రేటింగ్ లేదు
No Dateమీకు ఈ సినిమా చూడాలనే ఆసక్తి ఉందా?
ఆసక్తి ఉంది
UATelugu
నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు.తండేల్ అంటే సముద్రవ్యాపార చేపల షిప్ కెప్టెన్. అంటే ఇది పూర్తిగా సముద్రం, షిప్పులు ఈ నేపథ్యంలోనే కథ సాగుతుందని అంచనా వేయవచ్చు.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ సూన్ ఆన్Netflix| తేదీని ప్రకటించాలి
2024 Apr 297 months ago
తండెల్ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.40కోట్లకు దక్కించుకుంటని టాక్
తారాగణం
నాగ చైతన్య
సాయి పల్లవి
సిబ్బంది
చందూ మొండేటి
దర్శకుడుబన్నీ వాసు
నిర్మాతదేవి శ్రీ ప్రసాద్
సంగీతకారుడుషామ్దత్ సైనుదీన్
సినిమాటోగ్రాఫర్నవీన్ నూలిఎడిటర్ర్
కథనాలు
Thandel Movie: శివ పార్వతుల్లా నాగ చైతన్య - సాయిపల్లవి.. ‘తండేల్’ నుంచి అదిరిపోయే పోస్టర్స్!
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ‘తండేల్’ చిత్రంపై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున బజ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘లవ్ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్’పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తండేల్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ బయటకొచ్చింది. ఇది చేసిన సినీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
శివరాత్రి స్పెషల్ సాంగ్
నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో రూపొందుతున్న ‘తండేల్’ చిత్రానికి చందు మెుండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. శివరాత్రి థీమ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తోంది. ఇందుకోసం భారీ సెట్‌ను సైతం వేశారు. పాట విజువల్ ట్రీట్‌లా ఉండేందుకు మేకర్స్ రూ.4 కోట్లు ఖర్చు చేశారని టాక్. అంతేకాదు వందలాది మంది డ్యాన్సర్లు ఈ పాటలో భాగం కాబోతున్నారట. సాయిపల్లవి, నాగచైతన్య శివపార్వతులను తలపించే నృత్యరీతులతో అలరించబోతున్నారని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. శివరాత్రి థీమ్‌తో ఓ పాటను ఈ స్థాయిలో కంపోజ్ చేయడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారని టాక్. షూటింగ్ స్పాట్ ఫొటోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇందులో చైతు-సాయిపల్లవి శివ పార్వతులను తలపిస్తున్నారు.
https://twitter.com/ThandelTheMovie/status/1840612058691183016
తండేల్ స్టోరీ ఇదే
నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. గుజరాత్ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతోంది. తండేల్ అంటే గుజరాతి భాషలో బోటు నడిపే ఆపరేటర్ అని అర్థం. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని డైరెక్టర్ చందూ మెుండేటి ఓ ఇంటర్యూలో వెల్లడించారు.
చైతూ ఆశలన్నీ తండేల్ పైనే!
ప్రస్తుతం నాగ చైతన్య తన ఆశలన్నీ తర్వాతి సినిమా ‘తండేల్’ మీదే పెట్టుకున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత అతడికి సరైన హిట్ లభించలేదు. ‘బంగార్రాజు’, ‘థ్యాంక్ యూ’, ‘లాల్ సింగ్ చద్ధా’, గతేడాది వచ్చిన ‘కస్టడీ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందాయి. దీంతో ‘తండేల్’ ద్వారా ఎలాగైన గెలుపు బాట పట్టాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. మత్స్యకారుడి పాత్ర కోసం ఆయన ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది.
సాయిపల్లవి ప్రాజెక్ట్స్
ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్‌తో కలిసి 'అమరన్' అనే చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 31 థియేటర్లలోకి రానుంది. అలాగే బాలీవుడ్‌లో ‘రామాయణం’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. ఇందులో సీతగా ఆమె కనిపించనుంది. ఈ పాత్ర కోసం రూ.15 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే హీరో నాని, శేఖర్ కమ్ములా కాంబోలో రానున్న చిత్రంలోనూ సాయిపల్లవి హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి.
సెప్టెంబర్ 30 , 2024
Game Changer: సంక్రాంతి బరిలో వారసుల యుద్ధం.. గెలుపెవరిదో!
మెగా తనయుడు రామ్ చరణ్ (Ram Charan) హీరోగా డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ‘RRR’ వంటి గ్లోబల్ స్థాయి హిట్ తర్వాత చరణ్ చేస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ రేసు నుంచి తప్పుకోవడంతో ‘గేమ్ ఛేంజర్’ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటించారు. అయితే చరణ్‌తో తలపడేందుకు నాగార్జున తనయుడు నాగ చైతన్య రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తండేల్’ సంక్రాంతిని టార్గెట్ చేసినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
సంక్రాంతి రేసులోకి ‘తండేల్’!
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ‘తండేల్’ చిత్రంపై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున బజ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘లవ్ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్’పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తండేల్‌ను సంక్రాంతికి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. తొలుత డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. అయితే పెండింగ్ పనులు అప్పటిలోగా పూర్తయ్యే ఛాన్స్ కనిపించడలేదని సమాచారం. దీంతో 2025 సంక్రాంతికి తమ సినిమాను తీసుకొస్తే బాగుంటుందని తండేల్ టీమ్ భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.
చరణ్ వర్సెస్ చైతూ
టాలీవుడ్ సంక్రాంతి హిస్టరీలో ఇప్పటికే పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తలపడ్డారు. అయితే ఈ సంక్రాంతికి వాళ్ల వారసులు తలపడనున్నట్లు బజ్ వినిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. RRR సక్సెస్‌తో రామ్‌చరణ్ గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దాన్ని గేమ్ ఛేంజర్ ద్వారా మరింత పదిలం చేసుకోవాలని చరణ్ చూస్తున్నాడు. మరోవైపు లవ్‌స్టోరీ తర్వా చైతూకి సరైన హిట్ లభించలేదు. దీంతో ఎలాగైనా తండేల్‌తో హిట్ కొట్టి హిట్ ట్రాక్‌లోకి రావాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే లవ్ స్టోరీతో నాగచైతన్య, సాయి పల్లవి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. తండేల్‌లోనూ ఇదే జంట రిపీట్ కావడంతో ఫలితం సానుకూలంగా ఉంటుందని చైతూ భావిస్తున్నాడు. చరణ్ వర్సెస్ చైతూ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
బాలయ్య నుంచి గట్టిపోటీ!
గేమ్ ఛేంజర్, తండేల్‌తో పాటు సంక్రాంతి రేసులో నందమూరి బాలకృష్ణ సైతం ఉన్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK 109’ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గత రెండు సంక్రాంతి పండగలకు బాలయ్య తన చిత్రాలను రిలీజ్ చేసి హిట్ కొట్టారు. దీంతో ‘గేమ్ ఛేంజర్’, ‘తండేల్’ చిత్రాలకు బాలయ్య మూవీ నుంచి గట్టి పోటీ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వెంకటేష్ - అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా కూడా సంక్రాంతికి రిలీజయ్యే ఛాన్స్ ఉంది. వీటితో పాటు సందీప్ కిషన్ ‘మజాక’ కూడా పండగకే రానుంది. దీంతో ఈ సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు తప్పదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
తండేల్ స్టోరీ ఇదే
నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. గుజరాత్ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతోంది. తండేల్ అంటే గుజరాతి భాషలో బోటు నడిపే ఆపరేటర్ అని అర్థం. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని డైరెక్టర్ చందూ మెుండేటి ఓ ఇంటర్యూలో వెల్లడించారు.
అక్టోబర్ 15 , 2024
Telugu Sea/Ocean Movies: దేవర సినిమా మాదిరి సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు తెలుసా?
టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ మెుదలైంది. సముద్రం నేపథ్యం ఉన్న సినిమాలు గత కొంత కాలం నుంచి విరివిగా తెరకెక్కుతున్నాయి. తీర ప్రాంత కథలతో వచ్చే సినిమాలకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉండటంతో సీనియర్లతో పాటు యంగ్ హీరోలు తీర ప్రాంత కథల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కథలో వైవిధ్యం ఉంటే కొత్త డైరెక్టర్లతో కూడా పని చేసేందుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన, రాబోతున్న చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
దేవర
'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం ‘దేవర(Devara like movies)’. కొరటాల శివ దర్శకత్వంలో సముద్రపు బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన మూవీ గ్లింప్స్‌లో తారక్ సముద్రపు దొంగల్ని ఊచకోత కోస్తాడు. కాగా ఈ సినిమాలో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, టామ్ చాకో, శ్రీకాంత్, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.
తండేల్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తండేల్’(Thandel). ఇందులో చైతూ మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల రిలీజైన మూవీ గ్లింప్స్ అదిరిపోయింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్లు పొరపాటున పాక్ జలాల్లోకి ప్రవేశించి వారి చేతికి చిక్కుతారు. వారి బారి నుంచి ఏ విధంగా బయటపడ్డారు? అన్నది మూవీ స్టోరీ. దర్శకుడు చందూ మెుండేటి ప్రేమ కథ, దేశ భక్తి అంశాలను జోడించి ఈ సినిమాను కమర్షియల్‌గా తీస్తున్నారు.
ఓజీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ(OG MOVIE)’. ఈ సినిమా కూడా ముంబయి సముద్ర తీరం చుట్టూ తిరగనుంది. సముద్రంలో జరిగే అక్రమ రవాణాకు సంబంధించి కథ సాగనున్నట్లు తెలిసింది. ఇందులో పవన్‌కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, షాన్ కక్కర్ ప్రధాన పాత్రుల పోషించనున్నారు.
మట్కా
వరుణ్ తేజ్ హీరోగా, కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మట్కా’. ఈ మూవీ కూడా తీర ప్రాంత నేపథ్యంతో సాగనుందని సమాచారం. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ ఘటన ఆధారంగా మట్కా రూపొందుతోంది. ఈ మూవీలో వరుణ్ విభిన్న గెటప్‌లలో కనిపిస్తాడని టాక్. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
KGF 3
ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో కన్నడ స్టార్ యష్ హీరోగా రూపొందిన చిత్రం ‘కేజీఎఫ్’. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది. అయితే కేజీఎఫ్ 3 సముద్ర నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు.
