• TFIDB EN
  • సామాన్యుడు
    UATelugu2h 46m
    పోలీస్ ఉద్యోగం సాధించాలనే కల ఉన్న పోరస్ జీవితం తన సోదరి మరణం తర్వాత తలక్రిందులుగా మారుతుంది. తన సోదరి మరణం వెనుక ఉన్న మిస్టరీని కనుగోనేందుకు వెళ్లినప్పుడు అనేక చీకటి కోణాలు వెలుగు చూస్తాయి.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    విశాల్
    డింపుల్ హయాతీ
    రవీనా రవి
    బాబురాజ్
    యోగి బాబు
    జి. మరిముత్తు
    KSG వెంకటేష్
    విఐఎస్ జయపాలన్
    బిల్లీ మురళీ
    అఖిలన్ ఎస్. పుష్పరాజ్
    నవీన్ క్రుభాకర్ AU
    RNR మనోహర్
    ఎలాంగో కుమారవేల్
    కవితా భారతి
    వజక్కు ఎన్ ముత్తురామన్
    తులసి
    రాజా చెంబోలు
    జార్జ్ మేరియన్
    సిబ్బంది
    థు ప శరవణన్దర్శకుడు
    విశాల్
    నిర్మాత
    మహ్మద్ జుబేర్నిర్మాత
    రజిక్ అహమ్మద్నిర్మాత
    యువన్ శంకర్ రాజా
    సంగీతకారుడు
    NB శ్రీకాంత్
    ఎడిటర్
    కథనాలు
    హయాతి అందాలు.. కనుల విందు
    హయాతి అందాలు.. కనుల విందు
    ]విశాల్ సరసన సామాన్యుడు సినిమాలో నటించింది
    అక్టోబర్ 21 , 2022
    Dimple Hayati: ‘రామబాణం’లోనూ తగ్గని డింపుల్ అందాల తెగింపు 
    Dimple Hayati: ‘రామబాణం’లోనూ తగ్గని డింపుల్ అందాల తెగింపు 
    ‘ఖిలాడీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది తెలుగు గర్ల్ డింపుల్ హయతి. కెరీర్‌లో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకెళ్తోంది. నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల వైపు అడుగు పెట్టిన ఈ అమ్మాయి ‘రామబాణం’తో దూసుకొస్తోంది. మే 5న ఈ చిత్రం విడుదల కానుంది.  డింపుల్ హయతి పుట్టి పెరిగింది తెలుగు రాష్ట్రాల్లోనూ. విజయవాడలో డింపుల్ జన్మించింది. హైదరాబాద్‌లో పెరిగింది. తన ఫ్యామిలీలో అంతా నటులు, నృత్యకారులే అంటూ గతంలో చెప్పుకొచ్చింది. గల్ఫ్ చిత్రంతో 16వ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. వాస్తవానికి తొలుత ‘డింపుల్’ అని మాత్రమే పేరుండేది. ఆ తర్వాత మరీ చిన్నగా ఉందని న్యూమరాలజీని అనుసరించి డింపుల్ హయతిగా మార్చుకుంది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తెలుగులో గల్ఫ్, విశాల్ సామాన్యుడు, ఖిలాడీ, రామబాణం చిత్రాల్లో మెరిసిందీ బ్యూటీ.  కెరీర్‌లో డింపుల్ హయతి ఒకానొక సమయంలో డిప్రెషన్‌కు వెళ్లిందట. ఓ పెద్ద సినిమాలో హీరోయిన్‌గా చేసిందట. కానీ, 90శాతం షూటింగ్ పూర్తి కాగానే సినిమా ఆగిపోయింది. ఈ క్రమంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ ఆఫర్‌ని కూడా వదులుకున్నట్లు డింపుల్ తెలిపింది.  బడా మూవీ ఆగిపోవడంతో డింపుల్ డిప్రెషన్‌కి వెళ్లింది. ఈ విషయం ‘గద్దలకొండ గణేశ్’ డైరెక్టర్ హరీశ్ శంకర్‌కి తెలియగా ఐటం సాంగ్‌లో ఆడిపాడే అవకాశం కల్పించాడు. అనూహ్యంగా ఈ ‘జరా జరా’ సాంగ్‌ డింపుల్ కెరీర్‌ను మలుపు తిప్పింది.  ఈ సాంగ్ హిట్ కావడంతో వరుసగా అవే ఆఫర్లు వచ్చాయట. కానీ, నటనా ప్రాధాన్యమున్న సినిమాలు చేయాలని భావించి వీటికి డింపుల్ నో చెప్పిందట. అలా ట్రై చేస్తూ ఉండగా రవితేజ ‘ఖిలాడీ’ ఆఫర్ వచ్చిందట.  ఖిలాడీ చేస్తుండగానే రామబాణం సినిమాకు సైన్ చేసిందీ బ్యూటీ. అలా ఈ సినిమాలో భైరవీగా నటించింది. ఇందులో వ్లాగర్‌‌గా కనిపించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏమీ సిద్ధమవలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.  డింపుల్ హయతి స్కిన్ టోన్ కారణంగా చాలా అవకాశాలు మిస్సయ్యాయట. ఎదురుగా చెప్పకున్నా, తాను వెళ్లిపోయాక నలుపు రంగులో ఉందంటూ రిజెక్ట్ చేసేవారని గుర్తు చేసుకొనేది. కానీ, ఇప్పుడు ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం సానుకూల పరిణామమని అభిప్రాయపడింది.  హిందీలో ‘అత్రాంగి రే’ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. పరభాషా చిత్రాలు మరిన్ని చేయాలని డింపుల్ అనుకుంటోందట.  డింపుల్‌కి ఓ పెంపుడు శునకం ఉంది. వాడి పేరు భగీరథ్. తన ఇన్‌స్టాగ్రాంలో తరచూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఫిట్‌నెస్‌కు ప్రియారిటీ ఇస్తుంది. ఆరోగ్యకరమైన ఫుడ్‌ని తీసుకోవడానికి ఇష్టపడుతుంది.  ఇన్‌స్టాలో డింపుల్‌కి 6.5లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఓ తెలుగు, తమిళ సినిమాలకు ఓకే చెప్పిందీ బ్యూటీ. 
    మే 01 , 2023
    <strong>Chiru Odela: చిరు - ఓదెల మూవీ స్టోరీ ఇదేనా .. డైరెక్టర్‌కు ఫ్యాన్స్‌ కండీషన్స్</strong>
    Chiru Odela: చిరు - ఓదెల మూవీ స్టోరీ ఇదేనా .. డైరెక్టర్‌కు ఫ్యాన్స్‌ కండీషన్స్
    మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) కొత్త ప్రాజెక్ట్‌ ఖరారైంది. తొలి చిత్రం 'దసరా'తో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన యంగ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) ఈ సినిమా (Chiru Odela) ను డైరెక్ట్‌ చేయనున్నారు. యంగ్‌ హీరో నాని ఈ చిత్రాన్ని సమర్పించనున్నట్లు మూవీ యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్‌ చేసిన ప్రీ లుక్‌ పోస్టర్‌లో నెత్తురోడుతున్న చిరు చేతిని చూపించారు. దీంతో ఈ సినిమా చాలా వైలెంట్‌గా ఉండబోతుందని మేకర్స్‌ చెప్పకనే చెప్పారు. కమ్‌ బ్యాక్‌ తర్వాత చిరంజీవి నటించనున్న మోస్ట్‌ వైలెంట్ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు మెుదలయ్యాయి. స్టోరీని కూడా ముందే ప్రిడిక్ట్‌ చేసేస్తున్నారు. ఈ మూవీ ఏ స్థాయిలో ఉండాలో ముందుగానే ఫ్యాన్స్‌ సలహాలు ఇస్తున్నారు.&nbsp; చిరు - ఓదెల స్టోరీ ఇదే! మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల చిత్రాని (Chiru Odela)కి సంబంధించిన ప్రీలుక్‌ పోస్టులో ఆసక్తికర లైన్‌ను చిత్ర బృందం రాసుకొచ్చింది. 'అతడు హింసలో తన శాంతిని వెతుక్కుంటున్నాడు' అని ఆసక్తికర క్యాప్షన్‌ పెట్టింది. దీన్ని బట్టి చూస్తే ఇదో బిగ్‌ రివేంజ్‌ స్టోరీగా కనిపిస్తోంది. తనకు అన్యాయం చేసిన వారిపై మెగాస్టార్‌ చిరు కొదమసింహంలాగా ఈ సినిమాలో విరుచుకుపడతాడని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. తన ఫ్యామిలీ లేదా సమూహం లేదా ప్రజలకు జరిగిన దారుణాలను చూసి కన్నెర్ర చేసిన ఓ సామాన్యుడు ఎలాంటి హింసాత్మక దారిని ఎంచుకున్నాడు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రావొచ్చని నెటిజన్లతో పాటు ఫిల్మ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp; https://twitter.com/odela_srikanth/status/1864157520920817831 https://twitter.com/AlwaysRamCharan/status/1864173106480202135 ఫ్యాన్స్‌ ఏమంటున్నారంటే మెగాస్టార్‌ చిరంజీవి కమ్‌ బ్యాక్‌ తర్వాత అతడి స్థాయికి తగ్గ సక్సెస్‌ రాలేదు. ‘ఖైదీ నంబర్‌ 150’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఇండస్ట్రీ హిట్‌గా నిలవలేదు. ఈ నేపథ్యంలో చిరు-ఓదెల ప్రాజెక్ట్‌ ఊరమాస్‌ వైలెన్స్‌తో రానుండటంతో ఒక్కసారిగా మెగా ఆడియన్స్‌ దృష్టి దీనిపై పడింది. చిరు కెరీర్‌లో బిగ్గెస్ట్ మాస్‌ చిత్రాలుగా నిలిచిన ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘ముఠామేస్త్రీ’, ‘ఇంద్ర’ సరసన ఈ ప్రాజెక్ట్‌ నిలబడాలని కోరుకుంటున్నారు. చిరు బిగ్‌బాస్‌ చిత్రంలోని రగ్‌డ్‌ లుక్‌ షేర్ చేస్తూ ఆ విధంగా మెగాస్టార్‌ను మేకోవర్‌ చేయాలని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో వింటేజ్ చిరును మళ్లీ తీసుకురావాలని ఓదెలాకు విజ్ఞప్తి&nbsp; చేస్తున్నారు. 'దుమ్ము లేచిపోవాలి అన్న' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాంగ్స్‌, డ్యాన్స్‌, కామెడీ పక్కన పెట్టి కంటెంట్‌పై దృష్టి సారించాలని కోరుతున్నారు. తమ నమ్మకాన్ని నిలబెట్టి బెస్ట్‌ మూవీ ఇవ్వాలని సూచిస్తున్నారు.&nbsp; https://twitter.com/JohnWick_fb/status/1864188176165654619 చిరంజీవి స్ఫూర్తితో.. మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ బిగ్ ఫ్లాట్‌ఫామ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. ఈ జనరేషన్‌ హీరోలు, డైరెక్టర్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు ఆయనే స్ఫూర్తి. ఈ విషయం పలు సందర్భాల్లో వ్యక్తమైంది కూడా. చిరు తాజా ప్రాజెక్ట్‌ను నిర్మించనున్న యంగ్‌ హీరో నాని కూడా చిరుకి బిగ్‌ ఫ్యాన్‌. చిరు స్ఫూర్తితోనే తాను పెరిగానని, ఆయన సినిమా టికెట్ల కోసం గంటల తరబడి లైన్లలో నిల్చున్నానని ప్రీ లుక్‌ పోస్టర్‌ను షేర్‌ చేస్తూ నాని పేర్కొన్నాడు. అటువంటి చిరంజీవి చిత్రాన్ని సమర్పిస్తున్నందుకు తన జీవితం పరిపూర్ణమైందని చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించనున్నారు. ఇది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే 'ది ప్యారడైజ్‌' అనే సినిమాలో నటిస్తున్నాడు. https://twitter.com/NameisNani/status/1863954922926137824 2025 సమ్మర్‌ బరిలో.. ప్రస్తుతం చిరంజీవి - వశిష్ట కాంబోలో ‘విశ్వంభర’ (Viswambhara) రూపొందుతోంది. ఈ చిత్రం 2025 సమ్మర్‌లో రానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కావాలి. జనవరి 10న రాబోతున్నట్లు గతంలోనే విశ్వంభర టీమ్ అనౌన్స్ చేసింది. అయితే తనయుడు రామ్‌ చరణ్‌ (Ram Charan) నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) కోసం చిరు వెనక్కి తగ్గారు. దీంతో గేమ్‌ ఛేంజర్‌ సంక్రాంతి బరిలో నిలవగా ‘విశ్వంభర’ సమ్మర్‌కు పోస్టుపోన్‌ అయింది. 2025 మే (Viswambhara Release Date)లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో చిరు నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది.
