• TFIDB EN
  • సంక్రాంతి
    UTelugu2h 38m
    రాఘవేంద్రకు తన తముళ్లు అంటే ఎంతో ప్రాణం. వ్యాపారాలను నిర్వహిస్తూనే వారిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. పెద్ద తమ్ముడు విష్ణు భార్యకు ఇదంతా చూసి అసూయ కలుగుతుంది. తన భర్తను అన్న నుంచి విడదీయాలని కుట్రలు చేస్తుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    వెంకటేష్
    రాఘవేంద్ర
    శ్రీకాంత్
    విష్ణు
    స్నేహ
    అంజలి
    ఆర్తి అగర్వాల్
    పద్మ
    సంగీత క్రిష్
    కళ్యాణి
    శివ బాలాజీ
    చిన్నా
    రాతి
    కావేరి
    శర్వానంద్
    వంశీ
    ప్రకాష్ రాజ్
    కావేరి తండ్రి
    సుధాకర్
    అంజి
    తనికెళ్ల భరణి
    రాయుడు
    AVS
    సూపర్ మార్కెట్ యజమాని
    వేణు మాధవ్
    నల్ల బాలు
    సుమన్ సెట్టి
    దొంగ
    తిరుపతి ప్రకాష్
    దొంగ
    నర్సింగ్ యాదవ్
    పోలీస్ ఆఫీసర్
    రఘునాథ రెడ్డి
    శేషగిరి
    రాళ్లపల్లి
    సత్య మూర్తి
    దువ్వాసి మోహన్
    మల్లాది రాఘవకవిత తండ్రి
    శివపార్వతిపద్మ మరియు కళ్యాణి తల్లి
    శ్రీ హర్షబాలాజీ
    చంద్ర మౌళిపోస్ట్‌మ్యాన్
    జాహ్నవికవిత
    దిల్ రమేష్
    తనీష్
    యంగ్ చిన్నా
    మాస్టర్ మనోజ్యంగ్ వంశీ
    సిబ్బంది
    ముప్పలనేని శివ
    దర్శకుడు
    RB చౌదరి
    నిర్మాత
    SA రాజ్‌కుమార్
    సంగీతకారుడు
    ఎన్. లింగుసామి
    కథ
    కథనాలు
    సంక్రాంతికి విడుదలైన చిరంజీవి సినిమాలు
    సంక్రాంతికి విడుదలైన చిరంజీవి సినిమాలు
    ]సంక్రాంతి బ్లాక్‌ బస్టర్‌ జోష్‌ను చిరంజీవి కొనసాగించాలని చూస్తున్నారేమో. ఈ సారి కూడా వాల్తేరు వీరయ్యతో సిద్ధం అయిపోయారు. విజయంపై మరింత ధీమాాగా ఉన్నారు.వాల్తేరు వీరయ్య
    ఫిబ్రవరి 13 , 2023
    సంక్రాంతి బరిలో బాలయ్య హిట్లు
    సంక్రాంతి బరిలో బాలయ్య హిట్లు
    ]గత కొన్నేళ్లుగా బాలయ్య సంక్రాంతికి సినిమా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన వీరసింహా రెడ్డితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సినిమాపై ప్రస్తుతానికైతే పాజిటివ్‌ వైబ్స్‌ ఉన్నాయి.వీరసింహా రెడ్డి
    ఫిబ్రవరి 13 , 2023
    సంక్రాంతి పండగకి సందడి చేసిన తెలుగు పాటలు ఇవే!
    సంక్రాంతి పండగకి సందడి చేసిన తెలుగు పాటలు ఇవే!
    ]సోగ్గాడి పెళ్లాంముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో మెహన్‌బాబు హీరోగా వచ్చిన చిత్రంలో “సంక్రాంతి వచ్చింది తుమ్మెద సరాదాలు తెచ్చింది తుమ్మెద” అనే పాట ఇప్పటికీ మోగుతూనే ఉంటుంది.Watch Now
    ఫిబ్రవరి 13 , 2023
    సంక్రాంతి సినిమాలు..బాక్సాఫీస్‌ కలెక్షన్లు ఎవరు విన్నర్‌?
    సంక్రాంతి సినిమాలు..బాక్సాఫీస్‌ కలెక్షన్లు ఎవరు విన్నర్‌?
    ]ఇంకా రెండు మూడు రోజులు బాక్సాఫీస్‌ వార్‌ కొనసాగే అవకాశముంది. జనవరి 16న కూడా సంక్రాంతి సెలవు కావడంతో కలెక్షన్ల సునామీ కొనసాగే అవకాశముంది.
    ఫిబ్రవరి 13 , 2023
    సంక్రాంతి పందెంకోళ్లు.. బరిలో నిలిచిన సినిమాలు..!
    సంక్రాంతి పందెంకోళ్లు.. బరిలో నిలిచిన సినిమాలు..!
    ]మరి ఈ సంక్రాంతికి ఏ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి. సంక్రాంతి పందెం కోడిగా గెలిచేదెవరో వేచి చూడాలి. సంక్రాంతి పందెంకోడి ఎవరో..
