• TFIDB EN
  • సత్య
    UATelugu
    సత్య (హమరేష్‌) ప్రభుత్వ కాలేజీలో ఇంటర్‌ చదువుతూ ఫ్రెండ్స్‌తో హాయిగా జీవిస్తుంటాడు. తండ్రి కోరిక మేరకు ఇష్టంలేక పోయిన కార్పోరేట్‌ కాలేజీలో చేరతాడు. అక్కడి స్టూడెంట్స్‌ లో-క్లాస్‌ అంటూ సత్యను ఎగతాళి చేస్తుంటారు. ఇలాంటి టైమ్‌లో తోటి స్టూడెంట్‌ పార్వతి (ప్రార్థన సందీప్) పరిచయమవుతుంది. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? కాలేజీలో సత్య ఎలాంటి పరిస్థితులు ఫేస్‌ చేశాడు? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    హమారేష్ సతీష్
    ఆడుకలం మురుగదాస్
    ప్రార్థన సందీప్
    అమిత్ భార్గవ్
    సంజయ్
    రాహుల్
    విశ్వా
    అక్షయ హరిహరన్
    కృతిగ
    సిబ్బంది
    వాలి మోహన్ దాస్దర్శకుడు
    జి. సతీష్ కుమార్నిర్మాత
    కె. బాబు రెడ్డినిర్మాత
    వాలి మోహన్ దాస్రచయిత
    సుందరమూర్తి KSసంగీతకారుడు
    I. మారుతనాయగంసినిమాటోగ్రాఫర్
    ఆర్.సత్యనారాయణన్ఎడిటర్ర్
    కథనాలు
    సత్యదేవ్ (Satyadev) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సత్యదేవ్ (Satyadev) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
     తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో  సత్యదేవ్ ఒకరు. బ్లఫ్‌ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి సినిమాల సక్సెస్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా కొనసాగుతున్న సత్యదేవ్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. సత్యదేవ్ అసలు పేరు? సత్యదేవ్ కంచరణా సత్యదేవ్  ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు సత్యదేవ్ తొలి సినిమా? మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రం ద్వారా సత్యదేవ్ ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమయ్యాడు. హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'బ్లప్‌ మాస్టర్'  సత్యదేవ్ ఎక్కడ పుట్టాడు? విశాఖపట్నం, ఏపీ సత్యదేవ్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1989 జులై 4 సత్యదేవ్‌కు వివాహం అయిందా? దీపికతో 2016లో పెళ్లి జరిగింది. 2020లో ఈ జంటకు ఒక కొడుకు జన్మించాడు. పేరు సావర్ణిక్ సత్యదేవ్ ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి సత్యదేవ్ తొలి హిట్ సినిమా? జ్యోతి లక్ష్మి చిత్రం సత్యదేవ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, గాడ్‌ఫాదర్ వంటి చిత్రాలు హిట్‌గా నిలిచాయి. సత్యదేవ్‌కు ఇష్టమైన కలర్? బ్లాక్ అండ్ వైట్ సత్యదేవ్ తల్లిదండ్రుల పేర్లు? ప్రసాద్‌ రావు, లక్ష్మి సత్యదేవ్‌కు ఇష్టమైన ప్రదేశం? విశాఖపట్నం  సత్యదేవ్ ఏం చదివాడు? ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కొద్దికాలం బెంగుళూరులో పనిచేశాడు. సత్యదేవ్ ఎన్ని సినిమాల్లో నటించాడు?  2024 వరకు 30 సినిమాల్లో నటించాడు.  సత్యదేవ్‌కు ఇష్టమైన ఆహారం? దోశ సత్యదేవ్ నికర ఆస్తుల విలువ ఎంత? రూ. 7.5 కోట్లు సత్యదేవ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సత్యదేవ్ ఒక్కో సినిమాకి రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=bLnXyZ4pzhE
    మార్చి 21 , 2024
    Krishnamma Movie Review: రివేంజ్‌ డ్రామాలో అదరగొట్టిన సత్యదేవ్‌… సినిమా ఎలా ఉందంటే?
    Krishnamma Movie Review: రివేంజ్‌ డ్రామాలో అదరగొట్టిన సత్యదేవ్‌… సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : సత్య దేవ్‌, అథిరా రాజ్‌, ఆర్చన అయ్యర్‌, రఘు కుంచె డైరెక్టర్‌ : వి. వి. గోపాల కృష్ణ సంగీతం: కాల భైరవ సినిమాటోగ్రాఫర్‌ : సన్నీ కుర్రపాటి ఎడిటర్‌ : తిమ్మరాజు నిర్మాత : కృష్ణ కొమ్మలపాటి టాలీవుడ్ నటుడు సత్యదేవ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). వి.వి గోపాల కృష్ణ దర్శకుడు. అథిరా రాజ్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, మే 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? సత్య దేవ్‌కు మరో హిట్‌ను అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.  కథేంటి విజయవాడ వించిపేటలో జీవించే భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్‌), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ముగ్గురు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా జీవిస్తుంటారు. గతంలో నేరాలకు పాల్పడిన ఈ ముగ్గురు కొన్ని కారణాలతో మంచిగా మారతారు. భద్ర ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు. అయితే అనుకోకుండా వీరికి రూ. 3 లక్షలు అవసరం పడతాయి. చివరిసారిగా ఒక నేరం చేసి అవసరం తీర్చుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. జైలుకు కూడా వెళ్తారు. ఈ క్రమంలో వీరిలో ఒకరు అనూహ్యంగా చనిపోతారు? స్నేహితుల్లో ఒకరు చనిపోవడానికి కారణం ఎవరు? వారు జైలుకెళ్లేలా కుట్ర చేసిందెవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే విలక్షణ నటుడు సత్యదేవ్‌ ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తనదైన నటనతో అదరగొట్టాడు. పగతో రగిలిపోయే భద్ర పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ఎమోషనల్ సన్నివేశాల్లో సత్యదేవ్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. హీరోయిన్‌గా అతిర పాత్ర పరిమితమే. నటన పరంగా ఆమె పాత్రకు పెద్ద స్కోప్‌ లేదు. స్నేహితులుగా చేసిన మీసాల లక్ష్మణ్‌, కృష్ణ తేజా రెడ్డి తమ నటనతో ఆకట్టుకున్నారు. పోలీసు ఆఫీసర్‌గా చేసిన నందగోపాల్‌ పర్వాలేదనిపించాడు. రఘు కుంచే పాత్ర కూడా సినిమాలో బాగుంది. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు వి.వి గోపాలకృష్ణ.. రివేంజ్‌ డ్రామాగా ఈ సినిమాకు తెరకెక్కించాడు. అయితే కథ పరంగా చూస్తే కొత్త దనం ఏమి లేదని చెప్పాలి. ఈ తరహా రివేంజ్‌ డ్రామాలు చాలానే వచ్చాయి. అయితే స్క్రీన్‌ప్లే మాత్రం ఆకట్టుకుంటుంది. ఆడియన్స్‌ను కథలోకి తీసుకెళ్లిన విధానం ప్రశంసనీయం. ఫస్టాఫ్‌ మెుత్తం ఓ దారుణ హత్య.. స్నేహితుల పాత్రలు, వారి మధ్య ఉన్న ఎమోషనల్‌ బాండ్‌ను పరిచయం చేయడంతోనే సరిపోయింది. దీంతో ఆడియన్స్‌కు కథ ల్యాగ్ అయిన ఫీలింగ్‌ కలిగింది. సెకండాఫ్‌కు వచ్చాక దర్శకుడు కథలో వేగం పెంచాడు. తమ ఫ్రెండ్‌ను చంపిన వారిని హీరో టార్గెట్‌ చేసే సీన్లను దర్శకుడు ఆసక్తికరంగా చూపించాడు. అయితే క్లైమాక్స్ ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. చిన్న చిన్న లోపాలున్నా దర్శకుడిగా వి.వి. గోపాల కృష్ణ సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు.  టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సన్నీ కుర్రపాటి తన కెమెరా పనితనంతో తెరపై ప్లెజెంట్‌ వాతావరణాన్ని తీసుకొచ్చారు. అటు కాల భైరవ అందించిన పాటలు సో సోగా ఉన్నాయి. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్ సత్యదేవ్‌ నటనస్క్రీన్‌ప్లేసెకండాఫ్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్ రీవెంజ్‌ డ్రామాబోరింగ్‌ సీన్స్  Telugu.yousay.tv Rating : 2.5/5   https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-satyadev.html
    మే 10 , 2024
    కైకాల సత్యనారాయణకు సినీలోకం నివాళి
    కైకాల సత్యనారాయణకు సినీలోకం నివాళి
    ]బ్రహ్మానందం, చిరంజీవి సహా అనేక మంది ప్రముఖులు కైకాల పార్థీవదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.
    ఫిబ్రవరి 13 , 2023
    Comedian Satya: స్టార్‌ కమెడియన్‌గా అవతరిస్తున్న సత్య.. మరో బ్రహ్మానందం అవుతాడా?
    Comedian Satya: స్టార్‌ కమెడియన్‌గా అవతరిస్తున్న సత్య.. మరో బ్రహ్మానందం అవుతాడా?
