రివ్యూస్
How was the movie?
తారాగణం
.jpeg)
రాజేంద్ర ప్రసాద్
కృష్ణ మూర్తి
నరేష్ అగస్త్య
ఇన్స్పెక్టర్ కృష్ణ
హర్ష వర్ధన్
పరమజ్యోతిజ్ఞానేశ్వరి కాండ్రేగులసత్య

సత్య ప్రకాష్
SI పురుషోత్తం
రాకేందు మౌళి
హుస్సేన్రవి జోష్రాజు
ఎ. జీవన్ కుమార్

పావని రెడ్డి
రాకీ
సిబ్బంది
పవన్ సాదినేనిదర్శకుడు
విష్ణు ప్రసాద్నిర్మాత
సుస్మిత కొణిదెలనిర్మాత
శ్రవణ్ భరద్వాజ్సంగీతకారుడు
కథనాలు

Vikkatakavi Series OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ సిరీస్.. కారణం ఇదే!
యువ నటుడు నరేష్ అగస్త్య (Naresh Agasthya) 'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం' చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. అతడు నటించిన లేటెస్ట్ సిరీస్ ‘వికటకవి’ సిరీస్ ఇటీవల ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించగా మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్‌గా చేసింది. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వికటకవి సిరీస్ ఓటీటీలో దుమ్మురేపుతోంది. రికార్డ్ వ్యూస్‌తో ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. వికటకవి సిరీస్ ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
జాతీయ స్థాయిలో ట్రెండింగ్..
‘వికటకవి’ (Vikkatakavi Web Series) సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (Zee 5) స్ట్రీమింగ్‌కు తెచ్చింది. నవంబర్ 28 నుంచి తెలుగు సహా పలు దక్షిణాది భాషల్లో ప్రసారమవుతోంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు విశేష స్పందన వస్తున్నట్లు ఓటీటీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఇప్పటివరకూ 150+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదైనట్లు తెలిపింది. ఈ మేరకు స్పెషల్ పోస్టుతో పాటు, చిన్న వీడియో క్లిప్‌ను సైతం ‘జీ 5’ వర్గాలు విడుదల చేశాయి. ప్రతీ ఒక్కరూ ఈ మిస్టరీ థ్రిల్లర్‌ను వీక్షించాలని కోరాయి.
https://twitter.com/ZEE5Telugu/status/1866779619975893192
https://twitter.com/baraju_SuperHit/status/1866742687057187002
కారణం ఏంటంటే
దర్శకుడు ప్రదీప్ మద్దాలి (Pradeep Maddali) మిస్టరీ థ్రిల్లర్‌గా వికటకవి సిరీస్‌ను రూపొదించాడు. అమరగిరి ప్రాంతంలోని దేవతల గుట్టపైకి వెళ్తున్న వారంతా గతాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? అన్న కాన్సెప్ట్‌తో ఆద్యాంతం ఆసక్తిగా సిరీస్‌ను నడిపించారు. కథ, కథనం విషయంలో ఎక్కడా పక్కదారి పట్టకుండా ఇంట్రస్టింగ్‌గా తీసుకెళ్లారు. డిటెక్టివ్ అయిన హీరో ఓ పోలీసు అధికారి సాయంతో ఈ మిస్టరీని కనుగునేందుకు చేసే ఇన్‌వేస్టిగేషన్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. గుట్టపైన అంతుచిక్కని రహస్యానికి సంబంధించి ఒక్కో చిక్కుముడిని విప్పిన విధానం మెస్మరైజ్ చేస్తుంది. దేవతల గుట్ట రహస్యం, కథనాయకుడు దాన్ని ఛేదించడం చూసిన తర్వాత ఒక థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్‌ను చూసిన భావన తప్పక కలుగుతుంది.
https://twitter.com/an18256761/status/1864704641541210416
అగస్త్య వన్‌మ్యాన్ షో
డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నటుడు నరేష్ ఆగస్త్య (Vikkatakavi Web Series) వన్ మ్యాన్‌షో చేశాడు. సెటిల్డ్ నటనతో అదరగొట్టాడు. లుక్స్, డైలాగ్స్ పరంగా ఎంతో పరిణితి సాధించాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో పాత్రకు మంచి వెయిటేజ్ తీసుకొచ్చాడు. అటు సైకలాజి చదివిన యువతి పాత్రలో మేఘా ఆకాష్ (Megha Akash) ఆకట్టుకుంది. హావాభావాలను చక్కగా పలికించింది. రఘు కుంచె, షిజు అబ్దుల్ రషీద్, ముక్తార్ ఖాన్, అశోక్ కుమార్, అమిత్ తివారిలవి రెగ్యులర్ రోల్స్ అయినా కథలో సెట్ అయ్యాయి. తారక్ పొన్నప్ప చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు.
https://twitter.com/ZEE5Tamil/status/1862134559640531310
కథ ఇదే..
ఈ సిరీస్ 1970 కాలంలో సాగుతుంటుంది. రామకృష్ణ (నరేష్ అగస్త్య) ఫేమస్ డిటెక్టివ్. తన తెలివి తేటలతో ఎంతో సంక్లిష్టమైన కేసులను పరిష్కరిస్తుంటాడు. దీంతో పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసులు సైతం అతడి సాయం తీసుకుంటుంటారు. మరోవైపు అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. రామకృష్ణ డిటెక్టివ్ స్కిల్స్ గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్ దేవతల గుట్ట రహాస్యాన్ని కనుగొనాలని ఛాలెంజ్ చేస్తాడు. దీంతో దేవతల గుట్ట మీదకు వెళ్లిన రామకృష్ణ ఏం తెలుసుకున్నాడు?. అతడితో అమరగరి సంస్థాన రాజు మనవరాలు లక్ష్మీ (మేఘా ఆకాష్) ఎందుకు వెళ్లింది? వారిద్దరి పరిచయం ఎలా జరిగింది? ఇంతకీ ఆ శాపం ఏంటి? దానిని రామకృష్ణ పరిష్కరించాడా? లేదా? అన్నది స్టోరీ.
డిసెంబర్ 11 , 2024

Vikkatakavi Web Series Review: 1970ల నాటి దేవతల గుట్ట మిస్టరీ.. ‘వికటకవి’ థ్రిల్లింగ్‌గా ఉందా?
నటీనటులు: నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్, షిజు మీనన్, తారక్ పొన్నప్ప, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్ తదితరులు
దర్శకుడు: ప్రదీప్ మద్దాలి
సంగీత దర్శకుడు: అజయ్ అరసాడా
సినిమాటోగ్రఫీ: షోయెబ్ సిద్దికీ
ఎడిటర్: సాయి బాబు తలారి
నిర్మాత : రజని తాళ్లూరి
ఓటీటీ వేదిక : జీ 5
యువ నటుడు నరేష్ అగస్త్య (Naresh Agastya) 'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం' చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అతడు చేసిన లేటెస్ట్ సిరీస్ ‘వికటకవి’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్‌గా చేసింది. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. జీ5 ఓటీటీలో తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Vikkatakavi Web Series Review)
కథేంటి
ఈ సిరీస్ 1970 కాలంలో సాగుతుంటుంది. రామకృష్ణ (నరేష్ అగస్త్య) ఫేమస్ డిటెక్టివ్. తన తెలివి తేటలతో ఎంతో సంక్లిష్టమైన కేసులను పరిష్కరిస్తుంటాడు. దీంతో పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసులు సైతం అతడి సాయం తీసుకుంటుంటారు. మరోవైపు అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. రామకృష్ణ డిటెక్టివ్ స్కిల్స్ గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్ దేవతల గుట్ట రహాస్యాన్ని కనుగొనాలని ఛాలెంజ్ చేస్తాడు. దీంతో దేవతల గుట్ట మీదకు వెళ్లిన రామకృష్ణ ఏం తెలుసుకున్నాడు?. అతడితో అమరగరి సంస్థాన రాజు మనవరాలు లక్ష్మీ (మేఘా ఆకాష్) ఎందుకు వెళ్లింది? వారిద్దరి పరిచయం ఎలా జరిగింది? ఇంతకీ ఆ శాపం ఏంటి? దానిని రామకృష్ణ పరిష్కరించాడా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నరేష్ ఆగస్త్య (Vikkatakavi Web Series Review) ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ నటనతో అదరగొట్టాడు. లుక్స్, డైలాగ్స్ పరంగా ఎంతో పరిణితి సాధించాడని చెప్పవచ్చు. తన బాడీ లాంగ్వేజ్‌తో పాత్రకు మంచి వెయిటేజ్ తీసుకొచ్చాడు. మేఘా ఆకాష్ (Megha Akash) నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలోనే కనిపించింది. హావాభావాలను చక్కగా పలికించింది. రఘు కుంచె, షిజు అబ్దుల్ రషీద్, ముక్తార్ ఖాన్, అశోక్ కుమార్, అమిత్ తివారిలవి రెగ్యులర్ రోల్స్ అయినా కథలో సెట్ అయ్యాయి. తారక్ పొన్నప్ప చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా అతడి స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది. ఏ దశలోనూ కథ నుంచి డివియేట్ కాకుండా మెప్పించాడు. కథలోని ప్రతీ పాత్రకు ఓ పర్పస్ ఉండటం, ఆ క్యారెక్టర్లను డిజైన్ చేసిన విధానం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. కథకు సంబంధించి హింట్స్ ఇస్తూనే ఇంట్రస్ట్ క్రియేట్ చేశారు. ట్విస్టులు కాస్త ఊహించే విధంగానే ఉన్నప్పటికీ ఎంగేజింగ్‌గా అనిపిస్తాయి. అయితే కొన్ని సన్నివేశాలను ఇంకాస్త బలంగా చూపించే అవకాశమున్నప్పటికీ దర్శకుడు వినియోగించుకోలేకపోయాడు. కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగదీతగా అనిపించిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని ఎలివేషన్స్ షాట్స్ కూడా బెటర్‌గా తీసి ఉంటే సిరీస్ నెక్స్ట్ లెవల్లో ఉండేదని చెప్పవచ్చు. ఊహాజనితంగా సాగడం కూడా ఇంకో మైసన్‌గా చెప్పవచ్చు.
సాంకేతికంగా..
ఈ సిరీస్‌కు టెక్నికల్ విభాగాలు (Vikatakavi Web Series Review) అన్నీ మంచి పనితీరు కనబరిచాయి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కావడంతో అప్పటి సెటప్, డ్రెస్సింగ్ స్టైల్‌ను ఆర్ట్ డిపార్ట్‌మెంట్ బాగా తీర్చిదిద్దింది. సినిమాటోగ్రాఫీ కూడా వెనకటి కాలానికి తీసుకెళ్లేలా ఉంది. నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ, కథనంనరేష్ అగస్త్య నటనట్విస్టులు
మైనస్ పాయింట్స్
ఊహాజనితంగా ఉండటంకొన్ని సాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
నవంబర్ 28 , 2024

