UATelugu2h 44m
భైరవ్ సింగ్ (శరద్ ఖేల్కర్) అనే ఓ రాజకుటుంబానికి చెందిన నియంత రత్తన్ పూర్ ప్రాంతంలోని సహజ వనరులను అక్రమంగా చేజక్కించుకునేందుకు పన్నాగాలు పన్నుతుంటాడు. ఇలాంటి పరిస్థితులున్న ఊరిని చక్కబెట్టేందుకు సర్దార్ గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్) పోలీసాఫీసర్‍గా నియమితుడవుతాడు. ఇక సర్దార్ ఈ భైరవ్ సింగ్ ఆటలను ఎలా కట్టించాడు? అన్నది కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Hotstarఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
పవన్ కళ్యాణ్
సర్దార్ గబ్బర్ సింగ్సాథ్విక్ వర్మయంగ్ గబ్బర్ సింగ్/సర్దార్
కాజల్ అగర్వాల్
అర్షి దేవిశరద్ కేల్కర్
రాజా భైరవ్ సింగ్సంజ్జనా గల్రానీ
గాయత్రిBhairav Singh wife
బ్రహ్మానందం
శేఖర్ సింగ్ చౌహాన్ రాజ్పుత్అలీ
సాంబాతనికెళ్ల భరణి
గబ్బర్ సింగ్ మేనమామను దత్తత తీసుకున్నాడుముఖేష్ రిషి
హరి నారాయణరావు రమేష్
రమేష్ తల్వార్ప్రదీప్ రావత్
భైరవ్ సింగ్ తండ్రికబీర్ దుహన్ సింగ్
ధనుఊర్వశి
మధుమతిటిస్కా చోప్రా
గీతా దేవిపూజా రామచంద్రన్
రతన్‌పూర్‌లో ఒక అమ్మాయిపోసాని కృష్ణ మురళి
అప్పాజీ (స్కెచ్ మాస్టర్)బ్రహ్మాజీ
రాజ మాణిఖ్యం IPS (అవినీతి చెందిన పోలీసు అధికారి)సుడిగాలి సుధీర్
పోలీస్ కానిస్టేబుల్రఘు బాబు
గోవిందాధీర్ చరణ్ శ్రీవాస్తవ్
హకీమ్ప్రభాస్ శ్రీను
కృష్ణ భగవాన్
వినీత్ కుమార్
సలీం బేగ్
చరణ్దీప్
నర్రా శ్రీనివాస్
అశ్విని
అరవింద్
షకలక శంకర్
RKమట్కా శీను
రాయ్ లక్ష్మి
స్వయంగా అతిధి పాత్రలో కనిపించిందిసిబ్బంది
కెఎస్ రవీంద్ర
దర్శకుడుపవన్ కళ్యాణ్నిర్మాత
శరత్ మరార్నిర్మాత
సునీల్ లుల్లానిర్మాత
దేవి శ్రీ ప్రసాద్
సంగీతకారుడుపవన్ కళ్యాణ్
కథఆర్థర్ ఎ. విల్సన్
సినిమాటోగ్రాఫర్కథనాలు
Raai Laxmi: థండర్ థైస్ అందాలతో పంబ రేపుతున్న రాయ్ లక్ష్మి.. కుర్రకారుకు కనుల విందు!
హీరోయిన్ రాయ్ లక్ష్మి మరోసారి సోగసుల విందు చేసింది. మల్దీవ్స్‌లో వెకెషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాల తెగింపునకు పాల్పడింది.
థండర్ థైస్ అందాలతో కుర్రకారుకు కనువిందు చేసింది. వైట్ డ్రెస్‌లో అమ్మడి అందాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
బోట్‌లో ప్రయాణిస్తూ డ్రింక్ స్విప్ చేస్తున్న రాయ్ లక్ష్మి.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది.
ఇక రాయ్ లక్ష్మి థండస్ థైస్ అందాలకు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఈ హాట్ డాల్ ఎప్పుడు ఫోటోలు పెడుతుందా.. ఎప్పుడూ తమ కామెంట్లకు పనిచెప్పాలా అని ఉబలాటపడుతుంటారు.
3 పదుల వయసులోనూ తరగని అందంతో కుర్రకారు డ్రీమ్ గర్ల్‌గా మారింది రాయ్ లక్ష్మి. తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో 15 ఏళ్ల క్రితమే తెరంగేట్రం చేసింది
తొలి చిత్రం నుంచే అందాల దాడి పెంచిన రాయ్ లక్ష్మి ఇండస్ట్రీలో గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత దక్షిణాది భాషల్లో బిజీగా మారి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది.
సర్దార్ గబ్బర్ సింగ్, బలుపు, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
ఖైదీ 150 సినిమాలో చిరంజీవి సరసన ఐటెం సాంగ్‌లో నటించి ప్రేక్షకుల చేత ముద్దుగా రత్తాలుగా పిలిపించుకుంటోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాయ్ లక్ష్మి... అందాల ఆరబోతకు కెరాఫ్ ఆడ్రస్‌గా నిలుస్తోంది.
ఇక సముద్రయానానికి వెళ్లిందంటే.. రాయ్ లక్ష్మి అందాల దాడిని ఎవరు ఆపలేరు. బికినీ అందాలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతుంది. సింగిల్ పీస్ ధరించి ఇచ్చే ఫోజులకు, ఆమె కళ్లు చెదిరే అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఎప్పటికప్పుడూ తన అందాలకు మెరుగులు అద్దుతూ సరికొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది రాయ్ లక్ష్మి.
ఇక సినిమా ఈవెంట్లలో అమ్మడు ప్రదర్శించే అందాలకు కొలత కట్టడం అసాధ్యమే. ఆ రీతిలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఎక్స్‌పోజింగ్.
ప్రస్తుతం రాయ్ లక్ష్మి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటుంది. సోలో రోల్స్‌తో పాటు గ్లామర్‌కు అవకాశం ఉండే పాత్రలను సైతం ఇష్టంగా చేస్తోందీ సొగసుల సంచలనం.
అక్టోబర్ 23 , 2023
EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి ఓసారి చూద్దాం.
అడవి శేషు(Adivi Sesh)
ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు. 'కర్మ' అనే సినిమాతో డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.
విశ్వక్ సేన్(Vishwak Sen)
ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు. మరో నాలుగేళ్ల తర్వాత దాస్ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.
సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)
ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు.
రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran)
'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు. అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.
ఆర్ నారాయణ మూర్తి(R. Narayana Murthy)
విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
ఎన్టీఆర్ &సూపర్ స్టార్ కృష్ణ
లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
ఏప్రిల్ 01 , 2024
Tollywood Disaster Sequels: భారీ అంచనాలతో వచ్చి చతికలపడ్డ టాప్ 13 సీక్వెల్ చిత్రాలు ఇవే!
గత దశాబ్దాల కాలంలో తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీటిలో కొన్నింటికి సీక్వెల్స్ సైతం ప్రేక్షకులను పలకరించాయి. అయితే తొలి భాగంతో పోలిస్తే (Tollywood Disaster Sequels) సెకండ్ పార్ట్ ఆడియన్స్ పెద్దగా ఆకట్టుకులేకపోయాయి. తొలి సినిమా మానియాను కొనసాగించడంలో విఫలమయ్యాయి. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అందులో నటించిన స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
మనీ మనీ మోర్ మనీ
జేడీ చక్రవర్తి హీరోగా చేసిన మనీ మూవీ సిరీస్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. మనీ (1993), మనీ మనీ (1994) పేరుతో వచ్చిన ఆ చిత్రాలు మంచి హిట్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే ఆ చిత్రాలకు కొనసాగింపుగా 2011లో వచ్చిన ‘మనీ మనీ మోర్ మనీ’ (Money Money More Money) మాత్రం ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది.
Money Money More Money Wallpapers
శంకర్‌దాదా జిందాబాద్
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాల్లో శంకర్‌దాదా M.B.B.S ఒకటి. 2004లో విడుదలైన ఆ చిత్రం చిరుకి మంచి పేరు తీసుకొచ్చింది. అంతేగాక కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా ‘శంకర్‌దాదా జిందాబాద్’ (Shankar Dada Zindabad) తెరకెక్కించారు. డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది.
కిక్ 2
రవితేజ కెరీర్‌లోని టాప్-5 హిట్ చిత్రాల్లో ‘కిక్’ (Kick Movie) సినిమా కచ్చితంగా ఉంటుంది. 2009లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్‌గా 2015లో ’కిక్-2’ (Kick 2)వచ్చింది. అయితే సినిమా ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయింది. రవితేజ ఫ్లాపు చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.
సర్దార్ గబ్బర్ సింగ్
పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎన్నో అంచనాలతో వచ్చిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ (Sardaar Gabbar Singh) మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. 2016లో వచ్చిన ఈ చిత్రం.. పవన్ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.
మన్మథుడు 2
అక్కినేని నాగార్జున హీరోగా చేసిన ఎవర్‌గ్రీన్ చిత్రాల్లో ‘మన్మథుడు’ (Manmadhudu) ఒకటి. ఈ సినిమాను ఇప్పటికీ చాలామంది చూస్తుంటారు. ఇందులో నాగార్జున కామెడీ టైమింగ్‌ను, బ్రహ్మీ కాంబినేషన్‌లో వచ్చే సీన్లను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ‘మన్మథుడు 2’ (Manmadhudu 2) మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలైంది.
గాయం 2
1993లో జగపతి బాబు హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం (Gayam) చిత్రం బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఆరు నంది అవార్డులను సైతం కొల్లగొట్టింది. అటువంటి ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన గాయం-2 (Gayam 2) మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికలపడింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. 2010లో వచ్చిన ఈ సీక్వెల్ చిత్రానికి ప్రవీణ్ శ్రీ దర్శకత్వం వహించారు.
