• TFIDB EN
  • సైరన్
    UATelugu
    భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    ఇన్ ( Tamil, Telugu, Hindi, Malayalam, Kannada )
    Watch
    2024 Apr 158 months ago
    సైరన్‌ (తెలుగు) ఏప్రిల్‌ 19 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    జయం రవి
    తిలగన్
    కీర్తి సురేష్
    ఇన్‌స్పెక్టర్ కె. నందిని
    అనుపమ పరమేశ్వరన్
    జెన్నిఫర్, తిలగన్ భార్య
    సముద్రకని
    S. నాగలింగం IPS
    యువినా పార్థవి
    యోగి బాబు
    వేలంకన్ని
    అజయ్
    అళగం పెరుమాళ్
    పాండియన్
    సిబ్బంది
    ఆంటోని భాగ్యరాజ్దర్శకుడు
    సుజాత విజయకుమార్నిర్మాత
    ఆంటోని భాగ్యరాజ్రచయిత
    జివి ప్రకాష్ కుమార్
    సంగీతకారుడు
    సామ్ సిఎస్
    సంగీతకారుడు
    సెల్వకుమార్ SK
    సినిమాటోగ్రాఫర్
    రూబెన్
    ఎడిటర్ర్
    కథనాలు
    <strong>Antony Thattil: కీర్తి సురేష్‌ పెళ్లాడే ఆంటోని తట్టిల్‌ ఎంత గొప్పోడో తెలుసా?</strong>
    Antony Thattil: కీర్తి సురేష్‌ పెళ్లాడే ఆంటోని తట్టిల్‌ ఎంత గొప్పోడో తెలుసా?
    యంగ్‌ బ్యూటీ కీర్తి సురేష్‌ (Keerthy Suresh) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ప్రియుడు ఆంటోని తట్టిల్‌ (Antony Thattil)ను గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆంటోనిగురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంటోని తట్టిల్‌ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; ఆంటోని తట్టిల్‌ (Antony Thattil) కేరళలోని కొచ్చిలో 1989లో జన్మించాడు. విద్యాబ్యాసం అంతా కొచ్చి, తమిళనాడులోని చెన్నైలో జరిగింది. ప్రస్తుతం దుబాయ్‌ కేంద్రంగా పనిచేసే యంగ్‌ బిజినెస్‌ మ్యాన్‌గా ఆంటోని రాణిస్తున్నారు. చెన్నై కేంద్రంగా రెండు కంపెనీలను స్థాపించారు.&nbsp; తొలుత ‘ఎస్పిరోస్‌ విండో సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ’ (Asperos Window Solutions LLP) కంపెనీని చెన్నైలో స్థాపించారు. దానిని దుబాయ్‌కు విస్తరించి అక్కడ కేంద్రంగా పని చేస్తున్నారు.&nbsp; ఆ తర్వాత కైపాలత్‌ హబీబ్‌ ఫారుఖీ అనే బిజినెస్‌ మెన్‌తో కలిసి మరో కంపెనీని చెన్నైలో రిజిస్టర్‌ చేశారు. వారితో పాటు మరో ముగ్గురు కంపెనీలో షేర్‌ హోల్డర్స్‌గా ఉన్నారు. ఈ రెండు కంపెనీలతో పాటు ఆంటోనీకి పలు రిసార్ట్స్‌ కూడా ఉన్నాయి. హోమ్‌ టౌన్‌ కొచ్చిలో వాటి ద్వారా వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.&nbsp; ప్రముఖ నటి కీర్తికి 15 ఏళ్లు ఉన్నప్పటి నుంచే అంటోనితో పరిచయం ఉంది. వీరి పరిచయం నాటికి కీర్తి హైస్కూల్లో ఉండగా ఆంటోని డిగ్రీ చదువుతున్నాడు.&nbsp; కీర్తి బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి రాణిస్తుండగా ఆంటోని ఆమెతో రిలేషన్‌ను కొనసాగిస్తూనే చదువుపై ఫోకస్‌ పెట్టాడు.&nbsp; మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలని ఆంటోని (Antony Thattil) చిన్నప్పటి నుంచి కలలు కనేవారు. తన లక్ష్యానికి కీర్తితో ఉన్న రిలేషన్ అడ్డురాకుండా రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నారు.&nbsp; ఫలితంగా అటు బిజినెస్‌, ఇటు లవ్‌ లైఫ్‌లోనూ సక్సెస్‌ అయ్యి ప్రస్తుత యువతకు ఆంటోని ఎంతో ప్రేరణగా నిలస్తున్నారు.&nbsp; డిసెంబర్‌ 11, 12 తేదీల్లో గోవాలో వీళ్ల పెళ్లి (Keerthy Suresh Marriage) జరగనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. పెళ్లి పనులు కూడా మెుదలైనట్లు సమాచారం.&nbsp; అంటోనీ (Antony Thattil)కి తమ కూతుర్ని ఇచ్చేందుకు కీర్తి తల్లిదండ్రులు సురేశ్‌, మేనక ఎంతో సంతృప్తిగా ఉన్నారట. వీరి పెళ్లికి బంధుమిత్రులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారట.&nbsp; ఇదిలా ఉంటే ఇటీవల తన పెళ్లి (Keerthy Suresh Marriage) గురించి కీర్తి సురేష్ స్పందించింది. పెళ్లి ఎప్పుడని ఆంగ్ల పత్రిక ప్రశ్నించగా సరైన సమయం వచ్చినప్పుడు చెప్తా అంటూ బదులిచ్చింది.&nbsp; గతేడాది కూడా అంటోనితో ఉన్న రిలేషన్‌ గురించి పరోక్షంగా కీర్తి హింట్ ఇచ్చింది. సరైన సమయం వచ్చిన మిస్టరీ మ్యాన్‌ను బయటపెడతానంటు చెప్పుకొచ్చింది.&nbsp; 2013లో గీతాంజలి అనే మలయాళం మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేశ్. ‘నేను శైలజా’ చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించి ఇంప్రెస్‌ చేసింది.&nbsp; తెలుగులో చేసిన ‘మహానటి’ చిత్రం కీర్తి సురేష్‌ లైఫ్‌కు టర్నింగ్‌ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది.&nbsp; ఈ ఏడాది ఇప్పటికే ‘సైరన్‌’, ‘రఘుతాత’తో అలరించిన కీర్తి ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’, ‘ఉప్పు కప్పురంబు’తో బిజీగా ఉన్నారు. ‘బేబీ జాన్‌’ (Baby John)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
    నవంబర్ 19 , 2024
    <strong>Mathu Vadalara 2 Movie Review: కమెడియన్‌ సత్య వన్‌ మ్యాన్‌ షో.. ‘మత్తు వదలరా 2’ ఎలా ఉందంటే?</strong>
    Mathu Vadalara 2 Movie Review: కమెడియన్‌ సత్య వన్‌ మ్యాన్‌ షో.. ‘మత్తు వదలరా 2’ ఎలా ఉందంటే?
    నటీనటులు : శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్‌, వెన్నెల కిషోర్‌, రోహిణి తదితరులు రచన, దర్శకత్వం : రితేష్‌ రానా సంగీతం : కాల భైరవ సినిమాటోగ్రాఫర్‌ : సురేష్‌ సారంగం ఎడిటర్‌: కార్తిక శ్రీనివాస్‌ నిర్మాత : చిరంజీవి (చెర్రీ) విడుదల తేదీ: సెప్టెంబర్‌ 13, 2024 శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్‌, రోహిణి, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. హీరో ప్రభాస్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి బాబు (శ్రీ సింహా), యేసుబాబు (సత్య) డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తుంటారు. చాలిచాలని జీతంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. దీంతో డబ్బులు సరిపోకా వారు స్పెషల్ ఏజెంట్స్‌గా మారతారు. ఓ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఏంటా కేసు? వారు చేసిన పొరపాటు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అండర్‌ కవర్‌ ఏజెంట్‌ నిధి (ఫరియా అబ్దుల్లా) వారికి ఎలా సాయపడింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Mathu Vadalara 2 Movie Review) ఎవరెలా చేశారంటే హీరోగా శ్రీ సింహా మంచి నటన కనబరిచాడు. కామెడీ, యాక్షన్‌ సీక్వెన్స్‌లో ఆకట్టుకున్నాడు. అయితే ప్రతీ సీన్‌లో సత్య పక్కన ఉండటంతో అతడే హైలెట్‌ అయ్యాడు. ఈ సినిమాకు సత్యనే మెయిన్‌ హీరో అని చెప్పవచ్చు. తన పంచ్‌ డైలాగ్స్‌తో, కామెడీ టైమింగ్‌తో సత్య అదరగొట్టాడు. ముఖ్యంగా అతడి ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ‘సెక్సీ సైరన్‌’ అంటూ సినిమాలో అతడు చేసే హంగామా బాగా వర్కౌట్ అయ్యింది. హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లాకు ఇందులో మంచి రోల్‌ దక్కింది. చిట్టి పాత్ర తర్వాత ఆ స్థాయిలో ఈ రోల్‌ గుర్తుండిపోతుంది. అటు వెన్నెల కిషోర్‌ సైతం తనదైన కామెడీతో గిలిగింతలు పెట్టారు. సునీల్‌, రోహిణి తదితర ముఖ్య తారాగారణం తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఇతర నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు రితేశ్‌ రాణా కథలన్నీ కూడా సింపుల్‌గా డ్రగ్స్‌, గన్స్‌, డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. ఈసారి కూడా దర్శకుడు అలాంటి స్టోరీనే ఎంచుకున్నారు. ఒక కిడ్నాపింగ్‌ డ్రామాకు హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంతో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, బాల‌కృష్ణ‌, మ‌హేష్‌బాబుతో పాటు ప‌లువురు స్టార్ హీరోలను రిఫ‌రెన్స్‌లుగా తీసుకోవడం బాగా కలిసొచ్చింది. శ్రీ సింహా, సత్య పాత్రలను చాలా ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దడం మెప్పిస్తుంది. అలాగే తెరపై కనిపించే ప్రతీ క్యారెక్టర్‌ కొత్తగా, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రథమార్థం మెుత్తాన్ని ఫన్‌ రైడ్‌గా నడిపించిన దర్శకుడు ద్వితియార్థంకు వచ్చేసరికి కాస్త తడబడ్డాడు. సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్‌లో ల్యాగ్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌ కూడా ప్రిడిక్టబుల్‌గా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. చాలా సన్నివేశాలను బీజీఎం బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ శ్రీ సింహా, సత్య&nbsp;కామెడీ&nbsp;నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడ సాగదీత సీన్స్‌ప్రిడిక్టబుల్‌ క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 13 , 2024