    ఫిబ్రవరి 11 , 2023
    New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్‌.. ఓ లుక్కేయండి!
    New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్‌.. ఓ లుక్కేయండి!
    కొత్త ఏడాదిలో ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్‌ చేసేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతి (Sankranthi)కి విడుదలైన ‘హనుమాన్‌’ (Hanuman), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘సైంధవ్‌’ (Saindhav), ‘నా సామిరంగ’ (Na Sami Ranga) చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకొని ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ కోవలోనే మరికొన్ని సినిమాలు అలరించేందుకు రాబోతున్నాయి. కాగా, ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు సంక్రాంతి సందర్భంగా రిలీజై ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  ఈగల్‌ మాస్‌ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్‌ చిత్రం ‘ఈగల్‌ (Eagle). వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాలి. కొన్ని కారణాల నేపథ్యంలో ‘ఫిబ్రవరి 9’కి వాయిదా పడింది. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రవితేజ, హీరోయిన్‌ కావ్యా థాపర్ ఎంతో అందంగా కనిపించారు. రాజా సాబ్‌ పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌, డైరెక్టర్‌ మారుతీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్‌’ (Raja Saab)గా పేరును ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేయగా అది ట్రెండింగ్‌గా మారింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ లుంగీతో కనిపించడం విశేషం.  ఆపరేషన్‌ వాలెంటైన్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ఆపరేషన్‌ వాలెంటైన్‌ (Operation Valentine) చిత్రంలో నటిస్తున్నాడు. మాజీ మిస్‌ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో చేస్తోంది. ఈ చిత్ర యూనిట్‌ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అమృత్‌సర్‌లోని చారిత్రక వాఘా సరిహద్దులో వందేమాతరం పాటను కూడా లాంచ్‌ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.  భీమా ప్రముఖ హీరో గోపిచంద్‌ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భీమా (Bheema). పండగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ సైతం హల్‌చల్‌ చేసింది. ఇందులో గోపిచంద్‌ ఎద్దుపై కూర్చొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ. హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలవుతుంది.  గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి విశ్వక్‌ సేన్‌ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' (Gangs Of Godavari). ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ మార్చి 8న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.  వెట్టైయాన్‌ జైలర్‌ తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'వెట్టియాన్‌'. టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ సంక్రాంతి రోజున విడుదలై సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ పోస్టర్‌ వింటేజ్‌ రజనీకాంత్‌ను గుర్తుకు తెచ్చింది. ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ తమిళ స్టార్‌ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్‌ ఆఫ్ ది ఆల్‌టైమ్‌ (The Greatest of All Time). ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ కూడా తాజాగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌లో విజయ్‌తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, వెంకట్‌ ప్రభు కనిపించారు. ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం అందిస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్‌ తమిళ హీరో ధనుష్‌ నటించిన లెటేస్ట్‌ చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్’ (Captain Miller). ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. తెలుగులో జనవరి 25న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని లేటెస్ట్ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ మూవీని అరుణ్‌ మతేశ్వరణ్‌ డైరెక్ట్ చేశారు.  అంబాజీపేట మ్యారేజీ బ్యాండు యంగ్‌ హీరో సుహాస్‌, డైరెక్టర్‌ దుశ్యంత్‌ కటికనేని దర్శకత్వంలో రూపొందుతున్న 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ పండగ సందర్భంగా రిలీజై ఆకట్టుకుంది. 
    జనవరి 17 , 2024
    This Week OTT Movies: సంక్రాంతికి దద్దరిల్లనున్న థియేటర్లు.. ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!
    This Week OTT Movies: సంక్రాంతికి దద్దరిల్లనున్న థియేటర్లు.. ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!
    తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్‌ సంక్రాంతి సందడి మెుదలు కానుంది. దీంతో ఎప్పటిలాగే కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడబోతున్నాయి. ఈ ఏడాది కొత్త పలువురు స్టార్‌ హీరోలు సంక్రాంతి బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అటు ఓటీటీలోనూ సరికొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. మరి ఎవరెవరు సంక్రాంతి బరిలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.  థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు గుంటూరు కారం మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. హను-మాన్‌ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.. వైవిధ్యమైన సినిమాలు తీస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తేజ సజ్జా కథానాయకుడిగా ఆయన రూపొందించిన మరో చిత్రం ‘హను-మాన్‌’ (Hanu Man). ఆంజనేయస్వామి కథా నేపథ్యంతో సూపర్‌ హీరో ఫిల్మ్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రం కూడా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లోని వీఎఫ్‌ఎక్స్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. చిన్నారులను సైతం అలరించేలా ఇందులో సన్నివేశాలు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.  సైంధవ్‌ టాలీవుడ్‌ స్టార్ హీరో వెంకటేష్‌ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచారు. శైలేష్‌కొలను దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సైంధవ్‌’ (Saindhav) జనవరి 13న థియేటర్‌లలో విడుదల కానుంది. వెంకటేష్‌కి ఇది 75వ సినిమా. కూతురి సెంటిమెంట్‌తో పాటు, వెంకటేశ్‌ యాక్షన్‌ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. శ్రద్ధాశ్రీనాథ్‌, నవాజుద్దీన్‌ సిద్దిఖీ, ఆర్య కీలకపాత్రలు పోషించారు. నా సామిరంగ ఈ సంక్రాంతికి మరో స్టార్‌ హీరో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. నాగార్జున (Nagarjuna) హీరోగా విజయ్‌ బిన్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) చిత్రం.. జనవరి 14న విడుదల కానుంది. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలు పోషించగా.. ఆషికా రంగనాథ్‌ కథానాయికగా చేసింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘పొరింజు మరియం జోసే’ చిత్రానికి రీమేక్‌గా నా సామిరంగను రూపొందించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేశారు.  అయలాన్‌ సంక్రాంతికి తెలుగు చిత్రాలతో పాటు ఓ డబ్బింగ్‌ సినిమా సైతం విడుదల కాబోతోంది. తమిళ నటుడు శివకార్తికేయన్‌ ‘అయలాన్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాడు. ఆర్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా చేసింది. జనవరి 12న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. గ్రహాంతర వాసితో మనిషికి కుదిరిన స్నేహం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అన్నది కథ.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే ఏకంగా 29 చిత్రాలు / వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. థియేటర్లకు వెళ్లి కొత్త మూవీస్‌ చూసే ఆసక్తి లేకపోతే వీటిని ప్రిఫర్‌ చేయవచ్చు. ఇంతకీ ఓటీటీలో రాబోతున్న ముఖ్యమైన చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.  ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రం జనవరి 12న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గతేడాది డిసెంబర్‌ 8న విడుదలైన ఈ చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద విఫలమై నితీర్‌ కెరీర్‌లో మరో డిజాస్ ఫ్లాప్‌గా నిలిచింది. మరి ఓటీటీ ప్రేక్షకులనైనా ఈ చిత్రం ఆకట్టుకుందో లేదో చూడాలి. కోట బొమ్మాళి P.S శ్రీకాంత్‌ కీలక పాత్రలో జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’. వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. జనవరి 11వ తేదీ నుంచి ‘ఆహా’లో ప్రసారం కానుంది. నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateBreak Point Season 2SeriesEnglishNetflixJan 10King Dom - 3MovieEnglishNetflixJan 10The TrustSeriesEnglishNetflixJan 10Boy Swallows UniverseSeriesEnglishNetflixJan 10Killer SoupMovieHindiNetflixJan 11LiftMovieEnglishNetflixJan 12EchoSeriesEnglishDisney + HotstarJan 11The Legend of HanumanSeriesHindiDisney + HotstarJan 12JourneyMovieTamil SonyLIVJan 12SivappuMovieTamil AhaJan 12La BreaSeriesEnglishJio CinemaJan 10TedSeriesEnglishJio CinemaJan 12Mission: Impossible – Dead Reckoning Part OneMovieTelugu/EnglishAmazon PrimeJan 11RoleplayMovieEnglishAmazon PrimeJan 12
    జనవరి 08 , 2024
    గత 7 ఏళ్లలో సంక్రాంతి హిట్లుగా నిలిచిన తెలుగు సినిమాలివే..!
    గత 7 ఏళ్లలో సంక్రాంతి హిట్లుగా నిలిచిన తెలుగు సినిమాలివే..!
    ]అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ కూడా ఇదే సమయానికి వస్తోంది. తెలుగులోకి డబ్ అవుతున్న విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తునివు’ సినిమాలు ఏ మేరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.
    ఫిబ్రవరి 14 , 2023
    తారల ఇంట సంక్రాంతి సంబురం… చూపు తిప్పుకోలేని అందాల కనువిందు..
    తారల ఇంట సంక్రాంతి సంబురం… చూపు తిప్పుకోలేని అందాల కనువిందు..
    ]ప్రతి ఏడాది మాదిరాగనే మంచు ఫ్యామిలీ భోగి వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఇందులో మోహన్ బాబు, విష్ణు సహా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారి పిల్లలు సందడి చేశారు.మంచు విష్ణు
    ఫిబ్రవరి 13 , 2023
    Sankranti: ఈ చీరలతో సంక్రాంతిని మరింత ఆస్వాదించండి
    Sankranti: ఈ చీరలతో సంక్రాంతిని మరింత ఆస్వాదించండి
    ]డార్క్ బ్లూ- గ్రీన్ఫెస్టివల్ వైబ్స్‌ని ఉట్టిపడేలా చేసే కాంబినేషన్ క్లాసిక్ బ్రైట్ కలర్ ఇది. డార్క్ బ్లూ, గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న ఈ చీర చుడితే యువరాణిలా కనిపించడం ఖాయం.
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>Game Changer: సంక్రాంతి బరిలో వారసుల యుద్ధం.. గెలుపెవరిదో!</strong>
    Game Changer: సంక్రాంతి బరిలో వారసుల యుద్ధం.. గెలుపెవరిదో!
