• TFIDB EN
  • తేజ
    UTelugu
    తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    తరుణ్
    తేజ
    కుమార్ బంగారప్ప
    శారీ
    ప్రసాద్ రాయల
    ఆర్వీ ప్రసాద్
    సిబ్బంది
    ఎన్. హరి బాబుదర్శకుడు
    రామోజీ రావు
    నిర్మాత
    ఎంఎం కీరవాణి
    సంగీతకారుడు
    కథనాలు
    <strong>Matka Movie Trolls: వరుణ్‌ తేజ్‌ ‘మట్కా’ను ఏకిపారేస్తున్న బన్నీ ఫ్యాన్స్‌.. గట్టి రివేంజే ఇది!</strong>
    Matka Movie Trolls: వరుణ్‌ తేజ్‌ ‘మట్కా’ను ఏకిపారేస్తున్న బన్నీ ఫ్యాన్స్‌.. గట్టి రివేంజే ఇది!
    వరుణ్‌ తేజ్‌ (Varun Tej) లేటెస్ట్ చిత్రం ‘మట్కా’ను అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంబంధించి నెగిటివిటీని స్ప్రెడ్‌ చేస్తున్నారు. ఇటీవల మట్కా ఈవెంట్‌లో మాట్లాడిన వరుణ్‌ తేజ్‌ పరోక్షంగా బన్నీకి చురకలు అంటించారు. ‘జీవితంలో మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన వెనకాల ఎవరున్నారన్నది మర్చిపోతే ఆ విజయం దేనికీ పనికి రాదు’ అంటూ వరుణ్‌ వ్యాఖ్యానించాడు. దీనిని పర్సనల్‌గా తీసుకున్న బన్నీ ఫ్యాన్స్ ‘మట్కా’పై రివేంజ్ తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ పోస్టులు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మట్కా వన్‌ వర్డ్‌ రివ్యూ అంటు బన్నీ అభిమాని ఎక్స్‌లో పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. మట్కా చూసి బయటకు వచ్చిన ఓ ఆడియన్‌ ‘ఈ మూవీ పెద్ద డిజాస్టర్‌. దీనిని తెలంగాణ వాదులు, సమైక్యవాదులు ఆపోద్దు. ఎందుకంటే మధ్యాహ్నానికి ఇదే ఆగిపోతుంది’ అంటూ చెప్తాడు. దీనిని బన్నీ ఫ్యాన్స్‌ తెగ షేర్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/___AkAsh_____/status/1856912632692740516 వరుణ్‌ తేజ్‌ ‘మట్కా’ చిత్రాన్ని చూసేందుకు ఎవరు ఇష్టపడటం లేదంటూ రెడీ సినిమాలోని బ్రహ్మీ తలబాదుకునే సీన్‌ను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.&nbsp; https://twitter.com/PawanbunnyAADHF/status/1856917030836081144 టికెట్స్‌ బుకింగ్స్‌లో ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ రికార్డ్స్‌ను మట్కా బద్దలు కొట్టిందని బన్నీ అభిమాని ఓ పోస్టు పెట్టాడు. ఓ థియేటర్‌లో ఖాళీగా ఉన్న సీట్లను హైలెట్‌ చేశాడు.&nbsp;&nbsp;&nbsp; https://twitter.com/Ravanaroy/status/1856930066988408967 అందరూ సూర్య నటించిన కంగువా గురించే మాట్లాడుకుంటున్నారని, మరి మట్కా పరిస్థితి ఏంటంటూ ఓ నెటిజన్ పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/memessmingle/status/1856921713692254531 మట్కా ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటాన్ని హైలెట్‌ చేస్తూ ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ‘మెగా ఫ్యాన్స్‌ సపోర్ట్ లేదా సార్‌కి?’ అంటూ పోస్టు చేశాడు.&nbsp; https://twitter.com/OGFILESi7/status/1856695949411659987 మెగా ఫ్యాన్స్‌ వరుణ్‌ తేజ్‌ను మోసం చేశారని ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. మెగా అభిమానుల మద్దతు ట్విటర్‌ వరకే ఉంటుందని, థియేటర్లకు వారు వెళ్లరని అతడు ఆరోపించారు.&nbsp; https://twitter.com/omcreem9/status/1856948964387651762 https://twitter.com/GowTam_Naidu/status/1856947427313418573 మట్కాకు పోయే ధైర్యం లేక టికెట్స్‌ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. దీంతో సినిమా అంత దారుణంగా ఉందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/nameissujith/status/1856944444391448715 ‘మట్కా’ గురించి మెగా ఫ్యాన్స్‌ తప్పా మరే ఇతర హీరో అభిమానులు పాజిటివ్‌గా చెప్పడం లేదంటూ ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/narasimha_chow2/status/1856944192834203682 అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ వరుణ్‌ తేజ్‌పై ఏ విధంగా దాడి చేస్తున్నారో అద్దంపట్టేలా మహేష్ అభిమాని పెట్టిన వీడియో ఎక్స్‌లో వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/BasavaMBFan/status/1856943054592303335 ‘మట్కా’ డే 1 కలెక్షన్స్‌ గురించి కూడా నెట్టింట ట్రోల్స్‌ మెుదలయ్యాయి. తొలి రోజు వసూళ్లు చూసి షాకవ్వడం పక్కా అని అర్థం వచ్చేలా బ్రహ్మీ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/kiranabbavaramd/status/1856951768753868909 ఇదిలా ఉంటే మెగా ఆడియన్స్‌ నుంచి మాత్రం మట్కాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వరుణ్‌ తేజ్‌ ర్యాంప్ ఆడించాడని వారు పోస్టులు చేస్తున్నారు.&nbsp; https://twitter.com/arunkalyan5/status/1856942771266850963 మెగా ఫ్యామిలీ నుంచి ఒక బ్లాక్‌ బాస్టర్‌ మట్కా రూపంలో వచ్చేసిందని ఓ ఫ్యాన్ పోస్టు పెట్టాడు. తర్వాత ‘గేమ్‌ ఛేంజర్‌’తో మరో బ్లాక్‌ బాస్టర్‌ రాబోతోందని రాసుకొచ్చాడు.&nbsp; https://twitter.com/Girish_212/status/1856948877246828877 మట్కా విజయవంతం అయినందుకు పవన్‌ ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/Dr_Pawan_Kalyan/status/1856947874698850651 మట్కా సినిమా చాలా బాగుందని కావాలనే నెగిటివిటీని స్ప్రెడ్‌ చేస్తున్నారని సినిమా చూసిన అభిమానులు చెబుతున్నారు. https://twitter.com/dhruva1128885/status/1856944727465365552 https://twitter.com/i/status/1856944348296089848
    నవంబర్ 14 , 2024
    <strong>Tejaswi Madivada: బికినిపై తేజస్వి హాట్‌ కామెంట్స్‌ వైరల్</strong>
    Tejaswi Madivada: బికినిపై తేజస్వి హాట్‌ కామెంట్స్‌ వైరల్
    తెలుగమ్మాయి తేజస్వి మడివాడ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వరుస చిత్రాలు, సిరీస్‌లు చేస్తోంది. తాజాగా బికినీపై ఆమె చేసిన కామెంట్స్‌ ఆసక్తికరంగా మారాయి. రీసెంట్‌గా ఆమె చేసిన 'అర్థమయ్యిందా అరుణ్‌ కుమార్‌' సీజన్‌ 2 ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఓ సీన్‌లో బికినీలో కనిపించి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది.&nbsp; ఆ బికినీకి సంబంధించిన ఫొటోలను సైతం తేజస్వి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో అవి ఒక్కసారిగా వైరల్‌ అయ్యాయి. బికినీలో ఆమె లుక్‌ పర్పెక్ట్‌గా ఉందంటూ నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్‌ వచ్చాయి. దీనిపై తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తేజస్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.&nbsp; ప్రతీ యాక్టర్‌కు అందంగా, ఫిట్‌గా ఉండటం అవసరమని తేజస్వి స్పష్టం చేసింది. ఈ సిరీస్‌లోనే తాను తొలిసారి బికినీ వేశానని గుర్తుచేసింది. దీనిని గొప్ప అవకాశంలా భావించాని చెప్పింది. ఓటీటీ సిరీస్‌కు బికిని అవసరమా? అన్న ప్రశ్నకు ఆమె అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తానేమి ఊరికే బికినీ వేసుకొని రోడ్లమీద తిరగట్లేదని, సన్నివేశం కోసం మాత్రమే అలా చేశానని చెప్పింది.&nbsp; https://www.youtube.com/watch?v=tZHrZBu_TAY&amp;t=82s ఇక తేజస్వి వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె హైదరాబాద్‌లో జర్నలిజం చదివింది. షార్ట్‌ఫిల్మ్స్‌తో కెరీర్‌ ప్రారంభించింది. 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌' చిత్రంలో ఓ చిన్న క్యామియో చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో సమంతకు చెల్లిగా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ‘మనం’, ‘హార్ట్‌ అటాక్‌’ వంటి చిత్రాల్లో తేజస్వి నటించింది.&nbsp; 2014లో వచ్చిన ‘ఐస్‌క్రీమ్‌’ సినిమాలో కథానాయికగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘అనుక్షణం’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాల్లో కీ రోల్స్ చేసి నటిగా గుర్తింపు సంపాదించింది.&nbsp; 'కేరింత' చిత్రంలో ప్రియా పాత్రతో మెప్పించి యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడికి సరైన బ్రేక్‌ లభించలేదు.&nbsp; దీంతో బుల్లితెరపై ఫోకస్‌ పెట్టిన తేజస్వి మదివాడ అక్కడ పలు షోలలో హల్‌చల్‌ చేసింది. 2018లో బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 2లో పాల్గొన్న ఈ చిన్నది తన అల్లరితనంతో ఆకట్టుకుంది.&nbsp; తర్వాత స్టార్‌మాలో 'ది గ్రేటర్‌ తెలుగు లాఫర్‌ ఛాలెంజ్‌' సీజన్‌ 1లో కనిపించి సందడి చేసింది. 2022లో 'బిగ్‌బాస్‌ నాన్‌ స్టాప్‌ 1'లోనూ పాల్గొని మరోమారు టీవీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసింది.&nbsp; ఇటీవల 'హైడ్‌ ఎన్‌ సీక్‌' (Hide N Seek) మూవీలో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతిలో ఏ సినిమా లేకపోవడంతో ‘అర్థమయ్యిందా అరుణ్‌ కుమార్‌ 2’ సిరీస్‌లో చాలా ఆశలు పెట్టుకుంది.&nbsp; మరోవైపు సోషల్‌మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తూ తన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకునే పనిలో తేజస్వి ఉంది. ఇందుకోసం తన హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటోంది.&nbsp; ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 1.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తేజస్వి ఏ ఫొటో షేర్‌ చేసినా దానిని వెంటనే షేర్ చేస్తున్నారు.&nbsp;
    అక్టోబర్ 23 , 2024
    వరుణ్ తేజ్ (Varun Tej) గురించి మీకు తెలియని ఆసక్తికరమైన సంగతులు
    వరుణ్ తేజ్ (Varun Tej) గురించి మీకు తెలియని ఆసక్తికరమైన సంగతులు
    మెగా ప్రిన్స్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన వరుణ్ తేజ్… టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గద్దలకొండ గణేష్ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌తో మాస్  ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. కంచె, ముకుందా, తొలిప్రేమ వంటి  హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం యంగ్‌ హీరోల్లో స్టార్ డంతో కొనసాగుతున్న వరుణ్ తేజ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. వరుణ్ తేజ్ అసలు పేరు? సాయి వరుణ్ తేజ్. స్క్రీన్‌పై పెద్దదిగా ఉంటుందని తీసేశారట. అతని అన్ని సర్టిఫికెట్లలో ఇదే పేరు ఉంటంది. వరుణ్ తేజ్&nbsp; ఎత్తు ఎంత? 6 అడుగుల 4 అంగుళాలు వరుణ్ తేజ్ తొలి సినిమా? ముకుందా ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కంచె చిత్రం గుర్తింపు తెచ్చింది.&nbsp; వరుణ్ తేజ్‌కు వివాహం అయిందా? 2023 నవంబర్ 1న లావణ్య త్రిపాఠితో ఇటలీలో పెళ్లి జరిగింది. వరుణ్ తేజ్ క్రష్ ఎవరు? తనకు తన భార్య లావణ్య త్రిపాఠి అంటే మొదటి నుంచి క్రష్ ఉండేదని.. తర్వాత అది ప్రేమగా మారి ఆమెనే పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. అయితే సెకండ్ ఆప్షన్‌గా సాయి పల్లవి పేరు చెప్పాడు. వరుణ్ తేజ్ తొలి బ్లాక్ బాస్టర్ హిట్స్? గద్దలకొండ గణేష్, ఎఫ్2 వంచి చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాయి. వరుణ్ తేజ్‌కు ఇష్టమైన కలర్? వైట్ వరుణ్ తేజ్ పుట్టిన తేదీ? 19 January 1990 వరుణ్ తేజ్ తల్లి పేరు? పద్మజ వరుణ్ తేజ్ వ్యాపారాలు? ఆర్ట్స్‌ వర్క్స్ రీ సెల్లింగ్&nbsp; వరుణ్ తేజ్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? సైమా అవార్డ్స్‌ల్లో ఉత్తమ హీరో కెటగిరీలో కంచె, గద్దలకొండ గణేష్, తొలిప్రేమ చిత్రాలకు గాను నామినేట్ అయ్యాడు. కానీ అవార్డులు రాలేదు. వరుణ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? వరుణ్ తేజ్ 2024 వరకు 13 సినిమాల్లో హీరోగా నటించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=Mh9qxcJVGfI వరుణ్ తేజ్‌కు ఇష్టమైన సినిమా? ఇంద్ర వరుణ్ తేజ్‌కు ఇష్టమైన ఆహారం? థాయ్, మెక్సికన్ వంటలంటే ఇష్టం వరుణ్ తేజ్ ఇల్లు ఎక్కడ? వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి హైదరాబాద్- మణికొండలో కొత్తగా నిర్మించిన ఇంటిలో ఉంటున్నాడు.