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని&nbsp; అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని&nbsp; అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు టెనెంట్‌ హాస్య నటుడు సత్యం రాజేష్‌ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టెనెంట్‌' (Tenant). ఏప్రిల్‌ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. ప్రేమ పెళ్లి తర్వాత సంతోషంగా సాగాల్సిన హీరో జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగింది? అన్నది కథ. శశివదనే రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన ప్రేమకథ చిత్రం 'శశివదనే' (Sasivadane). సాయి మోహన్‌ ఉబ్బర దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. గోదావరి నేపథ్యంలో ఈ&nbsp; ప్రేమ కథ సాగనుంది. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijathaparvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీ ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.&nbsp; లవ్‌ మౌళి అవనీంద్ర దర్శకత్వంలో నవ్‌దీప్‌ హీరోగా చేసిన సినిమా 'లవ్‌ మౌళి' (Love Mouli). ఇందులు పంకురి గిద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. లవ్‌ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. మార్కెట్‌ మహాలక్ష్మీ కేరింత ఫేమ్‌ పార్వతీశం ఈ సినిమా (Market Mahalakshmi)లో హీరోగా చేశాడు. వీఎస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అఖిలేష్‌ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌, మహబూబ్‌ భాషా, ముక్కు అవినాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 19న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.&nbsp; శరపంజరం నవీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శరపంజరం’ (Sarapanjaram). లయ కథానాయిక. ఈ మూవీ ఏప్రిల్‌ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మార‌ణాయుధం సీనియర్‌ నటి మాలాశ్రీ.. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించిన తాజా చిత్రం ‘మార‌ణాయుధం’ (Maaranaayudham). గురుమూర్తి సునామి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం.. గతేడాది కన్నడలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులనూ అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్‌ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది. లవ్‌ యూ శంకర్‌&nbsp; దర్శకుడు రాజీవ్‌ ఎస్‌.రియా.. ‘మై ఫ్రెండ్‌ గణేశా’ యానిమేషన్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ‘లవ్‌ యూ శంకర్‌’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రేయాస్‌ తల్పాడే, తనీషా జంటగా నటించారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సైరెన్‌ జ‌యం ర‌వి (Jayam Ravi) క‌థానాయ‌కుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరెన్’ (Siren). ఫిబ్రవరి 16న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా సైరన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇందులో జయం రవితో పాటు కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మై డియర్ దొంగ&nbsp; ఓటీటీలోకి నేరుగా మరో కామెడీ మూవీ వస్తోంది. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన ‘మై డియర్ దొంగ’ (My Dear Donga) మూవీ.. ఏప్రిల్ 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.&nbsp; ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చిన యువ‌కుడు.. అనుకోని ప‌రిస్థితుల్లో అక్క‌డే బందీగా చిక్కుకుపోతే ఏం జ‌రిగింది? దొంగ‌కు, యువ‌తికి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ఎలాంటి మ‌లుపులకు కారణమైంది? అన్న కథతో ఈ మూవీ రూపొందింది. కాటేరా కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ నటించిన చిత్రం కాటేరా (Kaatera). తరుణ్‌ సుధీర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వెర్షన్‌ ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘జీ 5’ వర్గాలు ప్రకటించాయి. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnyone but YouMovieEnglishNetflixApril 15Rebel MoonMovieEnglishNetflixApril 19Chief Detective 1958SeriesKoreanDisney + HotstarApril 19SirenMovieTeluguDisney + HotstarApril 19My Dear DongaMovieTeluguAhaApril 19Dream ScenarioMovieEnglishLions Gate PlayApril 19The Tourist S2SeriesEnglishLions Gate PlayApril 19Pon Ondru KandenMovieTamilJio CinemaApril 14The SympathizerSeriesEnglishJio CinemaApril 14Article 370MovieHindiJio CinemaApril 19Quizzer Of The YearSeriesEnglishSonyLIVApril 15Dune: Part TwoMovieEnglishBook My ShowApril 16
    ఏప్రిల్ 15 , 2024
    <strong>Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్‌గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!</strong>
    Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్‌గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!
    అందం కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లలో కీర్తి సురేష్‌ (Keerthy Suresh) ఒకరు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తెలుగులోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర అద్భుతంగా పోషించి ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది. అయితే ఆమె ఫిల్మ్‌ కెరీర్‌లో ఎన్నో ఆసక్తికర సంఘనటలు చోటుచేసుకున్నాయి. నేడు (అక్టోబర్‌ 17) కీర్తి సురేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; చైల్డ్‌ ఆర్టిస్టుగా నటీనటులు సురేష్‌కుమార్‌, మేనకల కుమార్తె అయిన కీర్తి సురేష్‌ పెలట్స్‌ అనే మలయాళ చిత్రంతో బాలనటిగా మెరిసింది. మరో అచనేయనేనికిష్టం, కుబేరన్‌ అనే చిత్రాల్లోనూ ఆమె చైల్డ్‌ ఆర్టిస్టుగా కనిపించింది.&nbsp; చిరుకి జోడీగా తల్లి.. చెల్లిగా కూతురు చిరంజీవి (Chiranjeevi) ‘పున్నమినాగు’ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ తల్లి మేనక నటించారు. రీసెంట్‌గా వచ్చిన 'భోళా శంకర్‌' మూవీలో మెగాస్టార్‌ సోదరిగా కీర్తి సురేష్‌ నటించడం గమనార్హం. సినిమా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ అన్నా చెల్లెళ్లుగా వీరి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరిగిన అన్ని రోజులు తన ఇంటి నుంచే కీర్తికి భోజనం పంపినట్లు చిరు మూవీ ప్రమోషన్స్ సందర్భంగా తెలిపారు. ప్రారంభంలోనే అటకెక్కిన చిత్రాలు మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన గీతాంజలి సినిమాతో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా మారింది. అయితే అంతకుముందే హీరోయిన్‌గా మూడు ప్రాజెక్ట్స్‌ను కీర్తి ఓకే చేసింది. షూటింగ్‌ కూడా సగానికి పైనే జరిగింది. అయితే అనూహ్యంగా ఆ మూడు ప్రాజెక్ట్స్‌ మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైనట్లు ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.&nbsp; ఐరెన్‌ లెగ్‌గా ముద్ర కెరీర్‌ ప్రారంభంలోనే మూడు ప్రాజెక్ట్స్‌ ఆగిపోవడం.. మలయాళంలో చేసిన ‘గీతాంజలి’, రింగ్‌ మాస్టర్‌ చిత్రాలు ఫ్లాప్‌ కావడం, తమిళంలో ఆమె ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘ఇదు ఎన్న యామమ్‌’ కూడా డిజాస్టర్‌గా నిలవడంతో కీర్తికి ఐరెన్‌ లెగ్‌ అన్న ముద్ర వచ్చింది. విపరీతంగా ట్రోల్స్‌కు సైతం గురైంది. వాటిని పట్టించుకోకుండా విజయవంతమైన చిత్రాల్లో నటించి కీర్తి సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా మారింది.&nbsp; మహానటితో కెరీర్‌ టర్నింగ్‌ తెలుగులో చేసిన ఫస్ట్ ఫిల్మ్‌ ‘నేను శైలజా’ మంచి విజయం సాధించడంతో టాలీవుడ్‌, కోలీవుడ్‌లో కీర్తి సురేష్‌కు అవకాశాలు పెరిగాయి. వరుసగా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నప్పటికీ నటిగా ఏమీ సాధించలేదన్న అసంతృప్తి కీర్తిలో ఉండిపోయింది. ఆ సమయంలోనే ‘మహానటి’ ప్రాజెక్ట్ ఆమె చెంతకు వచ్చింది. ఇందులో సావిత్రిగా పరకాయ ప్రవేశం చేసి మరి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని తోటి హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచింది. మహానటి తర్వాత కీర్తి సురేష్‌ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయింది.&nbsp; వరుస ఫెయిల్యూర్స్ ‘మహానటి’ తర్వాత కెరీర్‌ పరంగా కీర్తి సురేష్‌కు తిరుగుండదని అంతా భావించారు. అందుకు తగ్గట్లే వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఆ సినిమాలన్నీ ఫ్లాప్‌ టాక్స్‌ తెచ్చుకోవడంతో కీర్తి సురేష్‌ ఇబ్బందుల్లో పడింది. మహానటి తర్వాత ఆమె చేసిన ‘సామి స్క్వేర్‌’, ‘పందెం కోడి 2’,&nbsp; రంగ్‌ దే, ‘అన్నాతే’ వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయి. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌ ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌లక్‌ సఖి’ చిత్రాలూ సందడి చేయలేకపోయాయి.&nbsp; కీర్తిని తీసేద్దామన్న డైరెక్టర్‌ గతేడాది విడుదలైన ‘దసరా’ సినిమాతో కీర్తి భారీ విజయం సాధించి తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లోకి అడుగుపెట్టింది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించి సత్తా చాటింది. ముఖ్యంగా కీర్తి సురేష్‌ నటనపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. వెన్నెల అనే గ్రామీణ యువతిగా ఆమె అదరగొట్టింది. ఉత్తమనటిగా సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సైతం అందుకుంది. అయితే వాస్తవానికి ఈ పాత్ర అయితే దసరా హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను తీసేద్దామని డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల భావించినట్లు ఆ మూవీ ప్రమోషన్స్‌ సందర్భంగా నాని చెప్పారు. మూవీ కథను కీర్తికి చెప్పిన డైరెక్టర్‌ ఆమెను 10-12 కిలోలు బరువు పెరగాలని సూచించారట. కానీ అందుకు తగ్గట్లు పెరగలేదట. దీంతో తన వద్దకు వచ్చి కీర్తి సురేష్‌ను తీసేద్దామని శ్రీకాంత్ ఓదెల అన్నట్లు నాని చెప్పారు. నువ్వు డెబ్యూ డైరెక్టర్‌వి, ఆమె నేషనల్ అవార్డ్ విన్నింగ్‌ నటి. ఇది జరగదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా సినిమా సెట్స్‌పైకి వెళ్లడం వారిద్దరు మంచి ఫ్రెండ్స్‌ కావడం చకాచకా జరిగిపోయినట్లు నాని వివరించారు. https://www.youtube.com/watch?v=J-PhzFEt9Wk కీర్తి స్పెషల్‌ టాలెంట్‌ కీర్తి సురేష్‌ ముఖమే కాదు, గొంతు కూడా చాలా అందంగా ఉంటుంది. దీనిని గుర్తించిన దర్శకులు ఆమె వాయిస్‌తో మ్యాజిక్‌ చేయించారు. ‘సామి స్క్వేర్’ సినిమాలో కీర్తి 'పుదు మెట్రో రైల్‌' అనే పాటను చాలా అందంగా పాడింది. అంతేకాకుండా ఇటీవల వచ్చి కల్కి 2898 ఏడీ చిత్రంలో బుజ్జి వాహనానికి వాయిస్‌ అందించి ఆకట్టుకుంది. ‘గాంధారి’ ఆల్బమ్‌తో తనలో మంచి డ్యాన్సర్‌ ఉందని కూడా చాటి చెప్పింది. ఈ ఏడాది బాలీవుడ్‌లోకి.. ఈ ఏడాది ఇప్పటికే ‘సైరన్‌’, ‘రఘుతాత’తో అలరించిన కీర్తి ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’, ‘ఉప్పు కప్పురంబు’తో బిజీగా ఉన్నారు. ‘బేబీ జాన్‌’ (Baby John)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తన కెరీర్‌లో సావిత్రి (మహానటి), వెన్నెల (దసరా), కళావతి (సర్కారువారి పాట) పాత్రలు సవాలు విసిరాయని ఓ సందర్భంలో అన్నారు.
