• TFIDB EN
 • ది కేరళ స్టోరీ (2023)
  ATelugu
  స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌

  కేరళలోని ఓ నర్సింగ్ కాలేజీలో హిందువైన షాలిని ఉన్నికృష్ణన్‌ (అదాశర్మ) చేరుతుంది. అక్కడ గీతాంజలి (సిద్ధి ఇద్నానీ), నిమా (యోగితా భిహాని), ఆసిఫా (సోనియా బలానీ)లతో కలిసి హాస్టల్‌లో రూమ్ షేర్ చేసుకుంటుంది. అయితే అసీఫా ఐసీస్ (ISIS)లో అండర్ కవర్‌గా పనిచేస్తుంటుంది. అమ్మాయిలను బ్రెయిన్‌ వాష్‌ చేసి ఇస్లాం మతంలోకి మారుస్తుంటుంది. ఆమె పన్నిన ఉచ్చులో షాలిని చిక్కుకొని ఎలాంటి కష్టాలు అనుభవించింది అన్నది కథ.

  ఇంగ్లీష్‌లో చదవండి
  రివ్యూస్
  How was the movie?

  తారాగణం
  అదా శర్మషాలినీ ఉన్నికృష్ణన్ / ఫాతిమా బా
  దేవదర్శినిషాలిని తల్లి
  విజయ్ కృష్ణఇషాక్
  ప్రణయ్ పచౌరిరమీజ్
  సిబ్బంది
  సుదీప్తో సేన్దర్శకుడు
  వీరేష్ శ్రీవాల్ససంగీతకారుడు
  ప్రశాంతను మహాపాత్రసినిమాటోగ్రాఫర్
  సంజయ్ శర్మఎడిటర్ర్
  కథనాలు
  The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
  The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
  'ది కేరళ స్టోరీ ' చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపుతోంది. మే 5న ఈ సినిమా విడుదల కానుండగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయోద్దంటూ కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్‌, సీపీఐ, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ విద్వేషపూరితంగా చిత్రీకరించారని, సినిమా విడుదల చేస్తే మత సామరస్యం దెబ్బతింటుందని పలువురు ఏకంగా సుప్రీకోర్టునే ఆశ్రయించారు. ఈ స్థాయిలో వివాదం రాజుకోడానికి కారణమేంటి? ఈ చిత్రంపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? కేరళ కంటే తమిళనాడు ఎందుకు ఎక్కువగా ఆందోళన చెందుతోంది? అసలు ఈ సినిమా సెన్సార్‌ క్లియర్‌ చేసుకుందా? వంటి ప్రశ్నలకు ఈ ప్రత్యేక కథనంలో సమాధానం చూద్దాం. వివాదానికి బీజం: సుదీప్తోసేన్‌ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్‌ అమృత్‌లాల్‌ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరతారు. ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఏప్రిల్‌ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది.  కేరళ సీఎం ఆగ్రహం 'ది కేరళ స్టోరీ' ట్రైలర్‌.. కేరళ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం స్పందించారు. ‘రాష్ట్రంలో మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుంది. ‘లవ్‌ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినా.. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయని.. వారి రాజకీయాలు ఇక్కడ సాగవని పరోక్షంగా భాజపా, RSSలకు చురకలు అంటించారు.  సినిమాను బ్యాన్‌ చేయాలి ‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలను కేరళ అధికార పార్టీతోపాటు విపక్ష కాంగ్రెస్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడింది. రాష్ట్రంలో చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్‌, డీవైఎఫ్‌ఐ, ఐయూఎంఎల్‌ వంటి యువజన సంఘాలు డిమాండ్‌ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కేరళను అవమానించే రీతిలో ఈ చిత్రం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీడీ సతీశన్‌ పేర్కొన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఓ వర్గం యత్నిస్తోందని ఐయూఎంఎల్ జాతీయ కార్యదర్శి పీకే ఫిరోజ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్విట్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు.  తమిళనాడు అలెర్ట్‌ ది కేరళ స్టోరి రిలీజ్‌ డేట్‌ సమీపిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్‌ బృందాలు అలెర్ట్‌ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ‘కేరళ స్టోరీ’ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి నిఘా వర్గాలు సూచించాయి. