UATelugu
కరోనా టైమ్‌లో హర్ష, శ్రుతి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అచ్చం హర్షలాగే ఉండే శ్రుతి మాజీ లవర్ ఆర్య వారి జీవితంలోకి వస్తాడు. వారిద్దరి ఇబ్బంది పెడుతుంటాడు. ఈ క్రమంలో కరోనా సోకి హర్ష చనిపోతాడు. అసలు హర్ష నిజంగానే చనిపోయాడా? పోలీసులు శ్రుతిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆర్య ఏమయ్యాడు? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్EtvAppఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
సుమన్ తేజ్
హెబ్బా పటేల్
శ్వేతా వర్మ
రషికా శెట్టి
శుభశ్రీ రాయగురు
చంద్ర శేఖర్ రెడ్డి
సుందర్ పర్చా
సిబ్బంది
సతీష్ పరమవేదదర్శకుడు
సత్యనారాయణ పర్చనిర్మాత
కథనాలు
Heroines Birthday: ట్విటర్‌ను షేక్ చేస్తున్న ముద్దుగుమ్మలు రష్మిక, కల్యాణి ప్రియదర్శన్
కథానాయికలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన సోషల్ మీడియాను షేక్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, ఇవాళ తెలుగు అగ్రకథానాయిక రష్మిక మందన్న పుట్టిన రోజు. దీంతో ట్విటర్‌లో రష్మిక బర్త్‌డే ట్రెండింగ్‌గా మారిపోయింది. తమ అభిమాన నటికి విషెస్ చెబుతూ రష్మిక ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. #RashmikaMandanna హ్యాష్‌టాగ్‌తో ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో రష్మిక ఫొటోలు రచ్చ రచ్చ చేస్తున్నాయి.
పుష్ప 2 లో రష్మికా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
https://twitter.com/BheeshmaTalks/status/1643477077314904065
ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకల్లో రష్మిక తన డ్యాన్స్ ప్రదర్శనతో అకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు రష్మిక పోస్టు చేసిన డ్యాన్స్ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ అవుతోంది.
https://twitter.com/iamRashmika/status/1641832071739084806
రష్మిక లేటెస్ట్ మూవీ ‘రెయిన్‌బో’ షూటింగ్ ప్రారంభోత్సవ ఫొటోలు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని రష్మిక ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
https://twitter.com/iamRashmika/status/1642859136558792705
తమిళ నటుడు విజయ్ ఫ్యాన్స్ కూడా రష్మికకు పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు. విజయ్‌తో రష్మిక ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు.
https://twitter.com/itz_jaiTheri/status/1643469141662400513
పలు సినిమాలకు సంబంధించిన రష్మిక డిఫరెంట్ లుక్స్ ఫొటోను ఓ నెటిజన్ పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.
https://twitter.com/SivaHarsha_1/status/1643484285998108674
https://twitter.com/SivaHarsha_1/status/1643484313055563777
ఇవాళ రష్మికతో పాటు మరో హీరోయిన్ కూడా బర్త్‌డే జరుపుకుంటోంది. హలో, చిత్ర లహరి సినిమాల్లో నటించిన కళ్యాణి ప్రియదర్శన్ పుట్టిన రోజు కూడా ఇవాళే. దీంతో ఆమె ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ప్రియదర్శన్‌కు విషెస్ చెబుతున్నారు. #kalyanipriyadarshanతో నటి ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు.
క్యూట్ లుక్స్‌తో ఉన్న కళ్యాణి ప్రియదర్శన్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. శారీలో నటి దిగిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
https://twitter.com/SivaHarsha_1/status/1593112240752058369
https://twitter.com/Pranay___Varma/status/1622950945335447555
ప్రియదర్శన్ చేసిన పలు సినిమాల్లోని మూవీ క్లిప్స్ ట్విటర్ ట్రెండింగ్ అవుతున్నాయి. వాటిని ఫ్యాన్స్ షేర్ చేస్తూ బర్త్‌డే విషెస్ చెబుతున్నారు.
https://twitter.com/24HoursUpdated/status/1511181288471871493
https://twitter.com/i/status/1643458567972990976
ఓ మూవీ ఈవెంట్‌లో ప్రియదర్శన్ సందడి ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పలు సినిమాల్లో మరింత అందంగా కనిపించిన వీడియో క్లిప్స్‌ను ఈ వీడియోకు ఫ్యాన్స్ జత చేశారు.
https://twitter.com/i/status/1643479187225976832
ఏప్రిల్ 05 , 2023
వేశ్య పాత్రల్లో ఆకట్టుకున్న తెలుగు హీరోయిన్లు
]అనుష్క శెట్టి - వేదంటాలివుడ్ స్వీటి అనుష్క వేదంలో చేసిన ‘సరోజ’పాత్ర తన కెరీర్‌లో ఓ మైలురాయిగా ఉంటుందనడంలో సందేహం లేదు. వేశ్యావృత్తిలోని చీకటి కోణాన్ని చూపించేలా ఉండే పాత్రలో అమాయకమైన అమ్మాయిగా అనుష్క నటన కన్నీళ్లు పెట్టించింది.
ఫిబ్రవరి 13 , 2023
FAMILY MOVIES: ఈ మధ్యకాలంలో కుటుంబ విలువలు చాటి చెప్పిన టాప్ 5 తెలుగు సినిమాలు
సినిమాల ప్రభావం జనాలపై ఎంతో కొంత కచ్చితంగా ఉంటుంది. చిత్రంలో వచ్చే సన్నివేశాలు కొన్ని సందర్భాల్లో కదిలిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు కుటుంబాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లు, ఓటీటీ అనే తేడా లేకుండా ఆదరించారు ప్రేక్షకులు. కుటుంబాలపై ప్రభావం చూపించిన టాప్ 5 చిత్రాలు ఇవే !
బలగం
ఈ ఏడాది విడుదలైన కుటుంబ కథా చిత్రాల్లో మెుదటిది బలగం. చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన కుటుం మళ్లీ ఎలా కలుస్తుందనే కథను అద్భుతంగా తెరకెక్కించడంతో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించిన ఈ చిత్రం కారణంగా ఎన్నో విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలుసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
రంగ మార్తాండ
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులు, ఇప్పటి జనరేషన్ పిల్లల మధ్య జరిగిన సంఘర్షణలే రంగ మార్తాండ. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కృష్ణవంశీ నుంచి వచ్చింది ఈ సినిమా. ఈ చిత్రం నేటితరం యువతకు మంచి పాఠంగా నిలుస్తుంది. తల్లిదండ్రులు మనకు ఏం చేశారో తెలుసుకొని వారిని ఎలా గౌరవించాలో తెలుసునేందుకు ఉపయోగపడుతుంది రంగ మార్తాండ.
రైటర్ పద్మభూషణ్
యంగ్ హీరో సుహాస్ లీడ్ రోల్ చేసిన సినిమా రైటర్ పద్మభూషణ్. సినిమా మెుత్తం ఓ యువకుడు కెరీర్‌లో నిలదొక్కుకోవటానికి పడే కష్టాల గురించి వివరించినా… అతడికి తల్లిదండ్రులు ఎలా మద్దతుగా నిలబడ్డారనేది అసలు అంశం. కలల్ని వదిలి వంటింటికే పరిమితమైన తల్లి కుమారుడి కోసం రచనలు చేయడం ప్రారంభించడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. అంతేకాదు, మహిళల కలల్ని అర్థం చేసుకొని వారి ఆలోచనల్ని గౌరవించాలనే విషయాన్ని చాలామందికి చెబుతుంది ఈ సినిమా.
మట్టి కుస్తీ
భార్య, భర్తల మధ్య సమస్యలను ఓ చిన్న కథతో ముడి పెట్టి తీశారు. భర్త ఆధిపత్యమే కొనసాగాలనే వ్యక్తికి.. మగవాళ్లకు మేము ఏం తక్కువ కాదనే భార్య. కానీ, ఒకరికొకరు అర్థం చేసుకుంటేనే జీవితం ముందుకు సాగుతుందని కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా చాలామందిలో మార్పు తీసుకువచ్చింది. ఇల్లాలికి తగిన గౌరవం ఇస్తామని చెప్పినవారు కూడా ఉన్నారు.
ది గ్రేట్ ఇండియన్ కిచెన్
సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో మహిళలను ఇంటి పనులకే పరిమితం చేస్తున్నారనేది సింపుల్ కథ. ఓ మహిళకు కొత్తగా పెళ్లై అత్తారింటికి వెళ్తుంది. మగవాళ్ల ఆధిపత్యం ఉన్న ఇంట్లో ఆమె ఇమడలేకపోతుంది. ఇళ్లు, వంటపని మెుత్తం చేస్తూ విసిగిపోయి శివమెత్తుతుంది. పురుషాధిక్యాన్ని ఎదురించి స్వతంత్రంగా తన లక్ష్యం వైపు సాగుతుంది. పురుషాధిక్య సమాజంలో మహిళలు ఇంకా ఎదుర్కొంటున్న అంశాలను సినిమాలో చక్కగా ప్రస్తావించారు. కొందరికి కళ్లు తెరిపిస్తే.. మరికొందరికి సమస్యగా మారింది ఈ చిత్రం. అన్ని పనులు షేర్ చేసుకోవాలంటూ ఆఫీసుల నుంచి వచ్చిన భర్తల్ని భార్యలు ఆటపట్టిస్తున్నారంట ఈ సినిమా చూసి…!
జయ జయ జయ జయ జయహే
ఈ సినిమా కూడా భార్య భర్తల మధ్య వచ్చే ఇగో ప్రాబ్లమ్స్‌తో తెరకెక్కించారు. అన్ని తను అనుకున్నట్లుగా సాగాలనుకునే భర్త.. అనుకోని సందర్భంలో భార్యపై చేయిచేసుకుంటాడు. ఎవరికి చెప్పినా పట్టించుకోకపోవటంతో తానే అన్ని చూసుకోవాలని ఆమె తైక్వాండో నేర్చుకుంటుంది. ఈ క్రమంలో ఇబ్బందులు రావటం, వాళ్లు విడిపోవడం జరుగుతుంది. అబ్బాయిపై ఆధారపడకుండా కూడా అమ్మాయిలు జీవిస్తారు. కానీ, అలా మగవారు ఉండలేరని చూపించారు. ఇది కూడా చాలామంది కపుల్స్‌పై ప్రభావం చూపించింది. ఇందులో భర్తను తైక్వాండోతో ఆటాడుకునే రీల్ తెగ వైరల్ అయ్యింది. ఆ పరిస్థితుల్లో మీరుంటే ఒక్కసారి ఊహించుకోండి.
ఏప్రిల్ 27 , 2023
Akhanda Movie Dialogues: గూస్ బంప్స్ తెప్పించే బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే
కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం విడుదలైన అఖండ ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. దాదాపు రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించిన చిత్రం ఇది. బోయపాటి- బాలకృష్ణ కాంబోలో వచ్చిన సెకండ్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోరగా నటించిన తీరు ప్రేక్షుకులను మెప్పించింది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా ఎలివేషన్, బాలయ్య డైలాగ్ మాడ్యులేషన్‌కు బాగా హెల్ప్ అయింది. ఆయన చెప్పే డైలాగ్స్ అభిమానుల చేత విజిల్స్ కొట్టించింది. మాస్ ప్రేక్షకులకు పునకాలు తెప్పించిందనడంలో సందేహం లేదు. ఇప్పటికీ ఈ సినిమాలోని డైలాగ్స్ అభిమానుల నాలుకల మీద నాట్యం చేస్తూనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరి ఆ పవర్ ఫుల్ డైలాగ్స్‌ను మీరు ఓసారి చూసేయండి.
“ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీనుగారు.. మీ నాన్నగారు బాగున్నారా ? అనేదానికి శీనుగారు మీ అమ్మమొగుడు బాగున్నాడా..అనేదానికి చాలా తేడా ఉంది రా!”
“ఏయ్ ..! అంచనా వేయడానికి నువ్ పోలవరం డాం ఆ ? పట్టుసీమ తోమా ? పిల్ల కాలువ .!“
“హర హర మహాదేవ! శంభో శంకర ! కాలుదువ్వే నంది ముందు..రంగు మార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.”
“నాకు బురదంటింది..నాకు దురదొచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది నాకు గడ్డు వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే ..!”
“విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసర కూడదు.!”
“ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!”
“ఒక మాట నువ్వంటే అది శబ్దం అదే మాట నేనంటే శాసనం. దైవశాసనం.”
“నీకు సమస్య వస్తే దణ్ణం పెడుతారు. మేము ఆ సమస్యకు పిండం పెడుతాం. బోథ్ ఆర్ నాట్ సేమ్.”
“లెఫ్ట్ ఆ, రైట్ ఆ, టాప్ ఆ , బాటమ్ ఆ , ఎటు నుంచి ఎటు పెట్టి గోకిన కొడకా ఇంచు బాడీ దొరకదు.”
“ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!”
“మీరు మా అంటే సెల్‌లో వేస్తారు.. నేను డైరెక్ట్ హెల్‌కి పంపించా..”
“మీరు ఆయువు కోసం భయపడతారు.. మేము మృత్యువుకు ఎదురెళ్తాం”.
“దేవుడిని కరుణించమని అడగాలి, కనిపించమని కాదు.”
“రెస్పెక్ట్ అనేది బిహేవియర్ చూసి ఇచ్చేది, అడుక్కుంటే వచ్చేది కాదు.”
“మేము ఎక్కడికైనా వెళ్తే తల దించుకోము.. తల తెంచుకుని వెళ్లిపోతాం.”
అక్టోబర్ 26 , 2024
Heroines Tattoo: మన హీరోయిన్లు ఏ పార్ట్స్ మీద టాటూస్ వేసుకున్నారో తెలుసా?
పచ్చబొట్టు (Tattoos) వేసుకోవడం నేడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా సెలబ్రెటీలు వేసుకునే టాటూస్‌పై అభిమానులతో పాటు మీడియా కూడా ఆసక్తిగా గమనిస్తుంటుంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టాటూస్‌లో చాలా మార్పులు వచ్చాయి. ప్రత్యేకించి టాటూస్ కోసం ఆర్టిస్టులు పుట్టుకొచ్చారు. ఆకర్షణీయమైన రంగుల్లో, కోరుకున్న ఆకృతులను వారు శరీరంపై వేస్తుంటారు. ఈ టాటూస్ వ్యక్తిత్వానికి ప్రతిబింబాలుగా కనిపించడంతో పాటు వారి అందాన్ని మరింత పెంచుతోందనడంలో సందేహం లేదు. మరి మన హీరోయిన్లు ఎలాంటి టాటూస్ ఏ శరీర భాగలపై వేయించుకున్నారో ఓసారి చూద్దాం.
[toc]
Eesha Rebba
తెలుగింటి అందం ఈషా రెబ్బ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. మోడల్ గా కేరిర్ ప్రారంభించిన ఈ భామ ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో 2013లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బందిపోటు, అమీ తుమి, సవ్యసాచి, అరవింద సమేత వీర రాఘవ, పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి మూవీల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ నుంచి కొన్ని ఫ్యాషన్ టిప్స్ నేర్చుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ కుడి చేతి మణి కట్టు మీద నెమలి పించం టాటూను వేయించుకుంది. ఈ టాటూ ఆమె అందాన్ని మరింత పెంచిందనడంలో సందేహం లేదు.
Tatoo images
యుక్తిత రేజా
రంగబలి హీరోయిన్ యుక్తిత రేజా తన నడుము మడతలకు పై భాగంలో కమలం పువ్వు గర్తును టాటూగా వేయించుకుంది. అసలె సెక్సీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ టాటూ మరింత హాట్‌గా తయారైంది.
నిహారిక కొణిదెల
మెగా డాటర్ నిహారిక కొణిదెలకు సైతం టాటూస్ అంటే పిచ్చి. ట్రెండీ టాటూస్ వేయించుకుంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె కుడి కాలు మడిమపైనా వర్షించే మేఘం చిత్రాన్ని టాటూగా వేయించుకున్నారు. ఇది చాలా ట్రెండిగా ఉంటుంది. కొత్తగా టాటూస్ వెయించుకోవాలనుకునే వారికి ఇదొక మంచి ఐడియాగా చెప్పవచ్చు.
https://youtu.be/FQVYHolKhR0?si=0WfytTlwJwEcd9Lh
గతంలో నిహారిక తన వీపు వెనుక భాగంలో ఓ పిట్ట బొమ్మను టాటూగా వేయించుకుంది. ఇది కూడా మంచి లుక్‌ను అందిస్తుంది.
సంయుక్త మీనన్
మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నుంచి కూడా ట్రెండీ టాటూ ఐడియాలను ఫాలో అవ్వొచ్చు. ఆమె వీపు వెనుక భాగంలో మలయాళం అక్షరాల్లో సంచారి అని రాసి ఉంటుంది. ఆ అక్షరాలపైన ఎగిరే పక్షి గుర్తు టాటూగా కనిపిస్తుంది.
అలాగే తన ఎడమ చేతి మణికట్టుపై మహా యంత్రం గుర్తును టాటూగా వేయించుకుంది. ఇది కూడా అమ్మాయిలకు మంచి అందాన్ని ఇస్తుంది.
https://www.youtube.com/watch?v=f-3OJFK1IZs
తృప్తి డిమ్రి టాటూస్
న్యూ నేషనల్ క్రష్ తృప్తి డిమ్రి కుడి భుజం పై భాగంలో సూర్యుడు- నెలవంక గుర్తుతో టాటూ వేయించుకుంది. ఇది కూడా టాటూ లవర్స్‌కు మంచి ఐడియా అని చెప్పవచ్చు.
సమంత టాటూస్
సమంత మొత్తం మూడు టాటూలను తన శరీరంపై వేయించుకుంది. మొదటిది.. తన వీపు వెనుక భాగంలో YMC అని ఉంటుంది. అంటే ఆమె నటించిన మొదటి చిత్రం ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా ఈ టాటూ వేయించుకుంది.
మరొక టాటూ తన మాజీ భర్త నాగచైతన్య పేరును 'చై' అని నడుముకు పై భాగంలో వేయించుకుంది. మూడో టాటూను తన మణికట్టు పై భాగంలో రోమన్ సింబల్స్(డబుల్ యారోస్) రూపంలో వేయించుకుంది. వీటి అర్థం సొంతంగా నువ్వే ఏదైనా సృష్టించు అని.
View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
శృతి హాసన్ టాటూస్
అందాల తారా శృతి హాసన్ తన వీపు వెనుక భాగంలో తన పేరును తమిళంలో స్టైలీష్ గా టాటూ వేయించుకుంది. అలాగే తన కుడి చేతి మణికట్టు మీద రోజ్ ప్లవర్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూల విషయాన్ని శృతి హాసన్ స్వయంగా ఓ వీడియో ద్వారా చెప్పింది.
https://youtu.be/p9n950dfSyU?si=3YYtZPTgh4ICnxrh
రాశి ఖన్నా టాటూస్
గ్లామర్ డాల్ రాశి ఖన్నా తన రైట్ లెగ్ మడిమపైనా టిన్ని క్యాట్ చిత్రాన్ని టాటూగా వేయించుకుంది. ఈ తరహా టాటూలు కూడా సింప్లీ సూపర్బ్‌గా ఉంటాయి.
అనసూయ భరద్వాజ్ టాటూస్
అనసూయ ఒంటి మీద మొత్తం రెండు టాటూలు ఉన్నాయి. మొదటిది తన భర్త ముద్దు పేరును 'నిక్' అని ఇంగ్లీష్ తన చెస్ట్ మీద వేయించుకుంది. మరో టాటూను తన ఎడమ చేతి మణికట్టుపై కేలాన్ అని వేయించుకుంది. గ్రీకు భాషలో కేలాన్ అంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్ అని అర్థం.
ఫరియా అబ్దుల్లా టాటూస్
పాత బస్తీ పిల్ల ఫరియా అబ్దుల్లా అందంతో పాటు ట్రెండీగాను ఉంటుంది. తన ఎడమ కాలిపై ఎర్రటి వేర్ల గీతలు, నీలి రంగులో వృత్తం ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో పైకి ఎదగాలంటే పునాది అనేది చాలా అవసరం. ఈ అర్ధాన్ని వేర్లు చూపిస్తాయి. మన రూట్స్ ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలం అనేది ఈ టాటూ ఉద్దేశం.
View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah)
అనన్య నాగళ్ల టాటూ
గ్లామరస్ డాల్ అనన్య నాగళ్ల తన ఎడమ చేతి మణికట్టుపై క్రేజీ లైన్‌ను టాటూగా వేయించుకుంది. బిలైవ్, స్మైలీ అనే పదాలతో పాటు రెండు ఎగిరే పక్షులను టాటూగా వేయించుకుంది.
View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla)
మమతా మోహన్ దాస్ టాటూ
ఒకప్పుడూ టాలీవుడ్ గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందిన మమతా మోహన్ దాస్ తన ఎడమ చేతి భుజంపై వినాయకుడి ప్రతిమను టాటూగా వేయించుకుంది. టాటూ కింద శ్రీ ఓం గణేశా అని ఉంటుంది.
నేహా శర్మ టాటూస్
అందాల భామ నేహా శర్మ తన మణికట్టుపై Excelsior అనే పదాన్ని టాటూగా వేయించుకుంది. ఇది ‘అద్భుతమైది, “ఉన్నతం” అనే పదాలను సూచిస్తుంది.
శోభిత దూళిపాళ
శోభిత దూళిపాళ తన ఎడమ చేతిపై హార్ట్ బీట్ గుర్తును టాటూగా వేయించుకుంది. ఈ టైప్ టాటూ చాల మందికి ఫేవరెట్ అని చెప్పొచ్చు.
షిర్లి షెటియా
అందాల భామ షిర్లి షెటియా తన కుడి చేతి మణికట్టుపై డబుల్ యారోస్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూ అర్థం నువ్వు ఏదైనా సాధించగలవు అనే స్ఫూర్తి వ్యాఖ్యం గురించి చెబుతుంది.
View this post on Instagram A post shared by Vaidehi [ I Am Hip Hop Kid ] (@vaidehi_theperformer)
రుహాని శర్మ
రుహాని శర్మ తన ఎడమ చేతి మీద అర్ధ చంద్రకారాన్ని టాటూగా వేయించుకుంది. అలాగే మెడ వంపులపై టిన్ని బర్డ్స్‌ను టాటూగా వేసుకుంది.
అక్టోబర్ 22 , 2024
Double Ismart Vs Mr. Bachchan: పూరి జగన్నాథ్ భయపడ్డారా? అందుకే డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్ చేయడం లేదా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం ఆగస్టు 15 నుంచి తప్పుకోవడంతో ఆ డేట్‌లో మహా యుద్ధమే మెుదలైంది. రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) చిత్రాన్ని ఆ రోజున రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అప్పటికీ ఏ చిత్రం ఆ డేట్‌కు లాక్ కాకపోవడంతో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ‘డబుల్ ఇస్మార్ట్’ సోలోగా విడుదలవుతుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆగస్టు 15 రేసులోకి రవితేజ - హరీష్ శంకర్ కాంబోలోని ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) వచ్చి చేరింది. దీంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్‌కు తెరలేచింది. అయితే ఈ మధ్య ఇండస్ట్రీలో జరుగుతున్న వరుస పరిణామాలను చూస్తుంటే ఈ పోరులో డైరెక్టర్ పూరి వెనకపడ్డారా? అన్న సందేహం కలుగుతోంది. ఆయన భయపడ్డారన్న వాదనలు సైతం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
ఓ వైపు ప్రమోషన్స్.. మరోవైపు డిప్రెషన్!
ఆగస్టు 15కు సమయం దగ్గర పడుతుండటంతో ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) టీమ్ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. వరుసగా ప్రెస్ మీట్‌లు నిర్వహిస్తూ తమ సినిమాను ఆడియన్స్‌లోకి తీసుకెళ్తోంది. అయితే ‘డబుల్ ఇస్మార్ట్’ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. పూరి జగన్నాథ్ & కో ఇప్పటివరకూ ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. తమ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్‌ను షురూ చేయలేదు. సాధారణంగా ప్రమోషన్స్ అనేవి సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతాయి. అటువంటి కీలకమైన ప్రమోషన్స్‌ను ‘డబుల్ ఇస్మార్ట్’ ఇంకా మెుదలే పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15 రేసులోకి రావడంతో పూరి ఢీలా పడిపోయారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. హీరో రామ్‌తో పాటు తనకూ ఈ మూవీ సక్సెస్ ఏంతో కీలకమైన నేపథ్యంలో రిజల్ట్‌పై పూరి ఆందోళనతో ఉన్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వెనక్కి తగ్గని బచ్చన్ టీమ్!
