• TFIDB EN
  • టిక్ టిక్ టిక్
    UTelugu2h 10m
    ఒక నెల కంటే తక్కువ వ్యవధిలో ఒక నగరం పరిమాణంలో ఉన్న గ్రహశకలం భూమిపై పడుతుందని తెలుసుకున్న తర్వాత, దేశాన్ని రక్షించేందుకు ప్రభుత్వం ఒక బృందాన్ని నియమిస్తుంది. గ్రహశకలం దేశంపై పడకుండా ఆ బృందం ఎలాంటి ప్రయత్నం చేసిందన్నది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    జయం రవి
    ఆరోన్ అజీజ్
    నివేదా పేతురాజ్
    ఆరవ్ రవి
    రమేష్ తిలక్
    అర్జునన్
    విన్సెంట్ అశోకన్
    జయప్రకాష్
    రేతిక శ్రీనివాస్
    బాలాజీ వేణుగోపాల్
    ఆత్మ పాట్రిక్
    జీవ రవి
    సిబ్బంది
    శక్తి సౌందర్ రాజన్
    దర్శకుడు
    నేమిచంద్ జబక్నిర్మాత
    డి. ఇమ్మాన్
    సంగీతకారుడు
    ప్రదీప్ ఇ రాఘవ
    ఎడిటర్
    కథనాలు
    నివేత పేతురాజ్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నివేత పేతురాజ్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    తెలుగులో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న కుర్ర హీరోయిన్లలలో నివేత పేతురాజ్ ఒకరు. మెంటల్ మదిలో(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. పెళ్ళిరోజు, టిక్ టిక్ టిక్, చిత్రలహరి వంటి సినిమాల్లో నటించింది. పాగల్, దాస్‌కా ధమ్కి వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నివేత పేతురాజు((Some Lesser Known Facts about Nivetha Pethuraj) గురించి కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. నివేత పేతురాజ్ ఎప్పుడు పుట్టింది? 1991, నవంబర్  30న జన్మించింది నివేత పేతురాజ్ హీరోయిన్‌గా నటించిన తొలి తెలుగు సినిమా? మెంటల్ మదిలో(2017) సినిమా ద్వారా ఆరంగేట్రం చేసింది. నివేత పేతురాజ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 4అంగుళాలు  నివేత పేతురాజ్ ఎక్కడ పుట్టింది? మదురై నివేత పేతురాజ్ అభిరుచులు? ట్రావెలింగ్, డ్యాన్సింగ్ నివేత పేతురాజ్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ నివేత పేతురాజ్‌కు  ఇష్టమైన కలర్?  వైట్, బ్లాక్\ నివేత పేతురాజ్‌కు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్ నివేత పేతురాజ్ ఏం చదివింది? డిగ్రీ నివేత పేతురాజ్ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ. కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. నివేత పేతురాజ్  సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది నివేత పేతురాజ్‌కు ఎమైన వివాదాలు ఉన్నాయా? 2018 మేలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. నివేత పేతురాజ్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/nivethapethuraj/?hl=en నివేత పేతురాజ్‌కు టాటూలు ఎక్కడ ఉన్నాయి? నివేత ఎద పై భాగంలో క్రిసెంట్ మూన్‌తో పాటు ఆమె నడుముకు వెనుక భాగంలో టాటూ ఉంది. నివేత పేతురాజ్ దగ్గర ఉన్న  ఖరీదైన కారు? డాడ్జ్ ఛాలేంజర్ స్పోర్ట్స్ కారు https://www.youtube.com/watch?v=S6luYDlMNiY
    అక్టోబర్ 22 , 2024
    BlueTick:  రోహిత్ శర్మ, కోహ్లీ, ధోని సహా సెలబ్రెటీలకు ట్విట్టర్ బిగ్ షాక్… నెట్టింట్లో ట్విట్టర్‌ను ఏకిపారేస్తున్న ఫ్యాన్స్
    BlueTick:  రోహిత్ శర్మ, కోహ్లీ, ధోని సహా సెలబ్రెటీలకు ట్విట్టర్ బిగ్ షాక్… నెట్టింట్లో ట్విట్టర్‌ను ఏకిపారేస్తున్న ఫ్యాన్స్
    ట్విటర్ బ్లూ టిక్. ప్రస్తుతం ఇదొక ట్రెండింగ్ టాపిక్. ఎందుకంటే దేశంలోని చాలామంది ప్రముఖుల ఐడీలకు ఈ బ్లూటిక్ మాయమైంది. సాధారణంగా ఫేక్ అకౌంట్లను గుర్తించడానికి ఇది సహాయపడేది. కానీ, ప్రస్తుతం ఎవరిది నిజమైన ఐడీనో తెలియని పరిస్థితి ఏర్పడింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని, రజినీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్ వంటి స్టార్ల అకౌంట్లు సాదాసీదాగా మారిపోయాయి.  బ్లూటిక్‌ ఏంటీ? ట్విటర్‌లో ఫేక్‌ ఐడీలు పెరిగిపోవటంతో ఈ బ్లూటిక్‌ కాన్సెప్ట్‌ను తీసుకువచ్చారు. అసలైన అకౌంట్‌కు బ్లూటిక్‌ ఇవ్వటంతో నకిలీ ఖాతాలకు చెక్‌ పడింది. దీని ద్వారానే ప్రముఖులను సులభంగా గుర్తించే అవకాశం లభించింది. అంతకముందు బ్లూటిక్‌ను ఉచితంగానే అందించేవారు. కానీ, ఎలాన్ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసి బాధ్యతలు చేపట్టిన తర్వాత మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగా బ్లూటిక్‌ కావాలంటే డబ్బులు చెల్లించాలనే నిబంధన తీసుకువచ్చాడు. భారత్‌లో ట్విట్టర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం రూ.6,800 చెల్లించాల్సి ఉంటుంది. నెలవారిగా అయితే.. రూ.650 చెల్లించాలి.  ప్రస్తుతం ఈ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించనివారి ఖాతా బ్లూటిక్‌ను ట్విట్టర్ తొలగించింది. ఈ కారణం వల్లే  ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రముఖుల ఖాతాలకు బ్లూటిక్ ఇప్పుడు కనిపించడం లేదు.  రాజకీయ నాయకులు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల అకౌంట్లకు బ్లూటిక్ మాయమయ్యింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, యోగీ ఆదిత్యానాథ్ వంటి పలువురు ఖాతాలకు దీన్ని తొలగించారు.  క్రికెటర్లు టీమిండియా స్టార్ క్రికెటర్లు కూడా షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని అకౌంట్లకు బ్లూటిక్ ఎగిరిపోయింది. ప్రస్తుతం ఏది నిజమైన ఖాతానో, నకిలీ ఖాతానో తేల్చుకోలేకపోతున్నారు నెటిజన్లు.  సినీ హీరోలు దేశంలో వివిధ ఇండస్ట్రీలకు సంబంధించిన సినీ హీరోలది కూడా ఇదే పరిస్థితి. రజినీకాంత్, అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌, సల్మాన్ ఖాన్ వంటి స్టార్‌ హీరోల అకౌంట్లకు బ్లూటిక్‌ను తీసివేశారు. కోలీవుడ్‌లో సూర్య, టాలీవుడ్‌లో మహేశ్ బాబు వంటి కొంతమందికి మాత్రమే ఉన్నాయి.  ఎందుకిలా? ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఖాతాలకు బ్లూటిక్‌ను తొలగించారు. క్రిస్టియానో రొనాల్డో, ఇమ్రాన్ ఖాన్ వంటి వాళ్లు ఉన్నారు. అయితే, ఎందుకు తీసివేశారనే విషయంపై స్పష్టత లేదు. గతంలో కొన్నిసార్లు ఇలాగే జరిగినా వెంటనే పునరుద్ధరించేవారు. అదికూడా కొంతమందికి మాత్రమే జరిగేది. ప్రస్తుతం వందల సంఖ్యలో ఖాతాలకు ఇలా జరగటంతో అందరూ షాక్ అయ్యారు. బ్లూటిక్‌ కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాలి. కానీ, అలా జరగకపోవటంతోనే తొలగించినట్లు తెలుస్తోంది.  ఏకిపారేస్తున్న నెటిజన్లు ట్విటర్‌లో ఎలాన్ మస్క్ తీసుకువస్తున్న మార్పులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్లూటిక్ తీసేయడంతో క్రికెట్‌, సినీ హీరోల అభిమానులు ఫైర్ అయ్యారు. ఎవరిది ఏ అకౌంట్‌ అనేది ఎలా అర్థమవుతుందని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌ వైరల్ అవుతున్నాయి.  https://twitter.com/cb_doge/status/1646308849652232192?s=20 https://twitter.com/kourtneelynne/status/1649186770435620866?s=20 https://twitter.com/majorgauravarya/status/1649257793202053120?s=20 https://twitter.com/ArunTuThikHoGya/status/1649122504152334336?s=20
    ఏప్రిల్ 21 , 2023
    Chiranjeevi in Bhola Shankar: స్ట్రెయిట్ సినిమాలు చేసే గట్స్ చిరంజీవికి లేదా? మెగాస్టార్‌కు ఎందుకంత భయం!
    Chiranjeevi in Bhola Shankar: స్ట్రెయిట్ సినిమాలు చేసే గట్స్ చిరంజీవికి లేదా? మెగాస్టార్‌కు ఎందుకంత భయం!
    టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉండే క్రేజే వేరు. తన నటన, డ్యాన్స్‌లతో ట్రెండ్ సెట్ చేసిన స్టార్ హీరో చిరంజీవి. ఇండియాలో తొలిసారిగా రూ.కోటి పారితోషికం తీసుకున్న నటుడు. మెగాస్టార్ సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం చొక్కాలు చినగాల్సిందే. కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు అందించి తన మార్కెట్ స్థాయి ఏంటో నిరూపించుకున్నాడు. కానీ, రీఎంట్రీ తర్వాత చిరంజీవిలో పదును తగ్గింది. స్ట్రెయిట్ సినిమాలు కాకుండా రీమేక్‌లపై ఎక్కువగా ఆధార పడుతున్నట్లు కనిపిస్తోంది. అసలు, ఒరిజినల్ ఫిల్మ్ చేసే గట్స్ చిరంజీవికి లేవా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  సగం రీమేక్‌లే.. సినీ కెరీర్‌లో రీఎంట్రీ తర్వాత మునపటి చిరంజీవిని పరిచయం చేయలేక పోతున్నాడు. పైగా, తీసిన 6 సినిమాల్లో 3 రీమేక్‌లే ఉన్నాయి. ఖైదీ నంబర్ 150, గాడ్‌ఫాదర్‌తో పాటు తాజాగా వచ్చిన భోళా శంకర్ కూడా రీమేక్ సినిమానే. మిగతావి స్ట్రెయిట్ సినిమాలే అయినా, అందులో ఇతర హీరోల అండదండలు తీసుకున్నాడు మెగాస్టార్. సైరా నరసింహరెడ్డిలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం ఉంది. ఇక, వాల్తేరు వీరయ్యలో రవితేజ, ఆచార్యలో తనయుడు రామ్‌చరణ్ తేజ్‌ల సపోర్ట్ తీసుకున్నాడు. అంటే, సొంతంగా సినిమాను చిరంజీవి నడిపించలేడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.   దిగజారిన స్థాయి? తన స్థాయి, మార్కెట్ తగ్గిందని చిరంజీవి గ్రహించినట్లు తెలుస్తోంది. ఇతర హీరోలను తీసుకుంటే మార్కెట్ కలిసి వస్తుందని చెప్పడానికి రీమేక్ అనంతరం చేసిన సినిమాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. పైగా, ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించేందుకు ఇదివరకు చేయని పనులను కూడా చిరు ట్రై చేస్తుండటం దీనికి ఊతమిస్తోంది. ఇతర హీరోలను ఇమిటేట్ చేయడం ఇందుకు నిదర్శనం. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ డైలాగ్‌ని చెప్పడం, భోళాశంకర్ సినిమాలో తమ్ముడు పవన్ కళ్యాణ్ మ్యానరిజం, డైలాగ్స్‌ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించడం.. ఈ కోవకు చెందేవే. ఇతర హీరోల ఫ్యాన్స్ అయినా థియేటర్లకు వస్తారన్న ఆశో? లేదా అందరి ఫ్యాన్స్‌ని అలరించాలన్న తాపత్రయమో? ఫలితం మాత్రం అటు, ఇటు గాకుండా పోతోంది. తేడాకొడుతున్న రీమేక్? ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇప్పటివరకు ఒక్క రీమేక్‌లోనూ నటించలేదు. స్టోరీ సెలక్షన్ పరంగా మెగాస్టార్‌ని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే, కెరీర్‌లో చేసిన ఎన్నో స్ట్రెయిట్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ కొట్టాయి. అయితే, రీఎంట్రీ తర్వాత కథల ఎంపికలో చిరు తడబడుతున్నాడు. లుక్స్ పరంగా వయసు కూడా పూర్తిగా సహకరించట్లేదు. దీంతో కొన్ని సినిమా కథలకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది. కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ చిరు సమకూరుస్తున్నా కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపించట్లేదు. భోళాశంకర్ సినిమాలో రీక్రియేట్ చేసిన ఖుషీ నడుము సీన్ బెడిసి కొట్టడానికి కారణం కూడా ఇదే .  సక్సెస్ ఫార్ములా? చిరంజీవికి ఎదురు దెబ్బ తగిలిన సమయాల్లో రీమేక్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఠాగూర్ వంటి రీమేక్ సినిమా అనంతరం 2004లో అంజి వచ్చింది. ఇది థియేటర్ల వద్ద బోల్తా పడింది. దీంతో మరోసారి చిరు రీమేక్‌నే నమ్ముకున్నాడు. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌తో అదే ఏడాది వచ్చి హిట్ కొట్టాడు. అందుకే, రీఎంట్రీకి సైతం రీమేక్‌నే ఎంచుకున్నాడు. సైరా, ఆచార్యల తర్వాత గాడ్‌ఫాదర్ రీమేక్ చేసి కాస్త ఊరట పొందాడు. ఇలా మాతృకలో ఉన్న బలమైన కథని తీసుకుని పై పై హంగులు చేరిస్తే తెలుగులో హిట్ అయిపోతుందని చిరు నమ్మకం. వాల్తేరు వీరయ్య సమయంలోనే మరో రీమేక్‌కి సైన్ చేశాడు. అయితే, బంగార్రాజు డైరెక్టర్ కల్యాణ్ క్రిష్ణతో చిరంజీవి మూవీ చేయనున్నాడు. ఇది కూడా మళయాల సినిమా ‘బ్రో డాడీ’కి రీమేక్ అన్నట్లు టాక్. ఇందులో చిరుతో పాటు హీరో శర్వానంద్ నటిస్తున్నట్లు సమాచారం. మరి, ఈ సారి సక్సెస్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అనేది వేచి చూడాలి.  రీమేక్స్ వద్దు.. చిరంజీవి రీమేక్ సినిమాలను ఎంచుకోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఆల్రెడీ సగం మంది చూసేసిన సినిమాలో తమ హీరోని ఊహించుకోలేక పోతున్నామని చెబుతున్నారు. రీమేక్ ఎంచుకున్న ప్రతి సందర్భంలోనూ ఒరిజినల్ ఫిల్మ్‌తో కంపేర్ చేయడం, రీమేక్‌లో లోపాలను వెతకడంతో ఇబ్బందులు పడుతున్నామని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీమేక్ సినిమాలు చేయొద్దంటూ వేడుకుంటున్నారు. 
    ఆగస్టు 11 , 2023
    Mirnalini Ravi: ‘లవ్‌ గురు’ ఫేమ్‌ మృణాళిని రవి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Mirnalini Ravi: ‘లవ్‌ గురు’ ఫేమ్‌ మృణాళిని రవి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    యంగ్‌ బ్యూటీ మృణాళిని రవి (Mirnalini Ravi).. తెలుగు, తమిళ చిత్రాలలో వరుసగా నటిస్తూ చాలా బిజీగా ఉంది. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్‌ గురు' ఏప్రిల్‌ 11న తెలుగులో విడుదల కాబోతోంది. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ ఆంటోని ఇందులో హీరోగా చేశాడు. కాగా, ఇటీవల ట్రైలర్‌లో మృణాళిని నటన అందర్నీ ఫిదా చేసింది. ముఖ్యంగా శోభనం గదిలో భర్త విజయ్ ఆంటోనికి గ్లాసులో మందు పోసే సీన్‌ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు ఆడియన్స్ తెగ వెతుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.. మృణాళిని రవి ఎక్కడ పుట్టింది? తమిళనాడులోని పాండిచ్చేరిలో మృణాళిని జన్మించింది.  మృణాళిని రవి పుట్టిన తేదీ ఏది? 10 మే, 1995 మృణాళిని రవి విద్యాభ్యాసం ఎక్కడ సాగింది? బెంగళూరు మృణాళిని రవి.. ఏ స్కూల్‌లో చదువుకుంది? లేక్‌ మౌంట్‌ఫోర్ట్‌ స్కూల్‌, బెంగళూరు మృణాళిని రవి ఏం చదువుకుంది? బెంగళూరులోని ఈస్ట్‌ పాయింట్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మృణాళిని బీటెక్‌ చేసింది. ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా చేసింది.  మృణాళిని రవి తల్లిదండ్రులు ఎవరు? తండ్రి పేరు విశాల్‌ రవి, తల్లి పేరు ఎక్కడా ప్రస్తావించబడలేదు. మృణాళిని రవి వయసు ఎంత? 29 సంవత్సరాలు (2024) మృణాళిని రవి బరువు ఎంత? 60 కేజీలు మృణాళిని రవి ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు మృణాళిని రవి ఎలా ఫేమస్‌ అయ్యింది? టిక్‌ టాక్‌, డబ్‌స్మాష్‌లో రీల్స్‌ చేసి మృణాళిని అందరి దృష్టిని ఆకర్షించింది.  మృణాళిని రవి తొలి చిత్రం? 2019లో వచ్చిన తమిళ చిత్రం 'సూపర్‌ డీలక్స్‌'.. మృణాళిని చేసిన మెుట్ట మెుదటి చిత్రం. దర్శకుడు త్యాగరాజన్‌ కుమారరాజా సోషల్‌ మీడియాలో ఈ భామ వీడియోలు చూసి అవకాశం ఇచ్చారు.  మృణాళిని రవి తొలి తెలుగు చిత్రం? గద్దల కొండ గణేష్‌ మృణాళిని రవి.. ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు? గద్దల కొండ గణేష్‌, ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్ అల్లుడు మృణాళిని రవి.. ఇప్పటివరకూ చేసిన తమిళ చిత్రాలు? ‘సూపర్‌ డీలక్స్‌’, ‘ఛాంపియన్‌’, ‘ఎనిమీ’, ‘ఎంజీఆర్‌ మగన్‌’, ‘జంగో’, ‘కోబ్రా’.. మృణాళిని రవి హాబీస్‌? ట్రావెలింగ్‌, రీడింగ్‌, సింగింగ్‌ మృణాళిని రవికి పెళ్లైందా? కాలేదు  మృణాళిని రవి నాన్‌-వెజ్‌ వంటకాలు తింటుందా? ఆమెకు నాన్ వెజ్‌ ఐటెమ్స్‌ను ఆమె ఎంతో ఇష్టంగా ఆరగించేస్తుందట. మృణాళిని రవికి ఇష్టమైన హీరో, హీరోయిన్లు? ఫేవరేట్‌ హీరో, హీరోయిన్ల గురించి మృణాళిని ఎక్కడా రివీల్ చేయలేదు.  మృణాళిని రవి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా లింక్‌? https://www.instagram.com/mirnaliniravi/
    ఏప్రిల్ 10 , 2024
    Maleesha Kharwa: మట్టిలో మాణిక్యం.. మురికివాడ నుంచి స్టార్‌ మోడల్‌ దాకా.. ఎవరీ మలీషా ఖర్వా?
    Maleesha Kharwa: మట్టిలో మాణిక్యం.. మురికివాడ నుంచి స్టార్‌ మోడల్‌ దాకా.. ఎవరీ మలీషా ఖర్వా?
    ముంబయిలోని ప్రముఖ మురికివాడ ధారావికి చెందిన 14 ఏళ్ల మలీషా ఖర్వా.. సోషల్‌ మీడియాలో మరోమారు సంచలనంగా మారిపోయింది. ప్రముఖ స్కిన్‌ కేర్‌ కంపెనీ ‘ఫారెస్ట్ ఎసెన్షియల్’ తన లగ్జరీ కలెక్షన్స్‌కు బాలికను బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడమే ఇందుకు కారణం. తమ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను మలీషా ప్రమోట్‌ చేస్తున్న ఓ వీడియోను ‘ఫారెస్ట్ ఎసెన్షియల్’ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రతీ ప్రయాణంలోనూ బ్యూటీ ఉంటుందని క్యాప్షన్‌ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మలీషాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  View this post on Instagram A post shared by @forestessentials 'లైవ్‌ యువర్‌ ఫెయిరీ టేల్‌' అనే షార్ట్‌ఫిల్మ్‌ ద్వారా తొలిసారి మలీషా ఫేమస్‌ అయింది. మురికివాడల్లో బతికే ఐదుగురు చిన్నారులను స్టార్‌ రెస్టారెంట్‌లో భోజనం చేయించి వారి అనుభవాలను తెలుసుకోవడం లక్ష్యంగా ఈ షార్ట్ ఫిల్మ్‌ రూపొందించారు. ఈ ఐదుగురు చిన్నారుల్లో మలీషా కూడా ఉంది.  2020లో హాలీవుడ్ యాక్టర్‌ ‘రాబర్ట్ హాఫ్‌మన్‌’ ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్‌ కోసం ముంబయికి వచ్చాడు. ఈ క్రమంలో మలీషాను చూసి రాబర్ట్ ఎంతగానో ఇంప్రెస్‌ అయ్యాడు. మోడల్ అవ్వాలన్న మలీషా కలను తెలుసుకొని ఆమె పేరున స్వయంగా ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ను క్రియేట్‌ చేశాడు.  మలీషా కోసం ‘గో ఫండ్‌ మీ‘ అనే పేరుతో రాబర్ట్ ఓ పేజ్‌ను కూడా క్రియేట్‌ చేశాడు. బాలికకు సాయం చేయాలని నెటిజన్లకు పిలుపునిచ్చాడు. దీంతో చాలా మంది మనీషాకు ఆర్థిక సాయం చేశారు.  సోషల్‌ మీడియాలో మలీషా పేరు మారుమోగడంతో చిన్న చిన్న కంపెనీలు ప్రమోషన్స్‌ కోసం మలీషా వెంటపడ్డాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న మలీషా.. మోడలింగ్ చేస్తూ సెలబ్రిటీగా మారిపోయింది. తనను తాను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘princess from the slum' గా ప్రెజెంట్ చేసుకుంది.  మలీషాకు పాపులారిటీని గమనించిన  ‘ది పికాక్‌’ అనే మ్యాగజైన్‌ బాలిక ఫొటోను ఏకంగా తన కవర్‌ పేజ్‌ మీద ప్రింట్‌ చేసింది. బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలతో పాటు జాతీయ మీడియా కూడా  మలీషా స్టోరీని పబ్లిష్‌ చేశాయి.  మురికి వాడల్లో అందరు చిన్నారుల్లానే బతికిన మలీషాకు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల 35 వేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. సెలబ్రెటీస్‌కు ఇచ్చినట్టే మలీషాకు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వెరిఫైడ్‌ బ్లూ టిక్‌ ఇచ్చింది. ‘ప్రిన్సెస్‌ ఆఫ్ స్లమ్‌’గా అందరూ తనను పిలుస్తుండటంపై మలీషా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఎవరీ జీవితం ఎలాంటి మలుపుతీసుకుంటుందో తెలియదని పేర్కొంది. కాబట్టి అందివచ్చిన అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచిస్తోంది.  మురికివాడలో పుట్టి, పెరగడం కష్టంగా లేదా? అని తరుచూ ఎదురయ్యే ప్రశ్నపైనా మలీషా స్పందించింది. తన ఇంటిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. అందుకే ఆ ప్రశ్న ఎదురైనప్పుడల్లా తికమకపడుతూ ఉంటాని తెలిపింది. అయితే సోదరుడితో పాటు చాలాసార్లు పస్తులు ఉండాల్సి రావడం తనకు నచ్చలేదని మలీషా అన్నది.  చిన్నప్పుడు ధారావిలో ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుంటే తన సోదరుడితో కలిసి అక్కడి వెళ్లేదానినని మలీషా తెలిపింది. తనకు బ్యాగ్రౌండ్‌ ఆర్టిస్టుగా అవకాశమిస్తారేమోనని ఎదురు చూసేదానిని చెప్పుకొచ్చింది.  గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తనకు ఎంతో ప్రేరణ అని మలీషా ఓ సందర్భంలో చెప్పింది. ఎప్పటికైనా స్టార్‌ మోడల్‌గా ఎదిగి మెరుగైన జీవితంతో పాటు, తమ తల్లిదండ్రులకు ఆర్థికంగా సాయపడాలని కోరుకుంటున్నట్లు వివరించింది. 