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు  ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అన్ని థియేటర్లలో పొన్నియన్‌ సెల్వన్‌-2 నడుస్తున్నట్లు చెప్పాయి. ధియేటర్‌ యాజమానులు ‘ది కేరళ స్టోరీ’ని ఇప్పట్లో రిలీజ్‌ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి. సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరాలు ‘ది కేరళ స్టోరీ’ ఇటీవలె సెన్సార్‌ పూర్తి చేసుకుంది. వివాదస్పదంగా మారిన ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ‘A సర్టిఫికేట్’ ఇచ్చింది. అంతేగాక సినిమాలోని వివిధ సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దేవుళ్లకు సంబంధించిన డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది. మరికొన్ని పదాలను సవరించాలని కోరింది. మొత్తం 10 సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. వాటిని డిలీట్ చేయాలని చెప్పింది. పలు సవరణలతో మే 5న చిత్ర విజయానికి అనుమతించింది.  సుప్రీంకోర్టు స్పందన ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన అభ్యర్థనను ధర్మాసనం నిరాకరించింది. ‘ది కేరళ స్టోరీ’లో విద్వేషపూరితమైన ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయని దాఖలైన పిటీషన్‌పై కోర్టు స్పందించింది. ‘ఈ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందింది. మీరు దీని విడుదలను సవాల్‌ చేయాలనుకుంటే ఆ సర్టిఫికెట్‌తో తగిన ఫోరంను సంప్రదించండి’ అని సుప్రీంకోర్టు పిటిషనర్లకు సూచించింది. 
  మే 03 , 2023
  HBD ADAH SHARMA: ఆదాశర్మను మీరు ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. టాప్‌-10 రేర్‌ పిక్స్ వైరల్‌
  HBD ADAH SHARMA: ఆదాశర్మను మీరు ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. టాప్‌-10 రేర్‌ పిక్స్ వైరల్‌
  ఇప్పుడు హీరోయిన్ ఆదాశర్మ పేరు దేశమంతా మార్మోగుతోంది. ది కేరళ స్టోరీలో ఆమె నటనకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక సినీ కెరీర్ ముగుస్తుందనుకున్న తరుణంలో ది కేరళ స్టోరీ హిట్‌తో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. నేడు హీరోయిన్ ఆదాశర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆదాశర్మ రేర్ పిక్స్‌తో పాటు ఆమె గురించి ప్రత్యేక విషయాలు మీకోసం.. ప్రముఖ నటి ఆదాశర్మ.. ముంబయిలోని నేవీ కుటుంబంలో జన్మించింది. చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. పదో తరగతి పూర్తి చేసిన వెంటనే సినీ రంగ ప్రవేశం కోసం ఆదాశర్మ యత్నించింది. అయితే మరీ యంగ్‌గా ఉండటంతో పలు ఆడిషన్లలో ఆమెను రిజెక్ట్ చేశారు. 2008లో వచ్చిన ‘1920’ అనే హారర్ చిత్రంతో ఆమె సినిమాల్లోకి ‌అడుగుపెట్టారు.  ‘1920’ తర్వాత మరో రెండు సినిమాల్లో నటించిన ఆదాశర్మ.. హార్ట్‌ ఎటాక్‌ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. హయాతి పాత్రలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.  ‘హార్ట్‌ ఎటాక్‌’ ఫ్లాప్‌ అయినా ఆదాశర్మకు మాత్రం ‌అవకాశాలు క్యూ కట్టాయి. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం ఇలా వరుస అవకాశాలు దక్కించుకుంది. కానీ అవేవీ ఆమెకు కలిసి రాలేదు.  తెలుగులో ఆదాశర్మ చేసిన చివరి సినిమా ‘కల్కి’. ఇందులో డాక్టర్ పద్మ అనే పాత్రలో ఈ భామ కనిపించింది. ఈ సినిమా కూడా కలిసిరాకపోవడంతో తెలుగులో అవకాశాలు మరింత సన్నగిల్లాయి. అటు బాలీవుడ్‌లోనూ ఛాన్సెస్‌ రాకపోవడంతో ఆమె వెబ్‌సిరీస్‌లపై ఫోకస్‌ పెట్టింది. ‘పతి పత్ని ఔర్ పంగా’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. శివాని భట్నాగర్ అనే పాత్రలో మెప్పించింది.  హిందీలో ‘చుహాబిల్లి’ అనే థ్రిల్లర్‌ షార్ట్ ఫిల్మ్‌లో కూడా ఆదాశర్మ నటించింది. అలాగే ‘పియా రే పియా’ అనే ఒక మ్యూజిక్ వీడియోలోనూ కనిపించి సందడి చేసింది.  ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ అనే సినిమాలోనూ ఆదాశర్మ కీలక పాత్ర పోషించింది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  ది కేరళ స్టోరీ సినిమాకు భాజపా పాలిత రాష్ట్రాలు రాయితీలు ప్రకటిస్తుంటే.. మరికొన్ని స్టేట్స్‌ మాత్రం షరతులు విధిస్తున్నాయి.  ఇక సోషల్‌ మీడియాలోనూ ఆదాశర్మ ఎంతో చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ అలరిస్తోంది. ఆదాశర్మ ఇన్‌స్టా ఖాతాను 7.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.  https://telugu.yousay.tv/the-kerala-story-review-in-telugu-adah-sharmas-performance-brought-tears-reminds-me-of-another-kashmir-files.html
