• TFIDB EN
  • తేజ
    UTelugu
    తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    తరుణ్
    తేజ
    కుమార్ బంగారప్ప
    శారీ
    ప్రసాద్ రాయల
    ఆర్వీ ప్రసాద్
    సిబ్బంది
    ఎన్. హరి బాబుదర్శకుడు
    రామోజీ రావు
    నిర్మాత
    ఎంఎం కీరవాణి
    సంగీతకారుడు
    కథనాలు
    వరుణ్ తేజ్ (Varun Tej) గురించి మీకు తెలియని ఆసక్తికరమైన సంగతులు
    వరుణ్ తేజ్ (Varun Tej) గురించి మీకు తెలియని ఆసక్తికరమైన సంగతులు
    మెగా ప్రిన్స్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన వరుణ్ తేజ్… టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గద్దలకొండ గణేష్ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌తో మాస్  ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. కంచె, ముకుందా, తొలిప్రేమ వంటి  హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం యంగ్‌ హీరోల్లో స్టార్ డంతో కొనసాగుతున్న వరుణ్ తేజ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. వరుణ్ తేజ్ అసలు పేరు? సాయి వరుణ్ తేజ్. స్క్రీన్‌పై పెద్దదిగా ఉంటుందని తీసేశారట. అతని అన్ని సర్టిఫికెట్లలో ఇదే పేరు ఉంటంది. వరుణ్ తేజ్  ఎత్తు ఎంత? 6 అడుగుల 4 అంగుళాలు వరుణ్ తేజ్ తొలి సినిమా? ముకుందా ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కంచె చిత్రం గుర్తింపు తెచ్చింది.  వరుణ్ తేజ్‌కు వివాహం అయిందా? 2023 నవంబర్ 1న లావణ్య త్రిపాఠితో ఇటలీలో పెళ్లి జరిగింది. వరుణ్ తేజ్ క్రష్ ఎవరు? తనకు తన భార్య లావణ్య త్రిపాఠి అంటే మొదటి నుంచి క్రష్ ఉండేదని.. తర్వాత అది ప్రేమగా మారి ఆమెనే పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. అయితే సెకండ్ ఆప్షన్‌గా సాయి పల్లవి పేరు చెప్పాడు. వరుణ్ తేజ్ తొలి బ్లాక్ బాస్టర్ హిట్స్? గద్దలకొండ గణేష్, ఎఫ్2 వంచి చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాయి. వరుణ్ తేజ్‌కు ఇష్టమైన కలర్? వైట్ వరుణ్ తేజ్ పుట్టిన తేదీ? 19 January 1990 వరుణ్ తేజ్ తల్లి పేరు? పద్మజ వరుణ్ తేజ్ వ్యాపారాలు? ఆర్ట్స్‌ వర్క్స్ రీ సెల్లింగ్  వరుణ్ తేజ్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? సైమా అవార్డ్స్‌ల్లో ఉత్తమ హీరో కెటగిరీలో కంచె, గద్దలకొండ గణేష్, తొలిప్రేమ చిత్రాలకు గాను నామినేట్ అయ్యాడు. కానీ అవార్డులు రాలేదు. వరుణ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? వరుణ్ తేజ్ 2024 వరకు 13 సినిమాల్లో హీరోగా నటించాడు.  https://www.youtube.com/watch?v=Mh9qxcJVGfI వరుణ్ తేజ్‌కు ఇష్టమైన సినిమా? ఇంద్ర వరుణ్ తేజ్‌కు ఇష్టమైన ఆహారం? థాయ్, మెక్సికన్ వంటలంటే ఇష్టం వరుణ్ తేజ్ ఇల్లు ఎక్కడ? వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి హైదరాబాద్- మణికొండలో కొత్తగా నిర్మించిన ఇంటిలో ఉంటున్నాడు.
    మార్చి 21 , 2024
    వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమా ఉప్పెనతోనే స్టార్ డం సంపాదించాడు. కొండపొలం, రంగ రంగ వైభవంగా చిత్రాల హిట్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ పొందిన వైష్ణవ్ తేజ్ గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. వైష్ణవ్ తేజ్ అసలు పేరు? పంజా వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ముద్దు పేరు? హీరో బాబు వైష్ణవ్ తేజ్ ఎత్తు ఎంత? 6 అడుగులు వైష్ణవ్ తేజ్  తొలి సినిమా? ఉప్పెన వైష్ణవ్ తేజ్  ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ వైష్ణవ్ తేజ్  పుట్టిన తేదీ ఎప్పుడు? 1995, జనవరి 13 వైష్ణవ్ తేజ్‌కు వివాహం అయిందా? ఇంకా జరగలేదు. వైష్ణవ్ తేజ్‌ ఫస్ట్ క్రష్? సొనాక్షి సిన్హా వైష్ణవ్ తేజ్  ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వైష్ణవ్ తేజ్  తొలి హిట్ సినిమా? ఉప్పెన వైష్ణవ్ తేజ్‌కు గుర్తింపునిచ్చిన చిత్రం? కొండపొలం వైష్ణవ్ తేజ్  ఇష్టమైన కలర్? వైట్, బ్లాక్ వైష్ణవ్ తేజ్  తల్లిదండ్రుల పేరు? విజయ దుర్గ, శివప్రసాద్ వైష్ణవ్ తేజ్‌కు ఇష్టమైన ప్రదేశం? తిరుమల వైష్ణవ్ తేజ్‌కు ఇష్టమైన సినిమాలు? రజనీకాంత్ నటించిన శివాజి సినిమా వైష్ణవ్ తేజ్  ఏం చదివాడు? డిగ్రీ వైష్ణవ్ తేజ్  అభిరుచులు? సినిమాలు చూడటం, ట్రావలింగ్ వైష్ణవ్ తేజ్  ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.  వైష్ణవ్ తేజ్  సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=wYDcnafZkS0
    మార్చి 21 , 2024
    Hanuman Movie Review: సూపర్‌ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్‌’ హిట్‌ కొట్టినట్లేనా?
    Hanuman Movie Review: సూపర్‌ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్‌’ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య దర్శకుడు : ప్రశాంత్ వర్మ సంగీతం: గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర ఎడిటింగ్: సాయిబాబు తలారి నిర్మాత: నిరంజన్ రెడ్డి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman Movie Review). అగ్రతారల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. బడ్జెట్‌ పరంగా ఇది చిన్న సినిమా అనిపించుకున్నా కంటెంట్‌ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు దీటుగా నిలబడింది. టీజర్‌ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతూ పోయిన ఈ చిత్రం.. ట్రైలర్‌తో వాటిని రెట్టింపు చేసింది. మరి ఆ అంచనాల్ని ‘హనుమాన్‌’ అందుకున్నాడా? ఈ సూపర్‌ హీరో చేసిన సాహసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హనుమంతు పాత్రలో ఓ సామాన్య కుర్రాడిలా తేజ సజ్జ (Teja Sajja) ఒదిగిన తీరు మెప్పిస్తుంది. సూపర్‌ పవర్స్‌ వచ్చాక అతను చేసే సందడి ఇంకా అలరిస్తుంది. యాక్షన్‌, భావోద్వేగ  సన్నివేశాల్లో తేజ చక్కటి నటనను కనబరిచాడు. పల్లెటూరి అమ్మాయి మీనాక్షిగా అమృత అయ్యర్‌ (Amritha Aiyer) అందంగా కనిపించింది. కథలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యత బాగుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar) పాత్ర ద్వితీయార్ధంలో సర్‌ప్రైజ్‌ చేస్తుంది. వినయ్‌ రాయ్‌ (Vinay Rai) స్టైలిష్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. విభీషణుడిగా సముద్రఖని పాత్ర కథలో ఓ ప్రత్యేక ఆకర్షణ. గెటప్‌ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్, రాకేష్‌ మాస్టర్‌ తదితరుల పాత్రలు కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. డైరెక్షన్‌ ఎలా ఉందంటే సూపర్‌ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth varma) సినిమాను తీర్చిదిద్దారు. సూపర్‌ హీరో అవ్వాలనే కోరికతో విలన్‌ చేసే ప్రయత్నాలను ప్రశాంత్‌ ఆసక్తికరంగా తెరకెక్కించారు. అంజనాద్రి ఊరు.. దాన్ని పరిచయం చేసిన తీరు కనులవిందుగా ఉంటుంది. ఆరంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగడం, కొన్ని పాత్రల్ని మరీ డిటైల్డ్‌గా చూపించడం ప్రేక్షకులకు బోర్‌ కొట్టిస్తుంది. హనుమంతుకు సూపర్‌ పవర్స్‌ వచ్చినప్పటి నుంచి కథ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లా పరుగులు పెడుతుంది. విరామానికి ముందు వచ్చే కుస్తీ పోటీ సన్నివేశం కిక్కిస్తుంది. ముఖ్యంగా మైఖేల్‌ స్థావరంలోకి హనుమంతు వెళ్లినప్పుడు వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ను ప్రశాంత్‌ అద్భుతంగా తెరకెక్కించారు. క్లైమాక్స్‌లో చివరి 20నిమిషాలు ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడు.  సాంకేతికంగా ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రశాంత్‌ తనకిచ్చిన బడ్జెట్‌లోనే చక్కటి గ్రాఫిక్స్‌తో క్వాలిటీ ఫిల్మ్‌ను చూపించారు. ఇక నేపథ్య సంగీతం విషయానికొస్తే ముగ్గురు సంగీత దర్శకులు తమ ప్రతిభను చూపించారు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలుస్తుంది. సాయిబాబు తలారి అందించిన ఎడిటింగ్‌ వర్క్‌ పర్వాలేదు.  ప్లస్ పాయింట్స్‌ కథా నేపథ్యంతేజ సజ్జా నటనగ్రాఫిక్స్‌, నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడా నెమ్మదిగా సాగే సీన్స్‌ రేటింగ్‌ : 3.5/5
    జనవరి 12 , 2024
    సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    పిల్లా నువ్వులేని జీవితం చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్.. చిత్రలహరి, విరూపాక్ష వంటి హిట్ చిత్రాల ద్వారా స్టార్ డం సంపాదించాడు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ గురించి మీకు తెలియని కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం. సాయి ధరమ్ తేజ్ ముద్దు పేరు? ధరమ్ సాయి ధరమ్ తేజ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా? పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ సాయి ధరమ్ తేజ్ పుట్టిన తేదీ ఎప్పుడు? October 15, 1986 సాయి ధరమ్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ క్రష్ ఎవరు? లారిసా బొనేసి(Larissa Bonesi). ఈమె తిక్క చిత్రంలో సాయి ధరమ్ సరసన హీరోయిన్‌గా నటించింది. సాయి ధరమ్‌కు ఇష్టమైన సినిమా? గ్యాంగ్ లీడర్ సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్, చిరంజీవి సాయి ధరమ్ తేజ్ తొలి హిట్ సినిమా? సుబ్రహ్మాణ్యం ఫర్ సేల్ చిత్రం సాయిధరమ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. చిత్రలహరి, బ్రో, విరూపక్ష వంటి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. సాయి ధరమ్‌కు ఇష్టమైన కలర్? నీలం రంగు సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రుల పేర్లు? విజయ దుర్గ, జీవీఎస్ ప్రసాద్ సాయి దరమ్‌కు ఇష్టమైన ప్రదేశం? దుబాయ్, లండన్ సాయి ధరమ్ చదువు? MBA సాయి ధరమ్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? పిల్లా నువ్వులేని జీవితం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ గెలుచుకున్నాడు. https://www.youtube.com/watch?v=G7ptLW3O0Qo సాయి ధరమ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? సాయి ధరమ్ 2024 వరకు 16 సినిమాల్లో నటించాడు.  సాయి ధరమ్‌కు ఇష్టమైన ఆహారం? రొయ్యల పలావు, పప్పు అన్నం సాయి ధరమ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సాయి ధరమ్ ఒక్కో సినిమాకి దాదాపు రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్ అభిరుచులు? ట్రావలింగ్, క్రికెట్ ఆడటం సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరోయిన్? సమంత
    మార్చి 21 , 2024
    Operation Valentine Box Office Collection Day 1: వరుణ్ తేజ్‌ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్లు... కారణం ఇదేనా?