పంద్రాగస్టు రోజున ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ కాకుండా ఉండేందుకు ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్ అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాను వాయిదా వేసుకోవాలని బచ్చన్ టీమ్‌ను వారు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి బచ్చన్ టీమ్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే డబుల్ ఇస్మార్ట్ నిర్మాత ఛార్మీ తాజాగా రవితేజతో పాటు దర్శకుడు హరీశ్ శంకర్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసినట్లు కూడా కథనాలు వచ్చాయి. మరోవైపు ‘లైగర్’ మూవీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి సైతం ‘డబుల్ ఇస్మార్ట్’కు సమస్యలు ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. లైగర్ నష్టాలను సెటిల్ చేయకుండా పూరి మరో ఫిల్మ్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధం కావడంపై డిస్ట్రిబ్యూటర్ల కోపం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్ ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.
వ్యూహామా లేదా గందరగోళమా?
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ లేకపోవడం వెనక ఓ వ్యూహాం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ పూరి కూడా ‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను అనుసరిస్తున్నట్లు చెప్పారు. కేవలం కంటెంట్ (ట్రైలర్, టీజర్, లిరికల్ సాంగ్స్, ప్రమోషన్ పోస్టర్లు) ద్వారానే తమ సినిమాను ప్రమోట్ చేయాలని ఇస్మార్ట్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘లైగర్’ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ఇచ్చి చేతులు కాల్చుకున్న నేపథ్యంలో మరోమారు ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అయితే ఇండస్ట్రీలో మరికొందరి వాదన ఇంకోలా ఉంది. డిస్ట్రిబ్యూటర్ల గొడవ, మిస్టర్ బచ్చన్ టీమ్‌తో సంప్రదింపులు నేపథ్యంలో ప్రస్తుతం ఇస్మార్ట్ టీమ్ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టలేకపోతోందని అంటున్నారు. టీమ్ అంతా గందరగోళంలో ఉన్నందువల్ల ఇంకా ప్రమోషన్స్ షురూ కాలేదని చెబుతున్నారు.
ఆ ఇష్యూ వల్లే రిలీజ్ చేస్తున్నాం: హరీశ్ శంకర్
రీసెంట్‌గా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇస్మార్ట్ టీంతో ఉన్న వివాదంపై స్పందించారు. పూరి జగన్నాథ్ సినిమాతో పాటు మీ సినిమా ఒకేసారి విడుదల కాబోతుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని రిపోర్టర్ అడుగగా హరీశ్ శంకర్ సమాధానం ఇచ్చారు. 'పూరితో నేను పోల్చుకోలేను. ఆయన ఒక దిగ్గజం. ఆయనతో నా సినిమా వస్తుండటం నా అదృష్టం. నిజానికి రెండు సినిమాలు ఒకే డేట్‌కి రావడం వెనుక ముఖ్య కారణం ఓటీటీ ఇష్యూ ఉండడం. అందుకే ముందుగా రిలీజ్ చేస్తున్నా. అంతేకాని నాకు పూరి సర్‌కి ఎలాంటి గొడవలు లేవు’ అంటూ హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు.
ఆగస్టు 01 , 2024
OTT Suggestions: ఈ చిత్రం 7 ఆస్కార్ అవార్డులు కొట్టింది… తెలుగులో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా చూశారా?
ఓటీటీలో ప్రతీ వారం పదుల సంఖ్యలో చిత్రాలు, సిరీస్‌లు రిలీజవుతుంటాయి. వాటిలో ఏది చూడాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. అద్భుతమైన చిత్రాలు ఏమైనా ఉన్నాయా? అని తెగ సెర్చ్ చేస్తుంటారు. అటువంటి వారి కోసం YouSay ఓ మంచి హాలీవుడ్ చిత్రాన్ని తీసుకొచ్చింది. 95వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో సత్తా చాటిన ఆ చిత్రం.. మీ వీకెండ్‌ను ఫుల్‌ఫిల్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందుకు చూడాలి? తెలుగులో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఇప్పుడు చూద్దాం.
ఆ సినిమా ఏదంటే?
2023లో 95వ ఆస్కార్స్ అవార్డ్స్ కోసం అత్యధిక నామినేషన్స్‌ను సొంతం చేసుకున్న సినిమాగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ (Everything Everywhere All at Once) సినిమా నిలిచింది. మొత్తం 11 విభాగాల్లో నామినేషన్స్‌ను పొందిన ఈ సినిమా ఏకంగా 7 ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుని యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో ఈ సినిమాను చూసేందుకు తెలుగు ఆడియన్స్ కూడా తెగ ప్రయత్నించారు. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లీవ్ (SonyLIV)లో మెుదట ఇంగ్లీష్ వెర్షన్ మాత్రమే రిలీజ్ కావడంతో నిరాశ చెందారు. తెలుగు వెర్షన్ కోసం కొన్ని రోజులు ఎదురు చూసినా రాకపోవడంతో తమ పనుల్లో పడిపోయి సినిమా గురించి మర్చిపోయారు. అయితే ప్రస్తుతం ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ తెలుగు వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను మిస్ అయ్యామని బాధపడుతున్నా వారంతా ఈ వీకెండ్ చూసేయండి.
https://twitter.com/i/status/1634197587438731264
ఊహకందని కాన్సెప్ట్‌తో..
హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవారికి ‘మల్టీవర్స్’ (Multiverse) అనే పదం చాలా సుపరిచతం. మార్వెల్ సినిమాలు అన్నీ దాదాపుగా ‘మల్టీవర్స్’ కాన్సెప్ట్‌తోనే వచ్చాయి. ఈ ఆస్కార్ విన్నింగ్ చిత్రం ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ కూడా దాదాపుగా అదే కాన్సెప్ట్‌తో రూపొందింది. మనిషిని పోలిన మనుషులు మిగిలిన ప్యారలాల్ యూనివర్స్‌లలో ఉంటారనే పాయింట్‌తో దర్శకులు డేనియల్ క్వాన్, డేనియల్ షైనెర్ట్ ఈ మూవీని తెరకెక్కించారు. హాలీవుడ్‌లో బ్లాక్‌బాస్టర్ విజయం అందుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద డాలర్ల వర్షం కురిపించింది.
కథ కోసం 8 ఏళ్ల శ్రమ
కొత్త తరహా సినిమాను ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశ్యంతో దర్శకుడు క్వాన్, షైనెర్ట్.. 2010లోనే ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ కథ రాయడం మొదలుపెట్టారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు కేవలం కథపైనే దృష్టి పెట్టిన వీరిద్దరు.. 2018లో తమ సినిమాను ప్రకటించారు. 2020లో ఈ సినిమా చిత్రీకరణ మెుదలు కాగా.. 2022లో దీన్ని విడుదల చేశారు. 2 గంటల 19 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. సుమారు 25 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం.. పెట్టిన డబ్బు కంటే నాలుగురెట్లు అధికంగా వసూళ్లు రాబట్టింది. దాదాపు 108 మిలియన్ డాలర్లు ఈ చిత్రం వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు.
కథేంటి
‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ (Everything Everywhere All At Once).. ఇదొక సైన్స్ ఫిక్షన్ చిత్రం. మిషెల్ యో, కి హుయ్ క్వాన్, జామీ లీ కర్టిస్ వంటి తారాగణంతో ఇది రూపుదిద్దుకుంది. కథలోకి వెళ్తే.. ఎవిలిన్ క్వాడ్ అనే చైనీస్ మహిళ కుటుంబంతో అమెరికాకు వలస వచ్చి లాండ్రీ షాపు పెట్టుకుంటుంది. అనుకోకుండా ఒకరోజు వేరే ప్రపంచం నుంచి వచ్చిన తన లాంటి వాళ్లే ఆమెకు ఎదురవుతారు. ఆ మల్టీవర్స్ కలిగించే ప్రమాదాల వల్ల ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది? తన కుటుంబాన్ని ఎలా కాపాడింది? కాలంతో పోరాడుతూ బ్లాక్ హోల్ ప్రమాదం నుంచి విశ్వాన్ని ఏ విధంగా రక్షించింది? అనే ఆసక్తికర అంశాలతో సినీ ప్రియులను ఆకట్టుకునేలా దీన్ని రూపొందించారు.
Telugu.yousay.tv Rating : 3.5/5
ఏప్రిల్ 13 , 2024
Mahesh Babu Trolls: మీమర్స్ స్టఫ్‌గా మారిపోయిన మహేష్ బాబు.. ఒక్క వీడియోపై ఇన్ని ట్రోల్సా!
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవల ఓ బిజినెస్ మ్యాన్ పుట్టినరోజు వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. మాల్దీవుల్లో జరిగిన ఈ సెలబ్రేషన్స్‌కు మహేష్‌తో పాటు టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, అఖిల్, వెంకటేష్ హాజరయ్యారు. సెలబ్రిటీలంతా కలిసిన దిగిన ఓ ఫొటో ఇటీవల బయటకు రాగా అది క్షణాల్లో నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా మరికొన్నిఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో మహేష్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ ట్రోలింగ్ (Mahesh Babu Trolls)కు గురవుతోంది. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహేష్ మరీ ఇంత ఇంట్రోవర్టా?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్రోవర్ట్ (Mahesh Babu Trolls) అన్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా ఫంక్షన్స్‌లో చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. తన మూవీ ఈవెంట్ అయినా కూడా కొద్ది మాటలతోనే ముగిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మహేష్ ఎంత ఇంట్రోవర్టో మరోమారు బయటపడింది. ఈ వీడియోలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అందరూ బర్త్‌డే బాయ్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటే మహేష్ మాత్రం పక్కనే కొంచెం గ్యాప్‌తో సైలెంట్‌గా నిల్చున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుంటే మహేష్ మాత్రం పక్కన ఫొటోకి ఫోజు ఇచ్చినట్లు నిలబడిపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మహేష్‌ను చూసి నవ్వుకుంటున్నారు. మహేష్ మరీ ఇంత ఇంట్రోవర్టా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1856609040123441371
మీమర్స్ స్టఫ్‌గా మహేష్..!
అయితే మహేష్ బాబు తాజా వీడియోను ఇంట్రోవర్ట్స్ అంతా ఓన్ చేసుకుంటున్నారు. ఇంట్రోవర్ట్స్ కమ్యూనిటీలోకి స్వాగతం అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆ వీడియోను పలు రకాలుగా ఎడిటింగ్ చేసి మీమ్స్ స్టఫ్ (Mahesh Babu Trolls)గా వాడుకుంటున్నారు. ‘మహేష్ బాబు.. సేమ్ టూ సేమ్ నాలాగే’ అంటూ ఇంట్రోవర్ట్స్ పోస్టులు పెడుతున్నారు. తాము కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుంటామని తెలియజేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్‌పై మహేష్ అభిమానులు మాత్రం తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. 'నిండు చంద్రుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు' అంటూ సమర్థించుకుంటున్నారు. నలుగురిలో ప్రత్యేకంగా ఉండటం తమ హీరోకు అలవాటని వెనకేసుకొస్తున్నారు.
https://twitter.com/Sampath01266745/status/1856890678778773683
https://twitter.com/ursbhargav_1/status/1856738857888473213
https://twitter.com/Memuchalabusy_2/status/1856590047505723771
ధనుష్ కోసం మహేష్..
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న లేటెస్ట్ చిత్రం 'కుబేర'. తమిళ స్టార్ హీరో ధనుష్ ఇందులో హీరోగా చేస్తున్నాడు. టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. రేపు (నవంబర్ 15) కార్తీక పౌర్ణమి సందర్భంగా ‘కుబేర’ గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ గ్లింప్ల్ విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. కాగా ఈ మూవీలో ధనుష్, నాగార్జున మధ్య వచ్చే సీన్స్ చాలా వైవిధ్యభరితంగా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
https://twitter.com/SVCLLP/status/1856645705110298753
మహేష్ లేటెస్ట్ లుక్ అదుర్స్!
