రివ్యూస్
How was the movie?
తారాగణం
నాగార్జున
ర్జున రవిచంద్రన్
ఇన్స్పెక్టర్ భరత్జుహీ చావ్లా
జ్యోతిఖుష్బు సుందర్
రేఖఅనంత్ నాగ్
డాడీకైకాల సత్యనారాయణ
సుభాష్ తండ్రిబాబు ఆంటోని
మాణిక్ ఇరానీ
శంకర్ పటేల్
శ్రీనాథ్
కమీషనర్ శివ కుమార్PJ శర్మ
హోం మంత్రిత్యాగరాజుఐజి
సాక్షి రంగారావు
రావు ఆహుతి ప్రసాద్
శివ రామ్
అన్నపూర్ణ
సుభాష్ తల్లివై. విజయ
ఐజి భార్యమాస్టర్ అమిత్
సంగీతా నాయర్
చైల్డ్ ఆర్టిస్ట్చారుహాసన్
ముఖ్యమంత్రిసిబ్బంది
రవిచంద్రన్
దర్శకుడువి. రవిచంద్రన్నిర్మాత
హంసలేఖ
సంగీతకారుడుకథనాలు
HBD Rajinikanth: రజనీకాంత్ - చిరంజీవి కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా?
ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన అగ్ర నటుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఒకరు. కోలీవుడ్‌కు చెందిన రజనీకి తెలుగుతో పాటు హిందీలోనూ వీరాభిమానులు ఉన్నారు. ఆయన చేసిన చాలవరకూ చిత్రాలు తెలుగులో డైరెక్ట్‌గా రిలీజై సూపర్ హిట్ విజయాలను అందుకున్నారు. కాగా, ఇవాళ (12 December) రజనీకాంత్ (HBD Rajinikanth) పుట్టిన రోజు . 74వ ఏటలోకి సూపర్ స్టార్ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో కలిసి నటించిన తెలుగు స్టార్ హీరోలు ఎవరు? ఏ ఏ చిత్రాల్లో నటించారు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
నందమూరి తారకరామారావుతో..
టాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంగత నందమూరి తారకరమారావు (Nandamuri Taraka Rama Rao)తో రజనీకాంత్ నటించారు. వారి కాంబోలో రూపొందిన ఒకే ఒక్క చిత్రం ‘టైగర్’ (Tiger Movie). 1979లో వచ్చిన ఈ చిత్రంలో రామారావు ప్రధాన హీరోగా నటిస్తే రజనీకాంత్ రెంటో కథానాయకుడిగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాను హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా హీరోలుగా ‘ఖూన్ పసీనా’ పేరుతో రీమేక్ చేశారు.
శోభన్ బాబుతో..
నట భూషణ్ శోభన్ బాబు (Sobhan Babu) తోనూ రజనీకాంత్ ఓ చిత్రంలో నటించారు. 1986లో వచ్చిన ‘జీవన పోరాటం’ సినిమాలో శోభన్ బాబు, రజనీకాంత్ అన్నదమ్ములుగా చేశారు. ఈ సినిమా కూడా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో సూపర్ హిట్‌గా నలిచిన ‘రోటి కపడా ఔర్ మకాన్’ చిత్రానికి రీమేక్‌గా తీశారు. అందులో మనోజ్ కుమార్, శశికపూర్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు.
సూపర్ కృష్ణతో..
ఒకప్పటి దిగ్గజ నటుడు సూపర్ కృష్ణ (Krishna) తోనూ రజనీకాంత్ నటించారు. ఏకంగా మూడు సినిమాల్లో వారు కలిసి చేశారు. ‘ఇద్దరూ అసాధ్యులే’ (1979), ‘అన్నదమ్ముల సవాల్’ (1978), ‘రామ్ రాబర్ట్ రహీమ్’ (1977) చిత్రాల్లో కృష్ణ, రజనీ నటించారు. ఈ మూడు చిత్రాలు యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మెగాస్టార్ చిరంజీవితో..
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తోనూ రజనీకాంత్ మూడు చిత్రాల్లో నటించారు. తెలుగులో వచ్చిన ‘కాళీ’, ‘బందిపోటు సింహం’ సినిమాల్లో వీరు (Chiranjeevi Rajinikanth Movies) స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ‘కాళీ’ సినిమాలో చిరు, రజనీ హీరోలుగా చేశారు. అయితే ‘బందిపోటు సింహం’లో మాత్రం రజనీకి విలన్‌గా చిరు నటించారు. అయితే ఆ రెండు చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించలేదు. అటు తమిళంలో రూపొందిన ‘మాపిళ్లై’ సినిమాలో చిరు గెస్ట్ రోల్లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. తెలుగు చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు సినిమాకు రీమేక్‌గా ‘మాపిళ్లై’ తమిళంలో రూపొందింది.
https://twitter.com/atheisttindian/status/1212794102867083265
డైలాగ్ కింగ్ మోహన్‌బాబుతో..
తెలుగు ఇండస్ట్రీలో నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu)తో రజనీకాంత్‌కు మంచి స్నేహబంధం ఉంది. ఒకరినొకరు ఓరేయ్ అని పిలుచుకునేంత చనువు వారి మధ్య ఉంది. ఇది పలు వేదికల్లో నిరూపితమైంది. ఇదిలా ఉంటే వీరి కాంబోలో పలు చిత్రాలు వచ్చాయి. రజనీ నటించిన చిత్రాల్లో మోహన్‌బాబు విలన్ పాత్ర పోషించారు. అయితే వీరి కాంబోలో వచ్చిన ‘పెదరాయుడు’ (Pedarayudu Movie) చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో మోహన్‌బాబు తండ్రిగా రజనీకాంత్ కనిపించారు. పాపారాయుడు పాత్రలో నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నందమూరి తారకరామారావు పాల్గొనడం విశేషం.
అక్కినేని నాగార్జునతో..
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రజనీకాంత్ (HBD Rajinikanth) కాంబోలో చాన్నాళ్ల తర్వాత ఓ సినిమా రూపుందుతోంది. రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరు కలిసి ఒక్కసారి కూడా తెరపై కనిపించలేదు. దీంతో ‘కూలీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గతంలో ఒకే సినిమా షూటింగ్లో నాగార్జున - రజనీకాంత్ పాల్గొన్నారు. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్‌తో కలిసి ‘పోలీస్ బుల్లెట్’ అనే సినిమాలో రజనీకాంత్ నటించారు. అయితే తెలుగులో ఈ సినిమాను ‘శాంతి క్రాంతి’ పేరుతో నాగార్జున, రవిచంద్రన్ తీశారు. ఒకేసారి తెరకెక్కించడంతో రజనీకాంత్ షూట్ అవ్వగానే నాగార్జున ఆయన పాత్రలో షూటింగ్లో నటించాడు.
జగపతి బాబుతో..
రజినీకాంత్ (HBD Rajinikanth), జగపతి బాబు (Jagapathi Babu) కలిసి ‘కథానాయకుడు’తో పాటు ‘లింగ’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే ‘అన్నాత్తే’, ‘పెద్దన్న’ సినిమాల్లో కూడా ఈ దిగ్గజ నటులు కలిసి నటించారు. ముఖ్యంగా ‘కథానాయకుడు’ సినిమాలో వీరి నటనకు మంచి గుర్తింపు లభించింది.
https://twitter.com/SolidLover123/status/1562791842898669568
డిసెంబర్ 12 , 2024
Oh My God 2 Review: సెక్స్‌పై సమాజం దృష్టిని మార్చే ప్రయత్నం.. అక్షయ్ నటించిన OMG 2 ఎలా ఉందంటే?
నటీనటులు: అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, పవన్ మల్హోత్రా, తదితరులు
రచన, దర్శకత్వం: అమిత్ రాయ్
విడుదల తేదీ: ఆగస్టు 11
2012లో వచ్చిన ‘ఓ మై గాడ్’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓ మై గాడ్ 2’ వచ్చింది. తొలి భాగంలో అక్షయ్ కుమార్ శ్రీ కృష్ణుడిగా కనిపించాడు. విభిన్నమైన అంశంతో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరొక కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేసింది. మరి, శుక్రవారం(Aug 11) థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సగటు ఆడియెన్స్‌ని మెప్పించిందా? ఈ సారి పోరాటంలో ఎవరు గెలిచారు? అని ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటంటే?
కాంతి శరణ్ ముద్గల్(పంకజ్ త్రిపాఠి) దైవ భక్తుడు. పట్టింపులను పాటించే వ్యక్తి. ఒక రోజు పాఠశాల టాయిలెట్లో తన కొడుకు హస్తప్రయోగం(Masturbation) చేసుకుంటాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది. దీంతో కాంతి ఫ్యామిలీ మానసికంగా ఎంతో కుంగిపోతుంది. బయటి వారికి ముఖం చూపించలేక పోతుంది. ఈ క్రమంలో వీరిని బయట పడేయడానికి దైవదూత(అక్షయ్ కుమార్) వస్తాడు. జరిగిన అన్యాయానికి ఎదురు నిలబడి న్యాయ పోరాటం చేయాలని కాంతికి సూచిస్తాడు. ఆ తర్వాత, పాఠశాలతో పాటు మొదట కొడుకు వైపు నిలబడనందుకు తనపై కూడా కేసు వేసుకుని కేసు విచారణ చేస్తుంటాడు. ప్రతి పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్‌ని సిలబస్‌గా చేర్చితే తన కొడుక్కి ఈ పరిస్థితి వచ్చుండేది కాదంటూ వాదిస్తాడు. మరి, చివరికి న్యాయం ఎవరు వైపు నిలిచింది? కాంతికి దైవదూత చేసిన సహాయం ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
https://twitter.com/Jagadishroyspr/status/1689888371089510400?s=20
ఎలా ఉంది?
