• TFIDB EN
  • శ్రీమద్ విరాట పర్వం
    UTelugu2h 35m
    శ్రీమద్విరాట పర్వము నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వంలో రూపు దిద్దుకున్న కళాఖండం. రామారావుతో పాటు బాలకృష్ణ, వాణిశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ఎన్టీ రామారావు
    as Lord Krishna
    వాణిశ్రీ
    as Draupadi
    నందమూరి బాలకృష్ణ
    as Abhimanyu
    కైకాల సత్యనారాయణ
    as Bhima & Ghatotkacha (Dual role)
    ఎం. ప్రభాకర్ రెడ్డి
    as Dharma Raju
    ముక్కామల కృష్ణమూర్తి
    as Virata
    మిక్కిలినేని
    as Bhishma
    ధూళిపాళ
    as Shakuni
    as Drona
    మాడా వెంకటేశ్వరరావు
    as Uttara Kumara
    భవానీ
    as Uttara
    ప్రభ
    as Dharma Raju
    పుష్పలత
    as Sudeshna
    విజయ లలిత
    as Urvashi
    సిబ్బంది
    ఎన్టీ రామారావు
    దర్శకుడు
    ఎన్.టి.రామారావునిర్మాత
    సుసర్ల దక్షిణామూర్తి
    సంగీతకారుడు
    కథనాలు
    నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నందమూరి నటసింహంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బాలకృష్ణను అభిమానులు ముద్దుగా ఆయన్ను బాలయ్య అని పిలుస్తారు. క్యాన్సర్ పెషెంట్లకు ఉచిత వైద్య అందిస్తూ మనవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో అగ్ర హీరోల్లో ఒకరైన బాలకృష్ణ గురించి చాలా మందికి తెలియని కొన్న విషయాలు నందమూరి బాలకృష్ణ ఎవరు? బాలకృష్ణ దిగ్గజ నటుడు నందమూరి తారకరామారావు గారికి ఆరవ సంతానం. నందమూరి బాలకృష్ణ ఎత్తు ఎంత? 5 అడుగుల 9  అంగుళాలు నందమూరి బాలకృష్ణ ఎక్కడ పుట్టారు? చెన్నై నందమూరి బాలకృష్ణ పుట్టిన తేదీ ఎప్పుడు? 1960 జూన్ 10  నందమూరి బాలకృష్ణ భార్య పేరు? వసుంధర దేవి బాలకృష్ణపై ఉన్న వివాదం ఏమిటి? ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్‌పై కాల్పులు జరిపి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. నందమూరి బాలకృష్ణకు ఎంత మంది పిల్లలు?  ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి(బ్రాహ్మణి, మోక్షజజ్ఞ, తేజస్విని) నందమూరి బాలకృష్ణ అభిరుచులు? పుస్తకాలు చదవడం, కుకింగ్ NTR డైరెక్ట్ చేసిన ఎన్ని సినిమాల్లో బాలకృష్ణ నటించాడు? తత్తమ్మ కల, శ్రీమద్విరాటపర్వం, అన్నదమ్ముల, దాన వీర శూర కర్ణ బాలకృష్ణ అభిమాన నటుడు? నందమూరి తారక రామారావు బాలకృష్ణ అభిమాన హీరోయిన్? సావిత్రి బాలకృష్ణకు స్టార్ డం అందించిన సినిమాలు? మంగమ్మ గారి మనవడు, భార్గవ రాముడు, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్‌స్పెక్టర్, బంగారు బుల్లోడు, నరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, సింహ, లెజెండ్, అఖండ. బాలకృష్ణకు ఇష్టమైన కలర్? వైట్ బాలకృష్ణ ఏం చదివాడు? నిజాం కాలేజీలో డిగ్రీ బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 108 సినిమాల్లో నటించాడు బాలకృష్ణకు ఇష్టమైన ఆహారం? చికెన్ పలావు బాలకృష్ణ సినిమాకు ఎంత తీసుకుంటారు?  ఒక్కో సినిమాకి దాదాపు రూ.28కోట్లు తీసుకుంటున్నారు. బాలకృష్ణ 100వ సినిమా పేరు? గౌతమిపుత్ర శాతకర్ణి https://www.youtube.com/watch?v=1BqS3ZPsdGM బాలకృష్ణ MLAగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం? హిందూపురం బాలయ్య గెలుచుకున్న అవార్డులు? బాలయ్య  3 నంది అవార్డులు, 1 సినిమా అవార్డు, 3 సంతోష్ అవార్డులు, 3 TSR జాతీయ అవార్డులు, 1 సైమా అవార్డు, 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.
