• TFIDB EN
  • సప్త సాగరాలు దాటి సైడ్‌-B
    UATelugu2h 28m
    మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రక్షిత్ శెట్టి
    మను
    రుక్మిణి వసంత్
    ప్రియా
    చైత్ర జె ఆచార్
    సురభి
    అచ్యుత్ కుమార్
    ప్రభు
    JP తుమినాడ్దీపక్
    రమేష్ ఇందిరసోమ
    గోపాల్ కృష్ణ దేశ్‌పాండేప్రకాష్
    భరత్ జి బివినోద
    యమునా శ్రీనిధి
    సిబ్బంది
    రక్షిత్ శెట్టి
    నిర్మాత
    గుండు శెట్టిరచయిత
    చరణ్ రాజ్ (స్వరకర్త)
    సంగీతకారుడు
    అద్వైత గురుమూర్తిసినిమాటోగ్రాఫర్
    సునీల్ ఎస్. భరద్వాజ్ఎడిటర్ర్
    కథనాలు
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. నవంబర్‌ మూడో వారంలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. నవంబర్‌ 13 నుంచి 19 తేదీల మధ్య ఆ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు మంగళవారం ‘RX 100’ డైరెక్టర్‌ అజయ్‌ భూపతి రూపొందించిన మరో ఆసక్తికర చిత్రం ‘మంగళవారం’ (Mangalavaaram). ఇందులో పాయల్‌ రాజ్‌పూత్‌ (Payal Rajput), అజ్మల్‌ అమిర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ముద్ర మీడియా వర్క్స్‌ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ ఈ మూవీని నిర్మించారు. నవంబరు 17న (శుక్రవారం) తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మై నేమ్‌ ఈజ్‌ శృతి ప్రముఖ హీరోయిన్‌ హన్సిక నటించిన లేటేస్ట్‌ మూవీ ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ (My Name Is Shruthi) సినీ ప్రియులను థ్రిల్‌ చేసేందుకు ఈ వారమే వస్తోంది. ఆమె లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఓంకార్‌ తెరకెక్కిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు. ఊహకందని మలుపులతో సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతిగా ఇందులో హన్సిక కనిపిస్తుందని పేర్కొన్నాయి. నవంబరు 17న (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పార్క్‌ లైఫ్‌ విక్రాంత్‌ హీరోగా నటించి.. స్వయంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్పార్క్‌ లైఫ్‌’ (Spark The Life). డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ మూవీని నిర్మించింది. మెహరీన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 17న థియేటర్‌లలో విడుదల కానుంది. సప్త సాగరాలు దాటి సైడ్‌-B కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి (Rakshit Shetty) కీలక పాత్రలో నటించిన ప్రేమకథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి సైడ్‌-B’ (Sapta Sagaralu Dhaati Side B). రుక్మిణీ వసంత్‌ కథానాయిక. హేమంత్‌ ఎం. రావు దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన  (Sapta Sagaralu Dhaati Side A) సినిమాకు కొనసాగింపుగా కొత్త చిత్రాన్ని తీసుకొస్తున్నారు. నవంబర్‌ 17న కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్వేషి విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్వేషి’ (Anvesh). వి.జె.ఖన్నా దర్శకత్వం వహించారు. టి.గణపతిరెడ్డి నిర్మాత. అడవి నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కిందని చిత్ర యూనిట్‌ తెలిపింది. కథానాయిక అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషించిందని చెప్పింది. ఆమె చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని, చైతన్‌ భరద్వాజ్‌ మరోసారి తన సంగీతంతో ఆకట్టుకుంటాడని చెబుతోంది. నవంబరు 17న ఈ సినిమా విడుదల కానుంది. ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateTwin LoveWeb SeriesEnglishAmazon PrimeNov 17ApurvaMovieHindiDisney + HotstarNov 15Chinna MovieTamil/TeluguDisney + HotstarNov 17Kannur SquadMovieMalayalamDisney + HotstarNov 17How to Become a Mob BossWeb SeriesEnglishNetflixNov 14Best. Christmas. Ever!MovieEnglishNetflixNov 16The crownWeb SeriesEnglishNetflixNov 16Believer 2MovieEnglishNetflixNov 17The DadsDocumentaryEnglishNetflixNov 17SukheeMovieHindiNetflixNov 18The RailwaymenMovieHindiNetflixNov 18 APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 5 తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
    నవంబర్ 13 , 2023
    Chaithra J Achar: చైత్ర జె ఆచార్ అందాల ఆరాచకం.. చూసి తట్టుకోగలరా?
    Chaithra J Achar: చైత్ర జె ఆచార్ అందాల ఆరాచకం.. చూసి తట్టుకోగలరా?
    'సప్త సాగరాలు దాటి మూవీ ఫేమ్ చైత్ర జె ఆచార్ అందాల ఆరాచకం సృష్టిస్తోంది. ఓ రేంజ్‌లో పరువాలు ఒల‌క‌బోస్తూ కుర్రాళ్లను కంగు తినేలా చేస్తోంది. తాజాగా ఆమె చేసిన ఫొటో షూట్  కుర్రకారులో మ‌రింత వేడిని పెంచుతోంది. క్రీమ్ కలర్ మల్బరీ బ్లౌజ్‌లో ఎద అందాలను ప్రదర్శిస్తూ కవ్విస్తోంది.  మల్బరీ పట్టు చీరను కేరళ స్టైల్‌లో ధరించి అందాల విందు చేసింది. మత్తెక్కించే చూపులతో గాలం వేస్తోంది లూజ్ హెయిర్, గొల్డెన్ జూకాలు, నోస్‌ రింగ్ ఆమె అందాన్ని మరింత ఆకర్శనీయం చేశాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం అందం రా బాబు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. స‌ప్త సాగ‌రాలు (Sapta Sagaralu Dhaati (Side B) చిత్రంలో లిప్‌లాక్‌ సీన్లలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ఏ డ్రెస్ వేసినా అందాల ప్రదర్శన మాత్రం ఆపడం లేదు.  మ‌హిరా (Mahira 2019)  అనే కన్నడ చిత్రంతో సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ... తక్కువ కాలంలో మల్టీ టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  చైత్ర ఆచార్ కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఆమె తల్లి పాడేటప్పుడు ఇంట్లో సంగీతం వింటూ పెరిగింది, అలా ఆమె పాడటంపై ఆసక్తిని పెంచుకుని కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంది. సంగీతం అంటే ఇష్టంతో సింగర్‌గా వచ్చిన చైత్ర అనుకోకుండా నటిగా మారింది. ఇప్పటికే నేపథ్య గాయనిగా 10కి పైగా పాటలు పాడింది. గరుడ గమన వృషభ వాహన సినిమాలో "సోజుగడ సూజుమల్లిగే" పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయనిగా సైమా అవార్డును పొందింది. కళాశాలలో ఉండగానే, నటుడు అనీష్ తేజేశ్వర్ దర్శకత్వం వహించి, నిర్మించిన బెంగళూరు క్వీన్స్ అనే కన్నడ వెబ్ సిరీస్‌తో తన కెరీర్ ప్రారంభించింది. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, సప్త సాగరాలు దాటి సైడ్ బి చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ చిత్రంలో  వేశ్యగా న‌టించి మెప్పించింది. టోబీ సినిమాలో తండ్రిని కాపాడే ఓ ప‌ల్లెటూరు కూతురిగా అంద‌రినీ అలరించింది. ప్రస్తుతం స్ట్రాబెర్రి, జన్మదిన శుభాకాంక్షలు వంటి కన్నడ చిత్రాల్లో నటిస్తోంది.
    ఏప్రిల్ 01 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌  ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.  2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best  Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:  నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ  నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ  అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా  మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన  సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని  ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.  ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
    Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
    అక్టోబర్‌లో పెద్ద హీరోల చిత్రాలు సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దసరా బరిలో నిలిచిన భగవంత్‌కేసరి, టైగర్‌నాగేశ్వరరావు సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే నవంబర్‌లో పెద్ద హీరోల సినిమాలు మాత్రం లేవు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం యాక్ట్ చేస్తున్న కీడాకోలా, నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రాలు దీపావళి బరిలో ఉన్నాయి. వీటితో పాటు పాయల్ రాజ్‌పూత్ నటించిన హరర్‌ మూవీ మంగళవారం సైతం నవంబర్‌లోనే విడుదల కానుంది. మరి నవంబర్‌ నెలలో విడుదల కానున్న ఇతర తెలుగు చిత్రాల వివరాలపై ఓ లుక్ వేయండి. మా ఊరి పొలిమేర-2  సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మా ఊరి పొలిమెర-2' చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. సత్యం రాజేష్‌తో పాటు గెటప్ శ్రీను, రాకెందు మౌళి, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.  కీడా కోలా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కీడాకోలా. ఈ చిత్రాన్ని  డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మానందంతో పాటు ఈ సినిమాలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎర్ర చీర శ్రీరామ్, అజయ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఎర్ర చీర. ఈ సినిమాను సుమన్ బాబు డైరెక్ట్ చేశారు. అమ్మ సెంటిమెంట్, హరర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 9న ఎర్రచీర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదికేశవ పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ. ఈ చిత్రం నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ అంచనాలను పెంచేసింది.  ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి డైరెక్ట్ చేశారు. సాయి సౌజన్య సంగీతం అందిస్తున్నారు. నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైగర్ 3 సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టైగర్ 3 మూవీ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పాన్ఇండియా లెవల్లో డైరెక్టర్ మానిష్ శర్మ తెరకెక్కించారు. సల్మాన్ సరసన కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మి, అషుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. మంగళవారం పాయల్ రాజ్‌పూత్ లీడ్‌ రోల్‌లో ఈ సినిమాను సైకాలజికల్ హరర్‌ చిత్రంగా డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. మంగళవారం చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది. సప్తసాగరాలు దాటి- సైడ్ బీ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సప్తసాగరాలు దాటి-సైడ్ బీ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం కన్నడలో సూపర్ హిట్‌ కాగా.. తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండో భాగాన్ని డబ్బింగ్ వెర్షన్‌లో నవంబర్‌ 17న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని  హేమంత్ రావు డైరెక్ట్ చేశారు.  రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. డెవిల్ నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబోలో వస్తున్న చిత్రం డెవిల్. ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను 'బాబు బాగా బిజీ' ఫేమ్ నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు. డెవిల్ చిత్రంలో కళ్యాణ్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. 
