• TFIDB EN
  • శాకుంతలం
    UATelugu2h 22m
    విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడి ఆదేశంతో మేనక (మధుబాల) భూమిపైకి వస్తుంది. విశ్వామిత్రుడికి శారీరకంగా దగ్గరై పాపకు జన్మనిస్తుంది. ఆ పాపకు కణ్వ మహర్షి (సచిన్‌ ఖడేకర్) శాంకుతల(సమంత)గా పేరు పెట్టి కన్నబిడ్డలా పెంచుతాడు. ఓ రోజు కణ్వ అశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు(దేవ్ మోహన్) యువతిగా ఉన్న ఆమె అందచందాలు చూసి ఇష్టపడతాడు. గాంధర్వ వివాహంతో ఒక్కటవుతారు. త్వరలోనే తిరిగి వచ్చి రాజ్యానికి తీసుకెళ్తానని దుష్యంతుడు హామి ఇస్తాడు. ఈ క్రమంలో సమంత గర్భవతి అవుతుంది. ఈ నేపథ్యంలో దుష్యంతుడు, సమంత ఎలా కలిశారు? వారు విడిపోవడానికి దుర్వాస మహాముని (మోహన్‌బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? అనేది అసలు కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సమంత రూత్ ప్రభు
    శకుంతల
    దేవ్ మోహన్
    దుష్యంత
    సచిన్ ఖేడేకర్
    కణ్వ మహర్షి
    మోహన్ బాబు
    దుర్వాస మహర్షి
    అదితి బాలన్
    ప్రియంవద
    అనన్య నాగళ్ల
    అనసూయ
    ప్రకాష్ రాజ్
    సారంగి
    గౌతమి
    గౌతమి
    మధు షా (మధుబాల)
    మేనక
    కబీర్ బేడిOMRI
    కశ్యప మహర్షి
    జిషు సేన్‌గుప్తా
    ఇంద్ర దేవ
    కబీర్ దుహన్ సింగ్
    రాజు అసుర
    అల్లు అర్హప్రిన్స్ భరత
    వర్షిణి సౌందరరాజన్
    సానుమతి
    హరీష్ ఉత్తమన్
    సుబ్బరాజు
    ఆదర్శ్ బాలకృష్ణ
    యష్ పూరి
    సిబ్బంది
    గుణశేఖర్
    దర్శకుడు
    నీలిమ గుణ
    నిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    శేఖర్ వి. జోసెఫ్
    సినిమాటోగ్రాఫర్
    ప్రవీణ్ పూడి
    ఎడిటర్
    కథనాలు
    Dev Mohan: సమంతను ఇంప్రెస్‌ చేసిన శాకుంతలం హీరో దేవ్ మోహన్‌కు ఇంత టాలెంటా?
    Dev Mohan: సమంతను ఇంప్రెస్‌ చేసిన శాకుంతలం హీరో దేవ్ మోహన్‌కు ఇంత టాలెంటా?
    శాకుంతలం చిత్రంలో సమంత సరసన నటించిన దేవ్‌ మోహన్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీంతో అసలు ఈ నటుడు ఎవరు? మన తెలుగు వ్యక్తియేనా? ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించాడు? అన్న ప్రశ్నలు సగటు సినీ ప్రేక్షకుడిలో నెలకొంది. ఈ నేపథ్యంలో దేవ్‌ మోహన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..  కేరళలోని త్రిస్సూరు చెందిన దేవ్‌ మోహన్‌ 18 సెప్టెంబర్‌ 1992లో జన్మించాడు. విద్యాభ్యాసమంతా త్రిస్సూర్‌లోనే చేసిన దేవ్‌.. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో టీమ్‌ లీడర్‌గా పనిచేశాడు. ఉద్యోగం చేస్తూనే దేవ్‌ మోడల్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ క్రమంలోనే 2016లో మిస్టర్‌ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచాడు. 2020లో రజీనా అనే అమ్మాయిని దేవ్‌ పెళ్లి చేసుకున్నాడు.  2020 లో మళయాళం మూవీ 'సూఫీయుం సుజాతయుమ్' చిత్రం ద్వారా తొలిసారి దేవ్‌ మోహన్‌ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇందులో ‘సూఫీ రోల్‌లో కనిపించి దేవ్‌ మెప్పించాడు. ఆ తర్వాత 2021లో పులి, పంత్రండు చిత్రాల్లో నటించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో డైరెక్టర్‌ గుణశేఖర్‌ కంట్లో పడ్డ దేవ్‌ మోహన్‌ శాకుంతలం చిత్రంలో కీలక పాత్రను దక్కించుకున్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్యూ ఇచ్చిన దేవ్ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.  ప్రశ్న: శాకుంతలం ఆఫర్ ఎలా వచ్చింది? దేవ్: నిర్మాత నీలిమ నా ఫస్ట్‌ ఫిల్మ్‌ 'సూఫీయుం సుజాతయుమ్' చూశారు. నా నటను ఆమెకు నచ్చింది. శాకుంతలంలో దుశ్యాంత పాత్రకు నేను సరిపోతానని ఆమె ఫీలయ్యారు. దీంతో ఆమె నన్ను సంప్రదించారు. మెుదట ఏదో ప్రాంక్ చేస్తున్నారని భావించా. నీలిమ, డైరెక్టర్ గుణశేఖర్‌తో మాట్లాడిన తర్వాత నిజమని నిర్ధారించుకున్నా. ఇందులో చేయడం ద్వారా నా కల నేరవేరినట్లు భావిస్తున్నా. ప్రశ్న: తెలుగు ఇండస్ట్రీ, గుణశేఖర్‌ గురించి మీకు అవగాహన ఉందా? దేవ్‌: తెలుగు సినీ పరిశ్రమపై నాకు అవగాహన ఉంది. అల్లు అర్జున్‌ సినిమాలు మా దగ్గర (కేరళ) చాలా ఫేమస్‌. ఆర్య, హ్యాపీ సినిమాలు చూశాను. రీసెంట్‌గా వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి చూశాను. గుణశేఖర్‌ గారి ఒక్కడు, రుద్రమదేవి చిత్రాలు చూశాను. ఆయనో చాలా గొప్ప దర్శకులు. ప్రశ్న. శాకుంతలం కోసం మీరు తీసుకున్న ట్రైనింగ్‌ ? దేవ్‌: ఈ మూవీ కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నా. రోజుకు రెండు గంటలు గుర్రపు స్వారీ చేసే వాడ్ని. తొలి రోజుల్లో చాలా కష్టంగా అనిపించింది. భుజం, వెన్ను నొప్పి వచ్చేది. క్రమంగా ఎంజాయ్‌ చేయడం ప్రారంభించా. గుర్రానికి బాగా కనెక్ట్‌ అయ్యి ట్రైనింగ్‌ను ఆస్వాదించాను.  ప్రశ్న. తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు? దేవ్‌: డైలాగ్స్‌ను డైరెక్టర్‌ నాకు వాయిస్ నోట్ పంపేవారు. నేను దాన్ని విని మలయాళంలో రాసుకునే వాడ్ని. షూటింగ్‌కు ముందు రోజు డైరెక్టర్‌ను కలిసి డైలాగ్‌ చెప్పేవాడ్ని. ఏమైనా తప్పు  ఉంటే సరిచేసుకొని షూటింగ్‌లో డైలాగ్స్ చెప్పాను.  పూర్తి ఇంటర్యూ కోసం ఇక్కడ చూడండి..              https://youtu.be/TrcHf9vOscM అవార్డులు దాసోహం... అరంగేట్రం సినిమాలతోనే దేవ్‌ మోహన్‌ తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. 'సూఫీయుం సుజాతయుమ్’ మూవీకి ‘ సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌’లో ఉత్తమ నూతన నటుడు అవార్డు దక్కించుకున్నాడు. సమయం మూవీ అవార్డులోనూ ఉత్తమ అరంగేట్ర యాక్టర్‌గా దేవ్ మోహన్‌ ఎంపికయ్యాడు. అటు 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ సౌత్‌లో బెస్ట్‌ డెబ్యూట్‌ మేల్‌ పురస్కారాన్ని దేవ్ అందుకున్నాడు.  దేవ్‌ మోహన్‌, రష్మిక మందన్నా జంటగా కొత్తగా రెయిన్‌బో చిత్రం తెరకెక్కబోతోంది. అక్కినేని అమల ఈ చిత్రం షూటింగ్‌ను క్లాప్‌ కొట్టి ప్రారంభించారు. ఏప్రిల్‌ 7 నుంచి రెయిన్‌బో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రొమాంటిక్‌ ఫాంటసీగా రూపొందనున్న ఈ సినిమాకు శాంతరూబన్‌ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 
    ఏప్రిల్ 03 , 2023
    2023 ఫిబ్రవరిలో విడుదల కానున్న చిత్రాలు ఇవే.. అలరించనున్న శాకుంతలం, అమిగోస్
    2023 ఫిబ్రవరిలో విడుదల కానున్న చిత్రాలు ఇవే.. అలరించనున్న శాకుంతలం, అమిగోస్
    ]మణి శర్మ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
    ఫిబ్రవరి 13 , 2023
    Actress Samantha : ఫ్యాన్స్‌ కొంటె ప్రశ్నలకు.. క్రేజీ ఆన్సర్స్‌ ఇచ్చిన సమంత
    Actress Samantha : ఫ్యాన్స్‌ కొంటె ప్రశ్నలకు.. క్రేజీ ఆన్సర్స్‌ ఇచ్చిన సమంత
    టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత తన లేటెస్ట్‌ మూవీ శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ మూవీపై అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ క్రమంలో సమంత ట్విటర్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించింది. శాకుంతలం సినిమాతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అలాగే నటి మృణాల్‌ ఠాకూర్‌ అడిగిన దానికి కూడా సమంత ఆన్సర్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టులను సామ్‌ ట్విటర్‌లో పంచుకుంది. అసలు నెటిజన్లు సామ్‌ను ఏం అడిగారు?. అందుకు సమంత ఇచ్చి క్రేజీ ఆన్సర్స్‌ ఏంటీ? ఇప్పుడు చూద్దాం.  మృణాల్‌ ఠాకూర్‌: శాకుంతలం సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా. నువ్వు చాలా ఇన్‌స్పైరింగ్‌. నా ప్రశ్న ఏంటంటే మనం కలిసి ఎప్పుడు సినిమా చేయబోతున్నాం? సామ్‌: కాంగ్రాట్యూలేషన్స్‌.... ‘గుమ్రా’ బ్యూటిఫుల్‌ మృణాల్‌ ఠాకూర్‌. నీ ఆలోచన చాలా నచ్చింది. మనం చేద్దాం. https://twitter.com/Samanthaprabhu2/status/1645087094765932545 నెటిజన్‌: మీ నిజమైన అభిమాని కోసం ఒక్క మాటలో ఏం చెబుతారు?  సామ్‌: నిన్నటి వరకు స్ట్రేంజర్.. ఇవాళ కుటుంబ సభ్యుడు https://twitter.com/Samanthaprabhu2/status/1645082714532642816 నెటిజన్: మీకు ధైర్యం ఎక్కడ నుంచి వస్తోంది? ఎన్నో సమస్యలు ఉన్నా మీరు ఎలా మూవ్‌ ఆన్‌ అవుతున్నారు.  సామ్: ఎందుకంటే నా కథ ఎలా ముగియాలో నేను నిర్ణయిస్తాను కాబట్టి. https://twitter.com/Samanthaprabhu2/status/1645082177414246401 నెటిజన్‌: మీరు శాకుంతలం రిలీజ్‌ రోజు ఫ్యాన్స్‌ షో చూసేందుకు దేవి 70MM థియేటర్‌కు వస్తారా? సామ్: రావొచ్చేమో? రావాలా..! https://twitter.com/Samanthaprabhu2/status/1645080239582871552 నెటిజన్‌: శాకుంతలం, ఖుషి, బాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌తో  శామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాముల్గా ఉండదు సామ్‌: ఈ ఏడాది కూడా చాలా క్రేజీగా గడవబోతోంది. https://twitter.com/Samanthaprabhu2/status/1645080067968749568 నెటిజన్‌ : నువ్వు టీనేజ్ అమ్మాయిగా ఎంతో క్యూట్‌గా ఉన్నావు. ఈ లుక్‌ను ఇలాగే కొంత కాలం కొనసాగించాలని భావిస్తున్నారా? సామ్‌: గ్లాసెస్‌.. నా కొత్త బెస్ట్‌ ఫ్రెండ్‌ https://twitter.com/Samanthaprabhu2/status/1645079008026189828 నెటిజన్‌: మీ ఉద్దేశంలో ఆత్మగౌరవం, సెల్ఫ్‌ లవ్‌ అంటే ఏంటి? సామ్‌ : మీ గురించి తెలుసుకోవడానికి ఇతరులపై ఆధారపడనప్పుడు..మీరు మీతోనే సంతోషంగా ఉండగలిగినప్పుడు.. https://twitter.com/Samanthaprabhu2/status/1645078774957088774 నెజిజన్‌: మీరు వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో జయపజయాలను ఎలా తీసుకుంటారు. మీ హార్ట్‌ అండ్ మైండ్‌లో ఎమోషన్స్‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? సామ్‌: విజయాల కంటే అపజయాలే మీకు ఎక్కువ గుణపాఠాలు నేర్పుతాయి. ఓటములే మిమ్మల్ని మంచి వ్యక్తిగా మారుస్తాయి. https://twitter.com/Samanthaprabhu2/status/1645075968133050369 నెటిజన్‌ : మీరు ఓ బేబి సినిమా అప్పుడు నాకు రిప్లై ఇచ్చారు. అది హిట్ అయింది. ఇప్పుడు కూడా ఒక రిప్లై ఇవ్వండి.. శాకుంతలం బ్లాక్‌ బస్టర్ అవుద్ది. సామ్‌: వామ్మో... అలాంటప్పుడు నీతో గొడవ పెట్టుకోకూడదు(నవ్వుతూ) https://twitter.com/Samanthaprabhu2/status/1645074391871668230
    ఏప్రిల్ 10 , 2023