    మార్చి 19 , 2024
    Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
    Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
    తెలుగులో ఎంతో మంది నటులు శ్రీకృష్ణుడి వేషధారణలో నటించి తమదైన ముద్ర వేశారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారల్లో శ్రీకృష్ణావతారం ఎంతో ఉత్కృష్ణమైంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ద్వాపర యుగంలో శ్రీమహా విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆయన నోటి నుంచి వచ్చిన జ్ఞాన బోధే పంచవేదం భగవద్గీతగా విరాజిల్లుతోంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువుగా ప్రసిద్ధిచెందాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా వెండితెరపై శ్రీకృష్ణుడి పాత్రలో మెరిసిన నేటి తరం యువ కథనాయకులు, పాత తరం హీరోలపై YouSay Telugu ప్రత్యేక కథనం. జూ.ఎన్టీఆర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వచ్చిన ‘బృందావనం’ సినిమాలో కొద్దిసేపూ జూ. ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపించి అలరించాడు. ఈ సినిమాలో ‘చిన్నదో వైపు, పెద్దదో వైపు’  పాటలో తారక్ మోడ్రన్ కృష్ణుడి గెటప్‌లో వావ్ అనిపించాడు. అయితే రాముడిగా, యంగ్ యముడి పాత్రలో ప్రేక్షకులను అలరించిన  జూ.ఎన్టీఆర్‌ను.. కృష్ణుడిగా ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో చూడాలని ఆయన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. అయితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌ మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రలో జూ.ఎన్టీఆర్ నటించే అవకాశం ఉన్నట్లు వార్తలైతే ఉన్నాయి. https://www.youtube.com/watch?v=hzAaEN6yc1g మహేష్ బాబు సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఓ సినిమాలో శ్రీకృష్ణుడిగా అలరించాడు. ఆయన కేరీర్ ఆరంభంలో వచ్చిన ‘యువరాజు’ సినిమాలోని 'గుంతలకిడి గుంతలకిడి గుమ్మ' పాటలో శ్రీకృష్ణుడిగా కనువిందు చేశాడు. కృష్ణుడి వేషంలో మహేష్ బాగా సెట్ అయ్యాడని అప్పట్లో అభిమానులు తెగ సంతోషపడిపోయారు. https://youtu.be/b02ieSLiyRI?feature=shared పవన్ కళ్యాణ్ ఈ తరం హీరోల్లో కృష్ణుడి పాత్రలో అలరించిన మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా మెరిసాడు. సామన్య మానవుడి రూపు దాల్చిన  శ్రీకృష్ణ పరమాత్మ వేషంలో పవర్ స్టార్ కనిపించి కనువిందు చేశాడు. https://www.youtube.com/watch?v=HNeBe1JvBmU నాగార్జున మంచు విష్ణు హీరోగా వచ్చిన 'కృష్ణార్జున' మూవీలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. నాగార్జున సైతం మోడ్రన్ కృష్ణుడిగా... సామాన్యుడిలా కనిపించి అలరించాడు. సునీల్ విలక్షణ నటుడు సునీల్ తొలిసారి తేజా డైరెక్షన్‌లో