• TFIDB EN
 • సీతా రామం
  UTelugu2h 43m
  ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్‌ స‌ల్మాన్‌) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామ‌హాల‌క్ష్మి (మృణాల్ ఠాకూర్‌) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంత‌కీ ఈ ఆమె ఎవ‌రు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వ‌చ్చింది? ఆమెని క‌లుసుకునేందుక‌ని వ‌చ్చిన రామ్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? అనేది కథ.
  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
  Watch
  స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstar
  Watch
  రివ్యూస్
  YouSay Review

  Sita Ramam Movie Review

  దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించిన ‘సీతా రామం’ మూవీ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాని ద‌ర్శ‌క...read more

  How was the movie?

  తారాగణం
  దుల్కర్ సల్మాన్
  లెఫ్టినెంట్ రామ్
  మృణాల్ ఠాకూర్
  యువరాణి నూర్ జహాన్ అలియాస్ సీతా మహాలక్ష్మి
  రష్మిక మందన్న
  ఆఫ్రీన్ అలియాస్ వహీదా
  సుమంత్
  బ్రిగేడియర్ విష్ణు శర్మ (గతంలో కెప్టెన్)
  తరుణ్ భాస్కర్
  బాలాజీ
  సచిన్ ఖేడేకర్
  దివంగత బ్రిగేడియర్ అబు తారిక్ (మాజీ ఆర్మీ జనరల్) పాకిస్థాన్ ఆర్మీ
  గౌతమ్ వాసుదేవ్ మీనన్
  మేజర్ సెల్వన్
  ప్రకాష్ రాజ్
  బ్రిగేడియర్ YK జోషి
  శత్రు
  లెఫ్టినెంట్ వికాస్ వర్మ
  వెన్నెల కిషోర్
  దుర్జోయ్ శర్మ
  భూమికా చావ్లా
  వైదేహి శర్మ
  రుక్మిణి విజయకుమార్
  ప్రొ.రేఖా భరద్వాజ్
  మురళీ శర్మ
  సుబ్రమణ్యం
  అశ్వత్ భట్ అన్సారీ
  టిన్ను ఆనంద్
  ఆనంద్ మెహతా
  సునీల్
  రైలు టిక్కెట్ ఎగ్జామినర్
  ప్రియదర్శి పులికొండ
  మార్తాండం
  రోహిణి
  విజయలక్ష్మి
  జిషు సేన్‌గుప్తా
  నూర్ జహాన్ సోదరుడు
  అభినయ
  నూర్ జహాన్ కోడలు
  రాహుల్ రవీంద్రన్
  రాహుల్ వర్మ
  పవన్ చోప్రా
  పాకిస్థాన్ ఆర్మీ జనరల్ మూసా ఖాన్
  నీరజ్ కబీ
  ఆఫ్రీన్ కుటుంబ న్యాయవాది
  అనంత్ బాబు
  సుబ్రహ్మణ్యం సహోద్యోగి
  గౌతమ్ రాజు
  టిక్కెట్ కలెక్టర్ మద్రాసు రైలులో
  అనీష్ కురువిల్లా
  నూర్ జహాన్ అన్నయ్యకి లీగల్ అడ్వైజర్
  గీతా భాస్కర్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్
  స్నిగ్ధ బావఆఫ్రీన్ రూమ్మేట్
  నయన్ రోష్ TMరేడియో జాకీ (వాయిస్)
  సిబ్బంది
  హను రాఘవపూడి
  దర్శకుడు
  సి. అశ్వని దత్
  నిర్మాత
  విశాల్ చంద్రశేఖర్
  సంగీతకారుడు
  కోటగిరి వెంకటేశ్వరరావు
  ఎడిటర్
  కథనాలు
  రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?
  రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?
  నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతాగోవిందం చిత్రంలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.  డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతా రామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప చిత్రాలు ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రష్మిక గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. రష్మిక మందన్న ఎవరు? రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. రష్మిక మందన్న దేనికి ఫేమస్? రష్మిక మందన్న పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రష్మిక మందన్న వయస్సు ఎంత? రష్మిక 1996 ఏప్రిల్ 5న జన్మించింది. ఆమె వయస్సు 27 సంవత్సరాలు  రష్మిక మందన్న ముద్దు పేరు? నేషనల్ క్రష్ రష్మిక రష్మిక మందన్న ఎత్తు ఎంత? 5 అడుగుల 3 అంగుళాలు  రష్మిక మందన్న ఎక్కడ పుట్టింది? విరాజ్ పేట, కర్ణాటక రష్మిక మందన్నకు వివాహం అయిందా? లేదు ఇంకా జరగలేదు రష్మిక మందన్న ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు? రష్మిక మందన్న తొలుత కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ఇష్టపడింది. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా అయింది. అయితే వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లవ్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. ఈ వార్తలను రష్మిక, విజయ్ దేవరకొండ కొట్టిపారేశారు. రష్మిక మందన్నకు ఇష్టమైన రంగు? బ్లాక్ రష్మిక మందన్న అభిరుచులు? ట్రావెలింగ్ రష్మిక మందన్నకి ఇష్టమైన ఆహారం? చికెన్, చాక్లెట్ రష్మిక మందన్న అభిమాన నటుడు? అక్షయ్ కుమార్ రష్మిక మందన్న ఫెవరెట్ హీరోయిన్? శ్రీదేవి రష్మిక మందన్న తొలి సినిమా? కిరాక్ పార్టీ(కన్నడ), ఛలో(తెలుగు) రష్మిక మందన్నకు గుర్తింపు తెచ్చిన సినిమాలు? గీతాగోవిందం, పుష్ప రష్మిక మందన్న ఏం చదివింది? సైకాలజీలో డిగ్రీ చేసింది రష్మిక మందన్న చౌదరి పారితోషికం ఎంత? రష్మిక ఒక్కొ సినిమాకు రూ.4కోట్లు- రూ.4.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. రష్మిక మందన్న తల్లిదండ్రుల పేర్లు? సుమన్, మదన్ మందన్న రష్మిక మందన్న ఎన్ని అవార్డులు గెలుచుకుంది? రష్మిక ఉత్తమ నటిగా వివిధ భాషల్లో 5 సైమా అవార్డులు పొందింది. మరో 4 ఇతర అవార్డులు సొంతం చేసుకుంది. రష్మిక మందన్న మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా? రష్మిక మందన్న అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది. ఎక్కువగా ట్రెడిషన్ వేర్ ధరించేందుకు ఇష్టపడుతుంది. రష్మిక మందన్న సిస్టర్ పేరు? సిమ్రాన్ మందన్న రష్మిక మందన్న ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిందా? లేదు, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. తన చిన్నతనంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇంటి అద్దే కట్టేందుకు కూడా తమ వద్ద డబ్బులు ఉండేవి కాదని పేర్కొంది. రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/rashmika_mandanna/?hl=en రష్మిక మందన్న ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది? రష్మిక తొలుత డియర్ కామ్రెడ్ సినిమాలో విజయ్ దేవరకొండతో ఆ తర్వాత యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో లిప్‌ లాక్ సీన్లలో నటించింది. https://www.youtube.com/watch?v=-I7Z5-LKCdc
  ఏప్రిల్ 16 , 2024
  Summer Heroines 2024: వేసవి హీట్‌ మరింత పెంచేందుకు సిద్ధమవుతున్న అందాలు భామలు వీరే! 
  Summer Heroines 2024: వేసవి హీట్‌ మరింత పెంచేందుకు సిద్ధమవుతున్న అందాలు భామలు వీరే! 