ప్రస్తుత సమాజంలో చాలా మంది శృంగారం(సెక్స్), సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చర్చించడానికి మొహమాట పడతారు. సరిగ్గా, ఈ వృత్తాంతాన్నే కథాంశంగా చూపించారు. ప్రతి పాఠశాల సిలబస్‌లో సెక్స్ ఎడ్యుకేషన్‌ని చేర్చాలని సినిమా ద్వారా చూపించడం బాగుంది. సున్నితమైన అంశం కనుక ఎక్కడా పక్కదారి పట్టకుండా పాయింట్‌పై ఫోకస్ చేస్తూ వినోదభరితంగా చెప్పడం మెచ్చుకోదగిందే. మాస్టర్బేషన్ ఒక నేరం కింద పరిగణించకూడదని చేసే వాదనలు ఆలోచింపజేస్తాయి. సెక్స్ విషయంలో సొసైటీ ఆలోచనా తీరును ఎండగట్టి కాస్త అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది. కోర్టు సన్నివేశాలతో సినిమాను మొదలు పెట్టి కథాంశాన్ని చెప్పడం, తర్వాత అక్షయ్ కుమార్ ఎంట్రీతో కథలో కదలిక రావడం చకచకా జరిగిపోతాయి. సెకండాఫ్ తొలి పోర్షన్లలో సినిమా కాస్త డల్‌గా అనిపించినా చివరి 40 నిమిషాల్లో ప్రేక్షకుడి మైండ్ మారిపోతుంది. అయితే, కాంతి వాదనల్లో ద్వంద్వ వైఖరి కనిపించడం ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజ్ చేస్తుంది.
ఎవరెలా చేశారు?
ఇది పూర్తిగా పంకజ్ త్రిపాఠి సినిమా అని చెప్పుకోవాలి. అక్షయ్ కుమార్ పూర్తి లెంగ్త్ ఉన్న అతిథి పాత్రను చేశాడనిపిస్తుంది. సినిమాలో పంకజ్ ఇరగదీశాడు. కోర్టు సీన్లలో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నాడు. ఇక దైవ దూతగా అక్షయ్ అలరించాడు. తన క్యారెక్టర్ పదును ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. ఇక, అపోనెంట్ లాయర్‌గా యామీ గౌతమ్ బలమైన పోటీ ఇచ్చింది. తన నటనతో మెప్పించింది.
https://twitter.com/Ajju___Bhai/status/1689868294038454273?s=20
టెక్నికల్‌గా
సున్నితమైన అంశాన్ని ప్రస్తావించడంలో రచయిత, డైరెక్టర్ అమిత్ రాయ్ సఫలమయ్యాడు. చాలా వినోదభరితంగా ఈ సమస్యను లేవనెత్తగలిగాడు. ఆసక్తికర కథనంతో ప్రేక్షకుడిని మెప్పించాడు. ప్రత్యేకంగా ఆలోచింపజేసే డైలాగులను డెలివరీ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్‌లో పరిపూర్ణ హిందీలో డైలాగ్స్ రాసుకోవడం భాషాభిమానులను మెప్పిస్తుంది. చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టకుండా సూటిగా లేవనెత్తాడు. ఎక్కడా స్థాయిని దిగజార్చే మాటలు వాడకపోవడం ప్రశంసనీయం.
పాజిటివ్ పాయింట్స్
నటీనటులు
కథ
కామెడీ
రచన
నెగెటివ్ పాయింట్స్
కన్ఫ్యూజ్డ్ క్యారెక్టరైజేషన్
కొన్ని బోర్ కొట్టించే సన్నివేశాలు
రేటింగ్.. 3.25/5
https://www.youtube.com/watch?v=x-KtclLsK7Q
ఆగస్టు 11 , 2023
Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. సస్పెన్స్‌కు తెర!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న “జై హనుమాన్” నుండి ఆసక్తికరమైన అప్డేట్ను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పటి నుంచో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారా అన్న చర్చకు ఎట్టకేలకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్లో(Jai Hanuman First Look) హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నారని పోస్టర్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో రిషబ్ శెట్టి హనుమంతుడిగా శక్తివంతంగా దర్శనమిస్తుండగా, ఆయన చేతిలో రాముడి విగ్రహాన్ని పట్టుకుని ఉన్న చిత్రం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్లో వచ్చిన 'హనుమాన్' యావత్ దేశాన్ని షేక్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ ఈమూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పెద్ద ఎత్తున సంప్రదింపులు జరిగాయి. కానీ ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచారు.
‘హనుమాన్’గా తొలుత యష్
‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే 'జై హనుమాన్' ఎలా ఉండనుందో హింట్ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్ సీక్వెల్లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, (Jai Hanuman First Look)రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. కేజీఎఫ్ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే యష్ టాక్సిక్ షూటింగ్లో బిజీగా ఉండటంతో కాంబినేషన్ కుదరలేదు. అయితే గత నెలలో రిషబ్ శెట్టిని ప్రశాంత్ వర్మ కలిసి స్టోరీ వినిపించగా ఆయన ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. దీంతో అధికారికంగా మూవీ మేకర్స్ రిషబ్ శెట్టి పేరును అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అటు మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అందుకే రిషబ్ శెట్టిని సెలెక్ట్ చేశారా?
రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'కాంతారా' జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’, ‘ది లయన్ కింగ్’, ‘బాట్‌మ్యాన్’ లాంటి విజయవంతమైన హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రిషబ్ శెట్టి క్రేజ్ జై హనుమాన్కు బాగా కలిసి వస్తుందని మూవీ మేకర్స్ అంచనా వేశారు. మరోవైపు కన్నడ మార్కెట్ కూడా కలిసి వస్తోందని భావిస్తున్నారు. పాన్ ఇండియా గోల్‌ను రిషబ్ శెట్టి ద్వారా ఈజీగా చేరుకోవచ్చని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
‘మహా కాళీ’ ప్రాజెక్ట్
మరోవైపు ‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి 'మహా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను(Jai Hanuman First Look) మేకర్స్ రిలీజ్ చేశారు. భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్ వర్మ పోస్టు పెట్టారు.
https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423
అక్టోబర్ 30 , 2024
Jai Hanuman: హనుమాన్‌గా కాంతారా హీరో రిషబ్ శెట్టి?
యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్లో వచ్చిన 'హనుమాన్' యావత్ దేశాన్ని షేక్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పాన్ ఇండియా స్టార్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
‘హనుమాన్’గా కాంతార నటుడు!
‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే 'జై హనుమాన్' ఎలా ఉండనుందో హింట్ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్ సీక్వెల్లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. ఇటీవల కేజీఎఫ్ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లే అని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. కానీ, లేటెస్ట్ బజ్ ప్రకారం కాంతారా ఫేమ్ రిషబ్‌శెట్టితో ప్రశాంత్ వర్మ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హనుమంతుడి పాత్ర కోసం ఆయన్ను సంప్రదించినట్లు సమాచారం. రిషబ్ శెట్టి సైతం ఈ ప్రాజెక్ట్ ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం ఇండస్ట్రీ లీక్.. అఫిషియల్‌గా ఇంకా అనౌన్స్ మెంట్ చేయాల్సిన అవసరం ఉంది.
స్టార్ల పేర్ల వెనక స్ట్రాటజీ ఉందా?
‘జై హనుమాన్’ను ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదోక వార్త నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంది. ఇందులోని హనుమాన్ పాత్రకు పలానా స్టార్ హీరోను ఫైనల్ చేసినట్లు కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి రామ్‌చరణ్, రానా దగ్గుబాటి, కేజీఎఫ్ ఫేమ్ యష్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా రిషబ్ శెట్టి ఫైనల్ అయ్యాడంటూ కథనాలు మెుదలయ్యాయి. మరి అతడైనా ఖరారు అవుతాడో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే దీనివెనక పెద్ద ప్రమోషన్ స్టంట్ ఉన్నట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘జై హనుమాన్’పై ప్రేక్షకుల్లో హైప్ తగ్గిపోకుండా చిత్ర బృందంమే ఇలా లీక్స్ ఇస్తున్నట్లు అభిప్రాయపడుతున్నాయి. అప్పుడు ‘జై హనుమాన్’ అంశం ట్రెండింగ్‌లోకి వచ్చి ప్రజల్లో హైప్ తగ్గకుండా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
‘కాంతార’తో పాన్ ఇండియా క్రేజ్
రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'కాంతారా' జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’, ‘ది లయన్ కింగ్’, ‘బాట్‌మ్యాన్’ లాంటి విజయవంతమైన హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది.
‘మహా కాళీ’ ప్రాజెక్ట్
‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి 'మహా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్ వర్మ పోస్టు పెట్టారు.
https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423
‘జై హనుమాన్’ కంటే ముందే..
