• TFIDB EN
  • స్టాలిన్
    UATelugu2h 56m
    స్టాలిన్ మాజీ ఆర్మి మేజర్. అవసరం ఉన్న వారికి సహాయం చేయాలనే మంచి ఆలోచన కలిగి ఉంటాడు. సాయం లభించని ఓ దివ్యాంగురాలు ఆత్మహత్య చేసుకోవడంతో స్టాలిన్‌ తీవ్ర మనోవేదనకు గురవుతాడు. దీంతో సమాజాన్ని మార్చేందుకు ఓ సాయం చేయాలని సూత్రాన్ని కనిపెడుతాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    చిరంజీవి
    మేజర్ స్టాలిన్
    త్రిష కృష్ణన్
    చిత్ర
    ప్రకాష్ రాజ్
    హోంమంత్రి ముద్దు కృష్ణయ్య
    శారద
    స్టాలిన్ తల్లి
    ఖుష్బు సుందర్
    ఝాన్సీ (స్టాలిన్ సోదరి)
    ప్రదీప్ రావత్
    ఎమ్మెల్యే
    బ్రహ్మానందం
    పూజారి
    ముఖేష్ రిషి
    లెఫ్టినెంట్ కల్నల్ ఇక్బాల్ కాకర్
    రియాజ్ ఖాన్
    ముద్దు కృష్ణయ్య కొడుకు
    రవళి
    ముద్దు కృష్ణయ్య కూతురు
    సునీల్
    స్టాలిన్ సోదరుడు
    శివా రెడ్డి
    స్టాలిన్ సోదరుడు శివారెడ్డి
    హర్ష వర్ధన్
    స్టాలిన్ సోదరుడు
    అన్నీ
    స్టాలిన్ స్నేహితుడు కుమార్తె
    హేమ
    చిత్ర తల్లి
    సుదీప పింకీ
    చిత్ర సోదరి
    బ్రహ్మాజీ
    కెప్టెన్ రావు
    సుమన్
    డాక్టర్
    ఢిల్లీ కుమార్
    ముఖ్యమంత్రి
    సుబ్బరాజు
    గూన్
    అమిత్ తివారీ
    గూన్
    మౌనిక
    లక్ష్మి
    ఎల్బీ శ్రీరామ్
    ఆటో డ్రైవర్
    గంగాధర్ పాండే డాక్టర్
    రవి ప్రకాష్
    సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
    మీనా కుమారిశిరీష
    సురేఖ వాణిపాప తల్లి
    సుప్రీత్
    మల్లి
    చత్రపతి శేఖర్
    వెంకాద్రి
    నర్సింగ్ యాదవ్
    అమర్‌పేట్ అబ్బులు
    పరుచూరి బ్రదర్స్
    ముద్దు కృష్ణయ్య సలహాదారు
    గోపీచంద్ మలినేని
    అనుష్క శెట్టి
    సిబ్బంది
    ఏఆర్ మురుగదాస్
    దర్శకుడు
    నాగేంద్ర బాబు
    నిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    ఛోటా కె. నాయుడు
    సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    Nayakudu 2023 Review: వడివేలు, ఉదయనిధి కెరీర్‌ బెస్ట్‌ నటన… నాయకుడు సినిమా ప్రేక్షకులను మెప్పించిందా?
    Nayakudu 2023 Review: వడివేలు, ఉదయనిధి కెరీర్‌ బెస్ట్‌ నటన… నాయకుడు సినిమా ప్రేక్షకులను మెప్పించిందా?
    నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు, లాల్ రచన, దర్శకత్వం : మారి సెల్వరాజ్ ఛాయాగ్రహణం : తేని ఈశ్వర్ ఎడిటర్ : ఆర్కే సెల్వ సంగీతం : ఏఆర్ రెహమాన్ నిర్మాత : ఉదయనిధి స్టాలిన్ దేశంలోని ప్రముఖ దర్శకుల జాబితాలో మారి సెల్వరాజ్‌ పేరు తప్పకుండా ఉంటుంది. తన సినిమాల ద్వారా ఆయన ప్రజా సమస్యలను టచ్‌ చేస్తుంటారు. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రతీ ఒక్కరిలోనూ అంచనాలు పెరిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లేముందు ఉదయనిధి స్టాలిన్ తన చివరి సినిమా అవకాశాన్ని మారి సెల్వరాజ్‌కు ఇచ్చారు. తమిళనాట ‘మామన్నన్’గా విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే పెద్ద సక్సెస్ అయింది. ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, వడివేలు, కీర్తి సురేష్ వంటి భారీ స్టార్ క్యాస్ట్ కూడా ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? కథ: రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. అతని తండ్రి తిమ్మరాజు (వడివేలు) రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే. లీల (కీర్తి సురేష్), రఘువీరా క్లాస్‌మేట్. కాలేజీ రోజుల నుంచి ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ కనీసం మాట్లాడుకోరు. కాలేజీ అయిపోయాక లీల ఉచిత వైద్యం కోసం ఇన్‌స్టిట్యూట్ స్థాపిస్తుంది. దీనికోసం రఘువీరా తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఇచ్చేస్తాడు. ఓ రోజు రత్నవేలు (ఫహాద్ ఫాజిల్) అన్న (సునీల్ రెడ్డి) మనుషులు ఇన్‌స్టిట్యూట్‌ దాడి చేసి బిల్డింగ్‌ను ధ్వంసం చేస్తారు. గొడవ పెద్దది కావడంతో సెటిల్ చేయడానికి రత్నవేలు దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇది కులాల మధ్య గొడవగా ఎలా మారింది? అనేది అసలు కథ. ఇది తెలియాలంటే థియేటర్స్‌కు వెళ్లాల్సిందే.  ఎవరెలా చేశారంటే ఈ సినిమాకు వడివేలు నటనే హైలెట్‌ అని చెప్పొచ్చు. ప్రథమార్థంలో అమాయకుడిగా, నిస్సహాయుడిగా, ద్వితీయార్థంలో కొడుకు కోసం ఎవరికైనా ఎదురించే ధైర్యవంతుడిగా వడివేలు నటన ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో కారులో ఫహాద్ ఫాజిల్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్‌లో, ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి కత్తి పట్టుకుని ఇంట్లో విలన్ కోసం ఎదురు చూసే సీన్‌లో ఆయన నటన గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక హీరో ఉదయనిధి స్టాలిన్‌ విషయానికొస్తే ఆయన కెరీర్‌లో ఇదే బెస్ట్‌ రోల్‌ అని చెప్పొచ్చు. ఎప్పటిలాగే ఉదయనిధి తన నటనతో ఆకట్టుకున్నాడు. అటు ఫహాద్‌ ఫాజిల్‌ కూడా అత్యుత్తమ నటన కనబరిచాడు. కీర్తి సురేష్‌ పాత్రకు నటనలో మంచి స్కోప్ ఉంది. లీల పాత్రలో ఆమె ఒదిగిపోయింది. మిగతా పాత్రదారులందరూ తమ పరిధి మేరకు నటించారు. ఎలా సాగిందంటే ప్రథమార్థం అంతా పాత్రలు, వాటి ఐడియాలజీల చుట్టూ తిరుగుతుంది. కీలకమైన అన్ని పాత్రల మధ్య ఫేస్ ఆఫ్‌కు రెడీ చేయడంతోనే ఫస్టాఫ్‌ అయిపోతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే ద్వితీయార్థం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. రాజకీయ పోరాటం, ఎత్తులకు పైఎత్తులు వేయడం ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచుతాయి. శాంతిని కోరుకునే వడివేలు పాత్ర ఆలోచించేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో బుద్ధుడి విగ్రహాన్ని చూపించడం వంటివి వీక్షకులకు ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. ఇక సినిమాకు డైలాగ్స్‌ ప్రధాన బలం అని చెప్పొచ్చు. టెక్నికల్‌గా మారి సెల్వరాజ్‌ ఈ సినిమాలోనూ తనదైన మార్క్‌ చూపించాడు.  హీరో, విలన్ ఇద్దరి పాత్రలనూ ఒకేసారి ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. పాత్రల పరిచయం వేగంగా చేసిన దర్శకుడు కొన్ని సీన్లను కూడా ట్రిమ్‌ చేసుంటే బాగుండేదని అనిపించింది. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ మధ్య వచ్చే  ఫ్లాష్ బ్యాక్ నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఇక సినిమాకు మరో బలం ఏఆర్ రెహమాన్ సంగీతం. ఆయన స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఎంతగానో దోహదం చేశాయి. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ ఆక్టటుకుంటుంది. ఈ సినిమాకు నిర్మాత కూడా ఉదయనిధి స్టాలినే కాబట్టి ఖర్చుకు వెనకాడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ కథవడివేలు నటనరెహమాన్‌ సంగీతంఇంటర్వెల్‌ బ్యాంగ్‌ మైనస్ పాయింట్స్ సాగదీత సీన్స్నెమ్మదిగా సాగే కథనం రేటింగ్‌: 3.25/5
    జూలై 14 , 2023
    <strong>Pawan Kalyan: ఉదయనిధి ఐటీ సెల్‌కు చుక్కలు చూపించిన పవన్‌ ఫ్యాన్స్‌.. భయంతో అకౌంట్స్ క్లోజ్‌!</strong>
    Pawan Kalyan: ఉదయనిధి ఐటీ సెల్‌కు చుక్కలు చూపించిన పవన్‌ ఫ్యాన్స్‌.. భయంతో అకౌంట్స్ క్లోజ్‌!
    తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాయిశ్చిత దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్‌ ఇటీవల తిరుమలకు కాలినడకన వెళ్లి దీక్ష విరమించారు. అనంతరం తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో సనాతన ధర్మంపై జరుగుతున్న దాడి గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో డీఎంకే, ఉదయనిధి సోషల్‌ మీడియా వింగ్‌ పవన్‌ను టార్గెట్‌ చేసింది. పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ వ్యక్తిత్వ హననానికి తెరలేపింది. ఇక పవన్‌ ఫ్యాన్స్‌ సైతం రంగంలోకి దిగి ఉదయనిధి ఐటీ సెల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. పవన్ ఫ్యాన్స్ దెబ్బకు డీఎంకే సోషల్‌ మీడియా విభాగం పూర్తిగా వెనక్కి తగ్గింది. నిన్నటి వరకూ పవన్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ చేసిన పలు అకౌంట్లు ప్రస్తుతం క్లోజ్‌ అయ్యాయి. చెన్నైలోని తమ హాస్టల్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసిన సనాతన ధర్మం గురించే చర్చ జరుగుతోందంటూ ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. దీనంతటికీ కారణం పవన్‌ కల్యాణ్‌ అని పేర్కొన్నారు. వచ్చే ఎలక్షన్స్‌లో అధికార డీఎంకే ఒక సీటుకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పాడు. https://twitter.com/Deepika_JSP/status/1843293613029200362 పవన్‌పై వరుస పోస్టులతో విరుచుకుపడుతున్న నటుడు ప్రకాష్‌ రాజ్‌ను సైతం సోషల్‌ మీడియాలో ఏకిపారేస్తున్నారు. లూజర్‌ అయిన ప్రకాష్‌ రాజ్‌ ఆంధ్రాలో రెండో అతిపెద్ద పార్టీ అధినేత పవన్‌కు రాజకీయాలపై సలహాలు ఇవ్వడమా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌ ఓ సైకియార్టిస్టును కలిస్తే బాగుటుందని సూచిస్తున్నారు. అంతేకాదు 2019లో బెంగళూరు సెంట్రల్‌ నుంచి పోటీ చేసి ప్రకాష్‌ రాజ్‌ ఏ విధమైన ఘోర ఓటమిని చవి చూశారో గుర్తుచేస్తున్నారు. https://twitter.com/nrkaravindh/status/1843349508127916391 పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మం నినాదాన్ని ఖండిస్తూ అసభ్యకరంగా పోస్టు పెట్టిన వ్యక్తుల నిజ స్వరూపాలను సైతం ఫ్యాన్స్ బట్టబయలు చేస్తున్నారు. We Dravidians 2.0 అకౌంట్‌ నుంచి పవన్‌పై తీవ్ర అసభ్యకర పోస్టు వచ్చింది. అయితే ఈ ఖాతాను నడుపుతున్న వ్యక్తి వేరే మతస్తుడని, పైగా మలేసియా పౌరసత్వం తీసుకున్నాడని ప్రూఫ్స్‌తో సహా బయటపెట్టారు. ద్రవిడియన్స్‌ ముసుగులో సనాతన ధర్మపై యుద్దం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.&nbsp; https://twitter.com/HPhobiaWatch/status/1843251985178657133 పవన్‌ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున We Dravidians 2.0 పేజీని టార్గెట్‌ చేయడంతో వారిని తట్టుకోలేక అడ్మిన్‌ తన పేజీను క్లోజ్ చేసుకున్నాడు. ఎగిరెగిరి పడ్డ సీఎంనే 11 సీట్లకు పరిమితం చేశాడని, అంటూ ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.  https://twitter.com/lyf_a_zindagii/status/1843309397952598086 https://twitter.com/Nanda_927/status/1843287653699211585 పవన్‌ కంటే తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ బాగా చదువుకున్నాడని చేస్తోన్న ట్రోల్స్‌కి ఫ్యాన్స్‌ గట్టిగానే బదులిస్తున్నారు. పదో తరగతి పాస్ అయిన పవన్‌.. చెన్నై వరదల సమయంలో రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చాడని గుర్తు చేశారు. మరి బాగా చదువుకున్న ఉదయనిధి  ఒక్క రూపాయి కూడా తన జేబులో నుంచి ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు. ఉగ్రవాది బిన్‌లాడెన్‌ కూడా సివిల్‌ ఇంజనీరింగ్‌ చేశాడని, కానీ ఎన్నో బిల్డింగులను బాంబులతో కూల్చి వేశాడని గుర్తు చేశారు. https://twitter.com/parandhamdalit/status/1842842605828415846 ఉదయ నిధి స్టాలిన్‌ ఐటీ సెల్‌ను ధీటుగా ఎదుర్కొవడం ద్వారా సోషల్‌ మీడియాలో మరోమారు పవన్‌ కల్యాణ్‌ సత్తా ఏంటో నిరూపితమైందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఫ్యాన్స్ అందరూ ఐకమత్యంగా ఏర్పడి పవన్‌ వ్యకతిరేక శక్తులను తిప్పికొట్టారని పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/lordshivom/status/1843026533906059587 పవన్‌కు వ్యతిరేకంగా వెళ్లాలంటే అతడి ఊర మాస్‌ ఫ్యాన్స్‌ను దాటుకొని వెళ్లాలంటూ ఓ అభిమాని పెట్టిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.&nbsp; https://twitter.com/i/status/1843210460226867648 https://twitter.com/PK_Addicts/status/1843004204392088060 ఏపీలో ఒకప్పటి అధికార వైఎస్సార్‌సీపీ పార్టీని, మాజీ సీఎం జగన్‌ను పవన్‌ కల్యాణ్‌ ఏ విధంగా ఓడించాడో చూడంటూ పెట్టిన వీడియో సైతం పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది.  https://twitter.com/i/status/1843210675512086692 https://twitter.com/JSPGovtIn2024/status/1843221542920159417 ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూపై తమిళ యూట్యూబ్‌ ఛానెల్ రీసెంట్‌గా ఓ పోల్‌ నిర్వహించింది. ఈ వ్యవహారంలో పవన్‌కే ఏకంగా 89 శాతం మంది మద్దతు లభించింది.&nbsp; https://twitter.com/_MSD_VK/status/1842860646544630155
    అక్టోబర్ 08 , 2024
    Vishwambhara: జపాన్‌ వీధుల్లో త్రిషతో చిరంజీవి రొమాన్స్‌.. ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు! 
