ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Hotstarఫ్రమ్
Watch
Free
స్ట్రీమింగ్ ఆన్Youtube
Watch
Free
రివ్యూస్
How was the movie?
తారాగణం
పవన్ కళ్యాణ్
మైఖేల్ వేలాయుధం మరియు అర్జున్ పాల్వాయిత్రిష కృష్ణన్
మీరా శాస్త్రికృతి ఖర్బందా
వసుమతిడానా మార్క్స్మిచెల్
పరేష్ రావల్
శీనాప్తిసోనూ సూద్
సుధీర్అలీ
టాక్సీ డ్రైవర్తనికెళ్ల భరణి
మైఖేల్ తండ్రిసుధ
మైఖేల్ తల్లిముఖేష్ రిషి
వసుమతి తండ్రిశంకర్ మెల్కోటే
రెస్టారెంట్ యజమానిరజిత
సిబ్బంది
జయంత్ సి. పరాన్జీ
దర్శకుడుబండ్ల గణేష్
నిర్మాతమణి శర్మ
సంగీతకారుడుత్రివిక్రమ్ శ్రీనివాస్
స్క్రీన్ ప్లేజయనన్ విన్సెంట్ ISC
సినిమాటోగ్రాఫర్కథనాలు
Varun Tej Marriage: నెట్టింట వరుణ్-లావణ్య పెళ్లి ఫొటోల సందడి.. మెగా హీరోలంతా ఒకే వేదికపై..!
మెగా ఫ్యాన్స్ ఎంతగానో వేచిచూసిన వేడుక ముగిసింది. అభిమాన హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య చేసిన ఫొటోషూట్ తాజాగా వైరల్ అవుతోంది. పెళ్లి దుస్తుల్లో నవ వధువువరులు నవ్వుతూ సంతోషంగా గడిపారు. ఇద్దరు కూర్చుని రొమాంటిక్‌గా పోజు ఇచ్చారు.
వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి తర్వాత సరదాగా గడిపారు. చేతుల్లో చేయి వేసుకుని గార్డెన్‌లో ఫొటోలకు పోజులిచ్చారు.
భార్య లావణ్య సొట్టబుగ్గపై చేతి వేలితో సరదాగా టచ్ చేశాడు వరుణ్ తేజ్. మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్ - గోల్డ్ షేర్వానీని వివాహా వేడుకలో వరుణ్ తేజ్ ధరించాడు.
వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల్లో హీరో తండ్రి మెగా బ్రదర్ నాగబాబు ఆయన సతీమణితో కలిసి హుందాగా పోజు ఇచ్చారు. బ్లూ కలర్ డ్రెస్సులో నాగబాబు స్టైలిష్‌గా కనిపించారు.
వరుణ్ లావణ్య పెళ్లిలో మెగా కుటుంబం అంతా సందడి చేసింది. వధువరులతో రామ్ చరణ్, పవన్ కల్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, సాయి తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, నాగబాబు కలిసి ఫొటోకు స్టిల్ ఇచ్చారు.
వరుణ్ తేజ్ పెళ్లిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సందడి. మెగా సోదరులు చిరంజీవి, నాగబాబుతో పవన్ కల్యాణ్ ఫొటో వైరల్ అవుతోంది.
ఈ పెళ్లి వేడుకలోనే బాబాయి - అబ్బాయి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. రామ్‌చరణ్-పవన్ నవ్వుతూ కనిపించిన ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ వేడుకల్లో వరుణ్ తేజ్ సోదరి నిహారిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అన్న పెళ్లిలో తీన్ మార్ స్టెప్పులతో అదరగొట్టింది. తండ్రి నాగబాబుతో కలిసి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
https://twitter.com/vamsikaka/status/1719756960852263315
కాగా ఇటలీలో అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు నవంబర్ 1 వరకు కొనసాగాయి. కాగా.. ఇటలీ నుంచి వచ్చిన అనంతరం ఇండస్ట్రీ ప్రముఖల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
ఈనెల 5న మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.
నవంబర్ 03 , 2023
Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
నటీనటులు: రామ్ పొత్తినేని, శ్రీలీల, శ్రీకాంత్, ప్రిన్స్, ఇంద్రజ, సాయిమంజ్రేకర్, శరత్ లోహితాశ్వ
నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి
డైరెక్టర్: బోయపాటి శ్రీను
సంగీతం: ఎస్‌ఎస్ తమన్
ఎడిటింగ్: తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రం స్కంద ప్రపంచవ్యాప్తంగా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న రామ్..ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? అఖండాతో భారీ విజయాన్ని నమోదు చేసిన బోయపాటి మరోసారి తన మాస్ మార్క్‌ను చూపించాడా? ఇంతకు సినిమా ఎలా ఉంది? సినిమాలోని ఏ అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి? వంటి అంశాలను YouSay రివ్యూలో చూద్దాం.
కథ
స్కంద స్టోరీ విషయానికి వస్తే ఓ ఊరిలో ఉండే హీరో రామ్ కుటుంబమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అదేక్రమంలో ఆలయంలో దొంగతనం జరుగుతుంది. ఆ నింద రామ్ ఫ్యామిలీపై పడుతుంది. ఆ నిందను రామ్ చెరిపేశాడా? ఈ మధ్యలో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది. హీరో మరియు విలన్‌ల మధ్య పగ ఎందుకు స్టార్ట్ అయింది. క్లైమాక్స్ ఏంటీ? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని ఇప్పటివరకు అభిమానులు చూడని మాస్ అవతార్‌లో కనిపించడం బాగుంది. సినిమాలో ఫస్టాఫ్ విషయానికొస్తే.. హీరో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్, హీరోయిన్‌తో కామెడీ ట్రాక్ రొమాన్స్ ఉంటుంది. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోయింది. అప్పటి వరకు సాదాసీదగా నడిచిన సినిమా ఆ తర్వాత నుంచి సినిమా హైప్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు బాగున్నాయి. కొన్ని సీన్లు కంటతడిపెట్టిస్తాయి. రామ్ చెప్పే మాస్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. 'ఇయ్యాలే పొయ్యాలే... గట్టిగా అరిస్తే తొయ్యాలే... అడ్డం వస్తే లేపాలే, దెబ్బతాకితే సౌండ్ గొల్కొండ దాటలే' వంటి డైలాగ్స్ ఊపు తెప్పిస్తాయి. ఇక సాంగ్స్‌లో రామ్- శ్రీలీల ఇద్దరు పోటీ పడి మరి స్టెప్పులతో ఇరగదీశారు. నీ చుట్టు సాంగ్, కల్ట్ మామ పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది.
ఎవరెలా చేశారంటే?
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ కంప్లీట్ మాస్ అవతార్‌లో అదరగొట్టాడు. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. సినిమా మొత్తం హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రామ్‌ను బోయపాటి బాగా చూపించారు. రెండు విభిన్న పాత్రల్లో రామ్ మెప్పించాడు. మాస్ డైలాగ్స్ థియేటర్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రామ్ పక్కన శ్రీలీల జోడీ బాగుంది. తన అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌తో అదరగొట్టింది. మరో హీరోయిన్ సాయీ మంజ్రేకర్ సైతం ఆకట్టుకుంది. శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్ తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్
బాలకృష్ణతో అఖండ విజయం తర్వాత బోయపాటి మరోసారి తన యాక్షన్ మార్క్‌ను చూపించాడు. లవ్లీ బాయ్ రామ్‌ను పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇంటెన్సివ్ యాక్షన్ సీన్లు ప్రేక్షకుల ఊహకు మించి ఉంటాయి. పస్టాఫ్‌ను కామెడీ లవ్ ట్రాక్‌తో నడిపిన బోయపాటి... సెకండాఫ్ నుంచి కథలో సీరియస్ నెస్ తీసుకొచ్చి స్టోరీకి ప్రేక్షకున్ని కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఓ నార్మల్ ఫ్యామిలీ స్టోరీకి మాస్ ఎలిమెంట్స్ జోడించి కమర్షియల్ సినిమాగా బోయపాటి మార్చేశాడు.
టెక్నికల్ పరంగా
సాంకేతికంగా , నిర్మాణ విలువల పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. థమన్ అందించిన BGM బాగుంది. సాంగ్స్ పర్వాలేదు. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోతుంది. సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ప్రేక్షకులకు మాస్ మీల్స్‌ను అందించడంలో ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదని తెలుస్తోంది.
బలం
బోయపాటి మార్క్ డైరెక్షన్
రామ్ మాస్ యాక్టింగ్
శ్రీలీల అందం
థమన్ BGM
బలహీతనలు
అవసరానికి మించిన కొన్ని యాక్షన్ సీన్లు
చివరగా:
మాస్ మీల్స్ కోరుకునే ప్రేక్షకులకు ఊహకు మించిన ట్రీట్ అందిస్తుంది స్కంద. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.
రేటింగ్ 4/5
సెప్టెంబర్ 28 , 2023
Guntur Kaaram: త్రివిక్రమ్‌తో ఆ విషయంలో కుదరకే పూజా హెగ్డే బయటకొచ్చిందా? సంయుక్త మీనన్ ఎంట్రీ!
మహేష్ బాబు, త్రివిక్రమ్(Mahesh Babu-Trivikram) కాంబినేషన్‌లో గుంటూరు కారం సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ గురించి ఏదొక వివాదం చర్చలకు మూల కేంద్రంగా మారుతునే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్పుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మార్పులే మార్పులు
ఇప్పటికే స్టోరీ మహేష్‌బాబుకు తగ్గట్టు లేదని ఓసారి మార్చివేశారు. కొన్ని కారణాల వల్ల ఫైట్ మాస్టర్స్‌ను తొలగించారు. రెండు షెడ్యూల్స్‌లో జరిగిన షూటింగ్‌ను కంప్లీట్‌గా పక్కకు పెట్టారు. ఇప్పుడు పూజా హెగ్డే సైతం బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది.
ఫలితంగా ఈ చిత్రం కాస్టింగ్‌లో భారీగా మార్పులు రానున్నాయి. పూజా హెగ్డే స్థానంలో మరొక స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంయుక్త మీనన్ లేదా త్రిషను సినిమాలోకి తీసుకోవాలని భావిస్తున్నారట.
అదే అసలు సమస్య
డేట్ సమస్యల కారణంగా పూజా హెగ్డే సినిమా నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. జూన్- ఆగస్టు టైమ్‌ఫ్రేమ్‌లో పూజా హెగ్డే ఇతర సినిమాలు చేయాల్సి ఉంది. ఈ టైమ్‌లో గుంటూరు కారం సినిమా వల్ల ఇతర చిత్రాల షెడ్యూల్‌కు ఆటంకం కలుగుతుందని ఆమె భావించిందని సమాచారం. షెడ్యూల్స్ సరైన టైమ్‌కి పూర్తికాకపోవడం, కొన్ని సీన్లు రీషూట్ చేయడం, అనుకున్న సమయానికి షెడ్యూల్స్ పూర్తికాకపోయినా.. కొత్త షెడ్యూల్స్ ప్రకటించడం, కొన్ని షెడ్యూల్స్‌లో జరిగిన సన్నివేశాలను రీ షూట్ చేయడం వంటి వాటి పట్ల పూజా హెగ్డే తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడేందుకే.. గుంటూరు కారం ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే వైదొలిగినట్లు తెలిసింది.
తమన్ తప్పుకున్నట్లు ప్రచారం..
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. తమన్‌కు బదులు అనిరుధ్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నట్లు బజ్ నడిచింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తమన్ క్లారిటీ ఇచ్చారు. కావాలని కొంత మంది కడుపు మంటతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి ప్రచారాలను నమ్మొద్దని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. కడుపుమంట ఉన్నవాళ్లు తన ఆఫీస్ వద్దకు రావాలని సూచించారు. ఆఫీస్ ముందు మజ్జిగ స్టాల్ ఏర్పాటు చేశానని అక్కడ ఫ్రీగా మజ్జిగ తాగి కడుపు మంట తగ్గించుకోవాలని సూచించారు. ఈసారి తాను అందించే మ్యూజిక్‌తో బాక్స్‌లు బద్దలు అవుతాయని చెప్పుకొచ్చారు.
https://twitter.com/MusicThaman/status/1670846867650002946?s=20
పూజా హెగ్డే స్థానంలో సంయుక్త మీనన్?
పూజా హెగ్డే స్థానంలో మరో హీరోయిన్ కోసం చిత్ర బృందం అన్వేషణ మొదలు పెట్టిందని సమాచారం. మహేష్ సరసన సంయుక్త మీనన్(Samyuktha Menon)ను హీరోయిన్‌గా తీసుకోవాలని యోచిస్తున్నట్లు టాక్. సంయుక్త మీనన్ కాకపోతే.. త్రిష(Trisha)ను కూడా సంప్రదించాలని భావిస్తున్నారట. మరి పూజా స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎవర్నీ తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
https://twitter.com/SSMB28_29/status/1671043502451609601?s=20
పూజా ఓవర్ యాటిట్యూడ్
అయితే కొంత మంది అభిమానులు పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు పూజా హెగ్డేను ఎంకరేజ్ చేయడం ఆపాలని సూచిస్తున్నారు. ఆమెకు తెలుగు సినిమాలంటే గౌరవం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభాస్‌తో తీసిన సినిమాలోనూ ఇదే జరిగిందని కామెంట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ విషయంలో హిందీ, తమిళ్ సినిమాలకు ఇచ్చే ప్రాధాన్యం తెలుగు సినిమాలకు ఇవ్వదని ఏకిపారేస్తున్నారు.
https://twitter.com/898SAG/status/1671025365240942595?s=20
పూజా హెగ్డే స్థానంలో కియరా అద్వానిని మహేష్‌కు జోడీగా తీసుకొస్తే బాగుంటుందని మరికొంత మంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
మూవీ బృందం క్లారిటీ
గుంటూరు కారం మూవీలో జరుగుతున్న మార్పులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో తాజాగా చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. పూజా హెగ్డేని హీరోయిన్‌గా మూవీ నుంచి తీసివేసే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఆమెతో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. సినిమా షూటింగ్ 24 జూన్ 2023 నుంచి ప్రారంభమవుతుంది అని స్పష్టం చేసినట్లు తెలిసింది.
https://twitter.com/TheAakashavaani/status/1671040847054528512?s=20
అల్లు అర్జున్‌తో మళ్లీ...
