• TFIDB EN
  • సొంతం
    UTelugu2h 25m
    బాల్య స్నేహితుడైన వంశీని నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రోహిత్
    బాస్
    ఆర్యన్ రాజేష్
    వంశీ కృష్ణ
    సునీల్
    శేషగిరి శేషం
    నమిత
    నందిని నందు
    నేహా పెండ్సే బయాస్
    సౌమ్య
    ఫ్లోరా సైనీ
    ఆశా
    ఝాన్సీ లక్ష్మి
    లెక్చరర్ వెంకటలక్ష్మి
    ఎంఎస్ నారాయణ
    లెక్చరర్ బోగేశ్వరరావు
    చిత్రం శీను
    శేషం స్నేహితుడు
    రామచంద్రశేషం స్నేహితుడు
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    సుబ్బు
    అడివి శేష్
    నందు కాబోయే భర్త
    తనికెళ్ల భరణి
    వంశీ తండ్రి
    నరేష్
    నందు తండ్రి
    హేమ
    నందు తల్లి
    నీలోఫర్మ్యాగీ
    తెలంగాణ శకుంతల
    ణ శకుంతల
    అలీ
    శేషం స్నేహితుడు
    వేణు మాధవ్
    శేషం స్నేహితుడు
    జయ ప్రకాష్ రెడ్డి
    ఒక దొంగ
    చిన్నా
    శేషం స్నేహితుడు
    రజిత
    బృందా పరేఖ్
    సిబ్బంది
    శ్రీను వైట్ల
    దర్శకుడు
    S. సోంపల్లినిర్మాత
    వీఆర్ కన్నెగంటినిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    సమీర్ రెడ్డి
    సినిమాటోగ్రాఫర్
    కోలా భాస్కర్
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    40కి చేరువైనా తరగని అందం ఈ హీరోయిన్ల సొంతం
    40కి చేరువైనా తరగని అందం ఈ హీరోయిన్ల సొంతం
    ]మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    మార్చి 21 , 2023
    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. సింగిల్ పోస్ట్ లేకుండా కేవలం 20 నిమిషాల్లోనే 140K ఫాలోవర్లను పవన్ చేరుకోగా.. గంటలో 250K ఫాలోవర్లను క్రాస్ చేశారు. మరో 5 నిమిషాల్లోనే 300K మార్క్‌ను దాటారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదల జెట్ వేగంతో దూసుకెళ్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. #PawanKalyanOnInstagram హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.  దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయాలని ట్వీట్ల జడివాన కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ షేర్ చేయాలని ఇతర అభిమానులకు ట్యాగ్ చేస్తున్నారు.  ఈరోజు  #PawanKalyanOnInstagram ట్యాగ్‌ను సోషల్ మీడియాలో నంబర్ 1 గా నిలపాలని పవన్ డైహర్టెడ్ ఫ్యాన్స్.. అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676106458516127747?s=20 ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెడుతున్నట్లు ఇటీవల నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ నోట్ చాలా సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా ఉంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో, జైహింద్ అనే ట్యాగ్ లైన్‌ను పవన్‌ తన అకౌంట్‌కు జత చేశారు.  ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవర్ స్టార్ అభిమానులకు, యువతకు నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్విట్టర్, తన అధికారిక వెబ్‌సైట్ (https://janasenaparty.org/) ద్వారా తన పార్టీ అభిప్రాయాలను పవర్ స్టార్ పంచుకుంటున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676108997869588480?s=20 అందుకేనా ఇన్‌స్టా? ఏపీలో మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో జనసేనాని సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో వెనకపడొద్దని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్, ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. సనిశితమైన సమస్యలపై ప్రశ్నిస్తూ యువత ద్వారా సమాధానాలు రప్పిస్తూ విలైనంత ఎక్కువ మందికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నారు. వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం తనదైన శైలీలో వాగ్బాణాలతో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గతానికంటే భిన్నంగా తన ప్రచార పర్వాన్ని మార్చివేశారు. తన అభిమానులతో పాటు టాలీవుడ్‌లో ఇతర అగ్ర హీరోలైన ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు. కులాల ప్రస్తావనకు తావులేకుండా తాను అందరివాడినంటూ యువతకు దగ్గరయ్యేందుకు తన టెంపోను మార్చుకున్నారు.  జులై  'బ్రో' నెల మరోవైపు పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన 'బ్రో' మూవీ ఈనెల 28న విడుదల కానుంది.  చిత్ర యూనిట్ బ్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. అభిమానులు జులై నెలను 'బ్రో' నెలగా ప్రకటించి ఉత్సాహంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. 'బ్రో' సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా, సాయిధరమ్ కామన్ మ్యాన్‌గా నటిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది. అటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ను ప్రారంభించింది.  పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ హిట్‌ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  క్రిష్ డెరెక్షన్‌లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రం నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా ఆగిపోయింది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న OG సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసింది. బ్రో సినిమా తర్వాత OG మూవీనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 
    జూలై 04 , 2023
    <strong>Anthahpuram</strong><strong>: </strong><strong>సౌందర్యను రీప్లేస్‌ చేయగల సత్తా ఆ ఇద్దరి సొంతం.. డైరెక్టర్‌ కృష్ణవంశీ క్రేజీ కామెంట్స్‌!&nbsp;</strong>
    Anthahpuram: సౌందర్యను రీప్లేస్‌ చేయగల సత్తా ఆ ఇద్దరి సొంతం.. డైరెక్టర్‌ కృష్ణవంశీ క్రేజీ కామెంట్స్‌!&nbsp;
    క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణ వంశీ సినిమా అంటే ఒకప్పుడు థియేటర్లలో పండగ వాతావరణం ఉండేది. కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను తీశారు. ముఖ్యంగా అంతఃపురం చిత్రం ఆయన కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. ఇందులో దివంగత నటి సౌందర్య ఫీమేల్‌ లీడ్‌గా నటించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనపై సర్వత్ర ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కృష్ణ వంశీ ఎక్స్‌ వేదికగా తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో అంతఃపురం సినిమాలో సౌందర్యను ఏ హీరోయిన్‌తో రీప్లెస్‌ చేయగలదని ఓ నెటిజన్‌ ప్రశ్నించారు. ఇందుకు కృష్ణ వంశీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; కృష్ణవంశీ ఏమన్నారంటే? సౌందర్య, సాయికుమాార్‌, ప్రకాష్‌ రాజ్‌, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన అంతఃపురం చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఇందులో క్రూరమైన తన మామ బారి నుంచి బిడ్డను కాపాడుకునే తల్లిగా సౌందర్య ఉత్తమ నటన కనబరిచింది. అయితే ఇప్పటి హీరోయిన్స్‌లో ‘అంతఃపురం’ ఎవరికి సెట్‌ అవుతుందని డైరెక్టర్ కృష్ణ వంశీని ఎక్స్‌ వేదికగా ఓ నెటిజన్‌ అడిగాడు. అందుకు ఆయన సమాధానం ఇస్తూ 'సౌందర్య స్థానంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నాను. కానీ ప్రస్తుతం హీరోయిన్స్‌ ఎంతో టాలెంటెడ్‌. తమ నటనతో మెస్మరైజ్‌ చేస్తున్నారు. వారిని గౌరవిస్తున్నా' అని అన్నారు. దానికి ఆ నెటిజన్‌ బదులిస్తూ నివేతా థామస్‌, శ్రద్ధా కపూర్‌లలో ఎవరు సెట్‌ అవుతారు? అని మళ్లీ ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణవంశీ రిప్లే ఇస్తూ ప్రస్తుత హీరోయిన్స్‌లో సమంత, సాయిపల్లవి సౌందర్య పాత్రకు సెట్‌ కావొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సమంత, సాయిపల్లవి ఫ్యాన్స్‌ ఇందుకు సంబంధించిన పోస్ట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.&nbsp; సౌందర్యను రీప్లేస్‌ చేయగలరా! స్టార్‌ హీరోయిన్ సమంతకు గ్లామర్‌ బ్యూటీగానే కాకుండా మంచి నటిగానూ గుర్తింపు ఉంది. తన ఫస్ట్ ఫిల్మ్‌ 'ఏమాయ చేశావే'తో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఆ తర్వాత ‘మనం’, ‘అ ఆ’, ‘యూటర్న్‌’, ‘జాను’, ‘యశోద’, ‘శాకుంతలం’, ‘బేబీ’ వంటి చిత్రాలతో నటిగా తనను నిరూపించుకుంది. అటు సాయిపల్లవి యాక్టింగ్‌ స్కిల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమమ్‌, ఫిదా, లవ్‌ స్టోరీ, శ్యామ్‌ సింగరాయ్‌, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాలతో నటనలో తనకు సాటి ఎవరూ లేరని చాటి చెప్పింది. అటువంటి ఈ స్టార్ హీరోయిన్స్‌ అంతఃపురంలో సౌందర్య పాత్రకు కచ్చితంగా న్యాయం చేయగలరి నెటిజన్లు భావిస్తున్నారు.&nbsp; డైరెక్టర్‌గా రెండు నేషనల్ అవార్డ్స్‌ డైరెక్టర్ కృష్ణ వంశీ అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. సినిమాల్లోకి వచ్చాక కృష్ణ వంశీ అని పిలుస్తారు.రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 1995లో JD చక్రవర్తి నటించిన చిత్రం ‘గులాబీ’ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ‘అంత:పురం’, ‘చంద్రలేఖ’, ‘నిన్నే పెళ్లాడుతా’ మురారి, ఖడ్గం, శ్రీ ఆంజనేయం, రాఖీ, చందమామ, మహాత్మ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించారు. రీసెంట్‌గా ‘రంగమార్తండ’ అనే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సినిమాను తీశారు. కృష్ణ వంశీ తన కెరీర్‌లో ఉత్తమ దర్శకుడిగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, నాలుగు నంది అవార్డులు అందుకున్నాడు.
    సెప్టెంబర్ 17 , 2024
    HBD Tamannaah: 15ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చిన మిల్కీబ్యూటీ
    HBD Tamannaah: 15ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చిన మిల్కీబ్యూటీ
    ]‘వైట్ అండ్ గోల్డ్’ పేరుతో 2015లో సొంతంగా జువెల్లరీ రిటైల్ షోరూంని ప్రారంభించింది. ఇందులో తమన్నానే క్రియేటివ్ హెడ్.
    ఫిబ్రవరి 13 , 2023
    సినిమాల్లోకి స్నేహరెడ్డి: ఓ స్టార్ హీరో భార్యగా కాకుండా ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఎలా ఎదిగింది?
    సినిమాల్లోకి స్నేహరెడ్డి: ఓ స్టార్ హీరో భార్యగా కాకుండా ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఎలా ఎదిగింది?
    ]స్నేహా రెడ్డి తెరంగేట్రం చేస్తే మరింత అభిమానాన్ని సొంతం చేసుకోగలదు.
