• TFIDB EN
  • శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి
    UTelugu2h 29m
    మాధవి చిన్నప్పుడే కృష్ణను పెళ్లి చేసుకుంటుంది. అతడు చనిపోయాడని తెలిశాక ఆమె రాజుతో ప్రేమలో పడుతుంది. అయితే అనూహ్యాంగా కృష్ణ బతికి వస్తాడు. దీంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అక్కినేని నాగేశ్వరరావు
    రామచంద్రరాజు
    చాందినిమాధవి
    చంద్ర మోహన్
    చంద్రం
    ఆహుతి ప్రసాద్
    రఘు
    మురళీ మోహన్
    మోహన్ రావు
    చలపతి రావు
    ఖాసీం
    బెనర్జీ
    వేణు
    చందుకృష్ణ
    శివాజీ
    కమల్కమల్
    రాధా కృష్ణరాధా
    వినాయక్కిషోర్
    వెన్నిరా ఆడై నిర్మల
    భవానీ
    రమాప్రభ
    బేగం
    కల్పనరాజ్యలక్ష్మి
    శైలజ ప్రియ
    ప్రియా
    కృష్ణ శ్రీ మహాలక్ష్మి
    నీలిమ సుధలావణ్య
    రాజేశ్వరిసుజాత
    దుర్గాశ్రీబజిత్
    బేబీ నిహారికరాజ్యం
    సిబ్బంది
    వైవీఎస్ చౌదరి
    దర్శకుడు
    నాగార్జున
    నిర్మాత
    ఎంఎం కీరవాణి
    సంగీతకారుడు
    కథనాలు
    <strong>HBD Nagarjuna: నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. ఆయన వేసిన ఈ డేరింగ్‌ స్టెప్స్‌ ఏ హీరో వేయలేదు భయ్యా!</strong>
    HBD Nagarjuna: నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. ఆయన వేసిన ఈ డేరింగ్‌ స్టెప్స్‌ ఏ హీరో వేయలేదు భయ్యా!
    అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున (Akkineni Nagarjuna) ఏ హీరో చేయనన్నీ ప్రయోగాలు తనపై తాను చేసుకున్నారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా వైవిధ్యమైన చిత్రాలతో కెరీర్‌లో ముందుకు సాగారు. మాస్‌, క్లాస్‌, ఆధ్యాత్మికం, లవ్‌ ఇలా అన్ని జానర్స్‌లో చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసులుగా తన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్‌ను సైతం ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి తండ్రిగానూ సక్సెస్‌ ‌అయ్యారు. ఇండస్ట్రీలో నాగార్జున సక్సెస్‌ వెనుక కొన్ని డేరింగ్ స్టెప్స్ ఉన్నాయి. ఇవాళ (ఆగస్టు 29) నాగార్జున బర్త్‌డే సందర్భంగా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; 'శివ'తో సెన్సేషన్‌ సాధారణంగా కెరీర్‌ తొలినాళ్లలో ఏ హీరో అయినా సేఫ్‌ స్టోరీలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు. అయితే నాగార్జున ‘శివ’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ఆడియన్స్‌ ముందుకు వచ్చాడు. కనీసం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేయని రామ్‌గోపాల్‌ వర్మకు డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇచ్చి గొప్ప సాహసమే చేశారు. నాగార్జున వేసిన ఆ డేరింగ్‌ స్టెప్‌ ‌అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎవరూ ఊహించిన విధంగా&nbsp; ‘శివ’ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నాగ్‌ కెరీర్‌తో పాటు టాలీవుడ్‌ దిశను కూడా శివ పూర్తిగా మార్చేసింది. హీరో అంటే ఇలాగే ఉండాలన్న మూసధోరణికి ‘శివ’తో నాగ్‌ - రామ్‌గోపాల్‌ వర్మ చెక్‌ పెట్టారు.&nbsp; వైవిధ్యతకు ప్రాధాన్యం శివ సినిమాతో నాగార్జున ఇండస్ట్రీలో టాప్‌ హీరోగా మారిపోయాడు. అప్పట్లో ఒక సినిమా హిట్‌ అయ్యిందంటే అదే ప్యాట్రన్‌లో చాలా కథలు వచ్చి పడేవి. అయితే నాగార్జున వాటికి తలొగ్గకుండా సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా ప్లాన్‌ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ‘గోవిందా గోవిందా’లాంటి సూపర్‌ నేచురల్‌ హెయిస్ట్‌ ఫిల్మ్‌, ‘నిన్నే పెళ్లాడతా’ వంటి ఫ్యామిలీ డ్రామా, ‘హలో బ్రదర్‌’లాంటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లతో ఫ్యాన్స్‌ను అలరించారు. తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా మారిపోయాడు.&nbsp; ‘అన్నమయ్య’ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి హీరోలు కమర్షియల్‌ చిత్రాలతో దూసుకుపోతున్న తరుణంలో నాగార్జున ‘అన్నమయ్య’ ప్రాజెక్ట్‌ను ఓకే చేసి అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటికే మాస్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న నాగార్జున డివోషనల్ చిత్రం చేయడమేంటని ఇండస్ట్రీలో విమర్శలు వచ్చాయి. నటుడు అంటే అన్ని రకాల పాత్రలు వేయాలన్న సిద్ధాంతాన్ని నమ్మిన నాగార్జున ఏమాత్రం సంకోచించకుండా అన్నమయ్య సినిమాలో నటించారు. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నాగార్జున తన నటనతో నిజమైన అన్నమయ్యను గుర్తుచేశారు. ఈ చిత్రానికి ఏకంగా రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ రావడం విశేషం.&nbsp; మరిన్ని ఆధ్యాత్మిక చిత్రాలు.. ‘అన్నమయ్య’ సక్సెస్‌తో నాగార్జున సరిపెట్టుకోలేదు. ఓవైపు కమర్షియల్‌ చిత్రాలు చేస్తూనే మరిన్ని భక్తిరస సినిమాల్లో ఆయన నటించారు. రాఘవేంద్రరావు-నాగార్జున కాంబోలో వచ్చిన ‘రామదాసు’ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అలాగే ‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’, ‘జగద్గురు ఆది శంకర’ వంటి ఆధ్యాత్మిక చిత్రాల్లో నాగార్జున మెరిశారు.&nbsp; కొత్తవారికి ఛాన్స్‌.. కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో రిస్కే కాదు, విజయమూ ఉందని ఎన్నోసార్లు నిరూపించారు నాగార్జున. సుదీర్ఘ నట ప్రస్థానంలో సుమారు 40 మంది దర్శకులను ఆయన టాలీవుడ్‌కి పరిచయం చేశారు. రామ్‌గోపాల్‌ వర్మ (శివ), వైవీఎస్‌ చౌదరి (శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి), లారెన్స్‌ (మాస్‌), విజయ్‌ బిన్నీ (నా సామిరంగ) తదితరులు ఆ జాబితాలోకే వస్తారు. తాను స్టార్‌ కావడానికి కారణం ఓ రకంగా నూతన దర్శకులే అంటుంటారు నాగ్‌. తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలను మార్చిన హీరోగా నాగార్జునను చెబుతుంటారు. ఈ విషయంపై డైరెక్టర్ కృష్ణవంశీ ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాను గ్లోబల్‌ చేసిన హీరో నాగార్జున అని కొనియాడారు. ఇతర ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లను తీసుకొచ్చి తన సొంత డబ్బుతో వైవిధ్యమైన చిత్రాలు నిర్మించారని గుర్తుచేశారు. తద్వారా ఆడియన్స్‌ విజన్‌ను నాగార్జున మార్చేశారని పేర్కొన్నారు. మణిరత్నం, ప్రియదర్శన్‌, ఫాజిల్‌, రవిచందర్‌, మహేష్‌ భట్‌ ఇలా మలయాళం, కన్నడ, హిందీ, తమిళ ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లతో నాగార్జున వర్క్‌ చేశారని గుర్తుచేశారు. చిన్న క్యారెక్టర్‌ అయినా బాంబే వెళ్లి వచ్చేవారని పేర్కొన్నారు. పాన్‌ ఇండియా అనే మాటకు మెుదట ఫౌండేషన్‌ వేసిందే నాగార్జున అని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/thokkaloteja/status/1828863171152757038 బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా.. సాధారణంగా స్టార్‌డమ్‌ వచ్చిన హీరోలు బుల్లితెర షోలలో కనిపించేందుకు పెద్దగా ఆసక్తి కనిపించరు. వారి దృష్టంతా సినిమాలపైనే ఉంటుంది. అయితే నాగార్జున అలా కాదు. బిగ్‌బాస్‌ తెలుగు షోకు గత కొన్నేళ్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌, తారక్‌ వంటి కుర్ర హీరోలు ఒక సీజన్‌కు మాత్రమే పరిమితం కాగా నాగ్‌ మాత్రం అలవోకగా సీజన్‌లపైన సీజన్‌లు చేసుకుంటూ వెళ్తున్నారు. వరుసగా ఐదు సీజన్ల (Bigg Boss 3,4,5,6,7)కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సెప్టెంబరు 1న ప్రారంభం కానున్న 8వ సీజన్‌కూ ఆయనే వ్యాఖ్యాత. అంతేకాదు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి కూడా నాగ్‌ హోస్ట్‌గా వ్యవహించడం గమనార్హం.&nbsp; https://twitter.com/i/status/1829013612117230039 ఫిట్‌నెస్‌ మంత్ర నాగార్జున ఫిట్‌నెస్‌ను చూసి కుర్ర హీరోలు సైతం షాకవుతుంటారు. శివ సమయంలో నాగ్‌ ఫిజిక్‌ ఎలా ఉందో ఇప్పటికే అదే బాడీని మెయిన్‌టెన్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తూ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం, వర్కౌట్ చేయడమే తన అందం సీక్రెట్‌ అంటూ పలు వేదికల్లో నాగార్జున చెప్పుకుంటా వచ్చారు. 1986లో ‘విక్రమ్‌’(Vikram)తో హీరోగా పరిచయమైన నాగ్‌ వంద చిత్రాలకు చేరుకున్నారు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ (Kubera)లో నటిస్తున్నారు.
    ఆగస్టు 29 , 2024
    Hansika Motwani: బాత్‌ టబ్‌లో అందాలు ఒలకపోసిన హన్సికా..!
    Hansika Motwani: బాత్‌ టబ్‌లో అందాలు ఒలకపోసిన హన్సికా..!
    అందాల భామ హన్సికా మోత్వానీ గత కొంతకాలంగా తన బోల్డ్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాను హీట్ ఎక్కిస్తోంది. అయితే తాజాగా తన రూట్‌ మార్చిన ఈ అమ్మడు చీరలో తళుక్కుమని మెరిసి ఆశ్చర్య పరిచింది.&nbsp; View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) లైట్‌ ఆరెంజ్‌ కలర్‌లో శారీ కనిపించిన హన్సికా ట్రెడిషనల్‌ లుక్‌లోనూ తాను మెప్పించగలనని నిరూపించుకుంది.&nbsp; గత కొన్ని రోజులుగా హన్సికను బోల్డ్‌ లుక్స్‌లో చూస్తు వచ్చిన ఫ్యాన్స్‌ ఇవాళ చీరలో చూసి ఆశ్యర్యపోతున్నారు. చీరలో అద్భుతంగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.&nbsp; శారీ ఫొటోలకు ముందు బాత్‌ టబ్‌లో ఉన్న ఫొటోలను హన్సిక పోస్టు చేసింది. ఇది చూసిన నెటిజన్లు బాబోయ్ ఇంత హాటా అని మైమరిచిపోతున్నారు.&nbsp; సముద్రంలో బోటుపై ప్రయాణిస్తూ హన్సికా పెట్టిన బోల్డ్‌ ఫొటోలు అప్పట్లో చాలా బాగా వైరల్‌ మారాయి. నీలి సంద్రంపై హన్సికా తెల్లటి అందాలు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. 2007లో దేశముదురు సినిమా ద్వారా హన్సికా&nbsp; టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వైశాలి పాత్రలో ఈ అమ్మడు చాలా గొప్పగా నటించింది.&nbsp; దేశముదురు చిత్రం హిట్‌ కావడంతో హన్సికకు అవకాశాలు క్యూ కట్టాయి. కంత్రి, మస్కా, బిల్లా, జయీభవ, సీతారాముల కల్యాణం, కందిరీగా, ఓ మై ఫ్రెండ్‌ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల హన్సికాకు పెళ్లి కాగా సినిమాలకు గుడ్‌బై చెబుతుందేమోనని అంతా భావించారు. అయితే ఆ అంచనాలను తలకిందు చేస్తూ వరుస షూటింగ్‌లతో హన్సికా బిజీ బిజీగా గడుపుతున్నారు. సోషల్‌ మీడియాలోనూ&nbsp; హన్సికా చురుగ్గా ఉంటోంది. మత్తెక్కించే ఫోజులతో ఫ్యాన్స్‌ను ఎప్పటికప్పుడు ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంది.&nbsp;
    ఏప్రిల్ 06 , 2023
    Lord Rama Movies: ‘శ్రీరామ’ అనగానే గుర్తొచ్చే టాప్ తెలుగు చిత్రాలు ఇవే!
