• TFIDB EN
  • సైజ్ జీరో
    UTelugu2h 11m
    స్వీటీ అనే మహిళ స్థూలకాయంతో బాధపడుతుంటుంది. దీంతో స్లిమ్మింగ్ సెంటర్‌లో చేరుతుంది. కానీ వారు సూచించే మందుల ప్రభావాలను చూసి భయపడుతుంది. ఆమె స్లిమ్‌గా కాకుండా ఫిట్‌గా ఉండటమే ముఖ్యమనే ప్రచారాన్ని ప్రారంభిస్తుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అనుష్క శెట్టి
    మరియు తమిళంలో దీపా వెంకట్ ద్వారా)
    ఆర్య
    అభిషేక్
    ప్రకాష్ రాజ్
    సైజు జీరో
    సోనాల్ చౌహాన్
    సిమ్రాన్
    పావని గంగిరెడ్డిజ్యోతి
    ఊర్వశి
    రాజేశ్వరి
    అడివి శేష్
    శేఖర్
    బ్రహ్మానందం
    ఆండ్రాయిడ్ బాబా (అతిథి పాత్ర)
    అలీ
    బాబీ
    మౌళి తాత
    రావు రమేష్
    స్వీటీ నాన్న
    తనికెళ్ల భరణి
    డాక్టర్
    పోసాని కృష్ణ మురళి
    నిజం నిరంజన్
    మాస్టర్ భరత్
    యాహూ
    హేమ
    నీరజ
    శివన్నారాయణ నారిపెద్ది
    జిమ్ శిక్షకుడు
    హర్ష చెముడు
    స్వీటీ అభిమాని
    ఏంజెలా క్రిస్లింజ్కి
    టైటిల్ సాంగ్‌లో ఐటెమ్ నంబర్
    సిబ్బంది
    ప్రకాష్ కోవెలమూడి
    దర్శకుడు
    పొట్లూరి వర ప్రసాద్
    నిర్మాత
    కనికా ధిల్లాన్
    రచయిత
    ఎంఎం కీరవాణి
    సంగీతకారుడు
    నీరవ్ షా
    సినిమాటోగ్రాఫర్
    ప్రవీణ్ పూడి
    ఎడిటర్
    కథనాలు
    అనుష్క శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అనుష్క శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అనుష్క శెట్టి తెలుగులో సూపర్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. అంచెలంచెలుగా ఎదిగి లెడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది. సినిమాల్లోకి రాకముందు అనుష్క బెంగుళూరులో యోగా శిక్షకురాలుగా పనిచేసేది. అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి విక్రమార్కుడు(2006), లక్ష్యం(2007) వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను పొందిన అనుష్క శెట్టి(Some Lesser Known Facts Anushka shetty)గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. అనుష్క శెట్టి ముద్దు పేరు? స్వీటి అనుష్క శెట్టి వయస్సు ఎంత? 1981, నవంబర్ 7న జన్మించింది అనుష్క శెట్టి బిరుదు? లెడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి తెలుగులో నటించిన తొలి సినిమా? సూపర్ (2005) అనుష్క శెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు  అనుష్క శెట్టి ఎక్కడ పుట్టింది? పుత్తూర్, కర్ణాటక అనుష్క శెట్టి ఉండేది ఎక్కడ? హైదరాబాద్ అనుష్క శెట్టి ఏం చదివింది? డిగ్రీ అనుష్క శెట్టి అభిరుచులు? ట్రావెలింగ్, యోగా, గార్డెనింగ్ అనుష్క శెట్టికి ఇష్టమైన ఆహారం? బిర్యాని, చికెన్ కర్రీ అనుష్క శెట్టికి  ఇష్టమైన కలర్ ? బ్యాక్, వైట్ అనుష్క శెట్టికి ఇష్టమైన ప్రదేశం లండన్ అనుష్క శెట్టికి ఇష్టమైన హీరో? అక్కినేని నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు అనుష్క శెట్టికి ఇష్టమైన హీరోయిన్? జ్యోతిక అనుష్క శెట్టి  పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. అనుష్క శెట్టి తల్లిదండ్రుల పేరు? A.N విఠల్ శెట్టి, ప్రఫుల్లా శెట్టి అనుష్క శెట్టి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? యోగా ట్రైనర్‌గా పనిచేసేది అనుష్క శెట్టి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/anushkashettyofficial/ అనుష్క శెట్టికి ఎన్ని అవార్డులు వచ్చాయి? అరుంధతి, రుద్రమదేవి చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ -సౌత్ అవార్డును, సైజ్ జీరో, అరుంధతి చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకుంది. బాహుబలి-2 చిత్రానికి గాను బిహైండ్ వుడ్ గోల్డ్ మెడల్ అందుకుంది. అనుష్క శెట్టి నికర ఆస్తుల విలువ? రూ.100కోట్లు https://www.youtube.com/watch?v=PuExPz-K09U
    ఏప్రిల్ 29 , 2024
    Pavani Gangireddy: సాఫ్ట్‌వేర్‌ టూ స్టార్‌ నటి.. పావని గంగిరెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?
    Pavani Gangireddy: సాఫ్ట్‌వేర్‌ టూ స్టార్‌ నటి.. పావని గంగిరెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?
    ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney + Hotstar)లో ఇటీవల వచ్చిన 'సేవ్‌ ద టైగర్స్ 2' (Save The Tigers 2) ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ప్రియదర్శి, అభినవ్‌ గోమఠం, చైతన్య కృష్ణ కామెడీ టైమింగ్‌ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో అభినవ్‌ గోమఠంకు జోడీగా చేసిన పావని గంగిరెడ్డి (Pavani Gangireddy) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన నటన, అభినయంతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో  పావని గంగిరెడ్డికి(Some Lesser Known Facts about Pavani Gangireddy) సంబంధించిన విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. పావని గంగిరెడ్డి ఎవరు? ఈమె టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. పావని గంగిరెడ్డి ఎక్కడ పుట్టింది? హైదరాబాద్‌ పావని గంగిరెడ్డి పుట్టిన తేదీ? ఆగస్టు 23, 1987  పావని గంగిరెడ్డి వయసు ఎంత? 37 సంవత్సరాలు (2024) పావని గంగిరెడ్డి తల్లిదండ్రులు ఎవరు? ఓబుల్‌ రెడ్డి గంగిరెడ్డి (రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌), శాంతి గంగిరెడ్డి (హౌస్‌ వైఫ్‌) పావని గంగిరెడ్డి తోడబుట్టిన వారు ఉన్నారా? సోదరుడు చందు గంగిరెడ్డి, సోదరి క్రిష్ణవేణి గంగిరెడ్డి పావని గంగిరెడ్డి ఏం చదువుకుంది? బీటెక్‌ చేసింది. పావని గంగిరెడ్డికి వివాహం జరిగిందా? అవును, 11 ఫిబ్రవరి, 2011లో ఆమెకు విష్ణు వర్ధన్‌ రెడ్డితో పెళ్లి జరిగింది.  పావని గంగిరెడ్డి భర్త ఏం చేస్తారు? హైదరాబాద్‌లోని ప్రెస్టీజ్‌ గూప్‌ కంపెనీలో వర్క్‌ చేస్తున్నారు.  పావని గంగిరెడ్డి ఎంత మంది పిల్లలు? ఈమెకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. పాప పేరు దియా. పావని గంగిరెడ్డి సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది? పావని సినిమాల్లోకి అడుగుపెట్టకముందు ఐటీ ఉద్యోగం చేసింది. 2008 నుంచి ఇన్ఫోసీస్‌లో 11 ఏళ్లకు పైగా జాబ్‌ చేసింది. తర్వాత కండ్యూయెంట్‌ బిజినెస్‌ సర్వీస్‌ ఎల్‌ఎల్‌పీ ఇండియాలో రెండేళ్ల పాటు మేనేజర్‌గా చేసింది. పావని గంగిరెడ్డి తొలి సినిమా? ‘వింధ్యా మారుతం’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో పావని నటనను చూసి ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రకు ఆమెను ఎంపిక చేశారు. ఆ చిత్రం 2015లో విడుదల అయింది. పావని గంగిరెడ్డి చేసిన చిత్రాలు? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju), సైజ్ జీరో (Size Zero), బ్రహ్మోత్సవం (Brahmotsavam), రైట్ రైట్ (Rite Rite) , జో అచ్యుతానంద (Jyo Achyutananda), అంతరిక్షం (Antariksham), మీకు మాత్రమే చెప్తా (Meku Matrame Chepta), జెస్సీ (Jessy) సినిమాల్లో ఆమె నటించింది.  పావని గంగిరెడ్డి నటించిన వెబ్‌సిరీస్‌లు? ‘ఎక్కడికి ఈ పరుగు’ (Ekkadiki Ee Parugu), ‘లూజర్‌’ (Looser) ‘సేవ్‌ ద టైగర్స్‌ 1 & 2’ (Save The Tigers S1 & S2), ‘వ్యూహాం’ (Vyooham). పావని గంగిరెడ్డి ఇష్టమైన అభిరుచులు? విహార యాత్రలకు వెళ్లడం, పుస్తకాలు చదవడం, గార్డెనింగ్‌ పావని గంగిరెడ్డికి ఇష్టమైన పెంపుడు జంతువు? పెట్ డాగ్ అంటే పావనికి చాలా ఇష్టం. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలను పరిశీలిస్తే శునకంతో దిగిన ఫొటోలు ఎక్కువగా కనిపిస్తాయి.  పావని గంగిరెడ్డికి ఇష్టమైన ఆహారం? దోశ, పిజ్జా పావని గంగిరెడ్డికి ఇష్టమైన హీరో, హీరోయిన్‌? తన ఫేవరేట్‌ హీరో, హీరోయిన్‌ గురించి పావని ఎక్కడా వెల్లడించలేదు. పావని గంగిరెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ?https://www.instagram.com/pavani_gangireddy/?hl=en
    ఏప్రిల్ 02 , 2024
    Pragati Srivastava: పెదకాపు 1 హీరోయిన్ జీరో సైజ్ గ్లామర్ చూస్తే మతి పోవాల్సిందే!
    Pragati Srivastava: పెదకాపు 1 హీరోయిన్ జీరో సైజ్ గ్లామర్ చూస్తే మతి పోవాల్సిందే!
    ]మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    సెప్టెంబర్ 29 , 2023
    Miss Shetty Mr. Polishetty: అనుష్క తిరిగి కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా..? ఈ భామ రెమ్యూనరేషన్‌ తెలిస్తే షాకే!
    Miss Shetty Mr. Polishetty: అనుష్క తిరిగి కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా..? ఈ భామ రెమ్యూనరేషన్‌ తెలిస్తే షాకే!
    టాలీవుడ్‌ ప్రముఖ కథానాయికల్లో అనుష్క శెట్టి ఒకరు. పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఆపై అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, బాహుబలి వంటి చిత్రాలతో అగ్రకథానాయికగా పేరు తెచ్చుకుంది. అయితే బాహుబలి తర్వాత అనుష్క కెరీర్‌ పూర్తిగా చతికిలపడింది. దీనికి కారణం ఆమె తీసిన ‘సైజ్‌ జీరో’ చిత్రం. 2015లో వచ్చిన ఈ మూవీ కోసం అనుష్క బరువు పెరిగింది. మూవీ అనంతరం తగ్గేందుకు యత్నించినా అది వర్కౌట్‌ కాలేదు. దీంతో ఈ భామకు సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. అయితే తాజాాగా యంగ్‌ హీరో నవీన్‌కు జతగా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంలో అనుష్క నటించింది. సోమవారం (ఆగస్టు 21) విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వైవిధ్యమైన ప్రేమ కథ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సెప్టెంబర్ 7న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ను బట్టి చూస్తే మరో వైవిధ్యమైన ప్రేమకథతో అనుష్క తన అభిమానులను మెస్మరైజ్ చేయబోతున్నారని అర్థమవుతోంది. ఈ సినిమాలో అనుష్క షెఫ్‌గా, నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటించారు. ప్రేమ, రిలేషన్‌షిప్స్, పెళ్లి మీద అస్సలు ఆసక్తి, నమ్మకం లేని అమ్మాయిగా అనుష్క కనిపించింది. అలాంటి అమ్మాయి హీరోని ఇష్టపడుతుంది. కానీ పెళ్లి చేసుకోవడానికి కాదు. గర్భం దాల్చడానికి అతడిని హెల్ప్ అడుగుతుంది. ఇదేంటో అర్థంకాక గందరగోళ పరిస్థితిలో హీరో పడతాడు. ఇదే విషయాన్ని ట్రైలర్‌లో ఆసక్తికరంగా చెప్పారు. సరికొత్త ప్రేమకథను ఎంటర్‌టైనింగ్‌, ఎమోషనల్‌గా చెప్పడానికి దర్శకుడు మహేష్ సిద్ధమయ్యారు.  అనుష్క.. గ్రేట్‌ కమ్‌బ్యాక్‌! ఈ సినిమాకు ముందు వరకు పెద్దగా అవకాశాలు లేక అనుష్క ఎంతగానో ఇబ్బంది పడింది. సుదీర్ఘకాలం పాటు మూవీస్‌కు దూరమైంది. దీంతో ఇక అనుష్క కెరీర్‌ అయిపోయినట్లేనని అంతా భావించారు. ఫ్యాన్స్‌ కూడా దాదాపు ఇదే అభిప్రాయానికి వచ్చేశారు. అనుష్కను ఇక వెండితెరపై చూడలేమా అని అనుకుంటున్న సమయంలో ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రం ద్వారా ఈ భామ గ్రేట్ కమ్‌ బ్యాక్‌కు సిద్దమైంది. ఈ సినిమా ట్రైలర్‌లో మునుపటి ‌అనుష్కను స్వీటీ గుర్తు చేసింది. తన గ్లామర్‌, గ్రేస్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. హీరో ప్రభాస్‌ సైతం ట్రైలర్‌ చూసి అద్భుతంగా ఉందంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ట్రైలర్‌ ఆధ్యాంతం కడుపుబ్బా నవ్వించిందని పేర్కొన్నాడు. పలువురు సినీ ప్రముఖులు సైతం ట్రైలర్‌ను మెచ్చుకుంటున్నారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిప్రాయపడుతున్నారు.  రెమ్యూనరేషన్‌ ఎంతంటే? ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా కోసం అనుష్క భారీగానే రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అనుష్క నటించినందుకు మేకర్స్‌ ఆమెకు రూ.6 కోట్లు చెల్లించారని సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే సినిమాలకు దూరమైనప్పటికీ అనుష్క క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అంచనాలకు ‌అనుగుణంగా ఈ చిత్రం భారీ విజయం సాధిస్తే తిరిగి అనుష్క టాలీవుడ్‌లో బిజీ కావడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అటు స్వీటి అభిమానులు సైతం ఇదే జరగాలని కోరుకుంటున్నారు.