    Operation Valentine Box Office Collection Day 1: వరుణ్ తేజ్‌ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్లు... కారణం ఇదేనా?
    మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం శుక్రవారం విడుదలై ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కలెక్షన్లపై సర్వత్రా క్రేజీ బజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడంతో ఎంత కలెక్ట్ చేసిందనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా భార‌త్‌, పాకిస్థాన్‌ మ‌ధ్య జ‌రిగిన కొన్న ఉద్రిక్త సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో  డైరెక్టర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019లో ఉగ్రవాదులు జ‌రిపిన పుల్వామా దాడులు మొద‌లుకొని, దానికి ప్రతిగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్  వ‌ర‌కూ ప‌లు సంఘ‌ట‌న‌లు ఇందులో ప్రతిబింబించాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం, దేశ భక్తి ప్రధానంగా సాగే సీన్స్‌, క్లైమాక్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించినట్లు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. కలెక్షన్లు ఇలా… ప్రముఖ వెబ్‌ సైట్ సాక్‌నిక్ ముందస్తు అంచనాల ప్రకారం ఈ చిత్రం తొలి రోజు రూ.1.25కోట్లు కలెక్ట్ చేసినట్లు కథనం(Operation Valentine Box Office Collection) రాసింది. అయితే తొలి రోజు లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని, ఈ కలెక్షన్లే పూర్తి విలువ కాదని పేర్కొంది.  మరో బాలీవుడ్ వెబ్‌సైట్ కోయిమోయి ఆపరేష్ వాలెంటైన్ చిత్రం రూ.3కోట్లు-రూ.4 కోట్ల వరకు వసూలు చేసినట్లు వెల్లడించింది. అయితే వరుణ్ తేజ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ కలెక్షన్లు చాలా తక్కువ అని స్పష్టం చేసింది. గతంలో వచ్చిన F3 సినిమా తొలి రోజు రూ.15కోట్ల వరకు వసూలు చేసిందని గుర్తు చేసింది.  ఇదేనా కారణం? అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతుండటం, పోటీపరీక్షలకు నోటిఫికెషన్లు జారీ కావడం వంటి అంశాలు ఈ చిత్రం వసూళ్ల ప్రభావం పడింది. పాజిటివ్ టాక్ ఉండటంతో వీకెండ్స్‌లో ఈ చిత్రం కలెక్షన్లు(Operation Valentine Box Office Collection) భారీగా పెరిగే అవకాశం ఉంది. పాజిటివ్ రివ్యూస్ మరోవైపు వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా ఆ పాత్రలో జీవించాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచాడు. వరుణ్ సరసన నటించిన మానుషి చిల్లర్ (Manushi Chhillar)  సైతం తన పాత్రకు న్యాయం చేసింది. వీళ్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ పాత్రలు కూడా సినిమాలో మెప్పిస్తాయి. సినిమా సాంకేతికంగాను ఉన్నతంగా ఉంది. పోరాట సన్నివేశాలు కోరుకునేవారికి ఈ చిత్రం మంచి విజువల్ ఫీస్ట్‌గా ప్రేక్షకులు చెబుతున్నారు. అప్పుడే  ఓటీటీలోకి! అటు 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. థియేటర్‌ వెర్షన్‌లో తెలుగు, హిందీ భాషల్లో విడుదలైలన ఈ చిత్రం… ఓటీటీల్లో మాత్రం, తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. https://telugu.yousay.tv/operation-valentine-review-in-telugu-varun-tej-who-is-popular-as-a-fighter-pilot-is-the-movie-a-hit-free.html
    మార్చి 02 , 2024
    Lavanya Tripathi: విదేశాల్లో వరుణ్‌ తేజ్‌తో కలిసి లావణ్య త్రిపాఠి ఎంజాయ్.. వరుణ్ బాధను తగ్గించేందుకే వెకేషన్?
    Lavanya Tripathi: విదేశాల్లో వరుణ్‌ తేజ్‌తో కలిసి లావణ్య త్రిపాఠి ఎంజాయ్.. వరుణ్ బాధను తగ్గించేందుకే వెకేషన్?
    మెగా ఫ్యామిలీకి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి విదేశాల్లో వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం కాబోయే భర్త వరుణ్‌తో  అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. వెకేషన్‌ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కాస్త హాట్ లుక్‌లో కనిపించింది. వంకాయ కలర్ డ్రెస్‌లో సోగసుల విందు చేసింది. స్లీవ్ లెస్‌టాప్‌లో మెరసిపోయింది.  లావణ్య త్రిపాఠి టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేసిన ఈ భామ తన అందం, నటనతో చాలా మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.  భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా లాంటి సినిమా హిట్స్  ఈ సొట్ట బుగ్గల చిన్నదాని ఖాతాలో ఉన్నాయి.  విభిన్న పాత్రలు చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉండే లావణ్య అంతరిక్షం లాంటి భిన్నమైన సినిమాలోనూ నటించింది. కుర్రహీరోల నుంచి అగ్రహీరోల సరసన పలు హిట్ సినిమాల్లో నటించినా... ఎందుకనో లావణ్యకు అవకాశాలు బాగా తగ్గాయి. రీసెంట్‌గా మెగా హీరో వరుణ్ తేజ్‌తో నిశ్చితార్థం జరుపుకోవడంతో ఒక్కసారిగా లావణ్య టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.  మిస్టర్ మూవీ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్.  ఇక వీరి లవ్ స్టోరీ విషయానికి వస్తే.. ఈ ఇద్దరూ 2017లో వచ్చిన మిస్టర్ సినిమాలో మొదటి సారి కలిసి నటించారు.  ఈ సినిమాలో ఇటలీలో షూటింగ్ జరుపుకుంది.  ఆక్రమంలోనే ఇద్దరి అభిప్రాయాలు కలిసి తొలుత స్నేహితులుగా మారి తర్వాత పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారు. విశేషమేమిటంటే.. వీరి పెళ్లి తర్వాత.. హనీమూన్‌ను వారి ప్రేమకు బీజం వేసిన ఇటలీలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారంట. ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే...  శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో తెరకెక్కిన ముకుందాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు.  క్రిష్ కంచె మూవీతో నటనలో పరిణతి చెందాడు.   అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసిన F2, శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాడు. రీసెంట్‌గా రిలీజైన గాండీవధారి అర్జున ఆశించినంత విజయం సాధించకపోవడంతో నిరాశలో ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే అతని బాధను తగ్గించేందుకు వెకేషన్ చేపట్టారు వరుణ్- లావణ్య త్రిపాఠి.
    సెప్టెంబర్ 06 , 2023
    Gandeevadhari Arjuna Movie Review: రా ఏజెంట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా ఎలా ఉందంటే?