  సమ్మర్‌ అంటే తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద పండగ లాంటిది. స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవుల నేపథ్యంలో చిన్న, పెద్ద సినిమాలు సమ్మర్‌లో విడుదలయ్యేందుకు ఆసక్తి కనబరుస్తాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో వినోదాలు పంచడానికి పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా అందులోని కథానాయకులు వేసవి హీట్‌ను తమ అందచందాలతో మరింత పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు నటించిన చిత్రాలు ఏంటి? అవి ఎప్పుడు విడుదలవుతాయి? వంటి అంశాలు ఈ కథనంలో చూద్దాం.  మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) ‘సీతా రామం’, ‘హాయ్‌ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మృణాల్‌ ఠాకూర్‌.. ఈ సమ్మర్‌లో సరికొత్త మూవీతో వస్తోంది. యంగ్‌ హీరో విజయ్‌ నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లో మరోమారు సందడి చేయబోతోంది. ఈ మూవీ ఏప్రిల్‌ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.  దివ్యాంశ కౌషిక్‌ (Divyansha Kaushik) ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ద్వారా అలరించనున్న మరో నటి దివ్యాంశ కౌషిక్‌. ఇందులో ఈ భామ సెకండ్‌ హీరోయిన్‌గా చేస్తోంది. 2019లో వచ్చిన మజిలీ సినిమా ద్వారా దివ్యాంశ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రామారావు ఆన్‌ డ్యూటీ, పోలీసు వారి హెచ్చరిక, మైఖేల్‌ తదితర చిత్రాల్లో నటించింది.  అంజలి (Anjali) ప్రముఖ హీరోయిన్‌ అంజలి కూడా ఈ వేసవిని మరింత హీటెక్కించేందుకు రెడీ అవుతోంది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను మరోమారు పలకరించనుంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్‌, షకలక శంకర్ ముఖ్యపాత్రలు పోషించారు.  స్వర్ణిమా సింగ్‌ (Swarnima Singh) హర్షివ్‌ కార్తీక్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బహుముఖం' (Bahumukham). 'గుడ్‌, బ్యాడ్ యాక్టర్‌' అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమాలో స్వర్ణిమా సింగ్‌ కథానాయికగా చేసింది. తన అందం, అభినయంతో ఆకట్టుకునేందుకు ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  మీనాక్షి గోస్వామి (Meenakshi Goswami) మీనాక్షి గోస్వామి కథానాయికగా చేసిన లేటెస్ట్‌ చిత్రం 'భరతనాట్యం'. ఈ మూవీ ద్వారానే మీనాక్షి తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా సూర్యతేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్నాడు. సినిమా ఓ యువకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందన్న కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రనీకాన్వికా (Praneekaanvikaa) ఏప్రిల్‌లో విడుదల కాబోతున్న మరో చిన్న చిత్రం 'మార్కెట్‌ మహాలక్ష్మీ'. కేరింత ఫేమ్‌ పార్వతీశం హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రణీకాన్వికా నటించింది. ఇదే ఆమెకు మెుదటి సినిమా. ఈ మూవీ విజయం ద్వారా తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకోవాలని ఈ బ్యూటీ భావిస్తోంది. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.  కోమలి ప్రసాద్‌ (Komali Prasad)  యంగ్‌ హీరోయిన్‌ కోమలి ప్రసాద్‌ కూడా.. ఈ వేసవిలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘శశివదనే’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను పలకరించనుంది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ‘నేను సీతాదేవి’ (2016) చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన కోమలి.. ‘హిట్‌ 2’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. శశివదనే సినిమా విజయంపై ఈ బ్యూటీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.  వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ సినిమా సెక్సెస్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయిన హీరోయిన్‌ వైష్ణవి చైతన్య. ఈ భామ నటించిన రెండో చిత్రం 'లవ్‌ మి ఇఫ్‌ యు డేర్‌' కూడా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ నెల 25 నుంచి తెలుగు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయనుంది. 
  ఏప్రిల్ 03 , 2024
  ADIPURUSH REVIEW: రాముడిగా ప్రభాస్‌ సూపర్‌… ఐదేళ్ల తర్వాత ప్రభాస్‌కు హిట్‌ వచ్చినట్లేనా?
  ADIPURUSH REVIEW: రాముడిగా ప్రభాస్‌ సూపర్‌… ఐదేళ్ల తర్వాత ప్రభాస్‌కు హిట్‌ వచ్చినట్లేనా?
  నటీనటులు: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్త నాగె, సన్నీ, తదితరులు. డైరెక్టర్: ఓం రౌత్ నిర్మాత: భూషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, కృష్ణ కుమార్, ఓం రౌత్. మ్యూజిక్: అజయ్-అతుల్, సాచిత్ పరంపర ఐదేళ్లుగా ప్రభాస్‌కు ఒక్క హిట్ లేదు. అందుకే, గతేడాది నుంచి ప్రభాస్ అభిమానులు ‘ఆదిపురుష్’ కోసం ఆశగా ఎదురు చూశారు. సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న చిత్రం ఎట్టకేలకు నేడు(జూన్ 16) విడుదలైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి భారీ ఎత్తున టికెట్లు కొనుగోలు చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, థియేటర్లలో ప్రేక్షకుడిని ఆదిపురుష్ మెప్పించిందా? రామాయణ కథను ఆదిపురుష్ ఎంత కొత్తగా ఆవిష్కరించింది? వంటి విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.  అదే కథ.. రామాయణం కథ అందరికీ తెలిసిందే. రాముడు మర్యాద పురుషోత్తముడు. విలువలను పాటించడంలో రాముడికి సాటెవరూ లేరు. అందుకే ఎన్ని యుగాలైనా ఇప్పటికీ రామాయణ కథను వింటూనే ఉన్నాం. ఆదిపురుష్‌లోనూ అదే కథ. ఈ సినిమాలో రాఘవ(ప్రభాస్) వనవాసం స్వీకరించిన ఘట్టం నుంచి కథ ప్రారంభం అవుతుంది. జానకి(కృతిసనన్), సోదరుడు శేషు(సన్నీ సింగ్)లతో కలిసి వనవాసం చేస్తుంటాడు. ఈ క్రమంలో శూర్పనక చెప్పుడు మాటలతో లంకేశ్(సైఫ్ అలీ ఖాన్) జానకిని అపహరిస్తాడు. జానకిని రాఘవ ఎలా కనిపెట్టాడు? లంక నుంచి తిరిగి తీసుకు రావడానికి ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది? రాఘవ, జానకిల కథని కొత్తగా చూపించడంలో ఆదిపురుష్ కొద్దిమేరకు సఫలం అయింది. ఇతిహాసాన్ని నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్ ప్రతిబింబించింది. రాఘవ, హనుమ, లంకేశుడికి మరింత శక్తిని ఆపాదిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులను మరింత మైమరిపిస్తుంది. ముఖ్యంగా, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు బలం చేకూర్చాయి. ఫస్టాఫ్‌లో ఎమోషనల్ డ్రామా కొనసాగుతుంది. సెకండాఫ్‌లో ఇక పూర్తిగా పోరాట సన్నివేశాలే. రామ్ సీతా రామ్, జైశ్రీరామ్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం రొమాలు నిక్కపొడుచుకునేలా ఉంటుంది. హనుమంతుడి చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే, వీఎఫ్ఎక్స్‌పై మరింత దృష్టి సారించాల్సింది. రావణుడి గెటప్‌ డిజైన్‌ కాస్త వెగటుగా ఉంటుంది. సాగతీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అతిగా గ్రాఫిక్స్ వాడటంతో నటీనటుల పర్ఫార్మెన్స్‌‌ మరుగున పడినట్లయింది. వాల్మీకి రామాయణం పరంగా లంక సుందరమైన నగరం. ఇందులో ఏదో రాక్షస గుహలా కనిపించడం ప్రేక్షకుడికి రుచించదు. 2Dలో కన్నా 3Dలో చూస్తే మెరుగైన అనుభూతిని పొందవచ్చు. ఎవరెలా చేశారు? రాఘవగా ప్రభాస్, జానకిగా కృతిసనన్ నటనతో మెప్పించారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలను చక్కగా పండించారు. పతాక సన్నివేశాల్లో నటనతో ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తారు. లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ ఫర్వాలేదనిపించాడు. తన పరిధి మేరకు నటించగలిగాడు. హనుమంతుడిగా దేవదత్త నాగె అద్భుతంగా నటించాడు. రాఘవతో జరిగే సన్నివేశాల్లో హనుమ వినయాన్ని తెరపై కనబరిచాడు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ ఒకే అనిపించాడు.  టెక్నికల్‌గా  రామాయణ కథను విజువల్ వండర్‌గా చూపించాలన్న ఓం రౌత్ ఆలోచనను మెచ్చుకోవాల్సిందే. పౌరాణిక పాత్రలకు సూపర్ పవర్ కల్పిస్తే ఎలా ఉంటుందని చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కానీ, లంకేశుడిని అలా ఎందుకు చూపించాడో అర్థం కాలేదు. పది తలలను ఒకే వరుసలో కాకుండా ఐదు తలలు కింద, ఐదు తలలు మీద చూపించడంలో ఆంతర్యం బోధపడలేదు. లంకను డిజైన్ చేసిన తీరు బాగోదు. ఇక, సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్ఎక్స్‌పై మరింత ఫోకస్ పెట్టాల్సింది. అజయ్, అతుల్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో సంచిత్, అంకిత్ సక్సెస్ అయ్యారు. అయితే, ఎడిటర్ తన కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది.  ప్లస్ పాయింట్స్ నటీనటులు మ్యూజిక్ సినిమాటోగ్రఫీ పోరాట సన్నివేశాలు మైనస్ పాయింట్స్ గ్రాఫిక్స్ సాగతీత సన్నివేశాలు ఎడిటింగ్ చివరగా.. ఓం రౌత్ ‘ఆదిపురుష్’ని ఒక్కసారి వీక్షించొచ్చు. రేటింగ్: 2.75/5
  జూన్ 16 , 2023
  Lord Rama Movies: ‘శ్రీరామ’ అనగానే గుర్తొచ్చే టాప్ తెలుగు చిత్రాలు ఇవే!
