రివ్యూస్
How was the movie?
తారాగణం
విష్ణు మంచు
సలీమ్ / మున్నామోహన్ బాబు
ఓగిరాల జోగయ్య ఓజోముఖేష్ రిషి
అప్పల నాయుడుఅలీ
గఫర్ ఖాన్జీవా
అప్పల నాయుడు అనుచరుడురఘు బాబు
ఓజో హెంచ్మ్యాన్నెపోలియన్
సత్యవతి తండ్రికావేరీ ఝా
ఇంగ్లీష్ టీచర్బెనర్జీ
అప్పల నాయుడు అనుచరుడుబ్రహ్మానందం
తనికెళ్ల భరణి
సత్యవతి బంధువుపృధ్వీ రాజ్
సత్యవతి బంధువుజయ ప్రకాష్ రెడ్డి
సత్యవతి బంధువుహేమ
సత్యవతి బంధువుశివన్నారాయణ నారిపెద్ది
సత్యవతి బంధువుభరత్ రెడ్డి
సత్యవతి నకిలీ వరుడుగిరి బాబు
సింగమనాయుడు స్నేహితుడుమాస్టర్ భరత్
ఎంఎస్ నారాయణ
సత్యవతి బంధువుతెలంగాణ శకుంతల
నూకమ్మరమ్య శ్రీఅప్పల నాయుడు భార్య
గిరిధర్సత్యవతి బంధువు
అమిత్ ఝా
సిబ్బంది
వైవీఎస్ చౌదరి
దర్శకుడుమోహన్ బాబు
నిర్మాతసందీప్ చౌతా
సంగీతకారుడుకోటగిరి వెంకటేశ్వరరావు
ఎడిటర్కథనాలు
Citadel Honey Bunny Review: ఇండియన్ స్పైగా అదరగొట్టిన సామ్.. ‘సిటాడెల్: హనీ బన్నీ’ ఎలా ఉందంటే?
నటీనటులు: వరుణ్ ధావన్, సమంత, కేకే మేనన్, సికందర్ ఖేర్, షకీబ్ సలీమ్, సిమ్రన్ తదితరులు
రచన: సీత.ఆర్ మేనన్, రాజ్ అండ్ డీకే
దర్శకత్వం: కృష్ణ డి.కె, రాజ్ నిడిమోరు
సంగీతం : అమన్ పంత్
సినిమాటోగ్రఫీ : జోహన్ హుర్లిన్
ఎడిటింగ్ : సుమిత్ కొటియన్
స్ట్రీమింగ్ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ : నవంబర్ 7, 2024
హిందీలో 'ఫ్యామిలీ మ్యాన్' (Family Man), 'ఫర్జీ' (Farzi) వంటి విజయవంతమైన సిరీస్‌లను రూపొందించి దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఎంతో గుర్తింపు సంపాదించారు. రీసెంట్‌గా వారి దర్శకత్వంలో రూపొందిన మరో మోస్ట్ వాంటెడ్ సిరీస్ ‘సిటాడెల్’. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan), గ్లామర్ బ్యూటీ సమంత (Samantha Ruth Prabhu) ఈ సిరీస్‌లో లీడ్ రోల్స్‌లో నటించారు. ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel Honey Bunny Review) పేరుతో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. జేమ్స్ బాండ్ మూవీల తరహాలో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఫ్యామిలీ మ్యాన్ తరహాలోనే సమంత మరోమారు ఆకట్టుకుంటుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
బన్నీ (వరుణ్ ధావన్) ఓ స్టంట్ మ్యాన్. అదే సమయంలో సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. గురు (కేకే మేనన్) ప్రైవేటు సీక్రెట్ ఏజెన్సీ నాయకుడిగా ఉంటాడు. ఓ రోజు షూటింగ్ సమయంలో జూనియర్ ఆర్టిస్టు హనీ (సమంత)తో బన్నీకి పరిచయం ఏర్పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బన్నీతో కలిసి ఓ సీక్రెట్ ఆపరేషన్ చేసేందుకు హనీ ఒప్పుకుంటుంది. మిషన్ సమయంలో జరిగిన నాటకీయ పరిణామాల వల్ల హనీ చనిపోయిందని బన్నీ భావిస్తాడు. 8 ఏళ్ల తర్వాత హనీ బతికే ఉందన్న విషయం తెలుస్తుంది. అంతేకాదు తమ కలయికతో పుట్టిన నాడియా (కశ్వీ మజ్ముందార్) అనే ఐదేళ్ల కూతురు కూడా ఉన్నట్లు తెలుసుకుంటాడు. దీంతో విదేశాల్లో ఉన్న బన్నీ ఆమెను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. మరోవైపు హనీ, ఆమె కూతుర్ని చంపేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు? తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హనీ దగ్గర ఉన్న అర్మాడాలో ఏముంది? దాని కోసం ఎందుకు విలన్ గ్యాంగ్ వెతుకుతుంది? అన్నది స్టోరీ. (Citadel Honey Bunny Review)
ఎవరెలా చేశారంటే
బన్నీ పాత్రలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సెటిల్డ్‌గా నటించాడు. యాక్షన్స్ సీక్వెన్స్‌లో తనమార్క్ చూపించి అదరగొట్టాడు. ఇక సిరీస్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సమంత నటన గురించే. తన నటనతో పాటు ఫైట్ సీన్స్‌లోనూ సామ్ దుమ్మురేపింది. సీక్రెట్ ఏజెంట్‌గా, లవర్‌గా, తల్లిగా సమంత మూడు వేరియేషన్స్‌లో చక్కగా నటించింది. సమంత, వరుణ్ లిప్‌లాక్ సీన్స్ యూత్‌కు కన్నుల విందుగా అనిపిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తరహాలో ఇందులో కూడా హాట్ సీన్స్‌లో సామ్ నటించింది. సిరీస్ మెుత్తం వరుణ్, సామ్ స్క్రీన్ ప్రజెన్స్ చుట్టే తిరిగింది. తన గ్లామర్‌తో సమంత కట్టిపడేసింది. నాడియా పాత్ర కథలో భావోద్వేగాలను పండించేందుకు బాగా ఉపయోగపడింది. ఆ పాత్ర చేసిన చిన్నారి అద్భుతంగా నటించింది. కేకే మేనన్, సిమ్రన్, సహా బన్నీ టీమ్‌లో ఉన్న మిగిలినవాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
కథ పరంగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel Honey Bunny Review)లో పెద్దగా కొత్త దనం కనిపించదు. కానీ కథను ప్రజెంట్ చేసే విధానం, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం రాజ్ అండ్ డీకే టీమ్ తమ మార్క్ చూపించారు. ప్రతి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా విభజించి 1992, 2000 సంవత్సరాల్లో పార్లర్‌గా కథను నడపడం ఆకట్టుకుంది. ప్రస్తుత కథలోని పాత్రలు, వాటికి గతంలో ఒకదానితో ఒకటికి ఉన్న కనెక్షన్స్‌ను ఎలాంటి గందరగోళం లేకుండా క్లీన్‌గా ప్రజెంట్ చేశారు. తొలి రెండు ఎపిసోడ్స్ పాత్రల పరిచయానికే సరిపోయినా మూడో ఎపిసోడ్ నుంచి స్టోరీలోకి తీసుకెళ్లారు డైరెక్టర్స్. ప్రపంచాన్ని, దేశాధినేతలను శాసించగల ఆర్మార్డ్ వస్తువును దక్కించుకునేందుకు హనీ-బన్నీ, విలన్ గ్యాంగ్ చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. అయితే ‘ఫ్యామిలీ మ్యాన్’ స్థాయి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం, ఎలాంటి ట్విస్టులు లేకుండా కూల్‌గా కథ సాగిపోవడం, ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాల పైనే నిడివి ఉండటం మైనస్‌గా మారింది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే అన్ని విభాగాలు (Citadel Honey Bunny Review) మంచి పనితీరు కనబరిచాయి. అమన్ పంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. జోహన్ హెర్లీన్ సినిమాటోగ్రఫి ఈ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్. ఫైట్స్, ఛేజింగ్ సీన్లను క్యాప్చర్ చేసిన తీరు యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకొనేలా ఉంది. అయితే నిడివి విషయంలో జాగ్రత్త పడి ఉంటే బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉండాల్సింది. రూసో, రాజ్ డీకే అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
సమంత, వరుణ్‌ధావన్‌యాక్షన్ సీక్వెన్స్‌టెక్నికల్ టీమ్
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ నిడివిట్విస్టులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
నవంబర్ 07 , 2024
Mahira Khan: ఆ ఫోటోలు లీకై ఉండకుంటే నా కేరీర్ మరోలా ఉండేది.. బాలీవుడ్ నటి ఆవేదన
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘రయీస్’ (Raees) సినిమా ద్వారా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ (Mahira Khan), తొలి సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆ సక్సెస్‌ను తగిన విధంగా కెరీర్‌లో కొనసాగించలేకపోయారు. మహిరా కెరీర్‌కి బాలీవుడ్‌లో చోటుచేసుకున్న కొన్ని వివాదాలు అర్థాంతరంగా తన కెరీర్‌ను ముగించేలా చేశాయి. ముఖ్యంగా, 2017లో నటుడు రణ్‌బీర్ కపూర్‌తో కలిసి దిగిన ఫోటోలు మహిరా ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపించాయి.