మరోవైపు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు త్రివిక్రమ్ ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనుండగా... నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఇంతకుముందు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు వచ్చాయి.
జూన్ 20 , 2023
Bhagavanth Kesari Review: ఎమోషనల్ బైండింగ్‌తో బాలయ్య కంటతడి పెట్టించాడు
నందమూరి నటసింహం బాలయ్య నటించిన ‘భగంత్ కేసరి’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి వంటి హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలకృష్ణ.. కూతురు సెంటిమెంట్‌తో తెరకెక్కిన భగవంత్ కేసరితో ముందుకొచ్చాడు. ట్రైలర్‌లో బాలయ్య- శ్రీలీల మధ్య వచ్చిన ఎమోషన్ సీన్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమాతో తన పంథాను మార్చుకున్న అనిల్ రావుపూడి.. బాలకృష్ణతో కొత్త ప్రయోగం చేయడంతో సినిమాపై హెప్ పెరిగింది. మరి ఇంతకు ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నేలకొండపల్లి భగంవత్ కేసరి మెప్పించాడా? లేదా? YouSay రివ్యూలో చూద్దాం.
నటీనటులు: బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రామ్‌పాల్, శరత్‌కుమార్
డెరెక్టర్: అనిల్ రావుపూడి
నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సినిమాటోగ్రఫి: సి. రామ్ ప్రసాద్
సంగీతం: తమన్
విడుదల తేదీ: అక్టోబర్ 19
కథ:
కొన్ని తప్పని పరిస్థితుల్లో జైలుకు వెళ్లిన భగవంత్ కేసరికి ఆ జైలు.. జైలర్ ఓ పని అప్పగిస్తాడు. తన కూతుర్ని కొంత మంది దుర్మార్గుల నుంచి రక్షించమని మాట తీసుకుంటాడు. అందుకోసం భగవంత్ కేసరి.. ఆమెను స్ట్రాంగ్ చేసేందుకు నిత్యం కష్టపడుతుంటాడు. అయితే విజ్జి పాప(శ్రీలీల) మాత్రం అవేమి పట్టనట్టుగా ఉంటుంది. తనను వదిలేయమని వేడుకుంటుంది. ఈక్రమంలో విజ్జును చంపడానికి వచ్చిన విలన్లతో బాలయ్య తలపడుతాడు. వాళ్లు ఊహించని ఓ ట్విస్ట్ ఇస్తారు. ఇంతకు ఆ ట్విస్ట్ ఏమిటి? జైలర్‌కు విలన్‌కు ఉన్న విరోధం ఏమిటి? భగవంత్ కేసరి.. జైలర్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఇక సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే.. బాలకృష్ణ, శ్రీలీల మధ్య కామెడీ ట్రాక్, ఎమోషనల్ సీన్లు ఉంటాయి. ఈ సన్నివేశాలు ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతాయి. శ్రీలీల- బాలయ్య కాంబోలో తెరకెక్కిన గణపతి సాంగ్ అదిరిపోతుంది. బాలయ్య మాస్ స్టేప్పులతో ఇరగదీశాడు. అయితే సినిమాలో కాజల్‌తో పాటలు ఏమి లేవు. బాలకృష్ణతో శ్రీలీల బాండింగ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. అయితే భగవంత్ కేసరి చిత్రం బాలయ్య గత సినిమాల మాదిరి ఉండదు. కొంత వినోదం, కొంత ఎమోషనల్‌గా సాగుతుంది. కూతురు సెంటిమెంట్ సినిమాలో ఎక్కువగా కనిపిస్తుంది. సినిమాలో మూడు పెద్ద ఫైట్లు ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. బాలయ్య చెప్పే హిందీ డైలాగ్స్ ప్రేక్షకుల చేత వన్స్ మోర్ అనిపిస్తాయి. బాలయ్య తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. విలన్ అర్జున్ రామ్‌పాల్‌తో బాలయ్య సన్నివేశాలు గూస్‌బంప్స్. సినిమాకే హైలెట్‌గా బాలకృష్ణ ఇంకో గెటప్ ఉంటుంది. బాలయ్యకు జైలర్‌కు మధ్య ఉన్న సంబంధమే కథకు సెంట్రల్ పాయింట్. ఆ పాయింట్‌కు శ్రీలీల, అర్జున్ రామ్‌పాల్‌ను ముడిపెట్టిన తీరు కుటుంబ ప్రేక్షకులను కదిలిస్తుంది, ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. భగవంత్ కేసరి సినిమాకు మెయిన్ థీమ్. ఈ ఎపిసోడ్‌లో 15 నిమిషాల పాటు బాలయ్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు.
ఎవరెలా చేశారంటే..
భగవంత్ కేసరిలో బాలకృష్ణ పూర్తిగా కొత్తగా కనిపించారు. ఇప్పటివరకు యాక్షన్ సీన్లలోనే ఎక్కువ కనిపించిన బాలయ్య.. కామెడీ సీన్స్‌లోనూ అదరగొట్టారు. శ్రీలీలతో జరిగే ఎమోషనల్ సీన్స్‌లో బాలయ్య తన నటనతో కంటతడి పెట్టించారు. యాక్షన్ సీన్స్‌లో ఎప్పటిలాగే అదరగొట్టారు. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేపిస్తాయి. ఇక శ్రీలీల గురించి చెప్పాలంటే.. విజ్జు పాత్రలో సహాజమైన నటనతో ఆకట్టుకుంది. ఈ పాత్ర శ్రీలీల కెరీర్‌లో గుర్తిండి పోతుంది. ముఖ్యంగా శ్రీలీలకు కెరీర్ ఆరంభంలోనే ఇలా నటనకు స్కోప్ ఉన్న పాత్ర పడటం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. కొన్ని ఎమోషనల్ సీన్లలో బాలయ్యతో పోటీపడి మరి నటించింది. ఇక బాలయ్య సరసన నటించిన కాజల్ తన పాత్ర పరిధిమేరకు నటించింది. పెద్దగా తన పాత్రకు స్కోప్ లేనప్పటికీ.. ఉన్నంతలో బాగా చేసింది. విలన్‌గా అర్జున్ రామ్‌పాల్ మెప్పించాడు. కథకు తగ్గట్లు ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
ఇప్పటి వరకు కామెడీ జోనర్‌లో హిట్ అయిన అనిల్ రావిపూడి తన సినిమాలకు భిన్నంగా బాలయ్యతో ఒక సీరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీసేందుకు మంచి ప్రయత్నమే చేశాడు. అనిల్ తీసుకొచ్చి స్టోరీ లైన్ బలమైనదే అయినప్పటికీ.. దానికి తగినవిధంగా ఇంకాస్త బలంగా కథ రాసుకుంటే బాగుండేది అనిపించింది. కానీ తాను అనుకున్న స్టోరీని అమలు చేయడంలో మాత్రం విజయం సాధించాడు. బాలయ్య- శ్రీలీల మధ్య ఇంకొన్ని బలమైన ఎమోషన్ సీన్లు పడితే బాగుండేది అనిపించింది.
టెక్నికల్ పరంగా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. తమన్ మ్యూజిక్ మెప్పిస్తుంది. కానీ గత సినిమాలతో పోలిస్తే BGM రేంజ్ కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. సినిమాలోని రెండు పాటలు అలరిస్తాయి. శ్రీరామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫి ప్రత్యేకంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో బాలయ్య రిచ్ లుక్‌లో కనిపించేందుకు బాగా కష్టపడినట్లు అర్థం అవుతోంది. ఇక వెంకట్ యాక్షన్ సిక్వెన్స్ హెలెట్. ఉన్న మూడు ఫైట్లు బాలయ్య మాస్ హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేశాయి. క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం అదిరిపోయాయి.
బలాలు
బాలకృష్ణ- శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్లు
యాక్షన్ సన్నివేశాలు
ఇంటర్వెల్ బ్యాంగ్
బలహీనతలు
అంచనాలకు తగ్గట్టుగా లేని ఫస్టాఫ్
కొన్ని చోట్ల లాగ్ సీన్లు
చివరగా: తండ్రి- కూతుళ్ల మధ్య ఎమోషనల్ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రంలో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ... ప్రేక్షకులకు అన్ని విధాల కనెక్ట్ అవుతుంది.
రేటింగ్: 3/5
అక్టోబర్ 26 , 2023
PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. సింగిల్ పోస్ట్ లేకుండా కేవలం 20 నిమిషాల్లోనే 140K ఫాలోవర్లను పవన్ చేరుకోగా.. గంటలో 250K ఫాలోవర్లను క్రాస్ చేశారు. మరో 5 నిమిషాల్లోనే 300K మార్క్‌ను దాటారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదల జెట్ వేగంతో దూసుకెళ్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. #PawanKalyanOnInstagram హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.
దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయాలని ట్వీట్ల జడివాన కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ షేర్ చేయాలని ఇతర అభిమానులకు ట్యాగ్ చేస్తున్నారు.
ఈరోజు #PawanKalyanOnInstagram ట్యాగ్‌ను సోషల్ మీడియాలో నంబర్ 1 గా నిలపాలని పవన్ డైహర్టెడ్ ఫ్యాన్స్.. అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
https://twitter.com/_jspnaveen/status/1676106458516127747?s=20
ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెడుతున్నట్లు ఇటీవల నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు.
పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ నోట్ చాలా సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా ఉంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో, జైహింద్ అనే ట్యాగ్ లైన్‌ను పవన్ తన అకౌంట్‌కు జత చేశారు.
ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవర్ స్టార్ అభిమానులకు, యువతకు నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్విట్టర్, తన అధికారిక వెబ్‌సైట్ (https://janasenaparty.org/) ద్వారా తన పార్టీ అభిప్రాయాలను పవర్ స్టార్ పంచుకుంటున్నారు.
https://twitter.com/_jspnaveen/status/1676108997869588480?s=20
అందుకేనా ఇన్‌స్టా?
ఏపీలో మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో జనసేనాని సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో వెనకపడొద్దని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్, ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. సనిశితమైన సమస్యలపై ప్రశ్నిస్తూ యువత ద్వారా సమాధానాలు రప్పిస్తూ విలైనంత ఎక్కువ మందికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నారు.
వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం తనదైన శైలీలో వాగ్బాణాలతో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గతానికంటే భిన్నంగా తన ప్రచార పర్వాన్ని మార్చివేశారు. తన అభిమానులతో పాటు టాలీవుడ్‌లో ఇతర అగ్ర హీరోలైన ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు. కులాల ప్రస్తావనకు తావులేకుండా తాను అందరివాడినంటూ యువతకు దగ్గరయ్యేందుకు తన టెంపోను మార్చుకున్నారు.
జులై 'బ్రో' నెల
మరోవైపు పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన 'బ్రో' మూవీ ఈనెల 28న విడుదల కానుంది. చిత్ర యూనిట్ బ్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. అభిమానులు జులై నెలను 'బ్రో' నెలగా ప్రకటించి ఉత్సాహంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. 'బ్రో' సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా, సాయిధరమ్ కామన్ మ్యాన్‌గా నటిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది.
అటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించింది. పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ హిట్ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిష్ డెరెక్షన్‌లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రం నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా ఆగిపోయింది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న OG సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసింది. బ్రో సినిమా తర్వాత OG మూవీనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
జూలై 04 , 2023
‘అల వైకుంఠపురంలో’ రీమేక్ ఎందుకు వర్కౌట్ కాలేదు..? డిజాస్టర్‌గా కార్తీక్ ఆర్యన్ ‘షెహ్‌జాదా’
సౌత్ సినిమాలను హిందీలోకి రీమేక్ చేసే సంప్రదాయం ఇటీవల బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే 2020లో విడుదలైన ‘అల వైకుంఠపురంలో’ సినిమాను ‘షెహ్‌జాదా’గా రీమేక్ చేశారు. కార్తీక్ ఆర్యన్‌కి జంటగా కృతి సనన్ నటించింది. రోహిత్ ధవన్ డైరెక్షన్ వహించారు. అయితే, ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా బీ టౌన్ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ‘షెహ్‌జాదా’పై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రబృందానికి ప్రేక్షకులు గట్టి షాక్ ఇచ్చారు. అసలు ఈ సినిమా ఎందుకు ఆడలేదు? ‘అల వైకుంఠపురం’ సినిమాకి, ‘షెహ్‌జాదా’కి మధ్య ప్రధాన తేడా ఏంటో చూద్దాం.
స్టోరీ లైన్, అల్లు అర్జున్ నటన, తమన్ సంగీతం, స్టైలిష్ ఫైట్స్,డ్యాన్స్ కొరియోగ్రఫీ త్రివిక్రమ్ మార్క్ టేకింగ్.. ‘అల వైకుంఠపురం’ సినిమా భారీ విజయం సాధించడానికి ప్రధాన కారణాలు. ‘నాన్ బాహుబలి’ కేటగిరీలో అత్యధిక వసూళ్లను సాధించి ‘అల వైకుంఠపురంలో’ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. అంతటి విజయవంతమైన సినిమాను రీమేక్ చేయగా కనీస స్పందన రాకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అయితే, ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో పోలిస్తే ‘షెహ్‌జాదా’లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. వీటి వల్ల మాతృక సినిమా కలిగించిన అనుభూతిని షెహ్‌జాదా కల్పించలేక పోయింది.