  Lord Rama Movies: ‘శ్రీరామ’ అనగానే గుర్తొచ్చే టాప్ తెలుగు చిత్రాలు ఇవే!
  ఐదు శతాబ్దాల హిందువుల నిరీక్షణను నిర్వీర్యం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం (Ayodhya Rama Mandir) కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట (Bala Rama Prana Pratishta) కనుల పండువగా జరిగింది. ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా, టీవీల్లో వీక్షించిన కోట్లాది భక్తజనం భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. జైరామ్‌ (Jai Shree Ram) నినాదాలతో యావత్‌ దేశం మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో రామాయాణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తెలుగు సినిమాలు, వాటిలో నటించిన ప్రముఖ హీరోల గురించి ఇప్పుడు చూద్దాం. ఆదిపురుష్‌ రామాయణాన్ని కథాంశంగా చేసుకొని ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Aadipurush). బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ (Om Raut) రూపొందించిన మూవీలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) రాముడి పాత్ర పోషించారు. సీతగా బాలీవుడ్‌ నటి కృతి శెట్టి కనిపించింది. ఆదిపురుష్‌లోని ‘జై శ్రీరామ్ జై శ్రీరామ్‌’ పాట ఆయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్బంగా దేశవ్యాప్తంగా మార్మోగడం విశేషం.  శ్రీరామ రాజ్యం బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతా దేవిగా నటించిన చిత్రం ‘శ్రీరామ రాజ్యం’ (Sri Rama Rajyam). శ్రీరాముడి సంతానం లవకుశల కథను ఆధారంగా చేసుకొని ఈ మూవీని రూపొందించారు. దిగ్గజ దర్శకుడు బాపు ఈ సినిమాను రూపొందించగా.. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలు ప్రతీ శ్రీరామ నవమి రోజున ప్రముఖంగా వినిపిస్తాయి. శ్రీ రామదాసు శ్రీరాముడికి పరమభక్తుడైన కంచర్ల గోపన్న(Kancharla Gopanna) జీవిత కథ ఆధారంగా ‘శ్రీరామదాసు’ (Sri Ramadasu) సినిమా తెరకెక్కింది. ఇందులో నాగార్జున (Nagarjuna) లీడ్‌రోల్‌లో నటించారు. గోపన్న భద్రాచలంలో రాములవారికి గుడి కట్టించి ఎలా శ్రీరామదాసుగా మారాడు అన్నది ఈ సినిమాలో చూపించారు. రాఘవేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్‌ రాముడిగా, అక్కినేని నాగేశ్వరరావు కబీర్‌దాస్‌గా నటించారు. దేవుళ్లు తెలుగులో వచ్చిన దేవుళ్లు (Devullu) చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. హిందువులు పూజించే ప్రముఖ దేవుళ్లను ఆధారంగా చేసుకొని ఈ సినిమా రూపొందింది. ఇందులో రాముడిగా శ్రీకాంత్‌, ఆంజనేయుడిగా రాజేంద్ర ప్రసాద్‌ నటించారు. ఇద్దరు చిన్నారుల తమ తల్లిదండ్రుల మెుక్కులను తీర్చేందుకు దేశంలోని ప్రముఖ ఆలయాలను ఎలా దర్శించుకున్నారు. వారికి దేవుళ్లు ఏవిధంగా సాయపడ్డారు అన్నది ఈ సినిమా. దేవుళ్లు చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.  బాల రామాయణం చిన్నారులనే పాత్రదారులుగా చేసుకొని నిర్మించిన చిత్రం 'బాల రామాయణం' (Bala Ramayanam). గుణశేఖర్‌ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) రామునిగా నటించారు. బాలనటి స్మిత.. సీత పాత్రను పోషించింది. ఈ చిత్రం జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ బాలల చిత్రంగా ఎంపిక చేయబడింది.  శ్రీ సీతారామ జననం 1944లో విడుదలైన 'శ్రీ సీతా రామజననం' (Sita Rama Jananam) చిత్రం అప్పట్లో అపూర్వ విజయాన్ని అందుకుంది. అక్కినేని రాముడిగా, నటి త్రిపుర సుందరి సీత పాత్ర పోషించారు. ఈ చిత్రం ద్వారానే ఘంటసాల గాయకుడిగా పరిచయం అయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో కోరస్‌ కూడా ఇచ్చారు. సీతారామ కళ్యాణం  నందమూరి తారకరామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం (Sita Rama Kalyanam Movie)లో హరినాథ్‌, గీతాంజలి సీతారాములుగా నటించారు. ఎన్‌.టీ రామారావు రావణాసురిడిగా కనిపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఇందులో నారద పాత్రను కాంతారావు పోషించడం విశేషం.  సంపూర్ణ రామాయణం టాలీవుడ్‌లో వచ్చిన శ్రీరాముని చిత్రాల్లో 'సంపూర్ణ రామాయణం' (Sampoorna Ramayanam) ఒకటి. ఈ చిత్రం కూడా అప్పట్లో విశేష ప్రజాధరణను పొందింది. శోభన్‌బాబు రాముడిగా, చంద్రకళ సీతగా నటించారు. ఎస్వీ రంగారావు రావణుడి పాత్రను పోషించడం విశేషం. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు.  లవకుశ నందమూరి తారకరామారావు చేసిన గుర్తిండిపోయే చిత్రాల్లో ‘లవకుశ’ (LavaKusa) కచ్చితంగా ఉంటుంది. రామాయణం ఉత్తరకాండం ఈ సినిమా కథాంశానికి మూలం. ఈ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్‌ నటించగా సీత పాత్రను అంజలీ దేవి పోషించింది. లవ, కుశలుగా నాగరాజు, సుబ్రహ్మణ్యం నటించారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎంతో ప్రసిద్ధి. శ్రీరామ నవమి సందర్భంగా పందిర్లలో ఈ చిత్ర పాటలు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. 
  జనవరి 23 , 2024
  Sai Pallavi: సీతారాములుగా సాయిపల్లవి, రణ్‌బీర్‌.. రావణుడిగా యష్‌.. బాలీవుడ్‌లో మరో ‘రామాయణం’!
  Sai Pallavi: సీతారాములుగా సాయిపల్లవి, రణ్‌బీర్‌.. రావణుడిగా యష్‌.. బాలీవుడ్‌లో మరో ‘రామాయణం’!
