• TFIDB EN
  • తొలి ప్రేమ
    UATelugu2h 16m
    ఆదిత్య (వరుణ్‌ తేజ్‌) రైలులో వర్ష (రాశీఖన్నా)ను చూసి ప్రేమిస్తాడు. తాను చదువుతున్న ఆమె కాలేజీకే రావడంతో ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కాలేజీలో జరిగిన ఓ గొడవ మూలంగా ఆదిత్య వర్షను వదిలి వెళ్లిపోతాడు. ఆరేళ్ల తర్వాత వర్ష మళ్లీ ఆదిత్య జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వారిద్దరు కలిశారా లేదా? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    వరుణ్ తేజ్
    ఆదిత్య శేఖర్
    రాశి ఖన్నా
    వర్ష
    నరేష్
    తొక్క బుచ్చి బాబు
    సుహాసిని మణిరత్నం
    ఆదిత్య తల్లి
    విద్యుల్లేఖ రామన్
    గోదావరి
    ప్రియదర్శి పులికొండ
    రవి
    హైపర్ ఆది
    రాజు
    అపూర్వ శ్రీనివాసన్
    కవిత
    సత్యం రాజేష్
    ప్రకాష్
    సప్నా పబ్బి
    సునైనా ('సునోనా సునైనా' పాటలో ప్రత్యేక ప్రదర్శన)
    హర్ష చెముడు
    ఆదిత్య చిన్ననాటి స్నేహితుడు
    సిబ్బంది
    వెంకీ అట్లూరి
    దర్శకుడు
    బివిఎస్ఎన్ ప్రసాద్
    నిర్మాత
    తమన్ ఎస్
    సంగీతకారుడు
    నవీన్ నూలి
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే లవ్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఇప్పటికే వందలాది చిత్రాలు వచ్చాయి. ఇకపైనా వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే  చాలమంది అబ్బాయిలు తమ ప్రేయసికి ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను చూపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు హీరో, హీరోయిన్ల పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. అటువంటి వారి కోసం You Say ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఫ్రెష్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రాలు యూత్‌కు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా తమ గార్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాలు చూస్తే వారి బంధం మరింత బలపడే అవకాశముంది.  భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy) మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. నిజమైన ప్రేమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అడ్డురావని నిరూపించింది. ఈ సినిమాలో హీరో నాని మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. హీరోయిన్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికీ హీరోయిన్‌ తండ్రి అతడి ప్రేమను గుర్తించి వారికి పెళ్లికి అంగీకరిస్తాడు.  తొలి ప్రేమ (Tholi Prema) వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్.. ప్రేమికులను మెప్పిస్తుంది. లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అది వారి ప్రేమపై ప్రభావం చూపదని ఈ సినిమా నిరూపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఎడబాటు వచ్చినప్పటికీ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను కోల్పోరు. ఈ సినిమా మీ ప్రేయసికి కచ్చితంగా నచ్చుతుంది.  ఊహలు గుసగులాడే (Oohalu Gusagusalade) నాగశౌర్య, రాశి ఖన్నా జంటగా చేసిన ఈ చిత్రం.. ఒక డిఫరెంట్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రేమకు ముఖ పరిచయంతో సంబంధం లేదని మనకు సరిగ్గా మ్యాచ్‌ అయ్యే భావాలు ఎదుటి మనిషి కలిగి ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇందులో హీరోయిన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. హీరోయిన్‌ను ఇంప్రెస్‌ చేసేందుకు ఆ వ్యక్తికి హీరో సాయం చేస్తాడు. హీరో చెప్పించే మాటలు, రాసిన లేఖలకు హీరోయిన్‌ ఫిదా అవుతుంది. చివరికీ హీరోను పెళ్లి చేసుకుంటుంది.  అష్టా చమ్మా (Ashta Chamma) నాని, అవసరాల శ్రీనివాస్‌, స్వాతి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో హీరోయిన్‌కు మహేష్‌ అనే పేరంటే పిచ్చి. దీంతో హీరో తన పేరు మహేష్‌ అని అబద్దం చెప్పి దగ్గరవుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివరికీ వారు ఎలా ఒక్కటయ్యారు అన్నది స్టోరీ.  అలా మెుదలైంది (Ala Modalaindi) డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మెుట్ట మెుదటి సినిమా ‘అలా మెుదలైంది’. నిత్యా మీనన్‌ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. లవ్‌ ఫెయిల్‌ అయిన హీరో (నాని) జీవితంలోకి ఓ రోజు నిత్యా వస్తుంది. అయితే అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. నిత్యాతో పరిచయంతో నాని మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి వీరు చివరికీ ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. అయితే ఈ సినిమా ఆధ్యాంతం ఎంతో సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తుంది.  సూర్య S/O కృష్ణన్ (Surya S/o Krishnan) హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.  మజిలి (Majili) తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.  ఓకే బంగారం (Ok Bangaram) ప్రస్తుత కాలంలో డేటింగ్‌ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిని కథాంశంగా చేసుకొని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లిలో కలుసుకున్న ఓ జంట ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కొద్దికాలం పాటు సహజీవనం చేస్తారు. ఈ ప్రయాణంలో వారు ఏం గ్రహించారు. చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? స్టోరీ. ఈ సినిమాను యూత్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది.  ఏ మాయ చేశావే (Ye Maya Chesave) తెలుగులో వచ్చిన ఎవర్‌గ్రీన్‌ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమికుల మధ్య ఎంత దూరం పెరిగినా లవ్‌ మాత్రం అలాగే ఉంటుందని దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చూపించాడు. ఇందులో నాగచైతన్య, సమంత కెమెస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారానే వీరికి పరిచయమై చివరికీ పెళ్లి కూడా చేసుకున్నారు.   పెళ్లి చూపులు (Pelli Chupulu) తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా చేశారు. పెళ్లిచూపులకు వెళ్లిన విజయ్‌ను రీతు రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ హీరో ఆమె ఫుడ్‌ బిజినెస్‌లో భాగమై సక్సెస్‌ చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ప్రేమలో పడి ఒక్కటవుతారు. ఈ సినిమా మీ ప్రేయసితో గనక చూస్తే ఆమె కచ్చితంగా థ్రిల్ అవుతుంది.  సీతారామం (Sita ramam) 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది. రీసెంట్‌గా వచ్చిన చిత్రాల్లో సూపర్‌ క్లాసిక్‌ మూవీగా దీన్ని చెప్పవచ్చు.  హాయ్‌ నాన్న (Hi nanna) ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది. తెలుగులో కచ్చితంగా చూాడాల్సిన చిత్రాల్లో హాయ్‌ నాన్న తప్పకుండా ఉంటుంది.  మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju) రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.  ఓయ్‌ (Oye) బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha) కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లడతా’ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూసేవారు చాలా మందే ఉన్నారు. కథలోకి వెళ్తే.. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి (Raja Rani) ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు. జాను (Jaanu) శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.  గోదావరి (Godavari) శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు చూసిన అసలు బోర్‌ కొట్టదు. హీరో సుమంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా గోదావరి నిలిచింది. ఇందులో పాటలు, కమలని ముఖర్జీ నటన మెప్పిస్తుంది. మీ ప్రేయసిలో మీరు కోరుకునే లక్షణాలన్ని కమలిని ముఖర్జీలో ఉంటాయి. కథ ఏంటంటే.. ఉన్నత ఆదర్శాలు ఉన్న శ్రీరామ్ తన మరదలు రాజీని ప్రేమిస్తాడు. కానీ రాజీ తండ్రి ఆమె పెళ్లిని ఒక IPS అధికారితో నిశ్చయిస్తాడు. దీంతో ఆ బాధను మరిచిపోయేందుకు శ్రీరామ్ గోదావరి నదిపై విహారయాత్రకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో సీత అనే యువతితో స్నేహం అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఆనంద్‌ (Anand) ఈ ఫీల్‌గుడ్‌ మూవీ కూడా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిందే. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్‌ ఏంటంటే.. రూప కుటుంబం కారు ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆనంద్ అనే ధనవంతుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
    మార్చి 22 , 2024
    True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
    True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించాయి. యాక్షన్‌, శృంగార సన్నివేశాలు, ఐటెం సాంగ్స్‌ ఇలాంటివి లేకపోయినా.. స్వచ్చమైన ప్రేమ, ఆకట్టుకునే కథ-కథనం, చక్కటి ప్రజెంటేషన్‌ ఉంటే చాలని అవి నిరూపించాయి. ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రగిలించి కొత్త రకం ప్రేమ కథలను ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ (Sitaramam), ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) చిత్రాలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్‌ ఇండస్ట్రీని సైతం ఈ చిత్రాలు కదిలించాయి. నార్త్‌ అభిమానుల ఫేవరేట్‌ చిత్రంగా మారిపోయాయి. మరి టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చి కల్ట్‌ క్లాసిక్‌ మూవీలు ఏవి? అవి ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.  సీతారామం 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది.  హాయ్‌ నాన్న ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది.  సూర్య S/O కృష్ణన్ హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.  మజిలి తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.  నిన్ను కోరి హీరో ఒక యువతిని ఎంతగానో ఇష్టపడతాడు. అనూహ్యంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. తొలత ఆమెను దక్కించుకోవాలని భావించినప్పటికీ చివరికీ ఆమె సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు.  మళ్లీ మళ్లీ ఇది రాని రోజు రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.  ఓయ్‌ బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. తొలి ప్రేమ  టాలీవుడ్‌లో వచ్చి కల్ట్‌ క్లాసిక్‌ ప్రేమ కథా చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. విదేశాల నుంచి వచ్చిన యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆమెకు తన భావాలను చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. తిరిగి వెళ్లేపోతున్న క్రమంలో తానూ హీరోను లవ్‌ చేస్తున్నట్లు యువతికి అర్థమవుతుంది.  నిన్నే పెళ్లాడతా కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన నిన్నే పెళ్లడతా చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.  జాను శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు. 
    ఫిబ్రవరి 13 , 2024
    PAWAN KALYAN: IMDBలో పవర్‌ స్టార్‌ టాప్‌ రేటెడ్‌ చిత్రాలు.. వీటి పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే..! 
    PAWAN KALYAN: IMDBలో పవర్‌ స్టార్‌ టాప్‌ రేటెడ్‌ చిత్రాలు.. వీటి పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే..! 
