• TFIDB EN
  • సంక్రాంతికి వస్తున్నాం
    రేటింగ్ లేదు
    No Dateమీకు ఈ సినిమా చూడాలనే ఆసక్తి ఉందా?
    ఆసక్తి ఉంది
    UATelugu
    వెంకటేష్‌ హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌ కథానాయికలుగా చేస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో శిరిష్‌ నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, సాయికుమార్‌, నరేష్‌ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    తారాగణం
    వెంకటేష్
    మీనాక్షి చౌదరి
    ఐశ్వర్య రాజేష్
    రాజేంద్ర ప్రసాద్
    ఉపేంద్ర లిమాయే
    సిబ్బంది
    అనిల్ రావిపూడి
    దర్శకుడు
    దిల్ రాజు
    నిర్మాత
    శిరీష్నిర్మాత
    కథనాలు
    Blockbuster Pongal: సెన్సేషనల్ రికార్డు సృష్టించిన వెంకటేష్ పాడిన పొంగల్ సాంగ్
    Blockbuster Pongal: సెన్సేషనల్ రికార్డు సృష్టించిన వెంకటేష్ పాడిన పొంగల్ సాంగ్
    విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘గోదారి గట్టు మీద’, బావా వంటి పాటలు ప్రేక్షకుల నుంచి విశేషంగా ఆదరణ పొందాయి. ఆ పాటల వల్ల సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా, ఈ చిత్రం నుంచి ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ అనే ఫుల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, వెంకటేశ్ స్వయంగా ఆలపించారు. బిమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. సంక్రాంతి వాతావరణాన్ని తెచ్చిన బ్లాక్‌బస్టర్ పొంగల్ ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ పాటలో పండుగ వాతావరణాన్ని పండించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట పక్కా కుటుంబ వినోదాన్ని మేళవించి రూపొందించినట్లు తెలుస్తోంది. పాటలో వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ల మధ్య సన్నివేశాలు వినోదాత్మకంగా ఉన్నాయి. పాటకు తగ్గ స్టెప్పులతో హోరెత్తించారు. ముఖ్యంగా బ్లాక్‌ బాస్టర్‌ సాంగ్‌కు వెంకటేష్ గాత్రం బాగా సెట్‌ అయిందని చెప్పొచ్చు. ఈ పాటను భీమ్స్ సిసిరోలియో సంగీత సారథ్యంలో భీమ్స్, రోహిణి సొరట్, వెంకటేశ్ పాడారు. భీమ్స్ సంగీతం పాటకు కొత్త జీవం పోసింది. వినగానే మనసుకు హత్తుకునే ట్యూన్‌తో ఈ పాట ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. విడుదలైన గంటలోనే 5 లక్షలకు పైగా వ్యూస్, 40 వేలకు పైగా లైక్స్‌ను క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. https://youtu.be/S8NDIJBbd3Q?si=5dVR3Nt755rxX_v9 వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై భారీ అంచనాలు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కినందున, ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత చిత్రాల విజయాలతో అనిల్ రావిపూడి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు తెరకెక్కించడంలో తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోషనల్ కంటెంట్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇకా సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పక్కా కుటుంబ కథ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది పక్కా పండుగ సినిమా. ఈ చిత్రంలోని వినోదం, సంగీతం, కథ అన్నీ కుటుంబ ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెంకటేశ్ చేస్తున్న పాత్ర, ఆయన అల్లరి ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. పండుగ సీజన్‌లో కుటుంబం మొత్తం కలిసి చూడదగిన చిత్రంగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.
    డిసెంబర్ 30 , 2024
    <strong>Sankranthiki Vasthunnam: ఒకేసారి 3 వేల మందికి సెల్ఫీ.. వెంకీ మామా నిజంగా గ్రేట్‌!&nbsp;</strong>
    Sankranthiki Vasthunnam: ఒకేసారి 3 వేల మందికి సెల్ఫీ.. వెంకీ మామా నిజంగా గ్రేట్‌!&nbsp;
    టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో విక్టరీ వెంకటేష్ (Daggubati Venkatesh) ఒకరు. ఆయన నటించిన తాజా చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వెంకటేష్‌కు జోడీగా యంగ్‌ హీరోయిన్స్‌ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ టీమ్‌ వినూత్న ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ప్రమోషన్‌కు నటుడు వెంకటేష్‌ శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  3000 మందితో ఫొటోలు.. 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు వెంకటేష్‌ క్రేజీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏకంగా 3000 మందికి పైగా అభిమానులతో ఏకధాటిగా ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వెంకీతో ఫొటో కోసం పెద్ద ఎత్తున ఫ్యాన్స్ బారులు తీరడం ఈ వీడియోలో గమనించవచ్చు. క్యూలో నిలబడిన అభిమానులు తమ వంతు రాగానే ఒక్కొక్కరిగా వెంకటేష్‌తో ఫొటో దిగారు. ఈ వీడియోపై ఓ లుక్కేయండి. https://twitter.com/baraju_SuperHit/status/1875442823736258582 వెంకీ నిజంగా గ్రేట్‌.. సాధారణంగా సెలబ్రిటీలు ఒకరిద్దరితో ఫొటోలు దిగాలంటేనే నీరసించిపోతారు. అటువంటిది వెంకటేష్‌ ఏకంగా 3000+ మందితో ఒకేసారి ఫొటోలు దిగడమంటే సాధారణ విషయం కాదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘వెంకీ మామా నిజంగా గ్రేట్’ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ఏమాత్రం విసుగులేకుండా ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగడాన్ని మెచ్చుకుంటున్నారు. ఫ్యాన్స్‌తో ఎలా వ్యవహరించాలో చూపిస్తూ ప్రస్తుత తరం హీరోలకు వెంకటేష్‌ ఆదర్శంగా నిలుస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.  మూడు పాటలు ట్రెండింగ్‌ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు యువ మ్యూజిక్ డైరెక్టర్‌ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ మూడు సాంగ్స్‌ విడుదలవ్వగా అన్ని చార్ట్‌ బస్టర్స్‌గా నిలిచాయి. ‘గోదారి గట్టు’, ‘మీను’, ‘బ్లాక్ బస్టర్‌ పొంగల్‌’ పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత రమణ గోగుల పాడిన 'గోదారి గట్టు' సాంగ్‌ మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అలాగే వెంకటేష్‌ స్వయంగా స్వరం అందించిన ‘బ్లాక్ బస్టర్‌ పొంగల్‌’ ఆకట్టుకుంటోంది.  మాజీ పోలీసు అధికారిగా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో వెంకటేష్‌ ఎక్స్ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. ఆయనకు భార్యగా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ లవర్‌గా మీనాక్షి చౌదరి నటించారు. వీరితోపాటు సినిమాలో ఉపేంద్ర, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్ మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి ఇతర పాత్రలు చేశారు. ఈ చిత్రం కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తుందని మూవీ టీమ్ ధీమాగా ఉంది. 
    జనవరి 04 , 2025
    <strong>Sankranthiki vasthunnam Trailer: పెరిగిన అంచనాలు… సంక్రాంతి విన్నర్ పక్కా!</strong>
    Sankranthiki vasthunnam Trailer: పెరిగిన అంచనాలు… సంక్రాంతి విన్నర్ పక్కా!
    టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో, ఐశ్వర్య రాజేశ్ మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన తాజా చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”. ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో మరింత వేగాన్ని చూపిస్తున్నారు. ట్రైలర్ అప్‌డేట్ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ జనవరి 6న విడుదల కానుందని తెలుస్తోంది. పక్కా వినోదాత్మకంగా ఉండే ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయనుంది. అయితే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ట్రైలర్‌పై అంచనాలు పెరిగాయి. సంక్రాంతికి వచ్చే సినిమాల్లో విన్నర్ అయ్యే అవకాశం ఉందని వెంకీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సినిమా విశేషాలు ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, వెంకటేశ్ స్వయంగా “బ్లాక్‌బస్టర్ పొంగల్” పాటను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. అంతేకాకుండా, "గోదారి గట్టు మీద" మరియు "బావా" పాటలు ఇప్పటికే పెద్ద విజయాన్ని సాధించాయి. ప్రతి పాట ఒకదాన్ని మించిన హిట్‌గా నిలవడం ఈ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచింది. వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబినేషన్ వెంకటేశ్ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి తన గత సినిమాల విజయాలతో కుటుంబ కథా చిత్రాలను రూపొందించడంలో తాను ప్రత్యేకమైన దర్శకుడని నిరూపించుకున్నాడు. ఈ చిత్రం కూడా ఆ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. Blockbuster Pongal పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సంక్రాంతికి వస్తున్నాం” పక్కా పండుగ కోసం రూపొందించిన సినిమా. వినోదం, కథ, సంగీతం అన్నీ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా మలిచారు. వెంకటేశ్ చేస్తున్న పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్‌గా విడుదలకానుంది.