    Lord Rama Movies: ‘శ్రీరామ’ అనగానే గుర్తొచ్చే టాప్ తెలుగు చిత్రాలు ఇవే!
    ఐదు శతాబ్దాల హిందువుల నిరీక్షణను నిర్వీర్యం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం (Ayodhya Rama Mandir) కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట (Bala Rama Prana Pratishta) కనుల పండువగా జరిగింది. ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా, టీవీల్లో వీక్షించిన కోట్లాది భక్తజనం భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. జైరామ్‌ (Jai Shree Ram) నినాదాలతో యావత్‌ దేశం మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో రామాయాణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తెలుగు సినిమాలు, వాటిలో నటించిన ప్రముఖ హీరోల గురించి ఇప్పుడు చూద్దాం. ఆదిపురుష్‌ రామాయణాన్ని కథాంశంగా చేసుకొని ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Aadipurush). బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ (Om Raut) రూపొందించిన మూవీలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) రాముడి పాత్ర పోషించారు. సీతగా బాలీవుడ్‌ నటి కృతి శెట్టి కనిపించింది. ఆదిపురుష్‌లోని ‘జై శ్రీరామ్ జై శ్రీరామ్‌’ పాట ఆయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్బంగా దేశవ్యాప్తంగా మార్మోగడం విశేషం.&nbsp; శ్రీరామ రాజ్యం బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతా దేవిగా నటించిన చిత్రం ‘శ్రీరామ రాజ్యం’ (Sri Rama Rajyam). శ్రీరాముడి సంతానం లవకుశల కథను ఆధారంగా చేసుకొని ఈ మూవీని రూపొందించారు. దిగ్గజ దర్శకుడు బాపు ఈ సినిమాను రూపొందించగా.. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలు ప్రతీ శ్రీరామ నవమి రోజున ప్రముఖంగా వినిపిస్తాయి. శ్రీ రామదాసు శ్రీరాముడికి పరమభక్తుడైన కంచర్ల గోపన్న(Kancharla Gopanna) జీవిత కథ ఆధారంగా ‘శ్రీరామదాసు’ (Sri Ramadasu) సినిమా తెరకెక్కింది. ఇందులో నాగార్జున (Nagarjuna) లీడ్‌రోల్‌లో నటించారు. గోపన్న భద్రాచలంలో రాములవారికి గుడి కట్టించి ఎలా శ్రీరామదాసుగా మారాడు అన్నది ఈ సినిమాలో చూపించారు. రాఘవేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్‌ రాముడిగా, అక్కినేని నాగేశ్వరరావు కబీర్‌దాస్‌గా నటించారు. దేవుళ్లు తెలుగులో వచ్చిన దేవుళ్లు (Devullu) చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. హిందువులు పూజించే ప్రముఖ దేవుళ్లను ఆధారంగా చేసుకొని ఈ సినిమా రూపొందింది. ఇందులో రాముడిగా శ్రీకాంత్‌, ఆంజనేయుడిగా రాజేంద్ర ప్రసాద్‌ నటించారు. ఇద్దరు చిన్నారుల తమ తల్లిదండ్రుల మెుక్కులను తీర్చేందుకు దేశంలోని ప్రముఖ ఆలయాలను ఎలా దర్శించుకున్నారు. వారికి దేవుళ్లు ఏవిధంగా సాయపడ్డారు అన్నది ఈ సినిమా. దేవుళ్లు చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.&nbsp; బాల రామాయణం చిన్నారులనే పాత్రదారులుగా చేసుకొని నిర్మించిన చిత్రం 'బాల రామాయణం' (Bala Ramayanam). గుణశేఖర్‌ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) రామునిగా నటించారు. బాలనటి స్మిత.. సీత పాత్రను పోషించింది. ఈ చిత్రం జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ బాలల చిత్రంగా ఎంపిక చేయబడింది.&nbsp; శ్రీ సీతారామ జననం 1944లో విడుదలైన 'శ్రీ సీతా రామజననం' (Sita Rama Jananam) చిత్రం అప్పట్లో అపూర్వ విజయాన్ని అందుకుంది. అక్కినేని రాముడిగా, నటి త్రిపుర సుందరి సీత పాత్ర పోషించారు. ఈ చిత్రం ద్వారానే ఘంటసాల గాయకుడిగా పరిచయం అయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో కోరస్‌ కూడా ఇచ్చారు. సీతారామ కళ్యాణం&nbsp; నందమూరి తారకరామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం (Sita Rama Kalyanam Movie)లో హరినాథ్‌, గీతాంజలి సీతారాములుగా నటించారు. ఎన్‌.టీ రామారావు రావణాసురిడిగా కనిపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఇందులో నారద పాత్రను కాంతారావు పోషించడం విశేషం.&nbsp; సంపూర్ణ రామాయణం టాలీవుడ్‌లో వచ్చిన శ్రీరాముని చిత్రాల్లో 'సంపూర్ణ రామాయణం' (Sampoorna Ramayanam) ఒకటి. ఈ చిత్రం కూడా అప్పట్లో విశేష ప్రజాధరణను పొందింది. శోభన్‌బాబు రాముడిగా, చంద్రకళ సీతగా నటించారు. ఎస్వీ రంగారావు రావణుడి పాత్రను పోషించడం విశేషం. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు.&nbsp; లవకుశ నందమూరి తారకరామారావు చేసిన గుర్తిండిపోయే చిత్రాల్లో ‘లవకుశ’ (LavaKusa) కచ్చితంగా ఉంటుంది. రామాయణం ఉత్తరకాండం ఈ సినిమా కథాంశానికి మూలం. ఈ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్‌ నటించగా సీత పాత్రను అంజలీ దేవి పోషించింది. లవ, కుశలుగా నాగరాజు, సుబ్రహ్మణ్యం నటించారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎంతో ప్రసిద్ధి. శ్రీరామ నవమి సందర్భంగా పందిర్లలో ఈ చిత్ర పాటలు ప్రముఖంగా వినిపిస్తుంటాయి.&nbsp;
    జనవరి 23 , 2024
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.&nbsp; ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో&nbsp; ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు&nbsp; ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్&nbsp; ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి&nbsp; శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్&nbsp; నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక&nbsp; కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి&nbsp; మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ&nbsp; ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్&nbsp; పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ&nbsp; సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:&nbsp; హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.&nbsp; సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి&nbsp; జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా&nbsp; బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం&nbsp; దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-&nbsp; యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.&nbsp; ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-&nbsp; జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు&nbsp; రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.&nbsp; ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.&nbsp; మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో&nbsp; ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి&nbsp; దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,&nbsp; కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి&nbsp; రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.&nbsp; ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్ &nbsp;ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని&nbsp; ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా&nbsp; దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.&nbsp; మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.&nbsp; ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    KISI KA BHAI KISI KI JAAN REVIEW : సల్మాన్ ఖాన్ వన్‌మేన్ షో.. అంతా కాపీ పెస్టేనా? ప్రేక్షకులకు నచ్చిందా?
    KISI KA BHAI KISI KI JAAN REVIEW : సల్మాన్ ఖాన్ వన్‌మేన్ షో.. అంతా కాపీ పెస్టేనా? ప్రేక్షకులకు నచ్చిందా?
    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్. దాదాపు మూడేళ్ల తర్వాత సల్మాన్‌ తెరపై కనిపిస్తున్నాడు. తమిళ్ చిత్రం వీరమ్ రీమేక్‌గా చిత్రాన్ని రూపొందించారు. కొద్దిపాటి మార్పులు చేసి తీర్చిదిద్దిన సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుందా? విక్టరీ వెంకటేశ్ రోల్ ఎలా ఉంది? అనే విషయాలను తెలుసుకోండి. దర్శకుడు: ఫర్హద్ సమ్జీ నటీ నటులు: సల్మాన్‌ ఖాన్, పూజా హెగ్డే, విక్టరీ వెంకటేశ్ సంగీతం:&nbsp; రవి బస్రూర్, హిమేశ్‌ రేష్మియా, దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: వి. మణికందన్ కథ భాయ్ జాన్( సల్మాన్ ఖాన్) తన ఊరిలో శక్తివంతమైన నాయకుడు. అమ్మాయిలంటే పడుదు. తన జీవితాంతం బ్రహ్మచారిగా జీవించాలనుకుంటాడు. తన ముగ్గురు సోదరులను ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. అయితే&nbsp; అతని ముగ్గురు తమ్ముళ్లు తన&nbsp; అన్నయ్యకు పెళ్లి చేసి వాళ్ల ప్రేమకు లైన్ క్లియర్ చేసుకోవాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మిని ( పూజా హెగ్డే) ప్రేమించేలా చేస్తారు. ఆమె ప్రేమలో పడిన భాయ్ జాన్, భాగ్యలక్ష్మికి ప్రాణ హాని ఉందని తెలిసి ఆమెను ఎలా కాపాడతాడు. అసలు&nbsp; భాగ్యలక్ష్మికి&nbsp; విలన్‌ నుంచి ఉన్న ఆపద ఏంటి? భాగ్యలక్ష్మిని భాయి జాన్ పెళ్లి చేసుకుంటాడా? లేదా అన్నది మిగతా కథ.&nbsp; ఎలా ఉందంటే ఈ సినిమాను ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు రెండు సార్లు చూశారు. అజిత్ హీరోగా నటించిన వీరమ్‌ చిత్రం తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. అయినా… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ అదే కథను కాటమ రాయుడుగా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి దీన్ని కిసీకా భాయ్ కిసీ కా జాన్ పేరుతో సల్మాన్‌ తీశాడు.&nbsp; చిత్రంలో స్వల్పంగా మార్పులు మాత్రమే చేశారు. అచ్చుగుద్దినట్లు కాటమరాయుడు చూస్తున్నట్లే అనిపిస్తుంది.సల్మాన్ ఖాన్ తనదైన స్టైల్‌లో కామెడీతో మెప్పించాడు. హీరోయిన్‌తో లవ్ ట్రాక్ మధ్యలో మాస్ ఫైట్లు అలరించాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఫైట్‌ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ తెప్పిస్తుంది.&nbsp; సెకాండాఫ్ సాదాసీదాగా సాగుతున్నప్పటికీ వెంకటేశ్‌, సల్మాన్ మధ్య సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక సల్లు భాయ్‌ లుంగీలో చేసిన డాన్స్‌ కామెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది. అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త నిరాశగానే ఉన్నారు. క్లైమాక్స్‌ అంతా రొటీన్‌గానే ఉంటుంది. బాలీవుడ్ ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చుతుందో చూడాలి.&nbsp; ఎవరెలా చేశారు సినిమా మెుత్తం సల్మాన్ ఖాన్ వన్‌ మేన్‌ షో. చిత్రం మెుదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు సల్లు భాయ్‌దే హవా. కామెడీ, ఫైట్లతో అలరించాడు. మరోసారి సినిమాను తన భుజాలపై మోశాడు. పూజా హెగ్డే నటనతో మెప్పించింది. తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. విక్టరీ వెంకటేశ్, షెహనాజ్ గిల్‌ సహా మిగతా వారందరూ తమ పరిధి మేరకు నటించారు. పాటలో రామ్ చరణ్‌ డాన్స్‌ బాగుంది.&nbsp; సాంకేతిక పనితీరు సినిమాటోగ్రఫీ బాగుంది. కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్ చిత్రానికి దాదాపు ఐదుగురు సంగీత దర్శకులు పనిచేశారు. పాటలు, నేపథ్య సంగీతం ఫర్వాలేదు. స్క్రీన్‌ ప్లేపై దర్శకుడు మరింత దృష్టి పెట్టాల్సింది. అచ్చుగుద్దినట్లు కాకుండా మార్పులు చేర్పులు చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.&nbsp; బలాలు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే కామెడీ బలహీనతలు తెలిసిన కథ రేటింగ్ : 2.75/5
    ఏప్రిల్ 21 , 2023
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    “విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్‌ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్‌ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం. నువ్వు నాకు నచ్చావ్‌! ప్రకాశ్‌ రాజ్‌ ఇంటికి వెంకటేశ్‌ వచ్చినపుడు సునీల్‌ తనని ఔట్‌ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్‌ సెటైర్‌ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్‌ పేరు లంకా” అనేస్తాడు. https://www.youtube.com/watch?v=UVFCtTNU29s అత్తారింటికి దారేది అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్‌. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్‌ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్‌ “ ఒరేయ్‌ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్‌ ఎలా కట్టాలి అని ప్లాన్‌ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్‌ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు. https://www.youtube.com/watch?v=9-PckWpekQY జల్సా జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్‌ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI అ ఆ ‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్‌ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్‌ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు. https://www.youtube.com/watch?v=qrrldRJc5e8 మన్మథుడు మన్మథుడులో సునీల్‌ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్‌ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్‌ ఇస్తాడు.&nbsp; https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow అల వైకుంఠపురములో అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్‌ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు. అజ్ఞాతవాసి “సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి) S/O సత్యమూర్తి “రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌) భీమ్లా నాయక్‌ “ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్‌) అతడు “హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్‌ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
    ఏప్రిల్ 14 , 2023
    Family Star First Review: మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా అదరగొట్టిన విజయ్‌.. ‘ఫ్యామిలీ స్టార్‌’ హిట్టా? ఫట్టా?