    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ఆయనకు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ ఏ హీరోకు లేదనడంలో అతిశయోక్తి లేదు. పవన్‌ క్రేజ్‌ సినిమాలకు అతీతమైనది కావడమే ఇందుకు కారణం. ఎందుకంటే పవన్‌ను హీరోగా కంటే మంచి మనసున్న వ్యక్తిగా ఆరాధించేవారే ఎక్కువ. ఇక పవన్‌ తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు తీశాడు. ఆయన తీసిన తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి, గబ్బర్‌సింగ్‌, అత్తారింటికి దారేది చిత్రాలు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. ఈ చిత్రాలను ఇప్పటికీ పవన్‌ ఫ్యాన్స్ రిపీట్‌ మోడ్‌లో చూస్తుంటారు. ఈ నేపథ్యంలో IMDB (Internet Movie Database)లో టాప్‌ రేటెడ్‌ పవన్‌ మూవీస్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.  1. తొలి ప్రేమ IMDBలోని పవన్‌ కల్యాణ్‌ సినిమాల జాబితాలో ‘తొలి ప్రేమ’ (Tholi Prema) టాప్ రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. ఈ చిత్రానికి IMDB 8.4 రేటింగ్ ఇచ్చింది. తొలి ప్రేమ చిత్రం పవన్‌ కెరీర్‌లో నాల్గో సినిమా. 1998లో విడుదలైన ఈ మూవీకి కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. పవన్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. కీర్తి రెడ్డి ఇందులో హీరోయిన్‌గా చేసింది. తొలి ప్రేమలోని పాటలు అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘నీ మనసే’ పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ అని సాంగ్‌. 2. ఖుషి  పవన్‌ సినిమాల్లో ‘ఖుషి’ (Kushi) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రానికి IMDB 8.1 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రంలో పవన్‌ మేనరిజమ్స్‌, సొంతంగా కొరియోగ్రాఫ్‌ చేసిన ఫైట్స్‌ మూవీకే హైలెట్‌ అని చెప్పొచ్చు. 2001లో వచ్చిన ఈ సినిమాకు S.J. సూర్య దర్శకత్వం వహించాడు. భూమిక చావ్లా హీరోయిన్‌గా చేసింది. ఇటీవలే ఈ చిత్రం రీ-రిలీజ్‌ కావడం విశేషం. తాజాాగా ఇదే సినిమా పేరుతో విజయ్‌ దేవరకొండ ఓ మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది.  3. తమ్ముడు  1999లో వచ్చిన ‘తమ్ముడు’ (Thammudu) చిత్రం బిగ్గెస్ట్‌ హిట్ అందుకుంది. ఈ చిత్రం IMDBలో 7.9 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అన్న కలను నెరవేర్చే తమ్ముడిగా పవన్‌ కల్యాణ్‌ నటించాడు. ఇందులో పవన్‌ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాలేజీ స్టూడెంట్‌గా పవన్‌ పండించిన హాస్యం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రానికి P.A అరుణ్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహించాడు. ప్రీతి ఝూంగియాని, అదితి గోవరికర్ హీరోయిన్లుగా నటించారు.  4. జల్సా త్రివిక్రమ్‌ - పవన్‌ కల్యాణ్‌ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరి బంధానికి బీజం వేసిన చిత్రం మాత్రం ‘జల్సా’ (Jalsa). త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో 2008లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ అప్పట్లో యూత్‌ను ఉర్రూతలూగించింది. ఇందులో ఇలియానా హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ చిత్రానికి IMDB 7.4 రేటింగ్ ఇచ్చింది.  5. బద్రి పూరి జగన్నాథ్‌, పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మెుదటి సినిమా ‘బద్రి’ (Badri). ఈ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో పవన్‌ కల్యాణ్‌ చెప్పే డైలాగ్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్‌' అనే డైలాగ్‌ ప్రేక్షకులను పవన్‌కు మరింత దగ్గర చేసింది. ఈ చిత్రానికి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది.  6. అత్తారింటికి దారేది మాటల మంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో పవన్‌ నటించిన రెండో చిత్రం ‘అత్తారింటికి దారేది’ (Attarintiki daredi). ఈ మూవీకి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది. 2013లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. విడుదలకు ముందే ఈ సినిమా ఒరిజినల్‌ ప్రింట్‌ లీకైనప్పటికీ కలెక్షన్స్‌పై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. దీన్ని బట్టి ఫ్యాన్స్‌లో పవన్‌ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో సమంత, ప్రణీత కథానాయికలుగా నటించారు.  7. గోపాల గోపాల పవన్ కల్యాణ్‌, వెంకటేష్‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘గోపాల గోపాల’ (Gopala Gopala). బాలీవుడ్ చిత్రం 'ఓఎంజీ' (OMG)కి తెలుగు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. 2015లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేశ్‌ ప్రధాన పాత్ర పోషించగా.. పవన్‌ దేవుడిగా కనిపించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటు IMDB సైతం ఈ మూవీకి 7.2 రేటింగ్ ఇచ్చింది. తాజాగా విడుదలైన ‘బ్రో’ చిత్రంలోనూ పవన్‌ దేవుడిలా కనిపించడం విశేషం. 8. గబ్బర్‌ సింగ్‌ హిందీలో సల్మాన్‌ ఖాన్‌ చేసిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్‌గా ‘గబ్బర్‌ సింగ్’ (Gabbar singh) చిత్రం రూపొందింది. కథలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పవన్‌ తనదైన స్టైల్‌లో పోలీసు పాత్రను పోషించాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో  అభిమానుల చేత ఈలలు వేయించాడు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. కాగా, IMDB ఈ మూవీకి 7.1 రేటింగ్ ఇచ్చింది.  9. వకీల్‌సాబ్‌  వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన చిత్రం వకీల్‌ సాబ్‌ (Vakeel saab). హిందీ పింక్‌ చిత్రానికి ఇది రీమేక్‌. 2021లో కోర్టు రూమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్‌ లాయర్‌గా కనిపించాడు. ఇందులోనూ శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం IMDBలో 7.0 రేటింగ్‌ సంపాదించింది. 10. పంజా ‘పంజా’ (Panja) చిత్రాన్ని తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ రూపొందించారు. ఇందులో పవన్ స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. 2011లో విడుదలైన ఈ చిత్రంలో సారా జేన్‌, అంజలి  లవానియా హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రానికి IMDB 6.5 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద పంజా పెద్దగా ఆకట్టుకోలేకపోవడమే ఇందుకు కారణం. 
    జూలై 31 , 2023
    MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
    MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
    ఒకప్పుడు టాలీవుడ్‌ అనగానే ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్‌ కృష్ణ గుర్తుకువచ్చేవారు. కానీ చిరంజీవి (Chiranjeevi) రాకతో తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్‌కు ఎన్నో సూపర్‌ హిట్స్‌ అందించిన చిరు.. ఇండస్ట్రీలో అగ్రహీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తద్వారా తన ఫ్యామిలీలోని యువతరానికి ఇండస్ట్రీ తలుపులు తెరిచాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా హీరోల హవా నడుస్తోంది. ప్రతీ ఏడాది మెగా హీరోల నుంచి కనీసం ఒక సినిమా అయినా రావాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌ను శాసిస్తున్న మెగా హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.. పవన్‌ కల్యాణ్‌ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో ఒకరిగా క్రేజ్‌ సంపాదించాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (1996) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్‌.. సుస్వాగతం, తొలి ప్రేమ, ఖుషీ మూవీలతో అగ్రహీరోల సరసన చేరిపోయాడు. రీసెంట్‌గా పవన్‌ తీసిన వకీల్‌ సాబ్‌ (Vakeel saab), భీమ్లా నాయక్‌ (Bheemla Nayak) సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, హరిహర వీర మల్లు సినిమా షూటింగ్‌లలో పవన్‌ బిజీగా ఉన్నాడు.  రామ్‌చరణ్‌ చిరు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్‌చరణ్ (Ram Charan).. ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు. మెుదట చిరుత సినిమా ద్వారా చరణ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మగధీర సినిమాతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రంగస్థలం (Rangasthalam) సినిమాతో చెర్రీ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దానిని ఆర్‌ఆర్‌ఆర్‌ మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్‌ సినిమాలో చరణ్‌ నటిస్తున్నాడు. దాని తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్‌ సినిమా ఉండనుంది.  అల్లుఅర్జున్‌ చిరు మేనల్లుడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా అల్లుఅర్జున్‌ (Allu Arjun) సినిమాల్లోకి వచ్చారు. తొలి సినిమా ‘గంగోత్రి’తో బన్ని మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన ఆర్య, బన్నీ, దేశముదురు చిత్రాలతో హీరోగా అల్లుఅర్జున్ స్థిరపడ్డారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమాతో బన్నీ పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తెలుగు హీరోల్లో బన్నీ తొలిస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) షూటింగ్‌లో బన్నీ బిజీబిజీగా గడుపుతున్నాడు.  సాయిధరమ్‌ తేజ్‌ చిరంజీవి సోదరి కుమారుడైన సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కూడా మెగా మేనల్లుడుగానే ఇండస్ట్రీ తలుపు తట్టాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ (2014) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌, సుప్రీమ్‌, చిత్ర లహారి సినిమాల ద్వారా సూపర్‌ హిట్స్ అందుకున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ లేటెస్ట్‌ మూవీ విరూపాక్ష ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.  వరణ్‌ తేజ్‌  మెగా బ్రదర్‌ నాగబాబు కుమారుడిగా వరణ్‌ తేజ్‌(Varun Tej) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం ‘ముకుంద’తో తేజ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తేజ్‌ హీరోగా చేసిన కంచె, అంతరిక్షం, తొలిప్రేమ, ఫిదా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం తేజ్‌ VT13, గాంధీవదారి అర్జున సినిమాల్లో నటిస్తున్నాడు.  పంజా వైష్ణవ్‌ తేజ్‌ పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej) కూడా చిరు సోదరి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమా ఉప్పెనతోనే ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొండపొలం మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే రీసెంట్‌గా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా వైష్ణవ్‌కు షాక్‌ ఇచ్చింది. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.  అల్లు శిరీష్‌ చిరు మేనల్లుడిగా, బన్నీ తమ్ముడిగా అల్లు శిరీష్‌ (Allu Sirish) సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తొలి చిత్రం గౌరవంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్‌... ఒక క్షణం, ABCD, కొత్త జంట సినిమాలతో ఆకట్టుకున్నాడు. శిరీష్‌ చేసిన శ్రీరస్తూ శుభమస్తూ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. అయితే శిరీష్‌ లేటెస్‌ మూవీ ఊర్వశివో రాక్షసివో చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.  కళ్యాణ్‌ దేవ్‌ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. విజేత సినిమా ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణ్‌ దేవ్‌ పర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూపర్‌ మచ్చి, కిన్నెర సాని చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 
    ఏప్రిల్ 11 , 2023
    Rashi Khanna: టైట్‌ జాకెట్‌లో పెదవి కొరుకుతూ రెచ్చగొడుతున్న రాశి ఖన్నా..!
    Rashi Khanna: టైట్‌ జాకెట్‌లో పెదవి కొరుకుతూ రెచ్చగొడుతున్న రాశి ఖన్నా..!