    అక్టోబర్ 26 , 2023
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్‌ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్‌ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్‌ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఆరెంజ్‌ (Orange) రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్‌’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్‌’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్‌బాస్టర్‌ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.  అ! (Awe) హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్‌లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు. C/o కంచరపాలెం (C/o Kancharapalem) ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్‌ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది. అంటే సుందరానికి (Ante Sundaraniki) నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్‌గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.  అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.  కర్మ (Karma) యంగ్‌ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.  1: నేనొక్కడినే (1: Nenokkadine) సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.  ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi) ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్‌ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.  వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఖలేజా (Khaleja) ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్‌ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్‌ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.  విరాట పర్వం సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్‌ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.  రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్‌ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ. 
    మార్చి 22 , 2024
    MOVIE RELEASES: ఈ వారం ( ఏప్రిల్ 28 )న థియేటర్లు/ ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు
    MOVIE RELEASES: ఈ వారం ( ఏప్రిల్ 28 )న థియేటర్లు/ ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు
    వేసవి సెలవులు వచ్చాయి. ఈ వారం పెద్ద సినిమాలు కూడా సందడి చేయనున్నాయి. మణిరత్నం, అక్కినేని అఖిల్ బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడుతున్నారు. అంతేకాదు, బ్లాక్‌ బస్టర్ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి, ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే వాటి గురించి తెలుసుకుందాం.  ఏజెంట్‌ అఖిల్‌ అక్కినేని, సాక్షి వైద్య జంటగా వస్తున్న ఏజెంట్ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా… హిపాప్‌ తమిజా సంగీతం అందించాడు. ఏకే ఎంట్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మించారు. ఈ భారీ యాక్షన్‌ చిత్రంపై అంచానాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.  https://telugu.yousay.tv/sentiment-followed-for-agent-akhil.html పొన్నియన్ సెల్వన్ 2 పొన్నియన్ సెల్వన్ మెుదటి భాగంలో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పనుంది PS-2. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా కూడా 28న రిలీజ్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద అఖిల్ ఏజెంట్‌తో పోటీ పడుతోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా.. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. పార్ట్‌ 2 కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.  https://telugu.yousay.tv/box-office-do-you-know-how-much-ps2-will-make.html రారా.. పెనిమిటి నందితా శ్వేత సింగిల్ క్యారెక్టర్‌లో రూపొందిన సినిమా రారా.. పెనిమిటి. సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించగా మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 28న విడుదలవుతుంది. కొత్తగా పెళ్లైన అమ్మాయి తన భర్త కోసం ఎదురుచూసే విరహ వేదనే ఈ చిత్రం. తెరపై ఒక్క పాత్రే కనిపించినా.. చాలా పాత్రలు వినిపిస్తాయి.  హాలీవుడ్‌ ‘శిసు’ హిస్టారికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న హాలీవుడ్‌ మూవీ శిసు. జల్మరీ హెలెండర్ దర్శకత్వం వహించాడు. జొర్మా తొమ్మిలా, అక్సెల్‌ హెన్ని, జూన్ డూలన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 28న ఇంగ్లీష్‌తో పాటు హిందీలో కూడా వస్తుంది. ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు దసరా నాని హీరోగా వచ్చిన మాస్ పీరియాడికల్ చిత్రం దసరా. మార్చి 30న విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.  సిటాడెల్ అమెరికన్ స్పై థ్రిల్లర్‌ సిటాడెల్ వెబ్ సిరీస్‌ తెలుగులో రాబోతుంది. రిచర్డ్‌ మ్యాడన్, ప్రియాంక చోప్రా నటించిన ఈ సిరీస్ ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మెుదట తొలి రెండు ఎపిసోడ్‌లను తీసుకువస్తారు. తర్వాత మేలో ప్రతి వారం ఒక్కో ఎపిసోడ్‌ విడుదల చేస్తారు. ఈ సిరీస్‌ హిందీ వెర్షన్‌లో వరుణ్ ధావన్, సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. https://telugu.yousay.tv/this-is-why-i-left-bollywood-says-india-priyanka-chopra.html వ్యవస్థ జీ 5 వేదికగా వెబ్‌ సిరీస్‌లు అలరిస్తున్నాయి. మరో కొత్త వెబ్ సిరీస్‌ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. న్యాయవ్యవస్థ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌కు ఆనంద్‌ రంగ్ దర్శకత్వం వహించారు. కేరాఫ్ కంచెరపాలెం, నారప్పతో గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ రత్నం, హెబ్బా పటేల్‌, సంపత్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరికొన్ని Title CategoryLanguagePlatformRelease DateCourt lady Series Hindi NetflixApril 26Novoland Series English Nerflix April 26The good bad mother Series EnglishNetflixApril 27Eka Series English NetflixApril 28Before life after deathMovieEnglish Netflix April 28Pathu thala MovieTamil Amazon primeApril 27U turnMovieHindi Zee5April 27Scream 6MovieEnglish Book my showApril 26thurumukhamMovie Malayalam Sony liv April 28Save the tigersSeries Telugu disney+hotstarApril 27Peter pan and vendiSeries English disney+hotstarApril 28
    ఏప్రిల్ 24 , 2023
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    “విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్‌ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్‌ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం. నువ్వు నాకు నచ్చావ్‌! ప్రకాశ్‌ రాజ్‌ ఇంటికి వెంకటేశ్‌ వచ్చినపుడు సునీల్‌ తనని ఔట్‌ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్‌ సెటైర్‌ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్‌ పేరు లంకా” అనేస్తాడు. https://www.youtube.com/watch?v=UVFCtTNU29s అత్తారింటికి దారేది అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్‌. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్‌ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్‌ “ ఒరేయ్‌ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్‌ ఎలా కట్టాలి అని ప్లాన్‌ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్‌ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు. https://www.youtube.com/watch?v=9-PckWpekQY జల్సా జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్‌ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.  https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI అ ఆ ‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్‌ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్‌ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు. https://www.youtube.com/watch?v=qrrldRJc5e8 మన్మథుడు మన్మథుడులో సునీల్‌ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్‌ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్‌ ఇస్తాడు.  https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow అల వైకుంఠపురములో అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్‌ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు. అజ్ఞాతవాసి “సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి) S/O సత్యమూర్తి “రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌) భీమ్లా నాయక్‌ “ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్‌) అతడు “హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్‌ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
    ఏప్రిల్ 14 , 2023
    Manamey Movie Review: శర్వానంద్‌, కృతి శెట్టి వరుస ఫెయిల్యూర్స్‌కు ‘మనమే’ చెక్‌ పెట్టిందా?
    Manamey Movie Review: శర్వానంద్‌, కృతి శెట్టి వరుస ఫెయిల్యూర్స్‌కు ‘మనమే’ చెక్‌ పెట్టిందా?
