UATelugu
గిరి (రాజ్ తరుణ్) చాలా పిరికివాడు. ప్రతి దానికి భయపడుతూ ఉంటాడు. ప్రేయసి శైలజా (మాల్వీ మల్హోత్ర) అలా కాదు. చాలా దూకుడుతో వైలెంట్‌గా ఉంటుంది. టీజ్ చేసిన వారిని ఇరగ దీస్తుంటుంది. శైలజాను కంట్రోల్ చేయలేక గిరి ఎలాంటి తిప్పలు పడ్డాడు? ఎప్పుడూ సౌమ్యంగా ఉండే గిరి ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
రివ్యూస్
YouSay Review
Thiragabadara Saami Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్ – మాల్వీ మల్హోత్ర చిత్రం ఎలా ఉందంటే?
యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరా సామి’ (Thiragabadara Saami Movie Review). ఏ.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించ...read more
How was the movie?
తారాగణం
రాజ్ తరుణ్
మాల్వీ మల్హోత్రా
మన్నారా చోప్రా
మకరంద్ దేశ్‌పాండే
ప్రగతి మహావాది
జాన్ విజయ్
రాజా రవీందర్
తాగుబోతు రమేష్
సిబ్బంది
ఎ.ఎస్. రవి కుమార్ చౌదరిదర్శకుడు
బెక్కెం రవీందర్నిర్మాత
మల్కాపురం శివకుమార్నిర్మాత
జె.బి.సంగీతకారుడు
జవహర్ రెడ్డిసినిమాటోగ్రాఫర్
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
This Week OTT Movies: ‘దేవర’ ఎఫెక్ట్.. థియేటర్లలో ఒకే ఒక్క తెలుగు చిత్రం.. ఓటీటీలో మాత్రం జాతరే!
సెప్టెంబర్ మూడో వారంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ఒకే ఒక్క తెలుగు చిత్రం సిద్ధమైంది. ఈ వారం సుహాస్ సింగిల్‌గా రాబోతున్నాడు. తర్వాతి వారమే 'దేవర' రిలీజ్ ఉండటంతో తమ చిత్రాలు రిలీజ్ చేసేందుకు తెలుగు దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరచలేదు. మరోవైపు రెండు బ్లాక్‌బాస్టర్ చిత్రాలు రీరిలీజ్ వచ్చేస్తున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు/ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
గొర్రె పురాణం
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. కొత్త తరహా కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో సుహాస్ (Suhas) నటించిన మరో వినూత్న చిత్రం ‘గొర్రె పురాణం’ (Gorre Puranam). బాబీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టింది? ఆ గొడవలోకి సుహాస్ ఎలా వచ్చాడు? అనే ఆసక్తికర కథతో సినిమా రూపొందింది. ఈ సినిమాలో గొర్రెకు దర్శకుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.
యుద్ర
సిద్ధాంత్ చతుర్వేది, మాళవిక మోహనన్ కీలక పాత్రల్లో రవి ఉద్యావర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ ‘యుద్ర’ (Yudhra Movie). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 20న హిందీలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఈ మూవీతోనే మాళవి బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఆమె పలు ఇంటిమేట్, ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేశారు.
కహా షురూ.. కహా ఖతం
ధ్వని భానుశాలి, ఆషిమ్ గులాటీ కీలక పాత్రల్లో శౌరబ్ దాస్‌గుప్త దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘కహా షురూ.. కహా ఖతం’ (Kahan Shuru Kahan Khatam). సెప్టెంబరు 20న ఈ మూవీ హిందీలో విడుదలకు సిద్ధమైంది. ‘మిమి’, ‘జర హట్కే జర బచ్కే’ వంటి కథలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ మూవీకి కథను అందించడం విశేషం.
బొమ్మరిల్లు
సిద్ధార్థ్, జెనీలియ జంటగా భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'బొమ్మరిల్లు' (Bommarillu) చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. 2006లో విడుదలైన ఈ చిత్రం పలు అవార్డులు సైతం సొంతం చేసుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలేట్‌గా నిలిచింది. కాగా, ఇప్పుడు ఈ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమవుతోంది. సెప్టెంబరు 21న తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్‌లో ‘బొమ్మరిల్లు’ విడుదల కానుంది.
జర్నీ
తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘జర్నీ’ (Journey Movie). జై, శర్వానంద్, అంజలి అనన్య కీలక పాత్రల్లో నటించారు. భారీ బస్ యాక్సీడెంట్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఇప్పుడు మరోమారు థియేటర్లలో అలరించేందుకు జర్నీ రాబోతోంది. సెప్టెంబరు 21న ‘జర్నీ’ కూడా రీ-రిలీజ్ కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు
తంగలాన్
తమిళ స్టార్ హీరో విక్రమ్ లేటెస్ట్ సినిమా 'తంగలాన్' (Thangalaan). ఆగస్టు 15న తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజైంది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. కాగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 20 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకే రోజు అందుబాటులోకి రానుంది. అయితే ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం మాత్రం ఎంథుసన్ ఓటీటీలో శనివారమే ఈ చిత్రం స్ట్రీమింగ్‌లోకి రావడం గమనార్హం.