    జనవరి 02 , 2025
    <strong>Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది</strong>
    Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది
    దిగ్గజ నటుడు వెంకటేష్‌ (Venkatesh) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) రూపొందిస్తున్న చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam). ఇందులో వెంకీకి జోడీగా యంగ్‌ హీరోయిన్‌ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటిస్తోంది. ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh) కూడా రెండో హీరోయిన్‌గా అలరించనుంది. ఈ చిత్రానికి దిల్‌ రాజు సమర్పులు వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఓ ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ క్రమంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘తెలియక రియల్‌ గన్‌ గురిపెట్టా’ ‘బీస్ట్’ సినిమాలో ‘ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు’ అనే ఒక్క డైలాగ్‌తో తమిళ నటుడు వీటీవీ గణేష్‌ (VTV Ganesh) తెలుగు ప్రేక్షకుల అభిమాన యాక్టర్‌గా మారిపోయారు. ప్రస్తుతం వెంకటేష్‌ చేస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) మూవీలోనూ ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. తాజా ప్రెస్‌మీట్‌ నేపథ్యంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీటీవీ గణేష్‌తో సెట్‌లో జరిగిన ఇంట్రెస్టింగ్‌ ఘటనను పంచుకున్నారు. ‘గణేష్‌ గారు నీకు రియల్‌ గన్‌ తెలుసా? అంటూ ప్రశ్నించారు. అప్పుడు సెట్‌లో ఉన్న నరేష్‌ గారు తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ గన్‌ తెప్పించారు. ఆ గన్‌ను గణేష్‌కు పాయింట్‌ బ్లాంక్‌లో గురి పెట్టగానే నరేష్‌ కంగారు పడ్డారు. వెంటనే గన్‌ నుంచి బుల్లెట్స్‌ తీశారు. అది జస్ట్‌ ఇలా టచ్‌ చేస్తే బుల్లెట్లు దూసుకు వస్తాయని నరేష్‌ చెప్పారు. ఆ చిన్న గన్ రియల్‌ గన్‌ అని తెలియక గణేష్‌ తలకు గురిపెట్టా. తృటిలో పెను ప్రమాదం తప్పింది. మీకు చాలా ఫ్యూచర్ ఉంది గనుకే ఆ రోజు తప్పించుకున్నారు' అంటూ గణేష్‌ను ఉద్దేశించి చెప్పారు. ఇలాంటి ఫన్నీ ఘటనలు షూటింగ్‌లో చాలానే జరిగాయని అనిల్‌ రావిపూడి తెలిపారు.&nbsp; https://twitter.com/i/status/1859203309460242668 'అప్పుడే పరిశ్రమ బాగుంటుంది' ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రెస్‌మీట్‌లో హీరో వెంకటేష్‌ (Venkatesh)కూడా మాట్లాడారు. సంక్రాంతికి రిలీజ్‌ చేయాలన్న లక్ష్యంతోనే ఈ సినిమా (Sankranthiki Vasthunnam)ను మెుదలుపెట్టినట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. అభిమానులు, కుటుంబ ప్రేక్షకులకు తప్పకుండా ఈ సినిమా (సంక్రాంతికి వస్తున్నాం) నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. పండగకి ఒక అద్భుతమైన సినిమా చూస్తారని ప్రేక్షకులకు చెప్పారు. ఈ సారి రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer), బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ (Daku Magaraj) కూడా విడుదలవుతున్నాయని, అవి కూడా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. అప్పుడే సినీ పరిశ్రమ బాగుంటుందని వెంకటేష్‌ అభిప్రాయపడ్డారు. సీనియర్‌ నటుడు నరేష్‌ (Naresh) మాట్లాడుతూ ఇండియాలో ఎలాంటి క్యారెక్టర్ అయిన చేయగల యాక్టర్‌ వెంకటేష్ అని కొనియాడారు.&nbsp; https://twitter.com/i/status/1859532368333373653 https://twitter.com/i/status/1859206087821737998 సంక్రాంతికి హ్యాట్రిక్‌ చిత్రాలు! 2025 సంక్రాంతి నిర్మాత దిల్‌రాజు ఎంతో కీలకం కాబోతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సహా ఆయన నుంచి ఏకంగా మూడు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలవబోతున్నాయి. రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ (Director Shankar) రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer)కు దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా 2025 జనవరి 10న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. అలాగే బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ రూపొందిస్తున్న ‘డాకు మహారాజ్‌’ (Daku Maharaj) కూడా సంక్రాంతికే రానుంది. ఈ మూవీని కూడా తామే డిస్ట్రిబ్యూట్‌ చేయబోతున్నట్లు తాజా ప్రెస్‌మీట్‌లో దిల్‌రాజు తెలిపారు. ఈ మూడు చిత్రాలు పెద్ద విజయాలు సాధిస్తాయని దిల్‌రాజు ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి గురించి ఫన్నీ కామెంట్స్‌ చేశారు. గేమ్‌ ఛేంజర్‌ నేపథ్యంలో సంక్రాంతికి ఎక్కడ సైడ్‌ చేస్తారోనని భావించి తెలివిగా ఈ సినిమాకు ‘సంక్రాంతి వస్తున్నాం’ అనే టైటిల్‌ను అనిల్‌ పెట్టారని వ్యాఖ్యానించారు.&nbsp; https://twitter.com/i/status/1859522147229573619 70% థియేటర్లు దిల్‌రాజుకే! 2025 సంక్రాంతికి రెండు చిత్రాలను నేరుగా రిలీజ్‌ చేస్తుండటంతో పాటు మరో సినిమా థియేట్రికల్‌ హక్కులను దక్కించుకోవడంతో దిల్‌రాజుకు థియేటర్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే దిల్‌రాజు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లతో సంప్రదింపులు జరిపి తమ చిత్రాన్ని థియేటర్లో ప్రసారం చేసేలా ఆయన అడుగులు వేస్తున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో ఇప్పటికే 70 శాతం థియేటర్లు దిల్‌రాజు ఖాతాలోకి వెళ్లిపోయాయని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. మిగిలిన చిత్రాలు రీమైనింగ్ 30 శాతం థియేటర్లతో సర్దుకోవాల్సి ఉంటుందనిఅంటున్నారు. ప్రస్తుతానికి ఇది ప్రచారమే అయినప్పటికీ త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp;
    నవంబర్ 21 , 2024
    <strong>Vidaamuyarchi: ఈ సినిమాలో అజిత్‌ ప్రాణాలకు తెగించి చేసిన ఫీట్‌ గుర్తుందా?</strong>
    Vidaamuyarchi: ఈ సినిమాలో అజిత్‌ ప్రాణాలకు తెగించి చేసిన ఫీట్‌ గుర్తుందా?
    కోలీవుడ్‌ (Kollywood) నటుడు అజిత్‌ (Ajith)కు దేశ వ్యాప్తంగా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. భాష, ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా అందరూ ఆయన్ను అభిమానిస్తుంటారు. తెలుగు ప్రేక్షకులు సైతం అజిత్‌ నటన, ఆయన చేసిన చిత్రాలను ఇష్టపడుతుంటారు. అటువంటి అజిత్‌ నుంచి ఈ సంక్రాంతికి ఓ క్రేజీ సినిమా రాబోతుంది. మగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో చేసిన 'విడముయార్చి' సినిమా పొంగల్‌కు లాక్‌ అయ్యింది. ఇందులో అజిత్‌కు జోడీగా స్టార్‌ హీరోయిన్‌ త్రిష (Actress Trisha) నటిస్తోంది. కాగా, ఇప్పటికే సంక్రాంతి రేసులో నిలిచిన స్టార్‌ హీరోలు రామ్‌చరణ్‌ (Ramcharan), బాలకృష్ణ (Balakrishna), వెంకటేష్‌ (Venkatesh)లతో అజిత్‌ తలపడటనుండటంతో అందరి దృష్టి 'విడముయార్చి'పై పడింది.&nbsp; హాలీవుడ్‌ లెవల్లో..&nbsp; హీరో అజిత్‌ (Ajith), డైరెక్టర్‌ మగిజ్‌ తిరుమేని (Magizh Thirumeni) కాంబోలో రూపొందుతున్న 'విడముయార్చి' (Vidaamuyarchi) చిత్రాన్ని ఫేమస్‌ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇందులో సీనియర్ నటుడు అర్జున్‌ (Arjun), రెజీనా కసాండ్రా (Regina Cassandra) నెగిటివ్‌ రోల్స్ చేస్తున్నారు. యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ (Vidaamuyarchi Teaser)ను రిలీజ్‌ చేశారు. ఒక నిమిషం 48 సెకన్లపాటు సాగిన ఈ టీజర్‌ ఒక్క డైలాగ్‌ కూడా లేకపోవడం విశేషం. టీజర్‌ ప్రారంభంలో అర్జున్, రెజీనా గట్టిగా నవ్వే సౌండ్ తప్ప మిగతాదంతా అనిరుధ్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే సాగిపోయింది. హాలీవుడ్‌ స్థాయి లోకేషన్స్‌ ఓ వింత ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఫీలింగ్ కనిపించాయి. కంప్లీట్ యాక్షన్ ప్యాక్‌గా ఈ చిత్రం రాబోతున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=Wtq3RRORVx4 ఆ రియల్‌ స్టంట్‌ గుర్తుందా! 'విడముయార్చి' (Vidaamuyarchi) చిత్రాన్ని 2025 జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఛేజింగ్‌ సీన్స్ ఎక్కువగా ఉండనున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. అయితే గతంలో డూప్‌ లేకుండా ఛేజ్‌ సీన్‌ చేస్తూ నటుడు అజిత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా తెగ వైరల్ అయ్యింది. ఆ సీన్‌ను 'విడముయార్చి'కి సంబంధించే షూట్‌ చేశారు. సన్నివేశంలో భాగంగా తన పక్కన ఉండే వ్యక్తిని కాపాడేందుకు అజిత్‌ ఫాస్ట్‌గా కారు డ్రైవ్‌ చేయాలి. డూప్‌ లేకుండా తానే స్వయంగా వెహికల్ నడిపాడు. దీంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. ‘ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో’ అంటూ అప్పట్లో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ఆ వీడియోను రిలీజ్‌ చేయడం విశేషం. https://twitter.com/LycaProductions/status/1775798815926395119 థియేటర్లు కష్టమే! సంక్రాంతి (Sankranthi Movies 2025) బరిలో ఇప్పటికే టాలీవుడ్ నుంచి మూడు చిత్రాలు నిలిచాయి. రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer), బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ (Daku Maharaj), వెంకటేష్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) చిత్రాలు ఇప్పటికే రిలీజ్‌ డేట్స్‌ను సైతం అనౌన్స్‌ చేశాయి. అవి వరుసగా జనవరి 9, 11, 13 తేదీల్లో థియేటర్లలో సందడి చేయనున్నాయి. అజిత్ తాజా చిత్రం 'విడముయార్చి'ను ఆ డేట్స్‌ క్లాష్‌ కాకుండా జనవరి 10న రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నలుగురు బడా హీరోల మధ్య బిగ్‌ ఫైట్‌ తప్పదని ఫిల్మ్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలను నిర్మించడం, ‘డాకు మహారాజ్‌’ నైజాం డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్ కూడా దిల్‌రాజు (Diraju)వెళ్లడంతో 70% థియేటర్లు ఆయన చేతిలోకి వెళ్లినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు చిత్రాలను దాటుకొని అజిత్‌ సినిమాకు థియేటర్లు వెళ్లడం కష్టమేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తక్కువ స్క్రీన్లతోనే అజిత్‌ మూవీ సరిపెట్టుకోవాల్సి రావొచ్చని అంటున్నారు.&nbsp;
    నవంబర్ 29 , 2024
    Dhop Song Promo: ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘దోప్’ సాంగ్ ప్రోమో రిలీజ్, సూపర్బ్ రెస్పాన్స్
    Dhop Song Promo: ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘దోప్’ సాంగ్ ప్రోమో రిలీజ్, సూపర్బ్ రెస్పాన్స్
    రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో, శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10, 2025న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘దోప్’ సాంగ్ ప్రోమో విడుదల చేయగా, ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘దోప్’ సాంగ్ విశేషాలు సినిమా టీమ్ ‘దోప్’ సాంగ్ ప్రోమోను విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటలో రామ్ చరణ్, కియారా అద్వానీ డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంది. పాజిటివ్ ఎనర్జీతో కూడిన ఈ సాంగ్, ఆడియన్స్‌ను కట్టిపడేయనుంది. మైక్రో మంత్ర అంటూ సాంగ్ లిరిక్స్ వినసొంపుగా ఉన్నాయి.  కియరా, రామ్‌ చరణ్ కెమిస్ట్రీ కనుల విందుగా ఉంది. మెకోవర్ అట్రాక్టివ్‌గా పదే పదే చూడాలనిపించే విధంగా ఉంది. https://twitter.com/SivaHarsha_23/status/1869361110325018735 కాగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ‘జరగండి’, ‘నానా హైరానా’, ‘రా మచా మచా’ సూపర్ హిట్ కావడంతో, ఇప్పుడు కొత్తగా విడుదలైన ‘దోప్’ సాంగ్ ప్రోమోపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. https://twitter.com/BheeshmaTalks/status/1869298339730386976 రామ్ చరణ్ డ్యూయల్ రోల్ ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు టీజర్ ద్వారా తెలిసింది. ఒక పాత్ర పీరియాడిక్ టైమ్‌ లైన్‌కు చెందినదైతే, మరో పాత్ర (DHOP Song Promo)ప్రస్తుత కాలానికి సంబంధించినది. తండ్రి, కొడుకులుగా రామ్ చరణ్ కనిపించనున్నట్లు బిగ్‌బాస్ సీజన్ 8 ఫినాలేలో ఆయన స్వయంగా వెల్లడించారు. సంక్రాంతి బరిలో ‘గేమ్ ఛేంజర్’ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతున్న మొదటి సినిమా కావడంతో మరింత ఆసక్తి పెరిగింది. జనవరి 12న నందమూరి బాలకృష్ణ ‘డాకూ మహరాజ్’(Daku Maharaj), జనవరి 14న విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, జనవరి 10న అజిత్ నటించిన డబ్బింగ్ చిత్రం ‘విడాముయర్చి’ విడుదల కానున్నాయి. టీజర్‌కు మంచి స్పందన ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టీజర్ చూస్తుంటే ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందనిపిస్తోంది. ఎస్ఎస్ థమన్ అందించిన సంగీతం, శంకర్ వినూత్న దర్శకత్వం, రామ్ చరణ్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీ, శంకర్ దర్శకత్వ ప్రతిభ, థమన్ సంగీతం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అవుతాయి. ‘దోప్’ సాంగ్ ప్రోమో ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉండగా, ఫుల్ సాంగ్ విడుదలకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
    డిసెంబర్ 18 , 2024
    This Week OTT Movies: సంక్రాంతికి దద్దరిల్లనున్న థియేటర్లు.. ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!
