• TFIDB EN
  • శివాజీ ది బాస్
    U3h 8m
    సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన శివాజీ దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో భారత్‌కు వస్తాడు. ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడతాడు. ఈ క్రమంలో ఓ దుర్మార్గుడైన రాజకీయ నేత నుంచి అతడికి సమస్యలు ఎదురవుతాయి. జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత శివాజీ ఏం చేశాడు? గుండు బాస్‌కి అతడికి మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రజనీకాంత్
    శ్రియా శరన్
    వివేక్
    సుమన్
    రఘువరన్
    మణివణ్ణన్
    వడివుక్కరాసి
    కొచ్చిన్ హనీఫా
    రవి కుమార్
    సోలమన్ పాపయ్య
    పట్టిమండ్రం రాజా
    షణ్ముగరాజన్
    పిరమిడ్ నటరాజన్
    ఎంఎస్ భాస్కర్
    J. లివింగ్స్టన్
    ఉమా పద్మనాభన్
    బోస్ వెంకట్
    వాసు విక్రమ్
    అమరసిగమణి
    హల్వా వాసు
    మహదేవన్
    ఇళవరసు
    కనల్ కన్నన్
    మయిల్సామి
    ఏసీ మురళీ మోహన్
    చిన్ని జయంత్
    ధాము
    స్వామినాథన్
    నయనతార
    ముత్తుకాళై
    ఎస్. శంకర్
    కేవీ ఆనంద్
    తోట తరణి
    సిబ్బంది
    ఎస్. శంకర్
    దర్శకుడు
    MS గుహన్
    నిర్మాత
    ఎం. శరవణన్ (చిత్ర నిర్మాత)
    నిర్మాత
    AR రెహమాన్
    సంగీతకారుడు
    కేవీ ఆనంద్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?</strong>
    Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
    మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. [toc] భోళా శంకర్ ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు. గాడ్ ఫాదర్ చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది. ఖైదీ నంబర్ 150 చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంజి చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది. శంకర్ దాదా జిందాబాద్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. శంకర్ దాదా M.B.B.S "మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. ఠాగూర్ తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు. మృగరాజు హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. స్నేహం కోసం కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది. హిట్లర్ మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది. ముగ్గురు మొనగాళ్లు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు. మెకానిక్ అల్లుడు "శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. ఆజ్ కా గూండా రాజ్ "గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఘరానా మొగుడు "అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. పసివాడి ప్రాణం&nbsp; &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.&nbsp; చక్రవర్తి&nbsp; రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆరాధన&nbsp; భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్‌లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; దొంగ మొగుడు&nbsp; ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్‌’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.&nbsp; వేట&nbsp; &nbsp;ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్&nbsp; &nbsp;యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; రాజా విక్రమార్క &nbsp;రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.&nbsp; ప్రతిబంధ్&nbsp; &nbsp;రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. త్రినేత్రుడు &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.&nbsp; ఖైదీ నంబర్ 786 &nbsp;విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అడవి దొంగ &nbsp;చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.&nbsp; చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; నాగు&nbsp; తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.&nbsp; ఇంటిగుట్టు &nbsp;చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.&nbsp; దేవాంతకుడు దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.&nbsp; హీరో విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్‌ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు. ‘ఖైదీ’ &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్‌లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది. అభిలాష&nbsp; ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్‌డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.&nbsp; ప్రేమ పిచ్చోళ్లు&nbsp; &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.&nbsp; బంధాలు అనుబంధాలు&nbsp; ‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.&nbsp; మంచు పల్లకీ&nbsp; &nbsp;వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.&nbsp; యమ కింకరుడు&nbsp; యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. పట్నం వచ్చిన పతివ్రతలు పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్‌నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. చట్టానికి కళ్లులేవు చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. 47 రోజులు కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మొగుడు కావాలి చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు. మోసగాడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రేమ తరంగాలు 'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్‌. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. పున్నమి నాగు 'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఇది కథ కాదు కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్‌గళ్' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్‌లో మెప్పించారు. మనవూరి పాండవులు బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
    సెప్టెంబర్ 25 , 2024
    Controversial Movies: విడుదలకు ముందే విమర్శలు.. సినిమాలు మాత్రం సూపర్ హిట్లు..!&nbsp;
    Controversial Movies: విడుదలకు ముందే విమర్శలు.. సినిమాలు మాత్రం సూపర్ హిట్లు..!&nbsp;
    సినిమాలను అమితంగా ఇష్టపడే దేశంలో భారత్‌ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ ఏటా వందల చిత్రాలు రిలీజవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. ప్రతీ మనిషి జీవితంలో సినిమాలు ఓ భాగం కావడంతో అవి సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు విడుదలకు ముందే వివాదస్పదంగా మారుతున్నాయి. ఆ చిత్రాలను బ్యాన్‌ చేయాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలే పుట్టుకొచ్చాయి. భారత్‌లో తీవ్ర వివాదానికి కారణమైన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; ది కేరళ స్టోరీ భారత్‌లో విడుదలకు ముందే తీవ్ర విమర్శలను మూటగట్టుకున్న సినిమా ‘కేరళ స్టోరీ’. కేరళలో గత కొన్నేళ్లలో అదృశ్యమైన 32 వేల మంది మహిళలు ఎక్కడనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. నలుగురు యువతులు మతం మారి, అనంతరం ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ నడుస్తుంది. తప్పిపోయిన అమ్మాయిలు ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది. దీనిపై కేరళ సీఎం సహా, ప్రతిపక్ష కాంగ్రెస్‌, ముస్లిం సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. సమాజంలో అల్లర్లు సృష్టించేలా ఈ సినిమా ఉందంటూ ఆరోపించాయి. వీటన్నింటిని దాటుకొని రిలీజైన ‘ది కేరళ స్టోరీ’ పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఆదా శర్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి. Image Credit: wikipedia/commons ఫర్హానా నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వంలో హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ నటించిన 'ఫర్హానా' సినిమాపై కూడా వివాదం చెలరేగింది. ముస్లింల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై కొన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాలో ముస్లిం మహిళలను, హిజాబ్‌ను అవమానించేలా డైలాగ్‌లు ఉన్నాయని కొన్ని ఇస్లామిక్ సంస్థలు ఆరోపించాయి. వివాదం మరింత ముదురుతుండటంతో మేకర్స్‌ స్పందించారు. ఈ సినిమా ఏ మతం సెంటిమెంట్‌లకు వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మే 12న రిలీజైన ఫర్హానా చిత్రం హిట్‌ టాక్ తెచ్చుకుంది.&nbsp; Image Credit: wikipedia/commons ది కాశ్మీర్‌ ఫైల్స్‌ 2022లో వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం అప్పట్లో తీవ్ర దుమారానికి కారణమైంది. కశ్మీరీ పండిట్లను మిలిటెంట్లు ఏ విధంగా హింసించి చంపారో అన్న అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా రాజకీయరంగు పులుముకోవడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భాజపా పాలిత రాష్ట్రాలు ఈ ప్రదర్శనలకు పన్ను రాయితీలు సైతం ఇచ్చాయి. అయితే, ది కాశ్మీర్‌ ఫైల్స్‌లో వాస్తవాలను వక్రీకరించి చూపించారంటూ కాంగ్రెస్‌ మండిపడింది.&nbsp; Image Credit: wikipedia/commons పఠాన్‌ బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ రీసెంట్‌ మూవీ ‘పఠాన్‌’ పైనా విడుదలకు ముందు వివాదం చెలరేగింది. చిత్రంలోని ‘బేషరమ్‌ రంగ్‌’ పాటలో దీపికా ధరించిన కాషాయ రంగు బికినీ వివాదానికి కారణమైంది. కాషాయ రంగు బికినిపై హిందూ - ముస్లిం సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా సైతం దీపిక వస్త్రధారణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్‌, వీర్ శివాజీ గ్రూప్‌లు సైతం అసంతృప్తి వ్యక్తం చేశాయి.&nbsp; Image Credit: wikipedia/commons అర్జున్‌ రెడ్డి విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్‌ రెడ్డి సినిమాపై కూడా అప్పట్లో చాలా విమర్శలే వచ్చాయి. ఈ మూవీలో అభ్యంతరకర సీన్లు ఎక్కువగా ఉన్నాయంటూ పలువురు ప్రజా సంఘ నేతలు సినిమా పోస్టర్లను చించేశారు. ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. యాంకర్‌ అనసూయ సైతం సినిమాలోని అభ్యంతరకర డైలాగ్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ వివాదాలను దాటుకొని అర్జున్‌ రెడ్డి సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. విజయ్‌ దేవరకొండను స్టార్‌ హీరోగా నిలబెట్టింది.&nbsp; Image Credit: wikipedia/commons పీకే బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ నటించిన 'పీకే' సినిమాపై కూడా 2014లో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని పలు హిందూ సంస్థలు ధ్వజమెత్తాయి. సినిమాపై నిషేధం విధించడంతోపాటు చిత్రంతో సంబంధం ఉన్న వారందరినీ సమాజం నుంచి వెలివేయాలని యోగా గురు బాబా రాందేవ్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ముస్లిం సంఘాలు సైతం పీకే సినిమాను తప్పుబట్టాయి. అప్పట్లో ఈ వివాదంపై స్పందించిన అమీర్‌ఖాన్‌ అన్ని మతాలను తాము గౌరవిస్తామన్నారు. అయితే రిలీజ్‌ అనంతరం పీకే సూపర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; Image Credit: wikipedia/commons ద ఢిల్లీ ఫైల్స్ కశ్మీర్ ఫైల్స్ చిత్రం తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ‘ద ఢిల్లీ ఫైల్స్’ సినిమాపై వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాపై కూడా చర్చ జరుగుతోంది. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ ఈ డైరెక్టర్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన నోటీసులు పంపించారు. ఈ విధంగా ‘ద ఢిల్లీ ఫైల్స్’ చిత్రీకరణకు ముందే హాట్ టాపిక్‌గా మారింది.
    మే 19 , 2023
    <strong>HBD Shriya Saran: శ్రియా బర్త్‌డే స్పెషల్‌.. ఆమె అందాల ఉప్పెనలో తడిసి ముద్దవ్వండి!</strong>
    HBD Shriya Saran: శ్రియా బర్త్‌డే స్పెషల్‌.. ఆమె అందాల ఉప్పెనలో తడిసి ముద్దవ్వండి!
