UATelugu2h 47m
స్కంద స్టోరీ విషయానికి వస్తే ఓ ఊరిలో ఉండే హీరో రామ్ కుటుంబమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అదేక్రమంలో ఆలయంలో దొంగతనం జరుగుతుంది. ఆ నింద రామ్ ఫ్యామిలీపై పడుతుంది. ఆ నిందను రామ్ చెరిపేశాడా? ఈ మధ్యలో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది. హీరో మరియు విలన్‌ల మధ్య పగ ఎందుకు స్టార్ట్ అయింది.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Hotstarఫ్రమ్
Watch
రివ్యూస్
YouSay Review
Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రం స్కంద ప్రపంచవ్యాప్తంగా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్ల...read more
How was the movie?
@Akhil24
1 year ago
తారాగణం
రామ్ పోతినేని
భాస్కర్ రాజుశ్రీలీల
శ్రీలీలా రెడ్డిఅజయ్ పుర్కర్ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి రాయుడు
సాయి మంజ్రేకర్
రుద్రకంటి పరిణీత "అమ్ములు", రుద్రకంటి రామకృష్ణరాజు కూతురు మరియు స్కంద ప్రేమికుడుశ్రీకాంత్
రుద్రకంటి రామకృష్ణరాజుశరత్ లోహితస్వా
రంజిత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి మరియు శ్రీలీల తండ్రిప్రిన్స్ సెసిల్
సంజయ్ రెడ్డిరాజా
మణికంఠ రాజు, భాస్కర్ తండ్రి మరియు రుద్రగంటి రామకృష్ణరాజు ప్రాణ స్నేహితుడుప్రభాకర్
చిన్నప్పపృథివీరాజ్
ప్రదీప్ మల్హోత్రాఇంద్రజ
రామకృష్ణరాజు భార్య రుద్రకంటి భారతినిత్య దాస్శ్రీలీల తల్లి
ఊర్వశి రౌటేలా
"కల్ట్ మామా" పాట కోసం అతిధి పాత్రలోసిబ్బంది
బోయపాటి శ్రీను
దర్శకుడుశ్రీనివాస చిట్టూరినిర్మాత
పవన్ కుమార్నిర్మాత
బోయపాటి శ్రీను
రచయితసంతోష్ డిటాకేసినిమాటోగ్రాఫర్
తమ్మిరాజుఎడిటర్ర్
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
September 11-16: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు..ఏకంగా 25 సినిమాల సందడి!
ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదల కావడం లేదు. స్కంద, చంద్రముఖి2, మార్క్ ఆంటోని చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే ఓటీటీల్లో మాత్రం 25కు పైగా సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాయి. ఆ లిస్ట్‌ను ఓసారి చూద్దాం.
స్కంద
యంగ్ హీరో రామ్ పోతినేని(RAPO), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో నిర్మితమైన చిత్రం స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. రామ్ మాస్ లుక్ హైప్ క్రియేట్ చేసింది. శ్రీలీల హీరోయిన్‍గా నటించింది. థమన్ మ్యూజిక్ అందించాడు.
చంద్రముఖి 2
సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న మరొక సినిమా చంద్రముఖి 2. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. 2005లో వచ్చిన బ్లాక్‌బాస్టర్ మూవీ చంద్రముఖికి ఇది సీక్వెల్. చంద్రముఖి 2 చిత్రాన్ని డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించగా.. MM కీరవాణి సంగీతం అందించారు.
మార్క్ ఆంటోనీ
తమిళ్ స్టార్ హీరో విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. పాన్‌ఇండియా రేంజ్‌లో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కింది.
మరోవైపు ఈ వారం ఓటీటీల్లో పెద్దసంఖ్యలో సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఏకంగా 25 సినిమాలు- వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. రామబాణం, భోళాశంకర్, అనీతి, బార్బీ, మాయపేటిక ఇంట్రెస్టింగ్ బజ్‌ను కలిగిస్తున్నాయి. మరి ఓటీటీ ప్లాట్‌ఫాంలలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు- వెబ్‌సిరీస్‌లను లిస్ట్‌వైజ్‌గా చూద్దాం.
TitleCategoryLanguagePlatformRelease DateJourney of Love 18+ MovieMalayalam Sony LivSeptember 15Dil Se MovieTeluguEtv winSeptember 16Wife Like movieEnglishNetflixSeptember 11Wrestlers seriesFrenchNetflixSeptember 13ErengardMovieDanishNetflixSeptember 14RambanamMovieTeluguNetflixSeptember 14Bhola Shankar) MovieteluguNetflixSeptember 15Love at First SightMovieEnglishNetflixSeptember 15Miss EducationSeriesEnglishNetflixSeptember 15Surviving Summer: Season 2 SeriesEnglishNetflixSeptember 15Kelsey September 12 MovieEnglish PrimeSeptember 12 The Kidnapping Day SeriesKorean PrimeSeptember 13Bombay Mary SeriesHindi primeSeptember 14A Million Miles Away MovieEnglish PrimeSeptember 15 Wilderness SeriesEnglishPrimeSeptember 15 Aneethi movieTelugu Dubbed Movie PrimeSeptember 15Mayapethika Movie TeluguPrimeSeptember 15Animals Up Close with Bertie Gregory SeriesEnglishHotstarSeptember 13 Elemental MovieEnglishHotstarSeptember 13 Han River Police SeriesEnglish HotstarSeptember 13 Welcome to the Wrexham Season 2(Documentary) English HotstarSeptember 13KaalaSeriesHindiHotstarSeptember 15Lang Place Movie EnglishHotstarSeptember 15 The Other Black Girl movieenglishHotstarSeptember 15 Barbie MovieEnglish Book My ShowSeptember 12 A Honeymoon to RemembermovieenglishBook My ShowSeptember 15Pappachan Olivilan MovieMalayalamSaina playSeptember 14
సెప్టెంబర్ 11 , 2023
Double iSmart Review: మాస్ ఎనర్జీతో ఇరగదీసిన రామ్ పొత్తినేని.. సినిమా ఎలా ఉందంటే?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని కావ్యాథాపర్ జంటగా నటించిన 'డబుల్ ఇస్మార్ట్' భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'లైగర్' ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh), 'స్కంద' పరాజయం తర్వాత రామ్ పోతినేని (Ram Pothineni) కలిసి చేసిన సినిమా కావడంతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోనూ ఈ చిత్రంపై పెద్ద ఎత్తున బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రామ్- పూరి కాంబో మరోసారి హిట్ అయిందా? లేదా? ఈ సమీక్షలో చూద్దాం.
కథేంటి?
మాఫియా డింపుల్ బిగ్ బుల్(సంజయ్ దత్) మరణం లేకుండా ఉండాలని అనుకుంటాడు. (Double iSmart Review)ఈ క్రమంలో వైద్యులు అతనికి ఓ సలహా ఇస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ గురించి వివరిస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ చేస్తే అలాంటి అవకాశం ఉందని చెబుతారు. బిగ్ బుల్ మెమోరిని రకరకాల వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కానీ విఫలమవుతుంది. ఈక్రమంలో ఇస్మార్ట్ శంకర్ గురించి బిగ్ బుల్‌కు తెలుస్తుంది. తన మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు శంకర్‌ను ఎంచుకుంటారు. మరీ శంకర్ బ్రేయిన్‌లోకి బిగ్ బుల్ మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? మళ్లీ బిగ్ బుల్, ఇస్టార్ట్ శంకర్ ఎందుకు తలపడుతారు? కావ్యా థాపర్‌కు శంకర్‌కు మధ్య సంబంధం ఏమిటి? బోకా(అలీ) క్యారెక్టర్‌కు ఈ చిత్రంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి అన్నది మిగతా సినిమా.
సినిమా ఎలా ఉందంటే?
ఫస్టాఫ్ లవ్, కామెడీ ట్రాక్‌తో ఉంటుంది. తెలంగాణ స్లాంగ్ డైలగ్‌లతో మాస్ జాతర ఉంటుంది. పూరీ జగన్నాథ్ మార్క్ పంచ్ డైలాగ్‌లు తన స్టైల్ కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ నుంచి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు రివీల్ అవుతుంటాయి. ముఖ్యంగా రామ్- సంజయ్ దత్‌ల మధ్య వచ్చే సీన్లు అదిరిపోతాయి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అలాగే డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. తెలంగాణ స్లాంగ్‌లో రామ్ చెప్పే సామెతలు సూపర్బ్‌గా పేలాయి. రామ్- కావ్యాథాపర్ మధ్య రొమాంటిక్ సీన్స్, అలాగే రామ్- సంజయ్ దత్‌ల మధ్య మైండ్ గేమ్, మదర్ సెంటిమెంట్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అలరించాడు.అలీ కామెడీ సన్నివేశాలు బాగున్నాయి.
ఎవరెలా చేశారంటే?
ఇస్మార్ట్ శంకర్‌గా రామ్ పొత్తినేని యాక్టింగ్ ఇరగదీశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా కంటే ఈ చిత్రంలో రామ్ యాక్టింగ్ ట్రిపుల్ టైమ్ మాస్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. తన ఎనర్జీకి మించి కష్టపడ్జాడని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక విలన్ బిగ్ బుల్‌గా సంజయ్ బాబా యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. (Double iSmart Review) తన పాత్రకు 100శాతం న్యాయం చేశాడు. హీరోయిన్ జన్నత్‌గా కావ్యాథాపర్ తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక సీబీఐ అధికారిగా షియాజీ షిండే, బన్నీ జయశంకర్, రామ్ తల్లిగా ఝాన్సీ, బొకాగా అలీ, రామ్ స్నేహితుడిగా గెటప్ శ్రీను తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
లైగర్ ప్లాఫ్ తర్వాత పూరి జగన్నాథ్ చాలా శ్రద్ధగా కథను రాసుకున్నట్లు ఈ సినిమాను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాతో పూరి తిరిగి కమ్‌బ్యాక్ అయ్యారని చెప్పవచ్చు. తాను అనుకున్న స్టోరీని బాగా తీశాడు. స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. యూత్‌ను అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్‌తో పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. తనదైన మార్క్ సింగిల్ లైన్ పంచ్ డైలాగ్‌లతో మరోసారి పాత తరం పూరిని పరిచయం చేశాడు. మదర్ సెంటిమెంట్ బాగున్నా(Double iSmart Review) ఇంకాస్తా ఎలివేట్ చేస్తే బాగుండేది అనిపించింది. ఓవరాల్‌గా యూత్‌ను అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్‌తో సినిమా తీయడంలో పూరి సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తుంది. మణిశర్మ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తుంది. జియాన్ కే గియాన్ హెల్లి, శ్యామ్ కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తంగా ఈ సినిమా మాస్ పీస్ట్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్
రామ్ పొత్తినేని నటన
పూరి డైరెక్షన్
సంజయ్ దత్- రామ్ మధ్య సీన్లు
మైనస్ పాయింట్స్
లెంగ్తీగా ఉన్న అలీ కామెడీ ట్రాక్
కొన్ని పాటలు
తీర్పు: ఓవరాల్‌గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్
రేటింగ్: 3/5
ఆగస్టు 16 , 2024
శ్రీలీల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
తెలుగులో చాలా తక్కవ కాలంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది శ్రీలీల. తన క్యూట్ లుక్, యాక్టింగ్‌తో విరివిగా అవకాశాలను అందిపుచ్చుకుంది. పెళ్లిసందD చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ కుర్ర హీరోయిన్ స్కంద, ధమాకా, గుంటూరుకారం వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. ఈక్రమంలో శ్రీలీల గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Sreeleela) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీలీల దేనికి ఫేమస్?
శ్రీలీల కన్నడ, తెలుగు భాషాల్లో స్టార్ హీరోయిన్‌గా ఉంది. ధమాకా, పెళ్లిసందD, గుంటూరు కారం చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.
శ్రీలీల వయస్సు ఎంత?
2001, జూన్ 14న జన్మించింది. ఆమె వయస్సు 23 సంవత్సరాలు
శ్రీలీల ముద్దు పేరు?
లీల
శ్రీలీల ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు
శ్రీలీల ఎక్కడ పుట్టింది?
డెట్రాయిట్, అమెరికా
శ్రీలీల అభిరుచులు?
సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం, డ్యాన్స్ చేయడం
శ్రీలీలకు ఇష్టమైన ఆహారం?
వెజిటేరియన్
శ్రీలీల తల్లిదండ్రుల పేర్లు?
తల్లిపేరు స్వర్ణలత( బెంగుళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్)
శ్రీలీల ఫెవరెట్ హీరో?
పవన్ కళ్యాణ్
శ్రీలీలకు ఇష్టమైన కలర్ ?
