UATelugu
గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఓ మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లి కొడుకును పొగొట్టుకుంటాడు. దీంతో భార్య అను (స్నేహా) అతడ్ని దూరం పెడుతుంది. కొన్నేళ్ల తర్వాత మాస్కోకు వెళ్లిన గాంధీకి చనిపోయాడనుకుంటున్న కొడుకు జీవన్ (విజయ్) కనిపిస్తాడు. సంతోషంగా ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీకి సంబంధించిన వారు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఈ హత్యలకు కారణం ఎవరు? చనిపోయిన జీవన్ ఎలా తిరిగొచ్చాడు? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Netflixఫ్రమ్
ఇన్ ( Telugu, Hindi, Malayalam, Kannada, Tamil )
Watch
రివ్యూస్
YouSay Review
The GOAT Review: దళపతి విజయ్ తనతో తానే తలపడాల్సి వస్తే.. ‘ది గోట్’ గ్రేట్‌గా ఉందా? లేదా?
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకుడు. మీనాక్షి చ...read more
How was the movie?
తారాగణం
విజయ్
ప్రశాంత్
ప్రభుదేవా
మోహన్
జయరామ్
స్నేహ
లైలా
అజ్మల్ అమీర్
మీనాక్షి చౌదరి
వైభవ్ రెడ్డి
యోగి బాబు
ప్రేమగీ అమరెన్
యుగేంద్రన్
పార్వతి నాయర్
వీటీవీ గణేష్
అరవింద్ ఆకాష్
గంజాయి కరుప్పు
సిబ్బంది
వెంకట్ ప్రభు
దర్శకుడుకల్పతి S. అఘోరంనిర్మాత
కల్పతి ఎస్. గణేష్నిర్మాత
కల్పతి ఎస్. సురేష్నిర్మాత
కథనాలు
The Goat Day 1 Collections: తొలి రోజున ‘ది గోట్’ వసూళ్ల సునామీ.. ‘లియో’తో పోలిస్తే ఎదురుదెబ్బే!
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. అయితే గురువారం (సెప్టెంబర్ 5)న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే తమిళనాడులో మాత్రం విజయ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షించి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
డే 1 కలెక్షన్స్ ఎంతంటే
విజయ్ హీరోగా నటించిన ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) అంచనాలకు తగ్గట్లే తొలిరోజు భారీ వసూళ్లను సాధించింది. ఒక్క ఇండియాలోనే ఈ చిత్రం రూ.55 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.43 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఒక్క తమిళనాడులోనే అత్యధికంగా రూ.38.3 కోట్లు (GROSS) వసూలైనట్లు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.3 కోట్లు, హిందీలో రూ.1.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ప్రకటించాయి. ఇక వరల్డ్‌వైడ్ గ్రాస్ కలుపుకుంటే రూ.80 కోట్లు (GROSS)పైనే తొలి రోజు రాబట్టే అవకాశముందని అంచనా వేస్తున్నాయి. అయితే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ‘ది గోట్’ చిత్రం ‘లియో’ రికార్డ్‌ను దాటలేకపోయినట్లు తెలుస్తోంది. విజయ్ గత చిత్రం ‘లియో’ తొలి రోజున రూ. రూ.148.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ రికార్డును ‘ది గోట్’ అధిగమించలేకపోయింది.
'ది గోట్' ఎలా ఉందంటే?
దర్శకుడు వెంకట్ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని చెప్పవచ్చు.
కథేంటి
గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్ (విజయ్)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
https://telugu.yousay.tv/the-goat-review-if-dalapati-vijay-had-to-face-himself-is-the-goat-great-or.html
సెప్టెంబర్ 06 , 2024
The Goat Weekend Collections: రూ.300 కోట్లు జస్ట్ మిస్.. ‘ది గోట్’ 4 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. అయితే గురువారం (సెప్టెంబర్ 5)న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తమిళనాడులో మాత్రం విజయ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షించి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ మూవీ తొలి రోజే రూ.120 కోట్లకు పైగా కొల్లగొట్టింది. మరీ వీకెండ్‌కు వచ్చేసరికి ఈ మూవీ వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
విజయ్ హీరోగా నటించిన ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. తొలి నాలుగు రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.282.5 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. కొద్దిలో రూ.300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రంగా ‘ది గోట్’ రికార్డు సృష్టించింది. ధనుష్ రీసెంట్ చిత్రం 'రాయన్' రూ.154 కోట్ల (GROSS) లైఫ్‌టైమ్ వసూళ్లను తొలి రెండ్రోజుల్లోనే క్రాస్ చేసి ఈ ఫీట్ సాధించింది. ఒక్క తమిళనాడులోనే ‘ది గోట్’ రూ.106.40 కోట్లు వసూలు చేయడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.10.10 కోట్లు, కర్ణాటకలో రూ.21.1 కోట్లు, కేరళ రూ.10.4 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.13.9 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.120.15 కోట్ల మేర విజయ్ చిత్రం రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం రూ.300 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది.
'ది గోట్' ఎలా ఉందంటే?
దర్శకుడు వెంకట్ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని చెప్పవచ్చు.
కథేంటి
గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్ (విజయ్)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
సెప్టెంబర్ 09 , 2024
The GOAT Review: దళపతి విజయ్ తనతో తానే తలపడాల్సి వస్తే.. ‘ది గోట్’ గ్రేట్‌గా ఉందా? లేదా?
నటీనటులు : విజయ్, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్ త్యాగరాజన్, కొకిలా మోహన్, జయరాం, స్నేహా, వీటీవీ గణేష్, అరవింద్ ఆకాష్, వైభవ్ రెడ్డి తదితరులు
కథ, దర్శకత్వం : వెంకట్ ప్రభు
సంగీతం : యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ నూని
ఎడిటింగ్ : వెంకట్ రాజన్
నిర్మాతలు : కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేశ్, కల్పతి ఎస్. సురేష్
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? విజయ్‌కు మరో మరుపురాని విజయాన్ని అందించిందా? లేదా? ఈ రివ్యూ (The Greatest of All Time Telugu Review)లో తెలుసుకుందాం.
కథేంటి
గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్ (విజయ్)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
దళపతి విజయ్ ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. గాంధీ పాత్రలో ఎప్పటిలాగే అదరగొట్టాడు. అయితే జీవన్ పాత్రలో యంగ్ విజయ్ డిజిటలైజ్డ్ లుక్ కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంత కన్విన్సింగ్‌గా ఉండదు. ఇక యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో విజయ్ మరోమారు తన మార్క్ చూపించాడు. హీరోయిన్‌గా మీనాక్షి చౌదరికి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆమెది గెస్ట్ రోల్‌లాగా అనిపిస్తుంది. స్పెషల్ స్క్వాడ్ సభ్యులుగా ప్రశాంత్, అజ్మల్, ప్రభుదేవా పర్వాలేదనిపించారు. వారికి హెడ్‌గా జయరాం తన నటనతో ఆకట్టుకున్నారు. సీనియర్ విజయ్‌కు జోడీగా చేసిన స్నేహా తన నటనతో మెప్పించింది. తమిళ యువ హీరో శివ కార్తికేయన్ చిన్న పాత్రలో సందడి చేశారు. త్రిష ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వెంకట్ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని చెప్పవచ్చు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే యువన్ శంకర్ రాజా అందించిన పాటలు పూర్తిగా తేలిపోయాయి. ఏది మైండ్‌లో గుర్తుంచుకునేలా లేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. యాక్షన్ సీక్వెన్స్‌లను బీజీఎం మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. గ్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఇంకాస్త బెటర్‌గా పనిచేయాల్సింది. ముఖ్యంగా విజయ్ డీఏజింగ్ లుక్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడినట్లు అనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
విజయ్ నటనయాక్షన్ సీక్వెన్స్‌క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
ఊహకందే కథనంప్రథమార్ధం
Telugu.yousay.tv Rating : 2.5/5
సెప్టెంబర్ 05 , 2024
OTT Releases This Week Telugu: సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
ఆగస్టులో వరుసగా చిత్రాలు రిలీజై సినీ ప్రియులను ఎంటర్‌టైన్ చేశాయి. ఇప్పుడు సెప్టెంబర్‌లోనూ అదే జోష్‌లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఈ నెల ఫస్ట్ వీక్‌లో ఓ పాన్ ఇండియా చిత్రంతో పాటు పలు చిన్న సినిమాలు థియేటర్లలోకి సందడి చేయనున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The Greatest of All Time). వెంకట్ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’తో రానుంది. ఈ సాంకేతికతతో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిలా చూపించనున్నారు. హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ‘ది గోట్’కు వర్క్ చేయడం విశేషం. సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
35 చిన్న కథ కాదు
నివేదా థామస్ (Nivetha Thomas), విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు రానా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళంలలో సెప్టెంబర్ 6న ఈ మూవీ విడుదల కానుంది. ప్రముఖ నటి నివేదా ఇందులో తొలిసారి తల్లి పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.