వచ్చిన నువ్వు- నేను సినిమాలో కాసేపు చిలిపి కృష్ణుడిగా కనిపించి నవ్వులు పూయించాడు. ‘గాజువాక పిల్ల మేము గాజులోల్లం కాదా’ సాంగ్‌లో సునీల్ కృష్ణుడిగా మెరిసాడు. అలాగే అందాలరాముడులో కొంటె శ్రీకృష్ణుడిగా కాసేపు కనువిందు చేశాడు.. https://youtu.be/VhyejE23l4M?feature=shared రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ డ్యుయల్ రోల్‌లో మెప్పించిన ‘కన్నయ్య కిట్టయ్య’ సినిమాలో... నటకిరిటి శ్రీకృష్ణుడిగా, భక్తుడిగా రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. బాలకృష్ణ పౌరాణిక వేషాల్లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ఆహార్యం సంపాదించిన నటులు బాలకృష్ణ. శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు, ఎన్టీఆర్ చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడిగా నటించి ప్రేక్షకులను అలరించారు. https://youtu.be/wcJhLH_T6N0?feature=shared శోభన్ బాబు: వెండితెరపై శ్రీకృష్ణుడి వేషం వేసి మెప్పించిన నటుల్లో శోభన్ బాబు ఒకరు.  బాపు డైరెక్షన్‌లో వచ్చిన 'బుద్దిమంతుడు' చిత్రంలో కాసేపూ ఆయన కృష్ణుడి వేషంలో దర్శనమిచ్చారు. 'కురుక్షేత్రం' సినిమాలో పూర్తి నిడివిలో కృష్ణ భగవానుడిగా అలరించారు. https://youtu.be/Nf2ts_Cld-s?feature=shared కాంతరావు ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడి పాత్రలో మెప్పించిన నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన తొలిసారి మలయాళ చిత్రం భక్త కుచేల చిత్రంలో కృష్ణుడిగా కనిపించారు. ఆ తర్వాత పాండవ వనమాసం, నర్తనశాల, ప్రమీలార్జనీయం చిత్రాల్లో కృష్ణుడి వేషంలో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల మదిలో కృష్ణుడు, రాముడు అంటే గుర్తుకొచ్చే పేరు ఎన్టీఆర్. వెండితెరపై ఎంతమంది కృష్ణుడి వేషంలో కనిపించినా ఆయనకు సాటి రాలేదనేది చాలా మందివాదన. ఆయన రూపం, సంభాషణ చాతుర్యం ఇలాంటివన్నీ ఎన్టీఆర్‌ను వెండితెర కృష్ణుడిగా నిలబెట్టాయి. ఆయన సినిమాలు, ఇతర నాటకాల్లో కలిపి మొత్తం 33 సార్లు శ్రీకృష్ణుడిగా కనిపించారు. మాయాబజార్, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణతులాభారం, దానవీరశూరకర్ణ వంటి చిత్రాల్లో ఆయన కృష్ణుడిగా అలరించారు. శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ 18 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. https://www.youtube.com/watch?app=desktop&v=JlsXEmQIWNs
    సెప్టెంబర్ 06 , 2023
    <strong>Darling Movie Review: ప్రియదర్శిని ఓ ఆట ఆడుకున్న లేడీ అపరిచితురాలు.. మరి ‘డార్లింగ్‌’ మెప్పించిందా?</strong>
    Darling Movie Review: ప్రియదర్శిని ఓ ఆట ఆడుకున్న లేడీ అపరిచితురాలు.. మరి ‘డార్లింగ్‌’ మెప్పించిందా?