    సమంత గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సమంత గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సమంత దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులో ఏమాయ చేసావే(2010) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ తమిళ్ అందం... దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు, యశోద, శాకుంతలం చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సమంత గురించి కొన్ని(Some Lesser Known Facts About Samantha) ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం సమంత ఎవరు? సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సమంత దేనికి ఫేమస్? సమంత.. ఏమాయ చేసావే, పుష్ప, దూకుడు, రంగస్థలం వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. సమంత వయస్సు ఎంత? సమంత 1987 ఏప్రిల్ 28న జన్మించింది. ఆమె వయస్సు  36 సంవత్సరాలు  సమంత ముద్దు పేరు? సామ్ సమంత ఎత్తు ఎంత? 5 అడుగుల 2 అంగుళాలు  సమంత ఎక్కడ పుట్టింది? చెన్నై సమంతకు వివాహం అయిందా? 2017లో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2021లో విడిపోయింది. సమంత అభిరుచులు? పాటలు పాడటం, షాపింగ్, జిమ్‌ చేయడం సమంత ఇష్టమైన ఆహారం? స్వీట్ పొంగల్, డైరీ మిల్క్ చాక్‌లెట్, పాలకోవ సమంత అభిమాన నటుడు? ధనుష్, సూర్య, రజనీకాంత్ సమంత తొలి సినిమా? ఏమాయ చేసావే సమంత ఏం చదివింది? కామర్స్‌లో డిగ్రీ చేసింది సమంత పారితోషికం ఎంత? సమంత ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. సమంత తల్లిదండ్రుల పేర్లు? జోసెఫ్ ప్రభు, నైనిటీ సమంతకు అఫైర్స్ ఉన్నాయా? సమంత తొలుత సిద్ధార్థతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత వీరు విడిపోయినట్లు తెలిసింది సమంతకు ఎన్ని అవార్డులు వచ్చాయి? 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు వచ్చాయి. సమంత ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/samantharuthprabhuoffl/?hl=en సమంత సిగరేట్ తాగుతుందా? కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లలో సమంత స్మోకింగ్ చేస్తుందని ఉంది సమంత మద్యం తాగుతుందా? తెలియదు సమంత ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది? సమంత తొలుత నాగచైతన్యతో లిప్‌లాక్ సీన్‌లో నటించింది. ఆ తర్వాత నానితో లిప్‌లాక్ సీన్‌లో నటించింది. సమంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? చిన్మయి, రానా, అక్కినేని అఖిల్ సమంతకు టాటూలు అంటే ఇష్టమా? అవును, తన కుడి వైపు నడుము పై భాగంలో 'చై' అని టాటూ వేయించుకుంది. విడిపోయిన తర్వాత టాటూ తొలగించింది. సమంతకు వచ్చి వ్యాధి పేరు? ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్(మయోసైటిస్), ఈ వ్యాధితో పాటు 2013లో ఆమెకు డయాబెటిస్ ఉన్నట్లు తెలిసింది.  సమంత గుడి ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్‌- బాపట్లలోని ఆలపాడు గ్రామంలో సమంత గుడిని ఆమె అభిమాని తెనాలి సందీప్ కట్టారు. https://www.youtube.com/watch?v=TRAuBpbd_nI
    ఏప్రిల్ 27 , 2024
    Tollywood Biggest Disasters 2023: ఈ ఏడాది డిజాస్టర్లుగా నిలిచిన స్టార్‌ హీరోల చిత్రాలు ఇవే!
    Tollywood Biggest Disasters 2023: ఈ ఏడాది డిజాస్టర్లుగా నిలిచిన స్టార్‌ హీరోల చిత్రాలు ఇవే!
    2023వ సంవత్సం కొందరి హీరోలకు ఊహించని విజయాలను అందిస్తే మరికొందరికి మాత్రం పీడకలను మిగిల్చింది. భారీ అంచనాలతో విడుదలైన కొన్ని చిత్రాలు భాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుని ఈ ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇంతకి ఆ చిత్రాలు ఏవి? అందులో నటించిన స్టార్‌ హీరోలు ఎవరు? ఇతర విశేషాలను ఇప్పుడు చూద్దాం.  శాకుంతలం గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘శాకుంతలం’. సమంత లీడ్‌ రోల్‌ చేసిన చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద చతికలపడింది. తీవ్ర నష్టాలను చవిచూసింది. సినిమాపై సామ్‌ పెట్టుకున్న ఆశలను అడియాశలు చేసింది. ఏజెంట్‌ యంగ్‌ హీరో అక్కినేని అఖిల్‌కు ఇండస్ట్రీలో ఇప్పటివరకూ సరైన హిట్‌ లేదు. దీంతో అతడు ‘ఏజెంట్’ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుంది. అఖిల్‌ కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా నిలిచింది.  ఆదిపురుష్‌ ప్రభాస్‌ రాముడిగా తెరకెక్కిన 'ఆదిపురుష్‌' చిత్రం ఈ ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఓం రౌత్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. విడుదల తర్వాత అనేక విమర్శలను మూటగట్టుకుంది.  కస్టడీ ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీకి కలిసిరాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే నాగ చైతన్య హీరోగా చేసిన ‘కస్టడీ’ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తొలిసారి కానిస్టేబుల్‌ పాత్రలో చేసిన చైతూ.. సినిమాను విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీంతో నిర్మాతలు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.  రావాణాసుర రవితేజ తొలిసారి విలన్‌ షేడెడ్‌ పాత్రలో నటించిన చిత్రం 'రావణాసుర'. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. అయితే థియేటర్లలో ఈ చిత్రం ఊహించని విధంగా ఫ్లాప్‌ టాక్ సొంతం చేసుకుంది. రవితేజ నటనకు మంచి మార్కులే పడినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం కాసుల వర్షం కురిపించలేకపోయింది.  గాండీవదారి అర్జున వరణ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కిన 'గాండీవదారి అర్జున' చిత్రం కూడా ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను చవిచూసింది.  రామబాణం ఈ మధ్య సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న స్టార్‌ హీరో గోపిచంద్‌.. ఈ ఏడాది ‘రామబాణం’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రం గోపిచంద్ ఆశలను అడియాశలు చేసింది. ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడింది. డిజాస్టర్‌గా నిలిచి హీరో గోపిచంద్‌కు అసంతృప్తిని మిగిల్చింది.  భోళాశంకర్‌ మెగాస్టార్‌ హీరోగా మేహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భోళాశంకర్‌’. భారీ అంచనాలు, ప్రమోషన్స్‌తో ఊదరగొట్టిన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది.  ఆదికేశవ మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్, శ్రీలీల జంటగా చేసిన ‘ఆదికేశవ’ చిత్రం కూడా ఇటీవల విడుదలై ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. 
    డిసెంబర్ 20 , 2023
    Tollywood Heroines: యంగ్‌ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?
    Tollywood Heroines: యంగ్‌ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?
    స్టార్‌ హీరోల పక్కన యంగ్ హీరోయిన్లు నటించడం మాములే. కానీ స్టార్‌ హీరోయిన్‌ల పక్కన ఓ యంగ్ హీరో నటించడం అరుదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే జరుగుతోంది. స్టార్‌ హీరోయిన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, అనుష్క శెట్టి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌లు యంగ్‌ హీరోలతో జతకడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. వరుస ఫ్లాపులు, చేతిలో సినిమాలు లేకపోవడంతో వీరంతా చిన్న హీరోలతోనూ రొమాన్స్‌ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.  సమంత అగ్రకథానాయిక అయిన సమంత.. డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా చేయబోతోంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో చేస్తున్న ‘ఖుషీ’ సినిమా పూర్తికాగనే ఆ చిత్రం పట్టాలెక్కుతుందని టాక్.  సమంత - సిద్ధూ జంటగా చేయబోయే సినిమాకు మహిళా డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఏజ్‌ గ్యాప్‌ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ కథను సిద్ధూ సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది.  ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమాలోనూ సమంతకు జంటగా యంగ్‌ హీరో దేవ్‌ మోహన్‌ నటిేంచాడు. సినిమా ఫ్లాప్‌ అయినా వీరి మధ్య కెమెస్ట్రీ బాగానే కుదిరినట్లు వార్తలు వచ్చాయి.  అనుష్క శెట్టి అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి సినిమాల ద్వారా హీరోయిన్‌ అనుష్క శెట్టి ఎంతో క్రేజ్ సంపాదించింది. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఈ భామ కుడా యంగ్‌ హీరోతో జతకట్టేందుకు సిద్ధమైంది.  ‘మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలో యువ హీరో నవీన్‌ పొలిశెట్టికి జోడీగా నటించింది. పి. మహేష్‌ బాబు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాట్రైలర్‌ ఆకట్టుకుంది.  వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న అనుష్క కెరీర్‌ను 2015లో వచ్చిన జీరో సైజ్‌ సినిమా దెబ్బతీసింది. సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన అనుష్క తిరిగి తగ్గలేకపోయింది. దీంతో ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.  రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మహేష్‌, రవితేజ, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌, తారక్‌, రామ్‌పోతినేని వంటి స్టార్ హీరోలతో జత కట్టిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరిగా ఓ వెలుగు వెలుగింది.  గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో రకుల్‌ సింగ్‌ తర్జనభర్జన అవుతోంది. దీంతో యంగ్‌ హీరోలతోనూ సినిమా చేసేందుకు వెనకాడటం లేదు. 2021లో వచ్చిన కొండ పొలం సినిమాలో యంగ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌ సరసన రకూల్ నటించింది.  కొండ పొలం సినిమాలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించి రకూల్‌ మెప్పించింది. తెలివిగల గిరిజన యువతి పాత్రలో ఒదిగిపోయింది. వైష్ణవ్‌ - రకూల్‌ జంటకు కూడా మంచి మార్కులే పడ్డాయి.  తమన్నా మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో కుర్ర హీరోలతో సైతం నటించేందుకు ఈ బ్యూటీ సై అంటోంది.  2021లో వచ్చిన ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా తమన్నా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడినప్పటికీ వారి జంటకు మాత్రం మంచి పేరే వచ్చింది. కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది.  కన్నడలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రానికి రీమేక్‌గా ‘గుర్తుందా శీతాకాలం ’ సినిమా తీశారు. డైరెక్టర్‌ నాగశేఖర్‌ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 
    మే 24 , 2023
    SAMANTHA: సమంత కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ పడిందా? ఖుషీ సినిమానే చివరిదా?
    SAMANTHA: సమంత కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ పడిందా? ఖుషీ సినిమానే చివరిదా?