తిరగబడరా సామి
రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా హీరోహీరోయిన్లుగా నటించిన ‘తిరగబడరా సామీ’ (Thiragabadara Saami) మూవీ ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 20న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సీనియర్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. స్టోరీ చాలా ఔట్‌డేటెడ్‌గా ఉందంటూ విమర్శలు వచ్చాయి.
హంట్
మలయాళం హారర్ మూవీ ‘హంట్’ (Hunt) థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. జీ5 వేదికగా సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు మలయాళం సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 29న థియేటర్లలో రిలీజైన హంట్ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. భావన యాక్టింగ్ బాగున్నా రొటీన్ స్టోరీ కారణంగా హంట్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్
అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ (The Mystery of Moksha Island). ఈ సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌కు అనిష్ యెహాన్ కురువిల్లా దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవల రిలీజై ఆకట్టుకుంటోంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateGrave TortureMovieEnglishNetflixSept 16Culinary Class WarsSeriesEnglish/KoreanNetflixSept 17Fast XMovieEnglishNetflixSept 18Leave from the other sideTalk ShowEnglishNetflixSept 18Twilight of the GodsSeriesEnglishNetflixSept 19He’s Three DaughtersMovieEnglishNetflixSept 20Evil Dead RiseMovieEnglishNetflixSept 21Saripodhaa SanivaaramMovieTeluguNetflixSept 26A very Royal Scandal SeriesEnglishAmazonSept 19Stree 2MovieHindiAmazonSept 27DurgaMovieHindiJio CinemaSept 16Jo Tera Hai Woh Mera HaiMovieHindiJio CinemaSept 20The PenguinSeriesEnglishJio CinemaSept 29UnPrisonedMovieEnglishHotstarSept 16Agatha All AlongMovieEnglishHotstarSept 17The Judge From HellSeriesEnglishHotstarSept 21
సెప్టెంబర్ 16 , 2024
Thiragabadara Saami Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్ - మాల్వీ మల్హోత్ర చిత్రం ఎలా ఉందంటే?
నటీనటులు : రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్ర, మన్నారా చోప్రా, అంకిత ఠాకూర్, మకరంద్ దేశ్‌పాండే, ప్రగతి, రాజా రవీంద్ర, జాన్ విజయ్, పృథ్వీ, తాగుబోతు రమేష్ తదితరులు
డైరెక్టర్ : ఏ.ఎస్. రవి కుమార్
సంగీతం : జేబీ
సినిమాటోగ్రఫీ : జవహర్ రెడ్డి
నిర్మాత : మాల్కాపురం శివ కుమార్
విడుదల తేదీ : ఆగస్టు 2, 2024
యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరా సామి’ (Thiragabadara Saami Movie Review). ఏ.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra), మన్నారా చోప్రా (Mannara Chopra) హీరోయిన్లుగా చేశారు. మకరంద్ దేశ్‌పాండే, రాజా రవీంద్ర, ప్రగతి ఇతర ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా హీరో హీరోయిన్లుగా చేసిన రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రపై సంచలన ఆరోపణలు వచ్చాయి. రాజ్‌తరుణ్ తనను మోసం చేసి మాల్వీతో రిలేషన్‌లో ఉన్నట్లు అతడి మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే ఆగస్టు 2న ‘తిరగబడరా సామి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గిరి (రాజ్ తరుణ్) చాలా పిరికివాడు. ప్రతి దానికి భయపడుతూ చుట్టూ ఏం జరుగుతున్నా అసలు పట్టించుకోడు. కానీ శైలజా (మాల్వీ మల్హోత్ర) అలా కాదు. చాలా దూకుడుతో వైలెంట్‌గా ఉంటుంది. టీజ్ చేసిన వారిని ఇరగ దీస్తుంటుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. అయితే శైలజాను కంట్రోల్ చేయలేక గిరి ఎలాంటి తిప్పలు పడ్డాడు? వారి ప్రేమకు వచ్చిన సమస్య ఏంటి? ఎప్పుడు సౌమ్యంగా ఉండే గిరి ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? తన ప్రేమను గెలిపించుకునేందుకు అతడు ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
