UATelugu
తంగలాన్ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బ్రిటిషర్లతో కలిసి బంగారం వెతికేందుకు వెళ్తాడు. అయితే బంగారాన్ని నాగజాతికి చెందిన మంత్రగత్తె ఆరతి (మాళవిక) రక్షిస్తుంటుంది. ఆమె నుంచి తంగలాన్ బృందానికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఆమె నుంచి తప్పించుకొని తంగలాన్ బంగారాన్ని ఎలా సాధించాడు? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Netflixఫ్రమ్
రివ్యూస్
YouSay Review
Thangalaan Telugu Review: విక్రమ్ కెరీర్‌లోనే మరో మైలురాయి చిత్రం.. ‘తంగలాన్’ ఎలా ఉందంటే?
‘అపరిచుతుడు’, ‘ఐ’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగులోనూ పాపులర్ అయిన నటుడు విక్రమ్ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘తంగ...read more
How was the movie?
తారాగణం
విక్రమ్
మాళవిక మోహనన్
పార్వతి తిరువోతు
పశుపతి
వెట్టై ముత్తుకుమార్
అర్జున్ అన్బుదన్
సిబ్బంది
పా. రంజిత్
దర్శకుడుకెఇ జ్ఞానవేల్ రాజా
నిర్మాతజ్యోతి దేశ్‌పాండే
నిర్మాతపా. రంజిత్
నిర్మాతజివి ప్రకాష్ కుమార్
సంగీతకారుడుఎ. కిషోర్ కుమార్సినిమాటోగ్రాఫర్
సెల్వ ఆర్.కె.ఎడిటర్ర్
కథనాలు
Thangalan OTT: ‘తంగలాన్’ ఇప్పట్లో ఓటీటీలోకి రానట్లే.. మరి ఎప్పుడంటే?
‘అపరిచుతుడు’, ‘ఐ’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తమిళ నటుడు విక్రమ్ తెలుగులోనూ పాపులర్ అయ్యాడు. ఇటీవల వచ్చిన 'తంగలాన్' చిత్రంలోనూ ఆటవిక మనిషిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమాలో పాత్ర కోసం విక్రమ్ తనను తాను మార్చుకున్న తీరుపై పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. ఆగస్టు 15న రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని గత కొన్ని రోజులగా సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే వారికి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెనక్కి తగ్గిన నెట్‌ఫ్లిక్స్!
చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’ (Thangalan) పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించారు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు (Parvathy Thiruvothu), మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో థియేటర్స్‌లో విడుదలై మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎక్స్‌పెక్ట్ చేసినంత సక్సెస్‌ను అందుకోకపోవడంతో ‘తంగలాన్’ ఓటీటీ డీల్‌పై నెట్‌ఫ్లిక్స్ పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. ఈ క్రమంలోనే ముందుగా ఒప్పందం చేసుకున్న మొత్తానికి కాకుండా తక్కువకే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇవ్వాలని నిర్మాణ సంస్థను డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మరో ఓటీటీలో రిలీజ్?
ఓటీటీ రైట్స్ తక్కువకు ఇవ్వాలన్న నెట్‌ఫ్లిక్స్ డిమాండ్‌కు తంగలాన్ నిర్మాతలు ససేమీరా అన్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో ఓటీటీ డీల్‌ను నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఎంతకూ పంతం వీడకపోవడంతో మరో ఓటీటీ సంస్థకు ‘తంగలాన్’ను ఇచ్చే ప్రయత్నాలను నిర్మాతలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ తంగలాన్ ఓటీటీలోకి రావడమే కష్టమే అని చెప్పవచ్చు. దీంతో ఓటీటీలో తంగలాన్ కోసం ఎదురుచూస్తున్న సినీ లవర్స్‌కు ఇది పెద్ద షాకే.
కలెక్షన్స్ నిల్!
ప్రముఖ తమిళ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తంగలాన్ చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల బడ్టెత్‌తో నిర్మించారు. యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా ఈజీగా రూ.150 కోట్ల పైనే వసూలు చేస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా రూ.105 కోట్ల గ్రాస్‌ను మాత్రమే అందుకుంది. కేవలం రూ.70 కోట్ల నెట్ వసూళ్లను సాధించగలిగింది. అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా విక్రమ్ నటనపై మాత్రం సర్వత్రా ప్రశంసలు కురిశాయి. నటన పరంగా ‘తంగలాన్’ అతడి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. దీంతో ఓటీటీలోనైనా ఈ సినిమాను వీక్షించాలని అంతా భావించగా నెట్‌ఫ్లిక్స్ వారికి నిరాశనే మిగిల్చింది.
కథేంటి
1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో కథ సాగుతుంటుంది. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్) తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు వారికి ఎదురవుతాయి. నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి (మాళవిక మోహనన్) తన అతీంద్రియ శక్తులతో బంగారాన్ని రక్షిస్తున్నట్లు తంగలాన్‌కు కలలు వస్తుంటాయి. మరి ఆమె నిజంగానే బంగారాన్ని రక్షిస్తుందా? తంగలాన్‌కు అతడి బృందానికి ఆమె వల్ల ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ ప్రయాణంలో తంగలాన్ ఏం తెలుసుకున్నాడు? చివరకు బంగారం కనిపెట్టాడా? లేదా? అన్నది స్టోరీ.
అక్టోబర్ 05 , 2024
Thangalaan Telugu Review: విక్రమ్ కెరీర్‌లోనే మరో మైలురాయి చిత్రం.. ‘తంగలాన్’ ఎలా ఉందంటే?
నటీనటులు: విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తు, పశుపతి, డానియల్ కాల్టాగిరోన్ తదితరులు
దర్శకత్వం: పా.రంజిత్
సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్
ఎడిటింగ్: సెల్వ ఆర్.కె.
సినిమాటోగ్రఫీ: ఎ.కిషోర్ కుమార్
నిర్మాతలు: కె.ఇ.జ్ఞానవేల్ రాజా, పా.రంజిత్, జ్యోతి దేశ్ పాండే
విడుదల: 15-08-2024
‘అపరిచుతుడు’, ‘ఐ’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగులోనూ పాపులర్ అయిన నటుడు విక్రమ్ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'తంగలాన్' చిత్రంలో ఆటవిక మనిషిగా విక్రమ్ కనిపించాడు. ఈ సినిమాలో పాత్ర కోసం విక్రమ్ తనను తాను మార్చుకున్న తీరు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేసింది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్, టీజర్ కూడా వాటిని రెట్టింపు చేసింది. ఆగస్టు 15న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. మరీ తంగలాన్ ఎలా ఉంది? విక్రమ్ మరోమారు తన నటనతో మెస్మరైజ్ చేశాడా? సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతి ఇచ్చింది? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో కథ సాగుతుంటుంది. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్) తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు వారికి ఎదురవుతాయి. నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి (మాళవిక మోహనన్) తన అతీంద్రియ శక్తులతో బంగారాన్ని రక్షిస్తున్నట్లు తంగలాన్‌కు కలలు వస్తుంటాయి. మరి ఆమె నిజంగానే బంగారాన్ని రక్షిస్తుందా? తంగలాన్‌కు అతడి బృందానికి ఆమె వల్ల ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ ప్రయాణంలో తంగలాన్ ఏం తెలుసుకున్నాడు? చివరకు బంగారం కనిపెట్టాడా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే?
తంగలాన్ పాత్రలో విక్రమ్ అదరగొట్టేశారు. అతడు తప్ప మరొకర్ని ఊహించుకోలేనంతగా ఆ పాత్రపై ప్రభావం చూపించారు. ఆదివాసిలా తను కనిపించిన తీరు, పలికించిన హావభావాలు అందర్నీ కట్టిపడేస్తాయి. ఇది విక్రమ్ కెరీర్‌లో మరో మైలురాయిగా చెప్పవచ్చు. తంగలాన్ భార్యగా చేసిన మలయాళ నటి పార్వతి తిరువత్తు ఉన్నంతలో పర్వాలేదనిపించింది. నాగిని జాతి నాయకురాలు ఆరతిగా మాళవిక మోహనన్ కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకుంది. తన లుక్స్, నటనతో ఆడియన్స్‌ను భయపెట్టింది. విక్రమ్ తర్వాత ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపిన పాత్ర ఆమెదే. విక్రమ్‌తో ఆమె చేసే యాక్షన్ హంగామా అలరిస్తాయి. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
తంగలాన్ చిత్రం ప్రధానంగా బంగారం అన్వేషణ చుట్టూ తిరిగినా అంతర్లీనంగా ఓ అణగారిన వర్గం చేసే పోరాటంగా దర్శకుడు పా.రంజిత్ ఈ మూవీని తెరెక్కించారు. బ్రిటిషర్ల కాలంలోని వర్ణ వివక్షను కళ్లకు కట్టారు. కథ చెప్పేందుకు దర్శకుడు సృష్టించిన ప్రపంచం, ప్రజల వస్త్రధారణలు ఆడియన్స్‌ను కొత్త లోకానికి తీసుకెళ్తాయి. బిటిషర్లతో కలిసి తంగలాన్ బంగారం వేటకు వెళ్లడం, ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సవాళ్లు ఉత్కంఠను రేపుతాయి. విరామంలో వచ్చే సీన్స్ సెకండాఫ్‌పై మరింతగా అంచనాలు పెంచేస్తాయి. అయితే సెకండ్ పార్ట్‌కు వచ్చే సరికి కథ గాడితప్పిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్‌లో బ్రిటిషర్లు-తంగలాన్-నాగజాతి తెగకు మధ్య జరిగే పోరు గందరగోళానికి గురిచేస్తుంది. ఏది తంగలాన్ ఊహో, ఏది నిజమో తెలియక ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అయితే క్లైమాక్స్‌లో తంగలాన్ పాత్రలోని మరో కోణం చూపించి దర్శకుడు మంచి ముగింపును ఇచ్చాడు.
టెక్నికల్‌గా
ఈ చిత్రం సాంకేతికంగా చాలా విషయాల్లో బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్, మేకప్, ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్స్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాయి. అలాగే కథకు తగ్గట్లుగా జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ, కథనంవిక్రమ్, మాళవిక నటనఫాంటసీ ఎలిమెంట్స్
మైనస్ పాయింట్స్
సెకండాఫ్‌లోని సాగదీత సీన్స్‌స్లో నారేషన్
Telugu.yousay.tv Rating : 3/5
ఆగస్టు 16 , 2024
Unique Movie Titles: సలార్, కంగువ, తంగలాన్.. ఈ టైటిల్స్ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
సినిమాపై ఆసక్తిని పెంచడంలో టైటిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా పేరు ఎంత యూనిక్‌గా ఉంటే ఆడియన్స్ అంతగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం రూపొందుతున్న చాలావరకూ సినిమాలు తమ ప్రాంతానికే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్నాయి. అయితే కథ డిమాండ్ మేరకు ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పేర్లనే డైరెక్టర్లు సినిమాకు ఖరారు చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఆ టైటిళ్లు కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వాటి అర్థం తెలుసుకోవాలన్న ఉత్సాహం వారిలో పెరిగిపోతోంది. ఇంతకీ ఆ సినిమా పేర్లు ఏవి? వాటి వెనకున్న అర్థం ఏమిటీ? ఇప్పుడు పరిశీలిద్దాం.
