• TFIDB EN
  • సర్కార్
    UATelugu2h 44m
    ఒక ఎన్నారై వ్యాపారవేత్త ఇంటికి తిరిగి వచ్చి చట్టవిరుద్ధంగా ఓటు వేయడాన్ని గురించి తెలుసుకుంటాడు. అతను ఈ విషయాన్ని పరిశోధించాలని నిర్ణయించుకున్నప్పుడు అతని ఇద్దరు అవినీతి రాజకీయనాయకులు అడ్డుపడుతారు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    విజయ్
    కీర్తి సురేష్
    వరలక్ష్మి శరత్‌కుమార్
    రాధా రవి
    పాల కరుప్పయ్య
    యోగి బాబు
    రాజేష్
    J. లివింగ్స్టన్
    తులసి
    కల్యాణి నటరాజన్
    ప్రేమ్ కుమార్
    పాప్రీ ఘోష్
    రంజినీ హరిహరన్
    యువినా పార్థవి
    ఆరుముగం బాల
    ఎంజే శ్రీరామ్
    జానకి
    జయదిత్య కాంగ్
    కనిష్క్
    మాన్య
    కె. శివశంకర్
    SS స్టాన్లీ
    అశ్వంత్ తిలక్
    రనీష్
    రవి
    మీను
    అలోక్ నాథ్
    ECR శరవణన్
    సెల్వ
    అనిత సంపత్
    బాలసుబ్రమణి
    లల్లూ
    ఎలిస్సా ఎర్హార్డ్ట్
    రాజా రాణి పాండియన్
    వినోద్
    ఏఆర్ మురుగదాస్
    సిమ్రాన్ గుప్తా ప్రత్యేక పాత్రలో కనిపించింది
    సిబ్బంది
    ఏఆర్ మురుగదాస్
    దర్శకుడు
    కళానిధి మారన్
    నిర్మాత
    బి. జయమోహన్
    రచయిత
    AR రెహమాన్
    సంగీతకారుడు
    గిరీష్ గంగాధరన్
    సినిమాటోగ్రాఫర్
    ఎ. శ్రీకర్ ప్రసాద్
    ఎడిటర్ర్
    కథనాలు
    కీర్తి సురేష్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    కీర్తి సురేష్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్‌ దే(2021), సర్కారువారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే కీర్తి సురేష్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Keerthy Suresh)  విషయాలు ఇప్పుడు చూద్దాం.  కీర్తి సురేష్ దేనికి ఫేమస్? కీర్తి సురేష్.. మహానటి, సర్కారువారి పాట వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. కీర్తి సురేష్ వయస్సు ఎంత? 1992, అక్టోబర్ 17న జన్మించింది. ఆమె వయస్సు  31 సంవత్సరాలు   కీర్తి సురేష్ ముద్దు పేరు? కీర్తమ్మ కీర్తి సురేష్ ఎత్తు ఎంత? 5 అడుగుల 2 అంగుళాలు  కీర్తి సురేష్ ఎక్కడ పుట్టింది? చెన్నై Screengrab Instagram: keerthysureshofficial కీర్తి సురేష్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు కీర్తి సురేష్ అభిరుచులు? యోగ, ట్రావెలింగ్, స్మిమ్మింగ్ కీర్తి సురేష్‌కు ఇష్టమైన ఆహారం? దోశ కీర్తి సురేష్ అభిమాన నటుడు? సూర్య, విజయ్  తెలుగులో కీర్తి సురేష్ తొలి సినిమా? నేను శైలజ(2016) కీర్తి సురేష్ నటించిన తొలి తెలుగు సినిమా? శ్రీ కీర్తి సురేష్ ఏం చదివింది? ఫ్యాషన్ డిజైన్‌లో BA హానర్స్  Courtesy Instagram: Keerthy suresh కీర్తి సురేష్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.3 కోట్లు వరకు ఛార్జ్ చేస్తోంది. కీర్తి సురేష్ తల్లిదండ్రుల పేర్లు? సురేష్ కుమార్, మేనక కీర్తి సురేష్‌కు అఫైర్స్ ఉన్నాయా? తమిళంలో కమెడియన్ సతీష్‌తో అఫైర్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. కీర్తి సురేష్ ఎన్ని అవార్డులు గెలిచింది? మహానటి చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తి సురేష్ అందుకుంది. తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/keerthysureshofficial/?hl=en కీర్తి సురేష్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? ఇంతవరకు అలాంటి సీన్లలో నటించలేదు కీర్తి సురేష్ ఫెవరెట్ హీరోయిన్ సిమ్రాన్ కీర్తి సురేష్ గురించి మరికొన్ని విషయాలు కీర్తి సురేష్ తండ్రి సురేష్, మలయాళం మెగాస్టార్ మమ్మూటి ఇద్దరు కాలేజీ రోజుల్లో క్లాస్‌మెట్స్ తన స్కూల్ డేస్‌లో కీర్తి సురేష్ అనేక స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని చాలా అవార్డులు గెలుచుకుంది.కీర్తి సురేష్ సోదరి రేవతి మంచి VFX స్పెషలిస్ట్, షారుక్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ సంస్థలో పనిచేస్తోంది.కీర్తి సురేష్ తండ్రి ఫిల్మ్ మేకర్ కాగా ఆమె తల్లి మేనక 100కు పైగా చిత్రాల్లో నటించింది. https://www.youtube.com/watch?v=dCuIkapXKDY
    ఏప్రిల్ 16 , 2024
    RGV Heroines List: శ్రీదేవి To ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతిలో పడి స్టార్లుగా మారిన హీరోయిన్లు వీరే!
    RGV Heroines List: శ్రీదేవి To ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతిలో పడి స్టార్లుగా మారిన హీరోయిన్లు వీరే!
    భారత చిత్ర పరిశ్రమలో వివాదస్పద డైరెక్టర్‌ అనగానే ముందుగా అందరికీ ‘రామ్‌ గోపాల్‌ వర్మ’ (Ram Gopal Varma)నే గుర్తుకు వస్తారు. ‘శివ’ వంటి ట్రెండ్‌ సెట్టర్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్జీవీ (RGV).. ఆ తర్వాత కెరీర్‌ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆర్జీవీ.. ఇప్పటివరకూ పదుల సంఖ్యలో చిత్రాలకు దర్శకత్వం వహించి, మరికొన్నింటిని నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రాల్లో నటించి చాలా మంది నటీమణులు స్టార్‌ హీరోయిన్లుగా మారిపోయారు. మరికొందరు తమ ఫేమ్‌ను మరింత పెంచుకున్నారు. ఆర్జీవీ చిత్రాల్లో చేసిన ఆ టాప్‌ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.  ఆరాధ్య దేవి (Aaradhya Devi) ఆర్జీవీ అప్‌కమింగ్‌ చిత్రం 'చీర'లో శ్రీలక్ష్మీ సతీష్‌ (Shri Lakshmi Satish) నటించింది. ఇందులో ఆమె ఆరాధ్య దేవి పాత్ర పోషిస్తుండటంతో ఆ పేరునే తన పేరుగా మార్చుకుంది. గతేడాది చీరలో ఉన్న అమ్మడి ఫొటో చూసి ఆర్జీవీ ఇంప్రెస్‌ అయ్యారు. ఆమె అందానికి దాసోహం అయినట్లు తెలిపారు. అంతే కాకుండా ఆమెతో ఏకంగా చీర అనే పేరుతో సినిమా తీసి ఆమె చేత అందాల ప్రదర్శన చేయించాడు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.  Aaradhya Devi Hot images gallery ఇర్రా మోర్‌ (Irra Mor) ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన ‘కొండ’ సినిమాతో నటి ఇర్రా మోర్‌ చాలా పాపులర్ అయ్యింది. అంతకుముందు 'భైరవ గీత', ‘డీ కంపెనీ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ‘కొండ’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.  శాన్వీ శ్రీవాస్తవ (Shanvi Srivastava) హాట్‌ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన 'రౌడీ' సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది. ఇందులో మంచు విష్ణుకు జోడీగా నటించి మెప్పించింది. అంతకుముందు లవ్లీ, అడ్డా, చంద్రలేఖ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకు పెద్దగా పేరు రాలేదు. రౌడీలో ఈ భామ హోయలు చూసి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో శాన్వీ వరుసగా చిత్రాలు చేసింది. Shanvi Srivastava Hot images gallery పూజా భలేకర్‌ (Pooja Bhalekar) హీరోయిన్ల అందాలను చూపించడంలో ఒక్కో డైరెక్టర్‌ ఒక్కో శైలి ఉంటుంది. అలాగే ఆర్జీవీకి ఓ భిన్నమైన శైలి ఉంటుంది. వివిధ రకాల పొజిషన్‌లో కెమెరాను పెట్టి హీరోయిన్‌ అందాలను ఆర్జీవీ క్యాప్చర్‌ చేస్తుంటారు. ఇలా వచ్చిన చిత్రమే ‘లేడీ బ్రూస్‌లీ. వర్మ రూపొందించిన ఈ చిత్రంలో నటి పూజా భలేకర్‌ హాట్‌ బాంబ్‌లా చేసింది. తెరపై ఈ భామ అందాల విన్యాసాలకు కుర్రకారు ఫీదా అయ్యారు.  Pooja Bhalekar Bikini images gallery నైనా గంగూలి (Naina Ganguly) ఆర్జీవీ టాలెంటెడ్‌ హీరోయిన్లతో పాటు బోల్డ్‌ నటీమణులను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా ఇంట్రడ్యూస్‌ చేసిన నటి నైనా గంగూలి. 2016లో వచ్చిన వంగవీటి సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. 2022లో వచ్చిన డేంజరస్‌ సినిమాలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. గ్లామర్‌ షో చేసింది.  అప్సర రాణి (Apsara Rani) ఆర్జీవీ చేతిలో పడి స్టార్‌గా మారిన మరో హాట్‌ బాంబ్‌ అప్సర రాణి. 2022లో వచ్చిన డేంజరస్‌ సినిమా ద్వారా ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందే పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ భామకు ఫేమ్ రాలేదు. ఆర్జీవీ సినిమా తర్వాతి నుంచి ఈ అమ్మడు ఓవైపు సినిమాలు, మరోవైపు గ్లామర్‌ పోస్టులతో సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. Apsara Rani Hot images gallery ఊర్మిళ (Urmila Matondkar) ఆర్జీవీ సినిమాల్లో అత్యధికసార్లు హీరోయిన్‌గా చేసిన నటి ఊర్మిల. 1992లో నాగార్జున హీరోగా చేసిన ‘అంతం’ సినిమాతో ఊర్మిళ తొలిసారి ఆర్జీవీతో కలిసి వర్క్‌ చేశారు. ఆ తర్వాత వరుసగా ‘సత్య’, ‘భూత్‌’, ‘రంగీలా’, ‘అనగనగా ఒక రోజు’, ‘మస్త్‌’, ‘జంగిల్‌’, ‘దావుద్‌’ తదితర చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించి అలరించారు. ముఖ్యంగా రంగీలా సినిమాల్లో ఈమె అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అద్భుతమైన మ్యూజిక్‌, అందమైన హీరోయిన్‌ ఉంటే సినిమాను సక్సెస్‌ చేయవచ్చని ఆర్జీవీ నిరూపించాడు.  అక్కినేని అమల (Akkineni Amala) స్టార్‌ హీరో అక్కినేని నాగార్జున భార్య అమల.. ఆర్జీవీ తొలి చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. ‘శివ’ హిందీ వెర్షన్‌లోనూ అమల నటించింది. ఇందులో ఆమె చక్కటి నటన కనబరిచి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమె ఆర్జీవీ డైరెక్షన్‌లో సినిమా చేయలేదు.  శ్రీదేవి (Sridevi) రామ్‌గోపాల్‌ వర్మకు బాగా ఇష్టమైన హీరోయిన్‌ ‘శ్రీదేవి’. ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా', 'క్షణ క్షణం' చిత్రాల్లో ఆమె కథానాయికగా చేసింది. ఆ తర్వాత కూడా ఆమెతో వర్క్‌ చేయాలని ఆర్జీవీ భావించిన అది సాధ్యపడలేదు. తన ఫేవరేట్‌ అయిన శ్రీదేవిపై ఆర్జీవీ పలు వేదికలపై ప్రశంసలు కురిపించడం విశేషం. రేవతి (Revathi) ఊర్మిళ తర్వాత ఆర్జీవీ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన హీరోయిన్‌ రేవతి. ‘రాత్రి’, ‘గాయం’, ‘గాయం-2’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ‘నిశబ్ద్‌’, ‘అబ్‌ తక్‌ ఛాపన్‌’, ‘డర్నా మనా హై’ తదితర హిందీ చిత్రాల్లో ఆమె నటించింది. హార్రర్‌ (RGV Horror Movies) బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘రాత్రి’ సినిమాలో ఆమె నటన ప్రతీ ఒక్కరిని బయటపెట్టింది. ఈ సినిమా రేవతితో పాటు రామ్‌ గోపాల్‌ వర్మకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.  మహేశ్వరి (Maheswari) ఒకప్పటి స్టార్‌ నటి మహేశ్వరి సైతం ఆర్జీవీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన గులాబీ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'దెయ్యం' సినిమాలో మహేశ్వరి లీడ్‌ రోల్‌లో నటించింది. హర్రర్‌ సీన్స్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఆడియన్స్‌ను థ్రిల్‌ చేశాయి. మనీషా కోయిరాలా (Manisha Koirala) ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా కూడా ఆర్జీవీ తీసిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో తళుక్కుముంది. 2002లో వచ్చిన 'కంపెనీ' చిత్రం ద్వారా ఆమె తొలిసారి ఆర్జీవీ డైరెక్షన్‌లో నటించింది. ఆ తర్వాత ‘భూత్‌ రిటర్న్స్‌’, ‘దర్వాజ బంద్‌’ సినిమాల్లో కనిపించింది. ముఖ్యంగా భూత్‌ రిటర్న్స్‌లో ఆమె నటన అందర్ని ఆకట్టుకుంది.  సుస్మితా సేన్‌ (Sushmita Sen) ఆర్జీవీ దర్శకత్వంతో పాటు ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో సుస్మితా సేన్‌ నటించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన ‘మర్రిచెట్టు’ సినిమా.. 2004లో విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో ఆమె నటన మెప్పిస్తుంది. అటు ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం 'AAG' లోనూ సుస్మితా సేన్‌ మెరిసింది.  ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai Bachchan) ఆర్జీవీ డైరెక్షన్‌లో స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌ కూడా ఓ సినిమాలో నటించింది. 2008లో వచ్చిన 'సర్కార్ రాజ్‌' అనే హిందీ మూవీలో ఈమె నటించింది. ఇందులో భర్త అభిషేక్‌ బచ్చన్‌, మామ అమితాబ్‌ బచ్చన్‌త https://telugu.yousay.tv/heroines-launched-by-ram-gopal-varma.html
    ఏప్రిల్ 24 , 2024
    2022లో ఇంతవరకు తెలుగులో బాక్సాఫీస్‌ హిట్లు ఇవే
    2022లో ఇంతవరకు తెలుగులో బాక్సాఫీస్‌ హిట్లు ఇవే
    ]కార్తీ హీరోగా తెరకెక్కిన ‘సర్దార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. రూ.5.5 కోట్ల తెలుగు హక్కులతో రూ.10.5 కోట్లు వసూళ్లు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.సర్దార్
    ఫిబ్రవరి 11 , 2023
    Raai Laxmi: థండర్ థైస్ అందాలతో పంబ రేపుతున్న రాయ్ లక్ష్మి.. కుర్రకారుకు కనుల విందు!
    Raai Laxmi: థండర్ థైస్ అందాలతో పంబ రేపుతున్న రాయ్ లక్ష్మి.. కుర్రకారుకు కనుల విందు!
    హీరోయిన్ రాయ్ లక్ష్మి మరోసారి సోగసుల విందు చేసింది. మల్దీవ్స్‌లో వెకెషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాల తెగింపునకు పాల్పడింది. థండర్ థైస్ అందాలతో కుర్రకారుకు కనువిందు చేసింది. వైట్ డ్రెస్‌లో అమ్మడి అందాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. బోట్‌లో ప్రయాణిస్తూ డ్రింక్ స్విప్ చేస్తున్న రాయ్ లక్ష్మి.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇక రాయ్ లక్ష్మి థండస్ థైస్ అందాలకు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ఫ్యాన్స్  ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  ఈ హాట్ డాల్ ఎప్పుడు ఫోటోలు పెడుతుందా.. ఎప్పుడూ తమ కామెంట్లకు పనిచెప్పాలా అని ఉబలాటపడుతుంటారు. 3 పదుల వయసులోనూ తరగని అందంతో కుర్రకారు డ్రీమ్‌ గర్ల్‌గా మారింది రాయ్ లక్ష్మి. తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో 15 ఏళ్ల క్రితమే తెరంగేట్రం చేసింది తొలి చిత్రం నుంచే అందాల దాడి పెంచిన రాయ్ లక్ష్మి ఇండస్ట్రీలో గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత దక్షిణాది భాషల్లో బిజీగా మారి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది.  సర్దార్ గబ్బర్ సింగ్, బలుపు, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  ఖైదీ 150 సినిమాలో చిరంజీవి సరసన ఐటెం సాంగ్‌లో నటించి ప్రేక్షకుల చేత ముద్దుగా రత్తాలుగా పిలిపించుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాయ్ లక్ష్మి... అందాల ఆరబోతకు కెరాఫ్ ఆడ్రస్‌గా నిలుస్తోంది. ఇక సముద్రయానానికి వెళ్లిందంటే.. రాయ్ లక్ష్మి అందాల దాడిని ఎవరు ఆపలేరు. బికినీ అందాలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతుంది. సింగిల్ పీస్ ధరించి ఇచ్చే ఫోజులకు, ఆమె కళ్లు చెదిరే అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఎప్పటికప్పుడూ తన అందాలకు మెరుగులు అద్దుతూ సరికొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది రాయ్ లక్ష్మి. ఇక సినిమా ఈవెంట్లలో అమ్మడు ప్రదర్శించే అందాలకు కొలత కట్టడం అసాధ్యమే. ఆ రీతిలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఎక్స్‌పోజింగ్.  ప్రస్తుతం రాయ్ లక్ష్మి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటుంది. సోలో రోల్స్‌తో పాటు గ్లామర్‌కు అవకాశం ఉండే పాత్రలను సైతం ఇష్టంగా చేస్తోందీ సొగసుల సంచలనం.
    అక్టోబర్ 23 , 2023
    RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్‌ను చంపేసిందా?... ఇవిగో సాక్ష్యాలు!
    RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్‌ను చంపేసిందా?... ఇవిగో సాక్ష్యాలు!
    టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ రాకేష్‌ మాస్టర్‌  తీవ్ర అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే రాకేష్ మాస్టర్ మృతి కారణాల పట్ల సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాకేష్ మాస్టర్ చనిపోవడానికి ఏపీలో అమ్ముతున్న చీప్ లిక్కర్, కల్తీ మద్యమే కారణమని వైసీపీ సర్కారును ట్రోల్ చేస్తున్నారు. అక్కడ విరివిగా లభించే 'బూమ్ బూమ్' బీర్లను రాకేశ్ మాస్టర్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోయి ప్రాణాలు కోల్పోయారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు వీడియోలను షేర్ చేస్తున్నారు.  https://twitter.com/mana_Prakasam/status/1670462301533765632?s=20 ఏపీలో మద్యపానం నిషేధం పేరిట తొలుత మద్యం ధరలు భారీగా పెంచారని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత నకిలీ, కల్తీ మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చి విచ్చలవిడిగా అమ్ముతున్నారనీ ఆరోపించారు.  వీటి తయారీ వెనుక ఉన్నది వైసీపీ నేతలే ఉన్నారని గతంలో  ప్రతిపక్షాలు కూడా పెద్దఎత్తున విమర్శించిన సంగతి తెలిసిందే. బ్రాండెడ్ మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాదని.. అందుకే చీప్ మద్యానికి అనుమతించారని కామెంట్లు చేస్తున్నారు. కల్తీ మద్యానికి రాకేష్ మాస్టర్ బలి అయ్యారని పోస్టులు పెడుతున్నారు. https://twitter.com/apramayanam/status/1670464153348190209?s=20 మరణం ముందే తెలుసు.. ఎప్పుడూ యూట్యూబ్‌లో ఎంటర్‌టైన్ చేసే రాకేష్ మాస్టర్ మృతిని చూసి తట్టుకోలేని అభిమానులు ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. రాకేష్ మాస్టర్ తాను చనిపోతాననే విషయం తనకు ముందే తెలుసు. తన అనారోగ్యం గురించి తెలిసినా... అందర్ని నవ్విస్తూ కడుపులోనే తన బాధను దాచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రాకేశ్ మాస్టర్ మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. "నా శరీరంలో మార్పు కనిపిస్తోంది. అది నాకు తెలుస్తోంది. నువ్వు ఉదయించే సూర్యుడివి నువ్వు  అయితే… నేను అస్తమించే సూర్యుడిని. అమ్మా, నాన్నలను బాగా చూసుకో'' అంటూ వీడియోలో చెబుతున్నట్లు ఉంది. దీంతో తాను చనిపోతానన్న విషయం తనకు ముందే తెలుసని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. https://twitter.com/Devineni_Hari/status/1670424465300402177?s=20 రాకేష్ మాస్టర్ చివరి కోరిక ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్యూ ఇచ్చిన రాకేష్ మాస్టర్ తన చివరి కోరిక ఏమిటో చెప్పారు. ఆయన చనిపోయాక ఎక్కడ సమాధి చేయాలో పేర్కొన్నారు. 'ఇల్లు, దుస్తులు, శరీరం ఏదీ శాశ్వతం కాదు. నా మామగారి సమాధి పక్కన వేప మెుక్క నాటా. దాన్ని పెంచుతా. నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయండని యూట్యూబ్ ఛానెల్స్‌కు విజ్ఞప్తి చేశా' అని మాస్టర్‌ అన్నారు.  డాక్టర్లు ఏమన్నారు?  రాకేశ్ మాస్టర్ మృతిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు బులెటెన్ విడుదల చేశారు. ఉదయం రక్త విరేచనాలు కావడంతో మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో రాకేష్ మాస్టర్ అడ్మిట్ అయ్యారు. ఆయనకు డయాబెటిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ తీవ్రంగా ఉండటంతో శరీరంలోని చాలా అవయవాలు దెబ్బతిన్నాయి అని  గాంధీ సూపరింటిండెంట్ రాజారావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాకేశ్ మాస్టర్ తుదిశ్వాస విడిచారని పేర్కొన్నారు. ప్రభాస్‌కు డ్యాన్స్ శిక్షణ రాకేశ్ మాస్టర్‌కి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరుంది. దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. కెరీర్ ఆరంభంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరో వేణు ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణను పొందారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో ఢీ లో బషీర్ అనే కంటెస్టెంట్‌కు మాస్టర్‌గా వ్యవహరించాడు. ఆయన మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ నివాళులు అర్పిస్తోంది. https://twitter.com/CreatorYog/status/1670510684935962625?s=20