RC16
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రానున్న చిత్రం 'RC 16'. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్.. ఆ తర్వాత RC16ను పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రం కూడా తీర ప్రాంత నేపథ్యంలోనే తెరకెక్కనుందని టాక్. ఇందులో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపిస్తాడని సమాచారం.
వాల్తేరు వీరయ్య
గతేడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సముద్రంలో చేపలు పట్టుకునే గంగపుత్రుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించాడు. ఇందులో రవితేజ పోలీసు ఆఫీసర్‌గా నటించి సినిమా విజయంతో ముఖ్య పాత్ర పోషించాడు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా చేసింది.
ఉప్పెన
సముద్రపు బ్యాక్‌డ్రాప్‌తో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఉప్పెన(Uppena)’. పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మత్సకార కుటుంబానికి చెందిన పేదింటి యువకుడు పాత్రలో వైష్ణవ్ నటించాడు. వ్యాపార వేత్త శేషారాయణం (విజయ్ సేతుపతి) కూతురు బేబమ్మగా కృతి శెట్టి కనిపించింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
ఘాజీ
1971లో భారత్ పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్థానికి ముందు సముద్ర గర్భంలో జరిగిన ఓ అప్రకటిత యుద్ధ కథే ఘాజీ(Ghazi). రానా, కేకే మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సీ లీడ్ రోల్స్‌లో నటించారు. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రానికి కె. కృష్ణ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.
మహా సముద్రం
అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మహాసముద్రం'. ఇందులో శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావు హైదరీ, అను అమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో చేశారు. తీర ప్రాంత నగరం వైజాగ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ.. ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం వెనుకబడింది.
జనవరి 10 , 2024
Unique Movie Titles: సలార్, కంగువ, తంగలాన్.. ఈ టైటిల్స్ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
సినిమాపై ఆసక్తిని పెంచడంలో టైటిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా పేరు ఎంత యూనిక్‌గా ఉంటే ఆడియన్స్ అంతగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం రూపొందుతున్న చాలావరకూ సినిమాలు తమ ప్రాంతానికే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్నాయి. అయితే కథ డిమాండ్ మేరకు ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పేర్లనే డైరెక్టర్లు సినిమాకు ఖరారు చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఆ టైటిళ్లు కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వాటి అర్థం తెలుసుకోవాలన్న ఉత్సాహం వారిలో పెరిగిపోతోంది. ఇంతకీ ఆ సినిమా పేర్లు ఏవి? వాటి వెనకున్న అర్థం ఏమిటీ? ఇప్పుడు పరిశీలిద్దాం.
తండేల్
నాగ చైతన్య లేటెస్ట్ మూవీ పేరు 'తండేల్' (Thandel). ఈ సినిమా టైటిల్ వెనకున్న అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తండేల్ అంటే మత్సకారుల బృంద నాయకుడు అని అర్థం. సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు అతడే బోటు నడుపుతాడు. చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సలార్
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'సలార్' (Salar). దీనికి నాయకుడు.. రక్షకుడు ఇలా పలు అర్థాలున్నాయి. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. డిసెంబర్ 22న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
డంకీ (DUNKI)
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డంకీ' (DUNKI). ఈ టైటిల్‌కు అర్ధం.. అక్రమంగా దేశ సరిహద్దుల గుండా ప్రయాణించడం. ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి తాప్సీ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ డిసెంబర్ 21న విడుదల కానుంది.
తంగలాన్
చియాన్ విక్రమ్ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). ఇది తమిళనాడులోని ఓ తెగ పేరు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటించింది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది.
కంగువ
స్టార్ హీరో సూర్య అప్‌కమింగ్ మూవీ పేరు 'కంగువ' (Kanguva). దీనికి ‘అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు’ అని అర్థం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్యకు జోడీగా దిశా పటానీ (Disha Patani) నటిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
మట్కా
వరణ్‌తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం పేరు 'మట్కా' (Matka). ఇదో రకమైన జూదం. యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యింది.
జిగర్‌తండ డబుల్ ఎక్స్
రాఘవ లారెన్స్, ఎస్.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్‌తండ డబుల్ ఎక్స్' (Jigarthanda DoubleX). తమిళనాడులోని మధురైలో ప్రసిద్ధి చెందిన ఓ కూల్‌డ్రింక్ పేరును దీనికి పెట్టారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.
అయలాన్
శివకార్తికేయన్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం 'అలయాన్' (Ayalaan). దీనికి పొరుగువాడు అని అర్థం. మానవుడు ఏలియన్ మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
నవంబర్ 25 , 2023
Sobhita Dhulipala: నాగ చైతన్య భలే చిలిపి! ఏం చేశాడో చూడండి!
ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), స్టార్ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంతతో విడాకుల అనంతరం చైతూ ఈ పెళ్లికి రెడీ కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది. దానికి తోడు సామ్ తమ విడాకుల గురించి తరుచూ ఏదోక కామెంట్స్ చేస్తుండటం కూడా చైతూ సెకండ్ మ్యారేజ్‌పై అందరి ఫోకస్ పడేలా చేసింది. ఇదిలా ఉంటే చైతూ-శోభిత పెళ్లి పనులు మెుదలైనట్లు తెలుస్తోంది. వారిద్దరు హల్దీ వేడుకలు (Naga Chaitanya and Sobhita Dhulipala Haldi ceremony) చేసుకున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
పసుపు దుస్తుల్లో..
అక్కినేని నాగచైతన్య - శోభితా దూళిపాళ్ల పెళ్లి డిసెంబర్ 4న గ్రాండ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా హల్దీ వేడుకలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. హల్దీ వేడుకల్లో (Naga Chaitanya and Sobhita Dhulipala Haldi ceremony) చైతూ-శోభితా చాలా సంతోషంగా కనిపించారు. కుటుంబ సభ్యులు వారికి పసుపు నీటితో మంగళ స్నానం చేయించారు. శోభితాపై నీళ్లు పోస్తున్న సందర్భంలో తీసిన ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఆ సమయంలో చైతన్య చిలిపి చేష్టలు చేసినట్లు తెలుస్తోంది. చేతిలోకి నీళ్లు తీసుకొని శోభిత ముఖాన చైతూ చల్లినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఈ హల్దీ ఫొటోలు అక్కినేని అభిమానులు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఆ ఫొటోలు మీరూ చూసేయండి.
https://twitter.com/etimes/status/1862417583234027679
https://twitter.com/i/status/1862343687931298101
నాగేశ్వరరావు విగ్రహం ఎదుట..
నాగచైతన్య - శోభిత వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా జరగనుంది. అయితే ఇరుకుటుంబాలకు చెందిన అతి ముఖ్యులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. రీసెంట్‌గా తమ పెళ్లి గురించి మాట్లాడిన నాగ చైతన్య ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. చాలా సింపుల్‌గా, సంప్రదాయబద్దంగా శోభిత తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా ఈ పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు. అతిథుల జాబితాను శోభితాతో కలిసి తయారు చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
అందులో వాస్తవం లేదట
నాగచైతన్య - శోభిత పెళ్లి (Naga Chaitanya and Sobhita Dhulipala Haldi ceremony)ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫ్లిక్ వర్గాలు రూ.50 కోట్లు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరిగింది. గతంలో నయనతార-విఘేష్ తరహాలోనే చైతూ కూడా తన పెళ్లిని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపించింది. అయితే అందులో వాస్తవం లేదని సమాచారం. స్ట్రీమింగ్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు అక్కినేని ఫ్యామిలీని సంప్రదించలేదని తెలుస్తోంది. అవి జస్ట్ పుకార్లు మాత్రమేనని ఫిల్మ్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.
రెండేళ్లుగా ప్రేమాయణం
సమంతతో విడాకుల అనంతరం నటుడు నాగచైతన్య (Naga Chaitanya and Sobhita Dhulipala Haldi ceremony) శోభితకు దగ్గరయ్యాడు. వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు గత రెండేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. క్యాండిల్ లైట్ డిన్నర్లు, డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరు కలిసి ఓ రెస్టారెంట్‌లో ఉన్న ఫొటోలు సైతం అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఎట్టకేలకు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ చైతూ-శోభిత ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 4న బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారు.
శోభితా సీక్రెట్స్ ఇవే
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో పుట్టింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలిచి సత్తా చాటింది. హిందీలో వచ్చిన ‘రామన్ రాఘవన్ 2.0’ (2016) సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చిన గూఢచారి చిత్రంతో తొలిసారి టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ను కట్టిపడేసింది. ఆ తర్వాత ‘మేజర్’, ‘పొన్నియన్ సెల్వన్ 1 & 2’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇటీవల 'మంకీ మాన్' అనే అమెరికన్ ఫిల్మ్‌లోనూ శోభితా మెరిసింది. రీసెంట్‌గా హిందీలో 'లవ్, సితారా' అనే చిత్రం చేసింది. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
నవంబర్ 29 , 2024
Pooja Hegde: పూజా హెగ్డేతో నాగచైతన్య రొమాన్స్.. మరి హైట్ సెట్ అవుతుందా?
టాలీవుడ్‌లో కొన్ని కాంబోలకు మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. అలాంటి వాటిలో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), అందాల భామ పూజా హెగ్డే (Pooja Hegde) జోడీ కూడా ఒకటి. వీరి కాంబోలో వచ్చిన ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. వీరి కెమెస్ట్రీ అద్భుతంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత నుంచి వీరు కలిసి నటించలేదు. వీరి కాంబోలో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ త్వరలోనే ఈ జంట కలిసి నటించబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీంతో ఈ జంటను మరోమారు తెరపై చూసేందుకు అక్కినేని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు.
విరూపాక్ష డైరెక్టర్‌తో..
సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష (Virupaksha) చిత్రం టాలీవుడ్‌లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ కార్తిక్ వర్మ దండుపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు ఈ డైరెక్టర్‌తోనే నాగ చైతన్య ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది రాబోతున్నట్లు ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను పరిశీలిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ కార్తిక్ వర్మ త్వరలోనే ఆమెను కలిసి కథ వినిపిస్తారని అంటున్నారు. చైతూతో నటించేందుకు ఆమె ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చిత్ర బృందం అంచనా వేస్తోంది. మూవీ అనౌన్స్‌మెంట్‌తో పాటే హీరో, హీరోయిన్ల పేరు ప్రకటించాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. అయితే నాగచైతన్య కంటే పూజా కాస్త ఎత్తు ఎక్కువ ఉండటంతో రొమాన్స్ పరంగా కాస్త ఇబ్బంది కలగొచ్చేమోనని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
పూజా హెగ్డే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
గత మూడేళ్లుగా పూజా హెగ్డే (Pooja Hegde)కు అసలు కలిసి రావడం లేదు. ప్రభాస్‌తో చేసిన రాధేశ్యామ్ (Radhe Shyam)తో మొదలైన ఆమె ఫ్లాపుల పరంపర ‘బీస్ట్’ (Beast), ‘ఆచార్య’ (Acharya), ‘సర్కస్’ (Circus), ‘కిసి కా భాయ్ కిసీ కీ జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) వరకూ కొనసాగింది. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు హ్యాపీగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపింది. అటు మేకర్స్ సైతం ఆమెను కాస్త పక్కన పెట్టారు. అయితే ఈ మధ్యే మళ్లీ పూజాకు ఆఫర్లు మొదలయ్యాయి. ‘దేవా’, ‘సూర్య 44’, ‘దళపతి 69’ సినిమాల్లో ఆమెకు అవకాశాలు దక్కాయి. ఇక చైతూతో ప్రాజెక్ట్ ఓకే అయితే ఆచార్య తర్వాత ఆమె చేయబోయే మెుదటి తెలుగు సినిమా ఇదే కానుంది.
‘తండేల్’తో వస్తోన్న చైతూ
ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య 'తండేల్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అతడికి జోడీగా సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తోంది. లవ్ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్’పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య ఆశలన్నీ ఈ మూవీపైనే ఉంది. ‘బంగార్రాజు’, ‘థ్యాంక్ యూ’, ‘లాల్ సింగ్ చద్ధా’, గతేడాది వచ్చిన ‘కస్టడీ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందాయి. దీంతో ‘తండేల్’ ద్వారా ఎలాగైన గెలుపు బాట పట్టాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది.
డిసెంబర్‌లో చై - శోభిత పెళ్లి!
టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల అనంతరం నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)తో ఏడడుగులు వేయబోతున్నాడు. డిసెంబర్ 4న వీరు గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 2న సంగీత్, 3న మెహందీ, 4న పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 10న గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్లు టాక్. వీరి వివాహం హైదరాబాద్ (Hyderabad)లోని అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios)లోనే జరగబోతోనున్నట్లు సమాచారం. ఈ మేరకు పెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సెట్టింగ్, డెకరేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. పెళ్లికి అతి తక్కువ మందిని మాత్రమే పిలబోతున్నట్లు తెలిసింది. రిసెప్షన్‌కు మాత్రం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానించనున్నారు.
నవంబర్ 16 , 2024
Sai Pallavi: నాని సినిమా షూట్‌లో నరకం చూసిన సాయిపల్లవి.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి (Sai Pallavi) గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అద్భుతమైన నటన, మిస్మరైజింగ్ డ్యాన్స్‌తో తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. రీసెంట్‌గా తమిళంలో ఆమె నటించిన ‘అమరన్’ (Amaran) చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘అమరన్’ సక్సెస్‌కు సంబంధించి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాని (Nani)తో చేసిన 'శ్యామ్ సింగరాయ్' (Shyam Singha Roy) మూవీ షూటింగ్ సమయంలో ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చింది.
కారణం ఏంటంటే?
శివకార్తికేయన్ హీరోగా సాయిపల్లవి (Sai Pallavi) నటించిన ‘అమరన్’ చిత్రానికి పెరియసామి దర్శకత్వం వహించారు. అమరుడైన ఆర్మీ జవాన్ జీవత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సాయిపల్లవి సినిమా గురించి మాట్లాడారు. అదే సమయంలో శ్యామ్ సింగరాయ్ షూటింగ్ సమయంలో తను పడ్డ ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. రాత్రిళ్లు షూటింగ్ తనకు అస్సలు అలవాటు లేదని సాయిపల్లవి తెలిపింది. అయితే శ్యామ్ సింగరాయ్‌లో తన సన్నివేశాలన్నీ చాలా వరకూ రాత్రి పూటే చిత్రీకరించినట్లు చెప్పింది. దీంతో తెల్లవారే వరకూ మేల్కొనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. దాదాపు 30 రోజులు ఇలాగే కొనసాగిందని పేర్కొంది. నైట్ షూట్ వల్ల తన పరిస్థితి వర్ణనాతీతంగా ఉండేదంటూ సాయిపల్లవి చెప్పుకొచ్చింది.
‘చెల్లికి చెప్పుకొని ఏడ్చేశా’
రాత్రి ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) షూటింగ్ చేస్తునే పగలు మరో మూవీ సెట్‌లో పాల్గొనేదానినని సాయిపల్లవి (Sai Pallavi) తెలిపింది. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల మానిసిక ఒత్తిడికి గురైనట్లు వాపోయింది. ఒకరోజు రాత్రి తనను చూడటానికి చెల్లి పూజా కన్నన్ వచ్చిందని, తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా ఏడ్చేశానని తెలిపింది. ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదని, ఒకరోజు విశ్రాంతి దొరికితే బాగుంటుందంటూ తన బాధను ఆమెతో చెప్పుకున్నానని అన్నది. ‘దీంతో నా చెల్లెలు నేరుగా శ్యామ్ సింగరాయ్ మూవీ నిర్మాత దగ్గరకు వెళ్లి ‘మా అక్క ఏడుస్తోంది. ఒక రోజైనా సెలవు ఇవ్వండి’ అని అడిగింది. ఇది విన్న నిర్మాత వెంకట్ బోయనపల్లి వెంటనే స్పందించారు. ‘పదిరోజులు సెలవు తీసుకో. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసి, అంతా బాగానే ఉందనుకున్నప్పుడు తిరిగి షూటింగ్‌కు రావచ్చు’ అన్నారు’ అని నాటి రోజులను సాయిపల్లవి గుర్తు చేసుకుంది.
దేవదాసిగా అదరగొట్టిన సాయిపల్లవి
నాని కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన 'శ్యామ్ సింగరాయ్' (Shyam Singha Roy) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్స్ చేశాడు. వాసు, శ్యామ్ సింగరాయ్ (1970నాటి పాత్ర) రోల్స్‌లో అలరించారు. ఇక దేవదాసి మైత్రీ పాత్రలో సాయిపల్లవి అదరగొట్టింది. తనదైన నటనతో ఆ పాత్రకు వన్నెలద్దింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ప్రేక్షకులని కట్టిపడేసింది. డ్యాన్స్‌లో తనకు తిరుగులేదని మరోమారు నిరూపించుకుంది. మైత్రి పాత్ర నటిగా సాయిపల్లవిని మరో మెట్టు ఎక్కించదని చెప్పవచ్చు. దేవదాసిల జీవితాలను అద్దం పట్టేలా ఆమె నటించిన తీరు ఎంత పొగిడిన తక్కువే. ‘శ్యామ్ సింగరాయ్’ రిలీజ్ అనంతరం నానితో సమానంగా సాయి పల్లవి నటన గురించి ప్రేక్షకులు మాట్లాడుకున్నారు.
సాయిపల్లవి ప్రాజెక్ట్స్
ప్రస్తుతం సాయిపల్లవి (Sai Pallavi) చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ (Thandel)లో నటిస్తోంది. ఇందులో నాగచైతన్య హీరోగా చేస్తున్నాడు. 'లవ్‌స్టోరీ' (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వీరిద్దరు మరోమారు జంటగా నటిస్తుండటంతో 'తండేల్'పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. నితేశ్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణ' (Ramayana)లో సీతగా ఆమె నటిస్తోంది. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన ఫొటోలు లీకవ్వగా సీతగా సాయిపల్లవి లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యష్ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్ కానుంది. తొలి పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
నవంబర్ 12 , 2024
Game Changer: దీపావళికి గేమ్ ఛేంజర్ నుంచి బిగ్ అప్‌డేట్!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌కు సైతం ముహోర్తం ఫిక్సయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
దీపావళి కానుకగా టీజర్?
రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీపావళి కానుకగా టీజర్‌ను విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. వీకెండ్‌లోనే దీనిపై అధికారిక ప్రకటన సైతం ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
తెలుగు స్టేట్స్‌లో రికార్డు బిజినెస్?
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ.150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి. ‘గేమ్‌ఛేంజర్’ను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పుడు ఇంత బిజినెస్ జరిగే అవకాశం కనిపించలేదట. అయితే ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి వాయిదా పడటంతో బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోయినట్లు ఫిల్మ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
చరణ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే!
సంక్రాంతి రిలీజ్ అంటే సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఈ సంక్రాంతికి బాలయ్య, వెంకటేష్ పాటు, సందీప్ కిషన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నాగచైతన్య 'తండేల్' కూడా పొంగల్‌కు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉంటుందని తెలిసినా డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మెుత్తంలో చెల్లించేందుకు ముందుకు వస్తున్నారట. చరణ్ కాకుండా మరే హీరో సినిమా సంక్రాంతికి రిలీజైనా ఈ స్థాయి బిజినెస్ జరుగుతుందన్న అంచనాలు ఉండేవి కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో చరణ్‌కు పూర్తిస్థాయిలో క్రెడిట్ ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు.
భారీ ధరకు ఓటీటీ హక్కులు!
గేమ్ ఛేంజర్ ఓటీటీ హక్కులు సైతం రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రూ.110 కోట్లకు గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవలం సౌత్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ కోసమే అమెజాన్ ఇంత మెుత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిటల్ రైట్స్‌ను మరో ఓటీటీ సంస్థకు అమ్మేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేకర్స్ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్ ఛేంజర్' రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఒక్క పాటకు రూ.20 కోట్లు!
