• TFIDB EN
  • షాడో
    UATelugu2h 40m
    ఈ సినిమా కథ తన తండ్రిని చంపిన మాఫియా డాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు రాజారామ్.. షాడో లా మారి ప్రతీకారం కోసం పోరాడతాడు. యాక్షన్ సన్నివేశాలతో సినిమా సాగుతుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    వెంకటేష్
    రాజారామ్ / షాడో / చంటి
    శ్రీకాంత్
    ACP ప్రతాప్
    తాప్సీ పన్ను
    మధుబాల
    నైరా బెనర్జీ
    రాజారాం సోదరి
    ఆదిత్య పంచోలి
    నానా భాయ్
    నాసర్
    బాబా
    సాయాజీ షిండే
    చైతన్య ప్రసాద్ సీపీ
    నాగేంద్ర బాబు
    రాజారాం తండ్రి
    గీతా కాదంబీ
    రాజారాం తల్లి
    సుమన్
    ఇంటెలిజెన్స్ అధికారి
    ఎంఎస్ నారాయణ
    డా.దొంగ శ్రీనివాసరావు అకా సైకో శ్రీను
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    పీటర్ పెంచలయ్య
    జయ ప్రకాష్ రెడ్డి
    హోంమంత్రి నాయుడు
    చలపతి రావు
    DG
    నాగినీడు
    పోలీస్ కమీషనర్
    సుబ్బరాజు
    హోంమంత్రి కొడుకు
    రావు రమేష్
    శివాజీ
    రాహుల్ దేవ్
    జీవా
    సుప్రీత్
    రాబర్ట్
    సత్య ప్రకాష్
    గురు భాయ్
    సూర్య
    వెన్నెల కిషోర్
    నానా భాయ్ హెంచ్మాన్
    కృష్ణ భగవాన్
    కమ్మారెడ్డి కాపురాజు
    ప్రభాస్ శ్రీను
    షాడో స్నేహితుడు మరియు భాగస్వామి
    సత్యం రాజేష్
    సైకో శ్రీను విద్యార్థి
    తాగుబోతు రమేష్
    తాగుబోతు
    నల్ల వేణుతాగుబోతు
    హర్ష వర్ధన్
    మధుబాల సోదరుడు
    ముక్తార్ ఖాన్షకీల్
    ఉత్తేజ్
    షాడో స్నేహితుడు మరియు భాగస్వామి
    తెలంగాణ శకుంతల
    హోంమంత్రి భార్య
    హేమ
    మధుబాల కోడలు
    వినయ ప్రకాష్
    లక్ష్మి కోడలు
    కేశ ఖంభాతి
    ఒక ఐటెమ్ నంబర్
    సిబ్బంది
    మెహర్ రమేష్
    దర్శకుడు
    పరుచూరి కిరీటినిర్మాత
    తమన్ ఎస్
    సంగీతకారుడు
    ప్రసాద్ మూరెళ్ల
    సినిమాటోగ్రాఫర్
    మార్తాండ్ కె. వెంకటేష్
    ఎడిటర్
    కథనాలు
    Tollywood Movies: రిలీజ్‌కు ముందే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న చిత్రాలు.. ఎందుకో తెలుసా?
    Tollywood Movies: రిలీజ్‌కు ముందే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న చిత్రాలు.. ఎందుకో తెలుసా?
    ఒక సినిమా థియేటర్‌లోకి రావాలంటే ఎంతో మంది కృషి అవసరం. ముఖ్యంగా హీరో, డైరెక్టర్‌ తమ సర్వశక్తులు ఒడ్డి సినిమాను తెరకెక్కిస్తారు. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అవుతుంటాయి. మరికొన్ని యావరేజ్‌ టాక్‌తో నిర్మాతలకు పెట్టుబడి మెుత్తాన్ని తిరిగి అందిస్తుంటాయి. ఇవన్నీ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత జరిగే సంఘటనలు. అయితే కొన్ని చిత్రాలు మాత్రం థియేటర్లలోకి రాకముందే ఫ్లాప్‌ టాక్‌ (Tollywood Films Got Flop Talk Before The Release)ను మూటగట్టుకున్నాయి. సోషల్‌ మీడియాలో ఆయా చిత్రాలపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. అటువంటి చిత్రాలు ఏవి? ఇందుకు గల కారణాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  భోళాశంకర్‌ (Bhola Shankar) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా.. మేహర్‌ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో రూపొందిన రీసెంట్‌ చిత్రం ‘భోళాశంకర్‌’. ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందంటూ రిలీజ్‌కు ముందే నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. మేహర్‌ రమేష్‌.. గతంలో ఇచ్చిన డిజాస్టర్ల నేపథ్యంలో ఈ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇందుకు అనుగుణంగానే రిలీజ్‌ తర్వాత ‘భోళాశంకర్‌’ ఫ్లాప్ టాక్‌ తెచ్చుకోవడం గమనార్హం.  ఆదిపురుష్‌ (Aadi Purush) పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్‌ సీతగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం కూడా విడుదలకు ముందే తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ విడుదలైనప్పటి నుంచి నెట్టింట విపరీతంగా ట్రోల్స్‌ మెుదలయ్యాయి. గ్రాఫిక్స్ మరి అద్వాన్నంగా ఉన్నాయని.. సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఇందుకు తగ్గట్లే విడుదల తర్వాత ‘ఆదిపురుష్‌’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సంభాషణలపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. షాడో (Shadow) వెంకటేష్‌ (Venkatesh) హీరోగా మేహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘షాడో’. మేహర్‌ రమేష్‌ గత చిత్రాలు ‘కంత్రి’, ‘శక్తి’ డిజాస్టర్‌గా నిలవడంతో దాని ప్రభావం ‘షాడో’పై కూడా పడింది. ఈ మూవీ ట్రైలర్‌.. అంచనాలను అందుకోకపోవడంలో విఫలం కావడంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్స్‌ ఉందని అప్పట్లో కథనాలు వచ్చాయి. లాంగ్‌ హెయిర్‌లో వెంకీ లుక్‌ బాలేదని కూడా సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. మెుత్తానికి విడుదల తర్వాత ‘షాడో’ కూడా డిజాస్టర్ నిలిచి ఆ విమర్శలను నిజం చేసింది.  స్కంద (Skanda) హీరో రామ్‌ (Ram), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో రూపొందిన ‘స్కంద’పై ట్రైలర్‌ రిలీజ్‌ ముందు వరకూ భారీ అంచనాలే ఉన్నాయి. ట్రైలర్‌ రిలీజ్ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. యాక్షన్‌ సీన్స్‌ మరి ఓవర్‌ డోస్‌ అయినట్లుగా ఉందని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని కొందరు నెటిజన్లు అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే ‘స్కంద’ రిలీజ్‌ తర్వాత బి లో యావరేజ్‌గా నిలిచింది. ముఖ్యంగా రామ్‌కు నటుడు శ్రీకాంత్‌ ఎలివేషన్‌ ఇచ్చే డైలాగ్‌ ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రోల్‌ కావడం గమనార్హం. వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌ హీరోగా (Tollywood Films Got Flop Talk Before The Release) బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను తొలి ఆట నుంచే ట్రోల్స్‌ చుట్టుముట్టాయి. ముఖ్యంగా రామ్‌చరణ్‌ విలన్ సోదరుడి తల నరకడం.. గద్ద దాన్ని ఎత్తుకెళ్లడానికి సంబంధించిన సీన్‌ విపరీతంగా ట్రోల్‌కు గురైంది. అలాగే రైలు పై నుంచి పరిగెత్తుకుంటూ రామ్‌చరణ్‌ బిహార్‌ వెళ్లడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఓవరాల్‌గా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచి చరణ్‌ ఫ్లాప్‌ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.  లైగర్‌ (Liger) విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్‌ అయ్యింది. ప్రమోషన్స్‌ సందర్భంగా నిర్మాత చార్మీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు దోహదం చేశాయి. పైగా సిక్స్‌ ప్యాక్‌తో ఎంతో దృఢంగా ఉన్న విజయ్‌కు సినిమాలో నత్తి ఉన్నట్లు చూపించడం కూడా ట్రోల్స్‌కు కారణమైంది. రాధే శ్యామ్‌ (Radheshyam)  బాహుబలి తర్వాత ప్రభాస్‌ తీసిన రెండో చిత్రం ‘రాధేశ్యామ్‌’. సాహో ఫ్లాప్‌ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా 1976 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఇందులో ప్రభాస్‌ హస్తసాముద్రికం తెలిసిన జ్యోతిష్కుడిగా కనిపిస్తాడని తెలియగానే ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అటు సోషల్‌ మీడియాలో ఈ సినిమా కూడా డౌటే అంటూ ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే విడుదలైన రాధేశ్యామ్‌ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకొని.. ఆ రూమర్స్‌ను నిజం చేసింది.  వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover) విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' చిత్రం టీజర్‌ రిలీజ్‌ నుంచే విమర్శలను మూటగట్టుకుంది. టీజర్‌ బోల్డ్‌గా ఉండటంతో పాటు విజయ్‌ నలుగురు హీరోయిన్లతో రొమాన్స్‌ చేయడం చూపించారు. అర్జున్‌ రెడ్డి సినిమా నుంచి హీరోయిన్లతో విజయ్‌ రొమాన్స్‌ ఎక్కువైందని సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి. అటు మహిళ సంఘాలు కూడా ఈ సినిమాపై తీవ్రంగా స్పందించాయి. ఇన్ని ట్రోల్స్‌, విమర్శల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో దారుణంగా విఫలమైంది.  సన్‌ ఆఫ్‌ ఇండియా (Son of India) మంచు మోహన్‌బాబు (Mohan Babu) హీరోగా చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ (Tollywood Films Got Flop Talk Before The Release) చిత్రం విడుదలకు ముందే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా కొన్ని సోషల్‌ మీడియా అకౌంట్స్‌ మీమ్స్‌ క్రియేట్‌ చేశాయి. మరో ఫ్లాప్‌ లోడింగ్‌ అంటూ ట్రోల్స్‌ చేశాయి. ఈ పరిణామాల మధ్య వచ్చిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. 
