• TFIDB EN
  • శశి
    UATelugu
    రాజ్ జీవితాన్ని అస్సలు సీరియస్‌గా తీసుకోడు. కుటుంబ భారం మొత్తం అతని సోదరుడు అజయ్ చూసుకుంటాడు. రాజ్‌కి సంగీతంపై ఆసక్తి ఉంటుంది. శశి అనే యువతితో ప్రేమలో పడుతాడు.కానీ శశి సమస్యల్లో ఉంటుంది. మరి రాజ్ ఆమెను ఆ సమస్యల నుంచి బయటకు తీసుకొచ్చాడా? తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ఆది సాయికుమార్
    రాజ్ అకా రాజ్ కుమార్
    సురభి
    శశి
    జయప్రకాష్
    ధోర
    అజయ్
    రాజ్ సోదరుడు
    తులసి
    రాజ్ తల్లి
    రాజీవ్ కనకాల
    శశి తండ్రి
    శిరీష సౌగంధశశి తల్లి
    హర్ష చెముడు
    వైవా హర్ష
    వెన్నెల కిషోర్
    వెన్నెల కిషోర్ as
    సిబ్బంది
    శ్రీనివాస్ నాయుడు నడికట్లదర్శకుడు
    ఆర్.పి.వర్మనిర్మాత
    చావలి రామాంజనేయులునిర్మాత
    చింతలపూడి శ్రీనివాసరావునిర్మాత
    అరుణ్ చిలువేరుసంగీతకారుడు
    కథనాలు
    క్రైం థ్రిల్లర్‌ జానర్‌లో తెలుగులో తప్పక చూడాల్సిన సినిమాలు ఇవే!
    క్రైం థ్రిల్లర్‌ జానర్‌లో తెలుగులో తప్పక చూడాల్సిన సినిమాలు ఇవే!
    ]గూఢచారి ఉత్కంఠగా సాగే సినిమా ఇది. అడివి శేష్ ఇందులో ‘రా ఏజెంట్’గా నటించాడు. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్‌గా చేసింది. శశి కిరణ్ టిక్కా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.గూఢచారి - Prime VideoDownload Our App
    ఫిబ్రవరి 14 , 2023
    డిసెంబర్‌లో విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే..!
    డిసెంబర్‌లో విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే..!
    ]’టాప్ గేర్‘ మూవీతో ఆది సాయికుమార్ బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. తన వరుస పరాజయాలకు ఈ సినిమాతో పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నాడు. ఆది సరసన రియా సుమన్ హీరోయిన్‌గా నటించింది. శశికాంత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.టాప్ గేర్ - డిసెంబర్ 30Download Our App
    ఫిబ్రవరి 14 , 2023
    Sasimadhanam Review: పేరెంట్స్‌ లేరని లవర్‌ ఇంటికెళ్లి ఇరుక్కుపోతే.. ఆ తర్వాత ఏం జరిగింది?
    Sasimadhanam Review: పేరెంట్స్‌ లేరని లవర్‌ ఇంటికెళ్లి ఇరుక్కుపోతే.. ఆ తర్వాత ఏం జరిగింది?
    నటీనటులు: ప‌వ‌న్ సిద్ధు, సోనియా సింగ్, రూప‌ల‌క్ష్మి, ప్ర‌దీప్ రాప‌ర్తి, కృతిక‌, అశోక్ చంద్ర‌ దర్శకులు: వినోద్ గాలి సంగీత దర్శకుడు: సింజిత్ యెర్ర‌మిల్లి సినిమాటోగ్రఫీ: రెహాన్ షేక్ ఎడిట‌ర్ : అనిల్ కుమార్ పి నిర్మాతలు : హ‌రీష్ కోహిర్క‌ర్ విడుదల తేదీ : జులై 4, 2024 ఓటీటీ వేదిక : ఈటీవీ విన్‌ రొమాంటిక్‌ లవ్‌ డ్రామాగా రూపొందిన తెలుగు లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ ‘శశి మథనం’ (Sasimadhanam Web Series). ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా జులై 4 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో పవన్‌ సిద్ధు, సోనియా ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరు ఇప్పటికే పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో జంటగా చేసి పాపులర్‌ అయ్యారు. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన 'శశిమథనం' సిరీస్‌ ఎలా ఉంది? వీరి కెమెస్ట్రీ ఏ మేరకు ఆకట్టుకుంది? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి వరంగల్‌కు చెందిన మదన్‌ (సిద్ధూ పవన్‌).. అన్నయ్య ఫ్యామిలీతో ఉంటూ.. ఈజీ మనీ కోసం బెట్టింగ్స్‌ వేస్తుంటాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన శశి (సోనియా సింగ్‌)తో ప్రేమలో పడతాడు. బెట్టింగ్‌లో పెద్ద మెుత్తంలో డబ్బు పోగొట్టుకోవడంతో మదన్‌ చిక్కుల్లో పడతాడు. మరోవైపు శశి ఇంట్లో వారంతా పది రోజులు పెళ్లి కోసం వెళ్తున్నారని తెలిసి.. ఆమె ఇంటికి వెళ్తాడు. శశి ఇంటికి మదన్ వెళ్లిన రాత్రే పెళ్లి క్యాన్సిల్‌ అయిందని ఆమె ఇంట్లో వాళ్లు తిరిగివస్తారు. అప్పటినుంచి శశి ఫ్యామిలీకి కనబడకుండా మదన్‌ ఎలా మ్యానేజ్‌ చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? శశికి పెళ్లి చూపులు జరిగితే ఎలా చెడగొట్టాడు? శశి-మదన్‌ పెళ్లికి ఆమె ఇంట్లో వారు ఒప్పుకున్నారా? లేదా? అన్నది ఈ సిరీస్‌ కథ.  ఎవరెలా చేశారంటే సోనియా సింగ్, సిద్ధూ పవన్ నటన.. ఈ సిరీస్‌కు అతిపెద్ద ప్లస్‌గా మారింది. నిజ జీవితంలోనూ ప్రేమ జంట కావడంతో ఈ సిరీస్‌లో వీరి కెమెస్ట్రీ అద్భుతంగా పండింది. ఇద్దరూ క్యూట్‌గా నటించి మెప్పించారు. శశి తండ్రిగా నటించిన ప్రదీప్ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు.. తాత పాత్రలో నటించిన అశోక్ చంద్ర కూడా నవ్విస్తూనే ఎమోషనల్‌ టచ్‌ కూడా ఇచ్చారు. సిద్ధూ అన్నయ్య పాత్రలో కేశవ్ దీపక్ మెప్పించాడు. రంగమ్మత్త పాత్రలో సీనియర్ నటి రూప లక్ష్మి అదరగొట్టారు. అవంతి దీపక్, శ్రీలలిత, వెంకటేష్, కృతిక రాయ్, కిరీటి.. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే.. బోల్డ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లకు భిన్నంగా ఓ క్యూట్‌ లవ్‌స్టోరీ సిరీస్‌ తెరకెక్కించడంలో దర్శకుడు వినోద్ గాలి సక్సెస్‌ అయ్యారు. రొటీన్‌ స్టోరీనే కథాంశంగా ఎంచుకున్నప్పటికీ ఎక్కడా బోర్‌ కొట్టకుండా జాగ్రత్తపడ్డారు. హీరోయిన్‌ ఇంట్లో హీరో ఇరుక్కుపోవడంతో నెక్స్ట్‌ ఏం జరుగుతుందా? అన్న క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో రగిలించాడు. ఇంట్లో వాళ్ల కంట పడకుండా మదన్‌ పడే కష్టాలు, అతడికి సాయం చేసే క్రమంలో శశి పడే టెన్షన్‌ నవ్వులు పూయిస్తాయి. అయితే కొన్ని సీన్స్‌ ఎక్కడో చూసిన భావన కలగడం మైనస్‌గా చెప్పవచ్చు. పైగా సిరీస్‌ మెుత్తం ఒకే ఇంట్లో తిరగడం వల్ల విజువల్‌ పరంగా రిఫ్రెష్‌మెంట్‌ ఫీల్‌ కలగదు. స్క్రీన్‌ప్లే ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది. క‌థ‌లో రెండో ల‌వ్ ట్రాక్‌కు సంబంధించిన అంశం బాగున్న‌ప్ప‌టికీ.. అది మెయిన్‌ క‌థ‌కు చాలా వ‌ర‌కు డ్యామేజ్ చేసింది. డైలాగ్స్‌ విషయంలోనూ దర్శకుడు కాస్త జాగ్రత్త పడి ఉండాల్సింది.  సాంకేతికంగా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. సింజిత్ యెర్ర‌మిల్లి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా సిరీస్‌లోని రెండు పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. లవ్ స్టోరీకి తగ్గట్టు విజువల్స్‌ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్‌ సిద్ధూ, సోనియా నటనకన్ఫ్యూజన్‌ కామెడీసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ స్టోరీసెకండ్‌ లవ్‌ ట్రాక్‌కొన్ని బోరింగ్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5 
    జూలై 04 , 2024