    తెలుగులో స్టార్‌ హీరోయిన్స్‌గా వెలుగొందిన ఒకప్పటి భామల్లో శ్రియా శరణ్‌ ఒకరు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించి శ్రియా అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, ఇవాళ శ్రియా (సెప్టెంబర్‌ 11) 42వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన గ్లామరస్‌ ఫొటోలపై ఓ లుక్కేద్దాం. అలాగే శ్రియాకు సంబంధించిన సమాచారమూ తెలుసుకుందాం. శ్రియా శరణ్‌ 1982 సెప్టెంబర్‌ 11న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించింది. ఆమె తండ్రి పుష్పేంద్ర శరణ్‌ BHEL సంస్థలో పనిచేశారు. తల్లి నీరాజ శరణ్‌ కెమెస్ట్రీ టీచర్‌గా వర్క్‌ చేశారు. 2001లో వచ్చిన 'ఇష్టం' సినిమాతో శ్రియా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అందులో తన నటనతో ఆకట్టుకుంది. తద్వారా తన రెండో చిత్రమే నాగార్జునతో చేసే అవకాశాన్ని శ్రియా దక్కించింది. ‘సంతోషం’ సినిమాలో నాగార్జునకు జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.&nbsp; ఆ తర్వాత బాలకృష్ణతో ‘చెన్నకేశవ రెడ్డి’ (2002), తరుణ్‌తో ‘నువ్వే నువ్వే’ (2002), ఉదయ్‌ కిరణ్‌తో ‘నేను మీకు తెలుసా’ (2003) చిత్రాల్లో నటించి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.&nbsp; ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి సరసనే హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ఠాగూర్‌’ సినిమా సక్సెస్‌తో శ్రియా స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది.&nbsp; ఆ తర్వాత 'నేనున్నాను', ‘ఛత్రపతి’, ‘భగీరథ’, ‘శివాజీ’, ‘డాన్‌ శీను’, ‘మనం’, ‘గోపాల గోపాల’, ‘ఊపిరి’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో శ్రియా నటించి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.&nbsp; తెలుగుతో పాటు హిందీలోనూ శ్రియా పలు చిత్రాలు చేసింది. అక్కడ కూడా మంచి మంచి చిత్రాలు తీసి బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించింది.&nbsp; రామ్‌చరణ్, తారక్‌ నటించిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)లోనూ శ్రియా ఓ స్పెషల్‌ రోల్‌లో నటించింది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ భార్యగా, రామ్‌చరణ్‌కు తల్లిగా ఆమె కనిపించింది.&nbsp; గతేడాది కబ్జ (కన్నడ), మ్యూజిక్‌ స్కూల్‌ చిత్రాల ద్వారా ప్రేక్షకులను శ్రియా పలకరించింది. అందులో తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రీసెంట్‌గా ‘షోటైమ్‌’ అనే వెబ్‌సిరీస్‌లోనూ శ్రియా నటించింది. ఈ సిరీస్‌ ద్వారా తొలిసారి ఓటీటీ రంగంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది. ఇందులో మందిరా సింగ్‌ పాత్రలో ఆకట్టుకుంది.&nbsp; ప్రస్తుతం తమిళ స్టార్‌ హీరో సూర్య సినిమాలో శ్రియా నటిస్తోంది. 'Suriya 44' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది.&nbsp; సినిమాలతో పాటు పలు హిందీ మ్యూజిక్‌ వీడియోలలోనూ శ్రియా శరణ్‌ మెరిసింది. 'తిరకటి క్యూన్‌ హవా', 'కహిన్‌ దూర్‌', 'రంగ్‌ దే చునారియా', 'బరి బరి సాంగ్‌' ఆల్బమ్స్‌లో శ్రియా స్టెప్పులు వేసింది.&nbsp; ప్రస్తుతం శ్రియా శరణ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 4.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 11 , 2024
    HBD ADAH SHARMA: ఆదాశర్మను మీరు ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. టాప్‌-10 రేర్‌ పిక్స్ వైరల్‌
    HBD ADAH SHARMA: ఆదాశర్మను మీరు ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. టాప్‌-10 రేర్‌ పిక్స్ వైరల్‌
    ఇప్పుడు హీరోయిన్ ఆదాశర్మ పేరు దేశమంతా మార్మోగుతోంది. ది కేరళ స్టోరీలో ఆమె నటనకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక సినీ కెరీర్ ముగుస్తుందనుకున్న తరుణంలో ది కేరళ స్టోరీ హిట్‌తో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. నేడు హీరోయిన్ ఆదాశర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆదాశర్మ రేర్ పిక్స్‌తో పాటు ఆమె గురించి ప్రత్యేక విషయాలు మీకోసం.. ప్రముఖ నటి ఆదాశర్మ.. ముంబయిలోని నేవీ కుటుంబంలో జన్మించింది. చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. పదో తరగతి పూర్తి చేసిన వెంటనే సినీ రంగ ప్రవేశం కోసం ఆదాశర్మ యత్నించింది. అయితే మరీ యంగ్‌గా ఉండటంతో పలు ఆడిషన్లలో ఆమెను రిజెక్ట్ చేశారు. 2008లో వచ్చిన ‘1920’ అనే హారర్ చిత్రంతో ఆమె సినిమాల్లోకి ‌అడుగుపెట్టారు.&nbsp; ‘1920’ తర్వాత మరో రెండు సినిమాల్లో నటించిన ఆదాశర్మ.. హార్ట్‌ ఎటాక్‌ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. హయాతి పాత్రలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.&nbsp; ‘హార్ట్‌ ఎటాక్‌’ ఫ్లాప్‌ అయినా ఆదాశర్మకు మాత్రం ‌అవకాశాలు క్యూ కట్టాయి. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం ఇలా వరుస అవకాశాలు దక్కించుకుంది. కానీ అవేవీ ఆమెకు కలిసి రాలేదు.&nbsp; తెలుగులో ఆదాశర్మ చేసిన చివరి సినిమా ‘కల్కి’. ఇందులో డాక్టర్ పద్మ అనే పాత్రలో ఈ భామ కనిపించింది. ఈ సినిమా కూడా కలిసిరాకపోవడంతో తెలుగులో అవకాశాలు మరింత సన్నగిల్లాయి. అటు బాలీవుడ్‌లోనూ ఛాన్సెస్‌ రాకపోవడంతో ఆమె వెబ్‌సిరీస్‌లపై ఫోకస్‌ పెట్టింది. ‘పతి పత్ని ఔర్ పంగా’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. శివాని భట్నాగర్ అనే పాత్రలో మెప్పించింది.&nbsp; హిందీలో ‘చుహాబిల్లి’ అనే థ్రిల్లర్‌ షార్ట్ ఫిల్మ్‌లో కూడా ఆదాశర్మ నటించింది. అలాగే ‘పియా రే పియా’ అనే ఒక మ్యూజిక్ వీడియోలోనూ కనిపించి సందడి చేసింది.&nbsp; ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ అనే సినిమాలోనూ ఆదాశర్మ కీలక పాత్ర పోషించింది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.&nbsp; ది కేరళ స్టోరీ సినిమాకు భాజపా పాలిత రాష్ట్రాలు రాయితీలు ప్రకటిస్తుంటే.. మరికొన్ని స్టేట్స్‌ మాత్రం షరతులు విధిస్తున్నాయి.&nbsp; ఇక సోషల్‌ మీడియాలోనూ ఆదాశర్మ ఎంతో చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ అలరిస్తోంది. ఆదాశర్మ ఇన్‌స్టా ఖాతాను 7.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp; https://telugu.yousay.tv/the-kerala-story-review-in-telugu-adah-sharmas-performance-brought-tears-reminds-me-of-another-kashmir-files.html
    మే 11 , 2023
    #90’s Web Series Review: మధ్యతరగతి ఫ్యామిలీలకు ప్రతీరూపం #90’s.. సిరీస్‌ ఎలా ఉందంటే?&nbsp;
    #90’s Web Series Review: మధ్యతరగతి ఫ్యామిలీలకు ప్రతీరూపం #90’s.. సిరీస్‌ ఎలా ఉందంటే?&nbsp;
    నటీనటులు: శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు రచనం, దర్శకుడు: ఆదిత్య హాసన్ సంగీతం: సురేష్‌ బొబ్బలి సినిమాటోగ్రఫీ: అజాజ్‌ మహ్మద్‌ ఎడిటింగ్‌: శ్రీధర్‌ సోంపల్లి నిర్మాత: రాజశేఖర్‌ మేడారం శివాజీ, వాసుకి జంటగా నటించిన లెేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ ‘#90's. ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన ఈ వినోదాత్మక సిరీస్‌ను రాజశేఖర్‌ మేడారం నిర్మించారు. మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాలతో నవ్వులు పూయిస్తూ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిరీస్‌ను రూపొందించినట్లు మేకర్స్‌ తెలిపారు. కాగా ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సిరీస్‌ ప్రసారంలోకి వచ్చింది. మరి దీని కథేంటి? లెక్కల మాస్టార్‌గా శివాజీ ఎలా నటించారు? ఇప్పుడు చూద్దాం. కథ చంద్రశేఖర్ (శివాజీ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్‌. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. ప్రభుత్వ టీచర్‌ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో జాయిన్‌ చేస్తాడు. వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్‌ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. మరి వచ్చిందా? క్లాస్‌మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్), రఘు మధ్య ఏం జరిగింది? చంద్రశేఖర్ ఇంట్లో ఉప్మా కథేంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఎవరెలా చేశారంటే చంద్రశేఖర్ పాత్రలో శివాజీ ఒదిగిపోయారు. మిడిల్ క్లాస్ తండ్రులందరికీ ప్రతినిధిగా ఆయన కనిపించారు. మధ్య తరగతి గృహిణి రాణిగా వాసుకీని చూస్తే 90లలో పిల్లలకు తమ తల్లి గుర్తుకు వస్తుంది. భర్తతో ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంట్లో పరిస్థితి గురించి చెప్పే సన్నివేశంలో ఆమె అద్భుత నటన కనబరిచారు. రఘు పాత్రలో మౌళి నటన సహజంగా ఉంది. అతడు చక్కగా చేశాడు. వాసంతి, స్నేహాల్ కామత్ అందంగా నటించారు. చిన్నోడు రోహన్ అయితే పక్కా నవ్విస్తాడు. చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల అతిథి పాత్రలో మెప్పిస్తారు. డైరెక్షన్ ఎలా ఉందంటే 90లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాతావరణాన్ని దర్శకుడు ఆదిత్య హాసన్ చక్కగా తెరపై ఆవిష్కరించారు. కథ రొటిన్‌గా అనిపించినప్పటికీ క్యూట్ &amp; లిటిల్ మూమెంట్స్‌తో దర్శకుడు ఆకట్టుకున్నాడు. ఆరు ఎపిసోడ్స్‌ కలిగిన ఈ సిరీస్‌తో ప్రేక్షకులను 90ల నాటి రోజుల్లోకి తీసుకెళ్లి ఆ స్మృతులను ఆదిత్య గుర్తుచేశారు. కుటుంబ విలువలను సిరీస్‌లో చక్కగా చూపించారు. చిన్న చిన్న విషయాల్లో సంతోషం వెతుక్కునే '90స్' మధ్యతరగతి కుటుంబాన్ని కళ్లకు కట్టారు. ముఖ్యంగా మనం 90ల నాటి పిల్లలమైతే ఈ సిరీస్‌కు కనెక్ట్‌ అవుతాం. దర్శకుడు ఆదిత్య హాసన్‌ ప్రతి ఒక్కరికీ అందమైన జ్ఞాపకాలను అందించారు. టెక్నికల్‌గా సాంకేతికంగా #90’s సిరీస్‌ బాగుంది. సంగీతం, ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ అన్నీ చక్కగా కుదిరాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సన్నివేశాలు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది.&nbsp;అప్పటి పరిస్థితులను ఆవిష్కరించడానికి యూనిట్‌ పడిన కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ నటీనటులుకథ, దర్శకత్వంసాంకేతిక విభాగం&nbsp; మైనస్‌ పాయింట్స్‌ నెమ్మదిగా సాగే కథనం రేటింగ్‌: 3/5
    జనవరి 05 , 2024
    Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.. కంటతడి పెట్టిస్తున్న పాత వీడియో
    Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.. కంటతడి పెట్టిస్తున్న పాత వీడియో
    సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతూరు గాయత్రి(38) గుండె పొటుతో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ సంఘటనతో యావత్తు తెలుగు సినీలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాజేంద్ర ప్రసాద్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ సమాచారం తెలిసి సినీ నటులు శివాజీ రాజా, సాయికుమార్, విక్టరీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు, డైరెక్టర్ అనిల్ రావుపూడి ఆయన్ను పరామర్శించారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఏకైక కూతురు కావడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. https://twitter.com/Theteluguone/status/1842470053838524558 రాజేంద్ర ప్రసాద్ తన కూతురు గాయత్రి అంటే ఎంత ఇష్టమో పలు వేదికలపై చర్చించారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఒక్కగానొక్క కూతురు గాయత్రి ప్రేమ వివాహం చేసుకుందని ఆమెతో కొన్నేళ్లు మాట్లాడలేదని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఒక తల్లిలేని వాడు తన తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటాడు అని తెలిపారు. తనలో తన చనిపోయిన అమ్మను చూసుకున్నానని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు తన బిడ్డ రెండో తల్లి లాంటిది అని చెప్పుకొచ్చారు. తన తల్లి చనిపోయినప్పుడు కూడా తను ఏడవలేదని కానీ తన కూతురుకు ఏమైన అయితే మాత్రం తట్టుకోలేనని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. https://twitter.com/Marx2PointO/status/1842423836060406267 సినీలోకం సంతాప సందేశం ‘‘రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి మరణం ఎంతో విచారకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ - ఏపీ మంత్రి లోకేశ్‌ ‘‘ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి హఠాన్మరణం తెలిసి మనసు తీవ్రంగా కలచివేసింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. పుత్రికను కోల్పోవడం ఎంతటి పెద్ద విషాదమో, ఈ కష్టాన్ని అధిగమించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను’’ - ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ‘‘కుమార్తెలో అమ్మను చూసుకున్న రాజేంద్రప్రసాద్ గారికి పుత్రిక వియోగం కావడం నిజంగా అంతులేని బాధ. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో దేవుడు వారిని ధైర్యంగా ఉండేలా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను’’ - సాయి ధరమ్ తేజ్‌ ‘‘రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి అత్యంత ఆప్తులైన గాయత్రి మరణం వ్యక్తిగతంగా ఎంతో బాధను కలిగించింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి’’ - జూ.ఎన్టీఆర్‌ ‘‘రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి నా గాఢ సానుభూతి. ఈ కష్టాన్ని వారికి ఎప్పటికీ తలచుకునే విషాదం. దేవుడు వారికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ - వరుణ్ తేజ్‌ ‘‘గాయత్రి మరణం నిజంగా చాలా బాధాకరం. ఈ సమయంలో రాజేంద్రప్రసాద్ గారికి, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి’’ - నవదీప్‌ ‘‘రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి నా సానుభూతి. వారి బాధకు మాటలు సరిపోవు. చాలా బాధగా ఉంది’’ - కీర్తి సురేశ్‌ ‘‘నా సోదరుడు రాజేంద్రప్రసాద్ గారికి సానుభూతి తెలుపుతున్నాను. వారి కుటుంబం ఈ విపత్కర సమయాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పొందాలని ప్రార్థిస్తున్నాను’’ - నరేశ్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటకిరిటీగా ప్రఖ్యాతి గాంచిన రాజేంద్ర ప్రసాద్.. బాపు డైరెక్షన్‌లో వచ్చిన స్నేహం(1977) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. 'అహ నా పెళ్లంట', లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు, 'ఆ నలుగుగురు' చిత్రాలు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఎక్కువగా హాస్య ప్రధానమైన చిత్రాల్లో నటించాడు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న ఆరోజుల్లో హీరో కూడా నవ్వుల్ని పూయించగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన ఘనత రాజేంద్రప్రసాదుది. 45 సంవత్సరాలకు పైగా తన సినీ కెరీర్‌లో రాజేంద్రప్రసాద్ 200కు పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. సహాయ నటుడిగా శ్రీమంతుడు, కౌసల్యకృష్ణమూర్తి, నాన్నకు ప్రేమతో, మహానటి వంటి హిట్ చిత్రాల్లో నటించారు. రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించారు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటారు. మేడమ్ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ నటి రమాప్రభ కూతురు విజయ చాముండేశ్వరిని వివాహం చేసుకున్నారు.
    అక్టోబర్ 05 , 2024
    <strong>Game Changer: మూడు హిట్‌ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ మెలోడీ సాంగ్‌.. ఇదెక్కడి అరాచకం!&nbsp;</strong>
    Game Changer: మూడు హిట్‌ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ మెలోడీ సాంగ్‌.. ఇదెక్కడి అరాచకం!&nbsp;
    స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానుంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటించింది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల రెండు పాటలను విడుదల చేయగా వాటికి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే మూడో సాంగ్‌ను కూడా రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాటకు సంబంధించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఈ మెలోడీ సాంగ్‌ కోసం చేసిన ఖర్చు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  ఒక్క పాటకు రూ.20 కోట్లు! 'గేమ్‌ ఛేంజర్‌' నుంచి వచ్చిన మెుదటి రెండు పాటలు ‘జరగండి.. జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా ‘రా మచ్చా మచ్చా’ సాంగ్‌ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ రాబట్టి నేషనల్‌ వైడ్‌గా ట్రెండింగ్‌ అయ్యింది. అయితే త్వరలో థర్డ్‌ సింగిల్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్‌ చివర్లో లేదా నవంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ఈ సాంగ్‌ రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి రెండు పాటలు మంచి బీట్‌తో వచ్చి దుమ్మురేపగా థర్డ్‌ సింగిల్‌ మాత్రం మెలోడిగా రానుంది. ఇక లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ మూడో పాటకు రూ.20 కోట్ల పైనే ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్‌ ధ్రువీకరించాల్సి ఉంది. మూడు హిట్‌ చిత్రాల బడ్జెట్‌! ఇటీవల తెలుగులో రిలీజైన ‘ఆయ్‌’ (Aay), ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu), ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేసి ప్రశంసలు పొందాయి. అయితే ఈ మూడు సినిమాలు తక్కువ బడ్జెట్‌తో వచ్చి మంచి వసూళ్లు సాధించాయి. ఈ మూడు చిత్రాలు బడ్జెట్‌ కలిపితే దాదాపు రూ.20 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అయితే గేమ్‌ ఛేంజర్‌లో ఒక్క సాంగ్‌ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేశారని రూమర్లు రావడం చర్చకు తావిస్తోంది. ఇటీవల వచ్చిన సెకండ్ సింగిల్‌ ‘రా మచ్చా మచ్చా’ పాటకు కూడా దాదాపు రూ.6-10 కోట్లు ఖర్చు అయినట్లు కథనాలు వచ్చాయి. ఆ పాటలో వందల సంఖ్యలో డ్యాన్సర్లు పాల్గొని వివిధ కాస్ట్యూమ్స్‌లో స్టెప్పులు వేశారు. ఇలా సాంగ్‌లకే భారీ మెుత్తం ఖర్చు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  శంకర్‌ మారాల్సిన అవసరం ఉందా? తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ సినిమా అంటే అందులోని పాటలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ‘భారతీయుడు’, ‘జీన్స్‌’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’, ‘స్నేహితుడు’, ‘రోబో 2.0’ ఇలా ఏ సినిమా తీసుకున్న అందులోని పాటలు చాలా రిచ్‌గా ఉంటాయి. విదేశాల్లోని బ్యూటీఫుల్‌ లోకేషన్స్‌లో పాటలను చిత్రీకరించడం ద్వారా ఆడియన్స్‌లో కొత్త అనుభూతిని కలిగించేందుకు శంకర్ ప్రయత్నిస్తుంటారు. అయితే గతంలో వరుస హిట్స్‌తో శంకర్ ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఈ పాటల గురించి పెద్దగా చర్చ జరగలేదు. అయితే గత కొంతకాలంగా డైరెక్టర్ శంకర్‌కు అసలు కలిసిరావడం లేదు. ఆయన తీసిన చివరి నాలుగు చిత్రాలు ఫ్లాప్‌ అయ్యాయి. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. ఇలాంటి సమయంలో పాటల కోసం రూ. కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుండటాన్ని సినీ ఆడియన్స్ తప్పుబడుతున్నారు. ప్రస్తుతం కాలంలో పాటలకు ఏ దర్శక నిర్మాతలు అంత మెుత్తంలో ఖర్చు చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. శంకర్‌ తన తీరు మార్చుకోకుంటే అతనితో వర్క్‌ చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేసే పరిస్థితులు తలెత్తవచ్చని అభిప్రాయపడుతున్నారు.  రికార్డు ధరకు ఓటీటీ హక్కులు! గేమ్‌ ఛేంజర్‌ ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తండేల్‌ vs గేమ్‌ ఛేంజర్‌ గేమ్‌ ఛేంజర్‌ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు నాగచైతన్య హీరోగా చేస్తున్న తండేల్‌ సైతం సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్‌ సంక్రాంతి హిస్టరీలో ఇప్పటికే పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తలపడ్డారు. అయితే ఈ సంక్రాంతికి వాళ్ల వారసులు తలపడనున్నట్లు బజ్‌ వినిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. RRR సక్సెస్‌తో రామ్‌చరణ్‌ గ్లోబల్‌ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. దాన్ని గేమ్‌ ఛేంజర్‌ ద్వారా మరింత పదిలం చేసుకోవాలని చరణ్‌ చూస్తున్నాడు. మరోవైపు లవ్‌స్టోరీ తర్వా చైతూకి సరైన హిట్‌ లభించలేదు. దీంతో ఎలాగైనా తండేల్‌తో హిట్‌ కొట్టి హిట్‌ ట్రాక్‌లోకి రావాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. చరణ్‌ వర్సెస్‌ చైతూ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
    అక్టోబర్ 18 , 2024
    Prabhas: 9 పార్టులుగా ‘కల్కీ 2898AD?... ఇక హాలీవుడ్‌ పని అయినట్లే!
    Prabhas: 9 పార్టులుగా ‘కల్కీ 2898AD?... ఇక హాలీవుడ్‌ పని అయినట్లే!