    సమంత…. నిన్న మెున్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్. కానీ, ప్రస్తుతం సీన్ మారిపోయింది. ఒకప్పుడు చేతినిండా ఆఫర్లతో బిజీగా గడిపిన సామ్‌కు… ఇప్పుడు తెలుగులో విజయ్ దేవరకొండ సినిమా మినహా మరొకటి లేదు. బాక్సాఫీస్‌ వద్ద ఆమె చిత్రాలు పెద్దగా ఆడకపోవటంతో పాటు అటు మయోసైటిస్ సమస్యలు కూడా వేధిస్తుండటంతో సామ్ కెరీర్‌ దాదాపు ముగిసిందనీ సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.  ఇండస్ట్రీలో ఇక కష్టమే సమంతకు గత కొన్నేళ్లుగా చెప్పుకోదగిన హిట్‌ పడటం లేదు. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు ఎంచుకున్నప్పటికీ ప్రేక్షకులు ఆదరించట్లేదు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన యశోద అంతంతమాత్రంగానే నడిచింది. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన శాకుంతలం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచిందనే చెప్పాలి. సినిమాకు పెద్దగా కలెక్షన్లు రావటం లేదు. ఓపెనింగ్స్‌ కూడా చాలా తక్కువ వచ్చాయని చెబుతున్నారు. అంటే సామ్ ఫ్యాన్‌ బేస్‌ కూడా చాలా తగ్గిపోయింది. దీంతో ఆమె కెరీర్‌కు దాదాపు ఎండ్‌ కార్డ్‌ పడిందని అంతా భావిస్తున్నారు. సామ్‌ ప్రాజెక్టులు సామ్ చేతిలో ప్రస్తుతం కేవలం రెండు సినిమాలే ఉన్నాయి. విజయ దేవరకొండ సరసన ఖుషీ అనే చిత్రంలో చేస్తోంది. లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో మజిలీ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో సిటాడెల్‌ రీమేక్ ప్రాజెక్టులోనూ నటిస్తోంది సామ్. ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈ రెండు మినహా ఆమె మరో చిత్రానికి కమిట్ అవ్వలేదు. దర్శకులెవ్వరూ చిత్రాలు చేయటానికి ఆసక్తి చూపడం లేదని టాక్ వినిపిస్తోంది.  మయోసైటిస్‌ సమస్యలు మయోసైటిస్ వ్యాధి సామ్‌ను తీవ్రంగా వేధిస్తోంది. యశోద సినిమా సమయంలో వ్యాధి సోకటంతో ఇబ్బంది పడుతుంది. సెలైన్ బాటిల్‌పైనే డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు కొద్దిగా కోలుకుని శాకుంతలం సినిమా చేసినప్పటికీ వివిధ సమస్యల కారణంగా ప్రచార కార్యక్రమాలు, షూటింగ్స్‌లో ఎక్కువగా పాల్గొనలేకపోయింది సమంత. కొన్ని సందర్భాల్లో ఈ సూచనలు స్పష్టంగా కనిపించాయి. మరి, ఇలాంటి సమయంలో నిర్మాతలు డబ్బులు పెట్టి షూటింగ్స్‌ ఆలస్యం చేసుకోవటం ఎందుకని భావిస్తున్నట్లు సమాచారం. అందం తగ్గిపోయిందా? సమంత లుక్‌ కూడా చాలా మారిపోయింది. ఒకప్పుడు ఉన్నంత అందంగా ఇప్పుడు ఆమె కనిపించట్లేదు. ఈ విషయం గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే జరిగింది. సామ్ అందం తగ్గిపోయిందని.. ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందని అందరూ అంటున్నారు. ఫ్యాన్స్‌ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ… చాలామంది విమర్శలు చేస్తున్నారు.  సమంత పనైపోయింది నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రేంజ్ పడిపోయిందని.. అందుకే వచ్చిన సినిమాలు చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆఫర్ల కోసం డ్రామాలు ఆడుతుందని ఓ అడుగు ముందుకేశారు. యశోద రిలీజ్‌ సమయంలో ఏడవటం.. శాకుంతలం అప్పుడు ఆరోగ్యం బాలేదని డ్రామాలు ఆడుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  ఏం మాయ చేశావే నాగ చైతన్య సరసన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది సమంత. జెస్సీగా అందరి మనసులు దోచి అభిమానులను సంపాదించింది. మెుదటి సినిమానే హిట్ కావటంతో పాటు అందం, అభినయం ఉండటంతో వరుస ఆఫర్లతో దూసుకుపోయింది ఈ హీరోయిన్. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేసి చేతి నిండా సినిమాలతో వెలుగు వెలిగింది.  ఫ్యాన్‌ బేస్‌ సమంత ఫ్యాన్ బేస్‌ కూడా చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు కేవలం ఆమె కోసం మాత్రమే సినిమాకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆమె నుంచి చిత్రం వస్తున్నా పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఒకప్పుడున్నంత ఫాలోయింగ్‌ సామ్‌కు ఇప్పుడు లేదనే చెప్పాలి. ఇన్ని ఒడుదొడుకుల నడుమ సమంత ఇండస్ట్రీలో ఎలా నెట్టుకు వస్తుందో చూడాలి. 
    ఏప్రిల్ 17 , 2023
    Shaakuntalam Review: శకుంతలగా సమంత ఓకే.. మరి డైరెక్టర్‌గా గుణశేఖర్‌ సక్సెస్ అయ్యాడా?
    Shaakuntalam Review: శకుంతలగా సమంత ఓకే.. మరి డైరెక్టర్‌గా గుణశేఖర్‌ సక్సెస్ అయ్యాడా?
    నటినటులు: సమంత, దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్‌రాజ్‌, గౌతమి, అల్లు అర్హ దర్శకత్వం: గుణశేఖర్‌ సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ: శేఖర్‌ వి. జోసెఫ్‌ నిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత గతేడాది ‘యశోద’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన కలెక్షన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో సామ్‌ ఇవాళ (ఏప్రిల్‌ 14) ‘శాంకుతలం’ సినిమా ద్వారా ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. సమంత తొలిసారి పౌరాణిక పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తోడు గుణశేఖర్‌ డైరెక్టర్‌ కావడం, దిల్‌ నిర్మాతగా ఉండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. దీనికి తగ్గట్టుగానే పాటలు, ప్రచార చిత్రాలు, ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉండటంతో శాకుంతలంపై ఆసక్తి రెట్టింపు అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? సమంత, గుణశేఖర్‌లకు హిట్‌ తెచ్చి పెట్టిందా? వంటివి రివ్యూలో చూద్దాం. కథ: విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడు ఆదేశంతో మేనక (మధుబాల) భూమిపైకి వస్తుంది. తన అందంతో తపస్సును నాశనం చేయడమే కాకుండా విశ్వామిత్రుడికి శారీరకంగా దగ్గరై పాపకు జన్మనిస్తుంది. ఆ పాపకు కణ్వ మహర్షి (సచిన్‌ ఖడేకర్) శాంకుతల(సమంత)గా పేరు పెట్టి కన్నబిడ్డలా పెంచుతాడు. శాంకుతల పెద్దయ్యాక ఓ రోజు కణ్వ అశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు(దేవ్ మోహన్) ఆమె అందచందాలు చూసి  ఇష్టపడతాడు. గాంధర్వ వివాహంతో ఒక్కటవుతారు. త్వరలోనే తిరిగి వచ్చి రాజ్యానికి తీసుకెళ్తానని దుష్యంతుడు హామి ఇస్తాడు. ఈ క్రమంలో సమంత గర్భవతి అవుతుంది. ఈ నేపథ్యంలో దుష్యంతుడు, సమంత ఎలా కలిశారు? వారు విడిపోవడానికి దుర్వాస మహాముని (మోహన్‌బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? అనేది అసలు కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే: శకుంతల పాత్రకు సమంత పూర్తిగా న్యాయం చేసింది. భావోద్వేగ సన్నివేశాలను బాగా పండించింది. అయితే ఈ పాత్రకు సమంత సొంతగా డబ్బింగ్‌ చెప్పుకోవడం మైనస్‌ అని చెప్పొచ్చు. పౌరాణిక పాత్ర కావడంతో సమంత వాయిస్‌ అతికినట్లు అనిపించదు. భరతుడి పాత్రలో అల్లు అర్హ ఆకట్టుకుంది. ఎంతో చలాకీగా నటించింది. ముద్దుముద్దు మాటలతో అలరించింది. అటు దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ నటన ఆకట్టుకుంటుంది. సమంత, దేవ్‌ మోహన్‌ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక దుర్వాస మహర్షి పాత్రకు మోహన్‌బాబు నిండుదనం తీసుకొచ్చారు. ఆయన తెరపై కనిపించేంది కొద్దిసేపే అయినప్పటికీ తన నటనతో అందరినీ కట్టిపడేస్తాడు. సచిన్‌, అనన్య, మధుబాల, జిషు సేన్‌ గుప్తా వంటి నటులు తెరపై చాలా మందే ఉన్నప్పటికీ నటనపరంగా వారికి పెద్దగా అవకాశం దక్కలేదు.  టెక్నికల్‌గా: శాకుంతలం సినిమాను తీయడంలో డైరెక్టర్‌ గుణశేఖర్‌ తడబడినట్లు కనిపిస్తోంది. అందరికీ తెలిసిన ప్రేమ కావ్యాన్ని ఓ దృశ్య కావ్యంలా ఆవిష్కరించడంలో డైరెక్టర్ విఫలమయ్యారు. గ్రాఫిక్స్‌ విజువల్స్ విషయంలో మరింత శ్రద్ధ వాహించి ఉంటే బాగుండేది. దుష్యంతుడు రాజుగా కంటే కమర్షియల్ సినిమాల్లో హీరోగానే ఎక్కువగా అనిపిస్తాడు. పైగా శాంకుతలం కథ దుష్యంతుడి కోణంలో చెప్పుకుంటూపోవడం ప్రేక్షుకులకు అంతగా రుచించలేదు. అయితే మణిశర్మ సంగీతం ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఆయన అందించిన నేపథ్య సంగీతం, పాటలే సినిమాలో హైలెట్‌ అని చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.  ప్లస్‌ పాయింట్స్ సమంత నటనమణిశర్మ సంగీతం విరామ, పతాక సన్నివేశాలు మైనస్ పాయింట్స్‌  నెమ్మదిగా సాగే కథనంగ్రాఫిక్స్‌సాగదీత సన్నివేశాలు రేటింగ్‌: 2/5
    ఏప్రిల్ 15 , 2023
    ఈ వారం( April 14,15) ఓటీటీ-థియేటర్లలో అలరించే సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు ఏంటో తెలుసా?
    ఈ వారం( April 14,15) ఓటీటీ-థియేటర్లలో అలరించే సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు ఏంటో తెలుసా?