రెడ్
శ్రీలీలకు ఇష్టమైన హీరోయిన్స్
శ్రీదేవి, రేఖ
శ్రీలీల తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా?
పెళ్లిసందD
శ్రీలీల ఏం చదివింది?
MBBS
శ్రీలీల పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.2కోట్ల నుంచి- రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
శ్రీలీల సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
శ్రీలీల సినిమాల్లోకి రాకముందు భరత నాట్యం ప్రదర్శనలు ఇచ్చింది. డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసింది
శ్రీలీల ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/sreeleela14/?hl=en
శ్రీలీలకు ఎన్ని అవార్డులు వచ్చాయి?
ధమాకా చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకుంది
శ్రీలీలకు ఎంత మంది పిల్లలు?
శ్రీలీల దివ్యాంగులైన ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతోంది. అబ్బాయి పేరు గురు, అమ్మాయి పేరు శోభిత
https://www.youtube.com/watch?v=N4Zdl7slKZc
శ్రీలీల గురించి మరికొన్ని విషయాలు
శ్రీలీల కన్నడలో కిస్ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది.శ్రీలీల తన మూడేళ్ల వయస్సు నుంచే భరతనాట్యం నేర్చుకుందిసినిమాలకు విరామం ప్రకటించిన తర్వాత డాక్టర్‌గా పనిచేస్తానని శ్రీలీల చెప్పింది.శ్రీలీలకు పెంపుడు జంతువులంటే ఇష్టంశ్రీలీల తండ్రి పారిశ్రామిక వేత్త సూరపనేని శుభాకర్‌రావు అని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అతను కొట్టి పారేశాడు. శ్రీలీల తల్లితో తాను విడాకులు తీసుకున్న తర్వాత ఆమె జన్మించినట్లు పేర్కొన్నాడు.
ఏప్రిల్ 08 , 2024
This WeeK OTT Movies (Sept 25- Oct 01) : ఈ వారం ఓటీటీల్లో 30కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
గత వారం వినాయక చవితి నవరాత్రులను దృష్టిలో ఉంచుకుని పెద్దగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాలేదు. అయితే ఈవారం మాత్రం ప్రేక్షకులను అలరించేందుకు పెద్ద సినిమాలు సిద్దమయ్యాయి. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫాంలోను దాదాపు 30కి పైగా సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. మరి ఆ చిత్రాలు ఏమిటో ఓసారి చూద్దాం
స్కంద (Skanda movie)
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. రామ్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు. రామ్ సరసన శ్రీలీల, సయిూ మంజ్రేకర్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియో సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకున్నాయి. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న రామ్‌కు ఈ సినిమా విజయం ఎంతో కీలకంగా మారింది. అటు వరుస బ్లాక్ బాస్టర్ హిట్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీనివాస చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. స్కంద చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
చంద్రముఖి 2 (chandramukhi 2)
రాఘవ లారెన్స్, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కాంబోలో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ చిత్రం చంద్రముఖి2. ఈ చిత్రాన్ని పి.వాసు తెరకెక్కిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖికి ఇది సిక్వేల్‌గా రాబోతుంది. 17 ఏళ్ల తర్వాత రాజ్ మహల్‌ను వీడిన చంద్రముఖి మళ్లి కోటలోకి ఎందుకు ప్రవేశించింది అనే కథాంశంతో సినిమాను తెరకెక్కించారు. ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చంద్రముఖిలో జ్యోతికను చంద్రముఖి ఆవహించగా, ఇందులో నిజమైన చంద్రముఖిగా కంగనా రనౌత్ నటిస్తోంది. లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ది వ్యాక్సిన్ వార్ (The Vaccine War)
కశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం ది వ్యాక్సిన్ వార్. ఈ సినిమాను కరోనా నాటి పరిస్థితుల సమయంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈనెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదొక సైన్స్ ఫిక్షన్‌తో కూడిన సినిమాగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా వైద్యులు, పరిశోధకులు చేసిన గొప్ప సేవలకు ఈ సినిమా నివాళులర్పించనున్నట్లు చిత్ర బృందం చెబుతోంది.
పెదకాపు-1 (Peddha Kapu 1)
ఫ్యామిలీ చిత్రాలకు పెట్టింది పేరైన శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమాతో తన దారిని యాక్షన్ చిత్రాల వైపు మరల్చుకున్నాడు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఆయన దగ్గరయ్యాడు. తాజాగా పెదకాపు-1 యాక్షన్ చిత్రంతో సెప్టెంబర్ 29న ప్రేక్షకులను పలకరించబోతున్నాడు . ఈ సినిమాలో విరాట్ కర్ణ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు ( సెప్టెంబర్ 25- October 1)
TitleCategoryLanguagePlatformRelease DateLittle Baby Bum: Music Time SeriesEnglishNetflixSept 25The Devil's Plan SeriesKoreanNetflixSept 26Forgotten LoveMoviePolishNetflixSept 27OverhaulMoviePortugueseNetflixSept 27Sweet Flow 2 MovieFrenchNetflixSept 27The Wonderful Story of Henry SugarMovieEnglishNetflixSept 27Castlevania: NocturneSeriesEnglishNetflixSept 27Ice Cold: Murder, Coffee and Jessica Wangso MovieEnglishNetflixSept 28Love is in the AirMovieEnglishNetflixSept 28Fair Play MovieEnglishNetflixSept 29Choona SeriesHindiNetflixSept 29Nowhere MovieSpanishNetflixSept 29Reptile MovieEnglishNetflixSept 29Khushi MovieTeluguNetflixOct 01Spider-Man: Across the Spider-VerseMovieEnglishNetflixOct 01The Fake ShakeSeriesEnglishAmazon PrimeSept 26Hostel Days Season 4SeriesHindiAmazon PrimeSept 27Doble DiscourseMovieSpanishAmazon PrimeSept 28Kumari SrimatiSeriesTelugu Amazon PrimeSept 28Jen WeiSeriesEnglishAmazon PrimeSept 29El-PopSeriesSpanishHotstarSept 27The Worst of EvilSeriesEnglishHotstarSept 27King of KotaMovieTelugu Dubbed HotstarSept 28Launchpad Season 2SeriesEnglishHotstarSept 29Tum Se Na Ho Payega MovieHindiHotstarSept 29Papam Pasivadu SeriesTeluguAhaSept 29Dirty HariMovieTamilAhaSept 29Charlie ChopraSeriesHindiSony LivSept 27Bye! MovieTamilSony LivSept 29Agent MovieTeluguSony LivSept 29Angshuman MBA MovieBengaliZee5Sept 29Blue BeetleMovieEnglishBook My ShowSept 29
సెప్టెంబర్ 25 , 2023
Double iSmart: డబుల్ ఇస్మార్ట్ రూ.100 కోట్లు కొల్లగొడుతాడా? గతం ఏం చెబుతుంది?
ఎనర్జిటిక్ హీరో రామ్ పొత్తినేని, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్(Double iSmart). ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. ఈ చిత్రం పూరి జగన్నాథ్, రామ్ కెరీర్‌కు కీలకం కానుంది. ఎందుకంటే పూరి తీసిన ‘లైగర్’(Liger) ఘోర పరాజయం చవిచూడటం.. రామ్ నటించి రెడ్, స్కంద చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో..వీరి కలయిక మళ్లీ అనివార్యమైంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. మనిషి మెడదులో వేరే వ్యక్తి ఆలోచనలకు సంబంధించిన చిప్ పెడితే ఎలా ప్రవర్తిస్తాడు అనే వినూత్న కాన్సెప్ట్‌తో వచ్చి మంచి విజయం సాధించింది. రీసెంట్‌గా ఈ చిత్రానికి సంబంధించి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. మే 15న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఒక రకమైన బజ్ ఏర్పడింది.
రూ.100 కోట్లు కొల్లగొట్టే ఛాన్స్
అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇండియాలో రూ.66 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ఈ సినిమాకు వస్తున్న సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంపై సహజంగానే అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందా? కనీసం దరిదాపుల్లోకైనా వస్తుందా అనే అంశాలపై చర్చ జరుగుతుంది.
టాలీవుడ్‌లో టైర్ 2 హీరోగా రామ్ పొత్తినేని ఉన్నప్పటికీ టైర్ 1 హీరో స్థాయిలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన మాస్ యాక్టింగ్, డాన్సింగ్‌తో ప్రేక్షకులను అలరించడంలో ఏమాత్రం తగ్గడు. ఇప్పటికే ఈ విషయం అతని సినిమాల ద్వారా నిరూపితమైంది. రామ్ పొత్తినేని- పూరి జగన్నాథ్ కాంబోలో సినిమా వస్తుండటం, ఇస్మార్ట్ శంకర్ చిత్రం హిట్ అవడం వంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇది డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి అనుకూలంశాలు. ఇవన్నీ ప్రేక్షకులను మొదటి రెండు రోజులు సినిమా థియేటర్లకు రప్పించేలా చేశాయి.
ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో బరిలో దిగిన ఇస్మార్ట్ శంకర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఓవరాల్‌గా రూ.80 కోట్లు కలెక్ట్ చేసి రామ్ పొత్తినేని సత్తా చాటాడు. దీంతో ఈ సినిమాకు కొనసాగింపుగా పూరి.. డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక రోల్‌లో నటిస్తున్నారు. తాజాగా విడుదలే చేసిన టీజర్ ప్రోమో ఆకట్టుకుంది. రామ్ గెటప్, స్వాగ్ కూడా చాలా బాగున్నాయి. ప్రోమోపై ప్రేక్షకులు పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. మే 15న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. మరి ఈ టిజర్ టాక్ ప్రి రిలీజ్ బిజినెస్‌పై ప్రభావం చూపనుంది. డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి రూ.100కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. పూరి- రామ్ హిటో కాంబో కావడంతో.. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ భారీ ధరకు చేజిక్కించుకునేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీపడుతున్నాయి. ఇప్పటికే చిత్రబృందానికి మంచి నంబర్ ఆఫర్ చేసినట్లు తెలిసింది.
కథ ఇదేనా?
ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ (Double iSmart Movie) సినిమా కథకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమాలో పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో రామ్ పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపిస్తాడని సమాచారం. యాక్షన్ - థ్రిల్లర్ నేపథ్యంలో ఇది సాగుతుందని అంటున్నారు. పైగా తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువగానే ఉండనుందట. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
పట్టుదలతో పూరి
డబుల్ ఇస్మార్ట్ మూవీని డైరెక్టర్ పూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఆయన గత మూవీ ‘లైగర్’ (Liger Movie) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం కావడంతో పూరీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. సినిమాకు ముందు ఆయన చేసిన కామెంట్స్ కూడా ఇందుకు కారణమయ్యాయి దీనిని అద్భుతంగా తెరకెక్కించి తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాలన్న కసిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా రేంజ్‌లో..
ఆ కారణంగానే ‘డబుల్ ఇస్మార్ట్’ను పాన్ ఇండియా స్థాయిలో పూరి జగన్నాథ్ రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని కేవలం సింగిల్ లాంగ్వేజ్ (తెలుగు)లో రిలీజ్ చేసిన పూరి.. సెకండ్ పార్ట్‌ను మాత్రం దేశంలోని పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. తద్వారా తన క్రేజ్‌ను జాతీయ స్థాయికి చేర్చాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు టాక్. ఇందులో భాగంగానే ‘డబుల్ ఇస్మార్ట్’ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
హీరో రామ్‌కూ కీలకం!
ఇక హీరో రామ్ కూడా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart Movie) చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘స్కంద’ (Skanda) చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా రాణించలేదు. పైగా ఈ సినిమాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలో యాక్షన్ మరి ఓవర్‌గా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అటు ఈ చిత్రానికి ముందు రామ్ చేసిన ‘వారియర్’ (Warrior Movie In Telugu)) కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక పోయింది. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రామ్‌కు ఎంతో కీలకంగా మారింది.
మే 14 , 2024
Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
ఈ ఏడాది టాలీవుడ్ చాలా మంది హీరోయిన్లకు కలిసొచ్చింది. వారు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ప్రత్యేకించి కొందరు మాత్రం ఈ ఏడాది తమ తల రాతలను మార్చుకున్నారు. తమకంటూ స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్నారు. అంతేగాక 2023 ఏడాదిలో తమకు తిరుగులేదని వారు నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు సాధించిన ఘనతలు ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
శ్రీలీల
ఈ ఏడాది చాలా బాగా పాపులర్ అయిన హీరోయిన్ల జాబితాలో శ్రీలీల (Sreeleela) ప్రథమ స్థానంలో ఉంటుంది. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. రవితేజ పక్కన ‘ధమాకా’లో చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా ఆ తర్వాత వరుసగా రామ్‌తో ‘స్కంద’, బాలయ్య కూతురిగా 'భగవంత్ కేసరి', పంజా వైష్ణవ్ తేజ్‌తో 'ఆదికేశవ', నితీన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం మహేష్, విజయ్ దేవరకొండ, పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల నటిస్తోంది.