    This Week OTT Movies: సంక్రాంతికి దద్దరిల్లనున్న థియేటర్లు.. ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!
    తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్‌ సంక్రాంతి సందడి మెుదలు కానుంది. దీంతో ఎప్పటిలాగే కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడబోతున్నాయి. ఈ ఏడాది కొత్త పలువురు స్టార్‌ హీరోలు సంక్రాంతి బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అటు ఓటీటీలోనూ సరికొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. మరి ఎవరెవరు సంక్రాంతి బరిలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు గుంటూరు కారం మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. హను-మాన్‌ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.. వైవిధ్యమైన సినిమాలు తీస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తేజ సజ్జా కథానాయకుడిగా ఆయన రూపొందించిన మరో చిత్రం ‘హను-మాన్‌’ (Hanu Man). ఆంజనేయస్వామి కథా నేపథ్యంతో సూపర్‌ హీరో ఫిల్మ్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రం కూడా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లోని వీఎఫ్‌ఎక్స్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. చిన్నారులను సైతం అలరించేలా ఇందులో సన్నివేశాలు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.&nbsp; సైంధవ్‌ టాలీవుడ్‌ స్టార్ హీరో వెంకటేష్‌ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచారు. శైలేష్‌కొలను దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సైంధవ్‌’ (Saindhav) జనవరి 13న థియేటర్‌లలో విడుదల కానుంది. వెంకటేష్‌కి ఇది 75వ సినిమా. కూతురి సెంటిమెంట్‌తో పాటు, వెంకటేశ్‌ యాక్షన్‌ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. శ్రద్ధాశ్రీనాథ్‌, నవాజుద్దీన్‌ సిద్దిఖీ, ఆర్య కీలకపాత్రలు పోషించారు. నా సామిరంగ ఈ సంక్రాంతికి మరో స్టార్‌ హీరో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. నాగార్జున (Nagarjuna) హీరోగా విజయ్‌ బిన్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) చిత్రం.. జనవరి 14న విడుదల కానుంది. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలు పోషించగా.. ఆషికా రంగనాథ్‌ కథానాయికగా చేసింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘పొరింజు మరియం జోసే’ చిత్రానికి రీమేక్‌గా నా సామిరంగను రూపొందించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేశారు.&nbsp; అయలాన్‌ సంక్రాంతికి తెలుగు చిత్రాలతో పాటు ఓ డబ్బింగ్‌ సినిమా సైతం విడుదల కాబోతోంది. తమిళ నటుడు శివకార్తికేయన్‌ ‘అయలాన్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాడు. ఆర్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా చేసింది. జనవరి 12న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. గ్రహాంతర వాసితో మనిషికి కుదిరిన స్నేహం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అన్నది కథ.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే ఏకంగా 29 చిత్రాలు / వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. థియేటర్లకు వెళ్లి కొత్త మూవీస్‌ చూసే ఆసక్తి లేకపోతే వీటిని ప్రిఫర్‌ చేయవచ్చు. ఇంతకీ ఓటీటీలో రాబోతున్న ముఖ్యమైన చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రం జనవరి 12న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గతేడాది డిసెంబర్‌ 8న విడుదలైన ఈ చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద విఫలమై నితీర్‌ కెరీర్‌లో మరో డిజాస్ ఫ్లాప్‌గా నిలిచింది. మరి ఓటీటీ ప్రేక్షకులనైనా ఈ చిత్రం ఆకట్టుకుందో లేదో చూడాలి. కోట బొమ్మాళి P.S శ్రీకాంత్‌ కీలక పాత్రలో జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’. వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. జనవరి 11వ తేదీ నుంచి ‘ఆహా’లో ప్రసారం కానుంది. నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateBreak Point Season 2SeriesEnglishNetflixJan 10King Dom - 3MovieEnglishNetflixJan 10The TrustSeriesEnglishNetflixJan 10Boy Swallows UniverseSeriesEnglishNetflixJan 10Killer SoupMovieHindiNetflixJan 11LiftMovieEnglishNetflixJan 12EchoSeriesEnglishDisney + HotstarJan 11The Legend of HanumanSeriesHindiDisney + HotstarJan 12JourneyMovieTamil&nbsp;SonyLIVJan 12SivappuMovieTamil&nbsp;AhaJan 12La BreaSeriesEnglishJio CinemaJan 10TedSeriesEnglishJio CinemaJan 12Mission: Impossible – Dead Reckoning Part OneMovieTelugu/EnglishAmazon PrimeJan 11RoleplayMovieEnglishAmazon PrimeJan 12
    జనవరి 08 , 2024
    సంక్రాంతి బరిలో బాలయ్య హిట్లు
    సంక్రాంతి బరిలో బాలయ్య హిట్లు
    ]గత కొన్నేళ్లుగా బాలయ్య సంక్రాంతికి సినిమా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన వీరసింహా రెడ్డితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సినిమాపై ప్రస్తుతానికైతే పాజిటివ్‌ వైబ్స్‌ ఉన్నాయి.వీరసింహా రెడ్డి
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>RC16: ఇస్రో శాస్త్రవేత్తల బాటలో డైరెక్టర్‌ బుచ్చిబాబు.. వర్కౌట్ అయితే చరణ్‌ను ఎవరూ ఆపలేరు!</strong>
    RC16: ఇస్రో శాస్త్రవేత్తల బాటలో డైరెక్టర్‌ బుచ్చిబాబు.. వర్కౌట్ అయితే చరణ్‌ను ఎవరూ ఆపలేరు!
    ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సంక్రాంతికి రాబోతున్న రామ్‌చరణ్‌ (Ramcharan) ఈ సినిమా రిలీజ్‌కు ముందే డైరెక్టర్‌ బుచ్చిబాబు సనా (Buchi Babu Sana)తో ‘RC 16’ ప్రాజెక్టు చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మల్లయుద్దం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం రామ్‌చరణ్‌ మేకోవర్‌ అవుతున్నాడు. పాత్రకు తగ్గట్లు శరీరాన్ని మలుచుకుంటున్నాడు. మరోవైపు డైరెక్టర్‌ బుచ్చిబాబు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ముందు దైవానుగ్రహం కోసం దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మూవీ స్క్రిప్ట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా కర్ణాటక మైసూరులోని ఓ ఆలయంలో బుచ్చిబాబు ప్రత్యక్షమయ్యారు. ఇదంతా చూస్తుంటే బుచ్చిబాబు వైఖరి ఇస్రో సైంటిస్టులను తలపిస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సేమ్‌ టూ సేమ్‌.. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ఇప్పటివరకూ ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించింది. అయితే ప్రతీ ప్రయోగానికి ముందు ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు దైవ దర్శనానికి వెళ్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రయోగం సక్సెస్‌ అయ్యేలా చూడమని వేడుకుంటారు. అలాగే నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలోని చెంగాలమ్మ సన్నిధిలోనూ ఇస్రో ఛైర్మన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు బుచ్చిబాబు చేస్తోంది చూస్తే ఇస్రో శాస్త్రవేత్తలే గుర్తుకు వస్తున్నారు. బచ్చిబాబు కూడా షూటింగ్‌ ప్రారంభానికి ముందు వరుస పెట్టి దేవలయాలు చుట్టేస్తున్నారు. ఇటీవల రామ్‌చరణ్‌తో కలిసి కడప వెళ్లిన బుచ్చిబాబు అక్కడ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఎదుట ‘RC16’ స్క్రిప్ట్‌ పెట్టి ఆశీర్వచనం కోరారు. తాజాగా మైసూర్‌లోని ఛాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న డైరెక్టర్‌ ఎలాంటి అవరోధాలు లేకుండా సినిమా సక్సెస్‌ కావాలని ప్రార్థించారు. దీంతో ఇస్రో సైంటిస్టులతో బుచ్చిబాబును పోలుస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/SriLakshmi_10/status/1679348363546730496 https://twitter.com/i/status/1858591431201317066 ‘RC 16’ షూటింగ్‌ షురూ.. శుక్రవారం (నవంబర్‌ 22) ఉదయం మైసూర్‌లోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి బుచ్చిబాబు ఆలయ ప్రాంగణంలో మూవీ స్క్రిప్ట్‌ పట్టుకొని దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈ పోస్టుకు ఆసక్తిక వ్యాఖ్యలను సైతం జోడించారు. ఇది తమకు చాలా ముఖ్యమైన రోజని, ఎంతోకాలం ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసిందని పేర్కొన్నారు. చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఇది మెుదలైందంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టు బట్టి శుక్రవారం (నవంబర్‌ 22) నుంచే RC 16 రెగ్యులర్ షూట్‌ మెుదలైనట్లు తెలుస్తోంది. మైసూరులోనే ఏర్పాటు చేసిన సెట్‌లో మూడు రోజుల పాటు షూట్‌ జరగనున్నట్లు సమాచారం. ఇందులో హీరో లేని సీన్లను మాత్రమే షూట్‌ చేస్తారని తెలిసింది. వచ్చే వారం నుంచి రామ్‌చరణ్‌ షూటింగ్‌లో భాగమవుతారని సమాచారం.&nbsp; https://twitter.com/BuchiBabuSana/status/1859777297768681631 టీమ్‌లోకి జగ్గుభాయ్‌.. 'RC 16' ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. అయితే ప్రాజెక్ట్‌లో దిగ్గజ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) జాయిన్‌ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. షూట్‌లో జాయిన్ అయినట్లు తెలుపుతూ ఓ ఫొటోను షేర్‌ చేశారు. దీంతో జగ్గుభాయ్‌ ఈ మూవీలో ఏ పాత్రలో కనిపించబోతున్నాడనే ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఈ పోస్టుకు థ్యాంక్యూ కామండో అంటూ జగపతిబాబు రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నెగిటివ్‌ షేడ్‌లోనే జగపతిబాబు కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. తాజాగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాగా, రామ్‌చరణ్‌ - జగ్గుభాయ్‌ ప్రత్యర్థులుగా చేసిన 'రంగస్థలం' (Rangasthalam) చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.&nbsp; https://twitter.com/IamJagguBhai/status/1859820964600742352? ‘RC16’ స్టోరీ ఇదే! ‘RC16’ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో మలయుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఏపీకి చెందిన మల్ల యుద్ద వీరుడు కోడిరామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు తగ్గట్లు బలిష్టంగా కనిపించేలా చరణ్‌ మేకోవర్‌ అవుతున్నాడు. ఇందుకు తగ్గట్లుగా బాడీని బిల్డ్‌ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే గతంలో 'బీస్ట్‌ మోడ్‌ ఆన్‌' అంటూ ఓ ఫొటోను సైతం అభిమానులతో చరణ్‌ పంచుకున్నాడు. ‘గేమ్‌ ఛేంజర్‌’ లుక్‌తో పోలిస్తే చరణ్‌ బాడీతో పాటు, లాంగ్‌ హెయిర్‌, గడ్డం పెంచాడు. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తోంది. ఏ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలు అందించనున్నారు. కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
    నవంబర్ 22 , 2024
    Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి దేశ అత్యున్నత పురస్కారం?... భాజపా పెద్ద స్కెచ్‌?
    Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి దేశ అత్యున్నత పురస్కారం?... భాజపా పెద్ద స్కెచ్‌?
    మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని మ‌రో అత్యున్న‌త పౌర పుర‌స్కారం వ‌రించనున్నట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌ద్మ‌విభూష‌ణ్ (Padma Vibhushan 2024) అవార్డుకు చిరంజీవి ఎంపికైన‌ట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో భారత రత్న(bharat ratna) తర్వాత పద్మవిభూషణ్‌ను రెండో అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. అయితే చిరంజీవికి అవార్డు గురించి&nbsp; గణతంత్ర దినోత్సవం రోజున (జనవరి 26) అధికారిక ప్రకటన రానున్న‌ట్లు స‌మాచారం. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్ర‌భుత్వం అఫిషియల్‌గా ఈ విషయాన్ని ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప‌ద్మ అవార్డ్స్ లిస్ట్‌లో ఇప్పటికే చిరంజీవి పేరు చేరిపోయినట్లు ప్రముఖంగా వినిపిస్తోంది.&nbsp; పురస్కారానికి కారణమిదే! సినీ రంగానికి చిరు చేసిన సేవలతో పాటు కొవిడ్‌ కాలంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి మోదీ ప్ర‌భుత్వం ఈ పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లాక్‌డౌన్ టైమ్‌లో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల‌ను చిరంజీవి ఆదుకున్నారు. నిత్యావ‌స‌రాలు అందించి వారి కుటుంబాలకు అండగా నిలిచారు. సామాన్య పౌరుల కోసం అంబులెన్స్‌, ఆక్సిజ‌న్ స‌దుపాయాల‌ను ఉచితంగా క‌ల్పించి పలువురికి ప్రాణం పోశారు. వీటన్నింటిని గమనించిన కేంద్రం.. మెగాస్టార్‌కు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం (మెుదటిది భారతరత్న) ఇవ్వాలని నిర్ణయించిందని సమాచారం.&nbsp; అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు భాజపా! కాగా, ఇప్ప‌టికే చిరంజీవి ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డును అందుకున్నారు. 2006లో అప్పటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం హ‌యాంలో చిరు ఆ పురస్కారాన్ని స్వీకరించారు. ఇప్పుడు భాజపా ప్ర‌భుత్వం ఆయ‌న్ని ప‌ద్మ‌విభూష‌ణ్‌తో స‌త్క‌రించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్‌ సంబ‌రాల్లో మునిగిపోయారు. మెగాస్టార్‌ చిరంజీవికి ఉన్న మానవత్వం, గొప్ప మనసుకు కేంద్రం ఇస్తున్న కానుకగా దీన్ని అభివర్ణిస్తున్నారు.&nbsp; పొలిటికల్‌ వ్యూహాం ఉందా? చిరంజీవికి పద్మవిభూషణ్‌ ఇచ్చే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చ మెుదలైంది. కేంద్రంలోని భాజపా కొన్ని ప్రయోజనాలను ఆశించే చిరుకు పద్మవిభూషణ్‌( Chiranjeevi Padma Vibhushan) ఇవ్వబోతున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలో ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో చిరుకు పద్మవిభూషణ్‌ ప్రకటించి పొలిటికల్‌గా మరింత మైలేజ్‌ పెంచుకోవాలన్నది భాజపా వ్యూహామని అంటున్నారు. ఏపీలో చిరు సోదరుడు పవన్‌ ఇప్పటికే భాజపాతో పొత్తులో ఉన్నారు. చిరుకి జాతీయ పురస్కారం ఇచ్చి తెలంగాణలోని మెగా ఫ్యాన్స్‌ను ఆకర్షించాలని భాజపా భావిస్తుండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp;&nbsp; చిరు బిజీ బిజీ.. ప్ర‌స్తుతం చిరంజీవి ‘విశ్వంభ‌ర’ మూవీతో బిజీగా ఉన్నారు. ఫాంట‌సీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రూ.100 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. విశ్వంభ‌ర‌లో చిరంజీవికి జోడీగా త్రిష న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్రిష‌తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో న‌టిస్తార‌ని అంటున్నారు. వారు ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లోనే క్లారిటీ రానున్న‌ట్లు తెలిసింది.
    జనవరి 19 , 2024
    RC15: రామ్‌ చరణ్ CEO&nbsp; స్టోరీ ఇదేనా? కథ అయితే మాములుగా లేదు!
    RC15: రామ్‌ చరణ్ CEO&nbsp; స్టోరీ ఇదేనా? కథ అయితే మాములుగా లేదు!
    ‘RRRకు&nbsp; ఆస్కార్ అవార్డు రావడంతో రామ్‌చరణ్ చేసే అప్‌కమింగ్ ప్రాజెక్టులపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ డైరెక్షన్‌లో ‘RC15’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాతో బిజీబిజీగా గడుపుతున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా సినిమా కథ గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మరి ఆ విశేషాలు తెలుసుకుందాం.&nbsp; కథ ఇదేనా? పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న కథను దర్శకుడు శంకర్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్ ఇందులో డ్యుయల్ రోల్‌లో చేయనున్నారట. ఈ మేరకు కొన్ని సెట్ ఫొటోలు గతంలో లీక్ అయ్యాయి. గ్రామీణ నేపథ్యానికి చెందిన వ్యక్తిగా ఒక రోల్, IAS అధికారిగా మరొక రోల్‌లో చెర్రీ నటించనున్నారట.&nbsp; తండ్రీ, కొడుకుల చుట్టూ.. ఎన్నికల అధికారి పాత్రలో చరణ్ నటించనున్నాడు. రామ్‌చరణ్ తండ్రి ఓ రాజకీయ పార్టీ అధినేత. దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన పోరు ఉండనున్నట్లు తెలిసింది. ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకే హైలెట్‌గా ఉంటాయని సమాచారం. &nbsp; వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపి, వాటిని రూపుమాపే ప్రయత్నంలో CEO గా&nbsp; రామ్‌చరణ్ ఎదుర్కొన్న అనుభవాల గురించి ఇందులో చూపించనున్నారట. సినిమా మొత్తం తండ్రీ, కొడుకుల చుట్టూనే తిరుగుతుందని టాక్&nbsp; సామాజిక కోణం.. శంకర్ సినిమా అంటే అందులో ఓ సోషల్ మెసేజ్ తప్పనిసరిగా ఉంటుంది. సమాజంలోని లోటుపాట్లను సినిమాల ద్వారా ప్రతిబింబించగలడు. దీంతో రామ్‌చరణ్ సినిమాలోనూ ఈ సోషల్ రిలవెన్స్ ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. చారిత్రక కట్టడమైన ‘చార్మినార్’ వద్ద ఇటీవల సినిమా షూటింగ్ జరుపుకోవడం ఇందుకు ఊతమిస్తోంది.&nbsp; శంకర్ మార్క్ ఎలిమెంట్స్.. సినిమా నాణ్యత విషయంలో డైరెక్టర్ శంకర్ అస్సలు రాజీ పడరు. కచ్చితంగా ఉన్నతంగా తీర్చిదిద్దేవరకు అలసిపోడు. సాధారణంగా ఒక పాట షూటింగ్‌ని పూర్తి చేయడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. కానీ, శంకర్ మాత్రం దాదాపు 10 రోజులు కేటాయిస్తాడని సమాచారం. ఈ సినిమా బృందం న్యూజిలాండ్‌లోనూ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.&nbsp; ఎమోషన్స్..&nbsp; తన ప్రతి సినిమాలో శంకర్ ఎమోషన్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇందులోనూ బలమైన సీన్స్‌ని రాసుకున్నారట. ముఖ్యంగా తండ్రీకొడుకల మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట.&nbsp; గ్రాండియర్ విజువల్స్.. రామ్‌చరణ్ సినిమాను శంకర్ గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్నాడు. పాటల చిత్రీకరణలోనూ శంకర్ కాంప్రమైజ్ అవ్వట్లేదు. పాటల కోసం ప్రపంచంలోని ఏ లొకేషన్‌కైనా వెళ్లేందుకు శంకర్ వెనుకాడడు. ఇటీవల న్యూజిలాండ్‌లో చిత్రబృందం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.&nbsp; టైటిల్ ఫిక్స్? శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న RC15 సినిమా గురించి చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు.C.E.O(Chief Electoral Officer) అనే టైటిల్‌ పెట్టారని టాక్. ఇక చరణ్ పుట్టిన రోజున టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పేశాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. క్రేజీ కాంబినేషన్‌ RRR తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమాకు భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కావడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు ప్రాజెక్టును టేకప్ చేయడంతో అంచనాలు బలపడ్డాయి. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్‌జే సూర్య, సునీల్‌, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.&nbsp; బర్త్‌డే కానుక చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్‌రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దర్శకుడు శంకర్ లోగోను తీర్చిదిద్దుతున్నారని మార్చి 27 బర్త్‌డే రోజున విడుదల చేస్తామని వెల్లడించారు. సినిమా విడుదలపై కూడా అటు ఇటుగా ఓ స్పష్టత వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ప్రకారం సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.&nbsp; ఫ్యాన్స్‌‌కి పూనకాలే.. సినిమా ప్రకటించిన తర్వాత షూటింగ్ జరుగుతున్నా చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్‌లు లేవు. దీంతో ఒకొక్క విషయం తెలుస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. దిల్‌రాజు కూడా మూవీ&nbsp; అప్డేట్‌పై క్లారిటీ ఇవ్వడంతో ‘పూనకాలు లోడింగ్’ అంటూ ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.