    ఆగస్టు 22 , 2023
    <strong>HBD Anushka Shetty: అనుష్క శెట్టి క్రష్ ఎవరో తెలిసిపోయింది! ఆ హీరో మాత్రం కాదు&nbsp;</strong>
    HBD Anushka Shetty: అనుష్క శెట్టి క్రష్ ఎవరో తెలిసిపోయింది! ఆ హీరో మాత్రం కాదు&nbsp;
    సౌత్‌లో హీరోల మాదిరి క్రేజ్‌ సంపాందించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క (Anushka Shetty). తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేగాక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి సత్తా చాటింది. ఇదిలా ఉంటే ఇవాళ అనుష్క పుట్టిన రోజు. 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె కెరీర్‌లో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; ప్రసిద్ధ తులు కుటుంబం నుండి వచ్చిన అనుష్క నటి అవుతానని ఎప్పడూ అనుకోలేదట. కొన్ని పరిస్థితుల వల్ల నటి కావాల్సి వచ్చిందని ఈ బ్యూటీ చెప్పింది.&nbsp; బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుంచి అనుష్క డిగ్రీ పట్టా అందుకుంది. ఈ కాలేజీలోనే స్టార్ హీరోయిన్స్‌ దీపికా పదుకొనే, అనుష్క శర్మ, మమతా మోహన్ దాస్ వంటి సినీ తారలు చదువుకున్నారు. అనుష్క కళాశాలలో చదువుకునే రోజుల్లో ‘తపస్య‘ అనే ధ్యాన వర్క్ షాపుకు వెళ్తుండేది. ఆమెకు దానిపై ఆసక్తి లేకపోయినప్పటికీ తన తండ్రి విట్టల్ శెట్టి కోసమే ఆ సెషనుకు హాజరయ్యేది.&nbsp; View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) అనుష్క శెట్టి తన గురువు భరత్ ఠాకూర్ చేత యోగాలో మెళుకువలు నేర్చుకుంది. ఆ తర్వాత యోగాను తన వృత్తిగా ఎంచుకుంది. ముంబయిలో కొంతకాలం పాటు యోగా సెషన్లు సైతం నిర్వహించింది. యోగా టీచర్‌గా చాలా బిజీగా ఉన్నప్పుడేే పూరి జగన్నాథ్ డైరక్షన్‌లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో ‘సూపర్‘ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) నిజానికి అనుష్క శెట్టి అసలు పేరు స్విటీ. ‘సూపర్‘ సినిమా సెట్స్‌లో అందరూ ఆమెను స్విటీ అని పిలిచినప్పుడల్లా ఆమెకు ఇబ్బందిగా అనిపించేదట.&nbsp; దీంతో తన పేరును అనుష్క శెట్టిగా మార్చుకోవాలని నిర్ణయించుకుందట. అయితే కుటుంబ సభ్యుల అనుమతి కోసం ఏడాది కాలం పాటు ఈ అమ్మడు వెయిట్‌ చేయాల్సి వచ్చిందట. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) టాలీవుడ్ ఎత్తైన హీరోయిన్లలో అనుష్కశెట్టి ఒకరు. ఆమె ఎత్తు ఏకంగా 5 అడుగుల 9 అంగుళాలు. ఆమె ఏదైనా వేదికపై నిలబడి మాట్లాడేటప్పుడు మన హీరోలు కొందరు ఆమె కన్నా పొట్టిగా కనిపిస్తారు. అనుష్క ఏదైనా విషయంలో ఒత్తిడి కలిగితే దాన్ని అధిగమించడానికి ఒక ఆసక్తికరమైన పని చేస్తుంది. తనకు అత్యంత ఇష్టమైన సామెతలను చదువుతుంది. అలా చేయడం వల్ల వెంటనే రిలాక్స్ అయిపోతానని ఓ ఇంటర్వ్యూలో అనుష్క తెలిపింది. అనుష్క శెట్టి ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లాలన్నా సమయపాలన కచ్చితంగా పాటిస్తుందట. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకుంటుందట. ఇది తన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనుష్క చెప్పింది.&nbsp; రాత్రి వేళ భోజనం కూడా 8 గంటలలోపే పూర్తి చేస్తుందట. దీని వల్ల ఆమెకు మంచి నిద్ర వస్తుందట. అలాగే ఉదయం 7 గంటలలోపు లేచి యోగాతో రోజును ప్రారంభిస్తానని స్వీటి తన సీక్రెట్‌ను రివీల్‌ చేసింది.&nbsp; ఈ యోగా బ్యూటీ అనుష్కకు ఇంగ్లీషులో కవితలు రాయడం అంటే చాలా ఇష్టమట. అలాగే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన వార్తా పత్రికలను సేకరించే అలవాటు కూడా ఉందట. ‘సైజ్‌ జీరో’ సినిమా ముందు వరకూ నాజుగ్గా ఉన్న అనుష్క ఆ మూవీ కోసం బిగ్‌ మిస్టేక్‌ చేసింది. పాత్ర కోసం విపరీతంగా బరువు పెరిగింది. ఆ తర్వాత సన్నబడేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రభావం ఇప్పటికీ అమెను వెంటాడుతోంది.&nbsp; సాధారణంగా హీరోయిన్లకు తమ ఫస్ట్‌ క్రష్‌ హీరోలు ఉంటారు. కానీ అనుష్క శెట్టి ఇందుకు భిన్నం. తన ఫస్ట్ క్రష్‌ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అని ఓ ఇంటర్వూలో రివీల్‌ చేసింది.&nbsp; సినిమాల్లోకి రాకముందు నుంచే రాహుల్‌ అంటే తనకు పిచ్చి అని స్వీటి చెప్పుకొచ్చింది. అయితే రాహుల్‌ ద్రావిడ్‌ను కలిసే అవకాశం పెద్దగా రాలేదని వాపోయింది. 'అరుంధతి' సినిమా అనుష్క ఫిల్మ్‌ కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ సినిమా సక్సెస్‌తోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌ హోదా ఈ అమ్మడు దక్కించుకుంది.&nbsp; ఆ తర్వాతే రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2, భాగమంతి వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసి ఆమె తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.&nbsp; వాస్తవానికి అరుంధతి ఆఫర్‌ నేరుగా తన వద్దకు రాలేదని అనుష్క ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ హీరోయిన్‌ రిజెక్ట్‌ చేయడం వల్లే తనకు కలిసొచ్చిందని తెలిపింది. ఆ హీరోయిన్‌ ఎవరన్న విషయం మాత్రం రివీల్‌ చేయలేదు.&nbsp; అనుష్క ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌తో ఓ బుక్‌ రిలీజైన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ల్యూక్‌ కుతిన్హో రచనలో వచ్చిన 'ది మ్యాజిక్‌ వెయిల్‌ లాస్‌ పిల్‌' అనే బుక్‌లో తన ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ను అనుష్క రివీల్‌ చేసింది. 62 రకాల హెల్త్‌ టిప్స్‌, వెయిట్‌ లాస్‌ టెక్నిక్స్ ఇందులో ఉంటాయి.&nbsp; అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఘాటి’ అనే చిత్రం తెరకెక్కుతోంది. నేడు అనుష్క బర్త్‌డే సందర్భంగా ఉదయం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో స్వీటీ తల, చేతికి రక్తం ఉండగా ఆమె సిగర్‌ తాగుతూ కనిపించింది. సాయంత్ర 4:05 గంటలకు ‘ఘాటి’ స్పెషల్‌ గ్లింప్స్‌ను సైతం మూవీ టీమ్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో అనుష్క కొడవలి పట్టి ఒకరి పీక కోసి తీసుకెళ్తున్నట్లు దారుణంగా చూపించారు. అనుష్కకు అదిరిపోయే మాస్ ఎలివేషన్ ఇచ్చారు.&nbsp; https://www.youtube.com/watch?v=W5FkYULk3Ls
    నవంబర్ 07 , 2024
    <strong>Nivetha Thomas: బరువు పెరగడంపై రిపోర్టర్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన నివేదా థామస్‌!</strong>
    Nivetha Thomas: బరువు పెరగడంపై రిపోర్టర్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన నివేదా థామస్‌!
    టాలీవుడ్‌లో తనకంటూ ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్న హీరోయిన్లలో నివేదా థామస్‌ (Nivetha Thomas) ఒకరు. ఈ అమ్మడు నటించింది తక్కువే సినిమాలే అయినప్పటికీ స్టార్‌ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని క్రేజ్‌ను తెలుగులో సొంతం చేసుకుంది. నివేదా.. ఇప్పటివరకూ యాక్టింగ్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే కనిపించింది. బోల్డ్‌ పాత్రలను అసలు చేయలేదు. దీంతో టాలీవుడ్‌ ఆడియన్స్‌లో ఈ భామకు మంచి గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే.. తన అప్‌కమింగ్‌ ఫిల్మ్‌ '35' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నివేదా థామస్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఈ అమ్మడు ఇచ్చిన కౌంటర్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.&nbsp; ఏం జరిగిందంటే? నివేథ థామస్‌ నటించిన '35&nbsp; చిన్న కథ కాదు' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టు బాడీ షేమింగ్‌ గురించి నివేదాను ప్రశ్నించారు. ‘అనుష్క లేదా మీలాంటి పలువురు ఆర్టిస్టులు బరువు పెరగడం అనేది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. హీరోయిన్‌ అంటే జీరో సైజే అని సోషల్‌ మీడియాలో ఇప్పటికీ వైరల్‌ అవుతోంది. వీటికి ఏం చెప్తారు మీరు? అని మహిళా రిపోర్టర్‌ ప్రశ్నిస్తారు. ఇందుకు నివేదా థామస్‌ బదులిస్తూ.. ‘నేను మీతోనే చెప్పాలి ఇది. ఈ వైరల్‌ అనేది మీకు మాత్రమే వస్తుందేమో.. నాకు తెలీదు. ఈ క్వశ్చన్‌కు నా సింపుల్ ఆన్సర్‌.. 35 అనేది ఈ సెట్‌లో ఉన్న ఎవరి వెయిట్‌ కాదు.. క్యాస్ట్‌లో ఉన్న ఎవరి వెయిట్‌ కాదు.. టెక్నిషియన్స్‌ వెయిట్‌ కాదు' అంటూ నవ్వుతూనే స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే వేయాలంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1808789199795204521 తొలిసారి ‘అమ్మ’ పాత్రలో.. '35 చిన్న కథ కాదు' చిత్రంలో నివేదా థామస్‌తో పాటు విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా థామస్ తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో పాస్‌ మార్కులు కూడా రానందుకు తండ్రి మందలించగా.. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కుమారుడి కోసం తల్లి ఆరాటపడటం లాంటి సన్నివేశాలు తాజా విడుదల చేసిన టీజర్‌లో చూపించారు. మూవీని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మీరు ఓ లుక్కేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=4cq7F7ihsbM నాకు పెళ్లైంది : నివేదా థామస్‌ తనకు పెళ్లంటూ గతంలో నెట్టింట జరిగిన ప్రచారంపై తాజాగా నటి నివేదా థామస్‌ స్పందించారు. టీజర్‌ విడుదల వేడుకలో దీనిపై కూడా మాట్లాడారు. ‘ఈ సినిమా ప్రచారంలో భాగంగా సోషల్‌ మీడియాలో నేను ఓ ఫొటో పోస్ట్‌ చేశా. దాన్ని చూసి చాలామంది నాకు పెళ్లి కానుందని భావించారు. దానిపై వార్తలు రాగా మా అమ్మ నాకు ఆ ఫొటో పంపారు. అవునా అమ్మా.. మీరెప్పుడు నా కోసం అబ్బాయిని చూశారు అని అమ్మని అడిగా’ అని నివేదా తెలిపారు. ఇక ఈ చిత్రంలో తన భర్తగా నటించిన విశ్వదేవ్‌, తన కుమారులుగా నటించిన వారిని ఉద్దేశిస్తూ.. ‘నాకు పెళ్లైంది. ఈయనే నా భర్త. వీళ్లే నా ఇద్దరు పిల్లలు అరుణ్‌, వరుణ్‌’ అంటూ నివేదా సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, హీరో రానా ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1808760891615416465
    జూలై 04 , 2024
    Tollywood Heroines: యంగ్‌ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?
