• TFIDB EN
  • తత్వ
    UATelugu
    ఆరిఫ్‌ (హిమ దాసరి) సాధారణ ట్యాక్సీ డ్రైవర్‌. అనుకోకుండా డబ్బు అవసరం పడుతుంది. ఈ క్రమంలో బిజినెస్‌ మ్యాన్‌ థామస్‌ (ఒస్మాని ఘని) ఆరిఫ్‌ ట్యాక్సీ ఎక్కుతాడు. దీంతో అతడి నుంచి ఎలాగైన డబ్బు తీసుకోవాలని అనుకుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత థామస్‌ హత్యకు గురవుతాడు. దీంతో ఆరీఫ్ ఈ కేసులో ఇరుక్కుంటాడు. అసలు థామస్‌ను హత్య చేసింది ఎవరు? పోలీసు ఆఫీసర్‌ జ్యోత్స్న (పూజా రెడ్డి బోరా) కేసును ఎలా సాల్వ్‌ చేసింది? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌EtvAppఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    రివ్యూస్
    YouSay Review

    Tatva Review in Telugu: 58 నిమిషాల నిడివితో అర్ధరాత్రి జరిగే క్రైమ్‌ థ్రిల్లర్‌.. ‘తత్వ’ మెప్పించిందా?

    ఈ మధ్యకాలంలో ఓటీటీలో ఎన్నో విభిన్నమైన కథలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈటీవీ విన్ వారానికి ఒక వైవిధ్యమైన సినిమాను తీసుకొస్తూ ప్రేక్షలను అలరిస్తోంది. ఈ క్రమం...read more

    How was the movie?

    తారాగణం
    హిమ దాసరి
    ఉస్మాన్ ఘనీ
    పూజా రెడ్డి బోరా
    సిబ్బంది
    రుత్విక్ యెలగారిదర్శకుడు
    మానస దాసరినిర్మాత
    కథనాలు
    <strong>Tatva Review in Telugu: 58 నిమిషాల నిడివితో అర్ధరాత్రి జరిగే క్రైమ్‌ థ్రిల్లర్‌.. ‘తత్వ’ మెప్పించిందా?</strong>
    Tatva Review in Telugu: 58 నిమిషాల నిడివితో అర్ధరాత్రి జరిగే క్రైమ్‌ థ్రిల్లర్‌.. ‘తత్వ’ మెప్పించిందా?
    నటీనటులు : హిమ దాసరి, పూజా రెడ్డి బోరా, ఒస్మాన్‌ ఘని తదితరులు దర్శకత్వం : రుత్విక్‌ యాలగిరి సంగీతం : సాయి తేజ సినిమాటోగ్రాఫర్‌ : సి. హెచ్‌. సాయి ఎడిటింగ్‌: జై సి. శ్రీకర్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ : అరవింద్‌ ములే నిర్మాత : మానస దాసరి ఓటీటీ వేదిక : ఈటీవీ విన్‌ ఈ మధ్యకాలంలో ఓటీటీలో ఎన్నో విభిన్నమైన కథలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈటీవీ విన్ వారానికి ఒక వైవిధ్యమైన సినిమాను తీసుకొస్తూ ప్రేక్షలను అలరిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం 'తత్వ' (Tatva Review In Telugu) అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. ఇందులో హిమ దాసరి, పూజా రెడ్డి బోరా జంటగా నటించారు. రుత్విక్‌ యాలగిరి దర్శకత్వం వహించారు. కేవలం గంట నిడివితో వచ్చిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి ఆరిఫ్‌ (హిమ దాసరి) ఒక సాధారణ ట్యాక్సీ డ్రైవర్‌. అనుకోకుండా అతడికి డబ్బు అవసరం పడుతుంది. ఈ క్రమంలో బిజినెస్‌ మ్యాన్‌ థామస్‌ (ఒస్మాని ఘని) ఆరిఫ్‌ ట్యాక్సీ ఎక్కుతాడు. తనకు కావాల్సిన డబ్బు థామస్‌ దగ్గర ఉందని గ్రహించిన ఆరిఫ్‌ అతడి నుంచి ఎలాగైన డబ్బు తీసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే అనుకోని విధంగా థామస్‌ హత్య జరుగుతుంది. ఇందులో ఆరిఫ్‌ ఇరుక్కుంటాడు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు పోలీసు ఆఫీసర్‌ జ్యోత్స్న (పూజా రెడ్డి బోరా) రంగంలోకి దిగుతుంది. అసలు థామస్‌ను హత్య చేసింది ఎవరు? ఆరిఫ్‌ ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడు? థామస్‌ - ఆరీఫ్‌ మధ్య రిలేషన్ ఏంటి? ఆరీఫ్‌ నిర్దోషిగా బయటపడ్డాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే సినిమాకి మెయిన్ హీరో హిమ దాసరి అయినప్పటికీ నటుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్న వ్యక్తి మాత్రం ఒస్మాన్ ఘని. థామస్ పాత్రకు అతడు ప్రాణం పోశాడు. ఓ వైపు నవ్విస్తూనే తన నటనతో ఆలోచింపజేశారు. ఇక ఆరీఫ్ పాత్రలో హిమ దాసరి కూడా అలరించాడు. కష్టాల్లో ఉన్న యువకుడిగా అతడి నటన సహజంగా అనిపిస్తుంది. నటి పూజా రెడ్డికి ఇందులో మంచి పాత్రే దక్కింది. ప్రారంభంలో ఆమె రోల్‌ సాదా సీదాగా అనిపించిన క్లైమాక్స్‌ వచ్చే సరికి ఆశ్చర్యపరుస్తుంది. కథను మలుపు తిప్పడంలో ఆమె పాత్రనే కీలకం. కథ మెుత్తం ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టే తిరిగింది. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే ‘రన్ రాజా రన్’, ‘సాహో’ చిత్రాలకు సుజీత్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన రుత్విక్ తనదైన శైలిలో థ్రిల్లింగ్‌గా ఈ సినిమాను రూపొందించారు. మనిషిలో మానవత్వం అంతరిచిపోతున్నదనే విషయాన్ని వివరించిన విధానం బాగుంది. ముఖ్యంగా మెుదటి 20 నిమిషాలు చాలా ఆసక్తికరంగా చూపించారు. తన చెప్పాలనుకున్న పాయింట్స్‌ను ఎలాంటి తికమక లేకుండా నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు. సినిమాను అనవసరంగా సాగదీయకుండా 58 నిమిషాల్లోనే ముగించడం బాగా ప్లస్ అయ్యింది. అయితే కొన్ని సీన్స్‌ లాజిక్‌కు దూరంగా, అసంపూర్ణంగా ఉండటం మైనస్‌గా మారింది. ఈ విషయంలో దర్శకుడు జాగ్రత్త పడి ఉండే రిజల్ట్‌ ఇంకా బెటర్‌గా ఉండేది. సాంగ్స్‌, ఫైట్స్‌, రొమాన్స్, లవ్‌ట్రాక్ వంటి కమర్షియల్‌ హంగులు కోరుకునేవారికి మాత్రం ఈ సినిమా అంతగా ఎక్కకపోవచ్చు. ఓవరాల్‌గా దర్శకుడు రుత్విక్‌ పనితనం మెప్పిస్తుంది.  టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి పనితీరు కనబరిచారు. సినిమా మెుత్తం అర్ధరాత్రి సాగడంతో లో-లైట్‌లోనూ మంచి విజువల్స్ అందించారు. నేపథ్య సంగీతం కూడా సినిమాకు అదనపు బలంగా మారింది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. టెక్నికల్‌గా చూసుకుంటే 'తత్వ'కి మంచి మార్కులే పడ్డాయి. ప్లస్‌ పాయింట్స్ ఆరిఫ్‌, థామస్‌ పాత్రలుకెమెరా వర్క్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కమర్షియల్‌ హంగులు లేకపోవడంఅసంపూర్ణమైన క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 11 , 2024
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.&nbsp; ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం) కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.&nbsp; ‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద.. వలలు వెయ్యొద్దు వయసు మీద.. ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి. సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.&nbsp;&nbsp; &nbsp;‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని.. చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ.. పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ.. దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’&nbsp; ‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా.. కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా.. కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా.. అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.&nbsp; https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk పుడుతూనే ఉయ్యాల(నేనింతే) పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.&nbsp; ‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే.. ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే.. చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే.. నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా.. నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’ ‘‘టర్నే లేని దారులూ.. ట్విస్టే లేని గాథలూ.. రిస్కే లేని లైఫులూ.. బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.&nbsp; https://www.youtube.com/watch?v=t8Afn_CX-tc తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్) సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.&nbsp; ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి. ‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని.. చేతకాని వాడల్లే చూడొద్దే.. ధర్మరాజు అంతటివాడు ఆడాడే.. తీసిపారేయొద్దు జూదాన్ని.. మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే.. స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే.. ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే.. వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’ https://www.youtube.com/watch?v=OzIL-v_OcRk పక్కా లోకల్(జనతా గ్యారేజ్) ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.&nbsp; &nbsp;తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది.. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ&nbsp; సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే… ‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో.. ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో.. ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో.. అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’ డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది. ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది. https://www.youtube.com/watch?v=GFEj1vnhvxA మరికొన్ని.. తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.&nbsp; https://www.youtube.com/watch?v=WkPsPWZQkzk