బిజినెస్ మ్యాన్ బర్త్‌డే ఫంక్షన్‌లో మహేష్‌కు సంబంధించి మరిన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. పార్టీ ఇచ్చిన బిజినెస్ మ్యాన్ కపుల్స్‌తో మహేష్ దంపతులు ఫొటోలు దిగారు. ఈ ఫొటోల్లో మహేష్ లుక్ అదిరిపోయింది. గతంలో వచ్చిన పిక్స్‌లో మహేష్ గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో కనిపించాడు. లేటెస్ట్ పిక్స్‌లో మాత్రం అతడి హెయిర్ కాస్త షార్ట్ అయ్యింది. అలాగే గడ్డాన్ని కూడా ట్రిమ్ చేశాడు. పూర్తిగా ఉంగరాల జుట్టుతో కనిపించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ రాజమౌళి సినిమాలో మహేష్ ఇలాగే కనిపిస్తారేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
https://twitter.com/Nikhil_Prince01/status/1856562711074636174
హైదరాబాద్‌లో వారణాసి సెట్!
రాజమౌళి - మహేష్ బాబు (SSMB29) చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ వారణాసి నేపథ్యంలో మెుదలవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత సౌతాఫ్రికాకు షిఫ్ట్ అవుతుందని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వారణాసి షెడ్యూల్ మెుత్తాన్ని ఓ సెట్‌లో పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నారట. దాని కోసం హైదరాబాద్ శివార్లలో భారీ కాశీ సెట్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కథ మెుత్తం అటవీ నేపథ్యంలో సాగనుండటంతో అందుకు అనువైన ప్రదేశాన్ని జక్కన్న టీమ్ రెక్కీ చేస్తున్నట్లు సమాచారం. లోకేషన్ ఫైనల్ కాగానే సెట్ నిర్మాణ పనులను మెుదలుపెడతారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
నవంబర్ 14 , 2024
Pushpa 2: ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ‘పుష్ప 2’ పరిస్థితి? కలెక్షన్స్ భారీగా పడిపోవడం ఖాయం!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన పుష్ప గ్లింప్స్, ప్రమోషన్ పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించడంతో ఆ రోజు కోసం.. సినీ ప్రేక్షకులు, బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదా పడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చెప్పిన తేదీకే సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్స్‌లో భారీగా కోత పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
పుష్ప 2 వాయిదా..!
ప్రస్తుతం ‘పుష్ప 2’ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మారింది. ఈ సినిమాను ఆగస్టు 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్ది నెలల క్రితం ప్రకటించారు. అందుకు తగ్గట్లే శరవేగంగా షూటింగ్ సైతం నిర్వహిస్తున్నారు. జూన్ ఎండింగ్ నాటికి షూటింగ్ ముగించాలని దర్శకుడు సుకుమార్ టార్గెట్ పెట్టుకోగా.. అది పూర్తయ్యే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది. సినిమా షూట్ పూర్తి కావడానికి ఇంకో నెల రోజుల సమయం పడుతుందని సమాచారం. అంటే జులై ఎండింగ్‌కి పుష్ప 2 షూట్ కంప్లీట్ కానుందట. కాబట్టి మిగిలిన 15 రోజుల్లో ప్రీ రిలీజ్ వర్క్ చేయడం అసాధ్యం కాబట్టి.. 'పుష్ప 2' పోస్ట్ పోన్ చేస్తే బెటర్ అని చిత్ర యూనిట్ భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. ఇది తెలిసిన ఫ్యాన్స్ తీవ్రంగా డిసప్పాయింట్ అవుతున్నారు.
సుకుమార్ అసంతృప్తి
పుష్ప 2 చిత్రానికి ఎడిటర్‌గా కార్తిక్ శ్రీనివాస్ పనిచేశారు. కొద్ది నెలల పాటు యూనిట్‌తో కలిసి ట్రావెల్ చేసిన అతడు పలు కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో నవీన్ నూలి వచ్చి ఫైనల్ కట్స్ చేశారు. అయితే ఆ ఫైనల్ ఔట్‌పుట్‌పై సుకుమార్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పైగా కొన్ని ఎపిసోడ్స్‌ను సుకుమార్ రీడిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆగస్టు 15 నాటికి సినిమాను రెడీ చేయడం కష్టమని మూవీ యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.
కలెక్షన్స్‌లో భారీ కోత!
పాన్ ఇండియా స్థాయి సినిమా అంటే విడుదల తేదీ పక్కాగా ఉండాలి. అలా లేకుంటే దాని ప్రభావం కలెక్షన్స్‌పై కూడా పడుతుంది. ‘పుష్ప 2’ను ఆగస్టు 15నే రిలీజ్ చేస్తే.. కలెక్షన్ల పరంగా బన్నీకి భారీ షాక్ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే రోజున తమ చిత్రాలు రిలీజ్ చేసేందుకు ముగ్గురు బడా హీరోలు సిద్ధమవుతున్నారు. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తున్న 'తంగలాన్' (Thagalaan) చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగణ్ (Ajay Devgan) కూడా తన ‘సింగం ఎగైన్’ (Singham Again) చిత్రాన్ని ఆ రోజునే తీసుకురావాలని చూస్తున్నారట. అలాగే స్టార్ నటుడు జాన్ అబ్రహం (John Abraham) నటించిన 'వేద' (Veeda) ఆగస్టు 15న తీసుకొస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ మూడు భారీ చిత్రాలు బరిలో ఉండగా వాటిని తట్టుకొని ‘పుష్ప 2’ పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్స్ రాబట్టగలదా? అన్న సందేహం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అజయ్ దేవగన్, జాన్ అబ్రహం చిత్రాల రిలీజ్ ఉన్న నేపథ్యంలో నార్త్‌లో ‘పుష్ప 2’ కలెక్షన్లపై భారీగా ప్రభావం పడొచ్చని అంటున్నారు.
పవన్ అభిమానుల్లో ఆగ్రహం
ప్రస్తుతం అల్లు అర్జున్‌పై పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఏపీ ఎన్నికల సందర్భంగా వైకాపా అభ్యర్థి తరపున బన్నీ ప్రచారం చేయడాన్ని మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ మూవీని బాయ్‌కాట్ చేస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు బుధవారం (జూన్ 12) జరిగిన పవన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సైతం బన్నీ హాజరు కాకపోవడంతో ఫ్యాన్స్ మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఇన్ని కష్టాల మధ్య ఇప్పట్లో ఈ మూవీని రిలీజ్ చేయకపోవడమే మంచిదని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జూన్ 13 , 2024
Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్ తెలుసా?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్ తొలి సారి వచ్చిన ‘ఆర్య’ (Arya) చిత్రం అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. వన్ సైడ్ లవ్ అనే ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత క్రమంగా పుంజుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. చాలా థియేటర్లలో 125 రోజులకు పైగా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే 2004 మే7న ఈ సినిమా రిలీజ్ కాగా, నేటితో సరిగ్గా 20 ఏళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో ఆర్యకు సంబంధించిన తెర వెనక రహాస్యాలపై ఓ లుక్కేద్దాం.
దిల్ సక్సెస్‌తో సుకుమార్‌కు ఛాన్స్
నితీన్ హీరోగా చేసిన ‘దిల్’ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో నిర్మాత దిల్ రాజుకు సుకుమార్ ‘ఆర్య’ స్టోరీ వినిపించారు. ఇంప్రెస్ అయిన అతడు.. ‘దిల్’ సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా అని సుకుమార్‌కు మాటిచ్చారు. ఈ లోపు పూర్తి కథ సిద్ధం చేసుకో అని సూచించారు. ఆ తర్వాత రిలీజైన ‘దిల్’.. బ్లాక్ బాస్టర్ కావడంతో సుకుమార్‌కు డైరెక్టర్ ఛాన్స్ వచ్చింది. పలు దఫాల చర్చల తర్వాత ఆర్య సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడింది.
మిస్ చేసుకున్న అల్లరి నరేష్
ఆర్య చిత్రానికి తొలుత హీరోగా అల్లరి నరేష్‌ను సుకుమార్ అనుకున్నారట. అతడ్ని దృష్టిలో పెట్టుకొనే కథను కూడా రాశారట. అయితే కొన్ని కారణాల వల్ల కథ ఆయన వరకూ వెళ్లలేదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్యూలో నరేష్ స్వయంగా పంచుకున్నారు. ‘సుకుమార్ ‘100%లవ్’ సినిమా తీస్తున్న సమయంలో నన్ను కలిశారు. ‘‘అల్లరి’లోని మీ నటన నన్ను ఆకట్టుకుంది. ‘ఆర్య’ కథ మీ కోసం రాసుకున్నా’’ అని చెప్పారు. ఎవరికి రాసి పెట్టి ఉన్న కథ వారి వద్దకే వెళ్తుంది. ఆయన దృష్టిలో పడ్డానంటే నటుడిగా నేనేదో చేస్తున్నట్లే లెక్క. ఆర్యగా అల్లు అర్జున్ కంటే బాగా ఎవరూ చేయలేరు’ అని నరేశ్ అన్నారు.
https://twitter.com/i/status/1787548147520061468
బన్నీని అలా ఫైనల్ చేశారు!
ఆర్య కథ సిద్ధమైన తర్వాత హీరోను ఎవరు పెట్టాలన్న సందేహం కొన్ని రోజుల పాటు దర్శక నిర్మాతలను వెంటాడిందట. హీరో కోసం వెతుకున్న క్రమంలోనే దిల్ మూవీ స్పెషల్ షో నిర్వహించారు. ఆ సమయంలో బన్నీ కూడా వెళ్లాడు. అల్లుఅర్జున్ చలాకీ తనం, కామెడీ టైమింగ్ చూసి తన కథకు బన్నీ అయితేనే సరిగ్గా సరిపోతాడని దిల్ రాజుతో సుకుమార్ అన్నాడట. వెళ్లి అల్లు అర్జున్‌తో మాట్లాడరట. గంగోత్రి తర్వాత చాలా కథలు విని విసిగిపోయిన బన్నీ రొటీన్ స్టోరీ అనుకొని నో చెప్పారట. ఎట్టకేలకు విన్నాక కథ బన్నీకి బాగా నచ్చిందట. అటు చిరంజీవి, అల్లు అరవింద్‌కు కూడా ఇంప్రెస్ కావడంతో సినిమా పట్టాలెక్కింది.
అసిస్టెంట్‌గా చేసిన స్టార్ డైరెక్టర్
కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల.. ఆర్య మూవీకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అంతేకాదు ఓ సీన్‌లోనూ ఆయన కనిపించాడు. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలోనూ తొలుత కాస్త గందరగోళం నెలకొందట. ఈ వన్‌సైడ్ లవ్ స్టోరీకి ఏ పేరు పెడితే బాగుంటుందా? అని దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజు తెగ ఆలోచించారట. ఈ క్రమంలో ‘నచికేత’ టైటిల్ పెడితే ఎలా ఉంటుదని చిత్ర యూనిట్ యోచించిందట. చివరకు బన్నీ పాత్ర పేరునే టైటిల్‌గా ఫిక్స్ చేశారట.
https://twitter.com/i/status/1787674074585714980
120 రోజుల్లో షూటింగ్ పూర్తి
ఆర్య చిత్ర షూటింగ్‌ను దర్శకుడు శరవేగంగా పూర్తి చేశాడు. 2003 నవంబరు 19న ఈ సినిమా లాంఛనంగా మెుదలవ్వగా.. 120 రోజుల్లోనే పూర్తి చేశారు. అటు సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో తొలిసారి వచ్చిన ఈ మూవీ ఆల్బమ్.. మ్యూజిక్ లవర్స్‌ను ఫిదా చేసింది. ముఖ్యంగా తెలుగు అక్షరాలమాలకు కొత్త అద్దం చెప్పే ‘అ అంటే అమలాపురం..’ పాట అప్పట్లో మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆటోలు, ట్రాక్టర్లు, ఫంక్షన్లు, ఈవెంట్స్ ఇలా ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపించేది.
ఆర్యతో వారికి స్టార్‌డమ్
ఆర్య సినిమా సక్సెస్.. డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, డీవోపీ రత్నవేలు జీవితాలను మార్చివేసింది. వారి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. గంగోత్రి తర్వాత బన్నీ చేసిన రెండో చిత్రం ఆర్య. ఈ సినిమాలో బన్నీ స్టైల్, డ్యాన్స్, గ్రేస్, యాక్షన్ చూసి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆర్య వచ్చి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా హీరో బన్నీ ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్టును సైతం పెట్టాడు. 'నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం.. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను' అని బన్నీ పోస్టు పెట్టాడు.