నాటి ఫోటోలపై మహిరా స్పందన
తాజాగా మహిరా ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఆ అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఆ ఫొటోలు బయటకు వచ్చినప్పుడు ఓ ప్రముఖ మీడియా ‘ది లిటిల్ వైట్ డ్రెస్’ అనే టైటిల్‌తో ఆర్టికల్ రాసింది. దానిలో నాకు సంబంధించి వచ్చిన వార్తలు చదివినప్పుడు మొదట ఆ పరిస్థితి అర్థం చేసుకోలేకపోయా. ‘పాకిస్థాన్ నుంచి ఇంత పెద్ద విజయాన్ని అందుకున్న ఈ నటి ఇప్పుడు ఇలా వెనక్కి తగ్గడం ఏమిటి?’ అనే వాక్యం చూసి నా మనసు తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో నా కెరీర్ ముగిసిపోతుందా అనే ఆలోచన వచ్చింది’’ అని తెలిపారు.
వ్యక్తిగత జీవితంపై ప్రభావం
‘‘ఆ ఫోటోల కారణంగా నా జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. నా కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంపై కూడా ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపింది. ఆ సమయంలో విడాకులు పొందాను, సింగిల్ పేరెంట్‌గా జీవించాను. రోజూ ఆత్మన్యూనతతో బాధపడుతూనే ఉండేదాన్ని. అయితే, ఆ కష్టసమయాల్లో నాకు అభిమానుల మద్దతు ఎంతో శక్తినిచ్చింది’’ అని మహిరా పేర్కొన్నారు.
రణ్‌బీర్‌తో లీకైన ఫొటోల వివాదం
2017లో న్యూయార్క్‌లో రణ్‌బీర్ కపూర్‌తో మహిరా దిగిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో ఇద్దరూ సిగరెట్ తాగుతుండగా కనిపించడంతో పెద్ద వివాదం చెలరేగింది. అప్పట్లో ఈ ఇద్దరి మధ్య సంబంధం ఉందని బాలీవుడ్‌లో గాసిప్‌లు హాట్‌టాపిక్‌గా మారాయి. ఆ సంఘటన తరువాత మహిరా బాలీవుడ్‌లో మరే సినిమాలోనూ కనిపించలేదు.
వ్యక్తిగత జీవితం
మహిరా ఖాన్ ఆమె స్నేహితుడు అలీ అస్కారీని వివాహమాడి, 2015లో విడిపోయారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత మహిరా వ్యాపారవేత్త సలీమ్ కరీమ్‌ను 2023లో వివాహమాడారు. ప్రస్తుతం ఆమె వ్యక్తిగతంగా శాంతియుత జీవితం గడుపుతున్నారు.
మహిరా ఈ సంఘటనలను గుర్తు చేసుకుంటూ తన అభిమానుల ప్రేమ, మద్దతు ఎప్పటికీ తనతో ఉంటుందని అభిప్రాయపడింది.
డిసెంబర్ 17 , 2024
Lal Salaam Movie Review In Telugu: రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, కపిల్ దేవ్, నిరోషా రాధా, సెంథిల్, జీవిత, తంబి రమేష్ తదితరులు
దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
సినిమాటోగ్రఫీ : విష్ణు రంగస్వామి
నిర్మాత: సుభాస్కరణ్ అల్లిరాజా
విడుదల తేదీ : 09 ఫిబ్రవరి, 2024
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో (Lal Salaam Movie Review In Telugu) నటించిన లేటెస్ట్ చిత్రం ‘లాల్ సలామ్’ (Lal Salaam). ఈ సినిమాకు ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్, విక్రాంత్ ముఖ్యపాత్రలు పోషించారు. భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ కూడా అతిథి పాత్రలో నటించారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో ప్రముఖ హీరోయిన్ జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రజనీ మరోమారు తన నటనతో మెప్పించాడా? కూతురికి విజయాన్ని అందించాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
తిరు (విష్ణు విశాల్), మెుయిద్దీన్ భాయ్ (రజనీకాంత్) కొడుకు షంశుద్దిన్ చిన్నప్పటి నుంచి ప్రత్యర్థులు. మెుయిద్దీన్ భాయ్ స్థాపించిన త్రీ స్టార్ క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్లుగా ఉంటారు. తిరు సక్సెస్ పట్ల అసూయ పడే కొందరు వ్యక్తులు అతడు జట్టు నుంచి బయటకొచ్చి కొత్త టీమ్ పెట్టుకునేలా ప్రేరేపిస్తారు. ఈ క్రమంలో తిరు.. ఎంసీసీ టీమ్‌ను ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ జట్లు రెండు విభిన్న మతాలను (హిందూ - ముస్లిం) రిప్రెజెంట్ చేస్తాయి. ఊర్లో ఈ రెండు జట్ల మ్యాచ్ అంటే అది ఇండియా - పాక్ మ్యాచ్‌ను తలపిస్తుంది. ఈ క్రమంలో ఓ మ్యాచ్ తిరు-షంశు జీవితాలను మలుపు తిప్పుతుంది. జాతీయ జట్టుకు ఆడాలన్న షంశు కలను ప్రశ్నార్థకం చేస్తుంది. ఇంతకీ ఆ మ్యాచ్‌లో ఏం జరిగింది? మతాల వారిగా విడిపోయిన ఊరు, జట్లను మెుయిద్దీన్ భాయ్ ఎలా కలిపాడు? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే?
లాల్ సలాం చిత్రంలో రజనీకాంత్ (Lal Salaam Movie Review In Telugu) ప్రత్యేక పాత్రలో కనిపించినా కథను ఆయన పూర్తిగా ఆక్రమించేశారు. మరోమారు తన అద్భుతమైన నటనతో మెప్పించారు. ఒక కొడుక్కి తండ్రిగా, మత పెద్దగా మెుయిద్దీన్ పాత్రలో ఆయన జీవించారు. కనిపించింది కొద్దిసేపే అయినా సినిమాకు రజనీ వెన్నెముకగా మారారు. ఇక ప్రత్యర్థులుగా విష్ణు విశాల్, విక్రాంత్ నటన ఆకట్టుకుంది. వారు ప్రొఫెషనల్ క్రికెటర్స్‌లా స్క్రీన్‌పై కనిపించారు. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకలకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. నిరోషా రాధా, సెంథిల్, జీవిత, తంబి రమేష్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్.. రెండు విభిన్న మతాలను (Lal Salaam Movie Review In Telugu) తన కథాంశంగా ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె కథను తీర్చిదిద్దారు. పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ను ఆమె ఎంచుకున్నప్పటికీ దానిని సరిగ్గా ప్రజెంట్ చేయడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. విష్ణు-విక్రాంత్‌ల సీన్లు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. కొన్ని అంశాలను క్లారిటీగా చెప్పకపోవడంలోనూ డైరెక్టర్ల వైఫల్యం కనిపిస్తుంది. ఇక రజనీకాంత్ పాత్ర నిడివి మరి తక్కువగా ఉంది. సినిమాలో ఆయన ప్రెజెన్స్‌ను ఇంకాస్త పెంచి ఉంటే ప్లస్ అయ్యేది. ఇంకా సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్. ముస్లింలను రిప్రెజెంట్ చేస్తూ తాము ఈ దేశ పౌరులమేనంటూ రజనీ చెప్పే డైలాగ్స్ థియేటర్లో చప్పట్లు కొట్టిస్తాయి.
టెక్నికల్‌గా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Lal Salaam Movie Review In Telugu).. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. ముఖ్యంగా రజనీకాంత్ పాత్రకు ఎలివేషన్స్ ఇస్తూ ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రెహమాన్ BGM.. రజనీపాత్ర మరింత ఎలివేట్ అయ్యేందుకు దోహదపడింది. ఇక విష్ణు రంగస్వామి కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ, కథనంరజనీకాంత్ నటనసంగీతం
మైసన్ పాయింట్స్
స్పష్టత లేని సన్నివేశాలుసాగదీత సీన్స్
Telugu.yousay.tv Rating: 3/5
ఫిబ్రవరి 09 , 2024
A.R. Rehman: ఏ.ఆర్. రెహమాన్‌తో ఎఫైర్ ఉందంటూ రూమర్లు.. అసిస్టెంట్ రియాక్షన్ ఇదే!