కీర్తి సురేష్
యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthy Suresh)కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. నాని సరసన ఆమె నటించిన 'దసరా' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విజయవంతమైంది. రూ.100 కోట్లకు పైగా ఇందులో తన నటనకు గానూ కీర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు ‘భోళాశంకర్’ సినిమాలో చిరంజీవి సోదరిగా నటించి మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్ పక్కన ‘మామన్నన్’ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
రష్మిక మందన్న
ఈ ఏడాది రష్మిక మందన్న(Rashmika Mandanna) తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంది. విజయ్‌తో ‘వారసుడు’ చిత్రంలో నటించిన ఈ భామ.. బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘మిస్టర్ మజ్నూ’ చేసింది. ఇక రణ్‌బీర్ కపూర్‌కు జోడీగా ఆమె నటించిన ‘యానిమల్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.
సమంత
ఈ ఏడాది సమంత (Samantha)కు మిశ్రమ స్పందన ఎదురైంది. ఆమె నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ మూవీ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు తమిళం, ఇంగ్లీష్‌లో తెరకెక్కుతున్న బైలింగ్విల్ ఫిల్మ్ ‘చెన్నై స్టోరీస్’లోనూ నటించే అవకాశాన్ని సమంత దక్కించుకుంది.
సంయుక్త మీనన్
ఈ ఏడాది సంయుక్త మీనన్ (Samyuktha menon)కు మంచి విజయాలను అందించింది. ధనుష్ సరసన ఆమె నటించిన 'సార్' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ సరసన ఆమె చేసిన 'విరూపాక్ష' చిత్రం ఘన విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో సంయుక్త తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
అనుష్క శెట్టి
గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన స్టార్ నటి అనుష్క (Anushka Shetty) ఈ ఏడాది మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా అనుష్కకు గట్టి కమ్‌బ్యాక్ లభించిందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.
శ్రుతి హాసన్
టాలీవుడ్‌లో సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న శ్రుతి హాసన్ (Shruti Haasan)కు ఈ ఏడాది కలిసొచ్చిందని చెప్పవచ్చు. చిరంజీవి, బాలకృష్ణలతో ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా నానితో ‘హాయ్ నాన్న’ చిత్రంలోనూ ఓ పాటలో స్టెప్పులేసి అదరగొట్టింది. అలాగే ప్రభాస్ సరసన 'సలార్' సినిమాలోనూ శ్రుతి హాసన్ నటించింది.
డిసెంబర్ 19 , 2023
OTT Releases This Week (Oct 24-28): ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సూపర్ హిట్ చిత్రాలు ఇవే!
దసరా పండుగ వేళ భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో వంటి పెద్ద సినిమాలు విడుదల కావడంతో ఈ వారం థియేటర్లలో రిలీజ్‌కు చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏమి లేవు. అయితే సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇక ఓటీటీల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు 20కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్దమయ్యాయి. ఇటీవల రిలీజైన చంద్రముఖి2, స్కందతో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. మరి అవెంటో ఓసారి చూసేద్దాం.
ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు
మార్టిన్ లూథర్ కింగ్ (Martin luther king telugu movie)
కమెడియన్ సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. పొలిటికల్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని పూజా కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ చిత్రం 'మండేలా'కీ రీమేక్ వస్తోంది. తమిళంలో కమెడియన్ యోగీ బాబు ఇందులో నటించారు. ఈ సినిమాలో నరేష్, మహా, శరణ్య ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని YNOT స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది. మార్టిన్ లూథర్ కింగ్ ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది.
ఘోస్ట్ (GHOST)
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం ఘోస్ట్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కింది. ఈ చిత్రం అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఘోస్ట్ సినిమాలో అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణ్, ఎంజీ శ్రీనివాస్, అర్చన్ జాయిస్, సత్యప్రకాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్ జన్య మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా.. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషాల్లో రిలీజ్ కానుంది.
ఈ వారం (October 24-28) ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న చిత్రాలు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott)
TitleCategoryLanguagePlatformRelease DateParamporulMovieTamilAmazon PrimeOctober 24Asprints Season 2WebseriesHindiAmazon PrimeOctober 25Transformers: Rise of the BeastMovieEnglishAmazon PrimeOctober 26ConsecrationMovieEnglishAmazon PrimeOctober 27Burning Betrayal MoviePortuguese NetflixOctober 25Life on Our PlanetSeriesEnglishNetflixOctober 25Chandramukhi 2MovieTelugu DubbedNetflixOctober 26Long Live LoveMovieThaiNetflixOctober 26PlutoWeb SeriesJapaneseNetflixOctober 26Pain HustlersMovieEnglishNetflixOctober 27Sister DeathMovieSpanishNetflixOctober 27TorWeb Series SwedishNetflixOctober 27Yellow Door: 90s Lo-Fi Film ClubMovie KoreanNetflixOctober 27PebblesMovieTamilSony LivOctober 27Paramporul MovieTamilahaOctober 24Changure Bangura RajaMovieTeluguE-WinOctober 27Phone CallMovieHindiJio movieOctober 23Duranga Season 2SeriesHindiZee 5October 24Nikonj - The Search BeginsMovieBengaliZee 5October 27Masterpiece SeriesTelugu Dubbed Disney Plus HotstarOctober 25 Koffee With Karan Season 8Talk ShowHindiDisney Plus HotstarOctober 26SkandaMovieTeluguDisney Plus HotstarOctober 27Nights of ZodiacMovieEnglishBook My showOctober 24CursesSeriesTamilApple Plus TVOctober 27The Enfield Poltergeist SeriesEnglishApple Plus TVOctober 27
అక్టోబర్ 26 , 2023
Actress Sreeleela: బాలయ్యతో పోటీపడి నటించిన శ్రీలీల.. అదే జరిగితే టాప్ హీరోయిన్ స్థానం ఖాయం!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల (Actress Sreeleela) నటించిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం ఇవాళ విడుదలైంది. ఇందులో నందమూరి బాలకృష్ణ కూతురిగా శ్రీలీల అదరగొట్టింది.
ముఖ్యంగా ఏమోషనల్ సీన్స్‌లో బాలయ్యతో పోటీ పడి మరీ శ్రీలీల నటించింది. కెరీర్ ప్రారంభంలోనే తనకు దక్కిన అద్భుతమైన అవకాశాన్ని ఈ భామ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.
శ్రీలీల తన గత చిత్రాల్లో కేవలం గ్లామర్, డ్యాన్స్‌కే పరిమితమైంది. కానీ భగవంత్ కేసరి ద్వారా నటనకు స్కోప్ ఉన్న పాత్రను ఆమె దక్కించుకుంది. డ్యాన్స్‌లోనే కాకుండా నటనలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.
శ్రీలీల హీరోయిన్‌గా ఇటీవల వచ్చిన ‘స్కంద’ (Skanda) చిత్రం కూడా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో కూడా ఆమె నటన, డ్యాన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి.
ఈ ఏడాది టాలీవుడ్‌లో శ్రీలీల నటించిన రెండు చిత్రాలు థియేటర్లలో విడుదలవ్వగా మరో నాలుగు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.
ప్రస్తుతం ఈ భామ చేతిలో ఆదికేశవ (Adi Keshava), ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man), గుంటూరు కారం (Guntur Karam), ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు కూడా విజయం సాధిస్తే ఇక శ్రీలీలకు తెలుగులో తిరుగుండదని చెప్పవచ్చు.
కిస్ (Kiss) అనే కన్నడ చిత్రం ద్వారా శ్రీలీల సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం కర్ణాటకలో 100 రోజులకు పైగా ఆడి సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'భరాతే' అనే మరో కన్నడ చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా చేసింది.
ఇక 2021లో వచ్చిన 'పెళ్లి సందD' చిత్రంతో ఈ సుందరి తెలుగులో అడుగుపెట్టింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఈ మూవీలో శ్రీలీల ఎంతో గ్లామర్‌గా కనిపించింది. తన డ్యాన్స్‌తో అదరగొట్టింది.
గతేడాది రవితేజ ‘ధమాకా’ చిత్రంలోనూ శ్రీలీల మెరిసింది. మాస్ మహా రాజా ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా నటిస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంది.
ఓ వైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ శ్రీలీల చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టా ఖాతాను 2.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
అక్టోబర్ 19 , 2023
Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
నటీనటులు: రామ్ పొత్తినేని, శ్రీలీల, శ్రీకాంత్, ప్రిన్స్, ఇంద్రజ, సాయిమంజ్రేకర్, శరత్ లోహితాశ్వ
నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి
డైరెక్టర్: బోయపాటి శ్రీను
సంగీతం: ఎస్‌ఎస్ తమన్
ఎడిటింగ్: తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రం స్కంద ప్రపంచవ్యాప్తంగా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న రామ్..ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? అఖండాతో భారీ విజయాన్ని నమోదు చేసిన బోయపాటి మరోసారి తన మాస్ మార్క్‌ను చూపించాడా? ఇంతకు సినిమా ఎలా ఉంది? సినిమాలోని ఏ అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి? వంటి అంశాలను YouSay రివ్యూలో చూద్దాం.
కథ
స్కంద స్టోరీ విషయానికి వస్తే ఓ ఊరిలో ఉండే హీరో రామ్ కుటుంబమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అదేక్రమంలో ఆలయంలో దొంగతనం జరుగుతుంది. ఆ నింద రామ్ ఫ్యామిలీపై పడుతుంది. ఆ నిందను రామ్ చెరిపేశాడా? ఈ మధ్యలో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది. హీరో మరియు విలన్‌ల మధ్య పగ ఎందుకు స్టార్ట్ అయింది. క్లైమాక్స్ ఏంటీ? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని ఇప్పటివరకు అభిమానులు చూడని మాస్ అవతార్‌లో కనిపించడం బాగుంది. సినిమాలో ఫస్టాఫ్ విషయానికొస్తే.. హీరో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్, హీరోయిన్‌తో కామెడీ ట్రాక్ రొమాన్స్ ఉంటుంది. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోయింది. అప్పటి వరకు సాదాసీదగా నడిచిన సినిమా ఆ తర్వాత నుంచి సినిమా హైప్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు బాగున్నాయి. కొన్ని సీన్లు కంటతడిపెట్టిస్తాయి. రామ్ చెప్పే మాస్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. 'ఇయ్యాలే పొయ్యాలే... గట్టిగా అరిస్తే తొయ్యాలే... అడ్డం వస్తే లేపాలే, దెబ్బతాకితే సౌండ్ గొల్కొండ దాటలే' వంటి డైలాగ్స్ ఊపు తెప్పిస్తాయి. ఇక సాంగ్స్‌లో రామ్- శ్రీలీల ఇద్దరు పోటీ పడి మరి స్టెప్పులతో ఇరగదీశారు. నీ చుట్టు సాంగ్, కల్ట్ మామ పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది.
ఎవరెలా చేశారంటే?
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ కంప్లీట్ మాస్ అవతార్‌లో అదరగొట్టాడు. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. సినిమా మొత్తం హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రామ్‌ను బోయపాటి బాగా చూపించారు. రెండు విభిన్న పాత్రల్లో రామ్ మెప్పించాడు. మాస్ డైలాగ్స్ థియేటర్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రామ్ పక్కన శ్రీలీల జోడీ బాగుంది. తన అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌తో అదరగొట్టింది. మరో హీరోయిన్ సాయీ మంజ్రేకర్ సైతం ఆకట్టుకుంది. శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్ తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్
బాలకృష్ణతో అఖండ విజయం తర్వాత బోయపాటి మరోసారి తన యాక్షన్ మార్క్‌ను చూపించాడు. లవ్లీ బాయ్ రామ్‌ను పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇంటెన్సివ్ యాక్షన్ సీన్లు ప్రేక్షకుల ఊహకు మించి ఉంటాయి. పస్టాఫ్‌ను కామెడీ లవ్ ట్రాక్‌తో నడిపిన బోయపాటి... సెకండాఫ్ నుంచి కథలో సీరియస్ నెస్ తీసుకొచ్చి స్టోరీకి ప్రేక్షకున్ని కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఓ నార్మల్ ఫ్యామిలీ స్టోరీకి మాస్ ఎలిమెంట్స్ జోడించి కమర్షియల్ సినిమాగా బోయపాటి మార్చేశాడు.