  మే 11 , 2023
  <strong>Mansi Taxak: యానిమల్‌లో బాబీ డియోల్ భార్యగా నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?</strong>
  Mansi Taxak: యానిమల్‌లో బాబీ డియోల్ భార్యగా నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
  యానిమల్ సినిమాలో బాబీ డియోల్ మూడో భార్యగా నటించిన మాన్సి టాక్సాక్( Mansi Taxak ) ఇప్పుడో సోషల్ మీడియాలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువైనా ప్రేక్షకులపై చాలా ఇంపాక్ట్ కలిగించింది.&nbsp; యానిమల్ సినిమాలో కొత్త పెళ్లి కూతురుగా అబ్రంను (బాబీ డియోల్‌) పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత వెంటనే అబ్రం.. అందరూ చూస్తుండగా ఆమెపై బలత్కారం చేసి తన క్రూరత్వాన్ని చూపిస్తాడు. ప్రస్తుతం ఆమె గ్లామర్‌పై సినిమా చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మాన్సి టాక్సక్ గురించి నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు.&nbsp; ఆమె బ్యాక్‌గ్రౌండ్, ఏజ్, బాయ్‌ ఫ్రెండ్ వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. మాన్సి టాక్సక్‌ 1998 జులై 23న ముంబైలో కుల్దీప్ సింగ్ టాక్సాక్, కౌనిక టాక్సాక్ దంపతులకు&nbsp; జన్మించింది. ఆమె విద్యభ్యాసం అంతా గుజరాత్, ముంబైలో జరిగింది. సినిమాల్లోకి రాకముందు మాన్సి టాక్సక్ మోడలింగ్ చేసేది. ఆమె 2019లో&nbsp; 'ఫెమినా మిస్‌ఇండియా' పోటీల్లో పాల్గొని 'మిస్‌ ఇండియా గుజరాత్‌' కిరిటం సాధించింది.&nbsp; ఆ తర్వాత 2022లో ఐ ప్రామిస్‌ అనే షార్ట్ ఫిల్మ్‌ ద్వారా వెండి తెరకు పరిచయమైమంది.&nbsp; ఈ చిత్రం యూట్యూ ఛానెల్‌ క్యూనెట్‌లో రిలీజైంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ బాద్‌షా నటించిన పఠాన్‌ మూవీలో నటించే అవకాశం దక్కింది.&nbsp; ఆ తర్వాత ది కేరళ స్టోరీ,&nbsp; గదర్ 2 సినిమాల్లోనూ కనిపించింది.&nbsp; మాన్సి నటించిన సినిమాలు బ్లాక్‌బాస్టర్ హిట్లు సాధించడం విశేషం. https://twitter.com/TBSTwizzle/status/1733476252290302005 ఇక మాన్సి టాక్సాక్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు 2 లక్షల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడూ గ్లామర్ ఫోటో షూట్ చేస్తూ కనువిందు చేస్తుంటుంది మాన్సి టాక్సాక్ కాలేజీ డేస్‌లో స్టేట్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్. అంతేకాదు జిల్లా స్థాయిలో అనేక బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని గెలిచింది. మాన్సి టాక్సాక్‌కు భరత నాట్యం, బెల్లీ డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. మాన్సికి సామాజిక స్పృహా కూడా ఎక్కువే.&nbsp; దిలే సే ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతుంటుంది. అంతేకాదు ఈ కుర్ర హీరోయిన్‌కు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్పానీష్ భాషలో మంచి ప్రావీణ్యం ఉంది. యానిమల్ సినిమాలో ఈ అమ్మడి గ్లామర్‌కు ఫిదా అయిన బాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చేందుకు క్యూ కట్టారంట. మరోవైపు యానిమల్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియా వైడ్‌గా రూ.438 కోట్ల వసూళ్లను రాబట్టింది. &nbsp;ఇప్పటివరకు బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి అగ్రహీరోల సినిమాలు మాత్రమే రూ.500 కోట్లు రాబట్టాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో రణ్‌బీర్ కపూర్ సినిమా యానిమల్ యాడ్ అయింది.