ఆర్య-2
అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన మెుట్టమెుదటి చిత్రం ‘ఆర్య’ (Arya Movie). ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. బన్నీతో పాటు సుకుమార్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘ఆర్య 2’ (Arya 2) అదే స్థాయిలో మెప్పించలేకపోయింది. మోస్టరు టాక్ మాత్రమే తెచ్చుకుంది.
చంద్రముఖి 2 & నాగవల్లి
తెలుగులో వచ్చిన టాప్-5 హారర్ చిత్రాల్లో రజనీకాంత్ హీరోగా ‘చంద్రముఖి’ కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో విపరీతంగా భయపెట్టింది. చంద్రముఖి (Chandramukhi) పాత్రలో జ్యోతిక అదరగొట్టింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చంద్రముఖి 2 (Chandramukhi 2), నాగవల్లి (Nagavalli) చిత్రాలు మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. నాగవల్లిలో వెంకటేష్ లీడ్ రోల్‌లో నటించగా.. చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్ చేశాడు.
రోబో 2
రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘రోబో’ (Robo) చిత్రం.. 2010లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన గ్రాఫిక్స్ మాయజాలంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురిపించింది. దీనికి అనుసంధానంగా 2018లో రిలీజైన ‘రోబో 2’ (Robo 2) అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో కనిపించాడు.
సత్య 2
రామ్‌గోపాల్ వర్మను బాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా చేసిన చిత్రం ‘సత్య’ (Sathya). ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సత్య-2 (Sathya 2)మాత్రం ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇందులో శర్వానంద్ హీరోగా నటించాడు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు.
వెన్నెల 1/2
రాజా హీరోగా దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల' (Vennela) చిత్రం.. 2005లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారానే వెన్నెల కిషోర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'వెన్నెల 1/2' (Vennela 1/2) దారుణంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాకు వెన్నెల కిషోర్ దర్శకత్వం వహించడం విశేషం.
అవును 2
విభిన్నమైన హారర్ కథాంశంతో వచ్చిన ‘అవును’ (Avunu).. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. డైరెక్టర్‌గా రవిబాబుకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘అవును 2’ (Avunu 2) మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది.
మంత్ర 2
కథానాయిక చార్మి చేసిన మరుపురాని చిత్రాల్లో ‘మంత్ర’ (Mantra). హారర్ & సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం మ్యాసివ్ విజయాన్ని అందుకుంది. 2007లో వచ్చిన ఈ చిత్రానికి ఓషో తులసి రామ్ దర్శకత్వం వహించాడు. అయితే దీనికి అనుసంధానంగా వచ్చిన ‘మంత్ర 2’ (Mantra 2) మాత్రం చార్మి ఆశలను అడియాశలు చేసింది.
ఫిబ్రవరి 22 , 2024
Item Songs Lyrics: ఈ ఐటెమ్ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.
ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం)
కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.
‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద..
వలలు వెయ్యొద్దు వయసు మీద..
ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి.
సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.
‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని..
చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ..
పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ..
దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’
‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా..
కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా..
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా..
అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.
https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk
పుడుతూనే ఉయ్యాల(నేనింతే)
పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.
‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే..
ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే..
చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే..
నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా..
నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’
‘‘టర్నే లేని దారులూ..
ట్విస్టే లేని గాథలూ..
రిస్కే లేని లైఫులూ..
బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.
https://www.youtube.com/watch?v=t8Afn_CX-tc
తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్)
సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.
ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి.
‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని..
చేతకాని వాడల్లే చూడొద్దే..
ధర్మరాజు అంతటివాడు ఆడాడే..
తీసిపారేయొద్దు జూదాన్ని..
మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే..
స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే..
ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే..
వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’
https://www.youtube.com/watch?v=OzIL-v_OcRk
పక్కా లోకల్(జనతా గ్యారేజ్)
ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.
తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది..
రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే…
‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో..
ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో..
ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో..
అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’
డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది.
ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది.
https://www.youtube.com/watch?v=GFEj1vnhvxA
మరికొన్ని..
తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.
https://www.youtube.com/watch?v=WkPsPWZQkzk
జూన్ 23 , 2023
శృతి హాసన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
శృతి హాసన్ తన మెస్మరైజింగ్ టాలెంట్‌తో తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లో గబ్బర్ సింగ్, క్రాక్, శ్రీమంతుడు, వాల్తేరు వీరయ్య వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అనగనగా ఓ ధీరుడు, గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు చిత్రాలకు గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకున్న శృతి హాసన్(Some Lesser Known Facts about Shruti Haasan) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
శృతి హాసన్ ముద్దు పేరు?
కన్నా
శృతి హాసన్ వయస్సు ఎంత?
1986, జనవరి28న జన్మించింది
శృతి హాసన్ తెలుగులో నటించిన తొలి సినిమా?
అనగనగా ఓ ధీరుడు(2011)
శృతి హాసన్ హిందీలో నటించిన తొలి సినిమా?
లక్(2009)
శృతి హాసన్ ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు
శృతి హాసన్ ఎక్కడ పుట్టింది?
చెన్నై, తమిళనాడు
శృతి హాసన్ ఏం చదివింది?
సైకాలజీలో డిగ్రీ
శృతి హాసన్ అభిరుచులు?
షాపింగ్, ట్రావెలింగ్
శృతి హాసన్‌కి ఇష్టమైన ఆహారం?
నాన్‌వెజ్
శృతి హాసన్‌కు అఫైర్స్ ఉన్నాయా?
హీరో సిద్ధార్థతో కొద్ది కాలం డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. ప్రస్తుతం శాంతను హజరికతో ప్రేమలో ఉంది.
శృతి హాసన్‌కు ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
శృతి హాసన్‌కు ఇష్టమైన హీరో?
షారుక్ ఖాన్, రజనీకాంత్
శృతి హాసన్ పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
శృతి హాసన్ తల్లిదండ్రుల పేరు?
కమల్ హాసన్, సారిక ఠాకూర్
శృతి హాసన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
శృతి హాసన్ సినిమాల్లోకి రాకముందు సింగర్‌గా పలు స్టేజ్ పర్ఫామెన్సెస్ ఇచ్చింది
శృతి హాసన్ ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/shrutzhaasan/?hl=en
శృతి హాసన్ వ్యాపారాలు?
శృతి హాసన్ పలు కాస్మోటిక్( Guess and aldo) బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది.
https://www.youtube.com/watch?v=mos5_ozTwEE
శృతి హాసన్ గురించి మరికొన్ని విషయాలు
స్కూళ్లో చదివేటప్పుడు తన పేరు పూజ రామచంద్రన్.శృతి హాసన్‌కు క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉంది.శృతి హాసన్ తన బెస్ట్ ఫ్రెండ్ తమన్నా భాటియా ఒకరికొకరు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి.శృతితో విడిపోతున్నట్లు ఆమె మాజీ ప్రేమికుడు మైఖెల్ కార్‌సెల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
ఏప్రిల్ 27 , 2024
Memes on Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్‌పై మీమ్స్.. ఇంత టాలెంట్‌గా ఉన్నారెంట్రా బాబు!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఇంట సంబరాలు నెలకొన్నాయి. జూన్ 20న జన్మించిన మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి సినీ, రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అగ్ర హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ రామ్‌చరణ్ దంపతులను విష్ చేశారు. దీంతో సోషల్ మీడియాల్లో ఫ్యాన్స్ హడావుడి చేసేస్తున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి ట్విటర్‌లో మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
మెగా లిటిల్ ప్రిన్సెస్ ఆగమనాన్ని తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. దీనికి రిప్లై ఇస్తూ ఓ నెటిజన్ వినూత్నంగా పార్టీ అడిగారు. వాల్తేరు వీరయ్య సినిమాలోని ‘బాస్ పార్టీ’ సాంగ్‌ని ట్యాగ్ చేసి ‘బాసూ పార్టీ ఎక్కడా’ అంటూ అడుగుతున్నారు.
https://twitter.com/Nithish13771106/status/1671007811839623170
దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ ఫలించిందంటూ మెగాస్టార్ ఎమోషనలయ్యారు. మెగా ఇంట అన్నీ శుభకార్యాలే జరుగుతున్నాయని, చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.
https://twitter.com/Hemanth_RcCult/status/1671006003612225536
లిటిల్ ప్రిన్సెస్ పుట్టిందని తెలియగానే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎలా ఆనందపడ్డారో తెలుపుతూ మరో మీమ్ చేశారు.
https://twitter.com/WeLoveMegastar/status/1671021787042447365
లయన్ కింగ్ సినిమాలో కూన సింహాన్ని రాజుగా ప్రకటించే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలా రామ్‌చరణ్, ఉపాసన తమ కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారంటూ ఓ మీమ్ చేశారు.
https://twitter.com/s_siechojithu/status/1670955824305569795
రామ్‌చరణ్, ఉపాసనల గారాల పట్టికి తన బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలిస్తే ఎలా ఆశ్చర్యపోతుందోనని చెబుతూ ఓ మీమ్ చేశారు.
https://twitter.com/HereFoRamCharan/status/1671203912190406656
తన నాన్న అల్లూరి సీతారామరాజు, తాతా ఇంద్రసేనరెడ్డి, చిన్నతాత గబ్బర్ సింగ్, మామయ్య పుష్పరాజ్ అని తెలుసుకుని మురిసిపోతుంది.
https://twitter.com/sunny5boy/status/1671039650897510400
మెగా ప్రిన్సెస్‌ని అరుంధతితో పోలుస్తూ చేసిన మీమ్ తెగ వైరల్ అవుతోంది.