    Family Star First Review: మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా అదరగొట్టిన విజయ్‌.. ‘ఫ్యామిలీ స్టార్‌’ హిట్టా? ఫట్టా?
    నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌, వాసుకి, రోహిణి హట్టంగడి, అభినయ, అజయ్‌ ఘోష్‌, కోట జయరాం, జబర్దస్త్ రాంప్రసాద్‌ తదితరులు రచన &amp; దర్శకత్వం : పరుశురామ్‌ పెట్ల సంగీతం : గోపి సుందర్‌ ఛాయా గ్రహణం : కె.యు మోహనన్‌ ఎడిటింగ్‌ : మార్తండ్‌ కె. వెంకటేష్‌ నిర్మాతలు : దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ విడుదల తేదీ : ఏప్రిల్‌ 5, 2024 విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్‌ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star Review In Telugu). నేడు (ఏప్రిల్‌ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. గీతా గోవిందం హిట్‌ తర్వాత విజయ్‌తో డైరెక్టర్‌ పరశురామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ఆడియన్స్‌లో మంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? విజయ్‌కు మరో హిట్‌ను అందించిందా? వంటి అంశాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి గోవ‌ర్ధన్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. కుటుంబానికి దూరంగా వెళ్లడం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ప‌నిచేస్తుంటాడు. కుటుంబ బాధ్యతలను మోస్తూ అండగా ఉంటాడు. ఈ క్రమంలో అతడి జీవితంలోకి ఓ రోజు ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. ఇద్దరూ ప్రేమ‌లో ప‌డతారు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధన్ చేతికందుతుంది. ఆ పుస్తకం వల్ల ఇద్దరు విడిపోతారు. ఇంత‌కీ ఆ పుస్తకంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్రభావితం చేసింది? అస‌లు ఇందు ఎవ‌రు? గోవ‌ర్ధన్ తన కుటుంబ క‌ష్టాల నుంచి గట్టెక్కాడా లేదా? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే నటుడు విజయ్‌ దేవరకొండ (Family Star Review In Telugu) ఎప్పటిలాగానే తన మార్క్ యాటిట్యూడ్‌తో ఈ మూవీలోనూ అదరగొట్టాడు. మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి పాత్రలో జీవించాడు. యాక్షన్, కామెడీ, ఎమోషనల్‌ సన్నివేశాల్లో తన మార్క్‌ చూపించి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేశాడు. ముఖ్యంగా డ్యాన్స్ పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యాడు.&nbsp; యాక్షన్ సన్నివేశాలు పరిమితంగానే ఉన్నా... తనదైన స్టైల్‌లో మెప్పించాడు. విజయ్- మృణాల్ మధ్య వచ్చే సీన్లు.. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే కనిపించింది. తన నటనతో పాటు అందం, అభినయంతో ఈ బ్యూటీ ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్‌ - మృణాల్‌ మధ్య కెమెస్ట్రీ&nbsp; వీరి మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అవుతుంది. ఇక వాసుకి, రోహిణి అభినయ, అజయ్‌ ఘోష్‌, కోట జయరాం, జబర్దస్త్ రాంప్రసాద్‌ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? డైరెక్టర్ పరుశురామ్‌.. ఫ్యామిలీ స్టార్‌ ద్వారా మరోమారు తన దర్శకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. టైటిల్‌కు తగ్గట్లు పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించారు. ఫస్టాఫ్‌ ఫ్యామిలి సెంటిమెంట్, కమర్షియల్ అంశాలతో నింపేసిన దర్శకుడు.. సెకండాఫ్‌ మాత్రం లవ్ ట్రాక్, కామెడీ, ఎమోషనల్ అంశాలు మేళవించి ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ముఖ్యంగా విజయ్- మృణాల్ ఠాకూర్ మధ్య వచ్చే ఇగో తాలుకు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. కుటుంబం కోసం మిడిల్‌ క్లాస్‌ వారు ఏ విధంగా ఆలోచిస్తారన్న విషయాన్ని చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు పరుశురామ్. అయితే ఇదే ఫ్లోను సెకండాఫ్‌లో ఇంకాస్త కొనసాగిస్తే బాగుండేది. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ సీన్‌లో విజయ్- మృణాల్ మధ్య వచ్చే భావోద్వేగపూరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. &nbsp; రొటిన్‌ కథను ఎంచుకోవడం, డైలాగ్స్‌లో పెద్దగా మెరుపులు లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. &nbsp; ఓవరాల్‌గా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Family Star Review In Telugu).. విజయ్‌-పరుశురామ్‌ కాంబోలో గతంలో వచ్చిన ‘గీతా గోవిందం’ మూవీకి మ్యూజిక్‌ బాగా ప్లస్‌ అయ్యింది. అయితే&nbsp; ఈ సినిమాలోనూ ఉన్న అన్ని పాటలు కూడా బాగున్నాయి. ఇంట్రోసాంగ్, కళ్యాణి వచ్చా వచ్చా, నందా నందన సాంగ్స్ ఫీల్‌ గుడ్‌గా ఉంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఇక సినిమాటోగ్రాఫర్‌ అద్భుత పనితీరు కనబరిచాడు. సినిమా మెుత్తాన్ని కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దిల్‌రాజు ఎక్కడ రాజీపడినట్లు కనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ విజయ్‌ - మృణాల్‌ కెమెస్ట్రీఎమోషనల్‌ సీన్స్‌కామెడీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ కథసాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5 https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vijay-devarkonda.html
    ఏప్రిల్ 08 , 2024
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.&nbsp; టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి&nbsp; ఓసారి చూద్దాం. అడవి శేషు(Adivi Sesh) ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు.&nbsp; 'కర్మ' అనే సినిమాతో&nbsp; డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.&nbsp; విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు.&nbsp; మరో నాలుగేళ్ల తర్వాత&nbsp; దాస్‌ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్‌ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) 'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు.&nbsp;అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్‌ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఆర్‌ నారాయణ మూర్తి(R. Narayana Murthy) విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ &amp;సూపర్ స్టార్ కృష్ణ లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే&nbsp; అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే&nbsp; డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
    ఏప్రిల్ 01 , 2024
    <strong>Jr NTR New Project: మైండ్‌బ్లోయింగ్‌ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తారక్‌.. మరో ఊచకోతకు సిద్ధం కండి!</strong>
    Jr NTR New Project: మైండ్‌బ్లోయింగ్‌ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తారక్‌.. మరో ఊచకోతకు సిద్ధం కండి!