    అక్టోబర్ 17 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌&nbsp; ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; 2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది.&nbsp;ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best&nbsp; Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) &amp; గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:&nbsp; నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ&nbsp; నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ&nbsp; అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా&nbsp; మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన&nbsp; సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని&nbsp; ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.&nbsp; ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    Science fiction movies in telugu: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే!
    Science fiction movies in telugu: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే!
    ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సైన్స్ సైన్స్ ఫిక్షన్, టైం ట్రావలింగ్&nbsp; చిత్రాల హవా సాగుతోంది. ఈ జోనర్‌లో తెరకెక్కించిన సినిమాలో మంచి విజయం సాధిస్తున్నాయి. దీంతో దర్శకులు ఈ కెటగిరీపై సినిమాలు తీస్తున్నారు. ఆదిత్య 369 నుంచి రాబోయే కల్కీ 2898 AD వరకు తెలుగులో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. 7:11PM టైమ్‌ ట్రావెలింగ్ కథాంశంతో ఈ సినిమా వచ్చింది. అనుకోకుండా ఓ ఊరిలోకి వచ్చిన గ్రహాంతర వాసుల బస్సును హీరో సాహస్ పగడాల ఎక్కడంతో అతను 1999 నుంచి 2024కు ట్రావెల్ చేస్తాడు. ఈ చిత్రాన్ని చైతు మదాల తెరకెక్కించాడు.&nbsp; తెలుగులో మంచి విజయం సాధించింది. ఒకే ఒక జీవితం తెలుగులో టైం ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. చనిపోయిన తన తల్లిని బతికించుకునేందుకు టైం ట్రావెలింగ్‌కు వెళ్లిన శర్వానంద్ ఏం చేశాడు అనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శ్రీ కార్తిక్ తెరకెక్కించారు. ఈ సినిమాలో(Science fiction movies in telugu) గుడ్ స్క్రీన్ ప్లే, మంచి భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. Disco Raja సైన్స్ ఫిక్షన్‌ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించి మెప్పించాడు. విలన్ల చేతిలో దెబ్బలు తిన్న రవితేజ మంచులో కూరుకుపోయి... చాలా ఏళ్లు గడిచిన వయసు పెరగకుండా యవ్వనంగా ఉంటాడు. ఈ సినిమా స్టోరీలో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది. Mark Antony టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన మార్క్ ఆంటోని మంచి విజయం సాధించింది. (Science fiction movies in telugu) గతంలోని వ్యక్తులతో మాట్లాడే ఓ టెలీఫోన్‌ను కనిపెట్టినప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయి అనే స్టోరీతో ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో మార్క్‌- ఆంటోనిగా విశాల్ డ్యూయల్ రోల్‌లో కనిపించి అదరగొట్టాడు. Krrish 3 సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. భయంకరమైన వైరస్‌ను భారత్‌ మీద ప్రయోగించినప్పుడు క్రిష్ దానిని ఎలా అంతమొందించాడు అనే స్టోరీతో అద్భుతంగా సినిమాను రాకేష్ రోషన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించింది. Robo 2.o సైన్స్ ఫిక్షన్ స్టోరీ లైన్‌తో ఈ సినిమా వచ్చింది. సెల్‌ఫోన్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతుంటాయి. దీనిపై కోపంతో పక్షిరాజు అక్షయ్ కుమార్.. ఈ లోకంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఎలక్ట్రానిక్ డివైస్‌లు పనిచేయకుండా చేస్తాడు. దీంతో పక్షిరాజు నుంచి వచ్చిన విపత్తును కాపాడేందుకు రజనీకాంత్ Robo 2.O లెటెస్ట్ వెర్షన్‌గా వచ్చి కాపాడుతాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించాడు. కాకపోతే ఈ సినిమా రోబో సినిమా అంత విజయం సాధించలేదు. Robo&nbsp; రజనీకాంత్ అందాల తార ఐశ్వర్య రాయ్ జంటగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఒక రోబోకు ఫీలింగ్స్ అందిస్తే&nbsp; ఎలాంటి వినాశనం జరుగుతుందనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తెరకెక్కిచారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గాను నిలిచింది. 24 టైం ట్రావెల్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో సూర్య నటించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 24 అనే వాచ్‌లో టైమ్‌ను మారిస్తే గతంలోకి- భవిష్యత్‌లోకి ప్రయాణం చేయవచ్చు. Skylab సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం విఫలమై దాని శిథిలాలు తెలంగాణలోని ఈ చిన్న గ్రామంపై పడేందుకు సిద్ధంగా ఉందనే వార్తల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తులసి శివమణి, తనికెళ్ల భరణి నటించారు. Srivalli బ్రేయిన్ మ్యాపింగ్‌ అనే సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమాను దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించారు. వేర్వేరు ప్రాంతాల్లో.. ఉన్న ఇద్దరు వ్యక్తులు కొన్నిసార్లు ఒకరి గురించి మరొకరు ఒకేవిధంగా ఆలోచిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ల మెదళ్ల మధ్య శబ్ద తరంగాలు ఎలా ప్రవహిస్తాయి? సైన్స్ దీనికేమైనా వివరణ ఇస్తుందా.. అనే పాయింట్ ఆధారంగా 'శ్రీవల్లి' సినిమా రూపొందింది.&nbsp; Taxiwaala ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే సైంటిఫిక్ థియరీతో ఈ సినిమా రూపొందింది.&nbsp; మనం చనిపోయిన తరువాత ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వెళ్తుంది. అయితే మనం బతికి ఉండగానే శరీరం నుంచి ఆత్మను వేరు చేసుకోవచ్చు అదే 'ఆస్ట్రల్ ప్రొజెక్షన్'. దీని ప్రకారం చనిపోయిన శరీరాల్లో ఈ ఆత్మలను ప్రవేశపెట్టి వారితో మాట్లాడవచ్చు. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జువాల్కర్ నటించింది. Tik Tik Tik సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అంతరిక్షంలో తిరిగే ఓ భారీ ఉల్క వల్ల భారత్‌కు ప్రమాదం ఉందని తెలిసి దానిని దారి మళ్లించడానికి కొందరు వ్యోమగాములను పంపిస్తారు. ఈ టీమ్‌ను జయం రవి లీడ్ చేస్తాడు. ఆ ఉల్కను ఎలా దారి మళ్లించేందుకు వ్యోమగాములు ఏం చేశారన్నది కథాంశం. ఈ చిత్రంలో&nbsp; జయం రవితో పాటు, నివేత పేతురాజ్, రమేష్ తిలక్, ఆరోజ్ అజిజ్ తదితరులు నటించారు. Chandamama Lo Amrutham చందమామపై హోటల్ నెలకొల్పాలన్న వెరైటీ కథాంశంతో ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కామెడీ జోనర్‌లో తెరకెక్కింది. ఈ చిత్రంలో శివన్నారాయణ, ఇంటూరి వాసు, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో నటించారు. Yuganiki Okkadu తమిళనాడును పాలించిన ప్రాచీన చోళులు- పాండ్యులతో వైరం వల్ల రాజ్యాన్ని వదిలి ఎవరు గుర్తించని ప్రాంతానికి వెళ్తారు. వారు వెళ్లే మార్గం ఎవరికీ తెలియకుండా అనేక అవాంతరాలు పెడుతారు. చివరకు వారిని ఎలా కనిపెట్టారు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో కార్తి అద్భుతంగా నటించాడు. అతని సరసన రీమా సేన్, ఆండ్రియా జెర్మియా నటించారు. ఈ సినిమాను సెల్వా రాఘవన్ తెరకెక్కించాడు. ఆదిత్య 369 తెలుగులో వచ్చిన ఫస్ట్ టైం ట్రావెల్ సినిమా ఇది. ఇందులో బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన బాలకృష్ణ... గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి ప్రయాణిస్తాడు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచింది. Kalki 2898 AD సైన్స్‌ ఫిక్షన్ ఆధారంగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు.&nbsp; కలియుగాంతంలో జరిగే విపత్తుల నుంచి ప్రజలను రక్షించే సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించనున్నాడు. టైం ట్రావెల్ మిషిన్ ద్వారా 2898 జన్మించబోయే కల్కిని 2024లోకి తీసుకుని రానున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకుణే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2024&nbsp; సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
    నవంబర్ 07 , 2023
    తెలుగులో బెస్ట్‌ సైన్స్‌ ఫిక్షన్ (Sci-Fi) మూవీస్‌
    తెలుగులో బెస్ట్‌ సైన్స్‌ ఫిక్షన్ (Sci-Fi) మూవీస్‌
    ]నాని (2004) - YouTubeబింబిసార (2021) - Zee5ఇవి కూడా చూడొచ్చు
    ఫిబ్రవరి 14 , 2023
    Ustaad Bhagat Singh: ‘గ్లాస్‌ అంటే సైజ్‌ కాదు సైన్యం’.. ఏపీ ప్రభుత్వానికి పవన్‌ గట్టి కౌంటర్‌?
    Ustaad Bhagat Singh: ‘గ్లాస్‌ అంటే సైజ్‌ కాదు సైన్యం’.. ఏపీ ప్రభుత్వానికి పవన్‌ గట్టి కౌంటర్‌?
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ చిత్రంపై పవన్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘గబ్బర్‌ సింగ్‌’ లాంటి బ్లాక్‌బాస్టర్‌ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఎక్స్‌పెక్టెషన్స్‌ తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం పవన్‌ ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ తరపున చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ అభిమానులతో పాటు జనసైనికులకు మంచి బూస్టప్‌ ఇచ్చేలా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ నుంచి మరో గ్లింప్స్‌ రిలీజైంది. ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.&nbsp; 'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’ భగత్‌ బ్లేజ్‌(Bhagath Blaze) పేరుతో రిలీజైన ఈ గ్లింప్స్‌ వీడియో ఆద్యాంతం అలరించింది. 1:02 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోల పవన్ ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ లుక్‌లో కనిపించాడు. గ్లింప్స్‌లోకి వెళ్తే.. మెుదట విలన్‌ గ్యాంగ్‌లోని మనిషి పవన్‌ను ఉద్దేశించి నీ రేంజ్ ఇది అంటూ టీ గ్లాస్‌ను చూపించి కింద పడేస్తాడు. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌.. 'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’, 'గ్లాస్ అంటే సైజ్‌ కాదు సైన్యం.. కనిపించని సైన్యం' అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ చెప్పడం వీక్షకులకు గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం కూడా సూపర్‌గా అనిపించింది. ఈ గ్లింప్స్‌పై మీరూ ఓ లుక్కేయండి. https://www.youtube.com/watch?v=oZYqzxtg4f8 అధికార వైసీపీకి గట్టి కౌంటర్! ఏపీలోని అధికార వైసీపీకి గట్టి కౌంటర్‌ ఇచ్చేలా ఈ గ్లింప్స్‌ను రూపొందినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్‌ ఓడిపోయాడని.. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారని తరచూ అధికార పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ను, జనసేన పార్టీని తక్కువగా చూస్తున్న వారికి గట్టి కౌంటర్‌ ఇచ్చేలా ఈ డైలాగ్స్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్లింప్స్‌లోని ‘గాజు గ్లాస్‌’ డైలాగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1770055005283688593 పొలిటికల్‌ హీట్‌ పెంచిన డైలాగ్స్‌! మరి కొన్నిరోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ.. టీడీపీ - భాజాపాతో పెట్టుకొని ఎన్నికల బరిలో దిగుతుంది. ఈ నేపథ్యంలో కావాలనే పొలిటికల్ హీట్ పెంచేలా ఈ గ్లింప్స్‌ను విడుదల చేశారని అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ మెుదలైంది. ఎన్నికల వేళ జనసైనికుల్లో ఫుల్‌జోష్‌ నింపేందుకు ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారని అంటున్నారు. ఏదీ ఏమైనా పవన్ ఫ్యాన్స్ మాత్రం మాస్ ఈ గ్లింప్స్‌తో జాతర చేసుకుంటున్నారు. చాల రోజుల తర్వాత పవన్ కల్యాణ్‌ను ఇలా యాక్షన్ మోడ్‌లో చూడటం సంతోషంగా ఉందంటూ సంబురాలు చేసుకుంటున్నారు.