https://twitter.com/always_dasari9/status/1670959463367598082
మనవరాలి రాకతో తాతయ్య చిరంజీవి ఎంతో సంబరపడుతున్నారు. ఇక చిట్టితల్లి పెంపకాన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత చిరుపై ఉంటుందని వివిధ మీమ్స్ షేర్ చేస్తున్నారు.
https://twitter.com/BharathRCKajal/status/1671029533041111040
డ్యాన్స్ నేర్పించడం, ఫొటోలు, వీడియోలు క్యాప్చర్ చేస్తుండటం, ఉదయాన్నే నిద్ర లేపి వ్యాయామం చేపిస్తుండటం వంటి పనులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
https://twitter.com/Hemanth_RcCult/status/1670954488969187328
ఇక లిటిల్ ప్రిన్సెస్‌ని స్కూళ్లో చేర్పించే సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి ఓ మీమ్ చేశారు. జై చిరంజీవ సినిమాలో సీన్‌ని స్పూఫ్ చేశారు. ఇది వైరల్ అవుతోంది.
https://twitter.com/PriyaRC_4/status/1671024958275997705
ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఎంతో ఫేమస్. కానీ, ఇందులో ఓ విలన్ ‘జయ ఆంటీ తెలుసా నీకు, లల్లూ అంకుల్ తెలుసా నీకు.. వారంతా నా వెనకే ఉన్నారు’ అని అర్థం వచ్చేలా హిందీలో చెబుతాడు. దీనిని మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి అన్వయించారు. మెగాస్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, మెగా పవర్ స్టార్.. ఇలా వీళ్లంతా నా వెనక ఉన్నారంటూ చెబుతున్న మీమ్ ఇది.
https://twitter.com/vj_vijayawada/status/1671070004484386818
అల్లు అర్జున్ కుమారుడు అయాన్. ఇప్పుడు పుట్టిన లిటిల్ ప్రిన్సెస్‌కు వరుసకు బావ అవుతాడు. రామ్‌చరణ్, ఉపాసనకు కుమార్తె పుట్టడంతో అత్యంత ఆనందం పొందిన వ్యక్తి అయానే అంటూ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
https://twitter.com/gnani0414/status/1670985319297212416
పుష్ప సినిమాలో ‘భలే య్యాపీగా ఉండాది కదరా నీకు’ అంటూ చెప్పే డైలాగ్ వైరల్ అవుతోంది.
https://twitter.com/gnani0414/status/1671012059625168897
రామ్‌చరణ్‌కి ప్రత్యేక అభిమాని అయాన్. రంగస్థలం చిట్టిబాబు గెటప్ వేసి మామ మీద అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా మరదలు పుట్టాక మామయ్యతో అయాన్ చిట్ చాట్ ఇలా ఉంటుందని మీమ్ చేశారు.
https://twitter.com/lokeshBangaram/status/1671441932294422529
మెగా ఫ్యామిలీ చిన్నదేం కాదు. ఎంతో మంది ఉంటారు. వారి మధ్యలో లిటిల్ ప్రిన్సెస్ చేరింది. దీంతో తనపై ప్రేమను ఎలా కురిపిస్తారో ఈ మీమ్ చూస్తే తెలిసిపోతుంది.
https://twitter.com/s_siechojithu/status/1671026894760992770
నాయక్ సినిమాలో పోసాని కృష్ణమురళి కామెడీ హైలైట్. అందులో అధికారులు ఓ ల్యాప్‌టాప్‌లో ప్రాపర్టీస్ చూపించి మీవేనా? అని అడిగితే అన్నీ నావేనని ఒప్పుకుంటాడు. ఈ వీడియోను స్పూఫ్ చేశారు.
https://twitter.com/KingLeo_007/status/1671348946755805191
చెర్రీకి పిల్లలంటే ఎంతో ఇష్టం. చిన్నపిల్లలు కనిపిస్తే చాలు చరణ్ పిల్లాడిలా మారిపోతాడు. వారితో ఎంతో ముచ్చటగా ఆడుకుంటాడు. ఇప్పుడు తనకే బిడ్డ పుట్టింది. మరి, ఏ రేంజ్‌లో ఫన్ ఉంటుందో ఊహించుకుంటేనే తెలిసిపోతుంది.
https://twitter.com/Noori_NN/status/1671045618079506433
జూన్ 21 , 2023
పవన్ కల్యాణ్ మేనియా షురూ.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్… మనల్ని ఎవడ్రా ఆపేది?
పవన్ కల్యాణ్ మేనియా మరోసారి మెుదలయ్యింది. వరుస పెట్టి సినిమాలు కమిట్ అవుతున్న పవర్ స్టార్.. షూటింగ్స్‌ను షురూ చేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) చిత్రం మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి దర్శకుడు హరీశ్ శంకర్ ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న పిక్స్ వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మెుదలయ్యింది. పవన్ మళ్లీ ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాడు.
మనల్ని ఎవడ్రా ఆపేది
గబ్బర్ సింగ్ హిట్ తర్వాత మళ్లీ హరీశ్ కాంబినేషన్‌లో పవన్ సినిమా రాబోతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ డేట్ కూడా ప్రకటించడంతో అభిమానుల సందడి మెుదలయ్యింది. బ్లాక్ బస్టర్ కాంబో యాక్షన్‌లోకి దిగిదంటూ పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/sunny4u007/status/1633901586413154304
ఉస్తాద్ భగత్ సింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మనల్ని ఏవడ్రా ఆపేది అనే పోస్టులు కనిపిస్తున్నాయి. త్వరగా సినిమాలు పూర్తి చేసేందుకు పవన్ కంకణం కట్టుకోవటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి.
https://twitter.com/i/status/1633886352583565313
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ లుక్ టెస్టు
ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా కోసం డైరెక్టర్ హరీశ్ శంకర్ లుక్ టెస్టు నిర్వహించారు. ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇచ్చేందుకు హరీశ్ శంకర్ గురువారం కెమెరామెన్లతో లుక్ టెస్ట్ చేపట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా థేరి రీమేక్ అని వినికిడి. అయితే.. కేవలం మాతృకను మాత్రమే తీసుకొని కథను విభిన్నంగా రాశారని తెలుస్తోంది. ఇందులో ఓ హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుంది.
https://twitter.com/PawanKalyanFan/status/1633878228619386880?s=20
వరుస పెట్టి సినిమాలు
క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర మీరమల్లు చిత్రంతో పాటు వినోదయ సీతమ్ రీమేక్‌లో పాల్గొంటున్నాడు పవన్. మార్చి 20 వరకు సముద్రఖని సినిమా పూర్తి చేసి వెంటనే హరీశ్ శంకర్ షూటింగ్‌ను మార్చి 28నుంచి పట్టాలెక్కించనున్నాడు. ఏప్రిల్ చివరి వారంలో సుజీత్ ఓజీ (OG) చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నట్లు టాక్.
https://twitter.com/CrazyBuffOffl/status/1633371708030849025
https://twitter.com/SupremePSPK/status/1630933852058423302
ఫటా ఫట్
పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నాడు. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లు, వినోదయ సీతమ్ రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్రాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పవర్ స్టార్ సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్‌కి ఇవి పండగనే చెప్పాలి.
పవన్ క్యూ
జనసేనానితో సినిమా తీసేందుకు చాలామంది దర్శకులే క్యూలో ఉన్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా దర్శకుడు సురేందర్ రెడ్డితో చిత్రం ఉంటుందని తెలిసింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లోనూ ఓ చిత్రం ఉంటుందని వినికిడి. ఇవి ప్రస్తుతం ప్రారంభమయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు.
ఎన్నికలకు వేళాయే
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు పవన్. అందుకోసమే త్వరగా షూటింగ్స్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. వరుస షెడ్యూల్స్‌ను ప్రకటిస్తూ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు జనసేనాని. ప్రస్తుతమున్న చిత్రాలు పూర్తైతే దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
మార్చి 10 , 2023
HBD SSMB: ఫ్లాప్స్‌ని నిజాయితీగా యాక్సెప్ట్ చేసిన హీరో.. మహేశ్ లాగే ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన హీరోలు ఎవరో తెలుసా?
సినీ ప్రస్థానంలో ఎంత పెద్ద హీరోకైనా హిట్, ఫ్లాప్‌లు సహజం. పరాజయాలను తట్టుకుని నిలబడితేనే ఇక్కడ రాణించగలం. అయితే, సినిమా హిట్ అయితే క్రెడిట్ హీరోది, ఫ్లాప్ అయితే డైరెక్టర్లదనే వాదన ఉండేది. కానీ, ఫెయిల్యూర్‌ని నిజాయితీగా ఒప్పుకున్న హీరోలు కొంత మందే ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉండేది మహేశ్ బాబునే. తన చిత్రాల పరాభవానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పి అభిమానుల ఆదరణను నిలబెట్టుకున్నాడు. మరి మహేశ్ సారీ చెప్పిన సందర్భాలేంటి? ఈ లిస్టులో ఉన్న ఇతర హీరోలు ఎవరో చూద్దాం.