    మెగా తనయుడు రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా డైరెక్టర్‌ శంకర్‌ రూపొందిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer). ‘RRR’ వంటి గ్లోబల్‌ స్థాయి హిట్‌ తర్వాత చరణ్‌ చేస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ రేసు నుంచి తప్పుకోవడంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటించారు. అయితే చరణ్‌తో తలపడేందుకు నాగార్జున తనయుడు నాగ చైతన్య రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తండేల్‌’ సంక్రాంతిని టార్గెట్‌ చేసినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. సంక్రాంతి రేసులోకి ‘తండేల్’! అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ‘తండేల్‌’ చిత్రంపై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున బజ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘లవ్‌ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్‌’పై&nbsp; అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్‌ కోసం సినీ లవర్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తండేల్‌ను సంక్రాంతికి తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు సమాచారం. తొలుత డిసెంబర్‌ 20న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని నిర్మాతలు భావించారు. అయితే పెండింగ్ పనులు అప్పటిలోగా పూర్తయ్యే ఛాన్స్‌ కనిపించడలేదని సమాచారం. దీంతో 2025 సంక్రాంతికి తమ సినిమాను తీసుకొస్తే బాగుంటుందని తండేల్‌ టీమ్ భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.&nbsp; చరణ్‌ వర్సెస్‌ చైతూ టాలీవుడ్‌ సంక్రాంతి హిస్టరీలో ఇప్పటికే పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తలపడ్డారు. అయితే ఈ సంక్రాంతికి వాళ్ల వారసులు తలపడనున్నట్లు బజ్‌ వినిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. RRR సక్సెస్‌తో రామ్‌చరణ్‌ గ్లోబల్‌ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. దాన్ని గేమ్‌ ఛేంజర్‌ ద్వారా మరింత పదిలం చేసుకోవాలని చరణ్‌ చూస్తున్నాడు. మరోవైపు లవ్‌స్టోరీ తర్వా చైతూకి సరైన హిట్‌ లభించలేదు. దీంతో ఎలాగైనా తండేల్‌తో హిట్‌ కొట్టి హిట్‌ ట్రాక్‌లోకి రావాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే లవ్‌ స్టోరీతో నాగచైతన్య, సాయి పల్లవి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. తండేల్‌లోనూ ఇదే జంట రిపీట్‌ కావడంతో ఫలితం సానుకూలంగా ఉంటుందని చైతూ భావిస్తున్నాడు. చరణ్‌ వర్సెస్‌ చైతూ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. బాలయ్య నుంచి గట్టిపోటీ! గేమ్‌ ఛేంజర్‌, తండేల్‌తో పాటు సంక్రాంతి రేసులో నందమూరి బాలకృష్ణ సైతం ఉన్నారు. డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK 109’ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గత రెండు సంక్రాంతి పండగలకు బాలయ్య తన చిత్రాలను రిలీజ్‌ చేసి హిట్‌ కొట్టారు. దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘తండేల్‌’ చిత్రాలకు బాలయ్య మూవీ నుంచి గట్టి పోటీ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వెంకటేష్‌ - అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా కూడా సంక్రాంతికి రిలీజయ్యే ఛాన్స్ ఉంది. వీటితో పాటు సందీప్ కిషన్ ‘మజాక’ కూడా పండగకే రానుంది. దీంతో ఈ సంక్రాంతికి కూడా బాక్సాఫీస్‌ వద్ద ఆసక్తికర పోరు తప్పదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.&nbsp; తండేల్‌ స్టోరీ ఇదే నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. గుజరాత్‌ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతోంది. తండేల్ అంటే గుజరాతి భాషలో బోటు నడిపే ఆపరేటర్‌ అని అర్థం. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని డైరెక్టర్‌ చందూ మెుండేటి ఓ ఇంటర్యూలో వెల్లడించారు.&nbsp;
    అక్టోబర్ 15 , 2024
    వీరసింహారెడ్డి.. బాలయ్య ఫ్యాన్స్‌కి సంక్రాంతి విందు భోజనం
    వీరసింహారెడ్డి.. బాలయ్య ఫ్యాన్స్‌కి సంక్రాంతి విందు భోజనం
    ]రేటింగ్: 3.0/5బాలయ్య మాస్ డైలాగ్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ పాత్రల నటన తమన్ మ్యూజిక్ శృతిహాసన్ గ్లామర్ప్లస్‌ పాయింట్స్‌స్లోనరేషన్ ఫస్టాఫ్‌లో అనవసర సన్నివేశాలు కథలోని మెయిన్ ఎమోషన్ ఎలివేట్ కాలేదు. మితిమీరి ఫైట్స్మైనస్ పాయింట్స్
    ఫిబ్రవరి 13 , 2023
    వారిసు మూవీ రివ్యూ… సంక్రాంతికి తొలి బ్లాక్ బాస్టర్ హిట్?
    వారిసు మూవీ రివ్యూ… సంక్రాంతికి తొలి బ్లాక్ బాస్టర్ హిట్?