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని  అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని  అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు టెనెంట్‌ హాస్య నటుడు సత్యం రాజేష్‌ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టెనెంట్‌' (Tenant). ఏప్రిల్‌ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. ప్రేమ పెళ్లి తర్వాత సంతోషంగా సాగాల్సిన హీరో జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగింది? అన్నది కథ. శశివదనే రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన ప్రేమకథ చిత్రం 'శశివదనే' (Sasivadane). సాయి మోహన్‌ ఉబ్బర దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. గోదావరి నేపథ్యంలో ఈ  ప్రేమ కథ సాగనుంది. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijathaparvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీ ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.  లవ్‌ మౌళి అవనీంద్ర దర్శకత్వంలో నవ్‌దీప్‌ హీరోగా చేసిన సినిమా 'లవ్‌ మౌళి' (Love Mouli). ఇందులు పంకురి గిద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. లవ్‌ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. మార్కెట్‌ మహాలక్ష్మీ కేరింత ఫేమ్‌ పార్వతీశం ఈ సినిమా (Market Mahalakshmi)లో హీరోగా చేశాడు. వీఎస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అఖిలేష్‌ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌, మహబూబ్‌ భాషా, ముక్కు అవినాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 19న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.  శరపంజరం నవీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శరపంజరం’ (Sarapanjaram). లయ కథానాయిక. ఈ మూవీ ఏప్రిల్‌ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మార‌ణాయుధం సీనియర్‌ నటి మాలాశ్రీ.. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించిన తాజా చిత్రం ‘మార‌ణాయుధం’ (Maaranaayudham). గురుమూర్తి సునామి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం.. గతేడాది కన్నడలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులనూ అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్‌ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది. లవ్‌ యూ శంకర్‌  దర్శకుడు రాజీవ్‌ ఎస్‌.రియా.. ‘మై ఫ్రెండ్‌ గణేశా’ యానిమేషన్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ‘లవ్‌ యూ శంకర్‌’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రేయాస్‌ తల్పాడే, తనీషా జంటగా నటించారు.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సైరెన్‌ జ‌యం ర‌వి (Jayam Ravi) క‌థానాయ‌కుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరెన్’ (Siren). ఫిబ్రవరి 16న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా సైరన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇందులో జయం రవితో పాటు కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మై డియర్ దొంగ  ఓటీటీలోకి నేరుగా మరో కామెడీ మూవీ వస్తోంది. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన ‘మై డియర్ దొంగ’ (My Dear Donga) మూవీ.. ఏప్రిల్ 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.  ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చిన యువ‌కుడు.. అనుకోని ప‌రిస్థితుల్లో అక్క‌డే బందీగా చిక్కుకుపోతే ఏం జ‌రిగింది? దొంగ‌కు, యువ‌తికి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ఎలాంటి మ‌లుపులకు కారణమైంది? అన్న కథతో ఈ మూవీ రూపొందింది. కాటేరా కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ నటించిన చిత్రం కాటేరా (Kaatera). తరుణ్‌ సుధీర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వెర్షన్‌ ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘జీ 5’ వర్గాలు ప్రకటించాయి. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnyone but YouMovieEnglishNetflixApril 15Rebel MoonMovieEnglishNetflixApril 19Chief Detective 1958SeriesKoreanDisney + HotstarApril 19SirenMovieTeluguDisney + HotstarApril 19My Dear DongaMovieTeluguAhaApril 19Dream ScenarioMovieEnglishLions Gate PlayApril 19The Tourist S2SeriesEnglishLions Gate PlayApril 19Pon Ondru KandenMovieTamilJio CinemaApril 14The SympathizerSeriesEnglishJio CinemaApril 14Article 370MovieHindiJio CinemaApril 19Quizzer Of The YearSeriesEnglishSonyLIVApril 15Dune: Part TwoMovieEnglishBook My ShowApril 16
    ఏప్రిల్ 15 , 2024
    Divi Vadthya: లంబసింగి బ్యూటీ ‘దివి వద్త్యా’ గురించి ఈ విషయాలు తెలుసా?
    Divi Vadthya: లంబసింగి బ్యూటీ ‘దివి వద్త్యా’ గురించి ఈ విషయాలు తెలుసా?
    యంగ్‌ బ్యూటీ దివి వద్త్యా (Divi Vadthya).. 'లంబసింగి' (Lambasingi) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో తెలుగు ఆడియన్స్‌ దృష్టి దివిపై పడింది. ఈ భామ గురించి తెలుసుకునేందుకు వారు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.  దివి.. మార్చి 15, 1996లో హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు.. శశికాంత్ వద్త్యా, దేవకి. పదో తరగతి వరకూ జూబ్లీ హిల్స్‌లోని పబ్లిక్‌ స్కూల్‌లో ఆమె చదువుకుంది. జి. నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుండి ఎంబీఏ పూర్తి చేసింది.  కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించిన దివి.. పలు ఫ్యాషన్‌ సంస్థలకు మోడలింగ్‌ చేసింది. 2018లో తొలిసారిగా 'లెట్స్‌ గో' అనే షార్ట్‌ ఫిల్మ్‌లో దివి నటించింది.  మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కిన మహర్షి (2019) సినిమాతో దివి వెండితెరపై అడుగుపెట్టింది. ఇందులో కాలేజీ స్టూడెంట్‌ పాత్రలో కొన్ని సీన్లలో కనిపించింది.  ఆ తర్వాత సందీప్‌ కిషన్‌ (Sandeep Kishan) హీరోగా చేసిన 'ఏ1 ఎక్స్‌ప్రెస్' సినిమాలో దివి మరోమారు తళుక్కుమంది. ఇందులో దివ్య పాత్రలో కనిపించి పర్వాలేదనిపించింది.  ఆ తర్వాత ‘బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4’లో అడుగుపెట్టిన దివికి ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. 49 రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. తన అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేసింది.  బిగ్‌ బాస్‌ తర్వాత దివికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. 'క్యాబ్‌ స్టోరీస్‌'  అనే చిత్రంలో ఫీమేల్‌ లీడ్‌ పాత్రలో ఈ భామ సర్‌ప్రైజ్‌ చేసింది. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు.  మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’లో కనిపించి దివి మరింత పాపులర్‌ అయ్యింది. తన సినిమాలో దివికి అవకాశమిస్తానని బిగ్‌బాస్ స్టేజీపైన చిరు చెప్పడమే కాకుండా ‘గాడ్‌ ఫాదర్‌’ ద్వారా ఆ మాటను నిలబెట్టుకోవడం విశేషం.  అదే ఏడాది మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా చేసిన ‘జిన్నా’ (Jinna) సినిమాలోనూ దివి ఓ కీలక పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచి ఈ బ్యూటీని నిరాశ పరిచింది.  అనంతరం ‘రుద్రంగి’ సినిమాలో 'జాజి మెుగులాలి' పాటలో దివి చిందేసింది. తన అద్భుతమైన నృత్యంతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది.  తాజాగా ఆమె నటించిన ‘లంబసింగి’ విజయం సాధించడంతో ఈ భామ చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్ర విజయంతో వరుస అవకాశాలు వస్తాయని ఈ దివి ఆశిస్తోంది.  ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడిన దివి.. గతంలో రవితేజ (Ravi Teja) సినిమాలో తనకు అవకాశం వచ్చిందని చెప్పింది. అయితే చివరి నిమిషంలో ఆ ఛాన్స్ మిస్‌ అయ్యిందని పేర్కొంది. అలా ఎందుకు జరిగిందో తెలీదని చెప్పుకొచ్చింది.  కెరీర్‌ ప్రారంభంలో సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడినట్లు దివి తెలిపింది. బాత్రూమ్‌లో షవర్‌ కింద ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని వాపోయింది.  అయితే గతంలో ఓ వ్యక్తిని ప్రేమించినట్లు దివి ఓ ఇంటర్యూలో తెలిపింది. అతని కుటుంబంలో చిన్న సమస్య రావడంతో బ్రేకప్‌ చెప్పుకున్నట్లు వివరించింది. 
    మార్చి 16 , 2024
    Bhoothaddam Bhaskar Narayana Review: థ్రిల్లింగ్‌ అంశాలతో ఆకట్టుకున్న ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’.. మూవీ ఎలా ఉందంటే? 