జనక అయితే గనక
యంగ్ హీరో సుహాస్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంగా అతడు నటించిన లేటెస్ట్ చిత్రం ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka). సందీప్‌రెడ్డి బండ్ల తెరకెక్కించిన ఈ మూవీలో వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఉరుకు పటేలా
తేజస్ కంచెర్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఉరుకు పటేలా' (Uruku Patela). వివేక్ రెడ్డి దర్శకుడు. ఖుష్బూ చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు రిసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
TitleCategoryLanguagePlatformRelease DateThe Perfect CoupleSeriesEnglishNetflixSep 05Apollo 13: SurvicalDocumentaryEnglishNetflixSep 05Bad Boys: Ride or DieMovieEnglishNetflixSep 06Adios AmigoMovieMalayalamNetflixSep 06Sector 36MovieHindiNetflixSep 13Tanav Season 2SeriesHindiSonyLIVSep 06ThalaivanMovieMalayalamSonyLIVSep 10English TeacherMovieEnglishHotstar Sep 03KillMovieHindiHotstar Sep 06Brick ToonsMovieEnglishHotstar Sep 04The Fall GuyMovieEnglishJio CinemaSep 03Fight Night: The Million Dollar HeistSeriesEnglishJio CinemaSep 06
సెప్టెంబర్ 02 , 2024
New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్.. ఓ లుక్కేయండి!
కొత్త ఏడాదిలో ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేసేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతి (Sankranthi)కి విడుదలైన ‘హనుమాన్’ (Hanuman), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘సైంధవ్’ (Saindhav), ‘నా సామిరంగ’ (Na Sami Ranga) చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ కోవలోనే మరికొన్ని సినిమాలు అలరించేందుకు రాబోతున్నాయి. కాగా, ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు సంక్రాంతి సందర్భంగా రిలీజై ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈగల్
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్ చిత్రం ‘ఈగల్ (Eagle). వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాలి. కొన్ని కారణాల నేపథ్యంలో ‘ఫిబ్రవరి 9’కి వాయిదా పడింది. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రవితేజ, హీరోయిన్ కావ్యా థాపర్ ఎంతో అందంగా కనిపించారు.
రాజా సాబ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్’ (Raja Saab)గా పేరును ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అది ట్రెండింగ్‌గా మారింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుంగీతో కనిపించడం విశేషం.
ఆపరేషన్ వాలెంటైన్
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine) చిత్రంలో నటిస్తున్నాడు. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో చేస్తోంది. ఈ చిత్ర యూనిట్ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అమృత్‌సర్‌లోని చారిత్రక వాఘా సరిహద్దులో వందేమాతరం పాటను కూడా లాంచ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.
భీమా
ప్రముఖ హీరో గోపిచంద్ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భీమా (Bheema). పండగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ సైతం హల్‌చల్ చేసింది. ఇందులో గోపిచంద్ ఎద్దుపై కూర్చొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ. హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలవుతుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విశ్వక్ సేన్ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari). ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ మార్చి 8న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
వెట్టైయాన్
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'వెట్టియాన్'. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ సంక్రాంతి రోజున విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పోస్టర్ వింటేజ్ రజనీకాంత్‌ను గుర్తుకు తెచ్చింది.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్‌టైమ్ (The Greatest of All Time). ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ కూడా తాజాగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌లో విజయ్‌తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, వెంకట్ ప్రభు కనిపించారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం అందిస్తున్నాడు.
కెప్టెన్ మిల్లర్
తమిళ హీరో ధనుష్ నటించిన లెటేస్ట్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller). ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో జనవరి 25న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని లేటెస్ట్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీని అరుణ్ మతేశ్వరణ్ డైరెక్ట్ చేశారు.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు
యంగ్ హీరో సుహాస్, డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో రూపొందుతున్న 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ పండగ సందర్భంగా రిలీజై ఆకట్టుకుంది.
జనవరి 17 , 2024
The Goat Director: తెలుగు ఆడియన్స్‌పై ‘ది గోట్’ డైరెక్టర్ అక్కసు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్). సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధిస్తూ రూ.300 కోట్ల మార్క్‌ను సైతం అందుకుంది. అయితే తెలుగు, హిందీ భాషల్లో మాత్రం 'ది గోట్'కు గట్టి ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ వెంకట్ ప్రభు స్పందించారు. తెలుగు, హిందీ ప్రేక్షకులపై అతడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
‘అందుకే నచ్చలేదు’
తెలుగు, హిందీ భాషల్లో ‘ది గోట్’ (The Greatest Of All Time) సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రూ.22 కోట్లకు ఈ మూవీని కొనుగోలు చేయగా ఇప్పటివరకు రూ.10 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే బ్రేక్ ఈవెన్ కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వెంకట్ ప్రభు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనీకి సంబంధించిన సీన్స్ హైలైట్ చేయడం వల్ల తెలుగు, హిందీ ప్రేక్షకులకు ఇది నచ్చలేదని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలు, హిందీ బెల్ట్‌లో ది గోట్ పనితీరు తక్కువగా ఉండడానికి ఇదే కారణమన్నారు. అంతేకాదు ఐపీఎల్‌లోని ముంబయి, బెంగళూరు జట్టు అభిమానులు తమ చిత్రాన్ని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. తాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానిని కావడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. వెంకట్ ప్రభు కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
https://twitter.com/TheAakashavaani/status/1833133203697131918
తెలుగు ఆడియన్స్ ఫైర్..!
డైరెక్టర్ వెంకట్ ప్రభు తాజా కామెంట్స్‌ను తెలుగు ఆడియన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో 'ది గోట్' డిజాస్టర్ దిశగా వెళ్లడానికి కారణాలు వేరే ఉన్నాయని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. కంటెంట్ బాగుంటే ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల చిత్రాలను తాము ఆదరిస్తామని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ‘మానాడు’ చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ఒకసారి గుర్తుచేసుకోవాలని డైరెక్టర్‌కు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధోనికి విపరీతంగా అభిమానులు ఉన్నారని, హైదరాబాద్‌లో సీఎస్కే మ్యాచ్ జరిగితే ఎల్లో జెర్సీలతో స్టేడియం నిండిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ‘ది గోట్’ ఫెయిల్యూర్‌కు గల కారణాలేంటో అన్వేషించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగులో ఫ్లాప్‌కు కారణాలు ఇవే!
దర్శకుడు వెంకట్ ప్రభు రొటిన్ స్టోరీతో ది గోట్‌ను తెరకెక్కించారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించాడు. అయితే టెర్రరిజం మూలాలతో తెరకెక్కినప్పటికీ ఏజెంట్ సినిమాల్లో కనిపించే ట్విస్టులు ఇందులో ఉండవు. మలుపులు, మెరుపులు ఏ ఒక్కటీ కథనంలో కనిపంచలేదు. కనీసం హీరో చేసే ఆపరేషన్స్‌లోనూ థ్రిల్ లేదు. పైగా విరామం వరకూ కథంతా సాగతీత వ్యవహారమే. అనవసరంగా వచ్చి పడిపోయే పాటలు, యోగిబాబు కామెడీ ట్రాక్ తెలుగు ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాయి. అయితే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్‌లో వచ్చే ఐపీఎల్ ట్రాక్ ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపాయి.
నో చెప్పిన ధోని!
‘ది గోట్’లో చాలా అతిథి పాత్రలు ఉన్నాయి. హీరో శివ కార్తికేయ (Sivakarthikeyan), హీరోయిన్ త్రిష (Trisha) అతిథులుగా అలరించారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీని కూడా క్లైమాక్స్‌లో చూపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజువల్స్ ద్వారా మహీని వెండితెరపై చూపారు. నిజానికి ధోనీతో ఒక్క సన్నివేశమైనా సినిమాలో చేయించాలని దర్శకుడు వెంకట్ ప్రభు అనుకున్నారట. అందుకు మహీ ఒప్పుకోకపోవడంతో ఐపీఎల్ విజువల్స్ ద్వారా స్క్రీన్‌పై చూపించారు. 20 నిమిషాల పాటు ఉండే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ క్రికెట్ లవర్స్‌ను ఎంతగానో ఆకర్షించింది.
నెగిటివ్ రివ్యూలపైనా మండిపాటు
‘ది గోట్’ సినిమాపై వచ్చిన నెగిటివ్ రివ్యూలపై దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు. ‘సినిమాని రూపొందించేందుకు మేం పడిన కష్టం గురించి మాట్లాడరు. కానీ, కొందరు సినిమాపై కావాలనే నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఈ సినిమాలో ఉన్నన్ని రిఫరెన్స్‌లు ఏ చిత్రంలోనూ లేవు. ఏ హీరో అభిమాని అయినా ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రిఫరెన్స్‌లు తీసుకున్నాం. అతిథి పాత్రల కోసమే చిత్రాన్ని రూపొందించలేదు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా కథను తీర్చిదిద్దా. సినిమా ఆడియన్స్ కోసమేగానీ రివ్యూవర్స్‌కు కాదు’ అని అన్నారు.
సెప్టెంబర్ 10 , 2024
IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్ హవా.. ఆ మూవీస్ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!
ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు, మోస్ట్ అవైటెడ్ భారతీయ చిత్రాల జాబితాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ జాబితాలను ప్రపంచవ్యాప్తంగా IMDBకి ఉన్న 250 మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ రియల్ పేజ్ వ్యూస్ ఆధారంగా రూపొందించారు. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ మూవీగా 'కల్కి 2898 AD' నిలవగా, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా 'పుష్ప 2: ది రూల్' నిలిచాయి. ఐఎండీబీ రిపోర్టుకు సంబంధించిన పూర్తి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
2024లో మోస్ట్ పాపులర్ చిత్రాలు ఇవే!
ఐఎండీబీ మోస్ట్ పాపులర్ మూవీస్ - 2024 జాబితాలో ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అగ్రస్థానంలో నిలిచింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన 'మంజుమ్మెల్ బాయ్స్' (Manjummel Boys) మూవీ ఈ జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకుంది. హృతిక్ రోషన్, దీపికా పదుకునే కలిసి నటించిన 'ఫైటర్' (Fighter) మూవీ 3వ స్థానంలో నిలవగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' (Hanuman) సినిమా నాలుగో స్థానం సంపాదించింది. అజయ్ దేవగన్, ఆర్.మాధవన్, జ్యోతిక కలిసి నటించిన 'సైతాన్' (Shaitaan) ఆ తర్వాతి ప్లేస్ లో ఉంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్' (Laapataa Ladies) 6వ స్థానం, యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆర్టికల్ 370' (Article 370) 7వ స్థానం, నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు జంటగా నటించిన మలయాళ మూవీ 'ప్రేమలు' (Premalu) 8వ స్థానంలో నిలిచాయి. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ హీరోగా చేసిన 'ఆవేశం' (Aavesham), హీందీలో మంచి విజయం సాధించిన 'ముంజ్య' (Munjya)చిత్రాలు 9, 10 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
https://twitter.com/IMDb_in/status/1815619130948771914
2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలు
IMDB రిలీజ్ చేసిన ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ అప్ కమింగ్ ఇండియన్ మూవీస్’ (Most Anticipated Upcoming Indian Movies Of 2024) జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం టాప్‌లో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'దేవర' (Devara) చిత్రం సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న 'వెల్ కమ్ టూ ది జంగిల్' (Welcome To The Jungle), కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (The Greatest Of All Time) సినిమాలు వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి.
తమిళ హీరో సూర్య నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కంగువ' (Kanguva) ఐదో స్థానంలో నిలవగా, అజయ్ దేవగన్ నటిస్తున్న ‘సింగం అగైన్’ (Singam Again) ఆరో స్థానంలో ఉంది. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న 'భూల్ భూలయ్యా 3', చియాన్ విక్రమ్ 'తంగలాన్', 'ఔరోన్ మే కహన్ దమ్ థా', 'స్త్రీ 2' ఆ తర్వాతి స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
https://twitter.com/IMDb_in/status/1815645100988379418
జూలై 24 , 2024
Indian Films With Rs.100 cr opening: తొలి రోజే రూ.100 కోట్లు ఖాతాలో వేసుకున్న పాన్ ఇండియా స్టార్స్ వీరే!
ప్రస్తుతం దేశంలో పాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు తమ ఇండస్ట్రీలకు మాత్రమై పరిమితమైన స్టార్ హీరోలు ఇప్పుడు ఇతర ఇండస్ట్రీలలోనూ సత్తా చాటుతున్నారు. జాతీయ స్థాయిలో తమ చిత్రాలను రిలీజ్ చేస్తూ పెద్ద ఎత్తున కలెక్షన్స్ రాబడుతున్నారు. తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను తమ ఖాతాల్లో వేసుకుంటూ సత్తా చాటుతున్నారు. తారక్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం ఇటీవలే విడుదలై తొలిరోజు రూ.172 కోట్లను కొల్లగొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లో తమ చిత్రాలను నిలిపిన స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు పరిశీలిద్దాం.
ప్రభాస్ (Prabhas)
ప్రస్తుతం దేశంలో ఏ హీరోకు లేనంత క్రేజ్ ప్రభాస్‌కు ఉంది. ఆయన సినిమా వస్తుందంటే రికార్డులన్నీ దాసోహం కావాల్సిందే. తొలి రోజు అత్యధికసార్లు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హీరోగా ప్రభాస్ టాప్‌లో ఉన్నారు. ప్రభాస్ ఐదు సార్లు ఈ ఫీట్‌ను సాధించాడు. ‘బాహుబలి 2’ (రూ. 214.5 కోట్లు), ‘సాహో’ (రూ.130 కోట్లు), ‘ఆదిపురుష్’ (రూ.140 కోట్లు), ‘సలార్’ (రూ.178.7 కోట్లు), ‘కల్కి 2898 ఏడీ’ (రూ.191.5 కోట్లు) చిత్రాలన్నీ తొలిరోజు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి.
విజయ్ (Vijay)
ప్రభాస్ తర్వాత విజయ్ అత్యధిక సార్లు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నారు. ఆయన నటించిన ‘లియో’, ‘ది గోట్’ చిత్రాలు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో గతేడాది వచ్చిన 'లియో' (Leo) చిత్రం తొలి రోజు రూ.145 కోట్లు కొల్లగొట్టింది. ఇటీవల వచ్చిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్' (The G.O.A.T) ఫస్ట్ డే రూ. 126.3 కోట్లను తన ఖాతాలో వేసుకుంది.
జూ.ఎన్టీఆర్ (Jr NTR)
దేవర సినిమా సక్సెస్‌తో తారక్ ఈ జాబితాలో టాప్ 3లో నిలిచారు. ఆయన చేసిన రెండు చిత్రాలు తొలి రోజు రూ.100 కోట్ల మార్క్‌ను అందుకున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో చేసిన ‘RRR’ చిత్రం తొలి రోజు ఏకంగా రూ.223 కోట్లను రాబట్టింది. తారక్ రీసెంట్ చిత్రం ‘దేవర’ (Devara) ఫస్ట్ డే రూ.172 కోట్లను వసూలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు చిత్రాల సక్సెస్‌తో తారక్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు.
షారుక్ ఖాన్ (Shah Rukh Khan)
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ రెండు సార్లు ఈ ఫీట్ సాధించారు. ఆయన నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్, దీపికా పదుకొనే జంటగా నటించిన ‘పఠాన్’ (Pathan) చిత్రం తొలిరోజు రూ.106 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ (Jawan) ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.129 కోట్లను తన ఖాతాలో వేసుకుంది.
యష్ (Yash)
కన్నడ నటుడు యష్ ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రం ద్వారా తొలి రోజే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరారు. ‘కేజీఎఫ్’ (KGF)కు ముందు వరకూ కన్నడ ఇండస్ట్రీకి పరిమితమైన యష్ ఆ సినిమా సక్సెస్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. ‘కేజీఎఫ్ 2’ చిత్రం తొలి రోజు రూ.164 కోట్లు కొల్లగొట్టి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) వంగా రూపొందించిన ‘యానిమల్’ (Animal) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రణ్‌బీర్ కెరీర్‌లో తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచింది. గతేడాది డిసెంబర్ 1 రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ డే రూ.116 కోట్లను తన ఖాతాలో వేసుకుంది.
రామ్‌చరణ్ (Ramcharan)
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘RRR’ చిత్రంలో తారక్‌తో పాటు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సైతం హీరోగా నటించారు. ఆ చిత్రం ద్వారా తొలి రోజు రూ.223 కోట్లను కొల్లగొట్టి ఈ జాబితాలో చోటు సంపాదించాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కూడా తొలి రోజు రూ.100 కోట్లు పైనే రాబడుతుందని చరణ్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మక్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సెప్టెంబర్ 30 , 2024
The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
'ది కేరళ స్టోరీ ' చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపుతోంది. మే 5న ఈ సినిమా విడుదల కానుండగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయోద్దంటూ కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్, సీపీఐ, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ విద్వేషపూరితంగా చిత్రీకరించారని, సినిమా విడుదల చేస్తే మత సామరస్యం దెబ్బతింటుందని పలువురు ఏకంగా సుప్రీకోర్టునే ఆశ్రయించారు. ఈ స్థాయిలో వివాదం రాజుకోడానికి కారణమేంటి? ఈ చిత్రంపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? కేరళ కంటే తమిళనాడు ఎందుకు ఎక్కువగా ఆందోళన చెందుతోంది? అసలు ఈ సినిమా సెన్సార్ క్లియర్ చేసుకుందా? వంటి ప్రశ్నలకు ఈ ప్రత్యేక కథనంలో సమాధానం చూద్దాం.
వివాదానికి బీజం:
సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరతారు. ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది.
కేరళ సీఎం ఆగ్రహం
'ది కేరళ స్టోరీ' ట్రైలర్.. కేరళ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం స్పందించారు. ‘రాష్ట్రంలో మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుంది. ‘లవ్ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినా.. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయని.. వారి రాజకీయాలు ఇక్కడ సాగవని పరోక్షంగా భాజపా, RSSలకు చురకలు అంటించారు.