స్టోరీ లైన్‌లో మార్పు..
ఒరిజినల్ సినిమాలో బంటు(అల్లు అర్జున్) వాల్మీకి(మురళీ కృష్ణ) కుమారుడిగా పెరుగుతాడు. వాల్మీకి భార్య(రోహిణి) పాత్ర ఇందులో కీలకం. తల్లిగా తన మాతృత్వాన్ని ప్రదర్శించింది. అయితే, ‘షెహ్‌జాదా’లో వాల్మీకి భార్య పాత్రని చంపేశారు. తద్వారా హీరోకి వాల్మీకి కుటుంబాన్ని వదిలించుకోవడానికి మార్గం సులువు చేశారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో పెంచిన తల్లికి ప్రాధాన్యమివ్వాలా? జన్మనిచ్చిన అమ్మ వైపు మొగ్గు చూపాలా? అనే విషయాన్ని బంటు విచక్షణకే వదిలేశారు. కానీ, షెహ్‌జాదాలో పెంచిన కుటుంబం నుంచి దూరం కావడానికి హీరోకు బలమైన కారణాన్ని సృష్టించారు. ఇలా పెంపుడు తల్లి పాత్రను తీసేయడం ప్రేక్షకులకు రుచించలేదు.
‘అల వైకుంఠపురంలో’ రాజ్ మనోహర్(సుశాంత్)కి ప్రేయసిగా నందిని(నివేతా పెత్తురాజ్) పాత్రకి తగిన ప్రాధాన్యత ఉంటుంది. అమూల్య(పూజా హెగ్డే)ని పెళ్లి చేసుకోవడంలో రాజ్ పడే ఇబ్బందికి ఇదే ప్రధాన కారణం. ‘షెహ్‌జాదా’లో నందిని పాత్రని తీసేశారు. ‘అమూల్య’ని పెళ్లి చేసుకోవడంలో రాజ్ పాత్రకి అభ్యంతరం లేకుండా చేశారు. ఇది కూడా సినిమాకు మైనస్‌గా నిలిచింది. అంతేగాకకుండా ‘రాజ్ మనోహర్’ పాత్రలో చేసిన మార్పులు ప్రేక్షకులను మెప్పించలేదు.
హీరో క్యారెక్టరైజేషన్..
అల వైకుంఠపురం సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ బాగా ఎలివేట్ అయింది. అమూల్య(పూజా హెగ్డే)ని చిక్కుల్లో నుంచి విడిపించే సమయంలో తన క్యారెక్టర్‌కు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. విలన్లకు కొట్టి బుద్ధి చెబుతాడు. కానీ, ‘షెహ్‌జాదా’లో ఇదే లోపించింది. ఈ సీన్‌లో తన క్యారెక్టర్‌కి విరుద్ధంగా కార్తీక్ ఆర్యన్ ప్రవర్తిస్తాడు. తనదైన శైలిలో కాకుండా సావధానంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇదే కాస్త అసహజంగా అనిపించింది.
ఫైట్స్ కొరియోగ్రఫీ
ఫైట్ సీన్‌లను రీక్రియేట్ చేయొచ్చు. కానీ, ఒక హీరో శైలిని రీక్రియేట్ చేయలేం. చెల్లెలి దుపట్టాను ఆకతాయిలు తీసుకెళ్లిన సమయంలో హీరో చేసే ఫైట్, తాతను రక్షించడంలో వచ్చే సీన్, క్లైమాక్స్ ఫైట్‌లు అల్లు అర్జున్‌ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినవి. స్టైలిష్‌గా ఈ సీన్లు సాగుతుంటాయి. ‘షెహ్‌జాదా’లో కార్తీక్ ఆర్యన్ ఈ సీన్లలో విఫలమయ్యాడు. సీన్లను ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టినా, తన పర్ఫార్మెన్స్‌తో కార్తీక్ ఆర్యన్ కొత్తదనాన్ని తీసుకురాలేక పోయాడు.
పాత్రలు
‘అల వైకుంఠపురంలో’ కనిపించే ప్రతి పాత్రకు నిర్దిష్టమైన ప్రాధాన్యత ఉంటుంది. ‘షెహ్‌జాదా’లో ఇది లోపించింది. పైగా, బంటు సహోద్యోగుల పాత్రలు శేఖర్(నవదీప్), రవీందర్(రాహుల్ రామకృష్ణ), సునీల్ క్యారెక్టర్‌లు రీమేక్‌లో లేవు. బోర్డ్ రూమ్‌లో జరిగే సన్నివేశం లేదు. ఇలా మార్పులు చేయడంతో ఆ మజాని ప్రేక్షకులు ఆస్వాదించలేకపోయారు. విలన్ పాత్రల్లో కూడా సహజత్వం లోపించినట్లు అనిపించింది.
సంగీతం
‘అల వైకుంఠపురం’ సినిమాకు సంగీతం పెద్ద అసెట్‌గా నిలిచింది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. బుట్టబొమ్మ, రాములో రాములా, సామజ వరగమన, టైటిల్ సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే సిత్తరాల సిరపడు, డాడీ సాంగ్.. ఇలా ఆల్బమ్ సూపర్ హిట్ అయింది. షెహ్‌జాదాలో చెప్పుకోదగ్గ సంగీతం లేదు. ఒకటి రెండు మినహా మిగతావి చప్పగా సాగాయి. ఫలితంగా సంగీత ప్రియులకు నిరాశే మిగిల్చింది. ఓవరాల్‌గా ‘అల వైకుంఠపురం’ సినిమాతో పోలిస్తే ‘షెహ్‌జాదా’ ఎక్కడా పోటీ పడలేక పోయింది. ఫలితంగా ‘డిజాస్టర్’ టాక్‌ని మూటగట్టుకుంది.
అల్లు అర్జున్ మేనియా
షెహ్‌జాదా సక్సెస్ సాధించకపోవడానికి అల్లు అర్జున్ మేనియా కూడా ఒక కారణమే. గతంతో పోలిస్తే దక్షిణాది సినిమాల పరిధి పెరిగింది. ‘అల వైకుంఠపురం’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. దీంతో బీ టౌన్ ప్రేక్షకులు బన్నీ మునపటి సినిమాలను వీక్షించారు. ఇది కూడా ‘షెహ్‌జాదా’కు మైనస్‌గా మారింది.
రీమేక్‌లు వర్కౌట్ అవుతాయా?
గతేడాది ఐదు దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. ఇందులో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్‌ల ‘విక్రమ్ వేధ’, అక్షయ్ కుమార్ ‘కట్‌పుట్లి’ సినిమాలు ఆశించిన మేర కలెక్షన్లు సాధించలేదు. ఇక జాన్వీ కపూర్ ‘మిలీ’, రాజ్‌కుమార్ ‘హిట్- ద ఫస్ట్ కేస్’, రాధిక ఆప్టే ‘ఫోరెన్సిక్’ సినిమాలు బోల్తా కొట్టాయి. తాజాగా ఈ లిస్టులోకి ‘షెహ్‌జాదా’ చేరింది. దీంతో రీమేక్ సినిమాలు వర్కౌట్ అవుతాయా అన్న సందేహం మొదలైంది. అయితే, అజయ్ దేవ్‌గన్ ‘దృశ్యం2’ మాత్రం ఘన విజయం సాధించింది. మళయాలంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకపోవడం, హిందీలోకి డబ్ కాకపోవడంతో అజయ్ దేవ్‌గన్ మూవీ హిట్ అయ్యింది.
దక్షిణాది భాషల సినిమా పరిధి పెరిగింది. ఇక్కడి కథలు బాలీవుడ్ మాస్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓటీటీ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రాంతీయ భాషల్లో విడుదలైన సినిమాలకు సబ్‌టైటిల్స్ ఇస్తుండటంతో హిందీలోనూ వాటిని చూస్తున్నారు. దీంతో రీమేక్ సినిమాలపై ఆసక్తి కొరవడింది. అయితే, ప్రస్తుతం మరికొన్ని రీమేక్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’(వీరం రీమేక్), అజయ్ దేవ్‌గన్ భోళా(లోకేష్ కనగరాజ్ ఖైదీ రీమేక్) ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.
ఫిబ్రవరి 23 , 2023
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (HBD Thaman) ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీలోని టాప్ హీరోల చిత్రాలకు అదిరిపోయే సంగీతం అందిస్తూ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయారు. ఇవాళ థమన్ పుట్టిన రోజు. 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో థమన్‌కు సంబంధించిన సీక్రెట్స్ ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
థమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్. 1983 నవంబరు 16 ఏపీలోని నెల్లూరులో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.
థమన్ తండ్రి పేరు ఘంటసాల శివకుమార్. ఆయన ప్రముఖ డ్రమ్మర్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు పొందాడు. ఒక్కప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కె. చక్రవర్తి దగ్గర ఏడు వందల సినిమాలకు వర్క్ చేశారు.
థమన్ (HBD Thaman) తల్లి పేరు ఘంటసాల సావిత్రి. ఆమె కూడా ప్లే బ్యాక్ సింగర్. సంగీత కుటుంబం నుంచి రావడం వల్ల సహజంగానే మ్యూజిక్‌పై థమన్‌కు ఆసక్తి ఏర్పడింది.
ఓ సారి థమన్ (HBD Thaman)కు తండ్రి శివ కుమార్ డ్రమ్ కొనిచ్చాడట. తొలిసారి దానిపైనే డ్రమ్ వాయించడం ప్రాక్టిస్ చేశాడట. అలా చిన్నప్పుడే తండ్రి ప్రోత్సాహంతో డ్రమ్స్‌పై పట్టు సాధించాడట.
థమన్ తన 13 ఏళ్ల వయసులో బాలయ్య నటించిన 'భైరవ ద్వీపం' సినిమాకు డ్రమ్మర్‌గా పనిచేశారు. ఇందుకుగాను రూ.30 పారితోషికం కూడా అందుకున్నాడు.
థమన్ (HBD Thaman) చదువుకుంటున్న క్రమంలోనే ఆయన తండ్రి అకస్మికంగా మరణించారు. దీంతో కుటుంబ బాధ్యత థమన్‌పై పడింది. చదువుకు స్వస్థి చెప్పి తను నేర్చుకున్న డ్రమ్స్‌నే వృత్తిగా మార్చుకున్నాడు.
థమన్ తండ్రికి ఉన్న పేరు దృష్ట్యా పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్‌కు సాయం చేశారు. షోలు చేసే అవకాశం కల్పించారు.
అలా తన తండ్రి చనిపోయిన నాలుగేళ్ల వ్యవధిలోనే 4 వేల స్టేజ్ షోలు చేసి థమన్ తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.
అలా షోలు చేస్తున్న క్రమంలోనే డైరెక్టర్ శంకర్ దృష్టిలో థమన్ పడ్డాడు. అలా బాయ్స్ సినిమాలో ఓ కీలకమైన కుర్రాడి రోల్‌ను సంపాదించాడు.
ఓవైపు షోలు చేస్తూనే పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ టీమ్‌లో డ్రమ్మర్‌గా థమన్ పనిచేశాడు. అలా 24 ఏళ్లు వచ్చేసరికి 64 మంది మ్యూజిక్ డైరెక్టర్స్‌తో 900 సినిమాలకు పనిచేయడం విశేషం.
ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ దగ్గర వర్క్ చేయడం తన కెరీర్‌కు ఎంతో బూస్టప్ ఇచ్చిందని థమన్ చెబుతుంటాడు.
ముఖ్యంగా మణిశర్మ టీమ్ భాగమై చేసిన 'ఒక్కడు' సినిమా తన జీవితాన్ని మార్చేసిందని థమన్ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు.
24 ఏళ్ల వయసులో మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిన థమన్.. తమిళ చిత్రం 'సింధనాయ్ సె' (2009) తొలిసారి వర్క్ చేశారు.
రవితేజ హీరోగా చేసిన ‘కిక్’ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్‌కు ఫస్ట్ తెలుగు ఫిల్మ్. ఈ సినిమాలో సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో థమన్ పేరు మారుమోగింది.
ఆ తర్వాత ‘బృందావనం’, ‘దూకుడు’, ‘బిజినెస్‌మెన్’, ‘రేసుగుర్రం’.. ఇలా అతి తక్కువ సమయంలోనే సంగీత దర్శకుడు 100కు పైగా సినిమాలకు పని చేశాడు.
తారక్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ థమన్‌కు 100వ చిత్రం. ఇప్పటివరకూ 145 చిత్రాలకు థమన్ సంగీతం అందించారు.
‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘ఓజీ’, ‘అఖండా 2’, ‘ది రాజా సాబ్’ సహా 18 చిత్రాలు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
థమన్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన భార్య శ్రీవర్దిని కూడా మంచి సింగరే. థమన్ సంగీతం అందించిన బాడీ గార్డ్ చిత్రంలో 'హోసన్న' పాట పాడారు.
థమన్ సోదరి యామిని ఘంటసాల కూడా ప్రముఖ నేపథ్య గాయని. అలాగే థమన్ అత్త పి. వసంత కూడా మంచి సింగర్‌గా రాణించారు.
థమన్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌తో పాటు బెస్ట్ క్రికెటర్ కూడా ఉన్నాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్స్‌లో ఆయన తెలుగు ఇండస్ట్రీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ధనా ధన్ సిక్స్‌లతో తెలుగు టీమ్‌కు విజయాలు అందించారు.
ఏ.ఆర్. రెహమాన్ అంటే తనకు ఎంతో స్పూర్తి అని థమన్ పేర్కొన్నాడు. ఎప్పటికైనా ఆయన స్థాయికి ఎదగాలని తన కోరిక అని చెప్పాడు.