    మార్చి 21 , 2024
    వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమా ఉప్పెనతోనే స్టార్ డం సంపాదించాడు. కొండపొలం, రంగ రంగ వైభవంగా చిత్రాల హిట్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ పొందిన వైష్ణవ్ తేజ్ గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. వైష్ణవ్ తేజ్ అసలు పేరు? పంజా వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ముద్దు పేరు? హీరో బాబు వైష్ణవ్ తేజ్ ఎత్తు ఎంత? 6 అడుగులు వైష్ణవ్ తేజ్&nbsp; తొలి సినిమా? ఉప్పెన వైష్ణవ్ తేజ్&nbsp; ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ వైష్ణవ్ తేజ్&nbsp; పుట్టిన తేదీ ఎప్పుడు? 1995, జనవరి 13 వైష్ణవ్ తేజ్‌కు వివాహం అయిందా? ఇంకా జరగలేదు. వైష్ణవ్ తేజ్‌ ఫస్ట్ క్రష్? సొనాక్షి సిన్హా వైష్ణవ్ తేజ్&nbsp; ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వైష్ణవ్ తేజ్&nbsp; తొలి హిట్ సినిమా? ఉప్పెన వైష్ణవ్ తేజ్‌కు గుర్తింపునిచ్చిన చిత్రం? కొండపొలం వైష్ణవ్ తేజ్&nbsp; ఇష్టమైన కలర్? వైట్, బ్లాక్ వైష్ణవ్ తేజ్&nbsp; తల్లిదండ్రుల పేరు? విజయ దుర్గ, శివప్రసాద్ వైష్ణవ్ తేజ్‌కు ఇష్టమైన ప్రదేశం? తిరుమల వైష్ణవ్ తేజ్‌కు ఇష్టమైన సినిమాలు? రజనీకాంత్ నటించిన శివాజి సినిమా వైష్ణవ్ తేజ్&nbsp; ఏం చదివాడు? డిగ్రీ వైష్ణవ్ తేజ్&nbsp; అభిరుచులు? సినిమాలు చూడటం, ట్రావలింగ్ వైష్ణవ్ తేజ్&nbsp; ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.&nbsp; వైష్ణవ్ తేజ్&nbsp; సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=wYDcnafZkS0
    మార్చి 21 , 2024
    Hanuman Movie Review: సూపర్‌ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్‌’ హిట్‌ కొట్టినట్లేనా?
    Hanuman Movie Review: సూపర్‌ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్‌’ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య దర్శకుడు : ప్రశాంత్ వర్మ సంగీతం: గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర ఎడిటింగ్: సాయిబాబు తలారి నిర్మాత: నిరంజన్ రెడ్డి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman Movie Review). అగ్రతారల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. బడ్జెట్‌ పరంగా ఇది చిన్న సినిమా అనిపించుకున్నా కంటెంట్‌ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు దీటుగా నిలబడింది. టీజర్‌ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతూ పోయిన ఈ చిత్రం.. ట్రైలర్‌తో వాటిని రెట్టింపు చేసింది. మరి ఆ అంచనాల్ని ‘హనుమాన్‌’ అందుకున్నాడా? ఈ సూపర్‌ హీరో చేసిన సాహసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హనుమంతు పాత్రలో ఓ సామాన్య కుర్రాడిలా తేజ సజ్జ (Teja Sajja) ఒదిగిన తీరు మెప్పిస్తుంది. సూపర్‌ పవర్స్‌ వచ్చాక అతను చేసే సందడి ఇంకా అలరిస్తుంది. యాక్షన్‌, భావోద్వేగ&nbsp; సన్నివేశాల్లో తేజ చక్కటి నటనను కనబరిచాడు. పల్లెటూరి అమ్మాయి మీనాక్షిగా అమృత అయ్యర్‌ (Amritha Aiyer) అందంగా కనిపించింది. కథలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యత బాగుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar) పాత్ర ద్వితీయార్ధంలో సర్‌ప్రైజ్‌ చేస్తుంది. వినయ్‌ రాయ్‌ (Vinay Rai) స్టైలిష్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. విభీషణుడిగా సముద్రఖని పాత్ర కథలో ఓ ప్రత్యేక ఆకర్షణ. గెటప్‌ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్, రాకేష్‌ మాస్టర్‌ తదితరుల పాత్రలు కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. డైరెక్షన్‌ ఎలా ఉందంటే సూపర్‌ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth varma) సినిమాను తీర్చిదిద్దారు. సూపర్‌ హీరో అవ్వాలనే కోరికతో విలన్‌ చేసే ప్రయత్నాలను ప్రశాంత్‌ ఆసక్తికరంగా తెరకెక్కించారు. అంజనాద్రి ఊరు.. దాన్ని పరిచయం చేసిన తీరు కనులవిందుగా ఉంటుంది. ఆరంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగడం, కొన్ని పాత్రల్ని మరీ డిటైల్డ్‌గా చూపించడం ప్రేక్షకులకు బోర్‌ కొట్టిస్తుంది. హనుమంతుకు సూపర్‌ పవర్స్‌ వచ్చినప్పటి నుంచి కథ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లా పరుగులు పెడుతుంది. విరామానికి ముందు వచ్చే కుస్తీ పోటీ సన్నివేశం కిక్కిస్తుంది. ముఖ్యంగా మైఖేల్‌ స్థావరంలోకి హనుమంతు వెళ్లినప్పుడు వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ను ప్రశాంత్‌ అద్భుతంగా తెరకెక్కించారు. క్లైమాక్స్‌లో చివరి 20నిమిషాలు ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడు.&nbsp; సాంకేతికంగా ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రశాంత్‌ తనకిచ్చిన బడ్జెట్‌లోనే చక్కటి గ్రాఫిక్స్‌తో క్వాలిటీ ఫిల్మ్‌ను చూపించారు. ఇక నేపథ్య సంగీతం విషయానికొస్తే ముగ్గురు సంగీత దర్శకులు తమ ప్రతిభను చూపించారు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలుస్తుంది. సాయిబాబు తలారి అందించిన ఎడిటింగ్‌ వర్క్‌ పర్వాలేదు.&nbsp; ప్లస్ పాయింట్స్‌ కథా నేపథ్యంతేజ సజ్జా నటనగ్రాఫిక్స్‌, నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడా నెమ్మదిగా సాగే సీన్స్‌ రేటింగ్‌ : 3.5/5
    జనవరి 12 , 2024
    <strong>Matka Movie Review: కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్న వరుణ్‌ తేజ్‌.. ‘మట్కా’ ఎలా ఉందంటే?</strong>
    Matka Movie Review: కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్న వరుణ్‌ తేజ్‌.. ‘మట్కా’ ఎలా ఉందంటే?
