• TFIDB EN
  • సుప్రీమ్
    UATelugu2h 22m
    ట్యాక్సీ డ్రైవర్‌ అయిన హీరోకి ఓ రోజు కష్టాల్లో ఉన్న చిన్న పిల్లవాడు పరిచయం అవుతాడు. కోటీశ్వరుడైన ఆ బాలుడ్ని చంపేందుకు విలన్లు యత్నిస్తుంటారు. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు? విలన్లకు బాలుడికి సంబంధం ఏంటి? బాలుడ్ని రక్షించడం కోసం హీరో ఎలాంటి సాహసాలు చేశాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సాయి ధరమ్ తేజ్
    ఒక టాక్సీ డ్రైవర్
    రాశి ఖన్నా
    సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు బాలు ప్రేమ ఆసక్తి
    రాజేంద్ర ప్రసాద్
    బాలు తండ్రి
    కబీర్ దుహన్ సింగ్
    విక్రమ్ సర్కార్
    రవి కిషన్ శుక్లా
    రాజన్‌ని కిడ్నాప్ చేయడానికి సర్కార్ నియమించిన ప్రొఫెషనల్ గూండా
    పి. సాయి కుమార్
    జాగృతి ఫౌండేషన్స్ ట్రస్టీ
    షిజు
    రాజన్ తండ్రి
    మురళీ మోహన్
    న్యాయమూర్తి
    పోసాని కృష్ణ మురళి
    సీనయ్య సోదరుడు
    అలీ
    డాక్టర్
    వినీత్ కుమార్
    బీకు స్నేహితుడు
    తనికెళ్ల భరణి
    కమీషనర్ ఆఫ్ పోలీస్
    వెన్నెల కిషోర్
    శ్రీదేవి అసిస్టెంట్
    జయ ప్రకాష్ రెడ్డి
    ఎమ్మెల్యే
    రఘు బాబు
    శ్రీదేవి తండ్రి
    శివన్నారాయణ నారిపెద్ది
    శ్రీదేవి మామ
    ఫిష్ వెంకటయ్య
    పోలీస్ ఆఫీసర్
    పృధ్వీ రాజ్
    క్రూజ్ భాగస్వామి మరియు కారు దొంగ
    ప్రభాస్ శ్రీను
    టామ్ భాగస్వామి మరియు కారు దొంగ
    సత్యం రాజేష్
    బాలు పక్కవాడు
    సుడిగాలి సుధీర్
    మూవీ డైరెక్టర్
    శంకర్ మెల్కోటే
    పారిశ్రామికవేత్త
    రఘు కారుమంచి
    ఎమ్మెల్యే అనుచరుడు
    గుండు సుదర్శన్
    తాగుబోతు
    గౌతమ్ రాజు
    హీరో
    సప్తగిరి
    విమానాశ్రయంలో ఒక వ్యక్తి
    పింగ్ పాంగ్ సూర్యశ్రీదేవి సోదరుడు
    మీనా కుమారిశ్రీదేవి కోడలు
    రజిత
    శ్రీదేవి అత్త
    శ్రవణ్ పోలీస్ ఆఫీసర్
    గిరిధర్వెంకటేష్
    తోటపల్లి మధుఎంపీ
    హరిబాబుహరి
    కమెడియన్ మహేష్కళ్లద్దాలు అమ్మేవాడు
    శృతి సోది
    టాక్సీవాలా పాటలో ప్రత్యేక పాత్ర
    అనిల్ రావిపూడి
    సిబ్బంది
    అనిల్ రావిపూడి
    దర్శకుడు
    దిల్ రాజు
    నిర్మాత
    సాయి కార్తీక్
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Kalki 2 Prediction: ‘కల్కి 2’కి రూ.2000 కోట్లు పక్కా? అసలు కథ ‘పార్ట్ 2’లోనే ఉంది!</strong>
    Kalki 2 Prediction: ‘కల్కి 2’కి రూ.2000 కోట్లు పక్కా? అసలు కథ ‘పార్ట్ 2’లోనే ఉంది!
    భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమా విడుదలై 2 వారాలు దాటినప్పటికీ కలెక్షన్స్‌లో ఏమాత్రం జోరు తగ్గలేదు. అందరి అంచనాలను అందుకుంటూ కల్కి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పురాణాలకు భవిష్యత్‌ను లింక్‌ చేస్తూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సినిమాను తెరకెక్కించిన తీరుపై ఆడియన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఓ డిఫరెంట్‌ వరల్డ్‌కి వెళ్లి వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. అయితే ప్రస్తుత కల్కి జస్ట్‌ ట్రైలర్ అని ప్రచారం జరుగుతోంది. సెకండ్‌ పార్ట్‌ ఎవరు ఊహించని స్థాయిలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కల్కి రూ.1000 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగితే పార్ట్‌ 2 మాత్రం రూ.2000 కోట్లే లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది.&nbsp; అసలు కథ ‘పార్ట్‌ 2’లోనే! ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను గమనిస్తే తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికి సరిపోయినట్లు అనిపిస్తుంది. భైరవగా ప్రభాస్‌ (Prabhas), సుమతిగా దీపికా పదుకొనే (Deepika Padukone), అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), విలన్‌ సుప్రీమ్‌ యాష్కిన్‌గా కమల్‌ హాసన్‌ (Kamal Hassan), అర్జునుడుగా విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) పాత్రల చుట్టే కల్కి తిరిగింది. ఒక్కో పాత్ర నేపథ్యం, కథలో వారి ప్రాధాన్యతలను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తొలి భాగంలో చూపించాడు. కలియుగం అంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు, విలన్‌ సుప్రీమ్‌ యాష్కిన్‌ వారిని పెడుతున్న బాధలు కళ్లకు కట్టాడు. మహా విష్ణువు పదో అవతారమైన ‘కల్కి’ రాకకు ముందు ఉన్న పరిస్థితులను ‘పార్ట్‌ 1’లో చూపించారు. అయితే హీరో ప్రభాస్‌, విలన్‌ సుప్రీమ్ యాష్కిన్‌ ఒక్కసారి కూడా తొలి భాగంలో ఎదురెదురు పడలేదు. అయితే ‘పార్ట్‌ 2’లో వీరిద్దరు ఒకరితో ఒకరు నేరుగా తలపడవచ్చు. ఇది సెకండ్‌ పార్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనుంది.&nbsp; కమల్‌ హాసన్‌ విశ్వరూపం కల్కి సినిమాలో కమల్‌ హాసన్‌ పాత్ర నిడివి 15 నిమిషాల కంటే తక్కువే. రెండు మూడు డైలాగ్స్ మినహా ఆయన నటనను వీక్షించే అవకాశం ఆడియన్స్‌కు లభించలేదు. సుమతి (దీపిక పదుకొనే) గర్భం నుంచి సేకరించిన సీరాన్ని ఇంజెక్ట్‌ చేసుకొని సుప్రీమ్‌ యాష్కిన్‌ దైవ శక్తి పొందుతాడు. అతడు మరింత శక్తివంతంగా మారడాన్ని ‘కల్కి’ క్లైమాక్స్‌లో చూపించారు. దీంతో ‘కల్కి 2’లో కమల్‌ హాసన్‌ పాత్ర పూర్తి స్థాయిలో ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ కమల్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘కల్కి 2’ తాను ఎక్కువ సేపు కనిపిస్తానని చెప్పుకొచ్చారు. ఫలితంగా భైరవ నుంచి కర్ణుడిగా మారిన ప్రభాస్‌, అశ్వత్థామ అమితాబ్‌తో సుప్రీమ్‌ యాష్కిన్‌ నేరుగా తలపడే అవకాశముంది. ఈ క్రమంలో నటన పరంగా కమల్‌ హాసన్‌ విశ్వరూపం చూసే ఛాన్స్‌ ఫ్యాన్స్‌కు లభించవచ్చు. భైరవ తన శక్తి ఎలా తెలుసుకుంటాడు? భైరవగా ఉన్న ప్రభాస్‌ను క్లైమాక్స్‌లో కర్ణుడుగా చూపించి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహాభారతంలో ఉపయోగించిన ఆయుధం భైరవ చేతిలో పడటం, దాని నుంచి శక్తి విడుదలై కర్ణుడుగా మారిపోవడం చూపించారు. యాష్కిన్‌ మనుషులను చంపిన తర్వాత మళ్లీ భైరవగా మారతాడు. కల్కిని గర్భంలో మోస్తున్న దీపికను భైరవ ఎత్తుకెళ్లడంతో తొలి భాగం ముగుస్తుంది. మరి సెకండ్ పార్ట్‌లో తాను కర్ణుడు అని ప్రభాస్‌ ఎలా గ్రహిస్తాడు? బౌంటీ (డబ్బు) కోసం దీపికను తీసుకెళ్లిన భైరవ ఆమెను ఏం చేశాడు? సోదరుడైన అశ్వత్థామకు ఎలా దగ్గరవుతాడు? కల్కి రాకను అడ్డుకుంటున్నవిలన్‌ యాష్కిన్‌తో ఎలా తలపడతాడు? అన్నది సెకండ్‌ పార్ట్‌లో రానుంది.&nbsp; విజయ్‌కి ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌! కల్కిలో అర్జునుడు పాత్రలో కనిపించి విజయ్‌ దేవరకొండ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహాభారతంలోని కురుక్షేత్రం ఎపిసోడ్‌లో అతడు మెప్పించాడు. అయితే విజయ్‌ది కేవలం క్యామియో మాత్రమే కాదని తెలుస్తోంది. రెండో పార్ట్‌లో ఆయన ఫుల్‌లెంగ్త్‌ క్యారెక్టర్‌ పోషించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. మరి అర్జునుడు పాత్రను ఫ్యూచర్‌లోకి తీసుకొస్తారా? లేదా కురుక్షేత్రానికి సంబంధించి మరిన్ని సన్నివేశాలు చూపించి అందులో విజయ్‌ కనిపించేలా చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ పాత్ర కూడా సెకండ్‌ పార్ట్‌లో తిరిగొస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ‘కల్కి 2’ ఈజీగా రూ.2000 కోట్ల మార్క్‌ను అందుకుంటుందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.&nbsp; కల్కి పాత్రలో ఎవరు? పురాణాల ప్రకారం కలిని మహా విష్ణువు అవతారమైన కల్కి అంతం చేస్తాడు. కల్కి షూటింగ్‌ మెుదలైనప్పటి నుంచి కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అంతా భావించారు. అయితే అతడ్ని కర్ణుడుగా చూపించి డైరెక్టర్‌ ఝలక్‌ ఇచ్చాడు. దీంతో సినిమాకు మూలమైన కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తొలి భాగం పూర్తయ్యే వరకూ కల్కి సుమతి గర్భంలోనే ఉన్నాడు. కాబట్టి సెకండ్‌ పార్ట్‌లో ఒక్కసారిగా పెరిగి పెద్దవాడైనట్లు చూపించే అవకాశం లేదు. కాబట్టి కల్కిని ఓ బాలుడిగా చూపించే ఛాన్స్‌ ఉంది. కలి అయిన సుప్రీమ్‌ యష్కిన్‌ను ఆ బాలుడు చంపేందుకు ప్రభాస్‌ (కర్ణుడు/భైరవ), అశ్వత్థామ (అమితాబ్‌ బచ్చన్‌) సాయం చేయవచ్చు.&nbsp; 'కల్కి 2' రిలీజ్‌ ఎప్పుడంటే? ‘కల్కి 2898 ఏడీ’ సూపర్‌ సక్సెస్‌ కావడంతో రెండో పార్ట్‌ రిలీజ్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కల్కి 2 రిలీజ్‌పై ఇటీవల నిర్మాత అశ్వనీదత్‌ మాట్లాడారు. 'కల్కి పార్ట్-2' షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సీక్రెట్​ను రివీల్ చేశారు.&nbsp; అంతేకాకుండా 2025 సమ్మర్​ కల్లా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 'త్వరగా అఫీషియల్ అప్డేట్​ ఇవ్వండి', 'పార్ట్ 2 కోసం వెయిటింగ్​' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.&nbsp;
    జూలై 08 , 2024
    <strong>Kalki 2: స్టార్‌ హీరోయిన్‌తో ప్రభాస్‌కు కొత్త చిక్కులు.. ‘కల్కి 2’ ఇప్పట్లో లేనట్లే!</strong>
    Kalki 2: స్టార్‌ హీరోయిన్‌తో ప్రభాస్‌కు కొత్త చిక్కులు.. ‘కల్కి 2’ ఇప్పట్లో లేనట్లే!
    ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. కమల్‌ హాసన్‌ (Kamal Hassan), అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), దీపికా పదుకొనే (Deepika Padukone) వంటి స్టార్‌ క్యాస్ట్‌ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అందరి అంచనాలను అందుకుంటూ రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై అందరి దృష్టి పడింది. ‘కల్కి 2’ ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఇప్పటి నుంచే ఆడియన్స్‌ ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ‘కల్కి 2’ షూట్‌ ఇప్పట్లో మెుదలయ్యేలా కనిపించడం లేదు. ఇందుకు స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకొనే కారణమని ప్రచారం జరుగుతోంది.&nbsp; షూటింగ్స్‌కు బ్రేక్‌! 'కల్కి 2' చిత్రం వచ్చే ఏడాది జూన్‌ - జులై కల్లా రిలీజ్‌ అవుతుందని నిర్మాత అశ్వని దత్‌ గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్‌ కూడా పూర్తైనట్లు పేర్కొన్నారు. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం 'కల్కి 2' రీమైనింగ్‌ షూటింగ్‌కు దీపిక పదుకొనే వల్ల బ్రేకులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రెగ్నెంట్‌. సెప్టెంబర్‌లో ఆమె బిడ్డకు జన్మనివ్వనుంది. బిడ్డ పుట్టాక కనీసం ఏడాది పాటు సినిమాలకు గ్యాప్‌ ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా తనకు ఎంతో ఇష్టమైన రోహిత్ శెట్టి ప్రాజెక్టును వదులుకున్నారట. అలాగే ఓ ప్రముఖ బాలీవుడ్‌ షోకు సైతం దీపిక నో చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి 'కల్కి 2' షూటింగ్‌కు కూడా ఆమె దూరంగా ఉండే ఛాన్స్ ఉంది.&nbsp; దీపికనే కీలకం! ‘కల్కి 2’ చిత్రానికి దీపికా పదుకొనే పాత్రే కీలకం. ఆమె చుట్టూనే సెకండ్‌ పార్ట్ తిరగనుంది. సంక్రాంతి తర్వాత నుంచి ‘కల్కి 2’ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని దర్శకుడు నాగ్ అశ్విన్‌ భావిస్తున్నారు. అటు హీరో ప్రభాస్‌ కూడా ‘కల్కి 2’ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దీపికా షూటింగ్‌ హాజరుకాకపోతే ఎలా అని కల్కి టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కల్కి కోసం ప్రభాస్‌ సిద్ధం చేసుకున్న డేట్స్‌ కూడా తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఊహించని పరిణామం ప్రభాస్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టినట్లు ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘కల్కి 2’ చిత్రం వచ్చే ఏడాది కాకుండా 2026లో రిలీజయ్యే అవకాశముందని విశ్లేషిస్తున్నాయి.&nbsp; అసలు కథ ‘పార్ట్‌ 2’లోనే! ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను గమనిస్తే తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికి సరిపోయినట్లు అనిపిస్తుంది. భైరవగా ప్రభాస్‌ (Prabhas), సుమతిగా దీపికా పదుకొనే (Deepika Padukone), అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), విలన్‌ సుప్రీమ్‌ యాష్కిన్‌గా కమల్‌ హాసన్‌ (Kamal Hassan), అర్జునుడుగా విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) పాత్రల చుట్టే కల్కి తిరిగింది. ఒక్కో పాత్ర నేపథ్యం, కథలో వారి ప్రాధాన్యతలను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తొలి భాగంలో చూపించాడు. కలియుగం అంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు, విలన్‌ సుప్రీమ్‌ యాష్కిన్‌ వారిని పెడుతున్న బాధలు కళ్లకు కట్టాడు. మహా విష్ణువు పదో అవతారమైన ‘కల్కి’ రాకకు ముందు ఉన్న పరిస్థితులను ‘పార్ట్‌ 1’లో చూపించారు. అయితే హీరో ప్రభాస్‌, విలన్‌ సుప్రీమ్ యాష్కిన్‌ ఒక్కసారి కూడా తొలి భాగంలో ఎదురెదురు పడలేదు. అయితే ‘పార్ట్‌ 2’లో వీరిద్దరు ఒకరితో ఒకరు నేరుగా తలపడవచ్చు. ఇది సెకండ్‌ పార్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనుంది.&nbsp; కమల్‌ హాసన్‌ విశ్వరూపం కల్కి సినిమాలో కమల్‌ హాసన్‌ పాత్ర నిడివి 15 నిమిషాల కంటే తక్కువే. రెండు మూడు డైలాగ్స్ మినహా ఆయన నటనను వీక్షించే అవకాశం ఆడియన్స్‌కు లభించలేదు. సుమతి (దీపిక పదుకొనే) గర్భం నుంచి సేకరించిన సీరాన్ని ఇంజెక్ట్‌ చేసుకొని సుప్రీమ్‌ యాష్కిన్‌ దైవ శక్తి పొందుతాడు. అతడు మరింత శక్తివంతంగా మారడాన్ని ‘కల్కి’ క్లైమాక్స్‌లో చూపించారు. దీంతో ‘కల్కి 2’లో కమల్‌ హాసన్‌ పాత్ర పూర్తి స్థాయిలో ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ కమల్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘కల్కి 2’ తాను ఎక్కువ సేపు కనిపిస్తానని చెప్పుకొచ్చారు. ఫలితంగా భైరవ నుంచి కర్ణుడిగా మారిన ప్రభాస్‌, అశ్వత్థామ అమితాబ్‌తో సుప్రీమ్‌ యాష్కిన్‌ నేరుగా తలపడే అవకాశముంది. ఈ క్రమంలో నటన పరంగా కమల్‌ హాసన్‌ విశ్వరూపం చూసే ఛాన్స్‌ ఫ్యాన్స్‌కు లభించవచ్చు. కల్కి పాత్రలో ఎవరు? పురాణాల ప్రకారం కలిని మహా విష్ణువు అవతారమైన కల్కి అంతం చేస్తాడు. కల్కి షూటింగ్‌ మెుదలైనప్పటి నుంచి కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అంతా భావించారు. అయితే అతడ్ని కర్ణుడుగా చూపించి డైరెక్టర్‌ ఝలక్‌ ఇచ్చాడు. దీంతో సినిమాకు మూలమైన కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తొలి భాగం పూర్తయ్యే వరకూ కల్కి సుమతి గర్భంలోనే ఉన్నాడు. కాబట్టి సెకండ్‌ పార్ట్‌లో ఒక్కసారిగా పెరిగి పెద్దవాడైనట్లు చూపించే అవకాశం లేదు. కాబట్టి కల్కిని ఓ బాలుడిగా చూపించే ఛాన్స్‌ ఉంది. కలి అయిన సుప్రీమ్‌ యష్కిన్‌ను ఆ బాలుడు చంపేందుకు ప్రభాస్‌ (కర్ణుడు/భైరవ), అశ్వత్థామ (అమితాబ్‌ బచ్చన్‌) సాయం చేయవచ్చు.&nbsp;
    ఆగస్టు 06 , 2024
    <strong>Kalki 2898 AD Top Dialogues: ‘కల్కి’ని సూపర్‌ సక్సెస్‌ చేసిన డైలాగ్స్‌ ఇవే..!</strong>
    Kalki 2898 AD Top Dialogues: ‘కల్కి’ని సూపర్‌ సక్సెస్‌ చేసిన డైలాగ్స్‌ ఇవే..!