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై అంచనాలు చాలా హైరేంజ్‍లో ఉన్నాయి. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‍, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సంచలన వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ బజ్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; 9 పార్ట్‌లుగా కల్కీ! ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. హీరో ప్రభాస్‌ తన ఫోకస్‌ మెుత్తం ఈ చిత్రంపైనే పెట్టాడు. అయితే ఈ సినిమాపై వచ్చిన లేటెస్ట్ బజ్‌ ప్రకారం ‘కల్కీ 2898 ఏడీ’ 9 భాగాలుగా రానున్నట్లు తెలిసింది. ఈ సినిమా కథను ఒక పార్ట్‌తో చెప్పటం సాధ్యం కాదని, బలమైన కథ ఉండటంతో దానిని ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు కనీసం 9 పార్ట్స్‌గా తీయాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదే నిజమైతే హాలీవుడ్‌ను మించిన క్రేజ్‌ టాలీవుడ్‌కు దక్కుతుందని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.&nbsp; https://twitter.com/MilagroMovies/status/1759613635327107364 ‘నేను ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్‌’ డార్లింగ్ ప్రభాస్‌కు సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల్లోనూ వీరాభిమానులు ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలు ఈ విషయాన్ని పలు వేదికలపై వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) ప్రభాస్‌పై తనకున్న అభిమాన్ని చాటుకున్నాడు. మెగా హీరోల తర్వాత తనకు నచ్చిన కథానాయకుడు ప్రభాస్ అని వరుణ్‌ తెలిపాడు. సూపర్ స్టార్ కావాలని ప్రభాస్ ఎప్పుడు అనుకోలేదని.. అతడి శ్రమ, కృషి డార్లింగ్‌ను ఈ స్థాయికి చేర్చాయని ప్రశంసించాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1759574622213947537 షమీ ఫేవరెట్‌ స్టార్లు వీరే టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami) కూడా తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో తాను ప్రభాస్‌ ఫ్యాన్‌ అంటూ ప్రకటించాడు. సౌత్‌ ఇండియాలో మీకు నచ్చిన స్టార్స్ ఎవరని షమీని జర్నలిస్టు ప్రశ్నిస్తుంది. ఇందుకు షమీ సమాధానం ఇస్తూ.. సౌత్‌ సినిమాలు చాలా బాగుంటాయని.. తనకు ప్రభాస్‌తో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) ఫేవరేట్ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను కూడా ప్రభాస్‌, తారక్‌ ఫ్యాన్స్ తెగ వైరల్‌ చేస్తున్నారు. https://twitter.com/i/status/1759506059331338533 ఛత్రపతి శివాజీగా ప్రభాస్‌! మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిన్న (ఫిబ్రవరి 19) దేశ వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ మెుదలైంది. ఛత్రపతి శివాజీ బయోపిక్‌ను సినిమాగా తీస్తే ప్రస్తుత ఇండియన్‌ స్టార్‌ హీరోల్లో ఆ పాత్రకు ఎవరు సరిపోతారన్న ప్రశ్న తలెత్తింది. దీంతో మెజారిటీ నెటిజన్లు ఛత్రపతి శివాజీ పాత్రకు ప్రభాస్ అయితేనే బాగుంటుందని బదులిచ్చారు. శివాజీ పాత్రకు ప్రభాస్ ఒక్కడే ఛాయిస్ అని పేర్కొన్నారు. https://twitter.com/i/status/1759409716114190363 ప్రభాస్‌కు హనుమాన్‌ ఎలివేషన్‌ ప్రస్తుతం ప్రభాస్‌కు సంబంధించిన సమాచారం #Prabhas హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఎడిటింగ్‌ వీడియో ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. హనుమాన్‌ సినిమాలో ఆంజనేయుడి శక్తిని వివరిస్తూ నటుడు సముద్రఖని చెప్పే డైలాగ్‌ను ఆ వీడియోలో ప్రభాస్‌కు ‌అన్వయించారు. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలను సముద్రఖని డైలాగ్స్‌కు మ్యాచ్‌ చేస్తూ వీడియోను ఎడిట్‌ చేశారు.&nbsp; https://twitter.com/i/status/1759832540071027104 మే 9న ఫ్యాన్స్‌కు పండగే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9వ తేదీన గ్లోబల్ రేంజ్‌లో విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్‍ (San Diego Comic-Con 2023)లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. అప్పటినుంచి మూవీపై హాలీవుడ్‍‍లో కూడా క్రేజ్ ఉంది. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ కీలకపాత్రలు చేస్తున్నారు.
    ఫిబ్రవరి 20 , 2024
    #90s A Middle Class Biopic: #90s వెబ్ సిరీస్‌ ఎందుకు చూడాలంటే? ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటి? 
    #90s A Middle Class Biopic: #90s వెబ్ సిరీస్‌ ఎందుకు చూడాలంటే? ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటి? 
    నిన్నటి గతాన్ని భద్రపరిచి నేటి తరానికి అందిస్తూ.. ఆనాటి మంచి, చెడు, ఆనందాలు, సమస్యలు అన్నింటిని హానెస్ట్‌గా చూపించింది #90s MiddleClass Biopic. మిడ్ 2000ను ఒక కాలచక్రంలో బంధించి అందమైన పాత్రల భావోద్వేగాలను చూపిస్తుంది. వెబ్‌సిరీస్‌లో పెద్దగా చెప్పుకోవడానికి కథేమి ఉండదు. కానీ ప్రతి వ్యక్తి జీవితంలో డే టూ డే లైఫ్‌ను అద్భుతంగా తెరకెక్కించింది. సిల్లీ సండే మూమెంట్స్, పండుగలు, హాలిడే ఎంజాయ్‌మెంట్‌ను కళ్లకు అద్ధినట్లు చూపిస్తుంది. నిజానికి ఇదే కదా లైఫ్‌ అంటే. మనం బ్రతికేది ఆ మూమెంట్స్‌లోనే కదా! చాలా విషయాలు మనం ఏదొక అజెండాతో చేస్తాం. ఎలాంటి ఎజెండా లేకుండా మనం చేసే పనులే మన లైఫ్. సరిగ్గా అలాంటి విషయాలను దగ్గరకు తెచ్చినదే #90s MiddleClass Biopic. ఈ సిరీస్ చూస్తున్నంతసేపూ అన్ని సీన్లు మన నిజ జీవితంలో ఎక్కడొక్కడ మనకు తారసపడినవే. వాటినే అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ఆదిత్య హాసన్. లెడీస్ తాలుకు సెన్సిటివ్ విషయాలను చాలా సూపర్బ్‌గా షోలో క్యారీ చేయించాడు. ఇక 90s A MiddleClass Biopic టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈటీవి విన్‌ ఫ్లాట్‌ఫాం నుంచి వచ్చిన ఈ  వెబ్‌సిరీస్‌కు IMDB ఏకంగా 9.6 రేటింగ్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఓ వెబ్‌సిరిస్‌కు ఈ స్థాయిలో రేటింగ్ రాలేదనే చెప్పాలి. ఈ మిడిల్ క్లాస్ బయోపిక్‌లో 90వ దశకం మధ్యతరగతి వాతావరణాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి పాత్ర ఆ కాలం నాటి సాధక బాధకాలను కళ్లకు కట్టింది. ముఖ్యంగా 90sలో పుట్టినవారికి బాగా కనెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా వరకు పోస్టులు ఈ వెబ్‌సిరీస్‌లోని ఏదొక సీన్‌తో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ పాత్రలను అభిమానులు బాగా ఓన్ చేసుకున్నారు. మరి అంతలా అభిమానించే విధంగా ఆ వెబ్‌సిరీస్‌లో క్లారెక్టర్ల తాలుకు ఔచిత్యాన్ని  ఓసారి విశ్లేషిద్దాం. చంద్రశేఖర్(శివాజీ):&nbsp; ఓ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టార్‌. మధ్యతరగతి మనస్తత్వం కలవాడు. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు.&nbsp; ప్రభుత్వ టీచర్‌ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చదివిపిస్తూ వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్‌ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. ఖర్చు విషయంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెడుతుంటాడు. పిల్లల భవిష్యత్ గురించి కలలుగంటగా పనిచేస్తుంటాడు. సినిమా చూస్తున్నంత సేపు శేఖర్ క్యారెక్టర్ 90వ దశకంలో సగటు తండ్రి ఆలోచనలకు ప్రతినిధిగా కనిపిస్తాడు. పిల్లల పట్ల అతను వ్యవహరించే తీరు నవ్వు తెప్పిస్తుంది. కొన్ని చోట్ల వారి భవిష్యత్ గురించి సగటు తండ్రిగా శేఖర్ పడే బాధ కంటతడి పెట్టిస్తుంది. ఆడ పిల్ల తండ్రి కావడంతో ఆమెకు ఏదో ఒకటి కూడ బెట్టాలన్న మధ్యతరగతి సమస్యలు కనిపిస్తుంటాయి. పిల్లల చదువు విషయంలో కఠినంగా ఉంటూనే వారికి అందించాల్సి సౌకర్యాల కోసం ఆలోచిస్తుంటాడు.&nbsp; https://twitter.com/sunny5boy/status/1745383429808517544?s=20 రాణి(వాసుకీ): ఈ వెబ్‌సిరీస్‌లో సగటు మధ్యతరగతి గృహిణిగా రాణి పాత్రలో వాసుకీ ఆనంద్ అద్భుతమైన నటన కనబర్చింది. నిరంతరం కుటుంబం కోసం ఆలోచించే గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. భర్త తెచ్చిచ్చే కాస్త డబ్బును పొదుపుగా ఖర్చు చేస్తుంటుంది. భర్తకు తన బాధ్యతలు గుర్తు చేస్తూ అనవసర ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఆడపిల్ల ఉన్న ఇంట్లో మధ్యతరగతి గృహిణి భయాలు ఆమెలో స్పష్టంగా కనిపించాయి. పిల్లల కోరికలను తీర్చుతునే... అనవసరమైన ఆశలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆనాటి జీవనగతిని కళ్లకు కట్టింది. https://twitter.com/Ga_ne_sh_5/status/1745774847375069388?s=20 ఆదిత్య: ముఖ్యంగా ఈ సినిమాకు నిజమైన హీరో మౌలి అనే చెప్పాలి. చిన్నవయసులోనే అద్భుతమైన నటన కనబరిచాడు. అతన్ని చూస్తుంటే ప్రతింట్లో ఉండే చిన్న కొడుకు మాదిరి కనిపిస్తాడు.&nbsp; సాధారణంగా ఇళ్లల్లో చిన్న కొడుకు గారాభంగా పెరుగుతుంటారు. వాళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇంట్లో వంట నచ్చకపోతే మారం చేయడం, తోటి పిల్లలను ఆట పట్టించడం వంటి చేష్టలు హాస్యంగా కనిపిస్తాయి. మార్కులు తక్కువ వచ్చినప్పుడు అమ్మ-నాన్న దగ్గర ఆదిత్య చెప్పే అబద్దాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇంటికి ఎవరైన చుట్టాలు వచ్చినప్పుడు వారివద్ద చిన్నపిల్లలు చేసే సరదా చేష్టలు ఆదిత్య క్యారెక్టర్ 90s కాలాన్ని గుర్తు చేస్తాయి.&nbsp; ముఖ్యంగా ఆ వయసులో చిన్నపిల్లలు పడే మానసిక వ్యథ.. ఆదిత్య పాత్రలో ప్రతిబింబిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ఆదిత్య- చంద్రశేఖర్ క్యారెక్టర్‌కు సంబంధించిన సీన్లు ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. https://twitter.com/Iharish999/status/1744674325352132686?s=20 ప్రశాంత్ &amp;దివ్య: పదోతరగతి చదువుతున్న ప్రశాంత్ టీనేజ్ కుర్రాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు. బయట ఆడుకోవాలని ఉన్నా, తన తండ్రి మాట కోసం ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. 10thలో జిల్లా ఫస్ట్ రావాలనే తన తండ్రి కోరిక కోసం పరిశ్రమిస్తుంటాడు. అతని తమ్ముడు ఆదిత్యతో చేసే సరదా సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇక దివ్య మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయి పుడితే ఎలా పెరుగుతుందో అలాగే కనిపించింది. తల్లిద్రండ్రుల భయాల మధ్య వారి మాటకు అనుగుణంగా పెరుగుతూ కనిపిస్తుంది. https://twitter.com/_Shivatweets/status/1745269317112119543?s=20 https://telugu.yousay.tv/90s-web-series-review-how-is-the-90s-series-a-reflection-of-middle-class-families.html
    జనవరి 16 , 2024
    This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే!