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ (A.R Rahman) దంపతులు ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. రెహమాన్ భార్య సైరా బాను (Saira Bhanu) తరపు లాయర్ ప్రకటించడంతో ఈ విషయం వెలుగుచూసింది. అయితే ఆ విడాకుల అనౌన్స్‌మెంట్ వచ్చిన కొద్దిసేపటికే అతడి టీమ్‌లోని మోహిని దే (Mohini Dey) అనే మహిళ తన భర్తకు విడాకులు ప్రకటించడం చర్చనీయాంశమైంది. రెహమాన్ ఆమెతో రిలేషన్‌లో ఉన్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వారిద్దరు ఒక్కటయ్యేందుకే జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చారని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే వీటిపై తాజాగా మోహిని దే స్పందించింది. రెహమాన్‌తో తనకున్న రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చింది.
‘నిందలు వేయడం కరెక్ట్ కాదు’
ఏ.ఆర్. రెహమాన్‌తో రిలేషన్‌పై వస్తోన్న నెగిటివ్ కామెంట్స్‌ను బేస్ ప్లేయర్ మోహిని దే తీవ్రంగా ఖండించింది. ఆయన తనకు తండ్రితో సమానమని స్పష్టం చేసింది. తనది ఏ.ఆర్. రెహమాన్ కుమార్తెలది ఒకటే వయసని గుర్తుచేసింది. ఆయన తనను ఎప్పుడూ కూతురు లాగానే చూశారని చెప్పింది. 8 ఏళ్ల నుంచి ఆయన బృందంలో పని చేస్తున్నానని రెహమాన్ అంటే తనకెంతో గౌరవమని పేర్కొంది. మాపై ఇలాంటి రూమర్స్ రావడం చాలా బాధకరమని చెప్పింది. సున్నితమైన విషయాల్లో సానుభూతి లేకుండా నిందలు వేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఈ ప్రచారానికి ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరింది. ఈ ఏడాదే తన తండ్రిని కోల్పోయానని అప్పటి నుంచి రెహమాన్ టీమ్‌లోని ప్రతీ ఒక్కరూ తనను సొంత వ్యక్తిలా ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చింది.
https://twitter.com/GemCinemas/status/1861288712652628193
ఆడియో రిలీజ్ చేసిన మాజీ భార్య
ఏ.ఆర్. రెహమాన్‌పై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన భార్య సైరా బాను సైతం స్పందించింది. ఈ మేరకు ఆఢియోను విడుదల చేసింది. యూట్యూబర్లు, తమిళ మీడియా రెహమాన్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరింది. రెహమాన్ ప్రపంచంలోనే చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చింది. ఇకనైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని హితవు పలికింది. మరోవైపు రెహమాన్ భార్య తరపు న్యాయవాది సైతం ఈ వ్యవహారంపై మాట్లాడారు. రెండు జంటల డివోర్స్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. పరస్పర అంగీకారంతోనే సైరా - రెహమాన్ విడిపోయారని స్పష్టం చేశారు. వైవాహిక బంధంలో సైరా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారని చెప్పుకొచ్చారు. వారు విడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయని చెప్పారు.
https://twitter.com/sunnewstamil/status/1860585811940352492
సైరా బాను గురించి తెలుసా!
రెహమాన్ మాజీ భార్య సైరా బాను (Saira Bhanu) గుజరాజ్‌లో జన్మించింది. ఆమె ప్రముఖ మలయాళ యాక్టర్ రషిన్ రెహమాన్ మరదలు. ఓ దర్గాలో తొలిసారి సైరాను చూసిన రెహమాన్ తల్లి ఆమెను ఇష్టపడింది. అలా పెద్దలు కుదిర్చిన పెళ్లితో రెహమాన్ సైరా ఒక్కటయ్యారు. ఏ.ఆర్ రెహమాన్ నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేది. రెహమాన్ - సైరా జంటకు ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు ఖతీజా వివాహాన్ని 2022లో ఘనంగా నిర్వహించారు.
ఫుల్ రైజింగ్‌లో రెహమాన్!
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ (A.R. Rehman) ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ ఏడాది వచ్చిన అయాలన్, లాల్ సలామ్ చిత్రాలకు రెహమానే సంగీతం సమకూర్చాడు. ముఖ్యంగా రాయన్‌లోని పాటలు ప్రేక్షకులను బాగా అలరించారు. రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబోలో రానున్న ‘RC 16’ ప్రాజెక్ట్‌కు సైతం రెహమాన్ వర్క్ చేస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత నేరుగా ఓ తెలుగు ఫిల్మ్‌కు రెహమాన్ వర్క్ చేయబోతున్నారు. దీంతో మ్యూజిక్ ఏ స్థాయిలో ఉంటుందోనని సంగీత ప్రియులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు.
నవంబర్ 26 , 2024
This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు విభిన్నమైన చిత్రాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం శివరాత్రి పండగను పురస్కరించుకొని థియేటర్లలో సందడి చేయనున్నాయి. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో ఈ ప్రత్యేక కథనంలో ద్వారా పరిశీలిద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
గామి
విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా రూపొందిన అడ్వెంచర్ డ్రామా ఫిల్మ్ ‘గామి’ (Gaami). విద్యాధర్ కాగిత ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్. ‘మానవ స్పర్శ సమస్యను ఎదుర్కొంటున్న ఓ అఘోర హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం’ అని దర్శకుడు తెలిపారు. విశ్వక్ అఘోరాకు నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి.
భీమా
గోపీచంద్ (Gopichand) హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష రూపొందించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘భీమా’ (Bhimaa). మాళవికా శర్మ (Malvika Sharma), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) కథానాయికలుగా చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ సినిమాలో గోపీచంద్ పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
షైతాన్
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘షైతాన్’ (హిందీ) (Shaitaan). వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవగణ్‌తో పాటు ఆర్. మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
ప్రేమలు
మలయాళంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ‘ప్రేమలు’.. ఈ వారం తెలుగులో రిలీజవుతోంది. గిరీశ్ ఎ.డి. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్ (Naslen K Gafoor), మ్యాథ్యూ థామస్ (Mathew Thomas), మమితా బైజూ (Mamitha Baiju) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 8న రిలీజ్ కానుంది.
రికార్డ్ బ్రేక్
నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్యకృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్నకుమార్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘రికార్డ్ బ్రేక్’ (Record Break). ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది.
వి లవ్ బ్యాడ్ బాయ్స్
అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’ (We Love Bad Boys). రాజు రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది.
రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి
రవితేజ నున్న, నేహా జురెల్ జంటగా సత్య రాజ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి’ (Raju Gari Ammayi Naidu Gari Abbayi). హాస్యంతోపాటు ఊహించని మలుపులతో ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ రేపుతుందని రవితేజ పేర్కొన్నారు. ఈ సినిమా మార్చి 9న రిలీజ్ కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్ సిరీస్‌లు
హనుమాన్
ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘హనుమాన్’. సంక్రాంతికి రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా.. సుమారు రెండు నెలల తర్వాత అంటే ఈ శుక్రవారం (మార్చి 8) మహా శివరాత్రినాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (Zee 5) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.
లాల్ సలామ్
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అతిథిపాత్రలో కనిపించిన ఈ ‘లాల్ సలామ్’ (Lal Salaam) మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ నెలలోపే నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెడుతోంది. మార్చి 8న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది.
యాత్ర 2
యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వస్తోంది. మాజీ సీఎం వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీని ఎక్కిన తీరును ఈ మూవీలో చూపించారు. 2019లో వచ్చిన యాత్రకు ఇది సీక్వెల్. ఈ చిత్రం కూడా మార్చి 8న అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.