    న‌టీన‌టులు: ప్రియదర్శి, నభా నటేష్, బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్, అనన్య నాగళ్ల, ముర‌ళీధ‌ర్ గౌడ్‌ తదితరులు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అశ్విన్ రామ్‌ సంగీతం: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: నరేష్ రామదురై మాట‌లు: హేమంత్‌ నిర్మాత‌లు:&nbsp; కె.నిరంజ‌న్ రెడ్డి, చైత‌న్య రెడ్డి విడుద‌ల తేదీ: 19-07-2024 ప్రియదర్శి (Priyadarsi), నభా నటేష్ (Nabha Natesh) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్' (Darling Movie Review In Telugu). ఈ సినిమాకు అశ్విన్ రామ్ (Aswin Ram) దర్శకత్వం వహించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో జూలై 19న ‘డార్లింగ్‌’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హీరోగా ప్రియదర్శి ఆకట్టుకున్నాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి రాఘవ్‌ (ప్రియ దర్శి) చిన్నప్పటి నుంచి పెళ్లి, హనీమూన్‌ అంటూ కలలు కంటాడు. అందుకోసం కష్టపడి ఓ ట్రావెల్ ఏజెన్సీలో ఏజెంట్‌గా సెటిల్ అవుతాడు. తండ్రి (మురళీధర్‌ గౌడ్‌) చూసిన సైకాలజిస్ట్ నందిని (అనన్య నాగళ్ల)ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవ్వగా చివర క్షణంలో ఆమె ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతుంది. దీంతో రాఘవ సూసైడ్‌కు రెడీ అవుతాడు. ఆ సమయంలోనే రాఘవకు ఆనంది (నభా నటేష్‌) పరిచయమవుతుంది. చూసిన కొద్ది నిమిషాలకే నచ్చేయడం, ఆ విషయం ఆమెకు చెప్పడం, ఇద్దరూ పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోతాయి. అయితే ఆనందికి మల్టిపుల్‌ స్ప్లిట్‌ పర్సనాలిటీ ఉందని శోభనం రోజున రాఘవ్‌కు తెలుస్తుంది. దీని వల్ల రాఘవ్‌ ఎన్ని తిప్పలు పడ్డాడు? ఆనందిలో ఉన్న ఐదు పర్సనాలిటీస్‌ (ఆది, మాయ, ఝాన్సీ, పాప, శ్రీశ్రీ) ఎవరు? తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే. ఎవరెలా చేశారంటే రాఘ‌వ పాత్ర‌లో హాస్య నటుడు ప్రియ‌ద‌ర్శి మరోమారు ఆకట్టుకున్నాడు. ఆ పాత్రలో చ‌క్క‌గా ఒదిగిపోయారు. త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో&nbsp; ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. కథానాయిక నభా నటేష్‌ విభిన్నైన కోణాలున్న పాత్రలో అదరగొట్టింది. సినిమా మెుత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించింది. కెరీర్‌ బెస్ట్‌ నటనతో మెప్పించింది. స్ప్లిట్‌ పాత్ర‌ల్లోని వేరియేష‌న్స్‌ను త‌న‌దైన న‌ట‌న‌తో చ‌క్క‌గా చూపించింది. నభా నటేష్‌, ప్రియద‌ర్శి మ‌ధ్య వ‌చ్చే ఫ‌న్నీ సీన్స్ ఆకట్టుకుంటాయి, అయితే నభా నటేష్‌ పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ అంత‌గా కుద‌ర్లేద‌నిపిస్తుంది. అటు అన‌న్య నాగ‌ళ్ల‌, ముర‌ళీధ‌ర్ గౌడ్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి. సుహాస్‌, బ్ర‌హ్మానందం, నిహారిక కొణిదెల త‌దిత‌రులు అతిథి పాత్ర‌ల్లో త‌ళుక్కుమ‌న్నారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే మల్టిపుల్‌ స్ప్లిట్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ కాన్సెప్ట్‌ను దర్శకుడు అశ్విన్‌ రామ్‌ వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు. తొలి భాగం అంతా పెళ్లి కోసం హీరో పడే పాట్లు, పీటలపై పెళ్లి ఆగిపోవడం, ఆత్మహత్యకు యత్నించడం, ఆనందితో పరిచయం ఏర్పడటం, ఆపై వివాహం కూడా చేసుకోవడం అంతా చకచకా ఫన్నీ వేలో జరిగిపోతాయి. తొలి భాగంలో ఓవైపు నవ్విస్తూనే ఆడియన్స్ థ్రిల్‌ను సైతం పంచారు దర్శకుడు. అయితే సెకండాఫ్‌కు వచ్చే సరికి ఒక్కసారిగా స్టోరీ డల్‌ అయినట్లు అనిపిస్తుంది. పేలవమైన హీరోయిన్‌ గతం, కథంతా ఒకే దగ్గర తిరుగుతుంటం ప్రేక్షకులకు బోర్‌ కొట్టిస్తుంది. కీలకమైన క్లైమాక్స్ విషయంలోనూ డైరెక్టర్ బాగా కన్ఫ్యూజ్‌ చేసేశారు. ఓవరాల్‌గా సినిమాలో కొత్తదనం ఉన్నా ఆద్యంతం అలరించడంలో మాత్రం దర్శకుడు అశ్విన్‌ రామ్ తడబడ్డాడని చెప్పవచ్చు. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. విజువల్స్‌ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇక వివేక్‌ సాగర్‌ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని కల్పించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు వియషంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రియదర్శి, నభా నటేష్‌ నటనకామెడీసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సెకండాఫ్‌స్క్రీన్‌ప్లేసంగీతం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    జూలై 19 , 2024
    <strong>This Week Movies: ఈ వారం చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళ బ్లాక్‌బాస్టర్‌!</strong>
    This Week Movies: ఈ వారం చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళ బ్లాక్‌బాస్టర్‌!