Bharateeyudu 2 Trolls: 106 ఏళ్ల వయసులో ఎగిరెగిరి ఆ ఫైట్స్ ఏంటి..? ఏకిపారేస్తున్న నెటిజన్లు!
గ్లోబల్ స్టార్ కమల్ (Kamal Hassan) హాసన్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ చిత్రం 'భారతీయుడు 2' (Bharateeyudu 2). స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో బజ్ ఉంది. విశ్వనటుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2' (Bharateeyudu 2). హీరో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్‌లు హీరోయిన్లుగా చేశారు. జులై 12న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం (జూన్ 25) ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సేనాపతి పాత్రలో కమల్ హాసన్ అదరగొట్టారు. అయితే కొందరు మాత్రం కమల్ పాత్రను టార్గెట్ చేస్తూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.
ట్రోల్స్‌కు కారణమిదే?
'భారతీయుడు 2' సినిమాలో 106 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా కమల్ హాసన్ కనిపించారు. ముఖం మెుత్తం ముడతలతో.. పార్ట్ -1 (భారతీయుడు)లోని సేనాపతి కంటే మరింత వయసు మళ్లిన వ్యక్తిగా దర్శకుడు కమల్‌ను చూపించారు. యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా యాక్షన్ సీక్వెన్స్‌లు పెట్టినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. అవినీతిలో కూరుకుపోయిన అధికారులను ఎంతో సాహసోపేతంగా కమల్ హత్య చేయడం గమనించవచ్చు. అయితే వందేళ్లకు పైబడిన వ్యక్తి ఇలా యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్ములేపడం లాజిక్‌లెస్‌గా ఉందంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ వయసులో కాళ్లు, చేతులు కదపడానికే కష్టంగా ఉంటుందని.. కానీ, సేనాపతి మాత్రం అలవోకగా స్టంట్స్ చేసేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఆ వయసులో ఉన్న తాత ఈ రేంజ్‌లో ఫైట్లు, ఎగిరెగిరి కొట్టడాలు ఎలా సాధ్యమవుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమాటిక్ ఫ్రీడం ఉండొచ్చు కానీ, మరీ ఈ స్థాయిలో కాదని హితవు పలుకుతున్నారు.
శంకర్.. స్ట్రాంగ్ కౌంటర్
'భారతీయుడు 2'లో కమల్ పాత్ర గురించి వస్తోన్న ట్రోల్స్‌పై డైరెక్టర్ శంకర్ స్పందించారు. తనదైన శైలిలో ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ‘106 సంవత్సరాల వ్యక్తి ఇలా ఫైట్స్ చేయడం సాధ్యమే. చైనా దేశంలో లూజియా అనే ఓ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఇప్పటికీ 120 ఏళ్ల వయసులో కూడా గాల్లో ఎగురుతూ విన్యాసాలు చేస్తున్నారు. ఆయన గాల్లో ఎగురుతూ కిక్స్ ఇస్తూ, ఫైట్స్ చేస్తున్నారు. ఆయన ప్రేరణతోనే సేనాపతి పాత్రను తీర్చిదిద్దాం’ అంటూ శంకర్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ శంకర్‌కు పలువురు నెటిజన్లు మద్దతిస్తున్నారు. సినిమాను సినిమాలాగా చూడాలని.. లాజిక్స్ గురించి ఆలోచిస్తే ఏ మూవీ చూడలేరని కామెంట్స్ చేస్తున్నారు.
ట్రైలర్ ఎలా ఉందంటే?
'ఇండియన్ 2' నుంచి విడుదలైన లేటెస్ట్ ట్రైలర్.. అందరి అంచనాలను అందుకుంటూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ట్రైలర్‌లో.. హీరో సిద్దార్థ్‌ను ఓ స్టూడెంట్‌లా చూపించారు. అన్యాయాలు, అక్రమాలను ఎదిరించే పాత్రలో అతడు కనిపించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీంతో సమాజంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని ట్విటర్‌లో 'ఆయన మళ్లీ రావాలి' హ్యాష్‌టాగ్‌ను యూత్ ట్రెండ్ చేస్తారు. దీంతో సేనాపతి రీఎంట్రీ ఇస్తాడు. అవినీతి చేసిన కొందరిని శిక్షించడం ట్రైలర్‌లో చూడవచ్చు. విజువల్స్ పరంగా ట్రైలర్ చాలా రిచ్‌గా ఉంది. యాక్షన్ సన్నివేశాలను డైరెక్టర్ శంకర్ తనదైన మార్క్‌తో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. అనిరుధ్ అందించిన నేపథ్యం సంగీతం కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
https://www.youtube.com/watch?v=H1GFcXaNXHU
జూన్ 26 , 2024

Bharateeyudu 3 OTT: కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్‌కు అవమానం.. తప్పక ఓటీటీలోకి వస్తోన్న‘భారతీయుడు 3’?
కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు చిత్రం గతంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి సీక్వెల్ ఈ ఏడాది జులై 12 'భారతీయుడు 2' రిలీజైంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్‌గా నిలిచింది. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకా దారుణంగా చతికిల పడింది. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా 'భారతీయుడు 3' రానుందని సెకండ్ పార్ట్ క్లైమాక్స్‌లోనే దర్శకుడు శంకర్ స్పెషల్ ట్రైలర్ చూపించి మరీ కన్ఫార్మ్ చేశారు. అయితే తాజాగా మూడో పార్ట్‌కు సంబంధించి క్రేజీ బజ్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులోని నిజానిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నేరుగా ఓటీటీలోకి ‘భారతీయుడు 3’!
కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రానున్న మరో చిత్రం 'భారతీయడు 3'. వీరి కాంబోలో విజయవంతమైన భారతీయుడు చిత్రానికి కొనసాగింపుగా రెండు, మూడు భాగాలను రూపొందించారు. ఈ ఏడాది జులైలో విడుదలైన 'భారతీయుడు 2' ప్రేక్షకాదరణ పొందని సంగతి తెలిసిందే. దాంతో మూడో భాగానికి థియేట్రికల్ సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం. రిస్క్ తీసుకునేందుకు థియేటర్ వర్గాలు సంసిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడో పార్ట్‌ను నేరుగా ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకున్న శంకర్, కమల్ హాసన్ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకురావడం ఇది వారికి అవమానేమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ధ్రువీకరించిన ఓటీటీ వర్గాలు!
‘భారతీయుడు 3’ చిత్రం ఓటీటీలోకి రావడం ఖాయమని నెట్‌ఫ్లిక్స్ వర్గాలు సైతం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 2025 జనవరిలో ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఓటీటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం వెల్లడించనున్నట్లు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే థియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ‘భారతీయుడు 2’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో వ్యూస్ సాధించలేకపోయింది. నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఈ సినిమాకు ఆదరణ లభించలేదు. దీంతో ‘భారతీయుడు 3’ ఓటీటీ హక్కులు తక్కువ ధరకే అమ్ముడుపోయే చాన్స్ ఉందని అంటున్నారు.
‘భారతీయుడు 2’పై దారుణమైన ట్రోల్స్!
'భారతీయుడు 2' సినిమాలో 106 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా కమల్ హాసన్ కనిపించారు. ముఖం మెుత్తం ముడతలతో.. పార్ట్ -1 (భారతీయుడు)లోని సేనాపతి కంటే మరింత వయసు మళ్లిన వ్యక్తిగా దర్శకుడు కమల్‌ను చూపించారు. అయితే యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆ పాత్రతో యాక్షన్స్ సీక్వెన్స్ చేయించారు డైరెక్టర్ శంకర్. వందేళ్లకు పైబడిన వ్యక్తి ఇలా యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్ములేపడం లాజిక్‌లెస్‌గా ఉందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. కాళ్లు, చేతులు కదపడానికే కష్టంగా ఉండే వయసులో అలవోకగా స్టంట్స్ చేస్తుండటం చూడటానికి నమ్మశక్యంగా అనిపించలేదు. ఇక ‘భారతీయుడు 2’ కథ, కథనం కూడా చాలా పూర్ ఉందన్న విమర్శలు వచ్చాయి. అసలు శంకర్ చిత్రంలాగే లేదని కామెంట్స్ వినిపించాయి.
గేమ్ ఛేంజర్‌తో గట్టెక్కేనా!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. అంతకుముందు వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. ఈ సినిమా విజయం సాధిస్తే శంకర్ పేరు మరోమారు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగే ఛాన్స్ ఉంది. లేదంటే అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గేమ్ ఛేంజర్ రిజల్ట్ చాలా కీలకంగా మారింది. ‘ఫ్యామిలీ స్టార్’ మిగిల్చిన నష్టాలను ‘గేమ్ ఛేంజర్’ పూడ్చాలని దిల్‌రాజు భావిస్తున్నారు.
అక్టోబర్ 04 , 2024

Bharateeyudu 2 Day 1 Collections: ‘భారతీయుడు 2’కి ఊహించని షాక్.. భారీగా పడిపోయిన కలెక్షన్స్!
కమల్ హాసన్ (Kamal Haasan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'భారతీయుడు 2'. గతంలో వచ్చిన 'భారతీయుడు' చిత్రం బ్లాక్ బాస్టర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో చిత్రం శుక్రవారం (జులై 12) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే ప్రేక్షకుల అంచనాలను అందులేక తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. 'భారతీయుడు 2' తమను తీవ్రంగా నిరాశ పరిచిందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారతీయుడు తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? మిశ్రమ స్పందన ఈ సినిమా వసూళ్లపై చూపిన ప్రభావం ఏంటి? ఇప్పుడు చూద్దాం.
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
‘భారతీయుడు 2’ (Bharateeyudu 2 Day 1 Collections)పై వచ్చిన నెగిటివ్ రివ్యూస్ తొలిరోజు కలెక్షన్స్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.25.6 కోట్ల వసూళ్లను (GROSS) రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క తమిళ వెర్షన్‌లోనే అత్యధికంగా రూ.16.5 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. తెలుగులో రూ.7.9 కోట్లు, హిందీలో కేవలం రూ.1.2 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ప్రకటించాయి. హిందీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో ఈ మూవీ పూర్తిగా విఫలమైందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకే నార్త్‌లో ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని విశ్లేషించాయి. అటు తెలుగు ఆడియన్స్ సైతం ఈ మూవీపై పెద్దగా ఆసక్తి కనబరచలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
కలెక్షన్స్‌లో భారీ కోత!
కమల్ హాసన్ గత చిత్రం 'విక్రమ్' (Vikram)తో పోలిస్తే 'భారతీయుడు 2' డే 1 కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. విక్రమ్ తొలి రోజున ఏకంగా రూ.60 కోట్ల వసూళ్లను సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. రీసెంట్‌గా కమల్ హాసన్ విలన్‌గా చేసిన 'కల్కి 2898 ఏడీ' తొలిరోజున రూ.190 కోట్లకు పైగా కలెక్షన్స్ దక్కించుకొని శభాష్ అనిపించుకుంది. అంతేకాదు డైరెక్టర్ శంకర్ గత చిత్రం ‘రోబో 2.0’ సైతం తొలిరోజు రూ.93 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అయితే శుక్రవారం విడుదలైన 'భారతీయుడు 2' (Indian 2) మాత్రం ఆ చిత్రాలకు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆయా మూవీల డే1 కలెక్షన్స్‌లో కనీసం సగం కూడా రాబట్టలేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి.
అందుకే వసూళ్లు తగ్గాయా?
‘భారతీయుడు 2’ డే 1 కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ప్రధాన కారణం ఆ మూవీ అంచనాలను అందులేకపోవడమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. ఔట్ డేటెడ్ స్టోరీతో రావడం, స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉండటం ఈ సినిమాను దెబ్బతీసింది. సోషల్ మెసేజ్ సినిమాకు కాస్త బలాన్ని చేకూర్చినా, ‘భారతీయుడు’లో లాగా తండ్రి కూతురు సెంటిమెంట్ లేకపోవడం మైనస్‌గా మారింది. పాటలు కూడా వినసొంపుగా లేకపోవడం కూడా సినిమాపై నెగిటివ్ ప్రభావం చూపించింది. అన్ని విధాలుగా ఈ సీక్వెల్‌లో సేనాపతి (కమల్ హాసన్) తమను నిరాశకు గురిచేశారని నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ కారణాల వల్ల ‘భారతీయుడు 2’ వసూళ్లు పడిపోయి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కథేంటి
చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్), అతని ఫ్రెండ్స్ దేశంలోని అవినీతి, అన్యాయాలపై పోరాటం చేస్తుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్టులు పెడతారు. దీంతో గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని చంపేస్తాడు. అలాగే యూత్‌ను మోటివేట్ చేస్తాడు. అయితే అనూహ్య ఘటనలతో భారతీయుడుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం జరిగింది? సామాన్య జనం సేనాపతిని ఎందుకు నిందించారు? వారి కోపానికి కారణం ఏంటి? భారతీయుడు తిరిగి వచ్చిన లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది కథ.
https://telugu.yousay.tv/bharateeyudu-2-review-bharateeyudu-2-is-a-major-disappointment-in-those-aspects-how-is-the-movie.html
జూలై 13 , 2024