'గేమ్ ఛేంజర్' నుంచి వచ్చిన మెుదటి రెండు పాటలు ‘జరగండి.. జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టి నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ అయ్యింది. అయితే త్వరలో థర్డ్ సింగిల్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సాంగ్ రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి రెండు పాటలు మంచి బీట్‌తో వచ్చి దుమ్మురేపగా థర్డ్ సింగిల్ మాత్రం మెలోడిగా రానుంది. ఇక లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూడో పాటకు రూ.20 కోట్ల పైనే ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ధ్రువీకరించాల్సి ఉంది.
అక్టోబర్ 24 , 2024
Telugu Movies 2025: వచ్చే ఏడాది రాబోతున్న మోస్ట్ వాంటెడ్ టాప్-10 చిత్రాలు!
సాధారణంగా ప్రతీ సంవత్సరం కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అయితే 2025 సంవత్సరం మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎంతో ముఖ్యమైనది. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రాలు 2025లోనే గ్రాండ్‌గా విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా పది చిత్రాల కోసం సినీ లవర్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చిన ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అందులో చేస్తోన్న స్టార్ హీరోలు ఎవరు? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
[toc]
రాజాసాబ్ (The Raja Saab)
ప్రభాస్ (Prabhas) సినిమా వస్తుందంటే ఇండియన్ బాక్సాఫీస్ కళకళలాడిపోతుంది. ఈ ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ వచ్చే ఏడాది ‘రాజాసాబ్’ మరోమారు బాక్సాఫీస్‌పై దండ యాత్ర చేయబోతున్నాడు. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. లవర్ బాయ్ మేకోవర్‌తో అదరగొడుతున్నాడు. దీంతో రాజా సాబ్ కోసం ప్రభాస్ ఫ్యాన్ తెగ ఎదురుచూస్తున్నాడు.
ఓజీ (OG)
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ (Director Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ తొలిసారి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో పవన్ ఊచకూత చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో పవన్ చేతిలో ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్’ వంటి ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ ‘ఓజీ’ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. 2025 సమ్మర్‌లో ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. లేదంటే సెప్టెంబర్‌లోనైనా కచ్చితంగా విడుదల చేసే ఛాన్స్ ఉంది.
గేమ్ ఛేంజర్ (Game changer)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నారు. ‘RRR’ వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత చరణ్ చేసిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇందులో రామ్‌చరణ్ తొలిసారి కలెక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అతడి లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు సైతం ఇటీవల పెద్ద ఎత్తున లీకయ్యాయి. అవినీతిపరులైన రాజకీయ నాయకులపై పోరాటం చేసే ఐఏఎస్ అధికారి పాత్రలో చరణ్ ఎలా నటించాడోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
వార్ 2 (War 2)
టాలీవుడ్ అగ్ర కథనాయకుల్లో ఒకరైన జూ.ఎన్టీఆర్ (Jr NTR) ‘వార్ 2’ (War 2) చిత్రంతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. ఇందులో హృతిక్ రోషన్ (Hrithik Roshan)కు ప్రత్యర్థిగా తారక్ నటిస్తున్నారన్న టాక్ బలంగా ఉంది. దేవర వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత తారక్ స్క్రీన్‌పై కనిపించనున్న చిత్రం కూడా ఇదే కావడంతో ‘వార్ 2’ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల లాగానే హిందీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకోవాలని కోరుకుంటున్నారు. 2025 ఆగస్టు 15న వార్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.
VD 12
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘VD 12’ తెరకెక్కుతోంది. వరుసగా నాలుగు ఫ్లాప్స్ తర్వాత చేస్తోన్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ప్రాణం పెట్టి చేస్తున్నాడు. ఇందులో రగ్‌డ్ లుక్‌లో కనిపించి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం విజయ్‌కు కేజీఎఫ్ లాంటి మూవీ అవుతుందని ప్రముఖ నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా హైప్ పెరిగింది. దీంతో ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 2025 మార్చి 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తండేల్ (Thandel)
నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న ‘తండేల్’ మూవీపై టాలీవుడ్‌లో మంచి హైప్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ (Love story) మంచి హిట్ కావడంతో పాటు చైతూ మత్సకారుడిగా ఇందులో నటిస్తుండంతో తండేల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఎంతో ప్రతీష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.
మిరాయ్ (Mirai)
‘హనుమాన్’ (Hanuman) వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) ‘మిరాయ్’ అనే మరో పాన్‌ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ (Manchu Manoj) విలన్‌గా నటిస్తున్నాడు. కెరీర్‌లో తొలిసారి నెగిటివ్ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో తేజ సజ్జా - మంచు మనోజ్ మధ్య ఫైట్ ఏ విధంగా ఉంటుందోనని తెలుగు ఆడియన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం 2024 ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కుబేరా (Kubera)
క్లాసిక్ సినిమాలకు పెట్టింది పేరైనా దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) 'కుబేర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో తమిళ నటుడు ధనుష్ (Dhanush)తో పాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Akkineni Nagarjuna) లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఇందులో బిచ్చగాడి పాత్రలో ధనుష్ చేస్తున్నట్లు టాక్. మరోవైపు నాగార్జున పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి స్టార్ హీరోలను శేఖర్ కమ్ముల ఏ విధంగా చూపిస్తారోనన్న అంచనాలు అందరిలో ఉన్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది పక్కాగా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
జీ 2 (G2)
అడివి శేష్ (Adivi Sesh) హీరోగా వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'జీ 2'. గతంలో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన 'గూడాఛారి' (Goodachari) చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. పైగా ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండటంతో అందరిలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. స్పైగా అడివి శేష్ ఈసారి ఎలాంటి సాహసాలు చేస్తాడోనని సినీ లవర్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా 2025లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
NANI 33
‘దసరా’ (Dasara) తో గతేడాది ఘన విజయాన్ని అందుకున్నారు నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela). వీరిద్దరి కాంబోలో ఇటీవల కొత్త ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆఖరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ ఉంది. దీంతో ‘NANI 33’ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దసరా లాంటి బ్లాక్ బాస్టర్ మరోమారు రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు.
అక్టోబర్ 23 , 2024
Naga Chaitanya : పెళ్లి పనులు షురూ.. శోభితా దూళిపాళ్ల ఏం చేసిందో చూడండి!
అక్కినేని ఇంట మరోమారు పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత (Samantha)తో విడాకులు అనంతరం ప్రముఖ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)తో చైతూ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఇక వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అక్కినేని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన పనులు అఫిషియల్‌గా మెుదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పెళ్లి పనులు షురూ
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఎంగేజ్ మెంట్ ఆగస్టు 8న గ్రాండ్‌గా జరిగింది తెలిసిందే. ఈ తరుణంలో వీరి పెళ్ళికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇరువురి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి శోభితా ధూళిపాళ్ల తన పెళ్లి పనులు షురూ అయినట్టు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. తాను పసుపు దంచుతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోస్ లో శోభిత చాలా సంప్రదాయంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. దాంతో అతి త్వరలోనే చై-శోభితా ఒక్కటవ్వనున్నారని తెలుస్తోంది. వైజాగ్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం.
View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)
రెండేళ్లుగా ప్రేమాయణం!
నాగ చైతన్య - శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి సైతం జరగబోతోంది.
‘పెళ్లి గురించి కలలు కనలేదు’
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పొల్గొన్న శోభిత ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. తన నిశ్చితార్థం, పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలని ఎప్పుడు కలలు కనలేదని తెలిపారు. వాటి కోసం ప్రత్యేకంగా ప్లాన్స్ కూడా వేసుకోలేేదని చెప్పారు. పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే తన పెళ్లి వేడుకలు సాంప్రదాయంగా సింపుల్‌గా జరిగితే చాలని భావించానని అన్నారు. అనుకున్నట్లే చైతూతో సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని అన్నారు. ఇక తన తల్లిదండ్రులు పాటించే సంసృతి, సంప్రదాయాలను తానూ గౌరవిస్తాని శోభిత స్పష్టం చేసింది. అందుకే తాను ఎంత ఎదిగిన నాకు సంబంధించినవి సాంప్రదాయంగా మా పేరెంట్స్ సమక్షంలో జరగాలని కోరుకుంటానని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే చైతూతో పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరుగుతుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్ రాఘవన్ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్' అనే అమెరికన్ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. తాజాగా హిందీలో 'లవ్, సితారా' అనే చిత్రంలో చేసింది. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
అక్టోబర్ 21 , 2024
Game Changer: మూడు హిట్ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్ ఛేంజర్’ మెలోడీ సాంగ్.. ఇదెక్కడి అరాచకం!
స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటించింది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల రెండు పాటలను విడుదల చేయగా వాటికి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే మూడో సాంగ్‌ను కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాటకు సంబంధించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ మెలోడీ సాంగ్ కోసం చేసిన ఖర్చు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఒక్క పాటకు రూ.20 కోట్లు!
'గేమ్ ఛేంజర్' నుంచి వచ్చిన మెుదటి రెండు పాటలు ‘జరగండి.. జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టి నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ అయ్యింది. అయితే త్వరలో థర్డ్ సింగిల్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సాంగ్ రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి రెండు పాటలు మంచి బీట్‌తో వచ్చి దుమ్మురేపగా థర్డ్ సింగిల్ మాత్రం మెలోడిగా రానుంది. ఇక లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూడో పాటకు రూ.20 కోట్ల పైనే ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ధ్రువీకరించాల్సి ఉంది.
మూడు హిట్ చిత్రాల బడ్జెట్!
ఇటీవల తెలుగులో రిలీజైన ‘ఆయ్’ (Aay), ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu), ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసి ప్రశంసలు పొందాయి. అయితే ఈ మూడు సినిమాలు తక్కువ బడ్జెట్‌తో వచ్చి మంచి వసూళ్లు సాధించాయి. ఈ మూడు చిత్రాలు బడ్జెట్ కలిపితే దాదాపు రూ.20 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అయితే గేమ్ ఛేంజర్‌లో ఒక్క సాంగ్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేశారని రూమర్లు రావడం చర్చకు తావిస్తోంది. ఇటీవల వచ్చిన సెకండ్ సింగిల్ ‘రా మచ్చా మచ్చా’ పాటకు కూడా దాదాపు రూ.6-10 కోట్లు ఖర్చు అయినట్లు కథనాలు వచ్చాయి. ఆ పాటలో వందల సంఖ్యలో డ్యాన్సర్లు పాల్గొని వివిధ కాస్ట్యూమ్స్‌లో స్టెప్పులు వేశారు. ఇలా సాంగ్‌లకే భారీ మెుత్తం ఖర్చు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
శంకర్ మారాల్సిన అవసరం ఉందా?