    నటీనటులు : శర్వానంద్‌, కృతి శెట్టి, సీరత్ కపూర్‌, అయేషా ఖాన్‌, రాహుల్‌, రామకృష్ణ, రాహుల్‌ రవీంద్రన్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు రచన, దర్శకత్వం : శ్రీరామ్‌ ఆదిత్య సంగీతం : హీషం అబ్దుల్‌ వహాబ్‌ సినిమాటోగ్రాఫర్‌ : విష్ణు శర్మ నిర్మాతలు : వివేక్‌ కుచిబొట్ల, కృతి ప్రసాద్‌ విడుదల తేదీ: 07 జూన్‌, 2024 యంగ్‌ హీరో శర్వానంద్‌ చేసిన చిత్రాలకు టాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలుస్తాయి. పక్కింటి అబ్బాయిలా కనిపించే చిత్రాల్లో నటించి చాలా సార్లు ఆడియన్స్‌ను మెప్పించాడు. ఇప్పుడు కూడా అలాంటి కథతోనే శర్వానంద్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్‌, హీరోయిన్‌ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఎంతో కాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.  కథేంటి విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ (త్రిగుణ్‌), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే నటుడు శర్వానంద్‌.. విక్రమ్‌ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఫుల్‌ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. కామెడీ, లవ్‌, ఎమోషన్‌తూ కూడిన సన్నివేశాల్లో తనదైన మార్క్‌తో అలరించాడు. హీరోయిన్‌ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్‌ - కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆ బాలుడి పాత్రే ఎంతో కీలకం. ఇక రాజ్‌ కందుకూరి, త్రిగుణ్‌ పాత్రలు కథకు ఎంతో బలాన్ని అందించాయి. వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. విలన్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో రాహుల్‌ రవీంద్రన్‌ మెప్పించాడు. సచిన్‌ ఖేదెకర్‌, సీత, ముఖేష్‌ రిషి, తులసి, సీరత్‌ కపూర్‌ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే  తల్లిదండ్రులు - పిల్లల మధ్య బాండింగ్‌ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య 'మనమే' సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో కొద్దిమేర సక్సెస్‌ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్‌ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్‌ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలతో ఫస్ట్‌ హాఫ్‌ ఓ మాదిరిగా గడిచిపోయింది. ఇక సెకండాఫ్‌కు వచ్చేసరికి దర్శకుడు కథ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్లు అనిపిస్తుంది. కథతో సంబంధం లేని సన్నివేశాలు తెరపై జరుగుతుండటం కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేస్తాయి. ఇక క్లైమాక్స్‌ను మంచి ఎమోషనల్‌ సీన్స్‌తో ముగించడం సినిమాకు ప్లస్‌ అయ్యింది. అయితే విలన్‌ ట్రాక్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకుంటే బాగుండేది. సినిమాలో చాలా చోట్ల ఎమోషనల్‌ మిస్ అయ్యింది. మెుత్తంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని తెరకెక్కించే క్రమంలోనే కాస్త తడబడ్డాడు.  టెక్నికల్‌గా  టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. లండన్‌ లొకేషన్స్‌ని బాగానే క్యాప్చర్ చేశారు. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మూవీకి తగ్గట్లు ఉంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ప్లస్‌ పాయింట్స్‌ శర్వానంద్‌, మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య నటనఎమోషనల్‌ సీన్స్‌సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్‌విలన్ ట్రాక్‌ఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5  https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-kriti-shetty.html
    జూన్ 07 , 2024
    Hanuman Movie Review: సూపర్‌ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్‌’ హిట్‌ కొట్టినట్లేనా?
    Hanuman Movie Review: సూపర్‌ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్‌’ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య దర్శకుడు : ప్రశాంత్ వర్మ సంగీతం: గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర ఎడిటింగ్: సాయిబాబు తలారి నిర్మాత: నిరంజన్ రెడ్డి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman Movie Review). అగ్రతారల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. బడ్జెట్‌ పరంగా ఇది చిన్న సినిమా అనిపించుకున్నా కంటెంట్‌ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు దీటుగా నిలబడింది. టీజర్‌ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతూ పోయిన ఈ చిత్రం.. ట్రైలర్‌తో వాటిని రెట్టింపు చేసింది. మరి ఆ అంచనాల్ని ‘హనుమాన్‌’ అందుకున్నాడా? ఈ సూపర్‌ హీరో చేసిన సాహసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హనుమంతు పాత్రలో ఓ సామాన్య కుర్రాడిలా తేజ సజ్జ (Teja Sajja) ఒదిగిన తీరు మెప్పిస్తుంది. సూపర్‌ పవర్స్‌ వచ్చాక అతను చేసే సందడి ఇంకా అలరిస్తుంది. యాక్షన్‌, భావోద్వేగ  సన్నివేశాల్లో తేజ చక్కటి నటనను కనబరిచాడు. పల్లెటూరి అమ్మాయి మీనాక్షిగా అమృత అయ్యర్‌ (Amritha Aiyer) అందంగా కనిపించింది. కథలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యత బాగుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar) పాత్ర ద్వితీయార్ధంలో సర్‌ప్రైజ్‌ చేస్తుంది. వినయ్‌ రాయ్‌ (Vinay Rai) స్టైలిష్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. విభీషణుడిగా సముద్రఖని పాత్ర కథలో ఓ ప్రత్యేక ఆకర్షణ. గెటప్‌ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్, రాకేష్‌ మాస్టర్‌ తదితరుల పాత్రలు కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. డైరెక్షన్‌ ఎలా ఉందంటే సూపర్‌ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth varma) సినిమాను తీర్చిదిద్దారు. సూపర్‌ హీరో అవ్వాలనే కోరికతో విలన్‌ చేసే ప్రయత్నాలను ప్రశాంత్‌ ఆసక్తికరంగా తెరకెక్కించారు. అంజనాద్రి ఊరు.. దాన్ని పరిచయం చేసిన తీరు కనులవిందుగా ఉంటుంది. ఆరంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగడం, కొన్ని పాత్రల్ని మరీ డిటైల్డ్‌గా చూపించడం ప్రేక్షకులకు బోర్‌ కొట్టిస్తుంది. హనుమంతుకు సూపర్‌ పవర్స్‌ వచ్చినప్పటి నుంచి కథ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లా పరుగులు పెడుతుంది. విరామానికి ముందు వచ్చే కుస్తీ పోటీ సన్నివేశం కిక్కిస్తుంది. ముఖ్యంగా మైఖేల్‌ స్థావరంలోకి హనుమంతు వెళ్లినప్పుడు వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ను ప్రశాంత్‌ అద్భుతంగా తెరకెక్కించారు. క్లైమాక్స్‌లో చివరి 20నిమిషాలు ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడు.  సాంకేతికంగా ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రశాంత్‌ తనకిచ్చిన బడ్జెట్‌లోనే చక్కటి గ్రాఫిక్స్‌తో క్వాలిటీ ఫిల్మ్‌ను చూపించారు. ఇక నేపథ్య సంగీతం విషయానికొస్తే ముగ్గురు సంగీత దర్శకులు తమ ప్రతిభను చూపించారు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలుస్తుంది. సాయిబాబు తలారి అందించిన ఎడిటింగ్‌ వర్క్‌ పర్వాలేదు.  ప్లస్ పాయింట్స్‌ కథా నేపథ్యంతేజ సజ్జా నటనగ్రాఫిక్స్‌, నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడా నెమ్మదిగా సాగే సీన్స్‌ రేటింగ్‌ : 3.5/5
    జనవరి 12 , 2024
    Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్ ఎవరి పోలికనో చెప్పేసిన రామ్‌చరణ్
    Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్ ఎవరి పోలికనో చెప్పేసిన రామ్‌చరణ్
    మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో మెగా కౌంపౌండ్‌లో సంబరాలు నెలకొన్నాయి. జూన్ 20న రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన సుఖంగా ప్రసవించారు. ఉపాసన డెలివరీ ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో జరిగింది. ఈ క్రమంలో జూన్ 23న మధ్యాహ్నం ఉపాసన డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో తొలిసారి బిడ్డను ఎత్తుకుని బయటకు వచ్చారు. ఈ తరుణంలో రామ్‌చరణ్ మీడియాతో మాట్లాడి పలు విషయాలను పంచుకున్నాడు.  పూలతో వెల్‌కం.. రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఆసుపత్రి నుంచి అడుగు పెట్టిన సమయంలో అభిమానులు వారిపై పూలాభిషేకం కురిపించారు. వెల్ కం టు మెగా లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఉత్సాహాన్ని చూపించారు. ఉపాసనకు సాధారణ ప్రసవం చేయడంతో మూడు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. https://twitter.com/HumanTsunaME/status/1672171267259260931 దిష్టి తగలకుండా.. నవజాత శిశువులకు సాధారణంగానే దిష్టి తగులుతుందని అంటుంటారు. మరి, మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించారు రామ్ చరణ్, ఉపాసన. ఆసుపత్రి నుంచి బయటకు తెస్తుండగా అప్రమత్తంగా ఉన్నారు. బిడ్డకు తెల్లటి వస్త్రాన్ని చుట్టి తీసుకొచ్చారు. బేబీ మొఖం కనిపించకుండా చెర్రీ, ఉప్సి తమ చేతులను అడ్డంగా పెట్టుకున్నారు. మీడియాకు ఏమాత్రం కూడా బేబీ మొఖాన్ని చూపించలేదు. https://twitter.com/captain_india_R/status/1672177223032524800 లిటిల్ ప్రిన్సెస్ పేరు? ఇప్పటికే తమ కూతురి పేరును ఫిక్స్ చేసినట్లు రామ్‌చరణ్ చెప్పుకొచ్చాడు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘నేను, ఉపాసన ఇప్పటికే ఒకట్రెండు పేర్లు అనుకున్నాం. సరైన సమయంలో మా బిడ్డ పేరుని నేనే స్వయంగా వెల్లడిస్తా’ అని చెప్పాడు చెర్రీ. మరి, ఆ పేరు ఏంటా అని అప్పుడే నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. మంగళవారం పుట్టడం, మెగా ఫ్యామిలీ ఆంజనేయ స్వామిని ఆరాధించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దేవత పేరు కలిసొచ్చేలా నామకరణం చేసే అవకాశం ఉంది.  https://twitter.com/telugufilmnagar/status/1672177021508792320 పట్టరాని ఆనందం.. కుమార్తె పుట్టిన విషయం తెలిశాక మీ ఫీలింగ్ ఏంటని ఓ విలేకరి ప్రశ్నించారు. ప్రతి మగవాడు తొలిసారి తండ్రయితే ఎలాంటి అనుభూతి చెందుతాడో తనూ అలాగే ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చాడు. బిడ్డను చూడగానే పట్టరాని సంతోషం వేసిందని చెప్పాడు. 21 రోజుల తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తానని వెల్లడించాడు చెర్రీ.  https://twitter.com/MilagroMovies/status/1672177857207103488 ఎవరి పోలికంటే? బిడ్డ పుడితే ఎవరి పోలికా? అనే ప్రశ్న ఎదురవడం సర్వ సాధారణం. కొందరు అమ్మ పోలికలతో పుడతారు. మరికొందరికి నాన్న పోలికలు వస్తాయి. ఇంకొందరికి అమ్మమ్మ/నానమ్మ, తాతయ్యల పోలికలు వస్తాయి. ఇదే ప్రశ్న రామ్‌చరణ్‌కు ఎదురైంది. పాప ఎవరి పోలిక అని ఓ విలేకరి అడిగారు. దీంతో ‘కచ్చితంగా నాన్న పోలికే’ అంటూ గర్వంగా చెబుతూ వెంటనే బయలు దేరారు.  https://twitter.com/sivacherry9/status/1672174966002049025 బొడ్డు పేగు రక్తం ప్రిజర్వ్.. పాప బొడ్డు పేగు రక్తాన్ని భద్రపరిచినట్లు తెలుస్తోంది. బిడ్డ జన్మించాక బొడ్డు పేగును కత్తిరించి తల్లి నుంచి వేరు చేస్తారు. ఇలా కత్తిరించిన పేగులో రక్తకణాలు ఉంటాయి. ఇవి చికిత్సకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధులపై పోరాడటానికి సహాయపడతాయి. అందుకే ఈ రక్తాన్ని పదిలంగా భద్రపరిచారట. మహేశ్ బాబుకు గౌతమ్ జన్మించిన సమయంలోనూ ఇలాగే చేశారట.  https://twitter.com/HoneYNavya_/status/1672182605385531392
    జూన్ 23 , 2023
    Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
    Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
    సూపర్‌ హీరోలను ఇష్టపడని వారు ఉండరు. సినిమాల్లో వారు చూపించే తెగువ, ధైర్య సాహసాలు వీక్షకులను ముఖ్యంగా చిన్న పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. రొటీన్‌ సినిమాల్లో హీరోల్లా కాకుండా వారు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటారు. కొండను సైతం పిండి చేయగల సామర్థ్యం వారి సొంతం. అటువంటి సూపర్‌ హీరోలందర్నీ ఏటా ఒక చోటకు చేరుస్తూ సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈవెంట్‌ ‘కామిక్‌ కాన్‌’ (Comic Con). అవెంజెర్స్‌, స్పైడర్‌మ్యాన్‌, అవతార్‌, సూపర్‌ మ్యాన్‌ వంటి పాత్రలు ఆ ఈవెంట్‌లో తళుక్కుమంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్‌ హీరోల అభిమానులు అక్కడ ప్రత్యక్షమై తమకు నచ్చిన హీరో వేషధారణను ధరిస్తాయి. అయితే తెలుగులోనూ కామిక్‌ కాన్‌ స్థాయి హీరో పాత్రలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  హనుమాన్‌ (Hanuman) ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్‌’ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. తొలి ఇండియన్‌ సూపర్‌ మ్యాన్‌ అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జ పాత్రను ఎలివేట్‌ చేశాడు. హనుమంతుడి పవర్స్‌ను పొందిన హీరో.. ఈ సినిమాలో చాలా శక్తివంతంగా మారతాడు. భారీ కొండరాయిని సైతం అలవోకగా చేతితో పైకెత్తుతాడు. తమ ఊరికి హాని తలపెట్టాలని చూసిన విలన్లకు తగి బుద్ది చెబుతాడు. అయితే హనుమాన్‌ గెటప్‌లోకి మీరూ సింపుల్‌గా మారవచ్చు. లాంగ్‌ హెయిర్‌ చేతిలో గదతో పాటు హీరో ధరించిన టీషర్ట్‌ వేసుకుంటే మీరు హనుమాన్‌లాగా మారిపోతారు. భీమ్ (ఆర్ఆర్‌ఆర్‌) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్రంలో తారక్‌ (Jr NTR) భీమ్‌ పాత్రలో కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో పెద్ద పులిని సైతం ఎదుర్కొని తన బలం ఎంటో నిరూపిస్తాడు. విరామానికి ముందు వచ్చే సీన్‌లో అడవి జంతువులతో కలిసి బ్రిటిష్‌ వారిపై పోరాడే సీన్‌ చూసిన ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇక భీమ్‌లా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా?. తారక్‌లా కర్లీ హెయిర్‌స్టైల్‌, చేతిలో బల్లెం పట్టుకొని ఆ పాత్రకు తగ్గ డ్రెస్‌ వేస్తే మీరూ భీమ్‌ లాగా కనిపించవచ్చు. బాహుబలి (Bahubali) ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వచ్చిన బాహుబలి (Bahubali) చిత్రంలో ప్రభాస్‌ ఎంతో శక్తివంతంగా కనిపిస్తాడు. మదగజం లాంటి ఏనుగును సైతం కంట్రోల్‌ చేయగల సామర్థ్యం అతడికి ఉంటుంది. కండలు తిరిగిన దేహంతో వందలాది మంది శత్రుసైనికులను బాహుబలి తన ఖడ్గంతో  అంతం చేస్తాడు. అటువంటి  బాహుబలిలాగా మీరు కనిపించాలంటే ఈ కింద ఫొటోలో ఉన్న గెటప్‌లోకి వెంటనే మారిపోండి.  భల్లాల దేవ (Bhallala Deva) ‘బాహుబలి’ చిత్రంలో ప్రతినాయకుడైన భల్లాల దేవ పాత్రలో రానా కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో భారీ దున్నపోతుపై భల్లాల పై చేయి సాధించడాన్ని బట్టి అతడు ఎంత పవర్‌ఫుల్‌లో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో వచ్చిన శక్తివంతమైన విలన్ పాత్రలో భల్లాల దేవ కచ్చితంగా టాప్‌-3లో ఉంటాడు. భల్లాలలాగా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా? అయితే గదను పోలిన ఆయుధాన్ని పట్టుకొని.. యుద్ధానికి వెళ్లే సూట్‌ ధరిస్తే సరి. కాకపోతే ముఖంలో కాస్త క్రూరత్వం ఉండేలా ఎక్స్‌ప్రెషన్ పెట్టాల్సి ఉంటుంది.  కట్టప్ప (Kattappa) ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రను కూడా దర్శకుడు రాజమౌళి ఎంతో దృఢంగా తీర్చిదిద్దాడు. విశ్వాసానికి నిలువెత్తు రూపంగా ఆ పాత్రను చూపించాడు. ‘బాహుబలి 2’ క్లైమాక్స్‌లో ప్రభాస్‌ సాయం చేస్తూ విలన్లపై కట్టప్ప దండెత్తే తీరు అతడి ధైర్య సాహసాలకు అద్దం పడుతుంది. బాహుబలి తొలి భాగం రిలీజ్‌ తర్వాత కట్టప్ప పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం గమనార్హం. అయితే కట్టప్పలా కనిపించడం చాలా సింపుల్‌. తలపై గుండు.. నెరిసిన గడ్డంతో కట్టప్ప తరహా డ్రెస్‌ వేస్తే మీరు అలాాగే మారిపోతారు.  కాలకేయ (Kalakeya) కొన్ని సినిమాల్లో హీరో పాత్రకు సమానంగా విలన్‌ రోల్‌ హైలెట్‌ అవుతుంటాయి. ఈ కోవకు చెందిందే ‘బాహుబలి’ సినిమాలోని ‘కాలకేయ పాత్ర’. చూస్తేనే భయం వేసేలా ఆ పాత్రను రాజమౌళి రూపొందించారు. నటుడు ప్రభాకర్‌ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ముఖ్యంగా కిలికి భాషలో ఆకట్టుకున్నాడు. ఈ వేషధారణను ధరించడం అంత తెలిక కాదు. నిపుణులు వద్దకు వెళ్తే వారు సులభంగా వేయగలరు. అపరిచితుడు (Aparichithudu) ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయగల అతికొద్ది మంది హీరోల్లో తమిళ నటుడు విక్రమ్‌ ఒకరు. అతడు హీరోగా చేసిన ‘అపరిచితుడు’ చిత్రం ఎవర్‌గ్రీన్‌ అని చెప్పవచ్చు. ఇందులో విక్రమ్‌ చేసిన మూడు పాత్రల్లో కెల్లా అపరిచితుడు ఎంతో అగ్రెసివ్‌. తప్పు చేసిన వారిని దండిస్తూ చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్‌ నిపుణులతో విక్రమ్‌ చేసే ఫైట్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అపరిచితుడిలా మీరు కనిపించాలంటే ముందుగా బ్లాక్‌ డ్రెస్‌ ధరించి లాంగ్‌ హెయిర్‌ను ముఖం మీదకు వదిలేయాలి. ఆ తర్వాత సగం ముఖం వరకూ పుర్రె స్టిక్కర్‌ను ధరిస్తే సరిపోతుంది.  