    మార్చి 16 , 2024
    Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
    Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
    నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగాలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ ‘కామిక్ కాన్’లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ‘ప్రాజెక్ట్ K’ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్ పాల్గొన్నారు. గ్లింప్స్‌ చెప్పే సీక్రెట్స్ ఇవే! కాగా, ప్రాజెక్ట్‌ K సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు. ఇక సినిమా టైటిల్ కింద ‘2898 AD’ అని పెట్టారు. అంటే కలియుగాంతం చివర్లో జరిగే కథ అని డైరెక్టర్‌ చెప్పకనే చెప్పాడు. గ్లింప్స్ చూస్తే సాధారణంగా ప్రపంచాన్ని చీకటి కమ్ముకున్నప్పుడు ఒక వెలుగు వస్తుంది అని, ప్రపంచాన్ని విలన్ తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు కల్కి ఉద్భవిస్తాడని, ప్రజల్ని కాపాడతాడని తెలుస్తుంది. అయితే గ్లింప్స్‌ను మరింత పరిశీలనగా చూస్తే చాలా విషయాలు మనకు అర్థమౌతాయి. కలియుగాంతం సమయంలో ఈ ప్రపంచం పూర్తిగా రోబోల మయంగా, ఆధునిక ఆయుధాలతో యుద్ధం జరిగే స్థాయికి వెళ్తుందని గ్లింప్స్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పైగా 2898 ADలో ప్రస్తుత స్థాయిలో జనాభా కాకుండా చాలా కొద్దిమంది ప్రజలే ఉండొచ్చని భావించవచ్చు. వారంతా ఓ వ్యక్తి (రాజు) పాలనలో జీవిస్తుండవచ్చు. https://twitter.com/DEADLINE/status/1682221771154677760?s=20 అమితాబ్‌ పాత్ర నిడివి తక్కువేనా? ప్రాజెక్ట్‌లో Kలో రాజు (అమితాబ్‌ బచ్చన్‌) తన ప్రజలని పాలిస్తుంటే ఒక విలన్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆ రాజుని బంధించి అతని ప్రజలని విలన్ తనకు బానిసలుగా చేసుకున్నట్లు గ్లింప్స్‌లో కనిపిస్తోంది. అలాంటప్పుడు రాజు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో వారిని ఆదుకునేందుకు కల్కి అవతారంలో హీరో (ప్రభాస్‌) ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. మూవీలో అయితే మొదట అమితాబ్ వచ్చి ఆ తర్వాత ప్రభాస్ వస్తాడని అర్థం చేసుకోవచ్చు. శివాలయంలోకి ఓ రోబో రావడం గ్లింప్స్‌లో చూశాం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడి క్యారెక్టర్‌లో అమితాబ్ నటిస్తున్నట్లు టాక్.  https://twitter.com/DEADLINE/status/1682129398600966146?s=20 ప్రభాస్ అందుకే కల్కి అవుతాడా? ఇక ప్రాజెక్ట్ K అంటే ‘ప్రాజెక్ట్ కల్కి’ అని, ప్రభాస్‌తో లోకాన్ని కాపాడించడానికి కొంతమంది చేసే యుద్ధమని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. నిమిషం వీడియోతో డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్‌గా కథ మెుత్తం రివీల్ చేసినట్లు అర్థమవుతోంది. ఇక కొంచెం డీటేలింగ్‌లోకి వెళ్తే అమితాబ్‌ బచ్చన్‌తో పాటు హీరోయిన్‌ దీపికా పదుకొణేను కూడా విలన్లు బంధించినట్లు గ్లింప్స్‌లో చూపించారు. దీన్ని బట్టి ప్రభాస్‌ ఆమె కోసం వచ్చి కల్కి లాగా మారతాడా? అన్న సందేహం కూడా ఉత్పన్నమవుతుంది. లేదా హీరోయిన్‌ను కాపాడే క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా దీపికా, ప్రభాస్‌ మధ్య ప్రేమ సన్నివేశాలను కూడా బాగా ఎలివేట్‌ చేయాలని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నారు.  చీకటికి రారాజు అతడే? ఇకపోతే ఈ సినిమాలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రతినాయకుడిగా కనిపిస్తాడని మెున్నటి వరకూ ఊహాగానాలు వినిపించినా తాజాగా విడుదలైన గ్లింప్స్‌ వీడియోతో ‌అది కన్‌ఫార్మ్‌ అయింది. ఎందుకంటే ప్రాజెక్ట్‌Kలో కమల్‌ హాసన్‌ నటించనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించిన సమయంలో ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. 'భూమి మెుత్తాన్ని కమ్మేసే షాడో (చీకటి) కోసం వెతికామని.. ఆ పాత్ర చేయగల ఒకే ఒక్కడు దొరికేశాడు' అని కమల్‌ గురించి ప్రకటించారు. తాజా గ్లింప్స్‌ కూడా భూమిని చీకటి కమ్మేయడం గమనించవచ్చు. ఈ రెండు కలిపి చూస్తే ఇందులో విలన్లకు రారాజుగా కమల్‌ హాసన్‌ కనిపిస్తాడని అర్థం చేసుకోవచ్చు.  https://twitter.com/i/status/1672854637014138880 సూపర్ రెస్పాన్స్ గ్లింప్స్‌ని చూస్తుంటే గూస్‌బమ్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు. విజువల్ వండర్‌గా, హాలీవుడ్ రేంజ్ సినిమాని తలపిస్తోందని చెబుతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ విజనరీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇక, సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. మళ్లీ మళ్లీ వినాలనిపించే ట్రాక్‌ని అందించాడు. గ్లింప్స్ చూశాక మ్యూజిక్ హాంట్ చేస్తూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు.  https://twitter.com/THR/status/1682126315229683715?s=20 విడుదల తేదీ? ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారం ఈ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ కావాలి. అయితే, గ్లింప్స్‌లో కేవలం 2024లో వస్తుందనే ఇచ్చారు. అంటే, మూవీ డేట్ మారుతుందనే సంకేతాలు ఇచ్చారు. మరి, జనవరి 12న కాకుండా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్‌కి అచ్చొచ్చిన ‘మే9’న కల్కిని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు ఇదే రోజున రిలీజ్ అయ్యాయి. https://www.youtube.com/watch?v=bC36d8e3bb0
    జూలై 21 , 2023
    EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌! 
    EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌! 
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రతీ చిత్రం సూపర్‌ హిట్‌ కావాలన్న రూల్‌ ఏమి లేదు. కొన్నింటికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మరికొన్నింటికి అసలే దక్కదు. దీనిని బట్టే ఆయా సినిమాలను హిట్స్‌, ఫ్లాప్స్‌గా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే ఫ్లాప్‌ అయిన చిత్రాలు కూడా కొన్ని సందర్భాల్లో ఓటీటీలో మంచి ఆదరణ పొందడం ఈ రోజుల్లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చిత్రాలకు పరమ డిజాస్టర్లుగా పేరుంది. అప్పట్లో ఆ సినిమాల ప్రదర్శన సందర్భంగా ఆడియన్స్‌ మూవీ మధ్యలో నుంచే బయటకు వచ్చేశారని టాక్ ఉంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటిపై నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.  ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ (Extra Ordinary Man) నితీన్‌ (Nithiin) - శ్రీలీల (Sreeleela) జంటగా చేసిన రీసెంట్‌ చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్‌’. ఈ సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. సినిమా ఇంటర్వెల్‌ వరకూ కూడా చూడలేకపోయామని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అసలు విలన్‌ చెప్పినట్లు హీరో ఆడటం ఏంటని కొందరు ప్రేక్షకులు మండిపడ్డారు. నితీన్‌ కేరీర్‌లో ఎక్కువగా ట్రోల్స్‌ గురైన చిత్రంగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ నిలిచింది.  శాకుంతలం (Shakunthalam) సమంత (Samantha) లీడ్‌ రోల్‌లో నటించిన ‘శాకుంతలం’ చిత్రంపై రిలీజ్‌కు ముందు భారీగానే అంచనాలు ఉండేవి. సమంత చేసిన తొలి పౌరాణిక సినిమా కావడం, ప్రచార చిత్రాలు కూడా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేలా ఉండటంతో తెలుగు ఆడియన్స్‌ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత సీన్ అంతా రివర్స్ అయ్యింది. శకుంతల పాత్రకు సమంత పెద్దగా నప్పలేదని, డబ్బింగ్‌ కూడా సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్‌ వరకూ సినిమాను చూడటమే కష్టంగా అనిపించిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్స్ చేశారు.   రాధే శ్యామ్‌ (Radhe Shyam) ప్రభాస్‌ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన ‘రాధే శ్యామ్‌’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో ప్రభాస్ వింటేజ్‌ లుక్‌తో స్మార్ట్‌గా ఉండటంతో ఫ్యాన్స్‌లో పెద్ద ఎత్తున అంచనాలు మెుదలయ్యాయి. కానీ రిలీజయ్యాక ప్రభాస్‌ను హస్తముద్రికా నిపుణుడిగా చూసి షాకయ్యారు. జ్యోతిష్యాన్ని ప్రేమను ముడి పెట్టిన విధానం చాలా మంది ఫ్యాన్స్‌కు ఎక్కలేదు. సినిమా మెుదలైన గంటకే విసుగు వచ్చిందని, ఇంటర్వెల్‌కు బయటకు వచ్చేశామని అప్పట్లో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వచ్చాయి. వరల్డ్ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover) విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా... రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లే హీరోయిన్లుగా చేసిన చిత్రం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. హీరో విజయ్‌పై ఈ సినిమా నుంచే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఈ సినిమాలో రొమాన్స్‌ తప్ప కథ లేదని ట్రోల్స్‌ వచ్చాయి. విజయ్‌ పో** చిత్రాలు చేసుకుంటే బెటర్‌ అని కొందరు నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు బయటకు వెళ్లిపోదామా? అని ఎదురు చూసినట్లు పోస్టులు పెట్టారు.  బ్రహ్మోత్సవం (Brahmotsavam) సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) కెరీర్‌లోనే పీడకల లాంటి చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం మహేష్‌కు మాయని మచ్చలా మిగిలిపోయిందని ఫ్యాన్స్ అంటుంటారు. కాజల్‌ (Kajal Aggarwal), సమంత (Samantha), ప్రణీత (Pranitha) వంటి కథానాయికలతో పాటు సత్యరాజ్‌, జయసుధ, రేవతి, తులసి, రావు రమేష్‌, షియాజీ షిండే, తనికెళ్ల భరణి వంటి హేమాహేమీలు ఉన్నా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా తొలి రోజు తొలి ఆట నుంచే సినిమాపై ట్రోల్స్‌ మెుదలయ్యాయి. సినిమా చూడకుండా మధ్యలోనే వచ్చేశామంటూ స్వయంగా మహేష్‌ ఫ్యాన్సే కామెంట్స్ చేశారు. సన్‌ ఆఫ్‌ ఇండియా (Son Of India) దిగ్గజ నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu) హీరోగా చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమాపై విడుదలకు ముందు నుంచే నెగిటివ్‌ మెుదలైంది. ఈ సినిమా తొలి రోజు మెుదటి ఆట కోసం ఓ థియేటర్‌లో రెండే టికెట్లు బుక్‌ కావడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఆ టికెట్లు బుక్‌ చేసుకుంది మంచు ఫ్యామిలీనే అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. చూసిన వారు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్‌ రివ్యూ ఇవ్వడంతో కొద్ది రోజులకే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసివేశారు. మోహన్‌ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ నిలిచింది. వినయ విధేయ రామా (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన వినయ విధేయ రామాపై తొలి ఆట నుంచి నెగిటివ్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఈ చిత్రం పరమ రాడ్‌ అంటూ చూసిన వారు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోదామా అని అనిపించిందని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి బిహార్‌కు వెళ్లడం.. హీరో విలన్‌ అనుచరుల తలకాయలు నరికితే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.  లైగర్‌ (Liger) విజయ్ దేవరకొండ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన మరో చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. తొలి గంటకే సినిమాపై ఆసక్తి సన్నగిల్లిందని అప్పట్లో నెట్టింట పోస్టులు వెల్లువెత్తాయి. అంత బాడీ పెట్టుకొని విజయ్‌ పాత్రకు నత్తి పెట్టడం ఏంటన్న విమర్శలు వచ్చాయి. శక్తి (Shakthi) తెలుగులో డిజాస్టర్‌ అని అనగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘శక్తి’. ఈ మూవీ దర్శకుడు మేహర్‌ రమేష్‌ను ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికీ ఓ ఆట ఆడుకుంటున్నారు. శక్తి మెుదటి ఆట చూసి తారక్‌ కథను ఎలా ఓకే చేశారని ప్రశ్నించారు. ఒక గంట కూడా సినిమాను వీక్షించలేకపోయామని చెప్పారు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో తారక్ లుక్‌ అసలు సూట్‌ కాలేదన్న విమర్శలు సైతం వచ్చాయి. ఇదే డైరెక్టర్‌ వెంకటేష్‌తో ‘షాడో’ తీయగా ఆ మూవీ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. మేహర్‌ రమేష్‌  రీసెంట్‌ చిత్రం ‘భోళా శంకర్‌’ సమయంలోనూ శక్తి సినిమా ప్రస్తావనకు రావడం గమనార్హం.  సలీం (Saleem) మంచు విష్ణు (Manchu Vishnu), ఇలియానా (Ileana D'Cruz) జంటగా చేసిన ‘సలీం’.. తెలుగులో వచ్చిన బారీ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం మంచు విష్ణు భారీగా వెయిట్‌ తగ్గాడు. నాలుగైదు సినిమా కథలను మిక్సీలో వేసి సలీం చిత్రాన్ని రూపొందించారని అప్పట్లో విమర్శలు సైతం వచ్చాయి. తొలి అర్ధభాగానికే సినిమా బోర్‌ కొట్టేసిందని కామెంట్స్ వినిపించాయి. 