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా అంటే అందులోని పాటలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ‘భారతీయుడు’, ‘జీన్స్’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’, ‘స్నేహితుడు’, ‘రోబో 2.0’ ఇలా ఏ సినిమా తీసుకున్న అందులోని పాటలు చాలా రిచ్‌గా ఉంటాయి. విదేశాల్లోని బ్యూటీఫుల్ లోకేషన్స్‌లో పాటలను చిత్రీకరించడం ద్వారా ఆడియన్స్‌లో కొత్త అనుభూతిని కలిగించేందుకు శంకర్ ప్రయత్నిస్తుంటారు. అయితే గతంలో వరుస హిట్స్‌తో శంకర్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఈ పాటల గురించి పెద్దగా చర్చ జరగలేదు. అయితే గత కొంతకాలంగా డైరెక్టర్ శంకర్‌కు అసలు కలిసిరావడం లేదు. ఆయన తీసిన చివరి నాలుగు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. ఇలాంటి సమయంలో పాటల కోసం రూ. కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుండటాన్ని సినీ ఆడియన్స్ తప్పుబడుతున్నారు. ప్రస్తుతం కాలంలో పాటలకు ఏ దర్శక నిర్మాతలు అంత మెుత్తంలో ఖర్చు చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. శంకర్ తన తీరు మార్చుకోకుంటే అతనితో వర్క్ చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేసే పరిస్థితులు తలెత్తవచ్చని అభిప్రాయపడుతున్నారు.
రికార్డు ధరకు ఓటీటీ హక్కులు!
గేమ్ ఛేంజర్ ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రూ.110 కోట్లకు గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవలం సౌత్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ కోసమే అమెజాన్ ఇంత మెుత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిటల్ రైట్స్‌ను మరో ఓటీటీ సంస్థకు అమ్మేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేకర్స్ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్ ఛేంజర్' రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తండేల్ vs గేమ్ ఛేంజర్
గేమ్ ఛేంజర్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు నాగచైతన్య హీరోగా చేస్తున్న తండేల్ సైతం సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ సంక్రాంతి హిస్టరీలో ఇప్పటికే పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తలపడ్డారు. అయితే ఈ సంక్రాంతికి వాళ్ల వారసులు తలపడనున్నట్లు బజ్ వినిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. RRR సక్సెస్‌తో రామ్‌చరణ్ గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దాన్ని గేమ్ ఛేంజర్ ద్వారా మరింత పదిలం చేసుకోవాలని చరణ్ చూస్తున్నాడు. మరోవైపు లవ్‌స్టోరీ తర్వా చైతూకి సరైన హిట్ లభించలేదు. దీంతో ఎలాగైనా తండేల్‌తో హిట్ కొట్టి హిట్ ట్రాక్‌లోకి రావాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. చరణ్ వర్సెస్ చైతూ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
అక్టోబర్ 18 , 2024
Tollywood Couples: నారా రోహిత్ - సిరి లేళ్ల తరహాలో ఒక్కటైన సెలబ్రిటీ జంటలు వీరే!
రీల్ లైఫ్‌లో జంటగా చేసిన సెలబ్రిటీలు నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారు. ముందుగా ప్రేమ బంధంతో ఒక్కటై ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కృష్ణ- విజయ నిర్మల, రాజశేఖర్- జీవిత, నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహా, మహేశ్ బాబు- నమ్రత ఈ కోవకు చెందిన వారే. అయితే టాలీవుడ్‌లో ఈ సెలబ్రిటీ పెళ్లిళ్లు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయి. యంగ్ హీరో నారా రోహిత్ రీసెంట్‌గా యువ నటి సిరి లేళ్లను వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జనరేషన్ హీరో- హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం.
నారా రోహిత్ - సిరి లేళ్ల
ఏపీ సీఎం నారా చంద్రబాబు సోదరుడి కుమారుడైన నటుడు నారా రోహిత్ (Nara Rohit) ‘బాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. సోలో, ప్రతినిధి, అసుర, సుందరకాండ వంటి చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నారు. రీసెంట్‌గా యువ నటి సిరి లేళ్ల (Siri Lella) ను ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం డిసెంబర్‌లో జరగనుంది. అయితే ఇటీవల వచ్చిన ‘ప్రతినిధి 2’లో వీరిద్దరు జంటగా నటించారు. షూటింగ్ సందర్భంగా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. హృదయాలు సైతం కలిసిపోవడంతో బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. సిరి లేళ్ల విషయానికి వస్తే ఆమె తెలుగమ్మాయే. ఏపీలోని రెంట చింతల ఆమె స్వగ్రామం. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె నటనపై మక్కువతో ఇండియాకు తిరిగి వచ్చింది. ‘ప్రతినిధి 2’ ఆడిషన్స్‌లో పాల్గొని హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది.
నాగచైతన్య - శోభిత దూళిపాళ్ల
అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థం ఇటీవలే బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. వాస్తవానికి 2017లో సమంతను నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో 2021లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య, శోభిత చాలా సార్లు కలిసి కనిపించారు. వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తోందనే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోని ఎంగేజ్‌మెంట్ చేసుకొని స్పందించకపోయినప్పటికీ నిశ్చితార్థంతో వాటికి ఫుల్‌స్టాప్ పెట్టారు. ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. శోభితా ఇటీవల మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించింది. హిందీలో ఆమె లవ్, సితారా చిత్రం రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది.
కిరణ్ అబ్బవరం - రహస్య గోరఖ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘రాజా వారు రాణిగారు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇందులో రహస్య గోరఖ్ (Rahasya Gorak)హీరోయిన్‌గా చేసింది. తొలి చిత్రంతోనే అందమైన జంటగా వీరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఏర్పడిన స్నేహం వీరి మధ్య ప్రేమ చిగురించేలా చేసింది. అలా ఐదేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్‌లో వివాహం చేసుకుంది. సినిమాల్లోకి రాకముందు కిరణ్, రహస్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేశారు. నటనపై ఆసక్తితో ఉద్యోగాలకు స్వస్థి చెప్పి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం కిరణ్ నటిస్తున్న ‘క’ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.
వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ (Varun Tej) ‘ముకుంద’ (2014) చిత్రంతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తరవాత ‘కంచె’, ‘ఫిదా’, ‘లోఫర్’, ‘ఎఫ్3’ వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ని గతేడాది నవంబర్‌లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే 2017లో వచ్చిన ‘మిస్టర్’ చిత్రంలో ఈ జంట తొలిసారి కలిసి నటించింది. ఆ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాలోనూ జోడీగా కనిపించి మెప్పించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మెుదలైన స్నేహం పెళ్లి పీటలపై వైపు అడుగులు వేసేలా చేసింది. ఇటలీ జరిగిన వీరి వివాహానికి మెగా ఫ్యామిలీ మెుత్తం హాజరయ్యింది. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా చిత్రంలో నటించాడు. ఈ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య ప్రస్తుతం ‘తనల్’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.
ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా యంగ్ హీరో ఆది పినిశెట్టి (Aadi Pinisetty) ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’, రామ్ హీరోగా చేసిన ‘వారియర్’ చిత్రాల్లో విలన్‌గా చేసి ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే నటి నిక్కీ గల్రానీ (Nikki Galrani)ని ఆది 2022 మే నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిక్కీ ఆదితో రెండు చిత్రాలు చేసింది. ‘మలుపు’, ‘మరకతమణి’ చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించారు. మలుపు షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అది కాస్త పెళ్లి పీటలకు దారితీసింది.
వరుణ్ సందేశ్ - వితిక షేరు
యంగ్ హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh) 2007లో విడుదలైన ‘హ్యాపీడేస్’తో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ‘కొత్త బంగారు లోకం’ సక్సెస్‌తో యూత్‌కు మరింత కనెక్ట్ అయ్యారు. నటి వితికా షేరు (Vithika Sheru)ను 2015 డిసెంబర్ 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరు అదే ఏడాది రిలీజైన 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో కలిసి నటించారు. మంచి స్నేహంతో పాటు ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లోనూ జంటగా అడుగుపెట్టి మంచి కపుల్‌గా బుల్లితెర ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. వరుణ్ సందేశ్ ఈ ఏడాది 'నింద', విరాజి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. వితిక షేరు ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
అక్టోబర్ 17 , 2024
Sobhita Dhulipala: తల్లి కావడంపై శోభితా ఆసక్తికర వ్యాఖ్యలు.. పెళ్లి గురించి పెద్దగా కలలు లేవట!
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ ఈ జంట ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకుంది. త్వరలోనే పెళ్లి పీటలు సైతం ఎక్కనుంది. ఇక చైతూతో ఎంగేంజ్‌మెంట్ తర్వాత నుంచి శోభిత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె ఏ చిన్న పోస్టు పెట్టినా, కామెంట్స్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత తన మెుదటి ఇంటర్యూ ఇచ్చింది. చైతూతో పెళ్లి, మాతృత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘నిశ్చితార్థం గురించి కలలు కనలేదు’
తను నటించిన లవ్, సితార చిత్రం ఓటీటీ ప్రమోషన్స్‌లో భాగంగా నటి శోభిత దూళిపాల తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. తన నిశ్చితార్థం, పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలని ఎప్పుడు కలలు కనలేదని తెలిపారు. వాటి కోసం ప్రత్యేకంగా ప్లాన్స్ కూడా వేసుకోలేేదని చెప్పారు. పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే తన పెళ్లి వేడుకలు సాంప్రదాయంగా సింపుల్‌గా జరిగితే చాలని భావించానని అన్నారు. అనుకున్నట్లే చైతూతో సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని అన్నారు. ఇక తన తల్లిదండ్రులు పాటించే సంసృతి, సంప్రదాయాలను తానూ గౌరవిస్తాని శోభిత స్పష్టం చేసింది. అందుకే తాను ఎంత ఎదిగిన నాకు సంబంధించినవి సాంప్రదాయంగా మా పేరెంట్స్ సమక్షంలో జరగాలని కోరుకుంటానని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే చైతూతో పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరుగుతుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
‘చైతూలో ఆ ప్రేమ చూశా’
నటుడు నాగచైతన్యతో నిశ్చితార్థం అనంతరం సంబంధిత ఫొటోలను షేర్ చేస్తూ కవిత్వంతో కూడిన ఆసక్తికర పోస్టు శోభిత పెట్టారు. ఆ విధంగా పోస్టు పెట్టడానికి గల కారణాన్ని తాజా ఇంటర్యూలో శోభిత వెల్లడించారు. ‘సంగం సాహిత్యానికి (తొలినాళ్లలో తమిళ సాహిత్యానికి పెట్టిన పేరు ఇది) నేను విపరీతమైన అభిమానిని. నా పోస్ట్‌లో పెట్టిన సాహిత్యం గతంలో నేను చదివినది. అది ఎంతో కవితాత్మకం. సరళంగా ఉంటుంది. హృదయాలను హత్తుకునే సందేశం అందులో ఉంది. అందుకే అది నా మనసులో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. నేను ఎల్లప్పుడూ అలాంటి అద్భుతమైన ప్రేమను పొందాలనుకుంటున్నాను. నా భాగస్వామిలో అదే ప్రేమను చూశా’ అని శోభితా ధూళిపాళ్ల వివరించారు.