వళరి
‘గురు’ ఫేమ్ రితికా సింగ్ (Ritika Singh) కీలక పాత్రలో నటించిన హారర్ మూవీ ‘వళరి’ (Valari). శ్రీరామ్ కీలక పాత్ర పోషించాడు. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’ (ETV Win)లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateAnweshippin KandethumMovieMalayalam / TeluguNetflixMarch 08The Gentleman MovieEnglishNetflixMarch 07DamselMovieEnglishNetflixMarch 08The Backup PlanMovieEnglishNetflixMarch 08SaaguMovieTeluguAmazon / MX PlayerMarch 08Captain MillerMovieHindiAmazon March 08Show TimeMovieHindiDisney + HotstarMarch 08Maha Rani Season 2Web SeriesTelugu/HindiSony LIVMarch 07
మార్చి 04 , 2024
This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
సంక్రాంతి తర్వాత గతవారం చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ వీక్ (This Week Movies) పెద్ద చిత్రాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాస్తవానికి ఆయా చిత్రాలు సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. మరోవైపు సంక్రాంతికి రిలీజైన రెండు పెద్ద సినిమాలు సైతం ఈ వారమే ఓటీటీలోకి (This Week OTT Releases) రాబోతున్నాయి. వాటితో పాటు మరిన్ని సిరీస్‌లు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
ఈగల్
రవితేజ (Raviteja) కథానాయకుడిగా (This Week Movies) కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ (Eagle). సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కథానాయికలు నటించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాదేవ్ సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్‌గా సాగే ఓ మంచి మాస్ యాక్షన్ మూవీగా ‘ఈగల్’ అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.
లాల్ సలామ్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’ (Lal Salaam) చిత్రం కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రజనీ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. క్రికెట్ ఆట చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. రజనీ ఇందులో మొయిద్దీన్ భాయ్ పాత్రలో అలరించనున్నారు.
యాత్ర-2
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర' (Yatra). ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' (Yatra 2) ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్ ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 మధ్య ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' సాగుతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మహీ వి. రాఘవ్ తెరకెక్కించారు. ఇందులో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి, జగన్ పాత్రలో జీవా నటించారు.
ట్రూ లవర్
మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి (This Week OTT Releases) కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘ట్రూ లవర్’. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ట్రూ లవర్ రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.
పవన్ మూవీ రీ-రిలీజ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ మూవీ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రం రీరిలీజ్‌కు (This Week OTT Releases) సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఎంపిక చేసిన థియేటర్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు
గుంటూరు కారం
మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కెప్టెన్ మిల్లర్
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller). ప్రియాంక మోహన్ కథానాయికగా చేసింది. సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా, తెలుగులో రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 9నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బబుల్‌గమ్
సుమ-రాజీవ్ కనకాల తనయుడు రోషన్ (Roshan Kanakala) కథానాయకుడిగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘బబుల్‌గమ్’(Bubblegum). మానస చౌదరి (Maanasa Choudhary) కథానాయిక. ఈ చిత్రం కూడా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
TitleCategoryLanguagePlatformRelease DateOne Day MovieEnglishNetflixFeb 8BhakshakSeriesHindiNetflixFeb 9AryaSeriesHindiDisney+HotstarFeb 9Aqua ManMovieEnglishBook My ShowFeb 5Bubble gumMovieTeluguAhaFeb 9The ExorcistMovieEnglishJio CinemaFeb 6The Nun 2MovieEnglishJio CinemaFeb 7HelloSeriesEnglishJio CinemaFeb 8AyalaanMovieTamilSun NXTFeb 9
ఫిబ్రవరి 05 , 2024
Malaika Arora: ఘాటు అందాలతో మలైకా రచ్చ రచ్చ… నెటిజన్లకు పెద్ద పని చెప్పిన హాట్ బ్యూటీ
హాట్ డాల్ మలైకా అరోరా మరోసారి ఘాటు అందాలతో రచ్చ చేసింది. మిల్కీ వైట్ అవుట్ ఫిట్‌తో సోగసుల విందు చేసింది. లేటు వయసులోనూ వన్నె తగ్గని అందంతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
వైట్ అండ్ వైట్ జార్జెట్‌లో టాప్ ఆండ్ బాటమ్స్‌లో టూ పాయింట్స్ వద్ద బ్లాక్ ప్లవర్స్ అద్దికతో సొగసును రెట్టింపు చేసుకుంది.
ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు అరోరా వయసు పెరుగుతుందా? తరగి పోతుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అందాలను విందు చేయడంలో కుర్ర హీరోయిన్లతో పొటీపడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఊపిరి సలపకుండా గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది.
హాట్ హాట్ క్లీవేజ్ అందాలతో అబ్బా..! అనిపిస్తోంది. నిత్యం యోగా, బాడీ ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ ఇంపైన అందంతో బాడీని మెయిన్‌టెయిన్ చేస్తోంది ఆరోరా
తన అందాన్ని కాపాడుకునేందుకు జిమ్, యోగా సెంటర్లలో గంటల తరబడి ఉంటానని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది ఈ సొగసుల కోవా
ఐదు పదుల వయసుకు చేరువవుతున్నా.. ఇంకా 25+ అందంలా మెరిసిపోతూ మాయ చేస్తోంది
మలైకా అరోరా 1973 అక్టోబర్ 23న మహారాష్ట్రలోని థానేలో జన్మించింది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది.
హీందీతో పాటు పలు చిత్రాల్లో నటిగా, ఐటెం సాంగ్స్ చేసి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది
షారుక్ ఖాన్ నటించిన దిల్‌సే చిత్రంలో చయ్య.. చయ్య పాటలో నర్తించి యావత్ సినీలోకం దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ పాట తనకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది
నటిగా మలైకా కాంటే (2002), EMI (2008) వంటి చిత్రాలలో లీడ్ రోల్స్‌లో నటించి మెప్పించింది.
దబాంగ్, దబాంగ్ 2, బిచ్చు, భారతీయుడు, మా తుఝే సలామ్, డాలీ కీ డోలీ వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించింది.
తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బసింగ్ సినిమాలో కెవ్వు కేక పాటలో నటించి పవర్ స్టార్ ఫ్యాన్స్ మనసుల్ని దోచుకుంది.
అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో రాత్రైనా నాకు ఓకే ఐటెం సాంగ్‌లో నర్తించి యూత్‌లో యమ క్రేజ్ సంపాదించింది.
ఇక మలైకా అరోరా వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను 1998లో వివాహం చేసుకుని 2015వరకు కాపురం చేసింది.
ఆ తర్వాత తనకన్న వయసులో చాలా చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్‌ను 2016లో పెళ్లి చేసుకుంది. దీంతో తన అందానికి మరింత మెరుగులు దిద్దుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది ఈ సొగసుల కొమ్మ
సెప్టెంబర్ 05 , 2023
Sriya Reddy: సలార్ ముద్దుగుమ్మ శ్రియా రెడ్డి అందాలు చూస్తే మతిపోవాల్సిందే!
శ్రియా రెడ్డి అందానికి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
సలార్‌లో ఓ పవర్‌ఫుల్ రోల్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ నటనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రియారెడ్డి గతంలో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు... కానీ ఈమె మరెవరో కాదు హీరో విశాల్‌కు స్వయాన వదిన.
హీరో విశాల్ సోదరుడు విక్రమ్‌ను పెళ్లి చేసుకున్న ఈ సుందరాంగి.. సినిమాల్లో నటిస్తూ రాణిస్తోంది.
లేటు వయసులోనూ తన ఒద్దికైన ఫిజిక్‌తో పెద్దసంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది.
సలార్ సినిమాలో శ్రియా రెడ్డి.. పృథ్విరాజ్ సవతి తల్లి కూతురిగా నటించి మెప్పించింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆమె అందానికి కుర్రకారు దాసోహమంటున్నారు.
40ఏళ్ల వయసులోనూ ఈ ఘాటు అందాలు ఏంటని నెటిజన్స్ తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.
2002 నుంచి ఇండస్ట్రీలో ఉన్న శ్రియా రెడ్డికి అవకాశాలు అంతంత మాత్రమే వచ్చినా... తనదైన మార్క్ నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది.
ప్రస్తుతం ఈ బామ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రియా రెడ్డి, హాట్ ఫోటో షూట్‌తో కుర్రకారుకు కనువిందు చేస్తుంటుంది.
ముఖ్యంగా చీర కట్టులో ఎద అందాల ఆరబోతతో కవ్విస్తుంటుంది.
చీరలోనో కాదు మోడ్రన్ డ్రెస్‌లోనూ కావాల్సినంత అందాన్ని అప్పనంగా అభిమానులకు అందిస్తుంటుంది.
పదునైన చూపులతో గాలం వేస్తూ కుర్రకారును కవ్విస్తుంటుంది.
ప్రస్తుతం శ్రియారెడ్డి ఇన్‌స్టాలో ఫాలోవర్ల సంఖ్య 1.6మిలియన్ దాటింది.
సలార్ మూవీ హిట్‌తో ఈ కుందనపు బొమ్మకు అవకాశాలు దక్షిణాదిలో వెల్లువెత్తుతున్నాయి.