    మే 04 , 2024
    War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌.. పూర్తిగా లుక్‌ మార్చిన తారక్ 
    War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌.. పూర్తిగా లుక్‌ మార్చిన తారక్ 
    భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). YRF (Yash Raj Films) స్పై యూనివ‌ర్స్‌లో 6వ చిత్రంగా రానుండటంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇటీవల ‘బ్ర‌హ్మ‌స్త’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అయాన్ ముఖ‌ర్జీ.. ‘వార్‌ 2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోష‌న్‌, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఈ సినిమాలో నటించనున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వార్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. అయితే తాజాగా హృతిక్‌, తారక్‌లకు సంబంధించి సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.  హృతిక్‌, తారక్‌ షూట్‌ ఎప్పుడంటే! ‘వార్‌ 2’ (War 2) చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్న హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), తారక్‌ (Jr NTR) షూటింగ్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. దీని ప్రకారం 'వార్‌ 2'లో హృతిక్‌కు సంబంధించిన సన్నివేశాలను జపాన్‌లో చిత్రీకరించనున్నారు. షావోలిన్‌ టెంపుల్‌ దగ్గర హృతిక్ ఎంట్రీ సీన్స్‌ తెరకెక్కిస్తారని టాక్‌ వినిపిస్తోంది. మార్చి 7 నుంచి షూటింగ్‌ ప్రారంభమవుతుందని సమాచారం. ఇక తారక్ విషయానికి వస్తే అతడు ఏప్రిల్‌లో షూటింగ్‌లో జాయిన్‌ అవుతాడని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచి తారక్‌-హృతిక్‌కు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తారని అంటున్నారు.  గాయం నుంచి కోలుకున్న హృతిక్‌! బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌.. వార్ 2 చిత్రం కోసం గత కొంతకాలం నుంచి వర్కౌట్స్‌ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఆయన జిమ్‌ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అనుకున్న దానికంటే ‘వార్‌ 2’ షూట్‌ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం హృతిక్‌ పూర్తి ఫిట్‌గా ఉండటంతో మార్చి 7 నుంచి ఆయనకు సంబంధించిన సన్నివేశాలను షూట్‌ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హృతిక్‌ కూడా ఓకే చెప్పడంతో మూవీ యూనిట్‌ జపాన్‌లో వాలిపోయేందుకు సిద్ధమవుతోంది.  https://twitter.com/i/status/1764908346640040382 ‘వార్‌ 2’లో తారక్‌ గెటప్‌ అదేనా? కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ (Devara) చిత్రంలో ప్రస్తుతం తారక్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి వరుస షెడ్యూల్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటిస్తోంది. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ఓ పార్టీకి తారక్‌ సతీసమేతంగా హాజరయ్యాడు. అక్కడ తారక్‌ లుక్‌ చూసి అంతా ఫిదా అయ్యారు. మెున్నటి వరకూ కాస్త లావుగా కనిపించిన తారక్‌.. లేటెస్ట్‌ ఫొటోల్లో బరువు తగ్గి చాలా స్లిమ్ అయ్యారు. దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రిభినయం చేస్తున్నారని వార్తలొస్తున్న తరుణంలో ఎన్టీఆర్‌ ఇలా మారి ఆ గాసిప్స్‌ను కన్ఫార్మ్‌ చేశారని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరోవైపు ‘వార్‌ 2’లోనూ తారక్‌ ఇదే గెటప్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ‘వార్‌ 2’ రిలీజ్ ఎప్పుడంటే? భారీ బడ్జెట్‌తో రూపొందనున్న 'వార్‌ 2' చిత్రం విడుదల తేదీని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 2025 ఆగ‌ష్టు 14న ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు సమాచారం ఉంది. హృతిక్ రోష‌న్‌కు ధీటుగా ప‌వ‌ర్‌ఫుల్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని స‌మాచారం. అటు బాలీవుడ్‌ స్టార్‌ హీరో జాన్‌ అబ్రహం కూడా ‘వార్‌ 2’లో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. 
    మార్చి 05 , 2024
    Dunki Review: హాస్యం, భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘డంకీ’.. షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా!
    Dunki Review: హాస్యం, భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘డంకీ’.. షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా!
    నటీనటులు: షారుక్‌ ఖాన్‌, తాప్సీ, విక్కీ కౌశల్‌, బొమన్‌ ఇరానీ, దియా మిర్జా, సతీశ్‌ షా, అనిల్‌ గ్రోవర్‌ తదితరులు దర్శకత్వం: రాజ్‌కుమార్‌ హిరాణీ సంగీతం: అమన్‌ పంత్‌, ప్రీతమ్ సినిమాటోగ్రఫీ: సి.కె.మురళీధరన్‌, మనుశ్‌ నందన్‌ నిర్మాతలు: గౌరీ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ ఫిల్మ్స్‌  విడుదల తేదీ: 21-12-2023 ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ - షారుక్‌ఖాన్‌ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ‘డంకీ’ (Dunki). హిరాణీ డైరెక్షన్‌లో వచ్చిన  ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘లగే రహో మున్నాభాయ్‌’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘పీకే’, ‘సంజు’ చిత్రాలు బ్లాక్‌బాస్టర్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది రెండు సూపర్‌ హిట్స్‌ (పఠాన్‌, జవాన్‌)తో ఊపుమీదున్న షారుక్‌తో హిరాణీ చిత్రం తీయడంతో 'డంకీ'పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో షారుక్‌కు జోడీగా తాప్సి నటించింది. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశాల్‌ అతిథి పాత్ర పోషించడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది? షారుక్‌కు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించిందా? దర్శకుడు హిరాణీ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.  కథ పంజాబ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన మ‌న్ను (తాప్సి), సుఖి (విక్కీ కౌశ‌ల్‌), బుగ్గు (విక్ర‌మ్ కొచ్చ‌ర్‌), బ‌ల్లి (అనిల్ గ్రోవ‌ర్‌) ఒక్కో స‌మ‌స్య‌తో బాధపడుతుంటారు. వాటి నుంచి గ‌ట్టెక్క‌డానికి ఇంగ్లండ్ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కానీ, వీసాల‌కి త‌గినంత చ‌దువు, డ‌బ్బు వీరి వద్ద ఉండ‌దు. ఈ క్ర‌మంలోనే ఆ ఊరికి జ‌వాన్ హార్డీ సింగ్ (షారుక్‌ ఖాన్‌) వ‌స్తాడు. ఆ న‌లుగురి ప‌రిస్థితులను అర్థం చేసుకుని సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఏన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారిలో ఒకరికి మాత్ర‌మే వీసా వ‌స్తుంది. అయినా స‌రే, అక్ర‌మ మార్గాన (డంకీ ట్రావెల్‌) ఇంగ్లండ్‌లోకి ప్ర‌వేశించాల‌ని వారు నిర్ణయించుకుంటారు. ఆ క్ర‌మంలో వాళ్ల‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? ఇంగ్లాండ్‌కు వెళ్లారా లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే 'డంకీ' చిత్రం షారుక్‌లోని మరో నట కోణాన్ని ఆవిష్కరించింది. మాట తప్పని జవాన్ హర్డీసింగ్‌ పాత్రలో షారుక్‌ ఒదిగిపోయారు. ప్రథమార్థంలో ఎంతగా నవ్వించారో, ద్వితియార్థంలో అంతగా భావోద్వేగాల్ని పంచారు. మన్ను పాత్రలో తాప్సి అదరగొట్టింది. చాలా చోట్ల ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది. ఇక  విక్కీ కౌశల్ కీలక పాత్రలో కనిపించాడు. ఆయన నిడివి తక్కువే అయినా సినిమాలో విక్కీ పాత్ర చాలా కీలకం. ఇక మిగిలిన నటులు తమ పాత్రపరిధి మేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ తన గత చిత్రాల మాదిరిగానే సామాజికాంశాలు, హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. న‌వ్విస్తూ, హృద‌యాలను బ‌రువెక్కిస్తూ, సాహ‌సోపేత‌మైన డంకీ ప్ర‌యాణంలో ప్రేక్ష‌కుల్ని భాగం చేశారు. మ‌న్ను, బుగ్గు, బ‌ల్లిల కుటుంబ నేప‌థ్యాలను గుండెకు హత్తుకునేలా చూపించారు. డంకీ ప్ర‌యాణంలో వ‌లస‌దారుల దయనీయ పరిస్థితులను కళ్లకు కట్టారు. విదేశాల్లో వారి బ‌తుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించిన తీరు ఆక‌ట్టుకుంది. హార్డీ, మ‌న్ను ప్రేమ‌క‌థను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. ప‌తాక స‌న్నివేశాల్లోనూ ఆ జంట మ‌ధ్య సాగే ప్రేమ‌ నేప‌థ్యం క‌న్నీళ్లు పెట్టిస్తుంది.  సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికొస్తే.. సంగీతం, కెమెరా విభాగాల‌ు చక్కటి పనితీరు కనబరిచాయి.  ‘లుట్ పుట్ గ‌యా’ అనే హుషారైన పాట సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అమ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌కుడిగానే కాకుండా ఎడిట‌ర్‌గానూ మ‌రోసారి త‌న‌దైన ముద్ర వేశారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నటీనటులుహాస్యం, భావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్ఊహకందే కథ, కథనం రేటింగ్‌ : 3/5
    డిసెంబర్ 21 , 2023
    Pushpa 3 : బన్నీ ఫ్యాన్స్‌కు షాకింగ్‌ న్యూస్‌.. ‘పుష్ప 3’ ఇప్పట్లో లేనట్లే!