  అందాల తార సాయి పల్లవి బాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కనున్న ‘రామాయణం’ చిత్రంలో ఆమె సీతా దేవి పాత్రను పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  2024లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటించేందుకు అలియా భట్, దీపికా పదుకొణె, కరీనా కపూర్‌ల పేర్లు పరిశీలిస్తున్నట్లు గతంలో ప్రచారం సాగింది. చివరికీ సాయిపల్లవిని ఫిక్స్‌ చేసినట్లు సమాచారం అందుతోంది.  రామయాణం చిత్రాన్ని బాలీవుడ్‌ డైరెక్టర్‌ నితీశ్‌ కుమార్‌ తెరకెక్కించనున్నట్లు బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. అంతేగాక ఈ చిత్రం మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ చిత్రంలో కేజీఎఫ్‌ హీరో యష్‌ రావణుడి పాత్రను పోషించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ ‘DNEG’.. ఈ మూవీకి VFX అందించనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. సహజంగా నటించి ఏ పాత్రకైనా ఒక మంచి విలువను తీసుకొచ్చే సాయి పల్లవి.. ఇక సీతగా ఆ క్యారెక్టర్‌కు ఎంతటి నిండుతనాన్ని తీసుకొస్తుందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించి మేకర్స్‌ సాయిపల్లవిని సంప్రదించగా నటించేందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.  ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్‌లో మరో సినిమాను సైతం చేస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో ఈ భామ నటిస్తోంది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సాయిపల్లవికి పెళ్లి అయ్యిందంటూ ఇటీవల తెగ రూమర్స్‌ వచ్చాయి. తమిళ దర్శకుడు వేణు ఊడుగులను ఆమె వివాహం చేసుకున్నట్లు నెట్టింట విస్తృతంగా ప్రచారం జరిగింది. వారు దండలతో ఉన్న ఫొటోలు తెగ వైరల్‌ అయ్యాయి.  పెళ్లిపై జరుగుతున్న రూమర్స్‌పై సాయిపల్లవి స్పందించింది. ఓ సినిమా పూజా కార్యక్రమంలో దిగిన ఫొటోలను క్రాప్‌ చేసి డబ్బుకోసం నీచంగా ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడింది. పనికిమాలిన విషయాలపై స్పందించడం నిజంగా బాధగా ఉందని పేర్కొంది. ఒక వ్యక్తికి ఇలాంటి ఇబ్బందిని కలిగించడం నిజంగా నీచమైన చర్యేనని మండిపడింది. తెలుగులో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో సాయిపల్లవి పరిచయమైంది. అంతకు ముందు ఈమె మలయాళంలో ’ప్రేమమ్’ సినిమాలో మలర్‌గా పలకరించింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో కలిసి ఓ సినిమా చేస్తోంది ఈ భామ. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తోందని తెలుస్తోంది. నాగ చైతన్యతో సాయి పల్లవికి ఇది రెండో సినిమా. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన లవ్ స్టోరీ తెలుగులో సూపర్ హిట్ అయింది.
  అక్టోబర్ 04 , 2023
  Hanuman Roles: హునుమంతుడి పాత్రలో మెప్పించిన తెలుగు హీరోలు తెలుసా? 
  Hanuman Roles: హునుమంతుడి పాత్రలో మెప్పించిన తెలుగు హీరోలు తెలుసా? 
  రామాయణం కథాంశంలో ఎన్నో సినిమాలు సినీ ప్రేక్షకులను అలరించాయి. రాముడు, సీతా, లక్ష్మణుల పాత్రలో కనిపించి చాలా మంది నటులు మెప్పించారు. అయితే రామాయణంలో హనుమంతుడి పాత్ర ఏంతో కీలకమైంది. సీతను ఎత్తుకెళ్లిన రావణాసురుడి వద్దకు రామయ్యను తీసుకెళ్లడంలో ఆంజనేయుడు కీలకభూమిక పోషించాడు. అటువంటి ఆంజనేయ పాత్రను సినిమాల్లో అద్భుతంగా పండించిన నటులను ఇప్పుడు చూద్దాం.  తేజ సజ్జ: యంగ్‌ హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్‌ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో తేజ ఆంజనేయుడు పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన  టీజర్‌, ప్రచార చిత్రాలు హనుమాన్‌ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రశాంత్‌ వర్మ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మే 12న విడుదల కానుంది.  https://youtu.be/AvjvZ7q2apE దేవ్‌దత్తా నాగే: అత్యంత భారీబడ్జెట్‌తో రూపొందుతున్న ఆదిపురుష్‌ చిత్రంలో రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తున్నాడు. ఇందులో ఆంజనేయుడి పాత్రలో దేవ్‌దత్తా నాగే నటిస్తున్నాడు. బాలీవుడ్‌లో సంఘర్ష్‌, సత్యమేవ జయతే, తానాజీ సినిమాల్లో దేవ్‌దత్తా నటించాడు. ఆయా సినిమాల్లో అద్బుతంగా చేయడంతో ఆదిపురుష్‌లో అత్యంత కీలకమైన హనుమాన్ పాత్ర దేవ్‌దత్తాకు దక్కింది.  చిరంజీవి: జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఓ సీన్‌లో ఆంజనేయుడిగా కనిపిస్తాడు. చిరు ఆంజనేయుడి వేషంలో కనిపించడం అదే తొలిసారి. హనుమాన్‌గా చిరు సరిగ్గా సరిపోయారని అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఓ సందర్భంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడికి తనకు మధ్య ఉన్న పోలికలను చూపూతూ ట్వీట్లు కూడా మన మెగాస్టార్ చేశారు. https://twitter.com/KChiruTweets/status/1247698208077172736?s=20 https://twitter.com/KChiruTweets/status/1247705832940175360?s=20 https://twitter.com/KChiruTweets/status/1247713378988154881?s=20 https://twitter.com/KChiruTweets/status/1247713383069159424?s=20 https://youtu.be/BfJRVxeIKD8 అర్జున్‌: నితిన్‌ హీరోగా చేసిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో అర్జున్‌ హనుమాన్‌ పాత్రను పోషించాడు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎంతటి కఠినమైన రోల్‌ అయినా అలవోకగా చేయగలనని అర్జున్‌ ఈ సినిమా ద్వారా నిరూపించారు. రాజేంద్ర ప్రసాద్‌: నటుడు రాజేంద్ర ప్రసాద్‌ కూడా దేవుళ్లు సినిమాలో ఆంజనేయుడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. అయితే ఆంజనేయుడి మేకప్‌లో కనిపించనప్పటికీ మారువేషంలో ఉన్న హనుమాన్‌గా ఆయన కనిపిస్తారు. రాజేంద్ర ప్రసాద్ చుట్టూ పాడే ‘అందరి బంధువయా’ పాట చాలా ఫేమస్‌ అయ్యింది.  విందు దర సింగ్‌: సినిమాల్లో ఆంజనేయుడు పాత్ర అంటే ముందుగా గుర్తుకువచ్చేది ‘విందు దర సింగ్‌’. రామాయణం కథాంశంతో తెరకెక్కిన చాలా సినిమాల్లో ఆయన హనుమాన్‌గా కనిపించారు. తెలుగు విడుదలైన శ్రీ రామదాసు చిత్రంలో కూడా హనుమంతుడి పాత్రలో కనిపించి విందు దర సింగ్ మెప్పించాడు.
  ఏప్రిల్ 04 , 2023
  Mrunal Thakur: సీతారామం బ్యూటీకి తెలుగు కష్టాలు.. భాషపై పట్టుకోసం శ్రమిస్తున్న మృణాల్‌ ఠాకూర్‌..!
  Mrunal Thakur: సీతారామం బ్యూటీకి తెలుగు కష్టాలు.. భాషపై పట్టుకోసం శ్రమిస్తున్న మృణాల్‌ ఠాకూర్‌..!