తన సినిమాటిక్ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని స్పష్టం చేశారు. ‘జై హనుమాన్’ కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళీ’ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటు నందమూరి వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నట్లు కూడా ఇటీవలే తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్ వర్మ దూకుడు చూస్తుంటే ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.
అక్టోబర్ 18 , 2024
Operation Valentine Box Office Collections: ఫస్ట్ వీకెండ్ తీవ్రంగా నిరాశ పరిచిన వసూళ్లు.. కారణం ఇదే!
మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej), మానుషి చిల్లర్ (Manushi Chhillar) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine). భారీ అంచనాల నడుమ గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రంలో.. ఫైటర్ పైలెట్‌గా వరుణ్ తేజ్ మంచి నటన కనబరిచాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు తిరుగుండదని అంతా భావించారు. కానీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. కలెక్షన్స్‌కు ఎంతో కీలకమైన తొలి వీకెండ్లోనే ఈ చిత్రం రూ.6 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
బ్రేక్ ఈవెన్ కష్టమే!
భారత వైమానిక దళం (Operation Valentine Weekend Collections) ఆధారంగా వచ్చిన తొలి తెలుగు చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. దీంతో సహజంగానే అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ చిత్రం విడుదలకు ముందు కూడా మంచి బిజినెస్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ.17 కోట్లకు అమ్ముడుపోవడం గమనార్హం. తొలి షోకు వచ్చిన పాజిటివ్ టాక్‌ను బట్టి ఈజీగానే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని అంతా భావించారు. అయితే తొలి వీకెండ్ వసూళ్లను చూసి మూవీ టీమ్ అంచనాలు తలకిందులైనట్లు కనిపిస్తోంది. కనీసం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
50% దాటని ఆక్యుపెన్సీ!
‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాన్ని వరుణ్ తేజ్ (Varun Tej)తో పాటు చిత్ర యూనిట్ చాలా బాగా ప్రమోట్ చేసింది. క్రమం తప్పకుండా సినిమాకు సంబంధించిన పోస్టర్లు, అప్డేట్స్ ఇస్తూ ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమా ఒకేసారి రిలీజ్ చేయడంతో బాలీవుడ్‌లోనూ మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహించారు. అయితే హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఆక్యుపెన్సీ ఎప్పుడూ 50 శాతం దాటలేదు. తొలి షో నుంచే మూవీకి నెగటివ్ రివ్యూలు రావడం కూడా సినిమాను దెబ్బ తీసింది. ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీని తెలుగు ప్రేక్షకులు అసలు ఆదరించలేదు.
ఇదేనా కారణం?
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతుండటం, పోటీపరీక్షలకు నోటిఫికెషన్లు జారీ కావడం వంటి అంశాలు ఈ చిత్రం వసూళ్ల ప్రభావం పడింది. పాజిటివ్ టాక్ ఉండటంతో వీకెండ్స్‌లో ఈ చిత్రం కలెక్షన్లు (Operation Valentine Box Office Collection) భారీగా పెరిగే అవకాశం ఉంది
హిందీలో దెబ్బతీసిన ‘ఫైటర్’!
ఇటీవల హిందీలో హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన ‘ఫైటర్’ (Fighter) చిత్రం రిలీజైంది. ఈ చిత్రం కూడా భారత వైమానిక దళం కాన్సెప్ట్‌తోనే విడుదలైంది. పుల్వామా దాడి, తర్వాత ఇండియా తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలు తెరకెక్కాయి. పైగా ఈ రెండు చిత్రాల విడుదలకు పెద్దగా గ్యాప్ కూడా లేకపోవడంతో హిందీలో ‘ఆపరేషన్ వాలెంటైన్’ పెద్దగా ఆదరణ లభించలేదు. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్‌కు తెలుగు, హిందీ భాషల్లో ఈ ‘ఆపరేషన్ వాలెంటైన్’ నిరాశనే మిగిల్చింది.
సినిమాను అవే దెబ్బతీశాయా?
‘ఆపరేషన్ వాలెంటైన్’ సెటప్, యాక్షన్ ఎపిసోడ్స్, హీరో యాక్టింగ్ బాగున్నా.. కథలో స్ట్రాంగ్ ఎమోషన్ కనిపించదు. సర్జికల్ స్ట్రైక్‌ను సక్సెస్ చేయడంలో వైమానిక దళం పడిన కష్టాన్ని పైపైన చెప్పినట్లుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ సైతం సరిగా వర్కవుట్ కాలేదు. ఈ మూవీలో ఎయిర్‌ఫోర్స్ అధికారులు వాడే డైలాగ్స్ కామన్ ఆడియెన్స్‌కు చాలా వరకు అర్థం కాలేదు. గ్రాఫిక్స్ విషయంలో కూడా అక్కడక్కడ కాంప్రమైజ్ అయినట్లుగా కనిపిస్తుంది. ఇవన్నీ సినిమాపై కలెక్షన్లపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
త్వరగానే ఓటీటీలోకి!
‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర మూవీకి పెద్దగా ఆదరణ లభించకపోవడంతో ఓటీటీలోకి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలి వారంలోనే వరుణ్ తేజ్ మూవీ ప్రైమ్ వీడియోలోకి రావచ్చు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ తన నెక్ట్స్ మూవీ మట్కా (Matka)లో నటిస్తున్నాడు.
సాక్నిక్ లెక్కల ప్రకారం
ఇదిలా ఉంటే 'ఆపరేషన్ వాలెంటైన్' కలెక్షన్స్ వివరాలను ప్రముఖ సినిమా వెబ్సైట్ 'సాక్నిక్' వెల్లడించింది. దాని ప్రకారం వరుణ్ తేజ్ సినిమా కలెక్షన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల నెట్ కలెక్షన్స్ - రూ.4.42 కోట్లు
హిందీలో మూడు రోజుల నెట్ కలెక్షన్స్ -రూ. 1.29 కోట్లు
దేశవ్యాప్తంగా మూడు రోజుల నెట్ కలెక్షన్స్ - రూ. 5.71 కోట్లు
ఓవర్సీస్లో మూడు రోజుల నెట్ కలెక్షన్స్ - రూ.0.25కోట్లు
ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ వాలెంటైన్స్ వసూళ్లు - రూ.6 కోట్లు
మార్చి 04 , 2024
MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’... తారక్ బావమరిది హిట్ కొట్టినట్లేనా!
నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు తదితరులు
దర్శకత్వం: కల్యాణ్ శంకర్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫ్రీ: శ్యామ్ దత్ -దినేష్ క్రిష్ణన్ బి
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
విడుదల తేదీ: 06-10-2023
ప్రస్తుతం టాలీవుడ్లో యూత్‌ఫుల్ సినిమా హవా బాగా పెరిగిపోయింది. యువతను ఆకట్టుకునే అంశాలను కథాంశంగా చేసుకొని పలు సినిమాలు మంచి టాక్‌ను తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం మ్యాడ్ (MAD) తెరకెక్కింది. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అలాగే యంగ్ హీరో సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంత మంది నూతన నటీనటులు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుందని మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ పదే పదే చెబుతూ వచ్చింది. మరి సినిమా నిజంగా నవ్వులు పూయించిందా? మంచి హిట్ సొంతం చేసుకుందా? అసలు మూవీ కథేంటి? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం.
కథ
మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) మంచి స్నేహితులు. వారు రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లలో చదువుతుంటారు. భగవాన్ క్యాంటిన్ విషయంలో జరిగిన బాస్కెట్ బాల్ పోటీలో విజేతగా నిలిచి వారు బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారతారు. ఇక మనోజ్.. శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్‌ను ఇష్టపడుతుంటుంది. దామోదర్ (డీడీ)కు గుర్తుతెలియని అమ్మాయి ప్రేమ లేఖలు రాయడంతో అతడు ఆమె ప్రేమలో పడతాడు. ఇలా వెన్నెల అనే అమ్మాయిని చూడకుండానే నాలుగేళ్లు గడిపేస్తాడు డీడీ. ఇంతకీ వెన్నెల ఎవరు?. ఆమెను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మనోజ్, అశోక్, దామోదర్ తమ ప్రేమను గెలిపించుకున్నారా? వంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా సాగిందంటే
ప్రథమార్ధం ప్రధాన పాత్రల పరిచయం, క్యాంపస్ కబుర్లు, ప్రేమ కబుర్లతో సాగిపోతుంది. ద్వితీయార్ధంలో వెన్నెల కోసం డీడీ వెతుకులాట, మనోజ్, అశోక్ ప్రేమ జంటల ఊసులు, లేడీస్ హాస్టల్లో డీడీ గ్యాంగ్ హంగామా కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. కథగా చూసుకుంటే పెద్దగా చెప్పడానికి లేకపోయినా కథనంలో పాత్రలు ప్రవర్తించే తీరు, వారి మధ్య సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశం వినోదాన్ని పంచుతూ సాగుతుంది. ప్రేక్షకులకు రెండు గంటలపాటు ఇంజనీరింగ్ కాలేజిలో ఉన్నామనే భావన కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే
తారక్ బావమరిది నార్నె నితిన్.. అశోక్ పాత్రలో లీనమై నటించాడు. సినిమా ప్రారంభ సన్నివేశాల్లో సీరియస్ లుక్‌లో కనిపించినా పతాక సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఎలివేషన్ సీన్స్ మెప్పించాడు. ఇక సంగీత్ శోభన్ , విష్ణుల పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీత్ శోభన్ వేగంగా చెప్పే సంభాషణలు, తన నటన తీరుతో మంచి మార్కులు కొట్టేశాడు. లడ్డూగా విష్ణు తన కామెడి టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ లవ్లీ బాయ్‌గా కనిపించి సందడి చేశాడు. అమ్మాయిలు గౌరి, అనంతిక చక్కటి నటన ప్రదర్శించారు. రఘుబాబు, మురళీధర్ గౌడ్లు తమ పాత్రల పరిధి మేర నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ అతిథి పాత్రలో మెరిసి కేకలు పుట్టించాడు. ఇతర పాత్రల్లో కనిపించిన నూతన నటీనటులంతా బాగా చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
కాలేజి క్యాంపస్‌లో చదువులు, విద్యార్థుల మనస్తత్వాలు, పోటీ ప్రపంచంలో విద్యార్థులు నలిగిపోయే తీరు ఎప్పటికీ కథా వస్తువులే. అయితే ‘మ్యాడ్’ సినిమాలో వాటిని దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. కథను తీర్చిదిద్దన విధానం బాగుంది. గతంలో వచ్చిన సినిమాల తాలుకు ఛాయలు కనిపించకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టర్ చాలా సులభంగా చెప్పేశారు. చదువులు, ర్యాగింగ్ , ర్యాంకులు జోలికి పోకుండా విద్యార్థులు ప్రవర్తించే తీరు, వారి మాటలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. కాలేజిలో దొరికే స్నేహం ఎంత మధురంగా, స్వచ్ఛంగా ఉంటుందనే విషయాన్ని మ్యాడ్ రూపంలో చక్కగా వివరించారు. డైరెక్టర్ కల్యాణ్ రాసిన మాటలు ప్రతి సన్నివేశంలో నవ్వులు పంచాయి..