తండేల్
నాగ చైతన్య లేటెస్ట్ మూవీ పేరు 'తండేల్' (Thandel). ఈ సినిమా టైటిల్ వెనకున్న అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తండేల్ అంటే మత్సకారుల బృంద నాయకుడు అని అర్థం. సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు అతడే బోటు నడుపుతాడు. చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సలార్
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'సలార్' (Salar). దీనికి నాయకుడు.. రక్షకుడు ఇలా పలు అర్థాలున్నాయి. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. డిసెంబర్ 22న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
డంకీ (DUNKI)
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డంకీ' (DUNKI). ఈ టైటిల్‌కు అర్ధం.. అక్రమంగా దేశ సరిహద్దుల గుండా ప్రయాణించడం. ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి తాప్సీ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ డిసెంబర్ 21న విడుదల కానుంది.
తంగలాన్
చియాన్ విక్రమ్ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). ఇది తమిళనాడులోని ఓ తెగ పేరు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటించింది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది.
కంగువ
స్టార్ హీరో సూర్య అప్‌కమింగ్ మూవీ పేరు 'కంగువ' (Kanguva). దీనికి ‘అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు’ అని అర్థం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్యకు జోడీగా దిశా పటానీ (Disha Patani) నటిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
మట్కా
వరణ్‌తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం పేరు 'మట్కా' (Matka). ఇదో రకమైన జూదం. యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యింది.
జిగర్‌తండ డబుల్ ఎక్స్
రాఘవ లారెన్స్, ఎస్.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్‌తండ డబుల్ ఎక్స్' (Jigarthanda DoubleX). తమిళనాడులోని మధురైలో ప్రసిద్ధి చెందిన ఓ కూల్‌డ్రింక్ పేరును దీనికి పెట్టారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.
అయలాన్
శివకార్తికేయన్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం 'అలయాన్' (Ayalaan). దీనికి పొరుగువాడు అని అర్థం. మానవుడు ఏలియన్ మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
నవంబర్ 25 , 2023
Mr. Bachchan Vs Double Ismart: డే 1 కలెక్షన్స్‌లో విన్నర్ ఎవరంటే?
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రామ్ - పూరి కాంబోలోని 'డబుల్ ఇస్మార్ట్', రవితేజ - హరిష్ శంకర్ కలయికలో తెరకెక్కిన 'మిస్టర్ బచ్చన్' చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. అలాగే తమిళ స్టార్ హీరో విక్రమ్ చేసిన 'తంగలాన్', ఎన్టీఆర్ బావమరిది నటించిన 'ఆయ్' థియేటర్లలో సందడి చేశాయి. వీటిలో రవితేజ, రామ్ చిత్రాలు మిశ్రమ స్పందన తెచ్చుకోగా, విక్రమ్, నార్నే నితిన్ చిత్రాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. మరి తొలి రోజున ఏ చిత్రం కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టింది? ఈ కథనంలో తెలుసుకుందాం.
డబుల్ ఇస్మార్ట్ వసూళ్లు ఎంతంటే!
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) చిత్రం తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ మంచి వసూళ్లను సాధించి పర్వాలేదనిపించింది. ఈ చిత్రం తొలిరోజున వరల్డ్ వైడ్‌గా రూ.12.45 కోట్లు (GROSS) రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.8.35 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మరో రూ. 4 కోట్ల రాబడి వచ్చినట్లు తెలిపాయి. లాంగ్ వీకెండ్ కావడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాయి.
మిస్టర్ బచ్చన్ పరిస్థితి ఏంటంటే!
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), క్రియేటివ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan)పై రిలీజ్‌కు ముందు వరకూ భారీగా అంచనాలే ఉన్నాయి. అయితే గురువారం (ఆగస్టు 15) రిలీజైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కాగా, వరల్డ్ వైడ్‌గా రూ. 5.3 కోట్లు (GROSS) రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఆగస్టు 14న వేసిన ప్రీమియర్ల ద్వారా రూ.1.8 కోట్లు వసూలైనట్లు పేర్కొన్నాయి. తొలి ఆట నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ రావడం మిస్టర్ బచ్చన్ వసూళ్లపై ప్రభావం చూపినట్లు అభిప్రాయపడ్డాయి. అయితే లాంగ్ వీకెండ్ ఉండటంతో ఈ మూవీ పుంజుకునే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చాయి. కాగా, ఇందులో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ ద్వారానే తొలిసారి తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది.
తంగలాన్ టాప్!
తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన ‘తంగలాన్’ చిత్రం తొలి రోజున భారీ వసూళ్లను రాబట్టింది. రిలీజైన చిత్రాల్లో కెల్లా అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.26.44 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నార్త్‌లో రిలీజ్ కాకుండానే ఈ స్థాయి వసూళ్లు సాధించడం పట్ల సర్వత్ర ప్రశంసలు వ్యక్తమవుతోంది. ఇక నార్త్‌లో ఈ నెల 30న తంగలాన్ రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మంచి మౌత్ టాక్‌తో దూసుకెళ్తున్న తంగలాన్ ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి భారీగానే వసూళ్లు సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో విక్రమ్ నటనపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.
‘ఆయ్’కి మంచి వసూళ్లు!
'మ్యాడ్' చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఎన్టీఆర్ బామ మరిది నార్నె నితిన్ తన రెండో చిత్రం 'ఆయ్' మరోమారు ప్రేక్షకులను పలకరించాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తొలి రోజు పాటిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక డే 1 కలెక్షన్ల విషయానికి వస్తే ఈ మూవీ రూ.2 కోట్లు (GROSS) రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.8 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ తొలి రోజే ఆకర్షణీయమైన వసూళ్లు సాధించడంతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది. ఈ వీకెండ్ నాటికి ఈజీగానే లాభాల్లోకి వెళ్లిపోతుందని అభిప్రాయపడుతోంది.
ఆగస్టు 16 , 2024
OTT Suggestions: ఈ వీకెండ్.. పక్కా వినోదాన్ని పంచే చిత్రాలు ఇవే
ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను పసందైన ఆనందాన్ని పంచుతున్నాయి. ఈ వారంతం పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలోకి రానున్నాయి. మరికొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్ (OTT Suggestions)లో ప్లాన్ చేసుకోండి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
జీబ్రా (Zebra)
సత్యదేవ్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra). ప్రియాభవానీ శంకర్ కథానాయిక. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా ఇది తెరకెక్కింది. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రసారం చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ అధికారికంగా ప్రకటించింది. డేట్ అనౌన్స్ చేయనప్పటికీ డిసెంబర్ 14న ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లాట్ ఏంటంటే ‘మిడిల్ క్లాస్‌కు చెందిన సూర్య (సత్యదేవ్) బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్‌లో రిలేషన్ షిప్ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్)ని తప్పుడు అకౌంట్‌కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్‌ఫర్ చేస్తుంది. ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడే క్రమంలో సూర్య రూ.5 కోట్ల ఫ్రాడ్‌లో ఇరుక్కుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాలతో ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి?’ అన్నది స్టోరీ.
తంగలాన్ (Thangalan)
తమిళ స్టార్ హీరో విక్రమ్ హీరోగా నటించిన 'తంగలాన్' చిత్రం ఈ వారమే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి పా. రంజిత్ దర్శకత్వం వహించగా మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే ‘తంగలాన్ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బ్రిటిషర్లతో కలిసి బంగారం వెతికేందుకు వెళ్తాడు. అయితే బంగారాన్ని నాగజాతికి చెందిన మంత్రగత్తె ఆరతి (మాళవిక) రక్షిస్తుంటుంది. ఆమె నుంచి తంగలాన్ బృందానికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఆమె నుంచి తప్పించుకొని తంగలాన్ బంగారాన్ని ఎలా సాధించాడు?’ అన్నది స్టోరీ.
7/G
సోనియా అగర్వాల్ (OTT Suggestions), స్మృతి వెంకట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘7/G’. హరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టెరిఫిక్ హారర్ థ్రిల్లర్‌గా థియేటర్లలో ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం తాజాగా ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగులో వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘రాజీవ్, వర్ష దంపతులు ఐదేళ్ల కుమారుడితో కలిసి కొత్త ఫ్లాట్‌లోకి షిఫ్ట్ అవుతారు. అక్కడ వర్షకు అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. అతీతశక్తులతో ఆమె పోరాటం చేయాల్సి వస్తుంది. చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ.
బౌగెన్‌విల్లా (Bougainvillea)
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, కుంచకో బోబన్, జ్యోతిర్మయి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం 'బౌగెన్‌విల్లా'. థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 13 నుంచి సోని లివ్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. తెలుగులోనూ వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే 'థామస్, రీతు భార్య భర్తలు. యాక్సిడెంట్‌లో గీతు గతం మర్చిపోతుంది. మరోవైపు మినిస్టర్ కుమార్తె మిస్సింగ్ కేసు రాష్ట్రంలో సంచలనం సృషిస్తుంటుంది. యాక్సిడెంట్‌కు ముందు మినిస్టర్ కుమార్తెను రీతు ఫాలో కావడం చూసి దర్యాప్తు చేసేందుకు ఏసీపీ కోషి వాళ్ల ఇంటికి వస్తాడు. అక్కడ ఏసీపీకి తెలిసిన షాకింగ్ నిజాలేంటి? అసలు మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేసింది ఎవరు? అన్నది స్టోరీ.
హరికథ (Harikatha)
పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపీల్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. 'హరికథ: సంభవామి యుగే యుగే' (OTT Suggestions) పేరుతో రూపొందిన ఈ సిరీస్ ఈ వారమే హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. డిసెంబర్ 13 నుంచి ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, దివి, అంబటి అర్జున్ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు.
రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance)
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ పొనుగంటి, సుప్రజ్ రంగా హీరోలుగా నటించిన సినిమా 'రోటి కపడా రొమాన్స్'. ఇందులో సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరోయిన్లు. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఈ వారం స్ట్రీమింగ్‌కు వచ్చింది. డిసెంబర్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సినిమా ప్రసారం అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష (హర్ష నర్రా), సాఫ్ట్‌వేర్ రాహుల్ (సందీప్ సరోజ్), ఆర్జే సూర్య (తరుణ్), విక్కీ(సుప్రజ్ రంగ) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకే రూమ్‌లో ఉంటూ హ్యాపీగా జీవిస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. వారి రాకతో ఆ నలుగురు ఫ్రెండ్స్ లైఫ్ ఎలా మారింది? ప్రేమ వల్ల వారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? వారిలో వచ్చిన రియలైజేషన్ ఏంటి?’ అన్నది స్టోరీ
కంగువా (Kanguva)
ఇదిలా ఉంటే గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్‌తో ఎంచక్కా చూసేయండి. తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్ చిత్రం 'కంగువా' (Kanguva OTT Release) డిసెంబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ఫ్రాన్సిస్ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి?’ అన్నది స్టోరీ.
అమరన్ (Amaran)
పాన్ ఇండియా స్థాయిలో (OTT Releases) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్ తమిళ చిత్రం 'అమరన్' . అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేశారు. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు?’ అనేది మిగతా కథ.
విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video)
’యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Suggestions) నటించిన లేటెస్ట్ చిత్రం గత వారం ఓటీటీలోకి వచ్చింది. 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్‌కుమార్ రావ్, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్ శాండిల్య డైరెక్ట్ చేశారు. ప్లాట్ ఏంటంటే ‘1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. ఫస్ట్ నైట్ మధుర జ్ఞాపకాలను ఓ సిడీలో బంధిస్తారు. అయితే అనూహ్యంగా ఆ సీడీ దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి దంపతుల పరిస్థితి ఏంటి? అన్నది స్టోరీ.
