• TFIDB EN
  • శివ మనసులో శృతి
    UATelugu
    శివ కొరియర్‌ కంపెనీలో పని చేస్తుంటాడు. రేడియో జాకీ అయిన శ్రుతిని చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. శివ చేసిన ఓ పని వల్ల శ్రుతి అతడికి బ్రేకప్‌ చెప్తుంది. ఇంతకి ఏంటి ఆ పని? తిరిగి వారు కలిశారా? లేదా? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సుధీర్ బాబు
    శివ
    రెజీనా కసాండ్రా
    శృతి
    చంటిశివ స్నేహితుడు
    వెన్నెల కిషోర్
    శృతి సోదరుడు
    కాశీ విశ్వనాథ్
    శృతి తండ్రి
    మిర్చి హేమంత్ (అతిథి పాత్ర)
    రోహిణి
    శివ తల్లి
    సుబ్బరాజు
    పోలీస్ ఆఫీసర్ (అతి పాత్ర)
    తాగుబోతు రమేష్
    హర్ష వర్ధన్
    ప్రియాంక నల్కారిశివ సిస్టర్
    సిబ్బంది
    తాతినేని సత్య
    దర్శకుడు
    విక్రమ్ రాజునిర్మాత
    వి.సెల్వగణేష్
    సంగీతకారుడు
    యువన్ శంకర్ రాజా
    సంగీతకారుడు
    ఎం. రాజేష్
    కథ
    సతీష్ సూర్య
    ఎడిటర్
    కథనాలు
    రెజీనా కాసాండ్రా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    రెజీనా కాసాండ్రా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
     రెజీనా కాసాండ్రా తెలుగులో సుధీర్ బాబు నటించిన SMS(శివ మనసులో శృతి) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. రొటీన్ లవ్‌స్టోరీ, కొత్తజంట సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సాయిధరమ్ తేజ్ నటించిన సుబ్రహ్మాణ్యం ఫర్ సేల్ చిత్రం ద్వారా కమర్షియల్ బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత శాకిని డాకిని, సౌఖ్యం, పవర్, రారా కృష్ణయ్య వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. హిందీలో సూపర్ హిట్ వెబ్‌సిరీస్ ఫర్జీలో నటించింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో హద్దులు చెరిపేస్తున్న రెజీనా గురించి కొన్ని ఆసక్తికరమైన (Some Lesser Known Facts about Regina Cassandra) విషయాలు ఓసారి చూద్దాం. రెజీనా కాసాండ్రా ముద్దు పేరు? రెజీనా  రెజీనా కాసాండ్రా ఎప్పుడు పుట్టింది? 1990, డిసెంబర్ 13న జన్మించింది రెజీనా కాసాండ్రా తొలి సినిమా? కందా నాల్ ముదల్(2005) రెజీనా కాసాండ్రా తెలుగులో నటించిన తొలి సినిమా? శివ మనసులో శృతి(2012) రెజీనా కాసాండ్రా ఎత్తు ఎంత? 5 అడుగుల 6అంగుళాలు  రెజీనా కాసాండ్రా  ఎక్కడ పుట్టింది? చెన్నై రెజీనా కాసాండ్రా   ఏం చదివింది? సైకాలజీలో పీజీ చేసింది రెజీనా కాసాండ్రా  అభిరుచులు? పుస్తకాలు చదవడం రెజీనా కాసాండ్రాకు ఇష్టమైన ఆహారం? చాకోలెట్స్, చీజ్ రెజీనా కాసాండ్రా కు అఫైర్స్ ఉన్నాయా? టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తో డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. రెజీనా కాసాండ్రాకు  ఇష్టమైన కలర్ ? బ్లాక్ రెజీనా కాసాండ్రాకు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్, అజిత్ కుమార్ రెజీనా కాసాండ్రా  పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.1.5Cr వరకు ఛార్జ్ చేస్తోంది. రెజీనా కాసాండ్రా  ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/reginaacassandraa/?hl=en https://www.youtube.com/watch?v=XHVrAH6968k
    ఏప్రిల్ 06 , 2024
    Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
    Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
    ఈ రోజుల్లో హీరో కావాలంటే డాన్సులు, నటన రావడమే కాదు ఫిజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో హీరో తెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. అందుకే ఎంత కష్టమైన భరించి కథానాయకులు సిక్స్ ప్యాక్‌లు చేస్తుంటారు. పాత్రలకు అనుగుణంగా తమను తాము రూపాంతరం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి బరువు కూడా పెరగాల్సి ఉంటుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం కోసం తమను ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని బట్టి మన స్టార్‌ హీరోలు సినిమా పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్భుతమైన ఫిజిక్‌ కలిగిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.  చిరంజీవి (Chiranjeevi) ఇంద్ర సినిమా ముందు వరకూ టాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్‌ కలిగిన హీరో అంటే ముందుగా మెగాస్టార్‌ చిరంజీవినే గుర్తుకు వచ్చాయి. శంకర్‌దాదా జిందాబాద్‌ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన చిరు బాడీని కాస్త అశ్రద్ధ చేశారు. తిరిగి సినిమాల్లోకి కమ్‌బ్యాక్‌ ఇచ్చిన చిరు.. ఆరు పదుల వయసులోనూ ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల ‘విశ్వంభర’ సినిమా కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపించారు. https://twitter.com/i/status/1752914245170364419 ప్రభాస్‌ (Prabhas) టాలీవుడ్‌లో మెస్మరైజింగ్‌ బాడీ అనగానే ముందుగా పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. తొలి చిత్రం ఈశ్వర్‌ నుంచి ఫిట్‌గానే ఉన్న ప్రభాస్‌.. బుజ్జిగాడు సినిమా కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్‌ చేశాడు. ఆ తర్వాత బాహుబలి కోసం మరింత బరువు పెరిగి కండలు తిరిగిన యోధుడిలా ప్రభాస్‌ మారాడు. రీసెంట్‌గా ‘సలార్‌’లోనూ ప్రభాస్‌ పలకలు తిరిగిన బాడీతో కనిపించాడు.  రానా (Rana) ప్రభాస్‌ తర్వాత ఆ స్థాయిలో గంభీరమైన దేహాన్ని కలిగిన హీరో రానా. తొలి సినిమా ‘లీడర్‌’లో బక్కపలచని బాడీతో కనిపించిన రానా.. ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెందాడు. ‘కృష్ణం వందే జగద్గురం’లో కడలు తిరిగిన బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి చిత్రం కోసం మరింత బరువు పెరిగి.. ప్రభాస్‌ను ఢీకొట్ట సమవుజ్జీలా మారాడు.  సుధీర్‌ బాబు (Sudheer Babu) శివ మనసు శృతి (SMS) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సుధీర్‌ బాబు.. తన బాడీతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు. బేసిక్‌గా జిమ్మాస్టర్‌ అయిన ఈ హీరో.. ప్రతీ సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ బాడీని మెయిన్‌టైన్‌ చేస్తూ మెప్పిస్తున్నాడు.  రామ్‌ చరణ్‌ (Ram Charan) మెగాస్టార్‌ వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్‌. తొలి సినిమాలో ఫిట్‌గా కనిపించిన చరణ్‌.. ‘మగధీర’కు వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా కండలతో మెరిశాడు. ఇక ధ్రువ సినిమాలో ఏకంగా సిక్స్‌ ప్యాక్‌తో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్ఆర్‌’లోనూ దృఢమైన బ్రిటిష్ పోలీసు అధికారిగా కనిపించి మెప్పించాడు.  అల్లు అర్జున్‌ (Allu Arjun) గంగోత్రి సినిమాతో లేలేత వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుఅర్జున్‌.. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. దేశముదురు చిత్రంతో తొలిసారి సిక్స్‌ ప్యాక్‌లో కనిపించిన బన్నీ.. తన ఫిట్‌నెస్‌ను ప్రతీ సినిమాలోనూ కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్‌ పుష్పలో తన పాత్ర కోసం బరువు పెరిగి కనిపించాడు.  జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) టాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌ బాడీని కలిగి ఉన్న స్టార్‌ హీరోల్లో తారక్‌ ఒకరు. కెరీర్‌ తొలినాళ్లలో చాలా బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్‌.. ‘యమదొంగ’ సినిమాతో సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లావైన తారక్.. ‘టెంపర్‌’లో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ దృఢమైన బాడీతో మెప్పించాడు.  రామ్ పోతినేని (Ram Pothineni) లవర్ బాయ్‌లాగా క్యూట్‌గా కనిపించే రామ్‌.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్‌.. డబుల్‌ ఇస్మార్ట్‌ కోసం మళ్లీ సిక్స్‌ ప్యాక్‌ చేసినట్లు తెలుస్తోంది.  నాగ శౌర్య (Naga Shourya) యంగ్‌ హీరో నాగ శౌర్య.. కెరీర్‌ ప్రారంభంలో డెసెంట్‌ సినిమాలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించాడు. ఇటీవల ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ చేసి మాస్‌ హీరోగా రూపాంతరం చెందాడు.  విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) మంచి హైట్‌, ఫిజిక్‌ కలిగిన విజయ్‌ దేవరకొండ.. ఇటీవల వచ్చిన ‘లైగర్‌’ సినిమాలో మెస్మరైజింగ్‌ బాడీతో అదరగొట్టాడు. బాక్సింగ్‌ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాత్రకు తగ్గట్టు విజయ్‌ తనను తాను మార్చుకున్నాడు.  అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సీనియర్‌ నటుల్లో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఒకటే బాడీని మెయిన్‌టెన్‌ చేస్తున్న నాగార్జున.. ‘ఢమరుకం’ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు.  సునీల్‌ (Sunil) టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని బాడీ ట్రాన్సఫర్‌మేషన్ ఏదైనా ఉందంటే అది కమెడియన్ సునీల్‌ (Sunil)ది మాత్రమే. హాస్య పాత్రలు పోషించి రోజుల్లో చాలా లావుగా కనిపించిన సునీల్‌.. హీరోగా మారాక సిక్స్‌ ప్యాక్‌ చేశాడు. పూలరంగడు సినిమాలో ఆరు పలకల బాడీతో కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశాడు. 
    ఫిబ్రవరి 23 , 2024
    Virat Kohli Biopic: విరాట్‌ కోహ్లీగా రామ్‌చరణ్ సెట్ అవుతాడా? సినిమా స్టోరీ, క్లైమాక్స్‌, డైరెక్టర్ల‌పై నెట్టింట్లో రచ్చ..
    Virat Kohli Biopic: విరాట్‌ కోహ్లీగా రామ్‌చరణ్ సెట్ అవుతాడా? సినిమా స్టోరీ, క్లైమాక్స్‌, డైరెక్టర్ల‌పై నెట్టింట్లో రచ్చ..