  డిసెంబర్ 11 , 2023
  Controversial Movies: విడుదలకు ముందే విమర్శలు.. సినిమాలు మాత్రం సూపర్ హిట్లు..!&nbsp;
  Controversial Movies: విడుదలకు ముందే విమర్శలు.. సినిమాలు మాత్రం సూపర్ హిట్లు..!&nbsp;
  సినిమాలను అమితంగా ఇష్టపడే దేశంలో భారత్‌ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ ఏటా వందల చిత్రాలు రిలీజవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. ప్రతీ మనిషి జీవితంలో సినిమాలు ఓ భాగం కావడంతో అవి సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు విడుదలకు ముందే వివాదస్పదంగా మారుతున్నాయి. ఆ చిత్రాలను బ్యాన్‌ చేయాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలే పుట్టుకొచ్చాయి. భారత్‌లో తీవ్ర వివాదానికి కారణమైన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; ది కేరళ స్టోరీ భారత్‌లో విడుదలకు ముందే తీవ్ర విమర్శలను మూటగట్టుకున్న సినిమా ‘కేరళ స్టోరీ’. కేరళలో గత కొన్నేళ్లలో అదృశ్యమైన 32 వేల మంది మహిళలు ఎక్కడనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. నలుగురు యువతులు మతం మారి, అనంతరం ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ నడుస్తుంది. తప్పిపోయిన అమ్మాయిలు ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది. దీనిపై కేరళ సీఎం సహా, ప్రతిపక్ష కాంగ్రెస్‌, ముస్లిం సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. సమాజంలో అల్లర్లు సృష్టించేలా ఈ సినిమా ఉందంటూ ఆరోపించాయి. వీటన్నింటిని దాటుకొని రిలీజైన ‘ది కేరళ స్టోరీ’ పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఆదా శర్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి. Image Credit: wikipedia/commons ఫర్హానా నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వంలో హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ నటించిన 'ఫర్హానా' సినిమాపై కూడా వివాదం చెలరేగింది. ముస్లింల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై కొన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాలో ముస్లిం మహిళలను, హిజాబ్‌ను అవమానించేలా డైలాగ్‌లు ఉన్నాయని కొన్ని ఇస్లామిక్ సంస్థలు ఆరోపించాయి. వివాదం మరింత ముదురుతుండటంతో మేకర్స్‌ స్పందించారు. ఈ సినిమా ఏ మతం సెంటిమెంట్‌లకు వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మే 12న రిలీజైన ఫర్హానా చిత్రం హిట్‌ టాక్ తెచ్చుకుంది.&nbsp; Image Credit: wikipedia/commons ది కాశ్మీర్‌ ఫైల్స్‌ 2022లో వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం అప్పట్లో తీవ్ర దుమారానికి కారణమైంది. కశ్మీరీ పండిట్లను మిలిటెంట్లు ఏ విధంగా హింసించి చంపారో అన్న అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా రాజకీయరంగు పులుముకోవడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భాజపా పాలిత రాష్ట్రాలు ఈ ప్రదర్శనలకు పన్ను రాయితీలు సైతం ఇచ్చాయి. అయితే, ది కాశ్మీర్‌ ఫైల్స్‌లో వాస్తవాలను వక్రీకరించి చూపించారంటూ కాంగ్రెస్‌ మండిపడింది.