    జూన్ 23 , 2023
    20 Years Of Allu Arjun: వీడు హీరోనా అన్నారు..ఐకాన్‌ స్టార్‌ అయ్యాడు!
    20 Years Of Allu Arjun: వీడు హీరోనా అన్నారు..ఐకాన్‌ స్టార్‌ అయ్యాడు!
    ‘అల్లు అర్జున్‌’... ! పుష్ప సినిమాతో ఇండియాను షేక్‌ చేసి పాన్‌ ఇండియన్‌ స్టార్‌. ఐకాన్‌ స్టార్‌. అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న నటుల్లో ఒకరు. బ్రాండ్‌ వాల్యూలో ఇండియాలో టాప్‌-25లో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్‌ ఇండియన్‌ హీరో. హైయెస్ట్‌ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న వారిలో ఒకడు. కానీ ఇదంతా ఒక్క రోజులో రాలేదు. 20 ఏళ్ల కఠోర శ్రమ, నిబద్ధత పట్టుదల, కథల ఎంపికలో వైవిధ్యత సినిమా కోసం కష్టపడే తత్వం ఇవన్నీకలిపితేనే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. https://telugu.yousay.tv/allu-arjun-pushpa-will-decrease-in-brand-value-allu-arjun-rashmika-and-pv-sindhu-in-top-25.html తొలి అడుగు 28 మార్చి 2003లో గంగోత్రి సినిమా వచ్చినపుడు చాలా మంది విమర్శించారు. ఇతను హీరోనా అని మాట్లాడిన వారు కూడా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ వాటన్నింటికీ సమాధానం చెప్పాడు. 6 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 3 నంది అవార్డులతో తనలోని నటుడిని ప్రపంచానికి చాటాడు. మరి అల్లు అర్జున్‌ను స్టార్‌ చేసిన అంశాలేంటో చూద్దాం. కథల ఎంపిక గంగోత్రి విడుదలైన నాటి నుంచి ఇప్పటిదాకా అల్లు అర్జున్‌ను స్టార్‌గా నిలిచేలా చేసింది మాత్రం అతడి స్టోరీ సెలెక్షన్‌. అల్లు అర్జున్‌ ఏ రెండు వరుస సినిమాలు కూడా ఒకే పంథాలో సాగవు. లుక్‌, మేనరిజం ఇలా ప్రతీది మారిపోతుంది. గంగోత్రితో విమర్శలు ఎదుర్కొన్నా… ఆ తర్వాత 2004లో వచ్చిన సుకుమార్‌ ‘ఆర్య’ సినిమా అల్లు అర్జున్‌ పేరు మార్మోగేలా చేసింది. అప్పటిదాకా తెలుగు సినిమా చూడని వెరైటీ లవ్‌స్టోరీని అల్లు అర్జున్‌ ఎంపిక చేసుకోవడం సాహసమనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నింటిలోనూ అల్లు అర్జున్ డిఫరెంట్‌గానే కనిపిస్తాడు. బన్నీ, పరుగు, దేశముదురు, ఆర్య-2, వేదం, దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో ఇలా తనలోని నటుడిని సినీ ప్రపంచానికి పరిచయం చేస్తూనే వచ్చాడు. పుష్పలో అయితే ఊర మాస్‌ లుక్‌లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాడు. డ్యాన్స్‌ మరో మాట లేకుండా ఇండియాలోని&nbsp; హీరోల్లో బెస్ట్‌ డ్యాన్సర్స్‌లో అల్లు అర్జున్‌ ఒకడు. అతడి డ్యాన్స్‌కు టాలివుడ్‌లోనే కాదు బాలివుడ్‌లోనూ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆర్య-2, అల వైకుంఠపురములో, రేసు గుర్రం ఇలా ఏ సినిమా తీసుకున్నా అల్లు అర్జున్‌ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే. సుకుమార్ అల్లు అర్జున్‌ కెరీర్‌లో సుకుమార్‌ది కీలక పాత్ర అనడం అతిశయోక్తి కాదు. అప్పుడు ఆర్యతో అతడి కెరీర్‌ను మలుపు తిప్పాడు. అలాగే ‘పుష్ప’తో పాన్‌ ఇండియా స్టార్‌ మార్చాడు. ఇప్పుడు పుష్ప: ది రూల్‌తో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.&nbsp; https://telugu.yousay.tv/allu-arjun-passed-prabhas-in-remuneration.html అల్లు అర్జున్‌ చేసిన అద్భుతమైన పాత్రలు అల్లు అర్జున్‌ సినీ కెరీర్‌లో కథల ఎంపిక, డ్యాన్స్‌లతో పాటు కొన్ని పాత్రలు సినీ ప్రియులు మరిచిపోలేరు. అవి ఆర్య సుకుమార్‌ కల్ట్‌ క్లాసిక్‌ మూవీ ఆర్యలో ‘ఆర్య’గా అల్లు అర్జున్‌ను ఎవరూ మర్చిపోలేరు. సినిమా అంతా నవ్వించినా, నవ్వులపాలైనా చివరిలో కన్నీరు పెట్టించినా ‘ఆర్య’ పాత్ర సూపర్‌ అని చెప్పాలి. బాల గోవింద్‌ అల్లు అర్జున్‌కు మాస్‌ ఇమేజ్ తెచ్చిన సినిమా దేశముదురు. ఇందులో బాల గోవింద్‌గా అల్లు అర్జున్ పాత్ర ఊర మాస్‌ ఉంటుంది. ఇందులో బాలగోవింద్‌ డైలాగ్స్‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్‌గా ఉంటాయి. గోన గన్నారెడ్డి స్టైలిష్‌ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్‌ కంప్లీట్‌ డీ గ్లామర్‌ రోల్‌లో చూపించిన సినిమా రుద్రమదేవి. ఇందులో గోన గన్నారెడ్డిగా తెలంగాణ యాసలో అల్లు అర్జున్‌ చెప్పే డైలాగులు ఎవరూ మర్చిపోలేరు. కేబుల్‌ రాజు క్రిష్‌ తెరకెక్కించిన ‘వేదం’ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా. హీరోయిజంకు ఏమాత్రం అవకాశం లేకుండా కేవలం నటనా ప్రాధాన్యం ఉన్న పాత్ర కేబుల్‌ రాజు. ఎంతోమంది మిడిల్‌ క్లాస్‌ కుర్రాళ్లకు కనెక్ట్‌ అయిన పాత్ర. ఇది కూడా అల్లు అర్జున్ కెరీర్‌లో అద్భుతమైన పాత్రల్లో ఒకటి. పుష్ప ఫైనల్‌గా ‘పుష్ప’. పుష్పరాజ్‌ అంటూ అల్లు అర్జున్‌ చేసిన ఈ పాత్ర తన కెరీర్‌లో మైలురాయి. 20 ఏళ్ల కష్టానికి ఫలితాన్నిచ్చిన పాత్ర. ప్రస్తుతం పుష్ప-2 కోసం అల్లు అర్జున్‌ కష్టపడుతున్నారు. సుకుమార్‌ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతోనూ అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. తన 20 ఏళ్ల ప్రయాణంపై అల్లు అర్జున్‌ ఎమోషనల్ పోస్ట్‌ చేశారు. ‘ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ప్రేక్షకులు, అభిమానులే. సదా మీకు కృతజ్ఞుడను’ అంటూ అల్లు అర్జున్‌ ట్వీట్ చేశాడు. https://twitter.com/alluarjun/status/1640581255732535296?s=20
    మార్చి 28 , 2023
    Balayya vs Jr.NTR: జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసిపారేయ్.. బాలకృష్ణ ఆగ్రహం.. వీడియో వైరల్
    Balayya vs Jr.NTR: జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసిపారేయ్.. బాలకృష్ణ ఆగ్రహం.. వీడియో వైరల్
    ఎన్టీఆర్(Sr. NTR) వర్ధంతి వేళ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌(NTR Ghat)లో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన బాలయ్య.. అక్కడ ఏర్పాటు చేసిన జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఫ్లెక్సీలను తొలగించడంపై తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ అంశంలోకి మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) కలుగచేసుకోవడంతో ఇది రాజకీయ చర్చకు దారి తీసింది.&nbsp; https://twitter.com/i/status/1747792524042006727 ‘తీయించేయ్‌.. ఇప్పుడే’ ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఉదయాన్నే జూనియర్‌ ఎన్టీఆర్‌ తన సోదరుడు కల్యాణ్ రామ్‌తో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌లో తన తాతకు నివాళులర్పించారు. ఆ తర్వాత కాసేపటికి నందమూరి బాలకృష్ణ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికెళ్లారు. ఎన్టీఆర్ సమాధిపై పూలమాల వేసి అంజలి ఘటించారు. తర్వాత.. అక్కడ జూ. ఎన్టీఆర్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై బాలయ్య చూపు పడింది. ఆ ప్లెక్సీలను తీసేయాలని బాలకృష్ణ ఆదేశించారు. ఇప్పుడే తీసేయాలి అంటూ కోపంగా బాలయ్య అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. https://twitter.com/i/status/1747862444142375247 తారక్‌ ఫ్యాన్స్‌ మండిపాటు ఈ ఘటన సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. తన అల్లుడు నారా లోకేష్ కోసమే జూ.ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తారక్‌ రాజకీయాల్లోకి వస్తే లోకేష్‌ భవితవ్యం ప్రశ్నార్థకం అవతుందని పేర్కొంటున్నారు. తారక్‌కు ఉన్న క్రేజ్‌, మాట్లాడే తత్వం, నాయకత్వ లక్షణాలు లోకేష్‌ను పొలిటికల్‌గా ఇరకాటంలో పడేస్తాయని, అందుకే బాలయ్య తారక్‌ను దూరం పెడుతున్నారని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. &nbsp; కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు మరోవైపు ఈ అంశంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘అల్లుడు నారా లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగిస్తున్నారు. గతంలో పెద్ద ఎన్టీఆర్‌ను దించేసి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారు. వెయ్యి మంది బాలకృష్ణలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. https://twitter.com/i/status/1747872349519765593 రంగంలోకి వైసీపీ వర్గాలు! ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి మెుదలైన నేపథ్యంలో అధికార వైసీపీ.. ఈ ప్లెక్సీల అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. వైసీపీ సోషల్‌ మీడియా టీమ్‌.. తారక్‌కు మద్దతుగా పోస్టులు పెడుతూ ఎన్టీఆర్‌ అభిమానులను మద్దతును కూడగట్టేందుకు యత్నిస్తోంది. బాలయ్య అన్న మాటలను తమ సోషల్‌ మీడియా వేదికల్లో విపరీతంగా సర్క్యూలేట్‌ చేస్తూ టీడీపీకి చెక్‌ పెట్టేందుకు యత్నిస్తోంది. మెుత్తంగా తారక్‌ ప్లెక్సీల తొలగింపు వ్యవహారం ఏపీలో రాజకీయ రంగును పులుముకోవడం గమనార్హం. https://twitter.com/i/status/1747887445574848809 గతంలోనూ ఇలాగే.. అయితే గతంలోనూ నందమూరి కుటుంబానికి, జూ.ఎన్టీఆర్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తారక్‌ ఒక్క ప్రకటన చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రెస్‌మీట్‌లో ఈ అంశంపై బాలయ్యను ప్రశ్నించగా ‘ఐ డోంట్‌ కేర్‌’ అంటూ అప్పట్లోనే ఆయన బదులిచ్చారు. ఆ అసహనంతోనే ఇప్పుడు ప్లెక్సీలు తీయించమని ఉండొచ్చు. ఆ తర్వాత జరిగిన ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లోనూ తారక్‌ ఎక్కడా కనిపించలేదు. ఎన్టీఆర్‌ స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేసే కార్యక్రమంలో నందమూరి కుటుంబం మెుత్తం పాల్గొన్నప్పటికీ&nbsp; హరికృష్ణ కుటుంబం దూరంగా ఉంది. తారక్‌ మౌనానికి కారణం అదేనా? 2009 ఎలక్షన్స్‌ ముందు వరకూ తారక్‌ టీడీపీ తరపున చాలా చురుగ్గా వ్యవహరించాడు. ఎన్నికల్లో పార్టీ తరపున సుడిగాలి పర్యటన చేసి తన ప్రచారంతో శ్రేణులను హోరెత్తించారు. అయితే ఆ ఎలక్షన్స్‌లో ఓడిపోవడంతో జూ.ఎన్టీఆర్‌ను చంద్రబాబు పక్కనే పెట్టేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా 2014 నుంచి పార్టీ వ్యవహారాలకు తారక్‌ను దూరంగా ఉంచారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటివరకూ పార్టీ అవసరాలకు వినియోగించుకొని ఒక్కసారిగా పక్కనపెట్టేయడం తారక్‌ను తీవ్రంగా బాధించిందని అతడి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
    జనవరి 18 , 2024
    BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
    BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
    నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్, బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిశోర్, తదితరులు దర్శకత్వం: సముద్రఖని స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యూజిక్: తమన్ ఎస్.ఎస్ సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల పవన్ కళ్యాణ్, సాయితేజ్ మల్టీస్టారర్‌ మూవీ ‘బ్రో’. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి రీమేక్ హిట్ల అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన మరో రీమేక్ ఇదే. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు, పవన్ కళ్యాణ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాను మలిచారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాతృక దర్శకుడు సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. మరి, ఫిలాసఫికల్ టచ్‌తో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మెప్పించిందా? టైం కాన్సెప్ట్ ప్రేక్షకుడిని కన్వీన్స్ చేసిందా? ‘బ్రో’ మూవీతో పవన్ హ్యాట్రిక్ రీమేక్ హిట్ అందుకున్నాడా? అనే విశేషాలు రివ్యూలో చూద్దాం. కథేంటంటే? మార్కండేయుడు(సాయితేజ్) ఓ బిజినెస్‌మేన్ పెద్దకొడుకు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మార్క్‌పై పడతాయి. గజిబిజి హడావుడిలో పడిపోయి అటు కుటుంబానికి, లవర్‌కి పెద్దగా టైం కేటాయించని పరిస్థితి మార్క్‌ది. ఈ క్రమంలో అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతాడు. మార్క్‌ని తీసుకెళ్లడానికి టైటాన్(పవన్ కళ్యాణ్) వస్తాడు. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయని, వాటిని పూర్తి చేశాక వస్తానని కాలదేవుడిని ఒప్పిస్తాడు. ఈ క్రమంలో మార్క్ చేసే ప్రతి పనిలోనూ ఎదురు దెబ్బ తగులుతుంది. మరి, చివరికి మార్క్ వాటినెలా పూర్తి చేశాడు? టైటాన్ ఏమైనా సాయం చేశారా? అనేది తెరపై చూడాల్సిందే. https://twitter.com/captain_India_R/status/1684756208845045760?s=20 ఎలా ఉంది? ‘వినోదయ సిత్తం’ మూవీ కంప్లీట్‌గా ఫిలాసఫికల్‌ మూడ్‌లో సాగుతుంది. కానీ, బ్రో ఇందుకు కాస్త భిన్నం. తత్వాన్ని బోధిస్తూనే కమర్షియల్ హంగులను అద్దుకుందీ సినిమా. దేవుడికి కూడా టైం రావాలని, దేవుడి కన్నా గొప్పది ‘టైం’ అనే విషయాన్ని చెబుతుంది. దీనినే పూర్తిగా ఫ్యాన్ మేడ్‌లా రూపొందించి కన్వే చేశారు. పవన్ కళ్యాణ్ పాత్రను దృష్టిలో పెట్టుకునే పూర్తి సినిమాను మలిచారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచే ఈ ఫ్లేవర్ కనిపిస్తుంది. అసలే ఆకలితో ఉన్న ఫ్యాన్స్‌కి పవన్ పాపులర్ సాంగ్స్‌ని మిక్స్ చేసి బిర్యానీ తినిపించారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ని కుర్చీలో కూర్చోనివ్వవు. ఇంట్రవెల్ పార్ట్, క్లైమాక్స్ పార్ట్ సినిమాకు అసెట్‌గా నిలుస్తాయి. సన్నివేశాలకు అనుగుణమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కథనం వేగంగా సాగుతుంటుంది. క్లైమాక్స్‌లో ఎమోషన్ పీక్స్. అప్పటిదాకా ఎంజాయ్ చేసిన సినిమాను చివరి 20 నిమిషాల్లో మర్చిపోతాం. థియేటర్ల నుంచి బయటకొచ్చేటప్పుడు ఈ క్లైమాక్స్ మాత్రమే గుర్తుంటుంది. అయితే, కొన్ని చోట్ల సీన్లు ఓవర్‌గా అనిపించడం, కుటుంబం ఎమోషన్లు ఊహించినంతగా పండకపోవడం కాస్త మైనస్. సినిమాలో ఏపీ పాలిటిక్స్‌ని ఇరికించడం రుచించకపోవచ్చు. https://twitter.com/CharanRuthless/status/1684406412892606464?s=20 ఎవరెలా చేశారు? కాలదేవుడిగా పవన్ కళ్యాణ్ ఇరగ దీశాడు. ఎంట్రీ సీన్ నుంచి సినిమాకు ఫుల్ ఎనర్జీని తీసుకొచ్చాడు. సినిమా ఆసాంతం నాటి పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేసేలా నటించాడు. తన పాపులర్ సాంగ్స్‌లలో స్టెప్పులతో అలరించాడు. క్లైమాక్స్‌లోనూ ఎమోషన్స్‌ని చక్కగా పండించాడు. ఇక మార్క్‌‌పై సానుభూతి కలిగేంతలా నటించాడు సాయితేజ్. తన రియల్ లైఫ్‌కి ఇది చాలా దగ్గరగా ఉండటంతో అట్టే ఒదిగిపోయాడు. మావయ్యతో కలిసి చేసే సీన్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. చివర్లో సాయితేజ్ ఏడిపించేస్తాడు. ఇక, కేతిక శర్మ తన పాత్రకు పరిమితమైంది. తల్లిగా రోహిణి, చెల్లిగా ప్రియా ఓకే అనిపించారు. టెక్నికల్‌గా సినిమాకు కథ ఎంతో బలాన్నిచ్చింది. రీమేక్ అయినప్పటికీ మాతృ కథలోని ఆత్మ పోకుండా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ సముద్రఖని సఫలమయ్యాడు. ఎంత వరకు అవసరమో, ఫ్యాన్స్‌కి ఏం కావాలో అంతే చూపించాడు. ఇక, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా డైలాగ్స్‌లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. ఇక, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి ఆకట్టుకుంటుంది. శ్లోకం బీజీఎం ఒక వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్‌ని యంగ్‌గా చూపించడంలో సుజీత్ వాసుదేవ్ తన పనితనం చూపించారు. నిర్మాణ విలువలు సరిపోయాయి. https://youtu.be/jnzuXnj6HE0 ప్లస్ పాయింట్స్ పవన్, సాయితేజ్ మధ్య సీన్స్ పవన్ సాంగ్స్ మిక్స్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ఓవర్ సీన్స్ పొలిటికల్ డైలాగ్స్ చివరగా.. సినిమా చూసొచ్చాక జీవితంలో ఏదైనా చేయాలనిపిస్తుంది ‘బ్రో’ రేటింగ్: 3/ 5 https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
    జూలై 28 , 2023
    Top 10 Melody Hits Of Veturi : ఈ సాంగ్స్ వింటే ఎవరైన ప్లాట్ కావాల్సిందే భయ్యా..!
    Top 10 Melody Hits Of Veturi : ఈ సాంగ్స్ వింటే ఎవరైన ప్లాట్ కావాల్సిందే భయ్యా..!
    వేటూరి సుందరరామమూర్తి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. గేయ రచయితగా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తన కెరీర్‌లో 5 వేలకు పైగా పాటలకు సాహిత్య దానం చేశారు వేటూరి. వేటూరి పాటను కీర్తిస్తూ ఎన్నో పాటలు పుట్టుకు రావడం సుందర రామమూర్తి సాహిత్యానికి నిదర్శనం. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా తన పాటలతో అందరినీ మరిపించగలరు. మంచి మెలోడీ పాటలనూ రాయగలరు. మరి, వేటూరి కలం నుంచి జాలువారిన కొన్ని మెలోడీ గీతాలేంటో తెలుసుకుందామా.&nbsp; పూసింది పూసింది పున్నాగ సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని ‘పూసింది పూసింది పున్నాగ’ గేయం ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తుంది. పదాలను ప్రాసలో వాడటంలో వేటూరి ప్రావీణ్యమేంటో ఈ పాటలో తెలిసిపోతుంది. ఈ పాటలోని లిరిక్స్ ఆహ్లాదంగా ఉంటాయి. వేటూరి మాటకు కీరవాణి బాణీ కడితే ఈ పాటలా ఉంటుంది. మీరూ వినేయండి మరి. https://www.youtube.com/watch?v=sBG_Z3zv96s యమహా నగరి కలకత్తా పురి చూడాలని వుంది సినిమాలోని పాట ఇది. కలకత్తా నగర విశిష్ఠతను తెలియజేస్తూ సాగిపోతుంటుందీ గీతం. బెంగాళీ చరిత్రను ఒక పాటలో అవపోసన పడితే వచ్చేదే ఈ గేయం. ‘కలలకు నెలవట.. కళలకు కొలువుట.. విధులకు సెలవట.. అతిథుల గొడవట.. కలకట నగరపు కిటకిటలో’ అంటూ ప్రాసలో చేర్చేశారు. వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్(నేతాజీ)లకు జన్మనిచ్చిన చోటు అంటూ గేయంలో చరిత్రను ఇనుమడించారు. https://www.youtube.com/watch?v=q2mt5XNgFVE యమునాతీరం ఆనంద్ సినిమాలోని ‘యమునాతీరం’ పాట చాలా మందికి ఎంతో ఇష్టం. ఉదయం లేవగానే ఈ పాటను ఎంతో మంది వింటుంటారు. ఉల్లాసంగా ఉంటూ.. కొత్త ఉత్సాహాన్ని నింపుతుందీ పాట. ‘శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమ.. చిగురించే రుతువల్లే విరబూసే ప్రేమ’ అంటూ సాగే గీతం నూతనోత్తేజాన్ని నింపుతుంది. హరిహరన్, చిత్ర వేటూరి సాహిత్యానికి ప్రాణం పోశారు. https://www.youtube.com/watch?v=375j2vlMbxM ఉప్పొంగెలే గోదావరి గోదావరి సినిమాలోని ‘ఉప్పొంగెలే గోదావరి’ పాట ఎంతో అద్భుతం. గోదావరి గొప్పదనాన్ని వేటూరి పాటకన్నా గొప్పగా ఏదీ వర్ణించదేమో అన్నట్లుగా ఉంటుందీ గీతం. ‘వెతలు తీర్చే మా దేవేరి.. వేదమంటి మా గోదారి.. శబరి కలిసిన గోదారి..రామ చరితకే పూదారి’ అంటూ గోదారి విశిష్ఠతను వర్ణించారు. బాల సుబ్రహ్మణ్యం పాటను మరోస్థాయికి తీసుకెళ్లారు.&nbsp; https://www.youtube.com/watch?v=yWnhTwJeKbQ తొలిసారి మిమ్మల్ని శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోని పాట ఇది. ఓ అబ్బాయిని చూసి మనసు పారేసుకున్న యువతి పాట పాడితే ఎలా ఉంటుందో ఈ గేయం చెబుతుంది. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు’ అంటూ నివేదిస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=VZEIVEjC5TE చుక్కల్లారా చూపుల్లారా ఆపద్భాందవుడు సినిమాలోని మధురమైన పాట ఇది. ‘చుక్కల్లారా చూపుల్లారా.. ఎక్కడమ్మా జాబిలీ.. మబ్బుల్లారా, మంచుల్లారా తప్పుకోండీ దారికీ’ అంటూ గేయం మొదలవుతుంది. ఇందులోని లిరిక్స్ శ్రోతలను కట్టిపడేస్తాయి. మీరూ ఈ మధుర గీతాన్ని ఆస్వాదించండి.&nbsp; https://www.youtube.com/watch?v=5QYZGxyg1ZE పచ్చందనమే సఖి సినిమాలోని తెలుగు వెర్షన్ పాటలను రాసింది వేటూరీనే. ఇందులో పచ్చందనమే పాట మ్యూజిక్ లవర్స్‌కి ఫేవరేట్ సాంగ్. ‘ఎర్రని రూపం ఉడికే కోపం.. మసకే పడితే మరకత వర్ణం.. అందం చందం అలిగిన వర్ణం’ అని సాగే లిరిక్స్ మెస్మరైజ్ చేసేస్తాయి.&nbsp; https://www.youtube.com/watch?v=XruNLPI0yQc జిలిబిలి పలుకుల సితార సినిమాలోని ‘జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘కలలను తెంచకు.. కలతను దాచకు’, ‘అడగను లే చిరునామా ఓ మైనా ఓ మైనా.. చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా’ వంటి వాక్యాలు ఇంప్రెస్ చేస్తాయి. ఇలాంటివి ఎన్నో ఉంటాయీ పాటలో. https://www.youtube.com/watch?v=yJNSkGafGJw మౌనమేళనోయి సాగర సంగమం సినిమాలోని పాటలన్నీ ప్రత్యేకం. అందులోనూ ‘మౌనమేళనోయి’ మెలోడీ మరెంతో స్పెషల్. ‘ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల.. తారాడే హాయిల’ అంటూ శ్రోతలను హాయిని చేకూర్చారు వేటూరి. అందుకే ఇప్పటికీ ఈ పాట వెంటాడుతూనే ఉంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=N-J2YjDtBGs రెక్కలొచ్చిన ప్రేమ బస్ స్టాప్ సినిమాలోని ‘రెక్కలొచ్చిన ప్రేమా నింగికి ఎగిరిందా’ పాట మ్యూజిక్ లవర్స్‌కి ఎంతో ఇష్టం. ‘ఆకాశం ఇల్లవుతుందా రెక్కలొచ్చాక.. అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక’ అంటూ ప్రశ్నిస్తూనే తత్వాన్ని చెప్పారు వేటూరి. ఈ పాటను ఓసారి వినేయండి మరి. https://www.youtube.com/watch?v=hQ7EaelCpP8
    జూన్ 21 , 2023
    త్వరలో ఒక్కటి కానున్న సమంత - విజయ్ దేవరకొండ! ఇద్దరి టార్గెట్ ఒక్కటే.. ఇదిగో సాక్ష్యాలు
    త్వరలో ఒక్కటి కానున్న సమంత - విజయ్ దేవరకొండ! ఇద్దరి టార్గెట్ ఒక్కటే.. ఇదిగో సాక్ష్యాలు