డిసెంబర్ 12 , 2024
OTT Releases Telugu: దీపావళి కానుకగా రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
ఈ వారం దీపావళి (Diwali Festival)ని పురస్కరించుకొని పలు కొత్త చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మీ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు రెడీ అవుతున్నాయి. వెలుగుల పండగ సందర్భంగా ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచేందుకు తాము సిద్ధమంటున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
క
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా సుజిత్ - సుదీప్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘క’ (KA Movie). నయన సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 31న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇందులో కిరణ్ అబ్బవరం పోస్టుమ్యాన్ పాత్రలో నటించాడు. ఇటీవల విడుదలై ‘క’ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.
లక్కీ భాస్కర్
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'లక్కీ భాస్కర్' (Lucky Bhaskar). మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఒక సాధారణ ఉద్యోగి కోటీశ్వరుడిగా ఎలా మారాడు అన్న ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు.
సింగమ్ అగైన్
భారీ అంచనాలతో దీపావళి కానుకగా రాబోతున్న బాలీవుడ్ చిత్రం ‘సింగమ్ అగైన్’ (Singam Again). డీసీపీ బాజీరావు సింగమ్‌గా అజయ్ దేవ్‌గన్ నటించాడు. నవంబర్ 1న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇందులో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రణ్‌వీర్‌సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె లాంటి స్టార్‌లు నటించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
అమరన్
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'అమరన్' (Amaran). ఉగ్రదాడిలో మరణించిన ఆర్మీ ఉద్యోగి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దిగ్గజ నటుడు కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 31న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
బఘీర
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించిన కథతో రూపొందిన కన్నడ చిత్రం 'బఘీర' (Bagheera). ఈ చిత్రంలో శ్రీమురళి, రుక్మిణీ వసంత్ జంటగా నటించారు. సూరి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 31న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు
తంగలాన్
తమిళ నటుడు చియాన్ విక్రమ్ నటించిన రీసెంట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'తంగలాన్' (Thangalan). ఆగస్టు 15న తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రిలీజైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. చాలా రోజుల జాప్యం తర్వాత ఈ వారం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. అక్టోబర్ 31 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు.
మా నాన్న సూపర్ హీరో
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ (Ma Nanna Super Hero) మూవీ ఈ వారం స్ట్రీమింగ్‌లోకి రానుంది. అక్టోబర్ 31 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 వేదికగా ప్రసారం కానుంది. అభిలాష్ కంకర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిచంద్ షాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. ఆర్ణ హీరోయిన్‌గా చేసింది. అక్టోబర్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది.
అర్థమైందా అరుణ్‌కుమార్ 2
హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ 'అర్ధమయ్యిందా..? అరుణ్ కుమార్'. సీజన్ 1కు విశేష స్పందన రావడంతో సీజన్ 2 (Arthamainda Arun Kumar Season 2)ను అక్టోబర్ 31న తీసుకొస్తున్నారు. ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో పవన్ సిద్దు మెయిన్ లీడ్‌గా నటించాడు.
TitleCategoryLanguagePlatformRelease DateTime Cut MovieEnglishNetflixOct 30Murder MindfullyMovieEnglishNetflixOct 31The Diplomat Season 2 SeriesEnglishNetflixOct 31Love Mocktail Season 2SeriesTeluguETV WinOct 31Wizards Beyond Waverly PlaceSeriesEnglishHotstarOct 30Lubber PandhuMovieTelugu DubHotstarOct 31Koshkinda KandamMovieTelugu DubNetflixNov 1Joker: Folie à DeuxMovieEnglishAmazon Oct 29AnjamaiMovieTamilAha Oct 31Somebody Somewhere S3SeriesHindiAmazon Oct 25VettaiyanMovieTelugu/TamilAmazon Nov 7Mithya: The Dark ChapterSeriesTelugu, HindiZee 5Nov 1
అక్టోబర్ 28 , 2024
Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్ పెట్టకుంటే ముప్పు తప్పదా!
ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అనగానే బాలీవుడ్ మాత్రమే గుర్తుకువచ్చేది. హిందీ స్టార్లను మాత్రమే పాన్ ఇండియా సెలబ్రిటీలుగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సౌత్ ఇండస్ట్రీ కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ జాతీయ స్థాయిలో అలరిస్తోంది. ముఖ్యంగా సౌత్ నుంచి టాలీవుడ్ (Tollywood), కోలివుడ్ (Kollywood) ఇండస్ట్రీల నుంచి మంచి కంటెంట్ ఉన్న పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అవి బాలీవుడ్ ఆదిపత్యానికి చెక్ పెడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏకత్రాటిపై ఉండాల్సిన సౌత్ ఇండస్ట్రీస్ అభిమానులు చేస్తోన్న ఫ్యాన్ వార్స్ కారణంగా బలహీన పడుతోంది. దీనిని కట్టడి చేయకపోతే మున్ముందు రోజుల్లో సౌత్ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టాలీవుడ్ vs కోలీవుడ్
గతంలో ఫ్యాన్ వార్ అంటే ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేది. హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు పోస్టుల రూపంలో విమర్శలు చేసుకునేవారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా కారణంగా ఇది పక్క ఇండస్ట్రీలపైకి కూడా పాకింది. తమ హీరో తీసిన సినిమా కంటే పక్క ఇండస్ట్రీ స్టార్ చేసిన చిత్రం ఎక్కువ కలెక్షన్స్ సాధించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ పోకడ సౌత్‌లో టాలీవుడ్, కోలివుడ్ ఇండస్ట్రీలో ప్రధానంగా కనిపిస్తోంది. తమిళ హీరో విజయ్ చేసిన చిత్రాలు రిలీజ్ అయితే తెలుగు ఆడియన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అదే సమయంలో మన హీరోల సినిమాలు వచ్చినప్పుడు అంతే స్థాయిలో తమిళులు సైతం నెట్టింట యాంటీ ప్రచారం చేస్తున్నారు.
https://twitter.com/iammvengence/status/1758435868799377642
https://twitter.com/RAO_Offl/status/1759121949656318267
నష్టం ఏంటంటే?
కొద్దిమంది మాత్రమే చేసే ఈ ఫ్యాన్ వార్ వల్ల హీరోలకు, సినిమా ఇండస్ట్రీలకు వచ్చే నష్టం ఏముందిలే అని చాలా మంది భావించవచ్చు. కానీ అది పొరపాటు. కొద్ది మంది ఫ్యాన్స్ చేస్తున్న ఈ ట్రోల్స్ చూసి ఆయా ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది ఆడియన్స్ ప్రభావితమవుతున్నారు. దాని వల్ల సహజంగానే పక్క ఇండస్ట్రీకి చెందిన హీరోపై వారిలోనూ తెలియకుండానే ద్వేషం ఏర్పడుతోంది. ఫలితంగా పక్క ఇండస్ట్రీ నుంచి ఏదైనా సినిమా రిలీజైనప్పుడు దానిని చూడకుండా రిజెక్ట్ చేస్తున్నారు. సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్ టాక్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల నార్త్‌లో బాగా రాణించిన సినిమాలు ఎంతో కీలకమైన సౌత్‌లో దెబ్బతింటున్నాయి. అది మూవీ ఓవరాల్ కలెక్షన్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. సినిమా ఎంత బాగున్నప్పటికీ మనం చేసుకుంటున్న నెగిటివ్ ట్రోల్స్ కారణంగా ఆ సినిమా హిందీ మూవీస్ కంటే కలెక్షన్స్ పరంగా వెనకబడిపోతున్నాయి.
ఆ సినిమాలకు దెబ్బ!
త్వరలో రిలీజ్ అయ్యేందుకు సౌత్ నుంచి పలు పాన్ ఇండియా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్ నుంచి ‘పుష్ప 2’, ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకోగా కోలీవుడ్ నుంచి సూర్య నటించిన ‘కంగువా’, శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు భారీ ఖర్చుతో పాన్ ఇండియా స్క్రిప్ట్‌తో రూపొందినవే. గతంలో లాగే ఈ సినిమాల విషయంలోనూ ఫ్యాన్స్ ఇండస్ట్రీల పరంగా విడిపోయి ట్రోల్స్ దిగితే గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమా బాగుంటే ఇండస్ట్రీలకు అతీతంగా వాటిని ఆదరించాలని కోరుతున్నాయి. అప్పుడు మాత్రమే ఆయా చిత్రాలు మంచి వసూళ్లు సాధించి పాన్ ఇండియా స్థాయిలో ఘనమైన కలెక్షన్స్ సాధించగలుగుతాయని పేర్కొంటున్నాయి. అలా కాకుండా మళ్లీ ఫ్యాన్ వార్‌కు దిగితే పరోక్షంగా లాభపడేది బాలీవుడ్‌యే అని స్పష్టం చేస్తున్నాయి.
టైటిల్స్ రచ్చకు చెక్ పెట్టాల్సిందే!
సౌత్‌లో బిగ్ ఇండస్ట్రీలుగా ఉన్న టాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన దర్శక, నిర్మాతలు తమ వైఖరితో ఫ్యాన్ వార్‌కు ఆజ్యం పోయకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇటీవల కాలంలో కోలీవుడ్ చిత్రాలు నేరుగా తమిళ టైటిల్స్‌తో తెలుగులోనూ రిలీజ్ కావడం ఎక్కువగా చూస్తున్నాం. కంగువా, వేట్టయన్‌తో పాటు అంతకుముందు వచ్చిన ‘తంగలాన్’, ‘రాయన్’, ‘వెలిమై’ తమిళ పేర్లను పెట్టడం వల్ల ఇది తెలుగు ఆడియన్స్‌లో ఆగ్రహానికి కారణమైంది. కొందరు చేసిన తప్పిదాలు కారణంగా మెుత్తం తమిళ ఇండస్ట్రీపైనే ద్వేషం వచ్చే ప్రమాదం తలెత్తుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమిళ ఇండస్ట్రీ జాగ్రత్తపడాలి.
పొలిటికల్ టర్న్
ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టించాయి. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశిస్తూ పవన్ చేసిన పరోక్ష కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్ తరహాలోనే ఉదయనిధి స్టాలిన్ తమిళ నటుడు కావడంతో ఈ వివాదం తెలుగు, తమిళ ఇండస్ట్రీల మధ్య వార్‌గా కూడా మారిపోయింది. ఇరువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పరస్పరం మాటల దాడి చేసుకున్నారు. పవన్ కల్యాణ్ సినీ కెరీర్‌తో ఉదయనిధిని పోలుస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. అటు ఉదయనిధి విద్యార్హతను తెరపైకి తీసుకొచ్చి పవన్‌పై తమిళ నెటిజన్లు విమర్శలు చేశారు.
https://twitter.com/i/status/1841876236840374698
పవన్ కల్యాణ్ vs అల్లు అర్జున్
టాలీవుడ్‌లోని అతిపెద్ద సినీ నేపథ్యమున్న కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఆ ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా నటులు ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. అయితే ఆ కుటుంబానికి చెందిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌కు అసలు పడటం లేదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో(Pawan Kalyan vs Allu Arjun) పవన్ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడంతో ఈ వివాదం ఆజ్యం పోసుకుంది. అప్పటి నుంచి బన్నీని మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అటు అల్లు ఆర్మీ సైతం వారికి దీటుగా బదులిస్తూ తమ హీరోకు అండగా నిలుస్తోంది. అయితే ఇటీవల ఓ ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కల్యాణ్ టాలీవుడ్‌కు చెందిన హీరోలతో పాటు అల్లు అర్జున్ పేరును ప్రస్తావించారు. ఆ హీరోలంటే తనకు ఎంతో గౌరవమని వ్యాఖ్యానించారు. ఈ వివాదానికి చెక్ పెట్టే ఉద్దేశ్యంతోనే బన్నీ పేరును పవన్ తీసుకొచ్చినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప 2 చిత్రాన్ని ప్రమోట్ చేయమని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
అక్టోబర్ 17 , 2024
#BoycottVettaiyan: తెలుగంటే అంత చిన్నచూపా? నెటిజన్ల ట్రోల్స్!