హీరో రాజ్ తరుణ్ గిరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తొలుత అమాయకుడిగా, ఆపై ప్రేయసి కోసం శత్రువులపై తిరగబడే ప్రియుడిగా రెండు డైమన్షన్లలో మంచి నటన కనబరిచాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో రాజ్ దుమ్మురేపాడు. ఈ స్థాయి యాక్షన్ సీన్స్ అతడు ఇప్పటివరకూ చేయలేదు. ఇక శైలజా పాత్రలో హీరోయిన్ మాల్వీ మల్హోత్ర ఒదిగిపోయింది. తెలుగులో ఆమెకు ఇది తొలి సినిమానే అయిన్పప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. స్క్రీన్‌పై రాజ్ తరుణ్ - మాల్వీ మల్హోత్ర కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. సెకండ్ హీరోయిన్ మన్నారా చోప్రా కూడా అద్భుతంగా నటించింది. ఇక జాన్ విజయ్, రఘుబాబు, అంకిత ఠాకూర్, ప్రగతి, రాజా రవీంద్ర తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని లవ్ & యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. తొలి భాగం మెుత్తం హీరో-హీరోయిన్ పరిచయం, వారి లవ్ ట్రాక్‌తో సాగిపోయింది. గిరిని శైలజా డామినేట్ చేసే క్రమంలో వచ్చే హాస్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా కుదరడంతో ఫస్టాఫ్ ఎక్కడా బోర్ లేకుండా వెళ్లిపోతుంది. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచారు డైరెక్టర్. రెండో భాగాన్ని హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌తో పూర్తిగా నింపేశారు. రాజ్ తరుణ్‌ను ఎన్నో మాస్ యాంగిల్స్‌లో చూపించి డైరెక్టర్ ఆకట్టుకున్నారు. అయితే అక్కడక్కడ వచ్చే కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. కొన్ని ఫైట్స్ రాజ్‌తరుణ్ కటౌట్‌కు మించి ఉండటంతో లాజికల్‌గా కనెక్ట్ కాలేము. భావోద్వేగ సన్నివేశాలు సైతం పెద్దగా వర్కౌట్ కాలేదు. ఒక మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కోరుకునేవారికి 'తిరబడరా సామి' నచ్చుతుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే జేబీ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్‌ను బీజీఎం మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే పాటలు గుర్తుంచుకునేలా లేవు. అటు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రాజ్‌తరుణ్ నటనలవ్ ట్రాక్‌యాక్షన్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్
వర్కౌట్ కాని ఎమోషన్స్‌కొన్ని బోరింగ్ సీన్స్
Telugu.yousay.tv Rating : 3/5
ఆగస్టు 02 , 2024
Raj Tarun: ఆ అమ్మాయితో 3 ఏళ్లు ఒకే రూమ్‌లో ఉన్నా… తన అఫైర్‌పై స్పందించిన రాజ్ తరుణ్
టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. తొలి చిత్రం 'ఉయ్యాల జంపాల' (Uyyala Jampala) తో మంచి సక్సెస్ అందుకున్న రాజ్‌తరుణ్.. ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్’ సినిమాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల వరుసగా ఫ్లాపులను చవిచూశాడు. ఇదిలా ఉంటే తాజాగా రాజ్‌తరుణ్‌పై అతడి ప్రేయసి సంచలన ఆరోపణలు చేసింది. తనను మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రాజ్ తరుణ్ కూడా ఘాటుగా స్పందించడంతో.. ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారిపోయింది.
‘ఆ హీరోయిన్‌తో ఎఫైర్’
సినీ నటుడు రాజ్ తరుణ్ (Raj Tarun) తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్, తాను 2012 నుంచి రిలేషన్‌లో ఉన్నామని ఇటీవల ఒక హీరోయిన్‌తో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్ కొనసాగిస్తున్నట్టు ఆరోపించింది. ఇదే విషయమై రాజ్‌తరుణ్‌ను నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను సంబంధం లేని కేసు (డ్రగ్స్)లో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే రాజ్‌తరణ్ ఎఫైర్‌లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నటి హీరోయిన్ మాల్వీ మల్హోత్రా అని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ‘తిరగబడర సామీ’లో ఈ భామే కథానాయికగా చేస్తుండటమే ఇందుకు కారణమని అంటున్నారు.
https://twitter.com/galli2delhi/status/1809123625074614310
అది నిజం కాదు: రాజ్ తరుణ్
మాజీ ప్రేయసి లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై నటుడు రాజ్ తరుణ్ స్పందించారు. ఓ ఛానల్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను షార్ట్‌ఫిల్మ్స్ చేసే సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. మంచి అమ్మాయే. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో సాయం చేసింది. మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నది వాస్తవమే. 2014 నుంచి 2017 వరకు కలిసున్నాం. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి సంబంధంలేదు. ఆమె ఫ్రెండ్స్ సర్కిల్, తను డ్రగ్స్ తీసుకోవడం చూసి తట్టుకోలేకపోయా. వదిలేసి వెళ్లిపోదామనుకుంటే.. మీడియా ముందుకెళ్తానని నన్ను బెదిరించేది. నా పరువుకు భంగం కలగకుండా ఉండేందుకు భరిస్తూ వచ్చా. ఆమెపై డ్రగ్స్ కేసు నమోదవగా దానికి నేనే కారణమని ఆరోపణలు చేస్తోంది’ అని మండిపడ్డారు.