    డిసెంబర్ 04 , 2024
    Dimple Hayathi vs DCP: ఐపీఎస్ కారును తన్ని డింపుల్ వీరంగం.. గొడవకు కారణం ఇదే!
    Dimple Hayathi vs DCP: ఐపీఎస్ కారును తన్ని డింపుల్ వీరంగం.. గొడవకు కారణం ఇదే!
    ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయాతి వివాదంలో చిక్కుకుంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై దాడి కేసులో ఆమెపై జూబ్లీ హిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాహుల్ హెగ్డే, డింపుల్ హయాతి ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయమై వీరి మధ్య తరచూ గొడవ జరుగుతున్నట్లు సమాచారం. డీసీపీ రాహల్ ఏమన్నారంటే.. కాగా, డింపుల్ హయాతిపై నమోదైన కేసుపై&nbsp; ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే స్పందించారు. తనకు హీరోయిన్ డింపుల్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు.&nbsp; పార్కింగ్ స్థలంలో కారు తీసెటప్పుడు ఆమె కారు అడ్డుగా ఉండటంతో ఓసారి తాను డింపుల్‌ను రిక్వెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తుండటం వల్ల ఎమర్జెన్సీ పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.&nbsp; ఈరోజు కూడా ఓ ఎమర్జెన్సీ పనిపై వెళ్లే క్రమంలో అడ్డుగా ఉన్న డింపుల్‌ కారును తీయాలని&nbsp; డ్రైవర్&nbsp; రిక్వెస్ట్‌ చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ క్రమంలో పోలీస్ కారును గుద్దడంతో పాటు కాలుతో తన్నిందని అది సీసీటీవీలో కూడా రికార్డైందని పేర్కొన్నారు. దీంతో తన డ్రైవర్‌ డింపుల్‌పై కేసు పెట్టినట్లు వివరించారు.&nbsp; డింపుల్ రియాక్షన్ తాజా వివాదంపై డింపుల్ హయాతి కూడా రియాక్ట్ అయింది. ‘అధికారాన్ని ఉపయోగించడం వల్ల ఏ తప్పు ఆగదు, అధికార దుర్వినియోగం తప్పులను దాచదు’ అంటూ ట్వీట్ చేసింది. ఎప్పటికీ సత్యమే గెలుస్తుందని హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చింది.&nbsp; https://twitter.com/DimpleHayathi/status/1660877913200406529 https://twitter.com/DimpleHayathi/status/1660863210436583424 డింపుల్ కోపానికి కారణం ఇది! తాజా వివాదం నేపథ్యంలో డీసీపీ రాహుల్ హెగ్డే, డింపుల్ మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత వారం రోజులుగా డింపుల్&nbsp; కారుపై ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తున్నట్లు తెలిసింది. ట్రాఫిక్‌ డీసీపీతో తలెత్తిన వివాదం వల్లే తన కారుకు అధికంగా చలాన్లు పడుతున్నట్లు డింపుల్‌ హయాతి భావించింది. ఈ నేపథ్యంలో తన ఫ్రస్టేషన్‌ అంతా రాహుల్‌ హెగ్డే కారుపై చూపించినట్లు తెలుస్తోంది.&nbsp; డింపుల్ హయాతి 2017లో 'గల్ఫ్' సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో ‘యురేక’ సినిమాలో ఆమె నటించింది. అభినేత్రి 2 సినిమాలో తన నటనతో డింపుల్ ఆకట్టుకుంది. గద్దల కొండ గణేష్‌ చిత్రంలో జర్ర జర్ర పాటలో స్టెప్పులేసి తెలుగు యువతను అలరించింది. ఆ తర్వాత ‘సామాన్యుడు’, ‘ఖిలాడి’ సినిమాలతో డింపుల్‌ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల రిలీజైన ‘రామబాణం’ లోనూ డింపుల్ హీరోయిన్‌గా చేసింది.&nbsp;
    మే 23 , 2023
    <strong>LipLock Scenes In Telugu Movies: టాలీవుడ్‌ హీరోయిన్‌ల హాట్‌ లిప్‌లాక్‌ సీన్స్‌.. ఇవి చాలా హూట్‌ గురూ!&nbsp;&nbsp;</strong>
    LipLock Scenes In Telugu Movies: టాలీవుడ్‌ హీరోయిన్‌ల హాట్‌ లిప్‌లాక్‌ సీన్స్‌.. ఇవి చాలా హూట్‌ గురూ!&nbsp;&nbsp;
    సినిమాల్లో లిప్‌లాక్‌ సీన్లకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఒక పాత్ర మరో పాత్రపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో ఈ ముద్దు సన్నివేశాలు వస్తుంటాయి. అయితే ఒకప్పుడు లిప్‌లాక్‌ సీన్ అంటే ఒక సెన్సేషన్‌. కానీ ప్రస్తుత సినిమాల్లో అవి కామన్‌గా మారిపోయాయి. కథ, సిట్చ్యూయేషన్‌ డిమాండ్‌ చేస్తే లిప్‌ లాక్‌ సీన్లకు రెడీ అంటూ పలువురు స్టార్ హీరోయిన్స్‌ బహిరంగంగానే ప్రకటించారు. ఆ మాటలకు కట్టుబడి ముద్దు సన్నివేశాల్లో నటించారు కూడా. టాలీవుడ్‌లో ముద్దు సీన్లలో నటించిన స్టార్‌ హీరోయిన్స్ ఎవరు? ఏ సినిమాల్లో చేశారు? ఇప్పుడు చూద్దాం.&nbsp; [toc] సమంత (Samantha) ‘ఏమాయ చేశావే’ చిత్రంతో నటి సమంత హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అందులో నాగచైతన్య ప్రేయసి పాత్రలో ఆమె అద్భుతమైన నటన కనబరిచింది. వీరిద్దరి మధ్య వచ్చే కిస్‌ సీన్స్ అప్పట్లో యూత్‌ను కట్టిపడేశాయి. ముఖ్యంగా చైతు, సమంత మధ్య వచ్చే ట్రైన్‌ సీన్‌లో వారిద్దరు లిప్‌కిస్‌లతో రెచ్చిపోయారు. ఇటీవల విజయ్‌ దేవరకొండతో చేసిన ‘ఖుషీ’ చిత్రంలోనూ సమంత లిప్‌లాక్‌ సీన్‌లో నటించింది.&nbsp; https://youtu.be/f1felGoecKE?si=pVGUjkN0VAIctHJg https://youtu.be/0oD68xOTg3Q?si=wGwFqNyNrGrzJBSS కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) మహేష్‌ బాబుతో కాజల్‌ ఓ లిప్‌లాక్‌ సీన్‌ చేసింది. ‘బిజినెస్‌ మ్యాన్‌’ చిత్రంలోని ‘చందమామ నవ్వే’ సాంగ్‌లో కాజల్ పెదాలపై మహేష్‌ కిస్‌ చేస్తాడు. ఈ సీన్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలోనూ మహేష్‌తో ఓ లిప్‌లాక్‌ సీన్‌ కాజల్‌ చేసింది. అలాగే ‘ఆర్య 2’లో బన్నీతో కలిసి లిఫ్ట్‌లో ముద్దుసీనులో నటించింది.&nbsp; https://youtu.be/uGsFI3FmhnI?si=NO5P0FFGoh7S5W4n https://youtu.be/5Hi1Ss8blKo?si=4TVKPCplYiPEBi8q నయనతార (Nayanthara) ‘వల్లభ’ చిత్రంలో నటుడు శింభుతో కలిసి నయనతార రెచ్చిపోయింది. లిప్‌కిస్‌ సీన్లను ఏ మాత్రం బెరుకు లేకుండా చేసింది. అప్పట్లో వారిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ముద్దు సీన్లలో మెుహమాటపడలేదని సమాచారం.&nbsp; https://youtu.be/GYn1g47mFZc?si=16ytg37esqYLiSsW రష్మిక మందన్న (Rashmika Mandanna) నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న సైతం రెండు చిత్రాల్లో అదర చుంబనం చేసింది. డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో విజయ్‌ దేవరకొండతో ముద్దు సీన్లలో నటించింది. అలాగే ఇటీవల వచ్చిన ‘యానిమల్‌’ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌తో రెచ్చిపోయింది.&nbsp; https://youtu.be/TSyLvBis830?si=OKi8o_8mIJGrU5dE https://youtu.be/Ma8GcZXvKeM?si=NfAYyztDJ4AtkNZj నేహా శెట్టి (Neha Shetty) యంగ్‌ బ్యూటీ నేహా శెట్టి డీజే టిల్లు చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి కొన్ని రొమాంటిక్ సీన్స్‌ చేసింది. ముఖ్యంగా ఓ పాట చివర్లో సిద్ధూకు డీప్‌ కిస్ ఇచ్చి మతి పోగొట్టింది. అలాగే ఇటీవల వచ్చిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రంలోని ఓ పాటలో విశ్వక్‌ సేన్‌ పెదాలను తాకిస్తూ ముద్దు పెట్టింది. https://youtu.be/DzegLt5UZuM?si=x8QPhZlMXzjCkUfe https://youtu.be/GpcIMmvdY9A?si=RUvpds4l1NcH9zYz రుహానీ శర్మ (Ruhani Sharma) 'ఆగ్రా' మూవీలో రుహానీ శర్మ కొన్ని శృంగార సన్నివేశాల్లో మితిమీరిపోయి నటించింది. రొమాన్స్ చేస్తూ, హావభావాల చూపిస్తూ పచ్చిగా కనిపించింది. తెలుగు సినిమాల్లో పద్దతిగా నటించిన రుహానీని అగ్రా చిత్రంలో అలా చూసి సినీ లవర్స్ షాకయ్యారు. అలాగే ‘దిల్‌సే దిల్‌’ వీడియో సాంగ్‌లోనూ లిప్‌లాక్‌ సీన్‌లో ఆమె కనిపించింది. థియేటర్‌లో వచ్చే ముద్దు సీనులో ఆమె నటించింది. https://youtu.be/ooCxCQh1dcI?si=-3Ifodd842oG9k5k కేతిక శర్మ (Ketika Sharma) యంగ్‌ బ్యూటీ కేతిక శర్మ తన ఫస్ట్‌ ఫిల్మ్ ‘రొమాంటిక్‌’ మూవీలో ముద్దు సీన్లతో మైమరపించింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరితో బస్‌లో ముద్దుల ప్రయాణం చేసింది. అలాగే ‘రంగ రంగ వైభవంగా’ మూవీలో పంజా వైష్ణవ్‌ తేజ్‌తోనూ లిప్‌లాక్‌ సీన్‌లో నటించింది.