భాషతో సంబంధం లేకుండా అభిమానులకు సంపాందించుకున్న హీరో రజనీకాంత్. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయనకు జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ స్టైల్ అన్నా, డైలాగ్ డెలీవరి అన్నా ఇప్పటికీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారు. అటువంటి రజనీకాంత్ నుంచి ‘వేట్టయన్’ సినిమా రానుండటంతో సహజంగానే దేశవ్యాప్తంగా మంచి హైప్ ఏర్పడింది. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌పై తెలుగు ఆడియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ #BoycottVettaiyanInTelugu హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్స్‌లో ట్రెండ్ చేస్తున్నారు.
‘తెలుగు ప్రేక్షకులంటే లోకువా’
రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వేట్టయన్'. ఈ మూవీలో రజినీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు. ‘వేట్టయన్’ అంటే తెలుగులో వేటగాడు అని అర్థం. అయితే తమిళంలో పెట్టిన వేట్టయన్ టైటిల్‌నే తెలుగులోనూ మక్కీకి మక్కీ దించారు. దీనిని తెలుగు ఆడియన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో వేటగాడు అనే పదం ఉన్నప్పటికీ తమిళ టైటిల్‌నే తెలుగులో పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు అంత లోకవయ్యారా? అంటూ నిలదీస్తున్నారు. బాషాభిమానం ఉన్నది మేకేనా? తెలుగు వారికి లేదనకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేట్టయన్‌ను తెలుగు బహిష్కరించాలంటూ ఎక్స్ వేదికగా హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/thenaani29/status/1843888854568431666
https://twitter.com/Kadirodu/status/1843694483508211884
https://twitter.com/kannayyaX/status/1843899836732743696
https://twitter.com/Jyotheshkum/status/1843844509123391639
ఆ సినిమాలు కూడా అంతే!
కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారని తెలుగు ఆడియన్స్‌కు పేరుంది. తమిళంలో ఫ్లాప్ అయిన చిత్రాలు సైతం తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు ‘డబ్బింగ్’ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టేవారు. ఇతర భాషలలో ఉండే బోర్డులని చక్కగా తెలుగులోకి మార్చేవారు. ఇప్పుడు అదంతా మానేసి నేరుగా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ‘కంగువ’, ‘వేట్టయన్’, ‘తంగలాన్’, ‘రాయన్’ ‘వలిమై’ వంటి తమిళ టైటిల్స్‌ను తెలుగులో అదే పేరుతో తీసుకురావడాన్ని తెలుగు ఆడియన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. చక్కగా తెలుగు టైటిల్స్ పెట్టొచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. తెలుగును గౌరవించని వారిని తెలుగు ఆడియన్స్ ఆదరించరని స్పష్టం చేస్తున్నారు.
తెలుగు భాష వద్దా!
గతంలో తమిళ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తుంటే మణిరత్నం లాంటి దర్శకులు తెలుగు డైలాగులు, పాటలు దగ్గరుంచి రాయించుకునేవారు. నేరుగా తెలుగు సినిమా చూస్తున్న భావన కలిగేది. ఘర్షణ, సఖి, యువ, చెలియా లాంటి మంచి మంచి టైటిళ్లు పెట్టడం చూశాం. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం మారిపోయింది. డబ్బింగ్, పాటల విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు. తమిళ వాసనలు గుప్పుమంటున్నాయి. ఇక టైటిల్స్ సంగతి సరే సరి. రజినీకాంత్ లాంటి హీరో కూడా ‘వేట్టయాన్’ టైటిల్ విషయంలో అభ్యంతరం పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు ఆడియన్స్ డబ్బు కావాలి కానీ భాష వద్దా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అక్టోబర్ 09 , 2024
Indian Oscar Entry 2025: ఆస్కార్ బరిలో ‘కల్కి 2898 ఏడీ’..? ‘RRR’ను ఫాలో కానున్నారా!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఈ ఏడాది మన దేశం తరుపున ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో నామినేట్ అవుతుందని అందరూ భావించారు. అంతర్జాతీయ స్టాండర్డ్స్‌తో రూపొందిన ఈ చిత్రం భారత్ తరపున ఆస్కార్ బరిలో నిలవడం లాంఛనమేనని అనుకున్నారు. అయితే అనూహ్యంగా హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’ 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి ఎంపికైంది. దీంతో గతేడాది ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనుసరించిన వ్యూహాన్నే ఫాలో కావాలని కల్కి టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
‘కల్కి’కి అన్యాయం జరిగిందా?
కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies For Oscars) 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో 12 మందితో కూడిన జ్యూరీ ఈ సినిమాను ఆస్కార్‌కు ఎంపిక చేసింది. దీనికి అస్సామీ దర్శకుడు జాహ్ను బారువా నేతృత్వం వహించారు. మెుత్తం 29 చిత్రాలు భారత్ తరపున నామినేట్ అయ్యేందుకు పోటీలో నిలిచాయి. అందులో టాలీవుడ్ నుంచి ‘కల్కి 2898 ఏడీ’, ‘హనుమాన్’, ‘మంగళవారం’ చిత్రాలు ఉన్నాయి. అయితే గ్లోబల్ స్థాయిలో సక్కెస్ అయినా కల్కిని కాదని లాపతా లేడీస్‌ను భారత్ తరపున ఎంపిక చేయడంపై సినీ లవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆస్కార్ సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్'కు జరిగిన అన్యాయమే ‘కల్కి’కి జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ బాటలో కల్కి!
గతేడాది ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో భారత్ తరపున ‘ఆర్ఆర్‌ఆర్’కు చోటుదక్కలేదు. దీంతో దర్శకధీరుడు రాజమౌళి జనరల్ కేటగిరిలో ఆస్కార్‌ను నామినేషన్స్ పంపించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటులు, ఉత్తమ డైరెక్టర్ సహా 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్‌కు పంపారు. ఈ క్రమంలో ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయ్యి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు కల్కి టీమ్ కూడా భారత్ తరపున అధికారికంగా కాకపోయిన జనరల్ చిత్రాల కేటగిరిలో ఆస్కార్ బరిలో నిలవాలని భావిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తరహాలోనే వివిధ కేటగిరీల కింద నామినేషన్స్ పంపాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం. ఆస్కార్ కమిటీ కల్కి పంపిన నామినేషన్స్‌ను పరిగణలోకి తీసుకొని షార్ట్ లిస్ట్ చేస్తే అధికారికంగా పోటీలో నిలుస్తుంది. అటు ‘హనుమాన్’ టీమ్ కూడా జనరల్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేషన్స్ పంపాలని భావిస్తున్నట్లు సమాచారం.
‘లాపతా లేడీస్’ ఎంపికకు కారణం ఇదే
లాపతా లేడీస్ చిత్రాన్ని భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ బరిలో నిలపడానికి గల కారణాలను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, అస్సామి దర్శకుడు జాహ్ను బారువ వెల్లడించారు. ‘జ్యూరీ అన్ని రంగాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే సరైన చిత్రాలను చూడాలి. ముఖ్యంగా లాపతా లేడీస్ భారతదేశ సామాజిక వ్యవస్థలు, నైతికతను చాటిచెప్పింది. భారతీయతను గొప్పగా చూపారు. అందుకే నామినేట్ అయిన 29 చిత్రాల్లో మేము దీన్ని ఎంపిక చేశాం. ఇది కేవలం ఒక్కరోజులో ఒకరు తీసుకున్న నిర్ణయం కాదు. 8 రోజుల పాటు జ్యూరీ సభ్యులందరం చర్చించుకొని లాపతా లేడీస్‌ను ఎంపిక చేశాం’ అని జాహ్ను బారువా తెలిపారు. ఇక ఈ సినిమా ఆస్కార్‌కు ఎంపిక కావడంపై దర్శకురాలు కిరణ్‌రావు కూడా ఆనందం వ్యక్తంచేశారు. ‘అద్భుతమైన కథకు ప్రాణం పోయడంలో ఎంతగానో శ్రమించిన టీమ్, వారి హార్డ్‌వర్క్‌కు దక్కిన గుర్తింపు ఇది. భారత్‌లో ప్రేక్షకులు ఏవిధంగా మా చిత్రాన్ని ఆదరించారో.. ప్రపంచస్థాయిలోనూ అదే విధంగా అభిమానిస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు.
సౌత్ నుంచి పోటీ పడ్డ చిత్రాలు ఇవే!
ఆస్కార్ అవార్డుల రేసులో భారత్ తరపున బరిలోకి దిగేందుకు మెుత్తం 29 చిత్రాలు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. అస్కార్ కోసం ఈసారి ఎక్కువగా సౌత్ ఇండియా సినిమాలే పోటీ పడ్డాయి. 29 చిత్రాల్లో టాలీవుడ్ నుంచి మూడు కాగా, కోలివుడ్ నుంచి 6 చిత్రాలు నామినేట్ లిస్ట్‌లో చోటు సంపాదించాయి. వాటిలో విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’, విక్రమ్ హీరోగా నటించిన ‘తంగలాన్’, సూరి ప్రధాన పాత్ర పోషించిన ‘కొట్టుక్కాళి’, లారెన్స్ - ఎస్.జే. సూర్య నటించిన ‘జిగర్తండా డబుల్ ఎక్స్’, మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్ హీరోగా చేసి దర్శకత్వం వహించిన ‘జమ’ చిత్రాలు ఉన్నాయి. మలయాళం నుంచి ‘ఆట్టం’, ‘ఆడుజీవితం’ (ది గోట్ లైఫ్), ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’, ‘ఉళ్ళోజుక్కు’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సౌత్ నుంచి 13 సినిమాలు ఆస్కార్ కోసం నామినేట్ అయ్యాయి. అయితే భారత్ నుంచి ‘లాపతా లేడిస్’ మాత్రమే అస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మిగిలిన సినిమాల గురించి అధికారికంగా ప్రకటన రానుంది.
లాపతా లేడీస్ ప్రత్యేకత ఏంటి?
సినిమాకి కథే హీరో అని ‘లాపతా లేడీస్’ చిత్రం మరోసారి నిరూపించింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారవుతారు. మరి ఆ తర్వాత వారి జీవితాలు ఎలా సాగాయి? వాళ్ల భర్తల దగ్గరికి ఎలా చేరుకున్నారు? అనేది ఇందులో చూపించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఓ వైపు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే మరోవైపు సమాజంలోని మహిళల గుర్తింపు గురించి ప్రశ్నలు లేవనెత్తేలా తీర్చిదిద్దారు. పితృస్వామ్య వ్యవస్థపై తీసిన వ్యంగ్య చిత్రమిది. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధోబీ ఘాట్’కు దర్శకత్వం వహించిన కిరణ్, 13 ఏళ్ల గ్యాప్ తర్వాత తెరకెక్కించిన చిత్రమిది. బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైనా ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.
సెప్టెంబర్ 24 , 2024
RC16: బుచ్చిబాబు సినిమా కోసం మహేష్ తరహాలో రామ్‌చరణ్ మేకోవర్.. వీడియో వైరల్!