    Gandeevadhari Arjuna Movie Review: రా ఏజెంట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : వరుణ్ తేజ్, సాక్షివైద్య, వినయ్ రాయ్, నాజర్, విమలా రామన్‌, రవివర్మ తదితరులు దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు  నిర్మాత : బీవీఎన్ఎస్ ప్రసాద్  సంగీత దర్శకుడు : మిక్కీ జే మేయర్ సినిమా నిడివి : 2 గంటల 16 నిమిషాలు  విడుదల తేదీ : ఆగస్టు 25, 2023 మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌(Varun tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). ప్రవీణ్‌ సత్తారు(Praveen sattaru) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సాక్షి వైద్య (Sakshi vaidya) హీరోయిన్‌గా నటించింది. BVS ప్రసాద్‌ నిర్మించిన ఈ మూవీకి మిక్కీ జే. మేయర్‌ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గాండీవధారి అర్జున సినిమా ఎలా ఉంది? ఈ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆడియన్స్‌ను ఏమేరకు మెప్పించింది? వరుణ్‌ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం. కథ కథలోకి వెళితే ఆచార్య (నాజర్‌) అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ మంత్రి. విలన్లు చేసే మెడికల్‌ స్కామ్‌ వల్ల మనుషులతో పాటు పర్యావరణం దెబ్బతింటున్నట్లు ఆచార్య గ్రహిస్తాడు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో ఆచార్యను చంపేందుకు విలన్‌ మనుషులు ప్రయత్నిస్తుంటారు. దీంతో తనకు రక్షణ కల్పించడంతో పాటు, మెడికల్‌ స్కామ్‌ను ఎలాగైనా ఆపే బాధ్యతను రా ఏజెంట్‌ అర్జున్ (వరుణ్‌తేజ్‌)కు ఆచార్య అప్పగిస్తాడు. ఈ క్రమంలో అర్జున్‌కు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి? మెడికల్‌ స్కామ్‌ను అతడు ఎలా బయటపెట్టాడు? ఆ స్కామ్‌కు పర్యావరణానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే. https://twitter.com/baraju_SuperHit/status/1694964373507260852?s=20 ఎలా సాగిందంటే గాండీవధారి అర్జున మూవీ రెగ్యులర్ ఫార్మాట్ మాదిరిగానే ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ చూసే కొందరిని తప్ప.. మిగతావారిని ఆకట్టుకునేలా లేదు. ఇంటర్వెల్ వరకు మూవీ సాగదీతగా అనిపిస్తుంది. కొంత నాటకీయత ఉన్నప్పటికీ అదీ ఎలివేట్ చేయబడలేదు. తర్వాత యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. కామెడీ ఆశించే ప్రేక్షకులకు భంగపాటు తప్పదు. మూవీ ఒక లోకేషన్ నుంచి మరో లోకేషన్‌కు ఈజీగా వెళుతుంది. క్లైమాక్స్ కూడా ఊహించినట్టే ఉంది. పెద్దగా మలుపులు, ట్విస్ట్స్ అంటూ ఏమీ లేవు.  ఎవరెలా చేశారంటే..? గాండీవధారి అర్జున మూవీలో వరుణ్ తేజ్ యాక్షన్ రోల్ చేశాడు. తన పర్సనాలిటీతో ఆ పాత్రకు హుందాతనాన్ని తీసుకొచ్చాడు. హాలీవుడ్ యాక్షన్ హీరోను తలపించాడు. అయితే యాక్షన్‌ చిత్రం కావడంతో నటనకు పెద్దగా స్కోప్‌ లేదు. అయినప్పటికీ వరుణ్‌ ఉన్నంతలో తన మార్క్‌ చూపించే ప్రయత్నం చేశాడు. ఇక సాక్షి వైద్య సినిమా మొత్తం ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండదు. నాజర్‌ ఎప్పటిలాగే తన అనుభవాన్ని ఉపయోగించి నటించారు. తమిళ నటుడు వినయ్ రాయ్ విలన్ పాత్రలో మెప్పించాడు. మనీశ్ చౌదరీ, రవి వర్మ పరిధి మేరకు నటించారు. టెక్నికల్‌గా  ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే మిక్కీ జే మేయర్‌ అందించిన సంగీతం సినిమాకు ప్లస్‌ కాలేకపోయింది. ఒక్క పాట కూడా గుర్తుంచుకునేలా లేదు. అటు బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సైతం నామమాత్రంగానే ఉంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు ఇచ్చే BGM లాగా అనిపించలేదు. G. ముఖేశ్‌ ఇచ్చిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఆయన పనితనం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ వరుణ్‌ తేజ్‌ నటనయాక్షన్‌ సన్నివేశాలుసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీడైరెక్షన్‌పాటలునో థ్రిల్స్‌ & నో ట్విస్ట్స్‌ సినిమా రేటింగ్‌: 2.5/5 https://www.youtube.com/watch?v=cBGSJcM8C8s
    ఆగస్టు 28 , 2023
    VARUNLAV:  ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
    VARUNLAV:  ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మనసిచ్చిన ఈ హీరో ఇప్పుడు మనువాడేందుకు రెడీ అవుతున్నాడు. గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌పై సైలెంట్‌గా ఉన్న వీరు ఏకంగా పెళ్లి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలిసి సినిమాల్లో నటించి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నది వీరొక్కరే కాదు. ఈ జాబితాలో ఇప్పటికే ఎంతో మంది ఉన్నారు. ఆ జంటలేవో తెలుసుకుందాం.  https://twitter.com/tupakinews_/status/1667059120313352192?s=20 https://twitter.com/Pallavi_M_K/status/1664277523608518657?s=20 కియారా- సిద్ధార్థ్ మల్హోత్రా బాలీవుడ్ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ షేర్షా సినిమాతో పరిచయం. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరికి పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నయనతార- విఘ్నేష్ శివన్ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నయన్.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. కొంతకాలంగా నడిచిన వీరి ప్రేమాయణం పెళ్లి పీటలెక్కి మరో స్థాయికి చేరుకుంది. 2022లో వీరికి వివాహం కాగా సరోగసి విధానంలో వీరు సంతానాన్ని పొందారు.  Screengrab Instagram:nayanatara నమ్రత- మహేశ్ బాబు నమ్రత, మహేశ్ బాబులది ప్రేమ వివాహమే. వంశీ సినిమాతో తొలిసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు. అప్పుడే మిల్క్ బాయ్ ప్రేమల్లో పడ్డాడు. ఐదేళ్ల పాటు నమ్రతతో ప్రేమాయణం నడిపి చివరికి నాన్న కృష్ణ పర్మిషన్‌తో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం. గౌతమ్, సితార.  అలియా భట్- రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్.. ప్రేమ ద్వారానే ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి చేసిన బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేమలో పడ్డారు. 2022లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ కుమార్తె పుట్టింది.  విజయనిర్మల- కృష్ణ సెలబ్రిటీ కపుల్స్‌లలో ఎప్పటికీ గుర్తుండిపోయే జంట వీరిది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. బాపూ ‘సాక్షి’ సినిమాతో వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. అలా సంవత్సరాలు గడిచాక 1969లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం.  జ్యోతిక- సూర్య  సౌత్‌లో పేరొందిన సెలబ్రిటీ కపుల్ జ్యోతిక- సూర్య. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ఎంతో అభిమానం, ప్రేమ. 2006లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు(దియా), కుమారుడు(దేవ్).  అమల- నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున, అమల సెలబ్రిటీల జంటకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 1992 జూన్‌లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్ధం, కిరాయి దాదా, శివ, నిర్ణయం సినిమాల్లో ఈ జంట కలిసి పనిచేసింది.  నిక్కీ గల్రానీ- ఆది పినిశెట్టి గొడవలతోనే వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. ‘మలుపు’ సినిమా వీరి జీవితాలను మలుపు తిప్పింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య గొడవలు, మనస్పర్దలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత అర్థం చేసుకుని ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ప్రేమలో పడి 2022, మే నెలలో ఒక్కటయ్యారు. జీవిత- రాజశేఖర్ జీవిత, రాజశేఖర్‌లది విచిత్ర ప్రయాణం. తలంబ్రాలు సినిమాతో వీరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ‘ఆహుతి’ సినిమా చిత్రీకరణ సమయంలో రాజశేఖర్‌కి గాయాలైతే దగ్గరుండి చూసుకుంది జీవిత. అలా తమ ప్రేమను పెద్దలతో పంచుకుని నిజ జీవితంలోనూ హీరో, హీరోయిన్లు అయ్యారు. 1991లో వీరి వివాహమైంది. వీరిద్దరికీ ఇద్దరు కూతుళ్లు. శివానీ, శివాత్మికలు హీరోయిన్లుగా చేస్తున్నారు.  షాలిని- అజిత్ బేబి షాలినిగా గుర్తింపు పొందింది షాలిని. తమిళ స్టార్ అజిత్‌తో ప్రేమాయణం పెళ్లి పీటల దాకా తీసుకొచ్చింది. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని 2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. దీపిక పదుకొణె- రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాజీరావ్ మస్తానీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అనంతర కాలంలో ప్రేమలో మునిగి తేలి 2018లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జంటలు కూడా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్-జయా బచ్చన్, శ్రీకాంత్- ఊహ, అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్- విక్కీ కౌశల్, శివబాలాజీ- మధుమిత, వరుణ్ సందేశ్- వితిక, రాధిక- శరత్ కుమార్, ఆర్య- సాయేషా సైగల్ కూడా ప్రేమ వివాహం చేసుకుని అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
    జూన్ 09 , 2023
    Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్
    Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్
    నటీనటులు: అభిరామ్‌ దగ్గుబాటి, గీతికా తివారి, సదా, కమల్‌ కామరాజ్‌, కల్పలత, రవి కాలే, రజత్ బేడి దర్శకత్వం: తేజ సంగీతం: R.P పట్నాయక్‌ సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యామిలీకి ఎంతో పేరు ఉంది. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు వారసులుగా వచ్చిన సురేష్‌బాబు, వెంకటేష్‌ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. సురేష్‌ బాబు విజయవంతమైన సినిమాలు నిర్మిస్తే.. వెంకటేష్‌ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వారి వారసుడుగా వచ్చిన రానా కూడా తనకంటూ ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ‘అహింస’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (జూన్‌ 2) రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?. అభిరామ్‌ తొలి హిట్‌ అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.  కథ రఘు (దగ్గుబాటి అభిరామ్) అహింసావాది. చీమకు కూడా హాని తలపెట్టని మనస్తత్వం అతనిది. రఘు అంటే అతని మరదలు అహల్య (గీతికా తివారి)కి ఎంతో ప్రేమ. వాళ్ళిద్దరికీ నిశ్చితార్థమైన రోజే ఆమెపై ధనలక్ష్మి దుష్యంత రావు (రజత్ బేడీ) ఇద్దరు కుమారులు దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. పూర్తి అహింసావాదైన రఘు వారిపై న్యాయపోరాటానికి దిగుతాడు. అతడికి లాయర్‌ లక్ష్మీ (సదా) సాయం చేస్తుంది. ఈ క్రమంలో లక్ష్మీ కుటుంబాన్ని దుష్యంతరావు చంపేస్తాడు. దీంతో న్యాయంగా, అహింస మార్గంలో దుష్యంతరావును గెలవలేమని భావించిన హీరో ఏం చేశాడన్నది అసలు కథ. ఇది తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.  ఎవరెలా చేశారంటే హీరోగా అభిరామ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. కీలకమైన సన్నివేశాల్లో తన శక్తిమేరకు నటించాడు. ఇదే తొలి సినిమా కావడంతో నటన పరంగా ఓకే అని చెప్పొచ్చు. హీరోయిన్‌ గీతికా తివారి తన నటనతో ఆకట్టుకుంది. అందం, అభినయంతో మెప్పించింది. కొన్ని సీన్లలో అందాలు సైతం ఆరబోసింది. ఇక లాయర్‌ పాత్రలో సదా పర్వాలేదనిపించింది. రవి కాలె సహా మిగతా ఆర్టిస్టులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ తేజ మంచి కథనే ఎంచుకున్నాడు. కానీ, దాన్ని సరిగ్గా ప్రజెంట్‌ చేయలేకపోయారు. సినిమా చూస్తున్నంత ప్రేక్షకుడికి ఏమాత్రం ఆసక్తి ‌అనిపించదు. కొన్ని సీన్లు చూస్తే జయం, నువ్వు నేను సినిమాలే గుర్తుకు వస్తాయి. సినిమా మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. లాజిక్స్‌లతో సంబంధం లేకుండా ఈ సినిమాను తేజ తెరకెక్కించాడు. సినిమా పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడు ఐటెమ్ సాంగ్ రావడం ఆడియన్స్‌కు రుచించదు. కొడుకుల శవాలు ఇంట్లో ఉండగా విలన్‌ ఇంట్లో ఐటెమ్‌ సాంగ్ ఎందుకు పెట్టడం అసలు అర్థం కాదు. దీంతో మూవీ త్వరగా ముగిస్తే బాగుంటుందన్న ఫీలింగ్‌ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. మెుత్తంగా సినిమాలో తేజ మార్క్‌ ఉన్నా రొటీన్‌ సన్నివేశాలతో బోర్ అనిపిస్తుంది.  టెక్నికల్‌గా టెక్నికల్‌ విషయాలకు వస్తే ఆర్పీ పట్నాయక్‌ సంగీతం పర్వాలేదనిపించిది. కొన్ని పాటలు బాగున్నాయి. ‘ఉందిలే’ పాట ఆకట్టుకుంది. చంద్రబోస్‌ అందించిన సాహిత్యం.. లోతైన భావంతో అర్థవంతంగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సమీర్‌రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ సినిమాటోగ్రఫీసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీతరొటీన్‌ సీన్స్లాజిక్‌ లేని సన్నివేశాలు రేటింగ్‌: 2/5
    జూన్ 02 , 2023
    VIRUPAKSHA FULL REVIEW: హారర్, సస్పెన్స్‌ కథాంశంతో  విరూపాక్ష… సాయి ధరమ్‌ తేజ్‌ సూపర్ కమ్‌ బ్యాక్!