    ప్రభాస్‌ (Prabhas).. ప్రస్తుతం ఈ పేరు యావత్‌ సినీ లోకాన్ని ఊర్రూతలూగిస్తోంది. థియేటర్లలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రభజనం కొనసాగుతున్న వేళ.. అందరూ ప్రభాస్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో అతడి నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ సీక్వెన్స్‌లో ప్రభాస్‌ అదరగొట్టాడని, ఇండియన్‌ సినిమా స్టాండర్డ్స్‌ను కల్కి టీమ్‌ గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లిందని అంటున్నారు. మరి ముఖ్యంగా కల్కిలో ప్రభాస్‌ డైలాగ్స్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ డైలాగ్స్‌ కల్కిలో పడ్డాయని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ సహా కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె ఇతర ప్రధాన తారాగణం చెప్పిన డైలాగ్స్‌ను కూడా ఫ్యాన్స్‌ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ప్రేక్షకులను మిస్మరైజ్‌ చేసిన కల్కి డైలాగ్స్ ఏవి? అవి ఏ సందర్భంలో వచ్చాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; కల్కి మూవీ డైలాగ్స్‌ కల్కి సినిమా ప్రారంభంలో కురుక్షేత్రం ఎపిసోడ్‌ చూపిస్తారు. గర్భస్త శిశువుపై అస్త్రాన్ని వదిలి.. అశ్వత్థామ పెద్ద తప్పు చేస్తాడు. దీంతో శ్రీకృష్ణుడు అతడ్ని శపించే క్రమంలో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.&nbsp; అశ్వత్థామ : చంపడానికి వస్తే నన్ను చంపు కృష్ణ. నీ ఉపదేశాలు వినడానికి నేను అర్జునుడ్ని కాదు.&nbsp; కృష్ణుడు : ఈ 18 రోజులు కురు క్షేత్రంలో జరిగిన పాపాల కన్నా.. నీ అధర్మం నిష్కృతమైనది. ధ్రోణాచార్యుడి పుత్రుడివి అయ్యుండి ఇంతకు దిగజారావా? అశ్వత్థామ : నా తండ్రి పేరు పలికే అర్హత నీకు లేదు. నువ్వు అనుకుంటే అతడి మరణాన్ని ఆపగలిగేవాడివి. కృష్ణుడు : అశ్వత్థామ.. దేవుడైనా క్రురుడైనా కర్మను తప్పించుకోలేరు. గర్భస్త శిశువుపై అస్త్రం వదిలావు. నీ ఖర్మ నువ్వు అనుభవించక తప్పదు.&nbsp; అశ్వత్థామ : అయితే సంధించు చక్రం.. విధించు నీ శిక్షని. కృష్ణుడు : చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ.. అది విముక్తి. కాలాంతరం పాండవులు అందరూ చనిపోతారు. నా శరీరమూ మరణిస్తుంది. ఈ యుగం అంతరిస్తుంది. కానీ, నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక.. చావు రాక.. బ్రతకలేక.. ఎన్నో పాపాలు చూస్తూ జీవిస్తావు. ఇదే నా శాపం. అశ్వత్థామ : మరి నా శాపానికి ప్రాయిశ్చిత్తం లేదా? కృష్ణుడు : నువ్వు నన్ను చంపాలనుకున్నావ్‌.. కానీ ఒక రోజు నువ్వే నన్ను కాపాడాలి.&nbsp; అశ్వత్థామ : నేనా? కృష్ణుడు : కలియుగం వస్తుంది. కలి వస్తున్నాడు. అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటి అయినప్పుడు నేను మళ్లీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి మహా శక్తిశాలి. ఎంత శక్తివంతుడు అంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భ గుడికి కాపలా కాయాలి. డైలాగ్‌ కాంప్లెక్స్‌ ఒక యువకుడిపై 5000 యూనిట్స్‌ నజరానా ప్రకటిస్తుంది. అతడ్ని పట్టుకునేందుకు ఓ గ్యాంగ్ వెళ్తుంది. ఈ సందర్భంలో పారిపోతున్న ఆ వ్యక్తికి బుజ్జి (AI వెహికల్‌).. సంకెళ్లు వేస్తుంది. అప్పుడు బుజ్జిపై విలన్‌ గ్యాంగ్‌ కాల్పులు జరుపుతారు. దీంతో బుజ్జి తన బాస్‌ భైరవ (ప్రభాస్‌)ను పరిచయం చేస్తూ బైరవకు ఎలివేషన్స్ ఇస్తుంది. బుజ్జి : హేయ్‌.. స్టాప్‌. నన్ను షూట్‌ చేస్తావా. ఇప్పుడు చూడు నా బాస్‌ వచ్చి మీ అందరిని స్మాష్‌ చేస్తాడు. విలన్‌ గ్యాంగ్‌: ఎవరు మీ బాస్‌? బుజ్జి : పాత యుద్ధాల్లో సోల్జర్‌. ఇంత వరకూ&nbsp; ఒక్క యుద్ధంలో ఓడిపోలేదు. ది వన్‌ అండ్‌ ఓన్లీ భైరవ (ఈ డైలాగ్‌ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు) భైరవ: ఎంట్రీ అనంతరం భైరవ నేలపై గురక పెట్టి నిద్ర పోతాడు.. బుజ్జి : భైరవ గెటప్‌.. చాలా బిల్డప్‌ ఇచ్చాను లే. భైరవ: బుజ్జి.. బుజ్జి.. ప్లీజ్‌ 5 మినిట్స్‌ పడుకుంటాను. (దీని తర్వాత ప్రభాస్‌ ఎంట్రీ ఫైట్‌ ఉంటుంది) డైలాగ్‌ సుప్రీమ్‌ యాస్కిన్‌ (కమల్‌ హాసన్‌).. కాంప్లెక్స్‌లో తన మనుషుల చేత గర్భిణి స్త్రీలపై ప్రయోగాలు చేయిస్తుంటాడు. దీంతో యాస్కిన్‌ బృందంలోని ఒక సైంటిస్టు అతడ్ని చంపడానికి యత్నిస్తాడు. యస్కిన్‌.. ఆ సెంటిస్టును చంపుతూ చెప్పే డైలాగ్స్‌ మెప్పిస్తాయి.&nbsp; సుప్రీమ్‌ యాస్కిన్‌: చావుకు నేను చాలా ప్రాణాలు ఇచ్చాను. అది నన్నేం చేయదు. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎందుకు నన్ను చంపాలనుకున్నావ్‌? సైంటిస్టు : మంచి కోసం..&nbsp; సుప్రీమ్‌ యాస్కిన్‌ : మంచి.. చరిత్రలో ఎన్ని ప్రాణాలు తీసిందో తెలుసా ఈ మంచి. రాజులు రాజ్యాలు మారుతున్న ప్రతీసారి మారుతుందీ మంచి. దాన్ని నమ్మోద్దు. ఇంతకీ నీకేం కావాలి? సైంటిస్టు : ఈ లోకాన్ని కాపాడాలి సుప్రీమ్ యాస్కిన్‌ : అదే కదా.. నేనూ చేసింది. దేవుడిని, డబ్బులని, వందల యుద్ధాలు చేసే అందరినీ ఒక్క యుద్ధంతో గెలిచాను తప్పా?. మీరు బూడిద చేస్తున్న ప్రకృతిని అందనంత దూరంలో పెట్టాను.. తప్పా? సైంటిస్టు : నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి నువ్వు ఎవరు? సుప్రీమ్‌ యాస్కిన్‌ : మరి నాశనం చేయడానికి మీరు ఎవరు? ఎన్ని యుగాలు అయినా.. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు.. మారలేడు. ఇది నీ తప్పు కాదులే. హ్యూమన్‌ బీయింగ్స్‌కు ఉన్న డిఫెక్టే అది.&nbsp; డైలాగ్‌ కల్కిని గర్భంలో మోస్తున్న సుమతి (దీపిక పదుకొణె)ని.. సుప్రీమ్‌ యస్కిన్‌ మనుషుల నుంచి కాపాడి అశ్వత్థామ శంబాలకు తీసుకు వస్తాడు. అప్పుడు శంబాలకు రక్షణాధికారిగా ఉన్న వ్యక్తి సుమతి ఎవరో తెలియక అడ్డుకుంటాడు. సందర్భంలో వచ్చే సీన్‌, డైలాగ్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. రక్షణాధికారి : ఆమెను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చావు. 5 మిలియన్ పౌండ్లు పెట్టారు ఈమె మీద. కాంప్లెక్స్‌ మాత్రమే కాదు వరల్డ్‌లో ప్రతీ ఒక్కరు ఆమె కోసం వెతుకున్నారు. ఎలా కాపాడతావు? అశ్వత్థామ : నేను కాపాడతాను రక్షణాధికారి : అసలు నువ్వు ఎవరు? పొడుగ్గా ఉంటే సరిపోదు. ఎప్పుడైనా యుద్ధం చేశావా? అశ్వత్థామ గురించి తెలిసిన బాలుడు: ఎక్స్‌క్యూజ్‌మీ.. మహాభారతంలో శ్రీకృష్ణుడితోనే యుద్ధం చేశాడు.. ఓకే. (ఇక్కడ హైలెట్‌ బీజీఎం వస్తుంది) రక్షణాధికారి : అందరికీ పిచ్చి ఎక్కిందా? ఈమె (సుమతి) ఇక్కడి రావడం వల్ల అందరికీ ఎంతో డేంజరో అర్థమవుతుందా? తను జస్ట్‌.. ల్యాబ్‌ నుంచి ఎస్కేప్‌ అయిన మామూలు ప్రెగ్నెంట్‌ ఉమెన్‌. ఏమీ స్పెషల్‌ ఉమెన్‌ కాదు. అయినా పుట్టేది దేవుడు అనడానికి ఏంటీ సాక్ష్యం. *ఆ డైలాగ్‌ అనగానే వెంటనే వర్షం మెుదలవుతుంది. అక్కడ వాన పడి చాలా కాలమే అయి ఉంటుంది. ఆమె రాకతో వర్షం పడటంతో కల్కి జన్మించేది ఆమె కడుపునే అని శంబాలా ప్రజలు నమ్ముతారు. ఈ సీన్‌ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. డైలాగ్‌ మహావిష్ణువు.. కల్కిగా పుట్టేందుకు తననే ఎందుకు ఎంచుకున్నాడని సుమతి (దీపిక).. అశ్వత్థామను ప్రశ్నిస్తుంది. ఆ సందర్భంలో వచ్చే డైలాగ్స్‌ మిస్మరైజింగ్‌ చేస్తాయి.&nbsp; అశ్వత్థామ : నువ్వు ప్రాణం ఇవ్వడానికే పుట్టావ్‌ అమ్మా? సుమతి : అసలు ఏం మాట్లాడుతున్నారు. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకా ఎంత మంది చనిపోవాలి? అశ్వత్థామ : ప్రతీ చావుకి ఒక పరమార్థం ఉంటుంది. ప్రతీ చావు లోకానికి కొత్త ఊపిరి పోస్తుందమ్మా. సుమతి : కానీ, నేనే ఎందుకు? అశ్వత్థామ : మోయగలిగిన శక్తి ఉన్నవారికే బాధ్యతను ఇస్తాడు ఆ దేవుడు. భగవంతుడ్ని కడుపులో మోయాలంటే భూదేవి అంత ఓర్పు ఉండాలి. మీలో ఆ ఓర్పు ఉందనే మిమ్మల్ని తల్లిగా ఎంచుకున్నారు.&nbsp; అశ్వత్థామ: నువ్వు ఇప్పుడు కనబోయేది మాములు ప్రాణం కాదమ్మ.. సృష్టిని. జన్మనివ్వడం నీ ధర్మం కాపాడటం నా బాధ్యత. డైలాగ్‌ శంబలకు తీసుకెళ్లిన సుమతి తనకు కావాలని కాంప్లెక్స్‌ ప్రతినిధి చటర్జీ తన మనుషులతో అంటాడు. అన్ని డైరెక్షన్స్‌లో రైడర్స్‌ పంపాం.. త్వరలోనే పట్టుకుంటామని అతని కమాండర్ చెబుతాడు. అప్పటికే అశ్వత్థామతో యుద్ధం చేసిన ప్రభాస్‌.. ఏమి చేయలేరని అంటాడు. ఈ సందర్బంలో ఛటర్జీతో అతడి సంభాషణ ఆకట్టుకుంటుంది. భైరవ : ఆ ముసలోడు ఉన్నంతవరకూ ఏం చేయలేరు. ఛటర్జీ : ముసలోడా? భైరవ : మీ వాళ్లందరినీ కొట్టింది అతడే? ఒక్కడు కూడా వాడ్ని టచ్‌ చేయలేదు. నేను తప్పా. ఛటర్జీ : వీడెవడు అసలు? కమాండర్‌: భైరవ అని బౌంటీ ఎంటర్‌ సర్‌. మన వాళ్లని కొడితే బ్లాక్‌ లిస్ట్‌ చేశాను.&nbsp; భైరవ: ఎలాగైనా బ్లాక్‌ లిస్ట్‌ చేశావు కదా. మళ్లీ కొడతా. పాయింట్‌ ఏంటి అంటే నేను ఒక్కడినే ఆ అమ్మాయిని తీసుకురాగలను. మీకు వేరే ఆప్షన్‌ లేదు.&nbsp; ఛటర్జీ : అంత ష్యూర్‌ ఆ..&nbsp; భైరవ : రికార్డ్స్‌ చూసుకో.. ఇంతవరకూ ఒక్క ఫైట్‌ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను.&nbsp; డైలాగ్‌ కల్కి క్లైమాక్స్‌లో.. కమల్‌ హాసన్‌ మీద వచ్చే సీన్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. శక్తిని పుంజుకున్న తర్వాత ఆయన చెప్పే 'జగన్నాథ రథచక్రాల్‌ వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌.. రథచక్ర ప్రళయఘోళ భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను'.. అనే డైలాగ్‌ సెకండ్‌ పార్ట్‌లో తాను ఎంత విధ్వంసం సృష్టిస్తానో తెలియజేస్తుంది. అయితే ఈ డైలాగ్‌ శ్రీశ్రీ మహా ప్రస్థానం లోనిది. 44 ఏళ్ల క్రితం ఆకలి రాజ్యం సినిమాలో ఇదే డైలాగ్‌ను కమల్‌ హాసన్ చెప్తారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అతడి నోట శ్రీశ్రీ కవిత వినిపించడం ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది.&nbsp; View this post on Instagram A post shared by TELUGU SONGS OLD (@telugu_songs_old) డైలాగ్‌ కల్కిలో అప్పటివరకూ భైరవగా ఉన్న ప్రభాస్‌.. చివరి భాగంలో కర్ణుడిగా కనిపించి అందరికీ షాకిస్తాడు. చివరి పది నిమిషాల మహాభారతం ఎపిసోడ్‌లో కర్ణుడిగా కనిపించి స్క్రీన‌ను షేక్‌ చేస్తాడు.&nbsp; ‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’ అంటూ ప్రభాస్‌ విల్లు పట్టుకుని రథంపై నిలబడగా.. థియేటర్‌ మొత్తం దద్దరిల్లిపోయింది. భైరవను కర్ణుడిగా పరిచయం చేసే సందర్భంలో వచ్చే కురుక్షేత్రంలోని డైలాగ్స్‌ విజిల్స్‌ వేయిస్తాయి.&nbsp; అర్జునుడు : అశ్వత్థామ.. తలరాతను రాసే బ్రహ్మ చేసిన గాంఢీవం ఇది. దీనిని ఎవరు అడ్డుకోలేరు. కర్ణుడు: ప్రభాస్‌ ఎంట్రీ ఇచ్చి అర్జునుడు వేసిన బాణాన్ని నిలువరిస్తాడు. ఆ సందర్భంలో ఆలస్యమైందా ఆచార్య దేవా? అని అశ్వత్థామతో అంటాడు. అశ్వత్థామ: లేదు.. సరైన సమయంలోనే వచ్చావు.&nbsp; అర్జునుడు: చూశావా.. కేశవ (కృష్ణుడు). తను నాకు సమానుడా? వాడ్ని (కర్ణుడు) అడ్డుకొని మన రథం కేవలం రెండు అడుగులు వెనక్కి వెళ్లింది. నా అస్త్రానికి అతడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్లింది.&nbsp; కృష్ణుడు : ఓ ధనుంజయ.. నీ రథం అగ్నిదేవుడి వరం. కాపాడుతున్నదని జెండాపై కపిరాజు (హనుమంతుడు).&nbsp; నడుపుతున్నది ముల్లోకాలు నడిపించే నేను. అయినా రెండడుగులు వెనక్కి తోశాడంటే ఆలోచించు అర్జునా.&nbsp; కృష్ణుడు: తను (కర్ణుడు) సామాన్య యోధుడు కాదు. తన కళ్లల్లోని తేజస్సు.. తన చేతిలోని ధనస్సు.. తన పేరు.. చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. సూర్య పుత్ర వైకర్ణ.. కర్ణ. (ఈ డైలాగ్‌తో కల్కి తొలిపార్ట్‌ ముగుస్తుంది).