    Tollywood Heroines: యంగ్‌ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?
    స్టార్‌ హీరోల పక్కన యంగ్ హీరోయిన్లు నటించడం మాములే. కానీ స్టార్‌ హీరోయిన్‌ల పక్కన ఓ యంగ్ హీరో నటించడం అరుదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే జరుగుతోంది. స్టార్‌ హీరోయిన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, అనుష్క శెట్టి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌లు యంగ్‌ హీరోలతో జతకడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. వరుస ఫ్లాపులు, చేతిలో సినిమాలు లేకపోవడంతో వీరంతా చిన్న హీరోలతోనూ రొమాన్స్‌ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.&nbsp; సమంత అగ్రకథానాయిక అయిన సమంత.. డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా చేయబోతోంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో చేస్తున్న ‘ఖుషీ’ సినిమా పూర్తికాగనే ఆ చిత్రం పట్టాలెక్కుతుందని టాక్.&nbsp; సమంత - సిద్ధూ జంటగా చేయబోయే సినిమాకు మహిళా డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఏజ్‌ గ్యాప్‌ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ కథను సిద్ధూ సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది.&nbsp; ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమాలోనూ సమంతకు జంటగా యంగ్‌ హీరో దేవ్‌ మోహన్‌ నటిేంచాడు. సినిమా ఫ్లాప్‌ అయినా వీరి మధ్య కెమెస్ట్రీ బాగానే కుదిరినట్లు వార్తలు వచ్చాయి.&nbsp; అనుష్క శెట్టి అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి సినిమాల ద్వారా హీరోయిన్‌ అనుష్క శెట్టి ఎంతో క్రేజ్ సంపాదించింది. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఈ భామ కుడా యంగ్‌ హీరోతో జతకట్టేందుకు సిద్ధమైంది.&nbsp; ‘మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలో యువ హీరో నవీన్‌ పొలిశెట్టికి జోడీగా నటించింది. పి. మహేష్‌ బాబు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాట్రైలర్‌ ఆకట్టుకుంది.&nbsp; వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న అనుష్క కెరీర్‌ను 2015లో వచ్చిన జీరో సైజ్‌ సినిమా దెబ్బతీసింది. సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన అనుష్క తిరిగి తగ్గలేకపోయింది. దీంతో ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.&nbsp; రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మహేష్‌, రవితేజ, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌, తారక్‌, రామ్‌పోతినేని వంటి స్టార్ హీరోలతో జత కట్టిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరిగా ఓ వెలుగు వెలుగింది.&nbsp; గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో రకుల్‌ సింగ్‌ తర్జనభర్జన అవుతోంది. దీంతో యంగ్‌ హీరోలతోనూ సినిమా చేసేందుకు వెనకాడటం లేదు. 2021లో వచ్చిన కొండ పొలం సినిమాలో యంగ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌ సరసన రకూల్ నటించింది.&nbsp; కొండ పొలం సినిమాలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించి రకూల్‌ మెప్పించింది. తెలివిగల గిరిజన యువతి పాత్రలో ఒదిగిపోయింది. వైష్ణవ్‌ - రకూల్‌ జంటకు కూడా మంచి మార్కులే పడ్డాయి.&nbsp; తమన్నా మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో కుర్ర హీరోలతో సైతం నటించేందుకు ఈ బ్యూటీ సై అంటోంది.&nbsp; 2021లో వచ్చిన ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా తమన్నా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడినప్పటికీ వారి జంటకు మాత్రం మంచి పేరే వచ్చింది. కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది.&nbsp; కన్నడలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రానికి రీమేక్‌గా ‘గుర్తుందా శీతాకాలం ’ సినిమా తీశారు. డైరెక్టర్‌ నాగశేఖర్‌ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.&nbsp;
    మే 24 , 2023
    <strong>Vedika Bikini: బికినిలో వేదిక థండర్ థైస్ అందాలు</strong>
    Vedika Bikini: బికినిలో వేదిక థండర్ థైస్ అందాలు
    గ్లామర్‌ బ్యూటీ వేదిక (Vedhika) మరోమారు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తన బికిని ఫొటోలను కుర్రకారు మతిపోగొడుతోంది.&nbsp; తాజాగా ఓ బీచ్‌కు వెళ్లిన వేదిక అక్కడ బికిని (Vedika Bikini Photos)తో హల్‌ చల్‌ చేసింది. ఆ ఫొటోలను నెట్టింట షేర్‌ చేసి అభిమానులకు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.&nbsp; జీరో సైజ్‌లో వేదిక (Vedhika Hot) అందాలు చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆమె సొగసుల సంపద అదిరిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; వేదిక ఫొటోలు నెట్టింట వైరల్ కావడం ఇదే తొలిసారి కాదు. గత కొంతకాలంగా ఈ బ్యూటీ షేర్‌ చేస్తోన్న హాట్‌ ఫొటోలు ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. వేదిక (Vedika Bikini Photos) వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1988 ఫిబ్రవరి 21న కర్ణాటకలో జన్మించింది. బ్రాటప్‌ అంతా ముంబయిలో జరిగింది.&nbsp; కెరీర్‌ ప్రారంభంలో వేదిక (Vedhika) మోడల్‌గా చేసింది. పలు వాణిజ్య సంస్థల ప్రకటనల్లో ఆమె నటించింది. ఆపై సినిమాల్లోకి అడుగుపెట్టింది.&nbsp; తమిళంలో 2006లో వచ్చిన 'మద్రాసి' చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్‌గా మారింది. అందులో అంజలి పాత్రలో నటించి ఆకట్టుకుంది.&nbsp; 2007లో రాఘవ లారెన్స్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ముని సినిమాలో వేదిక నటించింది. ఆ సినిమా తమిళం, తెలుగులో ఒకేసారి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.&nbsp; ఆ తర్వాత కళ్యాణ్‌ రామ్‌ నటించిన 'విజయ దశమి' మూవీతో నేరుగా తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్ద సక్సెస్‌ కాకపోవడంతో తెలుగులో అవకాశాలు లభించలేదు.&nbsp; దీంతో తమిళం, కన్నడ ఇండస్ట్రీపై ఫోకస్‌ పెట్టిన వేదిక అక్కడ వరుసగా చిత్రాలు చేసి మరింత పాపులర్ అయ్యింది.&nbsp; తద్వారా 2009లో నారా రోహిత్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ 'బాణం'లో&nbsp; హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో సుబ్బలక్ష్మీ పాత్రతో తెలుగు ఆడియన్స్‌ను ఫిదా చేసింది.&nbsp; ఆ తర్వాత తమిళంలో బాలా దర్శకత్వంలో చేసిన 'పరదేశి' చిత్రం నటిగా వేదికకు మంచి క్రేజ్‌ తెచ్చిపెట్టింది. అంగమ్మ పాత్రలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది.&nbsp; బాణం సినిమా సక్సెస్‌ అయినప్పటికీ తెలుగులో వేదికకు రెగ్యులర్‌గా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో ఈ అమ్మడు బిజీ అయిపోయింది.&nbsp; అడపాదడపా తెలుగు చిత్రాల్లో నటిస్తూ ఇక్కడి ప్రేక్షకులను సైతం అలరించింది. బాణం తర్వాత&nbsp;దగ్గరగా దూరంగా, రూలర్‌, బంగర్రాజు, రీసెంట్‌గా 'రజాకార్‌' చిత్రాల్లో వేదిక మెరిసింది.&nbsp; ప్రస్తుతం తెలుగులో ఫియర్‌ అనే చిత్రంలో వేదిక&nbsp; (Vedika Bikini Photos) నటిస్తోంది. షూటింగ్‌ పూర్తయ్యి ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూ సోషల్‌ మీడియాలోనూ వేదిక యాక్టివ్‌గా ఉంటోంది. ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 4.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    డిసెంబర్ 09 , 2024
    <strong>Mahesh Babu: ‘మహేష్‌ను చూసి నేర్చుకోండి’.. తమిళ ఆడియన్స్‌ ప్రశంసలు!</strong>
    Mahesh Babu: ‘మహేష్‌ను చూసి నేర్చుకోండి’.. తమిళ ఆడియన్స్‌ ప్రశంసలు!
    టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) ఒకరు. ఈ స్టార్‌ హీరో మంచి మనసు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు తమిళ ఆడియన్స్‌ కూడా మహేష్‌ గురించి తెగ పొగిడేస్తున్నారు. మహేష్‌ చేసిన ఓ పనికి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మహేష్‌ లాంటి జీరో ఇగో హీరోను ఇప్పటివరకూ చూడలేదంటూ ఆకాశానికెత్తుతున్నారు. అసలు మహేష్‌ బాబు ఏం చేశారు? కోలీవుడ్‌ ఫ్యాన్స్‌ ఎందుకు ఆ స్థాయిలో మెచ్చుకుంటున్నారు? ఈ కథనంలో చూద్దాం.&nbsp;&nbsp; ‘రాయన్‌’పై మహేష్‌ రివ్యూ..! ధనుష్‌ (Dhanush) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయన్‌' (Raayan) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన మహేష్‌ బాబు ఎక్స్‌ వేదికగా 'రాయన్‌' టీమ్‌ను అభినందించాడు. ధనుష్‌ సహా ప్రధాన తారాగణం యాక్టింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘అద్భుతమైన దర్శకత్వంతో పాటు మంచి నటనతో ధనుష్‌ అదరగొట్టారు. ఎస్‌జే సూర్య, ప్రకాశ్‌రాజ్‌, సందీప్ కిషన్‌లు ఉత్తమంగా నటించారు. చిత్రంలో ఉన్న ప్రతిఒక్కరూ వందశాతం మంచి నటన కనబరిచారు. మ్యాస్ట్రో ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం మరో అద్భుతం. ‘రాయన్‌’ కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చాడు. అటు మహేష్‌ బాబు పోస్టుపై నటుడు సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) స్పందించాడు. సూపర్‌ స్టార్‌కు ధన్యవాదాలు చెప్పాడు.&nbsp; https://twitter.com/urstrulyMahesh/status/1817979697126588552 ‘జీరో ఈగో’ అంటూ ప్రశంసలు కోలీవుడ్‌ హీరో ధనుష్‌ నటన, డైరెక్షన్‌ స్కిల్స్‌ను మహేష్‌ బాబు మెచ్చుకోవడంపై తమిళ ఆడియన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పక్క ఇండస్ట్రీ నుంచి తమిళ సినిమాను మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కోలీవుడ్‌లో ఎంతో మంది స్టార్స్‌ ఉన్నప్పటికీ సినిమా గురించి ఒక్కరు మాట్లడలేదని కామెంట్స్‌ చేస్తున్నారు. 'జీరో ఈగో'తో మహేష్‌ చేసిన ప్రశంసలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌ మంచి మనసు ఏంటో ఈ పోస్టుతో తమకు అర్థమైందని తమిళ ఫ్యాన్స్‌ పేర్కొంటున్నారు. అటు మహేష్‌ - ధనుష్‌ కాంబోలో ఓ సినిమా పడితే రికార్డ్స్‌ బద్దలేనని అభిప్రాయపడుతున్నారు. అటు తమిళ నటి అపర్ణ బాలమురళి కూడా మహేష్‌ పోస్టుకు ధన్యవాదాలు తెలిపారు.&nbsp; కొత్త సినిమాపై రివ్యూ ఇవ్వాల్సిందే! మహేష్‌ ఓ సినిమాకు రివ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఆయన తనకు నచ్చిన కొత్త సినిమాల గురించి గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో స్పందిస్తూనే ఉన్నారు. ప్రభాస్‌ నటించిన 'కల్కి 2898 ఏడీ'పై కూడా మహేష్‌ ఈ విధంగానే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్, కమల్‌ హాసన్‌ నటనకు డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ఫ్యూచరిక్‌ విజన్‌కు హ్యాట్యాఫ్‌ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. అలాగే 'హరోం హర', 'భజేవాయు వేగం' , ‘ప్రేమలు’ తదితర చిత్రాలపై ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహేష్‌ లాంటి స్టార్‌ హీరో ఒక సినిమాను ప్రశంసించారంటే ఆ మూవీలో ఏదోక ప్రత్యేకత ఉండే ఉంటుందని ఫ్యాన్స్‌ అంటున్నారు. మహేష్‌ రివ్యూ ఇచ్చాడంటే ఆ సినిమా కచ్చితంగా బాగుంటుందని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.&nbsp; ‘SSMB29’తో బిజీ బిజీ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో 'SSMB29' సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో దర్శకధీరుడు రాజమౌళి బిజీ బిజీగా గడుపుతున్నారు. అటు మహేష్‌ సైతం ఈ సినిమా కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. లాంగ్‌ హెయిర్‌తో ముఖాన గడ్డంతో హాలీవుడ్‌ హీరోగా మారిపోయాడు. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మూవీ ఫస్ట్‌ షెడ్యూల్‌ను జర్మనీలో స్టార్‌ చేయనున్నట్లు సమాచారం. అటు ఈ మూవీకి 'ఆజానుబాహుడు', 'మహారాజ్‌', 'GOLD' టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. మహేష్‌ బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న మూవీకి సంబంధించి ఏదోక అప్‌డేట్‌ ఉండొచ్చని అంటున్నారు.&nbsp;
    జూలై 30 , 2024
    <strong>HBD Suriya: సూర్యను ‘వేస్ట్‌ ఫెలో’ అని ఘోరంగా అవమానించారు.. ఎందుకంటే?</strong>
    HBD Suriya: సూర్యను ‘వేస్ట్‌ ఫెలో’ అని ఘోరంగా అవమానించారు.. ఎందుకంటే?
    తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు సూర్య తన మెస్మరైజింగ్‌ నటనతో సౌత్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తండ్రి శివకుమార్‌ తమిళంలో ప్రముఖ నటుడు కావడంతో సూర్య సినీ రంగ ప్రవేశం అంతా సాఫీగా జరిగి ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉండొచ్చు. కానీ నిజం కాదు. సూర్య కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విమర్శల రూపంలో ఒడిదొడుకులు ఎదురైన తట్టుకొని ముందుకు సాగారు. ఇవాళ సూర్య 49వ పుట్టిన రోజు (23 జులై) సందర్భంగా అతడి సినీ ప్రయాణంలోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; సూర్య అసలు పేరు ఇదే! సూర్యకు తల్లిదండ్రులు పెట్టిన పేరు శరవణన్‌. ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) ఆ పేరును సూర్యగా మార్చారు. మణిరత్నం తెరకెక్కించిన ‘దళపతి’ సినిమాలో రజనీకాంత్‌ పాత్ర పేరు కూడా సూర్య కావడం విశేషం. అటు సూర్య తొలి సినిమా ‘నేరుక్కు నేర్‌’లోని ముహూర్తపు సన్నివేశానికి మణిరత్నమే దర్శకత్వం వహించారు. మణిరత్నం నిర్మాతగా వసంత్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో హీరో విజయ్‌ (Vijay)తో కలిసి సూర్య నటించాడు. ఆ ఘటనతో సినిమాలపై అనాసక్తి! సూర్య తండ్రి శివ కుమార్‌ అప్పట్లో తమిళంలో పెద్ద హీరో. తండ్రి ప్రోద్భలంతో రంగస్థల నాటక సంఘంలో చేరిన సూర్య ఓ సందర్భంలో తనని తాను పరిచయం చేసుకునేందుకు వేదిక పైకి వెళ్లారు. నలుగురిలో మాట్లాడేందుకు భయమేసి ‘హలో! ఐయామ్‌ శరవణన్‌, డూయింగ్‌ మై డూకామ్‌’ అన్నారట. దీంతో ఒక్కసారిగా అతిథులందరూ నవ్వారట. షూటింగ్‌ వాతావరణం కూడా ఇలాగే ఉంటుందేమో అని భావించి సినిమాల్లోకి వెళ్లకూడదని సూర్య నిర్ణయించుకున్నారట.&nbsp; రూ.600 జీతంతో ఉద్యోగం హీరోగా నటించిన తండ్రి శివకుమార్‌, సూర్య డిగ్రీ పూర్తయ్యే సరికి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయారు. దీంతో కుటుంబ ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సూర్య ఓ గార్మెంట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. నెలకు రూ.600 చొప్పున రెండు నెలలకు రూ.1200 అందుకున్నాడు. కొన్నాళ్లకు వ్యాపారం పెట్టినా కలిసిరాలేదు. అప్పులపాలు కావడంతో సూర్య సినిమాల్లోకి రాకతప్పలేదు.&nbsp; కెమెరా ఫియర్‌ కెరీర్‌ తొలినాళ్లలో కెమెరా అంటే సూర్య తెగ భయపడిపోయేవారట. డైలాగ్స్‌ చెప్పడం, ఎమోషన్స్‌ చూపించడానికి తెగ ఇబ్బంది పడేవారట. దీంతో ‘వేస్ట్‌ ఫెలో’ అన్న విమర్శలను సూర్య ఎదుర్కొన్నారు. తండ్రి ఎంత మంచి నటుడో కుమారుడు అంత వరస్ట్ అని చిత్ర యూనిట్ నుంచి ఛిత్కారాలను భరించారట. రఘువరన్‌ వ్యాఖ్యలతో మార్పు సూర్య పూర్తి స్థాయి నటుడిగా మారడానికి ప్రధాన కారణం నటుడు రఘువరన్‌. ఓసారి వీరిద్దరూ రైలు ప్రయాణం చేశారు. గాఢ నిద్రలో ఉన్న సూర్యని లేపి ‘ఎలా నిద్రపడుతోందిరా నీకు. ఏం సాధించావని? ఇంకా ఎంతకాలం మీ నాన్న పేరు చెబుతూ ఇండస్ట్రీలో బతుకుతావ్‌?’ అని రఘువరన్‌ అన్నారట. ఆ మాటలకు బాధపడిన సూర్య నటనపై శ్రద్ధ పెట్టారు. ప్రపంచంలోని గొప్ప సినిమాలన్నీ చూసి ఏ హావభావాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చుకున్నారు. తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు షార్ట్‌ డాక్యుమెంటరీ ‘హీరోవా? జీరోవా?’, ‘స్పిరిట్‌ ఆఫ్‌ చెన్నై’వంటి మ్యూజిక్‌ వీడియోల్లోనూ సూర్య నటించారు. ఆస్కార్‌ అవార్డ్స్‌ కమిటీలోకి ఆహ్వానితుడిగా వెళ్లిన తొలి దక్షిణ భారతీయ నటుడు సూర్యనే కావడం విశేషం.&nbsp; సూర్య డబ్బింగ్‌ చెప్పారని తెలుసా! ఇతర హీరోలకు సంబంధించి సూర్య తమిళంలో డబ్బింగ్‌ చెప్పారు. ‘గురు’ (Guru) తమిళ్‌ వెర్షన్‌లో హీరో అభిషేక్‌ బచ్చన్‌కు గాత్ర దానం చేశారు. రానా హీరోగా రూపొందిన ‘ఘాజీ’కి తమిళ్‌లో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. వ్యాఖ్యాత, గాయకుడు, నిర్మాత ఇలా ప్రతి విభాగంలో సూర్య తనదైన మార్క్‌ చూపించారు. అవార్డులే అవార్డులు 27 ఏళ్ల నట ప్రస్థానంలో సూర్య జాతీయ అవార్డు (సూరారై పోట్రు) సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. బెస్ట్‌ యాక్టర్‌, బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌, బెస్ట్‌ యాక్టర్‌ (క్రిటిక్స్‌ ఛాయిస్‌) విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్నారు. సూర్య కెరీర్‌లో ఇప్పటివరకూ 6 ఫిల్మ్‌ఫేర్స్‌, 5 తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌, 2 సినిమా ఎక్స్‌ప్రెస్‌ అవార్డ్స్‌, 2, ఎడిసన్‌ అవార్డ్స్‌, 2 సైమా అవార్డ్స్‌, 6 విజయ్ అవార్డ్స్‌ అందుకున్నారు.&nbsp; సేవా కార్యక్రమాలు మంచి మనసు కలిగిన సూర్య ‘అగరం ఫౌండేషన్‌’ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేద పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్య అందిస్తూ వారిలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు. ఇప్పటివరకు వేల సంఖ్యలో విద్యార్థులకి సూర్య సాయమందించారు. ‘జై భీమ్‌’ సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో కలిసి ‘అగరం ఫౌండేషన్‌’ను ప్రారంభించడం గమనార్హం. ‘కంగువా’గా రాబోతున్న సూర్య&nbsp; సూర్య తాజా చిత్రం ‘కంగువా’ (Kanguva) అక్టోబరు 10న విడుదల కానుంది. అటు తన 44వ సినిమాని సూర్య ఇటీవల ప్రారంభించారు. ‘Suriya 44’ వర్కింగ్‌ టైటిల్‌తో దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
    జూలై 23 , 2024
    Comedian Satya: స్టార్‌ కమెడియన్‌గా అవతరిస్తున్న సత్య.. మరో బ్రహ్మానందం అవుతాడా?
    Comedian Satya: స్టార్‌ కమెడియన్‌గా అవతరిస్తున్న సత్య.. మరో బ్రహ్మానందం అవుతాడా?
    ప్రముఖ కమెడియన్‌ సత్య పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్మోగుతోంది. తాజాగా విడుదలైన ‘మత్తు వదలరా 2’ చిత్రంలో సత్య కామెడీ హిలేరియస్‌గా ఉందంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తెలుగులో స్టార్‌ కమెడియన్‌గా సత్య స్థిరపడిపోతాడంటూ పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఈ జనరేషన్‌ కమెడియన్స్‌లో సత్య మరో బ్రహ్మానందంగా మారతారంటూ నెట్టింట విస్తృతంగా పోస్టులు కనిపిస్తున్నాయి. దశాబ్దంన్నర పాటు సత్య పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం లభిస్తోందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రీలో సత్య దూకుడు చూస్తుంటే మిగతా కమెడియన్లు సైడ్ ‌అవ్వాల్సిందేనన్న టాక్‌ వినిపిస్తోంది.&nbsp; సత్య వన్‌ మ్యాన్‌ షో! శుక్రవారం రిలీజైన 'మత్తు వదలరా 2' చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు కమెడియన్‌ సత్యను ఆకాశానికెత్తుతున్నారు. ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులున్నా, హీరో శ్రీ సింహా అయినా అంద‌రూ స‌త్య గురించే మాట్లాడుకుంటున్నారు. మ‌త్తువ‌ద‌ల‌రాతో పోలిస్తే స్క్రిప్టు వీక్ అయినా సినిమాలో వేరే ఆక‌ర్ష‌ణ‌లు అంత‌గా పేల‌క‌పోయినా స‌త్య కామెడీ మాత్రం భ‌లే వ‌ర్క‌వుట్ అయింది. తొలి సీన్ నుంచి చివ‌రి వ‌ర‌కు ప్ర‌తి సీన్లోనూ స‌త్య న‌వ్వించాడు. ముఖ్యంగా సినిమాలోని ‘16 ఏళ్ల వయసు’ పాటలో సత్య డ్యాన్స్‌కు భీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో చాలా మైనస్‌లు ఉన్నప్పటికీ సత్య తన కామెడీతో వాటన్నింటిన సైడ్‌ చేసేశాడని వీక్షకులు అంటున్నారు. సత్య ఇలాంటి పర్‌ఫార్మెన్స్ తన తర్వాతి చిత్రాల్లోనూ చేస్తే స్టార్‌ కామెడియన్‌గా స్థిర పడటం ఖాయమని అంటున్నారు.&nbsp; 15 ఏళ్ల కృషి.. క‌మెడియ‌న్‌గా దాదాపు ద‌శాబ్దంన్న‌ర కింద‌ట్నుంచి సత్య ఇండ‌స్ట్రీలో ఉన్న‌ప్ప‌టికీ స‌రైన బ్రేక్ రావ‌డానికి చాలా ఏళ్లే ప‌ట్టింది. సునీల్ త‌ర్వాత అలాంటి టిపిక‌ల్ కామెడీ టైమింగ్‌తో చూడ‌గానే న‌వ్వు తెప్పించే క‌మెడియ‌న్ స‌త్య‌ చాలా ఏళ్ల పాటు అత‌ను చిన్న చిన్న పాత్ర‌ల‌తోనే నెట్టుకొచ్చాడు. ఐతే గ‌త కొన్నేళ్ల నుంచి నెమ్మ‌దిగా అత‌ను ఎదుగుతున్నాడు. మంచి క్యారెక్ట‌ర్ ప‌డిన ప్ర‌తిసారీ అదిరిపోయే కామెడీతో సినిమాకు ఆక‌ర్ష‌ణ‌గా మారుతున్నాడు. ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’, ‘రంగ‌బ‌లి’, ‘బెదురులంక 2012’, ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ లాంటి సినిమాల్లో త‌న కామెడీతో క‌డుపుబ్బ న‌వ్వించాడు. హీరోగా చేసిన ‘వివాహ భోజ‌నంబు’లో న‌వ్వించ‌డంతో పాటు క‌న్నీళ్లు సైతం పెట్టించాడు. గ‌తంతో పోలిస్తే చాలా బిజీ అయిన‌ప్ప‌టికీ త‌న టాలెంటుని పూర్తిగా వాడుకునే సినిమా రాలేదు. ఇప్పుడు ‘మ‌త్తువ‌ద‌ల‌రా-2’ సత్యకు ఆ లోటును తీర్చింద‌నే చెప్పాలి. సత్యపై డైరెక్టర్ల ఫోకస్‌! ప్రతీ సినిమాకు గ్రాఫ్‌ పెంచుకుంటూ దూసుకెళ్తున్న సత్యపై టాలీవుడ్‌ డైరెక్టర్ల దృష్టి పడినట్లు తెలుస్తోంది. పలువురు స్టార్ డైరెక్టర్లు తమ సినిమాలో అతడి ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుండటంతో సత్యతో సెపరేట్ కామెడీ ట్రాక్‌ పెట్టించే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల రవితేజ, హరీష్ శంకర్‌ కాంబోలో వచ్చిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రంలోనూ సత్యకు ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ దక్కింది. ఇందులో సత్య కామెడీ ఆకట్టుకున్నప్పటికీ సినిమా ఫ్లాప్‌ కావడంతో పెద్దగా గుర్తింపు లభించలేదు.&nbsp; ఆ కమెడియన్లకు గట్టి పోటీ! ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా మంది కమెడియన్లు ఉన్నారు. సీనియర్‌ హాస్య నటుడు అలీ, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, గెటప్‌ శ్రీను, సప్తగిరి, చమ్మక్‌ చంద్ర, తాగుబోతు రమేష్‌, ధన్‌రాజ్‌ తదితరులు వరుసగా సినిమాలు చేస్తూ స్టార్లుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సునీల్‌ సైతం హీరోగా మానేసి కమెడియన్‌గా, విలన్‌గా సినిమాలు చేస్తున్నారు. అయితే వీరందరికీ కమెడియన్‌ సత్య నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సత్య గ్రాఫ్‌ దృష్ట్యా దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్‌ అతడు అవుతాడని అంటున్నారు. కాబట్టి టాలీవుడ్‌లోని ఇతర హాస్య నటులు సైతం తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించకపోతే సినిమా అవకాశాలు సన్నగిల్లే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 14 , 2024
    <strong>Pushpa 2 : మళ్లీ గెలుక్కునేందుకు సిద్ధమైన బన్నీ ఫ్యాన్స్.. అవసరమా?</strong>
    Pushpa 2 : మళ్లీ గెలుక్కునేందుకు సిద్ధమైన బన్నీ ఫ్యాన్స్.. అవసరమా?
    అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా వేదికగా అల్లు అర్మీ (Allu Army), మెగా ఫ్యాన్స్‌ (Mega Fans) ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ‘పుష్ప 2’ చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేస్తామంటూ కూడా మెగా ఫ్యాన్స్‌ వార్నింగ్‌లు సైతం ఇస్తున్నారు. అయితే అల్లు వర్సెస్‌ మెగా వివాాదాని (Allu Vs Mega Families)కి కేంద్రంగా మారిన ప్రాంతం ఏపీలోని నంద్యాల. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా బన్నీ ఆ ఏరియాలో ప్రచారం చేయడాన్ని మెగా ఫ్యాన్స్‌, జన సైనికులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి బన్నీని టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. ఇదిలాఉంటే తాజాగా నంద్యాలలోని బన్నీ ఫ్యాన్స్ అత్యవసర మీటింగ్‌కు పిలుపునిచ్చారు. దీంతో నంద్యాల కేంద్రంగా మరో రచ్చ మెుదలవుతుందా అన్న అనుమానాలు మెుదలయ్యాయి.&nbsp; మీటింగ్‌ అందుకేనా! ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ (Allu Vs Mega Families) ఒక చోట సమావేశం కాబోతున్నారు. ఆత్మకూరు రోడ్డులోని చెరువుకట్ట ప్రాంతంలో గురువారం ఉదయం 10:30కు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను నంద్యాల ట్విటర్ హ్యాండిల్స్‌ ద్వారా ట్రెండింగ్‌ చేస్తున్నారు. అయితే మెగా - అల్లు ఫ్యామిలీ రచ్చకు కారణమైన నంద్యాలలో ఫ్యాన్స్ ఈ మీటింగ్‌ పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశం ద్వారా మరో వివాదానికి వారు తెరలేపుతారా? అన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 'పుష్ప 2' సినిమా నేపథ్యంలోనే ఈ భేటి జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్‌ కోసం తమ అభిమాన హీరోకు ఏ విధంగా సాయపడాలి? ఎలా అండగా నిలవాలి? మెగా ఫ్యాన్స్ చేస్తున్న నెగిటివ్‌ ప్రచారాన్ని ఎలా అడ్డుకోవాలి? అన్న దానిపై ఈ మీటింగ్‌లో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.&nbsp; https://twitter.com/NandyalTimes/status/1861659960972632065 నంద్యాల ఘటన గుర్తుందా? ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి&nbsp; మద్దతు&nbsp; తెలపడానికి ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ నంద్యాలకు వెళ్లారు. దీంతో అప్పట్లోనే బన్నీ వ్యవహార శైలి ఏపీ రాజకీయాలతో పాటు, తెలుగు చిత్ర పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది. శిల్పా రవి భార్య నాగిని రెడ్డి.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి క్లాస్ మెట్స్. అలా శిల్పా రవితో బన్నీకి పరిచయం ఏర్పడి స్నేహాంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో శిల్పా రవికి బన్నీ ట్విటర్‌ ద్వారా ‘ఆల్‌ ది బెస్ట్‌’ తెలిపి ఊరుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం కూడా సాధించారు. ఈసారి కూడా వైకాపా తరపున శిల్పా రవి బరిలో ఉండటంతో బన్నీ నేరుగా రంగంలోకి దిగాడు. మామయ్య పవన్‌ కల్యాణ్ గెలుపును కాంక్షిస్తూ ట్విటర్‌లో ఒక పోస్టు మాత్రమే పెట్టిన బన్నీ పవన్‌ ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి కోసం స్వయంగా రావడం పొలిటికల్‌ వర్గాల్లో (Allu Vs Mega Families) హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా, నంద్యాలలో బన్నీ మద్దతిచ్చిన వ్యక్తి ఓడిపోగా కూటమి అభర్థి, టీడీపీ నేత ఫరూఖ్‌ ఘన విజయం సాధించారు.&nbsp; https://twitter.com/aaa_cinemas/status/1789215453405208730 ‘కిస్సిక్‌’ నేపథ్యంలోనూ బన్నీపై ట్రోల్స్‌! నంద్యాల ఘటన నుంచి బన్నీని టార్గెట్‌ చేసిన మెగా ఫ్యాన్స్‌ (Allu Vs Mega Families) అతనిపై విపరీతంగా ట్రోల్స్‌ చేస్తున్నారు. బన్నీ తాజా చిత్రం ‘పుష్ప 2’ రిలీజ్‌కు రెడీ అయిన నేపథ్యంలో ఈ ట్రోల్స్‌ మరింత ఎక్కువయ్యాయి. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఐటెం సాంగ్‌ ‘కిస్సిక్‌’ను ఆధారంగా చేసుకొని ఓ ఎడిటింగ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ సందర్భంగా స్టార్‌ హీరోయిన్స్ రష్మిక మందన్న, శ్రీలీలను బన్నీ ఆలింగనం చేసుకోగా కిస్సిక్‌ లిరిక్స్‌ను వాటికి మ్యాచ్‌ అయ్యేలా ఎడిట్‌ చేశారు. ‘దెబ్బలు పడతాయిరో మామా’ గత చిత్రాల్లో బన్నీపై చేయిచేసుకున్న వీడియోలను దానికి జత చేశారు. ప్రస్తుతం ఈ ఎడిటింగ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/Jalsa44/status/1860990666245091594 బన్నీ ఇన్‌స్టా పోస్టుపై వివాదం సోషల్‌ మీడియాలో బన్నీ, పవన్ ఫ్యాన్స్ మధ్య పెద్ద ఎత్తున వార్‌ జరుగుతోంది. ఇటీవల చెన్నైలో జరిగిన 'పుష్ప 2' ప్రమోషనల్‌ ఈవెంట్‌లోని పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు కనిపించాయి. ఏం పీకలేరు బ్రదర్‌ అంటూ 'పీకే' (పవన్‌ కల్యాణ్‌) హైలెట్ చేస్తూ ఇంగ్లీష్‌ టెక్ట్స్‌లో ఉన్న ఓ ఫ్లకార్డ్ చర్చనీయాంశంగా మారింది. అయితే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ శ్రీలీలతో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా అందులో పోస్టర్‌ కనిపించింది. అయితే ఇది యాదృచ్చికంగా జరిగిందా? కావాలనే బన్నీ పెట్టాడా? అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. అయితే ఈ పోస్టును చూసి పవన్ ఫ్యాన్స్ మరోమారు బన్నీపై రెచ్చిపోయారు. అటు అల్లు ఆర్మీ సైతం స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వడం మెుదలుపెట్టింది. ఇది గమనించిన బన్నీ ఆ ఫ్లకార్డ్‌ను తీసేసి క్రాప్‌ ఇమేజ్‌ను మరోమారు ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అయితే జరగాల్సిన ఫ్యాన్‌ డ్యామేజ్ అంతా అప్పటికే జరిగిపోయిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. https://twitter.com/7theDestroyeRRR/status/1860759885773942867
    నవంబర్ 28 , 2024
    <strong>Bollywood Vs South Industries: బాలీవుడ్‌ - సౌత్‌ ఇండస్ట్రీల మధ్య కోల్డ్‌వార్‌ మెుదలైందా?</strong>
    Bollywood Vs South Industries: బాలీవుడ్‌ - సౌత్‌ ఇండస్ట్రీల మధ్య కోల్డ్‌వార్‌ మెుదలైందా?
    బాలీవుడ్‌ వర్సెస్‌ సౌతిండియాగా ప్రస్తుత పరిస్థితులు పరిణమిస్తున్నాయి. సౌతిండియా చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుండటాన్ని కొందరు బాలీవుడ్ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు జాతీయ స్థాయి అవార్డులు ఎక్కువగా హిందీ చిత్రాలకే వచ్చేవి. కలెక్షన్ల పరంగానూ అందనంత ఎత్తులో ఉండేవి. అయితే గత కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా బాహుబలి తర్వాత నుంచి సౌత్ సినిమాల హవా ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద గణనీయంగా పెరిగింది. అదే సమయంలో బాలీవుడ్‌లో ఒకట్రెండు మినహా సంచలనం సృష్టించిన సినిమాలు రిలీజ్‌ కాలేదు. దీంతో బాలీవుడ్‌ నటుల్లో సౌత్‌ సినిమాలపై అసహనం, అసంతృప్తి పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటుడు అర్షిద్ వర్సి హీరో ప్రభాస్‌ పలుష పదజాలాన్ని ఉపయోగించడం వివాదస్పదమైంది. తాజాగా సౌతిండియన్‌ స్టార్‌ బాలీవుడ్‌ సినిమాలపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో బాలీవుడ్‌ - సౌత్ ఇండస్ట్రీల మధ్య కోల్డ్ వార్‌ మెుదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.&nbsp; ‘బాలీవుడ్‌ మన దేశాన్ని తక్కువ చేస్తోంది’ కన్నడ స్టార్‌ హీరో రిషబ్‌ శెట్టి బాలీవుడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో బాలీవుడ్‌ మన దేశాన్ని తక్కువ చేసి చూపించిందన్నారు. తాను దేశం గర్వపడేలా సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్‌శెట్టి బాలీవుడ్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘కొన్ని భారతీయ సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్‌ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి. మన చిత్రాలను గ్లోబల్‌ ఈవెంట్‌లకు ఆహ్వానిస్తారు. రెడ్‌ కార్పెట్‌ వేస్తారు. అందుకే నేను దేశం గురించి గర్వంగా మాట్లాడేలా చేయాలనుకుంటున్నా. నా దేశం, నా రాష్ట్రం, నా భాష వీటన్నిటి గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా’ అని రిషబ్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో కొందరు నెటిజన్లు రిషబ్‌ను సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. గతంలో ఆయన నటించిన కొన్ని సినిమాల్లోని సన్నివేశాలను షేర్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1826135635754631603 ప్రభాస్‌పై బాలీవుడ్‌ నటుడు అక్కసు బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ (Arshad Warsi) తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడారు. 'కల్కి 2898 ఏడీ' చిత్రం గురించి ప్రస్తావిస్తూ హీరో ప్రభాస్‌పై తనకున్న ఈర్ష్యను వెళ్లగక్కారు. ‘క‌ల్కి’ తాను చూశానని మూవీ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని అర్షద్‌ చెప్పారు. బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌ అశ్వత్థామతో పోలిస్తే ప్రభాస్‌ పాత్ర తేలిపోయిందన్నారు. ప్రభాస్‌ను తెరపై చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని విచారం వ్యక్తం చేశారు. ‘ప్రభాస్‌.. ఈ మాట చెప్పడానికి బాధగా ఉంది. ఎందుకో ఆయన లుక్‌ జోకర్‌లా ఉంది. మ్యాడ్‌ మ్యాక్స్‌ తరహా మూవీలో చూడాలనుకుంటున్నా. అక్కడ మెల్‌ గిబ్సన్‌లా నిన్ను చూడాలి. ఎందుకు ఇలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు’ అని అన్నారు. అర్షద్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రభాస్‌ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. https://twitter.com/i/status/1825097374680621099 తెలుగు హీరోల స్ట్రాంగ్‌ కౌంటర్‌ ప్రభాస్‌పై అర్షద్‌ వార్సీ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు తనదైన శైలిలో స్పందించాడు. విమర్శించడం తప్పు కాదని అయితే నోరు పారేసుకోవడం ముమ్మాటికీ తప్పే అంటూ ఎక్స్‌ వేదికగా మండిపడ్డాడు. ఇలాంటి ప్రొఫెషనలిజం లేని మాటలు అర్షద్‌ వార్సీ నోటి నుంచి వస్తాయని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నాడు. ఇలాంటి చిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్లు చేసే కామెంట్స్‌ స్టాట్యూ లాంటి ప్రభాస్‌ను తాకలేవని స్పష్టం చేశాడు.&nbsp; అటు యువ నటుడు ఆది సాయికుమార్‌ సైతం అర్షద్‌ వ్యాఖ్యలను తప్పుబట్టాడు.&nbsp; అర్షద్‌ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా మండిపడ్డారు. ‘ఎటువంటి అభద్రతాభావం లేని నటుడు ప్రభాస్ అన్న. ఆయన లేకపోతే అసలు కల్కి సినిమాయే లేదు. నిజానికి తన రోల్ చాలా అద్భుతంగా ఉందనిపించింది. ఆయనంటే అసూయేమో’ అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు.&nbsp; https://twitter.com/isudheerbabu/status/1825746561495871657 https://twitter.com/iamaadisaikumar/status/1825250706938380360 బాలీవుడ్‌కు ఏమైంది? : అల్లు అర్జున్‌ గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంటున్నాయి.&nbsp; ఈ విషయంపై బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు నిఖిల్‌ అడ్వాణీ ఇటీవల స్పందించారు. బాలీవుడ్‌ సినిమాపై అల్లు అర్జున్‌ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలను పంచుకున్నారు. ‘గతంలో అల్లు అర్జున్‌తో నేనొక సినిమా చేయాలనుకున్నా. అందుకోసం ఆయన్ని కలిశా. బాలీవుడ్‌ పరిస్థితిపై ఆయన నిరాశ వ్యక్తంచేశారు. ‘బాలీవుడ్‌కు ఏమైంది? హీరోలను ఎలా చూపించాలో మీరెందుకు మర్చిపోయారు?’ అని అడిగారు. ఆయన చెప్పింది నిజమే దక్షిణాది చిత్రాల్లో హీరోయిజం, అందులోని కీలక భావోద్వేగాలను చక్కగా చూపిస్తారు. ఆవిధంగా ప్రేక్షకులను కథకు కనెక్ట్ అయ్యేలా చేస్తారు. ఒకానొక సమయంలో బాలీవుడ్‌లో అలాంటి చిత్రాలు ఎన్నో వచ్చాయి. మంచి విజయాన్ని అందుకున్నాయి. నేడు హిందీ సినిమాల్లో అది లోపించింది’ అని నిఖిల్‌ అన్నారు.&nbsp;
    ఆగస్టు 21 , 2024
    Pushpa 2 : మళ్లీ పవన్ ఫ్యాన్స్‌ను గెలికిన బన్నీ.. ఏకిపారేసిన గరికపాటి!