    నటీనటులు: వరుణ్‌ తేజ్‌, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ, నవీన్‌ చంద్ర, కిషోర్‌ కుమార్‌, అజయ్‌ ఘోష్‌, రవీంద్ర విజయ్‌, మైమ్‌ గోపి, రూపలక్ష్మీ తదితరులు రచన, దర్శకత్వం : కరుణ కుమార్‌ సంగీతం : జి. వి. ప్రకాష్‌ సినిమాటోగ్రఫీ: కిషోర్‌ కుమార్‌ ఎడిటింగ్‌ : కార్తికేయ శ్రీనివాస్‌ నిర్మాతలు: రజనీ తాళ్లూరి, విజేందర్ రెడ్డి తీగల విడుదల తేదీ: 14-11-2024 మెగా హీరో వరుణ్‌తేజ్‌ (Varun Tej) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మట్కా’ (Matka). కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వరణ్‌లోని నటుడ్ని మరోస్థాయికి తీసుకెళ్లే చిత్రం మట్కా అవుతుందని చిత్ర బృందం తెగ ప్రచారం చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్‌ అయ్యిందా? ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్న వరుణ్‌కు సక్సెస్‌ ఇచ్చిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Matka Movie Review) కథేంటి మట్కా మూవీ 1958 నుంచి 1982 మధ్య సాగే ఓ గ్యాంగ్‌స్టర్‌ కథ. పాకిస్తాన్‌ నుంచి ముంబయికి వచ్చిన రతన్‌ కత్రీ అనే గ్యాంగ్‌స్టర్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మట్కా స్టోరీకి వస్తే.. వాసు (వరుణ్‌ తేజ్‌) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్‌ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. కూలీ నాలి చేసుకునే సాధారణ కుర్రాడు మట్కా వాసుగా ఎలా మారాడు? ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? కథలో సుజాత ఎవరు? ఆమెతో వాసు ప్రేమాయణం ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే వాసు పాత్రలో వరుణ్‌ తేజ్‌ ఇరగదీశాడని చెప్పవచ్చు. ‘మట్కా’తో నటన పరంగా (Matka Movie Review) మరో మెట్టు ఎక్కేశాడు. లుక్స్, హెయిర్‌ స్టైల్‌, వాకింగ్‌ ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వయసుకు అనుగుణంగా పాత్రలో వేరియషన్స్ చూపిస్తూ మెప్పించాడు. ఇక హీరోయిన్‌ మీనాక్షి చౌదరికి మంచి రోలే దక్కింది. వరుణ్‌తో అమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి సోఫియా పాత్రలో మ్యాజిక్ చేసింది. తన అంద చందాలతో ప్రేక్షకులను అలరించింది. ‘మర్యాద రామన్న’ ఫేమ్‌ సలోనితో పాటు నవీన్‌ చంద్ర, సత్యం రాజేష్‌లు సైతం కీలక పాత్రల్లో కనిపించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ఒకప్పటి గ్యాంగ్‌ స్టార్‌ రతన్‌ కత్రీ జీవిత కథ ఆధారంగా దర్శకుడు కరణ్‌ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. (Matka Movie Review) 1970-80ల్లో కథ నడిపిస్తూ తన అద్భుతమైన టేకింగ్‌తో ఆకట్టున్నాడు. తాను అనుకున్న కథను పక్కాగా చూపించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌ను వాసు పాత్రకు ఎంచుకోవడం, అతడి నుంచి ఉత్తమ నటనను రాబట్టడంలో డైరెక్టర్ పూర్తిగా విజయం సాధించాడని చెప్పవచ్చు. సాధారణ కుర్రాడైన వాసు మట్కా అనే జూదాన్ని అడ్డంపెట్టుకొని దేశాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అన్న పాయింట్‌ను చాలా బాగా ప్రెజెంట్‌ చేశాడు. అయితే స్క్రీన్‌ ప్లే విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. అక్కడక్కడ వచ్చే సాగదీత సన్నివేశాలు, వరుణ్‌ మినహా ఏ పాత్రకు బలమైన నేపథ్యం లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా..&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగా ప్లస్‌ అయ్యింది. కెమెరామెన్‌ కిషోర్‌ కుమార్‌ తన ప్రతిభతో ప్రేక్షకులను 1970ల్లోకి తీసుకెళ్లారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా పీరియాడిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు బాగా కష్టపడింది. (Matka Movie Review) మ్యూజిక్‌ డైరెక్టర్‌ జి. వి. ప్రకాష్‌ అందించిన పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్&nbsp; వరుణ్‌ తేజ్ నటనయాక్షన్‌ సీక్వెన్స్‌సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ప్లేసాగదీత సీన్స్‌పాటలు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    నవంబర్ 14 , 2024
    <strong>Matka Promotions: ట్రెండ్ సెట్‌ చేసిన వరుణ్ తేజ్‌ ఇది కదా ప్రమోషన్ అంటే.. వీడియో వైరల్‌!</strong>
    Matka Promotions: ట్రెండ్ సెట్‌ చేసిన వరుణ్ తేజ్‌ ఇది కదా ప్రమోషన్ అంటే.. వీడియో వైరల్‌!
    మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా దర్శకుడు కరుణ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం 'మట్కా' (Matka). మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ భామా నోరా ఫతేహి మరో కీలక పాత్రలో నటించింది. గురువారం(నవంబర్‌ 14న) గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం చురుగ్గా ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ ఆడియన్స్‌లో తమ మూవీపై హైప్‌ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే నటుడు వరుణ్‌ తేజ్‌ సైతం వినూత్న ప్రమోషన్స్‌ (Matka Promotions)కు తెరతీశాడు. తన పాత్ర చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకొని అతడు చేసిన ఓ వీడియో సినీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇదెక్కడి మాస్‌ ప్రమోషన్స్! మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 2014లో వచ్చిన 'ముకుంద'తో తెలుగు ఆడియన్స్‌కు తొలిసారి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘కంచె’, ‘ఫిదా’, ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు చేశాడు. అలాగే లోఫర్‌, మిస్టర్‌, ‘గాండీవధారి అర్జున’ వంటి ఫ్లాప్‌లు కూడా తీశాడు. ఇదిలా ఉంటే 'మట్కా' ప్రమోషన్స్‌లో భాగంగా తన చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకొని వరుణ్ ఓ ఆసక్తికర వీడియోను చేశాడు. కెరీర్‌లో ఇప్పటివరకూ చేసిన హిట్‌, ఫ్లాప్‌ చిత్రాలు ఎదురుపడితే తన రియాక్షన్‌ ఎలా ఉంటుందో చేసి చూపించాడు. ఒక్కో వ్యక్తిని ఒక్కో సినిమాగా భావిస్తూ తన ఫీలింగ్స్‌ను పంచుకున్నాడు. చివర్లో 'మట్కా'గా వచ్చిన వ్యక్తికి బిగ్‌ హగ్‌ ఇచ్చి బాగా ప్రమోట్‌ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. https://twitter.com/SivaKri54096510/status/1856617018276839798 తిరుమలలో ‘మట్కా’ టీమ్‌! తిరుమల శ్రీవారిని ‘మట్కా’ (Matka Promotions) చిత్రబృందం ఇవాళ (నవంబర్‌ 13) తెల్లవారుజామున దర్శించుకుంది. వీఐపీ దర్శన సమయంలో నటుడు వరుణ్‌ తేజ్‌, చిత్ర యూనిట్‌ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో చిత్ర యూనిట్‌కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. గురువారం ‘మట్కా’ సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు వరుణ్‌ తెలిపారు. తిరుమలలో మట్కా టీమ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; https://twitter.com/baraju_SuperHit/status/1856530909580677270 వరుణ్‌ మేకోవర్‌ చూశారా? మట్కా సినిమాలో వరుణ్‌ తేజ్ శివ అనే పాత్ర పోషించాడు. మట్కా జూదాన్ని ప్రారంభించిన రతన్ ఖాత్రి అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా దీన్ని రూపొందించారు. 1970-90 ప్రాంతంలో వైజాగ్‌ పరిస్థితులను ఈ చిత్రంలో కళ్లకు కట్టనున్నారు. ఇదిలా ఉంటే వాసు పాత్ర కోసం వరుణ్‌ తేజ్‌ పూర్తిగా తన గెటప్‌ను మార్చుకున్నాడు. తన హెయిర్‌స్టైల్, కాస్ట్యూమ్స్‌ను 1970వ దశకానికి అనుగుణంగా మార్చుకున్నాడు. ఆ పాత్రలకు వరుణ్‌ ఏ విధంగా మారాడో తెలియజేసే వీడియోను మేకర్స్‌ తాజాగా రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు ఓవర్సీస్‌లో ఏ ఏ థియేటర్లలో తమ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారో ఓ పోస్టర్‌ ద్వారా మట్కా టీమ్‌ తెలియజేసింది.&nbsp; https://www.youtube.com/watch?v=b3CRE3IMdzA https://twitter.com/baraju_SuperHit/status/1856380138553802773 సెన్సార్‌ రివ్యూ వరుణ్‌ తేజ్‌ మట్కా (Matka Promotions) చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ సభ్యులు యూఏ (U/A) సర్టిఫికేట్‌ జారీ చేశారు. ఈ విషయాన్ని వరుణ్‌ తేజ్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలియజేశారు. ఇంటర్వెల్ ముందు నాలుగు ఫైట్స్ ఉంటాయని సమాచారం. ఆ నాలుగూ బాగా వచ్చాయని టాక్. ఇక క్లైమాక్స్‌లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. దర్శకుడు కరుణ కుమార్ రాసిన కథ, తీసిన తీరు సెన్సార్‌ సభ్యులకు బాగా నచ్చిందట. డైలాగులు కూడా నెక్స్ట్ లెవల్లో ఉన్నాయని వారు ఫీలయ్యారట. మట్కా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకూ చాలా ఎంగేజింగ్‌గా ఉన్నట్లు వారు భావించారట. క్యారెక్టర్ పరంగా వరుణ్ తేజ్ గెటప్స్ హైలైట్ అవుతాయని టాక్. నటుడిగా వరుణ్ తేజ్ మరో మెట్టు ఎక్కే సినిమా 'మట్కా'&nbsp; అవుతుందని అంటున్నారు.&nbsp;
    నవంబర్ 13 , 2024
    సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    పిల్లా నువ్వులేని జీవితం చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్.. చిత్రలహరి, విరూపాక్ష వంటి హిట్ చిత్రాల ద్వారా స్టార్ డం సంపాదించాడు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ గురించి మీకు తెలియని కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం. సాయి ధరమ్ తేజ్ ముద్దు పేరు? ధరమ్ సాయి ధరమ్ తేజ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా? పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ సాయి ధరమ్ తేజ్ పుట్టిన తేదీ ఎప్పుడు? October 15, 1986 సాయి ధరమ్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ క్రష్ ఎవరు? లారిసా బొనేసి(Larissa Bonesi). ఈమె తిక్క చిత్రంలో సాయి ధరమ్ సరసన హీరోయిన్‌గా నటించింది. సాయి ధరమ్‌కు ఇష్టమైన సినిమా? గ్యాంగ్ లీడర్ సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్, చిరంజీవి సాయి ధరమ్ తేజ్ తొలి హిట్ సినిమా? సుబ్రహ్మాణ్యం ఫర్ సేల్ చిత్రం సాయిధరమ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. చిత్రలహరి, బ్రో, విరూపక్ష వంటి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. సాయి ధరమ్‌కు ఇష్టమైన కలర్? నీలం రంగు సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రుల పేర్లు? విజయ దుర్గ, జీవీఎస్ ప్రసాద్ సాయి దరమ్‌కు ఇష్టమైన ప్రదేశం? దుబాయ్, లండన్ సాయి ధరమ్ చదువు? MBA సాయి ధరమ్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? పిల్లా నువ్వులేని జీవితం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ గెలుచుకున్నాడు. https://www.youtube.com/watch?v=G7ptLW3O0Qo సాయి ధరమ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? సాయి ధరమ్ 2024 వరకు 16 సినిమాల్లో నటించాడు.&nbsp; సాయి ధరమ్‌కు ఇష్టమైన ఆహారం? రొయ్యల పలావు, పప్పు అన్నం సాయి ధరమ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సాయి ధరమ్ ఒక్కో సినిమాకి దాదాపు రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్ అభిరుచులు? ట్రావలింగ్, క్రికెట్ ఆడటం సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరోయిన్? సమంత
    మార్చి 21 , 2024
    Operation Valentine Box Office Collection Day 1: వరుణ్ తేజ్‌ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్లు... కారణం ఇదేనా?
    Operation Valentine Box Office Collection Day 1: వరుణ్ తేజ్‌ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్లు... కారణం ఇదేనా?
    మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం శుక్రవారం విడుదలై ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కలెక్షన్లపై సర్వత్రా క్రేజీ బజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడంతో ఎంత కలెక్ట్ చేసిందనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా భార‌త్‌, పాకిస్థాన్‌ మ‌ధ్య జ‌రిగిన కొన్న ఉద్రిక్త సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో&nbsp; డైరెక్టర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019లో ఉగ్రవాదులు జ‌రిపిన పుల్వామా దాడులు మొద‌లుకొని, దానికి ప్రతిగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్&nbsp; వ‌ర‌కూ ప‌లు సంఘ‌ట‌న‌లు ఇందులో ప్రతిబింబించాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం, దేశ భక్తి ప్రధానంగా సాగే సీన్స్‌, క్లైమాక్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించినట్లు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. కలెక్షన్లు ఇలా… ప్రముఖ వెబ్‌ సైట్ సాక్‌నిక్ ముందస్తు అంచనాల ప్రకారం ఈ చిత్రం తొలి రోజు రూ.1.25కోట్లు కలెక్ట్ చేసినట్లు కథనం(Operation Valentine Box Office Collection) రాసింది. అయితే తొలి రోజు లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని, ఈ కలెక్షన్లే పూర్తి విలువ కాదని పేర్కొంది.&nbsp; మరో బాలీవుడ్ వెబ్‌సైట్ కోయిమోయి ఆపరేష్ వాలెంటైన్ చిత్రం రూ.3కోట్లు-రూ.4 కోట్ల వరకు వసూలు చేసినట్లు వెల్లడించింది. అయితే వరుణ్ తేజ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ కలెక్షన్లు చాలా తక్కువ అని స్పష్టం చేసింది. గతంలో వచ్చిన F3 సినిమా తొలి రోజు రూ.15కోట్ల వరకు వసూలు చేసిందని గుర్తు చేసింది.&nbsp; ఇదేనా కారణం? అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతుండటం, పోటీపరీక్షలకు నోటిఫికెషన్లు జారీ కావడం వంటి అంశాలు ఈ చిత్రం వసూళ్ల ప్రభావం పడింది. పాజిటివ్ టాక్ ఉండటంతో వీకెండ్స్‌లో ఈ చిత్రం కలెక్షన్లు(Operation Valentine Box Office Collection) భారీగా పెరిగే అవకాశం ఉంది. పాజిటివ్ రివ్యూస్ మరోవైపు వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా ఆ పాత్రలో జీవించాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచాడు. వరుణ్ సరసన నటించిన మానుషి చిల్లర్ (Manushi Chhillar)&nbsp; సైతం తన పాత్రకు న్యాయం చేసింది. వీళ్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ పాత్రలు కూడా సినిమాలో మెప్పిస్తాయి. సినిమా సాంకేతికంగాను ఉన్నతంగా ఉంది. పోరాట సన్నివేశాలు కోరుకునేవారికి ఈ చిత్రం మంచి విజువల్ ఫీస్ట్‌గా ప్రేక్షకులు చెబుతున్నారు. అప్పుడే &nbsp;ఓటీటీలోకి! అటు 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. థియేటర్‌ వెర్షన్‌లో తెలుగు, హిందీ భాషల్లో విడుదలైలన ఈ చిత్రం… ఓటీటీల్లో మాత్రం, తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. https://telugu.yousay.tv/operation-valentine-review-in-telugu-varun-tej-who-is-popular-as-a-fighter-pilot-is-the-movie-a-hit-free.html
    మార్చి 02 , 2024
    Lavanya Tripathi: విదేశాల్లో వరుణ్‌ తేజ్‌తో కలిసి లావణ్య త్రిపాఠి ఎంజాయ్.. వరుణ్ బాధను తగ్గించేందుకే వెకేషన్?
    Lavanya Tripathi: విదేశాల్లో వరుణ్‌ తేజ్‌తో కలిసి లావణ్య త్రిపాఠి ఎంజాయ్.. వరుణ్ బాధను తగ్గించేందుకే వెకేషన్?
    మెగా ఫ్యామిలీకి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి విదేశాల్లో వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం కాబోయే భర్త వరుణ్‌తో&nbsp; అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. వెకేషన్‌ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కాస్త హాట్ లుక్‌లో కనిపించింది. వంకాయ కలర్ డ్రెస్‌లో సోగసుల విందు చేసింది. స్లీవ్ లెస్‌టాప్‌లో మెరసిపోయింది.&nbsp; లావణ్య త్రిపాఠి టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేసిన ఈ భామ తన అందం, నటనతో చాలా మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.&nbsp; భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా లాంటి సినిమా హిట్స్&nbsp; ఈ సొట్ట బుగ్గల చిన్నదాని ఖాతాలో ఉన్నాయి.  విభిన్న పాత్రలు చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉండే లావణ్య అంతరిక్షం లాంటి భిన్నమైన సినిమాలోనూ నటించింది. కుర్రహీరోల నుంచి అగ్రహీరోల సరసన పలు హిట్ సినిమాల్లో నటించినా... ఎందుకనో లావణ్యకు అవకాశాలు బాగా తగ్గాయి. రీసెంట్‌గా మెగా హీరో వరుణ్ తేజ్‌తో నిశ్చితార్థం జరుపుకోవడంతో ఒక్కసారిగా లావణ్య టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.  మిస్టర్ మూవీ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్.  ఇక వీరి లవ్ స్టోరీ విషయానికి వస్తే.. ఈ ఇద్దరూ 2017లో వచ్చిన మిస్టర్ సినిమాలో మొదటి సారి కలిసి నటించారు.&nbsp; ఈ సినిమాలో ఇటలీలో షూటింగ్ జరుపుకుంది. &nbsp;ఆక్రమంలోనే ఇద్దరి అభిప్రాయాలు కలిసి తొలుత స్నేహితులుగా మారి తర్వాత పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారు. విశేషమేమిటంటే.. వీరి పెళ్లి తర్వాత.. హనీమూన్‌ను వారి ప్రేమకు బీజం వేసిన ఇటలీలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారంట. ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే...&nbsp; శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో తెరకెక్కిన ముకుందాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు.&nbsp; క్రిష్ కంచె మూవీతో నటనలో పరిణతి చెందాడు. &nbsp; అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసిన F2, శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాడు. రీసెంట్‌గా రిలీజైన గాండీవధారి అర్జున ఆశించినంత విజయం సాధించకపోవడంతో నిరాశలో ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే అతని బాధను తగ్గించేందుకు వెకేషన్ చేపట్టారు వరుణ్- లావణ్య త్రిపాఠి.
    సెప్టెంబర్ 06 , 2023
    Gandeevadhari Arjuna Movie Review: రా ఏజెంట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా ఎలా ఉందంటే?
    Gandeevadhari Arjuna Movie Review: రా ఏజెంట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : వరుణ్ తేజ్, సాక్షివైద్య, వినయ్ రాయ్, నాజర్, విమలా రామన్‌, రవివర్మ తదితరులు దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు&nbsp; నిర్మాత : బీవీఎన్ఎస్ ప్రసాద్&nbsp; సంగీత దర్శకుడు : మిక్కీ జే మేయర్ సినిమా నిడివి : 2 గంటల 16 నిమిషాలు&nbsp; విడుదల తేదీ : ఆగస్టు 25, 2023 మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌(Varun tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). ప్రవీణ్‌ సత్తారు(Praveen sattaru) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సాక్షి వైద్య (Sakshi vaidya) హీరోయిన్‌గా నటించింది. BVS ప్రసాద్‌ నిర్మించిన ఈ మూవీకి మిక్కీ జే. మేయర్‌ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గాండీవధారి అర్జున సినిమా ఎలా ఉంది? ఈ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆడియన్స్‌ను ఏమేరకు మెప్పించింది? వరుణ్‌ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం. కథ కథలోకి వెళితే ఆచార్య (నాజర్‌) అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ మంత్రి. విలన్లు చేసే మెడికల్‌ స్కామ్‌ వల్ల మనుషులతో పాటు పర్యావరణం దెబ్బతింటున్నట్లు ఆచార్య గ్రహిస్తాడు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో ఆచార్యను చంపేందుకు విలన్‌ మనుషులు ప్రయత్నిస్తుంటారు. దీంతో తనకు రక్షణ కల్పించడంతో పాటు, మెడికల్‌ స్కామ్‌ను ఎలాగైనా ఆపే బాధ్యతను రా ఏజెంట్‌ అర్జున్ (వరుణ్‌తేజ్‌)కు ఆచార్య అప్పగిస్తాడు. ఈ క్రమంలో అర్జున్‌కు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి? మెడికల్‌ స్కామ్‌ను అతడు ఎలా బయటపెట్టాడు? ఆ స్కామ్‌కు పర్యావరణానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే. https://twitter.com/baraju_SuperHit/status/1694964373507260852?s=20 ఎలా సాగిందంటే గాండీవధారి అర్జున మూవీ రెగ్యులర్ ఫార్మాట్ మాదిరిగానే ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ చూసే కొందరిని తప్ప.. మిగతావారిని ఆకట్టుకునేలా లేదు. ఇంటర్వెల్ వరకు మూవీ సాగదీతగా అనిపిస్తుంది. కొంత నాటకీయత ఉన్నప్పటికీ అదీ ఎలివేట్ చేయబడలేదు. తర్వాత యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. కామెడీ ఆశించే ప్రేక్షకులకు భంగపాటు తప్పదు. మూవీ ఒక లోకేషన్ నుంచి మరో లోకేషన్‌కు ఈజీగా వెళుతుంది. క్లైమాక్స్ కూడా ఊహించినట్టే ఉంది. పెద్దగా మలుపులు, ట్విస్ట్స్ అంటూ ఏమీ లేవు.&nbsp; ఎవరెలా చేశారంటే..? గాండీవధారి అర్జున మూవీలో వరుణ్ తేజ్ యాక్షన్ రోల్ చేశాడు. తన పర్సనాలిటీతో ఆ పాత్రకు హుందాతనాన్ని తీసుకొచ్చాడు. హాలీవుడ్ యాక్షన్ హీరోను తలపించాడు. అయితే యాక్షన్‌ చిత్రం కావడంతో నటనకు పెద్దగా స్కోప్‌ లేదు. అయినప్పటికీ వరుణ్‌ ఉన్నంతలో తన మార్క్‌ చూపించే ప్రయత్నం చేశాడు. ఇక సాక్షి వైద్య సినిమా మొత్తం ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండదు. నాజర్‌ ఎప్పటిలాగే తన అనుభవాన్ని ఉపయోగించి నటించారు. తమిళ నటుడు వినయ్ రాయ్ విలన్ పాత్రలో మెప్పించాడు. మనీశ్ చౌదరీ, రవి వర్మ పరిధి మేరకు నటించారు. టెక్నికల్‌గా&nbsp; ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే మిక్కీ జే మేయర్‌ అందించిన సంగీతం సినిమాకు ప్లస్‌ కాలేకపోయింది. ఒక్క పాట కూడా గుర్తుంచుకునేలా లేదు. అటు బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సైతం నామమాత్రంగానే ఉంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు ఇచ్చే BGM లాగా అనిపించలేదు. G. ముఖేశ్‌ ఇచ్చిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఆయన పనితనం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ వరుణ్‌ తేజ్‌ నటనయాక్షన్‌ సన్నివేశాలుసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీడైరెక్షన్‌పాటలునో థ్రిల్స్‌ &amp; నో ట్విస్ట్స్‌ సినిమా రేటింగ్‌: 2.5/5 https://www.youtube.com/watch?v=cBGSJcM8C8s