    ]రేటింగ్: 3.0/5విజయ్ నటన యోగిబాబుతో వచ్చే కామెడీ ట్రాక్ కుటుంబ సన్నివేశాలు పాటలుబలాలురొటీన్ కథ కథను ముందే ఊహించే సీన్లు ఫ్యాన్స్‌కు నచ్చే సీన్లకే ప్రాధాన్యంబలహీనతలు
    ఫిబ్రవరి 13 , 2023
    This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
    సంక్రాంతి తర్వాత గతవారం చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ వీక్ (This Week Movies) పెద్ద చిత్రాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాస్తవానికి ఆయా చిత్రాలు సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. మరోవైపు సంక్రాంతికి రిలీజైన రెండు పెద్ద సినిమాలు సైతం ఈ వారమే ఓటీటీలోకి (This Week OTT Releases) రాబోతున్నాయి. వాటితో పాటు మరిన్ని సిరీస్‌లు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఈగల్‌ రవితేజ (Raviteja) కథానాయకుడిగా (This Week Movies) కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle). సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ కథానాయికలు నటించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాదేవ్‌ సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్‌గా సాగే ఓ మంచి మాస్‌ యాక్షన్‌ మూవీగా ‘ఈగల్‌’ అలరిస్తుందని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేసింది.&nbsp; లాల్‌ సలామ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam) చిత్రం కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రజనీ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. క్రికెట్‌ ఆట చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. రజనీ ఇందులో మొయిద్దీన్‌ భాయ్‌ పాత్రలో అలరించనున్నారు.&nbsp; యాత్ర-2&nbsp; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర' (Yatra). ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' (Yatra 2) ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది. వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం జగన్‌ ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 మధ్య ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' సాగుతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ మహీ వి. రాఘవ్‌ తెరకెక్కించారు. ఇందులో వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి, జగన్‌ పాత్రలో జీవా నటించారు. ట్రూ లవర్ మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి (This Week OTT Releases) కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘ట్రూ లవర్’. ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ట్రూ లవర్ రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.&nbsp; పవన్‌ మూవీ రీ-రిలీజ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రం రీరిలీజ్‌కు (This Week OTT Releases) సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఎంపిక చేసిన థియేటర్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు గుంటూరు కారం మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ డ్రామా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. కెప్టెన్‌ మిల్లర్‌ తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయికగా చేసింది. సందీప్‌ కిషన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా, తెలుగులో రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఫిబ్రవరి 9నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. బబుల్‌గమ్‌ సుమ-రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ (Roshan Kanakala) కథానాయకుడిగా రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘బబుల్‌గమ్‌’(Bubblegum). మానస చౌదరి (Maanasa Choudhary) కథానాయిక. ఈ చిత్రం కూడా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. TitleCategoryLanguagePlatformRelease DateOne Day&nbsp;MovieEnglishNetflixFeb 8BhakshakSeriesHindiNetflixFeb 9AryaSeriesHindiDisney+HotstarFeb 9Aqua ManMovieEnglishBook My ShowFeb 5Bubble gumMovieTeluguAhaFeb 9The ExorcistMovieEnglishJio CinemaFeb 6The Nun 2MovieEnglishJio CinemaFeb 7HelloSeriesEnglishJio CinemaFeb 8AyalaanMovieTamilSun NXTFeb 9
    ఫిబ్రవరి 05 , 2024
    New OTT Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో 21 చిత్రాలు/సిరీస్‌లు!
    New OTT Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో 21 చిత్రాలు/సిరీస్‌లు!
    సంక్రాంతి సందడి ముగియడంతో ఇప్పుడు చిన్న సినిమాలు (This Week Movies) క్యూ కట్టేందుకు రెడీ అయిపోయాయి. ఈ వీకెండ్‪‌లో 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు', 'బూట్ కట్ బాలరాజు' లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 21 కొత్త సినిమాలు / వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ‘కేరాఫ్‌ కంచర పాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్‌ మహా. ఇప్పుడాయన సమర్పణలో సుహాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’ (Ambajipeta Marriage Band). దుశ్యంత్‌ కటికనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. బూట్‌కట్ బాలరాజు బిగ్‌బాస్ ఫేమ్‌ సోహెల్‌, అనన్య నాగళ్ల జంటగా లక్కీ మీడియా పతాకంపై రూపొందిన చిత్రం&nbsp; ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut balraju). శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్‌ నిర్మాత. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 2న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.&nbsp; ధీర వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు లాంటి సినిమాలలో మాస్‌ హీరోగా నటించిన లక్ష్‌ చదలవాడ ఈ వారం 'ధీర' (Dheera) సినిమాతో ప్రేక్షకుల ముందురు రాబోతున్నాడు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.&nbsp; విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది.&nbsp; హ్యాపీ ఎండింగ్‌ యష్‌ పూరి, అపూర్వ రావ్‌ జంటగా కౌశిక్‌ భీమిడి తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’ (Happy Ending). యోగేష్‌ కుమార్‌, సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాల సంయుక్తంగా నిర్మించారు. కౌశిక్‌ భీమిడి తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది. హీరోకి ఒక శాపం ఉంటే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌, టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు మిస్‌ పర్ఫెక్ట్‌ మెగా కోడలు లావణ్య త్రిపాఠీ (Lavanya Tripathi) నటించిన లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ 'మిస్‌ పర్ఫెక్ట్‌' (Miss Perfect). బిగ్‌బాస్‌ విజేత అభిజీత్‌ (Abhijit) ప్రధాన పాత్రలో నటించాడు. విశ్వక్‌ ఖండేరావ్‌ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఫిబ్రవరి 2 నుంచి హాట్‌స్టార్‌ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే హాస్యభరితమైన టామ్ అండ్ జెర్రీ కథలా ఉంటుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇందులో లావణ్య పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే యువతి పాత్రలో కనిపిస్తుంది.&nbsp; సైంధవ్‌ వెంకటేశ్‌ లేటెస్ట్‌ చిత్రం 'సైంధవ్‌' (Saindhav) సంక్రాంతి కానుకగా విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్‌ డేట్ త్వరగానే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2న ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. మరోవైపు మహా శివరాత్రి సందర్భంగా 9న కూడా రావొచ్చని వార్తలు వస్తున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని ప్రచారం జరుగుతోంది. స్ట్రీమింగ్‌ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై ఈ వారంలోనే క్లారిటీ రానుంది. TitleCategoryLanguagePlatformRelease DateMighty Bheem Play TimeSeriesEnglishNetflixJan 29The Greatest Night In PopMovieEnglishNetflixJan 29Jack Whitehall: Settle DownMovieEnglishNetflixJan 30NASCAR: Full SpeedSeriesEnglishNetflixJan 30Alexander: The Making of a GodSeriesEnglishNetflixJan 31Baby BanditoSeriesEnglishNetflixJan 31Let's Talk About CHUSeriesEnglishNetflixFeb 2MarichiMovieKannadaAmazon PrimeJan 29Mr. &amp; Mrs. SmithSeriesEnglishAmazon PrimeFeb 2SaindhavMovieTeluguAmazon PrimeFeb 2 (Rumor)KoierSeriesEnglishDisney+HotStarJan 31Miss PerfectSeriesTeluguDisney+HotStarFeb 2Self&nbsp;MovieEnglishDisney+HotStarFeb 2AsedioMovieSpanish/EnglishBook My ShowJan 30In The NoSeriesEnglishJio CinemaJan 29
    జనవరి 29 , 2024
    This Week OTT Movies : ఈ వారం విడుదల కానున్న చిత్రాలు/వెబ్ సిరీస్‌లు ఇవే!
    This Week OTT Movies : ఈ వారం విడుదల కానున్న చిత్రాలు/వెబ్ సిరీస్‌లు ఇవే!
    సంక్రాంతి తర్వాత మరోసారి సినీ ప్రేక్షకులను పలకరించడానికి ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. థియేటర్‌తో పాటు, ఓటీటీలోనూ అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ రిపబ్లిక్‌ డే సందర్భంగా వస్తున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు ఫైటర్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొణె (Deepika Padukone) జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఫైటర్‌’ (Fighter). సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్‌ యాక్షన్‌ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఇందులో యుద్ధ విమాన పైలట్‌గా హృతిక్‌ కనిపించనున్నాడు. అనిల్‌ కపూర్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం జనవరి 25న థియేటర్స్‌లో విడుదల కానుంది. మలైకోటై వాలిబన్‌ మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌.. ‘మలైకోటై వాలిబన్‌’ సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లిజో జోస్‌ పెలిసెరీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఓటమెరుగని రెజ్లర్‌ వాలిబన్‌ పాత్రలో ఆయన కనిపించనున్నారు. జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కెప్టెన్‌ మిల్లర్‌ ధనుష్‌ (Dhanush) కథానాయకుడిగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయిక. సందీప్‌కిషన్‌, శివరాజ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. జనవరి 25 నుంచి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. అయలాన్‌ శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన ‘అయలాన్‌’ (Ayalaan) చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ సినిమాను జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) హీరోయిన్‌గా చేసింది. శివ కార్తికేయన్‌ నటన, కామెడీ,&nbsp; గ్రహాంతరవాసి హంగామా తమిళ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి తెలుగులోనూ ఈ సినిమా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. 105 మినిట్స్‌ ఒకే ఒక్క పాత్రతో తెరకెక్కిన చిత్రం ‘105 మినిట్స్‌’. ప్రముఖ కథానాయిక హన్సిక (Hansika) ప్రధాన పాత్ర పోషించగా... రాజు దుస్సా దర్శకత్వం వహించారు. బొమ్మక్‌ శివ నిర్మించారు. జనవరి 26న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ వారం ఓటీటీలో విడుదయ్యే చిత్రాలు యానిమల్‌ రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్‌ (Animal) చిత్రం.. ఈ వారమే ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో కంటే 8 నిమిషాల ఎక్కువ నిడివి (3 గం.ల 29 ని.)తో ప్రసారం కానుంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. యానిమల్ మూవీపై ఎన్ని విమర్శలు వచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.900 కోట్లకుపైగా వసూళ్లతో సంచలనం సృష్టించింది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateQueer EyeSeriesEnglishNetflixJan 24Six NationsSeriesEnglishNetflixJan 24AnimalMovieTelugu/HindiNetflixJan 26Bad Land HuntersMovieKorean/EnglishNetflixJan 26HustlersMovieHindiAmazon PrimeJan 24PanchayatSeriesHindiAmazon PrimeJan 26Sam BahadurMovieHindiZee5Jan 26NeruMovieTelugu/MalayalamDisney+HotStarJan 23Karma callingMovieHindi&nbsp;Disney+HotStarJan 26Flex X CopSeriesEnglish/KoreanDisney+HotStarJan 26Fight ClubMovieTamilDisney+HotStarJan 27Shark Tank IndiaSeriesHindi&nbsp;SonyLIVJan 22WonkaMovieEnglishBook My ShowJan 22Aqaman 2MovieEnglishBook My ShowJan 23FearMovieEnglishBook My ShowJan 23
    జనవరి 22 , 2024
    This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో 22 చిత్రాలు/సిరీస్‌లు.. చూసేయండి!