రోబో (Robo) భారతీయ సినిమా చరిత్రలో ‘రోబో’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హాలీవుడ్‌ చిత్రాన్ని తలపించేలా డైరెక్టర్ శంకర్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో చిట్టి అనే రోబో పాత్రలో  రజనీకాంత్‌ సూపర్‌ హీరోలా కనిపిస్తాడు. అసాధ్యం అనుకున్న పనులను ఎంతో తెలిగ్గా చేసేస్తూ ఆశ్చర్యపరుస్తాడు. అయితే రోబోలా కనిపించాలని మీరు కోరుకుంటే వెంటనే రోబో సూట్‌ను ఆర్డర్‌ పెట్టేయండి. చిట్టిలా రెడీ అయ్యి మీ ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్ చేయండి.  పక్షిరాజా (Pakshi Raja) ‘రోబో 2’ చిత్రంలో ప్రతినాయకుడు పక్షిరాజా పాత్ర హాలీవుడ్‌ సినిమాల్లో విలన్లను తలపిస్తుంది. ప్రకృతిని కంట్రోల్‌ చేయగల పవర్‌ను పొంది అతడు చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. కథానాయకుడు రజనీకాంత్‌కు సవాళ్లు విసురుతూ ఇబ్బందులకు గురిచేస్తాడు. పక్షి రాజాలా మారాలనుకుంటే కాస్త శ్రమ పడాల్సిందే. కాబట్టి నిపుణుల వద్దకు వెళ్తే వారు మిమ్మల్ని అచ్చం అలాగే తయారు చేస్తారు.  అరుంధతి (Arundhati) తెలుగులో పవర్‌ఫుల్‌ ఫీమేల్‌ పాత్ర అనగానే ముందుగా అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమానే అందరికీ గుర్తుకువస్తుంది. దుర్మార్గుడైన పశుపతిని ఎదిరించే వీర వనితగా ఇందులో అరుంధతి కనిపిస్తుంది. అరుంధతి లాగా మీరు పవర్‌ఫుల్‌గా కనిపించాలని అనుకుంటే ముందుగా ముఖాన గుడ్రపు బొట్టు ధరించాలి. శిగను మూడేసి అనుష్క కట్టిన స్టైల్‌లో ఆభరణాలు, శారీ కడితే మీరు అరుంధతి అయిపోతారు.  పశుపతి (Pasupathi) తెలుగు సినీ చరిత్రలో ‘పశుపతి’ లాంటి విలన్‌ను చూసి ఉండరు. అరుంధతి చేతిలో చనిపోయినా అతడు పగ తీరని పిశాచిలా మళ్లీ తిరిగి వస్తాడు. అరుంధతి రూపంలో ఉన్న ఆమె వారసురాలని ఇబ్బందులకు గురి చేస్తాడు. పశుపతి లాగా కనిపంచాలంటే మీరు అఘోరాలాగా మారాల్సి ఉంటుంది.  ఆదిత్య 369 (Aditya 369) బాలయ్య హీరోగా చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇందులో బాలయ్య ఓ టైమ్‌ మిషన్‌ ద్వారా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్తాడు. అలాగే ఫ్యూచర్‌లోకి వెళ్లి అప్పటి పరిస్థితులు ఎలా ఉండనున్నాయో కళ్లకు కడతాడు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణలాగా మీరు మారిపోవాలని అనుకుంటే అతడు ధరించిన రోబోటిక్‌ జాకెట్‌ను వేయండి.  సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy) చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం.. నిజమైన యోధుడి జీవిత కథ ఆధారంగా రూపొందింది. బ్రిటిష్‌ వారి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి.. ఆంగ్లేయులకు సింహస్వప్నంలా సైరా మారతారు ప్రజల కోసం చివరికీ ప్రాణ త్యాగం చేసి అసలైన సూపర్‌ హీరోగా నిలుస్తారు. సైరా నరసింహా రెడ్డి మీరూ కనిపించాలంటే సేమ్‌ చిరంజీవిలాగా లాంగ్‌ హెయిర్‌, కోరమీసంతో వీపున కత్తి ధరించండి.  బింబిసార (Bimbisara) 5వ శతాబ్దానికి చెందిన మగద రాజ్యాధిపతి బింబిసారుడు కథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించాడు. శత్రువులను నిర్ధాక్షణ్యంగా ఏరిపారేసే శూరుడిలా బింబిసారుడు కనిపిస్తాడు. అతడి మీరూ కనిపించాలంటే లాంగ్‌ హెయిర్‌ గడ్డంతో పాటు చేతిలో ఖడ్గాన్ని ధరించాలి. కళ్యాణ్‌ రామ్‌ తరహాలో వజ్రాహారాలు, రాజ దుస్తులను ధరిస్తే బింబిసార గెటప్‌లోకి మారిపోతారు.  అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) బ్రిటిష్‌ వారికి ముచ్చెమటలు పట్టించిన స్వాతంత్ర సమరయోధుల్లో ‘అల్లూరి సీతారామరాజు’ ఒకరు. సూపర్‌ కృష్ణ ఆయన జీవిత కథను సినిమాగా తీశారు. ఆగస్టు 15 సందర్భంగా ఇప్పటికీ చిన్నారులు అల్లూరి సీతారామరాజు వేషధారణను ధరించి ఆయన్ను గుర్తు చేస్తుంటారు. ఇలా అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించడం చాలా సింపుల్‌. చొక్క లేకుండా శరీరానికి కాషాయ రంగు వస్తాన్ని చుట్టుకొని.. వీపున బాణాలు.. చేతిలో విల్లు పట్టుకుంటే ఆ మహాత్ముడిలా కనిపించవచ్చు. 
    ఫిబ్రవరి 29 , 2024
    Prabhas Marriage News: ఒక్క పోస్టుతో పెళ్లిపై అటెన్షన్‌ తీసుకొచ్చిన ప్రభాస్‌.. అసలు ఏం జరిగిందంటే?
    Prabhas Marriage News: ఒక్క పోస్టుతో పెళ్లిపై అటెన్షన్‌ తీసుకొచ్చిన ప్రభాస్‌.. అసలు ఏం జరిగిందంటే?
    టాలీవుడ్‌ ఖ్యాతీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు హీరోల్లో ప్రభాస్ (Prabhas) ముందు వరుసలో ఉంటాడు. ‘బాహుబలి’ (Bahubali), ‘బాహుబలి 2’ (Bahubali 2) చిత్రాలతో ప్రభాస్‌ గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయాడు. ఇటీవల ‘సలార్‌’ (Salaar)తో సాలిడ్‌ హిట్‌ అందుకున్న డార్లింగ్‌.. బాక్సాఫీస్‌ వద్ద మరోమారు తన సత్తా ఎంటో చూపించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా ప్రభాస్‌ ఉన్నాడు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. పెళ్లికి సంబంధించి గతంలో పలుమార్లు రూమర్లు సైతం వచ్చాయి. అయితే తాజాగా ప్రభాస్‌ పెట్టిన ఓ పోస్టు.. అతడి పెళ్లిపై మళ్లీ చర్చను లేవనెత్తాయి.  ‘ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు’ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌.. సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటాడు. చాలా అరుదుగా పోస్టులు పెడుతుంటాడు. అయితే లేటెస్ట్‌గా ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వ్యక్తి గురించి పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. ‘డార్లింగ్స్‌.. ఎట్టకేలకు మన జీవితంలోకీ ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్‌ చేయండి’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌లో చెప్పిన ప్రత్యేక వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ఫ్యాన్స్ ఎక్స్‌లో షేర్‌ చేస్తున్నారు. ఆ ప్రత్యేక వ్యక్తి ప్రభాస్‌ మనసుకు నచ్చిన యువతి అయ్యి ఉంటుందని చాలా మంది ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.  అసలు నిజం ఇదే! ప్రస్తుతం ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్‌ (Nag Ashwin).. ఈ సినిమాలోని పాత్రలను ఒక్కొక్కటిగా ప్రేక్షకులకు టీజర్‌ రూపంలో పరిచయం చేస్తున్నారు. ఇటీవలే అమితాబ్‌ బచ్చన్‌ చేసిన అశ్వద్థామ పాత్రను రివీల్‌ చేశారు. అలాగే కమల్‌ హాసన్‌ రోల్‌ను కూడా గ్లింప్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. దీనిని ఉద్దేశించే ప్రభాస్‌ లేటెస్ట్‌ పోస్టు పెట్టినట్లు సమాచారం. కల్కి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే డార్లింగ్‌ లేటెస్ట్‌ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది.  కమల్‌ అంటే చాలా ఇష్టం ప్రభాస్‌ ఫేవరేట్‌ హీరోల్లో దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ ముందు వరుసలో ఉంటారు. కమల్‌పై తనకున్న అభిమానం గురించి డార్లింగ్‌ ఇప్పటికే చాలా సార్లు తెలియజేశారు. కమల్‌.. కల్కి సినిమాలో భాగమైనట్లు వెల్లడించినప్పుడు కూడా ఆనందంతో పోస్ట్‌ పెట్టారు. ‘నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం. కమల్‌ హాసన్‌ లాంటి లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ అప్పట్లో వ్యాఖ్యానించాడు. ఇప్పుడు కూడా ఆయన కోసమే ప్రభాస్‌ ఈ పోస్ట్‌ పెట్టినట్లు అర్థమవుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.  నెలాఖరులో ఫస్ట్‌ సింగిల్‌! కల్కి 2898 ఏడీ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. సినిమా మ్యూజికల్‌ రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్‌ కంపెనీ సరిగమ సొంతం చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అంతేకాదు త్వరలో ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ కూడా విడుదల చేయనున్నట్లు హింట్‌ ఇచ్చారు. ఈ నెలాఖరులో దానిని రిలీజ్‌ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. 
    మే 17 , 2024
    Anupama Parameswaran: బొల్డ్ రోల్… అనుపమ  జాతకం మార్చనుందా?
    Anupama Parameswaran: బొల్డ్ రోల్… అనుపమ జాతకం మార్చనుందా?
