయ్యాడు!</strong>
    Gam Gam Ganesha Review: అన్న ఫెయిల్‌ అయినా తమ్ముడు సక్సెస్‌ అయ్యాడు!
    నటీనటులు: ఆనంద్‌ దేవరకొండ, నయన్‌ సారిక, ప్రగతి శ్రీవాస్తవ్‌, రాజ్‌ అర్జున్‌, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేష్‌, ప్రిన్స్‌ యావర్‌, జబర్దస్త్‌ ఇమ్మాన్యుయేల్‌, క్రిష్ణ చైతన్య డైరెక్టర్‌ : ఉదయ్‌ బొమ్మిశెట్టి సంగీతం : చైతన్ భరద్వాజ్‌ సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వడి ఎడిటర్‌ : కార్తిక శ్రీనివాస్‌ నిర్మాతలు : వంశీ కృష్ణ, కేదర్‌ సెలగంశెట్టి విడుదల తేదీ : 31-05-2024 విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) నటించిన లేటెస్ట్‌ చిత్రం.. ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్‌ బొమ్మిశెట్టి దర్శకుడు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక కథానాయికలు. జబర్దస్త్‌ ఇమ్మాన్యుయెల్‌, వెన్నెల కిశోర్‌, రాజ్‌ అర్జున్‌, సత్యం రాజేష్‌, ప్రిన్స్‌ యావర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘బేబీ’ లాంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ చేస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ ఏడాది విజయ్‌ దేరరకొండ చేసిన ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. మరి సోదరుడు ఆనంద్‌ దేవరకొండ సినిమా అయినా సక్సెస్‌ కావాలని విజయ్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మే 31న విడుదలైన ‘గం గం గణేశా’ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిచిందా? లేదా? కథేంటి గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ).. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయెల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్‌ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్‌ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్‌, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్‌ గణేష్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్‌ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ.. గణేష్ పాత్రలో ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్‌తో మెప్పించాడు. బేబీ చిత్రం తర్వాత నటుడిగా మరింత పరిణితి సాధించాడు. ఇమ్మాన్యుయెల్‌తో కలిసి అతడు చేసిన కామెడీ సినిమాకు ప్లస్‌ అయ్యింది. అటు హీరోయిన్‌ ప్రగతి శ్రీవాస్తవ అదరగొట్టింది. నీలవేణి పాత్రలో మెప్పించింది. హీరో హీరోయిన్ల మధ్య కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. మరో కథానాయిక నయన్‌ సారిక కూడా శ్రుతి పాత్రలో ప్రేక్షకులను అలరించింది. హాస్యనటులు వెన్నెల కిషోర్‌, ఇమ్మాన్యుయెల్‌ తమదైన కామెడీ ఆకట్టుకున్నారు. విలన్‌గా రాజ్‌ అర్జున్‌ నటన మెప్పిస్తుంది. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు ఉదయ్‌ బొమిశెట్టి రొటీన్‌ కథనే తీసుకున్నప్పటికీ సినిమాను క్రైమ్‌ &amp; ఎంటర్‌టైనింగ్‌ ఫార్మెట్‌లో అద్భుతంగా రూపొందించారు. కథనం, కామెడీ, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను దర్శకుడు బాగా వర్కౌట్‌ చేశాడు. ముఖ్యంగా హీరో - ఇమ్మాన్యుయెల్‌ - వెన్నెల కిషోర్‌ చుట్టూ రాసుకున్న కామెడీ ట్రాక్‌ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్టులు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఆడియన్స్‌కు థ్రిల్‌ను పంచేలా దర్శకుడు ఆ సీన్లను తీర్చిదిద్దాడు. అయితే కొన్ని చోట్ల అసంబద్ద నారేషన్‌ సినిమాకు మైనస్‌గా మారింది. ఫస్టాఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, సెకండాఫ్‌ ట్విస్టులు, థ్లిల్లింగ్‌ క్లైమాక్స్‌తో ఒక మంచి చిత్రాన్ని అందించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు.  టెక్నికల్‌గా ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్‌ టీమ్‌ మంచి పనితీరును కనబరిచింది. మరి ముఖ్యంగా నేపథ్య సంగీతం మూవీకి హైలెట్‌గా నిలిచింది. చైతన్ భరద్వాజ్‌ తన క్యాచీ బీజీఎంతో సన్నివేశాలకు అదనపు ఆకర్షణను అందించాడు. సినిమాటోగ్రాఫర్‌ ఆదిత్య జవ్వడి పనితనం బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ ఆనంద్‌ దేవరకొండ నటనకామెడీట్విస్టులు మైనస్‌ పాయింట్స్ కథలో కొత్తదనం లేకపోవడంస్టోరీ నారేషన్‌లో తడబాటు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp; పబ్లిక్‌ టాక్‌ ఎలా ఉంది? గం గం గణేశా చిత్రాన్ని చూసిన ఓ నెటిజన్‌.. ఇది పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌ అని చెబుతున్నారు. ఈ వీకెండ్‌ ఫుల్లుగా నవ్వుకోవచ్చని ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. ఆనంద్ ఖాతాలో మరో హిట్‌ చేరిందని కామెంట్‌ పెట్టాడు.