  సీతారామం సినిమాతో నటి మృణాల్‌ ఠాకూర్ రాత్రికి రాత్రే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఈ మరాఠీ బ్యూటీకి తెలుగు నేర్చుకోవడం తప్పనిసరిగా మారిపోయింది. దీంతో ఈ భామ తెలుగు భాషపై ఫోకస్‌ పెట్టింది. మృణాల్‌ తెలుగు నేర్చుకునేందుకు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ క్లాసులకు అటెండ్‌ ‌అవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు టీచర్‌ను ఏర్పాటు చేసుకొని భాషపై పట్టు సాధించేందుకు ఆమె యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ల్యాప్‌టైప్‌ ముందు తెలుగుతో ఈ భామ కుస్తీ పడుతున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.  https://twitter.com/i/status/1701561309178081571 నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ చిత్రంలో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.  కొన్నిరోజుల క్రితం నాని పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘సమయమా’ అనే సాంగ్‌ కూడా రిలీజ్‌ కాబోతోంది. ఈ పాట లిరికల్‌ వీడియోను సెప్టెంబర్‌ 16న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఓ పోస్టర్‌ ద్వారా తెలిపారు.  https://twitter.com/VyraEnts/status/1702193014792388866 విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘VD 13’ మూవీలో కూడా మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా చేస్తోంది. రెండు పెద్ద చిత్రాలు చేతిలో ఉండటంతో లాంగ్వేజ్‌ ప్రాబ్లమ్‌ రాకుండా మృణాల్‌ జాగ్రత్త పడుతోంది. ఎలాగైన తెలుగు నేర్చుకొని టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఈ బ్యూటీ భావిస్తోంది అటు చిరంజీవితోను కలిసి నటించే ఛాన్స్‌ను ఈ  భామ కొట్టెసినట్లు వార్తలు వస్తున్నాయి.  ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ.. చిరుతో 157వ చిత్రాన్ని చేయనున్నారు. ఇందులో హీరోయిన్‌ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని, ఆ క్యారెక్టర్‌కు మృణాల్‌ అయితేనే సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  టెలివిజన్ తెరపై సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్.. మరాఠి సినిమా ‘విట్టి దండు’తో వెండితెర ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత మరాఠీతో పాటు హిందీ సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  సీతారామం తర్వాత మృణాల్ ఈ యేడాది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సెల్ఫీ’తో ఆడియన్స్‌ను పలకరించింది. ఈ సినిమా మలయాళీ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్‌కు రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమా టాక్ బాగానే ఉన్న కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఈ సినిమాతో అక్షయ్ కుమార్ స్టార్‌డమ్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేసాయి.  మృణాల్‌కు తెలుగుతో పాటు తమిళం, మలయాళం ఇండస్ట్రీల నుంచి కూడా ఎన్నో ఆఫర్లు వస్తున్నాయట. అక్కడ అరంగేట్రానికి మంచి కథ కోసం ఈ భామ వెతుకుతోందట. మృణాల్‌ త్వరలోనే తన తమిళం లేదా మలయాళీ సినిమా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ తమిళ హీరో సూర్య మూవీలో మృణాల్‌కు ఓ  కీలక పాత్ర ఆఫర్ చేసినట్లు పుకార్లు ఉన్నాయి. 
  సెప్టెంబర్ 14 , 2023
  Mrunal Thakur : నెటిజన్లతో మృణాల్‌ ముచ్చట్లు… సీతారామం 2 సినిమాపై క్లారిటీ..!
  Mrunal Thakur : నెటిజన్లతో మృణాల్‌ ముచ్చట్లు… సీతారామం 2 సినిమాపై క్లారిటీ..!
  సీతారామం చిత్రంలో సీతగా నటించిన మృణాల్‌ ఠాకూర్‌ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ భామ అందం, అభినయం, నటన.. సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. సీతారామంలో ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలంగా తన హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. బోల్డ్‌ లుక్‌లో ఉన్న మృణాల్‌ను చూసి ఆమె ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాాగా మృణాల్‌ ట్విటర్‌ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. #askmrunal పేరుతో నెటిజన్ల ప్రశ్నలను ఆహ్వానించింది. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన ప్రతీ ప్రశ్నకు మృణాల్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నలు, సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  ప్రశ్న: మీకు కెనడియన్‌ యాక్టర్‌ కీను రీవ్స్‌తో నటించే అవకాశం వస్తే ఎలా ఫీలవుతారు? మృణాల్‌: సంతోషం, ఆనందం, ఆశ్చర్యాన్ని తెలియజేసే ఎమోజీస్‌  https://twitter.com/mrunal0801/status/1645117683267170306 భారత్‌లో బ్రిటన్ రాయబారి: మనం రెండేళ్ల క్రితం కలిసి విమాన ప్రయాణం చేశాం. మీరు సాధించిన విజయాలకు నా అభినందనలు. మృణాల్‌: మీ నుంచి ఈ మాటలు వినడం చాలా సంతోషం. ఆ రోజు సినిమాలపై మన మధ్య జరిగిన సంభాషణ ఇప్పటికీ నాకు గుర్తింది. https://twitter.com/mrunal0801/status/1645084379264237570 ప్రశ్న: హైదరాబాద్‌లో నాని 30 సినిమా షూటింగ్‌లో మిమ్మల్ని కలిశాను. మీరు చాలా బాగా మాట్లాడారు. ఇంతపెద్ద స్టార్‌గా ఎదగడానికి మీ వినయమే కారణం అనుకుంటా. మృణాల్‌: థ్యాంక్యూ https://twitter.com/mrunal0801/status/1645078658900525056 ప్రశ్న: సీతారామంలో సీతా మహాలక్ష్మీగా మీ నటన చూసి ఫ్యాన్‌ అయిపోయా. ఆ సినిమా గురించి ఏమైన చెప్పండి. మృణాల్‌: సీతారామం నిజంగా ఓ అద్భుతం. https://twitter.com/mrunal0801/status/1645067329078804482 ప్రశ్న: బాలీవుడ్ or సౌత్‌  మృణాల్‌: ఇండియన్ సినిమా. https://twitter.com/mrunal0801/status/1645062867035496451 ప్రశ్న: తెలుగులో ఒక మాట మాట్లాడండి? మృణాల్‌: మళ్లీ మెుదలు https://twitter.com/mrunal0801/status/1645062753697103875 ప్రశ్న: సీతారామం 2 కు అవకాశం ఉందా? మృణాల్: నాకూ తెలీదు. కానీ ఉండాలని కోరుకుంటున్నా https://twitter.com/mrunal0801/status/1645028690697519104 ప్రశ్న: మీరు నటించిన గుమ్రా మూవీ చూశా. యాక్షన్‌ మూవీలో నిన్ను చూడటం చాలా ఎక్జైటింగ్‌గా అనిపించింది. కేవలం నీ కోసమే మా పేరెంట్స్‌ను సినిమాకు తెసుకెళ్లాలని అనుకుంటున్నా. మృణాల్‌: మీ తల్లిదండ్రులకు నా ప్రేమను తెలియజేయండి. వారు సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. https://twitter.com/mrunal0801/status/1645060359915556864 బాలీవుడ్‌లో మృణాల్‌ నటించిన గుమ్రా మూవీ ఏప్రిల్‌ 7న విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో పోలీసు ఆఫీసర్‌గా మృణాల్‌ నటన ఆకట్టుకుంది. హీరో ఆదిత్య రాయ్‌ కపూర్‌కు పోటీగా నటించి మృణాల్‌ మెప్పించింది. తొలి మూడు రోజుల్లో గుమ్రా మూవీ రూ.15కోట్ల గ్రాస్‌ సాధించినట్లు మేకర్స్‌ ప్రకటించారు. 
  ఏప్రిల్ 10 , 2023
  SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!
  SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!