    Pushpa 3 : బన్నీ ఫ్యాన్స్‌కు షాకింగ్‌ న్యూస్‌.. ‘పుష్ప 3’ ఇప్పట్లో లేనట్లే!
    యావత్‌ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'పుష్ప 2' (Pushpa 2: The Rule) ఒకటి. అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా.. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన 'పుష్ప' (Pushpa : The Rise) సెన్సేషనల్‌ హిట్‌ కావడంతో 'పుష్ప 2' పై భారీగా బజ్ ఏర్పడింది. ఈ చిత్రం ఆగస్టు 15న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుండటంతో చిత్ర యూనిట్‌ మూవీ ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయగా.. రెండో పాటను నెలాఖరులో రిలీజ్‌ చేయనున్నారు. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’కు కొనసాగింపుగా మూడో పార్ట్ కూడా ఉండనున్నట్లు హీరో బన్నీ గతంలోనే హింట్‌ ఇచ్చాడు. తాజాగా థర్డ్‌ పార్ట్‌కు సంబంధించి ఓ బజ్‌ వైరల్‌ అవుతోంది. దీనిపై ఫ్యాన్స్‌ పెదవి విరుస్తున్నారు.  కొంత కాలం ఆగాల్సిందేె! ‘పుష్ప 3’ చిత్రానికి సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం.. మూడో పార్ట్‌కి కొంత కాలం పాటు బ్రేక్ ఇవ్వాలని డైరెక్టర్‌ సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్‌లో సుకుమార్‌ రెండు చిత్రాలు.. బన్నీ రెండు చిత్రాలు (విడివిడిగా) చేయాలని భావిస్తున్నారట. అటు నిర్మాణ సంస్థ కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ‘పుష్ప 2’ విడుదలైన రెండు, మూడేళ్ల వరకూ ‘పుష్ప 3’ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితులు ఉండవని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దేశంలో పుష్ప మేనియా ఉన్నప్పుడే మూడో పార్ట్ కూడా పట్టాలెక్కిస్తే బాగుటుందని సూచిస్తున్నారు.  రెండ్రోజుల్లో సెకండ్‌ సాంగ్‌ పుష్ప 2లోని రెండో పాటను మే 29న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తాజా ప్రోమోలో స్పష్టం చేశారు.  ఆ రోజు ఉ.11.07 గం.లకు పూర్తి లిరికల్‌ వీడియోను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ హీరోయిన్‌ రష్మిక ఈ పాటపై అంచనాలు పెంచేసింది. ఇది బన్నీ, రష్మిక మధ్య సాగే మెలోడీ సాంగ్. గతంలో పుష్ప సినిమాలో వచ్చిన ‘సామి.. సామి’ సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో సెకండ్‌ సింగిల్‌ కూడా ఆ స్థాయిలోనే అలరిస్తుందని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. ఆ పాట కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తి పుష్ప 2 సినిమా దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. ఫహాద్‌ ఫాజిల్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాట చిత్రీకరించడం బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. అది కూడా ఐటెం సాంగ్ అని అంటున్నారు. ఈ సాంగ్‌ కోసం యానిమల్‌ బ్యూటీ తృప్తి దిమ్రి పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సాంగ్‌ కోసం చిత్ర యూనిట్‌ ఆమెను సంప్రదించగా తృప్తి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్‌ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తుందని అంటున్నారు. పుష్పలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సమంత చేసిన మ్యాజిక్‌ను తృప్తి రిపీట్‌ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బన్నీ, తృప్తి కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు.  ఆ రోజు ఫ్యాన్స్‌కు పూనకాలే! భారీ ఎత్తున నిర్మిస్తున్న ‘పుష్ప 2’ చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రత్యర్థిగా మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahad Fazil) నటిస్తున్నారు. అనసూయ, ధనుంజయ్, సునీల్, రావు రమేశ్‌, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌ రిలీజ్‌ కానుంది. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ అన్నీ కూడా సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. 
    మే 27 , 2024
    Game Changer Story: షాకింగ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా కథ లీక్‌.. ఆందోళనలో రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌!
    Game Changer Story: షాకింగ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా కథ లీక్‌.. ఆందోళనలో రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌!
    'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) వంటి గ్లోబల్‌ స్థాయి సక్సెస్‌ తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) చేస్తున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). దిల్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో చరణ్‌ జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నెట్టింట ప్రత్యక్షమైన లీకుల మినహా ఈ సినిమాపై యూనిట్‌ నుంచి చెప్పుకోతగ్గ అప్‌డేట్‌ రాలేదు. సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాకుండా చిత్ర యూనిట్‌ జాగ్రత్త పడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌.. ఈ కథను లీక్‌ చేయడం గమనార్హం.  కథ ఏంటంటే? మంగళవారం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఆధ్వర్యంలో భారీ ఈవెంట్‌ జరిగింది. త్వరలో తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ హక్కులు సైతం తామే దక్కించుకున్నట్లు ప్రైమ్‌ వర్గాలు ప్రకటించాయి. అంతటితో ఆగకుండా త్వరలో స్ట్రీమింగ్‌కు రాబోయే సినిమాలు/ సిరీస్‌లకు సంబంధించిన స్టోరీ లైన్స్‌తో పాటు గేమ్‌ ఛేంజర్‌ ప్లాట్‌ను అమెజాన్‌ బహిర్గతం చేసింది. దీని ప్రకారం.. ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడారన్నదే కథ’. ప్రస్తుతం ఈ ప్లాట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో స్టోరీ ఎందుకు చెప్పారంటూ చరణ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇందులో చరణ్‌ తండ్రి కొడులుగా డ్యూయల్‌ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.  View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) వామ్మో ఏకంగా అన్ని కోట్లా! ‘గేమ్ ఛేంజర్’ సినిమా అన్ని భాషల్లో కలిపి డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ఏకంగా రూ.110 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. థియేటర్లలోకి రాకముందే ఇంత భారీ ధర పెట్టి కొన్నారా? అని సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏది ఏమైనా రూ.110 కోట్లకు డిజిటల్ రైట్స్ కొనుగోలు అంటే అది చాలా ఎక్కువనే చెప్పాలి. బడ్జెట్‌లో సగం రిలీజ్ అవ్వకుండా నిర్మాతలకు వచ్చేస్తుంది. ఈ వార్త నిజమైతే ఈ స్థాయిలో ఓటీటీ హక్కులకు అమ్ముడుపోయిన తొలి తెలుగు చిత్రంగా ‘గేమ్‌ ఛేంజర్‌’ నిలవనుంది.  గ్రాండ్‌గా ఆరంభమైన 'RC16’ గేమ్‌ ఛేంజర్‌ తర్వాత రామ్‌చరణ్‌ తన తర్వాతి చిత్రాన్ని ‘ఉప్పెన’ డైరెక్టర్‌ బుచ్చిబాబుతో తీయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్, బుచ్చిబాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్‌ శంకర్‌, హీరోయిన్ జాన్వీ కపూర్‌, ఆమె తండ్రి బోని కపూర్‌, నిర్మాత అల్లు అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  https://twitter.com/1012_raj/status/1770365882738573469 ఆ రోజున డబుల్‌ ధమాకా! మార్చి 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు గ్రాండ్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు ‘గేమ్ ఛేంజర్‌’, ‘RC16’ మేకర్స్ సిద్ధమవుతున్నారు. చరణ్‌ బర్త్‌డే రోజున ఓ అప్‌డేట్‌ ఉందని ఇప్పటికే గేమ్ ఛేంజర్‌ యూనిట్‌ ప్రకటించింది. అదే రోజున ‘RC16’ డైరెక్టర్‌ బుచ్చిబాబు కూడా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆ రోజున ఫ్యాన్స్‌ డబుల్ ట్రీట్ లభించనుంది.  
    మార్చి 20 , 2024
    Ridhi Dogra: ‘జవాన్‌’లో షారుక్‌ తల్లి.. బయట ఎంత హాట్‌గా ఉందో చూశారా?
    Ridhi Dogra: ‘జవాన్‌’లో షారుక్‌ తల్లి.. బయట ఎంత హాట్‌గా ఉందో చూశారా?
    ]మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    సెప్టెంబర్ 15 , 2023
    Prithwi Shaw: పృథ్వీ షాపై దాడి చేసిన సప్న గిల్ ఎవరు? వరుస వివాదాల్లో పృథ్వీ షా
    Prithwi Shaw: పృథ్వీ షాపై దాడి చేసిన సప్న గిల్ ఎవరు? వరుస వివాదాల్లో పృథ్వీ షా
    ]మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    ఫిబ్రవరి 17 , 2023
    Fahadh Faasil: ‘పుష్ప’ సినిమాపై ఫహాద్ ఫాజిల్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఒరిగిందేమి లేదని అసంతృప్తి!
    Fahadh Faasil: ‘పుష్ప’ సినిమాపై ఫహాద్ ఫాజిల్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఒరిగిందేమి లేదని అసంతృప్తి!
    టాలీవుడ్ ఖ్యాతిని పాన్‌ ఇండియా లెవల్‌కు తీసుకెళ్లిన చిత్రాల్లో పుష్ప ఒకటి. ఇందులో బన్నీ కెరీర్‌ బెస్ట్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇందులో విలన్‌గా చేసిన మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌తెలుగుతో పాటు జాతీయ స్థాయిలో అందరికీ పరిచయమయ్యాడు. బన్నీ తర్వాత ఆ స్థాయిలో పుష్పలో ఆకట్టుకున్నాడు ఫహాద్ ఫాసిల్‌. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్యూలో ఫాహాద్‌ ఫాజిల్‌ పుష్ప చిత్రంపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.  ‘పుష్ప నాకు చేసిందేమీ లేదు’ తాజాగా ఫిల్మ్ కంపానియన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కేరళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ మాట్లాడాడు. ‘పుష్ప’ సినిమాపై యాంకర్‌ ‌అడిగిన ప్రశ్నలకు షాకింగ్‌ రిప్లై ఇచ్చాడు. ‘పుష్ప’ తర్వాత ఫహాద్‌.. కేరళ హద్దులు దాటి పాన్ ఇండియా నటుడిగా మారారని అనుకుంటున్నట్లు యాంకర్ అన్నారు. ఇందుకు అందుకు ఫహాద్‌ బదులిస్తూ.. ’అలాంటిదేమీ లేదు. పుష్ప నాకు చేసిందేమీ లేదు. ఇదే విషయం సుక్కు సర్‌కు కూడా చెప్పాను. అందులో దాచుకోవాల్సిందేమీ లేదు. నేను ఇక్కడ మలయాళంలోనే సినిమాలు చేస్తున్నాను. ఎవరినీ అగౌరవపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ ఇది నిజం. పుష్పతో నా నుంచి ప్రేక్షకులు మ్యాజిక్ ఆశిస్తారని అనుకోవడం లేదు’ అని అన్నారు.  ‘సుకుమార్‌ కోసమే ఒప్పుకున్నా’ ఓ సందర్భంలో మీతో పాటు కూర్చోడానికి బాలీవుడ్‌ నటుడు కాస్త వెనకడుగు వేశాడని.. మీ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయిందని యాంకర్‌.. ఫహాద్‌తో అన్నారు. పుష్ప వల్లనే మీరు ఈ స్థాయికి చేరారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అప్పుడు ఫహాద్‌ స్పందిస్తూ.. ‘పుష్ప కేవలం సుకుమార్‌పై ఉన్న ప్రేమతో మాత్రమే చేశా. ఇప్పుడు మలయాళం తెలియని ప్రేక్షకులు కూడా మలయాళ సినిమాలు చూస్తున్నారు. అది నాలో ఉత్సాహం నింపుతోంది. అంతే తప్ప పుష్ప నన్ను ఎక్కడికో తీసుకెళ్లింది అని మాత్రం నేను అనుకోవడం లేదు’ అని ఫహాద్ స్పష్టం చేశాడు. నా ఫేవరేట్‌ స్టార్స్‌ వారే: ఫహాద్‌ యాంకర్‌ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ తాను పాన్‌ ఇండియా స్టార్‌ను కాదని కేవలం నటుడిని మాత్రమేనని ఫహాద్ తేల్చి చెప్పాడు. ఇక తనకు రాజ్‌ కుమార్‌ మంచి నటుడని తెలిపాడు. రణ్‌బీర్‌ కపూర్‌ దేశంలోనే అత్యుత్తమ యాక్టర్‌ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఫహాద్‌ నటించిన ఆవేశం చిత్రం బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద రూ.150 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఫహాద్‌ పుష్ప 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్‌ కానుంది. 