    సమంత - విజయ్ దేవరకొండ వీరిద్దరు తెలుగు తెరపై అనతి కాలంలోనే స్టార్స్‌గా ఎదిగారు. పెద్దఎత్తున ఫ్యాన్ బేస్‌ను సంపాదించారు. విజయ్ -సామ్ సినీ కెరీర్ పక్కన పెడితే ఇద్దరూ తమ పర్సనల్‌ లైఫ్‌లో ఒకేరకంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. వీరి ఆలోచనల్లో కొన్ని ఒకేరకంగా ఉండటం యాధృచ్చికమే అయినా.. కెరీర్‌ పరంగా ఒకే దారిలో అడుగులు వేస్తూ ఒకే టార్గెట్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది.&nbsp; ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న ఖుషీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; టాలీవుడ్‌లో తొలి సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాందించి రౌడీ బాయ్‌గా ఫ్యాన్స్‌కు దగ్గరయ్యాడు విజయ్ దేవరకొండ. తన యాటిట్యూడ్, టాకింగ్ నెస్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం మూవీలతోనే కాకుండా సొంతంగా బిజినెస్‌లు ప్రారంభిస్తూ అందులోనూ రాణిస్తున్నాడు. ఇదే దారిలో సమంత కూడా పయనిస్తోంది. సినిమాల్లోకి వచ్చిన తొలిరోజుల్లోనే సమంత తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా అవకశాలు కొల్లగొడుతూ అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగు, తమళంలో దాదాపు అందరు అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. విజయ్ దేవరకొండ ఓవైపు సినిమాలు చేస్తూనే వ్యాపారాలపై దృష్టి పెట్టాడు. యూత్‌లో క్రేజ్ సంపాదించిన విజయ్.. ఆ క్రేజ్‌ను తన వ్యాపారానికి పెట్టుబడిగా మార్చుకున్నాడు. రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్‌ టైల్ బిజినెస్ ప్రారంభించి ఈ రంగంలోనూ సక్సెస్ సాధించాడు. &nbsp;సొంత బ్రాండ్ కావడంతో తానే ప్రకటనల్లో నటిస్తూ ప్రమోట్ చేస్తున్నాడు. ఈ రౌడీ బ్రాండ్ మెన్స్‌వేర్‌కి యూత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇక సామ్ గురించి చెప్పాలంటే.. ఫ్యాషన్ రంగంపై తనకున్న ఇంట్రెస్ట్‌తో 'సాకీ' అనే పేరుతో ఓ ఆన్‌లైన్ వస్త్ర వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది సమంత. ఈ ఆన్ లైన్ స్టోర్ కోసం సొంతంగా ప్రమోషన్స్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతోంది. తన బ్రాండ్ ప్రమోషన్స్ కోసం వ్యాపార ప్రకటనల్లో పాల్గొనడం సామ్, విజయ్‌లో ఉన్న కామన్ పాయింట్.&nbsp; వీటితో పాటు&nbsp; బడా&nbsp; వ్యాపార సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. కేవలం వ్యాపారం, డబ్బు సంపాదించడమే కాకుండా సామాజిక స్పృహతో సమాజ సేవలో కూడా పాల్గొంటున్నారు ఇద్దరు స్టార్స్. ఈ క్రమంలో దేవరకొండ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను రౌడి స్టార్ ప్రారంభించాడు. దీని ద్వారా నిరుద్యోగులకు జాబ్ స్కిల్స్, ఇంగ్లిష్ వంటి వాటిలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. &nbsp;అలాగే కోవిడ్ టైంలో విజయ్ ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదవాళ్లకు నిత్యవసర సరకులను ఉచితంగా అందించి పెద్ద మనసు చాటుకున్నాడు. ఇక లెడీ బాస్ సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తోంది. ఈ ఫౌండేషన్ తరఫున ప్రాణాపాయంలో ఉన్న మహిళలు, చిన్నారులను సామ్ ఆదుకుంటోంది. అయితే వీరిద్దరు కలిసి ఓ కామన్ బ్రాండ్ ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. ఇప్పటికే రౌడీ బ్రాండ్‌తో విజయ్, సాకీ బ్రాండ్‌తో సమంత సొంత వ్యాపారాలు చేస్తుండగా ఈ రెండింటిని కలపడం లేదా , మరొ కొత్త బ్రాండ్‌తో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారట. ఇక సినిమాల విషయానికొస్తే.. వీరిద్దరు జంటగా నటించిన ఖుషి మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఖుషి మూవీ పాటలు, ప్రచార కార్యక్రమాలు ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ రోమాన్స్ అదిరిపోయింది. ఈ సినిమా విజయం ఇద్దరి స్టార్స్‌ కెరీర్‌కు కీలకం కానున్నాయి. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న విజయ్- సమంతలు ఈ చిత్రం సక్సెస్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
    ఆగస్టు 31 , 2023
    సమంత త్వరగా కోలుకో.. మేమున్నాం అంటున్న టాలీవుడ్
    సమంత త్వరగా కోలుకో.. మేమున్నాం అంటున్న టాలీవుడ్
    ]సమంత ఈ వ్యాధి బారిన పడడానికి చై, సామ్ బ్రేకప్పే కారణమని కొందరు అంటున్నారు. సమంత కుంగుబాటుకు గురైందని.. తద్వారా ఈ వ్యాధి అటాక్ చేసినట్లు చెబుతున్నారు. నాగచైతన్యని కొందరు నిందిస్తున్నారు.విడిపోవడమే కారణమా?
    ఫిబ్రవరి 11 , 2023
    Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్‌ థ్రిల్లర్‌.. ‘మిరల్‌’ ఎలా ఉందంటే?
    Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్‌ థ్రిల్లర్‌.. ‘మిరల్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు: భరత్, వాణి భోజన్, కేఎస్ రవికుమార్, మీరా కృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు దర్శకత్వం: ఎం. శక్తివేల్ మ్యూజిక్ డైరెక్టర్: ప్రసాద్ ఎస్ఎన్ సినిమాటోగ్రాఫర్: సురేష్ బాలా ఎడిటర్: కలైవనన్.ఆర్ నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్ విడుదల తేదీ: 17-05-2024 ప్రేమిస్తే ఫేమ్‌ భరత్‌ హీరోగా నటించిన చిత్రం 'మిరల్‌'. రెండేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో డబ్‌ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఎం. శక్తివేల్‌ దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి హరి (భరత్‌), రమ (వాణీ భోజన్‌) ప్రేమ వివాహం చేసుకొని కొడుకుతో సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు రమకు పీడ కల రావడంతో ఊరులో ఉన్న కుల దైవానికి పూజా చేయించమని ఆమె తల్లి చెబుతుంది. దీంతో ఊరికి వెళ్లి పూజలు చేయిస్తారు. ఈ క్రమంలో హరి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఓకే కావడంతో అర్ధరాత్రి ఫ్యామిలీతో కలిసి బయలుదేరతాడు. మెయిన్‌ రోడ్డులో వెళ్లాల్సిన వారి కారు ఓ కారణం చేత మరో రూట్‌లోకి వెళ్తుంది. అయితే ఆ రూట్‌లో ఆత్మ తిరుగుతుందని ఊరి ప్రజల నమ్మకం. అందుకని రాత్రి వేళ్లలో ఆ దారిలో ఎవరూ ప్రయాణించరు. అటువంటి మార్గంలో వెళ్లిన హరి ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? నిజంగానే ఆ మార్గంలో అతీత శక్తి ఉందా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హీరో భరత్‌ ఎప్పటి లాగే తన నటనతో అదరగొట్టాడు. హరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. అటు నటి వాణి భోజన్‌.. భరత్‌తో పాటు సినిమాను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరు తమ నటనతో అదరగొట్టారు. తమ హావ భావాలతో ఎమోషనల్‌ సన్నివేశాలను చక్కగా పండించారు. KS రవికుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించి అలరించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిలో పర్వాలేదనిపించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు ఎం. శక్తివేల్‌.. ఓ కుటుంబం చుట్టూ సాగే హార్రర్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్‌ ముందు వరకూ ఏదో జరుగుతోందన్న సస్పెన్స్‌ను మెయిన్‌టెన్‌ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. కథ పరంగా చూస్తే రొటిన్‌ స్టోరీ అయినప్పటికీ స్క్రీన్‌ ప్లే విషయంలో మాత్రం చక్కటి పనితీరును కనబరిచాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్‌లో ఏదో జరిగిపోతుందని భావించిన ప్రేక్షకులకు చివర్లో వచ్చే ట్విస్ట్ ఊసూరుమనిపిస్తుంది. అప్పటివరకూ మెయిన్‌టెన్‌ చేసిన ఆసక్తి మెుత్తం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. క్లైమాక్స్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్లు మరీ సాగదీతగా అనిపిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. చాలా సన్నివేశాల్లో నేపథ్యం సంగీతం భయపెడుతుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ భరత్‌, వాణీ భోజన్‌ నటనఆసక్తికరంగా సాగే కథనంనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథలో కొత్తదనం లేకపోవడంపేలవమైన క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    మే 17 , 2024
    Kannappa: 15 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో జత కట్టబోతున్న బాలీవుడ్‌ బ్యూటీ..!
    Kannappa: 15 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో జత కట్టబోతున్న బాలీవుడ్‌ బ్యూటీ..!
    నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కలల ప్రాజెక్ట్‌గా సిద్ధమవుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ శివుడి పాత్రలో చేయనుండగా.. శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, మోహన్‌లాల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్ స్టంట్‌ మాస్టర్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇదిలాంటే తాజాగా ‘కన్నప్ప’ సినిమాపై ఓ అప్‌డేట్‌ వచ్చింది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు సంబంధించిన విషయం కావడంతో ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ నటి!&nbsp; ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్‌ శివుడుగా నటించడం ఇప్పటికే ఖరారైంది. పార్వతి దేవి పాత్రలో తమిళ లేడి సూపర్‌ స్టార్‌ నయనతార (Nayanthara) చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజా అప్‌డేట్‌ ప్రకారం ఆ పాత్రను బాలీవుడ్‌ నటి పోషించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ ‘కంగనా రనౌత్’ (Kangana Ranaut) ప్రభాస్‌ పక్కన నటిస్తుందని అంటున్నారు. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అలాగే మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా బయటకి రానున్నట్లు తెలుస్తోంది. https://twitter.com/GetsCinema/status/1759893440500846829 15 ఏళ్ల తర్వాత.. ప్రభాస్‌-కంగనా కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో వచ్చిన ‘ఏక్‌నిరంజన్‌’ (2009) చిత్రంలోనూ వీరిద్దరూ జోడీగా కనిపించారు. తెలుగులో కంగనాకు అదే తొలి చిత్రం. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే కలెక్షన్లు రాబట్టడంలో మాత్రం విఫలమైంది. ఈ సినిమాలో ప్రభాస్‌-కంగనా జోడీకి మంచి మార్కులే పడ్డాయి. వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో వార్తలు సైతం వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు కలిసి నటించాలని భావించినప్పటికీ వీలు పడలేదు. ప్రస్తుత ప్రచారం నిజమైతే 15 ఏళ్ల తర్వాత ఈ జోడి మళ్లీ వెండితెరపై మెరవనుంది.&nbsp; కన్నప్పపై విష్ణు ఫోకస్‌ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన కన్నప్పను మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తూ.. ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ న్యూజిలాండ్‌లో జరిగింది. టీమ్‌లో అందరికీ గాయాలు అవుతున్నా కూడా షూటింగ్‌కు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. విష్ణుకి కూడా షూటింగ్‌ టైమ్‌లో గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా కన్నప్ప టీమ్ న్యూజిలాండ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని కొద్ది రోజుల క్రితం ఇండియాకు తిరిగొచ్చింది.&nbsp; https://twitter.com/i/status/1730567740325535838 ఆకట్టుకున్న ఫస్ట్‌లుక్‌ గతేడాది నవంబర్‌లో మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. హీరో ముఖం కనిపించకుండా శివలింగం వైపు ఓ యోధుడు విల్లు ఎక్కుపెట్టినట్లు ఈ పోస్టర్‌లో చూపించారు. దీన్ని షేర్‌ చేసిన మంచు విష్ణు.. 'కన్నప్ప' ప్రపంచంలోకి&nbsp; అడుగుపెట్టండి అంటూ క్యాప్షన్‌ జోడించారు. నాస్తికుడైన యోధుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారడన్నది ఈ చిత్రంలో చూపించనున్నట్లు ఆ సందర్భంలో విష్ణు తెలిపారు.&nbsp; ‘కన్నప్ప’ వచ్చేది అప్పుడేనా! కన్నప్ప సినిమా రిలీజ్‌కు సంబంధించి ఇటీవల ఓ వార్త బయటకొచ్చింది. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇప్పటికే మెజారిటీ షూటింగ్‌ను న్యూజిలాండ్‌లో ఫినిష్‌ చేసిన మూవీ బృందం.. తదుపరి షూట్‌ను కూడా త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తోందట. ఈ దసరాకు ‘కన్నప్ప’ను రిలీజ్ చేయాలని మంచు విష్ణు టార్గెట్‌గా పెట్టుకున్నాడని అంటున్నారు. దసరాకు రిలీజ్‌ చేస్తే ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతుందని టీమ్‌ భావిస్తోందట. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతున్న ‘కన్నప్ప’ కోసం అన్నీ భాషల్లోని స్టార్స్‌తో ప్రమోషన్స్‌ చేయాలనే ఆలోచనతో టీమ్ ఉందని టాక్‌.&nbsp;
    ఫిబ్రవరి 21 , 2024
    Viswambhara : 18 ఏళ్ల తర్వాత త్రిషతో రొమాన్స్ చేయనున్న చిరంజీవి!
    Viswambhara : 18 ఏళ్ల తర్వాత త్రిషతో రొమాన్స్ చేయనున్న చిరంజీవి!
    గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌ (Tollywood)ను తొలిచేస్తున్న ప్రశ్నకు ఇవాళ సమాధానం దొరికింది. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తర్వాతి చిత్రం ‘విశ్వంభర’లో హీరోయిన్ ఎవరన్న ఊహాగానాలకు చిత్ర బృందం చెక్ పెట్టింది. ఇందులో చిరుకు జోడీగా స్టార్‌ నటి త్రిష (Actress Trisha) నటించనున్నట్లు మూవీ యూనిట్‌ ప్రకటించింది. అంతేకాకుండా త్రిష సెట్‌లో పాల్గొన్న వీడియోను చిరంజీవి స్వయంగా షేర్‌ చేశారు.&nbsp; ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.&nbsp; చిరు - త్రిష ఆలింగనం చిరు షేర్‌ చేసిన వీడియో ప్రకారం.. మెుదట సెట్‌లో అడుగుపెట్టిన మెగాస్టార్‌.. డైరెక్టర్ వశిష్టతో (Mallidi Vasishta) కలిసి స్క్రిప్ట్‌కు సంబంధించిన విషయాలను చర్చిస్తుంటారు. పక్కనే చిరు తనయ సుస్మిత (Sushmita Konidela) కూడా నిలబడి ఉంటుంది. ఈ క్రమంలోనే నటి త్రిష.. క్యారీవ్యాన్‌ నుంచి బయటకొచ్చి మెగాస్టార్‌ చిరును ఆలింగనం చేసుకుంటుంది. ఆ తర్వాత మెగాస్టార్‌ ఆమెకు పుష్పగుచ్చంతో సెట్‌లోకి స్వాగతం పలుకుతారు. ఈ వీడియోను చూసిన మెగా ఫ్యాన్స్‌ ఉత్సాహంతో ఊగిపోతున్నారు. లైక్స్‌, షేర్స్‌తో వీడియోను ట్రెండింగ్‌ చేస్తున్నారు. https://twitter.com/i/status/1754373323910533528 18 ఏళ్ల తర్వాత.. చిరంజీవి - త్రిష జత కట్టడం (Viswambhara Trisha) ఇదేమి తొలిసారి కాదు. 2006లో వచ్చి ‘స్టాలిన్‌’ సినిమాలో వీరిద్దరు తొలిసారి జోడీగా నటించారు. ఆ తర్వాత వీరు ఏ సినిమాలో కలిసి నటించలేదు. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ జోడి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘స్టాలిన్‌’ సమయంలోనే వీరి జోడీకి&nbsp; మంచి మార్కులు పడ్డాయి. వెండి తెరపై వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో చిరు - త్రిష జతకడుతుండటంతో ఈ జోడీ ఈసారి ఏ మ్యాజిక్‌ చేస్తుందోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.&nbsp; ఆచార్యకు నో చెప్పిన త్రిష! నిజానికి ‘ఆచార్య’ చిత్రంలోనే చిరుకి జోడీగా త్రిష నటించాల్సి ఉంది. చిత్ర యూనిట్‌ తొలుత త్రిషనే హీరోయిన్‌గా ప్రకటించింది కూడా. అయితే షూటింగ్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తాను సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఆచార్య నుంచి వైదొలుగుతున్నట్లు ఆ సందర్భంలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. చిరు సినిమా ఆఫర్‌ను త్రిష కాదనుకోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. ఇక మెగా సినిమాలో త్రిష కనపించడం కష్టమేనన్న వార్తలు కూడా వచ్చాయి. వాటన్నింటికి చెక్‌ పెడుతూ చిరు లేటెస్ట్‌ మూవీలో ఈ భామ అవకాశం దక్కించుకోవడం విశేషం.&nbsp; సెకండ్‌ హీరోయిన్‌ ఎవరో? ‘విశ్వంభర’లో త్రిష (Viswambhara)తో పాటు మరో హీరోయిన్‌ కూడా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆమె కోసం మంచి పాత్ర కూడా సిద్దంగా ఉందని అంటున్నారు. అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోయే భామ కోసం చిత్ర యూనిట్‌ తెగ వెతికేస్తున్నట్లు టాక్‌. అంతకుముందు చిరు జోడీ ఎవరు? అంటు పలు హీరోయిన్ల పేరు బయటకొచ్చాయి. వారిలో త్రిషతో పాటు కాజల్ అగర్వాల్‌, హానీ రోజ్‌, సంయుక్త మీనన్‌ పేర్లు వినిపించాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకునేను కూడా తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. మరి మెయిన్‌ హీరోయిన్‌గా త్రిష ఫైనల్‌ అయిన నేపథ్యంలోనే ఈ జాబితా నుంచే సెకండ్‌ హీరోయిన్‌ను కూడా ఎంచుకుంటారా? లేదా? అన్నది చూడాలి.&nbsp; 13 భారీ సెట్‌లు..! చిరు 156వ చిత్రంగా ‘విశ్వంభర’ (Viswambhara Trisha) రూపొందుతోంది. సాహసాలు, ఊహా ప్రపంచం మేళవింపుతో ఈ చిత్రం మెగాస్టార్‌ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ కోసం 13 భారీ సెట్‌లతో ప్రత్యేక ప్రపంచాన్నే సృష్టించారు. 2025 జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ (UV Creations) బ్యానర్‌పై ఇది రానుంది.&nbsp;
    ఫిబ్రవరి 05 , 2024
    <strong>Director Sukumar: ‘పుష్ప 2’ తర్వాత మూవీస్‌కు గుడ్‌ బై చెప్పనున్న సుకుమార్‌? ఆందోళనలో ఫ్యాన్స్‌!</strong>
    Director Sukumar: ‘పుష్ప 2’ తర్వాత మూవీస్‌కు గుడ్‌ బై చెప్పనున్న సుకుమార్‌? ఆందోళనలో ఫ్యాన్స్‌!
    టాలీవుడ్‌కు చెందిన మోస్ట్‌ టాలెంటెడ్‌ దర్శకుల్లో డైరెక్టర్‌ సుకుమార్‌ (Director Sukumar) ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ (2021) యావత్‌ దేశాన్ని ఊర్రూతలూగించింది. ఇప్పుడు ‘పుష్ప 2’తో మరోమారు మాయ చేసేందుకు అల్లు అర్జున్‌తో కలిసి సుకుమార్ వస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. మూవీ విడుదలకు ఇంకా పది రోజుల సమయమే ఉండటంతో పోస్టు ప్రొడక్షన్‌ పనుల్లో డైరెక్టర్ సుకుమార్ బిజీ బిజీగా ఉన్నారు. అదే సమయంలో చురుగ్గా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. అయితే సుకుమార్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ‘పుష్ప 2’ రిలీజ్‌ తర్వాత ఆయన సినిమాలకు గుడ్‌బై చెబుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో సుకుమార్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వార్తలోని నిజానిజాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; రోజుకు 20 గంటలు వర్క్! అల్లు అర్జున్‌ (Allu Arjun), సుకుమార్‌ (Director Sukumar) కాంబోలో రూపొందిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రం సరిగ్గా పది రోజుల్లో థియేటర్లలోకి రానుంది. అయితే ఇప్పటికీ పోస్టు ప్రొడక్షన్‌ పనులు పూర్తికాలేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. దీంతో పెండింగ్‌ వర్క్‌ ఫినిష్‌ చేసేందుకు డైరెక్టర్ సుకుమార్‌ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు 20 గంటలు 'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌ కోసమే కేటాయిస్తున్నట్లు సమాచారం. బెస్ట్‌ ఔట్‌పుట్‌ కోసం పని రాక్షసుడిగా సుకుమార్‌ మారిపోయారని మూవీ వర్గాలు సైతం చెబుతున్నాయి. ఈ వర్క్‌ నేపథ్యంలోనే బిహార్‌లో జరిగిన ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమం, తాజాగా జరిగిన చెన్నై ఈవెంట్‌కు సుకుమార్ హాజరుకాలేదని అంటున్నారు.&nbsp; రాత్రిళ్లు సైతం శ్రమ..&nbsp; ‘పుష్ప2’ కోసం సుకుమార్‌ శ్రమిస్తున్న వీడియోను మూవీ టీమ్‌ ఎక్స్‌ వేదికగా పంచుకుంది. అర్ధరాత్రి సమయంలోనూ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్నారని తెలియజేస్తూ పోస్టు చేసింది. బిగ్గెస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ కోసం ‘ఏరౌండ్‌ ది క్లాక్‌’ సుకుమార్‌ పనిచేస్తున్నారని రాసుకొచ్చింది. వీడియోను పరిశీలిస్తే ల్యాప్‌టాప్‌లో ‘పుష్ప 2’ను పరిశీలిస్తూ టెక్నికల్‌ టీమ్‌ వ్యక్తికి సుకుమార్‌ కొన్ని సూచనలు చేస్తున్నాడు. ఇది చూసిన అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ సుకుమార్‌ చేస్తున్న కృష్టిని ప్రశంసిస్తున్నారు. బెస్ట్ ఔట్‌పుట్‌ ఇచ్చేందుకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆకాశానికెత్తుతున్నారు.&nbsp;&nbsp; https://twitter.com/PushpaMovie/status/1860015165732978697 సినిమాలకు గుడ్‌బై చెబుతారా? ‘పుష్ప పార్ట్‌ 1 మెుదలైనప్పటి నుంచి సుకుమార్‌ (Director Sukumar) ఆ సినిమానే లోకంగా గడుపుతున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి ‘పుష్ప.. పుష్ప..’ అంటూ పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'పుష్ప 2' తర్వాత ఆయన ఇండస్ట్రీ నుంచి దూరమవుతారన్న కామెంట్స్‌ నెట్టింట స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి. పూర్తిగా విశ్రాంతి మోడ్‌లోకి వెళ్తారని చర్చ జరుగుతోంది. అయితే ఇందులో నిజమున్నా శాశ్వతంగా మాత్రం కాదని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ‘పుష్ప 2’ విడుదలయ్యాక 6 నెలల నుంచి ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తారని చెబుతున్నాయి. ఆ తర్వాతనే రామ్‌చరణ్‌ (Ramcharan)తో అనౌన్స్‌ చేసిన 'RC 17' ప్రాజెక్ట్‌ను సుకుమార్‌ పట్టాలెక్కిస్తారని స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఫ్యాన్స్‌ ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఇండస్ట్రీ వర్గాలు సూచిస్తున్నాయి. చరణ్‌కు జోడీగా సాయిపల్లవి! ‘రంగస్థలం’ (Rangasthalam) వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత సుకుమార్, రామ్‌ చరణ్‌ కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ’RC17’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ రూపొందనుంది. అయితే ప్రాజెక్ట్‌కు సంబంధించి సైతం ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరోయిన్స్‌ను చాలా బలంగా చూపించే సుకుమార్‌ సాయిపల్లవిని ఇంక ఏ స్థాయిలో చూపిస్తారోనని ఇప్పటినుంచే చర్చ మెుదలైంది. చరణ్‌, సాయిపల్లవి జోడీ మరో లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ పెయిర్‌ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను సృష్టించడం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై 'RC 17' మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp;
    నవంబర్ 25 , 2024
    <strong>Puri Jagannadh: ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత విజయేంద్ర ప్రసాద్ క్లాస్ పీకారు.. పూరి జగన్నాథ్ క్రేజీ కామెంట్స్!</strong>
    Puri Jagannadh: ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత విజయేంద్ర ప్రసాద్ క్లాస్ పీకారు.. పూరి జగన్నాథ్ క్రేజీ కామెంట్స్!
    టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) ఒకరు. ఒకప్పుడు పూరి నుంచి సినిమా వచ్చిందంటే మాస్‌ ఆడియన్స్‌తో థియేటర్లు దద్దరిల్లేవి. పూరి మార్క్‌ డైలాగ్స్‌ కుర్రకారును ఉర్రూతలూగించేవి. అయితే గత కొలంగా పూరి మేనియా కనిపిచడం లేదు. ‘పోకిరి’, బిజినెస్‌ మ్యాన్‌’ ‘టెంపర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు రావడం లేదు. పూరి జగన్నాథ్‌ గత చిత్రం ‘లైగర్‌’ (Liger) దారుణంగా ఫెయిల్‌ అవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకప్పటి పూరి తమకు మళ్లీ కావాలంటూ పెద్ద ఎత్తున అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ (Vijayendra Prasad) పూరికి క్లాస్‌ పీకినట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ పూరి ఈ విషయాన్ని స్వయంగా పంచుకున్నారు.&nbsp; ‘సినిమా తీసే ముందు నాకు చెప్పండి’ రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'డబుల్‌ ఇస్మార్ట్‌' (Double Ismart). ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 11) హనుమకొండలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరి మాట్లాడుతూ ఆసక్తిక విషయాన్ని పంచుకున్నారు. ‘హిట్‌ సినిమా తీస్తే చాలామంది ఫోన్‌ చేసి ప్రశంసిస్తారు. ఫ్లాప్‌ సినిమా విషయంలోనూ నాకు ఓ కాల్‌ వచ్చింది. చేసిందెవరో కాదు విజయేంద్ర ప్రసాద్‌. నాకో సాయం చేస్తారా? అని అడిగారు. ఆయన కుమారుడు రాజమౌళే పెద్ద డైరెక్టర్‌. నేనేం హెల్ప్‌ చేయాలి? అని మనసులో అనుకున్నా. తదుపరి చిత్రం ఎప్పుడు చేస్తున్నారు? మీరెప్పుడు చేసినా ఆ సినిమా కథ నాకు చెబుతారా? అని అడిగారు. ఆయనెందుకు అలా అంటున్నారో కొంచెం అర్థమైంది. మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్‌ అవ్వడం నేను చూడలేను. చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అందుకే తీసే ముందు నాకు ఒక్కసారి చెప్పండి’ అని అన్నారు. ఆయన మాటలతో భావోద్వేగానికి గురయ్యా. నాపై అభిమానంతో చేసిన ఆ కాల్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. అయితే, ఈ స్టోరీ గురించి ఆయనకు చెప్పలేదు. జాగ్రత్తగా తెరకెక్కించి, సినిమానే చూపించాలనుకున్నా’ అని పూరి చెప్పారు. https://twitter.com/i/status/1822878179679203353 కథ చెప్పాల్సింది కదా! డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ అంటే విపరీతమైన అభిమానం. డైరెక్టర్లలో తనకు పూరి జగన్నాథ్‌ ఇష్టమని గతంలో ఓ ఇంటర్యూలో ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన మొబైల్ వాల్‌పేపర్‌గా పూరి జగన్నాథ్ ఫొటో పెట్టుకోవడం కూడా చూపించారు. అలాంటి విజయేంద్ర ప్రసాద్ తనను కథ చెప్పమని అడిగితే తాను చెప్పలేదని పూరి జగన్నాథ్ షాకింగ్ విషయాన్ని తాజాగా బయటపెట్టారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపతున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర వర్మ స్వయంగా కథ చెప్పాలని సూచిస్తే పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ స్టోరీ చెప్పి ఉంటే అందులోని తప్పొప్పులను ఆయన సూచించేవారు కదా అని పోస్టులు పెడుతున్నారు. రిస్క్‌ తీసుకోకుండా ఆయనకు స్టోరీ చెప్పుంటే బాగుండేదని అంటున్నారు.&nbsp; మనకంటూ ఓ క్లారిటీ ఉండాలి! ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో రామ్‌ పోతినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెగిటివ్‌ రివ్యూలు చూసి థియేటర్లకు రావడం మానివేసే వారికి పరోక్షంగా కీలక సూచనలు చేశాడు. 'మనలో చాలా మంది తమ అభిప్రాయానికి గౌరవం ఇవ్వడం లేదు. మనం ఓ రెస్టారెంట్‌లో తిన్న బిర్యానీ బాగుంటే మిగిలిన వారు బాగోలేదంటే మనపై మనకు డౌట్‌ ఉండకూడదు. నేను తిన్నాను బాగుందనుకోవాలి. సినిమాల విషయంలోనూ మీ కెరీర్‌ విషయంలోనూ అంతే. పక్కవారి ఒపీనియన్‌ వల్ల నీ ఒపీనియన్‌ మార్చుకోవద్దు. ఎందుకంటే ఇతరుల అభిప్రాయాలతో పోల్చుకుంటే మనం ఏ పనీ చేయలేం. మీరంతా నా వాళ్లు అనుకుని ఇదంతా చెబుతున్నా’ అని రామ్‌ అన్నారు. ఈ ఎనర్జిటిక్ స్టార్‌ వ్యాఖ్యలను మెజారిటీ నెటిజన్లు సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/i/status/1822887370594877712
    ఆగస్టు 12 , 2024
    Bhaje Vaayu Vegam Review: ‘RX100’ తర్వాత సాలిడ్‌ హిట్‌ అందుకున్న కార్తికేయ !
    Bhaje Vaayu Vegam Review: ‘RX100’ తర్వాత సాలిడ్‌ హిట్‌ అందుకున్న కార్తికేయ !
    నటీనటులు: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ హరిదాస్, తనికెళ్ళ భరణి, రవి శంకర్ తదితరులు దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి సంగీత దర్శకుడు: రధన్, కపిల్ కుమార్ జమ్ముల సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్ ఎడిటింగ్: జి.సత్య నిర్మాణ సంస్థ : యూవీ క్రియేషన్స్‌ విడుదల తేదీ : మే 31, 2024 యంగ్‌ హీరో కార్తికేయ (Karthikeya) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam). ప్రశాంత్‌రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌గా చేసింది. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్‌, టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. ఇందులో కార్తికేయ నటన సినిమాపై అంచనాలు పెంచింది. మరి మే 31న విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ ఎలా ఉంది? ప్రేక్షకులని ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్‌ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్‌ విలన్‌ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్‌ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో కార్తికేయ తనదైన నటనతో అదరగొట్టాడు. బాధ, ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. యాక్షన్స్ సీక్వెన్స్‌లలోనూ మెప్పించాడు. ఇక హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌కు నటన పరంగా పెద్దగా స్కోప్‌ లభించలేదు. స్క్రీన్‌పై కనిపించినంత సేపు తన గ్లామర్‌తో ఏదోలా నెట్టుకొచ్చింది. అటు సోదరుడి పాత్రలో రాహుల్‌ టైసన్‌ మంచి పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. విలన్‌ పాత్రలో బొమ్మాళి రవిశంకర్‌ ఎప్పటిలాగే తన మార్క్‌ ఏంటో చూపించాడు. తనికెళ్ల భరణి సహా మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే డైరెక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి.. తొలి చిత్రంతోనే తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. ఒక సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా మూవీని తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యాడు. హీరో లాకప్‌లో ఉండే సీన్‌తో మూవీని మెుదలు పెట్టిన డైరెక్టర్‌.. డిఫరెంట్‌గా ఫ్లాష్‌బ్యాక్‌లో కథను నడిపించారు. స్టోరీ సెటప్‌ కోసం ఫస్టాప్‌ను ఉపయోగించుకున్న అతడు.. ఇంటర్వెల్‌కు ఇచ్చిన బిగ్‌ ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని రగిలించారు. అక్కడ నుంచి ఏమాత్రం ఫ్లో మిస్‌ కాకుండా క్లైమాక్స్‌ వరకూ ఇంట్రస్టింగ్‌గా కథను నడిపించి ఆకట్టుకున్నాడు. అయితే క్లైమాక్స్‌ను రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మెట్‌లో ముగించడం కాస్త ఆసంతృప్తిగా అనిపిస్తుంది. మరోవైపు హీరో హీరోయిన్‌ లవ్‌ట్రాక్‌ కూడా రొటీన్‌గా ఉంటుంది. కెమెస్ట్రీ అసలు వర్కౌట్‌ కాలేదు. కొన్ని లాజికల్‌ ఎర్రర్స్‌ను మినహాయిస్తే ‘భజే వాయు వేగం’ తప్పకుండా థ్రిల్‌ చేస్తుంది. టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. కపిల్‌ కుమార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు.. యాక్షన్‌ సీక్వెన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. రాధన్‌ సాంగ్స్‌ కూడా బాగున్నాయి. ఆర్‌.డి రాజశేఖర్‌ కెమెరా పనితనం మెపిస్తుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కార్తికేయ నటనఇంటర్వెల్‌ ట్విస్ట్‌సెకండాఫ్‌ మైనస్‌ పాయింట్ హీరో హీరోయిన్‌ లవ్‌ట్రాక్‌రొటిన్‌ క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    జూన్ 05 , 2024
    Ram Charan: రామ్‌చరణ్‌ వరల్డ్ రికార్డ్‌.. బ్రిటన్‌ రాణి తర్వాత మనోడే!
    Ram Charan: రామ్‌చరణ్‌ వరల్డ్ రికార్డ్‌.. బ్రిటన్‌ రాణి తర్వాత మనోడే!
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ‘RRR’ బ్లాక్‌ బాస్టర్ తర్వాత అతడు చేసిన ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే చరణ్‌ ఇటీవల రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశాడు. అంబానీ ఇంట వివాహానికి సైతం ఈ కారులోనే వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఈ కారు రిజిస్టేషన్‌కు చరణ్ స్వయంగా వెళ్లారు. ఈ కారుకు సంబంధించిన నెంబర్‌ ప్లేట్ సైతం నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; ఫ్యాన్సీ నెంబర్ ఇదే! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ (Rolls Royce Car) కారును కొనుగోలు చేశారు. ఆ కారుకు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా రవాణాశాఖ ‘TG 09 C 2727’ నెంబర్‌ను కేటాయించింది. ఆ వాహనం రిజిస్ట్రేషన్ కోసం మంగళవారం ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ సెంట్రల్ జోన్ ఆఫీసుకు వచ్చారు. ఆయన రాకతో ఆఫీసులో సందడి నెలకొంది. అభిమానులు సెల్ఫీలు దిగారు. రవాణాశాఖ అధికారులు, సిబ్బంది సైతం కలిశారు. ఫొటోలు దిగారు. వాహన రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో వెళ్లిపోయారు. https://twitter.com/i/status/1848718642428711223 ఎన్నికోట్ల ఖర్చంటే! చరణ్‌ రోల్స్ రాయిస్ కారును రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా చరణ్‌ ఏరి కోరి మరి ‘TG 09 C 2727’ ఫ్యాన్సీ నెంబర్‌ను కారుకు ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.10-20 లక్షల వరకూ రుసుము చెల్లించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే చరణ్‌ దగ్గర చాలా కార్లే ఉన్నాయ్‌. ఇప్పుడు ఆ చెర్రీ గ్యారేజ్‌లోకి మరో కారు వచ్చి చేరింది. కాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా రోల్స్‌ రాయిస్‌ కారునే వినియోగిస్తున్నారు. అలాగే పలువురు సెలబ్రిటీస్‌ దగ్గర కూడా ఈ కారు ఉంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ కారుకి సంబంధించిన ఫ్యాన్సీ నెంబర్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1811294194205425882 రామ్‌చరణ్‌ అరుదైన ఘనత సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో రామ్‌చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. చరణ్‌తో పాటు ఆయన పెంపుడు శునకం ‘రైమ్‌’ విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల వీటికి సంబంధించిన కొలతలను సైతం మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు. అయితే బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ - 2 కూడా గతంలో తన పెంపుడు జంతువుతో మైనపు విగ్రహంగా కనిపించారు. ఆమె తర్వాత చరణ్‌ మాత్రమే తన పెట్‌ డాగ్‌తో మైనపు విగ్రహంగా కనిపించబోతున్నాడు. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి సెలబ్రిటీగా రామ్‌చరణ్‌ నిలిచాడు. ‘రైమ్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నా వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని మిళితం చేస్తూ ఈ విగ్రహం రూపుదిద్దుకోవడం ప్రత్యేకంగా భావిస్తున్నాను’ అని చరణ్‌ అన్నారు. https://twitter.com/Nilzrav/status/1840120654193897699 రికార్డు ధరకు ఓటీటీ హక్కులు! రామ్‌చరణ్‌ లేటెస్ట్‌ ప్రాజెక్ట్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    అక్టోబర్ 23 , 2024
    Sasimadhanam Review: పేరెంట్స్‌ లేరని లవర్‌ ఇంటికెళ్లి ఇరుక్కుపోతే.. ఆ తర్వాత ఏం జరిగింది?
    Sasimadhanam Review: పేరెంట్స్‌ లేరని లవర్‌ ఇంటికెళ్లి ఇరుక్కుపోతే.. ఆ తర్వాత ఏం జరిగింది?