మే 07 , 2024
Jr.NTR: తారక్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా? ఫొటో వైరల్!
దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) చిత్రం తర్వాత.. జూ. ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. భీమ్ పాత్రలో తారక్ నటన చూసి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ప్రతిష్టాత్మక హిందీ చిత్రం ‘వార్ 2’ (War 2)లో తారక్ నటించే అవకాశం దక్కింది. కాగా, ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్‌లో జూ.ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన తారక్ ఫొటో ఒకటి.. నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో తారక్ లుక్ పూర్తిగా మారిపోయింది. దీంతో తారక్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా? అన్న సందేహాలను సోషల్ మీడియాలో వ్యక్తమయ్యాయి.
అసలేం జరిగిదంటే?
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన 'వార్' చిత్రం.. 2019లో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘వార్ 2’లో తారక్ నటిస్తుండటంతో ఇప్పటి నుంచే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) కూడా నటిస్తున్నట్లు సమాచారం. అయితే వార్ 2 షూటింగ్ కోసం ముంబయి వెళ్లిన తారక్‌తో ఈ బ్యూటీ ఓ సెల్ఫీ దిగింది. వీరిద్దరు జిమ్‌లో ఈ సెల్ఫీ దిగగా.. ఇందులో తారక్ చాలా యంగ్‌గా కనిపించాడు. ఈ ఫొటోలో తారక్ లుక్ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తారక్.. ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా చేయించుకున్నాడా? అని కొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేశారు. అయితే ఊర్వరి ఈ ఫోటోను ఫిల్టర్ చేసి పోస్టు చేసిందని తెలియడంతో అంతా నవ్వుకుని ఊరుకున్నారు. ఫిల్టర్ ద్వారా నీ అందం పెంచుకునేందుకు.. మా తారక్ అన్నను ఇలా మార్చేశావా? అంటూ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela)
తారక్ జోడీగా యానిమల్ బ్యూటీ!
బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ (Triptii Dimri).. యానిమల్ చిత్రంలో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది. రాత్రికి రాత్రే ఈ భామకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారంలో 'వార్ 2' కోసం దీప్తి దిమ్రీని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే త్రిప్తిని తారక్‌కు జోడీగా తీసుకున్నారా? లేదా హృతిక్ రోషన్‌కి జంటగానా అనే దానిపై స్పష్టత లేదు. అయితే ఇప్పటికే హీరోయిన్‌గా కియారా అద్వానీ ఎంపికైన నేపథ్యంలో త్రిప్తి దిమ్రీ తారక్‌కు జోడీగా నటించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పది రోజులు అక్కడే..
యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ 'వార్ 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తారక్ కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న ఓ ఇండియన్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసం తారక్ రెండ్రోజుల క్రితం ముంబయిలో అడుగుపెట్టాడు. పది రోజుల పాటు అతడు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటాడు. వార్ 2 కోసం తారక్ 60 రోజుల కాల్షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబయిలో తారక్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 15 , 2024
NBK110: బాలయ్య - బోయపాటి చిత్రానికి ముహోర్తం ఫిక్స్.. ఇక బాక్సాఫీస్‌కు ఊచకోతే!
నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ (Bobby) కాంబినేషన్‌లో ఓ సినిమా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ‘NBK109’గా ఇది ప్రచారంలో ఉంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా గ్లింప్స్‌ను ఇటీవలే శివరాత్రి సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో బాలకృష్ణ ఎప్పటిలాగే పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపించారు. ఈ చిత్ర నిర్మాణంలో త్రివిక్రమ్ సొంత సంస్థ ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం విశేషం. ‘NBK109’ సినిమా తర్వాత బాలయ్య తన 110వ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
బాలయ్య - బోయపాటి కాంబో రిపీట్!
టాలీవుడ్‌లో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన సింహా (Simha), లెజెండ్ (Legend), అఖండ (Akhanda) చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. లేటెస్ట్ బజ్ ప్రకారం బాలకృష్ణ తన ‘NBK110’ చిత్రాన్ని బోయపాటి శ్రీనుతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య 110వ చిత్రానికి చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించినప్పటికీ చివరకూ బోయపాటి శ్రీనును ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ‘NBK110’ మూవీ కోసం బోయపాటి పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కోరిక మేరకు కొన్ని మార్పులు కూడా జరుగుతున్నట్లు టాక్. ఈ చిత్రంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
నెక్స్ట్ చిత్రం 'అఖండ 2' కాదా?
బాలకృష్ణ 110వ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ (Allu Aravind) నిర్మించనున్నారు. ‘అఖండ’ తర్వాత తమ కాంబోలో సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీను అప్పట్లోనే ప్రకటించారు. అయితే ‘అఖండ’ చిత్రాన్ని అప్పట్లో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. మరి ఇప్పుడు ఆయన ప్రమేయం లేకుండా 'అఖండ 2' (Akhanda 2) నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు. దీని బట్టి బాలయ్య - బోయపాటి కాంబోలో 'అఖండ 2' కాకుండా మరో కొత్త చిత్రం రూపొందుతుందా? అన్న సందేహం కలుగుతోంది. బాలయ్య, బోయపాటి చిత్రానికి ఏప్రిల్ 9 ముహోర్తం కుదరినట్లు తెలుస్తుండగా ఆ రోజే ఈ చిత్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, ‘NBK110’ చిత్రానికి థమన్ సంగీతం అందింబోతున్నారు.
ఏపీ ఎన్నికల తర్వాతే షూట్!
ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి మెుదలైన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే రాజకీయాల్లో బిజీ కానున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK109’ చిత్రాన్ని వేగంగా ఫినిష్ చేసేందుకు బాలకృష్ణ యత్నిస్తున్నారట. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్‌ను త్వరగా పూర్తి చేసి ఎన్నికల వరకూ తన ఫోకస్‌ను ఏపీ రాజకీయాలపై పెట్టాలని బాలయ్య భావిస్తున్నారట. ప్రస్తుతం బాలయ్య.. ఏపీలో హిందూపురం టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. స్థానికంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బోయపాటితో చేయనున్న ‘NBK110’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏపీ ఎన్నికల తర్వాతే జరగనున్నట్లు తెలుస్తోంది.
నాని డైరెక్టర్‌తో సినిమా!
ఇప్పటికే తన లైనప్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులను పెట్టుకున్న బాలకృష్ణ.. మరో యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. 'ట్యాక్సీవాలా' (Taxiwala)తో వచ్చి 'శ్యామ్ సింగ రాయ్' (Shyam Singha Roy)తో భారీ సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) చెప్పిన కథకు బాలయ్య దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మధ్యనే రాహుల్.. బాలయ్యను కలిసి ఒక పిరియాడికల్ స్టోరీ లైన్ గురించి చర్చించాడట. ఆ పీరియాడిక్ డ్రామా బాలయ్యకు నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా కథ.. బాలయ్యకు పూర్తిగా నచ్చితే ఈ మూవీ కూడా కన్ఫామ్ కానుంది.
మార్చి 14 , 2024
Animal Park Villain: ‘యానిమల్ పార్క్’లో విలన్‌గా స్టార్ హీరో.. సందీప్ రెడ్డి వంగా లక్ష్యమదే!
యానిమల్’ (Animal) చిత్రంతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. యాక్షన్ ప్రియులకు కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన ఈ సినిమాకు ‘యానిమల్ పార్క్’(Animal Park) అనే టైటిల్‌తో ఈ సీక్వెల్ రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించి క్రేజీ బజ్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
విలన్‌గా స్టార్ హీరో!
‘యానిమల్ పార్క్’లో విలన్‌గా రణ్‌బీర్‌ను పోలిన వ్యక్తినే ఉంటాడని తొలి పార్ట్ క్లైమాక్స్‌లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చూపించారు. అయితే తాజా బజ్ ప్రకారం బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో.. అందులో ప్రతినాయకుడిగా కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. షారుక్ ఖాన్ 'డంకీ' చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన 'విక్కీ కౌశల్' (Vicky Kaushal).. యానిమల్ పార్క్‌లో మెయిన్ విలన్‌గా చేయనున్నట్లు రూమర్స్ మెుదలయ్యాయి. ఇదే నిజమైతే రణ్‌బీర్ వర్సెస్ విక్కీ కౌశల్ పోరు ఆసక్తికరంగా మారనుంది. వీరిద్దరు ప్రత్యర్థులు అయితే తెరపై విధ్వంసమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
‘యానిమల్ పార్క్’ ఇప్పట్లో లేనట్లే!
'యానిమల్' సినిమా దెబ్బకు దేశంలోని టాప్ డైరెక్టర్ల జాబితాలోకి సందీప్ రెడ్డి వంగా చేరిపోయాడు. ప్రస్తుతం అతడు యానిమల్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే సందీప్ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటన్న దానిపై చాలా రోజుల నుంచి స్పష్టత లేదు. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చిత్రాన్ని ఇప్పటికే సందీప్ ఇప్పటికే ప్రకటించగా.. మరోవైపు యానిమల్ పార్క్‌కు సంబంధించిన కథను కూడా అతడి టీమ్ సిద్ధం చేస్తోంది. దీంతో ఈ రెండు చిత్రాల్లో తొలుత ఏది పట్టాలెక్కుతుందోనన్న సందేహం సినీ వర్గాల్లో ఏర్పడింది. అయితే దీనిపై తాజాాగా సందీప్ క్లారిటీ ఇచ్చాడు. ఓ వేడుకలో పాల్గొన్న సందీప్.. యానిమల్ పార్క్ ఇప్పట్లో రాదని క్లారిటీ ఇచ్చేశాడు. ముందు ప్రభాస్ స్పిరిట్ చేయాలని దాని తర్వాతే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.
యానిమల్ సీక్వెల్ లక్ష్యమదే!
గతంలో ‘యానిమల్’ సీక్వెల్ గురించి మాట్లాడుతూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయని పేర్కొన్నాడు. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్ పార్క్’ లక్ష్యంగా చెప్పుకొచ్చాడు. ‘యానిమల్ పార్క్‌లో ఊహించనన్ని యాక్షన్ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది. ‘యానిమల్’ చిత్రం ప్రేక్షకుల్లో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల వచ్చిన అత్యంత సాహసోపేతమైన.. అసాధారణమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది’’ అన్నారు.
‘విక్కీ కౌశల్’ ఎవరో తెలుసా?
యానిమల్ పార్క్‌లో విక్కీ కౌశల్ విలన్‌గా చేస్తారన్న వార్తలతో సోషల్ మీడియాలో అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. విక్కీ గురించి తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా తెలియకపోవచ్చు గానీ, బాలీవుడ్‌లో అతడు స్టార్ హీరో. ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif)కు స్వయాన భర్త. 2019లో వచ్చిన ‘ఉరి’ (Uri: The Surgical Strike) సినిమా ముందు వరకూ చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన విక్కీ ఆ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. రీసెంట్‌గా షారుక్ ఖాన్ ‘డంకీ’ చిత్రంలో సుఖి పాత్రలో అదరగొట్టాడు.
ఫిబ్రవరి 29 , 2024
Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?
టాలీవుడ్ స్టార్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీ (Italy)లోని టస్కనీ (Tuscany)లో కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల మధ్య వీరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మ. 2.48 నిమిషాలకు వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్-ఉపాసన, బన్నీ దంపతులు సందడి చేశారు.
అంతకుముందు పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కాక్‌టేల్ పార్టీ (Cocktail party) నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం రాత్రి హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వధూవరులిద్దరూ పసుపు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు #VarunLav హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే వరుణ్ లావణ్య జంట ఇటలీనే పెళ్లి వేదికగా ఎందుకు ఎంచుకుందన్న సందేహం చాలా మందిలో ఉంది. ఎన్నో డెస్టినేషన్ వెడ్డింగ్ పాయింట్స్ ఉండగా ఇటలీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని చాలా మంది ప్రశ్న. అయితే దీనికి ఓ ప్రధాన కారణమే ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే.. 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమాతో వరుణ్ తేజ్ - లావణ్య మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా షూటింగ్‌లోనే ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. కాలక్రమేణా ఇద్దరూ ప్రేమికులుగా మారిపోయారు. అయితే ఆ సినిమా ఇటలీలోని షూటింగ్ జరుపుకోవడం విశేషం. అలా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమకు తొలి అడుగు ఇటలీలోనే పడింది.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠికి తన ప్రేమను ఇటలీలోనే వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఆ విధంగా తమ ప్రేమకు మూలమైన ఇటలీని, తాము పెళ్లి చేసుకోవడానికి వేదికగా మార్చుకున్నారు ఈ జంట. అంతేకాదు సుందరమైన ప్రాంతాలతో ఇటలీలోని టస్కనీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఎంతో ప్రసిద్ధిగాంచింది.