    Pushpa 2 : మళ్లీ పవన్ ఫ్యాన్స్‌ను గెలికిన బన్నీ.. ఏకిపారేసిన గరికపాటి!
    అల్లు అర్జున్‌ (Allu Arjun), మెగా ఫ్యామిలీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంత వివాదాలు ఉన్నాయని గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా ‘మట్కా’ ప్రమోషన్స్ సందర్భంగా వరుణ్‌ తేజ్‌ చేసిన కామెంట్స్‌ ఇందుకు మరింత ఊతం ఇచ్చాయి. ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌ ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తికి అల్లు అర్జున్‌ స్వయంగా వెళ్లి మద్దతు తెలపడం ఈ మెగా - అల్లు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్‌, అల్లు అర్మీ రెండుగా చీలిపోయి సోషల్‌ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అల్లు అర్జున్‌ చేసింది కరెక్ట్‌ కాదని పలువురు సినీ పెద్దలు, రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే అదే వైసీపీ నేతకు తాజాగా అల్లు అర్జున్‌ థ్యాంక్స్‌ చెప్పారు. మెగా ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టడానికే బన్నీ ఇలా చేశాడన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.&nbsp; అసలేం జరిగిందంటే? ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించిన 'పుష్ప 2' (Pushpa 2) మరో రెండు వారాల్లో వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. సుకుమార్‌ - బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం దేశంలోని యావత్‌ సినీలోకం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్&nbsp; (Pushpa 2 Trailer)) రిలీజ్‌ కాగా దానికి ఆడియన్స్ నుంచి విశేష స్పందన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో 'పుష్ప 2' గురించి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి (Silpa Ravi Chandra Kishore Reddy) స్పందించారు. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. థియేటర్లలో వైల్డ్‌ ఫైర్‌ను చూసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎక్స్‌లో పోస్టు చేశారు. అలాగే మూవీ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ సైతం చెప్పారు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్‌ 'థాంక్యూ బ్రదర్‌.. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు' అంటు రిప్లే ఇచ్చాడు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. https://twitter.com/alluarjun/status/1859428674535030932 మెగా ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాడా? ‘డీజే: దువ్వాడ జగన్నాథం’ సినిమాకు ముందు వరకు తన ప్రతీ సినిమా ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌, మెగాస్టార్‌ చిరంజీవి గురించి బన్నీ (Allu Arjun) మాట్లాడుతూ వారిని ఆకాశానికెత్తారు. తొలిసారి డీజే ప్రమోషనల్‌ ఈవెంట్‌లో పవన్‌ గురించి ‘చెప్పను బ్రదర్‌’ అనడంతో మెగా ఫ్యాన్స్‌ అంతా షాకయ్యారు. ఆ తర్వాత ‘డీజే’ సినిమాపై నెగిటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేసి వదిలేశారు. అయితే ఏపీ ఎలక్షన్స్‌ టైమ్‌లో పవన్‌ ప్రత్యర్థి పార్టీ వైకాపా అభ్యర్థిగా ఉన్న శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డికి బన్నీ మద్దతు తెలిపడం, స్వయంగా నంద్యాల వెళ్లి ఓటు వేయాలని అక్కడి ప్రజలను అభ్యర్థించడం మెగా ఫ్యాన్స్‌, జనసైనికులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి బన్నీని హేట్‌ చేయడం ప్రారంభించారు. బన్నీని విపరీతంగా ట్రోల్స్‌ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు కూాడా. అటు అల్లు అర్మీ సైతం వారికి గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఇప్పుడు మరోమారు శిల్పా రవి రెడ్డికి థ్యాంక్స్‌ చెప్పి మరోమారు మెగా ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మెుదట శిల్పా రవి రెడ్డి పోస్టు చేశారని, దానికి బన్నీ రిప్లే మాత్రమే ఇచ్చారని అల్లు ఫ్యాన్స్ సమర్థించుకుంటున్నారు.&nbsp; వైసీపీ నేతతో స్నేహం ఎలా కుదిరింది? నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి భార్య నాగిని రెడ్డి.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి క్లాస్ మెట్స్. అలా శిల్పా రవితో బన్నీకి పరిచయం ఏర్పడి స్నేహాంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో శిల్పా రవికి బన్నీ ట్విటర్‌ ద్వారా ‘ఆల్‌ ది బెస్ట్‌’ తెలిపి ఊరుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం కూడా సాధించారు. ఈసారి కూడా వైకాపా తరపున శిల్పా రవి బరిలో ఉండటంతో బన్నీ నేరుగా రంగంలోకి దిగాడు. మామయ్య పవన్‌ కల్యాణ్ గెలుపును కాంక్షిస్తూ అప్పట్లో ఒక ట్వీట్‌ పెట్టి మాత్రమే ఊరుకున్న బన్నీ, ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి కోసం స్వయంగా వెళ్లడం పొలిటికల్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా, నంద్యాలలో కూటమి అభర్థిగా టీడీపీ నేత ఫరూఖ్‌ బరిలోకి దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు.&nbsp; ఐటెం సాంగ్‌పై క్రేజీ అప్‌డేట్‌! డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల (Sreeleela) ‘పుష్ప 2’ చిత్రంలో 'కిస్సిక్‌' అనే ఐటెం సాంగ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ స్పెషల్‌ సాంగ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. నవంబర్‌ 23న 'కిస్సిక్‌' లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన సైతం రాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ పాటలో అల్లు అర్జున్ (Allu Arjun), శ్రీలీల తమ స్టెప్పులతో దుమ్మురేపారని ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. ఈ పాట కోసం శ్రీలీల రూ.2 కోట్ల రెమ్యూనరేషన్&nbsp; (Sreeleela Remuneration) తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. 'పుష్ప'లోని ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ సాంగ్‌ కంటే 'కిస్సిక్‌' ఇంకా పెద్ద హిట్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. బన్నీపై గరికపాటి ఫైర్‌ 'పుష్ప 2' సినిమా రిలీజ్‌కి దగ్గరపడుతున్న వేళా సోషల్ మీడియాలో కొత్త రచ్చ మొదలైంది. గతంలో ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు (Garikipati Narasimha Rao) 'పుష్ప' సినిమాపై చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. 'పుష్ప' లాంటి సినిమాలు సమాజానికి హానికరమని 2021లో గరికపాటి నరసింహారావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియోను తెరపైకి తీసుకొచ్చి కొందరు ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ ‘ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంతవరకూ సమంజసం. సినిమా మొత్తం స్మగ్లింగ్‌ చూపించి చివరలో మంచిగా చూపిస్తాం తదుపరి భాగం వరకూ వేచి చూడండి అంటారు. ఇది ఎంతవరకూ న్యాయం. ఈలోపు సమాజం‌ చెడిపొవాలా? స్మగ్లింగ్‌ చేసే వ్యక్తి తగ్గేదే లే‌ అంటాడా?. ఈ డైలాగ్‌ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. తగ్గేదే లే అనేది హరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటి వారు వాడాలి. అంతేకానీ స్మగ్లర్లు కాదు’ అంటూ మండిపడ్డారు. https://twitter.com/i/status/1859501799511843292
    నవంబర్ 21 , 2024
    <strong>The Raja Saab: ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. ఏమిటంటే?</strong>
    The Raja Saab: ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. ఏమిటంటే?
    వరుస హిట్లతో మంచి జోష్‌లో ఉన్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. ఫ్యాన్స్‌కు మరో సర్‌ఫ్రైజ్ ట్రీట్ ఇచ్చారు. ఆయన నెక్స్ట్‌ చిత్రం రాజా సాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డెట్‌ను&nbsp; ఈరోజు సాయంత్రం 5.03 గంటలకు చిత్ర బృందం రివీల్ చేసింది. గ్లింప్స్‌ ఎలా ఉందంటే? &nbsp;కలర్‌ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్‌లో బైక్‌పై వచ్చిన&nbsp; ప్రభాస్ లుక్ అదిరిపోయింది.&nbsp; డార్లింగ్ గెటప్‌లో ప్రభాస్ హ్యండ్సమ్‌గా కనిపించారు. ప్లవర్ బొకేతో బైక్ దిగి మెస్మరైజ్ చేశాడు. బొకేలోని ప్లవర్స్‌ తెంపి ఓ కారు అద్దంలో తన అందం చూసుకుంటూ దిష్టి తీసుకోవడం అదిరిపోయింది. https://www.youtube.com/watch?v=YFZMBqyXkqQ పాన్ ఇండియన్ రెబల్ స్టార్ వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్నారు. ఫ్యాన్స్‌కు కావాల్సిన కంటెంట్‌పై ఫోకస్ పెడుతూ చక్కని విజయాలు అందుకుంటున్నారు. సలార్, కల్కి2898ఏడి విజయాలతో ఇండియాలో నంబర్ వన్ హీరోగా ఎదిగారు. కల్కి చిత్రం రూ. 1100 కోట్లు క్రాస్ చేసిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ హరర్‌ జనర్‌లో.. కల్కి సక్సెస్‌ నుంచి బయటకు వచ్చిన డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న రాజా సాబ్‌ షూటింగ్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. కల్కి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న స్పిరిట్‌లో నటించాల్సి ఉండగా.. ప్రభాస్ చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న రాజా సాబ్‌కే ఓటు వేసినట్లు తెలుస్తోంది. వరుసగా మాస్ యాక్షన్ చిత్రాలతో అలరించిన డార్లింగ్, కాస్త వాటికి విరామం ఇచ్చి రొమాంటిక్&nbsp; జనర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే కల్కి తర్వాత రాజా సాబ్ చిత్రాన్నే తొలుత విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం రొమాంటిక్ హరర్‌ జనర్‌లో తెరకెక్కుతోంది. సాయంత్రం 5 గంటలకు సర్‌ప్రైజ్ ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను,&nbsp; అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే రాజా సాబ్‌ సినిమాకు సంబంధించిన&nbsp; గ్లింప్స్ ను సోమవారం (జులై 29 ) సాయంత్రం 5:03 గంటలకి రిలీజ్ చేసి మేకర్స్ సర్‌ప్రైజ్ చేశారు. గ్లింప్స్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. హ్యాండ్సమ్ లుక్ బాగుందని పోస్ట్‌ చేస్తున్నారు. గ్లింప్స్‌లో బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్‌ కూడా సూపర్బ్‌గా ఉందని కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.&nbsp; ఆ హిందీ సాంగ్ రీమిక్స్ 'రాజా సాబ్‌' (Raja Saab) చిత్రంలో ఒకప్పటి సూపర్ హిట్‌ హిందీ సాంగ్‌ను రీమిక్స్‌ చేయాలని డైరెక్టర్‌ మారుతీ భావిస్తున్నారట. ఈ విషయమై మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌తో మారుతి చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మేకర్స్ పరిశీలనలో మూడు పాటలు ఉన్నాయట. వాటిలో ఒకటి ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ 'ఓ కైకే పాన్‌ బనారస్‌ వాలా' పాటను రీమేక్‌ చేసే అవకాశముందని సినీ వర్గాల్లో స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో.. మరోవైపు ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడితో ప్రభాస్‌ ఓ ప్రాజెక్ట్‌పై సైన్ చేశారు. ఆ సినిమా టైటిల్‌ను 'ఫౌజి'గా కూడా ఖరారు చేసినట్లు వార్తలు ఉన్నాయి.‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనులకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రభాస్‌ 'ఫౌజి'కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రం షూటింగ్‌ పనులను అక్టోబర్‌లో మొదలు పెట్టేందుకు డైరెక్టర్‌ హను రాఘవపూడి (Hanu Raghavapudi) సన్నాహాలు మెుదలుపెట్టినట్లు సమాచారం.&nbsp; ఫౌజి చిత్రం, ఓ పిరియాడికల్‌ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో బ్రిటిష్‌ కాలం నాటి సినిమాగా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కనిపించే అవకాశం ఉన్నట్టు టాక్. ఇక ఫౌజీ అంటే జవాన్‌ అని అర్థం. కాబట్టి ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపిస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అతి భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమైంది. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి అధికారిక అప్‌డేట్స్‌ త్వరలో రావొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp;
    జూలై 29 , 2024
    Pushpa 2: ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ‘పుష్ప 2’ పరిస్థితి? కలెక్షన్స్ భారీగా పడిపోవడం ఖాయం!