https://twitter.com/BunnyJashu3/status/1769400224081219797
‘మరో అబ్బాయితో నా ఇంట్లోనే ఉంది’
ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ లావణ్యపై రాజ్‌తరుణ్ సంచలన ఆరోపణలు చేశాడు. తాను ఉండగానే ఆమె మరో యువకుడితో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. 'మరో అబ్బాయితో ఆమె రిలేషన్ కొనసాగించింది. రోజూ కొడుతున్నాడంటూ ఆ వ్యక్తిపైనా కేసు పెట్టింది. మళ్లీ అతడితో కలిసి నా ఇంట్లోనే కొన్నాళ్లు ఉంది. నేనే బయటకు వచ్చేశా. తన తండ్రినీ బ్లాక్ మెయిల్ చేసింది. మాకు పెళ్లి కాలేదు. జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిన సంగతి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. ఆమెకూ ఆ విషయం తెలుసు. ముంబయికి చెందిన నటితో సహజీవనం చేస్తున్నట్టు ఆమె ఆరోపిస్తోంది. నేను హైదరాబాద్‌లో ఉంటున్నా. ఆమె ముంబయిలో నివాసముంటోంది. మేం సహజీవనం ఎలా చేస్తాం? తనను ఇంట్లోంచి నేను పంపించేస్తానన్న భయంతో ఇదంతా చేస్తోంది’ అని రాజ్‌తరుణ్ ఆరోపించాడు.
జూలై 05 , 2024
One Hero Two Heroines: ఒక హీరో ఇద్దరు భామలు.. టాలీవుడ్‌లో మరో కొత్త ట్రెండ్!
కొత్త ట్రెండ్‌లను సృష్టించడంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో మరో కొత్త ట్రెండ్ మెుదలైనట్లు తెలుస్తోంది. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు కాన్సెప్ట్‌ను దర్శక నిర్మాతలు అనుసరిస్తున్నారు. వాస్తవానికి ఈ ట్రెండ్ పాతదే. గతంలో ఈ తరహా చిత్రాలు తెలుగులో బోలెడు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఈ తరహా చిత్రాలు తగ్గిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ మళ్లీ మెుదలైంది. కొత్తగా రూపొందుతున్న చాలా వరకూ చిత్రాలు ఇద్దరు భామలు కాన్సెప్ట్‌తో రూపొందుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? అందులో నటించిన హీరోయిన్లు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
గాయత్రి భరద్వాజ్ - ప్రిషా రాజేశ్ సింగ్
అల్లు శిరీష్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం 'బడ్డీ' (Buddy). శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. అందులో ఒకరు గాయత్రి భరద్వాజ్ (Gayathri Bharadwaj) కాగా, మరొకరు ప్రిషా రాజేశ్ సింగ్ (Prisha Rajesh Singh). ఇప్పటికే విడుదలైన బడ్డీ ప్రచార చిత్రాల్లో ఈ ఇద్దరు భామలు ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు.
మాల్వీ మల్హోత్ర - మన్నారా చోప్రా
రాజ్‌తరుణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'తిరగబడరా సామి' (Thiragabadara saami). ఏ.ఎస్. రవి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. మెయిన్ హీరోయిన్ మాల్వీ మల్హోత్ర (Malvi Malhotra) కాగా, మరో నటి మన్నారా చోప్రా (Mannara Chopra) ప్రత్యేక గీతంలో చేసింది. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్ర గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. హీరో రాజ్ తరణ్ తనను మోసం చేసి మాల్వీ మల్హోత్రతో ప్రేమాయణం సాగించినట్లు అతడి ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదాల మధ్య వస్తోన్న ‘తిరగబడరా సామి’ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.
తన్వీ ఆకాంక్ష - సీరత్ కపూర్
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'ఉషా పరిణయం'. విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీకమల్ ఇందులో హీరోగా నటించాడు. ఆగస్టు 2న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అయితే ఇందులో ఇద్దరు భామలు మెరవనున్నారు. శ్రీకమల్‌కు జోడీగా తాన్వి ఆకాంక్ష (Thanvi Akansha) నటించగా ప్రముఖ నటి సీరత్ కపూర్ (Seerat Kapoor) ఇందులో ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. తాన్వి ఆకాంక్షకు ఇదే తొలి చిత్రం. సీరత్ కపూర్ గతంలో రన్ రాజా రన్, టైగర్, కొలంబస్, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు తదితర చిత్రాల్లో నటించింది.