    Vishwambhara: జపాన్‌ వీధుల్లో త్రిషతో చిరంజీవి రొమాన్స్‌.. ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు! 
    మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్ విశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ స్టార్‌ హీరోయిన్‌ త్రిష (Trisha) చిరుకి జోడీగా న‌టిస్తోంది. ‘అమిగోస్’&nbsp; ఆషికా రంగనాథ్, ర‌మ్య ప‌సుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జపాన్‌లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; త్రిషతో చిరు రొమాంటిక్‌ సాంగ్‌! ‘విశ్వంభర’ (Viswambhara) టీమ్‌ ప్రస్తుతం జపాన్‌లో ఉంది. 15 రోజుల షూటింగ్‌ షెడ్యూల్‌తో హీరో చిరంజీవి సహా దర్శకుడు విశిష్ట ఇతర టీమ్‌ సభ్యులు రీసెంట్‌గా జపాన్‌లో అడుగుపెట్టారు. షెడ్యూల్‌లో భాగంగా ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను మూవీ టీమ్‌ చిత్రీకరించింది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ప్రస్తుతం చిరు, త్రిష కాంబోలో ఓ డ్యూయేట్‌ సాంగ్‌ను షూట్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ సాంగ్‌లో చిరు, త్రిష జోడీ అదరగొడుతుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిరు మేకోవర్‌ చూస్తే ఆయన 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయినట్లు అనిపిస్తుందని అంటున్నారు. త్రిష - చిరంజీవి కెమెస్ట్రీ కూడా సాంగ్‌లో నెక్స్ట్‌ లెవల్లో వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. ఈ సాంగ్ షూట్ అయిపోగానే చిత్ర బృందం హైదరాబాద్‌లో అడుగుపెడుతుందని సమాచారం. ఇదిలా ఉంటే చిరు-త్రిష సాంగ్‌పై వస్తోన్న హైప్‌ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.&nbsp; 18 ఏళ్ల క్రితం ఇదే మ్యాజిక్‌! చిరంజీవి - త్రిష జత కట్టడం (Viswambhara Trisha) ఇదేమి తొలిసారి కాదు. 2006లో వచ్చి ‘స్టాలిన్‌’ సినిమాలో వీరిద్దరు తొలిసారి జోడీగా నటించారు. ఆ తర్వాత వీరు ఏ సినిమాలో కలిసి నటించలేదు. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ జోడి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘స్టాలిన్‌’ సమయంలోనే వీరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. వెండి తెరపై వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో చిరు - త్రిష జతకడుతుండటంతో ఈ జోడీ ఈసారి ఏ మ్యాజిక్‌ చేస్తుందోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. నిజానికి ‘ఆచార్య’ చిత్రంలోనే చిరుకి జోడీగా త్రిష నటించాల్సి ఉంది. చిత్ర యూనిట్‌ తొలుత త్రిషనే హీరోయిన్‌గా ప్రకటించింది కూడా. అయితే షూటింగ్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తాను సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది. https://twitter.com/i/status/1849101610762522837 2025 సమ్మర్‌ బరిలో.. చిరంజీవి - వశిష్ట కాంబోలో రూపొందుతున్న ‘విశ్వంభర’ (Viswambhara) చిత్రం 2025 సమ్మర్‌లో రానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కావాలి. జనవరి 10న రాబోతున్నట్లు గతంలోనే విశ్వంభర టీమ్ అనౌన్స్ చేసింది. అయితే తనయుడు రామ్‌ చరణ్‌ (Ram Charan) నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) కోసం చిరు వెనక్కి తగ్గారు. దీంతో గేమ్‌ ఛేంజర్‌ సంక్రాంతి బరిలో నిలవగా ‘విశ్వంభర’ సమ్మర్‌కు పోస్టుపోన్‌ అయినట్లు 2025 మే (Viswambhara Release Date)లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో చిరు నటించిన&nbsp; ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది. 2024లో చిరుకి గుర్తుండిపోయే మోమోరీస్‌! అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్‌ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్‌ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్‌, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.&nbsp;
    నవంబర్ 20 , 2024
    <strong>Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్‌ పెట్టకుంటే ముప్పు తప్పదా!&nbsp;</strong>
    Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్‌ పెట్టకుంటే ముప్పు తప్పదా!&nbsp;
    ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అనగానే బాలీవుడ్‌ మాత్రమే గుర్తుకువచ్చేది. హిందీ స్టార్లను మాత్రమే పాన్‌ ఇండియా సెలబ్రిటీలుగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సౌత్‌ ఇండస్ట్రీ కూడా ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతూ జాతీయ స్థాయిలో అలరిస్తోంది. ముఖ్యంగా సౌత్‌ నుంచి టాలీవుడ్‌ (Tollywood), కోలివుడ్‌ (Kollywood) ఇండస్ట్రీల నుంచి మంచి కంటెంట్‌ ఉన్న పాన్‌ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అవి బాలీవుడ్ ఆదిపత్యానికి చెక్‌ పెడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏకత్రాటిపై ఉండాల్సిన సౌత్‌ ఇండస్ట్రీస్‌ అభిమానులు చేస్తోన్న ఫ్యాన్‌ వార్స్‌ కారణంగా బలహీన పడుతోంది. దీనిని కట్టడి చేయకపోతే మున్ముందు రోజుల్లో సౌత్‌ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; టాలీవుడ్‌ vs కోలీవుడ్‌ గతంలో ఫ్యాన్‌ వార్‌ అంటే ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేది. హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు పోస్టుల రూపంలో విమర్శలు చేసుకునేవారు. ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రాల హవా కారణంగా ఇది పక్క ఇండస్ట్రీలపైకి కూడా పాకింది. తమ హీరో తీసిన సినిమా కంటే పక్క ఇండస్ట్రీ స్టార్‌ చేసిన చిత్రం ఎక్కువ కలెక్షన్స్‌ సాధించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ పోకడ సౌత్‌లో టాలీవుడ్‌, కోలివుడ్‌ ఇండస్ట్రీలో ప్రధానంగా కనిపిస్తోంది. తమిళ హీరో విజయ్‌ చేసిన చిత్రాలు రిలీజ్‌ అయితే తెలుగు ఆడియన్స్‌ పెద్ద ఎత్తున ట్రోల్స్‌ చేస్తున్నారు. అదే సమయంలో మన హీరోల సినిమాలు వచ్చినప్పుడు అంతే స్థాయిలో తమిళులు సైతం నెట్టింట యాంటీ ప్రచారం చేస్తున్నారు. https://twitter.com/iammvengence/status/1758435868799377642 https://twitter.com/RAO_Offl/status/1759121949656318267 నష్టం ఏంటంటే? కొద్దిమంది మాత్రమే చేసే ఈ ఫ్యాన్ వార్ వల్ల హీరోలకు, సినిమా ఇండస్ట్రీలకు వచ్చే నష్టం ఏముందిలే అని చాలా మంది భావించవచ్చు. కానీ అది పొరపాటు. కొద్ది మంది ఫ్యాన్స్‌ చేస్తున్న ఈ ట్రోల్స్‌ చూసి ఆయా ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది ఆడియన్స్‌ ప్రభావితమవుతున్నారు. దాని వల్ల సహజంగానే పక్క ఇండస్ట్రీకి చెందిన హీరోపై వారిలోనూ తెలియకుండానే ద్వేషం ఏర్పడుతోంది. ఫలితంగా పక్క ఇండస్ట్రీ నుంచి ఏదైనా సినిమా రిలీజైనప్పుడు దానిని చూడకుండా రిజెక్ట్‌ చేస్తున్నారు. సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్‌ టాక్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల నార్త్‌లో బాగా రాణించిన సినిమాలు ఎంతో కీలకమైన సౌత్‌లో దెబ్బతింటున్నాయి. అది మూవీ ఓవరాల్‌ కలెక్షన్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. సినిమా ఎంత బాగున్నప్పటికీ మనం చేసుకుంటున్న నెగిటివ్‌ ట్రోల్స్‌ కారణంగా ఆ సినిమా హిందీ మూవీస్‌ కంటే కలెక్షన్స్‌ పరంగా వెనకబడిపోతున్నాయి.&nbsp; ఆ సినిమాలకు దెబ్బ! త్వరలో రిలీజ్‌ అయ్యేందుకు సౌత్‌ నుంచి పలు పాన్ ఇండియా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్‌ నుంచి ‘పుష్ప 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకోగా కోలీవుడ్‌ నుంచి సూర్య నటించిన ‘కంగువా’, శివకార్తికేయన్‌ నటించిన ‘అమరన్‌’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు భారీ ఖర్చుతో పాన్‌ ఇండియా స్క్రిప్ట్‌తో రూపొందినవే. గతంలో లాగే ఈ సినిమాల విషయంలోనూ ఫ్యాన్స్ ఇండస్ట్రీల పరంగా విడిపోయి ట్రోల్స్‌ దిగితే గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమా బాగుంటే ఇండస్ట్రీలకు అతీతంగా వాటిని ఆదరించాలని కోరుతున్నాయి. అప్పుడు మాత్రమే ఆయా చిత్రాలు మంచి వసూళ్లు సాధించి పాన్‌ ఇండియా స్థాయిలో ఘనమైన కలెక్షన్స్‌ సాధించగలుగుతాయని పేర్కొంటున్నాయి. అలా కాకుండా మళ్లీ ఫ్యాన్‌ వార్‌కు దిగితే పరోక్షంగా లాభపడేది బాలీవుడ్‌యే అని స్పష్టం చేస్తున్నాయి.&nbsp; టైటిల్స్‌ రచ్చకు చెక్‌ పెట్టాల్సిందే! సౌత్‌లో బిగ్‌ ఇండస్ట్రీలుగా ఉన్న టాలీవుడ్‌, కోలీవుడ్‌కి చెందిన దర్శక, నిర్మాతలు తమ వైఖరితో ఫ్యాన్‌ వార్‌కు ఆజ్యం పోయకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇటీవల కాలంలో కోలీవుడ్‌ చిత్రాలు నేరుగా తమిళ టైటిల్స్‌తో తెలుగులోనూ రిలీజ్‌ కావడం ఎక్కువగా చూస్తున్నాం. కంగువా, వేట్టయన్‌తో పాటు అంతకుముందు వచ్చిన ‘తంగలాన్‌’, ‘రాయన్‌’, ‘వెలిమై’ తమిళ పేర్లను పెట్టడం వల్ల ఇది తెలుగు ఆడియన్స్‌లో ఆగ్రహానికి కారణమైంది. కొందరు చేసిన తప్పిదాలు కారణంగా మెుత్తం తమిళ ఇండస్ట్రీపైనే ద్వేషం వచ్చే ప్రమాదం తలెత్తుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమిళ ఇండస్ట్రీ జాగ్రత్తపడాలి.&nbsp; పొలిటికల్‌ టర్న్‌ ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టించాయి. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశిస్తూ పవన్‌ చేసిన పరోక్ష కామెంట్స్‌ తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్‌ తరహాలోనే ఉదయనిధి స్టాలిన్‌ తమిళ నటుడు కావడంతో ఈ వివాదం తెలుగు, తమిళ ఇండస్ట్రీల మధ్య వార్‌గా కూడా మారిపోయింది. ఇరువురు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పరస్పరం మాటల దాడి చేసుకున్నారు. పవన్‌ కల్యాణ్ సినీ కెరీర్‌తో ఉదయనిధిని పోలుస్తూ దారుణంగా ట్రోల్‌ చేశారు. అటు ఉదయనిధి విద్యార్హతను తెరపైకి తీసుకొచ్చి పవన్‌పై తమిళ నెటిజన్లు విమర్శలు చేశారు.&nbsp; https://twitter.com/i/status/1841876236840374698 పవన్‌ కల్యాణ్‌ vs అల్లు అర్జున్‌ టాలీవుడ్‌లోని అతిపెద్ద సినీ నేపథ్యమున్న కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఆ ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా నటులు ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. అయితే ఆ కుటుంబానికి చెందిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌కు అసలు పడటం లేదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో(Pawan Kalyan vs Allu Arjun) పవన్‌ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్‌ మద్దతు తెలపడంతో ఈ వివాదం ఆజ్యం పోసుకుంది. అప్పటి నుంచి బన్నీని మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. అటు అల్లు ఆర్మీ సైతం వారికి దీటుగా బదులిస్తూ తమ హీరోకు అండగా నిలుస్తోంది. అయితే ఇటీవల ఓ ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ టాలీవుడ్‌కు చెందిన హీరోలతో పాటు అల్లు అర్జున్‌ పేరును ప్రస్తావించారు. ఆ హీరోలంటే తనకు ఎంతో గౌరవమని వ్యాఖ్యానించారు. ఈ వివాదానికి చెక్‌ పెట్టే ఉద్దేశ్యంతోనే బన్నీ పేరును పవన్‌ తీసుకొచ్చినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప 2 చిత్రాన్ని ప్రమోట్ చేయమని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.&nbsp;
    అక్టోబర్ 17 , 2024
    <strong>Pawan Vs Prakash Raj: ప్రకాశ్ రాజ్‌కు ఎందుకంత తీటా? ఏకిపారేస్తున్న నెటిజన్లు!</strong>
    Pawan Vs Prakash Raj: ప్రకాశ్ రాజ్‌కు ఎందుకంత తీటా? ఏకిపారేస్తున్న నెటిజన్లు!
    ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పెషల్‌గా సిట్‌ను సైతం ఏర్పాటు చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఏకంగా పదకొండు రోజుల పాటు ప్రాయిశ్చిత దీక్ష సైతం చేపట్టారు. ఇటీవల విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లి అక్కడ కూడా మెట్లను శుభ్రం చేసి ప్రాయిశ్చిత్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రకాష్‌ రాజ్‌పై పవన్‌ నిప్పులు చెరిగారు. హిందూ ధర్మంకు అన్యాయం జరిగితే మాట్లాడొద్దా? అంటూ మండిపడ్డారు. దీంతో పవన్‌ను టార్గెట్‌ చేస్తూ ప్రకాష్‌ రాజ్‌ వరుసగా ప్రశ్నలు సందిస్తున్నారు. పవన్ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు.&nbsp; నిప్పు రాజేస్తున్న ప్రకాష్‌ రాజ్! తిరుమల లడ్డూ మహా ప్రసాదం కల్తీ ఘటనపై ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా తొలుత తన అభిప్రాయాన్ని పంచుకున్నారు నటుడు ప్రకాశ్‌రాజ్‌. ప్రాయిశ్చిత దీక్షలో భాగంగా విజయవాడ వచ్చిన పవన్‌, సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ప్రకాష్‌ రాజ్‌ను హెచ్చరించారు. ఆ తర్వాత నుంచి పవన్‌ను ప్రకాష్‌ రాజ్‌ టార్గెట్‌ చేయడం మెుదలుపెట్టారు. పేరు ప్రస్తావించకుండానే వరుస పోస్టులు పెడుతున్నారు. ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటూ పోస్టుల పరంపర కొనసాగిస్తున్నారు. తాజాగా ‘మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన, అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్ ఆస్కింగ్’ అని ట్వీట్‌ పెట్టారు.&nbsp; https://twitter.com/prakashraaj/status/1839524488322457898 పవన్‌ - కార్తీ ఇష్యూ పైనా కామెంట్స్‌&nbsp; సోమవారం జరిగిన 'సత్యం సుందరం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తిరుమల లడ్డు వ్యవహారంపై నటుడు కార్తీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసింది. యాంకర్‌ లడ్డు ప్రస్తావన తీసుకురాగా 'ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్‌ టాపిక్‌.. మనకొద్దు అది' అంటూ పరిహాసమాడారు. దీనిపై&nbsp; దుర్గ గుడి వేదికగా పవన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినిమా పరిశ్రమలో వాళ్లు మాట్లాడితే పద్దతిగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చొండి అని హెచ్చరించారు. దీనిపై వెంటనే స్పందించిన కార్తీ పవన్‌కు క్షమాపణలు చెప్పారు. అయితే ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ప్రకాష్‌ రాజ్‌ పవన్‌కు చురకలు అంటించారు. 'చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్...' అంటూ పోస్టు పెట్టాడు. ఆ తర్వాత ‘గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? అంటూ ఎక్స్‌లో మరో పోస్టు పెట్టారు.&nbsp; https://twitter.com/prakashraaj/status/1838879208455405581 https://twitter.com/prakashraaj/status/1839200681015546033 ఎందుకంత తీటా? ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశ్యపూర్వకంగా ప్రకాష్‌ రాజ్‌ టార్గెట్‌ చేస్తుండటంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నీకు సంబంధం లేని వ్యవహారంలో ఎందుకు తలదూరుస్తున్నావ్‌? అంటూ నిలదీస్తున్నారు. పవన్‌ తను పాటించే సనాతన ధర్మం గురించి మాట్లాడితే రెచ్చగొట్టినట్లు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. హిందువులపై వారి నమ్మకాలపై దాడి జరిగితే ప్రశ్నించవద్దా? అని మండిపడుతున్నారు. తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్‌ హిందువులను దూషించినప్పుడు ప్రకాష్‌ రాజ్‌ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని నిలదీస్తున్నారు. తను నమ్మిన ధర్మం కోసం పవన్‌ పోరాడితే నీకొచ్చిన తీట ఏంటని పలుష పదజాలంతో ఏకిపారేస్తున్నారు. తిరుమల లడ్డు వ్యవహారం హిందువుల విశ్వాసాలకు సంబధించిందని పరాయి మతానికి కొమ్ముకాసే నీలాంటి వ్యక్తులకు దానిపై మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేస్తున్నారు. తిరుమల లడ్డును బాంబుతో పోలుస్తూ ప్రకాష్‌ రాజ్‌ పెట్టిన ట్వీట్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Nithya_pspk/status/1839533477261131846 https://twitter.com/Thanos_Tweetss/status/1839534021484659159 https://twitter.com/i/status/1839526823782187363 https://twitter.com/jpnamburi/status/1839536155856916985 https://twitter.com/Kapu_community1/status/1839535562308378893 https://twitter.com/HariiTweetz/status/1839538486115729667 ఇది నమ్మక ద్రోహమే! నటుడు ప్రకాష్‌ రాజ్‌కు మెగా ఫ్యామిలీతో తొలి నుంచి మంచి అనుబంధమే ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి తనకు సోదర సమానుడు అంటూ పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జరిగిన మా అసోసియేషన్‌ ఎలక్షన్స్‌లో ప్రకాష్‌ రాజ్‌ అభ్యర్థిత్వాన్ని మెగా ఫ్యామిలీ బలపరిచింది. మంచు విష్ణుకి పోటీగా ప్రకాష్‌ రాజ్‌ బరిలో నిలవడంలో చిరంజీవి ప్రోత్సాహాం ఎంతో ఉంది. మెగా బ్రదర్‌ నాగబాబు సైతం ప్రకాష్‌ రాజ్‌కు మద్దతు ప్రచారం కూడా చేశారు. ప్రకాష్‌ రాజ్‌ లాంటి గొప్ప నటుడు, అనుభవజ్ఞుడు, జాతీయ స్థాయిలో పేరున్న వ్యక్తి మా అసోసియేషన్‌కు అధ్యక్షుడు అయితే ఇండస్ట్రీకి మంచి జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు. అయితే తాజాగా పవన్‌ను టార్గెట్‌ చేసి మెగా ఫ్యామిలీకి ప్రకాష్‌ రాజ్‌ నమ్మక ద్రోహం చేశాడని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; మరో పోసాని అవుతారా? ప్రకాష్‌ రాజ్‌ వరుస ట్వీట్ల వ్యవహారాన్ని పరిశీలిస్తే ఇండస్ట్రీలో ఆయన మరో పోసాని కృష్ణమురళి అయ్యేటట్లు కనిపిస్తోంది. గత వైకాపా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నటుడు పోసాని, మెగా ఫ్యామిలీని పదే పదే తన మాటలతో టార్గెట్‌ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ప్రకాష్‌ రాజ్‌ను చూస్తుంటే ఒకప్పటి పోసాని గుర్తుకు వస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రీలో బలమైన ఫ్యామిలీతో పెట్టుకోవడం ద్వారా సినిమా అవకాశాలను పోసాని కోల్పోయినట్లు టాక్‌ ఉంది. దీంతో ప్రకాష్‌ రాజ్‌ కూడా ఇదే తీరున వ్యవహరిస్తే ఆయనకూ అదే పరిస్థితి ఎదురుకావొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి పవన్‌ vs ప్రకాష్ రాజ్‌ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.&nbsp;
    సెప్టెంబర్ 27 , 2024
    <strong>Coolie Movie: </strong><strong>రజనీ కాంత్‌ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో? ఆహా.. ఇది కదా కాంబో అంటే!</strong>
    Coolie Movie: రజనీ కాంత్‌ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో? ఆహా.. ఇది కదా కాంబో అంటే!
    భారతీయ చిత్ర పరిశ్రమల్లో కాంబినేషన్స్‌కు ఎంతో క్రేజ్‌ ఉంది. ఇద్దరు హీరోల కాంబో సెట్‌ అయ్యిందంటే సినిమా అక్కడే సగం విజయం సాధించినట్లు అంతా భావిస్తారు. అలాంటిది ఇద్దరు జాతీయ స్థాయి దిగ్గజ నటులు ఒకే చిత్రంలో నటిస్తే ఇక ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోతాయే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ క్రేజీ కాంబో కోలివుడ్‌లో లాక్‌ అయినట్లు తెలుస్తోంది. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రంలో బాలీవుడ్‌ దిగ్గజ హీరో నటించబోతున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు? అతడు చేయబోయే చిత్రం ఏంటి? ఇప్పుడు చూద్దాం.  క్రేజీ కాంబో లోడింగ్‌..! తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం 'కూలీ' (Coolie) చిత్రంలో నటిస్తున్నారు. సూపర్‌ హిట్‌ చిత్రాల దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ (Lokesh Kanagaraj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం ఏపీలోని వైజాగ్‌లో జరుగుతుండటం విశేషం. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌ (Aamir Khan) నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ముఖ్యమైన పాత్రలో అమీర్‌ ఖాన్‌ కనిపించబోతున్నట్లు తమిళ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త కోలివుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; 29 ఏళ్ల క్రితమే.. రజనీకాంత్‌, అమీర్‌ ఖాన్‌ కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. 29 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఆటంక్‌ హై ఆటంక్‌’ (Aatank Hi Aatank) అనే ఫిల్మ్‌లో వీరిద్దరు తొలిసారి నటించారు. అయితే ఇది ఈ జనరేషన్ వారికి పెద్దగా తెలియక పోవచ్చు. ‘ది గాడ్ ఫాదర్‌’ అనే నవల ఆధారంగా దర్శకుడు దిలీప్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో జుహి చావ్లా ఫీమేల్‌ లీడ్‌గా కనిపించింది. అప్పట్లో రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.4.2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో అమీర్‌ ఖాన్‌, రజనీ నటనపై ప్రశంసలు కురిశాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వీరు మళ్లీ తెరపై కనిపించనుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విలన్‌గా కన్నడ స్టార్‌! రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న 'కూలీ' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర ముఖ్య పాత్రలో కనివిందు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉపేంద్ర సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. తన ఆరాధ్య నటుడు సూపర్ స్టార్‌తో తెర పంచుకోవడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సెట్లో రజనీతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఇందులో ఉపేంద్ర విలన్‌ పాత్రలో కనిపించబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 171వ చిత్రంగా కూలీ తలైవ కెరీర్‌లో 171వ సినిమాగా ‘కూలీ’ని సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. అటు ‘విక్రమ్‌’ సినిమా తర్వాత లోకేష్‌ కనకరాజ్‌కు దక్షిణాదిలో ఫుల్ క్రేజ్‌ వచ్చింది. తెలుగులోనూ అతడికి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. దీంతో డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ సినిమా అనగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక రజనీతో ఆయన సినిమా అనగానే ఓ రేంజ్‌లో బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా సంబంధించి పలు అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. రజనీ వ్యాఖ్యలపై దుమారం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిపై మంత్రి ఎ.వి. వేలు రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో తాజాగా రజనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కరుణా నిధి మరణం తర్వాత పార్టీని ప్రస్తుత సీఎం స్టాలిన్‌ చక్కగా నడిపిస్తున్నారని రజనీ అన్నారు. రాష్ట్ర మంత్రి దురై మురుగన్‌ పేరును ప్రస్తావిస్తూ ఆయన లాంటి పెద్దలున్న పార్టీని స్టాలిన్‌ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అంటూ సరదాగా సెటైర్లు వేశారు. కళాకారుడి కంట్లోనే వేలు పెట్టి ఆడించిన వ్యక్తి దురై మురుగన్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి దురై మురుగన్‌ ఘాటుగా బదులిచ్చారు. సినిమా రంగంలోని పెద్ద నటులంతా వయసు మీరి, పళ్లు పోయి, గడ్డాలు పెంచుకొని చావబోయే స్థితిలోనూ నటిస్తున్నారని పరోక్షంగా రజనీని ఉద్దేశించి అన్నారు. అలాంటి వారి వల్ల యువకులకు అవకాశాలు రావడం లేదని ఆరోపించారు. ఈ పరస్పర మాటల దాడి కోలివుడ్‌తో పాటు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.&nbsp;
    ఆగస్టు 27 , 2024
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    టాలీవుడ్‌లో అతి కొద్ది సినిమాలతోనే మంచి ఫేమ్ తెచుకున్న హీరోయిన్లలో 'నివేదా పేతురాజ్‌'. మెంటల్‌ మదిలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నివేతాకు గత కొంతకాలంగా ఏదీ కలిసిరావడం లేదు. ఇటీవల ఆమె ఓ సీఎం కొడుకుతో రిలేషన్‌లో ఉన్నారంటూ తమిళనాట పెద్ద ఎత్తున దుమారం రేగింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.&nbsp; అసలు ఏం జరిగిందంటే? వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న నివేదాను పోలీసులు అడ్డగించారు. ఆపై డిక్కీ ఓపెన్‌ చేయాలని ఆమెను కోరారు. దీనికి అంగీకరించని నివేద.. పోలీసులపై కోపం తెచ్చుకుంది. 'రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్‌ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చెక్‌ చేసుకోండి. డిక్కీలో ఏం లేవు. అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నేను డిక్కీ ఓపెన్‌ చేయలేను' అని కోపంగా చెప్పారు. ఇదంతా ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డు చేస్తుండగా అతడిపైనా నటి మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.&nbsp; https://twitter.com/Karthikkkk_7/status/1795883722673135776 నివేదా ప్రాంక్‌ చేసిందా? నివేదా పేతురాజ్‌ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిక్కీ ఓపెన్‌ చేస్తే సరిపోయేది కదా ఇలా పోలీసులతో వాగ్వాదం చేయడం ఎందుకు అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను ఓ ప్రాంక్‌గా అభిప్రాయపడ్డారు. వీడియో నేచురల్‌గా లేదని.. స్క్రిప్టెడ్‌లా కనిపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. ఏదైనా ప్రమోషన్స్‌లో భాగంగా నివేదా ఇలా చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా ఈ వీడియోలో పోలీసులు షూస్‌కి బదులు చెప్పులు వేసుకొని కనిపించారని అంటున్నారు. కాబట్టి ఇది పక్కా ప్రమోషనల్‌ వీడియోనేనని నెటిజన్లు తేల్చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై నివేదా క్లారిటీ ఇచ్చేవరకూ ఈ ప్రశ్నలకు ముగింపు రాదు.&nbsp; సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ పుకార్లు కొన్ని నెలల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌ - నివేదా పేతురాజ్‌కు మధ్య ఏదో నడుస్తోందంటూ ఆ రాష్ట్ర మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, రూ.50 కోట్లతో ఇంటిని కూడా కొనుగోలు చేశాడని ప్రచారం జరిగింది. దీనిపై నివేదా ఎక్స్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ తప్పుడు వార్తల వల్ల తాను, తన కుటుంబం ఒత్తిడికి లోనయ్యామని పేర్కొంది. మరోమారు తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చట్టపరమైన చర్యలకు దిగుతానని వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ఆ రూమర్లకు చెక్‌ పడింది. https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 విష్వక్‌తో హ్యాట్రిక్‌ చిత్రాలు తెలుగులో తన తొలి చిత్రం ‘మెంటల్‌ మదిలో’ తర్వాత నివేదా.. 'చిత్రలహరి'తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకొంది. ఆ తర్వాత శ్రీవిష్ణుతో చేసిన 'బ్రోచేవారెవరురా' మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; ఇక యంగ్‌ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్‌ కా ధమ్కీ’, ‘పాగల్’, ‘బూ’ అనే మూడు సినిమాల్లో నివేదా నటించింది. ఇవే కాకుండా రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’ మూవీలోనూ అలరించింది. ఇటీవల ‘బ్లడ్ మేరీ’ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ప్రాజెక్ట్స్‌ లేవు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు నివేదా ఇలా ప్రాంక్‌ చేసి ఉండొచ్చన వాదన కూడా నెట్టింట వినిపిస్తోంది.&nbsp;
    మే 30 , 2024
    Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్‌ సంచలన పోస్ట్‌!
    Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్‌ సంచలన పోస్ట్‌!
    కోలీవుడ్ నటి నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టున్న ఈ భామ ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘పాగల్’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇటీవల నివేతా గురించి ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. నివేతా పేతురాజ్‌ కోసం ఓ ప్రముఖుడు విచ్చలవిడిగా డబ్బుల ఖర్చు చేస్తున్నారంటూ తమిళ మీడియాలో ఆమెపై నెగిటివ్‌ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా వాటిపై నివేత స్పందిస్తూ ఎక్స్‌లో సంచలన పోస్టు పెట్టింది.&nbsp; ట్విటర్‌ వేదికగా ఆగ్రహం తమిళనాడులో తనను లక్ష్యంగా చేసుకొని వస్తున్న వార్తలపై నటి నివేతా పేతురాజ్ ఎక్స్‌ వేదికగా మండిపడింది. ‘నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల నాపై తప్పుడు వార్తలు రాశారు. ఈ తప్పుడు వార్తల వల్ల కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. ఇలాంటి వార్తలు రాసేముందు ఒకసారి ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను సంపాదించడం మొదలుపెట్టాను. నేను డబ్బు కోసం అత్యాశపడే వ్యక్తిని కాదు. నా కోసం ఎవరో డబ్బు ఖర్చు చేస్తున్నారనంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి నిరాధారమైనవి. ఆ వార్తలు రాసేవాళ్లు ఒకసారి ఆలోచించండి. మీలో మానవత్వం ఉందనే అనుకుంటున్నా. మరోసారి నా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తప్పుడు వార్తలు సృష్టించరని భావిస్తూ లీగల్‌ యాక్షన్‌ తీసుకోకుండ వదిలేస్తున్నా. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసినవారందరికి థ్యాంక్యూ’ అంటూ నివేతా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం నివేతా పేతురాజ్‌ ట్వీట్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.&nbsp; https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 అసలేం జరిగింది? గత కొన్నిరోజులుగా నివేతా పేతురాజ్, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు మధ్య ఏదో నడుస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాడని, ఆమె కోసమే కోట్లు ఖర్చుపెట్టి కారు రేసింగ్‌ను ఏర్పాటు చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రూ.50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చాడని, ఇంకా ఏది చేయడానికి అయినా ఉదయనిధి సిద్ధంగా ఉన్నాడని తమిళ మీడియాలో పుకార్లు.. షికార్లు చేసాయి. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని భరిస్తూ వచ్చిన నివేతా.. దీనికి ఫుల్‌స్టాప్‌ పడుతుందని భావించింది. రోజు రోజుకు ఈ ప్రచారం మరింత విస్తృతం కావడంతో తాజాగా దానిపై స్పందించింది. తప్పుడు వార్తలన్నింటికీ ఓ పోస్టు ద్వారా చెక్‌ పెట్టింది. 
    మార్చి 05 , 2024
    Vishwambhara : 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో చిరంజీవి... సినిమాలో ఇదే కీలకం!
    Vishwambhara : 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో చిరంజీవి... సినిమాలో ఇదే కీలకం!
    మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరు చెబితినే ఆయన ఫ్యాన్స్‌ పూనకాలతో తాండవం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చిరుకు ఉన్న క్రేజ్‌ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది ప్రారంభంలో "వాల్తేరు వీరయ్య"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మేహర్‌ రమేష్‌ దర్శకత్వంలో 'భోళా శంకర్‌' (Bhoola Shankar)గా వచ్చిన సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్‌తో జాగ్రత్త పడిన చిరు తన తర్వాతి చిత్రానికి ఓ సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నారు. బింబిసార ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో "విశ్వంభర" (Vishwambhara) చిత్రంలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తైనట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టర్ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకు అదేంటో ఇప్పుడు చూద్దాం. విశ్వంభర చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు చిరంజీవి పక్కన త్రిష హీరోయిన్‌గా కన్ఫామ్ అయింది. స్టాలిన్ చిత్రం తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ జోడీ ఎలాంటి కెమిస్ట్రీని స్క్రీన్‌పై పండిస్తారని చర్చించుకుంటున్నారు. అయితే విశ్వంభర సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిపోనుందని చెప్పుకొచ్చారు. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో చిరంజీవి 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో కనిపిస్తాడని తెలిసింది. ఈ గెటప్‌లో చిరంజీ మునుపెన్నడు కనిపించని లుక్‌లో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నాడని టాక్. ప్లాష్ బ్యాక్ నేపథ్యంగా వచ్చే సీన్స్ గ్రాఫిక్స్ విజువ్ వండర్స్‌గా ఉంటాయని సమాచారం. మరోవైపు రీసెంట్‌గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్  సైతం చేశాడు. ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే పాత్రను డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అద్భుతమైన క్యారెక్టరైజేషన్‌తో పాటుగా ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందని చిన్నపాటి లీక్స్ ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని క్రేజీ గెటప్‌లో చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విశ్వంభర చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర చిత్రం కోసం ప్రత్యేకంగా తన బాడీని టోన్ చేస్తున్నారు. యంగ్‌గా కనిపించేందుకు ఎక్కువసేపూ వ్యయామం చేస్తున్నారు. జిమ్‌లో అన్ని రకాల కసరత్తులు చేస్తున్న చిరు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 68 ఏళ్ల వయసులోనూ చిరు ఈ రేంజ్‌లో జిమ్ చేయడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.  ఇక చిరంజీవి ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఎంటర్టైనింగ్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఓ చిన్న మెసేజ్ కూడా ఉంటుందట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం.
    ఫిబ్రవరి 26 , 2024
    Viswambhara : 18 ఏళ్ల తర్వాత త్రిషతో రొమాన్స్ చేయనున్న చిరంజీవి!
    Viswambhara : 18 ఏళ్ల తర్వాత త్రిషతో రొమాన్స్ చేయనున్న చిరంజీవి!
    గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌ (Tollywood)ను తొలిచేస్తున్న ప్రశ్నకు ఇవాళ సమాధానం దొరికింది. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తర్వాతి చిత్రం ‘విశ్వంభర’లో హీరోయిన్ ఎవరన్న ఊహాగానాలకు చిత్ర బృందం చెక్ పెట్టింది. ఇందులో చిరుకు జోడీగా స్టార్‌ నటి త్రిష (Actress Trisha) నటించనున్నట్లు మూవీ యూనిట్‌ ప్రకటించింది. అంతేకాకుండా త్రిష సెట్‌లో పాల్గొన్న వీడియోను చిరంజీవి స్వయంగా షేర్‌ చేశారు.&nbsp; ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.&nbsp; చిరు - త్రిష ఆలింగనం చిరు షేర్‌ చేసిన వీడియో ప్రకారం.. మెుదట సెట్‌లో అడుగుపెట్టిన మెగాస్టార్‌.. డైరెక్టర్ వశిష్టతో (Mallidi Vasishta) కలిసి స్క్రిప్ట్‌కు సంబంధించిన విషయాలను చర్చిస్తుంటారు. పక్కనే చిరు తనయ సుస్మిత (Sushmita Konidela) కూడా నిలబడి ఉంటుంది. ఈ క్రమంలోనే నటి త్రిష.. క్యారీవ్యాన్‌ నుంచి బయటకొచ్చి మెగాస్టార్‌ చిరును ఆలింగనం చేసుకుంటుంది. ఆ తర్వాత మెగాస్టార్‌ ఆమెకు పుష్పగుచ్చంతో సెట్‌లోకి స్వాగతం పలుకుతారు. ఈ వీడియోను చూసిన మెగా ఫ్యాన్స్‌ ఉత్సాహంతో ఊగిపోతున్నారు. లైక్స్‌, షేర్స్‌తో వీడియోను ట్రెండింగ్‌ చేస్తున్నారు. https://twitter.com/i/status/1754373323910533528 18 ఏళ్ల తర్వాత.. చిరంజీవి - త్రిష జత కట్టడం (Viswambhara Trisha) ఇదేమి తొలిసారి కాదు. 2006లో వచ్చి ‘స్టాలిన్‌’ సినిమాలో వీరిద్దరు తొలిసారి జోడీగా నటించారు. ఆ తర్వాత వీరు ఏ సినిమాలో కలిసి నటించలేదు. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ జోడి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘స్టాలిన్‌’ సమయంలోనే వీరి జోడీకి&nbsp; మంచి మార్కులు పడ్డాయి. వెండి తెరపై వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో చిరు - త్రిష జతకడుతుండటంతో ఈ జోడీ ఈసారి ఏ మ్యాజిక్‌ చేస్తుందోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.&nbsp; ఆచార్యకు నో చెప్పిన త్రిష! నిజానికి ‘ఆచార్య’ చిత్రంలోనే చిరుకి జోడీగా త్రిష నటించాల్సి ఉంది. చిత్ర యూనిట్‌ తొలుత త్రిషనే హీరోయిన్‌గా ప్రకటించింది కూడా. అయితే షూటింగ్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తాను సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఆచార్య నుంచి వైదొలుగుతున్నట్లు ఆ సందర్భంలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. చిరు సినిమా ఆఫర్‌ను త్రిష కాదనుకోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. ఇక మెగా సినిమాలో త్రిష కనపించడం కష్టమేనన్న వార్తలు కూడా వచ్చాయి. వాటన్నింటికి చెక్‌ పెడుతూ చిరు లేటెస్ట్‌ మూవీలో ఈ భామ అవకాశం దక్కించుకోవడం విశేషం.&nbsp; సెకండ్‌ హీరోయిన్‌ ఎవరో? ‘విశ్వంభర’లో త్రిష (Viswambhara)తో పాటు మరో హీరోయిన్‌ కూడా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆమె కోసం మంచి పాత్ర కూడా సిద్దంగా ఉందని అంటున్నారు. అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోయే భామ కోసం చిత్ర యూనిట్‌ తెగ వెతికేస్తున్నట్లు టాక్‌. అంతకుముందు చిరు జోడీ ఎవరు? అంటు పలు హీరోయిన్ల పేరు బయటకొచ్చాయి. వారిలో త్రిషతో పాటు కాజల్ అగర్వాల్‌, హానీ రోజ్‌, సంయుక్త మీనన్‌ పేర్లు వినిపించాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకునేను కూడా తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. మరి మెయిన్‌ హీరోయిన్‌గా త్రిష ఫైనల్‌ అయిన నేపథ్యంలోనే ఈ జాబితా నుంచే సెకండ్‌ హీరోయిన్‌ను కూడా ఎంచుకుంటారా? లేదా? అన్నది చూడాలి.&nbsp; 13 భారీ సెట్‌లు..! చిరు 156వ చిత్రంగా ‘విశ్వంభర’ (Viswambhara Trisha) రూపొందుతోంది. సాహసాలు, ఊహా ప్రపంచం మేళవింపుతో ఈ చిత్రం మెగాస్టార్‌ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ కోసం 13 భారీ సెట్‌లతో ప్రత్యేక ప్రపంచాన్నే సృష్టించారు. 2025 జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ (UV Creations) బ్యానర్‌పై ఇది రానుంది.&nbsp;
    ఫిబ్రవరి 05 , 2024
    Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
    Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