టెక్నికల్ పరంగా
సాంకేతికంగా , నిర్మాణ విలువల పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. థమన్ అందించిన BGM బాగుంది. సాంగ్స్ పర్వాలేదు. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోతుంది. సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ప్రేక్షకులకు మాస్ మీల్స్‌ను అందించడంలో ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదని తెలుస్తోంది.
బలం
బోయపాటి మార్క్ డైరెక్షన్
రామ్ మాస్ యాక్టింగ్
శ్రీలీల అందం
థమన్ BGM
బలహీతనలు
అవసరానికి మించిన కొన్ని యాక్షన్ సీన్లు
చివరగా:
మాస్ మీల్స్ కోరుకునే ప్రేక్షకులకు ఊహకు మించిన ట్రీట్ అందిస్తుంది స్కంద. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.
రేటింగ్ 4/5
సెప్టెంబర్ 28 , 2023
Bhagyashri Borse: మరో బంపరాఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ.. ఈ అమ్మడి దూకుడు మామూల్గా లేదుగా!
యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు ఇటీవల పెద్ద ఎత్తున టాలీవుడ్‌లో మార్మోగింది. తెలుగులో ఆమె ఫస్ట్ ఫిల్మ్ ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైనప్పటికీ బాగ్యశ్రీ ప్రదర్శన మాత్రం మెప్పించింది. ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. తాజాగా మరో బంపరాఫర్ కొట్టేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. టాలీవుడ్‌లో చిన్నగా గేర్లు మారుస్తూ టాప్ హీరోయిన్ స్థాయికి భాగ్యశ్రీ ఎదుగుతోందంటూ ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
రామ్ సరసన హీరోయిన్గా..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఓ సినిమాను ప్లాన్ చేస్తోంది. 'RAPO22' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr. Polishetty) డైరెక్టర్ మహేష్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపికచేసినట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. ’రీసెంట్ సెన్సేషన్ భాగ్య శ్రీ తమ ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడం వల్ల ఈ చిత్రానికి మరింత అందం వచ్చింది’ అని సదరు సంస్థ పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను గురువారం (నవంబర్ 21) వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది. గురువారం (నవంబర్ 21) పూజా కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
https://twitter.com/MythriOfficial/status/1859100765832261753
రామ్ ఆశలన్నీ 'RAPO22' పైనే!
'RAPO22' రామ్ 22వ చిత్రంగా రానుంది. గురువారం(నవంబర్ 21) పూజా కార్యక్రమాలు నిర్వహించి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను మెుదలుపెట్టనున్నారు. హై ఎనర్జీ న్యూ ఏజ్ స్టోరీగా ఇది రాబోతోన్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీస్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్లు దీన్ని నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే మూవీ సక్సెస్‌పైనే రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత కొంత కాలంగా రామ్‌కు సాలిడ్ హిట్ పడలేదు. ఆయన గత చిత్రాలు ‘రెడ్’, ‘ది వారియర్’, ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్ ‘బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ పరిచాయి. దీంతో 'RAPO22'తోనైనా హిట్ కొట్టి ఫ్యాన్స్‌ను సంతోష పెట్టాలని ఈ ఎనర్జటిక్ స్టార్ భావిస్తున్నారు. మరోవైపు 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ నేపథ్యంలో భాగ్యశ్రీకి (Bhagyashri Borse) ఈ సినిమా సక్సెస్ కీలకం కానుంది.
ఫ్లాప్ వచ్చినా ఏమాత్రం తగ్గని క్రేజ్!
‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. ఇటీవల 'కాంత' సినిమాలో హీరోయిన్గా ఎంపికై తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే రామ్ సరసన మరో క్రేజీ ఆఫర్ దక్కించుకొని ఆశ్చర్యపరిచింది.
దుల్కర్‌కి జోడీగా పాన్ ఇండియా ఫిల్మ్
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’ (Kaantha). ‘నీలా’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగా కొన్ని వారాల క్రితం పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అందంగా చీరకట్టుకొని మరి భాగ్యశ్రీ హాజరయ్యింది. ఆమె లుక్స్‌కు మరోమారు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె మంచి ఛాన్స్ కొట్టేశారంటూ పోస్టులు పెట్టారు. వేఫరెర్ ఫిలిమ్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.
https://twitter.com/DQsWayfarerFilm/status/1833013939837276196
విజయ్ దేవరకొండతోనూ..
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న 'VD12' చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఈ సినిమాలో విజయ్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్ అయిన హీరో, మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో 'VD12' రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇక నేచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ ఉంది.
భాగ్యశ్రీ ప్రేమలో పడిందా?
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఓ వ్యక్తితో ప్రేమలో పడినట్లు ఇతర వార్తలు వచ్చాయి. 'ప్రేమ.. ఎలాంటి హెచ్చరిక లేకుండా పుడుతుంది' అంటూ గతంలో ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. తనకు బాగా దగ్గరైన వ్యక్తి ఇచ్చిన పూల బొకేను షేర్ చేస్తూ దానికి లవ్ సింబల్‌ను కూాడా ఈ అమ్మడు జత చేసింది. మంచుతో నిండిన కొండలోయలను ఇష్టమైన వాడితో వీక్షిస్తూ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. తాము ప్రేమ పక్షులం అని అర్థం వచ్చేలా రెండు బర్డ్స్ ఉన్న ఫొటోను షేర్ చేసి ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చింది. ఓ వ్యక్తితో కలిసి సూర్యస్తమయాన్ని వీక్షిస్తూ అతడి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. చివరిగా ‘ఈ వీక్‌లో కొంత భాగం’ అంటూ లవ్ ఎమోజీ, ఓ పక్షి ఫొటోను పెట్టింది. దీంతో భాగ్యశ్రీ ప్రేమలో పడిపోయిందంటూ నెటిజన్లు జోరుగా పోస్టులు పెట్టారు.
నవంబర్ 20 , 2024
Pushpa 2: ‘పుష్ప 2’ మేకింగ్‌లో ఊహించని ట్విస్ట్.. దేవిశ్రీ ప్లేసులో థమన్‌కు ఛాన్స్!
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రంలో దేశవ్యాప్తంగా బజ్ ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు నెల రోజుల సమయం కూడా లేదు. డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తవ్వగా రెండు పాటలు, ఓ సీన్ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో అనౌన్స్ చేసిన టైమ్‌కు పుష్ప 2 వస్తుందో లేదోనని ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే పుష్ప మేకింగ్‌కు సంబంధించి ఊహించని ట్విస్టు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బాథ్యతలు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
‘పుష్ప 2’ టీమ్‌లోకి థమన్!
‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్‌కు అతడు ఇచ్చిన మ్యూజిక్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు ‘పుష్ప 2’కు సంబంధించి ఇటీవల రిలీజైన రెండు పాటలు సైతం యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అటువంటి దేవిశ్రీని పుష్ప టీమ్ పక్కన పెట్టినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం దేవిశ్రీని కాదని థమన్‌కు ఈ సినిమా నేపథ్య సంగీతం బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ రాక్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న దేవిశ్రీని పెట్టుకొని థమన్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతలు అప్పగించడం చర్చలు తావిస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
సుకుమార్ అసంతృప్తి!
సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్‌కు మంచి ర్యాపో ఉంది. సుకుమార్ ఇప్పటివరకూ తెరకెక్కించిన అన్ని చిత్రాలకు దేవిశ్రీనే సంగీతం సమకూర్చారు. అంతేకాదు ఆయా చిత్రాల ఆల్బమ్స్ సూపర్ డూపర్‌గా నిలిచాయి. ఈ క్రమంలో ‘పుష్ప 2’ బాధ్యతలు సైతం దేవిశ్రీకి సుకుమార్ అందించారు. పుష్ప 2 పాటల విషయంలో సంతృప్తి చెందిన సుకుమార్ నేపథ్యం సంగీతం విషయంలో మాత్రం అసంతప్తిగా ఉన్నారట. సినిమా రిలీజ్‌కు 29 రోజుల సమయంలో మిగిలి ఉండటం, దేవిశ్రీకి ఇంకా చేతినిండా పని ఉండటంతో థమన్ చేత బీజీఎం ఇప్పించాలని సుకుమార్ నిర్ణయించారట. ఇందుకోసం థమన్‌తో చర్చలు సైతం జరిపినట్లు టాక్ వినిపిస్తోంది. థమన్ కూడా కొన్ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్‌ను సుకుమార్‌కు వినిపించారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది.
థమన్‌కే ఎందుకు!
సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ (S.S. Thaman)కు మంచి పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతం అందిస్తాడని పేరుంది. ఇటీవల కాలంలో థమన్ పాటల కన్నా బీజీఎంతోనే ఎక్కువగా అల్లాడిస్తున్నారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘వకీల్‌సాబ్’, ‘భగవంత్ కేసరి’, ‘గుంటూరు కారం’, ‘బ్రో’ ‘స్కంద’ వంటి చిత్రాలకు థమన్ ఏ స్థాయి బీజీఎం ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో ఎంతో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండగా థమన్‌నే ఏరికోరి సుకుమార్ బీజీఎం అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు థమన్ ఇప్పటికే అల్లు అర్జున్‌తో రెండు సినిమాలు చేశాడు. ‘సరైనోడు’, ‘అలా వైకుంఠపురంలో’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. బన్నీకి ఎలాంటి మ్యూజిక్ ఎలివేషన్స్ ఇస్తే థియేటర్లు దద్దరిల్లుతాయో థమన్‌కు ఇప్పటికే ఓ ఐడియా ఉంది. కాబట్టి 'పుష్ప 2'కు థమన్ నేపథ్య సంగీతం అందించినా అది కచ్చితంగా అదిరిపోతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
తెరపైకి మరో మ్యూజిక్ డైరెక్టర్!
థమన్‌తో పాటు మరో మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ‘కాంతార’, ‘మంగళవారం’ లాంటి సినిమాలకి వర్క్ చేసిన సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ (Ajaneesh Loknath)ను కూడా ‘పుష్ప 2’ (Pushpa 2) కోసం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఎక్కువ సమయం లేనందున థమన్‌కు తొలిభాగం, అజనీష్‌కు సెకండ్ పార్ట్ బాధ్యతలు అప్పగిస్తారని రూమర్లు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ‘పుష్ప 2’ చిత్రానికి ఏకంగా ముగ్గురు డైరెక్టర్లు పనిచేయనున్నారు. అయితే థమన్ ఒక్కరే నేపథ్యం సంగీతం అందిస్తారని ఇండస్ట్రీ వర్గాలు స్ట్రాంగ్‌గా చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకూ స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు.
‘పుష్ప 2’ అరుదైన ఘనత
పుష్ప (Pushpa 2) కి ముందు వరకూ కేవలం టాలీవుడ్‌కు మాత్రమే పరిచయమైన అల్లుఅర్జున్ ఆ సినిమా సక్సెస్‌తో వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా స్థాయితో పాటు ఓవర్సీస్లోనూ పుష్ప’ (2021) సక్సెస్ కావడంతో ‘పుష్ప 2’పై విదేశీ ఆడియన్స్‌లోనూ భారీగా హైప్ ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఓవర్సీస్లో ప్రీసేల్ బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు. దీంతో ‘పుష్ప 2’ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులంతా ప్రీసేల్ టికెట్స్ కోసం ఎగబడ్డారు. ఫలితంగా క్షణాల వ్యవధిలో అత్యంత వేగంగా తొలి 15 వేల టికెట్స్ (Pushpa 2 Record) అమ్ముడుపోయాయి. అమెరికాలో భారతీయ చిత్రానికి ఇంతవేగంగా టికెట్స్ అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పుష్ప టీమ్ స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేసింది.
https://twitter.com/PushpaMovie/status/1854036371146695000
నవంబర్ 07 , 2024
Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?
టాలీవుడ్‌లో గత ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు హీరోలు విభిన్నమైన కథలను ఎంచుకొని పాన్ ఇండియా స్థాయికి ఎదిగితే మరికొందరు తమ ఫేమ్‌ను తిరోగమనంలోకి తీసుకెళ్లారు. కొందరు హీరోలు చకచకా సినిమాలు చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తే ఇంకొందరు రెండేళ్లకు కూడా ఒక సినిమా రిలీజ్ చేయలేక ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమయ్యారు. ముఖ్యంగా కొందరు యంగ్ హీరోలు ఫ్లాప్స్ తియ్యడంలో పోటీ పడుతూ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఇక సీనియర్ హీరోల పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత ఐదేళ్లలో టాలీవుడ్‌లో వచ్చిన గణనీయమైన మార్పులు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ఒక మూవీకి ఏళ్లకు ఏళ్ల సమయం!