    మే 24 , 2023
    Tillu Square Day 1 Collections: హిట్ కొట్టిన టిల్లు భయ్యా.. తొలి రోజే కలెక్షన్ల సునామి!
    Tillu Square Day 1 Collections: హిట్ కొట్టిన టిల్లు భయ్యా.. తొలి రోజే కలెక్షన్ల సునామి!
    స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా, గ్లామర్ డాల్ అనుపమ పరమేశ్వరణ్ దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లు స్కేర్ చిత్రానికి మొదటి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది.  భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల అంచనాలను అందుకుని పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.23.7కోట్ల గ్రాస్(Tillu Square Day 1 Collections) కొల్లగొట్టినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఇండియా వైడ్‌గా రూ.12 కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ వద్ద వసూలు చేస్తే.. ఓవర్‌సీస్‌లోనూ అదే స్థాయిలో రూ.11 కోట్లు గ్రాస్ రాబట్టింది. 'అట్లుంటది మనతోని' అంటూ టిల్లు స్కేర్ ప్రభంజనాన్ని పోస్టర్‌ ద్వారా మూవీ మేకర్స్ చెప్పకనే చెప్పారు. శని, ఆది( వీకెండ్స్‌)  ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్‌ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. సిద్ధు జొన్నలగడ్డ  గత చిత్రాలతో పోలిస్తే ఇదే హయ్యేస్ట్‌ డే 1 కలెక్షన్స్‌గా చెప్పవచ్చు.  నెట్ వసూళ్లు ఎంతంటే? ఇండస్ట్రీలో టాక్ ప్రకారం (Tillu Square Day 1 1 Net Collections) తొలి రోజు మంచి షేర్ రాబట్టింది. ఈ చిత్రం మెుదటి రోజున భారత్‌లో రూ.11.2 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్ ఎంతంటే? సిద్ధు జొన్నలగడ్డ  గత చిత్రం 'డీజే టిల్లు చిత్రం' బ్లాక్‌ బాస్టర్‌ కావడం, హీరోయిన్ అనుపమ(Anupama Parameswaran) గ్లామర్ రోల్ చేయడం, సినిమా విడుదలకు ముందు రిలీజైన ట్రైలర్‌పై పాజిటివ్ రెస్పాన్స్.. టిల్లు స్కేర్ సినిమాకు థ్రియేట్రికల్‌ బిజినెస్‌ బాగానే జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.23.30 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.18.50కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. 4.80కోట్లకు థియేట్రికల్‌ హక్కులు అమ్ముడయ్యాయి. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 24కోట్లుగా ఉంది. ప్రస్తుతం టిల్లు స్కేర్ హిట్‌ టాక్ సాధించడంతో లాభాల్లోకి అడుగుపెట్టడం పెద్ద కష్టం కాదు. మరో రెండు రోజుల్లో సులభంగా ఈ టార్గెట్‌ను రీచ్ చేసే అవకాశం ఉంది.  టిల్లు స్కేర్ సక్సెస్‌కు కారణం ఇదే! స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లుగా అదరగొట్టాడు. తన మార్క్‌ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. కొన్ని సీన్లలో మరింత హ్యాండ్సమ్‌ లుక్స్‌తో కనిపించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాడు. ఇక రాధిక అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ మెప్పించింది. ముఖ్యంగా తన గ్లామర్ షోతో కుర్రకారును ఊర్రూతలూగించింది. సిద్ధూ, అనుపమా మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య కెమెస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. లిప్‌లాక్ సీన్లతో పాటు, బెడ్రూం సీన్లు అలరిస్తాయి. ఇద్దరి మధ్య వచ్చే వన్‌లైనర్‌ పంచ్‌లు ప్రేక్షకులను వెంటాడుతాయి. ఇక మాఫియా డాన్‌ పాత్రలో మురళీ శర్మ జీవించారు. తన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. టిల్లు తండ్రిగా మురళీ గౌడ్‌ కూడా మంచి ప్రదర్శనే చేశారు. అతని కామెడీ టైమింగ్‌ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపంచారు. ఇవన్నీ సినిమా విజయానికి కారణం అయ్యాయి. https://telugu.yousay.tv/tillu-square-review-in-telugu-tillu-square-is-a-hit-with-comedy-timing-how-is-the-sequel.html https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-siddu-jonnalagadda.html
    మార్చి 30 , 2024
    <strong>Kalki 2898 AD Tickets: ఆన్‌లైన్‌లో ‘కల్కి’ టికెట్ల గోల్‌మాల్‌..? థియేటర్ల కక్కుర్తిపై ఫ్యాన్స్‌ ఆగ్రహం!</strong>
    Kalki 2898 AD Tickets: ఆన్‌లైన్‌లో ‘కల్కి’ టికెట్ల గోల్‌మాల్‌..? థియేటర్ల కక్కుర్తిపై ఫ్యాన్స్‌ ఆగ్రహం!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) సినిమా కోసం యావత్‌ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గురువారం (జూన్‌ 27) వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ కాగా.. హాట్‌ కేకుల్లా టికెట్స్‌ అమ్ముడుపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచడానికి పర్మిషన్స్ రావడంతో అన్ని థియేటర్స్‌లో టికెట్ ధరలు భారీగా పలుకుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్‌లోనూ ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జోరుగా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టికెట్ల అమ్మకాల్లో కొన్ని థియేటర్లు అనుసరిస్తున్న వైఖరి వివాదస్పదమవుతోంది. దీనిపై ఫ్యాన్స్‌ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.&nbsp; ఫ్యాన్స్ అసంతృప్తి ఎందుకంటే? కల్కి సినిమాపై ఉన్న ఆసక్తిని సొమ్ము చేసుకునేందుకు కొన్ని థియేటర్లు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో టికెట్స్‌ అందుబాటులో ఉన్నట్లు చూపిస్తున్నా.. బుక్‌ చేసుకునేందుకు వీలుపడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ‘బుక్‌మై షో’.. థియేటర్లలో టికెట్స్ ఉన్నట్లు గ్రీన్‌ కలర్‌లో షోవారిగా టికెట్స్‌ను చూపిస్తున్నాయి. అయితే వాటిని క్లిక్‌ చేస్తే అభిమానులకు ‘Sorry! Something is not right’ సందేశం వస్తోంది.దీనిపై ప్రభాస్‌ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్‌ను బ్లాక్‌లో ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చన్న ఉద్దేశంతోనే థియేటర్‌ యాజమాన్యాలు ఇలా చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఓ వైపు టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న ఆందోళన ఉన్నప్పటికీ అభిమాన హీరో అయినందువల్ల బుకింగ్స్‌ కోసం ట్రై చేస్తున్నట్లు కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. కానీ.. థియేటర్ యాజమన్యాల కక్కుర్తి చర్యలు.. అసహనానికి గురిచేస్తున్నాయని మండిపోతున్నారు. ఇలా చేస్తే భవిష్యత్‌లో థియేటర్లకు రావాలన్న ఆసక్తి కూడా సన్నగిల్లుతుందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; రూ.1000 కోట్ల క్లబ్‌లో.. ఇదిలా ఉంటే.. కల్కి సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. సాధారణంగా ఏదైనా స్టార్‌ హీరో సినిమా అంటే టైర్‌-1 సిటీస్‌లో ఎక్కువగా అడ్వాన్స్‌ బుకింగ్స్ జరుగుతుంటాయి. కానీ, కల్కికి మాత్రం టైర్‌-2 సిటీస్‌లోనూ జోరుగా టికెట్స్‌ బుక్‌ అవుతున్నాయి. నగరవాసులు మాత్రమే కాకుండా చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలలోని ప్రేక్షకులు సైతం కల్కి చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి రోజున ఏమాత్రం పాజిటివ్‌ టాక్‌ వచ్చినా.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే ‘కల్కి’ ఈజీగానే రూ.1000 కోట్లు కొల్లగొడుతుందని అంటున్నారు.&nbsp; ఫస్ట్‌డే టార్గెట్‌ ఎంతంటే? గతంలో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి 2’ (Bahubali 2) సినిమా మొదటి రోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే రాజమౌళి తదుపరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) కూడా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసింది. ‘బాహుబలి 2’ తర్వాత మరోసారి ఆ మార్క్‌ను ప్రభాస్ టచ్ చేయలేకపోయాడు. గత ఏడాది ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘సలార్’ కూడా తొలిరోజు రూ.200 కోట్లు రాబట్టలేకపోయింది. దీంతో ప్రభాస్ ‘కల్కి’ ఫస్ట్ డే టార్గెట్ రూ.200 కోట్లు పైనే అని తెలుస్తోంది. రాజమౌళి బ్రాండ్‌తో సంబంధం లేకుండా ప్రభాస్‌ సోలోగా రూ.200 కోట్లు కొల్లగొడతాడా? లేదా? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రభాస్‌ ఈ ఫీట్‌ సాధిస్తే.. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కల్కి’ నిలవడం ఖాయమని చెప్పవచ్చు.&nbsp; టికెట్ రెట్లు పెంపు కల్కి టికెట్‌ ధరలు పెంపునకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టికెట్స్‌ పెంపునకు అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. జూన్‌ 27 నుంచి జులై 4 వరకూ సింగిల్ స్క్రీన్‌పై రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 వరకూ పెంచుకోవచ్చని సూచించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కల్కి టీమ్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. సింగిల్ స్క్రీన్‌లకి రూ.75, మల్టీప్లెక్స్‌లకి రూ.125 వరకూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అంతేకాక అదనపు షోలకి కూడా పర్మిషన్ ఇచ్చింది. ప్రతి థియేటర్‌లో 5 షోలు వేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కల్కి టికెట్‌ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే సగటున ఒక్కో టికెట్‌కు రూ.500 (ట్యాక్స్‌లతో కలిపి) వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అదే సింగిల్‌ స్క్రీన్స్‌లో అయితే రూ.200-300 వరకూ పెట్టాల్సిందే. ఫ్యామిలీ అంతా సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చు పెట్టాల్సి వస్తోందని కొందరు నెటిజన్లు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.&nbsp; ఒక్కో టికెట్‌ రూ.3 వేలు..! కల్కి సినిమా ప్రభావం నార్త్‌లోనూ గణనీయంగా కనిపిస్తోంది. పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ చిత్రాన్ని చూసేందుకు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తికనబరుస్తున్నాయి. దీన్ని గమనించిన థియేటర్‌ వర్గాలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ముంబయిలో కల్కి అడ్వాన్స్‌ బుకింగ్‌ టికెట్‌.. భారీ ధర పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మల్టీప్లెక్స్ లలో కల్కి సినిమా ఒక్కో టికెట్ ధర రూ.2000 రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. అదే డ్రైవ్ ఇన్ థియేటర్స్‌లో అయితే ఏకంగా రూ. 3000 రూపాయలకు విక్రయిస్తున్నారట. ఢిల్లీ మల్టీప్లెక్స్‌లో రూ.1300 నుంచి రూ.2000 వరకు టికెట్ రేట్లు ఉన్నట్లు సమాచారం. అటు బెంగళూరులోని కొన్ని మల్టీప్లెక్సుల్లో టికెట్‌ ధర రూ.1100-1500 వరకు ఉన్నాయని సమాచారం. ఇక హైదరాబాద్‌లో బెనిఫిట్ షోకి రూ.3000 వరకూ టికెట్స్ బ్లాక్‌లో అమ్ముతున్నారని టాక్.&nbsp; అక్కడ కల్కి రికార్డ్‌ షోస్.. హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభం అయిన అపర్ణ మల్టీప్లెక్స్‌లో తొలిరోజున కల్కి కోసం ఏకంగా 47 షోలు ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాకుండా అన్ని షోలకు సంబంధించిన టికెట్స్‌ సైతం ఇప్పటికే అమ్ముడి పోయినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి స్పెషల్‌&nbsp; పోస్టర్‌ను సైతం వారు రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభాస్‌ సినిమా అంటే ఆమాత్రం ఉంటుందని కొందరు పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/gopaladusumalli/status/1805502440420303323
    జూన్ 25 , 2024
    Leo Movie Review: సోషల్ మీడియాలో లియో డిజాస్టర్ టాక్.. మరి సినిమా ఎలా ఉంది?