ఇక వీరిద్దరి పెళ్ళికి వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్ దంపతులు, నిహారిక, లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా హాజరయ్యారు. సమంత, నాగచైతన్య, రష్మిక మందాన, పూజ హెగ్డే కూడా వీరి పెళ్లికి హాజరైనట్లు తెలిసింది.
నవంబర్ 01 , 2023
Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ కాలిఫోర్నియాలోని శాన్ డియాగాలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ ‘కామిక్ కాన్’లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ‘ప్రాజెక్ట్ K’ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్ పాల్గొన్నారు.
గ్లింప్స్ చెప్పే సీక్రెట్స్ ఇవే!
కాగా, ప్రాజెక్ట్ K సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు. ఇక సినిమా టైటిల్ కింద ‘2898 AD’ అని పెట్టారు. అంటే కలియుగాంతం చివర్లో జరిగే కథ అని డైరెక్టర్ చెప్పకనే చెప్పాడు. గ్లింప్స్ చూస్తే సాధారణంగా ప్రపంచాన్ని చీకటి కమ్ముకున్నప్పుడు ఒక వెలుగు వస్తుంది అని, ప్రపంచాన్ని విలన్ తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు కల్కి ఉద్భవిస్తాడని, ప్రజల్ని కాపాడతాడని తెలుస్తుంది. అయితే గ్లింప్స్‌ను మరింత పరిశీలనగా చూస్తే చాలా విషయాలు మనకు అర్థమౌతాయి. కలియుగాంతం సమయంలో ఈ ప్రపంచం పూర్తిగా రోబోల మయంగా, ఆధునిక ఆయుధాలతో యుద్ధం జరిగే స్థాయికి వెళ్తుందని గ్లింప్స్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పైగా 2898 ADలో ప్రస్తుత స్థాయిలో జనాభా కాకుండా చాలా కొద్దిమంది ప్రజలే ఉండొచ్చని భావించవచ్చు. వారంతా ఓ వ్యక్తి (రాజు) పాలనలో జీవిస్తుండవచ్చు.
https://twitter.com/DEADLINE/status/1682221771154677760?s=20
అమితాబ్ పాత్ర నిడివి తక్కువేనా?
ప్రాజెక్ట్‌లో Kలో రాజు (అమితాబ్ బచ్చన్) తన ప్రజలని పాలిస్తుంటే ఒక విలన్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆ రాజుని బంధించి అతని ప్రజలని విలన్ తనకు బానిసలుగా చేసుకున్నట్లు గ్లింప్స్‌లో కనిపిస్తోంది. అలాంటప్పుడు రాజు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో వారిని ఆదుకునేందుకు కల్కి అవతారంలో హీరో (ప్రభాస్) ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. మూవీలో అయితే మొదట అమితాబ్ వచ్చి ఆ తర్వాత ప్రభాస్ వస్తాడని అర్థం చేసుకోవచ్చు. శివాలయంలోకి ఓ రోబో రావడం గ్లింప్స్‌లో చూశాం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడి క్యారెక్టర్‌లో అమితాబ్ నటిస్తున్నట్లు టాక్.
https://twitter.com/DEADLINE/status/1682129398600966146?s=20
ప్రభాస్ అందుకే కల్కి అవుతాడా?
ఇక ప్రాజెక్ట్ K అంటే ‘ప్రాజెక్ట్ కల్కి’ అని, ప్రభాస్‌తో లోకాన్ని కాపాడించడానికి కొంతమంది చేసే యుద్ధమని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. నిమిషం వీడియోతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్‌గా కథ మెుత్తం రివీల్ చేసినట్లు అర్థమవుతోంది. ఇక కొంచెం డీటేలింగ్‌లోకి వెళ్తే అమితాబ్ బచ్చన్‌తో పాటు హీరోయిన్ దీపికా పదుకొణేను కూడా విలన్లు బంధించినట్లు గ్లింప్స్‌లో చూపించారు. దీన్ని బట్టి ప్రభాస్ ఆమె కోసం వచ్చి కల్కి లాగా మారతాడా? అన్న సందేహం కూడా ఉత్పన్నమవుతుంది. లేదా హీరోయిన్‌ను కాపాడే క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా దీపికా, ప్రభాస్ మధ్య ప్రేమ సన్నివేశాలను కూడా బాగా ఎలివేట్ చేయాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ భావిస్తున్నారు.
చీకటికి రారాజు అతడే?
ఇకపోతే ఈ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రతినాయకుడిగా కనిపిస్తాడని మెున్నటి వరకూ ఊహాగానాలు వినిపించినా తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియోతో అది కన్‌ఫార్మ్ అయింది. ఎందుకంటే ప్రాజెక్ట్Kలో కమల్ హాసన్ నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సమయంలో ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. 'భూమి మెుత్తాన్ని కమ్మేసే షాడో (చీకటి) కోసం వెతికామని.. ఆ పాత్ర చేయగల ఒకే ఒక్కడు దొరికేశాడు' అని కమల్ గురించి ప్రకటించారు. తాజా గ్లింప్స్ కూడా భూమిని చీకటి కమ్మేయడం గమనించవచ్చు. ఈ రెండు కలిపి చూస్తే ఇందులో విలన్లకు రారాజుగా కమల్ హాసన్ కనిపిస్తాడని అర్థం చేసుకోవచ్చు.
https://twitter.com/i/status/1672854637014138880
సూపర్ రెస్పాన్స్
గ్లింప్స్‌ని చూస్తుంటే గూస్‌బమ్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు. విజువల్ వండర్‌గా, హాలీవుడ్ రేంజ్ సినిమాని తలపిస్తోందని చెబుతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ విజనరీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇక, సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మళ్లీ మళ్లీ వినాలనిపించే ట్రాక్‌ని అందించాడు. గ్లింప్స్ చూశాక మ్యూజిక్ హాంట్ చేస్తూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
https://twitter.com/THR/status/1682126315229683715?s=20
విడుదల తేదీ?
ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారం ఈ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ కావాలి. అయితే, గ్లింప్స్‌లో కేవలం 2024లో వస్తుందనే ఇచ్చారు. అంటే, మూవీ డేట్ మారుతుందనే సంకేతాలు ఇచ్చారు. మరి, జనవరి 12న కాకుండా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్‌కి అచ్చొచ్చిన ‘మే9’న కల్కిని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు ఇదే రోజున రిలీజ్ అయ్యాయి.
https://www.youtube.com/watch?v=bC36d8e3bb0
జూలై 21 , 2023
100cr CLUB: టాలీవుడ్‌లో ఇప్పటిదాకా రూ. 100 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలివే!!
తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాల హవా నడుస్తోంది. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే దాదాపు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందనే చెప్పాలి. సినిమాకు మార్కెట్ పెరగటంతో పాటు ప్రేక్షకులు కూడా అదేస్థాయిలో ఆదరిస్తున్న కారణంగా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. టాలీవుడ్‌లో ఈ జాబితాలో సుమారు 40 సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు 100 కోట్ల క్లబ్‌లో టాప్‌లో ఉన్నాడు.రూ.100 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు, హీరోలు ఎవరో ఓ సారి చూద్దాం.
హీరో -సినిమాలు
హీరో సినిమాలుమహేశ్‌బాబు6అల్లు అర్జున్5ప్రభాస్4ఎన్టీఆర్ 4చిరంజీవి 3రామ్ చరణ్ 3పవన్ కల్యాణ్3బాలకృష్ణ 2
మహేశ్ బాబు
100 కోట్లకు పైన కలెక్ట్ చేయాలంటే మహేశ్ బాబుకు సాధ్యం. ఎందుకంటే ఆయన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా సులభంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబడతాయి. మహేశ్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.
సినిమా కలెక్షన్‌సరిలేరు నీకెవ్వరు 237 కోట్లుసర్కారు వారి పాట192 కోట్లుమహర్షి 184 కోట్లుభరత్ అనే నేను178 కోట్లుశ్రీమంతుడు 153 కోట్లుదూకుడు 101 కోట్లు
ప్రభాస్
ఎక్కువ సినిమాలు మహేశ్‌కు ఉండొచ్చు గానీ ఎక్కువ కలెక్షన్లు మాత్రం ప్రభాస్‌వే. బాహుబలి లాంటి సినిమాలను కొట్టే సినిమా రావాలంటే అది మళ్లీ ప్రభాస్ నుంచే రావాలి.
సినిమాకలెక్షన్‌బాహుబలి-21749 కోట్లుబాహుబలి-1600 కోట్లుసాహో 417 కోట్లురాధేశ్యామ్151 కోట్లు
చిరంజీవి
ఈతరం హీరోలతో పోటీ పడుతూ రూ.100 కోట్ల క్లబ్‌లో దూసుకుపోవడం కేవలం మెగాస్టార్‌కే చెల్లింది. యంగ్ హీరోలను దాటి 3 సినిమాలు 100 కోట్లు వసూలు చేయడం బాస్ క్రేజ్‌కు నిదర్శనం
సినిమాకలెక్షన్‌సైరా నరసింహా రెడ్డి248 కోట్లువాల్తేరు వీరయ్య200 కోట్లుఖైదీ నం.150166 కోట్లు
అల్లు అర్జున్
పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఆ సినిమా కంటే ముందే 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. రాబోయే రోజుల్లో ఈ లిస్ట్‌లో బాస్‌గా ఎదిగేందుకు అల్లు అర్జున్‌కు చక్కటి అవకాశముంది.
సినిమాకలెక్షన్‌పుష్ప-ది రైజ్369 కోట్లుఅల వైకుంఠపురములో274 కోట్లుసరైనోడు 120 కోట్లుడీజే 115 కోట్లురేసు గుర్రం 102 కోట్లు
రామ్ చరణ్
RRRతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్‌చరణ్, అంతకు ముందే తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్‌కు వచ్చిన క్రేజ్‌కు ఈ లిస్ట్‌లో తన సినిమాలు పెరుగుతాయడనడంలో సందేహం లేదు.
సినిమాకలెక్షన్RRR 1131కోట్లురంగస్థలం 213 కోట్లుమగధీర 125 కోట్లు
జూ. ఎన్టీఆర్
RRRతో రామ్ చరణ్‌కు ఎంత పేరొచ్చిందో అంతకు 10 రెట్లు ఎక్కువే పేరు సంపాదించాడు తారక్. తనకున్న వాక్ చాతుర్యంతో మరింత ఎక్కువ ఫ్యాన్‌బేస్ సొంతం చేసుకున్నాడు. 100 కోట్ల క్లబ్‌లో తారక్ కూడా మరింత దూసుకెళ్లబోతున్నాడు.
సినిమాకలెక్షన్RRR1131కోట్లుఅరవింద సమేత155 కోట్లుజై లవకుశ145 కోట్లుజనతా గ్యారేజ్126 కోట్లు
పవన్ కల్యాణ్
టాలివుడ్‌లో అరాచక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్‌కు ఈ క్లబ్‌లో 3 సినిమాలు ఉన్నాయి. అయితే పవర్ స్టార్ ప్రస్తుత సినిమా లైనప్ చూస్తుంటే తప్పకుండా కుర్ర హీరోలను దాటి ముందుకెళ్లే అవకాశముంది.
సినిమాకలెక్షన్‌భీమ్లా నాయక్ 161 కోట్లువకీల్ సాబ్138 కోట్లుఅత్తారింటికి దారేది 131 కోట్లు
బాలకృష్ణ
అఖండ సినిమాతో బాలయ్య ప్రభంజనం సృష్టించాడు. ఆ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరగా.. ఇటీవల విడుదలైన వీరసింహా రెడ్డి కూడా అదే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న NBK 108 కూడా భారీ బడ్జెట్‌తోనే రూపొందిస్తున్నారు.