    ఈ ఏడాది టాలీవుడ్‌ చాలా మంది హీరోయిన్లకు కలిసొచ్చింది. వారు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ప్రత్యేకించి కొందరు మాత్రం ఈ ఏడాది తమ తల రాతలను మార్చుకున్నారు. తమకంటూ స్టార్‌ స్టేటస్‌ను సంపాదించుకున్నారు. అంతేగాక 2023 ఏడాదిలో తమకు తిరుగులేదని వారు నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు సాధించిన ఘనతలు ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.&nbsp; శ్రీలీల ఈ ఏడాది చాలా బాగా పాపులర్ అయిన హీరోయిన్ల జాబితాలో శ్రీలీల (Sreeleela) ప్రథమ స్థానంలో ఉంటుంది. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. రవితేజ పక్కన ‘ధమాకా’లో చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా ఆ తర్వాత వరుసగా రామ్‌తో ‘స్కంద’, బాలయ్య కూతురిగా 'భగవంత్‌ కేసరి', పంజా వైష్ణవ్‌ తేజ్‌తో 'ఆదికేశవ', నితీన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' వంటి చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం మహేష్‌, విజయ్‌ దేవరకొండ, పవన్‌ కల్యాణ్‌ సరసన శ్రీలీల నటిస్తోంది. కీర్తి సురేష్‌ యంగ్‌ బ్యూటీ కీర్తి సురేష్‌ (Keerthy Suresh)కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. నాని సరసన ఆమె నటించిన 'దసరా' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విజయవంతమైంది. రూ.100 కోట్లకు పైగా ఇందులో తన నటనకు గానూ కీర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు ‘భోళాశంకర్‌’ సినిమాలో చిరంజీవి సోదరిగా నటించి మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ పక్కన ‘మామన్నన్‌’ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.&nbsp; రష్మిక మందన్న ఈ ఏడాది రష్మిక మందన్న(Rashmika Mandanna) తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంది. విజయ్‌తో ‘వారసుడు’ చిత్రంలో నటించిన ఈ భామ.. బాలీవుడ్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘మిస్టర్‌ మజ్నూ’ చేసింది. ఇక రణ్‌బీర్‌ కపూర్‌కు జోడీగా ఆమె నటించిన ‘యానిమల్‌’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. సమంత ఈ ఏడాది సమంత (Samantha)కు మిశ్రమ స్పందన ఎదురైంది. ఆమె నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోగా విజయ్‌ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ మూవీ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు తమిళం, ఇంగ్లీష్‌లో తెరకెక్కుతున్న బైలింగ్విల్‌ ఫిల్మ్‌ ‘చెన్నై స్టోరీస్‌’లోనూ నటించే అవకాశాన్ని సమంత దక్కించుకుంది.&nbsp; సంయుక్త మీనన్‌ ఈ ఏడాది సంయుక్త మీనన్‌ (Samyuktha menon)కు మంచి విజయాలను అందించింది. ధనుష్‌ సరసన ఆమె నటించిన 'సార్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ సరసన ఆమె చేసిన 'విరూపాక్ష' చిత్రం ఘన విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో సంయుక్త తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.&nbsp; అనుష్క శెట్టి గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన స్టార్‌ నటి అనుష్క (Anushka Shetty) ఈ ఏడాది మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'మిస్ శెట్టి మిష్టర్‌ పోలిశెట్టి' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా అనుష్కకు గట్టి కమ్‌బ్యాక్‌ లభించిందని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. శ్రుతి హాసన్‌ టాలీవుడ్‌లో సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న శ్రుతి హాసన్‌ (Shruti Haasan)కు ఈ ఏడాది కలిసొచ్చిందని చెప్పవచ్చు. చిరంజీవి, బాలకృష్ణలతో ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలై మంచి హిట్‌ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా నానితో ‘హాయ్‌ నాన్న’ చిత్రంలోనూ ఓ పాటలో స్టెప్పులేసి అదరగొట్టింది. అలాగే ప్రభాస్‌ సరసన 'సలార్‌' సినిమాలోనూ శ్రుతి హాసన్‌ నటించింది.&nbsp;
    డిసెంబర్ 19 , 2023
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    గతవారం రోజుల నుంచి సరైన హిట్‌ లేక థియేటర్లు చిన్నబోతున్నాయి. చిన్న చిన్న సినిమాలు సందడి చేసినప్పటికీ.. వాటికి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.&nbsp; గతవారం విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన నిఖిల్ నటించిన 'స్పై' డిజాస్టర్‌గా నిలిచింది. సామజవరగమణ సినిమా&nbsp; ఒక్కటే కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ వారం ఏయే సినిమాలు థియేటర్‌లో సందడి చేయనున్నాయి. ఏయే వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానున్నాయో ఓసారి చూద్దాం. &nbsp;బేబీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలు పోషించిన సినిమా 'బేబీ'.&nbsp; ఈ చిత్రం జులై 14న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం సినిమాపై చాలా కన్ఫడెంట్‌గా ఉంది. ఇప్పటిటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా చిత్రం తెరకెక్కినట్లు తెలిసింది.&nbsp; ఇద్దరి యువకుల ప్రేమ మధ్య నగిలే అమ్మాయిలా వైష్ణవి, చిన్నతనం గాఢంగా ఆమెను లవ్ చేసే పాత్రలో ఆనంద్ దేవరకొండ అద్భుతంగా నటించినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. నాయకుడు&nbsp; ఉద‌య‌నిధి స్టాలిన్‌, ఫ‌హాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో న‌టించిన తాజా తమిళ్&nbsp; హిట్ చిత్రం 'మామ‌న్నన్'. ఈ సినిమా తెలుగులో నాయకుడుగా జులై 14న రిలీజ్ కానుంది. జూన్ 29న తమిళ్‌లో రిలీజైన ఈ మూవీ రూ.40కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రూలింగ్ పార్టీ లీడ‌ర్‌తో ఓ తండ్రీకొడుకులు సాగించిన‌ పోరాటం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని సెల్వరాజ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. తొలిసారి కమెడియన్ వడివేలు ఎమ్మెల్యే పాత్రలో సీరియస్‌ రోల్ చేశాడు. &nbsp;మహావీరుడు శివ కార్తికేయన్‌ లీడ్‌ రోల్‌లో మడోన్‌ అశ్విన్‌ డైరెక్ట్ చేసిన యాక్షన్‌ చిత్రం మహావీరుడు (Mahaveerudu).&nbsp; ఈ మూవీ జులై 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.&nbsp; అదితి శంకర్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రచారాన్ని మూవీ యూనిట్ ప్రారంభించింది. శివ కార్తికేయన్‌ను మునుపెన్నడు చూడని పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. భారతీయన్స్‌: ది న్యూ బ్లడ్‌&nbsp; ప్రముఖ రచయిత ధీన్ రాజ్ డైరెక్టర్‌గా మారి తీసిన చిత్రం 'భారతీయన్స్'.&nbsp; ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత్- చైనా సరిహద్దుల్లో గల్వాన్ లోయ ఘర్షణల్లో&nbsp; చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలిచిన భారతీయ సైనికుల పోరాట పటిమ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్కాస్ హీరోలు. సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమంటే ఇదేరా, ప్రేమించుకుందాంరా, ఈశ్వర్, కలిసుందాంరా వంటి హిట్‌ చిత్రాలకు ధీన్‌ రాజ్ కథ అందించిన సంగతి తెలిసిందే.&nbsp; మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రికరింగ్‌ పార్ట్‌ 1 మిషన్‌ ఇంపాసిబుల్‌ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన హాలీవుడ్‌ హీరో టామ్‌ క్రూజ్‌ కీలక పాత్రలో వస్తున్న చిత్రం మిషన్ ఇంపాసిబుల్: డెడ్ రెకనింగ్ (Mission Impossible Dead Reckoning)&nbsp; క్రిస్టోఫర్‌, మెక్‌ క్యూరీ ఈ చిత్రాన్ని యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. పార్ట్‌-1 జులై 12న రిలీజ్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో సినిమా సందడి చేయనుంది. ఈ వారంలో OTTల్లో రిలీజ్ కానున్న మరికొన్ని చిత్రాలు TitleCategoryLanguagePlatformRelease DateBird Box BarcelonaMovieEnglishNetflixJuly 14KoharaWeb SeriesHindiNetflixJuly 15Transformers: Rise of the Beasts&nbsp;movieEnglishPrimeJuly 11Mayabazaar For Sale&nbsp;Web SeriesteluguZEE5July 14Janaki Johnny&nbsp;Web SeriesMalayalamDisney + HotstarJuly 11The Trial&nbsp;Web seriesHindiDisney + HotstarJuly 14Crime Patrol – 48 HoursMovieHindiSony LivJuly 10College Romance July 25Web seriesHindiSony LivJuly 25
    జూలై 10 , 2023
    <strong>Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?</strong>
    Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
    మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. [toc] భోళా శంకర్ ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు. గాడ్ ఫాదర్ చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది. ఖైదీ నంబర్ 150 చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంజి చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది. శంకర్ దాదా జిందాబాద్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. శంకర్ దాదా M.B.B.S "మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. ఠాగూర్ తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు. మృగరాజు హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. స్నేహం కోసం కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది. హిట్లర్ మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది. ముగ్గురు మొనగాళ్లు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు. మెకానిక్ అల్లుడు "శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. ఆజ్ కా గూండా రాజ్ "గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఘరానా మొగుడు "అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. పసివాడి ప్రాణం&nbsp; &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.&nbsp; చక్రవర్తి&nbsp; రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆరాధన&nbsp; భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్‌లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; దొంగ మొగుడు&nbsp; ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్‌’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.&nbsp; వేట&nbsp; &nbsp;ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్&nbsp; &nbsp;యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; రాజా విక్రమార్క &nbsp;రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.&nbsp; ప్రతిబంధ్&nbsp; &nbsp;రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. త్రినేత్రుడు &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.&nbsp; ఖైదీ నంబర్ 786 &nbsp;విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అడవి దొంగ &nbsp;చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.&nbsp; చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; నాగు&nbsp; తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.&nbsp; ఇంటిగుట్టు &nbsp;చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.&nbsp; దేవాంతకుడు దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.&nbsp; హీరో విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్‌ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు. ‘ఖైదీ’ &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్‌లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది. అభిలాష&nbsp; ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్‌డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.&nbsp; ప్రేమ పిచ్చోళ్లు&nbsp; &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.&nbsp; బంధాలు అనుబంధాలు&nbsp; ‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.&nbsp; మంచు పల్లకీ&nbsp; &nbsp;వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.&nbsp; యమ కింకరుడు&nbsp; యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. పట్నం వచ్చిన పతివ్రతలు పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్‌నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. చట్టానికి కళ్లులేవు చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. 47 రోజులు కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మొగుడు కావాలి చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు. మోసగాడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రేమ తరంగాలు 'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్‌. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. పున్నమి నాగు 'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఇది కథ కాదు కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్‌గళ్' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్‌లో మెప్పించారు. మనవూరి పాండవులు బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
    సెప్టెంబర్ 25 , 2024
    Top Whistle-Worthy Intro Scenes in Telugu Movies : తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 15 హీరో ఎంట్రీ సీన్స్ ఇవే!
    Top Whistle-Worthy Intro Scenes in Telugu Movies : తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 15 హీరో ఎంట్రీ సీన్స్ ఇవే!