    Leo Movie Review: సోషల్ మీడియాలో లియో డిజాస్టర్ టాక్.. మరి సినిమా ఎలా ఉంది?
    నటీనటులు : విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్ తదితరులు దర్శకత్వం : లోకేష్ కనగరాజ్ సంగీతం : అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస&nbsp; నిర్మాతలు : S.S లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి విడుదల తేదీ: అక్టోబర్ 19, 2023&nbsp;&nbsp; తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లియో’. ‘విక్రమ్‌’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీని తెరకెక్కించిన దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఈ మూవీని రూపొందించారు. దీంతో ఈ సినిమాపై తమిళ్‌తో పాటు తెలుగులోనూ విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అంతేగాక LCU (లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్)లో ఈ సినిమా కూడా భాగం కావడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీనికితోడు ఇటీవల విడుదలైన లియో ట్రైలర్‌ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. ఇక భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్‌ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.&nbsp; మరి ‘లియో’ మూవీ ఎలా ఉంది? విజయ్‌ ఏ మేరకు మెప్పించాడు? తదితర విషయాలు ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథ హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలు (అబ్బాయి, అమ్మాయి)తో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. అక్కడి నుంచి పార్తీబన్‌కు కష్టాలు మెుదలవుతాయి. అతడ్ని వెతుకుతూ ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) &amp; గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? ఆంటోనీ దాస్, హరోల్డ్ దాస్ (అర్జున్) బ్రదర్స్ ఎవరు? నిజంగా లియో దాస్ మరణించాడా? లేదంటే పార్తీబన్ పేరుతో కొత్త జీవితం మొదలు పెట్టాడా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి మరీ విజయ్‌ ‘లియో’ చిత్రంలో నటించాడు. తనతో సమానమైన ఎత్తు ఉన్న అబ్బాయికీ తండ్రిగా ఇందులో కనిపించాడు. విజయ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. అయితే మూవీలోని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ విజయ్‌ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసింది. ఫైట్స్‌లో విజయ్‌ తన మార్క్‌ చూపించాడు. ఇక తల్లి పాత్రలో త్రిష ఒదిగిపోయారు. ఆంటోనీ దాస్ పాత్రలో సంజయ్ దత్, హరోల్డ్ దాస్ పాత్రలో అర్జున్ సర్జాకు ఇచ్చిన ఇంట్రడక్షన్స్ బావున్నాయి. వారు తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. ఇక గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ పాత్రల పరిధి మేరకు నటించారు. ప్రియా ఆనంద్ చిన్న అతిథి పాత్రలో, మడోన్నా సెబాస్టియన్ కథను మలుపు తిప్పే క్యారెక్టర్‌లో మెప్పించారు.&nbsp;&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే 'లియో'లో కూడా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ తన స్టైల్‌ను అనుసరించాడు.&nbsp; సినిమా ప్రారంభంలో హైనాతో ఫైట్, కాఫీ షాపులో షూటౌట్, 'లియో' ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్స్‌ను ఆయన బాగా తెరకెక్కించారు. అయితే దర్శకుడిగా ఆయన మార్క్‌ సినిమా ఆసాంతం కనిపించదు. ఇంటర్వెల్‌ తర్వాత మాత్రమే అసలు కథ ప్రారంభమవుతుంది. పార్తీబన్‌, లియో ఒక్కరేనా? ఇద్దరూ వేర్వేరా? అని పాయింట్‌ మీద సెకండాఫ్‌ను డైరెక్టర్‌ నడిపించడంతో కాస్త సాగదీసిన భావన అందరికీ కలుగుతుంది. కార్ ఛేజింగ్ యాక్షన్ సీన్ బాగున్నప్పటికీ క్లైమాక్స్ ఫైట్ అంతగా ఆకట్టుకోలేదు. ఈ విషయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరింత దృష్టి పెట్టాల్సింది.&nbsp;&nbsp; టెక్నికల్‌గా&nbsp; టెక్నికల్ అంశాలకు వస్తే మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్‌ అని చెప్పవచ్చు. పతాక సన్నివేశాల్లో ఆయన కెమెరా పనితనం మెప్పిస్తుంది. సినిమా అంతటా సన్నివేశాలకు తగ్గట్టు డిఫరెంట్ లైటింగ్ ద్వారా ఆ సీన్స్ మూడ్‌ను మనోజ్‌ పరమహంస సెట్ చేశారు. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం బావుంది. కానీ, 'విక్రమ్', 'జైలర్' చిత్రాలతో పోలిస్తే 'లియో' మ్యూజిక్‌ అంతగా ఆకట్టుకోదు. ముఖ్యంగా పాటల్లో అనిరుధ్‌ మార్క్‌ కనిపించదు. తెలుగు సాహిత్యం కూడా బాలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.&nbsp;&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విజయ్‌ నటనసినిమాటోగ్రఫీనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ పాటలుసాగదీత సీన్స్‌ చివరిగా : లోకేష్‌ కనగరాజ్‌ గత చిత్రాలతో (ఖైదీ, విక్రమ్‌) పోలిస్తే అంచనాలను అందుకోవడంలో 'లియో' కాస్త వెనకపడిందని చెప్పవచ్చు. యాక్షన్ మూవీ ప్రేమికులకు మాత్రం సినిమా నచ్చుతుంది. విజయ్ అభిమానులను మెప్పిస్తుంది. రేటింగ్‌: 2.5/5
    అక్టోబర్ 19 , 2023
    Ram Charan: మాల విరమించిన రామ్‌చరణ్..GMA టాక్ షోలో రాజమౌలిపై ప్రశంసలు
    Ram Charan: మాల విరమించిన రామ్‌చరణ్..GMA టాక్ షోలో రాజమౌలిపై ప్రశంసలు
    ]టామ్ క్రూస్, నికోలస్ కేజ్, బ్రాడ్ పిట్ వంటి హేమాహేమీలతో ‘క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్’ కోసం చెర్రీ, ఎన్టీఆర్ పోటీపడుతుండటం విశేషం.
    ఫిబ్రవరి 23 , 2023
    GMA: రాజమౌళి ఓ ఇండియన్ స్పీల్‌బర్గ్.. టాక్ షోలో రామ్‌చరణ్ పంచుకున్న విశేషాలు
    GMA: రాజమౌళి ఓ ఇండియన్ స్పీల్‌బర్గ్.. టాక్ షోలో రామ్‌చరణ్ పంచుకున్న విశేషాలు
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    ఫిబ్రవరి 23 , 2023
    Tillu Square sequel: టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఉందా?... మూవీ మేకర్స్ క్లారిటీ!
    Tillu Square sequel: టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఉందా?... మూవీ మేకర్స్ క్లారిటీ!
    టాలీవుడ్‌లో ఈ ఏడాదిలో మరో బ్లాక్ బాస్టర్ చిత్రం టిల్లు స్కేర్ అని చెప్పాలి. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), క్యూట్ గల్ అనుపమ పరమేశ్వరణ్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా. నాగ్ అశ్వీన్ నిర్మాణంలో దర్శకుడు మల్లిక్ రామ్ డెరెక్ట్ చేసిన టిల్లు స్కేర్ చిత్రానికి మేకర్స్ అనుకున్నదానికంటే ఎక్కువ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. రెండు మూడు రోజుల్లోనే ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడి తిరిగి రానున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు టిల్లు స్క్వేర్ ఓటిటి డీల్‌కి సంబంధించి క్రేజీ బజ్ తెలిసింది. టిల్లు స్కేర్ ఓటీటీ ప్రసార హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏకంగా రూ.13 నుంచి రూ.15 కోట్ల వరకు చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకన్నట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే టిల్లు స్కేర్ మంచి నెంబర్‌నే సాధించిందని చెప్పవచ్చు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం... ఓటీటీ ద్వారా గట్టి నెంబర్ సాధించడం పట్ల మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఉందా? డీజే టిల్లు నుంచి 'టిల్లు స్కేర్' సీక్వేల్‌గా వచ్చింది. మరి టిల్లు స్కేర్ నుంచి మరో సీక్వేల్ వస్తే బాగుంటుందని ఈ సినిమా హిట్ తర్వాత అభిమానులు అనుకుంటున్నారు. రిలీజ్‌కు ముందు నుంచే ఈ బజ్ ఉండగా.. సినిమా విడుదల తర్వాత ఇది కాస్త ఎక్కువైంది. అయితే ఇదే విషయంపై మేకర్స్ టిల్లు స్క్వేర్‌ విడుదల తర్వాత స్పష్టత ఇచ్చారు. డీజే టిల్లు చిత్రం క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చినట్టుగా ఇందులో ఎలాంటి హింట్ ఇవ్వ లేదు. దీంతో మరో సినిమా లేనట్టే అని అంతా అనుకున్నారు. అయితే ప్రేక్షకుల మదిలో ఎక్కడో ఓ మూలన టిల్లు స్కేర్‌కు సీక్వేల్‌గా టిల్లు క్యూబ్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.&nbsp; టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఇస్తే ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను నిలబెట్టుకోలేక పోతే ఇబ్బందుల్లో పడుతామని తొలుత మేకర్స్ ఆలోచించారు. ఇదే విషయాన్ని&nbsp; చిత్ర నిర్మాత నాగ్ వంశీ కూడా తెలిపారు. అయితే శుక్రవారం సాయంత్రం జరిగిన సక్సెస్ మీట్‌లో టిల్లు క్యూబ్ ఉంటుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. "నిజానికి మీడియా నుంచి నా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సీక్వేల్‌పై ఓ ఐడియా ఇచ్చారు. ఇదే విషయంపై హీరో సిద్ధూ నేను మాట్లాడుకున్నాం. అతి త్వరలోనే&nbsp; చేద్దామని నిర్ణయించుకున్నాం. క్లైమాక్స్‌లో హీరోయిన్ స్లో మోషన్‌ మీద టిల్లు 3 అనౌన్స్ చేస్తాం. సోమవారం నుంచి ప్రేక్షకులకు అది కనిపిస్తుంది" అని స్పష్టం చేశారు. టిల్లు క్యూబ్ అనౌన్స్ చేయడంలో డీజే టిల్లు అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు. https://twitter.com/GulteOfficial/status/1773664243654471818?s=20
    మార్చి 30 , 2024
    Tillu Cube: టిల్లు గాడికి జోడీగా స్టార్‌ హీరోయిన్‌ లాక్‌!