    తారక్‌ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ (Devara) బాక్సాఫీస్‌ వద్ద సాలిడ్‌ విజయాన్ని అందుకుంది.&nbsp;వారం వ్యవధిలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం దిగ్విజయంగా థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ మూవీ సక్సెస్ తర్వాత తారక్ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ చిత్రం చేస్తున్న జూ.ఎన్టీఆర్‌ త్వరలోనే డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ‘NTR 31’ పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీపై అందరి దృష్టి ఉంది. అయితే లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం తారక్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్‌ డైరెక్టర్‌తో ఆ మూవీ ఉండనున్నట్లు చర్చించుకుంటున్నారు.&nbsp; ‘జైలర్‌’ డైరెక్టర్‌తో పాన్‌ ఇండియా చిత్రం! మ్యాన్ ఆఫ్‌ మాసెస్‌ జూ.ఎన్టీఆర్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. డాక్టర్‌, బీస్ట్ , జైలర్ వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ స్టార్ డైరెక్టర్‌ నెల్సన్ దిలీప్ కుమార్‌తో తారక్‌ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇప్పటికే తారక్‌కు నెల్సన్‌ కథ చెప్పారని అతి అతడికి బాగా నచ్చిందని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో దీనిని తెరెకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీస్ట్‌, జైలర్‌ హిట్స్‌తో నెల్సన్‌ పేరు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగింది. ముఖ్యంగా జైలర్‌తో రజినీకాంత్‌ను చూపించి తీరు అందరిని మెప్పించింది. అటువంటి డైరెక్టర్‌తో తారక్‌కు సినిమా పడితే రికార్డులు గల్లంతేనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.&nbsp; 2026 వరకూ ఆగాల్సిందే! తారక్ - నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చినా ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం తారక్‌ 'వార్‌ 2' (War 2) పెండింగ్‌ షూటింగ్‌తో పాటు త్వరలో 'NTR 31'ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అటు నెల్సన్‌ సైతం ‘జైలర్‌ 2’ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. రజనీకాంత్‌ కూలీ సినిమా షూటింగ్ పూర్తికాగానే ‘జైలర్‌ 2’ షూటింగ్‌ మెుదలు కానుంది. ఇద్దరూ బిజీ షెడ్యూల్స్‌తో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌ పైకి వెళ్లేందుకు మరింత సమయం పట్టవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2026లో ఈ సినిమా పట్టాలెక్క వచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో మూవీ చేయడం తనకు ఓకే అంటూ ఓపెన్‌గా ఇటీవల తారక్‌ ఆఫర్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో కూడా ఓ మూవీ ఉండే అవకాశం లేకపోలేదు.&nbsp; మా స్ట్రెంత్‌ అతడే: తారక్‌ 'దేవర' బ్లాక్‌ బాస్టర్‌ నేపథ్యంలో శుక్రవారం చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తారక్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. కల్యాణ్‌ రామ్‌ బావమరిది (భార్య సోదరుడు) హరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘హరి ముందుకు ఎప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు. చాలా మంది అతన్ని సరిగా అర్ధం చేసుకోరు. ఎందుకంటే అతను ముందుకు వచ్చి తన గురించి చెప్పుకోడు. ఎవరేమి అన్నా, ఎవరేమి అనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌కి మూల స్థంభం హరి. నాకు, కళ్యాణ్ అన్నకి మా ఇద్దరికీ స్ట్రెంత్ హరి. ఇందులో ఎటువంటి డోకా ఉండదు. నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు. నచ్చని వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు’ అని తారక్ అన్నారు. బంగ్లాదేశ్‌ రైతుగా జూ.ఎన్టీఆర్‌! తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ బజ్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్‌ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని ఫిల్మ్‌ వర్గాల సమాచారం.&nbsp; హీరోయిన్‌ ఫిక్సయ్యిందా? దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్‌-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్‌ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.&nbsp;&nbsp;
    అక్టోబర్ 05 , 2024
    <strong>EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే?&nbsp;</strong>
    EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే?&nbsp;
    సాధారణంగా ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి డైరెక్టర్లు ఎమోషనల్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటారు. కథకు సెంటిమెంట్‌, భావోద్వేగ సన్నివేశాలను జోడించడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుంటారు. అయితే ఆ ఎమోషనల్‌ సీన్సే కొన్నిసార్లు మిస్‌ ఫైర్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. వాస్తవానికి దూరంగా ఉండటం వల్ల అటువంటి సన్నివేశాలు ఎక్కువగా ట్రోల్స్‌కు గురవుతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. సినిమా రిలీజ్‌ తర్వాత వాటిపై విపరీతంగా మీమ్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; [toc] సరైనోడు (Sarrainodu) అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ చిత్రం అప్పట్లో బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అయితే ఇందులోని ఓ సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. ఆ ఏమోషనల్‌ సీన్‌ చూస్తే నవ్వు వచ్చిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను రౌడీలు వెంటాడుతారు. నాలుగు రోజుల నుండి తాను పరిగెడుతూనే ఉన్నానంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. ఇందులో లాజిక్ ఎక్కడ ఉందంటూ ఆడియన్స్ ప్రశ్నించారు.&nbsp; https://youtu.be/BTG1U_-sl-o?si=8SMhJezyIsBEMKG- వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ జరిగాయి. ఇందులో చరణ్‌ ట్రైన్‌పై నిలబడి బీహార్‌ వెళ్లే సీన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలోని ‘తందానే తందానే’ పాటలో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశంపైనా నెటిజన్లు ట్రోల్స్‌ చేశారు. పాట మధ్యలో హీరో అన్న ప్రశాంత్‌కు భోజనం సమయంలో పొలమారుతుంది. అయితే భార్య స్నేహా నీళ్లు ఇవ్వడానికి బదులు అతడ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇదేమి లాజిక్ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.&nbsp; https://youtu.be/GKrpi9NX6LY?si=78kGcH01QiUR6oej అరవింద సమేత (Aravinda Sametha) తారక్, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా తర్వాతే పూజా హెగ్డేపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఇందులో ఓ సీన్‌లో విలన్‌ మనుషులు పూజా హెగ్డేతో పాటు ఆమె సోదరుడ్ని కిడ్నాప్‌ చేస్తారు. అప్పుడు తారక్‌కు పూజా సీక్రెట్‌గా కాల్‌ చేస్తుంది. అప్పుడు తారక్‌ నిన్ను విలన్లు చంపేయచ్చు అనగానే ఆమె ఏడుస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌పై నెట్టింట తెగ ట్రోల్స్ వచ్చాయి. ఈ సీన్‌లో ఆమెను చూసి నవ్వు ఆగలేదని చాలా మంది ఆడియన్స్‌ పోస్టు చేశారు.&nbsp; https://youtu.be/uOTclNEcCAE?si=VaLMevP8Ir2yaLA1 మెుగుడు (Mogudu)&nbsp; కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్‌, తాప్సీ జంటగా చేసిన చిత్రం ‘మెుగుడు’. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ హైలెట్‌గా ఉంటుంది. అదే సమయంలో ఈ ఏమోషనల్‌ సీన్‌ గందరగోళంగా ఉందంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇందులో హీరో హీరోయిన్లకు పెళ్లి జరుగుతుంది. అప్పగింతల సమయంలో ఓ విషయం దగ్గర హీరోయిన్‌ తల్లి రోజా.. హీరో తరుపు బంధువు చెంప పగలగొడుతుంది. ఆ గొడవ పెద్దదై రోజా, హీరో తండ్రి రాజేంద్ర ప్రసాద్‌, గోపిచంద్‌, తాప్సీ ఒకరినొకరు చేయిచేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ విడాకులకు అప్లై చేస్తారు. అయితే ఈ సీన్‌ మరీ నాటకీయంగా ఉందని చాలా మంది విమర్శించారు. తమకు కామెడీ సీన్‌లాగా అనిపించదని అప్పట్లో పోస్టులు పెట్టారు.&nbsp; https://youtu.be/tSph1y0x9BA?si=PQvdooUFVQPxvKpX అత్తారింటికి దారేది (Attarintiki Daredi) పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్‌ సీన్‌ను చాలా ఏమోషనల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. తన చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయిన అత్తపై తమ కుటుంబానికి ఎంత ప్రేమ ఉందో పవన్‌ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కంట నీరు పెడుతూ ఆయన చెప్పే డైలాగ్స్‌ చాలా మందికి రుచించలేదు. పవన్‌ ఏడుస్తూ డైలాగ్స్‌ చెబుతుంటే తమకు విపరీతంగా నవ్వు వచ్చిందని కొందరు కామెంట్స్ చేశారు. పవన్‌ ఏడుపుకు సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో వైరల్‌ చేశారు.&nbsp; https://youtu.be/HsV7k8m0QU0?si=B2YwpApzSRLAHGDO శ్రీమంతుడు (Srimanthudu) మహేష్‌, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం టాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో హీరో తన తండ్రి పుట్టిన ఊరికి వచ్చి అభివృద్ధి చేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామస్తుడు తమ కష్టాలను తీర్చాలని మరిన్ని సమస్యలు మహేష్‌తో చెప్పుకోబోతాడు. అప్పుడు సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌.. అతడ్ని అడ్డుకుంటాడు. అలిసిన బతుకులు కదా ఏదో ఆశగా కనిపించే సరికి అడిగేశాడు అని అంటాడు. ఈ ఏమోషనల్‌ సీన్‌పై కొన్ని సోషల్‌ మీడియా పేజ్‌లు విపరీతంగా మీమ్స్‌ చేశాయి. ఇప్పటికీ ఆ సీన్‌కు సంబంధించిన మీమ్‌ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది.&nbsp; https://youtu.be/V_52TOrTqKI?si=xJkICf7HF-JiFikn హ్యాపీ (Happy) అల్లు అర్జున్‌, జెనీలియా జంటగా చేసిన హ్యాపీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో బన్నీ చాలా ఏమోషనల్‌ అవుతాడు. పోలీసు స్టేషన్‌లో గుండెలు బాదుకుంటూ లాకప్‌లో ఉన్న హీరోయిన్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. వారి ప్రేమ గొప్పతనం గుర్తించిన పోలీసు ఆఫీసర్‌ ఆమెను విడిపెడతాడు. అయితే ఈ సీన్‌లో బన్నీ నటన చూసి అతడి యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. బన్నీని ఈ సెంటిమెంట్‌ సీన్‌లో అసలు చూడలేకపోయామని, పైగా నవ్వు వచ్చిందని కామెంట్స్‌ చేశారు.&nbsp; https://youtu.be/H3h5fkT5wG4?si=sufvXBa7KErXPRM7 మిర్చి (Mirchi) ప్రభాస్, కొరటాల కాంబోలో వచ్చిన ఈ సినిమాలో హీరో విలన్‌ ఇంటికి వెళ్లి వారిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో విలన్ ఇంటి పెద్ద నాగినీడు ఊరి ప్రజలు అతడ్ని ఎంతగా గౌరవిస్తున్నారో తెలియజేస్తారు. దీంతో చదువుకు ఎందుకు అని పంపేసిన అమ్మాయిని స్కూల్‌లో జాయిన్‌ చేయించడానికి హీరోతో కలిసి నాగినీడు వెళ్తాడు. ఆ యువతి ఇంటి ముందు కారు ఆపి రా బండెక్కు అని పిలుస్తాడు. ఈ సీన్‌పై కూడా అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి. మీమర్స్‌ దీనిని తమకు అనుకూలంగా నెటిజన్లకు నవ్వు తెప్పించేలా వాడుకున్నారు. ఆ తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌తో జరిగే సంభాషణపై కూడా పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. https://youtu.be/8hbZeVdLOKU?si=njdIZGjrVoE55Iv1
    అక్టోబర్ 22 , 2024
    <strong>Tollywood New Directors: టాలీవుడ్‌లో కొత్త డైరెక్టర్ల హవా.. తొలి చిత్రంతోనే బ్లాక్‌ బాస్టర్ విజయాలు!</strong>
    Tollywood New Directors: టాలీవుడ్‌లో కొత్త డైరెక్టర్ల హవా.. తొలి చిత్రంతోనే బ్లాక్‌ బాస్టర్ విజయాలు!