మరి భవిష్యత్‌లో ఈ ఘాటు అందం ఎన్ని సంచలనాలకు వేదిక కానుందో చూడాలి.
డిసెంబర్ 26 , 2023
Unique Movie Titles: సలార్, కంగువ, తంగలాన్.. ఈ టైటిల్స్ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
సినిమాపై ఆసక్తిని పెంచడంలో టైటిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా పేరు ఎంత యూనిక్‌గా ఉంటే ఆడియన్స్ అంతగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం రూపొందుతున్న చాలావరకూ సినిమాలు తమ ప్రాంతానికే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్నాయి. అయితే కథ డిమాండ్ మేరకు ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పేర్లనే డైరెక్టర్లు సినిమాకు ఖరారు చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఆ టైటిళ్లు కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వాటి అర్థం తెలుసుకోవాలన్న ఉత్సాహం వారిలో పెరిగిపోతోంది. ఇంతకీ ఆ సినిమా పేర్లు ఏవి? వాటి వెనకున్న అర్థం ఏమిటీ? ఇప్పుడు పరిశీలిద్దాం.
తండేల్
నాగ చైతన్య లేటెస్ట్ మూవీ పేరు 'తండేల్' (Thandel). ఈ సినిమా టైటిల్ వెనకున్న అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తండేల్ అంటే మత్సకారుల బృంద నాయకుడు అని అర్థం. సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు అతడే బోటు నడుపుతాడు. చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సలార్
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'సలార్' (Salar). దీనికి నాయకుడు.. రక్షకుడు ఇలా పలు అర్థాలున్నాయి. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. డిసెంబర్ 22న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
డంకీ (DUNKI)
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డంకీ' (DUNKI). ఈ టైటిల్‌కు అర్ధం.. అక్రమంగా దేశ సరిహద్దుల గుండా ప్రయాణించడం. ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి తాప్సీ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ డిసెంబర్ 21న విడుదల కానుంది.
తంగలాన్
చియాన్ విక్రమ్ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). ఇది తమిళనాడులోని ఓ తెగ పేరు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటించింది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది.
కంగువ
స్టార్ హీరో సూర్య అప్‌కమింగ్ మూవీ పేరు 'కంగువ' (Kanguva). దీనికి ‘అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు’ అని అర్థం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్యకు జోడీగా దిశా పటానీ (Disha Patani) నటిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
మట్కా
వరణ్‌తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం పేరు 'మట్కా' (Matka). ఇదో రకమైన జూదం. యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యింది.
జిగర్‌తండ డబుల్ ఎక్స్
రాఘవ లారెన్స్, ఎస్.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్‌తండ డబుల్ ఎక్స్' (Jigarthanda DoubleX). తమిళనాడులోని మధురైలో ప్రసిద్ధి చెందిన ఓ కూల్‌డ్రింక్ పేరును దీనికి పెట్టారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.
అయలాన్
శివకార్తికేయన్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం 'అలయాన్' (Ayalaan). దీనికి పొరుగువాడు అని అర్థం. మానవుడు ఏలియన్ మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
నవంబర్ 25 , 2023
SalaarTheSaga: సలార్ ఒక పెను సంచలనం.. ఇండియా హిస్టరీలో అలాంటి మూవీ రాలేదు!
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సినిమాని ప్రభాస్ ఎలా యాక్సెప్ట్ చేశారంటూ నెట్టింట విమర్శలొచ్చాయి. ప్రభాస్ కెరీర్ ఢమాల్ అంటూ చాలామంది ట్వీట్లు కూడా చేశారు. అయితే, ఆదిపురుష్ ఫలితాన్ని మర్చిపోయేలా ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సలార్ ఫీవర్ షురూ అయింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దీంతో ఫోకస్ మొత్తం సలార్ వైపు మళ్లింది. సలార్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌లో సరికొత్త జోష్ మొదలైంది.
‘సలార్’కి 100 రోజుల ముందే కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్లను ట్రాక్‌లో పెట్టింది. దీంతో ఇప్పటి నుంచే సలార్ మూవీ ప్రజల్లో ఉండేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఒక్కో అప్‌డేట్‌ని రివీల్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న చిత్రం కావడమూ ఇందుకు మరో కారణం. పైగా, ఇందులో ‘KGF’కు మించిన యాక్షన్ సీన్స్ ఉంటాయట. ఊహకు అందని రీతిలో మూవీ ఉంటుందని టాక్. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
టీం సభ్యుల ప్రచారం..
సినిమా ప్రచార వ్యూహాలు ఒకెత్తయితే, మూవీ విషయాలను క్యాస్ట్ అండ్ క్రూ సందర్భానుసారంగా వెల్లడిస్తుండటం మరొక ఎత్తు. ఇప్పటికే సలార్ మూవీ గురించి రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి. సినిమా స్టోరీ ప్లాట్ సహా ఎక్కడ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటితోనే అభిమానులు పండగ చేసుకుంటుంటే వారికి మరింత కిక్ ఇచ్చేలా మూవీ టీం సభ్యులు అప్‌డేట్స్ ఇస్తున్నారు.
కెమెరా..
సలార్ మూవీ కోసం ప్రత్యేక కెమెరాను ఉపయోగిస్తున్నట్లు సినిమాటోగ్రఫర్ భువన గౌడ్ వెల్లడించాడు. సిగ్నేచర్ లెన్స్‌తో కూడిన నెక్ట్స్ వెర్షన్ అలెక్స్ ఎర్రీ కెమెరాను వాడుతున్నట్లు తెలిపాడు. పైగా, సినిమా పూర్తిగా ఐమ్యాక్స్ వెర్షన్‌కి సపోర్ట్ చేసేలా 4K లో తీస్తున్నట్లు వెల్లడించాడు. డార్క్ సెంట్రిక్ థీమ్‌లో తెరకెక్కుతున్నందున ఆరెంజ్‌కు బదులు బూడిద రంగును వాడినట్లు చెప్పాడు. పైగా, స్కేల్, జాగ్రఫీ పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయని చెప్పి హైప్ క్రియేట్ చేశాడు.
సరికొత్తగా ప్రభాస్..
సలార్ సినిమాలో చూసే ప్రభాస్ సరికొత్తగా ఉంటాడని నటి శ్రియా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని సలార్‌లో చూస్తారని చెప్పింది. కేజీఎఫ్ ఒక సంచలనం అయితే సలార్ పెను సంచలనం అంటూ చెప్పుకొచ్చింది. హాలీవుడ్ సెన్సేషనల్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ను మరిపించేలా ఫైట్స్ ఉండబోతున్నాయట. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో ఒక ప్రపంచం ఉంటుందని.. అదే విధంగా ప్రశాంత్ నీల్ మరొక ప్రపంచాన్ని సృష్టించాడని తెలిపింది. ఇలాంటి ప్రపంచంలో ఓ మైటీ ప్రభాస్ ఉంటాడని చెప్పింది. ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని పేర్కొంది. మరో 8 పాత్రలు వేటికవే ప్రత్యేకమని స్పష్టం చేసింది. ఇక సినిమా ఎలా ఉండబోతోందో మీరే ఊహించుకోండి అంటూ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించింది.
https://twitter.com/Attitudist/status/1671201399584227328
మ్యూజిక్
కేజీఎఫ్ 1, 2 సినిమాలకు మ్యూజిక్ అందించాడు రవి బాస్రూర్. ముఖ్యంగా ఈ రెండు సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు సలార్ మూవీకి కూడా రవినే సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీంతో మ్యూజిక్ పరంగా ఆల్బమ్ ముందే హిట్ లిస్టులోకి చేరుకుంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. రవి బాస్రూర్ పోస్ట్ చేసే మ్యూజిక్ ప్రాక్టీస్ వీడియోలు వీటికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇలా చిత్రంపై ఒకొక్క విషయం వెల్లడిస్తూ
https://twitter.com/NimmaNuthan/status/1671180132638420992
జూన్ 21 , 2023
UPCOMING MOVIES: మూవీ లవర్స్‌కి సమ్మర్ ట్రీట్.. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలుసా?
కస్టడీ (మే 12)
నాగచైతన్య - కృతి శెట్టి జంటగా చేసిన సినిమా ‘కస్టడీ’. వెంకట్ ప్రభు డైరెక్షన్ చేశారు
భువన విజయం (మే 12)
భువన విజయంలో సునీల్ లీడ్ రోల్‌లో చేశారు. యలమంద చరణ్ దర్శకత్వం వహించారు.