    మార్చి 19 , 2024
    OTT Suggestions: ఈ చిత్రం 7 ఆస్కార్ అవార్డులు కొట్టింది… తెలుగులో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా చూశారా?
    OTT Suggestions: ఈ చిత్రం 7 ఆస్కార్ అవార్డులు కొట్టింది… తెలుగులో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా చూశారా?
    ఓటీటీలో ప్రతీ వారం పదుల సంఖ్యలో చిత్రాలు, సిరీస్‌లు రిలీజవుతుంటాయి. వాటిలో ఏది చూడాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. అద్భుతమైన చిత్రాలు ఏమైనా ఉన్నాయా? అని తెగ సెర్చ్‌ చేస్తుంటారు. అటువంటి వారి కోసం YouSay ఓ మంచి హాలీవుడ్‌ చిత్రాన్ని తీసుకొచ్చింది. 95వ ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో సత్తా చాటిన ఆ చిత్రం.. మీ వీకెండ్‌ను ఫుల్‌ఫిల్‌ చేస్తుందనడంలో సందేహం లేదు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందుకు చూడాలి? తెలుగులో ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతోంది? ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆ సినిమా ఏదంటే? 2023లో 95వ ఆస్కార్స్‌ అవార్డ్స్‌ కోసం అత్య‌ధిక నామినేష‌న్స్‌ను సొంతం చేసుకున్న సినిమాగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వ‌న్స్’ (Everything Everywhere All at Once) సినిమా నిలిచింది. మొత్తం 11 విభాగాల్లో నామినేష‌న్స్‌ను పొందిన ఈ సినిమా ఏకంగా 7 ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకుని యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో ఈ సినిమాను చూసేందుకు తెలుగు ఆడియన్స్‌ కూడా తెగ ప్రయత్నించారు. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లీవ్‌ (SonyLIV)లో మెుదట ఇంగ్లీష్‌ వెర్షన్‌ మాత్రమే రిలీజ్‌ కావడంతో నిరాశ చెందారు. తెలుగు వెర్షన్‌ కోసం కొన్ని రోజులు ఎదురు చూసినా రాకపోవడంతో తమ పనుల్లో పడిపోయి సినిమా గురించి మర్చిపోయారు. అయితే ప్రస్తుతం ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వ‌న్స్’ తెలుగు వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను మిస్‌ అయ్యామని బాధపడుతున్నా వారంతా ఈ వీకెండ్‌ చూసేయండి.&nbsp; https://twitter.com/i/status/1634197587438731264 ఊహకందని కాన్సెప్ట్‌తో.. హాలీవుడ్‌ సినిమాలు ఎక్కువగా చూసేవారికి ‘మల్టీవర్స్‌’ (Multiverse) అనే పదం చాలా సుపరిచతం. మార్వెల్‌ సినిమాలు అన్నీ దాదాపుగా ‘మల్టీవర్స్‌’ కాన్సెప్ట్‌తోనే వచ్చాయి. ఈ ఆస్కార్‌ విన్నింగ్‌ చిత్రం ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వ‌న్స్’ కూడా దాదాపుగా అదే కాన్సెప్ట్‌తో రూపొందింది. మ‌నిషిని పోలిన మ‌నుషులు మిగిలిన ప్యార‌లాల్ యూనివ‌ర్స్‌ల‌లో ఉంటార‌నే పాయింట్‌తో దర్శకులు డేనియల్‌ క్వాన్‌, డేనియల్‌ షైనెర్ట్‌ ఈ మూవీని తెరకెక్కించారు. హాలీవుడ్‌లో బ్లాక్‌బాస్టర్‌ విజయం అందుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద డాలర్ల వర్షం కురిపించింది.&nbsp; కథ కోసం 8 ఏళ్ల శ్రమ కొత్త తరహా సినిమాను ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశ్యంతో దర్శకుడు క్వాన్‌, షైనెర్ట్‌.. 2010లోనే ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ కథ రాయడం మొదలుపెట్టారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు కేవలం కథపైనే దృష్టి పెట్టిన వీరిద్దరు.. 2018లో తమ సినిమాను ప్రకటించారు. 2020లో ఈ సినిమా చిత్రీకరణ మెుదలు కాగా.. 2022లో దీన్ని విడుదల చేశారు. 2 గంటల 19 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా హాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించింది. సుమారు 25 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం.. పెట్టిన డబ్బు కంటే నాలుగురెట్లు అధికంగా వసూళ్లు రాబట్టింది. దాదాపు 108 మిలియన్‌ డాలర్లు ఈ చిత్రం వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కథేంటి ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ (Everything Everywhere All At Once).. ఇదొక సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం. మిషెల్‌ యో, కి హుయ్‌ క్వాన్‌, జామీ లీ కర్టిస్‌ వంటి తారాగణంతో ఇది రూపుదిద్దుకుంది. కథలోకి వెళ్తే.. ఎవిలిన్‌ క్వాడ్‌ అనే చైనీస్‌ మహిళ కుటుంబంతో అమెరికాకు వలస వచ్చి లాండ్రీ షాపు పెట్టుకుంటుంది. అనుకోకుండా ఒకరోజు వేరే ప్రపంచం నుంచి వచ్చిన తన లాంటి వాళ్లే ఆమెకు ఎదురవుతారు. ఆ మల్టీవర్స్‌ కలిగించే ప్రమాదాల వల్ల ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది? తన కుటుంబాన్ని ఎలా కాపాడింది? కాలంతో పోరాడుతూ బ్లాక్ హోల్ ప్రమాదం నుంచి విశ్వాన్ని ఏ విధంగా రక్షించింది? అనే ఆసక్తికర అంశాలతో సినీ ప్రియులను ఆకట్టుకునేలా దీన్ని రూపొందించారు.&nbsp; Telugu.yousay.tv Rating : 3.5/5&nbsp;
    ఏప్రిల్ 13 , 2024
    <strong>Kalki 2898 AD: జపాన్‌లో ‘కల్కి’ ఫీవర్‌.. ప్రభాస్‌ ల్యాండింగ్‌కు కౌంట్‌డౌన్‌ ఆరంభం!</strong>
    Kalki 2898 AD: జపాన్‌లో ‘కల్కి’ ఫీవర్‌.. ప్రభాస్‌ ల్యాండింగ్‌కు కౌంట్‌డౌన్‌ ఆరంభం!
    ప్రభాస్‌ హీరోగా నటించిన రీసెంట్‌ సైన్స్ ఫిక్షన్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఇందులో ప్రభాస్‌తో పాటు దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాస్‌న్‌ ముఖ్య పాత్రలు పోషించారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, ఎస్‌.ఎస్‌ రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ వంటి స్టార్స్‌ స్పెషల్‌ క్యామియోస్‌ ఇచ్చారు. భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ సత్తా చాటిన ఈ మూవీని త్వరలో జపాన్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జపాన్‌ భాషలో ట్రైలర్‌ (Kalki 2898 AD Japanese Trailer)ను విడుదల చేశారు.&nbsp; జపాన్‌ భాషలో ట్రైలర్‌.. ప్రభాస్‌ హీరోగా నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వచ్చే ఏడాది జనవరి 3న జపాన్‌లో విడుదల కాబోతోంది. అలాగే అక్కడ జరిగే షోగాట్స్‌ ఫెస్టివల్‌లో ఈ మూవీని గ్రాండ్‌గా ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ప్రకటించింది. జపాన్‌ భాషలో డబ్‌ చేసిన ట్రైలర్‌ (Kalki 2898 AD Japanese Trailer)ను సైతం తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది.&nbsp; https://www.youtube.com/watch?v=V2j7iD0yHB0 నెలాఖరులో ప్రమోషన్స్‌ ‘బాహుబలి 2’ సినిమా జపాన్ రిలీజ్ సమయంలో యూనిట్‌ సభ్యులు అక్కడకు వెళ్లి ప్రమోట్‌ చేశారు. అదే విధంగా ‘కల్కి’ (Kalki 2898 AD) టీమ్‌ సైతం సినిమాను ప్రమోట్‌ చేయడం కోసం జపాన్‌ వెళ్లనుందట. మేకర్స్‌, అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ చర్చించి జపాన్‌లో మూడు రోజుల పాటు ప్రమోషన్స్‌కి ఏర్పాట్లు చేస్తున్నారట. డిసెంబర్‌ మూడు లేదా నాల్గో వారంలో ప్రభాస్‌ అండ్‌ టీమ్‌ జపాన్‌లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. https://twitter.com/Kalki2898AD/status/1864988575688757539 కల్కి టార్గెట్‌ ఎంతంటే? జపాన్‌లో ‘RRR’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపుగా 5 మిలియన్‌ డాలర్ల వసూళ్లను రాబట్టింది. అంతకుముందు వచ్చిన ‘బాహుబలి 2’ దాదాపుగా 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేసింది. ఇప్పుడు ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD Japanese Trailer)టార్గెట్‌ 5 మిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ స్థాయిలో వసూళ్లు సాధించాలంటే ప్రభాస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా కచ్చితంగా అక్కడ ల్యాండ్ అవ్వాల్సిందే.&nbsp; ట్రెండింగ్‌లోకి కల్కి ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD Japanese Trailer) చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్‌ చేస్తుండటంతో పాటు ట్రైలర్‌ను సైతం రిలీజ్‌ చేయడంతో చాలా రోజుల తర్వాత ఈ చిత్రం ట్రెండింగ్‌లోకి వచ్చింది. #Kalki2898AD మరోమారు వైరల్ అవుతోంది. జపాన్‌ ప్రేక్షకులను సైతం ‘కల్కి’ మెప్పిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భారతీయ సినిమాలకు జపాన్‌లో మంచి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో ‘కల్కి 2898 ఏడీ’ అక్కడ కూడా మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.&nbsp; https://twitter.com/NetflixIndia/status/1826982726550896953 కల్కి రికార్డు గల్లంతు ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ (Kalki 2898 AD) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లను కొల్లగొట్టింది. తన వసూళ్ల సునామీతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. తొలి రోజున రూ.191.5&nbsp; కోట్లు రాబట్టి హైయస్ట్‌ డే 1 గ్రాసర్‌ చిత్రాల్లో టాప్‌లో నిలిచింది. తాజాగా విడుదలైన ‘పుష్ప 2’ రూ.296 కోట్ల వసూళ్లతో కల్కిని బీట్‌ చేసింది. తొలి స్థానంలో ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రూ.223 కోట్లు) సైతం రెండో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది.&nbsp;
    డిసెంబర్ 06 , 2024
    Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ట్వీట్‌ వెనక నాగ్‌ అశ్విన్‌ మాస్టర్‌ ప్లాన్‌..!&nbsp;
    Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ట్వీట్‌ వెనక నాగ్‌ అశ్విన్‌ మాస్టర్‌ ప్లాన్‌..!&nbsp;