మీనాక్షి చౌదరి - శ్రద్ధా శ్రీనాథ్
విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మెకానిక్ రాకీ' (Mechanic Rocky). రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు చేస్తున్నారు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary), శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath) విశ్వక్‌కు జంటగా నటించనున్నారు. ట్రయాంగిల్ లవ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి ఇప్పటికే ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘కిలాడీ’, ‘హిట్ 2: సెకండ్ కేస్’, ‘గుంటూరు కారం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అటు శ్రద్ధా శ్రీనాథ్ సైతం జెర్సీ, సైంధవ్ చిత్రాలకు తెలుగు ఆడియన్స్‌ను అలరించింది.
తమన్నా - రాశి ఖన్నా
అరణ్మణై సిరీస్‌లో నాలుగో చిత్రంగా రూపొందిన 'బాక్' (Baak) ఇటీవల తెలుగులో విడుదలైంది. సుందర్. సి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా (Tamannaah Bhatia), రాశి ఖన్నా (Raashii Khanna) ముఖ్య పాత్రలు పోషించారు. వీరిద్దరు కలిసి చేసిన ఓ సాంగ్ పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. హార్రర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
తమన్నా - కీర్తి సురేష్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గత చిత్రం ‘భోళా శంకర్’లోనూ ఇద్దరు హీరోయిన్లు నటించారు. మేహర్ రమేష్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా (Tamannaah Bhatia), కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో చిరుకి జోడీగా తమన్నా, సోదరిగా కీర్తి సురేష్ నటించారు. గతేడాది ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షుకలను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
జూలై 31 , 2024
Raj Tarun Case: రాజ్‌తరుణ్ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. ప్రేయసికి షాకిచ్చిన పోలీసులు!
హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun) తనను మోసం చేశాడంటూ అతడి మాజీ ప్రేయసి లావణ్య శుక్రవారం (జులై 5) పోలీసులకు ఫిర్యాదు చేయడం.. టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఎఫ్‌ఐఆర్ కాపీలో యంగ్ హీరోపై సంచలన ఆరోపణలు చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజ్‌తరుణ్ సైతం తనదైన శైలిలో స్పందించాడు. లావణ్యతో గతంలో జరిగిన వ్యవహారం మెుత్తాన్ని బయటపెట్టాడు. టాక్ ఆఫ్ టాలీవుడ్‌గా మారిపోయిన ఈ కేసులో శనివారం (జులై 6) ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్యకి ఉల్టాగా పోలీసులు నోటీసులు పంపారు.
నోటీసులు ఎందుకంటే?
హీరో రాజ్‌తరుణ్‌పై మాజీ ప్రేయసి లావణ్య.. శుక్రవారం (జులై 5) నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తను 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నామని పేర్కొంది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించింది. మాల్వీ మల్హోత్ర, ఆమె బంధువులు తనను బెదిరిస్తున్నారని కూడా కంప్లైంట్‌లో పేర్కొంది. మరోవైపు అందులో ఎలాంటి వాస్తవం లేదని రాజ్‌తరుణ్ కూడా వివరణ ఇచ్చాడు. దీంతో నార్సింగి పోలీసులు లావణ్యకు ఊహించని షాక్ ఇచ్చారు. రాజ్ తరుణ్‌పై ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ నోటీసుల్లో కోరారు. 91 CRPC కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ నోటీసులపై లావణ్య ఇప్పటివరకూ స్పందించలేదని తెలుస్తోంది. ఆమె సమర్పించే ఆధారాలను బట్టి ఈ కేసు ముందుకు కదలనుంది.
ఫిర్యాదులోని మరిన్ని విషయాలు!
శుక్రవారం నార్సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య మరిన్ని ఆరోపణలు చేశారు. 2012 నుంచి రాజ్‌తరుణ్ తాను రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్ మెుదలైనప్పటి నుంచి మాల్వీ మల్హోత్రాతో రిలేషన్ స్టార్ట్ చేసినట్లు ఆరోపించింది. ఇదే విషయమై రాజ్‌తరుణ్‌ను నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను సంబంధం లేని కేసు (డ్రగ్స్)లో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని ఆరోపించింది. ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేయనున్నట్లు గురువారమే స్పష్టం చేశారు. అయితే స్టార్ సెలబ్రిటీలపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. ఆధారాల కోసం ఇవాళ లావణ్యకు నోటీసులు పంపారు.
అది చూసి తట్టుకోలేకపోయా: రాజ్ తరుణ్
మాజీ ప్రేయసి లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై నటుడు రాజ్ తరుణ్ శుక్రవారమే (జులై 5) స్పందించారు. ఓ ఛానల్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను షార్ట్‌ఫిల్మ్స్ చేసే సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. మంచి అమ్మాయే. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో సాయం చేసింది. మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నది వాస్తవమే. 2014 నుంచి 2017 వరకు కలిసున్నాం. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి సంబంధంలేదు. ఆమె ఫ్రెండ్స్ సర్కిల్, తను డ్రగ్స్ తీసుకోవడం చూసి తట్టుకోలేకపోయా. వదిలేసి వెళ్లిపోదామనుకుంటే.. మీడియా ముందుకెళ్తానని నన్ను బెదిరించేది. నా పరువుకు భంగం కలగకుండా ఉండేందుకు భరిస్తూ వచ్చా. ఆమెపై డ్రగ్స్ కేసు నమోదవగా దానికి నేనే కారణమని ఆరోపణలు చేస్తోంది’ అని మండిపడ్డారు.