తాజాగా తన 41వ పుట్టిన రోజు సందర్భంగా థమన్ తన జీవిత ఆశయం ఏంటో చెప్పారు. ఓ మ్యూజిక్ స్కూల్ ఏర్పాటు చేసిన వెనుకబడిన వారికి ఫ్రీగా సంగీతం నేర్చించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
థమన్‌పై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. క్యాపీ క్యాట్, కాపీ గోట్ అంటూ మీమర్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు.
ట్రోల్స్‌పై స్పందిస్తూ తనకు కాపీ కొట్టడం రాదని, అందుకే వెంటనే దొరికిపోతానని (నవ్వుతూ) థమన్ చెప్పాడు.
నవంబర్ 16 , 2024
BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్, బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిశోర్, తదితరులు
దర్శకత్వం: సముద్రఖని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్
మ్యూజిక్: తమన్ ఎస్.ఎస్
సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
పవన్ కళ్యాణ్, సాయితేజ్ మల్టీస్టారర్ మూవీ ‘బ్రో’. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి రీమేక్ హిట్ల అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన మరో రీమేక్ ఇదే. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు, పవన్ కళ్యాణ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాను మలిచారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాతృక దర్శకుడు సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. మరి, ఫిలాసఫికల్ టచ్‌తో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మెప్పించిందా? టైం కాన్సెప్ట్ ప్రేక్షకుడిని కన్వీన్స్ చేసిందా? ‘బ్రో’ మూవీతో పవన్ హ్యాట్రిక్ రీమేక్ హిట్ అందుకున్నాడా? అనే విశేషాలు రివ్యూలో చూద్దాం.
కథేంటంటే?
మార్కండేయుడు(సాయితేజ్) ఓ బిజినెస్‌మేన్ పెద్దకొడుకు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మార్క్‌పై పడతాయి. గజిబిజి హడావుడిలో పడిపోయి అటు కుటుంబానికి, లవర్‌కి పెద్దగా టైం కేటాయించని పరిస్థితి మార్క్‌ది. ఈ క్రమంలో అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతాడు. మార్క్‌ని తీసుకెళ్లడానికి టైటాన్(పవన్ కళ్యాణ్) వస్తాడు. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయని, వాటిని పూర్తి చేశాక వస్తానని కాలదేవుడిని ఒప్పిస్తాడు. ఈ క్రమంలో మార్క్ చేసే ప్రతి పనిలోనూ ఎదురు దెబ్బ తగులుతుంది. మరి, చివరికి మార్క్ వాటినెలా పూర్తి చేశాడు? టైటాన్ ఏమైనా సాయం చేశారా? అనేది తెరపై చూడాల్సిందే.
https://twitter.com/captain_India_R/status/1684756208845045760?s=20
ఎలా ఉంది?
‘వినోదయ సిత్తం’ మూవీ కంప్లీట్‌గా ఫిలాసఫికల్ మూడ్‌లో సాగుతుంది. కానీ, బ్రో ఇందుకు కాస్త భిన్నం. తత్వాన్ని బోధిస్తూనే కమర్షియల్ హంగులను అద్దుకుందీ సినిమా. దేవుడికి కూడా టైం రావాలని, దేవుడి కన్నా గొప్పది ‘టైం’ అనే విషయాన్ని చెబుతుంది. దీనినే పూర్తిగా ఫ్యాన్ మేడ్‌లా రూపొందించి కన్వే చేశారు. పవన్ కళ్యాణ్ పాత్రను దృష్టిలో పెట్టుకునే పూర్తి సినిమాను మలిచారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచే ఈ ఫ్లేవర్ కనిపిస్తుంది. అసలే ఆకలితో ఉన్న ఫ్యాన్స్‌కి పవన్ పాపులర్ సాంగ్స్‌ని మిక్స్ చేసి బిర్యానీ తినిపించారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ని కుర్చీలో కూర్చోనివ్వవు. ఇంట్రవెల్ పార్ట్, క్లైమాక్స్ పార్ట్ సినిమాకు అసెట్‌గా నిలుస్తాయి. సన్నివేశాలకు అనుగుణమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కథనం వేగంగా సాగుతుంటుంది. క్లైమాక్స్‌లో ఎమోషన్ పీక్స్. అప్పటిదాకా ఎంజాయ్ చేసిన సినిమాను చివరి 20 నిమిషాల్లో మర్చిపోతాం. థియేటర్ల నుంచి బయటకొచ్చేటప్పుడు ఈ క్లైమాక్స్ మాత్రమే గుర్తుంటుంది. అయితే, కొన్ని చోట్ల సీన్లు ఓవర్‌గా అనిపించడం, కుటుంబం ఎమోషన్లు ఊహించినంతగా పండకపోవడం కాస్త మైనస్. సినిమాలో ఏపీ పాలిటిక్స్‌ని ఇరికించడం రుచించకపోవచ్చు.
https://twitter.com/CharanRuthless/status/1684406412892606464?s=20
ఎవరెలా చేశారు?
కాలదేవుడిగా పవన్ కళ్యాణ్ ఇరగ దీశాడు. ఎంట్రీ సీన్ నుంచి సినిమాకు ఫుల్ ఎనర్జీని తీసుకొచ్చాడు. సినిమా ఆసాంతం నాటి పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేసేలా నటించాడు. తన పాపులర్ సాంగ్స్‌లలో స్టెప్పులతో అలరించాడు. క్లైమాక్స్‌లోనూ ఎమోషన్స్‌ని చక్కగా పండించాడు. ఇక మార్క్‌పై సానుభూతి కలిగేంతలా నటించాడు సాయితేజ్. తన రియల్ లైఫ్‌కి ఇది చాలా దగ్గరగా ఉండటంతో అట్టే ఒదిగిపోయాడు. మావయ్యతో కలిసి చేసే సీన్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. చివర్లో సాయితేజ్ ఏడిపించేస్తాడు. ఇక, కేతిక శర్మ తన పాత్రకు పరిమితమైంది. తల్లిగా రోహిణి, చెల్లిగా ప్రియా ఓకే అనిపించారు.
టెక్నికల్‌గా
సినిమాకు కథ ఎంతో బలాన్నిచ్చింది. రీమేక్ అయినప్పటికీ మాతృ కథలోని ఆత్మ పోకుండా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ సముద్రఖని సఫలమయ్యాడు. ఎంత వరకు అవసరమో, ఫ్యాన్స్‌కి ఏం కావాలో అంతే చూపించాడు. ఇక, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా డైలాగ్స్‌లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. ఇక, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి ఆకట్టుకుంటుంది. శ్లోకం బీజీఎం ఒక వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్‌ని యంగ్‌గా చూపించడంలో సుజీత్ వాసుదేవ్ తన పనితనం చూపించారు. నిర్మాణ విలువలు సరిపోయాయి.
https://youtu.be/jnzuXnj6HE0
ప్లస్ పాయింట్స్
పవన్, సాయితేజ్ మధ్య సీన్స్
పవన్ సాంగ్స్ మిక్స్
డైలాగ్స్, స్క్రీన్ ప్లే
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
ఓవర్ సీన్స్
పొలిటికల్ డైలాగ్స్
చివరగా.. సినిమా చూసొచ్చాక జీవితంలో ఏదైనా చేయాలనిపిస్తుంది ‘బ్రో’
రేటింగ్: 3/ 5
https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
జూలై 28 , 2023
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ లాక్.. అంచనాలు అందుకోలేకపోయిన చరణ్ బర్త్‌డే ట్రీట్!
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Gamer Changer). ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) తర్వాత రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తుండటం, స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు పెరిగిపోయాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. పలు రీజన్స్‌తో సినిమా షూట్ వాయిదా పడుతూ వస్తుండటంతో రిలీజ్ కూడా జరుగుతూ వస్తోంది. ఇక రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ తేదీని ప్రకటిస్తారని అంతా భావించినా లిరికల్ సాంగ్‌తో మేకర్స్ చేతులు దులుపుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు ఓ వార్త బయటకొచ్చింది.
రిలీజ్ డేట్ లాక్?
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ‘పుష్ప 2’ (Pushpa 2), ‘దేవర’ (Devara) వంటి చిత్రాలు ఇప్పటికే విడుదల తేదీని ఖరారు చేసుకున్నాయి. దీంతో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) పై అందరి దృష్టి పడింది. అసలు ఈ ఏడాది వస్తుందా రాదా అన్న సందేహాలు కూడా ఓ దశలో ఫ్యాన్స్‌లో మెుదలయ్యాయి. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ తేదీ లాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండోచ్చని అంటున్నారు. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
కాస్త ఓపిక పట్టండి: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. ఇందులో పాల్గొన్న ‘గేమ్ ఛేంజర్’ నిర్మాత దిల్‌రాజ్.. తన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని కీలక అప్‌డేట్స్ కోసం కాస్త ఓపిక పట్టమని ఫ్యాన్స్‌ను కోరారు. ‘మీ ఓపికకు ఎంతో పరీక్ష పెడుతున్నాం. ఒక తుపాను వచ్చే ముందు కాస్త ఓపిక పట్టక తప్పదు. రామ్‌చరణ్ ఇప్పుడు మెగా పవర్‌స్టార్ కాదు.. గ్లోబల్ స్టార్. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి ఆ స్థాయికి రీచ్ అయ్యేలా శంకర్ దీనిని తీర్చిదిద్దుతున్నారు. మరో రెండు నెలల్లో షూట్ పూర్తి కానుంది. ఐదు నెలల్లో రిలీజ్ చేస్తాం' అని అన్నారు.
రెస్పాన్స్ అంతంతమాత్రమే!
మార్చి 27న చరణ్ బర్త్‌డే కానుకగా ‘గేమ్ ఛేంజర్’ నుండి ‘జరగండి’ పాట విడుదలైంది. అయితే ఈ పాటకు రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. తమన్ రొటీన్ మ్యూజిక్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ ఉన్నా కూడా రామ్ చరణ్, కియారా స్టెప్స్ సో సోగానే ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బుధవారం ఉ. 9 గంటలకు ఈ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజ్ కాగా.. గురువారం ఉ. 9 గంటల సమయానికి 4.5 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఇక హిందీ, తమిళంలలో అయితే మరీ దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక దాంట్లో 3 లక్షలు, మరో దాంట్లో 5 లక్షల వ్యూస్‌తో జరగండి సాంగ్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఒక్క సాంగ్‌కు అన్ని కోట్లా?
యూట్యూబ్‌లో రిలీజైన ‘జరగండి’ లిరికల్ వీడియో సాంగ్‌ను పరిశీలిస్తే అందులో రంగు రంగు భవనాలను చూడవచ్చు. ఈ సాంగ్ అంతా చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అయితే అవన్ని ఒరిజినల్ భవనాలు కాదని.. చూడటానికి నిజమైన ఇల్లులా కనిపించే సెట్స్ అని టాక్ వినిపిస్తోంది. ఈ సెట్ నిర్మించడం కోసం ఏకంగా రూ.16 కోట్లను ఖర్చు చేశారని ఫిలింనగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే శంకర్ గురించి తెలిసినవారు ఇది మామూలు విషయమేనని అంటున్నారు.
మార్చి 28 , 2024
Guntur Kaaram Record: భారత సినీ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు.. ట్రోలర్లకు మహేష్ దెబ్బ అదుర్స్!
సూపర్‌స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu) 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమాతో ఆల్‌టైమ్ రికార్డు కొల్లగొట్టాడు. జనవరి 12న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల (Guntur Kaaram Collections) జోరు ప్రదర్శిస్తోంది. ఓపెనింగ్ రోజు రూ.94 కోట్లు, సెకండ్ డే రూ.33 కోట్లు, మూడో రోజు రూ.37 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం తొలి వారంలోనే ఏకంగా రూ.212 మొత్తం కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
భారత సినీ చరిత్రలో ప్రాంతీయ భాషలో రిలీజైన ఓ చిత్రం తొలి వారంలోనే ఇలా రూ.212 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం ఇదే తొలిసారి. ఈ అరుదైన ఘనతను సాధించి ‘గుంటూరు కారం’(Guntur Kaaram) ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిందని మేకర్స్ తాజా పోస్టర్ ద్వారా తెలియజేశారు. కాగా, మహేష్ కెరీర్‌లో రూ.200+ గ్రాస్ అందుకోవడం ఇది మూడోసారి. అదే విధంగా టాలీవుడ్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో మహేష్ సినిమాలు ఐదు ఉన్నాయి.
గుంటూరు కారం చిత్రం ద్వారా మహేష్‌బాబు కెరీర్‌లో వరుసగా ఐదోసారి రూ.100+ కోట్ల షేర్ సాధించాడు. 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' సినిమాల ద్వారా ఆయన ఈ ఫీట్ అందుకున్నారు. దీంతో వరుసగా ఐదుసార్లు ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా మహేష్ నిలిచాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా ముడోసారి మహేష్‌తో ‘గుంటూరు కారం’ తెరకెక్కించారు. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ మంచి సక్సెస్ సాధించాయి. తొలుత ‘గుంటూరు కారం’ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు బాగా కనెక్ట్ కావడంతో కలెక్షన్లలో ఆ ప్రభావం కనిపంచలేదు. మహేష్‌బాబు యాక్టింగ్, మేనరిజం, ఫైట్స్‌కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.
ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) నటించగా, మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కీ రోల్ ప్లే చేసింది. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు. కాగా హారికా అండ్ హసిన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుందని టాక్. మార్చి ఆఖరి వారంలో గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
మహేష్ టాప్-5 కలెక్షన్లు ఇవే!
‘గుంటూరు కారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తూ మరిన్ని రికార్డులను కొల్లగొట్టేందుకు పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో మహేష్ నటించిన చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాలపై ఓ లుక్కేద్దాం.
సర్కారు వారి పాట
పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్ల వసూళ్లు సాధించి మహేష్ సత్తా ఏంటో చూపించింది. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటించింది.