    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్ రిలీజ్ మూవీస్ శాకుంతలం గుణశేఖర్‌ దర్శకత్వంలో అగ్రకథానాయిక సమంత చేసిన శాకుంతలం చిత్రం ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 14) థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. శాకుంతలం మూవీ కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమాలో దేవ్‌ మోహన్‌, అల్లు అర్హ, ప్రకాష్‌ రాజ్‌, మోహన్‌ బాబు, గౌతమి కీలక పాత్రల్లో నటించారు. రుద్రుడు  రాఘవ లారెన్స్‌ హీరోగా తెరకెక్కిన ‘రుద్రుడు’ చిత్రం కూడా ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. కతరేశణ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియా భవాని కథానాయికగా చేసింది. ఈ సినిమాను అదే రోజున తమిళ్‌లోనూ రుద్రన్‌ పేరుతో రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఇవాళ (ఏప్రిల్‌ 10) హైదరాబాద్‌లోని  పార్క్‌ హయాత్‌ హోటల్‌లో ఘనంగా నిర్వహించనున్నారు.  విడుతలై పార్ట్‌-1 తమిళ హాస్యనటుడు సూరి హీరోగా రూపొందిన ‘విడుతలై పార్ట్‌-1’ చిత్రం శనివారం (ఏప్రిల్‌ 15) తెలుగులో రిలీజ్‌ కానుంది. మార్చి 31న తమిళంలో రిలీజ్‌ అయిన ఈ చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో తెలుగులోనూ ‘విడుదల’గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి ఓ ప్రధానపాత్రలో కనిపిస్తారు. నక్సలైట్లకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.  చిప్‌కలి ఈ వారం బాలీవుడ్‌ నుంచి చిప్‌కలి సినిమా ఒక్కటే రిలీజ్‌ అవుతోంది. క్రైం థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14 (శుక్రవారం)న రిలీజ్ చేస్తున్నారు. కౌషిక్ కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటులు యాష్‌పాల్‌ శర్మ, యోగేష్‌ భరద్వాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఓటీటీ సినిమాలు దాస్‌ కా ధమ్కీ తెలుగులో ఇటీవలే విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న దాస్‌ కా ధమ్కీ చిత్రం ఈ వారం ఓటీటీలో విడుదల కానుంది. ఆహాలో ఏప్రిల్‌ 14న స్ట్రీమింగ్‌ కానుంది. విశ్వక్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. విశ్వక్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాకు నిలిచింది. కాగా, ఈ సినిమాకు ఓటీటీ ప్రియులను కచ్చితంగా అలరిస్తుందని చెప్పొచ్చు.  అసలు రవిబాబు దర్శకత్వంలో రూపొందిన అసలు చిత్రం గురువారం( ఏప్రిల్‌ 13)న ఓటీటీలో సందడి చేయనుంది. ఈటీవీ విన్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. నటి పూర్ణ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందింది.  ఓ కల చక్కటి ప్రేమ కథాంశంతో రూపొందిన ఓ కల చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు దీపక్ కొలిపాక దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలైన ఓ కల ట్రైలర్‌ ఆకట్టుకుంది.  ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు…  TitleCategoryLanguagePlatformRelease DateRennervations. Premiereseries EnglishDisney+ HotstarApril 12Ticket to Paradise (2022)MovieEnglishAmazon PrimeApril 11Alter Ego (2022)MovieenglishAmazon PrimeApril 12Big Bad Wolves (2014) movieenglishAmazon PrimeApril 12Herbie Hancock: Possibilities (2006)movieenglishAmazon PrimeApril 12Kill Me Three Times (2015)MovieEnglishAmazon PrimeApril 12Life Itself (2014)MovieEnglishAmazon PrimeApril 12The Quest of Alain Ducasse (2018) MovieEnglishAmazon PrimeApril 12Whose Streets?DocumentEnglishAmazon PrimeApril 12Greek Salad (2023)SeriesEnglishAmazon PrimeApril 14CoComelon: Season 8SeriesEnglishNetflixApril 10All American: Homecoming Season 2SeriesEnglishNetflixApril 11Leanne Morgan: I’m Every WomanSeriesEnglishNetflixApril 11American ManhuntSeriesEnglishNetflixApril 11Operation: NationMovieEnglishNetflixApril 11The Boss BabySeriesEnglishNetflixApril 12PhenomenaSeriesEnglishNetflixApril 12QueenmakerDramaEnglishNetflixApril 14The Best Man HolidayMovieEnglishNetflixApril 16
    ఏప్రిల్ 10 , 2023
    పీరియాడిక్ రోల్స్‌లో తళుక్కుమన్న 10 మంది  అందాల తారలు
    పీరియాడిక్ రోల్స్‌లో తళుక్కుమన్న 10 మంది  అందాల తారలు
    సాధారణంగా హీరోయిన్స్‌ అంటే గ్లామర్‌ పాత్రలు, నటనకు ఆస్కారం లేని క్యారెక్టర్‌లే గుర్తుకు వస్తాయి. కథానాయికలు కేవలం కొన్ని సీన్లకు, పాటలకు మాత్రమే పరిమితమైన చిత్రాలు ఇటీవల కాలంలో  కోకొల్లలుగా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు హీరోయిన్లు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పిరియాడిక్‌ పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదిస్తున్నారు. ఓ వైపు కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే నటనకు ఆస్కారముండే పాత్రలూ చకా చకా చేసేస్తున్నారు. అలాంటి ఓ 10 మంది తారలను ఇప్పుడు చూద్దాం. సమంత: సమంత ఇప్పటివరకు అందం, అభినయం కలగలిపిన పాత్రల్లో చేశారు. కొన్ని సినిమాల్లో ప్రేయసి క్యారెక్టర్‌లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇందుకు భిన్నంగా తన లేటెస్ట్‌ మూవీ ‘శాకుంతలం’లో సమంత కనిపించబోతున్నారు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలము’ నాటకం ఆధారంగా డైరెక్టర్‌ గుణశేఖర్‌ ఈ సినిమాను రూపొందించారు. ఇందులో సామ్‌ శాకుంతల పాత్ర పోషిస్తున్నారు. సమంత ఇలా పౌరణిక పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. ఈ సినిమా తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా నిలిచిపోతుందని సమంత అంటున్నారు. ఏప్రిల్‌ 14న శాంకుతులం రిలీజ్‌ కానుండగా ఫ్యాన్స్‌ను సమంత ఏమేరకు మెప్పిస్తారో చూడాలి.  కృతి సనన్‌:  ప్రభాస్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఆదిపురుష్‌’ను రామాయణం కథ ఆధారంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా ‘కృతి సనన్‌’ సీత పాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రల్లో మాత్రమే నటించిన కృతి.. సీత క్యారెక్టర్‌ చేస్తుండటం ఆసక్తిరేపుతోంది. సీత పాత్రను పోషించి అందరి మన్ననలు పొందడమంటే సాధారణ విషయం కాదు. సీత మృధుస్వభావి, మిత భాషి. అంతేగాక సీత పాత్ర ఎంతో సుకుమారమైంది. ఎన్నో సవాళ్లతో కూడిన సీత పాత్రను కృతి చేస్తుండటం గొప్ప విషయమనే చెప్పాలి. తన నటనతో ప్రేక్షకులను కృతి మెప్పించినట్లయితే ఆమె క్రేజ్‌ అమాంతం పెరుగుతుందనడంలో సందేహం లేదు.  అలియా భట్‌: బాలీవుడ్‌ బ్యూటీ అలియభట్‌ వరుస విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. తాజాగా ఆమె హిస్టారికల్‌ మూవీలో నటిస్తున్నారు. మెుగల్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ‘టక్త్‌’ చిత్రంలో బాను భేగంగా ఆలియా నటిస్తున్నారు. ఈ పాత్రలో ఆలియా నటన సినిమాకే హైలెట్‌గా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. నటన పరంగా ఆలియా మరో మెట్టు ఎక్కుతుందని చెబుతున్నారు. కరణ్‌ జోహర్‌ నిర్మిస్తున్న టక్త్‌ చిత్రంలో త్వరలోనే విడుదల కానుంది.  త్రిష: నీ మనసు నాకు తెలుసు చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన త్రిష.. వర్షం మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. త్రిష తన కెరీర్‌లో ఎక్కువగా ప్రేమికురాలి పాత్రల్లో కనిపించి మెప్పించారు. కానీ ‘పొన్నియన్‌ సెల్వన్‌’ పార్ట్‌ 1, 2 చిత్రాల ద్వారా త్రిష తన రూటు మార్చారు. చోళుల రాజకుమారి కుందువై పాత్రలో కనిపించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. యువరాణిలా ఎంతో హుందాగా నటించడంతో పాటు రాజనీతిజ్ఞత కలిగిన మహిళగా త్రిష తన హావభావాలను చక్కగా పలికించారు. ఐశ్వర్యరాయ్‌: బాలీవుడ్ అగ్రకథానాయిక ఐశ్వర్యరాయ్‌ గ్లామర్‌ పాత్రలతోపాటు.. నటనకు ఆస్కారమున్న హిస్టారికల్‌ పాత్రల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదివరకే హృతిక్‌తో ‘జోదా అక్భర్‌’ లో నటించిన ఐశ్వర్య.. మహారాణి ‘జోధా బాయి’ పాత్రతో మెప్పించారు. తాజాగా పొన్నియన్‌ సెల్వన్‌లో సైతం ఐశ్వర్య ‘నందిని’ పాత్రలో కనిపించారు. చోళ సామ్రాజ్యపు కోశాధికారి అయిన పెరియా పళవెట్టారియార్‌కు భార్యగా నటించారు.  అనుష్క: టాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో ఒకరైన అనుష్క విభిన్న పాత్రలకు పెట్టింది పేరు. అరుంధతి చిత్రంతో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామ బాహుబలి సినిమాలో దేవసేన పాత్రతో ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. కాకతీయ సామ్రాజ్యపు వీర వనిత రుద్రమదేవి పాత్రను సైతం అలవోకగా చేసిన అనుష్క ఈ తరం హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రుద్రమదేవి చిత్రంలో అనుష్క నటన హైలెట్‌ అనే చెప్పాలి. ధైర్యవంతురాలైన రాణి పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయారు.  కంగనా రనౌత్‌: బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ మూస ధోరణి పాత్రలంటే ఆమాడ దూరం పాటిస్తారు. సవాలు విసిరే పాత్రల్లో నటించడమంటే ఆసక్తి చూపించే కంగనా ఝాన్సీ లక్ష్మీ బాయి పాత్రలో నటించి అదరగొట్టారు. 2019లో వచ్చిన ‘మణికర్ణిక’ చిత్రంలో కంగనా ఝాన్సీ లక్ష్మీ బాయిగా కనిపించారు. పోరాట సన్నివేశాల్లో అద్భుతంగా నటించి క్రిటిక్స్‌ సైతం మెచ్చుకునే స్థాయికి ఎదిగారు. ఈ చిత్రంలో ఆమె నటనకు జాతీయ అవార్డు వచ్చింది. 67వ జాతీయ సినీ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందించారు.  కాజల్‌: టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా కాజల్‌ ఎదిగారు. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం కాజల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో కాజల్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా యువరాణి మిత్రవింద పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. తొలిసారి పిరియాడిక్‌ పాత్ర పోషించినప్పటికీ నటనలో కాజల్ ఎంతో పరివర్తన కనబరిచారు. చరణ్‌తో పోటీపడి మరీ నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మగధీర చిత్రంతో కాజల్‌ కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. రిచా పనాయ్: అల్లరి నరేష్‌ హీరోగా తెరకెక్కిన యుముడికి మెుగుడు చిత్రంలో యుముడి కూతురిగా ‘రిచా పనాయ్‌’ నటించారు. ఈ చిత్రం ద్వారానే తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రిచా.. యమజ పాత్రలో నటించి అలరించారు. ‘మెుగుడా.. మెుగుడా’ అని అల్లరి నరేష్‌ను పిలుస్తూ థియేటర్లలో నవ్వులు పూయించారు. ఈ చిత్రంతో రిచా మంచి గుర్తింపునే సంపాదించినప్పటికీ ఆమెకు సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. ఆ తర్వాత చందమామ కథలు, రక్షక భటుడు వంటి చిత్రాల్లో నటించినా కూడా ఆమె పెద్దగా ఆకట్టులేకపోయింది. అవకాశాలు లేకపోవడంతో రిచా నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. రీమా సేన్: 2010లో టాలీవుడ్‌లో విడుదలైన యుగానికి ఒక్కడు చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. పాండ్య రాజుల కథాంశంతో రూపొందిన ఈ సినిమాతో హీరో కార్తీకి చెరి సమానమైన క్రేజ్‌ను రీమాసేన్‌ సంపాదించారు. అనితా పాండియన్‌ పాత్రలో ఆమె అద్భుత నటన కనబరిచారు. ఓవైపు మోడ్రన్‌ పాత్రలో అదరగొట్టిన ఆమె పాండ్యుల దేవతగా నటించి మెప్పించారు.
    మార్చి 29 , 2023
    <strong>Samantha Ruth Prabhu: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సమంత? ముఖం మారడంపై అనుమానాలు!</strong>
    Samantha Ruth Prabhu: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సమంత? ముఖం మారడంపై అనుమానాలు!
    టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత&nbsp; నటిస్తున్న స్పై యాక్షన్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో వరుణ్‌ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మరో కీలక పాత్రలో సామ్ యాక్ట్ చేస్తోంది.&nbsp; ఈ సిరీస్‌ను&nbsp; ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ఫర్జీ’ వంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్‌ అండ్‌ డీకే ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సిటాడెల్‌’కి ఇది అధికారిక రీమేక్. ఇందులో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో నటించిన నటీనటులు ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదలైన ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ ట్రైలర్‌ ఫుల్ యాక్షన్ ప్యాక్‌తో అలరించింది. ముఖ్యంగా సమంత చేసిన యాక్షన్ సీన్స్ అలరించాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ట్రైలర్‌ సిరీస్‌పై భారీ అంచనాలు పెంచింది.ఇప్పుడు విడుదలైన రెండో ట్రైలర్ కూడా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. (Samantha)యాక్షన్‌ సన్నివేశాలతో కడుపు కట్టేసే విధంగా ట్రైలర్‌లో కనిపించిన సమంత ఆకట్టుకుంది. తన స్టంట్స్‌, యాక్షన్ సీక్వెన్స్‌లు చూసి ఆడియెన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అభిమానులు అయితే, సమంత నటనను ప్రియాంక చోప్రా వెర్షన్ కంటే మెరుగ్గా ఉందని ప్రశంసిస్తున్నారు. ఈ సిరీస్‌లో సమంత “హనీ”గా, వరుణ్‌ ధావన్ “బన్నీ”గా అదరగొట్టారని అభిమానులు చెబుతున్నారు. సామ్ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే యాక్టింగ్‌తో సరికొత్తగా కనిపించింది. ఇప్పటివరకు సమంత చేసిన ఇతర యాక్షన్ రోల్స్ కంటే మరింత బలంగా, పవర్‌ఫుల్‌గా ఆమెను ఈ సిరీస్‌లో చూపిస్తున్నారు. &nbsp;అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో సమంత ఫేస్‌పై నెటిజన్లు చర్చిస్తున్నారు. మళ్లీ ఆమె ముఖానికి ఏమైంది అని కామెంట్ చేస్తున్నారు.(Samantha Ruth Prabhu) సామ్ ముఖం, హీరోయిన్ సంయుక్త మీనన్‌లాగా మారిపోయిందంటూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ ఫొటో చూస్తే నిజంగానే ఆమె ఐస్ గతంలో కంటే కాస్త భిన్నంగా ఉన్నాయి.&nbsp; ఇంకొంత మంది సమంత తన అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వాదిస్తున్నారు. మమోసైటిస్ వ్యాధి భారిన పడ్డ తర్వాత ముఖంలో వచ్చిన మార్పులను సరి చేసుకునేందుకు ఆమె పలుమార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కామెంట్ చేస్తున్నారు. అయితే ఇంకొంత మంది మాత్రం మయోసైటిస్ వ్యాధి నయం కోసం సామ్ చాలా పవర్‌ఫుల్ ట్యాబ్లెట్ వాడిందని.. వాటి సైడ్ ఎఫెక్ట్స్‌ ఆమె ముఖంపై ప్రభావం చూపించిందని చెబుతున్నారు. రెండేళ్ల క్రితం సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ వ్యాధితో సామ్ ఏడాదికిపైగా పోరాడింది.&nbsp; ఆ సమయంలో సమంత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లింది. చికిత్స తీసుకుంటూ స్నేహితులతో కలిసి దేశ విదేశీ టూర్లు చేసి ఆ బాధ నుంచి కొంత రిలీఫ్ పొందింది.&nbsp; మయోసైటిస్ వ్యాధి వల్ల శరీరం, ముఖంపై వస్తున్న మార్పులు గమనించిన సామ్.. పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని భావించింది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా కూడా ఉంది. విజయ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా ద్వారా తిరిగి రీఎంట్రీ ఇచ్చింది.&nbsp; ఆ తర్వాత శాకుంతలం సినిమాలోనూ నటించింది. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణించకపోవడంతో ప్రస్తుతం సామ్.. సిటాడెల్‌ సిరీస్‌పైనే ఆశలు పెట్టుకుంది.
    అక్టోబర్ 30 , 2024
    <strong>EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌!&nbsp;</strong>
    EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌!&nbsp;
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రతీ చిత్రం సూపర్‌ హిట్‌ కావాలన్న రూల్‌ ఏమి లేదు. కొన్నింటికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మరికొన్నింటికి అసలే దక్కదు. దీనిని బట్టే ఆయా సినిమాలను హిట్స్‌, ఫ్లాప్స్‌గా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే ఫ్లాప్‌ అయిన చిత్రాలు కూడా కొన్ని సందర్భాల్లో ఓటీటీలో మంచి ఆదరణ పొందడం ఈ రోజుల్లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చిత్రాలకు పరమ డిజాస్టర్లుగా పేరుంది. అప్పట్లో ఆ సినిమాల ప్రదర్శన సందర్భంగా ఆడియన్స్‌ మూవీ మధ్యలో నుంచే బయటకు వచ్చేశారని టాక్ ఉంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటిపై నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.&nbsp; [toc] ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ (Extra Ordinary Man) నితీన్‌ (Nithiin) - శ్రీలీల (Sreeleela) జంటగా చేసిన రీసెంట్‌ చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్‌’. ఈ సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. సినిమా ఇంటర్వెల్‌ వరకూ కూడా చూడలేకపోయామని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అసలు విలన్‌ చెప్పినట్లు హీరో ఆడటం ఏంటని కొందరు ప్రేక్షకులు మండిపడ్డారు. నితీన్‌ కేరీర్‌లో ఎక్కువగా ట్రోల్స్‌ గురైన చిత్రంగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ నిలిచింది.&nbsp; శాకుంతలం (Shakunthalam) సమంత (Samantha) లీడ్‌ రోల్‌లో నటించిన ‘శాకుంతలం’ చిత్రంపై రిలీజ్‌కు ముందు భారీగానే అంచనాలు ఉండేవి. సమంత చేసిన తొలి పౌరాణిక సినిమా కావడం, ప్రచార చిత్రాలు కూడా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేలా ఉండటంతో తెలుగు ఆడియన్స్‌ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత సీన్ అంతా రివర్స్ అయ్యింది. శకుంతల పాత్రకు సమంత పెద్దగా నప్పలేదని, డబ్బింగ్‌ కూడా సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్‌ వరకూ సినిమాను చూడటమే కష్టంగా అనిపించిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్స్ చేశారు.&nbsp;&nbsp; రాధే శ్యామ్‌ (Radhe Shyam) ప్రభాస్‌ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన ‘రాధే శ్యామ్‌’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో ప్రభాస్ వింటేజ్‌ లుక్‌తో స్మార్ట్‌గా ఉండటంతో ఫ్యాన్స్‌లో పెద్ద ఎత్తున అంచనాలు మెుదలయ్యాయి. కానీ రిలీజయ్యాక ప్రభాస్‌ను హస్తముద్రికా నిపుణుడిగా చూసి షాకయ్యారు. జ్యోతిష్యాన్ని ప్రేమను ముడి పెట్టిన విధానం చాలా మంది ఫ్యాన్స్‌కు ఎక్కలేదు. సినిమా మెుదలైన గంటకే విసుగు వచ్చిందని, ఇంటర్వెల్‌కు బయటకు వచ్చేశామని అప్పట్లో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వచ్చాయి. వరల్డ్ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover) విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా... రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లే హీరోయిన్లుగా చేసిన చిత్రం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. హీరో విజయ్‌పై ఈ సినిమా నుంచే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఈ సినిమాలో రొమాన్స్‌ తప్ప కథ లేదని ట్రోల్స్‌ వచ్చాయి. విజయ్‌ పో** చిత్రాలు చేసుకుంటే బెటర్‌ అని కొందరు నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు బయటకు వెళ్లిపోదామా? అని ఎదురు చూసినట్లు పోస్టులు పెట్టారు.&nbsp; బ్రహ్మోత్సవం (Brahmotsavam) సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) కెరీర్‌లోనే పీడకల లాంటి చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం మహేష్‌కు మాయని మచ్చలా మిగిలిపోయిందని ఫ్యాన్స్ అంటుంటారు. కాజల్‌ (Kajal Aggarwal), సమంత (Samantha), ప్రణీత (Pranitha) వంటి కథానాయికలతో పాటు సత్యరాజ్‌, జయసుధ, రేవతి, తులసి, రావు రమేష్‌, షియాజీ షిండే, తనికెళ్ల భరణి వంటి హేమాహేమీలు ఉన్నా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా తొలి రోజు తొలి ఆట నుంచే సినిమాపై ట్రోల్స్‌ మెుదలయ్యాయి. సినిమా చూడకుండా మధ్యలోనే వచ్చేశామంటూ స్వయంగా మహేష్‌ ఫ్యాన్సే కామెంట్స్ చేశారు. సన్‌ ఆఫ్‌ ఇండియా (Son Of India) దిగ్గజ నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu) హీరోగా చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమాపై విడుదలకు ముందు నుంచే నెగిటివ్‌ మెుదలైంది. ఈ సినిమా తొలి రోజు మెుదటి ఆట కోసం ఓ థియేటర్‌లో రెండే టికెట్లు బుక్‌ కావడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఆ టికెట్లు బుక్‌ చేసుకుంది మంచు ఫ్యామిలీనే అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. చూసిన వారు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్‌ రివ్యూ ఇవ్వడంతో కొద్ది రోజులకే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసివేశారు. మోహన్‌ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ నిలిచింది. వినయ విధేయ రామా (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన వినయ విధేయ రామాపై తొలి ఆట నుంచి నెగిటివ్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఈ చిత్రం పరమ రాడ్‌ అంటూ చూసిన వారు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోదామా అని అనిపించిందని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి బిహార్‌కు వెళ్లడం.. హీరో విలన్‌ అనుచరుల తలకాయలు నరికితే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.&nbsp; లైగర్‌ (Liger) విజయ్ దేవరకొండ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన మరో చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. తొలి గంటకే సినిమాపై ఆసక్తి సన్నగిల్లిందని అప్పట్లో నెట్టింట పోస్టులు వెల్లువెత్తాయి. అంత బాడీ పెట్టుకొని విజయ్‌ పాత్రకు నత్తి పెట్టడం ఏంటన్న విమర్శలు వచ్చాయి. శక్తి (Shakthi) తెలుగులో డిజాస్టర్‌ అని అనగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘శక్తి’. ఈ మూవీ దర్శకుడు మేహర్‌ రమేష్‌ను ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికీ ఓ ఆట ఆడుకుంటున్నారు. శక్తి మెుదటి ఆట చూసి తారక్‌ కథను ఎలా ఓకే చేశారని ప్రశ్నించారు. ఒక గంట కూడా సినిమాను వీక్షించలేకపోయామని చెప్పారు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో తారక్ లుక్‌ అసలు సూట్‌ కాలేదన్న విమర్శలు సైతం వచ్చాయి. ఇదే డైరెక్టర్‌ వెంకటేష్‌తో ‘షాడో’ తీయగా ఆ మూవీ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. మేహర్‌ రమేష్‌&nbsp; రీసెంట్‌ చిత్రం ‘భోళా శంకర్‌’ సమయంలోనూ శక్తి సినిమా ప్రస్తావనకు రావడం గమనార్హం.&nbsp; సలీం (Saleem) మంచు విష్ణు (Manchu Vishnu), ఇలియానా (Ileana D'Cruz) జంటగా చేసిన ‘సలీం’.. తెలుగులో వచ్చిన బారీ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం మంచు విష్ణు భారీగా వెయిట్‌ తగ్గాడు. నాలుగైదు సినిమా కథలను మిక్సీలో వేసి సలీం చిత్రాన్ని రూపొందించారని అప్పట్లో విమర్శలు సైతం వచ్చాయి. తొలి అర్ధభాగానికే సినిమా బోర్‌ కొట్టేసిందని కామెంట్స్ వినిపించాయి.&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    <strong>Anthahpuram</strong><strong>: </strong><strong>సౌందర్యను రీప్లేస్‌ చేయగల సత్తా ఆ ఇద్దరి సొంతం.. డైరెక్టర్‌ కృష్ణవంశీ క్రేజీ కామెంట్స్‌!&nbsp;</strong>
    Anthahpuram: సౌందర్యను రీప్లేస్‌ చేయగల సత్తా ఆ ఇద్దరి సొంతం.. డైరెక్టర్‌ కృష్ణవంశీ క్రేజీ కామెంట్స్‌!&nbsp;
    క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణ వంశీ సినిమా అంటే ఒకప్పుడు థియేటర్లలో పండగ వాతావరణం ఉండేది. కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను తీశారు. ముఖ్యంగా అంతఃపురం చిత్రం ఆయన కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. ఇందులో దివంగత నటి సౌందర్య ఫీమేల్‌ లీడ్‌గా నటించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనపై సర్వత్ర ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కృష్ణ వంశీ ఎక్స్‌ వేదికగా తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో అంతఃపురం సినిమాలో సౌందర్యను ఏ హీరోయిన్‌తో రీప్లెస్‌ చేయగలదని ఓ నెటిజన్‌ ప్రశ్నించారు. ఇందుకు కృష్ణ వంశీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; కృష్ణవంశీ ఏమన్నారంటే? సౌందర్య, సాయికుమాార్‌, ప్రకాష్‌ రాజ్‌, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన అంతఃపురం చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఇందులో క్రూరమైన తన మామ బారి నుంచి బిడ్డను కాపాడుకునే తల్లిగా సౌందర్య ఉత్తమ నటన కనబరిచింది. అయితే ఇప్పటి హీరోయిన్స్‌లో ‘అంతఃపురం’ ఎవరికి సెట్‌ అవుతుందని డైరెక్టర్ కృష్ణ వంశీని ఎక్స్‌ వేదికగా ఓ నెటిజన్‌ అడిగాడు. అందుకు ఆయన సమాధానం ఇస్తూ 'సౌందర్య స్థానంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నాను. కానీ ప్రస్తుతం హీరోయిన్స్‌ ఎంతో టాలెంటెడ్‌. తమ నటనతో మెస్మరైజ్‌ చేస్తున్నారు. వారిని గౌరవిస్తున్నా' అని అన్నారు. దానికి ఆ నెటిజన్‌ బదులిస్తూ నివేతా థామస్‌, శ్రద్ధా కపూర్‌లలో ఎవరు సెట్‌ అవుతారు? అని మళ్లీ ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణవంశీ రిప్లే ఇస్తూ ప్రస్తుత హీరోయిన్స్‌లో సమంత, సాయిపల్లవి సౌందర్య పాత్రకు సెట్‌ కావొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సమంత, సాయిపల్లవి ఫ్యాన్స్‌ ఇందుకు సంబంధించిన పోస్ట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.&nbsp; సౌందర్యను రీప్లేస్‌ చేయగలరా! స్టార్‌ హీరోయిన్ సమంతకు గ్లామర్‌ బ్యూటీగానే కాకుండా మంచి నటిగానూ గుర్తింపు ఉంది. తన ఫస్ట్ ఫిల్మ్‌ 'ఏమాయ చేశావే'తో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఆ తర్వాత ‘మనం’, ‘అ ఆ’, ‘యూటర్న్‌’, ‘జాను’, ‘యశోద’, ‘శాకుంతలం’, ‘బేబీ’ వంటి చిత్రాలతో నటిగా తనను నిరూపించుకుంది. అటు సాయిపల్లవి యాక్టింగ్‌ స్కిల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమమ్‌, ఫిదా, లవ్‌ స్టోరీ, శ్యామ్‌ సింగరాయ్‌, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాలతో నటనలో తనకు సాటి ఎవరూ లేరని చాటి చెప్పింది. అటువంటి ఈ స్టార్ హీరోయిన్స్‌ అంతఃపురంలో సౌందర్య పాత్రకు కచ్చితంగా న్యాయం చేయగలరి నెటిజన్లు భావిస్తున్నారు.&nbsp; డైరెక్టర్‌గా రెండు నేషనల్ అవార్డ్స్‌ డైరెక్టర్ కృష్ణ వంశీ అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. సినిమాల్లోకి వచ్చాక కృష్ణ వంశీ అని పిలుస్తారు.రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 1995లో JD చక్రవర్తి నటించిన చిత్రం ‘గులాబీ’ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ‘అంత:పురం’, ‘చంద్రలేఖ’, ‘నిన్నే పెళ్లాడుతా’ మురారి, ఖడ్గం, శ్రీ ఆంజనేయం, రాఖీ, చందమామ, మహాత్మ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించారు. రీసెంట్‌గా ‘రంగమార్తండ’ అనే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సినిమాను తీశారు. కృష్ణ వంశీ తన కెరీర్‌లో ఉత్తమ దర్శకుడిగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, నాలుగు నంది అవార్డులు అందుకున్నాడు.