రామ్‌చరణ్, తమిళ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో 'గేమ్ ఛేంజర్' (Game Changer) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను రామ్‌చరణ్ పూర్తిచేశారు. త్వరలోనే ఈ మూవీ పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కానున్నాయి. డిసెంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే రామ్‌చరణ్ తన తర్వాతి ప్రాజెక్ట్ 'RC16' పై ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే చరణ్‌కు సంబంధించిన లేటెస్ట్ లుక్ వైరల్ అవుతోంది. అతడి మేకోవర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
చరణ్ లుక్ వైరల్!
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు (Director Buchi Babu) దర్శకత్వంలో రామ్‌చరణ్ (Ram Charan) నటించబోతున్నాడు. ‘RC16’ వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మూవీలో రామ్‌చరణ్ సరికొత్తగా కనిపించబోతున్నట్లు సమాచారం. అందుకోసం చరణ్ కూడా తన బాడీని బిల్డ్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చరణ్ ప్రత్యక్షమయ్యాడు. బ్లాక్ కలర్ గ్లాసెస్‌తో లాంగ్ హెయిర్, థిక్ బియర్డ్‌తో చెర్రీ కనిపించాడు. గేమ్ ఛేంజర్ లుక్‌తో పోలిస్తే చరణ్ మరింత కండలు పెంచినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రామ్‌చరణ్‌తో పాటు భార్య ఉపాసన, కూతురు క్లింకార కూడా ఉన్నారు. రామ్‌చరణ్ తాజా లుక్స్ చూస్తుంటే రీసెంట్‌గా మహేష్‌బాబు లుక్స్ గుర్తువస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/BhavanircG46421/status/1837374510724505847
మల్లయోధుడిగా చరణ్!
‘RC16’ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మలయుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఏపీకి చెందిన మల్ల యుద్ద వీరుడు కోడిరామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు తగ్గట్లు బలిష్టంగా కనిపించేలా చరణ్ మేకోవర్ అవుతున్నాడు. ఇందుకు తగ్గట్లుగా బాడీని బిల్డ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 'బీస్ట్ మోడ్ ఆన్' అంటూ ఓ ఫొటోను అభిమానులతో చరణ్ పంచుకున్నాడు. ఈ పిక్‌లో చరణ్ తన ముఖం కనిపించకుండా వెనుకవైపుగా ఉన్న ఫొటోను షేర్ చేశారు.
View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan)
'తంగలాన్' కాస్ట్యూమ్ డిజైనర్
'RC16'ను పిరియాడిక్ డ్రామాగా దర్శకుడు బుచ్చిబాబు రూపొందించనున్నారు. ఈ చిత్రంలో సెట్స్, కాస్ట్యూమ్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. అందుకే గత కొన్ని వారాలుగా హైదరాబాద్ శివారులో దర్శకుడు సెట్స్ వేయిస్తున్నారు. ఇప్పుడు కాస్ట్యూమ్స్ కోసం తమిళ డిజైనర్ ఏగన్ ఏకాంబరంను రంగంలోకి దింపేందుకు సిద్ధమయ్యారు. తంగలాన్ చిత్రానికి ఏకాంబరం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఈ సినిమాలో విక్రమ్ సహా ముఖ్య పాత్రదారుల కాస్ట్యూమ్స్, ఔట్ ఫిట్ లుక్ కథకు అనుగుణంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆయన అయితేనే 'RC16' న్యాయం చేయగలరని దర్శకుడు బుచ్చిబాబు భావించినట్లు తెలుస్తోంది.
సెట్స్‌పైకి రెండు చిత్రాలు!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ చిరు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 17 ఏళ్లు అవుతోంది. మిగతా స్టార్స్‌తో పోలిస్తే సినిమా సినిమాకు చరణ్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారన్న విమర్శ ఉంది. దీంతో సంవత్సరానికి రెండు చొప్పున చిత్రాలు పట్టాలెక్కించేందుకు చరణ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇందులో భాగంగానే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కాకముందే డైరెక్టర్ బుచ్చిబాబుతో RC16 ప్రాజెక్ట్‌ను చరణ్ అనౌన్స్ చేశాడు. ఈ చిత్రంతో పాటుగానే సుకుమార్ దర్శకత్వంలో ‘RC17’ మరో మూవీ చేయబోతున్నాడు. ఒకేసారి ఆ రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని రామ్‌చరణ్ భావిస్తున్నారట. ఈ రెండు సినిమాలను 2026 లోపే రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.
'గేమ్ ఛేంజర్’ రిలీజ్‌పై తమన్ లీక్!
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్టు నిర్మాత దిల్ రాజు ఇటీవల వెల్లడించారు. కానీ, తేదీని ప్రకటించలేదు. సంగీత దర్శకుడు తమన్ (Thaman) తాజా పోస్ట్ ఆ లోటు తీర్చినట్టైంది. ‘వచ్చే వారం నుంచి డిసెంబరు 20 వరకూ ఈవెంట్స్, ప్రచార చిత్రాలుంటాయి. సిద్ధంగా ఉండండి’ అని అప్‌డేట్ ఇచ్చారు. దీంతో, రామ్ చరణ్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఆ సినిమా డిసెంబరు 20న విడుదల కానుందంటూ కామెంట్స్ రూపంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/MusicThaman/status/1836412745593286741
సెప్టెంబర్ 21 , 2024
This Week OTT Movies: ‘దేవర’ ఎఫెక్ట్.. థియేటర్లలో ఒకే ఒక్క తెలుగు చిత్రం.. ఓటీటీలో మాత్రం జాతరే!
సెప్టెంబర్ మూడో వారంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ఒకే ఒక్క తెలుగు చిత్రం సిద్ధమైంది. ఈ వారం సుహాస్ సింగిల్‌గా రాబోతున్నాడు. తర్వాతి వారమే 'దేవర' రిలీజ్ ఉండటంతో తమ చిత్రాలు రిలీజ్ చేసేందుకు తెలుగు దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరచలేదు. మరోవైపు రెండు బ్లాక్‌బాస్టర్ చిత్రాలు రీరిలీజ్ వచ్చేస్తున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు/ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
గొర్రె పురాణం
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. కొత్త తరహా కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో సుహాస్ (Suhas) నటించిన మరో వినూత్న చిత్రం ‘గొర్రె పురాణం’ (Gorre Puranam). బాబీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టింది? ఆ గొడవలోకి సుహాస్ ఎలా వచ్చాడు? అనే ఆసక్తికర కథతో సినిమా రూపొందింది. ఈ సినిమాలో గొర్రెకు దర్శకుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.
యుద్ర
సిద్ధాంత్ చతుర్వేది, మాళవిక మోహనన్ కీలక పాత్రల్లో రవి ఉద్యావర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ ‘యుద్ర’ (Yudhra Movie). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 20న హిందీలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఈ మూవీతోనే మాళవి బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఆమె పలు ఇంటిమేట్, ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేశారు.
కహా షురూ.. కహా ఖతం
ధ్వని భానుశాలి, ఆషిమ్ గులాటీ కీలక పాత్రల్లో శౌరబ్ దాస్‌గుప్త దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘కహా షురూ.. కహా ఖతం’ (Kahan Shuru Kahan Khatam). సెప్టెంబరు 20న ఈ మూవీ హిందీలో విడుదలకు సిద్ధమైంది. ‘మిమి’, ‘జర హట్కే జర బచ్కే’ వంటి కథలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ మూవీకి కథను అందించడం విశేషం.
బొమ్మరిల్లు
సిద్ధార్థ్, జెనీలియ జంటగా భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'బొమ్మరిల్లు' (Bommarillu) చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. 2006లో విడుదలైన ఈ చిత్రం పలు అవార్డులు సైతం సొంతం చేసుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలేట్‌గా నిలిచింది. కాగా, ఇప్పుడు ఈ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమవుతోంది. సెప్టెంబరు 21న తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్‌లో ‘బొమ్మరిల్లు’ విడుదల కానుంది.
జర్నీ
తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘జర్నీ’ (Journey Movie). జై, శర్వానంద్, అంజలి అనన్య కీలక పాత్రల్లో నటించారు. భారీ బస్ యాక్సీడెంట్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఇప్పుడు మరోమారు థియేటర్లలో అలరించేందుకు జర్నీ రాబోతోంది. సెప్టెంబరు 21న ‘జర్నీ’ కూడా రీ-రిలీజ్ కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు
తంగలాన్
తమిళ స్టార్ హీరో విక్రమ్ లేటెస్ట్ సినిమా 'తంగలాన్' (Thangalaan). ఆగస్టు 15న తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజైంది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. కాగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 20 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకే రోజు అందుబాటులోకి రానుంది. అయితే ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం మాత్రం ఎంథుసన్ ఓటీటీలో శనివారమే ఈ చిత్రం స్ట్రీమింగ్‌లోకి రావడం గమనార్హం.
తిరగబడరా సామి
రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా హీరోహీరోయిన్లుగా నటించిన ‘తిరగబడరా సామీ’ (Thiragabadara Saami) మూవీ ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 20న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సీనియర్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. స్టోరీ చాలా ఔట్‌డేటెడ్‌గా ఉందంటూ విమర్శలు వచ్చాయి.
హంట్
మలయాళం హారర్ మూవీ ‘హంట్’ (Hunt) థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. జీ5 వేదికగా సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు మలయాళం సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 29న థియేటర్లలో రిలీజైన హంట్ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. భావన యాక్టింగ్ బాగున్నా రొటీన్ స్టోరీ కారణంగా హంట్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్
అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ (The Mystery of Moksha Island). ఈ సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌కు అనిష్ యెహాన్ కురువిల్లా దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవల రిలీజై ఆకట్టుకుంటోంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateGrave TortureMovieEnglishNetflixSept 16Culinary Class WarsSeriesEnglish/KoreanNetflixSept 17Fast XMovieEnglishNetflixSept 18Leave from the other sideTalk ShowEnglishNetflixSept 18Twilight of the GodsSeriesEnglishNetflixSept 19He’s Three DaughtersMovieEnglishNetflixSept 20Evil Dead RiseMovieEnglishNetflixSept 21Saripodhaa SanivaaramMovieTeluguNetflixSept 26A very Royal Scandal SeriesEnglishAmazonSept 19Stree 2MovieHindiAmazonSept 27DurgaMovieHindiJio CinemaSept 16Jo Tera Hai Woh Mera HaiMovieHindiJio CinemaSept 20The PenguinSeriesEnglishJio CinemaSept 29UnPrisonedMovieEnglishHotstarSept 16Agatha All AlongMovieEnglishHotstarSept 17The Judge From HellSeriesEnglishHotstarSept 21
సెప్టెంబర్ 16 , 2024
Tollywood New Directors: టాలీవుడ్‌లో కొత్త డైరెక్టర్ల హవా.. తొలి చిత్రంతోనే బ్లాక్ బాస్టర్ విజయాలు!
టాలీవుడ్‌లో కొత్త శకం మెుదలైంది. వినూత్న ఆలోచనలు కలిగిన దర్శకులు కొత్త కథలతో వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్నారు. పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, శ్రీను వైట్ల, రామ్ గోపాల్ వర్మ, వి.వి. వినాయక్, తేజ, గుణశేఖర్ వంటి స్టార్ డైరెక్టర్లు హిట్స్ లేక ఇబ్బంది పడుతుంటే కుర్ర దర్శకులు మాత్రం ఫస్ట్ సినిమాతోనే అలవోకగా బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఫ్రెష్ కథలు, వైవిధ్యమైన మేకింగ్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధిస్తున్నారు. ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్స్ ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
అంజి కె. మణికుమార్
ఎన్టీఆర్ బామ మరిది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ఆయ్' (Aay). అంజి కె. మణిపుత్ర (Anji K. Maniputhra) ఈ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయం అయ్యారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘తంగలాన్ ’వంటి పెద్ద హీరోల సినిమాలను తట్టుకొని నిలబడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. గోదావరి నేపథ్యంలో తనదైన మేకింగ్ స్టైల్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించి ప్రసంసలు అందుకున్నారు. అమలాపురం నేపథ్యం, చిన్న నాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, పట్టింపులు, ఆప్యాయతలు, వెటకారం ఇలా అన్నింటిని మేళవిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది.