    Tillu Cube: టిల్లు గాడికి జోడీగా స్టార్‌ హీరోయిన్‌ లాక్‌!
    యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), టిల్లు స్క్వేర్‌ (Tillu Square) చిత్రాలు టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. ముఖ్యంగా సిద్ధు నటన, వాయిస్‌ మాడ్యూలేషన్‌కు తెలుగు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ముఖ్యంగా టిల్లు పాత్రకు యూత్‌ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ చిత్రాల్లో హీరోతో పాటు హీరోయిన్లు పాత్రలు కూడా అంతే క్రేజ్‌ను సంపాదించాయి. ఫస్ట్‌ మూవీలో రాధిక పాత్రలో నేహా శెట్టి మెస్మరైజ్‌ చేయగా.. సీక్వెల్‌లో లిల్లీలో పాత్రలో అనుపమా కనిపించి మెప్పించింది. దీంతో తర్వాతి చిత్రం టిల్లు క్యూబ్‌లో ఎవరు నటిస్తారన్న దానిపై ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే మూడో పార్ట్‌లో సిద్ధూకు జోడీగా స్టార్‌ హీరోయిన్‌ను లాక్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.&nbsp; సిద్ధూకి జోడీగా బుట్టబొమ్మ! ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్‌ (Tillu Square) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. రూ.125 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి అదరగొట్టింది. ఇందులో హీరోయిన్‌గా చేసిన అనుపమా.. తన హాట్‌షోతో అదరగొట్టింది. కాగా, ఈ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు క్యూబ్‌ రూపొందించనున్నట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే లెటేస్ట్‌ బజ్‌ ప్రకారం మూడో పార్ట్‌లో ‘పూజా హెగ్డే’ (Pooja Hegde)ను హీరోయిన్‌గా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్‌ ఆమె వద్దకు కూడా వెళ్లిందని అంటున్నారు. హిట్ సిరీస్ కావడం, తన రోల్​కు మంచి ఇంపార్టెన్స్ ఉండటంతో పూజ కూడా వెంటనే ఓకే చేసిందనే టాక్ నడుస్తోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది.&nbsp; సమంత, తమన్నా లేనట్లే! ‘టిల్లు స్క్వేల్‌’ భారీ సక్సెస్‌తో మూడో పార్ట్‌ను పెద్ద ఎత్తున నిర్మించాలని మేకర్స్‌ భావించారు. ఇందులో భాగంగా టిల్లు క్యూబ్‌ సినిమా కోసం తొలుత ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. సమంత (Samantha), తమన్నా (Tamannaah) పేర్లను పార్ట్ -3 కోసం పరిశీలిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. వీరిలో ఒకరు దాదాపు ఖరారవుతారంటూ కూడా ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, చివరకూ ‘పూజా హెగ్డే’ వైపే చిత్ర యూనిట్ మెుగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో సిద్ధు జొన్నలగడ్డ, పూజా పెయిర్‌ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో మెుదలైంది.&nbsp; పూజాకు మంచి ఛాన్స్! ఒకప్పుడు బ్లాక్‌ బాస్టర్ హిట్స్‌తో దూసుకెళ్లిన పూజా హెగ్డేకు గత కొంతకాలంగా టైమ్‌ అసలు కలిసి రావడం లేదు. ఈ భామ నటింటిన వరుస సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. దీంతో సినిమాలకు కాస్త&nbsp; బ్రేక్‌ ఇచ్చిన ఈ అమ్మడు.. ఫ్యామిలీతో ఖాళీ సమయాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. అదే సమయంలో ఓ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో పూజా హెగ్డేకు ‘టిల్లు క్యూబ్‌’లో ఆఫర్‌ రావడం నిజంగా లక్కీ అనే చెప్పాలి. పూజా ఈ మూవీలో నటిస్తే కెరీర్‌ పరంగా ఆమెకు తప్పకుండా ప్లస్‌ అవుతుంది. సిద్ధు పక్కన రాధికగా నటిస్తే తిరిగి యూత్‌లో క్రేజ్‌ సంపాదించే అవకాశం ఉంది.&nbsp; టిల్లు క్యూబ్‌ కథ అదే! డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌ చిత్రాలకు ఇంచుమించు ఒకే తరహా కథతో రూపొందాయి. తొలి భాగం.. ఓ అమ్మాయి మోసం చేసే పాయింట్‌ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. టిల్లు స్క్వేర్‌లో కూడా అదే పాయింట్‌తో పాటు మాఫియా డాన్ మిషన్ లాంటిది యాడ్‌ చేశారు. ఈసారి టిల్లు క్యూబ్‌ మాత్రం మరో లెవల్‌లో ఉంటుందట. టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ మీద కథ ఉండబోతుందని కథానాయకుడు సిద్ధూ స్వయంగా తెలిపాడు. త్వరలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ కూడా&nbsp; మొదలుపెడతానని గతంలో స్పష్టం చేశాడు.
    మే 03 , 2024
    Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్‌’లో అనుపమా అందాల ఆరబోతకు ఇంత డబ్బు తీసుకుందా?
    Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్‌’లో అనుపమా అందాల ఆరబోతకు ఇంత డబ్బు తీసుకుందా?
    యంగ్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) పేరు చెప్పగానే క్లాస్‌ లుక్స్‌, పద్దతిగా ఉండే పాత్రలే గుర్తుకు వస్తాయి. అయితే 'డీజే టిల్లు 2' సినిమాలో ఈ భామను చూసిన వారంతా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు.&nbsp; ఎందుకంటే రీసెంట్‌గా రిలీజైన&nbsp; 'డీజే టిల్లు 2' ట్రైలర్‌ ఈ భామను చూసిన వారంతా నోరేళ్లబెడుతున్నారు. ఈ సినిమాలో అనుపమా గట్టిగానే అందాలు ఆరబోసినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.&nbsp; తాజా ట్రైలర్‌లో ఈ భామ హీరో సిద్ధుతో ఓ సీన్‌లో ఘాటైన ముద్దు సీన్‌లో కనిపించింది. ఇది చూసిన అనుపమా ఫ్యాన్స్‌ నివ్వెరపోతున్నారు. ఒకప్పుడు చూసిన అనుపమానేనా తాము చూస్తోందని ప్రశ్నించుకుంటున్నారు.&nbsp; కొన్నాళ్ల ముందు 'రౌడీ బాయ్స్' (Rowdy Boys) సినిమాలో నటించిన అనుపమ.. కొత్త కుర్రాడు ఆశిష్‌తో ముద్దు సన్నివేశాలు చేసి అందరికి షాకిచ్చింది.&nbsp; ఆ సినిమాలో ఒక్క లిప్‌లాక్‌కే పరిమితం కాలేదు ఈ కేరళ కుట్టి. నాలుగైదు సన్నివేశాల్లో హీరో ఆశిష్ పెదాలను తన అదరాలతో లాక్ చేసేసింది. హీరో పెదాలకు ఊపిరి ఆడకుండా ముద్దులిచ్చింది.&nbsp; రౌడీబాయ్స్ సినిమాలో బెడ్ రూం సీన్లకు కూడా అనుపమ ఒకే చెప్పేసింది. నిర్మొహమాటంగా నటించి రొమాన్స్‌ని పండించింది. ఈ సినిమా విడుదలయ్యాక అనుపమ రొమాన్స్ సీన్లు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి.&nbsp; దీని తర్వాత మళ్లీ ‘కార్తికేయ 2’, ‘18 పేజీస్’ లాంటి సినిమాల్లో కాస్త నార్మల్‌గా కనిపించి ఒకప్పటి అనుపమాను గుర్తు చేసింది. ఈ చిత్రాల్లో తన అందం, అభినయంతో అనుపమా ఆకట్టుకుంది.&nbsp; ఇప్పుడు 'డీజే టిల్లు 2' ఈ భామ పూర్తిగా రెచ్చిపోయింది. హాట్‌గా కనిపించడంతో పాటు ఘాటైన లిప్ కిస్ సీన్స్ చేసింది. ఈ తరహా పాత్ర అనుపమ గతంలో చేయలేదు. ఇదే ఆమెకు తొలిసారి.&nbsp; అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం అనుపమా గట్టిగానే రెమ్యునరేషన్ డిమాండ్‌ చేసినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.&nbsp; ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి కోటిన్నర మధ్య రెమ్యునరేషన్ తీసున్న అనుపమ.. 'టిల్లు స్వ‍్కేర్' కోసం మాత్రం రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుందట.&nbsp; గ్లామర్ షో చేసినందుకు ఇదా అసలు కారణమని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకోవాలని ఈ బ్యూటీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. .&nbsp; కేరళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' (Premam) మూవీతో హీరోయిన్ అయిపోయింది. నితీన్‌ హీరోగా చేసిన 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.&nbsp; దీని తర్వాత 'శతమానం భవతి', ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాల్లో నటించింది. వీటన్నింటిలో కాస్త సంప్రదాయంగా ఉండే పాత్రల్లో కనిపించింది. ఎక్కడా గీత దాటలేదు. మాస్‌ మహారాాజా రవితేజ లేటెస్ట్ చిత్రం ఈగల్‌ (Eagle)లోనూ అనుపమా మెరిసింది. ఇందులో జర్నలిస్టు పాత్ర పోషించి మంచి నటనను కనబరిచింది.&nbsp; అలాగే తమిళంలో 'సైరెన్‌' అనే సినిమాలో ఈ కేరళ కుట్టి నటించింది. ఈ చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది.&nbsp; ప్రస్తుతం మలయాళంలో 'JSK Truth Shall Always Prevail' అనే సినిమాలో నటిస్తున్న వికిపీడియాను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉన్నట్లు సమాచారం.&nbsp;
    ఫిబ్రవరి 21 , 2024
    Tillu Square Weekend Collections: మూడు రోజుల్లో టిల్లు స్కేర్ ప్రభంజనం.. రూ.100 కోట్ల క్లబ్‌లో టిల్లు?
    Tillu Square Weekend Collections: మూడు రోజుల్లో టిల్లు స్కేర్ ప్రభంజనం.. రూ.100 కోట్ల క్లబ్‌లో టిల్లు?