    సినిమాల్లో హీరో ఎంట్రీ సీన్లతోనే… ప్రేక్షకులు ఆ చిత్రంపై ఓ అంచనాకు వస్తారు. ముఖ్యంగా స్టార్ హీరోలకైతే కచ్చితంగా ఎలివేషన్‌తో కూడిన ఇంట్రో సీన్ పడాల్సిందే. లేకపోతే ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తుంటారు. తెలుగులో హీరో ఎంట్రీ సీన్‌ ప్రత్యేకంగా లేని సినిమాను ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. ఫ్యాన్స్ ఛాయిస్, హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా డైరెక్టర్లు ముందుగానే ఈ ఇంట్రో సీన్ల కోసం చాలా కసరత్తు చేస్తుంటారు. సినిమా డిస్సాపాయింట్ చేసినా ఫ్యాన్స్‌ కాస్త ఒప్పుకుంటారు కానీ... ఇంట్రో సీన్‌ మాత్రం బాక్స్‌ బద్దలవాల్సిందే అని కోరుకుంటారు. మరి తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ ఇంట్రో సీన్లను ఓసారి చూద్దామా. అతడు- మహేష్ బాబు "ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే... అతడే.. అంటూ ఈ సాంగ్ లిరిక్స్ సాగుతూ మహేష్ బాబు ఇచ్చే పవర్‌ఫుల్ ఎంట్రీ ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్ అని చెప్పాలి. అతడు సినిమాలో మహేష్‌ బాబు ఎంట్రీ సీన్‌కు పడిన BGM సూపర్బ్‌గా ఉంటుంది. మణిశర్మ అందించిన స్కోర్‌ బెస్ట్ ఇంట్రో BGMలలో ఒకటిగా చెప్పవచ్చు. https://youtu.be/HpqfxXRhlgU?si=gVE6a5dcBzFqR1lQ పవన్ కళ్యాణ్- అత్తారింటికి దారేది "బుల్లెట్ ఆరు అంగుళాలే ఉంటుంది కానీ మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ ఆరు అడుగులు ఉంటే ఎలా ఉంటాడో అలా ఉంటాడు నా మనవడు గౌతం నందా" అని పవన్ కళ్యాణ్ గురించి ఆయన తాతా ఇచ్చే ఎలివేషన్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఆ తర్వాత వచ్చే BGMకు ఫ్యాన్స్‌ అరుపులు కేకలతో థియేటర్లు దద్దరిళ్లిపోయాయి.&nbsp; https://youtu.be/uoBS4Pl6-e8?si=CGm7Tdo6myR7330K ప్రభాస్- బాహుబలి 2 బాహుబలి2 ఇంట్రడక్షన్ సీన్ నెవర్ బిఫోర్‌ అని చెప్పవచ్చు. రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు రాజ మాత శివగామి దేవి అఖండ జ్యోతిని తలపై పెట్టుకుని వెళ్తున్న క్రమంలో మదగజం నుంచి ఆమెను ప్రభాస్ కాపాడే సీన్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్లలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ సీన్‌లో బాహుబలి బలం, ధైర్యాన్ని దర్శకుడు ఈ సీన్‌లో చెప్పకనే చెప్పాడు. https://youtu.be/jkgaUY3VJHY?si=IKuFfqQIiA6VeL92 దసరాలో నాని దసరా సినిమాలో నాని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చిన ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రన్నింగ్ ట్రైన్‌లో బొగ్గు దొంగతనం చేసే సీన్‌ ఫ్యాన్స్‌ చేత కేకలు పుట్టించిందని చెప్పవచ్చు. https://youtu.be/WcOf-pvKGn0?si=xZn3a4j-BvVMyrNF బాలకృష్ణ- లెజెండ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చినన్ని ఇంట్రడక్షన్ సీన్లు మరేతర హీరోకు రాలేదని చెప్పాలి. ముఖ్యంగా లెజెండ్ సినిమాలో విలన్లను చేజ్ చేసి ఫైట్ సిక్వెన్స్, తన మార్క్ డైలాగ్స్, ఇంట్రోకు తగ్గట్టుగా ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ నిజంగా ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ. https://youtu.be/Ech6LOW6UQA?si=-ueNWM61P2nAq4j- రామ్‌ చరణ్- చిరుత తన తొలి సినిమా చిరుతలో పవర్‌ఫుల్ ఇంట్రో పొందాడు హీరో రామ్‌ చరణ్. జైళ్లో తొటి ఖైదీలు అవమానించినప్పుడు వారిపై చరణ్ తన మొహం కనిపించకుండా రివేంజ్ తీర్చుకునే సీన్.. మెగా ఫ్యాన్స్‌ చేత పూనకాలు పెట్టించింది. https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby జూ.ఎన్టీఆర్- RRR కొమురం భీం క్యారెక్టర్ గురించి బ్రిటిష్ వారికి రాజీవ్ కనకాలా చెప్పే సీన్ నిజంగా జూ. ఎన్టీఆర్ సినిమాల్లో బెస్ట్ ఇంట్రోగా చెప్పవచ్చు. ఆ సీన్‌లో తారక్ పులితో పొరాడే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది.&nbsp; https://youtu.be/BN1MwXUR3PM?si=Cl7Fpcj0qc2nigQu పవన్ కళ్యాణ్- పంజా&nbsp; పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్‌ సైతం ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. బందీగా ఉన్న తనికెళ్ల భరణిని కాపాడేందుకు వెళ్లిన పవన్‌ను చంపేందుకు విలన్లు అతని కారుపై కాల్పులు జరుపుతారు. ఈక్రమంలో పవన్ చనిపోయాడని దగ్గరకు వెళ్తారు. కట్ చేస్తే... పెద్ద బాంబు పేలిన శబ్దం.. పవర్‌ఫుల్ బీజీఎంతో పవన్ ఎంట్రీ సీన్ సూపర్‌గా ఉంటుంది. https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby మహేష్ బాబు- పోకిరి పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్‌ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. "మేము కాదు పండుగాడు.. రేపు పొద్దున ఇందిరా నగర్‌లో పరుగెత్తించి, పరుగెత్తించి కొడుతాడు" అని హీరో ఫ్రెండ్స్ ఇచ్చే ఎలివేషన్.. కట్ చేస్తే.. మహేష్ స్టన్నింగ్ రన్నింగ్ స్టైల్‌తో వచ్చే ఇంట్రో సూపర్బ్‌గా ఉంటుంది. https://youtu.be/e8-GhC0gFtQ?si=PGXqB0DN34tfHaJg అల్లు అర్జున్- ఆర్య మ్యాన్‌ హోల్ పడిన కుక్క పిల్లను బన్నీ రక్షించే సీన్... హార్ట్‌ ఫెల్ట్‌గా ఉంటుంది. ఈలాంటి సీన్‌తో ఇప్పటి వరకు ఏ హీరోకు ఇంట్రో పడలేదని చెప్పాలి. అప్పవరకు ఉన్న మూస ధొరణి ఇంట్రోలకు సుకుమార్ తన స్టైల్‌ ఆఫ్ టేకింగ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టాడు. https://youtu.be/kvYePkoR6s0?si=jNeyhKqY4ARC-zRZ సింహాద్రి- జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి అప్పన్నకు మొక్కు చెల్లించేందుకు వెళ్తున్నప్పుడు విగ్రహాన్ని కోతి దొంగిలించి విలన్లకు ఇస్తుంది. కట్‌ చేస్తే జూ. ఎన్టీఆర్ ఇంట్రో అదిరిపోతుంది. https://youtu.be/P9q4u7KR9Is?si=Ftql6FN6xG8-uABE స్టాలిన్- చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో వచ్చిన ఇంట్రోల్లో స్టాలిన్ ఇంట్రో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్ అని చెప్పవచ్చు.&nbsp; అమ్మాయిని కిడ్నాప్‌ చేసిన విలన్లకు చిరు బుద్ది చెప్పే సీన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. https://youtu.be/Dlc5V4Gi0So?si=Af3xz6wiuoQw5NfT రామ్‌ చరణ్- మగధీర ఈ చిత్రంలో రామ్‌ చరణ్ చేసే హై ఎండ్ ఎక్స్‌ట్రీమ్ బైక్ ఫీట్.. టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ హీరో ఎంట్రీ సీన్లలో ఒకటిగా చెప్పవచ్చు. https://youtu.be/uGh4lbLnmio?si=vsy6ox3mmaiNDg_i ప్రభాస్- బిల్లా హాలీవుడ్ రేంజ్‌ ఎలివేషన్ ఈ సినిమాలో ప్రభాస్‌కు దక్కింది. ఆయన కటౌట్‌కు తగ్గ BGM స్కోర్ సూపర్బ్‌గా ఉంటుంది. ముఖ్యంగా హీరో ఎంట్రీ సీన్‌ ఆ సీన్‌కు తగ్గ మణిశర్మ బీజీఎం, ప్రభాస్ యాటిట్యూడ్‌ను ఎలివేట్ చేసింది.&nbsp; https://youtu.be/jq1Kr3nlOCE?si=OxJV6jjNiTTEDHta ఘర్షణ- వెంకటేష్ ఈ చిత్రంలో వెంకటేష్ ఇంట్రో వెరైటీగా చూపించాడు దర్శకుడు గౌతమ్ మీనన్. "నా పేరు రామచంద్ర, ఐపీఎస్, నా డ్రెస్ మీద ఉన్న మూడు సింహాలే నా జీవితం, నా తపస్సు" అంటూ ఎలివేషన్‌తో వెంకీని చూపించాడు. https://youtu.be/APNGeCwPlGQ?si=KxY7kBiopg4-6I5a
    ఫిబ్రవరి 26 , 2024
    Top 15 Telugu BGM Movies: తెలుగులో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా?
    Top 15 Telugu BGM Movies: తెలుగులో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా?
    ఒక సినిమా సక్సెస్‌లో కథ, హీరో స్టార్‌డమ్‌, పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా గణనీయమైన పాత్రను పోషిస్తుంది. ఒక సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా తీసినప్పటికీ దానిని సరిగ్గా ఎలివేట్‌ చేసే BGM లేకపోతే ఫలితం ఉండదు. అందుకే దర్శకులు పాటలతో పాటు(Top Telugu BGM Movies) నేపథ్య సంగీతానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించి మరీ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ను ఫైనలైజ్‌ చేస్తుంటారు. ఇప్పటివరకూ తెలుగులో వందలాది చిత్రాలు వచ్చినప్పటికీ BGM అనగానే ఠక్కున కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అటువంటి టాప్‌ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; సలార్‌ (Salaar) ప్రభాస్‌ (Prabhas) హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘సలార్‌’. ఈ సినిమా విజయంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. రవి బస్రూర్‌ (Ravi Basrur) అందించిన BGM.. యాక్షన్‌ సీన్లను చాలా బాగా ఎలివేట్ చేసింది.&nbsp; https://twitter.com/i/status/1756920670112317839 పుష్ప (Pushpa) సుకుమర్‌ - అల్లు అర్జున్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa BGM) లోనూ నేపథ్య సంగీతం హైలేట్‌గా అనిపిస్తుంది. రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్ సన్నివేశానికి తగ్గట్లు అద్భుతమైన బీజీఎంలను అందించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే BGM సినిమాకే హైలెట్ అనిచెప్పవచ్చు.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=B4aXmcfwkL4 ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా చేసిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమా గ్లోబల్‌ స్థాయిలో విజయాన్ని అందుకుంది. కీరవాణి అందించిన పాటలు, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. ముఖ్యంగా తారక్‌, రామ్‌చరణ్‌ పాత్రలను హైలెట్‌ చేస్తూ ఇచ్చిన BGM గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. https://www.youtube.com/watch?v=Cve98-ZDIjY రంగస్థలం (Rangasthalam) రామ్‌చరణ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో రంగస్థలం ఒకటి. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ సినిమాకు పాటలతో పాటు బీజీఎం((Rangasthalam) ప్రధాన బలంగా నిలిచింది.&nbsp; https://twitter.com/i/status/1508823419013369857 అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అర్జున్‌ రెడ్డి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో విజయ్ చాలా అగ్రెసివ్‌గా కనిపించాడు. అతడి యాక్షన్‌కు తగ్గ బీజీఎం తోడవడంతో సినిమాలోని సీన్లు అద్భుతంగా ఎలివేట్ అయ్యాయి.&nbsp; https://www.youtube.com/watch?v=RrtLwUR1kVQ బాహుబలి (Baahubali) తెలుగులో అద్భుతమైన నేపథ్య సంగీతంతో వచ్చి చిత్రాల్లో ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ ఒకటి. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాలోని ప్రతీ సన్నివేశానికి జీవం పోసిందని చెప్పవచ్చు. https://www.youtube.com/watch?v=poqKN52SKx0 ఇంద్ర (Indra) మెగాస్టార్ చిరంజీవి చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. ఈ సినిమా అప్పట్లో రికార్డుల మోత మోగించింది. మణిశర్మ ఇచ్చిన బీజీఎం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ‘మెుక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’.. అంటూ చిరు చెప్పే డైలాగ్‌కు మణిశర్మ ఇచ్చిన BGM విజిల్‌ వేసేలా ఉంటుంది. అటు చిరు - ప్రకాష్‌ ఎదురుపడ్డ సందర్భంలోనూ వచ్చే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.&nbsp; https://twitter.com/i/status/1281802257319641090 https://twitter.com/i/status/1286298937746264065 మిర్చి (Mirchi) ప్రభాస్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘మిర్చి’ సినిమా కూడా తన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో వీక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రెయిన్‌లో ఫైట్‌ సందర్భంగా వచ్చే BGM అదరహో అనిపిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1653647992283619340 విక్రమార్కుడు (Vikramarkudu) రాజమౌళి - రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన 'విక్రమార్కుడు' కూడా అద్భుతమైన బీజీఎం గలిగిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా ఉంది. ఇందులో ప్రకాష్‌ రాజ్‌ రవితేజ ప్రొఫైల్‌ను చూస్తున్న క్రమంలో వచ్చే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. నీకు భయం లేదా అన్న ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతుండగా వచ్చే BGM ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1407610528948645889 https://twitter.com/i/status/1672174183395266561 ఛత్రపతి (Chatrapathi) రాజమౌళి - ప్రభాస్‌ కాంబోలో వచ్చిన తొలి చిత్రం ఛత్రపతి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రభాస్ శత్రువులకు వార్నింగ్ వచ్చే సమయంలో నేపథ్య సంగీతం ఆకట్టుకుటుంది.&nbsp; https://twitter.com/i/status/1591641776083070978 స్టాలిన్‌ (Stalin) చిరు హీరోగా తమిళ దర్శకుడు మురగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా BGM అప్పట్లో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. విలన్ ప్రదీప్‌ రావత్‌కు చిరు వార్నింగ్ ఇచ్చే సమయంలో వచ్చే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1307524939029688320 తులసి (Tulasi) వెంకటేష్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి బ్లాక్‌బాస్టర్ చిత్రం ‘తులసి’. సినిమా టైటిల్‌తో వచ్చే BGM ఆడియన్స్‌ను కూర్చిలో కూర్చోనివ్వకుండా చేస్తుంది. అలాగే హీరోయిన్‌ నయనతారతో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లోని BGM కూడా హృదయాలకు హత్తుకుంటుంది.&nbsp; https://twitter.com/i/status/1377645148671148036 https://twitter.com/i/status/1386233991800360961 సింహాద్రి (Simhadri) తారక్‌ నటించిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాల్లో ‘సింహాద్రి’ ఒకటి. ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి రూపొందించారు. తన అక్కను చంపిన విలన్లను తారక్ వేటాడే క్రమంలో వచ్చే BGM మెస్మరైజ్‌ చేస్తుంది.&nbsp;&nbsp; https://twitter.com/i/status/1557928081096028160 రక్షకుడు (Rakshakudu) నాగార్జున హీరోగా ప్రవీణ్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమా సాంగ్స్‌ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అటు నేపథ్య సంగీతం కూడా అప్పటి చిత్రాలకు భిన్నంగా రెహమాన్‌ అందించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=hX06emC9sb8 ఓజీ (OG) పవన్‌ కల్యాణ్‌ హీరోగా డైరెక్టర్ సుజీత్‌ రూపొందిస్తున్న చిత్రం ‘ఓజీ’. ‘హంగ్రీ చీతా’ పేరుతో విడుదలైన ఈ చిత్ర సాంగ్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌లోని బీజీఎంను ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తమ మెుబైల్స్‌కు రింగ్‌టోన్‌, కాలర్‌ ట్యూన్స్‌గా పెట్టుకుంటున్నారు.&nbsp; https://twitter.com/i/status/1759904474091704446 యానిమల్‌ (Animal) ఈ మధ్య కాలంలో నేపథ్య సంగీతంతో బాగా పాపులర్ అయిన చిత్రం యానిమల్‌. రణ్‌బీర్‌ మాస్‌ యాక్షన్‌ను హర్షవర్ధన్‌ రామేశ్వర్ ఇచ్చిన బీజీఎం అద్భుతంగా ఎలివేట్‌ చేసింది. తన తండ్రిని చంపాలని అక్క భర్త స్కెచ్‌ వేస్తున్నట్లు రణ్‌బీర్‌ తెలుసుకున్న సమయంలో వచ్చే BGM సినిమాకే హైలేట్‌.&nbsp; https://twitter.com/Billa2Harry/status/1751450675991773283