    ప్రముఖ నటి రాశి ఖన్నా సోషల్‌ మీడియాలో మరింత రెచ్చిపోతోంది. తాజాగా కొన్ని ఫొటోలను షేర్‌ చేసిన రాశి తన ఎద అందాలతో నెటిజన్ల మత్తులో ముంచేసింది తాజా ఫొటోల్లో రాశి క్లివేజ్‌ లుక్‌లో కనిపించింది. ఒకేసారి ఎద, నడుము అందాలను ప్రదర్శించి ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది.   గతంలో కంటే ఇప్పుడు మరింత హాట్‌గా రాశి కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ అందానికి వరుస అవకాశాలు క్యూ కడతాయని పోస్టులు పెడుతున్నారు.  ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా తన అందం, అభినయంతో తెలుగు డైరెక్టర్ల దృష్టిలో పడింది.  జోరు, శివం, హైపర్‌, తొలి ప్రేమ, వరల్డ్‌ ఫేమస్ లవర్‌ వంటి చిత్రాల్లో నటించి రాశి మెప్పించింది. గతేడాది 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలతో రాశీ అలరించింది. తమిళంలోనూ తిరు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  రాశి ఖన్నా హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. మద్రాస్‌ కేఫ్‌ చిత్రం ద్వారా తొలిసారి ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తొలినాళ్లలో గ్లామర్ పాత్రలకు కాస్త దూరం పాటించిన రాశి గత కొంత కాలంగా ఆ హద్దులు చెరిపేసింది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌తో కలిసి రుద్ర వెబ్‌సిరీస్‌ రాశి ఖన్నా చేసింది. అంతకుముందు ఫర్జీ వెబ్‌సిరీస్‌లోను రాశి మెరిసింది.  ఇటీవల కాలంలో రాశి సినిమాల జోరు తగ్గింది. దీంతో తన అందాల ఆరబోత ద్వారా ఆఫర్లు దక్కించుకోవాలని రాశి చూస్తోంది. 
    ఏప్రిల్ 03 , 2023
    <strong>Celebrities Weddings &amp; Divorce: ఓవైపు పెళ్లిళ్లు మరోవైపు విడాకులు.. చిత్ర పరిశ్రమలో ఏంటీ విచిత్రం?</strong>
    Celebrities Weddings &amp; Divorce: ఓవైపు పెళ్లిళ్లు మరోవైపు విడాకులు.. చిత్ర పరిశ్రమలో ఏంటీ విచిత్రం?
    భారతీయ సమాజ వ్యవస్థలో వివాహం అనేది ఎంతో కీలకమైంది. పాశ్చాత్య దేశాలను భారత్‌ను ప్రధానంగా వేరు చేసే అంశాల్లో వివాహం కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. కలకాలం ఎంతో హాయిగా జీవించాలనే లక్ష్యంతో కొత్త జంట వైవాహిక బంధంలోకి అడుగుపెతుంటారు. చిత్ర పరిశ్రమలోనూ చాలా మంది సెలబ్రిటీలు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు ఏది చేసినా అది సెన్సేషన్ అయిపోతుంటుంది. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌ చేసినా, పెళ్లి చేసుకున్నా లేదా విడాకులు తీసుకున్నా అవి వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటాయి. కొన్ని దశాబ్దాల చిత్ర పరిశ్రమ చరిత్ర తీసుకుంటే పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీల కంటే విడిపోయే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. తాజాగా స్టార్‌ హీరో సిద్ధార్థ్‌, అదితిరావు హైదరి వివాహం చేసుకున్న నేపథ్యంలో ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది.&nbsp; [toc] వైభవంగా సిద్ధార్థ్‌ వివాహం నటుడు సిద్ధార్థ్‌ (Siddharth), నటి అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ అదు సిద్ధు’ అని అదితి క్యాప్షన్‌ జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. మహా సముద్రం షూటింగ్‌లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది క్రమేణా ప్రేమగా మారింది. ఎక్కడ చూసిన ఈ ఇద్దరు తారలు జంటగా కనిపించేవారు. దీంతో వీరి పెళ్లిపై చాలా కాలం నుంచే రూమర్లు వచ్చాయి. తాజాగా పెళ్లి చేసుకొని ఆ రూమర్లకు సిద్ధార్థ్‌ - అదితి జంట చెక్‌ పెట్టింది.  https://twitter.com/UnrealAkanksha/status/1835569675968602477 ఓవైపు పెళ్లిళ్లు.. యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రముఖ నటి శోభితా దూళిపాళను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవలేే ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. చైతూ తండ్రి అక్కినేని నాగార్జున తొలిసారి వీరి నిశ్చితార్థ ఫొటోలను నెట్టింట షేర్‌ చేయడంతో విషయం బయటకు వచ్చింది. యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం కూడా ఇటీవల వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే చైతన్య గతంలో స్టార్‌ హీరోయిన్‌ సమంతను వివాహం చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు.  ‘రాజావారు రాణిగారు’ చిత్రంలో తనకు జోడీగా చేసిన రహస్య గోరఖ్‌ను ఇటీవల పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. గతేడాది మెగా హీరో వరుణ్‌ తేజ్‌,  హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి అంగరంగ వైభంగా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకొని ఈ జంట ఆకట్టుకుంది.  https://twitter.com/iamnagarjuna/status/1821450886238851531 https://twitter.com/AadhanTelugu/status/1826816125809647850 మరోవైపు విడాకులు ఓవైపు సెలబ్రిటీలు ఎంత ఫాస్ట్‌గా వివాహం చేసుకుంటున్నారో అదే విధంగా తమ భాగస్వామికి విడాకులు ప్రకటిస్తూ షాక్ ఇస్తున్నారు. రీసెంట్‌గా తమిళ స్టార్‌ నటుడు జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచాడు. తనకు తెలియకుండానే విడాకులపై అనౌన్స్‌మెంట్‌ చేశారని ఆయన భార్య ఆర్తి అతడిపై మండిపడటంతో ఈ వ్యవహారంలో ట్విస్ట్ ఏర్పడింది. ఇటీవల తమిళ స్టార్ హీరో ధనుష్‌ తన భార్య, రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రముఖ నటుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ జి.వి. ప్రకాష్‌ కూడా పదేళ్ల వైవాహిక బంధానికి చెక్‌ పెట్టి తన భార్య, సింగర్‌ సైంధవికి విడాకులు ఇచ్చారు. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల కూడా గతేడాది తన భర్త చైతన్య జొన్నలగడ్డకు విడాకులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే పెళ్లిచేసుకోవడం, విడిపోవడం ‌అనేది వారి వ్యక్తిగత విషయాలే అయినప్పటికీ గతంతో పోలిస్తే ఇవి ఎక్కువ కావడం చర్చకు తావిస్తోంది.  గతంలో విడాకులు తీసుకున్న పాపులర్‌ సెలబ్రిటీలు నాగార్జున - లక్ష్మీ దగ్గుబాటి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మెుదట రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు ఆమె సినీ హీరో వెంకటేష్ (Venkatesh), నిర్మాత సురేష్ బాబుల సోదరి. వీరి సంతానంగా నాగచైతన్య జన్మించగా ఆరేళ్ల వివాహ బంధానికి వీరు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత లక్ష్మీ అమెరికా వెళ్లిపోగా నాగార్జున రెండేళ్ల తర్వాత అమలతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా అక్కినేని అఖిల్ జన్మించాడు. అక్కినేని కుటుంబంలో ఇది మొదటి విడాకుల వ్యవహారం. పవన్‌ కల్యాణ్‌ - రేణూ దేశాయ్‌ పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ తన వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. తొలి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి రేణూ దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారు. రష్యాకు చెందిన అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఆమెతో జీవిస్తున్నారు.&nbsp; సుమంత్‌ - కీర్తి రెడ్డి నాగార్జున మేనల్లుడు సురేంద్ర యార్లగడ్డ -సత్యవతిల కుమారుడైన నటుడు సుమంత్ (Sumanth) కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగా ‘తొలి ప్రేమ’ ఫేమ్‌ హీరోయిన్‌ కీర్తి రెడ్డిని ప్రేమించి 2004 ఆగస్టులో వివాహం చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ రెండేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి బెంగళూరు వెళ్లి సెటిల్ కాగా సుమంత్ మాత్రం అప్పటి నుంచి సింగిల్‌గానే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీగా మారుతున్నారు. అమీర్ ఖాన్ - కిరణ్ రావు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్ ఖాన్ తన మొదటి భార్యతో విడాకుల తర్వాత డిసెంబరు 28, 2015న కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వారికి ఆజాద్ రావు ఖాన్ అనే అబ్బాయి ఉన్నాడు. 16 సంవత్సరాల వివాహ బంధం తర్వాత 2021లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు.&nbsp; మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ అర్బాజ్ ఖాన్, నటి మలైకా అరోరా 1998లో వివాహం చేసుకున్నారు. వారికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు 2002లో జన్మించాడు. ఈ జంట 28 మార్చి 2016న విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 మే 2017న అధికారికంగా విడాకులు తీసుకున్నారు. హృతిక్ రోషన్ - సుసానే ఖాన్ బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్ రోషన్‌, సుస్సేన్ 20 డిసెంబర్ 2000న వివాహం చేసుకున్నారు. 14 సంవత్సరాల వివాహం తర్వాత ఈ జంట 2014లో పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు. కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్ కరిష్మా, సంజయ్ 2003లో వివాహం చేసుకున్నారు. అనేక విభేదాలు, ఆరోపణల కారణంగా ఈ జంట 2014లో అధికారికంగా విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైఫ్​ అలీఖాన్​ - అమృతా సైఫ్ అలీఖాన్ 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్​ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2004లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. భరణంగా అమృతాకు ఆస్తిలో సగం వాటా ఇచ్చారు. ఆ తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్‏ను రెండో వివాహం చేసుకున్నారు. సంజయ్‌ దత్‌ - రిచా శర్మ 1987లో నటి రిచా శర్మతో సంజయ్​ దత్​ వివాహం జరిగింది. 1996లో రిచా బ్రెయిన్ ట్యూమర్‏తో మృతి చెందింది. వీరికి త్రిషాలా కూతురు. 1998లో మోడల్ రియా పిళ్లైతో రెండో పెళ్లి జరిగింది. 2005లో విడాకులు తీసుకున్నారు. 2008లో మాన్యతా దత్​ను గోవాలో మూడో పెళ్లి చేసుకున్నారు సంజయ్.&nbsp;
    సెప్టెంబర్ 16 , 2024
    <strong>Divorces in Akkineni Family: అక్కినేని ఫ్యామిలీలో ఇంత మంది విడాకులు తీసుకున్నారా?</strong>
    Divorces in Akkineni Family: అక్కినేని ఫ్యామిలీలో ఇంత మంది విడాకులు తీసుకున్నారా?