    కొత్త సంవత్సరం మెుదలైంది. సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి. దీంతో ఈ వారం థియేటర్లలో చెప్పుకోతగ్గ చిత్రాలు రావడం లేదు. దీంతో అందరి దృష్టి ఓటీటీపైన పడింది. ఇందుకు తగ్గట్లే ఈ వారం బోలెడన్ని కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు కాలింగ్ సహస్ర సుడిగాలి సుధీర్ న‌టించిన కాలింగ్ స‌హ‌స్ర మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వ‌చ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా (జనవరి 1 నుంచి) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని అరుణ్ విక్కిరాల డైరెక్ట్ చేశాడు. డిసెంబ‌ర్ 1న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమాకు పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. సుడిగాలి సుధీర్‌ టీవీ ప్రేక్షకులకు సుపరిచితం కావడంతో త్వరగా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మూవీలో డాలీషా ఫిమేల్ లీడ్‌గా న‌టించింది.&nbsp; హాయ్‌ నాన్న నానీ లేటెస్ట్‌ మూవీ 'హాయ్‌ నాన్న' ఈ వారమే ఓటీటీలోకి రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి 4నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ మరీ ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో ముందే స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నారు. ఇందులో నానికి జోడీగా మృణాల్‌ థాకూర్‌ నటించింది.&nbsp; కంజూరింగ్‌ కన్నప్పన్ గతేడాది కోలీవుడ్‌లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన 'కంజూరింగ్‌ కన్నప్పన్‌' ఈ వారమే ఓటీటీలోకి విడుదల రాబోతోంది. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 5న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని వీక్షించవచ్చు. ఈ చిత్రంలో రెజీనా, నాసర్‌, శరణ్య ముఖ్య పాత్రల్లో నటించారు. #90s హీరో శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ '#90’s'. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ఈటీవీ విన్‌ వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మధ్యతరగతి కుటుంబం చుట్టు అల్లుకున్న సన్నివేశాలు, భావోద్వేగాలు వీక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్‌ తెలిపారు. ఈ సిరీస్‌లోని సరదాలు, ఆనందాలు, సంఘర్షణలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని పేర్కొన్నారు. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateBitconMovieEnglishNetflixJan 01Fool me onceSeriesEnglishNetflixJan 01You Are What You Eat: A Twin ExperimentSeriesEnglishNetflixJan 01Delicious in DungeonSeriesEnglish/JapaneseNetflixJan 04The brothers son&nbsp;SeriesEnglishNetflixJan 04Good griefMovieEnglishNetflixJan 05IshuraSeriesEnglish/JapaneseDisney HotStarJan 03Perilloor Premier LeagueSeriesMalayalamDisney HotStarJan 05Marry my husbandSeriesEnglish/KoreanAmazon PrimeJan 01LOL: Last One Laughing Quebec 2SeriesEnglishAmazon PrimeJan 05TejasMovieHindiZee5Jan 05Meg 2: The trenchMovieTelugu/EnglishJio CinemaJan 03Cubicles Season 3MovieHindiSonyLIVJan 05
    జనవరి 05 , 2024
    Jailer Movie Review: జైలర్‌లో విశ్వరూపం చూపించిన రజనీకాంత్‌.. మరి సినిమా హిట్‌ కొట్టినట్లేనా?
    Jailer Movie Review: జైలర్‌లో విశ్వరూపం చూపించిన రజనీకాంత్‌.. మరి సినిమా హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: రజినీకాంత్, తమన్నా, శివరాజ్ కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, యోగి బాబు, రమ్యకృష్ణ, వినాయకన్ తదితరులు. డైరెక్టర్: నెల్సన్ దిలీప్ కుమార్ మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్ నిర్మాత: కళానిధి మారన్ గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సరైన సక్సెస్ అందుకోలేదు. ‘బీస్ట్’ మూవీ పరాజయం అనంతరం, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌ చేస్తున్న చిత్రం ఇది. దీంతో వీరిద్దరూ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం(ఆగస్ట్ 10) విడుదలైన ఈ చిత్రం రజినీకి సక్సెస్ ఇచ్చిందా? థియేటర్లలో ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేసిందా? అనే అంశాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటంటే? టైగర్ ముత్తువేల్ పాండ్యన్(రజినీకాంత్) ఒక జైలర్‌గా పనిచేసి రిటైర్ అవుతాడు. భార్య, కొడుకు, కోడలు, మనవడితో సంతోషంగా కుటుంబాన్ని నడుతుపుతుంటాడు. కొడుకు అర్జున్ ఒక నిఖార్సైన పోలీస్ అధికారి. ఓ హై ప్రొఫైల్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో అర్జున్ అదృశ్యమౌతాడు. కొడుకు కోసం వెతకడం ప్రారంభించిన ముత్తువేల్ ఎవరైనా చంపేసి ఉంటారేమోనని భావిస్తాడు. కానీ, ప్రాణాలతోనే ఉన్నట్లు, విలన్ గ్యాంగ్ తన కొడుకును బంధించినట్లు తెలుసుకుంటాడు. వారి నుంచి విడిపించుకోవడానికి ముత్తువేల్ ఏం చేశాడు? విలన్ గ్యాంగ్ చేసిన డిమాండ్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.&nbsp; https://twitter.com/OnlineRajiniFC/status/1689512670238846976?s=20 ఎలా ఉంది? కమర్షియల్ సినిమాకు రజినీ మార్క్ ఎలివేషన్స్ సినిమాను నిలబెట్టాయి. కొన్ని సన్నివేశాలు రజినీ ‘శివాజీ’ సినిమా గుర్తొచ్చేంతలా ఉంటాయి. ఫస్టాఫ్‌లో నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ బాగుంటుంది. ఇక ఇంటర్వెల్ దగ్గరపడే కొద్దీ కథ కాస్త సీరియస్ టోన్‌లోకి వెళ్తుంది. చక్కటి ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి రేగుతుంది. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ రజినీ ఫ్యాన్స్‌కి పండగలా ఉంటాయి. ఇక క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. రజినీ మార్క్ యాక్టింగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా కుదిరింది. యాక్షన్ డోజ్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సెకండాఫ్‌లో ఓ సౌత్ హీరో కేమియో ఆశ్చర్యపరుస్తుంది. అయితే, కొన్ని చోట్ల కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ‘కావాలా’ పాటపై అంచనాలు పెరగడంతో తెరపై ఊహించిన విధంగా ఉండదు. అక్కడక్కడా కాస్త తడబడినట్లు అనిపిస్తుంది.&nbsp; https://twitter.com/OnlineRajiniFC/status/1689497366481514496?s=20 ఎవరెలా చేశారు? జైలర్‌గా రజినీకాంత్‌కి ఫుల్ మార్కులే వేయొచ్చు. యాక్షన్ సీన్స్‌లో మ్యానరిజంతో ఫ్యాన్స్‌ని ఫిదా చేశాడు. ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తూనే యాక్షన్ స్ట్రెంత్ చూపించాడు. స్టైల్, కామెడీ టైమింగ్‌తో ఫర్వాలేదనిపించాడు. ఇక, కామెడీతో యోగిబాబు మరోసారి అదరగొట్టేశాడు. రజినీతో వచ్చే సన్నివేశాల్లో హాస్యాన్ని పండించాడు. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విలన్‌గా వినాయకన్ మెప్పించాడు. వైవిధ్యాన్ని చూపిస్తూ భయపెట్టాడు.&nbsp; టెక్నికల్‌గా.. గత సినిమాల్లో చేసిన తప్పులను నెల్సన్ దిలీప్ కుమార్ సరిదిద్దుకున్నట్లే. జైలర్ విషయంలో నెల్సన్ పక్కగా వ్యవహరించాడు. ఎన్నో గూస్‌బంప్స్ మూమెంట్స్‌ని తెరపై పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దాడు. ఇక, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో బలం. రజినీ నడుస్తున్నప్పుడు కూడా విజిల్స్ వేయాలనిపించే నేపథ్య సంగీతాన్ని అందించాడు. విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలు సహజంగా అనిపించేలా లైటింగ్, కలర్ టోన్ బాగా నప్పింది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ వేసిన సెట్స్‌ బాగున్నాయి. https://twitter.com/tupakinews_/status/1689519979182612480?s=20 పాజిటివ్ పాయింట్స్ రజినీ ఎలివేషన్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ డార్క్ కామెడీ నెగెటివ్ పాయింట్స్ బోర్ కొట్టించే సన్నివేశాలు రేటింగ్.. 2.75/5
    ఆగస్టు 11 , 2023
    Ambajipeta Marriage Band Review: కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సుహాస్‌ చిత్రం.. హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా?