    మే 07 , 2024
    Devara: తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’కు ఊహించని షాక్‌.. ప్రభాస్‌, బన్నీతో పోలిస్తే వెనకబడ్డ తారక్‌!
    Devara: తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’కు ఊహించని షాక్‌.. ప్రభాస్‌, బన్నీతో పోలిస్తే వెనకబడ్డ తారక్‌!
    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత జూ.ఎన్టీఆర్‌ (Jr. NTR) నటిస్తున్న చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్‌గా చేస్తోంది. సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుండటం, తారక్‌ డ్యూయల్‌ రోల్‌లో చేస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా దేవర ప్రీరిలీజ్ బిజినెస్‌ అంటూ కొన్ని లెక్కలు వైరల్‌ అవుతున్నాయి. అవి చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఆ సినిమాల కంటే వెనకే! లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ థియేట్రికల్‌ హక్కులు రూ.130 కోట్లకు అమ్ముడుపోనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ కెరీర్‌లో ఇదే అత్యధికం. అయితే అల్లుఅర్జున్‌ ‘పుష్ప 2’ (Pushpa 2), ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కేవలం ఒక్క రీజియన్‌లోనే రూ.100 కోట్ల మేర బిజినెస్ చేస్తోందని టాక్. వీటితో పోలిస్తే దేవర చాలా తక్కువ థియేట్రికల్‌ బిజినెస్‌ చేసే పరిస్థితులు కనిపిస్తాయి. వాస్తవానికి టాలీవుడ్‌లో బన్నీ, తారక్‌కు సమాన క్రేజ్ ఉంది. ‘పుష్ప 2’ లాగానే ‘దేవర’ కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. అయినా కూడా ‘పుష్ప 2’ బిజినెస్‌ అంచనాలను తారక్ అందుకోకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరుగుతుందని భావించిన వారంతా తాజా లెక్కలు చూసి పెదవి విరుస్తున్నారు.  ప్రీరిలీజ్‌ బిజినెస్‌ అంచనాలు ఇవే! లేటెస్ట్ బజ్‌ ప్రకారం దేవర ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఏకంగా రూ.400 కోట్లకు పైగా జరిగే అవకాశముందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.130 కోట్లు పలకనున్నట్లు సమాచారం. ఈ రైట్స్ కోసం నిర్మాత దిల్‌రాజు, మైత్రీమూవీ మేకర్స్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు పోటీ పడుతున్నారట. మరోవైపు ఉత్తరాది, కర్ణాటక, తమిళనాడు, కేరళ కలుపుకొని సుమారు రూ.50-60 కోట్ల బిజినెస్‌ జరిగిందని అంటున్నారు. అటు ఓవర్సీస్‌ హక్కులను రూ.27 కోట్లకు హమ్సిని ఎంటర్‌టైన్‌మెంట్‌ లాక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆడియో రైట్స్‌ను రూ.33 కోట్లకు టి సిరీస్‌ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దేవర ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌.. రూ.155 కోట్లకు ఖాయం చేసుకోగా మిగిలిన శాటిలైట్‌ హక్కులను కూడా కలుపుకుంటే ప్రీ రిలీజ్‌ బిజినెస్ లెక్కలు ఈజీగానే రూ.400 కోట్లు దాటతాయని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  సినిమా రిలీజ్‌ ఎప్పుడంటే? ‘దేవర’ మూవీ టీజర్‌, ట్రైలర్, సాంగ్‌ రిలీజ్‌ కాకుండానే ఈ స్థాయిలో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు బయటకు రావడంపై సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. దేవర ఫస్ట్‌ పార్ట్‌కే ఈ స్థాయిలో బిజినెస్‌ జరిగితే.. రెండో భాగానికి ఇంకెంత బిజినెస్‌ జరుగుతుందోనని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నాయి. కాగా, అక్టోబర్‌ 10న దసరా కానుకగా దేవర చిత్రం విడుదల కానుంది. ఇందులో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధా ఫిల్మ్స్‌ పతాకాలపై కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. 
    ఏప్రిల్ 16 , 2024
    Gaami Movie: ‘గామి’ చిత్రానికి సెన్సార్‌ బోర్డు షాక్.. ఇక ఇలాంటివి చేయను: విశ్వక్ సేన్
    Gaami Movie: ‘గామి’ చిత్రానికి సెన్సార్‌ బోర్డు షాక్.. ఇక ఇలాంటివి చేయను: విశ్వక్ సేన్
    టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘గామి’ (Gaami). దర్శకుడు విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం (మార్చి 8) ప్రేక్షకుల ముందుకు రానుంది. వినూత్న కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. హాలీవుడ్‌ స్థాయిలో విజువల్‌ ట్రీట్ ఉండటంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ చిత్రంపైకి మళ్లింది. ప్రేక్షకులకు ఈ సినిమా ఒక గొప్ప అనుభూతిని పంచుతుందని మేకర్స్‌ చాలా ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్టు షాకిచ్చింది.  సెన్సార్‌ పూర్తి.. కానీ! ప్రామిసింగ్‌ కంటెంట్‌తో వస్తోన్న 'గామి' చిత్రం.. సెన్సార్‌ కంప్లీట్‌ చేసుకున్నట్లు మేకర్స్‌ ఓ పోస్టర్‌ ద్వారా వెల్లడించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్‌ లభించినట్లు వారు ప్రకటించారు. ‘గామి’ట్రైలర్‌లోని విజువల్స్‌ బట్టి చూస్తే డెఫినెట్‌గా ఈ మూవీకి యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ వస్తుందని అంతా భావించారు. కానీ సెన్సార్‌ బోర్డు.. అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఈ చిత్రంలో పెద్దలు మాత్రమే చూసే కంటెంట్‌ ఉండబోతున్నట్లు ‘ఏ’ సర్టిఫికేట్‌ ఇవ్వడాన్ని బట్టి తెలుస్తోంది. ఇంతకీ ఆ సన్నివేశాలు ఏంటా అని తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.  ‘నా కెరీర్‌లో గామి చివరిది’ ‘గామి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విశ్వక్ సేన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడ గామి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గామి సినిమా నాకే కాదు ఆడియన్స్ కి కూడా చాలా ప్రత్యేకం. దాదాపు ఆరు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నాం. కథ, కథనం, విజువల్స్, గ్రాఫిక్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఆడియన్స్‌కి ఒక సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఇలాంటి సినిమా రావడం చాలా అరుదు. నా కెరీర్‌లో నేను చేస్తున్న చివరి ప్రయోగాత్మక చిత్రం కూడా ఇదే. ఇక నుండి నేను చేసే సినిమాలు వేరే లెవల్లో ఉంటాయి. ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తా’ అని అన్నాడు. ‘ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి’ 'కలర్‌ ఫొటో' ఫేమ్‌ చాందినీ చౌదరి (Chandini Chowdary) ‘గామి’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఆమె సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘వారణాసి, కుంభమేళా, కాశ్మీర్, హిమాలయాలు.. ఇలా రియల్‌ లొకేషన్స్‌లో ‘గామి’ని చిత్రీకరించాం. షూటింగ్‌లో చాలా సవాల్‌తో కూడిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ సినిమా ప్రయాణం ఒక సాహస యాత్రలా జరిగింది. ఐమ్యాక్స్‌ స్క్రీన్‌లో మా మూవీ ట్రైలర్‌ చూసినప్పుడు మా కష్టానికి ప్రతిఫలం లభించిందనే ఆనందంతో నాకు కన్నీళ్లు వచ్చాయి' అని చాందిని తెలిపింది.  విశ్వక్‌ పారితోషికం ఏంతంటే? హీరో విష్వక్‌ సేన్ గత ఆరేళ్లుగా 'గామి' సినిమా కోసం పని చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాకు అతడి రెమ్యూనరేషన్ ఎంత అయ్యి ఉండవచ్చని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అయితే ఈ సినిమా కోసం విశ్వక్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆరేళ్ల క్రితమే సినిమా ప్రారంభం కాగా.. అప్పటికీ విష్వక్‌కు ఈ స్థాయిలో ఫేమ్‌ లేదు. దీంతో క్రౌడ్ ఫండింగ్‌ ద్వారా ఈ సినిమాను కంప్లీట్‌ చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాలకు తగ్గట్లు విష్వక్‌కు భారీ మెుత్తమే ముట్టే అవకాశముంది.
    మార్చి 05 , 2024
    Family Star Day 1 Collections: ‘ఫ్యామిలీ స్టార్‌’కు తొలిరోజు షాకింగ్‌ కలెక్షన్స్‌.. ‘విజయ్‌’ కెరీర్‌లోనే లోయేస్ట్‌!
    Family Star Day 1 Collections: ‘ఫ్యామిలీ స్టార్‌’కు తొలిరోజు షాకింగ్‌ కలెక్షన్స్‌.. ‘విజయ్‌’ కెరీర్‌లోనే లోయేస్ట్‌!