    VIRUPAKSHA FULL REVIEW: హారర్, సస్పెన్స్‌ కథాంశంతో  విరూపాక్ష… సాయి ధరమ్‌ తేజ్‌ సూపర్ కమ్‌ బ్యాక్!
    సాయి ధరమ్‌ తేజ్‌ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న అనంతరం చేసిన మెుదటి సినిమా విరూపాక్ష. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. యాక్సిడెంట్ తర్వాత మాట కూడా పడిపోయిందని చెప్పిన సాయి… సినిమాలో ఎలా నటించాడు? సుకుమార్ కాంపౌండ్‌ నుంచి వస్తున్న మరో దర్శకుడు సక్సెస్ అయ్యాడా ? లేదా ? సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం దర్శకుడు: కార్తీక్ దండు నటీ నటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్‌, సోనియా సింగ్, రవికృష్ణ సంగీతం:  అజనీశ్ లోక్‌నాథ్‌ సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌ కథ రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్‌ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ. ఎలా ఉందంటే? రుద్రవరం అనే ఊరికి ఓ జంట శాపం పెట్టడంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. సూర్య పాత్రలో సాయిధరమ్, నందినీగా సంయుక్త మీనన్‌ నటించారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. ఈ సీన్లు ప్రేక్షకులకు కాస్త బోరింగ్‌గానే అనిపిస్తాయి. అయితే, ఇంటర్వెల్‌కు ముందు అసలు కథను ప్రారంభించి అదిరిపోయే సన్నివేశాలు పెట్టడంతో సెకాండాఫ్‌పై ఆసక్తి కలుగుతుంది. ఊరిలో ఒక్కొక్కరు చనిపోతుంటే దాని వెనుకున్న రహస్యాన్ని చేధించే అంశాలతో సెకాండాఫ్‌ను నింపేశారు. కథనం చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుల్ని కచ్చితంగా సీటు అంచుల్లో కూర్చొబెడుతుంది. ప్రీ క్లైమాక్స్‌ వరకు చిత్రం బాగానే ఉంటుంది. చివర్లో కాస్త తడబడ్డారనే చెప్పాలి.  ఎవరెలా చేశారు? సాయిధరమ్ తేజ్‌కి ఇది కమ్ బ్యాక్ సినిమా. నటనలో మరో మెట్టు ఎక్కేశాడు కుర్ర హీరో. సూర్య పాత్రలో లీనమైపోయాడు. సెటిల్డ్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు సాయి. సంయుక్త మీనన్‌ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. వరుసగా హిట్లు కొడుతున్న ఈ హీరోయిన్‌ మరోసారి మెప్పించిందనే చెప్పాలి. తన ఖాతాలో మరో హిట్ వేసుకుంది. ప్రీ క్లైమాక్స్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సోనియా సింగ్, అజయ్ లాంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.  సాంకేతిక పనితీరు సుకుమార్ కాంపౌండ్‌ నుంచి వచ్చిన దర్శకుడు కార్తీక్ దండు మెుదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఉప్పెనతో బుచ్చిబాబు, దసరాతో శ్రీకాంత్‌ ఓదెల ఎలా ఆకట్టుకున్నారో కార్తీక్‌ కూడా అదేస్థాయిలో మెప్పించాడు. విరూపాక్ష చిత్రాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు కార్తీక్. ఈ చిత్రానికి మరో ప్లస్‌ పాయింట్‌ స్క్రీన్‌ ప్లే. సుకుమార్ స్వయంగా అందించిన స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. చిత్రాన్ని ఎక్కడో నెలబెట్టింది.  విరూపాక్ష చిత్రానికి సంగీతంతో ప్రాణం పోశాడు అజనీశ్‌ లోక్‌నాథ్. కాంతార చిత్రానికి మ్యూజిక్ అందించి మెప్పించిన అతడు.. విరూపాక్షలో అందించిన నేపథ్య సంగీతం పెద్ద అసెట్. చిత్రానికి పూర్తి న్యాయం చేశాడు సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. బలాలు కథ, కథనం సాయిధరమ్, సంయుక్త మీనన్ నేపథ్య సంగీతం బలహీనతలు క్లైమాక్స్‌, లవ్‌ ట్రాక్‌ రేటింగ్ 3.25/5
    ఏప్రిల్ 21 , 2023
    Operation Valentine Review In Telugu: ఫైటర్‌ పైలెట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
    Operation Valentine Review In Telugu: ఫైటర్‌ పైలెట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు: వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌, నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ తదితరులు దర్శకత్వం: శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా సంగీతం: మిక్కీ జే మేయర్‌ సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం ఎడిటింగ్‌: నవీన్‌ నూలి సంభాషణలు: సాయి మాధవ్‌ బుర్రా నిర్మాత: సోనీ పిక్చర్స్‌, సందీప్‌ ముద్ద విడుదల: 01-03-2024 వరుణ్‌తేజ్‌ (Varun Tej) హీరోగా దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) కథానాయిక. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సినిమాలో చూపించనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. తెలుగులో రూపొందిన తొలి ఏరియల్‌ యాక్షన్‌ చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఏక‌కాలంలో నిర్మాణం జ‌రుపుకొని ఇవాళ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది?  ఫైట‌ర్ పైల‌ట్ పాత్ర‌లో ఎలా చేశాడు? వరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ అర్జున్ రుద్ర‌దేవ్ అలియాస్ రుద్ర (వ‌రుణ్‌తేజ్‌) ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో స్వ్కాడ్ర‌న్ లీడ‌ర్‌. ‘ఏం జ‌రిగినా చూసుకుందాం’ అంటూ దూకుడు ముందుకు వెళ్లిపోతుంటాడు. వైమానిక ద‌ళంలోనే ప‌నిచేసే రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్ (మానుషి చిల్ల‌ర్‌)తో రుద్ర ప్రేమ‌లో ఉంటాడు. ప్రాజెక్ట్ వ‌జ్ర కోసం న‌డుం క‌ట్టిన స‌మ‌యంలోనే రుద్రకు ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. దాన్నుంచి బయటపడుతున్న క్రమంలోనే అతడు ఆప‌రేష‌న్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ఆప‌రేష‌న్ వెన‌క ఉన్న క‌థేమిటి? ప్రాజెక్ట్ వ‌జ్ర ల‌క్ష్య‌మేమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే వరుణ్‌ తేజ్‌ (Operation Valentine Review in telugu) కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా తన పాత్ర‌లో ఒదిగిపోయాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచి ప్ర‌తిభ చూపించాడు. హీరోయిన్‌గా మానుషి చిల్ల‌ర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది. దాదాపుగా సినిమా అంతా హీరో హీరోయిన్లే తెర‌పై క‌నిపిస్తారు. వీళ్ల జంట చూడటానికి చాలా బాగుంది. మిగిలిన పాత్ర‌ల‌న్నీ ప‌రిమితంగానే క‌నిపిస్తాయి. వారు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించాడు. డైరెక్షన్ ఎలా ఉందంటే భార‌త్‌, పాకిస్థాన్‌ మ‌ధ్య జ‌రిగిన నిజ‌మైన సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో  డైరెక్టర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019లో ఉగ్ర‌వాదులు జ‌రిపిన పుల్వామా దాడులు మొద‌లుకొని, దానికి ప్ర‌తిగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్  వ‌ర‌కూ ప‌లు సంఘ‌ట‌న‌లు ఇందులో ప్ర‌తిబింబిస్తాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం, దేశ భక్తి ప్రధానంగా సాగే సీన్స్‌, పతాక సన్నివేశాలను డైరెక్టర్ చాలా బాగా తెరకెక్కించారు. అయితే నాయ‌కా నాయిక‌ల మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌లోనే గాఢ‌త చూపలేకపోయారు. కథ దాదాపుగా అందరికే తెలిసిందే కావడం.. రచన పరంగా మరిన్ని కసరత్తులు చేయకపోవడం మైనస్‌ అని చెప్పవచ్చు. ఇక క‌థ‌నంలో కూడా ఎక్కడ బలం ఉన్నట్లు అనిపించదు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన ‘ఫైట‌ర్’ క‌థ‌కి ఆపరేషన్‌ వాలెంటైన్ స్టోరీకి దగ్గరి పోలికలు కనిపిస్తాయి.  టెక్నికల్‌గా  సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ముఖ్యంగా విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. (Operation Valentine Review in telugu) మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం మెప్పిస్తుంది. యాక్షన్‌ సన్నివేశాలను నేపథ్య సంగీతం చాలా బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్న‌తంగా ఉన్నాయి. బ‌డ్జెట్ ప‌రంగా ప‌రిమితులున్నా నాణ్య‌మైన విజువ‌ల్స్‌తో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు.  ప్లస్‌ పాయింట్స్‌ వరుణ్‌తేజ్‌ నటనవిజువల్స్‌యుద్ధ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ క‌థ‌నంహీరో, హీరోయిన్ కెమెస్ట్రీ Telugu.yousay.tv Rating : 3/5 Click Here For English Review https://telugu.yousay.tv/strongvarana-taja-varun-tej-garacha-maka-talayana-asakatakaramana-sagatala-strong.html
    మార్చి 01 , 2024
    Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!
    Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!
    ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించిన ‘హనుమాన్’ జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషించింది. అటు థియేటర్లతో పాటు ఓటీటీ, టెలివిజన్‌ ప్రీమియర్స్‌లోనూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే ‘హనుమాన్‌’ మరో ఘనత సాధించింది. దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. యంగ్‌ హీరో తేజ సజ్జా కలెక్షన్ల పరంగా బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), మహేష్‌ బాబు (Mahesh Babu), అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan) చిత్రాలను వెనక్కి నెట్టాడు. ఈ ఏడాది హైయస్ట్‌ కలెక్షన్స్‌ రాబట్టిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  హనుమాన్‌ (HanuMan) తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్‌ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడం గమనార్హం. ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో.. అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా చేసింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సముద్రఖని, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ‘జీ 5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.  ఫైటర్‌ (Fighter) హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొనే (Deepika Padukone), అనిల్‌ కపూర్‌ (Anil Kapoor) ప్రధాన పాత్రల్లో చేసిన బాలీవుడ్‌ చిత్రం 'ఫైటర్‌'.. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ. 337.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా హిందీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.  మంజుమ్మెల్‌ బాయ్స్‌ (Manjummel Boys) మలయాళం సెన్సేషన్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’.. ఈ ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ.242.3 కోట్లు కొల్లగొట్టింది. అటు మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం ఇది హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో స్ట్రీమింగ్‌లో ఉంది.  షైతాన్‌ (Shaitaan) బాలీవుడ్‌ లేటెస్ట్‌ చిత్రం 'షైతాన్‌' ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉంది. అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan), మాదవన్‌ (Madhavan), జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ.. రూ.211.06 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.40 కోట్లు. ఇందులో విలన్‌గా కనిపించిన మాధవన్‌.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘షైతాన్‌’ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ భాషలో అందుబాటులో ఉంది.  గుంటూరు కారం (Guntur Kaaram) మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం'.. ప్రస్తుత జాబితాలో టాప్‌ - 5లో నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 171.5 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ప్రకాష్‌ రాజ్‌, జయరామ్‌, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా ఉన్నారు. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు. ది గోట్‌ లైఫ్‌ (The Goat Life) మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) లీడ్‌ రోల్‌లో చేసిన 'ది గోట్‌ లైఫ్‌'.. తెలుగులో ఆడు జీవితం అనే పేరుతో విడుదలైంది. ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.158.15 కోట్లు సాధించి టాప్‌ - 6లో నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ. 82 కోట్లు ఖర్చు అయ్యింది. కాగా, ఈ మూవీ మే 26 నుంచి హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.  క్రూ (Crew) టబూ, కరీనా కపూర్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన 'క్రూ' (Crew) ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రూ.75 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.156.36 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మే 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.  ఆవేశం (Aavesham) ఈ ఏడాది విడుదలై మంచి వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం ‘ఆవేశం’. పుష్ప ఫేమ్‌ ఫహద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ. 155 కోట్లు రాబట్టింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ. 30 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ప్రేమలు (Premalu) మలయాళం సెన్సేషన్‌ ప్రేమలు కూడా.. రూ.136 కోట్ల వసూళ్లు సాధించి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్‌, మమితా బైజు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. టిల్లు స్క్వేర్‌ (Tillu Square) సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా చేసిన లెటేస్ట్‌ చిత్రం.. టిల్లు స్క్వేర్‌ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో టాప్‌ 10లో నిలిచింది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఇందులో సిద్ధూకు జోడీగా అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లో ఉంది. 
    మే 22 , 2024
    Nora Fatehi: కిర్రాక్ పోజులతో హీటెక్కిస్తున్న నోరా ఫతేహి.. త్వరలో వరుణ్ తేజ్‌తో రొమాన్స్!
    Nora Fatehi: కిర్రాక్ పోజులతో హీటెక్కిస్తున్న నోరా ఫతేహి.. త్వరలో వరుణ్ తేజ్‌తో రొమాన్స్!
    బాలీవుడ్ అందాల తెగింపు నోరా ఫతేహి మరోసారి తన హాట్ అందాలను సోషల్ మీడియాలో రచ్చకు పెట్టింది. చమ్కీలు పొదిగిన ట్రాన్సఫరెంట్ డ్రెస్‌లో హాట్‌గా కనిపించింది.  చెవులకు లోతైన లోలాకులు వంటినిండా చమ్కీల మెరుపుతో నోరా అందం మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ రియల్లీ హాట్, ఏంజెల్‌లా ఉన్నావంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నోరా ఫతేహి తెలుగులో అడపా దడపా కనిపించినా ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో ఇప్పటి వరకు నటించలేదు. బాహుబలి 1లో 'మనోహరి' అంటూ  ఐటెం సాంగ్ పాడిన ముగ్గురు వయ్యారి భామల్లో ఈ ముద్దుగుమ్మ కూడా ఉంది. ప్రస్తుతం వరుణ్‌ తేజ్ సరసన మట్కా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో కనువిందు చేయనుంది. మట్కాలో నోరా ఫతేహితో పాటు మరో హీరోయిన్‌ మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది. ఈ సినిమా కరుణ కుమార్ డైరెక్షన్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అటు పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలోనూ ఈ సొగసుల కోవ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. ఇక నోరా పర్సనల్ విషయాలకొస్తే.. నోరా పుట్టి పెరిగింది కెనడాలో. చదువు కూడా బాగానే చదివింది. టోరంటోలోని యార్క్ యూనివర్సిసిటీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా సంపాదించింది. ఇక సుందరాంగికి డ్యాన్స్ అంటే మక్కువ. అందులోనూ బెల్లీ డ్యాన్స్‌ను ఇరగదీస్తుంది.  https://twitter.com/Paleolitelly/status/1696461720754008307?s=20 యాక్టింగ్‌పై ఉన్న ఇష్టంతో తొలుత మోడలింగ్ చేసిన నోరా.. ఆతర్వాత యాక్టింగ్‌ వైపు తన దృష్టి మరల్చింది. కెనడా నుంచి ఇండియాకు వచ్చాక ఇక్కడ కొన్ని చిన్న చిన్న యాడ్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది.  అలా బాలీవుడ్ నిర్మాతల దృష్టిలో పడిన  నోరా..2014లో బాలీవుడ్‌లో ‘రోర్’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఊపిరి సినిమాలో నాట్య మయూరిగా కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ బాంబ్.. టెంపర్ చిత్రంలో 'ఇట్టాగే రెచ్చిపోదాం' పాటలో  రెచ్చిపోయింది. టెంపర్‌లో ఐటెం సాంగ్.. నోరాకు తెలుగులో మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది. బాహుబలి, కిక్ 2, ఊపిరి, లోఫర్,  షేర్ చిత్రాల్లో తన అందచందాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం సెక్సీ డాల్ 100%, మడగావ్ ఎక్స్‌ప్రెస్, డ్యాన్సింగ్ డాడ్ వంటి చిత్రాల్లో నటిస్తోంది. నోరా తన అందం, నటనతోనే కాకుండా పలు రియాల్టీ షోలు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహహించింది. డ్యాన్స్ ప్లస్, డ్యాన్స్ దివానే 3,  ఇండియా బెస్ట్ డ్యాన్సర్ వంటి షోలకు జడ్జిగా వ్యవహరించింది.అంతేకాదు పలు పాప్ సాంగ్స్ ఆల్బమ్స్‌లోని తన అందాల దాడితో రచ్చ చేసింది. 'బేబి మర్‌వాకే మనేగి', 'అచ్చా సిలా దియా', డ్యాన్స్ మేరీ రాణి వంటి వీడియో ఆల్బమ్స్ బాగా ఆకట్టుకున్నాయి.
    సెప్టెంబర్ 01 , 2023
    Bharatanatyam Review: డైరెక్టర్‌ అయ్యేందుకు దొంగగా మారిన హీరో.. ‘భరతనాట్యం’ సినిమా ఎలా ఉందంటే?