    This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో 22 చిత్రాలు/సిరీస్‌లు.. చూసేయండి!
    సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల హవా ఈ వారమూ కొనసాగనుంది. ‘హను-మాన్‌’, ‘గుంటూరుకారం’, ‘సైంధవ్‌’, ‘నా సామిరంగ’ చిత్రాలు మరో పది రోజుల పాటు థియేటర్‌లో అలరించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలాంటి కొత్త సినిమాలు థియేటర్లలోకి రావడం లేదు. అయితే, ఓటీటీలో మాత్రం సరికొత్త చిత్రాలు, సిరీస్‌ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఏకంగా 22 చిత్రాలు/సిరీస్‌లు రిలీజ్‌ కాబోతున్నాయి. ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌ కానుందో ఇప్పుడు చూద్దాం.&nbsp; అథర్వ కార్తీక్‌రాజు కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘అథర్వ’ (Atharva). సిమ్రాన్‌ చౌదరి, ఐరా కథానాయికలు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. డిసెంబరు 1న&nbsp; ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈటీవీ విన్‌ వేదికగా జనవరి 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.&nbsp;&nbsp; ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ నితిన్‌ (Nithiin) హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ (Extra Ordinary Man). డిసెంబరు 8న విడుదలైన ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. జనవరి 19 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఇందులో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటించగా రాజశేఖర్‌ ఓ కీలక పాత్రలో నటించారు.&nbsp; ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ పోలీస్‌ కథలతో తరచూ ప్రేక్షకులను అలరించే బాలీవుడ్‌ దర్శకుల్లో రోహిత్‌ శెట్టి (Rohit Shetty) ఒకరు. తాజాగా ఆయన తెరకెక్కించిన పవర్‌ఫుల్‌ పోలీస్‌ సిరీస్‌ ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ (Indian Police Force). సిద్ధార్థ్‌ మల్హోత్ర, శిల్పాశెట్టి, వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్‌ ప్రైమ్‌ ఒరిజినల్‌గా సిద్ధమైన ఈ సిరీస్‌ జనవరి 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దాదాపు ఏడు ఎపిపోడ్స్‌తో ఈ సిరీస్‌ సిద్ధమైంది.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateDusty Slay: Workin' ManSeriesEnglishNetflixJan 16American NightmareDocumentaryEnglishNetflixJan 17Merry Men 3MovieEnglishNetflixJan 18Full CircleSeriesEnglish&nbsp;NetflixJan 19Love on the Spectrum 2SeriesEnglish&nbsp;NetflixJan 19The KitchenMovieEnglishNetflixJan 19Where the Crawdads SingMovieEnglishSonyLIVJan 19Death and Other DetailsSeriesEnglishHotstarJan 16A Shop for KillersSeriesEnglish/KoreanHotstarJan 17Coleen Rooney: The Real Wagatha StoryDocumentaryEnglishHotstarJan 16Snakes SOS: Goa's Wildest 4DocumentaryEnglish&nbsp;HotstarJan 16Blue BeetleMovie&nbsp;English&nbsp;Jio CinemaJan 18Chicago Fire 12SeriesEnglishJio CinemaJan 18Law &amp; Order: Special Victims UnitSeriesEnglishJio CinemaJan 18Mayalo&nbsp;MovieTeluguAmazon primeJan 15Hazbin HotelSeriesEnglishAmazon primeJan 19LOL: Last One Laughing IrelandSeriesEnglishAmazon primeJan 19
    జనవరి 17 , 2024
    5 Reasons to watch “వాల్తేరు వీరయ్య”
    5 Reasons to watch “వాల్తేరు వీరయ్య”
    ]సంక్రాంతి రేసులో చిరంజీవి ఎన్నో సూపర్ హిట్స్ కొట్టారు. మరోసారి బాలయ్యతో పోటీకి దిగారు. ఇందుకోసమైనా ఎలా ఉందో చూడాలని ఇద్దరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.చిరు - బాలయ్య క్లాష్
    ఫిబ్రవరి 13 , 2023
    5 Reasons to watch “వీరసింహా రెడ్డి”
    5 Reasons to watch “వీరసింహా రెడ్డి”
    ]సంక్రాంతికి బాలయ్య 11 హిట్లు కొట్టాడు. మరోసారి అదే రేసులో నిలబడ్డాడు. చిరంజీవీతోనూ దాదాపు 10వ సారి &nbsp;సై అంటున్నాడు. ఈసారి ఆధిపత్యం ఎవరిదో చూడాలి మరి.కలిసొచ్చే కాలం
    ఫిబ్రవరి 13 , 2023
    Summer Movies 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’, ‘టిల్లు స్క్వేర్‌’కి బెస్ట్ ఛాన్స్‌.. అలా జరిగితే కలెక్షన్ల సునామీనే!