    మార్చి 18 , 2023
    <strong>Game Changer: దీపావళికి గేమ్‌ ఛేంజర్ నుంచి బిగ్ అప్‌డేట్!&nbsp;</strong>
    Game Changer: దీపావళికి గేమ్‌ ఛేంజర్ నుంచి బిగ్ అప్‌డేట్!&nbsp;
    గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటించిన పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గేమ్‌ ఛేంజర్ టీజర్‌ రిలీజ్‌కు సైతం ముహోర్తం ఫిక్సయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; దీపావళి కానుకగా టీజర్‌? రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌’ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్‌ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీపావళి కానుకగా టీజర్‌ను విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్‌ ఉన్నట్లు సమాచారం. వీకెండ్‌లోనే దీనిపై అధికారిక ప్రకటన సైతం ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.&nbsp; తెలుగు స్టేట్స్‌లో రికార్డు బిజినెస్? ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ.150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాయి. ‘గేమ్‌ఛేంజర్‌’ను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పుడు ఇంత బిజినెస్ జరిగే అవకాశం కనిపించలేదట. అయితే ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి వాయిదా పడటంతో బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోయినట్లు ఫిల్మ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; చరణ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే! సంక్రాంతి రిలీజ్‌ అంటే సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఈ సంక్రాంతికి బాలయ్య, వెంకటేష్‌ పాటు, సందీప్ కిషన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నాగచైతన్య 'తండేల్‌' కూడా పొంగల్‌కు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్‌ వద్ద గట్టి పోటీ ఉంటుందని తెలిసినా డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మెుత్తంలో చెల్లించేందుకు ముందుకు వస్తున్నారట. చరణ్‌ కాకుండా మరే హీరో సినిమా సంక్రాంతికి రిలీజైనా ఈ స్థాయి బిజినెస్‌ జరుగుతుందన్న అంచనాలు ఉండేవి కాదని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో చరణ్‌కు పూర్తిస్థాయిలో క్రెడిట్ ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు.&nbsp; భారీ ధరకు ఓటీటీ హక్కులు! గేమ్‌ ఛేంజర్‌ ఓటీటీ హక్కులు సైతం రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక్క పాటకు రూ.20 కోట్లు! 'గేమ్‌ ఛేంజర్‌' నుంచి వచ్చిన మెుదటి రెండు పాటలు ‘జరగండి.. జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా ‘రా మచ్చా మచ్చా’ సాంగ్‌ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ రాబట్టి నేషనల్‌ వైడ్‌గా ట్రెండింగ్‌ అయ్యింది. అయితే త్వరలో థర్డ్‌ సింగిల్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్‌ చివర్లో లేదా నవంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ఈ సాంగ్‌ రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి రెండు పాటలు మంచి బీట్‌తో వచ్చి దుమ్మురేపగా థర్డ్‌ సింగిల్‌ మాత్రం మెలోడిగా రానుంది. ఇక లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ మూడో పాటకు రూ.20 కోట్ల పైనే ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్‌ ధ్రువీకరించాల్సి ఉంది.
    అక్టోబర్ 24 , 2024
    Actress Samantha: సోషల్‌ మీడియాలో అకస్మాత్తుగా సమంత ట్రెండింగ్‌.. ఎందుకంటే?
    Actress Samantha: సోషల్‌ మీడియాలో అకస్మాత్తుగా సమంత ట్రెండింగ్‌.. ఎందుకంటే?
    స్టార్‌ హీరోయిన్‌ సమంత మరోమారు తన క్యూట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పలుచటి శారీలో స్లివ్‌లెస్‌ జాకెట్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది.&nbsp; ఫెయిర్‌ లుక్‌లో తళతళ మెరిసిపోతున్న సామ్‌ను చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. దగ్గర్లో&nbsp; సమంత చిత్రాలు లేకపోవడంతో ఇలా ఫొటోల్లో ఆమెను చూసుకుంటూ సంబరపడుతున్నారు.&nbsp; తాజాగా సంక్రాంతికి తాను ఏం చేశానో చెప్తూ సామ్‌ పలు ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. తాను వేసిన ముగ్గు, గాలిపటంతో ఆటలు, పెంపుడు జంతువులు, లైటింగ్‌ డెకరేట్‌ చేసిన ఇల్లు.. ఇలా పలు ఫొటోలను షేర్ చేసింది. గతేడాది ఖుషితో అలరించిన సమంత త్వరలో సిటాడెల్‌ (ఇండియన్‌ వెర్షన్‌) వెబ్‌సిరీస్‌తో సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్ సిటాడెల్‌ సిరీస్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు. రాజ్‌, డీకే దర్శకత్వం వహిస్తున్నారు.&nbsp; మరోవైపు సమంత కొన్ని రోజుల క్రితమే నిర్మాతగానూ మారింది.&nbsp; ‘ట్రా లా లా మూవీంగ్‌ పిక్చర్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.&nbsp; కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు సామ్‌ తెలిపింది. ఇదిలా ఉంటే తాజాగా సామ్‌ గురించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప2' చిత్రంలోనూ ఆమె ఐటెమ్‌ సాంగ్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్స్‌పై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే 'పుష్ప' పార్ట్‌-1లో సామ్ చేసిన ఐటెమ్‌ సాంగ్‌ అప్పట్లో ఉర్రూతలూగించింది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో సమంత సత్తా చాటింది. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన హీరోయిన్లలో సమంత రెండో స్థానంలో నిలిచింది.&nbsp; బాలీవుడ్ భామ ఆలియా భట్‌ మెుదటి ప్లేస్‌ స్థానంలో నిలవగా.. దీపికా పదుకునే , కత్రినా కైఫ్‌, నయనతార వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఆరో స్థానంలో రష్మిక నిలవడం గమనార్హం. ప్రస్తుతం సామ్ సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. ఈ భామ ఇన్‌స్టా ఖాతాను 31.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
    జనవరి 17 , 2024
    Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
    Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star).. గత శుక్రవారం విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ట్రైలర్‌, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన మూవీ టీమ్‌.. వినూత్నమైన ప్రమోషన్స్‌తో మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. కానీ రిలీజ్‌ తర్వాత ఒక్కసారిగా ఈ సినిమాపై ట్రోల్స్‌, నెగిటివిటీ మెుదలైంది. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురైంది. అసలు సినిమా ఇలా ఎవరైనా తీస్తారా? అంటూ విమర్శలు సైతం వచ్చాయి. ఓ వైపు ఫ్యామిలీ స్టార్‌ బాగుందంటూ చూసినవారు చెబుతుంటే.. నెట్టింట మాత్రం ఇంత నెగిటివిటీ రావడానికి కారణమేంటి? కావాలనే ఈ సినిమాపై నెగిటివిటీని రుద్దుతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; ఆడియన్స్‌ ఏమంటున్నారు? ఫ్యామిలీ స్టార్‌ సినిమాను చూసిన వారంతా సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందంటూ స్పష్టం చేస్తున్నారు. బయట ఎందుకు అంతలా ట్రోల్స్‌, నెగిటివిటీ స్ప్రెడ్‌ చేస్తూన్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ‘ఫ్యామిలీ స్టార్‌’ యావరేజ్‌ కూడా కాదని ఒకటికి రెండుసార్లు చూడాల్సిన సినిమా అంటూ కొందరు యువకులు చెప్పడం విశేషం. https://twitter.com/cult1_rowdy/status/1776852998855262234 https://twitter.com/i/status/1776636730034245707 https://twitter.com/plaasya/status/1777072948597428600 విజయ్‌కు ముందే తెలుసా? ‘ఫ్యామిలీ స్టార్‌’ గురించి ఇద్దరు యూట్యూబ్‌ రివ్యూవర్లు మాట్లాడుకున్న వీడియోను విజయ్‌ ఫ్యాన్స్‌ తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఇందులో ఓ రివ్యూవర్‌ మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్‌ సినిమాపై హేట్‌ లేదని చెప్పాడు. అయితే విజయ్‌ దేవరకొండపై మాత్రం బాగా వ్యతిరేకత ఉందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని విజయ్‌ స్వయంగా నిర్మాత దిల్‌ రాజుతో చెప్పినట్లు రివ్యూవర్‌ అన్నాడు. ‘నాతో సినిమా చేస్తే ఓ బ్యాచ్‌ రెడీ అవుతది.. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ దిల్‌రాజ్‌తో విజయ్‌ అన్నాడట. అలాంటి బ్యాచ్‌లు కూడా ఉంటాయా? అని అప్పుడు దిల్‌ రాజు కూడా షాకైనట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/chanticomrade_/status/1776839226312753263 విజయ్‌ను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు? మెుదటి నుంచి విజయ్‌ దేవరకొండకు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున యాంటి ఫ్యాన్స్ ఉంటున్నారు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఒక్క సినిమాతో స్టార్ హీరో స్థాయికి చేరడం.. కొంత మంది స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు మింగుడు పడలేదన్నది వాస్తవం. అయితే విజయ్ సహజమైన ప్రవర్తన, మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో… అతడు మాట్లాడే పద్దతి, ఉన్నది ఉన్నట్లు చెప్పే తీరు, కొన్ని అంశాలపై స్పష్టంగా మాట్లాడటం కొందరికి నచ్చలేదన్నిది వాస్తవం. పలు సందర్భాల్లో విజయ్ క్లిప్పులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేసిన సందర్భాలు అనేకం. &nbsp; కారణం ఏదైనా విజయ్‌ నుంచి ఏ సినిమా రిలీజైనా దాన్ని టార్గెట్‌ చేస్తూ సినిమాను వెనక్కిలాగటానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈసారి ‘ఫ్యామిలీ స్టార్‌’కు విజయ్‌పై ఉన్న నెగిటివిటీతో పాటు.. నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు పరుశురామ్‌పై ఉన్న హేట్‌ కూడా తోడైనట్లు కనిపిస్తోంది. అందుకే సినిమా బాగున్నా ఈ స్థాయిలో ట్రోల్స్‌, నెగిటివ్స్‌ బయటకు వస్తున్నాయి.