    ఆగస్టు 28 , 2023
    VARUNLAV:  ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
    VARUNLAV:  ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మనసిచ్చిన ఈ హీరో ఇప్పుడు మనువాడేందుకు రెడీ అవుతున్నాడు. గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌పై సైలెంట్‌గా ఉన్న వీరు ఏకంగా పెళ్లి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలిసి సినిమాల్లో నటించి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నది వీరొక్కరే కాదు. ఈ జాబితాలో ఇప్పటికే ఎంతో మంది ఉన్నారు. ఆ జంటలేవో తెలుసుకుందాం.&nbsp; https://twitter.com/tupakinews_/status/1667059120313352192?s=20 https://twitter.com/Pallavi_M_K/status/1664277523608518657?s=20 కియారా- సిద్ధార్థ్ మల్హోత్రా బాలీవుడ్ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ షేర్షా సినిమాతో పరిచయం. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరికి పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నయనతార- విఘ్నేష్ శివన్ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నయన్.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. కొంతకాలంగా నడిచిన వీరి ప్రేమాయణం పెళ్లి పీటలెక్కి మరో స్థాయికి చేరుకుంది. 2022లో వీరికి వివాహం కాగా సరోగసి విధానంలో వీరు సంతానాన్ని పొందారు.&nbsp; Screengrab Instagram:nayanatara నమ్రత- మహేశ్ బాబు నమ్రత, మహేశ్ బాబులది ప్రేమ వివాహమే. వంశీ సినిమాతో తొలిసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు. అప్పుడే మిల్క్ బాయ్ ప్రేమల్లో పడ్డాడు. ఐదేళ్ల పాటు నమ్రతతో ప్రేమాయణం నడిపి చివరికి నాన్న కృష్ణ పర్మిషన్‌తో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం. గౌతమ్, సితార.&nbsp; అలియా భట్- రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్.. ప్రేమ ద్వారానే ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి చేసిన బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేమలో పడ్డారు. 2022లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ కుమార్తె పుట్టింది.&nbsp; విజయనిర్మల- కృష్ణ సెలబ్రిటీ కపుల్స్‌లలో ఎప్పటికీ గుర్తుండిపోయే జంట వీరిది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. బాపూ ‘సాక్షి’ సినిమాతో వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. అలా సంవత్సరాలు గడిచాక 1969లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం.&nbsp; జ్యోతిక- సూర్య&nbsp; సౌత్‌లో పేరొందిన సెలబ్రిటీ కపుల్ జ్యోతిక- సూర్య. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ఎంతో అభిమానం, ప్రేమ. 2006లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు(దియా), కుమారుడు(దేవ్).&nbsp; అమల- నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున, అమల సెలబ్రిటీల జంటకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 1992 జూన్‌లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్ధం, కిరాయి దాదా, శివ, నిర్ణయం సినిమాల్లో ఈ జంట కలిసి పనిచేసింది.&nbsp; నిక్కీ గల్రానీ- ఆది పినిశెట్టి గొడవలతోనే వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. ‘మలుపు’ సినిమా వీరి జీవితాలను మలుపు తిప్పింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య గొడవలు, మనస్పర్దలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత అర్థం చేసుకుని ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ప్రేమలో పడి 2022, మే నెలలో ఒక్కటయ్యారు. జీవిత- రాజశేఖర్ జీవిత, రాజశేఖర్‌లది విచిత్ర ప్రయాణం. తలంబ్రాలు సినిమాతో వీరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ‘ఆహుతి’ సినిమా చిత్రీకరణ సమయంలో రాజశేఖర్‌కి గాయాలైతే దగ్గరుండి చూసుకుంది జీవిత. అలా తమ ప్రేమను పెద్దలతో పంచుకుని నిజ జీవితంలోనూ హీరో, హీరోయిన్లు అయ్యారు. 1991లో వీరి వివాహమైంది. వీరిద్దరికీ ఇద్దరు కూతుళ్లు. శివానీ, శివాత్మికలు హీరోయిన్లుగా చేస్తున్నారు.&nbsp; షాలిని- అజిత్ బేబి షాలినిగా గుర్తింపు పొందింది షాలిని. తమిళ స్టార్ అజిత్‌తో ప్రేమాయణం పెళ్లి పీటల దాకా తీసుకొచ్చింది. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని 2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. దీపిక పదుకొణె- రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాజీరావ్ మస్తానీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అనంతర కాలంలో ప్రేమలో మునిగి తేలి 2018లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జంటలు కూడా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్-జయా బచ్చన్, శ్రీకాంత్- ఊహ, అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్- విక్కీ కౌశల్, శివబాలాజీ- మధుమిత, వరుణ్ సందేశ్- వితిక, రాధిక- శరత్ కుమార్, ఆర్య- సాయేషా సైగల్ కూడా ప్రేమ వివాహం చేసుకుని అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
    జూన్ 09 , 2023
    Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్
    Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్
    నటీనటులు: అభిరామ్‌ దగ్గుబాటి, గీతికా తివారి, సదా, కమల్‌ కామరాజ్‌, కల్పలత, రవి కాలే, రజత్ బేడి దర్శకత్వం: తేజ సంగీతం: R.P పట్నాయక్‌ సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యామిలీకి ఎంతో పేరు ఉంది. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు వారసులుగా వచ్చిన సురేష్‌బాబు, వెంకటేష్‌ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. సురేష్‌ బాబు విజయవంతమైన సినిమాలు నిర్మిస్తే.. వెంకటేష్‌ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వారి వారసుడుగా వచ్చిన రానా కూడా తనకంటూ ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ‘అహింస’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (జూన్‌ 2) రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?. అభిరామ్‌ తొలి హిట్‌ అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ రఘు (దగ్గుబాటి అభిరామ్) అహింసావాది. చీమకు కూడా హాని తలపెట్టని మనస్తత్వం అతనిది. రఘు అంటే అతని మరదలు అహల్య (గీతికా తివారి)కి ఎంతో ప్రేమ. వాళ్ళిద్దరికీ నిశ్చితార్థమైన రోజే ఆమెపై ధనలక్ష్మి దుష్యంత రావు (రజత్ బేడీ) ఇద్దరు కుమారులు దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. పూర్తి అహింసావాదైన రఘు వారిపై న్యాయపోరాటానికి దిగుతాడు. అతడికి లాయర్‌ లక్ష్మీ (సదా) సాయం చేస్తుంది. ఈ క్రమంలో లక్ష్మీ కుటుంబాన్ని దుష్యంతరావు చంపేస్తాడు. దీంతో న్యాయంగా, అహింస మార్గంలో దుష్యంతరావును గెలవలేమని భావించిన హీరో ఏం చేశాడన్నది అసలు కథ. ఇది తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే హీరోగా అభిరామ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. కీలకమైన సన్నివేశాల్లో తన శక్తిమేరకు నటించాడు. ఇదే తొలి సినిమా కావడంతో నటన పరంగా ఓకే అని చెప్పొచ్చు. హీరోయిన్‌ గీతికా తివారి తన నటనతో ఆకట్టుకుంది. అందం, అభినయంతో మెప్పించింది. కొన్ని సీన్లలో అందాలు సైతం ఆరబోసింది. ఇక లాయర్‌ పాత్రలో సదా పర్వాలేదనిపించింది. రవి కాలె సహా మిగతా ఆర్టిస్టులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ తేజ మంచి కథనే ఎంచుకున్నాడు. కానీ, దాన్ని సరిగ్గా ప్రజెంట్‌ చేయలేకపోయారు. సినిమా చూస్తున్నంత ప్రేక్షకుడికి ఏమాత్రం ఆసక్తి ‌అనిపించదు. కొన్ని సీన్లు చూస్తే జయం, నువ్వు నేను సినిమాలే గుర్తుకు వస్తాయి. సినిమా మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. లాజిక్స్‌లతో సంబంధం లేకుండా ఈ సినిమాను తేజ తెరకెక్కించాడు. సినిమా పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడు ఐటెమ్ సాంగ్ రావడం ఆడియన్స్‌కు రుచించదు. కొడుకుల శవాలు ఇంట్లో ఉండగా విలన్‌ ఇంట్లో ఐటెమ్‌ సాంగ్ ఎందుకు పెట్టడం అసలు అర్థం కాదు. దీంతో మూవీ త్వరగా ముగిస్తే బాగుంటుందన్న ఫీలింగ్‌ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. మెుత్తంగా సినిమాలో తేజ మార్క్‌ ఉన్నా రొటీన్‌ సన్నివేశాలతో బోర్ అనిపిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా టెక్నికల్‌ విషయాలకు వస్తే ఆర్పీ పట్నాయక్‌ సంగీతం పర్వాలేదనిపించిది. కొన్ని పాటలు బాగున్నాయి. ‘ఉందిలే’ పాట ఆకట్టుకుంది. చంద్రబోస్‌ అందించిన సాహిత్యం.. లోతైన భావంతో అర్థవంతంగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సమీర్‌రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ సినిమాటోగ్రఫీసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీతరొటీన్‌ సీన్స్లాజిక్‌ లేని సన్నివేశాలు రేటింగ్‌: 2/5
    జూన్ 02 , 2023
    VIRUPAKSHA FULL REVIEW: హారర్, సస్పెన్స్‌ కథాంశంతో&nbsp; విరూపాక్ష… సాయి ధరమ్‌ తేజ్‌ సూపర్ కమ్‌ బ్యాక్!
    VIRUPAKSHA FULL REVIEW: హారర్, సస్పెన్స్‌ కథాంశంతో&nbsp; విరూపాక్ష… సాయి ధరమ్‌ తేజ్‌ సూపర్ కమ్‌ బ్యాక్!