    టాలీవుడ్‌ నటుడు అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), ప్రముఖ నటి శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. తాజాగా వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. అక్కినేని నాగార్జున తన కుమారుడికి ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయాన్ని స్వయంగా ప్రకటించడంతో ఈ వార్త నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. అయితే స్టార్‌ హీరోయిన్‌ సమంతను గతంలో నాగచైతన్య వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. నాగ చైతన్య తాజా ఎంగేంజ్‌మెంట్‌ నేపథ్యంలో ఈ డివోర్స్‌ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. అక్కినేని కుటుంబాలకు వివాహాలు అసలు కలిసి రావడం లేదన్న చర్చ కూడా నెట్టింట వినిపిస్తోంది. అక్కినేని ఫ్యామిలీలోని దాదాపు నాలుగు జంటలు విడాకుల తీసుకున్న విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; అక్కినేని ఫ్యామిలీ అక్కినేని నాగచైతన్య - సమంత విడాకుల వ్యవహారానికి ముందే ఆ ఫ్యామిలోలో నాలుగు జంటలు విడాకులు తీసుకున్నాయి. నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరావు. అన్నపూర్ణమ్మ దంపతులకు ఐదుగురు సంతానం కాగా వారిలో ఒకరైనా అక్కినేని నాగార్జున హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్‌ నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మించారు. కూతురు సత్యవతి పిల్లలైన సుమంత్‌, సుప్రియ ఇద్దరూ కూడా తెలుగు సినీ పరిశ్రమకు సుపరిచితమే. మరో కూతురు నాగసుశీల కుమారుడు సుశాంత్‌ కూడా ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నాడు.&nbsp; https://twitter.com/iam_strganesh/status/1821881385251991843 నాగార్జున విడాకులు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మెుదట రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు ఆమె సినీ హీరో వెంకటేష్ (Venkatesh), నిర్మాత సురేష్ బాబుల సోదరి. వీరి సంతానంగా నాగచైతన్య జన్మించగా ఆరేళ్ల వివాహ బంధానికి వీరు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత లక్ష్మీ అమెరికా వెళ్లిపోగా నాగార్జున రెండేళ్ల తర్వాత అమలతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా అక్కినేని అఖిల్ జన్మించాడు. అక్కినేని కుటుంబంలో ఇది మొదటి విడాకుల వ్యవహారం. సుమంత్‌ విడాకులు నాగార్జున మేనల్లుడు సురేంద్ర యార్లగడ్డ -సత్యవతిల కుమారుడైన నటుడు సుమంత్ (Sumanth) కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగా ‘తొలి ప్రేమ’ ఫేమ్‌ హీరోయిన్‌ కీర్తి రెడ్డిని ప్రేమించి 2004 ఆగస్టులో వివాహం చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ రెండేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి బెంగళూరు వెళ్లి సెటిల్ కాగా సుమంత్ మాత్రం అప్పటి నుంచి సింగిల్‌గానే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీగా మారుతున్నారు. సుప్రియా జీవితంలో విషాదం సుమంత్ సోదరి సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) కూడా దాదాపు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా పరిచయమైన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో సుప్రియ హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే ఆ తర్వాత ఆమె నటనకు దూరమై ఎక్కువగా సినీ నిర్మాణ కార్యకలాపాలలో భాగమైంది. ఈ క్రమంలోనే ఆమె చరణ్ రెడ్డి అనే నటుడిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది. అయితే వీరి వివాహం కూడా ఎక్కువ రోజులు సాఫీగా సాగలేదు. కొన్నాళ్లకు చరణ్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు.&nbsp; అఖిల్‌ నిశ్చితార్థం రద్దు అక్కినేని నాగచైతన్య సమంతల వివాహం కంటే ముందే అక్కినేని అఖిల్ (Akhil Akkineni) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. రామ్ చరణ్ భార్య ఉపాసన బంధువు అయినా శ్రియ భూపాల్‌తో అఖిల్‌కు నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళలేదు. కొన్ని కారణాలతో అఖిల్‌-శ్రియ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలో శ్రియ భూపాల్ మరో యువకుడిని పెళ్లి చేసుకోగా అఖిల్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.&nbsp; నాగ చైతన్య - సమంత డివోర్స్ 2017లో నాగ చైత‌న్య‌, స‌మంత గోవాలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. 2010లో ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఏర్పడిన పరిచయం ఆపై ప్రేమగా మారింది. ఏడేళ్ల లవ్‌ తర్వాత వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వివాహం తర్వాత టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌గా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అటువంటిది అనూహ్యంగా 2021లో ఈ జంట విడాకుల‌ు తీసుకొని ఫ్యాన్స్‌తో పాటు యావత్‌ సినీ లోకాన్ని షాక్‌కు గురి చేసింది. ఆ స‌మ‌యంలో అంద‌రూ స‌మంత‌నే పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. పెళ్లి త‌ర్వాత స‌మంత బోల్డ్ రోల్స్ చేయడమే విడాకుల‌కు కార‌ణ‌మైంద‌ని కొంద‌రు నిందించారు. 
    ఆగస్టు 10 , 2024
    Rashi Khanna: జాకెట్‌ విప్పి హద్దులు దాటిన రాశీ ఖన్నా..&nbsp; చూసి తట్టుకోవడం కష్టమే!
    Rashi Khanna: జాకెట్‌ విప్పి హద్దులు దాటిన రాశీ ఖన్నా..&nbsp; చూసి తట్టుకోవడం కష్టమే!
    టాలీవుడ్‌ బ్యూటీ రాశీ ఖన్నా (Rashi Khanna) తన బోల్డ్‌ ఫొటోలను షేర్‌ చేసి సోషల్‌మీడియాను తన వైపు తిప్పుకుంది.&nbsp; తాజా ఫొటోల్లో రాశీ తన హద్దులను చెరిపేసింది. జాకెట్‌ విప్పేసి మరి లోదుస్తుల్లో దర్శనం ఇచ్చింది. ఈ హాట్‌ ట్రీట్‌తో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.&nbsp; రాశీ ఖన్నా క్లీవేజ్‌ షోకు నెట్టింట భారీ స్పందన వస్తోంది. ఆమె లేటెస్ట్‌ పిక్స్‌కు పెద్ద ఎత్తున లైక్స్, షేర్లు వస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీ పేరు&nbsp; #RaashiiKhanna హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతోంది.&nbsp; గతంలో కంటే రాశీ మరింత హాట్‌గా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ అందానికి వరుస అవకాశాలు క్యూ కడతాయని పోస్టులు పెడుతున్నారు.&nbsp; సౌత్ నుంచి నార్త్ వరకూ వరుస సినిమాలతో సత్తా చాటిన రాశీ ఖన్నా.. ఇటీవల తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలు చేసింది.&nbsp; కానీ, ఆ రెండూ డిజాస్టర్‌గా మిగలడంతో ఈ బ్యూటీ (#RaashiiKhanna)కి భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో ఇటీవల పెద్ద సినిమా ప్రాజెక్టులు ఏవి ఆమె వద్దకు వెళ్లలేదు. అటు తమిళంలో రీసెంట్‌గా 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్' చిత్రాల్లో ఈ బ్యూటీ నటించింది. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే సినిమాలో మెరిసింది.&nbsp; ప్రస్తుతం టాలీవుడ్‌లో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) సరసన ఓ సినిమాలో రాశీ నటిస్తోంది. ఈ చిత్రానికి నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. రాశీతో పాటు శ్రీనిధి శెట్టి కూడా ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే హిందీలో ఈ చిన్నది 'యోధ' అనే సినిమాలో నటిస్తోంది.&nbsp; తమిళంలో 'అరన్మనై 4', 'మేథావి' అనే చిత్రాలతో రాశీ బిజీ బిజీగా ఉంది.&nbsp; కెరీర్‌ ప్రారంభంలో ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా&nbsp; (Rashi Khanna) తన అందం, అభినయంతో తెలుగు డైరెక్టర్ల దృష్టిలో పడింది.&nbsp; జోరు, శివం, హైపర్‌, తొలి ప్రేమ, వరల్డ్‌ ఫేమస్ లవర్‌ వంటి చిత్రాల్లో నటించి రాశి (#RaashiiKhanna) మెప్పించింది. రాశి ఖన్నా హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. మద్రాస్‌ కేఫ్‌ చిత్రం ద్వారా తొలిసారి ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌తో కలిసి రుద్ర (Rudra Series) వెబ్‌సిరీస్‌ రాశి ఖన్నా చేసింది. అంతకుముందు ఫర్జీ సిరీస్‌లోను రాశి మెరిసింది.&nbsp; ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా మూవీలు చేస్తోన్న రాశీ ఖన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది.&nbsp; ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా ఫ్యాన్స్‌కు షేర్‌ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు ఎన్నో హాట్ ఫొటోలను కూడా నెటిజన్లతో పంచుకుంటోంది. దీంతో ఈ అమ్మడు నెట్టింట తరచూ హైలెట్‌ అవుతూనే వస్తోంది.&nbsp;
    జనవరి 30 , 2024
    <strong>Love Reddy Review: ఒకే కులమైనా ప్రేమకు పరువు అడ్డొస్తే.. ‘లవ్‌ రెడ్డి’ పరిస్థితి ఏంటి?</strong>
    Love Reddy Review: ఒకే కులమైనా ప్రేమకు పరువు అడ్డొస్తే.. ‘లవ్‌ రెడ్డి’ పరిస్థితి ఏంటి?
    నటీనటులు : అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి, ఎన్‌.టి. రామస్వామి, గణేష్‌ డి.ఎస్‌, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ తదితరులు రచన, దర్శకత్వం : స్మరణ్‌ రెడ్డి సంగీతం : ప్రిన్స్‌ హెన్రీ సినిమాటోగ్రఫీ : మోహన్‌ చారీ, అస్కర్‌ అలీ ఎడిటర్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు నిర్మాత : హేమలతా రెడ్డి విడుదల తేదీ: 18-10-2024 అంజన్‌ రామచంద్ర, శ్రావణిరెడ్డి కీలక పాత్రల్లో స్మరన్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌రెడ్డి’ (Love Reddy Movie Review). ఎన్‌.టి. రామస్వామి, గణేష్‌ డి.ఎస్‌, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను రిలీజ్‌ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల వచ్చిన ట్రైలర్‌ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ క్రమంలో అక్టోబరు 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి నారాయణ రెడ్డి (అంజన్‌ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్‌ చేస్తుంటాడు. ఓ రోజు బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా మారిపోతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. లవ్‌రెడ్డిపై ఇష్టం ఉన్నప్పటికీ దివ్య ఎందుకు రిజెక్ట్‌ చేసింది? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్‌ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ‘లవ్‌రెడ్డి’ సినిమాలో నటించినవారంతా కొత్త వాళ్లే. భగ్నప్రేమికుడు నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర ఒదిగిపోయాడు. తొలి సినిమానే అయినా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి న్యాయం చేసింది. హీరోయిన్‌ తండ్రిగా చేసిన ఎన్‌.టి రామస్వామి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్ట్‌ మెప్పిస్తుంది. హీరోని ఇష్టపడే అమ్మాయి స్వీటీగా జ్యోతి మదన్‌ కొన్ని చోట్ల నవ్వులు పూయించారు. హీరో తమ్ముడిగా చేసిన నటుడుతో పాటు ఇతర పాత్రదారులు తమ పరిధిమేరకు మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే&nbsp; పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా దర్శకుడు స్మరణ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటిన్ స్టోరీనే అయినప్పటికీ ఆంధ్రా - కర్ణాటక నేటివిటితో చాలా సహజంగా తెరకెక్కించారు. పెళ్లి చూపుల సీన్‌తో సినిమాను ప్రారంభించిన డైరెక్టర్‌, హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత నుంచి కథను ఆసక్తికరంగా మార్చారు. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా అనిపిస్తాయి. లవ్‌ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా? లేదా? అన్న క్యూరియాసిటీతోనే ఫస్టాఫ్‌ గడిచిపోతుంది. సెకండాఫ్‌లో హీరో ప్రేమను రిజెక్ట్ చేయడం, అందుకు చెప్పిన కారణం నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా నడిపారు దర్శకుడు. క్లైమాక్స్‌తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే&nbsp; ప్రిన్స్‌ హేన్రి సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నటీ నటులుభావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ స్టోరీఫస్టాఫ్‌లో సాగదీత సీన్స్ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 18 , 2024
    Premalu Movie: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న మలయాళ చిత్రం.. ‘ప్రేమలు’ సక్సెస్‌ వెనక రాజమౌళి!