టెక్నికల్‌గా
పాటల విషయంలో సంగీత దర్శకుడు భీమ్స్ మరింత శ్రద్ధ పెట్టాల్సింది. శ్యామ్ దత్ - దినేష్ క్రిష్ణన్‌ల సినిమాటోగ్రఫి సినిమాను మరో మెట్టు ఎక్కించింది. వారు క్యాంపస్ వాతావరణాన్ని, పాత్రలను అందంగా చూపించింది. నిర్మాణం పరంగా సినిమా ఉన్నతంగా అనిపించింది. నిర్మాతగా అడుగుపెట్టిన హారిక సూర్యదేవరకు మొదటి ప్రయత్నం బాగా కలిసొస్తుందని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటనకామెడీ సీన్స్‌సంభాషణలుసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
పాటలుకథ పెద్దగా లేకపోవడం
రేటింగ్: 3.5/5
అక్టోబర్ 06 , 2023
‘రావణాసుర’లో “దశకంఠా రావణా..” అన్న ‘శాంతి పీపుల్’(Shanti people)
]“రావణాసురా దశకంఠా..” మీ మనసును ఆక్రమించేసిందా. అయితే శాంతి పీపుల్ చేసిన
ఈ పాటలు కూడా వినండి. మీకు తప్పక నచ్చుతాయిమహిశాసుర మర్ధినిWatch Nowకృష్ణాWatch Nowదేవా మహదేవాWatch Nowరాధా మధవWatch NowతాండవWatch Nowమురుగన్Watch Nowశివ శంభోWatch Nowఅయిగిరి నందినిWatch Now
ఫిబ్రవరి 10 , 2023
Trivikram Birthday Special: త్రివిక్రమ్ శ్రీనివాస్ బెస్ట్ డైలాగ్స్
]యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతి అడిగే హక్కు లేదు.- అరవింద సమేత వీర రాఘవ
ఫిబ్రవరి 11 , 2023
Happy Birthday Kamal Hassan: నవరసాల నట వైవిధ్యం కమల్ హాసన్
]సాగర సంగమం చిత్రంలో కమల్ హాసన్ నట విశ్వరూపమే ప్రదర్శించారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో అతను ప్రదర్శించిన శాంతి రసం ఎంతో అద్భుతం. ఎంతో శక్తివంతమైన క్లైమాక్స్ సన్నివేశాల్లో ఇది ఒకటిశాంతి- సాగర సంగమం (1983)
ఫిబ్రవరి 11 , 2023
Line Man Review: హీరో దెబ్బకు ఆ గ్రామంలో కరెంటు కష్టాలు.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : త్రిగుణ్, కాజల్ కుందెర్, జయశ్రీ, హరిణీ శ్రీకాంత్ తదితరులు..
డైరెక్టర్ : వి. రఘు శాస్త్రి
సంగీతం: మణికాంత్ ఖాద్రి
సినిమాటోగ్రాఫర్ : శాంతి సాగర్ హెచ్.జీ
నిర్మాత : గణేష్ పాపన్న
విడుదల తేదీ: 22-03-2024
యంగ్ హీరో త్రిగుణ్ (Trigun), కాజల్ కుందెర్ (Kaajal Kunder) జంటగా రఘు శాస్త్రి (Raghu Shastry) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లైన్ మ్యాన్’ (Line Man Review In Telugu). పర్పల్ రాక్ ఎంటర్టైనర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని తెరకెక్కించారు. కేరళలో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇవాళ తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
నటరాజ్ అలియాస్ నట్టు (త్రిగుణ్) తండ్రి విద్యుత్‌శాఖలో లైన్‌మ్యాన్‌గా పనిచేసేవాడు. ఆయన అకస్మిక మరణంతో ఆ జాబ్ నట్టుకు వస్తుంది. దీంతో ఊర్లో కరెంట్ రావాలన్న, పోవాలన్న అంతా నట్టు చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో గ్రామంలో అందరికి పురుళ్లు పోసే దేవుడమ్మ (బి. జయశ్రీ) 100వ పుట్టిన రోజు ఘనంగా చేద్దామని నట్టు గ్రామస్తులకు సలహా ఇస్తాడు. ఇందుకు గ్రామస్తులు ఓకే చెప్పి ఏర్పాట్లు కూడా మెుదలుపెడతారు. అయితే సడెన్‌గా నట్టు కరెంటు ఇవ్వను అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతారు. నట్టు ఎందుకు అలా అన్నాడు? దేవుడమ్మ రియాక్షన్ ఏంటి? కొన్ని రోజుల పాటు కరెంట్ ఆపేయడానికి కారణం ఏంటి? మళ్ళీ ఆ ఊరికి నట్టు కరెంట్ ఇచ్చాడా? లేదా? అన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
హీరో త్రిగుణ్.. లైన్ మ్యాన్ (Line Man Review In Telugu) పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. పల్లెటూరు వ్యక్తిగా నేచురల్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. చక్కగా హావాభావాలను పలికించి మెప్పించాడు. అటు హీరోయిన్ కాజల్ కుందెర్.. దేవుడమ్మ మనవరాలి పాత్రలో పర్వాలేదనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక 99 ఏళ్ల దేవుడమ్మ పాత్రలో బి. జయశ్రీ అద్భుతంగా నటించారు. ఆమె పాత్రనే సినిమాకు కీలకం. నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్ సహా మిగిత పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ రఘు శాస్త్రి ఈ సినిమా కోసం ఆసక్తికర కథను ఎంచుకున్నారు. గంట సేపు కరెంటు పోతేనే తట్టుకోలేని ఈ రోజుల్లో కొన్ని రోజుల పాటు విద్యుత్ పోతే ఆ ఊరి పరిస్థితి ఏంటి అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. పల్లెటూరులో ఉండే మనుషులు, వారి మనస్తత్వాలను డైరెక్టర్ కళ్లకు కట్టారు. కరెంటు లేకుండా రాత్రి పూట పల్లెల్లో ఎలా ఉండేవారో చూపించారు. కరెంటు లేకపోయినా గ్రామస్తులు ఉండటానికి సిద్ధపడ్డారంటే అందుకు బలమైన కారణమే చూపాలి. ఆ పాయింట్‌ను డైరెక్టర్ ఎమోషనల్‌గా చెప్పిన తీరు బాగుంది. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. కొన్ని సీన్లు మరి సాగదీతలా అనిపిస్తాయి. సినిమా నిడివి తక్కువ కావడం బాగా కలిసొచ్చింది. దర్శకుడిగా రఘుశాస్త్రి.. మొదటి ప్రయత్నంలో పర్వాలేదనిపించాడు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. టెక్నికల్ టీమ్ మంచి పనితీరు కనబరిచింది. కెమెరామెన్ శాంతి సాగర్ హెచ్.జీ.. విలేజ్ లుక్స్‌ను చాలా బాగా చూపించారు. మణికాంత్ ఖాద్రి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌కు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్
కథత్రిగుణ్, జయశ్రీ నటనసంగీతం
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లేసాగదీత సీన్స్
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 22 , 2024
Manchu Manoj: మంచు వివాదానికి ఫుల్స్టాప్? షూటింగ్‌కి వెళ్లిన మనోజ్!