‘తన తండ్రినీ బెదిరించింది’
ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ లావణ్యపై రాజ్‌తరుణ్ సంచలన ఆరోపణలు చేశాడు. తాను ఉండగానే ఆమె మరో యువకుడితో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. 'మరో అబ్బాయితో ఆమె రిలేషన్ కొనసాగించింది. రోజూ కొడుతున్నాడంటూ ఆ వ్యక్తిపైనా కేసు పెట్టింది. మళ్లీ అతడితో కలిసి నా ఇంట్లోనే కొన్నాళ్లు ఉంది. నేనే బయటకు వచ్చేశా. తన తండ్రినీ బ్లాక్ మెయిల్ చేసింది. మాకు పెళ్లి కాలేదు. జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిన సంగతి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. ఆమెకూ ఆ విషయం తెలుసు. ముంబయికి చెందిన నటితో సహజీవనం చేస్తున్నట్టు ఆమె ఆరోపిస్తోంది. నేను హైదరాబాద్‌లో ఉంటున్నా. ఆమె ముంబయిలో నివాసముంటోంది. మేం సహజీవనం ఎలా చేస్తాం? తనను ఇంట్లోంచి నేను పంపించేస్తానన్న భయంతో ఇదంతా చేస్తోంది’ అని రాజ్‌తరుణ్ ఆరోపించాడు.
జూలై 06 , 2024
Mannara Chopra: ఎద అందాలతో మాయ చేస్తున్న మన్నారా చోప్రా!
యంగ్ బ్యూటీ మన్నారా చోప్రా (Mannara Chopra).. మరోమారు తన అందచందాలతో సోషల్ మీడియాలో తళుక్కుముంది. ఎద అందాలను చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.
తాజాగా సెలెనా రఫుల్ షోల్డర్ మ్యాక్సీ డ్రెస్ (Selena Ruffle Shoulder Maxi Dress)లో ఫొటోషూట్ నిర్వహించిన ఈ సుందరి.. తన అందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది.
మ్యాచింగ్ ఎయిర్ రింగ్స్, వాచ్ ధరించి యూనిక్ హెయిర్ స్టైల్‌తో కనువిందు చేసింది. ఈ భామ లేటెస్ట్ ఫొటోలను చూసిన నెటిజన్లు మైమరిపోతున్నారు. మన్నారా లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)కు స్వయానా సోదరి అయిన ఈ బ్యూటీ.. తెలుగు సినిమాతోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టడం విశేషం.
2014లో 'ప్రేమ గీమా జాంతా నై' అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మన్నారా పరిచయమైంది. ఆర్.వి సుబ్బు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సింగర్ శ్రీరామ చంద్ర హీరోగా చేశాడు.
ఆ తర్వాత బాలీవుడ్‌లో జిద్ (Zid) సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. అందులో మన్నారా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మన్నారా.. అక్కడ 'సందమరుతమ్', 'కావల్' చిత్రాల్లో నటించింది. ఆ రెండు సినిమాలు చెప్పుకోతగ్గ విజయాన్ని అందుకోకపోవడంతో తిరిగి టాలీవుడ్‌పై మన్నారా ఫోకస్ పెట్టింది.
తెలుగులో సునీల్‌తో 'జక్కన్న' (Jakkanna), సాయిధరమ్ తేజ్‌తో 'తిక్క' (Thikka), పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'రోగ్' (Rough) వంటి సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.
ఆ తర్వాత రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. తిరిగి తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన 'సీత' (Sita) సినిమా అడుగుపెట్టింది. ఆ చిత్రం కూడా ఈ భామకు ఆశించిన బ్రేక్ ఇవ్వలేదు.
దీంతో బుల్లితెరపై ఫోకస్ పెట్టిన మన్నారా.. Bigg Boss 17 హిందీలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. అక్కడ తన ప్రవర్తన, ఆటతీరుతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెకండ్ రన్నరప్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది.
గతేడాది 'భూత్‌మేట్' అనే హిందీ సిరీస్‌లో మన్నారా మెరిసింది. పారి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల 'డ్యాన్స్ దివానే 4' అనే హిందీ షోలో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చి ఫ్యాన్స్‌ను అలరించింది.
తాజాగా తెలుగులో 'తిరగబడరా సామి' అనే చిత్రంలో ఈ భామ నటించింది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తికాగా.. విడుదలకు సిద్ధంగా ఉంది.