రెండేళ్లుగా ప్రేమాయణం!
నాగ చైతన్య - శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే ఇవాళ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.
శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్ రాఘవన్ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్' అనే అమెరికన్ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'లవ్, సితారా' అనే చిత్రం నటించింది. ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
సమంతతో విడాకులు
స్టార్ హీరోయిన్ సమంత (Samantha)ను గతంలో నాగ చైతన్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఏం మాయ చేశావే' (Ye Maaya Chesave) సినిమాతో చైతు-సమంతకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2017లో వివాహ బంధం ద్వారా వారిద్దరు ఒక్కటయ్యారు. బెస్ట్ కపుల్ అంటూ ప్రసంశలు కూడా అందుకున్నారు. అటువంటిది నాలుగేళ్ల తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అభిమానులకు షాకిస్తూ 2021లో నాగ చైతన్య, సమంత విడిపోయారు. ప్రస్తుతం ఎవరి దారి వారిది అన్నట్లుగా జీవిస్తున్నారు. మూడేళ్ల తర్వాత చైతు మరో పెళ్లికి రెడీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 26 , 2024
Ram Charan: రూట్‌మార్చిన రామ్‌చరణ్.. ఫుల్ జోష్‌లో మెగా ఫ్యాన్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) సక్సెస్‌తో గ్లోబల్ స్థార్‌గా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్‌ను కెరీర్ ప్రారంభం నుంచి ఓ సమస్య వెంటాడుతోంది. ఈ సమస్య నుంచి చరణ్ ఎన్నిసార్లు బయటపడాలని చూసిన కుదరడం లేదు. దీనిపై మెగా ఫ్యాన్స్ సైతం అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టే దిశగా రామ్‌చరణ్ సరికొత్త ప్లాన్స్‌ను రచిస్తున్నాడు. ఆ దిశగా ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ సైతం తెగ ఖుషీ అవుతున్నారట. ఇంతకీ ఆ సమస్య ఏంటి? దానిపై చెర్రీ తీసుకున్న నిర్ణయం ఏంటి? అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.
సెట్స్‌పైకి రెండు చిత్రాలు!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ చిరు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 17 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకూ ఆయన నుంచి వచ్చింది 13 చిత్రాలు మాత్రమే. మిగతా స్టార్స్‌తో పోలిస్తే సినిమా సినిమాకు చరణ్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారన్న విమర్శ ఉంది. దీని నుంచి ఎన్నిసార్లు బయటపడాలని చూసిన అది వర్కౌట్ కాలేదు. దీంతో ఈ సమస్యకు కచ్చితంగా చెక్ పెట్టాలని చరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై సంవత్సరానికి రెండు చొప్పున చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇందులో భాగంగానే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కాకముందే డైరెక్టర్ బుచ్చిబాబుతో RC16 ప్రాజెక్ట్‌ను చరణ్ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ చిత్రంతో పాటుగానే సుకుమార్ దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నాడు. ఒకేసారి ఆ రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని రామ్‌చరణ్ భావిస్తున్నారట. ఈ రెండు సినిమాలను 2026 లోపే రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.
ప్రభాస్‌ను అనుసరిస్తున్నాడా?
ప్రభాస్ కూడా తన ప్రాజెక్టుల విషయంలో గతంలో కంటే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పటిలాగా ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అనే విధానానికి స్వస్థి పలికి ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతీతో 'రాజాసాబ్' అనే చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించాడు. నవంబర్ కల్లా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని 'స్పిరిట్'ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో డార్లింగ్ ఉన్నాడు. తద్వారా ఏక కాలంలో ఈ మూడు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొని ఒక్కో సినిమాను ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ‘సలార్ 2’, ‘కల్కి 2’ చిత్రాలను కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది.
ముఖ్య అతిథిగా రామ్‌చరణ్
దక్షిణాది సినీ అవార్డుల పండుగ ‘ఐఐఎఫ్ఏ ఉత్సవం’ (IIFA Utsavam 2024) కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నారు. అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో సెప్టెంబరు 27న ఐఐఎఫ్ఏ (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) వేడుక జరగనుంది. ఇక్కడి ఎతిహాద్ ఎరీనా వేదికగా జరిగే ఈ అవార్డుల ఉత్సవంలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఈ మేరకు ఐఐఎఫ్ఏ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఈవెంట్‌కు చరణ్‌తో పాటు పలువురు దక్షిణాది ప్రముఖులు హాజరుకానున్నారు.
ఈ ఏడాది లేనట్లే!
ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' చిత్రంలో రామ్‌చరణ్ నటిస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిర్మాత దిల్ రాజు కూడా డిసెంబర్‌లోనే రిలీజ్ చేయనున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం గేమ్ ఛేంజర్ డిసెంబర్‌లో రావడం కష్టమేనని అంటున్నారు. డిసెంబర్ 20కి ఇప్పటికే తండేల్, రాబిన్ హుడ్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఆ టైమ్ లో గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేస్తే కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉందని మేకర్స్ భావిస్తున్నారట. వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేయవచ్చని అంటున్నారు. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
సెప్టెంబర్ 14 , 2024
Samantha: మహానటి సావిత్రి జీవితంతో సమంతకు పోలికలు.. సేమ్ సీన్ రిపీట్?
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), స్టార్ హీరోయిన్ సమంత (Samantha) 2017లో పెళ్లి చేసుకొని మనస్పర్థల కారణంగా 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. మూడేళ్ల గ్యాప్ తర్వాత నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala)ను రెండో వివాహం చేసుకునేందుకు నాగచైతన్య రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఘటనలతో పాటు ప్రస్తుత పరిణామాలను ముడివేస్తూ నటి సమంత పట్ల నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ నటి సావిత్రి జీవితంతో సామ్ లైఫ్‌ను ముడిపెడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఆ పోస్టులలోని సారాంశం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సావిత్రి జీవితంతో సామ్‌కు లింకేంటి?
2021లో నాగ చైతన్యతో డివోర్స్ సందర్భంగా అందరూ సమంతనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే తాజాగా చైతూ రెండో పెళ్లికి సిద్ధమైన నేపథ్యంలో పెద్ద ఎత్తున నెటిజన్లు సమంతపై సానుభూతి చూపిస్తున్నారు. దిగ్గజ నటిగా ఓ వెలుగు వెలిగిన మహా నటి సావిత్రి జీవితంతో సమంత లైఫ్‌ను కంపేర్ చేస్తున్నారు. సినిమా కెరీర్‌లో ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో సావిత్రి జీవితంలోకి అప్పటికే పెళ్లైన నటుడు జెమినీ గణేశన్ ప్రవేశించారు. ఆ సమయానికి సావిత్రితో పోలిస్తే జెమినీ గణేశన్ సినిమా జీవితం అంతంతమాత్రంగానే ఉంది. ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్న జెమినీ గణేశన్‌ను గెస్ట్ హౌస్‌లో మరో మహిళతో సన్నిహితంగా ఉండటం చూసి సావిత్రి తట్టుకోలేకపోయింది. డిప్రెషన్‌లోకి వెళ్లి మద్యానికి బానిసగా మారింది. ఆపై పలు అనారోగ్య సమస్యల బారిన పడి కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించింది. అయితే సమంత విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగి ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. నాగ చైతన్యను మరొకరితో చూసి సమంత డిప్రెషన్‌లోకి వెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయని అంటున్నారు. ఈ బాధలన్నీ తట్టుకోలేకనే చైతూకి సామ్ విడాకులు ఇచ్చిందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/vamccrishnaa/status/1822085950098505895/
‘అంతలా శోభితలో ఏముంది’
శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నప్పటి నుంచి సమంత ఫ్యాన్స్ నాగచైతన్యను ఏకిపారేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు శోభితాలో ఏముందని ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్‌గా ఆమె ఫెయిల్ అయ్యిందని అంటున్నారు. విడాకులు తీసుకున్న వెంటనే చైతూ మరొకరితో ప్రేయాయణం మెుదలుపెట్టారని విమర్శిస్తున్నారు. దీన్ని బట్టి చై-సమంతలతో ఎవరి ప్రేమ స్వచ్ఛమైందో గుర్తించాలని సూచిస్తున్నారు. మరోవైపు సమంత ఫ్యాన్స్ సంధిస్తున్న ప్రశ్నలకు చైతు, శోభిత ఫ్యాన్స్ గట్టిగానే బదులు ఇస్తున్నారు. పెళ్లి పెటాకులు అయినంత మాత్రాన జీవితాలు అక్కడే ఆగిపోవాలా? అంటూ నిలదీస్తున్నారు.
సామ్ చేస్తే తప్పు.. శోభిత చేస్తే ఒప్పా!