  దక్షిణ భారత దేశంలో జరిగే అతిపెద్ద సినీ ఈవెంట్‌గా  సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) గుర్తింపు పొందింది. ఏటా జరిగే SIIMA వేడుకల్లో అంతకుముందు ఏడాది వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్‌ 15, 16వ తేదీల్లో SIIMA అవార్డ్స్‌ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లకూ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. దీంతో టాలీవుడ్‌ నుంచి పలు సూపర్‌హిట్‌ సినిమాలు SIIMA అవార్డ్స్‌కు నామినేషన్స్‌ పంపాయి. ఈ క్రమంలోనే తెలుగు బెస్ట్ ఫిలిం క్యాటగిరీలో పలు సినిమాలు నామినేట్ కూడా అయ్యాయి. అలాగే తమిళం, మలయాళం, కన్నడ భాష చిత్రాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  తెలుగు టాలీవుడ్‌ నుంచి ఈసారి 5 చిత్రాలు SIIMA అవార్డ్స్‌ రేసులో నిలిచాయి. అందరూ ఊహించినట్లుగానే RRR చిత్రం అత్యధిక నామినేషన్స్‌ దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, కెమెరామెన్, స్టంట్స్, కొరియోగ్రఫీ, సంగీతం వంటి పలు విభాగాల్లో 11 నామినేషన్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సీతారామం (Sita Ramam) సినిమా  సైతం ‘ఉత్తమ చిత్రం’తో పాటు పలు విభాగాల్లో 10 నామినేషన్స్ దక్కించుకుంది. అటు నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2)  మూవీతో పాటు, సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), అడివి శేష్ నటించిన ‘మేజర్’ (Major) మూవీ ఉత్తమ చిత్రం క్యాటగిరీలో నామినేషన్స్ దక్కించుకున్నాయి. అయితే ఆస్కార్‌ అవార్డు కొల్లగొట్టిన RRR చిత్రం.. SIIMA రేసులో ఉండటంతో క్లీన్‌స్వీప్‌ ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.  తమిళం కోలీవుడ్‌ నుంచి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -1 (Ponniyin Selvan) మూవీ అత్యధిక నామినేషన్లు సొంతం చేసుకుంది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 10 నామినేషన్స్ దక్కించుకుంది. కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన ‘విక్రమ్’ (Vikram) మూవీ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా 9 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. అటు మాధవన్ దర్శకత్వం వహించి, నటించిన ‘రాకెట్రి’ (Rocketry) మూవీతో పాటు, ‘లవ్ టుడే’ (Love Today) మూవీలు ఉత్తమ చిత్రం కేటగిరిలో నామినేషన్స్ నిలిచాయి. అయితే పొన్నియన్ సెల్వన్ -1, విక్రమ్‌ చిత్రాలపై తమిళ ఇండస్ట్రీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.  కన్నడ 2022 ఏడాది కన్నడ చిత్ర పరిశ్రమకు చిరస్మరణీయ విజయాలను అందించింది. ఆ పరిశ్రమ నుంచి వచ్చిన కాంతార, కేజీఎఫ్‌ చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాయి. ఇదిలా ఉంటే ఈ సారి కన్నడ ఇండస్ట్రీ నుంచి నాలుగు చిత్రాలు SIIMA అవార్డ్స్‌ నామినేషన్‌కు ఎంపికయ్యాయి. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ (Kantara), యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రాలు 11 నామినేషన్స్‌ను దక్కించుకున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కెమెరా వర్క్ విభాగాల్లో రేసులో నిలిచాయి. అటు ‘విక్రాంత్ రోణ’ (Vikranth rona), ‘ఛార్లీ 777’ (Charlie 777) చిత్రాలు సైతం కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘ఉత్తమ చిత్రం’ కేటగిరిల్లో పోటీపడుతున్నాయి. మలయాళం మలయాళం నుంచి  ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. మమ్ముట్టి హీరోగా నటించిన ‘భీష్మ పర్వం’ 8 నామినేషన్స్‌తో అగ్ర స్థానంలో నిలిచింది. అటు టొవినో థామస్ (Tovino Thomas) హీరోగా చేసిన ‘థల్లుమాల’ (Thallumaala)కు ఏడు నామినేషన్స్ వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రాల్లో ఏయో చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకుంటారో చూడాలి. వీటితో పాటు హృదయం (Hridayam), జయ జయ జయ జయహే (Jaya Jaya Jaya Jaya Hey),  'న్నా తాన్‌ కేస్ కొడు' (Nna Thaan Case Kodu), జనగణమన (Jana Gana Mana) ఉత్తమ చిత్రం కేటాగిరిలో పోటీ పడుతున్నాయి. కాగా, SIIMA ఈవెంట్ సెప్టెంబర్ 15,16 తేదిల్లో దుబాయ్‌లోని DWTCలో అంగరంగ వైభవంగా జరగనుంది.
  ఆగస్టు 03 , 2023
  Mrunal Thakur: తెలుగులో మళ్లీ జతకట్టనున్న మృణాల్ ఠాకూర్- దుల్కర్ సల్మాన్.. డైరెక్టర్ ఎవరంటే?
  Mrunal Thakur: తెలుగులో మళ్లీ జతకట్టనున్న మృణాల్ ఠాకూర్- దుల్కర్ సల్మాన్.. డైరెక్టర్ ఎవరంటే?
  సీతారామం సినిమా తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఎంత పెద్ద హిట్టైందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో జతకట్టిన దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకూర్ హిట్ పేయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ రామ్ పాత్ర‌లో, మృణాల్ సీత పాత్రలో అలరించారు. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌ను తమ క‌ళ్ల‌తోటే పలికించి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని అద్భుతంగా పండించారు. మృణాల్ ఠాకూర్ సాంప్ర‌దాయ వస్త్రధారణతో ఆమె చేసిన అభినయం తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఈ జోడీ మరోసారి జత కట్టనుట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ పరుశురామ్ శిష్యుడు రవి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని మంచి ప్రేమకథా చిత్రం రాసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  హిట్ పేయిర్ రిపీట్ సీతారామం మూవీ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్‌తో పాటు మృణాల్ ఠాకూర్‌కు సరైన హిట్ పడలేదనే చెప్పాలి. దుల్కర్ కింగ్ కొత్త వంటి వెబ్ సిరీస్‌లో నటించినా అది ఆశించినంత విజయం సాధించలేదనే చెప్పాలి. మరోవైపు సీతారామం సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్.. హాయ్ నాన్నా, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు చేసింది. ఇందులో హాయ్ నాన్న బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా... ఫ్యామిలీ స్టార్ చిత్రం మాత్రం చతికిలపడిపోయింది. ఫ్యామిలీ స్టార్‌కు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆశించినంతగా వసూళ్లు రాలేదు. ఈ సినిమా కోసం మృణాల్ బాగానే కష్టపడిందని చెప్పాలి. విజయ్ దేవరకొండతో కలిసి మూవీ ప్రమోషన్లలో తీరిక లేకుండా పాల్గొంది. స్వయంగా రీల్స్ చేసి వైరల్ చేసినా.. సినిమా ఫలితం మాత్రం వేరేలాగా వచ్చింది. దీంతో ఆమె కెరీర్ తెలుగులో ప్రశ్నార్థకంగా మారింది. కొత్త హీరోయిన్లతో గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మృణాల్ హవా కొనసాగేనా? దశాబ్దకాలంగా మృణాల్ బాలీవుడ్‌లో నటిస్తోంది."సూపర్ 30"లో హృతిక్ రోషన్‌తో జతకట్టింది, కానీ ఇప్పటివరకు ఈ కలువ కనుల సుందరికి బీటౌన్‌లో సరైన గుర్తింపు దక్కలేదు. అయితే టాలీవుడ్‌లో మృణాల్ కేవలం ఒక్క సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకుంది. తెలుగు ప్రజల ప్రేమకు మైమరిచిపోయిన ఈ భామ అప్పట్లో కన్నీళ్లు కూడా పెట్టుకుంది.సీతారామం విజయం మృణాల్‌కు టాలీవుడ్‌లో రాచబాట పరిచింది. సీతారామం సినిమాకోసం రూ.80 లక్షలు పారితోషికం తీసుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత తన రెమ్యూనరేషన్‌ను రూ.కోటీన్నరకు పెంచింది. ఫ్యామిలీ స్టార్ పరాజయంతో  ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు సన్నగిల్లాయి. రవి డైరెక్షన్‌లో దుల్కర్ సల్మాన్‌తో జత కట్టే సినిమాపై ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ను నిర్ణయించే అవకాశం ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో స్టోరీ టాలీవుడ్‌లో దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకుర్ జోడీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో.. ఈ జంటలో మరో మారు సినిమా తీయాలని టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ పరుశురాం అసిస్టెంట్ డైరెక్టర్ రవి ఈ జంటతో సినిమా తీసేందుకు ముందుకొచ్చాడని సమాచారం. దుల్కర్- సల్మాన్‌ కోసం ఓ వినూత్నమైన ప్రేమ కథను రాసుకున్నాడంట. ఇది పూర్తిగా విలేజ్ బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా రవి పూర్తి చేశాడంట. ఈ సినిమా కోసం దిల్ రాజు దగ్గరికి వెళ్లగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్‌లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాశ్‌ను ఎంపిక చేశారంట. ఆయన కూడా ఈ సినిమాకు పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ.. తెలుగులో సార్, ఆదికేశవ వంటి చిత్రాలకు సంగీతం అందించాడు. సార్ సినిమా పాటలు ఎంత హిట్‌ అయ్యాయో అందరికి తెలిసిందే. అదే తరహాలో మ్యూజిక్ అందించేందుకు జీవీ ప్రకాశ్ సిద్ధమయ్యారు. షూటింగ్ ఎప్పుడంటే? ప్రస్తుతం దిల్ రాజు గేమ్ ఛేంజర్, విజయ్ దేవరకొండతో మరో సినిమాతో ఆయన బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తికాగానే దుల్కర్- మృణాల్ ఠాకూర్ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. అటు మృణాల్ ఠాకూర్ సైతం పూజా మేరి జాన్ అనే బాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉంది. ఇటు దుల్కర్ సైతం మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తికాగానే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు టాక్. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ జంటపై ఊహగానాలు వినిపిస్తున్నాయి.