&nbsp; దిల్‌ రాజుపై నెగిటివిటీ దిల్‌ రాజు విషయానికి వస్తే.. గత సంక్రాంతి నుంచి ఆయనపై ట్రోల్‌ మెుదలయ్యాయి. తమిళ స్టార్‌ విజయ్‌తో చేసిన ‘వారసుడు’ చిత్రాన్ని గతేడాది సంక్రాంతికి దిల్‌ రాజు రిలీజ్‌ చేశారు. చిరు (వాల్తేరు వీరయ్య), బాలయ్య (వీరసింహా రెడ్డి)లకు పోటీగా ఈ సినిమాను తీసుకురావడం కొందరికి నచ్చలేదు. ఈ సంక్రాంతికి ‘హనుమాన్‌’ విషయంలోనూ దిల్‌ రాజుపై విమర్శలు వచ్చాయి. చిన్న సినిమాలు వెనక్కి తగ్గాలంటూ ఇన్‌డైరెక్ట్‌గా హనుమాన్‌కు ఆయన సూచించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.&nbsp; అటు డైరెక్టర్‌ పరుశురామ్‌.. విజయ్‌తో ‘గీతా గోవిందం’ తర్వాత గీతా ఆర్ట్స్‌తో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే సడెన్‌గా దిల్‌ రాజు నిర్మాణంలో ‘ఫ్యామిలీ స్టార్‌’ చేయడం కూడా ఒక సెక్షన్‌లో ఆయనపై వ్యతిరేకత రావాడనికి కారణమైంది. ఈ ముగ్గురిపై ఉన్న వ్యతిరేకతే ‘ఫ్యామిలీ స్టార్‌’పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌, నెగిటివిటీ రావడానికి కారణమై ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; ఫేక్ రివ్యూస్ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని పీఆర్ టీమ్స్ పనిగట్టుకుని సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే నెగిటివిటిని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టాయి. సినిమా బాగోలేదని, ఈ సినిమా 90mm రాడ్ అంటూ ఘోరంగా ట్రోల్స్ చేశాయి. ఈ ట్రోల్స్ ప్రేక్షకులపై ప్రభావం చూపాయి. ఫలితంగా సినిమా వసూళ్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.&nbsp; అయితే అమెరికా, ఇతర దేశాల్లో మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో 500K డాలర్లను రాబట్టింది. రిలీజ్‌కు ముందే ట్రోల్స్‌! వాస్తవానికి ‘ఫ్యామిలీ స్టార్‌’ థియేటర్లలోకి రాకముందే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి కొందరు ఈ సినిమాను టార్గెట్‌ చేశారు. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ కథ అని చెప్పి.. హీరో ఎలా రిచ్‌ కాస్ట్యూమ్స్‌ ధరిస్తాడని.. బ్రాండెండ్‌ షూస్‌ ఎలా వేస్తారని విమర్శించడం మెుదలు పెట్టారు. మీడియా సమావేశంలోనూ కొందరు విలేఖర్లు ఇదే విధమైన ప్రశ్నలు వేయడంతో నిర్మాత దిల్‌ రాజు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. మిడిల్‌ క్లాస్ అబ్బాయిని సూపర్‌ మ్యాన్‌గా చూపించారు? అంటూ ప్రశ్నలు వేయగా.. ‘హీరో అన్నాక హీరో పని చేయాలి కదా. హీరో ఒక 20 మందిని కొడతాడు. రియల్ లైఫ్‌లో కొట్టగలుగుతామా? యాక్షన్ సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్లే కదా. అది సినిమా.. మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఎందుకు? ఎమోషన్‌కి కనెక్ట్ అయితే లాజిక్స్ ఉండవు’ దిల్‌ రాజు బదులిచ్చారు. ‘గుడ్‌ మూవీని చంపే ప్రయత్నం చేస్తున్నారు’ తొలిరోజు నుంచి సినిమాపై వచ్చిన నెగిటివిటీని తగ్గించేందుకు నిర్మాత దిల్‌రాజు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఓ థియేటర్‌ వద్దకు వెళ్లి సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్‌ను మైక్‌ పెట్టి స్వయంగా ప్రశ్నలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా సినిమా చూసిన ఓ ఆడియన్‌ మాట్లాడుతూ.. తనకు సినిమా చాలా బాగా నచ్చిందని దిల్‌రాజుతో అన్నారు. మంచి సినిమాను కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నెగిటివ్ రివ్యూలు ఇస్తున్న వారిపై మీరు యాక్షన్‌ తీసుకోవాలని దిల్‌రాజుకు సూచించారు.&nbsp; అయితే దిల్‌ రాజు దీనిపై స్పందిస్తూ.. కేరళలో సినిమా విడుదలైన మూడు రోజుల వరకు రివ్యూస్ ఇవ్వకూడదని అక్కడి కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక్కడ కూడా అలాంటి చట్టం ఏదైన వస్తే కానీ ఇండస్ట్రీకి మంచి జరగదు అంటూ చెప్పుకొచ్చారు. మేము మంచి సినిమానే తీశాం. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి… కానీ రివ్యూల పేరుతో మీ అభిప్రాయాలను ప్రేక్షకుల మీద రుద్దొద్దు అంటూ చురకలు అంటించారు. https://telugu.yousay.tv/family-star-first-review-vijay-who-played-as-a-middle-class-boy-is-family-star-a-hit-free.html
    ఏప్రిల్ 08 , 2024
    Pawan Kalyan: ‘సలార్‌’లో ప్రభాస్ లాగే ‘ఓజీ’లో పవన్‌ కూడా… ఫ్యాన్స్‌లో తగ్గిపోతున్న హైప్‌!
    Pawan Kalyan: ‘సలార్‌’లో ప్రభాస్ లాగే ‘ఓజీ’లో పవన్‌ కూడా… ఫ్యాన్స్‌లో తగ్గిపోతున్న హైప్‌!
    టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న హీరోల జాబితాలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ముందు వరుసలో ఉంటాడు. ఆయన కొత్త సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంటుంది. కానీ, పవన్‌ కల్యాణ్‌ నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్‌ ఇండియా చిత్రం రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఓజీ’ (OG) జాతీయ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం ‘సలార్‌’.. పవన్‌ ‘ఓజీ’ మూవీకి ఓ కనెక్షన్‌ ఉందంటూ నెట్టింట ఓ వార్త వైరల్‌ అవుతోంది. అలాగే పవన్‌ తదుపరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) గురించి కూడా ఓ రూమర్‌ హల్‌చల్‌ చేస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఓజీ - సలార్‌ మధ్య పోలిక! ‘కేజీఎఫ్‌’ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’ (Salaar) చిత్రంలో హీరో ప్రభాస్‌ (Prabhas) పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. దాదాపు మూడు గంటలు ఉండే ఈ చిత్రంలో ప్రభాస్ కనిపించేది సుమారు గంట మాత్రమే. మిగతా రన్ టైమ్‌లో ప్రభాస్‌పై ఎలివేషన్‌లు, ఇతర పాత్రలు, సినిమా కథ వంటివి కనిపించాయి. అయితే పవన్‌ అప్‌కమింగ్‌ మూవీ ‘ఓజీ’లోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్‌ కానున్నట్లు తెలుస్తోంది. సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓజీ'లో పవన్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ తక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే సినిమా ప్రారంభమైన తొలినాళ్లలోనే పవన్‌ రెగ్యులర్‌ షూట్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో షూటింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చాడు. పవన్‌ పాత్రకు సంబంధించి మిగిలిన షూటింగ్‌కు రెండు వారాల సమయం సరిపోతుందని టాక్‌ వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే పవన్‌ పాత్ర నిడివి 'ఓజీ'లో పరిమితంగా ఉండొచ్చనే అభిప్రాయానికి సినీ వర్గాలు వస్తున్నాయి.&nbsp; హై రేంజ్‌లో ఎలివేషన్స్‌! ‘ఓజీ’ సినిమాలో పవన్‌ పాత్ర నిడివి తక్కువగా ఉన్నా.. ఎలివేషన్స్‌ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయని మూవీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఓజీ’ గ్లింప్స్‌ చూస్తే ఈ విషయం ప్రతీ ఒక్కరికీ అర్థమవుతోంది. ఇందులో పవన్‌ను.. ఓ రేంజ్‌లో చూపించాడు డైరెక్టర్‌. గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో పవన్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. దీంతోపాటు ఓజీ నుంచి వచ్చి ‘హంగ్రీ చీతా’ సాంగ్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ సాంగ్‌ను పవన్‌ ఫ్యాన్స్‌ తమ కాలర్‌ ట్యూన్స్‌, రింగ్‌టోన్స్‌గా పెట్టుకోవడం విశేషం. ఇక ఈ భారీ చిత్రంలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌ పాత్ర పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.&nbsp; సన్నగిల్లుతున్న అంచనాలు! పవన్‌ కల్యాణ్‌ హీరోగా.. దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్న మరో చిత్రం 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్‌లో మంచి హైప్‌ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమై నాలుగేళ్ల గడిచినా ఎటువంటి సాలిడ్‌ అప్‌డేట్‌ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరుస్తోంది. సినిమా షూటింగ్‌ వాయిదా మీదా వాయిదా పడుతుండటంతో పాటు అరకొరగా అప్‌డేట్స్‌ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి సన్నగిల్లుతోంది. శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఓ ప్రోమో రిలీజ్‌ చేస్తామని ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించినప్పటికీ ఇవాళ్టికి కూడా దానిపై ఎలాంటి అలెర్ట్ లేకపోవడం గమనార్హం. దీంతో పవన్‌ కెరీర్‌లో ప్రిస్టేజియస్‌ ప్రాజెక్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న 'హరిహర వీరమల్లు'.. ‘ఓజీ’ చిత్రంతో పోలిస్తే చాలా లో బజ్‌లోకి వెళ్లిపోతోంది.&nbsp; చిరుకు పోటీగా పవన్‌ కల్యాణ్‌! ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ వాయిదాల మీద వాయిదా పడుతుండటంతో అసలు ఈ సినిమా రిలీజ్‌ అవుతుందా? అన్న ప్రశ్న ఫ్యాన్స్‌లో ఏర్పడింది. దీంతో ఇటీవల మేకర్స్‌ స్పందిస్తూ ఈ సినిమా ఆగలేదని, షూటింగ్‌ అయినంతవరకూ పోస్ట్‌ ప్రొడక్షన్, VFX వర్క్స్‌ జరుగుతున్నాయని ప్రకటించారు. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ఏపీ ఎన్నికల తర్వాత పవన్‌ డేట్స్‌ ఇస్తే డిసెంబర్‌లోగా షూటింగ్‌ పూర్తి చేయాలని వారు భావిస్తున్నారట. తద్వారా సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్‌ చేస్తున్నారట. అదే జరిగితే ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని ‘హరిహర వీరమల్లు’ ఢీకొట్టాల్సి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.&nbsp;&nbsp;