మంచు కుటుంబం (Manchu Family)లో చెలరేగిన వివాదం రెండు తెలుగు రాష్టాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తండ్రి కొడుకులైన మంచు మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇంటి వద్ద నెలకొన్న ఘర్షణ పరిస్థితులు రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరిని షాక్‌కు గురిచేసింది. ఆదివారం (డిసెంబర్ 8) మెుదలైన ఈ వ్యవహారం బుధవారం (డిసెంబర్ 11) సాయంత్రం వరకు దాదాపు నాలుగు రోజుల పాటు రచ్చ చేస్తూనే వచ్చింది. రాచకొండ సీపీ సుదీర్ బాబు స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ వివాదానికి తాత్కాలికంగా ఫుల్స్టాప్ పడింది. బుధవారం మంచు మనోజ్‌తో పాటు సోదరుడు మంచు విష్ణుకు సీపీ వార్నింగ్ ఇవ్వడంతో వివాదానికి కేంద్రమైన హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ప్రశాంత వాతావరణం ఏర్పడింది.
షూటింగ్‌కు వెళ్లిన మనోజ్..
తండ్రి మోహన్‌బాబుతో తలెత్తిన వివాదం నేపథ్యంలో మంచు మనోజ్ గత నాలుగు రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. గాయాలతో ఆసుపత్రికి వెళ్లడం, ఆపై రాచకొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం, తనకు జరిగిన అన్యాయంపై వరుస ప్రెస్మీట్లతో ప్రజలకు తెలియజేయడం ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. అటువంటి మనోజ్ బుధవారం రాచకొండ సీపీ సుదీర్ బాబు ఇచ్చిన కౌన్సిలింగ్‌తో వివాదానికి తాత్కాలికంగా చెక్ పెట్టారు. గురువారం సినిమా షూటింగ్‌కు ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మనోజ్ ‘భైరవం’ అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. ఇందులో మనోజ్‌తో పాటు నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో మనోజ్ పాల్గొన్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమాను క్రిస్మస్కు రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఇటీవల నారా రోహిత్ తండ్రి చనిపోవడం, తాజాగా మనోజ్ ఇంట్లో వివాదం చెలరేగడంతో సినిమా విడుదలపై అనుమానాలు ఏర్పడ్డాయి.
తముళ్లకు మంచు లక్ష్మి కౌంటర్..
మంచు ఫ్యామిలీలో జరిగిన వివాదం తెలుగు రాష్ట్రాలను కుదిపేసినప్పటికీ మంచు లక్ష్మీ ఎక్కడా ఈ వివాదంలో తలదూర్చలేదు. పైగా సోదరులు ఇద్దరు మీడియా ముఖంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే మంచు లక్ష్మీ మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరించింది. అంతటితో ఊరుకోకుండా నెట్టింట పరోక్ష కౌంటర్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో ప్రవచనాన్ని గురువారం ఉదయం మంచు లక్ష్మీ పోస్టు చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. 'ఈ ప్రపంచంలో ఏదీ నీకు సొంతం కానప్పుడు ఏదో కోల్పోతామనే భయం నీకెందుకు? అని మంచు లక్ష్మీ కొటేషన్ పెట్టింది. సోదరులు ఇద్దరు ఆస్తుల కోసం గొడవపతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె సూక్తి పెట్టినట్లు అర్ధమవుతోంది.
https://twitter.com/LakshmiManchu/status/1867031240064504027
మోహన్ బాబుపై హత్య కేసు
మీడియాపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి సీనియర్ నటుడు మోహన్‌పై హత్య కేసు నమోదైంది. మోహన్ బాబు దాడి ఘటనపై విచారణ జరిపిన పోలీసులు తొలుత మోహన్ బాబుపై 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే మోహన్ బాబుపై హత్యయత్నం కేసు నమోదు చేయాలని పెద్దఎత్తున్న జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో మరోమారు దాడి ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఆధారాలను పరిశీలించి మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్ 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసును పెట్టారు. దీనికి సంబంధించి త్వరలో మోహన్‌బాబును పోలీసులు విచారించే అవకాశముంది.
‘శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు’
మంచు మనోజ్ చేసిన ఫిర్యాదులో భాగంగా రాచకొండ సీపీ కార్యాలయానికి గురువారం సాయంత్రం మంచు విష్ణు వెళ్లిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా జరిగిన మంచు కుటుంబం వివాదాలపై సీపీ సుదీర్ బాబు ఆరా తీశారు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించొద్దని విష్ణుకి వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ప్రైవేటు సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడ్డవద్దని సూచించారు. సమస్యలు ఉంటే ఇంట్లోనే పరిష్కరించుకోవాలని, గొడవలు చేయవద్దని చెప్పారు. ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉన్న సరే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఇకపై శాంతిభద్రతలకు విఘాతం కలిగిలే వ్యవహరిస్తే లక్షరూపాయల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
డిసెంబర్ 12 , 2024
Manchu Manoj: మంచు వివాదంలో కీలక మలుపు.. ఒకరి అరెస్టు
మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. మంగళవారం వరుస ప్రెస్ మీట్స్ నిర్వహించిన మంచు మనోజ్, మంచు విష్ణు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మంచు విష్ణు తన ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. సాయంత్రం వరకు టైమ్ ఇస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ వివాదానికి సంబంధించి ఓ వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు.
విష్ణు.. మాస్ వార్నింగ్
మంచు ఫ్యామిలీ గొడవల్లో బయటవారి ప్రమేయం ఉందని మంచు విష్ణు అన్నారు. వారి వల్లే ఈ గొడవ పెద్దదైందని ఆరోపించారు. వారందరికీ సాయంత్రం వరకూ టైమ్ ఇస్తున్నట్లు చెప్పారు. వారంతట వారే ఇందులో నుంచి తప్పుకుంటే బాగుంటుందని చెప్పారు. లేదంటే వారి పేర్లు తానే బయటపెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. తనకు తన తండ్రి మాటే వేదవాక్కు అని, ఆయన చెప్పిందే చేస్తానని విష్ణు అన్నారు. అయితే తన తమ్ముడిపై ఎప్పుడూ దాడులు చేయనని విష్ణు అన్నారు.
https://twitter.com/Telugu360/status/1866749230423085437
మోహన్‌బాబుకు ఊరట
మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మోహన్ బాబుకు పోలీసులు జారీచేసిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. మంచు మనోజ్ ఫిర్యాదు నేపథ్యంలో రాచకొండ పోలీసులు మోహన్‌బాబుకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరవ్వాలని కోరారు. ఈ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది.
దాడి కేసులో ఒకరి అరెస్టు
మంచు మనోజ్‌పై దాడి కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోహన్ బాబు మేనేజర్ కందుల వెంకట్ కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచు మనోజ్‌పై దాడి చేసిన వారిలో కిరణ్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడు విష్ణుకు ప్రధాన అనుచరుడిగానూ వ్యవహరిస్తున్నారు. కిరణ్‌తో పాటు దాడికి పాల్పడిన వినయ్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.
మంచు లక్ష్మి ఆసక్తిక పోస్టు
మంచు ఫ్యామిలీ వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు కారణమైన నేపథ్యంలో మోహన్‌బాబు కూతురు, నటి మంచు లక్ష్మి ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. తన కుమార్తె చిరునవ్వులు చిందిస్తోన్న ఓ వీడియోను పోస్టు చేస్తూ 'పీస్' (శాంతి) అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల రిత్యా ఆమె షేర్ చేసిన ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. అంతకుముందు కూడా ఓ ఇంట్రస్టింగ్ పోస్టును మంచు లక్ష్మి పోస్టు చేశారు. ఈ ఏడాది ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు.
డిసెంబర్ 11 , 2024
Pushpa 2 Movie Box Office Collection: అన్ని రికార్డులు బ్రేక్.. ఇండియాలో నంబర్ 1 చిత్రంగా పుష్ప 2
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం థియేటర్లను షేక్ చేస్తోంది. గురువారం (డిసెంబర్ 5) విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్ నటనకు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ బన్నీ యాక్టింగ్ చూసి ఊగిపోతున్నారు. తాము ఊహించిన దాని కంటే అల్లు అర్జున్ నటన బాగుందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘పుష్ప 2’పై జాతీయ స్థాయిలో బజ్ ఉండటంతో పాటు, సూపర్ హిట్ టాక్ లభించడంతో తొలి రోజు (Pushpa 2 Movie Box Office Collection) అన్ని చోట్లా భారీ ఓపెనింగ్స్ లభించాయి. ఏరియాల వారీగా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
డే 1 కలెక్షన్స్ ఎంతంటే..