    స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా, గ్లామర్ డాల్ అనుపమ పరమేశ్వరణ్ దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లు స్కేర్ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఊహించిన దానికంటే ప్రేక్షకుల నుంచి ఎక్కువ రెస్పాన్స్&nbsp; వస్తుండటంతో.. వసూళ్లు భారీగా రాబడుతోంది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.68.1 కోట్ల గ్రాస్(Tillu Square&nbsp; Weekend Collections) కొల్లగొట్టినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది సెన్సేషనల్ రెస్పాన్స్‌గా చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో ఏ టాలీవుడ్ మూవీ రాబట్టలేదు. ఈ చిత్రం ఈవారంలో రూ.100కోట్ల మార్క్‌ను అవలీలగా దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నారు.&nbsp; ఈ చిత్రం ఇండియా వైడ్‌గా రూ.37 కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ వద్ద వసూలు చేస్తే.. ఓవర్‌సీస్‌లోనూ అదే స్థాయిలో రూ.31కోట్లు గ్రాస్ రాబట్టింది.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ&nbsp; గత చిత్రాల్లో టిల్లు స్కేర్ కలెక్షన్లు ఓ మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. నెట్ వసూళ్లు ఎంతంటే? ఇండస్ట్రీలో టాక్ ప్రకారం (Tillu Square Weekend Net Collections)&nbsp; మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.40-45 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలిసింది. లాభాల్లో టిల్లు స్కేర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుండటంతో... మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ&nbsp; గత చిత్రం 'డీజే టిల్లు చిత్రం' బ్లాక్‌ బాస్టర్‌ కావడం, హీరోయిన్ అనుపమ(Anupama Parameswaran) గ్లామర్ రోల్ చేయడం, సినిమా విడుదలకు ముందు రిలీజైన ట్రైలర్‌పై పాజిటివ్ రెస్పాన్స్.. టిల్లు స్కేర్ సినిమాకు థ్రియేట్రికల్‌ బిజినెస్‌ బాగానే(Tillu Square 3days Collections) జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.23.30 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.18.50కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. 4.80కోట్లకు థియేట్రికల్‌ హక్కులు అమ్ముడయ్యాయి. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 24కోట్లుగా ఉంది. ఇప్పటికే ఈ టార్గెట్‌ను దాటి మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లకు రూ.15కోట్ల లాభం కళ్లజూపింది. టిల్లు స్కేర్ సక్సెస్‌ కారణం ఇదేనా? స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లుగా అదరగొట్టాడు. తన మార్క్‌ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. కొన్ని సీన్లలో మరింత హ్యాండ్సమ్‌ లుక్స్‌తో కనిపించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాడు. ఇక రాధిక అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ మెప్పించింది. ముఖ్యంగా తన గ్లామర్ షోతో కుర్రకారును ఊర్రూతలూగించింది. సిద్ధూ, అనుపమా మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య కెమెస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. లిప్‌లాక్ సీన్లతో పాటు, బెడ్రూం సీన్లు అలరిస్తాయి. ఇద్దరి మధ్య వచ్చే వన్‌లైనర్‌ పంచ్‌లు ప్రేక్షకులను వెంటాడుతాయి. ఇక మాఫియా డాన్‌ పాత్రలో మురళీ శర్మ జీవించారు. తన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. టిల్లు తండ్రిగా మురళీ గౌడ్‌ కూడా మంచి ప్రదర్శనే చేశారు. అతని కామెడీ టైమింగ్‌ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపంచారు. ఇవన్నీ సినిమా విజయానికి కారణం అయ్యాయి. ఓటీటీ పార్ట్నర్‌&nbsp; ఫిక్స్ టిల్లు స్కేర్ ఓటీటీ ప్రసార హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏకంగా రూ.13 నుంచి రూ.15 కోట్ల వరకు చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకుంది. చూసుకుంటే టిల్లు స్కేర్ మంచి నెంబర్‌నే సాధించిందని చెప్పవచ్చు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం... ఓటీటీ ద్వారా గట్టి నెంబర్ సాధించడం పట్ల మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టిల్లు క్యూబ్&nbsp; మరోవైపు టిల్లు స్కేర్‌కు సీక్వేల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని మేకర్స్‌ ప్రకటించారు. థియేటర్లలో ఈరోజు నుంచి ఈ ప్రకటన వేయనున్నట్లు పేర్కొన్నారు.
    ఏప్రిల్ 01 , 2024
    Tollywood Movies: రిలీజ్‌కు ముందే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న చిత్రాలు.. ఎందుకో తెలుసా?
    Tollywood Movies: రిలీజ్‌కు ముందే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న చిత్రాలు.. ఎందుకో తెలుసా?
    ఒక సినిమా థియేటర్‌లోకి రావాలంటే ఎంతో మంది కృషి అవసరం. ముఖ్యంగా హీరో, డైరెక్టర్‌ తమ సర్వశక్తులు ఒడ్డి సినిమాను తెరకెక్కిస్తారు. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అవుతుంటాయి. మరికొన్ని యావరేజ్‌ టాక్‌తో నిర్మాతలకు పెట్టుబడి మెుత్తాన్ని తిరిగి అందిస్తుంటాయి. ఇవన్నీ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత జరిగే సంఘటనలు. అయితే కొన్ని చిత్రాలు మాత్రం థియేటర్లలోకి రాకముందే ఫ్లాప్‌ టాక్‌ (Tollywood Films Got Flop Talk Before The Release)ను మూటగట్టుకున్నాయి. సోషల్‌ మీడియాలో ఆయా చిత్రాలపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. అటువంటి చిత్రాలు ఏవి? ఇందుకు గల కారణాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; భోళాశంకర్‌ (Bhola Shankar) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా.. మేహర్‌ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో రూపొందిన రీసెంట్‌ చిత్రం ‘భోళాశంకర్‌’. ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందంటూ రిలీజ్‌కు ముందే నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. మేహర్‌ రమేష్‌.. గతంలో ఇచ్చిన డిజాస్టర్ల నేపథ్యంలో ఈ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇందుకు అనుగుణంగానే రిలీజ్‌ తర్వాత ‘భోళాశంకర్‌’ ఫ్లాప్ టాక్‌ తెచ్చుకోవడం గమనార్హం.&nbsp; ఆదిపురుష్‌ (Aadi Purush) పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్‌ సీతగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం కూడా విడుదలకు ముందే తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ విడుదలైనప్పటి నుంచి నెట్టింట విపరీతంగా ట్రోల్స్‌ మెుదలయ్యాయి. గ్రాఫిక్స్ మరి అద్వాన్నంగా ఉన్నాయని.. సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఇందుకు తగ్గట్లే విడుదల తర్వాత ‘ఆదిపురుష్‌’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సంభాషణలపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. షాడో (Shadow) వెంకటేష్‌ (Venkatesh) హీరోగా మేహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘షాడో’. మేహర్‌ రమేష్‌ గత చిత్రాలు ‘కంత్రి’, ‘శక్తి’ డిజాస్టర్‌గా నిలవడంతో దాని ప్రభావం ‘షాడో’పై కూడా పడింది. ఈ మూవీ ట్రైలర్‌.. అంచనాలను అందుకోకపోవడంలో విఫలం కావడంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్స్‌ ఉందని అప్పట్లో కథనాలు వచ్చాయి. లాంగ్‌ హెయిర్‌లో వెంకీ లుక్‌ బాలేదని కూడా సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. మెుత్తానికి విడుదల తర్వాత ‘షాడో’ కూడా డిజాస్టర్ నిలిచి ఆ విమర్శలను నిజం చేసింది.&nbsp; స్కంద (Skanda) హీరో రామ్‌ (Ram), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో రూపొందిన ‘స్కంద’పై ట్రైలర్‌ రిలీజ్‌ ముందు వరకూ భారీ అంచనాలే ఉన్నాయి. ట్రైలర్‌ రిలీజ్ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. యాక్షన్‌ సీన్స్‌ మరి ఓవర్‌ డోస్‌ అయినట్లుగా ఉందని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని కొందరు నెటిజన్లు అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే ‘స్కంద’ రిలీజ్‌ తర్వాత బి లో యావరేజ్‌గా నిలిచింది. ముఖ్యంగా రామ్‌కు నటుడు శ్రీకాంత్‌ ఎలివేషన్‌ ఇచ్చే డైలాగ్‌ ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రోల్‌ కావడం గమనార్హం. వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌ హీరోగా (Tollywood Films Got Flop Talk Before The Release) బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను తొలి ఆట నుంచే ట్రోల్స్‌ చుట్టుముట్టాయి. ముఖ్యంగా రామ్‌చరణ్‌ విలన్ సోదరుడి తల నరకడం.. గద్ద దాన్ని ఎత్తుకెళ్లడానికి సంబంధించిన సీన్‌ విపరీతంగా ట్రోల్‌కు గురైంది. అలాగే రైలు పై నుంచి పరిగెత్తుకుంటూ రామ్‌చరణ్‌ బిహార్‌ వెళ్లడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఓవరాల్‌గా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచి చరణ్‌ ఫ్లాప్‌ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.&nbsp; లైగర్‌ (Liger) విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్‌ అయ్యింది. ప్రమోషన్స్‌ సందర్భంగా నిర్మాత చార్మీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు దోహదం చేశాయి. పైగా సిక్స్‌ ప్యాక్‌తో ఎంతో దృఢంగా ఉన్న విజయ్‌కు సినిమాలో నత్తి ఉన్నట్లు చూపించడం కూడా ట్రోల్స్‌కు కారణమైంది. రాధే శ్యామ్‌ (Radheshyam)&nbsp; బాహుబలి తర్వాత ప్రభాస్‌ తీసిన రెండో చిత్రం ‘రాధేశ్యామ్‌’. సాహో ఫ్లాప్‌ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా 1976 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఇందులో ప్రభాస్‌ హస్తసాముద్రికం తెలిసిన జ్యోతిష్కుడిగా కనిపిస్తాడని తెలియగానే ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అటు సోషల్‌ మీడియాలో ఈ సినిమా కూడా డౌటే అంటూ ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే విడుదలైన రాధేశ్యామ్‌ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకొని.. ఆ రూమర్స్‌ను నిజం చేసింది.&nbsp; వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover) విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' చిత్రం టీజర్‌ రిలీజ్‌ నుంచే విమర్శలను మూటగట్టుకుంది. టీజర్‌ బోల్డ్‌గా ఉండటంతో పాటు విజయ్‌ నలుగురు హీరోయిన్లతో రొమాన్స్‌ చేయడం చూపించారు. అర్జున్‌ రెడ్డి సినిమా నుంచి హీరోయిన్లతో విజయ్‌ రొమాన్స్‌ ఎక్కువైందని సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి. అటు మహిళ సంఘాలు కూడా ఈ సినిమాపై తీవ్రంగా స్పందించాయి. ఇన్ని ట్రోల్స్‌, విమర్శల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో దారుణంగా విఫలమైంది.&nbsp; సన్‌ ఆఫ్‌ ఇండియా (Son of India) మంచు మోహన్‌బాబు (Mohan Babu) హీరోగా చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ (Tollywood Films Got Flop Talk Before The Release) చిత్రం విడుదలకు ముందే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా కొన్ని సోషల్‌ మీడియా అకౌంట్స్‌ మీమ్స్‌ క్రియేట్‌ చేశాయి. మరో ఫ్లాప్‌ లోడింగ్‌ అంటూ ట్రోల్స్‌ చేశాయి. ఈ పరిణామాల మధ్య వచ్చిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది.&nbsp;
    మార్చి 16 , 2024
    Day 1 Collections: ‘డే 1 కలెక్షన్స్‌’లో ఆ యంగ్‌ హీరోనే టాప్‌.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా ఆ ఇద్దరికీ నిరాశే!&nbsp;