యదువంశీ
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.17.76 కోట్లు (GROSS) వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతోనే యదువంశీ (Yadu Vamsi) దర్శకుడిగా పరిచయమయ్యారు. ఓ గ్రామం నేపథ్యంలో కుర్రాళ్లతో సాగిన ఈ కథను అతడు అద్భుతంగా తెరకెక్కించారు. కామెడీతో పాటు 1990ల జ్ఞాపకాలను గుర్తుచేయడం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లె వాతావరణాన్ని ఆకట్టుకునేలా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
ముఖేశ్ ప్రజాపతి
అంజలి వేశ్యగా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'బహిష్కరణ'. ఈ సిరీస్ ద్వారా దర్శకుడిగా ముఖేశ్ ప్రజాపతి (Mukesh Prajapati) డెబ్యూ ఇచ్చాడు. ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకొని మంచి వ్యూస్ సాధించింది. ఇందులో కుల వివక్షను కళ్లకు కట్టాడు దర్శకుడు. ఊరి పెద్ద అయిన వ్యక్తి అణగారిన వారి పట్ల ఎలా వ్యవహించేవారు? మహిళలను ఎలా హింసించేవారు? అన్నది ఈ సిరీస్‌లో చూపించారు. వేశ్య కోణంలో ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించిన ఈ రివేంజ్ డ్రామా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది.
శౌర్యువ్
నాని రీసెంట్ చిత్రం 'హాయ్ నాన్న'తో శౌర్యువ్ (Shouryuu) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక టిపికల్ సబ్జెక్ట్‌ను తీసుకొని అతడు అందంగా ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని అతడు చక్కగా చూపించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. తొలి చిత్రంతోనే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా అతడు ఇంపాక్ట్ చూపించాడు. 'హాయ్ నాన్న' చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సైతం సాధించింది.
కల్యాణ్ శంకర్
ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ యూత్ ఎంటర్‌టైనర్ చిత్రాల్లో 'మ్యాడ్' ఒకటి. దర్శకుడు కల్యాణ్ శంకర్ (Kalyan Sankar) తన తొలి ప్రయత్నంతోనే సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగా తనకు మంచి భవిష్యత్ ఉందని కల్యాణ్ శంకర్ తొలి చిత్రంతోనే చాటి చెప్పాడు. కాలేజీ కుర్రాళ్ల నేపథ్యంలో ఆకట్టుకునే ఫన్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రంలోనే కామెడీ సీన్స్, డైలాగ్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కార్తిక్ దండు
‘విరూపాక్ష’ చిత్రంతో కార్తిక్ దండు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్‌లో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. కార్తిక్ దండు సినిమాను నడిపిన విధానంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి.
శ్రీకాంత్ ఓదెల
నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్‌లో ఉందని నాని కితాబిచ్చాడు.
వేణు యెల్దండి
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్‌లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. హీరో నానితో అతడు సినిమా తీసే అవకాశముంది.
ప్రశాంత్ వర్మ
అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారారు. 2024 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ మహేష్, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల చిత్రాలను వెనక్కి నెట్టి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
గౌతమ్ తిన్ననూరి
నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’తో గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు నాని నటనపై ప్రశంసల వర్షం కురిసింది. గౌతమ్ డైరెక్షన్‌కీ ఆ స్థాయిలోనే గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. ప్రస్తుతం అతడు విజయ్ దేవరకొండతో ‘VD12’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తోంది.
బుచ్చిబాబు సానా
తొలి చిత్రం ‘ఉప్పెన’తో డైరెక్టర్ బుచ్చిబాబు సానా అందరి దృష్టిని ఆకర్షించారు. డిఫరెంట్ లవ్‌స్టోరీతో ప్రశంసలు అందుకున్నాడు. తన తర్వాతి చిత్రాన్ని రామ్ చరణ్‌తో అనౌన్స్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేయనుంది. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
తరుణ్ భాస్కర్
పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్‌గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నటుడిగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ఇటీవల ‘కీడా కోలా’ అనే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కించారు.
ఆగస్టు 27 , 2024
Natural Star Nani: ‘పుష్ప 2’ టీమ్‌కు నాని ఇండైరెక్ట్ వార్నింగ్?
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాతలు ప్రస్తుతం కొత్త పంథాను అనుసరిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే విడుదల తేదీలను అనౌన్స్ చేసేస్తున్నారు. షూటింగ్‌లో జాప్యం తదితర కారణాల వల్ల చెప్పిన తేదీకి రిలీజ్ చేయలేక వెంటనే కొత్త డేట్‌ను ప్రకటిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు ముందుగానే ఒక డేట్‌ను లాక్ చేయడం వల్ల చిన్న సినిమాలు, టైర్-2 హీరోల చిత్రాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఇవి ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.
‘ఆ ఆటిట్యూడ్ కరెక్ట్ కాదు’
సినిమాలు పోస్టు పోన్ అవ్వడం అనేది సహజమే. నటీనటుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, వీఎఫ్‌ఎక్స్ ఆలస్యం, షూటింగ్‌లో డీలే ఇలా ఏదోక కారణం చేత రిలీజులు వాయిదా పడుతుంటాయి. అయితే గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో వాయిదాల పర్వం బాగా ఎక్కువైంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మరలా చెప్పాపెట్టకుండా పోస్టు పోన్ చేస్తుండటంపై నాని హాట్ కామెంట్స్ చేశారు. ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఇష్యూపై మాట్లాడారు. 'క్లారిటీ లేకుండా రిలీజ్ డేట్ ప్రకటించడం వలన చాలా మంది నష్టపోతున్నారు. ఒక డేట్ వేసేద్దాం, సినిమా రెడీ అయితే ఆ డేట్‌కు వద్దాం. లేదంటే తర్వాత చూసుకుందా అనే ఆటిట్యూడ్ కరెక్ట్ కాదు' అని నాని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. సినీ వర్గాలతో పాటు నెటిజన్లు నాని వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.
‘పుష్ప 2’ టీమ్‌కు వార్నింగ్?
నాని తన లేటెస్ట్ కామెంట్స్‌లో ఎక్కడా పలానా సినిమా అంటూ పేరు ప్రస్తావించలేదు. అయితే ఇది ‘పుష్ప 2’ టీమ్ గురించే మాట్లాడినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వాస్తవానికి నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని ఆగస్టు 15 రిలీజ్ చేయాలని షూటింగ్ ప్రారంభంలోనే మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ చిత్రం తొలుత ఆ తేదీని లాక్ చేసుకోవడంతో సరిపోదా టీమ్ నెలఖారుకు (ఆగస్టు 29) జరగాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ‘పుష్ప 2’ టీమ్ విడుదల తేదీని డిసెంబర్ 6 మారుస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ వెంటనే ‘డబుల్ ఇస్మార్ట్‘, ‘మిస్టర్ బచ్చన్’, ‘తంగలాన్’, ‘ఆయ్’ చిత్రాలు తమ షెడ్యూల్‌ను మార్చుకొని ఆగస్టు 15కు వచ్చేశాయి. దీంతో ఆ పోటీలో తమ సినిమాను రిలీజ్ చేయడం ఎందుకని భావించి ఆగస్టు 29న నాని తన చిత్రాన్ని తీసుకొస్తున్నాడు. ‘పుష్ప 2’ టీమ్ సరైన అంచనాలు లేకుండా ఆగస్టు 15 లాక్ చేయడంతో ఆ సమయంలో వచ్చిన లాంగ్ వీకెండ్‌ను ‘సరిపోదా శనివారం’ కోల్పోవాల్సి వచ్చింది. ఈ కారణం చేతనే నాని పరోక్షంగా ఆ సినిమా టీమ్‌కు వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
నాని సినిమాకు రన్ టైమ్ ఫిక్స్!
నాని తాజా చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram)కు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గురువారం (ఆగస్టు 29) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి U/A సర్టిఫికెట్ జారి చేసినట్లు తెలుస్తోంది. రన్‌టైమ్‌ను 2 గంటల 50 నిమిషాలకు ఫిక్స్ చేసినట్లు ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్న ఎస్.జే సూర్య తెలియజేశారు. గతంలో నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన 'అంటే సుందరానికి' (Ante Sundaraniki) చిత్రం కూడా మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆగస్టు 24 , 2024
This Week Movies: ఆగస్టు 15 సందర్భంగా ఓటీటీలోకి మోస్ట్ వాంటెడ్ చిత్రాలు
పంద్రాగస్టు సందర్భంగా ఈ వారం థియేటర్లలో పెద్ద ఎత్తున సందడి నెలకొననుంది. భారీ చిత్రాలతో థియేటర్స్ కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. రవితేజ, రామ్ పోతినేని, విక్రమ్ వంటి స్టార్ హీరోల చిత్రాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan)
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న (Mr. Bachchan Release Date) థియేటర్స్‌లో సందడి చేయనుంది. రవితేజ ఇందులో ఐటీ అధికారిగా కనిపించనున్నారు. ఆయన ఎనర్జీ యాక్టింగ్, భాగ్యశ్రీ అందాలు, హరీశ్ శంకర్ టేకింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర బృందం తెలిపింది.
డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా దీన్ని నిర్మించారు. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న (Double Ismart Release Date) థియేటర్స్‌లో సందడి చేయడానికి ఈ మూవీ సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి.
తంగలాన్ (Thangalaan)
తమిళ స్టార్ హీరో విక్రమ్ (Vikram) నటించిన లేటెస్ట్ చిత్రం ‘తంగలాన్’ కూడా ఈ వారమే గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. స్వాతంత్య్రానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఆయ్ (Aay)
ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ నటించిన రెండో చిత్రం ‘ఆయ్’. మ్యాడ్ చిత్రంతో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ యంగ్ హీరో తన సెకండ్ హిట్ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం ‘ఆయ్’ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. గోదావరి విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. నార్నే నితిన్‌కు జోడీగా నయన్ సారిక నటించింది. ఈ మూవీ తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుందని చిత్ర బృందం తెలిపింది.
వేదా (Vedaa)
జాన్ అబ్రహం (John Abraham), శార్వరీ వాఘ్, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వేదా’ (Vedaa). నిఖిల్ అడ్వాణీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘వేదా’ను వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. నేటి సమాజంలో పరిస్థితులను ప్రతిబింబిస్తుందని చిత్ర బృందం తెలిపింది.
ఖేల్ ఖేల్ మే (Khel Khel Mein)
ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకున్న పర్‌ఫెక్ట్ స్ట్రేంజర్స్ (Perfetti Sconosciuti) ఇప్పుడు హిందీలో ‘ఖేల్ ఖేల్ మే’ (khel khel mein)గా రాబోతోంది. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్, తాప్సి, అమ్మీ వ్రిక్, వాణీకపూర్, ఫర్దీన్‌ఖాన్, ఆదిత్య సీల్, ప్రజ్ఞా జైశ్వాల్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
డార్లింగ్
ప్రియదర్శి, నభా నటేష్ నటించిన 'డార్లింగ్' (Darling) ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 13 నుంచి హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే సమస్యకు వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. జులై 19న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు.