    రామ్‌చరణ్.. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడు. సినిమా సినిమాకు తనలోని నటుడుని మెరుగు పరుచుకుంటూ స్థాయిని పెంచుకుంటున్న హీరో. RRR తర్వాత చరణ్ మేనియా మరింత పెరిగింది. దీంతో చెర్రీ అప్‌కమింగ్ ప్రాజెక్టులపై ఫ్యాన్స్‌కి ఎనలేని ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలో రామ్‌చరణ్ చెప్పిన చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి.  అవకాశం వస్తే రన్ మెషిన్ Virat Kohli Biopicలో నటిస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు చరణ్. ఎప్పటి నుంచో క్రీడా నేపథ్యం కలిగిన సినిమా చేయాలని భావిస్తున్నట్లు మనసులో మాటను బయటపెట్టాడు. ఈక్రమంలో విరాట్ కోహ్లీ బయోపిక్ మూవీ స్టోరీ ఇలా ఉంటే బాగుంటుంది అని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఫస్టాఫ్‌లో కథ ఇలా.. విరాట్ కోహ్లీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను సినిమాలో చూపించొచ్చు. అండర్19 వరల్డ్‌కప్ ఛాంపియన్, జాతీయ జట్టుకు ఎంపిక, 2011 వన్డే వరల్డ్‌కప్, కెప్టెన్సీ బాధ్యతలు, రికార్డులు, ఫామ్ లేమి, కమ్‌బ్యాక్ వంటి దశలను ఫస్టాప్‌లో చపిస్తే బాగుంటుంది. అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకోవడం అతడి జీవితంలో కీలక ఘట్టం. దీంతో సినిమాలో లవ్ ట్రాక్‌కి రూట్ క్లియర్ అయినట్లే. విరాట్ కోహ్లీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. కెరీర్‌లో వివిధ స్థాయుల్లో కొనసాగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ మనోగతం ఏంటో సినిమా ద్వారా చూపించొచ్చు.  క్లైమాక్స్ ఇలా ఉంటే సూపర్బ్ భారత్‌కు కోహ్లీ ఎన్నో విజయాలు అందించాడు. జట్టును అత్యుత్తమంగా నడిపించాడు. కానీ, చిరస్థాయిలో నిలిచిపోయే ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోలేక పోయాడు. వన్డే, టీ20 వరల్డ్‌కప్, టెస్టు ఛాంపియన్‌షిప్.. ఇలా కీలక ట్రోఫీలన్నీ నోటిదాకా అంది చేజారిపోయినవే. ఇలాంటివి సినిమాలో మంచి ఎమోషన్స్‌ను పండిస్తాయి. టీమిండియా 2023 వన్డే ప్రపంచకప్ గెలిస్తే విరాట్ బయోపిక్‌కి స్టోరీ లైన్ దొరుకుతుంది. అప్పుడు సినిమాకు మంచి క్లైమాక్స్ పాయింట్ దొరుకుతుంది.  బహుశా విరాట్ కోహ్లీ ఆడబోయే చివరి వన్డే వరల్డ్‌కప్ కూడా ఇదే అయ్యుంటుంది. మళ్ళీ వరల్డ్‌కప్ 2027లో జరుగుతుంది. అప్పటికి కోహ్లీ వయసు 38కి చేరుకుంటుంది. కాబట్టి ఈ వరల్డ్‌కప్ కోహ్లీకి గొప్ప జ్ఞాపకంగా మిగిలే ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా బయోపిక్ కోసం ఈ వరల్డ్‌కప్‌ విజయాన్నే స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా.. విరాట్ కోహ్లీని టీమిండియా కెప్టెన్సీ నుంచి తొలగించిన ఘటనను ఇంటర్వేల్ బ్యాంగ్‌గా ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ తర్వాత వరుస సెంచరీలతో కోహ్లీ కమ్ బ్యాక్‌ ఇచ్చిన తీరును సెకండాఫ్‌లో హైలెట్ చేస్తే బాగుంటుంది. వివాదాలపై క్లారిటీ.. విరాట్ ఓ పోరాటయోధుడు. కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగాడు.  అతనిపై కెప్టెన్సీ వివాదం తీవ్ర ప్రభావం చూపించింది. భారత జట్టుకు నాయకత్వ బాధ్యతల నుంచి తనను అర్ధంతరంగా తప్పించారని విరాట్ ఆరోపించాడు. అయితే, ఇది వాస్తవం కాదని అప్పటి బీసీసీఐ ప్రతినిధులు వెల్లడించారు. దీంతో ఇలాంటి వివాదాలపై సినిమాలో ఓ క్లారిటీ ఇస్తే అది ఫలప్రదంగా ఉంటుందని విరాట్ ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.  రామ్ చరణ్- కోహ్లీ పోలికలు రామ్‌చరణ్, విరాట్ కోహ్లీ ముఖ కవలికలు ఒకే విధంగా ఉంటాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ మేరకు విరాట్, చెర్రీల ఫొటోలను పక్కపక్కన పెట్టి పోల్చుతున్నారు. విరాట్‌ బయోపిక్‌ని చేయడానికి చరణ్ సరిగ్గా నప్పుతాడని అంటున్నారు.  https://twitter.com/Thyview/status/1636936587237003264?s=20 చరణ్‌లోనూ క్రికెటర్.. రామ్‌చరణ్‌లోనూ ఓ క్రికెటర్ ఉన్నాడు. సెలబ్రిటీల కోసం జరుపుతున్న ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌’లోనూ చరణ్ పాల్గొన్నాడు. తెలుగు వారియర్స్ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్ ఆడటం చరణ్‌కి అలవాటే కాబట్టి విరాట్ స్టైల్‌లో షాట్లు ఆడగలడని చెబుతున్నారు.  https://twitter.com/AlwysVenuCharan/status/1337393959786532867?s=20 ఫిట్‌నెస్..  విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటాడు. రామ్‌చరణ్‌కూ ఫిట్‌నెస్ మెరుగ్గా ఉంటుంది. క్రికెట్ ఆడాలన్నా, ఆడుతున్నట్లు నటించాలన్నా ఫిట్‌నెస్ అవసరం. కొన్ని షాట్లు ఎక్కువ టేక్‌లు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలోనూ చరణ్ మనుగడ సాగించగలడు.  https://twitter.com/BingedHelps/status/1636943158197252097?s=20 ఈ డైరెక్టర్లు కావాలంట.. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును టేకప్ చేయడం కూడా డైరెక్టర్లకు ఒక సవాళే. కాబట్టి, ఫ్యాన్స్ కొందరి డైరెక్టర్ల పేర్లు సూచిస్తున్నారు. ‘జెర్సీ’ సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి పేరు ముందుగా వినిపిస్తోంది. ఎం.ఎస్ ధోనీ సినిమా తీసిన ‘నీరజ్ పాండే’కు అనుభవం కలిసొస్తుంది. ఇక విలక్షణ దర్శకుడు సుకుమార్ ఈ ప్రాజెక్టును మరో స్థాయికి తీసుకెళ్తాడని భావిస్తున్నారు. హీరోయిజంను పండించే సందీప్ రెడ్డి వంగా, పూరీ జగన్నాథ్; కొరటాల శివ, గౌతమ్ మీనన్, ప్రశాంత్ నీల్, హను రాఘవపూడి పేర్లను సూచిస్తున్నారు.   హీరోయిన్‌లు.. విరాట్ బయోపిక్‌లో హీరోయిన్‌గా పూర్తిగా న్యాయం చేయగలిగే నటి అనుష్క శర్మనే. విరాట్ రియల్ లైఫ్ పార్ట్‌నర్ కావడం ఈమెకు ప్లస్ పాయింట్. పైగా తన అనుభవం కూడా సినిమాకు పనికొస్తుంది. కృతిసనన్, శ్రద్ధా కపూర్, లవ్‌టుడే నటి ఇవానా, కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్ ఈ పాత్రలకు సెట్ కాగలరని ఊహిస్తున్నారు. 
    మార్చి 18 , 2023
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.  ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో  ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు  ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్  ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి  శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్  నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక  కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి  మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ  ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్  పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ  సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:  హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.  సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి  జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా  బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం  దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-  యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.  ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-  జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు  రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.  ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.  మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో  ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి  దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,  కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి  రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.  ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్  ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్  ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా  దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.  మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.  ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    Celebrities Popular with Their Debut : సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు వీరే!
    Celebrities Popular with Their Debut : సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు వీరే!
    కళామ్మతల్లిని నమ్ముకొని తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు స్టార్లుగా ఎదిగారు. కెరీర్‌ తొలినాళ్లలో అవకాశాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డ కొందరు నటీనటులు.. తొలి సినిమాతో తమను తాము నిరూపించుకున్నారు. అందులోని పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తమ తొలి చిత్రం ద్వారా వచ్చిన ఫేమ్‌ను తర్వాత కూడా కొనసాగించేందుకు మెుదటి సినిమా టైటిల్‌ను కొందరు తమ పేరుకు జత చేసుకున్నారు. ఇంకొందరు తమ పాత్రల పేరును తమ ఇండస్ట్రీ నేమ్‌గా మార్చుకున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు? వారి చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  బట్టల సత్తి (Battala Satti) టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో మల్లికార్జునరావు అలియాస్‌ బట్టల సత్తి ఒకరు. 1972లో 'తులసి' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన.. అందులో ఓ చిన్న వేషం వేశారు. ఆ తర్వాత 'మంచు పల్లకి', 'అన్వేషణ'లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఇక రాజేంద్ర ప్రసాద్‌ హీరోగా చేసిన 'లేడీస్‌ ట్రైలర్‌' సినిమా.. మల్లిఖార్జున రావు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో 'బట్టల సత్తి' పాత్రలో ఆయన అదరగొట్టాడు. అప్పటి నుంచి ఆయనకు ‘బట్టల సత్తి’ అనే పేరు ఇండస్ట్రీలో మారుపేరుగా మారిపోయింది.  శుభలేఖ సుధాకర్‌ (Subhalekha Sudhakar) విలక్షణ నటుడు శుభలేఖ సుధారక్‌ అసలు పేరు.. సూరావఝుల సుధాకర్. ఆయన తొలి చిత్రం శుభలేఖ (1982) కావడంతో ఇండస్ట్రీలో ఆయనకు శుభలేక సుధాకర్‌ అన్న పేరు పడిపోయింది. సూరావఝుల అనే ఇంటి పేరు మరుగున పడి దాని స్థానంలో శుభలేక వచ్చి చేరింది. సుధాకర్.. దిగ్గజ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజను పెళ్ళి చేసుకున్నారు. రామిరెడ్డి (Spot Nana Rami Reddy) కొందరు నటులు.. తమ తొలి చిత్రాలతో ఫేమస్‌ అయితే నటుడు రామిరెడ్డి మాత్రం ఓ డైలాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. రాజశేఖర్‌ హీరోగా చేసిన ‌’అంకుశం’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. అందులో ‘స్పాట్‌ పెడతా’ అనే డైలాగ్‌ పదే పదే చెప్పి ఫేమస్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత నుంచి తోటి నటులు ‘స్పాట్‌ పెట్టావా’ అంటూ రామిరెడ్డిని ఆటపట్టించే వారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.  సుత్తి వీరభద్రరావు  (Sutti Veerabhadra Rao) సుత్తి వీరభద్రరావు అసలు పేరు.. మామిడిపల్లి వీరభద్ర రావు. జంధ్యాల దర్శకత్వములో వచ్చిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డారు. ముఖ్యంగా ఆ సినిమాలో ‘సుత్తి’ అనే పాత్రధారితో అధిక సన్నివేశాల్లో నటించడం.. వీరి కాంబోలో పుట్టిన హాస్యం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడంతో ఆయన పేరుకు ముందు ‘సుత్తి’ యాడ్‌ అయ్యింది.  https://twitter.com/i/status/1674734022793244672 సుత్తివేలు (Suthivelu) అలనాటి హాస్య నటుల్లో సుత్తివేలు ఒకరు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. చిన్నతనంలో చాలా సన్నగా ఉండటంతో బంధువులు వేలు అని పిలిచేవారు. 'నాలుగు స్తంభాలాట' సినిమాలో ‘సుత్తి’ అనే పాత్ర పోషించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. అప్పటి నుంచి ఆయన పేరు 'సుత్తివేలు'గా మారిపోయింది.  షావుకారు జానకి (Shavukaru janaki) షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు ఉన్నాయి. మొట్ట మొదటి చిత్రం ‘షావుకారు’ ఈమె ఇంటి పేరుగా మారిపోయింది. ‘షావుకారు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘మంచి మనసులు’, ‘రోజులు మారాయి’ వంటి చిత్రాలు తెలుగులో ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.  సాక్షి రంగారావు (Sakshi Ranga rao) ఈ దిగ్గజ నటుడు అసలు పేరు రంగవఝుల రంగారావు. 1967లో బాపూ-రమణల దర్శకత్వంలో వచ్చిన  'సాక్షి' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి మెుదటి చిత్రం పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. సాక్షి రంగారావు.. దాదాపు  800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ దర్శకత్వంలో వచ్చి సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు.  