సినిమాను బ్యాన్ చేయాలి
‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలను కేరళ అధికార పార్టీతోపాటు విపక్ష కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడింది. రాష్ట్రంలో చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్, డీవైఎఫ్‌ఐ, ఐయూఎంఎల్ వంటి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కేరళను అవమానించే రీతిలో ఈ చిత్రం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ పేర్కొన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఓ వర్గం యత్నిస్తోందని ఐయూఎంఎల్ జాతీయ కార్యదర్శి పీకే ఫిరోజ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్విట్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు.
తమిళనాడు అలెర్ట్
ది కేరళ స్టోరి రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ బృందాలు అలెర్ట్ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ‘కేరళ స్టోరీ’ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి నిఘా వర్గాలు సూచించాయి. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అన్ని థియేటర్లలో పొన్నియన్ సెల్వన్-2 నడుస్తున్నట్లు చెప్పాయి. ధియేటర్ యాజమానులు ‘ది కేరళ స్టోరీ’ని ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి.
సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు
‘ది కేరళ స్టోరీ’ ఇటీవలె సెన్సార్ పూర్తి చేసుకుంది. వివాదస్పదంగా మారిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A సర్టిఫికేట్’ ఇచ్చింది. అంతేగాక సినిమాలోని వివిధ సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దేవుళ్లకు సంబంధించిన డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది. మరికొన్ని పదాలను సవరించాలని కోరింది. మొత్తం 10 సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. వాటిని డిలీట్ చేయాలని చెప్పింది. పలు సవరణలతో మే 5న చిత్ర విజయానికి అనుమతించింది.
సుప్రీంకోర్టు స్పందన
‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన అభ్యర్థనను ధర్మాసనం నిరాకరించింది. ‘ది కేరళ స్టోరీ’లో విద్వేషపూరితమైన ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయని దాఖలైన పిటీషన్‌పై కోర్టు స్పందించింది. ‘ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పొందింది. మీరు దీని విడుదలను సవాల్ చేయాలనుకుంటే ఆ సర్టిఫికెట్‌తో తగిన ఫోరంను సంప్రదించండి’ అని సుప్రీంకోర్టు పిటిషనర్లకు సూచించింది.
మే 03 , 2023
Deviyani Sharma: “సేవ్ ది టైగర్స్” ఫేమ్ దేవియాని శర్మ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
‘సేవ్ ద టైగర్స్’ (Save The Tigers S1 & S2)సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ‘దేవియాని శర్మ’ (Deviyani Sharma). ఇందులో చైతన్య కృష్ణ (Chaitanya Krishna)కు జోడీగా నటించిన ఈ భామ.. తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు (Some Lesser Known Facts about Deviyani Sharma) సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దేవియాని శర్మ ఎవరు?
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యువ నటి.
దేవియాని శర్మ ఎక్కడ పుట్టింది?
న్యూఢిల్లీ
దేవియాని శర్మ పుట్టిన తేది?
మే 30, 1993
దేవియాని శర్మ వయసు ఎంత?
ఈ భామ వయసు ప్రస్తుతం 31 సంవత్సరాలు (2024)
దేవియాని శర్మ తల్లిదండ్రులు ఎవరు?
సునీల్ శర్మ, నీనా శర్మ
దేవియాని శర్మ తోబుట్టువులు ఉన్నారా?
ఈ బ్యూటీకి ఒక సోదరి ఉంది. ఆమె పేరు సోనం శర్మ
దేవియాని శర్మ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది?
ఈ నటి విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే జరిగింది.
దేవియాని శర్మ ఏం చదివింది?
ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసింది.
దేవియాని శర్మ ఎత్తు ఎంత?
165 సెం.మీ
దేవియాని శర్మ ప్రస్తుతం ఎక్కడ ఉంటోంది?
2019 నుంచి ఆమె హైదరాబాద్‌లోనే నివసిస్తోంది.
దేవియాని శర్మ సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది?
కెరీర్‌లో ప్రారంభంలో ఈ బ్యూటీ మోడల్‌గా చేసింది. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో సైతం నటించింది.
దేవియాని శర్మ తొలి చిత్రం?
2020లో వచ్చిన ‘భానుమతి & రామకృష్ణ’ (Bhanumathi & Ramakrishna)సినిమాలో ఓ అతిధి పాత్రతో తొలిసారి తెరంగేట్రం చేసింది.
దేవియాని శర్మ తొలి వెబ్‌సిరీస్?
2020లో జీ5లో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 'అనగనగా' (Anaganaga).. ఆమె చేసిన తొలి సిరీస్. ఇందులో లీడ్ రోల్‌లో కనిపించి దేవియాని గుర్తింపు పొందింది.
దేవియాని శర్మ ఇప్పటివరకూ చేసిన చిత్రాలు/ సిరీస్‌లు?
‘భానుమతి & రామకృష్ణ’, 'రొమాంటిక్' (Romantic), సైతాన్ (Shaitan), సేవ్ ద టైగర్స్ 1 & 2 (వెబ్‌సిరీస్)
దేవియాని శర్మకు పాపులారిటీ తీసుకొచ్చిన చిత్రం/ వెబ్‌సిరీస్?
హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ‘సేవ్ ద టైగర్స్’ ఆమెకు తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సిరీస్ ద్వారా అందం, అభినయంతో దేవియాని యూత్‌ను ఆకర్షించింది.
దేవియాని శర్మ హామీలు ఏంటి?
దేవియానికి ట్రావెలింగ్, పెయింటింగ్ అంటే చాలా ఇష్టమట.
దేవియాని శర్మకు ఇష్టమైన పెంపుడు జంతువు?
డాగ్
దేవియాని శర్మ పేవరేట్ హీరో, హీరోయిన్ ఎవరు?ఈ విషయాన్ని దేవియాని శర్మ ఏ ఇంటర్యూలోనూ పంచుకోలేదు.
దేవియాని శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా?
https://www.instagram.com/deviyyani/?hl=en
https://www.youtube.com/watch?v=4ZnkBGYa4Gg
ఏప్రిల్ 04 , 2024
This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్’, ‘ది గోట్ లైఫ్’.. అటు ఓటీటీలో ఏవంటే?
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు
ది గోట్‌లైఫ్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా, అమలా పాల్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ది గోట్‌లైఫ్’. సర్వైవల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ‘ఆడు జీవితం’ (Aadujeevitham) పేరుతో మార్చి 28న విడుదల కానుంది. దీనికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ‘గోట్ డేస్’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కేరళ నుంచి పని కోసం మధ్య ప్రాశ్చ్యానికి వెళ్లిన ఓ యువకుడు బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథాంశమని చిత్ర యూనిట్ తెలిపింది.
టిల్లు స్క్వేర్
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). బ్లాక్ బాస్టర్ సినిమా ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. మల్లిక్ రామ్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.
గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్
మరో విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ సిద్ధమైంది. ఆడమ్ విన్‌గార్డ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్’ (Godzilla x Kong: The New Empire) ఈ వారం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతోంది. ప్రపంచం మీద విరుచకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్ ఎలా చెక్‌పెట్టిందనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో మార్చి 29న విడుదల కానుంది.
కలియుగం పట్టణంలో
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanam Lo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
సుందరం మాస్టర్
వైవా హర్ష (Harsha Chemudu) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master OTT Release). ఫిబ్రవరిలో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు వినోదం పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్ కానుంది.
ఏం చేస్తున్నావ్?
విజయ్ రాజ్‌కుమార్, నేహా పటాని జంటగా భరత్ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్?’ (Em chesthunnav OTT Release). నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గతేడాది ఆగస్టు 25న విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈటీవీ విన్ (ETV Win) వేదికగా ప్రసారం కానుంది.