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజ నటులు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను అలరించేవారు. వీరి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంటటేష్, బాలకృష్ణ సైతం ఈ పరంపరను కొనసాగిస్తూ ఏడాదిలో ఒక సినిమాకు తగ్గకుండా రిలీజ్ చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల సమయం పడుతోంది. రామ్‌చరణ్, అల్లు అర్జున్, తారక్ వంటి స్టార్ హీరోల నుంచి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు దాటిపోయింది. ఓ వైపు ప్రభాస్ ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఈ ముగ్గురు స్టార్స్ మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారు. సైంటిఫిక్, మైథాలజీ, ఫ్యూచరిక్ సినిమాలంటే కొంత ఆలస్యం జరిగిన ఓ అర్థం ఉంది. ప్రస్తుతం తారక్ (దేవర), రామ్‌చరణ్ (గేమ్ ఛేంజర్), అల్లు అర్జున్ (పుష్ప 2) చేస్తున్న కమర్షియల్ చిత్రాలకు కూడా ఇంత ఆలస్యం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఫ్లాప్స్‌తో పోటీపడుతున్న కుర్ర హీరోలు!
యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నాగచైతన్య (Naga Chaitanya), రామ్ పోతినేని (Ram Pothineni)లకు గత ఐదేళ్లుగా టాలీవుడ్‌లో అసలు కలిసి రావడం లేదు. వారి నుంచి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు హిట్ సినిమాలతో పోటీ పడిన ఈ ముగ్గురు హీరోలు అనూహ్యంగా గత ఐదేళ్ల నుంచి ఫ్లాప్స్‌తో పోటీ పడుతున్నారు. విజయ్ నటించిన రీసెంట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’తో పాటు గతంలో వచ్చిన ‘లైగర్’, ‘ఖుషి’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. అలాగే నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’, ‘లాల్ సింగ్ చద్ధా’, ‘థ్యాంక్యూ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేసిన లేటెస్ట్ చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అంతకుముందు వచ్చిన ‘స్కంద’, ‘వారియర్’, ‘రెడ్’ సినిమాలు హిట్స్ అందుకోలేక ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి.
మార్కెట్ కోల్పోయే దిశగా సీనియర్లు
ఇక సీనియర్ హీరోల పరిస్థితి గత ఐదేళ్ల వ్యవధిలో దారుణంగా మారిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటివరకూ సరైన కమ్‌బ్యాక్ లభించలేదని చెప్పాలి. ఓవైపు రజనీకాంత్, కమల్ హాసన్ తమ వయసుకు తగ్గ స్టోరీలు ఎంచుకొని ‘జైలర్’, ‘విక్రమ్’ సినిమాలతో సాలిడ్ విజయాలను అందుకున్నారు. అయితే చిరు ఇప్పటికే కమర్షియల్ పాత్రలనే ఎంచుకుంటూ పోవడం ఆయనకు మైనస్‌గా మారుతోంది. అటు నాగార్జున, వెంకటేష్ పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. నాగార్జున గత చిత్రాలు ‘మన్మథుడు 2’, ‘బంగార్రాజు’, ‘నా సామిరంగ’లోని పాత్రలు ఏమాత్రం నాగార్జునకు సెట్ అయ్యేవిగా కనిపించవు. ఇక వెంటేష్ ‘రానా నాయుడు’ సిరీస్‌తో విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పటిలాగే మాస్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. అయితే కొత్త కథలు ఎంచుకోకపోవడం, వయసు తగ్గ పాత్రలు చేయకపోవడం, సరైన హిట్స్ లేకపోవడంతో ఒకప్పటి స్టార్ హీరోలుగా వెలిగిన ఈ హీరోల కలెక్షన్స్ కుర్రహీరోలతో పోలిస్తే పడిపోతూ వస్తున్నాయి. మార్కెట్‌ను పూర్తిగా కోల్పేయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రభాస్, నాని సూపర్బ్!
గత ఐదేళ్ల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హీరోలుగా ప్రభాస్, నానిలను చెప్పవచ్చు. ఓవైపు వేగంగా సినిమాలు చేస్తూనే ప్రతీ మూవీకి కథ, పాత్ర పరంగా వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నారు. క్వాలిటీ పరంగానూ మంచి సినిమాలు తీస్తూ ఎప్పటికప్పుడు తమ క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రభాస్ గత చిత్రాలను పరిశీలిస్తే ‘బాహుబలి 1 & 2’, ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కథ, పాత్ర పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. అటు నాని రీసెంట్ చిత్రాలైన ‘గ్యాంగ్ లీడర్’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘అంటే సుందరానికి’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ కూడా విభిన్నమైనవే. నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిందే. అటు ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ‘రాజాసాబ్’, సలార్ 2, ‘కల్కి 2’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ కథ, పాత్ర పరంగా ప్రభాస్‌ను మరో లెవల్‌లో చూపించనున్నాయి.
రీరిలీజ్‌లతో ఫ్యాన్స్ సంతృప్తి!
గతంలో లేని విధంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్ హీరోల బర్త్‌డేల సందర్భంగా గతంలో వారు చేసిన బ్లాక్ బాస్టర్ చిత్రాలు విడుదలవుతున్నాయి. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు లాంగ్ గ్యాప్ వస్తుండటంతో రీరిలీజ్ మూవీస్‌లోనే తమ హీరోను చూసుకొని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. గత రోజులను గుర్తుచేసుకుంటూ సంతోష పడుతున్నారు. అయితే రీరిలీజ్ చిత్రాలకు ఆదరణ పెరగడానికి ఓ కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఆ తరహా చిత్రాలను హీరోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రీరిలీజ్ రూపంలో తమ ఫేవరేట్ చిత్రాలను మళ్లీ చూసుకొని అభిమానులు సంతోష పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఆ స్టార్ డైరెక్టర్లకు ఏమైంది?
టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన పూరి జగన్నాథ్‌కు హీరోలతో సమానంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ఆయన నుంచి సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొనేది. ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘పోకిరి’, ‘బిజినెస్ మ్యాన్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బాస్టర్స్‌తో ఓ దశలో టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. అటువంటి పూరి గత కొంత కాలంగా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన గత చిత్రం ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. తాజాగా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సైతం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అటు హరీష్ శంకర్ పరిస్థితి కూడా ఇంచుమించు పూరి లాగానే ఉంది. ‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్స్‌తో మాస్ డైరెక్టర్‌గా హరీష్ శంకర్ ఇటీవల సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’, ‘గద్దల కొండ గణేష్’ ప్లాప్స్‌తో లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’పై అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మిస్టర్ బచ్చన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. హరీష్ శంకర్ టేకింగ్ సాదా సీదాగా ఉందంటూ విమర్శలు సైతం వచ్చాయి.
ఆగస్టు 17 , 2024
Balakrishna - Ram: టాలీవుడ్‌లో సరికొత్త కాంబోలు.. మల్టీస్టారర్ల శకం మెుదలైందా?
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలకు ఎంతో క్రేజ్ ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే అది ఆడియన్స్‌కు కన్నుల పండుగగా ఉంటుంది. గతంలో ఈ తరహా మల్టీ స్టారర్ చిత్రాలు పెద్ద ఎత్తునే వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో వాటి జోరు తగ్గింది. దీంతో ఆడియన్స్ కూడా మల్టీస్టారర్ మేనియా నుంచి కాస్త పక్కకు జరిగారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత మళ్లీ ఆ తరహా చిత్రాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో సరైన కథ తగిలితే మల్టీ స్టారర్లు చేసేందుకు తెలుగు స్టార్లు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల చిరు-పవన్-చరణ్, రామ్‌చరణ్-సూర్య కాంబినేషన్స్‌పై గాసిప్స్ వచ్చాయి. తాజాగా బాలయ్య-రామ్ పోతినేని కాంబో చిత్రంపైనా జోరుగా ప్రచారం మెుదలైంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మల్టీస్టారర్ లోడింగ్..!
మాస్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), రామ్ పోతినేని (Ram Pothineni) ముందు వరుసలో ఉంటారు. నటుడు బాలకృష్ణ గత కొంతకాలంగా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తున్నారు. అటు రామ్ కెరీర్ ప్రారంభంలో లవర్ బాయ్ చిత్రాలు చేసినప్పటికీ ఇటీవల యాక్షన్ చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఇస్మార్ట్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ వంటి యాక్షన్ చిత్రాల్లో నటించాడు. అటువంటి ఈ ఇద్దరి హీరోల కాంబోలో ఓ క్రేజీ మల్టీస్టారర్ రాబోతున్నట్లు ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి కాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే దీనిపై నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఈ వార్త నిజమైతే మాస్ ఆడియన్స్‌కు పండగే అని చెప్పవచ్చు.
గుడ్ ఫ్రెండ్‌షిప్
హీరో రామ్, నందమూరి బాలకృష్ణకు మధ్య వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఈ విషయం తొలిసారి స్కంద ఆడియో ఫంక్షన్‌లో బయటపడింది. బోయపాటి, రామ్ కాంబోలో రూపొందిన ‘స్కంద’ ఆడియో రిలీజ్ వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఆ సందర్భంగా హీరో రామ్‌తో ఆయన ఎంతో సన్నిహితంగా మెలిగారు. రామ్ తన స్పీచులో బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక్కడ ఒక్క తరాన్ని అలరించేందుకు అల్లాడుతుంటే బాలయ్య మాత్రం మూడు తరాలను అలరిస్తూనే ఉన్నారంటూ పొగడ్తల్లో ముంచేత్తారు. అటు బాలయ్య రామ్‌ను ఆకాశానికెత్తారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా మంచి స్నేహ బంధాన్ని కలిగి ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఓ సినిమాలో కలిసి నటిస్తే ఇక రికార్డులు గల్లంతేనని ఫ్యాన్స్ అంటున్నారు.
చరణ్ - సూర్య కాంబోపై బజ్!
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (Ram Charan), తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ రాబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అది అతడికి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందని తెలుస్తోంది. రామ్‌చరణ్ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే చరణ్ - సూర్య మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ క్రేజీగా ఉంటుందని అంటున్నారు. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
మెగా హీరోలతో మల్టీస్టారర్!
మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో హరీష్ శంకర్ (Harish Shankar) ఒకరు. అటువంటి హరీశ్ శంకర్ తన 'మిస్టర్ బచ్చన్' సినిమా ప్రమోషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పాన్ ఇండియా చిత్రం ఎందుకు తీయలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, చిరంజీవిల కోసం ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అది పట్టాలెక్కితే అన్ని పాన్ ఇండియాల కంటే అదే అతి పెద్ద పాన్ ఇండియా అవుతుందని పేర్కొన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అయితే గతంలో చిరు, రామ్‌చరణ్‌లు కలిసి ‘ఆచార్య’ చిత్రంలో నటించారు. ‘బ్రూస్‌లీ’, ‘మగధీర’ చిత్రాల్లో చరణ్ కోసం మెగాస్టార్ ఓ స్పెషల్ క్యామియో కూడా ఇచ్చారు. అటు పవన్ కల్యాణ్ సైతం 'శంకర్ దాదా MBBS', 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రాల్లో చిన్న క్యామియో పోషించారు.
ఆగస్టు 03 , 2024
Tollywood Movies: రిలీజ్‌కు ముందే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు.. ఎందుకో తెలుసా?
ఒక సినిమా థియేటర్‌లోకి రావాలంటే ఎంతో మంది కృషి అవసరం. ముఖ్యంగా హీరో, డైరెక్టర్ తమ సర్వశక్తులు ఒడ్డి సినిమాను తెరకెక్కిస్తారు. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. మరికొన్ని యావరేజ్ టాక్‌తో నిర్మాతలకు పెట్టుబడి మెుత్తాన్ని తిరిగి అందిస్తుంటాయి. ఇవన్నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిగే సంఘటనలు. అయితే కొన్ని చిత్రాలు మాత్రం థియేటర్లలోకి రాకముందే ఫ్లాప్ టాక్ (Tollywood Films Got Flop Talk Before The Release)ను మూటగట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఆయా చిత్రాలపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ వచ్చాయి. అటువంటి చిత్రాలు ఏవి? ఇందుకు గల కారణాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
భోళాశంకర్ (Bhola Shankar)
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా.. మేహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో రూపొందిన రీసెంట్ చిత్రం ‘భోళాశంకర్’. ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందంటూ రిలీజ్‌కు ముందే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. మేహర్ రమేష్.. గతంలో ఇచ్చిన డిజాస్టర్ల నేపథ్యంలో ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇందుకు అనుగుణంగానే రిలీజ్ తర్వాత ‘భోళాశంకర్’ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం గమనార్హం.