&nbsp; https://youtu.be/vXjWi6UQDMk?si=PUQ99x3oWOqQ7Ec7 https://youtu.be/tCc3R96puEI?si=LJeyKB98VHuCCeri డింపుల్‌ హయాతి (Dimple Hayathi) విశాల్‌తో చేసిన ‘సామాన్యుడు’ చిత్రంలో హీరోయిన్‌ డింపుల్‌ హయాతి లిప్‌లాక్‌ సీన్‌లో చేసింది. థియేటర్‌లో హీరో విశాల్‌ పెదాలపై ఎంతో క్యూట్‌గా ముద్దు పెట్టింది. అలాగే రవితేజ ‘కిలాడీ’ సినిమాలో బికినీలో కనిపించడంతో పాటు ఘాటు ముద్దు సీన్లు సైతం చేసింది.&nbsp; https://youtu.be/72xq28fxAj4?si=Vlm0s1dAnS2nIK1M https://youtu.be/LWOj-SxqES4?si=CTGBapB7zFw0giPF మాళవిక మోహన్‌ (Malavika Mohanan) మలయాళ నటి మాళవిక మోహన్‌ 'యుధ్రా' సినిమాతో ఇటీవల బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హీరో సిద్ధాంత్‌ ఛతుర్వేదితో కలిసి బోల్డ్‌ సీన్స్‌లో నటించింది. గతంలో ఈ స్థాయి రొమాన్స్ మాళవిక చేయలేదు. ముఖ్యంగా స్విమ్మింగ్‌ పూల్‌ సీన్‌లో ముద్దులతో విరుచుకుపడింది.&nbsp; https://youtu.be/QpWysxpVgkg?si=dmIpGe-s9c1qXLpK https://youtu.be/apzjoosKrHM?si=61ea0jQcIRmwX7d1 తృప్తి దిమ్రి (Tripti Dimri) బాలీవుడ్‌ భామ తృప్తి దిమ్రీ పేరు ‘యానిమల్‌’ చిత్రంతో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ఆమె ఇంటిమేట్‌ సీన్‌లో నటించింది. ఘాటైన లిప్‌లాక్‌తో కవ్వించింది. అలాగే ఇటీవల హిందీలో వచ్చిన ‘బ్యాడ్‌ న్యూస్‌’ సినిమాలోనూ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె లిప్‌లాక్‌ సీన్‌ చేసింది.&nbsp; https://youtu.be/OWBr0mtA09w?si=PYy7JvnIBwQGeS6j పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) ‘RX100’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్‌ అందులో హీరో కార్తికేయతో రొమాంటిక్‌ సీన్స్‌ చేసింది. లిప్‌లాక్‌ ముద్దులతో అతడ్ని ముంచెత్తింది. ‘RDX లవ్‌’ అనే మరో సినిమాలోనూ కుర్ర హీరోతో తన పెదాలను పంచుకుంది.&nbsp; https://youtu.be/M0A073kZqOs?si=Wem1xfWcBkihcjRP https://youtu.be/p63JKf879T4?si=4FmfuopZSq25C0p3 వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య ‘బేబీ’ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె పలు రొమాంటిక్‌ సీన్స్‌లో నటించింది. నటుడు విరాజ్‌తో కలిసి పబ్‌లో లిప్‌లాక్‌ సీన్‌ చేసింది. అలాగే ఇంటిమేట్‌ సీన్‌లోనూ కనిపించి హార్ట్‌ బీట్‌ను అమాంతం పెంచేసింది. https://youtu.be/dFo8klGt58Y?si=pi-dhy59FkD9CHnu కావ్యా థాపర్‌ (Kavya Thapar) గ్లామర్‌ బ్యూటీ కావ్యా థాపర్‌ కుర్ర హీరో సంతోష్‌ శోభన్‌తో కలిసి లిప్‌లాక్‌ సీన్‌ చేసింది. ‘ఏక్‌ మినీ కథ’ చిత్రంలోని ఓ సాంగ్‌లో ఘాటైన రొమాన్స్‌ చేసింది.&nbsp; https://youtu.be/Vbnp6wIf8XY?si=bmWPAr5lWg-YgNOn అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) ఒకప్పుడు ట్రెడిషనల్‌ పాత్రలతో ఆకట్టుకున్న అనుపమా పరమేశ్వరన్‌ ఈ మధ్య కాలంలో రొమాంటిక్‌ సీన్స్‌కు పెద్ద పీట వేస్తోంది. యూత్‌ను ఆకర్షించే క్రమంలో ‘రౌడీ బాయ్స్‌’, ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాల్లో రెచ్చిపోయింది. హీరోలను ముద్దులతో ముంచెత్తింది.&nbsp; https://youtu.be/vm8sg_Gtwf8?si=a0zPMR1VSnhROOIX https://youtu.be/-GqC3e4K4f0?si=ilK643bC0cRF8Uus https://youtu.be/ZY6U0N0jxtE?si=kZ1d5zGrK75cP-q- షాలిని పాండే (Shalini Pandey) అర్జున్‌ రెడ్డి చిత్రంతో నటి షాలిని పాండే టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో విజయ్‌ దేవరకొండతో కలిసి మల్టిపుల్ లిప్‌ లాక్‌ సీన్స్‌ చేసింది.&nbsp; https://youtu.be/p8OExtmSVQc?si=a7d-gIT9KwGMbW0A https://youtu.be/y9nY4xZ7d9c?si=g7NIk_s8k8M1MOm- శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) ప్రముఖ హీరోయిన్‌ శోభితా దూళిపాళ్ల కూడా పలు లిప్‌లాక్‌ సీన్లలో నటించింది. 'మేడ్‌ ఇన్‌ హెవెన్‌' వెబ్‌సిరీస్‌లో బోల్డ్‌ సీన్స్‌లో రచ్చ రచ్చ చేసింది. అలాగే ‘మంకీ మ్యాన్‌’ అనే హాలీవుడ్‌ మూవీలోనూ ఈ అమ్మడు ముద్దు సీన్లలో నటించింది. టాలీవుడ్‌ నటుడు నాగ చైతన్యతో శోభితాకు నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.&nbsp; https://youtu.be/-sZwctU1-AI?si=u7O55-nGt5lABZG4 https://youtu.be/ui5J3MMqyks?si=ORhbahScSjs_xvLu మానసా చౌదరి (Maanasa Chowdary) రోషన్‌ కనకాల హీరోగా పరిచయమైన 'బబుల్‌ గమ్‌' చిత్రంలో మానస చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లిప్‌ లాక్‌ సీన్స్‌ కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఒక్క సాంగ్‌లోనే ఏకంగా 14 లిప్‌ లాక్స్‌ ఉన్నాయి.&nbsp; https://youtu.be/ASWoafIYNpg?si=_4DmWUSQO03DibjZ https://youtu.be/jK5Yz41NqSU?si=I9juu_-cUhn2NCBU
    అక్టోబర్ 05 , 2024
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    ఒకప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్స్‌ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్‌, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్‌ ఠాకూర్‌ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్‌ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే&nbsp; గత కొద్ది కాలంగా&nbsp; ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్‌ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; గౌరి ప్రియ (Gouri Priya) టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్‌’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్‌ పక్కన ‘లవర్‌’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=8dwrE0OCq40 ఆనందిని (Anandhi) వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్‌ హీరోగా చేసింది.&nbsp; చాందిని చౌదరి (Chandini Chowdary) ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్‌ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్‌ సేన్‌ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్‌', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.&nbsp; వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్‌ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్‌ ఆనంద్‌ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI దివ్య శ్రీపాద (Divya Sripada) టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్‌ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్‌'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala) ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్‌ రాఘవ్‌ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం 'మంకీ మ్యాన్‌'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్‌, బాలీవుడ్‌ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.&nbsp; రితు వర్మ (Ritu Varma) హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్‌ షా' (Badshah) సినిమాలో కాజల్‌ ఫ్రెండ్‌ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్‌ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్‌’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్‌ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్‌ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=4hNEsshEeN8 స్వాతి రెడ్డి (Swathi Reddy) వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్‌' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా,&nbsp; గోల్కొండ స్కూల్‌, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్‌ ఆఫ్‌ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE డింపుల్‌ హయాతి (Dimple Hayathi) ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్‌ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్‌ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606 శివాని నగరం (Shivani Nagaram) ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్‌ హీరో సుహాస్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి. మానస చౌదరి (Maanasa Choudhary) ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్‌’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్‌.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్‌ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్‌ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్‌ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/i/status/1762802318934950146 అంజలి (Anjali) తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్‌, సరైనోడు, వకీల్‌సాబ్‌, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, గేమ్‌ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