    ఈ వారం (This Week Movies) చిన్న సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు డార్లింగ్‌ ప్రియదర్శి (Priyadarshi), నభా నటేష్ (Nabha Natesh) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. ఈ సినిమాకు అశ్విన్ రామ్ (Aswin Ram) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రామం రాఘవం కమెడియన్ ధనరాజ్ డైరెక్టర్‌గా మారి చేసిన ద్విభాషా చిత్రం 'రామం రాఘవం' (Ramam Raghavam). ఇందులో సముద్రఖని, ధన్‌రాజ్‌ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ చిత్రం జులై 19న తెలుగుతో పాటు తమిళంలోనూప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో ఈ సినిమాను ఆసక్తికరంగా రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.&nbsp; పేక మేడలు హీరోగా వినోద్‌ కిషన్‌ (Vinod Kishan), హీరోయిన్‌గా అనూష కృష్ణ (Anusha Krishna) నటిస్తున్న చిత్రం ‘పేకమేడలు’ (Peka Medalu). క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకులను పలకరించనుంది. అన్ని తరగతుల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత రాకేష్‌ వర్రే అన్నారు.&nbsp; క్రైమ్‌ రీల్‌ సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘క్రైమ్ రీల్’ (Crime Reel). పలు చిత్రాల్లో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించిన సంజన అన్నే ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. జూన్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సోషల్ మీడియా వల్ల యువత ఎలా చెడిపోతున్నారో ఇందులో చూపించాం. ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని డైరెక్టర్ సంజన అన్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మలయాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వ‌హించ‌గా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల‌కు పైగా వసూళ్లను రాబ‌ట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాష‌ల్లో ప్రసారం కానుంది.&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateWanda RuseSeriesEnglishNetflixJuly 15T・P BONSeriesJapaneseNetflixJuly 17The Green Glow Gang 2SeriesEnglishNetflixJuly 17Kobla Kay Season 6SeriesEnglishNetflixJuly 18Tribhuvan Mishra CA TopperSeriesHindiNetflixJuly 18Sweet Home S 3SeriesKorean/EnglishNetflixJuly 19Nagendran’s HoneymoonsSeriesTelugu DubHotstarJuly 18BahishkaranaSeriesTeluguZee 5July 19BarzakhSeriesHindiZee 5July 19HotspotMovieTelugu DubAhaJuly 17My Spy: The Eternal CityMovieEnglishAmazon&nbsp;July 18Betty Law FeeSeriesEnglish/ SpanishAmazon&nbsp;July 19
    జూలై 15 , 2024
    TIGER 3 Review in Telugu: సల్మాన్ ఖాన్ యాక్షన్‌తో అదరగొట్టాడు.. కానీ!
    TIGER 3 Review in Telugu: సల్మాన్ ఖాన్ యాక్షన్‌తో అదరగొట్టాడు.. కానీ!