ఆదిపురుష్ (Aadi Purush)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం కూడా విడుదలకు ముందే తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి నెట్టింట విపరీతంగా ట్రోల్స్ మెుదలయ్యాయి. గ్రాఫిక్స్ మరి అద్వాన్నంగా ఉన్నాయని.. సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఇందుకు తగ్గట్లే విడుదల తర్వాత ‘ఆదిపురుష్’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సంభాషణలపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
షాడో (Shadow)
వెంకటేష్ (Venkatesh) హీరోగా మేహర్ రమేష్ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘షాడో’. మేహర్ రమేష్ గత చిత్రాలు ‘కంత్రి’, ‘శక్తి’ డిజాస్టర్‌గా నిలవడంతో దాని ప్రభావం ‘షాడో’పై కూడా పడింది. ఈ మూవీ ట్రైలర్.. అంచనాలను అందుకోకపోవడంలో విఫలం కావడంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందని అప్పట్లో కథనాలు వచ్చాయి. లాంగ్ హెయిర్‌లో వెంకీ లుక్ బాలేదని కూడా సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. మెుత్తానికి విడుదల తర్వాత ‘షాడో’ కూడా డిజాస్టర్ నిలిచి ఆ విమర్శలను నిజం చేసింది.
స్కంద (Skanda)
హీరో రామ్ (Ram), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో రూపొందిన ‘స్కంద’పై ట్రైలర్ రిలీజ్ ముందు వరకూ భారీ అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. యాక్షన్ సీన్స్ మరి ఓవర్ డోస్ అయినట్లుగా ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని కొందరు నెటిజన్లు అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే ‘స్కంద’ రిలీజ్ తర్వాత బి లో యావరేజ్‌గా నిలిచింది. ముఖ్యంగా రామ్‌కు నటుడు శ్రీకాంత్ ఎలివేషన్ ఇచ్చే డైలాగ్ ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రోల్ కావడం గమనార్హం.
వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama)
రామ్‌చరణ్ హీరోగా (Tollywood Films Got Flop Talk Before The Release) బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను తొలి ఆట నుంచే ట్రోల్స్ చుట్టుముట్టాయి. ముఖ్యంగా రామ్‌చరణ్ విలన్ సోదరుడి తల నరకడం.. గద్ద దాన్ని ఎత్తుకెళ్లడానికి సంబంధించిన సీన్ విపరీతంగా ట్రోల్‌కు గురైంది. అలాగే రైలు పై నుంచి పరిగెత్తుకుంటూ రామ్‌చరణ్ బిహార్ వెళ్లడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఓవరాల్‌గా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచి చరణ్ ఫ్లాప్ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.
లైగర్ (Liger)
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది. ప్రమోషన్స్ సందర్భంగా నిర్మాత చార్మీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు దోహదం చేశాయి. పైగా సిక్స్ ప్యాక్‌తో ఎంతో దృఢంగా ఉన్న విజయ్‌కు సినిమాలో నత్తి ఉన్నట్లు చూపించడం కూడా ట్రోల్స్‌కు కారణమైంది.
రాధే శ్యామ్ (Radheshyam)
బాహుబలి తర్వాత ప్రభాస్ తీసిన రెండో చిత్రం ‘రాధేశ్యామ్’. సాహో ఫ్లాప్ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా 1976 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఇందులో ప్రభాస్ హస్తసాముద్రికం తెలిసిన జ్యోతిష్కుడిగా కనిపిస్తాడని తెలియగానే ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అటు సోషల్ మీడియాలో ఈ సినిమా కూడా డౌటే అంటూ ట్రోల్స్ మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే విడుదలైన రాధేశ్యామ్ ఫ్లాప్ టాక్ తెచ్చుకొని.. ఆ రూమర్స్‌ను నిజం చేసింది.
వరల్డ్ ఫేమస్ లవర్ (World Famous Lover)
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం టీజర్ రిలీజ్ నుంచే విమర్శలను మూటగట్టుకుంది. టీజర్ బోల్డ్‌గా ఉండటంతో పాటు విజయ్ నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేయడం చూపించారు. అర్జున్ రెడ్డి సినిమా నుంచి హీరోయిన్లతో విజయ్ రొమాన్స్ ఎక్కువైందని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అటు మహిళ సంఘాలు కూడా ఈ సినిమాపై తీవ్రంగా స్పందించాయి. ఇన్ని ట్రోల్స్, విమర్శల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో దారుణంగా విఫలమైంది.
సన్ ఆఫ్ ఇండియా (Son of India)
మంచు మోహన్‌బాబు (Mohan Babu) హీరోగా చేసిన ‘సన్ ఆఫ్ ఇండియా’ (Tollywood Films Got Flop Talk Before The Release) చిత్రం విడుదలకు ముందే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ మీమ్స్ క్రియేట్ చేశాయి. మరో ఫ్లాప్ లోడింగ్ అంటూ ట్రోల్స్ చేశాయి. ఈ పరిణామాల మధ్య వచ్చిన ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది.
మార్చి 16 , 2024
Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
ఈ రోజుల్లో హీరో కావాలంటే డాన్సులు, నటన రావడమే కాదు ఫిజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో హీరో తెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. అందుకే ఎంత కష్టమైన భరించి కథానాయకులు సిక్స్ ప్యాక్‌లు చేస్తుంటారు. పాత్రలకు అనుగుణంగా తమను తాము రూపాంతరం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి బరువు కూడా పెరగాల్సి ఉంటుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం కోసం తమను ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని బట్టి మన స్టార్ హీరోలు సినిమా పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్భుతమైన ఫిజిక్ కలిగిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
చిరంజీవి (Chiranjeevi)
ఇంద్ర సినిమా ముందు వరకూ టాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్ కలిగిన హీరో అంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవినే గుర్తుకు వచ్చాయి. శంకర్‌దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన చిరు బాడీని కాస్త అశ్రద్ధ చేశారు. తిరిగి సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన చిరు.. ఆరు పదుల వయసులోనూ ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల ‘విశ్వంభర’ సినిమా కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపించారు.
https://twitter.com/i/status/1752914245170364419
ప్రభాస్ (Prabhas)
టాలీవుడ్‌లో మెస్మరైజింగ్ బాడీ అనగానే ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. తొలి చిత్రం ఈశ్వర్ నుంచి ఫిట్‌గానే ఉన్న ప్రభాస్.. బుజ్జిగాడు సినిమా కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్ చేశాడు. ఆ తర్వాత బాహుబలి కోసం మరింత బరువు పెరిగి కండలు తిరిగిన యోధుడిలా ప్రభాస్ మారాడు. రీసెంట్‌గా ‘సలార్’లోనూ ప్రభాస్ పలకలు తిరిగిన బాడీతో కనిపించాడు.
రానా (Rana)
ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో గంభీరమైన దేహాన్ని కలిగిన హీరో రానా. తొలి సినిమా ‘లీడర్’లో బక్కపలచని బాడీతో కనిపించిన రానా.. ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెందాడు. ‘కృష్ణం వందే జగద్గురం’లో కడలు తిరిగిన బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి చిత్రం కోసం మరింత బరువు పెరిగి.. ప్రభాస్‌ను ఢీకొట్ట సమవుజ్జీలా మారాడు.
సుధీర్ బాబు (Sudheer Babu)
శివ మనసు శృతి (SMS) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సుధీర్ బాబు.. తన బాడీతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు. బేసిక్‌గా జిమ్మాస్టర్ అయిన ఈ హీరో.. ప్రతీ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీని మెయిన్‌టైన్ చేస్తూ మెప్పిస్తున్నాడు.
రామ్ చరణ్ (Ram Charan)
మెగాస్టార్ వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్. తొలి సినిమాలో ఫిట్‌గా కనిపించిన చరణ్.. ‘మగధీర’కు వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా కండలతో మెరిశాడు. ఇక ధ్రువ సినిమాలో ఏకంగా సిక్స్ ప్యాక్‌తో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’లోనూ దృఢమైన బ్రిటిష్ పోలీసు అధికారిగా కనిపించి మెప్పించాడు.
అల్లు అర్జున్ (Allu Arjun)
గంగోత్రి సినిమాతో లేలేత వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుఅర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. దేశముదురు చిత్రంతో తొలిసారి సిక్స్ ప్యాక్‌లో కనిపించిన బన్నీ.. తన ఫిట్‌నెస్‌ను ప్రతీ సినిమాలోనూ కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్ పుష్పలో తన పాత్ర కోసం బరువు పెరిగి కనిపించాడు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)
టాలీవుడ్‌లో ఫిట్‌నెస్ బాడీని కలిగి ఉన్న స్టార్ హీరోల్లో తారక్ ఒకరు. కెరీర్ తొలినాళ్లలో చాలా బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్.. ‘యమదొంగ’ సినిమాతో సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లావైన తారక్.. ‘టెంపర్’లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’లోనూ దృఢమైన బాడీతో మెప్పించాడు.
రామ్ పోతినేని (Ram Pothineni)
లవర్ బాయ్‌లాగా క్యూట్‌గా కనిపించే రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్.. డబుల్ ఇస్మార్ట్ కోసం మళ్లీ సిక్స్ ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది.
నాగ శౌర్య (Naga Shourya)
యంగ్ హీరో నాగ శౌర్య.. కెరీర్ ప్రారంభంలో డెసెంట్ సినిమాలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించాడు. ఇటీవల ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి మాస్ హీరోగా రూపాంతరం చెందాడు.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)
మంచి హైట్, ఫిజిక్ కలిగిన విజయ్ దేవరకొండ.. ఇటీవల వచ్చిన ‘లైగర్’ సినిమాలో మెస్మరైజింగ్ బాడీతో అదరగొట్టాడు. బాక్సింగ్ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాత్రకు తగ్గట్టు విజయ్ తనను తాను మార్చుకున్నాడు.
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)
ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సీనియర్ నటుల్లో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్ ప్రారంభం నుంచి ఒకటే బాడీని మెయిన్‌టెన్ చేస్తున్న నాగార్జున.. ‘ఢమరుకం’ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు.
సునీల్ (Sunil)
టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని బాడీ ట్రాన్సఫర్‌మేషన్ ఏదైనా ఉందంటే అది కమెడియన్ సునీల్ (Sunil)ది మాత్రమే. హాస్య పాత్రలు పోషించి రోజుల్లో చాలా లావుగా కనిపించిన సునీల్.. హీరోగా మారాక సిక్స్ ప్యాక్ చేశాడు. పూలరంగడు సినిమాలో ఆరు పలకల బాడీతో కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశాడు.
ఫిబ్రవరి 23 , 2024
Double iSmart Movie: రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో అదిరే ట్విస్ట్.. పూరి మార్క్ ఫ్లాష్ బ్యాక్!
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ (Ram Pothineni), స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart). వీరి కాంబోలో 2019లో వచ్చి ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) చిత్రానికి రీమేక్‌గా ఇది వస్తోంది. తొలి భాగం సూపర్ హిట్‌గా నిలవడంతో పార్ట్ 2పై ఆసక్తి నెలకొంది. 2023 జులైలో పూజ కార్యక్రమాలతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంగా.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ షెడ్యూల్ షూటింగ్ ముంబయిలో జరిగింది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి సంబంధించి క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
క్రేజీ ఫ్లాష్ బ్యాక్..!
ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ (Double iSmart Movie) సినిమా కథకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమాలో పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో రామ్ పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపిస్తాడని సమాచారం. యాక్షన్ - థ్రిల్లర్ నేపథ్యంలో ఇది సాగుతుందని అంటున్నారు. పైగా తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువగానే ఉండనుందట. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
కసితో ఉన్న పూరి..!
డబుల్ ఇస్మార్ట్ మూవీని డైరెక్టర్ పూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఆయన రీసెంట్ మూవీ ‘లైగర్’ (Liger Movie) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం కావడంతో పూరీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. సినిమాకు ముందు ఆయన చేసిన కామెంట్స్ కూడా ఇందుకు కారణమయ్యాయి. దీంతో పూరి తన ఫోకస్ మెుత్తం ‘డబుల్ ఇస్మార్ట్’పై పెట్టారట. దీనిని అద్భుతంగా తెరకెక్కించి తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాలన్న కసిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్థాయిలో..
ఆ కారణంగానే ‘డబుల్ ఇస్మార్ట్’ను పాన్ ఇండియా స్థాయిలో పూరి జగన్నాథ్ రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని కేవలం సింగిల్ లాంగ్వేజ్ (తెలుగు)లో రిలీజ్ చేసిన పూరి.. సెకండ్ పార్ట్‌ను మాత్రం దేశంలోని పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. తద్వారా తన క్రేజ్‌ను జాతీయ స్థాయికి చేర్చాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు టాక్. ఇందులో భాగంగానే ‘డబుల్ ఇస్మార్ట్’ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
హీరో రామ్‌కూ కీలకమే!