    ప్రముఖ కమెడియన్‌ సత్య పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్మోగుతోంది. తాజాగా విడుదలైన ‘మత్తు వదలరా 2’ చిత్రంలో సత్య కామెడీ హిలేరియస్‌గా ఉందంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తెలుగులో స్టార్‌ కమెడియన్‌గా సత్య స్థిరపడిపోతాడంటూ పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఈ జనరేషన్‌ కమెడియన్స్‌లో సత్య మరో బ్రహ్మానందంగా మారతారంటూ నెట్టింట విస్తృతంగా పోస్టులు కనిపిస్తున్నాయి. దశాబ్దంన్నర పాటు సత్య పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం లభిస్తోందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రీలో సత్య దూకుడు చూస్తుంటే మిగతా కమెడియన్లు సైడ్ ‌అవ్వాల్సిందేనన్న టాక్‌ వినిపిస్తోంది.  సత్య వన్‌ మ్యాన్‌ షో! శుక్రవారం రిలీజైన 'మత్తు వదలరా 2' చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు కమెడియన్‌ సత్యను ఆకాశానికెత్తుతున్నారు. ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులున్నా, హీరో శ్రీ సింహా అయినా అంద‌రూ స‌త్య గురించే మాట్లాడుకుంటున్నారు. మ‌త్తువ‌ద‌ల‌రాతో పోలిస్తే స్క్రిప్టు వీక్ అయినా సినిమాలో వేరే ఆక‌ర్ష‌ణ‌లు అంత‌గా పేల‌క‌పోయినా స‌త్య కామెడీ మాత్రం భ‌లే వ‌ర్క‌వుట్ అయింది. తొలి సీన్ నుంచి చివ‌రి వ‌ర‌కు ప్ర‌తి సీన్లోనూ స‌త్య న‌వ్వించాడు. ముఖ్యంగా సినిమాలోని ‘16 ఏళ్ల వయసు’ పాటలో సత్య డ్యాన్స్‌కు భీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో చాలా మైనస్‌లు ఉన్నప్పటికీ సత్య తన కామెడీతో వాటన్నింటిన సైడ్‌ చేసేశాడని వీక్షకులు అంటున్నారు. సత్య ఇలాంటి పర్‌ఫార్మెన్స్ తన తర్వాతి చిత్రాల్లోనూ చేస్తే స్టార్‌ కామెడియన్‌గా స్థిర పడటం ఖాయమని అంటున్నారు.  15 ఏళ్ల కృషి.. క‌మెడియ‌న్‌గా దాదాపు ద‌శాబ్దంన్న‌ర కింద‌ట్నుంచి సత్య ఇండ‌స్ట్రీలో ఉన్న‌ప్ప‌టికీ స‌రైన బ్రేక్ రావ‌డానికి చాలా ఏళ్లే ప‌ట్టింది. సునీల్ త‌ర్వాత అలాంటి టిపిక‌ల్ కామెడీ టైమింగ్‌తో చూడ‌గానే న‌వ్వు తెప్పించే క‌మెడియ‌న్ స‌త్య‌ చాలా ఏళ్ల పాటు అత‌ను చిన్న చిన్న పాత్ర‌ల‌తోనే నెట్టుకొచ్చాడు. ఐతే గ‌త కొన్నేళ్ల నుంచి నెమ్మ‌దిగా అత‌ను ఎదుగుతున్నాడు. మంచి క్యారెక్ట‌ర్ ప‌డిన ప్ర‌తిసారీ అదిరిపోయే కామెడీతో సినిమాకు ఆక‌ర్ష‌ణ‌గా మారుతున్నాడు. ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’, ‘రంగ‌బ‌లి’, ‘బెదురులంక 2012’, ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ లాంటి సినిమాల్లో త‌న కామెడీతో క‌డుపుబ్బ న‌వ్వించాడు. హీరోగా చేసిన ‘వివాహ భోజ‌నంబు’లో న‌వ్వించ‌డంతో పాటు క‌న్నీళ్లు సైతం పెట్టించాడు. గ‌తంతో పోలిస్తే చాలా బిజీ అయిన‌ప్ప‌టికీ త‌న టాలెంటుని పూర్తిగా వాడుకునే సినిమా రాలేదు. ఇప్పుడు ‘మ‌త్తువ‌ద‌ల‌రా-2’ సత్యకు ఆ లోటును తీర్చింద‌నే చెప్పాలి. సత్యపై డైరెక్టర్ల ఫోకస్‌! ప్రతీ సినిమాకు గ్రాఫ్‌ పెంచుకుంటూ దూసుకెళ్తున్న సత్యపై టాలీవుడ్‌ డైరెక్టర్ల దృష్టి పడినట్లు తెలుస్తోంది. పలువురు స్టార్ డైరెక్టర్లు తమ సినిమాలో అతడి ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుండటంతో సత్యతో సెపరేట్ కామెడీ ట్రాక్‌ పెట్టించే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల రవితేజ, హరీష్ శంకర్‌ కాంబోలో వచ్చిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రంలోనూ సత్యకు ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ దక్కింది. ఇందులో సత్య కామెడీ ఆకట్టుకున్నప్పటికీ సినిమా ఫ్లాప్‌ కావడంతో పెద్దగా గుర్తింపు లభించలేదు.  ఆ కమెడియన్లకు గట్టి పోటీ! ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా మంది కమెడియన్లు ఉన్నారు. సీనియర్‌ హాస్య నటుడు అలీ, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, గెటప్‌ శ్రీను, సప్తగిరి, చమ్మక్‌ చంద్ర, తాగుబోతు రమేష్‌, ధన్‌రాజ్‌ తదితరులు వరుసగా సినిమాలు చేస్తూ స్టార్లుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సునీల్‌ సైతం హీరోగా మానేసి కమెడియన్‌గా, విలన్‌గా సినిమాలు చేస్తున్నారు. అయితే వీరందరికీ కమెడియన్‌ సత్య నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సత్య గ్రాఫ్‌ దృష్ట్యా దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్‌ అతడు అవుతాడని అంటున్నారు. కాబట్టి టాలీవుడ్‌లోని ఇతర హాస్య నటులు సైతం తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించకపోతే సినిమా అవకాశాలు సన్నగిల్లే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. 
    సెప్టెంబర్ 14 , 2024
    తెలుగుతెరపై మర్చిపోలేని కైకాల సత్యనారాయణ పాత్రలు
    తెలుగుతెరపై మర్చిపోలేని కైకాల సత్యనారాయణ పాత్రలు
    ]సత్తిపండుమహేశ్‌ బాబు మురారీ గుర్తుందా. ఇందులో ఆయన తండ్రిగా కైకాల నటించారు. స్క్రీన్‌పైనా  తక్కువ సమయం కనిపించినప్పటికీ ఆయన నటన అద్భుతం. చిన్నపిల్లాడిలా కైకాల చెప్పిన డైలాగులు, హాస్యం ఎంతగానో అలరిస్తుంది.
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>Mathu Vadalara 2 Movie Review: కమెడియన్‌ సత్య వన్‌ మ్యాన్‌ షో.. ‘మత్తు వదలరా 2’ ఎలా ఉందంటే?</strong>
    Mathu Vadalara 2 Movie Review: కమెడియన్‌ సత్య వన్‌ మ్యాన్‌ షో.. ‘మత్తు వదలరా 2’ ఎలా ఉందంటే?
    నటీనటులు : శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్‌, వెన్నెల కిషోర్‌, రోహిణి తదితరులు రచన, దర్శకత్వం : రితేష్‌ రానా సంగీతం : కాల భైరవ సినిమాటోగ్రాఫర్‌ : సురేష్‌ సారంగం ఎడిటర్‌: కార్తిక శ్రీనివాస్‌ నిర్మాత : చిరంజీవి (చెర్రీ) విడుదల తేదీ: సెప్టెంబర్‌ 13, 2024 శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్‌, రోహిణి, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. హీరో ప్రభాస్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి బాబు (శ్రీ సింహా), యేసుబాబు (సత్య) డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తుంటారు. చాలిచాలని జీతంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. దీంతో డబ్బులు సరిపోకా వారు స్పెషల్ ఏజెంట్స్‌గా మారతారు. ఓ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఏంటా కేసు? వారు చేసిన పొరపాటు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అండర్‌ కవర్‌ ఏజెంట్‌ నిధి (ఫరియా అబ్దుల్లా) వారికి ఎలా సాయపడింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Mathu Vadalara 2 Movie Review) ఎవరెలా చేశారంటే హీరోగా శ్రీ సింహా మంచి నటన కనబరిచాడు. కామెడీ, యాక్షన్‌ సీక్వెన్స్‌లో ఆకట్టుకున్నాడు. అయితే ప్రతీ సీన్‌లో సత్య పక్కన ఉండటంతో అతడే హైలెట్‌ అయ్యాడు. ఈ సినిమాకు సత్యనే మెయిన్‌ హీరో అని చెప్పవచ్చు. తన పంచ్‌ డైలాగ్స్‌తో, కామెడీ టైమింగ్‌తో సత్య అదరగొట్టాడు. ముఖ్యంగా అతడి ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ‘సెక్సీ సైరన్‌’ అంటూ సినిమాలో అతడు చేసే హంగామా బాగా వర్కౌట్ అయ్యింది. హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లాకు ఇందులో మంచి రోల్‌ దక్కింది. చిట్టి పాత్ర తర్వాత ఆ స్థాయిలో ఈ రోల్‌ గుర్తుండిపోతుంది. అటు వెన్నెల కిషోర్‌ సైతం తనదైన కామెడీతో గిలిగింతలు పెట్టారు. సునీల్‌, రోహిణి తదితర ముఖ్య తారాగారణం తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఇతర నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు రితేశ్‌ రాణా కథలన్నీ కూడా సింపుల్‌గా డ్రగ్స్‌, గన్స్‌, డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. ఈసారి కూడా దర్శకుడు అలాంటి స్టోరీనే ఎంచుకున్నారు. ఒక కిడ్నాపింగ్‌ డ్రామాకు హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంతో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, బాల‌కృష్ణ‌, మ‌హేష్‌బాబుతో పాటు ప‌లువురు స్టార్ హీరోలను రిఫ‌రెన్స్‌లుగా తీసుకోవడం బాగా కలిసొచ్చింది. శ్రీ సింహా, సత్య పాత్రలను చాలా ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దడం మెప్పిస్తుంది. అలాగే తెరపై కనిపించే ప్రతీ క్యారెక్టర్‌ కొత్తగా, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రథమార్థం మెుత్తాన్ని ఫన్‌ రైడ్‌గా నడిపించిన దర్శకుడు ద్వితియార్థంకు వచ్చేసరికి కాస్త తడబడ్డాడు. సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్‌లో ల్యాగ్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌ కూడా ప్రిడిక్టబుల్‌గా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. చాలా సన్నివేశాలను బీజీఎం బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ శ్రీ సింహా, సత్య&nbsp;కామెడీ&nbsp;నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడ సాగదీత సీన్స్‌ప్రిడిక్టబుల్‌ క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 13 , 2024
    Movie Collections: ‘మనమే’, ‘సత్యభామ’ చిత్రాల్లో ఫ్రైడే బాక్సాఫీస్‌ విన్నర్‌ ఏది?
    Movie Collections: ‘మనమే’, ‘సత్యభామ’ చిత్రాల్లో ఫ్రైడే బాక్సాఫీస్‌ విన్నర్‌ ఏది?
    గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్‌ వద్ద చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ శుక్రవారం బాక్సాఫీస్‌ వద్ద 10 చిత్రాలు బరిలో నిలిచాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రెండు. ఒకటి శర్వానంద్‌ నటించిన ‘మనమే’ (Manamey) కాగా.. రెండో కాజల్ చేసిన ‘సత్యభామ’ (Satyabhama) మూవీ. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు తొలి ఆటతోనే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే కాజల్‌, శర్వానంద్‌ చిత్రాలలో ఏది తొలిరోజు బాక్సాఫీస్‌ విజేతగా నిలిచింది? ఏ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.&nbsp; మనమే శర్వానంద్‌, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'మనమే'. ఈ శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. హీరో రామ్‌ చరణ్‌ టీజర్‌ రిలీజ్‌ చేయడం, పలువురు సెలబ్రిటీలు సినిమాపై ఎక్స్‌లో పోస్టులు పెట్టడంతో 'మనమే' ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. రూ.12 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా తొలిరోజు రూ.2.8 కోట్ల గ్రాస్‌ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.4 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. రూ. కోటి మేర షేర్‌ కలెక్ట్ చేసింది. తొలిరోజు ఆశించిన మేర కలెక్షన్స్‌ రానప్పటికీ.. శని, ఆదివారాల్లో ప్రేక్షకుల తాకిడీ పెరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.&nbsp; ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ నటుడు శర్వానంద్‌.. ‘మనమే’ చిత్రంలో అదరగొట్టాడు. విక్రమ్‌ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఫుల్‌ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. హీరోయిన్‌ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్‌ - కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య.. తల్లిదండ్రులు - పిల్లల మధ్య బాండింగ్‌ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్‌ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్‌ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్‌ను మంచి ఎమోషనల్‌ సీన్స్‌తో ముగించడం సినిమాకు ప్లస్‌ అయ్యింది.&nbsp; కథేంటి విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ (త్రిగుణ్‌), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.&nbsp; సత్యభామ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తొలిసారి ఖాకీ డ్రెస్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన లేడీ ఒరియెంటెడ్‌ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రానికి సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించారు. అయితే సినిమాపై మంచి టాక్‌ వచ్చినప్పటికీ డే 1 కలెక్షన్స్ పరంగా సత్యభామ నిరాశ పరిచింది. తొలి రోజు ఈ చిత్రం రూ.1.20 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.50 లక్షల వరకూ షేర్‌ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాజ‌ల్‌ నటనపై ప్రశంసలు కమర్షియల్‌ చిత్రాల్లో ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన కాజల్‌ అగర్వాల్‌.. ఏసీపీ సత్యభామ పాత్రలో ఆకట్టుకుంది. ఖాకీ దుస్తుల్లో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోరాట ఘట్టాల్లో అద్భుతంగా చేసింది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్‌ నటనతో మెప్పించింది. దర్శకుడు సుమన్‌ చిక్కాల.. ఇన్‌వెస్టిగేటివ్‌ క్రైమ్ థ్రిల్లర్‌గా 'సత్యభామ'ను తెరకెక్కించారు. ఓ నేరం చుట్టు భావోద్వేగాలతో కూడిన కథను అల్లుకొని ఆకట్టుకున్నాడు. ఓ మహిళా పోలీసు అధికారి.. కేసును వ్యక్తిగతంగా తీసుకున్న క్రమంలో వచ్చే భావోద్వేగాలు మెప్పిస్తాయి. గృహ హింస, మహిళల అక్రమ రవాణా, టెర్రరిజం వంటి అంశాలను టచ్‌ చేస్తూ డైరెక్టర్‌ కథను నడిపించిన తీరు మెప్పిస్తుంది.&nbsp; కథేంటి ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్‌ (నవీన్‌ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ.&nbsp; https://telugu.yousay.tv/manamey-movie-review-has-manamey-put-a-check-on-sharwanand-kriti-shettys-series-of-failures.html https://telugu.yousay.tv/satyabhama-movie-review-did-kajal-rock-in-khaki-shirt-what-is-the-satyabhama-talk.html
    జూన్ 08 , 2024
    REVIEW: తమన్నా, సత్యదేవ్‌ ‘గుర్తుందా శీతాకాలం’
    REVIEW: తమన్నా, సత్యదేవ్‌ ‘గుర్తుందా శీతాకాలం’
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    ఫిబ్రవరి 13 , 2023
    Satyabhama Movie Review: ఖాకీ చొక్కాలో కాజల్‌ అదరగొట్టిందా? ‘సత్యభామ’ టాక్‌ ఏంటి?
    Satyabhama Movie Review: ఖాకీ చొక్కాలో కాజల్‌ అదరగొట్టిందా? ‘సత్యభామ’ టాక్‌ ఏంటి?
    నటీనటులు: కాజల్‌,&nbsp; నవీన్‌ చంద్ర, ప్రకాశ్‌రాజ్‌, నాగినీడు, హర్షవర్థన్‌, రవి వర్మ, తదితరులు రచన, దర్శకత్వం: సుమన్‌ చిక్కాల సంగీతం: శ్రీచరణ్‌ పాకాల సినిమాటోగ్రఫీ: విష్ణు బెసి ఎడిటింగ్‌: కోదాటి పవన్‌కల్యాణ్‌ నిర్మాత: బాబీ తిక్క, శ్రీనివాస్‌ తక్కలపెల్లి విడుదల: 07-06-2024 ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama Movie Review). సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్‌.. కెరీర్‌లో తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ క్రమంలో జూన్‌ 7న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? పోలీసు ఆఫీసర్‌గా కాజల్‌ ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్‌ (నవీన్‌ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే కమర్షియల్‌ చిత్రాల్లో ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన కాజల్‌ అగర్వాల్‌.. ఏసీపీ సత్యభామ పాత్రలో అదరగొట్టింది. ఖాకీ దుస్తుల్లో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోరాట ఘట్టాల్లో అద్భుతంగా చేసింది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్‌ నటనతో మెప్పించింది. సినిమా మెుత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించింది. ఇక భర్తగా నవీన్‌ చంద్ర పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేదు. ప్ర‌కాశ్‌రాజ్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, నాగినీడు న‌టులున్నా వాళ్ల ప్ర‌భావం ఎక్క‌డా క‌నిపించలేదు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు సుమన్‌ చిక్కాల.. ఇన్‌వెస్టిగేటివ్‌ క్రైమ్ థ్రిల్లర్‌గా 'సత్యభామ'ను తెరకెక్కించారు. ఓ నేరం చుట్టు భావోద్వేగాలతో కూడిన కథను అల్లుకొని ఆకట్టుకున్నాడు. ఓ మహిళా పోలీసు అధికారి.. కేసును వ్యక్తిగతంగా తీసుకున్న క్రమంలో వచ్చే భావోద్వేగాలు మెప్పిస్తాయి. గృహ హింస, మహిళల అక్రమ రవాణా, టెర్రరిజం వంటి అంశాలను టచ్‌ చేస్తూ డైరెక్టర్‌ కథను నడిపించారు. సత్యభామ క్యారెక్టరైజేషన్‌ను బలంగా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే ఆధారాల్ని చేజేతులా వదిలేస్తూ.. మళ్లీ వాటి కోసమే అన్వేషించడం కాస్త మైనస్‌గా మారింది. ఇంకాస్త బెటర్‌గా స్క్రీన్‌ప్లేను నడిపించి ఉంటే సినిమా మరో లెవెల్‌లో ఉండేది. అయితే సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు, పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతికంగా సినిమా ఒకే. కెమెరా, సంగీతం, ఎడిటింగ్ విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం.. యాక్షన్‌ సీక్వెన్స్‌ను, ఉత్కంఠ సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కాజల్‌ నటనకొన్ని ట్విస్టులుపతాక సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ పేలవమైన స్క్రీన్‌ప్లేసెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp; https://telugu.yousay.tv/do-you-know-these-interesting-facts-about-kajal-aggarwal.html
    జూన్ 07 , 2024
    దివికేగిన సీనియర్ నటి జమున… అలనాటి ‘సత్యభామ’ గురించి ఆసక్తికరమైన నిజాలు
    దివికేగిన సీనియర్ నటి జమున… అలనాటి ‘సత్యభామ’ గురించి ఆసక్తికరమైన నిజాలు
    ]1968 &nbsp;: ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు &nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;- మిలన్ 1964 &nbsp;: ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు&nbsp; &nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; &nbsp;- మూగ మనసులు 2008 &nbsp;: ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారం 2019 &nbsp;: ఆమె సంతోషం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్&nbsp; &nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;అవార్డును అందుకున్నారు. &nbsp;సాక్షి మీడియా 2019, 2020 జీవితసాఫల్య పురస్కారంఅవార్డులు
    ఫిబ్రవరి 11 , 2023
    Maa Oori Polimera 2 Review: ‘మా ఊరి పొలిమేర 2’ మళ్లీ భయపెట్టిందా? రేటింగ్ ఇదే!
    Maa Oori Polimera 2 Review: ‘మా ఊరి పొలిమేర 2’ మళ్లీ భయపెట్టిందా? రేటింగ్ ఇదే!