    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరుశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్‌గా చేసింది. నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు డివైడ్‌ టాక్‌ వచ్చింది. సినిమాలోని కామెడీ, సెంటీమెంట్‌ సీన్లను నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. దీని ప్రభావం.. డే1, ఓవర్సీస్‌ తొలిరోజు కలెక్షన్లపై పడిందా? లేదా? ఈ కథనంలో చూద్దాం.  లోయెస్ట్‌ కలెక్షన్స్‌! మిక్స్‌డ్‌ టాక్‌ ఎఫెక్ట్.. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star Day 1 Collections) కలెక్షన్స్ పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.10.60 కోట్ల గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకంటిచాయి. భారత్‌లో రూ. 6.6 కోట్ల గ్రాస్‌ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.4 కోట్లు, తమిళనాడు రూ.30 లక్షలు, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా రూ.20 లక్షలు రాబట్టినట్లు వివరించాయి. దీంతో  విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో అతి త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా ‘ఫ్యామిలీ స్టార్‌’ నిలిచింది. విజయ్‌ గత చిత్రం ‘ఖుషి’.. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.16 కోట్ల గ్రాస్‌ సాధించడం గమనార్హం. ఓవర్సీస్‌లో దూకుడు! లోకల్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా డాలర్ల వేటలో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇప్పటివరకూ 4.75 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్‌ ద్వారా స్వయంగా ప్రకటించారు. ఈ వీకెండ్‌లో మరిన్ని డాలర్లు సాధించే దిశగా ‘ఫ్యామిలీ స్టార్‌’ పరుగులు పెడుతోంది.  బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ ఎంతంటే? భారీ అంచనాలతో వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం.. గణనీయ సంఖ్యలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ (నైజాం)లో రూ. 13 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 4.5 కోట్లు, ఏపీలో రూ.17 కోట్లకు థియేట్రికల్‌ రైట్స్‌ను మేకర్స్ విక్రయించారు. అటు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్లతో కలిపి మెుత్తంగా ఈ సినిమా రూ.43 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఫలితంగా ఫ్యామిలీ స్టార్‌ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.44 కోట్లకు చేరింది. ప్రస్తుత డే1 కలెక్షన్స్‌ బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాగా శ్రమించాల్సి ఉంది.  ‘ఫ్యామిలీ స్టార్‌’.. కథేంటి గోవ‌ర్ధ‌న్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. కుటుంబానికి దూరంగా వెళ్ల‌డం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ప‌నిచేస్తుంటాడు. కుటుంబ బాధ్యతలను మోస్తూ చాలి చాలని జీతంతో నెట్టుకొస్తుంటాడు. ఇలా సాగుతున్న అతడి జీవితంలోకి ఓ రోజు ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డతారు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధ‌న్ చేతికందుతుంది. ఇంత‌కీ ఆ పుస్త‌కంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్ర‌భావితం చేసింది? అస‌లు ఇందు ఎవ‌రు? గోవ‌ర్ధ‌న్ తన కుటుంబ క‌ష్టాల నుంచి గట్టెక్కాడా లేదా? అన్నది కథ.  https://telugu.yousay.tv/family-star-first-review-vijay-who-played-as-a-middle-class-boy-is-family-star-a-hit-free.html
    ఏప్రిల్ 06 , 2024
    Anchor Rashmi: వ్యభిచారంపై యాంకర్‌ రష్మి సంచలన పోస్టు.. షాకవుతున్న నెటిజన్లు!
    Anchor Rashmi: వ్యభిచారంపై యాంకర్‌ రష్మి సంచలన పోస్టు.. షాకవుతున్న నెటిజన్లు!
    తెలుగులో మంచి క్రేజ్ ఉన్న ఫీమేల్ యాంకర్లలో రష్మి (Rashmi) ఒకరు. జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రష్మీ.. అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తోంది. ఓవైపు బుల్లితెర, మరోవైపు వెండితెరను బ్యాలెన్స్‌ చేసుకుంటూ తన కెరీర్‌ను అద్భుతంగా నిర్మించుకుంటోంది. యానిమల్‌ లవర్‌ అయిన రష్మి.. సోషల్‌ మీడియాలో మూగజీవాలకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వ్యభిచారం, సెక్స్‌కు సంబంధించి ఆమె చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.  ఘాటు కొటేషన్‌..! యాంకర్‌ రష్మి.. ఓ వైపు సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలు, జంతువులకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆసక్తిక కొటేషన్‌ను షేర్ చేసింది. ప్రముఖ రచయిత రచల్‌ మోరన్‌ రాసిన ఈ కొటేషన్‌ను రష్మి పంచుకుంది. ఇందులో వ్యభిచారం, మహిళల పేదరికానికి సంబంధించిన ప్రస్తావన ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ కొటేషన్‌లో 'మహిళలు పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మనిషిగా మనం చేయాల్సింది వారికి ఆహారం ఇవ్వడం అంతేకానీ డిక్‌ కాదు’ అని రాసి ఉంది.  కొటేషన్‌కు మూలం ఇదే ప్రముఖ రచయిత రచల్‌ మోరన్‌.. ఈ కొటేషన్‌ను ఓ వేశ్య నుంచి తీసుకున్నారు. ఆమె చెప్పిన వ్యాఖ్యలంటూ దానిని కొటేషన్‌ రూపంలో పేర్కొన్నారు. రష్మి పెట్టిన ఈ పోస్టును అంతర్లీనంగా పరిశీలిస్తే పెద్ద అర్థమే అందులో దాగుంది. ‘చాలా మంది మగవాళ్లు మంచివాళ్లైతే అసలు వ్యభిచారం ఉండదు.. దాని మనుగడ అసలే ఉండదు’ అన‌్నది రష్మిక పోస్టు వెనుక దాగున్న ఉద్దేశం. అయితే రష్మిక లేటెస్ట్ పోస్టు చూసి నెటిజన్లు షాకవుతున్నారు. వ్యభిచారానికి సంబంధించి పోస్టు పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రష్మి ఫ్యాన్స్‌ మాత్రం ఆమె పనిని సమర్థిస్తున్నారు.  గతంలోనూ ఇలాగే.. దేశంలో బాలికలపై జరుగుతున్న వరుస అత్యాచారాలపై గతంలో రష్మిక ఇలాగే ఘాటుగానే స్పందించింది. సె** పట్ల సరైన ప్రాథమిక అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని పేర్కొంది. ప్రతి ఒక్కరికి మినిమం సె** ఎడ్యుకేషన్ ఎంతో అవసరం అంటూ అప్పట్లో సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ఈ అంశం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. కొందరు రష్మి మాటలను సమర్ధిస్తే.. మరికొందరు విమర్శించారు.  రష్మి సినిమా కెరీర్‌.. హోలీ సినిమాతో తెరంగేట్రం చేసిన రష్మీ గౌతమ్‌.. థ్యాంక్స్‌, కరెంట్‌, ఎవరైనా ఎప్పుడైనా, వెల్‌ డన్‌ అబ్బా, బిందాస్‌, చలాకి, ప్రస్తానం తదితర చిత్రాల్లో నటించింది. ‘జబర్దస్త్‌’లో యాంకర్‌గా చేరినప్పటి నుంచి ఈ అమ్మడి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ‘గుంటూరు టాకీస్‌’ చిత్రంలో హీరోయిన్‌గా రష్మి చేసింది. ఆ తర్వాత లీడ్‌ రోల్స్‌లో పలు చిత్రాల్లో కనిపించింది. గతేడాది చిరంజీవి 'భోళాశంకర్‌' సినిమాలోనూ యాంకర్‌ రష్మి మెరిసింది. 
    మే 01 , 2024
    Poonam Pandey: పూనం పాండేపై నెటిజన్లు కన్నెర్ర.. ఏకిపారేస్తూ షాకింగ్‌ కామెంట్స్!
    Poonam Pandey: పూనం పాండేపై నెటిజన్లు కన్నెర్ర.. ఏకిపారేస్తూ షాకింగ్‌ కామెంట్స్!
    బాలీవుడ్‌ నటి, మోడల్‌ పూనమ్‌ పాండే (Poonam Pandey) మృతి చెందినట్లు శుక్రవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొంతకాలంగా సర్వైకల్‌ క్యాన్సర్‌ (Cervical Cancer)తో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె మేనేజర్‌ మీడియాకు వెల్లడించారు. అయితే, నటి మరణ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా పూనం పాండేనే ప్రకటించారు. తాను బతికే ఉన్నట్లు ఓ వీడియో సందేశాన్ని సైతం విడుదల చేశారు. అందుకే ఇలా చేశా: పూనం పాండే తను చనిపోయినట్లు స్వయంగా ప్రకటించుకున్న పూనం పాండే.. అందుకు గల కారణాలను తాజా వీడియోలో వివరించారు. తాను బాధపడుతున్న సర్వైకల్‌ క్యాన్సర్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు. సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడి ఏటా వేలాది మంది మహిళలు చనిపోతున్నట్లు పూనం తెలిపారు. ఆ వ్యాధి బారిన పడితే ఏమి చేయాలన్న అవగాహన చాలా మంది మహిళలకు ఉండటం లేదన్నారు. ఇతర క్యాన్సర్ల లాగే సర్వైకల్‌ క్యాన్సర్‌ను కూడా జయించవచ్చని తెలిపారు. కొన్ని రకాల టెస్టుల ద్వారా ప్రారంభంలోనే ఈ వ్యాధిని గుర్తించి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ (HPV Vaccine) తీసుకోవడం ద్వారా సర్వైకల్‌ క్యాన్సర్‌ నుంచి బయటపడ్డవచ్చని ఆమె సందేశం ఇచ్చారు.  https://twitter.com/i/status/1753677207913070756 ఏకిపారేస్తున్న నెటిజన్లు మరోవైపు పూనం పాండే చేసిన పనిపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సర్వైకర్‌ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలన్న ఆమె ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ అందుకు ఆమె ఎంచుకున్న మార్గం ఏమాత్రం ఆమోదయోగ్యమైంది కాదని అంటున్నారు. ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి కూడా ఆ వ్యాధిపై అవగాహన కల్పించే మార్గముందని చెబుతున్నారు. మరణం అనేది ఎప్పటికీ జోక్‌ కాదని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు.  పూనం పాండే తీసుకున్న నిర్ణయం అగౌరవంగా ఉందని.. ఇలాంటివి యాక్టింగ్‌ స్కూల్‌లో చేసుకుంటే బాగుంటుందని మరో నెటిజన్‌ అన్నారు. హెల్త్‌కేర్‌కు సంబంధించిన అంశాలను ప్రజలకు చేరువ చేయడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయని చెప్పారు.  అటు పూనం పాండే ఫేక్‌ మరణవార్త గురించి కొన్ని ఫన్నీ వీడియోలు కూడా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఒక డెడ్‌బాడీని లిఫ్ట్‌లోకి తీసుకురాగా అది పూనం పాండే లాగా నేను బతికే ఉన్నానని తిరిగి లేచినట్లు ఆ వీడియోలో ఉంది.  https://twitter.com/araza52505/status/1753689758847611052 మరికొందరు నెటిజన్లు ఇంకా విచిత్రమైన కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుత డీప్‌ఫేక్‌ వీడియోలు విస్తృతంగా పెరిగిపోవడంతో ఆమె రిలీజ్‌ చేసిన వీడియో కూడా అలాంటిదేనని ఓ నెటిజన్లు కామెంట్‌ పెట్టాడు. ఆమె నిజంగానే చనిపోయి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.  ఇది ఆమె పబ్లిసిటీ స్టంట్‌ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ఇది పూర్తిగా హేయమైన చర్య అంటూ మరో వ్యక్తి అభిప్రాయ పడ్డాడు.  ఆమె క్యాన్యర్‌పై అవగాహన కల్పించడం కోసం ఇలా చేయదని తన గురించి ప్రచారం కోసమే హేయమైన చర్యకు పూనుకున్నారని ఓ నెటిజన్‌ అన్నారు. ఆమె మరణవార్త విని తాను చాలా ఫీల్‌ అయ్యాయని.. ఎందుకంటే తన తండ్రి కూడా అలాగే చనిపోయాడని అతడు చెప్పుకొచ్చాడు. ‘అందరూ నన్ను క్షమించండి’ పూనం ఫేక్‌ మరణవార్తపై విమర్శలు వస్తోన్న వేళ ఆమె మరో వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. తను చేసిన పని వల్ల ఎవరైనా నొచ్చుకొని ఉంటే వారు క్షమించాలని అందులో కోరారు. ప్రతీ ఒక్కరిని షాక్‌కు గురి చేయాలన్నది తన ఉద్దేశం కాదని.. సర్వైకల్‌ క్యాన్సర్‌పై విస్తృత ప్రచారం కోసమే తాను ఇలా చేశానని పునరుద్ఘటించారు. ఈ ఫేక్‌ మరణవార్తను కాసేపు పక్కన పెడితే.. ప్రతీ ఒక్కరూ సర్వైకర్‌ క్యాన్సర్‌ గురించే చర్చించుకున్నారని గుర్తు చేసారు. ఆ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలగడం అత్యవసరమని చెప్పారు. తన మరణవార్త ద్వారా ఏం జరగాలని ఆశించానో అది నేరవేరిందని అన్నారు. ఇలా చెప్తునందుకు తాను గర్వపడుతున్నట్లు వీడియోను ముగించారు.   https://twitter.com/i/status/1753677387232096338
    ఫిబ్రవరి 03 , 2024
    SSMB29: మూడు పార్ట్స్‌గా రాజమౌళి-మహేష్ సినిమా… బడ్జెట్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?