ఇక హీరో రామ్ కూడా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart Movie) చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘స్కంద’ (Skanda) చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా రాణించలేదు. పైగా ఈ సినిమాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలో యాక్షన్ మరి ఓవర్‌గా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అటు ఈ చిత్రానికి ముందు రామ్ చేసిన ‘వారియర్’ (Warrior Movie In Telugu)) కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక పోయింది. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రామ్‌కు ఎంతో కీలకంగా మారింది.
ఛలో థాయిలాండ్!
‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్‌ను ముంబయిలో పూర్తి చేసిన డైరెక్టర్.. తర్వాతి షెడ్యూల్‌ను థాయిలాండ్‌లో ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అక్కడ కూడా సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను షూట్ చేస్తారని సమాచారం. ఇందుకోసం త్వరలోనే చిత్ర యూనిట్ థాయిలాండ్‌లో వాలిపోతుందని అంటున్నారు.
విలన్‌గా బాలీవుడ్ స్టార్
ఇక ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నారు. బిగ్ బుల్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌లో తాను భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ గతంలో సంజయ్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఆ రోజున రిలీజ్ కష్టమే!(Double Smart Release Date)
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ విడుదల తేదీని కూడా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. మహా శివరాత్రి సందర్భంగా వచ్చే నెల (మార్చి) 8న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అయితే అనుకున్నంత వేగంగా షూటింగ్ జరగడం లేదని సమాచారం. రకరకాల కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా ప్రకటించిన తేదీకి సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రిలీజ్ తేదీ మార్పుపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని పేర్కొంటున్నాయి.
ఫిబ్రవరి 05 , 2024
Tollywood Roundup 2023: గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. వారిలో ఎంత మంది సక్సెస్ అవుతారో చెప్పలేం. అందం, అభినయం, నటన వంటివి మాత్రమే వారిని హీరోయిన్స్‌గా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలామంది కథానాయికలు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ అంటే చెప్పటం కష్టమే. అయితే 2023 ఏడాదిలో గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ఉన్న తెలుగు హీరోయిన్స్ జాబితా బయటకొచ్చింది. అందులోని హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
రష్మిక మందన్న
గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన తెలుగు హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్న అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల ఈ భామ నటించిన యానిమల్ చిత్రం సూపర్ హిట్ కావడంతో రష్మిక పేరు మారుమోగింది. అంతకుముందు ఆమె డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. దీంతో రష్మిక గురించి ఎక్కువ మంది నెట్టింట శోధించారు.
మృణాల్ ఠాకూర్
‘సీతారామం’ మూవీతో మృణాల్ ఠాకూర్ స్టార్ హీరోయిన్ల సరసన చేరిపోయింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్‌తో సెల్ఫీ సినిమాలో నటించింది. అలాగే గుమ్రా, లస్ట్ స్టోరీస్-2, పిప్పా వంటి చిత్రాల్లో కనిపించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. దీంతో పాటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా మోస్ట్ సెర్చ్‌డ్ హీరోయిన్ల జాబితాలో ఆమె రెండోస్థానంలో నిలిచింది.
శ్రీలీల
ఈ ఏడాది టాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్‌గా శ్రీలీల నిలిచింది. ఈ సంవత్సరం ఆమె నటించిన నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాల ద్వారా ఈ భామ ప్రేక్షకులను పలకరించింది. మరో నాలుగు భారీ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో ఆమె పేరు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేయబడింది.
తమన్న భాటియా
మిల్కీ బ్యూటీ తమన్న గురించి కూడా ఎక్కువ మంది శోధించారు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమాయణం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో వీరిద్దరు స్క్రీన్ షేర్ చేసుకోవడంతో పాటు ఒకరిపైఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. వాటికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాయి.
సమంత
ఈ ఏడాది సమంత గురించి కూడా చాలా మందే శోధించారు. సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఆమె ప్రకటించడంతో సమంత పేరు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అలాగే సామ్ రీసెంట్ మూవీ ‘ఖుషి’ హిట్ కావడంతో ఆమె పాపులారిటి మరింత పెరిగింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలను పెడుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తుండటంతో ఎక్కువ మంది సమంత పేరును సెర్చ్ చేశారు.
అనుష్క శెట్టి
అనుష్క శెట్టి సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాదే వెండితెరపై తళ్లుక్కుమంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. సినిమా షూట్ మెుదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకూ ఏదోక రూపంలో ఆమె వార్తల్లో నిలుస్తూనే వచ్చారు.
కాజల్ అగర్వాల్
పెళ్లి తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన కాజల్.. ఈ ఏడాది స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. బాలయ్య సరసన ఆమె చేసిన ‘భగవంత్ కేసరి’ మంచి విజయాన్ని సాధించింది. అలాగే కాజల్ చేసిన ఘోస్ట్, కరుంగపియం వంటి చిత్రాలు కూడా ఈ ఏడాదే వచ్చాయి.
కీర్తి సురేష్
ఈ ఏడాది దసరా సినిమా ద్వారా కీర్తి సురేష్ బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకుంది. వెన్నెల పాత్రలో అద్భుత నటన కనబరిచి అందర్ని ఆశ్చర్యపరిచింది. పాన్ ఇండియా స్థాయిలో దసరా రిలీజ్ కావడంతో కీర్తి సురేష్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దీంతో కీర్తి గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది నెటిజన్లు శోధించారు.
రకుల్ ప్రీత్ సింగ్
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఈ ఏడాది తెలుగులో ఒక్క సినిమా కూడా ఆమె చేయలేదు. కానీ ఈ భామ పోస్టు చేసే గ్లామర్ ఫోటోలు కారణంగా రకుల్ తరుచూ ట్రెండింగ్‌లో నిలుస్తూ వచ్చారు.
కృతి శెట్టి
ఉప్పెన సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిన కృతి శెట్టి వరుసగా సినిమా అవకాశాలను దక్కించుంది. ఈ భామ గురించి కూడా ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేశారట. ఈ ఏడాది నాగ చైతన్య సరసన ఆమె చేసిన ‘కస్టడీ’ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
డిసెంబర్ 14 , 2023
This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు
కీడా కోలా
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రూపొందించిన చిత్రం ‘కీడా కోలా’ (keedaa cola). బ్రహ్మానందం, చైతన్యరావు, తరుణ్‌భాస్కర్, రాగ్‌మయూర్, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు కీలక పాత్రల్లో నటించారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించారు. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 3న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మా ఊరి పొలిమేర 2
విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది. నవంబరు 3న తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో సత్యం రాజేష్, కామాక్షి, బాలాదిత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. మూవీ తొలి పార్ట్ కరోనా కారణంగా ఓటీటీలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో పార్ట్-2పై అంచనాలు పెరిగిపోయాయి. తొలి భాగానికి మించిన థ్రిల్ ఇందులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
విధి
రోహిత్ నందా, ఆనంది జంటగా చేసిన చిత్రం ‘విధి’ (Vidhi). శ్రీకాంత్ రంగనాథన్ దర్శకత్వం వహించారు. నవంబరు 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
12 ఫెయిల్
విక్రాంత్ మస్సే హీరోగా విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం ‘12 ఫెయిల్’. మనోజ్ కుమార్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమా ఇప్పటికే హిందీలో విడుదలై అలరిస్తోంది. నవంబరు 3న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఘోస్ట్
కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘ఘోస్ట్’ (Ghost). ఈ మూవీకి శ్రీని దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా నవంబరు 4న తెలుగులోనూ రానుంది. ఆసక్తికరమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. క్లైమాక్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పింది.
ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
స్కంద
యంగ్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ 'స్కంద' ఈ వారం ఓటీటీలోకి రానుంది. నవంబర్ 2 నుంచి డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 27 నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని డైరెక్టర్ బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చాడు.
ఫ్లాట్‌ఫామ్ వారీగా ఓటీటీ విడుదలలు…
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(telugu.yousay.tv/tfidb/ott)
TitleCategoryLanguagePlatformRelease DateP.I. MeenaWeb SeriesHindiAmazon PrimeNov 3Scam 2003 ; Part-2Web SeriesHindiSony LIVNov 3Are You Ok Baby?MovieTamilAhaOctober 31Locked InMovieEnglishNetflixNov 1JawanMovieHindiNetflixNov 2
అక్టోబర్ 30 , 2023
National Cinema Day: సినీ ప్రియులకు బంపరాఫర్.. మల్టీప్లెక్స్‌లో రూ.99కే మూవీ టికెట్. ఎందుకో తెలుసా?
మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (Multiplex Association of India) సినీ ప్రేక్షకులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. PVR, INOX, సినీ పోలిస్ (Cinepolis), మిరాజ్(Miraj), సిటీప్రైడ్, ఏషియన్ (Asian), మూవీ టైమ్, వేవ్, ఎమ్2కే, డిలైట్ సహా 4వేలకు పైగా థియేటర్లలో రూ.99కే సినిమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. అక్టోబరు 13ను ‘నేషనల్ సినిమా డే’ (National Cinema Day)గా పేర్కొంటూ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది.
ఒక్కరోజు మాత్రమే!
అక్టోబర్ 13న మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆయా మల్టీప్లెక్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలుసుకోవచ్చని సూచించింది. అయితే రూ.99 లకే టికెట్ కావాలనుకునేవారు ఆఫ్‌లైన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సంబంధిత థియేటర్ల కౌంటర్ల వద్ద టికెట్ను కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్ ద్వారా బుక్ వస్తే టికెట్ ధరకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇక రిక్లెయినర్స్, ప్రీమియం ఫార్మాట్స్‌కు రూ.99 ఆఫర్ వర్తించదు.
గతేడాదే ప్రారంభం
ఎగ్జిబిటర్లకు దిశానిర్దేశం చేసే మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (M.A.I).. గతేడాది సెప్టెంబరు 23న ‘నేషనల్ సినిమా డే’ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఆ ఒక్క రోజే 6.5 మిలియన్స్‌కుపైగా ఆడియన్స్ మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూశారు. తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో ప్రేక్షకులకు మరోసారి ఆఫర్ ఇచ్చింది.
కరోనానే కారణం..!
తొలుత సెప్టెంబర్ 16ను ‘నేషనల్ సినిమా డే’ నిర్వహించాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ భావించింది. కొవిడ్ రెండు వేవ్‌ల తర్వాత భారత్‌లో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరచుకున్న రోజు కావడంతో దానికి గుర్తుగా సెప్టెంబర్ 16ను ‘నేషనల్ సినిమా డే’గా జరుపుకోవాలని నిర్ణయించింది. అయితే అనివార్య కారణాలతో దానిని సెప్టెంబరు 23కి వాయిదా వేశారు. చివరకూ అక్టోబరు 13ను ‘నేషనల్ సినిమా డే’గా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం విడుదలైన, త్వరలో విడుదలకానున్న చిత్ర బృందాలకు ఇది కలిసొచ్చే అంశమని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినీ ప్రియులకు పండగే!
ఇక వచ్చే వారం పలు బడా చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. రామ్ పోతినేని ‘స్కంద’ (Skanda), రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2), వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది వ్యాక్సిన్ వార్’ (The Vaccine War) తదితర చిత్రాలు వచ్చే శుక్రవారం (సెప్టెంబరు 28) రిలీజ్ కానున్నాయి. అటు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు 1’ (Peda Kapu-1), కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ (Rules Ranjan) అక్టోబరు 6న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
సెప్టెంబర్ 24 , 2023
New Hair Styles : దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ హీరోల ఈ హేయిర్ స్టైల్స్ గురించి తెలుసా?
అబ్బాయిలు హ్యాండ్సమ్‌గా కనిపించేందుకు ఎక్కువగా హేయిర్ స్టైల్స్ మీద దృష్టి పెడుతుంటారు. అభిమాన హీరో ఎలాంటి హెయిర్ స్టైల్‌లో ఉంటే అలాంటి హెయిర్ కట్‌ను ఫాలో(New Hair Styles) అవుతుంటారు. ఇక సినిమాల్లోనూ అంతే.. ఎప్పుడు కొత్త లుక్‌లతో అభిమానులను హీరోలు మెస్మరైజ్ చేస్తుంటారు. హీరోలను హెయిర్ స్టైల్స్ సరికొత్తగా ఆవిష్కరిస్తుంటాయి.ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ హీరోల ఏ ఏ హేయిర్ స్టైల్స్ ట్రెండ్ అయ్యాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
[toc]
జూనియర్ ఎన్టీఆర్ హేయిర్ స్టైల్స్
జూనియర్ ఎన్టీఆర్ తన పాతికేళ్ల సినీ కెరీర్‌లో ఎంతో లుక్స్ పరంగా, స్టైల్ పరంగా ఎంతో ట్రాన్స్‌పామ్ అయ్యాడు. కెరీర్ తొలినాళ్లలో కర్లీ హెయిర్‌తో కనిపించిన తారక్ తర్వాత సినిమా, సినిమాకు హెయిర్ స్టైల్స్, లుక్స్ మారుస్తూ ట్రెండ్ సెట్ చేశాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో ఏ హెయిర్ స్టైల్‌తో కనిపించాడో ఇప్పుడు చూద్దాం.