    నటీనటులు: సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, రవి వర్మ, చిత్రం శ్రీను, రాకేందు మౌళి, సాహితి దాస‌రి, అక్ష‌త శ్రీనివాస్‌ తదితరులు దర్శకుడు : డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ నిర్మాత: గౌరీ కృష్ణ సంగీతం: జ్ఞాని సినిమాటోగ్రఫీ: కుశిదర్ రమేష్ రెడ్డి విడుదల తేదీ : నవంబర్ 03, 2023 2021లో వచ్చిన మా ఊరి పొలిమేర (Maa Oori Polimera) చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ చిత్రం అత్యధిక ఆదరణను సంపాదించింది. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అందరికీ నచ్చేయడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా రూపొందించారు. డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ డైరెక్షన్‌లో రూపొందిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) ఇవాళ (నవంబర్‌ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా వాటిని అందుకుందా? పార్ట్‌-1 లాగే విభిన్నమైన కథాంశంతో మెప్పించిందా? సత్యం రాజేష్‌ నటన ఎలా ఉంది? వంటి అంశాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడే రెండో భాగం ప్రారంభమవుతుంది. ఊరిలో చెతబడులు చేస్తూ చనిపోయాడని భ్రమ పడిన కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు? ఇంతకీ ఆ గుడిలో ఏముంది? జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా ? లేదా? చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎలా సాగిదంటే పొలిమేర పార్ట్‌ 1 మొత్తాన్ని ఓ నాలుగు నిమిషాల్లో చూపించి పార్ట్‌ 2 మెుదలవుతోంది. ఆ తర్వాత కేరళలో ఉన్న కొమురయ్యను చూపించి కథను అతని భార్య వద్దకు తీసుకెళ్లాడు డైరెక్టర్‌. కొత్తగా వచ్చిన ఎస్సై ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. కేరళ అడవుల్లో కొమురయ్య చేసే పూజలు కొంతవరకు భయపెడతాయి. ఆ తర్వాత కథ అక్కడక్కడే సాగినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కూడా కథ రొటీన్‌గా సాగుతుంది. కానీ చివర్లో వచ్చే కొన్ని ట్విస్టులు మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. పార్ట్‌ 1లో మర్డర్‌ మిస్టరికీ చేతబడిని యాడ్‌ చేస్తే ఇందులో గుప్త నిధుల అనే పాయింట్‌ని జత చేశారు. పార్ట్‌-1లో లాగే పార్ట్‌-2లో కూడా పలు ప్రశ్నలు లేవనెత్తి వాటికి సమాధానం పార్ట్‌ 3లో ఉంటుందని ముగించేశారు.&nbsp; ఎవరెలా చేశారంటే? కొమురయ్య పాత్రలో సత్యం రాజేశ్‌ అదరగొట్టాడు. పార్ట్‌ 1లో నటించిన అనుభవంతో ఇందులో ఈజీగా నటించేశాడు. కొన్ని చోట్ల అతని ఎక్స్‌ప్రెషన్స్‌ భయపెడతాయి. కొమిరి భార్య లక్ష్మీ పాత్రలో కామాక్షి భాస్కర్ల&nbsp; చక్కగా నటించింది. పార్ట్‌ 1తో పోలిస్తే ఇందులో ఆమెకు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఆమె ఇచ్చిన ట్విస్ట్‌ అదిరిపోతుంది. ఇక జంగయ్యగా నటించిన బాలాదిత్య తన పాత్ర పరిధిమేరకు నటించాడు. తొలి భాగంతో పోలిస్తే ఇందుతో అతని పాత్ర నిడివి చాలా తక్కువే. ఇక బలిజ పాత్రలో గెటప్‌ శ్రీను జీవించేశాడు. ఎస్సైగా రాకేందు మౌళి, సర్పంచ్‌గా రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.&nbsp;&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? కథ, కథనాన్ని నడిపించడంలో దర్శకుడు డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది.&nbsp; కొన్ని సీన్స్‌కి అయితే లాజిక్కే ఉండదు. ప్రేక్షకుడిని థ్రిల్‌కి గురి చేయాలన్న ఉద్దేశంతోనే కొన్ని ట్విస్టులను రాసుకున్నట్లు కనిపిస్తుంది. అవి కథకు ఏ మేరకు అవసరమనేది డైరెక్టర్‌ పట్టించుకోలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సింది. ప్రతిసారి ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ని చూపించడం వల్ల ఏది గతం, ఏది ప్రస్తుతం అనే కన్యూఫ్యూజన్ ఆడియన్స్‌లో నెలకొంటుంది. అయితే పార్ట్‌ 1 చూడకపోయినా పార్ట్‌ 2 చూసే విధంగా కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ విషయంలో అతన్ని అభినందించాల్సిందే.&nbsp; టెక్నికల్‌గా ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం జ్ఞాని నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల ఆయన భయపెట్టాడు. ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ సత్యం రాజేశ్ నటనకథలోని ట్విస్ట్‌లునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్ నెమ్మదిగా సాగే కథనంలాజిక్‌ లేని సీన్స్‌ చివరిగా: థ్రిల్లింగ్‌ సినిమాలను ఇష్టపడే వారికి ‘మా ఊరి పొలిమేర 2’ కచ్చితంగా నచ్చుతుంది. ట్విస్టులు, క్రైమ్‌ సీన్స్‌, క్లైమాక్స్‌కు వారు బాగా కనెక్ట్ అవుతారు.&nbsp; రేటింగ్‌ : 3.5/5
    నవంబర్ 03 , 2023
    Aarambham Review: థ్రిల్లింగ్‌ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?
    Aarambham Review: థ్రిల్లింగ్‌ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ సురభి పద్మావతి, అభిషేక్‌ బొడ్డెపల్లి తదితరులు దర్శకుడు : అజయ్‌ నాగ్‌ సంగీతం: సింజిత్‌ యర్రమిల్లి సినిమాటోగ్రఫి: దేవ్‌దీప్‌ గాంధీ నిర్మాతలు: అభిషేక్‌ వి. తిరుమలేశ్‌, వియన్‌ రెడ్డి మామిడి విడుదల తేదీ: 10-05-2024 మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambam). వి. అజయ్ నాగ్ (Ajay Nag) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ కాలాఘటి జైలులో మిగిల్ (మోహన్ భగత్) శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఉరి తీయడానికి సరిగ్గా ఒక రోజు ముందు అనూహ్యంగా జైలు నుంచి మిస్‌ ‌అవుతాడు. జైలు గదికి ఉన్న తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం పోలీసులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని గురించి కనిపెట్టేందుకు డిటెక్టివ్ (రవీంద్ర విజయ్‌) రంగంలోకి దిగుతాడు. అతడు చేస్తున్న దర్యాప్తులో మిగిల్‌కు సంబంధించిన ఓ డైరీ దొరుకుతుంది. అందులో ఏముంది? మిగిల్‌ కథేంటి? అతడికి డెజావు ఎక్స్‌పరిమెంట్‌కు ఏంటి సంబంధం? అసలు మిగిల్‌ ఎందుకు జైలుకు వెళ్లాడు? అక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది మిగిలిన కథ.&nbsp; ఎవరెలా చేశారంటే కేరాఫ్ కంచర పాలెంలో (Aarambham Review In Telugu) గడ్డం క్యారెక్టర్‌లో కనిపించిన మోహన్‌ భగత్‌.. ఈ సినిమాలో మిగిల్‌ పాత్రలో అదరగొట్టాడు. మెయిన్ లీడ్‌లో కనిపించి తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నాడు. సుప్రీతా సత్యనారాయణ ఫిమేల్ లీడ్‌లో ఓకే అనిపించింది. తల్లి పాత్రలో సురభి ప్రభావతి అదరగొట్టేసింది. సైంటిస్ట్‌గా భూషణ్ చాలా బాగా నటించారు. లక్ష్మణ్ మీసాల, రవీంద్ర విజయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు అజయ్‌ నాగ్‌.. సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. జీవితంలో ఓ తోడు ఉండాలని అనే కాన్సెప్ట్‌కు డెజావు అనే సైన్స్‌ ఎక్స్‌పెరమెంట్‌ను జోడించి సస్పెన్స్‌ను క్రియేట్‌ చేశాడు. కథతో పాటు కథనాన్ని కూడా ఆసక్తికరంగా నడిపించాడు. స్టోరీలో అక్కడక్కడా బోరింగ్‌ సీన్లు ఉన్నప్పటికి సస్పెన్స్‌ను చివరి వరకూ కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు. ఓ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా రుచించకపోవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Aarambham Review In Telugu) ఈ మూవీకి అన్ని విభాగాలు చక్కటి పనితీరును అందించాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొండ ప్రాంతాల్లోని ఓ చిన్న గ్రామాన్ని తన కెమెరాలతో ఎంతో చక్కగా చూపించాడు. సింజిత్‌ యర్రమిల్లి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ పనితీరు కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, స్క్రీన్‌ప్లేసస్పెన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ బోరింగ్‌ సన్నివేశాలుకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    మే 10 , 2024
    Geethanjali Malli Vachindi Review: కడుపుబ్బా నవ్వించిన గీతాంజలి సీక్వెల్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
    Geethanjali Malli Vachindi Review: కడుపుబ్బా నవ్వించిన గీతాంజలి సీక్వెల్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, అంజలి, సత్యం రాజేష్, షకలక శంకర్, రవి శంకర్, సత్య తదితరులు. దర్శకుడు: శివ తూర్లపాటి సంగీత దర్శకుడు: ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ ఎడిటింగ్: చోటా కే ప్రసాద్ నిర్మాత: కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎం వివి సినిమాస్ ప్రముఖ హీరోయిన్‌ ‘అంజలి’ లీడ్‌ రోల్‌లో చేసిన ‘గీతాంజలి’ చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) రూపొందింది. అంజలితో పాటు శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, అలీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, ఈ చిత్రం ఎలా ఉంది? ప్రీక్వెల్‌ లాగానే ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.&nbsp; కథేంటి దర్శకుడు శ్రీనివాస్‌ (శ్రీనివాస్‌ రెడ్డి) హ్యాట్రిక్‌ ఫ్లాపులతో ఆర్థికంగా దెబ్బతింటాడు. పొట్టకూటి కోసం మిత్రుడు అయాన్ (సత్య)ను హీరో చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య సత్య హీరోగా ఓ సినిమా అవకాశం వస్తుంది. ఊటీలో రిసార్టు నడుపుతున్న అంజలి ఇందులో హీరోయిన్‌గా చేసేందుకు ఒప్పుకుంటుంది. అయితే దెయ్యాల కోటగా పిలవబడుతున్న సంగీత్‌ మహల్‌లోనే షూటింగ్ జరపాలని ప్రొడ్యూసర్ ఓ కండీషన్‌ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ సంగీత్‌ మహల్‌ గతం ఏంటి? మహల్‌లో షూటింగ్‌ మెుదలుపెట్టిన శ్రీను &amp; టీమ్‌కు ఎలాంటి సమస్యలు వచ్చాయి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే ప్రముఖ నటి అంజలి ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన అద్భుత నటనతో అదరగొట్టింది. పతాక సన్నివేశాల్లో తన అత్యుత్తమ యాక్టింగ్‌తో మెప్పించింది. కొన్ని హార్రర్‌ సీన్లలో ఆమె పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. దర్శకుడిగా శ్రీనివాస్‌ రెడ్డి, షకలక శంకర్‌, సత్యం రాజేష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అయాన్‌గా సత్య.. సినిమాటోగ్రాఫర్‌ నానిగా సునీల్‌ కడుపుబ్బా నవ్వించారు. వీరి పాత్రలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రతినాయకుడిగా విష్ణు పాత్రలో కనిపించిన రాహుల్‌ మాధవ్‌ నటన మెప్పిస్తుంది.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ఈ సీక్వెల్‌ మూవీ.. తొలి భాగం చూడనివారికి కూడా అర్థమయ్యేలా డైరెక్టర్‌ శివ తుర్రపాటి తెరకెక్కించారు. ప్రథమార్ధంలో ఎక్కువ భాగం పాత్రల పరిచయానికే కేటాయించిన దర్శకుడు సంగీత మహల్‌కు వెళ్లిన తర్వాత అసలు కథను మెుదలుపెట్టాడు. ఆ మహల్‌ చరిత్ర... అందులోని నటరాజశాస్త్రి కుటుంబ నేపథ్యం.. వాళ్లు దెయ్యాలుగా మారిన తీరును దర్శకుడు చక్కగా చూపించాడు. ఈ క్రమంలో తీసుకొచ్చిన విరామ సన్నివేశాలతో ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచాడు. ప్రేక్షకుల్ని అక్కడక్కడా భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే కథ పరంగా చూస్తే లాజిక్‌కు దూరంగా చాలా అంశాలే ఉన్నాయి. బలమైన ఎమోషన్స్‌ కూడా కొరవడ్డాయి. కోన వెంకట్ రాసుకున్న కథలో పెద్దగా మెరుపులు లేవు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లు సంభాషణలు రాసుకోవడం కాస్త ప్లస్ అయ్యింది. ఓవరాల్‌గా దర్శకుడిగా శివ తన పాత్రకు కొంతమేర న్యాయం చేశారు. టెక్నికల్‌గా సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఈ హర్రర్ కామెడీ సినిమాకి సుజాత సిద్ధార్థ కెమెరా పనితనం బాగా కలిసొచ్చింది. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా కొంచెం స్లోగా సాగిన, సెకెండ్ హాఫ్‌ను కట్ చేసిన విధానం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ అంజలి నటనకామెడీ సన్నివేశాలుకొన్ని హార్రర్‌ అంశాలు మైనస్‌ పాయింట్స్‌&nbsp; కథలో బలం లేకపోవడంలాజిక్‌కు అందని సీన్లు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    ఏప్రిల్ 12 , 2024
    <strong>Mathu Vadalara 2: బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతున్న ‘మత్తు వదలరా 2’.. త్రీ డేస్‌ కలెక్షన్స్ ఎంతంటే?</strong>
    Mathu Vadalara 2: బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతున్న ‘మత్తు వదలరా 2’.. త్రీ డేస్‌ కలెక్షన్స్ ఎంతంటే?
    శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్‌, రోహిణి, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం (సెప్టెంబర్‌ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్‌ టాక్‌ సొంతం చేసుకొంది. ముఖ్యంగా కమెడియన్‌ సత్య కామెడీ అదిరిపోయిందంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. దీంతో తొలి రోజు సాలిడ్‌ వసూళ్లు సాధించి ఆ చిత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి వీకెండ్‌లో ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వసూళ్ల జాతర 'మత్తు వదలరా 2' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి రెండు రోజుల్లో (శుక్ర, శని) రూ.11 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించిన ఈ చిత్రం ఆదివారం కూడా సాలిడ్‌ వసూళ్లనే రాబట్టింది. ఫస్ట్‌ త్రీ డేస్‌లో ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా రూ.16.2 కోట్లు కొల్లగొట్టినట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. 'పదహారేళ్ల వయసు.. పదహారు కోట్ల గ్రాసూ’ అంటూ ఈ పోస్టర్‌కు ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది. అటు ఓవర్సీస్‌లో 600K డాలర్లకు పైగా రాబట్టినట్లు మేకర్స్‌ మరో పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. రానున్న రోజుల్లో ‘మత్తు వదలరా 2’ కలెక్షన్స్‌ మరింత పెరగడం ఖాయమని, ఈ వీకెండ్‌ నాటికిి రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.&nbsp; https://twitter.com/MythriOfficial/status/1835560518255255726 https://twitter.com/MythriOfficial/status/1835533814803894507 తొలి రోజు ఎంతంటే కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ 'మత్తు వదలరా 2'. మూవీకి&nbsp; ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో తొలిరోజు అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. శుక్రవారం (సెప్టెంబర్‌ 13) ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ. 5.3 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో రూ.2.45 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఇక ఓవర్సీస్‌లో రూ.2.5 కోట్లు తన ఖాతాలో వేసుకుందని స్పష్టం చేశాయి.&nbsp; https://twitter.com/MythriOfficial/status/1834823161281757529 వారందరికీ బూస్టప్! ‘మత్తు వదలరా’ (పార్ట్‌ 1)తో హీరోగా పరిచయం అయిన కీరవాణి తనయుడు శ్రీసింహ తర్వాత నాలుగు సినిమాలు చేసిన కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. మరల ‘మత్తు వదలరా 2’తో రెండో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. కమెడియన్‌ సత్య కూడా ఈ సినిమా ద్వారా తన గ్రాఫ్‌ను అమాంతం పెంచుకున్నాడు. హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా కూడా ‘జాతిరత్నాలు’ సినిమా తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది. ఆమెకి కూడా ‘మత్తు వదలరా 2’ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ పేరు మరోసారి ఈ సినిమా వినిపించేలా చేసింది. మత్తు వదలరా సినిమా తర్వాత లావణ్య త్రిపాఠితో ‘హ్యాపీ బర్త్ డే’ చేసి ఫ్లాప్ అందుకున్న రితీష్ రానా మరల ‘మత్తు వదలరా 2’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఇలా ‘మత్తు వదలరా 2’ టీమ్ మొత్తానికి కూడా ఈ సక్సెస్ మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. కథేంటి డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు పోవడంతో బాబు మోహన్ (శ్రీసింహా), యేసు (సత్య) హైఎమర్జెన్సీ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్స్‌గా చేరతారు. కిడ్నాప్ కేసుల్ని ఛేదిస్తూ నిందితుల్ని పట్టుకోవడంలో ఆరితేరిపోతారు. ఇలా కొంచెం కొంచెం సంపాదన ఎంత కాలమని కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలని ఓ నిర్ణయానికొస్తారు. ఆ సందర్భంలోనే ఓ యువతి కిడ్నాప్ కేసు వస్తుంది. రూ.2 కోట్లు లావాదేవీలతో ముడిపడిన ఈ కేసును ఛేదించి ఆ మెుత్తాన్ని సొంతం చేసుకోవాలని బాబు, యేసు ప్లాన్‌ చేస్తారు. కానీ, అనూహ్యంగా కిడ్నాప్‌కు గురైన యువతి వీళ్ల కారులోనే శవమై తేలుతుంది. వీళ్లే కిడ్నాప్ చేశారనే రుజువుతో కూడిన వీడియో కూడా బయటికొస్తుంది. ఇంతకీ ఆ హత్య చేసిందెవరు? ఈ కేసు నుంచి బాబు మోహన్‌, యేసు బయట పడ్డారా? లేదా? డబ్బు సంపాదించాలనే వీళ్ల కోరిక నెరవేరిందా? లేదా? అన్నది స్టోరీ.&nbsp; https://telugu.yousay.tv/mathu-vadalara-2-day-1-collections-mathu-vadalara-2-has-a-great-opening-what-are-the-collections.html
    సెప్టెంబర్ 16 , 2024
    <strong>Mathu Vadalara 2 Day 1 Collections: ‘మత్తు వదలరా 2’ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్‌.. వసూళ్లు ఎంతంటే?</strong>
    Mathu Vadalara 2 Day 1 Collections: ‘మత్తు వదలరా 2’ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్‌.. వసూళ్లు ఎంతంటే?
    శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్‌, రోహిణి, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. హీరో ప్రభాస్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది. శుక్రవారం (సెప్టెంబర్‌ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్‌ టాక్‌ సొంతం చేసుకొంది. సత్య కామెడీ అదిరిపోయిందంటూ కామెంట్స్‌ వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; సాలిడ్‌ ఓపెనింగ్స్‌ కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ 'మత్తు వదలరా 2'. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా కమెడీ సత్య కీలక పాత్ర పోషించారు. ఈ మూవీకి&nbsp; ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. తొలి రోజున ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ. 5.3 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో రూ.2.45 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్‌లో రూ.2.5 కోట్లు తన ఖాతాలో వేసుకుందని స్పష్టం చేస్తున్నారు. ఈ వీకెండ్‌లో పెద్ద సినిమాలు ఏవి రిలీజ్‌ కాకపోవడంతో 'మత్తు వదలరా 2' ఈజీగానే రూ.15 కోట్ల గ్రాస్ అందుకుంటుందని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేస్తోంది.&nbsp; వారందరికీ బూస్టప్! ‘మత్తు వదలరా’ (పార్ట్‌ 1)తో హీరోగా పరిచయం అయిన కీరవాణి తనయుడు శ్రీసింహ తర్వాత నాలుగు సినిమాలు చేసిన కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. మరల ‘మత్తు వదలరా 2’తో రెండో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. కమెడియన్‌ సత్య కూడా ఈ సినిమా ద్వారా తన గ్రాఫ్‌ను అమాంతం పెంచుకున్నాడు. హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా కూడా ‘జాతిరత్నాలు’ సినిమా తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది. ఆమెకి కూడా ‘మత్తు వదలరా 2’ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ పేరు మరోసారి ఈ సినిమా వినిపించేలా చేసింది. మత్తు వదలరా సినిమా తర్వాత లావణ్య త్రిపాఠితో ‘హ్యాపీ బర్త్ డే’ చేసి ఫ్లాప్ అందుకున్న రితీష్ రానా మరల ‘మత్తు వదలరా 2’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఇలా ‘మత్తు వదలరా 2’ టీమ్ మొత్తానికి కూడా ఈ సక్సెస్ మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. కథేంటి డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు పోవడంతో బాబు మోహన్ (శ్రీసింహా), యేసు (సత్య) హైఎమర్జెన్సీ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్స్‌గా చేరతారు. కిడ్నాప్ కేసుల్ని ఛేదిస్తూ నిందితుల్ని పట్టుకోవడంలో ఆరితేరిపోతారు. ఇలా కొంచెం కొంచెం సంపాదన ఎంత కాలమని కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలని ఓ నిర్ణయానికొస్తారు. ఆ సందర్భంలోనే ఓ యువతి కిడ్నాప్ కేసు వస్తుంది. రూ.2 కోట్లు లావాదేవీలతో ముడిపడిన ఈ కేసును ఛేదించి ఆ మెుత్తాన్ని సొంతం చేసుకోవాలని బాబు, యేసు ప్లాన్‌ చేస్తారు. కానీ, అనూహ్యంగా కిడ్నాప్‌కు గురైన యువతి వీళ్ల కారులోనే శవమై తేలుతుంది. వీళ్లే కిడ్నాప్ చేశారనే రుజువుతో కూడిన వీడియో కూడా బయటికొస్తుంది. ఇంతకీ ఆ హత్య చేసిందెవరు? ఈ కేసు నుంచి బాబు మోహన్‌, యేసు బయట పడ్డారా? లేదా? డబ్బు సంపాదించాలనే వీళ్ల కోరిక నెరవేరిందా? లేదా? అన్నది స్టోరీ.&nbsp; https://telugu.yousay.tv/mathu-vadalara-2-movie-review-comedian-satyas-one-man-show-how-is-mathu-vadalara-2.html
    సెప్టెంబర్ 14 , 2024
    <strong>Mr. Bachchan Movie Review: రవితేజ - హరీష్‌ శంకర్‌ కాంబో మళ్లీ మ్యాజిక్‌ చేసిందా?</strong>
    Mr. Bachchan Movie Review: రవితేజ - హరీష్‌ శంకర్‌ కాంబో మళ్లీ మ్యాజిక్‌ చేసిందా?