    జూలై 02 , 2024
    <strong>Kalki 2898 AD Review: ఇండియన్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన ‘కల్కి’.. సినిమా ఎలా ఉందంటే?</strong>
    Kalki 2898 AD Review: ఇండియన్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన ‘కల్కి’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌, దుల్కర్ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, దిశా పటాని, రానా దగ్గుబాటి, అన్నా బెన్‌ తదితరులు రచన, దర్శకత్వం : నాగ్‌ అశ్విన్‌ సంగీతం : సంతోష్‌ నారాయణన్‌ ఎడిటింగ్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు నిర్మాతలు : అశ్విని దత్‌, ప్రియాంక దత్‌, స్వప్న దత్‌ నిర్మాణ సంస్థ : వైజయంతీ మూవీస్‌ మేకర్స్ విడుదల తేదీ : 27 జూన్‌, 2024 ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై గ్లోబల్‌ స్థాయిలో బజ్‌ ఉంది. ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, కమల్‌హాసన్‌, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ నుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ హాలీవుడ్ రేంజ్‌లో ఉండటంతో ఎక్స్‌పెక్టేషన్స్‌ మరింత పీక్స్‌కు వెళ్లాయి. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌ రూపొందిన ఈ చిత్రం.. జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు అంచనాలను అందుకుందా? ప్రభాస్‌ ఖాతాలో మరో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ చేరినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి 'కల్కి 2898 ఏడీ' కథ.. మహాభారతంలో ధర్మరాజు ఆడిన అబద్దం నుంచి మెుదలవుతుంది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్‌).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. మరోవైపు కాశీలో నివసించే భైరవ (ప్రభాస్‌) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇందుకోసం అతడికి 1 మిలియన్‌ యూనిట్లు అవసరం అవుతాయి. అయితే సుమతిని పట్టుకుంటే ఆ మెుత్తం లభిస్తుందని భైరవ తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్‌ యష్కిన్‌ (కమల్‌ హాసన్‌) పాత్ర ఏంటి? అతనికి సుమతి ఎందుకు కావాలి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? కాశీ, శంబాలా ప్రజలు ఎందుకు కష్టాల్లో మునిగిపోయారు? విజయ్‌ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌ పాత్రలు ఏంటి? అన్నది తెలియాలంటే కల్కి సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన విశ్వరూపం చూపించాడు. భైరవ పాత్రలో అదరగొట్టాడు. యాక్షన్స్‌ సీక్వెన్స్‌లో మరోమారు తన మార్క్‌ ఏంటో చూపించాడు. తొలి అర్ధభాగంలో అతడి పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌ చేశాడు. బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అశ్వత్థామ పాత్రలో ఆయన నెవర్‌ బీఫోర్‌ నటనతో మెప్పించారు. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేనంత బాగా నటించారు అమితాబ్‌. యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. విలన్‌గా కమల్‌ హాసన్‌ నెక్స్ట్‌ లెవెల్‌ పర్‌ఫార్మెన్స్‌తో అదరహో అనిపించారు. దీపికా, దిశా పటాని పాత్రలు ఆకట్టుకున్నాయి. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, రాజమౌళి, రానా, ఆర్జీవీ క్యామియో మెప్పిస్తాయి. మిగిలిన పాత్రదారులు అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పేరు.. కల్కితో గ్లోబల్ స్థాయిలో మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి అతిపెద్ద బలం నాగ్‌ అశ్విన్‌ రాసుకున్న కథ. నాగ్ అశ్విన్‌ టేకింగ్‌, విజన్‌, ప్రెజంటేషన్‌కు నూటికి నూరు శాతం మార్కులు ఇవ్వాల్సిందే. తొలి 40 నిమిషాలు కథ స్లోగా నడుస్తున్నట్లు అనిపించినా ఎక్కడా బోర్‌ కొట్టకుండా నాగ్‌ అశ్విన్‌ జాగ్రత్త పడ్డారు. ఇక ఆ తర్వాత నుంచి కథలో వేగం పెరుగుతుంది. క్లైమాక్స్‌ వరకూ ఒకే ఇంటెన్సిటీతో సినిమాను నడిపించారు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్‌ సీన్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. ఫ్యూచరిక్‌ వెహికల్స్‌, ఆయుధాలు, సెట్స్‌ విజువల్‌ వండర్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా చివరి 45 నిమిషాలు నెక్స్ట్‌ లెవల్లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశారు దర్శకుడు. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్‌ కాస్త తడబడినట్లు కనిపిస్తోంది. కొన్ని సన్నివేశాలు మరీ సాగదీతలా అనిపిస్తాయి. మాస్‌ ఆడియన్స్‌కు అలరించే అంశాలు లేకపోవడం మైనస్‌. దీపికా డబ్బింగ్‌ విషయంలోనూ నాగ్‌ అశ్విన్‌ కాస్త జాగ్రపడి ఉంటే బాగుండేది. అయితే మెుత్తంగా నాగ్‌ అశ్విన్‌.. డైరెక్టర్‌గా సూపర్‌ సక్సెస్‌ అయినట్లు చెప్పవచ్చు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు అత్యుత్తమ పనితనాన్ని కనబరిచాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు ఎక్కువ మార్కులు ఇవ్వాల్సిందే. సినిమాటోగ్రాఫర్‌ అద్భుత పనితీరు కనబరిచారు. సంతోష్‌ నారాయణన్‌ అందించిన సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా నేపథ్యం సంగీతం యాక్షన్‌ సన్నివేశాలను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో వారు ఎక్కడా రాజీపడలేదు. ప్రతీ సీన్‌ చాలా రిచ్‌గా ఉంది.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథ, దర్శకత్వంప్రభాస్‌&nbsp;ప్రధాన తారాగణం నటనహాలీవుడ్‌ రేంజ్‌ విజువల్స్‌కురుక్షేత్రం ఎపిసోడ్‌ మైనస్‌ పాయింట్స్‌ తొలి 40 నిమిషాల ఎపిసోడ్‌దీపికా డబ్బింగ్‌ఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 4/5&nbsp;&nbsp; Public Talk On Kalki 2898 AD ప్రభాస్‌ కల్కి (Kalki 2898 AD) చిత్రంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇన్ని రోజుల నిరీక్షణకు తగ్గ ఫలితం దక్కిందని ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానులు అంటున్నారు. కల్కి దెబ్బకు బాక్సాఫీస్‌ రికార్డులు అన్ని చెరిగిపోవడం ఖాయమని పోస్టులు పెడుతున్నారు.&nbsp; కల్కి సినిమాను పెద్ద సక్సెస్‌ చేసినందుకు కృష్ణంరాజు రెండో భార్య శ్యామలా దేవి ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో ప్రభాస్‌ను చూస్తే 1000 రెబల్‌ స్టార్లు కలిసినట్లు ఉందని పేర్కొన్నారు. https://twitter.com/i/status/1806243116405723294 కల్కి సినిమాలో విజయ్‌ దేవరకొండ.. ఓ ముఖ్యపాత్రలో కనిపించడంపై రౌడీ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. విజయ్‌ పాత్రకు సంబంధించిన క్లిప్‌ను నెట్టింట ట్రెండ్‌ చేస్తున్నారు. కల్కి లాంటి బ్లాక్ బాస్టర్‌ తమ హీరో భాగస్వామి అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1806146620867912015 అటు దుల్కర్‌ సల్మాన్ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఈ సినిమాలో దుల్కర్‌ క్యామియో అద్భుతంగా ఉందంటూ అతడి ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1806187132450406624 కల్కిలో రాజమౌళి పాత్ర కూడా తమను ఎంతో సర్‌ప్రైజ్‌ చేసిందని పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అతడి ఎంట్రీకి తాము ఫిదా అయినట్లు చెబుతున్నారు.&nbsp; https://twitter.com/i/status/1806177761280578043 ‘కల్కి 2898 ఏడీ’ చూసిన ఓ అభిమాని నెట్టింట ఆసక్తికర పోస్టు పెట్టాడు. సినిమా లవర్స్‌.. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కాళ్లు మెుక్కి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఓ వీడియోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/saidevendla/status/1806199250327359793 కల్కి సూపర్‌ హిట్‌ టాక్‌ చూసి.. మూవీ యూనిట్‌ మెుత్తం ఫుల్‌ జోష్‌లో ఉన్నట్లు అర్థం వచ్చేలా ఒక నెటిజన్‌ ఓ ఆసక్తిర వీడియోను పంచుకున్నాడు. ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, అమితాబ్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాత అశ్వనిదత్‌ చిందులు వేస్తునట్లుగా మాస్టర్‌ సినిమాలోని డ్యాన్స్‌ క్లిప్‌ను ఎడిటింగ్‌ చేసి పంచుకున్నాడు. https://twitter.com/i/status/1806199186813288713 ప్రభాస్‌కు ఈ స్థాయి సక్సెస్‌ను అందించినందుకు రెబల్‌ స్టార్ ఫ్యాన్స్‌ అందరూ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌కు మెుక్కుతున్నట్లు ఉన్న ఓ వీడియో పెద్ద ఎత్తున ట్రెండింగ్‌ అవుతోంది. ఖలేజా సినిమాలో ఓ సీన్‌ను ఎడిట్‌ చేసి పోస్టు చేశారు.&nbsp; https://twitter.com/i/status/1806199040368910540 ప్రభాస్‌ గత చిత్రం ‘సలార్‌’ కేవలం యూత్‌కు మాత్రమే నచ్చిందని.. కానీ, కల్కి యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ముఖ్యంగా మూవీలోని మహాభారతం ఎపిసోడ్‌కు పునకాలు వచ్చినట్లు పేర్కొన్నారు.&nbsp; https://twitter.com/SALAARSURYAA/status/1806198851164066271 పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకిరా నందన్‌ కూడా కల్కి థియేటర్‌ వద్ద సందడి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లోకి అకిరా వెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; https://twitter.com/i/status/1806198649107755236 కల్కి.. రెగ్యులర్‌ చిత్రం లాంటింది కాదని.. కచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిన మూవీ అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.&nbsp; https://twitter.com/btrsir/status/1806056337714864288?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1806056337714864288%7Ctwgr%5E340e81c546b0e7d2540bbcb78327e8a93b350cf2%7Ctwcon%5Es1_&amp;ref_url=http%3A%2F%2Fnewsroom.etvbharat.org కల్కి సెకండాఫ్‌ ఒక మాస్టర్‌ పీస్‌ అని, చివరి 45 నిమిషాలు గూస్‌ బంప్స్‌ తెప్పించాయని ఓ అభిమాని పోస్టు పెట్టాడు. ప్రభాస్‌, అమితాబ్‌ తమ నటనతో థియేటర్లను షేక్‌ చేశారని చెప్పుకొచ్చాడు.&nbsp; https://twitter.com/SivaHarsha_23/status/1806175733125132706 కల్కి సినిమా సక్సెస్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోంది. దీనికి అర్థం పట్టేలా ఓ అభిమాని షేర్‌ చేసిన వీడియో నెట్టింట ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/i/status/1806134805542941036
    జూన్ 27 , 2024
    Ugadi Special Movie Posters: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
    Ugadi Special Movie Posters: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
    ఉగాది సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. ఉగాది స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; సరిపోదా శనివారం నాని హీరోగా చేస్తున్న 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram) చిత్రం నుంచి ఓ ఆకర్షణీయమైన పోస్టర్‌ రిలీజైంది. ప్రముఖ నటుడు సాయికుమార్‌ నానితో పాటు ఈ పోస్టర్‌లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ చేసింది. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్‌ కానున్నట్లు మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.&nbsp; RT 75 ఇటీవల ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja).. తన తర్వాతి ప్రాజెక్టును ఉగాది సందర్భంగా అనౌన్స్ చేశారు. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రైటర్‌ భాను బొగ్గవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లవ్‌ మౌళి ప్రముఖ నటుడు నవదీప్ (Navdeep) హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ ట్రైలర్‌ వీక్షకులను ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/i/status/1777920829575078381 అరణ్మనై 4&nbsp; రాశీ ఖన్నా (Rashi Khanna), తమన్నా (Tamannaah), సుందర్. సి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరణ్మనై 4’ (Aranmanai 4) చిత్రం నుంచి కూడా ఉగాది కానుకగా ఓ పోస్టర్‌ విడుదలైంది. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్‌ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. కమిటీ కుర్రోళ్లు నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో రూపొందుతున్న ప్రొడక్షన్‌ నెం.1 చిత్రానికి ఉగాది సందర్భంగా టైటిల్‌ ఎనౌన్స్ చేశారు. 'కమిటీ కుర్రోళ్లు' అనే పేరును ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను సుప్రీమ్‌ హీరో సాయి దుర్గా తేజ్‌ అనౌన్స్‌ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. దర్శకుడు యదు వంశీ కొత్త వాళ్లతో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. https://twitter.com/i/status/1777941376782786758 ధూం ధాం చైతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ (Hebha Patel) జంటగా నటిస్తున్న 'ధూం ధాం' (Dhoom Dhaam) చిత్రం నుంచి కూడా కొత్త పోస్టర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన తారాగణం అంతా కనిపించింది. ఈ మూవీని దర్శకుడు సాయి కిషోర్‌ తెరకెక్కిస్తున్నారు.&nbsp; ఏ మాస్టర్‌ పీస్‌&nbsp; సుకు పూర్వజ్‌ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఏ మాస్టర్‌ పీస్‌' (A Master Peace). అరవింద్‌ కృష్ణ, జ్యోతి పుర్వాజ్‌, అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి పండగ సందర్భంగా పోస్టర్‌ రిలీజైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దేవకి నందన వాసుదేవ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్‌ గల్లా (Ashok Galla) నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vaasudeva). మేకర్స్ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఇందులో అశోక్‌ గల్లా లుక్ ఆకట్టుకుంటోంది. భలే ఉన్నాడే! యువ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tharun) హీరోగా రూపొందుతున్న భలే ఉన్నాడే సినిమా నుంచి ఓ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో రాజ్‌ తరుణ్‌ ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించాడు.&nbsp; ప్రతినిధి 2 నారా రోహిత్‌ (Nara Rohit) హీరోగా ప్రముఖ జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రతినిధి 2’ (Pratinidhi 2). ఈ మూవీ పోస్టర్‌ కూడా ఉగాది సందర్భంగా విడుదలై సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.&nbsp; కృష్ణమ్మ&nbsp; సత్యదేవ్‌ (Satya Dev) లేటెస్ట్‌ మూవీ ‘కృష్ణమ్మ’ (Krishnamma) నుంచి ఉగాది సందర్భంగా ఓ సాలిడ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీలోని దుర్గమ్మ పాటను ఏప్రిల్‌ 11న ఉ.11.11 గం.లకు రిలీజ్‌ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో సత్యదేవ్‌ త్రిశూలం పట్టుకొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు.&nbsp;
    ఏప్రిల్ 10 , 2024
    మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    స్వయంకృషితో సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానానికి ఎదగ వచ్చని నిరూపించిన వ్యక్తి ఆయన. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టించిన ఆచార్యుడు. కొత్త టాలెంట్ ఉన్న యువకులకు అండగా నిలబడే 'అన్నయ్య' ఆయన. కోవిడ్ సమయంలో ఎంతో మందికి సాయం చేసిన ఆపాద్బాంధవుడు. ఆయనెవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి. పద్మవిభూషణుడిగా వెలుగొందుతూ.. భావితరాలకు స్ఫూర్తి నింపుతున్న చిరంజీవిగారి గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.. చిరంజీవి అసలు పేరు? కొణిదెల శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు చిరంజీవి నటించిన తొలి సినిమా? ప్రాణం ఖరీదు, (చిరంజీవి నటింటిన తొలి చిత్రం పునాది రాళ్లు అయినా.. ప్రాణం ఖరీదు ముందుగా విడులైంది) చిరంజీవి ఎక్కడ పుట్టారు? పశ్చిమ గోదావరి, మొగల్తూరు, ఆంధ్రప్రదేశ్ చిరంజీవి పుట్టిన తేదీ ఎప్పుడు? 1955 ఆగస్టు 22 చిరంజీవి భార్య పేరు? ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను 1980లో పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి అభిరుచులు? చిరంజీవికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటాడు చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎవరు ఇచ్చారు?&nbsp; "సుప్రీమ్‌ హీరో"గా గుర్తింపు పొందిన చిరంజీవి.. తర్వాత మెగాస్టార్‌గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. 'మరణ మృదంగం' చిత్రం విజయం తర్వాత ఆ సినిమా నిర్మాత కేఎస్‌ రామారావు, చిరంజీవిని మెగాస్టార్‌గా పిలవడం ప్రారంభించారు. చిరంజీవి బ్రేక్ డ్యాన్స్‌ ఏ సినిమాలో ఫస్ట్‌ టైం చేశారు? పసివాడి ప్రాణం చిత్రం ద్వారా చిరంజీవి తొలిసారి తెలుగులో బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశారు చిరంజీవికి ఇష్టమైన సినిమా? రుద్రవీణ చిరంజీవికి ఇష్టమైన పాటలు? రుద్రవీణ చిత్రంలోని 'నమ్మకు నమ్మకు ఈ రేయిని' పాట అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. చిరంజీవి అభిమాన నటుడు? అమితాబ్ బచ్చన్, శత్రఘ్ను సిన్హా చిరంజీవికి స్టార్ డం అందించిన చిత్రం? ఖైదీ చిరంజీవికి ఇష్టమైన కలర్? బ్లాక్ అండ్ వైట్ చిరంజీవి తల్లిదండ్రుల పేర్లు? కొణిదెల వెంక‌ట్రావ్, అంజనా దేవి&nbsp; చిరంజీవి ఏం చదివారు? BCom https://www.youtube.com/watch?v=hURrrR2lMrY చిరంజీవి ఎన్ని సినిమాల్లో నటించారు? 150కి పైగా సినిమాల్లో నటించారు చిరంజీవికి ఇష్టమైన ఆహారం? బొమ్మడాయిల పులుసు, చిన్న చిన్న చెపల్లో చింతకాయ వేసి వండితే ఇష్టంగా తింటారు. చిరంజీవి నికర ఆస్తుల విలువ ఎంత? రూ.3000కోట్లు చిరంజీవి సినిమాకి ఎంత తీసుకుంటారు? &nbsp;ఒక్కో సినిమాకి దాదాపు రూ.70కోట్లు తీసుకుంటారు.