    జూన్ 19 , 2023
    DIRECTORS: దర్శకులుగా వచ్చి నటులుగా సెటిల్‌ అయిపోతున్న డైరెక్టర్లు
    DIRECTORS: దర్శకులుగా వచ్చి నటులుగా సెటిల్‌ అయిపోతున్న డైరెక్టర్లు
    సినిమా వాళ్ల కెరీర్ అంతా చిత్ర విచిత్రమే. ఎందుకంటే విలన్‌ అవుదామనుకొని కమెడియన్‌గా, హీరో అవ్వాలనుకొని దర్శకులుగా, డైరెక్టన్ చేయాలని వచ్చి డాన్స్ మాష్టర్లుగా సెటిల్ అవుతుంటారు. ఇక ఇంకో కేటగిరీ కూడా ఉంది. దర్శకులుగా హిట్లు కొట్టి తర్వాత నటులుగా మారిపోతుంటారు. దండిగా వచ్చే ఆదాయమో లేదా ఇష్టమో కానీ, ఇలా మారిన దర్శకులు చాలామందే ఉన్నారు వాళ్లేవరో చూద్దామా? సముద్రఖని సముద్రఖని తొలుత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వచ్చి తమిళ్‌లో సినిమాలకు దర్శకత్వం వహించాడు. రఘువరన్ బీటెక్ చిత్రంతో పూర్తిస్థాయి నటుడిగా మారారు సముద్రఖని. అప్పట్నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అలా వైకుంఠపురం చిత్రంతో విలన్‌గా మారాడు ఈ దర్శకుడు. క్రాక్‌, బీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాలతో తనలో ఉన్న మరో కోణాన్ని వెలికి తీసి ఇప్పుడు నటుడిగా సెటిల్ అయిపోయాడు.  ఎస్‌జే సూర్య పవన్ కల్యాణ్‌తో ఖుషీ సినిమా తీసిన ఎస్‌జే సూర్య తెలియనివారు ఉండరు. వివిధ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ చేశాడు సూర్య. మహేశ్ బాబు, మురుగదాస్‌ కాంబోలో వచ్చిన స్పైడర్ చిత్రంలో విలన్‌గా విశ్వరూపం చూపించాడు. ఏడుస్తున్న వారిని చూసి నవ్వుతూ సంతోషపడే క్యారెక్టర్ బాగా పేలింది. తర్వాత మెర్సల్‌, మానాడు వంటి చిత్రాల్లో ఎస్‌జే సూర్య నటనకి ఫిదా అవ్వాల్సిందే.  గౌతమ్ మీనన్‌ ఘర్షణ, ఏ మాయ చేశావే, ఎటో వెళ్లిపోయింది మనసు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ నటుడిగా బిజీ అయిపోయాడు. పోలీస్‌ పాత్రలకు సరిగ్గా సరిపోయే పర్సనాలిటీ గౌతమ్‌ది. కనులు కనులు దోచే సినిమాలో నెగటివ్ షేడ్ రోల్‌లో మెప్పించాడు. ఇక సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మైఖేల్‌ చిత్రంలో విలన్‌గా కనిపించి షాకిచ్చాడు ఈ దర్శకుడు. ఎలాంటి క్యారెక్టర్‌ అయినా చేసేందుకు సిద్ధమని మిగతా దర్శకులకు హింట్ ఇచ్చేస్తున్నాడు. భారతీ రాజా శ్రేదేవితో పదహారేళ్ల వయసు చిత్రం తీసిన దర్శకుడు గుర్తున్నాడా? అంత సులభంగా లెజెండరీ దర్శకుడిని ఎలా మర్చిపోతారు. అతడే భారతీ రాజా. ఆయన ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ షురూ చేశారు. ధనుశ్ హీరోగా వచ్చిన తిరు చిత్రంలో తాతగా నవ్వించారు. ఇటీవల సూపర్‌హిట్‌గా నిలిచిన సార్‌లోనూ చివర్లో గెస్ట్‌రోల్‌లో నటించారు భారతీ రాజా. తరుణ్‌ భాస్కర్‌ పెళ్లి చూపులు వంటి మెుదటి సినిమాతోనే హిట్‌ కొట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ తర్వాత నటుడిగా అవతారమెత్తాడు. ఫలక్‌నామా దాస్‌లో మాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా, నేను మీకు తెలుసా చిత్రంలో నటనతో ఆకట్టుకున్నాడు. ఏ సినిమాలో ఛాన్స్‌ వచ్చినా తరుణ్ భాస్కర్‌ వదులుకోవట్లేదు.  రిషబ్‌ శెట్టి కాంతారా హీరో రిషబ్ శెట్టి తెలుసు కదా.. ఆయన మెుదట దర్శకుడు. క్లాప్‌ బాయ్‌, స్పాట్ బాయ్‌ నుంచి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎదిగాడు. హీరో రక్షిత్‌ శెట్టితో కలిసి రిక్కీ అనే చిత్రం చేయగా.. యావరేజ్ టాక్ వచ్చింది. తర్వాత అదే హీరోతో కిర్రిక్ పార్టీ చిత్రాన్ని తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. కాంతార సినిమాతో ఏకంగా పాన్‌ ఇండియాను షేక్‌ చేశాడు రిషబ్ శెట్టి. ఈ సినిమాకు స్వీయ దర్శకత్వం వహించాడు. 
    ఏప్రిల్ 27 , 2023
    Sid Sriram: తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే టాప్‌-10 సిద్‌ శ్రీరామ్‌ సాంగ్స్‌..
    Sid Sriram: తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే టాప్‌-10 సిద్‌ శ్రీరామ్‌ సాంగ్స్‌..
    ప్రముఖ సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ ఎన్నో హిట్‌ పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. మిస్మరైజింగ్‌ వాయిస్‌తో కోట్లాది మంది సంగీత ప్రియులను ఉర్రూతలూగించాడు. ఇండో అమెరికన్‌ అయినప్పటికీ తెలుగు పాటలను ఎంతో అద్భుతంగా పాడుతూ శ్రీరామ్‌ తనదైన మార్క్‌ చూపిస్తున్నాడు. సిద్‌ శ్రీరామ్ స్వరం నుంచి వచ్చిన టాప్‌-10 తెలుగు హిట్‌ సాంగ్స్‌ను ఇప్పుడు చూద్దాం.  1. శ్రీవల్లి: పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను సిద్‌ శ్రీరామ్‌ చాలా అద్భుతంగా పాడాడు. అప్పటివరకు పాడిన పాటలకు పూర్తి భిన్నంగా ఈ పాటను ఆలపించాడు. శ్రీరామ్‌ యూనిక్‌ వాయిస్‌ వల్లే ఈ పాటకు అంత హైప్‌ వచ్చింది.  https://www.youtube.com/watch?v=txHO7PLGE3o 2. కళావతి సర్కారు వారి పాటలో కళావతి సాంగ్‌ను శ్రీరామ్‌ చాలా బాగా ఆలపించాడు. కమాన్‌ కమాన్‌ కళావతి అంటూ మహేష్‌ చేత స్టెప్పులు వేయించాడు. ఈ పాట రిలీజ్‌ తర్వాత సిద్‌ శ్రీరామ్‌ ఫేమ్‌ మరింత పెరిగింది. https://www.youtube.com/watch?v=SfDA33y38GE 3. మగువ మగువ వకీల్‌సాబ్‌ చిత్రంలోని మగువ మగువ సాంగ్‌ మహిళల గొప్పతనాన్ని తెలియజేసింది. ఈ పాటకు తన స్వరం ద్వారా సిద్‌ శ్రీరామ్‌ జీవం పోశాడు.  https://www.youtube.com/watch?v=fqM8DJIZIDw 4. ఇంకేం ఇంకేం కావాలి గీతా గోవిందం సినిమాలోని ‘ఇంకేం ఇంకేం కావాలి’ పాటను శ్రీరామ్‌ ప్రాణం పెట్టి పాడాడు. ఒక్క ఇంగ్లీష్‌ పదం లేని ఈ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించి ప్రశంసలు అందుకున్నాడు. లిరిక్స్‌లోని డీప్‌ ఎమోషన్స్‌ను శ్రీరామ్‌ తన గొంతులో చక్కగా పలికించాడు. అప్పట్లో యూత్‌ను ఈ పాట విపరీతంగా ఆకర్షించింది.  https://www.youtube.com/watch?v=VkmXX_jKmZw 5. ఉండిపోరాదే 2018లో విడుదలైన హుషారు సినిమాలోని ‘ఉండిపోరాదే పాట’ అప్పట్లో చాలా పెద్ద హిట్‌ అయింది. ప్రేమలో విఫలమైన యువకుడి బాధను తన గొంతులో శ్రీరామ్‌ పలికించాడు. దీంతో యువకులు ఈ పాటకు చాలా బాగా కనెక్ట్‌ అయ్యారు.   https://www.youtube.com/watch?v=wCnUAKzAmVo 6. సామజవరగమన అలా వైకుంఠపురంలో చిత్రంలోని ‘సామజవరగమన’ పాట ఎంత సూపర్‌ హిట్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాట ఘన విజయానికి అల్లు అర్జున్‌ క్లాసీ స్టెప్పులు ఎంతగానో దోహదం చేశాయి. అలాగే శ్రీరామ్‌ కూడా తన స్వరం ద్వారా సాంగ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.  https://www.youtube.com/watch?v=OCg6BWlAXSw 7. మాటే వినదుగా టాక్సీవాలా చిత్రంలోని ‘మాటే వినదుగా’ పాట సిద్‌ శ్రీరామ్‌ హిట్‌ ఆల్బమ్స్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ పాట ద్వారా కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాల్లో శ్రీరామ్‌ స్థానం సంపాదించాడు.  https://www.youtube.com/watch?v=HMh6W8oxmyc 8. అడిగా అడిగా  నిన్నుకోరి సినిమాలోని ‘అడిగా అడిగా’ పాట భగ్న ప్రేమికులను ఎంతగానో ఆకర్షించింది. ప్రేయసి ప్రేమను బలంగా కోరుకునే యువకుడి ఫీలింగ్స్‌ను సిద్‌ చాలా బాగా వ్యక్తపరిచాడు. ఈ పాటకు గాను ఈ యువ గాయకుడికి మంచి ప్రశంసలే దక్కాయి.  https://www.youtube.com/watch?v=evbYFsSJ4pU 9. వచ్చిందమ్మ గీతా గోవిందం మూవీలోని ‘వచ్చిందమ్మా’ పాట కూడా మంచి హిట్ అయింది. ఈ పాటలో శ్రీరామ్‌ వాయిస్‌ ప్రేక్షకులను మిస్మరైజింగ్‌ చేసిందనే చెప్పాలి.  https://www.youtube.com/watch?v=xVcoYF--0mM 10. ఏమున్నావే పిల్ల నల్లమల్ల సినిమాలోనే ఏమున్నావే పిల్ల పాట ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. సినిమా పెద్దగా ఆడకపోయిన ఈ పాట మాత్రం ఇప్పటికా చాలా మందికి ఫేవరేట్ సాంగ్‌ ఉంది. https://www.youtube.com/watch?v=0K7HpHP2Jk8   
    ఏప్రిల్ 05 , 2023
    Guntur Kaaram: ‘సర్రా సర్రా’.. పాటకు స్పైడర్ మ్యాన్ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
    Guntur Kaaram: ‘సర్రా సర్రా’.. పాటకు స్పైడర్ మ్యాన్ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
    సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్‌ చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. థియేటర్లలో డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని ఓ పాటకు స్పైడర్‌ మ్యాన్‌ గెటప్‌లో ఇద్దరు వ్యక్తులు డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  స్పైడర్‌ మ్యాన్స్‌ స్పెప్పులేస్తే.. గుంటూరు కారం సినిమాలో వచ్చే ‘మావ ఎంతైన’ పాటలో మహేష్‌ తన డ్యాన్స్‌తో అదరగొడతాడు. ముఖ్యంగా సాంగ్‌ ఎండింగ్‌లో వచ్చే ‘సర్రా.. సర్రా.. సర్రా.. సర్రా..’ మ్యూజిక్‌ హైలెట్‌గా అనిపిస్తుంది. బీట్‌కు తగ్గట్లు స్పెప్పులేసి మహేష్‌ అలరిస్తాడు. అయితే ఈ మ్యూజిక్‌కి స్పైడర్‌ మ్యాన్‌ (Spider Man) స్టెప్పులేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఓ నెటిజన్‌కు వచ్చింది. స్పైడర్‌ మ్యాన్‌ గెటప్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు వేసిన డ్యాన్స్‌ను.. ‘సర్రా.. సర్రా..’ మ్యూజిక్‌కు సరిగ్గా సింక్‌ అయ్యేలా ఎడిట్‌ చేశాడు. స్పైడర్‌ మ్యాన్‌ తెలుగు వెర్షన్‌ పాటకు డ్యాన్స్‌ వేస్తే... అందరికీ కనుల విందుగా ఉంటుందంటూ వీడియోకు క్యాప్షన్‌ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వీడియోపై మీరూ లుక్కేయండి.  https://twitter.com/i/status/1781273824639725625 ఫ్యాన్స్‌ ఏమంటున్నారంటే.. మహేష్‌ పాటకు స్పైడర్‌ మ్యాన్‌ స్టెప్పులు వేసిన వీడియోపై ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. స్టెప్పులు భలే సింక్ అయ్యాయి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఆసక్తికరంగా.. స్పైడర్‌ మ్యాన్‌ : గుంటూర్‌ కార్‌ 'హోమ్‌' (Spiderman: Guntur Kar'Home') అంటూ ఈ వీడియోకు ఫన్నీ టైటిల్‌ కూడా ఇచ్చాడు. మహేష్‌, స్పైడర్‌ మ్యాన్‌ కాంబోలో మూవీ వస్తే బాగుంటుందంటూ మరో ఫ్యాన్‌ అభిప్రాయపడ్డాడు. SSMB 29 తర్వాత మహేష్‌ క్రేజ్‌ హాలీవుడ్‌ స్థాయికి చేరుకుంటుందని అప్పుడు ఇది నిజంగానే సాధ్యమవుతుందని ఇంకో నెటిజన్‌ పేర్కొన్నాడు. అయితే ‘సర్రా.. సర్రా..’ మ్యూజిక్‌ తనకు ఎంతో ఇష్టమని మరికొందరు పోస్టు చేస్తున్నారు.  మరో రికార్డు.. గుంటూరు కారంలోని ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. మహేష్‌ బాబు, శ్రీలీల (Sreeleela), పూర్ణ (Purna) ఈ పాటకు డ్యాన్స్‌తో అలరించారు. అయితే ఈ పాట విడుదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రీల్స్‌లో సందడి చేస్తూనే ఉంది. తాజాగా యూట్యూబ్‌లో 200 మిలియన్ల మార్క్‌ను ఈ సాంగ్‌ అందుకుంది. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వ్యూస్ సాధించిన రెండో పాటగా ఇది నిలిచింది. సర్కారు వారి పాట సినిమా నుంచి కళావతి సాంగ్‌ అయితే ఏకంగా 245 మిలియన్ల వ్యూస్‌తో టాప్‌ ప్లేస్‌లో ఉంది. https://www.youtube.com/watch?v=Ldn11dMHTJ8
    ఏప్రిల్ 20 , 2024
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.  టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి  ఓసారి చూద్దాం. అడవి శేషు(Adivi Sesh) ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు.  'కర్మ' అనే సినిమాతో  డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.  విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు.  మరో నాలుగేళ్ల తర్వాత  దాస్‌ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్‌ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.  సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) 'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు. అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్‌ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఆర్‌ నారాయణ మూర్తి(R. Narayana Murthy) విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ &సూపర్ స్టార్ కృష్ణ లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే  అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే  డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
    ఏప్రిల్ 01 , 2024
    Tollywood: ఎక్కువ భాషల్లో రీమేక్‌ అయిన తెలుగు బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు ఇవే!
    Tollywood: ఎక్కువ భాషల్లో రీమేక్‌ అయిన తెలుగు బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు ఇవే!
    భారత చలనచిత్ర పరిశ్రమలో రీమేక్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. సహజంగా ఒక భాషలో విజయం సాధించిన చిత్రాన్ని కంటెంట్‌ బాగుంటే మరో భాషలోకి రిమేక్‌ చేస్తుంటారు. కొత్త నటీనటులను పెట్టి వారి నేటివిటికి అనుగుణంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తుంటారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, మలయాళం, భోజ్‌పూరి, బెంగాలి పరిశ్రమల్లో ఇలా పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌ (Telugu movies that have been remade in most languages) నుంచే ఏటా ఎక్కువ సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం.. ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ అయ్యి ఇటీవల సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో తెలుగులో రూపొంది మూడు లేదా అంతకంటే ఎక్కువ లాంగ్వేజెస్‌లో రీమేక్‌ అయిన చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  నువ్వొస్తానంటే నేనొద్దంటానా (Nuvvostanante Nenoddantana) టాలీవుడ్‌లో వచ్చిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' (2005) చిత్రం.. తొమ్మిది భాషల్లో రీమేకైన తొలి తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ చిత్రం 7 భారతీయ భాషల్లో (తమిళం, కన్నడ, హిందీ, ఒడియా, మణిపురి, పంజాబీ, బెంగాలీ), 2 విదేశీ భాషల్లో (బంగ్లాదేశ్‌ బెంగాలీ, నేపాలి) భాషల్లో అనువదింప బడింది. తెలుగులో సిద్ధార్థ్‌, త్రిష, శ్రీహరి నటించిన ఈ చిత్రాన్ని డ్యాన్స్ మాస్టర్‌ ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.  ఒక్కడు (Okkadu) మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా గుణశేఖర్‌ (Gunasekhar) దర్శకత్వంలో వచ్చిన ఈ తెలుగు సినిమా కూడా 5 భాషల్లోకి రీమేక్ అయ్యింది. తమిళం, కన్నడ, బెంగాలీ, హిందీ, ఒడియా భాషల్లో రిమేక్‌ చేయబడి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో స్టార్ హీరో విజయ్ (Vijay) 'గిల్లీ' పేరుతో ఈ సినిమాను రీమేక్‌ చేయగా.. కన్నడలో 'అజయ్‌' పేరుతో పునీత్‌ రాజ్‌కుమార్‌ (Punit Raj Kumar) నటించాడు.  మర్యాద రామన్న (Maryada Ramanna) దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) రూపొందించిన ‘మర్యాద రామన్న’ చిత్రం కూడా ఐదు భాషల్లో రీమేక్ కావడం విశేషం. సునీల్‌ (Sunil) హీరోగా చేసిన ఈ చిత్రం కన్నడ, బెంగాలీ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రీమేక్ అయ్యింది. అక్కడా ఈ సినిమా విజయాన్ని అందుకోవడం గమనార్హం. హిందీలో ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌’ పేరుతో రాజమౌళినే ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. ఇందులో అజయ్‌ దేవగన్‌, సంజయ్‌ దత్, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రలు పోషించారు.  వర్షం (Varsham) ప్రభాస్‌ (Prabhas), త్రిష (Trisha) జంటగా 2004లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం 'వర్షం'. శోభన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ఎక్కువ భాషల్లో రూపొందింది. ఒడియాలో ‘మై డార్లింగ్‌’ (2004), తమిళంలో ‘మజాయ్‌’ (2005), హిందీలో ‘భాగీ’ (2016) పేరుతో రిలీజై మంచి ఆదరణ పొందింది.  ఛత్రపతి (Chatrapathi) ప్రభాస్‌ (Prabhas) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి చిత్రం టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నిర్మాతలకు మూడు రెట్లు లాభాలను అందించింది. అయితే మూడు భాషల్లో రీమేక్‌ అయ్యింది. కన్నడ, బెంగాలి భాషల్లో రిఫ్యూజ్‌ పేరుతో విడుదల కాగా, హిందీలో రీసెంట్‌గా ఛత్రపతి పేరుతోనే విడుదలైంది. వి.వి వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా చేశాడు. అయితే ఈ సినిమా హిందీలో డిజాస్టర్‌గా నిలిచింది. పోకిరి (Pokiri) మ‌హేష్ బాబు (Mahesh Babu) హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ పోకిరి సినిమా.. 4 భాష‌ల్లో రిమేక్ అయ్యింది. తమిళంలో విజయ్‌ హీరోగా ‘పొక్కిరి’ (2007), హిందీలో సల్మాన్‌ ఖాన్ హీరోగా 'వాంటెడ్‌' (2009), కన్నడలో దర్శన్‌ హీరోగా ‘పొర్కి’ (2010) పేరుతో ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఉర్దూలోనూ ఈ సినిమా రీమేక్ అయినప్పటికి కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. అయితే హిందీలో ఈ సినిమాకు ప్రభుదేవ దర్శకత్వం వహించడం విశేషం.  డార్లింగ్‌ (Darling) ప్రభాస్‌ హీరోగా 2010లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ఏ. కరుణాకరణ్‌ తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ సాధించడంతో పలు భాషలకు చెందిన దర్శక నిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేశారు. కన్నడలో దర్షన్‌  హీరోగా 'బుల్‌బుల్', హిందీలో 'సబ్సే బధాకర్‌ హమ్‌' పేరుతో రీమేకై అక్కడ కూడా విజయాన్ని అందుకుంది. బెంగాలీలోనూ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు మెుదలు కాగా కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది.  విక్రమార్కుడు (Vikramarkudu) రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆరు భాషల్లో రీమేక్ అయ్యింది. కన్నడలో ‘వీర మదకారి’ (2009), తమిళంలో ‘సిరుతాయ్’ (2011), హిందీలో ‘రౌడీ రాతోడ్‌’ (2012), బంగ్లాదేశ్‌ బెంగాలీలో ‘ఉల్టా పల్టా 69’ (2007), ‘యాక్షన్‌ జాస్మిన్’ (2015) పేర్లతో రెండుసార్లు రీమేక్ అయ్యింది.  మిర్చి (Mirchi) ప్రభాస్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి కూడా మూడు భాషల్లో రీమేక్ అయ్యింది. కన్నడలో 'మాణిక్య', బెంగాలీలో 'బిందాస్‌', ఒడియాలో 'బిశ్వంత్‌'  పేర్లతో రిలీజ్‌ అయ్యింది. ఇక హిందీలో ఈ సినిమాకు సంబంధించిన రైట్స్‌ను స్టార్ నటుడు జాన్‌ అబ్రహం దక్కించుకున్నప్పటికీ ఇప్పటివరకూ సినిమా చేయలేదు. ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే వెంక‌టేష్ (Venkatesh) హీరోగా సెల్వ రాఘ‌వ‌న్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా 5 భాష‌ల్లోకి రిమేక్ అయ్యింది. త‌మిళం, బెంగాలీ, భోజ్‌పురి, క‌న్న‌డ‌, ఒడియా భాష‌ల్లోకి రిమేక్ చేయ‌బ‌డింది. అన్ని భాష‌ల్లో సూప‌ర్ హిట్‌గా నిలిచింది.