    సాయి ధరమ్‌ తేజ్‌ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న అనంతరం చేసిన మెుదటి సినిమా విరూపాక్ష. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. యాక్సిడెంట్ తర్వాత మాట కూడా పడిపోయిందని చెప్పిన సాయి… సినిమాలో ఎలా నటించాడు? సుకుమార్ కాంపౌండ్‌ నుంచి వస్తున్న మరో దర్శకుడు సక్సెస్ అయ్యాడా ? లేదా ? సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం దర్శకుడు: కార్తీక్ దండు నటీ నటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్‌, సోనియా సింగ్, రవికృష్ణ సంగీతం:&nbsp; అజనీశ్ లోక్‌నాథ్‌ సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌ కథ రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్‌ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ. ఎలా ఉందంటే? రుద్రవరం అనే ఊరికి ఓ జంట శాపం పెట్టడంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. సూర్య పాత్రలో సాయిధరమ్, నందినీగా సంయుక్త మీనన్‌ నటించారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. ఈ సీన్లు ప్రేక్షకులకు కాస్త బోరింగ్‌గానే అనిపిస్తాయి. అయితే, ఇంటర్వెల్‌కు ముందు అసలు కథను ప్రారంభించి అదిరిపోయే సన్నివేశాలు పెట్టడంతో సెకాండాఫ్‌పై ఆసక్తి కలుగుతుంది. ఊరిలో ఒక్కొక్కరు చనిపోతుంటే దాని వెనుకున్న రహస్యాన్ని చేధించే అంశాలతో సెకాండాఫ్‌ను నింపేశారు. కథనం చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుల్ని కచ్చితంగా సీటు అంచుల్లో కూర్చొబెడుతుంది. ప్రీ క్లైమాక్స్‌ వరకు చిత్రం బాగానే ఉంటుంది. చివర్లో కాస్త తడబడ్డారనే చెప్పాలి.&nbsp; ఎవరెలా చేశారు? సాయిధరమ్ తేజ్‌కి ఇది కమ్ బ్యాక్ సినిమా. నటనలో మరో మెట్టు ఎక్కేశాడు కుర్ర హీరో. సూర్య పాత్రలో లీనమైపోయాడు. సెటిల్డ్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు సాయి. సంయుక్త మీనన్‌ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. వరుసగా హిట్లు కొడుతున్న ఈ హీరోయిన్‌ మరోసారి మెప్పించిందనే చెప్పాలి. తన ఖాతాలో మరో హిట్ వేసుకుంది. ప్రీ క్లైమాక్స్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సోనియా సింగ్, అజయ్ లాంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.&nbsp; సాంకేతిక పనితీరు సుకుమార్ కాంపౌండ్‌ నుంచి వచ్చిన దర్శకుడు కార్తీక్ దండు మెుదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఉప్పెనతో బుచ్చిబాబు, దసరాతో శ్రీకాంత్‌ ఓదెల ఎలా ఆకట్టుకున్నారో కార్తీక్‌ కూడా అదేస్థాయిలో మెప్పించాడు. విరూపాక్ష చిత్రాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు కార్తీక్. ఈ చిత్రానికి మరో ప్లస్‌ పాయింట్‌ స్క్రీన్‌ ప్లే. సుకుమార్ స్వయంగా అందించిన స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. చిత్రాన్ని ఎక్కడో నెలబెట్టింది.&nbsp; విరూపాక్ష చిత్రానికి సంగీతంతో ప్రాణం పోశాడు అజనీశ్‌ లోక్‌నాథ్. కాంతార చిత్రానికి మ్యూజిక్ అందించి మెప్పించిన అతడు.. విరూపాక్షలో అందించిన నేపథ్య సంగీతం పెద్ద అసెట్. చిత్రానికి పూర్తి న్యాయం చేశాడు సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. బలాలు కథ, కథనం సాయిధరమ్, సంయుక్త మీనన్ నేపథ్య సంగీతం బలహీనతలు క్లైమాక్స్‌, లవ్‌ ట్రాక్‌ రేటింగ్ 3.25/5
    ఏప్రిల్ 21 , 2023
    <strong>Mokshagna Teja: మోక్షజ్ఞ తేజ సినిమాకు ముహోర్తం ఫిక్స్‌! శ్రీకృష్ణుడి గెటప్‌లో బాలయ్య గెస్ట్‌ రోల్‌?&nbsp;</strong>
    Mokshagna Teja: మోక్షజ్ఞ తేజ సినిమాకు ముహోర్తం ఫిక్స్‌! శ్రీకృష్ణుడి గెటప్‌లో బాలయ్య గెస్ట్‌ రోల్‌?&nbsp;
    నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. నందమూరి మూడో తరం వారసుడ్ని వెండితెరపై చూసుకునేందుకు కళ్లు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ తేజ తెరంగేట్రానికి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అప్‌డేట్స్‌ బయటకొచ్చాయి. ఇది చూసిన నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్ల తమ ఎదురుచూపులకు సరైన ఫలితం దక్కబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ అప్‌డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోక్షజ్ఞ కోసం స్పెషల్‌ పోస్ట్‌! ‘హనుమాన్‌’తో టాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఆకర్షించారు. మోక్షజ్ఞ తెరంగేట్రం చిత్రాన్ని అతడే డైరెక్ట్‌ చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రశాంత్‌ నీల్‌ పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఓ సింహం తన పిల్లను ఎత్తుకొని చూపుతోన్న పోస్ట్‌ పెట్టిన ప్రశాంత్‌ వర్మ ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని రాశారు. దీనికి ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్‌ ఈ పోస్ట్‌ పెట్టారని అందరూ అనుకుంటున్నారు. ఇటీవల ప్రశాంత్‌ వర్మ పెట్టిన మరో పోస్ట్‌ కూడా నెట్టింట వైరల్‌గా మారింది.&nbsp; ఒక ఫొటో షేర్‌ చేస్తూ ‘ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నా’ అని రాశారు. ఇది కూడా మోక్షజ్ఞ సినిమా కోసం పెట్టిన పోస్టు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368 https://twitter.com/PrasanthVarma/status/1830473835046461471 ముహోర్తం ఫిక్స్‌..! మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ సినిమాకు సంబంధించి పూజా వేడుక డేట్ ఖరారైనట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్‌ 6న ఈ సినిమాను అధికారికంగా లాంచ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించాలని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో పాటు నందమూరి బాలకృష్ణ నిర్ణయించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా మెుదలైనట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం మరో మూడు రోజుల్లో వస్తుండటంతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; శ్రీకృష్ణుడిగా బాలయ్య! మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్‌, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్‌ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్‌ తరహాలోనే ఈ సినిమాలో సూప‌ర్ హీరో, మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయ‌ని, చివ‌ర్లో బాల‌య్య శ్రీ‌కృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంద‌ని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్‌ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; హీరోయిన్‌ ఫిక్స్ అయ్యిందా? మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్‌. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్‌ జోడీ మరో ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. మోక్షజ్ఞ లుక్స్‌ వైరల్‌.. నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖాయమైన వేళ ఇటీవల ఆయన ఫొటోలు కూడా వైరలయ్యాయి. ఓ సినిమా వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మోక్షజ్ఞ అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ ఫొటోషూట్‌లో పాల్గొనగా, అందులోని కొన్ని లుక్స్‌ బయటికొచ్చాయి. అప్పటినుంచి సామాజిక మాధ్యమాల్లో అవి తెగ వైరల్‌ అవుతోన్నాయి. దీంతో త్వరలోనే ఈ నందమూరి వారసుడు తెరపై సందడి చేయడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.
    సెప్టెంబర్ 03 , 2024
    <strong>Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్?</strong>
    Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్?
    టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్‌లో అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఒకరు. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్ని చిత్రాల్లో మెయిన్‌ హీరోయిన్‌గా, మరికొన్నింటిలో క్యారెక్టర్‌ అర్టిస్టుగా చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల లీడ్‌ యాక్ట్రెస్‌గా ఆమె చేసిన ‘పొట్టేల్‌’ చిత్రం పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. అనన్య నటనకు నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి. అయితే ఎన్ని మంచి పాత్రలు చేసినా అనన్యకు సరైన అవకాశాలు రావడం లేదన్న అభిప్రాయం చాన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు బంపరాఫర్‌ కొట్టేసింది. దీంతో అనన్య ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; మెగా హీరో సరసన..! మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) నటిస్తున్న తాజా చిత్రం 'SDT 18'. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించిన కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్‌ కేపీ (Rohit KP) దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తెలుగు నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు.&nbsp; ‘విభిన్న పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుతోన్న ప్రతిభావంతురాలు అనన్య నాగళ్లను వెల్కమ్’’ అంటూ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌లో రాసుకొచ్చింది. ఇక ఈ పోస్టర్‌లో అనన్య అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించింది. చీరకట్టు, బొట్టుతో ముఖంగా చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటోది.&nbsp; https://twitter.com/Primeshowtweets/status/1855937397583953941 మెగా హీరోతో రొమాన్స్‌! 'SDT 18' ప్రాజెక్టులో ఇప్పటికే హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lakshmi) నటిస్తోంది. ఇటీవల రిలీజైన గ్లింప్స్‌లో ఈ అమ్మడు లుక్‌ ఆకట్టుకుంది. లేటెస్ట్‌గా అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రాజెక్టులో జాయిన్‌ కావడంతో ఆమె రోల్ ఏంటన్న ప్రశ్న అందరిలోనూ మెుదలైంది. అయితే ఇందులో అనన్య సెకండ్ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాయిధరమ్‌ తేజ్‌, అనన్యకు మధ్య కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్‌ కూడా ఉండే ఛాన్స్ లేకపోలేదని నెటిజన్లు ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు. అనన్య పాత్రకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే చిత్ర బృందం వెల్లడించే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; కొత్తవారికి ప్రేరణగా అనన్య! ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే స్టార్‌ హీరోల సరసన చేయడం తప్పనిసరి. ఈ విషయం అనన్య నాగళ్ల (Ananya Nagalla)కు తెలిసినంతగా ఏ హీరోయిన్‌కు తెలీదు. 2019లో వచ్చిన 'మల్లేశం' చిత్రంతో హీరోయిన్‌గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్‌' వంటి సైన్స్‌ ఫిక్షన్‌ మూవీతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్‌ హీరోగా చేసిన 'వకీల్‌ సాబ్‌'లో కీలక పాత్రే పోషించినప్పటికీ నటిగా ఆమెకు బ్రేక్ రాలేదు. దీంతో పలు చిత్రాల్లో సైడ్‌ క్యారెక్టర్స్‌ చేసింది. అవకాశం దొరికినప్పుడుల్లా హీరోయిన్‌గా కనిపించి తనను తాను నిరూపించుకుంది. రీసెంట్‌గా వచ్చిన 'తంత్ర', 'పొట్టేల్‌' సినిమాలతో నటిగా మరో మెట్టు ఎక్కింది. స్టార్‌ హీరో చిత్రాల్లో నటించడమే లక్ష్యంగా ఆమె చేస్తున్న కృషికి ఇన్నాళ్లకు సరైన ఫలితం దక్కింది. అనన్య టాలెంట్‌ను గుర్తించిన ‘SDT 18’ టీమ్‌ తమ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి గౌరవించింది. ఈ సక్సెస్‌ అయితే అనన్య కెరీర్‌ మరోస్థాయికి వెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అనన్య సినీ ప్రయాణం ఈ తరం తెలుగమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది పేర్కొంటున్నారు.&nbsp; 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో.. ‘SDT 18’ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్‌ తేజ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో వస్తోన్న చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా దర్శకుడు రోహిత్‌ కేపీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్స్‌ నిర్మించినట్లు ఇటీవల రిలీజ్‌ చేసిన మేకింగ్‌ వీడియోను బట్టి తెలుస్తోంది. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్‌ను ఒక షాట్‌లో చూపించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం సరికొత్త మేకోవర్‌లోకి మారాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు. https://twitter.com/IamSaiDharamTej/status/1846068731665174954 పడిలేచిన కెరటంలా.. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్‌ఫుల్‌ యాక్టర్‌గా మారారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలోనే అతడికి ఊహించని విధంగా యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులనూ ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేసింది. ప్రమాదం అనంతరం కోమాలోకి వెళ్లిన తేజ్‌ జీవన్మరణ సమస్య నుంచి కోలుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు. తన తల్లి పేరును తన పేరుకు జత చేసి సాయి ధరమ్‌ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మారాడు.&nbsp;
    నవంబర్ 12 , 2024
    Arthamaina Arun Kumar Season 2 review: బికినీ షోతో హీట్ పెంచేసిన తేజస్విని.. సిరీస్ ఎలా ఉందంటే?