    నటీనటులు: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, రేవతి,&nbsp; ఇమ్రాన్ హష్మీ,&nbsp; సిమ్రాన్, రద్ధీ డోంగ్రా,&nbsp; అనీష్ కురువిల్లా,&nbsp; కుముద్ మిశ్రా, మాస్టర్ విశాల్ జేత్వా, రణ్వీర్ షోరే. డైరెక్టర్: ఆదిత్య చోప్రా ప్రొడ్యూసర్: ఆదిత్య చోప్రా మ్యూజిక్: తనూజ్ టికు ఎడిటర్: రామేశ్వర్ S. భగత్ స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్ సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి విడుదల తేదీ: 12/11/2023 (దీపావళి రోజున) సల్మాన్‌ ఖాన్(TIGER 3 Review in Telugu) లెటెస్ట్ స్పై యాక్షన్ డ్రామా 'టైగర్ 3' దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఏక్‌థా టైగర్, టైగర్ జిందాహై సినిమాకు ఇది సీక్వెల్. మొదట వచ్చిన ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో టైగర్ 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, టీజర్‌లో సల్మాన్ మాస్ యాక్షన్, కత్రినా కైఫ్ బ్యూటీ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి టైగర్ 3 ఇంతకు ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథ:&nbsp; అవినాష్ అలియాస్ టైగర్(సల్మాన్ ఖాన్) భారత దేశం తరఫున 'రా' ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఆయన భార్య జోయా(కత్రినా కైఫ్) పాకిస్థాన్‌కు చెందిన మాజీ ISI ఏజెంట్. అయితే టైగర్ పాకిస్థాన్‌లో రా ఏజెంట్ గోపీ( రణ్వీర్ షోరే)ని ఉగ్రవాదుల నుంచి కాపాడుతాడు. అయితే గోపీ చనిపోయే ముందు జోయా గురించి ఓ నమ్మలేని నిజాన్ని చెబుతాడు. తన భార్య ఐస్ఐ ఏజెంట్ అని తెలుసుకున్న టైగర్ ఏం చేశాడు? అసలు జోయా తన భర్తను ఎందుకు మోసం చేసింది. భారత్- పాకిస్థాన్ ప్రభుత్వాలు వీరిద్దరి కోసం ఎందుకు వెతుకుతాయి అనేది మిగిలిన కథ ఎలా ఉందంటే? టైగర్ 3 సినిమా.. ఏక్‌ థా టైగర్, టైగర్ జిందా హై రేంజ్‌లో మాత్రం లేదు.&nbsp; భారీ యాక్షన్ విజువల్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. సినిమాలో శత్రుదేశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు 'భార్య భర్తలు' అయితే అనే పాయింట్ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్టుగా కథనం లేకపోవడం మైనస్ అని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మైనస్. ఎందుకంటే ఈ పార్ట్‌లో కథనం బలహీనంగా ఉంది. అయితే సెకండాఫ్‌లో(TIGER 3 Review in Telugu) వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ , క్లైమాక్స్ సీన్లు కొద్దిమేరకు మెప్పిస్తాయి. సులువుగా ప్రేక్షకుడు గెస్ చేసే స్క్రీప్ట్‌ను శ్రీధర్ రాఘవన్ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకాస్త దీనిపై వర్క్ చేస్తే బాగుండేది. స్పై సినిమాలు అంటే ఆద్యంతం ఉత్కంఠ, ప్రతి సీన్‌లో ట్విస్ట్‌ను ప్రేక్షకుడు ఊహిస్తాడు. కానీ టైగర్ 3 సినిమాలో అవేమి కనిపించలేదు. ప్రేక్షకున్ని సినిమాలో ఎంగేజ్ చేయకుండా కథ సాగిందని