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం గురువారం (డిసెంబర్ 5) వరల్డ్ వైడ్‌గా 12,500 పైగా థియేటర్లలో విడుదలైంది. దీనికితోడు బ్లాక్ బాస్టర్ టాక్ లభించడంతో ఈ మూవీకి రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.294 కోట్ల గ్రాస్ వసూలైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయస్ట్ ఓపెనింగ్స్ అని వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా, ఈ చిత్రం ఒక్క ఇండియాలోనే రూ.190 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ.92.36 కోట్లు, తమిళనాడు రూ. 10.71, కర్ణాటక రూ.17.89 కోట్లు, కేరళ రూ. 6.56 కోట్లు వసూలైనట్లు చెప్పాయి. హిందీ బెల్ట్‌లో ఏకంగా రూ. 87.24 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఓవర్సీస్లో తొలి రోజు రూ.68.15 కోట్లు ఖాతాలో వేసుకున్నట్లు వివరించాయి.
https://twitter.com/MythriOfficial/status/1865012207060422928
రికార్డులు గల్లంతు
తొలి రోజు కలెక్షన్స్‌తో ‘పుష్ప 2’ చరిత్ర తిరగరాసింది. ఇప్పటిదాకా 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 223 కోట్ల ఓపెనింగ్ సాధించి టాప్‌లో ఉంది. 'బాహుబలి 2' రూ.217 కోట్లు కొల్లగొట్టి రెండోస్థానంలో కొనసాగుతోంది. ‘పుష్ప 2’ ఆ రెండు చిత్రాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. రూ.294 కోట్ల గ్రాస్‌తో భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. రాజమౌళి రికార్డులను పాతరేసి కొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసింది. అటు నార్త్‌లోనూ 'పుష్ప 2' చరిత్ర సృష్టించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హిందీలో ఇప్పటివరకూ ఏ సినిమా సాధించని విధంగా రూ. రూ.72 కోట్లకు పైగా నెట్ వసూళ్లను ‘పుష్ప 2’ రాబట్టినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా బాలీవుడ్ హీరోలకు సైతం బన్నీ కొత్త టార్గెట్ ఇచ్చాడు.
https://twitter.com/MythriOfficial/status/1864976017733095871
బెనిఫిట్ షోలు రద్దు
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో 'పుష్ప 2' ప్రీమియర్స్ (Pushpa 2 Movie Box Office Collection) సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా ఓ బాలుడు చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇకపై ఏ సినిమాకి కూడా బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. బెనిపిట్‌షోలు రద్దు చేస్తున్నట్టు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. బెన్‌ఫిట్‌షోల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నందున వాటిని రద్దు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కారకులపై చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
డిసెంబర్ 06 , 2024
Samantha Ruth Prabhu: ఆ కారణంతోనే సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు(Samantha Ruth Prabhu) ఇంట్లో ఘోర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు తుది శ్వాస విడిచారు. ఈ విషాదకరమైన వార్తను సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పంచుకున్నారు. “మనం మళ్లీ కలిసే వరకు, నాన్న” అంటూ హృదయాన్ని తాకే మాటలతో హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జత చేశారు. చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించిన సమంత, తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని ఎన్నోసార్లు గర్వంగా వ్యక్తం చేసింది.
సమంత జీవితంలో తండ్రి ప్రాధాన్యత
సమంత జీవితంలో జోసెఫ్ ప్రభు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు. చిన్నతనం నుండి ఆమెకు ఉన్నత విలువలను నేర్పి, తన ప్రతి నిర్ణయానికి అండగా నిలిచారు. సినీ రంగంలో ప్రవేశించిన సమయంలో తన తండ్రి నుంచి అద్భుతమైన మద్దతు లభించిందని సమంత గతంలో అనేక ఇంటర్వ్యూలలో వెల్లడించారు. "తన తొలి సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసినప్పుడల్లా ఆయన ప్రోత్సాహం నన్ను ముందుకు నడిపింది" అని సామ్ వెల్లడించింది.
కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణం
జోసెఫ్ ప్రభు గురువారం రాత్రి నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూశారు. (Samantha Ruth Prabhu)ఈ వార్త తెలుసుకున్న వెంటనే సమంత ముంబై నుంచి తన స్వస్థలమైన కేరళకు చేరుకున్నారు. శనివారం జోసెఫ్ ప్రభు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
సమంత కుటుంబం
సమంత 1987 ఏప్రిల్ 28న కేరళలోని అలప్పుజలో జన్మించింది. జోసెఫ్ ప్రభు (Joseph Prabhu) ఆంగ్లో-ఇండియన్ కాగా, ఆమె తల్లి నినెట్ ప్రభు మలయాళీ. ఆమెకు ఇద్దరు అన్నలు జోనాథన్, డేవిడ్ ఉన్నారు.
తండ్రి-కూతుళ్ల అనుబంధం
సమంత తన తండ్రితో ఉన్న బంధాన్ని ఎంతో ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటుంది. ఒక ఇంటర్వ్యూలో, "నా తండ్రి నాకు జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను ఎదుర్కొనే ధైర్యం నేర్పించారు. ఆయన ప్రోత్సాహం లేకుండా నేను ఈ స్థాయికి చేరుకోలేను" అని చెప్పుకొచ్చింది. తండ్రి మరణ వార్త సమంతను తీవ్రంగా కలచివేసింది. "నాన్న నాకు నడిచే దైవం. ఆయన నాకు నేర్పించిన విలువలే నన్ను ముందుకు నడిపించాయి. ఇప్పుడు ఆయన లేకుండా జీవితం ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నాను" అని ఆవేదనతో తన సన్నిహితులతో పంచుకుంది.
విడాకుల సమయంలో తండ్రి మద్దతు
2021లో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు, జోసెఫ్ ప్రభు(Joseph Prabhu) తన ఫేస్బుక్లో వారి పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను అంగీకరించడానికి ఆయనకు ఎంతో సమయం పట్టిందని, కానీ తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆశతో ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
సెలబ్రెటీల సానుభూతి
జోసెఫ్ ప్రభు మరణవార్త తెలుసుకున్న వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సమంతకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
సమంతకు కష్టకాలం
సమంతకు 2021 నుంచి బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పవచ్చు. నాగచైతన్యతో విడాకుల అనంతరం.. ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడటం జరిగింది. దాని నుంచి కోలుకోవడానికి సామ్‌కు రెండేళ్లు పట్టింది. దాదాపు రెండేళ్లు సమంత సినిమాలకు దూరమై, ఒంటరిగా చాలా బాధలు పడింది. అనంతరం ఆమె చేసిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో చాలా కృంగిపోయింది. తాజాగా నాగచైతన్య - శోభిత దూళిపాల ఎంగేజ్మెంట్ కూడా ఆమెను ఓ రకంగా బాధ పెట్టిందని చెప్పవచ్చు.
సమంత ప్రస్తుత బిజీ షెడ్యూల్
ఇటీవలే సిటాడెల్ షూటింగ్ కోసం ముంబైలో ఉన్న సమంత, తండ్రి మరణ వార్త విన్న వెంటనే తన సొంత ఊరికి చేరుకుంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మరణ వార్త విన్న ఆమె అభిమానులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, సామ్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
నవంబర్ 29 , 2024
Nishadh Yusuf: కంగువా ఎడిటర్ మరణంపై పోలీసుల అనుమానాలు… ఎక్కడ చనిపోయాడంటే?
తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” పై ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో వివిధ ఈవెంట్లను నిర్వహిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమాపై మరింతగా ఆకర్షిస్తున్నారు.
ఈ ప్రమోషనల్ కార్యక్రమాల మధ్య, చిత్ర బృందానికి ఓ ఆందోళనకరమైన వార్త ఎదురైంది. ఈ సినిమా ఎడిటర్ నిషాద్ యూసుఫ్ అనుమానాస్పదంగా కన్నుమూయడం చిత్రబృందాన్ని తీవ్రంగా కలచివేసింది. కొచ్చిలోని తన అపార్ట్మెంట్లో ఆయన మరణించడం సినీలోకాన్ని విస్మయపరుస్తోంది. సినిమా ఎడిటింగ్‌లో చురుకుగా పాల్గొన్న నిషాద్ ఆకస్మాత్తుగా తనువు చాలించడం పట్ల సినీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున రెండుగంటలకు నిషాద్ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. ఆయన కొచ్చి- పనంపిల్లి నగర్‌లోని తన అపార్ట్మెంట్లో విగత జీవై కనిపించాడు. ఆయన మృతిపై పలు అనుమానాలు రెకెత్తడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్మెంట్ నివాసం ఉంటున్న వారితో పాటు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్‌ను కూడా విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలపై ఆరా తీస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకునేంత బాధలు ఏమి లేవని ఆయన ఆత్మీయులు చెబుతున్నారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. నిషాద్ మరణ వార్త తమిళ్, మలయాళ పరిశ్రమను శోక సంద్రంలో ముంచి వేసింది. ఆయనకు కడసారి వీడ్కోలు తెలిపేందుకు చిత్ర పరిశ్రమ పెద్దలు తరలివస్తున్నారు.
నిషాద్ యూసుఫ్ తెలుగు, తమిళ్ తో పాటు మలయాళ సినిమాలకు కూడా పనిచేశారు. అడియోస్ అమిగోస్, ఉండా, వన్, పెటారాప్, సౌదీ వెళ్లక్క వంటి ఎన్నో ఆసక్తికరమైన చిత్రాలకు ఎడిటింగ్ వర్క్ చేశారు. ఆయన ఆకస్మిక మరణం సినిమా రంగానికి భారీ నష్టం అని చెప్పాలి. ఇక ఆయన చివరగా పనిచేసిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు 15 రోజుల ముందు ఇలా జరగడం చిత్ర యూనిట్‌కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.