    మార్చి 07 , 2024
    Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
    Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
    నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగాలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ ‘కామిక్ కాన్’లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ‘ప్రాజెక్ట్ K’ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్ పాల్గొన్నారు. గ్లింప్స్‌ చెప్పే సీక్రెట్స్ ఇవే! కాగా, ప్రాజెక్ట్‌ K సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు. ఇక సినిమా టైటిల్ కింద ‘2898 AD’ అని పెట్టారు. అంటే కలియుగాంతం చివర్లో జరిగే కథ అని డైరెక్టర్‌ చెప్పకనే చెప్పాడు. గ్లింప్స్ చూస్తే సాధారణంగా ప్రపంచాన్ని చీకటి కమ్ముకున్నప్పుడు ఒక వెలుగు వస్తుంది అని, ప్రపంచాన్ని విలన్ తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు కల్కి ఉద్భవిస్తాడని, ప్రజల్ని కాపాడతాడని తెలుస్తుంది. అయితే గ్లింప్స్‌ను మరింత పరిశీలనగా చూస్తే చాలా విషయాలు మనకు అర్థమౌతాయి. కలియుగాంతం సమయంలో ఈ ప్రపంచం పూర్తిగా రోబోల మయంగా, ఆధునిక ఆయుధాలతో యుద్ధం జరిగే స్థాయికి వెళ్తుందని గ్లింప్స్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పైగా 2898 ADలో ప్రస్తుత స్థాయిలో జనాభా కాకుండా చాలా కొద్దిమంది ప్రజలే ఉండొచ్చని భావించవచ్చు. వారంతా ఓ వ్యక్తి (రాజు) పాలనలో జీవిస్తుండవచ్చు. https://twitter.com/DEADLINE/status/1682221771154677760?s=20 అమితాబ్‌ పాత్ర నిడివి తక్కువేనా? ప్రాజెక్ట్‌లో Kలో రాజు (అమితాబ్‌ బచ్చన్‌) తన ప్రజలని పాలిస్తుంటే ఒక విలన్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆ రాజుని బంధించి అతని ప్రజలని విలన్ తనకు బానిసలుగా చేసుకున్నట్లు గ్లింప్స్‌లో కనిపిస్తోంది. అలాంటప్పుడు రాజు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో వారిని ఆదుకునేందుకు కల్కి అవతారంలో హీరో (ప్రభాస్‌) ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. మూవీలో అయితే మొదట అమితాబ్ వచ్చి ఆ తర్వాత ప్రభాస్ వస్తాడని అర్థం చేసుకోవచ్చు. శివాలయంలోకి ఓ రోబో రావడం గ్లింప్స్‌లో చూశాం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడి క్యారెక్టర్‌లో అమితాబ్ నటిస్తున్నట్లు టాక్.&nbsp; https://twitter.com/DEADLINE/status/1682129398600966146?s=20 ప్రభాస్ అందుకే కల్కి అవుతాడా? ఇక ప్రాజెక్ట్ K అంటే ‘ప్రాజెక్ట్ కల్కి’ అని, ప్రభాస్‌తో లోకాన్ని కాపాడించడానికి కొంతమంది చేసే యుద్ధమని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. నిమిషం వీడియోతో డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్‌గా కథ మెుత్తం రివీల్ చేసినట్లు అర్థమవుతోంది. ఇక కొంచెం డీటేలింగ్‌లోకి వెళ్తే అమితాబ్‌ బచ్చన్‌తో పాటు హీరోయిన్‌ దీపికా పదుకొణేను కూడా విలన్లు బంధించినట్లు గ్లింప్స్‌లో చూపించారు. దీన్ని బట్టి ప్రభాస్‌ ఆమె కోసం వచ్చి కల్కి లాగా మారతాడా? అన్న సందేహం కూడా ఉత్పన్నమవుతుంది. లేదా హీరోయిన్‌ను కాపాడే క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా దీపికా, ప్రభాస్‌ మధ్య ప్రేమ సన్నివేశాలను కూడా బాగా ఎలివేట్‌ చేయాలని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నారు.&nbsp; చీకటికి రారాజు అతడే? ఇకపోతే ఈ సినిమాలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రతినాయకుడిగా కనిపిస్తాడని మెున్నటి వరకూ ఊహాగానాలు వినిపించినా తాజాగా విడుదలైన గ్లింప్స్‌ వీడియోతో ‌అది కన్‌ఫార్మ్‌ అయింది. ఎందుకంటే ప్రాజెక్ట్‌Kలో కమల్‌ హాసన్‌ నటించనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించిన సమయంలో ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. 'భూమి మెుత్తాన్ని కమ్మేసే షాడో (చీకటి) కోసం వెతికామని.. ఆ పాత్ర చేయగల ఒకే ఒక్కడు దొరికేశాడు' అని కమల్‌ గురించి ప్రకటించారు. తాజా గ్లింప్స్‌ కూడా భూమిని చీకటి కమ్మేయడం గమనించవచ్చు. ఈ రెండు కలిపి చూస్తే ఇందులో విలన్లకు రారాజుగా కమల్‌ హాసన్‌ కనిపిస్తాడని అర్థం చేసుకోవచ్చు.&nbsp; https://twitter.com/i/status/1672854637014138880 సూపర్ రెస్పాన్స్ గ్లింప్స్‌ని చూస్తుంటే గూస్‌బమ్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు. విజువల్ వండర్‌గా, హాలీవుడ్ రేంజ్ సినిమాని తలపిస్తోందని చెబుతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ విజనరీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇక, సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. మళ్లీ మళ్లీ వినాలనిపించే ట్రాక్‌ని అందించాడు. గ్లింప్స్ చూశాక మ్యూజిక్ హాంట్ చేస్తూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు.&nbsp; https://twitter.com/THR/status/1682126315229683715?s=20 విడుదల తేదీ? ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారం ఈ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ కావాలి. అయితే, గ్లింప్స్‌లో కేవలం 2024లో వస్తుందనే ఇచ్చారు. అంటే, మూవీ డేట్ మారుతుందనే సంకేతాలు ఇచ్చారు. మరి, జనవరి 12న కాకుండా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్‌కి అచ్చొచ్చిన ‘మే9’న కల్కిని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు ఇదే రోజున రిలీజ్ అయ్యాయి. https://www.youtube.com/watch?v=bC36d8e3bb0
    జూలై 21 , 2023
    Hanuman Viral Video: ‘హనుమాన్‌’ చూస్తూ థియేటర్లో మహిళ వింత ప్రవర్తన.. కారణం దైవమా? దెయ్యమా?
    Hanuman Viral Video: ‘హనుమాన్‌’ చూస్తూ థియేటర్లో మహిళ వింత ప్రవర్తన.. కారణం దైవమా? దెయ్యమా?
    సంక్రాతికి విడుదలైన హనుమాన్‌ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతూ తన జైత్రయాత్రను ఇప్పటికీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ చూస్తే గూస్‌బంప్స్‌ రావడం పక్కా అని వీక్షకులు చెబుతున్నారు. సినిమాలోని చివరి 20 నిమిషాలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుందని చిత్రం విడుదలైనప్పటికీ నుంచి ఆడియన్స్‌ పేర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ తాజాగా ఓ వీడియో (Hanuman Viral Video) బయటకి వచ్చింది. ప్రస్తుతం నెట్టింట అది వైరల్ అవుతోంది.&nbsp; మహిళ విచిత్ర ప్రవర్తన హనుమాన్‌ క్లైమాక్స్‌ చూస్తూ ఓ మహిళ పూనకంతో ఊగిపోయింది. ఒంట్లోకి ఎవరో ఆవహించినట్లు విచిత్రంగా ప్రవర్తించింది. ఈ ఘటనతో సినిమా చూస్తున్నవారు షాకయ్యారు. ఆ మహిళను సాధారణ స్థితిలోకి తీసుకువచ్చేందుకు యత్నించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. https://twitter.com/i/status/1752014453342969952 ఒంట్లోకి దేవుడు వచ్చాడా? ఉప్పల్‌లోని ఏసియన్‌ మాల్‌లో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. హనుమాన్ సినిమా చివర్లో వచ్చే పాటను చూస్తూ ఆ మహిళ పూనకం వచ్చినట్లు ప్రవర్తించిందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఆ మహిళ ఒంట్లోకి దేవుడు పూనాడని అందుకే ఆమె అలా ప్రవర్తించి ఉండొచ్చని అంటున్నారు. గ్రామ దేవతలు ఆవహించినప్పుడు కొందరి ప్రవర్తన సరిగ్గా ఇలాగే ఉంటుందని గుర్తు చేస్తున్నారు.&nbsp; దుష్టశక్తే ఈ పని చేసిందా? మరికొందరు నెటిజన్లు మరో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆమె శరీరంలో నెగిటివ్‌ ఎనర్జీ ఉండి ఉండవచ్చని అంటున్నారు. హనుమాన్‌ మూవీ చూస్తున్న క్రమంలో అది ఒక్కసారిగా బయటకు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. హనుమాన్‌ దెబ్బకి ఆ దుష్టశక్తి ఆమె ఒంట్లో నుంచి వెళ్లిపోయి కూడా ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. ఈ రెండు విభిన్నమైన వాదనలలో ఏది నిజమో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్‌ అవుతున్నారు.&nbsp; అసలు నిజం ఇదే! ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. సినిమా చూస్తున్న క్రమంలో ఆమెకు ఒక్కసారిగా ఫిట్స్‌ వచ్చాయని మహిళ సన్నిహితుల ద్వారా తెలిసింది. అందుకే ఆమె ఊగిపోయిందని సమాచారం. కొద్ది సేపటి తర్వాత సదరు మహిళ సాధారణ స్థితిలోకి వచ్చేసిందని చెబుతున్నారు. అసలు నిజం బయటకు వచ్చేలోపే వీడియో వైరల్‌ కావడంతో విభిన్నమైన అభిప్రాయాలు బయటకొచ్చాయి.&nbsp; రూ.300 కోట్ల దిశగా పరుగులు ఇక హనుమాన్‌ సినిమా (Hanuman Collections) విషయానికి వస్తే.. ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం రూ.300 కోట్ల మార్క్‌ను ‌అందుకునేందుకు చకా చకా అడుగులు వేస్తోంది. హనుమాన్‌ మ్యానియా థియేటర్లలో కొనసాగుతుండటంతో ఈ వారంలోనే రూ.300 కోట్ల గ్రాస్‌ వచ్చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తూ సీక్వెల్‌పై ఫోకస్‌ పెట్టారు.&nbsp;
    జనవరి 30 , 2024
    Upcoming Telugu Movies: 2024లో రాబోతున్న టాలీవుడ్‌ బడా చిత్రాలు ఇవే!
    Upcoming Telugu Movies: 2024లో రాబోతున్న టాలీవుడ్‌ బడా చిత్రాలు ఇవే!