చెప్పవచ్చు. సినిమా చివర్లో సల్మాన్‌ ఖాన్‌ను రక్షించేందుకు షారుఖ్‌ ఖాన్ రావడం, క్లైమాక్స్ సీన్‌లో హృతిక్ ఎంట్రీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. ఎవరెలా చేశారంటే సల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ ఆర్మీ షో చేశాడు. టైగర్ పాత్రకు పూర్తి&nbsp; న్యాయం చేశాడు. తన పాత్రలో జీవించాడు. తన యాక్షన్ స్టైల్‌తో ఇరగదీశాడు. ఆయనపై వచ్చిన కొన్ని ఎలివేషన్‌ సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఎమోషనల్ సీన్లలోనూ సల్మాన్ అద్భుతంగా నటించాడు. ఇక సల్మాన్- కత్రినా జంట కూడా స్క్రీన్‌పై ఆకట్టుకుంది. కత్రినా కాస్త ఓల్డ్ లుక్‌లో కనిపించినప్పటికీ యాక్టింగ్ బాగా చేసింది. తన బోల్డ్ లుక్స్‌తో ప్రేక్షకులకు కనువిందు చేసింది. ముఖ్యంగా టవల్ ఫైట్ సీన్‌లో ఆమె అందం యువ ప్రేక్షకులను రంజింపజేస్తుంది. ఇక విలన్‌గా నటించిన ఇమ్రాన్ హష్మీ తన పాత్ర పరిధిమేరకు నటించాడు. రా చీఫ్‌గా రేవతి, పాక్ ప్రైమ్ మినిస్టర్‌గా సిమ్రాన్ మెప్పించింది. క్లైమాక్స్‌లో పఠాన్‌గా వచ్చిన షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ సీన్లు సినిమాకే హైలెట్. టెక్నికల్ పరంగా సాంకేతికంగా టైగర్ 3 సినిమా ఉన్నతంగా ఉంది. అనయ్ గోస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకే బాగా ప్లస్ అయింది. యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన పడిన కష్టం తెలుస్తుంది. ఇక తనూజ్ టీకు బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ అలరిస్తుంది. యాక్షన్ సీన్లను(TIGER 3 Review) ఎలివేట్ చేసిందని చెప్పవచ్చు. డైరెక్టర్ ఆదిత్య చోప్రా ఇంకా బలమైన కథ రాసుకున్నప్పటికీ... అందుకు తగిన సీన్లు, కథనం పెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఉత్కంఠ భరితంగా సాగాల్సి కథనాన్ని ప్రేక్షకుడు ఊహించే విధంగా సాగింది. బలాలు సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు,&nbsp;కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్షారుఖ్‌ ఖాన్‌ కెమియో రోల్ బలహీనతలు స్క్రీన్ ప్లేసహజత్వం లేని కొన్ని సీన్లుప్రేక్షకుడు ఊహించదగిన కథనం చివరగా: హై వోల్టేజ్ యాక్షన్ స్పై మూవీగా వచ్చిన టైగర్ 3లో.. సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు, కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్, షారుఖ్‌ ఎంట్రీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఈ సినిమా సల్మాన్ ఖాన్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇతర యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా సగటు ప్రేక్షకులకు సినిమా నచ్చకపోవచ్చు. రేటింగ్: 2.5/5
    నవంబర్ 12 , 2023
    Japan Movie Review: దొంగగా ‘కార్తీ’ నటన అదుర్స్‌.. మరి ‘జపాన్‌’ హిట్టా? ఫట్టా?
    Japan Movie Review: దొంగగా ‘కార్తీ’ నటన అదుర్స్‌.. మరి ‘జపాన్‌’ హిట్టా? ఫట్టా?