    మార్చి 06 , 2024
    This Week OTT Movies: ఈ వారం సందడి చేసేందుకు వస్తోన్న చిత్రాలు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం సందడి చేసేందుకు వస్తోన్న చిత్రాలు ఇవే!
    టాలీవుడ్‌లో గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ సమ్మర్‌లో స్టార్‌ హీరోల చిత్రాలు లేకపోవడంతో యంగ్‌ హీరోలు తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మే చివరి వారంలో పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం మే 31న విడుదలవుతోంది. ఓ సామాన్యుడిగా చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టి అసామాన్యుడిగా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి&nbsp;సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. భజే వాయు వేగం యంగ్‌ హీరో కార్తికేయ.. ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) చిత్రంతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్‌రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. సామాన్య వ్యక్తి అసాధారణ సమస్యలో ఇరుక్కుని తిరిగి అందులో నుంచి ఎలా బయటపడ్డాడు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానున్నట్లు చెప్పింది.&nbsp; గం.. గం.. గణేశా విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన లేటెస్ట్‌ చిత్రం.. ‘గం.. గం.. గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్‌ శెట్టి దర్శకుడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. రిష్మా, వెన్నెల కిశోర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘బేబీ’ లాంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ చేస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ మే 31న విడుదల కానుంది.&nbsp; మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించిన లేటెస్ట్ రొమాంటిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా&nbsp; ‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి’ (Mr. &amp; Mrs. Mahi). శరణ్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాజ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్వీ క్రికెటర్‌గా కనిపించనుంది. హిట్ లిస్ట్ తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘హిట్ లిస్ట్’ (Hit List). యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో రూపొందిన ఈ చిత్రానికి సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వ వహించారు. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచుతోంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌ సిరీస్‌లు ఆ ఒక్కటి అడక్కు కామెడీ స్టార్‌ అల్లరి నరేష్‌ (Allari Naresh) నటించిన లేటెస్ట్ చిత్రం 'ఆ ఒక్కటి అడక్కు' (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేసింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. ఈ సినిమాను మే 31 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ స్ట్రీమింగ్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateErikSeriesEnglishNetflixMay 30Geek GirlSeriesEnglishNetflixMay 30Panchayat S3SeriesHindiAmazon primeMay 28Aa Okkati AdakkuMovieTeluguAmazon primeMay 31Swatantra Veer SavarkarMovieHindiZee 5May 28ComdenSeriesEnglishDisney + HotstarMay 28The First AmenMovieEnglishDisney + HotstarMay 30Uppu Puli KaramMovieTamilDisney + HotstarMay 30Illegal S3SeriesHindiJio CinemaMay 29Dedh Bigha ZameenMovieHindiJio CinemaMay 31The Last Refill ManMovieEnglishJio CinemaMay 31
    మే 27 , 2024
    Allu Arjun Viral Photo: భార్యతో రోడ్డు పక్కన దాబాలో కనిపించిన అల్లు అర్జున్‌.. ఫొటో వైరల్‌!
    Allu Arjun Viral Photo: భార్యతో రోడ్డు పక్కన దాబాలో కనిపించిన అల్లు అర్జున్‌.. ఫొటో వైరల్‌!
    టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న కథానాయకుల్లో అల్లు అర్జున్‌ (Allu Arjun) ఒకరు. ‘పుష్ప’ (Pushpa) సినిమాతో బన్నీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పాన్‌ ఇండియా స్థాయికి చేరింది. ఎంతటి పేరు ప్రఖ్యాతలు సాధించినా బన్నీ మాత్రం చాలా సింపుల్‌గా ఉండేందుకే ఇష్టపడుతుంటాడు. సామాన్యుడిగా జీవించేందుకు ఏమాత్రం సంకోచించడు. వివాదంలో చిక్కుకుంటానని తెలిసినా స్నేహం కోసం ఇటీవల వైకాపా నాయకుడి ఇంటికి వెళ్లి మరి బన్నీ మద్దతు ప్రకటించాడు. ఇటువంటి సందర్భాలు బన్నీ లైఫ్‌లో చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా బన్నీకి సంబంధించి ఓ ఫొటో బయటకొచ్చింది. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.&nbsp; బన్నీ.. సింప్లిసిటీ..! ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. తన భార్య స్నేహా రెడ్డితో కలిసి రోడ్డు పక్కన దాబాలో ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో అల్లు అర్జున్‌, అతని భార్య ఓ సాధారణ హోటల్‌లో టేబుల్‌పై కూర్చొని భోజనం చేస్తూ కనిపించారు. దీనిని అక్కడ ఉన్న ఓ వ్యక్తి రహాస్యంగా ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్‌.. తమ హీరో సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. లైఫ్‌లో ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండాలన్న జీవిత పాఠాన్ని బన్నీ పాటిస్తున్నాడని ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫొటోను షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌లో చేస్తున్నారు.&nbsp; .@alluarjun anna &amp; sneha garu🤨😯❤️❤️Spotted at road side dhaba SIMPLICITY LEVEL. Man 🫡 pic.twitter.com/KoI7NOLfmF— Trend_AlluArjun_FC™ (@Trend_AA_FC) May 21, 2024 ఎక్కడ జరిగిందంటే? ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో బన్నీ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి నంద్యాల జిల్లాలో పర్యటించాడు. అక్కడ వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డికి మద్దతు తెలిపాడు. భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్‌కు అభివాదం చేసి.. కొద్ది సేపటికే బన్నీ తిరిగి హైదరాబాద్‌ బయలుదేరాడు. ఈ సందర్భంగా దారిలో ఓ దాబా వద్ద బన్నీ ఆగినట్లు తెలుస్తోంది. అక్కడ తన భార్యతో కలిసి భోజనం చేశారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అప్పుడు తీసిన ఫొటోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నట్లు సమాచారం. గతంలోనూ ఇలాగే..! గతంలో ‘పుష్ప’ సినిమా షూటింగ్‌ సందర్భంలోనూ బన్నీ రోడ్డు పక్కన టిఫిన్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రంపచోడవరంలో తెల్లవారు జామున షూటింగ్‌కు వెళ్తూ బన్నీ మార్గం మధ్యలో ఓ కాకా హోటల్‌ దగ్గర కారు ఆపాడు. ఎంచక్కా పాకలోకి వెళ్లి టిఫిన్‌ చేశాడు. బయటకొచ్చి తన అసిస్టెంట్‌ను డబ్బులు అడిగి హోటల్‌ యజమాని చేతికి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియో మళ్లీ ఓసారి చూసేయండి. Icon Star #AlluArjun was having breakfast at road side tiffin centre near gokavaram.@alluarjun ❤️ #Pushpa pic.twitter.com/25OCuNGRB4— Allu Arjun Fan™ (@IamVenkateshRam) September 13, 2021 ‘పుష్ప 2’తో బిజీ బిజీ.. ప్రస్తుతం బన్నీ.. ‘పుష్ప 2: ది రూల్’ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ‘పుష్ప 2’ ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో ఈ సినిమా రానుంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తుండగా.. ఫహద్‌ ఫాసిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నాడు.&nbsp;
    మే 21 , 2024
    Pedda Kapu 1 Review: డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల గ్రేట్ కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!