    టాలీవుడ్‌లో కొత్త శకం మెుదలైంది. వినూత్న ఆలోచనలు కలిగిన దర్శకులు కొత్త కథలతో వచ్చి బ్లాక్ బాస్టర్‌ విజయాలను అందుకుంటున్నారు. పూరి జగన్నాథ్‌, హరీష్‌ శంకర్‌, శ్రీను వైట్ల, రామ్‌ గోపాల్‌ వర్మ, వి.వి. వినాయక్‌, తేజ, గుణశేఖర్‌ వంటి స్టార్‌ డైరెక్టర్లు హిట్స్‌ లేక ఇబ్బంది పడుతుంటే కుర్ర దర్శకులు మాత్రం ఫస్ట్ సినిమాతోనే అలవోకగా బ్లాక్‌ బాస్టర్‌ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఫ్రెష్‌ కథలు, వైవిధ్యమైన మేకింగ్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధిస్తున్నారు. ఇంతకీ ఆ యంగ్‌ డైరెక్టర్స్ ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; అంజి కె. మణికుమార్‌ ఎన్టీఆర్‌ బామ మరిది నార్నే నితిన్‌ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ చిత్రం 'ఆయ్‌' (Aay). అంజి కె. మణిపుత్ర (Anji K. Maniputhra) ఈ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయం అయ్యారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘తంగలాన్‌ ’వంటి పెద్ద హీరోల సినిమాలను తట్టుకొని నిలబడింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. గోదావరి నేపథ్యంలో తనదైన మేకింగ్‌ స్టైల్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించి ప్రసంసలు అందుకున్నారు. అమలాపురం నేపథ్యం, చిన్న నాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, పట్టింపులు, ఆప్యాయతలు, వెటకారం ఇలా అన్నింటిని మేళవిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది.&nbsp; యదువంశీ మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.17.76 కోట్లు (GROSS) వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతోనే యదువంశీ (Yadu Vamsi) దర్శకుడిగా పరిచయమయ్యారు. ఓ గ్రామం నేపథ్యంలో కుర్రాళ్లతో సాగిన ఈ కథను అతడు అద్భుతంగా తెరకెక్కించారు. కామెడీతో పాటు 1990ల జ్ఞాపకాలను గుర్తుచేయడం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లె వాతావరణాన్ని ఆకట్టుకునేలా చూపించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు.&nbsp; ముఖేశ్‌ ప్రజాపతి అంజలి వేశ్యగా నటించిన లేటెస్ట్ వెబ్‌ సిరీస్‌ 'బహిష్కరణ'. ఈ సిరీస్‌ ద్వారా దర్శకుడిగా ముఖేశ్‌ ప్రజాపతి (Mukesh Prajapati) డెబ్యూ ఇచ్చాడు. ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకొని మంచి వ్యూస్‌ సాధించింది. ఇందులో కుల వివక్షను కళ్లకు కట్టాడు దర్శకుడు. ఊరి పెద్ద అయిన వ్యక్తి అణగారిన వారి పట్ల ఎలా వ్యవహించేవారు? మహిళలను ఎలా హింసించేవారు? అన్నది ఈ సిరీస్‌లో చూపించారు. వేశ్య కోణంలో ముకేశ్‌ ప్రజాపతి తెరకెక్కించిన ఈ రివేంజ్‌ డ్రామా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. శౌర్యువ్‌ నాని రీసెంట్‌ చిత్రం 'హాయ్‌ నాన్న'తో శౌర్యువ్‌ (Shouryuu) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక టిపికల్ సబ్జెక్ట్‌ను తీసుకొని అతడు అందంగా ప్రజెంట్‌ చేసిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని అతడు చక్కగా చూపించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. తొలి చిత్రంతోనే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా అతడు ఇంపాక్ట్‌ చూపించాడు. 'హాయ్ నాన్న' చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సైతం సాధించింది.&nbsp; కల్యాణ్‌ శంకర్‌ ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్‌ యూత్ ఎంటర్‌టైనర్‌ చిత్రాల్లో 'మ్యాడ్‌' ఒకటి. దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ (Kalyan Sankar) తన తొలి ప్రయత్నంతోనే సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగా తనకు మంచి భవిష్యత్‌ ఉందని కల్యాణ్‌ శంకర్‌ తొలి చిత్రంతోనే చాటి చెప్పాడు. కాలేజీ కుర్రాళ్ల నేపథ్యంలో ఆకట్టుకునే ఫన్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రంలోనే కామెడీ సీన్స్‌, డైలాగ్స్‌ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.&nbsp; కార్తిక్‌ దండు ‘విరూపాక్ష’ చిత్రంతో కార్తిక్‌ దండు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఒక డిఫరెంట్ హారర్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. కార్తిక్‌ దండు సినిమాను నడిపిన విధానంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. శ్రీకాంత్ ఓదెల నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్‌లో ఉందని నాని కితాబిచ్చాడు. వేణు యెల్దండి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్‌లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. హీరో నానితో అతడు సినిమా తీసే అవకాశముంది.&nbsp; ప్రశాంత్ వర్మ అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారారు. 2024 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ మహేష్‌, వెంకటేష్‌, నాగార్జున వంటి స్టార్ హీరోల చిత్రాలను వెనక్కి నెట్టి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; గౌతమ్ తిన్ననూరి నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’తో గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు నాని నటనపై ప్రశంసల వర్షం కురిసింది. గౌతమ్ డైరెక్షన్‌కీ ఆ స్థాయిలోనే గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. ప్రస్తుతం అతడు విజయ్ దేవరకొండతో ‘VD12’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తోంది.&nbsp; బుచ్చిబాబు సానా తొలి చిత్రం ‘ఉప్పెన’తో డైరెక్టర్ బుచ్చిబాబు సానా అందరి దృష్టిని ఆకర్షించారు. డిఫరెంట్‌ లవ్‌స్టోరీతో ప్రశంసలు అందుకున్నాడు. తన తర్వాతి చిత్రాన్ని రామ్‌ చరణ్‌తో అనౌన్స్‌ చేసి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ సినిమాలో చరణ్‌ సరసన జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేయనుంది. స్పోర్ట్స్‌ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్‌గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నటుడిగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ఇటీవల ‘కీడా కోలా’ అనే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కించారు.&nbsp;
    ఆగస్టు 27 , 2024
    Allu vs Mega Families: మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌? చిరు బర్త్‌డే విషెస్‌లోనూ కానరాని ఎఫెక్షన్‌!
    Allu vs Mega Families: మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌? చిరు బర్త్‌డే విషెస్‌లోనూ కానరాని ఎఫెక్షన్‌!
    పాలు, నీళ్లలా కలిసి ఉండే అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌కు వ్యతిరేకంగా వైకాపా అభ్యర్థికి బన్నీ మద్దతు తెలపడం, ఓటు వేయాలని ప్రచారం కూడా చేయడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అప్పటి నుంచి సోషల్‌ మీడియా వేదికగా అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్‌ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పవన్‌ కల్యాణ్‌ పరోక్షంగా ‘పుష్ప’ సినిమాపై విమర్శలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ తాజాగా చేసిన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. సోషల్‌ మీడియాలో మరోమారు ఫ్యాన్ వార్‌కు కారణమయ్యాయి. దీంతో అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న వివాదం మరోమారు బట్టబయలైందన్న ప్రచారమూ ఊపందుకుంది. ఈ దెబ్బతో రెండు కుటుంబాల మధ్య ఉన్న రిలేషన్‌ కటీఫేనా అన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.&nbsp; ‘నా మనసుకు నచ్చితే వస్తా’ రావు రమేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం' ప్రిరీలిజ్‌ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు డైరెక్టర్ సుకుమార్‌ కూడా ఈ వేడుకలో సందడి చేశారు. సుకుమార్‌ భార్య తబిత సమర్పణలో వస్తోన్న సినిమా కావడంతో వారిద్దరూ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్‌కు చురకలు అంటించారు. ‘మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం సినిమాని సుకుమార్‌ భార్య తబిత ప్రెజెంట్‌ చేస్తున్నారు. మేం పుష్ప 2 క్లైమాక్స్‌ షూట్‌లో ఉండగా ఆమె వచ్చి సుకుమార్‌, మిమ్మల్ని కాకుండా నేను నా సినిమా ఈవెంట్‌కు ఎవరిని పిలవగలను అని అన్నారు. ఇప్పటి వరకూ నేను నటించిన వాటిలో అతికష్టమైన క్లైమాక్స్‌ పుష్ప 2ది. అలాంటి పరిస్థితిలోనూ ఆమె ఆహ్వానించారని వచ్చా. ఇష్టమైన వారిపై మన ప్రేమ చూపించాలి. మనం నిలబడగలగాలి. నాకు ఇష్టమైతే నేనొస్తా. నా మనసుకు నచ్చితే వస్తా’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. వైకాపా అభ్యర్థి తరపున ప్రచారం చేసిన బన్నీ పవన్‌ కోసం కూడా చేయవచ్చు కదా అన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే బన్నీ ఈవిధంగా బదులిచ్చి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  https://twitter.com/i/status/1826302303244091491 ‘నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి’ ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన అభిమానులైన అల్లు అర్మీ గురించి బన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిని ఆకాశానికెత్తుతూ మాట్లాడారు. ‘మై డియర్‌ ఫ్యాన్స్‌. నా ఆర్మీ. ఐ లవ్‌ యూ. నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్‌ అవుతారు. నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరో అయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లవుతున్నా మీరు చూపే ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికీ రుణపడి ఉంటా. మరోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. తప్పకుండా ఎక్కువ సినిమాలు చేస్తా. తెరపై తరచూ కనిపిస్తా' అని అన్నారు. అయితే గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఫ్యాన్స్ గురించి బన్నీ ఎప్పుడు మాట్లాడలేదు. వైకాపా నేతకు మద్దతు తెలిపినప్పటి నుంచి బన్నీని జనసైనికులతో పాటు మెగా ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున టార్గెట్‌ చేస్తూ వచ్చారు. సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ చేశారు. ఆ సమయంలో అల్లు అర్మీ తమ హీరోకి మద్దతుగా నిలిచి గొప్పగా పోరాడింది. మెగా ఫ్యాన్స్ ఆరోపణలకు ఎక్కడికక్కడ చెక్‌ పెడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు తనదైన శైలిలో ఐ లవ్ యూ చెబుతూ బన్నీ కృతజ్ఞతలు చెప్పి ఉండొచ్చు. అయితే బన్నీ స్పీచ్‌లో గమనించాల్సిన అంశం ఇంకోటి కూడా ఉంది. ఆయన గతంలో ఎప్పుడు మెగా ఫ్యాన్స్‌, అల్లు ఆర్మీని సెపరేట్‌ చేసి మాట్లాడింది లేదు. కానీ ఈ సారి అల్లు అర్మీ అంటూ బన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో మెగా ఫ్యాన్స్‌లో చీలికలను బన్నీ ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  చిరుకి సింపుల్‌ విషెస్‌..! నేడు (ఆగస్టు 22) మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్‌ హీరోగా నిలిచిన తమ హీరోకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ కూడా మెగాస్టార్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. అయితే తనకు లైఫ్‌ ఇచ్చిన చిరంజీవికి సింపుల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై మెగా అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ 'మన మెగాస్టార్‌ చిరంజీవి గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ద డే' అంటూ బన్నీ పోస్టు పెట్టాడు. అయితే గతంలో బన్నీ ఈ విధంగా ట్వీట్ ఎప్పుడు పెట్టలేదు. చిరు బర్త్‌డే అంటే ఎంతో హడావిడి చేసే బన్నీ ఇలా సింపుల్‌గా విషెస్‌ చెప్పి చేతులు దులిపేసుకోవడం వెనకు ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదమే కారణమై ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.&nbsp; https://twitter.com/alluarjun/status/1826438293350711467 బన్నీకి పవన్‌ చురకలు! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఇటీవల కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని పవన్ కల్యాణ్‌ అన్నారు. అయితే ఇప్పటి సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలా పరిస్థితి మారిపోయిందంటూ పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్ టాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే పవన్ కల్యాణ్‌ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీనిపై జనసైనికులు, మెగా ఫ్యాన్స్‌ - అల్లు ఆర్మీ మధ్య పెద్ద ఫ్యాన్‌ వారే జరిగింది. 
    ఆగస్టు 22 , 2024
    Hanuman Roles: హునుమంతుడి పాత్రలో మెప్పించిన తెలుగు హీరోలు తెలుసా? 
    Hanuman Roles: హునుమంతుడి పాత్రలో మెప్పించిన తెలుగు హీరోలు తెలుసా? 
    రామాయణం కథాంశంలో ఎన్నో సినిమాలు సినీ ప్రేక్షకులను అలరించాయి. రాముడు, సీతా, లక్ష్మణుల పాత్రలో కనిపించి చాలా మంది నటులు మెప్పించారు. అయితే రామాయణంలో హనుమంతుడి పాత్ర ఏంతో కీలకమైంది. సీతను ఎత్తుకెళ్లిన రావణాసురుడి వద్దకు రామయ్యను తీసుకెళ్లడంలో ఆంజనేయుడు కీలకభూమిక పోషించాడు. అటువంటి ఆంజనేయ పాత్రను సినిమాల్లో అద్భుతంగా పండించిన నటులను ఇప్పుడు చూద్దాం.&nbsp; తేజ సజ్జ: యంగ్‌ హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్‌ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో తేజ ఆంజనేయుడు పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన&nbsp; టీజర్‌, ప్రచార చిత్రాలు హనుమాన్‌ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రశాంత్‌ వర్మ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మే 12న విడుదల కానుంది.&nbsp; https://youtu.be/AvjvZ7q2apE దేవ్‌దత్తా నాగే: అత్యంత భారీబడ్జెట్‌తో రూపొందుతున్న ఆదిపురుష్‌ చిత్రంలో రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తున్నాడు. ఇందులో ఆంజనేయుడి పాత్రలో దేవ్‌దత్తా నాగే నటిస్తున్నాడు. బాలీవుడ్‌లో సంఘర్ష్‌, సత్యమేవ జయతే, తానాజీ సినిమాల్లో దేవ్‌దత్తా నటించాడు. ఆయా సినిమాల్లో అద్బుతంగా చేయడంతో ఆదిపురుష్‌లో అత్యంత కీలకమైన హనుమాన్ పాత్ర దేవ్‌దత్తాకు దక్కింది.&nbsp; చిరంజీవి: జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఓ సీన్‌లో ఆంజనేయుడిగా కనిపిస్తాడు. చిరు ఆంజనేయుడి వేషంలో కనిపించడం అదే తొలిసారి. హనుమాన్‌గా చిరు సరిగ్గా సరిపోయారని అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఓ సందర్భంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడికి తనకు మధ్య ఉన్న పోలికలను చూపూతూ ట్వీట్లు కూడా మన మెగాస్టార్ చేశారు. https://twitter.com/KChiruTweets/status/1247698208077172736?s=20 https://twitter.com/KChiruTweets/status/1247705832940175360?s=20 https://twitter.com/KChiruTweets/status/1247713378988154881?s=20 https://twitter.com/KChiruTweets/status/1247713383069159424?s=20 https://youtu.be/BfJRVxeIKD8 అర్జున్‌: నితిన్‌ హీరోగా చేసిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో అర్జున్‌ హనుమాన్‌ పాత్రను పోషించాడు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎంతటి కఠినమైన రోల్‌ అయినా అలవోకగా చేయగలనని అర్జున్‌ ఈ సినిమా ద్వారా నిరూపించారు. రాజేంద్ర ప్రసాద్‌: నటుడు రాజేంద్ర ప్రసాద్‌ కూడా దేవుళ్లు సినిమాలో ఆంజనేయుడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. అయితే ఆంజనేయుడి మేకప్‌లో కనిపించనప్పటికీ మారువేషంలో ఉన్న హనుమాన్‌గా ఆయన కనిపిస్తారు. రాజేంద్ర ప్రసాద్ చుట్టూ పాడే ‘అందరి బంధువయా’ పాట చాలా ఫేమస్‌ అయ్యింది.&nbsp; విందు దర సింగ్‌: సినిమాల్లో ఆంజనేయుడు పాత్ర అంటే ముందుగా గుర్తుకువచ్చేది ‘విందు దర సింగ్‌’. రామాయణం కథాంశంతో తెరకెక్కిన చాలా సినిమాల్లో ఆయన హనుమాన్‌గా కనిపించారు. తెలుగు విడుదలైన శ్రీ రామదాసు చిత్రంలో కూడా హనుమంతుడి పాత్రలో కనిపించి విందు దర సింగ్ మెప్పించాడు.