    SSMB29: మూడు పార్ట్స్‌గా రాజమౌళి-మహేష్ సినిమా… బడ్జెట్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?
    RRR చిత్రం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి.. మహేష్‌ బాబుతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. RRR చిత్రంతో పాన్‌ వరల్డ్‌ డైరెక్టర్‌గా రాజమౌళి గుర్తింపు సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తీయబోయే SSMB29 చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మహేష్‌ను జక్కన్న ఎలా చూపిస్తారన్న ఆసక్తి దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది. మూడు భాగలుగా.. మహేశ్‌తో రాజమౌళి తీయబోయే చిత్రం మూడు పార్ట్‌లుగా రానున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేగాక ఈ సినిమా బడ్జెట్‌ రూ.1000 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఒకసారి సినిమా ప్రారంభమైతే అది రూ.1500 కోట్లకు కూడా పెరగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికన్‌ యాక్టర్‌ జెన్నా ఒర్టెగా (Jenna Ortega) రాజమౌళి సినిమాలో నటిస్తారని రూమర్స్‌ వస్తున్నాయి. ఇప్పటికే జెన్నాతో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతోందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. https://twitter.com/arjuntn369/status/1645598037446918144 View this post on Instagram A post shared by Greg Williams (@gregwilliamsphotography) https://twitter.com/Theme43259475/status/1645457459971076097 హలీవుడ్ యాక్టర్లు మూడు పార్టులుగా తెరకెక్కబోయే రాజమౌళి సినిమాలో హాలీవుడ్‌, బాలీవుడ్ నటులు కూడా భాగస్వామ్యం అవుతారని తెలుస్తోంది. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు కూడా సినిమా కోసం పనిచేస్తారని సమాచారం. SSMB 29, 30, 31 కూడా రాజమౌళి చేతిలోనే ఉందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రానున్న8 ఏళ్లలో ఈ పార్టులు రిలీజ్‌ అవుతాయని చర్చించుకుంటున్నారు. మూడు పార్టులకు 8 ఏళ్లు అంటే మహేష్‌ ఏం చేస్తారోనని ఇప్పటినుంచే ఆయన అభిమానులు ఆలోచనల్లో పడ్డారు. అప్పటివరకు మరో సినిమాలో మహేష్‌ను చూడలేమా అంటూ దిగులు చెందుతున్నారు. అయితే రాజమౌళితో వరుసగా మూడు సినిమాలంటే మామూలు విషయం కాదని తమకు తామే ఫ్యాన్స్‌ సర్దిచెప్పుకుంటున్నారు.  https://twitter.com/Harmindarboxoff/status/1645422058501980165?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1645422058501980165%7Ctwgr%5E409944ca03b55589956ba02ba037da35535fd255%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FHarmindarboxoff%2Fstatus%2F1645422058501980165 హీరోయిన్లు వీళ్లేనా? SSMB29లో మహేశ్‌ సరసన నటించబోయే హీరోయిన్ల గురించి కూడా నెట్టింట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మహేశ్‌ సినిమాలో మెుత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని టాక్‌. బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ, హాలీవుడ్‌ నటి సిడ్నీ స్వీనీ హీరోయిన్లుగా చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా థర్డ్‌ హీరోయిన్‌గా సారా అలీఖాన్‌( Sara Alikhan) పేరు తెరపైకి వచ్చింది. రాజమౌళికి సారా పేరును బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ సూచించారని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమాలో కమల్‌ హాసన్‌, చియాన్‌ విక్రమ్‌, కేరళ నటుడు పృథ్వీరాజ్‌ కూడా నటిస్తారని ఇటీవలే విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది.  https://twitter.com/TLegoude/status/1645522645528776704?s=20 ప్రస్తుతం మహేష్‌ SSMB 28 షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూాజా హెగ్డే నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్‌ శ్రీలీల కూడా సినిమాలో సందడి చేయనుంది. ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్‌ లోపు ఫినిష్‌ చేసేందుకు చిత్ర బృందం కృషి చేస్తోంది. SSMB28 షూట్‌ పూర్తికాగానే రాజమౌళి సినిమాపై మహేష్‌ ఫోకస్‌ పెడతారని తెలుస్తోంది. అక్టోబర్‌ నుంచి రాజమౌళి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.  https://telugu.yousay.tv/ssmb29-rajamoulis-huge-sketch-for-maheshs-film-talks-with-kamal-haasan-chiyan-vikram.html
    ఏప్రిల్ 13 , 2023
    తెలుగు హీరోల్లో అత్యధిక  రెమ్యూరేషన్‌ ఎవరికంటే? తెలిస్తే షాకవుతారు!
    తెలుగు హీరోల్లో అత్యధిక రెమ్యూరేషన్‌ ఎవరికంటే? తెలిస్తే షాకవుతారు!
    ఒకప్పుడు జాతీయ సినీ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మన హీరోల ఫొటోలు, టాలీవుడ్‌ సినిమా పోస్టర్లు కనిపించేవి కావు. అయితే అదంతా గతం. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో మన ఇండస్ట్రీ ఖ్యాతి దేశ సరిహద్దులు దాటిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి వస్తున్న అగ్ర హీరోల సినిమాలన్నీ దాదాపు పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. దీంతో దానికి తగ్గట్లే మన హీరోల రెమ్యూనరేషన్లు సైతం ఆకాశన్నంటాయి. ఒకప్పుడు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకునే స్థితి నుంచి మన అగ్ర హీరోలు రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పైగా తీసుకునే రేంజ్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఏ హీరో రెమ్యూనరేషన్‌ ఎంత ఉందో చూద్దాం. ప్రభాస్‌: హీరో ప్రభాస్‌ కెరీర్‌ బాహుబలి చిత్రం తర్వాత పూర్తిగా మారిపోయింది. బాహుబలి ముందు వరకు టాలీవుడ్‌కే పరిమితమైన ప్రభాస్‌ క్రేజ్‌ఆ సినిమాతో విశ్వవ్యాప్తమైంది. దీంతో రెండేళ్ల నుంచి ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్... సిద్ధార్థ్ సినిమాతో పాటు భవిష్యత్తులో సైన్ చేయబోయే సినిమాల కోసం రెమ్యునరేషన్‌ను మరింత పెంచాడని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ తన 25వ చిత్రం స్పిరిట్‌ కోసం ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  మహేశ్‌: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ‘SSMB28’ నటిస్తున్న మహేశ్.. దాని తర్వాత దర్శకధీరుడు S.S. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ సినిమాలో చేయనున్నారు. రాజమౌళితో సినిమా అంటే ఓ రేంజ్‌లో ఉంటాయని ఆయన గత చిత్రాలు ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి ఇప్పటికే నిరూపించాయి. పాన్‌ వరల్డ్‌గా రూపొందనున్న ఈ మూవీకి మహేశ్‌ ఏకంగా రూ. 100కోట్లు తీసుకుంటున్నారని టాక్. గత చిత్రం ‘సర్కారు వారి పాట’కు రూ.55 కోట్లు తీసుకున్న మహేశ్‌ నెక్స్ట్‌ మూవీకి ఏకంగా వంద కోట్లు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.  పవన్‌ కళ్యాణ్‌: టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతూనే సినిమాలను సైతం అంతే స్పీడుగా పట్టాలెక్కిస్తున్నారు. పవన్‌ ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే హరిహర వీరమల్లు కోసం పవన్‌ రూ. 60 కోట్లు ఛార్జ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన ఒక్కో రోజు షూటింగ్ కోసం రూ. 2 కోట్లు తీసుకున్నట్టు పవన్‌ స్వయంగా వెల్లడించారు.  రామ్‌ చరణ్‌: ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో రామ్‌చరణ్‌ బ్రాండ్‌ పూర్తిగా మారిపోయింది. మగధీర, రంగస్థలంతో చరణ్‌కు వచ్చిన క్రేజ్‌ను RRR రెండింతలు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌ గేమ్ ఛేంజర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చెర్రీ దాదాపు రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు సినిమాకు రూ. 45 కోట్లు తీసుకున్న చెర్రీ శంకర్‌ మూవీ కోసం ఏకంగా రూ. 15 కోట్లు పెంచడం గమనార్హం. చెర్రీ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో నటించనున్నారు.  జూ. ఎన్టీఆర్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం రామ్‌చరణ్‌తో పాటు జూ.ఎన్టీఆర్‌కు వరల్డ్‌వైడ్‌గా ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది.  RRR కు ఎన్టీఆర్‌ రూ. 45 కోట్లు తీసుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ డైరెక్షన్‌లో NTR30 మూవీలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో  రూపొందుతున్న ఈ సినిమాకు ఎన్టీఆర్‌ రూ.60 కోట్లు తీసుకుంటున్నారని టాక్.  https://telugu.yousay.tv/these-are-the-top-10-telugu-heroes-with-the-most-followers-on-instagram.html అల్లు అర్జున్‌: పుష్ప చిత్రంతో అల్లు అర్జున్‌ మేనియా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ మూవీ హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో బన్నీ క్రేజ్‌ బాలీవుడ్‌కు విస్తరించింది. దీంతో అల్లుఅర్జున్ మార్కెట్‌ విలువ భారీగా పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ కోసం బన్నీ కూడా రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  చిరంజీవి అగ్రకథానాయకుడిగా టాలీవుడ్‌ను దశాబ్దాల పాటు ఏలిన మెగాస్టార్‌ చిరు.. సినిమాల్లో తన రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. చిరు మార్కెట్‌ వాల్యూ యంగ్‌ హీరోలకూ ఏ మాత్రం తక్కువగా లేదనే చెప్పాలి. దీంతో చిరు కూడా తన ప్రతీ సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య కోసం చిరు రూ.40 కోట్లు తీసుకున్నారని టాక్. బాలకృష్ణ: నట సింహం బాలకృష్ణ సైతం వరుస హిట్లతో తన మార్కెట్‌ను పెంచుకున్నారు. ‘అఖండ’కు రూ.11 కోట్లు తీసున్న బాలయ్య.. ఆ సినిమా రూ. 90 కోట్ల షేర్‌ వసూలు చేయడంతో రెమ్యూనరేషన్‌ను పెంచారు. ‘వీర సింహారెడ్డి’ కోసం బాలయ్య రూ.15 కోట్లు తీసుకున్నారని తెలిసింది.  విజయ్‌ దేవరకొండ: అర్జున్‌రెడ్డి సినిమాతో యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ టాలీవుడ్ సంచలనంగా మారారు. అయితే ఇటీవల రిలీజైన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌, లైగర్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా ఫెయిల్‌ అయ్యాయి. అయితే వరుస ఫ్లాపులు వస్తున్నప్పటికీ విజయ్ ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ‘లైగర్‌’కు కూడా విజయ్‌ రూ. 15 కోట్లు తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. 