కథ వెనుక కథ (మే 12)
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘కథ వెనుక కథ’ను తెరకెక్కించారు. సునీల్, విశ్వంత్ లీడ్ రోల్స్ చేశారు
మ్యూజిక్ స్కూల్ (మే 12)
ఈ సినిమాలో శ్రియ శరణ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు
ఛత్రపతి (మే 12)
ఈ సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. V.V వినాయక్ డైరక్టర్
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ (మే 12)
క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కింది. నిహాల్, దృషికా జంటగా నటించారు.
ఫర్హానా (మే 12)
ఐశ్వర్య రాజేశ్ కీ రోల్‌లో డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్ తెరకెక్కించిన చిత్రం ‘ఫర్హానా’.
అన్నీ మంచి శకునములే (మే 18)
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం.
సామజవరగమన (మే 18)
శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందింది. రెబా మోనికా కథానాయిక
బిచ్చగాడు 2 (మే 19)
ఇందులో విజయ్ ఆంటోనీ, కావ్య తాపర్ జంటగా చేశారు. బిచ్చగాడు మూవీకి సీక్వెల్ ఇది.
మళ్ళీ పెళ్లి (మే 26)
నరేష్, పవిత్ర లోకేష్ జంటగా చేసిన చిత్రం మళ్ళీ పెళ్లి. MS రాజు దర్శకత్వం వహించారు.
టక్కర్ (మే 26)
సిదార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా చేసిన చిత్రం ‘టక్కర్'. కార్తీక్.జి.క్రిష్ దర్శకత్వం వహించారు.
మేమ్ ఫేమస్ (మే 26)
మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య కీలక పాత్రలు పోషించారు. సుమంత్ ప్రభాస్ డైరెక్షన్ చేశారు.
అహింస (జూన్ 02)
రాణా బ్రదర్ అభిరామ్ హీరోగా తేజ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. హీరోయిన్‌గా గీతిక చేసింది.
విమానం (జూన్ 02)
సముద్రఖని నటించిన ద్విభాషా చిత్రం ‘విమానం’. అనసూయ కీలక పాత్ర పోషించింది.
ఆదిపురుష్ (జూన్ 16)
రాముడి పాత్రలో ప్రభాస్ నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్ డైరెక్షన్ చేశాడు.
స్పై (జూన్ 29)
హీరో నిఖిల్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పై'. ఎడిటర్ ‘గ్యారీ. BH డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు.
మే 11 , 2023
UPCOMING MOVIES: మూవీ లవర్స్‌కి సమ్మర్ ట్రీట్.. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలుసా?
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Download Our App
మే 11 , 2023
Prashanth Neel : సలార్, కేజీఎఫ్ 2 కలయికతో KGF 3..!
థియేటర్లలో పూనకాలే అంటున్న నెటిజన్లు
కన్నడ నటుడు యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. భారత చలనచిత్ర పరిశ్రమను నెలబెట్టిన సినిమాల్లో కచ్చితంగా కేజీఎఫ్ ఉంటుంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలు రికార్డు వసూళ్లను రాబట్టాయి. ముఖ్యంగా కేజీఎఫ్-2 చిత్రం రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్స్‌ను అధిగమించాయి. అయితే పార్ట్-2 హీరో సముద్రంలో మునిగిపోయినట్లు చూపించిన ప్రశాంత్ నీల్ మరణించినట్లు ధ్రువీకరించలేదు. దీంతో కచ్చితంగా పార్ట్-3 ఉంటుందని బలమైన సంకేతాలు వెళ్లాయి. ఇందుకు అనుగుణంగానే తాజాగా KGF మేకర్స్ పార్ట్-3పై ఆశలు కలిగించారు.
KGF-2 సినిమా రిలీజై నేటితో (ఏప్రిల్ 14) ఏడాది పూర్తైన సందర్బంగా మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. సినిమాలోని ప్రతీ పాత్రను తిరిగి గుర్తు చేస్తూ ఆ వీడియో సాగింది. ‘మరపురాని క్యారెక్టర్లు, యాక్షన్ ప్రయాణం అద్భుతంగా సాగింది. ప్రపంచ రికార్డులతో పాటు అనేక హృదయాలను గెలుచుకున్నాం’ అంటూ మేకర్స్ క్యాప్షన్ పెట్టారు. అమ్మకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది.. మరి నెరవేరిందా? అని మూడో పార్ట్‌పై హింట్ ఇచ్చారు. దీనిని మేకర్స్ చేసిన అధికారిక ప్రకటనగా భావించిన నెటిజన్లు #KGF3, #PrashanthNeel హ్యాష్‌ట్యాగ్‌లను తెగ ట్రెండ్ చేస్తున్నారు. కేజీఎఫ్2, సలార్ చిత్రాలను కలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
కేజీఎఫ్2, సలార్ చిత్రాల అనుసంధానంగా కేజీఎఫ్-3 రానుందని ఇప్పటినుంచే నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. ఈ మేరకు తమ అంచనాలను ట్విటర్‌లో పెడుతూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు.
https://twitter.com/hombalefilms/status/1646732589540028416
https://twitter.com/adheeraeditz/status/1646759564300173313
https://twitter.com/VickyOfficia1/status/1646758480051576832
https://twitter.com/SagarPrabhas141/status/1646738776880992256
‘బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది డే’ అంటూ మరికొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. KGF-3 కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.
https://twitter.com/MoviesPlexus/status/1646782407029444608
https://twitter.com/iamaniketL/status/1646781955395182593
https://twitter.com/Movies_Bar/status/1646781802378592257
1978-81 మధ్య రాకీ భాయ్ ఎక్కడ ఉన్నాడని సదరు వీడియోలో మేకర్స్ ఓ ప్రశ్నను వదిలారు. అయితే దానికి సమాధానం పార్ట్-3 వస్తుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. కేజీఎఫ్-3 కూడా ప్రభంజనం సృష్టిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/saloon_kada/status/1646776349733060608
https://twitter.com/imARajput66/status/1646781794988228608
థియేటర్‌లో అద్భుత అనుభూతిని పంచిన సినిమాల్లో కేజీఎఫ్ ఒకటని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. హీరో ఇంట్రో, క్లైమాక్స్ కోసమే మూడు సార్లు సినిమా చూశానని చెప్పుకొచ్చాడు. కేజీఎఫ్-3 కోసం పిచ్చిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.
https://twitter.com/Thalapathy_Bk/status/1646758004715581441
కేజీఎఫ్ 3 అంచనాలకు అందని రీతిలో ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మన ఊహాకు మించి సినిమా ఉండబోతుందని అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/YUVA__YASHCULT/status/1646787256202698752
షారుక్ ఖాన్ రీసెంట్ మూవీ పఠాన్ రికార్డులను KGF3 బద్దలు కొడుతుందని నెటిజన్లు అంటున్నారు. ఒకసారి సినిమా రిలైజ్ అయితే పటాన్ రికార్డ్స్ ఎక్స్‌పైరేనని ట్వీట్లు చేస్తున్నారు.
ఏప్రిల్ 14 , 2023
Shivathmika Rajashekar: సమ్మర్‌లో మరింత హీట్ పెంచుతున్న శివాత్మిక అందాలు
రాజశేఖర్ నట వారసురాలు శివాత్మిక సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తాజాాగా కొన్ని ఫోటోలను షేర్ చేసిన ఈ బామ ఎద అందాలతో రెచ్చిపోయింది.
నడుము, ఎద అందాలను చూపిస్తూ సెల్ఫీలకు ఫోజులు ఇచ్చింది. సినిమాల్లో ట్రెడిషనల్‌గా కనిపించే ఈ భామను హాట్ లుక్స్‌లో చూసి నెటిజన్లు షాకవుతున్నారు.
2019లో దొరసాని చిత్రం ద్వారా శివాత్మిక తెలుగు తెరకు పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయిన శివాత్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.
దొరసానిలో శివాత్మిక నటనకు సైమా అవార్డ్ లభించింది. ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్‌గా పురస్కారం అందుకుంది.
దొరసాని తర్వాత పంచతంత్రం, ఆకాశం చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది శివాత్మిక. అయితే ఆ చిత్రాలు కూడా కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోలేదు.
తాజాగా ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక మెరిసింది. బంగారం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.
గత కొన్ని రోజులుగా శివాత్మిక సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
శివాత్మిక పెట్టిన ఫొటోలను ఆమె ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఆమె అందాలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఏప్రిల్ 04 , 2023
అజిత్ “తెగింపు” సమీక్ష.. ప్రేక్షకులకు నచ్చిందా?