అల్లరి నరేష్‌ (Allari Naresh) ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నరేష్‌.. తొలి చిత్రం ‘అల్లరి’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తీసుకొచ్చిన ఫేమ్‌తో నరేష్‌ కాస్త అల్లరి నరేష్‌గా మారాడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు నటనకు స్కోప్‌ ఉన్న విలక్షణ పాత్రల్లో నటిస్తూ ఈ తరం ‘రాజేంద్ర ప్రసాద్‌’గా నరేష్‌ గుర్తింపు పొందాడు.  వందేమాతరం శ్రీనివాస్‌ (Vandemataram Srinivas) టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్ ‘వందేమాతరం శ్రీనివాస్‌’ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును మార్చుకున్నారు. ఇతని అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాలో 'వందేమాతర గీతం వరసమారుతున్నది' పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాట సూపర్‌ హిట్‌ కావడంతో ఆయన పేరుకు ముందు వందేమాతరం వచ్చి చేరింది.  సిరి వెన్నెల సీతారామ శాస్త్రి (Sri Vennela Sirivennela Sitaramasastri) టాలీవుడ్‌ సుప్రసిద్ధ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరుంది. ఆయన ‘సిరివెన్నెల’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలోని అన్ని పాటలను సీతారామశాస్త్రినే రాయడం విశేషం. అప్పట్లో ‘సిరివెన్నెల’ సినిమా పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీతారామశాస్త్రి లిరిక్స్‌కు చాలా మంది మైమరిపోయారు. అప్పటి నుంచి ఆయన్ను సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఇండస్ట్రీలో పిలుస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ 2021 నవంబరు 30న ఆయన మరణించారు. మహర్షి రాఘవ (Maharshi Raghava) వంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి' అనే సినిమాలో నటుడు రాఘవ కథానాయకుడిగా చేశారు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నారు. రాఘవ ఇప్పటివరకూ 170కి పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.  దిల్‌ రాజు (Dil Raju) ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ నిర్మాతగా దిల్‌రాజు కొనసాగుతున్నారు. ఈయన అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. కెరీర్‌ తొలినాళ్లలో డిస్టిబ్యూటర్‌గా వ్యవహరించిన ఆయన 2003లో వచ్చిన 'దిల్‌' సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్‌ రాజుగా కొనసాగుతూ వస్తున్నారు.  వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) నటుడు వెన్నెల కిషోర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ కమెడియన్‌గా చెలామణి అవుతున్నాడు. ఇండస్ట్రీలోకి రాకముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసిన కిషోర్‌.. ‘వెన్నెల’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మూవీ టైటిల్‌నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వెన్నెల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల 1 1/2' చిత్రం డిజాస్టర్‌గా నిలవడం గమనార్హం.  సత్యం రాజేష్‌ (Satyam Rajesh) నటుడు సత్యం రాజేష్‌ అసలు పేరు.. రాజేష్‌ బాబు. సుమంత్ (Sumanth) నటించిన ‘సత్యం’ సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. ఒక దశాబ్దం పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేష్‌.. ‘క్షణం’ సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రలో నటించాడు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘నాయకి’ సినిమాలో హీరోగా చేసి ఆశ్చర్యపరిచాడు. రీసెంట్‌గా పొలిమేర, పొలిమేర 2 చిత్రాల్లో లీడ్‌ పాత్రల్లో కనిపించి సాలిడ్‌ విజయాలను అందుకున్నాడు. చిత్రం శ్రీను (Chithram Srinu) చిత్రం శ్రీను అసలు పేరు మరోటి ఉంది. ఇండస్ట్రీలోకి రాకముందు వరకూ అతడ్ని బంధువులు శ్రీనివాసులు అని పిలిచేవారు. 'చిత్రం' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూవీ టైటిల్‌ను తన పేరు ముందు జత చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీలోని వారంతా అతడ్ని చిత్రం శ్రీను అని పిలవడం మెుదలుపెట్టారు. ఇతను దాదాపు 260 సినిమాల్లో నటించాడు. ‘చిత్రం’, ‘ఆనందం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’, ‘బొమ్మరిల్లు’, ‘మంత్ర’, ‘100% లవ్’ సినిమాలు అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu bhaskar) డైరెక్టర్ భాస్కర్‌.. తన తొలి చిత్రం ‘బొమ్మరిల్లు’తో సూపర్‌ డూపర్‌ విజయాన్ని అందుకున్నాడు. ఈ సక్సెస్‌తో ‘బొమ్మరిల్లు’ తన పేరుకు ముందు జత చేసుకున్నాడు. ఆయన తర్వాతి చిత్రం ‘పరుగు’ తెలుగులో బ్లాక్ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ‘ఆరెంజ్‌’తో హ్యాట్రిక్‌ కొట్టాలని భావించగా అతడికి తీవ్ర నిరాశే ఎదురైంది. రామ్‌చరణ్‌ హీరోగా రూపొందిన ‘ఆరెంజ్‌’ చిత్రానికి హారిస్‌ జయరాజ్ సంగీతం అందించగా.. మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. ఆహుతి ప్రసాద్‌ (Ahuti Prasad) నటుడు ఆహుతి ప్రసాద్‌ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. ఆయన తొలి చిత్రం  ఆహుతి (1987) ఘన విజయం సాధించింది. ఇందులో ఆయన పోషించిన శంభు ప్రసాద్‌ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. దీంతో అప్పటి నుంచి ఆయన ఆహుతి ప్రసాద్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటివరకూ 136 చిత్రాల్లో నటించారు. క్యాన్సర్‌ బారిన పడి  జనవరి 4, 2015న ఆయన మృతి చెందారు.   జేడీ చక్రవర్తి (JD Chakravarthy) హైదరాబాద్‌లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జేడీ చక్రవర్తికి తల్లిదండ్రులు పెట్టిన పేరు  నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' సినిమాతో చక్రవర్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అందులో జేడీ అనే ప్రతినాయక విద్యార్థి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఆ పాత్ర పేరుతో జేడీ చక్రవర్తిగా మారిపోయాడు.  బొమ్మాళి రవి శంకర్‌ (Bommali Ravi Shankar) తెలుగులోని సుప్రసిద్ధ డబ్బింగ్‌ ఆర్టిస్టుల్లో బొమ్మాళి రవిశంకర్‌ ఒకరు. ప్రముఖ నటుడు సాయి కుమార్‌కు స్వయాన సోదరుడైన ఆయన.. ప్రేమకథ (1999) సినిమాతో డబ్బింగ్‌ ఆర్టిస్టుగా మారారు. 2008లో వచ్చిన 'అరుంధతి'  చిత్రం రవిశంకర్‌కు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో సోన్‌సూద్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన రవిశంకర్‌.. అమ్మ బొమ్మాళి అంటూ చెప్పే డైలాగ్‌ అప్పట్లో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. అప్పటి నుంచి పి. రవిశంకర్‌ కాస్త.. బొమ్మాళి రవిశంకర్‌గా మారిపోయారు.  https://twitter.com/ramanuja2797/status/1393914318530351116 దేవి శ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) టాలీవుడ్‌ రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌.. తనదైన మ్యూజిక్‌తో యావరేజ్‌ సినిమాలను సైతం సూపర్‌హిట్స్‌గా మారుస్తుంటాడు. 1999లో వచ్చిన ‘దేవి’ సినిమాతో అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అందులోని అన్ని పాటలు సూపర్‌హిట్‌గా నిలవడంతో ఈ రాక్‌స్టార్‌కు గ్రాండ్ ఎంట్రీ లభించినట్లైంది. దీంతో తొలి సినిమా టైటిల్‌ను దేవి శ్రీ ప్రసాద్‌ తన పేరులో కలుపుకున్నాడు. బాహుబలి ప్రభాకర్‌ (Bahubali Prabhakar) ‘రైట్‌ రైట్‌’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు ప్రభాకర్‌.. ‘మర్యాద రామన్న’ సినిమాతో చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబలి’లో కాలకేయుడి పాత్రలో కనిపించి ప్రభాకర్‌ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన అద్భత నటనతో వీక్షకులను కట్టిపడేశాడు. ఈ సినిమా తర్వాత నుంచి అతడు బాహుబలి ప్రభాకర్‌గా అందరి దృష్టిలో పడ్డాడు.  ప్రభాస్‌ శ్రీను (Prabhas Srinu) పైనున్న నటులకు సినిమాలు, పాత్రలను బట్టి పేరులో మార్పు వస్తే.. ఈ నటుడికి మాత్రం స్నేహం వల్ల పేరులో మార్పు వచ్చింది. రెబల్ స్టార్‌ ప్రభాస్‌కు శ్రీనుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో తన మిత్రుడి పేరును తన పేరుకు మందు తగిలించుకొని ప్రభాస్‌ శ్రీనుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. 2012లో ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రానికి గాను ప్రభాస్‌ శ్రీను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు. 
    మార్చి 07 , 2024
    Tollywood Cult  Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే! 
    Tollywood Cult  Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే! 
    ఒకప్పుడు టాలీవుడ్‌ అంటే దేశంలోని సినీ ఇండస్ట్రీలలో ఒకటిగా ఉండేది. తెలుగు సినిమాలంటే నార్త్‌ ఇండియన్స్‌ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. మన డైరెక్టర్లు కూడా కేవలం సరిహద్దులు గీసుకొని కేవలం తెలుగు ఆడియన్స్‌ కోసమే సినిమా రిలీజ్‌ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జాతీయ అవార్డు ఫంక్షన్లకు ఆహ్వానం లభించని స్టేజీ నుంచి ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొనే స్థాయికి మన డైరెక్టర్లు ఎదిగారు. అంతర్జాతీయ బహుమతులను దేశానికి అందిస్తూ ప్రతీ ఒక్కరినీ గర్వపడేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే 1990 నుంచి ఇవాళ్టి దసరా వరకూ ఎన్నో కల్ట్‌ సినిమాలు టాలీవుడ్‌ గతిని మార్చాయి. తెలుగు ఇండస్ట్రీని రేంజ్‌ను ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నాయి. కల్ట్ మూవీ అంటే? కల్ట్ మూవీకి పర్యాయ పదంగా ట్రెండ్ సెట్టర్ సినిమా అని కూడా సినీ విశ్లేషకులు పిలుస్తారు. విభిన్న కథాంశం. విడుదలయ్యాక ఆ మూవీ పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ సంపాదించడం, ఆ చిత్రం పంథాను కొన్నేళ్లపాటు మరికొన్ని సినిమాలు అనుసరించి రావడం, ఆ సినిమా డైలాగ్స్.. ఇప్పటికీ జనాల నాలుకలపై నానడం వంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలాగే బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున కలెక్షన్ల వర్షం కురిపించే సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. 90వ దశకం నుంచి యాక్షన్ కల్ట్ మూవీలు శివ(1989) ఎలాంటి అంచనాలు లేకుండా 1989లో రిలీజైన 'శివ' మూవీ ఇండస్ట్రీ కల్ట్ గా నిలిచింది. అప్పటి వరకు సామాజిక ఆర్థిక అంశాలే ప్రధానం రూపొందిన చిత్రాల పంథాను ఒక్కసారిగా మార్చింది. పక్క యాక్షన్ మూవీగా తెరకెక్కిన శివ నాగార్జునకు స్టార్ డామ్ తెచ్చిపెట్టింది. ఆయన కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసింది. నాగార్జున పట్ల యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సైకిల్ చైన్ లాగే మెనరిజాన్ని అప్పట్లో యూత్ పిచ్చిగా ఫాలో అయ్యేవారు. ఈ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మతో మూవీలు చేసేందుకు స్టార్ హీరోలు క్యూ కట్టారు. అంతే కాదు శివ యాక్షన్ సిక్వెన్స్‌ను అనుసరిస్తూ చాలా చిత్రాలు వచ్చాయి. గాయం(1993) 1993లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లోనే  వచ్చిన 'గాయం' సైతం మంచి యాక్షన్ కల్ట్‌ గా నిలిచింది. ఈ మూవీని యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పెరొందిన జగపతి బాబు ఈ సినిమాతో ఒక్కసారిగా మాస్ లుక్ లోకి మారిపోయారు. దుర్గ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. జగపతి బాబు సరసన రేవతి, కోటా శ్రీనివాస్ రావు, సిరివెన్నెల సితారామశాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలోని 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని' అనే పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిందే. భారతీయుడు(1996) శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన భారతీయుడు ఆల్ టైమ్ యాక్షన్ కల్ట్ చిత్రంగా పేరొందింది. రొటీన్ మూవీలకు భిన్నంగా అవినీతికి వ్యతిరేకంగా సరికొత్త కథాంశంతో శంకర్ తెరకెక్కించాడు. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ అద్భుతంగా నటించాడు. ఈ మూవీ తర్వాత ఇదే తరహా కథాంశాలతో వచ్చిన రమణ, ఠాగూర్, మల్లన్న చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్‌లో మెప్పించాడు. మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించాడు. సమరసింహా రెడ్డి(1999) నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 'సమరసింహా రెడ్డి(1999), నరసింహా నాయుడు(2001) యాక్షన్ ఎంటర్ టైన్మెంట్‌కు కొత్త నిర్వచనం అందించాయి. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ చిత్రాల్ని డెరెక్టర్ బీ గోపాల్ అద్భుతంగా తెరకెక్కించాడు. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్  బాగా పేలాయి. ఈ చిత్రాల్లో బాలయ్య డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించేలా చేసింది. ఈ రెండు సినిమాలను అనుకరిస్తూ వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. ఫాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఇంద్ర, ఆది, యజ్ఞం మూవీలు హిట్ కొట్టాయి. పోకిరి(2006) తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ కల్ట్ మూవీ పోకిరి(2006). అప్పటివరకు తెలుగు తెరకు పరిచయం లేని గ్యాంగ్ స్టర్ స్టోరీ లైన్ తో పూరి ముందుకొచ్చాడు. పోకిరి దెబ్బకు అన్ని రికార్డులు దాసోహం అయ్యాయి. హీరో మేనరిజం, డెలాగ్స్, చిత్రీకరణ విలువలు, మణిశర్మ మ్యూజిక్  ప్రతి ఒక్కటీ వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలు పోకిరి యాక్షన్ సిక్వెన్స్ ను ఫాలో అయ్యాయి.    మగధీర(2009) రాజమౌళి డైరెక్ట్ చేసిన మగధీర క్లాసిక్ కల్ట్ గా చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను మగధీర బ్రేక్ చేసింది. పూర్వ జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ చాల ఏళ్ల తర్వాత మళ్లీ పౌరాణిక వాసనను తెలుగు తెరకు గుర్తు చేసింది. కత్తులు, యుద్ధం వంటి యాక్షన్ డ్రామాతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మంచి బ్రెక్ ఇచ్చింది. నటించిన రెండో సినిమాతోనే చరణ్ కు స్టార్ హోదా దక్కింది. ఈ చిత్రం పోలికలతో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఆశించినంత విజయం సాధించలేదు.   అర్జున్ రెడ్డి(2017) కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి డెరెక్ట్ చేసిన 'అర్జున్ రెడ్డి(2017)' టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం పెద్దఎ త్తున ఫ్యాన్ బేస్ సంపాదించింది.  విజయ్ దేవరకొండ కేరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఊహించని సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాను హిందీ, తమిళ్ ఇండస్ట్రీల్లో రీమేక్ చేశారు. యూత్ లో ఫుల్ జోష్ ను నింపింది. అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్ ని రౌడీ బాయ్ అంటూ అభిమానులు పిలవడం మొదలు పెట్టారు. బాహుబలి-2(2017) రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కావ్యం 'బాహుబలి-2(2017)' భారత చలనచిత్ర గతినే మార్చింది. అన్ని భాషలను ఏకం చేసి పాన్ ఇండియా ఇమేజ్ ను క్రియేట్ చేసింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. అప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల్లోనే సాధ్యమనుకునే  భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన దంగల్ రికార్డును బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులే కాదు సౌత్ సినిమాలను పెద్దగా ఆదరించని నార్త్ ఆడియన్స్ మనసులను సైతం కొల్లగొట్టింది. సౌత్, నార్త్ కాదు మన సినిమా ఇండియన్ సినిమా అనే స్థాయికి ఇండస్ట్రీ వర్గాలను తీసుకొచ్చింది. ఈ మూవీ తర్వాత పలువురు బాలీవుడ్ డైరెక్టర్లు పాన్ ఇండియా మూవీలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రంగస్థలం (2018) ఒకేరకమైన కథలతో వెళ్తున్న టాలీవుడ్‌కు రంగస్థలం సినిమా కొత్త మార్గాన్ని చూపించింది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా పక్కా పల్లెటూరు కథతోనూ హిట్‌ కొట్టొచ్చని డైరెక్టర్ సుకుమార్‌ ఈ తరం దర్శకులకు చూపించారు. ఇందులో రామ్‌ చరణ్, సమంత నటన మూవీకే హైలెట్‌ అని చెప్పాలి. రామ్‌చరణ్‌లోని కొత్త నటుడ్ని ఈ సినిమా ఆవిష్కరించింది. ఈ సినిమా స్ఫూర్తితో ప్రస్తుతం చాలా మంది దర్శకులు పల్లెటూరి కథలో దృష్టిసారిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో షేక్‌ చేస్తున్న దసరా, బలగం సినిమాలకు ఈ సినిమానే స్ఫూర్తి అని చెప్పొచ్చు.  పుష్ప(2022) పాన్ ఇండియా మూవీగా వచ్చిన 'పుష్ప' భారీ విజయాన్ని సాధించింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ  అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గేస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా డైలాగులను రాజకీయ నాయకులు మొదలు క్రికెటర్లు, WWE స్టార్ల వరకు వల్లవేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అయితే.. రాజకీయ నాయకులు 'తగ్గేదేలే'.. 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చే వరకు వెళ్లింది. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేశాడు. టాలీవుడ్‌ శక్తి సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌ అవార్డును సాధించింది. తద్వారా భారతీయుల హృదయాలను ఉప్పొంగేలా చేసింది. ఒకప్పుడు జాతీయ అవార్డులు రావడమే గగనంగా ఉన్న పరిస్థితి నుంచి తెలుగు సినిమా ఆస్కార్‌ స్థాయికి ఎదిగింది. కథానాయకులు రామ్‌చరణ్‌, ఎన్‌టీఆర్‌లు కూడా RRRలో ఎంతో అద్భుతంగా నటించారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.  బలగం (2023) సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయిన ఘనవిజయం సాధిస్తుందని బలగం సినిమా నిరూపించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ప్రభంజనే సృష్టించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రేమానురాగాలను డైరెక్టర్‌ వేణు చక్కగా చూపించాడు. పక్కా పల్లెటూరు నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.  దసరా (2023) టాలీవుడ్‌ రేంజ్‌ను దసరా చిత్రం మరింత పెంచింది. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తన తొలి సినిమాతోనే రూ.100 కోట్ల మార్క్‌ అందుకున్నాడు. ఈ సినిమా కూడా పల్లెటూరు కథాంశంతో తెరకెక్కి పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందింది. ముఖ్యంగా హీరో నాని ఈ సినిమా తన నటా విశ్వరూపమే చూపించాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఊరమాస్‌గా ఇరగదీశాడు. హీరోయిన్‌ కీర్తి సురేష్‌ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. మహానటి తర్వాత కీర్తి అత్యుత్తమ నటనను ఈ సినిమాలో చూడొచ్చు.
    ఏప్రిల్ 12 , 2023
    SAMANTHA: సమంత కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ పడిందా? ఖుషీ సినిమానే చివరిదా?
    SAMANTHA: సమంత కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ పడిందా? ఖుషీ సినిమానే చివరిదా?
    సమంత…. నిన్న మెున్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్. కానీ, ప్రస్తుతం సీన్ మారిపోయింది. ఒకప్పుడు చేతినిండా ఆఫర్లతో బిజీగా గడిపిన సామ్‌కు… ఇప్పుడు తెలుగులో విజయ్ దేవరకొండ సినిమా మినహా మరొకటి లేదు. బాక్సాఫీస్‌ వద్ద ఆమె చిత్రాలు పెద్దగా ఆడకపోవటంతో పాటు అటు మయోసైటిస్ సమస్యలు కూడా వేధిస్తుండటంతో సామ్ కెరీర్‌ దాదాపు ముగిసిందనీ సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.  ఇండస్ట్రీలో ఇక కష్టమే సమంతకు గత కొన్నేళ్లుగా చెప్పుకోదగిన హిట్‌ పడటం లేదు. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు ఎంచుకున్నప్పటికీ ప్రేక్షకులు ఆదరించట్లేదు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన యశోద అంతంతమాత్రంగానే నడిచింది. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన శాకుంతలం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచిందనే చెప్పాలి. సినిమాకు పెద్దగా కలెక్షన్లు రావటం లేదు. ఓపెనింగ్స్‌ కూడా చాలా తక్కువ వచ్చాయని చెబుతున్నారు. అంటే సామ్ ఫ్యాన్‌ బేస్‌ కూడా చాలా తగ్గిపోయింది. దీంతో ఆమె కెరీర్‌కు దాదాపు ఎండ్‌ కార్డ్‌ పడిందని అంతా భావిస్తున్నారు. సామ్‌ ప్రాజెక్టులు సామ్ చేతిలో ప్రస్తుతం కేవలం రెండు సినిమాలే ఉన్నాయి. విజయ దేవరకొండ సరసన ఖుషీ అనే చిత్రంలో చేస్తోంది. లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో మజిలీ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో సిటాడెల్‌ రీమేక్ ప్రాజెక్టులోనూ నటిస్తోంది సామ్. ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈ రెండు మినహా ఆమె మరో చిత్రానికి కమిట్ అవ్వలేదు. దర్శకులెవ్వరూ చిత్రాలు చేయటానికి ఆసక్తి చూపడం లేదని టాక్ వినిపిస్తోంది.  మయోసైటిస్‌ సమస్యలు మయోసైటిస్ వ్యాధి సామ్‌ను తీవ్రంగా వేధిస్తోంది. యశోద సినిమా సమయంలో వ్యాధి సోకటంతో ఇబ్బంది పడుతుంది. సెలైన్ బాటిల్‌పైనే డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు కొద్దిగా కోలుకుని శాకుంతలం సినిమా చేసినప్పటికీ వివిధ సమస్యల కారణంగా ప్రచార కార్యక్రమాలు, షూటింగ్స్‌లో ఎక్కువగా పాల్గొనలేకపోయింది సమంత. కొన్ని సందర్భాల్లో ఈ సూచనలు స్పష్టంగా కనిపించాయి. మరి, ఇలాంటి సమయంలో నిర్మాతలు డబ్బులు పెట్టి షూటింగ్స్‌ ఆలస్యం చేసుకోవటం ఎందుకని భావిస్తున్నట్లు సమాచారం. అందం తగ్గిపోయిందా? సమంత లుక్‌ కూడా చాలా మారిపోయింది. ఒకప్పుడు ఉన్నంత అందంగా ఇప్పుడు ఆమె కనిపించట్లేదు. ఈ విషయం గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే జరిగింది. సామ్ అందం తగ్గిపోయిందని.. ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందని అందరూ అంటున్నారు. ఫ్యాన్స్‌ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ… చాలామంది విమర్శలు చేస్తున్నారు.  సమంత పనైపోయింది నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రేంజ్ పడిపోయిందని.. అందుకే వచ్చిన సినిమాలు చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆఫర్ల కోసం డ్రామాలు ఆడుతుందని ఓ అడుగు ముందుకేశారు. యశోద రిలీజ్‌ సమయంలో ఏడవటం.. శాకుంతలం అప్పుడు ఆరోగ్యం బాలేదని డ్రామాలు ఆడుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  ఏం మాయ చేశావే నాగ చైతన్య సరసన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది సమంత. జెస్సీగా అందరి మనసులు దోచి అభిమానులను సంపాదించింది. మెుదటి సినిమానే హిట్ కావటంతో పాటు అందం, అభినయం ఉండటంతో వరుస ఆఫర్లతో దూసుకుపోయింది ఈ హీరోయిన్. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేసి చేతి నిండా సినిమాలతో వెలుగు వెలిగింది.  ఫ్యాన్‌ బేస్‌ సమంత ఫ్యాన్ బేస్‌ కూడా చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు కేవలం ఆమె కోసం మాత్రమే సినిమాకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆమె నుంచి చిత్రం వస్తున్నా పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఒకప్పుడున్నంత ఫాలోయింగ్‌ సామ్‌కు ఇప్పుడు లేదనే చెప్పాలి. ఇన్ని ఒడుదొడుకుల నడుమ సమంత ఇండస్ట్రీలో ఎలా నెట్టుకు వస్తుందో చూడాలి. 
    ఏప్రిల్ 17 , 2023
    Shivarathri: శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు… సినిమా లింక్‌లు ఇవిగో..
    Shivarathri: శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు… సినిమా లింక్‌లు ఇవిగో..
    శివరాత్రికి ఉండే ప్రత్యేకతే వేరు. ఈ రోజున భక్తి పరవశులై హిందువులు ఆధ్యాత్మికతలో మునిగి తేలుతారు. నీలకంఠేశుడిపైనే మనసు, తనువు లగ్నం చేసి నిష్ఠతో గడుపుతారు. శివరాత్రి రోజున ఉపవాస నియమాన్ని పాటించేవారు జాగారం చేస్తుంటారు. ఈ పవిత్ర రాత్రి సమయంలో మెలుకువతో ఉండి జీవితంలోని చీకట్లను తొలగించుకోవాలని చెబుతుంటారు. శివరాత్రి రోజున జాగారం కీలక ఘట్టం. ఈ సమయాన్ని కొందరు భజనకు కేటాయిస్తే మరికొందరు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకొందరు సినిమాలు చూస్తుంటారు. ప్రస్తుతం డిజిటల్ యుగంగా మారినందున చాలామంది ఫోన్‌లోనే సినిమాలు చూసేస్తున్నారు. అయితే, శివరాత్రి రోజున ఆధ్యాత్మికకు సంబంధించిన సినిమాలను చూడాలని భావించే వారు వీటిని ట్రై చేయొచ్చు.  భూ కైలాస్ అలనాటి సినిమా అయినప్పటికీ నేటికీ కొత్త అనుభూతిని కలిగించే సినిమా ఇది. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా. రావణాసురుడి పాత్రలో ఎన్టీఆర్ నటించారు. శివరాత్రికి మీకు తప్పకుండా మంచి అనుభూతిని అందిస్తుంది.  https://www.youtube.com/watch?v=I4C9hhuwxfQ భక్త కన్నప్ప 1976లో వచ్చిన భక్తిరస చిత్రమే ‘భక్త కన్నప్ప’. శివుడి భక్తుడి పాత్రలో దివంగత కృష్ణం రాజు నటించారు. భక్త కన్నప్పగా  ఆ పాత్రకు జీవం పోశారు. ఇది కూడా శివరాత్రి రోజున చూడదగిన సినిమానే. https://www.youtube.com/watch?v=1_oYrqjgBEM మహా శివరాత్రి సాయికుమార్, రాజేంద్రప్రసాద్ కలిసి నటించిన సినిమా ఇది. మీనా ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. రేణుక శర్మ దర్శకత్వం వహించారు.  https://www.youtube.com/watch?v=ArgkDQzeHXk శ్రీ మంజునాథ శివరాత్రి సినిమాలనగానే వెంటనే ఈ సినిమా పేరే గుర్తొస్తుంది. అంతలా ఫేమస్ అయ్యింది ఈ సినిమా. నాస్తికుడు శివుడి భక్తుడిగా ఎలా మారాడో ఈ సినిమాలో చూపిస్తారు. భక్తుడిగా అర్జున్, శంకరుడిగా చిరంజీవి నటించారు. అర్జున్ సరసన సౌందర్య కీలక పాత్ర పోషించింది.  https://www.youtube.com/watch?v=6B_kgUvWGsQ జగద్గురు ఆదిశంకర ఆదిశంకరాచార్యుల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో సాగుతుందీ సినిమా. నాగార్జున, సాయికుమార్, మోహన్ బాబు, కమలిని ముఖర్జీ తదితరులు కీలక పాత్ర పోషించారు. శంకరచార్యులుగా కౌశిక్ బాబు నటించాడు. https://www.youtube.com/watch?v=y8bB-aaVZv4 ఈ సినిమాలను చూసి మీలోని ఆధ్యాత్మిక భావాన్ని మరింత రెట్టింపు చేసుకోండి. శివరాత్రి జాగారాన్ని ఫలప్రదం చేయండి. 