    Bhoothaddam Bhaskar Narayana Review: థ్రిల్లింగ్‌ అంశాలతో ఆకట్టుకున్న ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’.. మూవీ ఎలా ఉందంటే? 
    నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ, వెంకటేష్ కాకుమాను తదితరులు. దర్శకుడు: పురుషోత్తం రాజ్ సంగీత దర్శకులు: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రాఫర్‌: గౌతమ్ జి నిర్మాతలు : స్నేహల్ జంగాల, శశిధర్ కాసి, కార్తీక్ ముడింబి విడుదల తేదీ : మార్చి 01, 2024 టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో డిటెక్టివ్ చిత్రాలు వచ్చాయి. చిరంజీవి ‘చంట‌బ్బాయ్’ నుంచి రీసెంట్‌గా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వ‌ర‌కూ ఆ తరహా చిత్రాలు ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచాయి. తాజాగా ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ డిటెక్టివ్‌ జానర్‌లోనే తెరకెక్కింది. అయితే దర్శకుడు పురుషోత్తం రాజ్‌.. పురాణాల‌తో డిటెక్టివ్ క‌థ‌ని ముడిపెడుతూ ఈ సినిమాను రూపొందించడం ఆసక్తికరం. శివ కందుకూరి ఇందులో క‌థానాయ‌కుడిగా చేశాడు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? ఈ డిటెక్టివ్ ఏ మేర‌కు మెప్పించాడు? అన్నది ఇప్పుడు చూద్దాం.  కథ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో (Bhoothaddam Bhaskar Narayana Review) ఓ సీరియల్‌ కిల్లర్‌ మహిళల్ని టార్గెట్‌ చేస్తూ వరుసగా హత్యలు చేస్తుంటాడు. ఆడవారి తలలు నరికేసి వాటి స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ వరుస హత్యలు పోలీసులకు చిక్కుముడిలా మారిపోతాయి. దీంతో కేసును పరిష్కరించడం కోసం లోకల్‌ డిటెక్టివ్‌ భాస్కర్‌ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కేసును డిటెక్టివ్‌ ఛేదించాడా? లేదా? ఆ సీరియల్‌ కిల్లర్‌ ఎవరు? ఎందుకు ఆడవారినే హత్య చేస్తున్నాడు? వారి తలలు తీసుకెళ్లి ఏం చేస్తున్నాడు? రిపోర్టర్‌ లక్ష్మీతో హీరో లవ్‌స్టోరీ ఏంటి? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే శివ కందుకూరి డిటెక్టివ్ పాత్ర‌లో స‌హ‌జంగా ఒదిగిపోయాడు. న‌ట‌న ప‌రంగానూ వైవిధ్యం ప్ర‌ద‌ర్శించాడు. ప్ర‌థ‌మార్ధంలో స‌ర‌దా స‌న్నివేశాల్లో హుషారుగా కనిపించిన అతడు.. సెకండాఫ్‌లో సీరియ‌స్ స‌న్నివేశాల‌పైనా బ‌ల‌మైన ప్ర‌భావం చూపించాడు. అటు హీరోయిన్‌ రాశిసింగ్ చాలా అందంగా క‌నిపించింది. రిపోర్ట‌ర్ ల‌క్ష్మిగా ఆమెకీ కీల‌క‌మైన పాత్రే ద‌క్కింది. ష‌ఫి, దేవి ప్ర‌సాద్‌, శివ‌న్నారాయ‌ణ, శివ‌కుమార్ త‌దిత‌రులు అల‌వాటైన పాత్ర‌ల్లో తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే  డైరెక్టర్‌ పురుషోత్తమ్‌ రాజ్‌.. ఆసక్తికర కథను ఎంచుకున్నారు. డిటెక్టివ్‌ కథను పురుణాలతో ముడిపెట్టిన విధానం బాగుంది. హీరోను ప‌క్కా లోక‌ల్ డిటెక్టివ్‌గా చూపించడం అంద‌రినీ క‌నెక్ట్ అయ్యేలా చేస్తుంది. హ‌త్య‌ల పూర్వాప‌రాలు, పోలీసుల ప‌రిశోధ‌న‌, ఆ కేసులోకి హీరో ప్ర‌వేశం, అత‌నికీ స‌వాల్ విసిరే ప‌రిశోధ‌న త‌దిత‌ర అంశాల‌న్నీ ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. ద్వితీయార్ధంలో మ‌లుపులు మ‌రింత ఉత్కంఠ‌ని పెంచుతాయి. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మరీ నాటకీయంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో కొన్ని సీన్లు కథకు స్పీడ్‌ బ్రేకుల్లా తయారయ్యాయి. ఓవరాల్‌గా పురషోత్తం రాజ్‌ దర్శకత్వం ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సంగీతం, కెమెరా, ఎడిటింగ్, క‌ళ త‌దిత‌ర  విభాగాలన్నీ మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. నేప‌థ్య సంగీతం ఈ సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది.  నిర్మాణంలోనూ నాణ్య‌త క‌నిపిస్తుంది. బడ్జెట్‌కు వెనకాడినట్లు ఎక్కడా అనిపించలేదు.  ప్లస్‌ పాయింట్స్ హీరో నటనక‌థ‌లో పురాణ నేప‌థ్యంద్వితీయార్థం మైనల్‌ పాయింట్స్‌ ప్ర‌థ‌మార్థంలో కొన్ని సీన్లు Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 02 , 2024
    Bramayugam Review In Telugu : మమ్ముట్టి ‘భ్రమయుగం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
    Bramayugam Review In Telugu : మమ్ముట్టి ‘భ్రమయుగం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
    నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు దర్శకుడు: రాహుల్ సదాశివన్ సంగీత దర్శకులు: క్రిస్టో జేవియర్ సినిమాటోగ్రాఫర్: షెహనాద్ జలాల్ ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ నిర్మాతలు: చక్రవర్తి, రామచంద్ర, ఎస్. శశికాంత్ విడుదల తేదీ: ఫిబ్రవరి 23, 2024 మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో రాహుల్‌ సదాశివన్ రూపొందించిన డార్క్‌ ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌ 'భ్రమయుగం'. ఇప్పటికే మలయాళంలో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ మూవీని రిలీజ్‌ చేసింది. అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలకపాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ తేవన్ (అర్జున్ అశోకన్) (Bramayugam Review In Telugu) ఒక మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ.. ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ ఓ వంటవాడు (సిద్ధార్థ్ భరతన్)తో పాటు ఆ ఇంటి యజమాని కుడుమోన్ పొట్టి (మమ్ముట్టి) మాత్రమే ఉంటారు. ఇంటికి వచ్చిన అతిథికి కుడుమోన్‌ బాగా ఆదరిస్తాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించవు. అసలు తేవన్ ఎందుకు పారిపోవాలి అనుకున్నాడు? కుడుమోన్ పొట్టి ఎవరు ? అడవిలో పాడుబడ్డ భవంతిలో ఏం చేస్తున్నాడు? తేవన్ ఆ భవంతి నుంచి తప్పించుకున్నాడా? లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? మలయాళ మెగాస్టార్‌ మమ్మూటి (Bramayugam Review In Telugu).. ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు. కుడుమోన్ పొట్టి మిస్టీరియస్ పాత్రలో అద్బుత నటన కనబరిచాడు. మంత్ర శక్తులను గుప్పిట్లోపెట్టుకొని తక్కువ కులం వాళ్లను కిరాతకంగా చంపే ఓ దుష్టుడి పాత్రలో జీవించాడు. మమ్ముట్టి బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక తేవన్‌గా అర్జున్ అశోకన్, వంట మనిషిగా సిద్దార్థ్ భరతన్ పోటీ పడి నటించారు. తెరపైన ముగ్గురు ఎవరికి వారే తమ ప్రతిభను చాటుకున్నారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే భ్రమయుగం మూవీ ప్రారంభం నుంచే చాలా ఇంటెన్స్‌తో, హై ఎనర్జీతో మెుదలవుతుంది. ఓపెనింగ్ మిస్ అయితే కథకు కనెక్ట్ కావడానికి చాలా ఇబ్బంది పడాల్సిందే. దర్శకుడు రాహుల్ సదాశివన్ రాసుకొన్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. మూడు పాత్రలు ఒకరిని మరోకరు చీట్ చేసుకొనే విధానాన్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా డైరెక్టర్‌ తెరకెక్కించారు. ఇక సెకండాఫ్‌లో అఖండ జ్యోతిని ఆరిపేయడం తర్వాత జరిగే సంఘటనలు చాలా ఎమోషనల్‌గా, భయానకంగా ఉంటాయి. సినిమాను చివరి ఫ్రేమ్ వరకు నడిపించిన తీరు దర్శకుడు రాహుల్ సదాశివన్ ప్రతిభకు అద్దం పట్టింది. అయితే స్లోగా ఒకే పాయింట్‌తో కథ సాగడం.. కమర్షియల్ వాల్యూస్‌కు దూరంగా ఉండటం ఓ మైనస్‌గా చెప్పవచ్చు. టెక్నికల్‌గా  ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. భ్రమయుగం సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి ప్రధాన బలంగా మారింది. యాక్టర్ల నటనకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడవడంతో సన్నివేశాలు హై రేంజ్‌లో ఎలివేట్ అయ్యాయి. సినిమాటోగ్రాఫర్‌ షెహనాద్ జలాల్ సినిమా మొత్తాన్ని బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించారు. ప్రతీ ఫ్రేమ్ చాలా అద్బుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకుడికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. సౌండ్ డిజైన్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడంలో సాయపడ్డాయి. ప్లస్‌ పాయింట్స్ కథ, స్క్రీన్‌ప్లేనటీనటులుసంగీతంకెమెరా పనితనం మైనస్‌ పాయింట్స్‌ స్లోగా సాగే కథనంకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5