    Pushpa 2: ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ‘పుష్ప 2’ పరిస్థితి? కలెక్షన్స్ భారీగా పడిపోవడం ఖాయం!
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో బజ్‌ ఉంది. ఇప్పటికే విడుదలైన పుష్ప గ్లింప్స్‌, ప్రమోషన్‌ పోస్టర్లు, ఫస్ట్‌ సింగిల్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించడంతో ఆ రోజు కోసం.. సినీ ప్రేక్షకులు, బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదా పడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చెప్పిన తేదీకే సినిమా రిలీజ్‌ చేస్తే కలెక్షన్స్‌లో భారీగా కోత పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; పుష్ప 2 వాయిదా..! ప్రస్తుతం ‘పుష్ప 2’ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మారింది. ఈ సినిమాను ఆగస్టు 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ కొద్ది నెలల క్రితం ప్రకటించారు. అందుకు తగ్గట్లే శరవేగంగా షూటింగ్‌ సైతం నిర్వహిస్తున్నారు. జూన్‌ ఎండింగ్‌ నాటికి షూటింగ్‌ ముగించాలని దర్శకుడు సుకుమార్‌ టార్గెట్‌ పెట్టుకోగా.. అది పూర్తయ్యే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదని టాక్‌ వినిపిస్తోంది. సినిమా షూట్ పూర్తి కావడానికి ఇంకో నెల రోజుల సమయం పడుతుందని సమాచారం. అంటే జులై ఎండింగ్‌కి పుష్ప 2 షూట్‌ కంప్లీట్‌ కానుందట. కాబట్టి మిగిలిన 15 రోజుల్లో ప్రీ రిలీజ్‌ వర్క్‌ చేయడం అసాధ్యం కాబట్టి.. 'పుష్ప 2' పోస్ట్‌ పోన్‌ చేస్తే బెటర్‌ అని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. ఇది తెలిసిన ఫ్యాన్స్‌ తీవ్రంగా డిసప్పాయింట్‌ అవుతున్నారు.&nbsp; సుకుమార్‌ అసంతృప్తి పుష్ప 2 చిత్రానికి ఎడిటర్‌గా కార్తిక్‌ శ్రీనివాస్‌ పనిచేశారు. కొద్ది నెలల పాటు యూనిట్‌తో కలిసి ట్రావెల్‌ చేసిన అతడు పలు కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో నవీన్‌ నూలి వచ్చి ఫైనల్ కట్స్‌ చేశారు. అయితే ఆ ఫైనల్‌ ఔట్‌పుట్‌పై సుకుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పైగా కొన్ని ఎపిసోడ్స్‌ను సుకుమార్‌ రీడిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆగస్టు 15 నాటికి సినిమాను రెడీ చేయడం కష్టమని మూవీ యూనిట్‌ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.&nbsp; కలెక్షన్స్‌లో భారీ కోత! పాన్‌ ఇండియా స్థాయి సినిమా అంటే విడుదల తేదీ పక్కాగా ఉండాలి. అలా లేకుంటే దాని ప్రభావం కలెక్షన్స్‌పై కూడా పడుతుంది. ‘పుష్ప 2’ను ఆగస్టు 15నే రిలీజ్‌ చేస్తే.. కలెక్షన్ల పరంగా బన్నీకి భారీ షాక్‌ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే రోజున తమ చిత్రాలు రిలీజ్‌ చేసేందుకు ముగ్గురు బడా హీరోలు సిద్ధమవుతున్నారు. తమిళ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) నటిస్తున్న 'తంగలాన్' (Thagalaan) చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారట. మరోవైపు బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan) కూడా తన ‘సింగం ఎగైన్‌’ (Singham Again) చిత్రాన్ని ఆ రోజునే తీసుకురావాలని చూస్తున్నారట. అలాగే స్టార్‌ నటుడు జాన్‌ అబ్రహం (John Abraham) నటించిన 'వేద' (Veeda) ఆగస్టు 15న తీసుకొస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఆ మూడు భారీ చిత్రాలు బరిలో ఉండగా వాటిని తట్టుకొని ‘పుష్ప 2’ పాన్‌ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్స్‌ రాబట్టగలదా? అన్న సందేహం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అజయ్‌ దేవగన్‌, జాన్‌ అబ్రహం చిత్రాల రిలీజ్‌ ఉన్న నేపథ్యంలో నార్త్‌లో ‘పుష్ప 2’ కలెక్షన్లపై భారీగా ప్రభావం పడొచ్చని అంటున్నారు.&nbsp; పవన్‌ అభిమానుల్లో ఆగ్రహం ప్రస్తుతం అల్లు అర్జున్‌పై పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఫ్యాన్స్‌ గుర్రుగా ఉన్నారు. ఏపీ ఎన్నికల సందర్భంగా వైకాపా అభ్యర్థి తరపున బన్నీ ప్రచారం చేయడాన్ని మెగా ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ మూవీని బాయ్‌కాట్‌ చేస్తామని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు బుధవారం (జూన్‌ 12) జరిగిన పవన్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సైతం బన్నీ హాజరు కాకపోవడంతో ఫ్యాన్స్‌ మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఇన్ని కష్టాల మధ్య ఇప్పట్లో ఈ మూవీని రిలీజ్‌ చేయకపోవడమే మంచిదని చిత్రయూనిట్‌ భావిస్తున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.&nbsp;
    జూన్ 13 , 2024
    <strong>Allu Arjun: ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ అతి చేశాడా?</strong>
    Allu Arjun: ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ అతి చేశాడా?
    సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించిన తాజా చిత్రం 'పుష్ప 2' (Pushpa 2: The Rule). రష్మిక మందన్న కథానాయికగా చేసింది. మరో నటి శ్రీలీల (Sreeleela) ఐటెం సాంగ్‌లో నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. అయితే ఈ వేడుకలో అల్లు అర్జున్‌ అతి చేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అతడి ప్రవర్తన ఏమాత్రం సమంజసంగా లేదని మండిపడుతున్నారు. అందుకు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఎలాగంటే? 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో సోమవారం (డిసెంబర్‌ 2) రాత్రి జరిగింది. యూసఫ్‌గూడ పోలీసు గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వేడకకు అల్లు అర్జున్‌ (Allu Arjun), రష్మిక మందన్న, డైరెక్టర్‌ సుకుమార్ సహా మూవీ టీమ్ అంతా హాజరైంది. దర్శకధీరుడు రాజమౌళి (S.S. Rajamouli) సైతం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ‘పుష్ప 2 గురించి అల్లు అర్జున్‌ దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడాడు. స్పీచ్‌ ఇస్తున్న సమయంలో స్టేజీపై బన్నీ అటు తిరిగాడు. ముఖ్యంగా ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా నిర్మించి స్టేజీ ముందుభాగానికి నడుచుకుంటూ వెళ్లాడు. దీంతో అభిమానులు అతడి వద్దకు రాకుండా నిలువరించేందుకు బౌన్సర్లు పరిగెత్తుకు వెళ్లాల్సి వచ్చింది. అంతకముందు స్టేజీపైకి ఓ అభిమాని పరిగెత్తుకు రాగా అతడ్ని నిలువరించేందుకు బౌన్సర్లు శ్రమించారు. అల్లు అర్జున్ నడిచిన రైలింగ్ చాలా తక్కువ ఎత్తులో ఉంది. ఫ్యాన్స్ ఈజీగా దానిపైకి ఎక్కెయ్యవచ్చు. బన్నీ నడుస్తున్న సమయంలో బౌన్సర్లకు, సెక్యురిటీ గార్డ్‌లకు చెమటలు పట్టాయి. ఎక్కడ అభిమానులు దూసుకొస్తారేమోనని కంగారు పడ్డారు. దీంతో&nbsp; ఈ వ్యవహారమంతా చూసిన నెటిజన్లు అల్లు అర్జున్‌ కాస్త అతి చేశాడని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభిమాని బన్నీ వద్దకు వచ్చిన వీడియోను సైతం ఎడిటింగ్‌ చేసి ట్రోల్ చేస్తున్నారు. https://twitter.com/alluarjun/status/1863667358939673075 https://twitter.com/telugufilmnagar/status/1863650477680079290 https://twitter.com/At_theatres/status/1863649705089175950 https://twitter.com/ReviewBollywoo1/status/1863875122555240724 ‘రామ్‌చరణ్‌ను చూసి నేర్చుకో’ 'పుష్ప' సక్సెస్‌ అల్లు అర్జున్‌లో గర్వాన్ని తీసుకొచ్చిందని మెగా అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌లో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. కుర్చీలో కూర్చొని ఉన్న బన్నీతో ఓ బాలిక సెల్ఫీ దిగేందుకు యత్నించగా అతడు కాలుపై కాలు వేసుకొని ఆ పాప ముందు అహం ప్రదర్శించాడని ఆరోపిస్తున్నారు. అంతేకాదు బన్నీ ఫ్యామిలీతో ఉన్న కటౌట్‌ను హైలేట్ చేయడాన్ని కూడా తప్పుబడుతున్నారు. ఇప్పుడు సక్సెస్‌ చూసి గర్వ పడితే ఆ తర్వాత బాధ పడాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. గతంలో తమ అభిమాన హీరో రామ్‌చరణ్‌ చెప్పిన కొన్ని వ్యాఖ్యలను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఎంత ఎదిగిన ఒదిగి ఎలా ఉండాలో చరణ్‌ను చూసి నేర్చుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. https://twitter.com/perfectwala99/status/1863772059073184034 https://twitter.com/Love_Cinemaa/status/1863731413607944573 పవన్‌ మంచి మనసు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' టికెట్‌ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో జారి చేసింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్ ధరను రూ.800 నిర్ణయించింది (జీఎస్టీ అదనం). ఈ షో చూడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే ప్రస్తుతం రూ.800+GST చెల్లించాలి. పుష్ప 2 రిలీజ్​ రోజు డిసెంబర్ 5న ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో లోయర్‌ క్లాస్‌ రూ.100 (జీఎస్టీతో కలిపి), అప్పర్‌ క్లాస్‌ రూ.150 (జీఎస్టీతో కలిపి), మల్టీఫ్లెక్స్‌లో రూ.200 (జీఎస్టీతో కలిపి) వరకూ పెంచుకునే వెసులుబాటు కల్పించింది. డిసెంబర్ 6 నుంచి 17 వరకు ఐదు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. డిసెంబరు 17 వరకు పెంచిన టికెట్‌ ధరలు అమల్లో ఉంటాయని తెలిపింది. తమ హీరోనూ అల్లు అర్మీ ఎంత దూషించిన ‘పుష్ప 2’ టికెట్ల పెంపు విషయంలో పవన్‌ మాత్రం మంచి మనసు చాటుకున్నారని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/screwtequila/status/1863618803114086642 https://twitter.com/thetalkenti/status/1863807290261815718
    డిసెంబర్ 03 , 2024
    <strong>Jr NTR New Project: మైండ్‌బ్లోయింగ్‌ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తారక్‌.. మరో ఊచకోతకు సిద్ధం కండి!</strong>
    Jr NTR New Project: మైండ్‌బ్లోయింగ్‌ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తారక్‌.. మరో ఊచకోతకు సిద్ధం కండి!