నిషాద్ యూసుఫ్ మరణం పట్ల కంగువా చిత్ర బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హీరో సూర్య నిషాద్ మరణవార్త తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు కంగువా మూవీ ప్రమోషన్స్ తమిళ్‌తో తెలుగులోనూ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏకంగా హీరో సూర్యనే తెలుగులో ప్రెస్ మీట్లు పెడుతూ బిజీగా గడుపుతున్నారు. ఆదివారం బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి నాగార్జునతో కలిసి కంటెస్టెంట్స్‌ను పలకరించారు. ప్రస్తుతం హిందీ బెల్ట్‌లోనూ సూర్య ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు . హీరోయిన్ దిశా పటాని, ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాబీ డియోల్‌తో కలిసి చిత్ర ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నాడు. కాగా ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
‘కంగువా’ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. డబ్బింగ్ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్’లో అమితాబ్‌బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్ చేయిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు. చైనీస్, జపనీస్ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు.
రూ.1000 కోట్ల లక్ష్యం!
రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించడమే లక్ష్యంగా 'కంగువా'ను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాత జ్ఞానవేల్ చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పారు. తొలి భాగం విజయం సాధిస్తే మిగితా భాగాలను కూడా తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నిర్మాత చెప్పారు. త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటించింది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించాడు. కంగ అనే ఓ పరాక్రముడి పాత్రలో సూర్య కనిపించనున్నాడు.
అక్టోబర్ 30 , 2024
Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.. కంటతడి పెట్టిస్తున్న పాత వీడియో
సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతూరు గాయత్రి(38) గుండె పొటుతో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ సంఘటనతో యావత్తు తెలుగు సినీలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాజేంద్ర ప్రసాద్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ సమాచారం తెలిసి సినీ నటులు శివాజీ రాజా, సాయికుమార్, విక్టరీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, డైరెక్టర్ అనిల్ రావుపూడి ఆయన్ను పరామర్శించారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఏకైక కూతురు కావడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
https://twitter.com/Theteluguone/status/1842470053838524558
రాజేంద్ర ప్రసాద్ తన కూతురు గాయత్రి అంటే ఎంత ఇష్టమో పలు వేదికలపై చర్చించారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఒక్కగానొక్క కూతురు గాయత్రి ప్రేమ వివాహం చేసుకుందని ఆమెతో కొన్నేళ్లు మాట్లాడలేదని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఒక తల్లిలేని వాడు తన తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటాడు అని తెలిపారు. తనలో తన చనిపోయిన అమ్మను చూసుకున్నానని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు తన బిడ్డ రెండో తల్లి లాంటిది అని చెప్పుకొచ్చారు. తన తల్లి చనిపోయినప్పుడు కూడా తను ఏడవలేదని కానీ తన కూతురుకు ఏమైన అయితే మాత్రం తట్టుకోలేనని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
https://twitter.com/Marx2PointO/status/1842423836060406267
సినీలోకం సంతాప సందేశం
‘‘రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి మరణం ఎంతో విచారకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ - ఏపీ మంత్రి లోకేశ్
‘‘ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి హఠాన్మరణం తెలిసి మనసు తీవ్రంగా కలచివేసింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. పుత్రికను కోల్పోవడం ఎంతటి పెద్ద విషాదమో, ఈ కష్టాన్ని అధిగమించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను’’ - ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
‘‘కుమార్తెలో అమ్మను చూసుకున్న రాజేంద్రప్రసాద్ గారికి పుత్రిక వియోగం కావడం నిజంగా అంతులేని బాధ. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో దేవుడు వారిని ధైర్యంగా ఉండేలా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను’’ - సాయి ధరమ్ తేజ్
‘‘రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి అత్యంత ఆప్తులైన గాయత్రి మరణం వ్యక్తిగతంగా ఎంతో బాధను కలిగించింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి’’ - జూ.ఎన్టీఆర్
‘‘రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి నా గాఢ సానుభూతి. ఈ కష్టాన్ని వారికి ఎప్పటికీ తలచుకునే విషాదం. దేవుడు వారికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ - వరుణ్ తేజ్
‘‘గాయత్రి మరణం నిజంగా చాలా బాధాకరం. ఈ సమయంలో రాజేంద్రప్రసాద్ గారికి, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి’’ - నవదీప్
‘‘రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి నా సానుభూతి. వారి బాధకు మాటలు సరిపోవు. చాలా బాధగా ఉంది’’ - కీర్తి సురేశ్
‘‘నా సోదరుడు రాజేంద్రప్రసాద్ గారికి సానుభూతి తెలుపుతున్నాను. వారి కుటుంబం ఈ విపత్కర సమయాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పొందాలని ప్రార్థిస్తున్నాను’’ - నరేశ్
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటకిరిటీగా ప్రఖ్యాతి గాంచిన రాజేంద్ర ప్రసాద్.. బాపు డైరెక్షన్లో వచ్చిన స్నేహం(1977) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. 'అహ నా పెళ్లంట', లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు, 'ఆ నలుగుగురు' చిత్రాలు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఎక్కువగా హాస్య ప్రధానమైన చిత్రాల్లో నటించాడు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న ఆరోజుల్లో హీరో కూడా నవ్వుల్ని పూయించగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన ఘనత రాజేంద్రప్రసాదుది. 45 సంవత్సరాలకు పైగా తన సినీ కెరీర్లో రాజేంద్రప్రసాద్ 200కు పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. సహాయ నటుడిగా శ్రీమంతుడు, కౌసల్యకృష్ణమూర్తి, నాన్నకు ప్రేమతో, మహానటి వంటి హిట్ చిత్రాల్లో నటించారు. రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించారు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటారు. మేడమ్ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ నటి రమాప్రభ కూతురు విజయ చాముండేశ్వరిని వివాహం చేసుకున్నారు.
అక్టోబర్ 05 , 2024
Weekend Box Office Collections: ఈ వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏదో తెలుసా?
గత శుక్రవారం (జూన్ 7) పది వరకూ చిత్రాలు విడుదలైనప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రెండు మాత్రమే. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘మనమే’ (Manamey) చిత్రం తొలి రోజు పాజిటివ్ టాక్‌తో పాటు మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఇక కాజల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో చేసిన ‘సత్యభామ’ (Satyabhama).. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా నిరాశ పరించింది. ఈ రెండు చిత్రాలు శని, ఆదివారాల్లో కలెక్షన్స్‌ను గణనీయంగా పెంచుకుంటాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మరి వారి అంచనాలను ‘మనమే’, ‘సత్యభామ’ అందుకున్నాయా? వీకెండ్లో వాటి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం.
‘మనమే’ 3 డేస్ కలెక్షన్స్
శర్వానంద్ లేటెస్ట్ మూవీ 'మనమే'కు బాక్సాఫీస్ వద్ద చెప్పుకోతగ్గ స్థాయిలోనే కలెక్షన్స్ వస్తున్నాయి. వీకెండ్లో ఈ సినిమా మంచి జోరునే చూపించింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ చిత్రం.. వరల్డ్‌వైడ్‌గా రూ.10.35 కోట్ల గ్రాస్ (Gross) సాధించినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఇక ఏపీ, తెలంగాణల్లో రూ.5.8 కోట్ల మేర వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. వర్కింగ్ డేస్‌లోనూ మంచి వసూళ్లు రాబడితే ఈ సినిమా లాభాల్లోకి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదని తెలిపాయి.
కథేంటి
విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ అనురాగ్ (త్రిగుణ్), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్ కొడుకు ఖుషీ (మాస్టర్ విక్రమ్ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.
వీకెండ్లో నిరాశ పరిచిన ‘సత్యభామ’
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సత్యభామ'. సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత శుక్రవారం (జూన్ 7) విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ వీకెండ్ కలెక్షన్స్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. శుక్ర, శని, ఆదివారాలు కలిపి ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.3 కోట్ల వరకూ గ్రాస్ (Gross) రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ వర్కింగ్ డేస్‌లో వచ్చే కలెక్షన్స్‌పై.. ఈ సినిమా లాభ నష్టాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నాయి.
కథేంటి
ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్ (నవీన్ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ.
జూన్ 10 , 2024
Movie Collections: ‘మనమే’, ‘సత్యభామ’ చిత్రాల్లో ఫ్రైడే బాక్సాఫీస్ విన్నర్ ఏది?
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద 10 చిత్రాలు బరిలో నిలిచాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రెండు. ఒకటి శర్వానంద్ నటించిన ‘మనమే’ (Manamey) కాగా.. రెండో కాజల్ చేసిన ‘సత్యభామ’ (Satyabhama) మూవీ. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు తొలి ఆటతోనే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే కాజల్, శర్వానంద్ చిత్రాలలో ఏది తొలిరోజు బాక్సాఫీస్ విజేతగా నిలిచింది? ఏ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
మనమే
శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'మనమే'. ఈ శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హీరో రామ్ చరణ్ టీజర్ రిలీజ్ చేయడం, పలువురు సెలబ్రిటీలు సినిమాపై ఎక్స్‌లో పోస్టులు పెట్టడంతో 'మనమే' ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. రూ.12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.2.8 కోట్ల గ్రాస్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.4 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. రూ. కోటి మేర షేర్ కలెక్ట్ చేసింది. తొలిరోజు ఆశించిన మేర కలెక్షన్స్ రానప్పటికీ.. శని, ఆదివారాల్లో ప్రేక్షకుల తాకిడీ పెరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్
నటుడు శర్వానంద్.. ‘మనమే’ చిత్రంలో అదరగొట్టాడు. విక్రమ్ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఫుల్ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. హీరోయిన్ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్ - కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్ విక్రమ్ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య.. తల్లిదండ్రులు - పిల్లల మధ్య బాండింగ్ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్‌ను మంచి ఎమోషనల్ సీన్స్‌తో ముగించడం సినిమాకు ప్లస్ అయ్యింది.