    Premalu Movie: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న మలయాళ చిత్రం.. ‘ప్రేమలు’ సక్సెస్‌ వెనక రాజమౌళి!
    దేశంలో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. గత కొన్ని నెలలుగా ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ‘ప్రేమలు’ (Premalu) కూడా దేశవ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్ చేస్తోంది. గత నెలలో మలయాళంలో రిలీజైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. మార్చి 8న తెలుగులోనూ ఈ సినిమా విడుదలైంది. రాజమౌళి తనయుడు తెలుగులో ఈ సినిమాను రిలీజ్‌ చేయగా.. రికార్డ్‌ కలెక్షన్స్ సాధిస్తోంది. టాలీవుడ్‌లో తొలి పది రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘ప్రేమలు’ వరల్డ్‌వైడ్‌ కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి? ఓటీటీలోకి ఎప్పుడు రానుంది? ‘ప్రేమలు’ కథ ఏంటి? వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. వరల్డ్‌ వైడ్‌గా రికార్డ్‌ కలెక్షన్స్‌ మలయాళం సెన్సేషన్‌ ‘ప్రేమలు’ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. మలయాళ వెర్షన్‌లో వరల్డ్‌ వైడ్‌గా ఇప్పటివరకూ రూ.117 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది. ఆ ఇండస్ట్రీలో హైయస్ట్‌ గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించిన చిత్రాల్లో ‘ప్రేమలు’ ఐదో స్థానంలో నిలవడం విశేషం. కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను డబ్ చేశారు. https://twitter.com/TheNewsDome/status/1769981699675611495?s=20 చరిత్ర సృష్టించిన ‘ప్రేమలు’ దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో ఈ సినిమాను రిలీజ్‌ చేయడంతో ఈ సినిమాపై బజ్‌ ఏర్పడింది. మార్చి 8న తెలుగు వెర్షన్‌లో రిలీజైన ఈ చిత్రం.. తొలి పది రోజుల్లో&nbsp; రూ.10.54 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది. ఒక మలయాళ డబ్బింగ్‌ చిత్రం తెలుగులో మెుదటి పది రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టడం ఇదే తొలిసారి. ఈ చిత్రం విడుదలై పది రోజులు దాటినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ఈ సినిమా హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో&nbsp; ప్రదర్శితమవడం ఆశ్చర్యపరుస్తోంది.&nbsp; సక్సెస్‌ వెనక రాజమౌళి! ‘ప్రేమలు’ చిత్రం ఈ స్థాయిలో తెలుగులో విజయవంతం కావడం వెనక దర్శకధీరుడు రాజమౌళి ప్రమేయం ఉంది. ఆయన కుమారుడు స్వయంగా ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేయడంతో మూవీ ప్రమోషన్స్‌ బాధ్యతను రాజమౌళి తీసుకున్నారు. రాజమౌళి లాంటి ప్రపంచస్థాయి దర్శకుడు ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగం కావడంతో.. తెలుగు ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. అలాగే మహేష్‌ బాబు, అనిల్‌ రావిపూడి వంటి సినీ ప్రముఖులు ‘ప్రేమలు’పై ప్రశంసలు కురిపించడం కూడా కలెక్షన్స్‌పై ప్రభావం చూపించింది. ఎటు చూసిన ప్రేమలు గురించి పాజిటివ్‌ రెస్పాన్స్ రావడంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ సినిమా 10 రోజులు దాటినా విజయవంతంగా రన్‌ అవుతోంది.&nbsp; ఓవర్సీస్‌లోనూ ప్రభంజనం ప్రేమలు చిత్రం తెలుగు వెర్షన్‌.. ఓవర్సీస్‌లోనూ అత్యధిక కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. మలయాళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా అత్యధిక డాలర్లను వసూళ్లు చేయడం విశేషం. ఈ సినిమా ఇప్పటివరకూ 3 లక్షల డాలర్లు రాబట్టినట్లు మేకర్స్‌ ఓ పోస్టర్‌ ద్వారా తెలియజేశారు. రెండో వారంలోనూ అత్యధిక వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతున్నట్లు ప్రకటించారు.&nbsp; ఓటీటీలోకి ఎప్పుడంటే? ప్రేమ‌లు మూవీ డిజిట‌ల్ హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ (Disney + Hotstar) సొంతం చేసుకుంది. మార్చి 29 నుంచి ఈ యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప్రేమ‌లు రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. తొలుత ఈ సినిమాను మార్చి ఫ‌స్ట్ వీక్‌లోనే ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని డిస్నీ హాట్‌స్టార్ ప్లాన్ చేసింది. ప్రేమ‌లు తెలుగు వెర్ష‌న్ మార్చి 8న, త‌మిళ వెర్ష‌న్ మార్చి 15న థియేటర్లలో రిలీజ్ కావడంతో ఈ సినిమా ఓటీటీ విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తోంది.&nbsp; ప్రేమలు కథేంటి? ‘ప్రేమ‌లు’ సినిమాను దర్శకుడు గిరీష్‌.. హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించాడు. కథలోకి వెళ్తే.. స‌చిన్ ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. కానీ వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. ఓ వేడుక‌లో అత‌డికి రీనూ ప‌రిచ‌యం అవుతుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు స‌చిన్‌. అప్ప‌టికే ల‌వ్‌లో ఓ సారి ఫెయిలైన స‌చిన్‌. .రీనుకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనును ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? భిన్న మ‌న‌స్త‌త్వాలు, ఆలోచ‌న‌లు క‌లిగిన స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు ఒక్క‌ట‌య్యారా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.&nbsp;
    మార్చి 19 , 2024
    అనుపమ పరమేశ్వరన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అనుపమ పరమేశ్వరన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    తక్కువ టైంలో స్టార్ హీరోయిన్‌గు గుర్తింపు పొందిన కథానాయికల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తొలి సినిమా ప్రేమమ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.&nbsp; టాలీవుడ్‌లో 'అ ఆ' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఉన్నది ఒక్కటే జీందగి, హలో గురు ప్రేమకోసమే, కార్తికేయ2 వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కొద్దికాలం పాటు పద్దతిగా నటించిన ఈ కేరళ అందం.. ప్రస్తుతం బోల్డ్ క్యారెక్టర్లలో నటిస్తోంది. మరి అనుపమ పరమేశ్వరన్ గురించి అభిమానులకు తెలియని కొన్ని (Some Lesser Known Facts about Anupama Parameswaran) ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.&nbsp; అనుపమ పరమేశ్వరన్ ముద్దు పేరు? అను అనుపమ పరమేశ్వరన్ ఎప్పుడు పుట్టింది? 1996, ఫిబ్రవరి 18న జన్మించింది అనుపమ పరమేశ్వరన్ తొలి సినిమా? ప్రేమమ్(2015) అనుపమ పరమేశ్వరన్ తెలుగులో నటించిన తొలి సినిమా? అఆ(2016) అనుపమ పరమేశ్వరన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 2 అంగుళాలు&nbsp; అనుపమ పరమేశ్వరన్ ఎక్కడ పుట్టింది? ఇరింజలకుడ, కేరళ అనుపమ పరమేశ్వరన్&nbsp; ఏం చదివింది? ఇంగ్లీష్‌లో పీజీ చదివింది అనుపమ పరమేశ్వరన్ అభిరుచులు? షాపింగ్, ట్రావెలింగ్ అనుపమ పరమేశ్వరన్‌కి ఇష్టమైన ఆహారం? తాయ్, ఇండియన్ వంటకాలు అనుపమ పరమేశ్వరన్‌కు అఫైర్స్ ఉన్నాయా? క్రికెటర్ జాస్ప్రిత్ బుమ్రా, ఫిల్మ్ మేకర్ చిరంజీవ్ మక్వానాతో అఫైర్స్ ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. అనుపమ పరమేశ్వరన్‌కు&nbsp; ఇష్టమైన కలర్ ? వైట్ అనుపమ పరమేశ్వరన్‌కు ఇష్టమైన హీరో? అల్లు అర్జున్&nbsp; అనుపమ పరమేశ్వరన్‌ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల&nbsp; వరకు ఛార్జ్ చేస్తోంది. అనుపమ పరమేశ్వరన్‌ తల్లిదండ్రుల పేరు? సునిత, పరమేశ్వరన్ ఎరక్‌నాథ్ అనుపమ పరమేశ్వరన్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/anupamaparameswaran96/?hl=en&amp;img_index=3 అనుపమ పరమేశ్వరన్‌ గురించి మరికొన్ని విషయాలు అనుపమ పెట్ లవర్, ఆమె పెంపుడు కుక్క పేరు విస్కీ అనుపమ ఖాళీ సమయంలో పేయింటింగ్ వేస్తుంది https://www.instagram.com/p/CH9oMWjJeJJ/?utm_source=ig_web_copy_link దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ వెంచర్‌లో ‘మనియారయెల్లి’(2019) అశోకన్ చిత్రానికి అనుపమ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. https://www.youtube.com/watch?v=Zl0QJwSnKtA
    ఏప్రిల్ 05 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌&nbsp; ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; 2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది.&nbsp;ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best&nbsp; Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) &amp; గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:&nbsp; నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ&nbsp; నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ&nbsp; అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా&nbsp; మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన&nbsp; సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని&nbsp; ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.&nbsp; ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    <strong>Viral Video: సినిమా చూసి నటుడిపై మహిళ దాడి.. వీడియో వైరల్‌&nbsp;</strong>
    Viral Video: సినిమా చూసి నటుడిపై మహిళ దాడి.. వీడియో వైరల్‌&nbsp;