    Ambajipeta Marriage Band Review: కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సుహాస్‌ చిత్రం.. హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: సుహాస్‌, శివానీ నగారం, గోపరాజు రమణ, స్వర్ణకాంత్‌, నితిన్‌ ప్రసన్న, శరణ్య ప్రదీప్‌ తదితరులు రచన, దర్శకత్వం: దుష్యంత్‌ సంగీతం: శేఖర్‌ చంద్ర సినిమాటోగ్రఫీ: వాజిద్‌ బేగ్‌ ఎడిటింగ్‌: కోదాటి పవన్‌ కల్యాణ్‌ నిర్మాత: ధీరజ్‌ మొగిలినేని, బన్నీవాస్‌, వెంకటేశ్‌ మహా (సమర్పణ) విడుదల: 02-02-2024 క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన నటుడు సుహాస్‌ (Suhas).. అనతికాలంలోనే టాలీవుడ్‌లో కథానాయకుడిగా ఎదిగాడు. ‘క‌ల‌ర్‌ఫొటో’, ‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ క్రమంలోనే సుహాస్‌ హీరోగా రూపొందిన మరో చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band Review). జీఏ 2 పిక్చర్స్ నిర్మాణంలో భాగ‌స్వామి కావడంతో పాటు ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించ‌డంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మ‌రి చిత్రం ఎలా ఉంది? సుహాస్‌కు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో మ‌ల్లి (సుహాస్‌) ఓ స‌భ్యుడు. చిర‌త‌పల్లిలో త‌న కుటుంబంతో నివ‌సిస్తుంటాడు. అక్క ప‌ద్మ (శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌) స్కూల్లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. ఊరి మోతుబ‌రి వెంక‌ట్‌బాబు (నితిన్ ప్ర‌స‌న్న‌) వ‌ల్లే ప‌ద్మ‌కి ఉద్యోగం వచ్చిందని, వాళ్లిద్ద‌రి మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌నే ఓ పుకారు మొద‌ల‌వుతుంది. ఓ కారణం చేత వెంక‌ట్‌బాబు - మల్లికీ మ‌ధ్య వైరం మొద‌ల‌వుతుంది. అవి చిలికి చిలికి గాలివాన‌లా మార‌తాయి. ఆ త‌ర్వాత ఏం జరిగింది? ల‌క్ష్మి (శివాని నాగారం), మల్లిల ప్రేమ కథ ఏంటి? అది చివరకు ఎలాంటి మ‌లుపు తీసుకుంది? తెలియాలంటే తెర‌పై చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే? ఈ సినిమాలో పాత్రలు తప్ప (Ambajipeta Marriage Band) నటీనటులు ఎక్కడా కనిపించరు. ప్రతీ ఒక్క నటుడు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు. మ‌ల్లి పాత్ర‌లో సుహాస్ అదరగొట్టాడు. ప్ర‌థ‌మార్ధంలో అబ్బాస్‌ హెయిర్‌ స్టైల్‌తో న‌వ్వించిన అతడు, ద్వితీయార్ధంలో గుండుతో క‌నిపిస్తూ ఎంతో స‌హ‌జంగా న‌టించాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లో అతడి న‌ట‌న మ‌న‌సుల్ని హ‌త్తుకుంటుంది. ఇక హీరోయిన్‌ శివానీ నాగారం.. ల‌క్ష్మి పాత్రకి 100 శాతం న్యాయం చేసింది. సుహాస్‌ ‌అక్కగా చేసిన శ‌ర‌ణ్య ప్ర‌దీప్ సినిమాకి మ‌రో హీరో అని చెప్పవచ్చు. ఆమె పాత్ర‌ని డిజైన్ చేసిన తీరు సినిమాకే హైలైట్‌. నితిన్‌, విన‌య మ‌హాదేవ్, హీరోకి స్నేహితుడిగా క‌నిపించే జ‌గ‌దీష్ బండారి పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. డైరెక్షన్ ఎలా ఉందంటే? డబ్బు, కులం వ్యాత్యాసం కలిగిన ప్రేమ కథలు, రివేంజ్‌ డ్రామాలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ మూవీ కూడా అదే కోవకి చెందిందే. కానీ, డైరెక్టర్‌ దుష్యంత్‌ (Ambajipeta Marriage Band Review) కథకు అక్క-తమ్ముడి ఎమోషన్స్‌, ఆత్మాభిమానం అనే కాన్సెప్ట్‌ను జోడించి కొత్తదనం తీసుకువచ్చారు. కులాల మ‌ధ్య అంత‌రాల్ని,&nbsp; ఆర్థిక అస‌మాన‌త‌ల్నీ స‌హ‌జంగా ఆవిష్క‌రిస్తూ ప్రేక్షకులను క‌థ‌కు కనెక్ట్ చేశాడు. ప్రథమార్థాన్ని అందమైన ప్రేమ కథ, సరదా సరదా సన్నివేశాలు చుట్టూ తిప్పిన దర్శకుడు.. విరామం ముందు వచ్చే సన్నివేశంతో సినిమాను కీలక మలుపు తిరిగేలా చేశారు. ద్వితియార్థంలో అత్మాభిమానాన్నే ప్రధాన అంశంగా తీసుకొని తనదైన శైలిలో కొత్త రివేంజ్‌ డ్రామాను ఆవిష్కరించారు. క‌థ ఊహ‌కు త‌గ్గ‌ట్టే సాగుతున్నా.. బ‌ల‌మైన స‌న్నివేశాల‌ు, డ్రామాతో ప్రేక్షకులకు ఎక్కడా బోర్‌ కొట్టించలేదు. ఓవరాల్‌గా డైరెక్టర్‌ దుష్యంత్‌ పనితనం మెప్పిస్తుంది.&nbsp; సాంకేతికంగా.. సాంకేతిక విభాగాల‌న్నీ మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. శేఖ‌ర్ చంద్ర పాట‌లు, నేప‌థ్య సంగీతం, వాజిద్ బేగ్ త‌న కెమెరాతో చిర‌త‌ప‌ల్లిని ఆవిష్క‌రించిన తీరు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ఎడిటింగ్‌, బ‌ల‌మైన ర‌చ‌న సినిమా గ‌మ‌నాన్నే మార్చేశాయి. మేకింగ్ ప‌రంగానూ ఎంతో ప‌రిణ‌తి క‌నిపిస్తుంది. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది. ప్లస్‌ పాయింట్స్‌ సుహాస్‌, శరణ్య నటనకథ, నేపథ్యంభావోద్వేగ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్ అక్కడక్కడ బోరింగ్ సీన్లు రేటింగ్‌: 3.5/5 ఓటీటీ వేదిక లాక్‌! ఇక ఈ 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం అప్పుడే ఓటీటీ పార్ట్నర్‌ను కూడా లాక్‌ చేసుకుంది. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక ఆహా (Aha) ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించున్నట్లు కన్‌ఫార్మ్‌ అయ్యింది. దీంతో థియేటర్స్‌లో రన్‌ అనంతరం ఈ సినిమా ఆహాలోనే అందుబాటులోకి రానుంది.
    ఫిబ్రవరి 02 , 2024
    Kotabommali PS Review: పోలీసుల కష్టాలను కళ్లకు కట్టిన ‘కోట బొమ్మాళి’... సినిమా హిట్టా? ఫట్టా?
    Kotabommali PS Review: పోలీసుల కష్టాలను కళ్లకు కట్టిన ‘కోట బొమ్మాళి’... సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు:&nbsp; శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌, మురళి శర్మ, బెనర్జీ, ప్రవీణ్‌ తదితరులు దర్శకత్వం: తేజ మర్నీ సంగీతం: రంజిన్‌ రాజ్‌, మిధున్‌ ముకుందన్ సినిమాటోగ్రఫీ: జగదీష్‌ చీకటి&nbsp; నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్‌ నిర్మాతలు: బన్నీ వాసు,&nbsp; విద్యా&nbsp; విడుదల తేదీ: నవంబర్‌ 24, 2023 ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ (Srikanth) ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’ (Kotabommali PS). తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ (Shivani) ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళంలో నేషనల్‌ అవార్డు అందుకున్న 'నయట్టు'కు రీమేక్‌గా ఈ మూవీగా తెరకెక్కింది. మరి తెలుగులోనూ ఈ చిత్రం మెప్పించిందా? శ్రీకాంత్‌ ఖాతాలో మరో హిట్‌ చేరిందా? శివానీ రాజశేఖర్‌ తొలి సక్సెస్‌ను అందుకుందా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ కోట బొమ్మాళి పోలీసు స్టేషన్‌లో పని చేసే ముగ్గురు కానిస్టేబుళ్లు (శ్రీకాంత్‌, శివానీ, రాహుల్‌ విజయ్‌) చేయని తప్పుకు ఓ కేసులో ఇరుక్కుంటారు. పోలీసు ఉన్నాతాధికారులు, రాజకీయ నాయకులు చేసిన వికృత చర్యలకు బలై అజ్ఞాతంలోకి పారిపోతారు. వీరిని పట్టుకునేందుకు ప్రభుత్వం పోలీసు ఆఫీసర్‌ వరలక్ష్మీని రంగంలోకి దింపుతుంది. దీంతో పోలీసులే పోలీసులను ఛేజ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? వరలక్ష్మీ నుంచి తప్పించుకోవడానికి శ్రీకాంత్‌, విజయ్‌, శివానీ ఏం చేశారు? చివరికి వారు పట్టుబడ్డారా లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే శ్రీకాంత్ అద్భుత నటన కనిబరిచాడు. చాలా రోజుల తర్వాత ఒక డెప్త్‌ ఉన్న పాత్రను పోషించాడు. అటు రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌లు కూడా తమ నటనలతో పాత్రలకు ప్రాణం పోశారు.&nbsp; మురళీ శర్మ యాక్టింగ్‌ కూడా సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. మిగతా ఆర్టిస్టులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే పోలీసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను డైరెక్టర్‌ తేజ మర్నీ చిత్ర కథాంశంగా ఎంచుకోవడం నిజంగా ప్రశంసనీయం. పోలీసుల కుటుంబాలకు ఉండే ఇబ్బందులను ఆయన చక్కగా చూపించారు. పొలిషియన్స్‌ చేతుల్లో పోలీసులు ఎలా నలిగిపోతారో కూడా చక్కగా తెరకెక్కించారు. అయితే సినిమాలో ఆధ్యంతం ఛేజింగ్‌ ఉండటం వల్ల కాస్త బోరింగ్‌ ఫీల్‌ అవుతారు. కథ బాగున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్‌ కాస్త జాగ్రత్త పడాల్సింది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. వాటిని కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా డైరెక్టర్‌ పని తీరును మెచ్చుకోవాల్సిందే.&nbsp; టెక్నికల్‌గా&nbsp; టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే రంజన్‌ రాజ్‌ ఇచ్చిన మ్యూజిక్‌ చాలా బాగుంది. ముఖ్యంగా ‘లింగిడి లింగిడి’ పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే నేపథ్య సంగీతం మూవీకి చాలా ప్లస్‌ అయ్యింది. అటు జగదీష్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథప్రధాన పాత్రల నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్ ప్లేబోరింగ్ సీన్లు రేటింగ్‌: 3/5
    నవంబర్ 24 , 2023
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు దర్శకుడు: మణికాంత్ గెల్లి సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్ సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి ఎడిటింగ్: సత్య గిడుతూరి నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట ఓటీటీ : ఆహా రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన&nbsp; లేటేస్ట్‌ చిత్రం 'విద్య వాసుల అహం'. మణికాంత్‌ గెల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎటర్నిటి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై లక్ష్మీ సవ్య, రంజిత్‌ కుమార్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాల సినిమా ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నేరుగా ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. మే 17 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?&nbsp; ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి విద్య (శివానీ రాజశేఖర్) తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. తను పెట్టిన పరీక్షల్లో నెగ్గిన వరుడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పిస్తుంది. అలా వాసు (రాహుల్‌ విజయ్‌)ను విద్య వెళ్లి చేసుకుంటుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది వారిలోని అహం మెుదలవుతుంది. అది వారి బంధాన్ని ప్రభావితం చేస్తుంటుంది. కొన్ని నాటకీయ పరిణామాలు.. వాసు-విద్య జీవితాల్లో ఎలాంటి మార్పులకు కారణమయ్యాయి? వారి మధ్య వచ్చిన గొడవలు ఏంటి? వాసు జాబ్‌ పోతే విద్య ఏం చేసింది? కొత్త జంట తమ కలహాలకు ఎలాంటి ముగింపు ఇచ్చారు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే యువ నటుడు రాహుల్ విజయ్ కొత్త పెళ్ళి కొడుకు పాత్రలో మెప్పించాడు. ఈ జనరేషన్‌ యూత్‌ను ప్రతిబింబిస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో శివాని రాజశేఖర్‌ చక్కటి నటన కనబరిచింది. నవ వధువుగా చీరలో క్యూట్‌గా కనిపిస్తూనే భర్తతో గొడవ పడే సీన్స్‌లో అదరగొట్టింది. ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే కథ మెుత్తం తిరిగింది. ఇక నారదుడుగా శ్రీనివాస రెడ్డి, లక్ష్మి దేవిగా అభినయ, విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్ కాస్సేపు కనపడి అలరించారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు మణికాంత్‌ గెల్లి.. ఈ జనరేషన్‌ యూత్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత యువతీ యువకులు ఎలా ఉంటున్నారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. సినిమాను మాముల కథలా చెప్పకుండా విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి, నారదుడు మాటల ద్వారా స్టోరీని నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో డైరెక్టర్‌ విఫలమయ్యారు. అహం కారణంగా వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయో తెరపై స్పష్టంగా చూపించడంలో తడబడ్డాడు. డైలాగ్స్‌ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కథ మెుత్తాన్ని భార్య భర్తల మధ్యే తిప్పడం.. ఆకట్టుకునే ఇతర పాత్రలు లేకపోవడం ఆడియన్స్‌కు బోర్‌ కొట్టిస్తుంది.&nbsp;&nbsp; సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రాఫర్‌ చక్కటి విజువల్స్ అందించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రాహుల్‌, శివానీ నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్ స్లో స్క్రీన్‌ప్లేఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    మే 17 , 2024
    వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమా ఉప్పెనతోనే స్టార్ డం సంపాదించాడు. కొండపొలం, రంగ రంగ వైభవంగా చిత్రాల హిట్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ పొందిన వైష్ణవ్ తేజ్ గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. వైష్ణవ్ తేజ్ అసలు పేరు? పంజా వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ముద్దు పేరు? హీరో బాబు వైష్ణవ్ తేజ్ ఎత్తు ఎంత? 6 అడుగులు వైష్ణవ్ తేజ్&nbsp; తొలి సినిమా? ఉప్పెన వైష్ణవ్ తేజ్&nbsp; ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ వైష్ణవ్ తేజ్&nbsp; పుట్టిన తేదీ ఎప్పుడు? 1995, జనవరి 13 వైష్ణవ్ తేజ్‌కు వివాహం అయిందా? ఇంకా జరగలేదు. వైష్ణవ్ తేజ్‌ ఫస్ట్ క్రష్? సొనాక్షి సిన్హా వైష్ణవ్ తేజ్&nbsp; ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వైష్ణవ్ తేజ్&nbsp; తొలి హిట్ సినిమా? ఉప్పెన వైష్ణవ్ తేజ్‌కు గుర్తింపునిచ్చిన చిత్రం? కొండపొలం వైష్ణవ్ తేజ్&nbsp; ఇష్టమైన కలర్? వైట్, బ్లాక్ వైష్ణవ్ తేజ్&nbsp; తల్లిదండ్రుల పేరు? విజయ దుర్గ, శివప్రసాద్ వైష్ణవ్ తేజ్‌కు ఇష్టమైన ప్రదేశం? తిరుమల వైష్ణవ్ తేజ్‌కు ఇష్టమైన సినిమాలు? రజనీకాంత్ నటించిన శివాజి సినిమా వైష్ణవ్ తేజ్&nbsp; ఏం చదివాడు? డిగ్రీ వైష్ణవ్ తేజ్&nbsp; అభిరుచులు? సినిమాలు చూడటం, ట్రావలింగ్ వైష్ణవ్ తేజ్&nbsp; ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.&nbsp; వైష్ణవ్ తేజ్&nbsp; సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=wYDcnafZkS0
    మార్చి 21 , 2024
    VARUNLAV:  ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
    VARUNLAV:  ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మనసిచ్చిన ఈ హీరో ఇప్పుడు మనువాడేందుకు రెడీ అవుతున్నాడు. గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌పై సైలెంట్‌గా ఉన్న వీరు ఏకంగా పెళ్లి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలిసి సినిమాల్లో నటించి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నది వీరొక్కరే కాదు. ఈ జాబితాలో ఇప్పటికే ఎంతో మంది ఉన్నారు. ఆ జంటలేవో తెలుసుకుందాం.&nbsp; https://twitter.com/tupakinews_/status/1667059120313352192?s=20 https://twitter.com/Pallavi_M_K/status/1664277523608518657?s=20 కియారా- సిద్ధార్థ్ మల్హోత్రా బాలీవుడ్ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ షేర్షా సినిమాతో పరిచయం. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరికి పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నయనతార- విఘ్నేష్ శివన్ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నయన్.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. కొంతకాలంగా నడిచిన వీరి ప్రేమాయణం పెళ్లి పీటలెక్కి మరో స్థాయికి చేరుకుంది. 2022లో వీరికి వివాహం కాగా సరోగసి విధానంలో వీరు సంతానాన్ని పొందారు.&nbsp; Screengrab Instagram:nayanatara నమ్రత- మహేశ్ బాబు నమ్రత, మహేశ్ బాబులది ప్రేమ వివాహమే. వంశీ సినిమాతో తొలిసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు. అప్పుడే మిల్క్ బాయ్ ప్రేమల్లో పడ్డాడు. ఐదేళ్ల పాటు నమ్రతతో ప్రేమాయణం నడిపి చివరికి నాన్న కృష్ణ పర్మిషన్‌తో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం. గౌతమ్, సితార.&nbsp; అలియా భట్- రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్.. ప్రేమ ద్వారానే ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి చేసిన బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేమలో పడ్డారు. 2022లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ కుమార్తె పుట్టింది.&nbsp; విజయనిర్మల- కృష్ణ సెలబ్రిటీ కపుల్స్‌లలో ఎప్పటికీ గుర్తుండిపోయే జంట వీరిది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. బాపూ ‘సాక్షి’ సినిమాతో వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. అలా సంవత్సరాలు గడిచాక 1969లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం.&nbsp; జ్యోతిక- సూర్య&nbsp; సౌత్‌లో పేరొందిన సెలబ్రిటీ కపుల్ జ్యోతిక- సూర్య. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ఎంతో అభిమానం, ప్రేమ. 2006లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు(దియా), కుమారుడు(దేవ్).&nbsp; అమల- నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున, అమల సెలబ్రిటీల జంటకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 1992 జూన్‌లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్ధం, కిరాయి దాదా, శివ, నిర్ణయం సినిమాల్లో ఈ జంట కలిసి పనిచేసింది.&nbsp; నిక్కీ గల్రానీ- ఆది పినిశెట్టి గొడవలతోనే వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. ‘మలుపు’ సినిమా వీరి జీవితాలను మలుపు తిప్పింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య గొడవలు, మనస్పర్దలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత అర్థం చేసుకుని ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ప్రేమలో పడి 2022, మే నెలలో ఒక్కటయ్యారు. జీవిత- రాజశేఖర్ జీవిత, రాజశేఖర్‌లది విచిత్ర ప్రయాణం. తలంబ్రాలు సినిమాతో వీరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ‘ఆహుతి’ సినిమా చిత్రీకరణ సమయంలో రాజశేఖర్‌కి గాయాలైతే దగ్గరుండి చూసుకుంది జీవిత. అలా తమ ప్రేమను పెద్దలతో పంచుకుని నిజ జీవితంలోనూ హీరో, హీరోయిన్లు అయ్యారు. 1991లో వీరి వివాహమైంది. వీరిద్దరికీ ఇద్దరు కూతుళ్లు. శివానీ, శివాత్మికలు హీరోయిన్లుగా చేస్తున్నారు.&nbsp; షాలిని- అజిత్ బేబి షాలినిగా గుర్తింపు పొందింది షాలిని. తమిళ స్టార్ అజిత్‌తో ప్రేమాయణం పెళ్లి పీటల దాకా తీసుకొచ్చింది. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని 2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. దీపిక పదుకొణె- రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాజీరావ్ మస్తానీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అనంతర కాలంలో ప్రేమలో మునిగి తేలి 2018లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జంటలు కూడా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్-జయా బచ్చన్, శ్రీకాంత్- ఊహ, అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్- విక్కీ కౌశల్, శివబాలాజీ- మధుమిత, వరుణ్ సందేశ్- వితిక, రాధిక- శరత్ కుమార్, ఆర్య- సాయేషా సైగల్ కూడా ప్రేమ వివాహం చేసుకుని అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
    జూన్ 09 , 2023
    శివాని నగరం గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    శివాని నగరం గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    &nbsp;టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త తెలుగు హీరోయిన్లలో శివాని నగరం(Shivani Nagaram) ఒకరు. యంగ్‌ హీరో సుహాస్‌ ప్రధాన పాత్ర పోషించిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఈక్రమంలో శివాని నగరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. (Some Lesser Known Facts about Shivani Nagaram )&nbsp; శివాని నగరం ఎప్పుడు పుట్టింది? 2001, ఆగస్టు 21న జన్మించింది శివాని నగరం హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా? అంబాజి పేట మ్యారేజ్ బ్యాండు శివాని నగరం ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు&nbsp; శివాని నగరం రాశి ఏది? కుంభం శివాని నగరం ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ శివాని నగరం అభిరుచులు? పుస్తకాలు చదవడం, సింగింగ్ శివాని నగరంకు ఇష్టమైన ఆహారం? నాన్ వెజ్, చికెన్ శివాని నగరంకు ఇష్టమైన కలర్? బ్లాక్, పింర్ శివాని నగరంకు ఇష్టమైన హీరో? మహేష్ బాబు శివాని నగరం ఏం చదివింది? డిగ్రీ శివాని నగరం పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కో సినిమాకు రూ.10 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. శివాని నగరం సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? ఇన్‌స్టా రీల్స్ ద్వారా ఫేమస్ అయింది శివాని నగరం ఎఫైర్స్ ఉన్నాయా? అలాంటివి ఏమి లేవు శివాని నగరం ఎక్కడ ఉంటుంది? జూబ్లీ హిల్స్, హైదరాబాద్ శివాని నగరం ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/shivani_nagaram/?hl=en&amp;img_index=1 https://www.youtube.com/watch?v=EAsvlMaZF3M
    ఏప్రిల్ 05 , 2024