    మార్చి 19 , 2024
    Telugu Debut Directors: ఎన్ని సినిమాలు తీశాం అన్నది కాదన్నయ్యా...స్టార్ డైరెక్టర్ అయ్యామా లేదా?
    Telugu Debut Directors: ఎన్ని సినిమాలు తీశాం అన్నది కాదన్నయ్యా...స్టార్ డైరెక్టర్ అయ్యామా లేదా?
    తెలుగు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్‌గా స్థిరపడటమంటే మామూలు విషయం కాదు. దానికి ఎన్నో సంవత్సరాల కృషి అవసరం. కొందరికి నాలుగైదు సినిమాలకు డైరెక్టర్‌గా గుర్తింపు వస్తే ఇంకొందరికి 10 సినిమాల వరకు పట్టొచ్చు. కానీ, ఇందుకు భిన్నంగా అరంగేట్ర సినిమాతోనే కొందరు డైరెక్టర్లు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. దశాబ్ద కాలానికి వచ్చే పేరును మెుదటి సినిమాతోనే సొంతం చేసుకున్నారు. తద్వారా టాలీవుడ్‌లో అగ్రడైరెక్టర్ల సరసన చేరిపోయారు. టాలీవుడ్‌లో బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.. 1. శ్రీకాంత్ ఓదెల&nbsp;(srikanth odela) ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల పేరు టాలీవుడ్‌లో మార్మోగుతోంది. తొలి సినిమా ‘దసరా’ తోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన శ్రీకాంత్‌.. డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దసరా సినిమా చూసిన వారంతా శ్రీకాంత్‌ డైరెక్షన్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌ను తెరపై చాలా బాగా చూపించాడని ప్రశంసిస్తున్నారు. కాగా, సుకుమార్‌ దగ్గర శ్రీకాంత్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలు విజయంలో కీలక పాత్ర పోషించాడు.&nbsp; 2. వేణు ఎల్దండి(Venu Yeldandi) బలగం సినిమాతో వేణు ఎల్దండి గొప్ప డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. చిన్న సినిమాగా వచ్చిన బలగం అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. వేణు డైరెక్షన్‌ స్కిల్స్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి కట్టుబాట్లు, ప్రేమానురాగాలను వేణు చాలా చక్కగా చూపించాడు. తెలంగాణలోని ప్రతీ పల్లెలోను తెరలు కట్టుకొని మరీ సినిమాను చూస్తున్నారంటే బలగం ఏ రేంజ్‌లో ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.&nbsp; 3. బుచ్చిబాబు సాన(buchi babu sana) డైరెక్టర్‌ బుచ్చిబాబు కూడా తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ కృతి శెట్టి ఇద్దరు కొత్త వారే అయినప్పటికీ బుచ్చిబాబు తన డైరక్షన్‌ స్కిల్స్‌తో సినిమాను నిలబెట్టాడు. స్వచ్చమైన ప్రేమ కావ్యాన్ని తెలుగు ఆడియన్స్‌కు అందించాడు. ఈ సూపర్‌ హిట్‌ సాధించడంతో బుచ్చిబాబు టాలెంట్‌ ఇండస్ట్రీ అంతా తెలిసింది. దీంతో తన రెండో సినిమానే రామ్‌చరణ్‌తో చేసే అవకాశం లభించింది. బుచ్చిబాబు కూడా సుకుమార్‌ దగ్గరే దర్శకత్వ పాఠాలు నేర్చుకోవడం విశేషం. 4. సందీప్‌ వంగా(sandeep reddy vanga) అర్జున్‌ రెడ్డి సినిమాతో విజయ్‌ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్‌ హీరోగా మారిపోయాడు. ఆ సినిమా డైరెక్ట్‌ చేసిన సందీప్‌ వంగా కూడా అంతే స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. మెుదట అర్జున్‌ రెడ్డి ప్రచార చిత్రాలు, ట్రైలర్‌ చూసి పెద్ద దుమారమే రేగింది. కానీ, సినిమా రిలీజ్‌ తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. పెద్ద ఎత్తున యువత సినిమాకు కనెక్ట్‌ అయ్యారు. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌ అనే చెప్పాలి. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి సందీప్‌ ఓ సినిమా చేయబోతున్నాడు. పుష్ప2 షూటింగ్‌ పూర్తైన వెంటనే బన్నీ ఈ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు. 5. అనిల్‌ రావిపూడి(anil ravipudi) డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తీసిన తొలి చిత్రం ‘పటాస్‌’ ఘన విజయం సాధించింది. హీరో కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లో గొప్ప హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో హాస్య దర్శకుడిగా అనిల్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, F2, సరిలేరు నీకెవ్వరు, F3 చిత్రాలు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల సరసన అనిల్‌ను నిలబెట్టాయి. ప్రస్తుతం అనిల్‌ బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు.&nbsp; 6. సుజీత్‌ (sujeeth) డైరెక్టర్‌ సుజీత్‌ కూడా రన్‌ రాజా రన్‌ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యారు. ఈ సినిమాకు గాను సుజీత్‌ ఉత్తమ అరంగేట్ర డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నాడు. అయితే ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ డైరెక్షన్‌లో వచ్చిన రీసెంట్ మూవీ సాహో బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో సుజీత్‌ ఓ సినిమా చేస్తున్నాడు. 7. తరుణ్‌ భాస్కర్‌(Tharun Bhascker) పెళ్లి చూపులు చిత్రం ద్వారా టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా తరుణ్‌ భాస్కర్ గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్‌ అండ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఈ సినిమాకు గాను తరణ్‌ భాస్కర్‌ సైమా అవార్డ్స్‌-2016 సైమా అవార్డ్స్‌ అందుకున్నారు. ఉత్తమ అరంగేట్ర డైెరెక్టర్‌గా పురస్కారాన్ని పొందారు. పెళ్లి చూపులు తర్వాత చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా కూడా తరుణ్‌కు మంచి హిట్‌ ఇచ్చింది. ఈ సినిమా ద్వారానే విశ్వక్‌ సేన్‌ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.&nbsp; 8. స్వరూప్‌ RSJ ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో డైరెక్టర్‌గా స్వరూప్‌ RSJ&nbsp; టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో పాటు స్వరూప్‌ డైరెక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి. రొటిన్‌ కామెడీతో వస్తున్న సినిమాలకు ఈ చిత్రం ట్రెండ్ సెటర్‌గా నిలిచింది. మిషన్‌ ఇంపాజిబుల్‌ (2022) చిత్రం ద్వారా మరోమారు స్వరూప్ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. 9. అజయ్ భూపతి(Ajay Bhupathi) అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన RX100 చిత్రం పెద్ద సంచలనమే అని చెప్పాలి. 'యాన్‌ ఇన్‌క్రెడిబుల్‌ లవ్‌ స్టోరీ' అనే ట్యాగ్‌లైన్‌కి తగ్గట్టే సినిమాను చాలా డిఫరేంట్‌గా తెరపైకి ఎక్కించాడు. ఈ సినిమా యూత్‌కు తెగ కనెక్ట్ అయింది. దీంతో అజయ్‌ భూపతి పేరు అప్పట్లో మార్మోగింది. ఆ తర్వాత అజయ్‌ తీసిని మహాసముద్రం (2021) బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.&nbsp; 10. కరుణ కుమార్‌(karuna kumar) డైరెక్టర్‌ కరుణ కుమార్‌ కూడా తన తొలి సినిమా పలాసతో మంచి డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. తన సొంత ఊరులో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు అప్పట్లో కరుణ కుమార్ తెలిపారు. కుల వివక్ష, అంటరానితనం, దళితుల శ్రమ దోపిడి వంటి అంశాలను పలాసలో చక్కగా చూపించాడు. ఈ సినిమాకు గాను కరుణ కుమార్‌ను సైమా అవార్డ్‌ వరించింది. ఉత్తమ అరంగేట్ర డైరెక్టర్‌-2020 పురస్కారాన్ని అందించింది. అయితే ఆ తర్వాత కరుణ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్‌, కళాపురం చిత్రాలు ఆకట్టుకోలేదు.
    ఏప్రిల్ 12 , 2023
    MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
    MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
    ఒకప్పుడు టాలీవుడ్‌ అనగానే ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్‌ కృష్ణ గుర్తుకువచ్చేవారు. కానీ చిరంజీవి (Chiranjeevi) రాకతో తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్‌కు ఎన్నో సూపర్‌ హిట్స్‌ అందించిన చిరు.. ఇండస్ట్రీలో అగ్రహీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తద్వారా తన ఫ్యామిలీలోని యువతరానికి ఇండస్ట్రీ తలుపులు తెరిచాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా హీరోల హవా నడుస్తోంది. ప్రతీ ఏడాది మెగా హీరోల నుంచి కనీసం ఒక సినిమా అయినా రావాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌ను శాసిస్తున్న మెగా హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.. పవన్‌ కల్యాణ్‌ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో ఒకరిగా క్రేజ్‌ సంపాదించాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (1996) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్‌.. సుస్వాగతం, తొలి ప్రేమ, ఖుషీ మూవీలతో అగ్రహీరోల సరసన చేరిపోయాడు. రీసెంట్‌గా పవన్‌ తీసిన వకీల్‌ సాబ్‌ (Vakeel saab), భీమ్లా నాయక్‌ (Bheemla Nayak) సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, హరిహర వీర మల్లు సినిమా షూటింగ్‌లలో పవన్‌ బిజీగా ఉన్నాడు.&nbsp; రామ్‌చరణ్‌ చిరు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్‌చరణ్ (Ram Charan).. ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు. మెుదట చిరుత సినిమా ద్వారా చరణ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మగధీర సినిమాతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రంగస్థలం (Rangasthalam) సినిమాతో చెర్రీ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దానిని ఆర్‌ఆర్‌ఆర్‌ మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్‌ సినిమాలో చరణ్‌ నటిస్తున్నాడు. దాని తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్‌ సినిమా ఉండనుంది.&nbsp; అల్లుఅర్జున్‌ చిరు మేనల్లుడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా అల్లుఅర్జున్‌ (Allu Arjun) సినిమాల్లోకి వచ్చారు. తొలి సినిమా ‘గంగోత్రి’తో బన్ని మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన ఆర్య, బన్నీ, దేశముదురు చిత్రాలతో హీరోగా అల్లుఅర్జున్ స్థిరపడ్డారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమాతో బన్నీ పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తెలుగు హీరోల్లో బన్నీ తొలిస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) షూటింగ్‌లో బన్నీ బిజీబిజీగా గడుపుతున్నాడు.&nbsp; సాయిధరమ్‌ తేజ్‌ చిరంజీవి సోదరి కుమారుడైన సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కూడా మెగా మేనల్లుడుగానే ఇండస్ట్రీ తలుపు తట్టాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ (2014) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.&nbsp;సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌, సుప్రీమ్‌, చిత్ర లహారి సినిమాల ద్వారా సూపర్‌ హిట్స్ అందుకున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ లేటెస్ట్‌ మూవీ విరూపాక్ష ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; వరణ్‌ తేజ్‌&nbsp; మెగా బ్రదర్‌ నాగబాబు కుమారుడిగా వరణ్‌ తేజ్‌(Varun Tej) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం ‘ముకుంద’తో తేజ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తేజ్‌ హీరోగా చేసిన కంచె, అంతరిక్షం, తొలిప్రేమ, ఫిదా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం తేజ్‌ VT13, గాంధీవదారి అర్జున సినిమాల్లో నటిస్తున్నాడు.&nbsp; పంజా వైష్ణవ్‌ తేజ్‌ పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej) కూడా చిరు సోదరి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమా ఉప్పెనతోనే ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొండపొలం మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే రీసెంట్‌గా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా వైష్ణవ్‌కు షాక్‌ ఇచ్చింది. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.&nbsp; అల్లు శిరీష్‌ చిరు మేనల్లుడిగా, బన్నీ తమ్ముడిగా అల్లు శిరీష్‌ (Allu Sirish) సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తొలి చిత్రం గౌరవంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్‌... ఒక క్షణం, ABCD, కొత్త జంట సినిమాలతో ఆకట్టుకున్నాడు. శిరీష్‌ చేసిన శ్రీరస్తూ శుభమస్తూ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. అయితే శిరీష్‌ లేటెస్‌ మూవీ ఊర్వశివో రాక్షసివో చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.&nbsp; కళ్యాణ్‌ దేవ్‌ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. విజేత సినిమా ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణ్‌ దేవ్‌ పర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూపర్‌ మచ్చి, కిన్నెర సాని చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.&nbsp;
    ఏప్రిల్ 11 , 2023
    Tollywood Top Experimental Movies: తెలుగులో తప్పక చూడాల్సిన ప్రయోగాత్మక చిత్రాలు.. చూస్తే థ్రిల్‌ అవుతారు!&nbsp;&nbsp;
    Tollywood Top Experimental Movies: తెలుగులో తప్పక చూడాల్సిన ప్రయోగాత్మక చిత్రాలు.. చూస్తే థ్రిల్‌ అవుతారు!&nbsp;&nbsp;