సరిలేరు నీకెవ్వరు
మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' (Sarileru Neekevvaru). రూ.85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తొలి రోజే రూ. 64.7 కోట్లను వసూలు చేసింది. ఓవరాల్‌గా రూ.214 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
మహర్షి
రూ.90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘మహర్షి’(Maharshi) చిత్రం.. వరల్డ్‌వైడ్‌గా రూ.170.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజునే రూ.48.2 కోట్లు రాబట్టి నిర్మాతలపై కనక వర్షం కురిపించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, పూజా హెగ్డే, జగపతిబాబు ముఖ్యపాత్రలు పోషించారు.
భరత్ అనే నేను
కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన 'భరత్ అనే నేను' సినిమా సైతం మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్ర బడ్జెట్ రూ.95 కోట్లు కాగా.. వరల్డ్‌వైడ్‌గా రూ. 164.9 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించింది.
శ్రీమంతుడు
మహేష్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో 'శ్రీమంతుడు'(Srimanthudu) ఒకటి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.145.2 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్ సరసన శ్రుతి హాసన్ చేసింది. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.
జనవరి 19 , 2024
REVIEW: కృష్ణ వంశీ మార్క్ భావోద్వేగాలతో నిండిన 'రంగమార్తాండ'
కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కృష్ణ వంశీ. కొద్దిరోజులుగా హిట్ చిత్రాలు తీయకపోయినా తన మార్క్ ఎవ్వరూ మర్చిపోలేదు. వంశీ ఇప్పుడు రంగమార్తాండ అనే సినిమాను తెరకెక్కించాడు. ఉగాది రోజున సినిమా విడుదలవుతున్నప్పటికీ ప్రీమియర్ షోలు వేశారు. మరాఠీ చిత్రం నటసామ్రాట్‌కు రీమేక్‌గా తీసిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? కృష్ణ వంశీ సక్సెస్ బాట పట్టాడా? అనేది చూద్దాం.
దర్శకుడు: కృష్ణవంశీ
నటీ నటులు: ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, తదితరులు
సంగీతం: ఇళయ రాజా
సినిమాటోగ్రఫీ: రాజ్.కె. నళ్లీ
కథేంటీ?
రంగస్థల నాటకాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాఘవరావు ( ప్రకాశ్ రాజ్). అతడి నటనకు మెచ్చి రంగమార్తాండ అనే బిరుదును ఇస్తారు. ఆ బిరుదుతోనే నాటకరంగం నుంచి తప్పుకొని ఆస్తిని పిల్లలకు పంచుతాడు. వారితో సంతోషమైన జీవితం గడుపుదామని భావించిన అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. రాఘవరావు స్నేహితుడు చక్రవర్తి ( బ్రహ్మానందం ) పాత్ర ఏమిటి? అనేది కథ.
ఎలా ఉందంటే?
రాఘవరావు, చక్రవర్తి పాత్రలతో కథను ఆరంభించిన దర్శకుడు రంగమార్తాండ బిరుదు తీసుకొని నాటకాలకు స్వస్థి పలికిన వ్యక్తి పాత్రలోకి ప్రేక్షకులను తీసుకెళ్లాడు. కోడలికి ఆస్తి పంచి, కుమార్తెకు ప్రేమించిన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేసి తన బాధ్యతలు నిర్వర్తించిన పెద్దమనిషి సాధారణమైన జీవితాన్ని చూపించాడు.
ఆనందంగా గడుపుదామనుకున్న వ్యక్తికి కోడలు పెట్టే అవమానాలు, కూతురు ఇంటికి వెళ్లిన అతడికి ఎదురయ్యే పరిణామాలు దిక్కుతోచని స్థితిలో పడేస్తాయి.కుటుంబ విలువలను చక్కగా చూపించే కృష్ణవంశీ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి చూపించాడు.
మరాఠీ చిత్రం నటసామ్రాట్‌కు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రమే అయినా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా మార్చాడు వంశీ. తెలుగు నాటకరంగం ఎంత గొప్పదో వివరించే సన్నివేశాలు అదిరిపోతాయి.
ఎవరెలా చేశారంటే?
నటనతో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ప్రకాశ్ రాజ్ ఈ సినిమాతో శిఖరాన్ని చేరుకున్నాడు. రాఘవపాత్రకు ఆయన తప్ప మరొకరు న్యాయం చేయలేరంటే అతిశయోక్తి కాదు.
పంచతంత్రం సినిమాతో రూటు మార్చిన బ్రహ్మానందం భావోద్వేగపూరితమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఆయనలో సరికొత్త కోణం కనిపిస్తుంది. భర్త చాటు భార్యగా కేవలం కళ్లతోనే హావాభావాలు పలికించే పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయింది.
రాఘవరావు కోడలి పాత్రలో అనసూయ, కుమార్తెగా శివాత్మిక, మిగిలిన పాత్రల్లో నటించిన రాహుల్ సిప్లిగంజ్, అలీ రాజా, ఆదర్శ్ వారి రోల్స్‌కు పూర్తిగా న్యాయం చేశారు. ఈ తరం యువత ఎలా ఉంటారనే కోణంలో మెప్పించారు.
సాంకేతికత విలువలు
రంగమార్తాండ సినిమాతో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు కృష్ణవంశీ. ఈ చిత్రంలో తన మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. ప్రస్తుత యువత, తల్లిదండ్రుల మధ్య సంఘర్షణను చూపించండంలో విజయం సాధించాడు .
సినిమాకు మరో పిల్లర్ సంగీతం. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా అందించిన వినసొంపైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. కెమెరా పనితీరు అద్భుతంగా ఉంది.
ఇక్కడ మరోవ్యక్తి గురించి చెప్పుకోవాల్సిందే. ఆకెళ్ళ శివ ప్రసాద్ మాటలు సినిమాకు ప్రధాన బలం. సినిమాలపై అతడికి ఉన్న అవగాహన స్పష్టంగా కనిపిస్తుంది.
బలాలు
నటీనటులు
దర్శకత్వం
సంగీతం
మాటలు
బలహీనతలు
తారాబలం లేకపోవటం
రేటింగ్: 3.5/5
మార్చి 21 , 2023
Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
ఈ రోజుల్లో హీరో కావాలంటే డాన్సులు, నటన రావడమే కాదు ఫిజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో హీరో తెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. అందుకే ఎంత కష్టమైన భరించి కథానాయకులు సిక్స్ ప్యాక్‌లు చేస్తుంటారు. పాత్రలకు అనుగుణంగా తమను తాము రూపాంతరం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి బరువు కూడా పెరగాల్సి ఉంటుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం కోసం తమను ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని బట్టి మన స్టార్ హీరోలు సినిమా పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్భుతమైన ఫిజిక్ కలిగిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
చిరంజీవి (Chiranjeevi)
ఇంద్ర సినిమా ముందు వరకూ టాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్ కలిగిన హీరో అంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవినే గుర్తుకు వచ్చాయి. శంకర్‌దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన చిరు బాడీని కాస్త అశ్రద్ధ చేశారు. తిరిగి సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన చిరు.. ఆరు పదుల వయసులోనూ ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల ‘విశ్వంభర’ సినిమా కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపించారు.
https://twitter.com/i/status/1752914245170364419
ప్రభాస్ (Prabhas)
టాలీవుడ్‌లో మెస్మరైజింగ్ బాడీ అనగానే ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. తొలి చిత్రం ఈశ్వర్ నుంచి ఫిట్‌గానే ఉన్న ప్రభాస్.. బుజ్జిగాడు సినిమా కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్ చేశాడు. ఆ తర్వాత బాహుబలి కోసం మరింత బరువు పెరిగి కండలు తిరిగిన యోధుడిలా ప్రభాస్ మారాడు. రీసెంట్‌గా ‘సలార్’లోనూ ప్రభాస్ పలకలు తిరిగిన బాడీతో కనిపించాడు.
రానా (Rana)
ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో గంభీరమైన దేహాన్ని కలిగిన హీరో రానా. తొలి సినిమా ‘లీడర్’లో బక్కపలచని బాడీతో కనిపించిన రానా.. ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెందాడు. ‘కృష్ణం వందే జగద్గురం’లో కడలు తిరిగిన బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి చిత్రం కోసం మరింత బరువు పెరిగి.. ప్రభాస్‌ను ఢీకొట్ట సమవుజ్జీలా మారాడు.
సుధీర్ బాబు (Sudheer Babu)
శివ మనసు శృతి (SMS) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సుధీర్ బాబు.. తన బాడీతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు. బేసిక్‌గా జిమ్మాస్టర్ అయిన ఈ హీరో.. ప్రతీ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీని మెయిన్‌టైన్ చేస్తూ మెప్పిస్తున్నాడు.
రామ్ చరణ్ (Ram Charan)
మెగాస్టార్ వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్. తొలి సినిమాలో ఫిట్‌గా కనిపించిన చరణ్.. ‘మగధీర’కు వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా కండలతో మెరిశాడు. ఇక ధ్రువ సినిమాలో ఏకంగా సిక్స్ ప్యాక్‌తో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’లోనూ దృఢమైన బ్రిటిష్ పోలీసు అధికారిగా కనిపించి మెప్పించాడు.
అల్లు అర్జున్ (Allu Arjun)
గంగోత్రి సినిమాతో లేలేత వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుఅర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. దేశముదురు చిత్రంతో తొలిసారి సిక్స్ ప్యాక్‌లో కనిపించిన బన్నీ.. తన ఫిట్‌నెస్‌ను ప్రతీ సినిమాలోనూ కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్ పుష్పలో తన పాత్ర కోసం బరువు పెరిగి కనిపించాడు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)
టాలీవుడ్‌లో ఫిట్‌నెస్ బాడీని కలిగి ఉన్న స్టార్ హీరోల్లో తారక్ ఒకరు. కెరీర్ తొలినాళ్లలో చాలా బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్.. ‘యమదొంగ’ సినిమాతో సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లావైన తారక్.. ‘టెంపర్’లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’లోనూ దృఢమైన బాడీతో మెప్పించాడు.
రామ్ పోతినేని (Ram Pothineni)
లవర్ బాయ్‌లాగా క్యూట్‌గా కనిపించే రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్.. డబుల్ ఇస్మార్ట్ కోసం మళ్లీ సిక్స్ ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది.
నాగ శౌర్య (Naga Shourya)
యంగ్ హీరో నాగ శౌర్య.. కెరీర్ ప్రారంభంలో డెసెంట్ సినిమాలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించాడు. ఇటీవల ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి మాస్ హీరోగా రూపాంతరం చెందాడు.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)
మంచి హైట్, ఫిజిక్ కలిగిన విజయ్ దేవరకొండ.. ఇటీవల వచ్చిన ‘లైగర్’ సినిమాలో మెస్మరైజింగ్ బాడీతో అదరగొట్టాడు. బాక్సింగ్ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాత్రకు తగ్గట్టు విజయ్ తనను తాను మార్చుకున్నాడు.
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)
ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సీనియర్ నటుల్లో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్ ప్రారంభం నుంచి ఒకటే బాడీని మెయిన్‌టెన్ చేస్తున్న నాగార్జున.. ‘ఢమరుకం’ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు.
సునీల్ (Sunil)
టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని బాడీ ట్రాన్సఫర్‌మేషన్ ఏదైనా ఉందంటే అది కమెడియన్ సునీల్ (Sunil)ది మాత్రమే. హాస్య పాత్రలు పోషించి రోజుల్లో చాలా లావుగా కనిపించిన సునీల్.. హీరోగా మారాక సిక్స్ ప్యాక్ చేశాడు. పూలరంగడు సినిమాలో ఆరు పలకల బాడీతో కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశాడు.
ఫిబ్రవరి 23 , 2024
Custody Review: ప్రేక్షకులను నాగచైతన్య తన ‘కస్టడీ’లో బంధించాడా? అక్కినేని ఫ్యామిలీకి హిట్ వచ్చిందా?
అక్కినేని నాగ చైతన్య-కృతి శెట్టి హీరో హీరోయిన్ గా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియమణి, అరవింద స్వామి కీలక పాత్రల్లో నటించారు. చైతూ కానిస్టేబుల్‌గా కనిపిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అక్కినేని ఫ్యామిలీకి సరైన హిట్ లేని సమయంలో కస్టడీతో చై ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి, భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం హిట్ తెచ్చిపెట్టిందా? కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య ఆకట్టుకున్నాడా? కస్టడీ కథ ఏంటి, ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
నటీనటులు: నాగ చైతన్య, కృతిశెట్టి, ప్రియమణి, అరవింద స్వామి, శరత్‌కుమార్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్
దర్శకుడు: వెంకట్ ప్రభు
సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: S.R కతిర్, సుమేర్ వర్మ
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
కథ:
శివ (నాగ చైతన్య) నిజాయితీ గల కానిస్టేబుల్. ఎంతగానో ప్రేమించిన రేవతి(కృతి శెట్టి)ని వివాహం చేసుకొని సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. సఖినేటి పల్లి పోలీస్ స్టేషన్లో రాజన్న(అరవింద్ స్వామి) ని అరెస్ట్ చేసి ఉంచుతారు. డ్యూటీలో ఉన్న శివకి రాజన్నని ఎవరో చంపేస్తున్నారు అనే సమాచారం అందుతుంది. మరోవైపు రేవతికి వేరే పెళ్లి నిశ్చయించారని తెలుస్తుంది. ఎలాగైనా న్యాయం గెలవాలని చెప్పి రాజన్నని కోర్టులో అప్పగించేందుకు అదే రాత్రి రేవతితో పాటు రాజన్నని కూడా తీసుకెళ్తాడు. అసలు రాజన్నను ఎందుకు అరెస్టు చేశారు? చంపాలనుకున్నది ఎవరు? శివ తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అనేది అసలు కథ.