    సెప్టెంబర్ 17 , 2024
    <strong>69th Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో ‘బేబీ’ మూవీ హవా.. రేసులోని తెలుగు చిత్రాలు ఇవే!</strong>
    69th Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో ‘బేబీ’ మూవీ హవా.. రేసులోని తెలుగు చిత్రాలు ఇవే!
    ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ 2024లో విజేతల ఎంపిక ప్రక్రియ మెుదలైంది. దక్షిణాది సినీ పరిశ్రమలైన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ సౌత్‌ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితాను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. అవార్డుల ప్రధానోత్సవం ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాలని త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా గణనీయ సంఖ్యలో టాలీవుడ్‌ చిత్రాలు, నటీనటులు నామినేషన్స్‌ బరిలో నిలిచారు. ఇంతకీ ఆ తెలుగు చిత్రాలు ఏవి? ఏ విభాగాల్లో ఏ తెలుగు నటులు పోటీలో నిలిచారు? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; నాని.. డబుల్‌ ధమాకా! 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 నామినేషన్స్‌లో హీరో నాని (Nani) డబుల్ ధమాకాగా నిలిచారు. ఉత్తమ నటుడు కేటగిరిలో రెండు సినిమాలకు (దసరా, హాయ్‌ నాన్న) నాని నామినేట్‌ అయ్యాడు. ఇదే కేటగిరిలో టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి (వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ (భగవంత్‌ కేసరి), ధనుష్‌ (సర్), నవీన్‌ పోలిశెట్టి (మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌ రాజ్‌ (రంగమార్తాండ), ఆనంద్‌ దేవరకొండ (బేబీ) నిలిచారు. అటు ఉత్తమ దర్శకుడు విభాగంలోనూ హాయ్‌ నాన్న, దసరా చిత్రాలు ఉండటం విశేషం. ఉత్తమ నటి విభాగంలో కీర్తి సురేష్‌ (దసరా) ఫిల్మ్‌ఫేర్ అవార్డు రేసులో నిలిచింది.&nbsp; బేబీ చిత్రం హవా! 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ నామినేషన్స్‌లో బేబీ చిత్రం సత్తా చాటింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది విభాగాల్లో నామినేషన్స్‌లో నిలిచింది. ఉత్తమ నటుడు (ఆనంద్‌ దేవరకొండ) కేటగిరితో పాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్‌ (సాయి రాజేష్‌), ఉత్తమ నటి (వైష్ణవి చైతన్య), ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్‌ (విజయ్‌ బుల్గానిన్‌), ఉత్తమ గేయ రచయిత (ఆనంత శ్రీరామ్‌), ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (శ్రీరామ చంద్ర, పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌) విభాగాల్లో బేబి చిత్రం బరిలో నిలిచింది. దీంతో ఫిల్మ్‌ఫేర్‌లో ‘బేబీ’ చిత్రానికి భారీగానే అవార్డ్స్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.&nbsp; https://twitter.com/MassMovieMakers/status/1813445764934431164 ఫిల్మ్‌ అవార్డ్స్‌ కోసం వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే... ఉత్తమ చిత్రం బేబీబలగందసరాహాయ్‌ నాన్నమిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టిసామజవరగమనసలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌ ఉత్తమ నటుడు ఆనంద్‌ దేవరకొండ (బేబీ)బాలకృష్ణ (భగవంత్‌ కేసరి)చిరంజీవి (వాల్తేర్‌ వీరయ్య)ధనుష్‌ (సర్‌)నాని (దసరా)నాని (హాయ్‌ నాన్న)నవీన్‌ పొలిశెట్టి (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ) ఉత్తమ నటి: అనుష్క (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)కీర్తిసురేశ్‌ (దసరా)మృణాళ్‌ ఠాకూర్‌ (హాయ్‌ నాన్న)సమంత (శాకుంతలం)వైష్ణవీ చైతన్య (బేబీ) ఉత్తమ దర్శకుడు: అనిల్‌ రావిపూడి (భగవంత్‌ కేసరి)కార్తిక్‌ దండు (విరూపాక్ష)ప్రశాంత్‌నీల్‌ (సలార్‌:పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)సాయి రాజేశ్‌ (బేబీ)శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న)శ్రీకాంత్‌ ఓదెల (దసరా)వేణు యెల్దండ (బలగం) ఉత్తమ సహాయ నటుడు: బ్రహ్మానందం (రంగ మార్తండ)దీక్షిత్‌శెట్టి (దసరా)కోట జయరాం (బలగం)నరేశ్‌ (సామజవరగమన)రవితేజ (వాల్తేర్‌ వీరయ్య)విష్ణు ఓఐ (కీడా కోలా) ఉత్తమ సహాయ నటి: రమ్యకృష్ణ (రంగమార్తండ)రోహిణి మోల్లెటి (రైటర్‌ పద్మభూషణ్‌)రుపా లక్ష్మీ (బలగం)శ్యామల (విరూపాక్ష)శ్రీలీల (భగవంత్‌ కేసరి)శ్రియారెడ్డి (సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)శ్వేతరెడ్డి (మంత్‌ ఆఫ్‌ మధు) ఉత్తమ గాయని: చిన్మయి శ్రీపాద (ఆరాధ్య – ఖుషి)చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ – హాయ్‌ పాప)దీ (చమ్కీల అంగీలేసి -దసరా)మంగ్లీ (ఊరు పల్లెటూరు-బలగం)శక్తిశ్రీ గోపాలన్‌ (అమ్మాడి -హాయ్‌ నాన్న)శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు -సర్‌) ఉత్తమ గాయకుడు: అనురాగ్‌ కుల్‌కర్ణి (సమయ-హాయ్‌ నాన్న)హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ (ఖుషి -టైటిల్‌ సాంగ్‌)పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ (ప్రేమిస్తున్నా -బేబీ)రామ్‌ మిర్యాల (పొట్టిపిల్ల -బలగం)సిధ్‌ శ్రీరామ్‌ (ఆరాధ్య – ఖుషి)శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ) ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌: బేబీ (విజయ్‌ బుల్గానిన్‌)బలగం (భీమ్స్‌ సిసిరిలియో)దసరా (సంతోష్‌ నారాయణ్‌)హాయ్‌ నాన్న (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)ఖుషి (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)వాల్తేర్‌ వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్) ఉత్తమ సాహిత్యం: అనంత శ్రీరామ్‌ (గాజు బొమ్మ -హాయ్‌ నాన్న)అనంత శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)కాసర్ల శ్యామ్‌ (చమ్కీల అంగీలేసి -దసరా)కాసర్ల శ్యామ్‌ (ఊరు పల్లెటూరు -బలగం)పి.రఘు (లింగి లింగి లింగ్డి -కోట బొమ్మాళి పి.ఎస్‌)
    జూలై 17 , 2024
    Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
    Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
    ఈ ఏడాది టాలీవుడ్‌ చాలా మంది హీరోయిన్లకు కలిసొచ్చింది. వారు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ప్రత్యేకించి కొందరు మాత్రం ఈ ఏడాది తమ తల రాతలను మార్చుకున్నారు. తమకంటూ స్టార్‌ స్టేటస్‌ను సంపాదించుకున్నారు. అంతేగాక 2023 ఏడాదిలో తమకు తిరుగులేదని వారు నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు సాధించిన ఘనతలు ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.&nbsp; శ్రీలీల ఈ ఏడాది చాలా బాగా పాపులర్ అయిన హీరోయిన్ల జాబితాలో శ్రీలీల (Sreeleela) ప్రథమ స్థానంలో ఉంటుంది. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. రవితేజ పక్కన ‘ధమాకా’లో చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా ఆ తర్వాత వరుసగా రామ్‌తో ‘స్కంద’, బాలయ్య కూతురిగా 'భగవంత్‌ కేసరి', పంజా వైష్ణవ్‌ తేజ్‌తో 'ఆదికేశవ', నితీన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' వంటి చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం మహేష్‌, విజయ్‌ దేవరకొండ, పవన్‌ కల్యాణ్‌ సరసన శ్రీలీల నటిస్తోంది. కీర్తి సురేష్‌ యంగ్‌ బ్యూటీ కీర్తి సురేష్‌ (Keerthy Suresh)కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. నాని సరసన ఆమె నటించిన 'దసరా' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విజయవంతమైంది. రూ.100 కోట్లకు పైగా ఇందులో తన నటనకు గానూ కీర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు ‘భోళాశంకర్‌’ సినిమాలో చిరంజీవి సోదరిగా నటించి మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ పక్కన ‘మామన్నన్‌’ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.&nbsp; రష్మిక మందన్న ఈ ఏడాది రష్మిక మందన్న(Rashmika Mandanna) తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంది. విజయ్‌తో ‘వారసుడు’ చిత్రంలో నటించిన ఈ భామ.. బాలీవుడ్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘మిస్టర్‌ మజ్నూ’ చేసింది. ఇక రణ్‌బీర్‌ కపూర్‌కు జోడీగా ఆమె నటించిన ‘యానిమల్‌’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. సమంత ఈ ఏడాది సమంత (Samantha)కు మిశ్రమ స్పందన ఎదురైంది. ఆమె నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోగా విజయ్‌ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ మూవీ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు తమిళం, ఇంగ్లీష్‌లో తెరకెక్కుతున్న బైలింగ్విల్‌ ఫిల్మ్‌ ‘చెన్నై స్టోరీస్‌’లోనూ నటించే అవకాశాన్ని సమంత దక్కించుకుంది.&nbsp; సంయుక్త మీనన్‌ ఈ ఏడాది సంయుక్త మీనన్‌ (Samyuktha menon)కు మంచి విజయాలను అందించింది. ధనుష్‌ సరసన ఆమె నటించిన 'సార్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ సరసన ఆమె చేసిన 'విరూపాక్ష' చిత్రం ఘన విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో సంయుక్త తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.&nbsp; అనుష్క శెట్టి గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన స్టార్‌ నటి అనుష్క (Anushka Shetty) ఈ ఏడాది మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'మిస్ శెట్టి మిష్టర్‌ పోలిశెట్టి' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా అనుష్కకు గట్టి కమ్‌బ్యాక్‌ లభించిందని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. శ్రుతి హాసన్‌ టాలీవుడ్‌లో సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న శ్రుతి హాసన్‌ (Shruti Haasan)కు ఈ ఏడాది కలిసొచ్చిందని చెప్పవచ్చు. చిరంజీవి, బాలకృష్ణలతో ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలై మంచి హిట్‌ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా నానితో ‘హాయ్‌ నాన్న’ చిత్రంలోనూ ఓ పాటలో స్టెప్పులేసి అదరగొట్టింది. అలాగే ప్రభాస్‌ సరసన 'సలార్‌' సినిమాలోనూ శ్రుతి హాసన్‌ నటించింది.&nbsp;
    డిసెంబర్ 19 , 2023
    Tollywood Controversies 2023: ఈ ఏడాది టాలీవుడ్‌ను కుదిపేసిన వివాదాల గురించి తెలుసా?