బాద్‌షా
బాద్‌షా సినిమాలోనూ తారక్ లుక్ ట్రెండ్ సెట్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో జూ. ఎన్టీఆర్ 'డౌన్‌వార్డ్ ఫ్లిక్స్' హేయిర్ స్టైల్‌తో స్టైలీష్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్ యూత్ మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
జనతా గ్యారేజ్
ఈ సినిమాలో తారక్... 'సెమీ క్రూ'(semi Crew cut) హేయిర్ కట్‌తో స్టైలీష్‌గా కనిపించాడు.
టెంపర్
ఫస్ట్‌టైం ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్... సిక్స్ ప్యాక్ బాడీతో ట్సాన్స్‌పార్మ్ అయ్యాడు. ఈ సినిమాలో తారక్ స్టైలీష్‌గా కనిపించాడు. స్పైక్‌డ్ హేయిర్(Spiked hairStyle) స్టైల్‌తో కనిపించాడు.
యమదొంగ
యమదొంగ చిత్రంలో తారక్ లాంగ్ స్ట్రెయిట్ హెయిర్‌తో(Long Strait Hair) స్టైల్‌గా కనిపించాడు. ఈ చిత్రం తర్వాత ఆ హేయిర్ స్టైల్‌ను అనుకరించేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు.
నాన్నకు ప్రేమతో
ఇక ఈ సినిమాలో స్టైలీష్ లుక్‌లో తారక్ అలరించాడు. ఈ హెయిర్ స్టైల్‌ను ఎంతో మంది అభిమానులు ఫాలో అయ్యారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ పేరు పోంపాడర్ విత్ సైడ్ ఫేడ్(pompadour with side Fade). ఈ హేయిర్ స్టైల్ తారక్‌ను మరింత అందంగా కనిపించేలా చేసింది.
జై లవకుశ
ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ హేయిర్ స్టైల్ లుక్‌లో కనిపించాడు. జై పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. క్లాసిక్ సైడ్ పార్టింగ్ (classic Side Parting), లవ్‌కుమార్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ స్ట్రేయిట్ లాంగ్ హేయిర్ స్టైల్‌లో అందంగా కనిపించాడు.
దేవర
పాతాళ భైరవిలో రామారావు లుక్‌కు.. ‘దేవర’ (Devara)లోని తారక్ గెటప్‌ను నందమూరి ఫ్యాన్స్ మ్యాచ్ చేసుకుంటున్నారు. పరిశీలనగా చూస్తే అందరికీ ఇదే భావన కలుగుతుందని చెబుతున్నారు. తారక్ ‘దేవర’ సినిమాలో డ్యూయల్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఒక పాత్ర రింగుల జుట్టుతో కూడిన లాంగ్ హెయిర్‌తో ఉంటుంది. ఈ గెటప్‌లో తారక్ అచ్చం నందమూరి తారకరామారావు లాగా కనిపిస్తున్నాడని నెటిజన్లు సైతం అభిప్రాయపడ్డారు.
మహేష్ బాబు హేయిర్ స్టైల్స్
బాబి
తన కెరీర్ ప్రారంభంలో మహేష్ మిల్కీ బాయ్‌గా కనిపించేవాడు. దాదాపు పోకిరి సినిమా వరకు ఒకే ఒకే హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో చైల్డీష్ లుక్ హేయిర్ స్టైల్ లుక్‌తో కనిపించాడు.
పోకిరి
పోకిరి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న తన లుక్స్, స్టైల్, స్వాగ్‌ను మహేష్ పూర్తిగా మార్చేశాడు. ముఖ్యంగా అతని హేయిర్ స్టైల్ ఎంతో ఫేమస్ అయింది. ఈ హేయిర్ స్టైల్‌ను... అంటారు. ఈ చిత్రం తర్వాత మహేష్ అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యారు.
సైనికుడు
ఈ చిత్రంలో మహేష్ బాబు స్టూడెంట్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఫంక్ హేయిర్ స్టైల్‌తో హ్యాండ్సమ్‌గా కనిపించాడు.
అతిథి
అతిథి సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. బ్రౌన్ కలర్ జుట్టుతో పొడవాటి లాంగ్ హెయిర్‌తో రగ్గ్‌డ్ లుక్‌లో అలరించాడు
వన్ నేనొక్కడినే
ఈ సినిమాలో మహేష్ బాబు ట్రెండీ లుక్‌లో అలరించాడు. అతని స్పైక్‌డ్ హెయిర్ స్టైల్‌తో మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ.. మహేష్ బాబు నటనకు(Mahesh Babu Hair Styles) విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
SSMB29
‘SSMB 29 నేపథ్యంలో మహేష్ షేర్ చేసిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫోటోని షేర్ చేశాడు. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు.
సిద్దు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్
డీజే టిల్లు& టిల్లు స్కేర్
డీజే టిల్లు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ చాలా ఫేమస్ అయింది. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది కూడా. ఈ హెయిర్ స్టైల్‌ను తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్ అని పిలుస్తారు. టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హేయిర్ స్టైల్స్
భద్రినాథ్
ఈ చిత్రంలో అల్లు అర్జున్ యుద్ధ వీరుడిగా కనిపించాడు. బన్నీ హెయిర్ స్టైల్ చాలా క్రేజీగా ఉంటుంది. మ్యాన్ బన్స్(Man Buns) మరియు పోనిటేయిల్స్(ponytails) హేయిర్ స్టైల్స్‌తో ఆకట్టుకున్నాడు.
అల వైకుంఠపురములో
ఈ చిత్రంలో అల్లు అర్జున్ లాంగ్ వేవ్స్(Long waves)హేయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. టాప్‌లో పప్ బాటమ్‌లో వేవీ హెయిర్ లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ను అనేక మంది అతని (Allu Arjun Hair styles)అభిమానులు ట్రై చేశారు.
హ్యాపీ
హ్యాపీ చిత్రంలో బన్నీ స్పైక్స్ హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఈ హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది.
దువ్వాడ జగన్నాథం
ఈ సినిమాలో "ఫోర్ హెడ్ సెమీ ఫ్రింజ్" హేయిర్ స్టైల్‌తో ఇంప్రెస్ చేశాడు ఇది కూడా ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. ఇదే చిత్రంలో బన్నీ మరో స్టైలీష్ హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు ఫ్రింజ్ బ్యాంగ్ (fringe Bangs)
సరైనోడు
ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్లాసిక్ హేయిర్ స్టైల్‌లో కనిపిస్తాడు. ఈ హెయిర్ స్టైల్ పేరు పొంపాడర్ హేయిర్ లుక్
(Pompadour)
బన్నీ ఇతర హేయిర్ స్టైల్స్
అల్లు అర్జున్ ఎక్కువగా బయట థిక్ బియర్డ్‌తో లాంగ్ వేవీ వెట్ హేయిర్(long wavy wet-hair)లుక్ కనిపిస్తుంటాడు. ఈ హెయిర్ స్టైల్ బన్నీ ఫెవరెట్ అని తెలిసింది.
రామ్ చరణ్ హేయిర్ స్టైల్స్
గోవిందుడు అందరివాడేలే
ఈ చిత్రంలో రామ్ చరణ్ పోని టేయిల్(Pony Tail) హేయిర్ కట్‌లో స్టైలీష్‌గా కనిపిస్తాడు. ఈ హెయిర్ స్టైల్‌ను బాలీవుడ్‌లో షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ కూడా ఫాలో అయ్యారు. ఈ హేయిర్ కట్‌ను చెర్రీ అభిమానులు క్రేజీగా ఫాలోయ్యారు.
గేమ్ ఛేంజర్
లెటేస్ట్ గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ గెల్డ్ హేయిర్ స్టైల్‌తో ఫర్‌ఫెక్ట్ లుక్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు.
రామ్ చరణ్ ఇతర హేయిర్ స్టైల్స్
రామ్ చరణ్ పలు సందర్భాల్లో గుడ్ బాయ్ లుక్‌లో కనిపంచేవాడు. ఈ హేయిర్ కట్ పైరు "సైడ్ పార్టింగ్". షూటింగ్ లేని సమయాల్లో రామ్ చరణ్ ఎక్కువగా ఈ హేయిర్ స్టైల్‌లో ఉంటాడు.
మరికొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఇవెంట్లు, మీడియా సమావేశాల్లో చరణ్ ఈ హేయిర్ కట్‌లో కనిపిస్తుంటాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు 'మెస్సీ హెయిర్ లుక్'(messy Hair lock).ఈ టైప్ హేయిర్ స్టైల్ కూడా బాగా ట్రెండ్ అయింది. చెర్రీ అభిమానులు చాలావరకు ఈ టైప్ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యారు.
కొన్నిసార్లు లైట్ బియర్డ్, షార్ట్ సైడ్స్ హెవీ "పొంపాడర్ హెయిర్"(pompadour) లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్ కూడా చెర్రీకి బాగా కుదిరింది. అయితే ఇలాంటి(Ram charan Hair styles) హేయిర్ స్టైల్‌తో రామ్‌చరణ్ ఏ సినిమాలోనూ నటించలేదు.
విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్స్
లైగర్
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్‌పై క్రేజీ టాక్ నడిచింది. "లాంగ్ వేవీ"(Long Wavy) హేయిర్ కట్‌లో మేరిసాడు. ఈ హేయిర్ స్టైల్‌ను చాలా మంది అతని అభిమానులు ఫాలో అయ్యారు.
ఇదే చిత్రంలో దేవరకొండ 'మ్యాన్ బన్' హేయిర్ కట్‌లోనూ కనిపిస్తాడు. గతంలో అనేమంది సెలబ్రెటీలు ఈ స్టైల్‌ను ఫాలో అయినప్పటికీ... విజయ్‌కు సెట్ అయినట్లుగా మరెవరికీ సెట్ అవ్వలేదు.
డియర్ కామ్రెడ్
డియర్ కామ్రెడ్ చిత్రంలో విజయ్ కర్లీ & మెస్సీ హేయిర్ స్టైల్ లుక్‌లో కనిపించి అదరగొట్టాడు. ఈ హేయిర్ స్టైల్ సైతం విజయ్‌కి బాగా కుదిరింది. (Vijay Deverakonda Hair styles)ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
ఖుషి
ఈ చిత్రంలోనూ విజయ్ దేవరకొండ మ్యాన్లీ లుక్‌లో కనిపిస్తాడు. సమంత, విజయ్ కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.
ఫ్యామిలీ స్టార్
ఈ సినిమాలో లైట్‌గా గడ్డం, ఒత్తైన మీసాలతో డీసెంట్ లుక్ హేయిర్ స్టైల్‌ను విజయ్ దేవరకొండ కలిగి ఉన్నాడు. ఈ లుక్ చాలా మంది ఫ్యాన్స్ అట్రాక్ట్ చేసింది. ఈ హేయిర్ కట్‌ను చాలా మంది ఫాలో అయ్యారు.
రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్స్
స్కంద
ఈ సినిమా చేయడానికి ముందు.. రామ్ పొత్తినేని(RAPO) 'స్పైకీ' హేయిర్ స్టైల్‌లో రామ్ పొత్తినేని అలరించాడు. ఈ చిత్రంలో రామ్ హేయిర్ స్టైల్ క్రేజీ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ హేయిర్ స్టైల్‌ను అనేకమంది అభిమానులు ఫాలో అయ్యారు.
ఇస్మార్ట్ శంకర్
ఈ చిత్రంలో రామ్ పొత్తినేని లుక్స్, హేయిర్ స్టైల్, స్వాగ్ ట్రెండ్ సెట్ చేశాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత చాలా మంది అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయిపోయారు. ఈ చిత్రంలో రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్ పేరు "హై వాల్యూమ్ క్విఫ్ విత్ ఫేడ్" ( high-volume quiff with a fade) ఈ హేయిర్ కట్‌కు గడ్డం గంభీరంగా ఉంటేనే సెట్ అవుతుంది.
మే 22 , 2024