మహేశ్ బాబు
టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న మహేశ్.. తన కెరీర్‌లో కొన్ని పరాజయాలను చవిచూశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాలు బోల్తా కొట్టడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేదు. దీంతో మహేశ్ బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. ఆగడు మూవీ పరాజయంపై శ్రీమంతుడు ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాడు. ఆగడు సినిమా మిమ్మల్ని నిరాశపరచడంపై సారీ చెప్తున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదే కాకుండా, ‘భరత్ అనే నేను’ సినిమా ఈవెంట్‌లో బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్‌ని యాక్సెప్ట్ చేశాడు. స్పైడర్ సినిమాపై కూడా సూపర్ స్టార్ సారీ చెప్పాడు.
https://www.youtube.com/watch?v=R99OpY-9uis&t=41s
జూనియర్ ఎన్టీఆర్
వరుస హిట్ మూవీలతో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’గా మారాడు ఎన్టీఆర్. కెరీర్‌లో రెండు, మూడు సినిమాల పరాజయాల్ని ఎన్టీఆర్ మరచిపోలేడు. రభస, రామయ్య వస్తావయ్యా సినిమాల విషయంలో అభిమానులకు సారీ చెప్పాడు. టెంపర్ మూవీ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌తో మనసులో మాట పంచుకున్నాడు. ‘ప్రతి సినిమాతో వస్తున్నాం. పోతున్నాం. కానీ, ఈ సారి మాత్రం కాలర్ ఎగిరేసే సినిమాను అందించబోతున్నాం’ అంటూ మైకులో చెప్పేశాడు. దీంతో పాటు ఎన్టీఆర్, మెహర్ రమేశ్ కాంబోలో వచ్చిన డిజాస్టర్ ‘శక్తి’ మూవీపై పలుమార్లు ప్రస్తావించాడు తారక్.
https://www.youtube.com/watch?v=-ZitbUbHFKQ&t=7s
పవన్ కళ్యాణ్
ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పుకునే విజయాన్ని సాధించలేదు. గబ్బర్‌సింగ్‌తో ఈ కోరిక తీరిపోయింది. గబ్బర్ సింగ్ సినిమాల కన్నా ముందు పరాజయం సాధించిన సినిమాలను ప్రస్తావించాడు. గబ్బర్ సింగ్ మూవీ ఆడియో ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రతి సినిమాకు శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు.
https://www.youtube.com/watch?v=0VAIYgsc5Bc&t=92s
నాగార్జున
భాయ్ సినిమా విషయంలోనూ నాగార్జున పెదవి విప్పారు. మనం మూవీ ఆడియో ఫంక్షన్‌లో ఆ సినిమా ఫెయిల్యూర్‌పై మాట్లాడారు.
https://www.youtube.com/watch?v=cXM5F5FAKKA&t=55s
రామ్‌చరణ్ తేజ్
రంగస్థలం సినిమా అనంతరం అంచనాల మధ్య వచ్చిన మూవీ.. ‘వినయ విధేయ రామ’. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా చెర్రీకి ఊహించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో సినిమా ఫలితంపై రామ్‌చరణ్ ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలో ఒక నోట్ రిలీజ్ చేశాడు.
అఖిల్, వరుణ్ తేజ్
రీసెంట్‌గా వచ్చిన స్పై మూవీపై నిఖిల్ సిద్ధార్థ, ఏజెంట్ మూవీపై అఖిల్, గని సినిమాపై వరుణ్ తేజ్‌లు కూడా పబ్లిక్‌గానే సారీ చెప్పారు. ఇంకా, ఇలా ఫెయిల్యూర్స్‌ని యాక్సెప్ట్ చేసిన హీరోలు ఉంటే కామెంట్ చేయండి.
https://twitter.com/AkhilAkkineni8/status/1658079819790422016
ఆగస్టు 08 , 2023
PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. సింగిల్ పోస్ట్ లేకుండా కేవలం 20 నిమిషాల్లోనే 140K ఫాలోవర్లను పవన్ చేరుకోగా.. గంటలో 250K ఫాలోవర్లను క్రాస్ చేశారు. మరో 5 నిమిషాల్లోనే 300K మార్క్‌ను దాటారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదల జెట్ వేగంతో దూసుకెళ్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. #PawanKalyanOnInstagram హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.
దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయాలని ట్వీట్ల జడివాన కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ షేర్ చేయాలని ఇతర అభిమానులకు ట్యాగ్ చేస్తున్నారు.
ఈరోజు #PawanKalyanOnInstagram ట్యాగ్‌ను సోషల్ మీడియాలో నంబర్ 1 గా నిలపాలని పవన్ డైహర్టెడ్ ఫ్యాన్స్.. అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
https://twitter.com/_jspnaveen/status/1676106458516127747?s=20
ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెడుతున్నట్లు ఇటీవల నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు.
పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ నోట్ చాలా సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా ఉంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో, జైహింద్ అనే ట్యాగ్ లైన్‌ను పవన్ తన అకౌంట్‌కు జత చేశారు.
ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవర్ స్టార్ అభిమానులకు, యువతకు నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్విట్టర్, తన అధికారిక వెబ్‌సైట్ (https://janasenaparty.org/) ద్వారా తన పార్టీ అభిప్రాయాలను పవర్ స్టార్ పంచుకుంటున్నారు.
https://twitter.com/_jspnaveen/status/1676108997869588480?s=20
అందుకేనా ఇన్‌స్టా?
ఏపీలో మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో జనసేనాని సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో వెనకపడొద్దని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్, ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. సనిశితమైన సమస్యలపై ప్రశ్నిస్తూ యువత ద్వారా సమాధానాలు రప్పిస్తూ విలైనంత ఎక్కువ మందికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నారు.
వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం తనదైన శైలీలో వాగ్బాణాలతో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గతానికంటే భిన్నంగా తన ప్రచార పర్వాన్ని మార్చివేశారు. తన అభిమానులతో పాటు టాలీవుడ్‌లో ఇతర అగ్ర హీరోలైన ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు. కులాల ప్రస్తావనకు తావులేకుండా తాను అందరివాడినంటూ యువతకు దగ్గరయ్యేందుకు తన టెంపోను మార్చుకున్నారు.
జులై 'బ్రో' నెల
మరోవైపు పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన 'బ్రో' మూవీ ఈనెల 28న విడుదల కానుంది. చిత్ర యూనిట్ బ్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. అభిమానులు జులై నెలను 'బ్రో' నెలగా ప్రకటించి ఉత్సాహంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. 'బ్రో' సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా, సాయిధరమ్ కామన్ మ్యాన్‌గా నటిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది.
అటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించింది. పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ హిట్ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిష్ డెరెక్షన్‌లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రం నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా ఆగిపోయింది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న OG సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసింది. బ్రో సినిమా తర్వాత OG మూవీనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
జూలై 04 , 2023
Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?
టాలీవుడ్‌లో గత ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు హీరోలు విభిన్నమైన కథలను ఎంచుకొని పాన్ ఇండియా స్థాయికి ఎదిగితే మరికొందరు తమ ఫేమ్‌ను తిరోగమనంలోకి తీసుకెళ్లారు. కొందరు హీరోలు చకచకా సినిమాలు చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తే ఇంకొందరు రెండేళ్లకు కూడా ఒక సినిమా రిలీజ్ చేయలేక ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమయ్యారు. ముఖ్యంగా కొందరు యంగ్ హీరోలు ఫ్లాప్స్ తియ్యడంలో పోటీ పడుతూ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఇక సీనియర్ హీరోల పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత ఐదేళ్లలో టాలీవుడ్‌లో వచ్చిన గణనీయమైన మార్పులు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ఒక మూవీకి ఏళ్లకు ఏళ్ల సమయం!
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజ నటులు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను అలరించేవారు. వీరి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంటటేష్, బాలకృష్ణ సైతం ఈ పరంపరను కొనసాగిస్తూ ఏడాదిలో ఒక సినిమాకు తగ్గకుండా రిలీజ్ చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల సమయం పడుతోంది. రామ్‌చరణ్, అల్లు అర్జున్, తారక్ వంటి స్టార్ హీరోల నుంచి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు దాటిపోయింది. ఓ వైపు ప్రభాస్ ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఈ ముగ్గురు స్టార్స్ మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారు. సైంటిఫిక్, మైథాలజీ, ఫ్యూచరిక్ సినిమాలంటే కొంత ఆలస్యం జరిగిన ఓ అర్థం ఉంది. ప్రస్తుతం తారక్ (దేవర), రామ్‌చరణ్ (గేమ్ ఛేంజర్), అల్లు అర్జున్ (పుష్ప 2) చేస్తున్న కమర్షియల్ చిత్రాలకు కూడా ఇంత ఆలస్యం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఫ్లాప్స్‌తో పోటీపడుతున్న కుర్ర హీరోలు!
యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నాగచైతన్య (Naga Chaitanya), రామ్ పోతినేని (Ram Pothineni)లకు గత ఐదేళ్లుగా టాలీవుడ్‌లో అసలు కలిసి రావడం లేదు. వారి నుంచి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు హిట్ సినిమాలతో పోటీ పడిన ఈ ముగ్గురు హీరోలు అనూహ్యంగా గత ఐదేళ్ల నుంచి ఫ్లాప్స్‌తో పోటీ పడుతున్నారు. విజయ్ నటించిన రీసెంట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’తో పాటు గతంలో వచ్చిన ‘లైగర్’, ‘ఖుషి’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. అలాగే నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’, ‘లాల్ సింగ్ చద్ధా’, ‘థ్యాంక్యూ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేసిన లేటెస్ట్ చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అంతకుముందు వచ్చిన ‘స్కంద’, ‘వారియర్’, ‘రెడ్’ సినిమాలు హిట్స్ అందుకోలేక ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి.