&nbsp; Image Credit: wikipedia/commons పఠాన్‌ బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ రీసెంట్‌ మూవీ ‘పఠాన్‌’ పైనా విడుదలకు ముందు వివాదం చెలరేగింది. చిత్రంలోని ‘బేషరమ్‌ రంగ్‌’ పాటలో దీపికా ధరించిన కాషాయ రంగు బికినీ వివాదానికి కారణమైంది. కాషాయ రంగు బికినిపై హిందూ - ముస్లిం సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా సైతం దీపిక వస్త్రధారణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్‌, వీర్ శివాజీ గ్రూప్‌లు సైతం అసంతృప్తి వ్యక్తం చేశాయి.&nbsp; Image Credit: wikipedia/commons అర్జున్‌ రెడ్డి విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్‌ రెడ్డి సినిమాపై కూడా అప్పట్లో చాలా విమర్శలే వచ్చాయి. ఈ మూవీలో అభ్యంతరకర సీన్లు ఎక్కువగా ఉన్నాయంటూ పలువురు ప్రజా సంఘ నేతలు సినిమా పోస్టర్లను చించేశారు. ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. యాంకర్‌ అనసూయ సైతం సినిమాలోని అభ్యంతరకర డైలాగ్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ వివాదాలను దాటుకొని అర్జున్‌ రెడ్డి సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. విజయ్‌ దేవరకొండను స్టార్‌ హీరోగా నిలబెట్టింది.&nbsp; Image Credit: wikipedia/commons పీకే బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ నటించిన 'పీకే' సినిమాపై కూడా 2014లో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని పలు హిందూ సంస్థలు ధ్వజమెత్తాయి. సినిమాపై నిషేధం విధించడంతోపాటు చిత్రంతో సంబంధం ఉన్న వారందరినీ సమాజం నుంచి వెలివేయాలని యోగా గురు బాబా రాందేవ్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ముస్లిం సంఘాలు సైతం పీకే సినిమాను తప్పుబట్టాయి. అప్పట్లో ఈ వివాదంపై స్పందించిన అమీర్‌ఖాన్‌ అన్ని మతాలను తాము గౌరవిస్తామన్నారు. అయితే రిలీజ్‌ అనంతరం పీకే సూపర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; Image Credit: wikipedia/commons ద ఢిల్లీ ఫైల్స్ కశ్మీర్ ఫైల్స్ చిత్రం తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ‘ద ఢిల్లీ ఫైల్స్’ సినిమాపై వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాపై కూడా చర్చ జరుగుతోంది. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ ఈ డైరెక్టర్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన నోటీసులు పంపించారు. ఈ విధంగా ‘ద ఢిల్లీ ఫైల్స్’ చిత్రీకరణకు ముందే హాట్ టాపిక్‌గా మారింది.
  మే 19 , 2023
  The Kerala Story Review In Telugu : ఆదా శర్మ నటన కన్నీళ్లు పెట్టించింది! మరో కాశ్మీర్ ఫైల్స్‌ను గుర్తు చేసింది!&nbsp;
  The Kerala Story Review In Telugu : ఆదా శర్మ నటన కన్నీళ్లు పెట్టించింది! మరో కాశ్మీర్ ఫైల్స్‌ను గుర్తు చేసింది!&nbsp;
  నటినటులు: ఆదా శర్మ, సిద్ధి ఇద్నాని, యోగిత బిహాని, సోనియా బలాని, ప్రణయ్‌ పచౌరి, ప్రణవ్‌ మిశ్రా, విజయ్‌ కృష్ణ దర్శకత్వం: సుదీప్తోసేన్ సంగీతం: వీరేష్‌ శ్రీవాల్స నిర్మాణ సంస్థ: సన్‌షైన్‌ పిక్చర్స్‌ ‘ది కేరళ స్టోరీ‘ చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపింది. తప్పిపోయిన కేరళ అమ్మాయిల ఇతివృత్తంతో దీన్ని తెరకెక్కించగా.. ఈ సినిమాను రిలీజ్‌ చేయోద్దంటూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఈ సినిమాను రూపొందించారని కేరళ సీఎం పినరయి విజయన్‌ సైతం మండిపడ్డారు. ఇలాంటి సినిమాను విడుదల చేయోద్ధంటూ కాంగ్రెస్‌, వామపక్షాలు, ముస్లిం సంఘాలు సైతం తీవ్రస్థాయిలో డిమాండ్‌ చేశాయి. వీటన్నింటినీ దాటుకొని ఎట్టకేళకు ఇవాళ ‘ది కేరళ స్టోరీ’ చిత్రం రిలీజ్‌ అయింది. మరీ సినిమా ఎలా ఉంది?. అందరూ అనుమానించినట్లు ఇందులో వివాదస్పద కంటెంట్‌ ఉందా? ది కేరళ స్టోరీ హిట్‌ కొట్టినట్లేనా? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి: షాలిని ఉన్ని క్రిష్ణన్‌ (ఆదాశర్మ) నర్స్‌ అవ్వాలన్న కోరికతో నర్సింగ్‌ కాలేజీలో చేరుతుంది. అక్కడి హాస్టల్‌ గదిలో గీతాంజలి (సిద్ది ఇద్నాని), నిమాహ్ (యోగితా బిహానీ), ఆసిఫా( సోనియా బలానీ) రూమ్‌మేట్స్‌గా ఉంటారు. ఆసిఫా తన రూమ్‌మేట్స్‌ అందర్ని ఇస్లాంలోకి మార్చాలని ఓ సీక్రెట్‌ ఎజెండాను కలిగి ఉంటుంది. కొందరు బయటి వ్యక్తుల సాయంతో వారు ఇస్లాం మతంలోకి మారేలా&nbsp; చేస్తోంది. ఈ నేపథ్యంలో షాలిని తన పేరును ఫాతిమాకు మార్చుకుంటుంది. ఆ తర్వాతి నుంచి ఫాతిమా జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. గర్భవతి అయిన ఫాతిమా సిరియా ఎందుకు వెళ్లింది? అక్కడ&nbsp; ISIS ఉగ్రవాదుల చేతుల్లో ఎలాంటి కష్టాలను అనుభవించింది? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే: ‘ది కేరళ స్టోరీ’ సినిమా అంతా ప్రధానంగా ఆదా శర్మ చుట్టే తిరుగుతుంది. ఆదాశర్మలోని గొప్ప నటిని ఈ సినిమా పరిచయం చేసిందనే చెప్పాలి. హిందూ మహిళగా, ముస్లిం యువతిగా రెండు వెర్షన్లలో ఆమె చాలా అద్భుతంగా నటించింది. సినిమా భారాన్నంతా మోస్తు తన నటనతో మెప్పించింది. ముఖ్యంగా ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న తర్వాత ఆదాశర్మ తనలోని అత్యుత్తమ నటిని బయటకు తీసుకొస్తుంది. అటు సిద్ధి ఇద్నాని, యోగిత బిహాని, సోనియా బలాని తమ నటనతో ఆకట్టుకున్నారు. తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. హాస్టల్‌ గదిలో వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.&nbsp; సాంకేతికంగా: దర్శకుడు సుదీప్తోసేన్ చాలా సున్నితమైన అంశాన్ని ఎంతో ధైర్యంగా తెరపైనా చూపించాడని చెప్పొచ్చు. సినిమాలో వచ్చే మత మార్పిడి సీన్లు చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. ఛాలెంజింగ్‌ సన్నివేశాలను కూడా ఏమాత్రం బెరుకు లేకుండా డైరెక్టర్‌ తెరకెక్కించాడు. ఈ క్రమంలో కొన్ని డైలాగులు, సీన్లు మరీ ఇబ్బంది కరంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఐసిస్‌ బానిస శిబిరాల్లో మహిళలపై జరిగే దారుణాలు, ‌అఘాయిత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టవచ్చు. ప్రధానంగా ఈ సినిమాను వినోదాత్మకంగా కాకుండా మత మార్పిడుల కోణంలో తీసినట్లు అనిపిస్తుంది. ఇకపోతే వీరేష్‌ శ్రీవాల్స అందించిన నేపథ్యం సంగీతం సినిమాకు బలం. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ఆదాశర్మ నటనడైరక్షన్‌ స్కిల్స్నేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ హింసాత్మక సన్నివేశాలుబోల్డ్‌ సీన్స్‌ రేటింగ్‌: 3/5
  మే 05 , 2023
  <strong>This Week Movies: ఈ వారం వస్తోన్న మోస్ట్ వాంటెడ్‌ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి!</strong>
  This Week Movies: ఈ వారం వస్తోన్న మోస్ట్ వాంటెడ్‌ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి!
  ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు (Tollywood Upcoming Movies), వెబ్‌సిరీస్‌లు (Upcoming Web Serieses) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈసారి చిన్న సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. ఫిబ్రవరి 12 - 18 తేదీల మధ్య అవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు భ్రమయుగం మలయాళం సూపర్ స్టార్‌ మమ్ముట్టి ఈ వారం ‘భ్రమయుగం’ (Bramayugam) సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. హారర్‌ థ్రిల్లర్‌గా&nbsp; రూపొందిన ఈ చిత్రానికి రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌, పోస్టర్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు, తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజధాని ఫైల్స్‌ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై మరో మూవీ వస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అంశంపై రూపొందిన ‘రాజధాని ఫైల్స్’ (Rajdhani Files) ఈ వారం థియేటర్లలోకి రాబోతుంది. అఖిలన్‌, వీణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది.&nbsp; ఊరు పేరు భైరవకోన సందీప్‌కిషన్‌ (Sundeep Kishan) కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). థ్రిల్లర్‌, సోషియో ఫాంటసీ కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ‘గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే భైరవకోన’ అంటూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. సైరెన్‌ జయం రవి (Jayam Ravi), కీర్తి సురేష్‌ (Keerthi Suresh) కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎమోషనల్‌ డ్రామా చిత్రం ‘సైరెన్‌’ (Siren Movie). ‘108’ అనేది ఉపశీర్షిక. ఆంటోనీ భాగ్యరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేసి క్రిమినల్‌గా మారిన ఓ వ్యక్తి కథ’ ఈ చిత్రం. కీర్తి ఇందులో పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నాసామి రంగ ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) ఒకటి. థియేటర్లలో మంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా.. ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా చేసింది. అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ ప్రధాన పాత్రలు పోషించారు.&nbsp; ది కేరళ స్టోరీ గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మూవీ ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. 9 నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా.. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న ఆసక్తి నెలకొంది. TitleCategoryLanguagePlatformRelease DateSunderland 'Till I Die 3SeriesEnglishNetflixFeb 13Love Is Blind&nbsp;SeriesEnglishNetflixFeb 13PlayersMovieEnglishNetflixFeb 14Einstein and the BombMovieEnglishNetflixFeb 16Five Blind Dates&nbsp;SeriesEnglishAmazon PrimeFeb 13This is me.. NowMovieEnglishAmazon PrimeFeb 16Queen ElizabethMovieMalayalamZee5Feb 14The Kerala StoryMovieHindiZee5Feb 16TrackerSeriesEnglishDisney+HotStarFeb 12Saba NayaganMovie&nbsp;TamilDisney+HotStarFeb 14Abraham OzlerMovieMalayalamDisney+HotStarFeb 15SlaarMovieHindi&nbsp;Disney+HotStarFeb 16Raisinghani v/s RaisinghaniSeries&nbsp;Hindi&nbsp;Sony LIVFeb 12Vera Maari Love StoryMovieTamilAhaFeb 14
  ఫిబ్రవరి 12 , 2024
  This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
  This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