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. నవంబర్ ఆఖరి వారంలో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు థియేటర్లలోకి రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు చిత్రాలు, కొత్త వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆదికేశవ మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహించారు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. కోట బొమ్మాళి పి.ఎస్‌ ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’ (Kota bommali PS). వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar), రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ (Shivani Rajashekar) ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తేజ మార్ని దర్శకుడు. బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇందులోని ‘లింగి లింగి లింగిడి’ (Lingi Lingi Lingidi) పాటకు శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ధృవ నక్షత్రం విక్రమ్‌ (Vikram) హీరోగా గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram). స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కగా.. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. చిత్రీకరణ పూర్తయినప్పటికీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. పర్‌ఫ్యూమ్‌ జేడీ స్వామి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పర్‌ఫ్యూమ్‌’ (Perfume). చేనాగ్‌, ప్రాచీ థాకర్‌ జంటగా నటించారు. జె.సుధాకర్‌, శివ.బి, రాజీవ్‌ కుమార్‌.బి, లావురి శ్రీనివాస్‌, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్‌ అక్కినేని కలిసి నిర్మించారు. స్మెల్‌ బేస్డ్‌ థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మాధవే మధుసూదన ‘మాధవే మధుసూదన’ (Madhave Madhusudana) చిత్రం కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తేజ్‌ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటించారు. బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జయప్రకాష్‌, సుమన్‌ కీలక పాత్రలు పోషించారు. ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateChaaverMovieMalayalamSonyLIVNov 24Stamped from the Beginning&nbsp;MovieEnglishNetflixNov 20Squid Game Season 2MovieEnglishNetflixNov 22Puli madaMovieTelugu/MalayalamNetflixNov 23My DemonWeb SeriesEnglishNetflixNov 23Doll boyMovieEnglishNetflixNov 24Gran TurismoMovieTelugu/EnglishNetflixNov 25FargoWeb SeriesEnglishDisney+HotStarNov 21The villageMovieTamilAmazon PrimeNov 24
    నవంబర్ 21 , 2023
    Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..!&nbsp;
    Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..!&nbsp;
    రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన ‘జైలర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ చిత్రానికి థియేటర్లు పెరిగాయి. రజనీకాంత్ మార్క్ స్టైల్, యాక్షన్; అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచాయి. ప్రధానంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు ఆడియెన్స్‌ని తెగ ఇంప్రెస్ చేశాయి. ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకుంటున్నారు. సినిమాని మళ్లీ మళ్లీ చూస్తూ తమ అభిమాన హీరో యాక్టింగ్‌ని ఆస్వాదిస్తున్నారు. అయితే, జైలర్ 2 (Jailer 2) కూడా ఉండబోతోందని చెప్పి ఫ్యాన్స్‌కి మరో ట్రీట్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.&nbsp; భారీ తారాగణంతో.. జైలర్ మూవీ భారీ తారాగణంతో తెరకెక్కింది. మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు. పాత్ర నిడివి కాసేపే అయినా సినిమాపై మంచి ప్రభావాన్ని చూపించారు. నట సింహం నందమూరి బాలకృష్ణతో కూడా జైలర్‌లో ఓ పాత్ర చేయించాలని నెల్సన్ చూశాడట. కానీ, బాలయ్య మాస్ ఫాలోయింగ్‌కి ఆ రోల్ సరితూగక పోవడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో, జైలర్ సీక్వెల్(Jailer Sequel) మూవీలోనూ బిగ్ స్టార్స్ ఉండే అవకాశం ఉంది. మ్యూజిక్ అతడేనా నెల్సన్ దిలీప్ కుమార్ తన కెరీర్‌లో 4 సినిమాలు చేశాడు. జైలర్‌కి ముందు బీస్ట్, డాక్టర్, కోలామావు కోకిల చిత్రాలు తెరకెక్కించాడు. ఈ నాలుగింటికి అనిరుధ్ రవిచందర్‌ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. నెల్సన్‌ తీసిన / తీయబోయే చిత్రాలకు అనిరుధ్‌ ఆస్థాన సంగీత దర్శకుడిగా మరిపోయాడు. జైలర్ మూవీ సక్సెస్‌లో మ్యూజిక్ కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే. దీంతో జైలర్ సీక్వెల్‌లోనూ అనిరుధ్‌నే కొనసాగించే అవకాశం ఉంది. దీంతో పాటు, తొలి సినిమా నుంచి ఒకే డీవోపీతో వర్క్ చేశాడు నెల్సన్. మరి, జైలర్ పార్ట్2 కి కూడా ఆర్.నిర్మల్ డీవోపీగా ఉంటాడేమో చూడాలి.&nbsp; వీటికి కూడా సీక్వెల్స్? జైలర్‌తో పాటు తాను తీసిన తొలి మూడు చిత్రాలకు సీక్వెల్ తెరకెక్కించడానికి నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ చేస్తున్నాడట. కొలామావు కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలకు పార్ట్ 2 తీయాలని చూస్తున్నాడట. మరి, వీటిలోనూ వారినే కొనసాగిస్తారా? లేక ఇతర హీరోలను పెట్టుకుంటాడా? అనేది వేచి చూడాలి. అయితే బీస్ట్ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి, పార్ట్ 2కి విజయ్ ఏమంటాడో.&nbsp; రజనీ, విజయ్‌లతో మూవీ కోలీవుడ్‌లో రజనీ, విజయ్‌లకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పలేం. వీరిద్దరికీ వీరాభిమానులు ఉన్నారు. కోలీవుడ్‌లోనే కాక తెలుగు, మలయాళం, కన్నడలోనూ ఈ హీరోల సినిమా వస్తుందంటే ఆసక్తితో ఎదురు చూస్తారు. మరి, ఈ హీరోలు ఇద్దరు స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది? నెల్సన్ దిలీప్ కుమార్ కూడా రజనీ, విజయ్‌లతో కలిసి సినిమా చేయాలని భావిస్తున్నాడట. వీరిద్దరితో సినిమా చేయడం తన కల అని వెల్లడించాడీ డైరెక్టర్. ఈ చిత్రం పట్టాలెక్కితే కోలీవుడ్ చరిత్రలోనే మైలురాయి చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. 4 రోజుల్లో 300 కోట్లు జైలర్ మూవీ తొలి 4 రోజుల్లో రూ.300 కోట్లు కలెక్షన్లను వసూలు చేసింది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.95.78 కోట్లు, రెండో రోజున రూ.56.24 కోట్లు, మూడో రోజున రూ.68.51 కోట్లు, నాలుగో రోజున రూ.82.36 కోట్లు సాధించింది. మొత్తంగా రూ.302.89 కోట్ల వసూళ్లను రాబట్టింది.&nbsp;
    ఆగస్టు 14 , 2023
    This Week OTT Movies: సంక్రాంతికి దద్దరిల్లనున్న థియేటర్లు.. ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!
    This Week OTT Movies: సంక్రాంతికి దద్దరిల్లనున్న థియేటర్లు.. ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!
    తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్‌ సంక్రాంతి సందడి మెుదలు కానుంది. దీంతో ఎప్పటిలాగే కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడబోతున్నాయి. ఈ ఏడాది కొత్త పలువురు స్టార్‌ హీరోలు సంక్రాంతి బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అటు ఓటీటీలోనూ సరికొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. మరి ఎవరెవరు సంక్రాంతి బరిలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు గుంటూరు కారం మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. హను-మాన్‌ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.. వైవిధ్యమైన సినిమాలు తీస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తేజ సజ్జా కథానాయకుడిగా ఆయన రూపొందించిన మరో చిత్రం ‘హను-మాన్‌’ (Hanu Man). ఆంజనేయస్వామి కథా నేపథ్యంతో సూపర్‌ హీరో ఫిల్మ్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రం కూడా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లోని వీఎఫ్‌ఎక్స్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. చిన్నారులను సైతం అలరించేలా ఇందులో సన్నివేశాలు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.&nbsp; సైంధవ్‌ టాలీవుడ్‌ స్టార్ హీరో వెంకటేష్‌ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచారు. శైలేష్‌కొలను దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సైంధవ్‌’ (Saindhav) జనవరి 13న థియేటర్‌లలో విడుదల కానుంది. వెంకటేష్‌కి ఇది 75వ సినిమా. కూతురి సెంటిమెంట్‌తో పాటు, వెంకటేశ్‌ యాక్షన్‌ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. శ్రద్ధాశ్రీనాథ్‌, నవాజుద్దీన్‌ సిద్దిఖీ, ఆర్య కీలకపాత్రలు పోషించారు. నా సామిరంగ ఈ సంక్రాంతికి మరో స్టార్‌ హీరో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. నాగార్జున (Nagarjuna) హీరోగా విజయ్‌ బిన్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) చిత్రం.. జనవరి 14న విడుదల కానుంది. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలు పోషించగా.. ఆషికా రంగనాథ్‌ కథానాయికగా చేసింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘పొరింజు మరియం జోసే’ చిత్రానికి రీమేక్‌గా నా సామిరంగను రూపొందించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేశారు.&nbsp; అయలాన్‌ సంక్రాంతికి తెలుగు చిత్రాలతో పాటు ఓ డబ్బింగ్‌ సినిమా సైతం విడుదల కాబోతోంది. తమిళ నటుడు శివకార్తికేయన్‌ ‘అయలాన్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాడు. ఆర్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా చేసింది. జనవరి 12న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. గ్రహాంతర వాసితో మనిషికి కుదిరిన స్నేహం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అన్నది కథ.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే ఏకంగా 29 చిత్రాలు / వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. థియేటర్లకు వెళ్లి కొత్త మూవీస్‌ చూసే ఆసక్తి లేకపోతే వీటిని ప్రిఫర్‌ చేయవచ్చు. ఇంతకీ ఓటీటీలో రాబోతున్న ముఖ్యమైన చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రం జనవరి 12న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గతేడాది డిసెంబర్‌ 8న విడుదలైన ఈ చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద విఫలమై నితీర్‌ కెరీర్‌లో మరో డిజాస్ ఫ్లాప్‌గా నిలిచింది. మరి ఓటీటీ ప్రేక్షకులనైనా ఈ చిత్రం ఆకట్టుకుందో లేదో చూడాలి. కోట బొమ్మాళి P.S శ్రీకాంత్‌ కీలక పాత్రలో జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’. వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. జనవరి 11వ తేదీ నుంచి ‘ఆహా’లో ప్రసారం కానుంది. నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateBreak Point Season 2SeriesEnglishNetflixJan 10King Dom - 3MovieEnglishNetflixJan 10The TrustSeriesEnglishNetflixJan 10Boy Swallows UniverseSeriesEnglishNetflixJan 10Killer SoupMovieHindiNetflixJan 11LiftMovieEnglishNetflixJan 12EchoSeriesEnglishDisney + HotstarJan 11The Legend of HanumanSeriesHindiDisney + HotstarJan 12JourneyMovieTamil&nbsp;SonyLIVJan 12SivappuMovieTamil&nbsp;AhaJan 12La BreaSeriesEnglishJio CinemaJan 10TedSeriesEnglishJio CinemaJan 12Mission: Impossible – Dead Reckoning Part OneMovieTelugu/EnglishAmazon PrimeJan 11RoleplayMovieEnglishAmazon PrimeJan 12
    జనవరి 08 , 2024

    @2021 KTree