    ఏప్రిల్ 04 , 2023
    <strong>Kasthuri Controversy: తెలుగు వారు లేకుండా తమిళుల ఉనికి ఉందా? చరిత్ర ఏం చెబుతోంది?</strong>
    Kasthuri Controversy: తెలుగు వారు లేకుండా తమిళుల ఉనికి ఉందా? చరిత్ర ఏం చెబుతోంది?
    ‘భారతీయుడు’ సహా పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన తమిళ నటి కస్తూరి (Kasthuri Shankar)&nbsp; తాజాగా తెలుగువారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలుగు మాట్లాడే ప్రజల్ని బానిసలతో పోలుస్తూ కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేశారు. చరిత్రలో ఏం జరిగిందో వివరిస్తూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమె చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సైతం చర్చనీయాంశంగా మారాయి. అయితే నటి కస్తూరికి చరిత్ర తెలిసి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. తమిళ నేలపై తెలుగు రాజులు, నేతలు, వ్యక్తులు ఎంతటి ఘనత సాధించారో తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేది.&nbsp; అసలేం జరిగిందంటే? తమిళ నటి కస్తూరి చేసిన తాజా కామెంట్స్‌ తెలుగు రాష్ట్రాల్లో తీవ్రదుమారం రేపాయి. భాజాపాలో చేరిన ఆమె చెన్నైలోని గురుమూర్తి నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. డీఎంకే (DMK), కరుణానిధి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. 300 ఏళ్ల క్రితం ఓ రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారని అన్నారు. రాణులకు సేవలు చేయడానికి ఇక్కడికి వచ్చిన తెలుగువారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదు అని చెప్పడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. ఇతరుల భార్యలపై కన్నేయవద్దని బ్రాహ్మణులు చెబుతున్నందుకే ద్రవిడ (Dravida) వాదులు వాళ్లని వ్యతిరేకిస్తున్నారని, అందుకే సనాతన ధర్మాన్ని (Sanathana Dharmam) డీఎంకే వ్యతిరేకిస్తోందన్నారు. తెలుగు మాట్లాడితే చాలు తమిళనాడు కేబినెట్‌లో మంత్రులు అవుతున్నారని, డీఎంకే ప్రభుత్వంలో ఐదుగురు తెలుగు మంత్రులు ఉన్నారని వ్యాఖ్యానించారు. తమిళ చరిత్రపై ప్రభావం తమిళనాడును పరిపాలించిన ప్రముఖ రాజవంశాల్లో చోళులు ఒకరు. వారిలో కుళోత్తంగ చోళుడు తెలుగువాడు. అతడి తండ్రి రాజ రాజ నరేంద్రుడు వేంగి చాళుక్య రాజు. ఈయన ఏపీలోని కృష్ణ- గోదావరి మధ్య ప్రాంతాన్ని పాలించాడు. కుళుత్తోంగ చోళుడి&nbsp; తల్లి అమ్మాంగైదేవి చోళ రాజ్యపు యువరాణి.&nbsp; ఆమె తండ్రి మరణం తర్వాత చోళ రాజ్యంలో అస్థిరత నెలకొంటుంది. దీంతో కులుత్తోంగ చోళుడు తన తాతా సామ్రాజ్యాన్ని కాపాడి చక్రవర్తిగా అక్కడే కొనసాగుతాడు. ఆ తర్వాత ఆయన వారసులు కూడా తమిళనాడుని దిగ్విజయంగా ఏలారు. (క్రీ.శ. 1061-1118) మధ్య చాళుక్యుల చక్రవర్తిగా కులోత్తుంగుడు వ్యవహరించారు. అయితే అతడి కుమారుడు విక్రమ చోళుడు.. చోళ రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. తెలుగు వారైన చాళుక్యుల రక్తం విక్రమ చోళుడిలో ఉంది. దీన్ని బట్టి గొప్ప తమిళ రాజ్యంగా చెప్పుకుంటున్న చోళ సామ్రాజ్యాన్ని ఓ తెలుగు వ్యక్తి పరిపాలించాడని చరిత్రకారులు చెబుతుంటారు. ఆ ప్రకారం చూసుకుంటే తమిళ చరిత్రపైనా మనవారి ముద్ర స్పష్టంగా ఉందని చెప్పవచ్చు.&nbsp; Image credit: Wikimedia Commons తెలుగు రాజు పేరు మీద ‘చెన్నై’ తమిళనాడు రాజధానిగా ఉన్న చెన్నైకి ఆ పేరు ఓ తెలుగు వ్యక్తి ద్వారా వచ్చింది. ఆంధ్ర పద్మనాయక ప్రభువైన వెంకటపతి నాయకుని కుమారుడైన దామెర్ల చెన్నప్ప నాయకుడు క్రీ.శ. 1639లో ఈ పట్టణాన్ని పాలించాడు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటిషర్లు ఆ ప్రాంతాన్ని స్థావరంగా చేసుకొని మద్రాసు పట్టణంగా మార్చారు. కాలక్రమణా ఆ పట్టణం మద్రాసుగా మారింది. కానీ స్థానికులు మాత్రం చెన్న పట్టణం లేదా చెన్నపురి అని పిలవడానికే ఇష్టపడేవారు. స్థానికుల కోరిక మేరకు స్వాతంత్రం అనంతరం 1996 ఆగస్టులో మద్రాసు పేరును చెన్నైగా మార్చారు.&nbsp; Image credit: Wikimedia Commons మద్రాసుపై తెలుగు వారి ప్రభావం ఒకప్పడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, మద్రాసు (ప్రస్తుత తమిళనాడు) రాష్ట్రం ఒక్కటిగా కలిసి ఉండేది. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష కారణంగా 1953 అక్టోబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. ఒకప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారే అన్ని రంగాల్లో కీలకపాత్రలు పోషించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు. 1925-29 మధ్య శ్రీకాళహస్తి జమీందారు పానగంటి రామారాయనం జస్టిస్ పార్టీ అధ్యక్షులుగా, మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారి హయాంలోనే ప్రస్తుత త్యాగరాయనగర్ రూపుదిద్దుకుంది. 1932-36 మధ్యకాలంలో బొబ్బిలి రాజు శ్రీ రామకృష్ణ రంగారావు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్య మంత్రిగా వ్యవహరించారు. రావు బహదూర్ కూర్మా వెంకట రెడ్డి మద్రాసు గవర్నర్‌గా పనిచేశారు. అంతేకాదు వీడిపోయే ముందువరకూ కూడా తెలుగు వ్యక్తి ప్రకాశం పంతులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి సీఎం చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన ముగ్గురు వ్యక్తులు తెలుగువారే. ఇలా రాజకీయాలతో పాటు విద్య, వైద్యం, న్యాయశాస్త్రం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేశారు. Image credit: Wikimedia Commons వందల్లో తెలుగు గ్రంధాలు విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు అంటే తెలియని తెలుగు వారు ఉండరేమో. అటువంటి దేవరాయలు తన ఆస్థానంలోని అష్టదిగ్గజాల సాక్షిగా రాసిన ‘ఆముక్తమాల్యద’ తాళపత్ర గ్రందం ఇప్పటికీ తమిళనాడులోని తంజావూరు గ్రంథాలయంలో భద్రంగా ఉంది. దానితో పాటు 778 తాళపత్ర గ్రంథాలు అక్కడి లైబ్రరీలో ఉన్నాయి. గణితం, వైజ్ఞానిక శాస్త్రం, గణితం, పురాణాలు ఇలా ఎన్నో ఉన్నాయి. దీన్నిబట్టి తెలుగు సంస్కృతి ప్రభావం తమిళనాడుపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పటి రాజుల సాంస్కృతిక కళా పోషణకు తమిళనాడు ప్రతీకగా నిలవడాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి.&nbsp;
    నవంబర్ 04 , 2024
    <strong>Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!&nbsp;</strong>
    Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!&nbsp;
    ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్‌కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్‌ రిలీజ్‌ అవుతుండటంతో కొన్ని మూవీస్‌ ఆటోమేటిక్‌గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా కూడా అవి అండర్‌ రేటెట్‌ ఫిల్మ్స్‌గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్‌ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్‌ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్‌? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; [toc] అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.&nbsp; కంచె (Kanche) వరణ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌ కంచె. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్‌ తేజ్‌).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్‌)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్‌తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya) నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు.&nbsp; మలయాళంలో విజ‌య‌వంత‌మైన‌ ‘మహేశ్‌ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ. పలాస 1978 (Palasa 1978) రక్షిత్‌ అట్లూరి హీరోగా కరుణ కుమార్‌ డైరెక్షన్‌ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్‌ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్‌రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; మను (Manu) బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్‌ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌గా చేసిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్‌ ఫండింగ్‌ రూపంలో నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు.&nbsp; కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్‌) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్‌గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్‌లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ. వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ. చక్రవ్యూహం: ది ట్రాప్‌ (Chakravyuham: The Trap) అజయ్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్‌ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్‌) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్‌ (సుదీష్‌)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.&nbsp; మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్‌, అమృత శ్రీనివాసన్‌ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్‌ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్‌ఫ్యూజన్‌తో ఉండే హీరో లైఫ్‌లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్‌ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.&nbsp; రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. క్షణం (Kshanam) అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్‌ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్‌ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
    అక్టోబర్ 22 , 2024
    True Lover Movie Review: ప్రేమికులకు అద్దం పట్టే అందమైన చిత్రం.. ఎలా ఉందంటే?
    True Lover Movie Review: ప్రేమికులకు అద్దం పట్టే అందమైన చిత్రం.. ఎలా ఉందంటే?