    Arthamaina Arun Kumar Season 2 review: బికినీ షోతో హీట్ పెంచేసిన తేజస్విని.. సిరీస్ ఎలా ఉందంటే?
    అర్థమైందా అరుణ్ కుమార్’ రెండో సీజన్&nbsp; అక్టోబర్ 31న విడుదలైంది. గత సంవత్సరం విడుదలైన మొదటి సీజన్‌కి మంచి ఆదరణ రావడంతో సెకండ్ సీజన్‌‌ను తీసుకువచ్చారు. ఈ సిరీస్‌ను ఆదిత్య కేవీ దర్శకత్వం వహించగా, ప్రధాన పాత్రలో సిద్ధు పవన్ నటించారు. తేజస్వి మదివాడ, అనన్య శర్మ, రాశి సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై ఉన్న అంచనాలను మరింత పెంచింది. మొదటి సీజన్‌లో అమలాపురం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడు కార్పొరేట్ ఆఫీస్‌లో ఎదుర్కొనే సవాళ్లను హాస్యభరితంగా చూపించిన ఈ సిరీస్, రెండో సీజన్‌లో తన ఉద్యోగ జీవితంలో పైకి ఎలా ఎదిగాడు, పలు సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆకర్షణీయంగా చూపించింది. మరి ఈ సిరీస్ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగంతో మొదలుపెట్టిన అరు౦ కుమార్ తన లేడీ బాస్‌తో సవాళ్లను ఎదుర్కొంటూనే అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందుతాడు. అటువంటి సమయంలో అతనికి ఓ ముఖ్యమైన ప్రాజెక్ట్ అప్పగించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కాకుండా చూసేందుకు తేజస్వి పాత్ర కుతంత్రాలు పన్నుతుంది. ఈ పరిస్థితుల్లో అరు౦ తన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు, ఆ అడ్డంకులను అధిగమించాడా అనేదే కథ. సిరీస్ విశేషాలు ఈ సిరీస్‌లో మొత్తం 5 ఎపిసోడ్‌లు ఉండగా, ప్రతీ ఎపిసోడ్ దాదాపు 25-30 నిమిషాల నిడివి కలిగి ఉంది. మొత్తం రెండు గంటల 15 నిమిషాల నిడివి ఉన్న ఈ సిరీస్‌ను చాలా సులభంగా వీక్షించవచ్చు. ఎపిసోడ్ల మధ్య ఎక్కడా బోర్ అనిపించకుండా స్టోరీ సులభంగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా 4వ ఎపిసోడ్ కొంచెం డ్రామాటిక్‌గా సాగి, కొన్ని సందర్భాల్లో నాటకీయత ఎక్కువై అసలు కథకు అంతరాయం కలిగిస్తుంది. అయితే, 5వ ఎపిసోడ్ ఆకట్టుకునే విధంగా ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఈ సిరీస్‌లో కొన్ని అడల్ట్ కంటెంట్ ఉండడం వల్ల కుటుంబంతో కలసి చూడటం కాస్త అసౌకర్యంగా ఉంటుంది, కపుల్స్ మాత్రం చక్కగా ఆస్వాదించవచ్చు. నటీనటులు తేజస్వి మదివాడ ఈ సిరీస్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గ పాత్ర పోషించారు. ట్రైలర్‌లో బికినీ లుక్‌తో ఆకట్టుకున్న ఆమె తన గ్లామర్ పాత్రతో అందరినీ ఆకర్షించింది. తేజస్వి గతంలో ఈ విధమైన పాత్ర చేయకపోయినా, ఈసారి తన రొమాంటిక్ పాత్రలో కొత్తగా కనిపించారు. అరుణ్ కుమార్ పాత్రలో నటించిన పవన్ సిద్ధు పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నాడు, ముఖ్యంగా తేజస్వితో ఉన్న సన్నివేశాల్లో సీన్లను బాగా మెప్పించాడు. అనన్య శర్మ తన క్యారెక్టర్‌కు అనుగుణంగా యాక్టింగ్‌ స్కోప్ ఉన్న పాత్రను సమర్థవంతంగా పోషించారు. ఆమె అరుణ్ కుమార్‌ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో తన యాక్టింగ్‌తో మెప్పించారు. దర్శకత్వం దర్శకుడు ఆదిత్య కేవీ మొదటి సీజన్‌లో అమెచ్యూర్ నుంచి హైదరాబాద్‌లోని కార్పొరేట్ ప్రపంచంలో సవాళ్లను అధిగమిస్తూ ఎదురుకెళ్లే అరుణ్ కథను చక్కగా చూపించారు. రెండో సీజన్‌లో అతను ఉద్యోగంలో ఎదగడం, కొత్త సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడన్న అంశాలను ఆసక్తికరంగా చూపించారు. అయితే, 4వ ఎపిసోడ్‌లో ఎక్కువగా కేవలం సంభాషణలే ఉండడంతో కథ ముందుకు వెళ్ళకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది. సాంకేతిక అంశాలు సాంకేతికంగా ఈ సిరీస్‌ ఎంతో ఉన్నతంగా ఉంది. ప్రతి సీన్ రిచ్ లుక్‌ను కలిగి ఉండి, అజయ్ అరసాడా అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ సన్నివేశాలను మరింత మెరుగ్గా ఆవిష్కరించింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా ఉంది. చివరగా: వీకెండ్‌లో మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కోసం ఎదురు చూసే వారికి అర్థమైందా అరుణ్ కుమార్ సిరీస్ సరైన ఎంపిక. పూర్తి వినోదాన్ని అందిస్తుంది. రేటింగ్: 3/5
    నవంబర్ 02 , 2024
    Operation Valentine Review In Telugu: ఫైటర్‌ పైలెట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
    Operation Valentine Review In Telugu: ఫైటర్‌ పైలెట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు: వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌, నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ తదితరులు దర్శకత్వం: శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా సంగీతం: మిక్కీ జే మేయర్‌ సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం ఎడిటింగ్‌: నవీన్‌ నూలి సంభాషణలు: సాయి మాధవ్‌ బుర్రా నిర్మాత: సోనీ పిక్చర్స్‌, సందీప్‌ ముద్ద విడుదల: 01-03-2024 వరుణ్‌తేజ్‌ (Varun Tej) హీరోగా దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) కథానాయిక. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సినిమాలో చూపించనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. తెలుగులో రూపొందిన తొలి ఏరియల్‌ యాక్షన్‌ చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఏక‌కాలంలో నిర్మాణం జ‌రుపుకొని ఇవాళ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది?  ఫైట‌ర్ పైల‌ట్ పాత్ర‌లో ఎలా చేశాడు? వరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ అర్జున్ రుద్ర‌దేవ్ అలియాస్ రుద్ర (వ‌రుణ్‌తేజ్‌) ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో స్వ్కాడ్ర‌న్ లీడ‌ర్‌. ‘ఏం జ‌రిగినా చూసుకుందాం’ అంటూ దూకుడు ముందుకు వెళ్లిపోతుంటాడు. వైమానిక ద‌ళంలోనే ప‌నిచేసే రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్ (మానుషి చిల్ల‌ర్‌)తో రుద్ర ప్రేమ‌లో ఉంటాడు. ప్రాజెక్ట్ వ‌జ్ర కోసం న‌డుం క‌ట్టిన స‌మ‌యంలోనే రుద్రకు ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. దాన్నుంచి బయటపడుతున్న క్రమంలోనే అతడు ఆప‌రేష‌న్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ఆప‌రేష‌న్ వెన‌క ఉన్న క‌థేమిటి? ప్రాజెక్ట్ వ‌జ్ర ల‌క్ష్య‌మేమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే వరుణ్‌ తేజ్‌ (Operation Valentine Review in telugu) కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా తన పాత్ర‌లో ఒదిగిపోయాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచి ప్ర‌తిభ చూపించాడు. హీరోయిన్‌గా మానుషి చిల్ల‌ర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది. దాదాపుగా సినిమా అంతా హీరో హీరోయిన్లే తెర‌పై క‌నిపిస్తారు. వీళ్ల జంట చూడటానికి చాలా బాగుంది. మిగిలిన పాత్ర‌ల‌న్నీ ప‌రిమితంగానే క‌నిపిస్తాయి. వారు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించాడు. డైరెక్షన్ ఎలా ఉందంటే భార‌త్‌, పాకిస్థాన్‌ మ‌ధ్య జ‌రిగిన నిజ‌మైన సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో&nbsp; డైరెక్టర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019లో ఉగ్ర‌వాదులు జ‌రిపిన పుల్వామా దాడులు మొద‌లుకొని, దానికి ప్ర‌తిగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్&nbsp; వ‌ర‌కూ ప‌లు సంఘ‌ట‌న‌లు ఇందులో ప్ర‌తిబింబిస్తాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం, దేశ భక్తి ప్రధానంగా సాగే సీన్స్‌, పతాక సన్నివేశాలను డైరెక్టర్ చాలా బాగా తెరకెక్కించారు. అయితే నాయ‌కా నాయిక‌ల మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌లోనే గాఢ‌త చూపలేకపోయారు. కథ దాదాపుగా అందరికే తెలిసిందే కావడం.. రచన పరంగా మరిన్ని కసరత్తులు చేయకపోవడం మైనస్‌ అని చెప్పవచ్చు. ఇక క‌థ‌నంలో కూడా ఎక్కడ బలం ఉన్నట్లు అనిపించదు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన ‘ఫైట‌ర్’ క‌థ‌కి ఆపరేషన్‌ వాలెంటైన్ స్టోరీకి దగ్గరి పోలికలు కనిపిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ముఖ్యంగా విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. (Operation Valentine Review in telugu) మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం మెప్పిస్తుంది. యాక్షన్‌ సన్నివేశాలను నేపథ్య సంగీతం చాలా బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్న‌తంగా ఉన్నాయి. బ‌డ్జెట్ ప‌రంగా ప‌రిమితులున్నా నాణ్య‌మైన విజువ‌ల్స్‌తో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ వరుణ్‌తేజ్‌ నటనవిజువల్స్‌యుద్ధ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ క‌థ‌నంహీరో, హీరోయిన్ కెమెస్ట్రీ Telugu.yousay.tv Rating : 3/5 Click Here For English Review https://telugu.yousay.tv/strongvarana-taja-varun-tej-garacha-maka-talayana-asakatakaramana-sagatala-strong.html
    మార్చి 01 , 2024
    <strong>Varun Tej: వరుస ఫ్లాప్స్‌.. వరుణ్‌ తేజ్‌ ఇక విలన్‌గా చేయాల్సిందేనా?</strong>
    Varun Tej: వరుస ఫ్లాప్స్‌.. వరుణ్‌ తేజ్‌ ఇక విలన్‌గా చేయాల్సిందేనా?