  అసలు సిసైలన వేసవి నెల ప్రారంభమైంది. ఈ సమయంలో థియేటర్లకు రప్పించి ప్రేక్షకులను చల్లబర్చేందుకు కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ వారం(మే 5) బాక్సాఫీసు వద్ద పలు సినిమాలు సందడి చేయబోతున్నాయి. మరోవైపు, ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటి వివరాలు చూద్దాం.&nbsp; రామబాణం హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్యం తరువాత గోపీచంద్, జగపతిబాబు, శ్రీవాస్ కాంబోలో వస్తోందీ సినిమా. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. డింపుల్ హయతీ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఖుష్బూ ప్రధాన పాత్రలో నటించింది. మే 5న సినిమా విడుదల కానుంది. ఉగ్రం నాంది హిట్ తర్వాత అల్లరి నరేష్ సరికొత్త కెరీర్‌ని పున: ప్రారంభించాడు. ఈ చిత్రానికి డైరెక్షన్ చేసిన విజయ్ కనకమేడలతో మరోసారి జతకట్టి ఈ సారి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మరో హిట్‌కు ప్రయత్నిస్తున్నాడు.ట్రైలర్ ఆసక్తిని పెంచింది. నాంది మాదిరిగానే ఇందులో మరో ప్రధాన సమస్యను డైరెక్టర్ లేవనెత్తే ప్రయత్నం చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఏటా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు చివరికి ఎటువైపు దారితీస్తున్నాయనే ప్రశ్నకు మే 5న ప్రేక్షకులకు జవాబు చెప్పనుంది. షైన్ స్క్రీన్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ది కేరళ స్టోరీ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన సినిమా ఇది. సుదిప్తో సేన్ డైరెక్షన్ వహించిన ఈ మూవీ మే 5న థియేటర్ల ముందుకు రాబోతోంది. ఆదా శర్మ లీడ్ రోల్‌లో నటించింది. కేరళలో మతం మారిన మహిళలు తీవ్రవాద సంస్థల్లో చేరడం, వాటి పూర్వాపరాల గురించి దాగివున్న నిజాలను ఈ సినిమా వెలికితీయనుందని చిత్రబృందం ప్రకటించింది. దీంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ స్టోరీకి ఆధారాలు చూపితే రూ.కోటికి పైగా నజరానా ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. చిత్రబృందం మాత్రం తమ సినిమాను సమర్థించుకుంది. హిందీ భాషలో ఇది తెరకెక్కింది. విరూపాక్ష(మళయాలం) తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న విరూపాక్ష మిగతా భాషల్లోనూ అలరించేందుకు రెడీ అవుతోంది. మే 5న మళయాలం భాషలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, చిత్రబృందం ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. కొచ్చిలో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా వైపు దృష్టిని ఆకర్షిస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైంది.&nbsp; అరంగేట్రం కమర్శియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమే ‘అరంగేట్రం’. శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వం వహించగా మహేశ్వరి నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. ఓ ముగ్గురు యువకులు, ఆరుగురు యువతుల మధ్య జరిగే కథగా ఇది తెరకెక్కింది. జబర్దస్త్ సత్తిపండు, రోషన్, ముస్తఫా, ఆస్కరి, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, శ్రీనివాస్, అనిరుధ్, ఇందు, లయ తదితరులు నటించారు. విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. మే 5న అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.&nbsp;&nbsp;&nbsp; యాద్గిరి అండ్ సన్స్ వాస్తవిక ఘటనల ఆధారంగా ‘యాద్గిరి అండ్ సన్స్’ తెరకెక్కింది. భిక్షపతి రాజు పందిరి దర్శకత్వం వహించాడు. రాజీవ్ కనకాల, మురళీధర్ గౌడ్, అనిరుధ్ తుకుంట్ల, జీవా, యశ్విని నివేదిత తదితరులు నటించారు. మే 5న సినిమా విడుదల కానుంది.&nbsp; OTT విడుదలలు TitleCategoryLanguagePlatformRelease DateClifford the Big Red DogMovieEnglishNetflixMay 2Queen Charlotte a Bridgerton StoryWeb seriesEnglishNetflixMay 2SanctuaryMovieEnglishNetflixMay 4The Larva FamilyAnimated MovieEnglishNetflix&nbsp;May 4MeterMovieTeluguNetflix&nbsp;May 53MovieTeluguNetflixMay 5YogiMovieTeluguNetflixMay 5Rowdy FellowMovieTeluguNetflixMay 5ThammuduMovieTeluguNetflixMay 5AmruthamChandamamaloMovieTeluguNetflixMay 5Match FixingMovieTeluguETV WinMay 5Tu Zuti mai makkarMovieHindiNetflixMay 5FirefliesSeriesHindiZEE 5May 5Shebhash FeludaMovieBengaliZEE5May 5Corona PapersMovieMalayalamDisney HotstarMay 5Sas Bahu aur FlamingoMovieHindiDisney HotstarMay 5
  మే 02 , 2023

  @2021 KTree