    మార్చి 23 , 2024
    Razakar Movie Review: రజాకార్ల అకృత్యాలను కళ్లకు కట్టిన డైరెక్టర్‌.. సినిమా ఎలా ఉందంటే?
    Razakar Movie Review: రజాకార్ల అకృత్యాలను కళ్లకు కట్టిన డైరెక్టర్‌.. సినిమా ఎలా ఉందంటే?
    న‌టీన‌టులు:  బాబీ సింహా, వేదిక‌, అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, ప్రేమ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, రాజ్ అర్జున్‌, తేజ్ స‌ప్రు, జాన్ విజ‌య్‌, దేవీ ప్ర‌సాద్ త‌దిత‌రులు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: యాట స‌త్య‌నారాయ‌ణ‌ సంగీతం: భీమ్స్ సిసిరోలియో ఛాయాగ్ర‌హ‌ణం: కె.ర‌మేష్ రెడ్డి ఎడిటింగ్‌ : తమ్మిరాజు నిర్మాత‌: గూడూరు నారాయ‌ణ రెడ్డి విడుద‌ల తేదీ: 15-03-2024 తెలంగాణ విముక్తి పోరాటం నేప‌థ్యంలో సాగే చారిత్ర‌క క‌థాంశంతో రూపొందిన చిత్రం ‘ర‌జాకార్‌’ (Razakar). బాబీ సింహా, వేదిక‌, అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, ప్రేమ‌ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ‌కీయంగా ఎన్నో వివాదాల‌కు కారణమైన ఈ చిత్రం.. పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? తెలంగాణ పోరాట యోధుల‌ గాథ‌ను ఎలా చూపించారు? వివాదాస్ప‌ద‌మైన అంశాలు ఏమైనా ఉన్నాయా? అన్నది ఇప్పుడు చూద్దాం.  కథ దేశంలో అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్‌ (నైజాం)ని భారత్‌లో విలీనం చేయడానికి నిజాం ప్రభువు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ (మకరంద్‌ పాండే) ఇష్టపడడు. నైజాం సంస్థానాన్ని తుర్కిస్తాన్‌గా మార్చి ఓ ప్రత్యేక దేశంగా పాలించాలని ప్రయత్నిస్తాడు. ఇందుకోసం ఖాసీం రజ్వీ(రాజ్‌ అర్జున్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజాకార్ల వ్యవస్థను ఉపయోగించుకుంటాడు. బలవంతపు మత మార్పిడి కోసం ఖాసీం రజ్వీ ప్రజలను అతి దారుణంగా హింసిస్తాడు. ఈ క్రమంలో ఐలమ్మ (ఇంద్రజ), గూడూరు సూర్య నారాయణ, రాజి రెడ్డి (బాబీ సింహా) రజాకార్లకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేశారు? ఈ సమస్యను కేంద్ర హోమంత్రి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ (తేజ్‌ సప్రు) ఎలా పరిష్కరించారు? రజాకార్లు చేసిన అరాచకాలు ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే ఈ సినిమాలో కనిపించినా ప్రతీ పాత్ర కీలకమే. ఫ‌లానా పాత్రే ప్రధానమైనదని చెప్ప‌డానికి వీల్లేదు. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో పాత్ర హీరోగా నిలిచింది. చాక‌లి ఐల‌మ్మ‌గా ఇంద్ర‌జ‌, రాజిరెడ్డిగా బాబీ సింహా, శాంత‌వ్వ‌గా వేదిక‌, నిజాం రాజుగా మ‌క‌రంద్ దేశ్ పాండే, స‌ర్దార్ వ‌ల్ల‌భభాయ్ ప‌టేల్‌గా రాజ్ స‌ప్రు, ఖాసీం రిజ్వీగా రాజ్ అర్జున్‌, లాయ‌క్‌గా జాన్ విజ‌య్... ఇలా ప్ర‌తిఒక్క‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. అద్భుత‌మైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టారు. ముఖ్యంగా ఖాసీం రిజ్వీ పాత్ర‌లో రాజ్ అర్జున్ క‌న‌బ‌ర్చిన న‌ట‌న‌.. ప‌లికించిన హావ‌భావాలు.. సంభాష‌ణ‌లు ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తాయి. జాన్‌ విజయ్‌, తలైవసల్‌ విజయ్‌, అరవ్‌ చౌదరి, మహేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే ద‌ర్శ‌కుడు యాట స‌త్య‌నారాయ‌ణ.. తాను రాసుకున్న క‌థ‌ను య‌థాత‌థంగా తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కొన్ని ఎపిసోడ్స్‌ చాలా బాగా చూపించారు. కాక‌పోతే క‌థాంశం సాగిన తీరు ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌క‌పోవ‌చ్చు. ప్రథమార్ధంలో ఎక్కువ‌గా ర‌జాక‌ర్ల అకృత్యాలను చూపిస్తే.. ద్వితీయార్ధంలో వారికి ఎదురుతిరిగిన ప్ర‌జ‌ల పోరాట స్ఫూర్తిని కళ్లకు కట్టారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొత్త పాత్రని తెరపైకి తీసుకురావడం.. వారికి ఇచ్చిన ఎలివేషన్‌.. యాక్షన్‌ సీన్స్‌ ఇవన్నీ ఆకట్టుకుంటాయి. వెయ్యి ఉరిల మర్రి చరిత్ర, పరకాల హింసకాండ, బైరాన్‌పల్లి మారణహోమం లాంటి సన్నివేశాలు హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించారు. సర్ధార్‌ పటేల్‌.. ఖాసీం రిజ్వీకి ఇచ్చే వార్నింగ్‌ ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఇక ప‌తాక స‌న్నివేశాలు భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టే పోలీస్ చ‌ర్య‌తో సాగుతాయి. అయితే ఈ ఎపిసోడ్‌ను డైరెక్టర్‌ మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే బాగుండేది.  సాంకేతికంగా సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం భీమ్స్ సిసిరోలియో సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో అతడు అదరగొట్టేశాడు. పాటలు అద్భుతంగా ఉన్నాయి. కథలో భాగంగానే సాంగ్స్‌ వస్తుంటాయి. బతుకమ్మ పాటతో పాటు చివర్లో వచ్చే జోహార్లు సాంగ్స్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్‌కు వంకపెట్టనక్కర్లేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన పాత్రల నటనప్రజా పోరాట ఘట్టాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ మితిమీరిన హింసతెలిసిన కథ కావడం.. Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 15 , 2024
    Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
    Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
    టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), ‌అలీ (Ali), సునీల్‌ (Sunil), వేణుమాదవ్‌ (Venu Madhav) లాంటి సీనియర్‌ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్‌ కమెడియన్స్‌ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్‌ సైతం  సాధిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్‌ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం.  సుహాస్‌ (Suhas) ప్రముఖ నటుడు సుహాస్‌.. వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్‌ అయిన సుహాస్‌.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్‌ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్‌..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్‌ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్‌ నటిస్తున్నాడు. వైవా హర్ష (Harsha Chemudu)  షార్ట్‌ఫిల్మ్స్‌ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్‌ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్‌’, ‘పక్కా కమర్షియల్‌’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకుంది.   అభినవ్‌ గోమటం (Abhinav Gomatam) యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్‌ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్‌ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్‌.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్‌గా  ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్‌ హీరోగా మారాడు.  సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer) ‘జబర్దస్త్‌’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్‌.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్‌ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు. సత్యం రాజేష్‌ (Satyam Rajesh) సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్‌.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్‌ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.  ప్రియదర్శి (Priyadarsi) యంగ్‌ కమెడియన్‌ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’  (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు. వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) టాలీవుడ్‌లోని స్టార్‌ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్‌ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్‌.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్‌ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్‌’తో కథానాయకుడిగా మారిన కిషోర్‌.. రీసెంట్‌గా  ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది.  ధన్‌రాజ్‌ (Dhanraj) జబర్దస్త్‌ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్‌ ధన్‌రాజ్‌. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్‌.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. 
    మార్చి 14 , 2024
    Tollywood Disaster Sequels: భారీ అంచనాలతో వచ్చి చతికలపడ్డ టాప్ 13 సీక్వెల్‌ చిత్రాలు ఇవే!
    Tollywood Disaster Sequels: భారీ అంచనాలతో వచ్చి చతికలపడ్డ టాప్ 13 సీక్వెల్‌ చిత్రాలు ఇవే!