    ఫిబ్రవరి 11 , 2023
    <strong>Pushpa 2 Movie Box Office Collection: అన్ని రికార్డులు బ్రేక్.. ఇండియాలో నంబర్ 1 చిత్రంగా పుష్ప 2</strong>
    Pushpa 2 Movie Box Office Collection: అన్ని రికార్డులు బ్రేక్.. ఇండియాలో నంబర్ 1 చిత్రంగా పుష్ప 2
    అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం థియేటర్లను షేక్‌ చేస్తోంది. గురువారం (డిసెంబర్‌ 5) విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్‌ నటనకు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌ బన్నీ యాక్టింగ్‌ చూసి ఊగిపోతున్నారు. తాము ఊహించిన దాని కంటే అల్లు అర్జున్‌ నటన బాగుందని ఆడియన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘పుష్ప 2’పై జాతీయ స్థాయిలో బజ్ ఉండటంతో పాటు, సూపర్‌ హిట్‌ టాక్‌ లభించడంతో తొలి రోజు (Pushpa 2 Movie Box Office Collection) అన్ని చోట్లా భారీ ఓపెనింగ్స్‌ లభించాయి. ఏరియాల వారీగా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; డే 1 కలెక్షన్స్‌ ఎంతంటే.. అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం గురువారం (డిసెంబర్‌ 5) వరల్డ్‌ వైడ్‌గా 12,500 పైగా థియేటర్లలో విడుదలైంది. దీనికితోడు బ్లాక్‌ బాస్టర్‌ టాక్ లభించడంతో ఈ మూవీకి రికార్డ్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.294 కోట్ల గ్రాస్‌ వసూలైనట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే హైయస్ట్‌ ఓపెనింగ్స్‌ అని వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. కాగా, ఈ చిత్రం ఒక్క ఇండియాలోనే రూ.190 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ.92.36 కోట్లు, తమిళనాడు రూ. 10.71, కర్ణాటక రూ.17.89 కోట్లు, కేరళ రూ. 6.56 కోట్లు వసూలైనట్లు చెప్పాయి. హిందీ బెల్ట్‌లో ఏకంగా రూ. 87.24 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఓవర్సీస్‌లో తొలి రోజు రూ.68.15 కోట్లు ఖాతాలో వేసుకున్నట్లు వివరించాయి.  https://twitter.com/MythriOfficial/status/1865012207060422928 రికార్డులు గల్లంతు తొలి రోజు కలెక్షన్స్‌తో ‘పుష్ప 2’ చరిత్ర తిరగరాసింది. ఇప్పటిదాకా 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 223 కోట్ల ఓపెనింగ్ సాధించి టాప్‌లో ఉంది. 'బాహుబలి 2' రూ.217 కోట్లు కొల్లగొట్టి రెండోస్థానంలో కొనసాగుతోంది. ‘పుష్ప 2’ ఆ రెండు చిత్రాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. రూ.294  కోట్ల గ్రాస్‌తో భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. రాజమౌళి రికార్డులను పాతరేసి కొత్త బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేసింది. అటు నార్త్‌లోనూ 'పుష్ప 2' చరిత్ర సృష్టించినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. హిందీలో ఇప్పటివరకూ ఏ సినిమా సాధించని విధంగా రూ. రూ.72 కోట్లకు పైగా నెట్‌ వసూళ్లను ‘పుష్ప 2’ రాబట్టినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా బాలీవుడ్‌ హీరోలకు సైతం బన్నీ కొత్త టార్గెట్‌ ఇచ్చాడు.  https://twitter.com/MythriOfficial/status/1864976017733095871 బెనిఫిట్‌ షోలు రద్దు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప 2' ప్రీమియర్స్‌ (Pushpa 2 Movie Box Office Collection) సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా ఓ బాలుడు చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇకపై ఏ సినిమాకి కూడా బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. బెనిపిట్‌షోలు రద్దు చేస్తున్నట్టు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రకటించారు. బెన్‌ఫిట్‌షోల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నందున వాటిని రద్దు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి థియేటర్‌ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కారకులపై చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.&nbsp;
    డిసెంబర్ 06 , 2024
    <strong>Boxoffice Collections: అమరన్, లక్కీ భాస్కర్‌, ‘క’ చిత్రాల్లో&nbsp; దీపావళి విన్నర్ ఎవరంటే?</strong>
    Boxoffice Collections: అమరన్, లక్కీ భాస్కర్‌, ‘క’ చిత్రాల్లో&nbsp; దీపావళి విన్నర్ ఎవరంటే?
    దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదలతోనే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే కథాంశం, దుల్కర్ సల్మాన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేసింది. లక్కీ భాస్కర్ మూవీ వసూళ్లు(Lucky Baskar Movie collections) మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 26.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి యూనానిమస్ హిట్‌గా నిలిచింది. దీపావళికి విడుదలైన తెలుగు సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే, దుల్కర్ సల్మాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా విజయంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ కూడా కీలక పాత్ర పోషించింది.&nbsp; కాగా ఈ సినిమాను నాగవంశీ మరియు సాయి సౌజన్య&nbsp; ప్రొడ్యూస్ చేశారు. తొలి రెండు రోజుల్లో మంచి వసూళ్లు సాధించడంతో.. వీకెండ్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే…భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది&nbsp; కథ. ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అమరన్ మూవీ వసూళ్లు (Amaran movie collections) ఇక తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’ కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది, ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా పట్ల మంచి క్రేజ్ ఏర్పడగా, తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 42.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి భారీ విజయాన్ని సాధించింది.&nbsp; తెలుగులోనూ ఈ చిత్రం డీసెంట్ వసూళ్లు రాబట్టింది.&nbsp; రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.4.34 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌కి మరో రూ.0.66 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. తెలుగులో అమరన్ చిత్రం రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దాటాలంటే రూ.5 కోట్ల వరకు వసూళ్లు రావాలి. వీకెండ్‌లో ఈ టార్గెట్‌ను ఈజీగా క్రాస్ చేసే అవకాశం ఉంది. &nbsp;ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడిగా జీవితాన్ని గడపాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ. ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి “క” సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు(KA Movie Collections) కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో, నయన్ సారిక మరియు తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘క’ చిత్రం కూడా దీపావళి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా మొదటిరోజే రూ. 6.18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ రికార్డ్‌ను సృష్టించింది. సినిమాకు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవుతుండగా, రెండో రోజున కూడా మంచి వసూళ్లు సాధించింది. మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 13.11 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఫైనల్ కలెక్షన్లు సుమారు రూ. 30 కోట్ల మార్క్‌ను చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది.&nbsp; చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ. &nbsp;ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ దీపావళి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ప్రభావితం చేసిన ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతున్నాయి.
    నవంబర్ 02 , 2024
    <strong>HBD Sujeeth: ‘ఓజీ’ డైరెక్టర్‌ సుజీత్‌ గురించి ఈ టాప్‌ సీక్రెట్స్‌ తెలుసా?</strong>
    HBD Sujeeth: ‘ఓజీ’ డైరెక్టర్‌ సుజీత్‌ గురించి ఈ టాప్‌ సీక్రెట్స్‌ తెలుసా?
    యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ (HBD Sujeeth) టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇప్పటివరకూ చేసింది రెండే చిత్రాలే అయినప్పటికీ పది చిత్రాలు చేసినా రానీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘రన్‌ రజా రన్‌’తో డైరెక్టర్‌గా మారిన సుజీత్‌ ‘సాహో’ (Saaho)తో పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో ‘ఓజీ’ చిత్రాన్ని తెరకెకిస్తూ మెగా ఫ్యాన్స్‌ దృష్టంతా తన వైపునకు తిప్పుకున్నాడు. ఇవాళ ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్ పుట్టిన రోజు. 34వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్‌లోని సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; 17 ఏళ్లకే షార్ట్‌ ఫిల్మ్స్‌ సుజీత్‌ రెడ్డి ఏపీలోని అనంతపురంలో 1990 అక్టోబర్‌ 26న జన్మించాడు. తొలుత చార్టెట్‌ అకౌంటెండ్‌ (CA) కావాలని కలలు కన్నాడు. సినిమాలపై ఆసక్తి పెరగడంతో L.V. ప్రసాద్‌ ఫిల్మ్‌ &amp; టీవీ అకాడమీలో ఫిల్మ్‌ కోర్సు చేశాడు. 17 ఏళ్లకే యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిల్మ్స్‌ చేయడం మెుదలు పెట్టాడు. ఇప్పటివరకూ 30కి పైగా షార్ట్‌ఫిల్మ్‌ను సుజీత్‌ తెరకెక్కించాడు.&nbsp; షార్ట్‌ ఫిల్మ్స్‌లో క్రియేటివిటీ సాధారణంగా యూట్యూబ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌ అంటే తక్కువ బడ్జెట్‌తో రూపొందుతుంటాయి. వాటి నుంటి హై స్టాండర్డ్స్‌ను ఎవరు పెద్దగా ఎక్స్‌పెక్ట్‌ చేయరు. కానీ సుజీత్‌ తెరకెక్కించిన ‘రన్‌ రాజా రన్‌’, ‘ప్రేమ ఇష్క్‌ కాదల్’, ‘తొక్కలో లవ్‌ స్టోరీ’, ‘వేషం’, ‘యుద్ధం’, ‘ప్రేమ కేరాఫ్‌ డ్రామా’, ‘ఇండియన్‌ ఐడల్‌’ వంటి షార్ట్‌ఫిల్మ్‌ను చాలా రిచ్‌గా తెరకెక్కించి సినీ ఇండస్ట్రీ వాళ్లను ఆశ్చర్యపరిచాడు. తన క్రియేటివిటీ మెస్మరైజ్‌ చేశాడు.&nbsp; View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign) తొలుత ఫ్యామిలీ ఒప్పుకోలేదట తను డైరెక్టర్ అవుతానని సుజీత్‌ చెప్పినప్పుడు కుటుంబ సభ్యులు విముఖత వ్యక్తం చేశారట. అయితే సినిమాపై అతడికి ఉన్న శ్రద్ధ చూసి ఫైనల్‌గా ఓకే చెప్పారట. అంతే కాదు సుజీత్‌ ఫస్ట్ కెమెరాను అతని తల్లి స్వయంగా తన డబ్బులతో కొనుగోలు చేసి గిఫ్ట్‌గా ఇచ్చిందట. అలా తల్లి, కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో సుజీత్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు.&nbsp; పూరి జగన్నాథ్‌ సూచనతో డైరెక్టర్‌ కావాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుజీత్‌ తొలుత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్‌ దగ్గర పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన్ను కలవగా అప్పటికే డైరెక్టర్‌ స్కిల్స్‌ పుష్కలంగా ఉన్నాయని పూరి చెప్పారు. దీంతో డైరెక్టర్‌గా సుజీత్‌ ప్రయత్నాలు మెుదలుపెట్టాడు.