    నటీనటులు : రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్‌ ఖేడ్కర్‌, శుభలేక సుధాకర్‌, కిషోర్‌ రాజు వశిష్ట, సత్య, చమ్మక్‌ చంద్ర తదితరులు దర్శకత్వం : హరీష్‌ శంకర్‌ సంగీతం : మిక్కీ. జె. మేయర్‌ సినిమాటోగ్రఫీ : అయనంక బోస్‌ ఎడిటర్‌ : ఉజ్వల్‌ కులకర్ణి నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్‌, భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, అభిషేక్‌&nbsp; మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా హరీష్‌ శంకర్‌ (Harish Shankar) డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan Movie Review). బాలీవుడ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. ‘మిరపకాయ్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రవితేజ-హరీష్‌ శంకర్‌ కాంబోలో రూపొందిన చిత్రం కావడంతో ‘మిస్టర్‌ బచ్చన్‌’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్‌, టీజర్‌, ప్రమోషన్ చిత్రాలు సైతం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ మూవీ స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? రవితేజ ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ పరుడు. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. దానివల్ల సస్పెండ్ కూడా అవుతాడు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సొంతూరు కోటిపల్లికి వెళ్లి అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి ప్రేమలో పడతాడు. పెళ్లికి రెడీ అవుతున్న క్రమంలో తిరిగి ఉద్యోగంలో చేరాలని బచ్చన్‌కు పిలుపు వస్తుంది. తదుపరి రైడ్‌ ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. అధికారులను సైతం భయపట్టే జగ్గయ్య ఇంట్లో బచ్చన్‌ ఎలా రైడ్‌ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? బచ్చన్‌ - జిక్కీ ప్రేమ వ్యవహారం ఏమైంది? పెద్దలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? చివరకు మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే మిస్టర్ బచ్చన్‌గా రవితేజ చాలా పవర్ ఫుల్‌గా కనిపించాడు. తనదైన కామెడీ శైలితో అదరగొట్టాడు. మునుపటి రవితేజను గుర్తుచేశాడు. అటు యాక్షన్ సీక్వెన్స్‌, భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్‌ చూపించాడు. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ రవితేజ నటించిన విధానం మెప్పిస్తుంది. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్‌తో అలరించింది. ముఖ్యంగా సాంగ్స్‌లో భాగ్యశ్రీ బోర్సే లుక్స్, స్టెప్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. విలన్‌గా జగపతి బాబు తన పాత్రకు పూర్తి నాయ్యం చేశారు. కమెడియన్ స‌త్య తన కామెడీతో నవ్వించాడు. ఫస్ట్ హాఫ్‌లో స‌త్య సీన్స్ దాదాపు వర్కౌట్ అయ్యాయి. ఇతర కీలక పాత్రల్లో నటించిన సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి, గౌతమి, ప్రవీణ్ తమ పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారి నిజాయతీగా పనిచేస్తే సమాజానికి ఎంత మేలు జరుగుతుందో దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. మిస్టర్‌ బచ్చన్‌ పాత్రను, దాని తాలుకా సన్నివేశాలను దర్శకుడు బాగా రాసుకున్నారు. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ ఈ మూవీకి ప్రధాన బలంగా చెప్పవచ్చు. ప్ర‌థమార్ధాన్ని నిల‌బెట్ట‌డంలో,&nbsp; ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత కాలక్షేపాన్నివ్వ‌డంలో ఈ ట్రాకే ముఖ్య భూమిక పోషించింది. దీనికి తోడు మ‌ధ్య‌లో దొర‌బాబుగా స‌త్య చేసే అల్ల‌రి ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని పంచింది. విరామానికి ముందు ముత్యం జ‌గ్గ‌య్య ఇంటిపై రైడ్‌కు వెళ్ల‌డం, ఆ త‌ర్వాత అక్క‌డ బ‌చ్చ‌న్ చేసే యాక్ష‌న్ హంగామా క‌థ‌ను ర‌స‌వ‌త్త‌రంగా మార్చారు డైరెక్టర్‌. అయితే ప్ర‌థమార్ధంలో క‌నిపించిన హ‌రీష్ మార్కు మ్యాజిక్ ద్వితీయార్ధంలో సన్నగిల్లింది. ఒక్క ఐటీ రైడ్ నేప‌థ్యంగానే ద్వితీయార్ధ‌మంతా నడపడంతో ఆసక్తి సన్నగిల్లింది. హీరో - విలన్ మధ్య మైండ్ గేమ్‌ని ఇంకా ఇంట్రెస్ట్‌గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు విలన్ పాత్రను ఇంకా బలంగా రాసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతికంగా ఈ చిత్రానికి తొలి హీరో మిక్కీ జే మేయర్. ఈ క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా మంచి క్యాచీ టూన్స్ ఇచ్చారు. రెప్పల్ డప్పుల్, జిక్కీ, సితార్, నల్లంచు తెల్ల చీర పాటలు ఓవైపు వీనులవిందును, మ‌రోవైపు క‌నుల విందును అందించాయి. అయానంక బోస్ కెమెరాపనితనం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ రవితేజ నటనలవ్‌ ట్రాక్కామెడీ, డైలాగ్స్‌ మైనస్‌ పాయింట్స్‌ ద్వితియార్థంకొన్ని బోరింగ్‌ సీన్స్ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    ఆగస్టు 16 , 2024
    Gam Gam Ganesha Review: అన్న ఫెయిల్‌ అయినా తమ్ముడు సక్సెస్‌ అయ్యాడు!
    Gam Gam Ganesha Review: అన్న ఫెయిల్‌ అయినా తమ్ముడు సక్సెస్‌ అయ్యాడు!