వీరాంజనేయులు విహార యాత్ర (Veeranjaneyulu Vihara Yatra)
ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఈ వారం మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. 'వీరాంజనేయులు విహార యాత్ర' పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీని స్ట్రీమింగ్ చేయబోతోంది. సీనియర్ నటుడు నరేశ్, శ్రీలక్ష్మీ, యువ నటులు రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. టైటిల్‌ని బట్టి విహార యాత్ర నేపథ్యంలో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది.
మనోరథంగల్ (Manorathangal)
కమల్‌హాసన్, మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ వంటి ప్రముఖ సౌత్ ఇండియన్ స్టార్స్ నటించిన లేటెస్ట్ సిరీస్ ‘మనోరథంగల్’. తొమ్మిది కథలతో, ఎనిమిది మంది దర్శకులు తీర్చిదిద్దిన ఈ సిరీస్‌ను ఆగస్టు 15న ఓటీటీలో విడుదల చేస్తున్నారు. జీ 5 వేదికగా తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎమ్.టి వాసుదేవన్ రాసిన కథల ఆధారంగా ఈ ఆంథాలజీ సిరీస్‌ను రూపొందించారు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateDaughtersMovieEnglishNetflixAugust 14Worst Ex EverSeriesEnglishNetflixAugust 14Emily In ParisSeriesEnglishNetflixAugust 14The UnionMovieEnglishNetflixAugust 16Love Nexts DoorMovieKorean/EnglishNetflixAugust 17DarlingMovieTeluguHotstarAugust 13The TyrantMovieKorean/EnglishHotstarAugust 14Nam Namak NishanMovieHindiAmazon August 14JackpotMovieEnglishAmazon August 15ChanakSeriesHindiSonyLIVAugust 16ManorathangalSeriesTelugu DubZee 5August 15Sekhar HomeMovieHindiJio CinemaAugust 14
ఆగస్టు 12 , 2024
Double Ismart: చిక్కుల్లో ‘డబుల్ ఇస్మార్ట్’.. పూరి, రామ్‌ను వెంటాడుతున్న ‘లైగర్’ నష్టాలు!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో రూపొందిన సెకండ్ ఫిల్మ్ 'డబుల్ ఇస్మార్ట్' (Double Ismart). గతంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' (Ismart Shankar)కు సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందింది. ఆగస్టు 15న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇటీవల సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న డైరెక్టర్ పూరికి, రామ్‌లకు ఈ మూవీ సక్సెస్ ఎంతో కీలకంగా మారింది. ఇటీవల రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను సైతం పెంచేసింది. దీంతో అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీకి ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. పూరి డైరెక్షన్‌లో వచ్చిన ‘లైగర్’ (Liger) సినిమా ఆర్థిక కష్టాలు రామ్ చిత్రాన్ని చుట్టుముడుతున్నాయి.
అసలేం జరిగిందంటే?
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీకి లైగర్ నష్టాలు పెద్ద తలనొప్పిగా మారాయి. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'లైగర్' (Liger) ఊహించని స్థాయిలో డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లకు పెద్ద ఎత్తున నష్టాలను మిగిల్చింది. అయితే లైగర్ నష్టాలను సెటిల్ చేయకుండా పూరి మరో సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేయడంపై డిస్టిబ్యూటర్లు కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. లైగర్ నష్టాలను సెటిల్‌మెంట్ చేసేవరకూ ఈ చిత్రాన్ని ప్రదర్శించకూడదని వారు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఓ పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌లో మీటింగ్ కూడా జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో లైగర్ నష్టాల భర్తీ గురించి కూలంకుషంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్‌కు ఏమైనా ఆటంకం కలుగుతుందా అన్న ఆందోళన మూవీ టీమ్‌లో నెలకొంది.
సాంగ్ పైనా వివాదం!
ఇటీవల డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 'మార్ ముంత చోడ్ చింత' పేరుతో సెకండ్ సింగిల్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. అయితే ఈ పాట మధ్యలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ ఉపయోగించారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన 'ఏం జేద్దామంటవ్ మరీ' పదాన్ని వాడారు. అది కూడా డైరెక్ట్‌గా కేసీఆర్ వాయిస్‌తోనే ఉపయోగించారు. దీంతో కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కల్చర్‌ను తాగుడు సంస్కృతిగా చూపించేలా ఈ పాట ఉందంటూ విమర్శలు చేశారు. కేసీఆర్ డైలాగ్‌ను తొలగించకపోతే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే దీనిపై మూవీ టీమ్ స్పందించాల్సి ఉంది.
https://www.youtube.com/watch?v=-Kba0qmTtZE
పోటీగా మూడు చిత్రాలు
డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 'పుష్ప 2' ఆ రోజున రిలీజ్ కావాల్సి ఉంది. షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ సినిమాను డిసెంబర్ 6కు పోస్టు పోన్ చేశారు. దీంతో ఆ డేట్‌ను పూరి జగన్నాథ్ తన సినిమా కోసం లాక్ చేశారు. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువ లేదు. రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' (Mr Bachchan), కోలీవుడ్ స్టార్ విక్రమ్ లీడ్ రోల్‌లో చేసిన 'తంగలాన్' (Thangalaan) చిత్రాలు ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటు 'ఆయ్' అనే మరో మూవీ కూడా డబుల్ ఇస్మార్ట్‌కు పోటీగా బరిలోకి దిగుతోంది. దీంతో ఆ మూడు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తలపడాల్సిన పరిస్థితి ‘డబుల్ ఇస్మార్ట్’కు ఏర్పడింది.
జూలై 31 , 2024
IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్ హవా.. ఆ మూవీస్ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!
ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు, మోస్ట్ అవైటెడ్ భారతీయ చిత్రాల జాబితాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ జాబితాలను ప్రపంచవ్యాప్తంగా IMDBకి ఉన్న 250 మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ రియల్ పేజ్ వ్యూస్ ఆధారంగా రూపొందించారు. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ మూవీగా 'కల్కి 2898 AD' నిలవగా, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా 'పుష్ప 2: ది రూల్' నిలిచాయి. ఐఎండీబీ రిపోర్టుకు సంబంధించిన పూర్తి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
2024లో మోస్ట్ పాపులర్ చిత్రాలు ఇవే!
ఐఎండీబీ మోస్ట్ పాపులర్ మూవీస్ - 2024 జాబితాలో ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అగ్రస్థానంలో నిలిచింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన 'మంజుమ్మెల్ బాయ్స్' (Manjummel Boys) మూవీ ఈ జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకుంది. హృతిక్ రోషన్, దీపికా పదుకునే కలిసి నటించిన 'ఫైటర్' (Fighter) మూవీ 3వ స్థానంలో నిలవగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' (Hanuman) సినిమా నాలుగో స్థానం సంపాదించింది. అజయ్ దేవగన్, ఆర్.మాధవన్, జ్యోతిక కలిసి నటించిన 'సైతాన్' (Shaitaan) ఆ తర్వాతి ప్లేస్ లో ఉంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్' (Laapataa Ladies) 6వ స్థానం, యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆర్టికల్ 370' (Article 370) 7వ స్థానం, నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు జంటగా నటించిన మలయాళ మూవీ 'ప్రేమలు' (Premalu) 8వ స్థానంలో నిలిచాయి. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ హీరోగా చేసిన 'ఆవేశం' (Aavesham), హీందీలో మంచి విజయం సాధించిన 'ముంజ్య' (Munjya)చిత్రాలు 9, 10 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
https://twitter.com/IMDb_in/status/1815619130948771914
2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలు
IMDB రిలీజ్ చేసిన ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ అప్ కమింగ్ ఇండియన్ మూవీస్’ (Most Anticipated Upcoming Indian Movies Of 2024) జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం టాప్‌లో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'దేవర' (Devara) చిత్రం సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న 'వెల్ కమ్ టూ ది జంగిల్' (Welcome To The Jungle), కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (The Greatest Of All Time) సినిమాలు వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి.
తమిళ హీరో సూర్య నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కంగువ' (Kanguva) ఐదో స్థానంలో నిలవగా, అజయ్ దేవగన్ నటిస్తున్న ‘సింగం అగైన్’ (Singam Again) ఆరో స్థానంలో ఉంది. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న 'భూల్ భూలయ్యా 3', చియాన్ విక్రమ్ 'తంగలాన్', 'ఔరోన్ మే కహన్ దమ్ థా', 'స్త్రీ 2' ఆ తర్వాతి స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
https://twitter.com/IMDb_in/status/1815645100988379418
జూలై 24 , 2024
Pushpa 2: ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ‘పుష్ప 2’ పరిస్థితి? కలెక్షన్స్ భారీగా పడిపోవడం ఖాయం!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన పుష్ప గ్లింప్స్, ప్రమోషన్ పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించడంతో ఆ రోజు కోసం.. సినీ ప్రేక్షకులు, బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదా పడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చెప్పిన తేదీకే సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్స్‌లో భారీగా కోత పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
పుష్ప 2 వాయిదా..!
ప్రస్తుతం ‘పుష్ప 2’ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మారింది. ఈ సినిమాను ఆగస్టు 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్ది నెలల క్రితం ప్రకటించారు. అందుకు తగ్గట్లే శరవేగంగా షూటింగ్ సైతం నిర్వహిస్తున్నారు. జూన్ ఎండింగ్ నాటికి షూటింగ్ ముగించాలని దర్శకుడు సుకుమార్ టార్గెట్ పెట్టుకోగా.. అది పూర్తయ్యే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది. సినిమా షూట్ పూర్తి కావడానికి ఇంకో నెల రోజుల సమయం పడుతుందని సమాచారం. అంటే జులై ఎండింగ్‌కి పుష్ప 2 షూట్ కంప్లీట్ కానుందట. కాబట్టి మిగిలిన 15 రోజుల్లో ప్రీ రిలీజ్ వర్క్ చేయడం అసాధ్యం కాబట్టి.. 'పుష్ప 2' పోస్ట్ పోన్ చేస్తే బెటర్ అని చిత్ర యూనిట్ భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. ఇది తెలిసిన ఫ్యాన్స్ తీవ్రంగా డిసప్పాయింట్ అవుతున్నారు.
సుకుమార్ అసంతృప్తి
పుష్ప 2 చిత్రానికి ఎడిటర్‌గా కార్తిక్ శ్రీనివాస్ పనిచేశారు. కొద్ది నెలల పాటు యూనిట్‌తో కలిసి ట్రావెల్ చేసిన అతడు పలు కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో నవీన్ నూలి వచ్చి ఫైనల్ కట్స్ చేశారు. అయితే ఆ ఫైనల్ ఔట్‌పుట్‌పై సుకుమార్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పైగా కొన్ని ఎపిసోడ్స్‌ను సుకుమార్ రీడిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆగస్టు 15 నాటికి సినిమాను రెడీ చేయడం కష్టమని మూవీ యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.
కలెక్షన్స్‌లో భారీ కోత!
పాన్ ఇండియా స్థాయి సినిమా అంటే విడుదల తేదీ పక్కాగా ఉండాలి. అలా లేకుంటే దాని ప్రభావం కలెక్షన్స్‌పై కూడా పడుతుంది. ‘పుష్ప 2’ను ఆగస్టు 15నే రిలీజ్ చేస్తే.. కలెక్షన్ల పరంగా బన్నీకి భారీ షాక్ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే రోజున తమ చిత్రాలు రిలీజ్ చేసేందుకు ముగ్గురు బడా హీరోలు సిద్ధమవుతున్నారు. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తున్న 'తంగలాన్' (Thagalaan) చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగణ్ (Ajay Devgan) కూడా తన ‘సింగం ఎగైన్’ (Singham Again) చిత్రాన్ని ఆ రోజునే తీసుకురావాలని చూస్తున్నారట. అలాగే స్టార్ నటుడు జాన్ అబ్రహం (John Abraham) నటించిన 'వేద' (Veeda) ఆగస్టు 15న తీసుకొస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ మూడు భారీ చిత్రాలు బరిలో ఉండగా వాటిని తట్టుకొని ‘పుష్ప 2’ పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్స్ రాబట్టగలదా? అన్న సందేహం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అజయ్ దేవగన్, జాన్ అబ్రహం చిత్రాల రిలీజ్ ఉన్న నేపథ్యంలో నార్త్‌లో ‘పుష్ప 2’ కలెక్షన్లపై భారీగా ప్రభావం పడొచ్చని అంటున్నారు.