ఎలా ఉందంటే
సినిమా ఓ యాక్సిడెంట్‌తో మెుదలై కథలోకి వెళ్తోంది. దాదాపు 15 నిమిషాల పాత్రల పరిచయానికే సమయం పడుతుంది. ప్రియమణి, నాగ చైతన్య, కృతి శెట్టి ఇంట్రో, ఫ్యామిలీ సన్నివేశాలతో స్లోగా సాగుతుంది. క్రూరమైన విలన్‌గా అరవింద్ స్వామి ఇంట్రోతో అసలు కథ ప్రారంభమవుతుంది. ప్రీ ఇంటర్వెల్ ముందు కథనంలో వేగం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్‌తో సెకాండాఫ్‌లోకి తీసుకెళ్లాడు దర్శకుడు.
సెకాండాఫ్ స్లోగా స్టార్ట్ అవ్వటంతో పాటు కొన్ని సాగదీత సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్‌ను కొట్టిస్తాయి. కొన్ని సీన్లు ఇప్పటికే చూసేశాం అన్నట్లుగా అనిపిస్తాయి. కృతి శెట్టితో లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. యాక్షన్ ఎపిసోడ్‌లు, ట్విస్ట్‌లు మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తాయి. వెంకట్ ప్రభు తరహా స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం యువన్ ఇరగదీశాడు.
ఎవరెలా చేశారంటే?
కస్డడీ సినిమాలో నాగచైతన్య అదరగొట్టాడు. శివ పాత్రలో పరకాయప్రవేశం చేసి అలరించాడు. సినిమా చూస్తున్నంత సేపు శివ పాత్రనే కనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్ చైతూ లుక్ సెట్ అవ్వలేదేమో అనిపించినా.. కథలో లీనమయ్యేకొద్ది శివపాత్రతో కనెక్ట్ అవ్వకుండా ఉండలేం. యాక్షన్ సీన్లలో చైతూ తనదైన మార్క్ చూపించాడు. హీరోయిన్ కృతి శెట్టి కూడా నాగ చైతన్య కి సమానంగా స్క్రీన్ షేర్ చేసుకుంది. కొన్ని సీన్లలో శృతి తన గ్లామర్‌తో ప్రేక్షకులను ముగ్దులను చేస్తుంది. అరవింద్ స్వామి నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటిలాగే ఆయన తన పాత్రని అద్భుతంగా పండించాడు. శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిషోర్ మిగిలిన తారాగణం కూడా వారి పాత్రల మేరకు బాగానే చేశారు.
సాంకేతికంగా
తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు తన మార్క్ కథనంతో తెరకెక్కిస్తారు. మానాడు చిత్రం ఇందుకు ఉదాహరణ.చై విషయంలో మంచి కథనే ఎంచుకున్నప్పటికీ కొన్ని చోట్ల తడబడ్డాడు.కథనం మరింత గ్రిప్పింగ్ రాసుంటే బాగుండేది. ఇళయ రాజా, యువన్ శంకర్ ఇద్దరు కలిసి పనిచేయడంతో మ్యూజిక్‌పై అంచనాలు పెరిగాయి. కానీ, పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్ద అసెట్ అని చెప్పాలి. కొన్ని సీన్లను BGM బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది.
బలాలు
నాగ చైతన్య నటనబ్యాక్ గ్రౌండ్ స్కోర్యాక్షన్ సీన్స్
బలహీనతలు
పాటలురొటీన్ కథసాగదీత సీన్లు
రేటింగ్: 2.5/5
మే 12 , 2023
The GOAT Review: దళపతి విజయ్ తనతో తానే తలపడాల్సి వస్తే.. ‘ది గోట్’ గ్రేట్‌గా ఉందా? లేదా?
నటీనటులు : విజయ్, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్ త్యాగరాజన్, కొకిలా మోహన్, జయరాం, స్నేహా, వీటీవీ గణేష్, అరవింద్ ఆకాష్, వైభవ్ రెడ్డి తదితరులు
కథ, దర్శకత్వం : వెంకట్ ప్రభు
సంగీతం : యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ నూని
ఎడిటింగ్ : వెంకట్ రాజన్
నిర్మాతలు : కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేశ్, కల్పతి ఎస్. సురేష్
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? విజయ్‌కు మరో మరుపురాని విజయాన్ని అందించిందా? లేదా? ఈ రివ్యూ (The Greatest of All Time Telugu Review)లో తెలుసుకుందాం.
కథేంటి
గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్ (విజయ్)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
దళపతి విజయ్ ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. గాంధీ పాత్రలో ఎప్పటిలాగే అదరగొట్టాడు. అయితే జీవన్ పాత్రలో యంగ్ విజయ్ డిజిటలైజ్డ్ లుక్ కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంత కన్విన్సింగ్‌గా ఉండదు. ఇక యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో విజయ్ మరోమారు తన మార్క్ చూపించాడు. హీరోయిన్‌గా మీనాక్షి చౌదరికి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆమెది గెస్ట్ రోల్‌లాగా అనిపిస్తుంది. స్పెషల్ స్క్వాడ్ సభ్యులుగా ప్రశాంత్, అజ్మల్, ప్రభుదేవా పర్వాలేదనిపించారు. వారికి హెడ్‌గా జయరాం తన నటనతో ఆకట్టుకున్నారు. సీనియర్ విజయ్‌కు జోడీగా చేసిన స్నేహా తన నటనతో మెప్పించింది. తమిళ యువ హీరో శివ కార్తికేయన్ చిన్న పాత్రలో సందడి చేశారు. త్రిష ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వెంకట్ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని చెప్పవచ్చు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే యువన్ శంకర్ రాజా అందించిన పాటలు పూర్తిగా తేలిపోయాయి. ఏది మైండ్‌లో గుర్తుంచుకునేలా లేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. యాక్షన్ సీక్వెన్స్‌లను బీజీఎం మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. గ్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఇంకాస్త బెటర్‌గా పనిచేయాల్సింది. ముఖ్యంగా విజయ్ డీఏజింగ్ లుక్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడినట్లు అనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
విజయ్ నటనయాక్షన్ సీక్వెన్స్‌క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
ఊహకందే కథనంప్రథమార్ధం
Telugu.yousay.tv Rating : 2.5/5
సెప్టెంబర్ 05 , 2024
Gandeevadhari Arjuna Movie Review: రా ఏజెంట్‌గా అదరగొట్టిన వరుణ్ తేజ్.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : వరుణ్ తేజ్, సాక్షివైద్య, వినయ్ రాయ్, నాజర్, విమలా రామన్, రవివర్మ తదితరులు
దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
నిర్మాత : బీవీఎన్ఎస్ ప్రసాద్
సంగీత దర్శకుడు : మిక్కీ జే మేయర్
సినిమా నిడివి : 2 గంటల 16 నిమిషాలు
విడుదల తేదీ : ఆగస్టు 25, 2023
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్(Varun tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). ప్రవీణ్ సత్తారు(Praveen sattaru) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సాక్షి వైద్య (Sakshi vaidya) హీరోయిన్‌గా నటించింది. BVS ప్రసాద్ నిర్మించిన ఈ మూవీకి మిక్కీ జే. మేయర్ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గాండీవధారి అర్జున సినిమా ఎలా ఉంది? ఈ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్‌ను ఏమేరకు మెప్పించింది? వరుణ్ ఖాతాలో మరో హిట్ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.
కథ
కథలోకి వెళితే ఆచార్య (నాజర్) అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ మంత్రి. విలన్లు చేసే మెడికల్ స్కామ్ వల్ల మనుషులతో పాటు పర్యావరణం దెబ్బతింటున్నట్లు ఆచార్య గ్రహిస్తాడు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో ఆచార్యను చంపేందుకు విలన్ మనుషులు ప్రయత్నిస్తుంటారు. దీంతో తనకు రక్షణ కల్పించడంతో పాటు, మెడికల్ స్కామ్‌ను ఎలాగైనా ఆపే బాధ్యతను రా ఏజెంట్ అర్జున్ (వరుణ్‌తేజ్)కు ఆచార్య అప్పగిస్తాడు. ఈ క్రమంలో అర్జున్‌కు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి? మెడికల్ స్కామ్‌ను అతడు ఎలా బయటపెట్టాడు? ఆ స్కామ్‌కు పర్యావరణానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
https://twitter.com/baraju_SuperHit/status/1694964373507260852?s=20
ఎలా సాగిందంటే
గాండీవధారి అర్జున మూవీ రెగ్యులర్ ఫార్మాట్ మాదిరిగానే ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ చూసే కొందరిని తప్ప.. మిగతావారిని ఆకట్టుకునేలా లేదు. ఇంటర్వెల్ వరకు మూవీ సాగదీతగా అనిపిస్తుంది. కొంత నాటకీయత ఉన్నప్పటికీ అదీ ఎలివేట్ చేయబడలేదు. తర్వాత యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. కామెడీ ఆశించే ప్రేక్షకులకు భంగపాటు తప్పదు. మూవీ ఒక లోకేషన్ నుంచి మరో లోకేషన్‌కు ఈజీగా వెళుతుంది. క్లైమాక్స్ కూడా ఊహించినట్టే ఉంది. పెద్దగా మలుపులు, ట్విస్ట్స్ అంటూ ఏమీ లేవు.
ఎవరెలా చేశారంటే..?
గాండీవధారి అర్జున మూవీలో వరుణ్ తేజ్ యాక్షన్ రోల్ చేశాడు. తన పర్సనాలిటీతో ఆ పాత్రకు హుందాతనాన్ని తీసుకొచ్చాడు. హాలీవుడ్ యాక్షన్ హీరోను తలపించాడు. అయితే యాక్షన్ చిత్రం కావడంతో నటనకు పెద్దగా స్కోప్ లేదు. అయినప్పటికీ వరుణ్ ఉన్నంతలో తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. ఇక సాక్షి వైద్య సినిమా మొత్తం ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండదు. నాజర్ ఎప్పటిలాగే తన అనుభవాన్ని ఉపయోగించి నటించారు. తమిళ నటుడు వినయ్ రాయ్ విలన్ పాత్రలో మెప్పించాడు. మనీశ్ చౌదరీ, రవి వర్మ పరిధి మేరకు నటించారు.
టెక్నికల్‌గా
ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ కాలేకపోయింది. ఒక్క పాట కూడా గుర్తుంచుకునేలా లేదు. అటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సైతం నామమాత్రంగానే ఉంది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు ఇచ్చే BGM లాగా అనిపించలేదు. G. ముఖేశ్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఆయన పనితనం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
వరుణ్ తేజ్ నటనయాక్షన్ సన్నివేశాలుసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీడైరెక్షన్‌పాటలునో థ్రిల్స్ & నో ట్విస్ట్స్
సినిమా రేటింగ్: 2.5/5
https://www.youtube.com/watch?v=cBGSJcM8C8s
ఆగస్టు 28 , 2023
Chiranjeevi in Bhola Shankar: స్ట్రెయిట్ సినిమాలు చేసే గట్స్ చిరంజీవికి లేదా? మెగాస్టార్‌కు ఎందుకంత భయం!
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉండే క్రేజే వేరు. తన నటన, డ్యాన్స్‌లతో ట్రెండ్ సెట్ చేసిన స్టార్ హీరో చిరంజీవి. ఇండియాలో తొలిసారిగా రూ.కోటి పారితోషికం తీసుకున్న నటుడు. మెగాస్టార్ సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం చొక్కాలు చినగాల్సిందే. కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు అందించి తన మార్కెట్ స్థాయి ఏంటో నిరూపించుకున్నాడు. కానీ, రీఎంట్రీ తర్వాత చిరంజీవిలో పదును తగ్గింది. స్ట్రెయిట్ సినిమాలు కాకుండా రీమేక్‌లపై ఎక్కువగా ఆధార పడుతున్నట్లు కనిపిస్తోంది. అసలు, ఒరిజినల్ ఫిల్మ్ చేసే గట్స్ చిరంజీవికి లేవా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
సగం రీమేక్‌లే..
సినీ కెరీర్‌లో రీఎంట్రీ తర్వాత మునపటి చిరంజీవిని పరిచయం చేయలేక పోతున్నాడు. పైగా, తీసిన 6 సినిమాల్లో 3 రీమేక్‌లే ఉన్నాయి. ఖైదీ నంబర్ 150, గాడ్‌ఫాదర్‌తో పాటు తాజాగా వచ్చిన భోళా శంకర్ కూడా రీమేక్ సినిమానే. మిగతావి స్ట్రెయిట్ సినిమాలే అయినా, అందులో ఇతర హీరోల అండదండలు తీసుకున్నాడు మెగాస్టార్. సైరా నరసింహరెడ్డిలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం ఉంది. ఇక, వాల్తేరు వీరయ్యలో రవితేజ, ఆచార్యలో తనయుడు రామ్‌చరణ్ తేజ్‌ల సపోర్ట్ తీసుకున్నాడు. అంటే, సొంతంగా సినిమాను చిరంజీవి నడిపించలేడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దిగజారిన స్థాయి?
తన స్థాయి, మార్కెట్ తగ్గిందని చిరంజీవి గ్రహించినట్లు తెలుస్తోంది. ఇతర హీరోలను తీసుకుంటే మార్కెట్ కలిసి వస్తుందని చెప్పడానికి రీమేక్ అనంతరం చేసిన సినిమాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. పైగా, ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించేందుకు ఇదివరకు చేయని పనులను కూడా చిరు ట్రై చేస్తుండటం దీనికి ఊతమిస్తోంది. ఇతర హీరోలను ఇమిటేట్ చేయడం ఇందుకు నిదర్శనం. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ డైలాగ్‌ని చెప్పడం, భోళాశంకర్ సినిమాలో తమ్ముడు పవన్ కళ్యాణ్ మ్యానరిజం, డైలాగ్స్‌ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించడం.. ఈ కోవకు చెందేవే. ఇతర హీరోల ఫ్యాన్స్ అయినా థియేటర్లకు వస్తారన్న ఆశో? లేదా అందరి ఫ్యాన్స్‌ని అలరించాలన్న తాపత్రయమో? ఫలితం మాత్రం అటు, ఇటు గాకుండా పోతోంది.