    నటీనటులు: కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, కెఎస్ రవికుమార్, విజయ్ మిల్టన్ తదితరులు&nbsp; దర్శకత్వం: రాజు మురుగన్ ఛాయాగ్రహణం: ఎస్. రవి వర్మన్ సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ నిర్మాతలు: S.R ప్రభు, S.R ప్రకాష్ బాబు విడుదల తేదీ: నవంబర్ 10, 2023&nbsp;&nbsp; టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న తమిళ నటుల్లో హీరో కార్తీ (Karthi) ఒకరు. స్టార్‌ హీరో సూర్య సోదరుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీ.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ నేపథ్యంలోనే కార్తీ నుంచి ఏ సినిమా వచ్చిన తెలుగులో భారీ అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కార్తీ కొత్త సినిమా ‘జపాన్‌’ (Japan) ఇవాళ (నవంబర్ 10) తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, ప్రమోషనల్‌ చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. మరి దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? కార్తీ చేసిన కొత్త ప్రయత్నం ఫలించిందా? ఇంతకీ సినిమా హిట్టా? ఫట్టా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు, ఆభరణాలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అందరూ అనుమానిస్తారు. శ్రీధర్ (సునీల్), భవాని (విజయ్ మిల్టన్) ఇద్దరి నేతృత్వంలోని రెండు బృందాలు జపాన్ కోసం వేట మొదలు పెడతాయి. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. దోచుకున్న డబ్బులతో సినిమాలు తీసిన జపాన్.. స్టార్ హీరోయిన్ సంజు (అనూ ఇమ్మాన్యుయేల్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో ఆమెను కలుసుకునేందుకు వెళ్లిన జపాన్‌ను పోలీసులు పట్టుకుంటారు. అయితే తాను దొంగతనం చేయలేదని చెప్పడంతో పోలీసులు అయోమయంలో పడతారు. జపాన్ కాకపోతే ఆ దొంగతనం చేసింది ఎవరు? ఈ కేసును పోలీసులు ఎలా పరిష్కరించారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే క్యారెక్టర్ కోసం కార్తీ పడిన కష్టం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా జపాన్ యాస పలకడం కోసం ఆయన శ్రమించారు. హెయిర్ స్టైల్, డ్రసింగ్ స్టైల్ ఛేంజ్ చేశారు. కార్తీ యాక్టింగ్ &amp; ఎఫర్ట్స్ వరకు ఎటువంటి లోపం లేదు. తన పాత్ర వరకు ఆయన న్యాయం చేశారు. హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్‌ యాక్టింగ్‌కు పెద్దగా స్కోప్ లేదు. గ్లామర్‌ సన్నివేశాలకు మాత్రమే ఆమె పరిమితమైంది. ఇక సునీల్‌ తన నటనతో సూపర్ అనిపించాడు. తన లుక్‌, గెటప్‌తోనే సగం మార్కులు కొట్టేశాడు. ఆయన కోసమే అన్నట్లు మధ్యలో కామెడీ సీన్లు కూడా ఉన్నాయి. భవాని పాత్రలో విజయ్ మిల్టన్ యాక్టింగ్ ఓకే. కెఎస్ రవికుమార్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? దర్శకుడు రాజు మురుగన్ ఓ దొంగ చుట్టూ అల్లుకొన్న సింగిల్ పాయింట్ స్టోరీని ఎమోషనల్‌గా మార్చడంలో విఫలమయ్యారు. జపాన్ క్యారెక్టర్‌పై పెట్టిన శ్రద్ద కథపై, స్క్రీన్ ప్లే, ఇతర క్యారెక్టర్లపై పెట్టలేదనే విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పేలవమైన సన్నివేశాలను, క్లారిటీ లేని క్యారెక్టర్లను సాగదీస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే కార్తీ కోసం రాసుకొన్న డైలాగ్స్, కొన్ని సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి.&nbsp; సాంకేతికంగా టెక్నికల్ అంశాల పరంగా చూసినా 'జపాన్' ఆకట్టుకోవడం కష్టం. సినిమాటోగ్రఫీలో డార్క్ థీమ్, లో లైట్ ప్యాట్రన్స్ ఫాలో అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో మళ్ళీ వినాలనిపించే పాటలు లేవు. నేపథ్య సంగీతం అంతంతమాత్రంగానే ఉంది. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ అనుకున్నవి ఏవీ వర్కవుట్ కాలేదు. తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ కార్తీ నటనకామెడీ సీన్స్‌ మైనస్ పాయింట్స్‌ సాగదీత సీన్లుసంగీతంసినిమాటోగ్రఫీ రేటింగ్‌: 2.5/5
    నవంబర్ 10 , 2023

    @2021 KTree