Bharateeyudu 2 Review: ఆ అంశాల్లో తీవ్రంగా నిరాశపరిచిన ‘భారతీయుడు 2’.. మూవీ ఎలా ఉందంటే!
నటీనటులు : కమల్‌హాసన్, సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, వివేక్
డైరెక్టర్ : శంకర్
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
సినిమాటోగ్రాఫర్ : రవి వర్మన్
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
నిర్మాత : అల్లిరాజా సుభస్కరన్
విడుదల తేదీ: 12-07-2024
కమల్ హాసన్ (Kamal Haasan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో పాతికేళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' (Bharateeyudu) చిత్రం ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అవినీతి, లంచగొండితనంపై భారతీయుడు చేసిన పోరాటం అప్పటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రూపొందింది. 'భారతీయుడు 2' (Bharateeyudu 2 Release Date) టైటిల్‌తో జులై 12న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో కమల్‌తో పాటు సిద్ధార్థ్ (Siddharth), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), ఎస్.జె.సూర్య (S.J Surya), బాబీ సింహా (Bobby Simha), బ్రహ్మానందం (Brahmanandam), సముద్రఖని (Samuthirakani) తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? భారతీయుడిగా మరోమారు కమల్ ఆకట్టుకున్నారా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్), అతని ఫ్రెండ్స్ దేశంలోని అవినీతి, అన్యాయాలపై పోరాటం చేస్తుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్టులు పెడతారు. దీంతో గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని చంపేస్తాడు. అలాగే యూత్‌ను మోటివేట్ చేస్తాడు. అయితే అనూహ్య ఘటనలతో భారతీయుడుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం జరిగింది? సామాన్య జనం సేనాపతిని ఎందుకు నిందించారు? వారి కోపానికి కారణం ఏంటి? భారతీయుడు తిరిగి వచ్చిన లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది కథ.
ఎవరెలా చేశారంటే
'భారతీయుడు 2'లో కమల్ హాసన్ నట విశ్వరూపం చూపించాడు. సేనాపతి పాత్రలో మరోమారు తన మార్క్ నటన కనబరిచారు. తన నటనతో సినిమా మెుత్తాన్ని లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. నటుడు సిద్ధార్థ్ కూడా కీలక పాత్రలో మెప్పించాడు. రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె. సూర్య వంటి నటులు కూడా తమ నటనతో సినిమాకు ఎస్సెట్‌గా మారారు. అయితే వారి పాత్రలు బలహీనంగా ఉండటం మూవీకి మైనస్‌గా మారింది. ఇతర నటీనటులు ప్రదర్శన పర్వాలేదు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ శంకర్ భారతీయుడు కథనే మళ్లీ రిపీట్ చేసినట్లు అనిపించింది. ఔట్ డేటెడ్ కథను నేటి తరానికి అనుగుణంగా మార్పులు చేసి తెరకెక్కించారు. భారతీయుడు ఎలా చంపుతాడో అనేది ఈ తరానికి చూపించడానికే సీక్వెల్ తీసినట్లు ఉంది. డైరెక్షన్‌లో శంకర్ మార్క్ కనిపించదు. స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉంది. కమల్ హాసన్ ఇంట్రడక్షన్ కూడా ఆకట్టుకునే స్థాయిలో లేదు. కొన్ని సన్నివేశాలను బాగానే తెరకెక్కించినా మరికొన్ని సీన్లు మాత్రం ప్రేక్షకుల ముందు తేలిపోయాయి. అయితే కమల్ హాసన్ ఛేజింగ్ సీక్వెన్స్, ముష్కరమూకలతో ఫైట్ సీక్వెన్స్ మెప్పిస్తాయి. సోషల్ మెసేజ్ సినిమాకు కాస్త బలాన్ని చేకూర్చుంది. కానీ, భారతీయుడులో లాగా తండ్రి కూతురు సెంటిమెంట్ లేకపోవడం, పాటలు ఆ స్థాయిలో వినసొంపుగా లేకపోవడం కూడా సినిమాపై నెగిటివ్ ప్రభావం చూపించింది. ఓవరాల్‌గా ఈ సీక్వెల్ సేనాపతి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో పూర్తిగా వెనకబడ్డాడని చెప్పవచ్చు.
సాంకేతిక అంశాలు
టెక్నికల్ విషయాలకు వస్తే.. సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం బాగుంది. అయితే కొన్ని సీన్స్‌ను BGM మరి డామినేట్ చేసినట్లు అనిపించింది. సినిమాటోగ్రాఫర్ పనితనం బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు మాత్రం చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడా రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్
కమల్ హాసన్ నటనసందేశంయాక్షన్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్
ఔట్‌డేటెడ్ స్టోరీస్క్రీన్‌ప్లేభావోద్వేగాలు పండకపోవడంసాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 2.5/5
నెటిజన్లు ఏమంటున్నారంటే? (Public Talk)
ఎక్స్ (ట్విటర్)లో సైతం 'భారతీయుడు 2' మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా బాగుందని కొంతమంది మాత్రమే కామెంట్ చేస్తుంటే చాలా మంది ఫ్లాప్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో నెగిటివ్ టాక్ 'భారతీయుడు 2' చిత్రాన్ని చుట్టేసింది. కొందరు ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించాడా? అంటూ అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.
భారతీయుడు 2 సినిమా డిజాస్టర్ అంటూ ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. బోరింగ్, ఔట్ డేటెడ్ స్టోరీ, సాగదీశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
https://twitter.com/TheWarriorr26/status/1811574234780733548
'భారతీయుడు 2' స్టోరీ ముందుకు సాగుతున్న కొద్ది బోరింగా అనిపించిందని మరో నెటిజన్ అన్నాడు. ఫస్టాఫ్‌లో గ్రిప్పింగ్‌గా, ఎగ్జైట్‌మెంట్ సీక్వెన్స్ ఏమి లేవని అన్నాడు.
https://twitter.com/newMovieBuff007/status/1811561032780820788
‘సినిమా నిరుత్సాహపరిచింది. స్క్రీన్‌ప్లే అస్సల్ బాగోలేదు. ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ కాలేదు. ఇండియన్ 3 కష్టమే’ అని ఒకరు ట్వీట్ చేశారు.
https://twitter.com/TheWarriorr26/status/1811574234780733548
'ఇండియన్ 2' బిలో యావరేజ్ చిత్రమని విజయ్ అనే నెటిజన్ పోస్టు పెట్టాడు. క్లైమాక్స్‌లో ఇండియన్ 3కి సంబంధించిన ట్రైలర్ ప్లే చేశారని అది కాస్త ఆసక్తిగా అనిపించిందని చెప్పాడు. 'ఇండియన్ 3' ఆశలు రేపుతోందని చెప్పుకొచ్చారు.
https://twitter.com/vijay827482/status/1811579025699066091
మరో నెటిజన్ 'భారతీయుడు 2' సినిమాపై ప్రశంసలు కురిపించాడు. శంకర్ డైరెక్షన్ మరో లెవల్‌లో ఉందంటూ పోస్టు పెట్టాడు.. కమల్ హాసన్ నటన, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయంటూ మూవీకి 4 స్టార్ రేటింగ్ ఇచ్చాడు.
https://twitter.com/FMovie82325/status/1811559067925524625
జూలై 12 , 2024

Tollywood Cult Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే!
ఒకప్పుడు టాలీవుడ్ అంటే దేశంలోని సినీ ఇండస్ట్రీలలో ఒకటిగా ఉండేది. తెలుగు సినిమాలంటే నార్త్ ఇండియన్స్ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. మన డైరెక్టర్లు కూడా కేవలం సరిహద్దులు గీసుకొని కేవలం తెలుగు ఆడియన్స్ కోసమే సినిమా రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జాతీయ అవార్డు ఫంక్షన్లకు ఆహ్వానం లభించని స్టేజీ నుంచి ఆస్కార్ వేడుకల్లో పాల్గొనే స్థాయికి మన డైరెక్టర్లు ఎదిగారు. అంతర్జాతీయ బహుమతులను దేశానికి అందిస్తూ ప్రతీ ఒక్కరినీ గర్వపడేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే 1990 నుంచి ఇవాళ్టి దసరా వరకూ ఎన్నో కల్ట్ సినిమాలు టాలీవుడ్ గతిని మార్చాయి. తెలుగు ఇండస్ట్రీని రేంజ్‌ను ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నాయి.
కల్ట్ మూవీ అంటే?
కల్ట్ మూవీకి పర్యాయ పదంగా ట్రెండ్ సెట్టర్ సినిమా అని కూడా సినీ విశ్లేషకులు పిలుస్తారు. విభిన్న కథాంశం. విడుదలయ్యాక ఆ మూవీ పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ సంపాదించడం, ఆ చిత్రం పంథాను కొన్నేళ్లపాటు మరికొన్ని సినిమాలు అనుసరించి రావడం, ఆ సినిమా డైలాగ్స్.. ఇప్పటికీ జనాల నాలుకలపై నానడం వంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలాగే బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున కలెక్షన్ల వర్షం కురిపించే సినిమాలు ఈ కోవలోకే వస్తాయి.
90వ దశకం నుంచి యాక్షన్ కల్ట్ మూవీలు
శివ(1989)
ఎలాంటి అంచనాలు లేకుండా 1989లో రిలీజైన 'శివ' మూవీ ఇండస్ట్రీ కల్ట్ గా నిలిచింది. అప్పటి వరకు సామాజిక ఆర్థిక అంశాలే ప్రధానం రూపొందిన చిత్రాల పంథాను ఒక్కసారిగా మార్చింది. పక్క యాక్షన్ మూవీగా తెరకెక్కిన శివ నాగార్జునకు స్టార్ డామ్ తెచ్చిపెట్టింది. ఆయన కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసింది. నాగార్జున పట్ల యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సైకిల్ చైన్ లాగే మెనరిజాన్ని అప్పట్లో యూత్ పిచ్చిగా ఫాలో అయ్యేవారు. ఈ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మతో మూవీలు చేసేందుకు స్టార్ హీరోలు క్యూ కట్టారు. అంతే కాదు శివ యాక్షన్ సిక్వెన్స్‌ను అనుసరిస్తూ చాలా చిత్రాలు వచ్చాయి.
గాయం(1993)
1993లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లోనే వచ్చిన 'గాయం' సైతం మంచి యాక్షన్ కల్ట్ గా నిలిచింది. ఈ మూవీని యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పెరొందిన జగపతి బాబు ఈ సినిమాతో ఒక్కసారిగా మాస్ లుక్ లోకి మారిపోయారు. దుర్గ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. జగపతి బాబు సరసన రేవతి, కోటా శ్రీనివాస్ రావు, సిరివెన్నెల సితారామశాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలోని 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని' అనే పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిందే.
భారతీయుడు(1996)
శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన భారతీయుడు ఆల్ టైమ్ యాక్షన్ కల్ట్ చిత్రంగా పేరొందింది. రొటీన్ మూవీలకు భిన్నంగా అవినీతికి వ్యతిరేకంగా సరికొత్త కథాంశంతో శంకర్ తెరకెక్కించాడు. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ అద్భుతంగా నటించాడు. ఈ మూవీ తర్వాత ఇదే తరహా కథాంశాలతో వచ్చిన రమణ, ఠాగూర్, మల్లన్న చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్‌లో మెప్పించాడు. మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించాడు.
సమరసింహా రెడ్డి(1999)
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 'సమరసింహా రెడ్డి(1999), నరసింహా నాయుడు(2001) యాక్షన్ ఎంటర్ టైన్మెంట్‌కు కొత్త నిర్వచనం అందించాయి. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ చిత్రాల్ని డెరెక్టర్ బీ గోపాల్ అద్భుతంగా తెరకెక్కించాడు. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్ బాగా పేలాయి. ఈ చిత్రాల్లో బాలయ్య డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించేలా చేసింది. ఈ రెండు సినిమాలను అనుకరిస్తూ వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. ఫాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఇంద్ర, ఆది, యజ్ఞం మూవీలు హిట్ కొట్టాయి.
పోకిరి(2006)
తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ కల్ట్ మూవీ పోకిరి(2006). అప్పటివరకు తెలుగు తెరకు పరిచయం లేని గ్యాంగ్ స్టర్ స్టోరీ లైన్ తో పూరి ముందుకొచ్చాడు. పోకిరి దెబ్బకు అన్ని రికార్డులు దాసోహం అయ్యాయి. హీరో మేనరిజం, డెలాగ్స్, చిత్రీకరణ విలువలు, మణిశర్మ మ్యూజిక్ ప్రతి ఒక్కటీ వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలు పోకిరి యాక్షన్ సిక్వెన్స్ ను ఫాలో అయ్యాయి.
మగధీర(2009)
రాజమౌళి డైరెక్ట్ చేసిన మగధీర క్లాసిక్ కల్ట్ గా చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను మగధీర బ్రేక్ చేసింది. పూర్వ జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ చాల ఏళ్ల తర్వాత మళ్లీ పౌరాణిక వాసనను తెలుగు తెరకు గుర్తు చేసింది. కత్తులు, యుద్ధం వంటి యాక్షన్ డ్రామాతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మంచి బ్రెక్ ఇచ్చింది. నటించిన రెండో సినిమాతోనే చరణ్ కు స్టార్ హోదా దక్కింది. ఈ చిత్రం పోలికలతో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఆశించినంత విజయం సాధించలేదు.
అర్జున్ రెడ్డి(2017)
కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి డెరెక్ట్ చేసిన 'అర్జున్ రెడ్డి(2017)' టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం పెద్దఎ త్తున ఫ్యాన్ బేస్ సంపాదించింది. విజయ్ దేవరకొండ కేరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఊహించని సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాను హిందీ, తమిళ్ ఇండస్ట్రీల్లో రీమేక్ చేశారు. యూత్ లో ఫుల్ జోష్ ను నింపింది. అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్ ని రౌడీ బాయ్ అంటూ అభిమానులు పిలవడం మొదలు పెట్టారు.
బాహుబలి-2(2017)
రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కావ్యం 'బాహుబలి-2(2017)' భారత చలనచిత్ర గతినే మార్చింది. అన్ని భాషలను ఏకం చేసి పాన్ ఇండియా ఇమేజ్ ను క్రియేట్ చేసింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. అప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల్లోనే సాధ్యమనుకునే భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన దంగల్ రికార్డును బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులే కాదు సౌత్ సినిమాలను పెద్దగా ఆదరించని నార్త్ ఆడియన్స్ మనసులను సైతం కొల్లగొట్టింది.
సౌత్, నార్త్ కాదు మన సినిమా ఇండియన్ సినిమా అనే స్థాయికి ఇండస్ట్రీ వర్గాలను తీసుకొచ్చింది. ఈ మూవీ తర్వాత పలువురు బాలీవుడ్ డైరెక్టర్లు పాన్ ఇండియా మూవీలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
రంగస్థలం (2018)
ఒకేరకమైన కథలతో వెళ్తున్న టాలీవుడ్‌కు రంగస్థలం సినిమా కొత్త మార్గాన్ని చూపించింది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా పక్కా పల్లెటూరు కథతోనూ హిట్ కొట్టొచ్చని డైరెక్టర్ సుకుమార్ ఈ తరం దర్శకులకు చూపించారు. ఇందులో రామ్ చరణ్, సమంత నటన మూవీకే హైలెట్ అని చెప్పాలి. రామ్‌చరణ్‌లోని కొత్త నటుడ్ని ఈ సినిమా ఆవిష్కరించింది. ఈ సినిమా స్ఫూర్తితో ప్రస్తుతం చాలా మంది దర్శకులు పల్లెటూరి కథలో దృష్టిసారిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో షేక్ చేస్తున్న దసరా, బలగం సినిమాలకు ఈ సినిమానే స్ఫూర్తి అని చెప్పొచ్చు.
పుష్ప(2022)
పాన్ ఇండియా మూవీగా వచ్చిన 'పుష్ప' భారీ విజయాన్ని సాధించింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గేస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా డైలాగులను రాజకీయ నాయకులు మొదలు క్రికెటర్లు, WWE స్టార్ల వరకు వల్లవేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అయితే.. రాజకీయ నాయకులు 'తగ్గేదేలే'.. 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చే వరకు వెళ్లింది.
ఆర్‌ఆర్‌ఆర్ (2022)
దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేశాడు. టాలీవుడ్ శక్తి సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించింది. తద్వారా భారతీయుల హృదయాలను ఉప్పొంగేలా చేసింది. ఒకప్పుడు జాతీయ అవార్డులు రావడమే గగనంగా ఉన్న పరిస్థితి నుంచి తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగింది. కథానాయకులు రామ్‌చరణ్, ఎన్‌టీఆర్‌లు కూడా RRRలో ఎంతో అద్భుతంగా నటించారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.
బలగం (2023)
సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయిన ఘనవిజయం సాధిస్తుందని బలగం సినిమా నిరూపించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రభంజనే సృష్టించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రేమానురాగాలను డైరెక్టర్ వేణు చక్కగా చూపించాడు. పక్కా పల్లెటూరు నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.
దసరా (2023)
టాలీవుడ్ రేంజ్‌ను దసరా చిత్రం మరింత పెంచింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన తొలి సినిమాతోనే రూ.100 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఈ సినిమా కూడా పల్లెటూరు కథాంశంతో తెరకెక్కి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందింది. ముఖ్యంగా హీరో నాని ఈ సినిమా తన నటా విశ్వరూపమే చూపించాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఊరమాస్‌గా ఇరగదీశాడు. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. మహానటి తర్వాత కీర్తి అత్యుత్తమ నటనను ఈ సినిమాలో చూడొచ్చు.
ఏప్రిల్ 12 , 2023