    ప్రభాస్‌ హీరోగా చేస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ ఫ్యూచరిస్టిక్ సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD)పై వరల్డ్‌ వైడ్‌గా బజ్‌ ఏర్పడింది. ఈ సినిమాను మహానటి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. జూన్‌ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు. సినిమాలో రోబిటిక్‌ వెహికల్‌గా కీలక పాత్ర పోషించిన బుజ్జి అనే వాహనాన్ని ఇటీవల అందరీ పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. సినిమా కోసం స్పెషల్‌గా తయారు చేయించిన వెహికల్‌ కావడంతో బుజ్జిపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం బుజ్జిని ఉపయోగించుకొని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సరికొత్త ప్రమోషన్స్‌కు తెరలేపారు.&nbsp; అపర కుబేరుడికి రిక్వెస్ట్‌ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన టెస్లా అధినేత ఎలా మస్క్‌ (Elon Musk)కు.. 'కల్కి 2898 ఏడీ' డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ తాజాగా ఓ రిక్వెస్ట్‌ పెట్టారు. బుజ్జి వెహికల్‌ను నడపడానికి ఆహ్వానిస్తున్నట్లు ఓ ట్వీట్‌ను ఎలాన్‌ మస్క్‌కు ట్యాగ్‌ చేశాడు. ‘ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా&nbsp; బుజ్జిని చూడటానికి, డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువుతో సరికొత్తగా డిజైన్‌ చేశాం. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం, అద్భుతమైన ఇంజినీరింగ్ వర్క్‌తో నిర్మించబడింది. మీకు బుజ్జి తప్పకుండా మంచి అనుభూతిని ఇస్తుంది' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/nagashwin7/status/1795534761072693594 ట్వీట్‌ వెనక మాస్టర్‌ ప్లాన్‌ అపర కుభేరుడు ఎలాన్‌ మస్క్‌కు నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌ పెట్టడం వెనక ఓ మాస్టర్‌ ప్లాన్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. కల్కి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్‌ ఇప్పటికే ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎలాన్‌ మస్క్‌ దృష్టిని కల్కి మీదకు మళ్లిస్తే అది గ్లోబల్‌ స్థాయిలో మూవీకి ప్లస్ అవుతుందని నాగ్ అశ్విన్‌ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అసాధ్యమని తెలిసినా బుజ్జిని నడపాలని, ఇండియాకు రావాలని ఆయన మస్క్‌ను కోరినట్లు సమాచారం. ఇప్పటికే నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా మంది భారతీయులు ట్వీట్‌పై స్పందిస్తున్నారు. ఈ అడ్వాన్స్‌డ్‌ వెహికల్‌ను నడపాలని మస్క్‌కు సైతం సూచిస్తున్నారు. అటు మస్క్‌ కూడా అశ్విన్‌ ట్వీట్‌కు సమాధానం ఇస్తే అది ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి రావాల్సినంత ప్రమోషన్ వరల్డ్‌ వైడ్‌గా వచ్చేస్తుంది.&nbsp; బుజ్జిని నడిపిన చైతూ బుజ్జి వెహికల్‌పై మనసు పారేసుకున్న టాలీవుడ్‌ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya).. ఇప్పటికే దానిపై ఓ రైడ్‌ కూడా వేశాడు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్‍రయ్ అంటూ ఇటీవల ఈ కారును డ్రైవ్ చేసాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఎక్స్‌లో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. అనంతరం బుజ్జి వెహికల్‌కు హాట్యాఫ్‌ చెప్పిన చైతూ.. అదొక ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చెప్పుకొచ్చారు.&nbsp; https://twitter.com/chay_akkineni/status/1794262966986215753 బుజ్జి ఎందుకు స్పెషలో తెలుసా? బుజ్జి అనే ఫ్యూచరస్టిక్‌ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్‌ తయారీ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.&nbsp; కల్కి బడ్జెట్‌ తెలిస్తే షాకే! ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
    మే 29 , 2024
    Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
    Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
    నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగాలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ ‘కామిక్ కాన్’లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ‘ప్రాజెక్ట్ K’ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్ పాల్గొన్నారు. గ్లింప్స్‌ చెప్పే సీక్రెట్స్ ఇవే! కాగా, ప్రాజెక్ట్‌ K సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు. ఇక సినిమా టైటిల్ కింద ‘2898 AD’ అని పెట్టారు. అంటే కలియుగాంతం చివర్లో జరిగే కథ అని డైరెక్టర్‌ చెప్పకనే చెప్పాడు. గ్లింప్స్ చూస్తే సాధారణంగా ప్రపంచాన్ని చీకటి కమ్ముకున్నప్పుడు ఒక వెలుగు వస్తుంది అని, ప్రపంచాన్ని విలన్ తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు కల్కి ఉద్భవిస్తాడని, ప్రజల్ని కాపాడతాడని తెలుస్తుంది. అయితే గ్లింప్స్‌ను మరింత పరిశీలనగా చూస్తే చాలా విషయాలు మనకు అర్థమౌతాయి. కలియుగాంతం సమయంలో ఈ ప్రపంచం పూర్తిగా రోబోల మయంగా, ఆధునిక ఆయుధాలతో యుద్ధం జరిగే స్థాయికి వెళ్తుందని గ్లింప్స్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పైగా 2898 ADలో ప్రస్తుత స్థాయిలో జనాభా కాకుండా చాలా కొద్దిమంది ప్రజలే ఉండొచ్చని భావించవచ్చు. వారంతా ఓ వ్యక్తి (రాజు) పాలనలో జీవిస్తుండవచ్చు. https://twitter.com/DEADLINE/status/1682221771154677760?s=20 అమితాబ్‌ పాత్ర నిడివి తక్కువేనా? ప్రాజెక్ట్‌లో Kలో రాజు (అమితాబ్‌ బచ్చన్‌) తన ప్రజలని పాలిస్తుంటే ఒక విలన్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆ రాజుని బంధించి అతని ప్రజలని విలన్ తనకు బానిసలుగా చేసుకున్నట్లు గ్లింప్స్‌లో కనిపిస్తోంది. అలాంటప్పుడు రాజు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో వారిని ఆదుకునేందుకు కల్కి అవతారంలో హీరో (ప్రభాస్‌) ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. మూవీలో అయితే మొదట అమితాబ్ వచ్చి ఆ తర్వాత ప్రభాస్ వస్తాడని అర్థం చేసుకోవచ్చు. శివాలయంలోకి ఓ రోబో రావడం గ్లింప్స్‌లో చూశాం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడి క్యారెక్టర్‌లో అమితాబ్ నటిస్తున్నట్లు టాక్.&nbsp; https://twitter.com/DEADLINE/status/1682129398600966146?s=20 ప్రభాస్ అందుకే కల్కి అవుతాడా? ఇక ప్రాజెక్ట్ K అంటే ‘ప్రాజెక్ట్ కల్కి’ అని, ప్రభాస్‌తో లోకాన్ని కాపాడించడానికి కొంతమంది చేసే యుద్ధమని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. నిమిషం వీడియోతో డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్‌గా కథ మెుత్తం రివీల్ చేసినట్లు అర్థమవుతోంది. ఇక కొంచెం డీటేలింగ్‌లోకి వెళ్తే అమితాబ్‌ బచ్చన్‌తో పాటు హీరోయిన్‌ దీపికా పదుకొణేను కూడా విలన్లు బంధించినట్లు గ్లింప్స్‌లో చూపించారు. దీన్ని బట్టి ప్రభాస్‌ ఆమె కోసం వచ్చి కల్కి లాగా మారతాడా? అన్న సందేహం కూడా ఉత్పన్నమవుతుంది. లేదా హీరోయిన్‌ను కాపాడే క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా దీపికా, ప్రభాస్‌ మధ్య ప్రేమ సన్నివేశాలను కూడా బాగా ఎలివేట్‌ చేయాలని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నారు.&nbsp; చీకటికి రారాజు అతడే? ఇకపోతే ఈ సినిమాలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రతినాయకుడిగా కనిపిస్తాడని మెున్నటి వరకూ ఊహాగానాలు వినిపించినా తాజాగా విడుదలైన గ్లింప్స్‌ వీడియోతో ‌అది కన్‌ఫార్మ్‌ అయింది. ఎందుకంటే ప్రాజెక్ట్‌Kలో కమల్‌ హాసన్‌ నటించనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించిన సమయంలో ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. 'భూమి మెుత్తాన్ని కమ్మేసే షాడో (చీకటి) కోసం వెతికామని.. ఆ పాత్ర చేయగల ఒకే ఒక్కడు దొరికేశాడు' అని కమల్‌ గురించి ప్రకటించారు. తాజా గ్లింప్స్‌ కూడా భూమిని చీకటి కమ్మేయడం గమనించవచ్చు. ఈ రెండు కలిపి చూస్తే ఇందులో విలన్లకు రారాజుగా కమల్‌ హాసన్‌ కనిపిస్తాడని అర్థం చేసుకోవచ్చు.&nbsp; https://twitter.com/i/status/1672854637014138880 సూపర్ రెస్పాన్స్ గ్లింప్స్‌ని చూస్తుంటే గూస్‌బమ్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు. విజువల్ వండర్‌గా, హాలీవుడ్ రేంజ్ సినిమాని తలపిస్తోందని చెబుతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ విజనరీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇక, సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. మళ్లీ మళ్లీ వినాలనిపించే ట్రాక్‌ని అందించాడు. గ్లింప్స్ చూశాక మ్యూజిక్ హాంట్ చేస్తూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు.&nbsp; https://twitter.com/THR/status/1682126315229683715?s=20 విడుదల తేదీ? ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారం ఈ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ కావాలి. అయితే, గ్లింప్స్‌లో కేవలం 2024లో వస్తుందనే ఇచ్చారు. అంటే, మూవీ డేట్ మారుతుందనే సంకేతాలు ఇచ్చారు. మరి, జనవరి 12న కాకుండా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్‌కి అచ్చొచ్చిన ‘మే9’న కల్కిని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు ఇదే రోజున రిలీజ్ అయ్యాయి. https://www.youtube.com/watch?v=bC36d8e3bb0
    జూలై 21 , 2023
    CHANDRIKA RAVI: మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయన్న భామ
    CHANDRIKA RAVI: మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయన్న భామ
    ]చంద్రిక వరుస పెట్టి సినిమాలకు ఓకే చెబుతోంది. తమిళ్‌లో కొన్నింటికి సైన్‌ చేసింది. తెలుగులోనూ ఓ సినిమా చర్చల దశలో ఉన్నట్లు టాక్. యూఎస్‌లో కొన్ని షోస్‌ కూడా ప్లాన్‌ చేసుకుంది.వరుస కట్టిన ఆఫర్లు
    ఫిబ్రవరి 13 , 2023
    Kalki 2898 AD: ‘కల్కి’ రన్‌టైమ్‌ లాక్‌.. సినిమా బడ్జెట్‌పై ప్రభాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!