&nbsp; https://twitter.com/OfficialSreeNu/status/1796180578644926755 ‘గం గం గణేశా’ డీసెంట్‌ సినిమా అని.. ట్విస్టులు, వినోదం సినిమాకు హైలెట్‌గా నిలిచాయని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/review_rowdies/status/1796384723033596372 స్టోరీలో కంటెంట్‌ మిస్‌ అయ్యిందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఆనంద్‌ దేవరకొండ తన శక్తిమేర నటించాడని పేర్కొన్నాడు. కానీ అప్‌ టూ ద మార్క్ చేరుకోలేకపోయడని పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/Mjcartels/status/1796394003979800864 ‘గం గం గణేశా’.. రిలాక్స్‌గా సీట్‌లో కూర్చొని ఎంజాయ్‌ చేసే మూవీ అని ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించాడు. సందర్భానుసారంగా వచ్చే కామెడీ సూపర్బ్‌గా వర్కౌట్ అయ్యిందని చెప్పాడు. https://twitter.com/tcsblogs/status/1796341604845867293
    మే 31 , 2024
    Bhaje Vaayu Vegam Review: ‘RX100’ తర్వాత సాలిడ్‌ హిట్‌ అందుకున్న కార్తికేయ!
    Bhaje Vaayu Vegam Review: ‘RX100’ తర్వాత సాలిడ్‌ హిట్‌ అందుకున్న కార్తికేయ!
    నటీనటులు: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ హరిదాస్, తనికెళ్ళ భరణి, రవి శంకర్ తదితరులు దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి సంగీత దర్శకుడు: రధన్, కపిల్ కుమార్ జమ్ముల సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్ ఎడిటింగ్: జి.సత్య నిర్మాణ సంస్థ : యూవీ క్రియేషన్స్‌ విడుదల తేదీ : మే 31, 2024 యంగ్‌ హీరో కార్తికేయ (Karthikeya) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam). ప్రశాంత్‌రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌గా చేసింది. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్‌, టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. ఇందులో కార్తికేయ నటన సినిమాపై అంచనాలు పెంచింది. మరి మే 31న విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ ఎలా ఉంది? ప్రేక్షకులని ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్‌ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్‌ విలన్‌ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్‌ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో కార్తికేయ తనదైన నటనతో అదరగొట్టాడు. బాధ, ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. యాక్షన్స్ సీక్వెన్స్‌లలోనూ మెప్పించాడు. ఇక హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌కు నటన పరంగా పెద్దగా స్కోప్‌ లభించలేదు. స్క్రీన్‌పై కనిపించినంత సేపు తన గ్లామర్‌తో ఏదోలా నెట్టుకొచ్చింది. అటు సోదరుడి పాత్రలో రాహుల్‌ టైసన్‌ మంచి పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. విలన్‌ పాత్రలో బొమ్మాళి రవిశంకర్‌ ఎప్పటిలాగే తన మార్క్‌ ఏంటో చూపించాడు. తనికెళ్ల భరణి సహా మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే డైరెక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి.. తొలి చిత్రంతోనే తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. ఒక సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా మూవీని తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యాడు. హీరో లాకప్‌లో ఉండే సీన్‌తో మూవీని మెుదలు పెట్టిన డైరెక్టర్‌.. డిఫరెంట్‌గా ఫ్లాష్‌బ్యాక్‌లో కథను నడిపించారు. స్టోరీ సెటప్‌ కోసం ఫస్టాప్‌ను ఉపయోగించుకున్న అతడు.. ఇంటర్వెల్‌కు ఇచ్చిన బిగ్‌ ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని రగిలించారు. అక్కడ నుంచి ఏమాత్రం ఫ్లో మిస్‌ కాకుండా క్లైమాక్స్‌ వరకూ ఇంట్రస్టింగ్‌గా కథను నడిపించి ఆకట్టుకున్నాడు. అయితే క్లైమాక్స్‌ను రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మెట్‌లో ముగించడం కాస్త ఆసంతృప్తిగా అనిపిస్తుంది. మరోవైపు హీరో హీరోయిన్‌ లవ్‌ట్రాక్‌ కూడా రొటీన్‌గా ఉంటుంది. కెమెస్ట్రీ అసలు వర్కౌట్‌ కాలేదు. కొన్ని లాజికల్‌ ఎర్రర్స్‌ను మినహాయిస్తే ‘భజే వాయు వేగం’ తప్పకుండా థ్రిల్‌ చేస్తుంది. టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. కపిల్‌ కుమార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు.. యాక్షన్‌ సీక్వెన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. రాధన్‌ సాంగ్స్‌ కూడా బాగున్నాయి. ఆర్‌.డి రాజశేఖర్‌ కెమెరా పనితనం మెపిస్తుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కార్తికేయ నటనఇంటర్వెల్‌ ట్విస్ట్‌సెకండాఫ్‌ మైనస్‌ పాయింట్ హీరో హీరోయిన్‌ లవ్‌ట్రాక్‌రొటిన్‌ క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    మే 31 , 2024
    <strong>Fahadh Faasil: పుష్ప విలన్‌ ఫహాద్‌ ఫాజిల్‌కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!</strong>
    Fahadh Faasil: పుష్ప విలన్‌ ఫహాద్‌ ఫాజిల్‌కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!