    కొత్త సంవత్సరంలో పలు భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు సంక్రాంతికి రిలీజ్‌ అవుతుండగా మరికొన్ని షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. వీటిలో రామ్‌చరణ్‌, ప్రభాస్‌, అల్లుఅర్జున్‌, పవన్‌ కల్యాణ్‌, కమల్‌హాసన్‌ వంటి స్టార్‌ హీరోల ప్రతిష్టాత్మక చిత్రాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాలు టాలీవుడ్‌ ఖ్యాతిని మరింత పెంచుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో రానున్న మోస్ట్‌ వాటెండ్‌ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; గుంటూరు కారం సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'గుంటూరు కారం' (Guntur Kaaram). భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ మూవీలో మహేష్‌కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరీలు నటిస్తున్నారు.&nbsp; హనుమాన్ ఈ సంక్రాంతికే రాబోతున్న పాన్‌ వరల్డ్ చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman). డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. హనుమంతుడికి మించిన సూపర్ మాన్ మరొకరు ప్రపంచంలో లేరని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు డైరెక్టర్‌. యంగ్ హీరో తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌గా హనుమాన్‌ విడుదల కానుంది.&nbsp; భారతీయుడు 2 అగ్ర కథానాయకుడు కమల్‌ హాసన్‌, దర్శకుడు శంకర్‌ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం 'భారతీయుడు 2'. కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వృద్ధుడు పాత్రలో కమల్‌ హాసన్‌ కనిపించనున్నారు.&nbsp; పుష్ప 2 సుకుమార్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటిస్తున్న చిత్రం 'పుష్ప2' (Pushpa 2). తొలి భాగం 'పుష్ప' పాన్‌ ఇండియా స్థాయిలో సూపర్‌హిట్‌ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి పార్ట్‌-2పై పడింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. కేరళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నాడు.&nbsp; ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'. ఈ చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నెల రోజుల క్రితం వరకూ ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరగ్గా.. ప్రస్తుతం పవన్‌ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో బ్రేక్‌ పడింది. ఏపీ ఎన్నికల తర్వాత ఈ సినిమా మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. గేమ్‌ ఛేంజర్‌ మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా.. డైరెక్టర్ శంకర్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ పట్టుదలగా ఉన్నారు. కాగా, ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి, ఎస్‌.జే. సూర్య, నవీన్ చంద్ర, సునీల్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.&nbsp; కల్కి 2898 ఏడీ సలార్‌ సూపర్‌ హిట్‌ కావడంతో సినీ ప్రియులంతా ఆయన తర్వాత చిత్రం 'కల్కి 2898 ఏడీ' కోసం ఎదురు చూస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే నటిస్తోంది. కమల్‌ హాసన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. స్పిరిట్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్‌ హీరోగా రానున్న క్రేజీ పార్జెక్ట్‌ 'స్పిరిట్‌' (Spirit). ఈ చిత్రంలో ప్రభాస్‌ కెరీర్‌లోనే మెుదటి సారి ఖాకీ డ్రెస్‌ వేసుకోబోతున్నాడు. అగ్రెసివ్ పోలీసు ఆఫీసర్‌గా రెబల్‌ స్టార్‌ కనిపిస్తాడని నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ కూడా కొత్త ఏడాదిలోనే ప్రారంభం కానున్నట్లు ఇటీవల డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా తెలియజేశారు.&nbsp;
    డిసెంబర్ 30 , 2023
    <strong>Game Changer: </strong><strong>RRR తరహాలో ‘గేమ్‌ ఛేంజర్‌’.. గుంపుతో మళ్లీ ఫైట్‌ చేయనున్న చరణ్‌?&nbsp;</strong>
    Game Changer: RRR తరహాలో ‘గేమ్‌ ఛేంజర్‌’.. గుంపుతో మళ్లీ ఫైట్‌ చేయనున్న చరణ్‌?&nbsp;
    గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటించిన పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గేమ్‌ ఛేంజర్ టీజర్‌ త్వరలో రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. దీని ద్వారా మేకర్స్ ఓ విషయాన్ని చెప్పకనే చెప్పారని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.&nbsp; గుంపుతో చరణ్‌ ఫైట్‌ RRR చిత్రంలోని రామ్‌చరణ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ ఎప్పటికీ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వందలాది మంది నిరసన కారులతో చరణ్‌ చేసే ఫైట్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. అయితే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలోనూ ఈ తరహా మాబ్‌ ఫైట్‌ను (Mob Fight) ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చని నెటిజన్లు చెబుతున్నారు. తాజాగా గేమ్‌ ఛేంజర్‌ టీమ్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్‌ ఇదే విషయాన్ని తెలియజేస్తోందని అంటున్నారు. సినిమా రిలీజ్‌కు 75 రోజులు ఉన్న నేపథ్యంలో మేకర్స్ ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. టీజర్‌ త్వరలో రానున్నట్లు ఇందులో హింట్ ఇచ్చారు. అయితే ఈ పోస్టర్‌ను గమనిస్తే చరణ్‌ ముందు టేబుల్ వేసుకొని కుర్చీలో కూర్చునట్లుగా వెనకనుంచి చూపించారు. అదే సమయంలో పదుల సంఖ్యల గుండాలు కత్తులు, కర్రలతో చరణ్‌ వైపు దూసుకురావడం చూపించారు. దీన్ని బట్టి RRR తరహాలో మాబ్‌ ఫైట్‌ను ఎక్స్‌పెక్ట్‌ చేయోచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మూవీ టీమ్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; కలిసొచ్చిన మాబ్‌ ఫైట్‌ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు వందలాది మంది రౌడీలతో చేసే మాబ్‌ ఫైట్‌ బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాలో చరణ్‌ తొలిసారి మాబ్ ఫైట్‌ చేశారు. ‘ఒక్కొక్కడిని కాదు షేర్‌ ఖాన్‌ 100 మందిని ఒకేసారి పంపించు’ శత్రు సైన్యంతో విరోచితంగా పోరాడాడు. ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించిన ధ్రువ సినిమాలోనూ ఈ తరహా సీన్‌ను చూడవచ్చు. తనపైకి దూసుకొచ్చిన అల్లరిమూకకు బుద్ధి చెప్పే సీన్ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ‘RRR’లో చేసిన మాబ్‌ ఫైట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చరణ్‌ గుంపుతో ఫైట్‌ చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ‘గేమ్‌ ఛేంజర్‌’లోనూ ఇలాంటి ఫైట్‌ ఉంటే ఆ మూవీ కూడా పక్కాగా విజయం సాధిస్తుందని ఫ్యాన్స్‌ నమ్మకంతో ఉన్నారు.&nbsp; దీపావళికి టీజర్‌ రిలీజ్‌! రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌’ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్‌ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీపావళి కానుకగా టీజర్‌ను విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్‌ ఉన్నట్లు సమాచారం. దీంతో మెగా ఫ్యాన్స్‌ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.&nbsp; రూ.150 కోట్లకు తెలుగు రైట్స్‌? ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ.150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాయి. ‘గేమ్‌ఛేంజర్‌’ను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పుడు ఇంత బిజినెస్ జరిగే అవకాశం కనిపించలేదట. అయితే ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి వాయిదా పడటంతో బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోయినట్లు ఫిల్మ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; రికార్డు ధరకు ఓటీటీ హక్కులు! గేమ్‌ ఛేంజర్‌ ఓటీటీ హక్కులు సైతం రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్‌కు ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    అక్టోబర్ 28 , 2024
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’తో చిరంజీవికి ఊహించని తలనొప్పి.. మెగా ఫ్యాన్స్‌ మధ్య చీలికలు తప్పదా?
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’తో చిరంజీవికి ఊహించని తలనొప్పి.. మెగా ఫ్యాన్స్‌ మధ్య చీలికలు తప్పదా?
    రామ్‌చరణ్‌ - డైరెక్టర్ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer). 'ఆర్ఆర్‌ఆర్‌' (RRR) తర్వాత రామ్‌ చరణ్‌ (Ram Charan) నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ ఖాయమంటూ పలు వేదికలపై దిల్‌రాజు స్పష్టం చేశారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా సంక్రాంతి రేసులో నిలవనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇప్పటికే పొంగల్‌ బరిలో నిలిచిన చిరుకు చరణ్‌ నుంచి గట్టి పోటీ తప్పదా అన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది.&nbsp; క్రిస్మస్‌ నుంచి సంక్రాంతికి లాక్‌! తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి చాలా పెద్ద ఫెస్టివల్. బడా బడా హీరోలందరూ తమ చిత్రాలను సంక్రాంతికి లాక్‌ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన అప్‌కమింగ్‌ చిత్రం 'విశ్వంభర'ను పొంగల్‌ రేసులో నిలిపారు. ఈ క్రమంలోనే రామ్‌చరణ్‌ లేటెస్ట్ చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'ను సైతం సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ నిర్ణయించినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి కావడానికి ఇంకాస్త సమయం పట్టే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో క్రిస్మస్‌ నాటికి రిలీజ్‌ సాధ్యం కాకపోవచ్చని సమాచారం. దీంతో సంక్రాంతికి రిలీజ్‌ చేస్తే బాగుంటుందని మేకర్స్‌ భావిస్తున్నారట. అదే జరిగితే బాక్సాఫీస్‌ వద్ద చిరు-రామ్‌చరణ్‌ మధ్య బిగ్‌ ఫైట్‌ తప్పదని అంటున్నారు.&nbsp; డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడే కారణమా? గేమ్‌ ఛేంజర్‌ చిత్రం డిసెంబర్‌ నుంచి సంక్రాంతికి మారడం వెనక డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని క్రిస్మస్‌ కంటే సంక్రాంతికి తీసుకువస్తేనే తమకు లాభదాయకంగా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్ల అంటున్నారట. అలా కాదని క్రిస్మస్‌కు తీసుకొస్తే తమకు గిట్టుబాటు కాకపోవచ్చని తేల్చి చెబుతున్నారట. పైగా జనవరి 10 నుంచి సంక్రాంతి చిత్రాలు వస్తుండటంతో లాంగ్‌ పీరియడ్‌ కలెక్షన్స్‌ పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారట. 20 రోజుల కలెక్షన్స్‌తోనే 'గేమ్‌ ఛేంజర్‌' సరిపెట్టుకోవాల్సి వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారట. దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ టీమ్‌ పూర్తిగా ఇరాకటంలో పడిపోయినట్లు తెలుస్తోంది.&nbsp; చిరు వెనక్కి తగ్గేనా! తండ్రి కొడుకులైనా చిరంజీవి, రామ్‌చరణ్‌ ఇప్పటివరకూ బాక్సాఫీస్‌ వద్ద తలపడలేదు. ‘విశ్వంభర’ వర్సెస్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’గా పోటీ మారితే ఫ్యాన్స్‌కు తప్పుడు సంకేతం ఇచ్చినవారవుతారు. రిలీజ్‌ సందర్భంగా ఏ సినిమా చూడాలన్న విషయంలో మెగా ఫ్యాన్స్‌ తర్జనభర్జన అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి కొడుకు కోసం ‘విశ్వంభర’ను పోస్ట్‌ పోన్‌ చేసుకునే అవకాశం లేకపోలేదని ఫిల్మ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా రిలీజ్‌పై ఎప్పటినుంచో సందిగ్దం నెలకొంది. నిర్మాత దిల్‌రాజు, సంగీత దర్శకుడు థమన్‌ క్రిస్మస్‌ కానుకగా సినిమా వస్తుందని చెప్పినా మెగా ఫ్యాన్స్‌ పూర్తిగా విశ్వసించలేదు. ఇప్పుడేమో సంక్రాంతికి సినిమా వస్తుందంటూ మరో ప్రచారం జోరందుకుంది. సంక్రాంతి కూడా మిస్‌ అయితే ‘గేమ్‌ ఛేంజర్‌’పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి తారాస్థాయికి చేరే ప్రమాదం ఉంది. కాబట్టి సంక్రాంతికే ‘గేమ్ ఛేంజర్‌’ను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ పట్టుబడితే మెగాస్టార్‌ వెనక్కి తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; రీషూట్‌కు నో చెప్పిన చరణ్‌! ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ షూటింగ్‌ ఇటీవలే కంప్లీట్‌ చేసుకున్న రామ్‌చరణ్‌ తన ఫోకస్‌ను తర్వాతి చిత్రంపైకి మళ్లించారు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో రానున్న ‘RC16’ కోసం లాంగ్‌ హెయిర్‌తో పాటు బాడీని సైతం పెంచాడు. అయితే దర్శకుడు శంకర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’కి సంబంధించిన కొన్ని సీన్లపై అసంతృప్తిగా ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. చరణ్‌తో వాటిని రీషూట్‌ చేాయాలని భావించినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని నిర్మాత దిల్‌రాజు ద్వారా చరణ్‌ దృష్టికి తీసుకెళ్లగా ఇందుకు అతడు నో చెప్పినట్లు తెలిసింది. తిరిగి ‘గేమ్‌ ఛేంజర్‌’ లుక్‌లోకి మారితే ‘RC16’ షూటింగ్‌లో జాప్యం జరుగుతుందని ఆయన భావించారట. ఇప్పటికే ‘RC16’ కోసం డేట్స్‌ కూడా ఇవ్వడంతో వాటిని అడ్జస్ట్ చేసుకునేందుకు చరణ్‌ సంసిద్ధంగా లేరని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపించింది. చరణ్‌- నీల్‌ కాంబో లోడింగ్‌! రామ్‌ చరణ్‌ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్‌, సలార్ వంటి బ్లాక్‌బాస్టర్స్‌ అందించిన ప్రశాంత్‌ నీల్‌తో చరణ్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను డీవీవీ దానయ్య నిర్మించనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కేందుకు చాలా సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతం ప్రశాంత్‌ చేతిలో 'NTR 31'తో పాటు సలార్‌ 2, కేజీఎఫ్‌ 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అటు చరణ్‌ సైతం బుచ్చిబాబుతో పాటు సుకుమార్‌తో ప్రాజెక్ట్‌ చేయాల్సి ఉంది. అవన్నీ పూర్తయిన తర్వాత చరణ్‌-నీల్‌ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
    అక్టోబర్ 09 , 2024

    @2021 KTree