తేడాకొడుతున్న రీమేక్?
ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇప్పటివరకు ఒక్క రీమేక్‌లోనూ నటించలేదు. స్టోరీ సెలక్షన్ పరంగా మెగాస్టార్‌ని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే, కెరీర్‌లో చేసిన ఎన్నో స్ట్రెయిట్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ కొట్టాయి. అయితే, రీఎంట్రీ తర్వాత కథల ఎంపికలో చిరు తడబడుతున్నాడు. లుక్స్ పరంగా వయసు కూడా పూర్తిగా సహకరించట్లేదు. దీంతో కొన్ని సినిమా కథలకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది. కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ చిరు సమకూరుస్తున్నా కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపించట్లేదు. భోళాశంకర్ సినిమాలో రీక్రియేట్ చేసిన ఖుషీ నడుము సీన్ బెడిసి కొట్టడానికి కారణం కూడా ఇదే
.
సక్సెస్ ఫార్ములా?
చిరంజీవికి ఎదురు దెబ్బ తగిలిన సమయాల్లో రీమేక్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఠాగూర్ వంటి రీమేక్ సినిమా అనంతరం 2004లో అంజి వచ్చింది. ఇది థియేటర్ల వద్ద బోల్తా పడింది. దీంతో మరోసారి చిరు రీమేక్‌నే నమ్ముకున్నాడు. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌తో అదే ఏడాది వచ్చి హిట్ కొట్టాడు. అందుకే, రీఎంట్రీకి సైతం రీమేక్‌నే ఎంచుకున్నాడు. సైరా, ఆచార్యల తర్వాత గాడ్‌ఫాదర్ రీమేక్ చేసి కాస్త ఊరట పొందాడు. ఇలా మాతృకలో ఉన్న బలమైన కథని తీసుకుని పై పై హంగులు చేరిస్తే తెలుగులో హిట్ అయిపోతుందని చిరు నమ్మకం. వాల్తేరు వీరయ్య సమయంలోనే మరో రీమేక్‌కి సైన్ చేశాడు. అయితే, బంగార్రాజు డైరెక్టర్ కల్యాణ్ క్రిష్ణతో చిరంజీవి మూవీ చేయనున్నాడు. ఇది కూడా మళయాల సినిమా ‘బ్రో డాడీ’కి రీమేక్ అన్నట్లు టాక్. ఇందులో చిరుతో పాటు హీరో శర్వానంద్ నటిస్తున్నట్లు సమాచారం. మరి, ఈ సారి సక్సెస్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అనేది వేచి చూడాలి.
రీమేక్స్ వద్దు..
చిరంజీవి రీమేక్ సినిమాలను ఎంచుకోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఆల్రెడీ సగం మంది చూసేసిన సినిమాలో తమ హీరోని ఊహించుకోలేక పోతున్నామని చెబుతున్నారు. రీమేక్ ఎంచుకున్న ప్రతి సందర్భంలోనూ ఒరిజినల్ ఫిల్మ్‌తో కంపేర్ చేయడం, రీమేక్‌లో లోపాలను వెతకడంతో ఇబ్బందులు పడుతున్నామని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీమేక్ సినిమాలు చేయొద్దంటూ వేడుకుంటున్నారు.
ఆగస్టు 11 , 2023
OG Release Date: ఒకే నెలలో పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు విడుదల?
ఒకప్పుడు టాలీవుడ్‌కు పరిమితమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్, పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ ఇటీవలే పెండింగ్ ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కించారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్ కూడా తిరిగి మెుదలైంది. త్వరలోనే పవన్ కూడా రెగ్యులర్ షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సమ్మర్ బరిలో పవన్‌తో పవనే పోటీ పడతారని వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ vs పవన్
పవన్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని 2025 మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ‘ఓజీ’ని కూడా సమ్మర్‌లోనే తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఏప్రిల్ లేదా మేలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ విచిత్ర పరిస్థితి చూసి అభిమానులు షాకవుతున్నారు. మెున్నటి వరకూ పవన్ సినిమా లేదని బాధపడ్డ ఫ్యాన్స్‌కు ఈ వార్తతో ఎలా ఫీలవ్వాలో అర్థం కావడం లేదు. గబ్బర్ సింగ్‌లో చెప్పిన ‘నాకు నేనే పోటీ’ డైలాగ్‌ను పవన్ నిజం చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నెల రోజుల గ్యాప్‌తోనే సెకండ్ ఫిల్మ్‌ను రిలీజ్ చేయడం వల్ల కలెక్షన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉందని పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హరి హర వీరమల్లు టీమ్ అసంతృప్తి!
‘ఓజీ’ చిత్రాన్ని సమ్మర్‌లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడంపై హరిహర వీరమల్లు టీమ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. రెండు సినిమాల మధ్య కనీసం 5 నెలల గ్యాప్ అయినా ఉండాలని హరి హర వీరమల్లు టీమ్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పవన్‌ను జోక్యం చేసుకోవాలని కూడా కోరుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో పవన్ ఎవరి పక్షాన నిలుస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మెుత్తం చూస్తుంటే పవన్ vs పవన్‌గా పరిస్థితులు మారిపోయాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెుత్తానికి ‘ఓజీ’నే వెనక్కి తగ్గే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
‘ఓజీ.. బ్లాక్‌బాస్టర్ పక్కా’
పవన్ - సుజిత్ కాంబోలోని 'ఓజీ' చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా ఇటీవల ఓజీ గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్స్ వేదికగా స్పందించారు. 'ఓజి అప్డేట్స్ గురించి అందరూ అడుగుతున్నారు. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్ మరింత జోష్ పెంచారు. థమన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.
https://twitter.com/MusicThaman/status/1842245316252209456
త్వరలో సెట్స్‌పైకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’!
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీశ్ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్‌డేట్స్‌తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అక్టోబర్ 23 , 2024
Thangalan OTT: ‘తంగలాన్’ ఇప్పట్లో ఓటీటీలోకి రానట్లే.. మరి ఎప్పుడంటే?
‘అపరిచుతుడు’, ‘ఐ’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తమిళ నటుడు విక్రమ్ తెలుగులోనూ పాపులర్ అయ్యాడు. ఇటీవల వచ్చిన 'తంగలాన్' చిత్రంలోనూ ఆటవిక మనిషిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమాలో పాత్ర కోసం విక్రమ్ తనను తాను మార్చుకున్న తీరుపై పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. ఆగస్టు 15న రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని గత కొన్ని రోజులగా సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే వారికి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెనక్కి తగ్గిన నెట్‌ఫ్లిక్స్!
చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’ (Thangalan) పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించారు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు (Parvathy Thiruvothu), మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో థియేటర్స్‌లో విడుదలై మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎక్స్‌పెక్ట్ చేసినంత సక్సెస్‌ను అందుకోకపోవడంతో ‘తంగలాన్’ ఓటీటీ డీల్‌పై నెట్‌ఫ్లిక్స్ పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. ఈ క్రమంలోనే ముందుగా ఒప్పందం చేసుకున్న మొత్తానికి కాకుండా తక్కువకే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇవ్వాలని నిర్మాణ సంస్థను డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మరో ఓటీటీలో రిలీజ్?
ఓటీటీ రైట్స్ తక్కువకు ఇవ్వాలన్న నెట్‌ఫ్లిక్స్ డిమాండ్‌కు తంగలాన్ నిర్మాతలు ససేమీరా అన్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో ఓటీటీ డీల్‌ను నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఎంతకూ పంతం వీడకపోవడంతో మరో ఓటీటీ సంస్థకు ‘తంగలాన్’ను ఇచ్చే ప్రయత్నాలను నిర్మాతలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ తంగలాన్ ఓటీటీలోకి రావడమే కష్టమే అని చెప్పవచ్చు. దీంతో ఓటీటీలో తంగలాన్ కోసం ఎదురుచూస్తున్న సినీ లవర్స్‌కు ఇది పెద్ద షాకే.
కలెక్షన్స్ నిల్!
ప్రముఖ తమిళ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తంగలాన్ చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల బడ్టెత్‌తో నిర్మించారు. యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా ఈజీగా రూ.150 కోట్ల పైనే వసూలు చేస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా రూ.105 కోట్ల గ్రాస్‌ను మాత్రమే అందుకుంది. కేవలం రూ.70 కోట్ల నెట్ వసూళ్లను సాధించగలిగింది. అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా విక్రమ్ నటనపై మాత్రం సర్వత్రా ప్రశంసలు కురిశాయి. నటన పరంగా ‘తంగలాన్’ అతడి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. దీంతో ఓటీటీలోనైనా ఈ సినిమాను వీక్షించాలని అంతా భావించగా నెట్‌ఫ్లిక్స్ వారికి నిరాశనే మిగిల్చింది.
కథేంటి
1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో కథ సాగుతుంటుంది. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్) తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు వారికి ఎదురవుతాయి. నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి (మాళవిక మోహనన్) తన అతీంద్రియ శక్తులతో బంగారాన్ని రక్షిస్తున్నట్లు తంగలాన్‌కు కలలు వస్తుంటాయి. మరి ఆమె నిజంగానే బంగారాన్ని రక్షిస్తుందా? తంగలాన్‌కు అతడి బృందానికి ఆమె వల్ల ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ ప్రయాణంలో తంగలాన్ ఏం తెలుసుకున్నాడు? చివరకు బంగారం కనిపెట్టాడా? లేదా? అన్నది స్టోరీ.
అక్టోబర్ 05 , 2024
Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?
దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. అపజయం ఎరుగని డైరెక్టర్‌గా ఆయన తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన ఆయన.. మహేష్‌తో SSMB29తో గ్లోబల్ మార్కెట్‌ను శాంసించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో రాణించగల డైరెక్టర్లు తెలుగులో ఉన్నారా అన్న సందేహాన్ని నార్త్ ఆడియన్స్ వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా పలువురు డైనమిక్ డైరెక్టర్స్ కనిపిస్తున్నారు. రాజమౌళి బాటలోనే నడుస్తూ.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారి ముందున్న అవకాశాలు ఏంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.
[toc]
నాగ్ అశ్విన్ (Nag Ashwin)
ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న డైరెక్టర్ పేరు ‘నాగ్ అశ్విన్’. ప్రభాస్ హీరోగా అతడు తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై గ్లోబల్ స్థాయిలో బజ్ ఉంది. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తోన్న ఈ సినిమా.. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్ అయితే నాగ్ అశ్విన్‌కు కెరీర్ పరంగా తిరుగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా టాలీవుడ్ స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్లి.. నాగ్ అశ్విన్‌కు ఎనలేని ఫేమ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. పైగా నాగ్ అశ్విన్.. విజన్, ఎగ్జిక్యూషన్, యునిక్ ప్రమోషన్స్ చూస్తే అచ్చం రాజమౌళి గుర్తుకు రాక మానడు.
టెక్నాలజీని సినిమాకు అన్వయించడంలో దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడు ముందుంటాడు. ప్రపంచస్థాయి గ్రాఫిక్స్, కొత్త తరహా ఆయుధాలు, వినూత్నమైన కాస్ట్యూమ్స్, వైవిధ్యమైన డైలాగ్స్, నెవర్‌బీఫోర్ హీరో ఎలివేషన్స్ ఇలా ప్రతీ అంశంలోనూ తన మార్క్ చూపిస్తుంటాడు. అయితే కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈ విషయంలో రాజమౌళిని గుర్తు చేస్తున్నాడు. కల్కి కోసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ మూవీ కోసం ఓ స్పెషల్ వెహికల్‌ను చిత్ర యూనిట్ తయారు చేయించింది. సినిమాలో ‘బుజ్జి’ అని పిలిచే ఈ రోబోటిక్ వాహనంతోనే హీరో ప్రభాస్ అడ్వెంచర్స్ చేశాడు. బుజ్జికి సంబంధించి బుధవారం (మే 22) స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా అది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
https://twitter.com/i/status/1793606030703927405
బుజ్జి అనే స్పెషల్ వెహికల్‌ని మూవీ టీమ్ మహీంద్రా కంపెనీతో కలిసి తయారు చేసింది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 7 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. సాధారణంగా ఏదైనా కొత్త వెహికల్‌ను తయారు చేయడానికి ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్.. మహీంద్రా టీమ్‌ను సినిమాలో భాగంగా చేసుకొని తమ ఆలోచనలకు అనుగుణంగా వారిని డైరెక్ట్ చేస్తూ వెహికల్‌ను తయారు చేయించుకున్నారు. ఈ సినిమాలో బుజ్జికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందని నాగ్ అశ్విన్.. గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో అన్నారు. వెహికల్ తయారీకి సహకరించిన ఆనంద్ మహీంద్ర టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు.
https://twitter.com/i/status/1793303611583418579
సుకుమార్ (Sukumar)
‘పుష్ప’ (Pushpa : The Rise) సినిమా ముందు వరకూ టాలీవుడ్‌కే పరిమితమైన సుకుమార్.. ఆ మూవీ తర్వాత ప్యాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇందులో సుకుమార్ దర్శకత్వ నైపుణ్యం చూసి ప్రతీ ఒక్కరు ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి స్టైలిష్ హీరోను.. ఎలాంటి మేకప్ లేకుండా మాసిన జుట్టు, గడ్డంతో చూపించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే కథకు తగ్గట్లు బన్నీ రూపురేఖలు మార్చి అక్కడే సినిమా విజయానికి పునాది వేశారు సుకుమార్. సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. సాలిడ్ ఇంటర్వెల్ ద్వారా సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తాడు. అటు సినిమా ముగింపును కూడా ఆడియన్స్‌కు చాలా సంతృప్తి కలిగేలా రాజమౌళి తీర్చిదిద్దుతాడు. అయితే డైరెక్టర్ సుకుమార్ దీనికి పూర్తి డిఫరెంట్ ఫార్మూలను పుష్ప విషయంలో అనుసరించారు. ఇందులో ఎలాంటి రక్తపాతం లేకుండా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లను డిజైన్ చేశారు. పుష్ప.. మంగళం శీను (సునీల్) ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్‌తో సెకండాఫ్‌పై హైప్ క్రియేట్ చేశారు సుకుమార్. అటు క్లైమాక్స్‌లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్)కు పుష్ప చేత సవాలు విసిరించి.. రెండో పార్ట్‌పై ఆసక్తిని రగిలించారు.