OTT Suggestions: ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను పసందైన ఆనందాన్ని పంచుతున్నాయి. అయితే ఈ వారంతం కంటెంట్ పరంగా తెలుగు ప్రేక్షకులకు ది బెస్ట్ అని చెప్పవచ్చు. థియేటర్‌లో పలు ఆసక్తికర చిత్రాలు ఈ వారం ఓటీటీలోకి వచ్చేశాయి. మరికొన్ని రాబోతున్నాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌లో ప్లాన్ చేసుకోండి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం. (OTT Suggestions)
అమరన్ (Amaran)
పాన్ ఇండియా స్థాయిలో (OTT Releases) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్ తమిళ చిత్రం 'అమరన్' (Amaran OTT Platform). అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేశారు. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు?’ అనేది మిగతా కథ.
మట్కా (Matka)
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘మట్కా’ (Matka) కూడా ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చింది. డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో వరుణ్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో 20 రోజులు తిరక్కముందే ఓటీటీలోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘వాసు (వరుణ్ తేజ్) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? సుజాతతో వాసు లవ్‌ట్రాక్ ఏంటి?’ అన్నది స్టోరీ.
విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video)
’యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Suggestions) నటించిన లేటెస్ట్ చిత్రం ఈ వీకెండ్‌లోనే ఓటీటీలోకి రాబోతోంది . 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్‌కుమార్ రావ్, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్ శాండిల్య డైరెక్ట్ చేశారు. అక్టోబర్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ప్లాట్ ఏంటంటే ‘1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. ఫస్ట్ నైట్ మధుర జ్ఞాపకాలను ఓ సిడీలో బంధిస్తారు. అయితే అనూహ్యంగా ఆ సీడీ దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి దంపతుల పరిస్థితి ఏంటి? అన్నది స్టోరీ.
జిగ్రా (Jigra)
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'జిగ్రా' (Jigra OTT). ఈ చిత్రం కూడా ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. కరుణ్ జోహర్ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. వాసన్ బాల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తెలుగు నటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషించాడు. అలియా చేసిన సత్య పాత్రకు తమ్ముడిగా వేదాంగ్ రైనా నటించాడు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ప్లాట్ ఏంటంటే ‘సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్ మేనేజ్‌మెంట్ స్టాఫ్‌గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. ఓ బిజినెస్ పనిమీద విదేశాలకు వెళ్లిన అంకుర్ అక్కడ డ్రగ్స్ తీసుకొని పట్టుబడతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి ఉరిశిక్ష విధిస్తారు. అప్పుడు సత్య ఏం చేసింది? తమ్ముడ్ని ఎలా రక్షించుకుంది?’ అన్నది స్టోరీ.
మందిర (Mandira)
సన్నీ లియోనీ (Sunny Leone) ప్రధాన పాత్రలో దర్శకుడు ఆర్. యువన్ తెరకెక్కించిన సినిమా ‘మందిర’ (Mandira). ఈ మూవీ డిసెంబర్ 5 (OTT Suggestions) నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ వచ్చింది. నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇందులో సన్నీ ద్విపాత్రాభియనం చేసింది. ఈ హారర్ కామెడీ మూవీలో యోగిబాబు, సతీశ్ కీలక పాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే 'గత జన్మలో అనకొండపురం అనే రాజ్యానికి ఓ యువరాణి అయిన మందిర ఇప్పుడు దెయ్యంలా ఎలా మారింది? అసలు ఆమె కథేంటి? అన్నది స్టోరీ.
కంగువా (Kanguva)
తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్ చిత్రం 'కంగువా' (Kanguva OTT Release) ఓటీటీ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. వచ్చే వారం డిసెంబర్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుండటం విశేషం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. తమిళ డైరెక్టర్ శివ రూపొందించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్‌గా చేసింది. హిందీ నటి దిశా పటాని కథానాయికగా చేసింది. థియేటర్లలో మోస్తరు టాక్ తెచ్చుకోవడంతో కంగువాను త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ప్లాట్ ఏంటంటే ‘ఫ్రాన్సిస్ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి?’ అన్నది స్టోరీ.
క (Ka)
ఇదిలా ఉంటే గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్‌తో ఎంచక్కా చూసేయండి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రం 'క' (Ka OTT Release) గత వారమే ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్ వేదికగా నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా చేశారు. ప్లాట్ ఏంటంటే ‘అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది. చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు?’ అనేది మిగతా కథ.
లక్కీ భాస్కర్ (Lucky Bhaskar)
దుల్కర్ సల్మాన్ (Dulquar Salman), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar OTT Release) సైతం గత వారమే ఓటీటీలోకి వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం అవుతోంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు?’ అనేది కథ.
వికటకవి (Vikkatakavi)
యువ నటుడు నరేష్ అగస్త్య (Naresh Agastya) 'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం' చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అతడు చేసిన లేటెస్ట్ సిరీస్ ‘వికటకవి’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్‌గా చేసింది. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. జీ5 ఓటీటీలో గతవారం తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్ ఏంటంటే 'అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. ఈ మిస్టరీని కనుగొనేందుకు డిటెక్టివ్ రామకృష్ణ రంగంలోకి దిగుతాడు. దేవతల గుట్టపైకి వెళ్తాడు. అక్కడ ఏం తెలుకున్నాడు? అమరగిరి సంస్థానానికి చెందిన లక్ష్మీ (మేఘా ఆకాష్)తో అతడికి పరిచయం ఎలా ఏర్పడింది? ఇంతకీ దేవతల గుట్టకు ఉన్న శాపం ఏంటి?' అన్నది స్టోరీ.
‘పుష్ప 2’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'పుష్ప 2' (Pushpa 2 OTT Release) థియేటర్లను షేక్ చేస్తోంది. దీంతో ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రావొచ్చన్న చర్చ మెుదలైంది. వాస్తవానికి 'పుష్ప 2' స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సాధారణగా ఏ సినిమా అయినా 6-8 వారాల గ్యాప్‌తో ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే 'పుష్ప 2'ను మాత్రం నెల రోజుల్లో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే జనవరి ఫస్ట్ వీక్‌లో ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. కానీ, ‘పుష్ప 2’ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం, సంక్రాంతి వరకూ పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో థియేటర్లలో నెల రోజులకు పైగా పుష్పగాడికి తిరుగుండక పోవచ్చు. కాబట్టి సంక్రాంతికి ‘పుష్ప 2’ను ఓటీటీలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అది మిస్ అయినా పది రోజుల గ్యాప్‌తో వచ్చే రిపబ్లిక్ డే (జనవరి 26) రోజునైనా 'పుష్ప 2' కచ్చితంగా స్ట్రీమింగ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
డిసెంబర్ 05 , 2024