ట్రూ లవర్
జై భీమ్, గుడ్‌నైట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కె.మణికందన్ (manikandan). ఆయన నటించిన తాజా చిత్రం ‘ట్రూ లవర్’ (True Lover OTT Release) ఇటీవల తెలుగులో రిలీజై పాజిటివ్ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్‌గా గౌరీ ప్రియ ఆకట్టుకుంది. ప్రభురామ్ తెరకెక్కించిన ఈ చిత్రం ‘ట్రూ లవర్’.. మార్చి 27న డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateTestamentSeriesEnglishNetflixMarch 27Heart Of The Hunter MovieEnglishNetflixMarch 29The Beautiful GameMovieEnglishNetflixMarch 29The Great Indian Kapil ShowSeriesHindiNetflixMarch 30Tig NotaroSeriesEnglishAmazon primeMarch 26The BoxtersSeriesEnglishAmazon primeMarch 28Patna ShuklaMovieHindiDisney + HotstarMarch 29Renegade NellSeriesEnglishDisney + HotstarMarch 29The HoldoversMovieEnglishBook My ShowMarch 29A Gentle Man In MaskSeriesEnglishJio CinemaMarch 29
మార్చి 25 , 2024
The Goat Life Review: పృథ్వీరాజ్ సుకుమారన్ కెరీర్ బెస్ట్ నటన.. ‘ది గోట్ లైఫ్’ సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: ప్రృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, జిమ్మీ జీన్ లూయీస్, లీనా, సంతోష్ కీఝాత్తూర్, అకేఫ్ నజీం, శోభా మోహన్ తదితరులు
దర్శకుడు : బ్లెస్సీ
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
సినిమాటోగ్రఫీ : సునీల్ కే.ఎస్
నిర్మాతలు: బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయీస్, స్టీవెన్ ఆడమ్స్, కే.జీ అబ్రహం
విడుదల తేదీ : 28-03-2024
‘సలార్’తో (Salaar) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). అంతకుముందు అతడు చేసిన మలయాళ చిత్రాలు తెలుగులో డబ్ అయినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. సలార్‌లో ప్రభాస్ ఫ్రెండ్‌గా నటించి తాజాగా మంచి పేరు గుర్తింపు సంపాదించాడు. తాజాగా అతడు నటించిన ‘ది గోట్ లైఫ్ : ఆడు జీవితం’ (The Goat Life : Aadujeevitham) మలయాళంతో పాటు తెలుగులోనూ ఇవాళ రిలీజైంది. బెన్యామిన్ రచించిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది (The Goat Life Review In Telugu)? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
ది గోట్ లైఫ్ చిత్ర కథ విషయానికి వస్తే.. కుటుంబ అవసరాల కోసం నజీబ్ అహ్మద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) వలస కూలీగా సౌదీ అరేబియా వెళతాడు. అనుకోకుండా నజీబ్ సౌదీ అరేబియాలో తప్పిపోతాడు. గల్ఫ్‌లో పని చేసి డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న నజీబ్ కల చెదిరిపోతుంది. ఏడారిలో బానిసగా మారి గొర్రెల కాపరిగా దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి? బానిస సంకెళ్ళ నుండి నజీబ్ ఎలా బయటపడ్డాడు? తిరిగి ఇండియాకు వచ్చి తన కుటుంబ సభ్యులను నజీబ్ కలుసుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే?
‘ది గోట్ లైఫ్’ చిత్రాన్ని పృథ్విరాజ్ సుకుమారన్ అన్నీ తానై నడిపించాడు. ఆయన నటన, షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అబ్బురపరుస్తాయి. నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్‌ను తప్ప మరో నటుడ్ని ఊహించుకోలేము. అంతగా ఆ పాత్రలో లీనమై నటించాడు పృథ్వీ. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన జీవించేశాడు. కెరీర్ బెస్ట్ నటనతో అదరగొట్టాడు. నటి అమలా పాల్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించింది. ఆమె తన పరిధి మేరకు నటించి మెప్పించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాకు మనసులను హత్తుకునే కథను ఎంచుకున్నాడు. బానిసల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో కళ్లకు కట్టాడు. ఫస్టాఫ్‌లో పృథ్వీ సౌదీకి రావడం.. అతడి పాస్‌పోర్టును లాక్కొని బానిసగా మార్చడం వంటివి చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్ హృదయాలను బరువెక్కిస్తుంది. సౌదీలో ఎలాంటి దారుణాలు జరుగుతాయో కూడా దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. సెకండాఫ్‌లో ఆ బానిస సంకెళ్ల నుంచి హీరో తప్పించుకోవడం, కనుచూపు మేర కనిపించే ఏడారిలో అతడు పడే కష్టాలను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఇసుక తుఫాను సీక్వెన్స్‌ను చాలా బాగా తెరకెక్కించాడు డైరెక్టర్. అయితే సినిమాలో సింహాభాగం అంతా పృథ్వీరాజ్ పడే కష్టాలే చూపించడం ఆడియన్స్‌కు బోర్ కొట్టిస్తుంది. పైగా సినిమా స్లో నేరషన్‌తో మరి నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సుదీర్ఘమైన సినిమాను చూసినట్లు ఆడియన్స్ ఫీలవుతారు. కమర్షియల్ చిత్రాలను ఇష్టపడే వారికి ‘ది గోట్ లైఫ్’ అంతగా రుచించకపోవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే (The Goat Life Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. అటు సినిమాట్రోగ్రాఫర్ కూడా చక్కటి ప్రతిభను కనబరిచాడు. సౌదీలోని ఎడారి పరిస్థితులను ఆ తన కెమెరా కళ్లతో అద్భుతంగా చూపించాడు. ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ అందించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రృథ్వీరాజ్ సుకుమారన్ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం
మైనస్ పాయింట్స్
స్లో నారేషన్‌కమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 28 , 2024
అవతార్-2 కోసం ఎదురుచూస్తున్నారా? ఆలోపు ఈ 10 Sci-Fi సినిమాలు చూసేయండి
]గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ vol.1 (2014 )2001: ఏ స్పేస్ ఒడిస్సే ( 1968 )
ఫిబ్రవరి 14 , 2023
Pushpa 2 Climax: పుష్ప 2లో క్లైమాక్స్ వైల్డ్ ఫైర్.. కనివినీ ఎరుగని రేంజ్‌లో ఫైట్ సీక్వెన్స్!
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప 2: ది రూల్’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 17న విడుదలైన తర్వాత అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంపై తాజాగా ఆసక్తికర వార్తలు వెలువడుతున్నాయి. పుష్ప రాజ్ ఊచకోత సన్నివేశం యాక్షన్ ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టిస్తుందని సమాచారం. ఈ సన్నివేశం ఊహించని విధంగా ఉంటుందని, యాక్షన్ ప్రేమికులకు ఇది నిజమైన పండగగా మారుతుందని టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. ‘పుష్ప: ది రైజ్’లో వీరి జంటకు అందరూ ఫిదా కాగా, ఈసారి ఈ కాంబినేషన్ మరింత ఎమోషనల్‌గా ఉంటుందని చెబుతున్నారు.
భారీ బడ్జెట్ నిర్మాణం
మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు ఈ సినిమా కోసం రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్, తమన్ ఇద్దరూ కలిసి సంగీతం అందిస్తున్నారు. వీరి కాంబినేషన్ అందరికీ అద్భుతమైన అనుభూతిని కలిగించనుందని సినీ వర్గాలు అంటున్నాయి.
https://twitter.com/resulp/status/1858089345464279297
సోషల్ మీడియాలో ‘వైల్డ్ ఫైర్’
‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భారీ వ్యూస్‌ను సాధించి, ట్రెండింగ్‌లో నిలిచిన ఈ ట్రైలర్‌పై ప్రేక్షకులతో పాటు ప్రముఖుల ప్రశంసలు కురుస్తున్నాయి. “ఇది నిజంగానే వైల్డ్ ఫైర్” అని రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులు ప్రశంసలు అందజేశారు.
క్లైమాక్స్ గురించి ఆసక్తికర సమాచారం
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు హై ఓల్టేజ్ ఎనర్జీ అందించనుందని తెలిసింది. క్లైమాక్ యాక్షన్ సీన్ల కోసం భారీ స్థాయిలో సెట్స్ వేశారని తెలిసింది. గతంలో అల్లు అర్జున్ ఎప్పుడూ చేయని యాక్షన్ ఫీట్స్ ఈ చిత్రంలో చేశాడని సమాచారం. అభిమానులకు క్లైమాక్స్ సీన్లు మంచి థ్రిల్‌ను పక్కాగా అందిస్తాయని ట్రైలర్ లోనే హింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప రాజ్ పాత్ర క్లైమాక్స్‌లో చూపించే ఊచకోత సీక్వెన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తుందని సమాచారం. కేవలం సెట్స్‌కే రూ.10 కోట్ల మేర ఖర్చు పెట్టినట్లు తెలిసింది. ఈ క్లైమాక్స్ సీన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు.
ప్రముఖుల స్పందన
ఈ చిత్ర ట్రైలర్‌పై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు:
రాజమౌళి: "పుష్పగాడి వైల్డ్ ఫైర్ దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్ 5న ఈ అగ్ని మరింత ఎత్తుకు చేరనుంది."అనిల్ రావిపూడి: "ఇది పవర్ ప్యాక్డ్ ట్రైలర్. బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూస్తున్నా."హరీశ్ శంకర్: "పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ తపన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాపై మీ ప్రేమకు హ్యాట్సాఫ్."రిషబ్ శెట్టి: "ట్రైలర్‌లో మాస్ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉన్నాయి. మరో బ్లాక్‌బస్టర్ సిద్ధమవుతోంది."ప్రశాంత్ వర్మ: "పుష్పరాజ్ తిరుగుబాటును విప్లవంగా మార్చాడు. ఈసారి మరింత ఘోరంగా రాబోతున్నాడు."
ఫ్యాన్స్ కోసం బన్నీ రిప్లై
నటుడు కిరణ్ అబ్బవరం చేసిన ట్వీట్‌కు అల్లు అర్జున్ స్పందిస్తూ, "థ్యాంక్యూ మై బ్రదర్. నీ సినిమా ‘క’ చూసి త్వరలో కాల్ చేస్తాను" అంటూ ప్రేమతో రిప్లై ఇచ్చారు.