ప్రస్తుతం సుకుమార్ రూపొందిస్తున్న పుష్ప సీక్వెల్ ‘పుష్ప 2 : ది రూల్’ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుండగా.. మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేశారు. ఈ సినిమా విజయం సాధిస్తే సుకుమార్ స్థాయి మరింత పెరగనుంది. పైగా తన తర్వాతి చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. అటు ‘పుష్ప 3’ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాబట్టి నెక్స్ట్ 2, 3 ఏళ్లలో సుకుమార్.. రాజమౌళి రేంజ్‌లో పాపులర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)
టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ‘యానిమల్’ (Animal) సినిమా ద్వారా తన సత్తా ఏంటో చూపించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సందీప్.. రాజమౌళిలాగా సినిమా మేకింగ్ స్టైల్‌నే మార్చేశాడు. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్ సాహించని విధంగా సినిమాలు తీస్తూ అలరిస్తున్నాడు. సందీప్ తన తర్వాతి చిత్రాన్ని ప్రభాస్‌తో తీయనున్నాడు. దీనికి స్పిరిట్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అతడి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో ప్రభాస్ వేసుకున్న పోలీసు డ్రెస్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంటర్‌నేషనల్ కాప్ లుక్‌ను తలపిస్తోంది. యానిమల్ కంటే స్ట్రాంగ్ కంటెంట్‌తో స్పిరిట్ రానుంది ఇప్పటికే సందీప్ ప్రకటించాడు. తొలి రోజే రూ.150 కోట్ల వసూళ్లను రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మూవీ హిట్ టాక్ వస్తే.. వారం రోజుల్లోనే రూ.1500 కలెక్షన్లు సాధిస్తుందని సందీప్ వంగా నమ్మకంగా ఉన్నట్లు తెలిసింది.
ఇక స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి.. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)తోనే ‘యానిమల్ 2’ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే సందీప్‌కు రాజమౌళి స్థాయిలో ఫేమ్ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రశాంత్ వర్మ (Prasanth Varma)
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తన టాలెంట్ ఏంటో ‘హనుమాన్’ (HanuMan) ద్వారా యావత్ దేశానికి తెలియజేశాడు. తన మూడో సినిమాతోనే స్టార్ డైరెక్టర్ల సరసన నిలబడ్డాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా హనుమాన్ నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్ కొలగొట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ.. ‘హనుమాన్ 2’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అటు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)తో ఓ పీరియాడికల్ సినిమా చేసే ఛాన్స్ ప్రశాంత్‌కు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ అయితే ప్రశాంత్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగడం ఖాయం.
ప్రశాంత్ నీల్ (Prashanth Neel)
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. టాలీవుడ్ స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ (Salaar) రూపొందించి సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఈ దర్శకుడి మేకింగ్ స్టైల్ రాజమౌళిని సైతం ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ ఎలివేషన్స్ ఇచ్చి.. ప్రతీ ఒక్కరినీ ప్రశాంత్ నీల్ ఆకట్టుకున్నారు. హీరో ప్రభాస్‌ను చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీగా సలార్‌లో ప్రొజెక్ట్ చేశాడు డైరెక్టర్. రాజమౌళి తరహాలోనే అద్భుతంగా ఇంటర్వెల్‌ను డిజైన్ చేశాడు. ప్రభాస్‌ను స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వచ్చాయి.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఫోకస్ మెుత్తం ‘సలార్ 2’ (Salaar: Part 2 - Shouryanga Parvam)పై ఉంది. ఈ మూవీ కూడా విజయం సాధిస్తే ప్రశాంత్ నీల్ జాతీయ స్థాయిలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోవడం ఖాయం. అటు తారక్‌తోనూ ప్రశాంత్.. ఓ సినిమాను ప్రకటించాడు. ‘NTR31’ ప్రొడక్షన్ టైటిల్‌తో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు ‘కేజీఎఫ్ 3’ రూపొందనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మూడు ప్రాజెక్టులు సక్సెస్ అయితే ప్రశాంత్ క్రేజ్ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముంది.
కొరటాల శివ (Koratala Siva)
టాలీవుడ్ టాలెంటెడ్ డైెరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆచార్య మినహా ఇప్పటివరకూ అతడు డైరెక్ట్ చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అతడు కెరీర్‌లో తొలిసారి ఓ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తారక్‌తో ‘దేవర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. మెుత్తం రెండు పార్ట్స్‌గా ఈ మూవీ రానుండగా తొలి భాగం.. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తారక్‌తో పాటు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో రిలీజ్ చేసిన దేవర గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ గ్లింప్‌లో తారక్.. కత్తితో శత్రువులను తెగనరకడం చూపించాడు డైరెక్టర్. ఓ సీన్‌లో తారక్ శత్రువుని నరకగా అతడి రక్తం.. హాఫ్ మూన్‌ను కింద వైపు నుంచి ఈక్వెల్‌గా రౌండ్ చేయడం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. అలాగే ఇటీవల తారక్ బర్త్‌డేను పురస్కరించుకొని రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ కూడా సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. ముఖ్యంగా తారక్ పాత్రను ఎలివేట్ చేస్తూ రాసుకున్న లిరిక్స్ హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీ సక్సెస్ అయితే కొరటాల శివ క్రేజ్ జాతీయ స్థాయికి చేరనుంది. ఇక దేవర రెండు పార్ట్స్ కూడా విజయం సాధిస్తే.. దేశంలోని ప్రముఖ డైరెక్టర్ల జాబితాలో అతడు చేరడం ఖాయం.
సుజీత్ (Sujeeth)
యంగ్ డైరెక్టర్ సుజీత్.. స్టైలిష్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో పేరుంది. అతడి డైరెక్షన్ స్కిల్స్ రాజమౌళి తరహాలోనే హాలీవుడ్ డైరెక్టర్లను తలపిస్తాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ చిత్రానికి
సుజీత్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. సుజీత్ మేకింగ్ నైపుణ్యం, స్క్రీన్‌ప్లే, ఐడియాలజీకి ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఆయన తెరకెక్కించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్‌ను చాలా స్టైలిష్‌గా చూపించాడు. సరైన హిట్ లభిస్తే సుజీత్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అతడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో ‘ఓజీ’ (OG) సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ సక్సెస్ అయితే సుజీత్ కెరీర్ మరోలా ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా. రెండు సాలిడ్ హిట్స్ పడితే అతడి క్రేజ్ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముందని విశ్లేషణలు ఉన్నాయి.
బుచ్చిబాబు (Buchi Babu)
తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకున్న అతికొద్ది దర్శకుల్లో బుచ్చిబాబు ఒకరు. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో స్వచ్ఛమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అతడు.. తనలో ఎంతో టాలెంట్ ఉందని ఇండస్ట్రీకి తెలిసేలా చేశాడు. తన తర్వాతి చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్‌తో చేసే స్థాయికి ఎదిగాడు. స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. రామ్‌చరణ్ క్రేజ్‌కు బుచ్చిబాబు టాలెంట్ తోడైతే ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయిలో అతడి పేరు మార్మోగుతుందని అభిప్రాయపడుతున్నారు.
అక్టోబర్ 22 , 2024
Predicted Box office Capacity: రాజమౌళి, ప్రభాస్, తారక్, బన్నీ.. బాక్సాఫీస్ బరిలో ఎవరి బలమెంత..?
టాలీవుడ్‌లో ఒకప్పుడు రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం మాములూ విషయం కాదు. ఒక చిత్రం తన లైఫ్‌టైమ్‌లో రూ.100 కోట్లు క్రాస్ చేసిందంటే గొప్పగా చెప్పుకునేవారు. అయితే ఈ మధ్య కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దర్శకధీరుడు రాజమౌళి దెబ్బకు టాలీవుడ్ ఖ్యాతీ గ్లోబల్ స్థాయికి చేరింది. మన హీరోలు తొలిరోజే ఈజీగా రూ.100 కోట్లు సాధిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ సైతం దేవరతో తొలిరోజే ఏకంగా రూ.172 కోట్లు కొల్లగొట్టారు. ఇదిలా ఉంటే టాలీవుడ్‌కు చెందిన కొందరు స్టార్ హీరోలు, డైరెక్టర్లు తమకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్నారు. సాలిడ్ హిట్ పడితే ఈజీగా ఆ మార్కెట్‌ను అందుకోగలరు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రూ.1000 కోట్లకు పైగా మార్కెట్!
దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే గ్లోబల్ స్థాయిలో బజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే జాతీయస్థాయిలో బజ్ ఉంటుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2' (రూ.1,810 కోట్లు), 'RRR' (రూ.1,300 కోట్లు) చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో 'SSMB 29' చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించనున్నారు. గ్లోబల్ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం రూ.2000 కోట్లు కొల్లగొడుతుందని ఇప్పటినుంచే అంచనాలు ఉన్నాయి. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) డైరెక్టర్లతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్నారు. ప్రభాస్ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందేనని ప్రతీ ఒక్కరూ అంటుంటారు. అందుకు తగ్గట్లే ఆయన రీసెంట్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘కల్కి 2’, ‘సలార్ 2’, ‘స్పిరిట్’, ‘రాజాసాబ్’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి అంచనాలను అందుకుంటూ విజయం సాధిస్తే ఈజీగానే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తాయి.
రూ.700-1000 కోట్ల మార్కెట్
ప్రస్తుతం టాలీవుడ్‌లో రూ.1000 కోట్ల వరకూ మార్కెట్ కలిగిన డైరెక్టర్లు, హీరోలు మెుత్తం ఐదుగురు ఉన్నారు. ముందుగా హీరోల విషయానికి వస్తే మహేష్ బాబు, అల్లు అర్జున్‌లు ఈజీగా రూ.1000 కోట్ల మార్కెట్ అందుకునే సత్తా ఉంది. ప్రస్తుతం బన్నీ 'పుష్ప 2' చిత్రంతో డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'పుష్ప 2'పై దేశవ్యాప్తంగా బజ్ ఉన్న నేపథ్యంలో హిట్ టాక్ వస్తే ఈజీగానే రూ.700-1000 కోట్లు రావొచ్చు. మహేష్ తన తర్వాతి చిత్రం రాజమౌళితో చేయబోతున్నాడు. ఆ సినిమాతో మహేష్ ఈజీగా రూ.1000 కోట్ల మార్కెట్‌లో చేరిపోతాడు. ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తర్వాతి చిత్రం ప్రభాస్‌తో చేయనున్న నేపథ్యంలో ఈ సినిమా రూ.1000 కోట్ల మార్క్ టచ్ చేయవచ్చని సినీ విశ్లేషకుల అభిప్రాయం. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తర్వాతి ప్రాజెక్ట్స్ తారక్ (NTR31), ప్రభాస్ (Salaar 2)తో ఉండటంతో అతడ్ని కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు.
రూ. 500-700 కోట్ల మార్కెట్
ఈ మార్కెట్ రేంజ్‌లో టాలీవుడ్ నుంచి ముగ్గురు హీరోలు ఉన్నారు. ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ramcharan), పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు సరైన హిట్ పడితే వారి చిత్రాలు ఈజీగానే రూ. 500-700 కోట్లు సాధిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తారక్ ఇప్పటికే దేవర సక్సెస్‌తో ఈజీగానే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు రామ్‌చరణ్ కూడా డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఎన్టీఆర్ తరహాలోనే చరణ్ కూడా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇక పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ ఒక్క పాన్ ఇండియా చిత్రం చేయలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నాయి. ముఖ్యంగా ఓజీపై ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్‌కు సరైన సక్సెస్ లభిస్తే బాక్సాఫీస్ వద్ద ఆయన్ను ఎవరు ఆపలేరని ఇప్పటికే ఇండస్ట్రీలో నిరూపితమైంది.
రూ.200-500 కోట్ల మార్కెట్
టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) ఈ జాబితాలోకి తీసుకొని రావచ్చు. 69 ఏళ్ల వయసులోనూ చిరంజీవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రీ ఎంట్రీ తర్వాత చిరుకి సరైన హిట్ రాలేదు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో అతడు నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ఈజీగానే రూ.200-500 కోట్ల కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక బాలయ్య నటించిన గత మూడు చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘NBK109’ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నాడు. అతడితో బాలయ్య క్లాష్ వర్కౌట్ అయితే అలవోకగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని అంచనా. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన గత చిత్రం ‘గుంటూరు కారం’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ. 250 కోట్లు సాధించింది. అతడి నెక్స్ట్ ఫిల్మ్ అల్లు అర్జున్‌తో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ కాంబో సక్సెస్ అయితే రూ.500 కోట్ల కలెక్షన్స్ పక్కా అని చెప్పవచ్చు. మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా ‘దేవర’ చిత్రంతో అమాంతం తన మార్కెట్‌ను పెంచుకున్నాడు. దీంతో అతడి తర్వాత చిత్రాల మార్కెట్ రూ.200 పైనే ఉండనుంది.
సెప్టెంబర్ 28 , 2024