Indian 2 Weekend Collections: దారుణంగా పడిపోయిన ‘భారతీయుడు 2’ వసూళ్లు.. వీకెండ్ ఎంతంటే?
కమల్ హాసన్ (Kamal Haasan), శంకర్ (Director Shankar) కాంబినేషన్‌లో వచ్చిన 'భారతీయుడు 2' (Bharateeyudu 2) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. తొలి ఆట నుంచే ఈ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో దాని ప్రభావం వసూళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తొలిరోజుతో పాటు శని, ఆదివారాల్లోనూ ఈ మూవీకి తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా ఈ మూవీ వీకెండ్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలిపోతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
‘భారతీయుడు 2’ చిత్రం ఈ వీకెండ్ (Bharateeyudu 2 Weekend Collections)లో రూ.59 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తొలిరోజు ఈ చిత్రానికి రూ.25 కోట్లు రాగా, శని, ఆది వారాల్లో అది రూ.18.2 కోట్లు, రూ.15.1 కోట్లకు పడిపోయినట్లు పేర్కొన్నాయి. శనివారం తమిళ వెర్షన్‌కు రూ.13.7 కోట్లు, తెలుగుకు రూ.3.2 కోట్లు, హిందీలో రూ.1.3 కోట్లు వచ్చినట్లు తెలిపాయి. ఇక ఆదివారం కలెక్షన్స్ పెరగాల్సింది పోయి మరింత తగ్గినట్లు చెప్పాయి. ఆదివారం (జులై 14) ఇండియాలో ఈ సినిమాకు రూ.15.1 కోట్లు రాగా అందులో తమిళ వెర్షన్‌కే రూ.11 కోట్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తెలుగులో రూ.2.8 కోట్లు, హిందీ వెర్షన్‌లో రూ.1.3 కోట్లు మాత్రమే ‘భారతీయుడు 2’ రాబట్టగలిగిందని వెల్లడించాయి.
ఇకపై మరింత పతనం!
తొలి వీకెండ్‌లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మెుదటి వారంతంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఏ స్థాయికి దిగిపోతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల తాకిడి లేకపోవడంతో ‘భారతీయుడు 2’ ప్రసారాలను థియేటర్ యజమానులు నిలిపేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సోమవారం నుంచి ‘భారతీయుడు 2’ వసూళ్లు మరింత దారుణంగా ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి. కేవలం తమిళ మార్కెట్ ఒక్కటే ‘భారతీయుడు 2’కు ఆశా కిరణంగా ప్రస్తుతం కనిపిస్తోందని పేర్కొన్నాయి.
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
‘భారతీయుడు 2’ (Bharateeyudu 2 Day 1 Collections)పై వచ్చిన నెగిటివ్ రివ్యూస్ తొలిరోజు కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.25.6 కోట్ల వసూళ్లను (GROSS) రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క తమిళ వెర్షన్‌లోనే అత్యధికంగా రూ.16.5 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. తెలుగులో రూ.7.9 కోట్లు, హిందీలో కేవలం రూ.1.2 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ప్రకటించాయి. హిందీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో ఈ మూవీ పూర్తిగా విఫలమైందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకే నార్త్‌లో ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని చెప్పాయి. అటు తెలుగు ఆడియన్స్ సైతం ఈ మూవీపై ఆసక్తి కనబరచడం లేదని తెలియజేశాయి.
ఆ చిత్రాలతో పోలిస్తే భారీ కోత!
కమల్ హాసన్ గత చిత్రం 'విక్రమ్' (Vikram)తో పోలిస్తే 'భారతీయుడు 2' డే 1 కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. విక్రమ్ తొలి రోజున ఏకంగా రూ.60 కోట్ల వసూళ్లను సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. రీసెంట్‌గా కమల్ హాసన్ విలన్‌గా చేసిన 'కల్కి 2898 ఏడీ' తొలిరోజున రూ.190 కోట్లకు పైగా కలెక్షన్స్ దక్కించుకొని శభాష్ అనిపించుకుంది. అంతేకాదు డైరెక్టర్ శంకర్ గత చిత్రం ‘రోబో 2.0’ సైతం తొలిరోజు రూ.93 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అయితే శుక్రవారం విడుదలైన 'భారతీయుడు 2' (Indian 2) మాత్రం ఆ చిత్రాలకు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆయా మూవీల డే1 కలెక్షన్స్‌లో కనీసం సగం కూడా రాబట్టలేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేశాయి.
అందుకే వసూళ్లు తగ్గాయా?
‘భారతీయుడు 2’ డే 1 కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ప్రధాన కారణం ఆ మూవీ అంచనాలను అందులేకపోవడమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. ఔట్ డేటెడ్ స్టోరీతో రావడం, స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉండటం ఈ సినిమాను దెబ్బతీసింది. సోషల్ మెసేజ్ సినిమాకు కాస్త బలాన్ని చేకూర్చినా, ‘భారతీయుడు’లో లాగా తండ్రి కూతురు సెంటిమెంట్ లేకపోవడం మైనస్‌గా మారింది. పాటలు కూడా వినసొంపుగా లేకపోవడం కూడా సినిమాపై నెగిటివ్ ప్రభావం చూపించింది. అన్ని విధాలుగా ఈ సీక్వెల్‌లో సేనాపతి (కమల్ హాసన్) తమను నిరాశకు గురిచేశారని నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ కారణాల వల్ల ‘భారతీయుడు 2’ వసూళ్లు పడిపోయి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కథేంటి
చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్), అతని ఫ్రెండ్స్ దేశంలోని అవినీతి, అన్యాయాలపై పోరాటం చేస్తుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్టులు పెడతారు. దీంతో గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని చంపేస్తాడు. అలాగే యూత్‌ను మోటివేట్ చేస్తాడు. అయితే అనూహ్య ఘటనలతో భారతీయుడుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం జరిగింది? సామాన్య జనం సేనాపతిని ఎందుకు నిందించారు? వారి కోపానికి కారణం ఏంటి? భారతీయుడు తిరిగి వచ్చిన లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది కథ.
జూలై 15 , 2024

నటనకు కేరాఫ్ విజయ్ సేతుపతి.. ఈ 5 సినిమాలు తప్పక చూడాల్సిందే
]ఈ చిత్రం చూశాక ప్రేక్షకులకు ‘రాయనం’ పాత్ర గుర్తిండిపోతుంది. తండ్రిగా, జమీందారుగా విజయ్ సేతుపతి ప్రేక్షకులను మెప్పించాడు. క్రూరత్వం ప్రదర్శిస్తూనే మనసులోని ప్రేమను కళ్లలో చూపించేలా నటించాడు విజయ్ సేతుపతి.
ఫిబ్రవరి 13 , 2023

Vidudala Part 2 Review: వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపిన ‘విడుదల 2’.. కానీ!
నటీనటులు: విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, కిషోర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, భవాని శ్రీ, గౌతమ్ మీనన్ తదితరులు
దర్శకత్వం : వెట్రిమారన్
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ : ఆర్. వెల్రాజ్
నిర్మాతలు: ఎల్రెడ్ కుమార్, వెట్రిమారన్
విడుదల తేదీ: డిసెంబర్ 20, 2024
గతేడాది తెలుగు, తమిళ భాషల్లో రిలీజై మెప్పించిన ‘విడుదల’ చిత్రానికి సీక్వెల్ రూపొందింది. ‘విడుదల 2’ (Vidudala Part 2 Review) పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో సూరి (Soori), విజయ్ సేతుపతి (Vijay Sethupathi), మంజు వారియర్, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, డిసెంబర్ 20న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
పెరుమాళ్ (విజయ్ సేతుపతి) అరెస్టుతో తొలిభాగం ముగియగా అతడి విచారణతో పార్ట్ 2 మొదలవుతుంది. పెరుమాళ్‌ను క్యాంప్ నుండి వేరే బేస్‌కి మార్చాలని పోలీసులు డిసైడ్ అవుతారు. అతడి అరెస్టులో కీలకంగా వ్యవహరించిన కుమరేశన్ (సూరి)తో కలిసి బయలుదేరతారు. ఈ క్రమంలో పోలీసులతో పెరుమాళ్ తన కథను పంచుకుంటాడు. అతడి స్టోరీ విన్నాక పోలీసులకు అతడిపై జాలి కలుగుతుంది. దీంతో పెరుమాళ్ అరెస్ట్‌ను సీక్రెట్‌గా ఉంచాలని అనుకుంటారు. అయితే అరెస్టు విషయం మీడియాకు లీక్ కావడంతో అధికారికంగా అనౌన్స్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతారు. ఈ క్రమంలోనే పెరుమాళ్ పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. అప్పుడు పోలీసులు ఏం చేశారు? అతడ్ని పట్టుకునేందుకు ఎలాంటి ప్లాన్స్ వేశారు? ఇంతకీ పోలీసులకు పెరుమాళ్ చెప్పిన గతం ఏంటి? అతడు ఉధ్యమనాయకుడిగా ఎలా మారాడు? పెరుమాళ్ మంచితనం గురించి తెలిసిన కుమారేశన్ ఎవరివైపు నిలబడ్డాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
పెరుమాళ్ పాత్రలో విజయ్ సేతుపతి (Vidudala Part 2 Review) అదరగొట్టాడు. కుర్రతనం నుంచి ఉద్యమ నాయకుడిగా ఎలా ఎదిగాడన్న పాత్రలో జీవించేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో ఎప్పటిలాగే తన నటనతో కట్టిపడేశాడు. తొలి భాగాన్ని తన భుజంపై వేసుకొని నడిపించిన నటుడు సూరి సెకండ్ పార్ట్‌కు వచ్చేసరికి కొన్ని సీన్లకే పరిమితమయ్యాడు. అతడికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరకలేదు. ఉన్నంతలో బాగానే చేశాడు. ఇండిపెండెంట్ ఉమెన్ పాత్రలో మంజు వారియర్ ఆకట్టుకుంది. పోలీసు ఉన్నతాధికారిగా గౌతమ్ మీనన్ నటన సెటిల్డ్‌గా ఉంది. విలన్ షేడ్స్ ఉన్న పోలీసు ఆఫీసర్ చేతన్ మంచి నటన కనబరిచాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి తర్వాత ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించిన రోల్ చేతన్‌దే. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వెట్రిమారన్.. గౌతమ్ మీనన్ - విజయ్ సేతుపతిల మధ్య వచ్చే ఇంటరాగేషన్ సీన్‌తో కథను ప్రారంభించారు. ఆపై వెంటనే ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్లి ఆడియన్స్‌ను కథలో లీనమయ్యేలా చేశారు. ఈ క్రమంలో విజయ్ సేతుపతి, మంజు వారియర్ల మధ్య సాగే లవ్ ట్రాక్ ఆకట్టుకునేలా చూపించారు. అలాగే పోలీస్ వ్యవస్థ, రాచరికపు దురహంకారం, ప్రభుత్వం ప్రజల్ని ఎలా మోసం చేస్తుంది వంటి విషయాలను ఏమాత్రం బెరుకు లేకుండా దర్శకుడు చూపించాడు. శాంతియుతంగా సాగే ఉద్యమం హింసా మార్గం ఎలా పట్టిందనే పాయింట్‌ను చాలా బలంగా చూపించారు. తొలి భాగం వరకూ కథ బాగానే సాగినప్పటికీ సెకండాఫ్‌కు వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పిన ఫీలింగ్ కలుగుతుంది. ముందు సీన్లో చనిపోయిన క్యారెక్టర్లు తర్వాతి సీన్లో కనిపించడం గందరగోళానికి గురిచేస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి. సీన్స్ మధ్య కనెక్టివిటీ ఉండదు. క్లైమ్యాక్స్ కూడా చాలా లెంగ్తీగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాలకు వస్తే (Vidudala Part 2 Review) ఇళయరాజా సంగీతం సినిమాగా బాగా ప్లస్ అయ్యింది. పావురమా పాట వినడానికి చాలా బాగుంది. వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం నేచురల్ లొకేషన్లలోనే తీశారు. అది స్క్రీన్‌పై మంచి ఎఫెక్ట్ చూపించింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. సెకండాఫ్‌ను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
విజయ్ సేతుపతి నటనసందేశాత్మక సన్నివేశాలుసంగీతం
మైనస్ పాయింట్స్
సెకండాఫ్అతుకుల బొంతలా ఉండే సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
డిసెంబర్ 20 , 2024