సమంత బోల్డ్‌గా నటించడమే విడాకులకు కారణమని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న శోభిత స్క్రీన్ ప్రజెన్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమంత కంటే ఎక్కువగా బోల్డ్ సీన్స్‌లో శోభిత నటించిందని కొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే బోల్డ్ వెబ్ సిరీస్‌లో హాట్ షోతో శోభితా ధూళిపాళ్ల రెచ్చిపోయిందని చెబుతున్నారు. అందులో ఇంటిమేట్ సీన్లలో శోభిత నటించిందని పేర్కొంటున్నారు. అలాగే ‘ది నైట్ మేనెజర్’ వెబ్ సిరీస్‌లో కూడా బికినీతోపాటు ఘాటు శృంగార సీన్లలో శోభిత యాక్ట్ చేసింది. ఇటీవల రిలీజైన ‘ది మంకీ మ్యాన్’ సినిమాలో సైతం శోభితా హాట్ షో చేసింది. ఎక్స్‌పోజింగ్, బోల్డ్ సీన్స్ కారణంగా సమంతకు డివోర్స్ ఇచ్చిన నాగ చైతన్య ఆెమె కంటే బోల్డ్ హీరోయిన్ అయిన శోభితాను ఎలా పెళ్లి చేసుకోబోతున్నారు? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్ రాఘవన్ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్' అనే అమెరికన్ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'సితారా' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
నాగచైతన్య రియాక్షన్ ఇదే!
శోభితతో నిశ్చితార్థంపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్న క్రమంలో తమ బంధం గురించి నాగ చైతన్య స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శోభిత పెట్టిన ఎంగేజ్‌మెంట్ ఫొటోలు, ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రీట్వీట్ చేస్తూ తన అభిప్రాయం కూడా ఇదే అంటూ రీపోస్టు చేశారు. 'నా తల్లి నీకేమవుతుంది? నా తండ్రి నీకు ఎలాంటి బంధువు? మనం ఎలా కలిస్తేనేం. మన హృదయాలు ఎర్రని భూమిలా వర్షిస్తోంది. విడిపోలేనంతగా అవి కలిసిపోయాయి’ అంటూ తమిళ కవి కురుంతోగై రాసిన పద్యం నుంచి పదాలను తీసుకుని క్యాప్షన్‌గా పెట్టారు. ఈ పోస్టును అక్కినేని సమర్థిస్తుండగా సామ్ అభిమానులు మాత్రం పెదవి విరుస్తున్నారు.
View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)
ఆగస్టు 10 , 2024
Naga Chaitanya - Sobhita: సమంత చేస్తే తప్పు.. శోభిత చేస్తే ఒప్పా! చైతూ నిశ్చితార్థంపై నెటిజన్ల ప్రశ్నలు!
అక్కినేని ఇంటి మరోమారు పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత (Samantha)తో విడాకులు అనంతరం ఆయన మరోమారు పెళ్లికి సిద్దమవుతున్నారు. ప్రముఖ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)ను నాగచైతన్య రెండో వివాహం చేసుకోనున్నాడు. తాజాగా వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసి అక్కినేని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం వీరి కలయికను తప్పుబడుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
నాగార్జున స్పెషల్ పోస్టు
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తన తనయుడు నాగ చైతన్య నిశ్చితార్థం గురించి స్వయంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘నా తనయుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈ రోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంటకు నా అభినందనలు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది’ అని నాగార్జున పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
https://twitter.com/iamnagarjuna/status/1821450886238851531
రెండేళ్లుగా ప్రేమాయణం!
నాగ చైతన్య - శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే ఇవాళ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.
సమంతతో విడాకులు
స్టార్ హీరోయిన్ సమంత (Samantha)ను గతంలో నాగ చైతన్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఏం మాయ చేశావే' (Ye Maaya Chesave) సినిమాతో చైతు-సమంతకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2017లో వివాహ బంధం ద్వారా వారిద్దరు ఒక్కటయ్యారు. బెస్ట్ కపుల్ అంటూ ప్రసంశలు కూడా అందుకున్నారు. అటువంటిది నాలుగేళ్ల తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అభిమానులకు షాకిస్తూ 2021లో నాగ చైతన్య, సమంత విడిపోయారు. ప్రస్తుతం ఎవరి దారి వారిది అన్నట్లుగా జీవిస్తున్నారు. మూడేళ్ల తర్వాత చైతు మరో పెళ్లికి రెడీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్ రాఘవన్ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్' అనే అమెరికన్ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'సితారా' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
సమంత కంటే చాలా బోల్డ్!
‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో సమంత బోల్డ్‌గా నటించడమే విడాకులకు కారణమని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. అలాగే పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేయడం వంటి అనేక కారణాలూ వినిపించాయి. అయితే, ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న శోభిత ధూళిపాళ స్క్రీన్ ప్రజెన్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమంత కంటే ఎక్కువగా బోల్డ్ సీన్స్‌లో శోభిత నటించిందని కొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే బోల్డ్ వెబ్ సిరీస్‌లో హాట్ షోతో శోభితా ధూళిపాళ్ల రెచ్చిపోయిందని చెబుతున్నారు. అందులో ఇంటిమేట్ సీన్లలో శోభిత నటించిందని పేర్కొంటున్నారు. అలాగే ‘ది నైట్ మేనెజర్’ వెబ్ సిరీస్‌లో కూడా బికినీతోపాటు ఘాటు శృంగార సీన్లలో శోభిత యాక్ట్ చేసింది. ఇటీవల రిలీజైన ‘ది మంకీ మ్యాన్’ సినిమాలో సైతం శోభితా హాట్ షో చేసింది. ఎక్స్‌పోజింగ్, బోల్డ్ సీన్స్ కారణంగా సమంతకు డివోర్స్ ఇచ్చిన నాగ చైతన్య ఆెమె కంటే బోల్డ్ హీరోయిన్ అయిన శోభితాను ఎలా పెళ్లి చేసుకోబోతున్నారు? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఆగస్టు 08 , 2024
Prabhas Future Projects: 2025లోనూ ప్రభాస్ జోరు.. మూడు సినిమాలు పక్కా!
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కెరీర్ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. ఆయన గత చిత్రాలైన ‘సలార్’ (Salaar: Part 1 - Ceasefire), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ప్రభాస్ సత్తా ఏంటో మరోమారు నిరూపించాయి. అయితే ‘బాహుబలి 2’ తర్వాతి నుంచి ప్రభాస్ చిత్రాల జోరు ఒక్కసారిగా పెరిగింది. ఒకటికి తగ్గకుండా ప్రతీ ఏడాది తన సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది రెండు చిత్రాలతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది ఇప్పటికే ‘కల్కి’ రూపంలో పలకరించాడు. ఇక వచ్చే ఏడాది ఏకంగా మూడు చిత్రాలతో ప్రభాస్ ఆడియన్స్‌కు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ మూడు చిత్రాలు లోడింగ్..!
‘బాహుబలి’ (Baahubali), ‘బాహుబలి 2’ (Baahubali 2) చిత్రాల తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకూ టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ఆ రెండు చిత్రాలతో గ్లోబల్ స్థాయికి చేరింది. ఆ క్రేజ్‌ను కాపాడుకోవడమే కాకుండా తన ప్రతీ సినిమాకు మరింత పెంచుకుంటూ రెబల్ స్టార్ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో ఐదు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డైరెక్టర్ మారుతీతో ‘రాజా సాబ్’ (Raja Saab), సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ (Salaar 2)తో పాటు హను రాఘవపూడితో ఓ చిత్రం చేయనున్నాడు. పైన చెప్పుకున్న వాటిలో తొలి మూడు చిత్రాలు 2025లో రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రాజా సాబ్’ను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అటు ‘కల్కి 2‘ షూటింగ్ కూడా కొంతమేర పూర్తైనట్లు నిర్మాత అశ్వనీ దత్ ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి (జూన్ నెలలో) రిలీజ్ చేయవచ్చని హింట్ ఇచ్చారు. అటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రానున్న ‘స్పిరిట్’ కూడా మరో రెండు నెలల్లో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది చివరి కల్లా ఈ మూవీని రిలీజ్ చేయాలని సందీప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నుంచి 2025లో మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
వరుస సినిమాలతో ప్రభాస్ జోరు!
‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్న సామెతను ప్రభాస్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అతడి కెరీర్ పీక్స్‌లో ఉన్న నేపథ్యంలో వరుసగా సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను, ఫాలోయింగ్‌ను మరింత పెంచుకునేందుకు డార్లింగ్ ప్రయత్నిస్తున్నాడు. శరవేగంగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌కు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. 2023లో ప్రభాస్ నుంచి ‘ఆదిపురుష్’, సలార్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది కల్కితో ఇప్పటికే ఆడియన్స్‌ను పలకరించిన ప్రభాస్ డిసెంబర్‌లో రానున్న ‘కన్నప్ప’లో ఓ క్యామియోతో అలరించనున్నాడు. ఆపై 2025లో మూడు చిత్రాలు, 2026 కోసం ‘సలార్ 2’, హను రాఘవపూడి దర్శకత్వంలోని చిత్రాన్ని రెడీ చేసుకున్నాడు. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడానికి తారక్, అల్లుఅర్జున్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలు తడబడుతుంటే ప్రభాస్ మాత్రం అలవోకగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. అది కూడా పాన్ ఇండియా స్థాయి చిత్రాలను చక చక పూర్తి చేస్తుండటం ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
రేసుకు తెరలేపిన ప్రభాస్!
ప్రభాస్ అప్‌కమింగ్ చిత్రం 'రాజా సాబ్'ను 2025 సమ్మర్ కానుకగా తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్‌గా ఐదు (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ) భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే 2025 సమ్మర్ రేసులో పలు భారీ చిత్రాలు నిలిచాయి. నాగ చైతన్య 'తండేల్' (Thandel), నాగార్జున - ధనుష్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'కుబేర' (Kubera)ను వచ్చే ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అటు ‘కేజీఎఫ్’ ఫేమ్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' (Toxic) కూడా సమ్మర్ -2025 టార్గెట్‌గా రూపొందుతోంది. అటు హిందీలో సల్మాన్ నటిస్తున్న 'సికిందర్' కూడా ఈ రేసులో ఉన్నాయి. ప్రభాస్ సినిమా డేట్‌ను లాక్ చేసుకున్న నేపథ్యంలో ఆయా చిత్రాలు సమ్మర్‌లోనే రిలీజ్ అవుతాయా? లేక ప్రీపోన్ లేదా పోస్ట్ పోన్ చేసుకుంటాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
జూలై 30 , 2024
Sai Pallavi Record: సాయిపల్లవి సరికొత్త రికార్డు.. ఏకైక హీరోయిన్‌గా అరుదైన ఘనత!