    గత దశాబ్దాల కాలంలో తెలుగులో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. వీటిలో కొన్నింటికి సీక్వెల్స్‌ సైతం ప్రేక్షకులను పలకరించాయి. అయితే తొలి భాగంతో పోలిస్తే (Tollywood Disaster Sequels) సెకండ్‌ పార్ట్‌ ఆడియన్స్‌ పెద్దగా ఆకట్టుకులేకపోయాయి. తొలి సినిమా మానియాను కొనసాగించడంలో విఫలమయ్యాయి. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అందులో నటించిన స్టార్‌ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.  మనీ మనీ మోర్‌ మనీ  జేడీ చక్రవర్తి హీరోగా చేసిన మనీ మూవీ సిరీస్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. మనీ (1993), మనీ మనీ (1994) పేరుతో వచ్చిన ఆ చిత్రాలు మంచి హిట్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే ఆ చిత్రాలకు కొనసాగింపుగా 2011లో వచ్చిన ‘మనీ మనీ మోర్‌ మనీ’ (Money Money More Money) మాత్రం ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది. బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది.  Money Money More Money Wallpapers శంకర్‌దాదా జిందాబాద్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో శంకర్‌దాదా M.B.B.S ఒకటి. 2004లో విడుదలైన ఆ  చిత్రం చిరుకి మంచి పేరు తీసుకొచ్చింది. అంతేగాక కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ (Shankar Dada Zindabad) తెరకెక్కించారు. డిఫరెంట్‌ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. కిక్‌  2 రవితేజ కెరీర్‌లోని టాప్‌-5 హిట్‌ చిత్రాల్లో ‘కిక్‌’ (Kick Movie) సినిమా కచ్చితంగా ఉంటుంది. 2009లో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్‌గా 2015లో ’కిక్‌-2’ (Kick 2)వచ్చింది. అయితే సినిమా ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయింది. రవితేజ ఫ్లాపు చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.  సర్దార్ గబ్బర్ సింగ్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ‘గబ్బర్‌ సింగ్‌’ (Gabbar Singh) చిత్రం ఎంత పెద్ద బ్లాక్‌ బాస్టర్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎన్నో అంచనాలతో వచ్చిన ‘సర్ధార్‌ గబ్బర్‌ సింగ్‌’ (Sardaar Gabbar Singh) మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. 2016లో వచ్చిన ఈ చిత్రం.. పవన్‌ డిజాస్టర్‌ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది. మన్మథుడు 2 అక్కినేని నాగార్జున హీరోగా చేసిన ఎవర్‌గ్రీన్ చిత్రాల్లో ‘మన్మథుడు’ (Manmadhudu) ఒకటి. ఈ సినిమాను ఇప్పటికీ చాలామంది చూస్తుంటారు. ఇందులో నాగార్జున కామెడీ టైమింగ్‌ను, బ్రహ్మీ కాంబినేషన్‌లో వచ్చే సీన్లను ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ‘మన్మథుడు 2’ (Manmadhudu 2) మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలైంది.  గాయం 2 1993లో జగపతి బాబు హీరోగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం (Gayam) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచింది. ఆరు నంది అవార్డులను సైతం కొల్లగొట్టింది. అటువంటి ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన గాయం-2 (Gayam 2) మాత్రం బాక్సాఫీస్‌ వద్ద చతికలపడింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. 2010లో వచ్చిన ఈ సీక్వెల్‌ చిత్రానికి ప్రవీణ్‌ శ్రీ దర్శకత్వం వహించారు.  ఆర్య-2  అల్లు అర్జున్‌ (Allu Arjun), సుకుమార్‌ (Sukumar) కాంబోలో వచ్చిన మెుట్టమెుదటి చిత్రం ‘ఆర్య’ (Arya Movie). ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. బన్నీతో పాటు సుకుమార్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘ఆర్య 2’ (Arya 2) అదే స్థాయిలో మెప్పించలేకపోయింది. మోస్టరు టాక్‌ మాత్రమే తెచ్చుకుంది.  చంద్రముఖి 2 & నాగవల్లి తెలుగులో వచ్చిన టాప్‌-5 హారర్‌ చిత్రాల్లో రజనీకాంత్‌ హీరోగా ‘చంద్రముఖి’ కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో విపరీతంగా భయపెట్టింది. చంద్రముఖి (Chandramukhi) పాత్రలో జ్యోతిక అదరగొట్టింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చంద్రముఖి 2 (Chandramukhi 2), నాగవల్లి (Nagavalli) చిత్రాలు మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. నాగవల్లిలో వెంకటేష్‌ లీడ్‌ రోల్‌లో నటించగా.. చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్‌ చేశాడు.  రోబో 2 రజనీకాంత్‌ హీరోగా డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన ‘రోబో’ (Robo) చిత్రం.. 2010లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన గ్రాఫిక్స్‌ మాయజాలంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కనక వర్షాన్ని కురిపించింది. దీనికి అనుసంధానంగా 2018లో రిలీజైన ‘రోబో 2’ (Robo 2) అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ విలన్‌ పాత్రలో కనిపించాడు.  సత్య 2 రామ్‌గోపాల్‌ వర్మను బాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా చేసిన చిత్రం ‘సత్య’ (Sathya). ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సత్య-2 (Sathya 2)మాత్రం ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇందులో శర్వానంద్‌ హీరోగా నటించాడు. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించాడు.  వెన్నెల 1/2  రాజా హీరోగా దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల' (Vennela) చిత్రం.. 2005లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారానే వెన్నెల కిషోర్‌ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'వెన్నెల 1/2' (Vennela 1/2) దారుణంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాకు వెన్నెల కిషోర్‌ దర్శకత్వం వహించడం విశేషం. అవును 2 విభిన్నమైన హారర్‌ కథాంశంతో వచ్చిన ‘అవును’ (Avunu).. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. డైరెక్టర్‌గా రవిబాబుకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘అవును 2’ (Avunu 2)  మాత్రం బాక్సాఫీస్‌ వద్ద చతికిల పడింది.  మంత్ర 2 కథానాయిక చార్మి చేసిన మరుపురాని చిత్రాల్లో ‘మంత్ర’ (Mantra). హారర్‌ & సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం మ్యాసివ్ విజయాన్ని అందుకుంది. 2007లో వచ్చిన ఈ చిత్రానికి ఓషో తులసి రామ్‌ దర్శకత్వం వహించాడు. అయితే దీనికి అనుసంధానంగా వచ్చిన ‘మంత్ర 2’ (Mantra 2) మాత్రం చార్మి ఆశలను అడియాశలు చేసింది. 
    ఫిబ్రవరి 22 , 2024
    Rashi Khanna: జాకెట్‌ విప్పి హద్దులు దాటిన రాశీ ఖన్నా..  చూసి తట్టుకోవడం కష్టమే!
    Rashi Khanna: జాకెట్‌ విప్పి హద్దులు దాటిన రాశీ ఖన్నా..  చూసి తట్టుకోవడం కష్టమే!
    టాలీవుడ్‌ బ్యూటీ రాశీ ఖన్నా (Rashi Khanna) తన బోల్డ్‌ ఫొటోలను షేర్‌ చేసి సోషల్‌మీడియాను తన వైపు తిప్పుకుంది.  తాజా ఫొటోల్లో రాశీ తన హద్దులను చెరిపేసింది. జాకెట్‌ విప్పేసి మరి లోదుస్తుల్లో దర్శనం ఇచ్చింది. ఈ హాట్‌ ట్రీట్‌తో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  రాశీ ఖన్నా క్లీవేజ్‌ షోకు నెట్టింట భారీ స్పందన వస్తోంది. ఆమె లేటెస్ట్‌ పిక్స్‌కు పెద్ద ఎత్తున లైక్స్, షేర్లు వస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీ పేరు  #RaashiiKhanna హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతోంది.  గతంలో కంటే రాశీ మరింత హాట్‌గా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ అందానికి వరుస అవకాశాలు క్యూ కడతాయని పోస్టులు పెడుతున్నారు.  సౌత్ నుంచి నార్త్ వరకూ వరుస సినిమాలతో సత్తా చాటిన రాశీ ఖన్నా.. ఇటీవల తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలు చేసింది.  కానీ, ఆ రెండూ డిజాస్టర్‌గా మిగలడంతో ఈ బ్యూటీ (#RaashiiKhanna)కి భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో ఇటీవల పెద్ద సినిమా ప్రాజెక్టులు ఏవి ఆమె వద్దకు వెళ్లలేదు. అటు తమిళంలో రీసెంట్‌గా 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్' చిత్రాల్లో ఈ బ్యూటీ నటించింది. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే సినిమాలో మెరిసింది.  ప్రస్తుతం టాలీవుడ్‌లో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) సరసన ఓ సినిమాలో రాశీ నటిస్తోంది. ఈ చిత్రానికి నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. రాశీతో పాటు శ్రీనిధి శెట్టి కూడా ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే హిందీలో ఈ చిన్నది 'యోధ' అనే సినిమాలో నటిస్తోంది.  తమిళంలో 'అరన్మనై 4', 'మేథావి' అనే చిత్రాలతో రాశీ బిజీ బిజీగా ఉంది.  కెరీర్‌ ప్రారంభంలో ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా  (Rashi Khanna) తన అందం, అభినయంతో తెలుగు డైరెక్టర్ల దృష్టిలో పడింది.  జోరు, శివం, హైపర్‌, తొలి ప్రేమ, వరల్డ్‌ ఫేమస్ లవర్‌ వంటి చిత్రాల్లో నటించి రాశి (#RaashiiKhanna) మెప్పించింది. రాశి ఖన్నా హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. మద్రాస్‌ కేఫ్‌ చిత్రం ద్వారా తొలిసారి ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌తో కలిసి రుద్ర (Rudra Series) వెబ్‌సిరీస్‌ రాశి ఖన్నా చేసింది. అంతకుముందు ఫర్జీ సిరీస్‌లోను రాశి మెరిసింది.  ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా మూవీలు చేస్తోన్న రాశీ ఖన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది.  ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా ఫ్యాన్స్‌కు షేర్‌ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు ఎన్నో హాట్ ఫొటోలను కూడా నెటిజన్లతో పంచుకుంటోంది. దీంతో ఈ అమ్మడు నెట్టింట తరచూ హైలెట్‌ అవుతూనే వస్తోంది. 
    జనవరి 30 , 2024
    Guntur Kaaram Record: భారత సినీ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు.. ట్రోలర్లకు మహేష్ దెబ్బ అదుర్స్!
    Guntur Kaaram Record: భారత సినీ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు.. ట్రోలర్లకు మహేష్ దెబ్బ అదుర్స్!