    నటీనటులు: మణికందన్, శ్రీ గౌరీ ప్రియ, కన్నా రవి తదితరులు.. దర్శకుడు : ప్రభురామ్ వ్యాస్ సంగీతం: సీన్ రోల్డన్ సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ ఎడిటింగ్: భరత్ విక్రమన్ నిర్మాతలు: నజెరత్ పసిలియన్, మగేష్ రాజ్ పాసిలియన్, యువరాజ్ గణేశన్ విడుదల తేదీ : ఫిబ్రవరి 10, 2024 మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి (This Week OTT Releases) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ట్రూ లవర్’ (True Lover). ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకత్వం వహించారు. తమిళంలో ఈ చిత్రం ‘లవర్‌’ పేరుతో విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇవాళ ట్రూ లవర్‌ పేరుతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తమిళంలో లాగే ఇక్కడ కూడా విజయాన్ని అందుకుందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ అరుణ్ (మణికందన్), దివ్య (గౌరి ప్రియ) (True Lover Movie Review In Telugu) కాలేజీ రోజుల నుంచి లవర్స్‌. దివ్య ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేస్తుండగా.. అరుణ్‌ ఒక కాఫీ షాపు పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో తాగుడుకు అలవాటై జీవితాన్ని టైం పాస్‌ చేస్తుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో వీరిద్దరి మధ్య గొడవలు మెుదలవుతాయి. తోటి ఉద్యోగస్తులతో దివ్య క్లోజ్‌గా ఉండటాన్ని అరుణ్‌ సహించలేక పోతాడు. ఆ తర్వాత ఏమైంది? అరుణ్‌ - దివ్య కలిశారా? విడిపోయారా? కాఫీ కేఫ్‌ పెట్టాలన్న హీరో కల నెరవేరిందా? లేదా? అన్నది మిగిలిన కథ.&nbsp; ఎవరెలా చేశారంటే నటీనటుల విషయానికి వస్తే.. మణికందన్‌ (True Lover Movie Review In Telugu) మంచి నటన కనబరిచాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో మంచి హావా భావాలను పలికించాడు. సగటు ప్రేమికుడ్ని తలపించేలా చక్కటి నటన కనబరిచాడు. అతడి కామెడీ టైమింగ్‌ కూడా ఆకట్టుకుంటుంది. ఇక దివ్య పాత్రలో గౌరి ప్రియ జీవించింది. తెరపై వీరిద్దరి కెమెస్ట్రీ మెప్పిస్తుంది. ఇక కన్నా రవితో పాటు మిగిలిన ప్రధాన పాత్రదారులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే ఈ జనరేషన్‌ ప్రేమలను కథాంశంగా తీసుకొని డైరెక్టర్‌ ప్రభురామ్ వ్యాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. చిన్న చిన్న అపార్థాలు, అపోహలతో లవర్స్‌ ఎలా గొడవపడతారు? మళ్లీ అంతలోనే ఎలా కలుస్తారు? అన్న కోణంలో కథను రాసుకున్న తీరు మెప్పిస్తుంది. వాస్తవ పరిస్థితులను, కుర్రాళ్ల భావోద్వేగాలను డైరెక్టర్ సినిమాలో చక్కగా ప్రెజెంట్‌ చేశారు. అయితే కథ బాగున్నప్పటికీ కథనం మాత్రం కొన్ని చోట్ల చాలా సింపుల్‌గా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే ఆసక్తిగా అనిపించదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని సీన్లు రెగ్యూలర్‌గా అనిపిస్తాయి. కొన్ని ఓవర్‌ డ్రామా సీన్లు సినిమాకు మైనస్‌గా మారాయి. మెుత్తంగా వ్యాస్‌ డైరెక్షన్‌ బాగున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే (True Lover Movie Review In Telugu).. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సీన్ రోల్డన్ అందించిన పాటలు బాగున్నాయి. కొన్ని సీన్లలో వచ్చే నేపథ్యం సంగీతం మెప్పిస్తుంది. ఎడిటర్ భరత్ విక్రమన్ తన కత్తెరకు మరింత పని పెట్టి ఉంటే బాగుండేది.&nbsp; ఇక శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. . నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్‌ కథా నేపథ్యంమణికందన్‌, గౌరీ ప్రియ నటనయువతకు నచ్చే కొన్ని సీన్లు మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్లుసెకండాఫ్‌ స్క్రీన్‌ ప్లే Telugu.yousay.tv Rating : 3/5
    ఫిబ్రవరి 10 , 2024
    Pedda Kapu 1 Review: డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల గ్రేట్ కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!
    Pedda Kapu 1 Review: డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల గ్రేట్ కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!
    నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ, శ్రీకాంత్ అడ్డాల, రావు రమేష్‌, నాగ బాబు, రాజీవ్‌ కనకాల, ఈశ్వరి రావు, ఆడుకలం నరేన్‌ డైరెక్టర్‌: శ్రీకాంత్ అడ్దాల సంగీతం: మిక్కీ జే. మేయర్‌ సినిమాటోగ్రఫీ: ఛోటా కే. నాయుడు నిర్మాత: మిర్యాల రమేష్‌, మిర్యాల సత్యనారాయణ క్లాస్‌ దర్శకుడిగా పేరొందిన శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) తెరకెక్కించిన పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పెదకాపు 1’ (Peda Kapu 1). టైటిల్‌ని బట్టి చాలామంది ఈ సినిమా ఓ సామాజిక వర్గం నేపథ్యంలో రూపొందిందని అనుకుంటున్నారు. కానీ, ఇది క్యాస్ట్‌కు సంబంధించి కాదు ఓ సామాన్యుడి సంతకం అని దర్శకుడు స్పష్టం చేశారు. నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి కుటుంబ సభ్యుడు విరాట్‌ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ సినిమాతో శ్రీకాంత్‌ అడ్డాల తన పంథా మార్చడం ఓ విశేషమైతే ఇందులో నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలో ఆయన నటించడం మరో విశేషం. అయితే ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్‌ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి రివ్యూ మీకోసం. కథ: 1980లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భం అది. లంక గ్రామాన్ని సత్యరంగయ్య (రావు రమేష్), బయన్న (నరేన్) అనే ఇద్దరు వ్యక్తులు శాసిస్తుంటారు. హింసని ప్రేరేపిస్తూ తమ అధికారం కోసం మిగతా జనాల్ని బలిపశువులుగా మారుస్తుంటారు. పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటారు. అనుకోని పరిస్థితిలో సత్యరంగయ్య తరపున పెదకాపు అన్న జైలుకి వెళ్ళాల్సివస్తుంది. అలా జైలుకి వెళ్ళిన పెదకాపు అన్న కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే 1983 సంవత్సరంలో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తాడు. బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం సరైన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఆవేశంతోపాటు ఆలోచన ఉన్న పెద్దకాపు (విరాట్ కర్ణ) తెలుగుదేశం జెండాను గ్రామంలోని నడిబొడ్డున పాతి సత్య రంగయ్య, బయన్నకు సవాల్ విసురుతాడు. పెదకాపు.. వారిని ఎలా ఎదిరించాడు? లంక గ్రామాల్లో అల్లర్లు చేలరగడానికి కారణం ఏమిటి? ఈ కథలో కన్నబాబు ( శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ (అనసూయ), పార్టీ ఇంచార్జ్ (నాగబాబు) పాత్రల స్వభావం ఏమిటి?&nbsp; తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎలా సాగిందంటే? ఫస్టాఫ్‌లోని ప్రథమ భాగమంతా గోదావరి జిల్లాలో కులాల కొట్లాటల చుట్టే తిరుగుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో బడుగు, బలహీన వర్గాల తరపున హీరో టీడీపీ జెండాను పాతే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఆ సీన్‌ కథలోని ఇంటెన్సిటీ ఏమిటో చెబుతుంది. ఇక సత్య రంగయ్య, బయన్న అరాచకాలు, వాటి మధ్య నలిగే గ్రామీణ ప్రజలు, పెద్దకాపు నేతగా ఎదిగే తీరును ఫస్టాఫ్‌లో డైరెక్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతల అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. సత్య రంగయ్య హఠాన్మరణం, పెద్దకాపు అన్నయ్య కిడ్నాప్, పెద్దకాపు కాబోయే వదిన హత్య, అనసూయ ఎంట్రీ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథలో ఎమోషన్స్, యాక్షన్ దట్టించిన విధానం సినిమాలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసేందుకు దోహదపడ్డాయి. అనసూయ పాత్ర సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఎవరేలా చేశారంటే పెదకాపు పాత్ర చేసిన విరాట్‌ కర్ణకు ఇదే తొలి సినిమా అయినప్పటికీ నటుడిగా తనకు మంచి భవిష్యత్‌ ఉందని ‌అతడు నిరూపించుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌లో బాగా నటించాడు. చాలా సహజంగా కనిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఎమోషన్ సీన్స్‌, భారీ డైలాగులు చెప్పేటప్పుడు మాత్రం కాస్త తడబడినట్లు కనిపించింది. హీరోయిన్‌ ప్రగతి పాత్రకు యాక్టింగ్‌ స్కోప్‌ లేకపోవడంతో తెరపై ఆమె కంట్రీబ్యూషన్‌ తక్కువే. ఇక సినిమాకు అనసూయ నటనే హైలెట్‌ అని చెప్పవచ్చు. అక్కమ్మ పాత్రలో ఆమె ఇరగదీసింది. అయితే రంగమ్మత్తలా ఓన్ చేసుకునే పాత్ర ఐతే కాదు. సత్యరంగయ్య పాత్రలో రావు రమేష్‌ అదరగొట్టాడు. బయన్న పాత్రలో నరేన్ కూడా మంచి నటన కనబరిచారు. కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్దాల నిజంగానే సర్ప్రైజ్ చేశారు. తనికెళ్ల భరణి, నాగబాబు, రాజీవ్‌ కనకాల ఎప్పటిలాగే తమ నటనతో మెప్పించారు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సి ఛోటా కె. నాయుడు కెమెరా పనితనం. ఆయన తన నైపుణ్యంతో సినిమాకు కలర్‌ఫుల్‌ రంగులు అద్దారు. నిజంగా కొత్త గోదావరిని చూపించారు. జెండాపాతే సన్నివేశం, గౌరీ ఉరి సన్నివేశం, జాతర పాటని చిత్రీకరించిన తీరు చాలా బావుంది. మిక్కీ జె. మేయర్‌ పాటలు సినిమాకి కలిసిరాలేదు. నేపథ్య సంగీతం మాత్రం బావుంది. మాటలు, పాటలతో కథ చెప్పే శ్రీకాంత్‌ అడ్డాల ఆ విషయంలో కాస్త గతి తప్పినట్లు కనిపించింది. ఒకట్రెండు మినహా సినిమాలో గుర్తుండిపోయే డైలాగులు పెద్దగా కనిపించవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నాణ్యత విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు ఎక్కడా కనిపించదు.  ప్లస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ ప్లేవిరాట్‌, అనసూయ నటననేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్పాటలు రేటింగ్‌ : 3/5
    సెప్టెంబర్ 29 , 2023
    Devi Sri Prasad Hits: DSP టాప్‌-10 బెస్ట్‌ సాంగ్స్.. ఈ పాటలు వింటే మైమరిచిపోవాల్సిందే..!
    Devi Sri Prasad Hits: DSP టాప్‌-10 బెస్ట్‌ సాంగ్స్.. ఈ పాటలు వింటే మైమరిచిపోవాల్సిందే..!