    ‘పుష్ప’ (Pushpa) సినిమాతో మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమాలో చివరి 30 నిమిషాలు అల్లు అర్జున్‌ (Allu Arjun)తో పోటీ పడి మరి నటించాడు. విలన్‌ షేడ్స్‌ ఉన్న ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌ పాత్రలో ఫహాద్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేము. ఆ స్థాయిలో ఆయన తన పాత్రపై ముద్ర వేశాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కావడంతో ఫహాద్‌కు నేషనల్‌ వైడ్‌గా క్రేజ్‌ వచ్చింది. ప్రస్తుతం అతడు వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఫహాద్‌ తాజాగా ఓ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.&nbsp; ఫహాద్‌కు వచ్చిన వ్యాధి ఇదే! మలయాళ స్టార్ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌.. అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజార్డర్‌ (ADHD)అనే వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసిన ఫహాద్‌.. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. దీని వల్ల దేనిపైనా ఎక్కువ శ్రద్ద పెట్టలేకపోతున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు అతి ప్రవర్తన, తొందరగా ఆవేశపడటం వంటివి గమనించినట్లు చెప్పారు. తన సమస్య గురించి డాక్టర్‌ను అడిగినట్లు ఫహాద్‌ తెలిపాడు. 41 ఏళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు తెలుసుకుంటున్నట్లు వివరించాడు.&nbsp; ADHD వ్యాధిని ఎలా గుర్తించాలి? ADHD రుగ్మత పిల్లల్లో చాలా సాధారణం. కానీ, పెద్దల్లో మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆజాగ్రత్తగా తప్పులు చేయడం, స్థిరంగా ఒక చోట కూర్చోలేకపోవడం, పరిగెత్తడం, గెంతడం, అతిగా మాట్లాడటం, తరచూ చేతులు కాళ్లు కదిలిస్తూ ఉండటం చెప్పిన విషయాలు మర్చిపోవడం, అర్థం చేసుకోలేకపోవడం,, ప్రతీ దానికి తొందరపడటం, ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా తీసుకోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతుంటారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.&nbsp; ADHD వ్యాధి ఎలా వస్తుంది? ఒక వ్యక్తి ADHD వ్యాధి ఎలా వస్తుందని చెప్పడానికి నిర్దిష్ట కారణాలు ఏవీ లేవని వైద్యులు తెలిపారు. పూర్తి స్థాయి చికిత్స కూడా అందుబాటులో లేదు. ఇప్పటికీ దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రుగ్మతతో బాధపడే పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారుతుంటుంది. ఇటువంటి పిల్లలను నియంత్రించడానికి థెరపీ, కొన్ని మందులు అవసరం. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. అటు పెద్దలు కూడా ఇదే ఫార్మూలాను అనుసరించాల్సి ఉంటుందని సమాచారం.&nbsp; కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ ఇటీవలే ‘ఆవేశం’ (Aavesham) సినిమాతో ఫహాద్‌ ఫాజిల్‌ సూపర్‌ హిట్‌ను అందుకున్నాడు. ఆ సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. జీతూ మాధవన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ. రూ.150 కోట్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది భారీ వసూళ్లు చేసిన మలయాళ చిత్రాల జాబితాలో నిలిచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; ఫహాద్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం ఫహాద్‌.. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప 2' (Pushpa 2: The Rule) లో నటిస్తున్నాడు. మొదటిభాగంతో పోలిస్తే రెండో పార్ట్‌లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య ఈ సీక్వెల్‌ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైంది. అలాగే తమిళంలో 'మారీసన్‌' (Maareesan), రజనీకాంత్‌తో 'వట్టైయాన్‌' (Vettaiyan) చిత్రంలో నటిస్తున్నాడు.&nbsp;
    మే 28 , 2024

    @2021 KTree