    ఫిబ్రవరి 21 , 2024
    HBD Chiranjeevi: మెగాస్టార్‌ గురించి మీకు తెలియని విషయాలు.. ఆయన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?&nbsp;
    HBD Chiranjeevi: మెగాస్టార్‌ గురించి మీకు తెలియని విషయాలు.. ఆయన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?&nbsp;
    దేశం గర్వించతగ్గ నటుల్లో మెగాస్టార్‌ చిరంజీవి ఒకరు. స్వయంకృషికి మారు పేరుగా ఆయన్ను చెబుతుంటారు. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన చిరంజీవి.. ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ వంటి మహామహులను తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడ్డారు. తన నటనతో స్టార్‌ హీరోగా ఎదిగారు. టాలీవుడ్‌ అగ్రస్థాన పీఠాన్ని సైతం మెగాస్టార్‌ అధిరోహించారు. కాగా, ఇవాళ మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు. ఆయన 68వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చిరు ఆస్తుల వివరాలు? లగ్జరీ కార్లు? వ్యాపార లావాదేవీలు? విలాసవంతమైన ఇళ్లు? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; 1. చిరు గ్యారేజీలోని లగ్జరీ కార్లు విదేశీ లేదా లగ్జరీ కార్లు అంటే మెగాస్టార్‌ చిరంజీవికి అమితమైన ఇష్టం. అందుకే ఆయన గ్యారేజీలో కోట్లు విలువ చేసే ప్రముఖ కంపెనీల బ్రాండెడ్‌ కార్లు ఉన్నాయి. బ్రిటన్‌, జర్మన్‌ బ్రాండ్‌ కార్లను ఆయన కలిగి ఉన్నారు. ఆ కార్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. రోల్స్ రాయిస్ ఫాంటమ్&nbsp; ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను రోల్స్ రాయిస్ కంపెనీ తయారు చేస్తుంది. ఆ కంపెనీకి చెందిన 'రోల్స్ రాయిస్ ఫాంటమ్' (Rolls Royce Phantom) కారు చిరంజీవి గ్యారేజిలో ఉంది. ఈ కారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. టయోటా ల్యాండ్ క్రూయిజర్&nbsp; చిరంజీవి గ్యారేజిలో రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser) కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి భారతీయ మార్కెట్లో విడుదల కాకముందే దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగిస్తారు. సేఫ్టీ పరంగా ప్రసిద్ధి చెందిన ఈ కారు చాలామంది సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 1 కోటి కంటే ఎక్కువే. రేంజ్ రోవర్ వోగ్&nbsp; ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue) కూడా మెగాస్టార్ గ్యారేజిలో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారు కంటే కూడా పాత వెర్షన్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంది. దీని ధర కూడా రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేంజ్ రోవర్ వోగ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది. 2. విలాసవంతమైన ఇల్లు హైదరాబాద్ నగరంలో చిరంజీవికి అత్యంత విశాలమైన &amp; విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇది రూ.30 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఈ బంగ్లాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇందులో అవుట్‌డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్‌పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉన్నాయని చెబుతారు. 3. ప్రైవేటు జెట్‌ చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. దీని ద్వారానే చిరు విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. ఈ జెట్‌ విలువ సుమారు రూ.30 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. 4. రియల్‌ ఎస్టేట్‌ మెగాస్టార్‌ చిరంజీవి రియల్‌ ఎస్టేట్‌ రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆయనకు హైదరాబాద్‌లో విలాసవంతమైన లగ్జరీ విల్లా కూడా ఉంది. హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో మెగాస్టార్‌కు 20 ఎకరాల భూమి కూడా ఉంది. ఇటీవల ఆ ప్రాంతంలో GHMC నిర్వహించిన వేలంలో ఎకరం రూ.100 పలకడం గమనార్హం. వీటితో పాటు బెంగళూరు, చెన్నై నగరాల్లో చిరంజీవికి ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. ఫిల్మ్‌నగర్‌లో 1990వ దశకంలో కొన్న ఓ ల్యాండ్‌ను ఇటీవల చిరు రూ.70 కోట్లకు విక్రయించినట్లు సమాచారం.&nbsp; 5. అంజనా ప్రొడక్షన్స్‌ 1988లో సోదరుడు నాగబాబుతో కలిసి ‘అంజనా ప్రొడక్షన్స్‌’ను మెగాస్టార్‌ చిరంజీవి ప్రారంభించారు. చిరు తల్లి అంజనా దేవి పేరు మీదుగా ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ను స్థాపించారు. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఇది కొనసాగుతోంది. రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మెునగాళ్లు, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్‌, రాధా గోపాలం, స్టాలిన్, ఆరంజ్‌ వంటి చిత్రాలు ఈ ప్రొడక్షన్‌ నుంచే వచ్చాయి.&nbsp; 6. కేరళ బ్లాస్టర్స్‌ ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లోని కేరళ బ్లాస్టర్స్‌ (Kerala Blasters) జట్టుకు చిరు సహా నిర్మాత. ఈ జట్టు యాజమాన్యంలో చిరుతో పాటు నాగార్జున, సచిన్‌ టెండూల్కర్‌ భాగస్వాములుగా ఉన్నారు. అలాగే అల్లు అరవింద్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌ సైతం ఈ ఫుట్‌బాల్‌ టీమ్‌పై పెట్టుబడి పెట్టినట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది.&nbsp; 7. చిరంజీవి బ్లడ్‌ &amp; ఐ బ్యాంక్‌ 1998లో చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ను మెగాస్టార్‌ స్థాపించారు. దాని ద్వారా బ్లడ్‌ &amp; ఐ బ్యాంక్స్‌ను (blood and eye banks) నెలకొల్పారు. వాటి సాయంతో చిరు ఎంతో మంది పేదల ప్రాణాలను కాపాడటంతో పాటు.. పలువురికి కంటి చూపును ప్రసాదించారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంకు ద్వారా ఇప్పివరకూ సుమారు 9.30 లక్షల యూనిట్ల బ్లడ్‌ను సేకరించారు. దానిలో 70 శాతం ఎలాంటి డబ్బు వసూలు చేయకుండా పేదలకు అందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.&nbsp; 8. చిరంజీవి నెట్‌వర్త్ ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో చిరు ఒకరిగా ఉన్నారు. ఇటీవల వచ్చిన భోళాశంకర్‌ చిత్రానికి చిరు రూ.60 కోట్లు డిమాండ్‌ చేసినట్లు కథనాలు వచ్చాయి. అటు మెగాస్టార్‌కు ఉన్న స్థలాలు, ఇళ్లు, ఆర్థిక లావాదేవీలు అన్ని కలుపుకుంటే ఆయన ఆస్తుల విలువ రూ.1650 కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా. &nbsp;
    ఆగస్టు 22 , 2023
    <strong>Deadpool &amp; Wolverine Review: గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్‌ సీక్వెన్స్‌.. 'డెడ్‌పూల్‌ &amp; వాల్వెరైన్‌' ఎలా ఉందంటే?</strong>
    Deadpool &amp; Wolverine Review: గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్‌ సీక్వెన్స్‌.. 'డెడ్‌పూల్‌ &amp; వాల్వెరైన్‌' ఎలా ఉందంటే?
    నటీనటులు : ర్యాన్‌ రేనాల్డ్స్‌, హ్యూ జాక్‌మన్‌, ఎమ్మా కొరిన్‌, మోరెనా బాక్రియన్‌, రామ్‌ డెలనే, లస్లీ ఉగ్గమ్స్‌, ఆరోన్‌ స్టాన్‌ఫోర్డ్‌ తదితరులు దర్శకత్వం : షాన్‌ లెవీ సినిమాటోగ్రఫీ: జార్జ్ రిచ్‌మండ్ సంగీతం : రాబ్‌ సిమన్‌సెన్‌ ఎడిట‌ర్ : డీన్ జిమ్మెర్‌మాన్, షేన్ రీడ్ నిర్మాణ సంస్థ : మార్వెల్‌ స్టూడియోస్‌, మ్యాక్జిమమ్‌ ఎఫర్ట్‌, 21 ల్యాప్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విడుదల తేదీ : 26 జులై, 2024 మార్వెల్‌ (Marvel) చిత్రాల సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయి క్రేజ్‌ ఉందో అందరికీ తెలిసిందే. భారత్‌లోనూ మార్వెల్‌ చిత్రాలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో సూపర్‌ హీరో కామిక్‌ సంస్థ మార్వెల్‌ స్టూడియోస్‌ నుంచి రూపొందిన మరో చిత్రమే 'డెడ్‌పూల్‌ &amp; వాల్వెరైన్‌' (Deadpool &amp; Wolverine). ఇద్దరు సూపర్‌ హీరోల కలయికతో రూపొందిన ఈ చిత్రం కోసం ఎంతోకాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ జులై 26న వరల్డ్‌ వైడ్‌గా విడుదలైంది. మరి ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి డెడ్‌పూల్‌ అలియాస్‌ వేడ్‌ విల్సన్‌ (ర్యాన్‌ రేనాల్డ్స్‌) సెకండ్‌ హ్యాండ్‌ కార్ల సేల్స్‌ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. గర్ల్ ఫ్రెండ్ వెనేసాతో బ్రేకప్ తర్వాత డెడ్‌పూల్ తన డ్రస్‌ తీసేసి తీసేస్తాడు. ఈ క్రమంలో ఓ రోజున టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు డెడ్‌పూల్‌ను ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616లో జాయిన్ అవ్వమంటారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వాల్వెరైన్‌ (హ్యూ జాక్‌మన్‌) సాయం అవసరం అవుతుంది. ఈ క్రమంలో వాల్వెరైన్‌తో కలిసి డెడ్‌పూల్‌ ఏం చేశాడు? మల్టీవెర్స్‌లో వీరిద్దరూ ఎలాంటి సాహసాలు చేశారు? పారాడాక్స్‌ను ఎలా ఎదిరించారు? అతడి ఎత్తులను ఎలా చిత్తు చేశారు? టైమ్ వేరియెన్స్ అథారిటీలో చివరకు ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ. ఎవరెలా చేశారంటే? డెడ్‌పూల్‌ పాత్రలో ర్యాన్‌ రెనాల్డ్స్‌ తనదైన నటనతో అదరగొట్టాడు. పూర్తిగా వినోదాన్ని పండిస్తూ యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్ములేపాడు. వాల్వెరైన్‌తో కలిసి యాక్ట్‌ చేసిన సన్నివేశాలను అద్భుతంగా పండించాడు. లెజండరీ నటుడు హ్యూ జాక్‌మాన్‌ వాల్వెరైన్ పాత్రలో అద్భుతం చేశాడు. తన సాలిడ్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఫ్యాన్స్‌కు గ్రాండ్‌ ట్రీట్‌ ఇచ్చాడు. కసండ్రా పాత్రలో ఎమ్మా కోరిన్ ఆకట్టుకుంది. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తూ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. మిగిలిన నటీనటులు తమ రోల్స్‌లో మెప్పించారు. తమ ఎంపిక సరైందని నిరూపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు షాన్‌ లెవీ అదిరిపోయే యాక్షన్‌ సీక్వెన్స్‌లతో పాటు ఎంతో వినోదాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఫన్‌ వేలో కథను నడిపించడం సినిమాకు బాగా కలిసొచ్చింది. డెడ్‌పూల్‌ మాటలు, సెటైర్స్‌, వన్‌లైనర్‌ డైలాగ్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికే సరిపోగా సెకండాఫ్‌ నుంచి అసలైన కథలోకి ఆడియన్స్‌ను తీసుకెళ్లారు. సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. ప్రీ క్లైమాక్స్‌ నుంచి ఎండ్‌ టైటిల్స్‌ వరకూ అదరహో అనిపిస్తుంది. అయితే సాలిడ్ ఎమోషన్స్‌ కూడా జోడించి ఉంటే సినిమా ఇంకా అదిరిపోయేది.&nbsp; ఓవరాల్‌గా ఒక మంచి సూపర్‌ హీరోల చిత్రాన్ని చూడాలనుకునేవారికి డెడ్‌పూల్‌ అండ్‌ వాల్వెరైన్‌ మంచి అనుభూతిని పంచుతుంది. ముఖ్యంగా తెలుగులోని డైలాగ్స్‌ నవ్వులు పూయిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే&nbsp; నేపథ్య సంగీతం చాలా బాగుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను BGM బాగా ఎలివేట్‌ చేసింది. అలాగే&nbsp; తెలుగు డబ్బింగ్‌ అదిరిపోయింది. పరిస్థితులకు డైలాగ్స్‌ బాగా సింక్‌ అయ్యాయి. అటు గ్రాఫిక్స్‌ టీమ్‌ మంచి పనితీరును కనబరించింది. ఎడిటింగ్‌ వర్క్‌ బాగుంది.&nbsp; నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ర్యాన్‌ రేనాల్డ్స్‌, హ్యూ జాక్‌మన్‌యాక్షన్‌ సీక్వెన్స్‌డైలాగ్స్‌ మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడ బోరింగ్‌ సీన్స్‌ఎమోషనల్ టచ్‌ లేకపోవడం Telugu.yousay.tv Rating : 3.5/5&nbsp;&nbsp;
    జూలై 26 , 2024
    <strong>HBD Priyanka Jawalkar: ‘ఆ స్టార్ అంటే క్రష్‌.. గాసిప్స్‌ నేనే షేర్‌ చేస్తా’.. ప్రియాంక జావల్కర్‌ టాప్‌ సీక్రెట్స్‌!</strong>
    HBD Priyanka Jawalkar: ‘ఆ స్టార్ అంటే క్రష్‌.. గాసిప్స్‌ నేనే షేర్‌ చేస్తా’.. ప్రియాంక జావల్కర్‌ టాప్‌ సీక్రెట్స్‌!