    నటీనటులు: ఆనంద్‌ దేవరకొండ, నయన్‌ సారిక, ప్రగతి శ్రీవాస్తవ్‌, రాజ్‌ అర్జున్‌, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేష్‌, ప్రిన్స్‌ యావర్‌, జబర్దస్త్‌ ఇమ్మాన్యుయేల్‌, క్రిష్ణ చైతన్య డైరెక్టర్‌ : ఉదయ్‌ బొమ్మిశెట్టి సంగీతం : చైతన్ భరద్వాజ్‌ సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వడి ఎడిటర్‌ : కార్తిక శ్రీనివాస్‌ నిర్మాతలు : వంశీ కృష్ణ, కేదర్‌ సెలగంశెట్టి విడుదల తేదీ : 31-05-2024 విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) నటించిన లేటెస్ట్‌ చిత్రం.. ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్‌ బొమ్మిశెట్టి దర్శకుడు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక కథానాయికలు. జబర్దస్త్‌ ఇమ్మాన్యుయెల్‌, వెన్నెల కిశోర్‌, రాజ్‌ అర్జున్‌, సత్యం రాజేష్‌, ప్రిన్స్‌ యావర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘బేబీ’ లాంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ చేస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ ఏడాది విజయ్‌ దేరరకొండ చేసిన ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. మరి సోదరుడు ఆనంద్‌ దేవరకొండ సినిమా అయినా సక్సెస్‌ కావాలని విజయ్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మే 31న విడుదలైన ‘గం గం గణేశా’ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిచిందా? లేదా? కథేంటి గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ).. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయెల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్‌ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్‌ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్‌, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్‌ గణేష్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్‌ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ.. గణేష్ పాత్రలో ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్‌తో మెప్పించాడు. బేబీ చిత్రం తర్వాత నటుడిగా మరింత పరిణితి సాధించాడు. ఇమ్మాన్యుయెల్‌తో కలిసి అతడు చేసిన కామెడీ సినిమాకు ప్లస్‌ అయ్యింది. అటు హీరోయిన్‌ ప్రగతి శ్రీవాస్తవ అదరగొట్టింది. నీలవేణి పాత్రలో మెప్పించింది. హీరో హీరోయిన్ల మధ్య కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. మరో కథానాయిక నయన్‌ సారిక కూడా శ్రుతి పాత్రలో ప్రేక్షకులను అలరించింది. హాస్యనటులు వెన్నెల కిషోర్‌, ఇమ్మాన్యుయెల్‌ తమదైన కామెడీ ఆకట్టుకున్నారు. విలన్‌గా రాజ్‌ అర్జున్‌ నటన మెప్పిస్తుంది. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు ఉదయ్‌ బొమిశెట్టి రొటీన్‌ కథనే తీసుకున్నప్పటికీ సినిమాను క్రైమ్‌ &amp; ఎంటర్‌టైనింగ్‌ ఫార్మెట్‌లో అద్భుతంగా రూపొందించారు. కథనం, కామెడీ, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను దర్శకుడు బాగా వర్కౌట్‌ చేశాడు. ముఖ్యంగా హీరో - ఇమ్మాన్యుయెల్‌ - వెన్నెల కిషోర్‌ చుట్టూ రాసుకున్న కామెడీ ట్రాక్‌ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్టులు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఆడియన్స్‌కు థ్రిల్‌ను పంచేలా దర్శకుడు ఆ సీన్లను తీర్చిదిద్దాడు. అయితే కొన్ని చోట్ల అసంబద్ద నారేషన్‌ సినిమాకు మైనస్‌గా మారింది. ఫస్టాఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, సెకండాఫ్‌ ట్విస్టులు, థ్లిల్లింగ్‌ క్లైమాక్స్‌తో ఒక మంచి చిత్రాన్ని అందించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు.  టెక్నికల్‌గా ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్‌ టీమ్‌ మంచి పనితీరును కనబరిచింది. మరి ముఖ్యంగా నేపథ్య సంగీతం మూవీకి హైలెట్‌గా నిలిచింది. చైతన్ భరద్వాజ్‌ తన క్యాచీ బీజీఎంతో సన్నివేశాలకు అదనపు ఆకర్షణను అందించాడు. సినిమాటోగ్రాఫర్‌ ఆదిత్య జవ్వడి పనితనం బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ ఆనంద్‌ దేవరకొండ నటనకామెడీట్విస్టులు మైనస్‌ పాయింట్స్ కథలో కొత్తదనం లేకపోవడంస్టోరీ నారేషన్‌లో తడబాటు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp; పబ్లిక్‌ టాక్‌ ఎలా ఉంది? గం గం గణేశా చిత్రాన్ని చూసిన ఓ నెటిజన్‌.. ఇది పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌ అని చెబుతున్నారు. ఈ వీకెండ్‌ ఫుల్లుగా నవ్వుకోవచ్చని ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. ఆనంద్ ఖాతాలో మరో హిట్‌ చేరిందని కామెంట్‌ పెట్టాడు.&nbsp; https://twitter.com/OfficialSreeNu/status/1796180578644926755 ‘గం గం గణేశా’ డీసెంట్‌ సినిమా అని.. ట్విస్టులు, వినోదం సినిమాకు హైలెట్‌గా నిలిచాయని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/review_rowdies/status/1796384723033596372 స్టోరీలో కంటెంట్‌ మిస్‌ అయ్యిందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఆనంద్‌ దేవరకొండ తన శక్తిమేర నటించాడని పేర్కొన్నాడు. కానీ అప్‌ టూ ద మార్క్ చేరుకోలేకపోయడని పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/Mjcartels/status/1796394003979800864 ‘గం గం గణేశా’.. రిలాక్స్‌గా సీట్‌లో కూర్చొని ఎంజాయ్‌ చేసే మూవీ అని ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించాడు. సందర్భానుసారంగా వచ్చే కామెడీ సూపర్బ్‌గా వర్కౌట్ అయ్యిందని చెప్పాడు. https://twitter.com/tcsblogs/status/1796341604845867293
    మే 31 , 2024
    Devil Movie Review: ఏజెంట్‌ ‘డెవిల్‌’గా అదరగొట్టిన కళ్యాణ్‌రామ్‌.. హిట్ కొట్టినట్లేనా?
    Devil Movie Review: ఏజెంట్‌ ‘డెవిల్‌’గా అదరగొట్టిన కళ్యాణ్‌రామ్‌.. హిట్ కొట్టినట్లేనా?
    నటీనటులు: నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్. సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య, అజయ్ తదితరులు దర్శకుడు: అభిషేక్‌ నామా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్ ఎడిటర్: తమ్మిరాజు నిర్మాత: అభిషేక్‌ నామా విడుదల తేదీ : డిసెంబర్ 29, 2023 నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram) హీరోగా అభిషేక్‌ నామా రూపొందించిన చిత్రం&nbsp; ‘డెవిల్‌’ (Devil). సంయుక్త కథానాయికగా చేసింది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పరిస్థితి ఎలా ఉండేదో ఈ సినిమాలో చూపించారు. కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో తొలిసారి గూఢచారిగా నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ ఈ కథ 1945 ప్రాంతంలో జరుగుతుంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను పట్టుకునేందుకు బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలోనే బోస్ ఇండియాలో అడుగు పెడుతున్నట్లు బ్రిటీష్ ఏజెన్సీలు తెలుసుకుంటాయి. బోస్‌ను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య జరుగుతుంది. కూతుర్ని హత్య చేశారన్న ఆరోపణల మీద జమీందారుని అరెస్ట్ చేస్తారు. ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) రంగంలోకి దిగుతాడు. అసలు ఈ కేసుకు, బోస్‌‌ను పట్టుకునే మిషన్‌కు ఉన్న లింక్ ఏంటి? ఆ హత్య ఎందుకు జరిగింది? ఏజెంట్‌ డెవిల్‌ గతం ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే కళ్యాణ్ రామ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్రిటిష్‌ ఏజెంట్‌గా తన లుక్స్‌లో, యాక్షన్‌లో ఫ్రెష్ నెస్ చూపించడానికి ఆయన చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఫైటింగ్‌ సీక్వెన్స్‌ల్లో కళ్యాణ్ రామ్‌ అదరగొట్టాడు. అటు మాళవిక నాయర్ అప్పియరెన్స్, పాత్ర తీరు బాగుంది. సంయుక్తా మీనన్ అందంగా కనిపించడంతో పాటు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. బ్రిటీష్ ఆఫీసర్లుగా కనిపించిన వారు చక్కగా నటించారు. వశిష్ట, షఫీ, మహేష్, కమెడియన్ సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, అభిరామి, ఏస్తర్ ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు అభిషేక్‌ నామా ఎంచుకున్న 1945 నాటి కథ, కథనం కొత్తగా అనిపిస్తుంది. కథ రాసుకున్న తీరు, దీనికి క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌ను యాడ్‌ చేసి ఒక్కో పాయింట్‌ను రివీల్‌ చేయడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. అయితే ఫస్ట్‌హాఫ్‌ను చాలా ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తున్నట్లు అనిపించినా సస్పెన్స్‌గా మాత్రం అనిపించదు. ద్వితీయార్థాన్ని కాస్త ఎమోషనల్‌గా నడుపుదామని డైరెక్టర్‌ యత్నించినప్పటికీ అది పెద్దగా వర్కౌట్‌ అయినట్లు కనిపించదు. కొన్ని సీన్లు లాజిక్స్‌కు దూరంగా ఉంటాయి. అయితే&nbsp; ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు మెప్పిస్తాయి. యాక్షన్‌ సీక్వెన్సెస్‌ను డైరెక్టర్‌ చాలా బాగా తెరకెక్కించారు.&nbsp; సాంకేతికంగా టెక్నికల్‌ అంశాలకు వస్తే.. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కొన్ని చోట్ల కథకు స్పీడు బ్రేకుల్లా అడ్డుపడినట్లు అనిపిస్తాయి. అయితే హర్షవర్ధన్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం అద్భుతంగా అనిపిస్తుంది. గ్రాఫిక్స్‌ అంతంతమాత్రంగానే అనిపిస్తాయి. సినిమా సెటప్‌, ఆర్ట్‌ వర్క్‌, కెమెరా వర్క్‌ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కళ్యాణ్‌రామ్ నటనయాక్షన్ సీక్వెన్స్‌ఆర్ట్‌ టీమ్‌ పనితనం మైనస్‌ పాయింట్స్‌ పాటలుస్క్రీన్‌ ప్లే రేటింగ్‌: 3/5
    డిసెంబర్ 29 , 2023
    BeduruLanka 2012 Movie Review: యుగాంతం చుట్టూ తిరిగిన బెదురులంక.. కార్తికేయ హిట్‌ కొట్టినట్లేనా?