    గ్లామర్ డాల్ అనుపమ పరమేశ్వరన్‌ తాజాగా బ్లూ కలర్ చీరతో ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. మత్తెక్కించే ఫోజుల్లో కనిపించి కైఫేక్కిస్తోంది. బ్లూకలర్ స్లీవ్ లెస్‌ జాకెట్‌ ధరించిన ఈ మలయాళీ బ్యూటీ… తన ఎద అందాలను ఆరబోసింది. నాజూకైన నడుము ఒంపులతో, మత్తెక్కించే లుక్స్‌తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది టిల్లు స్కేర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లో తన కెరీర్‌కు ఈ సినిమా విజయం టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశపడుతోంది. ఒకప్పుడు అందాల ప్రదర్శనకు దూరంగా ఉన్న అనుపమ.. టిల్లు స్కేర్ చిత్రంలో బొల్డ్‌ లుక్‌లో అన్నింటికీ సై అంటూ హింట్ ఇచ్చింది ఈ సినిమాలో ఏకంగా మూడు సార్లు సిద్ధు జొన్నలగడ్డతో లిప్‌ లాక్ సీన్లలో నటించి ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ చిత్రంలో అనుపమ లుక్స్, బొల్డ్ అటైర్ ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది. మునుపెన్నడులేని విధంగా అనుపమ కనిపించే సరికి ప్రేక్షకులు కనుల విందు చేసుకున్నారు. గతంలోనూ 'రౌడీ బాయ్స్' చిత్రంలో రొమాంటిక్ సీన్లలో నటించినా… ఆ డోస్‌ టిల్లు స్కేర్‌లో అనుపమ పెంచేసింది. ఈ చిత్రంలో బోల్డ్ రోల్‌తో అనుపమతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు లైన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది గత కొంతకాలంగా సరైన విజయం లేక ఆందోళనలో ఉన్న అనుపమ ఈ సినిమా ద్వారా బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పవచ్చు. అనుపమ ఈ చిత్రంలో బోల్డ్ లుక్‌లో నటించేసరికి ఆమెపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్ చేశారు. అయితే ఈ ట్రోల్స్‌పై మనస్తాపం చెందిన అనుపమ… క్యారెక్టర్ ఏమి కోరుకుంటుందో తాను అదే చేశానని సమాధానం చెప్పింది. గతంలో స్టార్ హీరోయిన్లు క్యారెక్టర్‌కు అనుగుణంగా బోల్డ్ పాత్రలు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ప్రస్తుతం సౌత్ సిని పరిశ్రమల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ మలయాళి సోయగం… తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనుపమ నటించిన కార్తికేయ 2 చిత్రం తెలుగులోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో హీరో నిఖిల్‌తో పోటీ పడి మరీ నటించింది. కార్తికేయ 2 తర్వాత అనుపమ 'బటర్‌ఫ్లై', '18 పేజెస్‌' చిత్రాల్లో నటించింది. ఇందులో '18 పేజెస్‌' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో సైరెన్, మలయాళంలో మరో చిత్రం కోసం తన డేట్స్ ఇచ్చింది.
    మార్చి 30 , 2024
    Tollywood: రాకేష్ మాస్టర్‌పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్‌లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
    Tollywood: రాకేష్ మాస్టర్‌పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్‌లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
    టాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) ఆదివారం తుది శ్వాస విడిచారు. చాలా రోజుల నుంచి రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం హన్‌-మ్యాన్ అనే సినిమా షూటింగ్‌లో ఆయనకు రక్త విరేచనాలు అయ్యాయి. అక్కడే రాకేష్ మాస్టర్‌ను పరిశీలించిన వైద్యులు ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. అయితే ఆయన మృతిపై ఏ ఒక్క టాలీవుడ్ ప్రముఖుడు సంతాప సందేశం విడుదల చేయలేదు. రామ్‌గోపాల్ వర్మ నుంచి చిరంజీవి వరకు ఏ ఒక్కరు స్పందించలేదు. రాకేష్ మాస్టర్ చిన్న వ్యక్తి ఏమి కాదు.. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫి చేశారు. ప్రభాస్, రామ్‌పొత్తినేని, రవితేజ, వేణు వంటి హీరోలు, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సత్య మాస్టర్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్లు కేరీర్ ఆరంభంలో ఆయన నుంచి డ్యాన్స్ మెళకువలు నేర్చుకున్నవారే. రామ్‌పొత్తినేని నటించిన దేవదాసు మూవీకి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కనీసం ఆయన పనిచేసిన సినిమాలకు చెందిన నిర్మాతలు కానీ, హీరోలు కానీ స్పందిస్తే బాగుండేది. వివాదాలే ఒంటరిని చేశాయి.. యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అనేకమంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ,  ఎన్టీఆర్, శ్రీరెడ్డి, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, మంచు లక్ష్మి‌లను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. అలాగే తన శిష్యులైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లపై పలు ఇంటర్వ్యూల్లో అసభ్య పదజాలంతో దూషించారు. వారికి అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తే.. చివరికి తనను పట్టించుకోలేదని చాలా సార్లు కంటతడి పెట్టుకున్నారు. ముక్కుసూటి తనం, నిజాలను నిర్భయంగా చెప్పడం వంటి లక్షణాలు ఆయన్ను ఇండస్ట్రీ నుంచి దూరం చేశాయి. దీంతో ఆయనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.  పొట్ట కూటి కోసం.. అవకాశాలు తగ్గడంతో పొట్ట కూటి కోసం రాకేష్ మాస్టర్ డ్యాన్స్ స్కూల్ రన్ చేశారు. దీంతో పాటు SRK ENTERTAINMENT అనే యూట్యూబ్ ఛానెల్‌ను ఓపెన్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్లను భారీగా పెంచుకున్నారు. డ్యాన్స్ ఈవెంట్‌లతో పాటు జబర్దస్త్‌ లాంటి కామెడీ షోల్లో నటించారు.  ఒకనొకప్పుడు ఖరీదైన కార్లలో కనిపించిన రాకేష్ మాస్టర్.. చనిపోయే నాటికి అద్దె ఇంట్లో ఉండే పరిస్థితికి పడిపోయారు. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా.. రాకేష్ మాస్టర్ మాత్రం సేవా దృక్పథం కలవారు. కోవిడ్ సమయంలో తన దగ్గర ఉన్న డబ్బునంత ఖర్చు చేశారు. రోజుకు 200 మందికి అన్నదానం చేశారు. వారికి కావాల్సిన సామాగ్రిని కొనిచ్చారు. ఇంత చేసినా ఏరోజు ఆయన బయటకు చెప్పుకోలేదు. వీళ్లే నయం..! తాను చనిపోతానని ముందే తెలిసిన రాకేష్ మాస్టర్... చివరి రోజులు ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియా స్టార్లతో ఓ పొగ్రాంను ఏర్పాటు చేశారు. ఆవేశం స్టార్, స్వాతినాయుడు, అగ్గిపెట్ట మచ్చతో కలిసి 'మ్యాన్షన్ హౌత్ విత్ మై హౌస్' అనే షోలో చాలా సంతోషంగా గడిపారు. తమను చేరదీసి ఆశ్రయం కల్పించిన రాకేష్ మాస్టర్ మృతి చెందటంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మాత్రం రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు నోచుకున్నారు. రాకేష్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ బోరున విలపించారు. ఏ సంబంధం లేనివారే ఇంత బాధపడితే... ఆయన నుంచి సినిమాలు చేయించుకున్న ప్రొడ్యూసర్లు, హీరోలు, డైరెక్టర్లు కనీసం ఒక్క సంతాప సందేశం కూడ విడుదల చేయకపోవడం నిజంగా విచారకరం. చనిపోయిన వ్యక్తితో ఎన్ని వివాదాలు ఉన్నా, ఎంత శత్రుత్వం ఉన్నా... ఆ వ్యక్తి చనిపోయాడు కదా..! మీ మీ బిజీ షెడ్యూల్స్ వల్ల రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు వెళ్లకపోయినా కనీసం మానవత్వం చాటుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ పెద్దలకు లేదా? అని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
    జూన్ 20 , 2023
    Telugu OTT Releases: ఈ వారం (మే 29) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..
    Telugu OTT Releases: ఈ వారం (మే 29) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..