    Bharatanatyam Review: డైరెక్టర్‌ అయ్యేందుకు దొంగగా మారిన హీరో.. ‘భరతనాట్యం’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : సూర్య తేజ, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్‌ వంశీ, నాగ మహేష్‌, సత్తన్న తదితరులు దర్శకత్వం : కేవీఆర్‌ మహేంద్ర సంగీతం :  వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్‌. శాఖమూరి ఎడిటింగ్‌ : రవితేజ గిరజాల నిర్మాత : పాయల్‌ సరాఫ్‌ నిర్మాణ సంస్థ : పీఆర్‌ ఫిల్మ్స్‌ విడుదల తేదీ: ఏప్రిల్‌ 5, 2024 కొత్త కుర్రాడు సూర్య తేజ ఏలే (Actor Surya Teja Aelay) హీరోగా మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా చేసిన చిత్రం ‘భరతనాట్యం’ (Bharatanatyam Review In Telugu). ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలా మార్చిందన్నది ఈ చిత్రం కథ. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, వైవా హర్ష వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఏప్రిల్‌ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? కథేంటి రాజు సుందరం (సూర్య తేజ ఏలే) అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ డైరెక్టర్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. పేద కుటుంబం నుండి రావడంతో అతడ్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతుంటాయి. దీంతో డబ్బు దొంగతనం చేసి ఇండస్ట్రీలో సెటిల్‌ అవ్వాలని రాజు భావిస్తాడు. ఇందుకోసం ఓ రౌడీ గ్యాంగ్‌ నుంచి డబ్బు అనుకొని పొరపాటున డ్రగ్స్‌ ఉన్న భరతనాట్యం బ్యాగ్‌ను దొంగిలిస్తాడు. ఈ క్రమంలో పోలీసు ఆఫీసర్‌ శకునికి దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రౌడీ గ్యాంగ్‌ నుంచి రాజుకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఈ సమస్య నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? డైరెక్టర్ కావాలన్న అతడి కల నెరవేరిందా? లేదా? హీరోయిన్‌ మీనాక్షి గోస్వామితో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? హీరోగా సూర్య తేజ ఏలే పర్వాలేదనిపించాడు. అయితే నటన పరంగా ఇంకాస్త పరిణితి చెందాల్సి ఉంది. అతడి పాత్రకు చెప్పిన డబ్బింగ్‌ కూడా పెద్ద సింక్‌ కాలేదు. హీరోయిన్‌ మీనాక్షి గోస్వామి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. హీరోయిన్‌లా కాకుండా అక్కడక్కడా ఓ గెస్ట్‌గా మెరిసింది. కనిపించినంత సేపు తన అందం, అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా హర్ష తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వులు పూయించాడు. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే ‘దొరసాని’ (Dorasaani) తో మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న కేవీఆర్ మహేంద్ర (KVR Mahendra) కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమాలో అతడి మార్క్‌ ఎక్కడా కనిపించదు. ‘స్వామిరారా’ (Swamy Ra Ra) స్టైల్లో ఓ క్రైమ్ కామెడీ కథగా తెరకెక్కించాలని భావించి ఇందులో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ‘స్వామిరారా’ రేంజ్లో ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఇందులో ఒక్కటి కూడా లేదు. ఏ దశలోనూ సినిమా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఇంటర్వెల్‌ వరకూ అసలు కథ ఏంటో తెలియక ప్రేక్షకులు సతమతమవుతుంటారు. దర్శకుడు మహేంద్ర ఒక్క సన్నివేశాన్ని కూడా సందర్భానుసారంగా తెరకెక్కించినట్లు అనిపించదు. సెకండాఫ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది.  టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. వెంకట్ ఆర్‌ శాఖమూరి అందించిన సినిమాటోగ్రాఫీ బాగుంది. వివేక్‌ సాగర్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం కాస్త బెటర్ అనిపిస్తుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ వైవా హర్ష కామెడీసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీసందర్భానుసారంగా లేని సీన్లుసంగీతం Telugu.yousay.tv Rating : 1.5/5 
    ఏప్రిల్ 05 , 2024
    Hanuman Movie OTT: హనుమాన్‌ ఓటీటీ ఆలస్యంపై డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ క్లారిటీ.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌!
    Hanuman Movie OTT: హనుమాన్‌ ఓటీటీ ఆలస్యంపై డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ క్లారిటీ.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌!
    యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja), అమృత అయ్యర్ (Amritha Aiyer) జంటగా నటించిన తొలి తెలుగు సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’ (Hanu Man). ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) డైరెక్షన్‌లో సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం.. బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఆశ్చర్యపరుస్తోంది. అయితే సంక్రాంతికి రిలీజైన చిత్రాలన్నీ ఇప్పటికే ఓటీటీలో విడుదలై సందడి చేస్తున్నాయి. దీంతో హనుమాన్‌ రాక ఎప్పుడంటూ ఓటీటీ ప్రేక్షకులు గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నారు. మార్చి 16న హనుమాన్‌ హిందీ వెర్షన్‌ విడుదలవుతున్నప్పటికీ తెలుగులో ఎప్పుడు వస్తుందో తెలియక ఆడియన్స్ తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ సినిమాపై ఓ అపడేట్‌ ఇచ్చాడు.  డైరెక్టర్ ఏమన్నారంటే! హనుమాన్‌ ఓటీటీ రిలీజ్‌ ఆలస్యంపై సినిమా లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పందించాడు. ‘హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా చేయలేదు. సినిమాను వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకువచ్చేందుకు మేము అహర్నిశలు కొన్ని విషయాల పట్ల దృష్టి సారించాం. ఎప్పుడూ మీకు మంచి బెస్ట్ కంటెంట్ ఇవ్వడమే మా ఉద్దేశం తప్పా ఇంకేం లేదు. దయచేసి అర్థం చేసుకోడానికి ప్రయత్నించి మాకు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. ధన్యవాదాలు’ అని ఎక్స్‌ (ట్విట్టర్‌)లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.  https://twitter.com/PrasanthVarma/status/1768483659928265154 తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌! హనుమాన్‌ సినిమా స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ 5' (Zee 5) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ పక్క హిందీలో స్ట్రీమింగ్‌ డేట్‌ కన్ఫార్మ్‌ కాగా తెలుగు ఆడియన్స్‌కు మాత్రం ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో 'జీ 5' కూడా తెలుగు వెర్షన్‌ స్ట్రీమింగ్‌పై ఆసక్తికర ట్వీట్ పెట్టింది. ‘ఎంతోకాలం ఎదురుచూసిన క్షణం ఆసన్నమైంది. జీ5లో ఇంగ్లీష్ సబ్‌ టైటిల్స్‌తో హనుమాన్ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి’ అంటూ రాసుకొచ్చింది. డైరెక్టర్‌తో పాటు ఓటీటీ సంస్థ కూడా స్ట్రీమింగ్‌ డేట్‌ను ప్రకటించకపోవడంతో ఆడియన్స్ మరింత నిరాశ చెందుతున్నారు. ఇంకెన్ని రోజులు ఈ ఎదురు చూపులు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే హనుమాన్‌ రేపే హిందీతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముందని టాక్‌ వినిపిస్తోంది.  https://twitter.com/ZEE5Telugu/status/1768250898784854434 హిందీలో డబుల్‌ ధమాకా ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో సినిమా’ (Jio Cinema)లో మార్చి 16 నుంచి ఈ సినిమా హిందీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఇటీవల ట్వీట్‌ రూపంలో ప్రకటించాడు. ఇక అదే రోజూ టెలివిజన్‌ ప్రీమియర్‌గానూ హనుమాన్‌ రానుంది. మార్చి 16 రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ (Colors Cineplex) ఛానల్‌లో హనుమాన్‌ ప్రసారం కానుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మతో పాటు ‘కలర్స్‌ సినీప్లెక్స్‌’ సంస్థ తమ సోషల్‌ మీడియా ఎక్స్‌ ఖాతాలో ధ్రువీకరించింది. దీంతో హిందీ ప్రేక్షకులు.. హనుమాన్‌ను ఓటీటీలో చూసేందుకు సిద్ధమవుతున్నారు. 
    మార్చి 15 , 2024
    Hanuman Movie: ‘హనుమాన్‌’ టీమ్‌ డబుల్ ధమాకా.. నిరాశలో తెలుగు ఆడియన్స్‌!
    Hanuman Movie: ‘హనుమాన్‌’ టీమ్‌ డబుల్ ధమాకా.. నిరాశలో తెలుగు ఆడియన్స్‌!
    టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘హనుమాన్’ (Hanuman). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. భారీ కలెక్షన్స్ రాబట్టి ఎవరూ ఊహించని విధంగా అందరి మెప్పు పొందింది. అయితే ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై దాదాపు 2 నెలలు పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. దీంతో హనుమాన్ ఎప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌లోకి వస్తుందా అని ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ ఎక్స్‌ వేదికగా డబుల్ గుడ్‌న్యూస్‌ ప్రకటించారు.  డబుల్‌ ధమాకా ఏంటంటే? ఓటీటీ ప్రేక్షకుల నిరీక్షణను పటాపంచలు చేస్తూ హనుమాన్ టీమ్‌.. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ తేదీని అధికారికంగా ప్రకటించింది. మార్చి 16 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ట్వీట్‌ రూపంలో తెలియజేశారు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. మార్చి 16న ఓటీటీతో పాటు టెలివిజన్‌ ప్రీమియర్‌గానూ హనుమాన్‌ రానుంది. ఆ రోజు రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ (Colors Cineplex) ఛానల్‌, ఓటీటీ వేదిక జియో సినిమా (Jio Cinema)లో హనుమాన్‌ ప్రసారం అవుతుందని డైరెక్టర్‌ తన పోస్టులో చెప్పుకొచ్చారు. ‌అయితే ఇది కేవలం హిందీలో మాత్రమే టెలికాస్ట్‌ కావడం గమనార్హం. ఈ వివరాలను ముందుగా ‘కలర్స్‌ సినీప్లెక్స్‌’ సంస్థ తమ సోషల్‌ మీడియా ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ పెట్టింది. దానిని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రీట్వీట్‌ చేయడంతో అధికారికంగా ప్రకటించినట్లైంది. https://twitter.com/PrasanthVarma/status/1766116151636140450 మరి తెలుగులో ఎప్పుడు? హనుమాన్‌ చిత్రానికి సంబంధించిన తెలుగు స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’ (Zee5) దక్కించుకుంది. మార్చి 2 నుంచి ‘జీ 5’లో ‘హనుమాన్‌’ స్ట్రీమింగ్‌ అవుతుందంటూ కొన్ని రోజులు ప్రచారం కూడా జరిగింది. తర్వాత, మార్చి 8న శివరాత్రి సందర్భంగా హనుమాన్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు టాక్‌ వినిపించింది. దీంతో, కొందరు అభిమానులు సోషల్‌ మీడియాలో ‘జీ5’ (Zee 5) సంస్థ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ఈ సినిమా ఎప్పుడొస్తుందని కోరారు. దానిపై స్పందించిన సదరు సంస్థ విడుదల తేదీపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. తాజా పోస్టులో డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కూడా తెలుగు స్ట్రీమింగ్‌ తేదీని ప్రకటించకపోవడంతో తెలుగు ఆడియన్స్ నిరాశ చెందుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ సస్పెన్స్‌ భరించాలని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే రెండ్రోజుల్లో దీనిపై క్లారిటీ రావొచ్చని సమాచారం.  తెలుగు రాష్ట్రాల్లో తగ్గని జోరు! హనుమాన్‌ చిత్రం విడుదలై దాదాపు 2 నెలలు దాటినప్పటికీ థియేటర్లలో ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. శుక్రవారం శివరాత్రి సందర్భంగా హనుమాన్‌ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని హనుమాన్‌ థియేటర్లలో ఆక్యుపెన్సీ రేటింగ్‌ గణనీయంగా పెరిగినట్లు వార్తలు వచ్చాయి. అటు డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ సైతం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ఆసక్తిక ట్వీట్‌ సైతం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ‘హనుమాన్‌’ హౌస్‌ఫుల్‌ కావడం చూసి తన హృదయం ఆనందంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు.  https://twitter.com/PrasanthVarma/status/1766064148956532944 సీక్వెల్‌లోనూ విలన్‌ అతడేనా? ప్రస్తుతం ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా 'జై హనుమాన్‌' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలి భాగంలో సూపర్‌ విలన్‌గా నటించిన 'వినయ్ రాయ్‌' (Vinay Roy) పార్ట్‌ 2లోనూ ప్రతినాయకుడిగా కనిపిస్తాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌ను డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ షేర్‌ చేసిన వీడియో మరింత బలపరుస్తోంది. ‘హనుమాన్ సూపర్ విలన్ మైఖేల్ ఆఫ్ స్క్రీన్ షెనానిగాన్స్’ అంటూ వినయ్‌ రాయ్‌కు సంబంధించిన ఓ వీడియోను తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ పోస్టు చేశారు. వినయ్‌ సినిమాలో మాదిరిగానే ఫేస్‌కు మాస్క్, బ్లాక్‌ డ్రెస్‌ ధరించి హోటల్‌ సిబ్బందికి షాక్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఎంజాయ్‌ చేస్తున్న నెటిజన్లు.. 'జై హనుమాన్‌'లోనూ వినయ్‌ విలన్‌గా కనిపిస్తాడా? అనే డౌట్‌ను రెయిజ్‌ చేస్తున్నారు. https://twitter.com/PrasanthVarma/status/1765336587184034177
    మార్చి 09 , 2024
    Operation Valentine Box Office Collections:  ఫస్ట్ వీకెండ్ తీవ్రంగా నిరాశ పరిచిన వసూళ్లు.. కారణం ఇదే!
    Operation Valentine Box Office Collections:  ఫస్ట్ వీకెండ్ తీవ్రంగా నిరాశ పరిచిన వసూళ్లు.. కారణం ఇదే!
    మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej), మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ఆపరేషన్‌ వాలెంటైన్‌ (Operation Valentine). భారీ అంచనాల నడుమ గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రంలో.. ఫైటర్‌ పైలెట్‌గా వరుణ్‌ తేజ్‌ మంచి నటన కనబరిచాడు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమాకు తిరుగుండదని అంతా భావించారు. కానీ ఫస్ట్‌ వీకెండ్‌ కలెక్షన్స్‌ చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. కలెక్షన్స్‌కు ఎంతో కీలకమైన తొలి వీకెండ్‌లోనే ఈ చిత్రం రూ.6 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  బ్రేక్ ఈవెన్‌ కష్టమే! భారత వైమానిక దళం (Operation Valentine Weekend Collections) ఆధారంగా వచ్చిన తొలి తెలుగు చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. దీంతో సహజంగానే అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ చిత్రం విడుదలకు ముందు కూడా మంచి బిజినెస్‌ చేసింది. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు రూ.17 కోట్లకు అమ్ముడుపోవడం గమనార్హం. తొలి షోకు వచ్చిన పాజిటివ్‌ టాక్‌ను బట్టి ఈజీగానే బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని అంతా భావించారు. అయితే తొలి వీకెండ్‌ వసూళ్లను చూసి మూవీ టీమ్‌ అంచనాలు తలకిందులైనట్లు కనిపిస్తోంది. కనీసం బ్రేక్ ఈవెన్‌ సాధిస్తుందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.  50% దాటని ఆక్యుపెన్సీ! ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రాన్ని వరుణ్ తేజ్‌ (Varun Tej)తో పాటు చిత్ర యూనిట్‌ చాలా బాగా ప్రమోట్‌ చేసింది. క్రమం తప్పకుండా సినిమాకు సంబంధించిన పోస్టర్లు, అప్‌డేట్స్‌ ఇస్తూ ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమా ఒకేసారి రిలీజ్‌ చేయడంతో బాలీవుడ్‌లోనూ మేకర్స్‌ ప్రమోషన్స్‌ నిర్వహించారు. అయితే హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఆక్యుపెన్సీ ఎప్పుడూ 50 శాతం దాటలేదు. తొలి షో నుంచే మూవీకి నెగటివ్ రివ్యూలు రావడం కూడా సినిమాను దెబ్బ తీసింది. ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీని తెలుగు ప్రేక్షకులు అసలు ఆదరించలేదు. ఇదేనా కారణం? అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతుండటం, పోటీపరీక్షలకు నోటిఫికెషన్లు జారీ కావడం వంటి అంశాలు ఈ చిత్రం వసూళ్ల ప్రభావం పడింది. పాజిటివ్ టాక్ ఉండటంతో వీకెండ్స్‌లో ఈ చిత్రం కలెక్షన్లు (Operation Valentine Box Office Collection) భారీగా పెరిగే అవకాశం ఉంది హిందీలో దెబ్బతీసిన ‘ఫైటర్‌’! ఇటీవల హిందీలో హృతిక్‌ రోషన్‌ హీరోగా రూపొందిన ‘ఫైటర్‌’ (Fighter) చిత్రం రిలీజైంది. ఈ చిత్రం కూడా భారత వైమానిక దళం కాన్సెప్ట్‌తోనే విడుదలైంది. పుల్వామా దాడి, తర్వాత ఇండియా తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలు తెరకెక్కాయి. పైగా ఈ రెండు చిత్రాల విడుదలకు పెద్దగా గ్యాప్ కూడా లేకపోవడంతో హిందీలో ‘ఆపరేషన్‌ వాలెంటైన్’ పెద్దగా ఆదరణ లభించలేదు. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్‌కు తెలుగు, హిందీ భాషల్లో ఈ ‘ఆపరేషన్ వాలెంటైన్’ నిరాశనే మిగిల్చింది. సినిమాను అవే దెబ్బతీశాయా? ‘ఆప‌రేష‌న్ వాలెంటైన్’ సెట‌ప్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, హీరో యాక్టింగ్ బాగున్నా.. కథలో స్ట్రాంగ్ ఎమోష‌న్ క‌నిపించ‌దు. స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌ను స‌క్సెస్ చేయ‌డంలో వైమానిక ద‌ళం ప‌డిన క‌ష్టాన్ని పైపైన చెప్పిన‌ట్లుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల ల‌వ్‌స్టోరీ సైతం స‌రిగా వ‌ర్క‌వుట్ కాలేదు. ఈ మూవీలో ఎయిర్‌ఫోర్స్ అధికారులు వాడే డైలాగ్స్ కామ‌న్ ఆడియెన్స్‌కు చాలా వరకు అర్థం కాలేదు. గ్రాఫిక్స్ విష‌యంలో కూడా అక్క‌డ‌క్క‌డ కాంప్ర‌మైజ్ అయిన‌ట్లుగా కనిపిస్తుంది. ఇవన్నీ సినిమాపై కలెక్షన్లపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  త్వరగానే ఓటీటీలోకి! ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర మూవీకి పెద్దగా ఆదరణ లభించకపోవడంతో ఓటీటీలోకి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలి వారంలోనే వరుణ్ తేజ్ మూవీ ప్రైమ్ వీడియోలోకి రావచ్చు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ తన నెక్ట్స్ మూవీ మట్కా (Matka)లో నటిస్తున్నాడు. సాక్నిక్‌ లెక్కల ప్రకారం ఇదిలా ఉంటే 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' కలెక్షన్స్‌ వివరాలను ప్రముఖ సినిమా వెబ్‌సైట్‌ 'సాక్నిక్‌' వెల్లడించింది. దాని ప్రకారం వరుణ్ తేజ్‌ సినిమా కలెక్షన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.  తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల నెట్‌ కలెక్షన్స్‌ - రూ.4.42 కోట్లు హిందీలో మూడు రోజుల నెట్‌ కలెక్షన్స్‌ -రూ. 1.29 కోట్లు దేశవ్యాప్తంగా మూడు రోజుల నెట్‌ కలెక్షన్స్ - రూ. 5.71 కోట్లు ఓవర్సీస్‌లో మూడు రోజుల నెట్‌ కలెక్షన్స్ - రూ.0.25కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ వాలెంటైన్స్ వసూళ్లు - రూ.6 కోట్లు
    మార్చి 04 , 2024
    Aadikeshava Review: యాక్షన్‌ సీన్లలో రుద్రతాండవం చేసిన మెగా మేనల్లుడు.. ‘ఆదికేశవ’ ఎలా ఉందంటే?
    Aadikeshava Review: యాక్షన్‌ సీన్లలో రుద్రతాండవం చేసిన మెగా మేనల్లుడు.. ‘ఆదికేశవ’ ఎలా ఉందంటే?
    నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, సదా, సుదర్శన్, రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుమన్, అపర్ణా దాస్ తదితరులు   రచన - దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్. రెడ్డి సినిమాటోగ్రఫీ: డడ్లీ  సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య విడుదల తేదీ: నవంబర్ 24, 2023   మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ తన తొలి సినిమా ‘ఉప్పెన’ (Uppen Movie)తో బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన చిత్రాలు ఆ స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తాజాగా నటించిన 'ఆదికేశవ' మూవీపై వైష్ణవ్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో మాస్‌ లుక్‌లో వైష్ణవ్‌ కనిపించాడు. మరి, 'ఆదికేశవ'తో ఆయన విజయం అందుకున్నారా? లేదా?. వైష్ణవ్‌-శ్రీలీల జోడీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ బాలు (వైష్ణవ్‌ తేజ్‌) తల్లిచాటు బిడ్డగా గారాబంగా పెరుగుతాడు. కానీ, కళ్లముందు అన్యాయం జరిగితే అసలు సహించడు. ఎంతటివాళ్లనైనా ఎదిరించే మనస్తత్వం అతడిది. తల్లిదండ్రుల బలవంతంతో కాస్మోటిక్‌ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు. కంపెనీ సీఈవో చిత్రావతి(శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో రాయలసీమలోని బ్రహ్మసముద్రం ప్రాంతం నుంచి వచ్చిన ఓ పెద్దాయన బాలుకు అసలైన కుటుంబం వేరే ఉందని చెబుతాడు. అతడి అసలు పేరు రుద్ర కాళేశ్వర్‌రెడ్డి అని తెలియజేస్తాడు. ఇంతకీ బాలు ఎవరు? బ్రహ్మ సముద్రం వెళ్లాక అక్కడ ఏం జరిగింది? ఆ ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న చెంగారెడ్డి (జోజు జార్జ్‌)ని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎలా సాగిందంటే ప్రథమార్థం మెుత్తం సరదా సరదాగా కాలక్షేపంగా సాగిపోతుంది. హైదరాబాద్‌లో స్నేహం, ప్రేమ, కుటుంబ సన్నివేశాలు కనిపిస్తాయి. విరామం సమయానికి కథ మలుపు తిరుగుతుంది. ద్వితీయార్థం కథంతా సీమలో చెంగారెడ్డితో ఢీ కొట్టడంతో సాగిపోతుంది. హీరో హీరోయిన్‌ కలవగానే ఓ పాట, విలన్‌ హీరో ఎదురుపడగానే ఓ ఫైట్‌ అన్నట్లు సినిమా సాగిపోతుంది.  ఎవరెలా చేశారంటే వైష్ణవ్‌తేజ్‌ మరోమారు మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. ప్రథమార్థంలో లవర్‌ బాయ్‌గా సరదాగా ఉండే పాత్రలో ఆకట్టుకున్నాడు. ద్వితీయార్థంలో రుద్రకాళేశ్వర్‌రెడ్డిగా వీరోచితాన్ని ప్రదర్శించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక శ్రీలీలకు నటన పరంగా పెద్దగా స్కోప్‌ లేదు. కానీ డ్యాన్సుల్లో మాత్రం ఎప్పటిలాగే ఇరగదీసింది. హీరో తల్లి పాత్రలో రాధిక మెప్పించారు. విలన్‌గా జోజు జార్జ్‌ క్రూరంగా కనిపించినా ఆ పాత్ర ప్రభావం తక్కువే. ఇక అపర్ణాదాస్‌, సుమన్‌, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సుదర్శన్‌ అక్కడక్కడా నవ్వించాడు డైరెక్షన్‌ ఎలా ఉందంటే? కథలో ప్రేమ, కుటుంబ బంధాలు, డ్రామా, రాజకీయం తదితర అంశాలు పుష్కలంగా ఉన్నా వాటిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి తడబడ్డాడు. ఒకట్రెండు మలుపులు తప్ప కథలో కానీ, కథనంలో కానీ కొత్తదనమేమీ కనిపించదు. పాత రోజుల్లో వచ్చిన ఫ్యాక్షన్‌ సినిమాల్లాగే డైరెక్టర్‌ కథను చెప్పినట్లు అనిపిస్తుంది. భావోద్వేగాలతో కట్టిపడేసే సీన్లు, తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి ఎక్కడా కనిపించదు. రచనలో బలం లేకపోయిన దర్శకుడి మేకింగ్‌ మాత్రం బాగుంది.  టెక్నికల్‌గా  సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. డడ్లీ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జీవీ ప్రకాశ్‌ పాటలు గుర్తుపెట్టుకునేలా లేవు. కానీ, నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాకు సంబంధించిన మిగతా విభాగాలు అన్నీ మంచి పనితీరునే కనబరిచాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ వైష్ణవ్‌తేజ్‌ నటనమలుపులునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ కథ, కథనంపండని భావోద్వేగాలు  రేటింగ్‌: 2.5/5
    నవంబర్ 24 , 2023
    Varunlav: కాక్‌టైల్‌ పార్టీలో వరుణ్‌తేజ్‌ను ఆట పట్టించిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్
    Varunlav: కాక్‌టైల్‌ పార్టీలో వరుణ్‌తేజ్‌ను ఆట పట్టించిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్
    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి కార్యక్రమం.. ఇటలీలో జరుగుతున్న సంగతి సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నాయి. తాజాగా కాబోయే వధువరులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట కుటుంబ సభ్యులకు కాట్‌ టైల్‌ పార్టీ ఇచ్చింది. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మెగాబాబు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ త్వరలో లావణ్య త్రిపాఠితో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.  వీరిద్దరు కొంత కాలంగా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ కొత్త జంట ఇక్కడ కాదని డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటోంది. వీరిద్దరు తొలిసారిగా అంతరిక్షం సినిమాలో జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. అక్కడే వరుణ్, లావణ్యలు ప్రేమలో పడ్డారు.  తమ ప్రేమ చిగురించిన ఇటలీలోనే  పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇటలీలోని టస్కానీలో ఈ కొత్త జంట వివాహం చేసుకోనుంది.  ఈ పెళ్లి కూడా పెద్దగా హడావుడి లేకుండా ఇరుకుటుంబాలకు చెందిన అతికొద్దిమంది కుటుంబ సభ్యుల నడుమ జరగనుంది. నవంబర్ 1న ఈ లవ్ బర్డ్స్‌ పెళ్లి బంధం ద్వారా ఒక్కటి కానున్నారు. అయితే సోమవారం రాత్రి వరుణ్‌తేజ్- లావణ్య జంట కుటుంబ సభ్యులకు కాక్‌టైల్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ బోర్గోసాన్ ఫెలిస్ రిసార్ట్‌లో కాక్టైల్ పార్టీ ఘనంగా జరిగింది. ఈ పార్టీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు హాజరయ్యారు. అలాగే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఉత్సాహంగా గడిపాడు. కుటుంబ సమేతంగా దిగిన ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. ఈక్రమంలో అల్లు అర్జున్ వరుణ్‌ను సరదాగా ఆట పట్టించాడు. నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో అంటూ ఫన్నీగా బెదిరించాడు.   మెగా హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్  ఈ పార్టీలో సందడి చేశారు. చాలా రోజుల తర్వాత అటు మెగా ఫ్యామిలీని ఇటు అల్లు ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్‌లో చూడటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ దంపతులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటలీలోనే లావణ్య త్రిపాఠి పేరెంట్స్ దియోరాజ్, కిరణ్ త్రిపాఠిలతో కలిసి దగ్గరుండి పెళ్లి వేడుకకు కావాల్సిన పనులు చేస్తున్నారు. నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు వరుణ్- లావణ్య పెళ్లి బంధం ద్వారా ఏకం కానున్నారు. అదే రోజు రాత్రి 8గంటలకు అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 120 మంది వరకు ప్రత్యేక అతిథులు పాల్గొననున్నారు. ఇటలీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక నవంబర్ 5న ఇక్కడ రిసెప్షన్‌ పెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ పెద్దలతో పాటు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. 
    అక్టోబర్ 31 , 2023
    Operation Valentine OTT Date: ఆపరేషన్‌ వాలంటైన్‌ ఓటీటీ పార్ట్నర్‌ లాక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
    Operation Valentine OTT Date: ఆపరేషన్‌ వాలంటైన్‌ ఓటీటీ పార్ట్నర్‌ లాక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
    భారత వైమానిక దళం నేపథ్యంలో మెగాహీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన తాజా చిత్రం  'ఆపరేషన్ వాలంటైన్' (Operation Valentine). గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైంది. ఈ సినిమాకు సంబంధించి గురువారం సాయంత్రమే ప్రీమియర్లు పడగా పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. రిలీజ్‌ రోజునే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్‌ ఫిక్స్‌ కావడం విశేషం.  నెల రోజుల్లో ఓటీటీలోకి! 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల డీల్ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు సంబంధించి నెల రోజుల వ్యవధిలో డబ్బింగ్‌ పనులు కూడా పూర్తి కావచ్చన అంటున్నారు. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఉండనుందని సమాచారం. కెరీర్‌ బెస్ట్‌ నటన మరోవైపు ఆపరేషన్‌ వాలెంటైన్‌లో వరుణ్‌ తేజ్‌ నటనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వరుణ్‌ కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా తన పాత్ర‌లో ఒదిగిపోయాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచి ప్ర‌తిభ చూపించాడు. హీరోయిన్‌గా మానుషి చిల్ల‌ర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది. దాదాపుగా సినిమా అంతా హీరో హీరోయిన్లే తెర‌పై క‌నిపిస్తారు. వీళ్ల జంట చూడటానికి చాలా బాగుంది. మిగిలిన పాత్ర‌ల‌న్నీ ప‌రిమితంగానే క‌నిపిస్తాయి. వారు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించాడు. https://telugu.yousay.tv/operation-valentine-review-in-telugu-varun-tej-who-is-popular-as-a-fighter-pilot-is-the-movie-a-hit-free.html
    మార్చి 01 , 2024

    @2021 KTree