&nbsp; 23 ఏళ్లకే డైరెక్టర్‌గా.. డైరెక్టర్‌ ఛాన్స్ కోసం సుజీత్‌ ప్రయత్నిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ అతడి టాలెంట్‌ను గుర్తించి అవకాశమిచ్చింది. 'రన్‌ రాజా రన్‌' చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. అలా 23 ఏళ్లకే సుజీత్‌ డైరెక్టర్‌గా మారాడు. తొలి చిత్రంతోనే సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు.&nbsp; షార్ట్‌ ఫిల్మ్‌నే సినిమా తీసి.. తనకు ఎంతగానో గుర్తింపు తీసుకొచ్చిన ‘రన్‌ రాజా రన్‌’ షార్ట్‌ ఫిల్మ్‌నే తన ఫస్ట్‌ ఫిల్మ్‌గా సుజీత్‌ తెరకెక్కించడం విశేషం. షార్ట్‌ ఫిల్మ్‌లోని స్టోరీ కొద్దిగా మార్పులు చేసిన సినిమాను తెరకెక్కించడం గమనార్హం.&nbsp; బాహుబలి కంటే ముందే తొలి చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేషన్స్‌ వాళ్లే ప్రభాస్‌తో ‘మిర్చి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలో ప్రభాస్‌తో రెండో ఫిల్మ్‌ ప్లాన్‌ చేయాలని యువీ క్రియేషన్స్ భావించగా తన వద్ద కథ ఉందంటూ సుజీత్‌ తెలియజేశాడు. ఆ స్టోరీని ప్రభాస్‌కు చెప్పగా బాగా నచ్చిందట. అయితే అప్పటికీ బాహుబలి రిలీజ్‌ కాలేదు. బాహుబలి రిలీజ్‌ తర్వాత ప్రభాస్‌ క్రేజ్ అమాంతం పెరగడంతో కథలో సుజీత్‌ మార్పులు చేశాడు. అలా ‘సాహో’ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాకపోయిన అంత చిన్న వయసులో సుజీత్‌ పనితనం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.&nbsp; View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign) ఫ్యాన్‌ నుంచి పవన్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి.. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు సుజీత్‌ వీరాభిమాని. జానీ సినిమాకు తలకు బ్యాండ్‌ కట్టుకొని మరి థియేటర్‌కు వెళ్లినట్లు ఓ ఇంటర్వ్యూలో సుజీత్‌ చెప్పారు. ఏడు రోజుల పాటు బ్యాండ్‌ను అలాగే ఉంచుకున్నట్లు స్పష్టం చేశారు. అటు గబ్బర్‌ సింగ్‌ రిలీజ్‌ సమయంలోనూ ర్యాలీగా థియేటర్‌కు వెళ్లినట్లు సుజీత్ అన్నారు. అటువంటి స్టేజ్‌ నుంచి ‘ఓజీ’తో పవన్‌ను డైరెక్ట్‌ చేసే స్థాయికి సుజీత్‌ ఎదగడం సాధారణ విషయం కాదు.&nbsp; జపనీస్‌ సినిమాలంటే చాల ఇష్టం డైరెక్టర్‌ సుజీత్‌కు జపనీస్‌ సినిమాలంటే చాలా ఇష్టమట. ఓ ఇంటర్వూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. పవన్‌ ‘ఓజీ’ సినిమాపైనా జపనీస్‌ సినిమాల ప్రభావం ఉంటుందని అంటున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign) ఫ్రెండ్స్‌తో ట్రావెలింగ్‌ సుజీత్‌ తీరిక దొరికినప్పుడుల్లా స్నేహితులతో గడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. వారితో కలిసి వరల్డ్‌ టూర్‌కు వెళ్తుంటారు. అక్కడ దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ఉంటారు.&nbsp; View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign) క్రికెట్ అంటే పిచ్చి సుజీత్‌కు క్రికెట్‌ అంటే మహా ఇష్టం. రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid), సచిన్‌ టెండూల్కర్ (Sachin Tendulkar) అతడి తన ఫేవరేట్ ప్లేయర్స్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.&nbsp; భక్తి ఎక్కువే సుజీత్‌కు భక్తి కాస్త ఎక్కువనే చెప్పాలి. సమయం దొరికినప్పుడూ దేవాలయాలను సందర్శిస్తుంటాడు. View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign) ప్రేయసితో వివాహం దర్శకుడు సుజీత్‌ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2020లో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రవల్లికను వివాహం చేసుకున్నారు.&nbsp; https://twitter.com/Filmiparadise/status/1271319435127603205 ఉత్తమ డైరెక్టర్‌గా తాను డైరెక్ట్ చేసిన తొలి సినిమా రన్‌ రాజా రన్ చిత్రానికి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా నంది అవార్డ్స్‌లో&nbsp; సుజీత్ నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత అతని రెండో చిత్రం సాహోకు గాను ఉత్తమ డైరెక్టర్‌గా సైమా అవార్డు పొందాడు. బర్త్‌డే స్పెషల్ వీడియో నేడు ద‌ర్శ‌కుడు సుజీత్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అతనికి బ‌ర్త్‌డే విషెస్‌ తెలుపుతూ ‘ఓజీ’ టీమ్‌ స్పెషల్ వీడియోను పంచుకుంది. షూటింగ్‌ స్పాట్‌లో సుజీత్‌కి సంబంధించిన వీడియో క్లిప్స్‌ను ఒక దగ్గర చేర్చి నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1850075370994925843
    అక్టోబర్ 26 , 2024
    <strong>Viral Video: సినిమా చూసి నటుడిపై మహిళ దాడి.. వీడియో వైరల్‌&nbsp;</strong>
    Viral Video: సినిమా చూసి నటుడిపై మహిళ దాడి.. వీడియో వైరల్‌&nbsp;
    అంజ‌న్ రామ‌చంద్ర‌, శ్రావ‌ణి హీరో హీరోయిన్లుగా న‌టించిన లేటెస్ట్‌ చిత్రం 'లవ్‌ రెడ్డి' (Love Reddy). గ‌త వారం థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ, క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే కలెక్షన్స్‌ పరంగా ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో ఫెయిల్యూర్‌ మీట్‌ పేరుతో చిత్ర బృందం థియేటర్లకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ ధియేటర్‌కు వెళ్లిన మూవీ యూనిట్‌కు ఊహించని ఘటన ఎదురైంది. బృందంలోని నటుడిపై ఓ మహిళ దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది.&nbsp; దాడి ఎందుకు జరిగిందంటే? లవ్‌ రెడ్డి చిత్రానికి హిట్‌ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్స్ రాకపోవడంతో చిత్ర బృందం వినూత్న నిర్ణయం తీసుకుంది. 'బ్లాక్‌ బాస్టర్‌ బట్‌ ఫెయిల్యూర్‌ మీట్‌' పేరుతో వినూత్న ఈవెంట్‌ను ప్రారంభించింది. సినిమా ఆడుతున్న థియేటర్లను విజిట్‌ చేస్తూ అభిమానుల రెస్పాన్స్‌ను తెలుసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ నిజాంపేటలోని జీపీఆర్‌ మాల్‌కు 'లవ్‌ రెడ్డి' బృందం వెళ్లింది. అప్పుడే ఆ సినిమాలో క్లైమాక్స్‌ సీన్‌ రన్‌ అవుతోంది. హీరోయిన్‌ ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి (ఎన్‌.టీ రామస్వామి) కూతుర్ని రాయితో కొడతాడు. ఆ సీన్‌ చూసి ఆగ్రహంతో ఊగిపోయిన థియేటర్‌లోని మహిళ, తండ్రి పాత్ర పోషించిన నటుడిపై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ హఠత్‌ పరిణామంతో అక్కడి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇది కేవలం సినిమానే అని నిజం కాదంటూ సదరు మహిళకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.&nbsp; https://twitter.com/telugu_insider/status/1849700707248767217 ‘లవ్‌ రెడ్డి’ ఎలా ఉందంటే పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా దర్శకుడు స్మరణ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటిన్ స్టోరీనే అయినప్పటికీ ఆంధ్రా - కర్ణాటక నేటివిటితో చాలా సహజంగా తెరకెక్కించారు. పెళ్లి చూపుల సీన్‌తో సినిమాను ప్రారంభించిన డైరెక్టర్‌, హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత నుంచి కథను ఆసక్తికరంగా మార్చారు. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా అనిపిస్తాయి. లవ్‌ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా? లేదా? అన్న క్యూరియాసిటీతోనే ఫస్టాఫ్‌ గడిచిపోతుంది. సెకండాఫ్‌లో హీరో ప్రేమను రిజెక్ట్ చేయడం, అందుకు చెప్పిన కారణం నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా నడిపారు దర్శకుడు. క్లైమాక్స్‌తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి. కథ ఏంటంటే నారాయణ రెడ్డి (అంజన్‌ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్‌ చేస్తుంటాడు. ఓ రోజు బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా మారిపోతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. లవ్‌రెడ్డిపై ఇష్టం ఉన్నప్పటికీ దివ్య ఎందుకు రిజెక్ట్‌ చేసింది? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్‌ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; https://telugu.yousay.tv/love-reddy-review-if-even-a-single-caste-hinders-love-what-is-the-situation-of-love-reddy.html
    అక్టోబర్ 25 , 2024
    <strong>NTR 31: జూ.ఎన్టీఆర్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌పై దిమ్మతిరిగే అప్‌డేట్‌.. బంగ్లాదేశ్‌ రైతుగా తారక్‌?</strong>
    NTR 31: జూ.ఎన్టీఆర్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌పై దిమ్మతిరిగే అప్‌డేట్‌.. బంగ్లాదేశ్‌ రైతుగా తారక్‌?
    తారక్‌ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక మూవీ సక్సెస్‌తో తారక్‌ తర్వాతి చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే సలార్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో తారక్‌ ఓ సినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘NTR 31’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్‌ నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిపై ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. రైతు పాత్రలో తారక్‌! &nbsp;తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న 'NTR 32' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్‌ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని ఫిల్మ్‌ వర్గాల సమాచారం.&nbsp; హీరోయిన్‌గా రష్మిక? దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్‌-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్‌ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.&nbsp;&nbsp; ఆ మూవీ తర్వాత సెట్స్‌పైకి! తారక్‌ బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో తారక్‌ నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లోనూ తారక్‌ పాల్గొన్నాడు. ఈ సినిమాలో తన కోటా షూటింగ్‌ పూర్తి చేసి ఆ తర్వాత ‘NTR 31’ను పట్టాలెక్కించాలని తారక్‌ భావిస్తున్నట్లు సమాచారం. ‘వార్‌ 2’ పూర్తయితే ఇక పూర్తిస్థాయిలో ప్రశాంత్‌ నీల్‌కు డేట్స్‌ అడ్డస్ట్‌ చేయవచ్చని తారక్‌ అనుకుంటున్నారట. ఇక ‘వార్‌ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; రాజకీయాలపై క్లారిటీ దేవర సక్సెస్ నేపథ్యంలో ఎన్టీఆర్ మరోసారి రాజకీయాలపై స్పందించారు. రాజకీయాలు కాదు.. నటనే తన తొలి ఆప్షన్ అని తేల్చి చెప్పారు. తొలి నుంచి నటుడిని కావాలనే అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో జూనియర్ స్పష్టం చేశారు. 17 ఏళ్ల వయసులో ఫస్ట్ మూవీ చేశానన్న తారక్‌ అప్పటి నుంచి నటనపైనే ఫోకస్ చేసినట్లు చెప్పారు. ఓట్ల సంగతి పక్కన పెడితే తన కోసం లక్షలాది మంది టికెట్లు కొంటున్నారని పేర్కొన్నారు. ఇంతమంది ప్రజలను కలుస్తున్నందుకు నటుడిగా తనకు ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ వ్యాఖ్యలను బట్టి ఆయన ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేనట్టు అర్ధమవుతోంది.