    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 29 నుంచి జూన్‌ 4వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అయితే ఈ వీక్‌ అన్నీ చిన్న సినిమాలు రిలీజ్‌ కావడం విశేషం. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్స్‌లో రిలీజయ్యే చిత్రాలు అహింస ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్‌ హీరోగా ‘అహింస’ సినిమా తెరకెక్కింది. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా అభిరామ్‌ తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ప్రేమ, యాక్షన్‌ అంశాల మేళవింపుతో ఈ సినిమా రూపొందింది. జూన్‌ 2న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఆర్పీ పట్నాయక్‌ స్వరాలు అందించిన ఈ సినిమాలో రజత్‌ బేడి, గీతిక, సదా, రవికాలే, మనోజ్‌ టైగర్‌ తదితరులు నటించారు.  ఐక్యూ సాయిచరణ్‌, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘ఐక్యూ’. పవర్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ పేరుతో ఈ సినిమాను శ్రీనివాస్‌ జీఎల్‌బి తెరకెక్కించాడు. సుమన్‌, సత్య ప్రకాష్‌, బెనర్జీ వంటి దిగ్గజ నటులు సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా జూన్‌ 2వ తేదీనే ప్రేక్షకులను పలకరించనుంది. ఇది మేధస్సుకు సంబంధించిన చిత్రమని, మంచి ఐక్యూ ఉన్న అమ్మాయిని హీరో ఎలా కాపాడాడన్నది సినిమా కథ అని చిత్ర బృందం చెబుతోంది. నేను స్టూడెంట్‌ సార్‌! బెల్లంకొండ గణేష్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నేను స్టూడెంట్‌ సార్‌!’. ఈ సినిమా కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. జూన్‌ 2న ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీని రాఖీ ఉప్పలపాటి తెరకెక్కించారు. సతీష్‌ వర్మ నిర్మించారు. ఈ చిత్రాన్ని యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన్నట్లు ప్రచార చిత్రాలను బట్టి తెలుస్తోంది. నేను స్టూడెంట్‌ సార్‌! సినిమాకు మహతి స్వరసాగర్ స్వరాలు సమకూర్చారు.  పరేషాన్ తిరువీర్‌, పావని కరణం జంటగా నటించిన కామెడీ మూవీ ‘పరేషాన్’. ఈ సినిమాకు రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహించారు.  జూన్‌ 2న సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సినిమా కొత్త రకమైన కామెడీని పరిచయం చేస్తుందని చిత్ర బృందం తెలిపింది. చక్రవ్యూహం విలక్షణ నటుడు అజయ్‌ పోలీసు ఆఫీసర్‌గా చెట్కూరి మధుసూదన్‌ దర్శకత్వంలో చక్రవ్యూహం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా జూన్‌ 2 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. మర్డర్‌ మిస్టరీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్‌గా సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం చెప్పింది. కాగా ఈ సినిమాలో జ్ఞానేశ్వరి, వివేక్‌ త్రివేది, ఊర్వశి పరదేశి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌ సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateSulaikha ManzilMovieMalayalamDisney+ HotstarMay 30VishwakMovieTeluguZee5June 2Asur season 2SeriesHindiJio CinemaJune 1Fake ProfileSeriesEnglishNetflixMay 31A Beautiful LifeMovieEnglishNetflixJune 1New AmsterdamSeriesEnglishNetflixJune 1Infinity StormMovieEnglishNetflixJune 1ScoopSeriesHindiNetflixJune 2ManifestSeriesEnglishNetflixJune 2
    మే 29 , 2023
    <strong>Kalki 2898 AD Collections: రూ.1000 కోట్లు క్రాస్‌ చేసిన కల్కి, ఆ విషయంలో ఏకైక హీరోగా ప్రభాస్</strong>
    Kalki 2898 AD Collections: రూ.1000 కోట్లు క్రాస్‌ చేసిన కల్కి, ఆ విషయంలో ఏకైక హీరోగా ప్రభాస్
    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలై 15 రోజులు గడిచినప్పటికీ కలెక్షన్స్‌ వేటలో ఏమాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రభాస్‌ చిత్రం దూసుకెళ్తోంది. తాజాగా వెల్లడైన కల్కి వరల్డ్ వైడ్‌ కలెక్షన్స్‌ కళ్లు చెదిరేలా చేస్తున్నాయి. ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఏవి? అందులో కల్కి ఏ స్థానంలో నిలిచింది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; 15 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే? ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం 15 రోజులుగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకూ వసూలైన కలెక్షన్స్‌ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. కల్కి చిత్రం 15 రోజుల్లో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను ఎక్స్‌ వేదికగా రిలీజ్‌ చేసింది. ప్రభాస్ కర్ణుడు గెటప్‌లో ఉండి రూ.1000 కోట్లకు గురి పెట్టినట్లుగా ఈ పోస్టర్‌ను డిజైన్‌ చేశారు. ప్రస్తుతం ఇది&nbsp; నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్‌ సత్తా ఏంటో మరోమారు నిరూపితమైందని ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Kalki2898AD/status/1812023448681750927 ఏకైకా సౌత్‌ హీరోగా ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ద్వారా హీరో ప్రభాస్‌ రికార్డు సృష్టించాడు. రెండు సార్లు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక దక్షిణాది హీరోగా నిలిచాడు. 'బాహుబలి 2' చిత్రం ద్వారా ప్రభాస్‌ తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాడు. సలార్‌తో మరోమారు రూ.1000 కోట్లను టచ్‌ చేస్తాడని భావించినా రూ.705–715 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. అయితే తాజాగా కల్కితో రెండోసారి ఈ ఫీట్‌ను సాధించాడు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ వద్ద తనకు తిరుగులేదని నిరూపించాడు. తద్వారా బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) రికార్డ్‌ను ప్రభాస్‌ సమం చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్లే రెండుసార్లు తమ చిత్రాలను వెయ్యి కోట్ల క్లబ్‌లో నిలిపాడు. జవాన్‌, పఠాన్‌ చిత్రాల ద్వారా షారుక్ ఈ ఘనత సాధించాడు.&nbsp; త్వరలో టాప్‌-3లోకి ‘కల్కి’ తాజా కలెక్షన్స్‌తో భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కల్కి ఏడో స్థానంలో నిలిచింది. రూ.2,023 కోట్లతో అమీర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ (Dangal) టాప్ ప్లేసులో కొనసాగుతోంది. ప్రభాస్‌ నటించిన 'బాహుబలి 2' చిత్రం రూ.1,810 కోట్లతో సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రూ.1,387 కోట్లు, ‘కేజీఎఫ్‌ 2’ రూ.1,200–1,250 కోట్లు, ‘జవాన్‌’ రూ.1,148 కోట్లు, ‘పఠాన్’ రూ.1,050 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే కల్కి రెండు వారాల వ్యవధిలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడంతో రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. రూ.1300 కోట్లకు పైగా రాబట్టి ఈ జాబితాలో ఈజీగా మూడో స్థానంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో 3, 4, 5 స్థానాల్లో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2, జవాన్ సినిమాలకు షాక్‌ తప్పేలా లేదు. డే1 కలెక్షన్స్‌ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ&nbsp; వైజయంతీ మూవీస్‌.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘లెట్స్‌ సెలబ్రేట్‌ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్‌ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్‌ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్‌ చేసుకుంది. ఫస్ట్‌ వీకెండ్‌ ఎంత వచ్చిందంటే? ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. ఫస్ట్‌ వీకెండ్‌లో వరల్డ్‌ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్‌ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ లాస్ట్‌ వీక్‌ పోస్టు చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది.&nbsp; https://twitter.com/VyjayanthiFilms/status/1807678411529506945
    జూలై 13 , 2024
    Rajamouli - David Warner: డేవిడ్ వార్నర్‌తో రాజమౌళి ఎందుకు షూటింగ్ చేశాడంటే?
    Rajamouli - David Warner: డేవిడ్ వార్నర్‌తో రాజమౌళి ఎందుకు షూటింగ్ చేశాడంటే?
    ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner)కు క్రికెట్‌తో పాటు యాక్టర్‌గానూ సోషల్‌ మీడియాలో గుర్తింపు పొందాడు. అతడు తెలుగు సినిమాలకు సంబంధించిన పలు డైలాగ్స్‌, సాంగ్స్‌కు రీల్స్‌ చేసి గతంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) తరపున ఆడుతున్న సమయంలో ఎక్కువగా సినిమా రీల్స్‌ చేసి తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫేమస్ అయ్యాడు. అల్లు అర్జున్‌ (Allu Arjun), ప్రభాస్ (Prabhas), మహేష్‌ బాబు (Mahesh Babu) వంటి హీరోలను అతడు ఇమిటేట్‌ చేసిన వీడియోలు అప్పట్లో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా వార్నర్.. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్‌ షూట్‌ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాను ఊపేస్తోంది.&nbsp; రాజమౌళిని ఫేవర్‌ కోరిన వార్నర్‌! ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) కోసం.. రాజమౌళి, డేవిడ్‌ వార్నర్‌ ఇద్దరూ కలిసి ఓ ఫన్నీ యాడ్‌లో నటించారు. ఆ యాడ్ ఓపెనింగ్‌లో ‘మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి` అని వార్నర్‌ను రాజమౌళి అడుగుతాడు. ‘రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ యాప్ ఉంటే క్యాష్‌బ్యాక్ వస్తుంది’ అని వార్నర్ బదులిస్తాడు. దానికి రాజమౌళి స్పందిస్తూ.. ‘నార్మల్ యూపీఐ యాప్ ఉంటే రాదా?’ అని ప్రశ్నిస్తాడు. అలా అయితే డిస్కౌంట్ కోసం తనకు ఫేవర్‌ చేయాలని వార్నర్‌ కోరతాడు. తనతో సినిమా చేయమని అడుగుతాడు.&nbsp; https://twitter.com/CRED_club/status/1778703889715646779? వార్నర్‌ రాక్స్.. రాజమౌళి షాక్స్‌! ఒక వేళ తన సినిమాలో డేవిడ్‌ వార్నర్‌ నిజంగానే హీరోగా నటిస్తే ఎలా ఉంటుందోనని రాజమౌళి ఊహించుకుంటాడు. బాహుబలి తరహా గెటప్‌లో అతడు నటిస్తే షూటింగ్‌ సెట్‌ ఎలా ఉంటుందోనని ఆలోచనల్లోకి వెళ్లిపోతాడు. సెట్స్‌లో వార్నర్‌ చేసే అల్లరి, డ్యాన్స్‌ స్టెప్పులు, డైలాగ్స్‌.. ఇవన్నీ ఊహించుకొని దర్శకధీరుడు ఒక్కసారిగా భయపడిపోయినట్లు యాడ్‌లో చూపించారు. మధ్యలో ‘ఆస్కార్ వేదికగా కలుద్దాం’, ‘నాకు గుర్రం వద్దు.. కంగారూ కావాలి’ అంటూ వార్నర్ చెప్పిన డైలాగులు నవ్వులు పూయిస్తాయి. చివరకు ఆ సినిమా ఆలోచన మానుకుని క్రెడ్ యాప్‌ను రాజమౌళి డౌన్‌లోడ్ చేసుకోవడంతో యాడ్ ముగుస్తుంది. ఈ వీడియోను క్రెడ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కొన్ని సార్లు ఫేవర్స్‌ కూడా మార్కెట్‌ రిస్క్‌కి లోబడి ఉంటాయంటూ వీడియోకు క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. ప్రస్తుతం సినీ ప్రేక్షకులతో పాటు క్రికెట్‌ లవర్స్‌ను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.&nbsp;
    ఏప్రిల్ 13 , 2024
    The 7 immortals Of Kalki: కల్కీ సినిమాలో సప్త చిరంజీవులు.. కథకు అసలు మూలం వీరేనా?