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్‌హిట్స్‌గా నిలిస్తే మరికొన్ని పరాజయాలను చవిచూశాయి. అయితే కొన్ని చిత్రాలు (Telugu Experimental Movies With Unique Concept) మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని పంచాయి. రొటిన్‌ చిత్రాలకు అలవాటు పడిన ఆడియన్స్‌కు కొత్తదనాన్ని పరిచయం చేశాయి. సరైన కంటెంట్‌తో వస్తే ఎలాంటి ప్రయోగాత్మక చిత్రాలనైనా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; జంబ లకిడి పంబ (Jamba lakidi Pamba) తెలుగులో ‘జంబ లకిడి పంబ’ చిత్రం ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పవచ్చు. మగవారు ఆడవారిగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పటికీ యూట్యూబ్‌లో ఈ సినిమా క్లిప్స్‌ పెట్టుకొని చూస్తుంటారు ఆడియన్స్‌.&nbsp; ఆదిత్య 369 (Aditya 369) నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇది తెలుగులో వచ్చిన తొలి టైమ్‌ ట్రావెలింగ్ సినిమా. అప్పటివరకూ హాలీవుడ్‌లోనే ఈ తరహా చిత్రాలు వచ్చాయి. అయితే మన పరిస్థితులకు అనుగుణంగా డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు కథను రాసుకున్నారు. టైమ్‌ ట్రావెలింగ్‌ కాన్సెప్ట్‌తో శ్రీకృష్ణ దేవరాయల కాలానికి కథను ముడిపెట్టి మంచి ఫలితాలను రాబట్టాడు.&nbsp; నాని (Nani) మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్‌.జె. సూర్య (S.J. Surya) దర్శకత్వంలో వచ్చిన నాని (2004) చిత్రం.. విభిన్నమైన కథాంశంతో రూపొందింది. ఓ బాలుడు సైంటిస్ట్‌ ద్వారా 28 ఏళ్ల కుర్రాడిగా మారడం.. ఓ కంపెనీలో పనిచేస్తూ ఓనర్‌ కూతుర్నే ప్రేమించడం చాలా కొత్తగా అనిపిస్తుంది. చివరికి తన తల్లికి దూరమవుతున్నానని భావించి మళ్లీ చిన్నపిల్లాడిగా మారిపోవడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది.&nbsp; దశావతరం (Dasavatharam) ఒక హీరో ద్విపాత్రాభినయం (Telugu Experimental Movies With Unique Concept) చేయడం సాధారణం. కొన్ని సినిమాల్లో ముగ్గురిగానూ నటించిన సందర్భాలు ఉన్నాయి. అయితే పది విభిన్నమైన పాత్రలను హీరో ఒక్కడే చేయడం ఒక్క ‘దశవాతరం’ (Kamal Haasan) సినిమాలోనే చూడవచ్చు. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ హీరోగా చేశారు. ఈ సినిమాను చూసిన వారంతా కమల్ నటనకు ఫిదా అయ్యారు.&nbsp; దొంగల ముఠా (Dongala Mutha) రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'దొంగల ముఠా' చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. రవితేజ, చార్మి కౌర్, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు, సుప్రీత్ రెడ్డి వంటి నటీనటులతో ఐదే రోజుల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ చిత్రం థియేటర్‌లోకి వచ్చే వరకూ తారాగణం ఒక్క రూపాయి తీసుకోకపోవడం విశేషం. కెనాన్ 5D కెమెరాలతో ఈ చిత్రం రూపొందించడం మరో ప్రత్యేకత.   ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రం.. టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఒక సినిమాకు (Telugu Experimental Movies With Unique Concept) స్టార్‌ హీరోనే అవసరం లేదు.. ఒక చిన్న ఈగతో కూడా ఘన విజయం సాధించొచ్చని ఈ సినిమా ద్వారా రాజమౌళి నిరూపించారు. హాలీవుడ్‌ స్థాయి టెక్నిషియన్లను వినియోగించుకొని అద్భుతమైన విజువల్‌ ట్రీట్‌ను అందించారు.&nbsp; మిథునం (Mithunam) పాతిక సంవత్సరాల క్రితం రచించిన 25 పేజీల ‘మిథునం’ కథకు నటుడు తనికెళ్ళ భరణి అందించిన చిత్రరూపమే ఈ సినిమా. ఈ మూవీ మెుత్తం కేవలం రెండు పాత్రలే కనిపిస్తాయి. పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడటంతో ఆ తల్లిదండ్రులు తమ శేష జీవితాన్ని ఎలా గడిపారు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ‘ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా’ ఇచ్చిన సూచనల మేరకు ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు సైతం నామినేట్ కావడం విశేషం.&nbsp; అనుకోకుండా ఒక రోజు (Anukokunda Oka Roju) 2005లో వచ్చిన ఈ చిత్రం కూడా విభిన్న కథాంశంతో రూపొందింది. సహస్ర (ఛార్మీ) అనే ఓ అమ్మాయి అనుకోకుండా ఓ నైట్ పార్టీకి వెళ్లడం.. అక్కడ పొరపాటున మత్తు పదార్థాలు తీసుకోవడం.. ఆ టైంలో ఆమెకు తెలీకుండా ఏదేదో చూసేయడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత ఆమె జీవితంలో ఓ రోజు తెలీకుండా మిస్ అవుతుంది. ఆ రోజు ఏం జరిగిందో తెలుకోవడానికి ప్రయత్నిస్తుంటే సహస్రపై హత్యాప్రయత్నాలు జరుగుతాయి. మూఢనమ్మకాలకు సహస్రపై జరుగుతున్న దాడులకు సంబంధం ఏంటన్నది కథ. ఈ సినిమా ఆధ్యాంతం చాలా ఆసక్తికరంగా సాగుతుంది.&nbsp; అ! (Awe!) టాలీవుడ్‌లో ఈ తరహా సినిమా ఇప్పటివరకూ రాలేదు. హనుమాన్‌ (Hanu Man) ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఈ సినిమాను తెరకెక్కించారు. కథలో ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.&nbsp; మనం (Manam) అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మనం’. పునర్జన్మలు - ప్రేమలకు ముడిపెడుతూ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం కథ కొత్తగా ఉండటంతో పాటు ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. భావోద్వేగాలలో మునిగి తేలేలా చేస్తుంది.&nbsp; ఒక్కడున్నాడు (Okkadunnadu) గోపిచంద్‌ హీరోగా&nbsp; చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడున్నాడు’ చిత్రం కూడా వీక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ఓ మాఫియా డాన్‌కు హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం కావడం.. హీరో గుండె అతడికి సరిగ్గా సరిపోలడం జరుగుతుంది. దీంతో విలన్లు హీరో వెంట పడుతుంటారు. చివరికీ ఏమైంది అన్నది స్టోరీ. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం మంచి థ్రిల్‌ను అందించింది.&nbsp; గగనం (Gaganam) నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని (Telugu Experimental Movies With Unique Concept) దర్శకుడు రాధా మోహన్‌ తెరకెక్కించారు. విమానం హైజాకింగ్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. హాలీవుడ్‌ చిత్రాలకే పరిమితమైన ఇలాంటి కథను.. తొలిసారి తెలుగులోకి తీసుకొచ్చారు. ఆద్యాంతం ఈ సినిమా ఉత్కంఠగా సాగుతుంది.&nbsp;
    మార్చి 20 , 2024
    Memorable Villains in Telugu Cinema: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్‌ పాత్రలు ఇవే!
    Memorable Villains in Telugu Cinema: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్‌ పాత్రలు ఇవే!
    సాధారణంగా ప్రతీ సినిమాలో హీరోతో సమానంగా విలన్‌ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. విలన్‌ రోల్‌ ఎంత బలంగా ఉంటే కథాయనాయకుడి పాత్ర అంత బాగా ఎలివేట్ అవుతుంది. కాబట్టి టాలీవుడ్‌ దర్శకులు హీరోతో పాటు విలన్‌ క్యారెక్టర్‌ డిజైన్‌పైనా ప్రత్యేకంగా శ్రద్ధా వహిస్తుంటారు. విలన్ రోల్ క్లిక్‌ అయ్యిందంటే ఆటోమేటిక్‌గా హీరోకి ఎలివేషన్‌ లభించి సినిమా హిట్‌ అవుతుందని వారి నమ్మకం. అయితే ఇప్పటివరకూ టాలీవుడ్‌లో కొన్ని వందల చిత్రాలు వచ్చినప్పటికీ కొన్ని విలన్ పాత్రలే ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేశాయి. అటువంటి పాత్రలను You Say ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; భిక్షు యాదవ్‌ (Sye) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’ చిత్రంలో హీరో నితిన్‌ పాత్ర కంటే.. విలన్‌ బిక్షు యాదవ్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతినాయకుడి పాత్రలో ప్రదీప్‌ రావత్‌ (Pradeep Rawat) తన లుక్‌తోనే భయపెట్టేలా ఉంటాడు. ముక్కుకు రింగ్‌ తగిలించుకొని నిజమైన విలన్‌గా కనిపిస్తాడు. ఈ పాత్ర ప్రదీప్‌ రావత్‌ కెరీర్‌ను మలుపుతిప్పింది.&nbsp; https://youtu.be/2JyoOhxNpGk?si=K9os2WSarS60Wz5b అలీభాయ్‌ (Pokiri) పోకిరిలో మహేష్‌ బాబు (Mahesh Babu) తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్‌ ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj) చేసిన అలీభాయ్‌ పాత్ర. మాఫియా డాన్‌గా పవర్‌ఫుల్‌గా కనిపిస్తూనే ప్రకాష్‌ రాజ్‌ తనదైన డైలాగ్స్‌తో నవ్వులు పూయించాడు. ఈ పాత్ర తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రకాష్‌ రాజ్‌ ఓ సందర్భంలో చెప్పడం విశేషం.&nbsp; https://youtu.be/4xhZMkerEtE?si=rz8Z19xEeNxXIefV భల్లాలదేవ (Baahubali) రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రంలో రానా (Rana Daggubati) చేసిన ‘భల్లాల దేవ’ పాత్ర ప్రతీ ఒక్కరినీ అలరించింది. కుట్రలు, కుతంత్రాలు పన్నే రాజు పాత్రలో అతడు కనిపించాడు. కండలు తిరిగిన దేహంతో బాహుబలి (ప్రభాస్‌)ని ఎదిరించి నిలుస్తాడు. భల్లాల దేవ తరహా పాత్ర ఇప్పటివరకూ తెలుగులో రాలేదని చెప్పవచ్చు.&nbsp; https://youtu.be/2dFeczHMf58?si=8UKU0_h7Q0qrIGPv పశుపతి (Arundhati) తెలుగులో అతి భయంకరమైన విలన్‌ పాత్ర ఏది అంటే ముందుగా ‘అరుంధతి’ చిత్రంలోని పశుపతినే గుర్తుకు వస్తాడు. ఈ పాత్రలో సోనుసూద్‌ (Sonu Sood) పగ తీరని పిశాచిలా నటించాడు. అరుంధతి (అనుష్క)ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. పశుపతి పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది.&nbsp; https://youtu.be/aJV6JIswFYw?si=JZdCFz_l2XYuNRj3 కాట్‌రాజ్‌ (Chatrapathi) ఛత్రపతి సినిమాలో కాట్‌రాజ్‌ పాత్ర కూడా చూడటానికి చాలా క్రూయిల్‌గా ఉంటుంది. శ్రీలంక నుంచి వలస వచ్చిన వారిపై జులుం ప్రదర్శించే పాత్రలో సుప్రీత్‌ రెడ్డి (Supreeth Reddy) జీవించేశాడు. ఈ సినిమా తర్వాత అతడికి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు చుట్టుముట్టాయి.&nbsp; https://youtu.be/QLc8I_WIFnE?si=4TYG9WD6BUUG9ZS9 పండా (Gharshana) ఘర్షణ సినిమాలో డీసీపీ రామచంద్ర పాత్రలో హీరో వెంకటేష్‌ (Venkatesh) చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. అతడ్ని ఢీకొట్టే ప్రతినాయకుడి రోల్ పండా కూడా అదే విధంగా ఉంటుంది. గ్యాంగ్‌స్టర్‌ అయిన పండా పాత్రలో నటుడు సలీం బైజ్ (Salim Baig) అద్భుతంగా నటించాడు.&nbsp; https://youtu.be/C15GczxdDWk?si=bCbFuf4jMA-Ku9Ml మద్దాలి శివారెడ్డి (Race Gurram) రేసుగుర్రం చిత్రంలోని మద్దాలి శివారెడ్డి కూడా తెలుగులో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్‌. అల్లు అర్జున్‌ చేతిలో దెబ్బలు తిని.. మంత్రి అయిన తర్వాత హీరోపై రీవేంజ్‌ తీర్చుకునే తీరు బాగుంటుంది. నటుడు రవి కిషన్‌ (Ravi Kishan) ఈ పాత్రలో ఎంతో విలక్షణంగా నటించాడు.&nbsp; https://youtu.be/1eI5MaEPH24?si=akVQ_0ky0sQvA__H వైరం ధనుష్‌ (Sarrainodu) బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ చిత్రంలో హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) తొలిసారి విలన్‌గా నటించాడు. సీఎం కొడుకు అయిన వైరం ధనుష్‌ పాత్రలో చాలా క్రూయల్‌గా చేశాడు.&nbsp; https://youtu.be/8-Dv9v3jlO4?si=O7-sqHVCz7MS0Usw భవాని (Siva) శివ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. భవాని అనే విలన్‌ పాత్ర కూడా అప్పటి ప్రతినాయకుడి రోల్స్‌కు చాలా భిన్నంగా ఉంటుంది. విలన్‌ అంటే కోరమీసాలు, గంభీరమైన గొంతు, పెద్ద పెద్ద డైలాగ్స్‌ అవసరం లేదని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) ఈ సినిమాతో నిరూపించాడు. భవాని పాత్రతో నటుడు రఘువరన్‌ (Raghuvaran) స్టార్‌ విలన్‌గా మారిపోయాడు.&nbsp; https://youtu.be/lOk1YI8xwk0?si=M7pHYNOlym7EGemT బుక్కా రెడ్డి (Rakta Charitra) రక్త చరిత్ర సినిమాలో బుక్కా రెడ్డి పాత్ర అతి భయానకంగా ఉంటుంది. కనిపించిన ఆడవారిపై అత్యాచారం చేస్తూ, అడ్డొచ్చిన వారిని చంపుకుంటూ పోయే ఈ పాత్రలో నటుడు అభిమన్యు సింగ్‌ (Abhimanyu Singh) జీవించేశాడు. సినిమాలో ఆ పాత్ర ఎంట్రీ అప్పుడల్లా ప్రేక్షకులు ఓ విధమైన టెన్షన్‌కు లోనవుతారు.&nbsp; https://youtu.be/xjVj28sLQGs?si=tFP6zVO5moZcczA0 అమ్రీష్‌ పూరి (Jagadeka Veerudu Athiloka Sundari) చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రంలో నటుడు అమ్రీష్‌ పూరి (Amrish Puri) ప్రతినాయకుడిగా కనిపించారు. మహాద్రాష్ట అనే మాంత్రికుడి రోల్‌లో ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించారు. దేవ కన్య అయిన హీరోయిన్‌ను వశం చేసుకునే పాత్రలో అమ్రీష్‌ నటన మెప్పిస్తుంది.&nbsp; https://youtu.be/l_XA9PuOwh0?si=3IUQQJNW3gFYuytc రణదేవ్ బిల్లా (Magadheera) రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ చిత్రంలో హీరోకు సమానంగా విలన్‌ రణదేవ్‌ బిల్లాకు స్క్రీన్‌ షేరింగ్ ఉంటుంది. దేవ్‌ గిల్ (Dev Gill) ఈ పాత్ర ద్వారా తొలిసారి టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. కండలు తిరిగిన దేహం, నటనతో వీక్షకులను కట్టిపడేశాడు.&nbsp; https://youtu.be/XoYCASOhKPw?si=F1JUwUIIo4FANYpN మంగళం శ్రీను (Pushpa) అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa)&nbsp; చిత్రంలో.. నటుడు సునీల్‌ (Sunil) మంగళం శ్రీను పాత్రలో నటించాడు. హాస్యనటుడిగా, హీరోగా గుర్తింపు పొందిన సునీల్‌ను విలన్‌గా చూసి తెలుగు ఆడియన్స్‌ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అతడి లుక్‌, నటన ఎంతగానో ఆకట్టుకుంది.&nbsp; https://youtu.be/qF_aQEXieGo?si=WBlNlBjRszc3KrzH
    మార్చి 20 , 2024
    BRO Pre Review: బ్రో మూల కథ ఎలా పుట్టింది? 12 భాషల్లో ఈ సినిమాను ఎందుకు తీస్తున్నారు?
    BRO Pre Review: బ్రో మూల కథ ఎలా పుట్టింది? 12 భాషల్లో ఈ సినిమాను ఎందుకు తీస్తున్నారు?