    Pedda Kapu 1 Review: డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల గ్రేట్ కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!
    నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ, శ్రీకాంత్ అడ్డాల, రావు రమేష్‌, నాగ బాబు, రాజీవ్‌ కనకాల, ఈశ్వరి రావు, ఆడుకలం నరేన్‌ డైరెక్టర్‌: శ్రీకాంత్ అడ్దాల సంగీతం: మిక్కీ జే. మేయర్‌ సినిమాటోగ్రఫీ: ఛోటా కే. నాయుడు నిర్మాత: మిర్యాల రమేష్‌, మిర్యాల సత్యనారాయణ క్లాస్‌ దర్శకుడిగా పేరొందిన శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) తెరకెక్కించిన పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పెదకాపు 1’ (Peda Kapu 1). టైటిల్‌ని బట్టి చాలామంది ఈ సినిమా ఓ సామాజిక వర్గం నేపథ్యంలో రూపొందిందని అనుకుంటున్నారు. కానీ, ఇది క్యాస్ట్‌కు సంబంధించి కాదు ఓ సామాన్యుడి సంతకం అని దర్శకుడు స్పష్టం చేశారు. నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి కుటుంబ సభ్యుడు విరాట్‌ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ సినిమాతో శ్రీకాంత్‌ అడ్డాల తన పంథా మార్చడం ఓ విశేషమైతే ఇందులో నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలో ఆయన నటించడం మరో విశేషం. అయితే ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్‌ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి రివ్యూ మీకోసం. కథ: 1980లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భం అది. లంక గ్రామాన్ని సత్యరంగయ్య (రావు రమేష్), బయన్న (నరేన్) అనే ఇద్దరు వ్యక్తులు శాసిస్తుంటారు. హింసని ప్రేరేపిస్తూ తమ అధికారం కోసం మిగతా జనాల్ని బలిపశువులుగా మారుస్తుంటారు. పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటారు. అనుకోని పరిస్థితిలో సత్యరంగయ్య తరపున పెదకాపు అన్న జైలుకి వెళ్ళాల్సివస్తుంది. అలా జైలుకి వెళ్ళిన పెదకాపు అన్న కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే 1983 సంవత్సరంలో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తాడు. బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం సరైన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఆవేశంతోపాటు ఆలోచన ఉన్న పెద్దకాపు (విరాట్ కర్ణ) తెలుగుదేశం జెండాను గ్రామంలోని నడిబొడ్డున పాతి సత్య రంగయ్య, బయన్నకు సవాల్ విసురుతాడు. పెదకాపు.. వారిని ఎలా ఎదిరించాడు? లంక గ్రామాల్లో అల్లర్లు చేలరగడానికి కారణం ఏమిటి? ఈ కథలో కన్నబాబు ( శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ (అనసూయ), పార్టీ ఇంచార్జ్ (నాగబాబు) పాత్రల స్వభావం ఏమిటి?&nbsp; తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎలా సాగిందంటే? ఫస్టాఫ్‌లోని ప్రథమ భాగమంతా గోదావరి జిల్లాలో కులాల కొట్లాటల చుట్టే తిరుగుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో బడుగు, బలహీన వర్గాల తరపున హీరో టీడీపీ జెండాను పాతే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఆ సీన్‌ కథలోని ఇంటెన్సిటీ ఏమిటో చెబుతుంది. ఇక సత్య రంగయ్య, బయన్న అరాచకాలు, వాటి మధ్య నలిగే గ్రామీణ ప్రజలు, పెద్దకాపు నేతగా ఎదిగే తీరును ఫస్టాఫ్‌లో డైరెక్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతల అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. సత్య రంగయ్య హఠాన్మరణం, పెద్దకాపు అన్నయ్య కిడ్నాప్, పెద్దకాపు కాబోయే వదిన హత్య, అనసూయ ఎంట్రీ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథలో ఎమోషన్స్, యాక్షన్ దట్టించిన విధానం సినిమాలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసేందుకు దోహదపడ్డాయి. అనసూయ పాత్ర సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఎవరేలా చేశారంటే పెదకాపు పాత్ర చేసిన విరాట్‌ కర్ణకు ఇదే తొలి సినిమా అయినప్పటికీ నటుడిగా తనకు మంచి భవిష్యత్‌ ఉందని ‌అతడు నిరూపించుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌లో బాగా నటించాడు. చాలా సహజంగా కనిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఎమోషన్ సీన్స్‌, భారీ డైలాగులు చెప్పేటప్పుడు మాత్రం కాస్త తడబడినట్లు కనిపించింది. హీరోయిన్‌ ప్రగతి పాత్రకు యాక్టింగ్‌ స్కోప్‌ లేకపోవడంతో తెరపై ఆమె కంట్రీబ్యూషన్‌ తక్కువే. ఇక సినిమాకు అనసూయ నటనే హైలెట్‌ అని చెప్పవచ్చు. అక్కమ్మ పాత్రలో ఆమె ఇరగదీసింది. అయితే రంగమ్మత్తలా ఓన్ చేసుకునే పాత్ర ఐతే కాదు. సత్యరంగయ్య పాత్రలో రావు రమేష్‌ అదరగొట్టాడు. బయన్న పాత్రలో నరేన్ కూడా మంచి నటన కనబరిచారు. కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్దాల నిజంగానే సర్ప్రైజ్ చేశారు. తనికెళ్ల భరణి, నాగబాబు, రాజీవ్‌ కనకాల ఎప్పటిలాగే తమ నటనతో మెప్పించారు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సి ఛోటా కె. నాయుడు కెమెరా పనితనం. ఆయన తన నైపుణ్యంతో సినిమాకు కలర్‌ఫుల్‌ రంగులు అద్దారు. నిజంగా కొత్త గోదావరిని చూపించారు. జెండాపాతే సన్నివేశం, గౌరీ ఉరి సన్నివేశం, జాతర పాటని చిత్రీకరించిన తీరు చాలా బావుంది. మిక్కీ జె. మేయర్‌ పాటలు సినిమాకి కలిసిరాలేదు. నేపథ్య సంగీతం మాత్రం బావుంది. మాటలు, పాటలతో కథ చెప్పే శ్రీకాంత్‌ అడ్డాల ఆ విషయంలో కాస్త గతి తప్పినట్లు కనిపించింది. ఒకట్రెండు మినహా సినిమాలో గుర్తుండిపోయే డైలాగులు పెద్దగా కనిపించవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నాణ్యత విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు ఎక్కడా కనిపించదు.  ప్లస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ ప్లేవిరాట్‌, అనసూయ నటననేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్పాటలు రేటింగ్‌ : 3/5
    సెప్టెంబర్ 29 , 2023
    <strong>Purushothamudu Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ ఆకట్టుకుందా!</strong>
    Purushothamudu Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ ఆకట్టుకుందా!