సినిమాకలెక్షన్‌అఖండ 133 కోట్లువీరసింహా రెడ్డి109 కోట్లు
మరికొన్ని సినిమాలు
వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన F2 రూ.100కోట్లు వసూలు చేసింది. కుటుంబ కథా చిత్రం కావటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి. రౌడీ విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం, రవితేజ ధమాకా, నాని దసరా చిత్రాలు ఈ క్లబ్‌లో ఉన్నాయి.
సినిమాహీరో కలెక్షన్F2 వెంకటేశ్-వరుణ్ తేజ్143 కోట్లుగీత గోవిందంవిజయ్ దేవరకొండ 130 కోట్లుదసరా నాని 110 కోట్లుధమాకా రవితేజ 108 కోట్లు
పాత రోజుల్లో సినిమా హిట్ లెక్కలు రోజుల్లో చూసేవారు. సిల్వర్ జుబ్లీ, గోల్డెన్ జుబ్లీ, 100 డేస్ ఫంక్షన్లు చేసేవారు.కానీ ఇప్పుడు రోజులు మారాయి. సినిమా పక్కా కమర్షియల్ అయిపోయింది. హిట్ లెక్కలు కలెక్షన్లతోనే నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇక 100 కోట్ల క్లబ్ గురించి మాట్లాడటం మానేసి రూ.1000 కోట్ల క్లబ్ గురించి మాట్లాడుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
https://telugu.yousay.tv/ott-movies-10-movies-to-watch-on-ott-with-friends.html
https://telugu.yousay.tv/movie-releases-movies-releasing-in-theaters-otts-this-week-april-28.html
ఏప్రిల్ 26 , 2023
తెలుగు హీరోల్లో అత్యధిక రెమ్యూరేషన్ ఎవరికంటే? తెలిస్తే షాకవుతారు!
ఒకప్పుడు జాతీయ సినీ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మన హీరోల ఫొటోలు, టాలీవుడ్ సినిమా పోస్టర్లు కనిపించేవి కావు. అయితే అదంతా గతం. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాలతో మన ఇండస్ట్రీ ఖ్యాతి దేశ సరిహద్దులు దాటిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వస్తున్న అగ్ర హీరోల సినిమాలన్నీ దాదాపు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. దీంతో దానికి తగ్గట్లే మన హీరోల రెమ్యూనరేషన్లు సైతం ఆకాశన్నంటాయి. ఒకప్పుడు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకునే స్థితి నుంచి మన అగ్ర హీరోలు రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పైగా తీసుకునే రేంజ్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఏ హీరో రెమ్యూనరేషన్ ఎంత ఉందో చూద్దాం.
ప్రభాస్:
హీరో ప్రభాస్ కెరీర్ బాహుబలి చిత్రం తర్వాత పూర్తిగా మారిపోయింది. బాహుబలి ముందు వరకు టాలీవుడ్‌కే పరిమితమైన ప్రభాస్ క్రేజ్‌ఆ సినిమాతో విశ్వవ్యాప్తమైంది. దీంతో రెండేళ్ల నుంచి ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్... సిద్ధార్థ్ సినిమాతో పాటు భవిష్యత్తులో సైన్ చేయబోయే సినిమాల కోసం రెమ్యునరేషన్‌ను మరింత పెంచాడని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ తన 25వ చిత్రం స్పిరిట్ కోసం ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మహేశ్:
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘SSMB28’ నటిస్తున్న మహేశ్.. దాని తర్వాత దర్శకధీరుడు S.S. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాలో చేయనున్నారు. రాజమౌళితో సినిమా అంటే ఓ రేంజ్‌లో ఉంటాయని ఆయన గత చిత్రాలు ఆర్‌ఆర్‌ఆర్, బాహుబలి ఇప్పటికే నిరూపించాయి. పాన్ వరల్డ్‌గా రూపొందనున్న ఈ మూవీకి మహేశ్ ఏకంగా రూ. 100కోట్లు తీసుకుంటున్నారని టాక్. గత చిత్రం ‘సర్కారు వారి పాట’కు రూ.55 కోట్లు తీసుకున్న మహేశ్ నెక్స్ట్ మూవీకి ఏకంగా వంద కోట్లు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
పవన్ కళ్యాణ్:
టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతూనే సినిమాలను సైతం అంతే స్పీడుగా పట్టాలెక్కిస్తున్నారు.
పవన్ ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే హరిహర వీరమల్లు కోసం పవన్ రూ. 60 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన ఒక్కో రోజు షూటింగ్ కోసం రూ. 2 కోట్లు తీసుకున్నట్టు పవన్ స్వయంగా వెల్లడించారు.
రామ్ చరణ్:
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో రామ్‌చరణ్ బ్రాండ్ పూర్తిగా మారిపోయింది. మగధీర, రంగస్థలంతో చరణ్‌కు వచ్చిన క్రేజ్‌ను RRR రెండింతలు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాన్ ఇండియా స్టార్‌గా మారిన చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చెర్రీ దాదాపు రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు సినిమాకు రూ. 45 కోట్లు తీసుకున్న చెర్రీ శంకర్ మూవీ కోసం ఏకంగా రూ. 15 కోట్లు పెంచడం గమనార్హం. చెర్రీ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో నటించనున్నారు.
జూ. ఎన్టీఆర్:
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం రామ్‌చరణ్‌తో పాటు జూ.ఎన్టీఆర్‌కు వరల్డ్‌వైడ్‌గా ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. RRR కు ఎన్టీఆర్ రూ. 45 కోట్లు తీసుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్‌లో NTR30 మూవీలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ రూ.60 కోట్లు తీసుకుంటున్నారని టాక్.
https://telugu.yousay.tv/these-are-the-top-10-telugu-heroes-with-the-most-followers-on-instagram.html
అల్లు అర్జున్:
పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ మేనియా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ మూవీ హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో బన్నీ క్రేజ్ బాలీవుడ్‌కు విస్తరించింది. దీంతో అల్లుఅర్జున్ మార్కెట్ విలువ భారీగా పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ కోసం బన్నీ కూడా రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
చిరంజీవి
అగ్రకథానాయకుడిగా టాలీవుడ్‌ను దశాబ్దాల పాటు ఏలిన మెగాస్టార్ చిరు.. సినిమాల్లో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. చిరు మార్కెట్ వాల్యూ యంగ్ హీరోలకూ ఏ మాత్రం తక్కువగా లేదనే చెప్పాలి. దీంతో చిరు కూడా తన ప్రతీ సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య కోసం చిరు రూ.40 కోట్లు తీసుకున్నారని టాక్.
బాలకృష్ణ:
నట సింహం బాలకృష్ణ సైతం వరుస హిట్లతో తన మార్కెట్‌ను పెంచుకున్నారు. ‘అఖండ’కు రూ.11 కోట్లు తీసున్న బాలయ్య.. ఆ సినిమా రూ. 90 కోట్ల షేర్ వసూలు చేయడంతో రెమ్యూనరేషన్‌ను పెంచారు. ‘వీర సింహారెడ్డి’ కోసం బాలయ్య రూ.15 కోట్లు తీసుకున్నారని తెలిసింది.
విజయ్ దేవరకొండ:
అర్జున్‌రెడ్డి సినిమాతో యంగ్ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్ సంచలనంగా మారారు. అయితే ఇటీవల రిలీజైన వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యాయి. అయితే వరుస ఫ్లాపులు వస్తున్నప్పటికీ విజయ్ ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ‘లైగర్’కు కూడా విజయ్ రూ. 15 కోట్లు తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
ఏప్రిల్ 01 , 2023
పీరియాడిక్ రోల్స్‌లో తళుక్కుమన్న 10 మంది అందాల తారలు
సాధారణంగా హీరోయిన్స్ అంటే గ్లామర్ పాత్రలు, నటనకు ఆస్కారం లేని క్యారెక్టర్‌లే గుర్తుకు వస్తాయి. కథానాయికలు కేవలం కొన్ని సీన్లకు, పాటలకు మాత్రమే పరిమితమైన చిత్రాలు ఇటీవల కాలంలో కోకొల్లలుగా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు హీరోయిన్లు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పిరియాడిక్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదిస్తున్నారు. ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే నటనకు ఆస్కారముండే పాత్రలూ చకా చకా చేసేస్తున్నారు. అలాంటి ఓ 10 మంది తారలను ఇప్పుడు చూద్దాం.
సమంత:
సమంత ఇప్పటివరకు అందం, అభినయం కలగలిపిన పాత్రల్లో చేశారు. కొన్ని సినిమాల్లో ప్రేయసి క్యారెక్టర్‌లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇందుకు భిన్నంగా తన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’లో సమంత కనిపించబోతున్నారు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలము’ నాటకం ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను రూపొందించారు. ఇందులో సామ్ శాకుంతల పాత్ర పోషిస్తున్నారు. సమంత ఇలా పౌరణిక పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. ఈ సినిమా తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా నిలిచిపోతుందని సమంత అంటున్నారు. ఏప్రిల్ 14న శాంకుతులం రిలీజ్ కానుండగా ఫ్యాన్స్‌ను సమంత ఏమేరకు మెప్పిస్తారో చూడాలి.
కృతి సనన్:
ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ను రామాయణం కథ ఆధారంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా ‘కృతి సనన్’ సీత పాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రల్లో మాత్రమే నటించిన కృతి.. సీత క్యారెక్టర్ చేస్తుండటం ఆసక్తిరేపుతోంది. సీత పాత్రను పోషించి అందరి మన్ననలు పొందడమంటే సాధారణ విషయం కాదు. సీత మృధుస్వభావి, మిత భాషి. అంతేగాక సీత పాత్ర ఎంతో సుకుమారమైంది. ఎన్నో సవాళ్లతో కూడిన సీత పాత్రను కృతి చేస్తుండటం గొప్ప విషయమనే చెప్పాలి. తన నటనతో ప్రేక్షకులను కృతి మెప్పించినట్లయితే ఆమె క్రేజ్ అమాంతం పెరుగుతుందనడంలో సందేహం లేదు.
అలియా భట్:
బాలీవుడ్ బ్యూటీ అలియభట్ వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. తాజాగా ఆమె హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు. మెుగల్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ‘టక్త్’ చిత్రంలో బాను భేగంగా ఆలియా నటిస్తున్నారు. ఈ పాత్రలో ఆలియా నటన సినిమాకే హైలెట్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. నటన పరంగా ఆలియా మరో మెట్టు ఎక్కుతుందని చెబుతున్నారు. కరణ్ జోహర్ నిర్మిస్తున్న టక్త్ చిత్రంలో త్వరలోనే విడుదల కానుంది.
త్రిష:
నీ మనసు నాకు తెలుసు చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన త్రిష.. వర్షం మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. త్రిష తన కెరీర్‌లో ఎక్కువగా ప్రేమికురాలి పాత్రల్లో కనిపించి మెప్పించారు. కానీ ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 1, 2 చిత్రాల ద్వారా త్రిష తన రూటు మార్చారు. చోళుల రాజకుమారి కుందువై పాత్రలో కనిపించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. యువరాణిలా ఎంతో హుందాగా నటించడంతో పాటు రాజనీతిజ్ఞత కలిగిన మహిళగా త్రిష తన హావభావాలను చక్కగా పలికించారు.
ఐశ్వర్యరాయ్:
బాలీవుడ్ అగ్రకథానాయిక ఐశ్వర్యరాయ్ గ్లామర్ పాత్రలతోపాటు.. నటనకు ఆస్కారమున్న హిస్టారికల్ పాత్రల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదివరకే హృతిక్‌తో ‘జోదా అక్భర్’ లో నటించిన ఐశ్వర్య.. మహారాణి ‘జోధా బాయి’ పాత్రతో మెప్పించారు. తాజాగా పొన్నియన్ సెల్వన్‌లో సైతం ఐశ్వర్య ‘నందిని’ పాత్రలో కనిపించారు. చోళ సామ్రాజ్యపు కోశాధికారి అయిన పెరియా పళవెట్టారియార్‌కు భార్యగా నటించారు.
అనుష్క:
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన అనుష్క విభిన్న పాత్రలకు పెట్టింది పేరు. అరుంధతి చిత్రంతో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామ బాహుబలి సినిమాలో దేవసేన పాత్రతో ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. కాకతీయ సామ్రాజ్యపు వీర వనిత రుద్రమదేవి పాత్రను సైతం అలవోకగా చేసిన అనుష్క ఈ తరం హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రుద్రమదేవి చిత్రంలో అనుష్క నటన హైలెట్ అనే చెప్పాలి. ధైర్యవంతురాలైన రాణి పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయారు.