    Summer Movies 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’, ‘టిల్లు స్క్వేర్‌’కి బెస్ట్ ఛాన్స్‌.. అలా జరిగితే కలెక్షన్ల సునామీనే!
    సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి (Sankranti) తరువాత సమ్మర్ సీజన్‌ (Summer Season) అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు ఉండటంతో యూత్‌, చిన్నారుల తల్లిదండ్రులు సమ్మర్‌లో సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు ప్రతీ సమ్మర్‌లోనూ పెద్ద హీరోల సినిమాలు రెడీగా ఉంటాయి. అయితే 2024 సమ్మర్‌లో మాత్రం ఏ స్టార్‌ హీరొ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. వాస్తవానికి ‘దేవర’ (Devara), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వంటి చిత్రాలను సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేశారు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో ఈ సమ్మర్‌ మెుత్తానికి ఇద్దరు యంగ్‌ హీరోల సినిమాలే దిక్కుగా కనిపిస్తున్నాయి. అవి సరైన విజయం సాధిస్తే కలెక్షన్ల పరంగా ఆ చిత్రాలకు తిరుగుండదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; సమ్మర్‌లో ఆ చిత్రాలదే హవా! ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అప్‌కమింగ్‌ చిత్రాలు.. ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square), ‘ఫ్యామిలీ స్టార్‌’’ (Family Star). సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్‌' (Tillu Square Release Date) చిత్రం మార్చి 29న ధియేటర్స్‌లోకి రానుంది. అటు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్‌గా చేసిన 'ఫ్యామిలీ స్టార్‌’' (Family Star Release Date) ఏప్రిల్‌ 5న థియేటర్స్‌లోకి రానుంది. ఈ చిత్రాలు మినహా మరే పెద్ద హీరో సినిమా ఈ సమ్మర్‌లో లేకపోవడంతో అందరి దృష్టి వీటిపైనే పడింది.&nbsp; హిట్‌ అయితే కలెక్షన్స్‌ సునామే! ‘టిల్లు స్క్వేర్‌’, ‘ఫ్యామిలీ స్టార్‌’’ చిత్రాలు రెండూ కూడా యూత్‌ను టార్గెట్‌ చేసుకొని వస్తున్నాయి. ముఖ్యంగా సమ్మర్ లో స్టూడెంట్స్ అందరూ కూడా సెలవులతో ఉంటారు. కాబట్టి ఇవి రెండూ కూడా రిలీజ్ అనంతరం మంచి సక్సెస్ అందుకుంటే వచ్చే కలెక్షన్స్ సూపర్‌గా ఉంటాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇవి రెండూ కూడా ఆ చక్కని అవకాశాన్ని వినియోగించుకుంటాయో లేదో చూడాలి. కాగా ‘ఫామిలీ స్టార్’ మూవీకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించగా.. ‘టిల్లు స్క్వేర్’ను మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు. హిట్‌ కాంబో రిపీట్‌ అవుతుందా? ‘టిల్లు స్క్వేర్‌’కు ముందు సిద్దు జొన్నలగడ్డ, డైరెక్టర్‌ మల్లిక్‌ రామ్‌ (Mallik Ram) కాంబోలో వచ్చిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో సిద్ధు తన నటనతో, డైలాగ్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. సిద్ధు కెరీర్‌లోనే ‘డీజే టిల్లు’ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మరోవైపు డైరెక్టర్‌ పరుశురామ్‌ పెట్ల, నటుడు విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గీతా గోవిందం’ (Geetha Govindam) ఘన విజయం అందుకుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సూపర్‌ హిట్‌ కాంబోలో వస్తున్న టిల్లు స్క్వేర్‌, ఫ్యామిలీ మ్యాన్‌ చిత్రాలు కూడా కచ్చితంగా విజయాన్ని సాధిస్తాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.&nbsp; సమ్మర్‌పై కన్నేసిన ‘సుహాస్‌’ హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా తనని తాను నిరూపించుకున్న నటుడు సుహాస్ (Suhas). రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో తాజాగా ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) అనే మూవీతో రాబోతున్నాడు. అర్జున్ వైకే ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా.. మే 3న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఆడియన్స్‌లో బజ్‌ ఏర్పడింది.&nbsp;
    మార్చి 21 , 2024

    @2021 KTree