కథేంటి
విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ అనురాగ్ (త్రిగుణ్), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్ కొడుకు ఖుషీ (మాస్టర్ విక్రమ్ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.
సత్యభామ
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొలిసారి ఖాకీ డ్రెస్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన లేడీ ఒరియెంటెడ్ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. అయితే సినిమాపై మంచి టాక్ వచ్చినప్పటికీ డే 1 కలెక్షన్స్ పరంగా సత్యభామ నిరాశ పరిచింది. తొలి రోజు ఈ చిత్రం రూ.1.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.50 లక్షల వరకూ షేర్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.
కాజల్ నటనపై ప్రశంసలు
కమర్షియల్ చిత్రాల్లో ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన కాజల్ అగర్వాల్.. ఏసీపీ సత్యభామ పాత్రలో ఆకట్టుకుంది. ఖాకీ దుస్తుల్లో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోరాట ఘట్టాల్లో అద్భుతంగా చేసింది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్ నటనతో మెప్పించింది. దర్శకుడు సుమన్ చిక్కాల.. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా 'సత్యభామ'ను తెరకెక్కించారు. ఓ నేరం చుట్టు భావోద్వేగాలతో కూడిన కథను అల్లుకొని ఆకట్టుకున్నాడు. ఓ మహిళా పోలీసు అధికారి.. కేసును వ్యక్తిగతంగా తీసుకున్న క్రమంలో వచ్చే భావోద్వేగాలు మెప్పిస్తాయి. గృహ హింస, మహిళల అక్రమ రవాణా, టెర్రరిజం వంటి అంశాలను టచ్ చేస్తూ డైరెక్టర్ కథను నడిపించిన తీరు మెప్పిస్తుంది.
కథేంటి
ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్ (నవీన్ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ.
https://telugu.yousay.tv/manamey-movie-review-has-manamey-put-a-check-on-sharwanand-kriti-shettys-series-of-failures.html
https://telugu.yousay.tv/satyabhama-movie-review-did-kajal-rock-in-khaki-shirt-what-is-the-satyabhama-talk.html
జూన్ 08 , 2024
Ramoji Rao: రామోజీ పార్థివదేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన రాజమౌళి.. వారి బంధం ఎంత బలమైందంటే?
ఈనాడు మీడియా అధినేత, ప్రముఖ సినీ నిర్మాత రామోజీరావు (Ramoji Rao) మరణం టాలీవుడ్ ఇండస్ట్రీని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. ఆయన లేని లోటును తలుచుకుంటూ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామోజీని కడసారి చూసేందుకు ఆయన పార్థివ దేహమున్న ఫిలిం సిటీకి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) సైతం కుటుంబ సమేతంగా ఫిలిం సిటీకి వెళ్లారు. అక్కడ అశ్రు నయనాలతో రామోజీకి అంజలి ఘటించారు.
వెక్కి వెక్కి ఏడ్చిన రాజమౌళి!
రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించడానికి దర్శకధీరుడు రాజమౌళితో పాటు ఆయన భార్య రమా రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani) కూడా వెళ్లారు. ఈ సందర్భంలో రామోజీని చూస్తూ రాజమౌళి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. రాజమౌళిని ఇంత బాధలో ఎప్పుడు చూడలేదని ఫ్యాన్స్ అంటున్నారు. రామోజీతో రాజమౌళికి ఉన్న బంధం ఎంత విలువైనదో ఈ దృశ్యాలే కళ్లకు కడుతున్నాయని చెబుతున్నారు.
https://twitter.com/i/status/1799327168675360807
ఆ కన్నీటికి కారణం ఇదే!
రాజమౌళి సినిమా దర్శకుడు అయ్యే కంటే ముందే శాంతి నివాసం అనే సీరియల్‌తో దర్శకుడిగా మారారు. ఈ శాంతి నివాసం సీరియల్ ఈటీవీలోనే ప్రసారమయ్యేది. అలా అప్పుడు రామోజీరావుతో రాజమౌళికి ఏర్పడిన పరిచయం తర్వాత సాన్నిహిత్యంగా మారింది. తనకు ఆత్మీయుడైన రామోజీ మరణించడంతో రాజమౌళి తట్టుకోలేకపోయారు. అటు సోషల్ మీడియా వేదికగాను నివాళులు అర్పించారు. 'ఒక వ్యక్తి తన 50 సంవత్సరాల స్థితిస్థాపకత, కృషి, ఆవిష్కరణలతో లక్షలాది మందికి ఉపాధి, జీవనోపాధి మరియు ఆశలను అందించారు. రామోజీ రావు గారికి మనం నివాళులు అర్పించే ఏకైక మార్గం 'భారతరత్న' ప్రదానం చేయడం' అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
స్టార్ హీరోల నివాళులు
పత్రికా రంగం, సినిమా ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసిన రామోజీ రావుకి టాలీవుడ్ స్టార్ హీరోలు.. సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించారు. రామోజీ రావు గారి మరణం అత్యంత బాధాకరమని రామ్ చరణ్ అన్నారు. ఈ మేరకు 'గేమ్ ఛేంజర్' చిత్ర యూనిట్‌తో కలిసి నివాళులు అర్పించారు. అక్షర యోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు పవన్ కల్యాణ్ అన్నారు. రామోజీ రావు పేరు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయని కళ్యాణ్ రామ్ పోస్టు చేశారు. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. తాను గౌరవించే స్ఫూర్తిదాయ వ్యక్తుల్లో రామోజీ ఒకరని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అంటూ అల్లు అర్జున్ పేర్కొన్నారు. రామోజీ మరణం తీరని లోటని సినీ నటుడు రవితేజ కామెంట్ చేశారు.
ఆదివారం అంత్యక్రియలు
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
జూన్ 08 , 2024
Manamey Movie Review: శర్వానంద్, కృతి శెట్టి వరుస ఫెయిల్యూర్స్‌కు ‘మనమే’ చెక్ పెట్టిందా?
నటీనటులు : శర్వానంద్, కృతి శెట్టి, సీరత్ కపూర్, అయేషా ఖాన్, రాహుల్, రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు
రచన, దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
సంగీతం : హీషం అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రాఫర్ : విష్ణు శర్మ
నిర్మాతలు : వివేక్ కుచిబొట్ల, కృతి ప్రసాద్
విడుదల తేదీ: 07 జూన్, 2024
యంగ్ హీరో శర్వానంద్ చేసిన చిత్రాలకు టాలీవుడ్లో ప్రత్యేకంగా నిలుస్తాయి. పక్కింటి అబ్బాయిలా కనిపించే చిత్రాల్లో నటించి చాలా సార్లు ఆడియన్స్‌ను మెప్పించాడు. ఇప్పుడు కూడా అలాంటి కథతోనే శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్, హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్ విక్రమ్ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఎంతో కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ అనురాగ్ (త్రిగుణ్), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్ కొడుకు ఖుషీ (మాస్టర్ విక్రమ్ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
నటుడు శర్వానంద్.. విక్రమ్ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఫుల్ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. కామెడీ, లవ్, ఎమోషన్‌తూ కూడిన సన్నివేశాల్లో తనదైన మార్క్‌తో అలరించాడు. హీరోయిన్ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్ - కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్ విక్రమ్ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆ బాలుడి పాత్రే ఎంతో కీలకం. ఇక రాజ్ కందుకూరి, త్రిగుణ్ పాత్రలు కథకు ఎంతో బలాన్ని అందించాయి. వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో రాహుల్ రవీంద్రన్ మెప్పించాడు. సచిన్ ఖేదెకర్, సీత, ముఖేష్ రిషి, తులసి, సీరత్ కపూర్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
తల్లిదండ్రులు - పిల్లల మధ్య బాండింగ్ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య 'మనమే' సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో కొద్దిమేర సక్సెస్ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ఓ మాదిరిగా గడిచిపోయింది. ఇక సెకండాఫ్‌కు వచ్చేసరికి దర్శకుడు కథ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్లు అనిపిస్తుంది. కథతో సంబంధం లేని సన్నివేశాలు తెరపై జరుగుతుండటం కన్ఫ్యూజన్ను క్రియేట్ చేస్తాయి. ఇక క్లైమాక్స్‌ను మంచి ఎమోషనల్ సీన్స్‌తో ముగించడం సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే విలన్ ట్రాక్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకుంటే బాగుండేది. సినిమాలో చాలా చోట్ల ఎమోషనల్ మిస్ అయ్యింది. మెుత్తంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని తెరకెక్కించే క్రమంలోనే కాస్త తడబడ్డాడు.
టెక్నికల్‌గా
టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంది. లండన్ లొకేషన్స్‌ని బాగానే క్యాప్చర్ చేశారు. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మూవీకి తగ్గట్లు ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
శర్వానంద్, మాస్టర్ విక్రమ్ ఆదిత్య నటనఎమోషనల్ సీన్స్‌సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్‌విలన్ ట్రాక్‌ఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 3/5
https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-kriti-shetty.html
జూన్ 07 , 2024