]రేటింగ్: 2.75/5అజిత్ నటన
యాక్షన్ ఎపిసోడ్స్
సందేశంప్లస్ పాయింట్స్‌కథలో బలం లేకపోవడం
రొటీన్ స్క్రీన్ ప్లే
లాజిక్‌లేని సీన్స్
ఫ్లాష్ బ్యాక్మైనస్ పాయింట్స్
ఫిబ్రవరి 13 , 2023
రవీంద్ర జడేజా సతీమణికి MLA టికెట్...ఇంట్లో వదిన,మరదళ్ల పోరు...?
]మూడు దశాబ్దాలుగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి కూడా అక్కడ అధికారం నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఆప్ వారికి గట్టి పోటీనిస్తోంది. ఇలాంటి చోట వదిన, మరదళ్ల పోరులో విజయమెవరిదో చూడాలి.Download Our App
ఫిబ్రవరి 11 , 2023
Hari Hara Veera Mallu: సమ్మర్ బరిలో పవర్‌స్టార్.. ఢీ కొట్టేందుకు సై అంటున్న విజయ్ దేవరకొండ!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లిపోతాయి. అయితే గత కొంతకాలంగా థియేటర్లలో పవన్ ఫ్యాన్స్ హడావుడి తగ్గింది. ఎందుకుంటే బ్రో సినిమా తర్వాత పవన్ నుంచి ఒక్కసినిమా కూడా రాలేదు. రాజకీయాల్లో బిజీగా అవ్వడంతో చేతిలో ఉన్న మూడు బిగ్ ప్రాజెక్టులు కూడా పెండింగ్‌లో పడిపోయాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ తిరిగి సెట్‌లోకి ఎప్పుడు వస్తాడా? ఆయన్ను మళ్లీ తెరపై ఎప్పుడు చూస్తామా? అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. విడుదల తేదీతో కూడిన అదిరిపోయే పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే అదే రోజున విజయ్ దేవరకొండ చిత్రం కూడా బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది.
సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu Release Date) రిలీజ్ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘అన్‌స్టాపబుల్ ఫోర్స్, అన్‌బ్రేకబుల్ స్పిరిట్ మార్చి 28న విడుదల కానుంది’ అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పవన్ కత్తిపైకెత్తి వారియర్‌లా కనిపించారు. ఇది చూసిన పవన్ అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. హరి హర వీరమల్లు సూపర్ హిట్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు స్టార్ హీరో స్టేటస్ ఉన్నప్పటికీ ఆయన నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్ ఇండియా చిత్రం రాలేదు. ‘హరి హర వీరమల్లు’ పవన్‌కు తొలి పాన్ ఇండియా చిత్రం కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్, టీజర్ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ పెస్టిజియస్ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి (Krish) కొంత భాగం తెరకెక్కించగా ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆ చిత్రాల్లోనూ కదలిక!
హరిహర వీరమల్లుతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పవన్ చేతిలో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ సుదీప్‌తో ‘ఓజీ’ (OG), హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు. రాజకీయాల్లో నిమగ్నం కావడంతో హరిహర వీరమల్లుతో పాటు ఆ రెండు చిత్రాల షూటింగ్ కూడా వాయిదా పడ్డాయి. నేటి నుంచి (సెప్టెంబర్ 23) విజయవాడలో హరిహర వీరమల్లు షూట్ తిరిగి ప్రారంభం కావడంతో పెండింగ్ పడ్డ ఆ రెండు చిత్రాలు కూడా త్వరలో పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు పవన్ సైతం ఆ రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా త్వరగా ఫినిష్ చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెటొచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
పవన్ vs విజయ్ దేవరకొండ!
హరి హర వీరమల్లు రిలీజ్ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద పవన్, విజయ్ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్ నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా అదే రోజున హరిహర వీరమల్లు వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు. పవన్ లాంటి బిగ్‌స్టార్‌ను ఢీకొట్టేందుకు తమ హీరో సిద్ధమంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్ చేసే అవకాశం లేకపోదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ నటిస్తున్న 'సికిందర్' చిత్రం పవన్‌కు పోటీగా మారే అవకాశముంది. ఈ చిత్రాన్ని 2025 ఈద్ సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాన్ ఇండియా స్థాయిలో వీరమల్లు వస్తుండటంతో నార్త్‌లో ప్రభావం చూపించవచ్చు.
సెప్టెంబర్ 23 , 2024
Salaar 2: ‘గేమ్స్ ఆఫ్ థ్రోన్స్’ను తలదన్నేలా ‘సలార్ 2’.. ప్రభాస్ షూట్‌లో పాల్గొనేది అప్పుడే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బాస్టర్ చిత్రం సలార్ పార్ట్ -1; సీజ్ ఫైర్' (Salaar: Part 1 Ceasefire). గతేడాది క్రిస్‌మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నిర్మాతలపై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సలార్ 2: శౌర్యంగ పర్వం’ (Salaar 2- Shouryanga Parvam) కూడా రానుందని తొలి పార్ట్ క్రైమాక్స్‌లోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. దీంతో రెండో భాగంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మెుదలవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్ 2’కి సంబంధించి ఒకేసారి రెండు అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వరదరాజ మన్నార్ స్పెషల్ ఎపిసోడ్
'సలార్ 2' సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుందని నటుడు బాబీ సింహా ఇటీవల ఓ ఇంటర్యూలో ప్రకటించాడు. తాజాగా కేరళ నటుడు పృథ్వీరాజ్ సుకుమాన్ (Prithviraj Sukumaran) కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘటించాడు. సలార్‌లో ప్రభాస్ స్నేహితుడిగా వరద రాజమన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ అదరగొట్టాడు. తాజాగా 'ది గోట్ లైఫ్' (The Goat Life) మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న పృథ్వీరాజ్ త్వరలోనే 'సలార్ 2' షూట్ మెుదలవుతుందని చెప్పాడు. ముందుగా వరదరాజమన్నార్ పాత్రకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తారని స్పష్టం చేశాడు. అయితే ఈ స్పెషల్ ఎపిసోడ్‌లోనే వరదరాజ మన్నార్ గ్రాఫ్ చూపిస్తారని అంటున్నారు.
సెట్‌లోకి ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే!
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)తో వరదరాజ మన్నార్ ఎపిసోడ్ పూర్తయ్యాక.. నటుడు బాబీ సింహా (Bobby Simha), శ్రియా రెడ్డి (Sriya Reddy), జగపతిబాబు (Jagapathi Babu)లపై కీలక సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ రెండు షెడ్యూల్స్ పూర్తైన తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సెట్‌లోకి అడుగుపెడతారని సమాచారం. ఈ మూవీ మూడో షెడ్యూల్ నుంచి ప్రభాస్ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 'సలార్ 2' స్క్రిప్ట్‌పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లా ‘సలార్ 2’..!
తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ‘సలార్ 2’ నిర్మాత విజయ్ కిరగందూర్ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ తర్వాత నుంచి ఈ సినిమా పార్ట్-2 షూటింగ్ ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2025లో సినిమా రిలీజ్ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రముఖ హాలీవుడ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లా సలార్ పార్ట్ 2 ఉండనుందని ఆయన తెలిపారు. నిర్మాత వ్యాఖ్యలతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ‘సలార్ 2’.. తొలి భాగానికి మించి విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు.
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్ బిజీ బిజీ..
ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి’ (Kalki 2898 AD), ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రాల షూటింగ్‌తో తీరిక లేకుండా గడుపుతున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ (Spirit)ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇంత బిజీలో ప్రభాస్ ‘సలార్-2’కు ఎలా డేట్లు కేటాయించి వచ్చే ఏడాది సినిమా రిలీజయ్యేలా చూస్తాడో చూడాలి మరి.
మార్చి 12 , 2024
Salaar English On Netflix: గ్లోబల్ స్థాయికి ‘సలార్’ క్రేజ్.. ఇక రికార్డుల మోతే!
ప్రభాస్ (Prabhas) హీరోగా కేజీఎఫ్ (KGF) ఫేమ్ ప్రశాంత్‌నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్’. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన సలార్.. టాప్-10 మూవీస్‌లో ఒకటిగా ట్రెండ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చిన సలార్.. తాజాగా గ్లోబల్ లాంగ్వేజ్ (Salaar English On Netflix) లోనూ అందుబాటులోకి వచ్చింది.
గ్లోబల్ రేంజ్‌కు ‘సలార్’..!