మలయాళ బ్యూటీ సాయి పల్లవి (Actress Sai Pallavi) అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. చేసింది తక్కువ సినిమాలే అయిన్పపటికీ తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. బికినీ, ముద్దు సీన్లతో రెచ్చిపోతున్న ఈ కాలంలో సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ నటన, డ్యాన్స్‌తోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ (Filmfare Awards South 2023) ప్రకటించగా అందులో సాయిపల్లవి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఏ హీరోయిన్‌కు సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించింది.
ఏకైక హీరోయిన్‌గా ‘సాయిపల్లవి’
దక్షిణాది సినిమా పరిశ్రమలో ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో 2022, 2023 చిత్రాలను పరిగణలోకి తాజాగా 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను ప్రకటించారు. తమిళంలో వచ్చిన 'గార్గీ' (Gargi) చిత్రానికి గాను సాయి పల్లవికి ఉత్తమ నటి పురస్కారం లభించింది. అటు తెలుగులో చేసిన 'విరాట పర్వం' (Virataparvam) సినిమాకు సైతం క్రిటిక్స్ విభాగంలో బెస్ట్ ఫీమేల్ యాక్టర్‌గా అవార్డు దక్కించుకుంది. ఇలా రెండు భాషల్లో ఒకే ఏడాదిలో అవార్డు దక్కించిన ఏకైక హీరోయిన్‌గా సాయిపల్లవి చరిత్ర సృష్టించింది. దీంతో సాయిపల్లవిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
తమిళ చిత్రం 'ప్రేమమ్' (Premam)తో సినీరంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి (Sai Pallavi) యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో 'ఫిదా' (Fidaa) చేసి భానుమతి పాత్రలో తనదైన ముద్ర వేసింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఇప్పటివరకూ 19 చిత్రాలు చేసిన సాయిపల్లవి ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను దక్కించుకుంది. దక్షిణాదిలో ఇంత తక్కువ కాలంలో ఆ ఫీట్ సాధించిన హీరోయిన్‌గానూ సాయిపల్లవి నిలిచింది.
సాయి పల్లవి అవార్డులు అందుకున్న సినిమాలు
ప్రేమమ్ (2015) – ఉత్తమ నటి (డెబ్యూ)ఫిదా (2017) – ఉత్తమ నటిలవ్ స్టోరీ (2021) – ఉత్తమ నటిశ్యామ్ సింగరాయ్ (2021) – ఉత్తమ నటి (క్రిటిక్స్)గార్గి (2022) – ఉత్తమ నటివిరాటపర్వం (2022) – ఉత్తమ నటి (క్రిటిక్స్)
ప్రేమ చిత్రాలకు చిరునామా
‘ప్రేమమ్’ (Premam) తర్వాత నుంచి సాయిపల్లవి ఆచితూచి సినిమాలు చేసింది. స్కిన్ షోకు పూర్తి వ్యతిరేకంగా, కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కంటెంట్ ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో హృదయాలకు హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో నటించింది. ‘ప్రేమమ్’ సహా ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలు ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేశాయి. ఆ తర్వాత రానాతో చేసిన ‘విరాట పర్వం’ సినిమాలో చక్కటి నటన కనబరిచి సాయిపల్లవి నటిగా మరో మెట్టు పైకెక్కింది.
ఫుల్ స్వింగ్‌లో సాయిపల్లవి
ప్రస్తుతం సాయి పల్లవి.. సినిమాల పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya)తో కలిసి ‘తండేల్’ (Thandel) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అటు తమిళంలో శివకార్తికేయన్ (Sivakarthikeyan)తో కలిసి ‘అమరన్’ (Amaran) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ రెండు భారీ ప్రాజెక్టులకు సాయిపల్లవి ఓకే చెప్పింది. ఇందులో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న 'రామయణం' కూడా ఉంది. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవలే విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు కూడా వార్తలు వచ్చాయి.
జూలై 13 , 2024
Vijay Deverakonda - Sai Pallavi: విజయ్ దేవరకొండతో సాయిపల్లవి రొమాన్స్!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి.. తన నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్‌తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవి.. రొమాంటిక్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
క్రేజీ లవ్‌స్టోరీ..
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా సాయిపల్లవిని తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ భావించారట. ఇప్పటికే చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని అంటున్నారు. ఇది నిజమైతే విజయ్ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
లవ్ స్టోరీలకు కేరాఫ్
తమిళంలో వచ్చిన ‘ప్రేమమ్’ (Premam) చిత్రంతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న సాయిపల్లవి (Sai Pallavi).. ఆ తర్వాత నుంచి ఆచితూచి సినిమాలు చేసింది. స్కిన్ షోకు పూర్తి వ్యతిరేకమైన ఈ భామ.. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కంటెంట్ ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో హృదయాలకు హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో ఆమె నటించింది. ‘ప్రేమమ్’ సహా ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలు ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేశాయి. ఆ తర్వాత రానాతో చేసిన ‘విరాట పర్వం’ సినిమాలో చక్కటి నటన కనబరిచి సాయిపల్లవి నటిగా మరో మెట్టు పైకెక్కింది.
ఫుల్ స్వింగ్‌లో సాయిపల్లవి
ప్రస్తుతం సాయి పల్లవి.. సినిమాల పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya)తో కలిసి ‘తండేల్’ (Thandel) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అటు తమిళంలో శివకార్తికేయన్ (Sivakarthikeyan)తో కలిసి ‘అమరన్’ (Amaran) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ రెండు భారీ ప్రాజెక్టులకు సాయిపల్లవి ఓకే చెప్పింది. ఇందులో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న 'రామయణం' కూడా ఉంది. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మెుదలైంది.
పోలీసు ఆఫీసర్‌గా విజయ్
'ఫ్యామిలీ స్టార్' చిత్రం తర్వాత ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ కెరీర్‌లో 12వ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని సీరియస్ పోలీసు ఆఫీసర్‌గా విజయ్ కనిపించనున్నాడు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
జూన్ 06 , 2024
Ranbir Kapoor - Sai Pallavi: ‘రామాాయణం’ నుంచి బిగ్ అప్‌డేట్.. ఏంటంటే?
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) సీతగా బాలీవుడ్‌లో ‘రామాయణం’ (Ramayanam) అనే చిత్రం తెరకెక్కబోతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో కేజీఎఫ్ (KGF) ఫేమ్ యష్ (Yash) రావణసురుడిగా కనిపిస్తారని సమాచారం. బాలీవుడ్‌కు ‘దంగల్’ (Dangal) లాంటి బ్లాక్ బాస్టర్‌ను అందించిన స్టార్ డైరెక్టర్ నితేష్ తివారి (Nitesh Tiwari) ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ కోసం ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడం మూవీ గురించి అంతా మర్చిపోయారు. అయితే తాజాగా సాలిడ్ అప్‌డేట్ బయటకు రావడంతో అందరిదృష్టి ఈ సినిమాపై పడింది.
షూటింగ్ ప్రారంభం ఆ రోజే!
లేటెస్ట్ బజ్ ప్రకారం.. 'రామాయణం' చిత్రానికి సంబంధించి ఏప్రిల్ 17న అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు శ్రీరామ నవమి (Sri Rama Navami) కావడంతో సినిమా అనౌన్స్‌కు అదే సరైన సమయంగా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో మూవీ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజున ఎలాంటి ప్రకటను రానుందోనని.. నటీనటుల ఎంపిక గురించి కూడా అనౌన్స్‌మెంట్ చేస్తారేమోనని అంచనాలు వేసుకుంటున్నారు. మరోవైపు ‘రామాయణం’కు సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ కూడా ముంబయిలో ఈ నెలాఖరు నుంచి ప్రారంభమవుతుందని టాక్.
ఆ స్టార్లను సాయిపల్లవికి అవకాశం!
‘రాయాయణం’ చిత్రంలో సీత పాత్రలో నటించేందుకు తొలుత అలియా భట్ (Alia Bhatt), దీపికా పదుకొణె (Deepika Padukone), కరీనా కపూర్ (Kareena Kapoor)ల పేర్లను మూవీ టీమ్ పరిశీలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. చివరికీ సాయిపల్లవి (Sai Pallavi)ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. సీతాదేవి పాత్రకు సాయిపల్లవి అయితేనే సరిగ్గా సరిపోతుందని యూనిట్ భావించిందట. ఆమె సహజసిద్ధమైన నటన ఆ పాత్రకు చాలా ప్లస్ అవుతుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.
ఆస్కార్ విన్నింగ్ కంపెనీతో గ్రాఫిక్స్!
రామాయణం చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాలని డైరెక్టర్ నితేష్ తివారి (Nitesh Tiwari) భావిస్తున్నారట. ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమా గ్రాఫిక్స్‌పై విపరీతంగా ట్రోల్స్ రావడంతో ఆయన జాగ్రత్తపడుతున్నారట. గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ కంపెనీ ‘DNEG’తో చిత్ర యూనిట్ చర్చలు జరిపినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ కంపెనీనే.. ఈ మూవీకి VFX అందించనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
అమీర్‌ఖాన్ కొడుకుతో సినిమా
ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్‌లో మరో సినిమాను సైతం చేస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan)తో ఈ భామ నటిస్తోంది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గతేడాది డిసెంబర్‌లో ప్రారంభమైంది. లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు టైటిల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూ సాయి పల్లవి బిజీ బిజీగా గడుపుతోంది.
సాయిపల్లవి ఫూచర్ ప్రాజెక్ట్స్
తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో సాయిపల్లవి పరిచయమైంది. అంతకు ముందు ఈమె మలయాళంలో ’ప్రేమమ్’ సినిమాలో మలర్‌గా పలకరించింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తోంది. లేటెస్ట్‌గా నాగచైతన్య (Naga Chaitanya)తో ‘తండేల్’ (Thandel)లో చేయగా ఆ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తమిళంలో శివకార్తికేయన్ (Siva Karthikeyan)తో ‘అమరన్’ (Amaran) చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఆ సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.
మార్చి 02 , 2024