    నటీనటులు: ప‌వ‌న్ సిద్ధు, సోనియా సింగ్, రూప‌ల‌క్ష్మి, ప్ర‌దీప్ రాప‌ర్తి, కృతిక‌, అశోక్ చంద్ర‌ దర్శకులు: వినోద్ గాలి సంగీత దర్శకుడు: సింజిత్ యెర్ర‌మిల్లి సినిమాటోగ్రఫీ: రెహాన్ షేక్ ఎడిట‌ర్ : అనిల్ కుమార్ పి నిర్మాతలు : హ‌రీష్ కోహిర్క‌ర్ విడుదల తేదీ : జులై 4, 2024 ఓటీటీ వేదిక : ఈటీవీ విన్‌ రొమాంటిక్‌ లవ్‌ డ్రామాగా రూపొందిన తెలుగు లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ ‘శశి మథనం’ (Sasimadhanam Web Series). ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా జులై 4 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో పవన్‌ సిద్ధు, సోనియా ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరు ఇప్పటికే పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో జంటగా చేసి పాపులర్‌ అయ్యారు. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన 'శశిమథనం' సిరీస్‌ ఎలా ఉంది? వీరి కెమెస్ట్రీ ఏ మేరకు ఆకట్టుకుంది? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి వరంగల్‌కు చెందిన మదన్‌ (సిద్ధూ పవన్‌).. అన్నయ్య ఫ్యామిలీతో ఉంటూ.. ఈజీ మనీ కోసం బెట్టింగ్స్‌ వేస్తుంటాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన శశి (సోనియా సింగ్‌)తో ప్రేమలో పడతాడు. బెట్టింగ్‌లో పెద్ద మెుత్తంలో డబ్బు పోగొట్టుకోవడంతో మదన్‌ చిక్కుల్లో పడతాడు. మరోవైపు శశి ఇంట్లో వారంతా పది రోజులు పెళ్లి కోసం వెళ్తున్నారని తెలిసి.. ఆమె ఇంటికి వెళ్తాడు. శశి ఇంటికి మదన్ వెళ్లిన రాత్రే పెళ్లి క్యాన్సిల్‌ అయిందని ఆమె ఇంట్లో వాళ్లు తిరిగివస్తారు. అప్పటినుంచి శశి ఫ్యామిలీకి కనబడకుండా మదన్‌ ఎలా మ్యానేజ్‌ చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? శశికి పెళ్లి చూపులు జరిగితే ఎలా చెడగొట్టాడు? శశి-మదన్‌ పెళ్లికి ఆమె ఇంట్లో వారు ఒప్పుకున్నారా? లేదా? అన్నది ఈ సిరీస్‌ కథ.&nbsp; ఎవరెలా చేశారంటే సోనియా సింగ్, సిద్ధూ పవన్ నటన.. ఈ సిరీస్‌కు అతిపెద్ద ప్లస్‌గా మారింది. నిజ జీవితంలోనూ ప్రేమ జంట కావడంతో ఈ సిరీస్‌లో వీరి కెమెస్ట్రీ అద్భుతంగా పండింది. ఇద్దరూ క్యూట్‌గా నటించి మెప్పించారు. శశి తండ్రిగా నటించిన ప్రదీప్ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు.. తాత పాత్రలో నటించిన అశోక్ చంద్ర కూడా నవ్విస్తూనే ఎమోషనల్‌ టచ్‌ కూడా ఇచ్చారు. సిద్ధూ అన్నయ్య పాత్రలో కేశవ్ దీపక్ మెప్పించాడు. రంగమ్మత్త పాత్రలో సీనియర్ నటి రూప లక్ష్మి అదరగొట్టారు. అవంతి దీపక్, శ్రీలలిత, వెంకటేష్, కృతిక రాయ్, కిరీటి.. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే.. బోల్డ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లకు భిన్నంగా ఓ క్యూట్‌ లవ్‌స్టోరీ సిరీస్‌ తెరకెక్కించడంలో దర్శకుడు వినోద్ గాలి సక్సెస్‌ అయ్యారు. రొటీన్‌ స్టోరీనే కథాంశంగా ఎంచుకున్నప్పటికీ ఎక్కడా బోర్‌ కొట్టకుండా జాగ్రత్తపడ్డారు. హీరోయిన్‌ ఇంట్లో హీరో ఇరుక్కుపోవడంతో నెక్స్ట్‌ ఏం జరుగుతుందా? అన్న క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో రగిలించాడు. ఇంట్లో వాళ్ల కంట పడకుండా మదన్‌ పడే కష్టాలు, అతడికి సాయం చేసే క్రమంలో శశి పడే టెన్షన్‌ నవ్వులు పూయిస్తాయి. అయితే కొన్ని సీన్స్‌ ఎక్కడో చూసిన భావన కలగడం మైనస్‌గా చెప్పవచ్చు. పైగా సిరీస్‌ మెుత్తం ఒకే ఇంట్లో తిరగడం వల్ల విజువల్‌ పరంగా రిఫ్రెష్‌మెంట్‌ ఫీల్‌ కలగదు. స్క్రీన్‌ప్లే ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది.&nbsp;క‌థ‌లో రెండో ల‌వ్ ట్రాక్‌కు సంబంధించిన అంశం బాగున్న‌ప్ప‌టికీ.. అది మెయిన్‌ క‌థ‌కు చాలా వ‌ర‌కు డ్యామేజ్ చేసింది. డైలాగ్స్‌ విషయంలోనూ దర్శకుడు కాస్త జాగ్రత్త పడి ఉండాల్సింది.&nbsp; సాంకేతికంగా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. సింజిత్ యెర్ర‌మిల్లి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా సిరీస్‌లోని రెండు పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. లవ్ స్టోరీకి తగ్గట్టు విజువల్స్‌ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్‌ సిద్ధూ, సోనియా నటనకన్ఫ్యూజన్‌ కామెడీసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ స్టోరీసెకండ్‌ లవ్‌ ట్రాక్‌కొన్ని బోరింగ్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    జూలై 04 , 2024
    Kajal Karthika OTT:&nbsp; ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన కాజల్ అగర్వాల్ హర్రర్ చిత్రం.. ఎందులో అంటే?
    Kajal Karthika OTT:&nbsp; ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన కాజల్ అగర్వాల్ హర్రర్ చిత్రం.. ఎందులో అంటే?
    కాజల్‌ (Kajal Aggarwal), రెజీనా (Regina Cassandra) ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కరుంగాపియం’ (Karungaapiyam). ‘కాజల్‌ కార్తీక’ (Kajal Karthika) పేరుతో ఈ సినిమా గతేడాది జులైలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా తమిళంలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహా(Aha)లో ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.&nbsp; నలుగురు హీరోయిన్లు ‘కాజల్‌ కార్తీక’ సినిమాలో మెుత్తం నలుగురు హీరోయిన్లు నటించారు. కాజల్‌, రెజీనాతో పాటు రైజా విల్సన్, జనని కూడా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. నలుగురు హీరోయిన్లు ఒకే తెరపై కనిపించనుండటం, అది కూడా హార్రర్‌ సినిమా కావడంతో తమిళంలో ‘కరుంగాపియం’పై అప్పట్లో మంచి హైప్‌ ఏర్పడింది. కానీ సినిమా రిలీజ్‌కు చాలా సమయం తీసుకోవడంతో మెల్లగా ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వచ్చింది. దీంతో థియేటర్లలో సినిమా వచ్చినా కూడా ఆడియన్స్‌ పెద్దగా పట్టించుకోలేదు. తమిళంలో ఎక్కువగా హైప్ లేకపోవడంతో తెలుగులో కూడా ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు.&nbsp; ఆహాలో సక్సెస్ అయ్యేనా? ఆహా (Aha)లో విడుదలయిన తర్వాత ‘కాజల్‌ కార్తిక’ ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవుతుందని చిత్ర నిర్మాతలు అంచనా వేస్తున్నారు.&nbsp; తమిళంలో పేవ్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని.. తెలుగులో ముత్యాల రామదాసు సమర్పణలో వెంకట సాయి ఫిల్మ్స్ బ్యానర్‌పై టి. జనార్ధన్ రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో షెర్లీస్ సేత్, యోగి బాబు, జాన్ విజయ్ వంటి నటీనటులు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇందులో కమెడియన్‌ యోగి బాబు పాత్ర మాత్రం ప్రేక్షకులను నవ్వించేలా ఉంటుంది. https://twitter.com/Telugu70mmweb/status/1675141362306646016 కథేంటంటే ఈ సినిమాను లాక్‌డౌన్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఐదు కథలతో తెరకెక్కించారు. కథలోకి వెళ్తే.. కార్తీక (రెజీనా).. కాలక్షేపం కోసం ఓ పాత లైబ్రరీకి వెళ్తుంది. అక్కడ ఆమెకు వందేళ్ల క్రితం రాసిన ‘కాటుక బొట్టు’ అనే పుస్తకం కనిపిస్తుంది. పురాతన గ్రంథంలా కనిపించిన ఆ పుస్తకాన్ని చూసిన వెంటనే ఆమెకు చదవాలనిపిస్తుంది. అయితే, ఆమె పుస్తకంలో చదివే పాత్రలన్నీ దెయ్యాలుగా మారి ఒక్కొక్కటిగా ఆమె ముందుకు వస్తుంటాయి. అలా, ఆమె ముందుకు వచ్చిన ఓ పాత్ర కార్తీక (కాజల్‌). గ్రామస్థుల వల్ల మరణించిన కార్తీక.. పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటుంది. ఆమె పగ ఎలా తీరింది? ఆమె మరణానికి కారణం ఏంటి? కార్తీక (రెజీనా), కార్తీక (కాజల్‌)కు ఉన్న సంబంధం ఏంటి? మిగిలిన నాలుగు కథలు ఏవి? అన్నది కథ.&nbsp;
    ఏప్రిల్ 02 , 2024
    Nora Fatehi: కిర్రాక్ పోజులతో హీటెక్కిస్తున్న నోరా ఫతేహి.. త్వరలో వరుణ్ తేజ్‌తో రొమాన్స్!
    Nora Fatehi: కిర్రాక్ పోజులతో హీటెక్కిస్తున్న నోరా ఫతేహి.. త్వరలో వరుణ్ తేజ్‌తో రొమాన్స్!
    బాలీవుడ్ అందాల తెగింపు నోరా ఫతేహి మరోసారి తన హాట్ అందాలను సోషల్ మీడియాలో రచ్చకు పెట్టింది. చమ్కీలు పొదిగిన ట్రాన్సఫరెంట్ డ్రెస్‌లో హాట్‌గా కనిపించింది.  చెవులకు లోతైన లోలాకులు వంటినిండా చమ్కీల మెరుపుతో నోరా అందం మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ రియల్లీ హాట్, ఏంజెల్‌లా ఉన్నావంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నోరా ఫతేహి తెలుగులో అడపా దడపా కనిపించినా ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో ఇప్పటి వరకు నటించలేదు. బాహుబలి 1లో 'మనోహరి' అంటూ  ఐటెం సాంగ్ పాడిన ముగ్గురు వయ్యారి భామల్లో ఈ ముద్దుగుమ్మ కూడా ఉంది. ప్రస్తుతం వరుణ్‌ తేజ్ సరసన మట్కా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో కనువిందు చేయనుంది. మట్కాలో నోరా ఫతేహితో పాటు మరో హీరోయిన్‌ మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది. ఈ సినిమా కరుణ కుమార్ డైరెక్షన్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అటు పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలోనూ ఈ సొగసుల కోవ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. ఇక నోరా పర్సనల్ విషయాలకొస్తే.. నోరా పుట్టి పెరిగింది కెనడాలో. చదువు కూడా బాగానే చదివింది. టోరంటోలోని యార్క్ యూనివర్సిసిటీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా సంపాదించింది. ఇక సుందరాంగికి డ్యాన్స్ అంటే మక్కువ. అందులోనూ బెల్లీ డ్యాన్స్‌ను ఇరగదీస్తుంది.&nbsp; https://twitter.com/Paleolitelly/status/1696461720754008307?s=20 యాక్టింగ్‌పై ఉన్న ఇష్టంతో తొలుత మోడలింగ్ చేసిన నోరా.. ఆతర్వాత యాక్టింగ్‌ వైపు తన దృష్టి మరల్చింది. కెనడా నుంచి ఇండియాకు వచ్చాక ఇక్కడ కొన్ని చిన్న చిన్న యాడ్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది.  అలా బాలీవుడ్ నిర్మాతల దృష్టిలో పడిన  నోరా..2014లో బాలీవుడ్‌లో ‘రోర్’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఊపిరి సినిమాలో నాట్య మయూరిగా కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ బాంబ్.. టెంపర్ చిత్రంలో 'ఇట్టాగే రెచ్చిపోదాం' పాటలో  రెచ్చిపోయింది. టెంపర్‌లో ఐటెం సాంగ్.. నోరాకు తెలుగులో మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది. బాహుబలి, కిక్ 2, ఊపిరి, లోఫర్,&nbsp; షేర్ చిత్రాల్లో తన అందచందాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం సెక్సీ డాల్ 100%, మడగావ్ ఎక్స్‌ప్రెస్, డ్యాన్సింగ్ డాడ్ వంటి చిత్రాల్లో నటిస్తోంది. నోరా తన అందం, నటనతోనే కాకుండా పలు రియాల్టీ షోలు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహహించింది. డ్యాన్స్ ప్లస్, డ్యాన్స్ దివానే 3,  ఇండియా బెస్ట్ డ్యాన్సర్ వంటి షోలకు జడ్జిగా వ్యవహరించింది.అంతేకాదు పలు పాప్ సాంగ్స్ ఆల్బమ్స్‌లోని తన అందాల దాడితో రచ్చ చేసింది. 'బేబి మర్‌వాకే మనేగి', 'అచ్చా సిలా దియా', డ్యాన్స్ మేరీ రాణి వంటి వీడియో ఆల్బమ్స్ బాగా ఆకట్టుకున్నాయి.