    Kalki 2898 AD: ‘కల్కి’ రన్‌టైమ్‌ లాక్‌.. సినిమా బడ్జెట్‌పై ప్రభాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా చేస్తున్న లేటెస్ట్ సైన్‌ ఫిక్షన్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో దిగ్గజ నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, కల్కి సినిమా విడుదలకు ఇంకా నాలుగు వారాలే గడువు ఉండటంతో మేకర్స్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులపై ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలోనే రన్‌ టైమ్‌ను లాక్‌ చేసినట్లు ఓ బజ్‌ బయటకొచ్చింది. మరోవైపు ఈ సినిమా బడ్జెట్‌పై హీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.&nbsp; కల్కి రన్‌టైమ్‌ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రాన్ని జూన్‌ 27న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మూవీలోని పాత్రలను ఒక్కొక్కరిగా రివీల్‌ చేస్తున్నారు. ఈ కోవలోనే ప్రభాస్‌ (భైరవ), అమితాబ్‌ బచ్చన్‌ (అశ్వత్థామ), బుజ్జి (రోబోటిక్‌ వెహికల్‌) పాత్రలు బయటకొచ్చాయి. అయితే తాజా అప్‌డేట్‌ ప్రకారం ఈ మూవీ రన్‌టైమ్‌ను కూడా మేకర్స్ ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినినా నిడివిని 3.10 గం.లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లి ఏమైన కత్తెరలు పడినా కూడా నిడివి 3 గం.లకు తగ్గే పరిస్థితి ఉండదని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే రన్‌టైమ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; దాని వల్లే కల్కి బడ్జెట్ పెరిగింది: ప్రభాస్‌ కల్కి సినిమా ప్రమోషన్స్‌ భాగంగా హీరో ప్రభాస్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ నేషనల్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్‌పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి చిత్రాన్ని దేశ ప్రజలతో పాటు వరల్డ్‌ వైడ్‌గా ఉన్న సినీ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు చెప్పారు. ఈ క్రమంలో బడ్జెట్‌ భారీగా పెరిగిందని అన్నారు. గ్లోబల్‌ రేంజ్‌ సినిమా కావడం వల్ల కల్కిలోని పాత్రల పేర్లు కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పారు. డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ మాట్లాడుతూ.. కల్కి సినిమా చూశాక ప్రేక్షకులు మరో కొత్త ప్రపంచంలోకి వెళ్లొచ్చామనే భావనలోకి వెళ్తారని అన్నారు. అవతార్‌ చూశాక పొందిన కొత్త అనుభూతినే కల్కి తర్వాత ప్రేక్షకులు పొందుతారని హామి ఇచ్చారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లీషుతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా కల్కి విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. చెన్నై వీధుల్లో బుజ్జి సందడి కల్కి చిత్రంలో కీలకమైన బుజ్జి వాహనాన్ని ఇటీవల చిత్ర యూనిట్‌ ఆవిష్కరించింది. ఆ మూవీని పలు నగరాల్లో తిప్పుతూ చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ చేస్తోంది. తాజాగా చెన్నై వీధుల్లో బుజ్జి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ తన ఎక్స్‌ ఖాతాలో పంచుకుంది. కాగా, ఇప్పటికే ఈ వాహనాన్ని టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ చైతన్య డ్రైవ్‌ చేశారు. మరోవైపు బుజ్జిని నడపాలంటూ టెస్లా, స్పెస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్‌ కోరారు.&nbsp; https://twitter.com/i/status/1795776188931305863 31న స్పెషల్‌ వీడియో! కల్కి సినిమాలో బుజ్జి - భైరవ (ప్రభాస్‌) ప్రయాణం ఎలా సాగిందో తెలియజేసేందుకు మే 31న ఓ స్పెషల్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేయబోతున్నారు. 'బుజ్జి అండ్‌ భైరవ' (Bujji And Bhairava) పేరుతో రూపొందిన ఈ ప్రత్యేక వీడియో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. చిన్నారులను ఎంటర్‌టైన్‌ చేసే ఉద్దేశ్యంతో ఓ కార్టూన్‌ రూపంలో వీడియోను రూపొందించినట్లు ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. ఇందులో ఏముందో తెలియాలంటే స్పెషల్‌ వీడియో వచ్చేవరకూ ఆగాల్సిందే.&nbsp; https://twitter.com/i/status/1795100292314186235 తెలుగులో అత్యధిక రన్‌టైమ్‌ చిత్రాలు కల్కి తరహాలోనే ఇప్పటివరకూ అత్యధిక రన్‌టైమ్‌ కలిగిన చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. వాటి గురించి తెలుసుకునేందుకు ఈ క్రింది లింక్‌పై క్లిక్‌ చేయండి.&nbsp; https://telugu.yousay.tv/tfidb/list/Animal_Runtime_3.21_Hours:_Do_You_Know_the_Longest-Running_Telugu_Movie$$7660d6ac-0846-43e3-b679-c28804e28ed4
    మే 30 , 2024
    <strong>Jayam Ravi Divorce: భార్యతో విడిపోయిన జయం రవి.. విడాకులకు ముందు ఇంత జరిగిందా?</strong>
    Jayam Ravi Divorce: భార్యతో విడిపోయిన జయం రవి.. విడాకులకు ముందు ఇంత జరిగిందా?
    తమిళ స్టార్‌ హీరో జయం రవికి కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి పేరుంది. ఆయన హీరోగా చేసిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి రిలీజ్‌ అయ్యాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘సైరెన్‌’ చిత్రం తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఎక్స్‌ వేదికగా అతడు పెట్టిన సుదీర్ఘ పోస్టు ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.&nbsp; ‘మా ఇద్దరి మంచి కోసమే..’ నటుడు జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు అతడు స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం.&nbsp; ఈ విషయంపై రూమర్స్‌, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని జయం రవి పేర్కొన్నారు. https://twitter.com/actor_jayamravi/status/1833030619481444611 15 ఏళ్ల బంధానికి బ్రేక్‌ 2009 జూన్‌లో జయం రవి, ఆర్తి పెళ్లితో ఒక్కటయ్యారు. వాళ్లకు ఇద్దరు కొడుకులు ఆరవ్, అయాన్ కూడా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట విడాకులకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కోలివుడ్‌ మీడియా సైతం అనేకసార్లు కథనాలు రాసింది. ఈ క్రమంలోనే వారు వేర్వేరుగా జీవిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరు త్వరలో విడిపోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపించాయి. వాటికి తాజా పోస్టుతో జయం రవి ముగింపు పలికారు. అయితే ఎందుకు విడిపోతున్న సంగతి ఎక్కడా రివీల్‌ చేయలేదు. దీంతో కారణం ఏమై ఉంటుందా? అని సెలబ్రిటీలతో పాటు జయం రవి అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే కలిసి ఉంటూ బాధ పడటం కన్నా విడిపోయి ఎవరికి నచ్చినట్లు హ్యాపీగా ఉండటమే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.&nbsp; తెలుగు సినిమాతోనే గుర్తింపు 1993లో వచ్చిన 'బావ బామ్మర్ది','పల్నాటి పౌరుషం' (1994) వంటి చిత్రాలతో బాల నటుడిగా జయం రవి పరిచయమయ్యారు. 2002లో టాలీవుడ్‌లో విడుదలై సూపర్‌ హిట్‌ అయిన ‘జయం’ సినిమాను తమిళ్‌లో రీమేక్‌ చేశారు. ఇది హీరోగా జయం రవికి ఫస్ట్‌ ఫిల్మ్‌. అది మంచి విజయం సాధించడంతో అప్పటినుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే హిట్‌ కావడంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. 2015లో వచ్చిన జెండాపై కపిరాజు మూవీలో జయం రవి ఓ అతిథి పాత్రలో కనిపించారు. ఇటీవల వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1 &amp; 2’ చిత్రాల్లో టైటిల్‌ రోల్‌ పోషించి పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు.&nbsp; ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.
    సెప్టెంబర్ 09 , 2024
    Kalki 2898 AD: శివరాత్రి స్పెషల్‌.. సాలిడ్‌ అప్‌డేట్‌తో ముందుకొస్తున్న ‘కల్కీ’ టీమ్‌!
    Kalki 2898 AD: శివరాత్రి స్పెషల్‌.. సాలిడ్‌ అప్‌డేట్‌తో ముందుకొస్తున్న ‘కల్కీ’ టీమ్‌!
    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేష్‌లో రూపొందుతున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). మైథాలజీ ఇన్‌స్పైర్డ్‌ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో అంచనాలు మరింత హైప్‌లోకి వెళ్లాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉండనుందో అర్థమైపోతోంది. ఇదిలా ఉంటే నేడు శివరాత్రి సందర్భంగా మేకర్స్ సరికొత్త అప్‌డేట్‌కి రెడీ అయిపోయారు. ఇందుకు సంబంధించి పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.&nbsp; పోస్టర్‌లో ఏముంది? ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌, టీజర్‌లో ప్రభాస్‌ పాత్ర పేరును మూవీ టీమ్‌ ఎక్కడా రివీల్‌ చేయలేదు. అయితే ఇవాళ శివరాత్రి సందర్భంగా హీరో పేరును ప్రకటించబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు. సాయంత్రం 5:00 గంటలకు రివీల్ చేయనున్నట్లు సరికొత్త పోస్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ పోస్టర్‌లోని శివలింగం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. మరోవైపు కల్కిలో ప్రభాస్‌ పేరు ఏమై ఉంటుందా? అని ఫ్యాన్స్‌ ఇప్పటికే ఆలోచనల్లో పడిపోయారు.&nbsp; https://twitter.com/chitrambhalareI/status/1766015501350883362 ఇటలీలో ప్రభాస్, దిశా పటానీ.. తాజాగా కల్కి చిత్ర యూనిట్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటానీతో పాటు యూనిట్ అంతా కలసి దిగిన ఫోటోను మేకర్స్ గురువారం షేర్ చేశారు. ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇటలీలోని అద్భుతమైన లోకేషన్స్‌లో ఈ పాటని చాలా గ్రాండ్‌గా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్‌లో ప్రభాస్ (Prabhas), దిశా పటానీ (Disha Patani) మధ్య రొమాన్స్ ఉండనుందని సమాచారం. కాగా ఈ మూవీలో దిశా పటానీతో పాటు బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొనే మరో హీరోయిన్‌గా నటిస్తోంది.&nbsp; ఆ రోజు రావడం పక్కా! ప్రభాస్‌ ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో జాప్యం జరుగుతున్నట్లు వార్తలు రావడంతో చిత్ర విడుదలపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ నిర్వహిస్తూ ఆ కన్ఫ్యూజన్‌ను దూరం చేసింది వైజయంతీ మూవీ మేకర్స్. కల్కి సినిమాను మే 9న విడుదల చేయడం పక్కా అన్నట్లుగా సోషల్ మీడియాలో వరుస అప్‌డేట్స్‌ను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.&nbsp; కల్కీ రిలీజయ్యే భాషలు ఇవే! ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్‍ (San Diego Comic-Con 2023)లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి టీమ్‌ రికార్డు సృష్టించింది. అప్పటినుంచి మూవీపై హాలీవుడ్‍‍లో కూడా క్రేజ్ ఉంది.&nbsp;
    మార్చి 08 , 2024
    Chaari 111 Review: స్పై ఏజెంట్‌గా మెప్పించిన వెన్నెల కిషోర్‌.. ‘చారి 111’ ఎలా ఉందంటే?