    నటీనటులు: రాజ్‌ తరుణ్‌, హాసిని, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు రచన, దర్శకత్వం: రామ్‌ భీమన సంగీతం: గోపీ సుందర్‌ సినిమాటోగ్రఫీ: పీజీ విందా ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ నిర్మాత: డాక్టర్‌ రమేశ్‌ తేజవత్‌, ప్రకాశ్‌ తేజవత్‌ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ (Raj Tarun) ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అటు సినీ, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదొడుకులను ఫేస్‌ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు నటించిన లేటేస్ట్ చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu Movie review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్‌ భీమన (Ram Bhimana) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హాసిని (Actress Hasini) హీరోయిన్‌గా చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రాజ్‌ తరుణ్‌కు హిట్‌ను అందించి ఊరట కల్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి రచిత్‌ రామ్‌ (రాజ్‌తరుణ్‌) పుట్టుకతోనే కోటీశ్వరుడు. పీఆర్‌ గ్రూప్స్‌ అధినేత ఆదిత్య రామ్‌ (మురళీ శర్మ) ఏకైక తనయుడు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని తిరిగొచ్చిన కుమారుడికి సీఈవో బాధ్యతలు అప్పగించాలని ఆదిత్య నిర్ణయించుకుంటాడు. అయితే రచిత్‌ పెద్దమ్మ వసుంధర దానికి (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ రూల్స్‌ ప్రకారం సీఈవోగా ఎంపికవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు సామాన్యుడిలా అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది. దీనికి రచిత్‌ అంగీకరించి బయటకువచ్చేస్తాడు. ఏపీలోని మారుమూల గ్రామమైన రాయపులంకకు వెళ్తాడు. అక్కడికి వెళ్లాక రచిత్‌ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు అతడు ఎలాంటి సాహసాలు చేశాడు? అమ్ముతో అతడి లవ్‌ స్టోరీ ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే రచిత్‌ రామ్‌ పాత్రలో రాజ్‌తరుణ్‌ చక్కటి నటన కనబరిచాడు. కోటీశ్వరుడిగా, ఎటువంటి ఐడెంటిలేని సాధారణ వ్యక్తిలా రెండు డైమన్షన్స్‌లో చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్స్‌లోనూ పర్వాలేదనిపించాడు. ఇక పల్లెటూరి అమ్మాయి అమ్ము పాత్రలో హాసిని సుధీర్‌ స్క్రీన్‌పై ఎంతో అందంగా మెరిసింది. రాజ్‌తరణ్‌ - అమ్ము మధ్య వచ్చే లవ్‌ సీన్స్ మెప్పిస్తాయి. హీరో ఫ్రెండ్‌ పాత్రలో ప్రవీణ్‌ నవ్వులు పూయిస్తాడు. సత్య, బ్రహ్మానందం వంటి కమెడియన్లు సినిమాలో తళుక్కుమని మెరిశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని కారణాల వల్ల ఓ సామాన్యుడిలా గడపటం గతంలో చాలా చిత్రాల్లోనే చూశాం. 'పురుషోత్తముడు' చిత్రాన్ని కూడా దర్శకుడు రామ్‌ భీమన ఈ కోవలోనే రూపొందించారు. ధనవంతుడైన హీరో రాయపులంక గ్రామం చేరాక అసలు కథ మెుదలవుతుంది. హీరోయిన్‌తో పరిచయం, లవ్‌ సీన్స్‌ ఆకట్టుకునేలా ఉంటాయి. ఫస్టాఫ్‌ మెుత్తం విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కామెడీతో ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. ఊర్లో జరిగే అన్యాయాలపై హీరో తిరగబడటం, ఇంటర్వెల్‌ బ్యాంగ్ మెప్పిస్తాయి. అయితే ద్వితీయార్థం నుంచి కథ గాడి తప్పినట్లు కనిపిస్తుంది. ఎలాంటి మలుపు లేకుండా ఊహకు తగ్గట్లు సాఫీగా, బోరింగ్‌గా సాగిపోతుంది. క్లైమాక్స్‌ సైతం అంచనాలకు తగ్గట్లు ఉన్నా ప్రకాశ్‌ రాజ్‌ ఎంట్రీ, అతడు చెప్పే డైలాగ్స్‌ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కథ, కథనంలో వైవిధ్యం చూపడంలో దర్శకుడు రామ్‌ భీమన పూర్తిగా విఫలమయ్యాడు. సాంకేతికంగా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే గోపి సుందర్‌ అందించిన సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. పీజీ విందా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని తన కెమెరా పనితనంతో చక్కగా చూపించారు. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ రాజ్‌తరుణ్‌ నటనఫస్టాఫ్‌లోని కొన్ని సీన్స్‌హీరో-హీరోయిన్‌ కెమెస్ట్రీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీఊహకందేలా సాగే కథనంట్విస్టులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    జూలై 27 , 2024
    Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
    Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
    తెలుగులో ఎంతో మంది నటులు శ్రీకృష్ణుడి వేషధారణలో నటించి తమదైన ముద్ర వేశారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారల్లో శ్రీకృష్ణావతారం ఎంతో ఉత్కృష్ణమైంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ద్వాపర యుగంలో శ్రీమహా విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆయన నోటి నుంచి వచ్చిన జ్ఞాన బోధే పంచవేదం భగవద్గీతగా విరాజిల్లుతోంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువుగా ప్రసిద్ధిచెందాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా వెండితెరపై శ్రీకృష్ణుడి పాత్రలో మెరిసిన నేటి తరం యువ కథనాయకులు, పాత తరం హీరోలపై YouSay Telugu ప్రత్యేక కథనం. జూ.ఎన్టీఆర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వచ్చిన ‘బృందావనం’ సినిమాలో కొద్దిసేపూ జూ. ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపించి అలరించాడు. ఈ సినిమాలో ‘చిన్నదో వైపు, పెద్దదో వైపు’&nbsp; పాటలో తారక్ మోడ్రన్ కృష్ణుడి గెటప్‌లో వావ్ అనిపించాడు. అయితే రాముడిగా, యంగ్ యముడి పాత్రలో ప్రేక్షకులను అలరించిన&nbsp; జూ.ఎన్టీఆర్‌ను.. కృష్ణుడిగా ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో చూడాలని ఆయన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. అయితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌ మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రలో జూ.ఎన్టీఆర్ నటించే అవకాశం ఉన్నట్లు వార్తలైతే ఉన్నాయి. https://www.youtube.com/watch?v=hzAaEN6yc1g మహేష్ బాబు సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఓ సినిమాలో శ్రీకృష్ణుడిగా అలరించాడు. ఆయన కేరీర్ ఆరంభంలో వచ్చిన ‘యువరాజు’ సినిమాలోని 'గుంతలకిడి గుంతలకిడి గుమ్మ' పాటలో శ్రీకృష్ణుడిగా కనువిందు చేశాడు. కృష్ణుడి వేషంలో మహేష్ బాగా సెట్ అయ్యాడని అప్పట్లో అభిమానులు తెగ సంతోషపడిపోయారు. https://youtu.be/b02ieSLiyRI?feature=shared పవన్ కళ్యాణ్ ఈ తరం హీరోల్లో కృష్ణుడి పాత్రలో అలరించిన మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా మెరిసాడు. సామన్య మానవుడి రూపు దాల్చిన&nbsp; శ్రీకృష్ణ పరమాత్మ వేషంలో పవర్ స్టార్ కనిపించి కనువిందు చేశాడు. https://www.youtube.com/watch?v=HNeBe1JvBmU నాగార్జున మంచు విష్ణు హీరోగా వచ్చిన 'కృష్ణార్జున' మూవీలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. నాగార్జున సైతం మోడ్రన్ కృష్ణుడిగా... సామాన్యుడిలా కనిపించి అలరించాడు. సునీల్ విలక్షణ నటుడు సునీల్ తొలిసారి తేజా డైరెక్షన్‌లో వచ్చిన నువ్వు- నేను సినిమాలో కాసేపు చిలిపి కృష్ణుడిగా కనిపించి నవ్వులు పూయించాడు. ‘గాజువాక పిల్ల మేము గాజులోల్లం కాదా’ సాంగ్‌లో సునీల్ కృష్ణుడిగా మెరిసాడు. అలాగే అందాలరాముడులో కొంటె శ్రీకృష్ణుడిగా కాసేపు కనువిందు చేశాడు.. https://youtu.be/VhyejE23l4M?feature=shared రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ డ్యుయల్ రోల్‌లో మెప్పించిన ‘కన్నయ్య కిట్టయ్య’ సినిమాలో... నటకిరిటి శ్రీకృష్ణుడిగా, భక్తుడిగా రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. బాలకృష్ణ పౌరాణిక వేషాల్లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ఆహార్యం సంపాదించిన నటులు బాలకృష్ణ. శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు, ఎన్టీఆర్ చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడిగా నటించి ప్రేక్షకులను అలరించారు. https://youtu.be/wcJhLH_T6N0?feature=shared శోభన్ బాబు: వెండితెరపై శ్రీకృష్ణుడి వేషం వేసి మెప్పించిన నటుల్లో శోభన్ బాబు ఒకరు.&nbsp; బాపు డైరెక్షన్‌లో వచ్చిన 'బుద్దిమంతుడు' చిత్రంలో కాసేపూ ఆయన కృష్ణుడి వేషంలో దర్శనమిచ్చారు. 'కురుక్షేత్రం' సినిమాలో పూర్తి నిడివిలో కృష్ణ భగవానుడిగా అలరించారు. https://youtu.be/Nf2ts_Cld-s?feature=shared కాంతరావు ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడి పాత్రలో మెప్పించిన నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన తొలిసారి మలయాళ చిత్రం భక్త కుచేల చిత్రంలో కృష్ణుడిగా కనిపించారు. ఆ తర్వాత పాండవ వనమాసం, నర్తనశాల, ప్రమీలార్జనీయం చిత్రాల్లో కృష్ణుడి వేషంలో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల మదిలో కృష్ణుడు, రాముడు అంటే గుర్తుకొచ్చే పేరు ఎన్టీఆర్. వెండితెరపై ఎంతమంది కృష్ణుడి వేషంలో కనిపించినా ఆయనకు సాటి రాలేదనేది చాలా మందివాదన. ఆయన రూపం, సంభాషణ చాతుర్యం ఇలాంటివన్నీ ఎన్టీఆర్‌ను వెండితెర కృష్ణుడిగా నిలబెట్టాయి. ఆయన సినిమాలు, ఇతర నాటకాల్లో కలిపి మొత్తం 33 సార్లు శ్రీకృష్ణుడిగా కనిపించారు. మాయాబజార్, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణతులాభారం, దానవీరశూరకర్ణ వంటి చిత్రాల్లో ఆయన కృష్ణుడిగా అలరించారు. శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ 18 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. https://www.youtube.com/watch?app=desktop&amp;v=JlsXEmQIWNs
    సెప్టెంబర్ 06 , 2023
    Vidudhala Review: NTR దర్శకుడు వెట్రిమారన్‌ ‘విడుదల’ ప్రేక్షకులను ఆకట్టుకుందా?