    Day 1 Collections: ‘డే 1 కలెక్షన్స్‌’లో ఆ యంగ్‌ హీరోనే టాప్‌.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా ఆ ఇద్దరికీ నిరాశే!&nbsp;
    గత కొన్ని వారాలుగా చిన్న హీరోల చిత్రాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. అయితే ఈ వీకెండు మూడు ఆసక్తికర సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. కుర్ర హీరోలు విష్వక్‌ సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, ఆనంద్‌ దేవరకొండ ‘గం గం గణేశా’, కార్తికేయ ‘భజే వాయు వేగం’ చిత్రాలతో పోటీపడ్డారు. శుక్రవారం (మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. మరి తొలి రోజు ఏ సినిమాకు ఎంత కలెక్షన్స్‌ వచ్చాయి? ఏ కుర్ర హీరో బాక్సాఫీస్‌ వద్ద పైచేయి సాధించాడు? ఈ కథనంలో చూద్దాం. [toc]&nbsp; గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి&nbsp; విశ్వ‌క్ సేన్ లేటెస్ట్‌ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’.. శుక్రవారం విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఫలితంగా ఈ సినిమా తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 8.2 కోట్ల‌కు గ్రాస్ రాబట్టినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేసింది. ఫలితంగా విశ్వ‌క్ సేన్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒకటిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ నిలిచింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌.. ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతున్నారు. నైజాంలో తొలిరోజు ఈ మూవీ కోటికిపైనే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు తెలిసింది. శ‌ని, ఆదివారాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి బాక్సాఫీస్ వ‌ద్ద జోరు చూపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. విశ్వక్‌ వన్‌మ్యాన్‌ షో గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. లంక గ్రామాల బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇందులో లంక‌ల ర‌త్న అనే యువ‌కుడిగా విశ్వ‌క్ సేన్ యాక్టింగ్‌, అత‌డి క్యారెక్ట‌రైజేష‌న్ అభిమానుల‌ను ఫిదా చేసింది. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో విశ్వ‌క్ సేన్ అద‌ర‌గొట్టాడ‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. మరోవైపు హీరోయిన్‌ నెహా శెట్టితో అతడి కెమెస్ట్రీ చాలా బాగా వర్కౌట్‌ అయినట్లు టాక్ వినిపిస్తోంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.&nbsp; కథేంటి కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం (విశ్వక్ సేన్) రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) బృందంలో చేరతాడు. ఆ తర్వాత నానాజీ (నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన అతడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాడు? బుజ్జి (నేహా శెట్టి)తో రత్నాకర్‌ లవ్‌ ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.&nbsp; గం.. గం.. గణేశా&nbsp; ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ‘గం గం గ‌ణేశా’ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ విష్వక్‌ మూవీతో పోలిస్తే కలెక్షన్ల పరంగా బాగా వెనకబడినట్లు తెలుస్తోంది. ఈ&nbsp; మూవీ ఫ‌స్ట్ డే రూ.80-90 లక్షల వ‌ర‌కు గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.50 ల‌క్ష‌ల‌కుపైగా షేర్ రాబ‌ట్టిన‌ట్లు పేర్కొంటున్నాయి. ఈ మౌత్ టాక్ పబ్లిసిటీతో శని, ఆదివారాల్లో కలెక్షన్లు బాగా పెరిగే అవకాశముందని అభిప్రాయ పడుతున్నాయి.&nbsp; కామెడీ ప్రధానం బలం క్రైమ్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ‘గం గం గణేశా’ చిత్రానికి ఉద‌య్ బొమ్మిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కామెడీ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. గం గం గ‌ణేశా మూవీలో ప్ర‌గ‌తి శ్రీవాస్త‌వ‌, న‌య‌న్‌సారిక హీరోయిన్లుగా న‌టించారు. బేబీ స‌క్సెస్ త‌ర్వాత ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన మూవీ ఇది. ఇందులో ఆనంద్‌ దేవరకొండ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడని ఫ్యాన్స్ అంటున్నారు. హాస్యనటులు ఇమ్మాన్యుయెల్‌, వెన్నెల కిషోర్‌తో కలిసి నవ్వులు పూయించాడని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; కథేంటి గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ).. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయెల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్‌ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్‌ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్‌, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్‌ గణేష్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్‌ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.&nbsp; భజే వాయు వేగం కార్తికేయ గుమ్మ‌కొండ హీరోగా న‌టించిన ‘భ‌జే వాయు వేగం’.. శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే మెుదటి రోజు ఆశించిన స్థాయిలో ఈ మూవీ వసూళ్లు రాబట్టలేకపోయింది. తొలి రోజు ఈ చిత్రం రూ.50 లక్షల లోపే గ్రాస్‌ రాబట్టినట్లు ట్రెడ్‌ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. రానున్న రోజుల్లో కలెక్షన్లు పెరిగే అవకాశముందని చెబుతున్నాయి.&nbsp; క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఐశ్వ‌ర్య మీన‌న్‌, హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైస‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు.&nbsp; కథేంటి తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్‌ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్‌ విలన్‌ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్‌ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ.&nbsp;
    జూన్ 01 , 2024
    <strong>Unstoppable: బాలయ్య షోలో రియల్‌ జాతిరత్నం.. శ్రీలీలకు గిఫ్ట్‌ ఇస్తుంటే ఏం చేశాడో చూడండి!</strong>
    Unstoppable: బాలయ్య షోలో రియల్‌ జాతిరత్నం.. శ్రీలీలకు గిఫ్ట్‌ ఇస్తుంటే ఏం చేశాడో చూడండి!
    నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో అన్‌స్టాపబుల్‌ సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో రికార్డు వ్యూస్‌తో దూసుకు వెళ్తోంది. సీజన్‌ 4 ఫస్ట్‌ ఎపిసోడ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు సందడి చేయగా ఆ తర్వాత నుంచి స్టార్‌ హీరోలు వేదికపై మెరిశారు. ఇప్పటివరకూ దుల్కర్‌ సల్మాన్‌, సూర్య, అల్లు అర్జున్‌ ఈ షోలో పాల్గొని బాలయ్యతో తమ సీక్రెట్స్‌ పంచుకున్నారు. ఇప్పుడు ఈ వేదికపై స్టార్‌ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela)తో పాటు, యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) రాబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఆహా పంచుకున్న ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; ‘రీల్ అండ్‌ రియల్‌ జాతిరత్నం’ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ (Unstoppable) సీజన్‌ 4లో స్టార్ హీరోలు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఎపిసోడ్‌ సైతం బాలయ్య సిద్ధం చేశారు. ఈసారి స్టార్‌ హీరోయిన్‌ శ్రీలీలతో పాటు యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టి బాలయ్యతో ముచ్చట్లు చెప్పినట్లు తెలుస్తోంది. వీరిద్దరు షోలో పాల్గొన్న ఫొటోను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ తాజాగా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఇందులో జాతిరత్నాలు ఫోజు పెట్టి నవీన్‌ నవ్వులు పూయించాడు. ఇందులో బాలయ్య శ్రీలీలకు గిఫ్ట్‌ ఇస్తుండగా దూరంగా నిలబడి చేత్తో దాన్ని పట్టుకుంటున్నట్లు నవీన్‌ పోలిశెట్టి నిలబడ్డాడు. అచ్చం ఇలాగే జాతిరత్నాలు సినిమాలోనూ నవీన్‌ పోలిశెట్టి చేశాడు. దీంతో ఆ రెండు ఫొటోలను పక్క పక్కన పెట్టి ఆహా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'రీల్‌ అండ్‌ రియల్‌ జాతిరత్నం ఆఫ్ ఇండియా' అంటూ రాసుకొచ్చింది. కారణం ఏమైనా ఉందా? బాలయ్య టాక్ షో (Unstoppable)కు వచ్చిన మెజారిటీ సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చారు. మరికొందరు సింగిల్‌గానే షోలో పాల్గొని బాలయ్యతో సరదాగా గడిపారు. అయితే ఈసారి ఎపిసోడ్‌లో శ్రీలీల - నవీన్‌ పోలిశెట్టి ఇద్దరూ పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం వారిద్దరు కలిసి ఏ సినిమా చేయడం లేదు. గతంలో ఓ సినిమా పట్టాలెక్కుతున్నట్లు వార్తలు వచ్చినా అది వర్కౌట్‌ కాలేదు. ఈ నేపథ్యంలో పర్టిక్యూలర్‌గా ఈ యువ హీరో, హీరోయిన్‌నే బాలయ్య పిలవడానికి కారణం ఏమైనా ఉందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే వారిద్దరిని బాలయ్య అడిగే ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య కొంటే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేక అల్లాడిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఎపిసోడ్‌ రిలీజయ్యాక ఆ ప్రశ్నలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; https://twitter.com/i/status/1861348565508862042 https://twitter.com/iam_NBKCult/status/1861306464893026701 100% ఫన్‌ పక్కా నవీన్‌ పోలిశెట్టి సినిమాల్లో ఏ విధంగా నవ్వులు పూయిస్తాడో బయట కూడా అదే విధంగా గిలిగింతలు పెడుతుంటాడు. ఏమాత్రం తడుముకోకుండా జోక్స్‌ వేస్తూ నవ్విస్తుంటాడు. మరోవైపు బాలయ్య అన్‌స్టాబుల్‌ షో ద్వారా తనలోని కామెడీ టైమింగ్‌కు మరింత పదును పెట్టారు. సరదా క్వశ్చన్స్‌ వేస్తూ సెలబ్రిటీలను ఇరాకటంలో పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు తొలిసారి ఒకే షోలో ఎదురుపడుతుండటంతో ఆ ఎపిసోడ్ కామెడీకి కేరాఫ్‌గా మారిపోతుందని నెటిజన్లు అంచనావేస్తున్నారు. 100% పక్కా ఎంటర్‌టైనింగ్‌గా ఈ ఎపిసోడ్ ఉండబోతుందని ఇప్పటి నుంచే కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ కుర్ర హీరోను బాలయ్య ఓ ఆట ఆడుకోవడం ఖాయమని కూడా అంటున్నారు. ఈ శుక్రవారం (నవంబర్‌ 29) ఈ ఎపిసోడ్‌ (Unstoppable) స్ట్రీమింగయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.&nbsp; ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌.. గతేడాది నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్క (Anushka Shetty) కాంబోలో వచ్చిన 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి' బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆ సక్సెస్‌ తర్వాత నవీన్‌ ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు' అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్‌లో చేతికి ఫ్రాక్చర్‌ కావడంతో గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు నయం కావడంతో తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మరోవైపు శ్రీలీల విషయానికి వస్తే నితీన్‌తో చేసిన 'రాబిన్‌హుడ్‌' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే శ్రీలీల స్పెషల్‌ సాంగ్‌లో మెరిసిన ‘పుష్ప 2’&nbsp; చిత్రం డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.&nbsp;
    నవంబర్ 28 , 2024
    <strong>Unstoppable Season 4 : సూర్యపైకి కళ్లజోడు విసిరిన బాలయ్య.. కంటతడి పెట్టిన నటుడు!</strong>
    Unstoppable Season 4 : సూర్యపైకి కళ్లజోడు విసిరిన బాలయ్య.. కంటతడి పెట్టిన నటుడు!
    నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌' సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో ఏపీ సీఎం చంద్రబాబు, దుల్కర్‌ సల్మాన్‌ ఎపిసోడ్లు రిలీజై ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి. తాజాగా మరో స్టార్ హీరో ఈ వేదికపై సందడి చేశారు. ఆయనెవరో కాదు తమిళ స్టార్ హీరో సూర్య. తన అప్​కమింగ్ మూవీ 'కంగువా' (Kanguva) ప్రమోషన్స్​లో భాగంగా సూర్య ఈ కార్యక్రమానికి తన టీమ్‌తో వచ్చారు. బాబీ డియోల్‌, దర్శకుడు శివ కూడా బాలకృష్ణతో సరదాగా గడిపారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్‌ చేయగా అందులో తన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తి గురించి సూర్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సూర్య సీక్రెట్‌ రివీల్‌ చేసిన కార్తీ! బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable Season 4). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్‌ కూడా ఫుల్‌ జోష్‌తో అలరిస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి హీరో సూర్య (Suriya) హాజరై సందడి చేశారు. తన తమ్ముడు కార్తి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టీజర్‌ ఆరంభంలో సూర్య ఎంట్రీ ఇస్తుండగా బాలయ్య తన వద్ద ఉన్న(Unstoppable Season 4) కళ్లద్దాలను సూర్యపైకి విసురుతాడు. దానిని క్యాచ్‌ చేసిన సూర్య బ్లాక్‌ గ్లాసెస్‌ పెట్టుకొని స్టైలిష్‌గా షోలోకి ఎంట్రీ ఇస్తాడు. తర్వాత కార్తి మీ నంబర్‌ను ఏమని సేవ్‌ చేసుకుంటారని బాలయ్య అడగ్గా ‘అది అవుట్‌ఆఫ్ సిలబస్‌’ అంటూ మొదటి ప్రశ్నతోనే సూర్య నవ్వులు పూయించారు. మొదటి క్రష్‌ ఎవరో చెప్పాలని కోరగా ‘వద్దు సర్‌ ఇంటికి వెళ్లాలి, గొడవలు అవుతాయని’ సరదాగా చెప్పారు. ఇక బాలకృష్ణ కార్తికి లైవ్‌లో ఫోన్‌ చేసి సూర్య గురించి అడగ్గా ఒక హీరోయిన్ అంటే సూర్యకు బాగా ఇష్టమని చెప్పారు. దీంతో కార్తిని సూర్య ‘నువ్వు కార్తివి కాదు.. కత్తివి రా’ అని సూర్య అన్నారు. https://twitter.com/ahavideoIN/status/1853655983760998850 కంటతడి పెట్టిన సూర్య తాజా టీజర్‌ (Unstoppable Season 4)లో జ్యోతిక గురించి కూడా సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జ్యోతిక లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేనని సూర్య ఎమోషనల్‌ అయ్యారు. మరోవైపు సూర్య చేసే సేవా కార్యక్రమాల గురించి కూడా ఈ ఎపిసోడ్‌లో ప్రస్తావనకు వచ్చింది. సూర్య సాయం చేసిన యువతి వీడియోను ఇందులో ప్లే చేశారు. అనంతరం సూర్య మాట్లాడుతూ మానవత్వం ఉన్న ఓ సగటు మనిషిగా నలుగురికి సేవ చేయడంలోనే తనకు ఆనందం ఉందంటూ పేర్కొన్నారు. ఆ సమయంలో సూర్య కళ్లు చెమడ్చాయి. దీంతో బాలయ్యతో పాటు అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. ఇక చివర్లో ‘కంగువ’లో విలన్‌గా చేస్తున్న బాబీ డియోల్‌, డైరెక్టర్ శివ స్టేజీపైకి వచ్చారు. వారితో బాలయ్య చేసిన సరదా సంభాషణ కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది.&nbsp; 10 వేల స్క్రీన్స్‌లో విడుదల ‘కంగువ’ చిత్రం (Unstoppable Season 4) గురించి నిర్మాత ధనుంజయ్‌ రీసెంట్‌గా ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఏకంగా 10వేల స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 2500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు, ఉత్తరాదిలో 3,500 స్క్రీన్లలో ప్రదర్శించునున్నట్లు చెప్పారు. ఓవరాల్‌గా 10 వేల స్క్రీన్‌లలో భారీస్థాయిలో కంగువా ప్రేక్షకుల ముందుకురానుందని స్పష్టం చేశారు.&nbsp; ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత చెప్పారు. పార్ట్ 2, పార్ట్‌ 3 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని పార్ట్‌ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు. రిలీజ్ ఎప్పుడంటే? ఇక 'కంగవా' విషయానికి వస్తే, డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్యతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్, యంగ్ స్టార్ దిశా పటానీ లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, KVN ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సాలిడ్ సంగీతం అందించారు. తాజాగా విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఇందులో సూర్య రెండు విభిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకోనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.&nbsp;
    నవంబర్ 05 , 2024
    <strong>Unstoppable 4: పవన్‌పై ప్రశ్న.. ఆ విషయంలో నేనే నెం.1: బన్నీ</strong>
    Unstoppable 4: పవన్‌పై ప్రశ్న.. ఆ విషయంలో నేనే నెం.1: బన్నీ
    నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పాపులర్ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌' సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో ఏపీ సీఎం చంద్రబాబు, దుల్కర్‌ సల్మాన్‌, సూర్య ఎపిసోడ్లు రిలీజై ట్రెండింగ్‌లో దూసుకెళ్లాయి. తాజాగా మరో స్టార్ హీరోకు సంబంధించిన ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఆయనెవరో కాదు ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). ఇందులో సినీ హీరోల గురించి బాలయ్య కొన్ని ప్రశ్నలు వేయగా బన్నీ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్‌ వార్‌ జరుగుతున్న వేళ పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు.&nbsp; పవన్‌పై ఏమన్నారంటే? బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable Season 4). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్‌ కూడా ఫుల్‌ జోష్‌తో అలరిస్తోంది. తాజాగా 4వ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇందులో పలు హీరోలను స్క్రీన్‌పై చూపిస్తూ వారికి గురించి అభిప్రాయం ఏంటో చెప్పాలని బాలయ్య అడిగారు. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్ ఫొటోను ప్రదర్శించగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ధైర్యం అంటే తనకు చాలా ఇష్టమని బన్నీ చెప్పారు. సొసైటీలో చాలా మంది లీడర్స్‌, బిజినెస్‌ మెన్స్‌ను దగ్గర నుంచి చూస్తుంటానని తెలిపారు. కానీ తాను లైవ్‌లో మాత్రం పవన్‌ కల్యాణ్‌ ధైర్యాన్ని చూస్తుంటానని ప్రశంసించారు. చాలా డేరింగ్‌ పర్సన్ అంటూ పవన్‌ను ఆకాశానికెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బన్నీ వ్యాఖ్యలను పవన్ అభిమానులు స్వాగతిస్తున్నారు. https://twitter.com/pakkafilmy007/status/1857292801391628444 ‘ఆ స్టార్‌తో మల్టీస్టారర్‌ చేయాలి’ పవన్‌ కల్యాణ్‌తో పాటు పలువురు స్టార్‌ హీరోల ఫొటోలు స్క్రీన్‌పై రాగా వారిపైనా అల్లు అర్జున్‌ (Allu Arjun) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ముందుగా మహేష్‌ బాబు (Mahesh Babu) గురించి మాట్లాడుతూ అందరూ అతడి అందం గురించే మాట్లాడతారని, కానీ అయన కమ్‌బ్యాక్స్‌ చాలా బాగుంటాయని పేర్కొన్నారు. ఫెయిల్యూర్స్‌ తర్వాత వచ్చే ఆయన కమ్‌బ్యాక్స్‌ చాలా బాగుంటాయన్నారు. ఇక ప్రభాస్ (Prabhas) గురించి ప్రస్తావిస్తూ అతడు ఆరడుగుల బంగారమని కొనియాడాడు. తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చాడు. తాను ప్రతీ ఏటా క్రిస్మస్‌ ట్రీ పెడతానని తెలిసి తనకోసం యూరప్‌ నుంచి డెకరేషన్‌ ఐటెమ్స్‌ తీసుకొచ్చారని తెలిపాడు. అటు బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) గురించి మాట్లాడుతూ ఈ జనరేషన్‌ హీరోల్లో వావ్‌ అనిపించే యాక్టర్ అంటూ వ్యాఖ్యానించాడు. తాను రణ్‌బీర్‌తో మల్టీస్టారర్‌ చేస్తే అద్భుతంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. ఈ తరం ఫేవరేట్‌ హీరో ఈ జనరేషన్‌ హీరోల్లో నీకు ఇష్టమైన హీరో ఎవరని బాలయ్య ప్రశ్నించగా బన్నీ ఇంట్రస్టింగ్‌ కామెంట్స్ చేశాడు. ఈ తరం వాళ్లందరూ బాగా నటిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాలో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) యాక్టింగ్‌ తనకు బాగా నచ్చిందని అన్నాడు. తర్వాత నవీన్‌ పొలిశెట్టి చేసిన జాతిరత్నాలు మూవీ చూసి పడి పడి నవ్వుకున్నట్లు తెలిపాడు. సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), విష్వక్‌ సేన్‌ (Vishwak Sen), అడివిశేష్‌ (Adivi Sesh)లు బాగా నటిస్తున్నట్లు ప్రశంసించాడు. ఒకరి పేరు చెప్పమంటే మాత్రం సిద్ధూ (Siddhu Jonnalagadda) అని స్పష్టం చేశాడు. మరోవైపు ఇండస్ట్రీలో టాప్‌ డ్యాన్సర్‌ నువ్వే అనుకుంటున్నావా? అని బాలయ్య ప్రశ్నించగా ‘నిజమే సర్‌’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. బాలకృష్ణ గారు చెప్పారు కాబట్టి నేనే నవంబర్‌ వన్‌ డ్యాన్సర్ అంటూ చెప్పుకొచ్చాడు. 'ఇండస్ట్రీలో నాకు నేనే పోటీ' ప్రస్తుతం ఇండస్ట్రీలో నీకు ఎవరు పోటీ అని అల్లు అర్జున్‌ను బాలయ్య ప్రశ్నించారు. దీనికి బన్నీ సమాధానం ఇస్తూ పుష్పా 2 టైటిల్‌ సాంగ్‌లోనూ లిరిక్‌ను చదివాడు. 'నన్ను మించి ఎదిగినవాడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవరంటే అది రేపటి నేనే. నాను నేనే పోటీ. అలాగే నేను అందరినీ గౌరవిస్తాను' అంటు బన్నీ సమాధానం ఇచ్చారు. ఇక త్రివిక్రమ్‌, సుకుమార్‌లో ఎవరు ఎక్కువ ఇష్టం అంటూ బాలయ్య ప్రశ్నించారు. దానిపై బన్నీ మాట్లాడుతూ 'చేస్తున్న దర్శకుడు ఒకరు.. చేయనున్న దర్శకుడు ఒకరు. నేను ఇప్పుడే చెప్పాను కదా.. ఏ సినిమా చేస్తే. ఆ చిత్ర బృందం నా ఫేవరేట్ అని. అందుకే సుకుమార్‌ అంటే ఇష్టం' అని ఆన్సర్ ఇచ్చాడు. https://twitter.com/i/status/1857314917340397862
    నవంబర్ 16 , 2024
    <strong>NTR 31: జూ.ఎన్టీఆర్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌పై దిమ్మతిరిగే అప్‌డేట్‌.. బంగ్లాదేశ్‌ రైతుగా తారక్‌?</strong>
    NTR 31: జూ.ఎన్టీఆర్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌పై దిమ్మతిరిగే అప్‌డేట్‌.. బంగ్లాదేశ్‌ రైతుగా తారక్‌?
    తారక్‌ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక మూవీ సక్సెస్‌తో తారక్‌ తర్వాతి చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే సలార్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో తారక్‌ ఓ సినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘NTR 31’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్‌ నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిపై ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. రైతు పాత్రలో తారక్‌! &nbsp;తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న 'NTR 32' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్‌ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని ఫిల్మ్‌ వర్గాల సమాచారం.&nbsp; హీరోయిన్‌గా రష్మిక? దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్‌-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్‌ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.&nbsp;&nbsp; ఆ మూవీ తర్వాత సెట్స్‌పైకి! తారక్‌ బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో తారక్‌ నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లోనూ తారక్‌ పాల్గొన్నాడు. ఈ సినిమాలో తన కోటా షూటింగ్‌ పూర్తి చేసి ఆ తర్వాత ‘NTR 31’ను పట్టాలెక్కించాలని తారక్‌ భావిస్తున్నట్లు సమాచారం. ‘వార్‌ 2’ పూర్తయితే ఇక పూర్తిస్థాయిలో ప్రశాంత్‌ నీల్‌కు డేట్స్‌ అడ్డస్ట్‌ చేయవచ్చని తారక్‌ అనుకుంటున్నారట. ఇక ‘వార్‌ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; రాజకీయాలపై క్లారిటీ దేవర సక్సెస్ నేపథ్యంలో ఎన్టీఆర్ మరోసారి రాజకీయాలపై స్పందించారు. రాజకీయాలు కాదు.. నటనే తన తొలి ఆప్షన్ అని తేల్చి చెప్పారు. తొలి నుంచి నటుడిని కావాలనే అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో జూనియర్ స్పష్టం చేశారు. 17 ఏళ్ల వయసులో ఫస్ట్ మూవీ చేశానన్న తారక్‌ అప్పటి నుంచి నటనపైనే ఫోకస్ చేసినట్లు చెప్పారు. ఓట్ల సంగతి పక్కన పెడితే తన కోసం లక్షలాది మంది టికెట్లు కొంటున్నారని పేర్కొన్నారు. ఇంతమంది ప్రజలను కలుస్తున్నందుకు నటుడిగా తనకు ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ వ్యాఖ్యలను బట్టి ఆయన ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేనట్టు అర్ధమవుతోంది.
    అక్టోబర్ 01 , 2024

    @2021 KTree