    Chaari 111 Review: స్పై ఏజెంట్‌గా మెప్పించిన వెన్నెల కిషోర్‌.. ‘చారి 111’ ఎలా ఉందంటే?
    నటీనటులు: వెన్నెల కిషోర్, సంయుక్త విశ్వనాథన్, మురళీ శర్మ తదితరులు దర్శకుడు: టీజీ కీర్తి కుమార్ సంగీత దర్శకులు: సైమన్ కె కింగ్ సినిమాటోగ్రాఫర్‌: రిచర్డ్ కెవిన్ ఎ ఎడిటింగ్: కాశీష్ గ్రోవర్ నిర్మాత: అదితి సోని వెన్నెల కిషోర్ (Vennela Kishore) హీరోగా (Chaari 111 Review In Telugu) నటించిన స్పై యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్ చిత్రం ‘చారి 111’ (Chaari 111). టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌కు జోడీగా సంయుక్త విశ్వనాథన్‌ నటించింది. మురళీశర్మ ప్రధాన పాత్ర పోషించారు. సైమన్‌ కె. సింగ్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ ఏ మేరకు మెప్పించింది? హీరోగా వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నాడా? వంటి విశేషాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ చారి (వెన్నెల కిషోర్) (Chaari 111 Review In Telugu) రుద్రనేత్ర అనే గుఢాచార సంస్థలో ఒక ఏజెంట్. డ్యూటీలో ఎప్ప‌డూ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ బాస్‌ రావు (మురళీశర్మ) చేత చివాట్లు తింటుంటాడు. ఈ క్రమంలో నగరంలో ఓ హ్యుమన్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ క్రైమ్‌ను సాల్వ్ చేయడానికి చారిని ఏజెంట్‌గా నియమిస్తారు. ‘ప్లాన్ బి’గా ఈషా (సంయుక్త విశ్వనాథన్)ను కూడా ఈ మిషన్‌లో భాగం చేస్తారు. అసలు ఈ క్రైమ్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఎందుకు పేలుళ్లకు ప్లాన్ చేశాడు? చారి అతన్ని ఎలా అంతం చేశాడు? చారి, ఈషా లవ్‌ స్టోరీ ఏంటి? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే వెన్నెల కిషోర్‌ ఈ సినిమాలో (Chaari 111 Review In Telugu) అద్భుతంగా నటించాడు. ఏజెంట్‌ చారి పాత్రలో సిల్లీ మిస్టేక్‌లు చేస్తూ తనదైన శైలీలో నవ్వులు పూయించాడు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సీన్లలోనూ అదరగొట్టాడు. గత చిత్రాలకు భిన్నంగా ఎమోషనల్‌ సీన్స్‌ను బాగా పండించాడు. ఇక హీరోయిన్‌గా సంయుక్త విశ్వనాథన్‌ బాగానే చేసింది. మురళి శర్మ, కమెడియన్‌ సత్యా కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే బ్రహ్మాజీతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు టీజీ కీర్తి కుమార్ రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్.. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. అయితే సింగిల్‌ లైన్‌ స్టోరీ కావడం.. కథనం కూడా రొటీన్‌గా ఆసక్తిలేకుండా సాగడం మైనస్‌ అయ్యింది. ఏజెంట్‌ చారీ చేత అదే పనిగా సిల్లీ మిస్టేక్‌లు చేయించడం ఓ దశలో ఆడియన్స్ బోర్‌ కొట్టిస్తుంది. కామెడీ మేకింగ్, ఫన్నీ డైలాగ్స్ ఉన్నప్పటికీ.. సాగదీత సన్నివేశాలు.. లాజిక్‌కు అందని సీన్లు సినిమాకు స్పీడ్‌ బ్రేకులుగా మారాయి. కీలకమైన ఫ్లాష్‌ బ్యాక్‌ సీన్‌ను కూడా డైరెక్టర్‌ అంత ఎఫెక్టివ్‌గా చూపించలేకపోయారు. క్లైమాక్స్‌ కూడా అంత సంతృప్తి కరంగా అనిపించదు. విలన్ పాత్ర ముగింపును కొంచెం బాగా చూపించాల్సింది. టెక్నికల్‌గా సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే (Chaari 111 Movie Review).. సైమన్ కె. కింగ్ నేప‌థ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్ర‌ాఫర్ రిచర్డ్ కెవిన్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్‌ను ఆయన చాలా ఎఫెక్టివ్‌గా తీశారు. ఎడిటింగ్ కూడా బాగుంది. అదితి సోని నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చులో రాజీపడినట్లు ఎక్కడా కనిపించలేదు. ప్లస్‌ పాయింట్స్‌ వెన్నెల కిషోర్‌ నటనకామెడీసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ స్లో నారేషన్‌రక్తి కట్టించే సీన్లు లేకపోవడం Telugu.yousay.tv Rating : 2.5/5
    మార్చి 01 , 2024
    <strong>Leela Vinodham Review: టీనేజ్‌లోకి తీసుకెళ్లే వింటేజ్‌ ప్రేమకథ.. ‘లీలా వినోదం’ మెప్పించిందా?</strong>
    Leela Vinodham Review: టీనేజ్‌లోకి తీసుకెళ్లే వింటేజ్‌ ప్రేమకథ.. ‘లీలా వినోదం’ మెప్పించిందా?
    నటీనటులు : షణ్ముఖ్ జస్వంత్, అనఘా అజిత్, గోపరాజు రమణ, ఆమని, రూప, శరన్, ప్రసాద్ బెహరా తదితరులు. దర్శకుడు : పవన్ సుంకర సంగీత దర్శకుడు : టి.ఆర్. కృష్ణ చేతన్ సినిమాటోగ్రఫీ : అనుష్ కుమార్ ఎడిటర్: నరేష్ అదుప నిర్మాత : సైర్ధర్ మారిస ఓటీటీ వేదిక:&nbsp; ఈటీవీ విన్‌ ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్‌ ఫిల్మ్‌ 'లీలా వినోదం' (Leela Vinodham Review). పవన్‌ సుంకర దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అనగ అజిత్‌, గోపరాజు రమణ, ఆమని, రూపాలక్ష్మికీలక పాత్రలు పోషించారు. పల్లెటూరులో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఈటీవీ విన్‌'లో నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి సినిమా కథ 2008లో జరుగుతుంటుంది. ప్రసాద్ (షణ్ముఖ్ జస్వంత్) ఓ కాలేజ్ స్టూడెంట్. క్లాస్ మేట్ లీలా (అనగ అజిత్)ను ప్రేమిస్తాడు. కానీ ఈ విషయాన్ని ఆమెకు చెప్పలేకపోతాడు. ఈ క్రమంలో కాలేజీ అయిపోవడంతో ఇద్దరూ ఒకరి ఫోన్‌ నెంబర్లు ఒకరు మార్చుకుంటారు. అలా సరదాగా రోజూ చాట్‌ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రెండ్ రాజేష్‌ (మిర్చి శరణ్‌) హెల్ప్‌తో తన ప్రేమ విషయాన్ని లీలాకు చెబుతాడు ప్రసాద్‌. దీంతో లీలా సైలెంట్ అయిపోతుంది. ఆ క్షణం నుంచి ఆమె సైడ్‌ నుంచి ఒక్క మెసేజ్‌ గానీ, ఫోన్‌ కాల్‌ గానీ రాదు. లీలా ఎందుకు రిప్లే ఇవ్వలేదు? అప్పుడు ప్రసాద్ ఏం చేశాడు? అతడి ప్రేమ సక్సెస్‌ అయ్యిందా? లేదా? అన్నది స్టోరీ.  ఎవరెలా చేశారంటే ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. ప్రసాద్‌ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ప్రేమను చెప్పేందుకు ఇబ్బంది పడే యువకుడి పాత్రలో అతడు జీవించాడు. లవ్‌ సీన్స్‌లో అతడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ యూత్‌ను ఇంప్రెస్‌ చేస్తాయి. 2008 కాలంలో అబ్బాయిలు ప్రేమ విషయంలో ఎంత బిడియంగా ఉండేవారో తన నటనతో కళ్లకు కట్టాడు. హీరోయిన్ అనగ అజిత్‌ కూడా తన నటనతో మంచి మార్కులు సంపాదించింది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెస్మరైజ్‌ చేసింది. వీరిద్దరి జంట స్క్రీన్‌పై చాలా ఫ్రెష్‌ ఫీలింగ్ తీసుకొచ్చింది. ఫ్రెండ్ పాత్రలు చేసిన మిర్ఛి శరణ్‌, ప్రసాద్ బెహరా తమ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు పవన్ సుంకర స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మిడ్‌ ఏజ్‌ వాళ్లకి కనెక్ట్‌ అయ్యేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు. ముఖ్యంగా 30+ ఉన్న వారు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. తమ టీనేజ్‌ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో యువకులు ఎంత ఇబ్బంది పడతారో దర్శకుడు బాగా చూపించాడు. చాటింగ్‌ చేసుకునే సీన్స్‌ను కూడా చక్కగా తెరకెక్కించారు. ‌మిర్ఛి శరణ్‌, ప్రసాద్ బెహరా పాత్రలతో కామెడీని రాబట్టాడు. అయితే రొటీన్‌ స్టోరి, ఆసక్తి లేని కథనం సినిమాకు మైనస్‌గా మారాయి. చాటా చోట్ల కథ నెమ్మదిగా, అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్‌ కలిగింది. ఎమోషనల్‌ సీన్స్‌ను ఇంకాస్త బెటర్‌గా తీసి ఉంటే బాగుండేది. ఆమని, గోపరాజు రమణ, రూపలక్ష్మీ వంటి సీనియర్ నటులు ఉన్నా వారి పాత్రలకు ప్రాధాన్యం లేదు.  సాంకేతికంగా..&nbsp; టెక్నికల్‌ విషయాలకు వస్తే (Leela Vinodham Review In Telugu) సినిమాటోగ్రఫీ బాగుంది. అనుష్ కుమార్ తన కెమెరా పనితనంతో పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా చూపించాడు. విజువల్స్‌ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. &nbsp; టి.ఆర్. కృష్ణ చేతన్ అందించిన సంగీతం బాగుంది. అతడు ఇచ్చిన నేపథ్య సంగీతంతో సన్నివేశాలు చాలా ప్లెజెంట్‌గా సాగిపోయాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ షణ్ముఖ్‌, అనగ అజిత్‌ నటనవింటేజ్‌ లవ్‌ సీన్స్‌కామెడీ మైనస్‌ పాయింట్స్‌ అసక్తిలేని కథనంసాగదీత సన్నివేశాలుఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5
    డిసెంబర్ 19 , 2024
    <strong>Venkata Datta Sai: పీవీ సింధు చేసుకోబోయే వ్యక్తి ఎంత గొప్పోడో తెలుసా?</strong>
    Venkata Datta Sai: పీవీ సింధు చేసుకోబోయే వ్యక్తి ఎంత గొప్పోడో తెలుసా?
    భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు (PV Sindhu Wedding) త్వరలో వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతోంది. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మెన్‌ వెంకటదత్త సాయి (Venkata Datta Sai)తో ఆమెకు పెళ్లి నిశ్చయమైంది.&nbsp; డిసెంబర్‌ 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వీరి పెళ్లి జరగనుంది. డిసెంబర్‌ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు.&nbsp; పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ఈనెల 20న ప్రారంభమవుతాయని పీవీ సింధు తండ్రి రమణ తెలిపారు. జనవరి నుంచి సింధు షెడ్యూల్‌ బిజీగా ఉండడంతో ఈ నెలలోనే పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.&nbsp; సింధు పెళ్లి ప్రకటనతో ఆమెకు కాబోయే భర్త (Venkata Datta Sai) గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆయన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయి (Venkata Datta Sai) ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ నుండి లిబరల్ ఆర్ట్స్ &amp; సైన్సెస్‌లో డిప్లొమో పొందారు 2018లో గ్యాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఫ్లేమ్‌ యూనివర్సిటీ నుంచి అకౌంటింగ్, ఫైనాన్స్‌లో బీబీఏ పట్టా అందుకున్నారు.&nbsp; బెంగళూరులోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డాటా సైన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత జేఎస్‌డబ్ల్యూలో (జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌) తన కెరీర్‌ను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అతను సమ్మర్‌ ఇంటర్న్‌గా, ఇన్‌-హౌస్‌ కన్సల్టెంట్‌గా పనిచేశారు.&nbsp; అప్పట్లో తన విధుల్లో భాగంగా జేఎస్‌డబ్ల్యూ యాజమాన్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) జట్టుతోనూ కలిసి పనిచేసినట్లు సమాచారం. ప్రస్తుతం పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ (Posidex Technologies) అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వెంకట దత్త సాయి (Venkata Datta Sai) వ్యవహరిస్తున్నారు.&nbsp; ఈ వెంకట దత్త సాయి అదే పోసిడెక్స్ ఎండీ, మాజీ ఐఆర్ఎస్ అయిన జీటీ వెంకటేశ్వర్ రావు తనయుడే. దీంతో తన కంపెనీలోనే సాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. గత నెలలో ఈ పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ (Posidex Technologies) కొత్త లోగోను సింధునే లాంచ్‌ చేయడం విశేషం. అలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.&nbsp; ఇదిలా ఉంటే పీవీ సింధు ఈ మధ్యే వైజాగ్‌లో బ్యాడ్మింటన్ అకాడమీ కోసం భూమి పూజ చేసింది. అరిలోవా ఏరియాలో ఈ బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సెంటర్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు అథ్లెట్ల పోషణ, సాధికారత కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు పీవీ సింధు తెలిపింది.
    డిసెంబర్ 03 , 2024
    <strong>Sai Pallavi: సాయిపల్లవిని బాయ్‌కాట్‌ చేయాలంటున్న నెటిజన్లు.. నటి ఎమోషనల్‌ పోస్టు!</strong>
    Sai Pallavi: సాయిపల్లవిని బాయ్‌కాట్‌ చేయాలంటున్న నెటిజన్లు.. నటి ఎమోషనల్‌ పోస్టు!
    నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) నటించిన లేటెస్ట్ చిత్రం ’అమరన్‌’ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్మీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ప్రమోషన్స్‌లో సాయి పల్లవి బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు ఆమెను టార్గెట్‌ చేస్తున్నారు. సినిమాల నుంచి సాయిపల్లవిని బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. #BoycottSaiPallavi హ్యాష్‌ట్యాగ్‌ను నేషనల్‌ వైడ్‌గా ట్రెండింగ్‌ చేస్తున్నారు. భారత సైన్యాన్ని కించపరిచిందంటూ గతంలో ఆమె చేసిన వ్యాఖ్యల వీడియోను గత మూడ్రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.  అసలేం జరిగిదంటే? ‘అమరన్’ చిత్రం ఆర్మీ నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో భారత ఆర్మీపై సాయిపల్లవి (Sai Pallavi) చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు ట్రెండ్‌ చేస్తున్నారు. విరాటపర్వం మూవీ ప్రమోషన్ సమయంలో సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఉగ్రవాదం, హింస అంశాల గురించి ప్రస్తావిస్తూ ‘పాకిస్థాన్ సైనికులను మన భారతీయులం ఉగ్రవాదుల్లా చూస్తాం. అలాగే పాకిస్థాన్‍లో ఉంటున్న వారు మన భారత సైనికులను ఉగ్రవాదుల్లా చూస్తారు. వాళ్లకు మనం చేటు చేస్తామని అనుకుంటుంటారు. సమస్యల పరిష్కారానికి హింస ఏ మాత్రం పరిష్కారం కాదు కదా. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్దాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు' అని ఆమె అన్నారు. దీనిపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.  https://twitter.com/ViralVidox/status/1850064411202932830 బాయ్‌కాట్‌ చేయాలని డిమాండ్‌ భారత సైన్యంతో పాటు సనాతన ధర్మాన్ని కూడా కించపరిచారంటూ అదే ఇంటర్వూలో సాయిపల్లవి (Sai Pallavi) మాట్లాడిన వీడియోను సైతం నెటిజన్లు వైరల్‌ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ సాయిపల్లవి చిత్రాలను బహిష్కరించాలను సోషల్‌ మీడియా వేదికగా క్యాంపైన్‌ నడుపుతున్నారు. జాతీయ వాద, సనాతన భావాలు కలిగిన వారు నూటికి నూరు శాతం సాయి పల్లవి చిత్రాలను బాయ్‌కాట్‌ చేయాలని ఓ నెటిజన్‌ పిలుపునిచ్చారు. సాయిపల్లవి పాక్‌కు అనుకూలంగా స్టాండ్ తీసుకున్నప్పుడు అక్కడే సినిమాలు చేసుకోవచ్చు కదా ‌అని సూచిస్తున్నారు. ఆమె అసలు నేషనల్ క్రష్‌ కానేకాదని మరో విధమైన క్రష్‌ అంటూ ఘాటు పదజాలంతో విమర్శిస్తున్నారు. సాయిపల్లవితో పాటు ఆమె లేటెస్ట్ చిత్రం 'అమరన్‌'ను కూడా బహిష్కరించాలని ఓ నెటిజన్‌ డిమాండ్ చేశాడు. అంతేకాదు హిందీలో తెరకెక్కుతోన్న 'రామాయణ' చిత్రంలో సీతగా ఆమెను తీసివేయాలని కోరారు. సనాతన ధర్మం గురించి కించపరుస్తూ మాట్లాడే వారిని కఠినంగా శిక్షించాలని మరో నెటిజన్ డిమాండ్‌ చేశారు. మరోవైపు సాయిపల్లవి ఫ్యాన్స్‌ దీటుగా బదులిస్తున్నారు. ఆమె మాటలను వక్రీకరించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తిప్పికొడుతున్నారు. https://twitter.com/Bhav1212B/status/1850791387672801479 https://twitter.com/cinematicfreak0/status/1850791153928745098 https://twitter.com/devx_18k/status/1850791086458831193 https://twitter.com/Chhuparustam91/status/1850790246012653618 https://twitter.com/itz_meprabhat/status/1850787660815855924 https://twitter.com/itz_meprabhat/status/1850787660815855924 https://twitter.com/MissDD114/status/1850829733895737441 సాయిపల్లవి ఎమోషనల్ పోస్టు ఇదిలా ఉంటే అమరన్‌ ప్రమోషన్స్‌లో భాగంగా నటి సాయిపల్లవి (Sai Pallavi) ఇటీవల నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించింది. దేశం కోసం మరణించిన సైనికులకు నివాళులు అర్పించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. వాటికి ఎమోషనల్‌ పదాలను సైతం సాయిపల్లవి జోడించింది. ‘నేను అమరన్ ప్రమోషన్స్ మొదలుపెట్టే ముందు నేషనల్ వార్ మెమోరియల్ సందర్శించాలి అనుకున్నా. కొన్ని రోజుల క్రితం వెళ్ళాను. మన కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల గురించి వివరాలు ఉంచే పవిత్రమైన ఆలయం ఇది. మేజర్ ముకుంద్ వరదరాజన్, సిపాయి విక్రమ్ సింగ్ (Vikram Singh)లకు నివాళులు అర్పిస్తున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను’ అని రాసుకొచ్చింది.  https://twitter.com/Sai_Pallavi92/status/1850571262755582363 కావాలనే టార్గెట్‌ చేస్తున్నారా? 'అమరన్‌' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా సాయి పల్లవి (Sai Pallavi) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  బాలీవుడ్‌ నుంచి ఓ వ్యక్తి వచ్చి పీఆర్‌ ఏజెన్సీ తరపున తన ఇమేజ్‌ను మరింత పెంచుతానని అన్నారని తెలిపింది. అయితే దానిని తాను రిజక్ట్‌ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు  తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్‌ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ‘రామాయణం’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సాయిపల్లవి పేరును డ్యామేజ్‌ చేసేందుకు వారు యత్నిస్తున్నట్లు టాక్. సీత పాత్ర నుంచి సాయి పల్లవిని తొలగించాలని కూడా వారే పెద్ద ఎత్తున కామెంట్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కావాలనే బాలీవుడ్‌ పీఆర్‌ టీమ్‌ సాయి పల్లవిని టార్గెట్‌ చేశారని ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. https://twitter.com/bollywooddadi/status/1849561000456179910 అమర జవాన్‌ బయోగ్రఫీ శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్‌’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. నటుడు శివకార్తికేయన్‌ ముకుంద్‌ పాత్ర పోషించగా, సాయిపల్లవి ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్‌ రోల్‌లో పోషించింది. తెలుగు, తమిళంతో పాటు పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. పూర్తిగా భావోద్వేగాలతో నిండిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.  https://twitter.com/Siva_Kartikeyan/status/1839559422332346584
    అక్టోబర్ 28 , 2024

    @2021 KTree