    ఏప్రిల్ 01 , 2023
    రకుల్, జాకీ భగ్నానీ న్యూఇయర్‌ వేడుకలు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
    రకుల్, జాకీ భగ్నానీ న్యూఇయర్‌ వేడుకలు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
    ]దక్షిణాది సినిమాలను ఈ నటి పెద్దగా పట్టించుకోవటం లేదని వినికిడి. టాలీవుడ్‌లో మరోసారి మంచి చిత్రం ద్వారా తన మ్యాజిక్‌ను చూపించాలని కోరుకుందాం.
    ఫిబ్రవరి 13 , 2023
    Music Shop Murthy Review: లక్ష్యం కోసం 52 ఏళ్ల వ్యక్తి చేసే పోరాటం.. ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ ఎలా ఉందంటే ?
    Music Shop Murthy Review: లక్ష్యం కోసం 52 ఏళ్ల వ్యక్తి చేసే పోరాటం.. ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ ఎలా ఉందంటే ?
    నటీనటులు: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు రచన, దర్శకత్వం: శివ పాలడుగు  సంగీతం: పవన్  సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్‌ బెజుగం ఎడిటర్‌: బొంతల నాగేశ్వరరెడ్డి నిర్మాతలు: హర్ష గారపాటి & రంగారావు గారపాటి విడుదల తేది: జూన్‌ 14, 2024 టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్ (Ajay Ghosh), క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy Review). శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి గ్రాండ్‌గా నిర్మించారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్, ప్రమోషన్‌ చిత్రాలు ఆడియన్స్‌ను ఆకర్షిస్తున్నాయి. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? నటుడిగా అజయ్‌ ఘోష్‌ను మరో మెట్టు పైకి ఎక్కించిందా? ఇప్పుడు చూద్దాం.  కథేంటి మూర్తి (అజయ్‌ ఘోష్‌).. 52 ఏళ్ల వయసులో మ్యూజిక్‌ షాప్‌ నడుపుతుంటాడు. లాభాలు లేకున్నా అదే పని చేస్తుంటాడు. అయితే మూర్తికి డీజే అవ్వాలన్న కోరిక ఉంటుంది. మరోవైపు అమెరికా నుంచి వచ్చిన అంజన (చాందిని చౌదరి) కూడా డీజే కావాలని కలలు కంటుంది. అందులో శిక్షణ కూడా తీసుకుంటుంది. ఓ కారణం చేత మూర్తిని కలిసిన అంజన.. డీజే కావాలన్న అతడి ఆసక్తిని గమనించి నేర్పించేందుకు ఒప్పుకుంటుంది. అలా ఆమె వద్ద డీజే నేర్చుకొని హైదరాబాద్‌కు వచ్చిన మూర్తి.. ఎలాంటి కష్టాలు పడ్డాడు? అంజన తండ్రి.. మూర్తిపై ఎందుకు కేసు పెట్టాడు? ఫేమస్‌ డీజే డెవిల్‌ (అమిత్‌ శర్మ) మూర్తిని ఎలా అవమానించాడు? ఇంతకీ మూర్తి డీజేగా సక్సెస్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అజయ్‌ ఘోష్‌.. మూర్తి పాత్రలో మరోమారు అదరగొట్టారు. మధ్యతరగతి వ్యక్తి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించారు. ఓ పక్క తనదైన కామెడీతో నవ్విస్తూనే.. ఎమోషనల్‌ సీన్స్‌లో ఏడిపించారు. ఇక అంజన పాత్రకు హీరోయిన్‌ చాందిని పూర్తిగా న్యాయం చేసింది. మూర్తికి డీజే నేర్పించే క్రమంలో ఆమె చెప్పే డైలాగ్స్‌ ఆలోచింపజేస్తాయి. మూర్తి భార్యగా ఆమని చక్కటి నటన కనబరిచింది. అమిత్‌ శర్మ, భానుచందర్‌, దయానంద్‌ రెడ్డి, పటాస్‌ నాని తదితరులు తమ పాత్ర పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు శివ పాలడుగు.. మూర్తి పాత్రకు అజయ్‌ ఘోష్‌ను ఎంచుకోవడం ద్వారానే సగం విజయం సాధించేశారు. కథలో పెద్దగా మెరుపులు లేనప్పటికీ ఎమోషనల్‌గా సినిమాను నడిపి ఆకట్టుకున్నారు. ప్రారంభంలో కథ స్లోగా నడుస్తున్నట్లు అనిపించినా.. పది నిమిషాలకే అందరు కథలో లీనమవుతారు. ఫస్టాఫ్‌లో మూర్తి ఫ్యామిలీ కష్టాలతో పాటు డీజే సాధన వంటివి చూపించారు. ఇక సెకండాఫ్‌ను ఫన్‌ & ఎమోషనల్‌గా నడిపి దర్శకుడు ఆకట్టున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే ప్రధానమైన క్లైమాక్స్‌ ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా 52 ఏళ్ల మూర్తి.. తన లక్ష్యం కోసం చేసే పోరాటం అందర్నీ మెప్పిస్తుంది.  టెక్నికల్‌గా..  సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా పవన్‌ అందించిన సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. అతడు అందించిన నేపథ్య సంగీతం.. భావోద్వేగ సన్నివేశాలను మరింత హత్తుకునేలా చేసింది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ అజయ్‌ ఘోష్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుప్రీ క్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ స్లో నారేషన్‌క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5   https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-telugu-beauty-chandini-chowdary.html
    జూన్ 14 , 2024
    Allu Arjun : వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు పలికిన అల్లు అర్జున్.. పవన్‌ కళ్యాన్‌కు గట్టి షాక్!
    Allu Arjun : వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు పలికిన అల్లు అర్జున్.. పవన్‌ కళ్యాన్‌కు గట్టి షాక్!
    ఏపీ ఎన్నికల ప్రచారంలో శనివారం (మే 11) ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun), మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) ఎలక్షన్‌ క్యాంపెయిన్‌లో ప్రత్యర్థులుగా మారారు. ముఖ్యంగా బన్నీ.. వైకాపా అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించి మెగా ఫ్యాన్స్‌కు, జన సైనికులకు షాకిచ్చాడు. సీఎం జగన్‌ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించాలంటూ అభ్యర్థించాడు. మరోవైపు అదే సమయంలో చిరు తనయుడు రామ్‌చరణ్‌.. పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురంలో పర్యటించి బాబాయి గెలుపునకు కృషి చేస్తున్నాడు. ప్రస్తుత ఈ రెండు ఘటనలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఏపీ ఎన్నికల వేళ మెగా ఫ్యామిలీ రెండు విడిపోయిందా? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్‌ కోసం బన్నీ! నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి  మద్దతు  తెలపడానికి ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ నంద్యాలకు వెళ్లాడు. దీంతో బన్నీ వ్యవహార శైలి ఏపీలో చర్చనీయాంశంగా మారింది. శిల్పా రవి భార్య నాగిని రెడ్డి.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి క్లాస్ మెట్స్. అలా శిల్పా రవితో బన్నీకి పరిచయం ఏర్పడి స్నేహాంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో శిల్పా రవికి బన్నీ ట్విటర్‌ ద్వారా ‘ఆల్‌ ది బెస్ట్‌’ తెలిపి ఊరుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం కూడా సాధించారు. ఈసారి కూడా వైకాపా తరపున శిల్పా రవి బరిలో ఉండటంతో బన్నీ నేరుగా రంగంలోకి దిగాడు. మామయ్య పవన్‌ కల్యాణ్ గెలుపును కాంక్షిస్తూ ఇటీవల ట్విటర్‌లో పోస్టు మాత్రమే పెట్టిన బన్నీ.. పవన్‌ ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి కోసం స్వయంగా రావడం పొలిటికల్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా, నంద్యాలలో కూటమి అభర్థిగా టీడీపీ నేత ఫరూఖ్‌ బరిలో ఉన్నారు.  https://twitter.com/i/status/1789232102518444087 బన్నీకి ఘన స్వాగతం భార్య సతీమణితో కలిసి నంద్యాల వచ్చిన బన్నీకి వైకాపా అభ్యర్థి శిల్పా రవి దంపతులు గజ మాలతో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు బన్నీ రాక గురించి తెలుసుకున్న ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున నంద్యాల రోడ్లపైకి చేరుకున్నారు. అతడి రేంజ్‌ రోవర్‌ కారును చుట్టుముట్టారు. వేలాది అభిమానుల మధ్య శిల్ప ఇంటికి చేరిన బన్నీ.. బాల్కనీ నుంచి ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అవి చూసిన జనసైనికులు బన్నీ చర్యపై మండిపడుతున్నారు. బన్నీ నిజస్వరూపం బయటపడిందంటూ ఘాటుగా పోస్టులు పెడుతున్నారు.  https://twitter.com/i/status/1789223801865359728 చంద్రబాబు రియాక్షన్‌ నంద్యాలలో బన్నీ పర్యటనపై తెలుగు దేశం అధినేత చంద్రబాబు స్పందించాడు. స్నేహితుడని భావించి అల్లు అర్జున్‌ వైకాపా అభ్యర్థి ఇంటికి వెళ్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశాన్ని పట్టుకొని వైకాపా చౌకబారు రాజకీయాలు చేస్తోందంటూ విమర్శించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తమ వెంట ఉన్నాడన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌ అవుతోంది.  https://twitter.com/SumanthOffl/status/1789218767366652109 పిఠాపురంలో రామ్‌చరణ్‌ జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురంలో గత కొన్ని రోజులుగా తారల సందడి నెలకొండి. పవన్‌కు మద్దతు సినీ నటులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన బాబాయ్‌ కోసం తల్లి సురేఖ, మామ అల్లు అరవింద్‌తో కలిసి రామ్‌చరణ్‌ పిఠాపురం వెళ్లాడు. అంతకుముందు రాజమండ్రి ఎయిర్‌పోర్టులో దిగిన రామ్‌చరణ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. కేరంతలు, ఆనందోత్సాహాల మధ్య తమ అభిమాన హీరోకు ఘన స్వాగతం పలికారు. తొలుత పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించిన చరణ్‌.. పట్టణంలో పర్యటిస్తున్నారు. కాగా, నేటితో ఏపీ ఎన్నికల ప్రచారం ముగియనుంది.  https://twitter.com/i/status/1789234120356499943
    మే 11 , 2024

    @2021 KTree