    Tollywood Controversies 2023: ఈ ఏడాది టాలీవుడ్‌ను కుదిపేసిన వివాదాల గురించి తెలుసా?
    ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా పలు వివాదాలు టాలీవుడ్‌ను షేక్‌ చేశాయి. తారలు, సినీ ప్రముఖుల మధ్య తలెత్తిన ఈ వివాదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మాటాల తూటాలను పేల్చేలా చేశాయి. ఇంతకీ ఆ కాంట్రవర్సీస్‌ ఏంటి? అందుకు కారణమైన నటీనటులు ఎవరు? తదితర అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది ప్రారంభంలో 'వీరసింహారెడ్డి' చిత్ర ప్రమోషన్‌ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'అక్కినేని తొక్కినేని' అంటూ నోరు జారారు. ఇది అక్కినేని అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. నాగచైతన్య, అఖిల్‌ సైతం ఈ అంశంపై ట్విటర్‌ (X) వేదికగా స్పందించారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుపై జూ.ఎన్టీఆర్‌ స్పందించకపోవడం పైనా బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఐ డోంట్‌ కేర్‌’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు కూడా వివాదం అయ్యాయి. సమంత vs చిట్టిబాబు టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత (Samantha) మయోసిటిస్‌ (Myositis) వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే 'శాకుంతలం' సినిమా విడుదల సందర్భంగా దీనిపై నిర్మాత చిట్టిబాబు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సామ్‌కు వచ్చిన వ్యాధి సాధారణమైనదేదని వ్యాఖ్యానించారు. సినిమా విడుదలకు ముందు ఆమె సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. అయితే దీనిపై సమంత పరోక్షంగా స్పందించింది. కొందరికి చెవుల్లో జుట్టు పెరగడానికి కారణం టెస్టోస్టిరాన్‌ అని చిట్టిబాబును ఉద్దేశిస్తూ కౌంటర్ ఇచ్చింది.&nbsp; విష్ణు vs మనోజ్‌ మంచు బ్రదర్స్ అయిన విష్ణు, మనోజ్ మధ్య గొడవలు ఈ ఏడాది తారా స్థాయికి చేరినట్లు కనిపించాయి. మనోజ్ పెళ్ళికి కూడా విష్ణు రాలేదు. వివాహం జరిగిన కొద్దిరోజులకు విష్ణు తన మనుషుల మీద దాడి చేస్తున్నాడని మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అది క్షణాల్లో వైరల్ అయ్యింది. వెంటనే ఆ వీడియో డిలీట్ చేశాడు. అప్పటి వరకు వచ్చిన పుకార్లకు ఆ వీడియో బలం చేకూర్చింది. అయితే రియాలిటీ షో కోసం చేసిన ఫ్రాంక్ అని విష్ణు నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ జనాలు నమ్మలేదు. కారణం విష్ణు ఇప్పటివరకూ ఎలాంటి రియాలిటీ షో చేయకపోవడమే. https://twitter.com/TeluguBitlu/status/1639265933175713800 పవన్‌ vs అంబటి పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో వచ్చిన చిత్రం 'బ్రో' (Bro). ఈ సినిమాలో 30 ఇయర్స్ పృథ్వీ ఓ పాత్ర పోషించాడు. ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైంది. ఆ పాత్రను తనను ఉద్దేశించే పెట్టారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ప్రెస్‌మీట్‌లు పెట్టి మరి పవన్‌పై విమర్శలు గుప్పించారు. అయితే ఆ పాత్ర ఎవరినీ ఉద్దేశించి పెట్టలేదని చిత్ర నిర్మాత, నటుడు పృథ్వీ స్పష్టం చేశారు.&nbsp;&nbsp; విజయ్‌ దేవరకొండ vs అనసూయ అనసూయ భరద్వాజ్- విజయ్ దేవరకొండల వివాదం కూడా ఈ ఏడాది టాలీవుడ్‌ని షేక్ చేసింది. ‘ఖుషి’ చిత్ర పోస్టర్‌పై 'ది విజయ్ దేవరకొండ' అని రాయడాన్ని ఆమె పరోక్షంగా ఎగతాళి చేశారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. విజయ్‌ని ఉద్దేశపూర్వకంగానే తాను టార్గెట్ చేశానని అనసూయ స్పష్టం చేసింది. విజయ్ వద్ద పనిచేసే వ్యక్తి డబ్బులు ఇచ్చి నాపై దుష్ప్రచారం చేయించాడని ఆమె ఆరోపించింది. విజయ్ ప్రమేయం లేకుండా ఇది జరగదని చెప్పింది. అందుకే తాను విజయ్‌పై విమర్శలు చేసినట్లు వివరించింది.&nbsp; దిల్‌రాజు vs సి.కళ్యాణ్‌ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు దిల్ రాజు - సి.కళ్యాణ్ మధ్య మాటల యుద్దానికి దారి తీశాయి. చిన్న నిర్మాతలను తొక్కేస్తూ వాళ్ళను దిల్ రాజు ఎదగనీయడం లేదని సి. కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు దిల్ రాజుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సి కళ్యాణ్ వీడియో బైట్ సైతం విడుదల చేశారు. ఇది అప్పట్లో చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. కాగా ఈ ఎన్నికల్లో దిల్‌రాజు ప్యానెల్ విజయం సాధించింది.&nbsp; బలగం స్టోరీ వివాదం ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్ర కథ తనదేనంటూ జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఆరోపణలు చేశారు. వేణు తన స్టోరీని కాపీ చేశాడని ఆరోపించారు. అయితే వేణు ఈ కామెంట్స్ ఖండించారు. తన సొంత అనుభవాలతో రాసుకున్న కథ అని సమాధానం ఇచ్చారు. కోర్టులో తేల్చుకోమని సవాలు సైతం విసిరారు.&nbsp; పుష్ప నటుడు అరెస్టు పుష్ప సినిమాలో అల్లుఅర్జున్‌ ఫ్రెండ్‌గా నటించి పాపులర్‌ అయిన జగదీష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసే ఓ యువతి ఆత్మహత్య కేసులో అతడ్ని డిసెంబర్‌ 6న పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను తన దారికి తెచ్చుకోవడం కోసం ఫొటోలతో బెదిరించినట్లు పోలీసుల వద్ద జగదీష్ అంగీకరించాడు. ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని తాను ఊహించలేదని చెప్పుకొచ్చాడు.&nbsp;
    డిసెంబర్ 18 , 2023
    HBD SAMANTHA: ఆ ఒక్కటి&nbsp; సమంతకే చెల్లింది..&nbsp; బోల్డ్ అయినా, ఎమోషనల్ అయినా సామ్ దిగనంత వరకే!
    HBD SAMANTHA: ఆ ఒక్కటి&nbsp; సమంతకే చెల్లింది..&nbsp; బోల్డ్ అయినా, ఎమోషనల్ అయినా సామ్ దిగనంత వరకే!
    చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌ సమంతది ప్రత్యేకమైన ప్రయాణం. ఏమాయ చేశావే చిత్రంతో జెస్సీగా పరిచయమై అందరి మనసుల్ని కొళ్లగొట్టింది సామ్. 2010లో కెరీర్ ప్రారంభించి దాదాపు 13 సంవత్సరాలుగా టాప్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సమంత ఇప్పటివరకు చేసిన సినిమాల్లో డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ వర్తమాన హీరోయిన్స్‌ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెకున్నంత డైహార్ట్ ఫ్యాన్స్‌ హీరోయిన్స్‌లో మరెవరికి లేరని చెప్పవచ్చు. ఏప్రిల్ 28న ఆమె పుట్టిన రోజు సందర్భంగా&nbsp; ఇప్పటి వరకు సమంత చేసిన విభిన్న పాత్రలు ఓసారి గుర్తు చేసుకుందాం… రంగస్థలం రామ లక్ష్మి రామ్‌చరణ్‌, సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలంలో అచ్చమైన పల్లెటూరు అమ్మాయి పాత్రలో జీవించేసింది సమంత. ఆంధ్రా స్లాంగ్‌ను అచ్చుగుద్దినట్లు దింపేసింది. ఇందులో సామ్‌ చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి.&nbsp; మజిలీ శ్రావణి నాగచైతన్య, సమంత నటించిన చిత్రం మజిలీ. ఇందులో భర్త ఏం చేసినా భార్య వెనకేసుకు వస్తూ ప్రేమించే పాత్రలో సామ్‌ నటన నెక్స్ట్‌ లెవల్‌. క్లైమాక్స్‌లో సమంత పర్‌ఫార్మెన్స్‌ కన్నీళ్లు పెట్టిస్తుంది. అంతలా క్యారెక్టర్‌ను ముందుకు తీసుకెళ్లింది.  ఓ బేబీ సమంత హీరోయిన్‌గా వచ్చిన లేడి ఓరియెంటెడ్‌ ఇది. ఓ ముసలి వ్యక్తి కొన్ని కారణాల వల్ల యవ్వనంలోకి వెళ్తుంది. కానీ, ఆ పాత్రను చేసిన వ్యక్తిలానే నటించడం చాలా కష్టమైన పని. సీనియర్ యాక్టర్‌లా హావాభావాలు పండిస్తూ… చూడటానికి 25 ఏళ్లున్నా వయసు మాత్రం 60 ఏళ్లు అన్నట్లుగా కనిపించే పాత్రలో చించేసింది ఈ బ్యూటీ. యశోద అద్దె గర్భం కాన్సెప్ట్‌లో వచ్చిన యాక్షన్ సినిమా. ఇందులో సమంత పోరాట సన్నివేశాల్లో అదరగొట్టింది. తన కోసం చిక్కుల్లో పడిన చెల్లెల్ని కాపాడేందుకు ఆమె వేసే ఎత్తుగడలు, విలన్లతో పోరాటం వంటివి ఆకట్టుకున్నాయంటే ఆమెనే కారణం. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలే వచ్చాయి. శకుంతల కాళిదాసు రచించి అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ సినిమాను పూర్తి చేసింది. ఇందులో తన పాత్ర కోసం చాలానే కష్టపడింది. శకుంతల పాత్రలో జీవించింది. గ్లామర్‌ పరంగా ఏమాత్రం తగ్గకుండా నటించింది. బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చినప్పటికీ సామ్ చేసిన డిఫరెంట్ రోల్స్‌లో ఇదొకటని చెప్పవచ్చు.&nbsp; పుష్ప ది రైజ్‌ పుష్ప చిత్రంలో ఐటెమ్‌ సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ అంటూ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఫ్యామిలీ మెన్ రాజీ మనోజ్ బాజ్‌పేయ్‌ లీడ్‌ రోల్‌లో వచ్చిన ఫ్యామిలీ మెన్ సిరీస్‌ పార్ట్‌ 2లో సమంత విభిన్నమైన క్యారెక్టర్‌లో కనిపించింది. శ్రీలంక రెబల్ గ్రూప్‌ అంటే నక్సలైట్‌ పాత్రలో మెరిసింది సుందరి. డీ గ్లామరస్‌ రోల్‌లో కనిపించడమే కాకుండా బోల్డ్‌ సీన్‌లో నటించి షాకిచ్చింది. సిటాడెల్ హాలీవుడ్‌ యాక్షన్ థ్రిల్లర్‌ సిటాడెల్‌ సిరీస్‌ను బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌, సమంత లీడ్‌ రోల్స్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా పోషించిన యాక్షన్‌ రోల్‌ను సామ్ చేయనుంది. ఇప్పటికే షూటింగ్‌ కోసం చిత్రబృందంతో జత కట్టింది చెన్నై సుందరి.&nbsp;
    ఏప్రిల్ 27 , 2023
    Tollywood Next Generation : తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన టాప్ హీరోల వారసులు… ఆ కళలు నిజమయ్యేనా?