కంగనా రనౌత్:
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మూస ధోరణి పాత్రలంటే ఆమాడ దూరం పాటిస్తారు. సవాలు విసిరే పాత్రల్లో నటించడమంటే ఆసక్తి చూపించే కంగనా ఝాన్సీ లక్ష్మీ బాయి పాత్రలో నటించి అదరగొట్టారు. 2019లో వచ్చిన ‘మణికర్ణిక’ చిత్రంలో కంగనా ఝాన్సీ లక్ష్మీ బాయిగా కనిపించారు. పోరాట సన్నివేశాల్లో అద్భుతంగా నటించి క్రిటిక్స్ సైతం మెచ్చుకునే స్థాయికి ఎదిగారు. ఈ చిత్రంలో ఆమె నటనకు జాతీయ అవార్డు వచ్చింది. 67వ జాతీయ సినీ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందించారు.
కాజల్:
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా కాజల్ ఎదిగారు. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం కాజల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇందులో కాజల్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా యువరాణి మిత్రవింద పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. తొలిసారి పిరియాడిక్ పాత్ర పోషించినప్పటికీ నటనలో కాజల్ ఎంతో పరివర్తన కనబరిచారు. చరణ్‌తో పోటీపడి మరీ నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మగధీర చిత్రంతో కాజల్ కెరీర్ పూర్తిగా మారిపోయింది.
రిచా పనాయ్:
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన యుముడికి మెుగుడు చిత్రంలో యుముడి కూతురిగా ‘రిచా పనాయ్’ నటించారు. ఈ చిత్రం ద్వారానే తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రిచా.. యమజ పాత్రలో నటించి అలరించారు. ‘మెుగుడా.. మెుగుడా’ అని అల్లరి నరేష్‌ను పిలుస్తూ థియేటర్లలో నవ్వులు పూయించారు.
ఈ చిత్రంతో రిచా మంచి గుర్తింపునే సంపాదించినప్పటికీ ఆమెకు సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. ఆ తర్వాత చందమామ కథలు, రక్షక భటుడు వంటి చిత్రాల్లో నటించినా కూడా ఆమె పెద్దగా ఆకట్టులేకపోయింది. అవకాశాలు లేకపోవడంతో రిచా నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
రీమా సేన్:
2010లో టాలీవుడ్‌లో విడుదలైన యుగానికి ఒక్కడు చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. పాండ్య రాజుల కథాంశంతో రూపొందిన ఈ సినిమాతో హీరో కార్తీకి చెరి సమానమైన క్రేజ్‌ను రీమాసేన్ సంపాదించారు. అనితా పాండియన్ పాత్రలో ఆమె అద్భుత నటన కనబరిచారు. ఓవైపు మోడ్రన్ పాత్రలో అదరగొట్టిన ఆమె పాండ్యుల దేవతగా నటించి మెప్పించారు.
మార్చి 29 , 2023
Ravi Teja: బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టిన రవితేజ... ఎలాగంటే?
టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఒకరు. ‘ఇడియట్’, ‘భద్ర’, ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘మిరపకాయ్’, ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’, ‘రాజాది గ్రేట్’ వంటి బ్లాక్‌బాస్టర్ తీసిన రవితేజ గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో కలిసి రావడం లేదు. ఇటీవల ధమకా, ఈగల్ చిత్రాలతో పర్వాలేదనిపించినా రవితేజ స్థాయికి తగ్గ సక్సెస్ మాత్రం అవి ఇవ్వలేకపోయాయి. ఇక రీసెంట్‌గా మిస్టర్. బచ్చన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. వరుస ఫ్లాప్స్ వెంటాడుతుండటంతో ఈ మాస్ మహారాజ్ డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మంచి విజయం సాధించిన ఓ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
‘ఆవేశం’ రీమేక్‌లో రవితేజ!
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో జీతూ మాధవన్ రూపొందించిన చిత్రం 'ఆవేశం' (Aavesham). యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఆవేశం ఈ ఏడాదే రిలీజై మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ స్వయంగా ఈ సినిమా రైట్స్ దక్కించుకోవడంతో ఆయనే ఇందులో నటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రవితేజ సొంత నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా రావొచ్చని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో రవితేజ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
బాలయ్యను కాదని..
‘ఆవేశం’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలుగులోకి రీమేక్ చేస్తారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇందులో ఫహాద్ ఫాజిల్ పోషించిన పాత్ర బాలయ్యకు బాగా సెట్ అవుతుందని కూడా ప్రచారం జరిగింది. అటు నందమూరి ఫ్యాన్స్ సైతం ‘ఆవేశం’ చిత్రాన్ని బాలయ్య ఖాతాలోనే వేసుకున్నారు. అయితే అనూహ్యంగా బాలయ్యను కాదని మాస్ మాహారాజా రవితేజ ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నారు. తద్వారా బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టారు. అయితే రవితేజకు కూడా ఫహాద్ ఫాజిల్ పాత్ర సెట్ అవుతుందని బాలయ్య అభిమానులు చెబుతున్నారు. ఆ పాత్రలోని డిఫరెంట్ షేడ్స్‌ను రవితేజ (Ravi Teja) చక్కగా పలికిస్తారని అంటున్నారు. మరి ఈ రీమేక్ ప్రాజెక్ట్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిరేపుతోంది.
ఫ్లాప్స్ బెడద తట్టుకోలేకనే!
ఒకప్పుడు మంచి హిట్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేసిన రవితేజ (Ravi Teja) ప్రస్తుతం వరుస ఫ్లాప్స్‌తో పూర్తిగా డీలా పడ్డారు. ఆయన చేసిన గత పది చిత్రాల్లో కేవలం ఒకే ఒక్క చిత్రం (క్రాక్) సూపర్ హిట్‌గా నిలిచింది. మరో రెండు చిత్రాలు (ధమకా, ఈగల్) యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మిగిలిన ఏడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. రీసెంట్‌గా వచ్చి ‘మిస్టర్ బచ్చన్’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్‌తో రవితేజపై కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. వయసుకు తగ్గ పాత్రలు చేయట్లేదని, కథ కంటే తనలో సగం ఏజ్ ఉన్న హీరోయిన్స్‌తో ఘాటు రొమాన్స్ చేయడానికే రవితేజ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఆలోచనలో పడ్డ రవితేజ ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సేఫ్ జోన్‌గా మలయాళం మంచి విజయం సాధించిన ‘ఆవేశం’ను రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన భావించినట్లు సమాచారం.
మరి ‘ఆవేశం’ సెట్ అవుతుందా?
‘ఆవేశం’ ఓ వైవిధ్యమైన కథ. ఓ ముగ్గురు కాలేజీ స్టూడెంట్లు, తమ సీనియర్లను కొట్టించడానికి లోకల్ గ్యాంగ్‌స్టర్ అయిన రంగా (ఫహద్ ఫాజిల్)ను ఆశ్రయిస్తారు. ఆ క్రమంలో రంగాకి, విద్యార్థులకి మంచి స్నేహం ఏర్పడుతుంది. అయితే ఓ దశ దాటిన తర్వాత రంగా క్యారెక్టర్ కారణంగా ముగ్గురు విద్యార్థులు చిక్కుల్లో పడతారు. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా వుంటుంది. ముఖ్యంగా ఫహద్ ఫాజిల్ క్యారెక్టరైజేషన్ ఈ కథలో స్పెషల్ ఎట్రాక్షన్. తెలుగులో ఆ క్యారెక్టర్ సీనియర్ నటులు ఎవరు చేసినా బాగానే ఉంటుంది. అందుకే మెుదటి బాలయ్య పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు రవితేజ (Ravi Teja) పేరు తెరపైకి రావడంతో అతడికి ఎలా ఉంటుందన్న సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం లేకుండా రవితేజ చేయవచ్చు. ఎందుకంటే కామెడీ, యాక్షన్, అగ్రెషన్ ఇలా అన్ని షేడ్స్ రంగా పాత్రలో ఉన్నాయి. దీనికి రవితేజ పూర్తిగా న్యాయం చేస్తాడని చెప్పవచ్చు.
నవంబర్ 06 , 2024
Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి. ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం..
[toc]
Allari Naresh comedy movies
సుడిగాడు
అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: జీ5
అల్లరి
టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
ఆ ఒక్కటీ అడక్కు
ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
లడ్డూ బాబు
ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
సిల్లీ ఫెలోస్
ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్) సూరిబాబు (సునీల్)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మేడ మీద అబ్బాయి
శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
జేమ్స్ బాండ్
నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ.
ఓటీటీ: జీ5
యముడికి మొగుడు
యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది.
OTT: అమెజాన్ ప్రైమ్
సీమ టపాకాయ్
శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్
కత్తి కాంతారావు
ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
బెండు అప్పారావు R.M.P.
ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు.
ఓటీటీ: జీ5
బ్లేడ్ బాబ్జీ
ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్
ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్‌నెక్స్ట్
సీమా శాస్త్రి
ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు
నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ప్లిక్స్
జాతి రత్నాలు
ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ; అమెజాన్ ప్రైమ్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది.
ఓటీటీ: ఆహా
సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు
సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
టిల్లు స్క్వేర్
రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్ వెర్షన్ లిల్లీ జోసెఫ్ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
డీజే టిల్లు
డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతడి కల. సింగర్ రాధిక (నేహాశెట్టి)ని చూడగానే ప్రేమలో పడుతాడు. ఇంతలో రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
రాజ్ తరుణ్
పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం.
ఉయ్యాల జంపాలా
బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
సినిమా చూపిస్త మావ
సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు
ఓటీటీ: హాట్ స్టార్
విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు
ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈనగరానికి ఏమైంది?
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
అశోకవనంలో అర్జున కళ్యాణం
మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
సునీల్ కామెడీ సినిమాలు
సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు. సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మర్యాద రామన్న
ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్
పూలరంగడు
ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్ వీడియో
కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు
అప్పల్రాజు (సునిల్) స్టార్ డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
అందాల రాముడు
ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
ఓటీటీ: యూట్యూబ్
జై చిరంజీవ!
ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్ డీలర్ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
సొంతం
ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
చిరునవ్వుతో
ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది.
ఓటీటీ: ఆహా
నువ్వే కావాలి
ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది.
ఓటీటీ: ఈటీవీ విన్
తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు
లేడీస్ టైలర్
సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ: యూట్యూబ్
చంటబ్బాయి
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
అహ! నా పెళ్లంట
తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు.
ఓటీటీ- యూట్యూబ్
జంబలకిడి పంబ
తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది.
ఓటీటీ- యూట్యూబ్
అప్పుల అప్పారావు
తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ- జియో సినిమా
రాజేంద్రుడు గజేంద్రుడు
రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.
ఓటీటీ: ఆహా
మాయలోడు
పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
యమలీల
S. V. కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా, కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
క్షేమంగా వెళ్లి లాభంగా రండి
రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.
ఓటీటీ: ప్రైమ్
హనుమాన్ జంక్షన్
ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది.
ఓటీటీ: ప్రైమ్
నువ్వు నాకు నచ్చావ్
కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: హాట్ స్టార్
వెంకీ
తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది.
ఓటీటీ: యూట్యూబ్
దూకుడు
పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.
మత్తు వదలరా
తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు
బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి.
అదుర్స్
అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
మన్మధుడు
ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు.
ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్
ఢీ
మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి.
ఓటీటీ: యూట్యూబ్
రెడీ
శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.
రేసు గుర్రం
ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు.
ఓటీటీ: యూట్యూబ్
మనీ మనీ
"వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి.
ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్
అనగనగా ఒకరోజు
ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే.
ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా
కింగ్
ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు.
ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్
వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు
వెన్నెల
ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
భలే భలే మగాడివోయ్
ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు.
ఓటీటీ: హాట్ స్టార్
అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు
అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.
దేశముదురు
ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది
ఓటీటీ: యూట్యూబ్
చిరుత
ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది
ఓటీటీ: యూట్యూబ్
పోకిరి
ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది
ఓటీటీ: యూట్యూబ్/ హాట్ స్టార్
సూపర్
ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది
ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
మే 23 , 2024