  మే 14 , 2024
  MRUNAL THAKUR: బికినీలో సెగలు పుట్టిస్తున్న మృణాల్ ఠాకూర్
  MRUNAL THAKUR: బికినీలో సెగలు పుట్టిస్తున్న మృణాల్ ఠాకూర్
  సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ మరోసారి అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామ తన హాట్ పిక్స్ షేర్ చేసి సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లకు పనిచెప్పింది.  బ్లూకలర్ సింగిల్ పీస్ బికినీ ధరించి సమ్మర్‌లో ఉన్న వేడిని మరింత పెంచేసింది. ఎద అందాల హోయలతో కెపెక్కించింది. నాభి అందాల సోగసుతో గిలిగింతలు పెడుతోంది.  https://telugu.yousay.tv/mrinal-who-increased-the-remuneration-hugely.html సీతారామం సినిమాలో కనిపించిన మృణాల్ ఠాకూరేనా ఇలా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హాట్ లుక్స్ ఆఫ్ ది ఇయర్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.  తాజాగా మరిన్ని బోల్డ్‌ ఫొటోలను మృణాల్ పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. రోజు రోజుకు సోషల్‌మీడియాను హీట్‌ ఎక్కిస్తున్న మృణాల్‌ను చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఈ భామ సొగసులకు ఎవరూ సాటి రారని కామెంట్లు చేస్తున్నారు. సీతారామం తర్వాత వరుసగా బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటించింది మృణాల్. ప్రస్తుతం తెలుగులో నాని 30 సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. సినిమాల్లో ట్రెడిషనల్‌ లుక్స్‌లో కనిపించి మెప్పించిన మృణాలు.. సోషల్‌ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది. తన వయ్యారాలను ఒలకపోస్తూ నెటిజన్లను కవ్విస్తోంది. నానితో చేయబోయే Nani 30 సినిమా గురించి మృణాల్‌ మాట్లాడింది. తన జీవితంలో అంత మంచి స్క్రిప్ట్‌ ఇంతవరకూ వినలేదని పేర్కొంది. 2014లో విడుదలైన మరాఠీ చిత్రం 'విట్టి దండు'తో మృణాల్ సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మరో మరాఠీ చిత్రం సురాజ్యలో కూడా నటించి మెప్పించింది.  హిందీలో జెర్సీ సినిమాలో నటించిన మృణాల్‌ తన నటనతో అందరిని అలరించింది. ఆ సినిమా ద్వారా హిందీలో మరిన్ని అవకాశాలు కొట్టేసింది. 2014లో విడుదలైన మరాఠీ చిత్రం 'విట్టి దండు'తో మృణాల్ సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మరో మరాఠీ చిత్రం సురాజ్యలో కూడా నటించి మెప్పించింది.  https://telugu.yousay.tv/sreemukhi-sreemukhi-is-competing-with-the-heroines-in-that-regard.html ప్రస్తుతం పూజా మేరి జాన్‌, పిప్పా, ఆంక్‌ మిచోలి వంటి బాలీవుడ్ చిత్రాల్లో  మృణాల్ నటిస్తోంది.
  ఏప్రిల్ 11 , 2023
  దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ... సీతారామం సినిమా సూపర్ హిట్‌తో తెలుగులో దుల్కర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలకు భిన్నంగా విలక్షణమైన పాత్రలు పోషిస్తూ నటనపరంగా భేష్ అనింపించుకుంటున్నారు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు మీకోసం..  దుల్కర్ సల్మాన్‌ను అలా ఎందుకు పిలుస్తున్నారు? దుల్కర్ సల్మాన్ మలయాళం మెగాస్టార్ మమ్మూటి కొడుకు. తన ఇంటిపేరు లేకుండానే తన కొడుకు సొంతకాళ్లపై ఎదగాలని దుల్కర్ సల్మాన్ పేరు పెట్టినట్లు మమ్మూటి చెప్పారు.  దుల్కర్ సల్మాన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 8 అంగుళాలు  దుల్కర్ సల్మాన్ ఎక్కడ పుట్టారు? కొచ్చి, కేరళ  దుల్కర్ సల్మాన్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1986 జులై 28  దుల్కర్ సల్మాన్ భార్య పేరు? అమల్ సూఫియా  దుల్కర్ సల్మాన్‌కు ఎంత మంది పిల్లలు?  ఒక బాబు, పేరు మరియం అమీరా సల్మాన్   దుల్కర్ సల్మాన్‌ అభిరుచులు? పుస్తకాలు చదవడం, కుకింగ్  దుల్కర్ సల్మాన్‌  హీరోగా నటించిన తొలిసినిమా? ABCD( అమెరికన్ బోర్న్.. కన్ఫ్యూజ్డ్ దేశీ  దుల్కర్ సల్మాన్‌కు అభిమాన నటుడు? మమ్మూటి దుల్కర్ సల్మాన్ అభిమాన హీరోయిన్? అలియా భట్ దుల్కర్ సల్మాన్‌కు స్టార్ డం అందించిన చిత్రం? సీతారామం దుల్కర్ సల్మాన్‌కు ఇష్టమైన కలర్? వైట్ దుల్కర్ సల్మాన్‌ తల్లిదండ్రుల పేర్లు? మమ్మూటి, సలాఫత్ కుట్టి దుల్కర్ ఏం చదివాడు? బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ దుల్కర్ సల్మాన్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 13 సినిమాల్లో నటించాడు https://www.youtube.com/watch?v=Ms2rrZ25ne0 దుల్కర్ సల్మాన్‌కు ఇష్టమైన ఆహారం? బిర్యానీ దుల్కర్ సినిమాకు ఎంత తీసుకుంటారు?  ఒక్కో సినిమాకి దాదాపు రూ.4కోట్లు- రూ.5కోట్లు తీసుకుంటాడు.
  మార్చి 19 , 2024
  మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  మృణాల్ ఠాకూర్ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సీతారామం(2022) చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఈక్రమంలో మృణాల్ ఠాకూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Mrunal Thakur) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మృణాల్ ఠాకూర్ దేనికి ఫేమస్? మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.  మృణాల్ ఠాకూర్ వయస్సు ఎంత? 1992, ఆగస్టు 1న జన్మించింది. ఆమె వయస్సు  31 సంవత్సరాలు  మృణాల్ ఠాకూర్  ముద్దు పేరు? గోళి మృణాల్ ఠాకూర్  ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు  మృణాల్ ఠాకూర్ ఎక్కడ పుట్టింది? ధూలే, మహారాష్ట్ర మృణాల్ ఠాకూర్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు మృణాల్ ఠాకూర్ అభిరుచులు? క్రికెట్ చూడటం, ఫొటోగ్రఫీ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన ఆహారం? ప్రాన్స్, చేపలు, జిలేబీ మృణాల్ ఠాకూర్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మృణాల్, శరత్ చంద్ర అనే రచయితతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మృణాల్ ఠాకూర్‌ తల్లిదండ్రుల పేర్లు? ఉదయ్ సింగ్ ఠాకూర్(యూనియన్ బ్యాంక్‌లు అసిస్టెంట్ జనరల్ మెనేజర్‌గా పనిచేస్తున్నారు) మృణాల్ ఠాకూర్‌ ఫెవరెట్ హీరో? అమితాబ్ బచ్చన్ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన హీరోయిన్? కరీనా కపూర్ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన కలర్ ? యెల్లో, వైట్, పింక్ మృణాల్ ఠాకూర్ తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? సీతారామం(2023) మృణాల్ ఠాకూర్ ఏం చదివింది? జర్నలిజంలో డిగ్రీ చేసిందిత మృణాల్ ఠాకూర్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. మృణాల్ ఠాకూర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మృణాల్ సినిమాల్లోకి రాకముందు అనేక టీవీ షోల్లో నటించింది. మోడల్‌గా కొన్ని యాడ్స్ చేసింది. మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/mrunalthakur/?hl=en మృణాల్ ఠాకూర్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? హాయ్‌ నాన్న చిత్రంలో నానితో కలిసి లిప్‌ లాక్ సీన్‌లో నటించింది. అలాగే జెర్సీ చిత్రంలో షాహిద్ కపూర్‌తో లిప్ లాక్ సీన్‌లో యాక్ట్ చేసింది. https://www.youtube.com/watch?v=36fZHQwlDCo
  ఏప్రిల్ 08 , 2024
  MRUNAL THAKUR: గ్లామర్‌ హద్దులు దాటేస్తున్న మృణాల్ థాకూర్… రెచ్చిపోయి అందాల ప్రదర్శన…
  MRUNAL THAKUR: గ్లామర్‌ హద్దులు దాటేస్తున్న మృణాల్ థాకూర్… రెచ్చిపోయి అందాల ప్రదర్శన…