మార్కెట్ కోల్పోయే దిశగా సీనియర్లు
ఇక సీనియర్ హీరోల పరిస్థితి గత ఐదేళ్ల వ్యవధిలో దారుణంగా మారిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటివరకూ సరైన కమ్‌బ్యాక్ లభించలేదని చెప్పాలి. ఓవైపు రజనీకాంత్, కమల్ హాసన్ తమ వయసుకు తగ్గ స్టోరీలు ఎంచుకొని ‘జైలర్’, ‘విక్రమ్’ సినిమాలతో సాలిడ్ విజయాలను అందుకున్నారు. అయితే చిరు ఇప్పటికే కమర్షియల్ పాత్రలనే ఎంచుకుంటూ పోవడం ఆయనకు మైనస్‌గా మారుతోంది. అటు నాగార్జున, వెంకటేష్ పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. నాగార్జున గత చిత్రాలు ‘మన్మథుడు 2’, ‘బంగార్రాజు’, ‘నా సామిరంగ’లోని పాత్రలు ఏమాత్రం నాగార్జునకు సెట్ అయ్యేవిగా కనిపించవు. ఇక వెంటేష్ ‘రానా నాయుడు’ సిరీస్‌తో విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పటిలాగే మాస్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. అయితే కొత్త కథలు ఎంచుకోకపోవడం, వయసు తగ్గ పాత్రలు చేయకపోవడం, సరైన హిట్స్ లేకపోవడంతో ఒకప్పటి స్టార్ హీరోలుగా వెలిగిన ఈ హీరోల కలెక్షన్స్ కుర్రహీరోలతో పోలిస్తే పడిపోతూ వస్తున్నాయి. మార్కెట్‌ను పూర్తిగా కోల్పేయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రభాస్, నాని సూపర్బ్!
గత ఐదేళ్ల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హీరోలుగా ప్రభాస్, నానిలను చెప్పవచ్చు. ఓవైపు వేగంగా సినిమాలు చేస్తూనే ప్రతీ మూవీకి కథ, పాత్ర పరంగా వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నారు. క్వాలిటీ పరంగానూ మంచి సినిమాలు తీస్తూ ఎప్పటికప్పుడు తమ క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రభాస్ గత చిత్రాలను పరిశీలిస్తే ‘బాహుబలి 1 & 2’, ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కథ, పాత్ర పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. అటు నాని రీసెంట్ చిత్రాలైన ‘గ్యాంగ్ లీడర్’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘అంటే సుందరానికి’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ కూడా విభిన్నమైనవే. నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిందే. అటు ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ‘రాజాసాబ్’, సలార్ 2, ‘కల్కి 2’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ కథ, పాత్ర పరంగా ప్రభాస్‌ను మరో లెవల్‌లో చూపించనున్నాయి.
రీరిలీజ్‌లతో ఫ్యాన్స్ సంతృప్తి!
గతంలో లేని విధంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్ హీరోల బర్త్‌డేల సందర్భంగా గతంలో వారు చేసిన బ్లాక్ బాస్టర్ చిత్రాలు విడుదలవుతున్నాయి. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు లాంగ్ గ్యాప్ వస్తుండటంతో రీరిలీజ్ మూవీస్‌లోనే తమ హీరోను చూసుకొని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. గత రోజులను గుర్తుచేసుకుంటూ సంతోష పడుతున్నారు. అయితే రీరిలీజ్ చిత్రాలకు ఆదరణ పెరగడానికి ఓ కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఆ తరహా చిత్రాలను హీరోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రీరిలీజ్ రూపంలో తమ ఫేవరేట్ చిత్రాలను మళ్లీ చూసుకొని అభిమానులు సంతోష పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఆ స్టార్ డైరెక్టర్లకు ఏమైంది?
టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన పూరి జగన్నాథ్‌కు హీరోలతో సమానంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ఆయన నుంచి సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొనేది. ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘పోకిరి’, ‘బిజినెస్ మ్యాన్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బాస్టర్స్‌తో ఓ దశలో టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. అటువంటి పూరి గత కొంత కాలంగా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన గత చిత్రం ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. తాజాగా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సైతం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అటు హరీష్ శంకర్ పరిస్థితి కూడా ఇంచుమించు పూరి లాగానే ఉంది. ‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్స్‌తో మాస్ డైరెక్టర్‌గా హరీష్ శంకర్ ఇటీవల సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’, ‘గద్దల కొండ గణేష్’ ప్లాప్స్‌తో లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’పై అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మిస్టర్ బచ్చన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. హరీష్ శంకర్ టేకింగ్ సాదా సీదాగా ఉందంటూ విమర్శలు సైతం వచ్చాయి.
ఆగస్టు 17 , 2024
Ustaad Bhagat Singh: ‘గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం’.. ఏపీ ప్రభుత్వానికి పవన్ గట్టి కౌంటర్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఎక్స్‌పెక్టెషన్స్ తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ తరపున చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ అభిమానులతో పాటు జనసైనికులకు మంచి బూస్టప్ ఇచ్చేలా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి మరో గ్లింప్స్ రిలీజైంది. ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’
భగత్ బ్లేజ్(Bhagath Blaze) పేరుతో రిలీజైన ఈ గ్లింప్స్ వీడియో ఆద్యాంతం అలరించింది. 1:02 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోల పవన్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ లుక్‌లో కనిపించాడు. గ్లింప్స్‌లోకి వెళ్తే.. మెుదట విలన్ గ్యాంగ్‌లోని మనిషి పవన్‌ను ఉద్దేశించి నీ రేంజ్ ఇది అంటూ టీ గ్లాస్‌ను చూపించి కింద పడేస్తాడు. ఆ తర్వాత పవన్ కల్యాణ్.. 'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’, 'గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం.. కనిపించని సైన్యం' అంటూ పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పడం వీక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం కూడా సూపర్‌గా అనిపించింది. ఈ గ్లింప్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
https://www.youtube.com/watch?v=oZYqzxtg4f8
అధికార వైసీపీకి గట్టి కౌంటర్!
ఏపీలోని అధికార వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చేలా ఈ గ్లింప్స్‌ను రూపొందినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయాడని.. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారని తరచూ అధికార పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ను, జనసేన పార్టీని తక్కువగా చూస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చేలా ఈ డైలాగ్స్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్లింప్స్‌లోని ‘గాజు గ్లాస్’ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1770055005283688593
పొలిటికల్ హీట్ పెంచిన డైలాగ్స్!
మరి కొన్నిరోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ.. టీడీపీ - భాజాపాతో పెట్టుకొని ఎన్నికల బరిలో దిగుతుంది. ఈ నేపథ్యంలో కావాలనే పొలిటికల్ హీట్ పెంచేలా ఈ గ్లింప్స్‌ను విడుదల చేశారని అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ మెుదలైంది. ఎన్నికల వేళ జనసైనికుల్లో ఫుల్‌జోష్ నింపేందుకు ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారని అంటున్నారు. ఏదీ ఏమైనా పవన్ ఫ్యాన్స్ మాత్రం మాస్ ఈ గ్లింప్స్‌తో జాతర చేసుకుంటున్నారు. చాల రోజుల తర్వాత పవన్ కల్యాణ్‌ను ఇలా యాక్షన్ మోడ్‌లో చూడటం సంతోషంగా ఉందంటూ సంబురాలు చేసుకుంటున్నారు.
మార్చి 19 , 2024
Pawan Kalyan: ‘ఓజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్? 2025లో పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గతేడాది మూడు బ్లాక్ బాస్టర్ చిత్రాలను పట్టాలెక్కించి ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఏపీ ఎన్నికల దృష్ట్యా షూటింగ్స్ బ్రేక్ ఇచ్చిన పవన్ ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరింత బిజీగా మారిపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై నాలుగు కావస్తుండటంతో ఇప్పుడిప్పుడే పవన్ తీరిక చేసుకొనిమరి పెండింగ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇటీవల హరిహర వీరమల్లును సెట్స్‌పైకి తీసుకెళ్లారు. తాజాగా ఓజీ సినిమాను సైతం పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. వచ్చే ఏడాది ఏకంగా రెండు సినిమాలతో పవన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
‘ఓజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు కల్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటైన ‘ఓజీ’ చిత్రం సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా సెట్స్‌పైకి వెళ్లింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. 2025 సెప్టెంబర్ 26న ఓజీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరోవైపు వచ్చే ఏడాది మార్చి 28న హరిహర వీరమల్లును రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు 2025లో వస్తుండటంతో ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు.
https://twitter.com/mogali_sat77717/status/1846452019868877252
ఓజీ షూటింగ్ రీస్టార్ట్
పవన్ కల్యాణ్ పెండింగ్ ప్రాజెక్ట్స్‌లలో ఒకటైన ‘ఓజీ’ (OG Movie) కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ ‘ఓజీ’ షూటింగ్ తాజాగా తిరిగి ప్రారంభం అయింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. షూటింగ్ లొకేషన్‍లో యూనిట్‍తో డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతున్న ఓ డార్క్ ఫొటోను నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘అన్ని సిలిండర్లను ఫైర్ చేసి మ్యాడ్‍నెస్‍ను సృష్టించేందుకు మేం మళ్లీ ఓజీ ఫీవర్‌లోకి అడుగుపెట్టేశాం’ అంటూ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టర్ ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారింది.
https://twitter.com/DVVMovies/status/1846206901295763648
త్వరలోనే సెట్స్‌పైకి పవన్!
ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్‌ను ప్రారంభించారు. ఇందుకోసం విజయవాడలో మేకర్స్ భారీ సెట్‌ను సైతం వేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మూవీ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఈ మూవీని తొలుత పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీని సైతం హరిహర వీరమల్లు టీమ్ ఫిక్స్ చేసింది. అయితే తాజాగా ఓజీ షూటింగ్‌ను తిరిగి పునఃప్రారంభించారు సుజీత్. ముందుగా పవన్ లేని సీన్స్‌ను డైరెక్టర్ సుజీత్ షూట్ చేయనున్నారు. కొద్ది రోజుల్లో పవన్ కూడా ఈ మూవీ షూటింగ్ పాల్గొంటారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఓజీ షూటింగ్ మళ్లీ మొదలు కావడంతో పవన్ కల్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ షూట్‌లో పాల్గొనే రోజు కోసం ఎదురుచూస్తున్నారు.