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మల్టీస్టారర్‌గా రూపొందిన చిత్రం ‘బ్రో’. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్‌ ఇది. మాతృకలో తీసిన డైరెక్టర్ సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సినిమా విజయంపై మూవీ యూనిట్ ఎంతో ధీమాతో ఉంది. దీనికి కారణం సినిమా మూల కథే. మరి, ‘వినోదయ సిత్తం’ కథ ఎలా పుట్టింది? ఈ సినిమాలో అంతగా ఏముంది? మూవీతో ఏం సందేశం ఇచ్చారు? వంటి అంశాలను తెలుసుకుందాం.&nbsp; అలా తెరమీదకి.. ఓటీటీ కంటెంట్ కోసం జీ స్టూడియోస్ సముద్రఖనిని పిలిపించుకుని ఓ 5 కథలను చెప్పమంది. ఇందుకు 25 నిమిషాలు టైం ఇచ్చింది. దర్శకుడు 20 నిమిషాల్లోనే 5 కథలను పూర్తి చేశారు. ఇందులో నుంచి ఓ కథను సెలెక్ట్ చేసి ఓకే చేసేశారు. మరో 3 నిమిషాలు మిగిలి ఉండటంతో ఒక కథ చెప్పే అవకాశం ఇవ్వండని కోరి ఈ ‘బ్రో’ మూవీ స్టోరీ లైన్ చెప్పారు సముద్రఖని. దీంతో ముందుగా ఓకే చేసిన స్టోరీని పక్కన పెట్టి ‘వినోదయ సిత్తం’కు నిర్మాతలు ఓటేశారు. అలా ఈ సినిమాకు బీజం పడింది. అయితే, వినోదయ సిత్తం కథను తన గురువు బాలచందర్ గారు అందించినట్లు సముద్రఖని చెబుతుంటారు.&nbsp;&nbsp; https://twitter.com/KarnatakaPSPKFC/status/1683893592304111617?s=20 స్టోరీ ఇదే.. పరశురామ్(తంబిరామయ్య) క్రమశిక్షణ గల ఉద్యోగి. 25 ఏళ్లుగా ఓ ఎంఎన్‌సీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా చేస్తుంటాడు. కంపెనీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. సమయాన్ని పకడ్బందీగా వాడుకోవాలని భార్య, పిల్లలకు చెబుతుంటాడు. అమెరికాలో ఉన్న కొడుక్కి సైతం పక్కా ప్లానింగ్ ఇస్తుంటాడు. అలా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తీరిక లేకుండా గడిపేస్తుంటాడు. కంపెనీ పనిమీద వేరే సిటీకి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్‌లో పరశురామ్‌ మరణిస్తాడు. పరశురామ్‌ని స్వర్గానికి తీసుకెళ్లడానికి కాలదేవుడు(సముద్రఖని) వస్తాడు. ఇక్కడ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు ఇంకా మిగిలే ఉన్నాయని, భవిష్యత్తులో ఆనందంగా ఉండటానికి ఎంతో కష్టపడ్డానని, తనను బతికించాలని వేడుకుంటాడు. వాదోపవాదాల అనంతరం 3 నెలల సమయాన్ని పొందుతాడు. అయితే, దీని గురించి ఇతరులకు చెప్పకుండా ఉండేందుకు కాలదేవుడు కూడా పరశురామ్‌ని వెంబడిస్తాడు. ముందుగా కూతురి పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. కానీ, ఆమె ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోతుంది. ఈ బాధలో ఉండగానే కొడుకు ఉద్యోగం కోల్పోయి అమెరికా నుంచి గర్ల్‌ఫ్రెండ్‌ని తీసుకొచ్చేస్తాడు. ఇదిలా ఉండగానే ఆఫీసులో తనకి కాకుండా వేరొకరికి ప్రమోషన్ వస్తుంది. ఇలా ఒకదాని వెంబడి మరొకటి జరిగి పరశురామ్‌కి జీవిత పరమార్థం అంటే ఏంటో అర్థమవుతుంది.&nbsp;&nbsp; https://youtu.be/stcCZWCBegk త్రివిక్రమ్‌కి అందుకే నచ్చిందా? మనిషికి భవిష్యత్తు అనేది ఉండదని వర్తమానం ఒక్కటే ఆచరణలో ఉంటుందని చెప్పే స్టోరీ ఇది.&nbsp; వాస్త‌వాల‌కు, భ్ర‌మ‌ల‌కు మ‌ధ్య ఉన్న తేడాని తెలుసుకుంటే జీవిత పరమార్థం బోధపడుతుందని చెబుతుంది. అందుకే, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి స్టోరీ చెబుతుండగానే నచ్చేసింది. చివర్లో వచ్చే డైలాగుని మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని ఇంప్రెస్ అయ్యారట త్రివిక్రమ్. దీంతో తెలుగులో తీయడానికి వెంటనే ఓకే చేసి తానే దగ్గరుండి క్యాస్టింగ్ ఫైనలైజ్ చేశారట. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకుని కథను కొత్తగా మలిచి ‘బ్రో’గా తీసుకొచ్చారు.&nbsp; https://www.youtube.com/watch?v=yNnJ9de339k 12 భాషల్లో చిత్రీకరణ డైరెక్టర్ సముద్రఖని తమిళనాడులోని మారుమూల గ్రామం. అక్కడినుంచి చెన్నై వచ్చి, అటుపై హైదరాబాద్‌కి రావడం వెనకాల ఏదో ఒక శక్తి ఉందని బలంగా నమ్మారు. దానినే ‘టైం’గా అభివర్ణించారు. అలా మనకు ఎన్నో ఇచ్చిన సమాజానికి మనం తిరిగి ఏమివ్వగలం అనే కోణం నుంచి కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. బ్రో మూల కథను అన్ని భాషల ప్రేక్షకులకు చేరవేయాలని సంకల్పించుకున్నారు. అలా, తమిళంలో ‘వినోదయ సిత్తం’తో ముందడుగు వేశారు. ఇప్పుడు తెలుగులో ‘బ్రో’ చేశారు. తర్వాత ‘తుళు’లో చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా బెంగాళీ, మరాఠీ, గుజరాతీ.. తదితర 12 భాషల్లో ఇదే సినిమాను తీస్తానని చెబుతున్నారు సముద్రఖని.&nbsp; https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
    జూలై 26 , 2023
    <strong>SDT 18: కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌తో వస్తోన్న మెగా మేనల్లుడు.. రికార్డులు గల్లంతేనా!</strong>
    SDT 18: కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌తో వస్తోన్న మెగా మేనల్లుడు.. రికార్డులు గల్లంతేనా!
    మెగా హీరో, చిరంజీవి మేనల్లుడు సాయి దుర్గా తేజ్ అలియాస్‌ సాయి ధరమ్‌ తేజ్‌ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. గతేడాది వచ్చిన ‘విరూపాక్ష’తో సాలిడ్‌ హిట్‌ కొట్టిన తేజ్‌ ఆ సినిమాతో ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌ చేరిపోయాడు. అదే ఏడాది పవన్‌ కల్యాణ్‌తో కలిసి ‘బ్రో’ సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. బ్రో తర్వాత ఇప్పటివరకూ ఒక్క ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేదు. కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘SDT18’ ప్రాజెక్ట్ ప్రకటించి అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపారు.&nbsp; ధైర్యాన్నే కవచంగా.. సుప్రీం స్టార్‌ సాయి దుర్గా తేజ్‌ నుంచి కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. నేడు ఈ యంగ్‌ హీరో పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. ‘SDT 18’ వర్కింగ్‌ టైటిల్‌తో ఇది తెరకెక్కనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఓ మేకింగ్‌ వీడియోతో పాటు పోస్టర్‌ను విడుదల చేసింది. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించిన కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ‘ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’ అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కండల తిరిగిన దేహంతో ఉన్న సాయి దుర్గా తేజ్‌ బ్యాక్‌ సైడ్‌ లుక్‌ను చూపించారు.&nbsp; https://twitter.com/Primeshowtweets/status/1846065983091536150 రాయలసీమ నేపథ్యంలో.. ‘SDT 18’ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. సాయి దుర్గా తేజ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో వస్తోన్న చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా దర్శకుడు రోహిత్‌ కేపీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్స్‌ నిర్మించినట్లు తాగా రిలీజ్‌ చేసిన మేకింగ్‌ వీడియోను బట్టి తెలుస్తోంది. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్‌ను ఒక షాట్‌లో చూపించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం సరికొత్త మేకోవర్‌లోకి మారాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు. https://twitter.com/IamSaiDharamTej/status/1846068731665174954 యాక్సిడెంట్‌తో కోమాలోకి.. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్‌ఫుల్‌ యాక్టర్‌గా మారారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలోనే సాయి దుర్గా తేజ్‌కు ఊహించని విధంగా యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులనూ ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేసింది. ప్రమాదం అనంతరం కోమాలోకి వెళ్లిన తేజ్‌ జీవన్మరణ సమస్య నుంచి కోలుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత విరూపాక్ష, బ్రో సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు. తన తల్లి పేరును తన పేరుకు జత చేసి సాయి ధరమ్‌ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మారాడు.&nbsp;
    అక్టోబర్ 15 , 2024
    <strong>Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్‌ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!</strong>
    Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్‌ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం.. సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని థియేటర్లలోనూ పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. హాలీవుడ్‌ రేంజ్‌ విజువల్స్‌ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నటీనటుల గెటప్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ స్థాయి సక్సెస్‌ కల్కి టీమ్‌కు అంత ఈజీగా రాలేదు. దీని వెనక అంతులేని శ్రమ దాగుంది. కల్కి చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ (Secrets of Kalki 2898 AD) తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; 40 ఏళ్ల తర్వాత.. కల్కి సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ (KALKI 2898 AD Hidden Truth) ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాష్కిన్‌ అనే ప్రతినాయకుడి పాత్రలో కమల్‌హాసన్‌ కనిపించారు. అయితే దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ఈ సినిమాలో నటించారట. 1985లో వచ్చిన ‘గిరాఫ్తార్’ అనే సినిమాలో చివరిగా అమితాబ్, కమల్‌ నటించారు. ఆ తర్వాత మళ్లీ కల్కిలోనే వీరిద్దరు కలిసి పనిచేశారు.&nbsp; కమల్‌ లుక్‌ కష్టాలు.. ‘కల్కి 2898 ఏడీ’ కమల్‌ హాసన్‌ చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. ఈ లుక్‌ ఫైనల్‌ చేసే క్రమంలో ఎన్నో గెటప్‌లను పరిశీలించారట. దేనితోనూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సంతృప్తి చెందలేదట. చివరకు లాస్‌ ఏంజెల్స్ వెళ్లి అక్కడ హాలీవుడ్‌ సినిమాలకు వర్క్ చేసే మేకప్‌ నిపుణులను కల్కి టీమ్‌ సంప్రదించట. అలా కమల్‌ హాసన్‌ ప్రస్తుత లుక్‌ బయటకొచ్చిందని సినీ వర్గాలు తెలిపాయి.&nbsp; మేకప్‌కు కోసం 5 గంటలు కల్కి సినిమాలో అశ్వత్థామ గెటప్‌ కూడా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. 81 ఏళ్ల వయసున్న అమితాబ్‌ బచ్చన్‌&nbsp; (Amitabh Bachchan) ఈ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు. అయితే అశ్వత్థామ మేకప్ వేయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేదని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇక తీయడానికి మరో 2 గంటలు పట్టేదట. దీంతో అమితాబ్‌ మేకప్‌ కోసమే అచ్చంగా 5 గంటల సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బుజ్జి కోసం రూ.4 కోట్లు ‘కల్కి’లో ప్రభాస్‌ రైడ్‌ చేసిన ‘బుజ్జి’ (KALKI 2898 AD Hidden Truth) అనే ఫ్యూచరిక్‌ వెహికల్‌ను ఎంతో కష్టపడి చిత్ర యూనిట్‌ తయారు చేయించింది. బుజ్జి తయారీకి మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ టీమ్‌తో పాటు, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ టీమ్‌ సహకారం అందించింది. ఈ ఒక్క కారు కోసమే రూ.4కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.&nbsp; 700VFX షాట్స్‌ కల్కి సినిమాలో కాశీ, శంబల, కాంప్లెక్స్‌ అనే మూడు ఫ్యూచరిక్‌ ప్రపంచాలను డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ క్రియేట్‌ చేశారు. కాశీని నిర్జీవంగా.. శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబలను చూపించారు. పుష్కలమైన వనరులను కలిగినట్లు కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. ఇలా చూపించేందుకు మెుత్తం వీఎఫ్‌ఎక్స్‌నే ఉపయోగించారు. ఇందుకోసం 700 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉపయోగించినట్లు సమాచారం.&nbsp; హాలీవుడ్‌ యంత్రాంగం ‘కల్కి 2898 ఏడీ’ విజువల్‌ వండర్‌గా ఉందంటూ పెద్ద ఎత్తున టాక్‌ వస్తోంది. హాలీవుడ్‌ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలు ఈ సినిమాకు పనిచేయడమే ఇందుకు కారణం. ప్రముఖ హాలీవుడ్‌ చిత్రాలైన హ్యారీ పోటర్‌, ఇంటర్‌స్టెల్లర్‌, డ్యూన్‌, బ్లేడ్‌ రన్నర్‌ వంటి భారీ హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన VFX టీమ్‌ ‘కల్కి’ కోసం పనిచేసింది. రికార్డు స్థాయి బడ్జెట్‌ భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌ (KALKI 2898 AD Hidden Truth)తో రూపొందించిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ.600 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు వేతనాలు, సెట్స్‌కు అయిన ఖర్చు కంటే.. నాణ్యమైన విజువల్స్‌, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌ కోసమే ఎక్కువ మెుత్తం ఖర్చు చేశారట. https://telugu.yousay.tv/kalki-2898-ad-review-kalki-which-raised-the-level-of-indian-cinema-immensely-how-is-the-movie.html#google_vignette
    జూన్ 27 , 2024
    The Kerala Story Review In Telugu : ఆదా శర్మ నటన కన్నీళ్లు పెట్టించింది! మరో కాశ్మీర్ ఫైల్స్‌ను గుర్తు చేసింది!&nbsp;
    The Kerala Story Review In Telugu : ఆదా శర్మ నటన కన్నీళ్లు పెట్టించింది! మరో కాశ్మీర్ ఫైల్స్‌ను గుర్తు చేసింది!&nbsp;
    నటినటులు: ఆదా శర్మ, సిద్ధి ఇద్నాని, యోగిత బిహాని, సోనియా బలాని, ప్రణయ్‌ పచౌరి, ప్రణవ్‌ మిశ్రా, విజయ్‌ కృష్ణ దర్శకత్వం: సుదీప్తోసేన్ సంగీతం: వీరేష్‌ శ్రీవాల్స నిర్మాణ సంస్థ: సన్‌షైన్‌ పిక్చర్స్‌ ‘ది కేరళ స్టోరీ‘ చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపింది. తప్పిపోయిన కేరళ అమ్మాయిల ఇతివృత్తంతో దీన్ని తెరకెక్కించగా.. ఈ సినిమాను రిలీజ్‌ చేయోద్దంటూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఈ సినిమాను రూపొందించారని కేరళ సీఎం పినరయి విజయన్‌ సైతం మండిపడ్డారు. ఇలాంటి సినిమాను విడుదల చేయోద్ధంటూ కాంగ్రెస్‌, వామపక్షాలు, ముస్లిం సంఘాలు సైతం తీవ్రస్థాయిలో డిమాండ్‌ చేశాయి. వీటన్నింటినీ దాటుకొని ఎట్టకేళకు ఇవాళ ‘ది కేరళ స్టోరీ’ చిత్రం రిలీజ్‌ అయింది. మరీ సినిమా ఎలా ఉంది?. అందరూ అనుమానించినట్లు ఇందులో వివాదస్పద కంటెంట్‌ ఉందా? ది కేరళ స్టోరీ హిట్‌ కొట్టినట్లేనా? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి: షాలిని ఉన్ని క్రిష్ణన్‌ (ఆదాశర్మ) నర్స్‌ అవ్వాలన్న కోరికతో నర్సింగ్‌ కాలేజీలో చేరుతుంది. అక్కడి హాస్టల్‌ గదిలో గీతాంజలి (సిద్ది ఇద్నాని), నిమాహ్ (యోగితా బిహానీ), ఆసిఫా( సోనియా బలానీ) రూమ్‌మేట్స్‌గా ఉంటారు. ఆసిఫా తన రూమ్‌మేట్స్‌ అందర్ని ఇస్లాంలోకి మార్చాలని ఓ సీక్రెట్‌ ఎజెండాను కలిగి ఉంటుంది. కొందరు బయటి వ్యక్తుల సాయంతో వారు ఇస్లాం మతంలోకి మారేలా&nbsp; చేస్తోంది. ఈ నేపథ్యంలో షాలిని తన పేరును ఫాతిమాకు మార్చుకుంటుంది. ఆ తర్వాతి నుంచి ఫాతిమా జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. గర్భవతి అయిన ఫాతిమా సిరియా ఎందుకు వెళ్లింది? అక్కడ&nbsp; ISIS ఉగ్రవాదుల చేతుల్లో ఎలాంటి కష్టాలను అనుభవించింది? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే: ‘ది కేరళ స్టోరీ’ సినిమా అంతా ప్రధానంగా ఆదా శర్మ చుట్టే తిరుగుతుంది. ఆదాశర్మలోని గొప్ప నటిని ఈ సినిమా పరిచయం చేసిందనే చెప్పాలి. హిందూ మహిళగా, ముస్లిం యువతిగా రెండు వెర్షన్లలో ఆమె చాలా అద్భుతంగా నటించింది. సినిమా భారాన్నంతా మోస్తు తన నటనతో మెప్పించింది. ముఖ్యంగా ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న తర్వాత ఆదాశర్మ తనలోని అత్యుత్తమ నటిని బయటకు తీసుకొస్తుంది. అటు సిద్ధి ఇద్నాని, యోగిత బిహాని, సోనియా బలాని తమ నటనతో ఆకట్టుకున్నారు. తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. హాస్టల్‌ గదిలో వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.&nbsp; సాంకేతికంగా: దర్శకుడు సుదీప్తోసేన్ చాలా సున్నితమైన అంశాన్ని ఎంతో ధైర్యంగా తెరపైనా చూపించాడని చెప్పొచ్చు. సినిమాలో వచ్చే మత మార్పిడి సీన్లు చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. ఛాలెంజింగ్‌ సన్నివేశాలను కూడా ఏమాత్రం బెరుకు లేకుండా డైరెక్టర్‌ తెరకెక్కించాడు. ఈ క్రమంలో కొన్ని డైలాగులు, సీన్లు మరీ ఇబ్బంది కరంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఐసిస్‌ బానిస శిబిరాల్లో మహిళలపై జరిగే దారుణాలు, ‌అఘాయిత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టవచ్చు. ప్రధానంగా ఈ సినిమాను వినోదాత్మకంగా కాకుండా మత మార్పిడుల కోణంలో తీసినట్లు అనిపిస్తుంది. ఇకపోతే వీరేష్‌ శ్రీవాల్స అందించిన నేపథ్యం సంగీతం సినిమాకు బలం. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ఆదాశర్మ నటనడైరక్షన్‌ స్కిల్స్నేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ హింసాత్మక సన్నివేశాలుబోల్డ్‌ సీన్స్‌ రేటింగ్‌: 3/5
    మే 05 , 2023
    The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
    The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
    'ది కేరళ స్టోరీ ' చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపుతోంది. మే 5న ఈ సినిమా విడుదల కానుండగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయోద్దంటూ కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్‌, సీపీఐ, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ విద్వేషపూరితంగా చిత్రీకరించారని, సినిమా విడుదల చేస్తే మత సామరస్యం దెబ్బతింటుందని పలువురు ఏకంగా సుప్రీకోర్టునే ఆశ్రయించారు. ఈ స్థాయిలో వివాదం రాజుకోడానికి కారణమేంటి? ఈ చిత్రంపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? కేరళ కంటే తమిళనాడు ఎందుకు ఎక్కువగా ఆందోళన చెందుతోంది? అసలు ఈ సినిమా సెన్సార్‌ క్లియర్‌ చేసుకుందా? వంటి ప్రశ్నలకు ఈ ప్రత్యేక కథనంలో సమాధానం చూద్దాం. వివాదానికి బీజం: సుదీప్తోసేన్‌ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్‌ అమృత్‌లాల్‌ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరతారు. ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఏప్రిల్‌ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది. &nbsp;కేరళ సీఎం ఆగ్రహం 'ది కేరళ స్టోరీ' ట్రైలర్‌.. కేరళ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం స్పందించారు. ‘రాష్ట్రంలో మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుంది. ‘లవ్‌ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినా.. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయని.. వారి రాజకీయాలు ఇక్కడ సాగవని పరోక్షంగా భాజపా, RSSలకు చురకలు అంటించారు.&nbsp; సినిమాను బ్యాన్‌ చేయాలి ‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలను కేరళ అధికార పార్టీతోపాటు విపక్ష కాంగ్రెస్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడింది. రాష్ట్రంలో చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్‌, డీవైఎఫ్‌ఐ, ఐయూఎంఎల్‌ వంటి యువజన సంఘాలు డిమాండ్‌ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కేరళను అవమానించే రీతిలో ఈ చిత్రం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీడీ సతీశన్‌ పేర్కొన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఓ వర్గం యత్నిస్తోందని ఐయూఎంఎల్ జాతీయ కార్యదర్శి పీకే ఫిరోజ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్విట్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు.&nbsp; తమిళనాడు అలెర్ట్‌ ది కేరళ స్టోరి రిలీజ్‌ డేట్‌ సమీపిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్‌ బృందాలు అలెర్ట్‌ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ‘కేరళ స్టోరీ’ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి నిఘా వర్గాలు సూచించాయి. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు&nbsp; ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అన్ని థియేటర్లలో పొన్నియన్‌ సెల్వన్‌-2 నడుస్తున్నట్లు చెప్పాయి. ధియేటర్‌ యాజమానులు ‘ది కేరళ స్టోరీ’ని ఇప్పట్లో రిలీజ్‌ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి. సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరాలు ‘ది కేరళ స్టోరీ’ ఇటీవలె సెన్సార్‌ పూర్తి చేసుకుంది. వివాదస్పదంగా మారిన ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ‘A సర్టిఫికేట్’ ఇచ్చింది. అంతేగాక సినిమాలోని వివిధ సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దేవుళ్లకు సంబంధించిన డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది. మరికొన్ని పదాలను సవరించాలని కోరింది. మొత్తం 10 సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. వాటిని డిలీట్ చేయాలని చెప్పింది. పలు సవరణలతో మే 5న చిత్ర విజయానికి అనుమతించింది.&nbsp; సుప్రీంకోర్టు స్పందన ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన అభ్యర్థనను ధర్మాసనం నిరాకరించింది. ‘ది కేరళ స్టోరీ’లో విద్వేషపూరితమైన ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయని దాఖలైన పిటీషన్‌పై కోర్టు స్పందించింది. ‘ఈ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందింది. మీరు దీని విడుదలను సవాల్‌ చేయాలనుకుంటే ఆ సర్టిఫికెట్‌తో తగిన ఫోరంను సంప్రదించండి’ అని సుప్రీంకోర్టు పిటిషనర్లకు సూచించింది.&nbsp;
    మే 03 , 2023
    <strong>Jithender Reddy Review: నక్సలిజంలోని చీకటి కోణాన్ని బయటపెట్టిన ‘జితేందర్‌ రెడ్డి’.. హిట్టా? ఫట్టా?</strong>
    Jithender Reddy Review: నక్సలిజంలోని చీకటి కోణాన్ని బయటపెట్టిన ‘జితేందర్‌ రెడ్డి’.. హిట్టా? ఫట్టా?