    అక్టోబర్ 01 , 2024
    <strong>Karthi - Mahesh Babu: మహేష్‌ గురించి టాప్‌ సీక్రెట్ రివీల్‌ చేసిన కార్తీ.. సర్‌ప్రైజ్ అయిన ఫ్యాన్స్‌!</strong>
    Karthi - Mahesh Babu: మహేష్‌ గురించి టాప్‌ సీక్రెట్ రివీల్‌ చేసిన కార్తీ.. సర్‌ప్రైజ్ అయిన ఫ్యాన్స్‌!
    తమిళ స్టార్‌ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ఆయన చేసిన చిత్రాలన్నీ దాదాపుగా తెలుగులో రిలీజై మంచి విజయాలను అందుకున్నాయి. రీసెంట్‌గా వచ్చిన సత్యం సుందరం కూడా తమిళంతో పాటు తెలుగులోనూ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తెలుగు భాష, ఇక్కడి ప్రేక్షకులంటే తనకు ఎంతో ఇష్టమని కార్తీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే సత్యం సుందరం సక్సెస్‌ మీట్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్యూలో నటుడు కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడు మహేష్‌ బాబుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహేష్‌ నా క్లాస్‌మేట్‌: కార్తీ కార్తీ (Karthi), అరవింద స్వామి (Aravinda Swami) ప్రధాన పాత్రల్లో నటించిన ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) చిత్రం శనివారం (సెప్టెంబర్‌ 28) విడుదలై హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కార్తీ మాట్లాడారు. సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్రమంలో ఫ్యూచర్‌లో మహేష్‌తో సినిమా చేసే ఛాన్స్‌ ఉందా? అంటూ రిపోర్టర్‌ కార్తీని అడిగారు. దీనికి కార్తీ బదులిస్తూ సరైన కథ దొరికితే మహేష్‌తో తాను సినిమా చేయడానికి రెడీ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు మహేష్‌ తాను స్కూల్లో క్లాస్‌మేట్స్ అంటూ పెద్ద సీక్రెట్‌ను రివీల్‌ చేశాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా షాకయ్యారు. అటు ఫ్యాన్స్‌ కూడా కార్తీ మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకాలం ఈ విషయం తమకు తెలియలేదే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/_VardhanDHFM_/status/1840974122475532541 కథ వినగానే అనుమానించా! సత్యం సుందరం స్టోరీ వినగానే ఇలాంటి సినిమాను ఈ రోజుల్లో చూస్తారా? అని అనుమానం కలిగిందని కార్తీ (Karthi) పేర్కొన్నారు. కానీ, కొత్త కాన్సెప్ట్‌తో వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. 'తెలుగు ప్రేక్షకులు చాలామంది నాకు ఫోన్‌ చేశారు. వారు సినిమా చూసి చాలా ఎమోషనల్‌గా ఫీలవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మంచి సినిమా కమర్షియల్‌గా కూడా విజయం సాధిస్తే నిర్మాతలకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది. ఈ తరహా చిత్రాలు చూస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది' అని కార్తీ చెప్పుకొచ్చారు. కార్తీకి కథ చెప్పిన రాజమౌళి! తమిళ స్టార్‌ హీరో కార్తీ ఇటీవల ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సత్యం సుందరం’ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో కార్తీ ఇంటర్యూ చేశారు. ఇందులో సూర్య, కార్తీ కలిసి నటించడంపై గౌతమ్ మీనన్ ప్రశ్నించగా గతంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని కార్తీ పంచుకున్నాడు. 'నేను కార్తిక్‌ కలిసి నటిస్తాం. అందుకు తగ్గ స్క్రిప్ట్‌ రావాలి. గతంలో రాజమౌళి సర్‌ మాకు ఒక కథ వినిపించారు. అది బాగానే ఉంది కానీ ఆ సినిమా వర్కౌట్‌ కాలేదు' అని తెలిపాడు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయ్యాయి. రాజమౌళి చెప్పింది ‘RRR’ అయ్యి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.&nbsp; https://twitter.com/adarshtp_offl/status/1835533193111392319 డిసెంబర్‌లో ‘SSMB 29’ షూటింగ్‌! మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా SSMB29కి సంబంధించిన అధికారిక అప్‌డేట్ ఉంటుందని సమాచారం. డిసెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మెుదలవుతుందని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. మెుదటి షెడ్యూల్‌ జర్మనీలో స్టార్ట్ అవుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 18వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో అరుదైన గిరిజన తెగల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది. 
    అక్టోబర్ 01 , 2024
    <strong>DEVARA: 23 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఏకైక హీరో.. మెుదలైన రోజే క్లోజ్‌!&nbsp;</strong>
    DEVARA: 23 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఏకైక హీరో.. మెుదలైన రోజే క్లోజ్‌!&nbsp;
    మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ తారక్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం 'దేవర'. గత కొన్నెళ్లుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్‌ 27) గ్రాండ్‌గా రిలీజైంది. అక్కడక్కడా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన ఓవరాల్‌గా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. అనిరుధ్‌ సంగీతం నెక్స్ట్‌ లెవల్లో ఉన్నట్లు కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. రిలీజ్‌కు ముందే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం ఇకపై మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సక్సెస్‌తో 23 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న రాజమౌళి ఫ్లాప్‌ రికార్డును తారక్‌ బద్దలు కొట్టాడని చెప్పవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తనయుడే డిక్లేర్‌ చేయడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రాజమౌళి ఫ్లాప్‌ సెంటిమెంట్‌! దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే బ్లాక్‌ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా ఇప్పటివరకూ వెంటనే హిట్‌ కొట్టిన సందర్భం లేదు. రాజమౌళి సినిమా తర్వాత ప్రతీ హీరో డిజాస్టర్‌తో బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచారు. ఇది 23 ఏళ్ల క్రితం వచ్చిన రాజమౌళి ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘స్టూడెంట్‌ నెం.1’ నుంచి కొనసాగుతూ వస్తోంది. ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’ చిత్రాల తర్వాత తారక్‌ ఘోర పరాజయాలను చవి చూశాడు. అలాగే ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ, ‘మర్యాద రామన్న’ తర్వాత సునీల్‌, ‘ఈగ’ తర్వాత నాని ఫ్లాప్‌లు అందుకున్నవారే. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌, రానా, అనుష్క కూడా తమ నెక్ట్స్‌ చిత్రాల్లో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ‘ఆర్ఆర్‌ఆర్‌’ తర్వాత తారక్‌ నటించిన చిత్రం కావడంతో సహజంగానే ‘దేవర’పై అందరిలోనూ ఆందోళనలు రేకెత్తాయి.&nbsp; 23 ఏళ్ల రికార్డు బద్దలు రాజమౌళి ఫ్లాప్‌ రికార్డు సెంటిమెంట్‌ మెుదలైందే తారక్‌తో అని అందరికీ తెలిసిందే. సెప్టెంబర్‌ 27, 2001లో రిలీజైన స్టూడెంట్‌ నెం.1 చిత్రం నుంచి ఈ ఫ్లాపుల పరంపర కొనసాగుతూ వస్తోంది. అయితే 23 ఏళ్ల తర్వాత అదే రోజైన సెప్టెంబర్‌ 27న దేవర రిలీజై హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అంటే ఈ ఫ్లాపుల సెంటిమెంట్‌ 23 ఏళ్ల కిందట ఏ హీరోతో మెుదలైందో, ఏ రోజు మెుదలైందో, మళ్లీ ఇన్నాళ్లకు అదే హీరోతో, అదే రోజుతో ముగిసిందని చెప్పవచ్చు. దీంతో రాజమౌళికి ఉన్న బ్యాడ్‌ సెంటిమెంట్‌ను తారక్‌ బద్దలు కొట్టాడని సోషల్‌ మీడియాలో తెగ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపై ఏ హీరో కూడా రాజమౌళి ప్లాపుల సెంటిమెంట్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోస్టులు పెడుతున్నారు.&nbsp; కార్తికేయ స్పెషల్‌ పోస్టు ఇదే విషయాన్ని రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా ట్వీట్ చేశాడు. ‘ఫైనల్​గా 23 ఏళ్ల మిత్‌ను బ్రేక్ అయింది. అది కూడా ఏ వ్యక్తితో ఏ రోజు అయితే మొదలైందో మళ్లీ అదే రోజు అదే వ్యక్తితో బద్దలైంది. చిన్నప్పటి నుంచి ఆయన్ను ఎంతో దగ్గరగా, ఆయన ఎదుగుదల, సక్సెస్​ను చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన చేసిన అద్భుతాలను చూస్తున్నాను. తెలుగు సినిమాకు ఆయన చేస్తున్న కృషిని చూస్తూ ఉన్నాను. నాకు అస్సలు మాటలు రావడం లేదు. ఫ్యాన్స్ అందరు సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది. దేవర ది బిగ్గెస్ట్ మాస్ సెలెబ్రేషన్స్ ఇన్​ సినిమా. ఇక ఇప్పుడు మ్యాడ్​నెస్​ కూడా మాట్లాడుతుంది. ఆల్ హెయిల్ ది టైగర్’ అంటూ ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. https://twitter.com/ssk1122/status/1839476779175567669 ఫ్యాన్స్‌తో దేవర చూసిన జక్కన్న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద ‘దేవర’ (Devara Release) సందడి కనిపిస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ (NTR) నటించిన సోలో మూవీ కావడంతో ఆయన అభిమానులు ఫుల్‌ ఖుష్‌లో ఉన్నారు. ఈనేపథ్యంలో సినిమాహాళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఇదిలాఉండగా, తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) వీక్షించారు. కుటుంబసభ్యులతో కలిసి బాలానగర్‌లోని మైత్రీ విమల్‌ థియేటర్‌కు వచ్చిన జక్కన్న అక్కడి సినీప్రియులకు అభివాదం చేశారు. అనంతరం వారితో కలిసి సినిమా చూశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్‌ రావిపూడి శ్రీరాములు థియేటర్‌లో సినిమా చూశారు. మరోవైపు, చెన్నైలోని ఓ థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశారు చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్‌. చిత్రంలోని ఫియర్‌ సాంగ్‌ను ఆలపించి ఫ్యాన్స్‌లో జోష్‌ నింపారు.&nbsp; https://twitter.com/ArtistryBuzz/status/1839517947548794958 https://twitter.com/AnirudhTrend/status/1839516079560802450
    సెప్టెంబర్ 27 , 2024
    <strong>The Goat Director: తెలుగు ఆడియన్స్‌పై ‘ది గోట్‌’ డైరెక్టర్‌ అక్కసు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!</strong>
    The Goat Director: తెలుగు ఆడియన్స్‌పై ‘ది గోట్‌’ డైరెక్టర్‌ అక్కసు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
    కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్‌). సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధిస్తూ రూ.300 కోట్ల మార్క్‌ను సైతం అందుకుంది. అయితే తెలుగు, హిందీ భాషల్లో మాత్రం 'ది గోట్‌'కు గట్టి ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్‌ వెంకట్ ప్రభు స్పందించారు. తెలుగు, హిందీ ప్రేక్షకులపై అతడు చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.&nbsp; ‘అందుకే నచ్చలేదు’ తెలుగు, హిందీ భాషల్లో ‘ది గోట్‌’ (The Greatest Of All Time) సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రూ.22 కోట్లకు ఈ మూవీని కొనుగోలు చేయగా ఇప్పటివరకు రూ.10 కోట్ల గ్రాస్‌ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే బ్రేక్‌ ఈవెన్‌ కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వెంకట్‌ ప్రభు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనీకి సంబంధించిన సీన్స్ హైలైట్‌ చేయడం వల్ల తెలుగు, హిందీ ప్రేక్షకులకు ఇది నచ్చలేదని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలు, హిందీ బెల్ట్‌లో ది గోట్‌ పనితీరు తక్కువగా ఉండడానికి ఇదే కారణమన్నారు. అంతేకాదు ఐపీఎల్‌లోని ముంబయి, బెంగళూరు జట్టు అభిమానులు తమ చిత్రాన్ని ఎక్కువగా ట్రోల్‌ చేస్తున్నారని ఆరోపించారు. తాను చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు అభిమానిని కావడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. వెంకట్‌ ప్రభు కామెంట్స్‌ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.&nbsp; https://twitter.com/TheAakashavaani/status/1833133203697131918 తెలుగు ఆడియన్స్ ఫైర్‌..! డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు తాజా కామెంట్స్‌ను తెలుగు ఆడియన్స్‌ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో 'ది గోట్‌' డిజాస్టర్‌ దిశగా వెళ్లడానికి కారణాలు వేరే ఉన్నాయని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. కంటెంట్‌ బాగుంటే ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల చిత్రాలను తాము ఆదరిస్తామని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ‘మానాడు’ చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ఒకసారి గుర్తుచేసుకోవాలని డైరెక్టర్‌కు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధోనికి విపరీతంగా అభిమానులు ఉన్నారని, హైదరాబాద్‌లో సీఎస్కే మ్యాచ్‌ జరిగితే ఎల్లో జెర్సీలతో స్టేడియం నిండిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ‘ది గోట్‌’ ఫెయిల్యూర్‌కు గల కారణాలేంటో అన్వేషించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.&nbsp; తెలుగులో ఫ్లాప్‌కు కారణాలు ఇవే! దర్శకుడు వెంకట్‌ ప్రభు రొటిన్‌ స్టోరీతో ది గోట్‌ను తెరకెక్కించారు. ఇందులో విజయ్‌ ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించాడు. అయితే టెర్రరిజం మూలాలతో తెరకెక్కినప్పటికీ ఏజెంట్‌ సినిమాల్లో కనిపించే ట్విస్టులు ఇందులో ఉండవు. మలుపులు, మెరుపులు ఏ ఒక్కటీ కథనంలో కనిపంచలేదు. కనీసం హీరో చేసే ఆపరేషన్స్‌లోనూ థ్రిల్‌ లేదు. పైగా విరామం వరకూ కథంతా సాగతీత వ్యవహారమే. అనవసరంగా వచ్చి పడిపోయే పాటలు, యోగిబాబు కామెడీ ట్రాక్‌ తెలుగు ఆడియన్స్‌ సహనానికి పరీక్ష పెట్టాయి. అయితే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌, క్లైమాక్స్‌లో వచ్చే ఐపీఎల్‌ ట్రాక్‌ ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపాయి.&nbsp; నో చెప్పిన ధోని! ‘ది గోట్‌’లో చాలా అతిథి పాత్రలు ఉన్నాయి. హీరో శివ కార్తికేయ (Sivakarthikeyan), హీరోయిన్ త్రిష (Trisha) అతిథులుగా అలరించారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీని కూడా క్లైమాక్స్‌లో చూపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) విజువల్స్‌ ద్వారా మహీని వెండితెరపై చూపారు. నిజానికి ధోనీతో ఒక్క సన్నివేశమైనా సినిమాలో చేయించాలని దర్శకుడు వెంకట్‌ ప్రభు అనుకున్నారట. అందుకు మహీ ఒప్పుకోకపోవడంతో ఐపీఎల్‌ విజువల్స్‌ ద్వారా స్క్రీన్‌పై చూపించారు. 20 నిమిషాల పాటు ఉండే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ క్రికెట్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకర్షించింది.&nbsp; నెగిటివ్‌ రివ్యూలపైనా మండిపాటు ‘ది గోట్‌’ సినిమాపై వచ్చిన నెగిటివ్‌ రివ్యూలపై దర్శకుడు వెంకట్‌ ప్రభు స్పందించారు. ‘సినిమాని రూపొందించేందుకు మేం పడిన కష్టం గురించి మాట్లాడరు. కానీ, కొందరు సినిమాపై కావాలనే నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తుంటారు. ఈ సినిమాలో ఉన్నన్ని రిఫరెన్స్‌లు ఏ చిత్రంలోనూ లేవు. ఏ హీరో అభిమాని అయినా ఈ సినిమాని సెలబ్రేట్‌ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రిఫరెన్స్‌లు తీసుకున్నాం. అతిథి పాత్రల కోసమే చిత్రాన్ని రూపొందించలేదు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా కథను తీర్చిదిద్దా. సినిమా ఆడియన్స్‌ కోసమేగానీ రివ్యూవర్స్‌కు కాదు’ అని అన్నారు.
    సెప్టెంబర్ 10 , 2024
    Highest Grossing Movies of Nani: నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలు ఇవే!
    Highest Grossing Movies of Nani: నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలు ఇవే!
    నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. సెప్టెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తద్వారా తొలి 8 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.73.6 కోట్లు (GROSS) కొల్లగొట్టి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగువేస్తోంది. థియేటర్‌ ఆక్యుపెన్సీ ఏమాత్రం తగ్గకపోవడంతో రెండు మూడు రోజుల్లోనే ఈ ఫీట్‌ సాధించే అవకాశం స్పష్టం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; [toc] దసరా (Dasara) నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'దసరా' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.120.4 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. రూ.55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం నాని కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా నిలిచింది. అటు తొలి రోజున రూ.38.7 కోట్లు కొల్లగొట్టి అత్యధిక డే1 వసూళ్లు రాబట్టిన నాని ఫిల్మ్‌గానూ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని అందుకునేందుకు 'సరిపోదా శనివారం' దూసుకెళ్తోంది. Budget : 55cr First Day Collection Worldwide : 38.7cr Worldwide Collection : 120.4cr Overseas Collection : 21.8cr India Gross Collection : 98.6cr ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రం నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఉంది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100.3 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఇందులో నాని ఫుల్‌లెంగ్త్‌ పాత్ర చేయలేదు. అతడిది గెస్ట్ రోల్‌లాగా అనిపిస్తుంది. అందుకే ట్రేడ్‌ వర్గాలు నాని రూ.100 కోట్ల సినిమాల జాబితాలో ఈగను చేర్చలేదు. Budget : 30cr First Day Collection Worldwide : 6.5cr Worldwide Collection : 100.3cr Overseas Collection : 13.8cr India Gross Collection : 86.5cr హాయ్‌ నాన్న (Hi Nanna) నాని రీసెంట్‌ చిత్రం ‘హాయ్‌ నాన్న’ రూ.77.2 కోట్ల (GROSS) కలెక్షన్స్‌తో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. శౌర్యువ్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం తండ్రి కూతురు సెంటిమెంట్‌తో వచ్చింది. ఇందులో నానికి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. తొలి రోజున ఈ చిత్రం రూ.10.5 కోట్లు కొల్లగొట్టింది. నటుడిగా నానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. Budget : 45cr First Day Collection Worldwide : 10.5cr Worldwide Collection : 77.2cr Overseas Collection : 18.5cr India Gross Collection : 58.7cr సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) నాని లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ ప్రస్తుతానికి ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం రూ.73.6 కోట్ల (GROSS) కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్‌ వద్ద రన్‌ అవుతోంది. ఏ క్షణంలోనైనా ఈ జాబితాలో పైకి ఎగబాకవచ్చు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రూ.55 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరక్కించారు. తొలిరోజే ఈ సినిమా రూ.21.8 కోట్లు కొల్లగొట్టింది. మూడు రోజుల్లోనే లాభాల్లోకి అడుగుపెట్టింది.&nbsp; Language : Telugu Budget : 55cr First Day Collection Worldwide : 21.8cr Worldwide Collection : 73.6cr (still running) Overseas Collection : 22.4cr (still running) India Gross Collection : 51.4cr (still running) MCA మిడిల్‌ క్లాస్ అబ్బాయి (MCA: Middle Class Abbayi) నాని హీరోగా వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.72.6 కోట్లు రాబట్టింది. ఇందులో నానికి జోడీగా సాయిపల్లవి చేసింది. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగుందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపించాయి.&nbsp; Budget : 25cr First Day Collection Worldwide : 15.6cr Worldwide Collection : 72.6cr Overseas Collection : 10.2cr India Gross Collection : 62.4cr నేను లోకల్‌ (Nenu Local) నాని, కీర్తి సురేష్‌ జంటగా చేసిన 'నేను లోకల్‌' చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. కేవలం రూ.15 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.61.2 కోట్లు (GROSS) వసూలు చేసింది. తద్వారా ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ నటుడిగా నానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.&nbsp; Budget : 15cr First Day Collection Worldwide : 9.7cr Worldwide Collection : 61.2cr Overseas Collection : 9.8cr India Gross Collection : 51.4cr నిన్ను కోరి (Ninnu Kori) శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ ఫిల్మ్‌ కూడా నాని కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో నాని లవ్‌ ఫెయిల్యూర్‌ అయిన యువకుడిగా నటించాడు. రూ.20కో ట్ల ఖర్చుతో రూపొందిన ఈ ఫిల్మ్‌ వరల్డ్‌వైడ్‌గా రూ.59.2 కోట్లు రాబట్టింది.&nbsp; Budget : 20cr First Day Collection Worldwide : 10.6cr Worldwide Collection : 59.2cr Overseas Collection : 10.3cr India Gross Collection : 48.9cr జెర్సీ (Jersey) నటుడిగా నాని మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం 'జెర్సీ'. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 58.7 కోట్లు రాబట్టింది. ఒక్క ఇండియాలోనే రూ. 47.3 కోట్లు తన ఖాతాలో వేసుకుంది.&nbsp; Budget : 30cr First Day Collection Worldwide : 11.2cr Worldwide Collection : 58.7cr Overseas Collection : 11.4cr India Gross Collection : 47.3cr శ్యామ్‌ సింగరాయ్‌ (Shyam Singha Roy) పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. రాహుల్‌ సంకృత్యన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.51.8 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఇందులో సాయి పల్లవితో పాటు కృతి శెట్టి హీరోయిన్‌గా చేసింది.&nbsp; Budget : 40cr First Day Collection Worldwide : 11.7cr Worldwide Collection : 51.8cr Overseas Collection : 6.5cr India Gross Collection : 45.3cr భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన పదో చిత్రంగా ‘భలే భలే మగాడివోయ్‌’ నిలిచింది. మారుతీ డైరెక్షన్‌లో రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.50.2 కోట్లను రాబట్టింది. ఇందులో మతిమరుపు ఉన్న వ్యక్తిగా నాని అద్భుత నటన కనబరిచాడు.&nbsp; Budget : 10cr First Day Collection Worldwide : 5.2cr Worldwide Collection : 50.2cr Overseas Collection : 11.6cr India Gross Collection : 38.6cr
    సెప్టెంబర్ 06 , 2024
    <strong>69th Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో ‘బేబీ’ మూవీ హవా.. రేసులోని తెలుగు చిత్రాలు ఇవే!</strong>
    69th Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో ‘బేబీ’ మూవీ హవా.. రేసులోని తెలుగు చిత్రాలు ఇవే!
    ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ 2024లో విజేతల ఎంపిక ప్రక్రియ మెుదలైంది. దక్షిణాది సినీ పరిశ్రమలైన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ సౌత్‌ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితాను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. అవార్డుల ప్రధానోత్సవం ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాలని త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా గణనీయ సంఖ్యలో టాలీవుడ్‌ చిత్రాలు, నటీనటులు నామినేషన్స్‌ బరిలో నిలిచారు. ఇంతకీ ఆ తెలుగు చిత్రాలు ఏవి? ఏ విభాగాల్లో ఏ తెలుగు నటులు పోటీలో నిలిచారు? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; నాని.. డబుల్‌ ధమాకా! 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 నామినేషన్స్‌లో హీరో నాని (Nani) డబుల్ ధమాకాగా నిలిచారు. ఉత్తమ నటుడు కేటగిరిలో రెండు సినిమాలకు (దసరా, హాయ్‌ నాన్న) నాని నామినేట్‌ అయ్యాడు. ఇదే కేటగిరిలో టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి (వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ (భగవంత్‌ కేసరి), ధనుష్‌ (సర్), నవీన్‌ పోలిశెట్టి (మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌ రాజ్‌ (రంగమార్తాండ), ఆనంద్‌ దేవరకొండ (బేబీ) నిలిచారు. అటు ఉత్తమ దర్శకుడు విభాగంలోనూ హాయ్‌ నాన్న, దసరా చిత్రాలు ఉండటం విశేషం. ఉత్తమ నటి విభాగంలో కీర్తి సురేష్‌ (దసరా) ఫిల్మ్‌ఫేర్ అవార్డు రేసులో నిలిచింది.&nbsp; బేబీ చిత్రం హవా! 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ నామినేషన్స్‌లో బేబీ చిత్రం సత్తా చాటింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది విభాగాల్లో నామినేషన్స్‌లో నిలిచింది. ఉత్తమ నటుడు (ఆనంద్‌ దేవరకొండ) కేటగిరితో పాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్‌ (సాయి రాజేష్‌), ఉత్తమ నటి (వైష్ణవి చైతన్య), ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్‌ (విజయ్‌ బుల్గానిన్‌), ఉత్తమ గేయ రచయిత (ఆనంత శ్రీరామ్‌), ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (శ్రీరామ చంద్ర, పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌) విభాగాల్లో బేబి చిత్రం బరిలో నిలిచింది. దీంతో ఫిల్మ్‌ఫేర్‌లో ‘బేబీ’ చిత్రానికి భారీగానే అవార్డ్స్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.&nbsp; https://twitter.com/MassMovieMakers/status/1813445764934431164 ఫిల్మ్‌ అవార్డ్స్‌ కోసం వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే... ఉత్తమ చిత్రం బేబీబలగందసరాహాయ్‌ నాన్నమిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టిసామజవరగమనసలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌ ఉత్తమ నటుడు ఆనంద్‌ దేవరకొండ (బేబీ)బాలకృష్ణ (భగవంత్‌ కేసరి)చిరంజీవి (వాల్తేర్‌ వీరయ్య)ధనుష్‌ (సర్‌)నాని (దసరా)నాని (హాయ్‌ నాన్న)నవీన్‌ పొలిశెట్టి (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ) ఉత్తమ నటి: అనుష్క (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)కీర్తిసురేశ్‌ (దసరా)మృణాళ్‌ ఠాకూర్‌ (హాయ్‌ నాన్న)సమంత (శాకుంతలం)వైష్ణవీ చైతన్య (బేబీ) ఉత్తమ దర్శకుడు: అనిల్‌ రావిపూడి (భగవంత్‌ కేసరి)కార్తిక్‌ దండు (విరూపాక్ష)ప్రశాంత్‌నీల్‌ (సలార్‌:పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)సాయి రాజేశ్‌ (బేబీ)శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న)శ్రీకాంత్‌ ఓదెల (దసరా)వేణు యెల్దండ (బలగం) ఉత్తమ సహాయ నటుడు: బ్రహ్మానందం (రంగ మార్తండ)దీక్షిత్‌శెట్టి (దసరా)కోట జయరాం (బలగం)నరేశ్‌ (సామజవరగమన)రవితేజ (వాల్తేర్‌ వీరయ్య)విష్ణు ఓఐ (కీడా కోలా) ఉత్తమ సహాయ నటి: రమ్యకృష్ణ (రంగమార్తండ)రోహిణి మోల్లెటి (రైటర్‌ పద్మభూషణ్‌)రుపా లక్ష్మీ (బలగం)శ్యామల (విరూపాక్ష)శ్రీలీల (భగవంత్‌ కేసరి)శ్రియారెడ్డి (సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)శ్వేతరెడ్డి (మంత్‌ ఆఫ్‌ మధు) ఉత్తమ గాయని: చిన్మయి శ్రీపాద (ఆరాధ్య – ఖుషి)చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ – హాయ్‌ పాప)దీ (చమ్కీల అంగీలేసి -దసరా)మంగ్లీ (ఊరు పల్లెటూరు-బలగం)శక్తిశ్రీ గోపాలన్‌ (అమ్మాడి -హాయ్‌ నాన్న)శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు -సర్‌) ఉత్తమ గాయకుడు: అనురాగ్‌ కుల్‌కర్ణి (సమయ-హాయ్‌ నాన్న)హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ (ఖుషి -టైటిల్‌ సాంగ్‌)పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ (ప్రేమిస్తున్నా -బేబీ)రామ్‌ మిర్యాల (పొట్టిపిల్ల -బలగం)సిధ్‌ శ్రీరామ్‌ (ఆరాధ్య – ఖుషి)శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ) ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌: బేబీ (విజయ్‌ బుల్గానిన్‌)బలగం (భీమ్స్‌ సిసిరిలియో)దసరా (సంతోష్‌ నారాయణ్‌)హాయ్‌ నాన్న (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)ఖుషి (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)వాల్తేర్‌ వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్) ఉత్తమ సాహిత్యం: అనంత శ్రీరామ్‌ (గాజు బొమ్మ -హాయ్‌ నాన్న)అనంత శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)కాసర్ల శ్యామ్‌ (చమ్కీల అంగీలేసి -దసరా)కాసర్ల శ్యామ్‌ (ఊరు పల్లెటూరు -బలగం)పి.రఘు (లింగి లింగి లింగ్డి -కోట బొమ్మాళి పి.ఎస్‌)
    జూలై 17 , 2024
    <strong>Nivetha Thomas: బరువు పెరగడంపై రిపోర్టర్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన నివేదా థామస్‌!</strong>
    Nivetha Thomas: బరువు పెరగడంపై రిపోర్టర్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన నివేదా థామస్‌!
    టాలీవుడ్‌లో తనకంటూ ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్న హీరోయిన్లలో నివేదా థామస్‌ (Nivetha Thomas) ఒకరు. ఈ అమ్మడు నటించింది తక్కువే సినిమాలే అయినప్పటికీ స్టార్‌ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని క్రేజ్‌ను తెలుగులో సొంతం చేసుకుంది. నివేదా.. ఇప్పటివరకూ యాక్టింగ్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే కనిపించింది. బోల్డ్‌ పాత్రలను అసలు చేయలేదు. దీంతో టాలీవుడ్‌ ఆడియన్స్‌లో ఈ భామకు మంచి గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే.. తన అప్‌కమింగ్‌ ఫిల్మ్‌ '35' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నివేదా థామస్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఈ అమ్మడు ఇచ్చిన కౌంటర్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.&nbsp; ఏం జరిగిందంటే? నివేథ థామస్‌ నటించిన '35&nbsp; చిన్న కథ కాదు' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టు బాడీ షేమింగ్‌ గురించి నివేదాను ప్రశ్నించారు. ‘అనుష్క లేదా మీలాంటి పలువురు ఆర్టిస్టులు బరువు పెరగడం అనేది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. హీరోయిన్‌ అంటే జీరో సైజే అని సోషల్‌ మీడియాలో ఇప్పటికీ వైరల్‌ అవుతోంది. వీటికి ఏం చెప్తారు మీరు? అని మహిళా రిపోర్టర్‌ ప్రశ్నిస్తారు. ఇందుకు నివేదా థామస్‌ బదులిస్తూ.. ‘నేను మీతోనే చెప్పాలి ఇది. ఈ వైరల్‌ అనేది మీకు మాత్రమే వస్తుందేమో.. నాకు తెలీదు. ఈ క్వశ్చన్‌కు నా సింపుల్ ఆన్సర్‌.. 35 అనేది ఈ సెట్‌లో ఉన్న ఎవరి వెయిట్‌ కాదు.. క్యాస్ట్‌లో ఉన్న ఎవరి వెయిట్‌ కాదు.. టెక్నిషియన్స్‌ వెయిట్‌ కాదు' అంటూ నవ్వుతూనే స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే వేయాలంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1808789199795204521 తొలిసారి ‘అమ్మ’ పాత్రలో.. '35 చిన్న కథ కాదు' చిత్రంలో నివేదా థామస్‌తో పాటు విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా థామస్ తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో పాస్‌ మార్కులు కూడా రానందుకు తండ్రి మందలించగా.. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కుమారుడి కోసం తల్లి ఆరాటపడటం లాంటి సన్నివేశాలు తాజా విడుదల చేసిన టీజర్‌లో చూపించారు. మూవీని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మీరు ఓ లుక్కేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=4cq7F7ihsbM నాకు పెళ్లైంది : నివేదా థామస్‌ తనకు పెళ్లంటూ గతంలో నెట్టింట జరిగిన ప్రచారంపై తాజాగా నటి నివేదా థామస్‌ స్పందించారు. టీజర్‌ విడుదల వేడుకలో దీనిపై కూడా మాట్లాడారు. ‘ఈ సినిమా ప్రచారంలో భాగంగా సోషల్‌ మీడియాలో నేను ఓ ఫొటో పోస్ట్‌ చేశా. దాన్ని చూసి చాలామంది నాకు పెళ్లి కానుందని భావించారు. దానిపై వార్తలు రాగా మా అమ్మ నాకు ఆ ఫొటో పంపారు. అవునా అమ్మా.. మీరెప్పుడు నా కోసం అబ్బాయిని చూశారు అని అమ్మని అడిగా’ అని నివేదా తెలిపారు. ఇక ఈ చిత్రంలో తన భర్తగా నటించిన విశ్వదేవ్‌, తన కుమారులుగా నటించిన వారిని ఉద్దేశిస్తూ.. ‘నాకు పెళ్లైంది. ఈయనే నా భర్త. వీళ్లే నా ఇద్దరు పిల్లలు అరుణ్‌, వరుణ్‌’ అంటూ నివేదా సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, హీరో రానా ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1808760891615416465
    జూలై 04 , 2024
    <strong>Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్‌ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!</strong>
    Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్‌ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం.. సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని థియేటర్లలోనూ పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. హాలీవుడ్‌ రేంజ్‌ విజువల్స్‌ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నటీనటుల గెటప్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ స్థాయి సక్సెస్‌ కల్కి టీమ్‌కు అంత ఈజీగా రాలేదు. దీని వెనక అంతులేని శ్రమ దాగుంది. కల్కి చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ (Secrets of Kalki 2898 AD) తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; 40 ఏళ్ల తర్వాత.. కల్కి సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ (KALKI 2898 AD Hidden Truth) ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాష్కిన్‌ అనే ప్రతినాయకుడి పాత్రలో కమల్‌హాసన్‌ కనిపించారు. అయితే దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ఈ సినిమాలో నటించారట. 1985లో వచ్చిన ‘గిరాఫ్తార్’ అనే సినిమాలో చివరిగా అమితాబ్, కమల్‌ నటించారు. ఆ తర్వాత మళ్లీ కల్కిలోనే వీరిద్దరు కలిసి పనిచేశారు.&nbsp; కమల్‌ లుక్‌ కష్టాలు.. ‘కల్కి 2898 ఏడీ’ కమల్‌ హాసన్‌ చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. ఈ లుక్‌ ఫైనల్‌ చేసే క్రమంలో ఎన్నో గెటప్‌లను పరిశీలించారట. దేనితోనూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సంతృప్తి చెందలేదట. చివరకు లాస్‌ ఏంజెల్స్ వెళ్లి అక్కడ హాలీవుడ్‌ సినిమాలకు వర్క్ చేసే మేకప్‌ నిపుణులను కల్కి టీమ్‌ సంప్రదించట. అలా కమల్‌ హాసన్‌ ప్రస్తుత లుక్‌ బయటకొచ్చిందని సినీ వర్గాలు తెలిపాయి.&nbsp; మేకప్‌కు కోసం 5 గంటలు కల్కి సినిమాలో అశ్వత్థామ గెటప్‌ కూడా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. 81 ఏళ్ల వయసున్న అమితాబ్‌ బచ్చన్‌&nbsp; (Amitabh Bachchan) ఈ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు. అయితే అశ్వత్థామ మేకప్ వేయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేదని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇక తీయడానికి మరో 2 గంటలు పట్టేదట. దీంతో అమితాబ్‌ మేకప్‌ కోసమే అచ్చంగా 5 గంటల సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బుజ్జి కోసం రూ.4 కోట్లు ‘కల్కి’లో ప్రభాస్‌ రైడ్‌ చేసిన ‘బుజ్జి’ (KALKI 2898 AD Hidden Truth) అనే ఫ్యూచరిక్‌ వెహికల్‌ను ఎంతో కష్టపడి చిత్ర యూనిట్‌ తయారు చేయించింది. బుజ్జి తయారీకి మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ టీమ్‌తో పాటు, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ టీమ్‌ సహకారం అందించింది. ఈ ఒక్క కారు కోసమే రూ.4కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.&nbsp; 700VFX షాట్స్‌ కల్కి సినిమాలో కాశీ, శంబల, కాంప్లెక్స్‌ అనే మూడు ఫ్యూచరిక్‌ ప్రపంచాలను డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ క్రియేట్‌ చేశారు. కాశీని నిర్జీవంగా.. శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబలను చూపించారు. పుష్కలమైన వనరులను కలిగినట్లు కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. ఇలా చూపించేందుకు మెుత్తం వీఎఫ్‌ఎక్స్‌నే ఉపయోగించారు. ఇందుకోసం 700 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉపయోగించినట్లు సమాచారం.&nbsp; హాలీవుడ్‌ యంత్రాంగం ‘కల్కి 2898 ఏడీ’ విజువల్‌ వండర్‌గా ఉందంటూ పెద్ద ఎత్తున టాక్‌ వస్తోంది. హాలీవుడ్‌ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలు ఈ సినిమాకు పనిచేయడమే ఇందుకు కారణం. ప్రముఖ హాలీవుడ్‌ చిత్రాలైన హ్యారీ పోటర్‌, ఇంటర్‌స్టెల్లర్‌, డ్యూన్‌, బ్లేడ్‌ రన్నర్‌ వంటి భారీ హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన VFX టీమ్‌ ‘కల్కి’ కోసం పనిచేసింది. రికార్డు స్థాయి బడ్జెట్‌ భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌ (KALKI 2898 AD Hidden Truth)తో రూపొందించిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ.600 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు వేతనాలు, సెట్స్‌కు అయిన ఖర్చు కంటే.. నాణ్యమైన విజువల్స్‌, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌ కోసమే ఎక్కువ మెుత్తం ఖర్చు చేశారట. https://telugu.yousay.tv/kalki-2898-ad-review-kalki-which-raised-the-level-of-indian-cinema-immensely-how-is-the-movie.html#google_vignette
    జూన్ 27 , 2024
    Sree Vishnu: మైండ్‌ బ్లోయింగ్‌ రిస్క్‌ చేస్తున్న శ్రీ విష్ణు.. సినీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్‌!
    Sree Vishnu: మైండ్‌ బ్లోయింగ్‌ రిస్క్‌ చేస్తున్న శ్రీ విష్ణు.. సినీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్‌!
    యంగ్‌ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu).. జయపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇటీవల ఆయన చేసిన చిత్రాలు హిట్‌ టాక్‌ సొంతం చేసుకోవడంతో నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగానూ మారిపోయాడు. కెరీర్‌ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన శ్రీవిష్ణు.. ప్రస్తుతం సోలో హీరోగా దూసుకెళ్తున్నాడు. రీసెంట్‌గా ‘ఓం భీమ్‌ బుష్‌’ సినిమాతో కెరీర్‌ బెస్ట్‌ వసూళ్లను సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇదిలా ఉంటే తన లేటెస్ట్‌ చిత్రం ‘స్వాగ్‌’ (SWAG) కోసం శ్రీ విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వార్త ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది.&nbsp; 14 విభిన్న పాత్రల్లో.. యువ నటుడు శ్రీ విష్ణు.. ప్రస్తుతం 'స్వాగ్‌' (SWAG) అనే చిత్రంలో చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని 'రాజ రాజ చోర' డైరెక్టర్ హసిత్‌ గోలి రూపొందిస్తున్నారు. దాంతో ఈ కాంబినేషన్‌పై మంచి హైప్‌ ఏర్పడింది. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. ఈ మూవీలో శ్రీ విష్ణు 14 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. అందులో ఒకటి ట్రాన్స్‌జెండర్‌ పాత్ర కూడా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ న్యూస్‌ ఇండస్ట్రీలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇదే నిజమైతే ఏ హీరో చేయని సాహాసాన్ని శ్రీ విష్ణు చేస్తున్నట్లే చెప్పాలి. కాగా, ఈ మూవీలో రీతు వర్మ హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే రిలీజైన టైటిల్‌ టీజర్‌, హీరోయిన్‌ టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.&nbsp; ఇండియాలోనే తొలిసారి! దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Hassan).. ‘దశావతారం’ చిత్రంలో 10 విభిన్నమైన పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రతీ పాత్రలో తనదైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే యంగ్‌ హీరో శ్రీ విష్ణు.. ఈ రికార్డును బీట్‌ చేయబోతున్నట్లు లేటెస్ట్ బజ్‌ను బట్టి తెలుస్తోంది. భారత సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఏ హీరో 14 విభిన్న పాత్రలు పోషించలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి శ్రీ విష్ణు ఈ డేరింగ్‌ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా ప్రశంసనీయమేనని చెబుతున్నారు. అయితే రోల్స్‌ సినిమాను ఏ మేరకు సక్సెస్‌ చేస్తాయో వేచి చూడాల్సి ఉందని అంటున్నారు.&nbsp; కీలక పాత్రలో మీరా జాస్మిన్‌ ‘స్వాగ్‌’ చిత్రంలో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ 'మీరా జాస్మిన్‌' కీలక పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆమె పాత్రకు సంబంధించిన స్పెషల్‌ పోస్టర్‌ను సైతం ఇటీవల మూవీ టీమ్‌ రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో మీరా జాస్మిన్‌ భారీ ఆభరణాలతో డిజైనర్‌ వేర్‌ కాస్ట్యూమ్‌లో రాణిలాగా ముస్తాబై కనిపించింది. రిలీజ్ అనంతరం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, స్వాగ్‌ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. వివేక్‌ సాగర్ మ్యూజిక్‌ సమకూరుస్తున్నారు.&nbsp; https://twitter.com/movielovers1021/status/1797136038881837295 శ్రీవిష్ణు ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ శ్రీ విష్ణు గత ఆరు చిత్రాలను పరిశీలిస్తే అందులో నాలుగు (రాజ రాజ చోర, అల్లూరి, సామజవరగమన, ఓం భీమ్‌ బుష్‌) మంచి హిట్‌ టాక్‌ సాధించాయి. మిగిలిన రెండు (భళా తందనాన, అర్జున పాల్గుణ) యావరేజ్‌గా నిలిచాయి. ప్రస్తుతం ‌అతడి కెరీర్‌ హైప్‌లో ఉండటంతో నిర్మాతలు అతడితో సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం అతడు ‘స్వాగ్‌’ సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. ‘SV18’, ‘SV19’ ప్రొడక్షన్ టైటిల్స్‌తో ప్రస్తుతం అవి షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాలు కూడా సక్సెస్‌ అయితే టాలీవుడ్‌లో శ్రీ విష్ణుకు తిరుగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Geetha Arts (@geethaarts)
    జూన్ 04 , 2024
    Weekend Collections: లాభాల్లోకి ‘గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి’, ‘భజే వాయు వేగం’.. ‘గం గం గణేశా’ పరిస్థితి ఏంటంటే?
    Weekend Collections: లాభాల్లోకి ‘గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి’, ‘భజే వాయు వేగం’.. ‘గం గం గణేశా’ పరిస్థితి ఏంటంటే?