హైప్ పెంచిన థమన్!
పవన్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' చిత్రంలో పవన్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నాడు. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇటీవల ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్ మరింత జోష్ పెంచారు. థమన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.
https://twitter.com/MusicThaman/status/1842245316252209456
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగతేంటి?
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీశ్ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్‌డేట్స్‌తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
పవన్ vs విజయ్ దేవరకొండ!
‘హరిహర వీరమల్లు’ రిలీజ్ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద పవన్, విజయ్ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్ నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అటు హరిహర వీరమల్లు టీమ్ కూడా అదే డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు. పవన్ లాంటి బిగ్‌స్టార్‌ను విజయ్ దేరరకొండ ఢీకొట్టక తప్పదని ఫిల్మ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. కాబట్టి పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అక్టోబర్ 16 , 2024
OG Release Update: ‘ఓజీ’ రిలీజ్‌పై క్రేజీ రూమర్స్.. ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినిమాలపై ఫోకస్ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆయన చేతిలోని ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu), ‘ఓజీ’ (OG), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) చిత్రాలు గత కొంతకాలంగా పెండింగ్‌లో పడిపోయాయి. అయితే రీసెంట్‌గా ఆ ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మినహా మిగిలిన రెండు ప్రాజెక్ట్స్ తిరిగి షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్‌ను సైతం మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో పవన్ మూడు ప్రాజెక్ట్స్‌లో ముందుగా హరిహర వీరమల్లునే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పుడా పరిస్థితి తారుమారైనట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
ముందే ‘ఓజీ’ రిలీజ్?
పవన్ కల్యాణ్ చేతిలో ఉన్న 'ఓజీ' ప్రాజెక్ట్‌కు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే ‘ఓజీ’ (OG Release Update) రిలీజ్ అవుతుందని సమాచారం. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజీత్ మూవీని త్వరగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ‘హరిహర వీరమల్లు’ కంటే ఎక్కువ బజ్ ‘ఓజీ’ పైనే ఉన్న నేపథ్యంలో ముందుగా ఈ సినిమానే రిలీజ్ చేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను త్వరగా ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. ఈ విషయంపై పవన్‌తో చర్చించి త్వరలోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
హరిహర వెనక్కి తగ్గాల్సిందే!
పవన్ హీరోగా రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రానుంది. అయితే పవన్ మూడు ప్రాజెక్టుల్లో ముందుగా మెుదలైన చిత్రం ఇదే. 2020లోనే దర్శకుడు క్రిష్ ఈ సినిమాను పట్టాలెక్కించారు. అనేక బ్రేక్స్ వచ్చినప్పటికీ క్రిష్ 60 శాతం షూటింగ్ ఫినిష్ చేశాడు. అయితే ఏపీ ఎన్నికల సమయంలో పవన్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నారు. మిగిలిన షూటింగ్‌ను ఫినిష్ చేసేందుకు నిర్మాత రత్నం కుమారుడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. ఎన్నికల అనంతరం షూటింగ్‌కు పవన్ కూడా సై అనడంతో మార్చి 28, 2025న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అనౌన్స్ కూడా చేసేశారు. ఇప్పుడు సడెన్‌గా ‘ఓజీ’ రిలీజ్ తెరపైకి రావడంతో ‘హరిహర వీరమల్లు’కు కొత్త సమస్య వచ్చి పడింది. ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న దృష్ట్యా పవన్ కూడా ‘ఓజీ’ రిలీజ్‌కే మద్దతు తెలిపితే ‘హరిహర వీరమల్లు’ టీమ్ వెనక్కితగ్గక తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఓజీపై ఎందుకంత హైప్?
పవన్ కల్యాణ్ చేతిలోని మూడు ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ’ (OG Release Update) చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. కెరీర్‌లోనే తొలిసారి గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. ‘ఓజీ’ గ్లింప్స్‌లో పవన్ యాక్టింగ్ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా మరో లెవల్లో ఉంటుందని ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఇదిలాఉంటే ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్థమన్ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి.
https://twitter.com/TorchbearerEdit/status/1744312598743351385
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగతేంటి?
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీశ్ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్‌డేట్స్‌తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు బాగా కలిసొచ్చిన పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
నవంబర్ 11 , 2024
OG Release Date: ఒకే నెలలో పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు విడుదల?
ఒకప్పుడు టాలీవుడ్‌కు పరిమితమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్, పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ ఇటీవలే పెండింగ్ ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కించారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్ కూడా తిరిగి మెుదలైంది. త్వరలోనే పవన్ కూడా రెగ్యులర్ షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సమ్మర్ బరిలో పవన్‌తో పవనే పోటీ పడతారని వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ vs పవన్
పవన్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని 2025 మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ‘ఓజీ’ని కూడా సమ్మర్‌లోనే తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఏప్రిల్ లేదా మేలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ విచిత్ర పరిస్థితి చూసి అభిమానులు షాకవుతున్నారు. మెున్నటి వరకూ పవన్ సినిమా లేదని బాధపడ్డ ఫ్యాన్స్‌కు ఈ వార్తతో ఎలా ఫీలవ్వాలో అర్థం కావడం లేదు. గబ్బర్ సింగ్‌లో చెప్పిన ‘నాకు నేనే పోటీ’ డైలాగ్‌ను పవన్ నిజం చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నెల రోజుల గ్యాప్‌తోనే సెకండ్ ఫిల్మ్‌ను రిలీజ్ చేయడం వల్ల కలెక్షన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉందని పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హరి హర వీరమల్లు టీమ్ అసంతృప్తి!
‘ఓజీ’ చిత్రాన్ని సమ్మర్‌లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడంపై హరిహర వీరమల్లు టీమ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. రెండు సినిమాల మధ్య కనీసం 5 నెలల గ్యాప్ అయినా ఉండాలని హరి హర వీరమల్లు టీమ్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పవన్‌ను జోక్యం చేసుకోవాలని కూడా కోరుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో పవన్ ఎవరి పక్షాన నిలుస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మెుత్తం చూస్తుంటే పవన్ vs పవన్‌గా పరిస్థితులు మారిపోయాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెుత్తానికి ‘ఓజీ’నే వెనక్కి తగ్గే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
‘ఓజీ.. బ్లాక్‌బాస్టర్ పక్కా’
పవన్ - సుజిత్ కాంబోలోని 'ఓజీ' చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా ఇటీవల ఓజీ గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్స్ వేదికగా స్పందించారు. 'ఓజి అప్డేట్స్ గురించి అందరూ అడుగుతున్నారు. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్ మరింత జోష్ పెంచారు. థమన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.
https://twitter.com/MusicThaman/status/1842245316252209456
త్వరలో సెట్స్‌పైకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’!
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీశ్ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్‌డేట్స్‌తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అక్టోబర్ 23 , 2024
Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), అలీ (Ali), సునీల్ (Sunil), వేణుమాదవ్ (Venu Madhav) లాంటి సీనియర్ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్ కమెడియన్స్ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్ సైతం సాధిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం.
సుహాస్ (Suhas)
ప్రముఖ నటుడు సుహాస్.. వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్ అయిన సుహాస్.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్ నటిస్తున్నాడు.
వైవా హర్ష (Harsha Chemudu)
షార్ట్‌ఫిల్మ్స్ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్’, ‘పక్కా కమర్షియల్’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
అభినవ్ గోమటం (Abhinav Gomatam)
యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్‌ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్‌గా ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్ హీరోగా మారాడు.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
‘జబర్దస్త్’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు.
సత్యం రాజేష్ (Satyam Rajesh)
సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది.
ప్రియదర్శి (Priyadarsi)
యంగ్ కమెడియన్ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’ (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు.
వెన్నెల కిషోర్ (Vennela Kishore)
టాలీవుడ్‌లోని స్టార్ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్’తో కథానాయకుడిగా మారిన కిషోర్.. రీసెంట్‌గా ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది.
ధన్‌రాజ్ (Dhanraj)
జబర్దస్త్ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్ ధన్‌రాజ్. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మార్చి 14 , 2024
Revanth Reddy: టాలీవుడ్‌పై రేవంత్ సర్కార్ పగ? వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి?
తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్ (Tollywood)ను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం నాగార్జున విషయంలో మెుదలైన ఈ ప్రచారం తాజాగా అల్లు అర్జున్ నేపథ్యంలో మరోమారు ఊపందుకుంది. రేపో మాపో మోహన్ బాబు అరెస్టు కూడా తథ్యం అన్న వార్తలు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కావాలనే ఇదంతా చేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలకు తన పవర్ ఏంటో రుచి చూపించాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వంలో ఇండస్ట్రీకి వ్యతిరేకంగా జరిగిన ఘటనలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
బన్నీ అరెస్టు నేపథ్యంలో..
అల్లు అర్జున్ (Allu Arrest) అరెస్టు నేపథ్యంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ ఇండస్ట్రీని టార్గెట్ చేసిందా? అన్న అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతకుముందు రేవంత్ నుంచి ఎదురైన ప్రతీకూల సంఘటనలకు బన్నీ అరెస్టును ముడిపెట్టి చూసినప్పుడు ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. బన్నీ అరెస్టుపై నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం ఫిల్మ్ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ‘చట్టం ముందు అందరూ సమానులే’.. ‘సినిమావాళ్లు సరిహద్దుల్లో యుద్ధం ఏమీ చేయడంలేదు కదా’.. ‘నాకు నేనే సూపర్ స్టార్’ అంటూ చేసిన కామెంట్స్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గత ముఖ్యమంత్రులు ఇండస్ట్రీతో ఎంతో సామరస్యంగా ఉన్నారని, రేవంత్ ప్రభుత్వం మాత్రం తమపై కన్నెర్ర చేస్తోదంటూ పలువురు దర్శక నిర్మాతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
https://twitter.com/profAIPC/status/1867584148153552902
https://twitter.com/narne_kumar06/status/1867753868052115915
మంచు ఫ్యామిలీ గొడవలోనూ..