    తారక్‌ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ (Devara) బాక్సాఫీస్‌ వద్ద సాలిడ్‌ విజయాన్ని అందుకుంది.&nbsp;వారం వ్యవధిలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం దిగ్విజయంగా థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ మూవీ సక్సెస్ తర్వాత తారక్ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ చిత్రం చేస్తున్న జూ.ఎన్టీఆర్‌ త్వరలోనే డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ‘NTR 31’ పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీపై అందరి దృష్టి ఉంది. అయితే లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం తారక్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్‌ డైరెక్టర్‌తో ఆ మూవీ ఉండనున్నట్లు చర్చించుకుంటున్నారు.&nbsp; ‘జైలర్‌’ డైరెక్టర్‌తో పాన్‌ ఇండియా చిత్రం! మ్యాన్ ఆఫ్‌ మాసెస్‌ జూ.ఎన్టీఆర్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. డాక్టర్‌, బీస్ట్ , జైలర్ వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ స్టార్ డైరెక్టర్‌ నెల్సన్ దిలీప్ కుమార్‌తో తారక్‌ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇప్పటికే తారక్‌కు నెల్సన్‌ కథ చెప్పారని అతి అతడికి బాగా నచ్చిందని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో దీనిని తెరెకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీస్ట్‌, జైలర్‌ హిట్స్‌తో నెల్సన్‌ పేరు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగింది. ముఖ్యంగా జైలర్‌తో రజినీకాంత్‌ను చూపించి తీరు అందరిని మెప్పించింది. అటువంటి డైరెక్టర్‌తో తారక్‌కు సినిమా పడితే రికార్డులు గల్లంతేనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.&nbsp; 2026 వరకూ ఆగాల్సిందే! తారక్ - నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చినా ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం తారక్‌ 'వార్‌ 2' (War 2) పెండింగ్‌ షూటింగ్‌తో పాటు త్వరలో 'NTR 31'ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అటు నెల్సన్‌ సైతం ‘జైలర్‌ 2’ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. రజనీకాంత్‌ కూలీ సినిమా షూటింగ్ పూర్తికాగానే ‘జైలర్‌ 2’ షూటింగ్‌ మెుదలు కానుంది. ఇద్దరూ బిజీ షెడ్యూల్స్‌తో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌ పైకి వెళ్లేందుకు మరింత సమయం పట్టవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2026లో ఈ సినిమా పట్టాలెక్క వచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో మూవీ చేయడం తనకు ఓకే అంటూ ఓపెన్‌గా ఇటీవల తారక్‌ ఆఫర్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో కూడా ఓ మూవీ ఉండే అవకాశం లేకపోలేదు.&nbsp; మా స్ట్రెంత్‌ అతడే: తారక్‌ 'దేవర' బ్లాక్‌ బాస్టర్‌ నేపథ్యంలో శుక్రవారం చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తారక్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. కల్యాణ్‌ రామ్‌ బావమరిది (భార్య సోదరుడు) హరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘హరి ముందుకు ఎప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు. చాలా మంది అతన్ని సరిగా అర్ధం చేసుకోరు. ఎందుకంటే అతను ముందుకు వచ్చి తన గురించి చెప్పుకోడు. ఎవరేమి అన్నా, ఎవరేమి అనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌కి మూల స్థంభం హరి. నాకు, కళ్యాణ్ అన్నకి మా ఇద్దరికీ స్ట్రెంత్ హరి. ఇందులో ఎటువంటి డోకా ఉండదు. నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు. నచ్చని వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు’ అని తారక్ అన్నారు. బంగ్లాదేశ్‌ రైతుగా జూ.ఎన్టీఆర్‌! తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ బజ్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్‌ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని ఫిల్మ్‌ వర్గాల సమాచారం.&nbsp; హీరోయిన్‌ ఫిక్సయ్యిందా? దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్‌-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్‌ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.&nbsp;&nbsp;
    అక్టోబర్ 05 , 2024
    <strong>Allu vs Mega Family: అల్లు - మెగా ఫ్యామిలీకి అస్సలు పడట్లేదా? నిర్మాత క్రేజీ కామెంట్స్‌!</strong>
    Allu vs Mega Family: అల్లు - మెగా ఫ్యామిలీకి అస్సలు పడట్లేదా? నిర్మాత క్రేజీ కామెంట్స్‌!
    మెగా (Mega Family), అల్లు ఫ్యామిలీల మధ్య వివాదాలు తలెత్తినట్లు గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్‌ను మెగా ఫ్యామిలీ దూరం పెట్టిదంటూ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏపీ మంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారానికి కూాడా అల్లు ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్కరు కూడా హాజరు కాకపోవడం ఈ వివాదానికి అప్పట్లో మరింత బలాన్నీ చేకూర్చింది. అయితే తాజాగా ఈ అంశంపై అల్లు, మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి.&nbsp; నిర్మాత ఏమన్నారంటే! జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) బావమరిది నార్నే నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న 'ఆయ్‌' (AAY) చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు. తాజాగా ఈ మూవీలోని థీమ్‌ సాంగ్‌ రిలీజ్‌ ఈవెంట్‌ జరగ్గా అందులో బన్నీ వాసు పాల్గొన్నారు. ఈ క్రమంలో అల్లు - మెగా ఫ్యామిలీ మధ్య రాజుకున్న విభేదాలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనిపై బన్నీ వాసు స్పందిస్తూ ‘మెగా, అల్లు ఫ్యామిలీలను 20 ఏళ్లుగా చూస్తున్నా. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండాలని చిరంజీవి కోరుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీని తీసుకొని బెంగళూరు వెళ్తుంటారాయన. ఏ కుటుంబంలోనైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని సందర్భాల్లో ఇష్యూస్‌ వస్తాయి. అంతమాత్రాన బంధం దెబ్బతిన్నట్లు కాదు. ఇలా తాత్కాలికమైన వాటిని హైలైట్‌ చేయడం మంచి పద్ధతి కాదు. వారి బంధం గురించి తెలుసు కాబట్టే నమ్మకంగా చెబుతున్నా. మేమంతా ఒక్కటే అని చెప్పేందుకు వారికి ఒక్క సందర్భం చాలు. సమయం రావాలంతే. ఇప్పుడొస్తున్నవన్నీ పాసింగ్‌ క్లౌడ్స్‌’ అని సమాధానం ఇచ్చారు.&nbsp; వివాదానికి కేంద్ర బిందువు ఇదే! ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్‌ ప్రచారం చేయడంతో వివాదం మెుదలైంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలోని అభ్యర్థికి బన్నీ మద్దతు ఇవ్వడాన్ని మెగా ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోయారు. దీనికి తోడు మంత్రిగా పవన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం అల్లు అర్జున్ గానీ, అల్లు ఫ్యామిలీ సభ్యులు గానీ ఎవరూ హాజరు కాలేదు. దీంతో మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగినట్లు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇటీవల పవన్‌ కల్యాణ్‌ను కలిసిన నిర్మాతల బృందంలో అల్లు అరవింద్‌ ఉండటం, ఇద్దరూ ఎంతో అప్యాయంగా పలకరించకోవడంతో ఈ వివాదానికి కాస్త బ్రేకులు పడ్డాయి. అయితే బన్నీపై మాత్రం ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ కోపంగానే ఉన్నట్లు సోషల్‌ మీడియాలో వస్తోన్న కామెంట్స్‌ను బట్టి తెలుస్తోంది.&nbsp; అల్లు అర్జున్‌ vs రామ్‌చరణ్‌ అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్‌ కావాల్సి ఉండగా షూటింగ్‌లో జాప్యం వల్ల డిసెంబర్‌ 6కు విడుదల తేదీని మార్చారు. అయితే డిసెంబర్‌లో వచ్చే చిత్రాల రేసులో రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ కూడా ఉంది. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ డిసెంబర్‌ ఫస్ట్‌వీక్‌లోనే గేమ్‌ ఛేంజర్‌ను రిలీజ్‌ చేయాలని భావిస్తే బాక్సాఫీస్‌ వద్ద ‘బన్నీ vs చరణ్‌’ పోరు తప్పదు. అదే జరిగితే మరోమారు మెగా ఫ్యాన్స్‌ రెండుగా చీలిపోయే తమ అభిమాన హీరో చిత్రాన్ని ప్రమోట్‌ చేయడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; సుకుమార్‌తో కోల్డ్‌వార్‌? 'పుష్ప: ది రూల్' షూటింగ్ విషయంలో అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో ఇటీవల వార్తలు వచ్చాయి. షూటింగ్‌ సక్రమంగా జరగడం లేదని బన్నీ గుర్రుగా ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. తను పూర్తిగా సహకరిస్తున్నా సుకుమార్‌ సరిగ్గా వినియోగించుకోవడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లారని తెలుస్తోంది. ఫ్లైట్ జర్నీ సమయంలో ఆయన్ను కొందరు వీడియో తీశారు. ఈ వీడియోలో బన్నీ గడ్డం ట్రిమ్‌ చేసి కనిపించారు. వాస్తవానికి పుష్ప గాడు అంటే ఆ గడ్డం లుక్కే మెయిన్‌. టువంటిది గడ్డాన్ని బన్నీ ట్రిమ్‌ చేసి పర్యటనకు వెళ్లడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. https://twitter.com/i/status/1813405877908726058
    జూలై 20 , 2024
    Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్‌ నుంచి రామ్‌చరణ్‌ ఫొటోస్‌ లీక్‌.. వైజాగ్‌లో చెర్రీ క్రేజ్‌ మామూల్గా లేదుగా !
    Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్‌ నుంచి రామ్‌చరణ్‌ ఫొటోస్‌ లీక్‌.. వైజాగ్‌లో చెర్రీ క్రేజ్‌ మామూల్గా లేదుగా !
    మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ (Ram Charan).. టాప్‌ గేర్‌లో దూసుకెళ్లున్నాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఆయన క్రేజ్‌ గ్లోబల్‌ స్థాయికి చేరింది. ప్రస్తుతం చరణ్‌.. గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ’ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్‌చరణ్‌ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు మెుదలయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. తాజాగా సెట్‌లో రామ్‌చరణ్‌ లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వైజాగ్‌లో షూటింగ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా చివరి దశ షూటింగ్‌ను మేకర్స్‌ వైజాగ్‌లో ప్లాన్ చేశారు. ఈ మూవీలోని పొలిటికల్ మీటింగ్‌కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఆర్‌కే బీచ్‌లో షూట్ చేస్తున్నారు. ఓపెన్ సెట్‌లో రామ్ చరణ్, ఎస్‌.జే సూర్య తదితరుల ముఖ్య తారాగణంతో శంకర్ ఈ షెడ్యూల్‌ని చిత్రీకరిస్తున్నారు. మార్చి 19 వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. బహిరంగ షూటింగ్ కావడంతో సెట్స్‌లోని చరణ్ ఫోటోలు, వీడియోలు బయటకి వచ్చాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో రామ్ చరణ్.. చాలా స్టైలిష్‌గా జెంటిల్‌మెన్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్ ఐఏఎస్ పాత్రకి సంబంధించినదని సమాచారం. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి.&nbsp; https://twitter.com/i/status/1768563620739453357 https://twitter.com/n_suren/status/1768531852414079277 https://twitter.com/i/status/1767734419715133518 https://twitter.com/venkysayzzz/status/1768539657896087692 చరణ్‌కు ఘన స్వాగతం వైజాగ్‌ షూటింగ్‌ నేపథ్యంలో.. నిన్ననే రామ్‌చరణ్‌, తమిళ నటుడు ఎస్‌.జే సూర్యతో పాటు ప్రధాన తారాగణం అంతా వైజాగ్‌ చేరుకుంది. వైజాగ్‌ ఎయిర్‌పోర్టుకు రామ్‌చరణ్‌ వస్తున్నట్లు ముందే తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి వెళ్లారు. చరణ్‌ ఎయిర్‌పోర్టులో దిగగానే కేరింతలు కొట్టారు. చరణ్‌ నినాదాలతో ఎయిర్‌పోర్టును మార్మోగించారు. తమ అభిమాన హీరోపై పూల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1768308149847753158 https://twitter.com/i/status/1768557163746656272 https://twitter.com/i/status/1768447264660296074 చరణ్‌ బర్త్‌డే రోజున స్పెషల్‌ సాంగ్‌ రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. మార్చి 27వ తేదీన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం నుంచి తొలి పాట రానుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (SS Thaman) ఇటీవలే ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించారు. ‘జరగండి.. జరగండి’ పాటని ఆ రోజున విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది దీపావళికి ఈ పాటను తీసుకొస్తామని ప్రకటించి మూవీ టీమ్ వాయిదా వేసింది. ఇప్పుడు చెర్రీ పుట్టిన రోజున ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఈ పాటతోనే ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్ డేట్ కూడా వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.&nbsp; ‘RC 16’ చిత్రానికి ముహోర్తం ఫిక్స్‌! ‘గేమ్‌ ఛేంజర్’ సినిమా తర్వాత రామ్‌ చరణ్‌.. ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు (Buchi Babu) దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నారు. ‘RC16’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. మార్చి 20వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఆ కార్యక్రమంతో ఈ సినిమా షురూ అవుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.&nbsp; మూవీ టైటిల్ అదేనా! రామ్‍చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్‍ను కూడా ఖరారు చేసినట్టు సినీ సర్కిల్‍లో టాక్ వినిపిస్తోంది. దీనిపై పూజా కార్యక్రమం రోజున అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. ఉత్తరాంధ్ర సైడ్ ‘పెద్ది’ అంటే పెద్ద అని అర్ధం. ఇప్పటికీ చాలామంది ముసలివారిని, పెద్దవారిని ‘మా పెద్ది’ అని బంధువులు, కుటుంబ సభ్యులు పిలుస్తూ ఉంటారు. కథ కూడా టైటిల్‌కు మ్యాచ్‌ అయ్యేలా ఉండటంతో ఆ పేరునే సినిమాకు ఫిక్స్‌ చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ టైటిల్‌ను ఎన్టీఆర్‌ కోసం బుచ్చిబాబు అనుకున్నారని గతంలో రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ టైటిల్‌నే రామ్‌చరణ్‌కు తీసుకున్నట్లు వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.&nbsp;
    మార్చి 16 , 2024

    @2021 KTree