అటు పంజాబీలో ఓహీ చాన్ ఓహీ రాతన్ అనే చిత్రంలో మన్నారా చోప్రా నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్లు వికీపిడీయా ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ మూవీ కూడా త్వరలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
మార్చి 12 , 2024
LATEST OTT RELEASES TELUGU: ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు ఇవే!
జులై నెల మొత్తం ప్రభాస్ కల్కి హవా సాగింది. ఇప్పుడు ఆగస్టు నెలలో అలరించడానికి పలు సినిమాలు సిద్ధమయ్యాయి. మొదటి వారంలో పలు చిన్న చిత్రాలు విడుదలవుతున్నప్పటికీ వీటిపై పెద్దగా బజ్ అయితే లేదు. శివం భజే, బడ్డీ, అంటోనీ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాయి. అటు ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో 20కి పైగా సినిమాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు విడుదల కానున్నాయి. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో రిలీజ్ కానున్న ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు
బడ్డీ
చాలా రోజుల తర్వాత బడ్డీ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అల్లు శిరీష్. ఈ చిత్రంలో ఆయన సరసన యంగ్ హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ నటిస్తోంది. ఈ సినిమాను ఫూల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శామ్ ఆంటోస్ తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రెకిత్తించాయి. ఆగస్టు 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.
శివం భజే
యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు హీరోగా దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం శివంభజే. అఫ్సర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం వైవిధ్యమైన కథ, కథనంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అర్బాజ్ ఖాన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు మంచి ఎగ్జైటింగ్ ఫీలింగ్ పొందుతారని మూవీ టీమ్ తెలిపింది.
ఉషా పరిణయం
తెలుగులో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతూ 'ఉషా పరిణయం'సినిమా వస్తోంది. ఈ చిత్రాన్ని విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు. శ్రీకమల్ సరసన తాన్వి ఆకాంక్ష హీరోయిన్‌గా నటిస్తోంది. వైవిధ్యమైన ప్రేమకథ, సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమా రానుంది. ఆగస్టు 2న థియేటర్లలో విడుదల కానుంది.
తిరగబడర సామి
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్ స్టోరీతో యువ హీరో రాజ్ తరుణ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.ఆయన సరసన మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మకరంద్ దేశ్‌పాండే, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకులను అలరించనుంది. యువతరాన్ని ఆకర్షింటే రొమాంటిక్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే సెంటిమెంట్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అయితే రాజ్ తరుణ్- లావణ్య వివాదం సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత వారం విడుదలైన పురుషోత్తముడు చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మరి ఆగస్టు 2న విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి రివ్యూలను అందుకుంటుందో చూడాలి. లెటెస్ట్ సినిమా రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అలనాటి రామచంద్రుడు
కృష్ణవంశీ, మోక్ష జంటగా నటింంచిన చిత్రం అలనాటి రామచంద్రుడు. తన ప్రేమకోసం ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకున్న యువకుడిని ఆ యువతి ప్రేమించిందా? లేదా? వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది అనే స్టోరీ లైనప్‌తో కథ సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఇక ఈ సినిమాను చిలుకూరి ఆకాష్‌రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమా విడుదల కానుంది.
ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు/ వెబ్ సిరీస్‌లు
ఇక ఓటీటీ విషయానికొస్తే.. దర్శక ధీరుడు రాజమౌళిపై వచ్చిన డాక్యుమెంటరీ 'మోడ్రన్ మాస్టర్స్', త్రిష నటించిన 'బృందా' సిరీస్, డ్యూన్ పార్ట్ 2, కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ వంటి తెలుగు డబ్బింగ్ సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాల ఓటీటీ రిలీజ్ డేట్లను ఇక్కడ చూడండి.
PlatformTitleTypeRelease DateNetflixA Good Girl's Guide to MurderEnglish seriesAugust 01NetflixBorderless FogIndonesian movieAugust 01NetflixLove Is Blind MexicoSpanish seriesAugust 01NetflixMon Laferte TemoSpanish movieAugust 01NetflixUnstable Season 2English seriesAugust 01NetflixModern Masters: SS RajamouliTelugu documentaryAugust 02NetflixSaving Bikini BottomEnglish movieAugust 02NetflixJoe RoganEnglish comedy eventAugust 03Amazon PrimeThe Lord of the Rings: The Rings of Power S2English seriesJuly 29Amazon PrimeBatman: Caped CrusaderEnglish seriesAugust 01HotstarFuturama Season 12English seriesJuly 29HotstarNo Way OutKorean seriesJuly 31HotstarKingdom of the Planet of the ApesTelugu dubbed movieAugust 02Book My ShowThe Bike RidersEnglish movieAugust 02Jio CinemaDune Part 2Telugu dubbed movieAugust 01Jio CinemaGud ChadiHindi movieAugust 01Jio CinemaTarotEnglish filmAugust 03Jio CinemaDas June Ki RaatHindi seriesAugust 04Sony LivBrindaTelugu dubbed seriesAugust 02Apple TV+Women in BlueEnglish seriesJuly 31
జూలై 29 , 2024
Purushothamudu Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్ ఫస్ట్ ఫిల్మ్ ఆకట్టుకుందా!