    ఫిబ్రవరి 23 , 2024
    This Week Movies: ఈ వారం వస్తోన్న మోస్ట్ వాంటెడ్‌ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం వస్తోన్న మోస్ట్ వాంటెడ్‌ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు (Tollywood Upcoming Movies), వెబ్‌సిరీస్‌లు (Upcoming Web Serieses) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈసారి చిన్న సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. ఫిబ్రవరి 12 - 18 తేదీల మధ్య అవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు భ్రమయుగం మలయాళం సూపర్ స్టార్‌ మమ్ముట్టి ఈ వారం ‘భ్రమయుగం’ (Bramayugam) సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. హారర్‌ థ్రిల్లర్‌గా  రూపొందిన ఈ చిత్రానికి రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌, పోస్టర్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు, తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజధాని ఫైల్స్‌ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై మరో మూవీ వస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అంశంపై రూపొందిన ‘రాజధాని ఫైల్స్’ (Rajdhani Files) ఈ వారం థియేటర్లలోకి రాబోతుంది. అఖిలన్‌, వీణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది.  ఊరు పేరు భైరవకోన సందీప్‌కిషన్‌ (Sundeep Kishan) కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). థ్రిల్లర్‌, సోషియో ఫాంటసీ కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ‘గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే భైరవకోన’ అంటూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. సైరెన్‌ జయం రవి (Jayam Ravi), కీర్తి సురేష్‌ (Keerthi Suresh) కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎమోషనల్‌ డ్రామా చిత్రం ‘సైరెన్‌’ (Siren Movie). ‘108’ అనేది ఉపశీర్షిక. ఆంటోనీ భాగ్యరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేసి క్రిమినల్‌గా మారిన ఓ వ్యక్తి కథ’ ఈ చిత్రం. కీర్తి ఇందులో పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నాసామి రంగ ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) ఒకటి. థియేటర్లలో మంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా.. ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా చేసింది. అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ ప్రధాన పాత్రలు పోషించారు.  ది కేరళ స్టోరీ గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మూవీ ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. 9 నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా.. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న ఆసక్తి నెలకొంది. TitleCategoryLanguagePlatformRelease DateSunderland 'Till I Die 3SeriesEnglishNetflixFeb 13Love Is Blind SeriesEnglishNetflixFeb 13PlayersMovieEnglishNetflixFeb 14Einstein and the BombMovieEnglishNetflixFeb 16Five Blind Dates SeriesEnglishAmazon PrimeFeb 13This is me.. NowMovieEnglishAmazon PrimeFeb 16Queen ElizabethMovieMalayalamZee5Feb 14The Kerala StoryMovieHindiZee5Feb 16TrackerSeriesEnglishDisney+HotStarFeb 12Saba NayaganMovie TamilDisney+HotStarFeb 14Abraham OzlerMovieMalayalamDisney+HotStarFeb 15SlaarMovieHindi Disney+HotStarFeb 16Raisinghani v/s RaisinghaniSeries Hindi Sony LIVFeb 12Vera Maari Love StoryMovieTamilAhaFeb 14
    ఫిబ్రవరి 12 , 2024
    ఈ వారం(Feb 24) థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు
    ఈ వారం(Feb 24) థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు
    గత వారం సార్, వినరో భాగ్యము విష్ణు  కథ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. అయితే, ఈ వారం(ఫిబ్రవరి 24) థియేటర్లలో చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఓటీటీలో మాత్రం సంక్రాంతి సినిమాలు మోత మోగించనున్నాయి. అవేంటో చూద్దాం.  మిస్టర్ కింగ్ కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ కింగ్’. దివంగత విజయ నిర్మల మనవడు శరణ్‌కుమార్ హీరోగా నటించాడు. శశికుమార్ చావలి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 24న ఈ సినిమా విడుదలవుతోంది.  డెడ్‌ లైన్  ఊహించిన విధంగా కథనంతో ‘డెడ్‌లైన్’ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం ప్రకటించి అంచనాలు పెంచింది. అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ నెల 24న విడుదలవుతోంది.  కోనసీమ థగ్స్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రఫర్ బృందా గోపాల్ డైరెక్ట్ చేసిన రెండో చిత్రమే ‘కోనసీమ థగ్స్’. ప్రొడ్యూసర్ రిబూ తమీన్స్ కుమారుడు హిద్రూ పరూన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘థగ్స్’గా రూపుదిద్దుకున్న ఈ అనువాద చిత్రాన్ని మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తెలుగులో ‘కోనసీమ థగ్స్’గా విడుదల చేస్తోంది.  OTT విడుదలలు TitleCategoryLanguagePlatformRelease DateVarasuduMoviesTamilAmazon PrimeFebruary 22Veerasimha ReddyMoviesTeluguDisney Plus HotstarFebruary 23MichaelMoviesTeluguAhaFebruary 24Waltheru VeeraiyaMoviesTeluguNetflixFebruary 27The StraysMoviesEnglishNetflixFebruary 22Call me ChichiroMoviesEnglishNetflixFebruary 23Rabia and OliviaMoviesEnglishHotstarFebruary 24Potluck S2SeriesHindiSonyLivFebruary 24A Quite PlaceMovieEnglishNetflixFebruary 24Puli MekaSeriesTeluguZee5February 24
    ఫిబ్రవరి 22 , 2023
    Summer Heroines 2024: వేసవి హీట్‌ మరింత పెంచేందుకు సిద్ధమవుతున్న అందాలు భామలు వీరే! 
    Summer Heroines 2024: వేసవి హీట్‌ మరింత పెంచేందుకు సిద్ధమవుతున్న అందాలు భామలు వీరే! 