డిసెంబర్ 5 - పుష్ప పండుగ
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పుష్పరాజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, క్లైమాక్స్ విజువల్స్ థియేటర్లలో ఓ పండుగలా ఉంటాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
‘పుష్ప’ ఎప్పుడు తగ్గడు, ఈసారి మరింత శక్తివంతమైన ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. "నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ అనుకుంటారా..?" అంటూ డైరెక్టర్ బుచ్చిబాబు చేసిన కామెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
ఇంతకు మించి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం మరెంత ఆసక్తిగా ఎదురుచూస్తారో మాటల్లో చెప్పలేం! డిసెంబర్ 5న పుష్ప 2 ప్రేక్షకులకు ఎలా సర్‌ప్రైజ్ ఇస్తుందో చూడాలి!
నవంబర్ 18 , 2024
Pushpa 2 Second Single: శ్రీవల్లితో పుష్ప గాడి డ్యూయెట్.. రేపు ఎప్పుడంటే?
టాలీవుడ్‌లో రానున్న మోస్ట్ అవెయిటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ (Pushpa : The Rule) ఒకటి. 2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్’కు కొనసాగింపుగా రానున్న దీని కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇటీవలే ‘పుష్ప 2 ‘టైటిల్ సాంగ్ రిలీజ్ చేయగా అది పాన్ ఇండియా స్థాయిలో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇదే ఊపులో రెండో సింగిల్‌కు కూడా చిత్ర యూనిట్ ముహోర్తం ఖరారు చేసింది.
రిలీజ్ ఎప్పుడంటే!
‘పుష్ప 2’ సెకండ్ సింగిల్‌ను రేపు (మే 23) ఉదయం 11:07 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఇందులో రష్మిక మందనతో బన్నీ చిందేయబోతున్నట్లు చెప్పింది. ఈ రొమాంటిక్ సాంగ్ ఆడియన్స్‌ను ఫిదా చేస్తుందని చెప్పుకొచ్చింది. ‘పుష్ప పుష్ప..' సాంగ్‌తో ఇటీవల పుష్ప రాజ్ దుమ్మురేపాడు. ఇప్పుడు శ్రీవల్లి తన సామితో కలిసి మన మనసులు కొల్లగొట్టబోతుంది అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. #Pushpa2SecondSingle హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
ఆ పాటను మరిపిస్తుందా!
పుష్ప సినిమాలోని 'నా సామీ రారా సామీ' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రొమాంటిక్ మెలోడీగా వచ్చిన ఈ పాట అప్పట్లో యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో రష్మిక నడుమును బెండ్ చేసి వేసే హుక్ స్టెప్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ స్టెప్‌ను అప్పట్లో యూత్ రీల్స్ చేసి తెగ ట్రెండ్ చేశారు. ఇప్పుడు ‘పుష్ప 2’ నుంచి రాబోతున్న సెకండ్ సింగిల్.. రొమాంటిక్ సాంగ్ కావడంతో ఇప్పటినుంచే అంచనాలు మెుదలయ్యాయి. ‘నా సామి రారా సామీ’ రేంజ్‌లోనే ఈ పాట ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
https://www.youtube.com/watch?v=vdY5SFZBgnk
ఐటెం సాంగ్‌పై ఫోకస్! (Pushpa 2 Item Song)
‘పుష్ప 2’ టైటిల్ సాంగ్ ఇప్పటికే విడుదలవ్వగా.. రొమాంటిక్ పాట రేపు (మే 23) ఫ్యాన్స్‌ను అలరించనుంది. దీంతో ప్రస్తుతం ఫ్యాన్స్ దృష్టి ఐటెం సాంగ్ వైపు మళ్లింది. పుష్ప సినిమాలోని 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా' సాంగ్ ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందే అందరికీ తెలిసిందే. ఇందులో సమంత (Samantha)తో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దీంతో 'పుష్ప 2' అదే రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఈ మూవీలో ఐటెం సాంగ్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. అదే సమయంలో మరో నటిని తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించలేదు. అయితే ఆగస్టు 15న సినిమా రిలీజ్ కానుండటంతో త్వరగా సాంగ్‌ను రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.
మే 22 , 2024
అశ్లీలత, బూతులకు OTT కేరాఫ్‌గా మారుతోందా? స్టార్లకు ఎందుకు నచ్చట్లేదు?
డిజిటల్ విప్లవంలో భాగంగా వచ్చిన కీలక మార్పు ఓవర్ ది టాప్(OTT). ఒకప్పుడు సినిమాలు థియేటర్లు, టీవీల్లోనే ప్రసారమయ్యేవి. కానీ, OTT వచ్చాక ఈ సంప్రదాయం పూర్తిగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ వినియోగంతో ఓటీటీ వినియోగం ఊపందుకుంది. అయితే, ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌పై ఎప్పటినుంచో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వ్యతిరేకత మరింత పెరిగింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఓటీటీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో చర్చ ఊపందుకుంది.
ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయి. కానీ, విస్తృతంగా ప్రజలకు చేరువయ్యింది మాత్రం కరోనా కాలంలోనే. థియేటర్లు మూత పడటంతో సినీ ప్రేక్షకులకు వినోదం దూరమైంది. దీంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీవీల్లో, ఫోన్లలో సినిమాలు, సిరీస్‌లు చూడటానికి చాలామంది అలవాటు పడ్డారు. ఒక్కసారిగా యూజర్ బేస్ పెరిగిపోవడంతో ఓటీటీ ప్లాట్‌ఫాంలు ప్రేక్షకుడిని మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. అయితే, ఈ మార్కెట్ బిజినెస్ పెంచుకునే క్రమంలో కంటెంట్ పరంగా కొన్ని సంస్థలు దిగజారాయి. యూజర్లను త్వరగా అట్రాక్ట్ చేయడానికి బూతు పదాలు, బోల్డ్ సన్నివేశాలను ఎంకరేజ్ చేశాయి.
ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్‌కు సెన్సార్‌షిప్ లేదు. దీంతో విచ్చలవిడి తనం పెరిగిపోయింది. ఫిల్మ్ మేకర్స్‌కి పూర్తిగా రెక్కలొచ్చాయి. జనాలు ఆదరిస్తుండటం వీరికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. నటీనటులు కూడా ఇందుకు తగ్గట్టు నడుచుకోవాల్సి వచ్చింది. చిలికి చిలికి గాలివాన అయినట్లు క్రమంగా అసభ్యకర సన్నివేశాలు, బూతులు, అశ్లీలత, హింస తీవ్రత పెరిగిపోయింది. బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించని పదజాలాన్ని వాడేలా వ్యూయర్స్‌పై ఓటీటీ సిరీస్‌లు తీవ్ర ప్రభావం చూపాయి. తాజాగా వచ్చిన ‘రానానాయుడు’ ఇందుకు ఉదాహరణ అని పలువురు చెబుతున్నారు.
ఈ సిరీస్‌పై ఒకప్పటి స్టార్ హీరోయిన్, బీజేపీ నేత విజయశాంతి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
సెన్సార్‌షిప్ ఎందుకు లేదు?
ఓటీటీలకు సెన్సార్‌షిప్ ఇవ్వడం ఒకరకంగా కాస్త కష్టతరమే. ఇదే విషయమై గతేడాది సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌కి సెన్సార్‌షిప్ ఉండాలనేది పిటిషన్ సారాంశం. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సాధ్యాసాధ్యాలను వెల్లడించింది. వెబ్‌సిరీస్‌లు ఎక్కువ డ్యురేషన్ ఉండటం సమస్యకు ప్రధాన కారణమని కోర్టు అభిప్రాయపడింది. అన్ని గంటల సేపు కూర్చుని ఓ వెబ్‌సిరీస్‌ని సెన్సార్ చేయడం కాస్త ఇబ్బందికరమేనని తేల్చిచెప్పింది. పైగా, ఒక్కో దేశంలో ఒక్కో సెన్సార్‌షిప్ నిబంధనలు ఉంటాయని గుర్తు చేసింది. ఓటీటీ పరిధి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది గనుక సెటాఫ్ రూల్స్‌ని డిజైన్ చేయలేమని తెలిపింది.
సెన్సార్ ఇస్తే ప్రయోజనకరమేనా?
రెచ్చగొట్టే ప్రసంగాలకు ప్రజలు సులువుగా ఆకర్షితులవుతారు. పైగా ఓటీటీ అందరికీ అందుబాటులో ఉండటం కారణంగా ఇలాంటి కంటెంట్‌కి తర్వగా అట్రాక్ట్ అవుతారు. ఫలితంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించలేం. అందుకే సెన్సార్ ఇవ్వడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. విద్వేశ పూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయొచ్చు. దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే కంటెంట్‌ని నివారించవచ్చు. ఓటీటీ కంటెంట్‌కి సెన్సార్ షిప్ ఇవ్వడం వల్ల హానికర కంటెంట్ నుంచి చిన్నపిల్లలను దూరంగా ఉంచవచ్చు.
ఎందుకు వద్దంటున్నారు?