    టాలీవుడ్‌కు చెందిన యంగ్‌ హీరోయిన్లలో ప్రియాంక జావల్కర్ (Priyanka Jawalkar) ఒకరు. సెకండ్‌ చిత్రం 'టాక్సీవాలా'తో సాలిడ్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తన అందంతో అందరి దృష్టి ఆకర్షించింది. ఆ తర్వాత సత్యదేవ్‌, కిరణ్‌ అబ్బవరం వంటి స్టార్స్‌తో సినిమాలు చేసిన పెద్దగా కలిసి రాలేదు. రీసెంట్‌గా టిల్లు స్క్వేర్‌ చిత్రంలో స్పెషల్ అప్పిరియన్స్‌ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే ఇవాళ (నవంబర్‌ 12) ప్రియాంక జావల్కర్ పుట్టిన రోజు (HBD Priyanka Jawalkar). 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె లైఫ్‌లోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; ప్రియాంక జావల్కర్‌ను చూసి హిందీ బ్యూటీ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆమె అచ్చ తెలుగు అమ్మాయి.&nbsp; ఏపీలోని అనంతపురంలో 1992 నవంబర్‌ 12 ప్రియాంక జన్మించింది. హైదరాబాద్‌లో ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సు చదివింది. ఆపై స్టాటిస్టిక్స్‌లో 8 నెలల కోర్సు చేసేందుకు అమెరికా వెళ్లింది. అది పూర్తయ్యాక ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో ఆరు నెలల పాటు జాబ్‌ చేసింది.&nbsp; ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో తన ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం మెుదలు పెట్టింది. అవి చూసి ఇంప్రెస్ అయిన ‘కలవరం ఆయె’ టీమ్‌.. ఆమెకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చింది.&nbsp; అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్‌ కాలేదు. కానీ ఈ అమ్మడు అందం, అభినయానికి మాత్రం తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.&nbsp; దీంతో విజయ్‌ దేవరకొండ సరసన ‘టాక్సీవాలా’లో అమ్మడికి ఛాన్స్‌ దొరికింది. ఆ సినిమా సాలిడ్‌ హిట్ అందుకోవడంతో ప్రియాంక పేరు మార్మోగింది.&nbsp; ఆ సినిమా సక్సెస్‌తో ఈ అమ‌్మడికి ఇక తిరుగుండదని అంతా భావించారు. కానీ అనూహ్యంగా తన నెక్స్ట్‌ సినిమా రిలీజ్‌కు ప్రియాంక మూడేళ్ల సమయం తీసుకుంది.&nbsp; టాక్సీవాల సక్సెస్‌ తర్వాత సరైన కథల కోసం ఎదురుచూసినట్లు ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక జావల్కర్‌ తెలిపింది. ఈ క్రమంలో 25 స్టోరీలను రిజెక్ట్ చేసినట్లు చెప్పింది.&nbsp; ‘టాక్సీవాలా’ తర్వాత సత్యదేవ్‌తో చేసి ‘తిమ్మరుసు’ మూవీ చేసింది. ఇది కూడా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఇందులో ప్రియాంక నటనకు మరోమారు ఆడియన్స్ ఫిదా అయ్యారు.&nbsp; దాని తర్వాత కిరణ్‌ అబ్బవరంతో చేసిన ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’ కూడా మంచి విజయాన్ని అందుకుంది.&nbsp; ‘తిమ్మరుసు’, ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’ చిత్రాలు ఒకే వారంలో రిలీజ్‌ కావడం విశేషం. తను చేసిన రెండు మూవీస్‌ సెక్సెస్‌ సాధించడంతో ఈ అమ్మడి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ‘తిమ్మరుసు’ సినిమాలో బొద్దుగా కనిపించడంతో ప్రియాంకపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఆమె శరీరాకృతి కొందరు విమర్శలు గుప్పించారు.&nbsp; అయితే ట్రోల్స్‌, గాసిప్స్‌ గురించి తాను అస్సలు పట్టించుకోనని ప్రియాంక జావల్కర్‌ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. తనపై వచ్చే గాసిప్స్‌ను ఫ్రెండ్స్‌కు షేర్‌ చేసి మరి సంతోషిస్తానని తెలిపింది.&nbsp; ఆ తర్వాత ‘గమనం’ అనే ఆంథాలజీ ఫిల్మ్‌లో ప్రియాంక నటించింది. అందులో జారా అనే ముస్లిం యువతి పాత్రలో ఆకట్టుకుంది.&nbsp; ఈ ఏడాది సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన 'టిల్లు స్క్వేర్‌'లో ఈ అమ్మడు స్పెషల్ క్యామియో ఇచ్చింది. పబ్‌ సీన్‌లో హాట్‌ హాట్‌గా కనిపించి కుర్రకారు హృదయాలను మెలిపెట్టింది.&nbsp; ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ అంటే తనకు క్రష్‌ అని ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పుష్ప చిత్రం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపింది. ప్రియాంక జావల్కర్‌కు బాగా ఇష్టమైన నటి ఐశ్వర్యరాయ్‌. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ అమ్మడు అనర్గళంగా మాట్లాడగలదు.&nbsp; ఈ భామ ఫేవరేట్‌ కలర్స్‌ రెడ్‌, బ్లాక్‌. న్యూయార్‌ అంటే తనకు చాలా ఇష్టమని ఓ ఇంటర్వూలో తెలిపింది.&nbsp; సినిమాల విషయానికి వస్తే భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూస్తానని ప్రియాంక తెలిపింది. అయితే మలాయళంలో వచ్చిన 'ది గ్రేట్ ఇండియన్‌ కిచెన్‌' అంటే బాగా ఇష్టమని తెలిపింది. ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్స్‌ చేతిలో లేకపోవడంతో ప్రియాంక సోషల్‌ మీడియాపై ఈ అమ్మడు ఫోకస్‌ పెట్టింది. హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.&nbsp; ప్రస్తుతం ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 2.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ అమ్మడు ఏ ఫొటో షేర్‌ చేసిన వెంటనే ట్రెండింగ్ చేస్తున్నారు.&nbsp;
    నవంబర్ 12 , 2024
    <strong>Kalki 2898 AD Weekend Collections: ‘కల్కి’ కలెక్షన్ల సునామి.. తొలి 4 రోజుల్లోనే 90% మేర బడ్జెట్‌ వసూల్‌!</strong>
    Kalki 2898 AD Weekend Collections: ‘కల్కి’ కలెక్షన్ల సునామి.. తొలి 4 రోజుల్లోనే 90% మేర బడ్జెట్‌ వసూల్‌!
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. శుక్రవారం (జూన్‌ 27) విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. అన్ని ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు కల్కి సినిమా చూసి అదిరిపోయిందంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇక తొలిరోజు రూ.191.5 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. వీకెండ్‌ పూర్తయ్యేసరికి ఏ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టిందోనని యావత్‌ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ప్రకటించిన వీకెండ్ కలెక్షన్స్ అంకెలు మతిపోగొడుతున్నాయి. హీరో ప్రభాస్‌ బాక్సాఫీస్‌ స్టామినాకు అద్దం పడుతున్నాయి.&nbsp; వీకెండ్‌ కలెక్షన్స్ ఎంతంటే? ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. వీకెండ్‌లో (గురు, శుక్ర, శని, ఆదివారాలు) వరల్డ్‌ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది. రూ.1000 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన కల్కి.. తొలి నాలుగు రోజుల్లోనే సగం కలెక్షన్స్‌ సాధించడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కల్కి నిర్మాణానికి రూ.600 కోట్లు ఖర్చు అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తొలి నాలుగు రోజుల్లోనే 90% మేర బడ్జెట్‌ను కల్కి రికవరి చేయడం విశేషం. కాగా, మరోవారం రోజులపాటు కొత్త సినిమాలు ఏవి విడుదలకు సిద్ధంగా లేకపోవడంతో కల్కి కలెక్షన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా వసూలు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘కల్కి’ కొత్త చరిత్ర ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఓవర్సీస్‌లో దూసుకెళ్తోంది. ముఖ్యంగా నార్త్‌ అమెరికా ఆడియన్స్‌ కల్కి చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా అక్కడ కల్కి కొత్త చరిత్రను సృష్టించింది. నార్త్‌ అమెరికాలో మెుదటి వారంతంలో 11 మిలియన్‌ డాలర్ల వసూళ్లను ‘కల్కి 2898 ఏడీ’ రాబట్టింది. ఒక ఇండియన్‌ సినిమా.. వీకెండ్‌లో ఈ స్థాయి వసూళ్లు సాధించడం నార్త్‌ అమెరికాలో ఇదే తొలిసారి. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువు దాదాపు రూ.91 కోట్లకు సమానం. ఏడేళ్లుగా నార్త్ అమెరికాలో పదిలంగా ఉన్న బాహుబలి 2 రికార్డ్స్‌ను ‘కల్కి’ తొలి నాలుగు రోజుల్లోనే చెరిపేయడం విశేషం. ప్రస్తుత అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చూస్తుంటే రానున్న రోజుల్లో కల్కి మరిన్ని రికార్డులను నార్త్‌ అమెరికాలో క్రియేట్‌ చేస్తుందని చెప్పవచ్చు.&nbsp; నార్త్‌లో కల్కి ప్రభంజనం ప్రభాస్‌ కల్కి చిత్రం.. నార్త్‌ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో బాలీవుడ్‌ ప్రేక్షకులు కల్కి చిత్రాన్ని చూసేందుకు విశేష ఆదరణ కనబరుస్తున్నారు. ఫలితంగా హిందీ భాషలో కల్కి తొలి నాలుగు రోజుల్లో ఏకంగా రూ.115 కోట్లకు (GROSS) పైగా వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ప్రకటించింది. ప్రత్యేక ధన్యవాదాలు అంటూ అమితాబ్‌ అశ్వత్థామ పాత్రలో ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. అటు తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ కలిపి) వీకెండ్‌లో రూ.171.15 కోట్లను ప్రభాస్‌ చిత్రం వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక + రెస్ట్‌ ఆఫ్ ఇండియా రూ.19.80 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నాయి. కల్కి బాక్సాఫీస్‌ సునామి మరిన్ని రోజులు కొనసాగనున్నట్లు స్పష్టం చేశాయి.&nbsp;
    జూలై 01 , 2024
    &nbsp;SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
    &nbsp;SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
    సూపర్ స్టార్ మహేష్‌తో చేయబోయే SSMB29 చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో నిర్మించేందుకు డైరెక్టర్‌ రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. కౌబాయ్‌ తరహాలో తెరకెక్కనున్న ఈ అడ్వెంజర్‌ మూవీ కోసం హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌ను కూడా తీసుకోబోతున్నట్లు తెలిసింంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల మహేష్‌బాబు నటించిన గుంటూరు కారం సినిమా మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ... కలెక్షన్ల పరంగా సేఫ్ జోన్‌లో పడింది. మహేష్‌బాబు స్టామినాకు తగ్గ హిట్ పడలేదన్నది నిజం. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమాపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.&nbsp;&nbsp; గ్లోబల్ స్థాయి అయితే రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీస్ అయిన బాహుబలి, RRR ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెన్సేషన్ క్రియేట్ చేశాయి. జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్ గ్లోబర్ స్టార్లుగా ఎదిగిపోయారు. ప్రస్తుతం వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాజమౌళితో ఏ హీరో సినిమా తీసినా హిట్‌ అవడం ఖాయం. కానీ ఆ తర్వాత చేసే సినిమాలు ఇండస్ట్రీలో ఫ్లాప్‌గా నిలుస్తున్నాయి. మహేష్‌కు లాభమా నష్టమా? ఇప్పటివరకు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఇదే నియమం లెక్కతప్పకుండా కొనసాగుతుంది. ఆయనతో సినిమాలు చేసిన హీరోలు వరుసగా మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్స్‌గా మూటగట్టుకున్నారు. దీంతో SSMB 29 అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎటువంటి సినిమా చేస్తారు?&nbsp; ఏ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తారు? సగటు సూపర్ స్టార్ అభిమానిని తొలచివేస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే రాజమౌళి సినిమాతో మహేష్ బాబుకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ లభిస్తుంది. మరి దానిని నిలబెట్టుకునేలా మహేష్ బాబు తన తదుపరి SSMB30 సినిమాను ఎలా ఎంచుకుంటాడు? అతని కెరీర్‌కు బిగ్‌ ఛాలెంజ్ అంటూ ఇండస్ట్రీ పెద్దలు విశ్లేషిస్తున్నారు. SSMB29 క్రియేట్ చేస్తున్న బజ్.. మహేష్ బాబుకు లాభంతో పాటు నష్టాన్ని కూడా తెచ్చిపెట్టనుందని ఊహిస్తున్నారు. గతంలో ఇదే విధంగా రాజమౌళితో ఇండస్ట్రీ హిట్లు అందుకున్న తెలుగు హీరోలు ఆ తర్వాత ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక వరుసగా పరాజయాలు పొందారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్స్ అందుకున్న హీరోల జాబితాను ఓసారి పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా 'స్టూడెంట్‌ నెం.1'ను జూ. ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన 'సుబ్బు' సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ తారక్‌తో "సింహాద్రి" సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన 'ఆంధ్రావాల' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు RRRలో తారక్ నటించి గ్లోబర్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.&nbsp; ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ RRRకు ముందు రామ్‌చరణ్‌తో 'మగధీర' సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా తీస్తున్న రామ్‌చరణ్ ఎలాంటి ఫలితాన్ని పొందుతాడో వేచి చూడాల్సి ఉంది. ఇక రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన 'ఈగ' సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.&nbsp; మహేష్ బాబు కూడా అదే పరిస్థితా? దీంతో మహేష్ బాబు కూడా SSMB29 తర్వాత ఇతర టాలీవుడ్ అగ్రహీరోల మాదిరి బోల్తా పడుతాడా లేక గత చరిత్రను తిరిగి రాస్తాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా అంది. అటు ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) కూడా నటిస్తారని తెలుస్తోంది. మలయాళం నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కూడా ఓ కీలకపాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఆ నటులతో రాజమౌళి బృందం చర్చలు జరుపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చర్చలు గాని ఫలిస్తే SSMB29 పై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అయితే దీనిపై రాజమౌళి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.&nbsp; వరల్డ్ వైడ్ బజ్ మరోవైపు మహేష్‌ బాబు.. రాజమౌళి సినిమా కోసం తన లుక్స్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన అన్న కొడుకు మ్యారెజ్ కార్డు ఇవ్వడానకి వెళ్లినప్పుడు.. మహేష్ బాబు పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్కువ జుట్టు, ఒత్తైన గడ్డంతో హాలీవుడ్ హీరోలా మహేష్ కనిపించాడు. అలాగే కొన్ని స్టంట్స్‌ నేర్చుకునేందుకు జర్మనీలో ఇటీవల మహేష్ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. అటు దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిఫ్ట్ కూడా ఫైనల్ చేసి రాజమౌళికి వినిపించినట్లు సమాచారం. ఏప్రిల్‌ నుంచి నటీనటుల ఎంపిక, సాంకేతిక బృందం వంటి అంశాలను చిత్ర యూనిట్ పరిశీలించనున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా వరల్డ్‌ వైడ్‌గా క్రియేట్ చేస్తున్న బజ్ అంతా ఇంతా కాదు.
    ఫిబ్రవరి 14 , 2024

    @2021 KTree