    మెగా హీరో వరుణ్‌తేజ్‌ తొలి చిత్రం ముకుందతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి ఫస్ట్‌ ఫిల్మ్‌ పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన ‘కంచె’, ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’, ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో అతడి కెరీర్‌ పరంగా తిరుగుండదని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫ్లాప్స్‌ అతడ్ని పూర్తిగా ఢీలా పడేలా చేశాయి. రీసెంట్‌గా చేసిన ‘మట్కా’ చిత్రం కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాను వరుణ్‌ పట్టాలెక్కించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అతడిపై నెటిజన్లు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. హీరోగా మానేసి విలన్‌ పాత్రలు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.&nbsp;&nbsp; కొత్త ప్రాజెక్ట్ ఏంటంటే? మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) ‘మట్కా’ (Matka) ఫ్లాప్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు. డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో వరుణ్‌ తన నెక్స్ట్‌ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందించనున్నట్లు సమాచారం. 'మట్కా' షూటింగ్‌ దశలో ఉండగా దర్శకుడు మేర్లపాక గాంధీ కథకు సంబంధించి వరుణ్‌తేజ్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. కథ నచ్చడంతో ప్రాజెక్ట్‌కు వరుణ్‌ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.&nbsp; సినిమాలకు వరుణ్‌ బ్రేక్‌! కరుణ కుమార్‌ దర్శకత్వంలో ఎంతో కష్టపడి చేసిన 'మట్కా' ఎవరూ ఊహించని స్థాయిలో డిజాస్టర్‌గా నిలవడం వరుణ్‌ తేజ్‌ను షాక్‌కు గురిచేసినట్లు తెలుస్తోంది. నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచి నెగిటివ్‌ టాక్‌ను మూటగట్టుకుంది. రొటీన్‌ స్టోరీ, పూర్ స్క్రీన్‌ప్లేతో అస్సలు బాలేదన్న టాక్‌ వచ్చింది. అయితే నటుడిగా వరుణ్‌ తేజ్‌ మాత్రం పూర్తిగా న్యాయం చేశాడన్న ప్రశంసలు కూడా వచ్చాయి. ఎన్నో ఎఫర్ట్స్‌ పెట్టి చేసిన సినిమా ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో వరుణ్‌ తేజ్‌ పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో కొద్ది రోజులు బ్రేక్‌ తీసుకోవాలని వరుణ్‌ నిర్ణయించుకున్నారట. ఈసారి ఆడియన్స్‌ను మెప్పించే కథ రావాలని గట్టిగా ఫిక్సయ్యారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ‘విలన్‌గా చేసుకో’ వరుణ్‌ తేజ్‌ (Varun Tej) చేసిన గత ఆరు చిత్రాల్లో ఒక్క 'ఎఫ్‌ 3' మాత్రమే మంచి విజయం సాధించింది. అది కూడా వరుణ్‌ తేజ్‌ స్ట్రైట్‌ ఫిల్మ్‌ కాదు. అందులో వెంకటేష్‌ కూడా చేయడంతో సక్సెస్ క్రెడిట్‌ పూర్తిగా వరుణ్‌కు ఇవ్వలేము. వరుస ఫ్లాప్స్‌తో అభిమానులను నిరాశ పరుస్తుండంతో వరుణ్‌ తేజ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.&nbsp; స్క్రిప్ట్‌ మీదు అసలు శ్రద్ధ వహించడం లేదని విమర్శలు చేస్తున్నారు. మంచి హైట్‌, ఫిజిక్‌ ఉన్న నేపథ్యంలో విలన్‌గా ట్రై చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానాను వరుణ్‌ తేజ్‌ ఫాలో అయితే కెరీర్‌ బెటర్‌గా ఉంటుందని సలహా ఇస్తున్నారు.&nbsp; ‘మట్కా’ ఓటీటీ రిలీజ్‌ లాక్‌ వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) హీరోయిన్‌గా చేసిన 'మట్కా' (Matka OTT Release) చిత్రం 20 రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్‌ 5 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ‘మట్కా’ (Matka)ను వీక్షించవచ్చని తెలిపింది. కాగా ఈ మూవీ పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందింది.&nbsp; ‘మట్కా’ స్టోరీ ఇదే మట్కా మూవీ 1958 నుంచి 1982 మధ్య సాగే ఓ గ్యాంగ్‌స్టర్‌ కథ. పాకిస్తాన్‌ నుంచి ముంబయికి వచ్చిన రతన్‌ కత్రీ అనే గ్యాంగ్‌స్టర్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మట్కా స్టోరీకి వస్తే.. వాసు (వరుణ్‌ తేజ్‌) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్‌ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. కూలీ నాలి చేసుకునే సాధారణ కుర్రాడు మట్కా వాసుగా ఎలా మారాడు? ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? కథలో సుజాత ఎవరు? ఆమెతో వాసు ప్రేమాయణం ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp;
    నవంబర్ 30 , 2024
    <strong>Allu Arjun Vs Mega Family: అల్లు - మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టిన వరుణ్‌ తేజ్‌.. ఎలాగంటే?</strong>
    Allu Arjun Vs Mega Family: అల్లు - మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టిన వరుణ్‌ తేజ్‌.. ఎలాగంటే?
    అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో వైకాపా నేతకు బన్నీ మద్దతు తెలిపినప్పటి నుంచి ఈ వార్తలు ఊపందుకున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్‌ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్‌ హాజరవుతారన్న వార్తల నేపథ్యంలో ఈ వార్‌కు కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపించింది. అయితే మెగా హీరో వరుణ్‌ తేజ్‌ తాజాగా చేసిన కామెంట్స్‌తో మరోమారు అల్లు వర్సెస్‌ మెగా వివాదం తెరపైకి వచ్చింది. సమసిపోతుందనుకుంటున్న ఈ సోషల్‌ మీడియా వార్‌కు అతడి వ్యాఖ్యలు అగ్గిరాజేసేలా చేసింది.&nbsp; వరుణ్ ఏమన్నారంటే.. మెగా హీరో వరుణ్ తేజ్- మీనాక్షి చౌదరి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మట్కా'. డైరెక్టర్ కరుణకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబర్ 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీటీమ్ ప్రమోషన్స్​లో విశాఖలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. అక్కడ వేదికపై మాట్లాడిన వరుణ్‌ ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. మట్కా గురించి రిజల్ట్‌పై టెన్షన్‌ పడుతున్న క్రమంలో తన అన్న రామ్‌చరణ్‌ నుంచి ఫోన్ వచ్చినట్లు వరుణ్‌ తెలిపాడు. చరణ్‌ 10 మాటలు చెప్పాల్సిన పనిలేదని, పక్కన కూర్చొని భుజంపై చేయి వేస్తే అదే రూ.100 కోట్లకు సమానమని అన్నాడు. 'ఎప్పుడూ కుటుంబం గురించే మాట్లాడతా అని అనుకోవచ్చు. జీవితంలో మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన వెనకాల ఎవరున్నారన్నది మర్చిపోతే ఆ విజయం దేనికీ పనికి రాదు. మా పెదనాన్న, బాబాయ్, మా నాన్న నా వెనకాల ఉన్నారు' అంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/TheAakashavaani/status/1855645538848317783 బన్నీకి ఇండైరెక్ట్‌ పంచ్‌..! వరుణ్‌ తేజ్‌ తన తాజా కామెంట్స్‌ ద్వారా ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ ఇండైరెక్ట్ పంచ్ ఇచ్చాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో ‘చెప్పను బ్రదర్‌’ అంటూ పవన్‌ గురించి బన్నీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. కెరీర్‌ తొలినాళ్లలో తన ప్రతీ సినిమా ఈవెంట్‌లో బన్నీ మెగాస్టార్ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడుతూ వచ్చాడు. అయితే తనకంటూ స్టార్‌డమ్ వచ్చాక బన్నీ వారి గురించి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదన్న విమర్స మెగా ఫ్యాన్స్‌లో ఉంది. ఏపీ ఎన్నికల సమయంలో ఇది తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. కొద్ది కాలం క్రితం మారుతీనగర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన బన్నీ ‘తనకు నచ్చితేనే వస్తా’ అంటూ వ్యాఖ్యానించారు. మెగా ఫ్యాన్స్‌ను సెపరేట్‌ చేస్తూ అల్లు ఆర్మీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐ లవ్‌ యూ అంటూ తన ఫ్యాన్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.&nbsp; సోషల్‌ మీడియాలో బిగ్ వార్‌! వరుణ్‌ తేజ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్ మరోమారు సోషల్ మీడియా వేదికగా దాడి చేసుకుంటున్నారు. ఎంత ఎత్తు ఎదిగినా మూలాలు మర్చిపోకూడదని వరుణ్‌ తేజ్‌ చెప్పకనే చెప్పాడని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ‘కుక్కకాటుకు చెప్ప దెబ్బ’ అన్న సామెతను కూడా ప్రయోగిస్తున్నారు. మరోవైపు బన్నీ ఫ్యాన్స్‌ సైతం వరుణ్‌ తేజ్‌, మెగా ఫ్యాన్స్‌కు దీటుగా బదులిస్తున్నారు. బన్నీలా సక్సెస్‌ అయ్యి వరుణ్‌ ఈ మాట చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు. తన సినిమా రిలీజ్‌ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌ను కాకా పట్టడం కోసమే వరుణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా వరుణ్‌ లేటెస్ట్ కామెంట్స్‌ నెట్టింట మరోమారు అల్లు vs మెగా ఫ్యాన్‌ వార్‌కు ఆజ్యం పోసిందనే చెప్పాలి.&nbsp; https://twitter.com/Mr_Thanniru/status/1855677559385506053 https://twitter.com/Mahendr00185818/status/1855658081923002548 https://twitter.com/KurnoolGabbar/status/1855648961681600850 https://twitter.com/Nishvk18/status/1855647703893786929 https://twitter.com/Pawala444/status/1855647070990082127 https://twitter.com/allumanu45/status/1855654467125096827 https://twitter.com/goudsaab410/status/1855646150281338887 ‘పుష్ప 2’ను టార్గెట్‌ చేసిన మెగా ఫ్యాన్స్‌! అల్లు అర్జున్‌ హీరోగా డైరెక్టర్ సుకుమార్‌ కాంబోలో రూపొందిన ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. అయితే ఈ సినిమా కోసం అల్లు అర్మీతో పాటు మెగా ఫ్యాన్స్‌ సైతం ఎంతగానో ఎదురుచేస్తున్నారు. కానీ, మెగా ఫ్యాన్స్‌ ఎదురుచూడటానికి ఓ బలమైన కారణం ఉంది. ‘పుష్ప 2’పై ఏమాత్రం నెగిటివ్‌ టాక్‌ వచ్చిన సోషల్‌ మీడియాలో బన్నీని ఓ ఆట ఆడుకోవాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఆ సినిమాను బాయ్‌కాట్‌ చేయడం ద్వారా కలెక్షన్స్‌ దెబ్బతీయాలని ప్లాన్‌ చేస్తున్నారట. #Pushpa2boycott అనే హ్యాష్‌ట్యాగ్‌ను సైతం వారు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ‘పుష్ప 2’ సక్సెస్‌ను ఎవరు అడ్డుకోలేరని అల్లు అర్మీ అంటోంది. ఈ నేపథ్యంలో అల్లు, మెగా ఫ్యాన్‌ వార్‌ మున్ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.&nbsp;
    నవంబర్ 11 , 2024

    @2021 KTree