    మార్చి 08 , 2024
    ‘రావణాసుర’లో “దశకంఠా రావణా..” అన్న ‘శాంతి పీపుల్‌’(Shanti people)
    ‘రావణాసుర’లో “దశకంఠా రావణా..” అన్న ‘శాంతి పీపుల్‌’(Shanti people)
    ]“రావణాసురా దశకంఠా..” మీ మనసును ఆక్రమించేసిందా. అయితే శాంతి పీపుల్‌ చేసిన  ఈ పాటలు కూడా వినండి. మీకు తప్పక నచ్చుతాయిమహిశాసుర మర్ధినిWatch Nowకృష్ణాWatch Nowదేవా మహదేవాWatch Nowరాధా మధవWatch NowతాండవWatch Nowమురుగన్‌Watch Nowశివ శంభోWatch Nowఅయిగిరి నందినిWatch Now
    ఫిబ్రవరి 10 , 2023
     SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
     SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
    సూపర్ స్టార్ మహేష్‌తో చేయబోయే SSMB29 చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో నిర్మించేందుకు డైరెక్టర్‌ రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. కౌబాయ్‌ తరహాలో తెరకెక్కనున్న ఈ అడ్వెంజర్‌ మూవీ కోసం హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌ను కూడా తీసుకోబోతున్నట్లు తెలిసింంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల మహేష్‌బాబు నటించిన గుంటూరు కారం సినిమా మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ... కలెక్షన్ల పరంగా సేఫ్ జోన్‌లో పడింది. మహేష్‌బాబు స్టామినాకు తగ్గ హిట్ పడలేదన్నది నిజం. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమాపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.   గ్లోబల్ స్థాయి అయితే రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీస్ అయిన బాహుబలి, RRR ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెన్సేషన్ క్రియేట్ చేశాయి. జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్ గ్లోబర్ స్టార్లుగా ఎదిగిపోయారు. ప్రస్తుతం వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాజమౌళితో ఏ హీరో సినిమా తీసినా హిట్‌ అవడం ఖాయం. కానీ ఆ తర్వాత చేసే సినిమాలు ఇండస్ట్రీలో ఫ్లాప్‌గా నిలుస్తున్నాయి. మహేష్‌కు లాభమా నష్టమా? ఇప్పటివరకు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఇదే నియమం లెక్కతప్పకుండా కొనసాగుతుంది. ఆయనతో సినిమాలు చేసిన హీరోలు వరుసగా మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్స్‌గా మూటగట్టుకున్నారు. దీంతో SSMB 29 అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎటువంటి సినిమా చేస్తారు?  ఏ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తారు? సగటు సూపర్ స్టార్ అభిమానిని తొలచివేస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే రాజమౌళి సినిమాతో మహేష్ బాబుకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ లభిస్తుంది. మరి దానిని నిలబెట్టుకునేలా మహేష్ బాబు తన తదుపరి SSMB30 సినిమాను ఎలా ఎంచుకుంటాడు? అతని కెరీర్‌కు బిగ్‌ ఛాలెంజ్ అంటూ ఇండస్ట్రీ పెద్దలు విశ్లేషిస్తున్నారు. SSMB29 క్రియేట్ చేస్తున్న బజ్.. మహేష్ బాబుకు లాభంతో పాటు నష్టాన్ని కూడా తెచ్చిపెట్టనుందని ఊహిస్తున్నారు. గతంలో ఇదే విధంగా రాజమౌళితో ఇండస్ట్రీ హిట్లు అందుకున్న తెలుగు హీరోలు ఆ తర్వాత ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక వరుసగా పరాజయాలు పొందారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్స్ అందుకున్న హీరోల జాబితాను ఓసారి పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా 'స్టూడెంట్‌ నెం.1'ను జూ. ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన 'సుబ్బు' సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ తారక్‌తో "సింహాద్రి" సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన 'ఆంధ్రావాల' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు RRRలో తారక్ నటించి గ్లోబర్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.  ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ RRRకు ముందు రామ్‌చరణ్‌తో 'మగధీర' సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా తీస్తున్న రామ్‌చరణ్ ఎలాంటి ఫలితాన్ని పొందుతాడో వేచి చూడాల్సి ఉంది. ఇక రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన 'ఈగ' సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.  మహేష్ బాబు కూడా అదే పరిస్థితా? దీంతో మహేష్ బాబు కూడా SSMB29 తర్వాత ఇతర టాలీవుడ్ అగ్రహీరోల మాదిరి బోల్తా పడుతాడా లేక గత చరిత్రను తిరిగి రాస్తాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా అంది. అటు ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) కూడా నటిస్తారని తెలుస్తోంది. మలయాళం నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కూడా ఓ కీలకపాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఆ నటులతో రాజమౌళి బృందం చర్చలు జరుపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చర్చలు గాని ఫలిస్తే SSMB29 పై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అయితే దీనిపై రాజమౌళి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  వరల్డ్ వైడ్ బజ్ మరోవైపు మహేష్‌ బాబు.. రాజమౌళి సినిమా కోసం తన లుక్స్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన అన్న కొడుకు మ్యారెజ్ కార్డు ఇవ్వడానకి వెళ్లినప్పుడు.. మహేష్ బాబు పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్కువ జుట్టు, ఒత్తైన గడ్డంతో హాలీవుడ్ హీరోలా మహేష్ కనిపించాడు. అలాగే కొన్ని స్టంట్స్‌ నేర్చుకునేందుకు జర్మనీలో ఇటీవల మహేష్ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. అటు దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిఫ్ట్ కూడా ఫైనల్ చేసి రాజమౌళికి వినిపించినట్లు సమాచారం. ఏప్రిల్‌ నుంచి నటీనటుల ఎంపిక, సాంకేతిక బృందం వంటి అంశాలను చిత్ర యూనిట్ పరిశీలించనున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా వరల్డ్‌ వైడ్‌గా క్రియేట్ చేస్తున్న బజ్ అంతా ఇంతా కాదు.
    ఫిబ్రవరి 14 , 2024
    War 2: బాలీవుడ్‌ సినిమాలో ఎన్టీఆర్.. ఏడుస్తున్న తారక్ ఫ్యాన్స్‌.. దీనికి అసలు కారణం ఇదేనా?
    War 2: బాలీవుడ్‌ సినిమాలో ఎన్టీఆర్.. ఏడుస్తున్న తారక్ ఫ్యాన్స్‌.. దీనికి అసలు కారణం ఇదేనా?
    టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో జూ.ఎన్టీఆర్‌ ఒకడు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన RRR చిత్రంతో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటనకు దేశం నలుమూలల నుంచి ప్రశంసలు వచ్చాయి. హాలీవుడ్‌ తారలు సైతం ఎన్టీఆర్‌ నటనను మెచ్చుకున్నారు. గ్లోబర్‌ స్టార్‌గా ఎదిగిన తారక్‌తో సినిమాలు చేసేందుకు హాలీవుడ్‌ దర్శకులు సైతం ఆసక్తి బహిరంగంగానే తమ ఆసక్తిని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ వార్‌-2 చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌తో పాటు తారక్‌ స్క్రీన్‌ చేసుకోనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి జాతీయ మీడియా పలు కథనాలు రాసింది. అది చూసిన తారక్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ వార్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  తారక్‌.. తనని తాను తగ్గించుకుంటున్నాడా? ఎన్టీఆర్ - హృతిక్‌ రోషన్‌ కలిసి చేయనున్న వార్‌ - 2 చిత్రాన్ని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యాష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌’లో భాగంగా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో తారక్‌ నెగిటివ్‌ రోల్‌లో కనిపిస్తాడని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. అంతేగాక ఈ పాత్ర కోసం రూ. 30 కోట్లు రెమ్యూనరేషన్‌ కూడా తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. RRRలో తమ హీరో కంటే రామ్‌చరణ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అప్పట్లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మళ్లీ వార్‌ 2 సినిమాలోనూ అదే పరిస్థితి రిపీట్‌ అవుతుందని కలవరపడుతున్నారు. ఎన్టీఆర్ నెగిటివ్‌ క్యారెక్టర్‌ చేయడం వల్ల సినిమాలో హృతిక్‌ పాత్రే హైలైట్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాల్లోనూ హీరోదే పైచేయి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.  రెమ్యూనరేషన్‌ తక్కువే! ఇక రెమ్యూనరేషన్‌ విషయానికి వస్తే  RRR చిత్రానికే ఎన్‌టీఆర్‌ 45 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో పెరిగిందో అందరికీ తెలిసిందే. RRR తర్వాత చేయబోయే చిత్రాలకు ఎన్టీఆర్‌ రూ.100 కోట్ల రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం పొందే టాప్ 5 స్టార్లలో ఒకడిగా ఎన్టీఆర్ చేరిపోయాడని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.30 కోట్లకే వార్‌-2 చిత్రంలో ఎన్టీఆర్‌ చేస్తున్నట్లు కథనాలు రావడంపై ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా తారక్‌ను అభిమాన హీరోను నెగిటివ్‌ రోల్‌లో చూడటానికి తమ మనసు అంగీకరించడం లేదని మదనపడుతున్నారు. అయితే బాలీవుడ్‌లోని అగ్ర నటులతో పోలిస్తే తారక్‌ రెమ్యూనరేషన్‌ ఎక్కువనే చెప్పాలి.  లాభాల్లో షేర్.. ఎన్టీఆర్‌ రెమ్యూనరేషన్‌కు సంబంధించి మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్‌ నేరుగా రెమ్యూనరేషన్‌ తీసుకోకుండా వార్‌-2 సినిమా లాభాల్లో షేర్‌ తీసుకునేలా డీల్‌ కుదిరి ఉండొచ్చని మరికొన్ని మరికొన్ని వార్త కథనాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే వార్‌ 2 సినిమా కోసం తారక్‌ కంటే ముందు ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండను సంప్రదించారని ‌గతంలో ప్రచారం జరిగింది. వారు రిజెక్ట్‌ చేయడం వల్లే తారక్‌ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను  యాష్‌ రాజ్‌ నిర్మాణ సంస్థ ఛైర్మన్‌ ఆదిత్య చోప్రా ఖండించారు. తాము ఎవరినీ సంప్రదించలేదని, తారక్‌ను దృష్టిలోపెట్టుకునే ఆ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దామని చెప్పుకొచ్చారు. దీంతో ఆ దుష్ప్రచారాలకు చెక్‌ పెట్టినట్లైంది. ఇకపోతే వార్‌ 2 సినిమా నవంబర్‌లో పట్టాలెక్కనున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి.  శరవేగంగా NTR 30 షూటింగ్‌ ప్రస్తుతం NTR 30 సినిమా షూటింగ్‌లో తారక్‌ బిజీబిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీకపూర్‌ నటిస్తోంది. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో భారీ అంచనాలున్నాయి. NTR 30 అనిరుధ్ సంగీతం ‌అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు రత్నవేలు తీసుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యవసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
    మే 10 , 2023
    Shivarathri: శివరాత్రి రోజున శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు ఇవే..
    Shivarathri: శివరాత్రి రోజున శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు ఇవే..
    ]జగద్గురు ఆదిశంకరఆదిశంకరాచార్యుల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో సాగుతుందీ సినిమా. నాగార్జున, సాయికుమార్, మోహన్ బాబు, కమలిని ముఖర్జీ తదితరులు కీలక పాత్ర పోషించారు. శంకరచార్యులుగా కౌశిక్ బాబు నటించాడు.Watch Now
    ఫిబ్రవరి 16 , 2023
    Bhoothaddam Bhaskar Narayana Review: థ్రిల్లింగ్‌ అంశాలతో ఆకట్టుకున్న ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’.. మూవీ ఎలా ఉందంటే? 
    Bhoothaddam Bhaskar Narayana Review: థ్రిల్లింగ్‌ అంశాలతో ఆకట్టుకున్న ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’.. మూవీ ఎలా ఉందంటే? 
    నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ, వెంకటేష్ కాకుమాను తదితరులు. దర్శకుడు: పురుషోత్తం రాజ్ సంగీత దర్శకులు: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రాఫర్‌: గౌతమ్ జి నిర్మాతలు : స్నేహల్ జంగాల, శశిధర్ కాసి, కార్తీక్ ముడింబి విడుదల తేదీ : మార్చి 01, 2024 టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో డిటెక్టివ్ చిత్రాలు వచ్చాయి. చిరంజీవి ‘చంట‌బ్బాయ్’ నుంచి రీసెంట్‌గా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వ‌ర‌కూ ఆ తరహా చిత్రాలు ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచాయి. తాజాగా ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ డిటెక్టివ్‌ జానర్‌లోనే తెరకెక్కింది. అయితే దర్శకుడు పురుషోత్తం రాజ్‌.. పురాణాల‌తో డిటెక్టివ్ క‌థ‌ని ముడిపెడుతూ ఈ సినిమాను రూపొందించడం ఆసక్తికరం. శివ కందుకూరి ఇందులో క‌థానాయ‌కుడిగా చేశాడు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? ఈ డిటెక్టివ్ ఏ మేర‌కు మెప్పించాడు? అన్నది ఇప్పుడు చూద్దాం.  కథ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో (Bhoothaddam Bhaskar Narayana Review) ఓ సీరియల్‌ కిల్లర్‌ మహిళల్ని టార్గెట్‌ చేస్తూ వరుసగా హత్యలు చేస్తుంటాడు. ఆడవారి తలలు నరికేసి వాటి స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ వరుస హత్యలు పోలీసులకు చిక్కుముడిలా మారిపోతాయి. దీంతో కేసును పరిష్కరించడం కోసం లోకల్‌ డిటెక్టివ్‌ భాస్కర్‌ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కేసును డిటెక్టివ్‌ ఛేదించాడా? లేదా? ఆ సీరియల్‌ కిల్లర్‌ ఎవరు? ఎందుకు ఆడవారినే హత్య చేస్తున్నాడు? వారి తలలు తీసుకెళ్లి ఏం చేస్తున్నాడు? రిపోర్టర్‌ లక్ష్మీతో హీరో లవ్‌స్టోరీ ఏంటి? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే శివ కందుకూరి డిటెక్టివ్ పాత్ర‌లో స‌హ‌జంగా ఒదిగిపోయాడు. న‌ట‌న ప‌రంగానూ వైవిధ్యం ప్ర‌ద‌ర్శించాడు. ప్ర‌థ‌మార్ధంలో స‌ర‌దా స‌న్నివేశాల్లో హుషారుగా కనిపించిన అతడు.. సెకండాఫ్‌లో సీరియ‌స్ స‌న్నివేశాల‌పైనా బ‌ల‌మైన ప్ర‌భావం చూపించాడు. అటు హీరోయిన్‌ రాశిసింగ్ చాలా అందంగా క‌నిపించింది. రిపోర్ట‌ర్ ల‌క్ష్మిగా ఆమెకీ కీల‌క‌మైన పాత్రే ద‌క్కింది. ష‌ఫి, దేవి ప్ర‌సాద్‌, శివ‌న్నారాయ‌ణ, శివ‌కుమార్ త‌దిత‌రులు అల‌వాటైన పాత్ర‌ల్లో తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే  డైరెక్టర్‌ పురుషోత్తమ్‌ రాజ్‌.. ఆసక్తికర కథను ఎంచుకున్నారు. డిటెక్టివ్‌ కథను పురుణాలతో ముడిపెట్టిన విధానం బాగుంది. హీరోను ప‌క్కా లోక‌ల్ డిటెక్టివ్‌గా చూపించడం అంద‌రినీ క‌నెక్ట్ అయ్యేలా చేస్తుంది. హ‌త్య‌ల పూర్వాప‌రాలు, పోలీసుల ప‌రిశోధ‌న‌, ఆ కేసులోకి హీరో ప్ర‌వేశం, అత‌నికీ స‌వాల్ విసిరే ప‌రిశోధ‌న త‌దిత‌ర అంశాల‌న్నీ ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. ద్వితీయార్ధంలో మ‌లుపులు మ‌రింత ఉత్కంఠ‌ని పెంచుతాయి. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మరీ నాటకీయంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో కొన్ని సీన్లు కథకు స్పీడ్‌ బ్రేకుల్లా తయారయ్యాయి. ఓవరాల్‌గా పురషోత్తం రాజ్‌ దర్శకత్వం ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సంగీతం, కెమెరా, ఎడిటింగ్, క‌ళ త‌దిత‌ర  విభాగాలన్నీ మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. నేప‌థ్య సంగీతం ఈ సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది.  నిర్మాణంలోనూ నాణ్య‌త క‌నిపిస్తుంది. బడ్జెట్‌కు వెనకాడినట్లు ఎక్కడా అనిపించలేదు.  ప్లస్‌ పాయింట్స్ హీరో నటనక‌థ‌లో పురాణ నేప‌థ్యంద్వితీయార్థం మైనల్‌ పాయింట్స్‌ ప్ర‌థ‌మార్థంలో కొన్ని సీన్లు Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 02 , 2024
    Devara Prepone: పవన్‌ ప్లేస్‌లో తారక్‌.. అనుకున్న దానికంటే ముందే ‘దేవర’ రిలీజ్‌!
    Devara Prepone: పవన్‌ ప్లేస్‌లో తారక్‌.. అనుకున్న దానికంటే ముందే ‘దేవర’ రిలీజ్‌!
    అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ (NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌ డ్రామా ‘దేవర’ (Devara). పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. కాగా, ఈ సినిమాను అక్టోబర్‌ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ గతంలో ప్రకటించారు. అయితే తాజాగా రిలీజ్‌ డేట్‌ను మార్చాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.  ముందే రానుందట..! తారక్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' (Devara) చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్‌ సింగిల్‌ రిలీజై మంచి ఆదరణ సంపాదించింది. ఇదిలా ఉంటే.. 'దేవర' చెప్పిన తేదీ కంటే ముందే థియేటర్లలోకి రానున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. అక్టోబర్‌ 10 కంటే రెండు వారాలు ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ 27న మూవీ రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు కూడా మెుదలైనట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.  ప్రీ-పోన్‌కు కారణం ఇదే! వాస్తవానికి పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన 'ఓజీ' చిత్రం సెప్టెంబర్‌ 27న విడుదల కావాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా పవన్‌.. ఏపీ రాజకీయాలకు పూర్తిగా సమయం కేటాయించడం.. తాజాగా మంత్రిగానూ ప్రమాణం స్వీకారం చేయడంతో ఇప్పట్లో ఓజీ షూటింగ్‌లో పాల్గోనే అవకాశం లేదని అంటున్నారు. దీంతో 'ఓజీ' (OG) సినిమా.. ఈ ఏడాది రిలీజయ్యే అవకాశం లేదని ఇండస్ట్రీలో బలంగా టాక్‌ వినిపిస్తోంది. దీంతో ఓజీకి లాక్‌ చేసిన తేదీనే 'దేవర'ను రిలీజ్‌ చేస్తే ఎలా ఉంటుందని కొరటాల శివ టీమ్‌ యోచిస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్‌ 27న ‘దేవర’తో థియేటర్లు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.  గోవాలో షూటింగ్‌.. ప్రస్తుతం.. 'దేవర' టీమ్‌ గోవాలో బిజీ బిజీగా గడుపుతోంది. తారక్‌, జాన్వీ కపూర్‌ల మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలను గోవా చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. మరి కొన్ని రోజుల పాటు ఈ షూటింగ్‌ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాక్‌ స్టార్‌ అనిరుధ్‌ రవి చందర్‌ అందించిన ఫస్ట్‌ సింగ్‌ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. రెండో పాటను కూడా త్వరలో రిలీజ్‌ చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి రొమాంటింక్‌ మెలోడీని రిలీజ్‌ చేసే అవకాశమున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.  భారీ ధరకు ఓటీటీ హక్కులు!  దేవర చిత్రం థియేటర్లలోకి రాకముందే ఓటీటీ హక్కులు అమ్ముడు పోయాయి. ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) దేవర ఓటీటీ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఈ సినిమా స్ట్రీమింగ్‌ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌.. దాదాపు రూ.155 కోట్లు ఖర్చుపెట్టిందని వార్తలు వచ్చాయి. దేవర విడుదలైన 56 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసుకునేలా నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుందని సమాచారం. తెలుగు, హిందీతో పాటు మరిన్ని సౌత్‌ భాషలలో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.  ‘దేవర’లో ఎన్టీఆర్‌ పాత్ర ఇదే! జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ‘దేవ‌ర’ వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. స‌ముద్ర తీర ప్రాంత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తీర్చే నాయ‌కుడిగా తారక్‌.. దేవరలో క‌నిపించ‌బోతున్న‌ట్లు సమాచారం. ఎన్టీఆర్‌లోని హీరోయిజాన్ని దర్శకుడు కొరటాల శివ.. ఈ మూవీతో ప‌తాక స్థాయికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్‌కు ధీటుగా నిలబడే విలన్ పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీఖాన్‌ నటిస్తున్నాడు. అతడి పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు టాక్‌. ఈ మూవీ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
    జూన్ 12 , 2024
    Devara Song: ఒక్క సాంగ్‌తో ‘దేవర’పై తలకిందులైన అంచనాలు.. నెట్టింట తీవ్ర సంతృప్తి! 
    Devara Song: ఒక్క సాంగ్‌తో ‘దేవర’పై తలకిందులైన అంచనాలు.. నెట్టింట తీవ్ర సంతృప్తి! 
    ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. తీర ప్రాంతం నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తారక్‌ బర్త్‌డే (మే 20)ను పురస్కరించుకొని నిన్ననే మూవీ టీమ్‌.. తొలి సాంగ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాటపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ సాంగ్‌ను ప్రశంసిస్తుంటే ఎక్కువ మంది సోషల్‌ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  దూసుకెళ్తున్న సాంగ్‌ దేవర సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ను ఆదివారం (మే 19) సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'ఫియర్‌ సాంగ్‌' (Fear Song) పేరుతో సాంగ్‌ లిరికల్‌ వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగులో ఈ పాట లిరిక్స్‌ రామజోగయ్య శాస్త్రి రాయగా.. సంగీత దర్శకుడు అనిరుధ్‌ స్వయంగా పాడాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌ తొలి 20 గంటల్లో 47 లక్షల వ్యూస్ (తెలుగులో) దూసుకెళ్తోంది. అటు ఇతర భాషల్లోనూ ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది.  https://www.youtube.com/watch?v=CKpbdCciELk&list=PLTtJUIuknk91d-Sq1qbTeI0WM0R6EbuZS&index=3 ‘అనిరుధ్‌ ఎలివేషన్స్‌ ఏంటి’ దేవర ఫస్ట్‌ సాంగ్‌ చూసి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ వచ్చినా.. మిగతా మ్యూజిక్‌ లవర్స్‌, నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఎన్టీఆర్‌ బర్త్‌డే సాంగ్‌లో అనిరుద్‌ ఎలివేషన్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. తారక్‌ కంటే ఎక్కువగా అనిరుధ్‌ కనిపించాడని మండిపడుతున్నారు. విక్రమ్‌ సినిమా టైటిల్‌ ట్రాక్‌ని తీసుకొచ్చి ‘దేవర’కు పెట్టారంటూ విమర్శలు చేస్తున్నారు. పాట మెుత్తాన్ని మ్యూజిక్‌ డామినేట్‌ చేసిందని పోస్టులు పెడుతున్నారు. ఆ మ్యూజిక్‌ మధ్యలో లిరిక్స్‌ ఏమి వినిపింలేదని మండిపతున్నారు. 'దేవర ముంగిట నువ్వెంత' అన్న పదం తప్ప ఇంకేమి స్పష్టంగా వినిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంగ్‌ విన్న తర్వాత ‘దేవర’ ఫిల్మ్‌పై ఉన్న అంచనాలు కూడా సన్నగిల్లుతున్ననయని మరికొందరు వ్యాఖ్యానించారు.  ఆ సాంగ్‌ను కాపీ కొట్టాడా? ‘దేవర’లోని ఫియర్‌ సాంగ్‌ను విన్న కొందరు నెటిజన్లు.. ఈ పాటను గతంలో వచ్చిన సాంగ్స్‌తో కంపేర్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్‌ 'లియో' చిత్రంలోని 'బ్యాడ్‌ యాస్‌' పాటలా ఉందంటూ తమిళ ఆడియన్స్‌ నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు. తమిళంలోనూ ఈ సాంగ్‌ రిలీజ్‌ అయిన నేపథ్యంలో ఈ మేరకు పోస్టులు పెడుతున్నారు. అనిరుధ్‌ మళ్లీ కాపీ కొట్టాడంటూ కామెంట్‌ బాక్స్‌లో పోస్టులు చేస్తున్నారు.  ‘దేవర’లో ఎన్టీఆర్‌ పాత్ర ఇదే! ‘జ‌న‌తా గ్యారేజ్’ త‌ర్వాత ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ‘దేవ‌ర’ వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. స‌ముద్ర తీర ప్రాంత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తీర్చే నాయ‌కుడిగా తారక్‌.. దేవరలో క‌నిపించ‌నున్నాడు. ఎన్టీఆర్‌లోని హీరోయిజాన్ని దర్శకుడు కొరటాలు ఈ మూవీతో ప‌తాక స్థాయికి తీసుకెళ్లనున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్‌కు ధీటుగా నిలబడే విలన్ పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీఖాన్‌ నటిస్తున్నాడు. అతడి పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. 