పవన్ అభిమానుల్లో ఆగ్రహం
ప్రస్తుతం అల్లు అర్జున్‌పై పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఏపీ ఎన్నికల సందర్భంగా వైకాపా అభ్యర్థి తరపున బన్నీ ప్రచారం చేయడాన్ని మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ మూవీని బాయ్‌కాట్ చేస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు బుధవారం (జూన్ 12) జరిగిన పవన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సైతం బన్నీ హాజరు కాకపోవడంతో ఫ్యాన్స్ మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఇన్ని కష్టాల మధ్య ఇప్పట్లో ఈ మూవీని రిలీజ్ చేయకపోవడమే మంచిదని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జూన్ 13 , 2024
Malavika Mohanan: వైట్ అరేబియన్ గుర్రంలా మాళవిక అందాలు
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్.. తన గ్లామర్ షోతో మరోమారు నెట్టింట వైరల్‌గా మారింది. చాలీ చాలని గౌనులో ఫొటో షూట్ నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజాగా ఫ్లవర్ డాట్ స్లీవ్‌లెస్ గౌనులో కనిపించిన ఈ అమ్మడు తన ఎద అందాలతో సోషల్ మీడియాలో రచ్చ రేపింది.
మతిపోగొట్టే విధంగా థైస్ అందాలను చూపిస్తూ ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. చురకత్తుల్లాంటి చూపులతో మరోమారు వారి మనసు దోచేసింది.
ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ‘ఏం సొగసురా బాబు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మాళవిక హాట్ పిక్స్‌ను విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.
ఈ బ్యూటీ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహన్‌కు మాళవిక మోహన్ కుమార్తె. ఆమె కుటుంబం కేరళకు చెందినది అయినా పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే.
‘పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది.
అనంతరం ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ సినిమా తరువాత నుంచి మాళవిక వరుస అవకాశాలను అందుకుంటూ వస్తోంది.
ఈ క్రమంలోనే ధనుష్ పక్కన ‘మారన్’ చిత్రంలో నటించి మాళవిక తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
2020లో 'మసాబా మసాబా' అని టెలివిజన్ సిరీస్‌లోనూ మాళవిక నటించింది. ఇది నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇంగ్లీషు భాషలో స్ట్రీమింగ్‌లో ఉంది.
గతేడాది క్రిస్టీ (Christy) అనే మలయాళ చిత్రంలో నటించిన మాళవిక.. తన నటనతో అక్కడి ప్రేక్షకులను కట్టిపడేసింది.
ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) హీరోగా చేస్తోన్న ‘రాజా సాబ్’ (Raja Saab)లో మాళవిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌తో తెలుగులో మరిన్ని ఆఫర్లు దక్కించుకోవాలని ఈ ముద్దుగుమ్మ భావిస్తోంది.
‘రాజా సాబ్’ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లోనూ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం విజయం సాధిస్తే మాళవికకు పాన్ ఇండియా స్థాయిలో తిరుగుండదని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
తమిళంలో విక్రమ్‌తో ‘తంగలాన్’ (Thangalaan) అనే సినిమాలో మాళవిక నటిస్తోంది. అలాగే హిందీలో ‘యుద్ర’ (Yudhra) ఫిల్మ్‌లో చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
ఇక మాళవిక అవార్డుల విషయానికి వస్తే.. 2019లో 'బియాండ్ ది క్లౌడ్స్' అనే బాలీవుడ్ చిత్రానికి గాను 'యాక్టింగ్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ఆమె గెలుచుకుంది.
అలాగే 2022లో ‘మాస్టర్’ చిత్రానికి గాను బెస్ట్ అరేంగేట్ర నటిగా మాళవిక మోహనన్ నామినేట్ అయ్యింది. కొద్దిలో సైమా అవార్డును చేజార్చుకుంది.
వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ మాళవిక చురుగ్గా వ్యవహరిస్తోంది. తన అందాల ఆరబోతతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
స్టన్నింగ్ ఫిగర్‌తో హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ఆమె నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
మే 27 , 2024
CHIYAAN VIKRAM: పాత్ర కోసం ప్రాణాన్ని లెక్క చేయడీ హీరో.. చియాన్ విక్రమ్ చేసిన డిఫరెంట్ రోల్స్ ఇవే!
విభిన్నమైన పాత్రలకు పెట్టింది పేరు జాన్ కెన్నడీ విక్టర్. ఆయన ఎవరో కాదు చియాన్ విక్రమ్. ఎలాంటి గెటప్‌నైనా వేసి నటనతో మెప్పించగలిగిన సామర్థ్యం ఈ హీరోది. ఇప్పటివరకు నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ.. చియాన్ ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు. ఎన్నో మర్చిపోలేని క్యారెక్టర్లతో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు విక్రమ్. అతడికి పేరు సంపాదించి పెట్టిన కొన్ని ప్రత్యేకమైన పాత్రల గురించి తెలుసుకోండి.
శివ పుత్రుడు
పితమగాన్ సినిమాను తెలుగులో శివ పుత్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమాయకుడి పాత్రలో చియాన్ విక్రమ్ అదరగొట్టాడు. క్రూరంగా కనిపిస్తూ జాలి, దయ కలిగున్న మనిషిగా నటించాడు. రస్టీ లుక్‌లో విక్రమ్ నటనకు జాతీయ అవార్డు లభించింది. బాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సూర్య కూడా మరో క్యారెక్టర్‌లో నటించాడు.
అపరిచితుడు
శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడులో విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో మూడు డిఫరెంట్ రోల్స్‌లో చేశాడు. తప్పులను ప్రశ్నించే అమాయకమైన రామానుజం, తప్పు చేసిన వారిని శిక్షించే అపరిచితుడు, ప్రియురాలి ప్రేమ కోసం తపించే రెమో క్యారెక్టర్‌లో నటనతో ప్రేక్షకులను మెప్పించాడు విక్రమ్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
మల్లన్న
విక్రమ్ సినిమా తీస్తున్నాడంటే ఏదో ప్రత్యేకత ఉందని అభిమానులు భావించేలా చిత్రాల్ని ఎంచుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మల్లన్న చిత్రంలోనూ వివిధ గెటప్‌లతో అలరించాడు చియాన్. కోడి మాస్క్ ధరించి నటించడంతో పాటు లేడీ గెటప్‌లోనూ నటించాడు. కానీ, సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఐ
శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమాలో విక్రమ్ చేసిన రోల్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇందులో విచిత్రమైన వ్యాధి సోకి వృద్ధాప్యం వచ్చిన పాత్రలో మెప్పించాడు విక్రమ్. ఇందుకోసం చాలా కష్టపడ్డాడు. ఓ పాటలో బీస్ట్ గెటప్‌లోనూ మెరిశాడు. బాడీ బిల్డర్‌గానూ నటించిన ఈ టాప్ హీరో… చాలా రోజుల పాటు కేవలం మంచినీళ్లు మాత్రమే తీసుకున్నట్లు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
నాన్న
విక్రమ్ కెరీర్‌లో నాన్న సినిమా ప్రత్యేకం. సరైన మతిస్థిమితం లేని వ్యక్తి కుమార్తెతో కలిసి ఉండే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో విక్రమ్ చేసిన క్యారెక్టర్‌కి కూడా మంచి మార్కులు పడ్డాయి. తండ్రి, కూతురు మధ్య కేవలం సైగలతో వచ్చే సీన్ ఇప్పటికే చాలామందిని మెప్పించింది.
ఇంకొక్కడు
ఇరుముగన్‌గా వచ్చిన తమిళ్ సినిమా తెలుగులో ఇంకొక్కడు పేరుతో అనువాదం అయ్యింది. ఇందులో రెండు క్యారెక్టర్స్‌లో విక్రమ్ కనిపించాడు. లేడీ విలన్ రోల్‌లో అదరగొట్టాడు. ఆ గెటప్ చూస్తే నిజంగా విక్రమ్ ఇలాంటి రోల్ చేశాడా అనిపిస్తుంది. అంతలా మెప్పించాడు విక్రమ్. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది.
తంగలాన్
విక్రమ్ తదుపరి చిత్రం తంగలాన్. ఇందులో మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
https://telugu.yousay.tv/thangalan-the-chian-mark-terror.html
ఏప్రిల్ 18 , 2023
Malavika Mohanan: తడి అందాలతో సోకుల విందు చేస్తున్న మలయాళి తెగింపు !
తమిళ్ స్టార్ నటి మాళవిక మోహన్ మరోసారి సోకుల విందు చేసింది. నదిలో జలకాలాడుతూ తడిసిన అందాలతో ఫోటో షూట్ చేసింది.
ట్సాన్సపరెంట్ వైట్ శారీలో పాల మీగడ లాంటి అందాలను కుర్రకారుకు విందు చేసింది. తడి అచ్ఛాదనతో అమ్మడి అందం ద్విగుణీకృతమైంది.
ఓవైపు తడిసిన ఎద అందాలు, వయ్యారపు నడుమందాలు మరోవైపు.. నాభి అందాల మేళవింపుతో కైఫెక్కిస్తోంది.
ఈ కుర్రదాని మత్తిక్కించే చూపులు తడిసిన దేహంతో ఉన్న అందాన్ని ఇంకాస్తా దొంతర్లు ఎక్కిస్తోంది
దక్షిణాది చిన్నదే అయినా గ్లామర్‌ను వడ్డించడంలో నార్త్ ముద్దు గుమ్మలకు ఏమాత్రం తీసిపోదు.
చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా... అందాలను తనదైన శైలీలో వడ్డించడంలో ఈ మలయాళి తెగింపు దిట్ట
కనీసం వారానికో హాట్ ఫొటో షూట్ అయినా చేస్తూ కుర్రాళ్ల అందాల దాహం తీరుస్తుంటుంది
సూపర్ స్టార్ రజినీకాంత్ 'పేట' మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ సోగసుల కోవకు పెద్దగా సక్సెస్ మాత్రం దక్కలేదు.
ఆ మధ్య లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన మాస్టర్ చిత్రంలో నటించి మెప్పించింది. అయితే అవకాశాలు మాత్రం ఈ తడి అందానికి అంతగా రావడం లేదు.
అయితేనేం.. సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మాత్రం సంపాదించింది.
స్టన్నింగ్ ఫిగర్‌తో హాట్ ఫొటో షూట్ చేస్తూ... ఎప్పటికప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.
మాళవిక మోహన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహన్ కుమార్తే. ఆమె కుటుంబం కేరళకు చెందినది అయినా పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే.
అలా సినీ నేపథ్యం ఉన్నా మలయాళి కుట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మలయాళంలో ఆమె నటించిన గ్రేట్ ఫాదర్ సినిమా మంచి విజయం సాధించింది.
ప్రస్తుతం తమిళ్‌లో తంగాళన్, హిందీలో యుద్ర మూవీల్లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్స్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.
అక్టోబర్ 26 , 2023