    Tollywood Next Generation : తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన టాప్ హీరోల వారసులు… ఆ కళలు నిజమయ్యేనా?
    హీరోల కుమారులు, కుమార్తెలు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టడం సర్వ సాధారణం. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది అలా వచ్చిన వారే. వారసులుగా వచ్చినప్పటికీ వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు తర్వాత జనరేషన్‌ కూడా సిద్ధంగా ఉంది. టాప్ హీరోల పిల్లలు చిన్నప్పుడే ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. భవిష్యత్‌ కోసం ఇప్పుడే బాటలు వేసుకుంటున్నారు వాళ్లేవరో ఓసారి లుక్కేద్దాం. గౌతమ్ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ అచ్చుగుద్దినట్లుగా కృష్ణలా ఉంటాడు. మహేశ్ తర్వాత సినిమాల్లోకి కచ్చితంగా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఓ సినిమాలో ఇప్పటికే నటించాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంలో మహేశ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేశాడు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.&nbsp; మహాధన్‌ చిత్ర పరిశ్రమలో ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఎదిగిన రవితేజ కుమారుడే మహాధన్. రాజా ది గ్రేట్ చిత్రంలో అంధుడి&nbsp; పాత్రలో కనిపించింది కొద్ది నిమిషాలే అయినా ఇరగ్గొట్టాడు. మహాధన్‌కి నటన మీద ఆసక్తి ఉంది. ఈ విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూల్లో రవితేజ కన్ఫర్మ్ చేశాడు. “ సినీ పరిశ్రమలో ఉన్నాం కనుక కచ్చితంగా ఆసక్తి ఉంటుంది. లేదని చెప్పలేను. కానీ, ఎప్పుడూ వస్తాడనేది వాడి ఇష్టం” అన్నారు. దీనిబట్టి మహాధన్‌ హీరోగా వస్తాడనటంలో ఎలాంటి సదేహం లేదు. అకీరా నందన్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లకు జన్మించిన కుమారుడు అకీరా నందన్. అకీరా సినిమాల్లోకి రావాలని పవర్ స్టార్ ఫ్యాన్స్‌ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. నటనవైపు కాకుండా ఇండస్ట్రీలోనే మరోరంగంపై దృష్టిసారించాడు అకీరా. ఇటీవల రైటర్స్ బ్లాక్‌ అనే షార్ట్‌ ఫిల్మ్‌కు సంగీతం అందించాడు. ఈ విషయాన్ని అడివి శేష్‌ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.&nbsp; సితార మహేశ్ కుమార్తె సితార కూడా ఎంట్రీ ఇచ్చేసింది. సర్కారు వారి పాట చిత్రంలో ఓ సాంగ్‌లో తళుక్కున మెరిసింది సితార పాప. సినిమారంగంపై మక్కువని చెప్పకనే చెప్పింది. భవిష్యత్‌లో సితార నుంచి కూడా ఓ సినిమా ఉంటుందని ఆశించవచ్చు. అల్లు అర్హ అల్లు అర్జున్ కుమార్తె అర్హ బాలనటి అవాతరమెత్తింది. సామాజిక మాధ్యమాల్లో తండ్రితో కలిసి సందడి చేసే ఈ చిచ్చర పిడుగు.. గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమాలో ఓ క్యారెక్టర్‌లో మెరిసింది. ప్రిన్స్‌ భరత పాత్రలో నటించింది అర్హ. ఇందులో ముద్దుగా చెప్పిన డైలాగులకు మంచి మార్కులు పడ్డాయి. భవిష్యత్‌లో సినీరంగంలో రాణిస్తుందనడానికి ఈ ఒక్క సినిమా చాలు.&nbsp; అరియానా, వివియానా మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా కూడా తమ ప్రతిభను చాటారు. విష్ణు నటించిన జిన్నా సినిమాలో పాటను ఆలపించారు ఇద్దరు. దీనిపై మంచు కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.&nbsp; అయాన్, అభిరామ్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్, జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభిరామ్ ఇప్పటివరకైతే ఆరంగేట్రం చేయలేదు. కానీ, రెండు కుటుంబాల నుంచి వారసులుగా ఉన్న కారణంగా భవిష్యత్‌లో కచ్చితంగా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉంది.
    ఏప్రిల్ 19 , 2023
    VIRAL PIC: రెస్టారెంట్‌లో హీరోయిన్‌తో డేటింగ్‌లో నాగచైతన్య!
    VIRAL PIC: రెస్టారెంట్‌లో హీరోయిన్‌తో డేటింగ్‌లో నాగచైతన్య!
    అక్కినేని నట వారసుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మధ్య రిలేషన్‌ ఉందంటూ చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. శోభిత హైదరాబాద్‌ వచ్చినపుడు పూర్తిగా చైతూతోనే ఉందని అతడి కొత్త ఇంటికి కూడా వెళ్లిందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు వీరు కలిసి దిగిన ఫోటో ఒకటి గతంలో వైరల్‌ అయింది. తాజాగా మరో ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినట్లుగా తెలుస్తున్న ఈ ఫోటోతో ఇప్పుడు వీరు డేటింగ్‌లో ఉన్న వార్తలు నిజమేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వీరు డిన్నర్‌ డేట్‌కే వెళ్లారంటూ చర్చించుకుంటున్నారు. సమంత అభిమానులు నాగచైతన్యను ట్రోల్‌ చేయడం కూడా మొదలు పెట్టారు. సామ్‌-చై విడిపోయినప్పుడు అందరూ సమంతనే నిందించారని ఇప్పుడు గురుడి అసలు రూపం భయటపడుతోందంటూ విమర్శిస్తున్నారు. గతంలో దిగిన ఓ ఫొటో లండన్‌లో దిగినట్లు సమాచారం.&nbsp; ఈ ఇద్దరి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా వీళ్లు ఇలా కలిసి ఫొటోలకు పోజులిచ్చారని సినిమా ఇండస్ట్రీలోని కొందరు చెప్పారు. కానీ చైతూ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికే యూకే వెళ్లినట్లు అప్పట్లో చర్చ జరిగింది.&nbsp;&nbsp; అయితే చైతూ అభిమానులు అప్పట్లో ఈ వార్తలను బలంగా తిప్పికొట్టారు. సమంత కావాలనే ఈ పుకార్లు సృష్టిస్తోందంటూ ఎదురుదాడి చేశారు. సోషల్‌ మీడియా వేదికగా చైతూ-సమంత ఫ్యాన్స్‌ మధ్య పెద్ద వార్‌ జరిగిందని చెప్పొచ్చు. శోభిత ధూళిపాళ్ల కూడా మిడిల్‌ ఫింగర్‌ చూపించి ఈ వార్తల పట్ల ఘాటుగా స్పందించారు.&nbsp; https://twitter.com/PrasadAGVR/status/1540383278166814720?s=20 ప్రస్తుతం నాగచైతన్య ‘కస్టడీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌&nbsp; కూడా ఆసక్తికరంగా ఉంది.&nbsp; మరోవైపు సమంత ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతోంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా..ఈ మైథాలాజికల్‌ డ్రామా 14 ఏప్రిల్‌న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
    మార్చి 29 , 2023
    Sanya Malhotra: దంగల్‌ బ్యూటీ సన్యా మల్హోత్రా హాట్‌ షో.. ఓ లుక్కేయండి!
    Sanya Malhotra: దంగల్‌ బ్యూటీ సన్యా మల్హోత్రా హాట్‌ షో.. ఓ లుక్కేయండి!
    బాలీవుడ్‌ బ్యూటీ సన్యా మల్హోత్రా (Sanya Malhotra) మరోమారు స్టన్నింగ్‌ సెల్ఫీతో సోషల్‌ మీడియాను తన వైపునకు తిప్పుకుంది.&nbsp; కర్లీ హెయిర్‌తో ఎద అందాలను చూపిస్తూ నెటిజన్లకు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. టైట్‌ ఫిట్‌ జాకెట్‌తో చూపు తిప్పుకోనికుండా చేసింది.&nbsp; ఫిబ్రవరి 24, 1992లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించిన సన్యా.. ఢిల్లీలో డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.&nbsp; డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ అనే రియాలిటీ షోలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. తన అద్భుతమైన నృత్యంతో న్యాయ నిర్ణేతల ప్రశంసలు అందుకుంది.&nbsp; ఆ తర్వాత ఢిల్లీ నుంచి ముంబయికి మకాం మార్చిన ఈ బ్యూటీ (Sanya Malhotra).. సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్‌కు వెళ్లింది.&nbsp; ఆడిషన్స్‌లో పాల్గొన్న ప్రతీసారి సన్యా (Sanya Malhotra)కు నిరాశే ఎదురైంది. కానీ, పట్టుదలతో అమీర్‌ఖాన్‌ (Amir Khan) పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.&nbsp; అమీర్‌ ఖాన్ బ్లాక్‌ బస్టర్‌ మూవీ 'దంగల్‌' (Dangal)తో అరంగేట్రం చేసి నటిగా అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; ఆ తర్వాత సన్యాకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ (Secret Superstar), పటాకా (Pataakha), బదాయి హో (Badhaai Ho) సినిమాల్లో నటించింది.&nbsp; ఫొటోగ్రాఫ్‌ (Photograph), శకుంతలా దేవి (Shakuntala Devi), లూడో (Ludo), పగ్‌లైట్‌ (Pagglait), మీనాక్షి సుందరేశ్వర్‌ (Meenakshi Sundareshwar) చిత్రాల్లోనూ నటించి బాలీవుడ్‌లో స్థిరపడింది.&nbsp; తెలుగు చిత్రం హిట్‌కు రీమేక్‌గా వచ్చిన బాలీవుడ్‌ మూవీలో ఈ భామ (Sanya Malhotra) హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది.&nbsp; రాజ్‌కుమార్‌ రావు హీరోగా చేసిన ఈ మూవీకి శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. ‘HIT: The First Case’ పేరుతో ఈ సినిమా విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; షారుక్‌ ఖాన్‌ నటించిన 'జవాన్‌' (Jawan) సినిమాలోనూ సన్యా మల్హోత్రా (Sanya Malhotra) నటించింది. డా. ఈరమ్‌ పాత్రలో నటించి అందర్నీ ఆకట్టుకుంది.&nbsp; హిందీలో బయోగ్రఫికల్‌ వార్‌ డ్రామాగా వచ్చిన 'శామ్ బహదూర్‌' మూవీలోనూ ఈ భామ చేసింది. ఇందులో చక్కటి నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.&nbsp; ప్రస్తుతం సన్యా చేతిలో రెండు బాలీవుడ్‌ చిత్రాలు ఉన్నాయి. ఒకటి 'బేబీ జాన్' కాగా రెండోదానికి ఇంకా టైటిల్‌ ఫిక్స్ చేయలేదు.&nbsp; ఓవైపు వరుస సినిమాల్లో నటిస్తూనే ఈ బ్యూటీ (Sanya Malhotra) సోషల్‌ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తోంది. తన హాట్‌ ఫొటోలతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది.&nbsp;
    ఫిబ్రవరి 13 , 2024

    @2021 KTree