    మే 20 , 2024
    105 Minuttess Review: హన్సికా కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘105 మినిట్స్‌’ హిట్టా? ఫట్టా?
    105 Minuttess Review: హన్సికా కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘105 మినిట్స్‌’ హిట్టా? ఫట్టా?
    న‌టీన‌టులు: హ‌న్సిక ద‌ర్శ‌క‌త్వం: రాజు దుస్సా  సంగీతం: సామ్ సిఎస్‌ ఛాయాగ్రహ‌ణం: కిషోర్ బోయిడ‌పు నిర్మాత‌: బొమ్మక్ శివ ‘దేశ‌ముదురు’, ‘కందిరీగ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో నటి హన్సిక తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం ఆమె నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే హన్సిక ‘105 మినట్స్‌’ (105 Minutes)తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ప్ర‌యోగాత్మ‌కంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సినిమా మెుత్తం హన్సిక ఒక్కరే కనిపించడం విశేషం. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి పంచింది? హ‌న్సిక‌కు విజ‌యాన్ని అందించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం. కథేంటి జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌ ఎవరెలా చేశారంటే జాను పాత్ర‌లో హ‌న్సిక  (105 Minutes Review) జీవించింది. తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయితే సినిమా ఆద్యంతం ఒకే ఎమోషన్‌ను మెయిన్‌టెన్‌ చేస్తూ ఆమె నటించడం వల్ల సినిమా భారంగా సాగినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా హన్సికా(Hansika) ఓ నటిగా మరోమారు సక్సెస్‌ అయ్యిందని చెప్పవచ్చు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ద‌ర్శ‌కుడు రాజు దుస్సా (Raju Dussa) కొత్త ప్ర‌య‌త్నం మంచిదైనా స‌రైన క‌థ‌, క‌థ‌నాలు లేకుండా రంగంలోకి దిగ‌డం వ‌ల్ల ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. సినిమా (105 Minutes Review) ఆస‌క్తిక‌రంగానే మొదలైనా.. ఆ త‌ర్వాత నుంచి క‌థ ముందుకు సాగదు. హన్సిక పాత్రను ఆద్యంతం కేకలు వేస్తూనే, ఏడుస్తూనే చూపించడం ప్రేక్షకులకు భారంగా అనిపించింది. అస‌లు జానును ఆ ఆత్మ ఎందుకు వేధిస్తోంది? అది ఏమి చెప్పాల‌నుకుంటోంది? అన్న‌దానిపై కూడా దర్శకుడు సరైన స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఇక సినిమాను ముగించిన తీరు కూడా ప్రేక్షకుల సహనానికి మరో పెద్ద పరీక్షగా అనిపిస్తుంది. టెక్నికల్‌గా.. సాంకేతిక విషయాలకు వస్తే.. నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. క‌థేమీ లేకున్నా ఆ సంగీత‌మే దీంట్లో ఏదో ఉందేమో అన్న అనుభూతిని అందిస్తుంది. ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ హన్సిక నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంసాగదీత సీన్లుక్లైమాక్స్‌ రేటింగ్‌: 2.5/5
    జనవరి 27 , 2024
    Music Shop Murthy Review: లక్ష్యం కోసం 52 ఏళ్ల వ్యక్తి చేసే పోరాటం.. ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ ఎలా ఉందంటే ?
    Music Shop Murthy Review: లక్ష్యం కోసం 52 ఏళ్ల వ్యక్తి చేసే పోరాటం.. ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ ఎలా ఉందంటే ?
    నటీనటులు: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు రచన, దర్శకత్వం: శివ పాలడుగు  సంగీతం: పవన్  సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్‌ బెజుగం ఎడిటర్‌: బొంతల నాగేశ్వరరెడ్డి నిర్మాతలు: హర్ష గారపాటి & రంగారావు గారపాటి విడుదల తేది: జూన్‌ 14, 2024 టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్ (Ajay Ghosh), క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy Review). శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి గ్రాండ్‌గా నిర్మించారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్, ప్రమోషన్‌ చిత్రాలు ఆడియన్స్‌ను ఆకర్షిస్తున్నాయి. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? నటుడిగా అజయ్‌ ఘోష్‌ను మరో మెట్టు పైకి ఎక్కించిందా? ఇప్పుడు చూద్దాం.  కథేంటి మూర్తి (అజయ్‌ ఘోష్‌).. 52 ఏళ్ల వయసులో మ్యూజిక్‌ షాప్‌ నడుపుతుంటాడు. లాభాలు లేకున్నా అదే పని చేస్తుంటాడు. అయితే మూర్తికి డీజే అవ్వాలన్న కోరిక ఉంటుంది. మరోవైపు అమెరికా నుంచి వచ్చిన అంజన (చాందిని చౌదరి) కూడా డీజే కావాలని కలలు కంటుంది. అందులో శిక్షణ కూడా తీసుకుంటుంది. ఓ కారణం చేత మూర్తిని కలిసిన అంజన.. డీజే కావాలన్న అతడి ఆసక్తిని గమనించి నేర్పించేందుకు ఒప్పుకుంటుంది. అలా ఆమె వద్ద డీజే నేర్చుకొని హైదరాబాద్‌కు వచ్చిన మూర్తి.. ఎలాంటి కష్టాలు పడ్డాడు? అంజన తండ్రి.. మూర్తిపై ఎందుకు కేసు పెట్టాడు? ఫేమస్‌ డీజే డెవిల్‌ (అమిత్‌ శర్మ) మూర్తిని ఎలా అవమానించాడు? ఇంతకీ మూర్తి డీజేగా సక్సెస్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అజయ్‌ ఘోష్‌.. మూర్తి పాత్రలో మరోమారు అదరగొట్టారు. మధ్యతరగతి వ్యక్తి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించారు. ఓ పక్క తనదైన కామెడీతో నవ్విస్తూనే.. ఎమోషనల్‌ సీన్స్‌లో ఏడిపించారు. ఇక అంజన పాత్రకు హీరోయిన్‌ చాందిని పూర్తిగా న్యాయం చేసింది. మూర్తికి డీజే నేర్పించే క్రమంలో ఆమె చెప్పే డైలాగ్స్‌ ఆలోచింపజేస్తాయి. మూర్తి భార్యగా ఆమని చక్కటి నటన కనబరిచింది. అమిత్‌ శర్మ, భానుచందర్‌, దయానంద్‌ రెడ్డి, పటాస్‌ నాని తదితరులు తమ పాత్ర పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు శివ పాలడుగు.. మూర్తి పాత్రకు అజయ్‌ ఘోష్‌ను ఎంచుకోవడం ద్వారానే సగం విజయం సాధించేశారు. కథలో పెద్దగా మెరుపులు లేనప్పటికీ ఎమోషనల్‌గా సినిమాను నడిపి ఆకట్టుకున్నారు. ప్రారంభంలో కథ స్లోగా నడుస్తున్నట్లు అనిపించినా.. పది నిమిషాలకే అందరు కథలో లీనమవుతారు. ఫస్టాఫ్‌లో మూర్తి ఫ్యామిలీ కష్టాలతో పాటు డీజే సాధన వంటివి చూపించారు. ఇక సెకండాఫ్‌ను ఫన్‌ & ఎమోషనల్‌గా నడిపి దర్శకుడు ఆకట్టున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే ప్రధానమైన క్లైమాక్స్‌ ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా 52 ఏళ్ల మూర్తి.. తన లక్ష్యం కోసం చేసే పోరాటం అందర్నీ మెప్పిస్తుంది.  టెక్నికల్‌గా..  సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా పవన్‌ అందించిన సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. అతడు అందించిన నేపథ్య సంగీతం.. భావోద్వేగ సన్నివేశాలను మరింత హత్తుకునేలా చేసింది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ అజయ్‌ ఘోష్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుప్రీ క్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ స్లో నారేషన్‌క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5   https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-telugu-beauty-chandini-chowdary.html
    జూన్ 14 , 2024
    RGV Heroines List: శ్రీదేవి To ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతిలో పడి స్టార్లుగా మారిన హీరోయిన్లు వీరే!
    RGV Heroines List: శ్రీదేవి To ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతిలో పడి స్టార్లుగా మారిన హీరోయిన్లు వీరే!
    భారత చిత్ర పరిశ్రమలో వివాదస్పద డైరెక్టర్‌ అనగానే ముందుగా అందరికీ ‘రామ్‌ గోపాల్‌ వర్మ’ (Ram Gopal Varma)నే గుర్తుకు వస్తారు. ‘శివ’ వంటి ట్రెండ్‌ సెట్టర్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్జీవీ (RGV).. ఆ తర్వాత కెరీర్‌ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆర్జీవీ.. ఇప్పటివరకూ పదుల సంఖ్యలో చిత్రాలకు దర్శకత్వం వహించి, మరికొన్నింటిని నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రాల్లో నటించి చాలా మంది నటీమణులు స్టార్‌ హీరోయిన్లుగా మారిపోయారు. మరికొందరు తమ ఫేమ్‌ను మరింత పెంచుకున్నారు. ఆర్జీవీ చిత్రాల్లో చేసిన ఆ టాప్‌ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.  ఆరాధ్య దేవి (Aaradhya Devi) ఆర్జీవీ అప్‌కమింగ్‌ చిత్రం 'చీర'లో శ్రీలక్ష్మీ సతీష్‌ (Shri Lakshmi Satish) నటించింది. ఇందులో ఆమె ఆరాధ్య దేవి పాత్ర పోషిస్తుండటంతో ఆ పేరునే తన పేరుగా మార్చుకుంది. గతేడాది చీరలో ఉన్న అమ్మడి ఫొటో చూసి ఆర్జీవీ ఇంప్రెస్‌ అయ్యారు. ఆమె అందానికి దాసోహం అయినట్లు తెలిపారు. అంతే కాకుండా ఆమెతో ఏకంగా చీర అనే పేరుతో సినిమా తీసి ఆమె చేత అందాల ప్రదర్శన చేయించాడు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.  Aaradhya Devi Hot images gallery ఇర్రా మోర్‌ (Irra Mor) ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన ‘కొండ’ సినిమాతో నటి ఇర్రా మోర్‌ చాలా పాపులర్ అయ్యింది. అంతకుముందు 'భైరవ గీత', ‘డీ కంపెనీ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ‘కొండ’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.  శాన్వీ శ్రీవాస్తవ (Shanvi Srivastava) హాట్‌ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన 'రౌడీ' సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది. ఇందులో మంచు విష్ణుకు జోడీగా నటించి మెప్పించింది. అంతకుముందు లవ్లీ, అడ్డా, చంద్రలేఖ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకు పెద్దగా పేరు రాలేదు. రౌడీలో ఈ భామ హోయలు చూసి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో శాన్వీ వరుసగా చిత్రాలు చేసింది. Shanvi Srivastava Hot images gallery పూజా భలేకర్‌ (Pooja Bhalekar) హీరోయిన్ల అందాలను చూపించడంలో ఒక్కో డైరెక్టర్‌ ఒక్కో శైలి ఉంటుంది. అలాగే ఆర్జీవీకి ఓ భిన్నమైన శైలి ఉంటుంది. వివిధ రకాల పొజిషన్‌లో కెమెరాను పెట్టి హీరోయిన్‌ అందాలను ఆర్జీవీ క్యాప్చర్‌ చేస్తుంటారు. ఇలా వచ్చిన చిత్రమే ‘లేడీ బ్రూస్‌లీ. వర్మ రూపొందించిన ఈ చిత్రంలో నటి పూజా భలేకర్‌ హాట్‌ బాంబ్‌లా చేసింది. తెరపై ఈ భామ అందాల విన్యాసాలకు కుర్రకారు ఫీదా అయ్యారు.  Pooja Bhalekar Bikini images gallery నైనా గంగూలి (Naina Ganguly) ఆర్జీవీ టాలెంటెడ్‌ హీరోయిన్లతో పాటు బోల్డ్‌ నటీమణులను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా ఇంట్రడ్యూస్‌ చేసిన నటి నైనా గంగూలి. 2016లో వచ్చిన వంగవీటి సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. 2022లో వచ్చిన డేంజరస్‌ సినిమాలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. గ్లామర్‌ షో చేసింది.  అప్సర రాణి (Apsara Rani) ఆర్జీవీ చేతిలో పడి స్టార్‌గా మారిన మరో హాట్‌ బాంబ్‌ అప్సర రాణి. 2022లో వచ్చిన డేంజరస్‌ సినిమా ద్వారా ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందే పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ భామకు ఫేమ్ రాలేదు. ఆర్జీవీ సినిమా తర్వాతి నుంచి ఈ అమ్మడు ఓవైపు సినిమాలు, మరోవైపు గ్లామర్‌ పోస్టులతో సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. Apsara Rani Hot images gallery ఊర్మిళ (Urmila Matondkar) ఆర్జీవీ సినిమాల్లో అత్యధికసార్లు హీరోయిన్‌గా చేసిన నటి ఊర్మిల. 1992లో నాగార్జున హీరోగా చేసిన ‘అంతం’ సినిమాతో ఊర్మిళ తొలిసారి ఆర్జీవీతో కలిసి వర్క్‌ చేశారు. ఆ తర్వాత వరుసగా ‘సత్య’, ‘భూత్‌’, ‘రంగీలా’, ‘అనగనగా ఒక రోజు’, ‘మస్త్‌’, ‘జంగిల్‌’, ‘దావుద్‌’ తదితర చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించి అలరించారు. ముఖ్యంగా రంగీలా సినిమాల్లో ఈమె అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అద్భుతమైన మ్యూజిక్‌, అందమైన హీరోయిన్‌ ఉంటే సినిమాను సక్సెస్‌ చేయవచ్చని ఆర్జీవీ నిరూపించాడు.  