    అంజ‌న్ రామ‌చంద్ర‌, శ్రావ‌ణి హీరో హీరోయిన్లుగా న‌టించిన లేటెస్ట్‌ చిత్రం 'లవ్‌ రెడ్డి' (Love Reddy). గ‌త వారం థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ, క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే కలెక్షన్స్‌ పరంగా ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో ఫెయిల్యూర్‌ మీట్‌ పేరుతో చిత్ర బృందం థియేటర్లకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ ధియేటర్‌కు వెళ్లిన మూవీ యూనిట్‌కు ఊహించని ఘటన ఎదురైంది. బృందంలోని నటుడిపై ఓ మహిళ దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది.&nbsp; దాడి ఎందుకు జరిగిందంటే? లవ్‌ రెడ్డి చిత్రానికి హిట్‌ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్స్ రాకపోవడంతో చిత్ర బృందం వినూత్న నిర్ణయం తీసుకుంది. 'బ్లాక్‌ బాస్టర్‌ బట్‌ ఫెయిల్యూర్‌ మీట్‌' పేరుతో వినూత్న ఈవెంట్‌ను ప్రారంభించింది. సినిమా ఆడుతున్న థియేటర్లను విజిట్‌ చేస్తూ అభిమానుల రెస్పాన్స్‌ను తెలుసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ నిజాంపేటలోని జీపీఆర్‌ మాల్‌కు 'లవ్‌ రెడ్డి' బృందం వెళ్లింది. అప్పుడే ఆ సినిమాలో క్లైమాక్స్‌ సీన్‌ రన్‌ అవుతోంది. హీరోయిన్‌ ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి (ఎన్‌.టీ రామస్వామి) కూతుర్ని రాయితో కొడతాడు. ఆ సీన్‌ చూసి ఆగ్రహంతో ఊగిపోయిన థియేటర్‌లోని మహిళ, తండ్రి పాత్ర పోషించిన నటుడిపై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ హఠత్‌ పరిణామంతో అక్కడి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇది కేవలం సినిమానే అని నిజం కాదంటూ సదరు మహిళకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.&nbsp; https://twitter.com/telugu_insider/status/1849700707248767217 ‘లవ్‌ రెడ్డి’ ఎలా ఉందంటే పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా దర్శకుడు స్మరణ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటిన్ స్టోరీనే అయినప్పటికీ ఆంధ్రా - కర్ణాటక నేటివిటితో చాలా సహజంగా తెరకెక్కించారు. పెళ్లి చూపుల సీన్‌తో సినిమాను ప్రారంభించిన డైరెక్టర్‌, హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత నుంచి కథను ఆసక్తికరంగా మార్చారు. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా అనిపిస్తాయి. లవ్‌ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా? లేదా? అన్న క్యూరియాసిటీతోనే ఫస్టాఫ్‌ గడిచిపోతుంది. సెకండాఫ్‌లో హీరో ప్రేమను రిజెక్ట్ చేయడం, అందుకు చెప్పిన కారణం నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా నడిపారు దర్శకుడు. క్లైమాక్స్‌తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి. కథ ఏంటంటే నారాయణ రెడ్డి (అంజన్‌ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్‌ చేస్తుంటాడు. ఓ రోజు బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా మారిపోతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. లవ్‌రెడ్డిపై ఇష్టం ఉన్నప్పటికీ దివ్య ఎందుకు రిజెక్ట్‌ చేసింది? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్‌ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; https://telugu.yousay.tv/love-reddy-review-if-even-a-single-caste-hinders-love-what-is-the-situation-of-love-reddy.html
    అక్టోబర్ 25 , 2024
    <strong>Dhoom Dhaam Review: ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అద్దం పట్టిన ‘ధూం ధాం’.. మరి హిట్‌ కొట్టినట్లేనా?</strong>
    Dhoom Dhaam Review: ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అద్దం పట్టిన ‘ధూం ధాం’.. మరి హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు : చేతన్ కృష్ణ, చేతన్ మద్దినేని, వెన్నెల కిషోర్, సాయికుమార్, వినయ్ వర్మ, ప్రవీణ్, నవీన్ నేని, గోపరాజు రమణ తదితరులు. దర్శకత్వం :&nbsp; సాయి కిషోర్ మచ్చా సంగీతం:&nbsp; గోపీ సుందర్&nbsp; సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి నిర్మాత : ఎం.ఎస్‌ రామ్ కుమార్&nbsp; విడుదల తేదీ: నవంబర్‌ 8, 2024 చేతన్ మద్దినేని (Chetan Maddineni), హెబ్బా పటేల్ (Hebah Patel) జంటగా చేసిన తాజా చిత్రం ‘ధూం ధాం’ (Dhoom Dhaam Review). సాయి కిశోర్ మచ్చ దర్శకుడు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎం.ఎస్ రామ్ కుమార్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను మెప్పిందించిందా? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; కథేంటి కార్తిక్‌ (చేతన్ మద్దినేని)కు తన తండ్రి రామరాజు (సాయికుమార్‌) అంటే చాలా ఇష్టం. నాన్నపై విపరీతమైన ప్రేమాభిమానాలను చూపిస్తుంటాడు. అటు రామరాజు సైతం కొడుకుపై అంతే ప్రేమ చూపిస్తుంటాడు. ఏ విషయాన్నైనా ఇద్దరు పంచుకుంటారు. ఇదిలా ఉంటే ఓ రోజు సుహానా (హెబ్బా పటేల్‌)ను చూసి కార్తిక్‌ తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ, ఆమె పట్టించుకోదు. కోపంతో పోలాండ్‌కు వెళ్తాడు. అక్కడికి వెళ్లిన సుహానా తిరిగి కార్తిక్‌ ప్రేమను దక్కించుకుంటుంది. మరోవైపు కార్తీక్‌కు సుహానా పెద్దనాన్న (రామరాజు), అతడి తమ్ముడు (బెనర్జి)తో వైరం ఉంటుంది. కార్తీక్‌ను చంపాలని వారు చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? సుహానా ఫ్యామిలీతో కార్తిక్‌కు వైరం ఎందుకు వచ్చింది? కార్తీక్‌ వాటిని ఎలా పరిష్కరించాడు? చివరికీ సుహానా - కార్తిక్‌ ఒక్కటయ్యారా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే హీరో కార్తిక్‌ పాత్రలో చేతన్‌ కృష్ణ పర్వాలేదనిపించాడు. నటన పరంగా గతంతో పోలిస్తే పరిణితి చూపించాడు. అయితే ఎక్స్‌ప్రెషన్స్‌ విషయంలో మరింత వర్క్‌ చేసి ఉంటే బాగుండేది. కీలక సన్నివేశాల్లో అతడి నటన తేలిపోయింది. ఇక హీరోయిన్‌ సుహానా పాత్రలో హెబ్బా పటేల్ ఎప్పటిలాగే మెప్పించింది. చాలా రోజుల తర్వాత కమర్షియల్ పాత్రలో ఆమె ఆకట్టుకుంది. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. వీరిద్దరి జోడి బాగా కుదిరింది. హీరో కజిన్‌గా సుహాస్‌ పాత్రలో వెన్నెల కిషోర్ అదరగొట్టాడు. అతడి కామెడీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. వీరితోపాటు సాయికుమార్‌, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్‌, ప్రవీణ్‌, గిరిధర్‌ తదిరులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు సాయికిషోర్‌ మచ్చా ఎంచుకున్న కథ సాదాసీదాగా ఉంది. అయితే మంచి రొమాంటిక్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అందించాలనే ప్రయత్నం మాత్రం అభినందనీయం. లవ్‌ట్రాక్‌ ఉన్నా ఎక్కడా వల్గారిటీ లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారు. తండ్రీ కొడుకుల ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల బాండింగ్‌తో పాటు ఫ్యామిలీ అనుబంధాలను చక్కగా చూపించారు. ఫస్టాఫ్‌ అంతా హీరో హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌, వారి మధ్య వచ్చే గొడవలు, అలకలు చూపించారు. ఇవి కాస్త రొటీన్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ప్రవీణ్‌ చేసే కామెడీ రిలీఫ్ ఇస్తుంది. ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌ను ఆసక్తికరంగా మార్చారు డైరెక్టర్‌. హీరోయిన్ ఫాదర్‌ గురించి తెలిసి హీరో షాకవ్వడం, ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సెకండాఫ్‌ మెుత్తాన్ని వెన్నెల కిషోర్‌ తన భుజాలపై నడిపించాడు. స్లో న్యారేషన్‌, గొప్ప క్యాస్టింగ్‌ ఉన్నా సరిగా వాడుకోకపోవడం, అక్కడక్కడ హీరో ఇచ్చే అర్థంకాని ఎక్స్‌ప్రెషన్స్‌ సినిమాకు మైనస్‌గా మారాయి. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాలకు వస్తే గోపి సుందర్‌ అందించిన మ్యూజిక్‌ ప్రధాన అసెట్ అయ్యింది. పాటలు చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా కొత్త ఫీల్‌ను అందించింది. అలాగే సిద్ధార్థ్‌ రామస్వామి కెమెరా వర్క్‌ మెప్పించింది. విజువల్స్‌ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎడిటిర్‌ సినిమాను మరింత షార్ట్‌గా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ వెన్నెల కిషోర్ కామెడీఫ్యామిలీ ఎమోషన్స్సంగీతం మైనస్ పాయింట్స్‌ రొటీన్ స్టోరీరెగ్యులర్‌ లవ్‌ట్రాక్‌స్లో న్యారేషన్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    నవంబర్ 08 , 2024
    Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్‌- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?
    Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్‌- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?
    టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీ (Italy)లోని టస్కనీ (Tuscany)లో కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల మధ్య వీరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మ. 2.48 నిమిషాలకు వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్‌-ఉపాసన, బన్నీ దంపతులు సందడి చేశారు.&nbsp; అంతకుముందు పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కాక్‌టేల్‌ పార్టీ (Cocktail party) నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం రాత్రి హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వధూవరులిద్దరూ పసుపు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు #VarunLav హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే వరుణ్‌ లావణ్య జంట ఇటలీనే పెళ్లి వేదికగా ఎందుకు ఎంచుకుందన్న సందేహం చాలా మందిలో ఉంది. ఎన్నో డెస్టినేషన్ వెడ్డింగ్ పాయింట్స్ ఉండగా ఇటలీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని చాలా మంది ప్రశ్న. అయితే దీనికి ఓ ప్రధాన కారణమే ఉన్నట్లు సోషల్‌ మీడియాలో&nbsp; ప్రచారం జరుగుతోంది.&nbsp; వివరాల్లోకి వెళితే.. 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమాతో వరుణ్‌ తేజ్‌ - లావణ్య మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా షూటింగ్‌లోనే ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. కాలక్రమేణా ఇద్దరూ ప్రేమికులుగా మారిపోయారు. అయితే ఆ సినిమా ఇటలీలోని షూటింగ్ జరుపుకోవడం విశేషం. అలా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమకు తొలి అడుగు ఇటలీలోనే పడింది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠికి తన ప్రేమను ఇటలీలోనే వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఆ విధంగా తమ ప్రేమకు మూలమైన ఇటలీని, తాము పెళ్లి చేసుకోవడానికి వేదికగా మార్చుకున్నారు ఈ జంట. అంతేకాదు సుందరమైన ప్రాంతాలతో ఇటలీలోని టస్కనీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక వీరిద్దరి పెళ్ళికి వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్ దంపతులు, నిహారిక, లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా హాజరయ్యారు. సమంత, నాగచైతన్య, రష్మిక మందాన, పూజ హెగ్డే కూడా వీరి పెళ్లికి హాజరైనట్లు తెలిసింది.&nbsp;
    నవంబర్ 01 , 2023
    Kushi Movie Review: విజయ్‌ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ సూపర్బ్‌.. మరి ‘ఖుషి’ హిట్ అయినట్లేనా? 