    సూపర్​స్టార్ మహేష్‌​బాబు (Mahesh Babu) 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమాతో ఆల్​టైమ్ రికార్డు కొల్లగొట్టాడు. జనవరి 12న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల (Guntur Kaaram Collections) జోరు ప్రదర్శిస్తోంది. ఓపెనింగ్ రోజు రూ.94 కోట్లు, సెకండ్ డే రూ.33 కోట్లు, మూడో రోజు రూ.37 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం తొలి వారంలోనే ఏకంగా రూ.212 మొత్తం కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.  భారత సినీ చరిత్రలో ప్రాంతీయ భాషలో రిలీజైన ఓ చిత్రం తొలి వారంలోనే ఇలా రూ.212 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించడం ఇదే తొలిసారి. ఈ అరుదైన ఘనతను సాధించి ‘గుంటూరు కారం’(Guntur Kaaram) ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిందని మేకర్స్ తాజా పోస్టర్‌ ద్వారా తెలియజేశారు. కాగా, మహేష్‌ కెరీర్​లో రూ.200+ గ్రాస్ అందుకోవడం ఇది మూడోసారి. అదే విధంగా టాలీవుడ్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో మహేష్‌ సినిమాలు ఐదు ఉన్నాయి.  గుంటూరు కారం చిత్రం ద్వారా మహేష్‌​బాబు కెరీర్​లో వరుసగా ఐదోసారి రూ.100+ కోట్ల షేర్ సాధించాడు. 'భరత్‌ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' సినిమాల ద్వారా ఆయన ఈ ఫీట్ అందుకున్నారు. దీంతో వరుసగా ఐదుసార్లు ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా మహేష్‌ నిలిచాడు.  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ముచ్చటగా ముడోసారి మహేష్‌​తో ‘గుంటూరు కారం’ తెరకెక్కించారు. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ మంచి సక్సెస్ సాధించాయి. తొలుత ‘గుంటూరు కారం’ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ సినిమాకు బాగా కనెక్ట్‌ కావడంతో కలెక్షన్లలో ఆ ప్రభావం కనిపంచలేదు. మహేష్‌​బాబు యాక్టింగ్, మేనరిజం, ఫైట్స్​కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ సినిమాలో మహేష్‌​కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) నటించగా, మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  కీ రోల్ ప్లే చేసింది. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు. కాగా హారికా అండ్ హసిన్ ప్రొడక్షన్ బ్యానర్​పై నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్​ఫ్లిక్స్​ భారీ ధరకు దక్కించుకుందని టాక్. మార్చి ఆఖరి వారంలో గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. మహేష్‌ టాప్‌-5 కలెక్షన్లు ఇవే! ‘గుంటూరు కారం’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కనక వర్షం కురిపిస్తూ మరిన్ని రికార్డులను కొల్లగొట్టేందుకు పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో మహేష్‌ నటించిన చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాలపై ఓ లుక్కేద్దాం. సర్కారు వారి పాట పరుశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్ల వసూళ్లు సాధించి మహేష్‌ సత్తా ఏంటో చూపించింది. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్‌ నటించింది. సరిలేరు నీకెవ్వరు మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' (Sarileru Neekevvaru). రూ.85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తొలి రోజే రూ. 64.7 కోట్లను వసూలు చేసింది. ఓవరాల్‌గా రూ.214 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది.  మహర్షి రూ.90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘మహర్షి’(Maharshi) చిత్రం.. వరల్డ్‌వైడ్‌గా రూ.170.5 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. తొలి రోజునే రూ.48.2 కోట్లు రాబట్టి నిర్మాతలపై కనక వర్షం కురిపించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్‌, పూజా హెగ్డే, జగపతిబాబు ముఖ్యపాత్రలు పోషించారు. భరత్ అనే నేను కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన 'భరత్‌ అనే నేను' సినిమా సైతం మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్ర బడ్జెట్‌ రూ.95 కోట్లు కాగా.. వరల్డ్‌వైడ్‌గా రూ. 164.9 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ నటించింది.  శ్రీమంతుడు మహేష్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో 'శ్రీమంతుడు'(Srimanthudu) ఒకటి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.145.2 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌ సరసన శ్రుతి హాసన్‌ చేసింది. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రలు పోషించారు.
    జనవరి 19 , 2024
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. జులై 31 నుంచి ఆగస్టు 6వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు LGM భారత మాజీ క్రికెటర్‌ ఎం.ఎస్‌.ధోని నిర్మాణం నుంచి వస్తున్న తొలి చిత్రం ‘ఎల్‌జీఎం’ (LGM). లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌’ అన్నది ఉపశీర్షిక. హరీష్‌ కల్యాణ్‌, ఇవానా జంటగా నటించిన ఈ సినిమాని రమేష్‌ తమిళమణి తెరకెక్కించారు. సాక్షి ధోని, వికాస్‌ హస్జా నిర్మించారు. నదియా, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 4న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మన జీవితంలోని బంధాలు, బంధుత్వాల ప్రాముఖ్యత గురించి ఈ మూవీ తెలియజేస్తుందని మేకర్స్‌ తెలిపారు.  రాజుగారి కోడిపులావ్ ‘రాజుగారి కోడిపులావ్‌’ (Rajugari kodipulao) చిత్రం కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శివ కోన, ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి కీలక పాత్రలు పోషించారు. శివ కోన స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 4న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ఒక వైవిధ్యమైన కథతో సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ చెబుతోంది.  విక్రమ్‌ రాథోడ్‌ విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా బాబు యోగేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’ (Vikram Rathode). ఎస్‌.కౌశల్య రాణి నిర్మాత. సురేష్‌ గోపి, సోనూసూద్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 4న థియేటర్‌లలో విడుదల కానుంది. ప్రచార చిత్రాలను చూస్తే, దీన్నొక యాక్షన్‌ మూవీగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. మిస్టేక్‌ అభినవ్‌ సర్దార్‌ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘మిస్టేక్‌’ (Mistake). భరత్‌ కొమ్మాలపాటి దర్శకుడు. ఆగస్టు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  యాక్షన్‌, కామెడీ, సస్పెన్స్‌, థ్రిల్‌.. ఇలా అన్ని రకాల అంశాలు ఉన్న మూవీ మిస్టేక్‌ అని చిత్ర బృందం చెబుతోంది. మెగ్‌ 2 హాలీవుడ్‌ మూవీ 'మెగ్‌ 2' (Meg 2) కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. 1999 నాటి ‘ది ట్రెంచ్‌’ అనే నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. బెన్ వీట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్‌ జాసన్ స్టాథమ్ హీరోగా నటించాడు. ఈ శుక్రవారం (ఆగస్టు 4) మెగ్‌ 2 థియేటర్స్‌లోకి రానుంది.  మరికొన్ని చిత్రాలు అభివ‌న్‌మేడిశెట్టి, స్నేహా సింగ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ‘దిల్ సే’ కూడా ఆగ‌స్ట్ 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే డ‌బ్బింగ్ సినిమాలు బ్ల‌డ్ అంట్ చాకోలెట్‌, కిచ్చా సుదీప్(Kiccha Sudeep) నటించిన హెబ్బూలి కూడా ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నాయి. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు రంగబలి నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘రంగబలి’ ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఆగస్టు 4 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. జులై 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ కామెడీతో సాగి సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి సీరియస్‌గా మారుతుంది. ఈ సినిమా కథ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఇందులో నాగశౌర్య యాక్టింగ్, సత్య కామెడి హైలెట్ అని చెప్పొచ్చు. TitleCategoryLanguagePlatformRelease DateChoonaWeb SeriesHindiNetflixAugust 3The Hunt for VeerappanDocumentary SeriesTamil / EnglishNetflixAugust 4Guardians of the Galaxy Vol. 3MovieEnglishDisney+HotsterAugust 2DayaaWeb SeriesTeluguDisney+HotsterAugust 5PareshanMovieTeluguSonyLIVAugust 4DhoomamMovieTelugu / KannadaAmazon PrimeAugust 4
    జూలై 31 , 2023
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.  ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం) కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.  ‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద.. వలలు వెయ్యొద్దు వయసు మీద.. ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి. సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.    ‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని.. చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ.. పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ.. దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’  ‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా.. కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా.. కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా.. అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.  https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk పుడుతూనే ఉయ్యాల(నేనింతే) పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.  ‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే.. ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే.. చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే.. నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా.. నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’ ‘‘టర్నే లేని దారులూ.. ట్విస్టే లేని గాథలూ.. రిస్కే లేని లైఫులూ.. బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.  https://www.youtube.com/watch?v=t8Afn_CX-tc తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్) సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.  ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి. ‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని.. చేతకాని వాడల్లే చూడొద్దే.. ధర్మరాజు అంతటివాడు ఆడాడే.. తీసిపారేయొద్దు జూదాన్ని.. మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే.. స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే.. ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే.. వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’ https://www.youtube.com/watch?v=OzIL-v_OcRk పక్కా లోకల్(జనతా గ్యారేజ్) ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.   తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది.. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ  సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే… ‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో.. ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో.. ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో.. అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’ డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది. ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది. https://www.youtube.com/watch?v=GFEj1vnhvxA మరికొన్ని.. తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.  https://www.youtube.com/watch?v=WkPsPWZQkzk
    జూన్ 23 , 2023
    POLICE MOVIES: పోలీస్ యూనిఫామ్‌పై హీరోల మోజు.. పెరుగుతున్న సినిమాల హవా
    POLICE MOVIES: పోలీస్ యూనిఫామ్‌పై హీరోల మోజు.. పెరుగుతున్న సినిమాల హవా
    టాలీవుడ్‌లో పోలీసు సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్‌ ఇష్టపడుతుంటారు. అందుకే కథానాయకులు సైతం పోలీస పాత్రలు చేసేందుకు మక్కువ చూపిస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పోలీసు ట్రెండ్‌ నడుస్తోంది. దీంతో కథానాయకులు మళ్లీ పోలీసు కథలపై తమ దృష్టి కేంద్రీకరించారు. ఖాకీ దుస్తుల్లో కనిపించి తమ అభిమానులను అలరిస్తున్నాారు. అటు డైరెక్టర్లు సైతం పోలీసు స్టోరీలను సిద్దం చేయడంలో బిజీబిజీగా ఉన్నారు. మరి ఆ హీరోలు ఎవరు? ఏ సినిమాలో ఇప్పుడు చూద్దాం. 1. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) సమంతతో కలిసి ఖుషీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఖుషీ తర్వాత గీతా గోవిందం డైరెక్టర్‌ పరుశురామ్, జెర్సీ డైరెక్టర్‌ గౌతం తిన్ననూరితోనూ విజయ్‌ సినిమాలు చేయనున్నాడు. గౌతం డైరెక్షన్‌లో విజయ్‌ VD12 సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా విజయ్‌ కనిపిస్తాడని టాక్‌. ఇప్పటికీ సినిమా కథను గౌతం తిన్ననూరి  చెప్పగా అది రౌడీబాయ్‌కు విపరీతంగా నచ్చేసిందని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. తమ హీరోను ఖాకీ దుస్తుల్లో చూసేందుకు ఇప్పటినుంచే ఆసక్తి కనబరుస్తున్నారు.  2. నాని హిట్ -3 సినిమాతో నాని (NANI) కూడా మొద‌టిసారి పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇందులో అర్జున్ స‌ర్కార్ అనే పోలీస్‌గా నాని క‌నిపించ‌బోతున్నాడు. హిట్ -2 క్లైమాక్స్‌లో పోలీస్‌గా నాని లుక్ ఎలా ఉండ‌బోతుందో రివీల్ చేసి సినిమాపై ఇంట్రెస్ట్‌ను పెంచేశారు. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి రానుంది. 3. నాగ చైతన్య నాగ చైతన్య (Naga Chaitanya) – కృతిశెట్టి (Krithi Shetty) జంటగా చేసిన కస్టడీ చిత్రం ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ ఇందులో చైతూ శివ అనే నిజాయతీ గల పోలీస్‌ కానిస్టేబుల్‌గా కనిపించనున్నారు. చై తొలిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపిస్తుండటంతో ఇప్పటినుంచే ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి.  4. అల్లరి నరేష్‌ అల్లరి నరేష్‌ (Allari Naresh) లేటెస్ట్‌ మూవీ ‘ఉగ్రం’.. ఇటీవలే విడుదలై మంచి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఇందులో నరేష్‌ సీఐగా కనిపించి మెప్పించాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా నరేష్‌ కనిపించాడు. యాక్షన్‌ సీన్లలోనూ ఇరగదీయగలనని నిరూపించుకున్నాడు. ఉగ్రంలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం నరేష్ అందుకున్నాడు.  5. కిరణ్‌ అబ్బవరం యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తాడు. ఎప్పుడూ ప్రేమికుడిగా, పక్కింటి కుర్రాడి పాత్రల్లో కనిపించే కిరణ్‌ అబ్బవరం మీటర్‌ సినిమాలో పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఎస్సైగా మెప్పించాడు. ఇందులో కిరణ్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మీటర్ స్ట్రీమింగ్ అవుతోంది.  6. రామ్‌ పోతినేని యంగ్‌ హీరో రామ్‌ పోతినేని (Ram pothineni) - కృతి శెట్టి (Krithi Shetty)  జంటగా చేసిన చేసిన సినిమా వారియర్‌. ఈ సినిమాలో రామ్‌ తొలిసారి పోలీసు గెటప్‌లో కనిపించాడు. మామూలుగానే యాక్షన్‌ సీన్లలో అదరగొట్టే రామ్‌.. ఒంటిపైన ఖాకీ దుస్తులతో ఈ సినిమాలో మరింత ఇరగతీశాడు. అయితే ఆశించిన రేంజ్‌లో వారియర్‌ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా.. పోలీసు పాత్రలోనూ మెప్పించగలనని రామ్‌ నిరూపించుకున్నాడు. ప్రస్తుతం రామ్‌.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు.  7. సుధీర్‌ బాబు విల‌క్ష‌ణ‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సుధీర్ బాబు (Sudheer Babu). ఆయన చేసిన రీసెంట్‌ మూవీ ‘హంట్‌’ మిశ్రమ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో సుధీర్‌బాబు కూడా పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. గతంలో ‘V’ సినిమాలోనూ సుధీర్ బాబు పోలీసాఫీసర్‌గా చేశాడు. యాక్షన్‌ సీన్స్‌లో తనదైన మార్క్‌ను చూపిస్తూ అదరగొట్టాడు. ఇందులో సుధీర్‌బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి.