అక్కినేని అమల (Akkineni Amala) స్టార్‌ హీరో అక్కినేని నాగార్జున భార్య అమల.. ఆర్జీవీ తొలి చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. ‘శివ’ హిందీ వెర్షన్‌లోనూ అమల నటించింది. ఇందులో ఆమె చక్కటి నటన కనబరిచి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమె ఆర్జీవీ డైరెక్షన్‌లో సినిమా చేయలేదు.  శ్రీదేవి (Sridevi) రామ్‌గోపాల్‌ వర్మకు బాగా ఇష్టమైన హీరోయిన్‌ ‘శ్రీదేవి’. ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా', 'క్షణ క్షణం' చిత్రాల్లో ఆమె కథానాయికగా చేసింది. ఆ తర్వాత కూడా ఆమెతో వర్క్‌ చేయాలని ఆర్జీవీ భావించిన అది సాధ్యపడలేదు. తన ఫేవరేట్‌ అయిన శ్రీదేవిపై ఆర్జీవీ పలు వేదికలపై ప్రశంసలు కురిపించడం విశేషం. రేవతి (Revathi) ఊర్మిళ తర్వాత ఆర్జీవీ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన హీరోయిన్‌ రేవతి. ‘రాత్రి’, ‘గాయం’, ‘గాయం-2’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ‘నిశబ్ద్‌’, ‘అబ్‌ తక్‌ ఛాపన్‌’, ‘డర్నా మనా హై’ తదితర హిందీ చిత్రాల్లో ఆమె నటించింది. హార్రర్‌ (RGV Horror Movies) బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘రాత్రి’ సినిమాలో ఆమె నటన ప్రతీ ఒక్కరిని బయటపెట్టింది. ఈ సినిమా రేవతితో పాటు రామ్‌ గోపాల్‌ వర్మకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.  మహేశ్వరి (Maheswari) ఒకప్పటి స్టార్‌ నటి మహేశ్వరి సైతం ఆర్జీవీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన గులాబీ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'దెయ్యం' సినిమాలో మహేశ్వరి లీడ్‌ రోల్‌లో నటించింది. హర్రర్‌ సీన్స్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఆడియన్స్‌ను థ్రిల్‌ చేశాయి. మనీషా కోయిరాలా (Manisha Koirala) ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా కూడా ఆర్జీవీ తీసిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో తళుక్కుముంది. 2002లో వచ్చిన 'కంపెనీ' చిత్రం ద్వారా ఆమె తొలిసారి ఆర్జీవీ డైరెక్షన్‌లో నటించింది. ఆ తర్వాత ‘భూత్‌ రిటర్న్స్‌’, ‘దర్వాజ బంద్‌’ సినిమాల్లో కనిపించింది. ముఖ్యంగా భూత్‌ రిటర్న్స్‌లో ఆమె నటన అందర్ని ఆకట్టుకుంది.  సుస్మితా సేన్‌ (Sushmita Sen) ఆర్జీవీ దర్శకత్వంతో పాటు ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో సుస్మితా సేన్‌ నటించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన ‘మర్రిచెట్టు’ సినిమా.. 2004లో విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో ఆమె నటన మెప్పిస్తుంది. అటు ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం 'AAG' లోనూ సుస్మితా సేన్‌ మెరిసింది.  ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai Bachchan) ఆర్జీవీ డైరెక్షన్‌లో స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌ కూడా ఓ సినిమాలో నటించింది. 2008లో వచ్చిన 'సర్కార్ రాజ్‌' అనే హిందీ మూవీలో ఈమె నటించింది. ఇందులో భర్త అభిషేక్‌ బచ్చన్‌, మామ అమితాబ్‌ బచ్చన్‌త https://telugu.yousay.tv/heroines-launched-by-ram-gopal-varma.html
    ఏప్రిల్ 24 , 2024
    Devara: తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’కు ఊహించని షాక్‌.. ప్రభాస్‌, బన్నీతో పోలిస్తే వెనకబడ్డ తారక్‌!
    Devara: తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’కు ఊహించని షాక్‌.. ప్రభాస్‌, బన్నీతో పోలిస్తే వెనకబడ్డ తారక్‌!
    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత జూ.ఎన్టీఆర్‌ (Jr. NTR) నటిస్తున్న చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్‌గా చేస్తోంది. సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుండటం, తారక్‌ డ్యూయల్‌ రోల్‌లో చేస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా దేవర ప్రీరిలీజ్ బిజినెస్‌ అంటూ కొన్ని లెక్కలు వైరల్‌ అవుతున్నాయి. అవి చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఆ సినిమాల కంటే వెనకే! లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ థియేట్రికల్‌ హక్కులు రూ.130 కోట్లకు అమ్ముడుపోనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ కెరీర్‌లో ఇదే అత్యధికం. అయితే అల్లుఅర్జున్‌ ‘పుష్ప 2’ (Pushpa 2), ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కేవలం ఒక్క రీజియన్‌లోనే రూ.100 కోట్ల మేర బిజినెస్ చేస్తోందని టాక్. వీటితో పోలిస్తే దేవర చాలా తక్కువ థియేట్రికల్‌ బిజినెస్‌ చేసే పరిస్థితులు కనిపిస్తాయి. వాస్తవానికి టాలీవుడ్‌లో బన్నీ, తారక్‌కు సమాన క్రేజ్ ఉంది. ‘పుష్ప 2’ లాగానే ‘దేవర’ కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. అయినా కూడా ‘పుష్ప 2’ బిజినెస్‌ అంచనాలను తారక్ అందుకోకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరుగుతుందని భావించిన వారంతా తాజా లెక్కలు చూసి పెదవి విరుస్తున్నారు.  ప్రీరిలీజ్‌ బిజినెస్‌ అంచనాలు ఇవే! లేటెస్ట్ బజ్‌ ప్రకారం దేవర ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఏకంగా రూ.400 కోట్లకు పైగా జరిగే అవకాశముందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.130 కోట్లు పలకనున్నట్లు సమాచారం. ఈ రైట్స్ కోసం నిర్మాత దిల్‌రాజు, మైత్రీమూవీ మేకర్స్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు పోటీ పడుతున్నారట. మరోవైపు ఉత్తరాది, కర్ణాటక, తమిళనాడు, కేరళ కలుపుకొని సుమారు రూ.50-60 కోట్ల బిజినెస్‌ జరిగిందని అంటున్నారు. అటు ఓవర్సీస్‌ హక్కులను రూ.27 కోట్లకు హమ్సిని ఎంటర్‌టైన్‌మెంట్‌ లాక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆడియో రైట్స్‌ను రూ.33 కోట్లకు టి సిరీస్‌ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దేవర ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌.. రూ.155 కోట్లకు ఖాయం చేసుకోగా మిగిలిన శాటిలైట్‌ హక్కులను కూడా కలుపుకుంటే ప్రీ రిలీజ్‌ బిజినెస్ లెక్కలు ఈజీగానే రూ.400 కోట్లు దాటతాయని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  సినిమా రిలీజ్‌ ఎప్పుడంటే? ‘దేవర’ మూవీ టీజర్‌, ట్రైలర్, సాంగ్‌ రిలీజ్‌ కాకుండానే ఈ స్థాయిలో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు బయటకు రావడంపై సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. దేవర ఫస్ట్‌ పార్ట్‌కే ఈ స్థాయిలో బిజినెస్‌ జరిగితే.. రెండో భాగానికి ఇంకెంత బిజినెస్‌ జరుగుతుందోనని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నాయి. కాగా, అక్టోబర్‌ 10న దసరా కానుకగా దేవర చిత్రం విడుదల కానుంది. ఇందులో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధా ఫిల్మ్స్‌ పతాకాలపై కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. 
    ఏప్రిల్ 16 , 2024
    Geethanjali Malli Vachindi Review: కడుపుబ్బా నవ్వించిన గీతాంజలి సీక్వెల్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
    Geethanjali Malli Vachindi Review: కడుపుబ్బా నవ్వించిన గీతాంజలి సీక్వెల్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, అంజలి, సత్యం రాజేష్, షకలక శంకర్, రవి శంకర్, సత్య తదితరులు. దర్శకుడు: శివ తూర్లపాటి సంగీత దర్శకుడు: ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ ఎడిటింగ్: చోటా కే ప్రసాద్ నిర్మాత: కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎం వివి సినిమాస్ ప్రముఖ హీరోయిన్‌ ‘అంజలి’ లీడ్‌ రోల్‌లో చేసిన ‘గీతాంజలి’ చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) రూపొందింది. అంజలితో పాటు శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, అలీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, ఈ చిత్రం ఎలా ఉంది? ప్రీక్వెల్‌ లాగానే ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.  కథేంటి దర్శకుడు శ్రీనివాస్‌ (శ్రీనివాస్‌ రెడ్డి) హ్యాట్రిక్‌ ఫ్లాపులతో ఆర్థికంగా దెబ్బతింటాడు. పొట్టకూటి కోసం మిత్రుడు అయాన్ (సత్య)ను హీరో చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య సత్య హీరోగా ఓ సినిమా అవకాశం వస్తుంది. ఊటీలో రిసార్టు నడుపుతున్న అంజలి ఇందులో హీరోయిన్‌గా చేసేందుకు ఒప్పుకుంటుంది. అయితే దెయ్యాల కోటగా పిలవబడుతున్న సంగీత్‌ మహల్‌లోనే షూటింగ్ జరపాలని ప్రొడ్యూసర్ ఓ కండీషన్‌ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ సంగీత్‌ మహల్‌ గతం ఏంటి? మహల్‌లో షూటింగ్‌ మెుదలుపెట్టిన శ్రీను & టీమ్‌కు ఎలాంటి సమస్యలు వచ్చాయి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే ప్రముఖ నటి అంజలి ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన అద్భుత నటనతో అదరగొట్టింది. పతాక సన్నివేశాల్లో తన అత్యుత్తమ యాక్టింగ్‌తో మెప్పించింది. కొన్ని హార్రర్‌ సీన్లలో ఆమె పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. దర్శకుడిగా శ్రీనివాస్‌ రెడ్డి, షకలక శంకర్‌, సత్యం రాజేష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అయాన్‌గా సత్య.. సినిమాటోగ్రాఫర్‌ నానిగా సునీల్‌ కడుపుబ్బా నవ్వించారు. వీరి పాత్రలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రతినాయకుడిగా విష్ణు పాత్రలో కనిపించిన రాహుల్‌ మాధవ్‌ నటన మెప్పిస్తుంది.  డైరెక్షన్ ఎలా ఉందంటే ఈ సీక్వెల్‌ మూవీ.. తొలి భాగం చూడనివారికి కూడా అర్థమయ్యేలా డైరెక్టర్‌ శివ తుర్రపాటి తెరకెక్కించారు. ప్రథమార్ధంలో ఎక్కువ భాగం పాత్రల పరిచయానికే కేటాయించిన దర్శకుడు సంగీత మహల్‌కు వెళ్లిన తర్వాత అసలు కథను మెుదలుపెట్టాడు. ఆ మహల్‌ చరిత్ర... అందులోని నటరాజశాస్త్రి కుటుంబ నేపథ్యం.. వాళ్లు దెయ్యాలుగా మారిన తీరును దర్శకుడు చక్కగా చూపించాడు. ఈ క్రమంలో తీసుకొచ్చిన విరామ సన్నివేశాలతో ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచాడు. ప్రేక్షకుల్ని అక్కడక్కడా భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే కథ పరంగా చూస్తే లాజిక్‌కు దూరంగా చాలా అంశాలే ఉన్నాయి. బలమైన ఎమోషన్స్‌ కూడా కొరవడ్డాయి. కోన వెంకట్ రాసుకున్న కథలో పెద్దగా మెరుపులు లేవు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లు సంభాషణలు రాసుకోవడం కాస్త ప్లస్ అయ్యింది. ఓవరాల్‌గా దర్శకుడిగా శివ తన పాత్రకు కొంతమేర న్యాయం చేశారు. టెక్నికల్‌గా సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఈ హర్రర్ కామెడీ సినిమాకి సుజాత సిద్ధార్థ కెమెరా పనితనం బాగా కలిసొచ్చింది. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా కొంచెం స్లోగా సాగిన, సెకెండ్ హాఫ్‌ను కట్ చేసిన విధానం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ అంజలి నటనకామెడీ సన్నివేశాలుకొన్ని హార్రర్‌ అంశాలు మైనస్‌ పాయింట్స్‌  కథలో బలం లేకపోవడంలాజిక్‌కు అందని సీన్లు Telugu.yousay.tv Rating : 2.5/5 
    ఏప్రిల్ 12 , 2024

    @2021 KTree