    Kushi Movie Review: విజయ్‌ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ సూపర్బ్‌.. మరి ‘ఖుషి’ హిట్ అయినట్లేనా? 
    నటీనటులు: విజయ్‌ దేవరకొండ, సమంత, లక్ష్మీ, మురళీ శర్మ, జయరామ్‌, రోహిణి, సచిన్‌ ఖేడేకర్‌, శరణ్య, అలీ, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు దర్శకత్వం: శివ నిర్వాణ&nbsp; సంగీతం: హేషమ్ అబ్దుల్‌ వహాబ్‌ సినిమాటోగ్రఫీ: మురళి. G నిర్మాత : చిరంజీవి పెదమల్లు, Y. రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని సమంత, విజయ్‌ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లైగర్‌ లాంటి డిజాస్టర్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ నుంచి వస్తున్న చిత్రమిది. విజయ్‌కి జోడిగా సమంత అని ఎనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ సూపర్‌ హిట్‌ సాధించడంతో ‘ఖుషి’పై హైప్‌ మరింత పెరిగింది. భారీ అంచనాల మధ్య ఇవాళ (సెప్టెంబర్‌ 1) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విజయ్, సమంత జోడీకి ఎన్ని మార్కులు పడ్డాయి? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.&nbsp; కథ: ఈ సినిమా కథ కశ్మీర్‌లో ప్రారంభమవుతుంది. బుర్ఖాలో ఉన్న బేగం (సమంత)ను చూసి విప్లవ్ (విజయ్ దేవరకొండ) తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ పిల్ల తనదని ఫిక్స్ అవుతాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో బేగం బ్రాహ్మిణ్ అని విప్లవ్‌కు తెలుస్తుంది. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్య (సమంత)ను క్రిస్టియన్ అబ్బాయి విప్లవ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి చంద్రరంగం (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో  పెద్దలను ఎదిరించి మరీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. అంతా ‘ఖుషి’గా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల కాపురం కొత్త మలుపు తిరుగుతుంది. అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి? దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.  ఎవరెలా చేశారంటే? విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. విప్లవ్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి అలరించాడు. అటు సమంత కూడా ఆరాధ్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో ఎంతగానో ఆకట్టుకుంది. తెరపై విప్లవ్‌, ఆరాధ్య పాత్రలు మాత్రమే కనిపించేంతలా విజయ్‌, సామ్‌ పోటీపడి నటించారు. వీరి మధ్య కెమెస్ట్రీ సైతం అద్భుతంగా కుదిరింది. అటు మురళీశర్మ, సచిన్‌ ఖేడేకర్‌, రోహిణి, లక్ష్మీ నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది. వెన్నెల కిషోర్‌, అలీ, రాహుల్‌ రామకృష్ణ కామెడీ నవ్వులు పూయించింది.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే? ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీసే దర్శకుడు శివ నిర్వాణ. తన గత చిత్రాలైన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఖుషి కోసం రొటిన్‌ కథనే ఆయన ఎంచుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దాన్ని తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారు. పెళ్లి తర్వాత ఇది చేద్దాం.. అది చేద్దాం అని ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న జంటలకు ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్లు బోరింగ్‌ అనిపిస్తాయి. మరికొన్ని సీన్లు ఎక్కడో చూసిన భావన కలిగిస్తాయి. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని చెప్పి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా శివ నిర్వాణ డైరెక్షన్‌ బాగుంది.&nbsp; టెక్నికల్‌గా&nbsp; ఖుషి సినిమాకు టెక్నికల్‌ అంశాలు చాలా బాగా ప్లస్‌ అయ్యాయి. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. సందర్భానుసారంగా వచ్చే సాంగ్స్‌ ఎంతో వినసొంపుగా అనిపిస్తాయి. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్‌ వహాబ్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. అటు G. మురళి అందించిన సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి మంచి ఎసెట్‌ అయ్యింది. ముఖ్యంగా కశ్మీర్‌ అందాలను ఆయన తన కెమెరా  పనితనంతో ఎంతో అద్భుతంగా చూపించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. నాణ్యత విషయంలో ప్రొడ్యుసర్లు ఎక్కడా రాజీపడినట్లు అనిపించలేదు. &nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విజయ్‌, సమంత నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ కథనంబోరింగ్‌ సీన్స్‌ రేటింగ్‌: 3/5
    సెప్టెంబర్ 01 , 2023
    &nbsp;Failure Hero’s: స్టార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా విఫలమవుతున్న టాలీవుడ్‌ హీరోలు తెలుసా?
    &nbsp;Failure Hero’s: స్టార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా విఫలమవుతున్న టాలీవుడ్‌ హీరోలు తెలుసా?
    ప్రస్తుతం టాలీవుడ్‌లో వారసుల హవా నడుస్తోంది. దిగ్గజ నటుల కుటుంబం నుంచి వచ్చిన వారు ఇప్పుడు స్టార్‌ హీరోలుగా మారి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌, మహేశ్‌ బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లు టాలీవుడ్‌లో దిగ్గజ హీరోలుగా స్థిరపడ్డారు. అయితే స్టార్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తాపత్రయపడుతున్నారు. కాలక్రమంలో కొందరు అవకాశాలు లేక సినిమాలకు దూరం కాగా, మరికొందరు ఉపయోగించుకొని క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మిగిలిపోయారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చుద్దాం. అక్కినేని అఖిల్‌: అక్కినేని నాగార్జున తనయుడిగా అఖిల్‌(Akhil) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే అతడు చేసిన అఖిల్‌, హలో, మిస్టర్‌ మజ్నూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద&nbsp; విఫలం&nbsp; అయ్యాయి.&nbsp; మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ హిట్ కొట్టిన అఖిల్..&nbsp; ఏప్రిల్‌ 28న రిలీజ్‌ కానున్న ఏజెంట్‌ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఫలితంగా అఖిల్ కెరీర్‌ ఆధారపడి ఉంది. అల్లు శిరీష్‌: చిరంజీవి మేనల్లుడు, అల్లు అరవింద్‌ కుమారుడు శిరీష్‌ (Allu Sirish) మంచి హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. ‘గౌరవం’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు శిరీష్‌ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అయితే ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకున్నప్పటికీ ‘కొత్త జంట’, ‘ఒక్క క్షణం’, ‘ఊర్వశివో.. రాక్షసివో’ ఫెయిల్యూర్స్‌తో శిరీష్ సినీ కెరీర్‌ మరింత డల్ అయ్యింది.&nbsp; అల్లరి నరేష్‌: దిగ్గజ హాస్య దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నరేష్‌ (Allari Naresh) తన తొలి చిత్రం ‘అల్లరి’ తోనే అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన ‘తొట్టి గ్యాంగ్‌’, ‘సీమశాస్త్రి’, ‘బెండు అప్పారావు’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ దశలో కామెడీ స్టార్‌గా ఎదుగుతున్నట్లే కనిపించిన నరేష్‌.. వరుస ఫ్లాప్‌లతో ఆ ట్యాగ్‌కు దూరమయ్యాడు. వరుసగా సినిమాలు చేసినా అవేమి చెప్పుకోదగ్గ హిట్స్‌ ఇవ్వకపోవడంతో నరేష్‌కు హీరో అవకాశాలు తగ్గాయి. దీంతో కారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిన నరేష్‌.. గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలతో అలరించాడు. ఇటీవల ‘నాంది’, ‘మారేడుమిల్లి ప్రజానికం’ సినిమాలతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు నరేష్. సుశాంత్‌: అక్కినేని నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్‌ (Sushanth) 2008లో కాళిదాసు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలవగా తర్వాతి ఏడాది వచ్చిన కరెంటు మూవీతో సుశాంత్‌ పర్వాలేదనిపించాడు. కానీ అడ్డా, దొంగాట, ఆటాడుకుందా రా, చిలాసౌ వంటి చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ కావడంతో సుశాంత్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సుశాంత్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయారు. అలా వైకుంఠపురం చిత్రంలో నటించి మెప్పించారు. ప్రస్తుతం సుశాంత్ రావణాసుర, భోళాశంకర్‌ చిత్రాల్లో నటించారు.&nbsp; ఆది పినిశెట్టి: దిగ్గజ డైరెక్టర్‌ రవి రాజా పినిశెట్టి వారసుడిగా ఆది పినిశెట్టి (Aadi pinisetty) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2006లో ఒక V చిత్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత తమిళంలో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్ద హీరో రెంజ్‌ సంపాదించలేకపోయాడు. దీంతో ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టు రోల్స్‌ చేస్తున్నాడు.&nbsp; ఆది: నటుడు సాయికుమార్‌ వారసుడిగా ఆది సినిమాల్లోకి వచ్చాడు. తొలి చిత్రం ‘ప్రేమ కావాలి’ తో మంచి యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన లవ్లీ, సుకుమారుడు, గాలిపటం, గరం వంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆది కెరీర్‌ ఒడిదొడుకులకు లోనైంది. దీంతో ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఇటీవలే ‘మేక పులి’ సిరీస్‌ ద్వారా ఆకట్టుకున్నాడు.&nbsp; రాజా గౌతం: హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతం 2004లో ‘పల్లకిలో పెళ్లి కూతురు’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో గౌతం సినిమాలకు లాంగ్‌ బ్రేక్‌ ఇచ్చాడు. మళ్లీ 2014లో ‘బాసంతి’ సినిమాతో గౌతమ్ ప్రేక్షకులను పలకరించాడు. అది కూడా ఫెయిలవ్వగా ఆ తర్వాత మను, బ్రేక్ ఔట్ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి.&nbsp; అరుణ్‌ దాసరి: టాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు తన సినిమాలతో ఎంతో మంది నటులను స్టార్‌ హీరోలుగా తీర్చిదిద్దారు. అలాంటి దర్శకుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అరుణ్‌ దాసరి తెలుగు ప్రేక్షకులను మెప్పిండంలో విఫలమయ్యారు. 2001లో చిన్నా సినిమా&nbsp; ద్వారా వెండి తెరకు పరిచయమైన అరుణ్‌ ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత చేసిన ‘ఆది విష్ణు’ చిత్రం సైతం ఫ్లాప్‌గా నిలవడంతో అరుణ్‌ హీరో కెరీర్‌ మసకబారిపోయింది. అయితే ఆ తర్వాత పలు సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపించిన అరుణ్‌ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.&nbsp;