    మే 08 , 2023
    NIHARIKA NM: యూట్యూబ్‌ సెన్సేషన్‌ నిహారిక NM గురించి ఈ నిజాలు తెలుసా?
    NIHARIKA NM: యూట్యూబ్‌ సెన్సేషన్‌ నిహారిక NM గురించి ఈ నిజాలు తెలుసా?
    నిహారిక NM. బహుశా ఈ యూట్యూబర్‌ గురించి తెలయని వారుండరనుకుంటా. బాలీవుడ్‌, టాలీవుడ్‌ ఇలా ఏ ఇండస్ట్రీలోనైనా సినిమా రిలీజ్‌ ఉందంటే ఆమెతో ప్రమోషన్ చేయించుకునేందుకు స్టార్స్ ఆసక్తి చూపిస్తుంటారు. విభిన్నమైన కాన్సెప్ట్స్‌తో యూట్యూబ్ రీల్స్‌ చేసి ఒక్కసారిగా ఫేమ్‌ను అందుకుంది. మహేశ్‌ బాబు, విజయ్ దేవరకొండ, అమీర్‌ ఖాన్‌, రణ్‌బీర్ కపూర్‌ ఇలా అందరితోనూ రీల్స్‌ చేసింది.   ఈ బెంగళూరు భామ ముంబై ఫ్యాషన్‌షోలో తళుక్కున మెరిసింది. ఫ్యాషన్ డిజైనర్ సమీర్‌ మదన్ కోసం ర్యాంప్‌పై హోయలొలకించింది నిహారిక.  ఓ తెలుపు రంగు డ్రెస్‌లో దానిపై అదే కలర్ జాకెట్‌ వేసుకొని ఎరుపు రంగు లిప్‌ స్టిక్‌ పెట్టి సూపర్‌హాట్‌గా కనిపించింది. పులి చారలుండే బెల్ట్‌ను కూడా పెట్టింది సుందరి.  ఏదో సరాదాగా యూట్యూబ్‌లో వీడియో తీసింది నిహారిక. చదువులో ఒత్తిడి నుంచి బయటపడేందుకు 2016లో పుట్టినరోజు వేడుకల్లో ఎలా ఉంటారని తీసి పోస్ట్ చేసింది.  వరుసగా అలాంటి కంటెంట్‌ పెడుతూ ఫేమస్ అయ్యింది. తర్వాత ఇన్‌స్టా గ్రామ్‌ రీల్స్‌ ప్రారంభం కావటంతో వాటిపై ఫోకస్‌ పెట్టింది.  ఇన్‌స్టా చాలా హిట్‌ రీల్స్‌ చేసింది నిహారిక. వన్‌ వే స్ట్రీట్‌ అనే రీల్‌ దాదాపు 10 మిలియన్ వ్యూస్ సంపాదించింది.  సామాజిక మాధ్యమాల్లో త్వరగా పేరు సంపాదించుకుంది ఈ యూట్యూబర్‌. కేవలం 2 నెలల్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ పెరిగారు. ప్రస్తుతం ఆమెకు 3.2 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కంటెంట్‌తోనే కాదు అందంతోనూ ఆకట్టుకుంటుంది ముద్దుగుమ్మ. ఈ అమ్మడి హాట్‌ లుక్స్‌కి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు.  తెలుగు స్టార్స్‌తోనే ప్రమోషనల్‌ రీల్స్ చేసింది నిహారిక NM. సర్కారు వారి పాట , మేజర్‌ కోసం మహేశ్‌బాబు, లైగర్‌ విజయ్ దేవరకొండ, కేజీఎఫ్‌ 2 యశ్‌తో చేసిన రీల్స్‌ చాలా ఫేమస్.  నిహారిక ఫ్యాషన్ ఫ్రీక్‌. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా డ్రెస్సింగ్‌ వేస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తుంది.  బెంగళూరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి లాస్‌ ఏంజెల్స్‌లో MBA చేసింది. కాస్త బ్రేక్‌ తీసుకోవటానికి వీడియోలు చేయడం ప్రారంభించింది.  కామెడీలో నిహారిక టైమింగ్ వేరే లెవల్. హాలీవుడ్‌ నటులు జిమ్ క్యారీ, రోవన్‌ అట్కిన్సన్, బ్రహ్మనందం, వడివేలు, వెన్నెల కిషోర్ స్ఫూర్తి అని చెప్పింది.
    ఏప్రిల్ 27 , 2023
    Tollywood Next Generation : తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన టాప్ హీరోల వారసులు… ఆ కళలు నిజమయ్యేనా?
    Tollywood Next Generation : తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన టాప్ హీరోల వారసులు… ఆ కళలు నిజమయ్యేనా?
    హీరోల కుమారులు, కుమార్తెలు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టడం సర్వ సాధారణం. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది అలా వచ్చిన వారే. వారసులుగా వచ్చినప్పటికీ వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు తర్వాత జనరేషన్‌ కూడా సిద్ధంగా ఉంది. టాప్ హీరోల పిల్లలు చిన్నప్పుడే ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. భవిష్యత్‌ కోసం ఇప్పుడే బాటలు వేసుకుంటున్నారు వాళ్లేవరో ఓసారి లుక్కేద్దాం. గౌతమ్ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ అచ్చుగుద్దినట్లుగా కృష్ణలా ఉంటాడు. మహేశ్ తర్వాత సినిమాల్లోకి కచ్చితంగా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఓ సినిమాలో ఇప్పటికే నటించాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంలో మహేశ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేశాడు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.  మహాధన్‌ చిత్ర పరిశ్రమలో ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఎదిగిన రవితేజ కుమారుడే మహాధన్. రాజా ది గ్రేట్ చిత్రంలో అంధుడి  పాత్రలో కనిపించింది కొద్ది నిమిషాలే అయినా ఇరగ్గొట్టాడు. మహాధన్‌కి నటన మీద ఆసక్తి ఉంది. ఈ విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూల్లో రవితేజ కన్ఫర్మ్ చేశాడు. “ సినీ పరిశ్రమలో ఉన్నాం కనుక కచ్చితంగా ఆసక్తి ఉంటుంది. లేదని చెప్పలేను. కానీ, ఎప్పుడూ వస్తాడనేది వాడి ఇష్టం” అన్నారు. దీనిబట్టి మహాధన్‌ హీరోగా వస్తాడనటంలో ఎలాంటి సదేహం లేదు. అకీరా నందన్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లకు జన్మించిన కుమారుడు అకీరా నందన్. అకీరా సినిమాల్లోకి రావాలని పవర్ స్టార్ ఫ్యాన్స్‌ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. నటనవైపు కాకుండా ఇండస్ట్రీలోనే మరోరంగంపై దృష్టిసారించాడు అకీరా. ఇటీవల రైటర్స్ బ్లాక్‌ అనే షార్ట్‌ ఫిల్మ్‌కు సంగీతం అందించాడు. ఈ విషయాన్ని అడివి శేష్‌ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.  సితార మహేశ్ కుమార్తె సితార కూడా ఎంట్రీ ఇచ్చేసింది. సర్కారు వారి పాట చిత్రంలో ఓ సాంగ్‌లో తళుక్కున మెరిసింది సితార పాప. సినిమారంగంపై మక్కువని చెప్పకనే చెప్పింది. భవిష్యత్‌లో సితార నుంచి కూడా ఓ సినిమా ఉంటుందని ఆశించవచ్చు. అల్లు అర్హ అల్లు అర్జున్ కుమార్తె అర్హ బాలనటి అవాతరమెత్తింది. సామాజిక మాధ్యమాల్లో తండ్రితో కలిసి సందడి చేసే ఈ చిచ్చర పిడుగు.. గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమాలో ఓ క్యారెక్టర్‌లో మెరిసింది. ప్రిన్స్‌ భరత పాత్రలో నటించింది అర్హ. ఇందులో ముద్దుగా చెప్పిన డైలాగులకు మంచి మార్కులు పడ్డాయి. భవిష్యత్‌లో సినీరంగంలో రాణిస్తుందనడానికి ఈ ఒక్క సినిమా చాలు.  అరియానా, వివియానా మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా కూడా తమ ప్రతిభను చాటారు. విష్ణు నటించిన జిన్నా సినిమాలో పాటను ఆలపించారు ఇద్దరు. దీనిపై మంచు కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.  అయాన్, అభిరామ్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్, జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభిరామ్ ఇప్పటివరకైతే ఆరంగేట్రం చేయలేదు. కానీ, రెండు కుటుంబాల నుంచి వారసులుగా ఉన్న కారణంగా భవిష్యత్‌లో కచ్చితంగా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉంది.
    ఏప్రిల్ 19 , 2023

    @2021 KTree