    Vidudhala Review: NTR దర్శకుడు వెట్రిమారన్‌ ‘విడుదల’ ప్రేక్షకులను ఆకట్టుకుందా?
    నటీనటులు: సూరి, విజయ్‌ సేతుపతి, భవానీ శ్రీ, గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, రాజీవ్‌ మీనన్‌&nbsp; దర్శకత్వం: వెట్రిమారన్‌ సంగీతం: ఇళయరాజా సినిమాటోగ్రఫీ: ఆర్‌.వేల్‌రాజ్‌ ఎడిటింగ్‌: రమర్‌ నిర్మాత: ఎల్రెడ్‌ కుమార్‌ డైరెక్టర్‌ వెట్రిమారన్‌కు తమిళంలో ఎంతో గుర్తింపు ఉంది. హీరోల కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆయన పలు జాతీయ అవార్డులను అందుకున్నాడు. అత్యంత సహజంగా కనిపించేలా ఆయన తీసిన విసరనై, వడా చెన్నై, అసురన్‌ వంటి సినిమాలు వెట్రిమారన్‌కు ప్రతిభకు అద్దం పడతాయి.&nbsp; తమిళ్‌లో ఆయన తీసిన ‘అసురన్’ చిత్రం ఓ ప్రభంజనమే సృష్టించింది. తెలుగులో ‘నారప్ప’గా వచ్చి ఇక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా, వెట్రిమారన్ తాజా చిత్రం ‘విడుదల పార్ట్‌ 1’ ఇవాళ తెలుగులో రిలీజైంది. వెట్రిమారన్ సినిమా కావడంతో ఎప్పటిలాగే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. మరీ ‘విడుదల’ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? వెట్రిమారన్‌కు మరో హిట్ తెచ్చిపెట్టిందా? ఇప్పుడు చూద్దాం. కథ పోలీసు కానిస్టేబుల్‌గా కుమరేశన్‌(సూరి) కొత్త ఉద్యోగంలో చేరతాడు. ప్ర‌జాద‌ళం నాయ‌కుడైన పెరుమాళ్‌(విజ‌య్ సేతుప‌తి)ని ప‌ట్టుకునేందుకు ప‌నిచేస్తున్న పోలీస్ ద‌ళంలో డ్రైవ‌ర్‌గా చేర‌తాడు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడం పోలీసు విధి అని కుమరేశన్ నమ్ముతుంటాడు. ఈ నేపథ్యంలో అడవిలో ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేస్తుంది. ఆమెను కాపాడేందుకు పోలీసు జీపును ఉపయోగించి కుమరేశన్‌ పైఅధికారుల ఆగ్రహానికి గురవుతాడు. మ‌రోవైపు గాయ‌ప‌డిన మ‌హిళ మ‌న‌వరాలు పాప (భ‌వానీ శ్రీ)తో కుమ‌రేశ‌న్ స్నేహం చేస్తాడు. అది కాస్త ప్రేమ‌కి దారితీస్తుంది. ఒక ప‌క్క ప్రేమ‌, ఇంకోవైపు పెరుమాళ్ కోసం సాగించే వేట‌లో కుమ‌రేశ‌న్ ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌కి గుర‌వుతాడ‌న్న‌ది మిగ‌తా క‌థ‌. ఎవరెలా చేశారంటే: పాత్రలకు తగ్గ నటుల్ని ఎంచుకోవడంలో డైరెక్టర్‌ వెట్రిమారన్‌ సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. సూరి, భవానీ శ్రీల నటన ఈ సినిమాలో ఆకట్టుకుంటుంది. కుమారేశన్‌, పాప పాత్రల్లో ఉన్న అమాయకత్వాన్ని వారు తమ నటనతో చక్కగా చేసి చూపించారు. అటు క్రూరంగా వ్యవహరించే పోలీసు ఆఫీసర్‌గా చేతన్‌ అదరగొట్టాడు.పెరుమాళ్‌గా విజయ్‌సేతుపతి కనిపించేంది కొద్దిసేపే అయిన తన మార్క్‌ నటనతో మెప్పించాడు. గౌతమ్‌ మీనన్‌, రాజీవ్ మీనన్ తదితరులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; టెక్నికల్‌గా:&nbsp; విడుదల పార్ట్‌-1 సినిమాలో డైరెక్టర్‌ వెట్టిమారన్‌ కొత్త ప్రపంచాన్నే ఆవిష్కరించారు. తనదైన శైలిలో అడవి, పోలీసుల సెటప్‌ అంతా చాలా సహజంగా ఉంది. కానీ.. కథలో&nbsp; సంఘర్షణ, డ్రామా మాత్రం పెద్దగా మెప్పించదు. కొన్ని సన్నివేశాలు మరీ సాగదీతలా అనిపిస్తాయి. దళాలను పట్టుకోవడం కోసం పోలీసులు యత్నించడం, వారి ఇరువురు మధ్య సాగే పోరాటంలో సామాన్యులు నలిగిపోవడం చాలా తెలుగు సినిమాల్లో చూసిందే. ఈ చిత్రంలోనూ అదే సన్నివేశాలు రిపీట్‌ కావడంతో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కుమారేశన్, పాప మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు కూడా రొటిన్‌గా అనిపిస్తాయి. ఇకపోతే కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ నటీనటులుసినిమాటోగ్రఫీపతాక సన్నివేశాలు మైనస్ పాయింట్స్ సంఘర్షణ లేని కథసాగదీత సన్నివేశాలు రేటింగ్‌: 2.5/5
    ఏప్రిల్ 15 , 2023
    Holi 2024: రంగుల్లో నిండైన అందాలు చూస్తారా?
    Holi 2024: రంగుల్లో నిండైన అందాలు చూస్తారా?
    సోమవారం హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా కన్నుల పండుగగా జరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతీ ఒక్కరూ ఎంతో సంతోషం హోలీని జరుపుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు భామలు ముఖానికి రంగులతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్‌ హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)తో కలిసి హోలీ వేడుకలను జరుపుకున్నాడు. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాన్స్‌తో కలిసి హోలీ సంబరాలు చేసుకున్నాడు.&nbsp; https://twitter.com/i/status/1772544977396220385 బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ (Disha Patani).. స్టార్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి హోలీ జరుపుకుంది. అప్‌కమింగ్‌ చిత్రం ‘బడేమియా చోటేమియా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ముగ్గురు తారలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.&nbsp; View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) స్టార్‌ నటి కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) తన తల్లితో కలిసి హోలీ వేడుకలను జరుపుకుంది. తల్లితో అన్యోన్యంగా ఉన్న ఫొటోను కాజల్ షేర్ చేసింది.&nbsp; హాట్‌ బ్యూటీ రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh).. పెళ్లి తర్వాత వచ్చిన తొలి హోలీని ఘనంగా జరుపుకుంది. భర్త జాకీ భగ్నానీతో కలిసి హోలీ డేను ఎంజాయ్ చేసింది.&nbsp; View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) స్టార్‌ హీరోయిన్‌ రాశీ ఖన్నా(Raashii Khanna) చేతులకు రంగుతో ఫొటోకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; యంగ్ బ్యూటీ దివి వడ్త్యా (Divi Vadthya).. హోలీ రోజును చాలా సంతోషంగా జరుపుకుంది.&nbsp; యంగ్‌ హీరోయిన్‌ మెహరీన్‌ సైతం స్నేహితులతో కలిసి హోలీని ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది.&nbsp; View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) నటి మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) కూడా హోలీ రోజున ఓ సెల్ఫీ దిగి అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె ముఖం, శరీరంపైన రంగులు ఉండటం గమనించవచ్చు.&nbsp; బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ (Kriti Sanon).. మిత్రులతో హోలీని జరుపుకుంది. హ్యాపీ హోలీ అంటూ ఈ భామ కన్ను గీటుతూ దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.&nbsp; నటి రాయ్‌ లక్ష్మీ (Raai Lakshmi) హోలీ రోజున ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రంగులతో తడిచిన ఒంటితో ఆమె ఫొటోలకు ఫోజులిచ్చింది.&nbsp; ప్రముఖ నటి మంచు లక్ష్మీ (Manchu Lakshmi)... నైజీరియాలో హోలీ వేడుకలను సెలబ్రేట్‌ చేసుకుంది. అక్కడ ఓ వ్యక్తితో దిగిన ఫొటోను ఆమె సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా హోలీ రోజున సందడి చేసింది. నుదురు, బుగ్గపైన రంగుతో క్యూట్‌గా కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది.&nbsp; హోలీని బాగా సెలబ్రేట్‌ చేసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరోయిన్‌ శివాలిక ఒబెరాయ్‌ ఉంది.&nbsp; యంగ్‌ హీరోయిన్‌ రుహానీ శర్మ.. స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొంది.&nbsp; మెగా డాటర్స్‌ సుస్మిత (Susmitha), శ్రీజ (Sreeja).. హోలీ సెలబ్రేషన్స్‌లో పాల్గొని.. సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సుస్మిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.&nbsp; బాలీవుడ్‌ భామ అవనీత్‌ కౌర్‌.. హోలీ రోజున సోషల్‌ మీడియాలో తళుక్కుమంది.&nbsp; ప్రముఖ నటి ఆకాంక్ష సింగ్‌.. హోలీ సందర్భంగా ముఖాన రంగుతో ఫ్యాన్స్‌కు ఓ కొంచె చూపు విసిరింది.&nbsp; పాపులర్‌ హీరోయిన్‌ శోభితా దూలిపాల (Sobhita Dhulipala).. డ్రెస్‌ మెుత్తం రంగుల మయం అయ్యేలా హోలీ జరుపుకుంది.&nbsp; హాట్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌.. కోలకత్తాలో ఫ్యాన్స్‌తో కలిసి హోలీ జరుపుకుంది. తన స్టెప్పులతో అక్కడి వారిని ఉర్రూతలూగించింది. మీరు చూసేయండి.&nbsp; View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez)
    మార్చి 26 , 2024
    <strong>Pushpa 2: మీరు మాత్రం టికెట్లు రేట్లు తగ్గాకే చూడండి.. లేకపోతే చూడొద్దు!</strong>
    Pushpa 2: మీరు మాత్రం టికెట్లు రేట్లు తగ్గాకే చూడండి.. లేకపోతే చూడొద్దు!