    ఏప్రిల్ 03 , 2023
    ఆది సాయి కుమార్ (Aadi Saikumar) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    ఆది సాయి కుమార్ (Aadi Saikumar) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    ప్రేమ కావాలి సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన  ఆది సాయి కుమార్.. మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. లవ్లీ, బ్లాక్, పులిమేక వంటి హిట్ చిత్రాలతో క్రేజ్ సంపాదించాడు. టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది సాయికుమార్ గురించి చాలా మందికి తెలియని కొన్ని సీక్రెట్స్ మీకోసం. ఆది సాయికుమార్ ముద్దు పేరు? ఆది ఆది సాయికుమార్ ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు ఆది సాయి కుమార్ తొలి సినిమా? ప్రేమకావాలి ఆది సాయికుమార్ ఎక్కడ పుట్టాడు? ఆముదాలవలస, ఏపీ ఆది సాయికుమార్ పుట్టిన తేదీ ఎప్పుడు? డిసెంబర్ 29, 1989 ఆది సాయికుమార్ బార్య పేరు? అరుణ ఆది సాయికుమార్ పెళ్లి ఎప్పుడు జరిగింది? 2014 ఆది సాయికుమార్ ఫెవరెట్ హీరోయిన్? కాజల్ అగర్వాల్ ఆది సాయికుమార్ ఫెవరెట్ హీరో? సాయికుమార్, మెగాస్టార్ చిరంజీవి ఆది సాయికుమార్ తొలి హిట్ సినిమా? ప్రేమ కావాలి తొలి హిట్ అందించింది. ఆ తర్వాత లవ్లీ, బ్లాక్, పులి మేక వంటి చిత్రాలు హిట్లుగా నిలిచాయి. ఆది సాయికుమార్ ఇష్టమైన కలర్? వైట్ కలర్ ఆది సాయికుమార్ ఇష్టమైన సినిమా? పోలీస్ స్టోరీ, గ్యాంగ్ లీడర్ ఆది సాయికుమార్ తల్లి పేరు? సురేఖ ఆది సాయి కుమార్ ఏం చదివాడు? BSC &nbsp;ఆది సాయికుమార్ అభిరుచులు? ఆది సాయికుమార్‌కు క్రికెట్ అంటే ఇష్టం. సినిమాల్లోకి రాకముందు అండర్19 రంజీ ట్రోఫికి సెలెక్ట్ అయ్యాడు.&nbsp; ఆది సాయికుమార్‌కు నచ్చిన ప్రదేశం? అమెరికా ఆది సాయికుమార్ ఎన్ని సినిమాల్లో&nbsp; నటించాడు? &nbsp;2024 వరకు 20 సినిమాల్లో హీరోగా నటించాడు.&nbsp; ఆది సాయికుమార్‌కు ఇష్టమైన ఆహారం? మంసాహారం ఏదైనా ఆది సాయికుమార్ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడు? &nbsp;దాదాపు రూ.3 కోట్ల వరకు తీసుకుంటున్నాడు ఆది సాయికుమార్‌కు ఎంత మంది పిల్లలు? ఒక పాప, పేరు అయానా(Ayaana) https://www.youtube.com/watch?v=ex3TOcgOmqI
    మార్చి 21 , 2024
    సుధీర్ బాబు (Sudheer Babu) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సుధీర్ బాబు (Sudheer Babu) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    "SMS" చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన సుధీర్ బాబు..విలక్షణ పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. శ్రీదేవి సోడా సెంటర్, వీ, ప్రేమ కథా చిత్రమ్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు గురించి చాలా మందికి తెలియని కొన్ని సీక్రెట్స్ మీకోసం. సుధీర్ బాబు అసలు పేరు? పోసాని నాగ సుధీర్ బాబు సుధీర్ బాబు ముద్దు పేరు? సుధీర్ సుధీర్ బాబు ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు సుధీర్ బాబు తొలి సినిమా? ఏ మాయ చేసావే చిత్రంలో హీరోయిన్ అన్నయ్య పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత SMS చిత్రం ద్వారా పరిచయం అయ్యాడు. సుధీర్ బాబు ఎక్కడ పుట్టాడు? విజయవాడ, ఏపీ సుధీర్ బాబు పుట్టిన తేదీ ఎప్పుడు? మే 11, 1977 సుధీర్ బార్య పేరు? ప్రియదర్శిని సుధీర్ బాబు పెళ్లి ఎప్పుడు జరిగింది? 2006 సుధీర్‌ బాబు ఫెవరెట్ హీరోయిన్? శ్రీదేవి సుధీర్ బాబు ఫెవరెట్ హీరో? కృష్ణ, మహేష్ బాబు, హృతిక్ రోషన్ సుధీర్ బాబు తొలి హిట్ సినిమా? ప్రేమ కథా చిత్రం తొలి హిట్ అందించింది. ఆ తర్వాత శ్రీదేవి సోడా సెంటర్, వి, చిత్రాలు హిట్లుగా నిలిచాయి. సుధీర్ బాబుకు ఇష్టమైన కలర్? బ్లాక్ అండ్ బ్లూ సుధీర్‌బాబు ఇష్టమైన సినిమా? అల్లూరి సీతారామరాజు సుధీర్‌ బాబు తల్లిదండ్రుల పేరు? నాగేశ్వరరావు, రాణి సుధీర్ బాబు ఏం చదివాడు? BE, GMT, MBA సుధీర్ బాబు అభిరుచులు? సుధీర్‌బాబు బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. సినిమాల్లోకి రాకముందు ఇండియా టాప్ 10 బ్యాడ్మింటన్ ప్లేయర్స్‌లో ఒకడు.&nbsp; సుధీర్‌ బాబుకు నచ్చిన ప్రదేశం? విజయవాడ సుధీర్ బాబు ఎన్ని సినిమాల్లో నటించాడు? &nbsp;2024 వరకు 18 సినిమాల్లో హీరోగా నటించాడు.&nbsp; సుధీర్ బాబుకు ఇష్టమైన ఆహారం? గ్రిల్డ్ చికెన్ సుధీర్ బాబు ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడు? &nbsp;దాదాపు రూ.7 కోట్ల వరకు తీసుకుంటున్నాడు సుధీర్ బాబుకు ఎంత మంది పిల్లలు? ఇద్దరు కొడుకులు- చరిత్ మానస్, దర్శన్ https://www.youtube.com/watch?v=Dw1knnyUrLY
    మార్చి 21 , 2024
    <strong>KA Trailer Review: ‘క’ ట్రైలర్‌లో ఇవి గమనించారా? ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయితే బ్లాక్‌బాస్టరే!</strong>
    KA Trailer Review: ‘క’ ట్రైలర్‌లో ఇవి గమనించారా? ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయితే బ్లాక్‌బాస్టరే!
    టాలీవుడ్‌లోని టాలెండెడ్ యంగ్‌ హీరోల్లో కిరణ్‌ అబ్బవరం ఒకరు. తొలి చిత్రం 'రాజా వారు రాణి గారు'తో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ కుర్ర హీరో కెరీర్‌ పరంగా సత్తా చాటేలా అనిపించాడు. ఆ తర్వాత చేసిన ఏడు చిత్రాల్లో ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం మినహా ఏ మూవీ ఆకట్టుకోలేదు. దీంతో కిరణ్‌ అబ్బవరం పని అయిపోయినట్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో ‘క’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ కుర్ర హీరో. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. దీపావళి కానుకగా ఈ సినిమా వస్తుండటంతో తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది.&nbsp; ట్రైలర్ రిలీజ్‌ కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ ‘క’. తన్వీ రామ్‌ (Tanvi Ram) హీరోయిన్‌. సుజిత్‌, సందీప్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న దీనిని విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ‘క ట్రైలర్‌’ను విడుదల చేసింది. ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. కిరణ్‌ అబ్బవరం నటన, సంభాషణలు, యాక్షన్‌ సన్నివేశాలు సినిమాపై పెంచేలా ఉన్నాయి. ట్రైలర్‌ను ఓసారి చూసేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=n75xEs-9u1I ఇవి గమనించారా? ట్రైలర్ అసాంతం యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటోంది. ఆరంభంలోనే చుట్టూ కొండల మధ్య ఉన్న కృష్ణగిరి అనే అందమైన ఊరిని చూపించారు. మధ్యాహ్నం 3 గంటలకే ఊరిలో చీకటిపడిపోవడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఆ ఊరికి పోస్ట్‌ మ్యాన్‌గా వచ్చిన అభినయ వాసుదేవ్‌ (కిరణ్ అబ్బవరం) సత్యభామతో ప్రేమతో పడతాడు. ఉత్తరాలు పంచే క్రమంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‌ను బెదిరించడం ట్రైలర్‌లో చూడవచ్చు. ఆ ఉత్తరంలో ఏముంది? వాసుదేవ్‌ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు? అనే అంశాలు ఆసక్తికిని పెంచేలా ఉన్నాయి. అయితే ట్రైలర్ చివరలో 'జాతర మొదలుపెడదామా' అంటూ ముసుగు వ్యక్తిగా వాసుదేవ్‌ను చూపించడం ఆడియన్స్‌కు బిగ్‌ ట్విస్ట్‌ అని చెప్పవచ్చు.&nbsp; బ్లాక్‌ బాస్టర్‌ పక్కానా? ‘క’ ట్రైలర్‌పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గ్రిప్పింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘క’ పక్కాగా ఆకట్టుకుంటుందని సినీ లవర్స్‌ విశ్వసిస్తున్నారు. హై క్వాలిటీ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ కూడా ట్రైలర్‌లో కనిపించాయని కామెంట్స్ చేస్తున్నారు. సరైన హిట్‌ లేక ఇంతకాలం ఇబ్బంది పడుతూ వస్తోన్న కిరణ్‌ అబ్బవరం ఈ సినిమా దెబ్బకు స్టార్ హీరోగా మారిపోవడం ఖాయమన్న కామెంట్స్‌ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ నటి రహాస్య గోరక్‌ను కిరణ్‌ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత టాలీవుడ్‌లో చాలా మంది హీరోలకు కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత కిరణ్‌కు కూడా బాగా కలిసి వస్తుందన్న సెంటిమెంట్‌ నెట్టింట వినిపిస్తోంది. మరోవైపు కిరణ్‌ అబ్బవరం సైతం ఈ ప్రాజెక్ట్‌పై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్‌పైనే అతడి ఫిల్మ్‌ కెరీర్‌ ఆధారపడి ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి.&nbsp; తొలి ఫిల్మ్‌ హీరోయిన్‌తోనే పెళ్లి గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) - రహస్య గోరక్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, కొద్ది అతిథుల సమక్షంలో ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ‘రాజావారు రాణిగారు’ (2019)తో కిరణ్‌ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అందులో రహస్య హీరోయిన్‌గా నటించారు. ఆ మూవీ షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. తర్వాత ప్రేమగా మారింది. తమపై వచ్చిన రూమర్స్‌పై ఎప్పుడూ స్పందించని ఈ హీరో- హీరోయిన్లు కొన్ని రోజుల క్రితం పెళ్లి కబురు వినిపించి అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. https://twitter.com/vamsikaka/status/1826657731585147141
    అక్టోబర్ 25 , 2024

    @2021 KTree