    గత శుక్రవారం (మే 31) విడుదలైన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, ‘గం గం గణేశా’, ‘భజే వాయు వేగం’ చిత్రాలు.. థియేటర్లలో పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే విష్వక్‌ నటించిన గ్యాంగ్య్‌ ఆఫ్‌ గోదావరి తొలి రోజు రికార్డు ఓపెనింగ్స్‌ రాబట్టగా.. ఆనంద్‌ దేవరకొండ నటించిన ‘గం గం గణేశా’, కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం’ చెప్పుకోతగ్గ స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. అయితే మౌత్‌ టాక్‌తో శని, ఆదివారాలు మంచి కలెక్షన్స్‌ను ఆకర్షిస్తాయని ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. మరి ఆ అంచనాలు నిజమయ్యాయా? వీకెండ్‌లో గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి కలెక్షన్స్‌ ఎంత? మిగిలిన రెండు చిత్రాల వసూళ్లు పుంజుకున్నాయా? లేదా? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; దుమ్మురేపిన విష్వక్‌&nbsp; విష్వక్‌ సేన్‌, నేహా శెట్టి జంటగా రూపొందిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’.. శుక్ర, శని, ఆదివారాల్లో మంచి వసూళ్లను రాబట్టింది. తొలి మూడు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.16.2 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. కాగా, ఈ సినిమాలో లంక‌ల ర‌త్న అనే పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ యాక్టింగ్‌, హీరోయిజంతో పాటు అత‌డిపై తెర‌కెక్కించిన యాక్ష‌న్ సీన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. నెగెటివ్ షేడ్స్‌ ఉన్న విష్వక్‌ సేన్ క్యారెక్ట‌ర్‌ను ద‌ర్శ‌కుడు రాసుకున్న తీరు బాగుందంటూ అభిమానులు చెబుతున్నారు. అటు హీరోయిన్‌ నేహా శెట్టి.. ఇందులో అంజలి అనే కీలక పాత్రను పోషించింది. https://twitter.com/vamsikaka/status/1797530286579917125 లాభాల్లోకి వచ్చినట్లేనా? యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌.. నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. ఆయన గత చిత్రాలు నిర్మాతలకు రూపాయి మిగిల్చిందే గానీ, నష్టాల పాలు చేయలేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. దీంతో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రానికి కూడా మంచి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. రూ.10 కోట్లకు మేర ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా నిర్మాతలు ప్రకటించిన గ్రాస్‌ రూ.16.2 కోట్లుగా ఉంది. ట్యాక్స్‌లు, థియేటర్ల అద్దెలు మినహాయిస్తే 95 శాతానికి పైగా పెట్టుబడి మెుత్తం వచ్చేసినట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. నేటి నుంచి ఈ సినిమా లాభాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు చెబుతున్నారు.&nbsp; నిరాశ పరిచిన ‘గం గం గణేశా’ ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ చిత్రం ‘గం గం గణేశా’ చిత్రం... బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో పర్‌ఫార్మ్‌ చేయలేకపోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ వీకెండ్‌లో ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్‌ రాలేదని సమాచారం. ఈ మూవీ తొలి మూడు రోజులు.. వరల్డ్‌ వైడ్‌గా రూ.1.94 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.68 కోట్లు కలెక్ట్‌ చేసినట్లు స్పష్టం చేశాయి. కాగా, గం గం గణేశా... బ్రేక్ ఈవెన్‌ పాయింట్‌ రూ.5.50 కోట్లుగా ఉంది. ఈ మార్క్‌ను అందుకోవాలంటే ఈ వర్కింగ్‌ డేస్‌లో ఆడియన్స్‌ను మరింత అట్రాక్ట్‌ చేయాల్సి ఉంది.&nbsp; ‘భజే వాయు వేగం’కు బెటర్‌ రెస్పాన్స్‌ యంగ్‌ హీరో కార్తికేయ నటించిన 'భజే వాయు వేగం'.. మే 31న విడుదలై సాలిడ్‌ టాక్ తెచ్చుకుంది. అయితే తొలి రోజు రూ. కోటి లోపే కలెక్షన్స్‌ సాధించిన ఈ చిత్రం.. శని, ఆదివారాల్లో గణనీయంగా పుంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.5 కోట్ల మేర గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.2 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. కాగా, భజే వాయు వేగం బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 4 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత గ్రాస్‌ కాకుండా షేర్‌ను పరిగణలోకి తీసుకుంటే నేటి నుంచి ఈ మూవీ కూడా లాభాల్లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
    జూన్ 03 , 2024
    HBD Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన ఈ ముఖ్యమైన విషయాల గురించి తెలుసా?
    HBD Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన ఈ ముఖ్యమైన విషయాల గురించి తెలుసా?
    నందమూరి నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తారక్‌ (Jr NTR).. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. ఎంతటి కఠినమైన డైలాగ్స్‌ను అయినా అలవోకగా చెప్పగల నైపుణ్యం.. కళ్లు చెదిరే డ్యాన్స్‌ చేయగల సామర్థ్యం తారక్‌ సొంతం. అందుకే తారక్‌ లాంటి హీరోకు అభిమానులుగా ఉన్నందుకు ఫ్యాన్స్ కూడా గర్వపడుతుంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) ముందు వరకూ టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా ఉన్న అతడు.. ఆ సినిమా ప్రభంజనంతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. టాలీవుడ్‌ గర్వించతగ్గ నటుల్లో ఒకరిగా ఎదిగాడు. ఇవాళ (మే 20) జూ.ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా అతడి సినీ, వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. (Jr NTR Birthday Special Story) అసలు పేరు&nbsp; జూనియర్ ఎన్టీఆర్‌ అసలు పేరు 'తారక్‌ రామ్‌' (Jr NTR Life Memorable Moments) . ఓ రోజు తారక్‌ను తీసుకొని తండ్రి హరికృష్ణ.. నందమూరి తారకరామారావు వద్దకు వెళ్లారు. అప్పుడు తారక్‌ను చూసిన ఎన్టీఆర్ ఎంతో మురిసిపోయారట. తన మనవడికి తనే పేరే పెట్టాలని సూచించారట. అంతేకాదు స్వయంగా ఆయనే నందమూరి తారక రామారావుగా తారక్‌ పేరు మార్చారు.&nbsp; ఎనిమిదేళ్ల వయసులోనే.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన నట ప్రస్థానాన్ని బాల్యం నుంచి మెుదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ‘బాల రామయాణం’ కంటే ముందే తారక్‌ ఓ సినిమాలో నటించాడు. తారక్‌ తన ఎనిమిదేళ్ల వయసులో ముఖానికి మేకప్ వేసుకున్నాడు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో భరతుడి పాత్రతో నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ‘బాల రామాయణం’లో నటించాడు. (Jr NTR Birthday Special Story) 100కి పైగా ప్రదర్శనలు తారక్‌కు కూచిపూడి నృత్యంలో గొప్ప ప్రావీణ్యం ఉంది. 12 ఏళ్ల పాటు కూచిపూడి సాధన చేశాడు. దేశవ్యాప్తంగా 100పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రస్తుతం తారక్ ఈ స్థాయిలో డ్యాన్స్‌ ఇరగదీస్తున్నాడంటే అందుకు కారణం.. కూచిపూడిలో నేర్చుకున్న మెళుకువలేనని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; ఆ విషయంలో ఎప్పటికీ లోటే! కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే నటుల్లో తారక్‌ ముందు వరుసలో ఉంటాడు. షూటింగ్‌ నుంచి ఏ మాత్రం విరామం దొరికిన వెంటనే ఫ్యామిలీ ఎదుట వాలిపోతుంటాడు. అయితే తారక్‌కు తొలి నుంచి ఓ కుమార్తె కావాలన్న కోరిక ఉండేదట. అయితే భార్య ప్రణతీకి ఇద్దరూ అబ్బాయిలే పుట్టడంతో కూతురు లేదన్న లోటు తనకెప్పుడూ ఉంటుందని ఓ ఇంటర్యూలో తారక్‌ తెలిపాడు.&nbsp; ఫోర్బ్స్‌ జాబితా జాతీయ స్థాయిలో తారక్‌ (Jr NTR Life Memorable Moments) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశంలో మంచి క్రేజ్‌ ఉన్న హీరోల్లో ఒకరిగా నిలిచాడు. ఈ క్రమంలోనే తారక్‌.. ‘ఫోర్బ్స్‌ ఇండియా’ సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు చోటు సంపాదించుకున్నాడు. ఆ దేశంలో యమా క్రేజ్‌! టాలీవుడ్‌ హీరోల క్రేజ్‌ గ్లోబల్‌ స్థాయికి చేరింది. ఆయా దేశాల్లోని తెలుగు వారంతా తమకు ఇష్టమైన హీరోలను అభిమానిస్తూ వారి సినిమాలకు ఓవర్సీస్‌లో సక్సెస్ చేస్తుంటారు. అయితే జపాన్‌లో ఏ హీరోకు లేనంత క్రేజ్‌ తారక్‌కు ఉంది. అక్కడ జూ.ఎన్టీఆర్‌ను అభిమానించే వారి సంఖ్య గణనీయసంఖ్యలో ఉంటుంది.&nbsp; ఎన్టీఆర్‌ మంచి గాయకుడు ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించడమే కాదు.. మంచిగా పాటలు కూడా పాడగలడు.&nbsp; ‘ఓలమ్మీ తిక్కరేగిందా’, ‘వన్‌ టూ త్రీ నేనో కంత్రి’, ‘వేర్‌ ఈజ్‌ ది పంచకట్టు చారి’ తదితర పాటలతో అతడు ఫ్యాన్స్‌ను అలరించాడు.&nbsp; హోస్ట్‌గానూ సూపర్‌ సక్సెస్‌ ప్రముఖ టెలివిజన్‌ షోలకు తారక్‌ గతంలో హోస్ట్‌గానూ (Jr NTR Life Memorable Moments) వ్యవహిరించాడు. గొప్ప వ్యాఖ్యాతగా గుర్తింపు పొందాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘బిగ్‌బాస్‌ తెలుగు’ షోలకు హోస్ట్‌గా పని చేసి బుల్లితెర ప్రేక్షకుల్లో మరింత క్రేజ్‌ను సంపాదించాడు.&nbsp; తారక్ ఫేవరేట్‌ నెంబర్‌ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌కు అందరిలాగే కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. తారక్‌కి ‘9’ సంఖ్య అంటే మహా ఇష్టం. దానిని తన లక్కీ నెంబర్‌గా ఫీలవుతుంటాడు తారక్‌. తన కారు నెంబర్‌ ప్లేట్‌ కూడా 9999 వచ్చేలా తీసుకున్నాడు. ట్విటర్‌&nbsp; ఫేవరేట్‌ సాంగ్‌ &amp; సినిమా తారక్‌కు మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో సంగీతాన్ని ఆస్వాదిస్తుంటాడు. తారక్‌ ఆల్‌టైమ్ ఫేవరేట్‌ సాంగ్‌.. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ (మాతృదేవోభవ). ఇష్టమైన సినిమా ‘దాన వీర శూర కర్ణ’.&nbsp; రికార్డు స్థాయిలో ఆడియో ఫంక్షన్‌ ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబోలో వచ్చిన మెుట్ట మెుదటి చిత్రం ‘ఆంధ్రావాలా’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఏపీలోని నిమ్మకూరులో జరిగిన ఈ ఈవెంట్‌ కోసం రైల్వే శాఖ స్పెషల్‌ ట్రైన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆడియో ఫంక్షన్‌లో సుమారు 10 లక్షల మంది తారక్‌ అభిమానులు పాల్గొన్నారు.&nbsp; రీరిలీజ్‌ రికార్డు గతేడాది ఇదే రోజున (మే 20) తారక్ బర్త్‌డేను పురస్కరించుకొని ‘సింహాద్రి’ సినిమాను రీరిలీజ్‌ చేశారు. 1000 స్క్రీన్లలో ఈ సినిమాను ప్రసారం చేసి రికార్డు సృష్టించారు. ఒక రీరిలీజ్‌ చిత్రాన్ని ఈ స్థాయిలో ప్రదర్శించడం అదే తొలిసారి.&nbsp;
    మే 20 , 2024

    @2021 KTree