    BeduruLanka 2012 Movie Review: యుగాంతం చుట్టూ తిరిగిన బెదురులంక.. కార్తికేయ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్‌ ఘోష్‌, రాజ్‌ కుమార్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సత్య&nbsp; దర్శకుడు: క్లాక్స్ సంగీతం: మణిశర్మ నిర్మాణ సంస్థ: లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌&nbsp; నిర్మాత: రవీంద్ర బెనర్జీ (బెన్నీ)&nbsp; సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్&nbsp; విడుదల తేది: ఆగస్ట్‌ 25, 2023 కార్తికేయ (Kartikeya Gummakonda) హీరోగా నూతన దర్శకుడు క్లాక్స్‌ తెరకెక్కించిన చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. అజయ్‌ ఘోష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఎల్బీ శ్రీరామ్‌, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యుగాంతం ఇతివృత్తంగా ఓ పల్లెటూరు నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాపై కార్తికేయ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలు వేరని, ఈ చిత్రం వేరని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తెలిపారు. సరికొత్త జానర్‌లో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ (ఆగస్టు 25) రిలీజైన ఈ చిత్రం కార్తీ నమ్మకాన్ని నిలబెట్టిందా? అతడికి మంచి హిట్‌ తెచ్చిపెట్టిందా? లేదా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. కథ&nbsp; ఈ సినిమా కథంతా 2012 నాటి కాలంలో బెదురులంక గ్రామంలో జరుగుతుంది. శివ శంకర వరప్రసాద్‌ (కార్తికేయ) హైదరాబాద్‌లో గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. తన ముక్కుసూటి తనంతో జాబ్‌ పోగొట్టుకుంటాడు. ప్రేమించిన అమ్మాయి (నేహాశెట్టి)కోసం బెదురులంక గ్రామానికి వస్తాడు. నేహా ఊరి ప్రెసిడెంట్ కూతురు. అప్పటికే ఈ ఊర్లో యుగాంతానికి సంబంధించి వార్త భయానికి గురి చేస్తుంది. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు ఊరి ప్రెసిడెంట్‌(గోపరాజు రమణ)తో కలిసి బ్రహ్మణుడైన బ్రహ్మం(శ్రీకాంత్‌ అయ్యంగార్‌), చర్చి ఫాదర్‌ కొడుకు డేనియల్‌(రాంప్రసాద్‌) పెద్ద ప్లాన్‌ వేస్తారు. ఊర్లో అందరి వద్ద ఉన్న బంగారాన్ని కరిగించి శివలింగం, శిలువ చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని వారు గ్రామస్తులను నమ్మిస్తారు. అందుకు ఊరి ప్రజలు అంగీకరించినప్పటికీ హీరో ఒప్పుకోడు. దీంతో అతడ్ని ఊరి నుంచి వెలివేస్తారు. మరి శివ ఊరి పెద్దల ఆటలు ఎలా కట్టించాడు? తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు? ఊరి జనం మూఢనమ్మకాలు పోగొట్టేందుకు ఏం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో కార్తికేయ నటన గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలో అయినా అతడు జీవించేస్తాడు. ఈ చిత్రంలో కూడా కార్తికేయ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు . తనకు నచ్చినట్లుగా జీవించే యువకుడు శివ పాత్రకు కార్తికేయ న్యాయం చేశాడు. కామెడీతో పాటు యాక్షన్‌ సీన్లలో కూడా అదరగొట్టేశాడు. ఇక చిత్రగా నేహాశెట్టి పాత్ర నిడివి తక్కువే అయినా తనదైన అందచందాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసింది. జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఆశ ఉన్న భూషణం పాత్రలో అజయ్‌ ఘోష్‌ అదరగొట్డాడు. కొన్ని చోట్ల తన నటనతో కోటా శ్రీనివాసరావును గుర్తు చేశాడు. అటు బ్రహ్మాగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌, డేనియల్‌గా రాంప్రసాద్‌ మెప్పించారు. రాజ్‌ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.&nbsp; ఎలా సాగిందంటే సినిమా యుగాంతం అనే వార్తతో ప్రారంభమవుతుంది. దీంతో బెదురులంక జనాల్లో భయాలు ప్రారంభవుతాయి. తొలి భాగం చాలా స్లోగా నడుస్తుంది. పాత్రల పరిచయం, కథని ఎస్టాబ్లిష్‌ చేయడానికి ఎక్కువ టైమ్‌ తీసుకోవడంతో కథలో వేగం మిస్‌ అయ్యింది. అది కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. ఊరి జనాలను మోసం చేసేందుకు ప్రెసిడెంట్‌, బ్రహ్మం, డేనియల్‌ కలిసి చేసే కుట్రలు నవ్వులు పూయిస్తాయి. ముల్లుని ముల్లుతోనే తీయాలని హీరో చేసే ప్రయత్నం ఆద్యంతం గిలిగింతలు పెట్టిస్తాయి. దీంతో మొదటి భాగంలోని నీరసాన్ని ఈ కామెడీ తగ్గిస్తుంది. అయితే నేహాశెట్టి, కార్తికేయల మధ్య లవ్‌ ట్రాక్‌ని బలంగా చూపించలేదు. దీంతో వారి లవ్‌ ట్రాక్‌లో ఇంట్రెస్ట్ మిస్‌ అవుతుంది.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే 2012లో యుగాంతం రాబోతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం&nbsp; జరుగుతుందో అర్థంకాక అప్పట్లో చాలా మంది ఆందోళనకు గురయ్యారు. కానీ దాన్ని ఎంటర్టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు ఈ చిత్ర దర్శకుడు క్లాక్స్. కొద్ది రోజుల్లో చనిపోతున్నామంటే జనంలో ఉండే భయం కారణంగా పుట్టే ఫన్‌పై ఫోకస్‌ పెట్టాడు. ప్రజల వీక్‌నెస్‌ని పెద్దలు ఎలా వాడుకుంటారో, మతాల పేరుతో వారిని ఎలా ఆడుకుంటారో కూడా ఈ చిత్రంలో చూపించారు. అదే సమయంలో&nbsp; మూఢవిశ్వాలపై సెటైర్లు పేల్చాడు. దేవుడి పేరుతో చేసే మోసాలను ఇందులో అంతర్లీనంగా చూపించారు. ఎవరికోసమే కాదు, మనకోసం మనం బతకాలనే సందేశాన్నిచ్చాడు. యుగాంతాన్ని యాక్షన్‌, థ్రిల్లర్‌ జోనర్‌లో కాకుండా వినోదాత్మకంగా చెప్పాలనే ఆలోచనతోనే దర్శకుడు సగం సక్సెస్‌ అయ్యారు. తొలి దర్శకుడైనా సినిమాని బాగా డీల్‌ చేశాడు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; చిత్రంలోని సాంకేతిక అంశాల విషయానికి వస్తే మణిశర్మ సంగీతం యావరేజ్‌గా ఉంది. ఈ సినిమాకు పాటలు మైనస్‌ అని చెప్పవచ్చు. సాంగ్స్‌ అంతగా ఆకట్టుకోకపోయినా మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్‌ పనితీరు బాగుంది. సినిమాను చాలా షార్ప్‌గా కట్‌ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ హీరో నటనకామెడీసినిమాటోగ్రఫీనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ పాటలుహీరో, హీరోయిన్‌ లవ్‌ ట్రాక్‌సాగదీత సీన్లు&nbsp; రేటింగ్‌: 2.75/5 https://www.youtube.com/watch?v=98y83GscKEI
    ఆగస్టు 25 , 2023
    Rangabali Movie Review: రంగబలితో నాగశౌర్య సక్సెస్ అందుకున్నట్లేనా.. మూవీ ఎలా ఉంది?
    Rangabali Movie Review: రంగబలితో నాగశౌర్య సక్సెస్ అందుకున్నట్లేనా.. మూవీ ఎలా ఉంది?
    నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు.. దర్శకుడు: పవన్ బాసంశెట్టి నిర్మాత: సుధాకర్ చెరుకూరి సంగీతం: పవన్ సీహెచ్ సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి ‘ఛలో’ తర్వాత ఆ స్థాయి హిట్ కోసం నాగశౌర్య ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు. క్లాస్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచి లవర్‌ బాయ్‌గా గుర్తింపు పొందిన నాగశౌర్య ఇందులో మాస్ క్యారెక్టర్ పోషించాడు. ఈ సారి ‘రంగబలి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి వచ్చాడు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? మాస్ ఆడియెన్స్‌ని నాగశౌర్య బుట్టలో వేసుకున్నాడా? వంటి అంశాలను రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటంటే? శౌర్య(నాగశౌర్య) పనీపాట లేకుండా తిరిగే అబ్బాయి. రాజవరంలో తండ్రి విశ్వం(రమణ) మెడికల్ షాపుని నిర్వహిస్తుంటాడు. కొడుకుకి మెడికల్ షాపును అప్పజెప్పి భవిష్యత్తును తీర్చిదిద్దాలని భావిస్తాడు విశ్వం. ఇందుకోసం ఫార్మసీ ట్రైనింగ్‌కి వైజాగ్ పంపిస్తాడు. అక్కడ శౌర్య సహజ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు. కానీ, వీరి ప్రేమను అంగీకరించడానికి సహజ తండ్రి అడ్డు చెబుతాడు. రాజవరంలోని రంగబలి సెంటర్ ఇందుకు ప్రధాన కారణం. మరి వీరి ప్రేమకి, రంగబలికి సంబంధం ఏంటి? ప్రేమ కోసం హీరో ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.&nbsp; ఎలా ఉంది? రంగబలి చూసిన ఆడియన్స్‌కు రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూసిన భావనే కలుగుతుంది. ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంటుంది. సత్య చేసే కామెడీ ఫస్టాఫ్‌లో బోర్ కొట్టకుండా చేస్తుంది. ఇక ఒక ట్విస్టుతో ఇంటర్వెల్ అవుతుంది. సెకండాఫ్ పూర్తిగా యాక్షన్ సీన్లతో నడుస్తుంది. ఫస్టాఫ్‌లో కనిపించిన జోరు సెకండాఫ్‌లో ఉండదు. ఇక, క్లైమాక్స్ తీసికట్టుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కథ అందరికీ తెలిసేలా ఉన్నా ప్రభావవంతమైన కథనంతో ప్రేక్షకుడిని రంగబలి మెప్పించలేకపోయింది.&nbsp; ఎవరెలా చేశారు? సొంతూరిలో రాజులా బతకాలనే భావనతో ఏమైనా చేసే యువకుడి పాత్రలో నాగశౌర్య మెప్పించాడు. లుక్స్‌తో క్లాస్, బాడీతో మాస్ ఆడియెన్స్‌ని మెప్పించాడు. హీరోయిన్ యుక్తి తరేజ ఫర్వాలేదనిపించింది. హీరోతో రొమాన్స్ పండించింది. ఇక కమెడియన్ సత్య కడుపుబ్బా నవ్వించాడు. ఇతరులు సంతోషపడితే చూడలేని అగాధం పాత్రలో ఇరగదీశాడు. ఫస్టాఫ్ మొత్తం తన కామెడీనే గుర్తుండిపోయేలా చేశాడు. ఇక, విలన్‌గా షైన్ టామ్ చాకోకు సరైన క్యారెక్టర్ పడలేదనిపించింది. డిజైన్ చేసిన మేరకు తన పాత్రలో మెప్పించాడీ మలయాళ నటుడు. గోపరాజు రమణ, మురళీ శర్మ, శరత్ కుమార్, తదితరులు ఓకే అనిపించారు. సాంకేతికంగా? ఒక చిన్న విషయాన్ని అనుకుని దానిని సినిమాగా డెవలప్ చేశాడు దర్శకుడు పవన్ బాసంశెట్టి. తొలి సినిమా అయినప్పటికీ కొన్ని సీన్లలో తన ప్రతిభను కనబర్చాడు. అయితే, ఓవరాల్‌గా ప్రేక్షకుడిని సాటిస్‌ఫై చేయలేకపోయాడు. క్లైమాక్స్‌ని మరింత పకడ్బందీగా ప్లాన్ చేసి ఉండాల్సింది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్ పాటలు పెద్దగా బయటికి రాలేవు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి.&nbsp; https://www.youtube.com/watch?v=e9d9qhvI3dk ప్లస్ పాయింట్స్ కామెడీ నటీనటులు మైనస్ పాయింట్స్ పేలవ కథ, కథనం క్లైమాక్స్ పాటలు రేటింగ్: 2.25/5 https://www.youtube.com/watch?v=B8ybLVdO2YQ
    జూలై 07 , 2023

    @2021 KTree