    నటీనటులు: రాకేష్ వర్రే, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్ తదితరులు.. దర్శకత్వం: విరించి వర్మ సంగీతం: గోపి సుందర్ సినిమాటోగ్రఫీ: వి.ఎస్. జ్ఞాన శేఖర్ ఎడిటర్: రామకృష్ణ అర్రం నిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డి విడుదల తేదీ: నవంబర్‌ 7, 2024 రాకేశ్‌ వర్రే కథానాయకుడిగా చేసిన లేటెస్ట్‌ పొలిటికల్‌ యాక్షన్‌ చిత్రం ‘జితేందర్‌రెడ్డి’ (Jithender Reddy). ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్‌ ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ ఈ సినిమాను రూపొందించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఆర్‌ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయం సేవకుడిగా పనిచేసిన వ్యక్తుల జీవిత కథను బేస్‌ చేసుకొని రూపొందించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; కథేంటి 1980లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రే) ఫ్యామిలీ మెుదటి నుంచి RSS స్వయంసేవకులు. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన జితేందర్ రెడ్డి చిన్నపుడే RSS సిద్దాంతాలకు ఆకర్షితుడు అవుతాడు. దేశం, ధర్మం, ప్రజలు కోసం ఏదైనా చేయాలని తపన పడుతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు 18 ఏళ్లు కూడా నిండని ఓ కుర్రాడిని నక్సలైట్లు అన్యాయంగా చంపేస్తారు. ఈ ఘటనతో కాలేజ్‌ స్టూడెంట్‌ అయిన జితేందర్‌ రెడ్డి కామ్రేడ్స్‌పై రగిలిపోతాడు. ప్రజల శ్రేయస్సు కోసం గన్ను పట్టుకున్నామని చెప్పుకునే నక్సలైట్స్‌ దారి తప్పారని గ్రహిస్తాడు. ఆ తర్వాత నక్సలైట్స్‌పై జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? విద్యా వ్యవస్థల్లో బలంగా నాటుకుపోయిన PDSUకి ధీటుగా ABVB ఎలా ఎదురొడ్డి నిలిచింది? కాలేజ్‌ స్టూడెంట్‌ లీడర్‌గా, ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనే నాయకుడిగా జితేందర్‌ రెడ్డి చేసిన సేవలు ఏంటి? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే చక్కగా ఒదిగిపోయాడు. RSS భావజాలం కలిగిన వ్యక్తిగా ఆకట్టుకున్నాడు. ప్రజల్లో చైతన్యం కల్పించే సీన్స్‌లో మంచి నటన కనబరిచాడు. ఇప్పటివరకూ చేసిన చిత్రాలతో పోలిస్తే నటన పరంగా ఎంతో మెచ్యూరిటీ ప్రదర్శించాడు. మొత్తంగా రాకేష్‌ వర్రే ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడని చెప్పవచ్చు. రాకేష్‌ తర్వాత PDSU నేతగా చేసిన నటుడి యాక్టింగ్‌ బాగుంది. స్వయం సేవకుడిగా సుబ్బరాజు నటన, నక్సలైట్ లీడర్‌గా ఛత్రపతి శేఖర్ యాక్టింగ్‌ మెప్పిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే తెలుగు తెరపై ఇప్పటి వరకు నక్సలైట్స్‌పై&nbsp; పాజిటివ్ యాంగిల్‌లోనే సినిమాలు తెరకెక్కాయి. కానీ తొలిసారి నక్సలిజం వెనకున్న చీకటి కోణాన్ని దర్శకుడు విరించి వర్మ ధైర్యంగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రగతికారక పనులకు వారు ఏ విధంగా అడ్డుగా నిలుస్తున్నారో కళ్లకు కట్టారు. అప్పట్లో అట్టడగు వర్గాల కోసం పాటుపడిన స్వయంసేవకులను నక్సలైట్స్ ఏ విధంగా కాల్చి చంపారో చూపించారు. కామ్రేడ్స్ ఆగడాలను చూసి చలించిపోయిన హీరో వారిపై చేసే పోరాటాన్ని ఎంతో ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కించారు. ఇంటర్వెల్‌ వరకూ కాలేజీ రాజకీయాలు చూపించిన దర్శకుడు ఆ తర్వాత మెయిన్‌ స్ట్రీమ్‌ పొలిటికల్ యాంగిల్‌ను టచ్‌ చేశాడు. నిజమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో కూడా జితేందర్‌ రెడ్డి పాత్ర ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్‌గా తను చెప్పాలనుకున్న పాయింట్‌ను సూటిగా, స్పష్టంగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే ఫస్ట్‌ హాఫ్‌ స్లోగా సాగడం, కమర్షియల్‌ హంగులు లేకపోవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. సాంకేతికంగా.. టెక్నికల్ విషయాలకు వస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కాస్త ఇబ్బంది పెట్టినా క్లైమాక్స్‌లో వచ్చే ఓ సాంగ్‌ గుండెలను హత్తుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, కథనంరాకేష్‌ వర్రే నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఫస్టాఫ్‌ స్లోగా ఉండటంకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    నవంబర్ 07 , 2024
    <strong>OTT Releases Telugu: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో వీటిని మిస్ అవ్వొద్దు!</strong>
    OTT Releases Telugu: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో వీటిని మిస్ అవ్వొద్దు!
    గతవారం లాగే ఈ వీక్‌ కూడా చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయనున్నాయి. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించి ఆనందంలో ముంచెత్తనున్నాయి. తద్వారా వీకెండ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు సి 202 (C 202) మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘సి 202’. గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటించారు. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కె.ఏ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ ‘ఎ’ సర్టిఫికెట్‌ జారీ చేసింది. రీసెంట్‌గా ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా అందులో ఒక్క డైలాగ్‌ లేకుండా తమ హావాభావాలతోనే నటీనటులు ఆకట్టుకున్నారు. అక్టోబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.&nbsp; పొట్టేల్‌ (Pottel) అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర కృష్ణ (Yuva Chandra Krishna) జంటగా చేసిన చిత్రం ‘పొట్టేల్‌’. సాహిత్‌ మోత్కూరి దర్శకుడు. అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 25న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.&nbsp; నరుడి బ్రతుకు నటన (Narudi Brathuku Natana) శివకుమార్‌ రామచంద్రవరపు, నితిన్‌ ప్రసన్న ప్రధాన పాత్రల్లో రిషికేశ్వర్‌ యోగి దర్శకత్వంలో ‘నరుడి బ్రతుకు నటన’ రూపొందింది. శ్రుతిజయన్‌, ఐశ్వర్య అనిల్‌ కుమార్‌, వైవా రాఘవ ప్రధాన పాత్రలు పోషించారు. టి.జి.విశ్వప్రసాద్‌, సుకుమార్‌ బొరెడ్డి, డా.సింధురెడ్డి నిర్మాతలు. అక్టోబరు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. లగ్గం (Laggam) సాయిరోనక్, ప్రగ్యా నగ్రా జంటగా చేసిన చిత్రం ‘లగ్గం’. ఈ చిత్రానికి రమేశ్‌ చెప్పాల దర్శకత్వం వహించారు. వేణుగోపాల్‌ రెడ్డి నిర్మాత. రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రోహిణి, సప్తగిరి, కృష్ణుడు, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ అక్టోబరు 25న విడుదల కానుంది. ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. రోటి కపడా రొమాన్స్‌ (Roti Kapda Romance) సందీప్‌ సరోజ్, తరుణ్, హర్షా నర్రా, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్‌లుగా చేసిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్‌’. విక్రమ్‌ రెడ్డి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్‌తో కలిసి సృజన్‌ కుమార్‌ బొజ్జం ఈ సినిమాను నిర్మించారు. అక్టోబరు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్&nbsp; (Venom The Last Dance) ఈ వారం హాలీవుడ్‌లో సూపర్ హీరో చిత్రం రాబోతోంది. బ్లాక్‌బాస్టర్‌ మూవీ సిరీస్‌ ‘వెనమ్‌’కు కొనసాగింపుగా పార్ట్‌ 3 రాబోతోంది. 'వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ పేరుతో అక్టోబర్‌ 24న ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. 3డి వెర్షన్‌లోనూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కెల్లీ మార్సెల్ దర్శకుడు. ఈ సిరీస్‌లో ఇదే తన చివరి చిత్రమని కథానాయకుడు టామ్‌ హార్డీ ఇప్పటికే ప్రకటించాడు.&nbsp;&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateFamily PackMovieEnglishNetflixOct 23The Comeback 2004 Boster Red SacksSeriesEnglishNetflixOct 23Beauty In BlackSeriesEnglishNetflixOct 24TerritorySeriesEnglishNetflixOct 24Do PattiMovieHindiNetflixOct 25Don't MoveMovieEnglishNetflixOct 25Hell Bound 2&nbsp;MovieEnglish/KoreanNetflixOct 25Satyam SundaramMovieTelugu/TamilNetflixOct 25NautilusSeriesEnglishAmazon&nbsp;Oct 25JigawattMovieHindiAmazon&nbsp;Oct 25VettaiyanMovieTelugu/TamilAmazon&nbsp;Nov 7The Bike RidersMovieEnglishJio CinemaOct 21Furiosa: A Mad Max SagaMovieTelugu Dub&nbsp;Jio CinemaOct 23The Miranda BrothersMovieHindiJio CinemaOct 25The Legend Of Hanuman 5SeriesTelugu DubHotstarOct 25Aindham VedhamMovieTamilZee 5Oct 25A Zindagi&nbsp;MovieHindiZee 5Oct 25Maa Nanna SuperheroMovieTelugu&nbsp;Zee 5Oct 31
    అక్టోబర్ 21 , 2024
    <strong>Megastar Chiranjeevi Dancing Hits: చిరంజీవికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన టాప్ 15 సాంగ్స్ ఇవే!</strong>
    Megastar Chiranjeevi Dancing Hits: చిరంజీవికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన టాప్ 15 సాంగ్స్ ఇవే!
    టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు, బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్‌, కోదండరామిరెడ్డి, గుణశేఖర్‌, బాబీతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్‌ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్‌, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. డ్యాన్స్‌కు కేరాఫ్‌! ‘పునాది రాళ్లు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగాస్టార్‌, కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తన టాలెంట్‌తో అధిగమించారు. నటనతో పాటు డ్యాన్స్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. డ్యాన్స్ అంటే చిరు.. చిరు అంటే డ్యాన్స్ అనే స్థాయిలో టాలీవుడ్‌పై బలమైన ముద్ర వేశారు. 1980 నుంచి 2005 మధ్య దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు డ్యాన్స్‌లో రారాజుగా వెలుగొందారు. చిరుతో డ్యాన్స్ అంటే కొరియోగ్రాఫర్లే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. రీఎంట్రీ తర్వాత 60 ప్లస్‌ వయసులోనూ అదిరిపోయే డ్యాన్స్‌లు చేస్తూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నారు. డ్యాన్స్‌లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సాధించిన నేపథ్యంలో చిరంజీవి అద్భుతమైన డ్యాన్స్ చేసిన టాప్‌-15 సాంగ్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రగులుతోంది మొగలిపొద (ఖైదీ) చిరంజీవిని సుప్రీం హీరోను చేసిన చిత్రం ఖైదీ. ఈ మూవీ సక్సెస్‌తో చిరంజీవి రాత్రికి రాత్రి స్టార్‌గా మారిపోయారు. ముఖ్యంగా ఇందులోని ‘రగులుతుంది మొగలిపొద’ సాంగ్ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. చిరులోని గొప్ప డ్యాన్సర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. మాధవితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. పాములా మెలికలు తిరుగుతూ చిరు వేసిన స్టెప్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సాంగ్ షూట్‌ తర్వాత దాదాపు వారం రోజుల పాటు చిరు ఒళ్లు నొప్పులతో బాధపడ్డారట. ఈ సాంగ్‌ ఓసారి మీరూ చూసేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=nyxj1TAjn8Q చక్కని చుక్క (పసివాడి ప్రాణం) కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని ‘చక్కని చుక్కలా’ సాంగ్‌ ద్వారా చిరు కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఈ సాంగ్‌ ద్వారానే చిరు బ్రేక్‌ డ్యాన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ పాటలో హీరోయిన్‌ విజయశాంతితో చిరు వేసిన స్టెప్స్‌ను నాటి తరం ఎప్పటికీ మరిచిపోలేదు.&nbsp; https://www.youtube.com/watch?v=q5aetbezCqM నవ్వింది మల్లె చెండు (అభిలాష) ‘అభిలాష’ చిత్రంలోని ఈ పాటలో చిరు హుషారైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. లవ్‌ను ప్రేయసి&nbsp; ఓకే చేస్తే ఆ ప్రియుడు సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో చిరు చూపించారు. ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ పాట మ్యూజిక్‌ లవర్స్‌ను కట్టిపడేసింది.&nbsp; https://www.youtube.com/watch?v=82hUDmPYazk హే పాప (త్రినేత్రుడు) ‘త్రినేత్రుడు’లోని ‘హే పాప’ అంటూ వచ్చే సాంగ్‌లో చిరంజీవి మరోసారి తన బ్రేక్ డ్యాన్స్‌ స్కిల్స్‌ను చూపించారు. ఓ క్లబ్‌లోని బ్రేక్‌ డ్యాన్సర్‌కు సవాలు విసిరిమరి చిరు నృత్యం చేస్తాడు. హీరోయిన్‌ భానుప్రియ కూడా అదిరిపోయే స్టెప్పులతో చిరుకు సహకారం అందించింది. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఆమె చిరుకు పోటీగా సాంగ్‌ చేసింది.&nbsp; https://www.youtube.com/watch?v=1vOAj1HaG1Y పదహరేళ్ల వయసు (లంకేశ్వరుడు) ‘లంకేశ్వరుడు’ మూవీలోని ‘పదహరేళ్ల వయసు’ పాటకు అప్పట్లో సూపర్‌ రెస్పాన్స్ వచ్చింది. క్లాప్‌ క్లాప్‌ అంటూ సాంగ్‌ను స్టార్ట్‌ చేసిన చిరు తన హుషారైన స్టెప్పులతో విజిల్స్‌ వేయించారు. ఈ సాంగ్‌లోని చిరు గెటప్ చాలా ఏళ్ల పాటు యువతను ఒక ఊపు ఊపింది. ఈ సాంగ్‌లో చిరు వేసిన స్టెప్స్‌ అభిమానులు ఎప్పుడు గుర్తుంచుకుంటారు. రీసెంట్‌గా ‘మత్తు వదలరా 2’ చిత్రంలో కమెడియన్‌ సత్య ఈ సాంగ్‌ను రిఫరెన్స్‌గా తీసుకొని స్టెప్పులు వేయడం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=fsnOGypjHI0 గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రం మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఇందులో గ్యాంగ్ లీడర్ అంటూ సాగే టైటిల్ సాంగ్‌లో చిరంజీవి వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. ఇప్పటికీ ఆ పాట చూస్తే మెగా ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. https://www.youtube.com/watch?v=KUZ4e7t4u5k స్టార్‌ స్టార్‌ మెగాస్టార్‌ (కొదమ సింహం) కొదమ సింహం సినిమాలోని 'స్టార్‌ స్టార్‌ మెగాస్టార్‌' సాంగ్‌ చిరంజీవిని డ్యాన్సర్‌గా మరో మెట్టు ఎక్కించింది. సుప్రీం హీరో ట్యాగ్‌ను దాటి మెగా స్టార్‌ ట్యాగ్‌ను అందించింది. ఇందులో ఆద్యంతం కౌబాయ్‌ కాస్ట్యూమ్స్‌లో కనిపించిన చిరు తన యునిక్‌ స్టెప్పులతో అదరగొట్టారు. ముఖ్యంగా తలపై టోపీని ఉపయోగిస్తూ ఆయన చేసిన డ్యాన్స్ తెలుగులో ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. అప్పటివరకూ టోపీని ఉపయోగించి ఏ తెలుగు హీరో స్టెప్స్‌ వేయలేదు.&nbsp; https://www.youtube.com/watch?v=cFKyIHvudzI బంగారు కోడిపెట్ట (ఘరానా మొగుడు) రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఘరానా మొగుడు’ చిత్రం చిరంజీవి ఇమేజ్‌ని ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ సినిమాకు గాను రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకుని దేశంలో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఇక ఇందులోని 'బంగారు కోడిపిట్ట' సాంగ్‌ ఏ స్థాయిలో సెన్సేషన్‌ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుదేవా కంపోజ్‌ చేసిన ఈ సాంగ్‌లో డిస్కో శాంతిని టీజ్‌ చేస్తూ చిరు స్టెప్పులు వేశారు. డ్యాన్స్‌తో పాటు తన హావభావాలతో ఆకట్టుకున్నారు. చిరు కుమారుడు రామ్‌చరణ్‌ మగధీర చిత్రంలో ఈ సాంగ్‌ను రీమేక్‌ చేయడం విశేషం. https://www.youtube.com/watch?v=hxvUiz6s4Gk రూపుతేరా మస్తానా (రిక్షావోడు) రిక్షావోడు చిత్రంలోని ‘రూపుతేరా మస్తానా’ మ్యూజిక్‌ ప్రియులకు పూనకాలు తెప్పిస్తుంది. సంగీత దర్శకుడు కోటీ ఇచ్చిన వెస్టర్న్‌ బీట్‌ను మ్యాచ్‌ చేస్తూ చిరు ఇరగదీశారు. మెలికలు తిరుగుతూ వెస్టర్న్‌ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. హీరోయిన్‌ నగ్మాతో కలిసి మెస్మరైజ్ చేశారు.&nbsp; https://www.youtube.com/watch?v=mugdo_VO9pY నడక కలిసిన నవరాత్రి (హిట్లర్) ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘హిట్లర్’ మూవీలోని నడక కలిసిన నవరాత్రి సాంగ్ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీనికి లారెన్స్ కొరియోగ్రఫి చేశారు. ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్‌ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా చేశాయి. హీరోయిన్‌ రంభ చిరుతో పోటీపడి మరి డ్యాన్స్ చేయడం గమనార్హం. https://www.youtube.com/watch?v=j2HY4G63qaE ఈ పేటకు నేనే మేస్త్రీ (ముఠా మేస్త్రి) ఈ సాంగ్‌లో చిరు వేసిన హుక్ స్టెప్స్‌ ఎవర్‌గ్రీన్‌ అని చెప్పవచ్చు. ఈ పేటకు నేనే మేస్త్రీ అంటూ చేతిలో టవల్‌తో బాడిని బెండ్‌ చేసి భుజాలు ఎగరేసే స్టెప్‌ చాలా మందికి పూనకాలు తెప్పించింది. ఈ సాంగ్‌ మెుత్తం చిరు లుంగీలోనే కనిపిస్తారు. తలకు టవల్‌ చుట్టుకొని మాస్‌ స్టెప్పులతో ఆద్యంతం అలరించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=oppz5I9KeQA దాయి దాయి దామ్మ (ఇంద్ర) ‘ఇంద్ర’ సినిమాలోని దాయి దాయి దామ్మ సాంగ్ చిరంజీవిలోని డ్యాన్సింగ్ స్కిల్స్‌ను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లింది. ఇందులోని వీణ స్టెప్‌ చిరు కెరీర్‌లోనే ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిచింది. లారెన్స్ కంపోజ్ చేసిన ఈ స్టెప్‌ను ఎంతో గ్రేస్‌తో చిరు చేశారు. అతి కష్టమైన ఆ స్టెప్‌ను అలవోకగా వేసి ఆశ్చర్యపరిచారు. ఈ స్టెప్‌ను ఇప్పటికీ చాలా మంది ట్రై చేస్తూ ఆనందిస్తుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=39W78Hp4E8A ఆటకావాలా పాటకావాలా (అన్నయ్య) ‘అన్నయ్య’ సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా’ సాంగ్‌లో చిరు మాస్‌ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. చిరు డ్యూయల్‌ రోల్‌లో కనిపించిన ఏకైక సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్ అప్పట్లో ఎక్కడా చూసిన వినిపించేది.&nbsp; https://www.youtube.com/watch?v=9NGgI8OHTLY మన్మథ మన్మథ (ఠాగూర్) వి.వి. వినాయక్‌ డైరెక్షన్‌లో చిరు హీరోగా వచ్చిన ‘ఠాగూర్‌’ చిత్రం తెలుగు రికార్డు విజయాన్ని అందుకుంది. ఇందులోని ‘మన్మథ మన్మథ మామ పుత్రుడా’ పాట అంతే స్థాయిలో ఆదరణ పొందింది. ఇందులో చిరు నిలబడి వేసే వీణ స్టెప్‌ మెస్మరైజ్‌ చేస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=FUnaQaxJNuQ అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు (ఖైదీ నెంబర్ 150) ‘ఖైదీ నెంబర్‌ 150’ చిరంజీవి రీఎంట్రీ చిత్రంగా వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరు తనదైన స్టెప్పులతో ఈ సినిమాలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’ అంటూ చిరు వేసిన హుక్‌ స్టెప్‌ ఫ్యాన్స్‌ను మునుపటి రోజులకు తీసుకెళ్లింది. ఆ సాంగ్‌ను మరోమారు చూసి ఎంజాయ్‌ చేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=7jHMP7J6tRs
    సెప్టెంబర్ 23 , 2024
    Aarambham Review: థ్రిల్లింగ్‌ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?
    Aarambham Review: థ్రిల్లింగ్‌ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ సురభి పద్మావతి, అభిషేక్‌ బొడ్డెపల్లి తదితరులు దర్శకుడు : అజయ్‌ నాగ్‌ సంగీతం: సింజిత్‌ యర్రమిల్లి సినిమాటోగ్రఫి: దేవ్‌దీప్‌ గాంధీ నిర్మాతలు: అభిషేక్‌ వి. తిరుమలేశ్‌, వియన్‌ రెడ్డి మామిడి విడుదల తేదీ: 10-05-2024 మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambam). వి. అజయ్ నాగ్ (Ajay Nag) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ కాలాఘటి జైలులో మిగిల్ (మోహన్ భగత్) శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఉరి తీయడానికి సరిగ్గా ఒక రోజు ముందు అనూహ్యంగా జైలు నుంచి మిస్‌ ‌అవుతాడు. జైలు గదికి ఉన్న తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం పోలీసులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని గురించి కనిపెట్టేందుకు డిటెక్టివ్ (రవీంద్ర విజయ్‌) రంగంలోకి దిగుతాడు. అతడు చేస్తున్న దర్యాప్తులో మిగిల్‌కు సంబంధించిన ఓ డైరీ దొరుకుతుంది. అందులో ఏముంది? మిగిల్‌ కథేంటి? అతడికి డెజావు ఎక్స్‌పరిమెంట్‌కు ఏంటి సంబంధం? అసలు మిగిల్‌ ఎందుకు జైలుకు వెళ్లాడు? అక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది మిగిలిన కథ.&nbsp; ఎవరెలా చేశారంటే కేరాఫ్ కంచర పాలెంలో (Aarambham Review In Telugu) గడ్డం క్యారెక్టర్‌లో కనిపించిన మోహన్‌ భగత్‌.. ఈ సినిమాలో మిగిల్‌ పాత్రలో అదరగొట్టాడు. మెయిన్ లీడ్‌లో కనిపించి తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నాడు. సుప్రీతా సత్యనారాయణ ఫిమేల్ లీడ్‌లో ఓకే అనిపించింది. తల్లి పాత్రలో సురభి ప్రభావతి అదరగొట్టేసింది. సైంటిస్ట్‌గా భూషణ్ చాలా బాగా నటించారు. లక్ష్మణ్ మీసాల, రవీంద్ర విజయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు అజయ్‌ నాగ్‌.. సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. జీవితంలో ఓ తోడు ఉండాలని అనే కాన్సెప్ట్‌కు డెజావు అనే సైన్స్‌ ఎక్స్‌పెరమెంట్‌ను జోడించి సస్పెన్స్‌ను క్రియేట్‌ చేశాడు. కథతో పాటు కథనాన్ని కూడా ఆసక్తికరంగా నడిపించాడు. స్టోరీలో అక్కడక్కడా బోరింగ్‌ సీన్లు ఉన్నప్పటికి సస్పెన్స్‌ను చివరి వరకూ కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు. ఓ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా రుచించకపోవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Aarambham Review In Telugu) ఈ మూవీకి అన్ని విభాగాలు చక్కటి పనితీరును అందించాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొండ ప్రాంతాల్లోని ఓ చిన్న గ్రామాన్ని తన కెమెరాలతో ఎంతో చక్కగా చూపించాడు. సింజిత్‌ యర్రమిల్లి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ పనితీరు కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, స్క్రీన్‌ప్లేసస్పెన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ బోరింగ్‌ సన్నివేశాలుకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    మే 10 , 2024
    Om Bheem Bush Weekend Collections: మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌.. ‘ఓం భీమ్‌ బుష్‌’కు ఇకపై అన్నీ లాభాలే!
    Om Bheem Bush Weekend Collections: మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌.. ‘ఓం భీమ్‌ బుష్‌’కు ఇకపై అన్నీ లాభాలే!
    హీరో శ్రీవిష్ణు (Sree Vishnu), కమెడియన్స్ ప్రియదర్శి (Priyadarshi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓం భీం బుష్’ (Om Bheem Bush). ఔట్‌ అండ్ ఔట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి (Sri Harsha konuganti) దర్శకత్వం వహించారు. గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తొలిరోజే గణనీయమైన వసూళ్లతో శ్రీవిష్ణు కెరీర్‌లోనే అత్యధిక డే1 కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా నిలిచింది. మరి వీకెండ్‌ పూర్తయ్యే సరికి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రం గత మూడు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.17 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మెుదటి రోజు రూ. 4.60 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. శనివారం రూ. 5.84 కోట్లు, ఆదివారం రూ. 6.5 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. అయితే సోమవారం నుంచి ఏ సినిమాకు అయినా సరే కలెక్షన్లు కాస్త తగ్గుతాయి. కానీ.. 'ఓం భీమ్ బుష్' విషయంలో మేజర్ డ్రాప్ కనిపించే అవకాశాలు తక్కువేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో పాటు ఈ సినిమాకు పోటీగా శుక్రవారం వరకూ ఏ సినిమా లేనందున వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నాయి. అమెరికాలోనూ వసూళ్ల ప్రభంజనమే! ఇండియాతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి కూడా&nbsp; 'ఓం భీమ్ బుష్'కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. వినోదాత్మక సినిమాలకు ఎన్నారై ఆడియన్స్ నుంచి ఎప్పుడూ ఆదరణ బావుంటుంది. వినోదంతో పాటు చక్కటి పాటలు, మ్యూజిక్ యాడ్ కావడంతో 'ఓం భీమ్ బుష్' అమెరికాలోనూ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతోంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా ఇప్పటివరకూ 3.15 లక్షల డాలర్లను వసూలు చేసింది. మరిన్ని డాలర్లు కొల్లగొట్టే దిశగా ప్రస్తుతం దూసుకుపోతోంది. ఈ వీకెండ్‌లోపూ ఓవర్సీస్‌లో 5 లక్షల డాలర్ల మార్క్‌ను ‘ఓం భీమ్‌ బుష్’ అందుకునే అవకాశం ఉంది.&nbsp; https://twitter.com/TeamVamsiShekar/status/1772133237508481183 నెట్‌ కలెక్షన్స్ ఎంతంటే? ట్రెడ్‌ వర్గాల లెక్కల ప్రకారం ‘ఓం భీమ్‌ బుష్‌’ గత మూడు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా 10.60 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. ఇక దేశవాప్తంగా ఈ సినిమా రూ.6.6 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ వసూలు చేసింది.&nbsp; తొలి రోజు రూ.1.75 కోట్లు, రెండో రోజు రూ. 2.5 కోట్లు, మూడో రోజు రూ.2.35 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.&nbsp; ఇకపై అన్నీ లాభాలే..! యంగ్‌ హీరో శ్రీవిష్ణు గత చిత్రం ‘సామజవరగమన’ బ్లాక్‌ బాస్టర్‌ కావడంతో పాటు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ వంటి హాస్యనటులు ఉండటంతో ఓం భీమ్‌ బుష్‌ థ్రియేట్రికల్‌ బిజినెస్‌ బాగానే జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.6.56 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.56 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. కోటికి థియేట్రికల్‌ హక్కులు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 6.6 కోట్లుగా ఉంది. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా గత మూడు రోజుల్లోనే రూ.10.60 కోట్ల నెట్‌ వసూళ్లను సాధించింది. దీన్ని బట్టి మూడో రోజునే ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టింది. ఇకపై ఈ సినిమాకు వచ్చేవన్నీ లాభాలే అని చెప్పవచ్చు.&nbsp; నెల రోజుల్లోనే ఓటీటీలోకి..! ‘ఓం భీం బుష్’ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రిలీజైన నెలరోజుల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌తో అమెజాన్‌ ఒప్పందం చేసుకుందట. దీని ప్రకారం ‘ఓం భీం బుష్’ సినిమా ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ మధ్య చాలా సినిమాలు నెలరోజుల కంటే ముందే ఓటీటీకి వస్తున్నాయి. అదే విధంగా ‘ఓం భీం బుష్’ కూడా అనుకున్న తేదీకన్నా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సినీ వర్గాలు అంటున్నాయి.&nbsp;
    మార్చి 25 , 2024

    @2021 KTree