ఇటీవల మంచు ఫ్యామిలీ (Manchu Family)లో చెలరేగిన వివాదం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో మంచు మనోజ్ (Manchu Manoj)తో పాటు మంచు విష్ణు (Manchu Vishnu), మోహన్‌బాబు (Mohan Babu) ఒకరిపై ఒకరు మీడియా ముఖంగా విమర్శలు చేసుకున్నారు. ప్రధాన మీడియా ఛానళ్లు ఈ ఫ్యామిలీ గొడవ గురించే చూపించింది. దీంతో తీవ్ర అసహనానికి లోనైనా మోహన్‌బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడి సైతం చేశారు. దీనికి సంబంధించి ఆయనపై హత్య కేసు కూడా నమోదైంది. త్వరలో అరెస్టు కూడా చేస్తారని అంటున్నారు. అయితే మనోజ్‌తో వివాదం నేపథ్యంలో పోలీసులకు ముందే ఫిర్యాదు చేసిన వారు ప్రేక్షక పాత్ర వహించారని ఆడియో సందేశంలో మోహన్ బాబు అసహనం వ్యక్తం చేశారు. మనోజ్ కూడా పోలీసుల వ్యవహార తీరును తప్పుబట్టాడు. ఆపై రాచకొండ సీపీ మంచు విష్ణుతో పాటు, మంచు మనోజ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కూడా మీడియాలో హైలెట్ అయ్యింది.
డ్రగ్స్ కేసుల విషయంలో..
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో రేవంత్ సెలబ్రిటీ (Tollywood)లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటులు తప్పకుండా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన వీడియోలు చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్ఫలితాలపై అవగాహన కల్పించే విధంగా తారాగణంతో ఒకటిన్నర లేదా రెండు నిమిషాల నిడివితో వీడియో సినిమాకు ముందు ప్రదర్శించాలని కోరారు. అలా చేస్తేనే టికెట్ ధరల పెంపునకు, షూటింగ్‌లకు తమ ప్రభుత్వం అనుమతిస్తుందని హుకుం జారీ చేశారు. అయితే రేవంత్ ఇచ్చిన పిలుపు మంచిదే అయిన్పపటికీ ఆయన ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడటం చాలా మంది దర్శక నిర్మాతలకు నచ్చలేదని అప్పట్లో టాక్ వినిపించింది.
https://twitter.com/Telugu360/status/1808059015038959963
గద్దర్ అవార్డ్స్ సందర్భంలో..
సి. నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలోనూ మరోమారు టాలీవుడ్ (Tollywood)పై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్రప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై మండిపడ్డారు. ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులని గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయించింది. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే విషయమై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు సినీ ఇండస్ట్రీని సీఎం రేవంత్ కోరారు. అయితే దీని గురించి టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడాన్ని జులైలో జరిగిన సి. నారాయణ రెడ్డి జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. గద్దర్‌పై గౌరవంతో తీసుకున్న ఈ నిర్ణయంపై టాలీవుడ్ పెద్దల నుంచి స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు. ఓ బహిరంగ సమావేశంలో రేవంత్ మరోమారు టాలీవుడ్‌పై విమర్శలు చేయడం అప్పట్లో వార్తల్లో హైలెట్ అయ్యింది.
https://twitter.com/M9News_/status/1818214759227118067
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
చెరువులు, కుంటలను ఆక్రమించి భవనాలను నిర్మించిన అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అయితే తొలినాళ్లలో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ భవనాన్ని ప్రభుత్వ అధికారులు ఆగమేఘాల మీద కూల్చివేయడం అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రూ.వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారన్న ఆరోపణలతో ఆయనపై క్రిమినల్ కేసును సైతం పోలీసులు నమోదు చేశారు. దీనిని కక్ష్యసాధింపు చర్యగా విపక్షాలు ఆరోపించాయి. దురుద్దేశ్యంతోనే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశారని మండిపడ్డాయి.
https://twitter.com/sudhakarudumula/status/1827197076960375266
సమంతపై కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ (KTR)ను టార్గెట్ చేస్తూ ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య - సమంత విడాకుల అంశాన్ని కేటీఆర్‌తో ముడిపెడుతూ దారుణంగా మాట్లాడారు. దీనిని అక్కినేని కుటుంబంతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గు చేటని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహేష్ బాబు ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. దీనికి సంబంధించి సదరు మంత్రిపై నాగార్జున పరువు నష్టం దావా వేయగా ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.
https://twitter.com/KDRtweets/status/1841433938297807337
డిసెంబర్ 14 , 2024
Keerthi Suresh: కీర్తి సురేష్ మంగళ సూత్రంపై అందరి దృష్టి.. ఏమైందంటే!
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌ను ఆమె గోవాలో వివాహమాడింది. ఈ పెళ్లికి స్టార్ హీరో విజయ్‌తో పాటు త్రిష పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలు సైతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్‌కు కీర్తి సురేష్ హాజరవ్వగా ఆమెను చూసి అక్కడి వారు షాకయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు, ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై ప్రశంసలు సైతం కురిపిస్తున్నారు.
తాళిబొట్టుతో కీర్తి..
యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthi Suresh) ‘బేబీ జాన్’ (Baby John)చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. డిసెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న కీర్తి సురేష్ అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. మోడ్రన్ డ్రెస్‌లో తాళిబొట్టు ధరించి ఈ వేడుకల్లో పాల్గొంది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడింది. ఓ వైపు ప్రమోషన్స్ కోసం హాట్‌గా కనిపిస్తూనే ట్రెడిషన్‌ను మాత్రం వదల్లేదని ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి.
https://twitter.com/GoldwinSharon/status/1869702290300674511
https://twitter.com/ActressGlamspo7/status/1869647927683276816
https://twitter.com/celeb_world99/status/1869647535469658421
‘కీర్తిని చూసి నేర్చుకోండి’
హిందూ వివాహం బంధంలో తాళిబొట్టుకు ఎంతో ప్రత్యేకత ఉంది. మహిళలు తాళిని పక్కన పెట్టడాన్ని అశుభంగా భావిస్తుంటారు. అటువంటి తాళిని ధరించడాన్ని కొందరు సెలబ్రిటీలు నమోషిగా ఫీలవుతున్నారు. పెళ్లైన మరుసటి రోజే దానిని పక్కన పెట్టేస్తున్నారు. బోసుపోయిన మెడతో సినిమా ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో కీర్తి సురేష్ తాళిబొట్టుతో కనిపించడాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు. కీర్తిని చూసి నేర్చుకోవాలని ప్రస్తుత తరం నటీమణులకు సూచిస్తున్నారు.
https://twitter.com/CelebGlamGaze/status/1869673197848977765
https://twitter.com/RitamTelugu1/status/1869638324702618082
కీర్తి జంటతో విజయ్..
గోవాలో జరిగిన కీర్తి సురేష్ పెళ్లికి తమిళ స్టార్ హీరో విజయ్ సైతం హాజరై నూతన వధూవరులను ఆశ్వీర్వదించారు. తాజాగా విజయ్కి సంబంధించిన ఫొటోస్ను కీర్తి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మేరకు విజయ్ ఫొటోస్కి క్యూట్ ట్యాగ్ని జోడించింది. ‘మా కలల వివాహానికి మా ఐకాన్ స్టార్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు’ అంటూ ప్రేమతో.. మీ నంబీ అని పోస్ట్ చేసింది. ఇందులో నూతన వధూవరులతో కలిసి విజయ్ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించాడు. తెల్లటి చొక్క, పంచెలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/KeerthyOfficial/status/1869429740660314482
ఆ మూవీకి రీమేక్‌గా..
కీర్తి సురేష్ నటించిన ‘బేబీ జాన్’ (Baby John) విషయానికి వస్తే ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తమిళంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న 'తెరీ' (Theri) చిత్రానికి రీమేక్‌గా ఇది వస్తోంది. అందులో సమంత (Samantha) పోషించిన పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది. ఈ చిత్రానికి కాలీస్ దర్శకత్వం వహించగా వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ అట్లీ కథ అందించడంతో పాటు నిర్మించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమా రాబోతోంది.
https://twitter.com/filmyyguy/status/1867826548726018190
డిసెంబర్ 19 , 2024
Telangana Folk Singers: తెలంగాణలో గద్దర్ లాంటి విప్లవ కళాకారులు ఉన్నారా?
ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇటీవల కన్నుమూశారు. విప్లవానికి కళం, గళం తోడైతే అది గద్దర్‌లా ఉంటుంది. గద్దరన్న ఎన్నో పాటలతో జాతిని జాగృతం చేశాడు. ఆయన చూపించిన విప్లవ పంథా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. గద్దరన్నతో పాటు ఎంతో మంది విప్లవ కళాకారులు ప్రజలను ఏకం చేసేందుకు ప్రయత్నించారు. పాట, ఆట రూపంలో ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించిన వారున్నారు. మరి, ఆ కళాకారులు ఎవరో తెలుసుకుందాం.