    సమ్మర్‌ అంటే తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద పండగ లాంటిది. స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవుల నేపథ్యంలో చిన్న, పెద్ద సినిమాలు సమ్మర్‌లో విడుదలయ్యేందుకు ఆసక్తి కనబరుస్తాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో వినోదాలు పంచడానికి పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా అందులోని కథానాయకులు వేసవి హీట్‌ను తమ అందచందాలతో మరింత పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు నటించిన చిత్రాలు ఏంటి? అవి ఎప్పుడు విడుదలవుతాయి? వంటి అంశాలు ఈ కథనంలో చూద్దాం.  మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) ‘సీతా రామం’, ‘హాయ్‌ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మృణాల్‌ ఠాకూర్‌.. ఈ సమ్మర్‌లో సరికొత్త మూవీతో వస్తోంది. యంగ్‌ హీరో విజయ్‌ నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లో మరోమారు సందడి చేయబోతోంది. ఈ మూవీ ఏప్రిల్‌ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.  దివ్యాంశ కౌషిక్‌ (Divyansha Kaushik) ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ద్వారా అలరించనున్న మరో నటి దివ్యాంశ కౌషిక్‌. ఇందులో ఈ భామ సెకండ్‌ హీరోయిన్‌గా చేస్తోంది. 2019లో వచ్చిన మజిలీ సినిమా ద్వారా దివ్యాంశ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రామారావు ఆన్‌ డ్యూటీ, పోలీసు వారి హెచ్చరిక, మైఖేల్‌ తదితర చిత్రాల్లో నటించింది.  అంజలి (Anjali) ప్రముఖ హీరోయిన్‌ అంజలి కూడా ఈ వేసవిని మరింత హీటెక్కించేందుకు రెడీ అవుతోంది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను మరోమారు పలకరించనుంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్‌, షకలక శంకర్ ముఖ్యపాత్రలు పోషించారు.  స్వర్ణిమా సింగ్‌ (Swarnima Singh) హర్షివ్‌ కార్తీక్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బహుముఖం' (Bahumukham). 'గుడ్‌, బ్యాడ్ యాక్టర్‌' అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమాలో స్వర్ణిమా సింగ్‌ కథానాయికగా చేసింది. తన అందం, అభినయంతో ఆకట్టుకునేందుకు ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  మీనాక్షి గోస్వామి (Meenakshi Goswami) మీనాక్షి గోస్వామి కథానాయికగా చేసిన లేటెస్ట్‌ చిత్రం 'భరతనాట్యం'. ఈ మూవీ ద్వారానే మీనాక్షి తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా సూర్యతేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్నాడు. సినిమా ఓ యువకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందన్న కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రనీకాన్వికా (Praneekaanvikaa) ఏప్రిల్‌లో విడుదల కాబోతున్న మరో చిన్న చిత్రం 'మార్కెట్‌ మహాలక్ష్మీ'. కేరింత ఫేమ్‌ పార్వతీశం హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రణీకాన్వికా నటించింది. ఇదే ఆమెకు మెుదటి సినిమా. ఈ మూవీ విజయం ద్వారా తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకోవాలని ఈ బ్యూటీ భావిస్తోంది. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.  కోమలి ప్రసాద్‌ (Komali Prasad)  యంగ్‌ హీరోయిన్‌ కోమలి ప్రసాద్‌ కూడా.. ఈ వేసవిలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘శశివదనే’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను పలకరించనుంది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ‘నేను సీతాదేవి’ (2016) చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన కోమలి.. ‘హిట్‌ 2’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. శశివదనే సినిమా విజయంపై ఈ బ్యూటీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.  వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ సినిమా సెక్సెస్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయిన హీరోయిన్‌ వైష్ణవి చైతన్య. ఈ భామ నటించిన రెండో చిత్రం 'లవ్‌ మి ఇఫ్‌ యు డేర్‌' కూడా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ నెల 25 నుంచి తెలుగు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయనుంది. 
    ఏప్రిల్ 03 , 2024
    Rashi Singh: జీన్స్ బటన్ విప్పి.. చెమటలు పట్టిస్తున్న కుర్ర హీరోయిన్
    Rashi Singh: జీన్స్ బటన్ విప్పి.. చెమటలు పట్టిస్తున్న కుర్ర హీరోయిన్
    కుర్ర హీరోయిన్ రాశి సింగ్ హాట్ ఫోటో షూట్‌తో పరువాల విందు చేస్తోంది. అందాల ప్రదర్శనతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది.  బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ వేసుకున్న ఈ ముద్గుగుమ్మ జీన్స్ బటన్ తొలగించి హాట్ ఫొటో షూట్ చేసింది. rashi singh ఎద, నాభి అందాలు ఎకరువు పెడుతూ కుర్రాళ్లకు కనుల విందు చేసింది.  దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అనే పంథాలో సాగుతున్నట్లు రాశి సింగ్ కనిపిస్తోంది. ఇన్‌స్టాలో హాట్ ఫోటో షూట్ తాలుకు ఫోటోలు పెడుతూ కవ్విస్తుంటుంది. ముఖ్యంగా తనకు ఇష్టమైన బ్లాక్, లైట్ పింక్ కలర్ డ్రెస్సులో నిండైన అందాలను ఎర వేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే రాశి సింగ్(Rashi singh Hot) చలాకీగా ఉంటుంది. ఎప్పటికప్పుడూ రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. ఇన్‌స్టాలో ఈ సుందరాంగికి 1మిలియన్‌కు దగ్గర్లో ఫాలోవర్లు ఉన్నారు. తెలుగులో జమ్ (2019) చిత్రం ద్వారా రాశి సింగ్ వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పోస్టర్, రీసౌండ్ వంటి చిన్నా చితక సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు . అయితే ఆది సాయికుమార్ నటించిన శశి చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్‌లో మెప్పిస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తోంది.  రాశి సింగ్ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. ఈమె ఛత్తీస్ గఢ్‌లోని బిలాయిలో 1994 జనవరి 5న జన్మించింది.  బిలాయిలోని కృష్ణ పబ్లిక్ స్కూల్‌లో సెకండరీ విద్యను, ముంబైలో పీజీ చదివింది. రాశి సింగ్‌కు డ్యాన్స్ చేయడం, సాంగ్స్ వినడమంటే ఇష్టం ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన "భూతద్దం భాస్కర్ నారాయణ'' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం విలేజ్ క్లైమ్ నేపథ్యంలో రానుంది. ఈ సినిమా విజయంపై రాశి సింగ్(Rashi singh Movies) గంపెడు ఆశలు పెట్టుకుంది. సినిమా సక్సెస్ అయితే అవకాశాలు దారి చూపుతాయని కలలు కంటోంది. 
    ఫిబ్రవరి 26 , 2024
    The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
    The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
    'ది కేరళ స్టోరీ ' చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపుతోంది. మే 5న ఈ సినిమా విడుదల కానుండగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయోద్దంటూ కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్‌, సీపీఐ, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ విద్వేషపూరితంగా చిత్రీకరించారని, సినిమా విడుదల చేస్తే మత సామరస్యం దెబ్బతింటుందని పలువురు ఏకంగా సుప్రీకోర్టునే ఆశ్రయించారు. ఈ స్థాయిలో వివాదం రాజుకోడానికి కారణమేంటి? ఈ చిత్రంపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? కేరళ కంటే తమిళనాడు ఎందుకు ఎక్కువగా ఆందోళన చెందుతోంది? అసలు ఈ సినిమా సెన్సార్‌ క్లియర్‌ చేసుకుందా? వంటి ప్రశ్నలకు ఈ ప్రత్యేక కథనంలో సమాధానం చూద్దాం. వివాదానికి బీజం: సుదీప్తోసేన్‌ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్‌ అమృత్‌లాల్‌ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరతారు. ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఏప్రిల్‌ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది.  కేరళ సీఎం ఆగ్రహం 'ది కేరళ స్టోరీ' ట్రైలర్‌.. కేరళ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం స్పందించారు. ‘రాష్ట్రంలో మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుంది. ‘లవ్‌ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినా.. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయని.. వారి రాజకీయాలు ఇక్కడ సాగవని పరోక్షంగా భాజపా, RSSలకు చురకలు అంటించారు.  సినిమాను బ్యాన్‌ చేయాలి ‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలను కేరళ అధికార పార్టీతోపాటు విపక్ష కాంగ్రెస్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడింది. రాష్ట్రంలో చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్‌, డీవైఎఫ్‌ఐ, ఐయూఎంఎల్‌ వంటి యువజన సంఘాలు డిమాండ్‌ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కేరళను అవమానించే రీతిలో ఈ చిత్రం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీడీ సతీశన్‌ పేర్కొన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఓ వర్గం యత్నిస్తోందని ఐయూఎంఎల్ జాతీయ కార్యదర్శి పీకే ఫిరోజ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్విట్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు.  తమిళనాడు అలెర్ట్‌ ది కేరళ స్టోరి రిలీజ్‌ డేట్‌ సమీపిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్‌ బృందాలు అలెర్ట్‌ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ‘కేరళ స్టోరీ’ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి నిఘా వర్గాలు సూచించాయి. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు  ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అన్ని థియేటర్లలో పొన్నియన్‌ సెల్వన్‌-2 నడుస్తున్నట్లు చెప్పాయి. ధియేటర్‌ యాజమానులు ‘ది కేరళ స్టోరీ’ని ఇప్పట్లో రిలీజ్‌ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి. సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరాలు ‘ది కేరళ స్టోరీ’ ఇటీవలె సెన్సార్‌ పూర్తి చేసుకుంది. వివాదస్పదంగా మారిన ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ‘A సర్టిఫికేట్’ ఇచ్చింది. అంతేగాక సినిమాలోని వివిధ సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దేవుళ్లకు సంబంధించిన డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది. మరికొన్ని పదాలను సవరించాలని కోరింది. మొత్తం 10 సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. వాటిని డిలీట్ చేయాలని చెప్పింది. పలు సవరణలతో మే 5న చిత్ర విజయానికి అనుమతించింది.  సుప్రీంకోర్టు స్పందన ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన అభ్యర్థనను ధర్మాసనం నిరాకరించింది. ‘ది కేరళ స్టోరీ’లో విద్వేషపూరితమైన ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయని దాఖలైన పిటీషన్‌పై కోర్టు స్పందించింది. ‘ఈ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందింది. మీరు దీని విడుదలను సవాల్‌ చేయాలనుకుంటే ఆ సర్టిఫికెట్‌తో తగిన ఫోరంను సంప్రదించండి’ అని సుప్రీంకోర్టు పిటిషనర్లకు సూచించింది. 