    The 7 immortals Of Kalki: కల్కీ సినిమాలో సప్త చిరంజీవులు.. కథకు అసలు మూలం వీరేనా?
    చిరంజీవులు అంటే ఎప్పటికీ మరణం లేని వారని మనకు తెలిసిన విషయమే. పురణాల్లో వీరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. వారు ఇప్పటికీ హిమాలయాల్లో జీవించి ఉన్నారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నట్లు అని ఆలోచిస్తున్నారా? ఇందుకు బలమైన కారణమే ఉంది. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)లో ఈ చిరంజీవులే సూపర్‌ హీరోలుగా కనిపించబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. పురణాల్లోని అశ్వత్థామ పాత్రను అమితాబ్‌ బచ్చన్‌ పోషిస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇంతకీ చిరంజీవులు ఎంత మంది? కల్కి సినిమాల్లో ఆ పాత్రలను ఎవరు పోషిస్తే బాగుంటుంది? ఆ వివరాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; సప్త చిరంజీవులు ఎవరంటే? పురణాలు ప్రకారం అశ్వత్థాముడు (Ashwathama), బలి చక్రవర్తి (Bali Chakravarthi), హనుమంతుడు (Hanuman), విభీషణుడు ((Vibhishana), కృపాచార్యుడు (Kripudu), పరశురాముడు (Parasuramudu), వ్యాసుడు (Vyasudu) అనబడే ఈ ఏడుగురిని సప్త చిరంజీవులుగా పిలుస్తుంటారు. వారు ఇప్పటికీ భూమి మీద.. మానవ మాత్రులకు కనిపించకుండా జీవిస్తున్నట్లు హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ శాపం వల్ల అశ్వత్థాముడు.. వామనుని అనుగ్రహము వల్ల బలి చక్రవర్తి చిరంజీవులు అయ్యారు. అలాగే లోకహితము కొరకు వ్యాసుడు, శ్రీరామునిపై భక్తితో హనుమంతుడు, రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు మరణం లేకుండా జీవించే వరం పొందారు. మరోవైపు విచిత్రమైన జన్మం కలగడం వలన కృపుడు, ఉత్క్రుష్టమైన తపోశక్తి కలగడంతో పరశురాముడు చిరంజీవులు అయ్యారు. వీరందర్ని సప్త చిరంజీవులుగా మన పురణాలు పేర్కొన్నాయి.&nbsp; కల్కి సినిమాలో సప్త చిరంజీవులు? ప్రభాస్ అప్‌కమింగ్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో.. ఈ సప్త చిరంజీవుల పాత్రలు ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే అశ్వత్థామ పాత్రను బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ పోషిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అటు హీరో ప్రభాస్‌ విష్ణుమూర్తి అవతారమైన పరుశురాముడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన పాత్రలకు ఎవర్ని ఫైనల్‌ చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అమితాబ్‌ లాంటి సీనియర్‌ నటుడ్ని అశ్వత్థామ పాత్రకు తీసుకోవడంతో మిగిలిన వాటికి కూడా దిగ్గజ నటులను తీసుకుంటే బాగుంటుందని సినిమా లవర్స్‌ భావిస్తున్నారు. హనుమాన్‌ పాత్రకు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi), విభిషణుడిగా రజనీకాంత్‌ (Rajinikanth), బలి చక్రవర్తిగా మోహన్‌లాల్‌ (Mohanlal), వ్యాసుడిగా కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ (Shiva Rajkumar), కృపుడిగా బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అనిల్‌ కపూర్‌ (Anil Kapoor) సరిగ్గా సరిపోతారని అంచనా వేస్తున్నారు. మరోవైపు కల్కీలో పాత్రల కోసం నాని (Nani), విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు రూమర్లు ఉన్నాయి. మరి చివరికీ ఏం జరుగుతుందో చూడాలి.&nbsp; కమల్‌కు భారీ రెమ్యూనరేషన్‌ కల్కి చిత్రంలో దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ 'కాళి' అనే పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా కమల్‌ పాత్ర ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. కమల్‌ ఈ పాత్ర కోసం భారీగా రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. కమల్‌కు ఏకంగా రూ.50 కోట్లు చిత్ర యూనిట్‌ చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బిగ్‌బీ అమితాబ్‌ పాత్రకు రూ.10 కోట్లు చెల్లించినట్లు సమాచారం అందుతోంది. కమల్‌తో పోలిస్తే అమితాబ్ అశ్వత్థామ పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో ఈ మాత్రం చెల్లించినట్లు బాలీవుడ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీలు దీపికా పదుకొనే, దిశా పటాని నటిస్తున్నారు.&nbsp;
    ఏప్రిల్ 25 , 2024
    Prithwi Shaw: పృథ్వీ షాపై దాడి చేసిన సప్న గిల్ ఎవరు? వరుస వివాదాల్లో పృథ్వీ షా
    Prithwi Shaw: పృథ్వీ షాపై దాడి చేసిన సప్న గిల్ ఎవరు? వరుస వివాదాల్లో పృథ్వీ షా
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    ఫిబ్రవరి 17 , 2023
    సమంత గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సమంత గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సమంత దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులో ఏమాయ చేసావే(2010) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ తమిళ్ అందం... దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు, యశోద, శాకుంతలం చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సమంత గురించి కొన్ని(Some Lesser Known Facts About Samantha) ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం సమంత ఎవరు? సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సమంత దేనికి ఫేమస్? సమంత.. ఏమాయ చేసావే, పుష్ప, దూకుడు, రంగస్థలం వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. సమంత వయస్సు ఎంత? సమంత 1987 ఏప్రిల్ 28న జన్మించింది. ఆమె వయస్సు&nbsp; 36 సంవత్సరాలు&nbsp; సమంత ముద్దు పేరు? సామ్ సమంత ఎత్తు ఎంత? 5 అడుగుల 2 అంగుళాలు&nbsp; సమంత ఎక్కడ పుట్టింది? చెన్నై సమంతకు వివాహం అయిందా? 2017లో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2021లో విడిపోయింది. సమంత అభిరుచులు? పాటలు పాడటం, షాపింగ్, జిమ్‌ చేయడం సమంత ఇష్టమైన ఆహారం? స్వీట్ పొంగల్, డైరీ మిల్క్ చాక్‌లెట్, పాలకోవ సమంత అభిమాన నటుడు? ధనుష్, సూర్య, రజనీకాంత్ సమంత తొలి సినిమా? ఏమాయ చేసావే సమంత ఏం చదివింది? కామర్స్‌లో డిగ్రీ చేసింది సమంత పారితోషికం ఎంత? సమంత ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. సమంత తల్లిదండ్రుల పేర్లు? జోసెఫ్ ప్రభు, నైనిటీ సమంతకు అఫైర్స్ ఉన్నాయా? సమంత తొలుత సిద్ధార్థతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత వీరు విడిపోయినట్లు తెలిసింది సమంతకు ఎన్ని అవార్డులు వచ్చాయి? 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు వచ్చాయి. సమంత ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/samantharuthprabhuoffl/?hl=en సమంత సిగరేట్ తాగుతుందా? కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లలో సమంత స్మోకింగ్ చేస్తుందని ఉంది సమంత మద్యం తాగుతుందా? తెలియదు సమంత ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది? సమంత తొలుత నాగచైతన్యతో లిప్‌లాక్ సీన్‌లో నటించింది. ఆ తర్వాత నానితో లిప్‌లాక్ సీన్‌లో నటించింది. సమంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? చిన్మయి, రానా, అక్కినేని అఖిల్ సమంతకు టాటూలు అంటే ఇష్టమా? అవును, తన కుడి వైపు నడుము పై భాగంలో 'చై' అని టాటూ వేయించుకుంది. విడిపోయిన తర్వాత టాటూ తొలగించింది. సమంతకు వచ్చి వ్యాధి పేరు? ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్(మయోసైటిస్), ఈ వ్యాధితో పాటు 2013లో ఆమెకు డయాబెటిస్ ఉన్నట్లు తెలిసింది.&nbsp; సమంత గుడి ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్‌- బాపట్లలోని ఆలపాడు గ్రామంలో సమంత గుడిని ఆమె అభిమాని తెనాలి సందీప్ కట్టారు. https://www.youtube.com/watch?v=TRAuBpbd_nI
    ఏప్రిల్ 27 , 2024

    @2021 KTree