Maharaja Movie Review: కర్మ సిద్దాంతంతో వచ్చిన రీవేంజ్ డ్రామా.. ‘మహారాజా’ మెప్పించాడా?
నటీనటులు: విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి తదితరులు
రచన, దర్శకత్వం: నిథిలన్ స్వామినాథన్
సంగీతం: అజనీశ్ లోకనాథ్
ఎడిటింగ్: ఫిల్లోమిన్ రాజ్
సినిమాటోగ్రఫీ: దినేశ్ పురుషోత్తమన్
నిర్మాత: సుదర్శన్ సుందరమ్, జగదీశ్ పళనిస్వామి
విడుదల : 14-06-2024
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన లేటెస్ట్ చిత్రం 'మహా రాజా' (Maharaja). అతడి కెరీర్‌లో 50వ చిత్రంగా ఇది రూపొందింది. దీంతో ఈ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. నిథిలాన్ స్వామినాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్, మునీశ్ కాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజైంది. మరి ‘మహా రాజా’ ఎలా ఉంది? ఎప్పటిలాగే విజయ్ సేతుపతి తన నటనతో అదరగొట్టాడా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
బార్బర్‌గా పనిచేసే మహారాజా (విజయ్ సేతుపతి) ఒక ప్రమాదంలో భార్యను పోగొట్టుకుంటాడు. కూతురు జ్యోతియే ప్రాణంగా సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. కట్ చేస్తే ఒక రోజు మహారాజా గాయాలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్తాడు. ఆగంతకులు తన ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశారని ఫిర్యాదు చేస్తాడు. ఈ క్రమంలోనే తన బిడ్డ ప్రాణాల్ని కాపాడిన లక్ష్మీని ఎత్తుకెళ్లిపోయారని చెబుతాడు. ఎలాగైన ఆ లక్ష్మిని వెతికి పెట్టమని పోలీసులను వేడుకుంటాడు. ఇంతకీ ఆ లక్ష్మి ఎవరు? మహారాజాపై దాడి ఎందుకు జరిగింది? వారితో మహారాజాకు ఉన్న వైరం ఏంటి? మహారాజా కూతురికి జరిగిన అన్యాయం ఏంటి? చివరికీ లక్ష్మీ దొరికిందా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
మహారాజా పాత్రలో విజయ్ సేతుపతి ఎప్పటిలాగే అద్భుత నటన కనబరిచాడు. సినిమా మెుత్తాన్ని తన భుజాలపై మోశారు. తన కూతురికి అన్యాయం చేసిన వారిని వెంటాడి హతమార్చే క్రమంలో వచ్చే మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ఇక కూతురు జ్యోతి పాత్రలో సచిన నటన మెప్పిస్తుంది. క్లైమాక్స్‌లో ఆమె నటన శభాష్ అనేలా ఉంటుంది. అటు ప్రతినాయకుడిగా సెల్వం పాత్రలో అనురాగ్ కశ్యప్ ఆకట్టుకున్నారు. మమతా మోహన్‌దాస్, భారతీరాజా, మణికందన్, అరుళ్‌దాస్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు నిథిల స్వామినాథన్.. ఒక రొటీన్ రివేంజ్ డ్రామాను తెరకెక్కించినట్లు అనిపించినా కథకు కర్మ సిద్దాంతాన్ని జోడించడం వల్ల సినిమా కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లేను ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపిన తీరు.. విజయ్ సేతుపతి విలక్షణమైన నటన ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఊహలకు అందని ట్విస్టులతో భావోద్వేగభరితంగా దర్శకుడు సినిమాను ముగించారు. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో వచ్చే మలుపులు ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌ను పంచుతాయి. ప్రథమార్ధంలో ఎక్కువ భాగం పాత్రల పరిచయాలకే కేటాయించినప్పటికీ డైరెక్టర్ ఎక్కడా బోర్ కొట్టించలేదు. ఓ వైపు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా.. మరోవైపు లక్ష్మీ, జ్యోతి ఎపిసోడ్స్‌ను సమాంతరంగా చూపిస్తూనే వాటన్నింటిని లింకప్ చేసిన విధానం మెప్పిస్తుంది. ఈ కథకు ముగింపు పలికిన తీరు ప్రేక్షకులకు సంతృప్తికరంగా అనిపిస్తుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఫిలోమిన్ ఎడిటింగ్ ప్రతిభ.. దినేశ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు.
ప్లస్ పాయింట్
విజయ్ సేతుపతి నటనట్విస్టులుసంగీతం
మైనస్ పాయింట్
స్లో నారేషన్‌సాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
జూన్ 14 , 2024

Vidudhala Review: NTR దర్శకుడు వెట్రిమారన్ ‘విడుదల’ ప్రేక్షకులను ఆకట్టుకుందా?
నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి, భవానీ శ్రీ, గౌతమ్ వాసుదేవ మీనన్, రాజీవ్ మీనన్
దర్శకత్వం: వెట్రిమారన్
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: ఆర్.వేల్‌రాజ్
ఎడిటింగ్: రమర్
నిర్మాత: ఎల్రెడ్ కుమార్
డైరెక్టర్ వెట్రిమారన్‌కు తమిళంలో ఎంతో గుర్తింపు ఉంది. హీరోల కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆయన పలు జాతీయ అవార్డులను అందుకున్నాడు. అత్యంత సహజంగా కనిపించేలా ఆయన తీసిన విసరనై, వడా చెన్నై, అసురన్ వంటి సినిమాలు వెట్రిమారన్‌కు ప్రతిభకు అద్దం పడతాయి. తమిళ్‌లో ఆయన తీసిన ‘అసురన్’ చిత్రం ఓ ప్రభంజనమే సృష్టించింది. తెలుగులో ‘నారప్ప’గా వచ్చి ఇక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా, వెట్రిమారన్ తాజా చిత్రం ‘విడుదల పార్ట్ 1’ ఇవాళ తెలుగులో రిలీజైంది. వెట్రిమారన్ సినిమా కావడంతో ఎప్పటిలాగే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. మరీ ‘విడుదల’ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? వెట్రిమారన్‌కు మరో హిట్ తెచ్చిపెట్టిందా? ఇప్పుడు చూద్దాం.
కథ
పోలీసు కానిస్టేబుల్‌గా కుమరేశన్(సూరి) కొత్త ఉద్యోగంలో చేరతాడు. ప్రజాదళం నాయకుడైన పెరుమాళ్(విజయ్ సేతుపతి)ని పట్టుకునేందుకు పనిచేస్తున్న పోలీస్ దళంలో డ్రైవర్‌గా చేరతాడు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడం పోలీసు విధి అని కుమరేశన్ నమ్ముతుంటాడు. ఈ నేపథ్యంలో అడవిలో ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేస్తుంది. ఆమెను కాపాడేందుకు పోలీసు జీపును ఉపయోగించి కుమరేశన్ పైఅధికారుల ఆగ్రహానికి గురవుతాడు. మరోవైపు గాయపడిన మహిళ మనవరాలు పాప (భవానీ శ్రీ)తో కుమరేశన్ స్నేహం చేస్తాడు. అది కాస్త ప్రేమకి దారితీస్తుంది. ఒక పక్క ప్రేమ, ఇంకోవైపు పెరుమాళ్ కోసం సాగించే వేటలో కుమరేశన్ ఎలాంటి సంఘర్షణకి గురవుతాడన్నది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే:
పాత్రలకు తగ్గ నటుల్ని ఎంచుకోవడంలో డైరెక్టర్ వెట్రిమారన్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సూరి, భవానీ శ్రీల నటన ఈ సినిమాలో ఆకట్టుకుంటుంది. కుమారేశన్, పాప పాత్రల్లో ఉన్న అమాయకత్వాన్ని వారు తమ నటనతో చక్కగా చేసి చూపించారు. అటు క్రూరంగా వ్యవహరించే పోలీసు ఆఫీసర్‌గా చేతన్ అదరగొట్టాడు.పెరుమాళ్‌గా విజయ్‌సేతుపతి కనిపించేంది కొద్దిసేపే అయిన తన మార్క్ నటనతో మెప్పించాడు. గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్ తదితరులు తమ పరిధిమేరకు నటించారు.
టెక్నికల్‌గా:
విడుదల పార్ట్-1 సినిమాలో డైరెక్టర్ వెట్టిమారన్ కొత్త ప్రపంచాన్నే ఆవిష్కరించారు. తనదైన శైలిలో అడవి, పోలీసుల సెటప్ అంతా చాలా సహజంగా ఉంది. కానీ.. కథలో సంఘర్షణ, డ్రామా మాత్రం పెద్దగా మెప్పించదు. కొన్ని సన్నివేశాలు మరీ సాగదీతలా అనిపిస్తాయి. దళాలను పట్టుకోవడం కోసం పోలీసులు యత్నించడం, వారి ఇరువురు మధ్య సాగే పోరాటంలో సామాన్యులు నలిగిపోవడం చాలా తెలుగు సినిమాల్లో చూసిందే. ఈ చిత్రంలోనూ అదే సన్నివేశాలు రిపీట్ కావడంతో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కుమారేశన్, పాప మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు కూడా రొటిన్‌గా అనిపిస్తాయి. ఇకపోతే కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నటీనటులుసినిమాటోగ్రఫీపతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
సంఘర్షణ లేని కథసాగదీత సన్నివేశాలు
రేటింగ్: 2.5/5
ఏప్రిల్ 15 , 2023

Mufasa Collections: ‘ముఫాసా’, ‘యూఐ’ తొలి రోజు కలెక్షన్స్.. టాప్ ఏదంటే?
క్రిస్మస్ కానుకగా ఈ వారం నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విడుదలయ్యాయి. హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ డిస్నీ (Disney) నిర్మించిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ శుక్రవారం (డిసెంబర్ 20) గ్రాండ్‌గా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘యూఐ’ విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. వీటితో పాటు తెలుగులో అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి, తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన ‘విడుదల 2’ కూడా రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మరి ఈ చిత్రాల తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ పరంగా ఏ సినిమా టాప్‌లో ఉంది? ఇప్పుడు తెలుసుకుందాం.
‘ముఫాసా’ డే 1 కలెక్షన్స్..
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) లైవ్ యానిమేషన్ చిత్రంగా రూపొందింది. ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు సూపర్ స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu) డబ్బింగ్ చెప్పాడు. మహేష్ వాయిస్ ఓవర్‌తో పంచ్‌లు, ప్రాసలు అదిరిపోయాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇండియాలో తొలి రోజు కలెక్షన్స్ విషయాన్ని వస్తే ఈ చిత్రం రూ.10 కోట్ల గ్రాస్ (Mufasa: The Lion King Day 1 Collections) సాధించినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఇంగ్లీషు వెర్షన్‌లో రూ.4 కోట్లు, హిందీలో రూ.3 కోట్లు, తెలుగులో రూ.2 కోట్లు, తమిళంలో రూ.కోటి గ్రాస్ తన ఖాతాలో వేసుకుందని పేర్కొన్నాయి. శని, ఆదివారాల్లో ఈ మూవీ కలెక్షన్స్ అమాంతం పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. క్రిస్మస్ సెలవులు కూడా ఉండటంతో మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాయి. కాగా, తొలి వీకెండ్‌లో ‘ముఫాసా’ వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 180 మిలియన్ డాలర్లు (రూ.1529 కోట్లు) వసూలు చేస్తుందని హాలీవుడ్ వర్గాలు అంచనా వేశాయి.
‘యూఐ’ కలెక్షన్స్ ఎంతంటే
ఉపేంద్ర (Upendra) హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన సైంటిఫిక్ థ్రిల్లర్ ‘యూఐ’ (UI) శుక్రవారం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం కనెక్ట్ అయితే పక్కా ఎంటర్టైన్ చేస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తొలి రోజు ఈ చిత్రం రూ.Rs 6.75 కోట్ల గ్రాస్ (UI Movie Day 1 Collections) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క కర్ణాటకలోనే రూ.6 కోట్లు తన ఖాతాలో వేసుకుందని పేర్కొన్నాయి. తెలుగు బాక్సాఫీస్ వద్ద రూ.70 లక్షలు, తమిళంలో రూ.4 లక్షలు, హిందీ రీజియన్‌లో రూ.లక్ష వసూలు చేసినట్లు తెలిపాయి. యూత్‌లో ఈ సినిమా పెద్ద ఎత్తున అటెన్షన్ రావడంతో వీకెండ్‌లో ‘యూఐ’ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి.
‘విడుదల 2’ కలెక్షన్స్..
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ రూపొందించిన ‘విడుదల 2’ (Vidudala 2) చిత్రం డిసెంబర్ 20న రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ సేతుపతి నటన, వ్యవస్థల లోపాలను దర్శకుడు ఎత్తిచూపిన విధానం బాగుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.9 కోట్ల గ్రాస్ (Vidudala 2 Movie Day 1 Collections) సాధించినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ.8 కోట్లు వసూలైనట్లు తెలిపాయి. తెలుగులో రూ.60 లక్షల వరకూ కలెక్షన్స్ వచ్చినట్లు తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.3.5 కోట్లు వచ్చి చేరాయని వివరించాయి. మూవీకి వచ్చిన టాక్‌ను బట్టి కలెక్షన్స్ పెరగడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
‘బచ్చల మల్లి’ వసూళ్లు..
అల్లరి నరేష్ (Allari Naresh) మాస్ రోల్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే అల్లరి నరేష్ మాస్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందంటూ ప్రశంసలు వచ్చాయి. ఇదిలా ఉంటే తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.80 లక్షల (Bachchala Malli Day 1 Collections) వరకూ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.60 లక్షల వరకూ ఉండొచ్చని చెప్పాయి. యావరేజ్ టాక్ నేపథ్యంలో వీకెండ్స్‌లో ఈ సినిమా ప్రభావం అంతగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాయి.
డిసెంబర్ 21 , 2024

This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. సెప్టెంబర్ 4 నుంచిసెప్టెంబర్ 10 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
జవాన్
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘జవాన్’ ఈ వారమే థియేటర్లలోకి రానుంది. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో షారుక్‌కు జోడీగా నయనతార నటించింది. విజయ్ సేతుపతి విలన్‌గా చేశారు. ఈ మూవీలో షారుక్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. జవాన్ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్‌ను పెంచేశాయి.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధానపాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మహేశ్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్ నిర్మించారు. కాగా, ఈ చిత్రం కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. సెప్టెంబర్ 7న (శుక్రవారం) విడుదల కాబోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
జైలర్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్‌బాస్టర్ చిత్రం ‘జైలర్’ ఈ వారం ఓటీటీలోకి రానుంది. సెప్టెంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మూవీని వీక్షించవచ్చు. ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ అయిన జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.600కోట్లకుపై గ్రాస్ కలెక్షన్లను సాధించింది. జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు.
TitleCategoryLanguagePlatformRelease DateShane GillisMovieEnglishNetflixSep 05Scout’s HonorMovieEnglishNetflixSep 05kung fu panda 3SeriesEnglishNetflixSep 07top boy season 2SeriesEnglishNetflixSep 07One shotSeriesEnglishAmazon primeSep 07Sitting in Bars With CakeMovieEnglishAmazon primeSep 06i'm groot season 2SeriesEnglishDisney + HotstarSep 06LoveMovieTamilAhaSep 08Love on the roadMovieEnglishBook My ShowSep 08
.
సెప్టెంబర్ 04 , 2023