నటీనటులు: రాజ్ తరుణ్, హాసిని, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్ తదితరులు
రచన, దర్శకత్వం: రామ్ భీమన
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: పీజీ విందా
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్
నిర్మాత: డాక్టర్ రమేశ్ తేజవత్, ప్రకాశ్ తేజవత్
యంగ్ హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun) ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అటు సినీ, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదొడుకులను ఫేస్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు నటించిన లేటేస్ట్ చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu Movie review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ భీమన (Ram Bhimana) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హాసిని (Actress Hasini) హీరోయిన్‌గా చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రాజ్ తరుణ్‌కు హిట్‌ను అందించి ఊరట కల్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
రచిత్ రామ్ (రాజ్‌తరుణ్) పుట్టుకతోనే కోటీశ్వరుడు. పీఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్య రామ్ (మురళీ శర్మ) ఏకైక తనయుడు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని తిరిగొచ్చిన కుమారుడికి సీఈవో బాధ్యతలు అప్పగించాలని ఆదిత్య నిర్ణయించుకుంటాడు. అయితే రచిత్ పెద్దమ్మ వసుంధర దానికి (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ రూల్స్ ప్రకారం సీఈవోగా ఎంపికవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు సామాన్యుడిలా అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది. దీనికి రచిత్ అంగీకరించి బయటకువచ్చేస్తాడు. ఏపీలోని మారుమూల గ్రామమైన రాయపులంకకు వెళ్తాడు. అక్కడికి వెళ్లాక రచిత్ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు అతడు ఎలాంటి సాహసాలు చేశాడు? అమ్ముతో అతడి లవ్ స్టోరీ ఏంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
రచిత్ రామ్ పాత్రలో రాజ్‌తరుణ్ చక్కటి నటన కనబరిచాడు. కోటీశ్వరుడిగా, ఎటువంటి ఐడెంటిలేని సాధారణ వ్యక్తిలా రెండు డైమన్షన్స్‌లో చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లోనూ పర్వాలేదనిపించాడు. ఇక పల్లెటూరి అమ్మాయి అమ్ము పాత్రలో హాసిని సుధీర్ స్క్రీన్‌పై ఎంతో అందంగా మెరిసింది. రాజ్‌తరణ్ - అమ్ము మధ్య వచ్చే లవ్ సీన్స్ మెప్పిస్తాయి. హీరో ఫ్రెండ్ పాత్రలో ప్రవీణ్ నవ్వులు పూయిస్తాడు. సత్య, బ్రహ్మానందం వంటి కమెడియన్లు సినిమాలో తళుక్కుమని మెరిశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని కారణాల వల్ల ఓ సామాన్యుడిలా గడపటం గతంలో చాలా చిత్రాల్లోనే చూశాం. 'పురుషోత్తముడు' చిత్రాన్ని కూడా దర్శకుడు రామ్ భీమన ఈ కోవలోనే రూపొందించారు. ధనవంతుడైన హీరో రాయపులంక గ్రామం చేరాక అసలు కథ మెుదలవుతుంది. హీరోయిన్‌తో పరిచయం, లవ్ సీన్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. ఫస్టాఫ్ మెుత్తం విలేజ్ బ్యాక్‌డ్రాప్ కామెడీతో ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. ఊర్లో జరిగే అన్యాయాలపై హీరో తిరగబడటం, ఇంటర్వెల్ బ్యాంగ్ మెప్పిస్తాయి. అయితే ద్వితీయార్థం నుంచి కథ గాడి తప్పినట్లు కనిపిస్తుంది. ఎలాంటి మలుపు లేకుండా ఊహకు తగ్గట్లు సాఫీగా, బోరింగ్‌గా సాగిపోతుంది. క్లైమాక్స్ సైతం అంచనాలకు తగ్గట్లు ఉన్నా ప్రకాశ్ రాజ్ ఎంట్రీ, అతడు చెప్పే డైలాగ్స్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కథ, కథనంలో వైవిధ్యం చూపడంలో దర్శకుడు రామ్ భీమన పూర్తిగా విఫలమయ్యాడు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే గోపి సుందర్ అందించిన సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. పీజీ విందా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని తన కెమెరా పనితనంతో చక్కగా చూపించారు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రాజ్‌తరుణ్ నటనఫస్టాఫ్‌లోని కొన్ని సీన్స్‌హీరో-హీరోయిన్ కెమెస్ట్రీ
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీఊహకందేలా సాగే కథనంట్విస్టులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 2.5/5
జూలై 27 , 2024