  మృణాల్ థాకూర్‌ ఫేమ్‌ రోజురోజుకి పెరుగుతోంది. హిట్ సినిమాలు లేకపోయినా ఈ అమ్మడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. మృణాల్‌ రోజురోజుకి గ్లామర్ డోస్ పెంచుతోంది. సీతారామం చిత్రంలో చీరకట్టులో పద్ధతిగా కనిపించిన ఈ సుందరి… అందాల ఆరబోతకు అవదుల్లేవ్‌ అనేంతలా చెలరేగుతోంది. ఇటీవల బికినీలో దర్శనమిచ్చి కుర్రకారు మతి పోగొట్టింది ఈ వయ్యారి. మృణాల్‌ను అలా చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.  View this post on Instagram A post shared by Shehla Khan (@shehlaakhan) సీతారామంలో చూసిన ఆ అమ్మాయేనా ఇలా కనిపించిందని అనుకునేలోపు డోసు పెంచింది. సొగసుల వయ్యారాలు ప్రదర్శిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది మృణాల్.  ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసిన మృణాల్ గురించే చర్చ. హాట్ అందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ అమ్మడు.  ఎద, నాభి సొగసులను మూటగట్టి మత్తెక్కించే చూపులతో రెచ్చిపోతుంది మృణాల్. ఫస్ట్‌ లుక్‌ అనే మ్యాగ్జిన్‌ కోసం పరువాల ప్రదర్శన చేస్తోంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న మృణాల్ థాకూర్‌కి ఫ్యాన్ బేస్ క్రమంగా పెరుగుతోంది. ఇన్‌స్టా, ట్విటర్‌లో ఫాలోవర్స్ పెరుగుతున్నారు. తెలుగులో నాని 30 సినిమాలో నటిస్తుంది ఈ ముంబయి భామ. ఆంక్‌ మిచోలీ అనే బాలీవుడ్‌ చిత్రంలోనూ మెరవనుంది.  View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) టెలివిజన్ సీరియల్‌ యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ లవ్ సోనియా చిత్రంతో బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేసింది. తెలుగు, హిందీ, మళయాలం చిత్రాల్లోనూ ఆఫర్లు కొట్టేస్తుంది చిన్నది. యువత టార్గెట్‌గా సినిమాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
  ఏప్రిల్ 19 , 2023
  WOMEN'S DAY SPECIAL: తెలుగులో పవర్‌ఫుల్ లెడీ క్యారెక్టర్స్.. వీళ్లు నటనకు కొత్తదారిని చూపారు!
  WOMEN'S DAY SPECIAL: తెలుగులో పవర్‌ఫుల్ లెడీ క్యారెక్టర్స్.. వీళ్లు నటనకు కొత్తదారిని చూపారు!
  తెలుగులో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చాలానే వచ్చాయి. కొన్ని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు కూడా ఉన్నాయి.  పాజిటివ్‌, నెగటివ్‌ అనే తేడా లేదు. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటనతో మెప్పిస్తున్నారు మన హీరోయిన్లు. ఇప్పటి వరకు తెలుగులో కథనాయికలు చేసిన పవర్‌ఫుల్ రోల్స్‌పై ఓ లుక్కేద్దాం. సీతారామం  సీతారామం చిత్రంలో సీత క్యారెక్టర్‌లో మృణాల్ ఠాకూర్ నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఈ మధ్య వచ్చిన చిత్రాల్లో ఇంతలా ప్రభావం చూపిన లేడీ క్యారెక్టర్లలో మరొకటి లేదని చెప్పాలి. యువరాణిగా హుందాతనం, ప్రియురాలిగా కొంటెతనం అన్ని కలగలిపిన పాత్ర సీతది. ఈ పాత్ర తెలుగులో వచ్చిన బెస్ట్ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్లలో ఒకటిగా చెప్పవచ్చు. అరుంధతి కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి చిత్రంలో జేజమ్మ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజ జీవితంలో ఆ క్యారెక్టర్‌ ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించేలా అనుష్క లీనమయ్యింది. మహా నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటిలో కీర్తి సురేశ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో అచ్చం సావిత్రిలానే నటించిందని అందరూ ప్రశసించారు. కర్తవ్యం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు నయనతార. కర్తవ్యం అనే సినిమాలో ఓ IAS అధికారిగా నయన్ మెప్పించి ప్రశంసలు దక్కించుకుంది. ధర్మ యోగి హీరోయిన్‌ త్రిషను విలన్‌ రోల్‌లో ఎలివేట్ చేసిన చిత్రం ధర్మ యోగి. ధనుశ్ హీరోగా చేసిన చిత్రంలో పొలిటిషన్‌గా వెన్నుపోటు పొడిచే పాత్రలో త్రిష నటన అద్భుతం. శివగామి బాహుబలిలో ప్రభాస్‌ కన్నా శివగామి ఫేమస్. అంతటి పవర్‌ఫుల్‌ రోల్‌ను రమ్యకృష్ణ ఒంటి చేత్తో నిలబెట్టింది. రాణిగా ఆమె చూపించిన రాజసం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటే అతిశయోక్తి కాదు. అత్తారింటికీ దారేది పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో నదియా రోల్‌ చిత్ర పరిశ్రమలో ఓ టర్నింగ్ పాయింట్. కథను హీరోపై కాకుండా మహిళ పాత్రపై నడిపించారు. నదియా పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ఓసేయ్ రాములమ్మ ఎవరెన్ని పవర్‌ఫుల్ పాత్రలు పోషించినా విజయశాంతిని వెనక్కి నెట్టలేరు. ఓసేయ్ రాములమ్మ చిత్రంలో నక్సలైట్‌గా ఆమె చేసిన ఎన్ని తరాలైనా అలానే ఉంటుంది. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరోనే కాదు లేడీ రోల్స్‌ కూడా అంతే మాస్‌గా ఉంటాయి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలో సహజనటి జయసుధ రవితేజ తల్లి క్యారెక్టర్‌లో ఇరగొట్టారు. ఇందులో ఆమె రోల్‌కు మంచి మార్కులు పడ్డాయి.  చంద్రముఖి చంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.
  మార్చి 07 , 2024
  True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
  True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
  టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించాయి. యాక్షన్‌, శృంగార సన్నివేశాలు, ఐటెం సాంగ్స్‌ ఇలాంటివి లేకపోయినా.. స్వచ్చమైన ప్రేమ, ఆకట్టుకునే కథ-కథనం, చక్కటి ప్రజెంటేషన్‌ ఉంటే చాలని అవి నిరూపించాయి. ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రగిలించి కొత్త రకం ప్రేమ కథలను ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ (Sitaramam), ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) చిత్రాలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్‌ ఇండస్ట్రీని సైతం ఈ చిత్రాలు కదిలించాయి. నార్త్‌ అభిమానుల ఫేవరేట్‌ చిత్రంగా మారిపోయాయి. మరి టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చి కల్ట్‌ క్లాసిక్‌ మూవీలు ఏవి? అవి ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.  సీతారామం 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది.  హాయ్‌ నాన్న ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది.  సూర్య S/O కృష్ణన్ హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.  మజిలి తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.  నిన్ను కోరి హీరో ఒక యువతిని ఎంతగానో ఇష్టపడతాడు. అనూహ్యంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. తొలత ఆమెను దక్కించుకోవాలని భావించినప్పటికీ చివరికీ ఆమె సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు.  మళ్లీ మళ్లీ ఇది రాని రోజు రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.  ఓయ్‌ బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. తొలి ప్రేమ  టాలీవుడ్‌లో వచ్చి కల్ట్‌ క్లాసిక్‌ ప్రేమ కథా చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. విదేశాల నుంచి వచ్చిన యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆమెకు తన భావాలను చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. తిరిగి వెళ్లేపోతున్న క్రమంలో తానూ హీరోను లవ్‌ చేస్తున్నట్లు యువతికి అర్థమవుతుంది.  నిన్నే పెళ్లాడతా కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన నిన్నే పెళ్లడతా చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.  జాను శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు. 
  ఫిబ్రవరి 13 , 2024

  @2021 KTree