Top 5 Upcoming Movies in 2023: రూ.500 కోట్ల వసూళ్లపై కన్నేసిన సినిమాలు.. బాక్సాఫీస్ షేక్ కావాల్సిందేనా..!
‘వంద కోట్లు కొల్లగొట్టిన సినిమా రా అది’ అని జనరల్‌గా మాట్లాడుకుంటుంటాం. సినిమా విజయం సాధించిందని చెప్పడానికి కలెక్షన్లు ఒక ప్రామాణికత. ఏ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయ్? వసూళ్లెంత? అనే డిస్కషన్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కలెక్షన్ల కౌంట్ ఎగబాకిన కొద్దీ సినిమా సక్సెస్ స్థాయి పెరుగుతుంది. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇదే సంప్రదాయం ఉంటుంది. ఎన్నో సినిమాలు హిట్టవుతాయి. కానీ, కొన్నే ల్యాండ్‌మార్క్ వసూళ్లను అందుకుంటాయి. రానున్న సినిమాలపై కూడా ఈ అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి, ఈ ఏడాది రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేయగల సినిమాలేంటో చూద్దాం.
జవాన్(JAWAN)
షారూక్ ఖాన్, విజయ్ సేతుపతి, దీపిక పదుకొణె, నయనతార.. ఇలా ప్రధాన తారాగణం నటించిన సినిమా ఇది. క్రియేటివ్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించాడు. సెప్టెంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. చిత్రంపై భారీ హైప్‌ని క్రియేట్ చేసింది. షారూక్ ఖాన్‌ని గుండుతో చూపించడం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మళయాల, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. నటీనటుల మార్కెట్, కంటెంట్‌ని బట్టి ఈ సినిమా రూ.500 కోట్ల పైచిలుకు వసూళ్లను సాధించగలదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=k8YiqM0Y-78
సలార్(SALAAR)
మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీగా ప్రభాస్ సలార్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ అనంతరం, ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. పైగా, సినిమాలోని నటీనటులు మూవీ గురించి గొప్పగా చెబుతుండటం మరింత ఆసక్తిని పెంచింది. కేజీఎఫ్2కి, దీనికి లింక్ ఉన్నట్లు టీజర్‌లో స్పష్టంగా కనిపించింది. ఫ్రెండ్‌షిప్ సెంటిమెంట్‌తో సినిమా వస్తోంది. రెండు పార్ట్‌లుగా వస్తున్న ఈ మూవీకి హొంబలే ఫిల్మ్ భారీగానే ఖర్చు చేస్తోంది. సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కూడా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లపై కన్నేసింది. సినిమా టాక్ బాగుంటే ప్రభాస్ మార్కెట్‌కి ఇది సాధ్యమే.
https://www.youtube.com/watch?v=bUR_FKt7Iso
లియో(LEO)
‘విక్రమ్’ మూవీ బ్లాక్‌బస్టర్ అనంతరం లోకేష్ కనగరాజ్ తీస్తున్న చిత్రమే ‘లియో’. దళపతి విజయ్ నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులను ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ సొంతం చేసుకుంది. రూ.20 కోట్లకు దీనిని దక్కించుకున్నట్లు టాక్. దీంతో విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్ ఇందులో కనిపించనున్నారట.
LEO - Bloody Sweet Promo | Thalapathy Vijay | Lokesh Kanagaraj | Anirudh
యానిమల్(ANIMAL)
రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లోనే మోస్ట్ వైలెంట్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ సినిమా ఎలా ఉండబోతోందో రుచి చూపించింది. ఈ మూవీ కూడా 5 భాషల్లో విడుదల అవుతోంది. తొలుత ఆగస్టు 11న విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాలతో సినిమా రిలీజ్ ఈ ఏడాది డిసెంబర్ 1కి వాయిదా పడింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.
https://www.youtube.com/watch?v=EywX_uxreYA
డంకీ(DUNKI)
రాజ్ కుమార్ హిరాణీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 3 ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే, సంజూ వంటి సినిమాలను తీశాడు. యూనిక్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించగలడు. ఇప్పుడు షారూక్ ఖాన్‌ని ‘డంకీ’(DUNKI)గా చూపించబోతున్నాడు. పూర్తి కామెడీ చిత్రంగా రాజ్‌కుమార్ హిరాణీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాప్సీ పన్ను హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయనున్నారు. ఈ మూవీ సైతం రూ.500 కోట్లకు పైగా వసూళ్లపై కన్నేసింది.
https://www.youtube.com/watch?v=aNxd01VzJsw&t=1s
ఆగస్టు 10 , 2023

3rd Day BOX OFFICE: స్టార్ హీరో లేకున్నా కలెక్షన్లు కుమ్మేసిన టాప్-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ ఊహించనంతగా వస్తాయి. కానీ, సినిమా బాలేకపోతే తర్వాత రోజు నుంచి తగ్గిపోతాయి. చిత్రం బాగున్నప్పటికీ అసలు వసూళ్లు రాని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలకు వరుసగా మూడ్రోజులు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. హీరో స్టార్ ఇమేజ్ ప్రేక్షకులను థియేటర్‌కు లాగుతుంది. కానీ మీడియం రేంజ్ చిత్రాలకు ఆ పరిస్థితి ఉండదు. సినిమా బాగుందని టాక్ వస్తే తప్ప థియేటర్‌కు ఎవరూ వెళ్లరు. అలా తొలి రోజు కలెక్షన్లు తక్కువగా ఉన్నా…. ప్రేక్షకుల టాక్‌తో మూడో రోజు కల్లా దూసుకు పోయిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం.
ఉప్పెన
మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్ మెుదటి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓపెనింగ్స్ ఫర్వాలేదనిపించినా.. హిట్ టాక్ రావటంతో మూడో రోజు ఏకంగా రూ. 8.26 కోట్లు కొళ్లగొట్టింది. చిత్రాన్ని రూ.15 కోట్లు పెట్టి తీస్తే రూ.83 కోట్లు వచ్చాయి. ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రను విజయ్ సేతుపతి మెుదట ఒప్పుకోలేదు. దర్శకుడు పట్టుబట్టడంతో సైన్ చేశారు. చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను మార్చి కృతి శెట్టిని తీసుకున్నారు. ఆమె కారణంగా మరింత బజ్ వచ్చింది.
దసరా
నేచురల్ స్టార్ నాని నటించిన పవర్ ప్యాక్డ్ మాస్ చిత్రం దసరా. లుక్, యాసతో నటీనటులందరూ అదరగొట్టారు. దీంతో కలెక్షన్ల వర్షం కురిసింది. సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. రూ. 65 కోట్లతో తెరకెక్కిస్తే రూ. 110 కోట్లు రాబట్టింది. ఇక మూడోరోజు రూ. 6.73 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. శ్రీకాంత్ ఓదెల మెుదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా అలా కనిపించదు. మరో డెబ్యూ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టాడు నాని.
విరూపాక్ష
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మూడోరోజు రూ. 5.77 కోట్లు రాబట్టింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు టాక్ తెలుసుకుందామని సినిమాకు వెళితే అతడి ఫోన్ కొట్టేశారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది.
https://telugu.yousay.tv/virupaksha-full-review-virupaksha-with-horror-suspense-plot-sai-dharam-tej-super-come-back.html
లవ్ స్టోరీ
శేఖర్ కమ్ముల మరో మ్యాజికల్ చిత్రం లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూడో రోజు రూ. 5.19 కోట్లు వసూలు చేసింది. కులం అనే సున్నితమైన అంశాన్ని ప్రేమకథకు జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు శేఖర్. ఇందులో చైతూ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.
బింబిసార
కల్యాణ్‌రామ్‌కు మంచి హిట్ ఇచ్చిన సినిమా బింబిసార. చరిత్రలోని ఓ కథను తీసుకొని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు రూ. 5.02 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. రూ. 40 కోట్లు పెట్టి తీస్తే రూ. 65 కోట్లు సాధించింది. బింబిసార ఫ్రాంఛైజీలో భాగంగా మరో పార్ట్ కూడా వస్తుంది. చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై కల్యాణ్‌రామ్ స్వయంగా నిర్మించాడు.
ఇస్మార్ట్ శంకర్
హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్, పూరి జగన్నాథ్‌లకు మంచి కిక్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్. మెుదట్నుంచే కలెక్షన్లలో దూసుకెళ్లిన ఈ చిత్రం మూడో రోజు రూ. 4.32 కోట్లు రాబట్టింది. సినిమాకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టగా ఏకంగా రూ. 75 కోట్లు వచ్చాయి. సినిమాలో నటించిన నభా నటేశ్, నిధి అగర్వాల్‌కు ఆఫర్లు వరుస కట్టాయి. మణిశర్మ బాణీలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి.
భీష్మ
వెంకీ కుడుముల, నితిన్, రష్మిక కాంబోలో వచ్చిన కామెడీ లవ్ ఎంటర్‌టైనర్ భీష్మ. బాక్సీఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం మూడో రోజు వసూళ్లు రూ. 4.31 కోట్లు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లో తీసినప్పటికీ రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతుంది. భీష్మ, ఛలోని మించి ఉంటుందని దర్శకుడు చెప్పాడు.
జాతి రత్నాలు
కరోనా తర్వాత థియేటర్లలో జనం బాగా ఎంజాయ్ చేసిన సినిమా జాతి రత్నాలు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మస్త్ వసూళ్లు వచ్చాయి. బ్లాక్‌బస్టర్ టాక్ రావటంతో మూడో రోజు రూ. 4.28 కోట్లు రాబట్టింది. కేవలం రూ. 4 కోట్లు ఖర్చు చేయగా.. రూ. 65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
కార్తీకేయ 2
ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాలీవుడ్‌ను షేక్ చేసింది కార్తీకేయ 2. నిఖిల్, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్‌లోనూ కోట్లు రాబట్టిన కార్తీకేయ 2 మూడో రోజు కలెక్షన్లు రూ. 4.23 కోట్లు. సినిమాకు అయ్యింది రూ. 15 కోట్లు.. కానీ రూ. 117 కోట్లు కొళ్లగొట్టింది. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని నిఖిల్ చెప్పడంతో ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
అఖిల్, పూజా హెగ్డే కాంబోలో లవ్ స్టోరీ స్పెషలిస్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తీశాడు. యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లలో దూసుకెళ్లింది. ఈ సినిమాకు మూడో రోజు రూ. 4.03 కోట్లు సాధించింది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్. కలెక్షన్ల పరంగా రూ. 51 కోట్లు రాబట్టింది అఖిల్ సినిమా.
ఏప్రిల్ 24 , 2023

Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!
హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు కారణమైన సంగతి తెలిసిందే. హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్‌లోనే మాయని మచ్చలాగా మిగిలిపోయింది. బన్నీ రాక నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం (డిసెంబర్ 7) సికింద్రాబాద్ కిమ్స్‌కు వెళ్లిన బన్నీ ఆంక్షల మధ్య శ్రీతేజ్‌ను పరామర్శించారు. ఇదిలా ఉంటే మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) సంధ్యా థియేటర్ ఘటనపై తొలిసారి స్పందించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
నిహారిక ఏమన్నదంటే..
కోలీవుడ్‌లో నిహారిక నటించిన ఫస్ట్ ఫిల్మ్ 'మద్రాస్ కారన్' రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మరో రెండ్రోజుల్లో జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కానుంది. షాన్ నిగమ్ హీరోగా చేసిన ఈ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిహారిక ఓ ఇంటర్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సంధ్యా థియేటర్ ఘటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సంధ్య థియేటర్ ఘటన నన్ను ఎంతో బాధించింది. ఇలాంటి ఘటనలను ఎవరూ ఊహించరు. మహిళ మృతి చెందడం బాధకరం. ప్రాణం కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయం. నా హృదయం ముక్కలైంది. ఇలాంటి ఘటనలు ఎవరికీ జరగకూడదు. తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. మరోసారి ఇండస్ట్రీలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవద్దని కోరుకుంటున్నా. ఈ దుర్ఘటన నుంచి అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు’ అని నిహారిక చెప్పుకొచ్చింది.
https://twitter.com/pakkatelugunewz/status/1876916188577431653
‘బన్నీ నుంచి ఎంతో నేర్చుకున్నా’
మెగా హీరోల నుంచి ఏమేమి నేర్చుకున్నారన్న ప్రశ్నలకు నిహారిక ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అతడి నుంచి ఎంతో నేర్చుకున్నట్లు చెప్పింది. ‘అల్లు అర్జున్ లుక్స్ పరంగా ఎంతో కేరింగ్ తీసుకుంటాడు. సినిమా సినిమాకు స్టైల్, లుక్ మార్చుకుంటాడు. ఈ విషయంలో బన్నీ నాకు ఇన్స్పిరేషన్’ అని నిహారిక తెలిపింది. సోదరుడు వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ తన ప్రతీ సినిమాకు సైన్ చేసే ముందు అతడితో డిస్కస్ చేస్తానని చెప్పింది. అటు రామ్‌చరణ్‌తో చాలా సరదాగా ఉంటానని, ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా వ్యవహరించాలి అన్నది ఆయన్ను చూసి నేర్చుకున్నట్లు నిహారిక చెప్పుకొచ్చింది.
నిహారిక.. రొమాంటిక్ సాంగ్ గుర్తుందా?
కొద్ది రోజుల క్రితం నెట్టింట హల్చల్ చేసిన నిహారిక బోల్డ్ రొమాంటిక్ సాంగ్.. 'మద్రాస్ కారణ్' (Madras Kaaran) సినిమాలోనిదే. మణి రత్నం 'సఖి' సినిమాలో మాధవన్, షాలిని చేసిన 'నగిన నగిన' పాటకు రీమిక్స్‌గా ఆ సాంగ్ రూపొందింది. ఇందులో నిహారిక, షాన్ నిగమ్ మధ్య ముద్దు సన్నివేశాలు, బోల్డ్ - రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. నిహారిక ఆ స్థాయిలో రొమాన్స్ చేయడం అదే తొలిసారి. దీంతో ఆ తమిళ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. కొందరు నిహారిక ప్రదర్శనను ప్రశంసించగా ఎక్కువ మంది విమర్శించారు. అందరూ అభిమానించే మెగా ఫ్యామిలీకి ఇలాంటి బోల్డ్ సాంగ్‌లో చేయడం ద్వారా నిహారిక తలవొంపులు తెచ్చిందని ట్రోల్స్ చేశారు.
https://twitter.com/SivareddE/status/1865713969794806123
కోలీవుడ్‌లో గతంలోనే మెరిసినా నిహారిక..
'మద్రాస్ కారణ్' (Madras Kaaran) చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ హీరోయిన్‌గా నిహారిక చేస్తోన్న ఫస్ట్ తమిళ చిత్రం. అయితే నటిగా మాత్రం ఆమెకు ఇది రెండో ఫిల్మ్. నిహారిక గతంలోనే ఓ తమిళ చిత్రంలో నటించింది. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా చేసిన 'ఓరు నళ్లనాళ్ పాతు సోల్రెన్' చిత్రంలో నిహారిక కనిపించింది. 2018లో ఈ సినిమా విడుదలైంది. ఇక నిహారిక విషయానికి వస్తే ఆమె హీరోయిన్‌గా ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ చిత్రాలు చేసింది. ‘డార్లింగ్’, ‘కమిటీ కుర్రోళ్లు’ (ప్రొడ్యూసర్‌గా కూడా) చిత్రాల్లో క్యామియో ఇచ్చింది. ప్రస్తుతం 'మద్రాస్ కారణ్'తో పాటు తెలుగులో ‘వాట్ ద ఫిష్’ చిత్రంలో నిహారిక నటిస్తోంది. అలాగే నిర్మాతగాను రాణించేందుకు ప్రయత్నిస్తోంది.
జనవరి 08 , 2025

OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాల లిస్ట్!
క్రిస్మస్ (Christmas 2025)ను పురస్కరించుకొని ఈ వారం బాక్సాఫీస్ వద్ద కొత్త చిత్రాలు సందడి చేయబోతున్నాయి. డిసెంబర్ మూడో వారంలో పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. పసందైన వినోదాన్ని పంచనున్నాయి. అటు ఓటీటీలోని ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్టైన్ చేసేందుకు సై అంటున్నాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యక కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు..
బచ్చల మల్లి (Bachchala Malli)
అల్లరి నరేశ్ (Allari Naresh) మాస్ రోల్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 20న (Bachhala Malli Movie Release Date) విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి.
విడుదల పార్ట్ 2 (Vidudala Part 2)
గతేడాది తెలుగు, తమిళ భాషల్లో రిలీజై మెప్పించిన ‘విడుదల’ చిత్రానికి ఈ వారం థియేటర్లలో సీక్వెల్ రాబోతోంది. సూరి (Soori), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రల్లో నటించిన ‘విడుదల పార్ట్ 2’ (Viduthalai Part 2) డిసెంబర్ 20న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. మావోయిస్టు నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
సారంగపాణి జాతకం (Sarangapani Jathakam)
కమెడియన్ ప్రియదర్శి (Priyadarsi) కథానాయకుడిగా చేసిన ‘సారంగపాణి జాతకం’ కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. డిసెంబర్ 20 నుంచి థియేటర్లలో ఈ సినిమాను వీక్షింవచ్చు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రూప కొడువాయూర్ (Roopa Koduvayur) హీరోయిన్‌గా చేసింది. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ట్రైలర్, టీజర్‌ను బట్టి చూస్తే ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.
యూఐ (UI)
కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యూఐ’ (UI). ఈ ఫాంటసీ చిత్రాన్ని జి.మనోహరన్ కేపీ శ్రీకాంత్ నిర్మించారు. ఈ సినిమా విజువల్స్ పరంగా, సంగీతం పరంగా కొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్ తెలిపారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదల్లే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
లీలా వినోదం (Leela Vinodam)
ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్ వెబ్‌సిరీస్ 'లీలా వినోదం'. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఈటీవీ విన్'లో ఈ వీక్ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. డిసెంబర్ 19 నుంచి ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. పవన్ సుంకర దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అనగ అజిత్, గోపరాజు రమణ, ఆమని, రూపాలక్ష్మికీలక పాత్రలు పోషించారు. పల్లెటూరులో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ సిరీస్ సాగనుంది.
జీబ్రా (Zebra)
సత్యదేవ్, ధనుంజయ్ హీరోలుగా నటించిన రీసెంట్ చిత్రం ‘జీబ్రా’ (Zebra). ప్రియాభవానీ శంకర్ హీరోయిన్. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో డిసెంబర్ 20 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుంది.
Telugu Movies OTT Release Dates 2024
TitleCategoryLanguagePlatformRelease DateZebraMovieTelugu AhaDec 20Leela VinodamSeriesTelugu ETV WinDec 19Mechanic RockyDocumentaryTelugu AmazonDec 13HarikathaSeriesTelugu Hot StarDec 13Roti Kapda RomanceMovieTelugu ETV WinDec 127/G – The Dark StoryMovieTelugu AhaDec 12Thangalaan MovieTelugu NetflixDec 10
OTT Releases This Week 2024
TitleCategoryLanguagePlatformRelease DateInigmaMovieEnglishNetflixDec 17Love to hate it juliasMovieEnglishNetflixDec 17Stepping StonesDocumentaryEnglishNetflixDec 18The Dragan PrinceSeriesEnglishNetflixDec 18Virgin River 6SeriesEnglishNetflixDec 19The Six Triple EightMovieEnglishNetflixDec 20Yo Yo HoneysinghDocumentaryHindiNetflixDec 21Girls Will Be GirlsMovieHindiAmazonDec 18Beast GamesMovieEnglishAmazonDec 18TwistersMovieEnglishJio CinemaDec 18Moon WalkMovieHindiJio CinemaDec 20TelmaMovieEnglishSonyLIVDec 21
డిసెంబర్ 16 , 2024

Niharika Konidela: బెడ్రూమ్ సీన్లలో రెచ్చిపోయి నటించిన నిహారిక.. వీడియో వైరల్
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగబాబు కూతురిగా, నటిగా, హోస్ట్‌గా, నిర్మాతగా ఆమె తనదైన ముద్ర ఇండస్ట్రీపై వేసింది. అటు పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసి మంచి మార్కులు కొట్టేసింది. 2020 డిసెంబర్‌లో చైతన్య కృష్ణను వివాహం చేసుకున్న ఆమె కొంతకాలం పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. గతేడాది జులైలో అతడితో విడిపోవడంతో తిరిగి ఈ అమ్మడి దృష్టి సినిమాలపై పడింది. ఇటీవలే ప్రొడ్యుసర్‌గా మారి 'కమిటీ కుర్రోళ్లు' అనే బ్లాక్ బాస్టర్ చిత్రం తీసింది. అటు తమిళంలో ఓ సినిమాలో హీరోయిన్‌గా సైతం నటిస్తోంది. అందులో నిహారిక చేసిన రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
రొమాంటిక్ సాంగ్‌లో..
ప్రస్తుతం తమిళంలో 'మద్రాస్ కారణ్' (Madras Kaaran) అనే చిత్రంలో నిహారిక (Niharika Konidela) నటిస్తోంది. షాన్ నిగమ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నిహారికతో పాటు ఐశ్వర్య దుత్త హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైనర్ రిలీజ్ చేయగా దానికి విశేష స్పందన వచ్చింది. తాజాగా షాన్ నిగమ్, నిహారిక మధ్య సాగే ఓ రొమాంటిక్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మణి రత్నం 'సఖి' సినిమాలో మాధవన్, షాలిని మధ్య వచ్చే 'నగిన నగిన' పాటను రీమిక్స్ చేసి దీన్ని విడుదల చేశారు. ఈ పాటలో నిహారిక తన డ్యాన్స్‌తో దుమ్మురేపింది. ఇందులో నిహారిక, షాన్ నిగమ్ మధ్య ముద్దు సన్నివేశాలు, బోల్డ్ - రొమాంటిక్ డ్యాన్స్ ఉన్నాయి. నిహారిక ఈ స్థాయిలో రొమాన్స్ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ తమిళ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొందరు నిహారిక ప్రదర్శనను ప్రశంసిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.
https://twitter.com/SivareddE/status/1865713969794806123
నెటిజన్ల మండిపాటు
'మద్రాస్ కారణ్' (Madras Kaaran) మూవీ సాంగ్ నేపథ్యంలో మెగా డాటర్ నిహారిక (Niharika Konidela)పై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి బోల్డ్ రొమాంటిక్ పాటల్లో నటించి మెగా ఫ్యామిలీ పరువు తీసిందని ఆరోపిస్తున్నారు. గ్లామర్ పాత్రలు చేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. చక్కగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి మెగా ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావొచ్చు కదా అని సూచిస్తున్నారు. మూడు నిమిషాల సాంగ్‌లోనే ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తే ఇక సినిమాలో ఇంకెంత ఎక్స్‌పోజింగ్ ఉంటుందోనని మరికొందరు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం నిహారికకు అండగా నిలుస్తున్నారు. దారుణంగా విమర్శించేంత ఎక్స్‌పోజింగ్ నిహారిక చేయలేదని మద్దతిస్తున్నారు. నటి అన్నాక అన్ని రకాల పాత్రలు పోషించాల్సిన అవసరం ఉంటుందని గుర్తుచేస్తున్నారు.
https://twitter.com/naprapanchamm/status/1865716593709244888
https://twitter.com/Manaki_Enduku_/status/1866059745263484992
గతంలో విజయ్ సేతుపతితో..
'మద్రాస్ కారణ్' (Madras Kaaran) చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ నిహారిక చేస్తోన్న ఫస్ట్ తమిళ చిత్రం కాదు. ఆమె గతంలో తమిళంలో ఓ చిత్రం చేసింది. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా చేసిన 'ఓరు నళ్లనాళ్ పాతు సోల్రెన్' చిత్రంలో నిహారిక నటించింది. 2018లో ఈ సినిమా విడుదలైంది. ఇక నిహారిక విషయానికి వస్తే ఆమె హీరోయిన్‌గా ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ చిత్రాలు చేసింది. ‘డార్లింగ్’, ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రాల్లో క్యామియో ఇచ్చింది. ప్రస్తుతం 'మద్రాస్ కారణ్'తో పాటు తెలుగులో ‘వాట్ ద ఫిష్’ చిత్రంలో నిహారిక నటిస్తోంది. అలాగే నిర్మాతగాను రాణించేందుకు ప్రయత్నిస్తోంది.
డిసెంబర్ 09 , 2024