    మే 03 , 2023
    SS RAJAMOULI: రాజమౌళి సినిమాల్లో కామన్‌గా కామాంధుడి పాత్ర… అసలు ఎందుకిలా ?
    SS RAJAMOULI: రాజమౌళి సినిమాల్లో కామన్‌గా కామాంధుడి పాత్ర… అసలు ఎందుకిలా ?
    దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సినిమాను ఎమోషన్‌తో నడిపిస్తాడు. ప్రేక్షకులు చిత్రంలో లీనమయ్యేందుకు కొన్ని క్యారెక్టర్లను సృష్టిస్తాడు. తన సినిమాల్లో ఓ కామాంధుడి పాత్ర కామన్‌గా ఉంటుంది. మెుదటి సినిమా స్టూడెంట్‌ నంబర్‌ 1 నుంచి మెుదలుకొని చాలా సినిమాల్లో మనకు ఈ పాత్రలు కనిపిస్తాయి. ఆ క్యారెక్టర్లు ఏంటో ఓసారి చూద్దాం..  స్టూడెంట్‌ నంబర్‌ 1 ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్‌ నంబర్‌ 1 సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాజమౌళి. ఈ చిత్రంలో ఛత్రపతి శేఖర్‌ ఓ అమ్మాయిని రేప్ చేయాలని చూస్తుండగా హీరో వాళ్లని అడ్డుకుంటాడు. ఫైట్‌ చేసి అమ్మాయిని రక్షిస్తాడు. ఈ క్రమంలో మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు ఎన్టీఆర్. ఇలాంటి ట్విస్ట్‌తో స్క్రీన్‌ప్లే మార్చేశాడు జక్కన్న. https://www.youtube.com/watch?v=z3zTPvCLNcI సింహాద్రి ఎన్టీఆర్‌తో సింహాద్రి సినిమా తీసి ఊర మాస్ హిట్‌ కొట్టాడు రాజమౌళి. ఇందులో విలన్ రాహుల్‌ దేవ్‌ కామాంధుడి పాత్రలో కనిపిస్తాడు. అత్యంత కిరాతకాలు చేస్తున్న అతడిని చంపేయడంతో సింగమలై అని ఎన్టీఆర్‌ను పిలుస్తుంటారు. అతడిని చంపేయడంతోనే సినిమా కీలక టర్న్ తీసుకుంటుంది. సింగమలై అంటూ కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు హైలెట్‌. ఈ సినిమా కథను తొలుత  ప్రభాస్‌కు చెప్పాడట రాజమౌళి.  https://www.youtube.com/watch?v=53DHset7VEw సై.. నితిన్‌ హీరోగా కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రం సై. ఇందులో రగ్బీ గేమ్‌తో సంచలనం సృష్టించాడు జక్కన్న. ఈ చిత్రంలోనూ విలన్‌ ప్రదీప్‌ రావత్‌కు అమ్మాయిల వీక్‌నెస్‌ ఉంటుంది. హీరో ముప్పు తిప్పలు పెడుతున్న వేళ శశికళ అనే అమ్మాయి దగ్గరికి వెళతాడు. వీళ్లిద్దరి మధ్య కూడా కొన్ని కామెడీ సన్నివేశాలు తీశాడు దర్శకుడు. https://www.youtube.com/watch?v=FUqXJb37DU4 ఛత్రపతి ఛత్రపతిలో ఎన్ని పాత్రలు ఉన్న షఫీ క్యారెక్టర్‌ ప్రత్యేకం. సినిమాలో ప్రభాస్‌ చెల్లిలి బస్సులో వెళ్తుండగా అసభ్యంగా ప్రవర్తిస్తాడు షఫీ. అతడిని చితక్కొట్టి గుండు గీయిస్తాడు ప్రభాస్. అక్కడే వాళ్లిద్దరూ అన్నదమ్ములు అని తెలుస్తోంది. ఇలా ప్రేక్షకులు చిత్రంలో లీనమయ్యేలా చేశాడు దర్శక దిగ్గజం రాజమౌళి.  https://www.youtube.com/watch?v=_rImbIj2wp8 విక్రమార్కుడు విక్రమార్కుడులో బావూజీ కుమారుడిగా నటించిన అమిత్ తివారిది కామాంధుడి పాత్ర. ఊర్లో నచ్చిన మహిళను తీసుకెళ్లి రేప్ చేస్తుంటాడు. అతడిని చితకబాది జైలులో వేస్తాడు రవితేజ. ఈ ఒక్క సీన్‌తో విక్రమ్ రాథోడ్‌ పవర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు రాజమౌళి.  ఈ సీన్‌ సినిమాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. https://www.youtube.com/watch?v=Tf8N3VNHt8w మగధీర మగధీరలోనూ రాజమౌళి కామాన్ని ప్రధాన ఇతివృత్తంగా మేళవించాడు.  మిత్రవిందపై రణదేవ్ బిల్లా కన్నపడుతుంది. పునర్జన్మల నేపథ్యంలోనూ రణదేవ్ కామంధుడి  క్యారెక్టర్‌లో కొనసాగుతాడు. కాజల్‌పై ఉన్న ఇష్టాన్ని తరచూ చూపిస్తుంటాడు. ఇలా విలన్‌ పాత్రను ప్రేక్షకులకు నచ్చకుండా చేస్తూ హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్‌ చేశాడు జక్కన్న. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. https://www.youtube.com/watch?v=Fl2plgSlZnE ఈగ ఈగలో కిచ్చ సుదీప్‌ క్యారెక్టర్‌ కూడా దాదాపు ఇలాంటిదే. సినిమా ప్రారంభంలోనే హంసనందినితో వచ్చే సన్నివేశాలు.. తర్వాత సమంతను ఇష్టపడుతూ ఆమెతో ట్రావెల్‌ చేస్తున్న సంఘటనలతో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. https://www.youtube.com/watch?v=fUY1hIAZyzo బాహుబలి 2 బాహుబలి 2లోనూ ఓ కామంధుడి పాత్ర మనకు కనిపిస్తుంది.  దేవసేన దైవ దర్శనం కోసం వస్తుంటే సేతుపతి( రాకేష్ వర్రే) ఆమెను అవమానించాలని ప్రయత్నిస్తాడు. ఆమెతో వస్తున్న మహిళలను అసభ్యంగా తాకుతూ.. దేవసేనను తాకెందుకు ప్రయత్నిస్తాడు. దేవసేన కత్తితో అతని వేళ్లను నరుకుతుంది. ఈ సీన్‌ తర్వాత కోర్ట్ సీన్‌లో ప్రభాస్ సేతుపతి తల నరికే సన్నివేశం గూస్‌బంప్స్ కలిగిస్తుంది.  https://youtube.com/shorts/Ih_Dnp-BbaI?feature=share https://telugu.yousay.tv/ssmb29-rajamoulis-huge-sketch-for-maheshs-film-talks-with-kamal-haasan-chiyan-vikram.html
    ఏప్రిల్ 25 , 2023
    శివాని నగరం గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    శివాని నగరం గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
     టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త తెలుగు హీరోయిన్లలో శివాని నగరం(Shivani Nagaram) ఒకరు. యంగ్‌ హీరో సుహాస్‌ ప్రధాన పాత్ర పోషించిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఈక్రమంలో శివాని నగరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. (Some Lesser Known Facts about Shivani Nagaram )  శివాని నగరం ఎప్పుడు పుట్టింది? 2001, ఆగస్టు 21న జన్మించింది శివాని నగరం హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా? అంబాజి పేట మ్యారేజ్ బ్యాండు శివాని నగరం ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు  శివాని నగరం రాశి ఏది? కుంభం శివాని నగరం ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ శివాని నగరం అభిరుచులు? పుస్తకాలు చదవడం, సింగింగ్ శివాని నగరంకు ఇష్టమైన ఆహారం? నాన్ వెజ్, చికెన్ శివాని నగరంకు ఇష్టమైన కలర్? బ్లాక్, పింర్ శివాని నగరంకు ఇష్టమైన హీరో? మహేష్ బాబు శివాని నగరం ఏం చదివింది? డిగ్రీ శివాని నగరం పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కో సినిమాకు రూ.10 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. శివాని నగరం సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? ఇన్‌స్టా రీల్స్ ద్వారా ఫేమస్ అయింది శివాని నగరం ఎఫైర్స్ ఉన్నాయా? అలాంటివి ఏమి లేవు శివాని నగరం ఎక్కడ ఉంటుంది? జూబ్లీ హిల్స్, హైదరాబాద్ శివాని నగరం ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/shivani_nagaram/?hl=en&img_index=1 https://www.youtube.com/watch?v=EAsvlMaZF3M
    ఏప్రిల్ 05 , 2024
    New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
    New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
    శివరాత్రి సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. శివరాత్రి స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.   కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 ఏడీ' నుంచి శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్‌ రిలీజైంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ పేరును పోస్టర్‌ ద్వారా మూవీ టీమ్‌ తెలియజేసింది. ప్రభాస్‌ పాత్ర పేరును భైరవగా ప్రకటిస్తూ భవిష్యత్తుకు చెందిన కాశీ వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం' అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది.  కన్నప్ప (Kannappa) మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు ఈ పోస్టర్‌లో కనిపించాడు. కాగా, ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. NBK109 నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ కాంబోలో వస్తున్న 'NBK 109' చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్‌ విడుదలైంది. యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందించిన గ్లింప్స్‌లో బాలయ్యను బాబీ ‘నేచురల్ బోర్న్ కింగ్’ (NBK)గా చూపించారు. గ్లింప్స్‌లో చాలా స్టైలిష్ లుక్‌లో బాలయ్య అదరగొట్టారు. ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా వైలెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.  https://twitter.com/i/status/1766375268804120887 ఓదెల 2 (Odela 2) తమన్నా (Tamannaah Bhatia) లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో డైరెక్టర్‌ సంపత్‌ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో తమన్నా కనిపించింది. షరతులు వర్తిస్తాయి! (Sharathulu Varthisthai) చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం నుండి కూడా శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్‌ విడుదలైంది. ‘ఈ దేశంలోని 80% మంది సామాన్యుల కథనే మన సినిమా’ అంటూ మేకర్స్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని స్టార్‌ లైట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. ‘దేవకీనందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) తొలి సినిమాతోనే హీరోగా ఆకట్టుకున్న మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) చేస్తున్న రెండో సినిమా ‘దేవకీనందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం చేస్తున్నారు. హనుమాన్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. కాగా, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర యూనిట్‌ ఓ స్పెషల్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ నెట్టింట ట్రెండ్ అవుతోంది.  గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi) హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వ‌చ్చిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శుక్రవారం శివరాత్రితో పాటు ‘ఉమెన్స్‌ డే’ కూడా కావడంతో దానికి గుర్తుగా ఇందులోని అంజలి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నటిస్తుండగా సత్యం రాజేష్‌, షకలక శంకర్‌, అలీ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  శ్రీరంగ నీతులు (Sri Ranga Neethulu) సుహాస్ హీరోగా ప్రవీణ్‌ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘శ్రీరంగ నీతులు’. ఈ సినిమాలో కార్తిక్‌ రత్నం మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ లుక్ పోస్టర్‌ విడుదలైంది. సుహాస్‌, కార్తిక్‌ రత్నంతో పాటు నటి రుహాని శర్మ పోస్టర్‌లో కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్‌ కానుంది. గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs Of Godavari) విశ్వక్‌సేన్‌  హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి  ఫీమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా  మేకర్స్‌ అంజలికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోస్టర్‌ను రిలీజ్ చేశారు.  సత్యభామ (Sathyabhama) స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘సత్యభామ’. అఖిల్‌ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఆరమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదలైంది. 
    మార్చి 09 , 2024
    Shivarathri: శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు… సినిమా లింక్‌లు ఇవిగో..
    Shivarathri: శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు… సినిమా లింక్‌లు ఇవిగో..
    శివరాత్రికి ఉండే ప్రత్యేకతే వేరు. ఈ రోజున భక్తి పరవశులై హిందువులు ఆధ్యాత్మికతలో మునిగి తేలుతారు. నీలకంఠేశుడిపైనే మనసు, తనువు లగ్నం చేసి నిష్ఠతో గడుపుతారు. శివరాత్రి రోజున ఉపవాస నియమాన్ని పాటించేవారు జాగారం చేస్తుంటారు. ఈ పవిత్ర రాత్రి సమయంలో మెలుకువతో ఉండి జీవితంలోని చీకట్లను తొలగించుకోవాలని చెబుతుంటారు. శివరాత్రి రోజున జాగారం కీలక ఘట్టం. ఈ సమయాన్ని కొందరు భజనకు కేటాయిస్తే మరికొందరు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకొందరు సినిమాలు చూస్తుంటారు. ప్రస్తుతం డిజిటల్ యుగంగా మారినందున చాలామంది ఫోన్‌లోనే సినిమాలు చూసేస్తున్నారు. అయితే, శివరాత్రి రోజున ఆధ్యాత్మికకు సంబంధించిన సినిమాలను చూడాలని భావించే వారు వీటిని ట్రై చేయొచ్చు.  భూ కైలాస్ అలనాటి సినిమా అయినప్పటికీ నేటికీ కొత్త అనుభూతిని కలిగించే సినిమా ఇది. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా. రావణాసురుడి పాత్రలో ఎన్టీఆర్ నటించారు. శివరాత్రికి మీకు తప్పకుండా మంచి అనుభూతిని అందిస్తుంది.  https://www.youtube.com/watch?v=I4C9hhuwxfQ భక్త కన్నప్ప 1976లో వచ్చిన భక్తిరస చిత్రమే ‘భక్త కన్నప్ప’. శివుడి భక్తుడి పాత్రలో దివంగత కృష్ణం రాజు నటించారు. భక్త కన్నప్పగా  ఆ పాత్రకు జీవం పోశారు. ఇది కూడా శివరాత్రి రోజున చూడదగిన సినిమానే. https://www.youtube.com/watch?v=1_oYrqjgBEM మహా శివరాత్రి సాయికుమార్, రాజేంద్రప్రసాద్ కలిసి నటించిన సినిమా ఇది. మీనా ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. రేణుక శర్మ దర్శకత్వం వహించారు.  https://www.youtube.com/watch?v=ArgkDQzeHXk శ్రీ మంజునాథ శివరాత్రి సినిమాలనగానే వెంటనే ఈ సినిమా పేరే గుర్తొస్తుంది. అంతలా ఫేమస్ అయ్యింది ఈ సినిమా. నాస్తికుడు శివుడి భక్తుడిగా ఎలా మారాడో ఈ సినిమాలో చూపిస్తారు. భక్తుడిగా అర్జున్, శంకరుడిగా చిరంజీవి నటించారు. అర్జున్ సరసన సౌందర్య కీలక పాత్ర పోషించింది.  https://www.youtube.com/watch?v=6B_kgUvWGsQ జగద్గురు ఆదిశంకర ఆదిశంకరాచార్యుల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో సాగుతుందీ సినిమా. నాగార్జున, సాయికుమార్, మోహన్ బాబు, కమలిని ముఖర్జీ తదితరులు కీలక పాత్ర పోషించారు. శంకరచార్యులుగా కౌశిక్ బాబు నటించాడు. https://www.youtube.com/watch?v=y8bB-aaVZv4 ఈ సినిమాలను చూసి మీలోని ఆధ్యాత్మిక భావాన్ని మరింత రెట్టింపు చేసుకోండి. శివరాత్రి జాగారాన్ని ఫలప్రదం చేయండి. 
    మార్చి 08 , 2024
    అల్లు శిరీష్ (Allu Sirish) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అల్లు శిరీష్ (Allu Sirish) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అల్లు శిరీష్ తన సోదరుడు అల్లు అర్జున్ స్ఫూర్తితో నటుడిగా మారాలని నిర్ణంచుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. గౌరవం చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఊర్వశివో రాక్షసివో చిత్రం మంచి బ్రెక్‌ ఇచ్చింది. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.  టాలీవుడ్‌లో చాక్లెట్ బాయ్‌గా గుర్తింపు పొందిన అల్లు శిరీష్‌ గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. అల్లు శిరీష్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు అల్లు శిరీష్ తొలి సినిమా? గౌరవం(2013) అల్లు శిరీష్ ఎక్కడ పుట్టాడు? చెన్నై అల్లు శిరీష్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1987, మే 30 అల్లు శిరీష్ వివాహం అయిందా? ఇంకా జరగలేదు. అల్లు శిరీష్‌కు లవర్ ఉందా? అను ఇమాన్యూవెల్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. అల్లు కిషన్ ఫెవరెట్ హీరో? పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్ అల్లు శిరీష్ తొలి హిట్ సినిమా? ఊర్వశివో రాక్షసివో చిత్రం శిరీష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది.  అల్లు శిరీష్ ఇష్టమైన కలర్? వైట్ అల్లు శిరీష్ తల్లిదండ్రుల పేరు? నిర్మల, అల్లు అరవింద్ అల్లు శిరీష్ ఇష్టమైన ప్రదేశం? కులు మనాలి అల్లు శిరీష్ ఏం చదివాడు? MCJ అల్లు శిరీష్ అభిరుచులు? డ్రైవింగ్, జిమ్మింగ్ అల్లు శిరీష్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.  అల్లు శిరీష్‌కు ఇష్టమైన ఆహారం? బిర్యాని అల్లు శిరీష్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకి దాదాపు రూ. 2.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=Wg-K4QjOf_Q
    మార్చి 21 , 2024
    Shivarathri: శివరాత్రి రోజున శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు ఇవే..