ఓటీటీ కంటెంట్‌కి సెన్సార్‌షిప్ ఉండకకూదనే వాదన ఉంది. కొన్ని విషయాలపై ప్రజలకు సినిమాల ద్వారా పూర్తిగా అవగాహన కల్పించలేకపోవచ్చు. మరికొన్నింటిని విడమరచి చెప్పాల్సిన అవసరం ఉండవచ్చు. అలాంటి వాటికి విఘాతం కలిగే అవకాశం ఉందనేది ప్రధాన వాదన. అలాగే ఫిల్మ్ మేకర్ల క్రియేటివిటీని అణచివేసే ముప్పు ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. సెన్సార్ ఇస్తే విభిన్నంగా సిరీస్‌లు తీసే ఫిల్మ్ మేకర్లను ఆలోచనలో పడేలా చేస్తుందని చెబుతున్నారు.
మంచి కన్నా చెడు ఎక్కువ..!
ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌తో ప్రేక్షకుడికి మంచి కన్నా ఎక్కువగా చెడు జరుగుతుందని పలువురు వాదిస్తున్నారు. బూతు పదాలకు ప్రభావితమై వాటినే ప్రేక్షకులు ఉచ్చరిస్తున్నారని అంటున్నారు. ఫలితంగా ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఇదే విషయమై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అలనాటి నటి విజయశాంతి ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్‌షిప్ ఉండాలనేది వారి వాదన.
ఈ ప్లాట్‌ఫాంలలో అధికంగా..
కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంలో అడల్ట్ కంటెంట్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ఆల్ట్ బాలాజీ, ఉల్లు యాప్, గప్‌చుప్, ఫనియో మూవీస్, హాట్‌షాట్, 8షాట్స్, ఫిజ్ మూవీస్ తదితర యాప్‌లు అడల్ట్ కంటెంట్‌ని పెద్దఎత్తున ప్రసారం చేస్తున్నాయి.
టాప్ అడల్ట్ ఓటీటీ సిరీస్‌లు(ఇండియా)..
క్లాస్ ఆఫ్ 2020
విద్యార్థుల చుట్టూ తిరిగే కథ ఇది. స్నేహితులే సరదాగా డ్రగ్స్ తీసుకోవడం, శృంగారం చేసుకోవడం, రిలేషన్‌షిప్ మెయింటేన్ చేయడం చుట్టూ కథ తిరుగుతుంది. మొత్తం 32 ఎపిసోడ్‌లు ఉంటుంది.
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్
జీవితంలో నిలబడటానికి నలుగురు అమ్మాయిలు ఏం చేయాల్సి వచ్చిందనేది సిరీస్ సారాంశం. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయింది.
మేడ్ ఇన్ హెవెన్
నేటి సమాజంలో పెళ్లిళ్లు జరుగుతున్న తీరు గురించి ఉంటుందీ వెబ్‌సిరీస్. 2019లో రిలీజైంది.
గందీబాత్
అడల్ట్ సిరీస్‌లలో దేశంలోనే గందీబాత్ ఫేమస్. చాలా బోల్డ్ సీన్లు ఇందులో ఉన్నాయి. ఐఎండీబీ రేటింగ్ కూడా నాసిరకంగా ఉంది.
మాయా: స్లేవ్స్ ఆఫ్ హర్ డిజైర్
మీరు కాస్త బలహీనులైతే ఈ సిరీస్ అస్సలు చూడొద్దు. గతం మర్చిపోయిన ఓ మహిళను తిరిగి మామూలు మనిషిని చేయడానికి సెక్స్‌ని ఓ కారకంగా చూపెడతారు.దీనికి ఐఎండీబీ రేటింగ్ 5.5 ఇచ్చింది.
వర్జిన్ భాస్కర్
రచయిత అయిన ఓ వ్యక్తి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథే ఇది. ఏక్తాకపూర్, శోభాకపూర్ నిర్మించారు.
ఆశ్రమ్
ఆశ్రమాల్లో జరిగే వాటి గురించి ఆశ్రమ్ సిరీస్ తెలుపుతుంది. ఆశ్రమాల పేరిట జరిగే కార్యకలపాల గురించి చెబుతుంది.
రాత్రి కీ యాత్రి
2021లో ఈ సిరీస్ విడుదలైంది. రెడ్ లైట్ ఏరియా గురించి ఈ సిరీస్ వివరిస్తుంది.
మీర్జాపూర్
అమెజాన్ ప్రైమ్‌లో అప్పట్లో సంచలనంగా మారిందీ వెబ్‌సిరీస్. క్రైం, అశ్లీలం ఇందులో అధికంగా ఉంటుంది.
రానానాయుడు
ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌లో అశ్లీలత అధికంగా ఉంది. తండ్రి, కొడుకుల మధ్య జరిగే కథ గురించి తెలుపుతుంది. వీటితో పాటు తదితర సిరీస్‌లు అధికంగా అశ్లీలత, బూతు కంటెంట్‌ని కలిగి ఉన్నాయి.
ఏప్రిల్ 08 , 2023
Prabhas: ప్రభాస్‌పై భారీగా ట్రోల్స్.. ఇంతకు ఆ పోస్టర్‌లో ఏముందంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). ఈ సినిమా అప్‌డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ ఉంటుందని మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా అక్టోబర్ 23న స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ పోస్టర్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. తాము ఎక్స్‌పెక్ట్ చేసిన స్థాయిలో పోస్టర్ లేదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రభాస్ లుక్ ఎలా ఉందంటే?
ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు మారుతి (Director Maruti) తెరకెక్కిస్తున్న 'ది రాజాసాబ్' (The Raja Saab) చిత్రంలో మాళవికా మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhi Agarwal), రిద్ధి కుమార్ (Riddhi Kumar) హీరోయిన్లుగా చేస్తున్నారు. బుధవారం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీమ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. స్పెషల్ వీడియోతో మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ప్రభాస్ సింహాసనం మీద నోటిలో సిగార్‌తో రాజు లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ లుక్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌కు గణనీయ సంఖ్యలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కొందరు మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
https://twitter.com/rajasaabmovie/status/1849400931978240114
అదేం పోస్టర్ అంటూ ట్రోల్స్!
రాజాసాబ్ తాజా పోస్టర్ చూసి తాము తీవ్రంగా డిజప్పాయింట్ అయినట్లు కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ నోట్లో సిగర్ పెట్టుకొని ఉన్న పోస్టర్‌ను ‘సై’ సినిమాలోని బిక్షు యాదవ్‌తో పోలుస్తున్నారు. బర్త్‌డే రోజున ఇలాంటి పోస్టర్ రిలీజ్ చేసి రాజాసాబ్ టీమే ప్రభాస్‌ను ట్రోల్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘నాగవల్లి’ సినిమాలో వెంకటేష్ లుక్‌కు కాంపిటీషన్ ఇచ్చేలా ప్రభాస్ పోస్టర్ ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మోషన్ వీడియోలో వీఎఫ్‌ఎక్స్ వర్క్ చాలా పూర్‌గా ఉందని, సడెన్‌గా చూసి ఫ్యాన్ మేడ్ అనుకున్నానని ఓ వ్యక్తి పోస్టు పెట్టాడు. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న ప్రభాస్‌ను ఇలా ఒక్క పోస్టర్ గురించి ట్రోల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రభాస్‌ను టార్గెట్ చేస్తున్న వారికి డార్లింగ్ ఫ్యాన్స్ దీటుగా సమాధానం ఇస్తున్నారు. ప్రభాస్ సక్సెస్‌ను తట్టుకోలేకనే ఇలా ట్రోల్స్ చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు.
https://twitter.com/apashyam_kiriki/status/1849072391244091807
https://twitter.com/globalstar_ntr/status/1849035870319362545
https://twitter.com/RavirockzNTR/status/1849018605377348020
https://twitter.com/Niteesh__09/status/1849012939560264070
పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో జోరు
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘రాజా సాబ్’ (Raja Saab)తో పాటు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లోనూ ప్రభాస్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్ వచ్చింది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు.
250 రోజులపాటు ట్రెండింగ్
మరోవైపు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన 'సలార్' చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చి అదరగొట్టింది. ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకొని హాట్‌స్టార్ ఓ ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది. 250 రోజుల పాటు వరుసగా ఈ సినిమా ట్రెండింగ్‌లో నిలిచినట్లు పేర్కొంది. దీంతో ప్రభాస్ దూకుడు ఓటీటీలోనూ కొనసాగుతోందంటూ ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సలార్‌ను హై వోల్టేజ్ చిత్రంగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమాను నింపేశారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా చేసింది.
https://twitter.com/DisneyPlusHS/status/1849068031244402840
అక్టోబర్ 24 , 2024
The Raja Saab: ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి రొమాంటిక్ ఫొటో లీక్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). ఈ సినిమా అప్‌డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ‘రాజా సాబ్’ సినిమా నుంచి ఓ రొమాంటిక్ ఫొటో నెట్టింట ప్రత్యక్షమయ్యింది. హీరోయిన్‌తో కలిసి క్రేజీ ఫోజులో ఉన్న ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
లేటెస్ట్ అప్‌డేట్ అదుర్స్
ప్రభాస్ బర్త్‌డేను పురస్కరించుకొని అక్టోబర్ 23న గ్రాండ్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు రాజా సాబ్ మేకర్స్ తాజాగా ప్రకటించారు. రాయల్ ట్రీట్ (టీజర్/ట్రైలర్ రిలీజ్) ఇవ్వనున్నట్టు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో గళ్ల చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ ప్రభాస్ కనిపించాడు. ఇది చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ లుక్ వింటేజ్ ప్రభాస్‌ను గుర్తుచేస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల రాజాసాబ్ నిర్మాత మాట్లాడుతూ ప్రభాస్ పుట్టిన రోజు నుంచి వరుస అప్‌డేట్స్ ఉంటాయని స్పష్టం చేశారు. అక్టోబర్ 23 నుంచి సినిమా విడుదల వరకూ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. కాగా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న 'రాజా సాబ్' రిలీజ్ కానుంది.