    ప్రస్తుతం యావత్‌ దేశం ‘పుష్ప 2’ పీవర్‌ నడుస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రీమియర్స్‌ మరికొద్ది గంటల్లో థియేటర్లలో పడనున్నాయి. అయితే టికెట్ల ధరలు భారీగా ఉండటంతో సినీ లవర్స్‌ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో టికెట్‌ రూ.1000 - రూ.3000 వరకూ విక్రయిస్తుండటంపై బన్నీ అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజే సినిమా చూడాలని భావించిన తమను టికెట్ ధరల పెంపు తీవ్ర నిరాశకు గురిచేస్తోందని నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రగడ నేపథ్యంలో వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) స్పందించారు. సుబ్బారావు ఇడ్లీ స్టోరీ చెప్పి నెట్టింట మరో చర్చకు కారణయ్యాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; ఫ్యాన్స్‌ జేబులకు చిల్లులు! అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం గురువారం (డిసెంబర్‌ 5) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఒక రోజు ముందే అంటే బుధవారం రా.9:30కి స్పెషల్‌ ప్రీమియర్స్‌ పడనున్నాయి. అయితే తెలంగాణలో ఈ ప్రీమియర్స్‌ టికెట్ ధర సింగిల్‌ స్క్రీన్‌లో రూ.1,121, మల్టీప్లెక్స్‌లో రూ.1,239 పలుకుతోంది. ఆన్‌లైన్‌లో పెట్టిన టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోవడంతో బ్లాక్‌లో రూ.2000 నుంచి రూ.3000 వరకూ విక్రయిస్తున్నారు. దీంతో సినీ లవర్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ స్థాయిలో టికెట్‌ ధరలు ఉంటే సినిమా ఎలా చూస్తామని ప్రశ్నిస్తున్నారు. తొలిరోజే సినిమా చూడాలని భావిస్తే తమ జేబుకి చిల్లులు పడటం ఖాయమని నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు. అభిమానులే తమ బలం అని పదే పదే చెప్పే హీరోలు.. ప్రీమియర్స్‌ పేరుతో ఇలా దోచుకోవడం ఏంటని నిలదీస్తున్నారు.&nbsp; https://twitter.com/icon_uday_09/status/1862842546986058178 https://twitter.com/HemanthSriram14/status/1862891462121152785 ‘రేట్లు తగ్గాకే చూడండి’ 'పుష్ప 2' టికెట్‌ ధరలను నియంత్రించాలని నెటిజన్లు కోరుతుండటంతో పాటు ఈ విషయమై పలువురు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఈ క్రమంలో వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ (RGV) ఓ ఆసక్తికర పోస్టు పెట్టాడు. పుష్ప 2 టికెట్లను స్టార్‌ హోటల్‌ ఇడ్లీతో పోలుస్తూ చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ‘సుబ్బారావు అనే ఒకడు హోటల్ పెట్టి ప్లేట్ ఇడ్లీ ధరను రూ.1000గా నిర్ణయించాడు. ఆ ఇడ్లీలు మిగతావాటి కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కస్టమర్‌కు ఆ ఇడ్లీలు వర్త్ అనిపించకపోతే హోటల్‌కు వెళ్లడు. సుబ్బారావు ఇడ్లీ ధర సామాన్యులకు అందుబాటులో లేదని ఎవరైనా ఏడిస్తే, అది సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత వెర్రితనం. అన్ని ప్రొడక్ట్స్‌లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మిస్తారు. ప్రజా సేవ కోసం కాదు. ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానేయొచ్చు లేదా రేట్లు తగ్గాక చూసుకోవచ్చు’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు.&nbsp;&nbsp; https://twitter.com/RGVzoomin/status/1864188826387873892 ఆర్జీవీకి నెటిజన్ల కౌంటర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) చెప్పిన సుబ్బారావు ఇడ్లీ స్టోరీకి నెటిజన్లు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. 7 స్టార్ హోటల్స్‌లో 10 మంది ఇడ్లీలు తింటే బయట హోటల్‌లో 50వేల మంది తింటారని గుర్తుచేస్తున్నారు. డే 1 రూ.1200 ఉన్న టికెట్‌ను మరుసటి రోజుకు రూ.500, ఆ తర్వాత రూ.200కి మార్చడం అంటే 'పుష్ప 2' విలువ అంత నీచంగా పడిపోయిందని అర్థమా? అని నిలదీస్తున్నారు. ‘మెుదటి రోజు 7 స్టార్‌ ఇడ్లీలు ఎవరు కొనట్లేదు భయ్యా!’ అంటూ ఖాళీ సీట్లు ఉన్న థియేటర్లను పోస్టు చేస్తున్నారు. గతంలో పవన్‌ సినిమా టికెట్‌ ధరను జగన్‌ తగ్గించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. రూ.10 ధరతో తొలి భాగం చూపించి రూ.1000 కడితేనే రెండో సగం చూడాలని కండీషన్‌ పెడితే అది దోపిడి కాదా? అని మండిపడుతున్నారు. హోటల్‌లో ఇడ్లీ ధర మరీ ఎక్కువగా ఉంటే ఇంట్లో చేసుకుంటామని, అలాగే ‘పుష్ప 2’ని ఓటీటీలోకి వచ్చాక చూస్తామని స్పష్టం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Raja__JSP/status/1864210260183142807 https://twitter.com/shravan_salaar/status/1864190328200179911
    డిసెంబర్ 04 , 2024
    New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
    New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
    శివరాత్రి సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. శివరాత్రి స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 ఏడీ' నుంచి శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్‌ రిలీజైంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ పేరును పోస్టర్‌ ద్వారా మూవీ టీమ్‌ తెలియజేసింది. ప్రభాస్‌ పాత్ర పేరును భైరవగా ప్రకటిస్తూ భవిష్యత్తుకు చెందిన కాశీ వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం' అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది.&nbsp; కన్నప్ప (Kannappa) మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు ఈ పోస్టర్‌లో కనిపించాడు. కాగా, ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. NBK109 నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ కాంబోలో వస్తున్న 'NBK 109' చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్‌ విడుదలైంది. యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందించిన గ్లింప్స్‌లో బాలయ్యను బాబీ ‘నేచురల్ బోర్న్ కింగ్’ (NBK)గా చూపించారు. గ్లింప్స్‌లో చాలా స్టైలిష్ లుక్‌లో బాలయ్య అదరగొట్టారు. ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా వైలెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.&nbsp; https://twitter.com/i/status/1766375268804120887 ఓదెల 2 (Odela 2) తమన్నా (Tamannaah Bhatia) లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో డైరెక్టర్‌ సంపత్‌ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో తమన్నా కనిపించింది. షరతులు వర్తిస్తాయి! (Sharathulu Varthisthai) చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం నుండి కూడా శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్‌ విడుదలైంది. ‘ఈ దేశంలోని 80% మంది సామాన్యుల కథనే మన సినిమా’ అంటూ మేకర్స్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని స్టార్‌ లైట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. ‘దేవకీనందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) తొలి సినిమాతోనే హీరోగా ఆకట్టుకున్న మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) చేస్తున్న రెండో సినిమా ‘దేవకీనందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం చేస్తున్నారు. హనుమాన్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. కాగా, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర యూనిట్‌ ఓ స్పెషల్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ నెట్టింట ట్రెండ్ అవుతోంది.&nbsp; గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi) హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వ‌చ్చిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శుక్రవారం శివరాత్రితో పాటు ‘ఉమెన్స్‌ డే’ కూడా కావడంతో దానికి గుర్తుగా ఇందులోని అంజలి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నటిస్తుండగా సత్యం రాజేష్‌, షకలక శంకర్‌, అలీ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp; శ్రీరంగ నీతులు (Sri Ranga Neethulu) సుహాస్ హీరోగా ప్రవీణ్‌ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘శ్రీరంగ నీతులు’. ఈ సినిమాలో కార్తిక్‌ రత్నం మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ లుక్ పోస్టర్‌ విడుదలైంది. సుహాస్‌, కార్తిక్‌ రత్నంతో పాటు నటి రుహాని శర్మ పోస్టర్‌లో కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్‌ కానుంది. గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs Of Godavari) విశ్వక్‌సేన్‌&nbsp; హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి&nbsp; ఫీమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా&nbsp; మేకర్స్‌ అంజలికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోస్టర్‌ను రిలీజ్ చేశారు.&nbsp; సత్యభామ (Sathyabhama) స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘సత్యభామ’. అఖిల్‌ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఆరమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదలైంది.&nbsp;
    మార్చి 09 , 2024

    @2021 KTree