    సెప్టెంబర్ 01 , 2023
    ADIPURUSH REVIEW: రాముడిగా ప్రభాస్‌ సూపర్‌… ఐదేళ్ల తర్వాత ప్రభాస్‌కు హిట్‌ వచ్చినట్లేనా?
    ADIPURUSH REVIEW: రాముడిగా ప్రభాస్‌ సూపర్‌… ఐదేళ్ల తర్వాత ప్రభాస్‌కు హిట్‌ వచ్చినట్లేనా?
    నటీనటులు: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్త నాగె, సన్నీ, తదితరులు. డైరెక్టర్: ఓం రౌత్ నిర్మాత: భూషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, కృష్ణ కుమార్, ఓం రౌత్. మ్యూజిక్: అజయ్-అతుల్, సాచిత్ పరంపర ఐదేళ్లుగా ప్రభాస్‌కు ఒక్క హిట్ లేదు. అందుకే, గతేడాది నుంచి ప్రభాస్ అభిమానులు ‘ఆదిపురుష్’ కోసం ఆశగా ఎదురు చూశారు. సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న చిత్రం ఎట్టకేలకు నేడు(జూన్ 16) విడుదలైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి భారీ ఎత్తున టికెట్లు కొనుగోలు చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, థియేటర్లలో ప్రేక్షకుడిని ఆదిపురుష్ మెప్పించిందా? రామాయణ కథను ఆదిపురుష్ ఎంత కొత్తగా ఆవిష్కరించింది? వంటి విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; అదే కథ.. రామాయణం కథ అందరికీ తెలిసిందే. రాముడు మర్యాద పురుషోత్తముడు. విలువలను పాటించడంలో రాముడికి సాటెవరూ లేరు. అందుకే ఎన్ని యుగాలైనా ఇప్పటికీ రామాయణ కథను వింటూనే ఉన్నాం. ఆదిపురుష్‌లోనూ అదే కథ. ఈ సినిమాలో రాఘవ(ప్రభాస్) వనవాసం స్వీకరించిన ఘట్టం నుంచి కథ ప్రారంభం అవుతుంది. జానకి(కృతిసనన్), సోదరుడు శేషు(సన్నీ సింగ్)లతో కలిసి వనవాసం చేస్తుంటాడు. ఈ క్రమంలో శూర్పనక చెప్పుడు మాటలతో లంకేశ్(సైఫ్ అలీ ఖాన్) జానకిని అపహరిస్తాడు. జానకిని రాఘవ ఎలా కనిపెట్టాడు? లంక నుంచి తిరిగి తీసుకు రావడానికి ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది? రాఘవ, జానకిల కథని కొత్తగా చూపించడంలో ఆదిపురుష్ కొద్దిమేరకు సఫలం అయింది. ఇతిహాసాన్ని నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్ ప్రతిబింబించింది. రాఘవ, హనుమ, లంకేశుడికి మరింత శక్తిని ఆపాదిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులను మరింత మైమరిపిస్తుంది. ముఖ్యంగా, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు బలం చేకూర్చాయి. ఫస్టాఫ్‌లో ఎమోషనల్ డ్రామా కొనసాగుతుంది. సెకండాఫ్‌లో ఇక పూర్తిగా పోరాట సన్నివేశాలే. రామ్ సీతా రామ్, జైశ్రీరామ్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం రొమాలు నిక్కపొడుచుకునేలా ఉంటుంది. హనుమంతుడి చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే, వీఎఫ్ఎక్స్‌పై మరింత దృష్టి సారించాల్సింది. రావణుడి గెటప్‌ డిజైన్‌ కాస్త వెగటుగా ఉంటుంది. సాగతీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అతిగా గ్రాఫిక్స్ వాడటంతో నటీనటుల పర్ఫార్మెన్స్‌‌ మరుగున పడినట్లయింది. వాల్మీకి రామాయణం పరంగా లంక సుందరమైన నగరం. ఇందులో ఏదో రాక్షస గుహలా కనిపించడం ప్రేక్షకుడికి రుచించదు. 2Dలో కన్నా 3Dలో చూస్తే మెరుగైన అనుభూతిని పొందవచ్చు. ఎవరెలా చేశారు? రాఘవగా ప్రభాస్, జానకిగా కృతిసనన్ నటనతో మెప్పించారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలను చక్కగా పండించారు. పతాక సన్నివేశాల్లో నటనతో ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తారు. లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ ఫర్వాలేదనిపించాడు. తన పరిధి మేరకు నటించగలిగాడు. హనుమంతుడిగా దేవదత్త నాగె అద్భుతంగా నటించాడు. రాఘవతో జరిగే సన్నివేశాల్లో హనుమ వినయాన్ని తెరపై కనబరిచాడు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ ఒకే అనిపించాడు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; రామాయణ కథను విజువల్ వండర్‌గా చూపించాలన్న ఓం రౌత్ ఆలోచనను మెచ్చుకోవాల్సిందే. పౌరాణిక పాత్రలకు సూపర్ పవర్ కల్పిస్తే ఎలా ఉంటుందని చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కానీ, లంకేశుడిని అలా ఎందుకు చూపించాడో అర్థం కాలేదు. పది తలలను ఒకే వరుసలో కాకుండా ఐదు తలలు కింద, ఐదు తలలు మీద చూపించడంలో ఆంతర్యం బోధపడలేదు. లంకను డిజైన్ చేసిన తీరు బాగోదు. ఇక, సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్ఎక్స్‌పై మరింత ఫోకస్ పెట్టాల్సింది. అజయ్, అతుల్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో సంచిత్, అంకిత్ సక్సెస్ అయ్యారు. అయితే, ఎడిటర్ తన కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది.&nbsp; ప్లస్ పాయింట్స్ నటీనటులు మ్యూజిక్ సినిమాటోగ్రఫీ పోరాట సన్నివేశాలు మైనస్ పాయింట్స్ గ్రాఫిక్స్ సాగతీత సన్నివేశాలు ఎడిటింగ్ చివరగా.. ఓం రౌత్ ‘ఆదిపురుష్’ని ఒక్కసారి వీక్షించొచ్చు. రేటింగ్: 2.75/5
    జూన్ 16 , 2023
    Ravanasura Review: విలన్‌ షేడ్స్‌లో అదరగొట్టిన మాస్‌ మహారాజా… ధమాకా తర్వాత మరో హిట్‌..!
    Ravanasura Review: విలన్‌ షేడ్స్‌లో అదరగొట్టిన మాస్‌ మహారాజా… ధమాకా తర్వాత మరో హిట్‌..!
    నటీనటులు: రవితేజ, దక్ష నగర్కర్‌, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, సుశాంత్‌, సంపత్‌, మురళి శర్మ, రావు రమేష్‌ దర్శకుడు: సుధీర్‌ వర్మ రచయిత: శ్రీకాంత్ విస్సా సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, భీమ్స్ సిసిరోలియో మాస్‌ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం భారీ అంచనాలతో ఇవాళ ( ఏప్రిల్‌ 7) థియేటర్లలో విడుదలైంది. మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో నటించిన రవితేజ.. ధమాకా చిత్రం ద్వారా భారీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం అదే ఉత్సాహంతో రావణుసుర చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటివరకు రవితేజ చేసిన సినిమాల్లో కెల్లా రావణసుర ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఇందులో రవితేజ విలన్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌, టీజర్‌ ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో రావణసుర చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రవితేజకు మరో హిట్‌ తెచ్చిపెట్టిందా? అసలు సినిమా స్టోరీ ఏంటి? విలన్‌గా రవితేజ నటనకు ఎన్ని మార్కులు పడ్డాయి? వంటి ప్రశ్నలకు ఆన్సర్స్‌ ఇప్పుడు చూద్దాం. కథ ఏంటంటే: రావణసుర కథలోకి వెళితే... ఫరియా అబ్దుల్లా దగ్గర రవీంద్ర (రవితేజ) జూనియర్‌ లాయర్‌గా పనిచేస్తుంటాడు. కోర్టులో న్యాయం జరగకపోతే బాధితులకు బయట న్యాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ ఓ కేసు విషయమై రవితేజ, ఫరియా అబ్దుల్లాను సంప్రదిస్తుంది. తన తండ్రి సంపత్‌ రాజ్‌పై పడిన హత్య అభియోగం వెనక నిజాలు వెలికితీసేందుకు వారి సాయం కోరుతుంది. అయితే మర్డర్స్‌ మాత్రం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఇలా వరుస హత్యలు చేస్తోంది ఎవరు?. మర్డర్స్‌ ఎందుకు జరుగుతున్నాయి?. రవితేజకు హత్యలకు సంబంధం ఏంటి? రవితేజ ఎందుకు విలన్‌గా మారాడు? అనేది సినిమా కథాంశం. ఎలా చేశారంటే: ఈ సినిమాకు రవితేజ నటనే హైలెట్‌ అని చెప్పాలి. ఫస్టాఫ్‌లో కామెడి చేస్తూ నవ్వించే రవితేజ.. విలన్‌ షెడ్స్‌లో కనిపించి మెప్పిస్తాడు. రవితేజ చేసిన నెగిటివ్‌ రోల్‌ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఆ పాత్ర ద్వారా విలన్‌గానూ ఆడియన్స్‌ను మెప్పించగలనని రవితేజ నిరూపించాడు. ఇక యువ హీరో సుశాంత్ కి చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర దక్కింది అనే చెప్పాలి. ఇందులో సుశాంత్ చాలా కొత్తగా కనిపిస్తాడు. తన నటనతో ఆడియన్స్‌ను మెప్పిస్తాడు. &nbsp;హీరోయిన్స్ గా నటించిన ఫైరా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ తమ పరిధిమేర బాగానే నటించారు. ఇక సంపత్‌, మురళి శర్మ, రావు రమేష్‌ నటన కూడా ఆకట్టుకుంటుంది.&nbsp; టెక్నికల్‌గా: ఈ సినిమాను డైరెక్టర్‌ సుధీర్‌వర్మ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. రవితేజ మార్క్‌ కామెడీని చూపిస్తూనే థ్రిల్లింగ్‌ అనుభూతిని కూడా పంచాడు. రవితేజలోని నటుడ్ని సుధీర్‌ చాాలా బాగా ఉపయోగించుకున్నాడు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు మరీ సాగదీసినట్లు అనిపిసిస్తుంది. ఇక విజయ్‌ కార్తిక్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. హర్షవర్ధన్‌, భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్‌ బాగుంది. ముఖ్యంగా&nbsp; బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కొన్ని సీన్లు చాలా రిచ్‌గా అనిపించాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రవితేజ యాక్టింగ్హీరోయిన్స్ గ్లామర్కథబ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్‌ పాయింట్స్‌ &nbsp;సినిమా ఫస్టాప్&nbsp;సాగదీత సన్నివేశాలు చివరిగా: వాల్తేరు వీరయ్య, ధమాాకా చిత్రాల తర్వాత రవితేజ నుంచి మరో డీసెంట్‌ మూవీ రావణాసుర అని చెప్పొచ్చు. ఈ వీకెండ్‌లో మంచి టైంపాస్‌ కావాలనుకునేవారికి రావణాసుర మంచి ఛాయిస్‌. రేటింగ్‌: 2.75/5
    ఏప్రిల్ 07 , 2023

    @2021 KTree