    టాలీవుడ్ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్‌ ఒకరు. 1999లో విడుదలైన దేవి చిత్రంతో దేవిశ్రీ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా పాటలు సూపర్‌హిట్‌ కావడంతో దేవిశ్రీ కెరీర్‌కు తిరుగులేకుండా పోయింది. దేవి సినిమా నుంచి రీసెంట్‌ వాల్తేరు వీరయ్య వరకు డీఎస్పీ ఎన్నో సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ అందించారు. హీరోకు తగ్గట్లు మ్యూజిక్ అందించే దేవి.. మాస్‌, క్లాస్, మెలోడి, ట్రెడిషనల్‌ సాంగ్స్‌లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ఇచ్చిన టాప్‌-10 సూపర్ హిట్ సాంగ్స్‌ మీకోసం.. 1. పూనకాలు లోడింగ్ మెగాస్టార్‌ చిరంజీవి లేటెస్ట్‌ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. ఇందులో అన్ని పాటలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అయితే ‘పూనకాలు లోడింగ్‌’ పాట మాత్రం ప్రేక్షకులను ఉర్రూతలూగించిందనే చెప్పాలి. దేవిశ్రీ సంగీతానికి తోడు చిరు, రవితేజ డ్యాన్స్‌ నిజంగానే థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించింది.&nbsp; https://www.youtube.com/watch?v=4JMpHGMYm1w 2. శ్రీవల్లి సుకుమార్‌ డైరెక్షన్‌లో అల్లుఅర్జున్‌ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించింది. సినిమా విజయానికి దేవిశ్రీ ఇచ్చిన పాటలు సైతం ఎంతో దోహదపడ్డాయి. ముఖ్యంగా ‘శ్రీవల్లి’ పాట అప్పట్లో మార్మోగింది. పందిళ్లు, శుభకార్యాలు, వేడుకలు ఇలా ఏ కార్యక్రమమైన శ్రీవల్లి పాట వినిపించాల్సిందే. ఈ పాట ద్వారా సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌కు మంచి పేరు వచ్చింది.&nbsp; https://www.youtube.com/watch?v=txHO7PLGE3o 3. బుల్లెట్‌ సాంగ్ రామ్‌ పోతినేని, కృతి శెెట్టి జంటగా నటించిన ‘వారియర్‌’ సినిమాలో ‘బుల్లెట్‌ సాంగ్’ బాగా హిట్ అయింది. సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఈ పాట మాత్రం మ్యూజిక్‌ లవర్స్‌కు బాగా దగ్గరైంది.&nbsp;దేవిశ్రీ ప్రసాద్ మాస్‌ బీట్‌కు రామ్‌, కృతి డ్యాన్స్‌ తోడవడంతో ఈ సాంగ్‌ ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=WgrLE4Fqxeo 4. జల జల జలపాతం నువ్వు చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ఉప్పెన. ఈ సినిమా ఎంత విజయం సాధించిందో దేవిశ్రీ ఇచ్చిన పాటలు కూాడా అంతే ఆదరణ పొందాయి. ముఖ్యంగా ‘జల జల జలపాతం’ నువ్వు అనే పాట యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయింది.&nbsp; https://www.youtube.com/watch?v=PTpimuHzlvE 5. ఎంత సక్కగున్నావే రామ్‌చరణ్‌లోని గొప్ప నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ‘రంగస్థలం’. ఇందులో చెర్రీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేగాక దేవిశ్రీ ఇచ్చిన పాటల్లో చరణ్‌ తనదైన స్టెప్పులతో అదరగొట్టాడు. ముఖ్యంగా ‘ఎంత సక్కగున్నావే’ పాట అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో సమంత హోయలు, రామ్‌చరణ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ పాటకు మరింత హైప్‌ తీసుకొచ్చింది.&nbsp; https://www.youtube.com/watch?v=NuWs_eKu_ic 6. ప్రేమ వెన్నెల చిరు మేనల్లుడు సాయిధరమ్‌ కెరీర్‌లో మంచి వసూళ్లను రాబట్టిన సినిమా చిత్ర లహరి. ఇందులో తేజ్ నటనతో పాటు దేవిశ్రీ సంగీతానికి ప్రేక్షుకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా ‘ప్రేమ వెన్నెల’ పాట సినిమాకే హైలెట్‌ అని చెప్పాలి. లవ్‌ మెలోడీగా రూపొందిన ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. తేజ్‌ కెరీర్‌లోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మెలోడి సాంగ్‌గా నిలించింది.&nbsp; https://www.youtube.com/watch?v=tpvNtKjlf5E 7. మైండ్‌ బ్లాక్‌ మహేశ్‌ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. దేవి శ్రీ అందించిన సంగీతం ఈ సినిమాకా బాగా ప్లస్‌ అయింది. ముఖ్యంగా ‘మైండ్‌ బ్లాక్‌’ పాటపై చాలా మంచి హైప్ వచ్చింది. దేవి శ్రీ ఇచ్చిన హై ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌కు మహేశ్‌, రష్మి హై వోల్టెజ్‌ పర్‌ఫార్మెన్స్‌ తోడవడంతో సాంగ్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; https://www.youtube.com/watch?v=ZBDSNy4Yn9Q 8. సీటీ మార్‌ అల్లుఅర్జున్‌ హీరోగా హరీశ్ శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన దువ్వాడ జగన్నాథం చిత్రానికి దేవిశ్రీనే సంగీతం ఇచ్చారు. ఇందులోని అన్ని పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ముఖ్యంగా ‘సీటీమార్‌’ పాట అప్పట్లో ఎంతో క్రేజ్‌ తెచ్చుకుంది. దేవిశ్రీ ఎనర్జీటిక్ మ్యూజిక్‌కు అల్లు అర్జున్‌ క్లాస్‌ స్పెప్పులు జతకావడంతో పాట రేంజ్‌ పెరిగిపోయింది.&nbsp; https://www.youtube.com/watch?v=F5X694sak5U 9. నువ్వొస్తానంటే నేనొద్దంటానా ప్రభాస్‌ హీరోగా చేసిన వర్షం సినిమాకు దేవిశ్రీ ఫీల్‌గుడ్‌ సాంగ్స్‌ను అందించారు. ముఖ్యంగా హీరోయిన్ త్రిష వర్షంలో డ్యాన్స్‌ చేసే పాట ఎప్పటికీ దేవిశ్రీ టాప్‌ సాంగ్స్‌లో ఒకటిగా ఉంటుంది.‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అంటూ సాగే ఈ పాట హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. https://www.youtube.com/watch?v=eUrC0jWdu-M 10. నువ్వుంటే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన అన్ని సినిమాాల్లో కెల్లా కెరీర్‌ స్టార్టింగ్‌లో చేసిన ఆర్య చిత్రం ఎంతో ప్రత్యేకమైంది. ఈ సినిమాలోని అన్ని సాంగ్స్‌ ఇప్పటికీ సూపర్‌హిట్‌గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ‘నువ్వుంటే’ పాటను ఇప్పటికీ గుర్తుచేసుకొని వినేవాళ్లు చాలా మందే ఉన్నారు. ప్రేమ గొప్పతనాన్ని వర్ణిస్తూ సాగే ఈ పాటలో అల్లుఅర్జున్‌ నటన ఆకట్టుకుంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=Llw7cXHmDDo
    ఏప్రిల్ 04 , 2023
    <strong>RC16: ఇస్రో శాస్త్రవేత్తల బాటలో డైరెక్టర్‌ బుచ్చిబాబు.. వర్కౌట్ అయితే చరణ్‌ను ఎవరూ ఆపలేరు!</strong>
    RC16: ఇస్రో శాస్త్రవేత్తల బాటలో డైరెక్టర్‌ బుచ్చిబాబు.. వర్కౌట్ అయితే చరణ్‌ను ఎవరూ ఆపలేరు!
    ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సంక్రాంతికి రాబోతున్న రామ్‌చరణ్‌ (Ramcharan) ఈ సినిమా రిలీజ్‌కు ముందే డైరెక్టర్‌ బుచ్చిబాబు సనా (Buchi Babu Sana)తో ‘RC 16’ ప్రాజెక్టు చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మల్లయుద్దం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం రామ్‌చరణ్‌ మేకోవర్‌ అవుతున్నాడు. పాత్రకు తగ్గట్లు శరీరాన్ని మలుచుకుంటున్నాడు. మరోవైపు డైరెక్టర్‌ బుచ్చిబాబు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ముందు దైవానుగ్రహం కోసం దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మూవీ స్క్రిప్ట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా కర్ణాటక మైసూరులోని ఓ ఆలయంలో బుచ్చిబాబు ప్రత్యక్షమయ్యారు. ఇదంతా చూస్తుంటే బుచ్చిబాబు వైఖరి ఇస్రో సైంటిస్టులను తలపిస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సేమ్‌ టూ సేమ్‌.. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ఇప్పటివరకూ ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించింది. అయితే ప్రతీ ప్రయోగానికి ముందు ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు దైవ దర్శనానికి వెళ్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రయోగం సక్సెస్‌ అయ్యేలా చూడమని వేడుకుంటారు. అలాగే నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలోని చెంగాలమ్మ సన్నిధిలోనూ ఇస్రో ఛైర్మన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు బుచ్చిబాబు చేస్తోంది చూస్తే ఇస్రో శాస్త్రవేత్తలే గుర్తుకు వస్తున్నారు. బచ్చిబాబు కూడా షూటింగ్‌ ప్రారంభానికి ముందు వరుస పెట్టి దేవలయాలు చుట్టేస్తున్నారు. ఇటీవల రామ్‌చరణ్‌తో కలిసి కడప వెళ్లిన బుచ్చిబాబు అక్కడ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఎదుట ‘RC16’ స్క్రిప్ట్‌ పెట్టి ఆశీర్వచనం కోరారు. తాజాగా మైసూర్‌లోని ఛాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న డైరెక్టర్‌ ఎలాంటి అవరోధాలు లేకుండా సినిమా సక్సెస్‌ కావాలని ప్రార్థించారు. దీంతో ఇస్రో సైంటిస్టులతో బుచ్చిబాబును పోలుస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/SriLakshmi_10/status/1679348363546730496 https://twitter.com/i/status/1858591431201317066 ‘RC 16’ షూటింగ్‌ షురూ.. శుక్రవారం (నవంబర్‌ 22) ఉదయం మైసూర్‌లోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి బుచ్చిబాబు ఆలయ ప్రాంగణంలో మూవీ స్క్రిప్ట్‌ పట్టుకొని దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈ పోస్టుకు ఆసక్తిక వ్యాఖ్యలను సైతం జోడించారు. ఇది తమకు చాలా ముఖ్యమైన రోజని, ఎంతోకాలం ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసిందని పేర్కొన్నారు. చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఇది మెుదలైందంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టు బట్టి శుక్రవారం (నవంబర్‌ 22) నుంచే RC 16 రెగ్యులర్ షూట్‌ మెుదలైనట్లు తెలుస్తోంది. మైసూరులోనే ఏర్పాటు చేసిన సెట్‌లో మూడు రోజుల పాటు షూట్‌ జరగనున్నట్లు సమాచారం. ఇందులో హీరో లేని సీన్లను మాత్రమే షూట్‌ చేస్తారని తెలిసింది. వచ్చే వారం నుంచి రామ్‌చరణ్‌ షూటింగ్‌లో భాగమవుతారని సమాచారం.&nbsp; https://twitter.com/BuchiBabuSana/status/1859777297768681631 టీమ్‌లోకి జగ్గుభాయ్‌.. 'RC 16' ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. అయితే ప్రాజెక్ట్‌లో దిగ్గజ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) జాయిన్‌ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. షూట్‌లో జాయిన్ అయినట్లు తెలుపుతూ ఓ ఫొటోను షేర్‌ చేశారు. దీంతో జగ్గుభాయ్‌ ఈ మూవీలో ఏ పాత్రలో కనిపించబోతున్నాడనే ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఈ పోస్టుకు థ్యాంక్యూ కామండో అంటూ జగపతిబాబు రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నెగిటివ్‌ షేడ్‌లోనే జగపతిబాబు కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. తాజాగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాగా, రామ్‌చరణ్‌ - జగ్గుభాయ్‌ ప్రత్యర్థులుగా చేసిన 'రంగస్థలం' (Rangasthalam) చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.&nbsp; https://twitter.com/IamJagguBhai/status/1859820964600742352? ‘RC16’ స్టోరీ ఇదే! ‘RC16’ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో మలయుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఏపీకి చెందిన మల్ల యుద్ద వీరుడు కోడిరామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు తగ్గట్లు బలిష్టంగా కనిపించేలా చరణ్‌ మేకోవర్‌ అవుతున్నాడు. ఇందుకు తగ్గట్లుగా బాడీని బిల్డ్‌ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే గతంలో 'బీస్ట్‌ మోడ్‌ ఆన్‌' అంటూ ఓ ఫొటోను సైతం అభిమానులతో చరణ్‌ పంచుకున్నాడు. ‘గేమ్‌ ఛేంజర్‌’ లుక్‌తో పోలిస్తే చరణ్‌ బాడీతో పాటు, లాంగ్‌ హెయిర్‌, గడ్డం పెంచాడు. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తోంది. ఏ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలు అందించనున్నారు. కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
    నవంబర్ 22 , 2024

    @2021 KTree