ఎపూరు సోమన్న
అయోధ్య అంటే గుర్తొస్తడు రామన్న. పల్లె పాట అంటే యాదికొస్తడు ఏపూరు సోమన్న. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం వెలిశాలలో జన్మించాడు ఏపూరు సోమన్న. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయినా నానమ్మ సంరక్షణలో పెరిగాడు. సోమన్న పాటలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఏ పాట పాడినా అది శ్రోతలను ఆకట్టుకుంటుంది. పాటే తన జీవితంగా బతుకుతున్నాడు. ‘జోరు సాగుతుందిరా కొడకా.. తెలంగాణ హోరు సాగుతుందిరా’, ‘ఎవడిపాలైందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నాడురో తెలంగాణ?’ అంటూ రాగమెత్తితే ఉద్యమ స్ఫూర్తి రగలాల్సిందే.
https://www.youtube.com/watch?v=JigfoYaKt5Y&t=33s
గోరేటి వెంకన్న
గోరేటి వెంకన్న కవి, గాయకుడు. ప్రస్తుతమున్న నాగర్ కర్నూల్ జిల్లా గౌరారంలో జన్మించాడు గోరేటి వెంకన్న. ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది’ అంటూ తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించాడు. వివిధ సినిమాల్లో పాటలు రాసి కుబుసం సినిమాలోని ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అంటూ గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించాడు. వెంకన్న రాసిన ‘వల్లంకి తాళం’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ లభించింది. ప్రస్తుతం వెంకన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు.
https://www.youtube.com/watch?v=kU344_l7S-U&t=4s
రసమయి బాలకిషన్
గజ్జె కట్టి, మైకు పట్టి.. గొంతెత్తి కాలు కదిపిన రసమయి బాలకిషన్ విప్లవ కళాకారుడే. రసమయి సిద్దిపేట జిల్లాలోని రావురూకులలో జన్మించాడు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. ‘తెలంగాణ ధూం ధాం’ కార్యక్రమానికి పురుడు పోసింది రసమయినే. ‘ఓ యమ్మ నా పల్లె సీమ.. ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామా?’ అంటూ ఎన్నో పాటలకు జీవం పోశాడు. తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి ప్రజలను ఏకం చేశాడు.
Oyamma Telangana- Rasamayi Balakishan Telangana Song || Folk Song Telugu || Folk songs
ఆర్.నారాయణమూర్తి
సామాజిక కళాకారుడిగా ఆర్ నారాయణ మూర్తి అందరికీ సుపరిచితం. క్రోనీ క్యాపిటలిజం, నిరుద్యోగిత, సామాజిక సమస్యలపై తన గళం విప్పిన వ్యక్తి. తన సినిమాలతో వివిధ అంశాలను స్పృశిస్తూ ప్రజలను మేల్కొలిపాడు. అందుకే ఈయణ్ను పీపుల్స్ స్టార్ అని పిలుస్తుంటారు. నటుడిగా, గాయకుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా సేవలు అందించాడు. ఎన్నో సినిమాలను తీశాడు. ‘బంజారే బంజో’, ‘ఆపుర రిక్షోడా’, ‘ఎర్ర జెండ.. ఎర్ర జెండ’ వంటి పాటలతో పోరాట స్ఫూర్తిని రగిల్చాడు.
https://www.youtube.com/watch?v=pwV92lAeq_w&t=1119s
విమలక్క
భువనగిరి జిల్లా ఆలేరులో జన్మించింది విమలక్క. తెలంగాణను జాగృతం చేసే ఎన్నో పాటలను పాడింది. ‘అసైదులా హారతి’, ‘పల్లె పల్లెనా’, ‘ఏడు గడిసి పాయె.. దినము ఒడిసి పాయె’ వంటి పాటలను పాడి ప్రజల మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది. మానవ హక్కుల సంరక్షణకు కదం తొక్కారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కళాకారులతో కలిసి కార్యక్రమాలను నిర్వహించినందుకు నాలుగు నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించింది.
https://www.youtube.com/watch?v=e33k9zFzk18&t=5s
బెళ్లి లలిత
‘తెలంగాణ గాన కోకిల’గా బిరుదు పొందిన బెళ్లి లలిత ఉద్యమ కళాకారిణి. అణచివేతకు, అధికారానికి వ్యతిరేకంగా గొంతెత్తి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వనిత. తెలంగాణ కళా సమితి వ్యవస్థాపకురాలు. నాడు ఈమె ఎలుగెత్తిన తీరుకు అధికార నేతలే హడలిపోయారు. ప్రజలను సంఘటితం చేయడాన్ని చూసి వణికిపోయారు. సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. అయితే, పుట్టిన భువనగిరిలోనే లలితక్కను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి 18 ముక్కులుగా నరికేశారు. ఈమె మరణంపై ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=wLsc-0JvUf4
పయిలం సంతోష్
తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడిగా పనిచేశాడు పయిలం సంతోష్. సంతోష్ అసలు పేరు అడూరి బ్రహ్మయ్య. జానపద కళాకారుడు. ఉద్యమ సమయంలో గొంతెత్తి ప్రజలను సంఘటితం చేశాడు. తెలంగాణ నుంచి బొంబాయికి వలస పోతున్న ప్రజలను ఉద్దేశించి సంతోష్ ‘పైలం’ అనే ఆల్బమ్ విడుదల చేశాడు. అప్పటి నుంచి పైలం సంతోష్‌గా పేరుపొందాడు. సూర్యాపేట వెలిదండలో పుట్టిన సంతోష్.. నల్గొండలోని దుగునెల్లిలో పెరిగాడు. 2020లో అకాల మరణం పొందాడు.
https://www.youtube.com/watch?v=XXQTnLMJP6g&t=3s
సాయిచంద్
తెలంగాణ ఉద్యమ సమయంలో గొంతుకు సానబెట్టిన కళాకారుడు సాయిచంద్. వనపర్తి జిల్లాలోని అమరచింతలో జన్మించిన సాయిచంద్ ఎంతో చురుగ్గా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం, అధికార పార్టీకి పనిచేశాడు. చనిపోయేంత వరకు వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్నాడు.
https://www.youtube.com/watch?v=KHtwovGCU9g&t=2s
ఆగస్టు 10 , 2023
2022లో ఇంతవరకు తెలుగులో బాక్సాఫీస్ హిట్లు ఇవే
]కార్తీ హీరోగా తెరకెక్కిన ‘సర్దార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. రూ.5.5 కోట్ల తెలుగు హక్కులతో రూ.10.5 కోట్లు వసూళ్లు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.సర్దార్
ఫిబ్రవరి 11 , 2023
కీర్తి సురేష్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్ దే(2021), సర్కారువారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే కీర్తి సురేష్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Keerthy Suresh) విషయాలు ఇప్పుడు చూద్దాం.
కీర్తి సురేష్ దేనికి ఫేమస్?
కీర్తి సురేష్.. మహానటి, సర్కారువారి పాట వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.
కీర్తి సురేష్ వయస్సు ఎంత?
1992, అక్టోబర్ 17న జన్మించింది. ఆమె వయస్సు 31 సంవత్సరాలు
కీర్తి సురేష్ ముద్దు పేరు?
కీర్తమ్మ
కీర్తి సురేష్ ఎత్తు ఎంత?
5 అడుగుల 2 అంగుళాలు
కీర్తి సురేష్ ఎక్కడ పుట్టింది?
చెన్నై
Screengrab Instagram: keerthysureshofficial
కీర్తి సురేష్‌కు వివాహం అయిందా?
ఇంకా కాలేదు
కీర్తి సురేష్ అభిరుచులు?
యోగ, ట్రావెలింగ్, స్మిమ్మింగ్
కీర్తి సురేష్‌కు ఇష్టమైన ఆహారం?
దోశ
కీర్తి సురేష్ అభిమాన నటుడు?
సూర్య, విజయ్
తెలుగులో కీర్తి సురేష్ తొలి సినిమా?
నేను శైలజ(2016)
కీర్తి సురేష్ నటించిన తొలి తెలుగు సినిమా?
శ్రీ
కీర్తి సురేష్ ఏం చదివింది?
ఫ్యాషన్ డిజైన్‌లో BA హానర్స్
Courtesy Instagram: Keerthy suresh
కీర్తి సురేష్ పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.3 కోట్లు వరకు ఛార్జ్ చేస్తోంది.
కీర్తి సురేష్ తల్లిదండ్రుల పేర్లు?
సురేష్ కుమార్, మేనక
కీర్తి సురేష్‌కు అఫైర్స్ ఉన్నాయా?
తమిళంలో కమెడియన్ సతీష్‌తో అఫైర్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి.
కీర్తి సురేష్ ఎన్ని అవార్డులు గెలిచింది?
మహానటి చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తి సురేష్ అందుకుంది.
తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/keerthysureshofficial/?hl=en
కీర్తి సురేష్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది?
ఇంతవరకు అలాంటి సీన్లలో నటించలేదు
కీర్తి సురేష్ ఫెవరెట్ హీరోయిన్
సిమ్రాన్
కీర్తి సురేష్ గురించి మరికొన్ని విషయాలు
కీర్తి సురేష్ తండ్రి సురేష్, మలయాళం మెగాస్టార్ మమ్మూటి ఇద్దరు కాలేజీ రోజుల్లో క్లాస్‌మెట్స్ తన స్కూల్ డేస్‌లో కీర్తి సురేష్ అనేక స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని చాలా అవార్డులు గెలుచుకుంది.కీర్తి సురేష్ సోదరి రేవతి మంచి VFX స్పెషలిస్ట్, షారుక్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ సంస్థలో పనిచేస్తోంది.కీర్తి సురేష్ తండ్రి ఫిల్మ్ మేకర్ కాగా ఆమె తల్లి మేనక 100కు పైగా చిత్రాల్లో నటించింది.
https://www.youtube.com/watch?v=dCuIkapXKDY
ఏప్రిల్ 16 , 2024