సలార్ ఇంగ్లీష్ వెర్షన్‍ను నెట్‍ఫ్లిక్స్ తాజాగా (ఫిబ్రవరి 5) అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘భారీ డిమాండ్ల నేపథ్యంలో గ్లోబల్ ఆడియన్స్ కోసం సలార్‌ను ఇంగ్లీష్ వెర్షన్‌లోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఎట్టకేలకు ఇంగ్లిష్ వెర్షన్‍ను నెట్‍ఫ్లిక్స్ (Salaar English On Netflix) తీసుకురావటంతో గ్లోబల్ రేంజ్‍లో సలార్ మరింత దుమ్మురేపే అవకాశం ఉంది. చాలా దేశాల్లో సలార్ మరింత ట్రెండ్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మరోమారు ప్రభాస్ పేరు మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇంగ్లీష్ వెర్షన్ వైరల్..
సలార్ చిత్రం ఇంగ్లీష్‌లో ప్రసారం అవుతుండటంతో ఈ మూవీలోని హైలెట్ సీన్స్ నెట్టింట వైరల్‌గా అవుతున్నాయి. ఆంగ్ల వెర్షన్‌లో ఉన్న ఈ సీన్లను ప్రభాస్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. #SalaarEnglishOnNetflix హ్యాష్‌ట్యాగ్‌తో అవి ట్రెండ్ అవుతున్నాయి. అయితే సలార్ సినిమా ఇంగ్లీష్ వెర్షన్‍లోకి రాకముందే గ్లోబల్ రేంజ్‍లో దుమ్మురేపింది. ఇంగ్లీష్ సబ్‍టైటిల్స్‌తో చాలా దేశాల్లోని ప్రజలు ఈ మూవీని చూసేశారు. అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ‘సలార్ గోస్ గ్లోబల్’ అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం విశేషం.
https://twitter.com/i/status/1754413397377253645
మరి హిందీలో ఎప్పుడు!
ఇక సలార్ హిందీ వెర్షన్ మాత్రం (Salaar English On Netflix) ఇప్పటి వరకు నెట్‍ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రాలేదు. ఈ విషయంపై సదరు స్ట్రీమింగ్ వర్గాలు అప్‍డేట్ కూడా ఇవ్వలేదు. సినిమా విడుదల తేదీ నుంచి ఓటీటీలోకి రావడానికి 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉండడం వల్లే హిందీ వెర్షన్ ఆలస్యమవుతోందని సమాచారం. అయితే మార్చిలో సలార్ హిందీ వెర్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే నెట్‍ఫ్లిక్స్ అధికారిక ప్రకటన కూడా చేయనుందని వార్తలు వస్తున్నాయి.
https://twitter.com/i/status/1754424769397838125
షారుక్‌ను ఢీకొట్టి నిలబడ్డ ప్రభాస్!
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన డంకీ (Dunki), సలార్ (Salaar) చిత్రాలు గతేడాది డిసెంబర్‌లో బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయి. అయితే సలార్ చిత్రమే కలెక్షన్లలో దుమ్మురేపింది. షారుక్ మూవీని వెనక్కి నెట్టి.. సలార్ అదరగొట్టింది. దీంతో ఉత్తరాదిలో ప్రభాస్‍కు ఉన్న విపరీతమైన క్రేజ్ మరోసారి రుజువైంది. హిందీలో సలార్ చిత్రానికి సుమారు రూ.170 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
https://twitter.com/i/status/1754426944857481621
సలార్ 2 షూటింగ్ ఎప్పుడంటే?
సలార్ సినిమాకు సీక్వెల్ (Salaar Part 2: Shouryaanga Parvam) కూడా రానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీక్వెల్ షూటింగ్ ఈ సమ్మర్‌లోనే మొదలు కానుందట. ఇందుకోసం ప్రభాస్ 2 నెలల డేట్స్ కూడా ఇచ్చేసినట్లు సమాచారం. సమ్మర్‌లో షూటింగ్ ప్రారంభించి డిసెంబర్ 22న సలార్ రెండో భాగాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందట. దీనికి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి.
https://twitter.com/i/status/1754457149055565894
ఫిబ్రవరి 06 , 2024
Salaar Teaser: సస్పెన్స్‌కు తెర… KGFతో ఉన్న లింక్‌ను బయట పెట్టిన సలార్ టీజర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సలార్ టీజర్ వచ్చేసింది. తెల్లవారుజామున చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. ప్రభాస్ మూవీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలను టీజర్‌లో పుష్కలంగా చూపించారు. దీనిని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే సలార్ టీజర్‌లో కనిపించిన అంశాలు ఇప్పటి వరకు అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నలకు అయితే క్లారిటీ ఇచ్చింది. టీజర్ చివర్లో పార్ట్-1 సీజ్ ఫైర్ అని పేర్కొన్నారు. అంటే సలార్ సినిమా రెండు భాగాల్లో తెరకెక్కనున్నట్లు అర్థం చేసుకోవచ్చు. సినిమా విజయాన్ని బట్టి మూడో పార్ట్‌ను కూడా ప్రశాంత్ నీల్ చిత్రీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం సలార్ మూవీ రెండు పార్ట్స్‌గా తెరకెక్కే విషయంలో క్లారిటీ వచ్చింది.
కేజీఎఫ్‌తో సలార్ లింక్
సలార్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కేజీఎఫ్ 2తో లింక్ ఉంటుందని చాలా మంది భావించారు. ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ టీజర్‌లో కొన్ని సీన్లు కనిపించాయి. టీజర్‌లో టిన్ను ఆనంద్ చెప్పిన డైలాగ్‌లో "లయన్, చీతా, టైగర్, ఎలిఫాంట్ వెరీ డేంజరస్.. అయితే జూరాసిక్ పార్క్‌లో కాదు. ఎందుకంటే.. ఆ పార్క్‌లో సలార్ నివసిస్తాడు” అనే అర్థం వచ్చేలా బ్యాక్‌గ్రౌండ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చూపించారు. అయితే జురాసిక్ పార్క్ అనే సినిమా 1993లో విడుదలయ్యింది. సలార్ బ్యాక్ డ్రాప్ 1990టైం నుంచి జరిగిందని ఊహించవచ్చు. కేజీఎఫ్ (KGF) 1980 సమయంలో జరిగింది. దీంతో సలార్‌ను కేజీఎఫ్‌తో లింక్ చేసే విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతోంది. కేజీయఫ్ తర్వాత సలార్ స్టోరీ చెప్పాలి కనుక ఈ విధంగా డైలాగ్స్ పేర్చి ఉండొచ్చు.
అలాగే కేజీఎఫ్ 2లో రాకీ భాయ్ ఆర్మీలో 'సలార్'( ఈశ్వరీ రావు) కొడుకు జాయిన్ అవుతాడు. కానీ అతను అధీరా (సంజయ్ దత్)తో పొరాడే క్రమంలో సలార్ గాయపడినట్లు చూపిస్తారు. ఆ తర్వాత అతను ఇక సినిమాలో కనిపించడు. ఆ యువకుడే సలార్( ప్రభాస్) అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే టీజర్‌లో సలార్ ఎవరనే దానిపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.
ఫ్యాన్స్ రచ్చ రచ్చ
మొత్తానికి సలార్ టీజర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. గ్యాంగ్ స్టర్ పాత్రకు ప్రభాస్‌కు మించిన కటౌట్ మరే ఏ హీరోకు నప్పదని కామెంట్లు చేస్తున్నారు. టీజర్ స్టార్టింగ్‌లో ప్రభాస్ ఇంట్రడక్షన్‌కు ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చారు. ప్రభాస్ ఫేస్ ఎక్కడా చూపించకపోయినా.. ఆయన చేస్తున్న యాక్షన్ సీన్లు, ఫర్పామెన్స్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఈ సందర్భంగా మిర్చి సినిమాలోని 'కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్' అంటూ డైలాగ్‌లు కొడుతున్నారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ టేకింగ్‌లో డార్లింగ్ ప్రభాస్ మరింత మాస్‌గా కనిపించారని ఊదరగొడుతున్నారు. అభిమానులుగా రెబల్ స్టార్ నుంచి కోరుకున్న ప్రతి అంశం టీజర్‌లో కనిపించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సలార్ టీజర్ ఉదయాన్నే మంచి కిక్ ఇచ్చిందని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
సలార్‌తో నడిచేది వీరే..
ఇక సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు సహా హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు యాక్ట్ చేస్తున్నారు. విలక్షణ నటుడు జగపతి బాబు రాజమన్నార్ పాత్రలో కనిపించనున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ రోల్‌లో నటిస్తున్నారు. కేజీఎఫ్, కాంతారా వంటి హిట్ చిత్రాలను నిర్మించి హోంబలే ఫిలిమ్స్.. సలార్ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. సలార్ చిత్రం రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోంది.
https://www.youtube.com/watch?v=bUR_FKt7Iso
జూలై 06 , 2023