    Shivarathri: శివరాత్రి రోజున శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు ఇవే..
    ]జగద్గురు ఆదిశంకరఆదిశంకరాచార్యుల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో సాగుతుందీ సినిమా. నాగార్జున, సాయికుమార్, మోహన్ బాబు, కమలిని ముఖర్జీ తదితరులు కీలక పాత్ర పోషించారు. శంకరచార్యులుగా కౌశిక్ బాబు నటించాడు.Watch Now
    ఫిబ్రవరి 16 , 2023
    <strong>Shivaleeka Oberoi Hot: పులి చారల బికినీలో టెంప్ట్‌ చేస్తున్న శివలీకా ఒబెరాయ్‌..!</strong>
    Shivaleeka Oberoi Hot: పులి చారల బికినీలో టెంప్ట్‌ చేస్తున్న శివలీకా ఒబెరాయ్‌..!
    బాలీవుడ్‌ సొగసుల సుందరి శివలీకా ఒబెరాయ్ (Shivaleeka Oberoi).. సోషల్‌ మీడియాలో పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది. తాజాగా బికినిలో ఫొటోషూట్ నిర్వహించిన ఈ అమ్మడు.. పులిచారల జాకెట్‌తో ఎద సొగసులను ఆరబోసింది.&nbsp; సముద్రంలో బోటుపై నిలబడిన శివలీక.. తన మత్తెక్కించే అందాలతో నెటిజన్లకు గిలిగింతలు పెట్టింది.&nbsp; శివలీక లేటెస్ట్‌ అందాలు.. ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ భామ అందాలకు కుర్రకారు ముగ్దులవుతున్నారు.&nbsp; శివలీక ఒబెరాయ్‌.. 1995 జులై 24న ముంబయిలో జన్మించింది. ముంబయి యూనివర్శిటీలో సైకాలజీ చేసింది.&nbsp; సినిమాలపై ఆసక్తితో అనుపమ్ ఖేర్స్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో 3 నెలల డిప్లమో కోర్సు చేసింది. తద్వారా నటనలో నైపుణ్యం సంపాదించింది.&nbsp; 2014లో వచ్చిన కిక్‌ సినిమాతో శివలీకా.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నటిగా కాదు. ఆ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా శివలీకా పనిచేసింది.&nbsp; ఇక 2016లో వచ్చిన హౌస్‌ ఫుల్‌ 3 (Housefull 3) మూవీకి సైతం శివలీక ఒబెరాయ్‌.. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసి పని గుర్తింపు సంపాదించింది. 2017లో వచ్చిన యే సాలి ఆషిఖీ (Yeh Saali Aashiqui) ఫిల్మ్‌తో నటిగా శివలీక.. తెరంగేట్రం చేసింది.&nbsp; ఇందులో మిథాలి డియోరా పాత్రలో చక్కటి నటన కనబరిచింది. తన అద్భుత నటనతో బెస్ట్ డెబ్యూట్‌ కేటగిరీలో ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్‌కు సైతం నామినేట్‌ అయ్యింది. ఆ తర్వాత ఖుదా హాఫీజ్ (2020), ఖుదా హాఫీజ్ చాప్టర్‌ 2 (Khuda Haafiz: Chapter 2) ఈ అమ్మడు కనిపించింది. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాకపోవడంతో బాలీవుడ్‌లో ఈ భామకు అవకాశాలు దక్కలేదు.&nbsp; శివలీక వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె 2018లో బాలీవుడ్‌ నటుడు కరమ్‌ రాజ్‌పాల్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల వారి బంధం పెళ్లిపీటల వరకూ వెళ్లలేదు. ఇక 2022లో బాలీవుడ్‌ నిర్మాత అభిషేక్‌ పతక్‌తో శివలీక ఒబెరాయ్‌ నిశ్చితార్థం చేసుకుంది. వీరి పెళ్లి 2023 ఫిబ్రవరిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో గోవాలో ఘనంగా జరిగింది.&nbsp; ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్టులు చేతిలో లేకపోవడంతో ఈ అమ్మడు సోషల్‌ మీడియాను నమ్ముకుంది. ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫొటో షూట్స్‌ నిర్వహిస్తూ దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోది. శివలీక ఇచ్చే హాట్‌ ట్రీట్‌ కోసం పెద్ద సంఖ్యలో నెటిజన్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఫాలో అవుతున్నారు. 2.3 మిలియన్ల మంది ఫాలోవర్లుగా ఉన్నారు.&nbsp;
    జూలై 02 , 2024
    Kalki 2898 AD: శివరాత్రి స్పెషల్‌.. సాలిడ్‌ అప్‌డేట్‌తో ముందుకొస్తున్న ‘కల్కీ’ టీమ్‌!
    Kalki 2898 AD: శివరాత్రి స్పెషల్‌.. సాలిడ్‌ అప్‌డేట్‌తో ముందుకొస్తున్న ‘కల్కీ’ టీమ్‌!
    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేష్‌లో రూపొందుతున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). మైథాలజీ ఇన్‌స్పైర్డ్‌ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో అంచనాలు మరింత హైప్‌లోకి వెళ్లాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉండనుందో అర్థమైపోతోంది. ఇదిలా ఉంటే నేడు శివరాత్రి సందర్భంగా మేకర్స్ సరికొత్త అప్‌డేట్‌కి రెడీ అయిపోయారు. ఇందుకు సంబంధించి పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.&nbsp; పోస్టర్‌లో ఏముంది? ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌, టీజర్‌లో ప్రభాస్‌ పాత్ర పేరును మూవీ టీమ్‌ ఎక్కడా రివీల్‌ చేయలేదు. అయితే ఇవాళ శివరాత్రి సందర్భంగా హీరో పేరును ప్రకటించబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు. సాయంత్రం 5:00 గంటలకు రివీల్ చేయనున్నట్లు సరికొత్త పోస్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ పోస్టర్‌లోని శివలింగం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. మరోవైపు కల్కిలో ప్రభాస్‌ పేరు ఏమై ఉంటుందా? అని ఫ్యాన్స్‌ ఇప్పటికే ఆలోచనల్లో పడిపోయారు.&nbsp; https://twitter.com/chitrambhalareI/status/1766015501350883362 ఇటలీలో ప్రభాస్, దిశా పటానీ.. తాజాగా కల్కి చిత్ర యూనిట్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటానీతో పాటు యూనిట్ అంతా కలసి దిగిన ఫోటోను మేకర్స్ గురువారం షేర్ చేశారు. ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇటలీలోని అద్భుతమైన లోకేషన్స్‌లో ఈ పాటని చాలా గ్రాండ్‌గా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్‌లో ప్రభాస్ (Prabhas), దిశా పటానీ (Disha Patani) మధ్య రొమాన్స్ ఉండనుందని సమాచారం. కాగా ఈ మూవీలో దిశా పటానీతో పాటు బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొనే మరో హీరోయిన్‌గా నటిస్తోంది.&nbsp; ఆ రోజు రావడం పక్కా! ప్రభాస్‌ ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో జాప్యం జరుగుతున్నట్లు వార్తలు రావడంతో చిత్ర విడుదలపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ నిర్వహిస్తూ ఆ కన్ఫ్యూజన్‌ను దూరం చేసింది వైజయంతీ మూవీ మేకర్స్. కల్కి సినిమాను మే 9న విడుదల చేయడం పక్కా అన్నట్లుగా సోషల్ మీడియాలో వరుస అప్‌డేట్స్‌ను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.&nbsp; కల్కీ రిలీజయ్యే భాషలు ఇవే! ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్‍ (San Diego Comic-Con 2023)లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి టీమ్‌ రికార్డు సృష్టించింది. అప్పటినుంచి మూవీపై హాలీవుడ్‍‍లో కూడా క్రేజ్ ఉంది.&nbsp;
    మార్చి 08 , 2024

    @2021 KTree