రాజా సాబ్ ఫొటో లీక్!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ‘రాజా సాబ్’ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రిలీజ్ కానున్న చిత్రం కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రభాస్‌ను చాలా హ్యాండ్సమ్‌గా చూపిస్తుండటంతో ఈ హైప్ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ లొకేషన్ నుంచి ఓ పిక్ లీకయ్యింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రభాస్ లాంగ్ హెయిర్‌తో ఫుల్ హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. గడ్డంతో ముఖంపై బొట్టుతో ఆకట్టుకుంటున్నాడు. అతడితో పోటు హీరోయిన్ రిద్ది కుమార్ లీకైన ఫొటోలో కనిపించారు. సాంగ్ షూటింగ్ సందర్భంగా మానిటర్ నుంచి ఈ ఫొటోను క్యాప్చర్ చేసినట్లు కనిపిస్తోంది.
https://twitter.com/Baahubali230/status/1848209164553814057
రీ-రిలీజ్‌ల సందడి
మరోవైపు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ పుట్టిన రోజు హంగామా మెుదలైంది. సలార్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని ఇటీవలే రీరిలీజ్ చేసి స్పెషల్ షోస్ సైతం వేశారు. సలార్‌తో పాటు ‘ఈశ్వర్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘మిర్చి’, ‘రెబల్’ చిత్రాలను బర్త్‌డే కానుకగా రీరిలీజ్ చేస్తున్నారు.
భారీ ధరకు మ్యూజిక్ రైట్స్
రాజా సాబ్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ T-సిరీస్ రాజాసాబ్ ఆడియో హక్కులను రూ.25 కోట్లకు కొనుగోలు చేసినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. త్వరలోనే ఒక్కొక్కటిగా ఈ సినిమాలోని సాంగ్స్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
వరుస సినిమాలతో ప్రభాస్ జోరు!
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘రాజా సాబ్’ (Raja Saab)తో పాటు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లోనూ ప్రభాస్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్ వచ్చింది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు.
అక్టోబర్ 21 , 2024
Mufasa Telugu Trailer: సింహం నోట మహేష్ పంచ్ డైలాగ్స్.. డబ్బింగ్ ఇరగదీశాడు భయ్యా!
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) ఒకటి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు మహేశ్‌బాబు (Mahesh babu) డబ్బింగ్ చెప్పి అదరగొట్టాడు. సింహానికి మహేష్ సూపర్బ్‌గా డబ్బింగ్ చెప్పారంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉంది? అందులో మహేష్ చెప్పిన డైలాగ్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.
మహేష్ వాయిసే హైలేట్
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) తెలుగు ట్రైలర్‌ను నిర్మాణ సంస్థ డిస్నీ సోమవారం (ఆగస్టు 26) విడుదల చేసింది. నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. పుట్టుకతోనే అన్నదమ్ములు కాకపోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువబడిన టాకాల కథ ఇది అంటూ కథలోకి వెళ్లారు. ఆ తర్వాత బాల్యంలో ముఫాసా, టాకాల మధ్య అనుబంధాన్ని, స్నేహాన్ని చూపించారు. ‘అప్పుడప్పుడు ఈ చల్లని గాలి, నా ఇంటి నుంచి జ్ఞాపకాల్ని గుర్తుచేస్తున్నట్లు అనిపిస్తుంది’ అంటూ మహేష్‌బాబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ‘మనం ఒక్కటిగా పోరాడాలి, నేను ఉండగా నీకు ఏం కాదు టాకా, భయపడకు’ అంటూ మహేష్ బాబు చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ‘ఇందాకా ఏదో అన్నావే’ అంటూ చివరలో తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు మహేష్. ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మహేష్ వాయిస్ కోసమైనా సినిమాను థియేటర్లలో చూస్తామంటూ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/urstrulyMahesh/status/1827943721280631129
‘ఇది నాకెంతో ప్రత్యేకం’
ముఫాసా తెలుగు ట్రైలర్‌ను మహేష్ తన ఎక్స్ ఖాతాలో స్వయంగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో ముఫాసాకు వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్‌కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. అంతకుముందు కూడా డబ్బింగ్ చెప్పడంపై మహేష్ మాట్లాడారు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తాను. డిసెంబర్ 20న ముఫాసాను నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు.
తెలుగులో మహేష్.. హిందీలో షారుక్
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్ ట్రైలర్ సైతం ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abram) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్ ఖాన్, సింబా పాత్రకు షారుక్ పెద్ద తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) వాయిస్ ఇవ్వడం విశేషం. ఈ సినిమా గురించి షారుక్ మాట్లాడుతూ ‘ముఫాసాకు అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజుగా నిలుస్తాడు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. బాల్యం నుంచి రాజుగా ఎదగడం వరకూ ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. 2019లో వచ్చిన ది లయన్ కింగ్ తర్వాత మరోసారి ఈ పాత్ర కోసం వర్క్ చేయడం ప్రత్యేకంగా ఉంది. మరీ ముఖ్యంగా నా పిల్లలతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=oelsxH0orHI
మహేష్‌కు డబ్బింగ్ కొత్త కాదు.. కానీ!
ముఫాస పాత్రకు డబ్బింగ్ చెప్పడం మహేష్ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్ కల్యాణ్ నటించిన 'జల్సా', తారక్ హీరోగా చేసిన 'బాద్‌షా' చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో మహేష్ వాయిస్ ఇచ్చారు. అయితే మహేష్ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్ ఆకట్టుకుంటారో చూడాలి.
'SSMB29'తో బిజీ బిజీ
దర్శక ధీరుడు రాజమౌళితో ఓ అడ్వెంచరస్ యాక్షన్ మూవీని మహేష్ చేయబోతున్నాడు. ఇందులో మహేష్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇందుకోసం లాంగ్ హెయిర్, గడ్డంతో మహేష్ మేకోవర్ అవుతున్నాడు. త్వరలోనే మహేష్‌బాబు, రాజమౌళి మూవీ ఆఫీషియల్‌గా లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నట్లు సమాచారం.
ఆగస్టు 26 , 2024
RRR సినిమాకు ఆస్కార్ రావడంపై బాలీవుడ్ అక్కసు… మేకప్ ఆర్టిస్ట్ వ్యాఖ్యలు దుమారం
భారతీయ చిత్రాలు RRR, ది ఎలిఫెంట్ విస్పరర్ సినిమాలకు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. దేశం మెుత్తం గర్వించింది. ఇలాంటి సమయంలో ఆస్కార్‌ను కూడా కొన్నారంటూ ఓ మేకప్ ఆర్టిస్ట్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మేకప్ చేసే షాన్ ముట్టాత్తిల్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో నెటిజన్లు అతడిపై విరుచుకుపడుతున్నారు.
తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాటకు ఆస్కార్ ఇవ్వటం పట్ల అక్కసు వెళ్లగక్కడా షాన్.
నాటునాటుకు ఆస్కార్ ఇవ్వటం చాలా హాస్యాస్పదం. భారత్‌లో అవార్డులు కొంటారని అనుకున్నా. కానీ, ఇప్పుడు ఏకంగా ఆస్కార్స్. మనదగ్గర డబ్బుంటే ఏదైనా వస్తుంది. ఆస్కార్‌తో సహా” అన్నాడు.
View this post on Instagram A post shared by viral.fta (@viral.fta)
షాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. నీ మాటల్లో ఈర్ష్య స్పష్టంగా కనిపిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు సినిమాకు ఆస్కార్ రావటం బాలీవుడ్‌లో చాలామందికి నచ్చలేదనే వాదన లేకపోలేదు. ఎందుకంటే, బాహుబలి నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు టాలీవుడ్ సినిమాలు అక్కడ ఏలుతున్నాయి.
నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాలీవుడ్‌లో రూ. 100 కోట్ల వసూళ్లు సాధించడం ఇందుకు నిదర్శనం. ఈ కారణంగానే కొంతమంది నాటునాటుకి ఆస్కార్ రావటాన్ని ఓర్వలేక పోతున్నారని వినికిడి.
నాటునాటుకి ఆస్కార్ రావటం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. కానీ, బాలీవుడ్ నుంచి పెద్దగా స్పందన రాలేదు.
ఈ క్రమంలో మేకప్ ఆర్టిస్ట్ షాన్ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని పెంచాయి. దీంతో ట్రోలర్స్ చేతికి పనిదొరికనట్లయ్యింది.
మార్చి 15 , 2023